● పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచాలి ● ఎస్పీ మహేశ్ బీ.గీతే
చందుర్తి(వేములవాడ): ప్రజలతో సంబంధాలు మెరుగుపర్చుకోవాలని ఎస్పీ మహేశ్ బీ.గీతే సూచించారు. చందుర్తి సర్కిల్ కార్యాలయంతోపాటు ఠాణాను శుక్రవారం సందర్శించారు. సిబ్బంది పనితీరు, సర్కిల్ పరిధిలో కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఎస్పీ మహేశ్ బీ.గీతే మాట్లాడుతూ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. వీపీవోలు తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ.. గ్రామీణులను అప్రమత్తం చేయాలన్నారు. అక్రమ బెట్టింగ్‌లు, గేమింగ్ యాప్‌లతో కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. అనంతరం మండలంలోని లింగంపేటలోని పోలీస్ అమరవీరుల స్తూపాన్ని సందర్శించారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు అంజయ్య, అశోక్ ఉన్నారు.
విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలి
రుద్రంగి(వేములవాడ): విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలని ఎస్పీ మహేశ్ బీ.గీతే సూచించారు. రుద్రంగి ఠాణాను సందర్శించిన సందర్భంగా సిబ్బందితో మాట్లాడారు. ఠాణాలో నమోదవుతున్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా అధికారులు, విలేజ్ పోలీస్ అధికారులు తరచూ గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. ప్రజలకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్ పరిధిలో నిత్యం డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని సూచించారు.


