
ప్రేమలో ఉన్న మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah Bhatia), బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma ) విడిపోయినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అటు తమన్నా, ఇటు విజయ్ స్పందించకపోవడంతో నిజంగానే విడిపోయారని అంతా భావించారు.
ఇలాంటి సమయంలో తమన్నా, విజయ్ తీవ్రమైన బాధలో ఉంటారని అభిమానులు ఊహించారు. కానీ ఇద్దరిలోనూ బ్రేకప్ అయిన బాధే కనిపించడంలేదు. నిన్న జరిగిన హోలీ వేడుకల్లో ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఏర్పాటు చేసిన హోలీ సంబరాలకు తమన్నా,విజయ్ హాజరయ్యారు. ప్రేమలో ఉన్నప్పుటు కలిసి వచ్చిన ఈ జంట.. నిన్న మాత్రం విడి విడిగా వచ్చి సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.
అయితే ఇద్దరు ముఖాల్లోనూ బాధలేదు. నవ్వుతూ ఎంట్రీ ఇచ్చారు.ఫోటోగ్రాఫర్లకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ వెళ్లిపోయారు. ఇలా ఇద్దరు వేరు వేరు ఈవెంట్‌కి వచ్చి వెళ్లడంతో మరోసారి తమన్నా, విజయ్‌ల బ్రేకప్ టాపిక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
‘లస్ట్ స్టోరీస్ 2’(2023) వెబ్ సిరీస్‌లో తమన్న, విజయ్ వర్మ కలిసి నటించారు. అదే సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తమన్నా పలు ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఇంతలోనే వీరిద్దరు విడిపోయారు.
ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుందామని తమన్నా అడిగితే..విజయ్ మాత్ర అందుకు నో చెప్పాడట. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఇంకొంత కాలం కెరీర్‌పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు విజయ్ అన్నాడట. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి..చివరకు విడిపోయారని బాలీవుడ్ టాక్.అయితే బ్రేకప్‌పై మాత్రం వీరిద్దరూ ఎక్కడా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment