2020 ఏడాది ముగుస్తుండటంతో న్యూ ఇయర్ వేడుకలకు అందరూ రెడీ అవుతున్నారు. కొత్త సంవత్సరానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉండటంతో వెకేషన్ ట్రిప్‌లకు వరుస కడుతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా హాలీడే ప్రదేశాలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ క్యూట్ కపూల్ సమంత, చైతన్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు మంగళవారం గోవా బయల్దేరారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి గోవా బయల్దేరారు. ఈ నేపథ్యంలో చైతన్యతో కలిసి సమంత ఎయిర్‌పోర్టులోకి వెళుతుండగా కెమెరా కంటికి చిక్కారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: ఒక్క చోట చేరిన అక్కినేని కుటుంబం!
ఎయిర్‌పోర్టులో గ్రే, బ్లాక్ దుస్తుల్లో సమంత.. వైట్ టీ షర్టు, గ్రే కార్గో ప్యాంట్‌లో నాగచైతన్య కనిపించారు. ఇద్దరూ ముఖానికి మాస్కు ధరించి ఉన్నారు. ఇదిలా ఉండగా నవంబర్ చివరి వారంలో నాగ చైతన్య 34వ పుట్టినరోజును సమంత మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన విషయం తెలిసిందే. మాల్దీవుల వెకేషన్ అనంతరం వీరిద్దరూ ప్రస్తుతం గోవా వెళుతున్నారు. గోవాలోని ప్లష్ రిసార్ట్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు. కాగా చైసామ్‌కు ఇష్టమైన ప్రదేశాల్లో గోవా ఒకటి. 2017లో గోవాలోని ఓ రిసార్ట్‌లోనే వీరి వివాహం జరిగింది. 2017 అక్టోబర్ 6న హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ జంట ఏడడుగులు వేయగా.. అక్టోబర్ 7న గోవాలో క్రిస్టియన్ పద్దతిలో సామంతకు చైతన్య రింగ్ తొడిగాడు.
Comments
Please login to add a commentAdd a comment