New Year Celebrations
-
Foula: ఆరున క్రిస్మస్.. 13న న్యూ ఇయర్!!
2025 ఏడాది మొదలై ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా కొత్త తీర్మానాలతో, ఆనందక్షణాలతో బంధుమిత్రుల సమక్షంలో జనమంతా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేసి తమతమ పనుల్లో బిజీ అయిపోయారు. కానీ బ్రిటన్‌లోని ‘ఫౌలా’ద్వీపంలో మాత్రం అత్యంత ఆలస్యంగా అంటే సోమవారం (జనవరి 13) రోజు ఘనంగా కొత్త ఏడాది వేడుకలు జరిగాయి. అందరూ డిసెంబర్ 31 రాత్రి నుంచే సెలబ్రేషన్లు మొదలెట్టి ముగించేస్తే వీళ్లేంటి ఇంత ఆలస్యంగా వేడుకలు చేస్తున్నారని ఆశ్చర్యపోకండి. వాళ్ల దృష్టిలో జనవరి 13వ తేదీనే అసలైన కొత్త ఏడాది. ఎందుకంటే వాళ్లు మనలా ఆధునిక గ్రెగోరియన్ క్యాలెండర్‌ను పాటించరు. ప్రాచీనకాలంనాటి సంప్రదాయ జూలియన్ క్యాలెండర్‌ను మాత్రమే అనుసరిస్తారు. జూలియన్ క్యాలెండర్ స్థానంలో నాలుగు శతాబ్దాల కిందట కొత్తగా గ్రెగరీ క్యాలెండర్ వచ్చిన సంగతి తెల్సిందే. 400 సంవత్సరల క్రితం నాటి 13వ పోప్ గ్రెగరీ కొత్త క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కొత్త క్యాలెండర్ ఆయన పేరిటే తర్వాత కాలంలో గ్రెగోరియన్ క్యాలెండర్‌గా స్థిరపడిపోయింది. కానీ ఫౌలా ద్వీపవాసులు మాత్రం తన ఐలాండ్‌లో వేడుకలను పాత జూలియన్ క్యాలెండర్‌ను అనుసరించి మాత్రమే జరుపుకుంటారు. అందుకే జూలియన్ క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాదిని జనవరి 13వ తేదీన మాత్రమే జరుపుకున్నారు. దీంతో ఆదివారం ద్వీపంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. క్రిస్మస్ను సైతం వాళ్లు జూలియన్ క్యాలెండర్ ప్రకారమే చేసుకుంటారు. అందరూ డిసెంబర్ 25న క్రిస్మస్ చేసుకుంటే వీళ్లు మాత్రం జనవరి ఆరో తేదీన క్రిస్మస్ను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఎక్కడుందీ ఫౌలా? బ్రిటన్‌లోని అత్యంత మారుమూల ద్వీపంగా గుర్తింపు పొందిన ఈ ఫౌలా.. షెట్‌ల్యాండ్ అనే ప్రధాన ద్వీపానికి 16 మైళ్ల దూరంలో ఉంది. ఫౌలా ద్వీపం పొడవు కేవలం ఐదు మైళ్లు. ప్రధాన భూభాగం నుంచి ఇక్కడికి విద్యుత్లైన్ల వ్యవస్థ లేదు. అందుకే ఇక్కడ జనం సొంతంగా విద్యుత్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. పవన విద్యుత్, చిన్నపాటి జల విద్యుత్ వ్యవస్థ, సౌర ఫలకాలతో సౌర విద్యుత్‌ను సమకూర్చుకుంటున్నారు. ప్రధాన ద్వీపసముదాయమైన షెట్లాండ్లోని టింగ్వాల్ విమానాశ్రయం నుంచి ఇక్కడికి విమాన సర్వీసులు ఉన్నాయి. బ్రిటన్‌లోని అత్యంత మారుమూల ద్వీపాల్లో ఒకటైన ఫౌలాలో అత్యంత పురాతన నార్న్ భాషను మాత్రమే మాట్లాడతారు. ఇక్కడి జనాభా కేవలం 40 మంది మాత్రమే. ప్రస్తుతం 36 మంది మాత్రమే ఉంటున్నారు. పని చేయడానికి బయటి నుంచి ఎవరూ రారు. మన పని మనం చేసుకోవాల్సిందే. ప్రకృతిని ఆస్వాదిస్తూనే ఇక్కడి జనమంతా పనుల్లో బిజీగా ఉంటారు. రెండూ అద్భుతమైనవే: రాబర్ట్ స్మిత్ రెండు వారాల వ్యవధిలో రెండు క్రిస్మస్లు, రెండు నూతన సంవత్సర వేడుకలు రావడం నిజంగా బాగుంటుందని 27 ఏళ్ల రాబర్ట్ స్మిత్ వ్యాఖ్యానించారు. విద్యాభ్యాసం కోసం కొంతకాలం షెట్లాండ్ ద్వీపసముదాయంలో ఉన్న రాబర్ట్.. మళ్లీ ఫౌలాకు వచ్చేశారు. అందరు ద్వీపవాసుల మాదిరిగానే ఆయనా అనేక పనులు చేస్తాడు. పడవను నడపడం, నీటి శుద్ధి కర్మాగారంలో పనిచేయడం, టూర్లు, అవసరమైతే ఉత్తరాలు అందించడం అన్ని పనుల్లో పాలు పంచుకుంటాడు. ‘‘ఉరుకుల పరుగుల షెట్లాండ్ లైఫ్‌ను చూశా. ప్రశాంతమైన ఫౌలా జీవితాన్ని గడుపుతున్నా. ఆస్వాదించగలిగే మనసున్న ఫౌలా స్వాగతం పలుకుతోంది. ఇక్కడ అందరం ఒకే కుటుంబంలా నివసిస్తాం. ఎప్పుడూ సంగీతం వింటాం. సాధారణంగా ఏ ద్వీపంలోనైనా వృద్ధులు, మధ్యవయస్కులు ఉంటారు. కానీ ఫౌలాలో ఎక్కువ మంది యువత, చిన్నారులే. గతంలో ఇక్కడి మెజారిటీ జనాభా పక్షుల వేటనే ప్రధాన వృత్తిగా ఎంచుకునేది. పక్షులను కొట్టి తెచ్చి కూర వండుకుని తినేయడమే. ఇప్పుడంతా మారిపోయింది. ఎన్నో వృత్తులు వచ్చాయి. తోటపని, చేపలు పట్టడం, కళాకారునిగా పనిచేయడం ఇలా...’’అని రాబర్ట్ అన్నారు. ‘‘ఇక్కడి వాళ్లు అందరితో కలుపుగోలుగా ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్తాం. ఆనందంగా పాడతాం. ఆడతాం. రాబర్ట్ గతంలో గిటార్ వాయించేవాడు. తర్వాత మాండలీన్ పట్టుకున్నాడు. ఇప్పుడేమో ఫిడేల్ నేర్చుకుంటున్నాడు’అని ద్వీపంలోని మరో వ్యక్తి చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బికినీలో ప్రియాంక చోప్రా.. కొత్త ఏడాది సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
కొత్త ఏడాది కొత్త కొలువులు
ఉద్యోగం చేయాలని గట్టిగా అనుకున్నా... పని ఒత్తిడి వల్ల ఇల్లు దాటలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది మహిళలు. ఇలాంటి వారికి కొత్త సంవత్సరం(New Year)లో వర్క్–ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు(Work from Home) స్వాగతం పలుకుతున్నాయి. ఇంటి పని, ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ఇల్లు దాటకుండానే చేసే ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. మచ్చుకు కొన్ని...వర్చువల్ అసిస్టెంట్విఏ (వర్చువల్ అసిస్టెంట్(Virtual Assistant) ఉద్యోగాలకు కొత్త సంవత్సరంలో మరిన్ని అవకాశాలు పెరగబోతున్నాయి.ఇ–మెయిల్స్, అపాయింట్మెంట్స్, బుకింగ్స్, ట్రావెల్ అండ్ పబ్లిక్ రిలేషన్ అకౌంట్లు...మొదలైన క్లరికల్, సెక్రటేరియల్ విధులను నిర్వహించే ఉద్యోగం వర్చువల్ అసిస్టెంట్. బాగా ఆర్గనైజ్డ్గా ఉండి వర్చువల్ పనులను సంబంధించి సులభంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం ఉన్న మహిళలకు ఈ ఉద్యోగం సరిౖయెనది.సోషల్ మీడియా మేనేజర్వివిధ వ్యాపారాలకు ఇప్పుడు సోషల్ మీడియా తప్పనిసరి అవసరం కావడంతో ‘సోషల్ మీడియా మేనేజర్’ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి పోస్ట్’ ప్లానింగ్ చేయడం, పోస్ట్‌కు సంబంధించిన కంటెంట్ జనరేట్ చేయడం, ఫాలోవర్స్‌తో ఎంగేజై ఉండడం... మొదలైనవి సోషల్ మీడియా మేనేజర్ పనులలో ఉన్నాయి. కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అయ్యే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న మహిళలు ఈ ఉద్యోగాన్ని సులభంగా చేయవచ్చు.ఆన్లైన్ ఈవెంట్ ప్లానర్వెబినార్స్, కాన్ఫరెన్స్‌లు, ఆన్లైన్ వర్కషాప్‌లు... మొదలైన ఆన్లైన్ ఈవెంట్స్ నిర్వహించే ఉద్యోగం ఆన్లైన్ ఈవెంట్ ప్లానర్. ఆర్గనైజేషనల్, కమ్యునికేషన్, క్రియేటివ్ స్కిల్స్‌కు సంబంధించిన ఉద్యోగం ఇది.ఈవెంట్స్ కో ఆర్డినేట్ చేయడం, వెండర్ అండ్ స్పీకర్ మేనేజ్మెంట్, టెక్నికల్ కోఆర్డినేషన్.. మొదలైనవి ఆన్లైన్ ఈవెంట్ ప్లానర్ బాధ్యతల్లో ఉంటాయి.ఆన్లైన్ ట్యుటోరింగ్కరోనా కాలంలో ఆన్లైన్ ట్యుటోరింగ్(Online Tutoring) అనేది ఉపాధి మార్గంగా బలపడింది. భాషా ప్రావీణ్యం నుంచి గణితం, సైన్స్‌లాంటి సబ్జెక్ట్‌లలో ప్రతిభ వరకు ఆన్లైన్ ట్యుటోరింగ్ మీకు ఉపయోగపడుతుంది. వేదాంతు, బైజు, ట్యుటోర్మీ... మొదలైన ఎన్నో ఆన్లైన్ ట్యుటోరింగ్ మోడల్స్ ఉన్నాయి. జాతీయంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఇంటి నుంచే ఉద్యోగం చేయవచ్చు.కస్టమర్ సపోర్ట్ రిప్రెజెంటివ్కస్టమర్ సర్వీస్ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఇంటినుంచి ఉద్యోగం చేయాలనుకునే మహిళలకు ఈ ఉద్యోగాలు అనుకూలం. కస్టమర్ల సందేహాలకు ఫోన్, ఇ–మెయిల్, చాట్... మొదలైన వాటి ద్వారా సమాధానం ఇవ్వడంలాంటి పనులు ఉంటాయి. ఎంత జటిలమైన విషయాన్ని అయినా సులభంగా అర్థమయ్యేలా చెప్పే సామర్థ్యం మీలో ఉంటే ఈ ఉద్యోగం మీకోసమే. (చదవండి: పిగ్మెంటేషన్ సమస్యకు చెక్ పెట్టండి ఇలా..!) -
12 మందిని కాల్చి ఆపై ఆత్మహత్య
పొడ్గొరిక(మాంటెనెగ్రో): నూతన సంవత్సర సంబరాలు జరుగుతున్న వేళ మాంటెనెగ్రోలోని సెటింజె పట్టణంలో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. అకో మార్టినోవిక్(45) అనే వ్యక్తి ఉన్మాదిగా మారి బార్ యజమాని, అతడి ఇద్దరు పిల్లలతోపాటు సొంత కుటుంబ సభ్యులను సైతం పొట్టనబెట్టుకున్నాడు. స్థానిక బార్లో బుధవారం ఉదయం నుంచి మార్టినోవిక్ గడిపాడు. సాయంత్రం గొడవకు దిగి ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి తుపాకీ తీసుకుని బార్లోకి ప్రవేశించిన అతడు బార్‌లోని వారిపైకి కాల్పులకు దిగాడు. అనంతరం బయటకు వెళ్లి మరో మూడు చోట్ల కాల్పులు జరిపాడు. పోలీసులు వెంబడించడంతో అక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొడ్గొరికకు వెళ్లాడు. పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకున్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. హింసా ప్రవృత్తి, చంచల స్వభావి అయిన మార్టినోవిక్పై గతంలో పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. యూరప్‌లోని చిన్న దేశం మాంటెనెగ్రో జనాభా 6.20 లక్షలు. ఆయుధాలను కలిగి ఉండటం ఇక్కడో సంప్రదాయం. తుపాకీ సంస్కృతి కారణంగా తరచూ నేరాలు జరుగుతుంటాయి. తాజా ఘటన జరిగిన సెటింజెలోనే 2022 ఆగస్ట్‌లో ఓ దుండగుడు ఇద్దరు చిన్నారులు సహా 10 మందిని కాల్చి చంపాడు. ఓ వ్యక్తి సకాలంలో అతడిని కాల్చి చంపడంతో మారణ హోమానికి పుల్‌స్టాప్ పడింది. -
హిమాచల్ పోలీసుల అకృత్యం
బనీఖేత్(హిమాచల్ ప్రదేశ్): నూతన సంవత్సర వేడుకల వేళ అర్ధరాత్రి దాటాక తాము అడిగిన మద్యం, ఆహారం ఇవ్వలేదన్న అక్కసుతో రిసార్ట్ మేనేజర్‌ను పోలీసులు కొట్టి చంపేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రిసార్ట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు, నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రిదాటాక పర్వతమయ పర్యాటక ప్రాంతం డల్హౌసీ దగ్గర్లోని బనీఖేత్లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చారు. రాత్రి రెండు గంటల సమయంలో తాము అడిగిన భోజనం, మద్యం ఏర్పాట్లు చేయాలని రిసార్ట్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. రాత్రి సమయంలో తాము చేయాల్సిన ‘సర్వీస్’సమయం మించిపోయిందని, ఇప్పుడు నిబంధనలు ఒప్పుకోవని, ఈ సమయంలో సర్వీస్ చేయడం కుదరని అక్కడి రిసెప్షనిస్ట్ సచిన్ చెప్పాడు. దీంతో పట్టరాని ఆవేశంతో కానిస్టేబుల్స్ అనూప్, అమిత్‌లు రిసెప్షనిస్ట్‌ను చితకబాదారు. ఇదంతా చూసిన రిసార్ట్ మేనేజర్ రాజీందర్ హుటాహుటిన అక్కడికొచ్చి కానిస్టేబుళ్లను నిలువరించబోయారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న కానిస్టేబుళ్లు రాజీందర్పైనా దాడికి తెగించారు. ఈ దాడిలో రాజీందర్ అక్కడికక్కడే చనిపోయారు. దాడి సమయంలో కానిస్టేబుళ్లు పూటుగా మద్యం తాగి ఉన్నారని వార్తలొచ్చాయి. విషయం తెల్సుకున్న స్థానికులు వెంటనే చంబా–పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాజీందర్ మృతికి కారణమైన కానిస్టేబుళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్‌చేశారు. ఇద్దరినీ విధుల నుంచి తప్పించి దర్యాప్తు మొదలుపెట్టామని చంబా ఎస్పీ గురువారం చెప్పారు. తీవ్రంగా గాయపడిన రిసెప్షనిస్ట్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. -
హైకోర్టులో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
సాక్షి,అమరావతి: రాష్ట్ర హైకోర్టులో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో పాటు న్యాయమూర్తులు పాల్గొన్నారు. 25 కేజీల కేక్‌ను కట్ చేశారు. ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైకోర్టు ఉద్యోగుల సంఘం 2025 సంవత్సర క్యాలెండర్‌ను సీజే ఆవిష్కరించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు, ఇతర రిజిస్ట్రార్లు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు, ఉపాధ్యక్షుడు సురేంద్రనాథ్, కార్యదర్శి ఎలీషా, కార్యనిర్వాహక కార్యదర్శి చంద్రబాబు, సంయుక్త కార్యదర్శి జి.కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు రేష్మ, రాంబాబు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
తెగ కొనేశారు!
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశంలో క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేశాయి. వివిధ వస్తువులు, ఆహారం వంటివాటి విక్రయాల్లో సాధించిన రికార్డులను జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ తదితర ప్లాట్‌ఫామ్‌ల ఎగ్జిక్యూటివ్‌లు, ప్రతినిధులు ఘనంగా ప్రకటిస్తున్నారు. ‘రియల్ టైమ్ ఆర్డర్ల’గణాంకాలను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 2023 డిసెంబర్ 31వ తేదీతో పోల్చితే 2024 డిసెంబర్ 31న (మంగళవారం) సాయంత్రం 5 గంటలకే అధిక ఆర్డర్లు వచ్చినట్టు బ్లింకిట్ సహ–వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా వెల్లడించారు. 2023తో పోల్చితే 2024 చివరి రోజు తమకు 200 శాతం అధిక ఆర్డర్లు వచ్చినట్లు జెప్టో కో–¸ఫౌండర్, సీఈవో ఆదిత్ పాలిచా తెలిపారు. బ్లింకిట్, జెప్టోల మాదిరిగానే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డిసెంబర్ 31న గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఆర్డర్లు సాధించినట్లు ఆ సంస్థ కో–ఫౌండర్ ఫణి కిషన్ ఆద్దెపల్లి తెలిపారు. ఆర్డర్లలో రికార్డులివే.. » గోవాలోని ఒక కస్టమర్ అత్యధికంగా రూ.70,325లకు ఇన్‌స్టామార్ట్ ప్లాట్‌ఫామ్‌పై ఆర్డర్ చేశాడు. » కోల్‌కత్తాకు చెందిన ఒక వినియోగదారుడు బ్లింకిట్‌లో రూ.64,988లకు ఆర్డర్ ఇచ్చాడు. » అన్ని క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై డిస్పోజబుల్ గ్లాసులు, ఆలుగడ్డ చిప్స్, ఐస్‌క్యూబ్స్, చాక్లెట్లు, టానిక్వాటర్, నిమ్మకాయలు, సోడాలు, కూల్‌డ్రింక్‌లు, ఇతర వస్తువుల ఆర్డర్లు అధికంగా వచ్చాయి. » ఫుడ్ డెలివరీ యాప్‌లలో వివి ధరకాల ఆహార పదార్థాలను కస్టమర్లు ఆర్డర్ చేశారు. స్విగ్గీలో బిర్యానీ ప్రాధాన్యత ఆహారంగా నిలిచింది. » ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఆర్డర్ చేసిన 164 సెకండ్లలోనే (మూడు నిముషాలలోపే) బిర్యానీని వినియోగదారుడి ఇంటి ముంగిటికి స్విగ్గీ చేర్చింది. » కేక్‌ల కోసం మొత్తం 2,96,711 ఆర్డర్లు స్విగ్గీకి వచ్చాయి. » తమ డెలివరీ భాగస్వాములతో కలిపి స్విగ్గీ సంస్థ డెలివరీ ఏజెంట్లు ఆర్డర్లను అందజేసేందుకు మొత్తం 65,19,841 కి.మీ దూరం ప్రయాణించారు (ఇది భూమి నుంచి చంద్రుడిపైకి ఎనిమిది మార్లు వెళ్లి వచి్చనదానికంటే అధిక దూరం) » రెస్టారెంట్ రిజర్వేషన్ సర్వీస్ స్విగ్గీ డైనౌట్లో మొత్తం ఆర్డర్లలో బెంగళూరు ప్రథమస్థానంలో నిలిచింది. » ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘మ్యాజిక్ పిన్’బిజినెస్ టైమ్‌లో నిమిషానికి 1,500 ఆర్డర్లు అందుకుంది. ఈ పాŠల్ట్ఫామ్పై ఢిల్లీకి చెందిన కస్టమర్ రూ.30 వేల అతిపెద్ద ఆర్డర్ ఇచ్చాడు. అత్యధిక టిప్ హైదరాబాదీదే.. » బ్లింకిట్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి డిసెంబర్ 31న ఓ హైదరాబాదీ ఫుడ్ ఆర్డర్ తెచి్చన డెలివరీ ఏజెంట్‌కు అత్మధికంగా రూ.2,500 టిప్‌గా ఇచ్చాడు. » మొత్తంగా అన్ని నగరాలు కలుపుకుంటే.. అత్యధికంగా బెంగళూరు వాసులు రూ.1,79,735 టిప్పులు ఇచ్చారు. » బర్గర్లకు సంబంధించి మొత్తం 35 వేలకు పైగా ఆర్డర్లు రాగా.. వీటిలో బెంగుళూరు కస్టమర్లు అగ్రభాగాన నిలిచారు. » డిసెంబర్ 31న క్యూకామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై చేసిన ప్రతీ 8 ఆర్డర్లలో ఒకటి కూల్‌డ్రింక్. » కాక్టెయిల్ మిక్సర్లు, సోడా, మింటీ ఫ్రెస్ ఇంట్రీడియెంట్స్కు స్విగ్గీలో 2,542 శాతం డిమాండ్ నమోదైంది. » నాన్ ఆల్కహాలిక్ బీర్లకు 1,541 శాతం డిమాండ్ పెరిగింది. » గేమ్స్, పజిల్స్ వంటి వాటి డిమాండ్ 600 శాతం పెరిగింది. » క్లౌడ్ కిచెన్ స్టార్టప్ క్యూర్ఫుడ్స్కు 2023 కంటే 2024 చివరి రోజు అధిక ఆర్డర్లు వచ్చారు. అధికంగా ఇచి్చన ఆర్డర్లవారీగా చూస్తే వరుసగా బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నిలిచాయి. » బ్లింకిట్‌లో 1,22,356 ప్యాకెట్ల కండోమ్స్, 45,531 మినరల్ వాటర్ బాటిళ్లకు ఆర్డర్లు వచ్చాయి. » ఇదే ప్లాట్‌ఫామ్‌పై 2,34,512 ఆలూ బుజియా ప్యాకెట్లు, 45,531 టానిక్ వాటర్ కాన్లు, 6,834 ప్యాకెట్ల ఐస్‌క్యూబ్‌లు, 1,003 లిప్‌స్టిక్‌లు, 762 లైటర్స్ అమ్ముడయ్యాయి. -
న్యూఇయర్ సెలబ్రేషన్స్: అడవిలో మెగా ఫ్యామిలీ అడ్వెంచర్ (ఫోటోలు)
-
గోవాలో భార్యతో టీమిండియా కెప్టెన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
న్యూ ఇయర్ వేళ తప్పతాగిన ప్రముఖ బుల్లితెర నటి.. నడవలేని స్థితిలో!
చూస్తుండగానే మరో ఏడాది ముగిసిపోయింది. ఎన్నో కొత్త ఆశలతో నూతన ఏడాదికి ప్రపంచమంతా స్వాగతం పలికింది. ఈ కొత్త సంవత్సరాన్ని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రిటీలు సైతం తమ ఫ్యామిలీస్‌తో కలిసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. బాలీవుడ్ తారలంతా కొత్త ఏడాది గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు.అయితే బాలీవుడ్ బుల్లితెర నటి మౌనీరాయ్ న్యూ ఇయర్ వేళ పార్టీకి హాజరైంది. ఆమె తన భర్తతో కలిసి కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకుంది. వీరిద్దరికి సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంటతో పాటు కల్కి భామ దిశాపటానీ కూడా న్యూ ఇయర్ పార్టీలో సందడి చేశారు.అయితే ఈ వీడియోలో మౌనీ రాయ్ ఫుల్‌గా ఆల్కహాల్ సేవించినట్లు కనిపించింది. తన భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకుంది. బార్ నుంచి బయటికి వస్తూ నడవలేక కింద పడిపోయింది. దీంతో మౌనీ రాయ్‌ను ఆమె భర్తనే స్వయంగా ఇంటికి తీసుకెళ్లారు. ఎవరూ ఫోటోలు తీయవద్దంటూ ఆమె భర్త కెమెరాలకు తన చేతిని అడ్డు పెట్టడం వీడియోలో కనిపించింది. వీరి వెనకాలే కల్కి మూవీ హీరోయిన్ దిశా పటానీ కూడా కనిపించింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేయడంతో నెట్టింట వైరలవుతోంది.కాగా.. మౌనీ రాయ్ నాగిని సీరియల్‌తో ఫేమస్ అయింది. బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో ఆమె నటించింది. View this post on Instagram A post shared by Saalim Hussain Rizvi (@saalim_hussain110) #MouniRoy fell while exciting the bar and then husband took her in his arm till the car #DishaPatani pic.twitter.com/N0uau0IInf— $@M (@SAMTHEBESTEST_) January 2, 2025 -
New Year 2025 : నీతా అంబానీ న్యూ ఇయర్ లుక్, ధర ఎంతో తెలుసా?
అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్యగానే కాదు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ వ్యాపారవేత్తగా, పరోపకారిగా అందరికి సుపరిచితమే. నీతా అంబానీ ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ ఓనర్ కూడా. అలాగే నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సొసైటి ఆధ్వర్యంలో ప్రాచీన కళలకు, సంస్కృతులకు పెద్ద పీట వేస్తున్నారు. అనేక మంది కళాకారులను ఎన్ఎంఏసీసీ ద్వారా ఆదరిస్తున్నారు. అయితే నీతా అంబానీ ఫ్యాషన్ ఐకాన్ కూడా. చేనేత చీరలు, ఖరీదైన పట్టుచీరలు, విలువైన డైమండ్ ఆభరణాలు, లగ్జరీ బ్యాగులు, లగ్జరీ పాదరక్షలు, ఇలా ఒకటనేమిటి ప్రతీ విషయంలోనూ తనదైన శైలితో అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా నూతన సంవత్సర వేడుకల్లో మరోసారి ప్రత్యేకంగా నిలిచారు. గోల్డెన్ కఫ్తాన్ గౌనులో నీతా అంబానీ గ్లామ్ న్యూ ఇయర్ లుక్ అభిమానులు, ఫ్యాషన్ ప్రియుల దృష్టిలో పడ్డారు. దాని ధర ఎంత అనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Ritika kadam (@ritikahairstylist)సన్నిహితులు ,కుటుంబ సభ్యుల మధ్య 2025 ఏడాదికి స్వాగతం పలికారు నీతా అంబానీ. కొత్త కోడలు అనంత్ అంబానీ భార్య రాధిక మర్చెంట్‌కు ఇది మొదటి న్యూఇయర్ కావడం మరో విశేషం. న్యూ ఇయర్ సందర్భంగా అనంత్, ఆకాష్ అంబానీ జంట అందంగా కనిపించారు. ఇక నీతా అంబానీ 60 ఏళ్ల వయసులో కూడా డిజైనర్ ఆస్కార్ డి లా రెంటా కలెక్షన్, మౌస్లైన్ ఫాబ్రిక్‌తో రూపొందించిన ముదురు బంగారు కఫ్తాన్ గౌనులో అప్పరసలా మెరిసిపోయారు. నెక్లైన్ క్రిస్టల్ లీవ్స్, లాంగ్ కేప్ స్లీవ్స్, అందమైన కఫ్తాన్ సిల్హౌట్, వీటన్నింటికీ మించి ఫ్లోర్-స్వీపింగ్ హెమ్‌లైన్ మరింత ఆకర్షణీయంగా నిలిచారు. ఇంతకీ ఈ లగ్జరీ గౌన్ ధర ఎంతో తెలుసా? దీని ధర సుమారు రూ. 1.54 లక్షలు. -
USA: న్యూ ఇయర్ వేళ ఉగ్రదాడి.. 15కు చేరిన మరణాలు
వాషింగ్టన్: కొత్త ఏడాది వేడుకల వేళ అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోయిన జనంపైకి ఓ ఆగంతకుడు ట్రక్కుతో ఢీకొట్టి, తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 15 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఇందుకు కారణమైన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపడంతో అతడు చనిపోయాడు. ఘటనపై ఉగ్ర చర్య కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోంది.ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐ కీలక ప్రకటన చేసింది. న్యూ ఆర్లీన్స్‌లో పికప్ ట్రక్‌తో బీభత్సం సృష్టించిన నిందితుడిని షంషుద్దీన్ జబ్బార్(42)గా ఎఫ్‌బీఐ గుర్తించింది. అతడు అమెరికా పౌరుడే. టెక్సాస్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా జబ్బార్ పనిచేస్తున్నాడు. ఏడేళ్లు మిలిటరీలోనూ సేవలు అందించాడు. అయితే, ఆర్థిక కారణాలు ఎదుర్కొంటున్న జబ్బార్‌కు భార్యతో విడాకులు అయ్యాయి. కాగా, ప్రమాదం తర్వాత అతడి వాహనంలో ఐసీస్ ఉగ్రవాద సంస్థ జెండా లభించింది. దీంతో, ఈ ఘటన టెర్రరిస్ట్‌ల పన్నాగమేనని ఎఫ్‌బీఐ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.New video of last night’s terror attack in New Orleans 😡😡 pic.twitter.com/7Zrab642ab— KellyCurrie45 (@KaCurrie_45) January 1, 2025ఇదిలా ఉండగా.. లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూఆర్లీన్స్‌లోని బార్బన్ వీధి కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాదిలాగే ఈసారీ వేల మంది ఈ వేడుకల కోసం తరలివచ్చారు. దీంతోపాటు బుధవారం సాయంత్రం సమీపంలోని స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఉండటంతో మరింత మంది ఈ ప్రాంతానికి ముందుగానే వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3.15 సమయంలో వారంతా సంబరాల కోసం రోడ్డుపై ఉండగా దుండగుడు వాహనంతో వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా.. మరో 35 మంది గాయపడ్డారు. దాడి అనంతరం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో, పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో జబ్బార్ అక్కడికక్కడే మృతిచెందాడు.#ShamsudDinJabbar also Muhammad Shamsuddin Jabbar is the #NewOrleansMassacre terrorist. It looks like he may have some Middle Eastern / South Asian ancestry, desides his dominant black ancestry. #NewOrleansHorror #NewOrleansTerroristAttack #NewOrleansStrong pic.twitter.com/PihoTkf0Qi— Dr. Asim Yousafzai (@asimusafzai) January 2, 2025 బైడెన్ సంతాపం..ఈ ఘటనపై ఉగ్ర కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ప్రతి అంశాన్నీ పరిశీలించి ఏం జరిగిందో తెలుసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించానని పేర్కొన్నారు. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి వచ్చిన వారు విగత జీవులుగా మారడంతో తన హృదయం బరువెక్కిపోయిందని వెల్లడించారు. ఎటువంటి హింసనూ సహించేది లేదని స్పష్టం చేశారు. -
విశాఖ : సాగర తీరంలో కొత్త సంవత్సరం జోష్.. యువత సెల్ఫీలు (ఫొటోలు)
-
కొత్త సంవత్సరం...హుసేన్ సాగర్ వద్ద సందడే సందడి (ఫొటోలు)
-
కొత్త ఏడాదిలో... ఇలా చేద్దాం!
న్యూ ఇయర్‌ను ‘హ్యాపీ’గా మలచుకునే మార్గాలు కాలం ఒక మాయాజాలం. కళ్లముందే కరిగిపోతుంది. ఒడిసిపట్టేందుకు ఎంత ప్రయత్నించినా వేలి సందుల గుండా ఇట్టే జారిపోతుంది. ఆ క్రమంలో మరో ఏడాది చూస్తుండగానే కరిగిపోయింది. తీపి, చేదు అనుభవాలను మిగిల్చి 2024 చరిత్ర పుటల్లోకి జారుకుంది. కొత్త ఆశలను, సరికొత్త ఆకాంక్షలను మోసుకుంటూ 2025 వచ్చేసింది. బద్ధకం వదిలించుకుంటామని, ఇంకోటని, మరోటని... ఇలా న్యూ ఇయర్ అంటేనే ఎన్నో తీర్మానాలు, మనకు మనమే చేసుకునే వాగ్దానాలు. ఇటు చేసే పనిని, అటు ఈదే సంసారాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంటిల్లిపాదితో పాటు మన ఆరోగ్యమూ జాగ్రత్తగా చూసుకోవాలి. పెట్టుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించేయాలి. కొత్త అభిరుచులు పెంచుకోవాలి. మొత్తమ్మీద వీలైనన్ని ఆనందమయ క్షణాలను ఒడిసిపట్టుకోవాలి. ఇలాంటివన్నీ ఎవరికైనా ఉండే ఆశలే. ఇవన్నీ తీరి 2025 ఆసాంతం హాయిగా సాగేందుకు ఏమేం చేయాలంటే..!ఆందోళనకు చెక్ ఆధునిక జీవన విధానం పుణ్యమా అని అప్పుడప్పుడు ఒత్తిళ్లు ఎవరికైనా ఉండేవే. కానీ రోజులో చాలాభాగం ఆందోళన మధ్యే గడుస్తోందంటే మాత్రం డేంజరే. కాస్త ఆగి, అర్థం చేసుకునే లోపే పూడ్చుకోలేనంత నష్టం జరిగిపోతుంటుంది. కనుక మనసును కుంగదీసే ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిష్పాక్షికంగా మదింపు చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం వారానికోసారి కొంత సమయాన్ని ప్రత్యేకించుకోవాలి. ప్రథమ కోపం వంటివేమైనా పెరుగుతున్నాయా అని ఒకటికి రెండుసార్లు పరిశీలించి చూసుకోవాలి. ఆ లక్షణాలు కనిపిస్తే మొదట్లోనేవదిలించుకోవాలి. లేదంటే ఆఫీసులోనూ, ఇంట్లోనూ లేనిపోని సమస్యలు నెత్తిన పడటం ఖాయం. లేదంటే నచ్చనిది, ఊహించనిది జరిగితే వెంటనే అరిచేసి అవతలి వారిని గాయపరచడం లాంటివి పెరిగిపోతాయి. ఇది సంబంధాలను సరిచేయలేనంతగా దెబ్బ తీస్తుందని గుర్తుంచుకోవాలి. అది ఆఫీసైనా కావచ్చు, ఇల్లయినా కావచ్చు. అయితే ఎంత ప్రయత్నించినా మనమూ మనుషులమే గనుక ఎప్పుడైనా నోరు జారవచ్చు. అప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు మీరే చొరవ తీసుకోండి. అవసరమైతే అవతలి వారికి సారీ చెప్పినా తప్పు లేదు. అది మీకు నామర్దా అని అస్సలు అనుకోవద్దు. అవతలి వారి దృష్టిలో వ్యక్తిగా మిమ్మల్ని మరో మెట్టు ఎక్కిస్తుందని తెలుసుకోండి. మంచి సావాసం మీకన్నా తెలివైన వారితో, మంచివారితో వీలైనంత ఎక్కువగా గడపండి. తెలివైనవారి సాహచర్యంలో తెలియకుండానే బోలెడు విషయాలు నేర్చుకుంటారు. మంచివారు ఆచరించి చూపే జీవిత విలువలు మనకు దారి చూపే దీపాలవుతాయి. వాటిని ఎంతగా అలవర్చుకుంటే అహంకారం వంటి అవలక్షణాలు అంతగా అణగుతాయి. మానసిక ప్రశాంతతకు, నిజమైన తృప్తికి బాటలు పడతాయి. బద్ధకానికి బై బై బద్ధకాన్ని వదలించుకుందాం. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా దీన్ని న్యూ ఇయర్ తీర్మానాల చిట్టాకు పరిమితం చేయకండి. ఈ క్షణం నుంచే ఆచరణలో పెట్టండి. దీన్నొక్కదాన్ని దూరం చేసుకుంటే చాలా సమస్యలు పరిష్కారమైనట్టేనని గుర్తుంచుకోండి. మెదడును ఖాళీగా ఉంచకపోవడమే ఈ సమస్యకు పరిష్కారం. ఏఐ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి. వృత్తి సంబంధ నైపుణ్యాలను మెరుగుపెట్టుకోండి. అది మీ ఆత్మవిశ్వాసాన్నీ అమాంతంగా పెంచేస్తుంది. నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే అటు బద్ధకమూ వదులుతుంది. ఇటు చక్కని ఐడియాలూ పుట్టుకొస్తాయి. రెండిందాలా లాభమే. ఇతరులకు సాయపడదాం ప్రతిఫలం ఆశించకుండా చేసే సాయం వల్ల కలిగే ఆత్మసంతృప్తి అంతా ఇంతా కాదు. అది ఎన్ని వేలు, లక్షలు ఖర్చు చేసినా దొరికేది కాదు. మనకిష్టమైన వారికి సాయపడటం పెద్ద విషయమేమీ కాదు. మీకిష్టం లేని వారికి అవసరాల్లో సాయపడితే మనిíÙగా మరో మెట్టు ఎక్కినట్టే. ఇతరుల్లోని మంచిని గుర్తించడం, అభినందించడం అలవాటుగా మార్చుకుంటే మన సాన్నిధ్యాన్ని అంతా ఇష్టపడతారు. పరిష్కారాలు సూచిద్దాం ఎప్పుడూ సమస్యలను ఎత్తిచూపడం కాదు. అది అందరూ చేసేదే. ఇంతకాలంగా మనమూ చేస్తూ వస్తున్నదే. వాటికి ఆచరణసాధ్యమైన పరిష్కారాలను సూచించే ధోరణి అలవర్చుకుందాం. మొదట్లో కాస్త కష్టమే అనిపించినా మనల్ని అందరికీ అత్యంత ఇషు్టలను చేస్తుందిది. ముఖ్యంగా ఆఫీసుల్లో మేనేజర్ వంటి పొజిషన్లలో ఉంటే ఈ ఒక్క అలవాటుతో సహోద్యోగులందరి మనసూ ఇట్టే గెలుచుకోవచ్చు. వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి వాళ్లకు సలహాలివ్వడమే గాక ఎప్పటికప్పుడు తోడు నిలిస్తే వాళ్లకూ బాగుంటుంది. మనకూ తృప్తిగా ఉంటుంది. సంస్థా లాభపడుతుంది. అలా ఆల్ హ్యాపీసే. చిన్న విజయాలనూ ఆస్వాదిద్దాం విజయం సాపేక్షం. దానికి ఒక్కొక్కరూ ఒక్కో నిర్వచనమిస్తారు. భారీ లక్ష్యాలు సాధించినప్పుడు కలిగే విజయానందం గొప్పదే. కానీ దాని కోసమని ఆనందాన్ని అప్పటిదాకా వాయిదా వేసుకోవడమెందుకు? ఆ లక్ష్యాలను సాధించే క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న సాఫల్యాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడాన్ని అలవాటుగా మార్చు కుందాం. అప్పుడిక ప్రతి రోజూ పండుగే. ఆత్మానందమూ ముఖ్యమే వ్యక్తిగత, వృత్తిగత, సాంసారిక సంతృప్తి చా లా ముఖ్యమే. కానీ ఆత్మానందం వీటన్నింటి కంటే విలువైనది. దాన్ని పొందేందుకు కూడా ఇప్పటినుంచే ప్రయత్నం మొ దలు పెడదాం.అంటే ఎకాయెకిన కఠోర ఆధ్యాత్మిక సాధనలు చేసి తీరాలని కాదు. ఏ కవిత్వం, సంగీతం వంటివాటితో లోపలి ప్రయాణాన్ని మెల్లిమెల్లిగా మొదలు పెట్టవచ్చు. నేనెవరిని అనే మూలాలోచన అంటూ ఒకటి మనసులో ఒక పక్కన సాగుతూ ఉంటే చాలు. ఆత్మాన్వేషణకు క్రమంగా బాటలు అవే పడతాయి. చివరగా, వీలైనంతగా నవ్వండి. మానసికంగా అది కలిగించే సానుకూల ప్రభావం అంతా ఇంతా కాదని ఎన్నెన్నో అధ్యయనాలు ముక్త కంఠంతో తేల్చాయి. మొహంపై చిరునవ్వు చెరగని వారికి ప్రతి క్షణమూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. మరింకెందుకు ఆలస్యం?! ఈ క్షణమే రంగంలోకి దిగుదాం. బద్ధకాన్ని వదిలించుకుందాం. మనల్ని మనం నిత్యం సానబట్టుకుంటూ సాగుదాం. 2025ను మన జీవితంలోకెల్లా అత్యంత ఆనందమయమైన ఏడాదిగా మలచుకుందాం. అవసరాలకే జై కోర్కెలకు, కనీస అవసరాలకు చాలా తేడా ఉంది. ఆశలు అనంతమే గానీ ఆర్జన ఎప్పుడూ పరిమితమే. ఇదొక్కటి గుర్తుంచుకుంటే అవసరాలు, సౌకర్యాలు, ఆడంబరాలకు మధ్య స్పష్టమైన గీత గీయగలం. వేటిని తీర్చుకోవాలో, వేటిని దూరం పెట్టాలో, వేటిని వదిలించుకోవాలో తేల్చుకోవ డం తేలికవుతుంది. చాలా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అనుకోని అవసరాల కోసం కొంత మొత్తం కూడా పక్కన పెట్టుకోగలుగుతాం. ఆర్థిక ప్రశాంతత ఎంత బావుంటుందో అనుభవంలోకి వస్తుంది.బంధాలే ముఖ్యం చిన్న పొరపాట్లకు బంధాలు తెంచుకునేదాకా వెళ్లకండి. ఇందుకోసం ప్రత్యేకించి ఏమీ చేయనక్కర్లేదు. అవతలివాళ్లు కూడా మనలాగే మామూలు మనుషులేనని, అప్పుడప్పుడు తప్పులు, పొరపాట్లు చేస్తుంటారని గుర్తుంచుకుంటే చాలు. క్షమించే గుణాన్ని పెంచుకుంటే ప్రపంచమంతా మరింత అందంగా మారుతుంది. ఎప్పుడో జరిగిన అవమానాలను, చేదు సంఘటనలను మనసులో మోయకండి. ఆ భారం నానారకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.సహోద్యోగులు కీలకం తిండీ, నిద్రా తదితరాలకు పోగా మన జీవితంలో మిగిలే నాణ్యమైన సమయంలో అత్యధిక భాగం గడిపేది కలిసి పనిచేసే సహోద్యోగులతోనే. వారితో సత్సంబంధాలు చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. చిన్నాచితకా కారణాలతో సహోద్యోగులతో కీచులాటలకు దిగకండి. అందుకోసం అవసరమైతే మీరే కాస్త తగ్గండి. తప్పేమీ లేదు. చక్కని పని వాతావరణం మన మానసిక, శారీరక ఆరోగ్యాలకు ఎంతో అవసరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కిక్కే.. కిక్కు
సాక్షి, అమరావతి: ‘సంపద సృష్టిస్తా’ అంటూ ఘనంగా చెప్పే సీఎం చంద్రబాబు... తాను సృష్టిస్తున్న సంపదేమిటో కొత్త సంవత్సర వేడుకల పేరిట చూపించారు. రాష్ట్రంలో మందుబాబులతో రెండు రోజులపాటు ఫుల్లుగా తాగించారు.డిసెంబర్ 30, 31 తేదీల్లోనే ఏకంగా రూ.331.84 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి లిక్కర్ సిండికేట్ దుకాణాలకు తరలిపోయి, మందుబాబులకు చేరింది. తద్వారా టీడీపీ మద్యం మాఫియాకు చంద్రబాబు భారీ లాభాలు తెచ్చిపెట్టారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ మార్కు సంపద సృష్టికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.ముందుగానే తరలిన మద్యంకొత్త సంవత్సరం వేడుకల పేరిట భారీగా విక్రయించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుగానే డిస్టిలరీల నుంచి భారీగా మద్యాన్ని రాష్ట్రంలోని 26 డిపోలకు, అక్కడి నుంచి రాష్ట్రంలోని 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలకు తరలించారు. కొత్త సంవత్సర వేడుకలు మొదలవడానికి ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 30న ఏకంగా రూ.219 కోట్ల విలువైన మద్యం లిక్కర్ షాపులకు చేరింది. ఆ నిల్వలు సరిపోవని భావించిన ప్రభుత్వం డిసెంబర్ 31న మరో రూ.112 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాలకు తరలించింది. తద్వారా రెండు రోజుల్లోనే రూ.331.84కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించింది.టీడీపీ మద్యం సిండికేట్‌కు డబ్బే డబ్బుకొత్త సంవత్సరం వేడుకల పేరిట రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్‌కు డబ్బుల పంట పండింది. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా సహకరించడంతో అడ్డూ అదుపు లేకండా మద్యం విక్రయాలు సాగించింది. ప్రభుత్వ ఉద్దేశం గుర్తించిన అధికారులు అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోలేదు. దాంతో టీడీపీ లిక్కర్ సిండికేట్ ఏకపక్షంగా గుప్పిట పట్టిన 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలతోపాటు ఒక్కో షాపు పరిధిలో దాదాపు 10 బెల్ట్ దుకాణాల ద్వారా యథేచ్ఛగా మద్యం విక్రయించింది. అధికారికంగా రూ.331.84 కోట్ల విలువైన మద్యం విక్రయించగా.. ఒక్కో బాటిల్‌పై ఎంఆర్పీ కంటే రూ.10 నుంచి రూ.25 వరకు అధికంగా విక్రయించినా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండిపోయింది. -
న్యూఇయర్ వేళ.. 18 వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు.. ఎక్కడంటే?
ముంబై : న్యూఇయర్ వేడుకల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు భారీ మొత్తంలో నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా ముంబైలో ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లలో వాహనదారుల నుంచి రూ.89లక్షల ఫైన్ల రూపంలో వసూలు చేశారు. ముంబై పోలీసుల సమాచారం మేరకు..న్యూఇయర్‌లో మొత్తం 17,800 ఇ-చలాన్లను జారీ చేశారు. అందులో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 2,893 కేసులు, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తులపై 1,923 కేసులు, ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ చేసిన 1,731 కేసులు, ప్రజా రవాణాకు అర్హతలేని వాహనాల్ని డ్రైవ్ చేసినందుకు 1,976 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు నగరంలో మితిమీరిన వేగానికి 842 చలాన్, సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడంపై 432 చలాన్లు వేసినట్లు పోలీసులు వెల్లడించారు. న్యూఇయర్ సందర్భంగా మద్యం తాగి డ్రైవ్ చేసిన వారికి 153 చలాన్లు, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడినందుకు 109 చలాన్లు, ట్రిపుల్ రైడింగ్ 123 చలాన్లను, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసినందుకు 40 చలాన్లు విధించారు. అలా మొత్తంగా విధించిన చలాన్లతో రూ.89,19,750 వసూలు చేసినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. మీడియా కథనాల ప్రకారం 2025 నూతన సంవత్సర వేడుకల్లో ఎనిమిది మంది అదనపు కమిషనర్లు, 29 మంది డిప్యూటీ కమిషనర్లు, 53 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 2184 మంది ఇన్స్పెక్టర్లు, 12,000 మందికి పైగా కానిస్టేబుళ్లు ముంబై వీధుల్లో విధులు నిర్వహించారు. -
అంబానీ ఫ్యామిలీ న్యూ ఇయిర్ వేడుకలు.. సన్నిహితులతో సందడి (ఫోటోలు)
-
వేడుకల వేళ ఉన్మాదం
న్యూ ఆర్లీన్స్: అమెరికాలో నూతన సంవత్సరం మొదలైన తొలి క్షణాలే కొందరికి ఆఖరి క్షణాలయ్యాయి. నడివీధిలో నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోయిన జనంపైకి ఓ ఆగంతకుడు ట్రక్కుతో ఢీకొట్టి, తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపి పది మంది ప్రాణాలు తీశాడు. ఈ కాల్పుల ఘటనలో మరో 35 మంది గాయపడ్డారు. వెంటనే మెరుపువేగంతో స్పందించిన పోలీసులు ఆ ఆగంతకుడిని హతమార్చారు. లూసియానా రాష్ట్రంలోని న్యూ ఆర్లీన్స్ సిటీలో మిసిసిప్పీ నదీతీరంలోని ఫ్రెంచ్ క్వార్టర్ ప్రాంత బార్బన్ వీధి ఈ దారుణానికి వేదికైంది. జనవరి ఒకటో తేదీ తెల్లవారుజామున 3.15 నిమిషాలకు ఈ ఘోరం జరిగింది. ఇది ఉగ్రదాడి అని, పేలుడు పదార్థాలు లభించాయని సిటీమేయర్ లాటోయా కాంట్రెల్ ప్రకటించారు. కాల్పులు జరిపింది 42 ఏళ్ల షంషుద్దీన్ జబ్బార్‌గా పోలీసులు భావిస్తున్నారు.ఘటనాస్థలిలో ఒక హ్యాండ్ గన్, ఏఆర్ రకం రైఫిల్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అసలేం జరిగింది? ఘటన జరగడానికి ముందు బార్బన్ వీధిలో స్థానికులు గుమిగూడి కొత్త ఏడాదివేడుకలు చేసుకుంటున్నారు. సమీప సూపర్‌డోమ్ స్టేడియంలో జార్జియా, నోట్రే డామ్ జట్ల మధ్య షుగర్ బౌల్ కాలేజ్ ఫుట్‌బాల్ ప్లేఆఫ్ మ్యాచ్ జరిగింది. ఇందుకోసం వచ్చిన ప్రేక్షకులు వీళ్లకు జతకావడంతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. అదే సమయంలో ఎక్కువ మందిని చంపేయాలన్న ప్రతీకారంతో ఆగంతకుడు పికప్ ట్రక్‌ను వేగంగా ఎక్కువ మందిపై పోనిచ్చాడు. జనం మధ్యలో ఇరుక్కుని ట్రక్కు పోయాక కిందకు దిగిన ఆగంతకుడు పొడవాటి రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 10 మంది చనిపోగా, 35 మంది గాయాలపాలయ్యారు. వేడుకల్లో జనాన్ని అదుపుచేసేందుకు అక్కడే ఉన్న పోలీసులు ఈ దాడిని చూసి హుతాశులయ్యారు. వెంటనే తేరుకుని ఆగంతకుడిపైకి కాల్పులు జరిపారు. పోలీసులపైకి అతను గురిపెట్టాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసు కాల్పుల్లో ఆగంతకుడు అక్కడిక్కడే మరణించాడు. వీలైనంత ఎక్కువ మందిని ట్రక్కుతో ఢీకొట్టి చంపేయాలన్న పక్కా ప్రణాళికతో ఆగంతకుడు దానిని నడుపుకుంటూ వచ్చాడని సిటీ పోలీస్ సూపరింటెండెంట్ అన్నారు. జనం ఎగిరిపడ్డారు అత్యంత వేగంగా ట్రక్కు ఢీకొనడంతో జనంలో కొందరు ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షి 22 ఏళ్ల కెవిన్ గార్సియా చెప్పారు. ‘‘ జనం మీదకు ట్రక్కు దూసుకొచ్చి తొక్కుకుంటూ పోతోంది. కొందరు బలంగా ఢీకొనడంతో ఎగిరిపడ్డారు. ఒకరి మృతదేహం ఎగిరి నా మీద పడింది’’ అని గార్సియా చెప్పారు. ‘‘ నైట్‌క్లబ్ నుంచి బయటికొచ్చా. అప్పటికే జనం పరుగెడుతున్నారు. ఇక్కడి నుంచి పారిపో అని ఒకాయన హెచ్చరించాడు. అప్పటికే అక్కడ కొన్ని మృతదేహాలు రక్తపుమడుగులో పడి ఉన్నాయి. గాయపడిన వారికి చుట్టుపక్కల వాళ్లు అక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఐదు ఆస్పత్రులకు తరలించారు’’ అని విట్ డేవిస్ అనే మరో ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ‘‘వాహనాలను దాడులకు మారణాయుధాలుగా వాడుతున్న దారుణశైలి మొదలైంది. దీన్నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంకావట్లేదు’’ అని మరొకరు వాపోయారు. An SUV crashed into a crowd in New Orleans, USA.At least 10 people were killed and 30 more were injured. After the collision, the driver got out of the car and started shooting.The perpetrator has not yet been arrested. pic.twitter.com/pOiHhIQu00— S p r i n t e r (@SprinterFamily) January 1, 2025 -
ఇయర్ ఎండ్‌లో కాజల్ అగర్వాల్ చిల్.. పార్టీలో మెరిసిన తమన్నా, విజయ్ వర్మ! (ఫోటోలు)
-
న్యూ ఇయర్ వేడుకల కోసం భారతీయుల అరాచకం.. ఏం చేశారంటే?
ఢిల్లీ : కొత్త ఏడాది 2025 సందర్భంగా ఆన్లైన్ అమ్మకాలు సరికొత్త రికార్డ్‌లు నమోదు చేశాయి. డిసెంబర్ 31 రోజున ద్రాక్ష నుంచి కండోమ్స్ వరకు.. చిప్స్ ప్యాకెట్ల నుండి హ్యాండ్కఫ్ల వరకు కస్టమర్లు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారని ఫాస్ట్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్‌తో పాటు ఫాస్ట్ డెలివరీ స్టార్టప్‌లు ఆన్లైన్ అమ్మకాల రిపోర్ట్‌ను విడుదల చేశాయి. తమ డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌లు మంగళవారం సాయంత్రం 8 గంటల వరకు చిప్స్, కోక్, నామ్కీన్లను కస్టమర్లకు డెలివరీ చేసినట్లు బ్లింకిట్ సహ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాత్రి 8 గంటల వరకు 2.3 లక్షల ప్యాకెట్ల ఆలూ భుజియా, 6,834 ఐస్ క్యూబ్‌ల ప్యాకెట్లను కస్టమర్లకు అందించినట్లు వెల్లడించారు. 39 శాతం చాక్లెట్ ఫ్లేవర్ కండోమ్ విక్రయించగా.. స్ట్రాబెర్రీ 31 శాతం, బబుల్గమ్ 19 శాతం అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. 1,22,356 packs of condoms45,531 bottles of mineral water22,322 Partysmart2,434 Eno..are enroute right now! Prep for after party? 😅— Albinder Dhindsa (@albinder) December 31, 2024 నిన్న కస్టమర్లు ద్రాక్ష పండ్లను ఎక్కువ మొత్తంలో ఆర్డర్ పెట్టడంపై దిండా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఈరోజు ద్రాక్ష పండుకు ఇంత క్రేజ్ ఏంటి? ఉదయం నుండి ప్లాట్‌ఫారమ్‌లో అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువులలో ఇదొకటి!’అని ట్వీట్లో పేర్కొన్నారు.అదే సమయంలో మంగళవారం సాయంత్రం 7:30ల వరకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నిమిషానికి 853 చిప్స్ ప్యాకెట్లను, బ్లైండ్ఫోల్డ్స్, హ్యాండ్కఫ్లను డెలివరీ చేసింది. 7:41కి ఐస్ క్యూబ్స్ ఊహించని స్థాయిలో ఆర్డర్లు వచ్చాయని, కేవలం నిమిషం వ్యవధిలో 119 కిలోలు ఐస్ క్యూబ్స్‌ను డెలివరీ చేసినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కోఫౌండర్ ఫణి కిషన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిగ్‌బాస్కెట్‌లో కూల్‌డ్రింగ్స్ ఆర్డర్లు 552 శాతానికి చేరుకున్నాయి. డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్ల అమ్మకాలు 325 శాతం, పచ్చిక కార్పెట్, మాక్ టెయిల్ విక్రయాలు 200 శాతం పెరిగాయి.https://t.co/ookPgwMqg3 pic.twitter.com/oUViC73eGS— Albinder Dhindsa (@albinder) December 31, 2024 న్యూఇయర్‌లో జరిగిన ఆన్లైన్ అమ్మకాలతో కోవిడ్-19 రాకతో వినియోగదారుల అభిరుచి మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా క్విక్ కామర్స్ సంస్థల రాకతో సంప్రదాయ ఆఫ్‌లైన్ షాపుల్లో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టింది. నిమిషాల్లో డెలివరీతో బిజినెస్ స్ట్రాటజీ మెట్రో నగరాలను దాటి టైర్-2, టైర్-3 నగరాలకు పాకింది. ఫలితంగా వినియోగదారులు ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లో కావాల్సిన వస్తువుల్ని ఆర్డర్ పెట్టుకుంటున్నట్లు తాజాగా, క్విక్ కామర్స్ డెలివరీ రిపోర్ట్‌లతో తేలింది. -
క్రేజీ కాంబో.. రాజమౌళి- మహేశ్ బాబు మూవీ అప్డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు తొలిసారిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో జతకట్టనున్నారు మన జక్కన్న. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని జనవరి 2న నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. న్యూ ఇయర్ వేళ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈనెల చివరి వారంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లోనే చిత్రయూనిట్ సభ్యుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమం జరగనుంది.కాగా.. మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై మరోవైపు రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అయింది.హీరోయిన్గా ప్రియాంక చోప్రా..?ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి 2025 నుంచి ప్రారంభం కానుంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ క్రమంలో హీరోయిన్ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావించిందట. ఈ కథలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉందని టాక్. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎక్కువగా విదేశీ నటులు కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆమె పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా చోప్రాను డైరెక్టర్ రాజమౌళి పలుమార్లు కలిసినట్లు బాలీవుడ్ మీడియా కూడా వెల్లడించింది. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇండోనేషియా నటి 'చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్' ఈ చిత్రంలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చెల్సియా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలు నిజమేనని నమ్మారు. మరి ఆమె పాత్ర ఈ చిత్రంలో ఏ మేరకు ఉంటుందో తెలియాల్సి ఉంది. -
బౌన్స్ బ్యాక్..ఈ విషయాలు అందరికీ తెలియాలి : టాలీవుడ్‘చందమామ’
మహిళలకు పెళ్లి, మాతృత్వం, పిల్లల పెంపకం అనేది కరియర్లో పెద్ద అడ్డంకిమాత్రమే కాదు. శారీరకంగా,మానసికంగా, భావోద్వేగ పరంగా చాలా క్లిష్టమైంది కూడా. ఈ విషయాన్నే టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. పట్టుదలగా, ఓర్పుగా సాధన చేస్తే పెళ్లీ, పిల్లల బాధ్యతలతో పాటు, కరియర్‌ను సాగించడం, అలాగే శారీరకంగా ఫిట్‌గా ఉండటం సాధ్యమే అంటూ తన అనుభవాలను షేర్ చేసింది.బ్యాలెన్స్ అనేది చెప్పుకోడానికి బానే ఉంటుంది, కానీ వాస్తవం చాలా క్లిష్టంగా ఉంటుందంటూ 2024లో తన జర్నీ గురించి వివరించింది కాజల్. 2024 ఏడాది అంతా భావోద్వేగాలు, శారీరక మార్పులు వీటన్నిటికీ మించిన బాధ్యతల వలయంలో గడిచిపోయింది. పసిబిడ్డకు తల్లిగా మాత్రమే కాకుండా, ఒక నటిగా తన బాడీనీ, శక్తిని నిరంతరం దృష్టిలో ఉంచుకోవాల్సిన పయనమిది అని పేర్కొంది.బిడ్డ పుట్టిన తరువాత బాగా బరువు పెరిగాను, తల్లిగా పెరిగిన బరువును తగ్గించుకోవడంతోపాటు, మాతృత్వపు బాధ్యతలు, నటిగా కరియర్, రెండింటినీ చాలా బలంగా నిర్వర్తించారు. ఆందోళనను అధిగమించాను. కానీ అదంతా సులభంగా సాగలేదు. ఎన్నో సందేహాలు, ఆశలు, నిరాశలు, అలసట ఇలాంటివెన్నో ఉన్నాయి. ‘‘మనలో చాలా మందిలాగే, నేనూ అద్దంలో చూసుకున్నాను.. మళ్లీ మునుపటిలా మారతానా అని ఆలోచించేదాన్ని’’ అంటూ ఇన్‌స్టాలో తెలిపింది కాజల్. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) "బౌన్స్ బ్యాక్" అసాధ్యం కాదని గ్రహించడమే కీలక మలుపు. దృఢ సంకల్పంతో కొత్త అధ్యాయం కోసం ముందుగా సాగా అని చెప్పుకొచ్చింది. అలాగే పోషకాహార నిపుణుడి సాయంతో ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకున్నాను. తృప్తినిచ్చే భోజనంతోపాటు క్రమశిక్షణగా, సమతుల్య ఆహారంపై దృష్టి కేంద్రీకరించాను అంటూ వివరించింది కాజల్. ఈ ప్రయాణంలో ఫిట్నెస్ మరో మూలస్తంభం. చాలా ఓర్పుగా, ధైర్యం, సంకల్పంతో ముందుకెళ్లాను. శ్రద్ధగా తీసుకున్న పోషకాహారం బిజీ షెడ్యూల్లో మరింత శక్తినిచ్చింది. ఈ నా జర్నీ మరింత మందికి ధైర్యంతో ముందుకు సాగాలే ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాను. ప్రపంచం కోసంమాత్రమే కాకుండా, మనకోసం మన ఆనందం కోసం కలిసి సాగుదాం అంటూ ముగించింది. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.కాగా చందమామ, మగధీర లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్, 2020లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు. ఈ బాధ్యతల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
నూతన సంవత్సర వేడుకల్లో వైయస్ఆర్ సీపీ నేతలు
-
New Year 2025: ఇకపై పుట్టేవారంతా ‘బీటా బేబీస్’
కొత్త సంవత్సరం 2025 వచ్చేసింది. కొంగొత్త ఆశలను, ఆకాంక్షలను మోసుకొచ్చింది. అయితే ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారి తరాన్ని జనరేషన్ బీటాగా పిలువనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలను బీటా బేబీస్ అని పిలుస్తారు. బీటా జనరేషన్(Beta Generation) సాంకేతిక యుగంలో అత్యున్నతంగా ఎదగడమే కాకుండా, మునుపటి తరాలు ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటూ, నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. జనరేషన్ బీటా 2035 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 16 శాతం ఉంటుందని అంచనా. నూతన దృక్పథంతో భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ తరం, 22వ శతాబ్దపు ప్రారంభానికి సాక్ష్యంగా నిలుస్తారంటున్నారు. సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ), సామాజిక మార్పుల మధ్య బీటా తరం జీవితం గడుపుతుంది. ఈ తరం ప్రతి అంశంలో సాంకేతికత వినియోగించడమే కాకుండా, పర్యావరణ, సామాజిక సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది.బీటా జనరేషన్ ఆల్ఫా జనరేషన్ (2010-2024 మధ్య పుట్టినవారు)ను అనుసరిస్తుంది. దీనికి ముందు జెనరేషన్ జెడ్ (1996–2010), మిలీనియల్స్ (1981–1996) జనరేషన్లు ఉన్నాయి. జనరేషన్ బీటాను బీటా బేబీస్(Beta Babies) అని కూడా అంటారు. ఈ తరం సాంకేతిక యుగంలో పెరుగుతుంది. టెక్నాలజీ యుగం సామాజిక పరిశోధకుడు మార్క్ మెక్‌క్రిండిల్ తెలిపిన వివరాల ప్రకారం జనరేషన్ బీటా జీవితాలు కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ముందుకు సాగుతాయి. విద్య, ఆరోగ్యం, వినోదం, కార్యాలయ కార్యకలాపాల్లో వీరు ఏఐని విరివిగా వినియోగిస్తారు.ఇది కూడా చదవండి: అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది? -
న్యూ ఇయర్ వేడుకల్లో బడంగ్‌పేట మేయర్ పారిజాత
రంగారెడ్డి: బడంగ్‌పేట మేయర్ శ్రీమతి చిగిరింత పారిజాత కొత్త సంవత్సర వేడుకల్లో సందడి చేశారు. మంగళవారం సాయంత్రం ఆల్మాస్గూడలో బోయపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. మేయర్ పారిజాత సమక్షంలో జరిగిన వేడుకల్లో అసోషియేషన్ సభ్యులు హుషారుగా గడిపారు. పలువురికి సన్మానాలు చేసి ఆమె బహుమతులు అందజేశారు. అలాగే కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని ఆమె అన్నారు. మరోవైపు కార్పొరేటర్ సాంరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటిదాకా చేసిన సేవల్ని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు ఎ. జనార్ధన్, ప్రధాన కార్యదర్శి పి.కవిత, కోశాధికారి సీహెచ్ వినోబా చారి తదితరులు పాల్గొన్నారు. -
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ
కొత్త సంవత్సరం వచ్చేసింది. నవ వసంతాన్ని తెచ్చింది. చేదు జ్ఞాపకాలను వదిలేసి.. మధురానుభూతులను పదిలం చేసుకుంటూ ముందుకు సాగిపొమ్మంటోంది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు అక్కడే కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. ఐదో టెస్టు కోసం మంగళవారమే సిడ్నీకి చేరుకుని న్యూ ఇయర్‌కి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది.అనుష్కతో విరాట్ఇక భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మ(Viat Kohli- Anushka Sharma)తో పాటు దేవ్‌దత్ పడిక్కల్, ప్రసిద్ కృష్ణతో కలిసి కొత్త సంవత్సర వేడులకు హాజరయ్యాడు. మరోవైపు.. యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ తదితరులు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్ శర్మఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 2024కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. ‘‘ఎన్నో ఎత్తు-పళ్లాలు.. అయినప్పటికీ ప్రతి ఒక్కటి గుర్తుండిపోతుంది. థాంక్యూ 2024’’ అంటూ గతేడాదికి సంబంధించిన జ్ఞాపకాలను వీడియో రూపంలో షేర్ చేశాడు.టీ20 ప్రపంచకప్ గెలిచిన సారథిగాకాగా 2024 రోహిత్ శర్మకు ఎన్నో ఆనందాలతో పాటు కొన్ని చేదు జ్ఞాపకాలను ఇచ్చింది. కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్-2024 గెలవడం రోహిత్ కెరీర్లోనే అత్యంత గొప్ప విషయం. అయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవగానే హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు.ఐపీఎల్లో మాత్రం పరాభవంఇక అంతకంటే ముందే.. అంటే ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడిన రోహిత్ బ్యాటర్‌గా ఆకట్టుకోలేకపోయాడు. జట్టు కూడా పాయింట్ల పట్టికలో అట్టడుగన పదో స్థానంలో నిలిచి ఘోర పరాభవం చవిచూసింది. అయితే, ఆ తర్వాత ప్రపంచ కప్ గెలుపు రూపంలో రోహిత్‌కు ఊరట దక్కింది.అదొక మాయని మచ్చగాఅనంతరం.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్ కావడం రోహిత్ శర్మ కెప్టెన్సీ కెరీర్లోనే ఓ మాయని మచ్చగా మిగిలింది. సొంతగడ్డపై ఇంతకు మునుపెన్నడూ భారత టెస్టు జట్టు ప్రత్యర్థి చేతిలో ఇలా 3-0తో వైట్‌వాష్ కాలేదు. అలా అత్యంత చెత్త కెప్టెన్సీ రికార్డు 2024లో రోహిత్ పేరిట నమోదైంది.కుమారుడి రాకఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ రోహిత్ శర్మకు 2024 మరుపురానిదిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. గతేడాదే రోహిత్- రితికా జంట తమ రెండో సంతానం కుమారుడు అహాన్ శర్మకు జన్మనిచ్చారు. ఇక ఈ శుభవార్త తర్వాత ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ శర్మకు అక్కడ మాత్రం గడ్డు పరిస్థితులే ఎదురయ్యాయి. బ్యాటర్‌గా, సారథిగానూ అతడు విఫలమయ్యాడు.అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్నా.. మెల్బోర్న్లో నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఇక ఆఖరిదైన సిడ్నీ టెస్టు(జనవరి 3-7)లో గెలిస్తేనే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 ఫైనల్ అవకాశాలను సజీవం చేసుకుంటుంది. చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
కోటి ఆశలతో.. కొత్త సంవత్సర సంబరాలు
-
కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన తారలు (ఫోటోలు)
-
అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది?
చూస్తుండగానే 2024 వెళ్లిపోయింది. 2025లోకి మనం ప్రవేశించాం. జనవరి ఒకటి సందర్భంగా ప్రపంచమంతా సంబరాలు జరుపుకుంటోంది. ఇదేవిధంగా నాటి 1978 నూతన సంవత్సరం తొలి రోజున ప్రపంచమంతా ఉత్సవవాతావరణంలో మునిగి తేలులోంది. ఇంతలో పిడుగులాంటి వార్త వినిపించింది. దీంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముంబైకి మూడు కిలోమీటర్ల దూరంలో1978, జనవరి ఒకటిన ముంబైకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఘోర విమాన ప్రమాదం(plane crash) చోటుచేసుకుంది. దుబాయ్‌కి బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే నిప్పులను ఎగజిమ్మింది. విమానంలోని పరికరాలు లోపభూయిష్టంగా ఉండటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ విమాన ప్రమాదం అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఒకటిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ప్రమాదంలో 213 మంది ప్రయాణికులు మృతిచెందారు.అంతా అనుభవజ్ఞులే..1978, జనవరి ఒకటిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855(Air India Flight 855) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. అప్పట్లో ఈ విమానాశ్రయాన్ని శాంటా క్రజ్ విమానాశ్రయంగా పిలిచేవారు. తరువాత దాని పేరు సహర్ విమానాశ్రయంగా మార్చారు. ఈ విమానాన్ని 51 ఏళ్ల కెప్టెన్ మదన్ లాల్ కుకర్ నడిపారు. ఆయన 1956లో ఎయిర్ ఇండియాలో చేరారు. పైగా అతనికి 18,000 గంటల విమానయాన అనుభవం ఉంది. ఫ్లైట్ ఇంజనీర్ అల్ఫ్రెడో ఫారియా(53) 955లో ఎయిర్ ఇండియాలో చేరారు. అతనికి 11,000 గంటల అనుభవం ఉంది. అలాగే వింగ్ కమాండర్ ఇందు వీరమణి(42) భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నుండి పదవీ విరమణ పొందారు. అతనికి 11,000 గంటల విమానయాన అనుభవం ఉంది. అనుభవజ్ఞులైన వీరంతా అదే విమానంలో ఉన్నారు.ఉండాల్సినంత ఎత్తును చేరుకోలేక..ఈ విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత, విమానం అకస్మాత్తుగా ఎడమవైపుకు తిరగడం ప్రారంభించింది. ఆ తర్వాత విమానం ఉండాల్సినంత ఎత్తును చేరుకోలేకపోయింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ నుండి అందిన డేటా ప్రకారం చూసుకుంటే విమానం ఎత్తును తెలిపే సూచిక పాడైపోయింది. దీంతో కెప్టెన్ ఎత్తును అంచనా వేయలేకపోయారు. చీకటిగా ఉండటానికి తోడు, కింద అరేబియా సముద్రం ఉండడంతో విమనం నడుపుతున్న సిబ్బందికి విమానం ఎత్తు, స్థానం గురించి సమాచారం లభించలేదు.ఇన్పుట్లు సక్రమంగా లేకపోవడంతో..విమానాన్ని రోలింగ్ చేసి నిఠారుగా చేసేందుకు కెప్టెన్ ప్రయత్నించగా, ఇంతలోనే అది సముద్రంలో కూలిపోయింది. విమానం 35 డిగ్రీల కోణంలో అరేబియా సముద్రాన్ని తాకింది. విమానంలోని 190 మంది ప్రయాణికులు, 23 మంది సిబ్బంది ఈ ప్రమాదంలో మృతిచెందారు. విమాన శిథిలాలను పరిశీలించగా అధికారులకు అక్కడ ఎలాంటి పేలుడు లేదా అగ్ని ప్రమాదం లేదా ఎలక్ట్రానిక్ వైఫల్యం(Electronic failure) గురించిన సమచారం లభించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన దరిమిలా.. పైలట్‌కు అందిన ఇన్పుట్లు సక్రమంగా లేవు. ఫలితంగా అతను విమానం ఎత్తును గుర్తించలేకపోయాడు. ఈ నేపధ్యంలోనే ప్రమాదం జరిగిందని వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: New Year 2025: మనీ ఆర్డర్ పుట్టిన వేళ.. గ్రామగ్రామాన సంబరాలు -
కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాది 2025 వేళ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతీ ఒక్కరి జీవితంలోనూ శుభ సంతోషాలు నింపాలని, మంచి జరగాలని కోరుకుంటున్నట్టు కోరుకుంటున్నట్టు నాయకులు తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా.. నవ వసంతంలో…విశ్వ వేదిక పై…విజయ గీతికగా…తెలంగాణ…స్థానం… ప్రస్థానం ఉండాలని…ప్రతి ఒక్కరి జీవితంలో…ఈ నూతన సంవత్సరం…శుభ సంతోషాలను నింపాలని…మనసారా కోరుకుంటూ…అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నవ వసంతంలో…విశ్వ వేదిక పై…విజయ గీతికగా…తెలంగాణ…స్థానం… ప్రస్థానం ఉండాలని…ప్రతి ఒక్కరి జీవితంలో…ఈ నూతన సంవత్సరం…శుభ సంతోషాలను నింపాలని…మనసారా కోరుకుంటూ…అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. #HappyNewYear2025 #HappyNewYear— Revanth Reddy (@revanth_anumula) January 1, 2025నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కేసీఆర్..‘2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని అన్నారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కేసీఆర్ సూచించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫోటోలు)
-
ఫ్యాన్స్‌కి ‘స్టార్స్’ న్యూ ఇయర్ విషెస్
కొత్త సంవత్సరం వచ్చేసింది. 2024కు గుడ్‌బై చెప్పి 2025కి వెల్కమ్ చెప్పేశారు. దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఇక తెలుగు స్టార్ హీరోల్లో చాలా మంది విదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. యూరప్‌లో మహేశ్, ప్రభాస్..లండన్‌లో ఎన్టీఆర్ కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే తామ ఎక్కడున్నా..అభిమానులను మాత్రం మరిచిపోమంటున్నారు మన హీరోలు. న్యూ ఇయర్ సందర్భంగా తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు. ‘అందరికి నూత సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు మరింత ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ లండన్‌లో ఉన్నారు. ఇటీవల వార్ 2 షూటింగ్‌కి గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి రాగానే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారట. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది.Wishing you all a very Happy New Year 2025. May this year bring you joy and success.— Jr NTR (@tarak9999) December 31, 2024 ఇక మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా తన అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. ‘ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను మీ అందరిని ప్రేమిస్తున్నాను’ అని బన్నీ ట్వీట్ చేశారు. Happy New Year to each and every one of you . Happy New year to all my Fans . I l love you all 🖤— Allu Arjun (@alluarjun) December 31, 2024ఇక నేచురల్ స్టార్ నాని కాస్త భిన్నంగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేశాడు. ‘హ్యాపీ న్యూ ఇయర్. 2025 ‘సర్కార్’ ఇయర్’ అంటూ ‘హిట్: ది థర్డ్ కేస్’ కొత్త పోస్టర్ని వదిలాడు.శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఇది వచ్చే ఏడాది మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Happy new year.2025. pic.twitter.com/CDLQ6DgieO— Nani (@NameisNani) December 31, 20242025వ సంవత్సరం మనందరికీ కొత్త ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని, భారతీయ సినిమా వైభవం మరింత విస్తరించి ప్రకాశవంతంగా వెలగాలని కోరకుంటూ మెగాస్టార్ చిరంజీవి నూతర సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.Bye Bye 2024 & Welcome 2025 !! 🎉🥳🎊🍾May the year 2025 give all of us New Hopes,Aspirations, Life & Career goals and the Drive & Energy to realise them all. May the Glory of Indian Cinema spread farther and shine brighter!!Happy New Year to All ! May Love, Laughter and Joy…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 1, 2025Happy New Year ❤️❤️! May we all thrive in greater harmony, peace, and positivity. Om Namah Shivaya 🙏🙏🙏.— Dhanush (@dhanushkraja) December 31, 2024Wishing you all a fantastic New Year ahead, filled with joy, growth, and success ❤️❤️🤗Let’s make 2025 a great one 👍👍#HappyNewYear2025— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 1, 2025Wishing you all a fantastic New Year ahead, filled with joy, growth, and success ❤️❤️🤗Let’s make 2025 a great one 👍👍#HappyNewYear2025— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 1, 2025 View this post on Instagram A post shared by jetpanja (@sai_dharam_tej_43) -
Tirumala: గోవింద నామస్మరణతో మార్మోగుతున్న తిరుమల
తిరుమల: ప్రపంచమంతా పార్టీలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకగా అందుకు భిన్నంగా గోవిందనామస్మరణతో తిరుమలలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు శ్రీవారి భక్తులు. సరిగ్గా 12 గంటలకు భక్తులందరూ గోవింద నామాన్ని జపించడంతో తిరుగిరులు మార్మోగాయి. దీంతో శ్రీవారి ఆలయం ముందు సందడి వాతావరణం నెలకొంది. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ లడ్డూ ప్రసాదంను పంచుకున్న భక్తులు తిరుమలలో నేడు (బుధవారం) తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు 4 గంటల సమయం పడుతుంది. . మంగళవారం శ్రీవారిని 62,495 మంది భక్తులు దర్శించుకోగా, 19,298 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
హైదరాబాద్ : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..శ్రీలీల,దక్ష నాగర్కర్ డ్యాన్స్ అదుర్స్ (ఫోటోలు)
-
నయా సాల్.. నయా జోష్. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు
-
కొత్తగా రెక్కలొచ్చెనా!
సాక్షి, సిటీబ్యూరో: కొత్త సంవత్సరం వచ్చేసింది. నయా జోష్ తెచ్చింది. ఉత్సాహాన్ని ఉరకలెత్తించింది. కానీ.. ఆ ఉత్సాహాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించాలంటే ఆశావహ దృక్పథంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలి. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏటా ఏవో కొన్ని కార్యక్రమాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ.. ఆచరణలో మాత్రం విఫలమవుతారు. అలా విలువైన కాలాన్ని కోల్పోయి మరో ఏడాది గడిచిపోయిందని నిరుత్సాహానికి గురి కాకుండా.. తమ ఆశయాలు, ఆకాంక్షలు, అభిరుచులు, లక్ష్యాలకు అనుగుణంగా జీవనశైలిలోనే మార్పులను తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. గతకాలపు సమీక్షల్లోనే గడిపేయకుండా ముందడుగు వేస్తే అద్భుతాలు సాధించవచ్చు. జీవితాన్ని ప్రతి నిత్యం వేడుక చేసుకోవచ్చు. రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్ కావాలి.. మొబైల్ మాయాజాలం.. కోరలు సాచి విస్తరించిన సామాజిక మాధ్యమాల వెల్లువ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యువత ఈ మాయాజాలంలో కొట్టుకుపోతోంది. రీల్ జీవితానికి, రియల్ జీవితానికి తేడాను గుర్తించడం లేదు. ఇప్పుడు ఇదే అతిపెద్ద ముప్పుగా పరిణమించింది. కుటుంబం నుంచి సమాజం నుంచి డిటాచ్ అవుతున్నారు. రీల్ జీవితమే రియల్ జీవితంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలి. కొత్త సంవత్సరం సందర్భంగా వ్యక్తిత్వం, కెరీర్, రిలేషన్స్, ఆర్థిక క్రమశిక్షణపై చక్కటి అవగాహన కలిగి ఉంటే అద్భుతమైన విజయాలను నమోదు చేయవచ్చు. ఇలా ఉందాం.. ⇒ వ్యక్తిత్వం అంటే నడవడిక మాత్రమే కాదు. ఆరోగ్యం. చక్కటి దేహదారుఢ్యం కూడా. ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఫిట్నెస్ విషయంలో అలసత్వం లేకుండా కొత్త సంవత్సరాన్ని ఆరంభించాలి. ⇒ చాలామంది చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తూ చివరి నిమిషంలో అంతా ఒకేసారి చదివేయాలని ప్రయతి్నస్తారు. దాంతో తీవ్రమైన ఒత్తిడికి గురై చదువులో వెనకబడిపోతారు. ‘టైమ్ కుదిరినప్పుడు’ చదువుకోవడం అనే పద్ధతి కాకుండా ‘టైమ్ కేటాయించి’ చదువుకోవడం మంచిది. దైనందిన జీవితంలో ఎంటర్టైన్మెంట్కు కూడా తప్పనిసరిగా కొంత సమయం ఉండాల్సిందే. అనుబంధాలను పెనవేసుకుందాం.. మొబైల్ ఫోన్, సోషల్ మీడియా వ్యసనంతో తల్లిదండ్రులకు, తోబుట్టువులకు దూరమైపోతున్నారు. స్నేహితులు, ఇరుగుపొరుగు పరిచయాలు కూడా ఉండడం లేదు. ఒంటరితనం అతి పెద్ద ప్రమాదంగా ముంచుకొస్తోంది. దీని నుంచి బయటపడేందుకు ఈ కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే కుటుంబానికి, స్నేహితులకు, మన చుట్టూ ఉన్నవాళ్లకు తప్పనిసరిగా సమయం కేటాయించి వాళ్లతో గడిపేందుకు, సంభాషించేందుకు గట్టి నిర్ణయం తీసుకోవాలి. సామాజిక సేవ కూడా ముఖ్యమే.. నూరు శాతం మార్కులు, సింగిల్ డిజిట్ ర్యాంకుల పోటీలో కొట్టుకొనిపోవడం వల్ల చాలామంది సామాజిక జీవితానికి దూరమవుతున్నారు. జీవితంలో చదువు ఎంతో ముఖ్యమైనది. సమాజం కూడా ముఖ్యమైందే. అందుకోసం కొంత సమయాన్ని తప్పనిసరిగా సామాజికసే వకు వినియోగించాలి.ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం.. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్‌లు, బెట్టింగ్‌లు యువతను పట్టి పీడిస్తున్నాయి. ఈ ఆటలు రూ.వందలు, వేలల్లో మొదలై రూ.లక్షల్లోకి చేరుతున్నాయి. డ్రగ్స్ కంటే ప్రమాదకరంగా మారిన ఈ జూదం ఆడేందుకు చాలామంది మైక్రో ఫైనాన్స్ అప్పులు చేసి చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ, డబ్బు అవసరాల పట్ల అవగాహన లేకపోతే చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ క్రమశిక్షణ కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే మొదలవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఏకాకులు కావద్దు.. వాట్సప్, ఫేస్‌బుక్‌లలో చురుగ్గా ఉండేవాళ్లు నిజ జీవితంలో ఏకాకులుగా ఉంటున్నారు. ఎవరితోనూ ఎలాంటి పరిచయం, ప్రేమ, బంధం, అనుబంధం లేకుండా మిగిలిపోతున్నారు. డిప్రెషన్‌కు గురవుతున్నారు. మొబైల్‌తో డిటాచ్ కావాలి. మనుషులతో అటాచ్మెంట్ పెంచుకోవాలి. జీవితం పట్ల ప్రగతిశీల దృక్పథాన్ని పెంచుకోవాలి. – డాక్టర్ సి.వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గోల్స్ కాదు.. లైఫ్స్టైల్లో మార్పు రావాలి కొత్త సంవత్సరం అనగానే ఏవో పెద్ద గోల్స్ పెట్టుకొని వాటిని సాధించలేక నిరాశా నిస్పృహలకు గురికావడం కంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నాం. భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నామనే విషయం పట్ల స్పష్టమైన అవగాహనతో అన్ని అంశాల్లో జీవన శైలిలోనే మార్పులు అలవర్చుకుంటే చాలు. ఏదో సాధించాలనుకొని, ఏదీ సాధించలేక గిల్టీగా ఫీల్ కావడం మంచిది కాదు. – చల్లా గీత, మానసిక నిపుణురాలు -
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా వేడుకలు జరిగాయి. ప్రజలందరూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. టపాసుల మోతలతో గ్రాండ్‌గా న్యూ ఇయర్ వేడుకలు చేసుకుని కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు.హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, విజయవాడ, విశాఖపట్నంలో న్యూ ఇయర్ జోష్ కనిపించింది. యువత రోడ్ల మీదకు వచ్చి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి వెల్కమ్ పలికారు. #WATCH | Vijayawada, Andhra Pradesh | People celebrate and welcome the New Year 2025. pic.twitter.com/BLOuKmIBM6— ANI (@ANI) December 31, 2024 #WATCH | Hyderabad | People celebrate as they welcome the New Year 2025. (Visuals from Tank Band, Hussain Sagar) pic.twitter.com/k7DSh0rWYh— ANI (@ANI) December 31, 2024#WATCH |Andhra Pradesh | People celebrate as they welcome the New Year 2025 in Vijayawada. pic.twitter.com/1z9q7kCIMF— ANI (@ANI) December 31, 2024అలాగే, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, యూపీ, తమిళనాడ, కేరళలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి.#WATCH | Maharashtra | People celebrate as they welcome the New Year 2025 in Mumbai. (Visuals from Bandra) pic.twitter.com/3Qsd5bEAY5— ANI (@ANI) January 1, 2025 #WATCH | Goa | People celebrate and witness fireworks as they welcome the New Year 2025.(Visuals from Baga Beach) pic.twitter.com/oI2nIv51wX— ANI (@ANI) December 31, 2024 #WATCH | Virudhunagar, Tamil Nadu | People gather to celebrate and witness the fireworks as they welcome the New Year 2025. pic.twitter.com/hi3LReXf19— ANI (@ANI) December 31, 2024న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. జపాన్‌లోని నాగసాకిలో ప్రపంచంలోనే అతి పెద్ద బాణాసంచాలను కాల్చారు. డ్రోన్ల సాయంతో వినూత్న ప్రదర్శనలు ఇచ్చారు. ఇక, దుబాయ్‌లో కూడా న్యూ ఇయర్ వేడుకలు మిన్నంటాయి.New Year, Dubai pic.twitter.com/TUEiIbxQny— Figen (@TheFigen_) December 31, 2024 When drones and fireworks meetpic.twitter.com/dZpnPCn1A3— Massimo (@Rainmaker1973) December 31, 2024 The world's largest firework launched over Nagasaki, Japan. pic.twitter.com/V7mP14aSYx— Pookie (@PookiesParadise) December 31, 2024అమెరికాలో న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. Welcome 2025! pic.twitter.com/EkFw5O2PsS— Times Square (@TimesSquareNYC) January 1, 2025 -
జూబ్లీహిల్స్ క్లబ్లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఆలయాల్లో నూతన సంవత్సర సందడి
ప్రపంచ వ్యాప్తంగా 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జనమంతా ఉత్సాహంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఉత్తర భారతదేశంలో విపరీతమైన చలి ఉన్నప్పటికీ జనం అత్యంత ఉత్సాహంగా న్యూ ఇయర్ జోష్‌లో మునిగిపోయారు.నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని హోటళ్లు, రెస్టారెంట్లు సందడిగా మారాయి. గడియారంలో 12 గంటలు చూపగానే జనమంతా పెద్ద ఎత్తున హ్యాపీ న్యూ ఇయర్(Happy New Year) అంటూ ఒకరికొకరు విష్ చేసుకున్నారు. ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అటు జమ్ముకశ్మీర్ నుండి ఇటు కన్యాకుమారి వరకు జనమంతా నూతన సంవత్సర వేడుకల్లో తేలియాడుతున్నారు. ఇదే సమయంలో చాలామంది నూతనసంవత్సరం వేళ ఆలయాలను సందర్శిస్తూ భగవంతుని ఆశీర్వాదాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో దేశంలోని ప్రముఖ ఆలయాలతో పాటు అన్ని ఆలయాల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. #WATCH | Maharashtra | People gather to witness the fireworks and celebrate as they welcome the New Year 2025.(Visuals from Marine Drive) pic.twitter.com/7tJizmhp8D— ANI (@ANI) December 31, 2024మహారాష్ట్రలోనూ నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముంబయిలోని మెరైన్‌డ్రైవ్(Marine Drive)లో బాణాసంచా కాల్చేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలువురు పర్యాటకలు ఎంజాయ్ చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా చేరుకున్నారు. ఒకరినొకరు విష్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.#WATCH | Himachal Pradesh | People gather to celebrate as they welcome the New Year 2025 in Shimla. pic.twitter.com/YXUhDGx8hI— ANI (@ANI) December 31, 2024కేరళలోని తిరువనంతపురంలో ప్రజలు బాణసంచా వెలిగించి నూతన సంవత్సరాన్ని స్వాగతించారు.గోవాలోని పనాజీలో జనం కేక్‌లు కట్ చేస్తూ 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సమయంలో చాలామంది ఉత్సాహంగా నృత్యం చేశారు.#WATCH | Fireworks in Kerala's Thiruvananthapuram as people celebrate to welcome the New Year 2025. pic.twitter.com/18ZAbzCGh4— ANI (@ANI) December 31, 2024కొత్త సంవత్సరం సందర్భంగా అమృత్సర్(Amritsar)లోని స్వర్ణ దేవాలయానికి కూడా పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు.షిర్డీలోని సాయిబాబా దేవాలయానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాబా దర్శనం కోసం బారులు తీరారు.ఇది కూడా చదవండి: New Year 2025: షిర్డీలో సంబరం.. రాత్రంతా దర్శనం#WATCH | Goa | People dance and cut cake as they celebrate and welcome the New Year 2025 in Panaji. pic.twitter.com/BRd67rFqSP— ANI (@ANI) December 31, 2024 #WATCH | Punjab | People visit the Golden Temple in Amritsar to celebrate as they welcome the New Year 2025. pic.twitter.com/yxmHzFzeC6— ANI (@ANI) December 31, 2024#WATCH | Maharashtra | Devotees visit Shirdi Temple as they welcome the New Year 2025. pic.twitter.com/MvWXZXz6rb— ANI (@ANI) December 31, 2024 -
కిక్కుతో వీడ్కోలు!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరానికి మందుబాబులు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,523 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, చివరి ఆరు రోజుల్లోనే రూ.1,220 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. అంటే నెల మొత్తంలో విక్రయించిన దాంట్లో చివరి ఆరు రోజుల్లో దాదాపు 40 శాతానికి పైగా అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి 2024 సంవత్సరానికి మందుబాబులు మంచి కిక్కుతో వీడ్కోలు పలికినట్లు అర్థమవుతోంది. ఎక్సైజ్ గణాంకాల ప్రకారం ఒక్క సోమవారమే (డిసెంబర్ 30) రికార్డు స్థాయిలో 7.7 లక్షలకు పైగా కేసుల మద్యం, బీర్లు డిపోల నుంచి షాపులకు వెళ్లాయి. ఆ మద్యం విలువ రూ. 402 కోట్ల పైమాటే. ఈ ఏడాది డిసెంబర్ నెలలో సగటున రోజుకు రూ.117 కోట్ల విలువైన మద్యం అమ్ముకాలు జరగ్గా.. సోమవారం దాదాపు నాలుగింతలు అమ్ముడయిందని గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు ఆదివారం (డిసెంబర్ 29) కూడా మద్యం డిపోలు తెరచే ఉంచారు. బ్యాంకులు లేకపోయినా వైన్‌షాపుల యజమానులు తీసుకున్న పాత డీడీలతో రూ.50 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని డిపోల నుంచి తీసుకెళ్లారు. ఇక, గత ఆరు రోజుల విక్రయ గణాంకాలు 2023 సంవత్సరం డిసెంబర్‌లోని చివరి ఆరు రోజులతో పోలిస్తే దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. డిసెంబర్ నెల మొత్తంతో పోలిస్తే మాత్రం 2023 కంటే ఈసారి లిక్కర్ అమ్మకాలు భారీగా పడిపోవడం గమనార్హం. 2023, డిసెంబర్ నెలలో రూ.4,147.18 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోగా, ఈ డిసెంబర్లో రూ.3,523 కోట్లకే పరిమితమైంది. -
నయా సాల్ జోష్
న్యూఢిల్లీ: ఆంగ్ల సంవత్సరాది సర్వత్రా నూతనోత్తేజం నింపింది. వేడుకలు, పార్టీలతో ఉత్సవ వాతావరణం నడుమ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. ఏ దేశంలో చూసినా ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలన్నీ భారీ జనసందోహంతో కిటకిటలాడాయి. వాణిజ్య సముదాయాలు, హోటళ్లు తదితరాలు కళకళలాడాయి. ఎప్పట్లాగే క్రిస్మస్ ఐలాండ్‌గా పేరొందిన కిరిబాటీ రిపబ్లిక్ 2025ను స్వాగతించిన తొలి దేశంగా నిలిచింది. ఎంత ముందుగా అంటే, అమెరికా కాలమానం ప్రకారం డిసెంబర్ 31 ఉదయం ఐదింటికే అక్కడ నూతన సంవత్సర వేడుకలు మొదలైపోయాయి! తర్వాత పావు గంటకే పసిఫిక్ మహాసముద్రానికి దక్షిణాన ఉన్న చాదం ఐలాండ్స్‌లో, ఆ వెంటనే న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాయి.అర్ధరాత్రి క్యాలెండర్ మారి 2024 డిసెంబర్ 31 కాలగర్భంలో కలిసిపోతూనే న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ నగరంలో సంబరాలు మిన్నంటాయి. తర్వాత ఆ్రస్టేలియా, జపాన్ తదితర దేశాలూ వేడుకల్లో పాలుపంచుకున్నాయి. ఆ్రస్టేలియాలోని చారిత్రక సిడ్నీ మార్బర్ బ్రిడ్జి బాణసంచా పేలుళ్లు, కళ్లు మిరుమిట్లుగొలిపే లేజర్ షోలతో పట్టపగలును తలపించింది. బ్రెజిల్‌లోని రియోడిజనిరో నగరంలో న్యూ ఇయర్ సంబరాలు మిన్నంటాయి. కోపాచబానా బీచ్ ఏకంగా 12 నిమిషాల పాటు బాణసంచా వెలుగుల్లో తళుకులీనింది. అక్కడి వేడుకల్లో ఏకంగా 20 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో వందేళ్ల సంప్రదాయం ప్రకారం బాల్ డ్రాప్ వేడుక జరగనుంది. జోనాస్ బ్రదర్స్, సోఫీ ఎలిస్–బెక్స్టర్, రీటా ఓరా తదితరులు సంగీత ప్రదర్శనలతో అలరించనున్నారు. అమెరికాలోని ఇతర నగరాలూ సంబరాలకు సిద్ధమయ్యాయి. అమెరికన్ సమోవా ప్రజలు ఎప్పట్లాగే అందరికన్నా ఆలస్యంగా న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పనున్నారు. న్యూజిలాండ్‌తో పోలిస్తే ఏకంగా 24 గంటల తర్వాత అక్కడ తేదీ మారుతుంది! యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌తో పాటు పలు పశి్చమాసియా దేశాల్లో మాత్రం న్యూ ఇయర్ సందడికి బదులు ఎప్పట్లా శ్మశాన నిశ్శబ్దమే తాండవించింది.భారత్‌లో సందడి భారత్‌లో దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు దుమ్మురేపాయి. రాజధాని ఢిల్లీ మొదలుకుని అన్ని ప్రధాన నగరాల్లోనూ పలు కార్యక్రమాలు కన్నులపండువగా జరిగాయి. ప్రజలంతా ఇళ్లను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించుకున్నారు. వేడుకగా కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. ఢిల్లీలోని ఇండియా గేట్, కోల్‌కతాలో విక్టోరియా మెమోరియల్, ముంబైలో గేట్‌వే ఆఫ్ ఇండియా, చెన్నై మెరినా బీచ్, బెంగళూరు బ్రిగేడ్ రోడ్ తదితర చోట్ల జనం ఇసుక వేసినా రాలనంతగా కన్పించారు. ఇక గోవాలోనైతే కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఏ నగరంలో చూసినా క్లబ్బులు, పబ్బులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, పార్కులు తదితరాలన్నీ కిటకిటలాడాయి. అవాంఛనీయ ఘటనలను నివారించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మందుబాబులకు ముకుతాడు వేసేందుకు అన్ని నగరాల్లోనూ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు.ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటికీ తాకిడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతటి హిమపాతంతో తడిసి ముద్దవుతున్న ఉత్తరాఖండ్, కశ్మీర్ తదితర చోట్లకు జనం పోటెత్తారు. ఉత్తరాఖండ్‌లోని హర్షిల్, దయారా, సంక్రి వంటి మారుమూల ప్రాంతాలకు కూడా దేశం నలుమూలల నుంచీ పర్యాటకులు విరగబడ్డారు. చుట్టూ మంచు నడుమ టెంట్లు, క్యాంపుల్లో బస చేశారు. అర్ధరాత్రి కాగానే న్యూ ఇయర్ సంబరాల్లో మునిగిపోయారు. అక్కడి హోటళ్లు, దాబాలు అత్యంత వినూత్నంగా నూతన సంవత్సర వేడుకలు జరిపి ఆకట్టుకున్నాయి. కుంభమేళా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో కొలువుదీరిన కుంభనగరిలో కూడా న్యూ ఇయర్ వేడుకలు అలరించాయి. -
ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు
సాక్షి, అమరావతి: ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ ప్రపంచం నినదించింది. అంబరాన్ని అంటే సంబరాన్ని తెచ్చింది. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2024 డిసెంబర్ 31 రాత్రి నుంచి 2025 జనవరి 1వ తేదీ ఉదయం వరకు ప్రపంచంలోని అనేక దేశాల్లో వేడుకల హోరెత్తింది. బాణసంచా వెలుగులు.. కేక్ కటింగ్‌లు.. స్వీట్స్ తినిపించుకోవడం.. పరస్పర శుభాకాంక్షలు తెలపడం వంటి నచ్చిన రీతిలో ప్రజానీకం కోటి ఆశలతో మరో ఏడాదికి ఘన స్వాగతం పలికింది. తొలి స్వాగతం న్యూజిలాండ్‌లో.. భారత కాలమానం ప్రకారం 2024 డిసెంబర్ 31 సాయంత్రం 4.30గంటలకే న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం నూతన సంవత్సరానికి (2025 జనవరి 1కి) ప్రపంచంలోనే ముందుగా స్వాగతం పలికింది. భారతదేశం తర్వాత ప్రపంచంలో 43 దేశాలు కొత్త ఏడాదికి ఆలస్యంగా స్వాగతం పలికితే ఆఖరున అమెరికా పరిధిలోని బేకర్, హోవార్డ్ దీవులను నూతన సంవత్సరం పలకరిస్తుంది. రష్యాలో జనవరి 1న, జనవరి 14న రెండుసార్లు నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తారు. అదే వియత్నాం, ఇజ్రాయెల్, చైనా, సౌదీ అరేబియాలో జనవరి 1న కాకుండా స్థానిక క్యాలెండర్ ప్రకారం వేడుకలను నిర్వహిస్తారు. జనవరి 1న దాదాపు అన్ని దేశాలతోపాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కొత్త సంవత్సర వేడుకలు జరుపుతున్నప్పటికీ మతాలు, ప్రాంతాల వారీగా ప్రత్యేక రోజుల్లో కొత్త సంవత్సరానికి నాంది పలుకుతున్నారు. క్రైస్తవులు జనవరి 1, 14 తేదీల్లో ప్రాంతాల వారీగా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. చైనీస్, వియత్నామీస్, టిబెటన్స్ జనవరి నుంచి మార్చిలోపు నిర్వహిస్తున్నారు. గురునానక్ జన్మదినోత్సవమైన మార్చి 14న సిక్కులు కొత్త సంవత్సర వేడుకలు నిర్వహిస్తారు. తెలుగునాట ఉగాది తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ దేశాలతో పోటీపడి మరీ ఆంగ్ల సంవత్సరాన్ని ఘనంగా నిర్వహిస్తున్నప్పటికీ తెలుగు సంవత్సరాదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వచ్చే ఉగాది రోజున తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాది వేడుకలను సంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఏప్రిల్ మధ్యలో చైత్ర మాసం తొలిరోజున తమిళ సంవత్సరాది ఘనంగా జరుపుకునేవారు. దీనికి బదులుగా రైతుల దినోత్సవమైన సంక్రాంతి(జనవరి 14)న తమిళుల సంవత్సరాదిగా పాటించాలని తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. ఏప్రిల్ 14న పంజాబ్, బెంగాల్, నవంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే పర్వదినంలో గుజరాత్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తుంది. దీంతోపాటు పలు రాష్ట్రాల్లోను స్థానిక పర్వదినాల్లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొంటున్నారు. పూర్వం నుంచి వేడుకలు పూర్వం నుంచీ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం పరిపాటిగా మారిందని చరిత్ర చెబుతోంది. రోమన్ ప్రజలు యుద్ధ దేవతగా భావించే ‘మార్స్’ గ్రహం పేరును మార్చి నెలకు పెట్టారు. మొదట 10 నెలలతో మాత్రమే క్యాలెండర్ సృష్టించారు. అప్పట్లో సంవత్సరంలో 310 రోజులు ఉండగా, 8 రోజులు ఒక వారంగా పరిగణించేవారు. మొదట్లో క్యాలెండర్ పది నెలలకు మాత్రమే ఉండటంతో మార్చి 1న కొత్త ఏడాది ప్రారంభంగా భావించారు. కొన్ని దేశాల్లో మార్చి 1, మరికొన్ని దేశాల్లో మార్చి 25న, మరికొన్ని దేశాలు డిసెంబర్ 25న నూతన సంవత్సర వేడుకలు జరిపేవారు. రోమన్ పాలకుడు జూలియస్ సీజర్ ఖగోళ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించి క్యాలెండర్లో మార్పులు చేశాడని చెబుతారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగేందుకు 365 రోజుల 5 గంటల 46 సెకన్ల కాలం పడుతుందని, దాన్ని ఒక ఏడాదిగా పేర్కొంటూ ఆ కాలపు ప్రముఖ మత గురువు సెయింట్ బీద్ నిర్ధారించారు. దీంతో జూలియన్ క్యాలెండర్లో సంవత్సరాన్ని 365 రోజులకు సవరించి జనవరి, ఫిబ్రవరి నెలలు చేర్చి 12 నెలలుగా నిర్ధారించారు. దీంతో జనవరి 1 కొత్త ఏడాదికి ప్రపంచం నాంది పలికింది. -
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో స్టార్స్.. ప్రభాస్ ఎక్కడంటే..?
2024కి బై చెప్పి... 2025కి వెల్కమ్ చెప్పడానికి అందరూ సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కొందరు స్టార్స్ అయితే కొత్త సంవత్సరం జరుపుకోవడానికి విదేశాలు వెళ్లారు. షూటింగ్స్‌కి కాస్త విరామం దొరకడంతో వెకేషన్ ప్లాన్ చేసుకునే అవకాశం ఈ స్టార్స్‌కి దక్కింది. వారి ఈ వెకేషన్ గురించి తెలుసుకుందాం...ఈ ఏడాది మహేశ్‌బాబు ఇప్పటికే రెండుసార్లు జర్మనీ వెళ్లొచ్చారు. అయితే ఇది హాలిడే ట్రిప్ కాదు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ప్రిపరేషన్లో భాగంగా జర్మనీ వెళ్లారని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఏడాది మహేశ్‌బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫారిన్లో జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా ఫారిన్లోనే మహేశ్‌బాబు ప్లాన్ చేశారని సమాచారం. మహేశ్‌బాబు మోస్ట్లీ యూరప్‌కు వెళ్లనున్నారట. ఇక ప్రభాస్ ఆల్రెడీ యూరప్‌లో ఉన్నారని తెలిసింది. ఇటీవల ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రభాస్ కాలికి గాయమైంది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. యూరప్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని, ప్రభాస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే అని టాక్. విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘రాజా సాబ్, ఫౌజి’ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ఈ సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చిత్రాన్ని ఆరంభిస్తారు ప్రభాస్. ఇక ‘దేవర’ సక్సెస్ జోష్‌లో ఉన్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో స్ట్రయిట్ ఫిల్మ్ ‘వార్ 2’ (ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో) లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు చెందిన ఓ లెంగ్తీ షూట్‌ను పూర్తి చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారని తెలిసింది. సో... ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లండన్‌లోనే అని ఊహించవచ్చు. లండన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్‌తో ఎన్టీఆర్ బిజీ అవుతారట. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం హీరోయిన్ పూజా హెగ్డే స్పెయిన్ వెళ్లారు. రష్మికా మందన్నా ఆల్రెడీ ఫారిన్లోనే ఉన్నారని తెలిసింది. హీరోయిన్ తమన్నా, ఫరియా అబ్దుల్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను అమెరికాలో ప్లాన్ చేశారని తెలిసింది. వీరితో పాటు మరి కొందరు టాలీవుడ్ యాక్టర్స్ గోవా, మాల్దీవ్స్‌లో వేడుకలు ప్లాన్ చేశారని సమాచారం. భర్త విఘ్నేష్ శివన్‌తో నయనతార దుబాయ్ వెళ్లారు. అక్కడే మాధవన్, ఆయన భార్య సరిత కూడా ఉన్నారు. సో... ఈ రెండు ఫ్యామిలీస్ ఒకే చోట వేడుక చేసుకోనున్నారు. కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ట్ హీరో హృతిక్ రోషన్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్పాట్‌గా దుబాయ్‌నే ఎంచుకున్నారు. ఇంకా ఫ్యామిలీతో కలిసి దియా మీర్జా శ్రీలంక వెళ్లారు. అర్జున్ రాంపాల్ సెలబ్రేషన్స్ గోవాలో జరుతాయని సమాచారం. ఫ్యామిలీతో కలిసి కరీనా కపూర్ స్విట్జర్లాండ్‌లో, శిల్పాశెట్టి లండన్‌లో, భర్త జహీర్ ఇక్భాల్‌తో కలిసి హీరోయిన్ సోనాక్షీ సిన్హా ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ ఫిన్‌ల్యాండ్ వెళ్లారు. -
భారత సంతతి ప్రముఖులకు బ్రిటన్ గౌరవ పురస్కారాలు
లండన్: నూతన సంవత్సరం సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్–3 అందించే గౌరవ పురస్కారాల జాబితాలో 30 మందికి పైగా భారత సంతతి వారికి చోటు లభించింది. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, విద్యారంగం, స్వచ్ఛంద సేవ సహా పలు రంగాల్లో ఆదర్శంగా నిలిచిన 1,200 మందిని జాబితాలో చేర్చారు. ‘‘వీరంతా సాధారణ వ్యక్తులే. అయినా అసాధారణ రీతిలో ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు’’అని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ప్రశంసించారు. వారి అద్భుత సేవలను గుర్తించడాన్ని గౌరవంగా తమ ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. ‘‘వీరిలో చాలామంది ఓవైపు ఉద్యోగాలు చేస్తూనే సంఘ సేవను కొనసాగిస్తున్నారు. వీరిలో 12 శాతం మందిది మైనారిటీ నేపథ్యం’’అంటూ కేబినెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. జాబితాలో పలు రంగాల వారు శ్రీలంక, భారత మూలాలున్న బ్రిటన్ ఎంపీ రణిల్ మాల్కమ్ జయవర్ధనేకు రాజకీయ, ప్రజాసేవ రంగాల్లో నైట్‌హుడ్ దక్కనుంది. విద్యారంగంలో సేవలకు సత్వంత్ కౌర్ డియోల్ ‘కమాండర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’గౌరవం దక్కించుకున్నారు. న్యాయరంగంలో సేవలకు చార్లెస్ ప్రీతమ్ సింగ్ ధనోవా, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి ప్రొఫెసర్ స్నేహ ఖేమ్కా కూడా గౌరవ పురస్కారాలు అందుకోనున్నారు. జాబితాలో లీనా నాయర్, మయాంక్ ప్రకాశ్, పూరి్ణమ మూర్తి తణుకు, కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్ ఆర్య, ప్రొఫెసర్ నందినీ దాస్, తర్సేమ్ సింగ్ ధలీవాల్, జాస్మిన్ దోతీవాలా, మోనికా కోహ్లి, శౌర్య మజుందార్, సీమా మిశ్రా, ఉష్మా మన్హర్ పటేల్, గ్యాన్ సంగ్ పవర్, శ్రావ్యా రావ్, మన్దీప్ కౌర్ సంఘేరా, సౌరజ్ సింగ్ సిద్ధూ, స్మృతీ శ్రీరామ్, టెక్ నిపుణుడు దలీమ్ కుమార్ బసు, నర్సింగ్ చీఫ్ మారిమౌత్ కౌమరసామి, రుమటాలజిస్ట్ ప్రొఫెసర్ భాస్కర్ దాస్‌గుప్తా, పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ ప్రొఫెసర్ అజయ్ జైకిషోర్ వోరా, కమ్యూనిటీ వర్కర్లు సంజీబ్ భట్టాచార్య, జగ్రూప్ బిన్నీ, పోస్టల్ వర్కర్ హేమంద్ర హిందోచా, స్వచ్ఛంద కార్యకర్త జస్వీందర్ కుమార్, సంగీతకారుడు బల్బీర్‌సింగ్ ఖాన్పూర్ భుజాంగీ తదితరులకూ జాబితాలో చోటు దక్కింది. -
ఆకాశాన్నంటుతున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మరో వివాదంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి,అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రి జేసీ పార్క్‌లో అర్ధరాత్రి దాకా డిస్కో ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్‌కు మహిళలకు మాత్రమే ప్రవేశమంటూ ప్రకటించారు. తాడిపత్రి మహిళలంతా ఎంజాయ్ చేయాలంటూ జేసీ సలహా ఇచ్చారు.అయితే,జేసీ తీరుపై బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలత మండిపడ్డారు. సున్నిత ప్రాంతమైన తాడిపత్రిలో ఇలాంటి ఈవెంట్ నిర్వహించడం సరికాదని హెచ్చరించారు. మహిళలకు భద్రత ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 2025లో ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాది ప్రతి ఇంట్లో ఆనందం నింపాలని, ఆరోగ్యం అందించాలని.. ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.“Happy New Year 2025! May this year bring Happiness, Health, and Prosperity to you all.”— YS Jagan Mohan Reddy (@ysjagan) January 1, 2025 -
అప్పటి వరకు మాత్రమే హ్యాపీ న్యూ ఇయర్: రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్
న్యూ ఇయర్ సందర్భంగా రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. కొత్త ఏడాది అనేది కేవలం అప్పటి వరకు మాత్రమే ఉంటుందని పోస్ట్ చేశారు. ఈ రోజు 31 రాత్రి నుంచి జనవరి 1 మధ్యాహ్నాం వరకు మాత్రమేనని రాసుకొచ్చారు. మీరు మీ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి వచ్చాక అసలు విషయం అర్థమవుతుందన్నారు. గతేడాదిలో వెంటాడిన సమస్యలు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతాయని.. హ్యాపీ ఓల్డ్ ఇయర్ అంటూ ట్విటర్లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. రాంగోపాల్ వర్మ టాలీవుడ్లో సంచలన డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగార్జున నటించిన శివ మూవీతో తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. ఆ తర్వాత ఆర్జీవీ డైరెక్షన్లో వచ్చిన పలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఆర్జీవీ డెన్ పేరుతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు.శారీ మూవీ..తాజాగా ఆర్జీవీ ఆయన తెరకెక్కిస్తున్న సినిమా 'శారీ'. ఇప్పటికే ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్‌గా శారీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీలో సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు.శారీ కథేంటంటే..ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొంది.HAPPY NEW YEAR will last only from 31st night till 1st afternoon , when u wake up from ur hangover and realise that all the OLD YEAR’S problems are still there in the NEW YEAR 😎 #HappyOldYear— Ram Gopal Varma (@RGVzoomin) December 31, 2024 -
న్యూ ఇయర్ ట్రెండ్..ఈ రాత్రికి '12 గ్రేప్స్' ట్రై చేసి చూస్తారా..!
ప్రపంచమంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికే సంబరాలకు సిద్ధమవుతోంది. కొన్ని దేశాలు కొత్త ఏడాదికి ఆహ్వానం పలికేశాయి కూడా. అయితే న్యూ ఇయర్ రాగానే మొదటగా ఈ పని చేయాలి, ఇలా ఉండాలంటూ రిజల్యూషన్స్ పనిలో పడ్డారు కొందరు. నెట్టింట కూడా ఈ చర్చే. అయితే కొత్త ఏడాదికి స్వాగతం పలకడం కోసం 12 ద్రాక్ష పండ్లను సిద్ధం చేసుకోండి అంటూ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఏంటిది వీటిని తింటే మంచి జరుగుతుందా? నిజమేనా అంటే..న్యూ ఇయర్(New Year)కి స్వాగతం పలుకుతూ..అర్థరాత్రి(Midnight) 12 ద్రాక్ష పండ్లు(12 grapes) తినడం అనేది స్పానిష్ సంప్రదాయం. వాళ్లు ఇలా తినడం వల్ల రాబోయే ఏడాదిలో అదృష్టాన్ని ప్రేమను పొందుతారనేది వారి నమ్మకం. శాస్త్రీయంగా ఇది నిజం అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు గానీ.. రానున్న కొత్త ఏడాది నేపథ్యంలో ఈ ఆచారం తెగ వైరల్ అవుతోంది సోషల్ డియాలో. ముఖ్యంగా మహిళలు ఈ ఆచారాన్ని పాటించేందుకు రెడీ అవుతున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేగాదు ఏడాదిలో అదృష్టాన్ని, ప్రేమను పొందేందుకు ఇది తప్పక ట్రై చేయండి అని పోస్టుల వెల్లువెత్తాయి. అంతేగాదు ఈ కొత్త ఏడాది 2025లో కొత్త భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నవారు లేదా పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా 12 గ్రేప్స్ తినండి అంటూ ఓ ట్రెండ్ ఊపందుకుంది. 12 పండ్లే ఎందుకంటే..ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే కాదు, స్పానిష్ సంప్రదాయంలో భాగం కూడా. దీన్ని "లాస్ డోస్ ఉవాస్ డి లా సూర్టే" అని పిలుస్తారు. దీని అర్థం '12 ద్రాక్షల అదృష్టం' అట. ఇలా ద్రాక్షలు తినే సంప్రదాయ 1800ల చివరలో ప్రారంభమైందట. అయితే ఇప్పుడు పాప్ కల్చర్‌లో భాగంగా మన దేశంలో కూడా ఈ ఆచారం ట్రెండ్ అవుతోంది. ఇక్కడ 12 ద్రాక్షల్లో ఒక్కొక్కటి కొత్త ఏడాదిలోని 12 నెలలను సూచిస్తాయి. ఇలా ఈ పన్నెండు తింటే.. ఏడాదంతా జీవితం సంతోషంగా సాగిపోతుందనేది వారి నమ్మకం. విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో ఈ ట్రెండ్‌పై తమ అనుభవాలను కూడా చెప్పేస్తూ ఊదరగొట్టేస్తున్నారు. దీంతో అందరూ ఈ ట్రెండ్‌ని అడాప్ట్ చేసుకునేలా పడ్డారు. నిజానికి ఇలా చేస్తే మంచి జరుగుతుందో లేదో తెలియదు గానీ తేలికపాటి పండ్లే కాబట్టి నిరంభ్యంతరంగా ప్రయత్నించొచ్చు. కానీ చలికాలం కాబట్టి రాత్రి టైంలో అలా తింటే ఆరోగ్య పరంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఏ ఆచారమైన మన నమ్మకాల నుంచే వస్తాయి. హాని కలిగించని ఫన్నీ నమ్మకాలతో ఈ కొత్త ఏడాదిని సంతోషభరితంగా సెలబ్రెట్ చేసుకుని ఖుషీగా ఉందాం. (చదవండి: నర్సుల విశాల హృదయం..సేవతో కొత్త ఏడాదికి స్వాగతం..!) -
అక్కడ న్యూ ఇయర్ వచ్చేసింది
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమమయ్యాయి. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆక్లాండ్ వాసులు న్యూఇయర్ వేడుకల్ని ప్రారంభించారు. భారత్‌లో కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్ వాసులు 2025లోకి అడుగుపెట్టారు. ఆనందోత్సాహాల మధ్య ఆక్లాండ్ స్కై టవర్ వద్ద న్యూఇయర్ వేడుకల్ని అట్టహాసంగా ప్రారంభించారు. కాగా, ప్రపంచంలో తొలిసారిగా కొత్త సంవత్సరంలోకి అడుగుకు పెట్టే నగరం ఆక్లాండ్ -
ఈ దొంగకు న్యూ ఇయర్ ఒకరోజు ముందే వచ్చింది.. ఏం చేశాడో తెలుసా?
సాక్షి,మెదక్ : అతడో దొంగ. అసలే కొత్త సంవత్సరం (new year). సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాడు. డబ్బులు కావాలి కదా. వైన్ షాపులో డబ్బులు బాగా ఉంటాయ్. దోచేద్దామని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా రెండ్రోజుల పాటు రెక్కీ కాచాడు. మూడో రోజు ప్లాన్ ప్రకారం.. తాను ముందుగా రెక్కి నిర్వహించిన వైన్ షాప్‌లో దొంగతనం చేశాడు. దొంగతనానికి ముందే తాను ఎవరికి దొరక్కూడదనే ఉద్దేశ్యంతో సీసీ టీవీ కెమెరాల్ని ధ్వంసం చేశాడు. గల్లా పెట్టెలో ఉన్న డబ్బుంతా ఊడ్చేశాడు. అనంతరం బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్లుగా చేశాడు. కానీ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టడంతో పోలీసులకు అడ్డంగా దొరికి పోయాడు.మెదక్ జిల్లా నార్సింగ్ ప్రాంతంలో నిర్వాహకులు కనకదుర్గా వైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి 10 వైన్ షాపును క్లోజ్ చేసి ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆ వైన్ షాప్‌లో దొంగతనం ప్లాన్ చేసిన దొంగ రూఫ్‌ను తొలగించి షాప్‌లో చొరబడ్డాడు. డబ్బుల్ని కాజేశాడు. అనంతరం, దొంగతనానికి వచ్చిన ఆ దొంగకి మందు మీద కుతిపుట్టింది. వెంటనే వైన్ షాపులో ఏ బ్రాండ్ దొరికితే.. ఆ బ్రాండ్‌ని ఫుల్లుగా సేవించాడు. మత్తులో తాను దొంగతనానికి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయి ఎంచక్కా పడుకున్నాడు. ఆ మరుసుటి రోజు అంటే నిన్న ఉదయం నిర్వహాకులు వైన్ షాప్‌ను ఓపెన్ చేశారు. దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఆ పక్కనే మత్తులో ఉన్న దొంగను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగను పరిశీలించి అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మోతాదుకు మించి మద్యం సేవించడం వల్ల స్పృహ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. స్పృహలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభిస్తామని వెల్లడించారు. -
New Year 2025: షిర్డీలో సంబరం.. రాత్రంతా దర్శనం
2024కి వీడ్కోలు పలుకుతూ, 2025కి స్వాగతం చెప్పే సమయం ఆసన్నమయ్యింది. ఈ నేపధ్యంలో నూతన సంవత్సరాన మహారాష్ట్రలోని షిర్డీలో కొలువైన బాబాను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే షిర్డీ చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ 31న రాత్రంతా బాబా ఆలయాన్ని తెరిచివుంచనున్నామని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలాసాహెబ్ తెలిపారు.షిర్డీ సాయిబాబా సంస్థాన్ ప్రస్తుతం నాలుగు రోజులపాటు షిర్డీ మహోత్సవ్(Shirdi Mahotsav)ను నిర్వహిస్తోంది. దీనిలో వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణం, సాయి ధర్మశాల తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పండపాలను ఏర్పాటు చేశారు. దీనికితోడు దేశం నలుమూలల నుండి సుమారు 90 పల్లకీలు ఈ కార్యక్రమానికి తరలిరానున్నాయి.2025, నూతన సంవత్సరం వేళ భక్తులకు పంపిణీ చేసేందుకు సుమారు 120 క్వింటాళ్ల బూందీ ప్రసాదం ప్యాకెట్లు, సుమారు 400 క్వింటాళ్ల మోతీచూర్ లడ్డూ ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఆలయ సముదాయం, దర్శనం క్యూ, సాయి కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో భక్తులకు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. మరోవైపు పోలీసు ఇన్స్పెక్టర్లు, క్విక్ యాక్షన్ టీమ్‌లు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(Bomb Disposal Squad)లు షిర్డీలో అణువణువునా పహారా కాస్తున్నాయి. ఆలయ ప్రాంగణం, సాయి ఆశ్రమం, ప్రసాదాలయం తదితర ప్రదేశాలలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంబులెన్స్‌లు, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు.డిసెంబరు 31న భక్తులకు రాత్రంతా దర్శనాలు కల్పించనున్నందున 31న రాత్రి 10 గంటలకు జరిగే హారతి జనవరి 1న ఉదయం 5.15 గంటలకు జరిగే హారతి కార్యక్రమాలను రద్దుచేశారు. కాగా ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు షిర్టీకి చేరుకున్నారు. ఆలయానికి వెళ్లే రహదారులన్నీ కిక్కిరిసిపోవడంతో భక్తులు బాబా దర్శనం కోసం క్యూలలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది.ఇది కూడా చదవండి: New Year 2025: జనవరి ఒకటి.. ప్రపంచ జనాభా 809 కోట్లు.. టాప్‌లో భారత్ -
New Year 2025: జనవరి ఒకటి.. ప్రపంచ జనాభా 809 కోట్లు.. టాప్‌లో భారత్
మనమంతా మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం-2025లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇంతలో అమెరికా జనాభా బ్యూరో ఒక ఆసక్తిక నివేదికను వెలువరించింది. 2025 నూతన సంవత్సరం తొలిరోజునాటికి ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరుకుంటుందని, దీనిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటుందని తెలియజేసింది.2024 చివరి నాటికి ప్రపంచ జనాభా(World population) 7.1 కోట్లు పెరిగిందని, కొత్త సంవత్సరం నాటికి 809 కోట్లకు చేరుకుంటుందని తాజాగా అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది. 2023నాటి జనాభాతో పోలిస్తే 2024లో జనాభా పెరుగుదల స్వల్పంగా తగ్గడంతోపాటు 0.9 శాతంగా నమోదైంది. 2025 విషయానికొస్తే జనవరిలో ప్రపంచ జనాభా మరో 7.5 కోట్లు పెరుగుతుందని, ప్రపంచంలో ప్రతి సెకనుకు 4.2 జననాలు, 2.0 మరణాలు నమోదవుతాయని ఈ నివేదిక అంచనా వేసింది.2024లో అమెరికా జనాభా 26 లక్షల మేరకు పెరిగింది. 2025 నాటికి అమెరికా జనాభా(US population) 34.1 కోట్లకు చేరుతుందని బ్యూరో అంచనాలున్నాయి. నూతన సంవత్సరం జనవరిలో అమెరికాలో ప్రతి తొమ్మిది సెకండ్లకు ఒక జననం, ప్రతి 9.4 సెకండ్లకు ఒక మరణం ఉంటుందనే అంచనాలున్నాయి. 2020 దశకంలో అమెరికా జనాభా దాదాపు 97 లక్షల మేరకు పెరిగింది. ఈ పెరుగుదల రేటు 2.9 శాతంగా ఉంది. 2010 దశకంలో అగ్రరాజ్యం జనాభా పెరుగుదల 7.4 శాతం ఉంది. 2024లో భారతదేశ జనాభా 144.17 కోట్లు. 2025 భారత జనాభా అన్ని దేశాలను మించి టాప్‌లో ఉండే అవకాశాలున్నాయని అమెరికా జనాభా బ్యూరో అంచనా వేసింది.ఇది కూడా చదవండి: New Year Celebration: రాజధాని సిద్ధం.. వేడుకలకు జనం సన్నద్ధం -
సరే సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం! కానీ..
‘‘అమ్మ సాక్షిగా చెబుతున్నా.. జాన్వరి ఫస్ట్ నుంచి మందు తాగను..’’ ఓ పెద్దాయన అనగానే ‘‘సూపర్ అసలు’’ అంటూ చప్పట్లు కొట్టే యాంకరమ్మ వీడియో ఒకటి ఎంతలా వైరల్ అయ్యిందో తెలియంది కాదు. నిజంగా మీరు కొత్త ఏడాదిలో తీసుకున్న లక్ష్యాలను.. అదేనండీ న్యూఇయర్ రెజల్యూషన్స్‌ను ఎప్పుడైనా కచ్చితంగా అమలు చేశారా?. పోనీ చేసినా.. అసలు వాటిలో కచ్చితంగా పూర్తిస్థాయిలో పాటించినవి ఉన్నాయి?. అసలు ఆ తీర్మానాల విషయంలో ఎప్పుడైనా మీకు మీరు సమీక్షించుకున్నారా?.మనలో చాలా మందికి బాగా అలవాటైన పనేంటో తెలుసా? మూడు రోజులు చాలా చక్కగా న్యూ ఇయర్ హడావుడిలో అనుకున్న లక్ష్యం(Resolutions) కోసం పని చేస్తారు. నాలుగో రోజు యథావిధిగా మానేయడమో, ఏదో ఒక కారణం చెప్పి దాని నుంచి వైదోలగడమో చేస్తారు. ఇలా చేసే వారు 100లో సుమారు 92 మంది ఉన్నారట!. అంటే.. సిన్సీయర్‌గా తమ రెజల్యూషన్స్ కోసం పని చేసేది కేవలం 8 మందినేనా?. ఈ మాట మేం చెప్తోంది కాదు.. పలు అధ్యయనాలు ఇచ్చిన నివేదికలు సారాంశం ఇదే. పాజిటివీటీ.. టైం సెట్ గో.. మనలో చాలమంది ఈ కొత్త ఏడాదిలో ఏదైనా సాధించాలనో, లేదంటే ఫలానా పని చేయకుండా ఉండాలనో తీర్మానాలు చేసుకుంటారు. అది కెరీర్ పరంగా కావొచ్చు, ఆరోగ్యపరం(Health Resolution)గా అవ్వొచ్చు, డబ్బు సంబంధితమైనవి కావొచ్చు.. విషయం ఏదైనా చాలామంది ఏదో ఒక తీర్మానం మాత్రం చేసి తీరతారు. అయితే.. అంత ఈజీగా జరిగే పని కాదని వాళ్లకూ బాగా తెలుసు. చాలామంది సమయాన్ని అడ్డంకిగా చెప్పి తప్పించుకుంటారు. పట్టుదల ఉండాలే కానీ సమయం సరిపోదు అనే సమస్య ఉండదు.అలాగే.. మనం ఓ నిర్ణయం కానీ కమిట్మెంట్ కానీ తీసుకునేప్పుడే అది పాజిటివ్‌గా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి మన లక్ష్యాన్ని సెట్ చేసుకోవటంలో ముందు ఇది ఉందో చూసుకోవడం మంచిది. ముందు నుంచే ‘‘ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కావు’’ అని ప్రిపేర్డ్‌గా ఉండకూడదు. అలాగే నెగటివిటీకి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది కూడా. అందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను ఫుల్ కమిట్మెంట్(Full Commitment)తో రూపొందించుకుని పక్కగా అమలయ్యేలా చిత్తశుద్ధి చూపాలి.వాస్తవాన్ని గుర్తించాలి!జీవితంలో ఒక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలంటారు పెద్దలు. ఒకేసారి నాలుగైదు మెట్లు ఎక్కాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో మనకు తెలియంది కాదు. అలాగే.. మార్పు ఓ చిన్న అడుగుతోనే మొదలువుతుంది. కాబట్టి స్టో అండ్ స్టడీ విన్ ది రేస్ బాటలోనే పయనించాలి. అలాంటప్పుడే విజయవంతమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.సమస్య ఏమిటంటే.. చాలాసార్లు మనం అసాధారణమైన లక్ష్యాలను ఎంచుకుంటుంటాం. వాటి సాధన క్రమంలో తడబడుతుంటాం. అందుకే వాస్తవానికి దగ్గరగా, నిజం చేసుకునేందుకు వీలుగా ఉన్న నిర్ణయాలే తీసుకోవాలి. అలాగే చిన్నపాటి లక్ష్యంతో పని మొదలు పెట్టడం ద్వారా ఉన్నత లక్ష్యానికి దారులు సులువుగా వేసుకోవచ్చు. అలాగని.. ఇక్కడ ‘తగ్గడం’ ఎంతమాత్రం అవదు. ఇలా చేస్తేనే దీర్ఘకాలిక లేదంటే ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుంది.రెగ్యులర్ వైఖరి వద్దు.. మనం చాలాసార్లు కొత్త ఏడాది వచ్చింది కదా అని.. ఏదో ఒక తీర్మానం చేసేస్తారు. కానీ, దాని అమలుకంటూ ఓ సరైన ప్రణాళిక వేసుకోరు. దాని వల్ల అంతా డిస్టర్బెన్స్ కలుగుతుంది. అందుకే సాధించాలనుకుంటున్న లక్ష్యం గురించి పక్కాగా ఆలోచించాలి. నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకోవడం వల్ల ఆచరణలో పెట్టడమూ సలువవుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.పంచుకుంటేనే ఫలితం!ఈ ఏడాది లక్ష్యసాధనలో.. మీతోపాటు తోడుగా ప్రయాణం చేసేందుకు మరికొందరిని వెతికి పట్టుకోగలిగితే మార్గం మరింత సుగమమం అయినట్లే. కలసికట్టుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో ఎన్నో ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.రివ్యూ ఈజ్ ఫర్ బెటర్ రిజల్ట్ప్రయాణంలో కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చేస్తున్న పనిని మరోసారి సమీక్షించుకోవాలి. ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు ఏమిటి? ఇప్పటివరకు ఏ వ్యూహం బాగా పనిచేసింది? ఏది సరిగా పనిచేయలేదు? అన్నది పరిశీలించుకోవాలి. చిన్నపాటి విజయానికైనా సరే సంబరాలు చేసుకోవాలి. అది పట్టుదలను మరింతగా పెంచుతుంది. అలాగే.. రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోగలిగినా అనుకున్న లక్ష్యం వైపు వెళ్లేందుకు అవి సాయపడతాయి.కొత్తగా సాధించడం కాదు.. కోల్పోయింది తిరిగి తెచ్చుకోవడంలోనే మాంచి కిక్ దొరుకుతుంది! అలా పొందడంలో ఎక్కువ ప్రేరణ పొందగలుగుతారు. -
#NewYear2025 : న్యూ ఇయర్ సందడి మొదలు... (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
-
New Year Celebration: రాజధాని సిద్ధం.. వేడుకలకు జనం సన్నద్ధం
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు దేశరాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం నుంచే రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్ తదితర ప్రాంతాల్లో జనం సందడి చేయనున్నారు. న్యూ ఇయర్‌ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు వేడుకలు సవ్యంగా సాగేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్లకు అనుసంధానమైన రహదారులపై రాత్రి 8 గంటల నుండి వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ఈ సమయంలో అన్ని వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఏఐ ఆధారిత కెమెరాలతో పహారా కాస్తున్నారు. అనుమానితులపై నిఘా ఉంచేందుకు వీటిని వినియోగించనున్నారు.ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన యోధా వాహనాల్లో కమాండోలను మోహరించనున్నారు. వీరు రోడ్లపై తిరుగుతూ అల్లర్లకు పాల్పడేవారి ఆటకట్టించనున్నారు. దీనికి తోడు ఢిల్లీలోని రద్దీ ప్రాంతాల్లో 600 మంది పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను కూడా మోహరించారు. కన్నాట్ ప్లేస్‌లో 50కి పైగా పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పోలీసులు మోటార్ సైకిళ్లపై నిరంతరం గస్తీ తిరగనున్నారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసు సిబ్బంది జనం మధ్యలో తిరుగుతూ, ప్రజలకు రక్షణ అందించనున్నారు.నూతన సంవత్సర వేడుకల్లో రాజకీయ పార్టీలు, సంస్థలు అనుమతి లేకుండా ప్రదర్శనలు నిర్వహించకూడదనే నిబంధన విధించారు. ఇండియా గేట్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించడానికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు విస్తృతమైన తనిఖీలు చేపట్టనున్నారు. ఇండియా గేట్ వద్ద పార్కింగ్ స్థలం పరిమితంగా ఉన్నందున సందర్శకులు ప్రజా రవాణాను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపినా, అతివేగంగా వాహనం నడిపినా, జిగ్-జాగ్ తరహాలో ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసినా వారిపై వివిధ సెక్షన్ల కింద జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలున్నాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: రక్షణరంగంలో విజయాలు.. సరికొత్త రికార్డులు -
2025లో లాంగ్ వీకెండ్లు.. ఎంజాయ్ చేద్దామిక..
ఇక కొద్దిగంటల్లో న్యూ ఇయర్ చిందులు మొదలుకానున్నాయి. మరోవైపు కొత్త సంవత్సరం రాగానే ఈ ఏడాది ఎక్కడికి వెళ్లాలి? అని పలువురు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇందుకు తగిన విధంగా సెలవులు కూడా అవసరమవుతుంటాయి. అందుకే ఈ ఏడాది ఎప్పుడెప్పుడు సెలవులు వచ్చాయా? లాంగ్ వీకెండ్ ఎప్పుడు వచ్చిందా? అని క్యాలెండర్లో చూస్తుంటారు.హోలీకి లాంగ్ వీకెండ్2025లో మొదటి లాంగ్ వీకెండ్(Long weekend) హోలీ సందర్భంగా వస్తుంది. మార్చి 14న శుక్రవారం హోలీ జరుపుకుంటారు. హోలికా దహన్ ఒక రోజు ముందు అంటే మార్చి 13న (గురువారం) జరుగుతుంది. ఈ నేపధ్యంలో హోలీ మరుసటి రోజు అంటే మార్చి 15న (శనివారం) ఆఫీసు నుండి సెలవు తీసుకోగలిగితే.. మార్చి 13 నుండి మార్చి 16 వరకు 4 రోజుల సుదీర్ఘ వీకెండ్ వస్తుంది. అంటే నాలుగు రోజుల పాటు ఎక్కడికైనా తిరిగే అవకాశం లభిస్తుంది.స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగాఆగస్ట్లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా కూడా లాంగ్ వీకెండ్ వస్తుంది. ఆగస్టు 15 శుక్రవారం నాడు వచ్చింది. ఈ నేపధ్యంలో శనివారం ఆగస్టు 16న సెలవు తీసుకోగలిగే మూడు రోజుల పాటు వీకెండ్ వస్తుంది. మరోవైపు జన్మాష్టమి ఆగస్టు 16న వచ్చింది. ఒకవేళ ఆరోజున సెలవు ఉంటే ప్రత్యేకంగా సెలవు పెట్టాల్సిన అవసరం రాదు. ఈ మూడు రోజుల్లో సమీపంలోని ఏదైనా ప్రదేశానికి రోడ్ ట్రిప్‌కు వెళ్లవచ్చు. లేదా రిసార్ట్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.దసరా హాలిడేస్2025 దసరా సెలవులకు గాంధీ జయంతి మరో సెలవుగా జతచేరింది. సాధారణంగా దుర్గాష్టమి నుండి విజయదశమి వరకూ ఆఫీసులో సెలవులు ఉంటాయి. 2025లో దుర్గాష్టమి సెప్టెంబర్ 30 (మంగళవారం), మహానవమి అక్టోబర్ ఒకటి (బుధవారం), గాంధీ జయంతి(Gandhi Jayanti), విజయదశమి అక్టోబర్ 2 (గురువారం) తేదీలలో వచ్చాయి. దీని ప్రకారం చూసుకుంటే సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 2 వరకు సుదీర్ఘ వారాంతాన్ని ఎంజాయ్ చేయవచ్చు.బక్రీద్‌కు..2025 జూన్ 7న (శనివారం) బక్రీద్ జరుపుకోనున్నారు. ఆ మర్నాడు ఆదివారం. దీంతో రెండు రోజులు సెలవులు వస్తాయి. ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్లివచ్చే అవకాశం ఉంటుంది.రక్షాబంధన్ సందర్భంగాఆగస్టు 9న (శనివారం) రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. ఆ మర్నాడు ఆదివారం. ఈవిధంగా రక్షాబంధన సందర్బంగా వచ్చే రెండు రోజుల సెలవుల్లో కుటుంబంతో పాటు ఎక్కడికైనా వెళ్లిరావచ్చు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎనిమిది ఘటనలు.. రాజకీయాల్లో పెనుమార్పులు -
హుస్సేన్ సాగర్ చుట్టూ నో ఎంట్రీ... హద్దు మీరితే..
సాక్షి, హైదరాబాద్: ‘డిసెంబర్ 31’ని జీరో ఇన్సిడెంట్, యాక్సిడెంట్ నైట్‌గా చేయడానికి నగర పోలీసు విభాగం కసరత్తు పూర్తి చేసింది. న్యూ ఇయర్ పార్టీల విషయంలో సభ్యత, భద్రత మరవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వేడుకలు నిర్వహించుకోవాలని చెబుతున్నారు. బౌన్సర్లు, నిర్వాహకులు సహా ఎవరు హద్దు మీరినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయం తర్వాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు.డిసెంబర్ 31 రాత్రి పార్టీలకు సంబంధించి పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం...కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి. వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీల నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు. యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పారీ్టలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు. నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శబ్ధతీవ్రతనూ కొలుస్తారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మించి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పోలీసులు పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ట్యాంక్‌బండ్‌పైన ఇతర కీలక ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్Œ సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్, డబీర్‌పుర ఫ్లైఓవర్లు మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను మంగళవారం రాత్రి మూసి ఉంచుతారు.వెస్ట్‌జోన్‌లో స్పెషల్ యాక్షన్స్... నగరంలోని మిగతా నాలుగింటితో పోలిస్తే పశ్చిమ మండలం పూర్తి విభిన్నమైంది. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం సైతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వివిధ సందర్భాలు, సమయాల్లో సిటీలోని పబ్స్ కపుల్ ఎంట్రీలను మాత్రమే అనుమతిస్తుంటాయి. జంటగా వచ్చేవారు మినహా మిగతా వారిని పబ్స్‌లోకి రానివ్వరు. దీనిపై పలు సందర్భాల్లో కొందరు యువకులు గుంపులుగా వచ్చి పబ్స్ వద్ద హల్చల్ చేస్తుంటారు. స్టాగ్ గ్యాంగ్స్‌గా పిలిచే వీరు గతంలో చేసిన హంగామాలను బట్టి పోలీసులు ఓ బ్లాక్‌లిస్ట్ తయారు చేస్తున్నారు. ఇలాంటి వారి కదలికలు, వ్యవహారాలపై డేగకన్ను వేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు కానున్నాయి. నగర వ్యాప్తంగా ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (క్యూఆర్టీ), ఈవ్‌టీజింగ్ కంట్రోలింగ్‌కు ప్రత్యేక షీ–టీమ్స్ బృందాలు మోహరిస్తున్నారు. ఆయా కార్యక్రమాలు, వెన్యూల వద్ద ఉండే బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ‘డ్రింక్సే’ కాదు డ్రగ్సూ పట్టేస్తారు... కేవలం డ్రంక్ డ్రైవింగే కాకుండా ‘డ్రగ్ డ్రైవింగ్’కు చెక్ చెప్పాలని అధికారులు నిర్ణయించారు. డ్రగ్స్ తీసుకుని వాహనాలు నడిపే వారితో పాటు కొన్ని సందర్భాల్లో ఇతర అనుమానితులకు గుర్తించడానికి డ్రగ్ డిటెక్టర్స్ సమీకరించుకున్నారు. జర్మనీ నుంచి ఖరీదు చేసిన ఈ అత్యా«ధునిక పరికరాల్లో 75 పరికరాలను తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (టీఎస్ ఏఎన్‌బీ) అధికారులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలకు అందించారు. వీటి ఆధారంగా అధికారులు రహదారులపైనే కాకుండా పబ్స్, ఫామ్‌హౌస్‌లతో పాటు మరికొన్ని సున్నిత ప్రాంతాల్లోనూ తనిఖీలు చేయనున్నారు. స్నిఫర్ డాగ్స్తోనూ తనిఖీలు చేపడతారు.అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు పొడిగింపున్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైల్ సేవలు పొడిగించారు. ఈ రోజు అర్ధరాత్రి 1:15 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం అర్ధరాత్రి 12.30కి చివరి రైలు స్టేషన్ నుండి బయలుదేరి 1.15 వరకు డెస్టినేషన్ స్టేషన్‌కు చేరుకోనున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. నగరంలో రాత్రి 11 నుంచి రేపు(మంగళవారం) ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓఆర్ఆర్ మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. -
న్యూఇయర్ వేడుకలకు భారీ ఏర్పాట్లు.. భద్రతతో సంబంధంలేదు..
సాక్షి, అమరావతి: గత కాలపు జ్ఞాపకాలను.. కొత్త ఏడాదిపై ఆశలను పదిలం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. గడిచిన సంవత్సరంలో ఎదురైన కష్టాలను, కన్నీళ్లను మర్చిపోవాలని, జీవితం మళ్లీ నూతనోత్సాహంతో మొదలవ్వాలని ఆకాంక్షిస్తారు. అలాంటి వారికి వారి సంతోషాలను రెట్టింపు చేసుకునేందుకు పలువురు ఈవెంట్ నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. డిసెంబరు 31 రాత్రి జీవితంలో మరిచిపోలేని అనుభూతులను మిగిల్చుకోవాలంటే ప్రముఖ హోటళ్లు, రిసార్టుల్లో తాము నిర్వహించే వేడుకల్లో భాగమవ్వాలంటూ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా..కొద్దిరోజులుగా ఫేస్బుక్, వాట్స ప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్నా యి. సినీ తారలు, బుల్లితెర నటులు, యాంకర్లు, స్టేజీ డ్యాన్సర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు వంటి సెలబ్రిటీల ప్రచార చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకూ ఉంటోంది. ‘డిసెంబర్ 31 రాత్రికి మీ ఊరు మేం వస్తున్నాం.. మీరూ రండి.. ఎంజాయ్ చేద్దాం.’ అంటూ సెల్ఫీ వీడియాలతో ఆకర్షిస్తున్నారు.భద్రతతో సంబంధంలేదు..మరోవైపు.. కొత్త సంవత్సరం పేరుతో మోతాదు మించే ఆనందోత్సాహాలను అదుపుచేయడానికి నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. వేడుకకు వచ్చిన వారుగానీ, అక్కడి నుంచి బయటకు వెళ్లిన వారు ఏమైపోయినా వారికి సంబంధంలేదని ముందే చెప్పేస్తున్నారు. డబ్బులు దండుకోవడమే పరమావధిగా జరిగే ఇలాంటి హంగామాలకు దూరంగా ఉంటేనే మంచిదని పౌర సమాజం ప్రతినిధులు సూచిస్తున్నారు. దీనికి బదులు ఆధ్యాత్మిక చింతనలో గడపడం, దేవాలయాలకు వెళ్లి భగవంతుణ్ణి దర్శించుకోవడం, మొక్కలు నాటడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, చెడు అలవాట్లను వదిలేయడం, కుటుంబ సభ్యులతో గడపడం, ఇంట్లోనే కేట్ కట్ చేసుకోవడం వంటివి మరింత సంతోషాని్నస్తాయని వారంటున్నారు. -
సంవత్సరమంతా జంట స్వరంగా...
కలసి పాడుదాం బతుకు పాట... కలసి సాగుదాం వెలుగు బాట... అన్నట్టు ప్రతి దంపతులు ఒకరికి ఒకరై ముందుకు సాగితే ఏ కాలమైనా మంచికాలంగానే ఉంటుంది. భార్య భర్త జీవననౌకకు ఉమ్మడి చుక్కానిగా మారాలి. కలతలు చిన్నవయ్యి ఆనందాలు పెద్దవవ్వాలి. కుటుంబం బాగుంటే సమాజం, దేశం బాగుంటాయి. మనకు తెలిసిన ఈ సెలబ్రిటీ జంటలు ఆ మాటే చెబుతున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.మనవాళ్లెవ్వరో తెలిసింది→ ప్రభాకర్: మాకు పెళ్లై 25 ఏళ్లయింది. ఎవరి ఫ్యామిలీ లైఫ్ అయినా బాగుండాలంటే భార్య సహకారం, తను అర్థం చేసుకునే విధానం మీదనే ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ విషయంలో మా ఆవిడకి సహనం, ఓపిక చాలా ఎక్కువ. మమ్మల్ని చాలా బాగా కేర్ చేస్తుంది. జనరల్‌గా మగవాళ్లకి చాలా ప్రపంచాలుంటాయి. ప్రొఫెషన్, మదర్స్ ఫ్యామిలీ, బిజినెస్, కెరీర్... ఇలా. కానీ భార్యకు మాత్రం ఎప్పుడూ ఒకే ఒక ఆలోచన మా ఆయన తిన్నారా? నా పిల్లలు టైమ్‌కి తిన్నారా? అందర్నీ ఆరోగ్యంగా చూసుకుంటున్నానా? అని! ఆ విషయంలో మేము రియల్లీ బ్లెస్డ్. 2025కి నావి రెండు ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ రెండు సీరియల్స్‌తో నేను బిజీగా ఉన్నాను. ఒకటి ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ అనే సూపర్ సీరియల్ ఇప్పటికే లీడ్‌లో ఉంది. అలాగే ‘చామంతి’ అనే మరో సీరియల్లో చేస్తున్నాను. మా మలయజ కూడా 2024లో వెబ్ సిరీస్‌తో పాటు రెండు సినిమాల్లో నటించింది.మా అబ్బాయి చంద్రహాస్ ‘రామ్‌నగర్ బన్నీ’ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి బాగా నటించాడు. అది మేం కళ్లారా చూశాం కాబట్టే మా స్థాయికి మించి ఆ సినిమా కోసం పెట్టుబడి పెట్టాం. మా అబ్బాయి సంతోషం కోసం ఆలస్యం చేయకుండా త్వరగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆప్రాసెస్లో డబ్బుల గురించి ఎక్కడా ఆలోచించలేదు. ‘రామ్‌నగర్ బన్నీ’తో చంద్రహాస్ తనని తాను నిరూపించుకున్నాడు. మా అమ్మాయి దివిజ ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. లండన్ వెళ్లి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలని, ఒక వ్యాపారవేత్తగా ఉండాలన్నది తన కల. తను ఇప్పటికే బాల నటిగా నంది అవార్డు అందుకుంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. ఈ రెండూ పూర్తయ్యాక తను ఎలా సెటిల్ అవ్వాలనుంటే అలా మేం సంతోషంగా సపోర్ట్ చేస్తాం. → మలయజ: 2024లో నేను నిర్మాతగా షూటింగ్ లొకేషన్‌కి రావటం, మా అబ్బాయి చంద్రహాస్ మూవీ (రామ్‌నగర్ బన్నీ) కోసం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ చూసుకోవడం ఒక కొత్త అనుభవం అని చెప్పగలను. కానీ, ఈ ఏడాది చాలా నేర్చుకున్నాను మా అబ్బాయి మూవీ ‘రామ్‌నగర్ బన్నీ’ పోస్ట్ ప్రొడక్షన్ అవుతున్న సమయంలో డబ్బులు అయిపోయి, మేం ఎదుర్కొన్న సవాళ్లలో ఎవరు మనవాళ్లో, ఎవరు కాదో అనేది తెలుసుకున్నాం. మనకేదైనా అవసరం వస్తే మనకంటూ తోడుగా వీళ్లందరూ ఉన్నారని అని కొంతమంది గురించి ఒక తప్పుడు అంచనాలతో ఉంటాం. కానీ, అది నిజం కాదు. ఈ సంవత్సరం మేం నేర్చుకున్న గుణపాఠం ఇది. అయితే అదే సమయంలో మేం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొత్తవాళ్లు కొంతమంది సమయానికి సహాయం చేశారు. మా అబ్బాయి నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ అనే సినిమా 2025లో రిలీజ్ అవుతుంది. అలాగే ఇంకో సినిమా షూటింగ్ చేస్తున్నాడు. అలాగే మా అమ్మాయి దివిజ కూడా రెండు సినిమాలు సైన్ చేసింది. చాలా మంచిప్రాజెక్ట్స్ అవి. వాటి షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. అందులో ఒకటి బ్రహ్మానందంగారి సినిమాలో ఆయన కూతురుగా, హీరో చెల్లెలిగా మంచి పాత్ర వచ్చింది. అలాగే ఇంకో సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. అలా మా అమ్మాయి కెరీర్ పరంగా కూడా బీజం పడింది 2024లోనే. ‘మనుషులను’సంపాదించుకున్నాం→ రాకేష్: 2024 విషయానికి వస్తే ఈ సంవత్సరం మా ఇద్దరికీ చాలా బ్యూటిఫుల్ ఇయర్. మేం సొంతంగా సినిమా (‘కేసీఆర్’లో రాకేశ్ నటించి, నిర్మించారు) ఆరంభించాం. ఎన్నో సంవత్సరాలుగా నా డ్రీమ్ అది. 2023లోనే మేం ‘కేసిఆర్’ సినిమా అనుకొని షూటింగ్ స్టార్ట్ చేశాం. మేం తీసుకున్న మూవీ టైటిల్ కన్ఫర్మేషన్, కొన్ని కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఇంత కష్టపడి,ప్రాణం పెట్టి చేసిన సినిమా ఎందుకు ఇలా ఆగిపోయిందో అని చాలా నిరుత్సాహంలో ఉన్న సంవత్సరం అది. కానీ 2024, ఆగస్ట్ 1న నా బంగారు తల్లి పుట్టింది. నిజంగానే మా అన్ని టెన్షన్లకీ, కష్టాలకీ ఫుల్స్టాప్ పడ్డట్లు, ప్రత్యక్షంగా లక్ష్మీదేవి మా జీవితాల్లో అడుగు పెట్టినట్లు అయింది. సినిమా రిలీజైంది. ‘దైవం మానుష రూపేణ’ అని నేను నమ్ముతాను. నా చుట్టూ ఉన్న మనుషులు నా కోసమే అనే భావనతో మనుషుల్ని సంపాదించుకుంటూ, వాళ్లని కాపాడుకునేందుకై కష్టపడుతున్నాను. దీపా ఆర్ట్స్ శ్రీనివాస్‌గారు ఈ సంవత్సరం ఆహాలో మా మూవీని రిలీజ్ చేసి ఈ సంవత్సరానికి మమ్మల్ని ఇంకో మెట్టు పైకి ఎక్కించి, ఈ ఇయర్ ఎండ్ గిఫ్ట్‌గా ఇచ్చారు.→ అంతా బాగుండి మనం నడుస్తున్నప్పుడు మన వెనక చాలామంది వస్తారు. ఒకసారి కిందపడితేనే తెలుస్తుంది మనకి చెయ్యి అందించి పైకి లేపేది ఎవరు, మనల్ని చూసి ఎగతాళిగా నవ్వేది ఎవరు అనేది క్లియర్‌గా తెలుసుకున్నాం. అన్నీ సక్రమంగా బ్యాలెన్స్ చేసుకుంటూ మూవీ రిలీజ్ అయ్యి, సక్సెస్ అయ్యి మంచి గుర్తింపుతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక సమయంలో హెక్టిక్ అయిపోయి తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో మా సుజాత నన్ను బిడ్డలాగా తోడు నీడగా ఉండి చాలా స్ట్రెంత్‌ను ఇచ్చింది. 2025లో ఇంకో న్యూప్రాజెక్ట్తో రాబోతున్నాం. మా సుజాతది కూడా 2025లో ‘సేవ్ ది టైగర్–3’ వెబ్ సిరీస్ రాబోతోంది. వర్క్‌లో,ప్రొఫెషన్లో ఇంకా ఇంకా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాం.→ సుజాత: నాకు 2023 డిసెంబర్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. 2024 జనవరి నుంచిప్రొఫెషన్ పరంగా ఎన్నో టెన్షన్స్‌తో ఉన్నా రాకేష్గారు నన్ను చాలా కేర్ తీసుకుంటూ, హాస్పిటల్‌కి తీసుకెళ్లి రెగ్యులర్ చెకప్‌లు చేయిస్తూ, చివరికి నా డెలివరీ రూమ్‌లో బేబీని తన చేతులలో బయటికి తీసి బొడ్డు కోసే వరకు, స్పెసిమెన్ శాంపిల్స్ కలెక్ట్ చేసే వరకు కూడా అన్నీ ఆయన చేతుల్లోనే జరిగాయి.మేము ముగ్గురం అక్కా, చెల్లెళ్ల్లం కాబట్టి నాకు బాబు పుడితే బాగుండు అని ఉంది. కానీ మా ఆయన మాత్రం ఎవరైనా ఒకటే అనేవారు. ఫైనల్‌గా మా పాపాయి ఇంట్లోకి అడుగు పెట్టింది. అప్పటివరకు ఆగిపోయిన సినిమాకు ఉన్న అడ్డంకులు అన్నీ వాటంతట అవే క్లీయర్ అయిపోయి, మూవీ రిలీజ్ అయిపోయింది. మా పాప పుట్టుకతో మా ఆయన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినట్లు మేము ఫీలవుతున్నాం. అందుకే మా పాప పేరు కూడా ‘ఖ్యాతిక’ అని పెట్టుకున్నాం. ఆ పేరు కూడా బాగా కలిసొచ్చింది. మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది. మా రాకేష్ చాలా కష్టపడుతున్నాడు, మనవాడి కోసం మనం కూడా ఏదైనా చేయాలని స్వచ్ఛందంగా వచ్చి సినిమాలో పని చేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. అందుకే మేం డబ్బు కంటే కూడా మనుషులను ఎక్కువగా సంపాదించుకున్నాం అనే తృప్తి 2024లో మాకు చాలా ఉంది.కామెంట్లు చేసినా కామ్‌గా ఎదిగాంఇంద్ర నీల్: ‘కాలచక్రం’ అనే సీరియల్లో మేఘన, నేను కలిసి నటించాం. మా ఫ్రెండ్షిప్తో కలిపి మా రిలేషన్‌షిప్‌కు 25 ఏళ్లు. మా పెళ్లి జరిగి 19 ఏళ్లవుతోంది. మా ఇద్దరి లైఫ్‌లో జరిగిన బెస్ట్ థింగ్ ఏంటి? అని చె΄్పాలంటే మా మ్యారేజ్ అనే చె΄్తాను. 2005 మే 26న ‘చక్రవాకం’ సీరియల్ చేస్తున్నప్పుడు నాకు అత్త రోల్ చేశారు మేఘన. ఆ సీరియల్లో అత్తను ప్రేమించే క్యారెక్టర్ నాది..సో... రియల్ లైఫ్‌లో కూడా తనని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాను. చాలా కష్టపడి, పెద్దల్ని ఒప్పించి, పెళ్లికి వచ్చేలా చేసుకుని, మా ఇద్దరి డబ్బుల్తోనే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం. అది మాకు ఎప్పటికీ తీయని గుర్తు. → నాకైతే 2024 గురించి చిన్న పశ్చాత్తాపం ఉంది. మా నాన్నకు మరీ మరీ జాగ్రత్తలు చెప్పి షోల కోసం అమెరికా వెళ్లాను. నేను వర్క్ చేయడానికి ఎక్కడికైనా వెళ్లి, కష్టపడుతుంటే నాన్నకు కూడా చాలా ఇష్టం. నేనున్నాను కదా... నువ్వు వెళ్లు అని ధైర్యం చెప్పి పంపారు. కానీ నేను ఇండియాకి తిరిగి వచ్చేసరికి, నా ధైర్యం అయిన ఆయనే మాకు దూరం అయిపోయారు. ఆ విషయంలో చాలా బాధపడుతున్నాను. ఈ రోజు ఆయన మాతో భౌతికంగా లేకపోవడం మాకు చాలా పెద్ద లాస్. ∙2025 పై మాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మా ఇద్దరికీ ఒక మంచి ΄్లాన్ కూడా ఉంది. మంచి బిజినెస్ ΄్లాన్స్తో పాటుగా కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రివీల్ చేస్తే సర్ప్రైజ్ అంతా పోతుందని చెప్పడంలేదు.ట్రిప్స్ అయితే చాలానే ΄్లాన్ చేస్తున్నాం. మేం ఇద్దరం ఎక్కువగా రోడ్ ట్రిప్స్‌కి వెళ్లడానికే ఇష్టపడతాం. అయితే అన్నీ అన్΄్లాన్డ్ ట్రిప్సే ఉంటాయి. అప్పటికప్పుడు అనుకోవడం... వెళ్లిపోవడం. మేఘన రామి: జీవితంలో ఓ మంచి పార్టనర్ దొరకడం అనేది చాలా ముఖ్యం. అప్పుడున్న ఆ ఏజ్‌లో అది కరెక్టో, కాదో అనేది పక్కన పెడితే... ఇప్పుడు మా 19 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత అనిపిస్తోంది.... అప్పుడు మేం తీసుకున్నది చాలా మంచి నిర్ణయమని. ‘ఏంటి, వాళ్లు ఇలా పెళ్లి చేసుకున్నారు?’ అని వ్యతిరేకంగా మాట్లాడుకున్నవాళ్లూ కూడా ఉన్నారు. కానీ మేం తీసుకున్న ఈ మంచి నిర్ణయం వల్ల మా లైఫ్ అప్పట్నుంచి చేంజ్ కావడం ఆరంభమైంది. ఇక నా ఫుడ్ బిజినెస్‌లో నీల్ సపోర్ట్ చాలా చాలా ఉంది. లేదంటే... ఈ రోజు ఈ బిజినెస్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఇంత దూరం రానే రాదు. వైఫ్‌తో పచ్చళ్లు అమ్మిస్తున్నాడనీ, ఇండస్ట్రీలో వర్క్ లేక పచ్చళ్లు అమ్ముకుంటున్నారనీ, బతుకుతెరువు కోసం ఇలా చేస్తున్నారనీ చాలామంది నెగటివ్ కామెంట్స్ చేశారు. కానీ మేం ఇద్దరం చాలా చాలా మెమొరీస్‌ని బిల్డ్ చేసుకోగలిగాం. మంచి లైఫ్‌ని లీడ్ చేస్తూ, ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా 2025లో మా రిలేషన్‌షిప్‌కి సంబంధించి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇక 2025 రిజల్యూషన్స్ అంటే... ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, చాలా ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గించుకోవాలని ఫిక్స్ అయ్యాను. అందుకే న్యూ ఇయర్ రావడానికి రెండు వారాల ముందే యోగా సభ్యత్వం తీసుకున్నాను. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంటర్వ్యూలు: శిరీష చల్లపల్లి -
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ స్పెషల్: ఆటోలు, కార్లలో ఉచిత ప్రయాణం!
సాక్షి,హైదారబాద్ : నగర వాసులకు శుభవార్త. డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని ప్రయాణికులకు ఉచిత రవాణా సదుపాయం అందించేందుకు సిద్ధమైంది.ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫోర్ వీలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ సదుపాయాన్ని నగర వాసులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 500 కార్లు 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులే క్షేమమే లక్ష్యంగా ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో తెచ్చినట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. రేపు రాత్రి 10 గంటల నుంచి అర్దరాత్రి 1 గంట వరకు ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉండనుంది.మరోవైపు,న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా మంగళవారం(రేపు)హైదరాబాద్‌లో అర్దరాత్రి వరకు మెట్రో రైల్ సేవలు కొనసాగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం రేపు అర్ధరాత్రి 12:30 కి చివరి రైలు స్టేషన్ నుండి బయలుదేరి 1.15 వరకు చివరి స్టేజి వరకు అందుబాటులో ఉండనుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు మెట్రో రైలు విభాగం సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం రాత్రి 11గంటల నుండి ఉదయం 5గంటల వరకు వాహనాల పోకల్ని నిషేధిస్తూ ఓఆర్ఆర్,ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ , ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ తప్పనిసరి. బార్లు, పబ్బులు,క్లబ్‌లు నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,మైనర్ డ్రైవింగ్ చెస్తే వాహనాలు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల ఆంక్షలు రేపు రాత్రి 11నుండి జనవరి 1 ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.న్యూఇయర్ వేడుకలపై మాదాపూర్ డీసీపీ వినీత్ సాక్షి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో భద్రత విషయంలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాం.మాదాపూర్ జోన్లో 61 ఈవెంట్స్ జరగనున్నాయి. 43పబ్స్ ఉన్నాయి. 20 కమ్యూనిటీ ఈవెంట్స్ జరగనున్నాయి.నిర్వాహకులు తప్పని సరిగా సమయం, నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఈవెంట్లో ఐడీకార్డ్‌లు తప్పని సరి.మైనర్లకి మద్యం సప్లయ్ చేయకూడదు. సౌండ్ ఎక్కువగా ఉండకూడదు.. స్థానికులను ఇబ్బందులు పెట్టొద్దు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలి.కెపాసిటీ మేరకు మాత్రమే కస్టమర్స్ ను అనుమతించాలి. ప్రతి ఈవెంట్స్ లో అన్నీ ఏర్పాట్లు నిర్వాహకులు చూసుకోవాలి. భద్రత ,పార్కింగ్, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా చూడాలి. క్యాబ్, టాక్సీ,ఆటో డ్రైవర్లకు సూచనలు ఇచ్చాం. డ్రంక్ అండ్ డ్రైవ్ రాత్రంతా కొనసాగుతుంది. తాగి డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు. డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంటుంది.న్యూ ఇయర్ ఎంజాయ్ చెయ్యాలి కానీ ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. -
New year 2025 : అదిరే ముగ్గులతో న్యూ ఇయర్‌కి స్వాగతం చెబుదామా!
నూతన సంవత్సరం వస్తోందంటే ఆ సంతోషం వేరే లెవల్లో ఉంటుంది. వచ్చే ఏడాదంతా మంచే జరగాలని, కోరిన కోరికలు నెరవేరాలని ఆశపడతారు. తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అభిలషిస్తారు. మా ఆశలు పండించు అంటూ తమ ఇష్టదైవాన్ని కోరుకుంటారు. కొంగొత్త ఆశలు, కోరికలతో ఉత్సాహంగా న్యూ ఇయర్ స్వాగతం పలుకుతారు. ‘హ్యాపీ న్యూయర్’ అంటూ బంధువులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఇక గృహణులు ఇంట్లోని ఆడపిల్లల సందడి మరింత ఉత్సాహంగా ఉంటుంది. కేవలం తాము మాత్రమే అందంగా తయారవ్వడం కాదు. ఇల్లంతా అందంగా అలంకరించుకుంటారు. సరికొత్తగా తమ డ్రీమ్ హౌస్‌ను తీర్చిదిద్దుకుంటారు. ఈ అలంకరణలో ముఖ్యమైంది. ఇంటిముందు తీర్చి దిద్దే రంగవల్లులు. ఎంత చలి అయినా సరే, అర్థరాత్రి దాకా పెద్దపెద్ద ముగ్గులు వేయాల్సిందే. వాటికి చక్కటి రంగులద్ది వాకిళ్లను శోభాయమానంగా రూపొందించాల్సిందే.. వాటిని తిరిగి తిరిగి చూసుకొని మరీ మురిసి పోవాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే ఈ రంగోలీ వారి కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. చక్కటి రంగవల్లులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే తీరు చాలా ప్రత్యేకమైంది అనడంలో ఎలాంటి సందేహంలేదు.ముగ్గులు, రకాలుచిన్న పక్షి నుంచి, ఆకులు పువ్వులు దాకా ప్రకృతిలో ప్రతీ అంశం, ప్రతీ సంబరం, సంతోషం ముగ్గు రూపంలో ముంగిట వాలిపోతుంది. ఇక సంక్రాంతిలో వేసే చాప, రథం ముగ్గు దాకా ముగ్గుల్లో ఎన్ని రకాలుంటాయో ఒక్క మాటలో చెప్పడం కష్టం. పద్మాల ముగ్గు, గులాబీల ముగ్గు, తూనీగల ముగ్గు, చిలకల ముగ్గు, ఏనుగుల ముగ్గు, శంఖాల ముగ్గు, డప్పు, డోలు ముగ్గు, గంగిరెద్దుల ముగ్గు, దీపాల ముగ్గు, అబ్బో..ఇలా ఎన్నో రకాలు. ఎవరి ఊహకు తగ్గట్టు, ఎవరి నైపుణ్యానికి తగ్గట్టు వారు ముగ్గులు వేస్తారు. ఇందులో దాదాపు ప్రతీ మహిళ, ప్రతీ కన్నెపిల్ల సిద్దహస్తురాలే. చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, మెలికల ముగ్గులు, అప్పటికప్పుడు అలా ఊహతో తీర్చిదిద్దే ముగ్గులు. తీరొక్క చుక్క, చుక్కకో లెక్కచుక్కల ముగ్గు వేయడంలో చుక్కలు వేయడం ప్రధానం. చుక్కలు లెక్క తప్పినా, ఏ మాత్రం వంకర పోయినా, ఆ ముగ్గు అందమే పోతుంది. చుక్క లెక్క తప్పిందా... ముగ్గు అంతా గోవిందా. అందుకే చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వేయాలి. న్యూఇయర్, సంక్రాంతి ముగ్గుసంవత్సరం అంతా వేసే ముగ్గులు ఒక ఎత్తయితే, సంక్రాంతి నెల అంతా, కొత్త ఏడాదికి స్వాగతం చెపుతూ వేసే ముగ్గులు మరో ఎత్తు. చుక్కలతో పెద్ద ముగ్గులు వేసి, మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ (Happy New Year 2025) అని రాసి మురిసిపోయే సంబరం అంతా ఇంతా కాదు. ముగ్గులు వేయడం కష్టంగా అనిపిస్తే.. రకరకాల డిజైన్లతో ఈజీగా, సింపుల్‌గా రంగోలిని వేసుకోవచ్చు. చూడటానికి చాలా అందంగా, వెరైటీగా కూడా ఉంటాయి. మీ ఊహకు తగినట్టు చక్కగా పద్మాలను, రోజా పువ్వులను తీర్చిదిద్దుకొని వాటిని రంగులద్దుకోవాలి. మనకున్న వాకిలి ఆధారంగా డిజైన్ ఎంచుకోవాలి. వీలైతే ఒకసారి కాగితం మీద వేసుకుంటే చక్కగా అమరినట్టు వస్తుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వెల్కం బొమ్మ వేసి, ఇంద్రధనుస్సురంగులో నింపేసుకోవచ్చు. దీపాలు, పువ్వులను తీర్చిదిద్ది వాకిలిని అలంకరించుకోవచ్చు. ప్రత్యేకంగా రంగు రంగుల పువ్వులతోనే చక్కటి ముగ్గును వేసుకొని కొత్త ఏడాదికి స్వాగతం చెప్పవచ్చు. లేదంటే మార్కెట్లో దొరికే అచ్చుల సాయంతో చక్కటి డిజైన్ వేసుకోవచ్చు. -
'నూతన' వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్ఐ గోపాల్
సాక్షి, నిడమనూరు (నల్గొండ జిల్లా): ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని నిడమనూరు ఎస్ఐ గోపాల్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. మద్యం తాగి బండి నడిపి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. రోడ్లపై కేక్ కటింగ్, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో డీజేలు, సౌండ్ సిస్టంలు వినియోగిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి బృందాలుగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు.న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది. వైన్ షాప్‌లకు రాత్రి 12.00 గంటల వరకు.. బార్లు, రెస్టారెంట్లు రాత్రి 1.00 గంట వరకు మాత్రమే ప్రభుత్వo అనుమతించింది. సమయపాలన పాటించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేస్తామన్నారు. -
December 31: ఫ్లైఓవర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఈసారి కొత్త సంవత్సరాన్ని శాంతి భద్రతల నడుమ జరపాలని తగిన భద్రతా చర్యలు చేపడుతున్నారు. బైక్ రేసులు, అతివేగంతో దూసుకెళ్లే ప్రమాదం పొంచి ఉండటంతో నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో డిసెంబర్ 31న రాత్రి 10 గంటల తర్వాత ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలకు ఫ్లై ఓవర్ల మీదకు అనుమతి ఉండదు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మాత్రం తగిన ఆధారాలు చూపిస్తే పీవీఎన్ఆర్ ఫ్లై ఓవర్ మీదికి అనుమతి ఇస్తారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రజలు సహకరించాలని రాచకొండ కమిషనర్ సు«దీర్ బాబు సూచించారు. ఔట్ డోర్ కార్యక్రమాలు జరిగే చోట డీజేలకు అనుమతి లేదన్నారు. ఎటువంటి బాణసంచా కాల్చడానికి వీల్లేదని, ఈవెంట్లలోకి పరిమితికి మించి ప్రేక్షకులను అనుమతించకూడదని ఆయన పేర్కొన్నారు. మహిళలపై ఎటువంటి వేధింపులు జరగకుండా నిరోధించడానికి షీ టీమ్ బృందాలు విధుల్లో ఉంటాయన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి తనిఖీలు చేస్తామని చెప్పారు. నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నామని కమిషనర్ పేర్కొన్నారు. నిర్దేశిత సమయంలోపే మూసేయాలి.. ⇒పబ్‌లు, బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయం లోపు మూసి వేయాలని, మైనర్ యువతకు మద్యం అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు ఉంటాయని సుధీర్ బాబు హెచ్చరించారు. వాహనాల పార్కింగ్‌కు సరైన ఏర్పాట్లు చేయాలన్నారు. నగర శివార్లలోని ఫాంహౌస్‌లలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు నిబంధనలకు లోబడి ఉండాలని, ఎటువంటి డ్రగ్స్ వినియోగం జరగకూడదని, మహిళలతో అసభ్యకర డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించకూడదని, మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
కొత్త ఏడాదికి సన్నద్ధమా?
కేలండర్లో నంబర్ మారిపోతోంది. కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామంటే ఏదో తెలియని హుషారు. కొత్త ఏడాదిలో కలలు సాకారం కావాలని, మరిన్ని విజయాలు వరించాలని, గొప్ప అవకాశాలను అందుకోవాలని, వృత్తి/వ్యాపారం/ఉద్యోగంలో రాణించాలని ఇలా.. ఎన్నెన్నో ఆకాంక్షలు. ఈ జాబితాలో ఆర్థిక లక్ష్యాలకూ చోటు ఉండాల్సిందే. అయితే ఆర్థిక నిర్ణయాలకు ఫలితాలు వెంటనే కనిపించవు. కొన్నేళ్ల ప్రయాణం తర్వాతే విజయాలు సాకారం అవుతాయి. పెట్టుబడి వృద్ధి అన్నది ఒక్క ఏడాదితో అయ్యేది కాదు. ఇది సుదీర్ఘ ప్రయాణం. ఈ దిశగా ఆచరణ పక్కాగా ఉండాలి. కారు, సొంతిల్లు, పిల్లల విద్య, రిటైర్మెంట్.. తదితర కీలక లక్ష్యాలను సరైన ప్రణాళికతోనే చేరుకోగలరు. ప్రస్తుత ఏడాది ఆర్థిక నిర్ణయాలు, పెట్టుబడులు, రుణాలను ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన తరుణం కూడా ఇదే. ఆర్థిక సన్నద్ధతను పరీక్షించుకోవాల్సిన సందర్భం కూడా ఇదే. బడ్జెట్ రూపకల్పనరూపాయి ఆదా చేయడం తిరిగి సంపాదించడంతో సమానం. అందుకే డబ్బు విషయంలో లెక్క పక్కాగా ఉండాలి. ఇందుకు వీలు కలి్పంచేదే ఆర్థిక ప్రణాళిక. ఈ దిశగా మొదట చేయాల్సింది కుటుంబానికి బడ్జెట్ ఏర్పాటు చేసుకోవడం. కానీ, అందరికీ ఆర్థిక అంశాలపై అవగాహన ఉండదు. అటువంటప్పుడు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తదితర నిపుణుల సాయంతో బడ్జెట్ రూపొందించుకోవాలి. ముందుగా మీ ఆర్థిక స్థితిపై అవగాహన అవసరం. వివిధ మార్గాల్లో వస్తున్న మొత్తం ఆదాయం, వ్యయాలు, అవసరాలు, కోరికలు, జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలు, వాటిని నెరవేర్చుకునేందుకు సమకూర్చుకోవాల్సిన వనరులు తదితర సమాచారం ఆధారంగా నిపుణులు మీకంటూ ప్రత్యేకమైన ఆర్థిక ప్రణాళికను సూచిస్తారు. ఆర్థిక స్వేచ్ఛకు స్పష్టమైన మార్గసూచీ మీకు లభిస్తుంది.50/30/20 సూత్రం ఆర్థిక క్రమశిక్షణతో మెలిగేవారికి 50/30/20 సూత్రం ఆచరణీయం. ఒక ఆర్థిక సంవత్సరంలో పన్నుల చెల్లింపులు పోను మిగులు ఆదాయంలో 50 శాతాన్ని అవసరాలకు వెచి్చంచుకోవాలి. రోజువారీ జీవన వ్యయాలు (గ్రోసరీ, ఇంటి అద్దె, ఫోన్, గ్యాస్, వాహన ఇంధన వ్యయాలు, పిల్లల స్కూల్/కాలేజీ ఫీజులు/ఔషధాలు, చికిత్సల ఖర్చులు), ఇన్సూరెన్స్ ప్రీమియం ఇవన్నీ అవసరాల కిందకే వస్తాయి. 30 శాతాన్ని కోరికలకు కేటాయించుకోవచ్చు. జీవనానికి కచ్చితంగా అవసరం లేనివి ఈ విభాగంలోకి వస్తాయి. రెస్టారెంట్లలో విందులు, విహార యాత్రలు, ఖరీదైన ఎల్రక్టానిక్ వస్తువులు, లగ్జరీ ఉత్పత్తులు, వినోదం ఈ విభాగం కిందకు వస్తాయి. మిగిలిన 20 శాతాన్ని పెట్టుబడులకు కేటాయించుకోవాలి. ఈ పెట్టుబడులు జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఉండాలి. ఇల్లు కొనుగోలు, పిల్లల ఉన్నత విద్య, పిల్లల వివాహాలు, ప్రశాంతమైన విశ్రాంత జీవనం వీటన్నింటికీ మద్దతుగా నిలవాలి. అవసరమైతే ముఖ్యమైన జీవన లక్ష్యాల కోసం 30–40 శాతం మేర పెట్టుబడులకు కేటాయించుకుని, కోరికలకు 20–10 శాతం బడ్జెట్‌తో సరిపెట్టుకున్నా తప్పులేదు. రోజువారీ ముఖ్యమైన జీవన అవసరాలు మొదటి ప్రాధాన్యంగా, ముఖ్యమైన జీవిత లక్ష్యాలు రెండో ప్రాధాన్యంగా పెట్టుబడుల ప్రణాళిక సాగిపోవాలి. పన్ను ప్రయోజనాలు పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల రాబడి పెంచుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవాలంటే అందుకు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనుకూలం. రిటైర్మెంట్ ఫండ్‌కు వీలైన పీపీఎఫ్, ఎన్పీఎస్ సాధనాల్లో చేసే పెట్టుబడులకూ పన్ను ప్రయోజనాలున్నాయి. అందుకే పెట్టుబడులను పన్ను ప్రయోజనాలతో సమన్వయం చేసుకోవాలి. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను ప్రయోజనాలను సైతం వినియోగించుకోవాలి. అంతేకాదు, పన్నుల్లోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. వీటికి అనుగుణంగా నిర్ణయాల్లో సవరణలు కూడా అవసరం కావొచ్చు. స్పష్టమైన ఆచరణ ముఖ్యమైన లక్ష్యాలకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ లక్ష్యాలకు ఎంత మొత్తం అవసరం అన్నది నిపుణుల సాయంతో తేల్చుకోవాలి. ఈ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు మెరుగైన పెట్టుబడి సాధనాలను గుర్తించాలి. 10 ఏళ్లు అంతకుమించిన సాధనాలకు ఈక్విటీలు మెరుగైనవి. కానీ, వీటిల్లో స్వల్పకాలానికి (మూడేళ్లలోపు) రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఈ రిస్క్ ప్రభావం తగ్గిపోయి రాబడులు అధికంగా ఉంటాయి. ఐదేళ్ల కంటే తక్కువ కాల లక్ష్యాలకు డెట్ సాధనాలు అనుకూలం. ఐదు– ఏడేళ్ల కాల లక్ష్యాలకు డెట్, ఈక్విటీ కలయికగా పెట్టుబడులు ఉండాలి. మొత్తం పెట్టుబడుల్లో 5–10 శాతం బంగారానికీ కేటాయించుకోవాలి. లక్ష్యాలకు కావాల్సిన రాబడుల కోసం ఏ ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలన్నది నిపుణులను అడిగి తెలుసుకోవాలి. సరైన అస్సెట్ అలోకేషన్ (వివిధ సాధనాల మధ్య వర్గీకరణ) వ్యూహం అమలు చేయాలి. ఈక్విటీ పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. ప్రతి నెలా నిర్ణయించిన మేర ఆటోమేటిగ్గా వాటిల్లోకి వెళ్లేలా చూసుకోవాలి. ఆదాయం వచి్చన వెంటనే ముందు చేయాల్సింది పెట్టుబడి. ఆ తర్వాతే మిగిలిన అవసరాల సంగతి చూడాలి. రిటైర్మెంట్ కోసం ఎన్పీఎస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా సంపాదన మొదలు పెట్టిన మొదటి నెల నుంచే పెట్టుబడులు కూడా ప్రారంభం కావాలి. ఎందుకంటే పెట్టుబడి సంపదగా మారడంలో కాంపౌండింగ్ (రాబడిపై రాబడి) కీలకం అవుతుంది. ఈ కాంపౌండింగ్‌కు ఎక్కువ కాలం కావాలి. ఎంత ఎక్కువ వ్యవధి ఉంటే అంత అధికంగా సంపద సమకూర్చుకోవచ్చు. అత్యవసర నిధి కుటుంబానికి అత్యవసర నిధి తప్పనిసరి. కారణం ఏదైనా ఉన్నట్టుండి ఆదాయం ఆగిపోతే.. కుటుంబ అవసరాలు, పెట్టుబడుల లక్ష్యాలు నిలిచిపోకూడదు. ముఖ్యమైన అవసరాలు, పెట్టుబడులకు ప్రతి నెలా ఎంత మెత్తం వెచి్చస్తున్నారో చూసుకుని.. కనీసం ఆరు నెలల నుంచి 12 నెలలకు సరిపడే మొత్తాన్ని అత్యవసర నిధి కింద ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో లేదా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు వేగంగా వెనక్కి తీసుకో వచ్చు. బీమా రక్షణ అత్యవసర నిధితోపాటే బీమా రక్షణ కూడా చాలా ముఖ్యమైనది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి జరగరానికి జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల్లోకి వెళ్లకుండా జీవిత బీమా రక్షణ (టర్మ్ లైఫ్) కలి్పస్తుంది. రోడ్డు ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలైతే ఆరోగ్య బీమా అండగా నిలుస్తుంది. ఈ రెండింటిలో ఏది లేకపోయినా, ఆర్థిక కష్టాలను ఆహా్వనించినట్టే అవుతుంది. అంతేకాదు బడ్జెట్ ప్రణాళికలు తల్లకిందులవుతాయి. తన కుటుంబ జీవనం, కీలక లక్ష్యాలకు సంబంధించి పెట్టుబడులకు ఒక ఏడాదిలో ఎంత వ్యయం అవుతుందో.. అంతకు 20 రెట్ల మొత్తం టర్మ్ లైఫ్ అష్యూరెన్స్ తీసుకోవాలి. యాక్సిడెంటల్ డెత్, డిస్‌మెంబర్‌మెంట్ (వైకల్యం) రైడర్ జోడించుకోవాలి. ఒక కుటుంబానికి కనీసం రూ.5–10 లక్షల బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ పాలసీతోపాటు, రూ.50 లక్షలకు (రూ.5–10 డిడక్టబుల్) సూపర్ టాపప్ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కూడా ఉండాలి. రుణపడొద్దు.. ఒక్కసారి బడ్జెట్ రూపొందించుకున్న తర్వాత దాని పరిధిలోనే లక్ష్మణ రేఖ దాటకుండా నడుచుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం నేటి కోరికలను నియంత్రించుకోవడం ఆర్థిక శాస్త్ర పరంగా ఎంత మాత్రం తప్పుకాదు. ఖర్చులు ఆర్జనను మించరాదు. మరీ ముఖ్యంగా ఆర్జనలో 70 శాతం దాటిపోకుండా చూసుకుంటేనే, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లకుండా చూసుకోవడం సాధ్యపడుతుంది. ఇందులో భాగంగా బై నౌ పే లేటర్, క్రెడిట్ కార్డు రుణాలకు దూరంగా ఉండాలి. రేపటి వనరులను కూడా నేడే ఖర్చు పెట్టేందుకు వీలు కల్పించే సాధనాలు ఇవి. వీటికి అలవాటుపడితే బయటకురావడం అంత సులభం కాదు. ఆర్థిక స్వేచ్ఛకు అతిపెద్ద అవరోధం రుణమే. గృహ రుణం, విద్యా రుణం మినహా మరే ఇతర రుణం జోలికి పోవకపోవడమే మంచిది. తప్పనిసరి అయి ఏదైనా రుణాన్ని ఆశ్రయించినట్టయితే.. పెట్టుబడి కంటే ముందే ఈ రుణాన్ని తీర్చివేసేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండేలా కాపాడుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్‌లో విద్యా, గృహ రుణాలు సులభంగా, తక్కువ రేటుకు పొందొచ్చు. పెట్టుబడులను రుణాల కోసం త్యాగం చేయాల్సి వస్తే.. అప్పుడు భవిష్యత్ లక్ష్యాల్లోనూ రాజీపడాల్సి వస్తుంది. అందుకే వచి్చన ఆదాయం పరిధిలోనే జీవించడం నేర్చుకోవాలి. ఒకవేళ రుణఊబిలోకి దిగి, బయటకు వచ్చే మార్గం తోచకపోతే ఆలస్యం చేయకుండా నిపుణుల సాయం తీసుకోవాలి. అవసరమైతే ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేíÙంచాలి. ఇలా చేయడం వల్ల రుణాల నుంచి బయటపడడంతోపాటు, దీర్ఘకాల లక్ష్యాలకు కావాల్సిన పెట్టుబడిని సమకూర్చుకోవచ్చు. నామినీ/వీలునామా ఇక పెట్టుబడులకు నామినేషన్ ఇవ్వడం మర్చిపోవద్దు. బ్యాంక్ ఖాతా, లైఫ్ ఇన్సూరెన్స్,, మ్యూచువల్ పండ్స్, డీమ్యాట్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా ప్రతి పెట్టుబడికి నామినీని నమోదు చేయాలి. అనుకోనిది జరిగితే, ఆయా పెట్టుబడులు తమ వారికి సులభంగా బదిలీ అయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి వీలునామా రాయడం మంచి చర్య అవుతుంది. నామినేషన్ అన్నది కేవలం క్లెయిమ్ అర్హత కలి్పస్తుంది. కానీ, వీలునామా అన్నది చట్టపరమైన హక్కులకు మార్గాన్ని సులభం చేస్తుంది. వారసుల మధ్య వివాదాలను నివారిస్తుంది. తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఆస్తుల బదిలీకి చట్టబద్ధమైన డాక్యుమెంట్‌గా సాయపడుతుంది. ముగ్గురిలో ఇద్దరు రుణగ్రస్తులే → మన దేశంలో రుణభారం లేని వారు 38 శాతమేనట. అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆర్థిక సంస్థలకు రుణపడి ఉన్నట్టు తెలుస్తోంది. → మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారిలోనూ 31 శాతం మంది ఈఎంఐ చెల్లింపులతో సతమతం అవుతున్నారు. → 40 శాతం మందికి అత్యవసర నిధి లేదు → 27 శాతం మందికి మెరుగైన పన్నుల ప్రణాళిక లేదు. → దేశంలో 74 శాతం మందికి సరిపడా బీమా కవరేజీ లేదు. వీరిలో కొందరికి అసలు బీమా రక్షణే లేదు. → ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారిలోనూ 54 శాతం మందికి కాంపౌండింగ్ గురించి తెలియకపోవడం విడ్డూరం (ఫైనాన్షియల్ ఫిట్నెస్ ప్లాట్‌ఫామ్ ‘ఫిన్నోవేట్’ ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో తెలిసిన ఆసక్తికర అంశాలు ఇవి) – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
సత్సంకల్పం.. సత్సంవత్సరం
సాధారణంగా కొత్తసంవత్సరం వస్తోంది అంటే పండుగ వాతావరణం నెలకొంటుంది. సంవత్సరంతోపాటు తమ జీవితాలలో కూడా మార్పు వస్తుందనే ఆశతో అందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తుతూ ఉంటుంది. ఎవరి పద్ధతులలో వారు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. కొత్తసంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. విందులు, వినోదాలు, శుభాకాంక్షలు తెలుపుకోటం. ఒకటే సంబరం. రాబోయే కాలం ఆనందదాయకంగా ఉండాలనే ఆకాంక్ష, ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేయటంతోపాటు ఇంతకాలం జీవితాన్ని ఆనందంగా గడిపినందుకు, ఆ విధంగా గడిపే అవకాశం ఇచ్చినందుకుభగవంతుడికి కృతజ్ఞతని ఆవిష్కరించటం వీటిలోని అసలు అర్థం. సంవత్సరంలో మొదటిరోజు ఏ విధంగా గడిపితే సంవత్సరం అంతా అదేవిధంగా ఉంటుందని అందరి విశ్వాసం. కనుక వీలైనంత ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాలాన్ని నారాయణ స్వరూపంగా భావించి పూజించటం, ఆరాధించటం భారతీయ సంప్రదాయం. అంటే, ఆయా సమయాలలో ప్రకృతిలో వచ్చే మార్పులకి తగినట్టుగా ప్రవర్తించటం అందులో ఒక భాగం. నిత్యవ్యవహారానికి ప్రధానంగా చాంద్రామానాన్నేపాటించినా సంక్రమణాలు, విషువులు మొదలయినవి సూర్యమానానికి సంబంధించినవి. ప్రస్తుతం ప్రపంచం చాలావరకు సౌరమానాన్ని అనుసరిస్తోంది. ఇందులో సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ఒకరకంగా లెక్క తేలిక. కాలచక్ర భ్రమణం వర్తులాకారంలో ఉంటుంది. ఎక్కడి నుండి లెక్క పెట్టటం మొదలుపెట్టామో అక్కడికి వచ్చి ఆగి మరొక ఆవృతం ప్రారంభం అవుతుంది. అందుకని ఎక్కడి నుండి అయినా లెక్కించటం మొదలు పెట్టవచ్చు.రాజకీయమైన అనేక వత్తిడుల కారణంగా చాలా మార్పులు, సద్దుబాట్లు జరిగిన తరువాత తయారైన గ్రెగేరియన్ కాలెండర్ ప్రకారం జనవరి ఒకటవ తేదీని కొత్త సంవత్సరప్రారంభ దినంగా నిర్ణయించటం జరిగింది. భూగోళాన్ని ఒక కుగ్రామంగా పరిగణిస్తున్న ఈ రోజుల్లో అందరూ ఒకే కాలమానాన్నిపాటించటం సౌకర్యం. వ్యక్తిగత ఇష్టానిష్టాలని పక్కకిపెట్టి అందరూ ‘‘కామన్ ఎరా’’ అని ప్రపంచంలో ఎక్కువ దేశాలలో అమలులో ఉన్న ఈ కాలమానాన్ని అనుసరిస్తున్నారు. చాంద్రమానాన్నిపాటించే భారతీయులు కూడా లౌకిక వ్యవహారాలకి కామన్ ఎరానే అనుసరిస్తున్నారు. విద్యాలయాలలో ప్రవేశానికి, ఉద్యోగ దరఖాస్తుకి,పాస్‌పోర్ట్, వీసా మొదలయిన వాటికి తేదీనే ఇస్తున్నాం కాని, తిథి, మాసం మొదలయిన వివరాలు ఇవ్వటం లేదు కదా! తమ వ్యక్తిగత, ఆధ్యాత్మిక వ్యవహారాలకి చాంద్రమానాన్నిపాటిస్తున్నారు. ఉదాహరణకి పుట్టిన రోజులు,పెళ్లి, గృహప్రవేశం మొదలయిన శుభ కార్యాల ముహూర్తాలు, పితృకార్యాలు మొదలైన వాటిని చాంద్రమానాన్ని అనుసరించి నిర్ణయిస్తారు. కాలం ఎవరికోసం ఆగదు. కాలచక్రంలో మరొక ఆకు ముందుకి కదిలింది. కొత్త ఆవృతం మొదలవుతోంది. అంటే మరొక సంవత్సరం కాలగర్భంలో కలిసింది. కొత్త సంవత్సరంప్రారంభం కాబోతోంది. కాని, అనుభవజ్ఞులైన పెద్దలు చేసే సూచన ఏమంటే జరిగిపోయిన సంవత్సరంలో ఏం చేశాము అని సమీక్షించుకుని, తీపి,చేదు అనుభవాలని నెమరు వేసుకుని, గెలుపోటములని, మానావమానాలని, బేరీజు వేసుకుని, తమ లక్ష్యాలని, లక్ష్యసాధన మార్గాలని నిర్ధారించుకుని, పనికిరానివాటిని పక్కకిపెట్టి, అవసరమైనవాటిని చేపడతామని నిర్ణయించుకోవలసిన సమయం ఇది అని. తమ ఆయుర్దాయంలో మరొక సంవత్సరం గడిచిపోయింది, చేయవలసిన పనులు త్వరగా చేయాలి అని తమని తాము హెచ్చరించుకోవాలి. అందుకే ఎంతోమంది ఒక చెడు అలవాటుని మానుతామనో, కొత్తపని ఏదైనా మొదలు పెడతామనో అని నూతన సంవత్సర నిర్ణయాలని ప్రకటిస్తూ ఉంటారు. రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఆనందాన్ని ఇతోధికంగా ఇవ్వాలని, యుద్ధవాతావరణం ఉపశమించి ప్రపంచంలో శాంతి నెలకొనాలని, చేసుకున్న తీర్మానాలు అమలు జరిపే శక్తిసామర్థ్యాలు ప్రసాదించాలని ఒకరికొకరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుందాం. – డా. ఎన్.అనంతలక్ష్మి -
TG: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల స్పెషల్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: మరో రెండు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్ వేడుకలకు దేశంలోని పలు నగరాలు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఇక, ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారులలో వేడుకలు భారీ రేంజ్లో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేకంగా నిఘా వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ, డ్రగ్స్ రహిత హైదరాబాద్ లక్ష్యాలను నిర్ధేశించిన నేపథ్యంలో పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు న్యూ ఇయర్ వేడుకలపై ఫోకస్ చేశాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారుల్లో జరిగే పార్టీలపై ప్రత్యేకంగా నిఘా పెట్టనున్నట్టు తెలుస్తోంది.అలాగే పలు జిల్లాల్లోని ముఖ్య నగరాల్లో, ఫామ్ హౌస్‌లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, హోటళ్లపై పోలీస్ శాఖ ఓ కన్నేసి ఉంచింది. న్యూ ఇయర్ వేడుకలపై సివిల్ పోలీస్తో పాటు నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటి పోలీస్ విభాగాలు కూడా అలర్ట్ అయ్యాయి. వేడుకల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఇప్పటికే హైదరాబాద్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్ , హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. బార్లు, పబ్‌ల లైసెన్స్ తనిఖీ చేశారు.మరోవైపు.. కొత్త ఏడాది వేడుకల్లో మైనర్లను బార్లు, పబ్‌లకు అనుమతిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. డీజేలతో హంగామా చేయవద్ధని, నిషేధానికి సహకరించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సౌండ్ పొలుష్యన్‌కు కారణంగా కాకుండా చూసుకోవాలని పబ్ యజమానులకు ఆదేశాలిచ్చారు.నాలుగు పబ్‌లకు అనుమతి నో... జూబ్లీహిల్స్‌లోని హార్ట్‌కప్, అమ్నేషియా, బ్రాడ్వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వడం లే దు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పో లీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ వేదికలకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సిద్ధమవుతున్న పబ్‌లు ఇవే... జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్‌లు ఉండగా ఇందులో నాలుగింటికి అనుమతులు నిరాకరించారు. కొన్నింట్లో మాత్రం ప్రత్యేక వేడుకలు జరగడం లేదు. అయితే న్యూ ఇయర్ వేడుకల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో లుఫ్ట్, క్లబ్ రోగ్, పోష్ నాష్, తబలారసా, జోరా, లార్డ్ ఆఫ్ డ్రింక్స్, ప్రోస్ట్, జిందగీ స్కై బార్, ఫోర్జ్ బ్రీవ్, 040 బ్రీవ్, హలో, ఎల్యూజన్, ఎయిర్‌లైవ్, గ్రీజ్ మంకీ, పోర్ ఫాదర్స్, జైథుమ్, స్టోన్ వాటర్, పోయిస్ట్ తదితర పబ్‌లు వేడుకలకు అనుమతులు పొందాయి. యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డీజేలను రప్పిస్తున్నారు. గోవా నుంచి పేరొందిన డీజేలతో పాటు గాయనీ, గాయకులను పిలిపిస్తున్నారు. కొన్ని పబ్‌లకు బాలీవుడ్ తారలు కూడా వస్తుండటం గమనార్హం. -
పబ్‌లపై డేగ కన్ను
బంజారాహిల్స్: పబ్‌లు అంటేనే గుర్తుకు వచ్చేది జూబ్లీహిల్స్... నగరంలో ఎక్కడా లేనంత హడావుడి, హంగామా జూబ్లీహిల్స్ పబ్‌లలోనే కనిపిస్తుంది. చుక్కేసినా... చిందేసినా జూబ్లీహిల్స్ పబ్‌లో ఉంటేనే ఆ కిక్కెక్కుతుంది. అందుకే యువత కళ్లన్నీ జూబ్లీహిల్స్ పబ్లపైనే ఉంటాయి. మామూలు రోజుల్లోనే హంగామా జరిగే ఈ పబ్‌లలో న్యూ ఇయర్ విషయం చెప్పనక్కర్లేదు...ఈ నెల 31న రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌లన్నీ సరికొత్త వేదికలతో సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆకర్శన కోసం బాలీవుడ్, టాలీవుడ్ తారలను రప్పిస్తున్నారు. అయితే పబ్ నిర్వాహకులు న్యూ ఇయర్ వేడుకల్లో శ్రుతిమించితే ఊరుకునే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం హద్దు మీరినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఏం చేయాలి.. ఏం చేయకూడదన్న దానిపై పబ్‌ల నిర్వాహకులకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఒక పబ్‌లో మద్యం సేవించి ఆ నిషాలో మరో పబ్‌కు వెళ్లి తాగుతామంటే ఇప్పుడు కుదరదు అని చెప్పాలని.. నిషాలో ఉన్న వ్యక్తికి మద్యం సరఫరా చేయకూడదని ఒక వేళ అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పబ్‌ల నిర్వాహకులకు సమావేశాలు నిర్వహించిన పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తే బాగుండదని హెచ్చరించారు. ప్రతి పబ్‌లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పబ్ ముందు, పార్కింగ్ ప్లేస్‌లోనూ సీసీ కెమెరాలు ఉండాలని సూచిస్తున్నారు. పబ్‌లలో డ్రగ్స్ సరఫరా అయ్యే సూచనలు ఉండటంతో గత పది రోజులుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు గతంలో డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు అన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగే అన్ని పబ్‌లపై పోలీసులు డేగ కన్ను వేయనున్నారు. అనుమానితుల కదలికలపై ఇప్పటికే దృష్టి సారించారు. ప్రతి పబ్‌లోనూ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గంజాయి సరఫరాదారులపై నిఘా ఉచిన పోలీసులు గతంలో గంజాయి కేసులు నమోదైన వారిపై దృష్టి సారించారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత మద్యం సేవించే వారు జాగ్రత్తగా ఇంటికి వెళ్లేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని లేని పక్షంలో వారినే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. నాలుగు పబ్‌లకు అనుమతి నో... జూబ్లీహిల్స్‌లోని హార్ట్‌కప్, అమ్నేషియా, బ్రాడ్వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వడం లే దు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పో లీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ వేదికలకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సిద్ధమవుతున్న పబ్‌లు ఇవే... జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్‌లు ఉండగా ఇందులో నాలుగింటికి అనుమతులు నిరాకరించారు. కొన్నింట్లో మాత్రం ప్రత్యేక వేడుకలు జరగడం లేదు. అయితే న్యూ ఇయర్ వేడుకల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో లుఫ్ట్, క్లబ్ రోగ్, పోష్ నాష్, తబలారసా, జోరా, లార్డ్ ఆఫ్ డ్రింక్స్, ప్రోస్ట్, జిందగీ స్కై బార్, ఫోర్జ్ బ్రీవ్, 040 బ్రీవ్, హలో, ఎల్యూజన్, ఎయిర్‌లైవ్, గ్రీజ్ మంకీ, పోర్ ఫాదర్స్, జైథుమ్, స్టోన్ వాటర్, పోయిస్ట్ తదితర పబ్‌లు వేడుకలకు అనుమతులు పొందాయి. యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డీజేలను రప్పిస్తున్నారు. గోవా నుంచి పేరొందిన డీజేలతో పాటు గాయనీ, గాయకులను పిలిపిస్తున్నారు. కొన్ని పబ్‌లకు బాలీవుడ్ తారలు కూడా వస్తుండటం గమనార్హం.అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి బంజారాహిల్స్: నూతన సంవత్సర వేడుకలను నిర్వహించే ఈవెంట్ ఆర్గనైజర్లు, పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ అన్నారు. ఈ నెల 31న నూతన సంవత్సర వేడుకల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల నిర్వాహకులు మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని, భద్రతా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. అన్ని పబ్‌లు, బార్లు మైనర్లను అనుమతించరాదన్నారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా తమ ప్రాంగణాలను ఖాళీ చేయించాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వెస్ట్‌జోన్ అడిషనల్ కమిషనర్‌తో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు. -
ఈ అలవాట్లు ఉంటే! 50లో హెల్దీ అండ్ హ్యాపీ..!
రొటీన్‌గా చేసే పనుల్లో చేసుకోదగిన చిన్న చిన్న మార్పులు న్యూ ఇయర్(New Year)తో 50 ఏళ్లు నిండుతాయా...ఎంతో హుషారుగా, మరెంతో శ్రమతో లేదంటే.. గడిచిన నాలుగు పదులనూఓ జ్ఞాపకంలా మార్చుకుంటూ ఐదు పదుల్లోకి అడుగుపెట్టి ఉంటారు. ఇప్పటివరకు ఒక లెక్క...ఇక నుంచి ఒక లెక్క అన్నట్టు 50 ఏళ్ల నుంచి మహిళల శరీరంలోనూ, మనస్తత్వంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇంటా బయట ఎదురయ్యే ఒత్తిళ్లు, తమ పట్ల తాము పట్టించుకోని విధానం ఎప్పుడూ ఉంటుంది. పర్లేదు అని నిర్లక్ష్యం చేసే రోజువారీ అలవాట్లను వదిలేసికొత్తగా ఈ అలవాట్లను అలవరచుకోండి. 50 ఏళ్లలోనూ ఫిట్ అండ్ హెల్తీగా ఉండండి.వ్యాయామాలు(Exercises)కార్డియో ఎక్సర్సైజులు చేయాలనుకోకండి. శరీరానికంతటికీ శక్తినిచ్చే వ్యాయామం కండర కణజాలాన్ని సంరక్షిస్తుంది. ఎముక నష్టం కాకుండా పోరాడుతుంది. సమతుల్యతను కాపాడుతుంది. సడెన్‌గా పడిపోయే ప్రమాదాలను నివారిస్తుంది. సెల్ఫ్‌కేర్(Self Care)ఎప్పుడూ తమ కన్నా ముందు ఇతరులకు ఇవ్వడానికే శక్తిని ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక నుంచి రోజులో కొంత సమయం ‘నా కోసం నేను’ అనేలా మిమ్మల్ని మీరు సంతోషపరుచుకునే మానసిక ఆరోగ్యాన్ని పెం΄÷ందించే అలవాట్లు, కార్యకలా΄ాలకు ప్రాధాన్యత ఇవ్వండి.చురుకుగా ఉండటానికి..50 లలో ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. గంటల తరబడి కూర్చుంటే గుండె జబ్బుల రిస్క్ పెరగవచ్చు. ఊబకాయం వల్ల కీళ్లపై భారం పడి మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. అందుకని శరీరం, మైండ్ చురుకుదనానికి రెగ్యులర్ మూవ్మెంట్స్ ఉండేలా చూసుకోవాలి.నిల్వ పదార్థాలకు ‘నో’ఉప్పు, చక్కెర మోతాదు నిల్వ పదార్థాలలో ఎక్కువ. అంతేకాదు, వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకని మైదాతోపాటు ఇతర నిల్వ ఉండే పదార్థాలను పక్కనపెట్టండి.చర్మం పట్ల జాగ్రత్త! (Skin Care)చర్మ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే వృద్ధాప్యం వేగంగా వచ్చేస్తుంది. చర్మ కేన్సర్ ప్రమాదాన్నీ పెంచుతుంది. వయసుతోపాటు చర్మమూ పొడిబారుతుంటుంది. ఎండవేళలో బయటకు వెళ్లినప్పుడు ఈ సమస్య మరీ పెరుగుతుంది. అందుకని, ఎండ నేరుగా చర్మంపై పడకుండా ఎస్పిఎఫ్ ప్రొటెక్షన్ ఉన్న క్రీమ్స్ ఉపయోగించాలి..ప్రోటీన్స్(Proteins)ఇన్నిరోజులు రుచిగా ఉండే ఆహారంపైన దృష్టి పెట్టి ఉంటారు. కానీ, తినే ఆహారంలో ప్రోటీన్ తక్కువ ఉంటే కండరాలకు వేగంగా నష్టం వాటిల్లడమే కాదు రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందుకని నట్స్, గుడ్లు, మొక్కల నుంచి లభించే ప్రోటీన్లు గల ఆహారాన్ని భోజనంలో చేర్చండి.తరచూ నీళ్లుడీహైడ్రేషన్ ప్రభావాలు చర్మం సాగే గుణం, అజీర్తి, శక్తి స్థాయిలపై పడుతుంది. దాహం వేయడం అనే సంకేతాలు వయస్సుతోపాటు తగ్గుతుంటాయని గ్రహించి, తరచూ నీళ్లు తాగుతుండాలి.హాయిగొలిపే నిద్రనిద్రలేమి జీర్ణక్రియ, మానసిక స్థితి, జ్ఞాపశక్తిపైన ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో మొబైల్, టీవీ స్క్రీన్ల వల్ల అర్ధరాత్రి తర్వాత నిద్రకు ఉపక్రమించేవాళ్లే ఎక్కువ. ఈ జాబితాలో మీరుంటే, స్క్రీన్లను త్వరగా కట్టిపెట్టి రోజూ 6–8 గంటల సమయాన్ని నిద్రకు కేటాయించండి. రాత్రివేళ కెఫీన్ వంటి పానీయాలకు దూరంగా ఉంటే నిద్ర లేమి సమస్య తలెత్తదు.అభిరుచులుఈ వయసులో తలెత్తే మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా డిప్రెషన్‌ని విస్మరిస్తే అవి దీర్ఘకాలం నష్టం జరగవచ్చు. అందుకని మానసిక శ్రేయస్సును ప్రోత్సహించే శ్రద్ధ, అభిరుచుల కోసం సమయం కేటాయించుకోవాలి. (చదవండి: 'యూపీఎస్సీ చాట్ భండార్'..నాటి స్వాతంత్య్ర సంగ్రామాన్ని..!) -
‘సోషల్’ ఘోషలో స్నేహమే సమ్మోహనం
‘చరిత్రని మరచిపోని వాళ్ళు.. ఆ పొరపాట్లు కచ్చితంగా మళ్ళీ చేస్తారు’ అని ఎవరో పెద్దమనిషి అన్నాట్ట. గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి మన మనసు సృష్టించే భ్రమలే అనుకున్నా.. గతం గుర్తుంచుకోవడం మంచిదే. కొత్త భ్రమల్ని, అపోహల్ని సృష్టించుకోకుండా అది మనల్ని అదుపులో పెడుతుంది.ప్రతి సంవత్సరాంతంలో ఆ సంవత్సరం మనం ఏం సాధించాం, శోధించాం అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. కొత్త సంవత్సరం కేవలం ఓ తారీఖు మారటమే అని హేతువాదులన్నా.. అదేదో కొత్తప్రారంభం అనుకోవడం మనకో ఉత్సాహాన్నిస్తుంది. అందుకే కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆశయాలు, ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం. వాటిలో ఎన్ని అమలు చేస్తాం? ఎన్ని సాధిస్తాం? అనేది మళ్లీ ఆ సంవత్సరాంతంలో బేరీజు వేసుకుంటాం. ఈ చక్రం కొంత సరదాగా ఉంటుంది. కొంత నిజంగా ఉపయోగపడుతుంది.నా వరకూ నాకు ‘2023’ ఒక విచిత్రమైన సంవత్సరం. 2018లో కోవిడ్‌కి ముందు ‘సమ్మోహనం’ థియేటర్లలో విడుదలై ఘనవిజయాన్ని అందుకున్న తర్వాత, కోవిడ్‌లో 2020లో ఓటీటీలో విడుదలైన ‘వి’, ఆ తర్వాత 2022లో థియేటర్లలో విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నన్ను కొంత గజిబిజికి గురి చేశాయి. ‘వి’ మిశ్రమ ఫలితాలు, ‘ఆ అమ్మాయి..’ వైఫల్యం నా కళా దృక్పథాన్ని గట్టిగా కుదిపాయి. అయితే ఆ సమయంలో సద్విమర్శకులు, శ్రేయోభిలాషులు కొన్ని విషయాలని గట్టిగా విమర్శిస్తూనే, కొన్ని విషయాలలో నాకు అండగా నిలిచి, నా అభిరుచిని బలపర్చారు. 2024లో మళ్లీ ఆత్మస్థైర్యంతో అడుగిడేలా చేశారు. నా 2023 అనుభవాలు 2024 లో నా నిర్ణయాలని గాఢంగా కానీ, ప్రొడక్టివ్ గా కానీ ప్రభావితం చేశాయి అనిపిస్తోంది.గతమైనా, వర్తమానమైనా, భవిష్యత్తైనా మనల్ని నిలబెట్టేది మన స్నేహితులు. నిష్కర్షగా, ద్వేషరహితంగా మన జీవితాన్ని మనకి ప్రతిబింబించగలిగే నిజమైన స్నేహితులు. అందుకే ఈ రోజుల్లో ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఎగసిపడుతున్న అకారణ ద్వేషం, నెగిటివిటీ, సంచలనవాదం, పోటీతత్వం, వేలంవెర్రి సొంతడబ్బాల మధ్య నిజమైన స్నేహితుల్ని వెతుక్కోవడమే కొత్త సంవత్సరంలో మన నిర్ణయం, ఆశయం కావాలి. ఈ యూట్యూబ్ ట్రోల్స్, ఇన్‌స్టా రీల్స్, గొడవలు, అరుపులు, దైనందిన జీవితపు రణగొణధ్వని మధ్య నిజమైన నిష్కల్మషమైన స్నేహాన్ని వెతుక్కుని పట్టుకోవడం కష్టమే. ఉన్న స్నేహితుల్లో ఎవరు హితులో, ఎవరు శత్రువులో తెలుసుకుని, శత్రువుల్ని పాము కుబుసం విడిచినట్టు విడిచి కొత్త సంవత్సరంలో సరికొత్త సహచర్య సౌందర్యంలో ముందుకు వెళ్లడమే ఆశయం కావాలి. నిజానికి ప్రతి సంవత్సరం ఈ నిర్ణయాన్ని మళ్లీ మళ్లీ కొత్తగా తీసుకోవాలి. మన స్నేహసంపదని నలుగురికి పంచి, మన స్నేహిత సంపదని ప్రతి సంవత్సరం పెంచుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, లార్జర్ దాన్ లైఫ్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాంటి నూతన ఆవిష్కారాలు, భావనలూ, ప్రచారాల నుండి మనల్ని మనం సంరక్షించుకోవాలంటే మంచి స్నేహితులే మనకి దిక్కు.2024లో ప్రతి సినిమాలో దాదాపు హీరో అంటే ఊచకోతకి మారుపేరయ్యాడు. నోట్లోంచి గొప్పగొప్ప ఉదాత్తమైన మానవత్వపు ఉపన్యాసాలిస్తూనే, రెండు చేతుల్తో వందలమందిని చంపుతున్నాడు. సున్నితమైన హాస్యం, ప్రేమ, సన్నిహితమైన సంభాషణలు, మానవ సంబంధాలు ట్రెండ్ కాదనే దుష్ప్రచారం మొదలై, బలం పుంజుకుంటోంది. ఈ సమయంలో ఈ కొత్త సంవత్సరంలో మనం ఆ ఒరవడికి కొంత అడ్డుకట్ట వేసి, మామూలు మనుషుల మానవత్వపు గుబాళింపు, తోటి మనిషి ఆనందాన్ని, అభ్యుదయాన్ని, కోరుకునే కొత్తరకం స్నేహితులని వెతుక్కుందాం. అలాంటి సరికొత్త కథానాయకుల్ని సృష్టిద్దాం, ఆదరిద్దాం. కొత్త సంవత్సరం కేవలం ఓ తారీఖు మారటమే అని హేతువాదులన్నా.. అదేదో కొత్తప్రారంభం అనుకోవడం మనకో ఉత్సాహాన్నిస్తుంది. అందుకే కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆశయాలు, ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం. – ఇంద్రగంటి మోహన కృష్ణ, సినీ దర్శకుడు -
ఆ దేశాల్లో న్యూ ఈయర్కి ఎలా స్వాగతం పలుకుతారో తెలుసా..!
కొత్త సంవత్సరం వేడుకలను కోలాహలంగా జరుపుకోవడం చాలాకాలంగా కొనసాగుతోంది. సంవత్సర ఆరంభ దినాన పాత అలవాట్లను వదిలేస్తామని కొత్తగా తీర్మానాలు చేసుకోవడం, కొత్త డైరీలను ప్రారంభించడం, కొత్త సంవత్సరం సందర్భంగా కేకు కోసి, బంధుమిత్రులతో పంచుకోవడం, ఆత్మీయులతో కలసి విందు వినోదాలు జరుపుకోవడం, పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడం వంటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్ధతులే! కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరం సందర్భంగా పాటించే ప్రత్యేక ఆచారాలు, పద్ధతులు కూడా ఉన్నాయి. ఇవి కొంత వింతగా ఉంటాయి. ఇలాంటి వింత ఆచారాల గురించి, కొత్త సంవత్సరం ముచ్చట్లు గురించి తెలుసుకుందాం.టమాలీల కానుకఆత్మీయులకు ఇంట్లో వండిన టమాలీలను కానుకగా ఇవ్వడం మెక్సికన్ల ఆచారం. టమాలీ స్పానిష్ సంప్రదాయ వంటకం. టమాలీల తయారీలో మొక్కజొన్న పిండితో పాటు కూరగాయల ముక్కలు, మాంసం, సుగంధద్రవ్యాలు ఉపయోగిస్తారు. కొత్త సంవత్సరం జరుపుకొనే విందు కార్యక్రమాల్లో ఈ టమాలీలను స్థానికంగా ‘మెనుడో’ అని పిలుచుకునే సూప్‌తో కలిపి వడ్డిస్తారు. మెక్సికన్లు టమాలీలను అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. పన్నెండు ద్రాక్షలుడిసెంబర్ 31న అర్ధరాత్రి పన్నెండు గంటలు కొడుతుండగా, కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే వేళ ఒక్కొక్కరు పన్నెండు ద్రాక్షలను ఆరగించడం స్పానిష్ ఆచారం. స్పెయిన్‌లో మాత్రమే కాదు, స్పానిష్ ప్రజలు ఎక్కువగా నివసించే లాటిన్ అమెరికా దేశాల్లోను, కరీబియన్ దీవుల్లోను ఈ ఆచారాన్ని తప్పనిసరిగా పాటిస్తారు. పన్నెండు ద్రాక్షలను కొత్త సంవత్సరంలోని పన్నెండు నెలలకు సంకేతంగా భావిస్తారు. స్పెయిన్‌లోని అలకాంటీ ప్రాంతానికి చెందిన ద్రాక్షతోటల యజమానులు 1895లో ఈ ఆచారాన్ని ప్రారంభించారు. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభం నాటికి ఈ ఆచారం స్పానిష్ ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి గడియారం పన్నెండు గంటలు కొడుతుండగా, ఒక్కో గంటకు ఒక్కో ద్రాక్ష చొప్పున పన్నెండు ద్రాక్షలు తినే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. స్పానిష్ ప్రజలు ఈ తంతు తర్వాతనే కేకు కోయడం, బాణసంచా కాల్చడం వంటి సంబరాలు జరుపుకుంటారు.ద్వారానికి ఉల్లిపాయలుకొత్త సంవత్సరం సందర్భంగా గ్రీకు ప్రజలు చర్చిలలో ప్రార్థనలు జరిపి, ఇళ్లకు చేరుకున్న తర్వాత, ఇళ్ల ప్రవేశ ద్వారాలకు, గుమ్మాలకు ఉల్లిపాయలను వేలాడదీస్తారు. ఉల్లిపాయలను ఇలా వేలాడదీయడం వల్ల ఇంట్లోని వారికి ఆయురారోగ్య వృద్ధి, వంశాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఇలా వేలాడదీసిన ఉల్లి΄పాయలను మరునాడు వేకువ జామునే తొలగిస్తారు. ద్వారాల నుంచి తొలగించిన ఉల్లిపాయలతో ఇంట్లో నిద్రిస్తున్న పిల్లల నుదుటికి తట్టి, వారిని నిద్రలేపుతారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు దృష్టిదోషాలు తొలగిపోతాయని వారి నమ్మకం.సోబా నూడుల్స్‌తో ప్రారంభంకొత్త సంవత్సరం రోజున జపాన్‌లో వేడి వేడి సోబా నూడుల్స్ తింటారు. ఈ ఆచారాన్ని జపానీస్ ప్రజలు పన్నెండో శతాబ్ది నుంచి కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పొడవాటి ఈ నూడుల్స్‌ను కొరికి తినడం వల్ల పాత ఏడాదిలోని చెడును కొరికి పారేసినట్లేనని జపానీస్ ప్రజలు భావిస్తారు. వేడి వేడి సూప్‌లో ఉడికించిన సోబా నూడుల్స్ తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుందని, శీతకాలంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని పురాతన జపానీస్ పాకశాస్త్ర గ్రంథాలు చెబుతుండటం విశేషం.అన్నీ గుండ్రమైనవేకొత్త సంవత్సరం సందర్భంగా ఫిలిప్పీన్స్ ప్రజలు గుండ్రని వస్తువులను సేకరించడాన్ని, గుండ్రని డిజైన్లు ఉన్న దుస్తులు ధరించడాన్ని, గుండ్రని పండ్లు, ఆహార పదార్థాలు తినడాన్ని శుభప్రదంగా భావిస్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా గుండ్రంగా ఉండే పుచ్చకాయలు, యాపిల్, ద్రాక్ష, కివీ, దానిమ్మ, నారింజ, బత్తాయి వంటి పండ్లను, గుండ్రంగా ఉండే డోనట్స్, కుకీస్, గుడ్లు తింటారు. అలాగే, గుండ్రంగా ఉండే నాణేలను సేకరించి దాచుకుంటారు. గుండ్రంగా ఉండే లాకెట్లను ధరిస్తారు. గుండ్రమైన వస్తువులను పరిపూర్ణమైన జీవితానికి సంకేతంగా భావిస్తారు. కొత్త సంవత్సరం రోజున అన్నీ గుండ్రంగా ఉండేటట్లు చూసుకుంటే జీవితంలో పరిపూర్ణత సాధించగలుగుతామని వీరి విశ్వాసం.కొత్త సంవత్సరం కానుకలుకొత్త సంవత్సరం సందర్భంగా ఆత్మీయులకు కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం చాలా చోట్ల ఉన్న పద్ధతే అయినా, జర్మనీలో మాత్రం దీనిని తప్పనిసరి ఆచారంగా పాటిస్తారు. జర్మన్లు కొత్త సంవత్సర వేడుకలకు హాజరైన తమ ఆత్మీయులకు కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ కానుకల్లో పుస్తకాలు, పెన్నులు వంటి సర్వసాధారణమైన వస్తువుల నుంచి ఖరీదైన వజ్రాభరణాల వంటివి కూడా ఉంటాయి. జర్మన్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూనే, షాంపేన్ లేదా స్పార్మింగ్ వైన్‌ను రుచి చూస్తారు. దీనివల్ల సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుందని వారి నమ్మకం. జర్మన్లకు మరో వింత ఆచారం కూడా ఉంది. కొత్త సంవత్సరం సందర్భంగా చిన్న చిన్న సీసపు విగ్రహాలను కరిగించి, కరిగిన సీసాన్ని నీట్లోకి పోస్తారు. నీటిలో ఆ సీసం సంతరించుకునే ఆకారాన్ని బట్టి, కొత్త సంవత్సరంలో జీవితం ఎలా ఉండబోతుందో జోస్యం చెబుతారు. ధవళవస్త్ర ధారణకొత్త సంవత్సరం వేడుకల్లో బ్రెజిల్ ప్రజలు ధవళవస్త్రాలను ధరిస్తారు. బ్రెజిల్లో జరిగే కొత్త సంవత్సరం వేడుకల్లో ఎక్కడ చూసినా, తెలుపు దుస్తులు ధరించిన జనాలే కనిపిస్తారు. సంవత్సర ప్రారంభ దినాన తెలుపు దుస్తులను ధరించడం వల్ల సంతవ్సరమంతా ప్రశాంతంగా, సంతృప్తికరంగా గడుస్తుందని బ్రెజిలియన్ల నమ్మకం. తెలుపు దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ్ర΄ార్థనలు జరుపుతారు. అనంతరం కొత్త సంవత్సరం వేడుకలను విందు వినోదాలతో ఆర్భాటంగా జరుపుకుంటారు.దిష్టిబొమ్మల దహనంఆఫ్రికన్ దేశమైన ఈక్వడార్‌లో కొత్త సంవత్సరం సందర్భంగా ఇళ్ల ముందు వీథుల్లో దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. పాత కాగితాలు, కట్టెల పొట్టు, చిరిగిన దుస్తులు నింపి, మానవాకారాల్లో దిష్టిబొమ్మలను తయారు చేస్తారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి పన్నెండు గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఈ దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ దిష్టిబొమ్మలను గడచిన సంవత్సరంలో ఎదురైన కష్టాలకు, నష్టాలకు, దురదృష్టాలకు సంకేతంగా భావిస్తారు. వీటిని తగులబెట్టడం ద్వారా కొత్త సంవత్సరంలో అదృష్టం కలసివస్తుందని నమ్ముతారు. ఇంకొన్ని వింత ఆచారాలుకొత్త సంవత్సరానికి సంబంధించి ఇంకొన్ని వింత ఆచారాలు కూడా ఉన్నాయి. ఐర్లండ్‌లో ప్రజలు బ్రెడ్ స్లైస్‌తో ఇంటి తలుపులను, కిటికీలను, గోడలను కొడతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దుష్టశక్తులు పారితాయని నమ్ముతారు. ఆచార సంప్రదాయాలు ఎలా ఉన్నా, కొత్త సంవత్సరం అంటేనే ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త సంరంభం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆల్ హ్యాపీస్ 2025పాత్రల మోతతో స్వాగతంకొత్త సంవత్సరానికి ఇంగ్లండ్, ఐర్లండ్లలోని కొన్ని ప్రాంతాల ప్రజలు విచిత్రంగా స్వాగతం పలుకుతారు. ఇంట్లోని గిన్నెలు, మూకుళ్లు, తపేలాలు వంటి వంటపాత్రలపై గరిటెలతో మోత మోగిస్తూ చేసే చప్పుళ్లతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. వంట΄ాత్రలను మోగిస్తూ రణగొణ ధ్వనులను చేయడం వల్ల ఇంట్లోని దుష్టశక్తులు పారితాయని వారి నమ్మకం. తొలుత ఈ ఆచారం ఐర్లండ్‌లో ప్రారంభమైందని చెబుతారు. తర్వాతి కాలంలో ఐర్లండ్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు కూడా ఈ ఆచారం వ్యాపించింది.గుమ్మడి సూప్ స్వేచ్ఛా చిహ్నంహైతీలో కొత్త సంవత్సరాన్ని గుమ్మడి సూప్ సేవించడంతో రంభిస్తారు. వీరికి జనవరి1 స్వాతంత్య్ర దినోత్సవం కూడా! గుమ్మడి సూప్‌ను హైతీయన్లు ‘సూప్ జోమో’ అంటారు. స్వాతంత్య్రానికి ముందు హైతీని పాలించిన స్పానిష్, ఫ్రెంచ్ వలస పాలకుల హయాంలో గుమ్మడి సూప్‌ను రుచి చూడటానికి స్థానిక నల్లజాతి ప్రజలకు అనుమతి లేదు. అందుకే స్వాతంత్య్రం పొందిన తర్వాత హైతీయన్లు స్వేచ్ఛా చిహ్నంగా గుమ్మడి సూప్ సేవనంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం ఆచారంగా మార్చుకున్నారు. -
New Year 2025 : ఒక్కో హోటల్ ఒక్కో తీరు..ఆహా.. ఏమి రుచి!
సాక్షి, సిటీబ్యూరో: వచ్చేది ఏడాది ముగింపు సెలబ్రేషన్స్.. ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి పండగ.. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు వివిధ హోటల్ యాజమాన్యాలు ప్రత్యేక రుచులను సిద్ధం చేస్తున్నాయి. సాధారణ రెసిపీలకు భిన్నంగా సంప్రదాయ, గ్రామీణ, స్థానిక, అంతర్జాతీయ వంటకాలను మరోమారు పరిచయం చేస్తున్నాయి. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ఆహారం వేగంగా తినడం, పానీయాలు త్వరగా తాగడం, ఇతర వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నాయి. ఈ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి జ్ఞాపకాలను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం. ఒక్కో హోటల్లో ఒక్కో రకం.. మినీ భారత దేశంగా ఖ్యాతిగాంచిన భాగ్యనగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 1.5 కోట్ల మంది జనాభా నివాసం ఉంటున్నారు. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా విభిన్నమైన ఆహారపు అలవాట్లు వారి సొంతం. ఒక్కో ప్రాంతంలో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఒక్కో విధంగా ఉంటాయి. దీనికి అనుగుణంగానే నగరంలోని పలు హోటల్స్ సైతం ప్రాంతీయ అభిరుచులకు తగ్గట్లుగా ప్రత్యేకించి చెఫ్‌లను తెప్పించి వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో హోటల్లో ఒక్కో రకమైన మెనూ ప్రత్యక్షం అవుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకించి బర్గర్ ఈటింగ్, పానీపూరీ, జూస్ స్పీడ్ డ్రింకింగ్ వంటి పోటీలను నిర్వహిస్తున్నారు. -
అంతరిక్షంలో ఉన్నా మాకూ సెలవు కావాలి
‘సెలవు కావాలి’. పండుగలు, పెళ్లిళ్లు, ముఖ్యమైన సందర్భాల్లో ఉద్యోగి నోట వినిపించే మొట్టమొదటి మాట ఇది. ప్రపంచదేశాలు అన్ని చోట్లా ఇదే వినతి. ఇప్పుడు ఈ విన్నపం భూమిని దాటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికీ చేరింది. క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల కోసం తాము కూడా విధులకు గైర్హాజరై సెలవు పెడతామని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లోని ఆస్ట్రోనాట్స్, కాస్మోనాట్స్ తెగేసి చెప్పారు. వీళ్ల సెలవు అభ్యర్థనకు ఇప్పటికే ఆమోదముద్ర పడిందోఏమో క్రిస్మస్, కొత్త ఏడాది సంబరాలకు వ్యోమగాములంతా సిద్ధమైపోయారు. ప్రత్యేకంగా క్రిస్మస్, న్యూ ఇయర్ విందు కోసం ఇప్పటికే ప్యాక్ చేసి పంపించిన ఆహారపదార్థాలు తినేందుకు నోరూరుతోందని అక్కడి భారతీయమూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ చెప్పారు. ఐఎస్ఎస్లోని ఏడుగురు వ్యోమగాముల బృందం క్రిస్మస్, జనవరి ఒకటిన తమ రోజువారీ శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలను కాసేపు పక్కనబెట్టి సంబరాల్లో తేలిపోతారని తెలుస్తోంది. తాజాగా ఐఎస్ఎస్కు వచి్చన స్పేస్ఎక్స్ డ్రాగన్ 2,700 కేజీల కార్గోలో వ్యోమగాముల కోసం విడి విడిగా వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల నుంచి గిఫ్ట్‌లు వచ్చాయి. స్పెషల్ మీల్స్ తింటూ కుటుంబంతో వీడియోకాల్స్ మాట్లాడుతూ వ్యోమగాములు సరదాగా గడపనున్నారు. ఇప్పటికే హాలిడే మూడ్‌ను తెస్తూ సునీత, డాన్ పెటిట్లు శాంటా టోపీలు ధరించిన ఫొటో ఒకటి తాజాగా షేర్చేశారు. బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఐఎస్ఎస్కు వచి్చన సునీతా విలియమ్స్ తాము వచ్చిన వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా తిరిగి భూమికి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. నెలల తరబడి అక్కడే ఉండిపోయిన సునీతకు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కాస్తంత ఆటవిడుపుగా ఉండబోతున్నాయి. – వాషింగ్టన్ -
‘మత్తు’రహిత వేడుకలు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర (2025) వేడుకలు మాదకద్రవ్య రహితంగా జరిగేలా చూడటమే లక్ష్యంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) పటిష్ట చర్యలు ప్రారంభించింది. వేడుకల్లో మత్తుపదార్థాల వినియోగాన్ని కట్టడి చేసేందుకు టీజీఏఎన్‌బీ బృందాలు నిఘా పెంచాయి. తనిఖీలు ముమ్మరం చేయడంతోపాటు మత్తు పదార్థాలు విక్రయించే, సరఫరా చేసే వారిపై ఫోకస్ పెంచినట్టు అధికారులు తెలిపారు. రంగంలోకి 266 పోలీస్ స్నిఫర్ డాగ్స్ స్థానిక పోలీస్, ఎక్సైజ్, టీజీఏఎన్‌బీ అధికారుల సోదాలు ముమ్మరం కావడంతో డ్రగ్స్, గంజాయి ముఠాలు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. అధికారులకు పట్టుబడకుండా వాహనాల్లోని రహస్య ప్రదేశాల్లో దాచి డ్రగ్స్, గంజాయి రవాణా చేస్తున్నాయి. ట్రాక్టర్లు, బస్సుల్లో, సీఎన్జీ వాహనాల్లోని సిలిండర్లలో, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనిపించేలా ఉండే డబ్బాలలో..ఇలా రకరకాల పద్ధతులలో పోలీసుల కన్నుగప్పి రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలను పోలీసులు గతంలో స్వా«దీనం చేసుకున్నారు. నిరుద్యోగులైన యువతుల్ని కూడా డ్రగ్స్ రవాణా కోసం మాఫియా వినియోగిస్తోంది. ఇలాంటి ముఠాలపై పటిష్టమైన నిఘా వేయడంతో పాటు ఇన్ఫార్మర్ వ్యవస్థతో మత్తు ముఠాల ఆటకు టీజీఏఎన్‌బీ కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ యూనిట్లలో కలిపి 266 పోలీసు జాగిలాలకు మాదకద్రవ్యాల గుర్తింపు శిక్షణ ఇచి్చంది. వాటి ద్వారా డ్రగ్స్ రవాణాను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల వరంగల్ రైల్వేస్టేషన్లో స్నిఫర్ డాగ్‌తో తనిఖీ చేస్తుండగా..అక్కడికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఒక ఇంటి మొదటి అంతస్తులో గంజాయి మొక్కలను కుండీలలో పెంచుతున్న విషయాన్ని ఈ స్నిఫర్ డాగ్ గుర్తించిందని చెప్పారు. టీజీఏఎన్‌బీ తీసుకుంటున్న చర్యలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రశంసించినట్టు తెలిపారు. ఇటీవల గుర్తించిన మరికొన్ని కేసులు» గంజాయి చాక్లెట్లతో స్కూలు విద్యార్థులను, దినసరి కూలీలను టార్గెట్ చేస్తున్న ముఠాలను రాజస్తాన్ వరకు వెళ్లి పట్టుకోవడమే కాకుండా తయారు చేస్తున్న ఫ్యాక్టరీని కూడా అక్కడి అధికారుల సహాయంతో టీజీఏఎన్‌బీ మూయించగలిగింది. » ఇటీవలే 120 కిలోల ఎఫిడ్రెన్ (ఎండీఎంఏ తయారీకి ఉపయోగించే ముడి సరుకు) తయారీ కేంద్రాన్ని గుర్తించడంలో సఫలీకృతమైంది.» ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి ఈనెల 20 వరకు 641 కిలోల గంజాయి, 15 కిలోల గంజాయి చాక్లెట్స్ , 1600 గ్రాముల హాష్ ఆయిల్, 1383 గ్రాముల ఎండీఎంఏ, కిలో ఓపియం, 115 గ్రాముల చరాస్, 53 కిలోల పాపి స్ట్రా, 44 గ్రాముల హెరాయిన్‌ను సీజ్ చేశారు. » మొత్తం 148 కేసులను రిజిస్టర్ చేయించడంతో పాటు స్థానిక పోలీసులతో కలిసి 315 మంది నేరస్తులను అరెస్టు చేశారు.» ఈనెల 1 నుంచి 20 వరకు మొత్తం రూ.4.45 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను సీజ్ చేశారు. » రూ.200 కోట్ల పైగా విలువ చేసే డ్రగ్స్‌ను పర్యావరణహిత పద్ధతులలో కాల్చివేశారు. మత్తు కేసుల్లో ఇరుక్కోవద్దు నూతన ఏడాది వేడుకలను మీ కుటుంబ స భ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోండి. అంతే తప్ప మాదకద్రవ్యాల కేసుల్లో ఇరుక్కుని మీరు ఇబ్బందిపడి, మీ కుటుంబ సభ్యులను బాధ పెట్టకండి. మేము ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాకు సంబంధించి ఎటు వంటి సమాచారం ఉన్నా 1908 టోల్ ఫ్రీ నంబర్ లేదా 8712671111 నంబర్లో లేదా http://tganb.tspolice.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు. – సందీప్ శాండిల్య, డైరెక్టర్, టీజీఏఎన్‌బీ -
అర్ధరాత్రి 1 గంట వరకే కొత్త వేడుకలు
శివాజీనగర: ఇక వారం రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది, పాత ఏడాదికి వీడ్కోలు పలికి నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు నగరవాసులు వేడుకలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సంబరాల నిర్వహణకు బీబీఎంపీ, పోలీస్ శాఖ కొత్త నిబంధనలను రూపొందించాయి.సీసీ కెమెరాలు రెట్టింపు⇒ సామూహిక వేడుకలకు కేంద్ర బిందువైన బెంగళూరులోని ఎం.జీ.రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులలో సీసీ టీవీ కెమెరాలను పెంచుతారు. గత ఏడాది 300 సీసీ టీవీ కెమెరాలు ఉంటే, ఇప్పుడు 800 కు పెంచుతారు.⇒ సంబరాలను అర్ధరాత్రి 1 గంటలోగా ముగించాలి. రాత్రి 10 గంటల తరువాత ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులో వాహన సంచారం బంద్ చేస్తారు. బార్, పబ్‌లకు కూడా రాత్రి 1 గంటకు మూసివేయాలి.⇒ ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు మినహాయించి మిగతా చోట్లలో సంబరాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి. లౌడ్ స్పీకర్ డీజే వాడకం, టపాసులు పేల్చడానికి అనుమతి ఉండాలి. నిబంధనల ప్రకారం బారికేడ్లు, లైటింగ్‌ను అమర్చాలి.⇒ వేడుకల్లో జనాలకు అనారోగ్యం తలెత్తితే పోలీసులే వైద్యులతో చికిత్స చేయిస్తారు.⇒ పోలీసులు సూచించిన చోట వాహనాలను పార్క్ చేయాలి. మహిళల భద్రత కోసం ఎక్కువ సంఖ్యలో మహిళా పోలీసుల ఏర్పాటు. -
న్యూ ఇయర్ ఎఫెక్ట్.. పబ్బులపై నిఘా..
-
శీతల ప్రయాణం..
కొద్ది రోజుల క్రితం సాధారణ స్థాయిలో ఉన్న విమానయాన ధరలు అమాంతం రెట్టింపయ్యాయి. ముఖ్యంగా డిసెంబర్ 15 నుంచి 31 తేదీల్లో గతంతో పోల్చితే రెండింతలు, మూడింతల మేర పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నగర వాసుల్లో ప్రయాణాల పట్ల ఉన్న ఆసక్తే దీనికి కారణం. కాగా ప్రస్తుత నెలల్లో వరుసగా క్రిస్మస్, ఇయర్ ఎండ్, న్యూఇయర్, సంక్రాంతి వంటి పండుగల నేపథ్యంలో నగరవాసులకు భారీగా సెలవులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ట్రావెలింగ్ మంత్‌గా డిసెంబర్‌ను ఎంచుకుంటున్నారు. ప్రతి యేడాదీ డిసెంబర్ నెలలో ఏదో ఒక టూర్ వేయడం అందివచ్చిన సెలవులను వినియోగించుకోవడం నగర వాసులకు అలవాటే. ఇందు కోసం ముందస్తుగానే నగరంలోని ప్రయాణ ప్రేమికులు వారి ప్రయాణ గమ్యస్థానాలకు మార్గాలను సుగమం చేసుకున్నారు. యువత, టెకీలు ట్రావెలింగ్ ప్లాన్స్‌లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా డొమెస్టిక్ ప్రయాణాలు ఇప్పటికే సోల్డ్ ఔట్ బోర్డ్పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో.కొందరు ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ టెకీలు యేడాదంతా వారి సెలవులను వినియోగించకుండా తమ తమ విధులు నిర్వహిస్తుంటారు. దీంతో పాటు మరికొందరు టెకీలకు, కాల్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ ఉద్యోగులకూ డిసెంబర్ నెలలో భారీగా సెలవులు ఉంటాయి. దీంతో ఆయా సెలవుదినాలను డిసెంబర్ డెస్టినేషన్ కోసమే వినియోగిస్తుంటారు.. నగరంలో విస్తరిస్తున్న ఐటీ ట్రెండ్‌తో గత కొన్నేళ్లుగా ట్రావెలింగ్ రంగంలోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు మిగిలిపోయిన సెలవులు, మరోవైపు నగరంలోని విదేశాలకు చెందిన గ్లోబల్ కంపెనీల క్రిస్మస్ లీవ్స్ దీనికి ప్రామాణికం అవుతున్నాయి.వీటిని ఎంజాయ్ చేయడానికి ఇప్పటికే యుద్ధప్రాతిపధికన టీమ్ హెడ్లకు మెయిల్స్ పెట్టేయడం, ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించడం, పర్యాటక ప్రాంతాల్లో విడిది, విందు, వినోదం తదితరాలకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇది కొత్తేం కాకపోయినప్పటికీ.. ఈ కల్చర్ ఈ ఏడాది మరింత పుంజుకోవడం విశేషం. సాధారణ రోజుల్లో 4 నేల నుంచి 9 వేల వరకూ ఉండే దేశీయ విమాన చార్జీలు ప్రస్తుతం 14 నుంచి 20 వేలకు పైగా కొనసాగడం ఈ సంస్కృతి ప్రభావానికి నిదర్శనం. కన్యాకుమారి, కేరళ మొదలు.. మనాలి, డార్జిలింగ్ వంటి శీతల ప్రదేశాలకు బయలు దేరుతున్నారు. మరికొందరైతే స్విస్ దేశాలు, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ వంటి విదేశాలకు బుకింగ్‌లు మొదలెట్టారు. ఏడాదికి వీడ్కోలు.. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పడం, నూతన ఏడాదికి నూతనోత్సాహాన్ని పొందడం కోసం కూడా ట్రావెలింగ్ డెస్టినేషన్లనే ఎంచుకుంటున్నారు ఈ తరం యువత. ఇయర్ ఎండ్ వేడుకలకైతే గోవాలాంటి మ్యూజికల్ నైట్స్ కోసం పరితపిస్తున్నారు నగర వాసులు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు వేసిన కొత్త రైలు సేవలు పొందడానికి ముందస్తుగానే బెర్త్ కరారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యంగా బుక్ చేస్తే ఈ చార్జీలు మరింత పెరిగిపోతాయని ఇప్పటికే చాలా టూర్స్ ప్లానింగ్, బుకింగ్ పూర్తయ్యాయని గూగుల్ చెబుతుంది. ఈ వేదికల్లో అవకాశం లేకపోతే ప్రైవేటు ట్రావెల్స్‌ను సైతం ఆశ్రయిస్తూ, సెల్ఫ్ డ్రైవింగ్‌కు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంతో పాటు దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లోని ట్రావెలింగ్ ఏజెన్సీలు, ఈవెంట్ ఆర్గనైజర్లు ముందస్తు పండగలు చేసుకుంటున్నారు.గోవా పార్టీలకు... యేడాది చివరి వేడుకలకు నగర యువత భారీగా ఆసక్తి చూపిస్తోంది. వీరిలో అత్యధికులు వెళ్లే ఏకైక డెస్టినేషన్ మాత్రం గోవానే. ఎందుకంటే..నగర కల్చర్‌లో భాగంగా పంబ్ పారీ్టలు, లైవ్ కాన్సర్ట్, డీజే మ్యూజిక్ వంటి ట్రెండ్స్‌ని ఆస్వాదించే వారు, ప్రకృతిని కోరుకునే వారు వేరు వేరుగా ఈస్ట్ గోవా, నార్త్ గోవాలను ఎంచుకుంటారు. తమకు అనుకూలమైన, అనువైన స్పాట్స్‌ను ముందస్తుగానే ఎంచుకుని అందుకు అనుగునంగా ప్రయాణాలకు టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో వైజాగ్, అరకు వ్యాలీ సైతం టాప్‌లోనే ఉన్నాయి.ఎతైన ప్రదేశాలకు.. ఇప్పటికే ఈ సీజన్లో దక్షిణాది రాష్ట్రాల్లోని కూర్గ్, ఊటీ, మున్నార్, వయనరాడ్, కొడైకెనాల్, ఇడుక్కి, యరక్కాడ్, కున్నూర్ వంటి హిల్ స్టేషన్స్‌కి భారీగా టికెట్లు బుక్ అయ్యాయని లోకల్ ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నామాట. దీంతోపాటు ఈ మధ్య కాలంలో మనాలి, డార్జిలింగ్, సిమ్లా, షిల్లాంగ్ వంటి చల్లటి ప్రకృతి ప్రాంతాలను ఆస్వాదించడానికి ఉవి్వళ్లూరుతున్నారు. ఈ ట్రిప్స్‌లో భాగంగానే నార్త్‌కు ఎక్కువగా ప్రయాణమవుతున్నారు. అంతేకాకుండా సాంస్కృతిక వైవిధ్యాన్ని తిలకించడానికి కేరళ, ఊటీ వంటి ప్రదేశాలను వారి గమ్యస్థానాలుగా చేర్చుకున్నారు. -
న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్..
నాగోలు: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్‌ను అదుపులోకి తీసుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు వారి నుంచి రూ.1.15 కోట్ల విలువైన 53.5 కిలోల పాపిస్ట్రా, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు.. రాజస్థాన్‌కు చెందిన మంగిలాల్ భీశాయ్, మంగీలాల్ డాక, బీరా రామ్ నగరంలోని మీర్ పేట్, అశోక్ రెడ్డి కాలనీలో ఉంటూ స్టీల్ రేలింగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. వీరికి మధ్యప్రదేశ్‌కు చెందిన పింటు అలియాస్ మోహన్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించారు. మోహన్‌సింగ్ తాను మధ్యప్రదేశ్ నుంచి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తానని ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని చెప్పడంతో అందుకు వారు అంగీకరించారు. దీంతో మధ్యప్రదేశ్ వెళ్లిన వారు ముగ్గురు మోహన్‌సింగ్ వద్ద పాపి్రస్టాను కొనుగోలు చేసి రైల్లో నగరానికి తీసుకువచ్చారు. అశోక్ రెడ్డి నగర్‌లోని తన ఇంట్లో భద్రపరిచిన వారు దానిని బీఎన్‌రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన శంకర్ లాల్, కరీంనగర్లో ఉంటున్న శర్వాన్ ద్వారా నగరంలో అధిక ధరకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్‌పేట పోలీసులు ఆదివారం రాత్రి అశోక్ రెడ్డి నగర్‌లోని వారి ఇంటిపై దాడి చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 53.5 కిలోల పాపిస్ట్రా, మూడు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఒకరైన మంగీలాల్ 2023లో గంజాయి విక్రయిస్తూ హయత్‌నగర్ పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మోహన్ సింగ్, శంకర్ లాల్, శర్వాన్‌లను త్వరలో అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు. మాదక ద్రవ్యాలపై నిరంతర నిఘా.. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మాదకద్రవ్యాల నియంత్రణకు రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నామని, నగర శివార్లలోని రిసార్ట్‌ల యాజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీపీ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ . మురళీధర్,అడిషనల్ డీసీపీ షాకీర్ హుస్సేన్, ఇన్స్పెక్టర్లు కీసర నాగరాజు, భాస్కర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.