
అవి ఆరోపణలు మాత్రమే
మా కార్యాలయంపై వస్తున్న ఫిర్యాదులన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే. ఓ వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన విషయం వాస్తవం. తాను సెలవులో ఉండడంతో స్థానిక సంస్థట అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓతో విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలుస్తోంది. ఆ రిపోర్టులో ఏం రాశారో తమకు తెలియదు.
– సౌభాగ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ
చర్యలు తీసుకోవాలి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్లు వేయకుండా, కలెక్టర్ అనుమతులు లేకుండా తన ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చిన డీఎంహెచ్‌ఓపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎంపీ డీకే అరుణకు డీఎంహెచ్‌ఓ పై ఫిర్యాదు చేశాం. త్వరలోనే హెల్త్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి విన్నవించబోతున్నాం.
– బొదిగల శ్రీనివాస్, బీఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట
●