సిద్ధార్థ్‌తో సమంత కటీఫ్? | Siddharth is a great guy: Samantha Prabhu on ex after break-up | Sakshi

సిద్ధార్థ్‌తో సమంత కటీఫ్?

Published Thu, Jan 8 2015 8:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

సిద్ధార్థ్‌తో సమంత కటీఫ్?

సిద్ధార్థ్‌తో సమంత కటీఫ్?

నటుడు సిద్ధార్థ్‌తో రెండున్నరేళ్ల ప్రేమ బంధాన్ని నటి సమంత తెంచేసుకున్నట్లు తాజాగా ప్రచారం వేగం పుంజుకుంది.

నటుడు సిద్ధార్థ్‌తో రెండున్నరేళ్ల ప్రేమ బంధాన్ని నటి సమంత తెంచేసుకున్నట్లు తాజాగా ప్రచారం వేగం పుంజుకుంది. సిద్ధార్థ్ సమంతలు 2012లో జబర్ధస్త్ అనే తెలుగు చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ వ్యవహారం గురించి  ఈ జంట పెదవి విప్పలేదు. కానీ ఫంక్షన్లు, పార్టీలకు చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు.
 
 ఆ మధ్య సిద్ధార్థ్ నటించిన తమిళ చిత్రం తీయవెలై సెయ్యనుం కుమారు చిత్రంతో సమంత అతిథిగా దర్శనమిచ్చింది. తన ప్రియుడు సిద్ధార్థ్ కోరిక మేరకు ఈ బ్యూటీ అలా మెరిసిందనే ప్రచారం సాగింది. తాజాగా సిద్ధార్థ్‌తో సమంత తన బంధాన్ని తెంచుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సమీప కాలంలో సమంత చాలా అశాంతితో కూడిన బాధను అనుభవిస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
 
 ఆ మనోవేదన నుంచి బయటపడడానికి ఆమె ఇటీవల తన స్నేహితురాలితో కలిసి గోవాకు విహార యాత్ర పేరుతో వెళ్లినట్టు టాక్. సిద్ధార్థ్‌కు దూరమైన సమంత నటనపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు కొంత కాలం ఈ ప్రేమ, దోమలాంటి వాటిని మరచిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నటుడు సిద్ధార్థ్‌పై ఇలాంటి ప్రేమ దుమారం చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. తన భార్యకు విడాకులిచ్చిన సిద్ధార్థే ఆ తరువాత నటి శ్రుతిహాసన్‌తో ప్రేమ వ్యవహారం జరిపారనే ప్రచారం ఆ మధ్య జోరుగా సాగిందన్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement