Narayanpet
-
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా బసవేశ్వరుడు
నారాయణపేట: సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుడని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మహాత్మా బసవేశ్వర జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి అడిషనల్ కలెక్టర్ పూలమాల వేశారు. అలాగే సరాఫ్ బజార్ బసవేశ్వర స్వామి ఆలయంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమాజంలో సీ్త్ర పురుషులు ఇద్దరికి సమాన హక్కుల కోసం కృషి చేశాడని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ వేల్ఫేర్ అధికారి అబ్దుల్ ఖలీల్, డిపీఆర్ఓ రషీద్, అగ్రికల్చర్ అధికారి జాన్ సుధాకర్, ఆర్విఎల్ఎల్బి జిల్లా అధ్యక్షుడు అవుటి రవికుమార్, కె.మల్లికార్జున్, గందె రవికాంత్, అరకంచి రవికుమార్, నాగభూషన్, కన్నా జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శప్రాయుడు.. కృష్ణా: మహాత్మా బసవేశ్వరుడు 18వ శతాబ్ధంలోనే కులమతాలకు అతీతంగా సమసమాజాన్ని నిర్మించి అందరికి ఆదర్శప్రాయుడయ్యాడని నేరడగం పీఠాధిపతి పంచమ సిద్దలింగమహాస్వామి అన్నారు. బుధవారం మండలంలోని హిందుపూర్లోని బసవేశ్వర విగ్రహానికి బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాజుల ఆశిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్యతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడారు. బసవ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. బసవ చరిత్ర మొదటిసారి తెలుగులోనే వ్రాయడం జరిగిందని, ఆ తరువాత కన్నడకు అనువాదం చేశారని గుర్తుచేశారు. అన్నికులాలవారికి, సీ్త్ర, పురుషులకు సమప్రాధాన్యతను ఇచ్చిన వీరశైవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేశాడని అన్నారు. అదే విధంగా టైరోడ్డు, చేగుంట, ఐనాపూర్ గ్రామాల్లో బసవ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అఖిల పక్షాల నాయకులు,వీరశైవులు పాల్గొన్నారు. -
భూభారతితో రైతులకు న్యాయం
చిన్నచింతకుంట: భూ భారతి చట్టంతో ప్రతి పేద రైతుకు న్యాయం జరుగుతుందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి జాతర మైదానంలో చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల రైతులకు భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు ఉపయోగపడేలా చట్టాలను అమలులోకి తీసుకొచ్చిందన్నారు. అందుకే రైతుల భూసమస్యలు పరిష్కరించేందుకు భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. ఈ చట్టం ద్వారా పేద రైతులకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.ఈ చట్టం ప్రతి రైతు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ముందుగా నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశామన్నారు. త్వరలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ కింద తీసుకుంటామన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేవరకద్రలో సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం, కొత్తగా ఏర్పడిన మండలాల్లో రెవెన్యూ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. కలెక్టర్ విజయేందరి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో భూభారతి చట్టంపై సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ధరణి చట్టం ద్వారా పరిష్కారం కాని భూ సమస్యలు భూ భారతి చట్టం ద్వారా తహసీల్దార్ స్థాయిలోనే ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అందుకు సీఎం రేవంత్ ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట మైనార్టీ పైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అదనపు కలెక్టర్లు మోహన్‌రావు, శివేంద్ర ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
‘చిన్నోనిపల్లి’ లింక్‌కు నో..
ఈ వివాదం నడుస్తున్న క్రమంలో ఆర్డీఎస్ కెనాల్‌కు చిన్నోనిపల్లి రిజర్వాయర్‌కు లింక్ చేసే ప్రతిపాదనలను ఎంపీ తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణానీటిపై ఆధారపడి గట్టు మండలంలో చిన్నోనిపల్లె రిజర్వాయర్ తెరపైకి వచ్చింది. తుంగభద్ర నీటి ఆధారంగా వడ్డేపల్లి మండలం తనగల సమీపంలో మల్లమ్మకుంట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తుంగభద్ర నదికి వరదలు వచ్చినప్పుడే కాకుండా వర్షపు నీటితో కూడా ఆధారపడి నిర్మించే ఈ రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేసుకుంటే తమకు ప్రయోజనం ఉంటుందని అలంపూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర నదిలో నీరు లేని సమయంలోనూ ఆర్డీఎస్ కెనాల్ ద్వారా వడ్డేపల్లి, మానవపాడు, ఉండవెళ్లి, అలంపూర్,రాజోళి మండలాల్లోని చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందే అవకాశం ఉంటుందని.. చిన్నోనిపల్లి ద్వారా ఇది సాధ్యం కాదని.. తాము ఒప్పుకునేది లేదని చెబుతున్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తే అలంపూర్ నియోజకవర్గంలోని 55 వేల ఎకరాల ఆయకట్టుకు, పదివేల ఎకరాల నాన్ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుంది. అలంపూర్ సస్యశ్యామలమవుతుంది. దీన్ని రద్దు చేయడం వల్ల కేవలం 400 ఎకరాల రైతులకు మాత్రమే మేలు జరుగుతుంది. మల్లమ్మకుంట రిజర్వాయర్ రద్దు మంచిది కాదు. నష్టపోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలి. సాటి రైతులు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు. – సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ మాజీ చైర్మన్, రిజర్వాయర్ రద్దు మంచిది కాదు.. -
వచ్చే నెల మొదటి వారంలోగా.. భూ సమస్యలన్నీ పరిష్కరించాలి
నారాయణపేట: ప్రభుత్వం కొత్తగా రూపొందించిన భూ భారతి చట్టం అమలుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న మద్దూరు మండలంలో భూ సమస్యలపై సమర్పించిన దరఖాస్తులను వచ్చే నెల మొదటి వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మద్దూరు మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల భూ సమస్యలపై అందిన దరఖాస్తులపై మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ గ్రామాల వారీగా అందిన దరఖాస్తులపై కలెక్టర్ ఆరా తీయగా.. మొత్తం 1,341 భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని మద్దూరు తహసీల్దార్ మహేశ్‌గౌడ్ వివరించారు. అందులో ఎక్కువగా డేటా మార్పు, విరాసత్, అసైన్ భూముల సమస్యలు ఉన్నాయన్నారు. అన్ని దరఖాస్తులను సదస్సుల్లో రైతులు నేరుగా సమర్పించారని.. ప్రస్తుతం ఆయా దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేసి.. పేపర్ వర్క్ పూర్తి చేయనున్నట్లు అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాలుగు మండలాలను ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా.. అందులో సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం ఉందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను కొత్త చట్టం ద్వారా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్య తీవ్రత మేర ఏ అధికారి స్థాయిలో పరిష్కారానికి అవకాశం ఉంటుందనే ఆంశంపై అదనపు కలెక్టర్ బేన్షాలంతో కలెక్టర్ చర్చించారు. దరఖాస్తుల పరిష్కారానికి తహసీల్దార్‌కు సహకారంగా మూడు బృందాలను ఏర్పాటుచేయాలని కలెక్టర్ సూచించారు. పైలెట్ ప్రాజెక్టు మండలంలో చూపిన భూ సమస్యల పరిష్కారాలే జూన్ 2వ తేదీ తర్వాత నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలకు వర్తిస్తాయన్నారు. అందుకే ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని జాగ్రత్తగా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ రాంచందర్ నాయక్, భూ భారతి ప్రత్యేకాధికారి యాదగిరి, సర్వే ల్యాండ్ ఏడీ గిరిధర్, మద్దూరు, కొత్తపల్లి, కోస్గి తహసీల్దార్లు మహేశ్‌గౌడ్, జయరాములు, బక్క శ్రీనివాస్, డీటీ వసుదేవరావు తదితరులు ఉన్నారు. భూ భారతి పైలెట్ ప్రాజెక్టుపైకలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష -
స్థానికంగానే పరిశ్రమ ఏర్పాటుచేయాలి..
ప్రభుత్వం అందించిన రాయితీ ప్రోత్సాహం, అధికారుల సహకారంతో 7 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుచేశాను. ఇటీవల గెలలను కోసి అశ్వారావుపేటకు తరలించాను. స్థానికంగానే పరిశ్రమ ఉంటే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్, రైతు, గూడెబల్లూరు, మాగనూర్ మండలం రైతులను ప్రోత్సహిస్తున్నాం.. జిల్లాలో ప్రస్తుతం 6వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవుతోంది. మరో 4వేల ఎకరాల్లో సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. 10వేల ఎకరాలు పూర్తిచేస్తే మన జిల్లాలోనే పరిశ్రమ ప్రారంభమవుతుంది. ఇటీవల ధర భాగా పెరిగిన పరిస్థితుల్లో రైతులు ఆయిల్‌పాం సాగుపై దృష్టిసారించాలి. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. – చంద్రశేఖర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, నారాయణపేట త్వరలో ఇబ్బందులు తీరుతాయి.. ఆయిల్‌ఫెడ్ జీఎం అందించిన సమాచారం మేరకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్ద 95 ఎకరాల్లో, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో 40 ఎకరాల్లో ఆయిల్‌పాం పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం చిత్తనూర్ వద్ద 80 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటుకు స్థలం సేకరణలో దాదాపు కొలిక్కి వచ్చింది. మరో కొన్ని నెలల్లో రైతులు స్థానికంగానే పంటను విక్రయించవచ్చు. – సమీనా బేగం, జిల్లా ఆయిల్‌ఫెడ్ ఇన్చార్జి, నారాయణపేట ● -
‘మల్లమ్మకుంట’పై నీలినీడలు..!
రాజోళిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్).. దశాబ్దాల కాలంగా నీటి వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ, కర్ణాటక మధ్య నీటి వాటాల స్థిరీకరణతోపాటు తెలంగాణ ప్రాంతానికి నీటి కేటాయింపుల్లో వివక్షపై జగడాలు కొనసాగాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇదే కీలకాంశంగా మారగా.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సైతం మునుపటి పరిస్థితులే నెలకొన్నాయి. ప్రస్తుతం మూడు రాష్ట్రాల సమస్యగా మారింది. ఇది ఒకవైపు కాగా.. మరోవైపు తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా వెనుకబడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని ఆర్డీఎస్ ఆయకట్టును పూర్తిస్థాయిలో సస్యశ్యామలం చేయాలనే లక్ష్యం మాటలకే పరిమితమైంది. ఈ ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించాల్సిన రిజర్వాయర్లపై ఏళ్ల తరబడి సందిగ్ధత వీడకపోవడం.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త ప్రతిపాదనలు తెరపైకి రావడం వంటి కారణాలు అనిశ్చితికి కారణమవుతున్నాయి. సరైన ప్రణాళిక లేమి.. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం వెరసి మల్లమ్మకుంట రిజర్వాయర్‌పై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ రిజర్వాయర్‌కు గ్రీన్‌సిగ్నల్.. అంతలోనే.. రిజర్వాయర్లు నిర్మిస్తే తప్ప పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు మొరపెట్టుకున్నారు. స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రిజర్వాయర్లలో రూ.520 కోట్ల వ్యయంతో 1.2 టీఎంసీల సామర్థ్యంతో మల్లమ్మకుంట నిర్మాణానికి మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తుమ్మిళ్ల లిఫ్ట్‌లో కీలకమైన ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అధికారులు చేపట్టిన భూసర్వేకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. మొత్తం 567 ఎకరాలు అవసరమని అధికారులు నివేదికలు రూ పొందించారు. పెగ్ మార్కింగ్ పనులు నిర్వహిస్తున్న క్రమంలో రైతులు అడ్డుకున్నారు. పూర్తి నష్టపరిహారం ఇచ్చి.. న్యాయం చేశాకే పనులు మొదలుపెట్టాలని ఆందోళనలకు దిగారు. ● ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి కలెక్టర్‌కు లేఖ రాయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం వల్ల 250 మంది దళిత రైతులు భూములు కోల్పోతారని.. దాన్ని రద్దు చేయాలని ఆయన గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్‌కు లేఖ రాయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఈ మేరకు ఆయన నీటిపారుదల శాఖ ఎస్ఈకి లేఖ రాయడం.. ఆ అధికారి పైఅధికారికి నివేదికలు సమర్పించడం.. కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం హాట్‌టాపిక్‌గా మారింది. మల్లమ్మకుంట రిజర్వాయర్‌పై నీలినీడలు కమ్ముకోగా.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పేరుకే 87,500 ఎకరాలు.. నిజాం కాలంలో కర్ణాటక పరిధిలోని రాజోళిబండ సమీపంలో తుంగభద్రపై ఆనకట్ట నిర్మించిన విషయం తెలిసిందే. తెలంగాణకు సంబంధించి నడిగడ్డ ప్రాంతంలో 87,500 ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ఆనకట్ట ఎడమవైపున 143 కిలోమీటర్ల కాల్వ (ఆర్డీఎస్ కెనాల్) నిర్మాణం పూర్తి చేశారు. అయితే 20 ఏళ్లుగా ఏనాడూ పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరందలేదు. పంటలు సాగుచేయడం.. నీరందక అవి ఎండిపోవడం.. రైతులు నష్టాల పాలవడం పరిపాటిగా మారింది. కనీసం 30 వేల ఎకరాలకు నీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆర్డీఎస్ ఆయకట్టును పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం 2017లో తుమ్మిళ్ల లిఫ్ట్‌తో పాటు ఇటిక్యాల మండలం వల్లూరు, వడ్డేపల్లి మండలం జూలకల్, తనగల వద్ద మల్లమ్మకుంట వద్ద మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించిన ఫేస్–1, 2 పనులకు జీఓ 429 జారీ చేసింది. 9.6 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం చేపట్టి.. తనగల సమీపంలోని డిస్ట్రిబ్యూటరీ 23 వద్ద డెలివరీ సిస్టమ్ ద్వారా తుంగభద్రలోని నీటిని తోడి ఆర్డీఎస్ కెనాల్‌కు మళ్లించేందుకు శ్రీకారం చుట్టింది. ఏడాది లోపే తుమ్మిళ్ల లిఫ్ట్‌ను రూ.190 కోట్లతో ఏర్పాటు చేసి.. కెనాల్‌కు నీటిని పంపింగ్ చేశారు. కానీ రిజర్వాయర్ల నిర్మాణం అటకెక్కింది. రిజర్వాయర్ నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు కలెక్టర్‌కు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి లేఖతో దుమారం అలంపూర్ పరిధిలోని ఆయకట్టు రైతుల్లో ఆందోళన చిన్నోనిపల్లి, ఆర్డీఎస్కు లింక్ అంటూ తెరపైకి కొత్త ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్న అన్నదాతలు.. కాంగ్రెస్‌లో భిన్నస్వరాలు -
ఆయిల్‌పాం కష్టాలు తీరేనా?
ఉమ్మడి జిల్లాలో పంట కోతలు షురూ ● గెలల విక్రయానికి అశ్వారావుపేటకు వెళ్లాల్సిందే.. ● స్థానికంగా ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉంటేనే రైతులకు ప్రయోజనం ● ఉమ్మడి జిల్లాలో 28,999 ఎకరాల్లో సాగు నర్వ: దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం వంటి కారణాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. డిమాండ్ మేర నూనె గింజల ఉత్పత్తే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు అనువైన నేలలు ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభంలో కాస్త వెనకబడినా.. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం పరిశ్రమ లేకపోవడంతో రైతులు పంటను విక్రయించేందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా.. 2020–21 సంవత్సరం ప్రారంభంలో ఉమ్మడి జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కాగా.. 430 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పాం సాగుకు శ్రీకారం చుట్టగా.. అధికారులు 4,60,000 మొక్కలను దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 28,999 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవుతోంది. నారాయణపేట జిల్లాలో 5,907 ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. జిల్లాలో ఆయిల్‌పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు ఆయిల్‌పాం గెలలను తరలించాల్సి వస్తోంది. లాభసాటిగా ధరలు.. ఈ ఏడాది ఆయిల్‌పాం ధర పెరిగింది. గతేడాది టన్నుకు రూ. 11వేల నుంచి రూ. 14వేల వరకు ధర ఉండేది. ప్రస్తుతం టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 21వేల వరకు ధర పలుకుతోంది. దీంతో ఆయిల్‌పాం రైతులకు లాభసాటిగా మారింది. ఏడాది పాటు కాపు కాస్తుండటంతో రైతులు గెలలను విక్రయించేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే ప్రతి 30 కి.మీ. ఒక సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. చిగురిస్తున్న ఆశలు.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించింది. అయితే కొత్త పాలకవర్గం ఆయిల్‌పాం సాగుకు కొత్త జనసత్వాలు నింపేందుకు చర్యలు తీసుకోవడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల నారాయణపేట జిల్లాలో చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించి.. రూ. 300 కోట్లతో ఆయిల్‌పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమ ఏర్పాటుపై జాప్యం చేయవద్దని రైతులు కోరుతున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడి.. ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 25వేలకు పైగా ఎకరాల్లో పంట కోతలు చేపట్టినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో 130 ట న్నులు, వనపర్తిలో 600, జోగుళాంబ గద్వా లలో 300, మహబూబ్‌నగర్ జిల్లాలో 260 ట న్నుల దిగుబడి రాగా.. నాగర్‌కర్నూల్ జిల్లా లో ఇప్పడిప్పుడే పంట కోత ప్రారంభమైంది. పరిశ్రమలు ఉంటేనేప్రయోజనం పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో కత్తిరించిన గెలలను గంటల వ్యవధిలోనే పరిశ్రమలో ప్రాసెసింగ్ చేస్తే ఎక్కువ స్థాయిలో నూనె వస్తుంది. జిల్లాలో తెంపిన గెలలను అశ్వారావుపేటకు తీసుకెళ్లేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగానే పరిశ్రమలు అందుబాటులో ఉంటే ప్రయోజనం కలుగుతోందని రైతులు అంటున్నారు. -
రెండు రోజుల్లో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బోయపల్లి (డివిజన్ నం.16), హనుమానున్నగర్–న్యూగంజి (డివిజన్ నం.47)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన చోట ఎక్కువ సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు. కాగా, ఆయా ప్రాంతాల్లో దరఖాస్తుదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ఎల్–1 కింద 1,400 ఇళ్లు కేటాయించారు. అయితే సుమారు రెండు వేల మంది నుంచి దరఖాస్తులు అందగా, క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీ చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. తొలిరోజు ప్రశాంతంగా ఎప్‌సెట్ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా తొలిరోజు ఎప్‌సెట్ ప్రశాంతంగా జరిగింది. మంగళవారం ఉదయం అగ్రికల్చర్– ఫార్మసీకి సంబంధించి రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని ఫాతిమావిద్యాలయం, జేపీఎన్సీలలో పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేయగా, ఉదయం 280, మధ్యాహ్నం 265 మంది విద్యార్థులు హాజరయ్యారు. రామన్‌పాడులో 1,015 అడుగులు మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం నీటిమట్టం సముద్ర మట్టానికి ఎగువన 1,021 అడుగు లకుగాను 1,015 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని.. జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసె క్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు. మొక్కజొన్న @ రూ.2,266 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి యార్డుకు మంగళవారం పంట దిగుబడులు పోటెత్తాయి. 4,600 క్వింటాళ్ల మొక్కజొన్న, 5,050 క్వింటాళ్ల ధాన్యం విక్రమానికి వచ్చింది. మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,266, కనిష్టంగా రూ.1,501, వేరుశనగ గరిష్టంగా రూ.5,641, కనిష్టంగా రూ.4,329, జొన్నలు గరిష్టంగా రూ.2,627, కనిష్టంగా రూ.2,227, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,931, కనిష్టంగా రూ.1,802, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,309, కనిష్టంగా రూ.1,801, పెబ్బర్లు రూ.4,404 ధరలు లభించాయి. ● దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,141, కనిష్టంగా రూ.1,879, హంస గరిష్టంగా రూ.1,809, కనిష్టంగా రూ.1,800గా ధరలు నమోదయ్యాయి. -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
నారాయణపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని టీపీసీసీ పరిశీలకులు వేణుగౌడ్, సంధ్యారాణి అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరజాన్ సూచన మేరకు పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే నెల 20వ తేదీలోగా కమిటీల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కులాల వారీగా అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇదివరకు నామినెటేడ్ పద్ధతిలో పార్టీ అధ్యక్షుల నియామకం జరిగిందని.. ఇప్పుడు పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు కష్టపడిన వారిని గుర్తిస్తూ.. నేరుగా పదవులకు పోటీచేసే విధంగా పార్టీ అవకాశం కల్పించిందన్నారు. పార్టీ కోసం పూర్తి సమయం కేటాయించి.. పార్టీ బాధ్యతలు నిర్వర్తించే సత్తా ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ పదవులు దక్కని వారికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత మండల, పట్టణ అధ్యక్షులు పదేళ్లుగా కష్టపడి పనిచేశారని, వారి కృషి ఫలితంగానే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అలాంటి వారిని పక్కన పెట్టవద్దని కోరారు. కష్టపడిన వారికి మళ్లీ అవకాశం కల్పించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కష్టపడిన ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను ప్రతి గ్రామంలో చేపట్టి.. రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడులను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, పార్టీ నాయకులు బాలకృష్ణారెడ్డి, కొత్తకోట సిద్దార్థరెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రసన్నరెడ్డి, ఎండీ సలీం, నరహరి, వీరన్న, సూర్యమోహన్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, నర్సింహ, రవికుమార్, యఘ్నేశ్వర్‌రెడ్డి, చంద్రకాంత్‌గౌడ్, బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, గందె చంద్రకాంత్ తదితరులు ఉన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతంచేసేందుకు కొత్త కమిటీలు టీపీసీసీ పరిశీలకులు వేణుగౌడ్, సంధ్యారాణి -
భూ భారతిపై విస్తృత చర్చ అవసరం
మాగనూర్/కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై విస్తృత చర్చ జరగాలని, తద్వారా చట్టంపై అవగహన కలిగి సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం మాగనూర్, కృష్ణాలో నిర్వహించిన మాగనూర్ భూభారతి అవగహన సదస్సుకు వారు హాజరయ్యారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సదస్సును ప్రారంభించారు. చట్టం విధి విధానాలపై అధికారులు రైతులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి చట్టంలో లేని అనేక నిబంధనలను 1971 రెవెన్యూ చట్టంలోని మంచి ఆంశాలను తీసుకుని రైతులకు లబ్ధి చేకూర్చేలా భూభారతి చట్టాన్ని రూపొందించారన్నారు. భూభారతి ద్వారా రైతులకు వారి భూములపై అన్ని రకాల హక్కులు కల్పించబడాయన్నారు. గ్రామాల్లో ప్రజలు తమ సమస్యలు ఏవి ఉన్నా జూన్ 2 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి అక్కడ వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారని, వాటిని 30 రోజుల్లో వాటిని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. కొత్త చట్టంతో రైతుల పాలిట వరం : ఎమ్మెల్యే భూ భారతి చట్టం రైతుల పాలిట వరం అని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో అనేక అవస్థలు పడ్డ రైతులకు భూభారతితో మేలు చేకూరనుందని వెల్లడించారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారని, భూ సమస్యలు పరిష్కరించడమే కాకుండా వారికి భూధార్ కార్డును కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. కొత్త చట్టం ప్రకారం కింది స్థాయి అధికారుల వద్ద తప్పు జరగితే పైస్థాయి అధికారులు న్యాయం చేసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్కూమార్, ఆర్డీఓ రాంచందర్, తహసీల్దార్లు సురేష్‌కుమార్, వెంకటేష్, ఎంపీడీఓలు జానయ్య, రహ్మతుద్దీన్ పాల్గొన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయండి ఆదివారం మాగనూర్ మండల వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన ఆకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి షరుతులు లేకుండా కోనుగులు చేయాలని మండల రైతులు జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. ముఖ్యంగా మండలంలో గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని, రైతులకు లారీలు రావాలంటే రూ.5 వేల వరకు లంచం ఇవ్వాల్సిందేనని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు 7 లక్షల టన్నులు జరిగాయని, మిగిలిన 8 లక్షల గన్నీ బ్యాగులు ఏమయ్యాయని ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యంపై సత్వరమే ఎంకై ్వరి చేస్తామని కలెక్టర్ రైతులకు తెలిపారు. మాహబూబ్నగర్, గద్వాల జిల్లాల నుండి మరో 4 లక్షలకు పైగా గన్నీ బ్యాగులు తీసువస్తామని, లారీల కొరత లేకుండా చూస్తామన్నారు. తడిసిన ధాన్యంను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడుతామని తెలిపారు. -
10 రోజులుగా తిరుగుతున్నా..
12 ట్రాక్టర్ల ధాన్యం ఆరబెట్టి పది రోజులవుతుంది. ఆ రోజు నుంచి సంచుల కోసం తీలేర్ కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నాను. ఇంకా సంచులు రాలేదు.. వస్తే ఇస్తామని చెప్పి పంపిస్తున్నారు. సకాలంలో సంచులు ఇవ్వకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుంది. మళ్లీ ఆరబెట్టి రాశులుగా పోసి కవర్లు కప్పి ఉంచాం. త్వరగా సంచులు ఇచ్చి ధాన్యం తరలించేందుకు అధికారులు చొరవ చూపాలి. – దూలప్ప, రైతు, రాకొండ అధికారుల పొరపాటు వల్లే.. పంట కోత వేయక ముందే రాజకీయ బ లం ఉన్నా రైతులకు ముందే సంచులు ఇ వ్వడం వల్ల తమలాంటి ధాన్యం ఆరబెట్టిన రైతులకు సంచులు దొరకడం లేదు. రోజుల తరబడి సంచుల కోసం కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నాం. ఆరిన ధాన్యం పరిశీలించిన తర్వాతనే సంచులు ఇవ్వాలి. కానీ అధికారులు చేసే పొరపట్ల వల్ల ఇతర రైతులకు నష్టం జరుగుతుంది. – శ్రీనివాసులు, రైతు, పెద్దచింతకుంట 25 లక్షల బ్యాగులు పంపిణీ చేశాం.. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి వరకు 25 లక్షల గన్నీ బ్యాగులను అందజేశాం. అయితే రైతులు పంటలు కోత వేయక ముందే సంచులు తీసుకెళ్లడం వల్ల ఇతర రైతులకు సంచులు దొరకడం లేదు. ఆ పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటాం. రెండు రోజుల్లో మరో 5 లక్షల గన్నీ బ్యాగులను తెప్పించి రైతులకు కొరత లేకుండా చూస్తాం. – సైదులు, జిల్లా సివిల్ సప్లయ్ డీఎం ● -
సద్వినియోగం చేసుకోవాలి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్స్ అందజేస్తున్నాం. 25 శాతం రాయితీ గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ ప్రక్రియపై ఎలాంటి సందేహాలున్నా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే దరఖాస్తుదారులకుసమాచారం ఇవ్వడం జరిగింది. – యాదయ్య, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట ● -
గన్నీబ్యాగుల కోసం రాస్తారోకో
● రహదారిపై స్తంభించిన ట్రాఫిక్ ● కార్యాలయం నుంచి నేరుగా రహదారిపైకి చేరిన రైతులు మక్తల్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు గన్నీబ్యాగులు దొరకక రైతులు ప్రతిరోజు కార్యాలయం చుట్టు తిరిగే పరిస్థితి ఏర్పడింది. సోమవారం దాదాపు 40 వేల బ్యాగులు వచ్చాయని రైతులకు సమాచారం తెలియడంతో టోకన్లు ఇచ్చి రైతులు సింగిల్ విండో కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. గన్నీ బ్యాగులు తమకు సరిపోవడం లేదని, ఏకంగా రైతులు అంబేడ్కర్ చౌరస్తా వరకు చేరుకొని అక్కడ రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో మక్తల్ సీఐ రాంలాల్, మక్తల్ ఎస్ఐ–2 ఆచారి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి రాస్తారోకో విరమింప చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని అధికారులు చెప్పడంతో రాస్తారోకో విరమించారు. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ కింద ఆయకట్టు సాగు పెరిగి ధాన్యం పండించడంతో గన్నీ బ్యాగులు కరువయ్యాయి. కొనుగోల కేంద్రాలకు వెళ్లాలంటే బ్యాగుల కొరత అధికంగా ఉండంతో ఎండలో ఆరబోసిన వరిధాన్యం వర్షంలో తడిసి ముద్దాయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అధికారులు పర్యటించి రైతులకు టోకన్ ఇవ్వడం జరుగుతుందని, దాని ప్రకారం గన్నీ బ్యాగులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆదివారం కురిసిన వర్షాలకు వరిధాన్యం తడిసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గంటల తరబడి కార్యాలయం చుట్టు తిరుగున్నా, తమ సమస్యలు ఎవరూ పరిష్కరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. -
గన్నీ బ్యాగుల కొరత.. రైతుల కలత
తీలేర్ కొనుగోలు కేంద్రం వద్ద సంచుల కొరత కారణంగా ఆరుబయట ఉంచిన ధాన్యం రాశులు మరికల్: యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో గన్నీ బ్యాగుల కొరత త్రీవంగా వేధిస్తోంది. దీంతో పొలాలు, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం నింపడం కోసం సంచులు లేక అవస్థలు పడుతున్నారు. మరోపక్క నిత్యం సంచుల కోసం రైతులు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది యాసంగి వరి ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారింది. పలు కేంద్రాల్లో రైతులు గన్నీ బ్యాగుల కొరత ఉండగా మరికొన్ని కేంద్రాల్లో సంచులకు నింపిన ధాన్యం తరలించేందుకు లారీలు రావడం లేదు. వీటికి తోడు రైస్ మిల్లుల వద్ద కూడా కూలీల కొరత ఉండటం వల్ల ధాన్యం అన్లోడ్ చేయడం కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లాలో 1.50 లక్షల మేట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు గాను 35 లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉండగా ప్రస్తుతానికి 25 లక్షల సంచులను అధికారులు రైతులకు అందజేశారు. ఇదిలాఉండగా, జిల్లాలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాలు, రోడ్ల వెంట ధాన్యం ఆరబోయగా.. ఏ నిమిషంలో వర్షం పడుతుందో, ఎక్కడ ధాన్యం తడిసిపోతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరగా గన్నీ బ్యాగులు అందించి ఉంటే ఇప్పటికే ధాన్యం విక్రయించేవారమని, ఇకనైనా జిల్లా అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. కారణం ఇదేనా.. జిల్లాలో ఏర్పాటు చేసిన 102 కొనుగోలు కేంద్రాలకు దశల వారీగా అధికారులు గన్నీ బ్యాగులను అందజేశారు. ఇప్పటి వరకు 25 లక్షల సంచులను రైతులకు చేరవేశారు. అయితే కొందరు రైతులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పంటలను కోత కోయకముందే ముందు జాగ్రత్తగా టోకెన్లు రాయించుకొని సంచులను తీసుకెళ్లారు. దీంతో రోజుల తరబడి ధాన్యం ఆరబెట్టిన రైతులకు మాత్రం సంచులు దొరకడం లేదు. ఆరిన ధాన్యం రాశులను పొలాలు, కొనుగోలు కేంద్రాల వద్దనే నిల్వ చేసుకున్నారు. ఒక్కో రైతు పది రోజుల నుంచి సంచుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సంచుల కోసం వెళ్లిన ప్రతిసారి ఇప్పుడు, అప్పుడంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలను కోత వేయకముందే సంచులు తీసుకెళ్లడంతో ధాన్యం ఆరబెట్టిన రైతులకు సంచులు కొరత ఏర్పడటానికి కారణమైందని అధికారులు చెబుతున్నారు. అరకొర బ్యాగులతో ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు కల్లాలు, కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోతున్న ధాన్యం రాశులు సంచులు, లారీల కోసం రైతులఎదురుచూపులు 35 లక్షలకు.. వచ్చినవి 25 లక్షలే.. -
ట్రైనీ కలెక్టర్‌గా ప్రణయ్‌కుమార్
నారాయణపేట: జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా 2024 తెలంగాణ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కొయ్యాడ ప్రణయ్ కుమార్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈమేరకు ఆయన సోమవారం కలెక్టర్ సిక్తాపట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు చేపట్టారు. జిల్లాపై అవగాహన కలిగి అభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సూచించారు. ‘ప్రజావాణి’కి34 ఫిర్యాదులు నారాయణపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 34 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ బెంషాలం వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ‘ఎల్ఆర్ఎస్’ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి నారాయణపేట: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రకటించిన 25శాతం ఫీజు రాయితీని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రాయితీ గడువు ఈ నెల ఈనెల 30 వరకు ఉంటుందని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీ గడువుకు మళ్లీ పొడగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. బాల్య వివాహాలను అరికట్టాలి నారాయణపేట: జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 30న బసవ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే బసవ జయంతి రోజున ఎక్కువగా వివాహాలు జరుగుతాయని, ఇదే సమయంలో బాల్యవివాహాలు జరిగే అవకాశం ఉందని, బాల్య వివాహాలు జరగకుండా అధికారులు నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎవరైన బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ నెల 30 న ఎక్కడైనా బాల్య వివాహం చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే హెల్ప్ లైన్ 1098 కి కాల్ చేయాలని ప్రజలను కోరారు. పెసర క్వింటాల్ రూ.7,651 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పెసర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,651, కనిష్టంగా రూ.6,225 ధర పలికింది. అలాగే, జొన్నలు గరిష్టంగా రూ.3,555, కనిష్టంగా రూ.3,425, వడ్లు హంస క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,771, కనిష్టంగా రూ.1,610, వడ్లు సోనా గరిష్టంగా రూ.2,186, కనిష్టంగా రూ.1,455, ఎర్ర కందులు గరిష్టంగా రూ.6,919, కనిష్టంగా రూ.6,829, తెల్ల కందులు గరిష్ట, కనిష్టంగా రూ.7,019 ధర పలికాయి. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,261 జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డులో సోమవారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,261, కనిష్టంగా రూ.1,469 ధరలు లభించాయి. అలాగే వేరుశనగ గరిష్టంగా రూ.5,789, కనిష్టంగా రూ.4,121, ఆముదాలు గరిష్టంగా రూ.6,110, కనిష్టంగా రూ.4,600, జొన్నలు గరిష్టంగా రూ.4,107, కనిష్టంగా రూ.2,001, ధాన్యం హంస గరిష్టంగా రూ.2,015, కనిష్టంగా రూ.1,809, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,369, కనిష్టంగా రూ.1,803 పలికాయి. ఆర్ఎన్ఆర్ రూ.2,201 దేవరకద్ర మార్కెట్ యార్డులో జరిగిన ఈ టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,201, కనిష్టంగా రూ.1,862 ధరలు లభించాయి. -
రజతోత్సవ సభతో రాజకీయాల్లో పెనుమార్పు
నారాయణపేట: బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు తీసుకువస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జెండాను ఆయన ఆవిష్కరించారు. కార్యకర్తలు, నాయకులు జై బీఆర్ఎస్.. జైతెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలో వరంగల్‌కు నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రత్యేక వాహనాలలో గులాబీ దండు కదిలిందన్నారు. 10 లక్షల మందితో జరిగే రజతోత్సవ మహాసభపై యావత్ ప్రపంచం ఇంత పెద్ద ఎత్తున ఎలా చేస్తారని ఎదురుచూస్తున్నరన్నారు. తెలంగాణను కదిలించే ప్రయత్నం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తారని అన్నారు. అనంతరం నియోజకవర్గం నుంచే 30 బస్సులు, 155 వాహనాలలో 3300 మంది వరంగల్ సభకు తరలివెళ్లారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ మాజీ వైస్చైర్మన్లు కన్నాజగదీశ్, చెన్నారెడ్డి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు వేపూరి రాములు, విజయ్‌సాగర్, నాయకులు ప్రతాప్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిళ్లకు తలొగ్గి..
ప్రైవేట్ కళాశాలల సూచనలతో డిగ్రీ సెమిష్టర్ పరీక్షలు వాయిదా ● 9 రోజులపాటు నిలిపివేయడంతో పీజీసెట్, లాసెట్పై ప్రభావం ● అప్లియేషన్, ర్యాటిఫికేషన్ ప్రక్రియపై పట్టింపులేని వైఖరి ● ఆదేశాలను బేఖాతరు చేస్తున్న యాజమాన్యాలు ● పీయూ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలుఇబ్బందులు రానివ్వం.. ప్రైవేటు కళాశాలలకు ఎట్టి పరిస్థితిలోనూ ర్యాటిఫికేషన్, అప్లియేషన్ ఇన్స్పెక్షన్ చేపడతాం. వీటికోసం ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. అలా చేస్తేనే దోస్త్‌లో అడ్మిషన్లు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సమస్యలు ఉన్న కారణంగా వాయిదా వే సిన పరీక్షలను వచ్చేనెలలో నిర్వహిస్తాం. వి ద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – రమేష్‌బాబు, పీయూ రిజిస్ట్రార్ షెడ్యూల్ ప్రకారమే.. అసలు యూనివర్సిటీ అధికారులు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఎందుకు తలొగ్గి.. పరీక్షలు వాయిదా వేశారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుంది కాబట్టి కచ్చితంగా వాటిని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలి. అలాగే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటి ప్రక్రియలు వెంటనే పూర్తిచేయాలి. – రాము, యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వింత ధోరణి నడుస్తోంది. ప్రైవేట్ కళాశాలలను నియంత్రించాల్సిన యూనివర్సిటీ అధికారులు.. ఏకంగా వారి ఒత్తిళ్లకే తలొగ్గి పనిచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు. ఈ నెల 28 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు 2, 4, 6 నిర్వహిస్తున్నట్లు గతంలో సర్క్యులర్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బ్రాంచ్ విడుదల చేయగా.. ఈ నెల 25న వాటిని వాయిదా వేస్తున్నట్లు మరో సర్క్యులర్ జారీ చేశారు. దీనికి కారణం ‘ప్రైవేట్ కళాశాలల విజ్ఞప్తి మేరకు’ మాత్రమే వాయిదా వేసినట్లు అందులో పేర్కొనడం గమనార్హం. సాధారణంగా పరీక్షలు వాయిదా వేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పోటీ పరీక్షలు, సెలవుల దృష్ట్యా మాత్రమే వాయిదా వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిళ్లతో వాయిదా వేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనందుకే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. విద్యార్థులకు తీవ్రనష్టం.. పీయూ పరిధిలో యూజీ, పీజీ, బీఈడీ తదితర అన్ని కళాశాలలు కలిపి 102 ఉండగా.. వీటిలో సుమారు 22 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీ పూర్తయిన వెంటనే పీజీలో పీజీ సెట్, లా సెట్, ఎంబీఏ వంటి కోర్సులలో ప్రవేశాలకు విద్యార్థులు సిద్ధం కావాల్సి ఉంది. ఎంట్రెన్స్‌లకు చదివేందుకు కనీసం 15 రోజుల సమయం కూడా సరిపోదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయడం వల్ల ఫలితాలు, మెమోల జారీ వంటి ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని.. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు తీవ్రనష్టం జరుగుతుందని వాపోతున్నారు. యథావిధిగా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాయిదా వేసిన డిగ్రీ పరీక్షలను అధికారులు వచ్చే నెల 6 నుంచి నిర్వహించనున్నారు. ర్యాటిఫికేషన్ కోసం.. పీయూ పరిధిలోని అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ర్యాటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఈ నెల 23 చివరి తేదీ కాగా.. 24 నుంచి 30 వరకు అన్ని కళాశాలల యాజమాన్యాలు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను అధికారులకు సమర్పించాలని ఈ నెల 7న యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వీటితోపాటు కళాశాలల్లో వసతులపై ఇన్స్పెక్షన్ చేయించుకోవాలని సూచించింది. అయితే అధికారుల సూచనల ప్రకారం కొన్ని కళాశాలలు మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. మరికొన్ని కళాశాలలు వాటిని పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాలల అప్లియేషన్ చివరిసారిగా 2022లో నిర్వహించగా.. తర్వాత గత వీసీ హయాంలో ప్రైవేటు కళాశాలలు అప్లియేషన్, ర్యాటిఫికేషన్ వంటి వాటి జోలికి వెళ్లలేదు. ప్రస్తుతం కొత్త వీసీ వచ్చాక పరిస్థితిలో మార్పు వస్తుందని భావించినా.. గతంలో మాదిరిగానే వాటిని మూలకు పెట్టినట్లు తెలుస్తోంది. ఉద్యమం చేపడుతాం.. ప్రైవేటు కళాశాలలకు రీయింబర్స్మెంట్ రాకుంటే పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నష్టం చేస్తారా.? పీయూ అధికారుల ఈ తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రైవేటు కళాశాలల్లో వసతులు మెరుగుపడాలంటే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటివి చేపట్టాల్సిందే. పీయూ అధికారులు తీరు మార్చుకోకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతాం. – నాగేష్, యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు -
సాంకేతిక వ్యవస్థపైఅవగాహన కలిగి ఉండాలి
నారాయణపేట: జిల్లా పరిధిలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నూతన సాంకేతిక వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీతో తయారుచేసిన సిసిటిఎన్ ఎస్ 2.0 వెర్షన్ పై ప్రతి ఒక్కరు అవగాహన ఉండాలన్నారు. పెండింగ్ కేసులను తగ్గించేందుకు అధికారులు సమర్థవంతంగా కోర్టు డ్యూటీ అధికారులతో, న్యాయ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. పోక్సో ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన, సత్వర సేవలు అందించాలని, వేసవికాలంలో చాలామంది సొంతూళ్లకు వెళ్తుంటారని, పెట్రోల్ కార్ మొబైల్స్, బ్లూ కోట్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించి నేరాలు జరగకుండా కాలనీలో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలపై పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే, 2025లో 9 కేసులలో నేరస్తులకు శిక్ష పడ్డాయని (కన్వేషన్స్) అందులో నాలుగు కేసులలో నేరస్తులకు యావజ్జీవ శిక్ష పడడం జరిగిందని ఆ కేసుల్లో కృషి చేసిన వారిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, రామ్‌లాల్, రాజేందర్‌రెడ్డి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జడ్జిని కలిసిన ఎస్పీ నారాయణపేట: జిల్లా నూతన జడ్జి బోయ శ్రీనివాసులును శనివారం ఎస్పీ యోగేష్ గౌతమ్, డీఎస్పీ ఎన్ లింగయ్య పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో నేరాల నమోదు, దర్యాప్తు, కోర్టు క్యాలెండర్ నంబర్, కేసు ట్రయల్స్ లోక్ అదాలత్ నిర్వహణ, కేసులలో నేరస్తులకు శిక్షల అమలు తదితర అంశాలపై చర్చించారు. కోర్టు అధికారులు పోలీసులు సమన్వయంతో పనిచేసి త్వరగా కేసుల పరిష్కారం చూపాలని జడ్జి సూచించారు. వారితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుల బాలప్ప ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలి ● ఎంపీ డీకే అరుణ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల సమయంలో అధ్యాపకులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. పీయూలో కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అధ్యాపకులకు ఎంపీ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రారంభం నుంచి పనిచేస్తున్న అధ్యాపకులకు వెంటనే న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే అధ్యాపకులకు పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం దారణమైన విషయమన్నారు. సెట్, నెట్, పీహెచ్డీ ఉన్న అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని, జీఓ నంబర్ 21ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీరి క్రమబద్ధీకరణ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే యూజీసీతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. భూమయ్య, శ్రీధర్‌రెడ్డి, వేణు, ఈశ్వర్ పాల్గొన్నారు. -
రికార్డుల నిర్వహణపై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం
ధన్వాడ: గన్నీ బ్యాగులు తక్కువ ఉన్నాయని చెబుతున్నారు కానీ రికార్డు ప్రకారం ఇంక మీ వద్ద 50వేల బ్యాగులు ఉండాలి.. ఎక్కడ ఉన్నాయి.. రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపడితే ఇలాంటి పొరపాట్లు జరగవు కదా అని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారులపై అడిషనల్ కలెక్టర్ బేన్ షేలం ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగుల కొరత ఉందని తెలియడంతో శనివారం ధన్వాడ సింగిల్‌విండో కార్యాలయాన్ని ఆయన సందర్శించి అధికారులతో వివరాలు సేకరించారు. ఇప్పటివరకు 73వేల గన్నీ బ్యాగులు వచ్చాయని, 80వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించామని తెలిపారు. దీంతో 80వేల క్వింటాళ్లకు 20వేల బ్యాగులు సరిపోతాయని, మిగతా బ్యాగులు ఎక్కడ ఉన్నాయి, ఇలా తప్పుడు లెక్కలు రాస్తూ, ఇష్టానుసారంగా వ్యవహిరిస్తే రైతులు ఇబ్బందులు పడరా అని ప్రశ్నించారు. అనంతరం గోటూర్లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వారం రోజులుగా లారీలు రాకపోవడంతో ఎదురుచూస్తున్నామని రైతులు తెలపగా.. వెంటనే లారీలను ఏర్పాటు చేయాలని సివిల్ సప్లె అధికారులకు సూచించారు. -
నిబంధనల మేరకే ఇసుక రవాణా
నారాయణపేట: జిల్లాలో గుర్తించిన ప్రాంతాలలో టీజీఎండిసి ద్వారా నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో డిస్టిక్ లెవెల్ స్యాండ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. మాగనూర్ మండలం అడవి సత్యవార్‌కు చెందిన నలుగురు రైతులు, వర్కూర్కు చెందిన మరో రైతు తమ పట్టా భూముల నుంచి ఇసుకను తొలగించాలని దరఖాస్తు చేసుకోగా ఆ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఇసుక తరలింపు విషయంలో ఇతర శాఖల అధికారుల నివేదికలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మైనింగ్ ఏడి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇసుక తొలగించేందుకు అనుమతులు ఇవ్వవచ్చని తెలపగా.. కలెక్టర్ అంగీకరించారు. ఇసుక తరలించే ప్రాంతాలలో సీసీ కెమెరాలు, వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ రీచ్‌ల నుంచి రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిఘా పెట్టాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ బేన్ షాలోమ్, ఆర్డీఓ రామచందర్ నాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, అధికారులు పాల్గొన్నారు. భూ భారతితో శాశ్వత పరిష్కారం కొత్తపల్లి: ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలకు నూతన భూ భారతి చట్టంతో పరిష్కారం లబిస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం కొత్తపల్లిలో ఏర్పాటుచేసిన భూ భారతి అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కొత్త చట్టం ద్వారా అధిక శాతం భూ సమస్యలు తహసీల్దార్ వద్దే పరిష్కారం అవుతాయని, వారసత్వంగా వచ్చే భూముల బదలాయింపు 30 రోజుల్లో పరిష్కారం అవుతాయని తెలిపారు. 2014 కంటే ముందుగా సాదా కాగితాలపై కొన్న భూములు, ప్లాట్లు భూ భారతిలో పరిష్కారం అవుతాయని, ఈ సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక సిద్దం చేయాలని తహసిల్దార్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్,తహసీల్దార్ జయరాములు పాల్గొన్నారు. అర్హులనే ఎంపిక చేయాలి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను మాత్రమే ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల దరకాస్తులను క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. దరకాస్తుదారుడి ఇంటికి వెళ్లి ఇంటి పరిస్థితిని పరిశీలించారు. -
చలో వరంగల్..
విశేష స్పందన ఆర్టీసీ లాజిస్టిక్ (కార్గో) చేపట్టిన రాములోరి తలంబ్రాలకు విశేష స్పందన లభించింది. వాతావరణం ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు వీస్తాయి. వివరాలు IIలో uసాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘గులాబీ’ శ్రేణుల్లో రజతోత్సవ సందడి నెలకొంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఆదివారం నిర్వహిస్తున్న రజతోత్సవ సభను ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు భారీ జనసమీకరణకు ఇదివరకే సన్నాహాలు మొదలుపెట్టిన నేతలు.. తాము రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ముందుకుసాగుతున్నారు. నేడు ఊరూరా పార్టీ జెండావిష్కరణలను పండుగ వాతావారణంలో నిర్వహించి.. అనంతరం వాహనాల్లో సభకు తరలేలా తగిన ఏర్పాట్లు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం సైతం పార్టీ జెండాలు ఆవిష్కరించారు. అదేవిధంగా ఫ్లెక్సీలు, పార్టీ బ్యానర్లతో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాకేంద్రాల్లో పలు కూడళ్లు గులాబీమయంగా మారాయి. పర్యవేక్షణకు ఇన్చార్జీల నియామకం.. వరంగల్‌కు సుదూర ప్రయాణం చేయాల్సి ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం పార్టీ నేతలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రతి వాహనానికి ఓ ఇన్చార్జితో పాటు భోజనం, తాగునీటి వసతుల పర్యవేక్షణకు విడివిడిగా ఇన్చార్జీలను నియమించారు. అదేవిధంగా సభకు వెళ్లే ప్రతి వాహనానికి సంఖ్య, ఇన్చార్జి పేరు, సెల్ నంబర్‌తో స్టిక్కర్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఇన్చార్జీలు నియోజకవర్గ ఇన్చార్జితో సమన్వయం చేసుకోనున్నారు. వాహనాలు ఎక్కడి నుంచి బయలు దేరాయి.. ఎక్కడ భోజనాలు చేశారు.. ఎప్పుడు సభకు వచ్చారు.. ఎప్పుడు వెళ్లారు.. ఇలా సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు పర్యవేక్షించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. ‘పాలమూరు’ ప్రధానాస్త్రంగా.. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభ తర్వాత కేసీఆర్ పాలమూరులో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అస్త్రంగా ఆయన పోరు బాటకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించి చివరి దశలో ఉన్న పనులను పూర్తి చేయకపోవడం.. వెసులుబాటు ఉన్నా, నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ఏం ప్రకటన చేస్తారనే దానిపై ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో రజతోత్సవ సందడి వరంగల్ సభకు భారీగా తరలుతున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు 50 వేల మంది తరలింపు బస్సులు, కార్లు ఇతర ప్రైవేట్‌వాహనాలను సమకూర్చిన నేతలు పట్టణాలతో పాటు ఊరూరా పండుగలా పార్టీ జెండావిష్కరణలు ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయమైన పలు కూడళ్లు -
పేదల భూములకు పట్టాలు ఇవ్వాలి
మరికల్: ఏళ్ల తరబడి పేదలు సాగు చేసుకుంటున్న భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని మాజీ ఎంపీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. మరికల్లో శనివారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంతకుముందు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి సభా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1850 ఎకరాల పేదలకు సంబందించిన భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఐదేళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నా స్పందన లేదన్నారు. రైతులకు పట్టాలు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. నారాయణపేట – కొడంగల్ లిప్టు ఇరిగేషన్ కోసం పాదయాత్ర చేసిన ఘనత తమదేన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13వేల ఎకరాలను సాగు చేస్తున్న పేద రైతుల తరపున పోరాటలు చేసి వారికి న్యాయం చేస్తామన్నారు. అలాగే అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టవంతంగా అమలు చేసి ఏడాదిలో 200 పని దినాలను పెంచాలన్నారు. అలాగే రోజుకు రూ. 600 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో కేవలం రెండింటిని అమలు చేసి మిగితా వాటిని గాలికి వదిలేసిందని, భూ సమస్యలను పరిష్కరించకుంటే త్వరలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. గోపాల్, వెంకట్రామారెడ్డి, జాన్‌వెస్లీ, నాగయ్య, బీంరాజ్, వెంకట్రాములు, భూపాల్, వెంకట్ పాల్గొన్నారు. -
ఉక్కపోత నుంచి ఉపశమనానికి ప్రజల పరుగులు
స్టేషన్ మహబూబ్‌నగర్/నారాయణపేట టౌన్: రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. దీంతో భరించలేని ఉక్కపోతతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి. ఫ్యాన్లు ఉన్నోళ్లు కూలర్లు, కూలర్లు వాడుతున్న వారు ఏసీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకా వేసవి సీజన్ ప్రారంభం కావడంతో వ్యాపారులు కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకురాగా కొనుగోలుదారులతో దుకాణాలు కిక్కిరిశాయి. ఇవే కాకుండా పళ్ల రసాలు, జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు సైతం కిటకిటలాడుతున్నాయి. ఫ్రిజ్‌లకు గిరాకీ వేసవిలో ఇంట్లో అడుగుపెట్టే చల్లని నేస్తం ఫ్రిజ్. కూల్‌వాటర్‌తో పాటు వేసవిలో తిండిపదార్థాలు చెడిపోకుండా ఉండడానికి ఇది చాలా అవసరం. ఈ నేపథ్యంలో పలువురు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇన్వెర్టర్లపైనా నడిచే ఫ్రిజ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. రూ.12,500 నుంచి రూ.30 వేల వరకు ధరలు అందుబాటులో ఉన్నాయి. సింగిల్, డబుల్, త్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లు కొనుగోలు చేస్తుండగా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేసిక్ మోడళ్ల ఫ్రిజ్‌లు తీసుకుంటుండటంతో వ్యాపారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 వరకు ఫ్రిజ్‌ల షాపులు ఉండగా ఈ వేసవి సీజన్లో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ● ఒకప్పుడు టేబుల్ ఫ్యాన్లు, ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ల హవా నడిచింది. ఇప్పుడు కూలర్లు, ఏసీల గాలి వీస్తోంది. ఒకప్పుడు ఉన్నత, మధ్య తరగతి ఇళ్లకే పరిమితమైన కూలర్లు ఇప్పుడు తక్కువ ధర, చిన్న సైజుల్లోనూ లభిస్తుండడంతో అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. లోకల్‌మేడ్ కాకుండా బ్రాండెడ్ కూలర్లు సైతంలో మార్కెట్లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేసవిలో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మేర వీటి వ్యాపారం నడుస్తుంది. ఏసీలు, ఫ్రిజ్‌ల కొనుగోళ్లతో షాపుల్లో రద్దీ పండ్ల జ్యూస్‌లు, లస్సీ, ఐస్‌క్రీమ్‌లకు భలే గిరాకీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.కోట్లలో సీజనల్ వ్యాపారం -
నోటీసులు ఇస్తున్నాం
పేట – కొడంగల్ ప్రాజెక్టు కింద భూముల పెగ్ సర్వే పూర్తి అయింది. రైతులకు నోటీసులను అందజేస్తున్నాం. అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలిస్తున్నాం. రీ సర్వే కోరిన చోట సర్వేయర్లు, రెవెన్యూ అధికారులను పంపించి సర్వే చేయిస్తున్నాం. రైతులు అందరూ సహకరించి నోటీసులు తీసుకోవాలని సూచిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల మేరకు భూ నష్టపరిహారం వస్తుంది. – చింత రవికుమార్, తహసీల్దార్, ఊట్కూర్ ఎకరాకు రూ.60 లక్షలు ఇవ్వాలి బహిరంగ మార్కెట్లో ఎకరానికి రూ. 60 లక్షలు పలుకుతుంది. ఆ ప్రకారం తమకు భూ నష్టపరిహరం ఇవ్వాలి. తనకున్న నాలగు ఎకరాల భూమి ఈ ప్రాజెక్టులో పోతుంది. ప్రభుత్వం ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇస్తే ఎలా. భూమి పోతే భూమి అయినా చూపించాలి. ఈ కాలంలో భూమి పోతే భూమి సంపాదించుకోవడం చాలా కష్టం. – దాసరి కనకదాసు, రైతు, బాపూర్ గ్రామం, ఊట్కూర్ మండలం ఇంటికో ఉద్యోగం.. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే రైతులకు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎకరానికి నష్టపరిహారం బహిరంగా మార్కెట్లో ఉన్న విలువ ప్రకారం ఇవ్వాలి. – నర్సింహులు గౌడ్, రైతు బాపూర్, ఊట్కూర్ మండలం స్పష్టత ఇవ్వడంలేదు.. భూములు కోల్పోతున్న రైతులకు ఎంత పరిహారం ఇస్తారనేది ఎవరూ స్పష్టత ఇవ్వడంలేదు. అన్ని భూములకు ఒకే ధర ఇస్తామంటే నష్టపోతాం. ఎకరానికి రూ.60 లక్షలు ఇవ్వాలి. – ఎం.సురేందర్‌రెడ్డి, రైతు, ఊట్కూర్ ● -
ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదు
జడ్చర్ల టౌన్: పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తప్పదని, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదని, అది ఎంతో దూరం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి జడ్చర్ల ప్రేమ్‌రంగా గార్డెన్లో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్, వక్ఫ్‌బోర్డు చట్టంపై ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేశాక కశ్మీర్‌ను మరో స్విట్జర్లాండ్‌గా భావించి పర్యాటక రంగం ఊపందుకుందన్నారు. అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో దేశ, విదేశాల నుంచి పర్యాటలకు వస్తుంటే చూస్తూ తట్టుకోలేక పాకిస్తానీయులు ఉగ్రవాదులతో దాడులు చేయించిందన్నారు. భారతీయులంతా పార్టీలకు అతీతంగా దేశం కోసం భద్రత, రక్షణ కోసం ఉగ్రదాడులను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల వ్యయ ప్రయాసాలు తగ్గి అభివృద్ధిపై దృష్టిసారించే ఆస్కారం ఉంటుందన్నారు. వక్ఫ్‌బోర్డు చట్టం వల్ల పేద ముస్లింలకు ఎంతో లాభం కలగనుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మేధావులు ఉమ్మెంతల మహేశ్వర్, జగ్పాల్రెడ్డి పాల్గొన్నారు. -
భూ భారతితో భూ సమస్యల పరిష్కారం
కోస్గి రూరల్/మద్దూరు: ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు నూతన భూ భారతి చట్టంతో పరిష్కారం లబిస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం కోస్గి, మద్దూరులో రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఎర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ధరణిలో ఉన్న సమస్యలను తొలగించి రైతు సంఘాలు, రెవెన్యూ అధికారులు, మేధావులతో చర్చలు జరిపి ప్రభుత్వం నూతన చట్టం భూ భారతిని తీసుకువచ్చిందన్నారు. ధరణి పోర్టల్‌లోని 32 అంశాలను తొలగించి 11 అంశాలతో భూ భారతి చట్టంతో భూ సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారికి భూదార్ కార్డును అందజేయనున్నామని అన్నారు. కింది స్థాయి అధికారులు పొరపాట్లు చేస్తే నన్యాయం కోసం పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని, 99శాతం భూ సమస్యలు తహసీల్దార్ వద్దే పరిష్కారం అవుతాయని, 30 రోజుల్లో మ్యుటేషన్లు పరిష్కారం అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్,ి తహసీల్దార్లు బక్క శ్రీనివాస్, భాస్కరస్వామి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు భింరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారం తహసీల్దార్ స్థాయిలోని సమస్యలను మోకా మీదనే పరిష్కరించాలని తహసీల్దార్ మహేష్‌గౌడ్‌కు కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం మద్దూరు మండలంలోని దమ్‌గాన్‌పూర్, నాగిరెడ్డిపల్లిలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు. రెవెన్యూ సదస్సులను వేగవంతం చేయాలని, సదస్సుల్లో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు ఏ సమస్యలపై ఎక్కువగా వచ్చాయని ఆరా తీశారు. అనంతరం వచ్చిన దరఖాస్తులను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, తదితర ఆంశాలపై మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి ప్రత్యేకాధికారి యాదగిరి, అడిషన్ కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, ఆర్డీఓ రాంచందర్‌నాయక్, భూ భారతి కోసం నియమించిన తహసీల్దార్, ఆర్ఐ, ఇతర సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మద్దూరు మండలంలో తలెత్తిన సమస్యలను వారి పరిష్కారం కోసం చేస్తున్న కసరత్తుపై అధికారులతో ఆమె సుదీర్ఘంగా చర్చించారు. -
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు వద్దు
నారాయణపేట: జిల్లా పరిధిలో సామాజిక మాద్యమాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టవద్దని, ఒకవేళ అలా చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేస్ గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయంగాను, కుల, మత, ప్రాంతీయంగాను ప్రజల భద్రతకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్న వాటిని షేర్ చేసిన చర్యలు తప్పవని తెలిపారు. ఫెస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సప్ గ్రూపులలో ఇతరులకు ఇబ్బంది కలిగే, ఒక వర్గానికి కించపరిచే విధంగా ఉన్న, తమకు తెలియని వీడియోలు, ఫొటోలు పోస్టులు చేసిన, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసిన ఆ గ్రూపు అడ్మిన్ నీ బాధ్యుడిగా చేస్తూ, ఫార్వర్డ్ చేసిన వారిపైన కేసులు నమోదు చేయబడుతాయని పేర్కొన్నారు. పోలీసులు 24/7 సోషల్ మీడియా యాప్‌లు, పోస్టులు పరిశీలిస్తుంటారని, ఏ పోస్టులు అయినా ఫార్వర్డ్ చేసే ముందు గమనించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్‌కు డీడబ్ల్యూఓ బాధ్యతలు నారాయణపేట: డీడబ్ల్యూఓగా విధులు నిర్వహిస్తున్న జయను బాధ్యతల నుంచి తప్పించి డీడబ్ల్యూఓ బాధ్యతలను అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌కు అప్పగించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం కీలకం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో కీలకం అని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్స్ ప్రతి ఒక్క విభాగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అందుకోసం విద్యార్థులు పూర్తిస్థాయిలో కంప్యూటర్ విద్యపై దృష్టిసారించాలన్నారు. వీటిద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలు సైతం స్కిల్స్ ఉన్న విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయని, పరిశోధన కోణం ఆలోచించే వారికి సృజనాత్మకత ఉండడం వల్ల వారు త్వరగా ఉద్యోగాలు సాధిస్తారన్నారు. ఈ సందర్భంగా అధికారులు సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంవీఎస్ ప్రిన్సిపాల్ పద్మావతి, ఆర్జేడీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. పెసర క్వింటాల్ రూ.7,477 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7,477 ధర పలికింది. అలాగే, జొన్నలు గరిష్టంగా రూ.3,926, కనిష్టంగా రూ.3,505, అలసందలు గరిష్టంగా రూ.6,305, కనిష్టంగా రూ.6,055, వడ్లు హంస గరిష్టంగా రూ.1,756, కనిష్టంగా రూ.1,525, వడ్లు సోనా గరిష్టంగా రూ.2.220, కనిష్టంగా రూ.1,350, కందులు ఎర్రవి గరిష్ట, కనిష్టంగా రూ.6,869 ధర పలికాయి. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,275 జడ్చర్ల/ దేవరకద్ర: పట్టణంలోని బాదేపల్లి మార్కెట్ యార్డులో శుక్రవారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,275, కనిష్టంగా రూ.1,402 ధరలు లభించాయి. అలాగే వేరుశనగ గరిష్టంగా రూ.5,913, కనిష్టంగా రూ.4,041, ఆముదాలు గరిష్టంగా రూ.6,137, కనిష్టంగా రూ.6,100, జొన్నలు సరాసరిగా రూ.1,817, ధాన్యం హంస గరిష్టంగా రూ.2,011, కనిష్టంగా రూ.1,809, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.1,809, రాగులు రూ.2,157 చొప్పున పలికాయి. ఆర్ఎన్ఆర్ ధర రూ.2,236 దేవరకద్ర మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,236, కనిష్టంగా రూ.1,809 ధరలు లభించాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,749, కనిష్టంగా రూ.1,629, ఆముదాలు గరిష్టంగా రూ.6,006 వచ్చాయి. సీజన్ కావడంతో మార్కెట్‌కు దాదాపు 2 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. నేడు మార్కెట్ బంద్ ఉగ్రదాడులను నిరసిస్తూ బాదేపల్లి మార్కెట్ వ్యాపార సంఘం ఆధ్వర్యంలో శనివారం క్రయవిక్రయాలను నిర్వహించడంలేదు. -
సంగమేశ్వరా.. దారి చూపవా..
● కృష్ణాతీరంలోనిసంగమేశ్వరుని దర్శనానికి సరిహద్దు పంచాయితీ ● ఏపీ పరిధిలోని ఆలయం చెంతకు తెలంగాణ బోట్లను రానివ్వకుండా అడ్డుపడుతున్నఏపీ జాలర్లు ● స్వామి దర్శనానికి వ్యయ ప్రయాసలతో కష్టాలు పడుతున్న భక్తులు ● ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమేసంగమేశ్వరుడి దర్శనం కృష్ణాతీరంలోని సంగమేశ్వరుడి ఆలయంసాక్షి, నాగర్‌కర్నూల్: ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే ఆలయం తెరచుకుని ఉంటుంది. మిగతా కాలమంతా నీటిలోనే మునిగి ఉంటుంది. ఏడు నదులు ఒక చోట కలిసే సంగమేశ్వర క్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులకు ప్రయాసలు తప్పడం లేదు. కృష్ణాతీరానికి ఇరువైపులా ఉన్న స్థానిక గ్రామాల జాలర్లు, బోట్ల నిర్వాహకుల మధ్య వివాదం, ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు పంచాయితీని తీసుకువచ్చింది. ఫలితంగా సంగమేశ్వరుడి దర్శనం కోసం వస్తున్న భక్తులు, పర్యాటకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
డీజీపీఎస్ పరికరం ఏమైంది ?
భూ సర్వే చేయడానికి అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించాలని గత కలెక్టర్ కోయ శ్రీహర్ష తన గ్రాంట్ నుంచి డీజీపీఎస్ పరికరాన్ని కొనుగోలు చేయించి గతేడాది మార్చి 15న జిల్లా సర్వేయర్ల అధికారుల బృందానికి అప్పగించారు. కానీ పేట – కొడంగల్ ప్రాజెక్టు సర్వేలో ఇరిగేషన్ అధికారులు డీజీపీఎస్ పరికరాన్ని వాడితే.. సర్వేయర్లు బృందం జీపీఎస్ పరికరంతో సర్వే చేపట్టారు. దీంతో ఇరిగేషన్, సర్వేయర్లు చేపట్టిన సర్వేలో లెక్కలు తేడా ఉందని, హద్దులు సరిగ్గా చూయించలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. అసలు ఆ పరికరాన్ని ప్రభుత్వ భూముల సర్వేలో అక్కడక్కడ వినియోగిస్తూ.. ప్రైవేట్ సర్వేలకు ఎక్కువగా వినియోగిస్తున్నరని తెలుస్తోంది. దీనిపై కలెక్టర్ దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలాఉండగా, భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహరం సీఎం ఇలాఖాలో ఎంత వస్తుందో.. నారాయణపేట, మక్తల్ నియోజకవర్గంలో రైతులకు అంతే వస్తుందని ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి భరోసానిస్తున్నారు. -
మలేరియా నిర్మూలనకు కృషి
నారాయణపేట: మలేరియా నిర్మూలన కోసం ప్రజలు, వైద్య సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్ఓ జయచంద్ర మోహన్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణం నుంచి అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన రహదారి గుండా వీర సావర్కార్ చౌరస్తాకు నినాదాలు చేస్తూ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వార వ్యాప్తి చెందుతుందన్నారు. ఈ వ్యాధి నివారించాలంటే ప్రతి ఒక్కరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రైడే ను పాటించాలని, దోమలు పుట్టకుండా.. కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చన్నారు. అదే విధంగా మలేరియా వ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎన్.శైలజా, వైద్యులు నర్సింహారావు, మల్లికార్జున్ డిఎంఅండ్‌హెచ్ కార్యాలయ అధికారులు, సిబ్బంది బిక్షపతి, గోవిందరాజు శ్రీనివాస్, తబితారాణి, శంకర్, శ్రీధర్, గోవిందా రావు, బుగ్గెశ్వర్, బాలశేఖర్, ఎఎన్ఎంలు శివశేశమ్మ, సరస్వతి, పుష్ప, పుష్పలత, రామేశ్వరీ , కరుణమ్మ, ఆశావర్కర్లు పాల్గొన్నారు. -
పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు..
సోమశిల వద్ద కృష్ణాతీరం వద్దకు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సంగమేశ్వరుడి దర్శనం కోసం కృష్ణానదిలో బోటులో వెళ్లాల్సి ఉండగా, ఏపీకి చెందిన సిద్దేశ్వరం, సంగమేశ్వర గ్రా మాల జాలర్లు బోట్లను రానివ్వడం లేదు. కొద్ది దూరం బోటులో, తర్వాత ఆటోలో, మళ్లీ బోటులో ప్రయాణిస్తూ కష్టాలు పడుతున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. – రామ్మోహన్, సోమశిల, కొల్లాపూర్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా -
డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత
నారాయణపేట: డ్రగ్స్ వల్ల యువ శక్తి విచ్ఛిన్నం అవుతుందని, డ్రగ్స్ మత్తులో దాడులు, నేరాలు పెరుగుతున్నాయని, డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నశా ముక్త్ భారత్ అభియాన్, డ్రగ్స్ వాడకాన్ని నిషేధిస్తూ డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన పోస్టర్‌ను ఎస్పీ ఆవిష్కరించి మాట్లాడారు. దేశ సంపద, దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, విద్యార్థులు, యువతలో మార్పు రావాలన్నారు. డ్రగ్స్ వినియోగంతో శరీరంలో శక్తి తగ్గుతుందని, మంచి భవిష్యత్తును కోల్పోతారు అదో వ్యసనంగా మారుతుందన్నారు. గంజాయి, కొకై న్, హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాల వల్ల అన్ని కోల్పోతారన్నారు. డ్రగ్స్ వినియోగం, రవాణా, సరఫరా చేయడం తీవ్రమైన నేరమన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారి పై సమాచారం ఇస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించి మార్పుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో డ్రగ్స్ లేకుండా నిర్మూలించడం మన అందరి బాధ్యత అన్నారు. అలాగే మత్తు పదార్థాలైన డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం సంయుక్తంగా ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ, ఎఫ్ఆర్ఓ సాయి, వలంటీర్స్ సంధ్య, లక్ష్మికాంత్ పాల్గొన్నారు. -
రైతు నెత్తిన.. నకిలీ పిడుగు
మరికల్: పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు.. నాసిరకం ఎరువులు జిల్లాకు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మొన్నటికి మొన్న ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. అంతలోనే నర్వ, మద్దూరు మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులో నిఘా వైఫల్యం కారణంగా విత్తనాలు నాటే సమయానికన్నా రెండు నెలలకు ముందే జిల్లాలోకి నకిలీ పత్తి విత్తనాలు వచ్చేశాయి. కొందరు వ్యాపారులు ముఠాగా ఏర్పడి అధికారుల కళ్లు కప్పి రహస్యంగా జిల్లాకు నకిలీ పత్తి విత్తనాలతో పాటు ప్రమాదకారమైన గ్లైకాసిన్ కలుపు నివారణ (గడ్డి పిచికారి) మందులను ఇక్కడి వ్యాపారులకు చేరవేశారు. ఇందుకు నిదర్శనం ఈ నెల 10న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడిలో నర్వ, మద్దురు మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడడమే. ఇప్పటికే 50 శాతానికి పైగా జిల్లాలో ఈ విత్తనాలు చేరినట్లు సమాచారం. వీటిని కొనుగోలు చేసిన రైతులు తమ పొలాలు, గడ్డివాములు, పశువుల కొట్టలో, భూమిల్లో ప్లాస్టిక్ కవర్లో భద్రపరుస్తున్నారు. 5 క్వింటాళ్ల విత్తనాల పట్టివేత కర్ణాటక వ్యాపారులతో సంబంధాలు ఉన్న కొందరు పత్తి విత్తన వ్యాపారులు కర్ణాటకలోని రాయచూర్, యాద్గీర్, గుల్బర్గా తదితర ప్రాంతాల నుంచి రాత్రి సమయంలో గుట్టుగా నకిలీ విత్తనాలను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ విత్తనాలను రహస్యంగా వ్యవసాయ పొలాల వద్ద భద్ర పరుస్తున్నారు. జిల్లాకు దిగుమతి అయిన నకిలీ పత్తి విత్తనాల విషయం తెలుసుకున్న రెండు మండలాల్లోని టాస్క్‌ఫోర్స్ పోలీసులు వరుస దాడులు నిర్వహించగా రెండు రోజుల వ్యవధిలోనే నర్వలో 2 కింటాళ్లు, మద్దూరులో 3 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. ఈమేరకు కేసులు నమోదు చేశారు. ఇదిలాఉండగా, ఇప్పటికే కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో నకిలీ పత్తి విత్తనాలు జిల్లాకు వచ్చాయని, ప్రతి ఏడాది తమ వద్దకు వచ్చే రైతులకు నేరుగా పొలాల వద్దకు వెళ్లి వ్యాపారులు విత్తనాలు విక్రయించారని సమాచారం. ఈ వ్యవహారం అంతా విత్తనాలు వచ్చిన వారం రోజుల్లో ఎవరికీ అనుమానం రాకుండా చేరవేస్తారని తెలిసింది. జిల్లాలో 60 శాతం నకిలీ పత్తి విత్తనాలను ఇక్కడి రైతులకు పరిచయం చేసింది ఆంధ్రా వ్యాపారులు. వీరు పత్తి సాగు కోసం పొలాలను కౌలుకు తీసుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడం చూసిన ఇక్కడి రైతులు వాటి వైపు ఆకర్శితులయ్యారు. ఇలా ఆంధ్రా వ్యాపారులు ఇక్కడి రైతులకు వాటిని అందజేయడంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 60 శాతం రైతులు నకిలీ విత్తనాలతో పంటలు సాగు చేస్తున్నారు. వీటితో సాగు చేయడం వల్ల కొంతమంది రైతులు ప్రమాదకారమైన వ్యాధుల భారిన పడ్డారు. పోలీసుల సూచనలు రైతులు ఎవరైనా పత్తి విత్తనాలు కొనుగోలు చేసే ముందు గుర్తింపు పొందిన కంపెనీ ప్యాకింగ్, లేబుల్ తనిఖీ చేసుకోవాలి. విడి విత్తనాలు, నాసిరకం పిచికారీ మందులతో ప్రాణాలకు ప్రమాదం. గ్రామాల్లోకి వచ్చి విడి విత్తనాలు అమ్మే వ్యాపారులను, మధ్యవర్తులను నమ్మొద్దు. ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తన ఫర్టిలైజర్ దుకాణాలు, వ్యాపారుల నుంచి మాత్రమే విత్తనాల కొనుగోలు చేయాలి. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తాం. విడి విత్తనాలు విక్రయించేవారు గ్రామాల్లోకి వస్తే 100కి డయల్ చేయాలి. మార్చిలోనే జిల్లాలోకి చేరిన నకిలీ పత్తి విత్తనాలు నర్వ, మద్దూరు మండలాల్లో ఇటీవల పట్టివేత రాష్ట్ర సరిహద్దులో నిఘా వైఫల్యం చక్రం తిప్పుతున్న కొందరు వ్యాపారులు కఠిన చర్యలు తీసుకుంటాం కర్ణాటక నుంచి తెచ్చిన నకిలీ పత్తి విత్తనాలు, నాసిరకం ఎరువులను రైతులకు అమ్ముతే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేయిస్తున్నాం. అనుమానిత వ్యాపారులతో, రైతులతో ఉన్న నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులను గుర్తించి సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశాం. గ్రామాల్లో ఎవరైనా విడి విత్తనాలు అమ్మేందుకు వస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. – యోగేష్ గౌతమ్, ఎస్పీ -
తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
కృష్ణా: వేసవి నేపథ్యంలో ఏ గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సత్యసాయి తాగునీటి సరఫరా అధికారులకు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. గురువారం మండలంలోని కున్సీ, కృష్ణా, గుడెబల్లూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం సత్యసాయి నీటి పంప్‌ను ఆయన సందర్శించి అక్కడ నీరు సరఫరా చేసే అధికారులతో మాట్లాడారు. ఇదిలాఉండగా, సత్యసాయి నీటి సరఫరా చేస్తున్న ఉద్యోగి ఆర్నెళ్లుగా వేతనం రావడంలేదని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలి నారాయణపేట: పాఠశాలలకు వేసవి సెలవులు అమలు చేస్తుండగా అదే పాఠశాలలో పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ సెంటర్లకు సెలవు లేకపోవడం సరైనది కాదని వెంటనే, వేసవి ఎండల దృష్ట్యా సెలవులు ప్రకటించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శశికళతోపాటు బాల్‌రాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మే నెల సెలవులు అమలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఎండల తీవ్రతతో చిన్నారులు అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందని, వెంటనే సెలవులు ఇవ్వాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌కు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో జోషి, పుష్ప, రాధిక ,సావిత్రమ్మ, బుగ్గమ్మ, సుజాత, చంద్రకళ, ఉమా మణిమాల తదితరులు పాల్గొన్నారు. హజ్ యాత్రికులకువ్యాక్సినేషన్ నారాయణపేట: హజ్ యాత్రికుల కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో గురువారం టీకా శిబిరాన్ని నిర్వహించారు. డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శైలజతో కలిసి ఈ శిబిరాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. మొత్తం 33 మంది హజ్ యాత్రికులకు టీకాలు వేశారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, హజ్‌యాత్ర కమిటీ సభ్యులు అమిరుద్దీన్, ముజాహిద్ సిద్దిఖీ,అజారోద్దీన్, అజిమ్ మడ్కి, వైద్యులు సాయిరాం, డీఐఓ గోవింద రాజు , ఎంపీహెచ్ఈఓ సూర్యకాంత్ రెడ్డి పాల్గున్నారు. నేడు డయల్ యువర్ ఏటీఎం లాజిస్టిక్ స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ లాజిస్టిక్ సమస్యల కోసం శుక్రవారం డయుల్ యువల్ ఏటీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇసాక్ బిన్ మహ్మద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ కార్గో సంబంధిత సమస్యలను 8125456978 నంబర్‌కు ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని కార్గో వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామన్‌పాడులో 1,015 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో గురువారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు గాను 1,015 అడుగులు ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. దీంతో జలాశయంలోని ఎన్టీఆర్ కాల్వ ద్వారా 2 క్యూసెక్కులు, కుడి, ఎమడ కాల్వల నుంచి 18, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వదిలామని ఆయన చెప్పారు. -
భూభారతి చట్టంతో రైతులకు మేలు
నర్వ/ఊట్కూర్: ధరణి స్థానంలో మేలైన చట్టాన్ని తేవాలన్న ఉద్దేశ్యంతో.. భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఈ చట్టంతో భూసమస్యలు త్వరగా పరిష్కరించబడతాయని కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం నర్వ, ఊట్కూర్‌లో అవగాహన సదస్సులు నిర్వహించగా.. కలెక్టర్, ఎమ్మెల్యే ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణిలో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. కొత్త చట్టంలో 4,5,6 సెక్షన్లు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయని, సాదాబైనామాల పరిష్కారానికి ప్రత్యేక ప్రొవిజన్ ఉందని వివరించారు. గతంలో అన్ని అధికారాలు కలెక్టర్ వద్దనే ఉండేవని, ఇప్పుడు తహసీల్దార్, ఆర్డీఓ, రెవెన్యూ కలెక్టర్ స్థాయిలో అధికారాలు ఉన్నాయని, రైతులకు న్యాయం జరగనప్పుడు పై అధికారులకుఽ అప్పిల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. చారిత్రాత్మకం.. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ఓ చారిత్రాత్మకమన్నారు. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 10 నెలల పాటు ఆహర్నిశలు కృషిచేశారని తెలిపారు. గత ప్రభుత్వం ధరణి ద్వారా రైతుకు–భూమికి ఉన్న బంధాన్ని తెంపిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తెంపిన బంధాన్ని కలిపిందని అన్నారు. గతంలో చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్ దగ్గరకు వెళ్లాల్సి ఉండేదని, భూ భారతి ద్వార తహాసీల్దార్ స్థాయిలో సమస్యలు పరిష్కామవుతాయని అన్నారు. దేశంలోనే లేని విధంగా భూఆధార్కార్డుతో పాటు సర్వే మ్యాప్‌ను ప్రభుత్వమే అందించి పాస్‌బుక్కులో పొందుపర్చేవిదంగా చట్టం రూపొందించారన్నారు. క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారం మద్దూరు: భూ భారతి రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి వచ్చే భూ సమస్యలను క్షత్రేస్థాయిలోనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మద్దూరు మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను అడిషన్ కలెక్టర్ రెవెన్యూ బెన్షాలోంతో కలిసి సందర్శించారు. ఇప్పటి వరకు పైలెట్ ప్రాజెక్టు క్రింద మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఏఏ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే సదస్సులను టీంలు పెంచాలన్నారు. రెవెన్యూ గ్రామాల వారిగా వచ్చిన సమస్యలను కేటగిరి వారిగా విభజించాలని, అలాగే సదస్సులు పూర్తయ్యే వరకు ఆర్డీఓ రాంచందర్‌నాయక్ ఈ మండలంలోనే ఉండాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహేష్‌గౌడ్, డీటీ వాసుదేవరావ్, ఆర్ఐలు, రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
జూరాల.. భద్రమేనా?
జలాశయంలో తెగిన 8 గేట్ల ఇనుప రోపులు ● 18 చోట్ల రబ్బర్‌సీల్ దెబ్బతినడంతో లీకేజీలు ● మరమ్మతు నేపథ్యంలో నిలిచిన గ్యాంటీక్రేన్ సేవలు ● మూడేళ్లుగా 50 శాతం కూడా పూర్తికాని రిపేర్లు ● ఆందోళన కలిగిస్తోన్న అధికార యంత్రాంగం, పాలకుల వైఖరి గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా పేరుగాంచిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రమేనా..? 2009 సంవత్సరం మాదిరిగా మరోసారి వరద పోటెత్తితే ప్రాజెక్టు తట్టుకుంటుందా? అంటే.. ప్రాజెక్టులోని తెగిన గేట్ల రోప్‌లు, ధ్వంసమైన రబ్బర్ సీల్ నిర్మాణాలను చూస్తే నిస్సందేహంగా లేదనే మాటే వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులకు సాగునీరందిస్తూ.. కీలకపాత్ర పోషిస్తున్న పెద్దన్నకు పెనుముప్పు తరుముకొస్తే.. అన్న ఆలోచన కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా పాలమూరుకు సాగు, తాగు నీరందిస్తున్న ప్రాజెక్టును.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అధికార యంత్రాంగం, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు.. కృష్ణాబేసిన్ పరిధిలో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా ఇందిరా ప్రియదర్శిని జూరాలను 1981లో రూ.550 కోట్లతో నిర్మించారు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. దీని కింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ పరిధిలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 37,700 ఎకరాలు, కుడి కాల్వ పరిధిలో ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో 63,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. -
రిపేర్లతో లీకేజీలు..
ప్రాజెక్టు మొత్తం 62 గేట్లలో 18 గేట్ల నుంచి ఏడాదిగా నీరు లీకేజీ అవుతోంది. ప్రధానంగా గేట్లు దెబ్బతినకుండా, రాపిడికి గురికాకుండా రక్షణ కల్పించే రబ్బర్ సీల్ పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే గేట్లను పైకి, కిందికి ఆపరేట్ చేసేందుకు సహాయపడుతున్న ఇనుప రోప్‌లు పూర్తిగా దెబ్బతిని 8 గేట్లను ఆపరేటింగ్ చేయలేకపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన అధికారులు మొత్తం 62 గేట్లు మొదలుకొని రబ్బర్ సీల్స్, రోప్స్, పెయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెంథనింగ్ వంటివి మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసింది. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఒప్పందం గడువు ముగిసి.. మరోసారి పొడిగించిన గడువు ముగిసిపోయినా పట్టుమని 50 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ● ప్రస్తుతం డ్యాం పైభాగాన ఉన్న హయిస్ట్ బ్రిడ్జి, గేట్ల వద్ద ఉన్న వాక్‌వే బ్రిడ్జికి సంబంధించి సాండ్ బ్లాస్టింగ్ పనులు పూర్తి చేయగా.. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. -
కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
మద్దూరు/కొత్తపల్లి: తెరాష్ట్రంలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చుదిద్దాదామని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారటీ( కడా) అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి ఉమ్మడి మద్దూరు మండలంలోని పంచాయతీరాజ్, అర్అండ్బీ నిధులతో పలు బీటీ రోడ్లకు శంకుస్థాపనలు, అంగన్వాడీ, గ్రామపంచాయతీ, పాఠశాల భవనాలను గురువారం అయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పనులను నాణ్యత ప్రామాణాలతో చేపట్టాలని అధికారులు ఆదేశించారు. కొత్తపల్లి మండలంలోని దుప్పట్‌గట్ నుంచి అల్లీపూర్ టూ గొకుల్నగర్ వరకు 5 కిలో మీటర్ల బీటీ రోడ్డు 8.93 కోట్లు, మద్దూరు మండలంలోని చెన్వార్ నుంచి నారాయణపేట మండలంలోని బండగొండ వరకు 2 కిలో మీటర్లు బీటీ రోడ్డు రూ.2.85 కోట్లు, మోమినాపూర్ వాగుపై వంతెన రూ. 7.20 కోట్లు, మోమినాపూర్ నుంచి బొమ్మన్‌పాడ్ 6.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు రూ. 12.35 కోట్లు, పెదిరిపాడ్ ఉన్నత పాఠశాల ప్రహారి నిర్మాణం కోసం రూ.43 లక్షలు, శంకుస్థాపనలు చేశారు. పెదిరిపాడ్లో రూ.20 లక్షతో చేపట్టినా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే మద్దూరులో రూ.20 లక్షలతో చేపట్టినా మాడల్ అంగన్వాడీ భవనాన్ని, అర్అండ్బీ శాఖ రూ.63.71 లక్షలతో నిర్మాణం చేపట్టినా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ విజయ్‌కమార్, కోస్గి ఎఎంసీ చైర్మన్ ముద్ది భీములు, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహా, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంజీవ్, రమేష్‌రెడ్డి, రహీం, హన్మిరెడ్డి, వీరారెడ్డి, షేక్మీరాన్, వెంకట్‌రెడ్డి, పీఆర్, అర్అండ్బీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాలు పేదలకు చేరాలి
నారాయణపేట/మరికల్: ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకలు ప్రతి ఇంటికి చేరాలని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. మరికల్ మండలంలోని అప్పంపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా లబ్ధిదారులు అందరికి సంక్షేమ పథకలను అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనికే దక్కిందన్నారు. అకాల వర్షాలకు రైతులు ఎవరూ భయపడవద్దన్ని ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఖచ్చితంగా అర్హులను మాత్రమే ఎంపిక చేయాలని సూచించారు. అనర్హులను ఎంపిక చేసి ప్రభుత్వన్ని చెడ్డపేరు తీసుకరావద్దన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్యమోహన్‌రెడ్డి, ఓబీసీ జిల్లా చైర్మన్ కృష్ణయ్య, వెంకట్రామారెడ్డి, వీరన్న, వినితమ్మ, సత్యన్న, నారాయణరెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు. అమరులకు నివాళులు కాశ్మీర్‌లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. అమాయకులైన ప్రజలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి ప్రాణాలు తీయడం హేయమైన చర్య అని, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఉగ్రవాదులు దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఉగ్రవాదన్ని ఉక్కుపాదం తో అణిచివేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం, సీనియర్ నాయకులు గందే చంద్రకాంత్, వకీల్ సంతోష్,మనోహర్ గౌడ్, కోట్ల రవీందర్ రెడ్డి,మహిమూద్ ఖురేషి, సతీష్ గౌడ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
మద్దూరు/ధన్వాడ: రైతుల భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మద్దూరు, ధన్వాడ, దామరగిద్ద మండలంలో కొనసాగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సందర్శించారు. భూ సమస్యలను దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన రైతులతో మాట్లాడారు. సమస్యలను తెలసుకున్నారు. సదస్సుకు వచ్చే ప్రతి రైతు నుంచి దరఖాస్తులను స్వీకరించాలన్నారు. గ్రామానికి సంబంధించిన పహాని, పాత, కొత్త ఆర్ఓఆర్, సేత్వార్, తదితర భూ రికార్డులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సదస్సుకు ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అక్కడే ఉన్న సిబ్బందిని ఆరా తీశారు. అలాగే, మద్దూరు తహసీల్దార్ కార్యలయంలో భూ భారతి దరకాస్తులు, వాటి పరిష్కారానికి చేపట్టే చర్యలను జిల్లా రెవెన్యూ అడిషన్ కలెక్టర్ బెన్షాలోమ్, భూ భారతి ప్రత్యేకాధికారి యాదగిరిని అడిగి తెలసుకున్నారు. ● ధన్వాడలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూ భారతిలో తహసిల్దార్ వద్దనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని ఎవరు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కింది స్థాయి నిర్ణయాన్ని పై స్థాయిలో అప్పిల్ చేసి అవకాశం భూ భారతిలో ఉందన్నారు. ప్రస్తుతం అందరికి ఆధార్ కార్డులు ఉన్నట్లే ఇకపై ప్రతి రైతుకు తన భూమికి సంబంఽధించిన అన్ని వివరాలతో కూడిన భూదార్ కార్డును కూడా అధికారులు ఇస్తారని ఆమె తెలిపారు. కొత్త పోర్టల్‌తో రైతులకు వారి భూముల అన్ని రకాల హక్కులు కల్పించబడతాయని అన్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
నారాయణపేట: నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటిని సంబంధిత అధికారులు ముందుజాగ్రత్తగా అడ్డుకట్ట వేయాలని ఎస్పీ యోగేష్‌గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. విత్తన వ్యాపార డీలర్స్ బాధ్యతగా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని, రైతులకు, వ్యవసాయానికి నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు అమ్మితే అలాంటి వారిపై చట్టపరంగా కేసులు, పీడీ యాక్ట్ తప్పదని పేర్కొన్నారు. జిల్లా కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉండడంతో నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉండడంతో ముందస్తు తనిఖీలు, రైతులకు, డీలర్లకు అవగాహన కల్పించడం, సరిహద్దులో పటిష్టమైన నిఘాతో నకిలీ విత్తనాలు నివారించాలని తెలిపారు. నాణ్యమైన కంపెనీ విత్తనాలు ఎంచుకోవాలని, లేబుళ్లు, ప్యాకింగ్ లేని విత్తనాలు కొనుగోలు చేయవద్దు అని సూచించారు. తక్కువ ధరకు వస్తున్నాయని గ్రామాల్లోకి వచ్చే మధ్యవర్తుల వద్ద విడి విత్తనాలు కొనుగోలు చేయవద్దు, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని తెలిపారు. నకిలీ విత్తనాలు, అనుమానిత బ్రోకర్లు, డీలర్ల పోలీసు వారికి ( డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్) లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పీసీసీ అబ్జర్వర్ల నియామకం సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాల వారీగా అబ్జర్వర్లను నియమించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఒక్కో జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ అబ్జర్వర్ల జాబితాను ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు దొమ్మటి సాంబయ్య, గజ్జి భాస్కర్ యాదవ్, నాగర్‌కర్నూల్‌కు టి.బెల్లయ్య నాయక్, దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, వనపర్తికి ఎ.సంజీవ్ యాదవ్, గౌరి సతీశ్, జోగుళాంబ గద్వాలకు దీపక్ జైన్, బి.వెంకటేశ్ ముదిరాజ్, నారాయణపేటకు ఎం.వేణుగౌడ్, బొజ్జ సంధ్యారెడ్డి పార్టీ అబ్జర్వర్లుగా కొనసాగనున్నారు. వీరు పార్టీ తరఫున ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులతో సమన్వయం చేయనున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నాయకుల పనితీరును అధిష్టానానికి నివేదించనున్నారు. చెంచుల స్థితిగతులపై అధ్యయనం మన్ననూర్: నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ చెంచుల జీవన స్థితిగతులపై బుధవారం రాష్ట్ర అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు అధికారుల బృందం అప్పాపూర్, భౌరాపూర్ చెంచు పెంటల్లో చెంచులతో సమావేశమై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. చెంచుల జోవనోపాదులతో పాటు జీవన భృతి తదితర అంశాల గురించి చర్చించారు. చెంచు పెంటల్లో తాగునీరు, రవాణా, రోడ్లు, చెక్‌డ్యాంలు తదితర సౌకర్యాల కల్పనతో పాటు నేచర్ గైడ్ల శిక్షణ కోసం రూ. 1.2కోట్లు మంజూరు చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యాలయ జాయింట్ సెక్రెటరీ భవానీ శంకర్, పవన్‌సింగ్, ఫైనాన్స్ అధికారి శ్రీనివాస్, ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇస్కాన్ సభ్యులు, మిషన్ భగీరథ డీఈ హేమలత, రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పౌజ్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రారంభం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా నుంచి వివిధ జిల్లాలకు ఇప్పటికే 8 మంది స్పౌజ్ ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా, వివిధ జిల్లాల నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు 21 మంది ఉపాధ్యాయులు బదిలీపై రానున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం 20 మంది ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయంలో రిపోర్టు చేయగా.. ఒక ఉపాధ్యాయుడు రాలేదని డీఈఓ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కాగా.. బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు వివిధ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్కులు, స్పౌజ్ సర్వీస్ బుక్‌లను పరిశీలన కమిటీ తనిఖీ చేసింది. అనంతరం గురువారం సాయంత్రం నాటికి వీరి బదిలీకి సంబంధించిన ఆర్డర్స్ కాపీలను అందజేయనున్నారు. ఈ ప్రక్రియను డీఈఓ ప్రవీణ్‌కుమార్, సూపరిటెండెంట్ శంబూప్రసాద్ పర్యవేక్షించారు. -
నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
నారాయణపేట ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నుంచి జూన్ 11 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, సాంఘీక సంక్షేమ, మైనారిటీ గురుకుల తదితర పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయని డీఈఓ గోవిందరాజులు తెలిపారు. సెలవుల్లో విద్యార్థులకు ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని, ఒకవేళ నిర్వహిస్తే ఆయా విద్యా సంస్థల యొక్క గుర్తింపు రద్దు చేస్తామని అన్నారు. కాగా, బుధవారం విద్యా సంవత్సరం చివరి పనిరోజు కావడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులను అందజేశారు. అనంతరం సెలవులు ఇస్తున్నట్లు తెలపడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. జిల్లా కేంద్రంలోని పలు వసతి గృహాల్లోని విద్యార్థులను వారి తల్లిదండ్రులు స్వగ్రామానికి తీసుకువెళ్లారు. -
కొత్త డీఎంహెచ్ఓకు.. ఎన్నో సవాళ్లు!
నారాయణపేట: జిల్లా ఆరోగ్యశాఖలో గ్రూపుల మధ్య కోల్డ్‌వార్.. గాడితప్పిన డీఎంహెచ్ఓ కార్యాలయ నిర్వహణ.. ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో అధికారులు, సిబ్బంది.. రిక్రూట్మెంట్, బదిలీలు, తదితర అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొందరిదే పెత్తనం.. ఇష్టానుసారంగా పీహెచ్‌సీలు.. ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహణ.. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారన్న అపవాదులు.. ఇలా ఎన్నో అంశాలు బుధవారం బాధ్యతలు స్వీకరించిన డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్‌కు స్వాగతం పలుకుతున్నాయి. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కొన్ని నియామకాలపై పలువురు ఫిర్యాదు చేయగా ఈ నెల 21 రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు.. ఇక్కడి డీఎంహెచ్ఓ సౌభాగ్యలక్ష్మిని డీపీహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. నూతన డీఎంఅండ్హెచ్ఓగా జయచంద్రమోహన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గాడిలో పెట్టేనా.. డీఎంహెచ్ఓ కార్యాలయంలో పైరవీకారుల ఆటలే సాగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పలు పోస్టులను డీఎంహెచ్ఓ కార్యాలయంలో నోటిఫికేషన్, కలెక్టర్ అనుమతులు లేకుండానే నియమకాలు చేపట్టడంతో డీఎంహెచ్‌ఓపై వేటుకు కారణమైందని అధికార వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. నూతన డీఎంహెచ్ఓ ఎలాంటి పైరవీ లేకుండా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నుంచి నేరుగా నియామకం కావడంతో.. పైరవీకారుల ఆటలు సాగవని కొందరు చర్చించుకుంటున్నారు. ఇక బాధ్యతలు చేపట్టిన డీఎంహెచ్ఓకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలు, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ ఒక ఎత్తయితే.. డీఎంహెచ్ఓ కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిని గాడిలో పెట్టడం మరో ఎత్తు అనే చర్చ కొనసాగుతోంది. రిక్రూట్మెంట్, ఇంక్రిమెంట్స్, బదిలీలు తదితర అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొందరి మాటే చెల్లుబాటు అవుతుందని సమాచారం. దీనికితోడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ఫోన్ వస్తుందో తెలియని పరిస్థితి. జిల్లాలో మరో రెండు నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు సైతం ఉద్యోగ నియామకాల్లో సిఫారసులు చేస్తుంటారు. అప్పుడు ఇన్చార్జ్..ఇప్పుడు ఫుల్‌చార్జ్ జిల్లా ఏర్పాటైన తర్వాత డాక్టర్ కె.జయచంద్రమోహన్ 2020 మేలో ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ బాధ్యతలు చేపట్టారు. 2021 జూన్‌లో వనపర్తి జిల్లా ఇన్చార్జ్గా, ఆ తర్వాత ‘పేట’ జిల్లా ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో వైద్యుడిగా విధులు నిర్వర్తించారు. తిరిగి ఇన్నాళ్లకు పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశానుసారం అడ్మినిస్ట్రేషన్‌ను కొనసాగించవచ్చు అని తెలుస్తోంది. ఇదిలాఉండగా, డాక్టర్ జయచంద్రమోహన్ బుధవారం డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. కార్యాలయంలోని ఉద్యోగులు, సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. అందరూ సమన్వయంతో బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆయనకు డిప్యూటీ డీఎంహెచ్ఓ శైలజ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ సిక్తాపట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో డీఎంహెచ్‌ఓగా పనిచేసిన వారు..పేరు విధుల్లో చేరింది బదిలీ అయ్యింది కె.సౌభాగ్యలక్ష్మి 17–02–2019 18–03–2020 ఎన్.శైలజా 19–03–2020 23–05–2020 కె.జయచంద్రమోహన్ 24–05–2020 10–06–2021 ఎన్.శైలజా 11–06–2021 06–07–2021 రాంమోహన్‌రావ్ 07–07–2021 23–08–2023 ఎన్.శైలజా 24–08–2023 10–10–2023 కె.సౌభాగ్యలక్ష్మి 11–10–2023 21–04–2025 కె.జయచంద్రమోహన్ 23.04.2025 బాధ్యతలు స్వీకరించిన జయచంద్రమోహన్ ఇటీవల వైద్యశాఖలో ఇష్టానుసారంగా నియామకాలతో తీవ్ర దుమారం ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణను గాడిన పెట్టేనా..? -
కల్తీ కల్లు బాధితులే ఎక్కువ..
జనరల్ ఆస్పత్రిలోని మెడికల్ హెల్త్ సెంటర్‌కు కల్తీ కల్లు బాధితులు ఎక్కువగా వస్తున్నారు. కల్లులో మత్తుకోసం క్లోరో, ఆల్ఫ్రాజోలం, యాంటీ సైకోటిక్ పదార్థాలను కలుపుతుండటంతో తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. నిత్యం కల్తీకల్లు సేవించడం వల్ల బ్రెయిన్, లివర్, నాడీ సంబంధ సమస్యలకు లోనవుతున్నారు. చివరికి నోట మాటరాని పరిస్థితి ఎదురవుతోంది. – డాక్టర్ అంబుజ, సైకియాట్రిస్ట్, జిల్లా మెడికల్ హెల్త్ సెంటర్, నాగర్‌కర్నూల్ కౌన్సెలింగ్ ద్వారా చికిత్స.. కల్తీకల్లు వినియోగంతో నరాల బలహీనత, ఫిట్స్, తిమ్మిర్లు రావడం, చేతులు, కళ్లలో మంటలతో ఆస్పత్రులకు వస్తున్నారు. వారికి కౌన్సెలింగ్, మందులు ఇచ్చి పంపిస్తున్నాం. తీవ్రమైన కేసులు ఉన్నవారిని హైదరాబాద్‌కు పంపుతున్నాం. – డాక్టర్ రఘు, సూపరింటెండెంట్, జనరల్ ఆస్పత్రి, నాగర్‌కర్నూల్● -
పకడ్బందీగా రాజీవ్ యువవికాసం
నారాయణపేట: రాజీవ్ యువవికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్తో కలిసి ఆదేశించారు. ఎంపీడీఓలు, బ్యాంకర్లతో కలెక్టర్ రాజీవ్ యువ వికాసం పథకం అమలు, అర్హుల ఎంపికపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండల స్థాయిలో దరఖాస్తులను ఎంపీడీఓలు, బ్యాంకు అధికారులు పరస్పర సమన్వయంతో పరిశీలించాలన్నారు. మొదటి ప్రాధాన్యతగా మహిళలు, వికలాంగులను, లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారులకు రుణం మంజూరు చేసే ముందు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించాలన్నారు. ఒకే గ్రామంలో ఎక్కువమంది ఒకే రకమైన యూనిట్లు పెట్టే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. దీంతో వ్యాపారంలో పోటీ పెరిగి నష్టాలు వస్తాయన్నారు. సరైన లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలన్నారు. వయస్సు, కులం, ఆదాయం, ఇతర ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని ఆమె సూచించారు. ఎంపికై న యూనిట్లకు సంబంధించిన గ్రౌండింగ్ పూర్తయిందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, 25 వరకు అర్హుల జాబితాను సిద్ధం చేసి ఉంచాలన్నారు. -
డీఎంహెచ్‌ఓపై వేటు
నారాయణపేట రూరల్: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఆదివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘అవినీతికి అడ్డా!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆ శాఖ రాష్ట్ర అధికారులు స్పందించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా వైద్యాధికారి డా. సౌభాగ్యలక్ష్మిని హైదరాబాద్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆమె స్థానంలో డా. జయచంద్రమోహన్ను నియమిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. నోటిఫికేషన్లు లేకుండానే పోస్టింగులు ఇవ్వడం, కలెక్టర్ అనుమతి లేకుండానే చేపట్టిన పలు పనులపై పలువురు ఫిర్యాదులు సైతం చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. దీంతో ఆమెను విధుల నుంచి తప్పించి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్ఎంఓగా పనిచేస్తున్న డా. జయచంద్రమోహన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈయన గతంలో వనపర్తి డీఎంహెచ్‌ఓగా, వికారాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా, హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి డిప్యూటీ ఆర్ఎంఓగా, జిల్లా ఏరియా ఆస్పత్రిలో అనస్తీషియా వైద్యుడిగా, డీఎంహెచ్‌ఓగా విధులు నిర్వర్తించారు. జాబ్ మేళాను వినియోగించుకోవాలి నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో మే 3న శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డా. కె.రాజ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం జాబ్ మేళాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తోందన్నారు. మేళాలో సుమారు 25 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, ఉదయం 9.30 నుంచి సాయత్రం 4 వరకు జాబ్ మేళా కొనసాగుతుందని.. జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, పోలీస్ పటేల్ మధుసూదన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, గోపాల్‌గౌడ్, రుద్రారెడ్డి, హన్మంత్, సంతోష్, శివరాజ్, నరేష్‌గౌడ్, ప్రవీణ్, విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు. ● రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సీరియస్ ● జిల్లా వైద్యాధికారిగా డా. జయచంద్రమోహన్ నియామకం -
అధికారులు పట్టించుకోవాలి..
కృష్ణా నది నుంచి ఇసుక తరలించడం మూలంగా సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతోపాటు నదిలో రోడ్లు వేయడం వల్ల దిగువకు నీళ్లు రాకుండా పోతున్నాయి. ఉన్న కాస్త నీరు అక్కడే నిలుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే వేసవి చివరలో నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అధికారులు పట్టించుకోవాలి. – అంబ్రెష్. మాజీ సర్పంచ్, గుడెబల్లూరు, కృష్ణా నా దృష్టికి రాలేదు.. నది రోడ్లు వేసినట్లు నా దృష్టికి రాలేదు. త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టినా.. అనుమతుల్లేకుండా తరలిస్తున్నా.. చర్యలు తప్పవు. – వెంకటేష్. తహసీల్దార్, కృష్ణా ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా.. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో మైనింగ్ సిబ్బంది కొరత ఉంది. అయినా నదిలో రోడ్డు వేసినట్లు మా దృష్టికి వచ్చిన వెంటనే.. పరిశీలించాలని సిబ్బందిని పంపించా. నీటిని మళ్లించేందుకు రైతులు వేసుకున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా. చర్యలు తీసుకోవాల్సింది వారు. – సంజయ్, ఏడీ, మైనింగ్ శాఖ, మహబూబ్‌నగర్ ● -
రోగులకు అందుబాటులో ఉండాలి
ధన్వాడ: వైద్యసిబ్బంది ఆస్పత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యం అందించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా. సౌభాగ్యలక్ష్మి కోరారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులు, ఈడీడీ క్యాలెండర్, ప్రసవాల నివేదికలను పరిశీలించారు. ఆస్పత్రిలోని అన్ని గదులను తనిఖీ చేశారు. ఆమె వెంట వైద్యులు డా. అనుషా, సింధుజ, సూపర్వైజర్ కతలప్ప తదితరులు ఉన్నారు. మత్తు నిర్మూలనే లక్ష్యం కోస్గి రూరల్: జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా నార్కోటిక్ స్నైపర్ పోలీస్ జగిలంతో తనిఖీలు చేపడుతున్నట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. సోమవారం పట్టణంలోని పలు కిరాణ దుకాణాలు, పాన్‌షాప్‌లు, పంటపొలాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టి మాట్లాడారు. పట్టణంలో ఎక్కడైనా, ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు, రవాణా చేస్తున్నట్లు, విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని.. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ ఆంజనేయులు, నార్కొటిక్ స్నైపర్ డాగ్ విక్కి, పరమేష్ తదితరులు ఉన్నారు. ‘అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్సే’ నారాయణపేట రూరల్: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌పార్టీ ఆది నుంచి అడుగడుగునా అవమానించిందని.. బీజేపీ అభిమానించి ఆరాధిస్తోందని రాష్ట్ర ఎస్సీ మోర్చా ఇన్చార్జ్, మాజీ ఎంపీ మునుస్వామి అన్నారు. అంబేడ్కర్ జయంతి వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నది కేంద్రంలోని మోదీ ప్రభుత్వమేనన్నారు. అంబేడ్కర్‌ను రాజ్యాంగ కమిటీలో నియమించడానికి నెహ్రూకు సైతం ఇష్టం లేదని గుర్తు చేశారు. 60 ఏళ్ల పాలనలో భారతరత్న ఇవ్వకుండా అవమానించింది కూడా కాంగ్రెస్పార్టీనని తెలిపారు. రాజ్యాంగాన్ని 108 సార్లు సవరించి ఎమర్జెన్సీ, రాష్ట్రపతి పాలనకు వినియోగించుకుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం కొన్ని సవరణలు మాత్రమే చేసిందని.. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నది మోదీ ప్రభుత్వమేనని వివరించారు. ఎస్సీ వర్గం ప్రజలకు మరింత చేరువై రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలోని ఎస్సీవాడల్లో పార్టీ ముఖ్య నాయకులు, బూత్ కమిటీల అధ్యక్షులతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. సమావేశంలో నాయకులు నాగూరావునామాజీ, కొండయ్య, కొప్పి బాషా, విజయ్‌కుమార్, కృష్ణ, నర్సన్‌గౌడ్, సుజాత, పార్టీ పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్, మండల అధ్యక్షురాలు జ్యోతి సాయిబన్న, జిల్లా పార్టీ నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. మొక్కజొన్న క్వింటా రూ.2,266 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డుకు సోమవారం భారీగా మొక్కజొన్న దిగుబడులు పోటెత్తాయి. దాదాపు 3,508 క్వింటాళ్ల మక్కలు విక్రయానికి రాగా.. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,266, కనిష్టంగా రూ.1576 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో వరి సోనారకం గరిష్టంగా రూ.2,179, కనిష్టంగా రూ.1,712, హంస రకం గరిష్టంగా రూ.1,978, కనిష్టంగా రూ.1,661, ఆముదాలు గరిష్టంగా రూ.6,018, కనిష్టంగా రూ.6,001గా ధరలు లభించాయి. మార్కెట్‌కు దాదాపు 5 వేల బస్తాల వరి ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
డబ్బులు లేక ప్రారంభించలే..
నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అధికారులు మార్కింగ్ కూడా ఇచ్చారు. కూలి పని, ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్లో ఇల్లు గడుస్తుంది. బేస్మెంట్ వరకు నిర్మించడానికి డబ్బులు లేవు. మహిళా సంఘంలో రూ.లక్ష రుణం ఇస్తే పనులు ప్రారంభిస్తా. – జమునాబాయి, ఒంటరి మహిళ, దేన్యానాయక్తండా, మద్దూరు పరిశీలిస్తున్నాం.. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు తక్షణ రుణసాయం రూ.లక్ష ఏ విధంగా మంజూరు చేయాలనే విషయంపై విధివిధానాలు పరిశీలిస్తున్నాం. స్పష్టత వచ్చిన వెంటనే లబ్ధిదారులు మహిళా సంఘాల సభ్యులైతే రుణ సాయం అందజేస్తాం. – మొగులప్ప, డీఆర్డీఓ, నారాయణపేట ● -
ఆ తర్వాత వేరే చోట..
తొలుత మట్టి రోడ్డు వేసి బెంజ్ వంటి వాహనాల్లో ఇసుక తరలించడంపై పలువురు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇసుక తరలిస్తున్న వాహనాలపై పోలీసులు తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఎవరు కూడా అటు వైపు చూడకపోవడంతో ఇసుక మాఫియా రాత్రిళ్లూ యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో అదే ఆశ్రమం నుంచి కొద్దిదూరంలో వేరే చోట మట్టి రోడ్డు వేసి.. భారీ ఎత్తున తవ్వకాలు చేపడుతోంది. రోజుకు వందలాది ట్రిప్పుల చొప్పున ఇసుకను కర్ణాటకలోని తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. బెంజ్ ఇసుకను రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. -
అకాల వర్షం.. అస్తవ్యస్తం
నారాయణపేట టౌన్: జిల్లాకేంద్రంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి జన జీవనం అస్తవ్యస్తమైంది. చెట్లు ఎక్కడికక్కడ విరిగిపడగా.. విద్యుత్ తీగలు తెగి సరఫరా నిలిచిపోయింది. జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలో భారీ చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో 3 స్తంభాలు విరిగిపడ్డాయి. అంజనా గార్డెన్స్, నాగులకట్ట, ఆర్డీఓ కార్యాలయం, శాతవాహనకాలని, నక్కరామయ్య కాలని తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లపై వర్షపు నీరు పారడంతో బస్టాండ్ సమీపంలోని పెట్రోల్‌బంక్ వద్ద కాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న గుడారాలు గాలికి ఎగిరిపోయాయి. పలు దుకాణాల ఎదుట ఉన్న ప్లెక్సీలు, బోర్డులు, ఇనుప రేకులు కొట్టుకుపోయి వ్యాపారులకు నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యం.. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డుకు అమ్మకానికి వచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. మధ్యాహ్నం వరకు టెండర్ ప్రక్రియ పూర్తికాగా.. తూకాలు వేసిన ధాన్యం బస్తాలు, ఆలస్యంగా అమ్మకానికి వచ్చిన ధాన్యం బస్తాలపై టార్పాలిన్లు కప్పినప్పటికీ ధాన్యం తడిసిపోయింది. నీటిలో కొట్టుకుపోయిన ధాన్యం తిరిగి కుప్ప వేసేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. యార్డులోని షెడ్డు పైకప్పు ఇనుప రేకులు గాలివానకు ఎగిరిపోగా.. పలు వేపచెట్లు నేలకొరిగాయి. -
అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
నారాయణపేట టౌన్: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రజల నుంచి గుర్తింపు లభిస్తుందని.. ఉత్తమ సేవలు అందించాలని హోంగార్డు ఇన్చార్జ్ ఆఫీసర్ (ఆర్ఎస్ఐ) మద్దయ్య అన్నారు. జిల్లా నుంచి మహబూబ్‌నగర్‌కు బదిలీపై వెళ్తున్న 60మంది హోంగార్డులకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ కాన్ఫరెన్స్ హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఇన్నాళ్లు అంకితభావంతో పనిచేసిన హోంగార్డ్లందరికీ అభినంధనలు తెలిపారు. ఇక ముందు కూడా బాగా పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఆకాంక్షిచారు. వీరి స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 61 మంది హోంగార్డ్లు ఇక్కడికి రాన్నునట్టు తెలిపారు. స్థానికంగా మహబూబ్‌నగర్ వారై ఇక్కడ పనిచేస్తూ ఎస్పీ చొరవతో తమ సొంత జిల్లాకు బదిలీపై వెళ్తున్నందున ఎస్పీ యోగేష్గౌతమ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
నారాయణపేట రూరల్: జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చర్చిలలో ఆదివారం యేసుక్రీస్తు పునరుత్థానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నారాయణపేట మండలంలోని బైరంకొండ, కొల్లంపల్లి, సింగారం గ్రామాల్లోని చర్చిలు యేసు నామస్మరణతో మార్మోగాయి. సింగారంలో ఉదయం ప్రభువును స్మరిస్తు పాటలు పాడుతూ ర్యాలీగా బయలుదేరి కల్వరి కొండకు చేరుకొని అక్కడ ఉదయపుకాల ఆరాధన కార్యక్రమం నిర్వహించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్థానిక ఇమ్మెన్యూయేల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రెవరెండ్ పాస్టర్ నగేష్ మాట్లాడుతూ ప్రభువు మరణాన్ని జయించి సమాధి నుంచి మృత్యంజయునీగా లేచిన దినాన్నే ఈస్టర్ అని, ఇది ఒక పర్వదినంగా క్రైస్తవులు భక్తిశ్రద్దలతో ఆచరిస్తారని అన్నారు. తనకు తాన తగ్గించుకొన్నవారే హెచ్చించబడుతారని ఏసు బోధించారని అన్నారు. అనంతరం ఏసుక్రీస్తు జీవిత పునరుత్థానంపై సందేశాన్ని వినిపించారు. మహిళలు యేసయ్య పాటలు గీతాలాపన చేశారు. అయా కార్యక్రమంలో పాస్టర్లు, క్రైస్తవ సంఘ పెద్దలు, చర్చీ కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. -
ఎండీసీఏ మైదానంలో ‘టర్ఫ్ వికెట్’
మహబూబ్‌నగర్ క్రీడలు: మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ సంఘం (ఎండీసీఏ) ఆధ్వర్యంలో టర్ఫ్ వికెట్ పిచ్‌లు సిద్ధం చేస్తున్నారు. జిల్లాకేంద్రం పిల్లలమర్రి సమీపంలోని ఈ మైదానంలో క్రీడాకారుల సౌకర్యార్థం చాలా వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు ఉన్న ఏకై క క్రీడా మైదానమిది. ఇప్పటికే ఇక్కడ క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం దాతల సహకారంతో నెట్, రెండు బౌలింగ్ యంత్రాలతో పాటు పెవిలియన్ భవనాన్ని ఏర్పాటు చేశారు. ● క్రికెట్లో టర్ఫ్ వికెట్(పిచ్)లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేవలం మ్యాట్ల మీద క్రికెట్ ఆడే క్రీడాకారులకు టర్ఫ్ వికెట్‌పై ఆడాలంటే మెరుగైన ప్రాక్టీస్ ఉండాల్సిందే. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఔత్సాహిక ఉమ్మడి జిల్లా క్రికెట్ క్రీడాకారులకు కల నెరవేరనుంది. గతేడాది ఎండీసీఏ మైదానంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో పలువురు హెచ్‌సీఏ ప్రతినిధులు పాల్గొనగా మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటు కోసం ఎండీసీఏ ప్రతినిధులు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హెచ్‌సీఏ రూ.60 లక్షలు కేటాయించగా.. కొన్ని రోజులుగా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అదే విధంగా మైదానం మొత్తం పచ్చగడ్డి (గ్రీనరీ)ని ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో వర్షపు నీరు నిలువకుండా ఎత్తు పెంచి చుట్టూ అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ వేస్తున్నారు. త్వరలో ఎండీసీఏ మైదానంలో మూడు టర్ఫ్ వికెట్ పిచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ● టర్ఫ్ వికెట్ పిచ్‌పైనే జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మ్యాచ్‌లు ఆడుతారు. ఇంతకాలం మ్యాట్‌పై ఆడే జిల్లా క్రీడాకారులు టర్ఫ్ వికెట్ అందుబాటులోకి వస్తే వారి ఆటతీరు మరింత మెరుగు పడే అవకాశం ఉంటుంది. హెచ్‌సీఏ రాష్ట్రస్థాయి టోర్నీల్లో జిల్లా క్రీడాకారులు మరింతగా రాణించవచ్చు. రంజీస్థాయిలో ఆడేలా జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చు. ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటయితే భవిష్యత్‌లో రాష్ట్రస్థాయి మ్యాచ్‌లతో పాటు రంజీ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. త్వరలో మూడు పిచ్‌లు అందుబాటులోకి.. మైదానం మొత్తం గ్రీనరీ ఏర్పాటు భవిష్యత్‌లో రంజీ మ్యాచ్‌లకు వేదిక కానున్న పాలమూరు -
చురుగ్గా సాగుతున్న పనులు..
ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ పిచ్ ఏర్పాటు చేయాలనే కల నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతే డాది హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు టర్ఫ్ వికెట్ కోసం విన్నవించగా వారు సానుకూలంగా స్పందించారు. మైదానంలో టర్ఫ్ వికెట్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. క్రీడాకారులకు మెరుగైన క్రికెట్ శిక్షణ లభిస్తుంది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు – ఎం.రాజశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ● -
నేటి ప్రజావాణి రద్దు
నారాయణపేట టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన భూభారతి చట్టం–2025పై ఈనెల 29వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బీఎం సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విషయాన్ని ప్రజలు గమనించి ఫిర్యాదులు చేసేందుకు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు. 20 మంది టీచర్లకు స్పౌజ్ బదిలీలు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: 317 జీఓలో గతంలో ఇబ్బందులకు గురైన స్పౌజ్ ఉపాధ్యాయులకు త్వరలో బదిలీ చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారు గతంలో తమకు బదిలీ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం ఈ అంశంపై నిర్ణయం తీసుకుని బదిలీలకు ఆమోదం తెలిపింది. మొత్తంగా మహబూబ్‌నగర్ జిల్లాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 20 మంది బదిలీపై రానున్నారు. పాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి మహబూబ్‌నగర్‌కు బదిలీ కానున్నారు. కాగా 8 మంది టీచర్లు ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు. ఇటీవల డీఎస్సీ ద్వారా ప్రభు త్వం చాలా పోస్టులు భర్తీ చేసింది. ఖాళీలు ఎక్కువ లేని క్రమంగా మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చే ఉపాధ్యాయులకు బై పోస్టుల కింద భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ విషయంపై డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. 20 మంది ఉపాధ్యాయులకు అన్ని పరిశీలించి ఈ నెల 22లోగా బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు.. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారని పీయూ అకాడమిక్ ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కెమిస్ట్రీ పూర్తి చేసిన విద్యార్థులు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. రీసెర్చ్ కెరీర్‌ను ఎంచుకోవడం వల్ల మిగతా విద్యార్థుల కంటే కూడా జీవితంలో త్వరగా స్థిరపడేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో హెచ్ఓడీ రవికుమార్, శ్రీధర్‌రెడ్డి, రామ్మోహన్ పాల్గొన్నారు. దివ్యాంగులకుప్రాతినిఽథ్యం కల్పించాలి జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్రంలో దివ్యాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ చౌరస్తాలోని రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ణగారిన వర్గాలలో ఉన్న దివ్యాంగులు అధికారం కలిగిన సంస్థల్లో భాగం కావడానికి చట్టపర అధికారాలతో స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దివ్యాంగులందరూ అందరూ ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్‌ను ఎన్నుకున్నారు. బెస్త యాదగిరి, జాతీయ ఉపాధ్యక్షుడు కుమార్ పాల్గొన్నారు. 27న ప్రవేశ పరీక్ష కొత్తకోట రూరల్: మండలంలోని అమడబాకుల మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశం కోసం ఈ నెల 27న అర్హత పరీక్ష, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ మల్లికార్జున్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, అలాగే 7, 8, 9, 10 తరగతుల వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. సోమవారం నుంచి హాల్‌టికెట్లు ఆన్‌ౖలైన్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
మహోన్నతమైన వ్యక్తి అంబేడ్కర్..
మక్తల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని గుడిగండ్లలో అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని బౌద్దబిక్షువులతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయలను భవిష్యత్ తరాలకు అందించడం మనందరి బాధ్యత అని, ప్రపంచ మేధావి చూపిన మార్గంలో ముందుకు సాగుతూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ ఒక వర్గానికి చెందిన వాడు కాదని ఆయన అందరివాడని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, విశ్రాంత ఎంఈఓ లక్ష్మినారాయణ, నాయకులు నర్సింహగౌడ్, రాజుల ఆశిరెడ్డి, శ్రీనివాసుగుప్తా, హనుమంతు టీచర్, మాజీ సర్పంచ్ మహేశ్వరి, మాజీ ఎంపీటీసీ లక్ష్మి నర్సిరెడ్డి, గణేష్కూమార్ పాల్గొన్నారు. -
మిస్ వరల్డ్ పోటీలు రద్దు చేయాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: రాష్ట్రంలో మే 7 నుంచి మే 30 వరకు జరిగే మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి విజయలక్ష్మీ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పీఓ డబ్ల్యూ, ఐద్వా, పీవైఎల్, డివైఎఫ్ఐ, పీడీఎస్‌యూ, సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి మున్సిపల్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి పార్కు ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు శారద అధ్యక్షత వహించగా విజయలక్ష్మీ, రాజేశ్వరి మాట్లాడారు. 72వ మిస్ వరల్డ్ పోటీలు హైద్రాబాద్‌లో జరగనున్నాయని, అందాల పోటీలు సామ్రా జ్యవాద దేశాల బహుళజాతి కంపెనీల సరుకుల అమ్మకం కోసం జరుగుతున్న పోటీమాత్రమేనని అన్నారు. పోటీలను రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలు వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా కార్యదర్శి ప్రతాప్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ , ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు నరహరి, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సౌజన్య, జిల్లా ఉపాద్యాక్షురాలు లక్ష్మీ, ఐద్వా జిల్లా కార్యదర్శి, సమ్రిన్ బేగం, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభం
నారాయణపేట రూరల్: సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా చదువుకుంటున్న విద్యార్థులకు ఆదివారం వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఓపెన్ టెన్త్ కొరకు 573 మంది, ఓపెన్ ఇంటర్‌కు 940మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో తొలిరోజు ఉదయం జరిగిన తెలుగు, కన్నడ, తమిల్, ఉర్దూ, హిందీ పరీక్షకు గాను టెన్త్ విద్యార్థులు 508కి 435మంది హాజరుకాగా.. 73మంది గైర్హాజరు అయ్యారు. అదేవిధంగా ఇంటర్లో 769మందికి 709మంది హాజరుకాగా.. 60మంది గైర్హాజరు అయ్యారు. మొత్తంగా టెన్త్‌లో 86శాతం, ఇంటర్లో 92శాతం హాజరు నమోదైంది. అదేవిధంగా మధ్యాహ్నం నిర్వహించిన టెన్త్ వారికి హిందీ పరీక్షను డీవీఎం, గర్ల్స్ స్కూల్ పాఠశాలల్లో నిర్వహిస్తే ఇద్దరికి గాను ఒకరు మాత్రమే హాజరయ్యారు. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు ఫిజిక్స్ పరీక్షను శ్రీసాయి, కృష్ణవేణి, శ్రీనారాయణ, లిటిల్‌స్టార్ కేంద్రాల్లో ఏర్పాటు చేయగా ఏడుగురికి ఒకరు గైర్హారు అయ్యి ఆరుగురు పరీక్ష రాశారు. శ్రీసాయి పరీక్షకేంద్రంలో ముగ్గురు. శ్రీనారాయణ సెంటర్లో ఇద్దరిని కేటాయించగా ఐదుగురు హాజరు కావడంతో వందశాతం హాజరు నమోదైంది. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్కాడ్ బృందం, టాస్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీనివాస్‌లు పరిశీలించారు. -
అవి ఆరోపణలు మాత్రమే
మా కార్యాలయంపై వస్తున్న ఫిర్యాదులన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే. ఓ వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన విషయం వాస్తవం. తాను సెలవులో ఉండడంతో స్థానిక సంస్థట అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ డీఎంహెచ్ఓతో విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలుస్తోంది. ఆ రిపోర్టులో ఏం రాశారో తమకు తెలియదు. – సౌభాగ్యలక్ష్మి, డీఎంహెచ్ఓ చర్యలు తీసుకోవాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్లు వేయకుండా, కలెక్టర్ అనుమతులు లేకుండా తన ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చిన డీఎంహెచ్‌ఓపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎంపీ డీకే అరుణకు డీఎంహెచ్ఓ పై ఫిర్యాదు చేశాం. త్వరలోనే హెల్త్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి విన్నవించబోతున్నాం. – బొదిగల శ్రీనివాస్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట ● -
అవినీతికి అడ్డా!
డీఎంహెచ్ఓ కార్యాలయంలో అవినీతి తిమింగలాలు నారాయణపేట: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయకుండా.. కలెక్టర్ అనుమతులు లేకుండా పలు పోస్టింగులు ఇవ్వడంతో అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఇటు ఉద్యోగం పొందిన వారిని అయోమయంలో పడేసినట్లయింది. దీనిపై సమగ్ర విచార చేపట్టాలంటూ ఎంపీతో పాటు కలెక్టర్‌కు కొందరు ఫిర్యాదు చేయగా.. తాజాగా విచారణకు ఆదేశించినట్లు సమాచారం. బయట పడిందిలా.. వివిధ స్థాయిలో ఉద్యోగాల్లో నియామకాలు జరిపిన వారికి జీతాలు చెల్లించాలంటే వారికి ఐడీ నంబర్లు ఉండాలి. అయితే వారికి ఐడీ నంబర్లు కేటాయించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి హైదరాబాద్‌లోని కమిషనరేట్‌కు వెళ్లారు. మా కమిషనరేట్ నుంచి ఉద్యోగాలను భర్తీ చేసుకోవాలని ఆర్డర్ ఏమైనా ఇచ్చామా, లేక కలెక్టర్ అప్రూవల్తో ఉద్యోగులను నియమించుకున్నారా అని వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనుమతులు లేకుండా అక్రమంగా నియామకం చేపట్టిన వారికి ఐడీ నంబర్లు ఇచ్చే ప్రసక్తే లేదని ఆ అధికారిని తిప్పి పంపించడంతో ఈ తతంగం బయటపడినట్లు సమాచారం. విచారణ చేపట్టిన జిల్లా అధికార యంత్రాంగం డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఇటీవల కలెక్టర్ సిక్తాపట్నాయక్‌కు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని ఓ ఉద్యోగిని, జిల్లా అడిషనల్ కలెక్టర్లతో విచారణ జరిపించినట్లు సమాచారం. ఫిర్యాదులో పేర్కొన్న ఆంశాలతో పాటు మరిన్ని విషయాలు అధికారుల విచారణలో తెలినట్లు తెలుస్తోంది. డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరుగుతున్న అవి నీతి, అక్రమాల పుట్టాను తయారు చేసి కలెక్టర్ ద్వారా రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులకు నివేదించినట్లు సమాచారం. అవినీతి ఆరోపణలు ఇవీ.. జిల్లా మలేరియా అధికారిగా పనిచేస్తున్న ఓ అధికారి సతీమణిని ఆర్బీఎస్కే కింద ఫార్మసిస్టుగా నియమించారు. ఈమె ఆర్బీఎస్కే ‘ఎ’ టీంలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తిప్రాస్‌పల్లికి చెందిన ఓ యువకుడు ఫార్మాసిస్టుగా ఆర్బీఎస్కే కోస్గి టీంలో పనిచేస్తున్నారు. (ఉద్యోగులకు ఐడీ నంబర్లు ఇవ్వమని తెలపడంతో ఈయనకు ఇచ్చిన ఆర్డర్ కాపీని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.) జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ఊట్కూరుకు చెందిన బీహెచ్ఎంఎస్ చేసిన ఓ వైద్యుడికి ఎంఎల్‌హెచ్‌పీగా తీసుకోవాల్సిందిగా రెఫర్ చేస్తూ లెటర్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ అదే లెటర్లో.. 104లో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న డీఈఓ పేరును సైతం జోడించి జిల్లా కమ్యూనిటీ మోబిలైజర్(డీసీఎం)గా నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ మహిళను ఎన్హెచ్ఎం కింద 2024 డిసెంబర్లో స్టాఫ్‌నర్స్‌గా నియమించడంతో మరికల్ పీహెచ్సీలో పనిచేస్తున్నారు. మరో వ్యక్తిని అక్టోబర్ 2024లో కృష్ణా పీహెచ్‌సీకి ఆయుష్ ఫార్మాసిస్టుగా నియమించారు. కానీ అతను ఫార్మసిస్టే కాదు. ఓ యువకుడు కోటకొండ పీహెచ్సీ, మరో యువతి కోస్గిలో డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరందరినీ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే ఆయా నియామకాలను చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఊట్కూరు పీహెచ్సీలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న మహిళ వైద్య పరీక్షల నిమిత్తం రెండు నెలలు సెలవులో ఉన్నా వేతనం మాత్రం డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈమె భర్త కలెక్టరేట్లో కంప్యూటర్ ఆపరేటర్ అనే సాకుతోనే రెండు నెలల జీతాన్ని చెల్లించినట్లు సమాచారం. నోటిఫికేషన్లు లేకుండానే పోస్టింగ్‌లు కలెక్టర్ అనుమతులు సైతం లేని వైనం ఉద్యోగాలు పొందిన వారికి ఐడీలు ఇవ్వకపోవడంతో అయోమయం విచారణ చేపట్టిన జిల్లా అధికార యంత్రాంగం -
ప్రతి కేసుపైపారదర్శక విచారణ
నారాయణపేట: ప్రతి కేసుపై పారదర్శక విచారణ చేయాలని, కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని, గంజాయి, గుట్కా, పేకాట పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి సమూలంగా నిర్మూలించాలని డీఎస్పీ ఎన్.లింగయ్య ఆదేశించారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ ఉన్న గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి సీఐ, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలన్నారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, 60 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. ఆత్మహత్యల కేసులలో అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేసి కేసు ఫైనల్ చేయాలని సూచించారు. పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈ సమావేశంలో సిఐలు శివ శంకర్, సైదులు, రాజేందర్ రెడ్డి, రామ్ లాల్ పాల్గొన్నారు. జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టుల ఏర్పాటు నారాయణపేట: యాసంగి వరి కొనుగోళ్లలో పోరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వరి ధాన్యం రాకుండా నివారించేందుకు జిల్లా పరిధిలో 6 బోర్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. నారాయణపేట మండలంలో జలాల్పూర్ చెక్ పోస్ట్, దామరగిద్ద మండలం కానుకుర్తి వద్ద, కృష్ణ మండలంలో చేగుంట వద్ద, కృష్ణా బ్రిడ్జి వద్ద, ఊట్కూర్ మండలంలో సమస్తాపూర్ వద్ద, మాగనూర్ మండలంలోఉజ్జెల్లి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ బోర్డర్ చెక్‌పోస్టులో పోలీస్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వరి ధాన్యం రాకుండా చూడాలని, వాహనాల వే బిల్లులను తనిఖీ చేయాలని సూచించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. చెక్‌పోస్టు దగ్గర వచ్చి పోయే ప్రతి ఒక్క వాహనాల నంబర్లను రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు. వ్యాపారస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, చెక్‌పోస్టుల వద్దనే కాకుండా బోర్డర్ గ్రామాల నుంచి జిల్లాలోకి వరి ధాన్యం రాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఉన్న హెచ్ఓలు నిరంతరం చెక్‌పోస్ట్‌లపై నిఘా ఉంచాలని తెలిపారు. పీయూలో కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. ఈ మేరకు పీయూ ప్రధాన గేట్ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సంఘం నాయకులు భూమయ్య, శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. నెట్, సెట్, పీహెచ్డీ వంటి అర్హతలు ఉన్న అధ్యాపకులను ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రెగ్యులరైజ్ చేయాలని, జీఓ నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మెకు నాన్ టీచింగ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్, బుర్రన్న సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో రవికుమార్, సుదర్శన్‌రెడ్డి, విజయభాస్కర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఈశ్వర్ పాల్గొన్నారు. -
భూ భారతి చట్టంపై అవగాహన ఉండాలి
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని... ఈ చట్టం ఎంతో సులభమైన, సరళమైందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తా వద్ద గల వృత్తి నైపుణ్య అభివృద్ధి శిక్షణా కేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి హాజరయ్యారు. సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ.. కొత్త పోర్టల్‌లో సింగిల్ ఆఫీసర్‌కు అధికారాలు ఇచ్చారని, భూ సమస్యలను బట్టి తహసీల్దార్, ఆర్డీఓ, రెవెన్యూ కలెక్టర్ స్థాయిలో అధికారాలు ఉన్నాయని, వారి పరిధి కంటే ఎక్కువ సమస్య ఉంటే కలెక్టర్‌కు అధికారం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే, ఆధార్ కార్డు ఎలాగో ప్రతి రైతుకు తన భూమికి సంబంధించిన అన్ని వివరాలతో కూడిన భూదార్ కార్డును జారీ చేయనున్నట్లు వివరించారు. ఈ కొత్త చట్టం, రూల్స్ జూన్ 2 తర్వాత అన్ని గ్రామాలలో సదస్సులు నిర్వహించి అక్కడి రైతుల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ.. ఈ కొత్త చట్టంపై రైతులందరికీ అవగాహన ఉంటే ఎవరికి వారే అధికారుల వద్దకు వెళ్లి భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. గత ప్రభుత్వంలోని ధరణిలో సాదా బైనామాలకు అవకాశం లేకపోయిందని, నియోజకవర్గంలో వెయ్యి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అంతేగాక, చిన్న చిన్న సమస్యలు పరిష్కారంకాక గతంలో రైతులు కోర్టుకు వెళ్లాలల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు కోర్టుకు వెళ్లకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రైతులందరూ భూ భారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకుని గొడవలు లేకుండా సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. సదస్సులో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, రాజేష్, తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలి కొత్తపల్లి/కోస్గి రూరల్: గడువులోగా మండల కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని, ఇసుక సమస్య అతిత్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం కొత్తపల్లి, గుండుమాల్ మండల కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను శనివారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. కొత్తపల్లి సమీపంలో మూడు ఎకరాల స్థలంలో రూ.8.80 కోట్లతో చేపడుతున్న మండల కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే, గుండుమాల్ పీహెచ్సి పక్కన గల రెండు ఎకరాల స్థలంలో నిర్మించే నిర్మాణ స్థలాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. రెండు చోట్ల ఇసుక సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. సమస్యను పరిష్కరించి రెండు రోజుల్లో ఇసుక వచ్చేలా చూడాలని ఆయా తహసీల్దార్లను ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ హీర్యానాయక్, డీఈ విలోక్, తహసిల్దార్లు జయరాములు, భాస్కర్ స్వామి, ఏఈ అంజి రెడ్డి పాల్గొన్నారు. -
పేదవాడి చుట్టంలా ’భూ భారతి’
నాగర్‌కర్నూల్: పేదల భూ సమస్యలు తీర్చే చట్టమే భూ భారతి అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న ఓ ఫంక్షన్హాల్లో భూ భారతి చట్టం–2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల కన్నీరు తుడవడానికి తీసుకొచ్చిన చట్టమే భూ భారతి అని, ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి చట్టాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఒక చట్టం రూపొందిస్తే అది పేదవాడికి చుట్టంలాగా ఉండాలని.. భూ భారతి చట్టం వందేళ్లకు సరిపడే విధంగా ఉందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగారని.. ఇప్పుడింకా ఆ అవసరం లేదని, అధికారులే రైతుల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. మే 1 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని వివరించారు.ఎకై ్స జ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఆర్టి ఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ప్రతిపక్షాలు అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని.. ప్రజలు గుర్తించి పేదల అభ్యున్నతికి పాటుపడే ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
సాగునీరు నిలిపివేత
జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు సాగునీటిని శుక్రవారం నిలిపివేశారు. వివరాలు 10లో uసుమారు 25 కి.మీ.లు పయనించి.. కర్ణాటక రాష్ట్రంలో యాద్గిర్ ఫారెస్ట్ డివిజన్లో హోరంచ, అష్‌నాల్, ఎర్గోల, మినాస్‌పూర్ బ్లాక్‌లు ఉన్నాయి. మొత్తం 28,868.55 హెక్టార్ల పరిధిలో అడవులు విస్తరించినట్లు అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, పెద్దపులులకు ఆవాసంగా ఉన్న ఈ అడవిలో కొన్నేళ్లుగా చిరుతల సంతతి గణనీయంగా పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో నీరు, ఆహారం కోసం చిరుతలు ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మినాస్‌పూర్ బ్లాక్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నారాయణపేట జిల్లాలోకి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
మక్తల్: క్రీడలు దేహ ధారుడ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని మక్తల్ సిఐ రాంలాల్ అన్నారు. శుక్రవారం మక్తల్‌లో షూటింగ్ బాల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సబ్ షూటింగ్ బాల్ బాలబాలికలకు ఏర్పాటు చేసిన క్రీడలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు, సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందన్నారు. ఇక్కడి క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిల్లో ఎంపిక అవుతుండడం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయిల్లో రాణించిన బాలికలు దివ్య, ప్రవీణ, లక్ష్మి, మేఘన, విశ్వాస, కౌసల్య, గాయత్రి, మధుప్రియ, అఖిల, శ్రావణిని సన్మానం చేశారు. అలాగే, రాష్ట్ర స్థాయికి ఎంపికై న దివ్య, లక్ష్మి, ప్రవీణ, మేఘన, విశ్వాస, కౌసల్య, అఖిల, శ్రావణి, మల్లేశ్వరి, రాజేష్, శివ, జగదీస్, మణికుమార్, మేగేందర్, రహీం, గణేష్, వెంకటేష్‌లను అభినందించారు. ఈ నెల 25 నుంచి 27 వరకు జరుగు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో వీరు పాల్గొంటారని అన్నారు. సత్యఅంజి, బి.గోపాల్, రమేష్‌కుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, స్వప్న, బీంరెడ్డి, అనిత, రాఘవేందర్ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి డెడ్‌లైన్
సాక్షి, నాగర్‌కర్నూల్: భూ సమస్యలపై తీసుకువచ్చిన భూభారతి చట్టం–2025పై ప్రజలకు క్షేత్రస్థాయిలో విస్త్రృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ధరణికి బదులుగా తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. గత రెవెన్యూ చట్టాలకు భిన్నంగా ఈసారి కొత్త చట్టంలో భూసమస్యల పరిష్కారానికి నిర్దేశిత గడువును విధించింది. భూరికార్డుల్లో తప్పుల సవరణ పరిష్కారం 60 రోజుల్లో పూర్తి కావాలని నిర్దేశించింది. వారసత్వ భూముల్లో హక్కుదారులను 30 రోజుల్లోగా నిర్ణయించాలని, లేకపోతే దరఖాస్తు ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు సైతం చర్యలు తీసుకోగా, ఇందుకోసం గరిష్టంగా 90 రోజుల గడువు విధించింది. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు.. పూర్వంలో గ్రామాల్లో రికార్డుల నిర్వహణ పక్కాగా నిర్వహించినట్టుగా ఇకనుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులను నిర్వహించనున్నారు. మ్యుటేషన్, రికార్డుల మార్పులు జరిగినప్పుడు వాటిని గ్రామ పహాణి, ప్రభుత్వ భూముల రిజిస్టర్లను మారుస్తారు. భూభారతి పోర్టల్‌లో దరఖాస్తుల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. తహసీల్దార్ నిర్ణయంపై ఆర్డీఓకు, ఆర్డీఓ నిర్ణయంపై కలెక్టర్‌కు, కలెక్టర్ నిర్ణయంపై ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీళ్లను 60 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ రైతులకు ఉచిత న్యాయసాయాన్ని అందించనున్నారు. మండలస్థాయి, జిల్లా లీగల్ అథారిటీల ఆధ్వర్యంలో పేద రైతులకు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించనున్నారు. మోసపూరితంగా పట్టాలు పొందితే చర్యలు.. ఇష్టారీతిగా భూ రికార్డుల్లో మార్పులు చేయడం, మోసపూరితంగా భూమి హక్కులు, పట్టాలను పొందితే వాటిని వెంటనే రద్దు చేయనున్నారు. ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టాలుగా పొందితే ఆ భూములన్నీ రద్దు కానున్నాయి. ఈ భూములు అన్యాక్రాంతం అయినట్టుగా అనుమానాలున్నా ప్రజలు నేరుగా సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయవచ్చని భూభారతి చట్టం పేర్కొంది. గ్రామాల్లో ఎక్కువగా ఆబాదీ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. గ్రామకంఠం, ఆబాదీ భూముల్లో ఇళ్లు ఉన్నవారికి సరైన చట్టబద్ధమైన భూ హక్కులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లస్థలాలు, ఆబాదీ, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులను పక్కాగా నిర్వహిస్తారు. ప్రతి భూ యజమానికి ఆధార్ తరహాలో భూధార్ కార్డులను జారీ చేస్తారు. భూభారతి పోర్టల్‌లో ఉన్న హక్కుల రికార్డు ఆధారంగా తహసీల్దార్లు భూధార్ కార్డులను జారీ చేయనున్నారు. కొత్త రెవెన్యూచట్టంలో సాదా బైనామా దరఖాస్తులను సైతం పరిష్కరించాలని నిర్ణయించడంతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో కదలిక రానుంది. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం విచారణకు రావాలని సంబంధిత ఆర్డీఓ నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత దరఖాస్తుదారుడు అఫిడవిట్ సమర్పించాలి. ఆర్డీఓ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సాదాబైనామా దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారు. వీటిలో అసైన్డ్, సీలింగ్, షెడ్యూల్ ఏరియా భూములు ఉంటే వాటిపై భూ హక్కులు ఉండవు. దరఖాస్తు సక్రమంగా తేలితే ఆర్డీఓ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 90 రోజుల్లోగా పూర్తికావాలని చట్టంలో నిర్దేశించారు. ఉమ్మడి జిల్లాలో నేడుమంత్రి పొంగులేటి పర్యటన.. భూభారతి చట్టంపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు నిర్వహించే అవగాహన సదస్సునకు హాజరయ్యేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. జోగుళాంబ గద్వాలతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని సదస్సుల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం 8.50 గంటలకు జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. ధరూర్ మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే భూ భారతి చట్టం –2025 అవగాహన సదస్సుల్లో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న తేజ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే అవగాహన సదస్సుకు హాజరవుతారు. అనంతరం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. భూభారతిపై విస్తృత అవగాహనకల్పించేందుకు సిద్ధమైన ప్రభుత్వం 60 రోజుల్లో సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త రెవెన్యూ చట్టం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు నేడు గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి పొంగులేటి -
ప్రోగ్రెస్ రిపోర్టులు ఇక ఆన్లైన్లో..
నారాయణపేట రూరల్: విద్యా సంవత్సరంలో చివరిగా నిర్వహించే ఎస్ఏ 2 పరీక్షలు పూర్తి కావడంతో ఉపాధ్యాయులు సమాధాన పత్రాల మూల్యాంకనంలో బిజీగా గడుపుతున్నారు. ఈనెల 23తో విద్యా సంవత్సరం పూర్తి అవుతున్న నేపథ్యంలో పిల్లల ప్రగతిని తెలిపే ప్రోగ్రెస్ రిపోర్టులను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో మాదిరి కాకుండా పాత విధానానికి స్వస్తి పలికి ఈసారి విద్యార్థులకు ఆన్లైన్లో ప్రగతి పత్రాలను అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది జరిగిన నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలతో పాటు సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షకు సంబంధించిన మార్పులను ఆన్లైన్ లో అప్లోడ్ చేశారు. ఇక ఎస్ఏ 2 పరీక్ష ఫలితాలను వెబ్సైట్లో పొందుపరిచేందుకు సన్నద్ధమవుతున్నారు. కంప్యూటర్, ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులే స్వయంగా ఆన్లైన్లో మార్కులు పొందుపరుస్తుండగా, ఈ సదుపాయం లేని స్కూల్ ప్రధానోపాధ్యాయులు చేతిరాతతో రాసి కాంప్లెక్స్ సముదాయంలోని సిఆర్పీల ద్వారా మార్పులను వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. ఇక ఎస్ఏ 2 పరీక్షలకు సంబంధించి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి ఈనెల 20 లోగా మార్కులను అప్లోడ్ చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 21న ఆన్లైన్ కార్డులను డౌన్లోడ్ చేసుకొని మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించింది. అన్ని సిద్ధం చేసుకుని ఈ నెల 23న తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి వారి సమక్షంలోనే ఆన్లైన్లో ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ముగిసిన ఎస్ఏ 2 పరీక్షలు ఈ నెల 23న ఆఖరి పనిదినం సమాధాన పత్రాల మూల్యాంకనంలో టీచర్లు బిజీబిజీ ప్రతి విద్యార్థికి అందిస్తాం.. ప్రభుత్వ పాఠశాలలో చ దివే ఒకటి నుంచి 9వ త రగతి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ప్రోగ్రెస్ రిపో ర్టులను అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. ఇప్పటికే పాఠశాలలో నిర్వహించిన అన్ని రకాల పరీక్షల మార్కులను సంబంధిత హెచ్ఎంలు వెబ్సైట్లో పొందుపరిచారు. సోమవారంలోగా క్రాస్ చెక్ చేసుకుని ఈ నెల 23 చివరి పని దినం పిల్లల తల్లిదండ్రులకు అందించాలని టీచర్లకు ఆదేశాలు ఇచ్చాం. – గోవిందరాజు, డీఈఓ -
భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు
నారాయణపేట టౌన్/ నారాయణపేట రూరల్: జిల్లా వ్యాప్తంగా గుడ్‌ఫ్రైడేను క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సర్వమానవాళికి రక్షణ లభిస్తుందని, పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని పాస్టర్లు సందేశమిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంబీ ఎబినేజర్ చర్చిలో డి.శోభారాణి సాల్మన్, బి.తిమోతి, ఆర్.మేరి సత్యపాల్,యం.దేవిపుత్ర,సహోదరి కే.సంకీర్తన చదివి వినిపించారు. ప్రతి ఒక్కరు సత్పవర్తనతో క్రీస్తు అడుగుజాడల్లో నడవాలని అన్నారు. అలాగే, మండలంలోని బైరంకొండ, సింగారం, కొల్లంపల్లి గ్రామాల్లోని చర్చీల్లో క్రైస్తవులు ఘనంగా జరుపుకొన్నారు. రెవరెండ్ పాస్టర్ నగేష్ మాట్లాడుతూ సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు మానవాళి ఆత్మరక్షణ కోసం ప్రాణ త్యాగం చేశారని, ఏసు ప్రభువు శిలువపై వేసిన రోజును గుడ్ ఫ్రైడే గా శుభ శుక్రవారంగా జరుపుకొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ పెద్ధలు, పాస్టర్ రెవ.అమృతకుమార్,అధ్యక్షులు బ్రదర్ బి.వినోద్‌కుమార్, ఎస్.డి.ఆనంద్‌కుమార్,మురళి మోహన్‌రెడ్డి, పరంజ్యోతి, శేశమ్మ పాల్గొన్నారు. -
‘నల్లమల’కు తరలిస్తున్నాం..
నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిన మాట వాస్తవమే. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. చిరుత సంచారాన్ని తెలుసుకునేలా మోమినాపూర్, నందిగామ, నందిపాడ్ వంటి ప్రధాన చోట్ల ట్రాక్ కెమెరాలు అమర్చాం. ఈ ప్రాంతాలతోపాటు దేవరకద్ర, ధన్వాడ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశాం. కొత్తపల్లి మండలం నందిగామ, ధన్వాడలో ఇప్పటివరకు రెండింటిని బంధించి నల్లమల పరిధిలోని లింగాల, అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాం. మిగతా వాటిని తరలిస్తాం. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటాం.. – కమాలొద్దీన్, జోగుళాంబ సర్కిల్ అటవీ రేంజ్ ఆఫీసర్ ● -
11 నెలల్లో 4 మృత్యువాత..
చిరుత వలసలు పెరిగిన క్రమంలో నారాయణపేట జిల్లాలో 11 నెలల కాలంలో నాలుగు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. గత ఏడాది మే నాలుగో తేదీన మద్దూరు మండలం నందిగామ గ్రామ పంచాయతీ పరిధి మల్కిజాదరావుపల్లి శివారులోని పొలంలో ఓ చిరుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అదే ఏడాది ఆగస్ట్ 17న అదే మండలం జాదరావుపల్లి శివారు తాటిగట్టు సమీపంలోని రాయం చెరువు వద్ద మరో చిరుత చనిపోయింది. ఈ ఏడాది జనవరి 28న దామరగిద్ద మండలం ఉడుమల్గిద్ద శివారులో ఉన్న గుట్టలో ఇంకొకటి, ఫిబ్రవరి 16న మద్దూరు మండలంల మోమినాపూర్ శివారులో మరొకటి మృత్యువాత పడింది. పోస్టుమార్టంలో ఇవి సహజ మరణాలేనని తేలినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సంరక్షణకు చర్యలు చేపట్టారు. మోమిన్ పూర్ లో చనిపోయిన చిరుతను పరిశీలిస్తున్న అటవీ సిబ్బంది -
బావాజీ ఆలయ హుండీ ఆదాయం రూ.20 లక్షలు
కొత్తపల్లి: దక్షిణ భారతేశంలోనే అతి పెద్ద గిరిజన పుణ్యక్షేత్రం గురులోకా మసంద్ బావాజీ బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా ఆలయంలోని మరో రెండు హుండీలను గురువారం లెక్కించారు. బావాజీ ఆలయ హుండీ ద్వారా రూ.19.8 లక్షలు, హనుమాన్ ఆలయ హుండీ ద్వారా రూ.1.54 లక్షల ఆదాయం వచ్చింది. ఎండోమెంట్, ఎస్బీఐ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించా రు. బావాజీ ఆలయంలో మొత్తం మూడు హుండీలు ఉండగా బుధవారం కాళికాదేవి హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.12.56 లక్షలు వచ్చాయి. మొత్తం మూడు హుండీలు కలిపి రూ.33.19లక్షలు వచ్చాయని ఆలయ ఈఓ కోమాల్ తెలిపారు. హుండీల్లో వేసిన ఆభరణాలు లెక్కించాల్సి ఉందని ఆయన తెలిపారు. భూ నిర్వాసితులకు అండగా ఉంటాం ఊట్కూరు: నారాయణపేట–కొండంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం రాత్రి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న దంతన్‌పల్లి రైతులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించారు. తాము వ్యవసాయ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, భూములు కోల్పోతే కుటుంబం పోషించుకోవడం కష్టతరమవుతుందని వాపోయారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఎకరాకు రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు అధిక మొత్తంలో నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానని, సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని, రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడవద్దని అన్నారు. వినతిపత్రం అందించిన వారిలో రైతులు ఎల్కోటి జనార్దన్‌రెడ్డి, ఎం గోపాల్‌రెడ్డి, శెట్టి రమేష్, జూపల్లి రవికుమార్, మోహన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, యజ్ఞేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఎన్టీఆర్ కళాశాలలో జాతీయ సదస్సు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రబంధ వాజ్మ యం సాహిత్యం శీలనముఅనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నేటి కాలంలో కవులు అంతరించి పోతున్నారని, ఇలాంటి తరుణంలో కళాశాలలో ప్రబంధ వాజ్మయం పేరుతో సెమినార్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ ప్రబంధ వాజ్మయం హాస్యం, చతురత, వర్ణన, శృంగారం, కథ అనే అంశాల ఆధారంగా ఆనాటి జీవన స్థితిగతులను, ఆర్థిక, సామాజిక పరిస్థితులను వివరిస్తుందన్నారు. ఈ సందర్భంగా సెమినార్ సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీయూ కంట్రోలర్ రాజ్‌కుమార్, లక్ష్మీనరసింహరావు, కేశర్దన్ తదితరులు పాల్గొన్నారు. 22న జిల్లా సదస్సు మహబూబ్‌నగర్ న్యూటౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మే 20న నిర్వహించే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 22న జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తెలిపారు. గురువారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు వెంకటేశ్‌గౌడ్, వేణుగోపాల్, అనురాధ, పద్మ, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
డెడ్ స్టోరేజీ
మే నెలాఖరుకు ఎడారిలా.. జూరాల అడుగంటిపోయిన జూరాల జలాశయం గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దదిక్కుగా అయిన జూరాల జలాశయం గతంలో ఎన్నడూ లేనంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోంది. వరుసగా రెండో ఏడాది కూడా జలాశయం అడుగంటిపోయింది. ఫలితంగా ఇప్పటికే సాగునీటి కష్టా లు తలెత్తగా.. రాబోయే రోజుల్లో తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురుకానున్నాయి. అధికారులు ఇప్పటికే జూరాల ఎడమ, కుడి ప్రధాన కాల్వల కింద రబీలో సాగుచేసిన ఆయకట్టుకు నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం జూరాలలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు ఈ నెలాఖరు నాటికే సరిపోతాయని, మే, జూన్ నెలల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తవచ్చని రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో తాగునీటి గండాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నా య చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.5 కోట్లను ఆయా కలెక్టర్లకు విడుదల చేశారు. అధిక సాగు నేపథ్యంలో.. జూరాల కింద.. జూరాల జలాశయం కింద ఎడమ, కుడి ప్రధాన కాల్వలు ఉండగా.. దీని ద మొత్తం ఆయకట్టు 1.09 లక్షల ఎకరాలు. కాగా ప్రతి ఏడాది ఖరీఫ్‌లో ఎడమ ప్రధాన కాల్వ పరిధిలో వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 72 వేల ఎకరాలు, కుడి ప్రధాన కాల్వ కింద జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 37 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది జూరాలలో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని ఆయా కాల్వల కింద కేవలం 35 వేల ఎకరాలకు వారబందీ విధానంలో ఏప్రిల్ 15 వరకు సాగునీటిని అందిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ, రైతులు అధికంగా సుమారు 50 వేల ఎకరాల్లో వరిపంట సాగుచేయడంతో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఏడాది అందుబాటులో నీటినిల్వ 2016 3.696 టీఎంసీలు 2017 4.829 టీఎంసీలు 2018 4.747 టీఎంసీలు 2019 2.689టీఎంసీలు 2020 7.627 టీఎంసీలు 2021 6.477 టీఎంసీలు 2022 7.836 టీఎంసీలు 2023 4.038 టీఎంసీలు 2024 4.004 టీఎంసీలు 2025 2.953 టీఎంసీలు (ఏప్రిల్17)మే నెలాఖరు నాటికే.. ఇదిలా ఉండగా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగరకర్నూల్ జిల్లాలు తాగునీటి అవసరాల కోసం జూరాల జలాశయం మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇందుకోసం ప్రస్తుతం రోజుకు 0.1 టీఎంసీల నీటిని వదులుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన జలాశయంలో ఉన్న 0.208 టీఎంసీల నీరు మే నెలాఖరు నాటికే సరిపోతాయని అధికారులు అంచనా వేశారు. అడుగంటిన జలాశయం.. ఆందోళనలో రైతన్నలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 2.871 టీఎంసీలు మాత్రమే తాగునీటి కోసం ప్రతి రోజు 0.1 టీఎంసీలు వినియోగం ఇప్పటికే ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీటి నిలిపివేత రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు -
ఉమ్మడి జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు ఉన్నారు. వీరిలో నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న జి.సబిత యాదాద్రి–భువనగిరి జిల్లాలోని రామన్నపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఆ బాధ్యతలను కల్వకుర్తి జడ్జికి అప్పగించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కోర్టులో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న నసీం సుల్తానాను నాగర్‌కర్నూల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పంపిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో అడిషనల్ జడ్జిగా పని చేస్తున్న వి.ఈశ్వరయ్యను మహబూబ్‌నగర్ జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్ర జుడీషియల్ అకాడమిలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్.వెంకట్రాంను నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టుకు సీనియర్ సివిల్ జడ్జిగా రానున్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న జి.కళార్చన వనపర్తి జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. ఇదే హోదాలో ఇక్కడ పనిచేస్తున్న కమలాపురం కవితను వనపర్తిలోని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న టి.లక్ష్మిని అక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. అలాగే ఇదే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న గంటా కవితాదేవిని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న గుండ్ల రాధికను ఇక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. జిల్లా జడ్జిని కలిసిన ఎస్పీ నారాయణపేట: జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ మహబూబాబాద్‌కు బదిలీ అయ్యారు. ఈమేరకు గురువారం ఎస్పీ యోగేష్‌గౌతమ్ మర్యాదపూర్వకంగా జడ్జిని కలిసి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
దేశంలోనే రోల్ మోడల్‌గా భూభారతి
ఒక్క రూపాయి తీసుకోకుండానే భూ సమస్యలు పరిష్కరిస్తాం ● రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ● మద్దూరు మండలం ఖాజీపూర్‌లో రెవెన్యూ సదస్సు ప్రారంభం నారాయణపేట/మద్దూర్/కొత్తపల్లి: పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని.. ఒక్క రూపాయి తీసుకోకుండానే భూ సమస్యలను పరిష్కరించనున్నామని.. దేశంలోనే భూ భారతి చట్టం రోల్‌మోడల్‌గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోర్టల్‌ను ప్రారంభించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున మంత్రికి స్వాగతం పలకగా.. కాలినడకన రెవెన్యూ సదస్సు సభా స్థలికి చేరుకుని మాట్లాడారు. ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ఉద్దేశంతో మేధావులతో కలిసి ఈ చట్టాన్ని రూపొందించామని, గత ప్రభుత్వ ధరణి చట్టానికి దీనికి ఎంతో తేడా ఉందన్నారు. ప్రజల వద్దకే అధికారులు.. ధరణి చట్టంతో ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, భూభారతితో ప్రజల వద్దకే అధికారులు వచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, వీఆర్ఏ వీఆర్వో వ్యవస్థను కుప్ప కూల్చిందని, ఈ ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి, అర్హులైన వారిని మళ్లీ తీసుకువచ్చి గ్రామాల్లో ఇలాంటి భూ సమస్య ఎక్కడ ఉన్నా అక్కడే పరిష్కారం చూపిస్తామన్నారు. ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు. మొదటి విడత 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి మ్యాప్‌పై సర్వేయర్ సంతకంతో కంప్యూటర్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. సీఎం ఇటీవల కలెక్టర్లను పిలిచి భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారన్నారు. అన్ని మండలాలకు కలెక్టర్లు వెళ్లి ఈ చట్టంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. అయితే జూన్ 2 లోగా ఎంపిక చేసిన మొదటి నాలుగు పైలెట్ గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఆ తర్వాత ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇదే పద్ధతిలో అధికారులే రైతుల వద్దకు వస్తారన్నారు. సీఎం నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. తాము అమలు చేస్తున్న కొత్త భూభారతి చట్టాన్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు వినియోగించుకోవచ్చని మంత్రి సూచించారు. ధరణితో ప్రజలను ఎంత గోస పెట్టారో భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే మంచి చేసిందని చెప్పకపోయినా పర్వాలేదు కానీ.. మంచిని చెడుగా చెప్పి ప్రచారం చేస్తే మాత్రం ప్రతిపక్షానికి వచ్చే ఎన్నికలలో రెండు అంకెల సీట్లు కూడా రావని, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరిగా శాసనసభ ఎన్నికలలో రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. నూతన అధ్యాయానికి శ్రీకారం రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి శ్రీకారం చూడుతూ భూ భారతి పోర్టల్‌ను ఈ నెల 14న ప్రారంభించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లాలోని మద్దూరు మండలాన్ని పైలెట్ మండలంగా ఎంపిక చేసిందని, భూ పరిపాలనలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పోర్టల్‌ను జిల్లా అధికార యంత్రాంగం, ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి, భూభారతి ప్రత్యేక అధికారి యాదగిరి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, మంద మకరంద్, ఎస్పీ యోగేష్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ బేన్‌షాలం, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లోనే సమస్యలపరిష్కారం పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మాట్లాడుతూ.. ధరణిలో ఏ చిన్న సమస్య వచ్చినా గతంలో కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి ఉండేదని, అయినా సమస్య పరిష్కారమయ్యేది కాదని, భూభారతి చట్టం ద్వారా గ్రామాలకే అధికారులు వచ్చి సమస్యను పరిష్కరిస్తారని అన్నారు. దీనిని రైతులందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. భూమి రైతులకు ఓ ఆర్థిక భరోసా అని, ఏ కష్టం వచ్చినా భూమిని అమ్ముకొని ఆ కష్టం తీర్చుకునేవాడని, కానీ ధరణిలో ఆ పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్‌రెడ్డి అన్ని భూ సమస్యలకు పరిష్కారం చూపేలా భూభారతిని తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ నియోజవకర్గ ఇన్చార్జ్, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలో ఏ రైతుకు మేలు జరగకపోగా భూమిపై హక్కు లేకుండా పోయిందని, ధరణి ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఆదాయం పెంచిందని ఆరోపించారు. భూ భారతతో రైతులందరికి మేలు జరుగుతుందని అన్నారు. -
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
ఖాజీపూర్‌లో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయగా.. మంత్రి రైతుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన బంటు చంద్రమ్మ.. తన తల్లి సాయమ్మ పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమిని నా పేరుకు మార్చాలని సమస్యను మంత్రికి వివరించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేయాలని అక్కడే ఉన్న అధికారులకు మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు భూ భారతి ఓ మైలురాయిలా ఉండిపోవాలన్నారు. నా పేరు మీద తప్పుడు రికార్డులున్నా కూడా ఉపేక్షించకుండా పార్టీలకతీతంగా భూ సమస్యలను పరిష్కరించాలని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. -
భూ వివాదాలకు తావుండదు
మక్తల్: ఏ గ్రామంలోనూ భూ వివాదాలు ఉండకూడదనే లక్ష్యంతో భూ భారతి చట్టాన్ని రూపకల్పన చేశారని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ భారతి చట్టం – 2025పై రైతులకు అవగహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన భూ భారతిపై ప్రజలకు అవగహన కల్పించాలని, ఈమేరకు రెవెన్యూ యంత్రం కృషి చేయాలన్నారు. వివాద రహిత భూవిధానాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని, భవిష్యత్‌లో భూమికి సంబందించిన సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో భూదార్ తీసుకొస్తామని అన్నారు. రాష్ట్రంలో 10,954 గ్రామపాలన అధికారులను నియమించబోతున్నామని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీస్‌కుమార్, లక్ష్మారెడ్డి, గణేస్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు..
ప్రస్తుతం జూరాలలో ఉన్ననీటి నిల్వలను పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తాం. ఇప్పుడు జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు మే నెలాఖరు వరకు సరిపోతాయి. అయితే ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు రావొచ్చు. అప్పుడు పరిస్థితులను బట్టి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. – రహీముద్దీన్ ఎస్ఈ జూరాల మరో తడి ఇవ్వండి.. అమరచింత ఎత్తిపోతల ద్వారా రబీలో 6 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. ప్రస్తుతం జూరాల ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని నిలిపేస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ కాల్వకు అనుసంధానంగానే అమరచింత లిఫ్ట్‌కు సాగునీరు అందుతుంది. మరో తడి సాగు నీరు ఇస్తేనే మా పంటలు చేతికి వస్తాయి. – వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు, అమరచింత రైతులను ఆదుకోవాలి.. జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని డీ–6లో పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇంకా పక్షం రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంట చేతికి వస్తుంది. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా పంటలు చేతికి వచ్చే విధంగా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి. – లక్ష్మణ్, రైతు, ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం ● -
చెరుకు రైతులకు బకాయిలు చెల్లించండి
అమరచింత: జిల్లాలో కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన రైతులకు బకాయిపడిన రూ.6 కోట్లు వెంటనే చెల్లించాలంటూ కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ఫ్యాక్టరీ కార్యాలయంలో ఈడీ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు కోతలు పూర్తయినా ఇప్పటి వరకు చెరుకు రైతులకు బకాయి డబ్బులను చెల్లించడం లేదన్నారు. బకాయిల చెల్లింపు వ్యవహారంపై పలుమార్లు ఫ్యాక్టరీ ఏజీఎం, డీజీఎంలకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే జీఎం కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు రూ.4.50 కోట్లను చెల్లించామని ఈడీ చెరుకు కార్మిక సంఘం నాయకులకు వెల్లడించారు. దీంతో మిగిలిన మొత్తం వెంటనే రైతు ఖాతాలలో జమ చేయాలని కోరగా.. వారం రోజుల వ్యవధిలో పూర్తి స్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చెరుకు రైతు సంఘం నాయకులు వాసారెడ్డి, చంద్రసేనారెడ్డి, ఆంజనేయలు, నాగేంద్రం, రంగారెడ్డి, షాలిమియా తదితరులు పాల్గొన్నారు. -
కాళికాదేవి హుండీ ఆదాయం రూ.12.56 లక్షలు
కొత్తపల్లి: దక్షిణ భారతేశంలోనే అతి పెద్ద గిరిజన పుణ్యక్షేత్రం గురులోకా మసంద్ బావాజీ బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా ఆలయ సముదాయంలోని కాళికాదేవి మాత హుండీని బుధవారం లెక్కించారు. మొత్తం రూ.12.56 లక్షలు ఆదాయం వచ్చింది. ఎండోమెంట్, ఎస్బీఐ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. బావాజీ ఆలయంలో మొత్తం మూడు హుండీలు ఉండగా బుధవారం కేవలం కాళికాదేవి హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ ఈఓ కోమాల్ తెలిపారు. బావాజీ, హనుమాన్ ఆలయాల్లోని హుండీలను లెక్కించాల్సి ఉందన్నారు. మద్దూరు పోలీసుల బందోబస్తు నిర్వహించారు. పెసర క్వింటాల్ రూ.7,579 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం పెసర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,579, కనిష్టంగా రూ.6,509 ధర పలికింది. అలాగే, జొన్నలు గరిష్టంగా రూ.3,951, కనిష్టంగా రూ.2,831, అలసందలు గరిష్టంగా రూ.6,241, కనిష్టంగా రూ. 6,231, వడ్లు సోనా గరిష్టంగా 2,209, కనిష్టంగా రూ.1,603, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,032, కనిష్టంగా రూ.6,722, తెల్ల కందులు గరిష్ట, కనిష్టంగా రూ.7,011 ధరలు పలికాయి. హజ్‌కు వెళ్లే వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలి నారాయణపేట: నారాయణపేట హజ్ సొసైటీకి చెందిన ప్రతినిధి బృందం జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్‌ను బుధవారం కలిసి హజ్‌యాత్రకు వెళ్లే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఫిట్నెస్ సర్టి ఫికెట్ ఇవ్వాలని కోరింది. ఇందుకు స్పందించిన ఆయన గురువారం ఉదయం 9 గంటలకు హజ్ యాత్రికులు నారాయణపేట, మక్తల్, కోస్గీ హాస్పిటల్లను సంప్రదించి వైద్య పరీక్షలు పూర్తిచేసుకోవాలని తెలిపారు. హజ్ యాత్రికులు సమయపాలనతో సంబంధిత ఆసుపత్రుల వద్ద హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సూపరింటెండెంట్‌ను కలిసిన వారిలో హజ్సోసైటి బృందం ప్రతినిధులు అమీరుద్దీన్, అబ్దుస్ సలీం, సర్ఫరాజ్ హుస్సేన్ అన్సారీ, అజీమ్ మడ్కి, మహమ్మద్ అజహర్లు ఉన్నారు. పనులు సకాలంలోపూర్తి చేయాలి పాలమూరు: మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులు, ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ క్యాంప్ కార్యాలయంలో రైల్వే అధికారులతో పెండింగ్ పనులపై ఎంపీ సమీక్షించారు. మహబూబ్‌నగర్‌లోని మోతీనగర్, న్యూగంజ్, టీడీగుట్ట, వీరన్నపేట, పాలిటెక్నిక్ కళాశాల వరకు డబ్లింగ్ పనులు, భూసేకరణలో కలిగే ఇబ్బందులపై చర్చించారు. మహబూబ్‌నగర్, దేవరకద్రలో ఆర్ఓబీ, డబ్లింగ్ పనుల భూసేకరణ, తిమ్మసానిపల్లి, బొక్కలోనిపల్లి ప్రాంతాల్లో రైల్వేగేట్, ఆర్ఓబీ ఏర్పాటుపై సమీక్షించారు. మక్తల్ పరిధిలోని దేవరపల్లిలో రైల్వే ట్రాక్ పరిధిలోని తదితర సమస్యలపై అధికారులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో అధికారులు సంజయ్‌కుమార్, డి.జగదీష్, ఎంఎంఎస్ రాజు, మహబూబ్‌నగర్ ఆర్డీఓ నవీన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ దిలీప్‌కుమార్, ఏఈఈ రొక్కేందర్రెడ్డి, డీఈఈ జైపాల్‌రెడ్డి, ఏఈఈ శివానంద్, సర్వేయర్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగాబండారోత్సవం
మక్తల్: కుర్వ కులస్తుల ఆరాధ్యదైవమైన బీరప్ప, ఎల్లమ్మ ఉత్సవాలు మండలంలోని కర్ని గ్రామంలో బుధవారం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని అమ్మవారి ఆలయం వద్ద బండారోత్సవం నిర్వహించారు. బీరప్పను ఇంటి దేవుడిగా కొలిచే వారు కుటుంబ సమేతంగా బండారు మహోత్సవంలో పాల్గొనగా బంధువులు పసుపు (బండారు)ను చల్లి ఆశీర్వదించారు. బండారు మహోత్సవంతో ఆలయ ప్రాంగణమంతా పసుపు మయంగా మారింది. నాయకులు జుబేర్పాష, రాజుల ఆశిరెడ్డి, నారాయణరెడ్డి, గాసం చిన్న రంగప్ప, వసంతగౌడ్, కృష్ణయ్యగౌడ్ తదితరులు హాజరై కుర్వ కులస్తులపై బండారు చల్లి ఆశీర్వదించారు. -
ఫలించిన రైతుల ఆందోళన
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ ఆయకట్టులో వరి సాగు చేసిన రైతులు తమకు నీరు అందడం లేదని, పంటలు వాడుముఖం పడుతున్నాయంటూ ప్రాజెక్టు రహదారిపై రెండు పర్యాయాలు చేసిన ఆందోళనకు ఫలితం దక్కింది. రైతుల ఆవేదనను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రాజెక్టు ఉన్నతాధికారులకు విన్నవించడంతో ఎట్టకేలకు చివరి తడిగా రెండురోజుల పాటు నీటిని అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం జూరాల ఎడమ కాల్వకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే నీటిని విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎడమ కాల్వ పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో అత్యధికంగా వరి సాగు చేయడంతో ఇరు మండలాల ప్రజలు సాగునీరు కావాలంటూ వారం రోజుల్లో రెండు పర్యాయాలు ఆందోళన చేపట్టారు. మరోతడి అవసరమే.. ఆత్మకూర్ మండలంలోని తూంపల్లి, కత్తేపల్లి, ఆరేపల్లి, మెట్లంపల్లి, జూరాల గ్రామాలతో పాటు ఇతర గ్రామాల ఆయకట్టు రైతులు ఆలస్యంగా వరి సాగుచేయడంతో సమస్య జఠిలంగా మారింది. అధికారుల అంచనా ప్రకారం మార్చి చివరి వారంలోనే పంట చేతికందాల్సి ఉంది. ఆలస్యంగా సాగు చేయడంతో 15 రోజుల తర్వాతే పూర్తిస్థాయిలో వరిపంట చేతికందే పరిస్థితి ఉంది. చివరి తడిగా బుధవారం నుంచి రెండురోజుల పాటు నీటిని వదులుతుండగా.. వచ్చేవారం రెండ్రోజుల పాటు నీటిని అందిస్తే పంటలు చేతికందుతాయంటున్నారు. జలాశయంలో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుండటంతో ఇదే చివరితడిగా వదులుతున్నామని, పొదుపుగా వాడుకోవాలని సూచిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎత్తిపోతల రైతులు గట్టెక్కినట్లే.. జూరాల ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు చివరిసారిగా అందిస్తున్న నీటితో తమ పంటలు చేతికందే అవకాశం ఉందని రైతులు తెలిపారు. సాగునీరు వదిలిన వెంటనే ఆయకట్టు పరిధిలోని మూలమళ్ల, మస్తీపురం, సింగంపేట, ఖానాపురం, అమరచింత, పాంరెడ్డిపల్లిలో రైతులు వెయ్యి ఎకరాల వరి సాగుచేశారు. పొట్టదశలో ఉన్న వరి పైరుకు ప్రస్తుతం అందిస్తున్న సాగునీరు ఊపిరి పోసేలా ఉందని, పంట చేతికందుతుందనే ఆశలో ఉన్నారు. రెండ్రోజుల పాటు సరఫరా.. ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు జూరాల ఎడమ కాల్వ పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల రైతులకు సాగునీరు రెండురోజుల పాటు వదులుతున్నాం. రోజువారీగా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించాం. – శ్రీనివాస్‌రెడ్డి ఎస్ఈ, జూరాల జలాశయం జూరాల ఎడమ కాల్వకునీటి విడుదల చివరి తడిగా ప్రకటించిన అధికారులు మరో తడి ఇవ్వాలంటున్న రైతన్నలు -
‘డయల్ 100’ సేవలు ఎంతో కీలకం
నారాయణపేట: శాంతిభద్రతలు పరిరక్షించడంలో బ్లూ కోట్స్, పెట్రో కార్స్ సిబ్బంది సేవలు ఎంతో కీలకమని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో డయల్ 100 సేవల నిర్వహణ పై బ్లూ కోట్స్, పెట్రో కార్స్ పోలీసు సిబందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. డయల్ 100 కాల్స్ వచ్చినప్పుడు ఏమైనా సమస్యలు వస్తున్నాయా, ఎలాంటి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. కాల్ వచ్చినప్పటి నుండి త్వరగా సంఘటన స్థలాలకు చేరుకునేంత వరకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు న్యాయం చేకూరే విధంగా విచారణ చేపట్టాలన్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే అట్టి వ్యక్తులను తనిఖీ చేయాలని తెలిపారు. రాత్రి సమయాలలో పట్టణాల ప్రాంతాలలో గస్తీలు నిర్వహిస్తూ ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ మొబైల్ ద్వారా, టాబ్ల ద్వారా, లేదా సెట్ ద్వారా కమ్యూనికేషన్ సమాచారాన్ని సంబంధిత సిబ్బందికి చేరవేసి ప్రజల వద్దకు త్యరగా చేరుకునే విధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. సిబ్బందికి ఉద్యోగపరంగా ఎటువంటి సమస్యలున్న నేరుగా సంప్రదించవచ్చని తెలియజేశారు. ఈసమావేశంలో డీఎస్పీ ఎన్ లింగయ్య, డయల్ 100 పెట్రో కార్స్, బ్లూ కోర్ట్స్ సిబ్బంది, కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యోగ ఆధారిత కోర్సులు ప్రవేశ పెడతాం..
డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆ వెంటనే ఉద్యోగాలు సాధించే దిశగా వివిధ కోర్సుల్లో అన్ని స్థాయిల్లో సిలబస్‌లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. కొత్త కోర్సుల వల్ల సులువుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, రీసెర్చి ఆప్టిట్యూట్, మెషిన్ టూల్స్, వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ తరగతులతో పాటు వీటిని బోధిస్తారు. అవకాశం ఉన్న కోర్సుల్లో మార్కులు నేరుగా విద్యార్థి మెమోలో ముద్రిస్తాం. అవకాశం లేని వాటికి నేరుగా సర్టిఫికెట్లు అందజేస్తాం. – జీఎన్.శ్రీనివాస్, వైస్ చాన్స్‌లర్, పీయూ ఉన్నత విద్యా మండలి సూచనలతో.. ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. చదువులు పూర్తయిన వెంటనే సాంకేతిక విద్యనభ్యసించిన వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి సూచనలతో సిలబస్‌లో 25 శాతం మార్పులకు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తాం. – రమేష్ బాబు, రిజిస్ట్రార్, పీయూ ● -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
నారాయణపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరై తొలివిడత బేస్మెంట్ లెవల్ పూర్తి చేసుకున్న వారికి బుధవారం సాయంత్రం వరకు మొదటి విడత రూ.లక్ష వారి ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల యాక్షన్ ప్లాన్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని, నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించిన 3500 ఇళ్లకుగాను అర్హత కలిగిన వారినే ఎంపిక చేయాలని తేల్చి చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి ప్రస్తుతం వాళ్లు ఉంటున్న ఇంటిని, పై కప్పును పరిశీలించిన తర్వాతే ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక చేయాలని ఆమె ఆదేశించారు. హైదరాబాద్, లేదా వేరే ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారిని ఎంపిక చేయవద్దన్నారు. ఎలిజిబుల్ విత్ ల్యాండ్ ప్రకారమే ఎంపిక ఉండాలన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఈ నెల 21 వరకు దరఖాస్తుల జాబితా ఎంపీడీవోలకు చేరుతుందని, ఈ నెల 30 వరకు ఇచ్చిన కోటాకు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఎంపిక చేయాలని ఆమె సూచించారు. మే 2న గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అర్హుల జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. అధికారులు ఎవరో ఫోన్ చేశారని, అనర్హులను పథకానికి ఎంపిక చేసినా గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు వస్తాయని, ఈ విషయం దృష్టిలో పెట్టుకొని అర్హుల ఎంపిక పగడ్బందీగా, పారదర్శకంగా చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ హౌసింగ్ పీడీ శంకర్, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పాటించాలి మద్దూరు: మద్దూరులో పీఎసీఎస్ ఆధ్వర్యంలో, పల్లెగడ్డ తండాలోని ఐకేపీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ బెన్షేలం బుధవారం తనిఖీ చేశారు. ఈ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు ఎంత మేరకు ధాన్యం కొనుగోలు చేశారని ఆరా తీస్తూ.. తేమ శాతం, రికార్డులను పరిశీలించారు. రైతులకు సకాలంలో డబ్బులు పడేలా చూడాలని, అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నర్సింహా, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకలు రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు ఖాజీపూర్‌లో మంత్రి పొంగులేటి పర్యటన మద్దూరు: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం మండలంలో పర్యటించనుండగా.. ఈమేరకు ఏర్పాట్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. వ్యవసాయ భూములకు సంబందించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తేగా.. మద్దూరు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈమేరకు మండలంలోని ఖాజీపూర్‌లో నిర్వహించే రెవెన్యూ అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ఈమేరకు బుధవారం కలెక్టర్‌తోపాటు అడిషనల్ కలెక్టర్ బేన్ షేలం, ఆర్డీఓ రాంచందర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామంలో భూ సమస్యలపై తహసీల్దార్ మహేష్గౌడ్ను అడిగి తెలసుకున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా చేయాల్సిన పనులు, రెవెన్యూ సదస్సుపై కింది స్థాయి అధికారులతో చర్చించారు. మంత్రి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం గుండా ఉదయం 9 గంటలకు ఖాజీపూర్ చేరుకుంటారని, గ్రామంలోని పాఠశాల ఆవరణలో రెవెన్యూ సదస్సును ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నారాయణపేట: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తామని.. ఆయన పర్యవేక్షణలో అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇళ్లు అర్హులకే కేటాయించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం భూ భారతిపై అధికారులతో చర్చించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బెన్‌షాలం, సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ రాంచందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ డీఎం నారాయణపేట రూరల్: జిల్లాలోని కోస్గి, నారాయణపేట ఆర్టీసీ డిపోల పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. ప్రయాణికులు సమస్యలతో పాటు సలహాలు, సూచనలను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు సెల్‌ఫోన్ నంబర్ 73828 26293 తెలియజేయాలన్నారు. వరి క్వింటా రూ.2,263 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం వరి (సోనారకం) క్వింటా గరిష్టంగా రూ.2,263, కనిష్టంగా రూ.1,769, వరి (హంసరకం) రూ.1,700 ధర పలికింది. అలాగే పెసర రూ.7,319, జొన్న గరిష్టంగా రూ.3,505, కనిష్టంగా రూ.2,755, ఆలసందలు రూ.6,256–రూ.4,859, ఎర్ర కంది రూ.7,153–రూ.5,422, తెల్ల కంది రూ.6,859 ధరలు లభించాయి. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు కృషి మరికల్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పార్లమెంట్లో ప్రసంగించానని.. వారికి న్యాయం చేయడానికి కృషి చేస్తానని ఎంపీ డీకే అరుణ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో మండల వాల్మీకి సంఘం నాయకులు ఆమెను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కులవృత్తి లేని బోయలు కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ఎస్టీలుగా ఉన్నారన్నారు. ఉమ్మడి జిల్లాలోని గద్వాల, మక్తల్, దేవరకద్ర, నారాయణపేట, అలంపూర్ ప్రాంతాల్లో అధిక శాతం వాల్మీకులు ఉన్నారని.. వీరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పార్లమెంట్లో ప్రస్తావించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుర్మయ్య, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, జిల్లా కన్వీనర్ నర్సింహులు, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, చంద్రప్ప, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’కి సన్నద్ధం
నారాయణపేట: కొత్త రెవెన్యూ చట్టం ‘భూ భారతి’పై గురువారం నుంచి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు అర్జీల స్వీకరణకు మద్దూర్, కోస్గి మండలాల తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లు సన్నద్ధమవుతున్నారు. పేర్ల మార్పు, విస్తీర్ణంతో తేడా, నిషేధిత జాబితాలోని భూములు, వ్యవసాయేతర భూములు, పెండింగ్ విరాసత్‌లు, మ్యూటేషన్లు తదితర వాటి గురించి వివరించి అర్జీలు స్వీకరిస్తారు. మద్దూర్ మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో 16,142 మంది పెరిట పట్టాదారు పాసుపుస్తకాలు ఉండగా, 47,706 సర్వేనంబర్లలో 30,622 ఎకరాల భూమి ఉంది. కాగా వ్యవసాయ యోగ్యంకాని భూములు 450 ఎకరాలు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. రెండు బృందాలతో.. కలెక్టర్ ఆదేశాల మేరకు మద్దూర్, కోస్గి తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఈ నెల 28 వరకు రోజు విడిచి రోజు కేటాయించిన గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు రెవెన్యూ బృందాలు సదస్సు నిర్వహించనున్నారు. మద్దూర్ తహసీల్దార్ మహేశ్‌గౌడ్ బృందం, కోస్గి తహసీల్దార్ బక్క శ్రీనివాసులు బృందం వేర్వేరుగా గ్రామసభలు నిర్వహిస్తారు. 17వ తేదీ నుంచి ఈ రెండు బృందాలు కేటాయించిన గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూ భారతి చట్టం అమలుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రాసెసింగ్ బృందం ఏర్పాటు.. గ్రామసభల్లో స్వీకరించిన అర్జీలను ప్రాసెసింగ్ చేసేందుకు బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో మరికల్ తహసీల్దార్ అనిల్‌కుమార్, జిల్లా సర్వే అధికారి గిరిధర్, కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, కంప్యూటర్ ఆపరేటర్ మహేశ్, ఆఫీస్ సబార్టినేట్ సమీర్ ఉన్నారు. భూ భారతి కార్యక్రమం అంతా ఆర్డీఓ రాంచందర్‌నాయక్ పర్యవేక్షణలో కొనసాగనుంది. సీఎం ఇలాఖాలో.. పైలెట్ ప్రాజెక్టుగా మద్దూరును ఎంపిక చేయగా గురువారం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. కొత్త భూ చట్టంపై తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లకు కలెక్టర్ సిక్తాపట్నాయక్ ప్రొజక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. భూ సమస్యలపై రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం చూపించాలన్నారు. ఈ ఫొటోలోని రైతు పేరు గణప రవి. మద్దూర్ స్వగ్రామం. 2012–13లో ఆయన సోదరులతో కలిసి మూడు ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఒక్కొక్కరికి 30 గుంటలు వచ్చింది. ముగ్గురు సోదరులకు పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చినా.. కిందిస్థాయి సిబ్బంది చేసిన తప్పిదంతో ఆయన భూమి ఇప్పటి వరకు పాస్‌బుక్‌లో ఎక్కలేదు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు సమస్య పరిష్కారం కాలేదు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నా ఆప్షన్స్ లేవని చేతులెత్తేస్తున్నారని.. కొత్త చట్టంలోనైనా పట్టాదారు పాసు పుస్తకం వస్తుందని ఆశిస్తున్నట్లు రైతు చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా మద్దూర్ ఎంపిక రేపు రెవెన్యూ మంత్రితో ప్రారంభం రెండు బృందాలతో గ్రామసభల నిర్వహణ -
మహిళల చేతికి ప్రగతి చక్రాలు
అచ్చంపేట: మహిళల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేస్తూ కోటీశ్వరులు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే మహిళా సమాఖ్యలకు జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తోంది. ఇందుకోసం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బస్సుల ఆవశ్యకతను దృష్టిలో మొత్తం ఉంచుకుని 10 డిపోల పరిధిలో అచ్చంపేట 5, కల్వకుర్తి 4, నాగర్‌కర్నూల్ 2, కొల్లాపూర్ 2, గద్వాల 4, వనపర్తి 7, మహబూబ్‌నగర్ 5, నారాయణపేట 2, కోస్గి 1, షాద్‌నగర్ 17 చొప్పున 49 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో నూతన సంఘాల ఏర్పాటుతో పాటు ఇది వరకు ఉన్న సంఘాలకు బస్సుల నిర్వహణకు అవసరమయ్యే రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్ల ఏర్పాటు, పెరటి కోళ్ల పెంపకం, మీ– సేవ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆహార కేంద్రాలు తదితర వాటి ఏర్పాటుకు సహకారం అందిస్తోంది. అద్దె ప్రాతిపదికన మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని డిపోల పరిధిలో సరిపడా బస్సులు లేవు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో బస్సుల కొనుగోలుతో కొంత వరకై నా సమస్య తీరనుంది. ఈ క్రమంలో మహిళా సమాఖ్యలు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. దీంతో మండల మహిళా సమాఖ్యలు పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఆర్టీసీ సంస్థ ఏడేళ్లపాటు ప్రతి నెలా రూ.77,220 అద్దె చెల్లించనుంది. దీంతో మహిళా సంఘాల మహిళలకు ఆర్థిక ఊతం లభిస్తుంది. మరోవైపు రూ.లక్షల విలువైన బస్సు సమాఖ్య సొంతం కానుంది. రద్దీ నేపథ్యంలో 64 కొత్త బస్సుల కోసం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేశాక అన్ని డిపోల్లో బస్సుల కొరత తీవ్రమైంది. రద్దీతో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి సరిపడా బస్సులు లేక ఉన్న వాటినే పంపిస్తున్నారు. ఇవి చాలా ఏళ్ల కిందటివి కావడంతో తరుచుగా మరమ్మతుకు గురవుతున్నాయి. పండుగలు, జాతర్లు, ముఖ్యమైన రోజుల్లో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. బస్‌భవన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో బస్సుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 10 డిపోల పరిధిలో అచ్చంపేటకు (2 ఎక్స్‌ప్రెస్‌లు), కల్వకుర్తికి (2 ఎక్స్‌ప్రెస్‌లు) నాగర్‌కర్నూల్‌కు (3 పల్లె వెలుగులు), గద్వాలకు (7 ఎక్స్‌ప్రెస్‌లు, 12 పల్లె వెలుగులు, 2 డీలక్స్‌లు), వనపర్తికి (4 ఎక్స్‌ప్రెస్‌లు, 4 పల్లె వెలుగులు), మహబూబ్‌నగర్‌కు (11 ఎక్స్‌ప్రెస్‌లు, 6 పల్లె వెలుగులు), నారాయణపేటకు (1 ఎక్స్‌ప్రెస్, 1 పల్లెవెలుగు), షాద్‌నగర్‌కు (6 ఎక్స్‌ప్రెస్‌లు, 3 పల్లె వెలుగులు) చొప్పున మొత్తం 64 బస్సుల కోసం అధికారులు ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే ఈ కొత్త బస్సులు ఆయా డిపోలకు చేరనున్నాయి. మండల సమాఖ్యలకు ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో 49 బస్సుల కోసం ప్రతిపాదనలు ప్రతినెలా ఒక్కో బస్సుకు అద్దె రూపంలో రూ.77,220 చెల్లింపు మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించే సదావకాశం ఇందిరా మహిళా శక్తి ద్వారా ప్రభుత్వం చేయూత -
కొల్లాపూర్ – నాగర్‌కర్నూల్ మధ్య..
మాకు కేటాయించిన బస్సును మార్చి 20 నుంచి కొల్లాపూర్– నాగర్‌కర్నూల్ మధ్య నడిపిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షలతో ఎలక్ట్రికల్ బస్సు కొనుగోలు చేసి అప్పగించింది. ఆర్టీసీ వారు నెలకు రూ.77,220 అద్దె చెల్లిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. పెద్దకొత్తపల్లి మండల మహిళా సమాఖ్య జిల్లాలోనే ఉత్తమ మహిళా సమాఖ్యగా ఎంపికై ంది. – అరుణ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, పెద్దకొత్తపల్లి జిల్లాకు ఏడు బస్సులు.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 మండలాలకు గాను ఏడింటికి మొదటి విడతలో ఏడు బస్సులు మంజూరయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా పెద్దకొత్తపల్లికి చెందిన సమాఖ్య బస్సు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రూ.30 లక్షల నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాగా మహిళా సంఘాల అకౌంట్లో జమ అయ్యాయి. – చిన్న ఓబులేషు, డీఆర్డీఓ, నాగర్‌కర్నూల్ ● -
పాలమూరు పనుల్లో కదలిక
వివరాలు 8లో u● నార్లాపూర్– ఏదుల ప్రధాన కాల్వ పెండింగ్ పనులకు రూ.780.63 కోట్లు మంజూరు ● డిసెంబర్ నాటికి కర్వెన రిజర్వాయర్ వరకు పనులు పూర్తిచేసేలా కార్యచరణ ● విడతల వారీగా పనులను పూర్తిచేయనున్న ప్రభుత్వం ఏదుల రిజర్వాయర్ప్రధాన కాల్వ నిర్మాణ పనులకు నిధులు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ మధ్యలో ప్రధాన కాల్వకు 1.725 కి.మీ. పాయింట్ నుంచి 2.125 పాయింట్ కాల్వ తవ్వకం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 6.325 కి.మీ. పాయింట్ నుంచి 6.650 కి.మీ. పాయింట్ నడుమ కాల్వ నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. ప్యాకేజీ 3 పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.780.63 కోట్లు కేటాయించింది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ మధ్య పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ కెనాల్, ఓపెన్ కెనాల్ నిర్మాణంతో పాటు హెడ్ రెగ్యులేటరీ ఏర్పాటు కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. కుడికిళ్ల సమీపంలో ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తిగా ఆగిపోయాయి. అక్కడ హార్డ్ రాక్తో కాల్వ తవ్వకాలకు ఇబ్బందిగా ఉందని చెబుతుండగా, తాజాగా ప్రభుత్వం అంచనాలను సవరించి నిధులను విడుదల చేసింది. గతంలో ఈ ప్యాకేజీ కింద పనులకు రూ.416.10 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం ఈ పనుల విలువను రూ.780.63 కోట్లకు చేరింది. -
సాగునీటి కోసం రైతుల రాస్తారోకో
● మండుటెండలో జూరాల ప్రాజెక్టుపై బైఠాయింపు ● గంటన్నర వరకు కదలని రైతులు.. నిలిచిన వాహన రాకపోకలు అమరచింత: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు రహదారిపై సాగునీరు ఇవ్వాలంటూ మండుటెండలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా యాసంగిలో 20 వేల ఎకరాలకు సాగునీటిని రామన్‌పాడు వరకే అందిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రాజెక్టు సమీపంలో ఉన్న అమరచింత, ఆత్మకూరు మండలాల రైతులు వరిపంట సాగుచేశారు. వారబందితో సాగునీటిని అందించిన అధికారులు పంటలు చేతికొచ్చే సమయంలో నీటిని నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి, తూంపల్లి, గుంటిపల్లి, జూరాల గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం జూరాల ఎడమ కాల్వ వద్దకు చేరుకొని ప్రాజెక్టు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అక్కడే ఉన్న బారికేడ్లు, ముళ్లపొదలు అడ్డంగా పెట్టడంతో వాహనాల రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ ఎస్ఐ, వనపర్తి జిల్లా అమరచింత ఎస్ఐ సురేష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, తమకు సాగునీరు అందించాల్సిందేనని, అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు తెగేసి చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రైతుల రాస్తారోకో విషయాన్ని సీఐ శివకుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వచ్చి ఉన్నతాధికారులతో చర్చించి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. -
ఘనంగా బీరప్ప బండారు ఉత్సవం
మక్తల్: కుర్వ కులస్తుల ఆరాధ్యదైవమైన బీరప్ప దేవర ఉత్సవాలు మండలంలోని కర్ని గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం గ్రామంలోని అడవి బీరప్పస్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ట్ర, హైదరాబాద్, తదిర ప్రాంతాల నుంచి దాదాపు 15వేల మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం బీరప్ప దేవుడికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించారు. బీరప్పను ఇంటి దేవుడిగా కొలిచే వారు కుటుంబ సమేతంగా బండారు మహోత్సవంలో పాల్గొనగా బంధువులు పసుపు (బండారు)ను చల్లి ఆశీర్వదించారు. బండారు మహోత్సవంతో ఆలయ ప్రాంగణమంతా పసుపు మయంగా మారింది. నాలుగు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు పెళ్లీడుకు వచ్చిన పిల్లలకు పట్టం కట్టడం, రెండో రోజు బీరప్పస్వామి బండారు (పసుపు) చల్లడం, మూడోరోజు తమ మొక్కుల మేరకు గొర్రెలు, మేకలు బలి ఇవ్వడం, నాల్గో రోజు ఎల్లమ్మ బండారు నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి తదితరులు హాజరై బీరప్పకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుర్వ కులస్తులపై బండారు చల్లి ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండయ్య, అధికార ప్రతినిది శంకరోళ్ళ రవికుమార్, దేవరి మల్లప్ప, గణేష్‌కుమార్, కోళ్ళ వెంకటేస్, నారాయణరెడ్డి, నర్సింహగౌడ్, గాసం చిన్న రంగప్ప, వసంతగౌడ్ పాల్గొన్నారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు -
నారాయణపేట
‘భూ భారతి’కి మద్దూరు ఎంపిక మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వివరాలు 8లో uనారాయణపేట: వ్యవసాయ భూములకు సంబందించి సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం ఈ పోర్టల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించగా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో సీఎం ఇలాఖా అయిన కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. తొలుత ప్రయోగాత్మకంగా మద్దూర్ మండలంలో దీనిని అమలు చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద మద్దూర్ మండలాన్ని ఎంపిక చేయడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్‌షాలం సూచనలతో తహసీల్దార్ మహేశ్‌గౌడ్, అధికార యంత్రాంగం భూభారతిని క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి మండలంలో క్షేత స్థాయిలో రైతులకు, ప్రజలకు ముందుగా భూ భారతిపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల నుంచి వచ్చే సందేహాలు, సలహాలు, సూచనలు స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు. రెవెన్యూ గ్రామాలు 17..భూమి 30,621 ఎకరాలు మద్దూర్ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. చెన్వార్, చెన్నారెడ్డిపల్లి, చింతల్‌దిన్నె దమ్‌గన్‌పూర్ దొరెపల్లి, జాదరావ్‌పల్లి, ఖాజీపూర్, లక్కాయపల్లి, మద్దూర్, మల్కిజాదవ్రావ్పల్లి, మొమినాపూర్, నాగిరెడ్డిపల్లి, నందిపహడ్, పల్లెర్ల, పర్సపూర్, పెదరిపాడు, రేనివట్ల గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం మండల వ్యాప్తంగా 30,621 ఎకరాల భూమి ఉంది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండగా ఒక ఆర్ఐ, ఒకరు సర్వేయర్ విధుల్లో ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మద్దూర్ మండలానికి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ రెవెన్యూ, సర్వేయర్లను నియమించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి.. పోర్టల్‌పై నేటి నుంచి అవగాహన సదస్సులు భూ సమస్యల పరిష్కారం, వేగవంతమైన లావాదేవీలే లక్ష్యం -
తాగునీటి అవసరాలకే..
ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద 818 అడుగుల మేరకు కృష్ణానదిలో బ్యాక్ వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాలను బట్టే ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణానదిలో బ్యాక్ వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఎప్పటికీ ఢోకా ఉండదు. – అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ -
మహనీయుడు అంబేడ్కర్
● మహిళల అభ్యున్నతి, సమానత్వం కోసం ముందుకు సాగాలి ● బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి ● అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ నారాయణపేట: మహిళల అభ్యున్నతి, సమానత్వం కోసం అంబేడ్కర్ రాజ్యాంగం రచించారని ఆయన చూపిన మార్గంలో మనమంతా ముందుకు సాగాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూజ, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయన మార్గం అనుసరణీయం ప్రతి ఒక్కరు అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేసి ఆయన చూపిన మార్గంలో నడవాలని ఎమ్మెల్యే చిట్టెం పర్నికారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చుతుందన్నారు. ఇటీవలె కుల గణన నిర్వహించారని, అలాగే అంబేడ్కర్ నాలెడ్జి సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే నేడు తాము రాజకీయ పదవులను అనుభవిస్తున్నామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో భాగంగా కులాంతర వివాహం చేసుకున్న ఇద్దరు దంపతులకు ఆర్థిక సహాయ చెక్కులను అందజేశారు. అంతకు ముందు అదనపు కలెక్టర్లు బెన్ షాలోమ్, సంచిత్ గాంగ్వర్, ఎస్పీ యోగేష్ గౌతమ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, ఆర్టీవో మెంబర్ పోషల్ రాజేష్, మార్కెట్ చైర్మన్ సదాశివ రెడ్డి, వైస్ చైర్మన్ కొనంగేరి హనుమంతు, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీ ఐ శివ శంకర్, ఈదప్ప, అధికారులు ఉమాపతి, అబ్దుల్ ఖలీల్, ఎం.ఏ. రషీద్,జాన్ సుధాకర్ పాల్గొన్నారు. యువత అంబేడ్కర్అడుగుజాడల్లో నడవాలి నారాయణపేట: రాజ్యాంగ రచయిత, న్యాయవాది, ఆర్థికశాస్త్రవేత్త అయినా బీఆర్ అంబేడ్కర్.. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా చిత్ర పటానికి ఎస్పీ పూలమాలవేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశా నిర్దేశం చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని, ఆయన ఆశయ సాధన దిశగా నేటి యువత నడుం బిగించాలన్నారు. -
పారితోషికం అందలే..!
మద్దూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించిన ఎన్యూమరేటర్లకు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటి వరకు పారితోషికాలు అందించలేదు. నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నవంబర్‌లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 1,61,187 కుటుంబాలను సర్వే చేయడానికి 1,172 మంది ఎన్యూమరేటర్లు, 116 మంది సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ వివరాలను 1,285 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేశారు. సర్వే నిర్వహించినందుకు ఎన్యుమరేటర్లకు రూ.10వేలు, సూపర్వైజర్లకు రూ.12 వేల చొప్పున పారితోషికం ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.25 చొప్పున చెల్లిస్తామని పేర్కొంది. కానీ సర్వే పూర్తై ఐదు నెలలు దాటినా ఇప్పటికీ ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తామని.. సమగ్ర కుటుంబ సర్వే చేసినా ఎన్యుమరేటర్ల, సూపర్వైజర్ల, డాటా ఎంట్రీ ఆపరేటర్ల డబ్బులు ఈ– కుబేరాలో పడినట్లు అధికారులు తెలిపారు. కానీ ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియడం లేదు. గతంలో సమగ్ర సర్వే చేసినా వెంటనే ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు వారివారి వ్యక్తిగత ఖాతాలో జమచేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇందుకోసం వారి వ్యక్తిగత ఖాతాలను కూడా తీసుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ డబ్బులు ఈ– కుబేరా నుంచి నేరుగా ఆయా మండలాల ఎంపీడీఓల ఖాతాల్లో జమ అవుతాయని, సర్వే చేసిన వారికి అందజేస్తారని అధికారులు చెబుతున్నారు. ఐదు నెలలుగా గడుస్తుండడంతో సర్వే చేసినా ఉపాధ్యాయులు 317 జీఓ, స్పోజ్ భాగంగా ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. వారికి డబ్బులు ఎలా చెల్లిస్తారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే సిబ్బందిఎదురుచూపులు నెలలు గడుస్తున్నా జరగని చెల్లింపులు అధికారుల చుట్టూ ఎన్యూమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల ప్రదక్షిణలు జిల్లాలో రూ.2.90 కోట్లు పెండింగ్.. -
కలిసికట్టుగా.. ప్రగతి బాటలో!
నర్వ: దేశంలో అత్యంత వెనకబడ్డ ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు నీతి అయోగ్ జూలై 4, 2022న సంపూర్ణ అభియాన్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి దేశంలోని 500 వెనుకబడ్డ ప్రాంతాలను గుర్తించగా ఇందులో రాష్ట్రంలోని 10 జిల్లాలోని అత్యంత వెనకబడ్డ మండలాలను ఎంపిక చేసింది. ఈ మండలాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా దృష్టి పెట్టింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆరోగ్యం, పోషణ, విద్య, పారిశుద్ధ్యం, నీటి వసతి, వ్యవసాయం వంటి ఆరు ముఖ్యమైన సూచికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం, నారాయణపేట జిల్లాలో నర్వ మండలాన్ని ఎంపికచేసి మొదటి మూడు నెలల పాటు చేపట్టిన ఆరు విభాగాల పనితీరును ఇటీవల జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ విడుదల చేశారు. ఇందులో జాతీయ స్థాయిలో దక్షిణ భారత దేశంలో ప్రథమ స్థానం, జాతీయ స్థాయిలో నర్వకు 3వ ర్యాంకు సాధించినట్లు అధికారులు గణంకాలను విడుదల చేశారు. మెరుగైన పనితీరు.. సంపూర్ణ అభియాన్ ద్వారా ఆరు విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పనుల పనితీరును గత ఏడాది డిసెంబర్ 27న కేంద్రమంత్రి బండి సంజయ్ ఈ ప్రాంతాల్లో పర్యటించి కేంద్రానికి నివేదిక అందించారు. ఇందులో గత 6 నెలలుగా నర్వ మండలంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపించి రూ. 4 లక్షలు విడుదల చేయించి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కూర్చునేందుకు ప్రీస్కూల్ బల్లాలు, కుర్చీలు, గోడపై పెయింటింగ్స్, మ్యాంపులు, మంకీ బార్స్, బెడ్‌షీట్స్ వంటి పరికరాలను మండలంలోని 33 అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. దీంతోపాటు మోడల్ అంగన్వాడీ కేంద్రాలను కొన్నింటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. కేంద్రమంత్రి పర్యటనతో సాకారం.. నీతి అయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికై న 10 జిల్లాల్లో కేంద్రమంత్రి బండి సంజయ్ గత ఏడాది డిసెంబర్లో పర్యటించారు. ఈ సందర్భంగా నర్వ మండలంలోని రాయికోడ్‌లో గత ఏడాది డిసెంబర్ 27న పర్యటించి సంపూర్ణ అభియాన్ ద్వారా అమలవుతున్న పథకాలను లబ్ధిదారులు, చిన్నారులను అడిగి తెలుసుకొని కేంద్రానికి నివేదిక అందించారు. దీంతో జాతీయ స్థాయిలో నర్వ మండలానికి అభివృద్ధి పరంగా ప్రత్యేక నిధులు రాబట్టేందుకు ఈ కార్యక్రమం దోహదమవుతుందని అన్నారు. నర్వ మండలం రాయికోడ్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో పరిశీలిస్తున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్ (ఫైల్) ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో జాతీయ స్థాయిలో నర్వకు 3వ ర్యాంకు జిల్లాలో నీతి అయోగ్ సంపూర్ణ అభియాన్‌కు ఎంపిక మూడు నెలలు.. ఆరు విభాగాల్లో ఉత్తమ ప్రగతి కేంద్రం నుంచి రూ.2 కోట్ల వరకు సమకూరనున్న నిధులు ఆరు విభాగాల్లో పనితీరు మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో ఆరు విభాగాలు న్యుట్రీషణ్(పోషణ), అగ్రికల్చర్( వ్యవసాయం), విద్య (ఎడ్యుకేషన్, నీటి వసతి, సోషల్ సెక్టార్ విభాగాల్లో మెరుగైన పనితీరు కనబర్చారు. మూడు నెలల్లో 240 మంది గర్భిణులకు ఆరోగ్య, పోషణవంటి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించారు. మండలంలో 21,405 మందికి బీపీ, షుగర్(మధుమేహం), టీబీ పరీక్షలు నిర్వహించారు. సంపూర్ణ అభియాన్ ద్వారా తక్షణ అవసరంగా నర్వ పీహెచ్‌సీకి అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ విభాగంలో రాష్ట్ర వ్యవసాయ కమీషనర్ ఆదేశాల మేరకు 7,145 ఆరోగ్య మట్టి పరీక్షల కార్డులను అందజేశారు. దీంతో పాటు 3200 మట్టి నమూనాలకు సంబందించి త్వరలో కార్డులు అందజేయాల్సి ఉంది. సోషల్ సెక్టార్ కింద స్వయం సహాయక సంఘాలకు మండల వ్యాప్తంగా రూ.9.40 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలను అందించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారం స్వీకరించి మెరుగైన పలితాలను సాధించిన చిన్నారుల తల్లిదండ్రులకు స్వాతంత్య్ర వేడుకలకు ఢిల్లీలో పర్యటించే ఏర్పాట్లు చేపట్టారు. ఉత్తమ ర్యాంకుతో మరిన్ని నిధులు సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా ఆరు విభాగాల్లో నర్వ మండలం అత్యుత్తమ ఫలితాలను సాధించి జాతీయ స్థాయిలో ముందంజలో నిలవడం అభినందనీయం. కేంద్రమంత్రి పర్యటన అనంతరం మండలంలో కలెక్టర్ సిక్తాపట్నాయక్ ప్రత్యేక చొరవతో మెరుగైన ఫలితాలను సాధించాం. దక్షిణ భారత దేశంలో ప్రథమ ర్యాంకు, దేశ వ్యాప్తంగా 3వ ర్యాంకులో నిలవడం అభినందనీయం. – బాలాజీ, నీతి అయోగ్ కోఆర్డినేటర్ జాతీయ స్థాయిలో గుర్తింపు కలెక్టర్ ఆదేశాల మేరకు నీతి అయోగ్ కార్యక్రమం ద్వారా మండలంలో ఆరు విభాగాల్లో వంద శాతం ప్రగతి సాధించేలా చర్యలు చేపట్టాం. ఇటీవల విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలను నర్వ మండలం సాధించడం సంతోషానిచ్చింది. దేశ వ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వేలో 3వ ర్యాంకు సాధించడంతో మరింత బాధ్యత పెంచింది. – శ్రీనువాసులు, ఎంపీడీఓ, నర్వ -
ఇప్పటివరకు 12,521 మెట్రిక్ టన్నుల పంపిణీ..
● అన్నం వండుకోవడానికే ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులు ● పలు రేషన్ షాపుల పరిధిలో నిర్ణీత కోటా మించి డిమాండ్ ● అక్కడక్కడా కొంత మేర నూకలు.. ముద్దగా అన్నం ● దొడ్డు బియ్యంతో పోల్చితే పరవాలేదంటున్న వినియోగదారులు ● సరైన సమయంలో గంజి వార్చితే బాగుంటుందంటున్న మహిళలు ● ‘రేషన్ దుకాణాల్లో ఇదివరకు దొడ్డు బియ్యం ఇచ్చేవారు. అన్నం సరిగ్గా కాకపోయేది. వాటిని పిండి పట్టించి దోశలు ఇతర పిండి పదార్థాల తయారీకి ఉపయోగించేటోళ్లం. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. కొంత మేర నూకలు ఉన్నాయి. అన్నం ముద్దగా అవుతోంది. అయినా దొడ్డు బియ్యంతో పోల్చితే నయమే కదా. ఈ సన్న బియ్యంతో అన్నమే వండుకుంటున్నాం. సరైన సమయంలో గంజి వార్చితే అన్నం పుల్లలు పుల్లలుగా ఉంటుంది.’ అని రేషన్ లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ● దొడ్డుబియ్యం పంపిణీ సమయంలో ఆసక్తి చూపని లబ్ధిదారులు, కిలో రూ.9, రూ.10 అంటూ బేరసారాలకు దిగే వారు.. సన్న బియ్యం వచ్చాయా.. తీసుకోవడానికి వస్తున్నాం అంటూ డీలర్లకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారు... సర్కారు ఉగాది కానుకగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీపై ప్రజా స్పందనకు ఇవి అద్దం పడుతున్నాయి. లబ్ధిదారులు అన్నం వండుకుని తినేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలో 2,024 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 9,67,639 రేషన్ కార్డులు ఉండగా.. ఏప్రిల్ కోటాకు సంబంధించి రేషన్ దుకాణాలకు సుమారు 20,469 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 21,064 మెట్రిక్ టన్నులు సరఫరా కాగా.. రేషన్‌షాపుల ద్వారా లబ్ధిదారులకు శనివారం వరకు 12,521 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.60 లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. ఇందులో మెజార్టీ సంఖ్యలో ముంబై, పూణే వంటి ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు కాకుండా హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో 80 వేల మంది వరకు భవన నిర్మాణ రంగంలో మేసీ్త్రలు, అడ్డా కూలీలు, డైలీ కూలీలుగా బతుకీడుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సన్న బియ్యం పంపిణీ వాయిదా పడింది. అక్కడ దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన వలస కూలీలు సొంత ప్రాంతాలకు వచ్చి రేషన్‌షాపుల్లో తమ కోటా సన్న బియ్యం తీసుకెళ్తున్నారు. దీంతో వనపర్తి జిల్లా అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరుతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్, మహమ్మదాబాద్, హన్వాడా, కోయిల్‌కొండ, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నారాయణపేట జిల్లా కోస్గి, మద్దూర్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని పలు రేషన్ దుకాణాలకు నిర్ణీత కోటాకు మించి సరఫరా చేయాలని డీలర్లు కోరుతున్నారు. ఈ మేరకు అధికారులు రేషన్ కోటా పెంచేలా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకే కోటాకు మించి 594.478 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా పంపిణీ చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ● వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో మొత్తం 9,673 రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ షాపులు 21 ఉండగా.. లబ్ధిదారులు 34,629 మంది ఉన్నారు. ఫిబ్రవరిలో చౌక దుకాణాలకు 203.929 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అయ్యాయి. అదే ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు నాలుగు మెట్రిక్ టన్నులు అధికంగా సరఫరా చేశారు. వలస కూలీలు వచ్చి సన్నబియ్యం తీసుకెళ్లడంతో కోటాకు మించి అధికంగా కావాల్సి వచ్చినట్లు డీలర్లు చెబుతున్నారు. సన్నవి ఇస్తుండడంతో ఊరికొచ్చి తీసుకున్నాం.. నా భార్య, పిల్లలతో సహా 15 ఏళ్లుగా హైదరాబాదులో నివాసం ఉంటున్నాం. మేం మొత్తం ఐదుగురం. ప్రతి నెల 35 కిలోల బియ్యం వస్తాయి. ఈ సారి సన్న బియ్యం ఇస్తున్న కారణంగా మా ఊరిలో తీసుకున్నాం. సన్న బియ్యంలో కొంత నూక ఉంది. అయినా బాగానే ఉన్నాయి. – స్వామి, వలస కూలీ, దుప్పల్లి, మదనాపురం, వనపర్తి అన్నం బాగానే అయింది.. గతంలో వేసే లావు బియ్యం తినటానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయితే ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం ఇస్తుండగా.. మొన్ననే తెచ్చుకున్నాం. అవే తింటున్నాం. అన్నం చాలా బాగా అయ్యింది. కాకపోతే కొత్త బియ్యం కావడంతో మెత్తగా అయింది. ఇదే బియ్యం బయట అంగట్లో కొంటే కిలో రూ.53 పలుకుతోంది. మా లాంటి పేదోళ్లు అంత ధర పెట్టి కొనలేం. – వెంకటేష్, నల్లకుంట, గద్వాల నాణ్యతపై రాజీ పడొద్దు.. మేము కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాం. కుటుంబంలో నలుగురికి కలిపి వచ్చే 24 కేజీల రేషన్ బియ్యమే మాకు కడుపు నింపుతోంది. సన్నబియ్యం ఇవ్వడం సంతోషం. ఇప్పుడు వచ్చినవి వండుకుంటే అన్నం బాగానే అయింది. ప్రతి నెలా నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలి. ఎక్కడా రాజీ పడొద్దు. – కాసింబీ, గోప్లాపూర్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ 3 రోజుల్లోనే అయిపోయాయి.. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేపట్టడంతో ఎప్పుడూ లేని విధంగా మూడు రోజుల్లోనే నా షాప్‌నకు వచ్చిన కోటా 171.33 క్వింటాళ్లు అయిపోయాయి. మిగతా రెండు షా పుల్లో కూడా మూడు రోజుల్లోనే బియ్యం స రఫరా జరిగిపోయింది. గతంలో బియ్యం పంపిణీకి 15 రోజులు పట్టేది. కోటా అయిపోయి న కూడా లబ్ధిదారులు వస్తున్నారు. అదనపు కోటా కోసం అధికారులకు తెలియజేశాం. – సంజీవరెడ్డి, డీలర్, రేషన్‌షాప్ నంబర్–3, మద్దూరు, నారాయణపేట జిల్లాల వారీగా సన్న బియ్యం పంపిణీ వివరాలు (మెట్రిక్ టన్నుల్లో).. జిల్లా రే.షా రే.కా ఏప్రిల్ కోటా రే.షా.ప.అ ల.ప.అ మహబూబ్‌నగర్ 506 2,53,229 5,228.000 5,129.000 3,471 జోగుళాంబ గద్వాల 335 1,63,693 3,591.429 3,591.428 2,500 నారాయణపేట 301 1,44,472 3,382.916 3,382.916 1,745 నాగర్‌కర్నూల్ 558 2,43,107 4,946.455 4,500.000 2,813 వనపర్తి 324 1,63,138 3,321.066 4,461.000 1,992 మొత్తం 2,024 9,67,639 20,469.866 21,064.344 12,521 రే.షా: రేషన్‌షాపులు, రే.కా: రేషన్‌కార్డులు, రే.షా.ప.అ: రేషన్‌షాపులకు పంపిణీ అయింది, ల.ప.అ: లబ్ధిదారులకు పంపిణీ అయింది అవసరమైతే గడువు పెంపు.. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో శనివారం నాటికి 65 శాతం మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సరఫరా చేశారు. మరో మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు వేగం పెంచాలని డీలర్లను ఆదేశించారు. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉన్నట్లయితే.. వారికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచి అందజేయనున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు. నిర్ణీత కోటాకు మించి డిమాండ్.. -
రమణీయం.. రథోత్సవం
కొత్తపల్లి: గిరిజనుల ఆరాధ్యదైవమైన గురులోకామసంద్ ప్రభు బావాజీ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం ఆదివారం కనులపండువగా సాగింది. బంజారాల సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల నృత్యాలు, భజనల నడుమ రథం ముందుకు కదిలింది. మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన గురులోకామసంద్ ప్రభు బావాజి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున రథోత్సవం, స్వామి వారి పల్లకీసేవ నిర్వహించారు. శనివారం నుంచే వివిధ రాష్ట్రాల నుంచి గిరిజనులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ పూజారులు చందర్ నాయక్, బీంమ్లానాయక్ ఆధ్వర్యంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథాన్ని ఆలయ ముఖద్వారం నుంచి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వరకు లాగారు. అంతకుముందు బావాజి, కాళికాదేవికి భక్తులు బెల్లంతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పించారు. మరికొందరు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూణె గ్రూప్ అసోషియేషన్ అన్నదానం చేశారు. ఇదిలాఉండగా, రథోత్సవంలో ఆర్డీఓ రాంచందర్ చేసిన కత్తి విన్యాసం ఆకట్టుకుంది. పోలీసుల పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ఎస్టీ సెల్ సాయకులు దేవులానాయక్, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్ది బీములు, పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సిములు, రఘుపతి రెడ్డి, మహేందర్ రెడ్డి,రాజశేఖర్ రెడ్డి,రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బావాజీ జాతరకు తరలివచ్చిన భక్తజనం ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు -
రాజ్యాంగ రక్షణకు ముందుకు రావాలి
నారాయణపేట: రాజ్యాంగ రక్షణకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 70 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తే, నేడు బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో తిరోగమనం వైపు ప్రయాణిస్తూ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుందని పలువురు కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు శివారెడ్డి, బండి వేణుగోపాల్ తదితరులు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలకు కుల, మత, పేద, ధనిక అనే తేడా లేకుండా సమాన హక్కులను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో అంబేద్కర్ ఆధ్వర్యంలో ఎందరో మేధావులతో కలిసి రాజ్యాంగాన్ని రచించుకున్నామన్నారు. రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా కులాల మధ్య చిచ్చుపెట్టి, మతా కల్లోలలో సృష్టించి దేశాన్ని విచ్చిన్నం చేసే విధానాలను బీజేపీ అవలంభిస్తుందన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్‌పై స్వయంగా పార్లమెంట్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ అవమానిస్తున్నారన్నారు. వీటిని ప్రజల్లో ఎండగడుతూ ప్రతి గడపగడపకు వెళ్లి జై బీం, జై బాపు జై సంవిధాన్ పై విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ యాత్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. కార్యక్రమంలో ఎండి. సలీం, ఎండి. గౌస్,కోట్ల రవీందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మహిమూద్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు. 1,075 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత కల్వకుర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చాలని సంకల్పంతో రేషన్ షాపుల ద్వారా ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే సన్నబియ్యం సైతం పక్కదారి పట్టిన సంఘటన కల్వకుర్తి మండలంలో వెలుగుచూసింది. సన్నబియ్యంతోపాటు దొడ్డు బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారం రావడంతో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఆదివారం మండలంలోని మార్చాల సమీపంలో ఉన్న శ్రీకృష్ణ రైస్‌మిల్‌పై ఆకస్మికంగా దాడులు నిర్వహించగా.. 1,075 క్వింటాళ్ల బియ్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. మిల్లర్లు ఇవి రేషన్ బియ్యం కావని చెప్పినప్పటికీ అధికారులు వారి మాటలను పట్టించుకోలేదు. మిల్లుకు నాలుగేళ్లుగా సీఎమ్మార్ వడ్లు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. అయినా మిల్లులో ఎఫ్ఆర్కే బియ్యం దర్శనం ఇవ్వడంతో అవి రేషన్ బియ్యం అని అధికారులు తేల్చారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసే పనిలో పడ్డారు. రాత్రి 10 గంటల వరకు.. రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో అధికారులు మిల్లుకు చేరుకున్నారు. ఆ సమయంలో మిల్లు మూసి ఉండగా సంబంధిత యజమాని గుమాస్తాలతో మిల్లు తెరిపించారు. దీంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు టెక్నికల్ సిబ్బందితోపాటు జిల్లాలో పనిచేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డీటీలు, డీఎం రాజేందర్‌ను మిల్లు వద్దకు రప్పించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సోదాలు నిర్వహించారు. మిల్లులో ఉన్న రేషన్ బియ్యాన్ని వివిధ వాహనాల ద్వారా వేరే మిల్లుకు తరలించారు. మిల్లు గుమాస్తాలను అదుపులోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. మిల్లు యజమాని సంబు రమణపై పోలీసులకు ఫిర్యాదు చేశామని డీఎం రాజేందర్ తెలిపారు. -
నారాయణపేట
జై హనుమాన్.. ఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025నారాయణపేటలో వీరహనుమాన్ శోభాయాత్రలో జన సందోహం● జిల్లా కేంద్రంలో కనులపండువగా శోభాయాత్ర నారాయణపేట: జిల్లా కేంద్రంలో హనుమాన్ శోభాయాత్ర శనివారం కనులపండువగా సాగింది. భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో స్థానిక బారంబావి దగ్గర హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి గుండా చౌక్‌కు చేరుకొని గణేశ్ మార్గ్‌గా మహంకాళి వీధి నుంచి పాతగంజ్ వరకు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని నృత్యాలు, భజనలు చేసుకుంటూ ముందుకు సాగారు. డీజే పాటలు, టపాకాయలు కాల్చుతూ.. జైశ్రీరామ్.. జై హనుమాన్.. జై భజరంగ్భళి నినాదాలతో పురవీధులు మార్మోగాయి. కార్యక్రమంలో వీహెచ్‌పీ ప్రముఖ్ హరిశ్చంద్రరెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాంబాబు, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందునామాజీ, మాజీ ఎంపిపి అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, భజరంగ్‌దళ్ సభ్యులు, వీహెచ్‌పీ సభ్యులు పాల్గొన్నారు. -
91మంది చిన్నారులకు తులాభారం
నారాయణపేట రూరల్: మండలంలోని జాజాపూర్ గ్రామంలో శనివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జట్టి హనుమాన్ 36వ జాతర ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం, వెండి ఆభరణాలతో అలంకరణ, హారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, 91మంది చిన్నారులకు తులాభారం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఏఎస్ఐ బాలరాజ్ ఆద్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం నారాయణపేట: జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ మహేష్‌గౌడ్ శనివారం తెలిపారు. ఇటీవల ఈదురు గాలులు వీస్తుడండంతో స్థానిక సివిల్ బహర్పేట్, ధన్ గడ్డ, పరుమళాపురం, యాద్గిర్ రోడ్డు శాంతినగర్ ప్రాంతంలో విద్యుత్ తీగల కింద ఉన్న చెట్టు కొమ్మలతో ప్రమాదం పొంచి ఉందని, ఈక్రమంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి కొమ్మలను తొలగించనున్నామని తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించాలని ఏఈ కోరారు. యూనిఫాంలు సిద్ధం చేయాలి మరికల్: పాఠశాలాలు పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు సంబందించిన యూనిఫాంలను సిద్ధం చేయాలని సీఈఓ రాజేంద్రకుమార్ మహిళా సమాఖ్య సభ్యులకు సూచించారు. శనివారం విద్యార్థుల కొలతలు చేసిన కటింగ్ చేసిన దుస్తులను మహిళా సమాఖ్య వారికి అందజేశారు. వీటిని జూన్ 2 నాటికి పాఠశాలలకు అప్పగించాలని తెలిపారు. ఆలస్యం చేయకుండా త్వరగా యూనిపామ్‌లను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మనోరంజిని, యాదయ్యశేట్టి, చెన్నప్ప, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పీయూలో ప్రాంగణ ఎంపికలు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లోని సెమినార్ హాల్లో శనివారం ఎంఎస్ఎన్ లేబరేటరీ నిర్వాహకులు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. కాగా క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ పోస్టుల కోసం యూజీ, పీజీ రసాయన శాస్త్రం విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ ఆఫీసర్ డా.ఎస్ఎన్ అర్జున్‌కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో రాత పరీక్ష ఉంటుందన్నారు. ఇందులో అర్హత సాధించిన ఉద్యోగార్థ్లుకు తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మధుసూదన్‌రెడ్డి, హెచ్ఆర్ సుబ్బారావుతో పాటు క్యూసీ మేనేజర్లు పాల్గొన్నారు. -
ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి..
రోడ్లపై విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది వీలైనంత ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ కలిపిన నీటిని సైతం తీసుకోవాలి. ఎండలోనే ఎక్కువ సమయం నిలబడి ఉండే వారు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు సైతం మేలు చేస్తాయి. చెమటలో నీటితో పాటు లవణాలు ఉంటాయి. వీటిలో సోడియం, క్లోరైడ్ ముఖ్యమైనవి. రోజుకు ఐదు లీటర్ల నీటిని తీసుకోవడంతో పాటు పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఏజీ శంకర్, జనరల్ మెడిసిన్, మహబూబ్‌నగర్ జాగ్రత్తలు పాటిస్తున్నాం జిల్లా ఎస్పీ సూచన మేరకు ఆరోగ్య జాగ్రత్తలు పాటించడంతో పాటు ఇటీవల ఎస్పీ ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ వాటర్ బాటిల్స్, క్యాప్‌లు, కూలింగ్ గ్లాస్లు అందజేశాం. అలాగే ఆరోగ్య పరీక్షలు సైతం చేయించారు. నిత్యం సిబ్బందికి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నాం. – భగవంతురెడ్డి, ట్రాఫిక్ సీఐ, మహబూబ్‌నగర్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి.. పట్టణంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు మొత్తం తిరుగుతూ తనిఖీలు చేస్తుంటాను. ధర్నాలు, ర్యాలీలు, ఇతర ట్రాఫిక్ సమస్యలు వస్తే ఘటన స్థలానికి వెళ్తుంటాను. ఇటీవల ఉన్నతాధికారులు అద్దాలు, టోపీలు, వాటర్‌బాటిల్స్ ఇవ్వడం వల్ల సిబ్బందికి ఉపయోగకరంగా మారాయి. మా వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యపరంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. – లక్ష్మయ్య, ఏఎస్ఐ, మహబూబ్‌నగర్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. దాదాపు ఆరు గంటల పాటు రోడ్లపై విధులు నిర్వహించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రధానంగా నీరు అధికంగా తాగుతున్నాం. ఉన్నతాధికారులు ఇచ్చిన టోపీలు, అద్దాలు ఉపయోగపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో తలనొప్పి వంటి సమస్య వస్తే మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల నుంచి కావాల్సిన సహాయం అందుతుంది. – రాఘవేందర్, ట్రాఫిక్ కానిస్టేబుల్, మహబూబ్‌నగర్ ఎండతో ఇబ్బందికరం.. ట్రాఫిక్ నియత్రించేందుకు ఎండలో నిలబడటం వల్ల ఎండవేడిమితో ఇబ్బందికరంగా ఉంది. షిఫ్ట్‌ల వారీగా విధులు ఉండటంతో కొంత ఉపశమనంగా ఉంది. ఎండవేడిమి నుంచి రక్షణ పొందేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూలింగ్ గ్లాసెస్‌తో పాటు టోపీలను అందజేశారు. ఎండలో ట్రాఫిక్ డ్యూటీలో ఉండే సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా ఉండటంకోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. – శ్రీనివాస్, ట్రాఫిక్ కానిస్టేబుల్, నాగర్‌కర్నూల్ ● -
తప్పని వెతలు
ఎండలో విధులు.. వడగాల్పుల నడుమ ట్రాఫిక్ పోలీసుల విధులు ఒకవైపు పోటెత్తిన వాహనాలు.. మరోవైపు నిప్పులు కురిసేలా ఎండ.. ఒక్క క్షణం ఆదమరిచినా ముంచుకొచ్చే ప్రమాదాలు. ఎండల్లో ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సామే. నిప్పుల కుంపటిపై నిల్చొని పని చేస్తున్నట్లు ఉన్నా.. వేడి గాలులు వీస్తున్నా.. వడదెబ్బలు తగులుతున్నా.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నారు. – మహబూబ్‌నగర్ క్రైం ఉదయం 8 గంటల నుంచే ఎండ దంచికొడుతోంది. ప్రస్తుతం దాదాపు 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగకు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి.. కానీ ట్రాఫిక్ పోలీసులకు సెగలు కక్కుతున్న ఎండలో విధులు కొనసాగిస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఎండలతో రోడ్లపై విధులు నిర్వహించే పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నా సమర్థవంతంగా వారి బాధ్యతలు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏకై క ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ మహబూబ్‌నగర్‌లో ఉండగా.. ఇక్కడ మొత్తం 55 మంది పోలీస్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో ఒక సీఐతో పాటు ఇద్దరూ ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, 12 మంది హెడ్‌కానిస్టేబుల్స్, 32 మంది కానిస్టేబుల్స్, ఏడుగురు హోంగార్డులు ఉన్నారు. మిగతా జిల్లాలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ లేనప్పటికీ ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. వనపర్తి జిల్లాలో ఏఆర్ ఎస్ఐ, ఏఎస్ఐ,12 మంది కానిస్టేబుల్స్, నలుగురు హోంగార్డులు, గద్వాల జిల్లాలో ఒక ఏఆర్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది హోంగార్డులు, నాగర్‌కర్నూల్‌లో ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, నలుగురు హోంగార్డులు, ఆరుగురు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో ట్రాఫిక్ విభాగంలో 102 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను బట్టి రెండు షిఫ్ట్‌లుగా విభజించి విధులు కేటాయిస్తున్నారు. మొదటి షిప్ట్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో షిప్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మహబూబ్‌నగర్‌లోని పిస్తాహౌస్, మెట్టుగడ్డ, న్యూటౌన్, సుభాష్ చంద్రబోస్ సర్కిల్,, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, అశోక్ టాకీస్, పాత బస్టాండ్, వన్‌టౌన్ చౌరస్తా, తెలంగాణ కూడలి, పాన్‌చౌరస్తా, గాంధీచౌక్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఉంటుంది. వనపర్తిలో ఇందిరాపార్క్, రాజీవ్ చౌరస్తా, కొత్త బస్టాండ్, గాంధీ చౌక్, నారాయణపేటలోని సత్యనారాయణ చౌరస్తా, ఓల్డ్ బస్టాండ్, మెయిన్ చౌక్, నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో బస్టాండ్ ఇన్‌గేట్, ఔట్‌గేట్ వద్ద, శ్రీపురం చౌరస్తా, రవీంద్రటాకీస్ చౌరస్తా, గద్వాలో పాత బస్టాండ్, కృష్ణవేణి చౌరస్తా, పాత కూరగాయల మార్కెట్, గాంధీ చౌక్, సుంకులమ్మ మెట్టు వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అధిక వేడి వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు పాలమూరులో క్యాప్‌లు, కూలింగ్ అద్దాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ -
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి
మక్తల్: వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మండలంలోని గడ్డంపల్లిలో శనివారం వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించగా.. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కర్ణాటకలో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో రాష్ట్రంలోనూ ఎస్టీ జాబితాలోకి మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతానని, తన వంతు కృషి చేస్తానని అన్నారు. అలాగే, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, సబ్సిడీపై రుణాలు ఇచ్చేలా చూస్తామన్నారు. అంతకుముందు గ్రామస్తులు రెండు రోజుల నుంచి వాల్మీకి విగ్రహానికి వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నాయకులు గట్టుతిమ్మప్ప, బాలక్రిష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, హన్మంతు, చంద్రాంత్గౌడ్, నర్సింహగౌడ్, గణేష్‌కుమార్, నారాయణరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, మండలంలోని భూత్పుర్‌లో డీఆర్డీఏ ఐకేపి ఆధ్వర్యంలో వరి కోనుగోలు కేంద్రాన్ని మక్తల్ ప్రారంబించారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తాం నర్వ: రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరీ అన్నారు. శనివారం సీపూర్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యాసంగి సాగులో కోతలు ప్రారంభానికి కంటే ముందుగానే వరిని సాగుచేసిన రైతులు ఎలాంటి అధైర్యపడకుండా కనీస మద్దతు ధర రూ.2300 చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు. దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులయ్య, సింగిల్ విండో చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ నాయకులు బాలక్రిష్ణారెడ్డి, చంద్రకాంత్‌గౌడ్ పాల్గొన్నారు. -
గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే
నారాయణపేట: విద్య ,మహిళల బలోపేతానికి మహాత్మా జ్యోతిబాపూలే చేసిన కృషి అపూర్వమని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించగా..ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ.. చదువు, మహిళల సాధికారత కోసం ఆయన చేసిన కృషి అపూర్వమని, సామాజిక ఉద్యమకారుడిగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా ,అన్ని వర్గాల సమానత్వానికి కృషి చేసిన జ్యోతిబాపూలే సేవలు నేటి సమాజం ఆచరిస్తుందన్నారు. దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు అని కొనియాడారు. విద్య ప్రాముఖ్యతను విస్తరింప చేశారని, ప్రత్యేకించి మహిళల విద్యకు కృషి చేశారని, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు, అణగారిన కులాలను పైకి తీసుకువచ్చేందుకు తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్ఓ ఎం. ఏ. రషీద్, సీపీఓ యోగానంద్, షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి, రచయిత నరసింహ, గాయకుడు గౌరీ శంకర్, రజక సంఘం నాయకులు మడి వాల్ కృష్ణ, బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా చైతన్యం కోసమే ‘గావ్ చలో అభియాన్’
నారాయణపేట రూరల్: ప్రజలను చైతన్యపర్చడం కోసమే గాల్ చలో అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత నాగురావు నామాజీ, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గావ్ చలో ఘార్ చలో అభియాన్ కార్యక్రమం లో భాగంగా మండలంలోని కోటకొండలో వారితోపాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు కెంచే శ్రీనివాసులు బృందం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలను పరిశీలించారు. అదేవిదంగా కొల్లంపల్లి గ్రామంలో జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ పర్యటించి కేంద్రప్రభుత్వ పథకాల పరిశీలనలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూలీలను అన్ని రకాలు గా ఆదుకుంటుంది అని భరోసా ఇచ్చారు. ఆయా గ్రామ పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలల్లోని సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. బీజేపీ ఎమ్మెల్సీల సహకారంతో ఆయా సమస్యల పరిష్కారం చేసేవిధంగా చూస్తామన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి ఇంటింటికీ బిజెపిని చేర్చాలని తద్వారా రానున్న ఎన్నికల్లో బిజెపి గెలుపునకు బాటలు వేయాలని పిలుపు నిచ్చారు. ఆయా కార్యక్రమాలో వెంకట్రాములు, సాయిబన్న, చంద్రశేఖర్, గ్రామ బూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
హనుమాన్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
నారాయణపేట: హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా పరిధిలో 58 హనుమాన్ శోభాయాత్రలు నిర్వహించడం జరుగుతుందని ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన చౌరస్తాల్లో పోలీస్ పికెట్స్, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ చేస్తామని, సోషల్ మీడియా లో రూమర్లు పోస్ట్ చేసే వారిపై నిఘా ఉంచామని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శోభాయాత్ర జరిగే సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయా లని తెలిపారు. యువకులు సంయమానం పాటించాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు వలంటీర్లను ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీస్ వారికి సహకరించాలని తెలిపారు. నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలి మరికల్: కార్మికులను కట్టు బానిసత్వంలోకి నెట్టే నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం డిమాండ్ చేశారు. శుక్రవారం మరికల్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో సదస్సుకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్రానికి పూర్వం నుండే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి యజమానులకు అనుకూలంగా తీసుకువచ్చిన నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ నాలుగు కోడ్లు అమల్లోకి వస్తే సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితంగా ఉండే హక్కు, కనీస హక్కులను కార్మిక వర్గం కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళావతి, తిరుపతమ్మ, అనురాధ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంగా భవానీప్రసాద్ స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం(ఎం)గా ఎస్.భవానీప్రసాద్ బదిలీపై వచ్చారు. ఖమ్మం రీజి యన్‌లో డిప్యూటీ ఆర్ఎంగా పనిచేస్తున్న ఇత ను ఇటీవల బదిలీపై ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ ఆర్ఎం(ఎం)గా పనిచేసిన శ్యామల హైదరాబాద్‌లోని మియాపూర్‌కు బదిలీపై వెళ్లారు. ముగిసిన జాబ్‌మేళా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాబ్‌మేళాకు 380 మంది విద్యార్థులు హాజరయా ్యరు. టీఎస్కేసీ, సైంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ జాబ్‌మేళాలో 120 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు మరిన్ని వస్తాయని, అందరూ ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐక్యూసీ కో–ఆర్డినేటర్ డా.జె.శ్రీదేవి, టీఎస్కేసీ కో–ఆర్డినేటర్ డా.హరిబాబు, మెంటర్ పి.స్వరూప, సైంట్, టీఎంఐ ప్రాజెక్టు మేనేజర్ వికాస్, ఐసీఐసీఐ బ్యాంకు హెచ్ఆర్ కిరణ్ పాల్గొన్నారు. వైభవంగా అయ్యప్పస్వామి పంబ ఆరట్టు స్టేషన్ మహబూబ్‌నగర్: అఖిలభారత అయ్యప్పదీక్ష ప్రచార సమితి పాలమూరు ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యప్పస్వామి పంబ ఆరట్టు (చక్రస్నానం) వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువింటి శ్రవణ్‌కుమార్ శర్మ, మోనేష్, పవన్ ఆధ్వర్యంలో స్థానిక చెలిమేశ్వర శివాలయం ఊటబావిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురుస్వామి రఘుపతిశర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. ప్రచార సమితి అధ్యక్షుడు సీమ నరేందర్, రామేశ్వర్, సతీష్, సంతోష్, శ్రీనుస్వామి, యుగంధర్, సత్యం, రఘురాంగౌడ్, కొండల్, కురుమయ్య పాల్గొన్నారు. -
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
కొత్తపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవం గురులోకామాసంద్ బావాజీ జయంతి ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్, జాతర నోడల్ అధికారి సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో శుక్రవారం గురులోకామాసంద్ బావాజీ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా.. ఆయన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయ పరిసరాల్లో చేపట్టిన శానిటేషన్ పనులను పరిశీలించారు. ఆయా పంచాయతీ సిబ్బందికి కేటాయించిన విధులు తూచా తప్పకుండా పాటించాలని, భక్తులకు మంచినీరు, ఇతర వసతులు కల్పించాలని ఆదేశించారు. తహసిల్దార్ జయరాములు, ఎంపీడీఓ కృష్ణారావ్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాల్లో జాగిలాలతో తనిఖీలు ఎస్పీ యోగేశ్ గౌతం ఆదేశాల మేరకు ఆలయ పరిసరాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా బాంబ్ స్క్వాడ్, పోలీసు జాగితాలతో తనిఖీలు నిర్వహించారు. ఎవరికై నా అనుమానాస్పద వస్తువులు కనిపించినా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. శుక్రవారం నుంచి 14వ తేది వరకు కొనసాగే ఉత్సవాలకు వచ్చే భక్తుల భద్రత నిమిత్తం 150 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని కోస్గి సీఐ సైదులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం జాతర బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు రానివ్వకుండా ట్రాఫిక్ పాయింట్స్ ఏర్పాటు చేసి డైవర్షన్, వాహనాల కొరకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతరలో పోలీస్ పికెట్స్, దొంగతనాలు, దోపిడీలు జరగకుండా మఫ్టీలో పోలీసులు విధులు నిర్వహిస్తారన్నారు. జాతరలో చిన్నారులు, ముసలి వాళ్లు ఎవరైనా తప్పిపోతే పోలీస్ కంట్రోల్ రూం,లేదా దగ్గరలోని పోలీసులకు తెలియజేయాలని, అత్యవసర సమయంలో 100కి కాల్ చేయాలని తెలిపారు. మద్దూరు ఎస్ఐ విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం
మద్దూరు: ప్రజల పక్షాన బీఆర్ఎస్ నాయకులు నిరంతర పోరాటం చేయాలని, లగచర్లలో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేసినప్పటి నుంచే సీఎం రేవంత్‌రెడ్డి పతనం ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మద్దూరు పట్టణంలో మద్దూరు, కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా వరంగల్‌లో ఈ నెల 27 న నిర్వహించే సభకు ఈ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్యకర్తలకు సూచించారు. మీమీ గ్రామాల్లో ఉదయం జెండావిష్కరణ అక్కడి నుంచే వాహానాల్లో బయలుదేరాలని సూచించారు. గ్రామాల్లో మన కార్యకర్తలపై ఎలాంటి కేసులు పెట్టినా, బెదిరింపులకు దిగినా భయపడకండి మండల పార్టీ నాయకులు, నేను మీకు అండగా ఉంటామన్నారు. అవసరమైతే ధర్నాలు కూడా చేద్దామన్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలనపై ఎవ్వరు సంతృప్తిగా లేరన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయలేని పరిస్థితిలో రేవంత్ సర్కార్ ఉందన్నారు. హెచ్‌సీయూ భూములమ్మి ఏదో చేద్దామనుకుంటే కోర్టులో మొట్టికాయలు పడ్డాయని గుర్తుచేశారు. అంతకుముందు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సలీం, వీరారెడ్డి, గోపాల్, రామకృష్ణ, మధుసుదన్‌రెడ్డి, మహిపాల్, బసిరెడ్డి, నర్సింహా, మహేందర్, చంద్రశేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
180 ఎకరాల్లో పంటనష్టం
దేవరకద్ర: మండలంలోని బల్సుపల్లిలో గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి దాదాపు 180 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటను శుక్రవారం ఏఓ రాజేందర్ అగర్వాల్ పరిశీలించారు. వడగండ్ల వర్షానికి జరిగిన పంటనష్టంపై అధికారులకు నివేదిక అందిస్తామన్నారు. తడిచిన ధాన్యం పరిశీలన దేవరకద్ర రూరల్: అకాల వర్షంతో దేవరకద్ర మార్కెట్ యార్డులో తడిచిన ధాన్యాన్ని తహసీల్దార్ కృష్ణయ్య పరిశీలించారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఉన్నతాధికారుల అదేశాల మేరకు తహసీల్దార్ పరిశీలించి.. రైతుల వివరాలు నమోదు చేసుకున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు. -
సీ్త్రనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
కోస్గి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంపికై ఆర్థిక పరిస్థితి బాగో లేని నిరుపేద మహిళలకు సీ్త్రనిధి రుణాల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందవచ్చని డీఆర్డీఓ మొగులప్ప అన్నారు. శుక్రవారం మండలంలోని చంద్రవంచ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాన్ని చేపట్టి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లను బేస్మెంట్ వరకు నిర్మించుకున్న వారికి సీ్త్రనిధి రుణాల ద్వారా రూ.లక్ష మంజూరు చేస్తామని, ప్రతి నెల కొంత మొత్తంలో చెల్లించవచ్చునని, లేని పక్షంలో ప్రభుత్వం నుంచి మంజూరయ్యే మొదటి విడత నిధులతో భర్తీ చేస్తామన్నారు. 20 మంది లబ్ధిదారులతో మాట్లాడగా సగం మంది రుణాలను తీసుకునేందుకు ముందుకు వచ్చారని వివరించారు. ప్రభుత్వం అందించే సహకారాన్ని ఉపయోగించుకొని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటి వరకు పనులు జరుగుతున్న 14 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరీశీలించారు. అనంతరం మండలంలోని లోదిపూర్, చంద్రవంచ ,పోతిరెడ్డిపల్లి గ్రామాలలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు తాజా కూరగాయలతో నాణ్యమైన భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ డిప్యూటీ ఈఈ హరికృష్ణ ఎంపీడీఓ శ్రీధర్, ఏపీఎం నర్సింహ పాల్గొన్నారు. -
పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి
మక్తల్: రిజర్వాయర్లకు సంబందించి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. గతంలో కాల్వల పనులు, గెట్ల పనులు పెండింగ్‌లో ఉన్న వాటిని గుర్తించి వెంటనే పూర్తి చేయాలని అన్నారు. గెట్ల నుంచి నీరు వృథాగా పోతుందని, కాల్వలు అసంపూర్తి దశలో ఉన్నాయని అన్నారు. మరమ్మతు పనులు వేగవంతం చేయాలని, సాగునీటి విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అధికారులు దగ్గరుండా పనులు పూర్తి చేయించాలని అన్నారు. రైతులు పంటల సాగు విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
‘పేట’ అభివృద్ధి మాటేమిటి..?
నారాయణపేట: ఎన్నికల ముందు నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలు రెండు కళ్లలాంటివని, ఇప్పుడేమో నిధులన్నీ కొడంగల్‌కు తరలిస్తున్నారని, నారాయణపేట అభివృద్ధి మాటేమిటని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాల రెండో సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నా భవనం నిర్మాణం ప్రారంభించలేదని, కలెక్టరేట్ నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయని, ఎస్పీ కార్యాలయానికి పునాదే పడలేదని అన్నారు. మరో వైపు కొడంగల్ నియోజకవర్గ చివరి వరకు డబుల్ రోడ్డు వేస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్నా...లేకున్నా తెలంగాణ ప్రజల బాగోగుల కోసం పోరాటం చేసే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నదని అన్నారు. 25 వసంతలు పూర్తిచేసుకొని ఈ నెల 27న వరంగల్ నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవాలకు భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావాలనిపిలుపునిచ్చారు. ఈ నెల 27న ప్రతి గ్రామంలో గ్రామ అధ్యక్షులు, మండల కేంద్రాల్లో మండల అధ్యక్షులు, జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుల చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించాలన్నారు. అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, కానుకుర్తి వెంకట్‌రెడ్డి,వేపూరి రాములు, విజయ్‌సాగర్ పాల్గొన్నారు. -
రాజీవ్ యువ వికాసంపై అవగాహన కల్పించండి
నారాయణపేట: రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్ సంబంధిత శాఖల అధికారులతో రాజీవ్ యువ వికాసం, ఎన్ఆర్ఈజీఎస్, యూనిఫామ్ కుట్టు పని, లోగోస్ డాటా ఎంట్రీ, జీవిత భాగస్వామి పెన్షన్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వెనకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు ద్వారా జిల్లాలో నిరుద్యోగం తగ్గుతుందన్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 14, 2025 లోపు దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ క్రింద టార్గెట్ పూర్తి చేయాలన్నారు. ఉదయం ఏడు గంటలకు ఫీల్డ్ లోకి వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. వరి ధాన్యం తడవకుండా చూడాలని టార్పాలిన్లు సిద్ధం చేయాలన్నారు. లేబర్‌ను ఎక్కువగా ఏర్పాటు చేసి ఎఫ్టిఓ జనరేట్ చేయాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామాలలో తాగునీటి ఇబ్బందు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, అధికారులు అబ్దుల్ ఖలీల్, రషీద్ పాల్గొన్నారు. పోషకాహార ప్రాముఖ్యతను వివరించాలి పోషకాహార ప్రాముఖ్యతపై ఈనెల 22 వరకు నిర్వహించనున్న పోషణా పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.కలెక్టరేట్లో జిల్లా పోషణ పక్షం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 8 నుండి 22 వరకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రం, ప్రాజెక్ట్‌ల పరిధిలో జిల్లా స్థాయిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. 704 అంగన్ వాడీ కేంద్రాలలో 6 సంవత్సరాల లోపు చిన్నారులతో పాటు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపంతో భాధపడుతున్న వారిని గుర్తించి అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం ఇతర సేవలను పూర్తిగా వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. -
ఈ ఫైలింగ్‌పై అవగాహన ఉండాలి
నారాయణపేట: ఈ ఫైలింగ్‌పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ బెన్‌షాలం తెలిపారు. గురువారం అధికారులకు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఈ ఆఫీస్‌పై శిక్షణ జరిగింది. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ ఫైలింగ్ విధానంపై సంస్థ తరఫున శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్, జిల్లాలోని అన్ని శాఖల సాంకేతిక సిబ్బంది సూపరింటెండెంట్లు సెక్షన్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
నారాయణపేట: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవలు ఎంతో అభినందనీయమని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి, ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం బాలాజీ గోల్డ్–సిల్వర్ ప్రయివేట్ లిమిటెడ్, కార్పొరెట్ సోషల్ రెస్పాన్సిబులిటి, లయన్‌న్స్ లైఫ్ చారిట్రబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మాజీగవర్నర్ సరిత హరినారాయణ్ బట్టడ్ నేతృత్వంలో పట్టణంలోని ఎర్రగుట్ట వద్దనున్న కస్తూర్భాగాంధీ పాఠశాల విద్యార్థినులకు రూ.5లక్షల విలువ గల బెంకర్ బెడ్స్‌ను అందజేశారు. ఈకార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని మహంకాళి వీధిలో గల హరినారాయణ బట్టడ్ నివాసంలో రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లయన్‌న్స్ క్లబ్ సభ్యులు సేవా దృక్పథంతో ఏర్పాటు చేసే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేజీబీవీ విద్యార్థినులకు బంకర్ బెడ్స్ ఇచ్చిన క్లబ్ సభ్యులను కలెక్టర్ అభినందించారు. రూ.7.50లక్షల అధునాతన అంబులెన్స్ వాహనాన్ని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, ఎస్పీ యోగేష్ గౌతమ్ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, కుంభం శివకుమార్ రెడ్డి, బాలాజీ గోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ బబితా సాకేత్బట్టడ్, సురేష్ జగ్ననానీ, ఎంవి చారి రమేష్ చంద్రబాబు, శక్తి పీఠం వ్యవస్థపకుడు డాక్టర్ శాంతానంద్స్వామి పాల్గొన్నారు. -
రాజీమార్గంతో కేసుల పరిష్కారం
నారాయణపేట: రాజీమార్గంతో కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ రఫీ సూచించారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ కార్యదర్శి వింధ్య నాయక్ మాట్లాడుతూ.. మే 10న జరగాల్సిన లోక్ అదాలత్ జూన్ 14న నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 14 పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను అడిగి తెలుసుకున్నారు. వాటిని ఈ లోక్ అదాలత్‌లో త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. ఎకై ్స జ్, ఇతర కేసులను అన్ని కలిపి 6400 కేసులను లక్ష్యంగా నిర్దేశించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని టీములు సిద్ధంగా ఉండాలని ఈ లోక్ అదాలత్‌ను కక్షిదారులు ఉపయోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు యధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏజెండా లోని అంశాలను నాన్ –బైలాల్ వారెంట్ కేసులను, చార్జిషీట్, పిడి యాక్ట్ పెండింగ్ లో ఉన్నాయా చర్చించారు. ముందుగా హై కోర్ట్ జుడిషియల్ ఆదేశానుసారం జైలులో ఉన్న ఖైదీల కేసులను డిస్పోసల్ చెయ్యాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సురేష్ కుమార్, బాలప్ప, డిఫెన్స్ కౌన్సిల్స్ కె లకి్ష్మ్పతి గౌడ్, నాగేశ్వరి, డీఎస్పీ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా రాజేశ్వర్‌గౌడ్ నారాయణపేట: కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా రాజేశ్వర్ గౌడ్ నియమిస్తూ టీపీసీసీస లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డర్ కాపీని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి గురువారం రాజేశ్వర్‌గౌడ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు ఇచ్చిన లిగల్సెల్ రాష్ట్ర చైర్మన్‌కు, డీసీసీ అధ్యక్షడు ప్రశాంత్కుమారెడ్డితో పాటు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలుచిట్టెం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పీయూలో తరగతుల బహిష్కరణ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడికి వెళ్లిన అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పాలమూరు యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగులు తరగతుల బహిష్కరించారు. ఈ సందర్భంగా భూమయ్య, రవికుమార్ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన చేపట్టిన అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేయడం ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
నారాయణపేట రూరల్: రాష్ట్రంలో పాలకులు మారిన పరిపాలన మాత్రం మారలేదని, గతంలో కేసీఆర్ చేసిన తప్పులను రేవంత్ కొనసాగిస్తున్నాడని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజెపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా కొండ సత్యయాదవ్ బుధవారం పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరగగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల గారడీతో 6 అబద్ధాలు 66 మోసాలతో అధికారంలోకి వచ్చిందని, రైతు రుణమాఫీ, రైతు భరోసా పూర్తిగా లేదని, మహాలక్ష్మి, గృహజ్యోతితో మహిళలను మోసం చేశారని, వృద్ధులకు చేయూత అందించలేదని, సొంతిల్లు కలగానే మిగిలి పోయిందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్డున పడ్డారనీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ దోచుకోవడంలో రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. పదేళ్లు బీఆర్ఎస్ కే.ట్యాక్స్ ఇప్పుడు కాంగ్రెస్ ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లిస్తుందని, ప్రజాస్వామ్యాన్ని పాతర వేశారని ప్రజలు వీరి పాలనలో భూమి, ఇళ్లు కోల్పోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో చేపట్టిన సంక్షేమ పథకాలను, వక్ఫ్ బోర్డు రద్దుతో ముస్లింలకు నష్టం లేదన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని బీజేపీ గెలుపునకు పట్టుదలతో కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. నిరంకుశ పాలన తలపిస్తున్న సర్కారు.. కేసీఆర్ హిట్లర్ మాదిరి వ్యవహరిస్తూ పరిపాలిస్తున్నాడని ప్రజలు భావించి ఆయనను గద్దె దింపితే.. రేవంత్‌రెడ్డి సైతం అదే తీరులో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 12 యూనివర్సిటీలకు సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు జీవో 21ని రద్దు చేయాలని ప్రజాస్వామ్య భద్రంగా నిరసన వ్యక్తం చేస్తుండగా దౌర్జన్యంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. హెచ్‌సీయూ భూములను అమ్మడంపై బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందనిన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈక్రమంలోనే చంద్రఘడ్ కు చెందిన గర్భిణి బిడ్డను కోల్పోయిందని వాపోయారు. ఇంత దారుణమైన సంఘటన జరిగిన ప్రభుత్వానికి చలనం లేదన్నారు. వెంటనే సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సవతి తల్లి ప్రేమ విడనాడాలి కొడంగల్, నారాయణపేటను సమాంతరంగా అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని విస్మరించి సవతితల్లి ప్రేమ చూయిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండ సత్తియాదవ్ విమర్శించారు. రాబోవు ఎన్నికల్లో కమల వికాసమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. నాగురావు నామాజీ, రతన్ పాండు రెడ్డి, శ్రీనివాసులు, కొండయ్య, పూనమ్ చాంద్ లాహోటి, రఘువీర్ యాదవ్, రఘురామయ్య గౌడ్, జ్యోతి సాయిబన్న పాల్గొన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలే కాంగ్రెస్ చేస్తుంది.. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ -
20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
దామరగిద్ద: 2024–25 విద్యాసంవత్సరం ఓపెన్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని జెడ్పీ ఉన్నత పాఠశాల జీఎచ్ఎం అశోక్‌కుమార్, అసిస్టెంట్ కోఆర్డినేటర్ శంభులింగం తెలిపారు. విద్యార్థులు స్థానిక అధ్యయన కేంద్రం (జెడ్పీఉన్నత పాఠశాల)లో సంప్రదించి హాల్‌టికెట్లు పొందాలని, పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకుకొనసాగుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం కోస్గి రూరల్: నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్లవిజయ్కుమార్, మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చెన్నారంలో పలు గ్రామాల బీటీ రోడ్లకు భూమి పూజ చేపట్టారు. రూ 9.14 కోట్ల నిధులతో చెన్నారం నుంచి కడంపల్లి, చెన్నారం నుంచి ముక్తిపహడ్ గ్రామల వరకు బీటీ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని, ఇప్పటికే రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. త్వరలో యువతకు సైతం సబ్సిడీపై రుణాలు అందజేయనున్నట్లు వివరించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిప్రసాద్‌రెడ్డి, బెజ్జురాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో క్రీడల అభివృద్ధికి రూ.465 కోట్లు మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 465 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని జితేందర్‌రెడ్డి నివాసంలో బుధవారం లాక్రోస్ క్రీడాకారులు, రాష్ట్ర సంఘం ప్రతినిధులు ఆయనను మర్వాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో క్రీడలకు కేటాయించిన నిధులతో రాష్ట్రంలో మరుగున పడిన క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామన్నారు. యువత మాదక ద్రవ్యాల వైపు మరలకుండా ఏదో ఓ క్రీడలో పాలుపంచుకోవాలని సూచించారు. లాక్రోస్ క్రీడను రాష్ట్రంలో అభివృద్ధి పరిచి గుర్తింపు తీసుకొస్తామని తెలిపారు. లాక్రోస్ క్రీడ అభివృద్ధి చెందిన అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ముఖ్య క్రీడగా ఉందని, ఇండియాలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుందని లాక్రోస్ ఇండియా టీమ్ కెప్టెన్ అనుదీప్‌రెడ్డి తెలిపారు. త్వరలో ఆగ్రాలో లా క్రోస్ క్రీడ నేషనల్స్ నిర్వహిస్తున్నారని చెప్పా రు. కార్యక్రమంలో తెలంగాణ లాక్రోస్ అకాడమీ అధ్యక్షుడు భానుచందర్, ప్రధాన కార్యదర్శి శేఖర్, కోచ్, క్రీడాకారులు పాల్గొన్నారు. విచారణ ప్రారంభం నారాయణపేట: అడిషనల్ డీఆర్డీఓపై సెర్ఫ్ ఉద్యోగులు చేసిన ఫిర్యాదుతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ విచారణ కమిటిని నియమించింది. బుధవారం ఆ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో సెర్ఫ్ ఉద్యోగులను విచారించారు. వారు తెలిపిన వివరాలను రికార్డు చేసుకున్నారు. అదే విధంగా అడిషనల్ డీఆర్డీఓతో సైతం స్టేట్మెంట్ను తీసుకున్నారు. ఈ నివేదికను రెండు రోజుల్లో కలెక్టర్‌కు నివేదిస్తున్నట్లు విచారణ కమిటీ చైర్మన్, ఇంచార్జీ డీడబ్ల్యూఓ జయ తెలిపారు. -
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
మరికల్: యాసంగిలో సాగు చేసిన వరిధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరూ ఆధైరపడొద్దని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. మండలంలోని లాల్కోట చౌరస్తాలోని తీలేర్ సింగిల్‌విండో సొసైటీ వద్ద బుధవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్‌తో క్వింటాల్‌కు రూ. 2,820 చెల్లిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, విండో అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్, సూర్యమోహన్‌రెడ్డి, జయసింహరెడ్డి, కృష్ణయ్య, తిమ్మరెడ్డి, హరీష్, రామకృష్ణారెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. 60 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ పోటీలు బాలుర, బాలికల విభాగంలో విడివిడిగా అండర్ –8,10,12,14,16, అండర్–20లలో నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారికి మెడల్స్ అందజేశారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి స్పోర్ట్స్ స్కూల్, ఆర్మీ స్కూల్లలో ప్రవేశానికి ఈ మెడల్స్ ఎంతో ఉపయోగపడతాయని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. కార్యక్రమంలో ఖేలో ఇండియా అథ్లెటిక్ కోచ్ హారిక దేవి, పీఈటీ అక్తర్ ఫాషా, ఆంజనేయులు, భాను ప్రకాష్, పాల్గొన్నారు. -
రజతోత్సవ సభకు తరలిరావాలి
నారాయణపేట: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఈ నెల 27న నిర్వహించే పార్టీ అవిర్భావ రజోత్సవ సభకు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కదలిరావాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి పిలునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (ఏప్రిల్ 27) పురస్కరించుకొని వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు గడప,గడప నుంచి భారీ ఎత్తున గులాబీ దళాన్ని తరలించాలని, రజోత్సవ వేడుకలతో బీఆర్ఎస్కు మళ్లీ పూర్వ వైభవం రానుందన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నరన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు విజయ్‌సాగర్, వేపూరిరాములు,భగవంతు, చెన్నారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. నేడు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం గేట్ వద్దనున్న బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఉదయం 10గంటలకు కార్యకర్తల సమావేశం నిర్వ హించనున్నట్లు ఆ పార్టీ పట్టణ, మండల అధ్యక్షుడు విజయ్‌సాగర్, వేపూరి రాములు పేర్కొన్నారు. -
బావాజీ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
కొత్తపల్లి: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన లంబాడా జాతర గురులోకమా సంద్ బావాజీ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసి బావాజీ బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి 14 వరకు నిర్వహించనుండగా.. బుధవారం ఆలయ సమీపంలో ఎస్పీ యోగేష్గౌతమ్తో కలిసి కలెక్టర్ ఆలయ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి శాఖకు సంబందించి అధికారులకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణకు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌ను నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు. నోడల్ అదికారి పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు జాతర ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా వీఐపి మేనెజ్మెంట్ను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. దేవాదాయ శాఖ పరంగా ఇప్పటివరకు ఏఏ ఏర్పాట్లు చేశారని ఆరా తీశారు. గతేడాది మాదిరిగానే ఈసారి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని, డిప్యూటేషన్‌పై సిబ్బందిని రప్పిస్తున్నామని ఈఓ తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వసతి కల్పించాలని ఆదేశించారు. భక్తులకు కోస్గి, మహబూబ్‌నగర్ డిపో నుండి అదనంగా మరికొన్ని బస్సులను నడిపిస్తామని డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. బస్సుల పార్కింగ్ వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. జాతరలో ఒక డాక్టర్ సూపర్వైజర్, ఏఎన్ఎం ఆశ కార్యకర్తలతో మూడు విడతలుగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని డీఎంహెచ్ఓ శైలజ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్, డీఎస్పి లింగయ్య, సీఐ సైదులు, ఎక్షైజ్ సీఐ బాలకృష్ణ, తహసిల్దార్ జయరాములు, ఎంపిడీఓ కృష్ణారావ్,ఎంపీఓ రామన్న పాల్గొన్నారు. పటిష్ట బందోబస్తు బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. జాతరలో దొంగతనాలు జరగకుండా మఫ్టీలో పోలీసులను నియమిస్తామని, భక్తుల సౌకర్యార్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తామని, పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. -
రేషన్ కార్డు లేకపోవడంతో..
రాజీవ్ యువవికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వెళితే రేషన్‌కార్డు అడిగారు. మాకు రేషన్‌కార్డు రాకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకం తీసుకోలేదు. కొత్త ప్రభుత్వంలోనైన రేషన్‌కార్డు వస్తుందనుకుంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడంలేదు. – రాజు, గద్వాల పట్టణం టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తాం యువ వికాసం పథకం దరఖాస్తులకు సంబంధించి పలు టెక్నికల్ సమస్యలు మా దృష్టికి వచ్చాయి. కొన్నింటిని పరిష్కరించాం. కొత్త మండలాల్లో బ్యాంకులు, గ్రామాలు తదితర సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ లోన్ కింద దరఖాస్తు చేసుకునే వారు మహబూబ్‌నగర్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వస్తే వెంటనే పరిష్కరిస్తాం. ఎవరూ ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం ఉంది. – ఇందిర, బీసీ సంక్షేమ శాఖ అధికారి, మహబూబ్‌నగర్ ● -
ముదిరాజ్‌లను బీసీ–ఏలో చేర్చడమే లక్ష్యం
మరికల్: అన్నిరంగాల్లో వెనకబడిన ముదిరాజ్‌లను బీసీ–ఏలో చేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాశ్ అన్నారు. మంగళవారం మరికల్‌కు వచ్చిన ఆయనకు మండల ముదిరాజ్ సంఘం నాయకులు ఘనస్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బండ ప్రకాశ్ విలేకర్లతో మాట్లాడుతూ.. బీసీ–ఏలోకి ముదిరాజ్‌లను చేర్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఇందుకు ముదిరాజ్ జాతి చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముదిరాజ్‌లను బీసీ–ఏలో చేర్చేందుకు బిల్లు పెట్టగా.. అప్పట్లో కొన్ని దుష్టశక్తులు అడ్డు పడటంతో ఆగిపోయిందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ముదిరాజ్‌లను బీసీ–ఏలోకి చేర్చేందుకు ప్రభుత్వానికి నెలరోజుల సమయం ఇస్తామన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, నారాయణ, పటేల్ శ్రీను, కృష్ణయ్య, రాములు, టంకర శ్రీను, కుర్మన్న, కొండప్ప, నర్సింహులు, సతీష్, సాయితేజ ఉన్నారు. -
మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్ట చర్యలు
నారాయణపేట: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల నిషేధం అమలుపై మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగును అరికట్టేందుకు వ్యవసాయశాఖ అధికారులు చర్య లు తీసుకోవాలన్నారు. అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఆయా కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేవలం గంజాయి మాత్రమే కాకుండా బీడీ, సిగరెట్, మద్యం లాంటివి విద్యార్థులపై ప్రభావం చూపే ఆస్కారం ఉందని.. కళాశాలల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అయితే జిల్లాలోని 109 జూనియర్, డిగ్రీ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య వివరించారు. అదే విధంగా గంజాయి సాగు, సరఫరాకు సంబంధించి 2022లో మూడు కేసులు, 2024లో మూడు కేసులు నమోదయ్యాయని.. ప్రస్తుతం ట్రయల్ నడుస్తున్నాయన్నారు. ఇకపై జిల్లాలో ఎక్కడా ఇలాంటి కేసులు నమోదు కావడానికి వీలులేకుండా రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్, ఎకై ్సజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిషేధించాలన్నారు. మాదకద్రవ్యాల నిషేధిత జిల్లాగా నారాయణపేటను మార్చాలన్నారు. మళ్లీ నిర్వహించే సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, సైకాలజిస్టు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. సమావేశంలోఆర్టీఓ మేఘాగాంధీ, ఎకై ్సజ్ సీఐలు అశోక్ కుమార్, బాలకృష్ణ, ఎస్ఐలు గురవయ్య, ఎల్ఎస్ శిరీష, అటవీశాఖ అధికారి సత్యనారాయణ, డీపీఆర్ఓ ఎంఏ రషీద్, డీఐఈఓ సుదర్శన్, డీఈఓ గోవిందరాజులు, కలెక్టరేట్ సీ సెక్షన్ అధికారిణి అఖిల ప్రసన్న ఉన్నారు. -
చెరుకు రైతుల ఆందోళన
అమరచింత: బకాయి ఉన్న రూ.6 కోట్లు వెంటనే చెల్లించాలంటూ చెరుకు రైతులు కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ ఎదుట మంగళవారం ఆందోళన చేపట్డారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న మా ట్లాడుతూ.. ఫ్యాక్టరీ పరిధిలో కోతలు పూర్తయినా ఇప్పటి వరకు బకాయి డబ్బులు చెల్లించడం లేదన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత ఫ్యాక్టరీ ఏజీఎం, డీజీఎంలకు విన్నవించినా ఫలితం లేకపోయిందని వివరించారు. వెంటనే బకాయి డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, కేన్ అసిస్టెంట్ కమిషనర్ రవీంద్రరావుకు సమస్యను వివరించగా.. ఆయన ఫ్యాక్టరీ డైరెక్టర్ రవికుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. వారం రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వాసారెడ్డి, చంద్రసేనారెడ్డి, ఆంజనేయలు, నాగేంద్రం, రంగారెడ్డి, షాలిమియా పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ
నారాయణపేట: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయం వద్ద మంగళవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాసంగిలో పండించిన వరిధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో గ్రామాల్లోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. గ్రేడ్–ఏ ధాన్యాన్ని రూ. 2,320, సాధారణ గ్రేడ్ ధాన్యాన్ని రూ. 2,300 ధరకు కొనుగోలు చేయడంతో పాటు సన్నరకాలకు క్వింటాల్ రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శివారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కె.నర్సింహారెడ్డి, కార్యదర్శి పి.అశోక్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
నారాయణపేట: ప్రతి గ్రామంలో మెరుగైన వైద్య సేవలు అందాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట మండలంలోని అప్పక్‌పల్లి వద్ద గల ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, కాళోజి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రన్‌ఫర్ హెల్త్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వైద్య కళాశాల విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఒకే సంవత్సరంలో ఎంబీబీఎస్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీని ప్రారంభించామని, త్వరలో మదర్ ఆండ్ చైల్డ్ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వైస్ ఛాన్స్లర్ డాక్టర్ నందకుమార్ మాట్లాడుతూ.. నారాయణపేట మెడికల్ కాలేజీ పురోగతిలో ఉందని, కళాశాలకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని, లైబ్రరీకి అవసరమైన 4 వేల పుస్తకాలను పంపిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పర్యావరణవేత్త కే పురుషోత్తం రెడ్డి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ దాసరి ప్రసాద్‌రావు, డాక్టర్ విజయ్ సీనియర్ జర్నలిస్టు పంతంగి రాంబాబు,సామాజిక వేత్త కుంభం శివకుమార్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి , రెడ్ క్రాస్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, వైద్య నిపుణులు ఆదిత్య, చంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు. పేదల కడుపునింపేందుకే.. నర్వ: పేదల కడుపునింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నర్వ మండలంలోని లంకాల్‌లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారు రేణుక ఇంట్లో భోజనం చేశారు. అనంతరం గ్రామంలో రూ.20 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులు, అంగన్వాడీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనువాసులు, ఏఓ అఖిలారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణారెడ్డి,శరణప్ప, బీసం రవికుమార్, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రెగ్యులర్ ‘రగడ’..!
పీయూలో జీఓ 21 లొల్లివివరాలు 8లో u●మాకు న్యాయం చేయాలి.. ప్రభుత్వం జీఓ నంబర్ 21ని వెంటనే రద్దు చేయాలి. ఇచ్చిన హామీలో భాగంగా డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. కానీ పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించలేదు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వం ఇప్పటికై నా పీయూలో కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించేలా న్యాయం చేయాలి. ఆ తర్వాత మిగిలిన పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాలి. – రవికుమార్, పీయూ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆందోళనలు తీవ్రతరం చేస్తాం.. యూనివర్సిటీ ప్రారంభం నుంచి పీయూలో లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్నాం. అయినా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. 2016లో రెగ్యులర్ పోస్టుల్లో సీనియర్లను పక్కన బెట్టి భర్తీ చేశారు. ఉద్యోగ విరమణకు దగ్గరగా వస్తున్నాం. వెంటనే ప్రభుత్వం జీఓ 21ను రద్దు చేసి క్రమబ ద్ధీకరించాలి. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నిరసనలు తీవ్రతరం చేస్తాం. – భూమయ్య, పీయూ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒకవేళ తొలగించాల్సిన పరిస్థితి వస్తే కొత్త కోర్సులు, పీజీ సెంటర్లలో సర్దుబాటు చేస్తాం. ఎవరిని తొలగించాలనే ఉద్దేశం లేదు. కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ న్యాయం చేసేలా నా వంతు కృషి చేస్తా. – శ్రీనివాస్, వీసీ, పాలమూరు యూనివర్సిటీ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పాలమూరు యూనివర్సిటీలో లొల్లి రాజుకుంది. విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల శాశ్వత భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 21 కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లలో అలజడి సృష్టిస్తుండగా.. రగడ మొదలైంది. దశలవారీగా తమను తొలగించేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని.. తమను క్రమబద్ధీకరించిన తర్వాతే శాశ్వత నియామకాలు చేపట్టాలంటూ సోమవారం వారు ప్రత్యక్ష పోరుకు శ్రీకారం చుట్టారు. గత తొలగింపుల నేపథ్యంలో.. పీయూలో చివరిసారిగా 2014లో రెగ్యులర్ అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే భర్తీ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు 2016లో రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు జరిగాయి. ఆంగ్ల విభాగంలో ఇద్దరు, తెలుగులో ముగ్గురు, కెమిస్ట్రీ, కామర్స్, పొలిటికల్ సైన్స్, మైక్రోబయాలజీ విభాగాల్లో ఒక్కొక్కరిని చొప్పున మొత్తం తొమ్మిది మంది అధ్యాపకులను తీసుకున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించారు. దీంతో సీనియర్ కాంట్రాక్ట్ అధ్యాపకుడు భూమయ్య తదితరులు ఆందోళనలు చేపట్టారు. అనంతరం వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టును సైతం ఆశ్రయించారు. ప్రస్తుతం రెగ్యులర్ ప్రాతిపాదికన అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతుండడం.. గతంలో జరిగిన తొలగింపుల నేపథ్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు అభద్రతా భావానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. అనుభవానికి వెయిటేజీ ఇస్తున్నా.. నూతనంగా నియామకాలను మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో 50 మార్కులు.. వీసీ, ఉన్నత విద్యామండలి సభ్యుడు, బోర్డు ఆఫ్ స్డడీస్ చైర్మన్, హెచ్ఓడీ కన్వీనర్‌గా ఉండే స్క్రూట్నీ కమిటీ పలు కొలమానాల ఆధారంగా మార్కులు కేటాయించనుంది. రెండో దశలో మొత్తం 30 మార్కులు.. ఇందులో బోధనానుభవం ఉన్న వారికి ఒక్క సంవత్సరానికి ఒక్క మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు, డెమోకు 10 మార్కులు, పుస్తక రచన, రీసెర్చ్ ఫెల్లోషిప్ ఇలా మొత్తం 10 మార్కులు కేటాయించనున్నట్లు సమాచారం. మూడో దశలో ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటా యించనున్నారు. మొత్తంగా 100 మార్కులకు సంబంధించి అత్యధిక మార్కులు సాధించిన వారికి మాత్రమే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. నియామకాల్లో అనుభవానికి వెయిటేజీ ఇస్తున్న క్రమంలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు మేలు జరిగే అవకాశం ఉంది. అయితే అంతా సవ్యంగా జరుగుతుందా? గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని.. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తమను క్రమబద్ధీకరించిన తర్వాతే మిగిలిన పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలో 22 పోస్టులకు నోటిఫికేషన్.. యూనివర్సిటీలో ప్రస్తుతం 16 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరితో పాటు 93 మంది కాంట్రాక్ట్, 60 మంది పార్ట్‌టైం ప్రతిపాదికన విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలా మంది ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. పీయూలో మొత్తం 58 రెగ్యులర్ పోస్టులు కాగా.. గతంలో 16 భర్తీ చేశారు. ఇవి పోను 42 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో కనీసం 22 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి.. భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీయూలో ప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపకులను నియమిస్తే.. ఆయా విభాగాల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. శాశ్వత నియామకాలపై కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల్లో ఆందోళన దశల వారీగా తమను తొలగిస్తారని బెంబేలు.. పోరుబాటకు శ్రీకారం వీసీకి వినతి.. యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రభుత్వ ఉత్తర్వు కాపీల దహనం డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో క్రమబద్ధీకరణ తమకు వర్తించదా అంటూ నిరసన గళం ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాం.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ మేమెందుకు అర్హులం కాదు ? ఇటీవలి డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో అర్హత ఉన్న అధ్యాపకులను ప్రభుత్వం రెగ్యులర్ చేసిన విషయం తెలిసిందే. పీయూ ఏర్పాటైనప్పటి నుంచి లెక్చరర్లుగా పనిచేస్తున్నామని.. అయినా తమను క్రమబద్ధీకరించపోవడం అన్యాయమని కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమెందుకు అర్హులం కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పీయూ వైస్‌చాన్స్‌లర్ శ్రీనివాస్, నూతన రిజిస్ట్రార్ రమేష్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తాము ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్, పార్ట్ టైం ప్రాతిపదికన లెక్చరర్లుగా చేస్తున్నామని.. తమను రెగ్యులర్ చేసిన తర్వాత మాత్రమే మిగిలిన పోస్టుల భర్త్తీ ప్రక్రియ చేపట్టాలని కోరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పీయూలోని అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద జీఓ 21 ప్రతులను దహనం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి ప్రణాళికలు
మద్దూరు: నూతనంగా ఏర్పడిన మద్దూరు మున్సిపాలిటీ సమగ్రాభిద్ధికి ప్రణాళికలు సిద్దం చేస్తామని ఎన్సీపీఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు ఇంజినీర్ మహ్మమద్ సిద్దికి తెలియజేశారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మున్సిపల్ కమిషన్ శ్రీకాంత్, మద్దూరు, రెనివట్ల గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ మున్సిపాలిటీ మరో 30 ఏళ్ల వరకు సరిపడా ప్రణాళికలు రుపొందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. మీమీ గ్రామాల్లో అత్యంత ప్రాధాన్యత అంశాలను మాకు తెలియజేయాలని కోరారు. దీంతో వారు పలు సూచనలు చేశారు. రెండు నెలల పాటు మున్సిపాలిటీలో తిరిగి సమగ్ర ప్రణాళికలు సిద్దం చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ మహేష్, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్, మల్లీకార్జున్, బాబుస్వామి, చంద్రమోహన్, శ్రీనావాస్‌రెడ్డి, ఆశోక్, య సిన్, చందు, రామక్రిష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సన్న బియ్యంపై నిఘా
నారాయణపేటమంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025మరికల్: ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది. దీంతో రేషన్‌దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. ఇదే సమయంలో బియ్యం పక్కదారి పట్టకుండా, దొడ్డు బియ్యాన్ని కలపకుండా ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్రమాలకు చోటు లేకుండా ప్రక్షాళన చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల్ని రంగంలోకి దింపింది. జిల్లా వ్యాప్తంగా నిరంతరం ఎక్కడో ఒకచోట రేషన్ బియ్యం పట్టుబడుతునే ఉన్నాయి. కొన్ని రేషన్‌దుకాణాలు అక్రమాలకు నిలయంగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. గతానికి బిన్నంగా టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలను సమాయత్తం చేసి దుకాణాల్లో అక్రమాలకు తెరపడేలా పౌర సరఫరాల అధికార యంత్రాంగం పటిష్ట నిఘా కొనసాగిస్తోంది. రేషన్ దుకాణాల చుట్టూ వ్యాపారులు ఇన్నాళ్లు రేషన్ దుకాణాల అడ్డాగా జరిగిన బియ్యం అక్రమ దందాకు సన్నబియ్యం పంపిణీతో అడ్డు పడింది. ఎలాగైన తమ వ్యాపారం కొనసాగించాలనే ఉద్దేశంతో అక్రమ వ్యాపారులు జిల్లా వ్యాప్తంగా పాత పద్ధతి ప్రకారం రేషన్‌దుకాణాల వద్దకు వెళ్లి సన్నబియ్యం ఎలా ఉన్నాయి.. వాటిని ఏమైనా అమ్ముతారా అంటూ ఆరా తీస్తున్నారు. దొడ్డు బియ్యం కంటే కిలోకి రూ.5 ఎక్కువగా ఇస్తామంటూ బేరసారాలు ఆడుతున్నారు. ఇదే ఆశతో కొందరు డీలర్లు డబ్బులు కావాలా, లేక బియ్యం కావాలా అంటూ లబ్ధిదారులను రహస్యంగా అడగటం గమనార్హం. కొందరు అక్రమ బియ్యం వ్యాపారులు లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్లి కిలో రూ.20కి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సివిల్ సప్లయ్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో బియ్యం వ్యాపారుల కదలికపై కన్నేసింది. బియ్యం బాగున్నాయి ప్రభుత్వం రేషన్ ద్వారా పంపిణీ చేసిన సన్నబియ్యం బాగున్నాయి. బువ్వ కూడా పొడి, పొడిగా అవుతోంది. గతంలో దొడ్డురకం బియ్యం బువ్వ మంచిగా ఉండేది కాదు. మార్కెట్లో క్వింటాల్ సన్నబియ్యం రూ.5 వేలకు కొనుగోలు చేసేవాళ్లం. ప్రస్తుతం రేషన్‌లో సన్నబియ్యం పంపిణీ చేయడంతో సంతోషంగా భోజనం చేస్తున్నాం. – పాపన్న, కిష్టంపల్లి బేరాలు ఆడుతున్నారు లావు బియ్యం కొనుగోలు చేసే వ్యాపారులు సన్నబియ్యం కూడా అమ్ముతారా.. అంటూ ఇటీవల బేరాలు ఆడుతున్నారు. అమ్మేది లేదంటూ చెబుతుండడంతో వెనుదిరుగుతున్నారు. సన్న బియ్యం వండగా.. ఇంట్లో పిల్లలు సైతం బాగుంది అంటున్నారు. అందరి మాదిరిగా తాము కూడా సన్నబువ్వ భోజనం చేయడం ఆనందంగా ఉంది. – భాగ్యమ్మ, మరికల్ పక్కదారి పడితే చర్యలు జిల్లాలో మొత్తం రేషన్ దుకాణాలకు 3,382 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అందించాం. బియ్యం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు అందేలా చూస్తాం. కలెక్టర్ ఆదేశాలతో ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారులు రేషన్ దుకాణాలను పర్యవేక్షణ చేయిస్తున్నాం. అక్రమాలకు పాల్పడినా, లబ్ధిదారులకు సరైన సేవలు అందించకపోయినా డీలర్లపై చర్యలు తప్పవు. – సైదులు, జిల్లా సివిల్ సప్లయ్ డీఎం, నారాయణపేట పక్కదారి పట్టకుండా రేషన్ దుకాణాలపై కన్నేసిన ఎన్ఫోర్స్మెంట్ రోజువారి తనిఖీలు, నివేదికలు సన్నబియ్యంపై ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులు -
నిర్వహణకు నిధుల్లేవ్..!
మక్తల్: రైతులకు సాగులో మెళకువలు.. సీజన్ల వారీగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో అవగాహన సమావేశాలు.. ఇలా నిరంతరం రైతులను అప్రమత్తం చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో రైతు వేదికలను నిర్మించారు. కానీ.. నేడు నిధుల్లేక రైతువేదికల నిర్వహణ భారంగా మారింది. ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ఏర్పాటు చేసి ఒక్కో దానికి రూ.22 ఖర్చు చేసి జిల్లా వ్యాప్తంగా 76 రైతు వేదికలను నిర్మించారు. ఈ వేదికల నిర్వహణ బాధ్యతలను క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారులకు అప్పగించింది. వేదికల నిర్వహణకు ప్రతినెల రూ.9వేల వరకు ఖర్చు అయ్యేది. రైతువేదిక విధిగా శుభ్రం చేయడం, తాగునీటి వసతి, స్టేషనరీ, రైతులకు శిక్షణ, విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. పెండింగ్‌లో రూ.2.05 కోట్లు రైతు వేదిక నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో రైతుల శిక్షణ కార్యక్రమాల భారం వ్యవసాయ విస్తరణాధికారులపై పడుతోంది. అయితే, ఏఈఓలు చేతి నుంచి ఖర్చు పెడుతూ నిధులు వచ్చినప్పుడే తీసుకునేవారు. కానీ, దాదాపు 30 నెలలుగా రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి విడుదల కావడంలేదు. నెల నెల చేతి నుంచే డబ్బులను వెచ్చించాల్సి వస్తుందని పలువురు వ్యవసాయ విస్తరణాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని 76 రైతు వేదికలకు రూ.2.05 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. కానీ, ఆ నిధులు రాకపోవడంతో వేదికల నిర్వహణ విషయంలో ఏఈఓలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతు వేదికకు నెలకు రూ.9వేలు ఖర్చు నెలల తరబడి విడుదల చేయని ప్రభుత్వం ఏఈఓలకు తప్పని నిర్వహణ భారం జిల్లాలో మొత్తం 76 రైతు వేదికలు -
సత్యసాయి సేవలు చిరస్మరణీయం
నారాయణపేట రూరల్: భగవాన్ శ్రీసత్యసాయి సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాగునీటి సమస్యను గుర్తించి నాడు ఈ ప్రాంతానికి నీరు అందించిన భగవంతుడు సాయి అన్నారు. ఆయన సేవలను మరితం విసృతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరు సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగాలని, ఎండాకాలంలో దాహం తీర్చడం ఎంతో గొప్ప కార్యమని అన్నారు. నీటి వనరులను కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరు నీటిని వృధా చేయరాదని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం లావణ్య, సేవా సమితి సభ్యులు చిట్టెం మాధవరెడ్డి, మల్లికార్జున్, గోపీనాథ్‌రావు, శివరాజు, ఆనంద్, బీవీఎన్ రెడ్డి పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం
నారాయణపేట రూరల్: రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కమల వికాసమే లక్ష్యంగా పని చేద్దామని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావునామాజీ అన్నారు. పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయలంలో జిల్లా నూతన అధ్యక్షులు సత్యాయాదవ్తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు సంఘ్ పరివార్ ఏర్పాటకు కారకులైన శ్యాంప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్‌దయాల్, భరతమాత చిత్రపటాలకు పూజలు చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అత్యధిక సభ్యత్వం కల్గిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందన్నారు. మోదీ నేతృత్వంలో ఎన్నో హామీలను నెరవేర్చడమే కాకుండా ప్రకటన చేయని ఎన్నో కార్యక్రమాలు చేసి చూచించిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కిందన్నారు. ప్రపంచ దేశాలకే భారతావని ఒక చుక్కానిలా మారిందన్నారు. రాబోవుస్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం గెలుపు ఎవరు అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో 15 రాష్ట్రాల్లో సొంతంగా, మరో ఐదు చోట్ల మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో తిరిగి పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు గ్రామ స్థాయి కార్యకర్తలు సిద్దం కావాలన్నారు. కార్యక్రమంలో రఘురామయ్యగౌడ్, పట్టణ అధ్యక్షులు పోషల్ వినోద్, మండల అధ్యక్షురాలు జ్యోతి సాయిబన్న, రఘువీర్, వెంకటయ్య, రఘువీర్, కతలప్ప, కృష్ణ, సత్యరఘుపాల్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. పల్లెపల్లెన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం కోస్గి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి గడపకు పార్టీ అందించిన పథకం వివరించి గ్రామీణస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పలువురు నాయకులు ఈ సందర్భంగా సూచించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఇందులో పార్టీ మండల అధ్యక్షుడు పాలెం ప్రశాంత్, కోడంగల్ అసెంబ్లీ కో కన్వీనర్ రాము, జిల్లా కార్యవర్గ సభ్యుడు అంజయ్య, మాజీ మండల అధ్యక్షుడు సీబీ వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, పార్టీ నాయకులు, బీజేవైఎం నాయకులు బద్రీనాథ్, సంపల్లి శ్రీను, రమేష్, జైపాల్, శ్రీనివాస్, భాస్కర్ పాల్గొన్నారు. -
రహదారులే దిక్కు..!
వివరాలు 8లో uనర్వ: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను అకాల వర్షాల నుంచి కాపాడుకునేందుకు టార్పాలిన్లు (కల్లం పట్టాలు) ఎంతో అవసరం. వ్యవసాయ పొలాలు, ఇళ్ల వద్ద ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలన్నా టార్పాలిన్లు కావాల్సిందే. అలాంటి వీటిని ఐదేళ్ల క్రితం వరకు వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో 50శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందించేది. ఆ తర్వాత టార్పాలిన్ల పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడటంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటులో అధిక ధరలకు టార్పాలిన్లు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణానికి సైతం ప్రోత్సాహం కరువైంది. ఫలితంగా రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో రహదారులపై పంట నూర్పిళ్లు, ధాన్యం ఆరబోత వంటి పనులు చేపడుతున్నారు. గతేడాది కురిసిన అకాల వర్షాలకు చాలా మంది రైతుల ధాన్యం తడిసిపోవడంతో నష్టపోయారు. ప్రస్తుతం యాసంగిలో సాగుచేసిన వరిపంట చేతికిరావడంతో కోతలు ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా ధాన్యం ఆరబోతకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎండలు తీవ్రంగా ఉన్నా ధాన్యం ఆరబెట్టేందుకు టార్పాలిన్లు లేకపోవడంతో రహదారులే దిక్కుగా మారాయి. అయితే రహదారులపై ధాన్యం ఆరబోతతో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు రైతులు సైతం అసౌకర్యానికి గురవుతున్నారు. అకాల వర్షాలతో ఇబ్బందులు.. జిల్లాలో వరికోతలు చేపట్టిన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఎక్కువ శాతం రహదారులనే కల్లాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల సాయంత్రం కాగానే అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ధాన్యంతో పాటు మిరప, ఇతర పంటలు తడిసిపోతున్నట్లు రైతులు వాపోతున్నారు. ధాన్యాన్ని, ఇతర పంటలను ఆరబెట్టుకోవాలంటే టార్పాలిన్లు ఎంతో అవసరమని చెబుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై టార్పాలిన్ల పంపిణీని పునఃప్రారంభించాలని రైతన్నలు కోరుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లావ్యాప్తంగా యాసంగిలో 1.51 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. దాదాపు 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. గత సీజన్ మాదిరిగానే ఈసారి సన్నాలకు ప్రభుత్వం బోనస్ రూ.500 ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుందని సమాచారం. ఇటీవల అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించారు. దీంతో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులు సుమారు 100కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పంట నూర్పిళ్లు, ధాన్యం ఆరబెట్టేందుకు రైతుల అవస్థలు సబ్సిడీపై రైతులకు అందని టార్పాలిన్లు ఐదేళ్లుగా మూలనపడిన పథకం కల్లాల నిర్మాణాలకు సైతం ప్రోత్సాహం కరువు -
ఇసుక మాఫియా ఆగడాలపై చర్యలు తీసుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని మూసాపేట మండలంలో ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ల సంఘం నాయకుడు ఘన్సిరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ, టీఎన్జీఓ, టీజీఓ, తహసీల్దార్ల సంఘం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసాపేట తహసీల్దార్ రాజునాయక్, కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రికార్డ్ అసిస్టెంట్‌పైన అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడిన ఇసుక మాఫియా నాయకుడిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి సంఘటనలు జరిగితే విధులు నిర్వహించలేని పరిస్థితి ఉంటుందన్నారు. ఇలాంటి వాటిని మొగ్గలోని తొలగించాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, టీజీఓ జిల్లా కార్యదర్శి వరప్రసాద్, టీజీఎస్ఏ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, దేవేందర్, చైతన్య, సుదర్శన్‌రెడ్డి, రవికుమార్, రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం మహబూబ్ నగర్ న్యూటౌన్: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ సొసైటీ భవన్లో రెండు రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా యూసుఫ్ మాట్లాడుతూ మోదీ సర్కార్ రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా కల్పించబడిన చట్టబద్ధ హక్కులను హరిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మిక కర్షక ఫాసిస్ట్ విధానాలపై మే రెండో వారంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను చిన్న చూపు చూస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. -
సమసమాజ దార్శనికుడు జగ్జీవన్‌రాం
నారాయణపేట: సమసమాజ దార్శనికుడు బాబు జగ్జీవన్‌రాం అని.. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఎస్పీ యోగేష్ గౌతమ్ ముఖ్య అతిథులుగా హాజరై జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహనీయుడు జగ్జీవన్‌రాం అని కొనియాడారు. ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశ స్వయం పాలనలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసి కార్మిక శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తుచేశారు. దేశ రక్షణ, వ్యవసాయం, టెలీ కమ్యూనికేషన్ శాఖల్లో విశేష సేవలు అందించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. అంటరానితనం, కులం పేరుతో కొనసాగుతున్న సామాజిక వివక్ష సంపూర్ణంగా సమసిపోయే దిశగా అందరూ పనిచేసినప్పుడే బాబు జగ్జీవన్‌రాంకు ఘనమైన నివాళి అర్పించిన వారమవుతామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి, డీఎస్పీ నల్లపు లింగయ్య, డీఆర్డీఓ మొగులప్ప, డీపీఆర్ఓ ఎంఏ రషీద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, డీఏఓ జాన్ సుధాకర్, సివిల్ సప్లై డీఎం సైదులు, దళిత సంఘాల నాయకులు మహేశ్, శరణప్ప, రమేశ్, వెంకటేశ్, సత్యనారాయణ, సూర్యకాంత్, గడ్డం కృష్ణయ్య పాల్గొన్నారు. -
ఇబ్బందులు పడుతున్నాం..
ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీ పై అందించే టార్పాలిన్ల పంపిణీ నిలిచిపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్నాం. మాములు సంచులతో తయారు చేసిన పట్టాలను వినియోగించుకుంటున్నాం. వీటిని రోజుకు రూ. 30 చొప్పున అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. టార్పాలిన్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరించాలి. – మగ్ధుంఅలీ రైతు, కల్వాల్ పథకం నిలిచిపోయింది.. రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు సబ్సిడీపై ఇచ్చే టార్పాలిన్ల పథకం కొన్నేళ్ల క్రితం నిలిచిపోయింది. రైతులు తమ పొలాల్లో కల్లాలు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఈ మేరకు ఉపాధి హామీ పథకం ద్వారా కల్లాల నిర్మాణాలు చేపట్టారు. రైతులు రహదారులపై పంట నూర్పిళ్లు చేయకుండా కల్లాలను ఏర్పాటు చేసుకోవాలి. – జాన్ సుధాకర్, డీఏఓ ● -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మక్తల్: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మక్తల్ మండలం జక్లేర్‌లోని రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి పేద కుటుంబం కడుపునిండా భోజనం తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తమ ప్రభుత్వంలోనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అనంతరం పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కాగా, జక్లేర్‌లోని వాటర్‌ట్యాంకు వద్ద ఉన్న వరిపంటకు మిషన్ భగీరథ నీటిని అక్రమంగా వాడుకుంటుండటంతో తాగునీటి కొరత నెలకొందని గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయిందని అన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, తహసీల్దార్ సతీశ్‌కుమార్, ఎంపీడీఓ రమేశ్‌కుమార్, మాజీ ఉపసర్పంచ్ కట్టా సురేశ్, గురురాజారావు, రవికుమార్, గోవర్ధన్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
రామయ్య కల్యాణ వేడుకకు ముస్తాబు
మక్తల్: శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించేందుకు మక్తల్ రాంలీలా మైదానాన్ని ముస్తాబు చేశారు. కల్యాణ మండపాన్ని రంగురంగు పూలు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. కల్యాణ వేడుకకు హాజరయ్యే భక్తుల కోసం వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో కల్యాణ వేడుక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో లక్ష్మీహయగ్రీవ హోమం ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం యాగశాలలో శ్రీలక్ష్మీ హ యగ్రీవ హోమం, చతుస్థానార్చన వంటి ప్రత్యే క పూజా కార్యక్రమాలను వేదమంత్రోచ్ఛారణల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, గరుడపట గ్రామోత్సవం, ధ్వజారోహణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం చిన్నచింతకుంట: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ సీతాదయాకర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దమగ్నాపురంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం రేషన్ లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యం వండించి భోజనం చేశారు. జైబాపు, జైబీమ్, జైసంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతాదయాకర్‌రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. భారత రాజ్యంగ పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, మదనాపూరం, దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రశాంత్‌కుమార్, కథలప్ప, అప్పంపల్లి సింగిల్‌విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, నాయకులు వట్టేం శివ, రవికుమార్‌గౌడ్ ఉన్నారు. రేషన్ డీలర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలోని హన్వాడ, కౌకుంట్ల, మహబూబ్‌నగర్ అర్బన్, రూరల్, మిడ్జిల్ మండలాల్లో ఖాళీగా ఏర్పడిన ఆరు రేషన్ డీలర్ భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఆర్డీఓ నవీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యావంతులైన నిరుద్యోగులు 18–40 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ప్రభుత్వ పని దినాలలో సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అయితే రిజర్వేషన్ల ప్రకారం చూస్తే హన్వాడ మండలం గొండ్యాల–2 బీసీ–ఈ, చిన్నదర్పల్లి బీసీ–ఈ, కౌకుంట్ల మండలం అప్పంపల్లి బీసీ, మహబూబ్‌నగర్ అర్బన్ మండలం అస్లాంఖాన్ స్ట్రీట్ ఓసీ, మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఫతేపూర్ఎస్టీ, మిడ్జిల్ మండలం సింగందొడ్డి ఓసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించొద్దు
నారాయణపేట రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట, ధన్వాడ మండలాల్లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అప్పక్‌పల్లిలో గత ఫిబ్రవరిలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన దేవమ్మ ఇంటి నిర్మాణ పను ల పురోగతిని తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించా రు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అదే గ్రామానికి చెంది న షమీ బేగం, ఆశాబేగం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి.. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ధన్వాడలో రూఫ్ లెవెల్ వరకు నిర్మా ణం పూర్తయిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను కలెక్టర్ పరిశీలించారు. నెలరోజుల్లో నిర్మాణం పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. వంద రోజులపాటు ‘ఉపాధి’ కల్పించాలి.. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వంద రోజులపాటు పనులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. నారాయణపేట మండలం అప్పక్‌పల్లిలో ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారని.. రోజుకు ఎంత కూలి పడుతుందని ఆరా తీశారు. వచ్చిన డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందా? లేక బీపీఎం బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ వద్ద తీసుకుంటున్నారా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. కొందరు కూలీలు తమకు ఇంతవరకు కూలి డబ్బులు రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. డబ్బులు కూలీల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని ఏపీఓను ఆదేశించారు. పని ప్రదేశంలో కూలీలకు ఏర్పాటుచేసిన టెంట్, నీటి వసతిని చూశారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ సుదర్శన్, సాయి ప్రకాశ్ తదితరులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి నారాయణపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సివిల్ సప్లై శాఖ ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సన్నాలకు రూ. 500 బోనస్ ఇస్తోందన్నారు. కేంద్రాల్లో దొడ్డు రకం, సన్నరకం వడ్లను కొనేందుకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని కొలిచే యంత్రాలు, అవసరమైనన్ని గన్ని బస్తాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ట్యాబ్, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, సివిల్ సప్లై డీఎం సైదులు పాల్గొన్నారు. -
సీతమ్మకు కీలక పదవి
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా దయాకర్‌రెడ్డి ● మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ● దయాకర్‌రెడ్డి కుటుంబానికి పెద్దపీట నారాయణపేట: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కొత్తకోట దయాకర్‌రెడ్డి కుటుంబానికి పదవి వరించింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ గురువారం ప్రభుత్వం జీఓ ఆర్టీ నంబర్ 45 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం సీతా దయాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లపాటు బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం కొనసాగనున్నారు. సీతా దయాకర్‌రెడ్డికి కీలక పదవి రావడంతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దయాకర్‌రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మక్తల్ టికెట్ ఆశించిన సమయంలో భరోసా.. దయాకర్‌రెడ్డి కుటుంబానికి మక్తల్, దేవరకద్రల్లో పెద్దఎత్తున అభిమానులు, మద్దతుదారులు ఉన్నారు. సీతమ్మ, దయాకర్ రెడ్డిలు పలు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు సీతమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. కాంగ్రెస్ టికెట్ మక్తల్ నియోజకవర్గం నుంచి ఇవ్వాలని కోరారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి టికెట్ ఇస్తూ.. గెలిపించుకొని రావాలని, భవిష్యత్‌లో కీలక పదవి అప్పగిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఎలాంటి రాజకీయ తప్పిదాలు జరగకుండా వాకిటి శ్రీహరి గెలుపులో కీలకపాత్ర పోషించి అధిష్టానం దృష్టిలో పడ్డారు. టీడీపీని వీడుతూ కంటతడి.. సుదీర్ఘకాలం దయాకర్‌రెడ్డి దంపతులు టీడీపీలో కొనసాగారు. అయితే 2022లో వీరు టీడీపీని వీడారు. టీడీపీతో తమకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపించడంతో ఏదో ఓ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే 2023 జూన్‌లో దయాకర్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. దయాకర్‌రెడ్డి అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని పాడె మోశారు. రాజకీయ పరిణమాలతో రేవంత్‌రెడ్డి సమక్షంలో సీతమ్మ కాంగ్రెస్ గూటికి చేరారు. రాజకీయరంగ ప్రస్థానం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో కొత్తకోట దయాకర్‌రెడ్డి దంపతులు కీలకంగా వ్యవహరించారు. అమరచింత నియోజకవర్గం నుంచి దయాకర్‌రెడ్డి 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్ నుంచి గెలుపొందారు. సీతమ్మ 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2001లో దేవరకద్ర జెడ్పీటీసీగా విజయం సాధించిన ఆమె.. ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2009లో కొత్తగా ఏర్పడిన దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీచేసి.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణసుధాకర్‌రెడ్డిపై 19,034 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2014 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన ఆల వెంకటేశ్వరరెడ్డి చేతిలో ఆమె పరాజయం పొందారు. 2023 సెప్టెంబర్ 11న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో సీతా దయాకర్‌రెడ్డి హస్తం గూటికి చేరారు. ఉమ్మడి రాష్ట్రంలోని 2009లో ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి భార్యాభర్తలిద్దరూ కలిసి అసెంబ్లీలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. విద్యాభ్యాసం.. కుటుంబ నేపథ్యం సీతాదయాకర్ రెడ్డి 1961 అక్టోబర్ 27న కామినేని రాజేశ్వరరావు, భారతి దంపతులకు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లో జన్మించారు. ఆర్బీవీఆర్ఆర్ కళాశాలలో ఇంటర్ (1977–79), బీఏ (1979–82) పూర్తిచేశారు. 1982–84లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషియాలజీ చదివారు. 1984 ఫిబ్రవరి 3న కొత్తకోట దయాకర్ రెడ్డితో సీతాదయాకర్ రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు (సిద్ధార్థ, కార్తీక్) ఉన్నారు. -
నిఘానేత్రాల వినియోగంలో మొదటి స్థానం
అమరచింత: సీసీ కెమెరాలను వినియోగించి నేరాలను ఛేదించడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, నిఘా నేత్రాల ఏర్పాటుపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముందున్నామని డీజీపీ డా. జితేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మస్తీపురం గ్రామంలో ఐజీ రమేశ్‌రెడ్డి సహకారంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం.రమేష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందని.. ఆపద సమయంలో డయల్ 100కు ఫిర్యాదు చేయాలని, దీన్ని మించిన నంబర్ మరోటి లేదని చెప్పారు. గ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ఐజీ రమేష్‌రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అక్రమ రవాణాకు అడ్డుకట్టు.. జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటుతో అంతర్రాష్ట్ర అక్రమ రవాణాను నియంత్రించే అవకాశం ఉందని డీఐజీ డా. జితేందర్ అన్నారు. శుక్రవారం రూ.1.50 లక్షలతో నిర్మించే పోలీస్ అవుట్‌పోస్టు భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. ప్రాజెక్టు భద్రతతో పాటు పరిసరాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రాజెక్టు పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని వివరించారు. అనంతరం పోలీస్ అవుట్‌పోస్టు స్థలంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి,మల్టీజోన్ –11 ఐజీపి సత్యనారాయణ, జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శివకుమార్ పాల్గొన్నారు. -
పేదల ఆరోగ్య సంరక్షణకే సన్నబియ్యం
నర్వ: పేదల ఆరోగ్య సంరక్షణ కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వాల్ గ్రామంలో రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కడుపు నింపేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనువాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నయ్యసాగర్, జగన్మోహన్రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శరణప్ప, జగదీశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు. 8న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈ నెల 8న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–8, 10, 12, 14, 16, 20 బాలబాలికలకు 60 మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు అసోసియేషన్ సభ్యులను సంప్రదించాలని సూచించారు. ప్రతి గ్రామానికిరోడ్డు సౌకర్యం కోస్గి: ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్ అన్నారు. శుక్రవారం గుండుమాల్ మండలంలో బ్రిడ్జీల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్డీఎఫ్ నుంచి మంజూరైన రూ. 7కోట్లతో గుండుమాల్–పగిడియాల్ మార్గంలో, రూ. 8.5 కోట్లతో ముదిరెడ్డిపల్లి–పగిడియాల్ మార్గంలో బ్రిడ్జీలు నిర్మించనున్నట్లు తెలిపారు. పనులు నాణ్యతగా చేపట్టి, త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విక్రంరెడ్డి, మాజీ ఎంపీపీ మధుకర్‌రావు, మాజీ సర్పంచ్ సురేష్ రెడ్డి, పీఆర్ డిప్యూటీ ఈఈ విలోక్, ఏఈ అంజిరెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, గోపాల్‌రెడ్డి, జహీర్ పాల్గొన్నారు. అల్పాహారం పరిశీలన మద్దూరు: హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారాన్ని శుక్రవారం అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంత మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు.. ఏ సమయానికి పాఠశాలకు చేరుకుంటుందనే వివరాలను హెచ్ఎం సవితను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆయన ఆరా తీశారు. అనంతరం ఎస్‌ఎల్‌టీఏ డైరీని అడిషనల్ కలెక్టర్‌కు ఉపాధ్యాయులు అందించారు. ఉల్లి క్వింటాల్ రూ.1,200 మక్తల్: పట్టణంలోని మార్కెట్‌యార్డుకు శుక్రవారం ఆరు క్వింటాళ్ల ఉల్లి అమ్మకానికి రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ. 1,200, కనిష్టంగా రూ. 900 ధర పలికింది. ఈ ప్రాంతంలో పండించిన పంటలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా, మక్తల్ మార్కెట్లో అమ్మేందుకు ఏర్పాట్లు చేసినట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు. -
ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించొద్దు
నారాయణపేట రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట, ధన్వాడ మండలాల్లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అప్పక్‌పల్లిలో గత ఫిబ్రవరిలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన దేవమ్మ ఇంటి నిర్మాణ పను ల పురోగతిని తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించా రు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అదే గ్రామానికి చెంది న షమీ బేగం, ఆశాబేగం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి.. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ధన్వాడలో రూఫ్ లెవెల్ వరకు నిర్మా ణం పూర్తయిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను కలెక్టర్ పరిశీలించారు. నెలరోజుల్లో నిర్మాణం పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. వంద రోజులపాటు ‘ఉపాధి’ కల్పించాలి.. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వంద రోజులపాటు పనులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. నారాయణపేట మండలం అప్పక్‌పల్లిలో ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారని.. రోజుకు ఎంత కూలి పడుతుందని ఆరా తీశారు. వచ్చిన డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందా? లేక బీపీఎం బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ వద్ద తీసుకుంటున్నారా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. కొందరు కూలీలు తమకు ఇంతవరకు కూలి డబ్బులు రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. డబ్బులు కూలీల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని ఏపీఓను ఆదేశించారు. పని ప్రదేశంలో కూలీలకు ఏర్పాటుచేసిన టెంట్, నీటి వసతిని చూశారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ సుదర్శన్, సాయి ప్రకాశ్ తదితరులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి నారాయణపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సివిల్ సప్లై శాఖ ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సన్నాలకు రూ. 500 బోనస్ ఇస్తోందన్నారు. కేంద్రాల్లో దొడ్డు రకం, సన్నరకం వడ్లను కొనేందుకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని కొలిచే యంత్రాలు, అవసరమైనన్ని గన్ని బస్తాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ట్యాబ్, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, సివిల్ సప్లై డీఎం సైదులు పాల్గొన్నారు. -
‘ఆఫీసుకు వచ్చి మీ అందరిని లోపల వేసి తంతా..’
పాలమూరు: మూసాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శెట్టిశేఖర్ ఇటీవల రెవెన్యూ ఉద్యోగితో ఫోన్లో మాట్లాడిన తిట్ల దండకం ఆడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారం క్రితం నిజాలాపూర్‌లో సీసీరోడ్లు వేయడానికి ట్రాక్టర్లతో స్థానిక పెద్దవాగు నుంచి ఇసుకను తరలించుకోవడానికి కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ద్వారా అనుమతి పొందారు. 10 ట్రిప్పులకు అనుమతి ఉండటంతో సమయం దాటిపోయిన తర్వాత అదే గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి చందు అక్కడికి వెళ్లి ట్రాక్టర్లను ఆపాడు. గ్రామస్తులు పార్టీ మండల అధ్యక్షుడు శెట్టిశేఖర్కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పడంతో ఆయన చందుకు ఫోన్ చేసి తిట్టాడు. వాహనాలను ఆపడానికి నువ్వెవరు అంటూ బూతు పురాణం అందుకున్నాడు. అంతటితో ఆగకుండా నౌకరి చేయాలనుకుంటే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశాడు. ‘తహసీల్దార్ ఆఫీసుకు వచ్చి మీ అందరిని లోపల వేసి తంతా..’ అంటూ తిట్టిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఘటన జరిగిన మరుసటి రోజు దీనిపై మండల అధికారులు రాజీ చేశారని తెలిసింది. తాజాగా ఆడియో లీకై సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తహసీల్దార్ రాజును ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. రెవెన్యూ ఉద్యోగిపై కాంగ్రెస్ నాయకుడి తిట్ల దండకం సోషల్ మీడియాలో వైరల్ -
మాటలతో.. వేధింపులు!
నారాయణపేట: జిల్లా సెర్ప్ ఉద్యోగులను ఎవరిని కదిలించినా ‘‘అడిషనల్ డీఆర్డీఓ వ్యంగ్యంగా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతాడు.. పని త్వరగా చెయ్.. పని చేయనింకా రాదా.. ఏం నేర్చుకున్నారంటూ.. సారూ సైకోలా వ్యవహరిస్తాడు.. సాధిస్తాడు అంతే..’’ అంటూ ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా ‘సాక్షి’లో ప్రచురితమవుతున్న ‘మహిళా ఉద్యోగుల హడల్’.. ‘అసలేం జరుగుతోంది..’ అనే వార్తా కథనాలతో డీఆర్డీఓ కార్యాలయంతో పాటు ఇతర శాఖల్లో సైతం చర్చానీయాంశంగా మారింది. ఈ కథనాలతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని డీఆర్డీఓ కార్యాలయాల్లో మహిళలపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఒక పట్టు పట్టాలనే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆరా.. ఎమ్మెల్యే పీఏ చిట్టెం మాధవరెడ్డికి సెర్ప్ ఉద్యోగులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అడిషనల్ డీఆర్డీఓ వ్యవహార తీరుపై స్థానిక ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. మహిళా ఉద్యోగినులు, సెర్ఫ్ ఉద్యోగులతో వ్యవహరించిన తీరుపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. తగు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు, నిర్వాహణ, అందులో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది నియామకంపై ఇటు డీఆర్డీఓ ఉన్నతాఽధికారులు, అటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ఒక దశలో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. డీపీఎంకు లీవ్ లెటర్.. అధికారులకు ఎవరికై నా సెలవు కావాలంటే ఉన్నతాధికారులకు లీవ్ లెటర్ సమర్పించి అనుమతి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే అడిషనల్ డీఆర్డీఓపై వస్తున్న ఆరోపణలతో ఉన్నతాధికారులకు ముఖం చూయించలేకపోతున్నారు. గురువారం అడిషనల్ కలెక్టర్‌ను కలిసేందుకు ఆయన ప్రయత్నించగా.. అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇక చేసేదిలేక వెనుదిరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఒక రోజు లీవ్ పెడుతున్నట్లు లెటర్ రాసి.. డీఆర్డీఓ కార్యాలయంలోని ఓ డీపీఎంకు ఇచ్చి వెళ్లిపోయారు. అయితే శుక్రవారం ఒక రోజు సెలవు తీసుకుంటే.. శనివారం బాబు జగ్జీవన్‌రాం జయంతి, ఆదివారం రెండు రోజులు ప్రభు త్వ సెలవులు ఉండటంతో సోమవారం చూసుకుందామంటూ వెళ్లిపోయినట్లు తెలిసింది. కాగా, డీపీఓ ఆ లీవ్ లెటర్‌ను డీఆర్డీఓకు అందజేసేందుకు వెళ్లగా.. ఆ లెటర్ మీకు ఇస్తే మీ వద్ద పెట్టుకోండి.. అంతా అతడి ఇష్టమేనా అంటూ అటెండెన్స్ రిజిస్ట్రర్‌లో అటు సీఎల్.. ఇటు అబ్సెంట్ వేయకుండా డాస్ (–) పెట్టినట్లు తెలిసింది. సెర్ప్ ఉద్యోగులను ఎవరిని కదిలించినా ఇదే మాట.. అడిషనల్ కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తే నో అపాయిమెంట్ డీపీఎంకు లీవ్ లేటర్ ఇచ్చి వెళ్లిపోయిన అడిషనల్ డీఆర్డీఓ -
అద్దె కార్ల పేరుతో అక్రమాలు
అడిషనల్ డీఆర్డీఓ విధి నిర్వహణకు ఓ అద్దె కారును తీసుకొని జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ చేసేందుకు ప్రభుత్వం నెలకు రూ.33 వేలు చెల్లిస్తోంది. కాగా సదరు అధికారి మాత్రం జిల్లాలోని డీపీఎంల కారుల్లో తిరుగుతూ.. కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి కారు పేరిట నెలకు రూ. 33 వేలు బిల్లులు డ్రా చేస్తున్నట్లు సమాచారం. అయితే గతేడాది నుంచి వాహనం బిల్లు చెల్లించాలని ఉన్నతాధికారులకు కోరగా ఇటీవల ఏడాదికి సంబంధించిన బిల్లు చెక్ రేడీ అయినట్లు తెలుస్తోంది. అడిషనల్ పీడీపై ఫిర్యాదు రావడంతో ఆ బిల్లు సైతం ఆగినట్లు సమాచారం.