Bollywood
-
కథ విన్నారా?
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందించడానికి సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇటీవల హృతిక్ రోషన్ ను కలిసి ఓ కథ వినిపించారట బాబీ. ఈ స్టోరీ లైన్‌కు ప్రాథమికంగా అంగీకారం తెలిపారట హృతిక్. దీంతో ప్రస్తుతం స్క్రిప్ట్‌కు మరింత మెరుగులుదిద్దే పనిలో దర్శకుడు బాబీ బిజీగా ఉన్నారని సమాచారం. మరోసారి హృతిక్ రోషన్ ను కలిసి, బాబీ ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ ఇవ్వనున్నారట. అప్పుడు ఈ స్టోరీకి హృతిక్ రోషన్ ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ కాంబినేషన్ సెట్ అయినట్లేనని ఫిల్మ్‌నగర్ టాక్.ఇక ఈ మూవీని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారని భోగట్టా. మరి.. హృతిక్ రోషన్ కథ విన్నారా? హృతిక్–బాబీల కాంబినేషన్ సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘వార్ 2’ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించారు. -
ఇంటిమేట్ సీన్స్.. ఆ ఫీలింగ్ ఉండకూడదు: బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ నటి ఆదితి పోహంకర్ బాలీవుడ్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది. లాల్ భారీ అనే మరాఠీ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆదితి.. ఆ తర్వాత తమిళ చిత్రాల్లోనూ కనిపించింది. బాలీవుడ్లో షీ, ఆశ్రమ్ లాంటి వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆశ్రమ్ వెబ్ సిరీస్‌లో బాబీ డియోల్‌తో చేసిన ఇంటిమేట్ సీన్లపై స్పందించింది.ఇద్దరు నటీనటులు సన్నిహితంగా ఉండే సన్నివేశాలు చేయడం చాలా కష్టమని ఆదితి పోహంకర్ తెలిపింది. ఇలాంటి సీన్స్‌లో పురుషులే ఎక్కువగా కష్టపడతారని ఒకరు నాతో చెప్పారని గుర్తు చేసుకుంది. ఇలాంటి విషయాల్లో ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని తెలిపింది. ఆశ్రమ్ సిరీస్‌లో నటించే సమయంలో మా మధ్య రిలేషన్ బలంగా ఉందని.. ఏదైనా సీన్స్ మళ్లీ చేయాల్సి వస్తే.. తప్పకుండా చేసే వాళ్లమని వెల్లడించింది.ఇంటిమేట్ సీన్స్‌పై అదితి మాట్లాడుతూ.. " అసలు అలాంటి కాన్సెప్ట్ ఉందని నాకు తెలియదు. కానీ ఇద్దరు నటీనటుల మధ్య దూరం ఉంటే.. అది తెరపై మరింత ఇబ్బందికరంగా మారుతుందని నేను నిజంగా నమ్ముతున్నా. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, మీ స్వంత లయను కనిపెట్టడం మంచిది. ఈ విషయాల్లో కచ్చితంగా దర్శకుడు సాయం చేస్తాడు. కానీ ఇద్దరి మధ్య మానసికంగా దూరం లేనప్పుడే నిజమైన ఫలితం వస్తుంది. ఇలాంటి సన్నివేశాల్లో ఎంత సహజంగా నటించారనేదే ముఖ్యం. ఎందుకంటే ఆ సీన్లో లిమిట్స్ మనకు తెలుసు. అందుకే నటీనటులు భయపడకూడదు" అని అన్నారు. -
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఓదెల-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్ సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. అశోక్ తేజ డైరెక్షన్లో వస్తోన్న ఈ థ్రిల్లర్ మూవీ ఈనెల 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 8న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా ముంబయిలోనే ఉంటోంది. బాలీవుడ్లో కొన్ని సినిమాలు, సిరీస్‌లు చేసిన తమన్నా.. ప్రముఖ నటి రవీనా టాండన్ కూతురు రషా తడానీతో సన్నిహితంగా ఉంటోంది. అంతే కాదు..వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. తరచుగా బీటౌన్‌లో పార్టీలకు హాజరవుతూ సందడి చేస్తుంటారు. అలా వీరిద్దరి స్నేహం బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే దాదాపు 15 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న రషాతో మీకు స్నేహమేంటని కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.(ఇది చదవండి: ఆ న్యూస్ చూసి ఏడ్చేశాను: హీరోయిన్ తమన్నా)తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన తమన్నా ఈ విషయంపై స్పందించింది. ఈ మధ్య కాలంలోనే నేను రషా తడానీని కలిసినట్లు తమన్నా చెప్పుకొచ్చింది. ఇద్దరు కలిసి పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేశామని.. డ్యాన్స్ కూడా చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత నుంచి మేమిద్దరం చాలా సన్నిహితంగా మెలిగినట్లు మిల్కీ బ్యూటీ పేర్కొంది. మా ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది.. వయసుతో మాకు ఎలాంటి ఇబ్బందిలేదని వెల్లడించింది. ఎందుకంటే మా రిలేషన్లో ఇచ్చిపుచ్చుకోవడానికి ఏమీ లేవు.. కేవలం నచ్చిన వారితో కొద్ది సమయం ఎంజాయ్ చేస్తామని అంటోంది తమన్నా. కాగా.. ఇటీవల తమన్నా భాటియా బాలీవుడ్ చిత్రనిర్మాత ప్రగ్యా కపూర్‌తో స్నేహంగా ఉంటున్నారు. ఈ ముగ్గురూ కలిసి ఇటీవల హోలీ పార్టీలో సందడి చేశారు. View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) -
సోనూ సూద్ భార్యకు ప్రమాదం.. అభిమానులకు హీరో సందేశం
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. పలు సినిమాల్లో సహాయ నటుడు, విలన్ పాత్రలతో మెప్పించారు. సోనూసూద్ ప్రస్తుతం హిందీలో మాత్రమే మూవీస్ చేస్తున్నాడు. తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తున్నారు.అయితే ఇటీవల సోనూ సూద్ భార్య సోనాలి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సోనాలితో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ నేపథ్యంలో అభిమానుల కోసం సోనూ సూద్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇటీవల నా భార్యకు యాక్సిడెంట్ జరిగిన విషయం మీకు కూడా తెలుసని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కారులో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. సీట్ బెల్ట్ లేకపోతే.. మీరు మీ కుటుంబాన్ని కోల్పోయినట్లే అని సోనూ సూద్ తెలిపారు. మీరు వెనుక సీటులో కూర్చున్నప్పటికీ కూడా సీట్ బెల్ట్ ధరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
WorldHealthDay ఇది రెండో రౌండ్, అయినా యుద్ధమే!
నటి, దర్శకురాలు తహిరా కశ్యప్ (Tahira Kashyap) ఆరోగ్యం మరోసారి ఇబ్బందుల్లో పడింది. గతంలో బ్రెస్ట్ కేన్సర్‌ను ఓడించిన ఈ యోధురాల్ని మహమ్మారి ఇంకా వదల్లేదు. మళ్లీ తాను బ్రెస్ట్ కేన్సర్ (Breast Cancer) బారిన పడినట్టు నటుడు ఆయుష్మాన్ ఖుర్రానా భార్య తహిరా కశ్యప్ వెల్లడించింది. రొమ్ము కేన్సర్ మళ్లీ వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. దీనిపై ఆమె భర్త ఆయుష్మాన్ ఖురానాతో సహా పలువురు స్పందించారు. ఈ సారి కూడా ఈ వ్యాధి నుంచి బైటపడతావంటూ ధైర్యం చెప్పారు.తనకు మళ్లీ కేన్సర్ సోకిందన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్యం దిన రోజున తన అభిమానులతో పంచుకుంది. ఆ పోస్ట్ కి తహిరా క్యాప్షన్ ఇచ్చింది:"ఏడేళ్ల బాధలు, రెగ్యులర్ చెకప్‌లు.. మామోగ్రామ్లు చేయించుకోవాలని ప్రతి ఒక్కరికీ అదే చెప్తూ ఉంటా... అయినా నాకు రౌండ్ 2...సోకింది అని తెలిపింది. అయినా తాను మరొక యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని, ఈ వ్యాధితో పోరాడటానికి తాను నిశ్చయించుకున్నానని తెలిపింది. నాకు మళ్లీ కేన్సర్ వచ్చింది అని ప్రకటించడానికి మొహమాటం ఏమీ లేదు. ప్రపంచ ఆరోగ్య దినం రోజున ఇలా చెప్పడం బాధాకరమే. కానీ మన ఆరోగ్య సంరక్షణ గురించి మనం చేయ గలిగినంత చేద్దాం’ అంటూ పేర్కొంది. జీవితం నిమ్మకాయలు ఇచ్చినప్పుడు, నిమ్మరసమే తయారు చేసుకోవాలి. జీవితం గాడిన పడుతున్న సమయంలో మళ్లీ తిరగబెట్టినపుడు, దాన్ని కాలా ఖట్టా డ్రింక్‌లో దాన్ని పిండుకొని తాగడమే. ఎందుకంటే అది మంచి పానీయం. రెండోసారి కూడా నీకు కూడా మేలు జరుగుతుంది అంటూ రాసు కొచ్చింది"నా హీరో" అంటూ భార్య పోస్ట్‌పై ఆయుష్మాన్ ఖుర్రానా స్పందించగా, తాహిరా మరిది అపరశక్తి ఖురానా, "బిగ్ టైట్ హగ్ బాబీ! అని, మోర్ పవర్టూయూ అని మరొకరు, "నువ్వు దీన్ని కూడా గెలుస్తావు! మీ కోసం ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తా.. నీకు మరింత శక్తి" అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.ఈ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండటం దానిని ఎదుర్కోవడానికి ఉత్తమమైన మార్గాల్లోఒకటి అని తహిరా విశ్వాసం. ఇందులో భాగంగానే గత కొన్నేళ్లుగా తన పోరాటాలు ,చికిత్స ప్రయాణం గురించి సోషల్ మీడియాలో తన అభిమానులతో నిరంతరం మాట్లాడుతూ ఉంటుంది. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజు కీమో థెరపీ దుష్ప్రభావంతో జుట్టు ఊడిపోయి గుండుగా మారిన పోటోతో మరో స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌ను పంచుకుంది.‘టెన్ కమాండ్మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఎ ఉమెన్ ’ సహా అనేక బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల రచయిత్రి తహిరా కశ్యప్ .2018లో తహిరాకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం కోలుకుంది. కీమోథెరపీ సమయంలో తన అనుభవాలను, బాధలతోపాటు, ఈ ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచు కుంది. ‘‘శర్మ జీ కి బేటి" తో బాలీవుడ్ దర్శకురాలిగా అరంగేట్రం చేసినటిగా తన ప్రతిభను చాటుకుంటోంది. ప్రకటించింది. ఇంతలోనే బ్రెస్ట్‌కేన్సర్ ఆమె సాహసానికి సవాల్ విసిరింది. యుద్ధంలో గెలవడానికి తాను సిద్ధంగా ఉన్నాననిగతంలో ప్రకటించిన మరీ కేన్సర్‌నుంచి బయటపడిన తహిరా ఇపుడు కూడా అదే నిబ్బరాన్ని ప్రకటించింది. దీంతో ఆమె స్నేహితులు, కుటుంబం స్నేహితులు అందరూ ఆమెకు అండగా నిలిచారు. అదే ధైర్యంతో ఈ వ్యాధినుంచి బైట పడి, విజేతగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) -
తెలుగబ్బాయికి నిరాశ.. 'ఇండియన్ ఐడల్' విజేతగా మానసి
సింగింగ్ రియాలటీ షోల్లో 'ఇండియన్ ఐడల్'(Indian Idol 15)కు మంచి క్రేజ్ ఉంది. తెలుగువాళ్లు దాదాపు ప్రతి సీజన్ లోనూ పాల్గొంటూనే ఉంటారు. తాజాగా పూర్తయిన 15వ సీజన్ లోనూ అనిరుధ్ అనే తెలుగు కుర్రాడు పాల్గొన్నాడు. ఫైనల్ వరకు వచ్చాడు కానీ నిరాశే మిగిలింది. బెంగాలీ అమ్మాయి విజేతగా నిలిచింది.(ఇదీ చదవండి: తారక్ కి ప్రేమతో.. సుకుమార్ ఇంట్లో ఎన్టీఆర్)గతేడాది అక్టోబరులో మొదలైన ఇండియన్ ఐడల్-15.. నిన్నటితో(ఏప్రిల్ 6) ముగిసింది. పశ్చిమ బెంగాల్ కి చెందిన మానసి ఘోష్ (Manasi Ghosh) విజేతగా నిలిచింది. ఈమెకు ట్రోఫీతో పాటు రూ.25 లక్షల ప్రైజ్ మనీ, కొత్త కారు బహుమతిగా ఇచ్చారు. రన్నరప్స్ గా నిలిచింది చక్రవర్తి, స్నేహా శంకర్ కి చెరో రూ.5 లక్షలు ఇచ్చారు.ఈ సీజన్ లో కర్నూలుకి చెందిన అనిరుధ్ సుస్వరం (Anirudh Suswaram) అనే కుర్రాడు పాల్గొన్నాడు. ఫైనల్ వరకు వచ్చాడు గానీ ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఆహా ఓటీటీలో ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ లో పాల్గొన్న అనిరుధ్.. తొలి రన్నరప్ గా నిలిచాడు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా) -
'పెద్ది' సిక్సర్‌తో.. పుష్ప2, దేవర రికార్డ్స్ గల్లంతు
మెగా హీరో రామ్ చరణ్ కొట్టిన సిక్సర్‌తో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ గల్లంతు అయ్యాయి. తాజాగా విడుదలైన 'పెద్ది' గ్లింప్స్‌కు షోషల్‌మీడియా షేక్ అయిపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుంది. ఫస్ట్ షాట్‌తోనే సినీ అభిమానులను రామ్‌చరణ్ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల గ్లింప్స్‌కు వచ్చిన వ్యూస్ విషయంలో దేవర (26.17 మిలియన్లు) టాప్‌లో ఉంది. ఇప్పుడు పెద్ది సినిమా గ్లింప్స్ ఆ రికార్డ్‌ను దాటేసింది. 24గంటల్లోనే ఏకంగా 30.6 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపింది. ఇప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న అన్ని సినిమాల గ్లింప్స్ రికార్డ్స్‌ను పెద్ది దాటేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. తప్పకుండా పెద్ది సినిమాతో భారీ హిట్ కొడుతున్నామని వారు పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. టాలీవుడ్లో పెద్ది గ్లింప్స్ టాప్-1లో ఉంటే.. ఇండియాలో టాక్సిక్ (36 మిలియన్లు)తో టాప్-1లో ఉంది.'పెద్ది' హిందీ గ్లింప్స్ విడుదల.. డబ్బింగ్ ఎవరంటే..?పెద్ది సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా హిందీ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. హందీ వర్షన్లో తన పాత్రకు డబ్బింగ్ స్వయంగా చెప్పుకున్నారు. ఈ గ్లింప్స్ నుంచి ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది.టాలీవుడ్ టాప్ (గ్లింప్స్) చిత్రాలుపెద్ది (30.6 మిలియన్లు)దేవర (28.7 మిలియన్లు)పుష్ప2 (27.11 మిలియన్లు)ఓజీ (27 మిలియన్లు)కల్కి (23.16 మిలియన్లు)గుంటూరు కారం (21.12 మిలియన్లు)ది ప్యారడైజ్ (17.12 మిలియన్లు) -
స్టార్ హీరోను పట్టుకుని అలా తోసేస్తావేంటి? నటుడికి మణిరత్నం వార్నింగ్
దర్శకుడు మణిరత్నం ఓసారి తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని, అప్పుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తనకు సపోర్ట్ చేశాడని చెప్తున్నాడు నటుడు గజరాజ్ రావు. షారూఖ్, మణిరత్నం, గజ్రాజ్ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన చిత్రం దిల్సే. 1998లో వచ్చిన ఈ సినిమా తెర వెనుక జరిగిన ఓ సంఘటనను గజరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. దిల్‌సేలో నాది సీబీఐ ఆఫీసర్ పాత్ర. నేను షారూఖ్ ఖాన్‌ను ప్రశ్నించాల్సి ఉంటుంది. షారూఖ్‌ను గోడకు నెట్టేశాఅందుకు సంబంధించిన సన్నివేశం రిహార్సల్స్ చేస్తున్నాం. అందులో భాగంగా నేను షారూఖ్‌ను గోడకేసి కొట్టాను. అప్పుడు మణిరత్నం నాపై అసహనం వ్యక్తం చేశాడు. షారూఖ్ పెద్ద హీరో.. ఆయనొక స్టార్.. మనం ఈ సినిమా పూర్తి చేయాలి, అర్థమవుతుందా? ఆయన్ను అలా బలంగా నెట్టేయకు అని వారించాడు. కానీ షారూఖ్ మాత్రం అదేమీ పట్టించుకోలేదు. ఇంతకుముందెలా చేశావో మళ్లీ అలాగే చేయు అని ఎంకరేజ్ చేశాడుఅందరికంటే ఎక్కువ ఎనర్జీనా బలాన్నంతా ఉపయోగించమనేవాడు. సెట్లో, బయటా అందరూ సమానమే అని చాటిచెప్పేవాడు. ఆయన్ను నేను రఫ్‌గా ఎందుకు హ్యాండిల్ చేశానంటే మేమిద్దరం ఢిల్లీలోని థియేటర్ స్కూల్ నుంచి వచ్చినవాళ్లమే! ఏదేమైనా షారూఖ్ ఎనర్జీ మిగతా అందరు నటులకంటే 10 వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది అని గజ్రాజ్ చెప్పుకొచ్చాడు. ఇతడు.. తల్వార్, బదాయి హో, రంగూన్, మేడ్ ఇన్ చైనా, శుభ్ మంగళ్ జ్యాద సావధాన్, మైదాన్, సత్యప్రేమ్ కీ కథ, బ్యాడ్ న్యూజ్, యుద్ర చిత్రాల్లో నటించాడు.చదవండి: బీచ్‌లో సిగరెట్ తాగిన బోల్డ్ బ్యూటీ.. -
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
విడాకులు అనే పదం ఈ రోజుల్లోనే కామన్ అయిపోయింది. సినీ ఇండస్ట్రీలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పెళ్లైన కొన్నేళ్లలోనే పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్ పడేస్తున్నారు. అలా తాజాగా ప్రముఖ బుల్లితెర నటి తన వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్ బుల్లితెర నటి ముగ్ధా చాఫేకర్ విడాకులు తీసుకున్నట్లు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు రవీశ్ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకు పెళ్లైన తొమ్మిదేళ్ల తర్వాత భర్త రవీశ్ దేశాయ్‌తో విడిపోయింది.రవీశ్ దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "చాలా ఆలోచనల తర్వాత, ముగ్ధ , నేను మా సొంత మార్గాల్లో ప్రయాణించేందుకు నిర్ణయించుకున్నాం. అందుకే భార్య,భర్తలుగా విడిపోవాలని డిసిషన్ తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పట్టింది. ఇప్పటివరకు పరస్పరం ప్రేమ, స్నేహం, గౌరవంతో కలిసి ప్రయాణించాం. ఆమెతో ఉన్న రోజులు జీవితాంతం గుర్తుంటాయి." అని పోస్ట్ చేశారు. ఈ సమయంలో తమకు గోప్యత కావాలని అభిమానలను అభ్యర్థించాడు. అభిమానులు, మీడియా మాపై దయతో మద్దతుగా ఉండాలని.. ఎటువంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని నటి భర్త కోరారు.కాగా.. రవీశ్ దేశాయ్, ముగ్ధా చాఫేకర్ 2014లో సత్రంగి ససురల్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ సీరియల్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత డిసెంబరు 2016లో ముంబయిలో జరిగిన గ్రాండ్ వేడుకలో వీరి వివాహం జరిగింది. ప్రముఖ టీవీ సీరియల్ కుంకుమ భాగ్య సీరియల్లో ప్రాచీ మెహ్రా కోహ్లి పాత్రకు గానూ ముగ్ధా చాఫేకర్ బాగా ఫేమస్ అయింది. అలాహే రవీశ్ దేశాయ్ మేడ్ ఇన్ హెవెన్, షీ (సీజన్ 2), స్కూప్ లాంటి వెబ్ సిరీస్‌ల్లో కనిపించారు. చివరిసారిగా స్పోర్ట్స్ డ్రామా విజయ్ 69లో కనిపించారు. -
మొదటి పెళ్లి దుస్తుల్ని వేలంలో అమ్మేశా, రెండో పెళ్లి దుస్తులు..వెల్లడించిన నటి
నటి దియా మీర్జా మన హైదరాబాదీ అమ్మాయే. మిస్ ఏసియా పసిఫిక్ ఇంటర్నేషనల్‌గా అందాల సుందరిగా కిరీటాన్ని దక్కించుకున్న తర్వాత వరుసగా విభిన్న భాషల్లో సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం బాలీవుడ్లో నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తెలుగులో ఆమె చివరగా నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ చిత్రంలో చేసింది. సినిమాలతో పాటు పలు రకాల వ్యాపారాలు కూడా చేస్తూ స్థిరపడిన దియా మీర్జా... వ్యక్తిగత జీవితంలో ప్రేమ పెళ్లి మాత్రం విఫలమైంది. ఆమె గత 2014లో తన వ్యాపార భాగస్వామి సాహిల్ సంఘాని పెళ్లాడింది. అయితే ఐదేళ్లలోనే ఆ పెళ్లి పెటాకులైందని ఆమే స్వయంగా ప్రకటించింది. అనంతరం రెండేళ్లు గ్యాప్ ఇచ్చి అప్పటికే వివాహితుడు, ఒక బిడ్డకు తండ్రి అయిన వైభవ్ రేఖిని పెళ్లి చేసుకుని దియా మీర్జా రేఖిగా మారింది. అయితే విడాకుల తర్వాత కూడా ఎప్పుడూ తన మొదటి పెళ్లి గురించి దియామీర్జా మాట్లాడింది లేదు. ఇటీవల మాత్రం ఒక ఇంటర్వ్యూలో, దియా మీర్జా తన పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, ఆ తరహా ఆలోచనల వెనుక ఉన్న పలు అంశాల్ని గురించి మాట్లాడుతూ తన రెండవ పెళ్లిని పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ తరహాలో చేసుకున్నట్టు వివరించింది.తమ ఇంటి తోటలోనే అత్యంత నిరాడబంరంగా సహజమైన పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది. చేతితో తయారు చేసిన వ్యక్తిగతీకరించిన బహుమతులు స్థానిక సహజమైన అలంకరణ ఉత్పత్తులనే వివాహం కోసం వాడినట్టు తెలిపారు. ఆహార వ్యర్థాలను తగ్గించడానికి అతిథులకు శాకాహార మాంసాహార వంటకాల ఖచ్చితమైన సంఖ్యను నిర్ధారిస్తూ, భోజనాలను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేశామన్నారు. కేవలం ఓ మహిళా పూజారితో దంపతులు సాదాసీదాగా వేడుక పూర్తి చేశామన్నారు. వధువుగా ధరించడానికి బాలీవుడ్ వధువులకు సాధారణమైన లెహెంగాకు బదులుగా ఎరుపు రంగు బనారసీ చీరను దియా ఎంపిక చేసుకోవడం విశేషం.ఇదే సందర్భంగా ఆమె తన మొదటి పెళ్లి గురించి కూడా గుర్తు చేసుకుంది. ఆ పెళ్లి ఒక ఫార్మ్ హౌజ్‌లో జరిగింది. ఆడంబరంగా జరిగిన ఆ పెళ్లిలో ఆమె ఖరీదైన దుస్తులను ఎంచుకుంది. ఆ పెళ్లిలో ఆమె బాలీవుడ్ వధువుల తరహాలోనే లెహంగానూ ధరించింది. అయితే వివాహాల తర్వాత బ్రైడల్ లెహంగాలు తరచు నిరుపయోగంగా ఉంటాయని తెలిపింది. వాటిని పారవేయలేక, ఇటు ధరించనూ లేక వార్డ్‌రోబ్స్‌లో ఉంచుతారంది. ఒక పర్యావరణ అనుకూల మనస్తత్వంతో తాను దాన్ని ఇష్టపడలేదని చెప్పింది. దాంతో ఆమె తన మొదటి పెళ్లిలో తాను ధరించిన తన వివాహ లెహంగాను వేలం వేయాలని అనుకుంది. అనుకున్నట్టుగానే దాన్ని మంచి ధరకు వేలం వేశానని వెల్లడించింది. నిరుపయోగంగా పడి ఉండకూడదనే తాను తన రెండవ పెళ్లికి సాధారణ చీరను ఎంచుకున్నానని తన భర్త వైభవ్ రేఖీ సైతం అదే పనిచేశారని తెలిపింది. పెళ్లి తర్వాత అలమారాలో ఉపయోగించకుండా కూర్చోకుండా జీవితాంతం ధరించగలిగే దుస్తులను ఆయన కూడా ఎంచుకున్నట్లు కూడా ఆమె పేర్కొంది. ఆమె పెళ్లి రోజున, దియా మీర్జా సాంప్రదాయ ఎరుపు రంగుకు దూరంగా డిజైనర్ రీతూ కుమార్ తయారు చేసిన ఆకుపచ్చ జర్దోసీ ఘరారాను ఎంచుకుంది. -
చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు
సినిమా సెలబ్రిటీలు బయటకు నవ్వుతూ కనిపిస్తుంటారు. కానీ అప్పుడప్పుడు అభిమానుల వల్ల ఇబ్బంది పడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితి శ్రీలీలకు (Sreeleela) ఎదురైంది. కొందరు అభిమానులు ఈమెని గట్టిగా పట్టి లాగేశారు. (ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా)కొన్నాళ్ల ముందు వరకు వరస తెలుగు సినిమాలు చేసిన శ్రీలీల.. ప్రస్తుతం బాలీవుడ్ లో మూవీస్ చేస్తోంది. కార్తీక్ ఆర్యన్(Karthik Aryan)తో ఓ ప్రేమకథలో నటిస్తోంది. నిన్నటివరకు డార్జిలింగ్ లో షూటింగ్ చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కార్తిక్, శ్రీలీల నడిచి వస్తుండగా.. పక్కనే ఉన్న కొందరు శ్రీలీలని పట్టి లాగేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన శ్రీలీల ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరీ ఇలా ప్రవర్తిస్తున్నారేంట్రా అని అనుకుంటున్నారు. ఇకపోతే కార్తిక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ అని కూడా కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ మూవీపై బజ్ పెంచేందుకేనని కొందరు నెటిజన్లు అంటున్నారు.(ఇదీ చదవండి: దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్)Manhandling actresses in public places has to stop tf #Sreeleela pic.twitter.com/TdMjPLQHlT— Aryan (@Pokeamole_) April 6, 2025 -
రహస్య సంభాషణల కోసం కొరియన్ భాష.. మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
దక్షిణాది నటుడిగా తన ప్రయాణం ప్రారంభించిన ఆర్ మాధవన్ (R Madhavan ) ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రముఖ నటుడిగా మారారు. కేవలం అభినయానికే ప్రాధాన్యతను ఇస్తూ టాప్ నటులుగా మారిన అతి తక్కువ మందిలో ఆయన ముందు వరుసలో ఉంటారు. గత ధోరణికి భిన్నంగా ఆయన ఇటీవల కాస్త ఎక్కువగానే ఇస్తున్న ఇంటర్వ్యూల్లో అనేక సమకాలీన, సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నారు. తాజాగా చాలా మంది తల్లిదండ్రులకు సమకాలీన పాప్ సంస్కృతి పరిశీలకులకు సుపరిచితం అయిన ఓ అంశాన్ని ప్రస్తావించాడు, ప్రస్తుతం భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కె.పాప్ పట్ల ఆయన తొలిసారిగా స్పందించాడు.ప్రస్తుత ఓటీటీ యుగం పుణ్యమా అని అనేక దేశాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలు మన యువతకు చేరువయ్యాయి. అందులో అత్యంత వేగంగా పిల్లల్ని ఆకట్టుకుంటోంది కొరియన్ పాప్ (K Pop) సంగీతం, కొరియన్ సినిమా, సిరీస్‌లు. ఈ కొరియన్ సంస్కృతి పట్ల భారతీయ పిల్లలు పెంపొందించుకున్న గాఢమైన ఆకర్షణపై మాధవన్ ఆశ్చర్యంతో పాటు తన ఆందోళనను సైతం వ్యక్తం చేశారు, ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయన ఊపందుకుంటున్న ధోరణిపై తన ఆలోచనలను ఆందోళననను పంచుకున్నాడు.‘దక్షిణాదిలో–ఇంకా చెప్పాలంటే భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో–కె–పాప్ సరికొత్త సంస్కృతిగా అవతరిస్తోంది‘ అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. యువత లో కె–పాప్ సంస్కృతి ఊహలకు అందనంత లోతుగా అల్లుకుపోతోందని వారి కథా కథనాలలో భారతీయ సినిమా తో పోలిస్తే అంత వైవిధ్యం ఏం ఉందో? అదెందుకు వారిని అంతగా ఆకట్టుకుంటుందో తెలియడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అయితే వీటన్నింటి కన్నా తల్లిదండ్రులకు మరింత ఆందోళనను కలిగించే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదేమిటంటే... అనేకమంది భారతీయ యువత కొరియన్ భాషను నేర్చుకుంటున్నారు అనేది. నిజానికి అన్యభాషా చిత్రాలను ఆదరించడం, వారి సంగీతాన్ని ఎంజాయ్ చేయడం ఎప్పుడూ ఉండేదే. అయితే ఏకంగా కొరియన్ భాషను నేర్చుకుని మరీ ఆ సంగీతం, వినోదాన్ని ఆస్వాదించాలనే వారి బలమైన ఆసక్తి పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఆయన మరో రహస్యాన్ని కూడా బహిర్గత పరిచాడు. కొరియన్ భాషను నేర్చుకుంటున్న పిల్లలు వారి తల్లిదండ్రులకు అర్థం కాని రహస్య సంభాషణల కోసం కోడ్ లాంగ్వేజ్ గా కూడా ఉపయోగిస్తున్నారనే చేదైన వాస్తవాన్ని ఆయన తెలియజేశాడు. సాంకేతిక విప్లవం కారణంగా ఇప్పటికే టీనేజర్లు రకరకాల మాయాజాలాల్లో ఇరుక్కుపోతున్న పరిస్థితుల్లో కొరియన్ భాషలో వారు సాధించే పట్టు ద్వారా పొందే ప్రయోజనం కేవలం సినిమా, పాప్ సంగీత వినోదానికే పరిమితం కాగా...దాని వల్ల తల్లిదండ్రులకు కలిగే నష్టం అంతకు మించి ఉండబోతోందని ఒక టీనేజర్ తండ్రి కూడా అయిన మాధవన్ చెబుతున్న విషయం ప్రతీ ఒక్క పేరెంట్ గుర్తు పెట్టుకోవాల్సిందే అనడంలో సందేహం లేదు. -
దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు. గతేడాది స్త్రీ 2 మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రద్ధా నవ్వుపై విచిత్రమైన కామెంట్స్ చేశాడు. దీంతో ఆమె అభిమానులు సదరు దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?'స్త్రీ సినిమా తీయాలని అనుకున్నప్పుడు హీరోయిన్ ఎవరిని తీసుకుందామా అని చాలా ఆలోచించాం. ఆ టైంలో శ్రద్ధా కపూర్ పేరుని నిర్మాత దినేశ్ విజన్ ప్రతిపాదించారు. ఆమెనే ఎంపిక చేయడానికి గల కారణాన్ని కూడా నాతో చెప్పారు. ఓసారి దినేశ్, శ్రద్ధా విమానంలో వెళ్తున్నప్పుడు చాలాసేపు మాట్లాడుకున్నారట. ఆమె అచ్చం దెయ్యంలా నవ్వుతుందని, అందుకే ఈ పాత్రకు ఆమె అయితేనే పూర్తి న్యాయం చేయగలదని ఆయన నాతో చెప్పారు' అని డైరెక్టర్ అమర్ కౌశిక్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బాలీవుడ్ హీరోయిన్ ఇంట విషాదం)ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై శ్రద్దా కపూర్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో సినిమా తీసి, హిట్ కొట్టి ఇలా మాట్లాడటం తగునా అని అంటున్నారు. వెంటనే సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.శక్తి కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి 2010లో శ్రద్దా వచ్చింది. తీన్ పట్టి మూవీతో హీరోయిన్ అయింది. ఆషికి 2 మూవీ ఈమె కెరీర్ ని మలుపు తిప్పింది. ప్రభాస్ సాహో మూవీలోనూ హీరోయిన్ గా చేసింది గానీ పెద్దగా ఉపయోగపడలేదు. ఇకపోతే స్త్రీ 3 మూవీ 2027లో వస్తుందని ఇదివరకే నిర్మాతలు ప్రకటించారు.(ఇదీ చదవండి: 'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది.. సిక్సర్ కొట్టిన రామ్ చరణ్) -
బాలీవుడ్ హీరోయిన్ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) ఇంట విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి కిమ్ ఫెర్నాండేజ్ (Kim Fernandez) కన్నుమూసింది. మార్చి 24న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మరణించింది. జాక్వెలిన్ తల్లి మృతి పట్ల పలువురూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.జాక్వెలిన్ బ్యాక్గ్రౌండ్జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శ్రీలంకవాసి. అక్కడ టీవీ రిపోర్టర్‌గా పని చేసింది. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటం గెల్చుకుంది. మోడలింగ్‌లో భాగంగా ఇండియాకు వచ్చినప్పుడు సుజయ్ ఘోష్ తనకు అలాద్దీన్ సినిమా ఆడిషన్‌కు రమ్మన్నాడు. ఆడిషన్లో పాస్ అవడంతో అలాద్దీన్ సినిమాతో భారతీయ ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ చిత్రంతో ఉత్తమ డెబ్యూగా ఐఫా అవార్డు అందుకుంది. సినిమాఅయితే తనకు గుర్తింపును, కమర్షియల్ సక్సెస్‌ను ఇచ్చిన మొదటి చిత్రం మర్డర్ 2. హౌస్‌ఫుల్ 2, రేస్ 2 చిత్రాలతో మరింత స్టార్డమ్ సంపాదించుకుంది. భాగీ 2, రాధే, సెల్ఫీ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో ఆడిపాడింది. ప్రభాస్ సాహో మూవీలో బ్యాడ్ బాయ్ అనే ఐటం సాంగ్ చేసింది. ఇటీవల వచ్చిన ఫతే సినిమాలో కథానాయికగా అలరించింది. ప్రస్తుతం రైడ్ 2లో స్పెషల్ సాంగ్ చేస్తోంది. అలాగే వెల్కమ్ టు ద జంగిల్, హౌస్‌ఫుల్ 5 చిత్రాల్లో నటిస్తోంది.చదవండి: హీరోయిన్గా అవకాశాలు రాక ఐటం సాంగ్? కేతిక ఏమందంటే? -
'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది.. సిక్సర్ కొట్టిన రామ్ చరణ్
'పెద్ది' సినిమాతో దుమ్మురేపేందుకు రామ్‌చరణ్ రెడీ అయిపోయాడు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన రామ్‌చరణ్ ఫస్ట్ లుక్కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ షాట్ పేరుతో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. శ్రీరామ నవమి (ఏప్రిల్ 6) సందర్భంగా విడుదలైన తొలి షాట్ అదిరిపోయింది. ఫస్ట్ బాల్కే చరణ్ సిక్సర్ కొట్టేశాడని చెప్పవచ్చు. తన జట్టును గెలిపించేందుకు మాస్ లుక్‌లో బరిలోకి దిగాడు చరణ్. సినీ అభిమానులను మెప్పించేలా పెద్ది గ్లింప్స్ ఉంది. గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ ఈ సినిమా బయటపడేస్తుందని ఆయన ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. 2026 మార్చి 27న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్‌లో తెలిపారు.జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించగా కెమేరామెన్‌గా ఆర్. రత్నవేలు ఉన్నారు. గుర్తింపు కోసమే పెద్ది పోరాటం ఉంటుందని రామ్‌చరణ్ సామాజిక మాధ్యమాల ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే. -
నేను కాపీ కొట్టలేదు.. ఏళ్లకిందటే రాసుకున్న కథ ఇది: లాపతా లేడీస్ రచయిత
బాక్సాఫీస్ వద్ద అంతంతమాత్రమే ఆడినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది లాపతా లేడీస్ (Laapataa Ladies). బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ చిత్రాన్ని 2019లో వచ్చిన అరబిక్ మూవీ నుంచి కాపీ కొట్టారని ఇటీవల ట్రోలింగ్ జరిగింది. బుర్ఖా సిటీ అనే అరబిక్ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్‌ను యథాతథంగా తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.టూ బ్రైడ్స్ పేరిట రిజిస్టర్తాజాగా ఈ ఆరోపణలపై లాపతా లేడీస్ కథారచయిత బిప్లాబ్ గోస్వామి (Biplab Goswami) స్పందించాడు. అరబిక్ సినిమాను తెరకెక్కించడానికంటే ముందే తను ఈ కథను రిజిస్టర్ చేయించినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేశాడు. అందులో ఏముందంటే.. లాపతా లేడీస్ కథ ఎన్నో ఏళ్లకిందట రాసుకున్న కథ. 2014 జూలై 3న ఈ కథను స్క్రీన్రైటర్స్ అసోసియేషన్‌లో టూ బ్రైడ్స్ పేరిట క్లుప్తంగా రిజిస్టర్ చేయించాను. ఎప్పుడో రాసుకున్నా..పరదా కారణంగా పెళ్లికొడుకు పొరపాటున వేరొకరి భార్యను ఇంటికి తీసుకురావడం.. తీరా ఇంటికొచ్చాక జరిగిన తప్పిదానికి బాధపడటం.. ఇవన్నీ కూడా ఆ కథలో పొందుపర్చాను. అలాగే పెళ్లికొడుకు తన భార్య ఆచూకీ వెతికిపెట్టమని పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడని.. పరదా కప్పుకున్న భార్య ఫోటోను పోలీస్‌కు ఇస్తాడని కూడా పేర్కొన్నాను. 2018 జూన్ 30న పూర్తి స్క్రిప్ట్‌ను రిజిస్టర్ చేయించాను. అదే ఏడాది జరిగిన సినీస్తాన్ స్టోరీటెల్లర్స్ పోటీలో నా కథకుగానూ రన్నరప్ అవార్డు గెల్చుకున్నాను. దశాబ్దాల నుంచి ఉన్నదే!పరదాల కారణంగా అమ్మాయిల్ని గుర్తుపట్టడం కష్టంగా మారుతుందనే అంశాన్ని దశాబ్దాల తరబడి ఉపయోగిస్తున్నాం. విలియం షేక్స్పియర్, అలెగ్జాండర్ డుమాస్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ఎందరో రచయితలు సైతం తమ కథల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. వధువులు మారిపోతే అనే అంశాన్ని ప్రధానంగా తీసుకున్న లాపతా లేడీస్ తెరకెక్కింది. ఇది పూర్తిగా ఒరిజినల్ స్టోరీ. కథ, డైలాగ్స్, పాత్రలు, సన్నివేశాలు, స్క్రీన్‌ప్లే.. అంతా కూడా ఏళ్లతరబడి మేము చేసిన అధ్యయనానికి ప్రతీకగా నిలిచాయి. 100% ఒరిజినల్లింగ వివక్ష, అసమానత్వం వంటి సమస్యల్ని స్పష్టంగా చూపించాం. మా కథ, పాత్రలు, డైలాగ్స్ అన్నీ కూడా నూటికి నూరుపాళ్లు ఒరిజినలే! కాపీ కొట్టామంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి ఆరోపణలు మా శ్రమకు ఫలితం లేకుండా చేస్తాయి. నాకే కాదు, నా టీమ్ మొత్తం చేసిన కృషిని దెబ్బ తీస్తాయి అని రచయిత బిప్లాబ్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Biplab Goswami (@biplabgoswamicinema) చదవండి: రాముడి పాత్ర చేసిన తొలి తెలుగు హీరో ఎవరో తెలుసా? -
'జాట్' తెలుగు వర్షన్‌కు ఇబ్బంది ఏంటి..?
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా 'జాట్'. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భారీ మాస్ యాక్షన్ సీన్స్ కనిపించడంతో వారికి కొత్తగా జాట్ సినిమా కనిపిస్తోంది. తమన్ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. రీసెంట్గా ఊర్వశి రౌతేలా స్టెప్పులేసిన ఒక స్పెషల్ సాంగ్‌ను విడుదల చేసి సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశారు.2023లో వీరసింహారెడ్డి చిత్రం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జాట్' కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సినిమా తెలుగులో విడుదల కావడం మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. తెలుగు వర్షన్ డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో హిందీతో పాటుగా టాలీవుడ్లో ఈ మూవీ విడుదల కాకపోవచ్చని సమాచారం. అయితే, పాన్ ఇండియా రేంజ్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. ఏప్రిల్ 10లోపు పనులు పూర్తి కాకుంటే తెలుగు వర్షన్ మరో వారం ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.టాలీవుడ్‌కు సన్నీ డియోల్ ఫిదాజాట్ సినిమాలో రణదీప్ హుడా విలన్‌గా నటిస్తున్నారు. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో మెప్పించనున్నారు. ఈ సినిమాని లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించారు. జాట్ సినిమాకు దర్శకుడు, నిర్మాత తెలుగు వారే కావడం విశేషం. అయితే, బాలీవుడ్ నిర్మాతలు టాలీవుడ్ వాళ్లని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని సన్నీ డియోల్ తాజాగా అన్నారు. టాలీవుడ్ వాళ్లతో కలిసి వర్క్ చేయడం తనకు నచ్చిందని ఆయన ప్రశంసించారు. సౌత్ వాళ్లతో మరో సినిమా చేయాలనుకుంటున్నట్లు ఆయన ఆశించారు. భవిష్యత్‌లో సౌత్ పరిశ్రమలో స్థిరపడాలని ఉంది అని సన్నీ డియోల్ అన్నారు. -
ఖైదీ సీక్వెల్లో అమలాపాల్
కోలీవుడ్ నటుడు కార్తీ కథానాయకుడుగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ఖైదీ. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్సార్ ప్రకాష్ బాబు, ఎస్సార్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. కాగా త్వరలో ఈ చిత్రానికి సీక్వల్‌ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఖైదీ చిత్రాన్ని హిందీలో నటుడు అజయ్ దేవగన్ 'భోలా' పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఆయనే దర్శకత్వం వహించారు. అయితే, అక్కడ కూడా ఫర్వాలేదనిపించింది. తమిళం కార్తీ కథానాయకుడిగా నటించిన పాత్రను హిందీలో అజయ్ దేవగన్ పోషించారు. నరేన్ పాత్రలో నటి టబు కనిపించారు.అజయ్ దేవగన్ ఫిలిమ్స్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నటి అమలాపాల్ కీలక పాత్రలో కనిపించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను బాలీవుడ్లో కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను యూనిట్ వర్గాలు త్వరలో వెల్లడించనున్నారు. కాగా 2009లో మలయాళంలో నీలతామర అనే చిత్రంలో కథానాయకిగా పరిచయమైన అమలాపాల్ తమిళంలో వీరశేఖరన్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అలా మలయాళం ,తమిళం, తెలుగు భాషల్లోనూ ప్రముఖ హీరోల సరసన కథానాయకగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు మనస్పర్ధల కారణంగా రెండేళ్లకే విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలో నటించడం మొదలెట్టిన అమలాపాల్ అదేవిధంగా జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఒక పాప కూడా పుట్టింది. కాగా అమలాపాల్ నటించిన మలయాళ చిత్రం గోట్ మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆమె తమిళంలో నటించి చాలా కాలమే అయ్యింది. కాగా తాజాగా బాలీవుడ్‌లోకి ఖైదీ2తో మరోసారి సందడి చేయనున్నారు. -
రామయ్య వస్తున్నాడయ్యా
తండ్రి మాటను జవదాటని తనయుడు... సోదరులను అభిమానించే అన్న... భార్య దూరమైనా ఆమె కోసమే జీవించిన ఏక పత్నీవ్రతుడు... ప్రజల క్షేమం కోరిన రాజు... ధర్మం తప్పని మహనీయుడు... ఇలా అన్నీ సుగుణాలున్నాయి కాబట్టే రాముడు ఆదర్శ్రపాయుడు. నేడు శ్రీరామ నవమి సందర్భంగా ‘రామాయణం’ ఆధారంగా రూపొందుతున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...రామాయణాన్ని ఒక్క సినిమాగా చెప్పడం కష్టం అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి. అందుకే రెండు భాగాలుగా ఆయన ‘రామాయణ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుగుణాల సుందరాంగుడు రాముడి పాత్రకు హ్యాండ్సమ్ హీరో రణ్‌బీర్ కపూర్‌ని ఎంపిక చేసుకున్నారు. సుగుణవతి, సౌందర్యవతి సీతమ్మ పాత్రకు సాయి పల్లవిని తీసుకున్నారు. రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటిస్తున్నారు. దాదాపు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యశ్ కూడా ఓ నిర్మాత. రాముడి పాత్ర నాకో కల: రణ్‌బీర్ కపూర్ ‘‘ఇలాంటి అద్భుత చిత్రంలో భాగం కావడం గౌరవంలా భావిస్తున్నాను. ఈ చిత్రం తొలి భాగం షూటింగ్ పూర్తి చేశాను. త్వరలో రెండో భాగం చిత్రీకరణ ఆరంభిస్తాం. రాముడి పాత్రను ఎంతో వినయ విధేయతలతో చేస్తున్నాను. ఈ పాత్ర నాకో కలలాంటిది. ఈ సినిమాలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి గురించి చెప్పే సినిమా. అలాగే కుటుంబం, భార్యా–భర్తల అనుబంధాన్ని తెలియజేసే చిత్రం’’ అని రణ్‌బీర్ కపూర్ ఓ సందర్భంలో పేర్కొన్నారు.ఇక నితీష్ తివారీ అయితే ‘‘ఈ అద్భుత ఇతిహాసాన్ని వెండితెరపైకి తీసుకురావడానికి పదేళ్ల క్రితమే అన్వేషణ మొదలుపెట్టాను. మన పవిత్రమైన చరిత్రకు దృశ్యరూపం ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఫొటోలను అధికారికంగా విడుదల చేయలేదు. షూటింగ్ స్పాట్లో రణ్‌బీర్–సాయి పల్లవిల ఫొటోలు లీక్ అయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి, మలి భాగం 2027 దీపావళికి విడుదలవుతాయి.ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ రాముడికి పరమ భక్తుడు ఆంజనేయుడు. తన జీవితం మొత్తం రాముడి సేవకే అంకితం చేశాడు. శ్రీరాముడు అంటే ఆంజనేయుడికి ఎంత భక్తి అంటే... తన ఛాతీ చీల్చితే అందులో సీతారాములే ఉంటారనేంతగా... రాముడి జీవితంలో ఎంతో కీలకమైన ఆంజనేయుడి పాత్ర కీలకంగాప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జై హనుమాన్’. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ ‘హను–మాన్’కి ఇది సీక్వెల్. గతేడాది జనవరిలో అయోధ్యలో శ్రీరాముడి ప్రా ణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. అదే ఏడాది ఏప్రిల్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రం పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు ఆ శ్రీరాముడి ఆశీస్సులతో మాటిస్తున్నా... మీరందరూ జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ‘జై హనుమాన్’తో అద్భుతమైన అనుభూతిని అందిస్తా’’ అని పేర్కొన్నారు ప్రశాంత్ వర్మ.శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటి? అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్’ని రూపొందిస్తున్నారని తెలిసింది. ఇక హనుమంతుడి పాత్రను ప్రముఖ కన్నడ స్టార్, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి పోషిస్తున్నారు. గత ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఆయన హనుమంతుడి లుక్‌కి మంచి స్పందన లభించింది. తొలి భాగంలో కనిపించిన తేజ సజ్జా ఈ చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య రానా, రిషబ్‌తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘జై జై హనుమాన్’ అని పోస్ట్ చేశారు ప్రశాంత్ వర్మ. దాంతో ఈ చిత్రంలో రానా నటిస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ‘హను–మాన్’ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ‘జై హనుమాన్’ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.శ్రీరామ్ జై హనుమాన్ ‘శ్రీరామ్ జై హనుమాన్’ పేరిట రామాయణం నేపథ్యంలో ఓ కన్నడ చిత్రం రూపొందుతోంది. ‘‘ఇప్పటి వరకూ రామాయణం ఆధారంగా పలు చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల్లో చెప్పని కొత్త విషయాలను ఈ చిత్రంలో చెప్పనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘రామాయణం గురించి ఎవరికీ తెలియని అంశం’ అని అర్థం వచ్చే ట్యాగ్‌లైన్ ఈ చిత్రం పోస్టర్ మీద ఉంది. కాగా అయోధ్యలో శ్రీరాముడిప్రా ణ ప్రతిష్ఠ జరిగిన ముహూర్తానికి ఈ చిత్రం పోస్టర్‌ను రిలీజ్ చేశారు.అయితే నటీనటుల గురించి, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. అవధూత్ దర్శకత్వంలో కేఏ సురేష్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు... ఇంకా తెలుగులో ‘జర్నీ టు అయోధ్య’ అనే చిత్రం ప్రకటన వెలువడింది. ఇంకా రామాయణం నేపథ్యంలో మరికొన్ని చిత్రాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. – డి.జి. భవాని -
బ్రాండ్ ఎండోర్స్మెంట్లకు దూరంగా ప్రభాస్
మహేష్‌బాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి సమకాలీకులతో పోలిస్తే రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) మాత్రం బ్రాండ్ ఎండోర్స్మెంట్లకు దూరంగా వుంటారు. చాలా కాలం క్రితం ఓ ప్రముఖ కార్ల సంస్ధకు ప్రభాస్ బ్రాండ్ ఎండోర్స్మెంట్ చేశారు. ఆ తరువాత మళ్లీ ఏ బ్రాండ్‌కు తను పని చేయలేదు. అయితే ఇటీవల కాలంలో పలు ప్రముఖ బ్రాండ్ల నుండి ఆఫర్లు వచ్చినప్పటికీ ప్రభాస్ వాటిని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఒక ప్రముఖ కోలా కంపెనీతో పాటు ఓ ఆటోమొబైల్ కంపెనీ వారు ప్రభాస్‌ను సంప్రదించగా తను వాటిపై ఆసక్తి చూపలేదట.ఓ యాడ్‌కు కేవలం మూడు రోజుల్లోనే 25 కోట్ల వరకు సంపాదించగలిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభాస్ మాత్రం బ్రాండ్ ఎండోర్స్మెంట్లు చేయడానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఓ సెలబ్రిటీ మేనేజర్ తెలిపారు.మహేష్‌బాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే పలు బ్రాండ్‌తో ఒప్పందాలు చేసుకుని ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం తన ఫోకస్ అంతా నటన, సినిమాలపైనే పెట్టారు. సినిమాలకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. ఇలా తనకు కోట్లలో భారీ మొత్తాలను చెల్లించేందుకు పలు బ్రాండ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ డార్లింగ్ మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ కేవలం తన నటనపై మాత్రమే ఫోకస్ పెట్టారంటూ ఆ సెలబ్రిటీ మేనేజర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఒక్కో సినిమాకు వందల కోట్ల రెమ్యునిరేషన్ తీసుకుంటూ టాప్ స్టార్‌గా ఉన్నప్పటికీ బ్రాండ్ ఎండోర్స్మెంట్లకు దూరంగా ఉండటం ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను తెలిజేస్తుంది. -
ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో 'ఛావా' విలన్
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం 'జై హనుమాన్' పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాదిలోనే దీని షూటింగ్ మొదలవొచ్చు. దీనితోపాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)అయితే మహాకాళి సినిమాని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. దీనికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించగా.. పూజ కొల్లూరు అనే మహిళా దర్శకురాలు స్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి 'ఛావా' విలన్ పాత్రధారి అక్షయ్ ఖన్నా వచ్చి చేరాడు. మన దేశంలో వస్తున్న తొలి లేడీ సూపర్ హీరో మూవీ ఇది అని అంటున్నారు. ఇందులోనూ అక్షయ్ ఖన్నా విలన్ పాత్రలోనే కనిపిస్తారా? మరేదైనా కీలక పాత్ర పోషిస్తారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో హీరోగా చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో చాన్నాళ్లు నటించలేదు. ఛావా మూవీలో ఔరంగజేబుగా అదరగొట్టేయడంతో ఇప్పుడు వరస అవకాశాలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?) -
జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్ రోషన్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమాతో బిజీగా ఉన్నాడు. అటు బాలీవుడ్లో హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ (War 2 Movie)లోనూ భాగమయ్యాడు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. జార్జియాలో జరిగిన వార్ 2 ఈవెంట్లో హృతిక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. హృతిక్ (Hrithik Roshan) మాట్లాడుతూ.. వార్ సినిమా సీక్వెల్ ఎలా ఉంటుందోనని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడీ సినిమా చూస్తుంటే గర్వంగా ఉంది. మొదటి భాగం కంటే కూడా ఇదే మరింత బాగుంటుంది.ఎన్టీఆర్‌తో డ్యాన్స్..జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ కోస్టార్. తను అద్భుతమైన వ్యక్తి, చాలా తెలివైనవాడు. ఒక పాట మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయింది. ఆ పాటలో ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్ చేయాలంటే కాస్త భయంగా ఉంది. తను ఎలాగైనా చేయగలడు. నేను కూడా బాగా డ్యాన్స్ చేస్తానని అనుకుంటున్నాను. మీరు మా సినిమాను తప్పక ఆదరించాలి అని చెప్పుకొచ్చాడు. వార్ 2 విషయానికి వస్తే.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీతో తారక్ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఇకపై డైరెక్టర్‌గానూ..హృతిక్ రోషన్ నెక్స్ట్ 'క్రిష్ 4' సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంతో అతడు దర్శకుడిగా మారనున్నాడు. '25 ఏళ్ల క్రితం నిన్ను నటుడిగా ప్రవేశపెట్టాను.. మళ్లీ పాతికేళ్ల తర్వాత నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది' అని హృతిక్ తండ్రి రాకేశ్ ఇటీవల సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు.చదవండి: జైలు నుంచి విడుదల, మహేశ్ చేతికి చిక్కిన పాస్‌పోర్ట్.. వీడియో వైరల్ -
'30 ఏళ్లు గ్యాప్ అయితే ఏంటి?'.. సల్మాన్- రష్మిక జోడీపై బాలీవుడ్ హీరోయిన్
సల్మాన్ ఖాన్ ఇటీవలే సికందర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే ఊహించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోతోంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందు సల్లు భాయ్ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొన్నారు. అదే సమయంలో రష్మికతో సల్మాన్ ఏజ్ గ్యాప్‌పై పలువురు ప్రశ్నించారు. మీ కూతురి వయస్సున్న అమ్మాయితో ఎలా నటిస్తారంటూ నెట్టింట విమర్శలొచ్చాయి. దీనిపై సల్మాన్ సైతం స్పందించారు. ఆమెకు లేని ఇబ్బంది.. మీకు ఎందుకని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. భవిష్యత్తులో రష్మికకు పాప పుడితే ఆమెతో కూడా నటిస్తానని సల్మాన్ ఖాన్ అన్నారు.తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ కూడా స్పందించారు. సినిమాల్లో నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ అనేది సాధారణ విషయమన్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో అమీషా పటేల్ మాట్లాడారు. అలాగే తనకు కూడా గదర్ చిత్రంలో సన్నీ డియోల్‌కు, నాకు దాదాపు 20 ఏళ్ల అంతరం ఉందని ఆమె గుర్తు చేశారు.అమీషా మాట్లాడుతూ..' గదర్-2 సినిమాలో నాకు సన్నీ డియోల్‌కు 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. కానీ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. అందుకే మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. అలాగే సల్మాన్, రష్మిక జోడిని అభిమానులు ఇష్టపడుతున్నారు. నేను కూడా నాకంటే వయసులో చాలా పెద్ద హీరోలతో కలిసి పనిచేశానని' తెలిపింది. -
జలియన్‌వాలా బాగ్ నేపథ్యంలో...
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కేసరి చాప్టర్ 2’. ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ అనేది ఉపశీర్షిక. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాధవన్, అనన్యా పాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత దురదృష్టకర, హేయమైన సంఘటనగా నిలిచిపోయిన ఘటనల్లో జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఒకటి. 1919 ఏప్రిల్ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొం దింది. ట్రైలర్లో అక్షయ్, మాధవన్‌ల మధ్య వచ్చే డైలాగులు సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్నాయి. -
'అతనే నా భర్త కూడా'.. ఆర్జే మహ్వశ్ వీడియో వైరల్!
ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్వశ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మొదలైన చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో దుబాయ్ స్టేడియంలో మెరవడంతో ఒక్కసారిగా వీరిద్దరిపై చర్చ మొదలైంది. ఈ జంట డేటింగ్ ఉన్నారంటూ పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆర్జే మహ్వశ్ వార్తల్లో నిలిచింది. ఇటీవల లక్నోలోని ఓ హోటల్లో స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే చాహల్ ఐపీఎల్ మ్యాచ్ కోసమే తాను అక్కడికి వెళ్లిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తనపై వస్తున్న డేటింగ్ వార్తల నేపథ్యంలో తాజాగా ఆర్జే మహ్వశ్ షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆమె పోస్ట్ చేసిన రీల్లో తన జీవితంలో రాబోయే వ్యక్తి గురించి ప్రస్తావించింది. నా లైఫ్‌లోకి వచ్చిన వ్యక్తే నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్‌తో పాటు తనే నా భర్త కూడా అవుతాడు.. అంతేకాదు నేను అతని చుట్టూ తిరుగుతానంటూ మాట్లాడింది. అయితే ఈ వీడియోకు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ లైక్ కొట్టాడు. దీంతో మీ జీవితంలో యుజ్వేంద్ర చాహల్ రాబోతున్నారా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే చాహల్‌కు తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం ఐపీఎల్ లీగ్‌తో బిజీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్నారు. ఇటీవల లక్నోలో జరిగిన మ్యాచ్ కోసం ఆర్జే మహ్వశ్ అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్జే వరుసగా సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక.. ఎందుకంటే?
హీరోయిన్ హన్సిక మోత్వానీ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టి వేయాలంటూ బాంబే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆమె సోదరుడి భార్య, నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్‌కు నోటీసులు జారీ చేసింది. మార్చి 24న హన్సిక పిటిషన్ వేయగా.. ఇవాళ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. కాగా.. ఇప్పటికే ఈ కేసులో హన్సిక మోత్వానీకి ముంబై సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.కాగా.. గతంలో హన్సికతో పాటు ఆమె తల్లిపై సోదరుడి భార్య ముస్కాన్ నాన్సీ జేమ్స్ గృహ హింస కేసు పెట్టారు. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ.. బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత విభేదాలు రావడంతో 2022లోనే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలోనే తనను వేధింపులకు గురి చేశారంటూ హన్సికతో పాటు సోదరుడు ప్రశాంత్, ఆమె తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే తమపై నమోదైన కేసును కొట్టి వేయాలంటూ హన్సిక బాంబే హైకోర్ట్‌ను ఆశ్రయించింది. -
సూపర్ హిట్ వెబ్ సిరీస్.. మళ్లీ వచ్చేస్తోంది
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీలకు అడిక్ట్ అయిపోయారు. ఏ సినిమా అయినా.. వెబ్ సిరీస్ అయినా ఓటీటీలోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరికొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు రూపొందిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఓటీటీల్లోనూ కంటెంట్ బాగుంటేనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అలా ప్రేక్షకుల అభిమానం దక్కించుకున్న వెబ్ సిరీస్‌లు చాలా తక్కువగానే ఉన్నాయి. వాటిలో పంచాయత్ వెబ్ సిరీస్ ఒకటి.ఇప్పటికే విడుదలైన మూడు సీజన్స్‌కు సినీ ప్రియుల నుంచి ఆదరణ దక్కింది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో రెండో సీజన్.. 2024లో మూడో భాగం ప్రేక్షకులను అలరించాయి. ఈ వెబ్ సిరీస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ మరో సీజన్‌కు రెడీ అయిపోయారు. సరికొత్త కామెడీ డ్రామా సిరీస్‌గా వస్తోన్న నాలుగో సీజన్ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ విషయాన్ని ప్రత్యేక వీడియో రిలీజ్ చేస్తూ వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ తొలి సిరీస్ విడుదలై ఐదేళ్లు పూర్తి కావడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నాలుగో సీజన్ స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేశారు. పంచాయత్ సీజన్- 4 ఈ ఏడాది జూలై 2న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. కాగా.. ఈ సిరీస్‌లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ-డ్రామా సిరీస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఫూలేరా గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
నాపై ట్రోలింగ్.. ఆ ఒక్క పని చేస్తే చాలు: సారా అలీ ఖాన్
సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ గురించి బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. సైఫ్ వారసురాలిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. కొత్త ఏడాదిలో స్కై ఫోర్స్‌తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సారా అలీ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఉద్దేశించి మాట్లాడింది. తన నటనపై సోషల్ మీడియాలో తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అయినప్పటికీ అవీ నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదని వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ నుంచి బయటపడేందుకు ధ్యానం చేస్తానని తెలిపింది.సారా అలీ ఖాన్ మాట్లాడుతూ.. "నేను సాధ్యమైనంత వరకు వాటిని ఫిల్టర్ చేయడం ప్రారంభించా. ఈ విషయంలో నాకు సహాయపడేది ధ్యానం. ఇలా చేయడం వల్ల నాకు నిజమేంటో తెలుస్తుంది. నేను నా స్వంత ఆలోచనలతో చూడటం ప్రారంభించా. ప్రతి ఆలోచనకు కూడా నన్ను సమర్థించుకోను. ఒక నటిగా నేను ఉన్నతమైన స్థానంలో లేను. కొంతమందికి కొందరు నటీనటులు అంటే ఇష్టం. మరికొందరికి ఇష్టం ఉండదు. నటిగా ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాలి. ఆ భగవంతుడు కోరుకుంటే సుదీర్ఘ జీవితం సినిమాల్లో ముందుకు సాగుతా. ఆ తర్వాత ప్రొడక్షన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై దృష్టి సారిస్తా.' అని తెలిపింది. -
చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. ఇలా దొరికిపోయిందేంటి?
ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్వశ్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ తర్వాత అందరి దృష్టి ఆమెపైనే పడింది. అంతవరకు ముక్కు మొహం తెలియని ఆమె గురించి నెటిజన్స్ తెగ వెతికారు. ఇంతకీ ఆమె ఎవరంటూ ఆరా తీశారు. దీనికంతటికీ కారణం ఆ టీమిండియా క్రికెటరే. అతనితో కలిసి మ్యాచ్‌లో కనిపించడంతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేసింది. టీమిండియా స్పిన్నర్ చాహల్‌తో కలిసి ఛాంపియన్ ట్రోఫీలో సందడి చేసింది. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక సందర్భంలో టాక్ వినిపిస్తూనే ఉంది. అంతేకాకుండా వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి ఆర్జే మహ్వశ్ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి చాహల్‌తో కలిసి మాత్రం కనిపించలేదు. అతని ఆడుతున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం లక్నోలో వాలిపోయింది ముద్దుగుమ్మ. నగరంలో ప్రముఖ హోటల్లో ఆర్జే మహ్వశ్ ఈత కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.అయితే చాహల్‌తో డేటింగ్ రూమర్స్ వస్తున్న వేళ.. ఐపీఎల్ మ్యాచ్ కోసం ఆర్జే మహ్వశ్ రావడంతో మరోసారి వీరిద్దరిపై రిలేషన్‌పై టాక్ నడుస్తోంది. నిజంగానే ఈ జంట డేటింగ్లో ఉన్నారా? అనే చర్చ మొదలైంది. కాగా.. చాహల్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ లీగ్ ఆడుతున్నారు. ఇటీవలే తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు కూడా తీసుకున్నారు. మార్చి 20, 2025న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.లక్నోలో ఆర్జే మహ్వశ్ కనిపించడంతో చాహల్‌తో డేటింగ్ నిజమేనంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్, లక్నో మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఆమె కనిపించడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. మీ రిలేషన్‌షిప్‌ను ఇంకెన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచతారని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.ఎవరీ ఆర్జే మహ్వశ్?ఆర్జే మహ్వశ్ రేడియో మిర్చిలో రేడియో జాకీ(ఆర్జే)గా పని చేస్తోంది. సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది. చాహల్‌తో డేటింగ్ కథనాలు రావడంతో జనవరిలో 1.5 మిలియన్లు ఉండే ఫాలోవర్ల ఒక్కసారిగా అమాంతం పెరిగింది. అంతేకాకుండా నవాజుద్దీన్ సిద్దిఖీ, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సెక్షన్ 108' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. వీటితో పాటు హీరోయిన్గా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. -
మనకు మరో ఆలియా భట్ అవసరం లేదు: అర్జున్ రెడ్డి హీరోయిన్
బాలీవుడ్ భామ షాలిని పాండే తెలుగువారికి సుపరిచితమైన పేరు. విజయ్ దేవరకొండ సరసన అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒక్కటే సినిమాలతో మెప్పించింది. అయితే గతేడాది మహరాజ్ చిత్రంతో నటించిన ముద్దుగుమ్మ.. ఇటీవల జ్యోతిక ప్రధాన పాత్రలో వచ్చిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాలిని పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనను ఆలియా భట్‌తో పోల్చడంపై కూడా మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలని కోరుకుంటానని తెలిపింది. అంతేకానీ మరొకరితో తనను పోల్చడం సరికాదని హితవు పలికారు. మనకు మరో ఆలియా భట్ అవసరం లేదని షాలిని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.షాలిని మాట్లాడుతూ.. "మనకు మరొక అలియా అవసరం లేదు. ఎవరూ మరో ఆలియా భట్ కాకూడదు. ఎందుకంటే ఆమె చాలా అద్భుతంగా ఉంది. కేవలం ఆమె సినిమాల వల్ల మాత్రమే కాదు. తెరపై మాత్రమే కాదు.. నేను వ్యక్తిగతంగా అలియా భట్‌ను అభిమానిస్తాను. అందువల్లే నేను మరో ఆలియా భట్ కావాలనుకోవడం లేదు. నాకంటూ స్వంత వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఎవరైనా నన్ను షాలిని లాగే చూడాలని కోరుకుంటున్నా. అది నాకు చాలు.' అని అన్నారు. కాగా.. రణ్వీర్ సింగ్ సరసన జయేష్‌భాయ్ జోర్దార్లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన షాలిని.. తెలుగులో అర్జున్ రెడ్డి మూవీతో ఫేమస్ అయింది. -
సల్మాన్ సినిమాకు ఇన్ని కష్టాలా?
ఈద్ వచ్చిందంటే సల్మాన్ ఖాన్ సినిమా రావాల్సిందే అనేది బాలీవుడ్ లో చాన్నాళ్లుగా ఉన్న సెంటిమెంట్. ఈసారి అలా సికిందర్ మూవీ రిలీజైంది. కానీ మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ బయటకు వచ్చింది. దీంతో సినిమా హైప్ అమాంతం కిందకు పడిపోయింది. ఇప్పట్లో లేవడం కూడా కష్టమే.(ఇదీ చదవండి: మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి)ఇకపోతే తొలిరోజు రూ.26 కోట్ల మేర వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రంజాన్ సందర్బంగా రెండో రోజు రూ.29 కోట్ల వరకు సొంతం చేసుకుంది. మూడో రోజు కూడా కాస్త అటు ఇటుగా ఓ రూ.20 కోట్లు వరకు వచ్చాయని అంటున్నారు. అలా ఇప్పటివరకు రూ.75.49 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ టాక్.సాధారణంగా పెద్ద హీరోల సినిమాలంటే కాస్త అటుఇటుగా ఉన్నా సరే రెండు మూడు రోజుల్లో రూ.100 కోట్ల వసూళ్లు వస్తుంటాయి. కానీ సల్మాన్ మూవీకి మాత్రం రోజురోజుకు కలెక్షన్స్ పడిపోతున్నాయనిపిస్తోంది. మరోవైపు చాలాచోట్ల జనాల్లేక షోలు రద్దవుతున్నాయని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మూవీకి రూ.100 కోట్ల వసూళ్లయినా వస్తాయా అనేది సందేహంగా మారింది. (ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) -
ఆస్కార్ ఎంట్రీ సినిమా.. కాపీ కొట్టారంటూ నెటిజన్ల ట్రోల్స్!
గతేడాది విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన చిన్న సినిమా లపతా లేడీస్. అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. అంతేకాకుండా భారత్ నుంచి ఆస్కార్ ఎంట్రీ దక్కించుకుంది. కానీ నామినేషన్స్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది.అయితే తాజాగా ఈ సినిమాపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాను 2019లో వచ్చిన అరబిక్ చిత్రం నుంచి కాపీ కొట్టారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. 2019 అరబిక్ చిత్రం బుర్ఖా సిటీ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్‌ను కాపీ చేశారని నెట్టింట ఆరోపిస్తున్నారు. ఆ సినిమాలోని ఓ సీన్.. లపతా లేడీస్‌లోని పోలీస్ స్టేషన్ సన్నివేశం ఓకేలాగా ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే గతంలోనూ లపతా లేడీస్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాను తొలిసారిగా దర్శకత్వం వహించిన ఘున్‌ఘట్ కే పాట్ ఖోల్ (1999)మూవీతో లపతా లేడీస్‌కు పోలికలు ఉన్నాయని అనంత్ మహదేవన్ ఆరోపించారు. రైల్వే స్టేషన్లో వధువులు మారిపోవడం సీన్‌ను తన చిత్రంలో నుంచి కాపీ కొట్టారని అన్నారు.కాగా.. లపతా లేడీస్ చిత్రాన్ని జియో స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. అమీర్ ఖాన్ లగాన్ (2001)చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావు తన కెరీర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం కావడం విశేషం. 2011లో తన ధోబీ ఘాట్ అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, రవి కిషన్, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 1, 2024న థియేటర్లలో విడుదలైన లపతా లేడీస్.. 2001లో ఓ రైలు ప్రయాణంలో అనుకోకుండా మారిన ఇద్దరు వధువుల కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మించారు.It’s intriguing that Lapata Ladies has drawn comparisons to Burqa City given the striking similarities in themes and narrative structure. If Rao’s film indeed mirrors key aspects of Burqa City, it raises valid questions about originality and the fine line between inspiration and…— Sumit Arora (@kingsumitarora) April 1, 2025 -
ఊర్వశి మరో ఐటమ్ సాంగ్.. ఈసారి 'జాట్' కోసం
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని లేటెస్ట్ మూవీ 'జాట్'. ప్రముఖ హిందీ హీరో సన్నీ డియోల్ ఇందులో నటించాడు. టాలీవుడ్ కి చెందిన మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాయి. ఇదివరకే టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తొలి గీతాన్ని విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మాస్ పాటో, మెలోడీ సాంగ్ కాకుండా ఐటమ్ పాటని విడుదల చేశారు. టచ్ కియా అంటే సాగే ఈ పాటలో ఊర్వశి రౌతేలా హస్కీ స్టెప్పులేసింది. తమన్ ఈ చిత్రానికి సంగీతమందించాడు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీలో సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్లు కాగా.. రణదీప్ హుడా కీలక పాత్రలో నటించాడు.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) -
నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చలనచిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. యానిమల్, పుష్ప 2: ద రూల్, ఛావా.. ఇలా వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకుని బాక్సాఫీస్ క్వీన్‌గానూ మారింది. అయితే రంజాన్ పండక్కి రిలీజైన హిందీ సినిమా సికందర్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.నా విషయంలో నిజం కాదుఅయితేనేం.. ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. మరో మూడు రోజుల్లో రష్మిక మందన్నా బర్త్‌డే (ఏప్రిల్ 4). ఈ సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. 'ఇది నా బర్త్‌డే మంత్.. చాలా ఎగ్జయిట్‌గా ఉన్నాను. వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్న ఆసక్తి సన్నగిల్లుతుందని విన్నాను.నమ్మబుద్ధి కావట్లేకానీ నా విషయంలో మాత్రం అది నిజం కాదు. ఏ యేటికాయేడు నా బర్త్‌డే జరుపుకునేందుకు మరింత సంతోషంగా, ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అప్పుడే నాకు 29 ఏళ్లు వచ్చేస్తున్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. గడిచిన ఏడాదిలో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. అందుకోసమైనా ఈ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే!' అని రాసుకొచ్చింది.చదవండి: హెచ్‌సీయూ వివాదం.. నేనెలాగో చనిపోతాను.. దయచేసి.. : రేణూ దేశాయ్ విన్నపం -
'బోల్ బేబీ బోల్'తో సెన్సేషన్.. ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్‌తో మరోసారి వైరల్
‘‘బోల్ బేబీ బోల్...’’ పాట గుర్తుందా? ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ... ఒకప్పుడు యూత్ మొత్తాన్ని ఊపేసిన బాలీవుడ్ పాట ఇది! పాటెలా ఉన్నా.. దానికి స్టెప్పులేసిన జావేద్ జాఫ్రీ... ఒక్కదెబ్బకు బాగా పాపులర్ అయిపోయాడు కూడా! ఆ తరువాత ఎన్నో సినిమాల్లో ఆర్టిస్ట్‌గా, టీవీ షో జడ్జిగా పనిచేసిన జావేద్ జాఫ్రీ.. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాడు. ఎందుకంటే.. 61 ఏళ్ల వయసులోనూ యూత్‌కు కిర్రాక్ తెప్పించే స్థాయిలో బ్రేక్‌డ్యాన్స్ ఆడేశాడు మరి! నమ్మకం కుదరకపోతే.. @yoursJoee హ్యాండిల్ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేసిన వీడియో కింద చూసేయండి!జావేద్ జాఫ్రీ తన నటనా జీవితాన్ని 1985లో మేరీ జంగ్ (Meri Jung) చిత్రంతో ప్రారంభించాడు. ఈ చిత్రంలోని "బోల్ బేబీ బోల్ రాక్ అండ్ రోల్" పాటలో అతని అద్భుతమైన నృత్యం అతనికి తక్షణ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ పాటలో అతను విక్రమ్ ఠాక్రాల్ అనే పాత్రలో కనిపించాడు. తన డ్యాన్స్ స్టైల్‌తో 80వ దశకంలో యువతను ఆకర్షించాడు. javed jaffrey’s moves at 61... unreal, absolute LEGENDARY stuff! pic.twitter.com/w5Y06VJvho— Joe (@YoursJoee) April 1, 2025చదవండి: లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు -
లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు
మన్సూర్ ఖాన్ (Mansoor Khan).. ఖయామత్ సే ఖయామత్ తక్, జో జీతా వోహి సికందర్ వంట కల్ట్ క్లాసిక్స్ అందించిన గొప్ప డైరెక్టర్. 2000వ సంవత్సరంలో వచ్చిన జోష్ తర్వాత మళ్లీ మళ్లీ ఇండస్ట్రీలో కనిపించనేలేదు. కూనూర్ వెళ్లి అక్కడే పొలం పని చేసుకుంటున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లిన ఈయనను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలు చూద్దాం..డైరెక్షన్‌పై ఆసక్తి లేదునేను సినీ ప్రేమికుడిని కాదు. కథలు చెప్పడం ఇష్టమే కానీ దర్శకుడిగా రాణించడం మాత్రం అస్సలు ఇష్టం లేదు. 99శాతం సినిమాలు నేను చూడనేలేదు. కథలు రాయడం ఇష్టం కాబట్టి రెండు పుస్తకాలు కూడా రాశాను. మూడోది రాస్తున్నాను. అయితే రెండో పుస్తకాన్ని సినిమాగా తీయాలన్న ఆలోచన ఉంది. ఆమిర్ ఖాన్ (Aamir Khan)కు ఆ బుక్ చాలా నచ్చింది. దాన్ని సినిమాగా తీసుకురావాలన్న తపన నాకంటే అతడికే ఎక్కువగా ఉంది. అన్నీ కుదిరితే ఆ మూవీలో ఆమిర్ ఖానే హీరోగా నటిస్తాడు.ఫెయిల్యూర్ పార్టీ..అతడి ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు దగ్గరివాళ్లని పిలిచి స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాడు. అందులో నేనూ ఉంటాను. లాల్ సింగ్ చద్దా సినిమా చూసినప్పుడు నాకంతగా నచ్చలేదు. తన హావభావాలు కాస్త ఎక్కువైనట్లుగా అనిపించింది. పీకే మేనరిజానికి దగ్గరగా అతడి యాక్టింగ్ ఉంది. అది ఆమిర్ కూడా పసిగట్టాడు. ఆ సినిమాకు నేనే డైరెక్టర్ అయ్యుంటే అతడిని అలా చేయనిచ్చేవాడినే కాదు! సాధారణంగా అందరూ సినిమా సక్సెస్ అయ్యాక పార్టీ చేసుకుంటారు. కానీ ఆమిర్ ఫ్లాప్ అయ్యాక పార్టీ ఇస్తాడు. ఫెయిల్యూర్‌కు తనే బాధ్యత వహిస్తాడు. తండ్రి కంటే కొడుకే బాగా..నిజానికి లాల్ సింగ్ చద్దాలో మొదట ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ (Junaid Khan)ను తీసుకుందామనుకున్నారు. అది మంచి ఛాయిస్ అని చెప్పాను. ఎందుకంటే అతడి వయసు 28. ఆ వయసులో వారి ముఖంలో ఒకరకమైన అమాయకత్వం కనిపిస్తుంది. గొప్ప గొప్ప నటుల్లో కూడా అది గోచరించదు. ఈ సినిమాకు అతడే మంచి ఛాయిస్ అని చెప్పాను. అలాగైతే సినిమాకు ఓపెనింగ్స్ కూడా రావని దర్శకనిర్మాతలు వెనకడుగు వేశారట. ఇంత చెత్తగా ఆలోచిస్తున్నారేంటనుకున్నాను. వారి వల్ల చివరకు ఆమిర్ చేయక తప్పలేదు అని మన్సూర్ చెప్పుకొచ్చాడు.చదవండి: పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. నటుడి ఆగ్రహం -
హీరోయిన్ తమన్నా ఇంట్లో ప్రత్యేక పూజలు
హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) ఇంట్లో మాతా కీ చౌకీ నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా చేసే ఈ పూజ.. ఇప్పుడు తమన్నా ఇంట్లో జరిగింది. పూజ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తమన్నా సంప్రదాయ డ్యాన్స్ కూడా చేయడం విశేషం. (ఇదీ చదవండి: అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?)ఈ మొత్తం పూజకు సంబంధించిన వీడియోని తమన్నా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకకు బాలీవుడ్ యువ నటి రషా తడానీ (Rasha Thadani) కూడా హాజరైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నిరోజుల క్రితం విజయ్ వర్మతో (Vijay Verma) తమన్నాకు బ్రేకప్ అయిందనే రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు తమన్నా ఇంట్లో చేసిన పూజ కార్యక్రమంలో విజయ్ కనిపించకపోవడంతో బ్రేకప్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లే. సినిమాల విషయానికొస్తే ఓదెల 2 (Odela 2 Movie) అనే తెలుగు సినిమాలో తమన్నా ప్రధాన పాత్ర పోషించింది. ఇది మరికొన్నిరోజుల్లో థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
అన్నతో కలిసి గ్రాండ్‌గా ఈద్ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు
రంజాన్ పర్వదినం సందర్బంగా వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా శర్మ ఖాన్ సోమవారం రాత్రి ఈద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరుడితో కలిసి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. పండుగ వేడుక, గ్లామర్ రెండింటినీ మిళితం చేసిన ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్లో పలువురు బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈద్ వేడుకలో సాంప్రదాయ లుక్స్‌లో అందరూ మంత్రముగ్ధుల్ని చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విశేషంగా నిలిచాయి.రంజాన్ సందర్బంగా అర్పితా ఖాన్ ఇచ్చిన లావిష్ పార్టీకి అర్బాజ్ ఖాన్, అల్విరా ఖాన్ , ఆయుష్ శర్మ వంటి కుటుంబ సభ్యులతోపాటు పెళ్లి తరువాత తొలిసారి ఈద్ వేడుకలను జరుపుకుంటున్నసోనాక్షి సిన్హా, భర్తతో కలిసి హాజరైంది.అర్పితా శర్మ ఖాన్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ ఈద్ వేడుకలో, సోనాలి బింద్రే పింక్ సూట్లో అందంగా కనిపించింది. ఇంకా జెనీలియా,రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, షమితా శెట్టి, అంగద్ బేడి, నేహా ధుపియా తదితర బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.అంతకుముందు తన సోదరి గెలాక్సీ అపార్ట్మెంట్స్లోని తన బాల్కనీ నుండి అభిమానులను పలకరించాడు. సల్మాన్ సోదరి అర్పితా కుమార్తె, మేనకోడలితో కలిసి అభిమానులకు కనువిందు చేశాడు. అధిక భద్రతా సమస్యల కారణంగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి తెల్లటి కుర్తా-పైజామా ధరించి ఫ్యాన్స్‌ను అభినందించారు. ఈ సందర్బంగా సల్మాన్ మూవీ "సికందర్" అంటూ సందడి చేశారు. “షుక్రియా ధన్యవాదాలు ఔర్ సబ్ కో ఈద్ ముబారక్.” అంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.Shukriya Thank you aur sab ko Eid Mubarak! pic.twitter.com/EaW0CeaZWi— Salman Khan (@BeingSalmanKhan) March 31, 2025 -
55 కిలోల వెయిట్ లాస్ : నిర్మాతకు రామ్ భార్య స్ట్రాంగ్ కౌంటర్
ప్రముఖ బుల్లి తెర నటుడు రామ్ కపూర్ 55 కిలోల బరువు తగ్గడం నెట్టింట విస్తృత చర్చకు, ఊహాగానాలకు దారితీసింది. ఓజెంపిక్ లేదా సర్జరీ వంటి షార్ట్కట్ల ద్వారా అంత బరువు తగ్గాడనే అరోపణలను తీవ్రంగా ఖండించిన నటుడు కష్టపడి , అంకితభావంతో 140 కిలోల బరువును 55 కిలోలు తగ్గి 85 కిలోలకు తగ్గించుకున్నట్టు వెల్లడించాడు. దీనిపై రామ్‌కు అనేక ప్రశంసలు లభించాయి కూడా. అయితే రామ్‌కు పేరు తీసుకొచ్చిన టీవీ షో ‘బడే అచ్చే లగ్తే హై’ నిర్మాత ఏక్తా కపూర్ మాత్రం సంచనల వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. తాజాగా ఏక్తాకు కౌంటర్‌గా రామ్ భార్య గౌతమి కపూర్ ఒక వీడియోను పో స్ట్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఎంచుకోవాలా లేదా మౌంజారో, ఓజెంపిక్ తీసుకోవాలా, లేదా మౌనంగా ఉండాలా.. బడేహీ అచ్చే లగ్తేహై అంటూ ఒక పోస్ట్ పెట్టింది. పరోక్షంగా రామ్ కపూర్ వెయిట్ లాస్ జర్నీని ఏక్తా కపూర్ ఎగతాళి చేసింది. దీనిపై స్పందించిన గౌతమి వీడియోను విడుదల చేసింది. ఏక్తా కపూర్ తరహాలోనే కౌంటర్ "నేను యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవాలా? నేను మౌంజారో తీసుకోవాలా?నేను ఓజెంపిక్ తీసుకోవాలా లేదా పైన పేర్కొన్నవన్నీ తీసుకోవాలా? లేదా నా నోరు మూసుకోవాలా? క్యుంకి హుమే బడే నహీ చోటే హే అచ్చే లగ్తే హై..' అంటూ వీడియో పోస్ట్ చేసింది. అలాగే ఎవరికి నచ్చినది వార్ని చేయనివ్వాలి. జీవించాలి, జీవించనివ్వాలి, ఎందుకంటే లైఫ్‌లో అతి ముఖ్యమైనవి ఆరోగ్యం, ఆనందం, శాంతి అంటూ గౌతమి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చివరగా నీ జీవితం నువ్వు చూస్కో అంటూ చురకలంటించింది. దీంతో భర్తకు సపోర్ట్‌గా నిలిచిన గౌతమిని అభిమానులు ప్రశంసించారు. View this post on Instagram A post shared by Gautami Kapoor (@gautamikapoor) ఏక్తా టీవీ సీరియల్ షో, బడే అచ్చే లగ్తే హై సీరియల్లో లీడ్ రోల్లో నటించిన రామ్‌కు, ఏక్తాకపూర్కు మధ్య ఇటీవల పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. బడే అచ్చే లగ్తే హై షోలో గురించి ఒక ఇంటర్వ్యూ లో రామ్ వ్యాఖ్యల నేపథ్యంలో వారువురి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఈ సీరియల్లో సాక్షి తన్వర్ పాత్రకు మధ్య తనకు సన్నిహిత సన్నివేశాన్ని రాసినది ఏక్తా కపూర్ అని, టీఆర్పీ రేటింగ్ కోసం అలాంటి సీన్లు పెట్టడాన్ని తాను ముందుగానే వ్యతిరేకించానని రామ్ వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన ఏక్తా కపూర్ పరోక్షంగా 'నోరు మూసుకో’ రామ్‌పై అంటూ మండిపడింది. ప్రొఫెషనల్ యాక్టర్ కాదని, అతనివి 'తప్పుడు' వ్యాఖ్యలని, తాను నోరు విప్పితే అసలు నిజం బయటపడుతుందని, కాన మౌనమే బెటర్ అని సమాధానమిచ్చింది. ఆ తరువాత అతని వెయిట్‌లాస్ జర్నీపై కూడా ఏక్తా వ్యంగ్య బాణాలు విసిరిన సంగతి తెలిసిందే. -
లంక మాజీ క్రికెటర్ తో 51 ఏళ్ల మలైకా డేటింగ్?
మలైకా అరోరా పేరు చెప్పగానే ఐటమ్ సాంగ్స్ గుర్తొస్తాయి. తర్వాత డేటింగ్ వ్యవహారం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న ఈమె.. దాదాపు 19 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చేసింది. కొన్నాళ్లకు తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)మూడు నాలుగేళ్ల పాటు అర్జున్-మలైకా తెగ తిరిగారు. టూర్లకు కూడా కలిసి వెళ్లారు. పెళ్లి ఏమైనా చేసుకుంటారేమో అని అందరూ అనుకుంటున్న టైంలో విడిపోయి షాకిచ్చారు. ప్రస్తుతానికైతే మలైకా ఒంటరిగానే ఉంటోంది. అలాంటిది ఇప్పుడు ఈమె మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.చెన్నై-రాజస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి గౌహతిలో ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. దీనికి హాజరైన మలైకా.. లంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర పక్కన కూర్చుని కనిపించింది. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా అంటూ బాలీవుడ్ మీడియా ఉదయం నుంచి తెగ ఉదరగొట్టేస్తుంది. మరోవైపు మలైకా సన్నిహితులు మాత్రం.. అనుకోకుండా పక్కన కూర్చున్నంత మాత్రం డేటింగ్ అనేస్తారా అని అంటున్నారు. అంటే డేటింగ్ కామెంట్స్ అన్ని గాసిప్స్ అనమాట.(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?) -
మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్
ప్రయాగరాజ్ మహాకుంభమేళా వల్ల పూసలమ్మే మోనాలిసా అనే అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈమెకు ఏకంగా సినిమా హీరోయిన్ ఛాన్స్ కూడా వచ్చింది. అయితే ఈమెకు అవకాశమిచ్చిన దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు బెదిరిస్తున్నాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?)బాధితురాలు చెప్పిన దాని ప్రకారం.. 2020లో టిక్ టాక్, ఇన్ స్టా ద్వారా దర్శకుడు సనోజ్ మిశ్రాకు ఉత్తరప్రదేశ్ ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఈ యువతి పరిచయమైంది. 2021 జూన్ 17న ఈమెకు ఫోన్ చేసిన సనోజ్ మిశ్రా.. తాను ఝాన్సీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానని రావాలని కోరాడట. కానీ ఆమె రాలేదు. కలవడానికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో భయంతో సనోజ్ ని వెళ్లి కలిసింది.సదరు యువతిని ఓ రిసార్ట్ కి తీసుకెళ్లిన సనోజ్ మిశ్రా.. మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడట. ఈ విషయం బయటకు చెప్తే.. ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడట. ఇలా పెళ్లి, సినిమా అవకాశాలు పేరు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడట. దీంతో ఈమె దిల్లీలోని నబీ కరీమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. సనోజ్ మిశ్రాను అరెస్ట్ చేశారు.(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?) -
'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?
సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ సికిందర్. రష్మిక హీరోయిన్. ఈద్ సందర్భంగా ఆదివారం (మార్చి 30) థియేటర్లలో రిలీజైంది. మొదటి ఆట నుంచి దీనికి నెగిటివ్ టాక్ బయటకొచ్చింది. రొట్టకొట్టుడు స్టోరీకి తోడు సల్మాన్ యాక్టింగ్ నీరసంగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు వచ్చాయి?(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్' మూడు రోజుల కలెక్షన్లు)చాలా ఏళ్లుగా సల్మాన్ సినిమాలు చేస్తున్నాడు. కానీ ఒక్కటంటే ఒక్కటీ హిట్ అవ్వట్లేదు. దీంతో ఈ సారి తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తో కలిసి సికిందర్ తీశాడు. హిట్ బ్యూటీ రష్మిక ఉండటంతో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. కానీ టీజర్, ట్రైలర్ దెబ్బకు మూవీపై ఉన్న హైప్ అంతా పోయింది. సినిమా కూడా అలానే ఉందని, చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఇకపోతే రిలీజ్ కి ముందు రోజు అంటే శనివారం రాత్రి.. సికిందర్ పైరసీ హెచ్ డీ ప్రింట్ పలు వెబ్ సైట్లలో దర్శనమిచ్చింది. అలా ప్రతికూల అంశాలతో రిలీజైన ఈ మూవీకి తొలిరోజు కేవలం రూ.26 కోట్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సల్మాన్ లాంటి స్టార్ హీరో.. తొలిరోజు ఈ వసూళ్లు అంటే చాలా తక్కువనే చెప్పాలి. మరి ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?) -
మరో నటుడితో ఫోటోలు.. ఇందుకే నీ భర్త నిన్నొదిలేశాడు.. నటిపై ట్రోలింగ్
స్నేహాన్ని కూడా ప్రేమగా ముద్ర వేస్తున్నారు. పెళ్లయ్యాక అబ్బాయితో స్నేహాన్ని కొనసాగిస్తే దానికి రకరకాల పేర్లు పెట్టి తనను విమర్శించారంటోంది హిందీ బుల్లితెర నటి బర్కా బిష్త్ (Barkha Bisht). బుల్లితెరపై అనేక సీరియల్స్ చేసిన ఈమె పీఎమ్ నరేంద్రమోదీ, 1920: హారర్స్ ఆఫ్ ద హార్ట్, సేఫ్డ్, ఖదాన్ వంటి పలు చిత్రాలతో వెండితెరపైనా మెరిసింది. 2008లో నటుడు ఇంద్రనీల్ సేన్‌గుప్తాను పెళ్లాడగా వీరికి ఓ కూతురు పుట్టింది. 2022లో వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం నటుడు, నిర్మాత ఆశిష్ శర్మతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వైరలవుతున్నాయి!కొందరు స్పెషల్తాజాగా బర్క బిష్త్ మాట్లాడుతూ.. కరణ్ (Karan Veer Mehra), నేను ఏళ్లతరబడి స్నేహాన్ని కొనసాగిస్తున్నాం. కానీ, జనాలు మమ్మల్ని తప్పుగా అనుకుంటున్నారు. మా మధ్య ఏదో ఉందన్నట్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ మన జీవితంలో మనకంటూ స్పెషల్ అనేవాళ్లుంటారు. అలా నా లైఫ్‌లో నాకు కరణ్ వీర్ మెహ్రా ఉన్నాడు. మా గురించి ఎప్పుడూ ఏదో ఒక పుకారు వస్తూనే ఉంటుంది. జనాలు నన్ను విమర్శిస్తూనే ఉంటారు. దారుణమైన ట్రోలింగ్ముఖ్యంగా బిగ్‌బాస్ షోలో కరణ్‌ను సపోర్ట్ చేయడానికి వెళ్లినప్పుడు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. కరణ్ వెంట తిరుగుతున్నందుకే నా పెళ్లి పెటాకులైందని తిట్టిపోశారు. అతడు, నేను కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు.. అసలు దీనికి నీ భర్త ఎలా ఒప్పుకున్నాడు? అంటూ ఆగ్రహించేవారు అని చెప్పుకొచ్చింది.డేటింగ్.. అంత టైం లేదుఆశిష్తో లవ్ రూమర్స్‌పై స్పందిస్తూ.. కష్ట సమయంలో అతడు నాకు కనెక్ట్ అయ్యాడు. జనాలు మేము డేటింగ్ చేస్తున్నామని అనుకుంటున్నారు. నిజంగా ప్రేమలో ఉంటే దాన్ని దాచాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం నా దృష్టంతా నా 13 ఏళ్ల కూతురు మైరాపైనే ఉంది. ప్రేమ పాటలు పాడుకునేంత ఆసక్తి, సమయం లేదు అని బర్క పేర్కొంది.చదవండి: బ్యాంకాక్‌లో భూకంపం.. ఇప్పటికీ నా చేతులు వణుకుతున్నాయి -
కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?
పేరుకే హిందీ హీరోయిన్ గానీ దక్షిణాదిలోనూ ఈమె పర్వాలేదనిపించే ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ప్రభాస్ పక్కన సాహో మూవీలో హీరోయిన్ గానూ చేసింది. ప్రస్తుతానికైతే పూర్తి ఫోకస్ హిందీపైనే ఉంది. గతేడాది 'స్త్రీ 2'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఖరీదైన కారు కొనుగోలు చేసింది. ఇంతకీ దీని రేటు ఎంతంటే?(ఇదీ చదవండి: 'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్)తండ్రి నటుడు కావడంతో సులభంగానే ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రద్ధా కపూర్.. ఆచితూచి సినిమాలు చేస్తోంది. స్త్రీ 2 తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు లేదు. అలా అని ఖాళీగా లేదు. అపార్ట్ మెంట్స్ కొనడం, అమ్మడం లాంటివి చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ఈ బ్యూటీ.. లగ్జరీ లైఫ్ మెంటైన్ చేస్తుందని చెప్పొచ్చు.రెండేళ్ల క్రితం దాదాపు రూ.4 కోట్ల విలువైన లాంబోర్గిని కారుని కొనుగోలు చేయగా.. ఇప్పుడు రూ.2.93 కోట్ల విలువ చేసే లెక్సెస్ ఎల్ఎమ్ 350హెచ్ అనే లగ్జరీ కారుని కొనేసింది. చాలామంది స్టార్స్ ప్రస్తుతం ఈ మోడల్ కారునే ఉపయోగిస్తుండటం విశేషం. ఇప్పుడు శ్రద్ధా కూడా ఆ లిస్టులోకి చేరిపోయిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మెల్బోర్న్లో బాలీవుడ్ సింగర్ కన్సర్ట్.. ఐదు లక్షల డాలర్ల నష్టమా?
బాలీవుడ్ ప్రముఖ సింగర్ నేహా కక్కర్ ఇటీవల మెల్బోర్న్లో ఓ మ్యూజిక్ కన్సర్ట్కు హాజరైంది. అయితే తాను మూడు గంటలకు ఈవెంట్‌కు వెళ్లడంతో నిర్వాహకులు తమను పట్టించుకోలేదని విమర్శలు చేసింది. అంతేకాకుండా నా టీమ్‌తో పాటు తనకు డబ్బులు ఇవ్వకుండా పారిపోయారని ఆరోపించింది. నా టీమ్‌కు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.అయితే తాజాగా సింగర్ నేహా కక్కర్ ఆరోపణలపై మ్యూజిక్ కన్సర్ట్ నిర్వాహకులు స్పందించారు. ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. నేహా కక్కర్ షోతో తాము తీవ్రంగా నష్టపోయామని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈవెంట్‌కు సంబంధించిన అన్ని రుజువులు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ఆమె బృందానికి నిర్వాహకులు పెట్టిన ఖర్చులను కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ ఈవెంట్ వల్ల తామే అప్పుల్లో చిక్కుకున్నామని రాసుకొచ్చారు. ఆమెనే తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. View this post on Instagram A post shared by Beats Production (@beatsproductionau) View this post on Instagram A post shared by Beats Production (@beatsproductionau) -
జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. ఇంతకీ ముద్దుపెట్టిన ఆమె ఎవరు?
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్ విషయానికొస్తే హీరోయిన్లలో ఓ మెట్టు ముందు వరుసలో ఉంటుంది. గతేడాది దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో కనిపించనుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఇటీవల చెర్రీ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఫ్యాషన్ షో మెరిసింది. తన ర్యాంప్‌వాక్‌తో అభిమానులను కట్టిపడేసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ర్యాంప్ వాక్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ బ్యూటీ ఈ షోకు హాజరైన ఓ పెద్దావిడను ఆలింగనం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో జాన్వీ కపూర్‌కు అప్యాయంగా ముద్దు పెట్టిన ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు.అయియతే అక్కడ ఉన్నది శ్లోకా మెహతా తల్లిదండ్రులు మోనా, రస్సెల్ మెహతా. కాగా.. రస్సెల్ మెహతా భారతదేశంలోని వజ్రాల తయారీదారులలో ఒకటైన రోజీ బ్లూ ఇండియాను కలిగి ఉన్న వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఆయన కుమార్తె శ్లోకా మెహతా ప్రముఖ బిలియనీర్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలకు పెద్ద కోడలు కావడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బ్రేకప్ రూమర్స్.. స్టార్ ప్రొడ్యూసర్‌తో తమన్నా హాట్ ఫోటో షూట్
తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ రూమర్స్ గత కొద్ది రోజులుగా అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇటీవల విడిపోయినట్లు తెలుస్తోంది. గతంలో పలు ఈవెంట్స్, వెకేషన్లలో కలిసి కనిపించడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఫోటోలు షేర్ చేసేవారు. కానీ ఇటీవల వీరిద్దరు విడివిడిగా కనిపించడం..సోషల్ మీడియా నుంచి ఫోటోలను తొలగించడంతో బ్రేకప్అయినట్లు రూమర్స్ వచ్చాయి. అవి నిజమే అన్నట్లుగా అటు తమన్నా, ఇటు విజయ్‌ల మాటలు ఉన్నాయి. రిలేషన్‌షిప్‌ను ఐస్‌క్రీమ్ లాగా ఆస్వాదించాలి, అప్పుడే సంతోషంగా ఉంటారని విజయ్ అంటే.. ప్రేమను వ్యాపార లావాదేవీలా చూడటం ప్రారంభించినప్పుడే సమస్యలు మొదలవుతాయని తమన్నా అంటోందీ. పెళ్లి విషయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయట. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని తమన్నా ప్రతిపాదించగా, విజయ్ మాత్రం అందుకు సుముఖత చూపలేదట. ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని, కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు విజయ్ చెప్పినట్లు సమాచారం. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తి, చివరకు విడిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.హాట్ ఫోటోలతో హల్చల్బ్రేకప్ రూమర్స్‌పై తమన్నా, విజయ్‌లలో ఒకరు కూడా స్పందించలేదు. పైగా వీరిద్దరు కూడా విడివిడిగా చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. తమన్నా అయితే వరుస సినిమాలతో పాటు పలు ప్రైవేట్ పార్టీలకు హాజరవుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ మిల్కీ బ్యూటీ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరన్ జోహార్‌తో హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలను తమన్నా తన ఇన్‌స్టాలో షేర్ చేయగా..అవికాస్త వైరల్‌గా మారాయి. బ్రేకప్ తర్వాత తమన్నా మరింత సంతోషంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.సినిమాల విషయాకొస్తే.. తమన్నా ప్రస్తుతం ఓదెల 2 లో నటిస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆమె నాగసాధువుగా కనిపించనుంది. ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
బంధువుల పెళ్లిలో ఐశ్వర్య- అభిషేక్.. ఇకనైనా ఆపేస్తారా?
బాలీవుడ్ జంటల్లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ దంపతులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అభిషేక్ సినీ ఇండస్ట్రీలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వారసుడు కావడంతో ఏ చిన్న విషయమైనా అందరిదృష్టి వారిపైనే ఉంటుంది. గతంలో వీరిద్దరిపై పలుసార్లు విడాకుల రూమర్స్ వినిపించాయి. ఈ జంట త్వరలోనే విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.అయితే గత కొద్ది నెలలుగా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. ఏదైనా శుభకార్యం జరిగితే ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇటీవల తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. మహారాష్ట్రలోని పూణెలో తన కజిన్ శ్లోకా శెట్టి సోదరుడి వివాహానికి తన ముద్దుల కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక నుంచైనా సోషల్ మీడియా వీరిపై వస్తున్న విడాకుల వార్తలకు చెక్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.కాగా.. అభిషేక్ - ఐశ్వర్య రాయ్ 2007లో వివాహ చేసుకున్నారు. ఆ తర్వాత 2011లో వీరిద్దరి కుమార్తె ఆరాధ్య జన్మించింది. గతేడాది డిసెంబర్లో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఆరాధ్య వార్షిక కార్యక్రమానికి కూడా జంటగా కలిసి వచ్చారు. దీంతో విడాకుల వార్తలకు చెక్‌పెట్టేశారు. కొత్త ఏడాది జనవరిలో న్యూ ఇయర్ వేకేషన్ నుంచి తిరిగి వస్తూ విమానాశ్రయంలో కూడా కనిపించారు. వరుసగా ఐశ్వర్య దంపతులు కలిసి హాజరు కావడంతో ఇకపై విడాకుల వార్తలకు చెక్ పడినట్లే.ఇక సినిమాల విషయానికొస్తే అభిషేక్ చివరిసారిగా బి హ్యాపీలో కనిపించాడు. ఈ చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత అక్షయ్ కుమార్, రితీష్ దేశ్‌ముఖ్‌లతో కలిసి హౌస్‌ఫుల్- 5లో కనిపించనున్నారు. అంతేకాకుండా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించబోయే షారుఖ్ ఖాన్ రాబోయే చిత్రం కింగ్‌లో విలన్‌గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఐశ్వర్య విషయానికొస్తే చివరిసారిగా పొన్నియన్ సెల్వన్- 2లో కనిపించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, త్రిష కృష్ణన్, శోభితా ధూళిపాళ కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. -
థియేటర్లలో రిలీజ్ కి ముందే పైరసీ.. పాపం 'సికందర్'
సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలు ప్రతి ఏటా ఈద్(రంజాన్)కి రావడం ఆనవాయితీ. అలా ఈసారి సికందర్ అనే సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చాడు. ఆదివారం దేశవ్యాప్తంగా ఇది రిలీజైంది. ఇది జరగడానికి ముందే మూవీకి భారీ నష్టం కలిగే పని జరిగింది. అదే పైరసీ.ఈ మధ్య చాలా సినిమాలు రిలీజైన రోజే పైరసీకి గురవుతున్నాయి. రీసెంట్ టైంలో రిలీజైన తండేల్, ఛావా.. ఇలా పైరసీ బారిన పడ్డాయి. కాకపోతే కంటెంట్ కాస్త ఉండటంతో థియేటర్లకు కూడా జనాలు వచ్చారు. ఇప్పుడు సల్మాన్ సికిందర్ మూవీ పరిస్థితి చూస్తుంటే పాపం అనిపిస్తుంది.(ఇదీ చదవండి: సౌత్‌లో నా సినిమాలు చూడరు.. మనమేమో: సల్మాన్)రిలీజ్ ఆదివారం ఉందనగా.. శనివారం రాత్రే ఎవరో పైరసీ చేసి ఫుల్ హెచ్ డీ ప్రింట్ ని సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇది తెలిసిన నిర్మాత వెంటనే పోలీసులని ఆశ్రయించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పొచ్చు.మరోవైపు ఈ సినిమాకు తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వస్తోంది. ఇప్పటికే మూవీ చూసిన పలువురు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని పోస్ట్ చేస్తున్నారు. సినిమా మరీ నీరసంగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: 'సికందర్' ట్విటర్ రివ్యూ.. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం బెటర్ అంటూ..) -
గంట లేటైందని సెట్లో కమల్ హాసన్ తిట్టాడు: సీనియర్ హీరోయిన్
కొందరు సమయపాలన పాటిస్తే మరికొందరేమో సమయానికి రావడం అంటే అదేదో బ్రహ్మ విద్య అన్నట్లుగా ఫీలవుతారు. ఎప్పుడూ చెప్పిన సమయానికంటే ఆలస్యంగానే సెట్లో అడుగుపెడతారు. ఈ విషయంలో నటీనటులపై దర్శకనిర్మాతలు లోలోపలే విసుక్కునేవారు. అందరిలాగే కమల్ హాసన్ (Kamal Haasan) కూడా అదే బాపతు అనుకున్నాను.. కానీ తన అంచనా తప్పని నిరూపించాడంటోంది హీరోయిన్ పూనమ్ ధిల్లాన్.ఎప్పుడంటే అప్పుడు..తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూనమ్ ధిల్లాన్ (Poonam Dhillon) మాట్లాడుతూ.. సెట్లో నాకు మొదటిసారి అక్షింతలు పడింది కమల్ హాసన్ చేతిలోనే! షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చానని ఆయన నాపై కోప్పడ్డారు. ముంబైలో 30-45 నిమిషాలు ఆలస్యంగా వస్తే పెద్దగా పట్టించుకునేవారు కాదు. రాజేశ్ ఖన్నా, శతృఘ్న సిన్హా వంటి పెద్ద స్టార్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేవారు. వాళ్లను చూసి మేము కూడా ఓ అరగంటయినా ఆలస్యంగా సెట్‌కు వచ్చేవాళ్లం.గంట ఆలస్యం తప్పు కాదనుకున్నాఓసారి చెన్నైలో ఉదయం ఏడు గంటలకు షూటింగ్‌కు రమ్మన్నారు. నేను ఎనిమిది గంటలకల్లా అక్కడున్నాను. ఆలస్యం చేశానన్న ఫీలింగ్ కూడా నాకు లేదు. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తుంటే ప్రతి ఒక్కరూ నావంక కోపంగా చూస్తున్నారు. వెంటనే కమల్.. పూనమ్, నీకోసం ఇక్కడున్న అందరూ ఏడు గంటల నుంచి ఎదురుచూస్తున్నారు. లైట్‌మన్, కెమెరామెన్.. ఎప్పుడో ఇల్లు వదిలేసి బస్సులోనో, ఆటోలోనో ఇంత దూరం నుంచి వచ్చారు. క్లాస్ పీకిన కమల్ హాసన్ఏడు గంటలకల్లా ఇక్కడుండాలని ఐదింటికంటే ముందే నిద్ర లేచి రెడీ అయుంటారు. నువ్వేమో ఎనిమిదింటికి వస్తావా? అందరినీ ఇలా వెయిట్ చేయిస్తావా? ఇది కరెక్ట్ కాదు అని సున్నితంగా మందలించాడు. అప్పుడు నేను తప్పు తెలుసుకున్నాను. సౌత్‌లో టెక్నీషియన్లకు కూడా సముచిత స్థానం ఇస్తారు. సాయంత్రం టిఫిన్, స్నాక్స్ ఏవైనా సరే అందరూ తింటారు. దక్షిణాదిలో టెక్నీషియన్లను ఎంతగానో గౌరవిస్తారు అని చెప్పుకొచ్చింది. పూనమ్ ధిల్లాన్.. కమల్ హాసన్‌తో యే తో కమాల్ హో గయా, యాద్గర్, గెరాఫ్తార్ సినిమాలు చేసింది.చదవండి: సౌత్‌లో నా సినిమాలు చూడరు.. మనమేమో వాళ్లవి ఎగబడి చూస్తారు: బాలీవుడ్ స్టార్ -
సౌత్‌లో నా సినిమాలు చూడరు.. మనమేమో వాళ్లవి ఎగబడి చూస్తాం: సల్మాన్
దక్షిణాది చిత్రాలను మనం ఆదరిస్తాం కానీ.. మన సినిమాలను సౌత్‌లో ఆదరించరు అంటున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan). సౌత్ హీరోల అభిమానులు హిందీ సినిమాలు చూసేందుకు థియేటర్‌కు రారు అని చెప్తున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన సికందర్ సినిమా ఈవెంట్లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. దక్షిణాదిలో కథలు కాపీ కొట్టరు. సొంత ఐడియాతో స్క్రిప్టు రాసుకుని సినిమా తీస్తారు. సౌత్‌లో ప్రతి సినిమా అద్భుతమేమీ కాదుఅలా అని అక్కడ తెరకెక్కిన ప్రతి సినిమా అద్భుతం అని కాదు. సౌత్‌లో వారానికి రెండుమూడు సినిమాలు రిలీజవుతాయి. అవన్నీ సక్సెస్ అందుకోవు. అక్కడైనా ఇక్కడైనా మంచి సినిమా మాత్రమే హిట్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్ని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం. ఇదే నియమం సౌత్కూ వరిస్తుంది. అలాగే సౌత్ సినిమాలను నార్త్‌లో ఎంతగానో ఆదరిస్తాం. కానీ వాళ్లు మాత్రం హిందీ చిత్రాలను పెద్దగా పట్టించుకోరు. మన సినిమాలు చూడరునన్ను చూసి భాయ్ అని గుర్తుపడతారు, మాట్లాడతారు.. థియేటర్‌కు వెళ్లి నా సినిమాలు మాత్రం చూడరు. సౌత్ సినిమాలను నార్త్‌లో ఆదరించినంతగా.. బాలీవుడ్ చిత్రాలను దక్షిణాదిలో ఆదరించరు. రజనీకాంత్, సూర్య, చిరంజీవి, రామ్‌చరణ్ వంటి స్టార్ సినిమాలు రిలీజవుతున్నాయంటే మనమంతా వెళ్లి చూస్తాం.. కానీ వారి అభిమానులు మాత్రం ఆ హీరోలకే కట్టుబడి ఉంటారు. మన సినిమాల్ని చూడరు అని సల్మాన్ చెప్పుకొచ్చాడు.సికందర్ రిలీజ్సికందర్ సినిమా విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ మార్చి 30న విడుదలైంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, షరీబ్ హష్మి కీలక పాత్రలు పోషించారు.చదవండి: హీరామండి తర్వాత అవకాశాలు రావట్లేదు: అదితిరావు హైదరి -
'సికందర్' ట్విటర్ రివ్యూ.. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం బెటర్ అంటూ..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) , రష్మికా మందన్నా(Rashmika ) జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సికందర్' సినిమా థియేటర్స్‌లోకి వచ్చేసింది. రంజాన్ కానుకగా మార్చి 30న విడుదలైన ఈ చిత్రాన్ని సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. రజనీకాంత్ దర్బార్ (2020) సినిమా తర్వాత ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన చిత్రం కావడంతో సికిందర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు నటించారు. ఇప్పటికే పలుచోట్ల సినిమా చూసిన నెటిజన్లు సికిందర్‌పై తమ ఎక్స్ పేజీలలో ఇలా చెప్పుకుంటున్నారు.సికిందర్ అందరికి షాక్ ఇచ్చాడు అంటూ నెటిజన్లు పంచులు వేస్తున్నారు. సినిమా ఏమాత్రం అంచనాలకు కనీసం దగ్గర్లో కూడా లేదని చెబుతున్నారు. అవుట్ డేటెడ్ కథను ఎన్నిసార్లు మాకు చూపుతారంటూ చెబుతున్నారు. ఇందులో ఒక సాంగ్ మినహా సంగీతం చాలా దారుణంగా ఉందని చెబుతున్నారు. సినిమా చూసి ఎంజాయ్ చేయాడానికి అందులో ఏమీ లేదని చెబుతున్నారు. సల్మాన్ , AR మురుగదాస్ కాంబోకి సికిందర్ సినిమా అతిపెద్ద డిజాస్టర్ అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయం తెలుపుతున్నారు.సల్మాన్ ఖాన్ ఎంట్రీ సీన్ చాలా హైప్లో ఉంటుందని అభిమానులు సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సల్మాన్ నటించిన గత సినిమాలకు సికందర్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది అందుకే ప్రేక్షకులకు నచ్చలేదని అభిమానులు తెలుపుతున్నారు. ఇందులో యాక్షన్, ఎమోషన్స్, పాటలు అన్నీ కూడా చాలా బాగున్నాయంటున్నారు. కానీ, సాధారణ ప్రేక్షకుల మాత్రం ఇదేం సినిమా అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి కథ పట్టుకుని సల్మాన్‌ను మురగదాస్ ఎలా ఒప్పించాడు అంటూ సెటైర్స్ వేస్తున్నారు. సినిమాపై డివైడ్ టాక్ భారీగా వస్తున్నా సల్లూ భాయ్ ఫ్యాన్స్ మాత్రం సికిందర్‌ను బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.పైసా వసూల్ బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు చెబుతున్నప్పటికీ కామన్ ఆడియెన్స్ నుంచి మాత్రం చెత్త సినిమా అంటూ రివ్యూలు ఇస్తున్నారు. మురుగదాస్ ఇకనైన సినిమాల నుంచి రిటైర్ అయిపోవడం మంచిదని తెలుపుతున్నారు. కాజల్ అగర్వాల్ పాత్రపై కూడా విమర్శలు వస్తున్నాయి. విలన్‌గా సత్యరాజ్ కూడా సెట్ కాలేదని తెలుపుతున్నారు. సల్మాన్ కనిపిస్తే చాలు బీజీఎమ్‌తో సంతోష్ నారయణ బాగా ఇబ్బంది పెట్టాడని ఒకరు కామెంట్ చేశారు. ఫస్టాఫ్ ఏదో కాస్త ఓకే అనుకుంటే సెంకండాఫ్లో స్టోరీ మరింత ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. ఫైనల్‌గా సల్మాన్‌కు సికిందర్ బిగ్ డిజాస్టర్‌గా మిగిలిపోతుందని ఎక్కువమంది ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. #Sikandar is a dull action drama with a lifeless story that fails to engage. The background music is very bad, and except for a few decent action scenes, there’s nothing to enjoy. Biggest disaster for Salman and AR Murugadoss combo.— LetsCinema (@letscinema) March 29, 2025#Sikandar Public reviews are coming out and it’s disappointing .. Another mess by salman khan on eid 😢#SikandarReview pic.twitter.com/JPZkestxMs— Cheemrag (@itxcheemrag) March 30, 2025Crowd goes crazy on Megastar #SalmanKhan entry scene in #Sikandar movie.Theatre Turn Into Stadium 🔥🔥🔥 @BeingSalmanKhan #SalmanKhan #SikandarReview #Sikandar pic.twitter.com/ytTrI7CQaO— Filmy_Duniya (@FMovie82325) March 30, 2025@ARMurugadoss pls get retire.#Sikandar #SalmanKhan We appreciate your contributions to the film industry with your successful movies. However, we kindly request that you refrain from directing any further films.. Heart-full Request.— Daino (@ursrokk) March 30, 2025The audience is showering love on #Sikandar. Another blockbuster loading for @iamRashmika and @BeingSalmanKhan. 🔥🔥#RashmikaMandanna ❤️#SalmanKhan #Sikandar 🔥 pic.twitter.com/xywPwUnhFA— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) March 30, 2025Sikandar Review ⭐️⭐️⭐️⭐️⭐Blockbuster, Blockbuster, Blockbuster......Just Saw sikandar- #Sikandar is the best #SalmanKhan film after Bajrangi Bhaijaan, Yes even better than Sultan and TZH.Even I cry after Watching it, Too emotional and Action packedMany goosebump moments. pic.twitter.com/QPqlNohEGG— taran adarsh (@taran_adarsh76) March 29, 2025 -
హీరామండి తర్వాత అవకాశాలు రావట్లేదు: అదితిరావు హైదరి
టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో నటించే ఛాన్స్ వస్తే ఏ నటులైనా ఎగిరి గంతేస్తారు. అలా ఆయన డైరెక్షన్లో హీరామండి (Heeramandi: The Diamond Bazaar) వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసే అవకాశం హీరోయిన్ అదితిరావు హైదరి (Aditi Rao Hydari)కి వచ్చింది. సెకండ్ థాట్ లేకుండా వెంటనే ఓకే చేసింది. హీరామండి: ద డైమండ్ బజార్ సిరీస్‌లో బిబ్బోజాన్‌గా నటించింది. అందులో ఆమె గజగామిని నడక సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే!అవకాశాలు జలపాతంలా కురుస్తాయనుకున్నా..అయితే ఈ సిరీస్ తర్వాత తనకు మంచి అవకాశాలే రావడం లేదంటోంది బ్యూటీ. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితిరావు హైదరి మాట్లాడుతూ.. హీరామండి సిరీస్‌లో నన్ను ఎంతగానో ఆదరించారు. దీని తర్వాత నాకు అవకాశాలు వెల్లువెత్తుతాయి అనుకున్నాను. కానీ ఆ ఊహలో నుంచి త్వరగానే బయటపడ్డాను. ఎందుకంటే అవకాశాలు జలపాతంలా కురవడం కాదు కదా.. ఏకంగా కరువే ఏర్పడింది. ఆ సిరీస్ తర్వాత ఏ ప్రాజెక్టుకూ నన్ను సంప్రదించలేదు. ఛాన్సులు లేవని పెళ్లి చేసుకోలేదు కానీ... సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాను.అందుకే పెళ్లి చేసుకున్నా.. ఎలాగోలా ఖాళీ సమయం దొరికింది కాబట్టి సిద్దార్థ్‌తో మూడు ముళ్లు వేయించుకున్నాను. సిద్దార్థ్ చాలా మంచి మనిషి. పెళ్ల ప్రస్తావన తెచ్చినప్పుడు సెకను ఆలోచించకుండానే ఒప్పేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. సిద్దార్థ్, అదితి రావు హైదరి గతేడాది సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇక అదితి రావు ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఓ సినిమాలో భాగం కానుంది. ఇంతియాజ్ అలీ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో అవినాష్ తివారితో కలిసి నటించనుంది. ఈ బ్యూటీ తెలుగులో సమ్మోహనం, అంతరిక్షం 9000 కి.మీ పర్ హవర్, వి, మహాసముద్రం చిత్రాలు చేసింది.చదవండి: పిల్లలు పుట్టిన తర్వాత 'రీ ఎంట్రీ' ఇస్తానన్నా.. కానీ తనే..: జెనీలియా -
నీ అభిమానం తగలెయ్య.. ఏకంగా రూ.1.72 లక్షల విలువైన టికెట్లు దానం
ఈసారి ఉగాది, రంజాన్ పండగలు వెంటవెంటనే వచ్చాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు సినిమాలు పోటాపోటీగా రిలీజవుతున్నాయి. ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్, (Mad Square) రాబిన్‌హుడ్ (Robinhood), ఎల్2: ఎంపురాన్ (L2:Empuraan), వీర ధీర శూరన్ (Veera Dheera Sooran: Part 2) చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడిక భారీ బడ్జెట్ సినిమా విడుదలకు సమయం ఆసన్నమైంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, బాక్సాఫీస్ క్వీన్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం సికందర్ (Sikandar Movie). ఈ మూవీ మార్చి 30న విడుదల కానుంది. లక్షన్నర ఖర్చు పెట్టి మరీ..ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సల్మాన్ (Salman Khan) వీరాభిమాని, రాజస్థాన్ వాసి కుల్దీప్ కస్వాన్ ఏకంగా 800 టికెట్లు కొనుగోలు చేశాడు. అది కూడా ఐకానిక్ గైటీ గెలాక్సీ థియేటర్లో! ఈ టికెట్ల కోసం అతడు ఏకంగా లక్షన్నర ఖర్చు చేశాడు. దీని గురించి కుల్దీప్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ కోసం నేనెప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఆయన పుట్టినరోజు నాడు నిరుపేదలకు అన్నదానం చేస్తాను. అభిమానం కాదు పిచ్చి!ఇప్పుడాయన సినిమా వస్తోంది కాబట్టి టికెట్లు పంచాలనుకున్నాను. అందుకోసం 800 టికెట్లు కొనుగోలు చేశాను. ఇందుకుగానూ రూ.1.72 లక్షలు ఖర్చు పెట్టాను. వీటిని అందరికీ పంచేస్తాను అన్నాడు. అన్నట్లుగానే ఆ 800 టికెట్లను ఉచితంగా ఇచ్చేశాడు. ఇది చూసిన జనాలు.. దీన్ని అభిమానం అనరు, పిచ్చి అంటారు అని కామెంట్లు చేస్తున్నారు.సినిమాసికందర్ సినిమా విషయానికి వస్తే.. ఈ యాక్షన్ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో సాజిద్ నదియావాలా నిర్మించాడు. కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బాబర్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రీతమ్ సంగీతం అందించగా, సంతోష్ నారాయణన్ బీజీఎమ్ అందించాడు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) చదవండి: నన్ను క్షమించండి.. తప్పట్లేదు: మంచు విష్ణు -
బాలీవుడ్లో అంతా గొర్రెలే.. సౌత్‌ను చూసి నేర్చుకోండి: బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ (Bollywood)లో ఒకర్ని చూసి ఇంకొకరు గొర్రెల్లా ఫాలో అవుతారు. కథ, పాత్రల చిత్రీకరణపై దృష్టి పెట్టకుండా కండలు తిరిగిన దేహంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటున్నాడు బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా (Randeep Hooda). దక్షిణాదిలో మాత్రం ఎక్కువగా ఎమోషన్స్‌కు కట్టుబడి ఉంటారని చెప్తున్నాడు. తాజాగా రణ్‌దీప్ హుడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'రీరిలీజ్.. సోషల్‌మీడియాలో ఇప్పుడిదే ట్రెండ్. ఒకటీరెండు రీరిలీజ్ సినిమాలు బాగా ఆడగానే మిగతా అందరూ అదే ఫాలో అవుతున్నారు. కానీ, ప్రతీది ఎందుకు వర్కవుట్ అవుతుంది.గొర్రెల్లా ఫాలో అవుతారుఒకటి సక్సెస్ అయితే చాలు.. గొర్రెల్లా గుడ్డిగా దాన్నే ఫాలో అయిపోతారు. అందరూ అదే చేయాలనుకుంటారు. స్త్రీ సినిమా సక్సెస్ అవగానే హారర్ కామెడీ చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఇలాంటి పలు కారణాల వల్లే హిందీ చిత్రపరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సినిమాలు నిర్మిస్తున్నారు కానీ సినిమాలను ధృడంగా ఎలా తెరకెక్కించాలన్నది మర్చిపోతున్నారు. ప్రయోగాలకు సైతం దూరంగా ఉంటున్నారు.పుష్ప సినిమా తీసుకోండిదక్షిణాదిలో మనలాగే సినిమాలు రూపొందిస్తున్నారు. కాకపోతే వాటిలో ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పాత్రను తీర్చిదిద్దేవిధానంలో ఎక్కువ శ్రద్ధ కనిపిస్తుంది. విలువలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఉదాహరణకు పుష్ప తీసుకోండి. అందులో హీరోకు సిక్స్ ప్యాక్ బాడీ ఉండదు. గడ్డం, ఒకవైపు విరిగిన భుజం ఉంటుంది. మనదగ్గర ఎంతసేపూ కండలు తిరిగిన దేహం కోసమే ప్రయత్నిస్తారు తప్ప పాత్రల్ని తీర్చిదిద్దేందుకు ఆసక్తి చూపించరు. దీనివల్ల జనాలు ఓటీటీలపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు' అని చెప్పుకొచ్చాడు.సినిమారణ్దీప్ హుడా ప్రస్తుతం 'జాట్'(Jaat Movie) అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో రణతుంగ అనే విలన్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీలో సన్నీడియోల్, రెజీనా, ఆయేషా ఖాన్, సయామీ ఖేర్, జరీనా వాహబ్, వినీత్ కుమార్, అజయ్ ఘోష్, జగపతిబాబు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.చదవండి: తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు -
‘ఓరీ’ దేవుడా.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు మేనేజర్!
ఓరీ(Orry) అలియాస్ ఓర్హాన్ అవత్రమని.. ఈ పేరు బాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి బాగా తెలుసు. బాలీవుడ్ తారల పార్టీల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ నిలిస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. జాన్వీ కపూర్, అనన్య పాండే, సుహానా ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ కిడ్స్ పార్టీల్లో మనోడు కచ్చితంగా ఉండాల్సిందే. ఇలా స్టార్స్‌తో కలిసి తిరుగడంతో మనోడికి కూడా ‘స్టార్’ హోదా వచ్చేసింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేంది. ఇన్‌స్టాలో ఏ పోస్ట్ పెట్టినా ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా ఈ సోషల్ మీడియా సంచలనం గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇతని మేనేజర్‌గా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పని చేస్తోంది. ఆమె ఎవరో కాదు ‘ఖడ్గం’ఫేం కిమ్ శర్మ(kim sharma).కిమ్ శర్మ తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించి, 2000లో 'మొహబ్బతేన్' చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగు సినిమా 'ఖడ్గం' (2002)లో నటించి మంచి పేరు సంపాదించింది. అయితే, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో ఈ అందాల తార సినీ పరిశ్రమకు వీడ్కోలు పలికింది. ఆ తర్వాత ఆమె బిజినెస్ రంగంలోకి ప్రవేశించి, ప్రస్తుతం ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ సోషల్ మీడియా స్టార్ ఓరీకి సంబంధించినది. కిమ్ శర్మ తన చాకచక్యంతో ఓరీ నికర విలువను రూ. 10 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. ఒకప్పటి హీరోయిన్ నుంచి మేనేజర్‌గా స్థానం మార్చుకున్న ఆమె జీవన ప్రస్థానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. -
ఇంటికి చేరుకున్న అతియా శెట్టి.. కేఎల్ రాహుల్ వారసురాలికి ఘనస్వాగతం!
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈనెల 24న పాప తమ జీవితంలోకి అడుగుపెట్టిందని సంతోషం వ్యక్తం చేసింది. ఆ తర్వాత పలువురు సినీతారలు, అభిమానులు అతియా శెట్టి దంపతులకు అభినందనలు తెలిపారు.అయితే తాజాగా అతియా శెట్టి తన బిడ్డతో కలిసి ఇంటికి చేరుకుంది. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ లభించింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. పూలు, కుంకుమతో తనకు స్వాగతం పలికి ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అతియా పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోటోలో 'ఓం' దేవుడి పేరును కూడా ప్రస్తావించింది.కాగా.. అతియాశెట్టి, కేఎల్ రాహుల్ గతేడాది నవంబర్ 2024న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రెండు వారాల క్రితమే అతియా శెట్టి తన ప్రసూతి ఫోటోషూట్ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. అంతకుముందు కేఎల్, అతియా 2019లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో జనవరి 2023లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సన్నిహితులు, బాలీవుడ్ సినీతారలు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్‌లో గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరిగింది. -
రాజమౌళి ఒక్కరే.. ఆయన స్థానం ఎవరూ పొందలేరు: బాలీవుడ్ నటుడు
నేను అడుగుపెడితే విజయమే తప్ప పరాజయం ఉండదు అని నిరూపిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli). ఆయన చేసిన ప్రతి సినిమా బ్లాక్‌బస్టరే! అలాంటి దర్శకుడిని కాపీ కొట్టాలని చూస్తున్నారని.. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆయన స్థాయిని అందుకోలేరంటున్నాడు బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap).రాజమౌళి ఒరిజినల్తాజాగా అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాన్ ఇండియా హిట్లు తీయగానే రాజమౌళిపి కాపీ కొట్టినవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, వారెప్పటికీ ఆయనలా మారలేరు. ఎందుకంటే రాజమౌళి ఒక్కరే.. ఆయన ఒరిజినల్! ఎన్నటికీ ఆ చీప్ కాపీలు రాజమౌళి కాలేవు. అలాగే కేజీఎఫ్ సినిమా హిట్టవగానే చాలామంది అదే తరహా చిత్రాలు తీశారు. ఏవీ వర్కవుట్ కాలేదు.కాపీ కొట్టడం మానేసి..అయినా పాన్ ఇండియా ట్రెండ్ ఇప్పటిది కాదు. చిరంజీవి (Chiranjeevi) 'ప్రతిబంధ్', నాగార్జున 'శివ', రజనీకాంత్ 'ఫౌలది ముక్క' (పాయం పులి).. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలే.. నా చిన్నతనంలోనే ఈ పాన్ ఇండియా సినిమాలు చూశాను. నేనేమంటానంటే ఎవరికి వారే ప్రత్యేకం. అవతలివారిని కాపీ కొట్టడానికి బదులు తమలోని నైపుణ్యాన్ని బయటకు తీయాలి అని అనురాగ్ చెప్పుకొచ్చాడు.ఆ సినిమాలెప్పుడు వచ్చాయంటే?చిరంజీవి 'ప్రతిబంధ్' సినిమా 1990లో వచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూహీ చావ్లా కథానాయిక. రజనీకాంత్ హీరోగా నటించిన 'పాయం పులి' సినిమాకు హిందీ డబ్బింగ్ వర్షనే 'ఫౌలది ముక్క'. ఎస్పీ ముత్తుమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 1983లో రిలీజైంది. నాగార్జున హీరోగా నటించిన 'శివ' 1989లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది. దీనికి రామ్ గోపాల్‌వర్మ దర్శకుడిగా వ్యవహరించాడు.చదవండి: ఇక ఆపండి.. మీ తల్లి, చెల్లి, భార్య వీడియోలు చూడండి: నటి ఫైర్ -
కోట్లాది రూపాయల స్కాంలో 'పుష్ప 2' డబ్బింగ్ ఆర్టిస్ట్
సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. తాజాగా ప్రముఖ నటుడు శ్రేయస్ తల్పడే అలానే దొరికిపోయాడు. హిందీలో పలు చిత్రాల్లో నటించిన ఇతడు.. పుష్ప 2 హిందీ వెర్షన్ అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పాడు. ఇప్పుడు ఇతడిపై పోలీసులు కేసు పెట్టారు. ఇంతకీ ఏంటి విషయం?ఉత్తరప్రదేశ్ మహోబ జిల్లాలో చిట్ ఫండ్ పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసిన కేసులో నటుడు శ్రేయస్ తల్పడేతో పాటు మరో 14 మందిపై కేసు పెట్టారు. దాదాపు పదేళ్ల నుంచి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అర్బన్ మల్టీస్టేట్ క్రెడిట్ అండ్ థ్రిఫ్ట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కంపెనీతో శ్రేయాస్ కి సంబంధం ఉందని అంటున్నారు. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)పలువురు గ్రామస్థుల దగ్గర అధిక వడ్డీ ఆశ చూపించి కోట్లాది రూపాయలని ఈ కంపెనీ వసూలు చేసిందని, రూపాయి పెడితే రెండు రూపాయలు ఇస్తామని చెప్పి ఈ మోసానికి పాల్పడ్డారట. ఇప్పటికే ఏజెంట్లతో పాటు సదరు కంపెనీ బోర్డ్ తిప్పేసినట్లు తెలుస్తోంది.ఇదే కాదు గత నెలలోనూ శ్రేయస్ పై ఇలాంటి కేసు నమోదైంది. దాదాపు రూ.9 కోట్లని పెట్టుబడి దారుల దగ్గర నుంచి తీసుకుని తిరిగి ఇవ్వలేదని గోమతి నగర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతకు ముందు హర్యానాలోని సోనిపట్ లోనూ శ్రేయస్ పై మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్ లో కేసు నమోదైంది.(ఇదీ చదవండి: గాయం నుంచి కోలుకోని రష్మిక.. ఇప్పుడెలా ఉంది?) -
ఆస్కార్ నామినేషన్.. ఇండియాలో రిలీజ్‌కు నోచుకోని చిత్రం
యూకే నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన సినిమా సంతోష్ (Santosh Movie). బ్రిటీష్ ఇండియన్ ఫిలిం మేకర్ సంధ్యా సూరి తెరకెక్కించిన ఈ మూవీ భారత్‌లో రిలీజ్‌కు నోచుకోవడం లేదు. పలు సున్నితమైన అంశాలను చూపించడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందని చిత్రయూనిట్ వెల్లడించింది. కొన్ని సన్నివేశాలను తీసేయమని కోరిందని, అది ఇష్టం లేకపోవడం వల్లే భారత్‌లో దీన్ని విడుదల చేయడం లేదని పేర్కొంది.ఎంతో ప్రయత్నించా..దీని గురించి సంధ్యా సూరి (Sandhya Suri) మాట్లాడుతూ.. సినిమాలో చూపించిన సమస్యలు భారత్‌కు కొత్తేమీ కాదు. వీటి గురించి గతంలోనూ ఎన్నో సినిమాల్లో ప్రస్తావించారు. అయినప్పటికీ మా సినిమా రిలీజ్‌కు ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు. బహుశా మా సినిమాలో హీరో లేకపోవడం నచ్చట్లేదేమో! ఈ మూవీని భారత్‌లో రిలీజ్ చేయడం నాకెంతో అవసరం. దీనికోసం అన్నిరకాలుగా ప్రయత్నించాను. కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. మా చిత్రంలో కొన్ని సన్నివేశాలు తొలగించమని సీబీఎఫ్సీ కోరింది. వారు చెప్పినట్లు చేస్తే కథ తీవ్రత తగ్గిపోతుంది. సినిమాను దెబ్బతీయడం ఇష్టం లేక రిలీజ్ చేయడం లేదు. ఇది మాకెంతో బాధగా ఉంది అని పేర్కొంది.ఆస్కార్ నామినేషన్చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మహిళ కథ ఇది. వితంతువు పోలీసుగా మారి.. దళిత అమ్మాయి హత్య కేసును ఎలా ఛేదిస్తుందన్నది సినిమాలో చూపించారు. కుల వివక్ష, అంటరానితనం, అధికారుల క్రూరత్వం, లైంగిక వేధింపులను ప్రస్తావించారు. ఈ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అలాగే యూకే నుంచి అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్‌కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. డిసెంబర్లో షార్ట్ లిస్ట్ అయినప్పటికీ అవార్డు అందుకోలేకపోయింది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన శెహానా గోస్వామి ఉత్తమ నటిగా ఏషియన్ ఫిలిం అవార్డు గెలుచుకుంది.చదవండి: మలయాళంలో బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ఎల్ ఎంపురాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? -
సినిమా ఆగిపోయిందన్నారు.. కట్ చేస్తే హీరోనే డైరెక్టర్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ఇప్పటి జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. 2019లో చేసిన వార్ హిట్ అవగా.. తర్వాత చేసిన విక్రమ్ వేదా, ఫైటర్ చిత్రాలు ఘోరంగా ఫెయిలయ్యాయి.ప్రస్తుతం హృతిక్.. వార్ 2 మూవీ చేస్తున్నాడు. దీనిపై దక్షిణాదిలో బజ్ ఉంది. ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో నటిస్తుండటమే దీనికి కారణం. ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీని తర్వాత క్రిష్ 4ని హృతిక్ చేయబోతున్నాడు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమా మొత్తానికే ఆగిపోయిందని ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. కానీ అలాంటిదేం లేదని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ మూవీతో హృతిక్.. దర్శకుడిగా మారబోతున్నాడని ఈ హీరో తండ్రి రాకేశ్ రోషన్ ఇన్ స్టా వేదికగా ప్రకటించారు.క్రిష్ ఫ్రాంచైజీలో ఇదివరకే మూడు సినిమాలు వచ్చాయి. కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 ఇప్పటికే రిలీజయ్యాయి. మంచి టాక్ తెచ్చుకున్నాయి. మరి త్వరలో క్రిష్ 4 తీయబోతున్నారు, అది కూడా హృతిక్ డైరెక్టర్ అంటే ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?) View this post on Instagram A post shared by Rakesh Roshan (@rakesh_roshan9) -
74వ రైడ్.. రూ.4200 కోట్ల నల్లధనం.. టీజర్ చూశారా?
హిందీలో ఇప్పుడంటే సరైన సినిమాలు రావట్లేదు. ఒకప్పుడు మాత్రం మంచి కంటెంట్ ఉన్న మూవీస్ అడపాదడపా రిలీజ్ అవుతుండేవి. అలా 2018ల రిలీజై సూపర్ హిట్ అయిన సినిమా రైడ్. అజయ్ దేవగణ్ హీరో. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా రెడీ చేశారు. రైడ్ 2 పేరుతో మే 1న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు. తొలి పార్ట్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈసారి కూడా సినిమాని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ఈసారి హీరో పాత్రధారి 74వ రైడ్ కి వెళ్తాడు. ఏకంగా రూ.4200 కోట్ల నల్లధనం పట్టుకుంటాడు. ఇంతకీ ఎవరింట్లో ఈసారి రైడ్ చేశారో తెలియాలంటే మూవీ చూడాల్సిందే.(ఇదీ చదవండి: గాయం నుంచి కోలుకోని రష్మిక.. ఇప్పుడెలా ఉంది?) -
సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?
సల్మాన్ ఖాన్ (Salman Khan) కొత్త సినిమా సికిందర్.. ఈద్ (రంజాన్) సందర్భంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. నార్త్ లో ఓకే కానీ దక్షిణాదిలో పెద్దగా హైప్ లేదు. మరోవైపు సౌత్ ఆడియెన్స్ తమ సినిమాల్ని చూడట్లేదంటూ సల్మాన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)ఇలా సికిందర్ (Sikandar Movie) చిత్రంపై కాస్తంత నెగిటివిటీ నడుస్తోంది. దీన్ని న్యూట్రలైజ్ చేసేందుకో ఏమో గానీ సల్మాన్.. రామ్ జన్మభూమి వాచ్ (Ram Janmabhoomi Watch) ధరించాడు. జాకబ్ & కో కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వాచీలో రాముడు, అయోధ్య రామమందిరం బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వాచ్ ధర ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సల్మాన్ చేతికి ధరించిన రామ్ జన్మభూమి ఎడిషన్ వాచ్ ఖరీదు దాదాపు రూ.34 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సికిందర్ మూవీలో రష్మిక హీరోయిన్ కాగా.. ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై సల్మాన్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. మరి ఏం ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: వెండితెరకు డొక్కా సీతమ్మ జీవితం)See you in theatres this Eid! pic.twitter.com/XlC2xFkIQ0— Salman Khan (@BeingSalmanKhan) March 27, 2025 -
నాలుగు నెలల్లో రూ.3,000 కోట్ల కలెక్షన్స్! బాక్సాఫీస్ క్వీన్‌గా రష్మిక
రష్మిక మందన్నా (Rashmika Mandanna).. ఇండస్ట్రీ ఏదైనా ఆమె అడుగు పెడితే బ్లాక్ బస్టర్ వెల్ కమ్ చెపాల్సిందే. హీరో ఎవరైనా సరే.. ఆమె జోడి కడితే కెరీర్ లో బిగ్ హిట్ అందుకోవాల్సిందే. అలా అని మహానటి పేరు లేదు. గ్లామర్ క్వీన్ అనే క్రేజ్ కూడా లేదు. టోటల్‌గా లక్ ఫ్యాక్టర్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. ఇండియన్ సినిమాలో తనని తిరుగులేని నటిగా నిలబెడుతోంది. రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.నాలుగు నెలల్లో మూడు వేల కోట్లు!రష్మిక కథానాయికగా నటించిన పుష్ప 2 (Pushpa 2: The Rule) గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయింది. ఈ మూవీతో 1800 కోట్ల వసూళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛావా రిలీజ్.. 800 కోట్ల కలెక్షన్స్. అంటే ఏడాదిలోపే, 2600 కోట్ల వసూళ్లు. ఇప్పుడు ఈద్‌కు మరో బాలీవుడ్ ఫిలిం సికిందర్ సినిమా రిలీజ్ అవుతోంది. ఎంత లేదనుకున్నా ఈద్ సమయంలో సల్మాన్ సినిమా అంటే ఈజీగా మూడు నాలుగు వందల కోట్లు కొల్లగొడుతుంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో మూడు వేల కోట్ల వసూళ్లకు రష్మిక కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది అనేది సంచలనం సృష్టిస్తోంది.దేశ సినీచరిత్రలోనే..బాలీవుడ్‌ను ఏళ్లకు ఏళ్లు ఏలిన దీపిక, ఆలియా భట్, కత్రినాకైఫ్‌కు కూడా ఇలాంటి రికార్డ్ లేదు. భవిష్యత్తులో వారు అందుకునే ఛాన్స్ కూడా లేదు. వీటికి అంతకు ముందు రష్మిక నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ యానిమల్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే హిందీ ఇండస్ట్రీలో రష్మిక కలెక్షన్స్ రికార్డ్ రూ.3500 కోట్లు దాటుతుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరే హీరోయిన్‌కు ఈ స్థాయి బ్లాక్ బస్టర్స్ లేవు. ఈ రేంజ్ కలెక్షన్స్ లేవు. అందుకే రష్మిక నేమ్ అంత స్పెషల్ గా మారింది. బాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ క్వీన్ అనిపించుకుంటోంది.(చదవండి: మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్ పోస్ట్)కొంత కష్టం.. కొంత అదృష్టంకెరీర్ బిగినింగ్ నుంచి రష్మికకు లక్ ఫ్యాక్టర్ ఎక్కువ. పైగా కష్టపడం ఈ హీరోయిన్‌కు మరింత ఇష్టం. అందుకే ఇంత అందలం. ఆకాశమే హద్దుగా స్టార్ డమ్. ఒక్క బ్లాక్ బస్టర్ అందివస్తేనే కెరీర్ పరుగులు పెడుతుంది. అలాంటిది బాలీవుడ్లో రష్మికపై బ్లాక్ బస్టర్స్ వర్షం కురుస్తోంది. హిట్ మీద హిట్, రికార్డుల మీద రికార్డులు వస్తున్నాయి, పడుతున్నాయి. సికందర్లో తనకంటే 31 ఏళ్ల పెద్ద వయసు ఉన్న సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ఆడిపాడింది రష్మిక. ఇక్కడ కూడా మంచి మార్కులే వేయించుకుంది. తనదైన నటనతో సల్మాన్ మనసు గెల్చుకుంది. అందుకే భాయ్ జాన్.. ఏజ్ గ్యాప్‌పై ఓపెన్ అయిపోయాడు.రష్మికకు, వాళ్ల ఫాదర్ కు లేని ఇబ్బంది మిగతా వాళ్లకు ఎందుకని ప్రశ్నించాడు. సికిందర్ తర్వాత కూడా మరిన్ని క్రేజీ మూవీస్ చేయబోతోందీ బ్యూటీ. అందులో స్త్రీ సిరీస్ లాంటి హారర్ కామెడీ మూవీ కూడా ఉంది. సికిందర్ బాక్సాఫీస్ రిజల్ట్ అనుకున్న స్థాయిలో ఉన్నా, లేకపోయినా ఆ తర్వాత కనిపించే హారర్ కామెడీ మెప్పించకపోయినా బాలీవుడ్లో రష్మిక కెరీర్‌కు వచ్చిన ఢోకా ఏం లేదు. ఎందుకంటే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ లైన్లో ఉంది. ఆలాగే పుష్ప-3 పట్టాలెక్కాల్సి ఉంది. ఈ రెండు సీక్వెల్స్‌తో రష్మిక నేమ్, రష్మిక రికార్డ్స్, రష్మిక కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.చదవండి: కమెడియన్ ధనరాజ్‌తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య -
నా డబ్బులతో పారిపోయారు.. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు: సింగర్ ఆవేదన
బాలీవుడ్ సింగర్ నేహ కక్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఓ మ్యూజిక్ కన్సర్ట్కు వెళ్లారు. కానీ ఆమె ఆ ఈవెంట్‌కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. ఆ తర్వాత లేట్‌గా రావడంపై అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు సింగర్. ఆయితే నేహాకు ఈవెంట్ ఆర్గనైజర్స్ మాత్రం ఊహించని విధంగా షాకిచ్చారు. ఈవెంట్ ముగిశాక నేహా కక్కర్‌కు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు. ఈ విషయాన్ని నేహా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.నేహా కక్కర్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నేను మెల్బోర్న్ కన్సర్ట్ను ప్రేక్షకులకు పూర్తిగా ఉచితంగా ప్రదర్శన ఇచ్చానని మీ అందరికీ తెలుసా? నిర్వాహకులు నా డబ్బుతో పారిపోయారు. నా టీమ్‌కు కనీసం ఆహారం, హోటల్, నీరు కూడా ఇవ్వలేదు. నా భర్త, అతని స్నేహితుల వెళ్లి వారికి ఆహారం అందించారు. అయినా కూడా మేము స్టేజ్‌పైకి వచ్చాం. మేము ఆలస్యంగా వచ్చామని మాకు డబ్బు ఇవ్వలేదు. అంతేకాకుండా నిర్వాహకులు నా మేనేజర్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు' అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ కన్సర్ట్కు హాజరైన కొంతమంది కక్కర్‌పై సానుభూతి వ్యక్తం చేయగా.. మరికొందరు ఆలస్యం రావడంపై నిరాశ వ్యక్తం చేశారు.అభిమానులకు కృతజ్ఞతలు..అయితే సింగర్ నేహా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నాకు జరిగిన విషయం గురించి మాట్లాడిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాసుకొచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆ రోజు నా కచేరీకి హాజరైన ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు వెల్లడించింది. View this post on Instagram A post shared by Neha Kakkar (@nehakakkar) -
ఆలియాను చూసి ఈర్ష్య పడ్డా.. ఈమెకేంటి.. లైఫ్ సెట్టు అనుకున్నా!
పెళ్లవగానే హీరోయిన్లను పక్కన పెట్టేసే ధోరణి సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ బాలీవుడ్లో అలా కాదు.. పెళ్లయినా, పిల్లలున్నా సరే పలువురు కథానాయికలు అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీనే ఏలుతారు. ఆలియా భట్ (Alia Bhatt) హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. ఆమెను చూస్తే ఈర్ష్యగా ఉందంటోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్.లైఫ్ సెట్టయిపోయిందనుకున్నాఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్ (Sara Ali Khan) మాట్లాడుతూ.. ఆలియాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా? ఆలియా అవార్డు గెలిచింది.. అటు తనకు పాప కూడా ఉంది. ఇంకేంటి? తన లైఫ్ సెట్టయిపోయింది అనుకున్నాను. కానీ ఆ స్థాయికి చేరుకోవడానికి తను ఎంత కష్టపడిందన్నది ఆలోచించలేదు. నటిగా మానవత్వం మరిచిపోయాననిపించింది. తను ఎన్ని కష్టాలు పడింది.. ఎన్నిసార్లు నిరాశకు గురైందన్నది మనకు తెలియదు. ఆ సక్సెస్ మనకెందుకు లేదని..నాణానికి రెండువైపులా చూడాలి. మనలా చాలామంది అవతలివారి గురించి తెలుసుకోకుండా ఊరికే కుళ్లుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి సక్సెస్ చూసి మనకెందుకు రాలేదా? అన్న ఈర్ష్య వస్తుంది. కానీ ఆ సక్సెస్ వెనక ఉన్న శ్రమను గుర్తించం. అసూయ చెందడం అంటే కళ్లు మూసుకుపోవడంతో సమానం అని సారా చెప్పుకొచ్చింది. సినిమా..కాగా ఆలియా భట్.. 2022లో రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడింది. అదే ఏడాది వీరికి రాహా అనే కూతురు జన్మించింది. గంగూబాయ్ కథియావాడి చిత్రానికిగానూ ఉత్తమనటిగా 2023లో జాతీయ అవార్డు అందుకుంది. సారా అలా ఖాన్ విషయానికి వస్తే.. ఈమె చివరగా స్కై ఫోర్స్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే మూవీ చేస్తోంది. అనురాగ్ బసు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.చదవండి: బెట్టింగ్ యాప్స్.. ఏడాదికి రూ.10 లక్షలిస్తామన్నారు: వాసంతి -
ఓటీటీకి పూజా హెగ్డే డిజాస్టర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
బుట్టబొమ్మ పూజా హెగ్డే, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ జంటగా నటించిన చిత్రం దేవా. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఆదరణ కరవైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన దేవా అభిమానులను థియేటర్లలో రప్పించడంలో విఫలమైంది.అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈనెల 28 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ మేరకు దేవా పోస్టర్‌ను పంచుకుంది.కాగా..2013లో మలయాళంలో 'ముంబై పోలీస్' అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అదే సినిమాని తెలుగులో 'హంట్' పేరుతో సుధీర్ బాబు రీమేక్ చేశాడు. ఇక్కడ అంతగా వర్కవుట్ కాకపోవడంతో ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమానే మళ్లీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'దేవా' పేరుతో తెరకెక్కించగా డిజాస్టర్‌గా నిలిచింది. మరీ ఓటీటీలోనైనా అభిమానులను ఏమేర అలరిస్తుందో వేచి చూడాలి.Bhasad macha 🥁🥁🥁 Trigger chala 🚨🚨🚨 Deva aa raha hai 🔥#DevaOnNetflix pic.twitter.com/9eHQGvnjWn— Netflix India (@NetflixIndia) March 27, 2025 -
సల్మాన్ ఖాన్‌తో సూపర్ హిట్ డైరెక్టర్ మూవీ.. ఆలస్యానికి అదే కారణం!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, సల్మాన్ ఫిల్మ్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సాజిద్ నదియావాలా నిర్మించారు.అయితే జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సల్మాన్ ఖాన్ చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ మూవీ ఆలస్యం కావడంపై ఆయన స్పందించారు.ఈ సినిమా బడ్జెట్‌పై అంచనాలు మరోసారి రూపొందిస్తున్నారని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. అదే ఈ సినిమా ఆలస్యానికి ప్రధాన కారణమని తెలిపారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించినా బడ్జెట్ విషయంలో సమస్యలు రావడంతో వాయిదా పడిందని సల్మాన్ పేర్కొన్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరెకెక్కించనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.షారూఖ్ ఖాన్ జవాన్ తర్వాత అట్లీ చేస్తున్న రెండో హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన జవాన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1,150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 2023లో విడుదలైన జవాన్ మూవీలో నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. -
అట్లీతో సినిమా ఇప్పట్లో లేదు.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
హిందీలో షారుక్ ఖాన్‌తో ‘జవాన్’ తీసి, బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ ( Atlee Kumar). ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రూ. వెయ్యి కోట్లకు పైగా దాటాయి. ఈ క్రమంలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రం ఏంటి..? అనే చర్చలు చాలారోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్(Allu Arjun), సల్మాన్ ఖాన్లలో ఒకరితో ఆయన సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) కాంబినేషన్లోనే అట్లీ సినిమా దాదాపు ఖరారైనట్లే అనే టాక్ బాలీవుడ్లో బలంగా వినిపించింది. ఈ సినిమాను దక్షిణాదిలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వైరల్ అయింది. అయితే, తాజాగా ఈ విషయంపై సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. అట్లీతో సినిమా ఇప్పట్లో ఉండదని ఆయన తేల్చేశారు. ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడంతోనే కాస్త వాయిదా వేస్తున్నట్లు సల్మాన్ ప్రకటించారు. అయితే, అట్లీతో సినిమా ఉంటుందని మాత్రం ఆయన చెప్పుకొచ్చారు.బన్నీ- అట్లీ లైన్ క్లియర్బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలతో అల్లు అర్జున్- అట్లీ మూవీ దాదాపు ఖరారైపోయిందని చెప్పవచ్చు. 'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం త్రివిక్రమ్‌తో బన్నీ మూవీ చేయాలి. కానీ ఇది భారీ బడ్జెట్‌తో తీసే మైథలాజికల్ కావడంతో ప్రీ ప్రొడక్షన్‌కే చాలా సమయం పట్టే అవకాశముంది. దీంతో ఈ గ్యాప్‌లో మరో మూవీ చేయాలని బన్నీ అనుకున్నాడట. ఈ క్రమంలోనే అట్లీ లైనులోకి వచ్చాడు. ఈ ప్రాజెక్టుని బన్నీ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. -
ఐశ్వర్యరాయ్ కారుకు ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ముంబయిలో ఆమె కారును ఓ బస్సు ఢీకొట్టినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో ఐశ్వర్య బాడీ గార్డ్స్ వెంటనే కారులో నుంచి బయటికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఐశ్వర్యరాయ్ కారులో లేదని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.ఐశ్వర్యరాయ్ కారును బస్సు వెనుక నుంచి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే కారుకు ఎలాంటి తీవ్రమైన నష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటి తర్వాత కారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది.అక్కడ పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని జుహుకి చెందిన ఒక పోలీసు అధికారి వెల్లడించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్యరాయ్ అభిమానులు కాస్తా ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ ఆమె క్షేమం గురించి పలువురు ఆరా తీశారు.కాగా.. ఐశ్వర్యరాయ్ చివరిసారిగా పొన్నియిన్ సెల్వన్: పార్ట్- 2లో కనిపించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు ఆమె ప్రశంసలు అందుకుంది. దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో ఆమె ఉత్తమ నటిగా ప్రధాన పాత్ర (క్రిటిక్స్) అవార్డును గెలుచుకుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన హిస్టారికల్ యాక్షన్ చిత్రం 2023లో విడుదలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis) -
సల్మాన్ కొత్త సినిమాకు ఘోరమైన పరిస్థితి!
ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. టీజర్, ట్రైలర్ ని బట్టి సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తున్నారు. అక్కడున్నది స్టార్ హీరో అయినా, అనామక హీరో అన్నది పట్టించుకోవట్లేదు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త మూవీకి సరిగ్గా ఇలాంటి సమస్యే ఎదురైంది.(ఇదీ చదవండి: రష్మిక ఆస్తి ఎన్ని కోట్లు? ఏమేం ఉన్నాయి?)సల్మాన్ ఖాన్ కి చాన్నాళ్లుగా సరైన హిట్ లేదు. దీంతో తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తో కలిసి సికిందర్ తీశాడు. రష్మిక హీరోయిన్. కొన్నిరోజుల క్రితం టీజర్, ట్రైలర్ రిలీజయ్యాయి. కానీ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దక్షిణాది సినిమాల కాపీ అనే కామెంట్స్ వినిపించాయి. ఆ ప్రభావం ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ పై పడింది.సల్మాన్ కొత్త సినిమా ఈద్ (రంజాన్)కి రావడం ఆనవాయితీ. అందుకు తగ్గట్లే ఈ సారి పండగకు సికిందర్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా బుకింగ్స్ ఓపెన్ చేశారు. దాదాపు 24 గంటలు గడిచింది గానీ ఇప్పటివరకు రూ.1.91 కోట్ల మేర మాత్రమే టికెక్స్ బుక్ అయినట్లు తెలుస్తోంది. ఈ ట్రెండ్ ఇలానే ఉంటే మాత్రం రిలీజ్ రోజుకి రూ6-10 కోట్ల మాత్రమే వసూళ్లు రావొచ్చేమో అనిపిస్తోంది. మరి సికిందర్ రిలీజై ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: నన్ను తీసేసి యాడ్ లో ఓ కుక్కని పెట్టుకున్నారు.. హర్టయిన శోభిత) -
అర్ధరాత్రి ఫోన్.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. హర్టయిన శోభిత
సక్సెస్ అంత ఈజీగా రాదు. ఎన్నో ఆటంకాలు, అవమానాలు దాటుకుని వచ్చాకే విజయ ఫలాల్ని అందుకోగలరు. తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) విషయంలోనూ ఇదే జరిగింది. టాలీవుడ్ (Tollywood)లో కంటే బాలీవుడ్ (Bollywood)లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. అయితే హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి ముందు చేదు అనుభవాల్ని ఎదుర్కొందట. గతంలో తనే ఈ విషయాన్ని వెల్లడించింది. రాత్రి 11.30 గంటలకు ఫోన్శోభిత మాట్లాడుతూ.. ఒక బ్రాండ్ వాళ్లు రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేసి ఆడిషన్‌కు పిలిచారు. నాకు కాస్త విచిత్రంగా అనిపించింది. సర్లే అని వెళ్లాను. ఆడిషన్ పూర్తయింది. నన్ను సెలక్ట్ చేశామని తెలిపారు. యాడ్ షూటింగ్ కోసం గోవాకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అదేదో థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా కాకపోయినా గోవా అనగానే నేను ఎగ్జయిట్ అయ్యాను. గోవా వెళ్లాక మొదటిరోజు షూటింగ్ బానే జరిగింది. కానీ కెమెరాలో ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పి మిగిలింది తర్వాత షూట్ చేద్దామన్నారు. సెట్టవట్లే అని తీసేశారుతర్వాతి రోజు నేను సెట్‌కు వెళ్లగానే.. ఈ అమ్మాయి మన బ్రాండ్ ఇమేజ్‌కు సరిపోదు అని మాట్లాడుతున్నారు. కారణమేంటో తెలుసా? నేను కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నానని వద్దన్నారు. అంత ఆత్మస్థైరంతో కనిపించే అమ్మాయి ఈ బ్రాండ్‌కు సెట్టవదని పక్కన పెట్టేశారు. నా ప్లేస్‌లో ఓ శునకాన్ని తీసుకున్నారు. కానీ ఒకరోజు పనిచేసినందుకు నాకు డబ్బులిచ్చారు అని చెప్పుకొచ్చింది. అది విన్న యాంకర్.. శోభితకు బదులు శునకాన్ని బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడుకోవడమేంటని నోరెళ్లబెట్టారు.సినిమా..రామన్ రాఘవన్ 2.0 సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించింది శోభిత. గూఢచారితో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మేజర్, పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో మెరిసింది. మంకీ మ్యాన్ అనే హాలీవుడ్లో మూవీలోనూ యాక్ట్ చేసింది. కల్కి 2898 ఏడీ చిత్రంలో దీపికా పదుకొణెకు తెలుగు డబ్బింగ్ చెప్పింది. శోభిత 2024 డిసెంబర్ 4న హీరో అక్కినేని నాగచైతన్యను పెళ్లాడింది. View this post on Instagram A post shared by MTV (@toni.op55) చదవండి: వాటాలు పంచుకుందాం..టాలీవుడ్ దర్శకులు ఓకే అంటారా? -
ఐసీయూలో తల్లి.. IPLకు నో చెప్పిన హీరోయిన్
హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుతున్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తెలుగులోనూ ప్రభాస్ సాహో మూవీలో నటించింది. కెరీర్ పరంగా ఎప్పుడూ ఏదో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉండే ఈమె.. సడన్ గా ఆస్పత్రిలో కనిపించింది. ఈమె తల్లి ఐసీయూలో ఉండటమే దీనికి కారణం.(ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని)శ్రీలంకకు చెందిన జాక్వెలిన్.. చాన్నాళ్ల క్రితమే మన దేశానికి వచ్చేసింది. హిందీ మూవీస్ చేస్తూ ముంబైలో సెటిలైపోయింది. తెలుగు, కన్నడ, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తల్లితో పాటు కలిసుంటోంది. అయితే జాక్వెలిన్ తల్లి కిమ్ కి సోమవారం గుండెపోటు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా పరామర్శించి వెళ్లినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఐపీఎల్ లో గౌహతి వేదికగా గురువారం కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు ప్రారంభోత్సవ వేడుకలకు జాక్వెలిన్ హాజరై ఫెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ తల్లి ఐసీయూలో ఉండటంతో దీనికి నో చెప్పేసింది. ప్రస్తుతాకైతే ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: మిలియన్ డాలర్ 'కోర్ట్'.. నానికి ఇది చాలా స్పెషల్) -
మేలో రైడ్
అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైడ్ 2’. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘రైడ్’ (2018)కి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ రూపొందింది. ఈ మూవీలో వాణీ కపూర్, రితేష్ దేశ్‌ముఖ్ ఇతర పాత్రలు పోషించారు. అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్, భూషణ్ కుమార్, గౌరవ్ నంద, క్రిషణ్ కుమార్, ప్రగ్యా సింగ్ నిర్మించారు.ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘వాస్తవ ఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘రైడ్ 2’. ఈ మూవీలో ఐఆర్ఎస్ అధికారి అమయ్ పట్నాయక్‌గా అజయ్ దేవగన్ నటించారు. వాస్తవ ఘటనలకి సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు జోడించి తనదైన శైలిలో ఈ మూవీని తీర్చిదిద్దారు రాజ్‌కుమార్ గుప్తా. ‘రైడ్’ సినిమాలా ‘రైడ్ 2’ కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య
తెలుగులో పలు సినిమాల్లో సహాయ నటుడు, విలన్ పాత్రల్లో నటించిన సోనూసూద్ ప్రస్తుతం హిందీలో అడపాదడపా మూవీస్ చేస్తున్నాడు. మరోవైపు లాక్ డౌన్ టైమ్ నుంచి తన వంతుగా చాలామందికి సాయం చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)ఇకపోతే సోనూసూద్ భార్య సోనాలి ప్రయాణిస్తున్న కారు.. మంగళవారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. ముంబై-నాగ్ పూర్ హైవేపే ఈ సంఘటన జరిగింది. సోనాలి డ్రైవ్ చేస్తున్న కారు ట్రక్ ని ఢీ కొట్టిందని, దీంతో కారులో ఉన్న సోనాలి, ఈమె చెల్లి, చెల్లి కూతురికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.సోనూ సూద్ కుటుంబం విషయానికొస్తే 1996లో సోనాలిని పెళ్లి చేసుకున్నాడు. ఈమె తెలుగమ్మాయి కావడం విశేషం. వీళ్లకు అయాన్, ఇషాన్ అని ఇద్దరు కొడుకులున్నారు. సోనూసూద్ భార్య మూవీ ప్రొడ్యూసర్.(ఇదీ చదవండి: క్రికెటర్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్) -
స్టేజీపైనే స్టార్ సింగర్ కి అవమానం.. గో బ్యాక్ నినాదాలు
సెలబ్రిటీలకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా కామన్. అలా అని పొరపాటు చేస్తే అభిమానించే వాళ్లు కూడా తిడతారు. నోటికొచ్చింది మాట్లాడుతారు. ఇప్పుడు ఇలాంటి అనుభవమే ఇండియన్ స్టార్ సింగర్ కి ఎదురైంది. ఆస్ట్రేలియాలో ఈమెని ఏడిపించేశారు. ఇంతకీ ఏమైందంటే?(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత)హిందీ సాంగ్స్ పాడి గుర్తింపు తెచ్చుకున్న నేహా కక్కర్ (Neha Kakkar).. 'ఇండియన్ ఐడల్' షోకి జడ్జిగా ఇంకా ఫేమస్. జడ్జిమెంట్ ఇస్తూ అప్పుడప్పుడు కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. ఇదంతా డ్రామా అని కొందరు ట్రోల్ చేస్తుంటారు. ఇక అసలు విషయానికొస్తే తాజాగా ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో ఈమె స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది.కాకపోతే సాయంత్రం ఏడున్నరకు ప్రోగ్రాంకి రావాల్సి ఉండగా.. దాదాపు మూడు గంటలు ఆలస్యంగా వచ్చి పాటలు పాడింది. అది కూడా గంట మాత్రమే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో టికెట్ కొని షో చూసేందుకు వచ్చిన కొందరు ఈమెని 'గో బ్యాక్' (తిరిగి హోటల్ కి వెళ్లిపో) అని కామెంట్ చేశారు. దీంతో ఏం చేయాలో తెలీక స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)Neha Kakkar crying for being 3 hrs late at a Melbourne showShe also performed for less than 1 hour #NehaKakkar pic.twitter.com/TGyhaeCjpu— Redditbollywood (@redditbollywood) March 24, 2025 -
మరోసారి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
నటి అమీ జాక్సన్ మరోసారి తల్లయ్యారు. రెండోసారి కూడా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె వెల్లడించారు. 2019లో జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసిన అమీ జాక్సన్.. వారి ప్రేమకు గుర్తుగా 'ఆండ్రూ' అనే బాబుకు జన్మనిచ్చారు. ఆయనతో విడిపోయిన తర్వాత హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ (Ed Westwick)ను నటి అమీ జాక్సన్ (Amy Jackson) ప్రేమించి గత ఏడాదిలో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఈ దంపతులకు జన్మించిన బిడ్డకు 'ఆస్కార్ అలెగ్జాండర్' అని నామకరణం చేశారు.చిత్రపరిశ్రమలో ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అమీ జాక్సన్ సుపరిచితమే అని తెలిసిందే. ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ పెళ్లికాకుండానే 'ఆండ్రూ' అనే కుమారుడికి మొదట జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత 2020లో పెళ్లి చేసుకుంటామని వారు ప్రకటించారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అది కాస్త వాయిదా పడింది. ఇంతలో వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ను ప్రేమించి 2024లో వివాహ బంధంలోకి ఆమె అడుగు పెట్టారు. ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లిగా ఆమె జీవిత ప్రయాణం సంతోషంగా ఉంటుందని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ed Westwick (@edwestwick) -
మీకు.. సమస్య ఎందుకు ?
సల్మాన్ ఖాన్ , రష్మికా మందన్నా జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మించిన హిందీ చిత్రం ‘సికందర్’. ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈవెంట్లో సల్మాన్ ఖాన్ , రష్మికా మందన్నాల మధ్య 31 సంవత్సరాల వయసు వ్యత్యాసం విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ–‘‘నాకు, హీరోయిన్ కు (రష్మికా మందన్నాను చూస్తూ..) మధ్య ఏ సమస్య లేదు. హీరోయిన్ తండ్రికీ ఏ ఇబ్బంది లేదు.మరి.. మీకు సమస్య ఎందుకు భాయ్? (ఆడియన్స్, నెటిజన్లను ఉద్దేశిస్తూ కావొచ్చు). భవిష్యత్‌లో హీరోయిన్ కు వివాహం జరిగి, ఆమెకు ఓ కుమార్తె జన్మించి, ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీలో స్టార్ అయితే తనతోనూ కలిసి నటిస్తాను. వాళ్ల అమ్మ అనుమతి తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
బాలీవుడ్ నిర్మాతల పరువు తీసేసిన హిందీ స్టార్ హీరో
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే అందరూ బాలీవుడ్ అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 'బాహుబలి', 'పుష్ప 1& 2', 'ఆర్ఆర్ఆర్' తదితర చిత్రాలతో తెలుగు సినిమా ఎనలేని పేరు గడిస్తోంది. దీంతో బాలీవుడ్ హవా రోజురోజుకీ తగ్గిపోతోంది. ఇండస్ట్రీపై ఇదివరకే పలువురు విమర్శలు చేయగా.. ఇప్పుడు స్టార్ హీరో సన్నీ డియోల్ బాలీవుడ్ పరువు తీసేశాడని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: రిలీజ్ కి ముందే రూ.58 కోట్ల కలెక్షన్)'యానిమల్'లో విలన్ గా నటించిన బాబీ డియోల్ అన్నయ్య సన్నీ డియోల్. కొన్నాళ్ల క్రితం 'గదర్ 2' మూవీతో అద్భుతమైన హిట్ కొట్టాడు. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని ఇతడిని హీరోగా పెట్టి 'జాట్' అనే సినిమా తీశాడు. తాజాగా సోమవారం ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సన్నీ డియోల్.. హిందీ నిర్మాతలపై కౌంటర్స్ వేశాడు.'ముంబై ప్రొడ్యూసర్స్.. జాట్ నిర్మాతలని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకసారి స్క్రిప్ట్ అంతా లాక్ అయితే పూర్తిగా దర్శకుడిపై నమ్మకం ఉంచుతారు' అని సన్నీ డియోల్ చెప్పుకొచ్చాడు.ఇతడు హీరోగా లాహోర్ 1947 అనే మూవీ మొదలైంది. కానీ అది ఆలస్యమవుతూ వస్తోంది. ఇలా లేట్ అవుతుండటంపైనే సన్నీ.. పరోక్షంగా అసంతృప్తిని వెళ్లగక్కడా అనిపిస్తోంది. ఇకపోతే జాట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతుంది. తెలుగు నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి.(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు)#SunnyDeol says Bombay Producers should learn from #Jaat Producers Mythri & PMF and Trust the Director once everything is locked!!He is possibly indicating his displeasure about the much delayed #Lahore1947!! pic.twitter.com/JUfSLZVQYZ— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) March 24, 2025 -
ఆ బాలనటి గుర్తుందా? ఇప్పుడు పెళ్లికూతురయ్యింది!
బ్లాక్ సినిమా (Black Movie) గుర్తుందా? అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మూడు జాతీయ అవార్డులు అందుకుంది. 11 ఫిలింఫేర్ పురస్కారాలు గెలుచుకుంది. సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో జూనియర్ రాణి ముఖర్జీగా ఆయేషా కపూర్ (Ayesha Kapur) నటించింది. ఆనాటి బాలనటి ఇప్పుడు పెళ్లికూతురిగా ముస్తాబయింది. పెళ్లి చేసుకున్న నటిప్రియుడు ఆడం ఒబెరాయ్‌ను పెళ్లాడింది. ఢిల్లీలో ఈ వివాహం జరిగింది. ఆయేషాలో పింక్ లెహంగా ధరించగా ఆడం పేస్టల్ కలర్ షేర్వాణీని ఎంచుకున్నాడు. ప్రియురాలికి మ్యాచ్ అయ్యేలా ఉండేందుకు పింక్ తలపాగా ధరించాడు. ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.చైల్డ్ ఆర్టిస్టుగా..తమిళనాడులో పెరిగిన ఆయేషా.. బ్లాక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు రణ్‌బీర్ కపూర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆయన పర్యవేక్షణలోనే ఆమె తన పాత్ర కోసం సన్నద్ధమైంది. బ్లాక్ తర్వాత సికిందర్ అనే సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ప్రస్తుతం న్యూట్రిషన్ హెల్త్ కోచ్‌గా పని చేస్తోంది. చదవండి: రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే డ్యాన్స్ చేస్తావా?: రాజేంద్రప్రసాద్ వార్నింగ్ -
మన ఆస్కార్ అవార్డ్స్‌ను లాక్కున్నారు.. దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) అస్కార్ అవార్డ్స్-2025 గురించి మాట్లాడారా. ఈ ఏడాదిలో భారత్‌కు అవార్డ్స్ రాకపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేశారు. పారిస్‌లో జరుగుతున్న లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ లూయిస్ విట్టన్ (Louis Vuitton) షోలో ఆమె పాల్గొంటుండగా ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.ఆస్కార్ అవార్డులు గెలుపొందే అన్ని అర్హతలు ఉన్న అనేక భారతీయ చిత్రాలు ఉన్నాయని దీపికా పదుకొణె చెప్పారు. భారతీయ అభిమానుల హృదయాలను గెలుచుకున్న 'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్, మిస్సింగ్ లేడీస్' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికల మీద ప్రశంసలు అందుకున్నాయి. అయినప్పటికీ ఈ రెండు చిత్రాలు ఆస్కార్- 2025 తుది జాబితాలో చోటు దక్కలేదు. ఇలా చాలాసార్లు మనకు రావాల్సిన ఆస్కార్లను లాగేసుకుంటూనే ఉన్నారు. భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి. కానీ, ఆ సినిమాలకు, ఆ కథలకు, నటీనటుల ప్రతిభకు గుర్తింపు ఇవ్వడం లేదు. కారణం ఏంటో తెలియదు. కానీ, ఆస్కార్ మాత్రం మన సినిమాలను తిరస్కరిస్తుంది. అయితే, ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులలో ది బ్రూటలిస్ట్ చిత్రానికి గాను నటుడు అడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు రావడం నాకు సంతోషాన్ని ఇచ్చింది.RRR అవార్డ్.. ఎంతో భావోద్వేగం చెందాను:దీపికాభారత్ నుంచి ఎన్నో విలువైన చిత్రాలు వచ్చినప్పటికీ అస్కార్ అవార్డ్ దక్కకపోవడం చాలా బాధాకరం అని చెప్పిన దీపికా పదుకొణె.. ఆర్ఆర్ఆర్ గురించి కూడా మాట్లాడారు. '2023 ఆస్కార్ అవార్డ్స్ నేను వ్యాఖ్యతగా ఉన్నాను. కానీ, ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ ప్రకటించిన సమయంలో నేను ప్రేక్షకుల్లో కూర్చొని ఉన్నాను. అప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను. అవి నాకు ఎంతగానో ప్రత్యేకమైన క్షణాలు. ఆ సినిమాలో నేను భాగం కాకపోయినప్పటికీ ఒక భారతీయురాలిగా ఆ విజయం నా సొంతం అనిపించింది. ఆ గొప్ప క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను.'అని చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్‌చరణ్,ఎన్టీఆర్ నటించారు. ఇందులో నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
'రష్మిక కూతురితో కూడా పని చేస్తా'.. ట్రోల్స్‌పై సల్మాన్ ఖాన్ దిమ్మదిరిగే కౌంటర్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సికందర్. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, సల్మాన్ ఫిల్మ్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సాజిద్ నదియావాలా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సికందర్ ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన సల్మాన్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. తనతో నటిస్తోన్న హీరోయిన్లతో వయస్సు అంతరంపై ప్రశ్నించగా.. తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. నాకు, హీరోయిన్‌కి మధ్య 31 ఏళ్ల వయస్సు గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.. హీరోయిన్ రష్మికకు, ఆమె తండ్రికి నా వయస్సుతో ఎలాంటి సమస్య లేదు.. మీకేంటి ప్రాబ్లమ్ అన్నయ్యా? అంటూ ఫన్నీగా ఆన్సరిచ్చారు. భవిష్యత్తులో రష్మికకు కూతురు పుడితే తనతో కూడా కలిసి పనిచేస్తా అని అన్నారు. రష్మిక అనుమతి తీసుకుంటానని నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇది చదవండి: సల్మాన్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది)కాగా.. ఆదివారం ముంబయిలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో సికందర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రల్లో నటించారు. -
‘సుశాంత్ కేసు క్లోజ్.. రియాకు ఇదే నా శాల్యూట్..’!
ముంబై: సుమారు ఐదేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు పెద్ద సంచలనం. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తినే కారణమంటూ పెద్ద దుమారమే చెలరేగింది. 2020, జూన్ 14వ తేదీన సుశాంత్ బాంద్రాలోని తన నివాసంలో విగతజీవిలా పడివున్నాడు. మెడకు ఉరి వేసుకుని ఉన్న సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. దీనిపై దాదాపు ఐదేళ్ల పాటు విచారణ జరిపిన సీబీఐ.. ఎట్టకేలకు తుది రిపోర్ట్ ఇచ్చింది. సుశాంత్ మరణం వెనుక ఎవరి ప్రేరేపితం లేదని స్పష్టం చేసింది. అంటే ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియాకు భారీ ఊరట లభించినట్లయ్యింది.అయితే దీనిపై రియా లాయర్ సతీష్ మనీషిండే మాట్లాడుతూ..‘ ఈ కేసులో ప్రతీకోణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తుది నివేదికను ఇచ్చిన సీబీఐకి కృతజ్ఞతలు. అటు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా రియాపై అనేక రకాలైన తప్పుడు కథనాలు వచ్చాయి. అది కోవిడ్ వచ్చిన సమయం కావడంతో ప్రతీ ఒక్కరూ టీవీలు, సోషల్ మీడియాను ఎక్కువ చూశారు. ఈ క్రమంలోనే రియాపై ఎన్నో తప్పుడు వార్తలు చుట్టుముట్టాయి. నిరాధారమైన ఆరోపణలతో ఆమెను, ఆమె కుటుంబాన్ని నానా యాగీ చేశారు. ఈ రకంగా చేయడం వల్ల అమాయకులు చాలా నష్టపోతారు. కానీ చివరకు రియా పాత్ర ఏమీ లేదని క్లియరెన్స్ వచ్చింది. ఇక్కడ రియాకు సెల్యూట్ చేస్తున్నా. ఎన్నో అవమానాలను భరించి ఎటువంటి నోరు విప్పకుండా మౌనం పాటించిన రియాకు, ఆమె కుటుంబానికి సెల్యూట్ చేస్తున్నా’ అని రియా లాయర్ సతీష్ మనీషిండే తెలిపారు.సీబీఐ రిపోర్ట్‌లో ఏం చెప్పింది..?సుశాంత్ మరణానికి సంబంధించి నమోదైన రెండు కేసుల్లో ఎవరి పాత్ర లేదని తెలిపింది. ఈ మేరకు ముంబై కోర్టులో సీబీఐ క్లోజర్ రిపోర్ట్‌ను దాఖలు చేసింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం వెనుకు ఎవరి పాత్ర లేదని, ఎటువంటి కుట్రలు జరగలేదని తెలిపింది. సుశాంత్ మరణంలో నటి రియా, ఆమె కుటుంబ సభ్యుల పాత్ర లేదని పేర్కొంది. -
సల్మాన్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సికందర్. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, సల్మాన్ ఫిల్మ్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సాజిద్ నదియావాలా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే మేకర్స్ సికందర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సల్మాన్ ఖాన్ ఫైట్స్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ యాక్షన్ మూవీలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతమందించారు. -
ఐపీఎల్ ప్రారంభ వేడుక.. కింగ్ ఖాన్‌తో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ
వేసవి క్రీడా సంబురం ఐపీఎస్ సందడి అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ ఏడాది మెగా సీజన్ మొదలైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ప్రారంభ వేడుకల్లో పలువురు సినీతారలు కూడా సందడి చేశారు. ముఖ్యంగా కేకేఆర్ యజమాని షారూఖ్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్లో బాలీవుడ్ భామ దిశాపటానీ తన డ్యాన్స్‌తో అభిమానులను మెప్పించింది.అయితే ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్ క్రికెటర్లను కాసేపు నటులుగా మార్చేశారు. తనతో పాటు విరాట్ కోహ్లీ, రింకూ సింగ్‌ను డ్యాన్స్ చేయించారు. పఠాన్ మూవీలోని ఓ సాంగ్‌కు కింగ్ కోహ్లీ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఐపీఎల్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అంతేకాకుండా ఈ వేడుకలో ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన పాటలతో అభిమానులను అలరించారు. పుష్ప-2 సాంగ్ పాడి ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం షారూక్ ఖాన్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో నటించడం లేదు. చివరిసారిగా జవాన్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. King Khan 🤝 King Kohli When two kings meet, the stage is bound to be set on fire 😍#TATAIPL 2025 opening ceremony graced with Bollywood and Cricket Royalty 🔥#KKRvRCB | @iamsrk | @imVkohli pic.twitter.com/9rQqWhlrmM— IndianPremierLeague (@IPL) March 22, 2025 -
'ఒకప్పటిలా లేదు.. ప్లాస్టిక్ సర్జరీ'.. పెదవి విప్పిన హీరోయిన్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తోంది అవనీత్ కౌర్ (Avneet Kaur). అయితే అప్పటికి, ఇప్పటికీ అవనీత్ చాలా మారిపోవడంతో తను ఏదైనా సర్జరీ చేయించుకుందన్న పుకార్లు కూడా వచ్చాయి. వీటన్నింటికీ ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో చెక్ పెట్టింది. అవనీత్ కౌర్ మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచి నేను కెమెరా చూస్తూనే పెరిగాను. చాలామంది నా గురించి విచిత్రంగా మాట్లాడుతుంటారు. ప్లాస్టిక్ సర్జరీ.. గట్రా!చిన్నప్పుడు ఎలా ఉండేది.. ఇప్పుడెలా అయింది.. చాలా మారిపోయింది. కచ్చితంగా తన ముఖానికి ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంది అంటుంటారు. ఈ తరహా కామెంట్లు చదివినప్పుడు కోపమొస్తుంది. ఎందుకంటే ఏడెనిమిదేళ్ల వయసులో నేను చిన్న పిల్లను. ఎదుగుతూ ఉండేకొద్దీ శరీరంలో మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు నాకు 23 ఏళ్లు. చిన్నప్పటిలా ఎలా ఉంటాను?కేవలం అది మాత్రమే..నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు. ఏ ఫిల్లర్స్ వేయించుకోలేదు. కాకపోతే ముఖానికి ఫేషియల్ మాత్రం చేయించుకుంటాను. చర్మసంరక్షణ కోసం ఆమాత్రమైనా చేయాలి కదా! చర్మం వదులుగా కాకుండా బిగుతుగా ఉండేలా చూసుకుంటాను అని చెప్పుకొచ్చింది. అవనీత్ కౌర్ జన్మస్థలం పంజాబ్. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అలా ఎనిమిదేళ్ల వయసు నుంచే పలు స్టేజ్ షోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోల నుంచి సినిమాల దాకా..‘డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్’, ‘డాన్స్ కీ సూపర్ స్టార్స్’, ‘ఝలక్ దిఖ్లా జా 5’ తదితర డ్యాన్స్ షోలలో పాల్గొంది. ‘మేరీ మా’, ‘సావిత్రి ఏక్ ప్రేమ్ కహానీ’, ‘హమారీ సిస్టర్ దీదీ’ వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. అలాద్దీన్ సీరియల్లో యాస్మిన్ పాత్రతో ఫేమస్ అయింది. అలా మర్దానీ సినిమాలో నటించింది. ‘దోస్త్’, ‘బ్రూనీ’, ‘ఏక్తా’, ‘మర్దానీ 2’, 'టీకూ వెడ్స్ షెరూ', 'లవ్‌కీ అరేంజ్ మ్యారేజ్' చిత్రాల్లో యాక్ట్ చేసింది.చదవండి: నిజం ఎంతోకాలం దాగదు, ఈ రోజు వస్తుందని తెలుసు: మంచు లక్ష్మి -
నిజం ఎంతోకాలం దాగదు, ఈ రోజు వస్తుందని తెలుసు: మంచు లక్ష్మి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మృతి కేసులో రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదు. తను ఆత్మహత్యకు ప్రేరేపించలేదు అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వెల్లడించింది. ఈ మేరకు కేసును క్లోజ్ చేసింది. దీంతో ఐదేళ్లుగా నిందలు మోస్తూ ఒంటరి పోరాటం చేస్తున్న రియా చక్రవర్తికి ఎట్టకేలకు ఉపశమనం లభించినట్లయింది. సుశాంత్ మృతి.. మాజీ ప్రేయసిపై ట్రోలింగ్సుశాంత్ సింగ్ 2020లో జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన మృతి వెనక కుట్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) కూడా అందులో భాగమై ఉండొచ్చన్న ప్రచారం జరిగింది. దీంతో ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. తనను ఈసడించుకున్నారు. ఒక విలన్‌గా చూశారు. దీని పర్యవసానంగా సినిమా అవకాశాలకు ఫుల్స్టాప్ పడింది. అరెస్టు, జైలు జీవితం, విచారణతో రియా మానసికంగా కుంగిపోయింది.కేసులో నిర్దోషిగా తేలిన నటితాను తప్పు చేయలేదన్న మాటను ఎవరూ లెక్కచేయలేదు. తప్పంతా నీదేనని నోరు నొక్కేశారు. ఎంతో భవిష్యత్తున్న హీరో ప్రాణాలు తీసుకోవడానికి కారణమయ్యావని అభాండాలు వేశారు. గుండె నిండా బాధను మోస్తూనే ఒంటరిగా పోరాడింది.. చివరకు కేసులో నిర్దోషిగా తేలింది. ఐదేళ్లుగా రియా అనుభవించిన బాధని, పోరాటాన్ని గుర్తు చేస్తూ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నిజం ఎంతోకాలం దాగదురియా చక్రవర్తికి, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ వచ్చింది. ఇలాంటి రోజొకటి వస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే నిజం ఎంతోకాలం దాగదు.. కాస్త ఆలస్యమైనా సరే బయటకు రాక తప్పదు. రియా, ఆమె కుటుంబం.. భరించలేని బాధను అనుభవించింది. సమాజం మిమ్మల్ని తప్పని నిందిస్తుంటే, మీతో రాక్షసంగా ప్రవర్తిస్తుంటే మీరు పోరాడిన విధానం ఆదర్శవంతం. మిమ్మల్ని అవమానించారు, చీల్చి చెండాడారు. అయినా ఎంతో హుందాగా నిలబడ్డారు.క్షమాపణలు చెప్పండి: మంచు లక్ష్మినిజానిజాలు తెలుసుకోకుండా మీపై నోరు పారేసుకున్నవారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. అన్యాయంగా ఒక కుటుంబాన్ని ఎంత బాధపెట్టారో గుర్తు చేసుకుని పశ్చాత్తాపపడాలి. రియా.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నీకు మరింత శక్తి చేకూరాలి. ఇది ఒక ఆరంభం మాత్రమే.. ఇకపై అంతా మంచే జరుగుతుంది. నువ్వు అనుభవిస్తున్న బాధ ఇప్పటికైనా తగ్గుతుందని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చింది. దీనికి #Justice, #TruthWins, #RheaChakraborty అన్న హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చింది.చదవండి: 'ఖుషి' ఫ్లాప్ అయితే నేను బతికేవాడిని కాదు: ఎస్జే సూర్య -
మొదటి భార్యకు విడాకులు.. దేవదాసులా తాగుడుకు బానిసయ్యా..: హీరో
ప్రేమలో విఫలమైతే జీవితమే అయిపోయినట్లు డీలా పడిపోతారు. పెళ్లి పెటాకులైతే అంతా శూన్యమైపోయినట్లు దిగులు చెందుతారు. అందుకు తాను కూడా అతీతుడిని కాదంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan). మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు ఆ బాధ భరించలేకపోయానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ.. రీనా దత్తా (Reena Dutta), నేను విడిపోయినప్పుడు దాదాపు మూడేళ్లపాటు ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాను. డిప్రెషన్లోకి వెళ్లిపోయా..ఏ స్క్రిప్టు కూడా వినలేకపోయాను. సినిమాలపై శ్రద్ధ పెట్టలేకపోయాను. ఏడాదిన్నరపాటు ఇంట్లో ఒంటరిగా కూర్చున్నాను. మందు ముట్టని నేను విపరీతంగా తాగడం మొదలుపెట్టాను. అసలేం చేయాలో అర్థం కాలేదు. రాత్రిళ్లు సరిగా నిద్రపట్టేది కాదు. అందుకే తాగుడుకు అలవాటుపడ్డాను. మద్యం తాగడం అంటేనే గిట్టని నేను ఒక ప్రతి రోజు ఒక బాటిల్ లేపేసేవాడిని. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. దేవదాసులా మారిపోయాను.రెండు పెళ్లిళ్లు- విడాకులుకానీ మనకు నచ్చిన వ్యక్తులు మనతో లేరన్న విషయాన్ని జీర్ణించుకోవాలి. వాళ్లు తిరిగొచ్చే అవకాశం లేనప్పుడు మిస్ అవుతాం.. అయినా తప్పదని ముందుకు వెళ్లాలి అని చెప్పుకొచ్చాడు. ఆమిర్ ఖాన్, రీనా దత్తా 1986లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్ ఖాన్, కూతురు ఇరా ఖాన్ సంతానం. ఆమిర్-రీనా 2002లో విడాకులు తీసుకున్నారు. 60 ఏళ్ల వయసులో డేటింగ్2005లో ఆమిర్.. కిరణ్ రావు (Kiran Rao)ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసి ద్వారా ఆజాద్ జన్మించాడు. ఈ దంపతులు కూడా పెళ్లయిన 15 ఏళ్లకు విడిపోయారు. ప్రస్తుతం ఆమిర్ మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఇటీవల తన 60వ బర్త్‌డే వేడుకల్లో.. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌ను తన ప్రేయసిగా పరిచయం చేశాడు. వీరిద్దరూ ఏడాదిన్నర కాలంగా డేటింగ్లో ఉన్నారు.చదవండి: ఓటీటీలో 'మజాకా'.. స్ట్రీమింగ్ వైరల్ -
ప్రభాస్‌కి అన్నయ్యగా..?
ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించనున్నారట. అది కూడా ప్రభాస్‌కి అన్నయ్య పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్. తనదైన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దనున్నారట సందీప్. ఈ మూవీలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు ప్రభాస్.ఇందులో యాక్షన్ ఓ రేంజ్లో ఉంటుందని భోగట్టా. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందనుంది. బాలీవుడ్లో సంజయ్ దత్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్‌కి అన్నయ్యగా ఆయన్ని తీసుకోనున్నారట సందీప్. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి సంజయ్ అయితే పక్కాగా సరితూగుతారన్నది దర్శకుడి ఆలోచనట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. మరి ‘స్పిరిట్’లో సంజయ్ దత్ భాగం అవుతారా? లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. -
ఐపీఎల్ ఆరంభం.. తెలుగు పాటతో అదరగొట్టిన శ్రేయా ఘోషల్
క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ కొత్త సీజన్ (IPL 2025) మొదలైంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మొదటగా స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ప్రసంగించాడు. అనంతరం సింగర్ శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) తన గాత్రంతో అందరినీ మైమరిపించింది. బ్లాక్‌బస్టర్ హిందీ సాంగ్స్‌తో ఆడియన్స్‌లో జోష్ నింపింది. అలాగే అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ మూవీ 'పుష్ప 2' (Pushpa 2: The Rule)లోని సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ.. పాటను తెలుగులో పాడి అదరగొట్టింది.టాప్ సింగర్..శ్రేయా ఘోషల్ విషయానికి వస్తే.. ఈమె ఏ భాషలోనైనా ఇట్టే పాటలు పాడగలదు. తెలుగులో.. నువ్వేం మాయ చేశావో గానీ.. (ఒక్కడు), నమ్మిన నా మది.. (రాఘవేంద్ర), కోపమా నాపైనా.. (వర్షం), నీకోసం నీకోసం..(నేనున్నాను), అందాల శ్రీమతికి (సంక్రాంతికి), పిల్లగాలి అల్లరి (అతడు), జలజలజలపాతం నువ్వు.. (ఉప్పెన), సూసేకి అగ్గిరవ్వమాదిరి (పుష్ప 2), హైలెస్సో హైలెస్సా.. (తండేల్).. ఇలా చెప్పుకుంటూ పోతే వందలకొద్దీ పాటలు పాడింది.చదవండి: నాకు కోపమొస్తే తెలుగులోనే బూతులు తిడతా..: తమన్నా -
నన్ను తిట్టించడం కోసం లక్షలు ఖర్చు చేశారు: పూజా హెగ్డే
సెలబ్రిటీలకు పొగడ్తలే కాదు విమర్శలు కూడా వస్తుంటాయి. హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా ఎన్నోసార్లు ట్రోలింగ్ బారిన పడింది. అయితే డబ్బులిచ్చి మరీ తనను తిట్టించడం షాక్‌కు గురి చేసిందంటోందీ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. పీఆర్(Public Relations) స్ట్రాటజీలతో నాపై ట్రోలింగ్ చేయించారు. అది నన్నెంతగానో షాక్‌కు గురి చేసింది. డబ్బు ఖర్చు చేసి మరీ తిట్టించారుమీమ్ పేజెస్ వరుసగా నన్ను తిడుతూ పోస్టులు పెడుతున్నాయి. అరె, ఇదేంటి? నా గురించి కంటిన్యూగా తిడుతూనే ఉన్నారేంటి.. అనుకున్నాను. కావాలనే టార్గెట్ చేశారని తర్వాత తెలిసింది. నన్ను కిందకు లాగడానికి కొందరు ఈ రకంగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తెలుసుకున్నాను. అప్పుడు నేను, నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డాం. ఇంత దిగజారతారా? అని షాకయ్యాను. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ట్రోలింగ్ (Trolling) చేయించారు. లక్షలు ఖర్చు చేశారునన్ను కిందకు లాగాలని చూస్తున్నారంటే వారికంటే ఒక మెట్టు పైనున్నట్లే కదా! నా పేరెంట్స్‌కు ఆందోళన పడొద్దని ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాను. మరోవైపు ట్రోలింగ్ తారాస్థాయికి చేరింది.. నన్ను ట్రోల్ చేయడానికి లక్షలు ఖర్చు పెట్టారు. అసలు వారి బాధేంటో కనుక్కోమని నా టీమ్‌కు చెప్పాను. వాళ్లు మీమ్ పేజెస్‌ను సంప్రదించగా.. నన్ను తిట్టేందుకు ఫలానా మొత్తం ఇస్తున్నారని చెప్పారు. చెప్పినంత డబ్బిస్తే ట్రోలింగ్ ఆపేస్తారట!ట్రోలింగ్‌ను ఆపేయాలన్నా.. అవతలివారిని తిట్టాలన్నా మీరు కూడా ఇంత మొత్తం ఇస్తే సరిపోతుందని ఆఫర్ ఇచ్చారు. నాకది మరీ వింతగా అనిపించింది. ఇలాంటి పీఆర్ స్టంట్లు నాకు నచ్చవు. కొన్నిసార్లు భయంకరమైన కామెంట్లు పెడుతుంటారు. చెడుగా కామెంట్ చేసిన వ్యక్తి ప్రొఫైల్లోకి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. కనీసం ఒక ఫోటో, పోస్ట్‌లాంటివేవీ ఉండదు. కేవలం ఎవరో ఆశ చూపించిన డబ్బుకోసం కక్కుర్తి పడి ఇలా తిడుతున్నారని ఇట్టే అర్థమైపోతుంది అని చెప్పుకొచ్చింది.టాలీవుడ్‌కు దూరమైన బుట్టబొమ్మఒకప్పుడు టాలీవుడ్(Tollywood)లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన పూజా హెగ్డే.. తెలుగు వెండితెరపై కనిపించి చాలాకాలమే అవుతోంది. 2022లో రాధేశ్యామ్, ఆచార్య సినిమాలతో మెరిసింది. ఎఫ్ 3లో లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా పాటలో తళుక్కుమని మెరిసింది. మళ్లీ ఇంతవరకు తెలుగులో కనిపించనేలేదు. ప్రస్తుతం హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. సూర్యతో రెట్రో, రాఘవ లారెన్స్‌తో కాంచన 4, విజయ్‌తో జన నాయగన్లో నటిస్తోంది. బాలీవుడ్లో వరుణ్ ధావన్‌తో హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ చేస్తోంది.చదవండి: నీదీ నాది ఒకే కథ.. బంధువులే అసభ్యంగా.. ఏడ్చేసిన వరలక్ష్మి -
తమన్నా- విజయ్ నాకు దేవుడిచ్చిన పేరెంట్స్..: రవీనా టండన్ కూతురు
తమన్నా భాటియా (Tamannaah Bhatia)- విజయ్ వర్మ (Vijay Varma).. ప్రేమకబుర్లు చెప్పుకున్నారు. పెళ్లి కోసం కలలు కన్నారు. వాటిని కలగానే మిగుల్చుతూ విడిపోయారు. పెళ్లి ముఖ్యమా? కెరీర్ ముఖ్యమా? అంటే కెరీరే కావాలని విజయ్ అన్నాడని.. అందుకనే విడిపోయారన్న ప్రచారమూ జరిగింది. ముచ్చటైన జంట అనుకునేలోపే ప్రేమ బంధాన్ని ముక్కలు చేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.చాలా త్వరగా క్లోజ్ అయిపోయాం!ఇటీవల ముంబైలో జరిగిన హోలీ ఈవెంట్‌కు వీరిద్దరూ విడివిడిగా హాజరయ్యారు. రవీనా టండన్ కూతురు రాషా (Rasha Thadani)తో కలిసి హోలీ ఆడారు. తమన్నా, విజయ్ అంటే రాషాకు బోలెడంత ఇష్టం. దాని గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఓ బర్త్‌డే పార్టీకి వెళ్లాను. అక్కడ తమన్నా కూడా ఉంది. ఓ సింగర్ పాడుతూ ఉంటే స్టేజీ ముందు డ్యాన్స్ చేస్తున్నాను. తమన్నా కూడా అక్కడే స్టెప్పులేస్తోంది. ఒకరినొకరం చూసుకున్నాం. కలిసి డ్యాన్స్ చేశాం. అలా పరిచయం ఏర్పడింది. చాలా త్వరగా క్లోజ్ అయిపోయాం.వీళ్లిద్దరూ నా గాడ్పేరెంట్స్తను లేకపోతే ఏం చేయాలో కూడా తోచదు. తమన్నా, విజయ్ వర్మ.. వీరిద్దరూ నాకు అంత బాగా క్లోజ్ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే దేవుడిచ్చిన పేరెంట్స్ అయ్యారు అని చెప్పుకొచ్చింది. రాషా.. ఇటీవలే 20వ పడిలోకి అడుగుపెట్టింది. తన బర్త్‌డే పార్టీకి తమన్నా కూడా హాజరైంది. ఇదిలా ఉంటే రాషా ఈ ఏడాదే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన తొలి చిత్రం ఆజాద్. జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.చదవండి: బాలీవుడ్లో ఒక్క హీరోకు కూడా చేతకాలేదు, కానీ అల్లు అర్జున్..: గణేశ్ ఆచార్య -
బాలీవుడ్లో ఒక్క హీరోకు కూడా చేతకాలేదు, కానీ అల్లు అర్జున్..: గణేశ్ ఆచార్య
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. అలాగే 24 విభాగాలు సరిగా పనిచేస్తేనే సినిమా సంపూర్ణమవుతుంది. కానీ సినిమా విజయం సాధించినప్పుడు చాలామంది కేవలం దర్శకులు, హీరోలను మాత్రమే మెచ్చుకుంటారు. ఆ విజయానికి దోహదపడ్డవారిని ప్రత్యేకంగా గుర్తించరు. అయితే దక్షిణాదిన మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందంటున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య (Ganesh Acharya). ముఖ్యంగా అల్లు అర్జున్ పిలిచి మరీ అభినందించడం మర్చిపోలేనంటున్నాడు. ఇతడు పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ అందించాడు.ఒకేసారి మేకప్తాజాగా కమెడియన్ భారతీ సింగ్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గణేశ్ ఆచార్య మాట్లాడుతూ.. 'దక్షిణాదిలో టెక్నీషియన్లకు గుర్తింపు, గౌరవం ఇస్తారు. నటీనటులు పదేపదే మేకప్స్ వేసుకోరు. ఉదయం ఒక్కసారి మేకప్ వేసుకున్నాక నేరుగా లంచ్‌కు వెళ్లిపోతారు. ఆ మధ్యలో మళ్లీ ముఖానికి రంగు పూసుకోవడం ఉండదు. మేనేజర్ల హడావుడి అసలే ఉండదు. అంతా ఒక పద్ధతిగా సాగిపోతుంది.చివరి నిమిషంలో డ్యాన్స్ స్టెప్పులు మార్చమంటారుడ్యాన్స్ విషయానికి వస్తే.. చాలామంది దర్శనిర్మాతలు మా కొరియోగ్రఫీ బాగుందని, దాన్ని యథాతథంగా పాటలో ఉంచాల్సిందేనని మా ముందు బీరాలు పలుకుతారు. కానీ స్టార్ హీరోల ముందు మాత్రం మౌనంగా ఉండిపోతారు. వారు అభ్యంతరం చెప్పగానే చివరి నిమిషంలో స్టెప్పుల్ని మార్చేయమంటారు. ఆ పాట కోసం మేమెంత కష్టపడ్డామన్నది పట్టించుకోరు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా నాకెంతో బాధగా అనిపిస్తుంది.మనకు ఇగో ఎక్కువ.. కానీ సౌత్‌లో..బాలీవుడ్లో జనాలు కేవలం హీరోనే పొగుడుతారు. దర్శకుడు, కొరియోగ్రాఫర్, టెక్నీషియన్ల ప్రతిభను, కష్టాన్ని ఏమాత్రం గుర్తించరు. పైగా మనకు ఇగోలు ఎక్కువ. కానీ సౌత్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పుష్ప పాటలకు నేను కొరియోగ్రఫీ చేసిన కొద్ది రోజుల తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) నన్ను పిలిచి మరీ అభినందించాడు. మాస్టర్, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది అని మెచ్చుకున్నారు. బాలీవుడ్లో అలా అభినందించిన హీరో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. (చదవండి: విశాల్ చెల్లెలి భర్తపై సీబీఐ కేసు)పుష్ప సక్సెస్ పార్టీకి ఆహ్వానంకానీ అల్లు అర్జున్ నన్ను గుర్తించాడు. జనాలు నా డ్యాన్స్ చూసి పొగుడుతున్నారంటే దానికి కారణం మీరే అన్నారు. మనసు సంతోషంతో నిండిపోయింది. అక్కడితో ఆగలేదు. హైదరాబాద్‌లో జరిగిన పుష్ప సక్సెస్ పార్టీకి నన్ను ఆహ్వానించాడు. తాగి తూలుతూ డ్యాన్స్ చేసే పార్టీ కాదది. ప్రతి టెక్నీషియన్ ఆ పార్టీలో భాగమయ్యాడు. స్టేజీపై పుష్ప సినిమాకు పని చేసిన లైట్మెన్ను కూడా అవార్డుతో సత్కరించారు.బాలీవుడ్‌ను తక్కువ చేయాలని కాదు!నేను బాలీవుడ్‌ను తక్కువ చేసి మాట్లాడటం లేదు. హిందీ ఇండస్ట్రీ మాకెంతో ఇచ్చింది. దానివల్లే ఈ స్థాయిలో ఉన్నాం. కానీ కొందరి కారణంగా మన చిత్రపరిశ్రమ అద్వాణ్నంగా మారిపోతోంది. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గణేశ్ ఆచార్య చెప్పుకొచ్చాడు. ఈయన పుష్ప 1లో దాక్కో దాక్కో మేక.., ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా పాటకు కొరియోగ్రఫీ చేశాడు. పుష్ప 2లో సూసేకి అగ్గిరవ్వ మాదిరి.., కిస్సిక్.. పాటకు స్టెప్పులు నేర్పించాడు.చదవండి: ఇంట్లో ఉన్నప్పుడు ఐదారుగురు మంది అసభ్యంగా తాకారు.. ఏడ్చేసిన వరలక్ష్మి -
ఐశ్వర్య ఫోన్ చేస్తే టెన్షన్ వచ్చేస్తుంది: అభిషేక్ బచ్చన్
అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇటీవలే 'బి హ్యాపీ' చిత్రంతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో కూతురి గెలుపు కోసం పాటుపడే తండ్రిగా కనిపించాడు. అయితే తండ్రయ్యాక రొమాంటిక్ సీన్లలో నటించడానికి ఇబ్బందిగా ఉందని.. దానివల్ల అలాంటి సన్నివేశాలున్న సినిమాలను వదిలేసుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఉత్తమ నటుడిగా తొలి అవార్డ్ఇకపోతే 'ఐ వాంట్ టు టాక్' (I want to Talk) చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా షోషా రీల్ అవార్డు అందుకున్నాడు. ఉత్తమ నటుడిగా నేను గెల్చుకున్న తొలి అవార్డు ఇదేనంటూ అభిషేక్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంతలో హీరో అర్జున్ కపూర్.. ఐ వాంట్ టు టాక్ (నేను నీతో మాట్లాడాలి) అని ఎవరు అన్నప్పుడు నువ్వు టెన్షన్ పడతావు? అని ప్రశ్నించాడు.పెళ్లయితే తెలుస్తుందిఅందుకు అభిషేక్.. నీకింకా పెళ్లి కాలేదు కదా.. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు దానికి ఆన్సరేంటో నీకే తెలుస్తుంది. నా భార్య ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అన్నప్పుడు ఒత్తిడిగా ఫీలవుతాను. ప్రత్యేకంగా మాట్లాడాలని ఫోన్ చేసిందంటే కచ్చితంగా మనం సమస్యలో ఇరుక్కున్నట్లే లెక్క అని సరదాగా చెప్పాడు. కాగా అభిషేక్, ఐశ్వర్య రాయ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఆరాధ్య జన్మించింది. కాగా అభిషేక్- ఐశ్వర్య విడిపోతున్నట్లు పలుమార్లు రూమర్లు రాగా.. అవి నిజం కాదని నటుడు క్లారిటీ ఇచ్చాడు.చదవండి: నీదీ నాది ఒకే కథ.. బంధువులే అసభ్యంగా.. ఏడ్చేసిన వరలక్ష్మి -
ఛావాను వదలని కేటుగాళ్లు.. కేసు నమోదు
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన హిస్టారికల్ చిత్రం ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ జీవితంగా ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. నెల రోజులైనా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు వసూళ్లు సాధించింది.అయితే గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టి పీడిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సూపర్ హిట్ సినిమా ఛావాను కూడా పైరసీ చేశారు కేటుగాళ్లు. దీంతో ఛావా మేకర్స్ పోలీసులను ఆశ్రయించారు. ఆగస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ శ్రీ రజత్ రాహుల్ హక్సర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఇప్పటికే పలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఛావాను ప్రదర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మేకర్స్. నిర్మాణ సంస్థ మడ్హాక్ ఫిల్మ్స్ ఏర్పాటు చేసిన యాంటీ పైరసీ ఏజెన్సీ పైరసికీ సంబంధించిన ఇంటర్నెట్ లింకులను పోలీసులకు సమర్పించింది. దీనిపై ముంబయిలోని సౌత్ సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. -
మా సినిమాను ఓటీటీలు తిరస్కరించాయి.. ఎందుకంటే?: జాన్ అబ్రహం
బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఇటీవలే ఓ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శివమ్ నాయర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది డిప్లొమాట్ ఈనెలలోనే థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో విడుదలైన తొలివారంలోనే రూ.20 కోట్ల మార్క్ చేరుకునేందుకు దగ్గరలో ఉంది. ఈ సందర్భంగా హీరో జాన్ అబ్రహం ఓ ఆసక్తకర విషయాన్ని పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన జాన్ తన మూవీని కొనేందుకు ఎవరూ కూడా ముందుకు రాలేదని అన్నారు. స్టూడియోలతో పాటు ఓటీటీలు కూడా ఆసక్తి చూపలేదని వెల్లడించారు.ది డిప్లొమాట్పై జాన్ అబ్రహం మాట్లాడుతూ..'మొదట మా సినిమా స్టూడియోలు నమ్మలేదు. కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఓటీటీలను సంప్రదిస్తే వారు కూడా తిరస్కరించారు. ఎందుకంటే మా సినిమాను తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే ఈ సినిమా నిర్మించిన నిర్మాణ సంస్థ సామర్థ్యంపై వారికి నమ్మకం లేదు. అందువల్లే మా సినిమాపై వారికి ఎలాంటి అంచనాలు లేవు. అయితే థియేటర్లలో రిలీజైన తర్వాత వారి నిర్ణయం తప్పు అని నిరూపించాం. జీరో నుంచి మొదలై ప్రేక్షకుల అభిమానం సాధించాం. మా చిత్రంపై సున్నా అంచనాలు ఉండటమే మాకు కలిసొచ్చింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత కొంతమంది వచ్చి గత పదేళ్లలో ఈ బ్యానర్లో ఉత్తమ చిత్రం ఇదే అని అన్నారని' వెల్లడించారుకాగా.. ది డిప్లొమాట్ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. భారతీయ దౌత్యవేత్త జేపీ సింగ్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో ఆయన పాత్రలో జాన్ కనిపించాడు. ఈ మూవీలో సాదియా ఖతీబ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని జాన్స్ జేఏ ఎంటర్టైన్మెంట్తో పాటు టీ సిరీస్, ఫార్చ్యూన్ పిక్చర్స్, సీతా ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. మార్చి 14న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.19 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
తప్పెవరిదైనా సారీ చెప్పేదొకరే.. భార్య కోసం వంట చేసిపెడ్తున్న చై!?
టాలీవుడ్ జంట నాగచైతన్య (Naga Chaitanya)- శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. ప్రముఖ మ్యాగజైన్ వోగ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్‌స్టాగ్రామ్‌లోనే తమ ప్రేమ మొదలైందని వెల్లడించారు. తాజాగా ఎవరు సారీ చెప్తారు? పెళ్లి తర్వాత వంట ఎవరు చేసిపెడ్తున్నారు? వంటి విషయాలను అన్నింటినీ వోగ్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.సారీ ఎవరు చెప్తారు?తప్పు ఎవరిదైనా సరే ఎవరు సారీ చెప్తారు? అన్న ప్రశ్నకు శోభిత తనే క్షమాపణలు చెప్తానంది. అది విని ఆశ్చర్యపోయిన చై.. నువ్వసలు సారీలు, థాంక్స్ నమ్మవు కదా అన్నాడు. అందుకామె ప్రేమలో క్షమాపణలు, కృతజ్ఞతలకు చోటు లేదు అని పేర్కొంది. దాంతో నవ్వేసిన చైతూ.. తనే సారీ చెప్తానని ఒప్పుకుంటూనే మొదటగా ప్రేమను వ్యక్తపరిచింది కూడా తానే అని ఒప్పుకున్నాడు. నీకది లేదులే.. చై సెటైర్లుఎవరు బాగా వంట చేస్తారంటే తామిద్దరికీ వంట రాదన్నారు. కాకపోతే ప్రతిరోజు షూట్ నుంచి ఇంటికి రాగానే చై.. హాట్ చాక్లెట్ చేసిస్తాడంది శోభిత. అది వంట కిందకు రాదని, అది ప్రతి ఒక్కరికీ ఉండే కనీస నైపుణ్యం. కానీ నీకు లేదులే అని సెటైర్ వేశాడు. సినిమాలు చూడటం ఇష్టమని చై అంటుంటే.. చైను చూస్తూ ఉండిపోవడం నాకిష్టం అని పేర్కొంది శోభిత. చై 100 సినిమాలు చూస్తే నేను ఐదు చూసుంటానంది. వాదనల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్నకు ఎప్పుడూ చైతూయే గెలుస్తాడంది.అదే శోభిత హాబీశోభిత ఎక్కువ సరదాగా ఉంటుంది. నాకు ఫేమస్ పాటల హుక్ స్టెప్స్ నేర్పిస్తూ ఉంటుంది. అది తనకు హాబీ.. కాకపోతే అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రం ప్రాణం పోయినట్లే చేస్తుంది. కాస్త అస్వస్థతకు గురైనా అసలు ఓర్చుకోలేదు. నీరసంతో కింద పడిపోతుంది అన్నాడు నాగచైతన్య.చదవండి: బిగ్‌బాస్ నుంచి నాగార్జున తప్పుకోవాలి.. రానా బెటర్: సోనియా -
Dhanashree Verma: సరిగ్గా అదే టైంకి ధన శ్రీ పాట రిలీజ్
యూట్యూబర్ ధనశ్రీ వర్మ ఈ మధ్య మళ్లీ వార్తల్లో నిలిచింది. దీనికి ప్రధాన కారణం విడాకులు. టీమిండియా క్రికెటర్ చాహల్ ని పెళ్లి చేసుకున్న ఈమె.. గత కొన్నాళ్లుగా అతడికి దూరంగా ఉంటోంది. తాజాగా కోర్ట్ వీళ్లిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. కానీ ఇదే టైంలో ధనశ్రీ.. గృహహింసపై చేసిన ఓ పాట రిలీజ్ కావడం చర్చనీయాంశమైంది.2020 డిసెంబరులో చాహల్- ధనశ్రీ పెళ్లి చేసుకున్నారు. ఐపీఎల్ తన భర్త ఆడే ప్రతి మ్యాచ్ కి ధనశ్రీ వచ్చేది. మరి ఏమైందో ఏమో కొన్నాళ్ల క్రితం వీళ్లిద్దరూ ఇన్ స్టాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. అదే టైంలో ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్ల ఇస్తారనే రూమర్స్ వినిపించాయి. వీటిని ధనశ్రీ కుటుంబం ఖండింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి కొత్త సినిమా)మరోవైపు చాహల్.. ఆర్జే మహ్ వశ్ అనే అమ్మాయితో కనిపించడం హాట్ టాపిక్ అయింది. ఇవన్నీ పక్కనబెడితే తాజాగా న్యాయస్థానం చాహల్-ధనశ్రీకి విడాకులు మంజూరు చేసింది. భరణంగా రూ.4.75 కోట్లు ఇస్తాడని తేలింది. ఇదంతా గురువారం జరగ్గా.. అదే టైంలో ధనశ్రీ నటించిన ఓ ఆల్బమ్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.'దేఖా జీ దేఖా మైనే' అని సాగే ఈ పాటంతా గృహహింస నేపథ్యంగా తీశారు. ధనశ్రీ.. గృహహింస బాధితురాలు, భర్త చేతిలో మోసపోయిన మహిళగా కనిపించింది. భర్తను ఎంతగానో ప్రేమించినప్పటికీ.. అతడు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉండటం.. అడిగినందుకు దాడి చేయడం, చివరకు విడాకులు తీసుకోవడం లాంటి సీన్స్ ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే చాహల్ పై ప్రతీకారంగా ధనశ్రీ ఈ పాట తీసిందా అనే సందేహం వచ్చింది.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?) -
నా ఇంటి గేటుని ఆమె పెళ్లి చేసుకుంది: 'యానిమల్' హీరో
రణబీర్ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ 'యానిమల్' సినిమా వల్ల మనోళ్లకు కూడా తెగ నచ్చేశాడు. ఇతడి భార్య ఆలియా భట్.. తెలుగులో 'ఆర్ఆర్ఆర్' మూవీలో హీరోయిన్ గానూ చేసింది.ఇకపోతే వీళ్లిద్దరూ 2022 ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లది ప్రేమ వివాహం. అదే ఏడాది నవంబరులో వీళ్లకు కూతురు కూడా పుట్టింది. సరే ఇదంతా పక్కనబెడితే ఆలియా తన మొదటి భార్య కాదని, గతంలో ఓ క్రేజీ అనుభవం ఉందని రణబీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు)'హీరోగా నేను నటిస్తున్న తొలినాళ్లలో ఓ అమ్మాయి.. ఏకంగా పెళ్లి కూతురిలా రెడీ అయి నా ఇంటి దగ్గరకొచ్చింది. కూడా పురోహితుడు ఉన్నాడు. ఆ సమయానికి నేను వేరే దేశంలో ఉన్నాను. దీంతో నా ఇంటి గేటుకి బొట్టు పెట్టి ఆమె పెళ్లి చేసుకుంది. తిరిగొచ్చి మా వాచ్ మన్ ద్వారా జరిగిందంతా తెలుసుకుని.. ఇదేదో క్రేజీగా ఉందే అనుకున్నాను. ఇప్పటివరకైతే నా తొలి భార్యని కలుసుకోలేకపోయాను. ఏదో రోజు కచ్చితంగా కలుస్తానని అనుకుంటున్నాను' అని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు.మరి రణబీర్ అన్నట్లు అప్పుడెప్పుడో ఇతడి ఇంటి గేటుని పెళ్లి చేసుకున్న ఆ వీరాభిమాని ఎక్కడుందో? మరి ఇప్పుడు రణబీర్ చెప్పిన మాటలకు స్పందిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: కాలమే సమాధానం.. పోలీసు విచారణ తర్వాత విష్ణుప్రియ) -
ఆర్థిక ఇబ్బందులు.. ఆగిపోయిన ప్రాజెక్ట్.. అయినా నిలదొక్కుకున్న నటుడు
చిన్నప్పటి నుంచి టీవీల్లో డ్యాన్స్ షోలు చూస్తూ డాన్సర్ కావాలనుకునేవాడు రోహిత్ సరాఫ్. వెండితెరపై కుమారుడిని చూడాలని కలలు కనేవాడు అతడి తండ్రి. అయితే తన కల నెరవేరే భాగ్యాన్ని చూడలేదు. రోహిత్ పన్నెండేళ్లు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. ‘నాన్న ఆత్మకు శాంతి చేకూరాలంటే నేను నటుడిని కావాల్సిందే’ అని బలంగా డిసైడైపోయాడు రోహిత్.టీవీ షోల నుంచి..ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన సరాఫ్ ఒక టీవీ చానల్ యూత్ షోకు హాజరయ్యాడు. కెమెరా ముందుకు రావడం కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపించింది. ‘బాగా కష్టపడితేగానీ ఇక్కడ నెగ్గుకు రాలేం’ అనుకున్నాడు. మొదటి సంవత్సరం రెండు టీవీ షోలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత యాడ్స్‌లో, ఒక సినిమాలో అవకాశం వచ్చింది. అయితే... తొలి సినిమా షూట్ చేసిన రెండున్నరేళ్ల తరువాత అది ఆగిపోయిందని తెలుసుకున్నాడు. బాగా నిరాశకు గురయ్యాడు.ఆర్థిక ఇబ్బందులు..ఆడిషన్స్‌కు కూడా వెళ్లేవాడు కాదు. దీంతో ఎవరి నుంచి పిలుపు వచ్చేది కాదు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. ఆ చీకటి రోజులలో ‘ఇలా అయితే ఎలా?’ అని తనకు తానే ప్రశ్న వేసుకున్నాడు. మళ్లీ కష్టపడాలని గట్టిగా అనుకున్నాడు. ‘ప్రతిరోజూ కొండంత ధైర్యంతో, కోటి కలలతో నిద్ర లేవాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు.డియర్ జిందగీ, హిచ్కీ, ది స్కై ఈజ్ పింక్‌లాంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ‘యస్...నాకు భవిష్యత్తు ఉంది’ అనే ఆశాకిరణం ఉజ్వలంగా మెరిసింది. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘మిస్మ్యాచ్డ్’ తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. ప్రస్తుతం మణిరత్నం– కమల్‌హాసన్ సినిమాలో, ధర్మ ప్రొడక్షన్‌లాంటి పెద్ద సంస్థ సినిమాలో నటిస్తున్నాడు. ‘కలలు అనేవి పిరికి వాళ్ల కోసం కాదు. ధైర్యంగా ఉండే వ్యక్తుల కోసమే’ అంటున్న 28 సంవత్సరాల రోహిత్ సరాఫ్ ఫోర్బ్స్ ఇండియా ‘30 అండర్ 30’ జాబితాలో చోటు సాధించాడు.చదవండి: ‘పెళ్లికాని ప్రసాద్’ మూవీ రివ్యూ -
శోభితలో నాకు బాగా నచ్చేదదే.. తన నుంచి నేర్చుకోవాలి: నాగచైతన్య
పెళ్లయ్యాక అదృష్టం కలిసొస్తుందంటారు. కిరణ్ అబ్బవరం.. రహస్యను పెళ్లి చేసుకున్నా 'క' మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. అటు నాగచైతన్య (Naga Chaitanya).. శోభిత (Sobhita Dhulipala)ను పెళ్లాడాక 'తండేల్'తో పెద్ద హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ అవకపోతే ఇంట్లో పరువు పోతుందని తెగ భయపడిపోయాడు. చివరకు విజయం దక్కడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ మధ్యే ఇద్దరూ మెక్సికోలో హనీమూన్‌కు కూడా వెళ్లొచ్చారు.అప్పటిదాకా చైను ఫాలో కాలేతాజాగా ఈ జంట వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శోభిత మాట్లాడుతూ.. ఓసారి నేను సోషల్ మీడియాలో అభిమానులడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాను. అప్పుడో వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతున్న అక్కినేని నాగచైతన్యను తిరిగి ఎందుకు ఫాలో అవడం లేదు? అని ప్రశ్నించారు. అవునా అని ఆశ్చర్యపోతూ అతడి ప్రొఫైల్ చెక్ చేశా.. తను కేవలం 70 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. అందులో నేనూ ఉన్నాను. నచ్చినవాటి కోసం..అది చూసి కాస్త ఖుషీ అయ్యాను. వెంటనే నేనూ ఫాలో కొట్టాను. అప్పటినుంచి అతడి పోస్టులు రావడం.. ఒకరికొకరం మెసేజ్ చేసుకోవడం మొదలైంది. 2022 ఏప్రిల్‌లో తొలిసారి ఇద్దరం కలుసుకుని లంచ్ డేట్‌కు వెళ్లాం. తను చాలా సింపుల్‌గా ఉంటాడు. తను ఇష్టపడే బైక్‌ను రెండు గంటల సమయం కేటాయించి తనే శుభ్రం చేసుకుంటాడు. తనకు నచ్చిన వస్తువుల కోసం, వ్యక్తుల కోసం ఏదైనా చేస్తాడు. (చదవండి: సినిమాల్లో అసభ్యకర స్టెప్పులు... మహిళా కమిషన్ సీరియస్)శోభితలో బాగా నచ్చే అంశం అదే!జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాడు. కస్టడీ ఫ్లాప్ అయినప్పుడు, తండేల్ హిట్టయినప్పుడు ఒకేలా ఉన్నాడు అని చెప్పుకొచ్చింది. నాగచైతన్య మాట్లాడుతూ.. శోభిత చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. అది నాకు బాగా నచ్చుతుంది. మా ఇంట్లో వారంతా కూడా తెలుగులోనే మాట్లాడతారు. కానీ నేను చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళం భాష వచ్చేసింది. బయటకు వెళ్తే తమిళం, ఇంట్లో ఇంగ్లీష్‌లో మాట్లాడేవాడిని. ఫోటోలో స్మైల్ ఇవ్వు అంటే..శోభిత మాట్లాడే తెలుగు ముందు నా భాష దేనికీ పనికిరాదు. ఈ విషయంలో ఆమెను మెచ్చుకోవాల్సిందే! నాకూ తెలుగు నేర్పించమని అడుగుతూ ఉంటాను. అలాగే తన మేధస్సును కూడా పంచమని చెప్తుంటాను. ఇకపోతే శోభిత ఫోటోల్లో పెద్దగా నవ్వనే నవ్వదు. ఎందుకలా ఉంటావ్, కాస్త నవ్వుతూ దిగొచ్చుగా అంటే నేను లోపల నవ్వుతున్నాను, కానీ మీరెవరూ చూడలేకపోతున్నారు అని నాకే డైలాగ్స్ వేస్తుంది అని చై చెప్పుకొచ్చాడు. చై-శోభిత 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు.చదవండి: తమన్‌ని అన్‌ఫాలో చేసిన రామ్ చరణ్..నిజమెంత? -
'ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యా'.. మహిళపై ప్రియాంక చోప్రా ప్రశంసలు
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ మూవీతో బిజీగా ఉంది. దర్శకధీరుడు రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఒడిశా షెడ్యూల్ పూర్తి కావడంతో ప్యాకప్ చెప్పేశారు. దీంతో చిత్రబృందంతో పాటు ప్రియాంక చోప్రా ముంబయికి ప్రయాణమైంది. అయితే తాజాగా ఇవాళ షూటింగ్ లోకేషన్ నుంచి వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తుండగా దారిలో ప్రకృతి అందాలను తన సెల్‌ఫోన్ కెమెరాలో బంధించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే అందులో ప్రియాంక చోప్రా ఓ వీడియోను కూడా పంచుకుంది. ఓ మహిళను చూసి తాను ఇన్స్పైర్ అయ్యానని తెలిపింది. ఆమె తనలో స్ఫూర్తి నింపిందని కొనియాడింది. అందుకే ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకోవాలనిపించిందని తెలిపింది.(ఇది చదవండి: SSMB29 ఒడిశా షెడ్యూల్ పూర్తి.. ఫొటోలు వైరల్)వీడియోలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..'నేను ఇలా తరచుగా చేయను. కానీ ఈరోజు ఎందుకో నాకు చాలా స్ఫూర్తినిచ్చే సంఘటన ఎదురైంది. నేను ముంబయికి వెళ్లేక్రమంలో విశాఖపట్నం విమానాశ్రయానికి కారులో వెళ్తున్నా. వైజాగ్ ట్రాఫిక్‌లో ఓ మహిళ జామపండ్లు అమ్ముతుండటం చూశాను. నాకు కచ్చా (పచ్చి) జామపండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే నేను వెంటనే ఆమెను ఆపి మీ జామపండ్లన్నింటికీ ఖరీదు ఎంత? అని అడిగాను. ఆమె 150 రూపాయలు అని చెప్పింది. నేను తనకు 200 రూపాయల నోటు ఇచ్చా. కానీ ఆమె నాకు చిల్లర ఇవ్వడానికి ప్రయత్నించింది. వద్దు.. దయచేసి మీరే ఉంచుకోండి అని తనతో అన్నా. ఎందుకంటే జీవనోపాధి కోసం ఆమె జామపండ్లు అమ్మింది. కానీ ట్రాఫిక్‌లో గ్రీన్ సిగ్నల్ పడేలోపే ఆమె తిరిగి వచ్చి నాకు మరో రెండు జామపండ్లు ఇచ్చింది. అంటే ఆ మహిళ నా నుంచి ఎలాంటి దాతృత్వాన్ని కోరుకోలేదు. ఆమె తీరు నిజంగా నన్ను కదిలించింది' అని పంచుకుంది.ఈ వీడియోతో పాటు ఎస్ఎస్ఎంబీ29 సెట్లో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం హాలీవుడ్లో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమా ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ఇది 2019 లో విడుదలైంది. ఇటీవల సిటాడెల్ రెండవ సీజన్ షూటింగ్ ముగించుకుని ఇండియాకు తిరిగొచ్చింది. ప్రస్తుతం మహేశ్ బాబు మూవీలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
వెండితెరపై సునీత విలియమ్స్ బయోపిక్?
సునీతా విలియమ్స్ (Sunita Williams).. ఈ పేరు ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం మారోమోగిపోతోంది. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ దాదాపు 9 నెలల పాటు అంతతరిక్షంలోనే గడిపి మంగళవారం(భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 2.41 గంటలకు) స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమి మీదకు వచ్చింది. సునీత క్షేమంగా రావాలంటూ యావత్ ప్రపంచం కోరుకుంది. ఆమె క్షేమంగా భూమి మీదకు చేరుకుందనే వార్త తెలియగానే సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?)ఆమె చేసిన సేవలను, సాహసాలను కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సునీతా విలియమ్స్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతుందట. ఆమె చేసిన సాహోసోపేతమైన యాత్రలను వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నయట. ఇప్పటికే బాలీవుడ్‌కి చెందిన పలువురు దర్శక నిర్మాతలు సునీత లైఫ్ జర్నీని కథగా మలిచే పనిలో పడ్డారట. బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ సునీతా విలియమ్స్ బయోపిక్ గురించి చర్చలు జరుగుతున్నాయట. సునీత విలియమ్స్ జీవితంలోని స్ఫూర్తిదాయక అంశాలు, ఆమె శిక్షణ, నాసాలో చేరడం, అంతరిక్షంలో 322 రోజులు గడపడం, మరియు భూమికి సురక్షితంగా తిరిగి రావడం.. ఈ అంశాలతో భారీ బడ్జెట్లో ఓ సినిమా చేసేందుకు బాలీవుడ్‌కి చెందిన బడా డెరెక్టర్ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్‌తో సునీతకు సంబంధం ఉండడంతో ఆమె బయోపిక్‌ని ఇక్కడ కచ్చితంగా ఆదరిస్తారని సదరు దర్శకుడు బలంగా నమ్ముతున్నాడట. మరి సునీతా బయోపిక్ వచ్చేది హాలీవుడ్ లోనా? లేదా బాలీవుడ్లోనా? చూడాలి. -
సగం బాలీవుడ్ 'ఐపీఎల్' కోసం.. ఒక్క రాత్రి ఖర్చు ఎంతంటే?
మన దేశంలో జనాలు ఏది ఎక్కువ ఇష్టపడతారో అంటే టక్కున చెప్పే మాట సినిమాలు, క్రికెట్. మరీ ముఖ్యంగా ఐపీఎల్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ సెలబ్రిటీల ఆటపాట ఉండాల్సిందే. స్టార్ హీరోహీరోయిన్లు వస్తారు, తమదైన డ్యాన్సులతో ఫుల్లుగా ఎంటర్ టైన్ చేస్తారు. మిగతా సీజన్ల మాటేమో గానీ ఈ సీజన్ (IPL 2025) ప్రారంభోత్సవానికి సగం బాలీవుడ్ వచ్చే ప్లాన్ చేశారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)ప్రతి సీజన్ లోనూ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో 2-3 గంటల ప్రోగ్రామ్ ఉంటుంది. ఈసారి తొలి మ్యాచ్ కోల్ కతా vs బెంగళూరు (KKR vs RCB) మధ్య జరగనుంది. కోల్ కతా జట్టు ఓనర్ షారుక్ ఎలానూ ఉంటాడు. మరోవైపు సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, సంజయ్ దత్, వరుణ్ ధావన్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.హీరోయిన్లలో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, 'యానిమల్' తృప్తి, శ్రద్దా కపూర్, తమన్నా, ఊర్వశి రౌతేలా, కరీనా కపూర్, పూజా హెగ్డే.. ఇలా లిస్ట్ చాలా పెద్దగానే ఉన్నట్లు సమాచారం. వీళ్లతో పాటు స్టార్ సింగర్స్ అర్జిత్ సింగ్, శ్రేయా ఘెషల్, అమెరికన్ పాప్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ కూడా ఫెర్ఫార్మ్ చేయనుంది.అయితే వీళ్లేం ఊరికే రారుగా. ఐపీఎల్ మేనేజ్ మెంట్ లేదా ఆయా ఫ్రాంఛెజీలు కోట్ల రూపాయల పారితోషికం చెల్లిస్తాయట. మొత్తంగా రెండు మూడు గంటల పాటు జరిగే ప్రోగ్రామ్ కోసం రూ.40-50 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారని టాక్. వీటిలో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?) -
ఛీ ఛీ అదేం టైటిల్..?: స్టార్ హీరో సినిమాపై జయా బచ్చన్ విమర్శలు!
అదో బ్లాక్ బస్టర్ మూవీ. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు రాబట్టి రికార్టు సృష్టించిన చిత్రం. కానీ ఆ చిత్రం అంటే తనకు నచ్చదని, అసలు ఆ సినిమానే చూడలేదని చెబుతోంది బాలీవుడ్ నటి, ఎంపీ జయా బచ్చన్(Jaya Bachchan). ఆ సినిమాకి పెట్టిన పేరు నచ్చకపోవడంతోనే తాను ఇప్పటివరకు ఆ మూవీ చూడలేదని, తన దృష్టిలో అదొక ఫ్లాప్ చిత్రమని చెబుతోంది. జయ బచ్చన్‌కి నచ్చని ఆ చిత్రం పేరే ‘టాయిటెట్: ఎక్ ప్రేమ్ కథ’ ( Toilet Ek Prem Katha Movie). అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రం 2017లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. శ్రీ నారాయణ్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రంపై జయా బచ్చన్ తీవ్ర విమర్శలు చేసింది. ఓ జాతియ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో జయాబచ్చన్ మాట్లాడుతూ.. ‘సినిమాలు చూసే విషయంలోనూ నేను కొన్ని కండీషన్స్ పెట్టుకున్నా. టైటిల్ నచ్చకపోతే సినిమా చూడను. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ’ పేరు నాకు ఏమాత్రం నచ్చలేదు. ఒక్కసారి ఆ టైటిల్ చూడండి. అలాంటి పేరు ఉన్న సినిమాలు చూడాలని నేను ఎప్పుడూ అనుకోను. ఛీ ఛీ అసలు అదేం పేరు? నిజంగా అది కూడా ఒక పేరేనా?. అది బ్లాక్ బస్టర్ హిట్ అయినా.. నా దృష్టిలో మాత్రం ఫ్లాప్ చిత్రమే’ అని జయా బచ్చన్ అన్నారు.‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ’ సినిమా కథ విషయానికొస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న టాయిలెట్ల కొరతను ఎత్తి చూపుతూ శ్రీ నారాయణ్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అక్షయ్‌కి జోడీగా భూమి ఫడ్నేకర్ నటించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోరిక మేరకు గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించడానికి ఓ భర్త ఏం చేశాడనేది ఆ సినిమా కథాంశం. -
రూ.120 కోట్లతో అమితాబ్ టాప్!
మన దేశంలో పలువురు సెలబ్రిటీలు సినిమాలు, యాడ్స్, షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తారు. అదే టైంలో ప్రభుత్వానికి ట్యాక్స్ (పన్ను) కూడా కడుతుంటారు. అదీ కోట్లలోనే ఉంటుంది. తాజాగా ఈ లిస్టులో అగ్రస్థానానికి బిగ్ బీ అమితాబ్ (Amitabh Bachchan) వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ గత ఏడాది కాలంలో ఎంత సంపాదించారంటే?(ఇదీ చదవండి: చిరంజీవికి ముద్దు.. ఈ ఫొటో వెనక ఇంత కథ ఉందా?)82 ఏళ్ల వయసులోనే ఫుల్ ఎనర్జీతో పనిచేస్తున్న అమితాబ్ బచ్చన్.. గతేడాది 'కల్కి'లో (Kalki 2898AD) ప్రభాస్ కి ధీటుగా నటించి ఆకట్టుకున్నారు. మరోవైపు 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోతోనూ అలరిస్తున్నారు. కొన్ని యాడ్స్ కూడా చేస్తున్నారు. అలా 2024-25 సంవత్సరానికి గానూ దాదాపు రూ.350 కోట్ల వరకు సంపాదించారట. ఇందులోనూ రూ.120 కోట్ల ట్యాక్స్ ఈ మధ్యే కట్టారట.మన దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టే సెలబ్రిటీల్లో గతేడాది షారుక్ ఖాన్ (రూ.92 కోట్లు) అగ్రస్థానంలో నిలిచినట్లు వార్తలొచ్చాయి. ఇతడి తర్వాత తమిళ హీరో దళపతి విజయ్ (రూ.80 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.75 కోట్లు) ఉండగా.. నాలుగో స్థానంలో అమితాబ్ ఉన్నాడు. ఈసారికి వచ్చేసరికి ఎక్కువ పన్ను కట్టి టాప్ లోకి వచ్చేశాడని సమాచారం.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?) -
సందీప్ వంగా 'యానిమల్'.. ఒకవేళ ధోనీ చేస్తే?
సందీప్ రెడ్డి పేరు చెప్పగానే 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలే గుర్తొస్తాయి. రా అండ్ రస్టిక్ స్టోరీలతో తీసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉన్న సందీప్.. సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు ధోనీతో కలిసి ఓ యాడ్ లో కనిపించాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్' పాటల్ని పక్కనపడేసిన తమన్)ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ఓ ప్రముఖ కంపెనీ యాడ్ తాజాగా రిలీజ్ చేసింది. 'యానిమల్' సినిమాలో ధోనీ నటిస్తే ఎలా ఉంటుందో.. అచ్చుగుద్దినట్లు ఈ యాడ్ ని అలానే రూపొందించారు. బ్లూ కోట్ లో బ్లాక్ కలర్ కార్ నుంచి దిగే సీన్, సినిమా ప్రారంభంలో హీరోయిన్ ఇంటికి హీరో వెళ్లే సీన్, క్లైమాక్స్ లో హీరో చేతితో సైగ చేసి చూపించే సీన్.. ఇలా ఫుల్ సీరియస్ గా ఉంటే మూడు సీన్స్ తీసుకుని వాటితో యాడ్ చేశారు.'యానిమల్' సీరియస్ మూవీ కాగా.. ఈ యాడ్ ఏమో ఫుల్ నవ్వు తెప్పిస్తోంది. ఇందులో ధోనీతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కనిపించడం విశేషం. ఏదేమైనా మూవీ స్ఫూప్ లా తీసిన ఈ యాడ్.. ఇప్పుడు వైరల్ అయిపోయవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?) -
బాక్సాఫీస్ వద్ద ఛావా దూకుడు.. పుష్ప-2 రికార్డ్ బ్రేక్!
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన పీరియాడికల్ డ్రామా ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 14 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఛావా రిలీజైన ఐదో వారంలో మరో సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. హిందీ బాక్సాఫీస్ వద్ద ఐదో వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ లిస్ట్‌లో ఛావా రూ.22 కోట్లు రాబట్టగా.. గతేడాది విడుదలైన స్త్రీ-2 రూ.16 కోట్లు, అల్లు అర్జున్ పుష్ప-2 రూ.14 కోట్లతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఐదో వారాంతంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఛావా నిలిచింది. పుష్ప 2 తర్వాత రష్మిక కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.కాగా.. ఈ చిత్రం ఇప్పటికే రణబీర్ కపూర్ చిత్రం యానిమల్‌ను దాటేసింది. ఈ సినిమా రిలీజైన 31 రోజుల్లో ఇండియా వ్యాప్తంగా నెట్ కలెక్షన్ 562.65 కోట్లు రాగా.. అందులో హిందీ వెర్షన్ రూ.548.7 కోట్లు, తెలుగు వెర్షన్ మరో రూ.13.95 కోట్లు రాబట్టింది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్ 661.3 కోట్లు కాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఛావా 750.5 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కాగా.. ఈ సినిమా తెలుగు వర్షన్ మార్చి 7న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. మాడాక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో దినేష్ విజన్ నిర్మించారు. View this post on Instagram A post shared by Taran Adarsh (@taranadarsh) -
ప్రియుడితో బిగ్‌బాస్ బ్యూటీ బ్రేకప్.. త్వరలోనే తెలుగులో ఎంట్రీ!
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న జంట ప్రియాంక చాహర్ చౌదరి, అంకిత్ గుప్తా. బిగ్ బాస్ సీజన్- 16లో వీరిద్దరు కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఈ సీజన్లో ప్రియాంక సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఆ రియాలిటీ షో తర్వాత వీరిద్దరు పలు సీరియల్స్‌లోనూ నటించారు. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం కాబోయే తేర్రే హో జాయేన్ హమ్ షో కోసం జతకట్టనున్నారు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఓ వార్త బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ బుల్లితెర జంట ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక, అంకిత్ తమ రిలేషన్‌కు గుడ్ బై చెప్పనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈ జంట పెళ్లికి సిద్ధమయ్యారని టాక్ వినిపించింది. కానీ తాజా పరిణామాలతో ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది.ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ నిరాశను వ్యక్తం చేశారు. అయితే ఒకరినొకరు అన్‌ఫాలో చేసినప్పటికీ.. ఇన్స్టాగ్రామ్ ఫోటోలు తొలగించలేదు. అయితే ఇదంతా రాబోయే కొత్త షో కోసం ఇలా చేశారా? అని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా.. అంకిత్ గుప్తా, ప్రియాంకతో బాలికా వధు, సద్దా హక్ సిరీయల్స్‌లో జంటగా నటించారు. ప్రియాంక చాహర్ చౌదరి శ్రీ విష్ణు హీరోగా నటించే తెలుగు చిత్రం హీరో హీరోయిన్లో కనిపించనుంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా కుమార్ కూడా నటించనుంది. -
కూతురికి పాలు పట్టిద్దామంటే రూ.5 కూడా చేతిలో లేవు: నటుడు
సినిమా సక్సెస్ అయిందంటే ఆర్టిస్టుల పంట పండినట్లే అంటుంటారు. కానీ తన విషయంలో మాత్రం ఇది తలకిందులైంటున్నాడు బాలీవుడ్ నటుడు ఆది ఇరానీ (Adi Irani). తను నటించిన సినిమాలు సక్సెస్ అయినప్పటికీ కష్టాలు మాత్రం కొనసాగాయని చెప్తున్నాడు. ఈయన 1990వ దశకంలో అనేక సినిమాలు చేశాడు. షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan), సల్మాన్ ఖాన్‌లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇబ్బందులు ఏకరువు పెట్టిన నటుడుసహాయ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆది తాజాగా తన ఇబ్బందులను బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1993లో వచ్చిన బాజీగర్ సినిమా (Baazigar Movie) షారూఖ్‌ను స్టార్‌గా మార్చింది. కానీ నాకు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. 1995లో నాకు కూతురు పుట్టింది. ఆ సమయంలో పాల ధర రూ.5గా ఉండేది. కూతురికి పాలు కొనడానికి నా దగ్గర కనీసం రూ.5 కూడా ఉండేవి కాదు. బాజీగర్ సినిమా స్టిల్పెట్రోల్కు డబ్బుల్లేకపోతే..ప్రతిరోజు నగరానికి వెళ్లి ఉద్యోగం కోసం చెప్పులరిగేలా తిరిగేవాడిని. అవకాశాల కోసం అడుక్కునేవాడిని. నా స్నేహితుడి స్కూటర్ తీసుకుని వెళ్లేవాడిని. కొన్నిసార్లు అందులో పెట్రోల్ కొట్టించడానికి కూడా నా దగ్గర డబ్బు ఉండేదికాదు. అప్పుడు బస్సుల్లో తిరిగేవాడిని. జనాలేమో.. నువ్వేంటి, బస్‌స్టాప్‌లో ఉన్నావని ఆశ్చర్యపోతూ అడిగేవారు. ఫ్రెండ్ వస్తానన్నాడు, అందుకే వెయిట్ చేస్తున్నా అని అబద్ధాలు చెప్పేవాడిని. అక్క సాయం వద్దన్నానుబస్సుల్లో తిరుగుతుంటే నీకు బస్ ఎక్కాల్సిన అవసరం ఏంటనేవారు. వారి మాటలు భరించలేక ఒక్కోసారి ఇంటికి తిరిగి వెళ్లిపోయేవాడిని. మా అక్కకు నా విషయం తెలిసి ఎన్నోసార్లు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ నేను ఒప్పుకోలేదు. తమ్ముడినైనంతమాత్రాన జీవితాంతం నన్ను పోషించాలని లేదు కదా.. పైగా తనకంటూ ఓ కుటుంబం ఉంది. అప్పటికే ఆ ఫ్యామిలీని చూసుకుంటోంది. నా బాధలేవో నేను పడ్డా..మళ్లీ నా కుటుంబాన్ని కూడా తనే చూసుకోవడం కరెక్ట్ కాదుకదా.. అందుకే నా బాధలేవో నేను పడ్డాను అని చెప్పుకొచ్చాడు. కాగా ఆది ఇరానీ అక్క అరుణ ఇరానీ అప్పటికే ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఆది ఇరానీ.. దిల్, బాజీగర్, బాద్షా, హమ్ ఆప్కే దిల్ మే రెహతా హై, వెల్కమ్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. 2022లో వచ్చిన ఎ థర్స్డే చిత్రంలో చివరిసారిగా నటించాడు.చదవండి: నువ్వు దొరకడం నా అదృష్టం.. ఈ ఏడాదైనా జరగాల్సిందే!: రవి కృష్ణ -
ఓటీటీలో భారీ యాక్షన్ మూవీ.. ఆ రోజు నుంచి ఫ్రీగా చూడొచ్చు
బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించిన చిత్రం స్కై ఫోర్స్. ఈ యాక్షన్ మూవీని దర్శక ద్వయం సందీప్ కెవ్లానీ– అభిషేక్ అనిల్ కపూర్ తెరకెక్కించారు. జియో స్టూడియోస్, మాడ్డాక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్ యూకే ప్రొడక్షన్స్ పతాకాలపై జ్యోతి దేశ్‌పాండే, అమర్ కౌశిక్, భౌమిక్, దినేశ్ విజన్ దాదాపు రూ. 160 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ వార్ నేపథ్యంలో భారతదేశపు మొదటి వైమానిక దాడి సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారీ అంచనాల మధ్య రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు వరకు కలెక్షన్లు రాబట్టింది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం రెంటల్ పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మూవీని చూడాలంటే అదనంగా రూ.249 అద్దె చెల్లించాల్సిందే. ఈ మూవీ కేవలం హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో ఇతర భాషల వారు కూడా చూడొచ్చు.అయితే ఈ సినిమాను ప్రేక్షకులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈనెల 21 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా... ఈ సినిమాలో వీర్ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కమాండర్ కేవో అహుజా పాత్రలో అక్షయ్ కుమార్, టి. విజయ పాత్రలో వీర్ పహారియా నటించారు. -
60 ఏళ్ల స్టార్ హీరోతో ప్రేమాయణం.. అందుకే ప్రేమించానన్న ప్రియురాలు
ప్రేమ ఎప్పుడు? ఎక్కడ? ఎలా? చిగురిస్తుందో తెలియదంటారు. ఆమిర్ ఖాన్ (Aamir Khan) విషయంలోనూ ఇదే జరిగింది. 25 ఏళ్లుగా పరిచయస్తురాలైన గౌరీ స్ప్రాట్ (Gauri Spratt)తో ప్రేమలో పడతానని కలలో కూడా ఊహించకపోవచ్చు. కానీ ఏమైంది? రెండేళ్లక్రితం మనసు మాట వినలేదు. గౌరీ గురించే పరితపించసాగింది. ఇది స్నేహం కాదు ప్రేమ అని ఆమిర్‌కు అర్థమయ్యింది. అదే మాట ఆమెతో చెప్పగా తను కూడా సంతోషంగా ఒప్పుకుంది.60 ఏళ్ల హీరోతో ప్రేమ..అయితే ఆమిర్ ఖాన్ ఈ ఏడాది 60వ వయసులోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని వారికి విడాకులిచ్చేశాడు. మరి అంతటి పెద్దాయనను ఈవిడ ఎలా ప్రేమించింది? అని సోషల్ మీడియాలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అనుమానాలకు చెక్ పెట్టింది గౌరి. ఆమిర్‌ను జీవిత భాగస్వామిగా ఎంచుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. ప్రేమకు కారణం అదా!నా లైఫ్‌లో ఒక జెంటిల్మన్ ఉండాలనుకున్నాను. ఎక్కడలేని ప్రేమ కురిపించడంతోపాటు.. దయాగుణం కలిగుండే వ్యక్తి నా జీవితంలోకి వస్తే బాగుండనుకున్నాను అని గౌరి చెప్పింది. ఇంతలో ఆమిర్ అందుకుంటూ.. అప్పుడు నేను నీకు కనిపించాను కదూ.. అంటూ సరదాగా బదులిచ్చాడు. గౌరీ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు. తను పెరిగిందంతా బెంగళూరులోనే కాదు. పెద్దగా హిందీ సినిమాలు కూడా చూడదట! గౌరీకి ఆరేళ్ల కుమారుడునన్ను సూపర్‌స్టార్‌గా చూడదు కానీ పార్ట్నర్గా మాత్రం భావిస్తోందని ఆమిర్ స్వయంగా పేర్కొన్నాడు. మార్చి 12న ఆమెను తన స్నేహితులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌కు పరిచయం చేశాడు. ఇకపోతే గౌరీకి గతంలో పెళ్లయినట్లు తెలుస్తోంది. ఆమెకు ఆరేళ్ల కుమారుడు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. తను ముంబైలో బిబ్లంట్ అనే సెలూన్ నడుపుతోంది.చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్ -
60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్
బరువు తగ్గడం అనేది పెద్ద టాస్కే. అదీ 50 దాటిన తరువాత అధిక బరువును తగ్గించు కోవడానికి చాలా కృషి, పట్టుదల, ప్రేరణ కావాలి. ఇతర ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని వెయిట్ లాస్ జర్నీని ప్లాన్ చేసుకోవాలి. అలా ప్రముఖ నిర్మాత,సల్మాన్ ఖాన్ స్నేహితుడు, సాజిద్ నదియాడ్ వాలా బరువును తగ్గించుకుని ఫిట్‌గా మారిన తీరు అభిమానులను ఆశ్చర్యపర్చింది. అతని బాడీలోని భారీ పరివర్తన, బాగా బరువు తగ్గి స్మార్ట్‌గా తయారైన అతడి ఫోటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి..బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'సికందర్' చిత్రానికి సాజిద్ నిర్మాత. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సాజిద్ ఫేస్ ఆఫ్ ది ఇంటర్నెట్గా మారిపోయాడు. అతని భార్య వార్దా ఖాన్ బాగా సన్నగా ఉన్న భర్త సాజిద్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. రిప్డ్ జీన్స్, డెనిమ్ జాకెట్, బటన్స్ లేని షర్ట్‌లో అస్సలు గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సాజిద్‌ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా 59 ఏళ్ల వయసులో, ఆరోగ్యంగా, సంతోషంగా, ఫిట్‌గా కనిపిస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాడు. అభిమానులు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.“ఎంత సెక్సీ లుక్… అబ్ తో ఫిల్మ్ మే హీరో బన్నే కా సమయ్ ఆ గయా హై” (సెక్సీగా ఉన్నారు.. ఇక సినిమాల్లో హీరో ఐపోయే సమయం వచ్చింది.)"అప్నా అస్లీ సికందర్ యే హై (మా నిజమైన సికందర్)" , ‘‘యువ హీరోలకు కఠినమైన పోటీ...” ,“21 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు! జవానీ కా రాజ్ క్యా హై?” ( ఈ యంగ్ లుక్ వెనుక రహస్యం ఏమిటి?), తదితర వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.కాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నిర్మించిన ‘సికందర్’ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈద్‌కు విడుదల కానున్న ఈ మూవీలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, ప్రతీక్ బబ్బర్, సత్యరాజ్ , శర్మన్ జోషి ప్రధాన పాత్రలు పోషించారు.50ల తరువాత బరువు తగ్గడం, జాగ్రత్తలు శరీరం వయస్సు పెరిగే కొద్దీ, కండరాలు, అవయవాలు, ఎముకలు ధృడత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. 50 ఏళ్లు దాటాకి ఇది మరీ పెరుగుతుంది. అందుకే ఆహారం, వ్యాయామం , జీవనశైలిపై దృష్టి పెట్టడం చాలా అవసరం అవుతుంది. ఈక్రమంలో పురుషులు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను పరిశీలిద్దాంహైడ్రేషన్: 60కి సమీపిస్తున్న తరుణంలో వెయట్ లాస్ అంటే చాలా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి.ముఖ్యంగా హైడ్రేషన్ అనే గోల్డెన్ టిప్‌ను అస్సలు మిస్ చేయకూడదు. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచి, మూత్రపిండాల పనితీరుకు సహాయపడుతుంది, టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.ఆహారం: కండరాల బలం కోసం చికెన్, గుడ్డు, పనీర్, కాయధాన్యాలు వంటి ప్రోటీన్లున్న ఫుడ్ తీసుకోవాలి. జీర్ణక్రియకోసం తృణధాన్యాలు, కరిగే ఫైబర్, పండ్లు , కూరగాయలపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యకరమైన మెటబాలిజం రేటుపై శ్రద్ధపెట్టాలి. .తీపి పదార్థాలకు దూరంగా : తీపి పానీయాలు, చక్కెర కలిగిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఫుడ్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. లేదంటే అరుగుదల సమస్యలు, కొవ్వు పేరుకు పోవడం లాంటి సమస్యలొస్తాయి.వ్యాయామం: ప్రతి వ్యక్తికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. బాడీలో అన్ని ఎ ముకలు, కీళ్ల కీళ్ల స్వేచ్ఛా కదలికల నిమిత్తం క్రమం తప్పకుండా వ్యాయామం చాలా అవసరం. ఇది మొత్తం కండరాల, ఎముక బలానికి కూడా సహాయపడుతుంది.నిద్రకు ప్రాధాన్యత: సరియైన నిద్ర అనేది మరో ప్రధాన మైన నియమం. నాణ్యమైన 8-9 గంటల నిద్ర చాలా ముఖ్యం. ఇది శరీరం కోలుకోవడానికి,విశ్రాంతికి సహాయపడుతుంది. -
17 ఏళ్లకే వాడిలో అలాంటి ఆలోచనలా: అదితి
మహారాష్ట్రకు చెందిన అదితి పోహంకర్.. షీ,ఆశ్రమం అనే వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయింది. ఆపై క్యాడ్బరీ మంచ్, గోద్రెజ్, ఎయిర్టెల్, లెన్స్‌కార్ట్, శామ్సంగ్తో సహా ఇరవైకి పైగా ప్రముఖ కంపెనీలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలలో నటించింది. ది టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో 2020లో 47వ ర్యాంక్‌ని పొందింది. అయితే, తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో చిన్నతనంలో తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఆమె చెప్పుకొచ్చింది.ఒకరోజు తన అమ్మతో స్కూల్‌కు వెళ్తుండగా జరిగిన సంఘటనను ఆదితి పోహంకర్ ఇలా చెప్పింది. 'అమ్మ, సీఏఐసీడబ్ల్యూఏ టీచర్‌గా ఉన్నప్పుడు.. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇద్దరం కలిసి బస్సులో వెళుతుండగా ఓ ప్రయాణికుడు నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సీట్ లేకపోవడంతో నేను నిల్చోనే ఉన్నాను. ఆ సమయంలో అతను నాపై చేయి వేయడం గమనించాను. వెంటనే అమ్మతో చెప్పాను. అతను భయంతో వెళ్తున్న క్రమంలో నన్ను బలంగా పక్కకు లాగేశాడు. దీంతో నేను కింద పడిపోయాను. ఆ గాయం ఇప్పటికీ ఉంది.' అని చెప్పింది.'నేను సినిమా ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ముంబై రైలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. నేను లేడీస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్నాను. కానీ, అందులో 18 ఏళ్ల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులు ఎవరైనా సరే ప్రయాణించవచ్చని నిబంధన ఉంది. ఆ రోజు 17 ఏళ్ల విద్యార్థి అకస్మాత్తుగా నా ఛాతీని బలంగా టచ్ చేశాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాను. అప్పుడు నాకేమీ అర్థం కావడం లేదు. నేను గట్టిగా అరిచిన కూడా అక్కడున్న వారెవరూ పట్టించుకోలేదు. అప్పుడు మరోస్టాప్ రాగానే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇంతలో ఆ అబ్బాయి వెళ్లిపోయాడు. పోలీసులు పట్టించుకోలేదని వారిని నిలదీశాను. దీంతో తిరిగి నాపైనే కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. అతను మీపై చేయి వేశాడని రుజువు ఏంటి అంటూ ప్రశ్నించారు. కానీ, అంత చిన్న వయసులోనే వాడి చెడు ఆలోచన నన్ను బాగా కలిచివేసింది.' అని ఆమె గుర్తుచేసుకుంది.షీ వెబ్ సిరీస్‌లో కానిస్టేబుల్ భూమిగా నటించిన అదితి, బోహంకర్ నాయక్ అనే డ్రగ్ కింగ్‌పిన్‌ను పట్టుకోవడానికి రెడ్ లైట్ ఏరియా అమ్మాయిగా రహస్యంగా వెళ్తుంది. ఈ సిరీస్‌లో ఆమె చాలావరకు మితిమీరిన గ్లామర్ పాత్రలోనే కనిపిస్తుంది. విజయ్ వర్మతో కొన్ని ఇంటిమేట్ సీన్లు కూడా చేస్తుంది. బాబీ డియోల్ నటించిన ఆశ్రమ్ వెబ్‌సిరీస్‌లో కూడా ఆమె చాలా రొమాన్స్ సన్నివేశాలలో నటించింది. అశ్లీల సన్నివేశాల్లో నటించాలంటే నటీమణుల కంటే నటులే ఎక్కువ భయపడతారని ఆమె చెప్పుకొచ్చింది. -
తండేల్‌ను వెనక్కి నెట్టిన ఎమర్జన్సీ.. సిల్లీ ఆస్కార్ అంటూ కంగనా కామెంట్స్!
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). చాలాసార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ మూవీలో కంనగా ఇందిరా గాంధీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆడియన్స్‌ను అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విఫలమైన ఈ సినిమా ఓటీటీలో దూసుకెళ్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇండియన్ సినిమాల జాబితాలో టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. నాగచైతన్య మూవీ తండేల్, అజయ్ దేవగణ్ ఆజాద్ సినిమాలను వెనక్కి నెట్టేసింది.ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్స్ ఎమర్జన్సీ చిత్రాన్ని ఉద్దేశించి ట్వీట్స్ చేశారు. ఈ చిత్రాన్ని భారత్ నుంచి ఆస్కార్ పంపాలని పోస్ట్ చేశాడు. వీటికి సోషల్ మీడియా వేదికగా కంగనా రిప్లై ఇచ్చింది. ఇన్‌స్టా లో ట్వీట్స్‌ను షేర్ చేస్తూ తనదైన శైలిలో స్పందించింది. అమెరికా లాంటి దేశం ఇలాంటి సినిమాలను గుర్తించడానికి ఇష్టపడరు. వారు అభివృద్ధి చెందుతున్న దేశాలను అణచివేస్తారు. అదే ఈ ఎమర్జన్సీలో చూపించాను. వారి సిల్లీ ఆస్కార్ అవార్డ్‌ను వాళ్ల వద్దే ఉంచుకోనివ్వండి. మాకు నేషనల్ అవార్డులు ఉన్నాయని నెటిజన్‌కు రిప్లై ఇచ్చింది.బాలీవుడ్ చిత్ర నిర్మాత సంజయ్ గుప్తా కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ రోజు నేను ఎమర్జెన్సీ మూవీని చూశాను. చాలా స్పష్టంగా చెప్పాలంటే.. నేను ముందుగా అంచనా వేసినట్లుగా ఈ సినిమాను ప్లాన్ చేయలేదని అన్నారు. ఈ సినిమాలో కంగనా నటన, దర్శకత్వం రెండూ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. దీనికి కంగనా బదులిస్తూ 'సినిమా పరిశ్రమ తన ద్వేషం, పక్షపాతాల నుంచి బయటపడాలి.. మంచి పనిని ఎప్పటికీ గుర్తించాలి సంజయ్ జీ.. మీరు ఆ అడ్డంకిని బద్దలు కొట్టినందుకు ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది.కాగా.. నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం విడుదలైన ఎమర్జెన్సీ మూడు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్ సినిమాల జాబితాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అజయ్ దేవగన్ ఆజాద్, నాగ చైతన్య తండేల్ చిత్రాలను అధిగమించింది. ఈ చిత్రం కంగనా రనౌత్ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటించారు. 1975లో అప్పటి ప్రధానమంత్రి విధించిన 21 నెలల ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్, దివంగత నటుడు సతీష్ కౌశిక్ కూడా నటించారు. ఈ మూవీని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. -
హృతిక్ రోషన్ క్రిష్-4.. బిగ్ షాకిచ్చిన నిర్మాత!
హృతిక్ రోషన్, ప్రీతి జింటా నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కోయి మిల్ గయా'. ఈ మూవీకి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ మూవీ సీక్వెల్‌గా వచ్చిన చిత్రం క్రిష్. ఈ మూవీలో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా జంటగా నటించారు. ఆ తర్వాత వచ్చిన క్రిష్ -3లో హృతిక్, ప్రియాంక, వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్ కీలక పాత్రల్లో నటించారు. అలా ఈ సిరీస్‌లో వచ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.అయితే ఈ సిరీస్‌లో క్రిష్-4 రానుందని చాలాకాలంగా బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను సిద్ధార్థ్ ఆనంద్ నిర్మించనున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈ మూవీకి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించారని టాక్ వినిపించింది. ఈ మూవీకి తాను డైరెక్షన్ చేయడం లేదని హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.అయితే తాజాగా ఈ నిర్మాణ బాధ్యతల నుంచి సిద్ధార్థ్ ఆనంద్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.700 కోట్ల భారీ బడ్జెట్ కావడంతోనే సిద్ధార్థ్ ఆనంద్ ఆలోచనలో పడ్డారని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అందుకే నిర్మాణ బాధ్యతల నుంచి వైదొలగారని సమాచారం. తాజా పరిణామాలు చూస్తే అతనితో పాటు కరణ్ మల్హోత్రా ఈ ప్రాజెక్ట్ తప్పుకున్నట్లు అర్థమవుతోంది. దీంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రిష్-4 ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.సిద్ధార్థ్ ఆనంద్‌తో పాటు కరణ్ తప్పుకోవడంతో ఈ మూవీకి కొత్త దర్శకత్వంలో తెరకెక్కించే ఛాన్స్ ఉంది. కొత్త టీమ్‌తో మళ్లీ బడ్జెట్‌ను అంచనా లు తయారు చేయాల్సి ఉంది. ఇప్పటికే రాకేష్ రోషన్ కూడా తాను దర్శకుడిగా చేయడం లేదని చెప్పడంతో మరో డైరెక్టర్ ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. కాగా.. క్రిష్, క్రిష్ -3 చిత్రాలకు రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే క్రిష్-4 కూడా ఆయనే డైరెక్ట్ చేస్తాడని అభిమానులంతా భావించారు. కానీ తాజా ఇంటర్వ్యూలో తాను దర్శకత్వం చేయడం లేదని చెప్పేశారు. ఈ బాధ్యతలు వేరే దర్శకుడికి అప్పగించనున్నట్లు వెల్లడించారుయ. అయితే ఇప్పుడు తాను డైరెక్ట్ చేసినా బ్లాక్ బస్టర్ అవుతుందన్న గ్యారెంటీ లేదని అన్నారు. అందుకే దర్శకత్వం మార్పు అవసరమని స్పష్టం చేశారు. -
అఫీషియల్: అనుమానాల్లేవ్.. చెప్పిన టైంకే 'వార్ 2'
ఎన్టీఆర్ చేస్తున్న తొలి హిందీ మూవీ 'వార్ 2'. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుగుతోంది. మొన్నీమధ్యే డ్యాన్స్ ప్రాక్టీసు చేస్తూ హృతిక్ రోషన్ మోకాలికి గాయం కావడంతో విడుదల ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని రూమర్స్ వినిపించాయి. కానీ వీటికి చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్.. మరోసారి తేదీపై క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: రామ్ చరణ్.. ఓ 'అద్దె ఆటగాడు'?)'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తారక్.. గతేడాది 'దేవర'గా వచ్చాడు. ఈ ఏడాది 'వార్ 2'తో రాబోతున్నాడు. తాజాగా ట్విటర్ లో ఓ మీమ్ పేజ్.. ఈ మూవీ కోసం వీడియో చేసింది. దీనికి రిప్లై ఇచ్చిన యష్ రాజ్ ఫిల్మ్స్.. ఆగస్టు 14న 'వార్ 2' థియేటర్లలోకి వస్తుందని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.యష్ రాజ్ ఫిల్మ్స్ తీస్తున్న స్పై యూనివర్స్ లో తొలుత 'ఏక్ థ టైగర్'(2012) వచ్చింది. దీని కొనసాగింపుగా 'టైగర్ జిందా హై' (2017), 'వార్' (2019), 'పఠాన్'(2023) వచ్చాయి. వీటిలో భాగమైన 'వార్ 2'.. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఇదే ఏడాది క్రిస్మస్ కి ఈ యూనివర్స్ లో భాగమైన 'ఆల్పా' కూడా విడుదల కానుంది.(ఇదీ చదవండి: మళ్లీ హాస్పిటల్ బెడ్ పై సమంత)Must say… you have set it up brilliantly even before we have started our marketing of #War2 🔥😎💥😱💪 ... there will be mayhem in cinemas on 14 August 2025, worldwide… 😈⚠️‼️🚨🤯 https://t.co/eVmQRLLJtG— Yash Raj Films (@yrf) March 16, 2025 -
ఆయన త్వరగా కోలుకోవాలి.. దయచేసి నన్ను అలా పిలవొద్దు: సైరా భాను
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఏఆర్ రెహమాన్. గతేడాది చివర్లో తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. దాదాపు 28 ఏళ్ల తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ ఆస్పత్రి పాలయ్యారు. డీ హైడ్రేషన్‌కు గురికావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం డిశ్ఛార్డ్ అయ్యారు.తాజాగా ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై ఆయన భార్య సైరా భాను ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నానని తెలిపారు. ఆయనకు ఛాతీలో నొప్పితో ఆస్పత్రిలో చేరినట్లు నాకు తెలిసింది.. ఆ దేవుడి ఆశీర్వాదంతో ప్రస్తుతం బాగానే ఉన్నారని.. ఎవరూ కూడా ఆందోళనకు గురి కావొద్దని అభిమానులను కోరారు. అయితే మేమిద్దరం ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదని అన్నారు. కేవలం నా ఆరోగ్య సమస్యల కారణంగానే విడిపోయామని.. గత రెండేళ్లుగా నా పరిస్థితి బాగాలేదని పేర్కొన్నారు. నా వల్ల ఆయనకు అదనపు ఒత్తిడిని గురి చేయవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాకు ఇంకా విడాకులు మంజూరు కాలేదని.. అందువల్ల తనను మాజీ భార్య అని పిలవవద్దని మీడియాతో పాటు అందరికీ విజ్ఞప్తి చేసింది.కాగా.. ఏఆర్ రెహమాన్, సైరా భాను 1995లో వివాహం చేసుకున్నారు. గతేడాది నవంబర్‌లో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. సైరా తరపు లాయర్ వందనా షా ఈ జంట విడిపోవాలనే నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా.. ఈ జంటకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు.రెహమాన్ సినీ ప్రయాణంఏఆర్ రెహమాన్.. రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఎన్నో హిట్ చిత్రాలకు బ్లాక్‌బస్టర్ సంగీతం అందించాడు. తెలుగులో గ్యాంగ్‌మాస్టర్, నీ మనసు నాకు తెలుసు, నాని, ఏ మాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలకు పని చేశాడు. ఇటీవల వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ఛావాకు అద్భుతమైన సంగీతం అందించాడు. ప్రస్తుతం రామ్‌చరణ్-బుచ్చిబాబు సనా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈయనను ప్రభుత్వం.. పద్మ శ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకుగానూ రెండు ఆస్కార్లు అందుకున్నాడు. -
అమిర్ ఖాన్‌తో డేటింగ్.. తొలిసారి అలా కనిపించిన గౌరీ స్ప్రాట్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవల అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. తాను డేటింగ్లో ఉన్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దాదాపు 60 ఏళ్ల వయసులో అమిర్ ఖాన్ రిలేషన్లో ఉన్నానంటూ ప్రకటించడంతో ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. ఇటీవల ముంబైలో జరిగిన తన ప్రీ బర్త్ డే ఈవెంట్లో తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను మీడియా ముందు అందరికీ పరిచయం చేశాడు. దీంతో అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేశారు.అయితే తాజాగా అమీర్ ఖాన్‌తో రిలేషన్ తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది గౌరీ. అమిర్ ఖాన్ పుట్టినరోజు పార్టీలో కనిపించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.అసలు ఎవరీ గౌరీ స్ప్రాట్..కాగా.. ఇటీవల ముంబయి నిర్వహించిన ప్రెస్మీట్లో గౌరీతో తన రిలేషన్‌షిప్‌ను అమీర్ ఖాన్ ధృవీకరించారు. దాదాపు ఏడాదిగా తాము డేటింగ్లో ఉన్నామని పేర్కొన్నారు. ఆమెకు ఆరేళ్ల పాప కూడా ఉందని తెలిపారు. గత 25 ఏళ్లుగా ఆమె తెలుసని కూడా అన్నారు. అంతేకాకుండా గౌరీ ఇటీవలే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కలిశారని ఆయన ప్రస్తావించారు. కాగా.. ఇప్పటికే అమిర్ ఖాన్ కిరణ్ రావు, రీనా దత్తాలతో విడిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు బెంగళూరుకు చెందిన గౌరీ.. రీటా స్ప్రాట్ కుమార్తె. ప్రస్తుతం ఆమె ముంబయిలోనే ఓ సెలూన్‌ను నిర్వహిస్తోంది. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
ఆ సినిమా చూస్తుంటే చేదు గతం కళ్లముందుకు..: టాలీవుడ్ హీరోయిన్
కొన్ని సినిమాలు మనసును పట్టి కుదుపుతాయి. గతాన్ని, మనసుకైన గాయాల్ని గుర్తు చేస్తాయి. అలా దో పట్టి సినిమా కూడా గడిచిపోయిన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసిందంటోంది గాలి పటం హీరోయిన్ ఎరికా ఫెర్నాండేజ్ (Erica Fernandes). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎరికా మాట్లాడుతూ.. నా ప్రేమకథ అందమైనదేమీ కాదు, హింసాత్మకమైనది. అతడు నాపై చేయి చేసుకునేవాడు. అది రానురానూ ఎక్కువయ్యేది. అతడి దుర్మార్గపు ప్రవర్తన గురించి బయటకు చెప్పాలనిపించేది.. కానీ పెదవి కిందే అణిచేశాను.న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదుఒక నటిగా నేను ఏం చెప్పినా, ఏం చేసినా అది ఒక వార్తవుతుంది. పోలీసుల దగ్గరకు వెళ్దామంటే అది కూడా న్యూసే అవుతుంది. మీడియా నా వెంటపడుతుంది. అతడి పేరు చెప్పకుండా ఉందామంటే ఎవరినో ఒకరిని నాతో లింక్ చేస్తారు. పైగా నేను పోలీసులను కలిసినంతమాత్రాన న్యాయం జరుగుతుందా? అన్న ఆలోచన నా మెదడును తొలిచేసింది. న్యాయ వ్యవస్థపై నాకు అంతగా నమ్మకం లేదు. అందులోనూ నేనేదో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నానని కూడా విమర్శిస్తారు.(చదవండి: ప్రేయసితో వయసు ముదిరిన హీరో చెట్టాపట్టాల్.. మాజీ భార్యలకూ ఓకే)మాయని మచ్చగా..అందుకే మౌనంగానే ఉండిపోయాను. ఒంటరిగానే పోరాడాను. అయినా ఆ రిలేషన్ నా జీవితంలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. సినిమాల్లో ప్రేమించిన అమ్మాయిని టార్చర్ పెట్టే సన్నివేశాలు చూసినప్పుడు నా ఫ్లాష్‌బ్యాక్ అంతా ఒక్కసారిగా కళ్లముందుకు వస్తుంటుంది. దో పట్టి సినిమా చూసినప్పుడు అదే జరిగింది. ఆ సినిమా చూస్తూ నేను నా గతంలోకి వెళ్లిపోయాను. ఆ విష సంబంధాల నుంచి బయటపడేందుకు, ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అని చెప్పుకొచ్చింది.సినీ ప్రయాణంఎరికా ఫెర్నాండేజ్.. అయింతు అయింతు అయింతు అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగులో గాలిపటం, డేగ (తమిళంలో విరాట్టు సినిమా) చిత్రాల్లో కథానాయికగా మెప్పించింది. తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయింది. కసౌటీ జిందగీ కే, కుచ్ రంగ్ ప్యార్‌కే ఐసే భీ: నయీ కహానీ సీరియల్స్‌లో మెరిసింది. లవ్ అధురా అనే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది. చదవండి: ఐటం సాంగ్‌లో మల్లెపూలతో హీరోయిన్.. సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్ -
ప్రేయసితో వయసు ముదిరిన హీరో చెట్టాపట్టాల్.. మాజీ భార్యలకూ సంతోషమే!
ప్రేమకు వయసుతో పని లేదని నిరూపించాడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan). 60 ఏళ్ల వయసులో తాను డేటింగ్లో ఉన్నానని నిర్మొహమాటంగా మీడియాకు వెల్లడించాడు. గౌరీ స్ప్రాట్ (Gauri Spratt)తో ప్రేమలో ఏడాదికాలంగా ప్రేమలో ఉన్నానని తన బర్త్ సందర్భంగా వెల్లడించాడు. ఆమె కోసం ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని కూడా నియమించి తనపై ప్రేమను చాటుకున్నాడు.వైరల్‌గా మారిన వీడియోఅయితే ఆమిర్‌కు గతంలో రెండు పెళ్లిళ్లయిన విషయం తెలిసిందే! రీనా దత్తా (Reena Dutta), కిరణ్ రావు (Kiran Rao)లను పెళ్లి చేసుకోగా ఇద్దరికీ విడాకులిచ్చేశాడు. అలా అని వారితో శత్రుత్వమేమీ పెంచుకోలేదు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితుల్లా మాత్రం ఇప్పటికీ ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఫిబ్రవరి నెలలో మాజీ భార్యలతో ఆమిర్ ఓ ఫంక్షన్‌కు వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.అందరూ ఒకేచోట..క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) - సఫా మీర్జాల 9వ పెళ్లి రోజుకు ఆమిర్ వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. మాజీ భార్యలతో పాటు ప్రేయసి గౌరీని కూడా తీసుకెళ్లాడు. ఈ వీడియోను ఇర్ఫాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఆమిర్ మాజీ భార్యలు, ప్రియురాలు ఒకేచోట సంతోషంగా నవ్వుతూ కనిపించారు. ఇంత మోడ్రన్ ఫ్యామిలీని ఎక్కడా చూడలేదంటున్నారు నెటిజన్లు.సినిమాఆమిర్ ఖాన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సితారే జమీన్ పర్ మూవీ చేస్తున్నాడు. ఇది 2007లో వచ్చిన తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్ సినిమాలో కూడా భాగం కానున్నాడు. View this post on Instagram A post shared by Irfan Pathan (@irfanpathan_official) చదవండి: ఛాతి నొప్పి.. ఆస్పత్రిలో చేరిన ఏఆర్ రెహమాన్ -
అమ్మా... నాన్నా... ఒక రాహా!
‘అమ్మాయి పుట్టాక మా ఆయనలో పూర్తిగా మార్పు వచ్చింది’ అనే మాట అక్కడక్కడా వింటుంటాం. అంటే... ఎప్పుడూ ఫైర్‌బ్రాండ్‌లా ఉండే భర్త శాంతమూర్తిగా మారిపోతాడు. వ్యసనాల బారిన పడిన భర్త ఆ చీకటి నుంచి బయటికి వస్తాడు.ఒక్క ముక్కలో చెప్పాలంటే... పిల్లలకు ఉండే పవర్ అదే! తాజా విషయానికి వస్తే... ఒక ఇంటర్వ్యూలో భర్త రణ్‌బీర్ కపూర్ గురించి చెప్పారు ఆలియా.‘రాహా పుట్టిన తరువాత రణ్‌బీర్ మారిపోయాడు’ అనడమే కాదు ‘రాహాను ఎంటర్టైన్ చేయడానికి చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తాడు’ అని ప్రశంసలు కురిపించారు ఆలియా.మరి ముద్దుల కూతురు మాటేమిటి? ‘రాహా కూడా రణ్‌బీర్‌ను బాగా ఎంటర్టైన్ చేస్తుంది’ అని చెప్పారామె. ‘వారిద్దరూ మాట్లాడుకుంటుంటే తండ్రీ కూతుళ్లు మాట్లాడుకున్నట్లుగా కాకుండా ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది’ అని మురిసిపోతారు ఆలియా. ‘వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన వీడియోలు నాకు భవిష్యత్ కాలంలో అపూర్వమైన నిధులు’ అని కూడా అంటారామె.ఇంతకీ రాహా వల్ల రణ్‌బీర్‌లో వచ్చిన మార్పు ఏమిటి? ఆలియా సూటిగా చెప్పకపోయినా ఆమె మాటలను బట్టి అర్థమయ్యేదేమిటంటే.... ‘మునుపటితో పోల్చితే చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు’ ‘ఇతరులతో మాట్లాడే విధానంలో మార్పు వచ్చింది’ మార్పు... మంచిదే కదా! థ్యాంక్స్.... రాహా! రాహా అంటే స్వాహిలీ భాషలో ‘సంతోషం’ అని అర్థం. -
సల్మాన్ వల్ల ముఖానికి గాయమై విలవిల్లాడా.. అతడు సారీ కూడా చెప్పకుండా..!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తనకు గాయం చేసి కనీసం పట్టించుకోలేదంటున్నాడు నటుడు ఆది ఇరానీ (Adi Irani). గాయంతో అల్లాడిపోతుంటే తననలా గాలికి వదిలేసి వెళ్లిపోయాడని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆది ఇరానీ.. చోరీ చోరీ చుప్కే చుప్కే సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను పంచుకున్నాడు.గాజు ముక్కలు గుచ్చుకుని..ఆది మాట్లాడుతూ.. చోరీ చోరీ చుప్కే చుప్కే సినిమా షూటింగ్లో ఈ సంఘటన జరిగింది. సల్మాన్ నా వైపు గ్లాస్ ఫ్రేమ్ విసిరాడు. అది పగిలి నా ముఖం రక్తసిక్తమైంది. చిన్నచిన్న గాజు ముక్కలు నా ముఖానికి గుచ్చుకున్నాయి. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నా వల్ల కాదని చేతులెత్తేస్తే కనీసం రెండు నెలలైనా షూటింగ్ ఆగిపోవాల్సిందే! దానివల్ల నిర్మాతలు నష్టపోతారు. వారిని కష్టపెట్టడం ఇష్టం లేక కంటిన్యూ చేశాను.కనీసం సారీ చెప్పలేదుఅయితే నాకు గాయమవగానే సల్మాన్ తనకు సంబంధం లేదన్నట్లుగా అక్కడి నుంచి ఉలుకూ పలుకు లేకుండా వెళ్లిపోయాడు. నా ముఖంపై రక్తం కారుతుంటే కనీసం సారీ కూడా చెప్పకుండా నన్నలాగే వదిలేసి తన గదిలోకి వెళ్లిపోయాడు. కానీ తర్వాతి రోజు నేను షూటింగ్‌కు వచ్చినప్పుడు అతడి గదిలోకి పిలిచాడు. ఏంటని వెళ్లగా.. సారీ చెప్పాడు. ఆది, నన్ను క్షమించు.. నీ కళ్లలోకి కూడా చూడలేకపోయాను. అలా చేసినందుకు నా మనసంతా అదోలా ఉంది అంటూ మాట్లాడుతూ పోయాడు. సల్మాన్‌ది అహంకారమని నేననుకోను, అతడిది చిన్నపిల్లాడి మనస్తత్వం అని పేర్కొన్నాడు.ఆది సినీ జర్నీ..సల్మాన్ ఖాన్, రాణీ ముఖర్జీ, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం చోరీ చోరీ చుప్కే చుప్కే. అబ్బాస్ ముస్తాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2001లో విడుదలైంది. ఆది విషయానికి వస్తే.. 1978లో వచ్చిన తృష్ణ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశాడు. దిల్, బాజీగర్, అనారి నెం.1, ఎ వెడ్నస్డే, వెల్కమ్ వంటి చిత్రాల్లో సహాయ నటుడిగా మెప్పించాడు. కసౌటీ జిందగీ కే, సావిత్రి - ఏక్ ప్రేమ్ కహాని, ష్.. ఫిర్ కోయ్ హై, నాగిన్ వంటి సీరియల్స్‌లోనూ నటించాడు. -
తమన్నా బ్రేకప్.. విడి విడిగా వచ్చారు.. విడిపోయినట్లేనా!
ప్రేమలో ఉన్న మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah Bhatia), బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma ) విడిపోయినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అటు తమన్నా, ఇటు విజయ్ స్పందించకపోవడంతో నిజంగానే విడిపోయారని అంతా భావించారు. ఇలాంటి సమయంలో తమన్నా, విజయ్ తీవ్రమైన బాధలో ఉంటారని అభిమానులు ఊహించారు. కానీ ఇద్దరిలోనూ బ్రేకప్ అయిన బాధే కనిపించడంలేదు. నిన్న జరిగిన హోలీ వేడుకల్లో ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఏర్పాటు చేసిన హోలీ సంబరాలకు తమన్నా,విజయ్ హాజరయ్యారు. ప్రేమలో ఉన్నప్పుటు కలిసి వచ్చిన ఈ జంట.. నిన్న మాత్రం విడి విడిగా వచ్చి సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అయితే ఇద్దరు ముఖాల్లోనూ బాధలేదు. నవ్వుతూ ఎంట్రీ ఇచ్చారు.ఫోటోగ్రాఫర్లకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ వెళ్లిపోయారు. ఇలా ఇద్దరు వేరు వేరు ఈవెంట్‌కి వచ్చి వెళ్లడంతో మరోసారి తమన్నా, విజయ్‌ల బ్రేకప్ టాపిక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.‘లస్ట్ స్టోరీస్ 2’(2023) వెబ్ సిరీస్‌లో తమన్న, విజయ్ వర్మ కలిసి నటించారు. అదే సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తమన్నా పలు ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఇంతలోనే వీరిద్దరు విడిపోయారు. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుందామని తమన్నా అడిగితే..విజయ్ మాత్ర అందుకు నో చెప్పాడట. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఇంకొంత కాలం కెరీర్‌పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు విజయ్ అన్నాడట. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి..చివరకు విడిపోయారని బాలీవుడ్ టాక్.అయితే బ్రేకప్‌పై మాత్రం వీరిద్దరూ ఎక్కడా స్పందించలేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
హోలీ వేడుకల్లో సోనాక్షి సిన్హా.. ఆయన ఎక్కడంటూ నెటిజన్ల ట్రోల్స్!
సినీ తారలంతా హోలీ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఫ్యామిలీతో కలిసి రంగులు చల్లుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకుంటున్నారు. అందరిలాగే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సైతం హోలీ పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇవీ చూసిన అభిమానులు ఈ ముద్దుగుమ్మకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.అయితే కొందరు నెటిజన్స్ మాత్రం సోనాక్షిని ట్రోల్ చేశారు. హోలీ వేడుకల్లో మీ భర్త జహీర్ ఇక్బాల్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అయితే నెటిజన్ల కామెంట్స్‌కు సోనాక్షి కూడా స్పందించింది. 'నేను ప్రస్తుతం జటాధర మూవీ షూట్లో ఉన్నా.. నా భర్త జహీర్ ముంబయిలో ఉన్నారు.. మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి' అంటూ విమర్శలకు తనదైన స్టైల్లో కౌంటరిచ్చింది.కాగా.. గతేడాది జూన్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. సోనాక్షి, జహీర్ దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. సల్మాన్‌ఖాన్ నిర్వహించిన పార్టీలో తొలిసారిగా వీరిద్దరు కలుసుకున్నారు. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ 'నోట్‌బుక్'తో అరంగేట్రం చేసిన జహీర్.. సోనాక్షితో కలిసి డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. గతేడాది జూన్ 23, 2024న ముంబయిలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సల్మాన్ ఖాన్, కాజోల్, విద్యాబాలన్ లాంటి అగ్రతారలు హాజరయ్యారు.ఇక సినిమాల విషయానికొస్తే సోనాక్షి సిన్హా ప్రస్తుతం జటాధార చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో ఈ బ్యూటీ కళ్లకు కాటుక, చిందరవందరగా ఉన్న జుట్టుతో కనిపించింది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
మద్యానికి బానిసయ్యా.. రోజుకు 9 గంటల నరకం: స్టార్ హీరో చెల్లెలు
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉండగా స్టార్ హృతిక్ రోషన్‌కు సునయన రోషన్ అనే చెల్లెలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. తాను మద్యానికి బానిసైనట్లు వెల్లడించారు. ఆ వ్యసనం నుంచి బయప పడేందుకు చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపారు. రిహబిలిటేషన్ సెంటర్లో నరకం అనుభవించినట్లు సునయన చెప్పుకొచ్చారు. అక్కడ సాధారణ పునరావాస కేంద్రం కంటే అధ్వాన్నంగా ఉంటుందని తాను ఊహించలేదన్నారు. సునయన రోషన్ మాట్లాడుతూ.. 'ఇది మొత్తం 28 రోజుల కోర్సు. అయితే ఇది సాధారణ పునరావాసం లాంటిది కాదు. ప్రాథమికంగా అక్కడ ఎలాంటి వ్యసనానికైనా చికిత్స అందస్తారు. ఆ సెంటర్లో దాదాపు 56 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే అక్కడి వాతావరణం సాధారణ పునరావాసం కంటే చాలా దారుణంగా ఉంది. అసలు నార్మల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నన్ను రోజుకు 9 గంటల పాటు ఓకే గదిలో ఉంచేవారు. అలా ప్రత్యక్షం నరకం అనుభవించా' అని తెలిపింది.అయితే తాను బాగుపడతానని తెలిసే అక్కడికి వెళ్లినట్లు సునయన రోషన్ తెలిపారు. మద్య వ్యసనం నుండి బయటపడేందుకు జీవితంలో ముందుకు సాగడానికి ఒక అడుగుగా భావించినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో కేవలం నాకు కాల్ చేసే వ్యక్తుల నంబర్లు మాత్రం అమ్మ వారికి ఇచ్చిందని వెల్లడించింది. అక్కడికి సెల్ ఫోన్లు, షుగర్, కాఫీ , చాక్లెట్, పెర్ఫ్యూమ్లు అనుమతించరని ఆమె చెప్పింది. అయితే పునరావాసం నుంచి బయటపడిన క్షణంలోనే తన తండ్రి రాకేష్ రోషన్‌కు క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదని సునయన రోషన్ వెల్లడించింది. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో.. పేరు వచ్చినా అవకాశాలు రావడం లేదు: నటుడు
కష్టపడు.. ఫలితం ఆశించకు అంటుంటారు. కానీ ఏళ్లతరబడి కష్టపడుతూనే ఉన్నా ఫలితం దక్కకపోతే ఎలా ఉంటుంది? తనదీ అదే పరిస్థితి అంటున్నాడు పంచాయత్ నటుడు దుర్గేశ్ కుమార్ (Durgesh Kumar). పంచాయ్ సిరీస్, లాపతా లేడీస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడికి అవకాశాలు రావడం లేదట! తాజాగా దుర్గేశ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తన గోడు వెల్లబోసుకున్నాడు. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లవుతోంది. ఇప్పటికీ అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాను. ఆడిషన్స్‌కు కూడా పిలవట్లేదుకష్టాలు నాకు చుట్టాలు కాదు, ఇంటిమనుషులైపోయాయి. అందరూ పంచాయత్ సిరీస్ (Panchayat Web Series)తో నేను సక్సెస్ అయ్యాననే చూస్తున్నారు. కానీ ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. గత ఏడాదిన్నర కాలంగా పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి ఒక్క ఫోన్ కాల్ రాలేదు. ఆడిషన్‌కు రమ్మని ఎవరూ పిలవలేదు. నా టాలెంట్ గుర్తించిన చిన్న నిర్మాతలతోనే నేను ఎక్కువగా పని చేస్తున్నాను. ఇప్పటికీ ఆడిషన్స్ కోసం పరిగెడుతూనే ఉన్నాను.పాపులారిటీ ఫుల్.. అవకాశాలు నిల్హైవే, పంచాయత్ ప్రాజెక్టులతో నన్ను నేను నిరూపించుకున్నాక కూడా ఎవరూ పెద్దపాత్రలు ఇవ్వడం లేదు. అందరికీ నేను తెలుసు. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. నా పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియడం లేదు. ఇంకో విషయమేంటంటే.. నేను నటించిన సినిమాలు అవార్డులు సాధిస్తున్నాయి. పలువురు సినీవిశ్లేషకులు ఆయా సినిమాలను మెచ్చుకుంటున్నారు కానీ అందులో ఎక్కడా నా పేరు ప్రస్తావించడం లేదు. పంచాయత్‌తో ట్రెండింగ్‌లో..నాకు రావాల్సిన క్రెడిట్ ఎప్పుడూ రాదు. కనీసం ప్రేక్షకులైనా నా పనిని గుర్తించినందుకు గర్విస్తున్నాను అన్నాడు. సరైన పని దొరక్కపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దుర్గేశ్.. హైవే, సుల్తాన్, సంజు, ధడక్, భక్షక్ వంటి చిత్రాల్లో నటించాడు. పంచాయత్ సిరీస్ నటుడిగా అతడికి ఎక్కువ గుర్తింపు తెచ్చింది.చదవండి: రజనీకాంత్ భార్యగా ఛాన్స్ ఇప్పిస్తాం.. కాకపోతే ఒక కండీషన్! -
'వార్2' దర్శకుడు ఆయాన్ ముఖర్జీ ఇంట్లో విషాదం
బాలీవుడ్ ప్రముఖ నటుడు దేబ్ ముఖర్జీ శుక్రవారం (83) ఏళ్ల వయసులో మరణించారు. కొన్ని నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపుడుతున్నారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా దేబ్ మరణించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. బాలీవుడ్లో దేబ్ ముఖర్జీ కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వారి కుటుంబంలో నిర్మాతలు, దర్శకులు అనేకమంది ఉన్నారు. ఆయన కుమారుడు ఆయాన్ ముఖర్జీ 'వార్2' డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. దేబ్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని పవన్ హన్స్లో శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు ఓ ప్రకటలో తెలిపారు.దేబ్ ముఖర్జీ అంత్యక్రియలలో బాలీవుడ్ స్టార్స్ పాల్గొననున్నారు. కాజోల్, రాణి ముఖర్జీ ఇద్దరూ కూడా దేబ్ ముఖర్జీకి మేనకోడళ్ళు అవుతారు. దీంతో వారు తప్పకుండా అక్కడకు రానున్నారు. వారితో పాటుగా అజయ్ దేవ్గన్, తనూజ, తనిషా, ఆదిత్య చోప్రాతో సహా ఆయన కుటుంబ సభ్యులు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా, దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ వంటి ఆయన్ ముఖర్జీ స్నేహితులు కూడా అంత్యక్రియలకు హాజరవుతారని భావిస్తున్నారు.దేబ్ ముఖర్జీ కుమారుడు అయాన్ ముఖర్జీ వార్ 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. -
ప్రేయసి కోసం ముందు జాగ్రత్తలు తీసుకున్న 60 ఏళ్ల హీరో.. అప్పుడే..!
తోడు కోరుకోవడం తప్పేం కాదు.. అయితే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) 60 ఏళ్ల వయసులో తోడు కావాలని కోరుకోవడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు. పైగా ఇతడు రెండుసార్లు పెళ్లి చేసుకోగా.. ఇద్దరికీ విడాకులిచ్చేశాడు. విడాకులిచ్చాడన్నమాటే కానీ మాజీ భార్యల్ని సొంత మనుషుల్లా చూసుకుంటాడు. వారితో ఇప్పటికీ స్నేహితుడిగానే మెదులుతాడు.60 ఏళ్ల వయసులో డేటింగ్ఇకపోతే మార్చి 14న ఆమిర్ బర్త్‌డే. ఈ రోజు అతడు 60వ పడిలోకి అడుగుపెట్టాడు. రెండు రోజులనుంచి ప్రీబర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాను ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టి అందరికీ షాకిచ్చాడు. గౌరి స్ప్రాట్ (Gauri Spratt)ను ప్రేమిస్తున్నట్లు వెల్లడించాడు. ఆమె 25 ఏళ్లుగా తెలుసని, కాకపోతే ఏడాది నుంచే డేటింగ్లో ఉన్నామని తెలిపాడు. బెంగళూరులో నివసిస్తున్న గౌరీకి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రేయసి కోసం ముందుజాగ్రత్తఆమిర్ ప్రేయసి అనగానే అందరూ ఆమె ఎలా ఉంది? ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? అని తనను ఫాలో అవడం ఖాయం. అందుకనే ప్రేయసికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఆమె కోసం ప్రైవేట్ సెక్యురిటీని పెట్టాడు. అలాగే మీడియా ఫాలోయింగ్ ఎలా ఉంటుందో కూడా చెప్పాడట! దీని గురించి ఆమిర్ మాట్లాడుతూ.. ఒక స్టార్ కనిపిస్తే మీడియా ఎలా వారి వెంటపడతారు? ఎలా ఫాలో చేస్తారు? వంటి విషయాలన్నీ తనకు అర్థమయ్యేలా చెప్పాను. స్పెషల్ డిన్నర్ డేట్తనకివన్నీ అలవాటు కావడానికి సమయం పడుతుంది. మీరు కాస్త సహకరిస్తారని కోరుకుంటున్నాను. తనకోసం ఇప్పటికే సెక్యూరిటీని కూడా నియమించాను అని చెప్పుకొచ్చాడు. అన్నట్లు ఈరోజు ఆమిర్ బర్త్‌డే కావడంతో డిన్నర్ డేట్ ఏర్పాటు చేసిందట. క్యాండిల్స్, ఫ్లవర్స్ మధ్య వారిద్దరూ విందును ఆస్వాదించనున్నారట!పర్సనల్ లైఫ్బాలీవుడ్లో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న ఆమిర్ ఖాన్.. 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు జునైద్, కూతురు ఐరా ఖాన్ సంతానం. తర్వాత పలు కారణాల వల్ల ఆమిర్ 2002లో రీనాకు విడాకులిచ్చేశాడు. 2005లో డైరెక్టర్ కిరణ్‌రావును పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసి ద్వారా ఆజాద్ రావు జన్మించాడు. 2021లో ఈ జంట కూడా విడిపోయారు.చదవండి: సీక్రెట్ పెళ్లి.. నాలుగు నెలలకే విడాకులు.. స్పందించిన బుల్లితెర నటి -
సీక్రెట్ పెళ్లి.. నాలుగు నెలలకే విడాకులు.. స్పందించిన బుల్లితెర నటి
ఇటు ప్రేమ కావాలి, అటు కెరీర్ కావాలి అనుకుంది హిందీ బుల్లితెర నటి అదితి శర్మ (Aditi Sharma). అందుకే నాలుగేళ్లుగా డేటింగ్లో ఉన్న ప్రియుడు అభిజిత్ కౌశిక్(Abhineet Kaushik)ను సీక్రెట్‌గా పెళ్లాడింది. దంపతులుగా కొత్త జీవితం ప్రారంభించి నాలుగు నెలలైందో లేదో అప్పుడే విడాకులు కావాలన్నాడు అభిజిత్. అదితి.. నటుడు సమర్థ్య గుప్తా అత్యంత సన్నిహితంగా ఉండటం చూశానని, తనతో ఉండలేనని మీడియా ముందు వాపోయాడు.సీక్రెట్ పెళ్లి- విడాకులు.. స్పందించిన నటితాజాగా ఈ విడాకుల వ్యవహారంపై అదితి తొలిసారిగా స్పందించింది. పెళ్లయిన నెలకే గొడవలు మొదలయ్యాయి. నాతో దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇంకా చాలా జరిగాయి. కానీ విడాకుల వ్యవహారం కోర్టులో ఉన్నందున ఇప్పుడవేవీ చెప్పలేను. అతడితో ఉండలేనని అర్థమైంది. అందుకే శాంతియుతంగా విడిపోవాలనుకున్నాం. ఇరు కుటుంబాలు అందుకు ఒప్పుకున్నాయి. అతడు చాలాసార్లు నా ఫ్రెండ్స్ ముందు.. నన్ను, నా కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడాడు. కానీ నేను ఎన్నడూ అతడి కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. తనలా నేను హింసించలేదు. మనస్ఫూర్తిగా ప్రేమించాను.అందుకే చెప్పలేదుమరో విషయం.. మేము రహస్యంగా పెళ్లి చేసుకోలేదు. మా కుటుంబాలు, క్లోజ్ ఫ్రెండ్స్, బంధువులందరికీ మా వివాహం గురించి తెలుసు. అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో మా పెళ్లి జరిగింది. నా కెరీర్ గ్రాఫ్ బాగుంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకున్నానని తెలిస్తే బాగోదనిపించింది. ఎందుకంటే అపోలెనా సీరియల్లో నేను 18 ఏళ్ల అమ్మాయి పాత్ర పోషిస్తున్నాను. అందుకే పబ్లిక్కు ఈ విషయం గురించి ఇప్పుడే చెప్పకూడదనుకున్నాను అని అదితి శర్మ చెప్పుకొచ్చింది. అపోలెనా సీరియల్ నటుడు సమర్థ్య గుప్తాతో అదితిఆన్స్క్రీన్ కపుల్ మాత్రమే..ఇకపోతే అపోలెనా సీరియల్లో సమర్థ్య గుప్తా- అదితి జంటగా నటిస్తున్నారు. వీరు సన్నిహితంగా ఉంటూ దొరికిపోయారన్న అభిజిత్ మాటలపై సమర్థ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాము ఆన్‌స్క్రీన్‌పై మాత్రమే జంటగా కనిపిస్తామన్నాడు. అభిజిత్ చెప్పినట్లుగా తాము అడ్డంగా దొరికిపోయామన్నదాంట్లో ఎటువంటి నిజం లేదని వెల్లడించాడు. ఇలాంటి పిచ్చికామెంట్ల వల్ల తన పేరెంట్స్ ఇబ్బందిపడుతున్నారన్నాడు.చదవండి: ‘దిల్ రూబా’ మూవీ రివ్యూ -
Holi 2025 : భూమికి పచ్చాని రంగేసినట్టు, రంగులద్దిన ఫ్యాషన్ క్వీన్స్
హోలీ (Holi2025) పండుగ అంటే ఉల్లాసం, ఉత్సాహం. పిల్లాపెద్దా అంతా అందంగా ముస్తాబవుతారు. ఇంద్రధనుస్సు లాంటి రంగులతో ఆటలాడుకుని తమ జీవితాలు మరింత రంగులమయం శోభిల్లాలని కోరుకుంటారు. రంగు రంగుల రంగులు, గులాల్ చల్లుకొని హోలీ ఆడతారు. ఇక సెలబ్రిటీలయితే అందంగా ముస్తాబై తమ అభిమానులను అలరిస్తారు. రంగుల పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వయసుతో పని ఏముంది అని నిరూపించారు బాలీవుడ్ హీరోయిన్లు. వారెవరో చూసేద్దామా.2025 హోలీ కోసం సాంప్రదాయ చీరలో మాధురి దీక్షిత్ ( Madhuri Dixit ) ప్రశాంతకు చిహ్నమైన పచ్చని రంగులో అందంగాముస్తాబైనారు. తొమ్మిది గజాల అద్భుతంలో ఆకుపచ్చ రంగులో మాధురి యంగ్ అండ్ ఎనర్జటిక్‌గా కనిపించారు. 57 ఏళ్ల ఈ బాలీవుడ్ స్టార్ పండుగ కళతో ఉట్టిపడుతూ దేవతలామెరిపించింది.చీర అంటే గుర్తొచ్చే సెలబ్రిటీలలో మాధురి ఒకరు అనడంలో ఎలాంటి సందేహంలేదు. డిజైనర్ జయంతి రెడ్డి రూపొందించిన చీరకు వెండి జర్డోజీ ఎంబ్రాయిడరీ స్వీట్హార్ట్ నెక్లైన్, జుట్టుగా చక్కగా ముడి వేసుకకొని తన సిగ్నేచర్ లుక్కు మరింత వైభవాన్ని జోడించారు. చదవండి: Holi 2025 Celebrations: యంగ్ హీరోయిన్ల ఫ్యావరేట్ కలర్స్ ఇవే! సెలబ్రిటీ స్టైలిస్ట్, సుకృతి గ్రోవర్ మాధురి ఎథెరియల్ లుక్‌ను వజ్రాలు, పచ్చలు నిండిన మహారాణి నెక్లెస్, చెవిపోగులు, ఇతర ఆభరణలతో ఎథ్నిక్ లుక్కు మెరుపు వచ్చేసింది. గ్లామర్ విత్ ట్రెడిషన్ మాధురి షేర్ చేసిన ఫోటోలను ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి.చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా! తగ్గేదెలే అంటున్న రవీనా నాకేం తక్కువ అంటూ ఈ హోలీకి వచ్చేశారు మరో సీనియర్ నటి, 52 ఏళ్ల రవీనా టాండన్ (Raveena Tandon). 90ల కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ అందమైన దివా , ఈ హోలీకి బ్యూటీ ట్రీట్‌ను అందించింది. తన అందమైన కళ్ళతో హోలీకి రంగుల కళను తీసుకొచ్చింది. ఇద్దరు బిడ్డలతల్లి, రవీనా దేశీ స్టైల్ గ్లామ్‌లో మహారాణిలా కనిపించింది. గోధుమరంగు డ్రెస్‌కు, పింక్ కలర్ దుప్పట్టాను జోడించింది. సొగసైన ఝుంకాలు ఆమె లుక్నుమరింత ఎలివేట్ చేశాయి. హోళికా దహన్ శుభాకాంక్షలు అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
ఎన్నెల్లు తిరిగొచ్చె మా కళ్లకు! చాలా కాలంగా ప్రేమికులుగా వార్తల్లో ఉన్న కరీనాకపూర్, షాహిద్ కపూర్లు ‘బ్రేకప్’ అంటూ అభిమానులను నిరాశపరిచారు. బ్రేకప్‌కు కారణాలు ఏమిటో తెలియదుగానీ వీరి అప్పటి లవ్‌స్టోరీ ఇప్పటికీ హాట్ టాపిక్కే! వారు మళ్లీ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే చూడాలనేది ఎంతోమంది కల. వారి కల ఎట్టకేలకు నిజం అయింది. జైపూర్‌లో జరిగిన ఐఫా 2025 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాజీ జంట కరీనా కపూర్, షాహీద్ కపూర్లు ఒకరినొకరు హగ్ చేసుకున్న దృశ్యం అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విడిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకుంటున్న దృశ్యం అభిమానులకు కన్నుల పండగ అయింది. -
కాన్స్ కాలింగ్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనాలంటూ ఆలియా భట్(Alia Bhatt)కు కాల్ వచ్చింది. ఈ ఏడాది మే 13 నుంచి మే 24 వరకు ఫ్రాన్స్‌లో 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ చిత్రోత్సవాలకు ఆలియా భట్ హాజరు కానున్నారు. ఈ బ్యూటీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఇక తాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొననున్న విషయాన్ని ఆలియా భట్ ధృవీకరించారు. ఈ నెల 15న ఆమె బర్త్ డే సందర్భంగా ముంబైలో గురువారం జరిగిన ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలియా భట్ మాట్లాడుతూ– ‘‘నేను తొలిసారిగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా కాస్ట్యూమ్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయమని నా సిబ్బందికి చెప్పాను’’ అన్నారు. -
అవును.. ఆమెతో డేటింగ్లో ఉన్నా: అమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ప్రస్తుతం రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. తన స్నేహితురాలితో డేటింగ్లో ఉన్నమాట వాస్తవమేనని వెల్లడించారు. ముంబయిలో నిర్వహించిన తన పుట్టినరోజు వేడుకల ముందు ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో ఏడాదిగా డేటింగ్లో ఉన్నట్లు తెలిపారు. తాను దాదాపుగా 25 ఏళ్ల నుంచి తెలుసని అమిర్ స్పష్టం చేశారు.గౌరీ స్ప్రాట్ ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నట్లు అమిర్ ఖాన్ వెల్లడించారు. అంతేకాకుండా తన ప్రొడక్షన్ బ్యానర్లో పనిచేస్తోందని వివరించారు. ఆమెతో పాటు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నారని వివరించారు. ఆమె తన కుటుంబ సభ్యులను కూడా కలిసిందని.. మా రిలేషన్ గురించి వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఆమెతో రిలేషన్లో తాను నిబద్ధతతో, సంతోషంగా ఉన్నానని అమిర్ ఖాన్ పేర్కొన్నారు. 'లగాన్', 'దంగల్' లాంటి కొన్ని చిత్రాలను మాత్రమే గౌరీ స్ప్రాట్ చూశారని అన్నారు. తనకు 'సూపర్ స్టార్' అనే లేబుల్‌ను ఉండడాన్ని తాను నమ్మడం లేదని చెప్పినట్లు ఈ సందర్భంగా అమిర్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు.తన స్నేహితులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌లను పుట్టినరోజు విందుకు ఆహ్వానించినట్లు అమిర్ ఖాన్ తెలిపారు. ఈ డిన్నర్ పార్టీకి గౌరీ స్ప్రాట్ వచ్చిందని వెల్లడించారు. ఆమె సగం తమిళియన్ కాగా.. మరో సగం ఐరిష్ మహిళ అని అన్నారు. ఆమె తాత స్వాతంత్ర్య సమరయోధుడని అమిర్ పేర్కొన్నారు.కాగా.. అమిర్ ఖాన్ అంతకుముందే చిత్ర నిర్మాత కిరణ్ రావును పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూలై 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ దంపతులకు ఆజాద్ రావ్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. మొదట మన సూపర్ స్టార్ రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా ఖాన్, జునైద్ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెతో 2002లో విడిపోయారు. -
తలకు గాయంతో ఆస్పత్రిపాలైన భాగ్యశ్రీ.. 13 కుట్లు వేసిన డాక్టర్స్
బాలీవుడ్ నటి భాగ్యశ్రీ (Bhagyashree) ఆస్పత్రిపాలైంది. ఈ మధ్య ట్రెండింగ్‌లోకి వచ్చిన పికెల్‌బాల్ ఆడుతుండగా తలకు గాయమైంది. దీంతో ఆస్పత్రిలో చేరగా వైద్యులు ఆమె నుదురుకు 13 కుట్లు వేశారు. తలకు కట్టుతో ఉన్న భాగ్యశ్రీ ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ భాగ్యశ్రీ?అందాల తార భాగ్యశ్రీ.. ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణించింది. 1989లో మైనే ప్యార్ కియా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇందులో సల్మాన్ ఖాన్‌తో జోడీ కట్టింది. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ మరుసటి ఏడాదే వ్యాపారవేత్త హిమాలయ్ దస్సానిని పెళ్లి చేసుకుంది.తర్వాత కూడా పలు సినిమాలు చేసింది. త్యాగి, పాయల్, అమ్మవ్రా గంద (కన్నడ), మా సంతోషి మా, రెడ్ అలర్ట్: ద వార్ వి, ఛత్రపతి, ససాజిని షిండేకా వైరల్ వీడియో వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఓంకారం, యువరత్న రానా, రాధేశ్యామ్ సినిమాలతో మెప్పించింది. ఈమె చివరగా లైఫ్ హిల్ గయూ అనే హాట్‌స్టార్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.చదవండి: అంబానీ ఎవరో మాకు తెలీదు.. అయినా పెళ్లికి వచ్చాం: కిమ్ కర్దాషియన్ -
అయోధ్యలో మళ్లీ భూమి కొన్న బిగ్‌బీ.. ఈసారి పెద్ద మొత్తంలో..!
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అయోధ్యలో మరోసారి భూమి కొన్నారు. అయితే ఈసారి తను నిర్వహిస్తున్న హరివంశ్ రాయ్ బచ్చన్ ట్రస్ట్ కోసం ఈ భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. 54,454 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ల్యాండ్‌ను ఎంపిక చేసుకున్నారట. రామమందిరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమి ఉంది. దీనికోసం ఆయన రూ.86 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తండ్రి హరివంశ్ రాయ్ గౌరవార్థం అక్కడ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది.గతంలో కొన్న ప్లాట్ విలువ ఎంతంటే?అమితాబ్ గతేడాది జనవరిలో అయోధ్యలోని హవేలి అవధ్‌లో ప్లాట్ కొన్నారు. ఇందుకోసం దాదాపు రూ.4.54 కోట్లు వెచ్చించారు. ఈ ప్లాట్ కొనుగోలు చేసిన ప్రదేశానికి 10 నిమిషాల ప్రయాణ దూరంలో రామాలయం, 20 నిమిషాల దూరంలో అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. అమితాబ్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది రిలీజైన కల్కి 2898 ఏడీ, వేట్టైయాన్ సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. నెక్స్ట్ 'కౌన్ బనేగా కరోడ్ పతి 17'వ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యహరించేందుకు రెడీ అవుతున్నారు.చదవండి: వద్దంటున్నా క్రికెటర్ చాహల్‌తో లింక్.. అసలెవరీ ఆర్జే మహ్వశ్? -
వద్దంటున్నా క్రికెటర్ చాహల్‌తో లింక్.. అసలెవరీ ఆర్జే మహ్వశ్?
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal).. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటి, నిర్మాత, ఆర్జే మహ్వశ్ (RJ Mahvash) ప్రేమలో ఉన్నారంటూ కొద్ది నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే డేటింగేనా? ఎందుకిలా తయారయ్యార్రా బాబూ అని మహ్వశ్ తలపట్టుకుంది. కట్ చేస్తే ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు వీరిద్దరూ కలిసి వెళ్లారు.ఓపక్క సంతోషం.. మరోపక్క చికాకుదీంతో లవ్ గాసిప్స్‌కు మరోసారి ఆజ్యం పోసినట్లైంది. తాజాగా మరోసారి ఈ రూమర్స్‌పై మహ్వశ్ ఘాటుగా స్పందించింది. ఈ మధ్యే తనకు ఉత్తమ మెగా ఇన్ఫ్లుయెన్సర్గా అవార్డు వచ్చింది. అందుకు సంతోషపడుతూనే తనపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టింది. నేను ఈ స్థాయికి రావడం చూసి చిన్ననాటి మహ్వశ్ ఎంతో గర్విస్తోంది. ఇదే నాకు కావాల్సింది! ఏ తప్పు చేయకుండా, పనికిరాని విషయాలను పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి అని రాసుకొచ్చింది. డేటింగ్ కథనాలనుద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టిందని తెలుస్తోంది.భార్యకు చాహల్ విడాకులు!కాగా టీమిండియా ఆటగాడు యజువేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో 2020 డిసెంబర్ 20న వీరి వివాహం జరిగింది. కానీ ఐదేళ్లకే వీరు తమ దారులు వేరంటూ విడిపోయారు. వీరు విడిపోయాక చాహల్ ఎక్కువగా మహ్వశ్తో కలిసి కనిపిస్తుండటంతో డేటింగ్ రూమర్స్ పుట్టుకొచ్చాయి.ఎవరీ ఆర్జే మహ్వశ్?మహ్వశ్ రేడియో మిర్చిలో రేడియో జాకీ(ఆర్జే)గా పని చేస్తోంది.సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది.చాహల్‌తో డేటింగ్ కథనాల వల్ల జనవరిలో 1.5 మిలియన్లు ఉండే ఫాలోవర్ల సంఖ్య నేడు 2.3 మిలియన్స్‌కు చేరింది.నవాజుద్దీన్ సిద్దిఖీ, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సెక్షన్ 108' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.హీరోయిన్గా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) చదవండి: కుమారుడితో బ్రహ్మానందం నటించిన సినిమా.. ఓటీటీలో ఎప్పుడంటే? -
వీళ్లు పాడితే చాలా కాస్ట్ లీ.. లిస్టులో టాప్ ఎవరు?
సినిమాకి ఏది కీలకం అంటే చాలామంది హీరో లేదా డైరెక్టర్ అని చెబుతారు. కానీ ఒక మూవీ హిట్ కావాలంట 24 క్రాఫ్ట్స్ సరిగ్గా పనిచేయాలి. వీటిలో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. కంటెంట్ అంతంత మాత్రం ఉన్న కొన్ని చిత్రాలు కూడా సంగీతం వల్ల హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)అలా సినిమాకు ఎంతో కీలకమైన సంగీతం గురించి చెప్పుకోవాలి. తెలుగులో గాయనీగాయకులకు పెద్దగా రెమ్యునరేషన్స్ ఇవ్వరు కానీ ఉత్తరాదిలో కొందరు స్టార్ సింగర్స్ కి మాత్రం లక్షలాది రూపాయలు ఇస్తారు. మరి మన దేశంలో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే సింగర్ ఎవరు? తొలి పది స్థానాల్లో ఎవరెవరు ఉన్నారు?ఏఆర్ రెహమాన్ - స్వతహాగా ఈయన మ్యూజిక్ డైరెక్టర్. కానీ పాట పాడాలంటే మాత్రం రూ.3 కోట్లు తీసుకుంటారట. మొన్నే 'ఛావా'తో హిట్ కొట్టారు. ప్రస్తుతం చరణ్-బుచ్చిబాబు మూవీకి పనిచేస్తున్నారు.శ్రేయా ఘోషల్ - ఏ భాషలో ఎలాంటి పాటైనా సరే పాడగలిగే సింగర్ ఈమె. ఒక్కో పాటకు రూ.25 లక్షల వరకు పారితోషికంగా తీసుకుంటుందని టాక్.సునిధి చౌహాన్ - ఫేమస్ లేడీ సింగర్. ఒక్క పాట పాడితే రూ.18-20 లక్షలు ఇచ్చేయాల్సిందే. ఈమె ఎక్కువగా హిందీ సాంగ్స్ పాడుతూ ఉంటుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో టాప్-10 కోర్ట్ రూమ్ మూవీస్.. ప్రతి క్షణం థ్రిల్లో థ్రిల్)ఆర్జిత్ సింగ్ - బ్రేకప్ సాంగ్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఇతడు పాడిన పాటలే ఉంటాయి. తెలుగు, హిందీలో ఎప్పటికప్పుడు పాడుతూనే ఉంటాడు. ఒక్కో సాంగ్ కోసం రూ.18-20 లక్షలు తీసుకుంటాడట.బాద్ షా - సింగర్ గా కంటే ర్యాపర్ గా ఎక్కువ ఫేమస్. కానీ పాట పాడితే వందలాది మిలియన్ వ్యూస్ గ్యారంటీ. ఒక్కో సాంగ్ కోసం రూ.18-20 లక్షలు తీసుకుంటాడట.సోనూ నిగమ్ - దిగ్గజ సింగర్. చాన్నాళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఒక్కో సాంగ్ పాడేందుకు రూ.15-18 లక్షలు అడుగుతాడట.దిల్జీత్ దోసాంజే - సింగర్ కమ్ యాక్టర్. రీసెంట్ టైంలో కన్సర్ట్ లతో వైరల్ అవుతున్నాడు. ఒక్కో పాట పాడేందుకు రూ.10 లక్షలు, స్టేజీ మీద అయితే రూ.50 లక్షల రెమ్యునరేషన్ కావాలట.హనీ సింగ్ - ఇతడు కూడా ర్యాపర్ గా బాగా ఫేమస్. ఎప్పటికప్పుడు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఒక్కో సాంగ్ కోసం రూ.10 లక్షల వరకు ఛార్జ్ చేస్తాడట.నేహా కక్కర్ - మంచి సింగర్, కానీ సింగింగ్ షోల్లో జడ్జిగా బాగా ఫేమస్. హిందీ, పంజాబీ సాంగ్స్ ఎక్కువగా పాడుతుంది. ఒక్కో పాట కోసం రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తుందట.మికా సింగ్ - హిందీలో ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటాడు. ఒక్కో సాంగ్ కి తన గాత్రం ఇచ్చేందుకు రూ.10 లక్షల వరకు అందుకుంటాడట.(ఇదీ చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ) -
'ఛావా'.. తెర వెనక ఇంత కష్టపడ్డారా?
గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన మూవీ 'ఛావా'. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే రూ.600 కోట్ల మేర వసూళ్లు సాధించింది. తెలుగులోనూ రూ.11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)దాదాపు నెలరోజుల నుంచి థియేటర్లలో అద్భుతంగా ప్రదర్శితమవుతున్న 'ఛావా' క్లైమాక్స్ బీటీఎస్ (బిహైండ్ ద సీన్స్) వీడియోని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇందులో విక్కీ రిహార్సల్ చేయడం, ప్రొస్థటిక్ మేకప్ లాంటివి చూపించారు. ఇదంతా చూస్తున్నప్పుడు సినిమా కోసం ఇంతలా కష్టపడ్డారా అనిపించకమానదు.(ఇదీ చదవండి: 40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత) -
ఎక్స్‌ట్రాలు ఎక్కువైతున్నాయ్.. ఇలాంటివారికి బుద్ధి చెప్పాల్సిందే!: హీరోయిన్
సెలబ్రిటీలను నేరుగా చూడాలనుకోవడం, సెల్ఫీ తీసుకోవడం తప్పు లేదు. కానీ సందు దొరికింది కదా అని వారితో అతి చనువుగా ప్రవర్తిస్తూ, అసౌకర్యం కలిగేలా తాకితే మాత్రం ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఇలా ఇబ్బందిపెట్టేవారిని చూసీ చూడనట్లుగా వదిలేయొద్దని, గుణపాఠం చెప్పి తీరాలంటోంది హీరోయిన్ రాగిణి ద్వివేది (Ragini Dwivedi). ఇటీవల ఆమె తన కొత్త పాటను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆమె కాస్త ముందుకు రాగానే ఓ వ్యక్తి ఆమె చేయి పట్టుకుని లాగే ప్రయత్నం చేశాడు. అలాంటివారిని వదిలిపెట్టొద్దుదీంతో తిక్క రేగిన ఆమె అతడి చెంప చెళ్లుమనిపించింది. నటి రియాక్షన్‌తో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన గురించి రాగిణి మాట్లాడుతూ.. అభిమానులు హద్దు మీరిన సందర్భాలు చాలా ఉన్నాయి. నటీమణుల విషయంలోనే కాదు నటుల విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తున్నారు. ఒకరిని ఇబ్బందిపెట్టాలనుకోవడం, గాయం చేయాలనుకోవడం చాలా తప్పు. ఇలా చేస్తే ఏదో హైలైట్ అయిపోతామనుకుంటారు. అలాంటివారిని కొట్టినా తప్పు లేదు.పారిపోయాడు.. లేదంటేనా!నన్ను ఇబ్బందిపెట్టిన వ్యక్తిని కొట్టకుండా నేనెందుకు ఊరుకుంటాను. అతడు వెంటనే అక్కడినుంచి పారిపోయాడు కానీ లేదంటే స్టేజీ దిగి మరో రెండు దెబ్బలు వేసేదాన్ని. అలాంటివారికి గుణపాఠం చెప్పాల్సిందే! అలా అయితేనే వారికి బుద్ధి వస్తుంది అని చెప్పుకొచ్చింది. ఎక్కువగా కన్నడ సినిమాలు చేసే రాగిణి ద్వివేది తెలుగులో జెండాపై కపిరాజు అనే సినిమాలో కనిపించింది. తమిళ, మలయాళంలోనూ మురిపించిన రాగిణి ప్రస్తుతం వృషభ, సారీ: కర్మ రిటర్న్స్ సినిమాలు చేస్తోంది.చదవండి: హనీరోజ్ అమాయకురాలేం కాదు.. దేనికైనా లిమిట్ ఉంటుంది: నటి ఫైర్ -
రికార్డు సృష్టించిన డాకు బ్యూటీ.. ఆ కారు కొన్న మొట్టమొదటి నటిగా..
బాసూ.. వేర్ ఈజ్ ద పార్టీ.. అంటూ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఊర్వశి రౌతేలా (Urvashi Rautela). ఐటం సాంగ్స్‌కు పెట్టింది పేరైన ఈ బ్యూటీ ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అలరించింది. ఇటీవలే డాకు మహారాజ్ మూవీలో కీలక పాత్రలో నటించడంతో పాటు దబిడి దిబిడి పాటతో సెన్సేషన్ సృష్టించింది. తాజాగా ఊర్వశి ఖరీదైన కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కారు విలువ అన్ని కోట్లా?భారత్‌లో ఏ నటికి సాధ్యం కాని రీతిలో ఏకంగా రూ.12 కోట్లు పెట్టి రోల్స్ రాయిస్ కులినన్ను కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే ఈ కారు సొంతం చేసుకున్న మొట్టమొదటి నటిగా ఊర్వశి రికార్డుకెక్కనుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌లోనూ స్థానం దక్కించుకున్నట్లు భోగట్టా! ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో వెల్కమ్ టు ద జంగిల్, కసూర్ 2 చిత్రాలున్నాయి. ఊర్వశి ఇటు సినిమాల్లో యాక్ట్ చేస్తూ, స్పెషల్ సాంగ్స్ చేయడమే కాకుండా ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తూ ఉంటుంది.విమర్శలపాలైన ఊర్వశిడాకు మహారాజ్ సినిమా రూ.100 కోట్లపైనే వసూళ్లు రాబట్టినప్పుడు ఊర్వశి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. తన సినిమా సెంచరీ దాటిందని గర్వపడిపోయింది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి గురించి స్పందించమన్నప్పుడు కూడా డాకు మహారాజ్ సినిమా గురించి చెప్తూ సొంత డబ్బా కొట్టుకుంది. ఈ సినిమా విజయం తర్వాత తనకు తల్లి డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చిందని చూపించింది. ఇలాంటివి చేతికి ధరించి బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని కామెంట్స్ చేసింది. సైఫ్‌పై సానుభూతి చూపించకుండా తన బహుమతులను చూపిస్తూ షోఆఫ్ చేయడంపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె తన తప్పిదం తెలుసుకుని సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. సైఫ్‌పై దాడి తీవ్రత తెలియకుండా మాట్లాడినందుకు క్షమించమని కోరింది.చదవండి: చిల్లిగవ్వ లేదు.. ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పని చేశాం: హీరోయిన్ -
చిల్లిగవ్వ లేదు.. ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పని చేశాం: హీరోయిన్
మన కలలను సాకారం చేసుకోవాలంటే.. కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నవాళ్లంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలను భరించిన వాళ్లే. లక్ష్యాన్ని ఛేదించడం కోసం ఎన్నో అవస్థలతో పాటు అవమానాలను ఎదుర్కొన్నవాళ్లే. అందుకు నటి దియా మీర్జా( Dia Mirza ) కూడా అతీతం కాదు. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన దియా.. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందట. మోడల్‌గా రాణించేందుకు చాలా కష్టాలను భరించాల్సి వచ్చిందట. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా..చాలీ చాలని డబ్బులతోనే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.‘మోడలింగ్‌లోకి వెళ్తానని చెబితే ..ఫ్యామిలీ నుంచి అంతగా సపోర్ట్ అందలేదు. అయినా కూడా నా లక్ష్యం వైపే అడుగులు వేశాను. 2000లో నాతో పాటు ప్రియాంక చోప్రా(priyanka chopra), లారా దత్తా(Lara Dutta) మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాం. ప్రియాంకకు ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉండేది. లారాకు, నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ ఉండేవాళ్లు కాదు. ముంబైలో లారా ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉండేది. నేను ముంబై వెళ్లిన ప్రతిసారి ఆమె ఇంట్లోనే ఉండేదాన్ని. డబ్బులు ఉండేవి కాదు. ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి ఖరీదైన దుస్తులు కొనేవాళ్లం కానీ..తినడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండేది కాదు. ఆకలి తీర్చుకోవడం కోసం నూడుల్స్ తినేవాళ్లం. మా పరిస్థితి తలుచుకొని మేమే నవ్వుకునేవాళ్లం. ఖరీదైన దుస్తులు వేసుకున్నా..తినేది మాత్రం నూడుల్స్’ అని అనుకునేవాళ్లం’ అని దియా నాటి దీన కథను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయింది.కాగా, 2000లో జరిగిన మిస్ ఇండియా పోటిల్లో లారా దత్తా విజేతగా నిలవగా.. ఫస్ట్ రన్నరప్‌గా ప్రియాంక, సెకండ్ రన్నరప్‌గా దియా మీర్జా నిలిచారు. 2001లో ‘రెహ్నా హై తేరే దిల్ మే’మూవీతో దియా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. ఇక 2021 లో విడుదలైన ‘ వైల్డ్ డాగ్’ అనే తెలుగు సినిమాలో కూడా ఈమె నటించారు. నటిగా, మోడల్‌గా, సమాజ సేవకురాలిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమెకు 2012లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ ‘గ్రీన్ అవార్డు’ లభించింది. -
‘ఫ్యాషన్ ఐకాన్’ : 70 ఏళ్లు దాటితేనేం, ఆమే బ్యూటీ క్వీన్
ష్యాషన్ క్వీన్ అనగానే గుర్తొచ్చే సీనియర్ నటీమణులలో ముందు వరుసలో ఉంటారు ప్రముఖ నటి రేఖ. ఏడు పదుల వయసులో కూడా ఉత్సాహంగా, ఫ్యాషన్ ఐకాన్‌లా ఉంటారామె. ఆమె చీర కడితే ఆ చీరకే అందం. కాంజీవరం చీరలో ఆమె అందానికి అందరూ ముగ్ధులవ్వాల్సిందే. ఆమె ఏ వేదిక మీద ఉన్నా ఆ వేదిక కళకళలాడిపోవాల్సిందే.. ఆమె అద్భుతమైన నటి మాత్రమే కాదు మంచి సింగర్. చాలా సార్లు ఈ విషయాన్ని స్వయంగా చాటి చెప్పింది. అందానికీ, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన రేఖ సిగ్నేచర్ స్టైల్ చీరలో కాకుండా ఓవర్ సైజు బ్లేజర్లో మరోసారి అల్టిమేట్ స్టైల్ ఐకాన్‌గా నిలిచింది. స్టైల్, గ్రేస్, డై-హార్డ్ లుక్స్‌తో ఫ్యాషన్‌కు, మెడ్రన్ స్టైల్‌కు వయస్సు పనేముందని నిరూపించిన వైనం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.ఒక రెడ్ కార్పెట్ ఈవెంట్లో లేడీ బాస్ తన ఎనర్జీతో అక్కడున్న వారి నందరినీ అబ్బురపర్చింది. ‘పింటు కి పప్పీ’ ట్రైలర్ లాంచ్‌లో అద్భుతమైన తెల్లటి ప్యాంటుసూట్లో చిక్ లుక్‌లో ఆకట్టుకుంది.శాటిన్ బ్లౌజ్,దానిపై లేయర్డ్ ట్రెండీ ఓవర్ సైజు బ్లేజర్‌ను జోడింకి ట్రెండీగా మెరిసింది. దీనికి వైడ్ లెగ్ ట్రౌజర్‌తో జత చేసింది. బ్లాక్ సన్ గ్లాసెస్, బంగారు చెవిపోగులు, స్టైలిష్‌గా వైట్ క్యాప్ ఆమె లుక్కు మరింత గ్లామర్‌ను తెచ్చి పెట్టాయి. అలాగే ఒక అందమైన షాయరీని చదవి వినిపించడం విశేషం.అంతేనా, మెటాలిక్ గోల్డ్ ప్లాట్‌ఫామ్ స్నీకర్లతో మరింత యంగ్‌గా, ఫ్రెష్‌గా లుక్‌తో మెస్మరైజ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఆమె స్టైల్‌ను ఫ్యాన్స్ పొగడ్తల్లో ముంచేశారు. "జస్ట్ లుకింగ్ లైకే వావ్!’’, ‘‘ఆమెకు70 ఏళ్లు అని నేను నమ్మలేకపోతున్నాను" "ఫ్యాషన్ ఐకాన్" ఇలా అందరూ రేఖను ప్రశంసించారు. ఇటీవల IIFA అవార్డ్స్ 2025 వేడుకలో రేఖ అద్బుతమైన కాంజీవరం చీరలో కనిపించారు. అవార్డు ఫంక్షన్లో రేఖ తన ఐకానిక్ బంగారు కాంజీవరం చీరలలో అద్భుతంగా కనిపించింది. View this post on Instagram A post shared by IIFA Awards (@iifa)ఆమె లుక్‌తో పాటు, తన సహనటులు, ఇప్పటి నటులతో పాటు, అభిమానులతో ప్రేమగా ఉండటం ఆమె ప్రత్యేకత. ఇటీవల ఒక అభిమాని ప్రత్యేకంగా తీసుకొచ్చిన అందమైన బొమ్మను స్వీకరించడం, తన అభిమానాన్ని చాటుకోవడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు, సినిమాకు సంబంధించి ముఖ్యమైన ఏ వేడుక అయినా, తన సమయాన్ని కేటాయించడం, కళామతల్లిపై ప్రేమను, అభిమానాన్ని ప్రదర్శించడం విశేషం. రేఖగా పాపులర్ అయిన భానురేఖ గణేషన్, 1954లో అక్టోబర్ 10న పుట్టింది. 180కి పైగా చిత్రాలలో నటించిన రేఖ, జాతీయ చలనచిత్ర అవార్డు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను దక్కించుకుంది. -
నో డూప్.. ప్రభాస్‌కు సందీప్‌రెడ్డి వంగా కండీషన్!
యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ ప్రభాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘స్పిరిట్’(Spirit Movie)అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా ఎప్పుడో పూర్తయింది. ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం..షూటింగ్ స్టార్ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ని సరికొత్తగా చూపించబోతున్నాడట సందీప్. తొలిసారి పూర్తి స్థాయి పోలీసు అధికారిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రభాస్‌కి సందీప్ కొన్ని కండీషన్స్ పెట్టినట్లు సమాచారం. షూటింగ్ కోసం నాన్‌స్టాఫ్‌గా 65 రోజుల కాల్షిట్లు ఇవ్వాలని, గ్యాప్ లేకుండా రావాలని ప్రభాస్(Prabhas)కి చెప్పాడట. అలాగే ఇంకో పెద్ద కండీషనే ప్రభాస్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. స్పిరిట్ సినిమా కోసం డూప్ ని వాడే ప్రసక్తే లేదని తెల్చిచెప్పాడట. ప్రతి షాట్ ప్రభాస్‌తోనే చిత్రీకరించాలని కండీషన్ పెట్టాడట. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలందరూ డూప్‌ని సెట్ చేసుకుంటున్నారు. యాక్షన్ సీన్స్‌తో పాటు చాలా సన్నివేశాలను డూప్‌తోనే కానిస్తున్నారు. కొంతమంది హీరోలు అయితే..లాంగ్ షాట్లు, బ్యాక్ షాటులు, క్లోజ్‌లు మినహా మిగతాదంతా డూప్‌తో ముగించాలని కండీషన్స్ పెడుతున్నారు. ప్రభాస్ గత సినిమాల్లో కూడా బాడీ డబుల్స్(డూప్) వాడారు. అయితే సందీప్ మాత్రం సినిమాలోని అన్ని షాట్స్ హీరోనే డైరెక్ట్‌గా చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా షూటింగ్‌ని జూన్ రెండు వారంలో ప్రారంభించాలనుకుంటున్నారట. నాన్ స్టాప్‌గా షూటింగ్ పూర్తి చేసి..వచ్చే సంక్రాంతికి స్పిరిట్‌ని బరిలోకి దింపాలని సందీప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
యంగ్ హీరోతో శ్రీలీల.. నిజమేనా?
ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. 2023-24లో వరస తెలుగు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. కాస్త గ్యాప్ తీసుకుంది. త్వరలో 'రాబిన్ హుడ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇది కాకుండా మరో హిందీ మూవీలోనూ నటిస్తోంది. ఇదంతా పక్కనబెడితే శ్రీలీలపై ఇప్పుడు డేటింగ్ రూమర్స్ వస్తున్నాయి.తెలుగమ్మాయి అయిన శ్రీలీల.. ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేస్తోంది. అయితే బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో ఈమె డేటింగ్ లో ఉందని తెగ మాట్లాడేసుకుంటున్నారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: టాలీవుడ్ నిర్మాత)ప్రస్తుతం శ్రీలీల-కార్తిక్ ఆర్యన్.. అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సరే ఈ విషయం పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం కార్తిక్ ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి పార్టీ చేసుకుంటే శ్రీలీల అక్కడ కనిపించింది. తాజాగా ఐఫా అవార్డుల వేడుకల్లో కార్తిక్ తల్లి కూడా వచ్చింది. ఎలాంటి కోడలు మీకు కావాలి అనే ప్రశ్నకు.. డాక్టర్ కోడలు అని చెప్పారు. ఈ క్రమంలోనే కార్తిక్ ఆర్యన్ తల్లి చెప్పిన కామెంట్, శ్రీలీల డాక్టర్ కోర్స్ పూర్తి చేసి ఉండటాన్ని లింక్ చేసి శ్రీలీల-కార్తిక్ ఆర్యన్ డేటింగ్ లో ఉన్నారని అనేస్తున్నారు. ఇది నిజమా అంటే చెప్పలేం. ఎందుకంటే బాలీవుడ్ ఇలాంటి గాసిప్స్ కావాలనే పుట్టిస్తారేమో గానీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. శ్రీలీలది కూడా బహుశా ఇలాంటి రూమరే అయ్యిండొచ్చేమో?(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
సంతాన ప్రాప్తి కోసం కత్రినా కైఫ్ భక్తి మార్గం!
దేవుడు, పూజలు అనేవి చాలా పవిత్రమైనవి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎప్పుడో ఓసారి భక్తి మార్గంలోకి వెళ్తారు. అలా కొన్నాళ్లపాటు దేవాలయాలు, పూజలు అని చాలా బిజీ అయిపోతారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా అలానే చేస్తోంది.'ఛావా'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విక్కీ కౌశల్ ని.. కత్రినా కైఫ్ 2021లో పెళ్లి చేసుకుంది. వయసులో తన కంటే చిన్నవాడైనప్పటికీ కత్రినా అతడితో కొత్త జీవితం ప్రారంభించింది. పెళ్లి తర్వాత ఒకటి రెండు మూవీస్ చేసింది గానీ ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: 'దిల్ రుబా' నిర్మాత)కొన్నాళ్ల క్రితం కుంభమేళాలో పాల్గొన్న కత్రినా కైఫ్.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించింది. భక్తులకు ప్రసాదం కూడా పంచిపెట్టింది. ఇది జరిగిన ఎన్నిరోజులు కాలేదు ఇప్పుడు కర్ణాటకలోని ప్రసిద్ధ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయంలో దర్శనమిచ్చింది. కుటుంబంతో కలిసి సర్ప సంస్కార పూజలో పాల్గొంది.అయితే కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లి కాని యువతలు త్వరలో ఓ ఇంటివారవుతారని, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు కత్రినా కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడం, ప్రత్యేక పూజలు చేయించడం లాంటివి చూస్తుంటే పిల్లల కోసం గుళ్లు, గోపురాలు తిరిగేస్తూ భక్తి మార్గంలోకి వెళ్లిపోయిందా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?) -
సినిమా వ్యాపారాన్ని మనమే చంపేశాం: ఆమిర్ ఖాన్
‘‘గతంలో ఏ సినిమా చూడాలనుకున్నా థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. ఎందుకంటే మూవీస్ చూసేందుకు నాకు మరో చాయిస్ లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమాలు విడుదలైన ఎనిమిది వారాలకే ఓటీటీల్లో రిలీజ్ చేసి, మన సినిమా వ్యాపారాన్ని మనమే చంపేశాం’’ అని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan) ఆగ్రహావేదన వ్యక్తం చేశారు.ఈ నెల 14న ఆమిర్ ఖాన్ బర్త్ డేని పురస్కరించుకుని ‘పీవీఆర్ ఐనాక్స్’ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ‘ఆమిర్ ఖాన్: సినిమా కా జాదూగర్’ పేరుతో ఆయన హిట్ సినిమాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమిర్ ఖాన్, రచయిత జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ‘‘గతంతో పోలిస్తే ప్రస్తుతం హిందీ చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి.బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం లేని దక్షిణాది నటుల సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 600 నుంచి 700 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నాయి. మన సినిమాలను కూడా దక్షిణాది దర్శకులు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?’’ అంటూ ఆమిర్ ఖాన్‌ను ప్రశ్నించారు జావేద్ అక్తర్. ఇందుకు ఆమిర్ స్పందిస్తూ– ‘‘దక్షిణాది, ఉత్తరాది చిత్రాలు అనే విషయం సమస్యే కాదు... దర్శకులప్రాంతీయ నేపథ్యం కూడా అప్రస్తుతం.సినిమా విడుదలైన ఎనిమిది వారాలకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. ఓటీటీలో ఎన్నిసార్లయినా ఫ్రీగా చూసే వీలుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఒక సినిమాని రెండు సార్లు ఎలా అమ్మాలో నాకు తెలియడం లేదు. థియేటర్లలో విడుదలైన మూడు లేదా నాలుగు నెలల తర్వాత ఓటీటీల్లో రిలీజ్ చేయాలి.అప్పుడే థియేట్రికల్ బిజినెస్ బాగుంటుంది. ప్రేమ, కోపం, పగ వంటి ఎమోషన్స్ మీద బాలీవుడ్ రచయితలు, డైరెక్టర్స్ ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. కేవలం వినో దానికే పెద్ద పీట వేస్తున్నారు. పైగా మూలాలను మర్చిపోతున్నారు. దక్షిణాది చిత్రాల్లాగా భావోద్వేగాలను మిళితం చేయలేపోతున్నారు’’ అని పేర్కొన్నారు. -
ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీలో పలు సినిమాలు చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్ 'దేవర'తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీలో నటిస్తోంది.తాజాగా తాను నటించిన రూహి సినిమాకు నాలుగేళ్లు పూర్తయిన సందర్బంగా ఈ మూవీలో 'నదియో పార్' పాట చిత్రీకరణ అనుభవాల్ని పంచుకుంది. దీని షూటింగ్ టైంలో తాను చాలా టెన్షన్ పడ్డాడని, మూడు రోజులు నిద్రపోలేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)'రూహి సినిమా తీసే సమయానికి నటిగా నాకున్న అనుభవం చాలా తక్కువ. దీంతో నదియో పార్ పాట విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. భారీ లైట్స్ వెలుగులో కళ్లు తెరిచి చూడలేకపోయేదాన్ని. ఓవైపు 'గుడ్ లక్ జెర్రీ' షూటింగ్ లో పాల్గొంటూనే ఈ పాట రిహార్సల్స్ చేసేదాన్ని. పటియాలాలో రాత్రంతా షూట్ చేసి.. పేకప్ తర్వాత ప్రయాణం చేసొచ్చి పాట షూటింగ్ లో పాల్గొనేదాన్ని.''నిద్రలేకపోయినా 7 గంటల్లో ఆ పాట పూర్తిచేయగలిగాను. మళ్లీ వెంటనే గుడ్ లక్ జెర్రీ షూటింగ్ కి వెళ్లేదాన్ని. అలా మూడురోజుల పాట నిద్రపోలేకపోయాను. కానీ కెమెరా ముందుకొచ్చేసరికి మాత్రం ఎనర్జీ వచ్చేసేది' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
ప్రముఖ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. కర్ణాటకలోని ప్రముఖ కుక్కే శ్రీ సుబ్రమణ్య ఆలయాన్ని సందర్శించారు. ఇటీవలే కుంభమేళాలోనూ కత్రినా కైఫ్ పుణ్యస్నానమాచరించారు. తాజాగా శ్రీ సుబ్రమణ్య ప్రత్యేకమైన పూజులు చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన కత్రినా కైఫ్ స్టార్ హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. తెలుగులో వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. 2023లో మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో నటించడం లేదు. ప్రస్తుతం ఆమె భర్త విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఛావాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవలే తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టిస్తోంది.కాగా... కత్రినా కైఫ్ ఇటీవల ఐఫా అవార్డ్స్- 2025 వేడుకలో మెరిసింది. జైపూర్‌లో జరిగిన ఈ వేడుకల్లో పలువురు సినీ అగ్రతారలు పాల్గొని సందడి చేశారు. ఈ అవార్డ్స్‌లో కిరణ్ రావు తెరకెక్కించిన లపతా లేడీస్ అత్యధిక అవార్డులు సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో బాలీవుడ్ సినీతారలు షారూఖ్ ఖాన్, రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడాని, అభిషేక్ బెనర్జీ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు.