
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని ఇల్యూజన్ పబ్‌లో శనివారం రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు ఓ యువతిపై దాడి చేసి పొత్తి కడుపులో బూటు కాలితో తన్ని తీవ్రంగా గాయపరిచిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..పాతబస్తీకి చెందిన యువతి తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి శనివారం రాత్రి ఇల్యూజన్ పబ్‌కు వచ్చింది.
రాత్రి 12.40 గంటల సమయంలో ఆమె మాజీ ప్రియుడు ఓల్డ్ సిటీకే చెందిన ఎండీ ఆసిఫ్‌జానీ మద్యం సేవించి అక్కడికి వచ్చాడు. సదరు యువతి స్నేహితురాళ్లతో బర్త్‌డే వేడుకలు జరుపుకుంటుండగా అక్కడికి వచ్చిన ఆసిఫ్‌జానీ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దూషిస్తూ దాడి చేశాడు. దీంతో ఆమె స్నేహితురాళ్లతో కలిసి కిందకు పరుగులు తీయగా అక్కడికి కూడా వచి్చన ఆసిఫ్‌జానీ ఆమె పొత్తి కడుపులో బూటు కాలితో తన్నడమేగాక తీవ్రంగా కొట్టాడు.
అడ్డుకునేందుకు యతి్నంచిన ఆమె స్నేహితురాలిపై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. గతంలో ఆసిఫ్‌జానీ, తాను ప్రేమించుకున్నామని, కొద్ది రోజులు కలిసి తిరిగామని, అయితే అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నానని తెలిపింది. అయినా తనను వెంబడిస్తూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. జూబ్లీహిల్స్ పోలీసులు ఆసిఫ్‌జానీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment