breaking news
Narayanpet District News
-
సంక్రాంతి సందడి
● రంగుల్లులతో శోభిల్లిన లోగిళ్లు ● ఇంటింటా కలకూరగాయ.. సద్ద, నువ్వుల రొట్టెలు నారాయణపేట: సరదాల సంక్రాంతి సంబరాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భోగి పండగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు. తెల్లవారుజామునే మహిళలు ఇంటి ముంగిళ్లలో కల్లాపి చల్లి రంగవల్లులతో సుందరంగా అలంకరించారు. వాటిలో కొత్తగా పండించిన ధాన్యం, గొబ్బెమ్మలను పెట్టి పూజలు చేశారు. భోగభాగ్యాలు కలగాలని భోగి మంటలు వేయగా.. యువత, చిన్నారులు సందడి చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. అక్కడక్కడా బొమ్మల కొలువులను ఏర్పాటుచేశారు. మహిళలు వాయినాలను ఇచ్చి పుచ్చుకున్నారు. ఇంటింటా సద్ద, నువ్వుల రొట్టెలు, కలకూరగాయలతో ప్రత్యేక వంటకాలను తయారుచేసి ఇంటిల్లిపాది ఆనందంగా ఆరగించారు. చిన్నారులు పతంగులను ఎగరవేస్తూ సంతోషంగా గడిపారు. ఏ పల్లెలో చూసినా యువకుల ఆటపాటలు, బంధుమిత్రుల రాకలతో సందడిగా కనిపించాయి. ఇక గురువారం సంక్రాంతి పండగను ఘనంగా నిర్వహించుకోనున్నారు. మూడోరోజు శుక్రవారం కనుమ సందర్భంగా పశువులకు పూజలు చేసి.. విందు, వినోదాలతో సంబరాలు జరుపుకోనున్నారు. పండగ సందర్భంగా పలు గ్రామాల్లో యువతులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. వాయినం ఇచ్చి పుచ్చుకుంటున్న మహిళలు -
అభివృద్ధి దిశగా పాలమూరు
దేవరకద్ర/ భూత్పూర్: వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాను ఈ ప్రాంత బిడ్డ, సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధిగా నడిపిస్తున్నారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం పాలమూరు ప్రాజెక్టు పనులు 10 శాతమే మిగిలి ఉన్నాయని, వాటిని సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి చేయడం లేదని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బుధవారం దేవరకద్ర, భూత్పూర్ పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి కోమటిరెడ్డి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో జిల్లాను దత్తత తీసుకుని వివక్ష చూపించారని విమర్శించారు. దేవరకద్ర నియోజవవర్గ అభివృద్ధి కోసం ఇక్కడి ఎమ్మెల్యే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు రూ.110 కోట్లు మంజూరు చేయించుకున్నారని, అలాగే కోయిల్‌సాగర్ రోడ్డుకు, డ్యాం డెవలప్మెంట్ పనులకు నిధులు కేటాయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కార్యకర్తలే నాయకులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ విజయేందిర, జెడ్పీ మాజీ చైర్పర్సన్ స్వర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలు మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టండి రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
డూడూ.. బసవన్న
అయ్య వారికి.. అమ్మవారికి దండంపెట్టు ● గంగిరెద్దులతో సంక్రాంతికి కళ ● పండగకు ముందు నుంచే సందడి ● ఉమ్మడి జిల్లాలో వంద కుటుంబాలపైగా గంగిరెద్దులోళ్లు జడ్చర్ల టౌన్: డూడూ బసవన్న అనగానే సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దు గుర్తుకు వస్తుంది. పండగ భోగి మొదలు కనుమ వరకు మూడు రోజుల పాటు గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ యాచిస్తూ గంగిరెద్దుల వాళ్లు చేసే విన్యాసాలు అలరిస్తుంటాయి. రెండు మూడు దశాబ్దాల కిందటి వరకు నాలుగైదు ఊర్లలో మూడు నాలుగు వందల కుటుంబాలు ఉండే గంగిరెద్దుల వాళ్లు ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 105 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. గంగిరెద్దులను ఆడించే వారు యాదవ కులంకు చెందిన వారే అయినప్పటికీ వారితో సంబంధాలు అంతంత మాత్రమే. వీరిది అంతా సంచార జీవనమే. యాచక వృత్తి ప్రధానంగా జీవిస్తుంటారు. పండగలు, పర్వదినాలతో పాటు ఎవరైనా మరణిస్తే అక్కడ ప్రత్యక్షం అవుతుంటారు. ముఖ్యంగా పంటలు చేతికి వచ్చే సమయానికి గంగిరెద్దులతో వీరు ప్రత్యక్షం అవుతుంటారు. అప్పటి వరకు ఊరూరా సంచరిస్తూ జీవనం గడుపుతుంటారు. గంగిరెద్దు అలంకరణ ఎద్దుకు వారు చెప్పినట్లుగా ఆడేలా శిక్షణ ఇచ్చి అలంకరిస్తారు. మూపురం నుంచి తోక వరకు ఎంతో అందంగా రంగు రంగులతో కుట్టిన బొంతలు, పాత పట్టు చీరలను అలంకరిస్తారు. కొమ్ములను రింగులతో అందంగా తీర్చిదిద్ది వాటికి గొట్టాలను ధరింపజేసి రంగురంగుల ఊలు ధారాలను కడతారు. వీటిని కుప్పెలుగా పిలుచుకుంటారు. నొసటిభాగంలో తోలుతో అలంకరించి పైన గవ్వలు వేలాడదీస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టి ఆడిస్తుంటారు. సన్నాయి, బూర గంగిరెద్దును ఆడించే వారి వేషాధారణ సైతం ప్రత్యేకంగానే ఉంటుంది. వారి చేతిలో సన్నాయి, బూర, చిన్న గంట పట్టుకుంటారు. ఎవరైనా పాతకోటు ఇస్తే అది వేసుకుని తిరుగుతుంటారు. ఏకాలనీలోకి అడుగుపెట్టినా సరే సన్నాయి బూర శబ్దం వచ్చిందంటే గంగిరెద్దులోళ్లు వచ్చారని అట్టే అర్థం అవుతుంది. ఆదరణ తగ్గింది మా గ్రామం చర్లపల్లి అయినా పెద్దలనుంచి వచ్చిన గంగిరెద్దులను ఆడించటం కోసం సంచార జీవనం గడుపుతున్నా. భార్య ఇద్దరు పిల్లలతో గంగాపూర్‌లో గుడారాలు వేసుకొని జీవిస్తున్నాను. నా చిన్నతనం నుంచి ఇదే వృత్తిలో ఊరూరా తిరుగుతుంటాను. ఏడాదిలో ఈ మూడు రోజులే జడ్చర్లలో తిరిగి యాచకం చేస్తా. ఇంతకుముందు అయితే ధనం, ధాన్యం, గడ్డి అన్ని దానం చేసేవారు. ఇప్పుడు పూర్తిగా ఆదరణ తగ్గిపోయింది. – రాములు, గంగిరెద్దులను ఆడించే వ్యక్తి ఎద్దులే సాకుతాయి.. ఎద్దులను మంచిగా చూసుకుంటే అవి మా కుటుంబాలను సాకుతున్నాయి. వాటినే నమ్ముకుని ఏళ్ల తరబడి బతుకుతున్నాం. ఎద్దులు మంచిగా ఉంటేనే మా కుటుంబాలు చల్లగా ఉంటాయి. మారుతున్న సమాజంతో పొటీ పడేలా మాకు ప్రత్యేకమైన సదుపాయలు కల్పిస్తే మానుగడ సాగిస్తాం. తాతల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగించేలా నెట్టుకొస్తున్నాం. – రాములు, నవాబుపేట ● -
‘పుర’ రిజర్వేషన్లు ఖరారు
నారాయణపేట: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు బుధవారం సీడీఎంఏ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని కోస్గి, మద్దూరు, మక్తల్, నారాయణపేట మున్సిపాలిటీల్లో 2011 జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ స్థానాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ కేటాయిస్తారనేది స్పష్టత రానుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ స్థానాల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. అయితే మూడు మున్సిపాలిటీల్లో ఒక్కొక్క స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. మద్దూర్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళకు రెండు వార్డులను రిజర్వు చేశారు. నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులకు గాను ఎస్టీ జనరల్ 4, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 6, ఎస్సీ మహిళకు 4, బీసీ జనరల్‌కు 12, బీసీ మహిళకు 9, జనరల్‌కు 14, జనరల్ మహిళకు 22 స్థానాలు కేటాయించారు. 72 స్థానాల్లో మహిళలకు 36 స్థానాలు దక్కనున్నాయి. అత్యధికంగా జనరల్ మహిళ స్థానాల్లోనే 22 మందికి అవకాశం కల్పించనున్నారు. -
వైభవంగా క్షీరలింగేశ్వరుడి రథోత్సవం
క్షీరలింగేశ్వరస్వామి రథోత్సవంలో పాల్గొన్న భక్తజనం కృష్ణా: మండల కేంద్రంలో బుధవారం శ్రీక్షీరలింగేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్ కు క్షీరాభిషేకం, మహా మంగళహారతి, బిల్వార్చన నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆల యం నుంచి ఆలయ ధర్మకర్త ఎంకణ్ణగౌడ్ మంగళవాయిద్యాల మధ్య కలశంతో ఊరేగింపుగా రథం వద్ద చేరుకొని ప్రత్యేక పూజలు చేసి.. ఉత్సవమూర్తిని రథపై కొలువుదీర్చగా.. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. రథోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ని ర్వహించారు. కార్యక్రమంలో మఠం పీఠాధిపతి బంతనల్ శ్రీవృశభలింగేశ్వర మహాస్వామి, నేరడగం పీఠాధిపతి శ్రీసిద్దలింగ మహాస్వామి, శ్రీక్షీరాలింగ మహాస్వామి పాల్గొన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్
మక్తల్: మున్సిపల్ ఎన్నికలను సజావుగా పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ఎన్నికల నిర్వహణ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తూ.. ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. కాగా, మక్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయని, ఇప్పటికే తుది ఓటరు జాబితా విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. జూనియర్ కళాశాల భవనంలో స్ట్రాంగ్‌రూం ఏర్పాటుచేసి.. ఎన్నికల సామగ్రి భద్రపర్చనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు, తహసీల్దార్ సతీష్‌కుమార్, ఎంపీడీఓ రమేశ్‌కుమార్ తదితరులు ఉన్నారు. ● మక్తల్‌లో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలిసి పూలమొక్క అందజేసి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై చర్చించారు. -
రూ.1,035 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి
మక్తల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలోనే రూ. 1,035 కోట్లతో మక్తల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్‌లో పట్టణంలోని 1, 11, 14 వార్డుల్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అంతకుముందు పలు కాలనీల్లో సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకులు మక్తల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. తాను మంత్రి పదవి చేపట్టిన కొన్ని రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో రూ.కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. మక్తల్‌లో తాగునీటి సమస్య తలెత్తకుండా రూ. 80లక్షలతో పైపులైన్ నిర్మిస్తున్నట్లు చెప్పా రు. 1, 11, 14 వార్డుల్లో రూ. 2.50కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటి స్తూ.. త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో నిధుల కొరత లేదని.. అభివృద్ధి కార్యక్రమాలకు వెనకాడేదిలేదని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్‌కుమార్‌రెడ్డి, ఏఈ నాగశివ, గోవర్ధన్, కట్టా సురేశ్, రవికుమార్, రాజేందర్, రహీం పటేల్, శంషొద్దీన్, ఎండీ సలాం, భాస్కర్ పాల్గొన్నారు. -
సంబరాల పండగొచ్చే..
పిండి వంటల ఘుమఘుమలు.. భోగిమంటల కాంతులు.. ముంగిళ్లలో ముచ్చటైన రంగవల్లులు.. పతంగుల కోలాహలం.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు.. వెరసి మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. బుధవారం భోగభాగ్యాల భోగి, గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమను కుటుంబంతో కలిసి నిర్వహించుకునేందుకు గాను ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు సొంతూళ్లకు చేరుకున్నారు. బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంది. పల్లె, పట్టణాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. – నారాయణపేట/నారాయణపేట రూరల్ ఆనందంగా నిర్వహించుకోవాలి.. జిల్లా ప్రజలకు ఎస్పీ డా.వినీత్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి అని.. ఈ పండగ అందరిలో స్నేహభావం, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ పండగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడంతో పాటు స్వీయ భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా అందరూ కలిసిమెలిసి సంతోషంగా పండగ నిర్వహించుకోవాలని తెలిపారు. ముగ్గులు వేసే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని.. అపరిచితులు అడ్రస్ అడుగుతూ, మాట కలిపి ఏమార్చి మెడలో నుంచి బంగారు ఆభరణాలు దొంగలించే అవకాశం ఉందన్నారు. అనుమానితులు కనిపిస్తే స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. జీవితంలో కొత్తదనాన్ని స్వాగతిస్తూ.. పాత వస్తువుల్ని మంటల్లో వేయడంతో భోగి పండుగ ప్రారంభమవుతుంది. మూడు రోజుల పండుగలో ఇది మొదటిది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు. చిన్నారులను సాక్ష్యాత్తు శ్రీమన్నారాయణుడిగా భావించి.. తలపై రేగిపండ్లు, పూలు, అక్షింతలు, చిల్లర నాణాలు పోసి, హారతి ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఇలా చేస్తే దిష్టి పోతుందని, ఆయు వృద్ధి కలుగుతుందని నమ్మకం. భోగి మంటలతో వచ్చిన బూడిదను పిల్లలు, పెద్దలు నుదుటన ధరిస్తారు. కాగా, కొన్ని గ్రామాల్లో మంగళవారమే భోగి వేడుకలు జరుపుకొన్నారు. తెల్లవారుజామునే ఇంటి ముంగిళ్లలో కల్లాపి చల్లి రంగవల్లులతో తీర్చిదిద్దారు. దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నువ్వుల రొట్టెలు ప్రత్యేకం.. భోగి రోజు అందరి ఇళ్లల్లోనూ నువ్వుల రొట్టెలు చేయడం ప్రత్యేకత. కొందరు బియ్యంపండి, మరికొందరు జొన్నపిండిలో నువ్వులను వేసి రొట్టెలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. చలికాలం కావడం వల్ల నువ్వులు వంటికి వేడిని అందిస్తాయని భోగి రోజున వాటిని ఆరగిస్తారు. అలాగే చిక్కుకాయ లేదా వివిధ రకాల కూరగాయలను కలిపి వండుతారు. సిరిసంపదలు కలగాలని.. రైతులు ఆరుగాలం శ్రమించగా చేతికి వచ్చిన పంటలతో సంతోషంగా నిర్వహించుకునే పండగ సంక్రాంతి. రెండవ రోజు సంక్రాంతి పర్వదినాన పాలు పొంగించి పొంగళి అనే తీపిపదార్థం తయారు చేస్తారు. వచ్చే ఏడాది పాటు తమ ఇళ్లల్లో సిరిసంపదలు కలగాలని కోరుకుంటూ ఇళ్లల్లో పాలు పొంగించడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటిముందు రంగవల్లులతో తీర్చిదిద్దుతారు. లోగిళ్లన్నీ ఇంద్రధనుస్సు తలపిస్తూ కొత్త కాంతిని ప్రసరింపజేస్తాయి. మూడో రోజు కనుమ పండగ సందర్భంగా పశువులను అలంకరించి, వాటికి పూజలు చేసి విందు, వినోదాలతో గడుపుతారు. జిల్లాలో మొదలైనసంక్రాంతి సందడి నేడు భోగభాగ్యాల భోగి పల్లెల్లో ఉట్టిపడుతున్న పండగ శోభ -
వీబీ–జీ రామ్‌జీ చట్టంపై తప్పుడు ప్రచారం
● కేంద్రం నిధులిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకోవడం సరికాదు ● ఎంపీ డీకే అరుణ పాలమూరు: వికసిత్ భారత్ రోజ్ గార్ ఔర్ ఆజివిక మిషన్ గ్రామీణ్ (వీబీ–జీ రామ్‌జీ)చట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వికసిత్ భారత్ కావాలంటే వికసిత్ గ్రామం కావాలని జీ రామ్‌జీ పథకం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ఎంఎన్ఆర్ఈజీఏ కింద రూ.2 లక్షల కోట్ల పై చిలుకు ఖర్చు చేస్తే మోదీ ప్రభుత్వం రూ.8.53 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గతంలో ఈ పథకం అధికార పార్టీల నేతల జేబులు నింపుకోవడానికి ఉపయోగపడిందన్నారు. ఈ పథకం ద్వారా గ్రామ సభలలో అభివృద్ధి పనులను తీర్మానం చేసి ప్రణాళిక రూపొందించాలని దీని ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు.. ఈనిధులు ఎక్కడివో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సీఎం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వీబీ–జీ రామ్ జీ పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమి తగ్గడం లేదని రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు అదనంగా కేటాయిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.600 కోట్లకు పైగా నిధులు వచ్చాయని వాటిని రాష్ట్ర ప్రభుత్వ నిధులు చెప్పుకోవడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పద్మజారెడ్డి, బాలరాజు, వీర బ్రహ్మచారి, పాండురంగారెడ్డి, అంజయ్య, రమేష్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
● నేటి నుంచి ‘అరైవ్ అలైవ్’పై అవగాహన కార్యక్రమాలు : ఎస్పీ డా.వినీత్ నారాయణపేట: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసుశాఖ అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎస్పీ డా.వినీత్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం, అతివేగం, అజాగ్రత్తతోనే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం కేవలం ఒక నినాదం కాకుండా.. రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్యమంలా ముందుకు సాగాలన్నారు. ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలనే వారి కుటుంబ సభ్యుల ఆశను తీర్చే కార్యక్రమం కావాలన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురయ్యే బాధితుల బాధ, మరణం సంభవించిన వారి కుటుంబ సభ్యుల మనోవేదనను ఎస్పీ స్వయంగా తెలియజేశారు. అలాంటి పరిస్థితి మరో కుటుంబంలో జరగకుండా.. అందరూ రహదారి భద్రత నియమాలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. హెల్మెట్ ధరించడం కేవలం చలానా, చట్టం నుంచి తప్పించుకోవడానికి కాదని.. అది తమ ప్రాణాన్ని కాపాడే ఆయుధమని ప్రతి వాహనదారుడు గ్రహించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాద మరణాలు జరిగి, ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయన్నారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంపై ఈ నెల 24వ తేదీ వరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకుముందు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు, క్షతగాత్రులతో స్వయంగా మాట్లాడించారు. అదే విధంగా డాక్టర్లతో రోడ్డు ప్రమాదానికి గురైతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనే వివరాలను తెలియజేశారు. అనంతరం రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, డీటీఓ మేఘాగాంధీ, ఆర్తోఫెడిక్ ప్రసాద్ శెట్టి, ప్రభుత్వ మార్చురీ డాక్టర్ తవ్ సిఫ్, ఆర్టీఓ జిల్లా మెంబర్ పోషల్ రాజేశ్ పాల్గొన్నారు. -
మహిమగల దేవుడు..
మా పూర్వీకుల నుంచి చింతలకుంట ఆంజనేయస్వామిని కొలుస్తున్నాం. ఈ స్వామివారు చాలా మహిమ గల దేవుడు. మా కుటుంబం ఆలయ అభివృద్ధిలో కొద్దిమేర భాగస్వాములయ్యాం. ప్రజాప్రతినిధులు, భక్తులు, దాతలు ముందుకొచ్చి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలి. – వెంకటస్వామి, భక్తుడు, సూగూరు, పెబ్బేరు మండలం భక్తుల రాక పెరుగుతోంది.. కోరిన కోరికలు తీరుతుండటంతో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుంది. పెద్దసంఖ్యలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయం, పరిసరాలను అభివృద్ధి చేసేందుకు భక్తులు, దాతలు ముందుకు రావాలి. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. – వెంకటేశ్వర్లు, ఆలయ పూజారి -
నాణ్యమైన విద్యుత్‌సరఫరాకు చర్యలు
నారాయణపేట: జిల్లాలోని రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్ఈ నవీన్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సింగార్ బేస్, శ్రీనగర్ కాలనీ, శ్యాసన్‌పల్లి రోడ్డు, సరస్వతీ నగర్ కాలనీల్లో విద్యుత్‌శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి విద్యుత్ సరఫరా, ఓల్టేజీ తదితర సమస్యలను తెలుసుకున్నారు. అయితే సరస్వతీ నగర్లో సుమారు 130 ఇళ్లు ఉన్నాయని.. విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో 45 స్తంభాలు అవసరమని.. వెంటనే కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డీఈ నర్సింహారావు, ఏఈ మహేశ్‌కుమార్‌గౌడ్, లైన్ ఇన్స్పెక్టర్ వెంకటన్న, జిల్లా విద్యుత్ కాంట్రాక్టు అసోసియేషన్ అధ్యక్షుడు పోలేమోని కృష్ణ, కాలనీవాసులు లక్ష్మీకాంత్, వెంకట్రామారెడ్డి, శివారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. సత్తాచాటినదివ్యాంగ విద్యార్థులు ఆత్మకూర్: గోల్‌బాల్ జాతీయ స్థాయి పోటీల్లో ఆత్మకూర్‌కు చెందిన దివ్యాంగ విద్యార్థులు సత్తాచాటి మొదటి బహుమతి సాధించారు. ఈ నెల 10 నుంచి బిహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న 5వ నేషనల్ గోల్‌బాల్ పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఈ క్రమంలో ఆత్మకూర్ సమ్మిలిత ఫౌండేషన్‌కు చెందిన విద్యార్థి పవన్‌కల్యాణ్ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా ఇక్కడి దివ్యాంగ విద్యార్థులు రాజేష్, వేణు, కిరణ్, మధు, సాయిరాంవర్మ ప్రతిభ కనబర్చి ఫైనల్లో ఏపీ జట్టుపై విజయం సాధించారని కోచ్, సంస్థ డైరెక్టర్ శివకుమార్ తెలిపారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆర్థిక సహకారంతోనే తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. 18న రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ ఎంపికలు మహబూబ్‌నగర్ క్రీడలు: తాండూర్‌లో ఈనెల 18వ తేదీన రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ ఎంపికలు జరుగుతాయని జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆక్యపోగు ఆడమ్స్, బి.పుష్ప మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో ప్రతిభను కనబరిచిన వారిని సౌత్‌జోన్ జాతీయ స్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈనెల 17న సాయంత్రం 4గంటలకు తాండూర్లోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లో క్రీడల నిర్వహణ కార్యదర్శి రాములు (9951343432) రిపోర్టు చేయాలని కోరారు. ఎర్రకందులు క్వింటా రూ.7,705 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం ఎర్ర కందులు క్వింటా గరిష్టంగా రూ. 7,705, కనిష్టంగా రూ. 5,800 ధర పలికింది. తెల్ల కందులు గరిష్టంగా రూ. 7,718, కనిష్టంగా రూ. 6,666, వడ్లు (సోన) గరిష్టంగా రూ. 2,640, కనిష్టంగా రూ. 2,290 ధరలు వచ్చాయి. వేరుశనగ క్వింటా రూ.8,661 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,661, కనిష్టంగా రూ.3,056 ధరలు లభించాయి. ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,759 కనిష్టంగా రూ.2,569, హంస రూ.1,869, పత్తి గరిష్టంగా రూ.7,439, కని ష్టంగా రూ.5,659, కందులు గరిష్టంగా రూ.6,959, కనిష్టంగా రూ.4,100, మొక్కజొ న్న గరిష్టంగా రూ.1,973, కనిష్టంగా రూ.1,666, ఉలువలు రూ.4,342, మినుము లు గరిష్టంగా రూ.7,882, కనిష్టంగా రూ.7,669 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు రూ.6,719గా ఒకే ధర లభించింది. కాగా.. సంక్రాంతి సందర్భంగా దేవరకద్ర మార్కెట్‌కు మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు. తిరిగి 17వ తేదీ మార్కెట్లో లావాదేవీలు జరుగుతాయని మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. -
‘డయల్ యువర్ ఎస్పీ’కి అనూహ్య స్పందన
నారాయణపేట: జిల్లా ప్రజలకు పోలీస్‌శాఖ మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుందని ఎస్పీ డా.వినీత్ తెలిపారు. సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 19 మంది స్వయంగా ఎస్పీని ఫోన్లో సంప్రదించి తమ సమస్యలను తెలియజేశారు. ప్రధానంగా తమ ప్రాంతాల్లో చోరీల నివారణకు పెట్రోలింగ్ పెంచాలని, భూ వివాదాలు, కుటుంబ తగాదాలు పరిష్కరించాలని, గతంలో జరిగిన చోరీ కేసుల్లో నిందితులను ఇప్పటివరకు పట్టుకోలేదని, దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లను బదిలీ చేయాలని, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి.. సంబంధిత పోలీస్ అధికారుల ద్వారా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని.. పోలీస్‌శాఖ ఎల్లప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు జిల్లాలో ఎవరైనా పేకాట, కోడిపందాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లావ్యాప్తంగా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిరంతర వాహన తనిఖీలు, సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించబడిన కొన్ని ప్రదేశాలలో గస్తీని ముమ్మరం చేశామన్నారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్స్టేషన్లలో పనిచేసే అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. -
ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమం
నారాయణపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టినట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బాల్‌రాం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. కార్మిక, కర్షక, కూలీల హక్కులను కాలరాయడమే కాకుండా రాష్ట్రాల హక్కులను హరించేలా కొత్త చట్టాలు చేస్తుందని విమర్శించారు. కార్మికులను కట్టుబానిసత్వంలోకి నెట్టేలా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని విమర్శించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో మోదీ ప్రభుత్వం వీబీజీ రాంజీ చట్టం తీసుకొచ్చి గ్రామీణ కూలీల పొట్ట కొట్టేందుకు కుట్రలు చేస్తోందన్నారు. ప్రజావ్యతిరేక చట్టాలతో పాటు జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈ నెల 17న జిల్లావ్యాప్తంగా జీపుజాతా నిర్వహించనున్నట్లు తెలిపారు. 19న కార్మిక, కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు రైతులు, వ్యవసాయ కూలీలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 28 నుంచి మన్యంకొండ జాతర జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఈనెల 28 నుండి మార్చి 5 వరకు నిర్వహించనున్న మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్‌హాల్‌లో వివిధ శాఖల అధికారులతో కలిసి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన తాగునీరు, శానిటేషన్, టాయిలెట్లు, బందోబస్తు రద్దీ నియంత్రణ వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ముఖ్య శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ప్రతి శాఖ నుంచి ఒక అధికారిని నియమించి ఏర్పాట్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం ఫిబ్రవరి 1న స్వామి వారి గరుడ వాహనసేవ, రథోత్సవం ఉంటాయని ఈ సందర్భంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్‌శాఖ తరఫున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ తగినన్ని బస్సులు నడపాలని, కొండపైకి మినీ బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. -
పాలమూరుకు నీళ్లు
కేసీఆర్ వస్తేనే సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పాలమూరు అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆరే రావాలి. ఐటీ హబ్ పునర్ వైభవం పొందాలంటే, ఉద్యోగాలు రావాలంటే, అమర్ రాజా కంపెనీ మళ్లీ రావాలన్నా, రైతులు, మహిళల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నా, భూముల ధరలు పెరగాలన్నా మళ్లీ కేసీఆర్ రావాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఎస్వీఎస్ మెడికల్ కళాశాల నుంచి ఎంబీసీ మైదానం వరకు బీఆర్ఎస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంబీసీ మైదానం నిర్వహించిన బీఆర్ఎస్ నూతన సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్‌తో సహా 14 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. అభ్యర్థిగా ఎవరున్నా గులాబీ జెండాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే పాలమూరు బిడ్డనంటూ రేవంత్ గద్దెనెక్కారు రెండేళ్లయినా ఒక్క పనీ చేయలేదు పాలమూరు నుంచే మున్సిపల్ ఎన్నికల జైత్రయాత్ర మహబూబ్‌నగర్‌లో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్‌శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి సీఎస్ రామకృష్ణారావు జిల్లా ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఫొటో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, ఎన్నికల నిర్వహణ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం తుది ఓటరు జాబితా ప్రకటించడం జరిగిందన్నారు. 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటన అనంతరం అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తామని.. 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నోడల్, జోనల్, సెక్టోరియల్ అధికారుల నియామకం, ఫ్లయింగ్, స్టాటిస్టిక్ సర్వేలైన్స్ బృందాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. అదే విధంగా నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూంల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్, మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీరాములు, నాగరాజు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు ప్రాధాన్యతనిచ్చి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 20 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించి అర్జీలు సమర్పించారు. -
మహిళలే కీలకం..!
పురుషులతో పోలిస్తే 10,891 మంది అధికం ఓటర్ల తుది జాబితా ఖరారు సోమవారం రాత్రి వరకు కొనసాగింది. దీంతో ఫొటోల వారీగా డివిజన్లు/వార్డుల ఓటర్ లిస్ట్‌ను మంగళవారం ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మిగిలింది డివిజన్లు/వార్డులు, పురపాలికల పీఠాల వారీగా ఎస్టీ, ఎస్టీ మహిళ, ఎస్సీ, ఎస్సీ మహిళ, బీసీ, బీసీ మహిళ, అన్రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌కు అనుగుణంగా ఆయా సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసేలా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈనెల రెండో వారంలో పురపాలికల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పురపాలికల ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదవీ కాలం పూర్తి కాని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మరో 18 పురపాలికలకు సంబంధించి సోమవారం తుది ఓటర్ల జాబితాను ఖరారు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జయాపజ యాల్లో వారి కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. పురుషులు 3,03,839.. మహిళలు 3,14,730 ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని 60 డివిజన్లు.. మరో 18 మున్సిపాలిటీల్లోని 316 వార్డుల పరిధిలో మొత్తం 903 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఫైనల్ చేశారు. ఈ మేరకు పురుష ఓటర్లు 3,03,839 మంది, మహిళా ఓటర్లు 3,14,730 మంది, ఇతర ఓటర్లు 35 మంది ఉన్నారు. ఈ లెక్కన పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 10,891 మంది అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, దేవరకద్ర, భూత్పూర్ పురపాలికల్లో మొత్తంగా పురుషుల కంటే 2,921 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో 2,409.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి పురపాలికల్లో 2,807.. నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో 2,053.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ పురపాలికల్లో మొత్తంగా 701 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. శాతాల వారీగా గమనిస్తే గద్వాల జిల్లాలో 2.58 శాతం మంది మహిళలు అధికంగా ఉన్నారు. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో 2.24 శాతం, వనపర్తిలో 2.05 శాతం, మహబూబ్‌నగర్‌లో 1.33 శాతం, చివరగా నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యల్పంగా 0.87 శాతం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇంటి నంబర్ల ప్రకారం ఓటు హక్కు కల్పించలేదని.. ఇతర వార్డుల్లో ఓట్లు నమోదయ్యాయని.. వేరే జిల్లాలు, గ్రామాలు, ఇతర ప్రాంతాల ఓటర్లు తమ వార్డుల్లో నమోదైనట్లు వందలాది మంది ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల పదో తేదీనే తుది ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా.. మరో రెండు రోజులు పొడిగించారు. ఈ మేరకు సోమవారం అధికారులు ఫైనల్ ఓటర్ల జాబితాను వెల్లడించగా.. ఇందులోనూ పలు అభ్యంతరాలకు పరిష్కారం చూపలేదని రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ప్రధానంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్, అయిజ, పెబ్బేరు, అమరచింత, మద్దూరు పురపాలికల్లో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదులు పరిష్కరించి.. తుది జాబితాను వెల్లడించినట్లు చెబుతున్నారు. మున్సిపాలిటీ/ డివిజన్లు/ పోలింగ్ ఓటర్లు.. కార్పొరేషన్ వార్డులు కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్‌నగర్ 60 279 97,636 1,00,191 14 1,97,841 దేవరకద్ర 12 12 4,909 5,161 0 10,070 భూత్పూర్ 10 11 5,975 6,089 0 12,064 వనపర్తి 33 95 31,655 32,527 8 64,190 కొత్తకోట 15 30 8,822 9,370 0 18,192 పెబ్బేరు 12 24 7,076 7,257 0 14,333 అమరచింత 10 18 4,364 4,783 0 9,147 ఆత్మకూరు 10 20 5,624 6,013 0 11,637 గద్వాల 37 78 31,730 33,630 10 65,370 అయిజ 20 26 11,233 11,790 0 23,023 అలంపూర్ 10 20 4,681 4,940 1 9,622 వడ్డేపల్లి 10 19 5,256 5,347 1 10,604 నారాయణపేట 24 54 17,244 18,216 0 35,460 మక్తల్ 16 35 11,407 11,938 0 23,345 కోస్గి 16 32 10,028 10,219 1 20,248 మద్దూర్ 16 20 6,171 6,530 0 12,701 నాగర్‌కర్నూల్ 24 48 17,460 17,918 0 35,378 కల్వకుర్తి 22 44 12,975 13,048 0 26,023 కొల్లాపూర్ 19 38 9,593 9,763 0 19,356 జిల్లాలవారీగా పురపాలికల ఓటర్లు ఇలా.. మున్సిపాలిటీ డివిజన్లు/ పోలింగ్ ఓటర్లు.. వార్డులు కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్‌నగర్ 82 302 1,08,520 1,11,441 14 2,19,975 వనపర్తి 80 187 57,541 59,950 08 1,17,499 జోగుళాంబ గద్వాల 77 143 52,900 55,707 12 1,08,619 నారాయణపేట 72 141 44,850 46,903 01 91,754 నాగర్‌కర్నూల్ 65 130 40,028 40,729 00 80,757 మొత్తం 376 903 3,03,839 3,14,730 35 6,18,604 పురపాలికల్లో తేలిన ఓటర్ల లెక్క ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో వెల్లడి జడ్చర్ల, అచ్చంపేటకు పూర్తి కాని పదవీ కాలం ఉమ్మడి జిల్లాలో పట్టణ ఓటర్లు 6,18,604 మంది పలు మున్సిపాలిటీల్లో పరిష్కారం కాని అభ్యంతరాలు? పురపాలికల వారీగా ఓటర్ల వివరాలు.. -
అన్ని బల్దియాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
నారాయణపేట: ప్రతి గ్రామం, పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన మరోసారి నియామకం కాగా.. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశ యువత ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపడం మొదలెట్టారన్నారు. ఇందుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే నిదర్శనమన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు, నాయకులతో కలిసి పనిచేస్తామన్నారు. పాత, కొత్త కాంగ్రెస్ అంటూ ఏమీ ఉండదని.. అందరూ సమానమేనని అన్నారు. మరో 15ఏళ్లు అధికారంలో ఉండే విధంగా పార్టీని పటిష్టం చేస్తామన్నారు. తన తండ్రి దివంగత వీరారెడ్డి బాటలో పయనిస్తూ ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని అన్నారు. తనకు మరోసారి అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ● డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి వార్డుకు రూ. కోటి చొప్పున రూ. 24కోట్లు తీసుకొస్తానని.. లేనిపక్షంలో మరోసారి ఓట్లు అడగనని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మున్సిపాలిటీని హస్తగతం చేసుకొని సీఎంకు కానుకగా ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కోఆర్డినేటర్ నూమాన్, టీపీసీసీ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీనుబాబు, చరణ్ జోషి, నంగి దేవేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, రాజీవ్‌రెడ్డి, మార్కెట్ కమిటీల చైర్మన్లు శివారెడ్డి, బెక్కరి అనిత, యువజన నాయకులు శివాంత్రెడ్డి, సత్తూర్ చంద్రకుమార్‌గౌడ్, జహీర్ అక్తర్, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు కాంతకుమార్, జిల్లా ఆర్టీఏ మెంబర్ పోష్ రాజేశ్‌కుమార్ పాల్గొన్నారు. -
వసూళ్లలో తగ్గిన దూకుడు
● లక్ష్యం చేరుకోవడంలో వెనకబడిన ఉమ్మడి జిల్లా ఆర్టీఏ శాఖ ● జీవితకాల ఫీజు, త్రైమాసిక పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం ● సిబ్బంది కొరతతో నామమాత్రంగా తనిఖీలు ● మూడు నెలల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం 2025–26లో కేటాయించిన లక్ష్యంలో డిసెంబర్ 31 వరకు చేరుకున్నది ఇలా.. (రూ.కోట్లలో..) పాలమూరు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆర్టీఏ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలల గడువు ఉన్న క్రమంలో అప్పటి వరకు ఇచ్చిన లక్ష్యం కంటే అధిక మొత్తంలో పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో వాహనాలకు జరిమానాలు, అధిక లోడ్, పత్రాలు లేకుండా, డ్రైవర్‌కు లైసెన్స్ లేకుండా తిరిగే వాహనాలకు జరిమానాలు విధించడానికి తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. జిల్లా ఆర్టీఏ శాఖ జీవిత కాల పన్నుతోపాటు ఫీజుల వసూలులోనూ పూర్తిగా వెనుకబడి ఉంది. ప్రధానంగా త్రైమాసిక పన్నులు అయితే పూర్తిగా తగ్గిపోవడంతో సమస్యగా మారింది. దీంతోపాటు తనిఖీల వల్ల వచ్చిన ఆదాయం కూడా తగ్గింది. ప్రతిరోజు తనిఖీలు చేయాలని లక్ష్యం ఉన్నా.. సిబ్బంది కొరత వల్ల అది సాధ్యం కావడం లేదు. అరకొరగా ఉన్న అధికారులు రోడ్ల మీద వాహన తనిఖీలకు వెళ్తే కా ర్యాలయంలో పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అధిక లోడ్.. పత్రాలు.. జిల్లాలో జాతీయ రహదారి–44 ఉండటంతో అధిక లోడ్ కలిగిన వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తుంటాయి.. అలాంటి వాహనాలపై ఆర్టీఏ శాఖ కొరడా ఝులిపిస్తుంది. అదేవిధంగా పత్రాలు లేకుండా కూడా అధిక సంఖ్యలో వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాహనాల కోసం ఆర్టీఏ శాఖ వారు జాతీయ రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు పత్రాలు లేకుండా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి సర్వీస్ ఫీజు, డిటెక్షన్, గ్రీన్‌ట్యాక్స్ వసూలులో లక్ష్యానికి మించి సాధించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వసూలు చేసిన పన్నుల వివరాలు పన్ను రకాలు లక్ష్యం వసూలు చేసింది శాతం (రూ.లక్షల్లో..) మూడునెలల పన్ను 1,735.01 1,639.03 94.46 జీవితకాల పన్ను 5,301.00 4,230.19 79.79 ఫీజులు 990.00 798.84 80.69 సర్వీస్ ఫీజు 243.00 295.46 121 డిటెక్షన్ 207.00 338.68 163 గ్రీన్‌ట్యాక్స్ 117.00 119.28 101 జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నాం. ప్రత్యేక టీంల ద్వారా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేసి ఆదాయం పెరిగే విధంగా చూస్తాం. జీవిత కాల బీమా, నూతన వాహనాల ట్యాక్స్ ఇతర ఆదాయ మార్గాల్లో లక్ష్యం పూర్తి చేస్తాం. మరో మూడు నెలల గడువు ఉన్న నేపథ్యంలో అన్ని రకాల వాహనాల ధ్రువపత్రాలపై తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తాం. – రఘుకుమార్, ఆర్టీఓ, మహబూబ్‌నగర్ -
బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలని హైదరాబాద్ ప్రాంతీయ విద్యా సంచాలకులు ఎం.సోమిరెడ్డి అన్నారు. జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (ఎన్ఐఈపీఏ– నీపా) ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన కేజీబీవీల ప్రత్యేకాధికారులకు సాధికారతపై నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ తరగతులు ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల అభ్యున్నతికి నాణ్యమైన విద్యతోపాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రుల వద్ద కంటే విద్యార్థినులు ఎక్కువ సమయం ఉపాధ్యాయులు, వార్డెన్లతోనే గడుపుతారని వారి భవిష్యత్ కేజీబీవీల ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థినులకు ఉత్తమ విద్య, అవసరమైన సౌకర్యాలు కల్పించడమే గాక సత్ప్రవర్తనతో ఆదర్శంగా మెలగాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను కేజీబీవీలలో తప్పక అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీసీడీఓలు అర్షాఖాద్రీ, సంగీత, మాస్టర్ ట్రైనర్లు నాయుడు, పల్లవి, శివలీల, నర్మద తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం.. గ్రీన్ గంగాపురం
జడ్చర్ల టౌన్: స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని మండలంలోని గంగాపురం గ్రామంలో 6 మంది సభ్యులతో 2013 ఏడాదిలో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ (స్వామి వివేకానంద యూత్) పేరిట ఏర్పాటైనన యువజన సంఘం నేడు 222 మంది సభ్యులకు చేరింది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రతిఒక్కరిలోనూ సేవాభావం పెంపొందిస్తున్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం గ్రామంలో విరాళాలు సేకరించి అప్పటి కలెక్టర్‌కు అందజేశారు. తొలి అడుగు విజయవంతం కావడంతో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ సంఘం నమోదు చేయించారు. 6 మందితో ప్రారంభమైన సంఘంలో ప్రస్తుతం 222 మంది సభ్యులు చేరారు. ఎన్నో భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా గ్రీన్ గంగాపురంగా మార్చడానికి కృషిచేస్తున్నారు. -
నేడు డయల్ యువర్ ఎస్పీ
నారాయణపేట: సమస్యల పరిష్కారానికిగాను సోమవారం డ యల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. ప్రజలు, ఫిర్యాదుదారులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఎస్పీ కార్యాలయ నంబర్ 08506281182కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని సూ చించారు. ఫిర్యాదులు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడతామని.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలం: బీఆర్ఎస్ కోస్గి రూరల్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన పుర ఎన్నికల సన్నాహాక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న కోస్గిని 2018లో పురపాలికగా అప్‌గ్రేడ్ చేశామని, రూ.8 కోట్లతో సయ్యద్ పహాడ్ దర్గా నుంచి ఏబీకే ఫంక్షన్‌హాల్ వరకు రహదారి విస్తరణ చేపట్టామని, నాటి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి భూత్పూర్–చించోలి డబుల్ రోడ్డు పనులు చేయించామన్నారు. కోస్గిలో కూరగాయల మార్కెట్, పార్కులు ఏర్పాటు చేశామని, తమ హయాంలో 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 30 పడకలకు తగ్గించారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కొనుగోలు చేసిన భూముల విలువ పెంచుకోవడానికే ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలను హకీంపేటకు తరలించారని ఆరోపించారు. రేవంత్ అబద్దపు హామీలపై ఇంటింటా ప్రచారం చేపడతామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రైతులే స్వయంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వెంకట్‌నర్సింహులు, జనార్దన్, సాయిలు, బందెప్ప, సాయిలు, ఉసెనప్ప, మధుసూదన్‌రెడ్డి, నీలప్ప, వెంకట్రాములు పాల్గొన్నారు. ‘నారాయణపేటహస్తగతం కావాలి’ నారాయణపేట: పురపాలిక ఎన్నికలపై కాంగ్రెస్‌పార్టీ నారాయణపేట నియోజకవర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించా రు. ఆదివారం జిల్లాకేంద్రంలో 24 వార్డుల ముఖ్యనాయకులు, కార్యకర్తలతో వార్డుల వారీగా అభిప్రాయసేకరణ చేపట్టడంతో పాటు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించా రు. ఇప్పటి వరకు 150కిపైగా దరఖాస్తులు అందాయి. స్థానిక పురపాలికను హస్తగతం చేసుకునేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్దులై నడవా లని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఆధ్వర్యంలో పురపాలికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కా ర్డులు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత ప్ర యాణం తదితర పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు గెలిచే వారికే టికెట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, ఆర్టీఓ సభ్యుడు రాజేశ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ సలీం పాల్గొన్నారు. నేడు డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం నారాయణపేట: డీసీసీ అధ్యక్షుడిగా కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి సోమవారం జిల్లాకేంద్రంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని మెట్రో ఫంక్షన్హాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఏనుముల తిరుపతిరెడ్డి, కుంభం శివకుమార్‌రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షులు, గ్రంథాలయ చైర్మన్లు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
మున్సిపోల్స్‌కు కసరత్తు..!
72 వార్డుల మ్యాప్‌లు సిద్ధం.. 150 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ● మూడు పురపాలికల్లో పాత వార్డులే.. ● కొత్తగా ఏర్పాటైన మద్దూర్‌లో 16 వార్డుల విభజన ● ఆర్ఓల నియామకానికి ఆదేశాలు నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ముసాయిదా ఓటరు జాబితాను పుర అధికారులు ఇటీవల విడుదల చేయగా.. తుది జాబితా రూపకల్పనకు కసరత్తు చేస్తున్నారు. 4 పురపాలికలు.. 72 వార్డులు... జిల్లాలోని నారాయణపేట, కోస్గి, మక్తల్ మున్సిపాలిటీలు పాతవే కావడంతో వార్డుల మార్పు జరగలేదు. నారాయణపేటలో 1,800 ఓట్లున్న వార్డులో మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్కో వార్డుకు ఒకటి లేదా రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మక్తల్, కోస్గి విలీన గ్రామపంచాయతీలు, శివారు ప్రాంతాలు కలిగిన వార్డుల్లో రెండు, మూడు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తారా లేక 1,600 ఓట్లలోపు ఉండటంతో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారా అనేది అధికారులు నిర్ణయించాల్సి ఉంది. ఫొటో ఓటరు జాబితాతో పాటు వార్డు, పోలింగ్ కేంద్రాలపై ఫిర్యాదులు, అభ్యంతరాలను సంబంధిత కమిషనర్‌కు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అందజేయడంతో వాటిని పరిశీలించి పరిష్కారం చూపినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ జాబితాపై రాజకీయ నాయకులతో పట్టణ, జిల్లాస్థాయిలో చర్చించి తుది ఓటరు జాబితాను ప్రచురించేందుకు కసరత్తు చేస్తున్నారు. అధికారుల నియామకానికి ఆదేశాలు.. రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు సీడీఎంఏ నుంచి ఉత్తర్వులు అందాయి. ప్రతి రెండు, మూడు వార్డులను ఓ క్లస్టర్‌గా ఏర్పాటుచేసి వాటికి ఆర్ఓ, ఏఆర్వోను నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ● మద్దూర్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటు కావడంతో వార్డుల విభజన చేసి మ్యాపులను రూపొందించారు. మొత్తం 16 వార్డులు కాగా.. పట్టణంలో 9 వార్డులు, విలీన గ్రామాలైన రెనివట్ల, భీంపురం, నాగంపల్లి, సాపన్‌చెరువుతండా, ఎర్రగుంటతండాలతో 7 వార్డులుగా మ్యాపులను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డులో రెండు పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 72 వార్డుల్లో వార్డుకు రెండు చొప్పున, నారాయణపేటలో అదనంగా ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పుర అధికారులు కేంద్రాలను పరిశీలించి ఫైనల్ చేస్తున్నారు. రిజర్వేషన్లపై ఉత్కంఠ.. అధికారులు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాల వివరాలు సేకరించారు. వీటి ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతుండటంతో.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు పురపాలికల్లోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయా పార్టీల ప్రతినిధులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రిజర్వేషన్ ఏ విధంగా వస్తుందోననే ఉత్కంఠ ఆశావాహుల్లో కనిపిస్తుంది. ఆశావహులు వార్డుల్లో తిరుగుతూ రిజర్వేషన్ అనుకూలిస్తే బరిలోకి దిగుతామని.. ఆశీర్వదించాలని ప్రచారం చేసుకుంటున్నారు. -
సేవ చేయడం అదృష్టం..
ఆత్మకూర్‌లో వివేకానంద సేవాసమితిని నెలకొల్పిన నాటి నుంచి యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నాం. రక్తదాన, వైద్యశిబిరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. పేదలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. – బాలు, సేవాసమితి అధ్యక్షుడు, ఆత్మకూర్ ఆత్మకూర్: పట్టణానికి చెందిన డాన్స్‌మాస్టర్ బాలు, మ్యాడం శ్రీను, ల్యాబ్ టెక్నీషియన్ రాజేశ్ తదితరులు ఎనిమిదేళ్ల క్రితం స్వామి వివేకానంద సేవాసమితిని నెలకొల్పి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం క్లాత్ సంచులను పంపిణీ చేస్తున్నారు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. ఇప్పటివరకు 275 మందితో రక్తదానం చేయించారు. నేత్రం ఫౌండేషన్ సహకారంతో విద్యార్థుల్లో కంటి లోపాలను గుర్తించి.. చికిత్స అందేలా చూస్తున్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. ●తలసేమియా బాధితులకు అండగా.. -
సేవాతత్పరులు
స్వామి వివేకానంద.. తన జీవన విధానంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన మహనీయుడు. లక్ష్యం లేకుండా పయనించే యువతకు ఆయనే ఓ దిక్సూచి. మానవ సేవయే.. మాధవసేవగా భావించి సామాన్య ప్రజలపై అసామాన్య సానుభూతిని కనబరిచిన మానవతావాది. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది యువకులు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆశించకుండా మనల్ని మనమే సంస్కరించుకోవాలని ముందడుగు వేస్తున్నారు. రక్తదానం, అన్నదానం, విద్యాదానం, విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్లు పంపిణీ, మొక్కల పెంపకం, శ్రమదానంతోపాటు.. సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం కల్పిస్తూ ఇతరుల్లోనూ స్ఫూర్తిని రగిలిస్తున్నారు. ఏటికేడాది తమ లక్ష్యాలను మార్చుకుంటూ.. వాటి సాధన కోసం అవిశ్రాంతగా శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారు. సోమవారం స్వామి వివేకానందుడి జయంతి (జాతీయ యువజన దినోత్సవం)ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్న యువజన సంఘాలపై ప్రత్యేక కథనం.. ముందుండి.. రక్తదానం నవాబుపేట: సేవా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన రక్తదానాలకు పెట్టింది పేరు నవాబుపేట స్వామి వివేకానంద సేవాసమితి. మరికొందరు యువత తమ తల్లిదండ్రుల పేరుతో సంస్థలను స్థాపించి.. పేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు ఒకరు ఏర్పాటు చేస్తుంటే.. మరొకరు అన్నదాన కార్యక్రమాలు, పేదలకు ప్రతినెలా కొంత ఆర్థిక సాయం అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సామాజిక సేవలో యువతరం రక్తదానం, అన్నదానంతోపాటు ప్రగతిలో మమేకం సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు.. నేడు జాతీయ యువజన దినోత్సవం -
అప్రమత్తతతోనే చోరీల నియంత్రణ : ఎస్పీ
నారాయణపేట: ప్రస్తుత సంక్రాంతి సెలవుల్లో చాలామంది కుటుంబాలతో కలిసి స్వగ్రామాలకు వెళ్తుంటారని.. ఇదే అదనుగా భావించి దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తూ చోరీలకు పాల్పడతారని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డా. వినీత్ పేర్కొన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని.. సిబ్బంది రాత్రిళ్లు గస్తీ నిర్వహిస్తారని చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటి చిరునామా, ఫోన్న్నంబర్ సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేయిస్తే నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఇరుగు పొరుగు వాళ్లకు తరచూ గమనిస్తూ ఉండాలని చెప్పడంతో పాటు ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాల్స్‌లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలో నిలపాలని సూచించారు. బీరువా తాళం చెవులను వెంట తీసుకెళ్లాలని, ఇళ్లకు వేసిన తాళం కనిపించకుండా డోర్ కర్టెనన్ వేయాలని, ఇంట్లోని ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలన్నారు. ఇంటి ఎదుట చెత్తా చెదారం, పాల ప్యాకెట్లు జమకాకుండా చూడాలని, ప్రయాణం చేస్తున్నప్పుడు బంగారు నగలు, డబ్బు దగ్గరలో పెట్టుకోవాని సూచించారు. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, సభ్యులు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ సెల్‌నంబర్ 87126 70399 సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి ధన్వాడ: ప్రతి రైతు ప్రత్యేక గుర్తింపు నంబర్ కోసం ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ కోరారు. శనివారం మండలంలోని కిష్టాపూర్, మందిపల్లి గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే పథకాల కోసం ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తుందన్నారు. ఇందుకోసం ఆధార్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కు లింక్ ఉన్న మొబైల్ నంబర్‌తో ఏఈఓ లేదా సమీప మీసేవా కేంద్రానికి వెళ్లి నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రతి రైతువేదికలో నమోదు కార్యక్రమం కొనసాగుతోందని.. సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయశాఖ అధికారి నవీన్‌కుమార్, సర్పంచ్ కొండయ్య, సురేందర్‌రెడ్డి, ఏఈఓలు జైన్‌సింగ్, రాజు ఉన్నారు. కేటీఆర్ సభ ఏర్పాట్ల పరిశీలన జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 12న పాలమూరుకు వస్తున్నారని.. పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎంబీసీ మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుమెంబర్లను కేటీఆర్ సన్మానిస్తారని పేర్కొన్నారు. సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు శివరాజు, మున్నూరు రాజు, ప్రభాకర్ పాల్గొన్నారు. నేడు పాలమూరులో బీసీ న్యాయసభ మెట్టుగడ్డ: 42శాతం బీసీ రిజర్వేషన్ల సాధన – 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్‌తో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం బీసీ సామాజిక న్యాయసభను నిర్వహిస్తున్నట్లు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు రమేశ్‌గౌడ్ ప్రకటనలో తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఫౌండర్ చైర్మన్ చిరంజీవులు, మాజీ సుప్రీం కోర్టు జడ్జి జస్టీస్ ఈశ్వరయ్య, వి శారదన్ మహారాజ్, సంగెం సూర్యారావు పా ల్గొంటున్నట్లు తెలిపారు. కావున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. -
పెద్ద పులులు.. వన్యప్రాణులు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ అధికారులు టైగర్ సఫారీ ద్వారా పెద్ద పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులు, అడవి అందాలను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నల్లమలలో 34 వరకు పెద్ద పులులు, వందకుపైగా చిరుతలు, ఎలుగుబంట్లు, వందల సంఖ్యలో జింకలు, దుప్పులు, మనుబోతులు, అడవి పందులు, అడవి కుక్కలు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. టైగర్ సఫారీ వాహనంలో ప్రయాణించే సందర్శకులకు తరచుగా వన్యప్రాణులు కనిపిస్తున్నాయి. ఇటీవల 20 రోజుల వ్యవధిలోనే సందర్శకులకు మూడుసార్లు పెద్ద పులులు కనిపించాయి. ఎలుగుబంట్లు, జింకలు, మనుబోతులు ఇక్కడికి వస్తున్న సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నల్లమలను సందర్శించాలనుకునే పర్యాటకులు అటవీశాఖ టైగర్ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్ సఫారీ ట్రిప్‌ను అందిస్తోంది. సఫారీ వాహనంలో ప్రయాణించాలనుకునే సందర్శకులు హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ఉన్న ఫర్హాబాద్ గేటు వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. -
పరవశించే మది
ప్రకృతి ఒడి..ఆక్టోపస్ వ్యూపాయింట్ సఫారీ టూర్ కోసం పర్యాటకులు (amrabadtigerreserve.com) వెబ్సైట్నుసందర్శించి ముందస్తుబుకింగ్ చేసుకోవచ్చు. ఒకవైపు చుట్టూ దట్టమైన నల్లమల.. మధ్యలో కృష్ణమ్మ సెలయేరు.. చీమ చిటుకుమన్నా వినిపించేంత నిశ్శబ్దం.. మరోవైపు పెద్ద పులుల గాండ్రింపు.. చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, దుప్పుల చప్పుళ్లు.. ఇక ఎటువైపు చూసినా వివిధ రకాల పక్షుల కిలకిలరావాల మధ్య.. ప్రకృతితో మమేకమై సాగే నల్లమల జంగిల్ సఫారీ టూర్ పర్యాటక ప్రియులకు మరచిపోలేని అనుభూతినిస్తోంది. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన టైగర్ స్టే ప్యాకేజీ, టైగర్ సఫారీలకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తూ నల్లమల అందాలు, వన్యప్రాణులను కనులారా వీక్షిస్తున్నారు. 24 గంటలపాటు రణగోనుల ప్రపంచానికి దూరంగా.. ప్రకృతితో మమేకమవుతూ.. రోజంతా ఆనందంగా గడుపుతూ మైమరిచిపోతున్నారు. – సాక్షి, నాగర్‌కర్నూల్ నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీశాఖ చేపట్టిన టైగర్ స్టే ప్యాకేజీ, టైగర్ సఫారీలకు విశేష స్పందన లభిస్తోంది. సాధారణం కన్నా శని, ఆదివారాలతోపాటు సెలవు రోజుల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత రెండు నెలల వ్యవధిలో సుమారు 8 సార్లు పెద్ద పులి కనిపించడం విశేషం. జంగిల్ సఫారీలో నిత్యం పర్యాటకులకు పులులతోపాటు చిరుతలు, వన్యప్రాణులు తారసపడుతూ కనువిందు చేస్తున్నాయి. దీంతో అటవీశాఖ అమలుపరుస్తున్న టైగర్ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్ సఫారీ కోసం పెద్దసంఖ్యలో సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.రెండు రోజులపాటు.. పర్యాటక ప్రియులను ఆకర్షిస్తున్న నల్లమల టూరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఫర్హాబాద్, ఆక్టోపస్ వ్యూపాయింట్లు జంగిల్ సఫారీలో పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల కనువిందు వారాంతాలు, సెలవు రోజుల్లో విశేషంగా పెరుగుతున్న ఆదరణ రెండు రకాల ప్యాకేజీల్లో అవకాశం కల్పిస్తున్న అటవీశాఖ -
సీఎంకు రుణపడి ఉంటాం..
గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నా. ప్రస్తుతం నిర్మాణానికి అడుగులు పడగా.. తాత్కాలిక రోడ్డు పనులు పూర్తయి గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఏళ్లనాటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం. – మహేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి (గద్వాల) మండలంలోని జూరాల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి ఎంతో శ్రమించారు. కొందరు కావాలని అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురిచేసినా సీఎంను ఒప్పించి రూ.123 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. – పరమేష్, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు, ఆత్మకూర్ మా ఊరి మీదుగా ఆత్మకూర్, గద్వాలకు వాహనాలు తిరుగుతుంటే సందడిగా మారింది. గతంలో మా గ్రామంవైపు కన్నెత్తి చూడనివారు సైతం ఊరి మీదుగా ప్రయాణం చేస్తున్నారు. ఊరి రూపురేఖలు మారడం ఖాయం. – నర్సింహ, సర్పంచ్, జూరాల (ఆత్మకూర్) ● -
వెట్టి నుంచి విముక్తి
నారాయణపేట: పాఠశాలలకు వెళ్లాల్సిన చిన్నారులు పని బాట పడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు తెలిసో తెలియకో తమ పిల్లలను పనులకు పంపించి బాలకార్మికులుగా మారుస్తున్నారు. బడిఈడులో బాధ్యతలు మీదేసుకొని ఆ పనుల్లోనే మగ్గిపోతున్నారు. అలాంటి బాలల భవిష్యత్ అంధకారం కాకుండా ప్రభుత్వం ఏటా ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తప్పిపోయిన, బాలకార్మికులుగా పనిచేస్తున్న వారి ని గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తూ పాఠశాలలో చేర్పిస్తున్నారు. చిన్నారులతో పనులు చేయిస్తే యజమానులపై కేసులు సైతం నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడటం లేదు. స్పెషల్ డ్రైవ్.. ఎస్పీ డా. వినీత్ దిశానిర్దేశంలో ఈ ఏడాది పోలీసు, కార్మిక, ఐసీడీఎస్ శాఖలు సంయుక్తంగా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమం నిర్వహిస్తూ బాల కార్మికులను గుర్తించేందుకు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ చేపట్టి 1,125 మంది బాలకార్మికులను గుర్తించారు. బాలలను పనుల్లో పెట్టుకున్న 59 మంది యజమానులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ప్రత్యేక బృందాలతో.. బాలకార్మికులను గుర్తించి పని నుంచి విముక్తి కల్పించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది, కార్మికశాఖ, చిల్డ్రన్, 1098, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, బాలరక్ష భవన్, సఖి, ఐసీడీసీ అధికారులు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. బాలల హక్కులు కాపాడేందుకు పోలీసు, ఇతర విభాగాలు కలిసి బృందాలుగా ఏర్పడి బస్టాండ్లు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు ఇతర ప్రదేశాలపై నిఘా ఉంచి ఆకస్మిక దాడులు చేసి బాల కార్మికులను గుర్తించారు. 9 రోజుల్లో 21 మంది.. బాలకార్మికులకు వెట్టి నుంచి విముక్తి కల్పిస్తూ వారి ముఖాల్లో చిరునవ్వు నింపడమే ధ్యేయంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా తొమ్మిది రోజుల్లో 21 మంది బాలలను గుర్తించి.. 16 మందిపై కేసులు నమోదు చేశారు. 12వ విడత ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం 31వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లాలో ఏడేళ్లుగా ఆపరేషన్ స్మైల్ కింద 604 మందికి, ఆపరేషన్ ముస్కాన్ కింద 521 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. అయితే ఈ ఏడాది చేపట్టిన ఆపరేషన్ స్మైల్‌లో 21 మంది చిన్నారులకు విముక్తి కల్పించడంతో 625 మందికి చేరినట్లయింది. జిల్లాలో కొనసాగుతున్నఆపరేషన్ స్మైల్ ఇప్పటి వరకు 21 మంది చిన్నారుల గుర్తింపు ఏడేళ్లలో 1,125 మంది బాలకార్మికులు -
చదువును మించిన ఆయుధం లేదు
కోస్గి: జీవితంలో విజయం సాధించాలంటే చదువును మించిన ఆయుధం ఏదీ లేదని.. శ్రద్ధగా చదివి ఉన్నతంగా ఎదగాలని జిల్లా న్యాయమూర్తి వింద్యానాయక్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ఆధ్వర్యంలో ‘రోడ్డు భద్రత, విద్యశ్రీపై నినాదాల తయారీ, పోస్టర్ మేకింగ్ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. మండలంలోని మీర్జాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చగా.. శుక్రవారం జిల్లా న్యాయస్థానంలోని తన చాంబర్లో విజేతలు నవ్యశ్రీ, మమత, అక్షితకు బహుమతులు అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జనార్దన్, ఉపాధ్యాయుడు వార్ల మల్లేషం తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్ టార్చ్ ర్యాలీ కోస్గి రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలు చక్కటి అవకాశమని జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేష్‌శెట్టి అన్నారు. సీఎం కప్ పోటీల్లో భాగంగా శుక్రవారం గుండుమాల్ మండల కేంద్రంలో టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 18 నుంచి 26 వరకు పాఠశాల స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ మొదలైన క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎం కప్ ఇన్చార్జి సాయినాథ్, ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, మండల తహసీల్దార్ భాస్కర్‌స్వామి, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, మండల విద్యాధికారి శేఖర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీశైల, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఊమెఆస్రా, మండల అధ్యక్షులు విక్రంరెడ్డి తదితరులు ఉన్నారు. వరి క్వింటా రూ.2,703 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం వరి ధాన్యం (సోన రకం) క్వింటా గరిష్టంగా రూ.2,703, కనిష్టంగా రూ.1,500 ధర పలికింది. అదేవిధంగా తెల్ల కంది గరిష్టంగా 7,659, కనిష్టంగా 5,550, ఎర్ర కంది గరిష్టంగా రూ.7,625, కనిష్టంగా రూ.5,551 ధరలు లభించాయి. ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2809 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,809, కనిష్టంగా రూ.1,729 ధరలు పలికాయి. అలాగే హంస రూ.1,871, కందులు గరిష్టంగా రూ.6,876, కనిష్టంగా రూ.5,056, వేరుశనగ గరిష్టంగా రూ.8,733, కనిష్టంగా రూ.6,903, ఉలువలు రూ.3,610, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,975, కనిష్టంగా రూ.1,777 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు రూ.5,720గా ఒకే ధర లభించింది. పార్టీ బలమున్న స్థానాల్లో పోటీ : సీపీఎం వనపర్తి రూరల్: రాబోయే పుర ఎన్నికల్లో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బలమున్న స్థానాల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బాలస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు అవకాశం ఇవ్వాలని, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు తదితర వర్గాల అభ్యున్నతికి పార్టీ పని చేస్తోందన్నారు. నేటి రాజకీయాలు వ్యాపారంగా మారాయని.. డబ్బు, మద్యం తదితర తాత్కాలిక ప్రయోజనాలను చూయించి ఓట్లు దండుకొంటున్నారని చెప్పారు. అభివృద్ధిని మరిచే రాజకీయాలు నేడు ఉన్నాయని.. నీతి, నిజాయితీతో ప్రజల కోసం పాటు పడుతున్న పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శులు పుట్టా ఆంజనేయులు, ఎండీ జబ్బార్, కార్యదర్శివర్గ సభ్యులు బాల్‌రెడ్డి, ఎం.రాజు, ఎ.లక్ష్మి, పట్టణ కార్యదర్శి పరమేశ్వరాచారి, సీపీఎం నాయకులు కురుమయ్య, రమేష్, గట్టయ్య, బీసన్న, గంధం మదన్, బాలరాజు, ఉమా, సాయిలీల, రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు. -
ఊట్కూరును ముంపు గ్రామంగా ప్రకటించాలి
ఊట్కూరు: ముంపు గ్రామంగా ప్రకటించాలని మండలకేంద్ర ప్రజలు శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఊట్కూరు, దంతన్‌పల్లి శివారులో భూములు కోల్పోతున్న రైతుల వివరాలు చదివి వినిపించారు. ఎవరికై నా అభ్యంతరాలుంటే ఫిర్యా దు చేయాలని అధికారులు సూచించారు. ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ఇంతవరకు విడుదల చేయలేదని, పెద్ద చెరువు రిజర్వాయర్‌గా మారితే భవిష్యత్‌లో గ్రామానికి ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు గ్రామస్తులు ఆయనకు వివరించారు. అలుగుపారే సమయంలో చిన్న గుంత తీసినా ఊటనీరు వస్తుందని, గ్రామం జలమయంగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. రిజర్వాయర్ కట్ట ఎత్తు, పొడవు, విస్తీర్ణం తదితర వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడి పూర్తి సమాచారం తీసుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తానని గ్రామస్తులకు హాహీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్, తహసీల్దార్ చింత రవి, విండో అధ్యక్షుడు బాల్‌రెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అరవింద్‌కుమార్, నాయకులు భరత్, శివారెడ్డి, రమేష్, మోనప్ప తదితరులు పాల్గొన్నారు. -
మక్తల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా
● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: స్థానిక పురపాలికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం పట్టణంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి మాట్లాడారు. ట్యాంకుబండ్‌పై రూ. 3.70 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని.. సుందరీకరణకు నిధుల కొరత లేదని, వేగంగా పూర్తి చేయాలని ఏఈ నాగశివను ఆదేశించారు. చెరువు దగ్గర బోటింగ్, ఈదమ్మ ఆలయం దగ్గర ఘాట్ నిర్మించాలని, వీధిదీపాలు అమర్చాలని సూచించా రు. పర్యాటకులు కూర్చోడానికి కట్టపై సిమెంట్ కు ర్చీలు ఏర్పాటు చేయాలని, కట్టపై కిలోమీటర్ పొడవునా సీసీ రోడ్డు వేయాలని కోరారు. వినాయక నిమజ్జనానికి ప్రత్యేకంగా ఘాట్ నిర్మించాలన్నారు. అదేవిధంగా 16వ వార్డులో సీసీ రహదారి నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. రూ.25 కోట్లతో నిర్మిస్తున్న క్రీడా మైదానం పనులు, రూ.43 కోట్లతో నిర్మాణంలో ఉన్న 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పట్టణాభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోళ్ల వెంకటేశ్, మార్కెట్ డైరెక్టర్లు ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్‌కుమార్‌రెడ్డి, గోవర్ధన్, రవికుమార్, రాజేందర్, రహీం పటేల్, శంషోద్దీన్, ఎండీ సలాం, కట్టా సురేశ్, భాస్కర్ తదితరులు ఉన్నారు. -
సిబిల్ సప్లయ్..!
