Love Break Up
-
సక్సెస్ కోసం అమ్మ పేరు మార్చుకోలేం కదా?: కోమలీ ప్రసాద్
ఒకప్పుడు టాలీవుడ్లో చాలా మంది తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా మారి తమదైన నటనతో ఆకట్టుకునేవారు. కానీ ఆ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు కొద్దిమంది తెలుగమ్మాయిలు మాత్రమే హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో కోమలీ ప్రసాద్ ఒకరు. ‘నేను సీతాదేవి’(2016) అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘నెపోలియన్’, ‘సెబాస్టియన్ పిసి524’, ‘రౌడీ బాయ్స్’ సినిమాల్లోనూ చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.‘హిట్– 2’ చిత్రం కోమలి ఖాతాలో హిట్ పడింది. ఆర్వాత వరుస అవకాశాలలో దూసుకెళ్తోంది. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘శశివదనే’. పలాస 1978' ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా కోమలీ ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. టాలీవుడ్లో తెలుగమ్మాయిలకు అవకాశం ఇవ్వడం లేదనే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. మన దర్శకనిర్మాతలు టాలెంట్ ఉన్న తెలుగమ్మాయిల కోసం వెతుకున్నారని.. అవకాశం ఉన్న ప్రతి సినిమాలోనూ ఇక్కడి అమ్మాయిలనే హీరోయిన్లుగా నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇంకా కోమలి మాట్లాడుతూ.. ‘ నేను ఓ తమిళ సినిమా కోసం 20 రోజుల పాటు వర్క్ షాప్ చేశాను. ప్రతి రోజు ఉదయం 7 గంటలకే లేచి..వ్యాయామం చేసుకొని..10 గంటలకల్లా ఆఫీస్‌కి వెళ్లేదాన్ని. అక్కడ యాక్టింగ్ ట్రైనర్ చెప్పినట్లుగా నటించేదాన్ని. 20 రోజుల్లో తమిళం కూడా నేర్చుకున్నాను. కానీ అక్కడి వారి నుంచి ఎలాంటి ప్రశంసలు రాలేదు. చివరి రోజు మాత్రం ‘తెలుగు వాళ్ల డెడికేషన్ ఇలా ఉంటుంది’ అని యాక్టింగ్ ట్రైనర్ అన్నారు. మన వాళ్లపై తమిళ్లో అలాంటి నమ్మకం ఉంది. నేను టాలీవుడ్‌కి వచ్చిన తొలినాళ్లలో ..‘నువ్వు ముంబై నుంచి వచ్చావు కదా? నువ్వు తెలుగమ్మాయి అని ఎక్కడా చెప్పకండి. అవకాశాలు రావు. ముంబై అమ్మాయినే అని చెప్పండి’ అని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ నేను తొలి నుంచి తెలుగమ్మాయిని అనే చెప్పుకున్నాను. నాకు వచ్చిన ప్రతి అవకాశం కూడా తెలుగమ్మాయిని అనే వచ్చింది. ఏదో సక్సెస్ అవ్వాలని అమ్మ పేరు మార్చుకోలేం కదా? నేను కూడా తెలుగమ్మాయిని..అలానే చెపుకుంటాను. ఇకపై కూడా అలానే ఉంటాను. తెలుగమ్మాయిలకు టాలీవుడ్లో చాన్స్‌లు ఇవ్వరనేది పచ్చి అబద్దం. అది బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే.. ఇండస్ట్రీలో అలా లేదు. ప్రతి డైరెక్టర్, నిర్మాత.. తెలుగమ్మాయి అయితే బాగుంటందని ఆలోచిస్తారు. అలాంటి పుకార్లు ఇకనుంచైనా ఆగిపోతే బాగుంటుంది’ అని కోమలి అన్నారు. ఇక తన లవ్‌స్టోరీ గురించి చెబుతూ.. ‘అందరిలాగానే నేను కూడా ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయింది. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నాను. డేటింగ్ అంటే నాకు నచ్చదు. పద్దతిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రోజుకు రెండు జోకులు..ఒక పూట బిర్యానీ తినిపించేవాడు దొరికితే చాలు పెళ్లి చేసుకుంటా (నవ్వుతూ) చెప్పింది ఈ తెలుగు బ్యూటీ. -
బ్రేకప్‌తో మంచే జరిగింది.. నా పెళ్లి అలా జరగాలి: కంగనా
ఎలాంటి విషయాన్ని అయినా కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పడం బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు అలవాటు. కేవలం సినిమా విషయాల్లోనే కాకుండా..రాజకీయ అంశాలపై కూడా ఆమె స్పందిస్తుంటారు. అందుకే కంగనాకు ఫైర్‌బ్రాండ్ అనే ముద్ర పడింది. తాజాగా ఈ బాలీవుడ్ భామ తన లవ్ బ్రేకప్ విషయంతో పాటు పెళ్లిపై తనకున్న అభిప్రాయం ఏంటో చెప్పింది. కంగనా నటించిన తాజా చిత్రం తేజస్ అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో బ్రేకప్ అయిన తన రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది. ‘ఎలాంటి సంబంధాలు అయినా ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ప్రేమ విషయంలో అందరూ విజయం సాధించలేరు. నేను కూడా తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డాను. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయాం. బ్రేకప్ వల్ల నాకు మంచే జరిగింది. ఒకవేళ నేను ఇప్పటికీ ప్రేమలో ఉన్నట్లయితే.. నా సమయం అంతా దానికే కేటాయించాల్సి వచ్చేది. అదృష్టవశాత్తు నాకు బ్రేకప్ జరిగింది. లవ్ ఫెయిల్యూర్ వల్ల జరిగే లాభాలేంటో చాలా మందికి ఆలస్యంగా తెలుస్తాయి’అని కంగనా చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘ప్రతి అమ్మాయి తన పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ గురించి కలలు కంటుంది. నేను కూడా కుటుంబ వ్యవస్థలకు గౌరవం ఇస్తాను. పెళ్లి చేసుకోవాలని, నాకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలనుకుంటున్నారు. రానున్న ఐదేళ్లలో పెళ్లి చేసుకుంటాను. అయితే అది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అయితేనే చేసుకుంటాను. నా పెళ్లి పెద్దల సమక్షంలో జరగాలని కోరుకుంటున్నాను’అని కంగనా తెలిపింది. -
బాలీవుడ్ భామతో వెస్టిండీస్ క్రికెటర్ ప్రేమాయణం... చివరకు ఏమైందంటే
వెస్ట్ ఇండీస్ క్రికెటర్.. అరుదైన ఆల్‌రౌండర్స్‌లో ఒకడు.. గ్యారీ సోబర్స్! సిల్వర్ స్క్రీన్ గ్లామర్.. టాలెంట్‌లో ది బెస్ట్.. అంజు మహేంద్రు! ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. కానీ పెళ్లితో జత కట్టలేకపోయారు. కలవని ఆ ప్రేమ కథ గురించి.. పేజ్ త్రీ సర్కిల్ పార్టీల్లో క్రికెట్, సినిమా స్టార్స్ కలసుకోవడం సర్వసాధారణం. అలాంటి పార్టీలోనే అంజు మహేంద్రును కలిశాడు గ్యారీ సోబర్స్. తొలి చూపులోనే ఆమె అతణ్ణి ఆకట్టుకుంది. ‘హాయ్.. నేను గ్యారీ’ అంటూ ఆమె దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నాడు. ‘ఎస్.. ఐ నో.. మై నేమ్ ఈజ్ అంజు.. అంజు మహేంద్రు.. ఫిల్మ్ యాక్ట్రెస్’ అంటూ కరచాలనం చేసింది. ‘ఐ నో!’ అంటూ నవ్వి.. ‘నాతో డాన్స్ చేస్తావా అన్నట్టుగా ‘డాన్స్..?’ అంటూ తన చేయి అందించాడు ఆమెకు. ‘వై నాట్.. ’అంటూ అతని చేయి అందుకొని అతనితో అడుగులు కదిపింది. ఆ ఇద్దరి డాన్స్‌కు అందరూ కళ్లప్పగించారు. ఆ రోజు ఆ పార్టీలో ఆ జంటే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయింది. గ్యారీతో అంజు స్నేహం కంటిన్యూ అయింది. అప్పుడు అంజుకి ఇరవై ఏళ్లు. అప్పటికే రాజేశ్ ఖన్నాతో ప్రేమలో ఉంది.. స్పర్థలూ మొదలయ్యాయి. అంజుని హీరోయిన్గా ప్రోత్సహించినట్టే ప్రోత్సహించి.. ఆమెకు అవకాశాలు రావడంతోనే తనకున్న పొజెసివ్ నేచర్‌ను ప్రదర్శించడం మొదలుపెట్టాడు రాజేశ్ ఖన్నా. ఆ తీరుతో విసిగి వేసారిపోయున్న అంజుకి గ్యారీ ఫ్రెండ్షిప్తో సాంత్వన దొరికింది. ఇది 1966 నాటి సంగతి. ఆ సమయంలో ఇండియాతో మ్యాచ్ ఆడ్డానికి ఇక్కడికి వచ్చింది వెస్ట్ ఇండీస్ టీమ్. ఆ టూర్ అంతా గ్యారీ .. అంజుతోనే కలసి ఉన్నాడు. మ్యాచ్ అయిపోగానే హ్యాంగవుట్లు, డిన్నర్లు, పార్టీలు పరిపాటయ్యాయి ఆ జంటకి. వెస్ట్ ఇండీస్ టీమ్ ఇండియా టూర్ ముగిసే సమయానికి అంజు ప్రేమలో మునిగిపోయాడు గ్యారీ. ఆ ఇద్దరికీ నిశ్చితార్థమూ జరిగింది అంజు వాళ్ల కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో (గ్యారీ సోబర్స్ ఆటోబయోగ్రఫీ ప్రకారం). ఇద్దరి షెడ్యూల్స్‌లోని వీలు ప్రకారం పెళ్లికి తేదీ నిర్ణయించుకోవాలను కున్నారు. ఆలోపు సొంత దేశానికి వెళ్లిపోయాడు గ్యారీ. అక్కడ గ్యారీ ఉత్తరప్రత్యుత్తరాలు.. టెలిఫోన్ సంభాషణలతో అంజుతో అనుబంధం కొనసాగించాడు. కొన్నాళ్లు గడిచాక.. మ్యాచ్‌లతో, క్రికెట్ టూర్లతో బిజీ అయిపోయాడు. అంజును పూర్తిగా మరచిపోకపోయినా ఆమె ఆలోచన మాత్రం వెనక్కి వెళ్లిపోయింది. ఆ క్రమంలోనే అతను ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ ప్రు కిర్బీ అనే అమ్మాయిని కలిశాడు. ఆ ఆకర్షణలో పడ్డాడు. అది లవ్వై.. మ్యారేజ్ వరకూ వెళ్లింది. అప్పుడు..అంజుకి ఫోన్ చేశాడు గ్యారీ. ‘అంజు.. ఐ యామ్ రియల్లీ సారీ.. ప్రు అని.. ఆస్ట్రేలియన్.. వి ఆర్ ఇన్ లవ్. వాన్న గెట్ మ్యారీ!’ అని ఆగాడు. అవతల నుంచి అంజు ఉఛ్వాస..నిశ్వాసాలే వినపడుతున్నాయి. గ్యారీ మనసులో ఏదో బాధ.. ‘హలో.. అంజు..’ పిలిచాడు. అతని స్వరంలో అపరాధ భావం స్పష్టంగా! ‘ఎస్ గ్యారీ..’ గొంతు పెగల్చుకుని పలికింది అంజు. ‘ఐ యామ్ సారీ డియర్.. ’ గ్యారీ. ‘వాట్ కెన్ ఐ డు ఫర్ యూ నౌ’ అని అడిగింది. ‘నీడ్ యువర్ కన్సెంట్ టు మ్యారీ ప్రు’ చెప్పాడు గ్యారీ. ‘ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ గ్యారీ’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది అంజు. పొగిలి పొగిలి ఏడ్చింది. అవతల గ్యారీ కూడా.. ‘ప్లీజ్ ఫర్ గివ్ మీ డియర్’ అంటూ ఏడ్చేసి అపరాధ భారం దించేసుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ ప్రు కిర్బీని గ్యారీ పెళ్లి చేసుకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని రాతపూర్వకమైన సమ్మతినీ తెలియజేసింది అంజు మహేంద్రు. గ్యారీ, ప్రుల పెళ్లి అయిపోయింది. అంజు ఒంటరిగానే మిగిలిపోయింది. ‘అంజు చాలా మంచి అమ్మాయి. ఆమెను మనసావాచా ఇష్టపడ్డాను. ఇద్దరం కలసి ఇంగ్లండ్ వెళ్లి అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తను నాతో వచ్చేయడానికి ఉవ్విళ్లూరింది. అలా ఇంగ్లండ్ వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడానికి ఆ టైమ్‌లో నేను ఆమె పేరు మీద రిజర్వ్ బ్యాంక్‌లో కొంత డబ్బును డిపాజిట్ చేయాలనే నియమం ఏదో ఉన్నట్టుంది. అదేంటో నాకర్థం కాలేదు. ఇండియా వదిలి వచ్చేశాను. తర్వాత తనూ వచ్చేద్దామనుకుంది. కానీ చివరి నిమిషంలో ఆగిపోయింది. మా రిలేషన్షిప్ బ్రేక్ అవడానికి ఆ దూరమే కారణం అనుకుంటున్నాను!’ – గ్యారీ సోబర్స్ (‘గ్యారీ సోబర్స్: మై ఆటోబయోగ్రఫీ’ నుంచి) -ఎస్సార్ -
