సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల రోజు నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. జూబ్లీహిల్స్‌లో ఆరు పబ్బులపై కేసులు నమోదు చేశారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు నడిచిన హలో, టార్,గ్రీన్ మంకిస్, మకవ్,లాస్ట్, జీనా పబ్బులపై కేసులు నమోదయ్యాయి.
నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను పబ్ నిర్వాహకులు లెక్కచేయలేదు. అధిక డీజే సౌండ్‌తో స్థానికులను ఇబ్బందిపెట్టినందుకు కూడా కేసు నమోదు చేశారు. భారీ శబ్ధాలు వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు. ఐపీసీ సెక్షన్ 188, 290, సీపీ చట్టం కింద కేసు నమోదైంది.
కాగా, కొత్త ఏడాదికి లిక్కర్ కిక్కు బాగానే ఎక్కింది. కొత్త సంవత్సర వేడుకల ప్రారంభమయ్యే రోజుతో పాటు రెండు రోజుల ముందు నుంచీ ఏకంగా రూ.620 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్‌షాపులకు చేరింది. డిసెంబర్ 31న ఆదివారం సెలవుదినం అయినా, మద్యం డిపోలు తెరచి ఉంచగా, రూ.127 కోట్ల విలువైన మద్యం షాపులకు చేరింది
డిసెంబర్ 30న రూ.313 కోట్లు, డిసెంబర్ 29న రూ.180 కోట్ల మద్యం డిపోల నుంచి వెళ్లిందని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా ప్రారంభమైన షాపుల్లో అమ్మకాల కోసం ఈ నెల మొదట్లోనే పెద్ద ఎత్తున లిక్కర్ చేరిందని, ఈ నేపథ్యంలో కొంత తగ్గుదల కనిపిస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: నుమాయిష్ 2024 ప్రారంభం.. మాస్క్ కంపల్సరీ!
Comments
Please login to add a commentAdd a comment