ఉమ్మడి పాలమూరు జి ల్లాలో 2020 నుంచి న వంబర్ వరకు 148 మంది మిల్లులను డీఫాల్ట్‌గా గుర్తించి.. 52 మిల్లులపై కేసులు నమోదు చేశారు. వీటి పరిధిలో రూ.566 కోట్ల విలువైన ధాన్యం ఉంది. ఇందులో రూ.450 కోట్ల విలువైన ధాన్యాన్ని రాబట్టాల్సి ఉండగా..ఈ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. పైగా ఆయా రైస్ మిల్లర్ల చేతిలోని మిల్లులు సహకరించే అధికారులు, నేతలకు అక్షయపాత్రగా మారాయి. దీనిపై విజిలెన్స్, ఎన్ఫోర్మెంట్ అధికారులు సైతం సందర్భాన్ని బట్టి దాడులు నిర్వహించి.. చేతులు తడుపుకొని పోతారనే విమర్శలూ ఉన్నాయి. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న క్రమంలో ప్రభుత్వ పెద్దలు ఆ శాఖపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలోనే మిల్లర్ల అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గ్రహించిన విజిలెన్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అవినీతికి కేరాఫ్‌గా నిలిచిన సివిల్ సప్లయ్ శాఖపై ముప్పేట దాడులు కొనసాగుతున్నాయి. ఒకవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, మరోవైపు అవినీతి నిరోధకశాఖ దూకుడు పెంచడంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రధానంగా ఇటీవల వనపర్తి జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం జగన్మోహన్ రెడ్‌హ్యాండెడ్‌గా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం.. ఆ తర్వాత ఆ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డీఎస్‌ఓలను సైతం విచారించడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టరేట్ వేదికగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఉమ్మడి పాలమూరులో సంచలనం సృష్టిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి మొదలు పైస్థాయి దాకా లంచాల్లో వాటాల పంపకాలు నిత్యకృత్యంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లతో ‘దోస్తాన్’ దందాతోనే.. మర ఆడిచేందుకు ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన సీఎమ్మార్ ధాన్యంలో మిల్లర్ల అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. పెట్టుబడి పెట్టకుండా అవకతవకలకు పాల్పడుతూ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమాలను అరికట్టాల్సిన సివిల్ సప్లయ్ శాఖ మిన్నకుండిపోయింది. ప్రధానంగా మిల్లర్ల నుంచి ఆ శాఖకు చెందిన పలువురు సిబ్బంది, అధికారులు కుమ్మకై ్క నెల నెలా లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకరించని మిల్లర్లను నానా తిప్పలు పెట్టి దారికి తెచ్చుకున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఇలా మిల్లర్లతో పౌర సరఫరాల శాఖ అధికారులు దోస్తాన్ దందాకు తెగబడడంతో ప్రధానంగా వనపర్తిలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్.. ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఏ‘సీ’బీ.. చిక్కిన డీఎం వనపర్తి జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. కొత్తకోట మండలంలోని ఓ రైస్ మిల్లుకు సంబంధించి సీఎమ్మార్ అనుమతి కోసం రూ.1.70 లక్షలు డిమాండ్ చేశాడు. గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్లోని తన కార్యాలయం నుంచి బయటకు వెళ్తూ కారులో మిల్లు నిర్వాహకులను ఎక్కించుకుని తొలి విడతగా రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటనతో పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకున్న అవినీతి పర్వం, అధికారుల ధనదాహం మరోసారి వెలుగుచూసినట్లయింది. ముందుగావిజి‘లెన్స్’.. డీఎస్ఓ, అడిషనల్ కలెక్టర్‌పై విచారణతో.. పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ను వల పన్ని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు తాజాగా శుక్రవారం డీఎస్ఓ కాశీనాథం, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కీమ్యానాయక్ను విచారించడం సంచలనం సృష్టిస్తోంది. ఉదయం కలెక్టరేట్లోని డీఎం కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు వారిని పిలిపించుకున్నారు. సుమారు ఏడు నుంచి పది గంటల వరకు ఇద్దరు జిల్లాస్థాయి అధికారులను విచారించడం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. పౌర సరఫరాల శాఖలో లంచావతారులు కింది స్థాయి నుంచి పైదాకా వాటాల పంపకాలు? రూ.50 వేలతో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన వనపర్తి డీఎం తాజాగా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డీఎస్‌ఓలపై విచారణతో కలకలం ఓ వైపు విజిలెన్స్, మరోవైపు అవినీతి నిరోధక శాఖ దాడులు ఉమ్మడి పాలమూరులో అధికారులఉక్కిరిబిక్కిరి -
నేరాల నియంత్రణకు చర్యలు
నారాయణపేట: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ వినీత్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, గ్రేవ్, నాన్ గ్రేవ్, పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. దర్యాప్తులో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి త్వరగా కేసులు పరిష్కరించాలన్నారు. పెండింగ్ కేసులు తగ్గించేందుకు న్యాయ, వైద్య అధికారులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తిచేసి చార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని, షీటీం, స్థానిక పోలీసులు, ప్రజలకు సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్రాంతి పండుగకు ప్రజలు ఊర్లకు వెళ్తుంటారని, చోరీలు జరగకుండా నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు. నీతి నిజాయితీగా విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా డీటీఓ అధికారులతో కలిసి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించాలని, పాత నేరస్తులపై నిఘా ఉంచి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన డీఎంహెచ్ఓ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, రెవెన్యూ అధికారులను ఎస్పీ శాలువాలతో సత్కరించి పూల మొక్కలు అందించి అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, డీఎంహెచ్ఓ డా. జయచంద్రమోహన్, ఆర్టీఓ మెగాగాంధీ, రిటైర్డ్ రెవెన్యూ అధికారి బాలాజీ సఫారీ, సీఐలు శివశంకర్, రాజేందర్‌రెడ్డి, రాంలాల్, సైదులు, ఎస్ఐలు వెంకటేశ్వ ర్లు, రాజు, రాముడు, విజయ్‌కుమార్, బాలరాజు, రాజశేఖర్, అశోక్‌బాబు, రమేష్, రాము, నవీద్, సు నీత, గాయత్రి, రేవతి, మహేశ్వరి పాల్గొన్నారు. -
గురుకులాల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
మరికల్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత పెంచే లక్ష్యంతో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పని చేయాలని ఏడో జోనల్ ఆఫీసర్ విద్యులత అన్నారు. విద్యార్థుల వంద శాతం ఉతీర్ణత సాధించడం కోసం ప్రభుత్వం తీసుకవచ్చిన మార్క్ కార్యక్రమంలో భాగంగా మరికల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల్లో గురువారం ఉమ్మడి జిల్లాలోని 32 ప్రిన్సిపాల్స్‌కు, 150 మంది ఉపాధ్యాయులకు ఈ విషయంపై ఒకరోజు శిక్షణ తరగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని 32 బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో పదో తరగతి నుంచి 2432 మంది విద్యార్థులు, ఇంటర్ మొదటి సంవత్సరం 1906, రెండో సంవత్సరంలో 1756 మంది విద్యార్థులు వార్షీక పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. అందరు ఉతీర్ణత సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్క్ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇందుకు గాను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులకు గతంలో నిర్వహించిన త్రైమాసిక పరీక్షల జవాబు పత్రాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. పరిశీలించిన జవాబు పత్రాల ఆధారంగా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను ఎలా ప్రోత్సాహించాలి, వారిలో మెరుగైన ఫలితలను ఎలా రాబట్టెందుకు తీసుకోవాల్సిన అంశాలను ఆమె వివరించారు. విద్యార్థులు వందశాతం ఉతీర్ణత సాధించడం కోసం ప్రణాళిక ప్రకారం వారికి ప్రత్యేకంగా మెటీరియల్ రూపొందించి అందజేసి అర్థవంతమైన పద్ధతిలో బోధన ఉండాలన్నారు. విద్యార్థులకు విద్య పరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉన్నది ఉన్నట్లు సమర్పిస్తాం
పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో 28 మంది మాట్లాడిన అభిప్రాయాలన్నింటిని నమోదు చేసుకున్నాం. వీడియో చిత్రీకరణ చేశాం. మీటింగ్ మినిట్స్‌తో పాటు వీడియోను కాలుష్య నియంత్రణ మండలికి ఉన్నది ఉన్నట్లు సమర్పిస్తాం. – సురేష్, ఈఈ, పీసీబీ హైదరాబాద్ ఏ గ్రామం ముంపునకుగురికాదు ఈ ప్రాజెక్టులో ఏ గ్రామం ముంపునకు గురికావడం లేదు. 163 గ్రామాలకు తాగునీరు అందించేందుకు డిజైన్ అయింది. ఈ ప్రాజెక్టులో ఊట్కూర్ గ్రామం ముంపునకు గురయ్యే ఆస్కారమే లేదు. ఊట్కూరు మండల పరిసరాలలో సంచరించే జింకలను సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. – శ్రీధర్, ఎస్ఈ, నీటి పారుదల శాఖ ప్రాజెక్టుతో ఆర్థిక వ్యవస్థ మెరుగు ఈ ప్రాజెక్టు చిట్టెం నర్సిరెడ్డి కన్న కల. చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి దీనికోసం పాదయాత్ర చేశారు. ఈ ప్రాంతంలో రాళ్లు తేలిన భూములు కనిపిస్తాయి. వన్యం లేదు.. వన్యప్రాణులు లేవు. నీళ్లు ఉంటే వన్యప్రాణులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. పర్యావరణ అనుమతులు త్వరగా ఇస్తే ప్రాజెక్టు ఈ నెలలోనే ప్రారంభించుకునే అవకాశం ఉంది. అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం. – కుంభం శివకుమార్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు ● -
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వద్దు
మక్తల్: వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దని, ప్రధానంగా డయాలసిస్ రోగులకు మెరుగైన సేవలు అందించాలని నిమ్స్ నెప్రాలజీ బృందం సూచించింది. గురువారం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్‌ను డాక్టర్లు నిరంజన్, గణేష్, పార్వతి, సౌత్ డీఎస్ అసోషియెటెడ్ మేనేజర్ సిబ్దతుల్లా సందర్శించారు. డయాలసిస్ పరికరాలు ఎలా పనిచేస్తున్నాయని ఆరా తీశారు. రోగులను కలిసి సేవలు ఎలా అందుతున్నాయని, ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా అని అడిగారు. వైద్యం విషయం ఏమైనా ఇబ్బంది అనిపిస్తే రోగులను వెంటనే నిమ్స్‌కు పంపించాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఎస్హెచ్ఓ వినూత, తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులకు సౌకర్యాలు
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలు, బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, అదనపు వలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా తాగునీటి వసతి, కూర్చోవడానికి కుర్చీలు, బస్సుల వివరాలు, సూచనలను ఎప్పటికప్పుడూ ప్రయాణికులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. సద్వినియోగం చేసుకోండి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని డిపోల నుంచి అదనపు బస్సులు నడపనున్నాం. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సురక్షితమైన ప్రయాణానికి ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలి. – సంతోష్‌కుమార్, ఆర్టీసీ ఆర్ఎం -
భూములిచ్చిన రైతులకు సాష్టాంగ సమస్కారం
దామరగిద్ద: మక్తల్ –పేట– కొడంగల్ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామానికి చెందిన జలసాధన సమితి నాయకుడు నర్సిములు వేదిక నుంచి సాష్టాంగ నమస్కారం చేశారు. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత రైతుల సంక్షేమం కోసం తరతరాల బాగు కోసం తమ సొంత భూములను ఇవ్వడానికి ముందుకు రావడంతోనే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టే అభివృద్దికి సహకారం అందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ అనుమతులు ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర వాటాను అందించి ఈ ప్రాంత ప్రజల కల నెరేవేరేందుకు సహకరించాలని కోరారు. కాలినడకన వచ్చిన రైతులు.. దామరగిద్ద తండాలో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి మండలంలోని గడిమున్కన్పల్లి గ్రామ రైతులు కాలినడక తరలివచ్చారు. దామరగిద్ద నుంచి తండా వరకు ఎలాంటి వాహన సదుపాయం లేకపోవడంతో రైతులు కాలినడకన అక్కడికి చేరుకున్నారు. ఆటోలు, జీపులు, ఇతర వాహనాలు తండాకు వెళ్లవని, అందుకే కాలినడకన వెళ్లినట్లు ఈ సందర్భంగా రైతులు తెలిపారు. -
ముంపు గ్రామంగా ప్రకటించాలి
ఈ ప్రాజెక్టుతో ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఊట్కూర్ గ్రామం చెరువు కట్ట కింద ఉంది. పునాదులు వేస్తే ఊట నీరు వస్తుంది. కాబట్టి ఈ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలి. లేని పక్షంలో మా ప్రాణాలకు తెగించి అడ్డుపడతాం. ఊట్కూర్ చెరువు శివారు ప్రాంతంలో జింకలు, నెమళ్లు సంచరిస్తుంటాయి. వాటిని సంరక్షించేందుకు వన్యప్రాణుల కేంద్రాలకు తరలిస్తారా.. కేంద్రాలను ఏర్పాటు చేస్తారా స్పష్టం చేయాలి. – ఎం.భరత్, రైతు, ఊట్కూర్ వేటికీ ముప్పు లేదు జీఓ 69ను 2014 తర్వాత మూలకు పడేశారు. బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టు ఊసేత్తలేదు. అయినా పోరాటాలు.. ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే ఈ ప్రాంత రైతుల కలను సాకారం చేయాలని ఈ ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి పునాది వేశారు. ఈ ప్రాజెక్టులో ఎలాంటి పర్యావరణ ముప్పులేదు. అనుమతులు ఇవ్వాలి. – నర్సింమ, జలసాధన సమితి కో కన్వీనర్, పేట -
తాగునీటి సమస్య తీరనుంది
ఈ ప్రాజెక్టు చేపట్టడంతో పర్యావరణానికి నయా పైసా నష్టం లేదు. అడవి జంతులు, చెట్లు సమతుల్యత దెబ్బతనవు. పశు, మత్స్య సంపద అభివృద్ధి చెందుతుంది. తాగునీటి సమస్య తీరుతుంది. ఈ ప్రాజెక్టుతో పర్యావరణం మెరుగుపడుతుంది. వ్యవసాయం నిర్వీర్యం అవుతున్న సమయంలో పునరుజ్జీవం పోసినట్లవుతుంది. బోర్లు ఫెయిల్ అయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు, ముంబాయికి వలస వెళ్లి మృత్యువు చెందిన సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు చేపట్టడంతో ఎలాంటి పర్యావరణ సమస్యలు లేవు. – వెంకట్రామరెడ్డి, భూ నిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు -
‘సంక్రాంతి’కి ఆర్టీసీ సన్నద్ధం
స్టేషన్ మహబూబ్‌నగర్: పల్లె సంస్కృతి ప్రతిబింబించే సంక్రాంతి పండుగకు ఎక్కడున్న వారి స్వస్థలాలకు రావడం పరిపాటిగా మారింది. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, శ్రామికులు ఈ పండుగకు ఇళ్లకు వచ్చి మూడు రోజులు జరిగే పండుగ సంబరాలను ఆస్వాదిస్తారు. అయితే ఈ ఏడాది పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 10 డిపోల నుంచి అదనపు బస్సులను నడపనున్నారు. శుక్రవారం నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి రీజియన్‌లోని పది డిపోలకు 430 బస్సులు నడపనున్నారు. పండుగ తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 21 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులను నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజలు సంక్రాంతి పండుగకు ఎక్కువ సంఖ్యలో వారి స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉండడంతో హైదరాబాద్‌కు అదనపు సర్వీసులు నడపడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అన్ని డిపోలకు హైదరాబాద్ రూట్లో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో ఈ రూట్లోనే ఎక్కువగా అదనపు బస్సులు నడపనున్నారు. రీజియన్ నుంచి అదనపు బస్సులు హైదరాబాద్ నుంచి డిపోల వైపు 430 సర్వీసులు నేటినుంచి ప్రారంభం కానున్న రాకపోకలు -
సాగునీటి కోసం మరో ఉద్యమం
నారాయణపేట రూరల్: సాగునీటి సాధన కోసం బీజేపీ మరో ఉద్యమం చేపడుతుందని.. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదని, మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరూ తోడుదొంగలని, వారి నిర్లక్ష్యంతో ఉమ్మడి పాలమూరు జిల్లా సర్వనాశనం అయిందని బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణపేట సరిహద్దు తంగిడి నుంచి కృష్ణానది పాలమూరు జిల్లాలో 300 కిలోమీటర్ల దూరం తరలిపోతుంటే మన నీటిని మనం వాడుకోని దుస్థితి కల్పించారని అన్నారు. 2014 కన్నా ముందు ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు మాత్రమే ఇచ్చి నీటి కేటాయింపులు చేయకుండా కాంగ్రెస్ పచ్చి మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను డీపీఆర్ లేకుండా పనులు మొదలుపెట్టి రూ.30 వేల కోట్ల నిధులు ఖర్చు పెట్టి పంపిణీ కాల్వలు లేకుండా కమిషన్లు మెక్కి పాలమూరును ఎడారి చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విబీజిరాంజీ పతాకంపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తుందని ప్రజలు నమ్మొద్దని జిల్లా అద్యక్షుడు సత్య యాదవ్ ప్రజలను కోరారు. సిద్ది వెంకట్ రాములు, పోశాల్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత నియమాలు పాటించండి
నారాయణపేట: దేశంలో ప్రతి సెకండ్ కు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని, భద్రతా నియమాలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాల నుంచి తప్పించుకోగల్గుతామని, తల్లిదండ్రులు డ్రైవింగ్ చేసేటప్పుడు పిల్లలను.. యువకులు డ్రైవింగ్ చేసేటప్పుడు తల్లిదండ్రులను గుర్తు పెట్టుకోవాలని రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈమేరకు విద్యార్థులచే మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల వల్ల తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను, దేశ జట్టులో ఆడే అవకాశం కోల్పోయానని తన స్వీయ అనుభవాలను పంచుకున్నారు. మన శరీరంలో ప్రతీ అవయవం ముఖ్యమని అందుకే వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ పెట్టుకోవడం వంటి నియమాలు పాటించాలన్నారు. బైక్ స్పీడో మీటర్లపై అమ్మానాన్న అని ఉండేలా స్టిక్కర్లను అంటించాలని రవాణా అధికారులకు సూచించారు. లక్ష స్టిక్కర్లకు తానే స్వయంగా డబ్బులు ఇస్తానని, వాటిని ప్రింట్ తీయించి ప్రతి బైక్‌కు అంటించాలని ఆదేశించారు. యువకులు బైక్ లపై స్టంట్లు చేయడం మానుకోవాలని, ఎంతో మంది రోడ్డు ప్రమాదాల వల్ల ఆత్ములను కోల్పోయారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ పోషల్ రాజేష్, మాజీ మార్కెట్ చైర్మెన్ సరఫ్ నాగరాజు , మాజీ కౌన్సిలర్ బోయ రమేష్, నాయకులు దొడ్డి కార్తీక్ వకీల్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణానికి ముప్పులేదు..
నారాయణపేట: మక్తల్– నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపడితే ఈ ప్రాంతంలో ఎలాంటి పర్యావరణ ముప్పు.. విఘాతం కలగడం లేదని, వీలైనంత త్వరగా ఆ పథకానికి పర్యావరణ అనుమతులు ఇచ్చి ప్రారంభించాలని ప్రజలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం మక్తల్ –నారాయణపేట –కొడంగల్ ఎత్తిపోతల పథకంపై జిల్లాలోని దామరగిద్ద తండాలో గురువారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(పిసిబి) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుంచి ఈఈ సురేష్ హాజరు కాగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్, నీటి పారుదల శాఖ ఎస్. ఈ శ్రీధర్ సమక్షంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని 7 మండలాల నుంచి ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఏకాభిప్రాయాన్ని బృందం ముందు వెల్లడించారు. వందలాది మంది సమక్షంలో 28 మంది తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులను త్వరగా ప్రారంభించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని, ఆ పథకం పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని ఆకాంక్షించారు. ఈ పథకంతో పర్యావరణానికి వచ్చే నష్టం ఏమీ లేదని, గాలి, నీరు, వాతావరణ కాలుష్యం ఏమీ జరగదని తేల్చి చెప్పారు. ఆ పథకం పూర్తి అయితే పర్యావరణం ఇంకా మెరుగు అవుతుందన్నారు. వెంటనే పథకం ప్రారంభించేందుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని అధికారి సురేష్ ను వారు కోరారు. కార్యక్రమంలో నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, పర్యావరణ కన్సల్టెన్సీ కరీముల్లా, దామరగిద్ద తహసిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీఓ జయలక్ష్మి, దామరగిద్ద తండా సర్పంచ్ శరణ్ నాయక్, దామరగిద్ద సర్పంచ్ అద్దన్ కనికిరెడ్డి, బాపన్‌పల్లి శ్రీను, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, రైతులు, రైతు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. మక్తల్– పేట– కొడంగల్ప్రాజెక్టుకు అనుమతివ్వాలి ఉద్యమాలు, పోరాటాలతో ప్రాజెక్టు సాధించుకున్నాం పర్యావరణ శాఖ నుంచి అనుమతులిచ్చి త్వరగా పూర్తి చేయండి ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించిన ప్రజలు మూడు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల నుంచి హాజరు -
కందిపోతున్నారు..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ని‘బంధనాలు’ దౌల్తాబాద్ మండలం చెల్లాపూర్‌కు చెందిన రైతు రాజప్ప తన రెండు ఎకరాల్లో 6 బస్తాల కందులు పండించారు. వాటిని విక్రయించేందుకు కోస్గిలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రానికి శాంపిల్ తీసుకెళ్లగా.. 17 శాతం తేమ వచ్చింది. దీంతో కందులను ఆరబెట్టుకొని తీసుకురావాలని చెప్పడంతో చేసేదేమి లేక వెళ్లిపోయారు. నారాయణపేట మండలం శాసన్పల్లికి చెందిన రైతు శ్రీనివాస్ 16 బస్తాల కందులను విక్రయించేందుకు స్థానికంగా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రానికి నాలుగు రోజుల క్రితం తీసుకొచ్చారు. తేమ శాతం ఎక్కువగా ఉందని.. ఆరబెట్టాలని.. జల్లెడ పట్టించాలని చెప్పడంతో అక్కడే కందులను ఆరబెట్టి శుభ్రం చేశారు. అయినా మళ్లీ జిన్నింగ్ మిషన్‌కు వేయాలని చెప్పడంతో ఎన్నో అవస్థలు పడి జిన్నింగ్ మిషన్‌కు కందులను వేయాల్సి వచ్చింది. ఊట్కూర్‌కు చెందిన రైతు రాము తనకున్న 4 ఎకరాల పొలంలో పండించిన 33 బస్తాల కందులను పేట మార్కెట్ యార్డులో విక్రయించారు. ధర క్వింటాకు రూ. 7,831 వచ్చింది. పంట పండించేందుకు పెట్టిన పెట్టుబడి రూ. 60వేలు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకునేందుకు వెళ్తే వారు చెప్పే నిబంధనలకు గిట్టుబాటు కాదని ప్రైవేటులో అమ్ముకున్నారు. ● -
పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ
నారాయణపేట: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ కలెక్టర్ శ్రీను అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తుది ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించి.. అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ కేంద్రాలు, ఫొటో ఓటరు జాబితాలను ప్రకటిస్తామన్నారు. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వీసీలో ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణికుమార్, మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీరాములు, నాగరాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు. చదువు, క్రీడలకు సమప్రాధాన్యం ఇవ్వాలి నారాయణపేట: విద్యార్థులు చదువు, క్రీడలకు సమప్రాధాన్యత ఇచ్చి ఆకాశమే హద్దుగా ముందుకుసాగాలని డీఎస్పీ నల్లపు లింగయ్య అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సీఎం కప్ 2025– 26 క్రీడా పోటీల సందర్భంగా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డితో కలిసి ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి.. వారిని అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేలా చేయడమే లక్ష్యంగా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, సీఎం కప్ టార్చ్ ర్యాలీ మినీ స్టేడియం నుంచి సత్యనారాయణ చౌరస్తా, పాతబస్టాండ్ సెంటర్ చౌక్ మీదుగా దామరగిద్దకు చేరుకుంది. కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేశ్‌శెట్టి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరణప్ప, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పీడీ గొడుగు నర్సింహులు, వ్యాయామ ఉపాధ్యాయులు సాయి, అనంతసేన, బాల్‌రాజ్, రమణ, రత్నయ్య, అక్తర్ పాషా తదితరులు పాల్గొన్నారు. పాడి పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి దామరగిద్ద: పాడి పశువుల ఆరోగ్యంపై పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్‌రెడ్డి సూచించారు. బుధవారం దామరగిద్ద మండలం ఉడ్మల్‌గిద్దలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి పశువులకు గర్భకోశ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి.. చికిత్స అందించారు. అనంతరం కృత్రిమ గర్భదారణ, గర్భకోశ వ్యాధి లక్షణాలు, గర్భస్థ పశువుల ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యమ్మ, పశువైద్యుడు శ్రీనివాస్, సూపర్వైజర్ ఉత్తేజ్కుమార్, గోపాలమిత్ర భీంషప్ప, కనకప్ప, నర్సింహులు పాల్గొన్నారు. తెల్లకందులు క్వింటా రూ.8,211 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం తెల్లకందులు క్వింటా గరిష్టంగా రూ. 8,211, కనిష్టంగా రూ. 6,500 ధర పలికింది. ఎర్రకందులు గరిష్టంగా రూ.7,865, కనిష్టంగా రూ.6,200, వడ్లు (సోన) గరిష్టంగా రూ. 2,690, కనిష్టంగా రూ. 2,489 ధరలు వచ్చాయి. -
రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి
నారాయణపేట: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రత నియమాలు పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన చాంబర్లో రోడ్డు సురక్ష అభియాన్–2026 కరపత్రం విడుదలచేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో మెలిగి ప్రమాదాలను నివారించాలన్నారు. అధిక వేగంతో వాహనాలను నడిపి ప్రాణాలను కోల్పోవద్దని.. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపరాదన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లిన తమ కోసం తమ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూ ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి వింధ్యా నాయక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి బి.సాయిమనోజ్, అదనపు జూనియర్ సివిల్‌జడ్జి కె.అవినాష్, ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణచైతన్య పాల్గొన్నారు. -
డయాలస్ట్రెస్!
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ‘కిడ్నీ’ బాధితులు ● వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధికం ● అధునాతన పరికరాలున్నా.. వైద్యులు కరువు ● గతేడాది 7,270 మందికి డయాలసిస్.. ప్రస్తుతం 900 మందికి చికిత్స పాలమూరు: రోజురోజుకు మూత్రపిండ సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. ఏటా పదుల సంఖ్యలో బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న విభిన్న పరిస్థితులు, అలవాట్లు, భూగర్భజలాలు కలుషితం కావడం వంటివి కూడా బాధితుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గతేడాది 7,270 మందికి డయాలసిస్ చేయగా.. ప్రస్తుతం ప్రభుత్వ సెంటర్లలో 550 మంది, ప్రైవేటులో మరో 350 మందికి పైగా బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రధానంగా మక్తల్, నారాయణపేట, వనపర్తి ప్రాంతాలతో పాటు భూత్పూర్ మండలంలోని గ్రామాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితులు అధికమవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 సెంటర్లు ఉండగా.. కొత్తగా మళ్లీ ప్రతి 20 కి.మీ. పరిధిలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో.. ఉమ్మడి జిల్లా నుంచి 20 సెంటర్లు నూతనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించారు. ● రెండు నెలల్లో గద్వాలలో అత్యధికంగా డయాలసిస్ చేయించుకున్న బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో గద్వాల సెంటర్లో 12 మిషన్లు ఉండగా.. నవంబర్‌లో 963, డిసెంబర్లో 976 మందికి డయాలసిస్ సేవలు అందించారు. కాగా.. అధునాత కేంద్రాలున్నా.. పాలమూరులో రోగులకు సలహాలు, సూచనలు అందించేందుకు ఒక్క నెఫ్రాలజిస్టు అందుబాటులో లేకపోవడం గమనార్హం. -
పురం.. ఉత్కంఠభరితం
నారాయణపేట: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. గత రిజర్వేషన్లు మారుస్తారా.. లేక పాత వాటిపైనే నిర్వహిస్తారా అనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేసి.. అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. తప్పులను సరిచేసి వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి.. 10న పోలింగ్ బూత్‌ల వారీగా తుది జాబితాను ప్రకటించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. కొత్తగా మద్దూర్.. జిల్లాలో ఇదివరకు నారాయణపేట, మక్తల్, కోస్గి మున్సిపాలిటీలు ఉండగా.. కొత్తగా మద్దూర్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. ఈ సారి నాలుగు పురపాలికలకు ఎన్నికలు జరుగుతుండటంతో రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో మారితే.. ఏ మున్సిపాలిటీ ఏ రిజర్వేషన్ అవుతుందోననే ఉత్కంఠ నెలకొంది. మక్తల్ మున్సిపాలిటీ గతంలో బీసీ మహిళగా రిజర్వు అయింది. ఈ సారి జనరల్ లేదా బీసీ జనరల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నారాయణపేట, కోస్గి రెండు మున్సిపాలిటీలు దాదాపుగా జనరల్ లేదా జనరల్ మహిళ రిజర్వు అయ్యే అవకాశం కనిపిస్తోంది. మద్దూర్ విషయానికి వస్తే.. తొలిసారిగా బీసీ లేదా ఎస్సీ, ఎస్టీ రిజర్వు అయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ రిజర్వేషన్లు కేవలం రాజకీయ పరిశీలకుల ఊహాగనాలు మాత్రమే. చేర్పులు, మార్పులు సైతం జరగొచ్చని చెబుతున్నారు. ● 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మూడు చైర్పర్సన్ పదవులను మహిళలే దక్కించుకున్నారు. నారాయణపేటలో బీఆర్ఎస్ తరఫున 5వ వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించిన గందె అనసూయ (బీసీ మహిళ) చైర్పర్సన్ పీఠాన్ని రెండో సారి కై వసం చేసుకున్నారు. ఆమె ఎంపీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. కోస్గి మున్సిపాలిటీలోనూ బీసీ మహిళకు రిజర్వు కాగా.. 15 వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్‌గా శిరీష గెలుపొంది చైర్పర్సన్ అయ్యారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మక్తల్ మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వు కాగా.. బీజేపీ నుంచి 13వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన పావని చైర్పర్సన్ అయ్యారు. ఆమె ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఆద్యంతం..ఉత్సాహం రెండు రోజుల పాటు ఉత్సాహభరితంగా సాగిన పిల్లలమర్రి బాలోత్సవం నాలుగో పిల్లల జాతర మంగళవారం ముగిసింది. –8లో uముగిసిన రాజకీయ ప్రతినిధుల సమావేశాలు.. ముసాయిదా ఓటరు జాబితాపై ఈ నెల 5న జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో పుర కమిషనర్లు సమావేశాలు నిర్వహించి.. వారి నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించారు. మంగళవారం జిల్లాస్థాయిలో అడిషనల్ కలెక్టర్ శ్రీను సమక్షంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. రిజర్వేషన్లపై ఆశావహుల్లో టెన్షన్ 2020లో మూడు మున్సిపాలిటీల్లోనూ బీసీ మహిళలే చైర్పర్సన్లు తుది ఓటరు జాబితా రూపకల్పనలో అధికారుల నిమగ్నం -
ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించండి
నారాయణపేట: ఎలాంటి తప్పిదాలు లేని తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో మున్సిపల్ తుది ఓటరు జాబితా రూపకల్పనపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించిన అభ్యంతరాలపై చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబి తా స్వచ్ఛత, కచ్చితత్వం ప్రజాస్వామ్యానికి కీలకమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా.. అర్హత లేని పేర్లు తొలగించే ప్రక్రియలో రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాల ని కోరారు. ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులపై అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా సమర్పించాలని.. క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని నారాయణపేట మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరిగిందన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని.. ఏ చిన్న పొరపాటు లేని తుది ఓటరు జాబితాను రూపొందించేందుకు అన్ని పార్టీల నాయకులు సహ కరించాలని ఆయన కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీరాములు, నాగరాజు, శ్రీకాంత్, కలెక్టరేట్ సీ సెక్షన్ అధికారులు జయసుధ, రాణిదేవి తదితరులు ఉన్నారు. -
గ్రామాల్లో క్రీడల సందడి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది కూడా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. గ్రామస్థాయి, మండల–అర్బన్, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 17, 22 వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31 వరకు మండల/అర్బన్, వచ్చేనెల 3 నుంచి 7 వరకు అసెంబ్లీ స్థాయి, 10 నుంచి 14 వరకు జిల్లాస్థాయి, వివిధ ప్రాంతాల్లో 19 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ క్రీడాపోటీలు జరగనున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయిలో క్రీడలతో ఒక నూతన ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంటుంది. ఈసారి చిన్నారులు, ఇతరులకు కూడా రీక్రియేషన్ క్రీడలు జరగనున్నాయి. సీఎం కప్ సందర్భంగా జనవరి 8 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. వివిధ క్రీడాంశాల్లో పోటీలు సీఎం కప్‌లో 44 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, షూటింగ్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సెపక్తక్రా, చెస్, బేస్‌బాల్, నెట్‌బాల్, కిక్‌బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, స్క్వాష్ రాకెట్, కనోయింగ్–కయాకింగ్, వుషు, అత్యపత్య, పవర్ లిఫ్టింగ్, సాఫ్ట్‌బాల్, తైక్వాండో, బిలియర్డ్స్ స్నూకర్స్, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్, ఫెన్సింగ్, పికిల్‌బాల్, సెయిలింగ్, బాల్‌బ్యాడ్మింటన్, మల్లకంబ్, పారా గేమ్స్, రీక్రియషనల్ క్రీడలులకు పోటీలు నిర్వహిస్తారు. గతేడాది 90 పతకాలు.. సీఎం కప్ క్రీడాపోటీలు క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్నాయి. 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి 2 వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మొదటి సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో రాష్ట్రస్థాయి కబడ్డీ, నెట్‌బాల్ పోటీలు జరిగాయి.రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు 90 పతకాలు సాధించారు. వీటిలో 26 బంగారు పతకాలతో సత్తాచాటారు. మహబూబ్‌నగర్ క్రీడాకారులు 9 బంగా రు, 15 రజతం, 11 కాంస్య పతకాలతో మొత్తం 35 పతకాలు సాధించారు. వనపర్తి జిల్లా 8 బంగారు, 6 రజతం, 5 కాంస్య పతకాలు మొత్తం 19 పతకాలు, నారాయణపేట జిల్లా 6 బంగారు, 6 రజతం, 2 కాంస్యంతో 14 పతకాలు, జోగుళాంబ గద్వాల జిల్లా 2 బంగారు, 2 రజతం, 5 కాంస్య పతకాలతో మొత్తం 9 పతకాలు, నాగర్‌కర్నూల్ జిల్లా ఒక బంగారు, 2 రజతం, 10 కాంస్యంతో 13 పతకాలు సొంతం చేసుకున్నారు. ఔత్సాహికులకు మంచి అవకాశం సీఎం కప్ క్రీడలు ఔత్సాహిక క్రీడాకారులకు మంచి అవకాశం. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటికి వస్తుంది. గ్రామస్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దడమే సీఎం కప్ ప్రధాన ఉద్దేశం. అధికారులు, క్రీడాసంఘాలు, పీడీ, పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల సహకారంతో జిల్లాలో సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తాం. ఆసక్తిగల క్రీడాకారులు https://satg.telangana.govi.in/ cmcup వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్‌నగర్ సీఎం కప్ కోసం సన్నాహాలు గ్రామ, మండల, అసెంబ్లీ, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు పోటీలు 17 నుంచి వచ్చేనెల 26 వరకుసీఎం కప్ క్రీడలు -
దరఖాస్తుల ఆహ్వానం
మద్దూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిన కంప్యూటర్ సైన్స్ బోధించేందుకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.కృష్ణారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీజీలో 55 శాతం మార్కులు, సెట్ లేదా నెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ వరకు డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జాతీయ నెట్‌బాల్ టోర్నీకి గురుకుల విద్యార్థి ధన్వాడ: మండలంలోని కొండాపూర్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి హరీశ్ జాతీయస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నల్లగొండ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అతడు అత్యంత ప్రతిభ చాటడంతో రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ రాజారాం తెలిపారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే 69వ జాతీయస్థాయి ఎస్జీఎఫ్ అండర్–17 బాలుర నెట్‌బాల్ పోటీల్లో హరీశ్ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని కోచ్ డా.రామ్మోహన్‌గౌడ్, పీఈటీ ఆంజనేయులు, హౌస్ మాస్టర్ తిమ్మప్ప, సంజీవ్ అభినందించారు. ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వండి నారాయణపేట రూరల్: ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ఇంటర్ అధ్యాపకులకు రాబోయే మున్సిపల్ ఎన్నికల విధులు కేటాయించకుండా మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్, పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. అదే విధంగా గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, పదవీ విరమణ చేరువలో ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వారికి విధులు కేటాయించకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని.. కేడర్ స్ట్రెంత్ అప్డేట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు రఘువీర్, రాంరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు. అలసందలు క్వింటా రూ.5,611 నారాయణపేట/జడ్చర్ల/దేవరకద్ర: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం అలసందలు క్వింటా రూ. 5,611 ధర పలికింది. అదే విధంగా వరిధాన్యం (సోన) గరిష్టంగా రూ. 2,683, కనిష్టంగా రూ. 2,603, ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,011, కనిష్టంగా రూ. 4,506, తెల్లకందులు గరిష్టంగా రూ. 8,181, కనిష్టంగా రూ. 6,516 ధరలు వచ్చాయి. ● బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,739, కనిష్టంగా రూ.1,781 ధరలు లభించాయి. హంస రూ.1,866, కందులు గరిష్టంగా రూ.7,060, కనిష్టంగా రూ.3,561, వేరుశనగ గరిష్టంగా రూ.8,840, కనిష్టంగా రూ.6,886, మినుములు రూ. 8,401, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,956, కనిష్టంగా రూ.1,630 ధరలు పలికాయి. దేవరకద్రలో కందులు గరిష్టంగా రూ. 6,759, కనిష్టంగా రూ.6,159 ధర లభించింది. -
పాలమూరును ఎడారి చేసేందుకు కుట్ర
అమరచింత/ కొల్లాపూర్/ కొల్లాపూర్ రూరల్: కేవలం 9 టీఎంసీల సామర్థ్యం గల జూరాల నుంచి కొడంగల్, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు కృష్ణా నీటిని తరలించి పాలమూరును ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జలపోరులో భాగంగా జూరాల, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను మంగళవారం ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించారు. ముందుగా జూరాల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు ముందుకు సాగలేదని విమర్శించడం సరికాదన్నారు. జూరాలలో నీటి నిల్వలను కాపాడుకునే ప్రయత్నం చేయలేని సీఎం రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ప్రచారం తెరపైకి తెచ్చారన్నారు. వేసవి రాక ముందే జూరాలలో నీటి నిల్వలు అడుగంటాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు ఇవ్వలేక క్రాప్ హాలీడే ప్రకటించడమే ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు. కేవలం 9 టీఎంసీల సామర్థ్యం కలిగిన జూరాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి తరలించేలా పనులు ప్రారంభించి 90 శాతం పూర్తిచేశారని చెప్పారు. ప్రస్తుతం మిగులు పనులు చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి నీటి కొరత ఉంటుందనే సాకుతో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటి తరలింపు దండగని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరు జిల్లా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత నష్టపోయిందని అలాంటి జిల్లాలో సాగునీటితోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కృష్ణానది జలాలు వందశాతం వాడుకునే హక్కు పాలమూరుకే ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 90 శాతం పూర్తయినప్రాజెక్టుపై నిందలా జూరాల నుంచి కొడంగల్‌కు నీటి పంపింగ్ ఎలా సాధ్యమవుతుంది సీఎం, మంత్రులకు ‘పాలమూరు’పై కనీస అవగాహన లేదు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో మాజీ మంత్రుల ధ్వజం -
రైతుల సౌకర్యార్థమే కొనుగోలు కేంద్రాలు
కోస్గి రూరల్: పండించిన పంటను విక్రయించేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం కోస్గిలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నాఫేడ్ ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన మక్కలను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర రూ. 8వేలకు విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం సాయన్న, పీఏసీఎస్ మాజీ చైర్మన్ భీంరెడ్డి, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు అంజమ్మ, కార్యదర్శి సువర్ణ, కోశాధికారి మంగమ్మ, సీసీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
భళా బాలోత్సవం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని బృందావన్ గార్డెన్స్‌లో సోమవారం పిల్లలమర్రి బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలోత్సవం నాలుగో పిల్లల జాతర అలరించింది. జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు బాలోత్సవానికి తరలివచ్చి జాతర జరుపుకున్నారు.అకాడమిక్ అంశాల్లో సీనియర్, జూనియర్ విభాగాల్లోని తొమ్మిది వేదికల్లో చిత్రలేఖనం, వ్యాసరచన, కథారచన, కవితారచన, దేశభక్తి గీతాలు, స్పెల్‌బీ, క్విజ్లు, సాంస్కృతిక అంశాల్లో జానపద, శాసీ్త్రయ నృత్యాలు, బతుకమ్మ వేషధారణ, ఏకపాత్రాభినయం, లఘు నాటికలు, ఫ్యాన్సీ డ్రెస్ అంశాల్లోనూ, సైన్స్‌ఫెయిర్ విభాగాల్లో విద్యార్థులు చురుగ్గా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఫ్యాన్సీ డ్రెస్‌లో వచ్చిన చిన్నారులకు నిర్వాహకులు అప్పటికప్పుడే మెడల్స్‌ను బహుకరించారు. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయవచ్చు పిల్లలమర్రి బాలోత్సవంతో పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయవచ్చని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడు తూ చిన్నారులు మట్టిలో మాణిక్యాలు అని, వారిని చదువుతో పాటు ఆటల్లో ప్రోత్సహించాలన్నారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పిల్లలమర్రి బాలోత్సవం చక్కటి కార్యక్రమం అని కొనియాడారు. అంతకుముందు బాలోత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బెక్కం జనార్దన్, డాక్టర్ పి.ప్రతిభ జాతీయ జెండా, బాలోత్సవ జెండాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి వీరాంజనేయులు, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, వీణ శివకుమార్, సువర్ణలత, రాజేంద్రకుమార్, నాగేష్, ప్రమోద్‌కుమార్, వేణుగోపాల్‌వర్మ, వెంకటస్వామి, అశోక్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు -
అటు సీఎం.. ఇటు మాజీ సీఎం!
● ‘పాలమూరు’ వేదికగా ఎన్నికల శంఖారావం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రస్తుతం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతోంది. ఈ సభకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం ప్రాజెక్టుల బాట పట్టారు. సంక్రాంతి తర్వాత కేసీఆర్ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం మహబూబ్‌నగర్‌నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తొలుత వచ్చేనెల మూడో తేదీన జడ్చర్ల నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ ప్రారంభోత్సవానికి రానున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అంతకన్నా ముందుగానే మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి శుద్ధీకరణ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈనెల 10న ఓటర్ల తుది జాబితా ప్రకటించనుండగా.. ఆ తర్వాత పురపాలికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు నుంచే ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం మోగించనున్నట్లు తెలుస్తోంది. -
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి
నర్వ: మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టే కంది కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ అన్నారు. సోమవారం నర్వ మహిళా సమాఖ్య భవనం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ప్రారంభం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.8 వేలు అందజేస్తుందని, రైతులు ధాన్యాన్ని 12 శాతంలోపు తేమ ఉండేలా తీసుకురావాలన్నారు. తక్కువ ధరకు దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలతోనే లబ్ధి పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనువాసులు, ఏపీఎం చంద్రశేఖర్, మహిళా సమాఖ్య కోశాధికారి సంతోష, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, నర్వ సర్పంచు హన్మంతురెడ్డి, ఉప సర్పంచు అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యూహరచన..!
‘పుర’ పోరుపై ముమ్మర కసరత్తు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పుర’ పోరుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. కార్పొరేషన్/మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడినప్పటికీ సం‘గ్రామం’లో బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకోవడం.. శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపింది. గతంతో పోల్చితే మెరుగైన పంచాయతీ స్థానాలను సాధించడంతో బీజేపీలోనూ జోష్ నెలకొంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలు పోటాపోటీగా పోరు సన్నాహాలకు శ్రీకారం చుట్టాయి. పుర పాలికల ఎన్నికల్లో పాగా వేసేలా వ్యూహాలు పన్నుతున్నాయి. వెలసిన ఫ్లెక్సీలు.. విందులు పురపాలిక ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించిన క్రమంలో ఆయా డివిజన్లు/వార్డుల్లోని ఆశావహ అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. యువతను ఆకట్టుకునేందుకు విందులకు తెర లేపారు. తాము బరిలో నిలుస్తామనే సంకేతాలను వార్డు ప్రజలకు తెలిసేలా ప్రచారం ప్రారంభించారు ఈ క్రమంలో దాదాపుగా అన్ని వార్డుల్లోనూ నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి, ఉగాది శుభాకాంక్షలు చెబుతూ భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే తమకే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల కార్యాలయాలతో పాటు వార్డుల్లో రాజకీయ సందడి నెలకొంది. ప్రధానంగా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన మహబూబ్‌నగర్ పీఠంపై అన్ని రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులతో పాటు పార్టీల నాయకుల మధ్య కూడా పోరు రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలసన్నాహకాలు షురూ అభ్యర్థుల జల్లెడకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఆశావహుల నుంచి వ్యక్తిగత సమాచార సేకరణ బీఆర్ఎస్, బీజేపీ సైతం రంగంలోకి.. ఎత్తులకు పైఎత్తులతో ముందుకు.. -
సమగ్రంగా పరిశీలించాలి
మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా అంతా గందరగోళంగా ఉంది. 10వ వార్డులో మొత్తం 1129 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ మా వార్డుకు సంబంధం లేని పట్టణం చివర ఉన్న పలు వార్డుల ఓటర్ల పేర్లను మా వార్డులో చేర్చారు. అధికారులు సమగ్రంగా పరిశీలించి సరియైన ఓటరు జాబితా తయారు చేసి ఎన్నికలు నిర్వహించాలి. – హన్మంతు, మాజీ ఎంపీటీసీ, 10వ వార్డు, కోస్గి అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం ఓటరు జాబితా సవరణపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలి. ఈ నెల 9 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం. ఇందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశాం. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తుది జాబితాను విడుదల చేస్తాం. – నర్సయ్య, మున్సిపల్ కమిషనర్, నారాయణపేట ● -
వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయండి
నారాయణపేట: ఆకతాయిలు, ఇతరులు ఎవరైనా మహిళలు, యువతులు, బాలికలను వేధింపులకు గురిచేస్తే.. నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలు, పాఠశాలల విద్యార్థినులు బస్టాండ్లు, గ్రామాలు, కాలనీల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌కు గురైనప్పుడు, ఉద్యోగులు పని చేసే ప్రదేశాల్లో వేధింపులకు గురైనప్పుడు, అలాగే బాలికలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు వెంటనే షీ టీమ్ పోలీసులను సంప్రదిస్తే సత్వర న్యాయం అందిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మహిళలు సోషల్ మీడియా వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఫొటోలు, వీడియోలు పోస్టు చేసే వేళ వ్యక్తిగత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నేరుగా ఫిర్యాదు చేయలేని వారు షీ టీమ్ ఫోన్ నెం.8712670398 కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి, నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
వ్యవసాయ రంగంలో మార్పులు జరగాలి
● నూతన విధానంతో పంటల సాగు చేయాలి ● కేంద్ర నోడల్ అధికారి రమణ్‌కుమార్ ● మరికల్లో ఎర్రచందనం, ఆయిల్‌పాం పంటల పరిశీలన మరికల్: అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టేందుకు కేంద్రం అమలు చేసిన దన్ ధాన్య కృషి యోజన పథకం ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు వస్తున్నాయని కేంద్ర జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ కో ఆపరేషన్, పీఎండీడీకేవై సెంట్రల్ నోడల్ అధికారి రమణ్‌కుమార్ అన్నారు. దేశా వ్యాప్తంగా 100 జిల్లాలను ధన్ ధాన్య కృషి యోజన పథకం కింద ఎంపిక చేయగా, అందులో నారాయణపేట జిల్లా ఉండటంతో ఆదివారం కేంద్ర బృందం మరికల్లో వ్యవసాయ పంటలు, తోటలను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా కుర్వ శరణప్ప అనే రైతు పంట మార్పిడి చేసి యాసంగిలో సాగు చేసిన ఆముదం, నారాయణరెడ్డి రైతు 28 ఎకరాల్లో సాగు చేసిన ఎర్రచందనం, శ్రీగంధం, మామిడి, నిమ్మ తోటలను పరిశీలించారు. ప్రస్తుతం పండిస్తున్న పంటల లాభ నష్టాలపై రైతుల నుంచి కేంద్ర అధికారులు అభిప్రాయాలను సేకరించారు. అనంతరం జోనల్ అధికారి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా నారాయణపేట జిల్లాలో 6 ఏళ్లలోపు వ్యవసాయ రంగంలో మార్పులను తీసుకురావడం, రైతుల బలోపేతం కోసం కేంద్రం రూ. 1.11 కోట్లను ప్రతిపాదించిందన్నారు. దీని ద్వారా వ్యవసాయ గిడ్డంగులు, పాడి పరిశ్రమ, హార్టీకల్చర్, రైతు సంఘాల బలోపేతం, వ్యవసాయ పరికరాలు, భూసార పరీక్షలు, తదితర వంటిని చేర్చడంతో వ్యవసాయంలో మార్పులు జరిగే అవకాశం ఉందన్నారు. కాలానుగుణంగా వ్యవసాయంలో వస్తున్న మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చూట్టడంతో రైతుల తలరాత మారుతుందన్నారు. పాత పద్దతితో వ్యవసాయం చేస్తే కుటుంబం గడవడమే కష్టంగా ఉంటుందని, కొత్త పద్ధతితో పంటలను సాగు చేయించి, రైతుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. నూతన విధానాలతో వ్యవసాయం చేస్తే రైతులకు లాభదాయం ఉంటుందన్నారు. ఇందుకు సంబందించి రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలతో పాటు సలహాలు, సూచనలు అధికారులు అందజేస్తారన్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందంకు రైతులు సూచించారు. కేంద్ర నోడల్ అధికారి రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటుచేయగా.. రైతులు తమ సమస్యలను విన్నవించారు. మరికల్లో ప్రధానంగా మార్కెట్‌యార్డు లేకపోవడం ఇబ్బందులు పడుతున్నామని, యాసంగి పంటలకు కోయిల్‌సాగర్ నీటిని కాల్వల ద్వారా మళ్లించాలని, పత్తి కొనుగోలులో ప్రాధాన్యత ఇవ్వాలని, ధాన్యం అరబెట్టేందుకు ప్లాట్‌ఫాంలు ఏర్సాటు చేయాలని విన్నవించారు. ఇందుకు స్పందించిన ఆయన సీసీఐ కేంద్ర మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడి పత్తి కొనుగోళ్లలో జిల్లా రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలో గొర్రెల షెడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని పశు సంవర్ధక శాఖ అధికారికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకరప్రసాద్, శిక్షణ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, వికారాబాద్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, డీఆర్డీవో మెగులప్ప, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, పశుసంవర్ధక శాఖ అధికారి ఈశ్వర్‌రెడ్డి, నాబార్డు అధికారి షణ్ముఖ చారి, ఎల్డీం విజయ్‌కుమార్, డీపీఓ సుధాకార్‌రెడ్డి పాల్గొన్నారు. -
రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్– నారాయణపేట– కొడంగల్ ప్రాజెక్ట్‌ను రూ. 4500 కోట్లతో రెండేళ్లలో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం పోరాటం చేసిన అన్ని పార్టీలకు, భూమి ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. దేశ చరిత్రలో ఏ ప్రాజెక్ట్‌కు ఇంత నష్ట పరిహారం ఇవ్వలేదని, సీఎం మన ప్రాంతం బిడ్డ కాబట్టే భూనిర్వాసితులకు రూ.14 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచి రూ.20 లక్షల నష్ట పరిహారం ఇచ్చారన్నారు. జీవో 333 మిగతా ప్రాంత రైతులకు వరప్రదాయిని అయ్యిందన్నారు. ఈ ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయిన రైతులు డబ్బులు వృధా చేయకుండా మళ్లీ భూమి కొనుక్కోండని వారికి సలహాఇచ్చారు. ఆంధ్రాలో సర్ ఆర్డర్ కాటన్లాగా ఈ ప్రాజెక్టుతో సీఎం రేవంత్‌రెడ్డి పేరు ఈ ప్రాంతంలో నిలిచిపోతుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం పోరాటం చేసిన తనకు భూ నిర్వాసితులకు చెక్కులు ఇచ్చే గొప్ప అవకాశం దక్కిందన్నారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్నారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వరి వేస్తే సిరి అని నిరూపించామన్నారు. విద్య, ఉద్యోగం, అభివృద్ధి, సంక్షేమంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ రామచంద్రనాయక్, నీటి పారుదల శాఖ సీఈ ఎఎస్ఎన్ రెడ్డి, ఎస్ఈ హెచ్‌టీ శ్రీధర్, ఈఈ బ్రహ్మానంద రెడ్డి, రాజేష్, మత్స్య సహకార సంఘం శాఖ జిల్లా అధ్యక్షుడు కాంత్ కుమార్, మక్తల్ మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్, సలీం, కోణంగేరి హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
నారాయణపేట: యోగా సాధన ద్వారా వృత్తి జీవితంలో ఏర్పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని, మానసిక–శారీరక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నారాయణపేట జిల్లా కేంద్రంలోని కొండారెడ్డిపల్లి చెరువు గట్టు వద్ద పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో, యోగ గురువు శ్రీ సురేష్ మార్గదర్శకత్వంలో ప్రకృతి ఒడిలో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగాభ్యాసకులు, దామరగిద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా డీఎస్పీ నల్లపు లింగయ్య, డీఎంహెచ్ఓ జయచంద్ర మోహన్, బీజేపీ నాయకులు నాగురావు నామాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించగా, నిత్య యోగాభ్యాసం వల్ల శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత లభిస్తుందని యోగ గురువు సురేష్ వివరించారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక రకాల రోగాల నుంచి దూరంగా ఉండవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ ఒత్తిడి ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుందని, అలాంటి పరిస్థితుల్లో యోగ సాధన మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుందన్నారు. డీఎంహెచ్ఓ జయచంద్ర మోహన్ మాట్లాడుతూ... యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా జీవన శైలిగా మారాలని, రక్తపోటు, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులను నియంత్రించవచ్చని వివరించారు. నాగురావు నామాజీ మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సంపద యోగా అని, వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా సమాజంలో సానుకూల మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆర్ఐ నరసింహ, రాజు లహోటి, క్యాతన్ రఘు, అశోక్, వెంకటేష్, యశ్వంత్, సుదర్శన్, బాలాజీ, మల్లికర్జున్, నర్సింహులు, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర
కృష్ణా: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలో ఉపాధిహామీ పథకం కూలీలతో క్షీరాలింగేశ్వర మఠంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యవర్గ సభ్యుడు రాజమల్లేష్ సిద్ధార్థతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం పేదలకు వేసవిలో 100 రోజులు ఖచ్చితమైన పని కల్పించి వారికి కూలి చెల్లించేవారని, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు ఉపాధిహామీ పథకాన్ని నీరుగారుస్తూ గ్రామాల్లో పనులు లేకుండా చేస్తుందని అన్నారు. అలాగే పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో పనులు కూడా కల్పించడంలేదని, ఇదివరకు చేసిన పనులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని అన్నారు. గతంలో ఈ పథకానికి కేంద్రం 90 శాతం నిధులు ఇచ్చేదని, ఇప్పుడు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40శాతం భరించాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రం నుంచి జీఎస్టీ రూపంలో నిధులు తీసుకెళ్తుంది కాని మనకు రావాల్సిన వాటా మాత్రం ఇవ్వకుండా వేధిస్తుందని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉండి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి,సర్పంచ్ నాగేష్,నాయకులు రవిగౌడ,సబ్జీర్ ఆలీ,సర్ఫరాజ్,బీమ్సీ, నారాయణ,బాబు,తిమ్మప్ప,బొల్ల మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు. కోయిల్‌సాగర్ నీటిని సద్వినియోగం చేసుకోండి దేవరకద్ర: కోయిల్‌సాగర్ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా యాసంగి పంటలకు నీటిని వదిలిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు వేసుకునే అనువైన సమయంలోనే నీటిని వదులుతున్నామన్నారు. ప్రాజెక్టులో ఉన్న నీటిని యాసంగి పంటలకు అందించాలని ఇటీవల జిల్లాస్థాయిలో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రైతులు నీటి వృథాను అరికట్టి కిందిస్థాయిలో ఉండే రైతులకు నీటిని వదలాలని సూచించారు. అయిదు విడతలుగా నీటిని వదలడం జరుగుతుందని, ప్రతి విడత పది రోజులు ఉండేలా ప్రణాళికలు చేశారన్నారు. రైతు సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని గుర్తుచేశారు. పాలమూరు– రంగారెడ్డి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రూపకల్పన చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. 2013లో జూరాల సోర్స్‌గా పాలమూరు ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. -
చాలా సంతోషంగా ఉంది
ప్రాజెక్టులో మూడు ఎకరాల భూమి కోల్పోయాను. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూమి ఇవ్వడంతో ఎకరాకు రూ.14 లక్షలు మొదట ఇచ్చారు. ఇప్పుడు పెరిగిన రూ.6 లక్షల చెక్కును ఇవ్వడంతో చాలా ఆనందంగా ఉంది. – నామ్యానాయక్, భూనిర్వాసితుడు, దామరగిద్ద మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులో రైతులకు రూ.20 లక్షలు ఎకరానికి భూ పరిహారం ఇచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మాటా ఇచ్చారు. ఈ రోజు నిలబెట్టుకున్నారు. కలెక్టర్, ఎస్పీ ఎంతో సహకరించారు. ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయం, అఖిల పక్షం పార్టీల సహాకారంతో రైతులకు ఎకరాకు రూ.20 లక్షల భూ పరిహారం తీసుకోగలిగాం. అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు. – కుంభం శివకుమార్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు -
అంతటా అంతేగా..!
మున్సిపాలిటీ వార్డులు ఫిర్యాదులు మ.నగర్ (కా) 60 98 భూత్పూర్ 10 20 దేవరకద్ర 12 03 నాగర్‌కర్నూల్ 24 51 కొల్లాపూర్ 19 05 కల్వకుర్తి 22 32 నారాయణపేట 24 – మక్తల్ 16 07 కోస్గి 16 03 మద్దూర్ 16 03 గద్వాల 37 06 అలంపూర్ 10 – అయిజ 20 06 వడ్డేపల్లి 10 01 వనపర్తి 33 18 కొత్తకోట 15 01 అమరచింత 10 – ఆత్మకూర్ 10 06 పెబ్బేరు 12 31 మొత్తం 376 291 మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వెల్లడించిన ఓటర్ల ముసాయిదా జాబితాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో జడ్చర్ల, అచ్చంపేట మినహా ఎన్నికలు జరిగే మహబూబ్‌నగర్ కార్పొరేషన్.. మిగిలిన 18 మున్సిపాలిటీలు అన్నింటిలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు నివ్వెరపరుస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎత్తిచూపుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ఉమ్మడి పాలమూరులోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల పరిధిలో గురువారం పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. అదేరోజు నుంచి అభ్యంతరాలు స్వీకరణ ప్రారంభించారు. ఈ మేరకు అన్ని పురపాలికల్లో కలిపి ఆదివారం వరకు మొత్తం 291 ఫిర్యాదులు వచ్చాయి. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 98 రాగా.. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 51 అభ్యంతరాలు వచ్చాయి. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరిష్కారం గడువును ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని.. అన్నింటినీ పరిష్కరించి ఈ నెల 10న తుది జాబితా వెల్లడించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రహసనంగా మారడం.. సర్దుబాటు చేయడంతో.. ప్రధానంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన క్రమంలో డివిజన్ల వారీగా తీసిన లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈసీ ఆదేశాల మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రకారం.. ఆయా పురపాలికల్లో డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించారు. ఇంటి నంబర్ల ఆధారంగా సంబంధిత డివిజన్లు/ వార్డుల్లో పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్లను చేర్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రహసనంగా మారగా.. తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. పలు డివిజన్లు/ వార్డుల్లో ఇంటి నంబర్లు లేకుండా.. కొన్నిచోట్ల ఇంటి నంబర్లకు బై నంబర్లు చేర్చి జాబితా వెల్లడించినట్లు అభ్యంతరాలు వ్యక్తం కావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉన్న ఓట్లను తొలగించే అధికారం లేకపోవడం కారణంగా పలు వార్డుల్లో ఆయా ఓట్లను సర్దుబాటు చేయడంతో సమస్యలు ఉత్పన్నమైనట్లు సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. అభ్యంతరాలు ఇలా.. ● ఒకే పురపాలికలో పలు డివిజన్లు/ వార్డుల్లో అటు ఇటుగా ఓటర్లు తారుమారు ● ఒకే జిల్లా ఒక మున్సిపాలిటీలోని వార్డుల్లో వేరే పురపాలిక పరిధిలోని ఓటర్లు చేరిక ● ముసాయిదా జాబితాలో ఓటర్లు పేర్లు ఉండి, ఫొటోలు లేకపోవడం.. ● ఉమ్మడి పాలమూరులోని ఒక జిల్లా పురపాలికలో వేరే జిల్లా ఓటర్లు ఉండడం.. ● ఓ పురపాలికలో వికారాబాద్, మెదక్ జిల్లాల ఓటర్లు ఉండడం.. ● వందలాది పేర్లు ఇంటి నంబర్లు లేకుండా ఉండడం.. ● మున్సిపాలిటీల్లో గ్రామాలకు సంబంధించిన ఓటర్ల పేర్లు దర్శనమివ్వడం.. ● జాబితాలో ఇంటి నంబర్లు వరుసగా లేకపోవడం.. తప్పులతడకగా ముసాయిదా ఓటర్ల జాబితా మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో ఇతర జిల్లాల ఓటర్లు ఉమ్మడి పాలమూరులోని అన్ని పురపాలికల్లోనూ గందరగోళం ఇప్పటివరకు మొత్తం 291 ఫిర్యాదులు.. అత్యధికంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో 98 అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శల వెల్లువ బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించి రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో తప్పిదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంలో ఈ చర్చ జరిగినట్లు తెలిసింది. దీనిపై ఏ ఒక్క అధికారి కూడా నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. ఇది ముసాయిదా జాబితానే.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నామంటూ కొట్టిపారేస్తూనే.. గడువులోపు పరిష్కరిస్తామని చెబుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయంటూ రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. నారాయణపేట మున్సిపాలిటీలో విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో ఓటర్ల ఫొటోలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లను గుర్తించడం ఎలా అంటూ వివిధ రాజకీయ పార్టీలు నాయకులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో జాజాపూర్, కొల్లంపల్లి, ఊట్కూర్, ఒల్లంపలి, అవుసలోనిపల్లి, కోటకొండ గ్రామాలకు సంబంధించి ఓటర్లను చేర్చినట్లు ఆయా పార్టీల పరిశీలకులు గుర్తించారు. ఈ మేరకు సోమవారం మున్సిపాలిటీలో జరిగే రాజకీయ పార్టీల సమావేశంలో అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
సావిత్రిబాయి స్ఫూర్తితో ముందుకు సాగాలి
నారాయణపేట: సావిత్రిబాయి ఫూలే జీవితం అందరికీ ఆదర్శప్రాయం అని, వారి స్ఫూర్తితో మహిళలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని, మహిళా సాధికారత దిశగా ముందుకు సాగాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. మహిళలు సావిత్రిబాయి ఫూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వాటన్నిటిని అధిగమించి చదువుకోవడంతో పాటు మొదటిసారిగా సమాజంలో మహిళలు చదువుకోడానికి ప్రోత్సహించి పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, జిల్లా మత్స్య శాఖ అధికారి రహమాన్, డీపీఆర్ఓ రషీద్, డీపీవో సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా టీచర్ల సేవలు వెలకట్టలేనివి నారాయణపేట రూరల్: మహిళా ఉపాధ్యాయుల సేవలు విద్యారంగంలో వెలకట్టలేనివి డీఈఓ గోవిందరాజు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళా టీచర్లకు సన్మానించారు. అనంతంర ఆయన మాట్లాడుతూ.. నిరంతరం కుటుంబ బాధ్యతలను మోస్తూ ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖమైనదని అన్నారు. పిల్లల మానసిక ప్రవర్తనను అంచనా వేసి అన్ని రంగాలలో విద్యార్థులను సుశిక్షితులుగా చేయడంలో మహిళా టీచర్లు ముందంజలో ఉన్నారని అన్నారు. అంతకుముందు పూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వై. జనార్దన్ రెడ్డి, నాయకులు వరలక్ష్మి, వాణిశ్రీ, హనీఫ్, జహీరోద్దీన్, రఘువీర్, జనార్దన్, రమేష్, నర్సింహా రెడ్డి, నర్సింగ్ రావు, నరేష్, అరవింద్, భాగ్యరాజు, ప్రసాద్, సాయిలు, వెంకటప్ప, శ్రీనివాస్ పాల్గొన్నారు. నేడు కోయిల్‌సాగర్ నీటి విడుదల దేవరకద్ర: యాసంగి పంటల సాగుకు గాను కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి ఆదివారం నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 5 తడులు విడుదల చేయడానికి నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో తడి కింద 10 రోజులపాటు నీటిని విడుదల చేసి మధ్యలో విరామం ఇస్తారు. యాసంగి సీజన్లో భాగంగా ప్రాజెక్టు పాత ఆయకట్టు కింద ఉన్న 12 వేల ఎకరాల వరకు సాగునీరు అందిస్తారు. కుడి కాల్వ కింద 8 వేలు, ఎడమ కాల్వ కింద 4 వేల ఎకరాల మేర నీటిని అందించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మొదటి తడి ఆదివారం విడుదల చేస్తారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 32.2 అడుగుల వద్ద 2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉన్న రెండు టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ సాగునీటికి.. మరో టీఎంసీని వేసవిలో తాగునీటికి వినియోగిస్తారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కోయిల్‌సాగర్ నీటిని విడుదల చేస్తారని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అంజిల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ఎన్ఆర్ క్వింటాల్ రూ.2,749 జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,749, కనిష్టంగా రూ.2,289 ధరలు లభించాయి. అలాగే హంస రూ.1,811, కందులు గరిష్టంగా రూ.6,810, కనిష్టంగా రూ.5,610, వేరుశనగ గరిష్టంగా రూ.8,791, కనిష్టంగా రూ.6,269, మినుములు రూ.7,881, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,971, కనిష్టంగా రూ.1,856, పత్తి గరిష్టంగా రూ.7,129, కనిష్టంగా రూ.4,500, ఉలువలు రూ.3,900 చొప్పున వచ్చాయి. ● వామ్మో రక్తపింజర ● తల్లి మందలించిందని యువతి ఆత్మహత్యాయత్నం ● రూ.17 లక్షల పత్తి విత్తనాలు చోరీ – వివరాలు 8లో.. -
శాఖల సమన్వయంతోనే వ్యవసాయరంగ అభివృద్ధి
నారాయణపేట: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతోపాటు రైతుల అభ్యున్నతికి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) కమిటీ సభ్యులు సమన్వయంతో కృషి చేయాలని జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ కో ఆపరేషన్/పీఎండీడీకేవై సెంట్రల్ నోడల్ అధికారి రమణ్ కుమార్ ఆదేశించారు. రెండు రోజుల జిల్లా పర్యటనకు శనివారం ఢిల్లీ నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు ఇన్చార్జి కలెక్టర్ ప్రతీక్‌జైన్ స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ శ్రీను, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్‌తో కలిసి పీఎండీడీకేవై సమితి సభ్యులతో రమణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వచ్చే ఆరేళ్లలో వ్యవసాయంతోపాటు ఉద్యానవన, మత్స్య పరిశ్రమ, పశుపోషణ పెంచేందుకు కృషిచేయాలని, మొత్తం 36 పథకాలను ఆయా మంత్రిత్వ శాఖల సహకారం తీసుకుని పురోగతి సాధించాలన్నారు. ఇకపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి వచ్చి సమీక్ష చేస్తానని, పథకం సెంట్రల్ నోడల్ అధికారిగా తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. రైతులకు సకాలంలో రుణాలివ్వాలి ప్రతీ నెల కలెక్టర్ నేతృత్వంలో సభ్యులు పీఎండీడీకేవై పురోగతిపై చర్చించి సమస్యలను అదిగమించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలని, ఆయా పథకాల అభివృద్ధికి నాబార్డు సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలోని అనుగొండ గ్రామంలో ఆక్వా పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని జిల్లా మత్స్య శాఖ అధికారి రహమాన్ తెలిపారు.ఆయా శాఖల అభివృద్ధి ప్రణాళికలను ఈశ్వర్‌రెడ్డి, డీఏఓ సుధాకర్, నోడల్ అధికారి సాయిబాబా వెల్లడించారు. కాగా పీఎండీ డీకేవై ఆరేళ్ల వార్షిక ప్రణాళిక పై తయారు చేసిన పూర్తిస్థాయి నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సెంట్రల్ నోడల్ అధికారికి చూపించారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ హర్స్ చౌదరి, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణి కుమార్, నీటిపారుదల శాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్ ఏజీఎం షణ్ముఖ చారి, ఎల్డీఎం విజయకుమార్, డీఎం ఓ బాలమణి పాల్గొన్నారు. -
సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదం
నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని డీఈఓ గోవిందరాజు అన్నారు. మండలంలోని జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో సమర్థవంతమైన బోధన చేసినప్పుడే విద్యార్థుల్లో నేర్చుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుందన్నారు. సైన్స్ అంటేనే నిత్య ప్రయత్నం అని, ఓటమికి కుంగిపోకుండా, గెలుపునకు పొంగిపోకుండా రెండింటిని సమానంగా ఆస్వాదించాలన్నారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలన్నారు. కామారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ లోనూ ప్రతిభ చాటాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయుల చక్కటి బోధనతోనే విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా తయారు కాగలరని అన్నారు. సైన్స్ ఫెయిర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని శాసీ్త్రయ దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుత సమాజంలో సైన్స్ ముఖ్యం అని, సైన్స్ లేనిదే జీవితం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎస్ఓ భాను ప్రకాష్, సూపరింటెండెంట్ నరసింహ రెడ్డి, సెక్టోరియల్ అధికారులు విద్యాసాగర్, రాజేంద్రకుమార్, శ్రీనివాస్, నాగార్జునరెడ్డి, యాదయ్యశెట్టి, ట్రాస్మా రాష్ట్ర కార్యదర్శి రాజేష్ కుమార్, ఉపాధ్యాయ సంఘం నాయకులు జనార్దన్ రెడ్డి, నరసింహ, రెడ్డప్ప, హైమావతి, యశ్వంత్, షేర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఏడు అంశాలకు సంబంధించి సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు అందించారు. అదేవిధంగా ఇన్ స్పైర్ పోటీల్లో అరుణ్ (జడ్పీ స్కూల్ గోటుర్), అనిత (జడ్పీ స్కూల్ ముశ్రిఫా) రాష్ట్రస్థాయికి ఎన్నికయ్యారు. ఇక సెమినార్ నిర్వహణలో ప్రవీణ్ (గిరిజన పాఠశాల, కొండాపూర్) విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. -
కలెక్టర్ చొరవ.. ప్రధాని ప్రశంసలు
నారాయణపేట: నారాయణపేట జిల్లాకేంద్రంలో నిరాదరణకు గురైన బారంబావి.. కలెక్టర్ హరిచందన చొరవతో భావితరాలకు అందుబాటులోకి వచ్చింది. ముళ్లపొదలు, చెత్తాదారం పేరుకుపోయి దుర్గంధభరితంగా మారిన బారంబావిని చూసిన 2021లో అప్పటి కలెక్టర్ దాసరి హరిచందన ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పునరుద్ధరించి ఇటు ప్రజల మన్ననలతోపాటు మన్‌కీబాత్‌లో ప్రధాని నరేంద్రమోదీచే ప్రశంసలు అందుకుంది. అలాగే 2021 నుంచి అక్కడే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బావి చుట్టూ విద్యుద్దీపాలు అలంకరించడంతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. బారంబావి పునరుద్ధరణకు చొరవ తీసుకున్న అప్పటి కలెక్టర్ దాసరి హరిచందన, ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. చారిత్రకమైన మెట్లబావి పునరుద్ధరణపై స్థానిక ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. -
‘పేట’ చేనేత చీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
నారాయణపేట: నారాయణపేట చేనేత చీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, మరింత నైపుణ్యంతో తక్కువ సమయంలో ఎక్కువ చీరలను నేసి వ్యాపారం పెంచుకొని ఆర్థికాభివృద్ధి చెందాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్లో నారాయణపేట చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకంలో భాగంగా 72 మంది చేనేత కార్మికులకు మగ్గలు, చేనేత అధునాతన యంత్రాలు, పరికరాలు జక్కడ్స్, ఫ్రేమ్ లూన్, వైడింగ్ మిషన్, ఫిర్కం డబ్బా,ఫిట్లను శనివారం ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నారాయణపేటలో నేసిన చేనేత చీరలకు మహారాష్ట్రలో డిమాండ్ ఎక్కువగా ఉందని, ఎక్కువ ఆదాయం పెంచుకోవాలన్నారు. తొందరగా స్కీమ్ అమలు చేస్తే.. మరో విడత తొందరగా మంజూరు అవుతుందని, లబ్ధిదారులు 10 శాతం వాటా చెల్లిస్తే.. మిగతా 90శాతం వాటా కేంద్రం అందిస్తుందని ఆమె తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులు, చేనేత కార్మికులకు చేనేత పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వర్క్ షెడ్లు వస్తాయని, వర్క్ షెడ్ అనేది హౌసింగ్ స్కీమ్‌లో భాగమన్నారు. ఎంతమందికి వర్క్ షెడ్లు అవసరమో అధికారులు గుర్తించి కేంద్రానికి పంపాలని ఆదేశించారు. చేనేత కార్మికులకు పని ఒత్తిడి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. యంత్రాల ఉపయోగంతో శారీరక శ్రమ తగ్గుతుందనీ చెప్పారు. నారాయణపేట చీరలకు మంచి డిజైన్ జోడిస్తే.. మరింత డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, ఆర్డీఓ రామచందర్ నాయక్, అధికారి విజయ్ కుమార్, పగుడాకుల శ్రీనివాసులు, ఆంజనేయులు, బత్తుల సతీష్, క్లశ్రీనివాస్, నవిలే విజయ్ కుమార్ ల్గొన్నారు. -
ఇన్‌స్ట్రాగాంలో వచ్చి..వాట్సప్‌లో మెరిసి
కల్వకుర్తి రూరల్: ఒకానొక సందర్భంలో కల్వకుర్తి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించిన సుభాష్‌నగర్‌లోని గచ్చుబావి కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. ఈ బావి దుస్థితిని పట్టణానికి చెందిన యువకుడు కల్వ కార్తీక్ ‘కల్వకుర్తి డైరీ ఇన్‌స్ట్రాగాం’ పేజీలో కళ్లకు కట్టినట్లు వీడియో తీసి పోస్టు చేయడంతో పెద్దఎత్తున స్పందన లభించింది. వందలాది మంది యువకులు ముందుకు వచ్చి వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ‘సేవ్ గచ్చుబావి కమిటీ’ పేరిట చైతన్యం చేశారు. దీంతో గత 52 రోజులుగా శివాలయం మెట్ల బావి మరమ్మతు చేపట్టారు. మేముసైతం అంటూ మహిళలు శ్రమదానంలో పాల్గొని తమవంతు సహకారం అందించారు. అయితే బావి లోతు తీయడానికి ఇబ్బందిగా మారడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం మరమ్మతుకు నిధులు మంజూరు చేయించి పెద్ద క్రేన్ ఏర్పాటు చేయించారు. దీంతో వేగంగా పనులు పూర్తి కావొస్తున్నాయి. శివరాత్రి నాటికి శివాలయం, గచ్చు బావికి పూర్వవైభవం తీసుకువచ్చేలా కృషిచేస్తున్నారు. శివాలయంలోని శివలింగానికి బావినీటితో అభిషేకం చేసేందుకు సేవ్ గచ్చుబావి కమిటీ సభ్యులు సంసిద్ధులు అవుతున్నారు. సేవ్ గచ్చుబావి పేరుతో మొదలుపెట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో యువకుల శ్రమ ఫలించనుంది. యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు. ఇందుకు సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన చైతన్యం కూడా గచ్చుబావి పూర్వవైభవానికి ఒక మెట్టులా ఉపయోగపడింది అనేది అక్షర సత్యం. -
తాలు పేరిట.. నిలువు దోపిడీ
అన్నదాతలను రైస్ మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. మట్టి, తాలు పేరిట కోతలపై కోతలు పెడుతూ వారి కష్టాన్ని అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. అంగీకరించని రైతులను దారికి తెచ్చుకునే వరకూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇలా ఈ వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు కోట్లాది రూపాయలు దండుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరూ దీని గురించి పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగిన దందాపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ కిలోకు రూ.24చొప్పున నష్టం.. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 1,049 ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 13,24,145 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 6,16,398 మె.ట., కొనుగోలు చేశారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,389 పలుకుతోంది. క్వింటాల్‌కు 3 కిలోల చొప్పున కోత పెడితే రైతుకు రూ.72 నష్టం వాటిల్లుతోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 61,63,980 క్వింటాళ్ల ధాన్యానికి రూ.44.38 కోట్లు నష్టపోయారు. తక్కువలో తక్కువ 3 కిలోలు తీసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. సగటున 4 కిలోలు వేసుకున్నా.. మిల్లర్లు తాలు పేరిట దోచుకున్న ధాన్యం విలువ రూ.60 కోట్లు ఉంటుందని రైతు సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. రైతులకు ఫోన్లు చేసి మరీ.. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు 3 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. ఈ ధాన్యాన్ని వాహనాల్లో మిల్లులకు తరలించగా.. అక్కడ మిల్లర్లు కొందరు మళ్లీ దోపిడీకి తెగబడ్డారు. ఆ వాహనంలో ఏయే రైతులకు సంబంధించిన ధాన్యం ఉందో.. వారికి ఫోన్లు చేస్తున్నారు. తాలు ఎక్కువగా ఉంది.. క్వింటాల్‌కు కిలో నుంచి రెండు కిలోల కోత తప్పదు.. అలా అయితేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. కొన్ని చోట్ల మిల్లుల్లో కోత పెట్టకుండా నేరుగా సెంటర్లలోనే క్వింటాల్‌కు4 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక బస్తాలో 40.600 కిలోలు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు మట్టి, తాలు, తేమ శాతం అన్ని పరిశీలించి.. నిబంధనల ప్రకారం ఉంటేనే తూకం వేస్తున్నారు. లెక్క ప్రకారం బస్తాకు 40 కిలోల ధాన్యం నింపాలి. బస్తా బరువుతో కలిపి 40.600 కిలోలు తూకం వేయాలి. అయితే తాలు, మట్టి, బస్తా బరువు పేరిట ఇందుకు అదనంగా కిలో నుంచి రెండు కిలోల వరకు ధాన్యం తూకం వేసి మిల్లులకు పంపిస్తున్నారు. ఈ వ్యవహారం ఆయా జిల్లాల్లో ఒక్కోచోట ఒక్కోలా సాగుతోంది. ఖరీఫ్‌లో రైస్ మిల్లర్లఅక్రమార్జన రూ.45 కోట్లు క్వింటాల్‌కు 3 కిలోల కోత వేసుకుంటేనే ఈ విలువ ఒక్కో చోట 4, 5 కేజీల వరకు తరుగు తొలుత సెంటర్లలో.. ఆ తర్వాత మళ్లీ మిల్లుల్లో.. అంగీకరించకుంటే ధాన్యం లారీ వెనక్కే.. మిల్లుల నిర్వాహకులకే అధికారుల వత్తాసు -
‘పీఎం ధన్ ధాన్య కృషి’ ప్రణాళికలు పక్కాగా అమలు
నారాయణపేట: పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రణాళికలను జిల్లాలో పక్కాగా అమలు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో పథకం అమలుకు సంబంధిత అధికారులు రూపొందించిన ప్రణాళికలు, వాటి అమలు తీరుపై ఆరా తీశారు. జిల్లాలో పంటసాగు విస్తీర్ణం, పండించే పంటల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. సహజ సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించడం, రైతుల ఆదాయం పెంచడం, గ్రామీణ జీవనోపాధికి మద్దతుతో స్థిరమైన వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయాన్ని స్వీకరించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో పథకం ప్రణాళిక, అమలుపై సమీక్షించేందుకు సెంట్రల్ నోడల్ అధికారి రమణ్‌కుమార్ జిల్లా పర్యటనకు వస్తున్నారని తెలిపారు. 3న కలెక్టరేట్లో కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహిస్తారని.. 4న క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారన్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో సభ్యులు సిద్ధంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీను, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, డీఏఓ జాన్ సుధాకర్, పథకం నోడల్ అధికారి సాయిబాబా, డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్‌రెడ్డి, నీటి పారుదలశాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, డీపీఆర్ఓ రషీద్ ఉన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలి.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు, పాదచారులు విధిగా రహదారి భద్రత నియమాలు పాటించాలని ఇన్చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆర్టీఓ మేఘాగాంధీతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం రహదారి భద్రత నియమాలు పాటిస్తామని అందరితో సామూహికంగా ప్రతిజ్ఞ చేయించారు. -
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
మక్తల్: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టణంలో శుక్రవారం ఆయన నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలన్నారు. మక్తల్ మున్సిపాలిటీలోని 16 వార్డులలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు తదితర అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. మక్తల్, అమరచింత, ఆత్మకూ రు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు ఇప్పటికీ నెరవేరలేదని ఆయన ఆరోపించారు. వార్డులలో ఓటర్ల జాబితాను పరిశీలించి దొంగ ఓట్లు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో మాజి మార్కెట్‌కమిటి చైర్మెన్ నర్సింహగౌడ్, పట్టణ అధ్యక్షులు చిన్నహనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్ రూపకర్తలు విద్యార్థులు
● కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలి ● ఇన్చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ ● ఆకట్టుకున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నారాయణపేట రూరల్: విద్యార్థులు, యువత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికి.. ప్రపంచం గుర్తించే శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఇన్చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్‌ఫెయిర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదపడుతాయన్నారు. చిన్నతనం నుంచే ప్రయోగాలు రూపొందించాలని.. మొదట తప్పులు జరిగినా ఆ తర్వాత కొత్త ఆవిష్కరణలు విజయవంతం అవుతాయన్నారు. తనకు సైన్స్ అంటే ఎంతో ఇష్టమని.. భౌతికశాస్త్రంతోనే ఐఏఎస్ సీటు సాధించానని గర్వంగా చెప్పారు. త్వరలో జిల్లాలోని కోస్గికి బిర్లా ప్లాంటోరియం, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో రోబోటిక్ లైబ్రరీ ఏర్పాటు కానున్నాయని.. విద్యార్థులకు సైన్స్ పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులు డ్రగ్స్ వంటి మహమ్మారికి దూరంగా ఉండాలని, రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలని సూచించారు. నిత్య జీవితంలో సైన్స్ ఒక భాగం.. జాతీయ సైన్స్ ఫిక్షన్ దినోత్సవం రోజున జిల్లాలో ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకనబరిచి.. కామారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్లోనూ ప్రతిభ చాటాలని సూచించారు. ఉపాధ్యాయుల చక్కటి బోధనతోనే విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా తయారు కాగలరని అన్నారు. మనిషి జీవితం సైన్స్‌తో ముడిపడి ఉందన్నారు. ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి స్వీయ మూల్యాంకనం, సరికొత్త అన్వేషణలు, ప్రయోగాలతో గొప్ప ఫలితాలను సాధించవచ్చని అన్నారు. విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. -
30 పోలీస్ యాక్ట్ అమలు
నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నెల 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని.. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, బహిరంగ సభలు, ధర్నాలు వంటివి నిర్వహించరాదని ఎస్పీ డా.వినీత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతులు లేకుండా పై కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారితీసే సమావేశాలు, జన సమూహం చేయ డం పూర్తిగా నిషేధమని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అనవసరమైన విషయాలతో పాటు మతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలను వ్యాప్తిచేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు. అవాంతరాలు లేకుండా యూరియా సరఫరా నర్వ: యాసంగి పంటల సాగుకు అవసరమైన యూరియా సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సహకార సంఘం సీఈఓ ప్రసాద్‌రావు అన్నారు. శుక్రవారం నర్వ పీఏసీఎస్‌లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు యూరియా స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాసంగి పంటలకు సరిపడా యూరియాను రైతులకు సకాలంలో అందించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. రైతులకు యూరియా అందుబాటులో ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సీఈఓ వెంట అసిస్టెంట్ రిజిస్ట్రార్ సయ్యద్ రఫియొద్దీన్, జూనియర్ ఇన్స్పెక్టర్ షాకీర్ పాషా, పీఏసీఎస్ సీఈఓ ఉదయ్‌కుమార్, కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్ ఉన్నారు. ఓపీ సేవలు ప్రారంభం నారాయణపేట: జిల్లా కేంద్రంలోని పాత ఏరియా ఆస్పత్రి భవనంలో ఏర్పాటుచేసిన అర్బన్ హెల్త్ సెంటర్లో శుక్రవారం ఓపీ సేవలను డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి కృషితో అత్యవసర సేవల నిమిత్తం అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వైద్యపరీక్షల కోసం ల్యాబ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీహెచ్సీ సభ్యులు కోర్వర్ కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కొణంగేరి హన్మంతు , ఆర్టీఏ మెంబర్ పోశల్ రాజేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరణప్ప పాల్గొన్నారు. జోనల్ కిక్‌బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకం మహబూబ్‌నగర్ క్రీడలు: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో గత నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన జోనల్ కిక్‌బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి తన్షిత ప్రతిభ కనబరిచినట్లు స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు కె.రవికుమార్ తెలిపారు. ఈ పోటీల్లో తన్షిత–37 కేటగిరిలో పాయింట్ ఫైట్‌లో కాంస్య పతకం సాధించినట్లు వివరించారు. ఈ మేరకు శుక్రవారం తన్షితను డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించి సన్మానించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాస్టర్ రవికుమార్, సలహాదారులు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రేపు బీచుపల్లిలో సీతారాముల కల్యాణం ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రాములోరి కల్యాణ వేడుకను కనులారా తిలకించాలని ఆయన కోరారు. -
‘తప్పుల తడకగా ఓటరు జాబితా’
అమరచింత: పురపాలిక ఎన్నికల సందర్భంగా గురువారం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. పుర, తహసీల్దార్ కార్యాలయాల నోటీసు బోర్డులపై పది వార్డులకు సంబంధించిన ఓటరు జాబితాలను గురువారం ప్రదర్శించారు. శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు వార్డుల వారీగా పరిశీలించగా జాబితా పూర్తిగా తప్పుల తడకగా ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇలాంటి పరిస్థితి కనిపించలేదని.. ఇప్పుడు ఓటర్ల పేర్లు ఏకంగా వార్డుల వారీగా తారుమారు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో పురుష ఓటర్లు 4,404, మహిళా ఓటర్లు 4,813, మొత్తం ఓటర్లు 9,217 మంది ఉన్నారని.. వీరంతా తమ తమ వార్డుల్లో ఓటు వేసేలా ఓటరు జాబితాను సవరించాలని కోరుతున్నారు. పుర కమిషనర్‌తో పాటు మేనేజర్, సిబ్బంది మద్య సఖ్యత లేక ఓటరు జాబితాలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. -
వైజ్ఞానిక మేళాకు వేళాయె..
నారాయణపేట రూరల్: విద్యార్థులలో మేధాసంపత్తి పెంపునకు.. నూతన ఆవిష్కరణలకు.. సృజనాత్మకతను వెలికి తీసేందుకు యేటా నిర్వహించే విద్యా వైజ్ఞానిక మేళా నిర్వహణకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. శుక్రవారం నుంచి నారాయణపేట మండలంలోని జాజాపూర్ గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పిల్లల్లో శాసీ్త్రయ ఆలోచనలు ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు విజ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో భావిశాస్త్రవేత్తల ఎంపికకు ఈ వేదిక ప్రధాన భూమిక పోషించనుంది. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాల, కళాశాలలకు సంబంధించి 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులతో పాటు డీఎడ్, బీఎడ్ ట్రైనీ ఉపాధ్యాయులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులు సైతం నూతన ఆవిష్కరణలతో బోధనా సామగ్రి ప్రదర్శనకు అవకాశం కల్పిస్తారు. 6 నుంచి 8వ తరగతి జూనియర్స్, 9నుంచి 12వ తరగతి సీనియర్స్ విభాగాలుగా విభజించి పోటీలు చేపట్టనున్నారు. ఒక పాఠశాల నుంచి ప్రతి ఉపాంశానికి ఒకటి చొప్పున ఐదు ప్రాజెక్టులు ప్రదర్శించే అవకాశం ఉంది. విద్యార్థులతోపాటు గైడ్ టీచర్ హాజరు కావాల్సి ఉంటుంది. ఉత్తమంగా నిలిచిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ఇన్స్పైర్ ప్రాజెక్టులు సైతం 2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలు సైతం ఈ వేదికపై కనిపించనున్నాయి. జిల్లావ్యాప్తంగా కేవలం 19 ప్రాజెక్టులు మాత్రమే ఎంపికయ్యాయి. వారు ఆన్లైన్లో వివరించిన ఆవిష్కరణల తయారీకి ఇప్పటికే సదరు విద్యార్థుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున నగదు జమ చేశారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులకు మార్గ నిర్దేశం చేశారు. ఏర్పాట్లు పూర్తి జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా గ్రామీణ ప్రాంతంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణకు జిల్లా విద్యాశాఖ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. నారాయణపేట మండలంలోని జాజాపూర్ గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో వేదిక ఏర్పాటు చేశారు. శుక్ర, శనివారాలు రెండు రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకుఈ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి 150మంది ఉపాధ్యాయులతో 22 కమిటీలు ఏర్పా టు చేసి పర్యవేక్షిస్తున్నారు. హాజరయ్యే విద్యార్థులు ఉపాధ్యాయులకు అవసరమైన వసతి, భోజనం ఏర్పాటు చేయనున్నారు. ఇదిలాఉండగా, రెండు నెలల ముందు నుంచే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు సమయం ఉండగా జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఉపాధ్యాయ సంఘాలు విమ ర్శిస్తున్నాయి. ఈ నెల 5 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదరాబాదరా చివరి నిమిషంలో తూతూ మంత్రంగా వైజ్ఞానిక ప్రదర్శన చేపట్టడం సరికాదని వాపోయారు. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో ఉండడం.. రెగ్యులర్ కలెక్టర్ సెలవులో ఉన్న సమయంలో నిర్వహణ చేపట్టడం సబబు కాదని బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి. సమన్వయంతో విజయవంతం చేస్తాం జిల్లాస్థాయి వైజ్ఞానిక మేళా జయప్రదం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రణాళికా ప్రకారం కమిటీలను వేసి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాం. ఉపాధ్యాయ సంఘాలు, మండల స్థాయి అధికారులు, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు తమన్వయంతో విజయవంతంగా పూర్తి చేస్తాం. – గోవిందరాజు, డీఈఓ ప్రధాన అంశం..ఉప అంశాలు ఇవీ.. ఈ విద్యా సంవత్సరం విద్యా వైజ్ఞానిక సదస్సులో ప్రధాన అంశంగా అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధి భారతదేశ కోసం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) గా నిర్ధారించారు. దీనికి తోడు ఏడు ఉప అంశాలను ఎంపిక చేశారు. సుస్థిర వ్యవసాయం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్రత్యామ్నాయ మొక్కలు, హరిత శక్తి (పునరుత్పాదక శక్తి), అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదవరితమైన గణిత నమూనాలు, ఆరోగ్యం పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణపై విద్యార్థులు ప్రాజెక్టులు తీసుకురావాల్సి ఉంటుంది. సెమినార్ నిర్వహణ రెండు రోజులపాటు జరిగే ప్రదర్శనలో విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత కోసం ప్రత్యేక సమినార్ను నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం అనే అంశంపై జూనియర్, సీనియర్ విభాగాల్లో ఒక్కో పాఠశాల నుంచి ఒక్కో విద్యార్థి పాల్గొనిందుకు అవకాశం ఉంటుంది. నేడు ప్రారంభంకానున్నసైన్స్ఫెయిర్ జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సర్వం సన్నద్ధం -
‘సవాయిగూడెం’లో ఓటు చోరీ..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లాలో ఓటు చోరీకి సంబంధించిన ఓ కేసును జిల్లా కోర్టు విచారణకు స్వీకరించింది. వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో ఓటర్ లిస్టులో చనిపోయిన వారు ఉన్నారని.. వలస వెళ్లిన వారు డబుల్ ఓటర్లుగా ఉన్నారని పలువురు గ్రామస్తులు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌తో పాటు రాష్ట్ర, జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారిని తొలగించాలని రెండేళ్ల నుంచి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన అధికారులు గ్రామంలోని 65 మంది పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. అయితే పంచాయతీ ఎన్నికలను పాత ఓటర్ లిస్టు ప్రకారమే నిర్వహించారు. దీనిపై గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా కోర్టులో పిల్ వేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ, ఆర్వో తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్, సామగ్రి అంతా కోర్టుకు సమర్పించాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది. 5 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మద్దతుదారు గెలుపు.. పంచాయతీ ఎన్నికల్లో అధికారులు వెల్లడించిన జాబితా ప్రకారం గ్రామంలో మొత్తం 2,201 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో రెండో విడతలో డిసెంబర్ 14న పోలింగ్ జరిగింది. మొత్తం 10 వార్డులు ఉన్నాయి. సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారు యామిని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీలత బరిలో నిలిచారు. శ్రీలతకు 913 ఓట్లు రాగా.. యామినికి 918 ఓట్లు వచ్చాయి. దీంతో యామిని ఐదు ఓట్లు తేడాతో గెలుపొందారు. మొత్తంగా 1,882 ఓట్లు పోల్ కాగా.. యామినికి 918, శ్రీలతకు 913, నోటాకు 12 రాగా.. 39 ఓట్ల చెల్లలేదు. వందకు పైగా దొంగ ఓట్లు వేయించారు.. గ్రామంలో వందకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని.. పోలింగ్ రోజు పేర్లు తొలగించిన వారి స్థానంలో పలువురు ఓటు వేసేందుకు రాగా అభ్యంతరం తెలిపినట్లు గ్రామస్తులు వెల్లడించారు. అయినా అధికార కాంగ్రెస్ నేతల అండదండలతో పోలీసులు బందోబస్తు మధ్య వారితో ఓటు వేయించారని చెబుతున్నారు. ఈ దొంగ ఓట్లతోనే తాము ఓటమి పాలైనట్లు సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన పలువురు తెలిపారు. ఇది ముమ్మాటికీ ఓటు చోరేనని.. ఓటు చోరీ గురించి గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ నేతలు దీనిపై ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. దొంగ ఓట్లతో గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని.. సవాయిగూడెం ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఓటు చోరీకి సంబంధించి ఇది రాష్ట్రంలో నమోదైన మొదటి కేసు అని చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లోదొంగ ఓట్లు వేశారని పిల్ విచారణకు స్వీకరించిన వనపర్తి జిల్లా కోర్టు జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ, ఆర్వోలకు నోటీసుల జారీ 8న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు బ్యాలెట్ బాక్స్, సామగ్రి సమర్పించాలని సూచన -
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
నారాయణపేట: గతేడాది పెండింగ్‌లో ఉన్న కేసులను తగ్గించేందుకు.. ఈ ఏడాది అందరూ సమన్వయంతో పనిచేసి నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ వినీత్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ కేక్ కట్ చేశారు. ప్రజలకు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. 2025 ఎన్నో చేదు, తీపి గుర్తులతో గడిచిపోయిందని, కొత్త ఏడాది జిల్లా జిల్లా పోలీసులు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుని వాటిని సాధించడానికి అహర్నిశలు కృషి చేయాలని, నేరాలను తగ్గించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. పనితీరు మెరుగుపరుచుకుని అద్భుతమైన ఫలితాలు సాధించాలని, గతేడాది జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించినందుకు సిబ్బందిని అభినందించారు. సమస్యాత్మక కేసులను సాంకేతికతను ఉపయోగించి త్వరగా పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రియాజ్ హుల్‌హక్, డీఎస్పీ లింగయ్య, సిఐలు శివశంకర్, రాంలాల్, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
నయా సాల్.. ఫుల్ జోష్!
● రికార్డు స్థాయిలో రూ.5.50 కోట్ల మద్యం అమ్మకాలు ● కిటకిటలాడిన చికెన్, మటన్ దుకాణాలు ● జిల్లాలో 86 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నారాయణపేట: కొత్త సంవత్సర సంబరాలు మందుబాబుల్లో ఫుల్ జోష్ నింపాయి. ఒక్క రోజులోనే రూ.5.50 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. 2025కు వీడ్కోలు పలుకుతూ.. 2026కు గ్రాండ్ వెల్కమ్ పలికారు. జిల్లాలోని 33 వైన్స్ దుకాణాల్లో మద్యం ప్రియులు బీర్లు, వైన్ల కోసం బారులు తీరారు. నారాయణపేట సర్కిల్ పరిధిలో వైన్స్‌లతో పాటు బెల్డ్ దుకాణాల్లో రూ.3.50 కోట్లు.. సీఎం ఇలాఖాలోని 14 వైన్స్‌లు, ఒక బారు, బెల్ట్ దుకణాల్లో రూ.కోటిన్నర విక్రయాలు జరిగాయని ఎకై ్సజ్ శాఖ అంచనా వేస్తోంది. మద్యం ప్రియుల జేబులు గుల్ల అయినా.. ప్రభుత్వ ఖజానా మాత్రం గలగలలాడింది. ఇదిలాఉండగా, యువత హోటళ్లు, దాబాలు, రిసార్ట్స్‌కు వెళ్లి వేడుకలు జరుపుకొన్నారు. రాత్రి 12 అవగానే కేరింతలు కొడుతూ నూతన సంవత్సరానికి ఘన స్వాగతం తెలిపారు. హాపీ న్యూ ఇయర్ అంటూ గంతులేశారు. రెండు రోజుల ముందు నుంచే.. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మద్యం ప్రియుల అభిరుచులకు అనుగుణంగా వారికి కావాల్సిన బ్రాండ్లను వైన్స్‌ల్లో అందుబాటులో ఉంచారు. డిసెంబర్ 28 నుంచే అన్ని సాధారణ రోజుల కంటే 20 నుంచి 40 శాతం అధికంగా మద్యం స్టాక్ వైన్స్, బార్లకు చేరుకున్నాయి. ఒక వైన్స్‌లో 31న ఒక్కరోజు ఉన్న స్టాక్ మొత్తంలో 60శాతం వరకు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. వీటికితోడు దాబాలు, హోటళ్లు కిటకిటలాడాయి. డిసెంబర్ 31 రాత్రి కేక్ కట్ చేయడం నుంచి మద్యం సేవించడం, భోజనాలకు ఏర్పాట్లు చేశారు. ఇక చికెన్, మటన్ విక్రయాలతో షాపులు పొద్దున్నుంచే కిటకిటలాడాయి. కాల్చిన కూర, చికెన్ ఫ్రై, చేపల ఫ్రై వద్ద జనం బారులు తీరి కనిపించారు. సాధారణ రోజులతో పోలిస్తే డిసెంబర్ 31న మాంసం విక్రయాలు జోరందుకున్నాయి. ముమ్మర తనిఖీలు.. 86 డ్రంకెన్ డ్రైవ్ కేసులు జిల్లాలో నూతన సంవత్సరం సందర్భంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 ఉదయం 6 గంటల వరకు జిల్లా పరిధిలోని 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలలో మొత్తం 86 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని పీఎస్‌ల వారీగా పరిశీలిస్తే నారాయణపేట టౌన్ 14, దామరగిద్ద 8, కోస్గి 5, మద్దూర్ 4, మరికల్ 7, ధన్వాడ 15, నర్వ 15, మక్తల్ 5, కృష్ణా 4, మాగనూర్ 8 నారాయణపేట రూరల్‌లో 1 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రాణాలకు ప్రమాదమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించిన తరువాత వాహనం నడపకూడదని ఆయన సూచించారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. -
లక్ష్య సాధనకు కృషి చేయాలి
నారాయణపేట రూరల్: తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేరుస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు విద్యార్థులు కృషి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీను అన్నారు. పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులతో మాట్లాడారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా చదవాలని, అర్థం కాని విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. శీతాకాలం సందర్భంగా చలి నుంచి తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనారోగ్య సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అంతకుముందు పాఠశాలలో ని వసతులు, భోజనం తదితర అంశాలపై విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పరీక్ష ప్యాడ్, నోటు పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో ఏవో శ్రీధర్, తహసీల్దార్, ప్రిన్సిపాల్ యాదమ్మ, ఎస్ఓ శ్వేతాజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తెల్లకందులుక్వింటా రూ.7,866 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం తెల్ల కందులు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,866 , కనిష్టంగా రూ.6,216 ధర పలికింది. అలాగే, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,759, వడ్లు (సోన) గరిష్టంగా రూ.2,711, కనిష్టంగా రూ.2,260 ధర పలికాయి. రోడ్డు భద్రత నియమాలు పాటించాలి నారాయణపేట: రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి వాహనదారుడు, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాదాలను తగ్గించవచ్చని, నియమాలు పాటించాలని ఎస్పీ వినీత్ అన్నారు. గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఏఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, డిస్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మేగా గాంధీతో కలిసి ఎస్పీ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మాసోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖతో పాటు రవాణా శాఖ అధికారులు కలిసి నెల రోజుల పాటు రోడ్డు భద్రత నియమాలపై విద్యాసంస్థలు, గ్రామా లు, పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలు హెల్మెట్, సీట్‌బెల్ట్ ప్రాముఖ్యతపై అవగాహన వంటివి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అందుబాటులో సాగుకు సరిపడా యూరియా
నారాయణపేట: జిల్లాలో యాసంగి సాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. బుధవారం జిల్లాలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా నిల్వలను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా ఎరువుల పంపిణీ జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నారాయణపేట మండలంలో 125.82 ఎంటీఎస్, దామరగిద్దలో 33.16, ధన్వాడలో 47.12, కోస్గిలో 83.84, కృష్ణాలో 99.82, మద్దూర్‌లో 38.43, మాగనూర్‌లో 74.88, మక్తల్‌లో 300.05, మరికల్లో 60.30, నర్వలో 31.73, ఊట్కూర్ మండలంలో 52.26 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. అన్ని సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్ద యూరియాతో సహా ఇతర అన్నిరకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువుల పంపిణీ కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి ప్రతి రైతుకు ఎరువులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కడైనా యూరి యా సరఫరాలో సమస్య ఏర్పడితే వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు. ఎవరైనా ఎరువుల కృత్రిమ కొరత సష్టించడం, అధిక ధరలకు విక్రయించడం, దారి మళ్లించడం వంటి అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నీళ్లు, ఆరోగ్యం, ఉద్యోగ కల్పనే లక్ష్యం
నారాయణపేట: నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో జిల్లా ప్రజానీకానికి సాగు, తాగునీరు, మెరుగైన వైద్యం అందించడం.. రవాణా సౌకర్యం పెంచేందుకు రహదారుల విస్తరణ, పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీవీఆర్ భవన్లో ఆయన మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడారు. 2026, 2027 సంవత్సరాల్లోనే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఈ రెండేళ్లు పెద్ద టాస్క్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. 2028లో డీలిమిటేషన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని.. ఇప్పుడు ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు మూడు స్థానాలయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగే సమయంలో ఏ మండలం ఎక్కడ ఉండాలి.. ఏ మండలం ఏ నియోజకవర్గంలోకి వెళ్తుందో తెలియని గందరగోళ పరిస్థితులు వస్తాయన్నారు. 2028 వరకు నియోజకవర్గాల పునర్విభజనకే సమయం సరిపోతుందన్నారు. తమకు ఉన్నది రెండేళ్ల సమయమేనని.. జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ప్రభుత్వం రూ. 4,610 కోట్లతో చేపట్టిన పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలో పూర్తిచేసి.. ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరా రూ. 20లక్షల చొప్పున పరిహారం అందించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. నష్టపరిహారం పెంపునకు డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి చేసిన కృషి మరవలేనిదన్నారు. ఎన్నో దశాబ్ధాలుగా కలగా మారిన వికరాబాద్ – కృష్ణా రైల్వేలైన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా భూ సర్వేకు రూ. 430కోట్లు కేటాయించిందన్నారు. జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులను చేపడుతున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని.. పచ్చకామేర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటూ మంత్రి చురకలంటించారు. పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా గోప్లాపూర్ వద్ద మినీ జురాల ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌శాఖ మంత్రులు బోసు రాజు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై చర్చించడం జరిగిందన్నారు. గోప్లాపూర్ వద్ద నీటిని ఎత్తిపోస్తూ భూత్పూర్, అక్కడి నుంచి ఊట్కూర్, జాయమ్మ చెరువు, కానుకుర్తి, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, కొడంగల్ వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. చిట్‌చాట్‌లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సుధాకర్, బండి వేణుగోపాల్, ఆర్టీఓ మెంబర్ పోశల్ రాజేశ్, డా.సాయిబాబా, సలీం, కతలప్ప ఉన్నారు. గోప్లాపూర్ వద్ద మినీ జూరాల ప్రాజెక్టు ఏర్పాటు దిశగా చర్యలు కమీషన్ల కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం లేదు మీడియాతో చిట్‌చాట్‌లో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి -
పుర పోరు.. కసరత్తు జోరు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. అధికారులు కసరత్తు ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి కాగా.. ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీల్లోనూ హడావుడి మొదలైంది. కొందరు కౌన్సిలర్/కార్పొరేటర్ ఆశావహులు రిజర్వేషన్లపై అంచనాలు వేసుకుంటుండగా.. మరికొందరు అనుకూలంగా వస్తాయనే ధీమాతో బరిలో ఉంటున్నామనే సంకేతాలను పంపిస్తున్నారు. 2 మినహా మిగిలిన 19 మున్సిపాలిటీల్లో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో కలుపుకుని మొత్తం 21 పురపాలికలు ఉన్నాయి. వీటిలో మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు పురపాలికల పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది మే వరకు ఉంది. 2021 ఏప్రిల్‌లో వీటికి ఎన్నికలు జరిగాయి. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి 2020 జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. అదే నెల 25న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. అదే నెల 28న పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో 2025 జనవరి 27తో వాటి పాలకవర్గాల కాలపరిమితి ముగియగా.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. నేడు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 2023 అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రమాణికంగానే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఆ ఏడాది అక్టోబర్ ఒకటి నాటికి ఉన్న ఓటర్ల జాబితా మేరకు కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో అధికారులు వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. జనవరి ఒకటి (గురువారం)న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా పురపాలికల కార్యాలయాల్లో విడుదల చేయడంతోపాటు ప్రదర్శించనున్నారు. అదేరోజు నుంచి నాలుగో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఐదో తేదీన ఆయా మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆరున జిల్లా స్థాయిలో సమావేశం కానున్నారు. పదో తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. తొలిసారిగా కార్పొరేషన్లో.. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్‌నగర్ 2025 జనవరి 27న మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అప్‌గ్రేడ్ అయిన తర్వాత కార్పొరేషన్ పరిధిలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 49 వార్డులు ఉండగా.. 60 డివిజన్లు అయ్యాయి. ఈ క్రమంలో డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలను అధికారులు పునర్ వ్యవ్యస్థీకరించారు. అదేవిధంగా డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన పూర్తి చేశారు. కొత్తగా దేవరకద్ర.. మద్దూరు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన రోజే మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట జిల్లాలోని మద్దూరు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా అవతరించాయి. మద్దూరు జీపీగా ఉన్న సమయంలో 14 వార్డులు ఉండగా.. ఐదు గ్రామాలను కలుపుకుని 16 వార్డులుగా విభజించారు. అదేవిధంగా దేవరకద్ర మేజర్ గ్రామ పంచాయతీలో 14 వార్డులు ఉండగా.. నాలుగు గ్రామాలను కలుపుకుని 12 వార్డులకు కుదించారు. జీపీల నుంచి మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన తర్వాత వీటికి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్.. 20 మున్సిపాలిటీలు అచ్చంపేట, జడ్చర్ల పురపాలికలకు ముగియని పదవీ కాలం మిగిలిన 19 పురపాలికల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి ఓటర్ల జాబితా సైతం.. నేడు ముసాయిదా విడుదల రాజకీయ పార్టీల్లో హడావుడి షురూ -
నయా జోష్
● నూతనోత్సాహంతో కొత్త సంవత్సర వేడుకలు ● కేరింతలతో యువత, చిన్నారుల సందడి ● కిటకిటలాడిన బేకరీలు.. మద్యం దుకాణాలు ● జిల్లాలో పండుగ వాతావరణం చరిత్ర పుటల్లో మరో ఏడాది కరిగిపోయింది. ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2025 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోగా.. కోటి ఆశలతో 2026 సంవత్సరానికి జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలు దాటగానే హ్యాపీ న్యూఇయర్ అంటూ చిన్నారులు, పెద్దలు, యువత ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఎటుచూసినా నూతన సంవత్సర వేడుకలతో పండుగ వాతావరణం కనిపించింది. యువకులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సందడి చేశారు. నయా సాల్ జోష్ హోరెత్తింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు, చర్చిలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. స్వీట్ షాపులు, బేకరీలు, మద్యం దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. – నారాయణపేట -
అడిషనల్ కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్
నారాయణపేట: జిల్లా లోకల్‌బాడీ అడిషనల్ కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్‌ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అడిషనల్ కలెక్టర్‌గా నియమించిన నారాయణ్ అమిత్ మలేంపాటి నియామకాన్ని రద్దు చేశారు. వికరాబాద్ జిల్లా తాండూర్‌లో సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉమాశంకర్ ప్రసాద్‌ను జిల్లా లోకల్‌బాడీ అడిషనల్ కలెక్టర్ (ఎఫ్ఏసీ)గా నియమించారు. హంసధాన్యం @ రూ.2,366 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం హంసధాన్యం క్వింటా గరిష్టంగా రూ. 2,366, కనిష్టంగా రూ. 2,005 ధర పలికింది. సోనధాన్యం గరిష్టంగా రూ. 2,735, కనిష్టంగా రూ. 1,801, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,695, కనిష్టంగా రూ.5,411, తెల్లకందులు గరిష్టంగా రూ. 7,759, కనిష్టంగా రూ. 6,300 ధరలు వచ్చాయి. -
తగ్గిన నేరాలు!
నారాయణపేట: గతేడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా.వినీత్ వార్షిక క్రైం రిపోర్టును విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. 2024–25కు గాను రిపోర్టెడ్ కేసులు 10.5 శాతం పెరిగాయి. తీవ్రమైన నేరాలు 22 శాతం తగ్గగా.. కిడ్నాప్ కేసులు 4 శాతం పెరిగాయి. మహిళలపై జరిగే నేరాలు 12.5 శాతం, క్రైం అగనెస్ట్ ఉమెన్ 4శాతం, బాల్యవివాహాలు 40 శాతం తగ్గాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎంసీసీ వైలెన్స్ 12, పోల్ వైలెన్స్ 3, లిక్కర్ కేసులు 63, ఇతర కేసులు 2 నమోదయ్యాయి. సైబర్ నేరాలకు సంబంధించి 368 ఫిర్యాదులు అందగా.. 165 కేసులను పరిష్కరించారు. ఈ కేసుల్లో రూ. 43,74,618 గాను కోర్టు ఆదేశాల మేరకు రూ. 20.40 లక్షలు రికవరీ చేశారు. డయల్ 100కు 11,124 మంది సంప్రదించగా.. బ్లూ కోట్స్ పోలీసులు సత్వర సేవలు అందించారు. సీఈఐఆర్ ద్వారా రూ. 35.34లక్షల విలువైన మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. గంజాయికి సంబంధించి 20 మందిపై కేసులు నమోదు చేసి.. 12.675 కిలోలు సీజ్ చేశారు. అక్రమ మద్యం కేసులు 147 నమోదు కాగా.. 1526.57 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. 36 గేమింగ్, జూదం యాక్ట్‌లో 221 మందిపై కేసులు నమోదు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మిన ఐదుగురిపై కేసులు నమోదు చేసి.. 300 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 58 మందిపై కేసులు చేసి.. 612 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 313 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 169 ట్రాక్టర్లు, 73 టిప్పర్లు, 2 జేసీబీలు, 1 బొలేరో వాహనాలను సీజ్ చేశారు. పోలీసు సేవలకు పతకాలు.. ప్రజలు సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు గాను ఎస్పీ వినీత్ కొత్తగా డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతినెలా మొదటి వారంలో ప్రజలు 08506–281182 నంబర్‌ను సంప్రదించి సమస్యలను తెలియజేస్తున్నారు. జిల్లా పోలీసు సేవలను సంబంధితశాఖ గుర్తించి గోల్డ్, సిల్వర్, కాంస్య పతకాలను ప్రదానం చేసింది. సరికొత్త విధానాలతో ప్రజలకు పోలీసుశాఖ మరింత చేరువైందని ఎస్పీ వినీత్ చెప్పారు. 2026 నూతన సంవత్సరంలో డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
‘వైకుంఠ’ శోభితం
నారాయణపేట ఎడ్యుకేషన్/మక్తల్: జిల్లావ్యాప్తంగా మంగళవారం వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం ఉత్తరద్వార దర్శనాలు కల్పించగా.. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని తన్మయం చెందారు. జిల్లా కేంద్రంలోని పళ్లవీధిలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయంతో పాటు సరాఫ్ బజార్ బాలాజీ మందిరం, సత్యనారాయణస్వామి ఆలయం, అశోక్‌నగర్ శ్రీమాత మల్లాంభిక ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో మహా అభిషేకం, పుష్పాలంకరణ, తులసి అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మక్తల్ పట్టణంలోని నాగిరేశ్వరాలయంలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీపడమటి ఆంజనేయస్వామి, మల్లికార్జునస్వామి, కుంభేశ్వరుడు, నల్లజానమ్మ ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. -
స్థానికం.. సంస్థాగతం!
నారాయణపేటపాలమూరులో కాంగ్రెస్‌కు కలిసొచ్చిన కాలం బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 20253 జిల్లాల్లో ‘ఢీ’సీసీ.. ఈ ఏడాది తొలి నుంచి డీసీసీ అధ్యక్షుల ఎంపిక కసరత్తు కొనసాగింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఏఐసీసీ పరిశీలకులు అభిప్రాయాలు సేకరించారు. అనంతరం నవంబర్ 22న ఐదు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో పాత నేతలు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ప్రశాంత్ కుమార్‌రెడ్డికి అవకాశం దక్కింది. మిగిలిన మూడు జిల్లాల్లోనూ డీసీసీ అధ్యక్షుల ఎంపిక చిచ్చు రేపింది. మహబూబ్‌నగర్‌లో సంజీవ్ ముదిరాజ్, వనపర్తిలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, గద్వాలలో రాజీవ్‌రెడ్డికి డీసీసీ పీఠం అప్పగించారు. కాంగ్రెస్: పై‘చేయి’.. అయినా డీలా.. మూడు విడతలుగా డిసెంబర్ 11, 14, 17న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,678 సర్పంచ్ స్థానాలు ఉండగా.. ఏడు జీపీల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన వాటిలో 964 మంది కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. వనపర్తి, కొల్లాపూర్, జడ్చ ర్ల నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నాయకుల్లో నిరాశ అలుముకుంది. జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డికి తమతమ స్వగ్రామాల్లో ఎదురుదెబ్బ తగిలింది. పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్ఎస్ గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ ‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్ వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్ఎస్ గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ ‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్ వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం గువ్వల బీజేపీకి జై.. బండ్లకు ఊరట -
‘పాలమూరు’ పనుల్లో కదలిక..
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈ ఏడాది ప్రాజెక్టు పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా ప్రాజెక్టు కింద సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా రైతులకు వరప్రదాయినిగా నిలిచే ఈ ప్రాజెక్టు పనుల్లో కదలికతో రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు పూర్తిస్థాయిలో మోటార్ల బిగింపు పూర్తయితేనే సాగునీరు అందనుంది. అలాగే రిజర్వాయర్ల నుంచి ఆయకట్టు రైతులకు నీరందించేందుకు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు, ఫీడర్ చానళ్ల నిర్మాణం చేపడితేనే రైతులకు మేలు చేకూరుతుంది. -
సాగులో నూతన ఒరవడి
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు రైతులు సాగులో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈసారి పత్తి కన్నా.. వరి, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేసేందుకు మొగ్గుచూపారు. పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా.. పలుచోట్ల ఆయిల్‌పాం, ఉద్యాన, వాణిజ్య పంటలు పండించేందుకు ఆసక్తి చూపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈసారి 900 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు సాగైంది. గద్వాల జిల్లాలో పొగాకు, వనపర్తి జిల్లాలో చెరకు, బెబ్బర పంటలు పండించారు. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మిగతా మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో రైతులు గతేడాది కన్నా ఈసారి వానాకాలంలో వరి, పత్తి పంటలు అధికంగా సాగుచేశారు. కానీ, జిల్లాలో ఈ ఏడాది పత్తి పంట సాగుచేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. అధిక వర్షాల నేపథ్యంలో పత్తి పంట దెబ్బతిని దిగుబడి సగానికి పడిపోయింది. దీంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇతర పంటలకే ప్రాధాన్యం.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో రైతులు అధికంగా వరి, పత్తి పంటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి నాగర్‌కర్నూల్ మినహా అన్ని జిల్లాల్లోనూ పత్తి పంట సాగు తగ్గించి వరి వైపు రైతులు మొగ్గుచూపారు. మహబూబ్‌నగర్‌లో ఈసారి వరి 10 వేల విస్తీర్ణం పెరగగా.. పత్తి 2 వేల ఎకరాలు తగ్గింది. నాగర్‌కర్నూల్‌లో వరి విస్తీర్ణం ఏకంగా 66 వేల ఎకరాలు పెరిగింది. అలాగే పత్తి విస్తీర్ణం సైతం గతేడాది కన్నా 4 వేలు అధికంగా సాగైంది. నారాయణపేటలో వరి గతేడాది కంటే 10 వేల ఎకరాల్లో రైతులు అధికంగా సాగుచేశారు. ఇక్కడ అధికంగా 50 వేల ఎకరాల్లో కందిపంట సాగవుతోంది. వనపర్తి జిల్లాలో వరి 8 వేల ఎకరాలు పెరగగా.. పత్తి విస్తీర్ణం 5 వేల ఎకరాలు తగ్గింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈసారి పత్తి సాగు 70 వేల ఎకరాల వరకు తగ్గగా.. వరి పంట విస్తీర్ణం 7 వేల ఎకరాలు తక్కువగా నమోదైంది. పాలమూరులో వినూత్నపంటల వైపు రైతుల మొగ్గు పలుచోట్ల ఆయిల్‌పాం, వాణిజ్య తోటల పెంపకం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా తగ్గిన పత్తి సాగు, దిగుబడి తీవ్ర నష్టాలు మిగిల్చిన వానాకాలం యూరియా కోసం రైతాంగానికి తప్పని పడిగాపులు యూరియా కోసం పాట్లు.. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి రైతులను యూరియా కష్టాలు వెంటాడాయి. పంటలు సాగు చేసిన రైతులు యూరియా కోసం రోజుల తరబడి పంపిణీ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. తెల్లవారుజామునే పీఏసీఎస్‌ల వద్దకు వచ్చి క్యూలో నిల్చోవడం, రోడ్లపై ధర్నాలు, ఆందోళనలు చేయడం కనిపించింది. సరిపడా యూరియా తెప్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. -
భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి
నారాయణపేట: పెండింగ్‌లో ఉన్న భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అన్ని మండలాల తహసీల్దార్లతో భూ భారతి, ఎస్ఐఆర్ సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు. దరఖాస్తులకు తమ పరిధిలో పరిష్కారం చూపి ఆర్డీఓ లాగిన్‌కు పంపించాలని, ఆర్డీఓ సైతం తహసీల్దార్లు పంపించిన ఆయా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. జనవరి మొదటి వారంలోపూ దరఖాస్తులను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ రామచందర్ నాయక్, కలెక్టరేట్ ఏవో శ్రీధర్ పాల్గొన్నారు. మహిళల రక్షణ మన కర్తవ్యం మహిళల రక్షణ, మహిళాభివృద్ధి, మహిళా సాధికారత కోసం అందరం కృషి చేద్దామని అడిషనల్ కలెక్టర్ శ్రీను అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ– జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పోష్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టం, 2013 గురించి వివరించారు. డీపీఆర్ఓ రషీద్, మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోర్డినేటర్ నర్సింహులు, జెండర్ స్పెషలిస్టులు అనిత, నరసింహ పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీను సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి 19 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌కు విన్నవించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. -
చలికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి
వాతావరణం ఉదయం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం వేడిగా, సాయంత్రం ఆహ్లాదంగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం పెరుగుతుంది. ● ప్రశ్న: పిల్లలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలపండి? – ముమ్మడి రాములు, పెద్దకడ్మూర్ ● డీఎంహెచ్ఓ: చిన్నారుల్లో తీవ్రమైన జ్వరాలు, జలుబు, ముక్కుకారడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. వ్యాధి ముదిరి న్యుమోనియా బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ఎలర్జీలు, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలతో చిన్నారులు అధికంగా బాధపడుతుంటారు. నెలలోపు ఉన్న పసిపిల్లలో హైపోథర్మియా వచ్చే అవకాశం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి శరీరం చల్లబడుతుంది. ఇది చాలా ప్రమాదకరం, కాబట్టి పసిపిల్లల్ని వెచ్చగా ఉంచాల్సిందే. వేడి ఆహార పదార్థాలు ఇవ్వాలి. సాయంత్రం నుంచే వెచ్చని దుస్తులు ధరించాలి. చలి పెరిగే సమయాల్లో బయటకు పంపొద్దు. ● ప్రశ్న: వృద్ధులు, గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? – మారుతి, నాగిరెడ్డిపల్లి, నర్వమండలం ● డీఎంహెచ్ఓ: చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉన్ని వస్త్రాలు ధరించడం, ఆహార నియమాలు, వ్యాయామం, నడక, యోగా చేయాలి. ఆస్తమా ఉన్న రోగులు ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. సొంటి, మిరియాలు, అల్లం, బెల్లంతో కషాయం చేసుకొని తాగితే చలితీవ్రతను తట్టుకోగలుగుతారు. ● ప్రశ్న: బీపీ, షుగర్, గుండె జబ్బు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి.? – వెంకటేశ్, ఉజ్జెలి ● డీఎంహెచ్ఓ: బీపి, షుగర్, గుండె జబ్బు ఉన్నవారు చలి ఎక్కువగా ఉన్న సమయంలో తిరగరాదు. చలి ప్రభావంతో రక్త నాళాలు మూసుకుపోయి రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతాయి. తద్వారా అకస్మత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. బీపీ పేషెంట్లకు ఆక్సిజన్ అందక హైపర్ టెన్షన్‌కు గురవుతారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్తం చలికి చిక్కబడి బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారి తీస్తుంది. వృద్ధులు, గర్భిణులకు ప్రాణాంతకంగా మారే పరిస్థితులు ఉంటాయి. ఇంట్లోనే ఉన్ని దుస్తులు ధరించి ఉండడం మంచిది. యోగా లేదా తేలికపాటి ఎక్సర్సైజ్లు చేయాలి. నారాయణపేట: చలికాలం నేపథ్యంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయని.. వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని.. స్వీట్స్, జంక్‌ఫుడ్ తింటే గొంతు నొప్పి, ఇతర అనారోగ్యాలను ఆహ్వానించినట్లేనని.. స్వీయ జాగ్రత్తలే రక్షణగా నిలుస్తాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జయచంద్రమోహన్ అన్నారు. సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమంలో శీతాకాలంలో ఎదురయ్యే సమస్యలు, వ్యాధులపై ప్రజల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడే రోగుల సంఖ్య పెరుగుతోందని, సూర్యోదయం తర్వాత యోగా, వ్యాయామం చేయాలని, జనంలోకి వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరి ధరించాలని అన్నారు. పూర్తి వివరాలిలా.. ● ప్రశ్న: చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే వ్యాధులు ధరిచేరవు ? – మధూసూధన్, మాగనూర్ ● డీఎంహెచ్ఓ: ఆహారం వేడిగా ఉన్నప్పుడే భుజించాలి. స్టోరేజ్ ఉన్నవి, ఫ్రిడ్జ్‌లో పెట్టినవి, బయట దొరికే చిరుతిండ్లు, జంక్‌పుడ్, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండడమే మంచిది. విధిగా గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. చలికాలంలో చాలామంది నీరు ఎక్కువగా తీసుకోరు. కానీ, నీరు తాగకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సీజనల్ పండ్లు, ఆకు కూరలు, రాగులు, సజ్జలు, పీచు పదార్థాలు తినాలి. ● ప్రశ్న: ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలు ఉన్నాయా..? – నాగేశ్, కొత్తపల్లి ● డీఎంహెచ్ఓ: అన్ని పీహెచ్సీలలో వైద్యులు అందుబాటులో ఉన్నారు. మందుల కొరత లేదు. ప్రభుత్వ ఆస్పత్రులలోనే మెరుగైన వైద్యం అందుతోంది. జ్వరం, జలుబు, ఇతర ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా అతి తీవ్రం కాక ముందే సమీప పీహెచ్‌సీల్లోని వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు మందులు వాడాలి. ప్రస్తుతం గ్రామాల్లో లెప్రసీ సర్వే నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా ప్రజలు జ్వరం, ఇతర వాటితో బాధపడుతున్నట్లు తెలిస్తే అక్కడే వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రశ్న: శీతాకాలంలో ప్రధానంగా వచ్చే వ్యాధులు ఏమిటీ? – బస్వరాజ్, తంగిడి డీఎంహెచ్ఓ: జలుబు, చలి జ్వరం, ఆస్తమా, న్యుమోనియా, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్లకపోవడమే మంచిది. తప్పనిసరి వెళ్లాల్సి వస్తే చెవి, ముక్కుతో పాటు శరీరం కప్పి ఉంచేలా ఉన్ని దుస్తులు ధరించాలి. ఉదయం 8 గంటల తర్వాత బయటకు వెళ్లడం, సాయంత్రం 6 గంటలలోపే ఇంటికి చేరడం ఆరోగ్యానికి మేలు. ప్రశ్న: కాళ్లు.. ఒళ్లునొప్పులు తీవ్రమయ్యాయి. రక్షణ చర్యలు వివరించరూ? – వెంకటయ్య, ధన్వాడ డీఎంహెచ్ఓ: చలి తీవ్రత ఈ ఏడాది ఎక్కువగా ఉండడంతో ప్రధానంగా వృద్ధులకు కాళ్లు, ఒళ్లనొప్పులు తీవ్రమయ్యే అవకాశం ఉంది. వెంటనే వైద్యులను సంప్రదించి మందులు వాడాలి. సొంత నిర్ణయాలతో మెడికల్ షాపుల్లోకి వెళ్లి మందులు కొనుగోలు చేయొద్దు. వ్యాధి ముదిరే ప్రమాదం ఉంది. ఆహార నియమాలను పాటిస్తే ఎలాంటి ఆనారోగ్య సమస్యలు రావు. -
అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలి
మద్దూరు: కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ మద్దూరు మండలంలోని వివిధ గ్రామాల్లో అంగన్వాడీ, జీపీ, పాఠశాల తదితర భవనాల పనులు వెంటనే ప్రారంభించాలని కడా అధికారి వెంకట్‌రెడ్డి అధికారులకు అదేశించారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తూ, ఇంకా ప్రారంభంకాని పనులపై చర్చించారు. జాధరావ్పల్లితండా, మద్దూరు, దమ్‌గాన్‌పూర్, నందిపాడ్ గ్రామాల్లో రూ.20 లక్షలతో మంజూరైన అంగన్వాడీ భవనాలను నిర్మాణం చేపట్టకపోవడంపై పీఆర్ డిప్యూటీ ఈఈ విలోక్ను అడిగి తెలసుకున్నారు. కొన్ని చోట్ల స్థలాభావం, తదితర సమస్యలో పనిప్రారంభించలేదని కడా అధికారికి తెలియజేశారు. పోర్లకుంటతండా జీపీ భవన నిర్మాణం, పల్లెర్లలో రూ.కోటి 60 లక్షలతో నూతన పాఠశాల భవన నిర్మాణాలు, రూ. 80 లక్షలతో మద్దూరులో గ్రంథాలయ భవన నిర్మాణం జనవరి 5 వరకు చేపట్టకపోతే ఈ నిధులు వేరే వాటికి మళ్లించాల్సి ఉంటుందని సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ నర్సింహా, మద్దూరు మున్సిపల్ కమిషన్ శ్రీకాంత్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి కూలీకి ‘ఉపాధి’ కల్పించాలి
అమరచింత: గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడంలో అధికారుల అలసత్వం కారణంగానే అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని.. ఇప్పటికై నా బాధ్యతగా పనిచేయాలని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. అమరచింత మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన ఉపాధి హమీ 4వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో ఆమె పాల్గొని గ్రామాల వారీగా చేపట్టిన పనులు, కూలీలకు డబ్బుల చెల్లింపులను పరిశీలించారు. మండలంలో రూ. 5.50కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టారని.. ఏపీఓ రఘుపతిరెడ్డి తెలిపారు. వీటికి సంబంధించి డీఆర్పీలు సేకరించిన వివరాలను ఒక్కొక్క పంచాయతీ వారీగా వివరాలను వెల్లడించారు. అనంతరం డీఆర్డీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో పని కావాలని అడిగితే ప్రతి కూలీకి ఉపాధి హామీ పనులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పనులు చేసిన కూలీలకు క్రమం తప్పకుండా కూలి డబ్బులు చెల్లించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాలని.. రోజు మస్టర్లో కూలీల వివరాలు నమోదు చేయాలన్నారు. కాగా, పక్కదారి పట్టిన రూ. 15,010 రికవరీ చేయాలని ఏపీఓను ఆదేశించారు. సమావేశంలో అంబుర్స్మెంట్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీఓ నర్సింహులు, ఏపీఓ రహీం, రఘుపతిరెడ్డి, మల్లికార్జున, బాలరాజు పాల్గొన్నారు. -
పడమటి అంజన్న హుండీ లెక్కింపు
మక్తల్: మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కించగా.. రూ.7.95 లక్షలు వచ్చింది. సోమవారం ఈ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయశాఖ పరిశీలకుడు ఎస్ శ్రీనివాసచారి, ఆలయ వ్యవస్థాపక వంశీయులు ప్రణేశాచారి ఆధ్వర్యంలో చేపట్టారు. మొత్తం రూ.7,98,572 రాగా ఇందులో రూ.92,802 నాణెములు, రూ.70,5770 నోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ లెక్కింపులో మారుతి భజాన మండలి సభ్యులు గుంతల వెంకటేష్, , శ్రీనివాసచారి ఈసరి హన్మంతు, అచ్చుతారెడ్డి, మల్లిఖార్జున్‌రావు, సంజీవ్‌కుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు నారాయణపేట: జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టామని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా యూరియా సరఫరా పూర్తిస్థాయిలో కొనసాగుతుందని ఇన్చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని యూరియా పంపిణీ కేంద్రాలలో ప్రైవేట్ డీలర్స్ దగ్గర అవసరమైనంత స్టాకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాకు యూరియా అవసరం 2,394 మెట్రిక్ టన్నులకు కాగా ఇప్పటికే 3000 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేసినట్లు, ఇంకా వివిధ పంపిణీ కేంద్రాలలో 1009 మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్‌లో 2885 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. రైతులకు సౌకర్యవంతంగా, క్రమబద్ధంగా యూరియా పంపిణీ జరిగేలా ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు డీలర్ యూరియా పంపిణీ కేంద్రం ముందు తప్పనిసరిగా షామియానా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని, ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ మరింత కట్టుదిట్టంగా చేపడతానని తెలిపారు. గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం నారాయణపేట: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026 – 27 విద్యా సంవత్సరానికి ప్రవేశానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్ నాగ మణిమాల తెలిపారు. ఈమేరకు సోమవారం ప్రవేశ పరీక్షకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతితోపాటు 6 నుంచి 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు 2026 జనవరి 21లోగా ఆన్లైన్లో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బోనోఫైడ్, ఫొటో, విద్యార్థి సంతకంతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. మున్సి‘పోల్స్’కు సన్నద్ధం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఎట్టకేలకు మున్సి‘పోల్స్’కు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ఓటరు జాబితా ముసాయిదాకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 30న ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పోలింగ్ కేంద్రాల వివరాలను తయారు చేయనునున్నారు. జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారీగా తుది ఓటరు జాబితాను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 20 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉన్నాయి. అయితే జడ్చర్లలో ఇంకా పాలకవర్గం గడువు ముగియలేదు. టెట్‌కు ఏర్పాట్లు పూర్తి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా జనవరి 2వ తేదీ నుంచి టెట్ నిర్వహణకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్‌లోని ఫాతిమా విద్యాలయ, జేపీఎన్సీ ఇంజినీరింగ్ కళాశాలలో మాత్రమే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం మూడు దశల్లో అభ్యర్థులకు సబ్జెక్టుల వారీగా టెట్ నిర్వహించనున్నారు. ఒక్కో దశలో 190 మంది చొప్పన పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 22 రోజుల పాటు జరగనున్న పరీక్షకు 4,009 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. చాలా మందికి హైదాబాద్, రంగారెడ్డి జిల్లాలో కేంద్రాలను కేటాయించారు. -
రాబంధుల పాలన వచ్చే
రైతుబంధు పాలన పోయి.. ● బీఆర్ఎస్ హయాంలో ఆగిన వలసలు మళ్లీ మొదలయ్యాయి ● పాలమూరు ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ● సర్పంచ్ల సన్మాన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు ఎవరికీ భయపడొద్దని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమను ఏం చేయలేరని కేటీఆర్ ధైర్యం చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో.. గ్రామానికి సర్పంచ్ అలాగే అన్నారు. మరో రెండేళ్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని.. ఆ తర్వాత బీఆర్ఎస్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పల్లెలు మళ్లీ పచ్చబడుతాయని.. లక్ష్మీకళ వస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాలు, పరిపాలనతో హైదరాబాద్‌లో ఎకరం రూ.150 కోట్లకు చేరిందని.. ప్రస్తుతం ఆ భూములపై రేవంత్ కన్ను పడిందన్నారు. పరిశ్రమల కోసం ఇచ్చిన భూముల్లో ఏదైనా కట్టుకోవచ్చా అని ప్రశ్నించారు. రూ.5 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు రేవంత్ హిల్ట్ పాలసీ తెచ్చిండని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, హర్షవర్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి.. రాబంధుల పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి పాలమూరులో ఆగిన వలసలు తిరిగి మొదలయ్యాయన్నారు. ఈ ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఎప్పుడూ పండబెట్టి తొక్కుతా అంటూ మాట్లాడే రేవంత్‌రెడ్డి.. పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి రైతులను తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ మరో పోరాటానికి సిద్ధమయ్యారని వెల్లడించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని.. ఆయన చేపట్టే పోరాటానికి పాలమూరు బిడ్డలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. రెతులు యూరియా బస్తాల కోసం గోస పడుతున్నారని కేటీఆర్ అన్నారు. చలిలో చెప్పులు క్యూలో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రేవంత్‌రెడ్డికి రైతులపై ప్రేమ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చామని గుర్తుచేశారు. కేసీఆర్ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబితే రేవంత్‌కు సోయి వచ్చిందన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుందని.. జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్, అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్ అని పేర్కొన్నారు. -
రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపిక
మక్తల్: ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 16 మంది బాల బాలికలు ఎంపికయ్యారని జిల్లా సైక్లింగ్ అసొసియేషన్ ప్రధాన కార్యదర్శి, విశ్రాంత పీఈటీ గోపాలం ఆదివారం తెలిపారు. ఈ నెల 27వ తేదీ మక్తల్‌లో ఎంపిక పోటీలు జరగగా.. ఈమేరకు బాలబాలికలు ఎంపికయ్యారని వివరించారు. వీరిలో నవ్య, జ్యోతి, గీతిక, ప్రణిత, త్రివేణి, అంబిక, అబిజ్ఞ, పూజ, మీనాక్షి, మేఘన, శశిప్రియ, శ్రీకాంత్, నవీన్, దర్శన్, కె.శ్రీకాంత్ ఉన్నారని, వీరంతా ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లోని మేడ్చల్, మల్కాజిగిరిలో జరుగు రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటారని అన్నారు. ఈమేరకు ఆదివారం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై స్కూల్ గేమ్స్ నిర్వహణ కార్యదర్శి ఉషారాణి, ఎస్జీఎస్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, పీఈటీలు విష్ణువర్ధన్‌రెడ్డి, మీనాకుమారి వారిని అభినందించారు. -
రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ప్రారంభం
నారాయణపేట ఎడ్యుకేషన్: ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఆరోగ్యకర జీవనానికి క్రీడలు ఎంతో ముఖ్యమని, ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమన్నారు. జిల్లా యువజన క్రీడా అభివృద్ధి అధికారి వెంకటేష్ మాట్లాడుతూ.. జిల్లాలో అనేక టోర్నీలు నిర్వహించామని, తాజాగా రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి 360 మంది క్రీడాకారులు 40 మంది కోచ్‌లు, మేనేజర్లు పాల్గొంటున్నారన్నారు. ఇక్కడ ఎంపికై న విద్యార్థులు రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సాయినాథ్ అన్నారు. కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన పోటీలు ప్రారంభవమవగా.. కార్యక్రమంలో ఉదయ భాను, యాదయ్య శెట్టి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి నారాయణపేట ఎడ్యుకేషన్: బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ఇందుకు కార్యకర్తలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు కె ప్రశాంత్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈమేరకు పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, రానున్న రాజకీయ కార్యచరణపై విస్తృత చర్చ నిర్వహించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్టం చేయాలని, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ పాత్రను బలోపేతం చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలు ఎల్లాప్పుడు ఐక్యమత్యంగా ఉండాలని, ప్రజా సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అదే విధంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సోషల్‌మీడియా ద్వారా పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ వేణుగౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్‌కుమార్, యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ శివంత్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ సదా శివారెడ్డి పాల్గొన్నారు. -
వేలానికి దొడ్డు బియ్యం
మరికల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో దొడ్డు బియ్యం మరుగున పడింది. వీటిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రేషన్ దుకాణాల్లో నిల్వలు ఉన్నాయి. దీంతో దొడ్డు బియ్యం వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పంపిణీలో భాగంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో దొడ్డు బియ్యం వేలం వేలానికి చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ నెల 20న టెండర్ ప్రకటన జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్ దుకాణాలు, స్టేజీ–1, స్టేజీ–2 గోదాముల్లో దొడ్డు బియ్యం నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో అధికారులు ఆయా మండలాల వారీగా ఎంతమేర దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయనేది రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు పంపారు. ఈ నెల 23 నుంచి ఆన్లైన్ టెండర్ ప్రక్రియ మొదలు పెట్టారు. 29వ తేదీ వరకు ఆన్లైన్ టెండర్ వేసుకోవచ్చు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 301 రేషన్ దుకాణాల పరిదిలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తూ దొడ్డు బియ్యం నిల్వలను గుర్తించారు. ఈ ఏడాది మార్చి నుంచి దొడ్డు బియ్యం రేషన్ దుకాణాల్లోనే నిల్వ ఉన్నాయి. వాటి సేకరణపై అధికారులు వివిధ రకాలుగా కసరత్తు చేస్తున్నారు. దుకాణాల్లో నిల్వలు ఉన్నాయా, లేక నిర్ణయించిన తేదీ నాటికి వాటి సేకరణ పూర్తవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల్లో పొందుపరిచిన నిల్వలకు వాస్తవ నిల్వలను అధికారులు పోలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 301 రేషన్ దుకాణాల్లో, గోదాముల్లో కలిపి 190 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలున్నట్లు అధికారులు గుర్తించారు. నిల్వలు తక్కువగా ఉన్న చోట బృందాలుగా ఏర్పడి పరిశీలిస్తున్నారు. టెండర్ ద్వారా దొడ్డు బియ్యాన్ని దక్కించుకున్న టెండర్‌దారుడు ఆ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకెళ్లి విక్రయించుకోవడం కోసం ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. టెండర్ ప్రక్రియ పూర్తయ్యాక బియ్యాన్ని సంబంధించిన వివిరాలను ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంటుంది. నేటితో ముగియనున్న టెండర్ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా 190 క్వింటాళ్ల దొడ్డు బియ్యం ఆన్లైన్ టెండర్ ప్రక్రియ పూర్తయ్యాక.. ఉన్నతాధికారుల సూచన మేరకు మరో తేదీని ఖరారు చేసి టెండర్‌దారుల సమీక్షంలో దొడ్డు బియ్యాన్ని టెండర్ వేస్తాం. ఎవరు ఎక్కువగా ధర పాడితే వారికి బియ్యం అప్పగించేందుకు చర్యలు తీసుకుంటాం. టెండర్ వివరాలను ప్రభుత్వానికి అప్పగిస్తాం. – బాల్‌రాజ్, డీఎస్ఓ -
కూల్‌పై కూపీ..!
‘సాక్షి’ కథనాలపై కదిలిన ‘అధికార’ యంత్రాంగం ● మద్యం షాపుల్లో కూల్ పాయింట్ల వివాదంపై నజర్ ● నేరుగా రంగంలోకి దిగిన ‘ఎకై ్సజ్’ ఉన్నతాధికారులు ● వైన్స్ దుకాణాల ఓనర్ల నుంచి వివరాల సేకరణ ● ‘షెటర్ల’ కేటాయింపుల్లో అక్రమాలపైనా విచారణ ● పురపాలక శాఖకు ముఖ్య నేత ఆదేశాలు ● ఇంతకు ఎవరా నాయకులు.. ‘ఇంటెలిజెన్స్’ ఆరా? సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని వైన్స్ షాపుల్లో కూల్ పాయింట్లు, వీధి వ్యాపారులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణాల కేటాయింపుల్లో చోటుచేసుకున్న దందాపై ‘అధికార’ యంత్రాంగం దృష్టిసారించింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగిన బాగోతాలపై ‘కూల్శ్రీగా దోపిడీ’, ‘నేతల వసూళ్ల పర్వం’ శీర్షికన ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన వరుస కథనాలు సంచలనం సృష్టించాయి. అధికార కాంగ్రెస్‌లోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నడిపించిన ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కూపీ లాగుతున్నారు. దీంతో అసలేం జరుగుతోంది.. ఈ వివాదాలకు ఎవరెవరు కారణం అని పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సైతం నేరుగా రంగంలోకి దిగారు. తమకు పార్టీలో అత్యంత నమ్మకంగా ఉన్న వేగుల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. -
దుకాణాల కేటాయింపులపై..
నగరంలోని రోడ్లపై చిరు వ్యాపారాలతో నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారుల కోసం నగరంలోని క్లాక్‌టవర్ వద్ద పది.. మార్కెట్ రోడ్డులో మరో మూడు షెటర్లు నిర్మించిన విషయం తెలిసిందే. వీటిని వీధి వ్యాపారులకు కేటాయించాల్సి ఉండగా.. ఇందులో దుకాణానికి ఒక్కో రేటు చొప్పున ఫిక్స్ చేసి కొందరు నాయకులు వసూళ్లకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోననే భయంతో మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కొందరు ఉద్యోగులు ముఖ్య నేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు ముఖ్య నేత ఆదేశాలతో ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. -
యువత వ్యవసాయంలో రాణించాలి
మరికల్: దేశంలో అతిపెద్ద రంగమైన వ్యవసాయ రంగంలో యువత రాణించాల్సిన సమయం వచ్చిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆత్మీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని మరికల్‌లోని శ్రీవాణీ ఉన్నత పాఠశాలలో ఆదివారం రైతు మహోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తయారు చేసిన వ్యవసాయ పరికరాలను పరిశీలించి వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల తలరాత మారకపోవడం బాధారమన్నారు. దుకాణంలో విక్రయించే వస్తువుకు ఒక ధర నిర్ణయించి అమ్ముతారు కానీ, రైతు పండించిన ధాన్యానికి వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయించాల్సిన పరిస్థితులు దేశంలో ఉండటంతో వ్యవసాయం రంగం అభివృద్ధి చెందడం లేదన్నారు. రైతు తాను పండించిన పంటను స్వేచ్ఛగా విక్రయించుకునే రోజులు రావాలని, అప్పుడే వారి జీవితాలు బాగుంటాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు అమలుచేస్తున్నా.. వాటిని అచరణలో పెట్టడంలో విఫలమవుతున్నాయన్నారు. కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడంతో వ్యవసాయం అంతరించిపోయే ప్రమాదం ఉందని, కార్పొరేట్‌కు దీటుగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు. లేదంటే భవిష్యత్ తరాలకు అన్నం పెట్టే నాథుడు లేకుండా పోతారన్నారు. అనంతరం ఉత్తమ రైతులను, నూతనంగా ఎన్నికై న సర్పంచులను ఆయన సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ పూర్ణిమ, వెంకటేశ్వర్లుశర్మతోపాటు వినతమ్మ, నాయకులు పాల్గొన్నారు. -
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 99493 10297
తేది: 29–12–2025, సమయం: మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకునారాయణపేట: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్తో ఫోన్–ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర వైద్యసేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు ఫోన్లో సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్–ఇన్ నేడు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్–ఇన్ -
‘రైతుభరోసా’ అందేనా..?
● జిల్లాలో ప్రారంభమైన యాసంగి సాగు ● పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు ● ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాతలు నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సీజన్లో అన్నదాతలు ప్రధానంగా వరి సాగు చేయనుండగా.. కొన్నిచోట్ల రైతులు నాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొందరు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే రైతుభరోసా కోసం కొండత ఆశతో ఎదురు చూస్తున్నారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వెల్లడించడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. సాగు భూములకే.. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.10 వేలు ఉన్న పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచుతామని రైతులకు హామీ ఇచ్చింది. ఈ మేరకు మొదట యాసంగి సీజన్లో రైతు భరోసా పథకాన్ని పాతపద్ధతిలోనే అమలు చేసి తర్వాత వానాకాలంలో ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. గుట్టలు, రహదారులు, వెంచర్లు తదితర సాగుకు యోగ్యం కాని భూములకు రైతుభరోసాను నిలిపివేసింది. ● వానాకాలంలో అధిక వర్షాలు, యూరియా కొరతతో పత్తి, వరి, కంది పంటలు సరైన దిగుబడి రాక రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా అందడం లేదు. చివరకు పంటలకు కనీస మద్దతు ధరలు కూడా లేకపోవడంతో అప్పులతో కొట్టుమిట్టాడుతున్నారు. యాసంగి సాగుకై నా వీలైనంత త్వరగా రైతు భరోసా సాయం అందించాలని కోరుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో సన్న, చిన్న, పెద్ద రైతులు మొత్తం 1,80,221 మంది ఉండగా.. వానాకాలంలో రూ.260.93 కోట్లు ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉండింది. కాగా.. పలు కారణాలతో 534 మందికి రైతుభరోసా నిధులు చెల్లించకపోవడంతో రూ.260.56 కోట్లు మాత్రమే జమ చేశారు. -
కంది రైతుకు కన్నీరే..!
నారాయణపేట: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా వానాకాలంలో 38,568 మంది రైతులు 56,154 ఎకరాల్లో కంది సాగుచేశారు. వర్షాధార సాగులో ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున, నీటి పారుదల సాగులో ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా జిల్లా రైతులు కంది పంటను దాదాపు 90 శాతం మేర వర్షధారంపైనే సాగుచేశారు. అత్యధికంగా దామరగిద్ద మండలంలో 10,714 మంది రైతులు 15,209 ఎకరాల్లో.. అత్యల్పంగా కృష్ణా మండలంలో 34 మంది రైతులు 93 ఎకరాల్లో కంది పండించారు. నవంబర్ రెండోవారం నుంచి పంట చేతికందుతుండటంతో రైతులు నారాయణపేట మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. నాణ్యతకు కాస్త అటూ ఇటుగా ఉన్న కందికి వ్యాపారులు కనీస గిట్టుబాటు ధర చెల్లించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా మార్కెట్లో ధర పరిశీలిస్తే ఎర్ర కంది క్వింటా గరిష్టంగా రూ.7,825, కనిష్టంగా రూ.6,305.. తెల్ల కంది గరిష్టంగా రూ.7,860, కనిష్టంగా రూ.6 వేలు పలికింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం మద్దతు ధరతో కంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని పూనుకుంది. వీటిని సకాలంలో ప్రారంభించి ఉంటే రైతులకు కాస్త మేలు జరిగేదని, కానీ విక్రయాలు జోరందుకున్నా నేటికీ ప్రారంభించకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ఆశ్రయించి నష్టాలు చవిచూస్తున్నారు. నాణ్యత లేదంటూ గిట్టుబాటు కాని ధరల చెల్లింపు అధికారుల అలసత్వం.. పాలకుల నిర్లక్ష్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆలస్యం ఆందోళనలో రైతులు జిల్లాలో సాగు 56,154 ఎకరాలు.. దిగుబడి అంచనా2,24,588 క్వింటాళ్లు -
వెంటనే విడుదల చేయాలి..
నేను ఉన్న పొలంలో వానాకాలం కంది, వరి సాగు చేశా. ఆశించిన దిగుబడిరాక పెట్టిన పెట్టుబడి కూడా చేతికందడం లేదు. ప్రభుత్వం స్పందించి రైతులు అప్పుల పాలు కాకుండా యాసంగి సాగుకుగాను రైతు భరోసా నిధులు వీలైనంత త్వరగా విడుదల చేసి ఆదుకోవాలి. – బస్వరాజ్, రైతు, మద్దెల్‌బీడు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు రైతుభరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. అందరు రైతులకు అందజేస్తారా లేదా పంట వేసిన వారికే ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ముందుకుసాగుతాం. – జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి ● -
సైబర్.. టెర్రర్
జిల్లాల్లో గణనీయంగా పెరిగిన సైబర్ నేరాలు ● ఉమ్మడి పాలమూరులోని 4 జిల్లాల్లో ఇదే పరిస్థితి ● ఈసారి మొత్తం 3,625 ఫిర్యాదులు.. 454 కేసులు నమోదు ● అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో.. అత్యల్పంగా వనపర్తిలో.. ● ఈ ఏడాది కేటుగాళ్లు కొల్లగొట్టింది రూ.9.29 కోట్లు ● గతంతో పోల్చితే కాస్త మెరుగుపడిన రికవరీ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాలే వేదికగా వల పన్ని దోపిడీకి పాల్పడుతున్నారు. ఆయా వర్గాల వ్యక్తుల బలహీనత అయిన అత్యాశను ఆసరాగా చేసుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రకరకాల పేర్లతో ఏపీకే లింక్‌లు పంపించి నిలువునా దోచుకుంటున్నారు. ఈ ఏడాది ఎక్కువగా ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట యువత నుంచి భారీగా డబ్బులు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. వారి మాయలో చిక్కుకున్న వారిలో అమాయకులే కాకుండా.. రైతులు మొదలుకొని విద్యాధికులు, రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను సైబర్ మాయ కమ్మేసిన తీరుపై ‘సాక్షి’ క్రైం రౌండప్.. ధని ఇండియా బుల్స్ ఫైనాన్స్ పేరులో ఆన్లైన్ లోన్లు మంజూరు చేస్తామని నకిలీ పత్రాలు చూపిస్తూ.. ప్రాసెసింగ్ ఫీజుగా బాధితుడి నుంచి రూ.75,650 వసూలు చేశారు. మోసపోయినట్లు గ్రహించిన తర్వాత బాధితుడు మహబూబ్‌నగర్ టూటౌన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ జరిపి నేరస్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. రాష్ట్రవ్యాప్తంగా 35 కేసుల్లో రూ.3 కోట్లకు పైగా ఆన్లైన్ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. తీగలాగితే 35 కేసులు.. -
నారాయణపేట
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025622 ఫిర్యాదులు.. 218 కేసులు ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించి గతేడాది (2024)లో మొత్తం 3,003 ఫిర్యాదులు రాగా.. 236 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత 2025 సంవత్సరంలో 3,625 ఫిర్యాదులు అందగా.. 454 కేసులు నమోదైనట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 622 ఫిర్యాదులు.. 218 కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. గత సంవత్సరంలో నమోదైన కేసులతో పోలిస్తే మహబూబ్న గర్, జోగుళాంబ గద్వా ల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో సైబర్ నేరాల సంఖ్య అధికంగా ఉంది. -
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 99493 10297
తేది: 29–12–2025, సమయం: మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకునారాయణపేట: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్తో ఫోన్–ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర వైద్యసేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు ఫోన్లో సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్–ఇన్ -
మిగిలింది రూ. 5 వేలు..
ఉన్న 2 ఎకరాల పొలంలో వానాకాలంలో కంది సాగు చేశా. 7 క్వింటాళ్ల దిగుబడి రాగా.. పేట మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తే క్వింటాకు రూ.7,206 ధర వచ్చింది. పెట్టుబడి రూ.35 వేలు తీసేస్తే ఆరు నెలల పంటకు కనీసం కూలి కూడా మిగలలేదు. – అనంతయ్య, సాకలోనిపల్లి, దామరగిద్ద పెట్టుబడి రూ.50 వేలు.. ఉన్న రెండు ఎకరాల పొలంలో పండిన 6 క్వింటాళ్ల కందిని పేట మార్కెట్లో విక్రయించా. క్వింటాకు రూ.7,369 ధర పలికింది. మొత్తం రూ.44,214 చేతికందగా.. పెట్టుబడి రూ.50 వేలు అయింది. రూ.5,786 నష్టం వచ్చింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆలస్యం కావడంతో నష్టపోతున్నాం. – కతలప్ప, రైతు, పెద్దజట్రం, ఊట్కూర్ 7 కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు జిల్లాలోని నారాయణపేట, ధన్వాడ, నర్వ, మక్తల్, కోస్గి, దమ్‌గాన్‌పూర్, దామరగిద్ద పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కంది కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం. సోమవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తాం. – నర్సింహరావు, మార్క్‌ఫెడ్ డీఎం, మహబూబ్‌నగర్ కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.. మూడున్నర ఎకరాల్లో కంది సాగు చేస్తే భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దిగుబడి అంతంతే చేతికందగా క్వింటా రూ.7,032 ధరకు విక్రయించా. పెట్టిన పెట్టుబడి సైతం చేతికందలేదు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి ఉంటే రూ.5 వేలు మిగిలేవి. – ఈరప్ప, రైతు, పేరపళ్ల, నారాయణపేట ● -
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
నారాయణపేట ఎడ్యుకేషన్: క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లోని చర్చిలలో గురువారం క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రార్థన మందిరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. నారాయణపేటలోని మూడు చర్చిలతో పాటు మండలంలోని బైరంకొండ, కొల్లంపల్లి, సింగారం గ్రామాల్లోని చర్చిలను సర్వాంగ సుదరంగా తీర్చిదిద్దారు. యాద్గిర్ రోడ్డులోని ప్రధాన చర్చి, సింగారంలోని చర్చిలో ఉదయం ప్రత్యేక ప్రార్థనలను, క్రీస్తూ బోధనలు, పలువురి నాటక ప్రదర్శన నిర్వమించారు. అలాగే, మహిళల గీతాలాపన, కానుకల సమర్పణ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పాస్టర్లు అమృతం, నాగేష్ యేసయ్య పుట్టుక, చరిత్రతోపాటు ప్రవచనాలు వినిపించారు. సర్వోన్నతుడైన యేసుక్రీస్తూ మానవాళికి మార్గదర్శకుడని, అందరిని రక్షించడానికి వచ్చాడన్నారు. ఇదిలాఉండగా, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, యువతీ యువకులు గీతాలాపన, డ్రామా కార్యక్రమాలు అలరించాయి. చర్చి పాస్టర్లు, మత పెద్దలు, ఇతర రాజకీయ నాయకులు వేరువేరుగా జిల్లా కేంద్రంతోపాటు మండలాల పరిధిలోని పలు చర్చిలలో పాల్గొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సంఘం చైర్మెన్ వినోద్ కుమార్, కార్యదర్శి ఆనంద్, సంఘం పెద్ద రత్నయ్య, దేవిపుత్ర మరియు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
దేశం గర్వించదగ్గ స్ఫూర్తి ప్రదాత వాజ్‌పేయి
నారాయణపేట: దేశం గర్వించదగ్గ స్ఫూర్తి ప్రదాత మాజీ ప్రదాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం మాజీ ప్రధాని జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వాజ్ పాయ్ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. రాజకీయాల్లో విలువలు పెంచిన మహానాయకుడని.. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు నేటి యువత ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ నందు నామాజీ, జిల్లా కోశాధికారి సిద్ది వెంకట్ రాములు, జిల్లా కార్యదర్శి సుజాత, సత్య రఘుపాల్, పోషల్ వినోద్, మిర్చి వెంకటయ్య, శ్యామ్ సుందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అడిషనల్ కలెక్టర్ బదిలీ
నారాయణపేట రూరల్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో నారాయణపేట లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టరర్గా విధుల నిర్వర్తిస్తున్న సంచిత్ గంగ్వార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మల్కాజ్ గిరి విభాగం జోనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న నారాయణ్ అమిత్ మలెంపాటిని నారాయణపేటకు కేటాయించారు. ప్రస్తుతం నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ సైతం సెలవులో ఉండడంతో ఇన్చార్జి కలెక్టర్‌గా ఎఫ్ఎసీ బాధ్యతలను సంచిత్ గంగ్వార్ వ్యవహరిస్తున్నారు. ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలోని 5 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాలని మహబూబ్‌నగర్ గిరిజన సంక్షేమ అధికారి జనార్ధన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 8వ తరగతి ఎస్సీ, ఎస్టీ బాలురకు రూ.వెయ్యి, బాలికలకు రూ.1500, రాజీవ్ విద్యా దీవెన కింద 9, 10వ తరగతి డే స్కాలర్ విద్యార్థులకు రూ.2250 అందజేస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈపాస్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థి ఫొటో, ఆదార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్బుక్కు, రేషన్‌కార్డు, కులం, ఆధాయ ధ్రువపత్రాలు అవసరమని తెలిపారు. అన్ని వివరాలు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేసి ఈ పాస్ ద్వారా పూర్తి చేసిన దరఖాస్తులను మంజూరు కొరకు మహబూబ్‌నగర్ కలెక్టరేట్లోని గిరిజన సంక్షేమ అధికారి కార్యాలయంలో ఈ నెల 31 లోపు అందజేయాలని తెలిపారు. పద్యాకృతుల ఆవిష్కరణ మహోత్సవం స్టేషన్ మహబూబ్‌నగర్: జాతీయ సాహిత్య పరిషత్ పాలమూరు జిల్లాశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి రాచాలపల్లి బాబుదేవిదాస్రావు రచించిన ‘రామచంద్ర ప్రభో’, ‘చిత్రాంగద– సారంగధరుడు’ పద్యకృతుల ఆవిష్కరణ మహోత్సవాన్ని గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. జాతీ య సాహిత్య పరిషత్ జిల్లాశాఖ అధ్యక్షుడు ఇరివింటి వెంకటేశ్వరశర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సాహిత్యం జగద్వితం కోసం సృష్టించబడుతుందన్నారు. కవులు సమాజ హితాన్ని కోరుకుంటారని తెలిపారు. ముఖ్య అతిథి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రామచంద్ర ప్రభో కావ్యం సరళమైన, సుందరమైన సుమధుర తెలుగు భాషలో అందించినట్లు తెలిపారు. ఇందు లో ప్రాచీన కవుల గుంబనం, లలిత పదజాతం ఆకట్టుకుంటుందన్నారు. రామచంద్రప్రభో మకుటంతో ఆద్యంతం పద్యాలను ఎంతో శ్రావ్యంగా చదువుతూ బాబుదేవిదాసును అభినందిస్తూ సమీక్ష చేశారు. డాక్టర్ పొద్దుటూరు ఎల్లారెడ్డి రామచంద్రప్రభో మకుటం ఉన్న 131 పద్య కావ్యాన్ని, పద్యాలను చదువుతూ రామ కథను అసాంతం పరి చయం చేశారు. డాక్టర్ తంగెళ్లపల్లి శ్రీదేవి చిత్రాంగద–సారంగధరుడు కథను 126 ప్యదాల కృతిని సమీక్ష చేస్తూ చక్కగా వివరించారు. అదేవిధంగా ప్రముఖ న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి, అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి, డాక్టర్ కె.బాలస్వామి, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ పద్యకృతులపై ప్రసంగించారు. కార్యక్రమంలో పాలమూరు నగర అధ్యక్షులు జి,శాంతారెడ్డి, కవులు ప్రభులింగంశాస్త్రి, దేవదానం, రవీందర్‌రెడ్డి, ఖాజా మైనొద్దీన్, జగపతి రావు, గడ్డం వనజ, డాక్టర్ కృష్ణవేణి, జమున, ఈశ్వరమ్మ, గుముడాల చక్రవర్తి, శ్యాంప్రసాద్, అను రాధ, వీరేందర్‌గౌడ్, శ్రీరాములు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన జనమంచి గౌరీశంకర్ (గౌరీజీ) పేరిట ఏటా అందజేసే యువ పురస్కార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్తేజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపే సేవా కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, ప్రముఖ రంగాల్లో విశేష కృషి చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ భావాలు కలిగిన 40 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. తాము చేపట్టిన కార్యక్రమాల వివరాలతో దరఖాస్తుదారులు ఆదివారంలోగా sosabvptg@gmail.com కు పంపుకోవాలన్నారు. పూర్తి వివరాలకు పాలమూరు విభాగ్ ప్రముఖ్ రామచందర్ (సెల్ నం.9440981137)ను సంప్రదించాలని సూచించారు. -
యాసంగి పంటలకు సాగునీరు
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలపై రైతుల ఆశలు పదిలం అయ్యాయి. ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలకు సాగునీటిని విడుదల చేయడానికి షెడ్యూల్ ఖరారు చేశారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టర్ విజయేందిర, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆయకట్టు రైతులతో చర్చించి నీటి విడుదల చేసే తేదీలను ఖరారు చేశారు. 2 టీఎంసీల నీరు.. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పాత ఆయకట్టు కింద కుడి, ఎడమ కాల్వల యాసంగి సీజన్ పంటలకు సాగునీటిని వదులుతారు. గతేడాది రూపొందించిన షెడ్యూల్లో తేదీలను అటు ఇటుగా మార్చి అయిదు తడులుగా నీటిని వదలడానికి నిర్ణయించారు. దేవరకద్ర మండలంలో ఎడమ కాల్వ పూర్తిస్థాయిలో ఉండగా.. కుడి కాల్వ కింద ధన్వాడ, మరికల్, చిన్నచింతకుంట మండలాలు ఉన్నాయి. అయితే పాత ఆయకట్టు ప్రకారం 12 వేల ఎకరాల మేర ఉండగా అందులో పూర్తిస్థాయిలో సాగునీరు అందే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. వానాకాలంలో దాదాపు మూడు నెలలపాటు నీటి విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని దీనివల్ల దాదాపు 35 వేల ఎకరాల మేర సాగవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 2 టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ సాగునీటికి, మరో టీఎంసీ వేసవిలో తాగునీటి అవసరాలకు ఉపయోగించే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రణాళిక సిద్ధం చేశాం.. కోయిల్‌సాగర్‌లో ఉన్న నీటిని సద్వినియోగం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఉన్న రెండు టీఎంసీల నీటిలో సాగుకు ఒక టీఎంసీ, తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీని ఉపయోగించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. యాసంగి సీజన్ పంటల కోసం రైతులు ఇప్పటికే వరినారు మడులు సిద్ధం చేసుకోవడం జరిగింది. దీనివల్ల నేరుగా నాట్లు వేసుకోడానికి నీటిని వదిలేందుకు తేదీలను ఖరారు చేశాం. – ప్రతాప్‌సింగ్, ఈఈ, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కోయిల్‌సాగర్ నీటి విడుదల షెడ్యూల్ ఖరారు పాత ఆయకట్టు 12 వేల ఎకరాలకే అవకాశం జనవరి 5 నుంచి ఏప్రిల్ 14 వరకు అయిదు తడులు ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 32.2 అడుగులు -
పరిహారం.. పరిహాసం
జడ్చర్ల: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద జడ్చర్ల మండలంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలకు పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్అండ్ఆర్) పరిహారం పరిహాసంగా మారింది. గతంలో కొల్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారాన్ని డిసెంబర్ 9లోగా అందిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సైతం పలుసార్లు ఇదేమాట చెప్పారు. దీంతో తమకు నిర్ణీత గడువులోగా పరిహారం అందుతుందని ఆశించిన నిర్వాసితులకు చివరికి నిరాశే మిగిలింది. ఎప్పడెప్పుడా అంటూ నిర్వాసితులు పరిహారం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. కోడ్ అమలు నేపథ్యంలో.. ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం ప్రకటించిన డిసెంబర్ 9 గడువు పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా అంతరాయం ఏర్పడింది. కోడ్ అమలు సమయంలో నిధులు విడుదలకు అవకాశం లేకపోయింది. అయితే ఎన్నికల కోడ్ ముగియడంతో త్వరితగతిన అవార్డు పాస్ చేసి పరిహారాన్ని విడుదల చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ ఏమైనా ఎన్నికలు వస్తే మరోసారి కోడ్ అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందని, ఆలోగా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదండాపూర్ వాసులకు పెండింగ్ ఉదండాపూర్ రిజర్వాయర్ పరిధిలోని వల్లూరు గ్రామంతోపాటు ఒంటిగుడిసె తండా, చిన్నగుట్టతండా, రేగడిపట్టతండా, తుమ్మలకుంటతండా, సామగడ్డతండా నిర్వాసితులకు దశల వారీగా రూ.250 కోట్ల ఆర్అండ్ఆర్ పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాలలో ఇప్పటికే జమ చేశారు. అయితే ఉదండాపూర్ గ్రామానికి సంబంధించి మాత్రం ఆలస్యంగా సర్వే పూర్తి కావడంతో ఆర్అండ్ఆర్ పరిహారానికి సంబంధించి అవార్డు పాస్ కాలేకపోయింది. గతంలో నిర్వహించిన సర్వేలో బోగస్ కుటుంబాల నమోదు ఉన్నాయన్న ఆరోపణలు, ఫిర్యాదులపై అధికారులు రీసర్వే చేపట్టారు. ఫలితంగా అవార్డు పాస్ కాక నిధులు విడుదల కావడంలో జాప్యం జరిగింది. ఫలితంగా ఇప్పటికీ ఉదండాపూర్ అవార్డు ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అవార్డు పాస్ అయితేనే ఆర్అండ్ఆర్ నిధులు విడుదల కానున్నాయి. పెంపుపై కసరత్తు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పెంపునకు కృషిచేస్తామని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆయన పలుమార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి గత ప్రభుత్వం రూ.16.30 లక్షల ప్యాకేజీని ప్రకటించగా.. దీనిని రూ.25 లక్షలకు పెంచుతామని ఎమ్మెల్యే చెప్పారు. అయితే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పెంపుతో ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు పాత ప్యాకేజీ ప్రకారంగానే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కాగా.. ఇటీవల ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారం పెంపు కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించగా.. ప్రభుత్వం అదనంగా రూ.146 కోట్ల విడుదల కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఇదివరకే ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ ఆర్అండ్ఆర్ పరిహారం కేటాయింపులో వేర్వే రుగా ప్యాకేజీ ఖరారు చేశారు. తాజా ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం తప్పని ఎదురుచూపులు ఈనెల 9లోగా అందిస్తామన్న సీఎం.. ముగిసిన గడువు పంచాయతీ ఎన్నికల కోడ్‌తో నిధుల విడుదలలో జాప్యం ఆందోళనలో ఉదండాపూర్ నిర్వాసితులు ఇప్పటికే ప్యాకేజీ పెంపు ప్రకటించిన ప్రభుత్వం రూ.18 లక్షలకు పెంపు..? ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారం కింద ఒక్కో కుటుంబానికి రూ.16.30 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే 65 ఏళ్లు పైబడిన ఒంటరి వ్యక్తులను సైతం ఒక కుటుంబంగా పరిగణించి పరిహారం చెల్లించనున్నట్లు సమాచారం. న్యాయం చేయాలి.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా ఇప్పటి వరకు ప్యాకేజీ అందలేదు. గతంలోనే ప్యాకేజీ ఇచ్చి ఉంటే అప్పట్లో తక్కువ ధరలకు ప్లాట్లు, ఇతరత్రావి కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పెరిగిన ధరలకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం దేనికీ సరిపోదు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చెప్పిన విధంగా ప్యాకేజీ రూ.25 లక్షలకు పెంచి న్యాయం చేయాలి. – హన్మంతు, నిర్వాసితుడు, ఉదండాపూర్ -
పోలీస్ సిబ్బందికి రివార్డులు
నారాయణపేట: పలు కేసులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదుచేయడం, కేసుల విచారణలో టెక్నాలజీ వినియోగం, ఉత్తమ సేవలు అందించిన జిల్లా పోలీసు సిబ్బందికి బుధవారం డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీ శ్రీనివాసరావు రివార్డులు అందజేశారు. ఐటీ కోర్ టీమ్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు, సభ్యులు మహేష్, మాగనూర్ టెక్ టీమ్ సభ్యుడు నీలయ్య గౌడ్, ధన్వాడ స్టేషన్ నుంచి వినయ్‌కుమార్‌లు రివార్డులు అందుకున్నారు. డిజిటల్ పోలీసింగ్ దిశగా జిల్లా పోలీస్ విభాగం చూపిస్తున్న కృషి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోందని, టెక్నాలజీని సమర్థంగా వినియోగించినప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని ఈ రివార్డులు స్పష్టంగా చాటిచెబుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఎస్పీ వినీత్ రివార్డులు అందుకున్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. పీయూ అథ్లెటిక్స్ ఎంపికలు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సౌత్‌జోన్, ఇంట ర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనే పాలమూ రు యూనివర్సిటీ అథ్లెటిక్స్ జట్లకు ఎంపికలు నిర్వహించారు. బుధవారం పీయూ పరిధిలో పోటీలను వీసీ శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యూనివర్సిటీలో ఉన్న వసతులను వినియోగించుకుని క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదే స్ఫూర్తి కొనసాగించండి
నారాయణపేట: జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు విజయఢంకా మోగించారని, ఇదే స్ఫూర్తితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కంకణబద్దులై కృషి చేయాలని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లాలో బీజేపీ మద్దతుదారులుగా విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సన్మాన సభలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. ముందుగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్ర పటానికి నివాళులు ఎంపీ అర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో పదేళ్లుగా పాలన అందించిన బీఆర్ఎస్పై ప్రజలు కోపం వచ్చి కాంగ్రెస్‌కు పట్టం కట్టారని.. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు అమలుపర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, జీపీలకు కేంద్ర నిధులు తప్పా కాంగ్రెస్ ప్రభుత్వల నుంచి పైసా రాలేదన్నారు. చేసిన పనులకు బకాయిలు రాక గత సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. డబ్బులు లేవని సీఎం స్వయంగా చెబుతున్నారన్నారు. రెండేళర్ల పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను గ్రామ గ్రామాన ఎండగట్టడంతో పాటు.. కేంద్ర పథకాలు వివరించాలన్నారు. బీజేపీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరికీ వర్క్ షాప్ త్వరలో వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి మరింత బలంగా పని చేయాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి ఇప్పటి నుంచే పని చేయాలన్నారు. ఒక్కసారి తెలంగాణలో అధికారంలోకి బీజేపీ వస్తే దించే సత్తా ఏ పార్టీకి లేదని, ప్రజలే మళ్లీ గెలిపించుకుంటారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగురావు నామాజీ, రతంగ్ పాండు రెడ్డి, సత్య యాదవ్, పగడకుల శ్రీనివాసులు, కొండయ్య, ప్రతాప్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, డోకూరు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వరి క్వింటా రూ.2,480
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా వరికి (హంస)గరిష్టంగా రూ.2480, కనిష్టంగా రూ.2030 ధర పలికింది. అలాగే, వరి (సోనా) గరిష్టంగా రూ.2,789, కనిష్టంగా రూ.2,200, ఎర్ర కందులకు గరిష్టంగా రూ.7,680, కనిష్టంగా 5,600, తెల్ల కందులకు గరిష్టంగా రూ.7,680, కనిష్టంగా రూ.6,200 ధరలు పలికాయి. 27న అర్చక సంఘం ఉమ్మడి జిల్లా సమావేశం స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రం సింహగిరిలోని లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మండపంలో ఈనెల 27న దూపదీప నైవేద్య అర్చక సంఘం ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవికుమార్ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులతో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు ముఖాముఖి సమావేశం ఉంటుందని, 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30గంట వరకు అర్చకులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల దూపదీప నైవేద్య అర్చకులు ఉదయం 11 గంటల్లోగా కల్యాణ మండపానికి చేరుకోవాలని కోరారు. సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో అర్చక చైతన్యయాత్ర ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వరకు ఉంటుందని తెలిపారు. ‘పోరాటాలకు సిద్ధం కావాలి’ వనపర్తిటౌన్: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జంగయ్య ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీవో భవనంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.రవిప్రసాద్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగగా.. ఆయనతో పాటు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ ముఖ్యఅతిథులుగా హాజరై టీఎఫ్ఐ, టీఎస్టీయూఎఫ్ జెండాలను ఆవిష్కరించారు. జంగయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ అమలు కాలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, డీఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఈఓ అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే లా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సంఘం నాయకులు కె.జ్యోతి, బి.వెంకటేష్, తిమ్మప్ప, శ్రీనివాస్‌గౌడ్, అరుణ, ఆర్.రామన్‌గౌడ్, మురళి, రాముడు, అగ్రిప్ప, రియాజ్, చెన్నకేశవులు, జి. కృష్ణ, అనసూయా, జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నరేందర్ పాల్గొన్నారు. -
సమష్టిగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి
నర్వ: గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషిచేయాలని.. సర్పంచు అంటే నిరంతర ప్రజా సేవకుడు అని పశుసంవర్ధక, పాడి, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం నర్వ సర్పంచు హన్మంతురెడ్డి, పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో రాష్ట్రపతి సంతకం ఎంత ముఖ్యమో, గ్రామాభివృద్ధికి సర్పంచు సంతకం అంత ముఖ్యమని, ఎన్నికల వరకే పార్టీలు చూడాలని గ్రామాభివృద్ధిలో అందరు ఏకమై అభివృద్ధి సాదించుకోవాలన్నారు. గెలిచిన నాటి నుండే నర్వ మండలాన్ని దత్తత తీసుకున్నానని తన పదవి ముగిసే నాటికి మండలంలో బీటీ రోడ్లు లేని గ్రామాలు లేకుండా చేస్తానన్నారు. గ్రామంలో సీసీ రహదారులు, డ్రైనేజీల ఏర్పాటుకు రూ. 2 కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తానని ఇందుకు పక్క ప్రణాళిక తయారు చేసుకొని కలవాలన్నారు. మండలంలోని ఎన్నో అపరిశ్కృత సమస్యల పరిష్కారానికి నా వంతు శక్తితో కృషిచేస్తానన్నారు. మండలంలో 300 ఇళ్ళు మంజూరు చేస్తే 120 మంది మాత్రమే కట్టారని మొత్తం పూర్తి చేస్తే వెయ్యి ఇళ్ళైన ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానన్నారు. నియోజకవర్గంలో 3600 ఇళ్లు ఇవ్వాలని సహచర మంత్రి పొంగులేటిని అడిగానన్నారు. రేపటి నుంచి మండల కేంద్రంలో పాడుబడ్డ ఇళ్లు, ముళ్ళపొదలు, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను జేసీబీ పెట్టి శుభ్రం చేయిస్తామని, మంత్రి సహకారంతో అభివృద్ధి చేసుకుందామని నాయకుడు జలందర్‌రెడ్డి అన్నా రు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనువాసులు, పోలీ స్ చంద్రశేఖర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, చెన్నయ్యసాగర్, జగధభిరెడ్డి, జగన్మోహన్రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శరణప్ప పాల్గొన్నారు. సోదరభావంతో పండుగలు జరుపుకోవాలి మక్తల్: ప్రజలంతా సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని, ప్రభుత్వం క్రైస్తవుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొని కేక్ కట్ చేశారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవయే మాదవ సేవ అని.. పేదలకు సేవ చేస్తే ఎంతో మంచిదని, ఏసుక్రీస్తు చూపిన మార్గంలో నడవాలని, ప్రేమ, విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తాయని అన్నారు. ఆర్డీఓ రాంచదర్, నాయకులు లక్ష్మారెడ్డి. వెంకటేస్, శ్రీనివాసులు, పాస్టర్ జాన్సన్ గొల్లపల్లి నారాయణ, నాగేస్, రవికుమార్, గణేస్కుమార్, నారాయణ పాల్గొన్నారు. -
క్రిస్మస్ వేడుకలకు సిద్ధం
● విద్యుద్దీపాలతో చర్చిల ముస్తాబు ● ఆకట్టుకున్న ముందస్తు వేడుకలు నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చిలను కిస్మస్ వేడుకలకు ముస్తాబు చేశారు. ప్రార్థన మందిరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. నారాయణపేట పట్టణంలోని మూడు చర్చిలతో పాటు మండలంలోని భైరంకొండ, కొల్లంపల్లి, సింగారం గ్రామాలలోని చర్చిలను సర్వాంగ సుదరంగా తీర్చిదిద్దారు. సింగారంలో ఉదయం యోసయ్యను స్మరిస్తూ ఊరేగింపు, ప్రత్యేక ప్రార్థనలను, క్రీస్తూ బోధనలు, డ్రామా కార్యక్రమం, మహిళలలచే గీతాలాపన, కానుకల సమర్పణ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఇదివరకే గ్రామంలో సెమి క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. క్రైస్తవులు తమ ఇంటిపై నక్షత్రాకారంలో లైట్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా నారాయణపేటలోని బీసీ కాలనీలో ఉన్న చర్చిలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. యువతి యువకులు పాల్గొని గీతాలాపన, డ్రామాలతో అలరించారు. ● జిల్లా కేంద్రంలోని యాద్గిర్ రోడ్డు పక్కన ఉన్న ఎంబీ చర్చిను 1952 లో ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ బిల్డింగ్ టన్ మత ప్రచారానికి వచ్చి చర్చ్‌ను ఏర్పాటు చేశారు. ఆయన ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు నడిచిన తర్వాత మోనోనైట్ బ్రదరాన్ అనే సంస్థవారికి అప్పజెప్పగా ఆ సంస్థ పేరు మీదనే దీనికి ఎంబీ చర్చి అనే పేరు వచ్చింది. తదనంతరం ఎంబీ సంస్థ స్థానికంగా ఉన్న రత్నయ్య అనే వ్యక్తి అప్పజెప్పగా 45 సంవత్సరాల నుండి ఆయననే చర్చి నిర్వహణ కొనసాగిస్తున్నారు. -
పార్టీలు, పంతాలు వద్దు.. అభివృద్ధి చేసుకుందాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/కోస్గి: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి చెందినట్లనే విషయాన్ని గుర్తించి నూతనంగా ఎన్నికై న సర్పంచులు గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. సమష్టి కృషితో దేశంలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు, రాజకీయాలుంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు, పంతాలు పక్కన బెట్టి అభివృద్ధియే ఏకై క ఎజెండాగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని కోస్గి పట్టణం ఓ ఫంక్షన్హాల్లో కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లను సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రాతినధ్యం వహిస్తున్నాడు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. బెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా నూతన సర్పంచ్‌లు పాలకవర్గాలతో కలిసి పని చేయాలి. అభివృద్ధికి ఎన్ని నిధులైన మంజూరు చేస్తా. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కాకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రత్యేక ముఖ్యమంత్రి నిధులు అందిస్తా. ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లు వేసి సర్పంచులుగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత నూతన సర్పంచ్‌లుగా మీపైనే ఉంది. గ్రామస్థాయి మొదలు మండలస్థాయి నాయకుల వరకు రాజకీయాలు పక్కనబెట్టి అన్ని పార్టీల సర్పంచ్‌లను కలుపుకొని గ్రామాల అభివృద్ధియే ఏకై క లక్ష్యంగా పని చేయాలి.’ అని పేర్కొన్నారు. చదువుతోనే వెలుగులు ‘చదువుతోనే వెలుగు, మార్పు వస్తుంది. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో 25 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. రాష్ట్రం మొత్తం అన్ని పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టించి చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. విద్యా, వసతులు, భోజనం అందిస్తేనే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. నియోజకవర్గంలోని లగచర్లలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేలా విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి.’ అని సీఎం సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతిక్ జైన్, అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, నాయకులు కుంభం శివకుమార్‌రెడ్డి, వార్ల విజయ్‌కుమార్, రఘువర్ధన్‌రెడ్డి, విక్రంరెడ్డి, నర్సిములు, మహేందర్‌రెడ్డి, యూసూఫ్, శేఖర్, మద్దప్ప దేశ్‌ముఖ్, అన్న కిష్టప్ప, నాగులపల్లి నరేందర్, తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తా ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ అందించే బాధ్యత సర్పంచులదే -
చన్నీళ్లే దిక్కు!
సంక్షేమ వసతిగృహాల్లో గీజర్లు, హీటర్లు కరువు నారాయణపేట/నారాయణపేట ఎడ్యుకేషన్/మక్తల్: రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటలైనా మంచుదుప్పటి పర్చుకుని కనిపిస్తోంది. బయటికి రావాలంటే చలి చంపేస్తోందంటూ జంకుతున్నారు. ఈ నేపథ్యంలో వసతిగృహాల్లో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలను మంగళవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ‘సాక్షి’ బృందం విజిట్ చేయగా.. అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా పలు వసతిగృహాల్లో స్నానాల గదులు సరిగ్గా లేవు. సోలార్ ప్లాంట్లు మరమ్మతుకు గురయ్యాయి. గీజర్లు, హీటర్లు లేకపోవడంతో విద్యార్థులకు చన్నీళ్లే దిక్కవుతున్నాయి. కాలకృత్యాలతో మొదలుకొని స్నానాలు పూర్తయ్యే వరకు ప్రతి అవసరానికి చన్నీళ్లనే ఉపయోగించాల్సి వస్తోంది. తమ గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యారంటూ కొందరు విద్యార్థులు క్రిస్మస్ పండుగ అంటూ ఇంటిబాట పడుతున్నారు. తగ్గుతున్న హాజరుశాతం.. జిల్లాలోని ఏ వసతిగృహాన్ని పరిశీలించినా విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకు తగ్గుతూ వస్తుందని తెలిసింది. మొత్తం 13 ఎస్సీ వసతిగృహాల్లో 1,998 మంది విద్యార్థులు చేరాల్సి ఉండగా.. 1,758 మంది ఉన్నారు. అందులో 1,536 మంది వసతిగృహాల్లో ఉంటూ చదువుతున్నారు. బీసీ వసతిగృహాలు 13 ఉండగా.. 1,688 సీట్లు ఉన్నాయి. వీటిలో 1,531 మంది ప్రవేశం పొందగా.. 1,053 మంది మాత్రమే హాస్టళ్లలో ఉంటున్నారు. విద్యార్థుల హాజరు తగ్గడంపై వసతిగృహ వార్డెన్లతో ఆరా తీస్తే.. క్రిస్మస్ సెలువులు ఉండటంతో స్వగ్రామాలకు వెళ్లారని చెప్పారు. అయితే చలి తీవ్రత అధికం కావడం.. వసతిగృహాల్లో వసతుల లేమితో అవస్థలు పడుతున్న విద్యార్థులు ఇంటిబాట పడుతున్నట్లు తెలుస్తోంది. చెడిపోయిన సోలార్ వాటర్ ప్లాంట్లు వణికించే చలిలోనే చన్నీటి స్నానాలు చేస్తున్న విద్యార్థులు కొన్ని హాస్టళ్లకు కిటికీలు, డోర్లు కూడా సరిగా లేని వైనం తగ్గుతున్న హాజరుశాతం -
మక్తల్ సమగ్రాభివృద్ధికి కృషి
మక్తల్: మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని 4, 5, 12 వార్డుల్లో పర్యటించి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా శ్మశానవాటిక లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని, తిర్మలయ్య చెరువును పునరుద్ధరించాలని, రూ. 2కోట్లతో ఖానాపురం రోడ్డు నుంచి ఏరుకలవాడ మీదుగా కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు రోడ్డు నిర్మించాలని కోరారు. ఆయా సమస్యల పరిష్కారంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో ఇప్పటికే రూ. 1,035 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. రోడ్ల నిర్మాణం కోసం రూ. 70కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మక్తల్‌లో డిగ్రీ కళాశాల, 150 పడకల ఆస్పత్రి, రూ. 200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అనంతరం 150 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేశ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, డైరెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాసులు, కట్టా సురేశ్, హన్మంతు, తాయప్ప, నాగేశ్, శంషొద్దీన్, ఫయాజ్, శ్రీనివాసులు, సలాం తదితరులు పాల్గొన్నారు. -
జీవాల్లో నట్టల నివారణ ముఖ్యం
నర్వ: జీవాల ఆరోగ్య సంరక్షణలో నట్టల నివారణ ముఖ్యమని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నర్వ మండలం పెద్దకడ్మూర్, పాథర్చేడ్ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి.. మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు రోజు రెండు గ్రామాల్లో నట్టల నివారణ మందు పంపిణీ చేస్తామని.. జీవాల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్లు సురేశ్, శ్రీలత పాల్గొన్నారు. పేదల హక్కులపై కేంద్రం కత్తి నారాయణపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల హక్కులపై కత్తి నూరుతోందని ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సమాధి కట్టేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా వీబీ రామ్‌జీ చట్టాన్ని తీసుకొచ్చిందని.. ఈ నల్ల చట్టాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రాములు, సహాయ కార్యదర్శి హాజీ మాలంగ్ ఉన్నారు. ‘మీ సొమ్ము.. మీ హక్కు’పై అవగాహన నారాయణపేట: పదేళ్లుగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన బ్యాంకు డిపాజిట్లను తిరిగి పొందేందుకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించిందని ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ‘మీ సొమ్ము.. మీ హక్కు’పై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఇన్చార్జి కలెక్టర్‌తో పాటు ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రెహమాన్, ఎస్బీఐ రీజనల్ ఆఫీసు నుంచి సీఎం సత్యప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్డీఎం విజయకుమార్ మాట్లాడుతూ... క్లెయిమ్ చేయని పొదుపు ఖాతాలను ఏ విధంగా తిరిగి స్వంత యజమానులు పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సులో వివిధ బ్యాంకుల అధికారులు తమ బ్యాంకు స్టాళ్లను ఏర్పాటుచేసి సేవలను వివరించారు. అర్హులైన క్లెయిమ్ దారులకు సెటిల్మెంట్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు షణ్ముఖచారి, జేమ్స్ డేవిడ్, ప్రదీప్, ప్రసన్నకుమార్, హిమాన్షు, సరుద్ధకర్ పాల్గొన్నారు. ఎర్ర కందులు క్వింటా రూ.7,811 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో మంగళవారం ఎర్ర కందులు క్వింటా గరిష్టంగా రూ. 7,811, కనిష్టంగా రూ. 5 వేల ధర పలికింది. అదే విధంగా తెల్లకందులు గరిష్టంగా రూ. 7,725, కనిష్టంగా రూ. 6,200, నల్ల కందులు రూ. 6,329, వరి (సోనా) గరిష్టంగా రూ. 2,791, కనిష్టంగా రూ. 1,800, వరి (హంస) గరిష్టంగా రూ. 2,460, కనిష్టంగా రూ. 2,200 ధరలు వచ్చాయి. -
ట్యాంకు నీళ్లతో స్నానం చేస్తాం
ఎస్సీ వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ గ్రౌండ్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్నా. హాస్టల్లో గీజర్ లేదు. బోరు నుంచి ట్యాంకుకు నీళ్లు ఎక్కిస్తారు. ఆ నీటితోనే స్నానం చేస్తాం. చలికాలం కావడంతో స్నానం చేసేందుకు వణికిపోతున్నాం. హాస్టల్లో గీజర్లు ఏర్పాటు చేయాలి. – నరేందర్, విద్యార్థి, ఎస్సీ వసతిగృహం, నారాయణపేట పైకప్పు పెచ్చులూడుతుంది.. మాది నారాయణపేట మండలంలోని అభంగాపూర్. జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతిగృహంలో ఉండి రవితేజ హైస్కూల్లో 9వ తరగ తి చదువుతున్నా. హాస్టల్ భవనం పాతది కావ డంతో పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు కింద పడుతుందో అనే భయం ఉంది. చలి తీవ్రత కూడా అధికంగా ఉంది. – రాజు, విద్యార్థి, ఎస్సీ వసతిగృహం, నారాయణపేట రోజు వణికిపోతున్నాం.. రోజు ఉదయాన్నే స్నానం చేయాలంటే వణికిపోతున్నాం. కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్లి వచ్చాక స్నానాలు చేస్తున్నారు. చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నాం. ఆనంద నిలయంలో గీజర్లు లేదా హీటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – వెంకటేశ్, విద్యార్థి, ఆనంద నిలయం, మక్తల్ ● -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
నారాయణపేట: వేసవిలో గృహ, వ్యవసాయ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సీఈ బాలస్వామి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీఎల్ఆర్ సెంటర్లో మంగళవారం విద్యుత్‌శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవసరమైన వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. గ్రామాల్లో వందశాతం విద్యుత్ బిల్లులు వసూలయ్యే విధంగా పనిచేయాలన్నారు. వేసవిలో వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సమావేశంలో ఎస్ఈ డి.నవీన్‌కుమార్, డీఈ బీఎల్ నర్సింహారావు, డీఈటీ జితేందర్, ఏఈ మహేశ్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
గవర్నర్ దృష్టికి ప్రముఖుల సేవలు
జిల్లాకు వివిధ రంగాల్లో సేవలందించిన 12 మంది ప్రముఖుల గురించి అధికారులు గవర్నర్ దృష్టికి తెచ్చారు. వీరిలో విశ్రాంత ఐఏఎస్ దినకర్‌బాబుతోపాటు పద్యకవులు ఆకుల శివరాజ లింగం, సందాపురం బిచ్చయ్య, కూచిపూడి నృత్యకారిణి వంగీపురం నీరజాదేవి, విశ్వ మానవతా సంస్థ శ్రీనివాస అల్లూరి, అంధత్వాన్ని జయించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రాణిస్తున్న పెరవల్లి గాయత్రి, శిల్పి బైరోజు చంద్రశేఖర్, సెపక్తక్రా అంతర్జాతీయ క్రీడాకారిణి రాళ్ల నవత, బాక్సింగ్ క్రీడాకారుడు నున్సావత్ వెంకటేష్, పోచ రవీందర్‌రెడ్డి, చిత్రకారుడు గడ్డం శివకుమార్, జానపద కళాకారుడు రాజారాం ప్రకాష్ గవర్నర్‌తో పరిచయం చేసుకున్నారు. దక్షిణకాశీలో ప్రత్యేక పూజలు దక్షిణకాశీ క్షేత్రానికి చేరుకున్న గవర్నర్‌కు దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.హరీష్, ఈఓ దీప్తి అర్చక స్వాములతో కలిసి పూర్ణకుంబ స్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో విఘ్నేశ్వరుడికి, అనంతరం స్వామివారి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు జరిపించారు. అలాగే జోగుళాంబదేవిని దర్శించుకొని కుంకుమార్చన, విశేష పూజలు జరిపించారు. అంతకు ముందు అలంపూర్ చేరుకున్న గవర్నర్‌కు ఎంపీ మల్లురవి, కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విజయుడు పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో గవర్నర్ సంయుక్త కార్యదర్శి భవానీశంకర్, ఏడీసీ మేజర్ అమన్ కుందూ, ఏడీసీ కాంతిలాల్ పటేల్, సీఎస్ఓ శ్రీనివాసరావు, వ్యక్తిగత కార్యదర్శి పవన్‌సింగ్, గద్వాల అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీఓ అలివేలు, డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, డీఎస్పీ మొగలయ్య, పురావస్తు శాఖ ఇంజినీర్ కిశోర్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్ మంజుల పాల్గొన్నారు. చేనేత మగ్గం నేసి.. గద్వాల జరీ చీరల ప్రాముఖ్యత తెలుసుకున్న గవర్నర్ చేనేత స్టాల్ దగ్గర కార్మికులతో మాట్లాడారు. నెలకు ఎన్ని చీరలు నేస్తారు.. కూలీ ఎంత వస్తుందని ఆరాతీశారు. ఖండాంతర ఖ్యాతి ఘడించిన గద్వాల జరీ చీరల ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేయాలని సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్లో మగ్గంపై కూర్చొని చీర నేసే విధానాన్ని పరిశీలించి.. రాట్నం ద్వారా ధారం చుట్టారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాల వివరాలు తెలుసుకుని ప్రశంసించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో రాజ్‌భవన్‌ను లోక్‌భవన్‌గా మార్చామన్నారు. అంతకు ముందు కలెక్టర్ సంతోష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రసిద్ధ క్షేత్రాలు, ప్రాముఖ్యత, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు గద్వాల జరీ చీర ఫ్రేమ్‌ను జ్ఞాపికగా అందజేశారు. -
నేడు కోస్గికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్లుసంచిత్ గంగ్వార్, ప్రతీక్ జైన్ కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం కోస్గికి రానున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ డా.వినీత్‌తో కలిసి నారాయణపేట, వికారాబాద్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతీక్ జైన్ పరిశీలించారు. పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించే స్థానిక లక్ష్మీనర్సింహ ఫంక్షన్హల్తో పాటు సభాస్థలం, హెలిప్యాడ్ ఏర్పాటు, సీఎం కాన్వాయ్ రూట్, వాహనాల పార్కింగ్, బారికేడ్లు తదితర భద్రతాపరమైన అంశాలను వారు పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనను విజయవంతంగా పూర్తిచేసేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం వికారాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన 800 మంది పోలీసులతో ఎస్పీ వినీత్ సమావేశమై మాట్లాడారు. మొత్తం 10 సెక్టార్లుగా విభజించి.. అదనపు ఎస్పీలు, డీఎస్పీలను ఇన్‌చార్జీలుగా నియమించామని తెలిపారు. ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఇద్దరు ఏఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలతో పాటు 93 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, 600 మంది సిబ్బందితో పాటు ప్రత్యేక బృందాలతో పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో అదనపు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ రూట్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ప్రజలకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. వారి వెంట అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, అదనపు ఎస్పీ ఎండీ రియాజ్, డీఎస్పీ లింగయ్య, మహేశ్, సీఐ సైదులు తదితరులు ఉన్నారు. -
వందశాతం లక్ష్యాలు సాధించాలి
నారాయణపేట: జిల్లాలోని నర్వ యాస్పరేషన్ బ్లాక్‌లో వందశాతం లక్ష్యాలను సాధించాలని సెంట్రల్ ప్రభారీ అధికారి స్వప్నాదేవిరెడ్డి అన్నారు. నర్వ యాస్పరేషన్ బ్లాక్ ప్రాజెక్ట్ ప్రగతిపై కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి రంగాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సెంట్రల్ ప్రభారీ అధికారిణి మాట్లాడుతూ.. నర్వ యాస్పరేషన్ బ్లాక్‌లో సూచికల ప్రకారం కొన్ని గణాంకాలు సరిగ్గా నమోదు కాలేదన్నారు. డాటా, సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా సాంకేతిక లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. బ్లాక్‌లో నిర్దేశించిన అన్ని సూచికల్లో వందశాతం లక్ష్యాల సాధ న దిశగా ముందుకు సాగాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీను, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్‌సుధాకర్, డీపీఓ సుధాకర్‌రెడ్డి, డీఎంహెచ్ఓ డా.జయచంద్రమోహన్, డీఈఓ గోవిందరాజులు, నోడల్ అధికారి హీర్యానాయక్, తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, యాస్పరేషన్ బ్లాక్ సమన్వయకర్త బాలాజీ ఉన్నారు. ● స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్‌రెడ్డి వీసీ నిర్వహించగా.. కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి ఇన్చార్జి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలన్నారు. వారంలోగా పురోగతి కనిపించాలని.. లేనిచో సంబంధిత బీఎల్ఓలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా ఓటరు జాబితాలో బ్లర్‌గా ఉన్న ఫొటోలను పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తించి.. ఫాం–8 ద్వారా ఫొటోలను బీఎల్ఓలతో అప్డేట్ చేయించే ప్రక్రియను కూడా పూర్తిచేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్ పాల్గొన్నారు. -
పల్లెసీమల్లో నవశకం
● గ్రామపంచాయతీల్లో కొలువుదీరిన పాలకవర్గాలు ● అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవాలు ● గ్రామాల్లో పండుగ వాతావరణం నారాయణపేట: పల్లెసీమల్లో నవశకం ఆరంభమైంది. అన్ని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. పండుగ వాతావరణంలో సర్పంచులు, వార్డు సభ్యులతో పంచాయతీ కార్యదర్శులు ప్రమాణం చేయించారు. జిల్లావ్యాప్తంగా 272 మంది సర్పంచులుగా, 2,466 మంది వార్డు మెంబర్లుగా విజయం సాధించగా.. ఎన్నికల అధికారులు ధ్రువపత్రాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రమాణం చేయించారు. అనంతరం సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో 272 జీపీలు ఉండగా.. 271 జీపీల్లో తొలి గ్రామసభలు జరిగాయి. ధన్వాడ మండలంలోని మడిగెలములతండా సర్పంచ్ బంధువు ఒకరు మృతిచెందడంతో గ్రామసభ వాయిదా పడింది. మక్తల్ మండలం ముస్లాయిపల్లిలో ఒక్క ఓటుతో గెలుపొందిన సర్పంచ్ పవిత్రమ్మ, ఉపసర్పంచ్ సురేష్, వార్డు సభ్యులు పోలీసు బందోబస్తు నడుమ ప్రమాణం చేశారు. కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకరోత్సవానికి గ్రామస్తులను సైతం కాస్త దూరంగానే ఉంచారు. ఎన్నో ఆశలు.. ఆశయాలతో ఎన్నో ఆశలు, ఆశయాలతో కొలువుదీరిన పంచాయతీల పాలకవర్గాలకు నిధులలేమి అసలు సమస్యగా కనిపిస్తోంది. పంచాయతీలకు ఇంటి పన్నులు తప్ప.. ఇతర ఆదాయ వనరులు పెద్దగా ఉండవు. కార్మికుల జీతాలు, విద్యుత్ చార్జీలు, చెత్త సేకరణ ట్రాక్టర్లకు డీజిల్, నీటి వనరుల సంరక్షణ వంటి వాటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. గత ప్రభుత్వ హయాంలో రైతువేదికలు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను నిర్మించారు. అవసరాలకు మూలం నిధులే కావడంతో ప్రభుత్వం సరిపడా నిధులు ఇవ్వాలని కొత్త పాలకవర్గాలు కోరుతున్నాయి. సన్మానాలు.. అభినందనలు జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీల మద్దతుతో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందనలతో ముంచెత్తారు. గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ డా.వినీత్ దిశానిర్దేశంతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విధులు.. బాధ్యతలు గ్రామ పంచాయతీల పరిపాలకులుగా సర్పంచులు వ్యవహరిస్తూ గ్రామసభలు నిర్వహించాలి. ఎన్నిక తర్వాత 15 రోజుల్లో తొలి గ్రామసభ జరపాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టుకునేలా చొరవ తీసుకోవాలి. బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి పనులు, రోడ్డు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, వీధి దీపాలు, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ, స్వచ్ఛభారత్ వంటి కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచులపైనే ఉంటుంది. పంచాయతీ ఆర్థిక నిర్వహణ, లాభనష్టాల రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. పీఎం ఆవాస్ యోజన వంటి పథకాల్లో పారదర్శకత ఉండాలి. ఒకే కుటుంబంలో ముగ్గురు.. ధన్వాడ మండలం రామకిష్టాయిపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాణస్వీకారం చేశారు. సర్పంచ్‌గా కవిత, వార్డు సభ్యులుగా ఆమె భర్త తిరుపతి నాయక్, మరిది శంకర్‌నాయక్ బాధ్యతలు చేపట్టారు. -
సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 24న కోస్గి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డా.వినీత్ అన్నారు. కోస్గిలో కొత్త సర్పంచుల సన్మాన సభ నిర్వహించే లక్ష్మీనర్సింహ ఫంక్షన్‌హాల్‌తో పాటు హెలిప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, వీఐపీ పార్కింగ్ స్థలాలు, బారికేడ్లు తదితర భద్రతాపరమైన ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ రూట్లో ట్రాఫిక్ సమస్య లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పి లింగయ్య, సీఐ సైదులు, ఎస్ఐలు బాల్‌రాజ్, వినయ్‌కుమార్, నరేశ్, తహసీల్దార్ శ్రీనివాసులు ఉన్నారు. 52 కేసుల్లో రూ.25.58 లక్షల రికవరీ నారాయణపేట: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో సైబర్ నేరాల బాధితులకు గణనీయమైన ఉపశమనం లభించిందని.. మొత్తం 52 కేసుల్లో రూ. 25.58లక్షలు రికవరీ చేసినట్లు ఎస్పీ డా.వినీత్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 12 పోలీస్స్టేషన్లలో 167 క్రైం కేసులు, డ్రంకెన్ డ్రైవ్ 364, ఈ పెట్టీ 1,513 కేసులతో కలిపి మొత్తం 2,044 కేసులను పరిష్కరించగా.. సుమారు రూ. 5లక్షల వరకు జరిమానా చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే సైబర్ మోసం జరిగిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేయడం అత్యంత కీలకమని ఎస్పీ సూచించారు. అలా చేయడం వల్ల పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. సైబర్ నేరాల విచారణలో సమర్థవంతంగా పనిచేసి.. బాధితులకు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
రికార్డు స్థాయిలో వరదలు వచ్చినా క్రాప్‌హాలిడేనా?
● చేతకాని పాలనకుఇదే నిదర్శనం ● మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఈసారి రికార్డు స్థాయిలో వరదలు వస్తే అవగాహన లేకుండా సముద్రంపాలు చేసి.. ఇప్పుడు క్రాప్‌హాలిడే ప్రకటించడం దురదృష్టకరమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూర్‌లో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణానదికి వచ్చిన వరదను ప్రణాళికా బద్ధంగా వాడుకోకుండా యాసంగిలో క్రాప్‌హాలిడే ప్రకటించడం చేతకాని పాలనకు నిదర్శనమన్నారు. 1981లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య 17.8 టీఎంసీల డిజైన్‌తో ప్రారంభించిన జూరాల ప్రాజెక్టును 11 టీఎంసీలకు కుదించారని.. ఆ తర్వాత 6.5 టీఎంసీలకే ప్రాజెక్టు పరిమితమైందన్నారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 33 ఏళ్ల సమయం పట్టిందన్నారు. ప్రస్తుత పాలకులు ఏకంగా క్రాప్‌హాలిడే ప్రకటించడం బాధాకరమన్నారు. కేసీఆర్ ముందుచూపుతో నిర్మించతలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బచావత్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్కు కేటాయించిన 15.9 టీఎంసీలు, జూరాలకు కేటాయించిన 17.8 టీఎంసీల నీటిని వాడుకోలేని దుస్థితి నెలకొందన్నారు. కొడంగల్–నారాయణపేటకు ఎత్తిపోతలకు పాలమూరు–రంగారెడ్డి నుంచే నీటిని పంపింగ్ చేసే విధంగా తక్కువ ఖర్చుతో డిజైన్ చేస్తే.. ప్రస్తుతం ఎక్కువ ఖర్చుతో కొడంగల్–పేట ఎత్తిపోతల పథకం డిజైన్ మార్చడం సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన రాహి త్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి యాసంగిలో సాగునీరు ఇవ్వలేమని చెప్పడం సిగ్గుచేటని.. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి నీరు తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు తాత్కాలికంగా ఏర్పాటు చేశారని.. ఇందుకు సంబంధించి ఆధిత్యనాధ్ ఏపీ తరఫున, తెలంగాణ తరఫున ఎస్కే జ్యోషి చేసిన సంతకాల పత్రాలను చూయించారు. కేసీఆర్ మరణశాసనం చేశారని పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని.. ముఖ్యమంత్రి సలహదారుగా ఉన్న ఆధిత్యనాఽథ్ను సంతకం ఎందుకు చేశారో అడగాలని సవాల్ విసిరారు. షాపుల్లో యూరియా ఇవ్వలేని వారు యాప్ ద్వారా ఇస్తామని చెబుతున్నారని.. ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వమని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవియాదవ్ తదితరులు ఉన్నారు. -
వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
నారాయణపేట: కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్ హక్ అన్నారు. వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా పోలీ సు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. లక్షలాది కార్మి కు లు, నిరుపేదల గొంతుకగా నిలిచిన మహోన్న త వ్యక్తి వెంకటస్వామి అని కొనియాడారు. ఒక సాధారణ కార్మికుడి స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. కార్మిక హక్కు ల కోసం ఆయన చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని.. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఐ నర్సింహ, ఆర్ఎస్ఐలు శ్వేత, శిరీష, మద్దయ్య పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో జాగృతి గద్వాల టౌన్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా జాగృతి వైపు నుంచి మేం పోటీలో ఉంటాం.. పేరు అదే ఉంటదా.. ఇంకొకటి ఉంటదా.. అనేది సెకండరీ.. 2029లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రోజుల జాగృతి జనంబాట కార్యక్రమం అనంతరం సోమవారం గద్వాల జిల్లాకేంద్రంలోని హరిత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తనకు, తన ఫ్యామిలీకి మధ్య అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని వివరించారు. తన భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని, తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీ నాయకులే నాపై కుట్ర చేసి ఎంపీగా ఓడించారని, వద్దంటే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని చెప్పారు. తిరిగి బీఆర్ఎస్లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పదవిలో ఉన్నా.. లేకున్నా ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటామని చెప్పారు. ఎంపీగా ఉన్న సమయంలో ‘మన ఊరు– మన ఎంపీ’ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం జాగృతి జనం బాట చేపట్టిందని వివరించారు. ఆర్ఎన్ఆర్ @ రూ.2,799 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,799, కనిష్టంగా రూ.1,869 ధరలు లభించాయి. హంస గరిష్టంగా రూ.1,862, కనిష్టంగా రూ.1,841, కందులు గరిష్టంగా రూ.6,831, కనిష్టంగా రూ.5,710, వేరుశనగ గరిష్టంగా రూ.8,260, కనిష్టంగా రూ.3,029, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,981, కనిష్టంగా రూ.1,669 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,705, కనిష్టంగా రూ.2,409గా ధరలు లభించాయి. -
కాంగ్రెస్‌లో పంచాయితీ..!
పేలుతున్న నేతల మాటల తూటాలు ● వనపర్తిలో చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఘాటు వ్యాఖ్యలు ● మంత్రి వాకిటి ఇలాకాలోనూ మంటలు ● సామాజిక మాధ్యమాల్లోనూ ఇరువర్గాల పోరు ● వైరల్‌గా మారిన పలు పోస్టులు.. ● జిల్లాలో రసవత్తరంగా మారిన రాజకీయాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. అధికార కాంగ్రెస్‌లో సం‘గ్రామం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘రెబల్స్’తో రాజుకున్న సెగ దావానలంలా ఎగిసిపడుతోంది. గెలుపును ప్రభావితం చేసిన తిరుగుబాటుదారులు.. ఓడిపోయిన వర్గాల మధ్య పోరు ఆ పార్టీ ముఖ్య నేతలను రచ్చకీడుస్తోంది. మరోవైపు కీలక బాధ్యతల్లో ఉన్న పెద్దలు సంయమనం కోల్పోయి అసహనం వ్యక్తం చేస్తుండడం.. స్వపక్షంలోని నాయకులపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తుండడం రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. ప్రధానంగా వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లతో పాటు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో పేలుతున్న మాటాల తూటాలు ఉమ్మడి పాలమూరులో హాట్ టాపిక్‌గా మారాయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో గెలపొందిన కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా మాట్లాడుతూ చేపలు గ్రామాలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయిన పలు గ్రామాల ప్రజలను బాహాటంగా తూర్పారబట్టడం విమర్శలకు దారితీసింది. మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలోనే ఇదంతా జరగగా.. కనీసం ఆయన వారించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇటీవల పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ క్రమంలో తన స్వగ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ మద్దతుదారు గెలుపొందడం.. సొంత మండలం రాజాపూర్‌లో బీఆర్ఎస్ సత్తా చాటడంతో ఆయనలో అసహనం.. ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు, వర్గాలు సామాజిక మాధ్యమాలు వేదికగా పోరు సాగిస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య తొలి నుంచీ విభేదాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం వారివారి వర్గాల మధ్య పోరు కొనసాగింది. ఈ నియోజకవర్గంలో జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించినా.. బీఆర్ఎస్ సత్తా చాటింది. ఈ క్రమంలో ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేగా నాపై, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవిపై కోపం ఉంటే ప్రత్యక్షంగా చూసుకోవాలి. కాంగ్రెస్ విధేయులుగా, జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేయడం ఏమిటి?’ అని చిన్నారెడ్డిపై ప్రెస్మీట్లో పరోక్షంగా విమర్శలు చేయడం దుమారం రేపాయి. ప్రతిగా చిన్నారెడ్డి వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు వైరల్‌గా మారగా.. నియోజకవర్గం అట్టడుకుతోంది. వనపర్తి పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఉన్నా.. సర్పంచ్ స్థానాల్లో గెలవకపోవడంపై ఉమ్మడి పాలమూరులోని పలువురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య సమన్వయ లోపాన్ని సైతం వారికి ఎత్తిచూపినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు వారి బంధువులు, అనుచరులకు పార్టీ తరఫున మద్దతిచ్చి నిలబెట్టడం ‘రెబల్స్’ బరిలో ఉండేందుకు ఆస్కారమిచ్చిందని.. దీంతో ఓట్లు చీలిపోయి ప్రతిపక్షానికి కలిసి వచ్చిందంటూ ఉదాహరణలతో వారిని ఎండగట్టినట్లు సమాచారం. వచ్చేవి పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు.. జాగ్రత్తగా వ్యవహరించాలని.. డీసీసీలు సైతం పక్కా కార్యాచరణతో విజయం సాధించేలా శ్రమించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం ఎవరెవరికి చీవాట్లు పెట్టారు.. ఇప్పటికై నా కాంగ్రెస్ ముఖ్యనేతల్లో మార్పు వచ్చేనా అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. -
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
నారాయణపేట: రాష్ట్రంలో 2.45 లక్షల మంది పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి రాష్ట్ర పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఆదర్శ బీఈడీ కళాశాలలో నారాయణపేట జిల్లా పెన్షనర్ల సాధారణ సర్వసభ్య సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే నాయకత్వం లేకపోవడంతో గత రెండేళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో 2.45 లక్షల మంది సభ్యత్వం కలిగిన పెద్ద సంఘం పెన్షనర్స్ సంఘం అన్నారు. గత పదేళ్లలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉండిపోయాయని, పెన్షనర్ల సంఘం రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హైదరాబాద్ హెడ్‌క్వాటర్‌లో లేకపోవడంతో సభ్యులు తీవ్ర నష్టానికి గురవుతున్నారన్నారని ఆందోళన వ్యక్తపరిచారు. పెన్షనర్స్ సంఘంలో మార్పు ఎంతైన అవసరమన్నారు. తెలంగాణ ఏర్పడి ప్రాతినిత్యం వహించేందుకు జేఏసీలో కీలక భూమిక పోషించేది పెన్షనర్స్ సంఘమన్నారు. ప్రధానంగా మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పెన్షనర్లకు హెల్త్‌కార్డులు వర్తింపజేశారన్నారు. కానీ ఇప్పుడు అంతగా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయాన్ని ఫైనాన్స్ మినిష్టర్స్‌కు తీసుకుపోవడంలో విఫలమైందన్నారు. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీ గత ప్రభుత్వం 5 శాతం తాత్కాలిక భృతి ఇచ్చిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం నుంచి రెండేళ్ల నుంచి పీఆర్సీ ఇవ్వాల్సి ఉందన్నారు. రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ అందడంలేదన్నారు.ఈ నాలుగు ప్రధానమైన డిమాండ్లపై ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి సీఎంను ఆహ్వానించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు పెన్షనర్లను ఏకం చేస్తున్నామన్నారు. సమావేశంలో పెన్షనర్ల సంఘం రాష్ట్ర సంఘం నాయకులు మనోహర్‌గౌడ్, వకిల్ సంతోష్ తదితరులు ఉన్నారు. -
‘ఉపాధి’లో గాంధీజీ పేరు తొలగించడం దారుణం
నారాయణపేట: గ్రామీణ ప్రాంత ప్రజలకు వంద రోజులు గ్యారంటీ ఉపాధి పనులు కల్పించాలని ఉద్దేశ్యంతో అప్పటి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును తొలగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పాలించే అర్హత కోల్పోయి, చరిత్రను మార్చే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహానేత మహాత్మా గాంధీ పేరు పథకాల నుంచి తొలగించడం అంటే గాంధీజీ సిద్ధాంతాలపై, రాజ్యాంగ విలువలపై నేరుగా దాడి చేయడమే అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గాంధీ పేరు తుడిచిపెట్టే ప్రయత్నాలు చేయడమే కాకుండా నెహ్రూ–గాంధీ కుటుంబాన్ని అవమానించేలా రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు చరిత్రను వక్రీకరించే చర్యలు నిరంతరం కొనసాగిస్తున్నదని ఆరోపించారు. గాంధీ పేరు లేకుండా అభివృద్ధి జరగదని, గాంధీ సిద్ధాంతాలు లేకుండా భారతదేశం ముందుకు సాగదని స్పష్టం చేస్తూ, ఈ తరహా నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గాంధీ ఆశయాలను రాజ్యాంగ విలువలను ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్లు బండి వేణుగోపాల్, సరఫ్ నాగరాజ్, పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం, ఆర్టీఓ బోర్డ్ సభ్యుడు పోషల్ రాజేష్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎండి. గౌస్, మార్కెట్ వైస్ చైర్మన్ హన్మంతుతోపాటు శరణప్ప, లిఖి రఘు, మహిమూద్ ఖురేషి, వినోద్ పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో 5,509 కేసుల పరిష్కారం
నారాయణపేట: జిల్లాలో ఆదివారం ఏర్పాటు చేసిన లోక్‌అదాలత్‌తో 5509 కేసులు పరిష్కరించారు. జాతీయ న్యాయ సేవాధికార ఆదేశాలతో జిల్లా న్యాయ సేవ సంస్థ లీగల్ సర్వీసెస్ ఆథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో 4 బెంచులను ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కం చైర్మన్ నారాయణపేట బోయ శ్రీనివాసులు, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి కం సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ , జూనియర్ సివిల్ జడ్జి సాయి మనోజ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే.అవినాష్ కోర్టు ఆవరణలో జరిగిన లోక్ అదాలత్‌లో అన్ని కోర్టు పరిధిలో 5509 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. జిల్లాలో 14 పోలీస్ స్టేషన్లతో పాటు రెండు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల (కోస్గి, నారాయణపేట) పరిధిలో ఉన్న కేసులకు న్యాయవాదులు సహకరించి పరిష్కారానికి కృషి చేశారు. కాగా మొత్తం కేసుల పరిష్కారానికిగాను రూ.26.90 లక్షల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు తెలియజేశారు. కార్యక్రమంలో అడ్వకేట్స్ కే. కురుమన్న గౌడ్ , కే. సత్యనారాయణగౌడ్, వినోద్ కుమార్, సురేంద్ర చారి , కక్షిదారులు, కోర్ట్ పోలీసులు పాల్గొన్నారు. ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని పీఆర్టీయూ ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎల్.మనోహర్ప్రసాద్గౌడ్, జనరల్ సెక్రటరీగా వి.సంతోష్‌కుమార్‌తో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగులతో కార్యవర్గన్ని నియమించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని మనోమర్గౌడ్ పేర్కొన్నారు. అనంతరం కార్యవర్గాన్ని సన్మానించారు. సత్యనారాయణ, రాములు, సయ్యద్ మౌలనా, వెణుగౌడ్, రమేశ్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, బాల్రాజ నర్సయ్య, క్రిష్ణరెడ్డి, అంబాజీ , వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. చదువుతోపాటు క్రీడలు అవసరం మక్తల్: చదువుతోపాటు క్రీడలు అవసరమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య అన్నారు. ఆదివారం మక్తల్‌లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.గోపాలం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీనియర్ షూటింగ్ బాల్ మెన్, ఉమెన్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఎంపిక పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసం పెంపొందుతుందని, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాలన్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు వరంగల్ జిల్లా చెన్నారంలో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్స్ షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, సోంశేఖర్‌గౌడ్, ఆడమ్స్, రాజు, సత్యఆంజనేయులు, రమేష్, ఝాన్సీ, అనిత తదితరులు పాల్గొన్నారు. ఐద్వా మహాసభలను జయప్రదం చేయండి నాగర్‌కర్నూల్ రూరల్: ఐద్వా 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో వచ్చే నెల 25 నుంచి 28 వరకు కొనసాగుతాయని.. పెద్దఎత్తున మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేపడుతామన్నారు. పదేళ్లుగా మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై హింస, అభద్రత భావం, నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పని దొరక్కపోవడంతో మహిళలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకురాలు నిర్మల, దీప, వెంకటమ్మ, ఈశ్వరమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కోటి ఆశలు..!
కొత్త పాలకవర్గంపై.. నేడు కొలువుదీరనున్న పల్లె పాలకవర్గాలు ఏడేళ్ల క్రితం సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. మళ్లీ ఈ సారి ప్రజలు పట్టం కట్టారు. ఈ ఐదేళ్లలో ముందుగా గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తాం. తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం. – శ్రీనివాస్, సర్పంచ్, బాపన్‌పల్లి, దామరగిద్ద మండలం రెండోసారి సర్పంచ్‌గా గెలిపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆశీర్వాదంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తా. మా గ్రామానికి కావాల్సిన నిధులు మంజూరు చేయించి నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. – హరిత కృష్ణయ్య, సర్పంచ్, గొర్లోనిబాయి, కొత్తపల్లి మండలం 20 ఏళ్లుగా జూనియర్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఈ కలను సాకారం చేస్తాం. ప్రభుత్వ స్థలాలను కాపాడుకుంటాం. 30 ఏళ్ల నుంచి గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ టెండర్లకు నోచుకోవడం లేదు. వాటికి టెండర్లు వేయిస్తాం. మరికల్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం. – చెన్నయ్య, సర్పంచ్, మరికల్ నారాయణపేట: దాదాపు రెండేళ్లుగా సీసీరోడ్లు.. డ్రైయినేజీలు వంటి అభివృద్ధి పనులకు నోచుకోక.. నిధుల లేమితో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడాయి పల్లెలు. అటు సమస్యలు పరిష్కరించేవారు లేక.. ప్రత్యేక అధికారులు అందుబాటులోకి రాక ఇన్నాళ్లు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంచాయతీ పగ్గాలు చేపట్టబోతున్న పాలకవర్గాలపైనే ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల్లో ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యలు పరిష్కరించి.. అభివృద్ధి వైపు నడిపిస్తారని ఎదురుచూస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు సోమవారం కోలువుదీరనున్నాయి. జిల్లావ్యాప్తంగా 272 గ్రామపంచాయతీలు, 2,466 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గెలుపొంది సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు ఈ నెల 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకుగాను గ్రామ పంచాయతీ భవనాలకు నూతనంగా రంగులు దిద్దుతూ ముస్తాబు చేశారు. ఇక నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో పంచాయతీల పరిపాలన కొనసాగనుంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేయకపోయినా గెలిచిన అభ్యర్థులు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మద్దతు దారులే ఉన్నారు. 272 స్థానాల్లో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ మద్దతుదారులు 162..బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 53..బీజేపీ పార్టీ మద్దతుదారులు 32...ఇతరులు 25 మంది సర్పంచులు గెలుపొందారు. ఇదిలాఉండగా, కొత్తపాలక వర్గాలు ప్రమాణస్వీకారం చేస్తున్న సోమవారం తొలి సమావేశం నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గెజిట్ విడుదల చేశారు. చట్టప్రకారం నెలకోసారి పాలకవర్గాలు సమావేశాలు చేయాల్సి ఉంటుంది. గత సర్పంచ్ల పదవీకాలం రెండేళ్ల క్రితమే ముగియడంతో అప్పటి నుంచి ప్రత్యేక అధికారులపాలన కొనసాగింది. ప్రత్యేకాధికారులు అందుబాటులో లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు ఎవరికి చెప్పు కోవాలో అర్థంకాక ప్రజలు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఒక్కో అధికారికి రెండు మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. అటు వారి శాఖలకు సంబంధించిన విధి నిర్వహణలపై అధికారులు దృష్టి సారించడంతో పంచాయతీ పాలన పట్టు తప్పింది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడి సమస్యలు అక్కడే అపరిష్కృతంగా ఉన్నాయి. ఇదిలాఉండగా, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే మూడు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. గెలుపొందిన సర్పంచ్‌లు, పాలకవర్గాలతో కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పాలన సాగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 272 మంది సర్పంచ్‌లు, 2,466 వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ముస్తాబైన గ్రామ పంచాయతీలు దాదాపు రెండేళ్ల ప్రత్యేకాధికారుల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే.. గ్రామాలకు నిధుల ఇక్కట్లు తీరేనా..? -
జాతర్ల సందడి
పాలమూరులోని ప్రముఖ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ● కార్తీక మాసంలో మొదలై.. ఉగాది పండుగ వరకు వేడుకలు ● తమ ఇంటి ఇలవేల్పుగా కొలిచి మొక్కుల చెల్లింపు ● మట్టికుండలో భోజనం, పచ్చిపులుసుతో నైవేద్యం ● ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలకు తిరుమలతో సారూప్యత ● వివిధ రకాల వేలం పాటలు, హుండీ ద్వారా రూ.కోట్లలో ఆదాయం ఆర్జన కురుమూర్తి.. ఘన కీర్తి చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో వెలసిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర దీపావళి అమావాస్యతో మొదలవుతుంది. రాష్ట్రంలోని మేడారం తర్వాత ఆ స్థాయిలో ఇక్కడికే జనాలు ఇక్కడికి తరలివస్తారు. అలాగే స్వామివారు తిరుపతి వేంకటేశ్వరస్వామి మాదిరిగానే ఏడుకొండల మధ్య కాంచనగుహలో కొలువుదీరారు. మరెక్కడా లేని విధంగా ఉద్దాల ఉత్సవం (పాదరక్షల ఊరేగింపు) ప్రధాన ఘట్టంగా నిలుస్తోంది. చిన్నవడ్డెమాన్లో మొదలయ్యే ఈ ఊరేగింపు అప్పంపల్లి, తిర్మలాపూర్ గ్రామాల మీదుగా కురుమూర్తికి చేరుకుంటుంది. జాతర దాదాపు నెలరోజులపాటు సాగినా.. భక్తుల రద్దీ దృష్ట్యా మరికొన్ని రోజులు పొడిగించిన సందర్భాలు కోకొల్లలు. అలాగే ఇక్కడ లభించే కాల్చిన మాంసం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి మాంసప్రియులు తరలివస్తారు. ప్రత్యేకం.. గంగాపూర్ ఆలయం గంగాపూర్ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం కోణార్క్ సూర్యదేవాలయం ఒకే విధంగా నిర్మించారని ప్రతీతి. ఈ ఆలయం చతురస్త్రాకారంలో నిర్మితమై ఉండటం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. అలాగే మెట్లు సైతం చతురస్త్రాకారంలో మెట్లు నిర్మించడం వల్ల ఎటు నుంచి చూసినా కోనేరు ఒకేలా కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా మాఘశుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు కొనసాగుతాయి. ఇక్కడ స్వామివారి కల్యాణోత్సవం, పెద్ద తేరు (రథోత్సవం), చిన్న తేరు (పుష్పరథం), శకటోత్సవం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆలయం పడమర ప్రాంతమైన కోయిలకొండ, కోస్గి, కొడంగల్, తాండూరు, నారాయణపేట నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు హాజరవుతారు. కాగా.. జనవరి 19 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. -
రాజీమార్గంతోనే కేసుల పరిష్కారం
నారాయణపేట: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కారం చేసుకోవాలని.. రాజీ మార్గం ఎంతో మేలని జిల్లా జడ్జి బోయశ్రీనివాసులు సూచించారు. రాష్ట్ర న్యాయ సేవల అధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు పెండింగ్ కేసులను పరిష్కరించాలని శనివారం జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో ఆదివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ఉద్దేశించి జిల్లా జడ్జి మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్‌లో కక్షిదారులకు త్వరగా కేసులు పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందన్నారు. న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు ముందుగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలన్నారు. యాక్సిడెంట్, దాడి, చీటింగ్, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, దొంగతనం, కరోనా సమయంలోని పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం ఎగ్జిక్యూషన్ పిటిషన్ , క్రిమినల్ కాంపౌండ్డబుల్ కేసులు, సివిల్ కేసులు, సైబర్ క్రైమ్ కేసులపై ఆరాతీశారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి సెక్రటరీ వింధ్య నాయక్ పాల్గొన్నారు. -
పొగమంచుతోవాహనదారులు జాగ్రత్త
నారాయణపేట: వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగటంతో వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయద్దని, అత్యవసరమైతే వాహనాలను నెమ్మదిగా, సురక్షితంగా నడిపి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ వినీత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచుతో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులను గుర్తించడం, వీక్షించే సామర్ధ్యం తక్కువుగా వుంటుందని తెలిపారు. ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే పొగమంచు ఎక్కువగా ఉండే సమయంలో వాహనాలను వేగంగా నడపొద్దని, వాహనదారులు శ్రద్ధతో, నిదానంగా ప్రయాణించాలని, తక్కువ వీక్షించే సామర్ధ్యం కారణంగా ఇతర వాహనాలు, పాదచారులు, మలుపులు, రోడ్డు విభాగాలు సరిగా కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుదని తెలిపారు. హెడ్లైట్లను లో బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లను వాడాలని సూచించారు. ప్రయాణానికి ముందే ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ఆకస్మికంగా ఓవర్టేక్ చేయడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. పోలీసుల సూచనలతోపాటు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనదారులు వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 23న ‘మీ డబ్బు,మీ హక్కు’పై ప్రత్యేక శిబిరం నారాయణపేట: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా ‘మీ డబ్బు మీ హక్కు’ అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకోని ఆర్థిక పరమైన ఆస్తులు (సొమ్ము) సమస్యను పరిష్కరించేందుకు ఈ నెల 23న కలెక్టరేట్లో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని, క్లెయిమ్ చేసుకోని బ్యాంక్ పొదుపులు, ఇన్ష్సూరెన్స్ ఖాతాలు, తదితరాలు వాటిని పరిష్కరించాలనే తలంపుతో ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ బ్యాంకులు ఉమ్మడి శిబిరాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం 31 వరకు కొనసాగుతుందని, బ్యాంకుల్లో 10 సంవత్సరాలకుపైగా క్లెయిమ్ చేసుకొని డిపాజిట్ల వివరాలు (https://udham.rbi.org.in/uncaimed-deposits/#/login) ద్వారా పొందవచ్చని , క్లెయిమ్ చేసుకోని ఆర్థిక పరమైన ఆస్తులను వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు శిబిరంలో బ్యాంక్ శాఖ, బీమా సంస్థని సంప్రదించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు సబ్జెక్టులో పట్టు సాధించాలి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు ఇంజినీరింగ్ సబ్జెక్టులలో పట్టు సాధించాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రస్తుతం ఇంజినీరింగ్ పరిధి చాలా పెరిగిందని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు కూడా నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి బ్యాచ్ కాబట్టి బాధ్యతాయుతంగా నడుచుకుంటే భవిష్యత్‌లో వచ్చే విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటారని సూచించారు. ఎక్కువ సమయం చదువులకు కేటాయించాలని, ఇక్కడ ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, మహమ్మద్గౌడ్, రామరాజు, తేజవర్దన్ తదితరులు పాల్గొన్నారు. -
విలేకర్లపై కేసులు ఎత్తివేయకపోతే ఉద్యమిస్తాం
నారాయణపేట: విలేకర్లపై ‘పేట’ ఆర్టీసీ డిపో డీఎం అక్రమ కేసులు నమోదు చేయించడం సరైందికాదని, వెంటనే ఎత్తివేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సకాలంలో బస్సులు నడపాలంటూ విద్యార్థి సంఘాలు బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపడుతుండగా.. వృత్తి ధర్మంగా న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన విలేకర్లపై డీఎం తప్పుడు ఫిర్యాదు చేయించి అక్రమ కేసులు బనాయించడం సరైందికాదన్నారు. దసరా, దీపావళి పండుగ సందర్భంగా నడిపిన స్పెషల్ బస్సుల సమాచారం అడగగా.. డీఎం ఇవ్వలేదని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి విలేకర్లపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడాలని పూనుకున్నట్లు ఉందన్నారు. పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండా అక్రమ కేసులు బనాయించడం ఆర్టీసీ అధికారులకు వత్తాసుపలకడమే అన్నారు. డిపోలో జరుగుతున్న అవకతవకలపై పూర్తి స్థాయి సమగ్ర విచారణ చేపట్టి డీఎంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టేందుకు వెనుకడబోమని హెచ్చరించారు. ఆయనతో పాటు బీజేపీ జిల్లాఅధ్యక్షులు సత్యయాదవ్ ఉన్నారు. -
నారాయణపేట
వెనకబాటు, వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు.. దేవుళ్లను కొలువడంలో మాత్రం ఘనమైన చరిత్రను లిఖించుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రధాన దేవాలయాలతో పాటు.. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నపాటి ఆలయాల వరకు ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు, జాతర్లు కొనసాగుతాయి. ప్రతి జాతర సుమారు నెలరోజుల పాటు నిర్వహించడం ఇక్కడి విశేషం. వీటి కోసం పొట్ట చేతబట్టుకొని వలస వెళ్లిన పాలమూరు కూలీలంతా స్వగ్రామాలకు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి దేవుడిని తమ ఇంటి ఇలవేల్పుగా భావించి.. మట్టి కుండలో అన్నం వండి.. పచ్చి పులుసుతో నైవేద్యం సమర్పిస్తారు. సమీప గ్రామాల ప్రజలు బంధుమిత్రులతో కలిసి ఎద్దుల బండ్లపై ఆయా ఆలయాలకు వెళ్లి రెండు రోజుల పాటు అక్కడే గడపడానికి ఇష్టపడతారు. ఇక ఆయా జాతర్ల నిర్వహణతో వివిధ రకాల సేవలు, హుండీ ద్వారా ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని ఆలయాల ప్రత్యేకతపై ‘సాక్షి’ కథనం.. – మహబూబ్‌నగర్ డెస్క్ ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు
మక్తల్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని మక్తల్ కమిషనర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ అన్నారు. శనివారం పురపాలిక సంఘం అన్ని విభాగాలకు చెందిన అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, పన్ను వసూలు, ప్రజా సమస్యలపై చర్చించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా తగు చర్యలు చేపట్టాలని, ప్రజలు, దుకాణదారులకు ఈమేరకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమష్టిగా పనిచేసి ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే, కాలనీల్లో నిత్యం అధికారులు పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని, పారిశుద్ధ్య పనులు విధిగా చేపట్టేలా చూడాలని, వీధులు శుభ్రంగా ఉంచేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కమిషనర్ శ్రీరాములు, ఏఈ నాగశివ తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యంతోనే ఉపాధి అవకాశాలు
కోస్గి రూరల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత తమ నైపుణ్యాల ఆధారంగానే ఉపాధి అవకాశాలు వరిస్తాయని ఏస్ (ఏసీఈ) ఇంజినీరింగ్ అకాడమీ చైర్మన్ వి.గోపాలకృష్ణ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థులకు భవిష్యత్ దృక్పథాలు, ఉపాధి అవకాశాలపై అవగాహన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధానం, ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కోవడం, సాప్ట్స్కీల్స్, ఆన్లైన్, ఆప్లైన్ శిక్షణ వంటి అంశాలపై అవగాహన చేపట్టారు. లాటరల్ ఎంట్రీ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్శహించేందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పలువురు విద్యార్థులు భవిష్యత్ కెరీర్‌కు సంబంధించిన ప్రశ్నలను అడిగి వివృత్తి చేసుకున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో లక్ష్యసాధన దిశగా ముందుకు సాగలన్నారు. ప్రొఫెసర్ మూర్తి కళాశాల అభివృద్ధికి అవసరమైన నాలుగు డిజిటల్ బోర్డులు, ఆర్ఓ వాటర్ ప్లాంట్, 200 ఫైబర్ చైర్స్, సోలార్ లైటింగ్ సిస్టంలను విరాళంగా అందించారు. అంతకుముందు కళాశాల అవరణలో పూల మొక్కులను నాటారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హేమంత్, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, హెచ్ఓడీలు పాల్గొన్నారు.