ఒక్క కన్నీటి బొట్టు
ఇద్దరూ ప్రేమించుకున్నారు. బ్రేకప్ అయి ‘ఇద్దరు’గా మిగిలారు. అమ్మాయి ఏడ్చింది. అబ్బాయి ఏడ్వలేదనుకుంది. ‘నా కోసం ఒక్క కన్నీటి బొట్టు.. నీ దగ్గర లేదా’ అని అడిగింది. అతడి చేత కన్నీళ్లు పెట్టించడానికి.. ట్రక్కునిండా ప్రేమను పంపింది. ‘‘రెండు కళ్ల నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి’’ అంటాడు క్రిష్. (డైరెక్టర్ కెవీ రెడ్డి ఆయన). ‘‘ఊ’’ అంటుంది కీర్తి సురేశ్. (నటి సావిత్రి ఆమె). మళ్లీ చెప్తాడు క్రిష్. ‘‘రెండు కళ్ల నుంచి కాదమ్మాయ్. ఒక కంటి నుంచి మాత్రమే కొన్ని కన్నీటి బొట్లు రావాలి’’ ‘‘ఊ’’ అని తల ఊపుతుంది. పాట మొదలౌతుంది. ‘నీ కోసమే నే జీవించునది, ఈ విరహములో, ఈ నిరాశలో నీ కోసమే నే జీవించునది’. కీర్తి సురేశ్‌కి ఒక కంటి నుంచి మాత్రమే కన్నీటి బొట్లు వచ్చేస్తాయి! రెండంటే రెండు బొట్లే అడిగి ఉంటాడు క్రిష్. రెండంటే రెండు బొట్లే రాలుస్తుంది కీర్తి సురేశ్. ‘మహానటి’లోని సన్నివేశం ఇది. (తెలంగాణలో కొత్తగా 27 కేసులు ) ∙∙ మిస్ ఝావో ఓ కుర్రాడిని ప్రేమించింది. అతడూ ఆమెను ప్రేమించాడు. ఇద్దరిదీ చైనా. జీబో అనే ప్రాంతంలో ఉంటారు. ఉండేది జీబోలోనే అయినా, ప్రేమ మొదలైనప్పట్నుంచీ ఒకరి మనసుల్లో ఒకరు ఉంటున్నారు. ఏడాది క్రితం ప్రేమలో పడ్డారు. ఈమధ్యే విడిపోయారు. బ్రేకప్ చెప్పేశాడు ఆ కుర్రాడు. ఝావో తట్టుకోలేకపోయింది. తల్లడిల్లిపోయింది. ‘నీకోసమే నే జీవించునది, ఈ విరహములో, ఈ నిరాశలో నీ కోసమే నే జీవించునది’ అని పాడుకుంది. అతడు పట్టించుకోలేదు. కాల్ చేయలేదు. కాల్ చేస్తే తియ్యలేదు. ఏడ్చింది. తన లెక్క ప్రకారం అతడూ ఏడుస్తూ ఉండాలి. కానీ అతడు ఏడ్వడం లేదని, హాయిగా ఉన్నాడని ఆమెకు తెలిసింది! అతడు ఏడుస్తూ లేకపోవడం చూసిన వారెవరో వచ్చి ఆమెకు చెప్తే తెలిసింది. ∙∙ ఝావో బాయ్‌ఫ్రెండ్ అప్పుడే నిద్ర లేచాడు. కళ్లు నలుముకుంటూ ముందు గదిలోకి వచ్చాడు. గది నిండా ఉల్లి సంచులు! వెయ్యి కిలోల ఉల్లిపాయలు. డెలివరీ బాయ్ ట్రక్కులో తీసుకొచ్చి అక్కడి దింపేసి వెళ్లిపోయాడు. సంచుల్లో చిన్న స్లిప్ ఉంది. ఆ స్లిప్‌లో ఎవరిదో చేతి రాత! ఎవరిదో ఏంటి.. తన గర్ల్ ఫ్రెండ్ ఝావోదే! అక్షరాలు పైకే కనిపిస్తున్నాయి. ‘‘నేను మూడు రోజులు ఏడ్చాను. ఇప్పుడు నీ వంతు’’ అని రాసి ఉంది! ‘తిక్క పిల్ల’ అనుకున్నాడు. ఈలోగా, ‘‘ఏంటి బాబూ, ఇన్ని ఎర్ర ఉల్లిపాయల సంచులూ’’ అని పక్కింటి వాళ్లొచ్చి అడిగారు. అప్పుడు ఏడ్చాడు ఆ కుర్రాడు. ‘‘నా ఫ్రెండే. ప్రతి దానికీ అతి చేస్తుంటుంది. అందుకే విడిపోయాం. విడిపోయినందుకు తను ఏడుస్తోందట. నన్నూ ఏడవమని ఈ ఉల్లిపాయల్ని పంపింది. బ్రేకప్ అయినప్పట్నుంచీ నేను ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదని నా ఫ్రెండ్స్ అందరితో చెబుతోందట! ఏడ్వనందుకు చెడ్డవాణ్ణి అయ్యాను’’ అని ఫీల్ అయ్యాడు. ఈ ఫీలింగేదో ఫోన్ చేసి ఆ పిల్ల దగ్గరే ఏడిస్తే హ్యాపీగా ఫీల్ అయి ఉండేది కదా పాపం. బ్రేకప్ అవడం అంటే మరింత దగ్గరవడం. ఉల్లి సంచుల్ని చూస్తూ తల పట్టుకున్న మిస్ ఝావో బాయ్‌ఫ్రెండ్ బాయ్‌ఫ్రెండ్ ఇంటికి మిస్ ఝావో డెలివరీ చేసిన ఉల్లిపాయలు -
మానసిక వ్యాధిగ్రస్తులకు నచ్చదు
ఎవరేమనుకున్నా గానీ, నటుడు శింబు అనాలనుకుంది అనేస్తారు. చేయాలనుకుంది చేసేస్తాడు. ప్రస్తుతం ఈయన నటించిన మూడు చిత్రాలు విడుదల కావలసి ఉంది. వీటి గురించి శింబు చింతించరు. ఇద్దరు హీరోయిన్లతో లవ్ బ్రేక్ అప్ అయినా మరోసారి వర్కౌట్ అవుతుందిలే అనే ధీమాను వ్యక్తం చేస్తారు. అలాంటి నటుడి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యూయి. శింబు అజిత్‌కు వీరాభిమాని. తన అభిమాన నటుడి చిత్రం ఎన్నై అరిందాల్ చిత్రం ఇటీవల విడుదలైంది. ఆ చిత్రాన్ని శింబు సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలసి చూశారు. అరుుతే చాలా కాలం తరువాత ఒక మంచి తమిళ చిత్రం చూశాను. అజిత్ అద్భుతంగా నటించారు. తల (అజిత్ ) అభిమానులకు పసందైన విందుగా ఉంటుంది. మానసిక బాధితులకు మినహా ఎన్నై అరిందాల్ తమిళ ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో ఆ చిత్రం నచ్చని వారినందరినీ శింబు మానసిక వ్యాధిగ్రస్తులతో ఎలా పోల్చుతారని పలువురు ఆయనపై ట్విట్టర్లో దాడి చేస్తున్నారు. అయితే శింబు మాత్రం చిత్రం చూసి నా అభిప్రాయాన్ని చెప్పాను. ఆ భావ స్వేచ్ఛ నాకుంది. దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అంటున్నారు. ఈ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. -
అతడిని నమ్మి తప్పు చేశా?
ఒక అతడిని నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు అంటూ నటి తాప్సీ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. తమిళు, తెలుగు, హిందీ తదితర భాషల్లో నటిగా గుర్తింపు పొందిన తాప్సీ ఊహించని స్థాయికి చేరుకోలేక పోయింది. అయితే, తనకంటూ ఓ రోజు వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తోంది. ప్రతి మనిషికి జీవితంలో ఒక చేదు అనుభవం ఉంటుంది. తాప్సీకి కూడా అలాంటి అనుభవాలు చవి చూసిందట. వద్దు అనుకున్నా, గుర్తుకు వస్తున్న ఆ సంఘటన గురించి ఆమె చెబుతూ, తన తండ్రి రియల్ ఎస్టేట్ సంస్థలో ఓ చిరు ఉద్యోగి అని చెప్పింది. రాత్రి వేళ తన స్నేహితుల ఇంట ఉండడానికి కూడా అంగీకరించే వారు కారని తెలిపింది. అలాంటి పరిస్థితుల్లో తాను ఒక చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఒంటరిగా ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. అప్పుడు తనపై ప్రేమాభిమానాలు కురిపించిన వాళ్లను ఎక్కువగా నమ్మినట్టు పేర్కొంది. ఒకరితో సన్నిహితంగా మెలిగానని, అది తాను చేసిన పెద్ద తప్పు అని ఆవేదన వ్యక్తం చేసింది. అతడితో ప్రేమ బ్రేక్ అయిందని తెలిపింది. అయితే, ఆ బాధ ఒక వారం వరకే ఉందని అందింది. ఒక నటుడుకి నటికి మధ్య అనుబంధం నిరంతరం సాగుతుందని చెప్పలేమంది. ఇంతకీ ప్రేమ బ్రేక్ అయిందన్న తాప్సీ బాయ్ ఫ్రెండ్‌తోనా లేదా మరెవ్వరితోనా? అన్నది తేల్చక పోవడం చర్చకు దారి తీసింది. -
నేనిప్పటికీ సింగిల్‌నే
నేనిప్పటికీ సింగిల్నేనంటోంది ఇంగ్లీష్ దొరసాని ఎమిజాక్సన్. మదరాసు పట్టణం చిత్రం తో కోలీ వుడ్లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే లక్కీ చాన్స్‌ను కొట్టేసింది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడి తొలిచిత్రం మినహా విజయాలేమీ లేవు. బాలీవుడ్లో నటించిన ఏక్ దివానా చిత్రం ఆమెను నిరాశపరచింది. అంతేకాదు ఆ చిత్ర హీరో ప్రతీక్‌తో లవ్ బ్రేక్ అప్ అయి మరో షాక్ తింది. సరిగ్గా అలాంటి సమయంలోనే విక్రమ్ సరసన ఐ చిత్రంలో నటించే అవకాశం ఆమెను సంతోషంలో ముంచెత్తింది. ఈ చిత్రం తరువాత తన రేంజే వేరంటున్న ఎమిజాక్సన్ మాట్లాడుతూ ఐ చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానంది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్, ధనుష్‌తో నటించే చిత్రాలను అంగీకరించానని చెప్పింది. ఈ రెండు చిత్రాల్లోనూ తన పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని తెలిపింది. తమిళంలో చాలా చిత్రాలు చేయాలని కోరిక ఉందని చెప్పింది. అందుకే తమిళభాష కూడా నేర్చుకుంటున్నానని అంది. ఉదయనిధి స్టాలిన్ సరసన లంగా, ఓణీ, చీర అంటూ గ్రామీణ యువతిగా నటించనున్నట్లు వెల్లడించింది. నటనతోపాటు ఇంకేమి తెలుసని అడుగుతున్నారని తాను వంట బాగా చేస్తానని చెప్పింది. దోసెలు సూపర్‌గా చేస్తానని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనేనని సినిమాలో తనకు మంచి భవిష్యత్ ఉంటుందనే నమ్మకం ఉందని చెప్పింది. గతం గురించి ఏమీ అడగొద్దు దాని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రస్తుతం తాను సింగిల్‌గానే జీవిస్తున్నాను ఎవరినీ ప్రేమించడం లేదు అని ఎమిజాక్సన్ అంటోంది. -
సిద్ధార్థ్ మంచి వ్యక్తి
సిద్ధార్థ్, సమంతల మధ్య ప్రేమ బ్రేక్ అప్ అయిందంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అత్తమొత్తినా ఫర్వాలేదుగానీ తోడికోడలు నవ్వినందుకు బాధేసిందంటూ సమంత ట్విట్టర్లో మీడియా మండి పడింది. పైగా సిద్ధార్థ్ మంచి వ్యక్తిఅంటూ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. సిద్ధార్థ తో ప్రేమ వ్యవహారంలో తాను చాలా బాధపడ్డానని అందరూ అడుగుతున్నారని, అయితే తాను ఎలాంటి బాధ పడలేదని పేర్కొంది. ఇది తన సొంత విషయమని, ఇకనైనా మీడియా ప్రచారాన్ని ఆపేయాలని కోరింది. సిద్ధార్థ్ మాత్రం ఈ విషయంపై మౌనం వహించడం గమనార్హం. ఇలాంటి పరిస్థితిలో మలయాళ చిత్రం బెంగళూర్ డేస్ తమిళం, తెలుగు భాష రీమేక్‌లో సిద్ధార్థ్, సమంత జంటగా నటించడానికి ఎంపికయ్యారు. ఇప్పుడీ చిత్రంలో వీరిద్దరూ నటిస్తారా? అనే ప్రశ్నకు ఆ చిత్ర వర్గాలు వారి వ్యక్తిగత విషయాలకు ఈ చిత్రంలో నటించడానికి సంబంధం లేదంటున్నాయి. నిజానికి సిద్ధార్థ్, సమంతలు నెల రోజులకు ముందే ఒకరికొకరు మాట్లాడుకోవడం మానేశారని, అయినా తమ చిత్రంలో వారు నటించడంలో ఎలాంటి మార్పూ లేదని పేర్కొన్నాయి. బెంగళూరు డేస్ చిత్ర రీమేక్‌కు సంబంధించిన ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అనుకున్నట్లు మార్చిలో ఈ చిత్రం సెట్‌పైకి వెళుతుందని తెలిపాయి. -
సిద్ధార్థ్‌తో సమంత కటీఫ్?
నటుడు సిద్ధార్థ్‌తో రెండున్నరేళ్ల ప్రేమ బంధాన్ని నటి సమంత తెంచేసుకున్నట్లు తాజాగా ప్రచారం వేగం పుంజుకుంది. సిద్ధార్థ్ సమంతలు 2012లో జబర్ధస్త్ అనే తెలుగు చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ వ్యవహారం గురించి ఈ జంట పెదవి విప్పలేదు. కానీ ఫంక్షన్లు, పార్టీలకు చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఆ మధ్య సిద్ధార్థ్ నటించిన తమిళ చిత్రం తీయవెలై సెయ్యనుం కుమారు చిత్రంతో సమంత అతిథిగా దర్శనమిచ్చింది. తన ప్రియుడు సిద్ధార్థ్ కోరిక మేరకు ఈ బ్యూటీ అలా మెరిసిందనే ప్రచారం సాగింది. తాజాగా సిద్ధార్థ్‌తో సమంత తన బంధాన్ని తెంచుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సమీప కాలంలో సమంత చాలా అశాంతితో కూడిన బాధను అనుభవిస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఆ మనోవేదన నుంచి బయటపడడానికి ఆమె ఇటీవల తన స్నేహితురాలితో కలిసి గోవాకు విహార యాత్ర పేరుతో వెళ్లినట్టు టాక్. సిద్ధార్థ్‌కు దూరమైన సమంత నటనపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు కొంత కాలం ఈ ప్రేమ, దోమలాంటి వాటిని మరచిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నటుడు సిద్ధార్థ్‌పై ఇలాంటి ప్రేమ దుమారం చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. తన భార్యకు విడాకులిచ్చిన సిద్ధార్థే ఆ తరువాత నటి శ్రుతిహాసన్‌తో ప్రేమ వ్యవహారం జరిపారనే ప్రచారం ఆ మధ్య జోరుగా సాగిందన్నది గమనార్హం. -
కమలహాసన్ రెండవ కూతురు ప్రేమ బ్రేక్అప్
ప్రేమించుకోవడం ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోవడం ఈ తరం యువతలో సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితి లోకమంతా ఉన్నా సినిమా రంగంలో కాస్త అధికమనే చెప్పాలి. తాజాగా నటి శ్రుతిహాసన్ చెల్లెలు, కమలహాసన్ రెండవ కూతురు అక్షర ప్రేమ కథ ఇలానే ముగిసింది. ప్రేమించుకోవడం ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోవడం ఈ తరం యువతలో సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితి లోకమంతా ఉన్నా సినిమా రంగంలో కాస్త అధికం అనే చెప్పాలి. శింబు, నయనతార, ప్రభుదేవ, నయనతార, శింబు, హన్సిక ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రేమ కథలు కంచికే చేరాయి. తాజాగా నటి శ్రుతిహాసన్ చెల్లెలు, కమలహాసన్ రెండవ కూతురు అక్షర ప్రేమ కథ సేమ్ తంతే. అక్షరకు మొదట్లో హీరోయిన్గా చాలా అవకాశాలు వచ్చినా ఆమె నిరాకరించి కెమెరావెనుక ఉండటానికి ఆసక్తి చూపారు. ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడివద్ద సహాయ దర్శకురాలిగా కూడా పనిచేశారు. ఆ సమయంలోనే నటుడు నసిరుద్దిన్షా కొడుకు వివాన్షాతో ప్రేమలో పడ్డారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారాన్ని వీరిద్దరూ ఖండించలేదు. అయితే అక్షర తల్లి సారిక మాత్రం వీళ్ల వ్యవహారాన్ని కనిపెట్టి ప్రేమ, దోమ అంటూ జులాయిగా తిరగకుండా పనిమీద దృష్టి సారించు అంటూ చీవాట్లు పెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. ఏదేమైనా అప్పటి వరకు నటనకు దూరంగా ఉంటూ వచ్చిన అక్షర అక్క శ్రుతిహాసన్ సక్సెస్ జోరు చూసిన తరువాత తనూ హీరోయిన్గా నటించాలనే నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా బాలీవుడ్ దర్శకుడు బాల్కి తెరకెక్కిస్తున్న షమితాబ్ చిత్రంలో నటుడు ధనుష్ సరసన నటించే అవకాశం కొట్టేశారు. ఈ చిత్రంలో అమితాబ్ కూడా ఒక ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ఈ కథ అటుంచితే అక్షర, వివాన్‌షాల ప్రేమకు చిల్లులు పడ్డాయన్నది తాజా సమాచారం. ఇప్పటివరకు తమ ప్రేమ వ్యవహారం గురించి నోరు మెదపని వివాన్‌షా ఇప్పుడు పెదవి విప్పారు. అక్షరహాసన్‌తో తన రెండేళ్ల ప్రేమకు ఫుల్స్టాప్ పడిందని ఇకపై తమ మధ్య ఎలాంటి బంధం లేదని మూడు ముక్కల్లో చెప్పేశాడు. -
బ్రేకప్ తరువాత సంతోషంగా ఉన్నా
నటి హన్సికతో లవ్ బ్రేక్ అప్ అయిన తరువాత తాను బ్రహ్మాండంగా ఉన్నానంటున్నారు నటుడు శింబు. కోలీవుడ్‌లో ప్లేబాయ్‌గా ప్రచారం పొందిన యువ నటులలో శింబు ఒకరు. నటి నయనతారతో గాఢమైన ప్రేమ, నటి హన్సికతో ప్రేమ, పెళ్లి అంటూ సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నటుడు శింబు. అయితే ఆ ఇద్దరితో ప్రేమ వర్కౌట్ కాకపోవడంతో మొదట్లో కొంత ఆవేదన చెందిన ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నానంటున్నారు. ప్రస్తుతం మాజీ ప్రేయసి నయనతారతో కలిసి ఇదునమ్మ ఆళు చిత్రంలో నటిస్తున్న శింబుతో చిట్‌చాట్. ఇదునమ్మ ఆళు చిత్రం పూర్వ వైభవాన్ని తెస్తుందా? నా చిత్రం కోసం ఎదురు చూస్తున్న నా అభిమానులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను వరుసగా చిత్రాలు చేయాలనుకుంటున్నది వారి కోసమే. అదే విధంగా చిన్నతనం నుంచి ఈ రంగంలోనే ఉండటం వలన నాకు సినిమా తప్ప వేరేది తెలియదు. ఇక మీరడిన ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. ఫలానా చిత్రం హిట్ అవుతుందని చెప్పలేను. అయితే నటుడిగా నా పాత్రకు న్యాయం చేయడానికి శాయశక్తులా శ్రమిస్తా. ఆ విధంగా నేను నటిస్తున్న ఇదు నమ్మ ఆళు, వాలు చిత్రాలు అభిమానులకు నచ్చుతాయనే నమ్మకం ఉంది. రెండేళ్లు గ్యాప్ రావడానికి కారణం? రెండు సంవత్సరాల గ్యాప్ అన్నది పెద్ద విషయం కాదు. నిజానికి ఈ రెండేళ్లలో నేను నాలుగు చిత్రాలు చేశాను. అయితే ఆ చిత్రాలు పలు కారణాల వలన నిలిచిపోయాయి. అన్నీ అనుకున్నట్లు జరగవు కదా. ఈ చిత్రాలను వరుసగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. వేట్టైమన్నన్ చిత్రం చాలా బాగా వస్తోంది. ఇంకా ఒక్క షెడ్యూల్ షూటింగ్ చేయాల్సి ఉంది. ఈ షెడ్యూల్‌ను విదేశాల్లో చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నాను. మీరు కరెక్ట్ టైమ్‌కు షూటింగ్ స్పాట్‌కు రారనే అపవాదు ఉందా? నిజమే. నేను షూటింగ్ స్పాట్‌కు ఆలస్యంగా వెళతాను. అయితే ఈ విషయంలో నేనెవరినీ మోసం చేయడం లేదు. ఉదయం ఏడు గంటలకు వస్తానని చెప్పి పదకొండు గంటలకు వెళ్లను. ఉదయం ఎప్పుడూ ఆలస్యంగానే షూటింగ్ స్పాట్‌కు వెళతాను. నా వర్కింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. దర్శకుడు సన్రైడ్ లాంటి షాట్స్ చిత్రీకరించాలంటే ఖచ్చితంగా టైమ్‌కు స్పాట్లో ఉంటాను. నటి హన్సికతో లవ్ బ్రేక్ అయినట్లు స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఒంటరి జీవితం ఎలా ఉంది? ఏ విషయమైనా నేను ఓపెన్‌గానే మాట్లాడుతాను. హన్సికతో రిలేషన్షిప్, ఆ తరువాత లవ్ బ్రేకప్ విషయాల గురించి విస్పష్టంగా వెల్లడించాను. కొన్ని కారణాల వలన రకరకాలుగా ప్రచారం జరగడం నా కిష్టం ఉండదు. మేమిద్దరం సుదీర్ఘంగా చర్చించుకుని తీసుకున్న నిర్ణయం కావడంతో నేనిప్పుడు చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాను.