pub
-
ఇల్యూజన్ పబ్‌లో యువతిపై దాడి
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని ఇల్యూజన్ పబ్‌లో శనివారం రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు ఓ యువతిపై దాడి చేసి పొత్తి కడుపులో బూటు కాలితో తన్ని తీవ్రంగా గాయపరిచిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..పాతబస్తీకి చెందిన యువతి తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి శనివారం రాత్రి ఇల్యూజన్ పబ్‌కు వచ్చింది. రాత్రి 12.40 గంటల సమయంలో ఆమె మాజీ ప్రియుడు ఓల్డ్ సిటీకే చెందిన ఎండీ ఆసిఫ్‌జానీ మద్యం సేవించి అక్కడికి వచ్చాడు. సదరు యువతి స్నేహితురాళ్లతో బర్త్‌డే వేడుకలు జరుపుకుంటుండగా అక్కడికి వచ్చిన ఆసిఫ్‌జానీ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దూషిస్తూ దాడి చేశాడు. దీంతో ఆమె స్నేహితురాళ్లతో కలిసి కిందకు పరుగులు తీయగా అక్కడికి కూడా వచి్చన ఆసిఫ్‌జానీ ఆమె పొత్తి కడుపులో బూటు కాలితో తన్నడమేగాక తీవ్రంగా కొట్టాడు. అడ్డుకునేందుకు యతి్నంచిన ఆమె స్నేహితురాలిపై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. గతంలో ఆసిఫ్‌జానీ, తాను ప్రేమించుకున్నామని, కొద్ది రోజులు కలిసి తిరిగామని, అయితే అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నానని తెలిపింది. అయినా తనను వెంబడిస్తూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. జూబ్లీహిల్స్ పోలీసులు ఆసిఫ్జానీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గచ్చిబౌలి ప్రిజం పబ్ లో కాల్పుల కలకలం
-
HYD: గచ్చిబౌలిలో కాల్పుల కలకలం
సాక్షి,హైదరాబాద్: నగరంలో ఐటీకి పేరుగాంచిన గచ్చిబౌలిలో శనివారం సాయంత్రం (ఫిబ్రవరి1) కాల్పలు కలకలం రేపాయి. ఇక్కడున్న ఒక పబ్‌కు వెళ్లిన పాత నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా సమాచారంతో పబ్‌కు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నేరస్తుడు తన వద్దనున్న తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. మొత్తం రెండు రౌండ్లు పాత నేరస్తుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పబ్‌లో పనిచేసే బౌన్సర్‌కు, కానిస్టేబుల్ వెంకట్రామ్‌రెడ్డికి గాయాలయ్యాయి. అయితే చివరకు ఆ పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నేరస్తుడు పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎవర్ గ్రీన్ పబ్ లో మహిళలతో అశ్లీల నృత్యాలు
-
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో పబ్ కల్చర్
-
‘తిరుపతి పవిత్రత మంటగలుస్తుంటే.. పవన్ ఎక్కడ?’
తిరుపతి, సాక్షి: కూటమి ప్రభుత్వ ఏలుబడిలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పవిత్రత మంటగలిసిపోతోందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచానూరు సమీపంలో పబ్ ను తలపించేలా నిర్వహించిన ఈవెంట్ చర్చనీయాంశమైన వేళ.. భూమన మీడియాతో మాట్లాడారు. మద్యంతో పాటు మాదకద్రవ్యాల వినియోగించారనే వార్తలు కలిచివేస్తున్నాయని అన్నారాయన. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో బుధవారం భూమన మీడియాతో మాట్లాడుతూ.. దేవదేవుడు కొలువైన తిరుపతిలో కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఇటువంటి దుష్టసంస్కృతికి బీజం పడింది. అధికార పార్టీ అండతోనే పబ్ తరహా ఈవెంట్ జరిగింది. గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న తిరుమల తిరుపతిలో పబ్ తరహా ఈవెంట్ల నిర్వహణ వెనుక అధికారపార్టీ అండదండలు ఉండటం ఆందోళనకరం.సనాతన ధర్మంను కాపాడేందుకు అవతరించిన పీఠాధిపతి పవన్ కల్యాణ్ ఈ ఘటనపై స్పందించాలి. డిప్యూటి సీఎం హోదాలో తిరుపతిలో ధర్మానికి జరుగుతున్న విఘాతంపై ఆయన తన దండంను బయటకు తీసి, కారకులపై చర్యలు తీసుకుంటాని ఆశిస్తున్నామని భూమన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నగరంలో మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. మద్యం దుకాణాలను ఉదయం ఏడుగంటలకు తెరుస్తూ, రాత్రి పది గంటలు దాటిన తరువాత కూడా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయాలను కూడా పాటించకుండా మద్యం దుకాణాలు, రెస్టారెంట్లను నిర్వహిస్తున్నా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చివరికి తిరుపతిలో మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిలతో నృత్యాలు, డీజే పేరుతో పాశ్చాత్యసంగీతాలతో తిరుపతి ఔచిత్యాన్నే ప్రశ్నించేలా ఘటనలు ప్రారంభమయ్యాయి అంటే దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.ధర్మాన్ని కాపాడేందుకు ఉద్యమంతిరుపతి పవిత్రత కోసం ప్రజలతో కలిసి వైయస్ఆర్ సిపి ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్దంగా ఉందని భూమన ప్రకటించారు. గతంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా నూతన సంవత్సరం అర్థరాత్రి జరిపే హంగామాను కూడా తిరుపతిలో జరగకుండా చర్యలు తీసుకున్నాం. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తరువాత ఆయన ఆదేశాలతోనే తిరుపతి పవిత్రతకు భంగం వాటిల్లే కార్యక్రమాలు జరుగుతుంటే, ఈ నగరాన్ని ఇక ఆ భగవంతుడే కాపాడాలి అని భూమన అన్నారు. -
చేయి తగిలిందని పోలీస్ మార్క్ కేసు!
గచ్చిబౌలి: పబ్‌లో చేయి తగిలిందని ఓ డాక్టర్ మీద కేసు నమోదు చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఫెనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని తబులా రసా పబ్‌కు ఓ ఐపీఎస్ ఆఫీసర్ భార్యతో కలిసి వెళ్లారు. అదే పబ్‌కు కొంత మంది డాక్టర్లు వెళ్లారు. ఐపీఎస్ భార్య వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మదీనాగూడకు చెందిన ఓ డాక్టర్ చేయి తగిలింది. పొరపాటు జరిగిందని సదరు డాక్టర్ ఆమెకు సారీ చెప్పారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆమె జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. ఆ తర్వాత క్షణాల మీద గచ్చిబౌలి పోలీసులు పబ్‌కు చేరుకున్నారు. సదరు డాక్టర్‌ను గచ్చిబౌ పీఎస్‌కు తరలించారు. నేను కావాలని చేయలేదని, యాదృచి్ఛకంగా జరిగిందని చెప్పినా పోలీసులు శాంతించలేదు. మద్యం ఎక్కువ తాగి అసభ్యంగా ప్రవర్తించాడా అనేది నిర్ధారించుకునేందుకు బ్రీత్ ఎనలైజర్ చేశారు. మద్యం అతిగా తాగలేదని తేలినట్లు సమాచారం. గంటల తరబడి స్టేషన్లోనే కూర్చోబెట్టారు. మరుసటి రోజు పబ్ నిర్వాహకులతో ఫిర్యాదు తీసుకొని ఆ డాక్టర్‌పై కేసు నమోదు చేసి, నోటీసు ఇచ్చి పంపించారు. మహిళలను కించపరిచే వ్యవహరించినా, అసభ్యంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కాని ఐపీఎస్ భార్య కావడంతో చిన్న విషయానికి పోలీసులు హంగామా చేశారనే ప్రచారం జరుగుతోంది. సామాన్యుల ఫిర్యాదుపైనా పోలీసులు ఇలానే వ్యవహరిస్తే బాగుండేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం తబులా రసా పబ్ కేసుపై నోరు మెదపడం లేదు. కేసు గురించి మాకు తెలియదని, కేవలం పబ్‌లలో తనిఖీలు మాత్రమే చేశామని గచ్చిబౌలి పోలీసులు బుకాయించడం గమనార్హం. -
హైదరాబాద్ పబ్బుల్లో తనిఖీలు.. డ్రగ్స్ పరీక్షలో 11 మందికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జోర పబ్బులో నార్కెటిక్ బ్యూరో పోలీసులు తనిఖీలు చేశారు. పబ్బులోని ఓ ఈవెంట్లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో 11 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్‌గా తేలడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్బు లోపలికి డ్రగ్స్ ఏ విధంగా చేరాయి? ఎవరు సరఫరా చేశారు? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. -
పబ్‌లో.. ఫస్ట్ టైమ్!
సాధారణంగా సిటీలో పబ్స్, క్లబ్స్‌లో కని/వినపడే డీజేలు, బ్యాండ్స్, సింగర్స్... ఎక్కువగా పాశ్చాత్య పోకడలకు ప్రతీకగా ఉంటారు. వెస్ట్రన్ మ్యూజిక్‌ని ఇష్టపడే యువతను మెప్పించడం వీరి వల్లే సాధ్యమని ఈవెంట్ మేనేజర్లు భావిస్తుండడం వల్ల ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఇటీవలే వీరి స్థానంలో హిందీ, తెలుగు సంగీతాన్ని అందించే బ్యాండ్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది.ఆ థోరణి మరింత బలపడి ఇప్పుడు ఏకంగా తెలుగు గాయనీ గాయకులకు కూడా పబ్స్ రెడ్ కార్పెట్ పరుస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో వియ్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితురాలైన ప్రముఖ గాయని గీతా మాధురి తన సొంతంగా సమకూర్చుకున్న బ్యాండ్‌తో కలిసి తొలిసారి నగరంలోని ప్రిజ్మ్ పబ్‌లో శుక్రవారం సాయంత్రం సోలో ప్రదర్శన ఇవ్వనున్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రపంచాన్నే మన పాట పాలిస్తోంది.. ఇక పబ్స్‌లో తెలుగు పాట వినిపించడంలో ఆశ్చర్యమేముంది? అంటున్నారు ప్రముఖ నేపథ్యగాయని గీతా మాధురి. ‘సాక్షి’తో పంచుకున్న ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...సోలోగా...ఇదే తొలిసారి.. నగరంలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది పెళ్లిళ్ల నుంచి పార్టీల వరకూ చాలా రకాల కార్యక్రమాల్లో నాకు అనుభవమే. అయితే మోడ్రన్ కల్చర్‌కు కేరాఫ్‌గా ఉండే యూత్ సమక్షంలో ఒక పబ్‌లో సోలోగా పాడడం ఇదే తొలిసారి. అదీ సొంతంగా ఒక బ్యాండ్‌ను సమకూర్చుకుని, వారితో కలిసి రిహార్సిల్స్ చేసి పబ్ షోలో పాడడం కొత్త అనుభవమే. అభిమానుల స్పందన తెలుస్తుంది... అలాగే కార్పొరేట్, కాలేజ్ షోస్ వంటివి కొందరికి మాత్రమే పరిమితమయ్యేవి, అలా కాకుండా ఈ తరహా పబ్లిక్ ఈవెంట్స్ వల్ల ప్రయోజనం ఏమిటంటే.. అభిమాన గాయనీ గాయకుల పాటలు వినాలనుకునే ఎవరైనా షోకి హాజరుకావ్వొచ్చు. అలా మాకు కూడా మా అభిమానుల స్పందనను దగ్గరగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. బ్యాండ్ స్టైల్ అంటే ఇదే... సాధారణంగా లైవ్ పెర్ఫార్మెన్స్లో పూర్తి స్థాయి వాద్య బృందంతో కలిసి పాడతాం. అయితే పబ్‌లో మాత్రం ఇద్దరు గిటారిస్ట్, డ్రమ్మర్, కీబోర్డ్ ప్లేయర్.. ఇలా ఓ ముగ్గురు నలుగురు మాత్రమే ఉంటారు. ఆర్కె్రస్టాతో పాడేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా పాడతాం.. అయితే ఇందులో 3, 4 పాటలు కలిపి బ్యాకింగ్ కొంచెం మార్చి.. ఇలా ఎక్స్‌పిరిమెంటల్ టైప్‌లో ఉంటుంది. ఓ రకంగా పాపులర్ సాంగ్‌ని కొత్త ఫ్లేవర్‌లో వినిపించడమే బ్యాండ్ స్టైల్ అనొచ్చు. మన పాట ప్రపంచవ్యాప్తం... మన తెలుగు పాటలు ప్రపంచం అంతా ఒక ఊపు ఊపుతున్నాయి. కాబట్టి సిటీలో కూడా పబ్ క్లబ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో తెలుగు, హిందీ పాటలు పాడడానికి సిద్ధమవుతున్నా..అయితే అక్కడకు వచ్చే క్రౌడ్‌ని బట్టి వారి టేస్ట్‌ని బట్టి అప్పటికప్పుడు పాడాల్సి ఉంటుంది.భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్స్‌లో పూర్తి స్థాయిలో ఒక పాటల జాబితా ఇచ్చి, దాని ప్రకారం పాడాలనే ఆలోచన ఉంది. ఇక పర్సనల్ లైఫ్‌కి వస్తే..అడపాదడపా సినిమా పాటలు, రెగ్యులర్‌గా కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్, ఇవి కాక... ఓటీటీ వేదికగా ఇండియన్ ఐడల్ కు వర్క్ చేస్తున్నాను.ఇవి చదవండి: ఫుల్కారీ ఎంబ్రాయిడరీలో విభిన్న డిజైన్లు.. -
Virat Kohli: విరాట్ కోహ్లీ పబ్‌పై FIR ఏం జరిగిందంటే..!
-
24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ
-
రాయదుర్గం కేవ్ పబ్ కేసులో కీలక విషయాలు
-
పబ్ లో డ్రగ్స్ కలకలం.. 50 మందికి డ్రగ్స్ టెస్ట్
-
Mosh Pub: అమ్మాయిలను ఎరగా వేసి దందా చేస్తున్న మోష్ పబ్..
సాక్షి,హైదరాబాద్: డేటింగ్ యాప్స్ కేంద్రంగా పబ్స్ యజమానులు, కొందరు యువతులు చేస్తున్న భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్స్ ఆధారంగా వ్యాపారులు, బడా బాబులకు ఎర వేయడం, వాళ్లను పబ్స్‌కు రప్పించడం ఇందులో మొదటి ఎత్తు. సదరు యువతులకు మద్యం పేరుతో సాఫ్ట్ డ్రింక్స్ సరఫరా చేసే పబ్స్ నిర్వాహకులు భారీ బిల్లుల్ని మాత్రం వెంట వచి్చన వారికి ఇస్తాయి. ఇలా వచ్చిన సొమ్ములో కొంత వాటా ఆ యువతులకు ఇస్తున్నాయి. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాలో అనేక మంది బాధితులుగా మారినా ఎవరూ బయటపడలేదు. సోమవారం హైటెక్ సిటీ సమీపంలోని మోష్ పబ్‌లో మోసపోయిన వ్యాపారి సోషల్ మీడియా ద్వారా తన గోడు వెళ్లబోసుకోవడంతో వెలుగులోకి వచి్చంది. ఓ యువతి వలలో పడి రూ.40,505 బిల్లు చెల్లించిన ఆ బాధితుడి వ్యధ ఇది.. టిండర్ యాప్ ద్వారా పరిచయం.. నగరానికి చెందిన వ్యాపారికి డేటింగ్ యాప్ టింబర్ ద్వారా రితికగా పేరు చెప్పుకున్న యువతి పరిచయమైంది. కాసేపు చాటింగ్ చేసిన ఈమె కలుద్దామంటూ ఆఫర్ ఇచ్చింది. వ్యాపారి సైతం ఆసక్తి చూపించడంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్నుమీటింగ్ పాయింట్‌గా చెప్పింది. సోమవారం సాయంత్రం అక్కడకు వచ్చిన వ్యాపారిని కలిసిన రితిక కొద్దిసేపటికి సమీపంలోని ఓ భవనం నాలుగో అంతస్తులో ఉన్న పబ్‌కు వెళ్దామని చెప్పింది. అక్కడకు చేరుకున్న తర్వాత కొద్దిసేపు తీయగా మాట్లాడిన రితిక మద్యం తాగుదామంటూ అడిగింది. వ్యాపారి అంగీకరిచడంతో వెయిటర్‌ను కలిసి ఆ పబ్‌లో ఉన్న వాటిలో ఖరీదైన మద్యం ఆర్డర్ ఇచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా వల వేయాలని, పడిన వారిని పబ్‌కు తీసుకురావాలని పబ్ యజమానులు–యువతి మధ్య ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలోనే ‘పబ్స్ అండ్ గారల్స్’ కలిసి వినూత్న స్కామ్‌కు తెరలేపారు. మద్యం పేరుతో కూల్‌డ్రింక్స్ సరఫరా.. వ్యాపారితో కలిసి సదరు యువతి రాకను గమనించే పబ్ నిర్వాహకులు వెయిటర్‌ను అప్రమత్తం చేస్తారు. దీంతో అతడు ఏ మద్యం ఆర్డర్ తీసుకున్నా.. గ్లాసుల్లో సరఫరా చేసేది మాత్రం కూల్‌డ్రింకే. రితిక సైతం ఆ రోజు ఒక్కో పెగ్గు రూ.1,799 ఖరీదు చేసే పది పెగ్గుల మద్యం ఆర్డర్ చేసింది. ఈ పేరుతో పబ్ నిర్వాహకులు సరఫరా చేసిన కూల్‌డ్రింక్ తాగుతూపోయింది. దీంతో రూ.20 ఖరీదు చేసే కూల్‌డ్రింక్‌కు యువతి సహకారంతో మద్యం రంగుపూసిన నిర్వాహకులు రూ.1,799 చొప్పున వసూలు చేశారు. ఈ ‘మద్యం’తో పాటు ఇతర డ్రింక్స్, తినుబండారాలు కలిపి రూ.40,505 (పన్నులతో కలిపి) బిల్లు చేసింది. చివరకు వెయిటర్ బిల్లు తీసుకువచి్చన తర్వాత అది వ్యాపారి చేతిలో పెట్టిన యువతి వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తానంటూ ఉడాయించింది. దాదాపు పది పెగ్గులు తాగిన ఆ యువతిలో ఎలాంటి తేడా లేకపోవడం, తూలకుండా నేరుగా నడిచి వెళ్లడంతో పాటు ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. ఆ పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్ పరిశీలించి షాక్ అయ్యాడు. అక్కడ వేదనలు నిత్యకృత్యం సదరు పబ్‌లో ఇలాంటి మోసాలు నిత్యకృత్యమంటూ అనేక మంది వెలిబుచ్చిన వేదనలు ఆ రివ్యూస్‌లో ఆ వ్యాపారికి కనిపించాయి. ఓ వ్యక్తి రూ.16 వేలు, మరో వ్యక్తి రూ.24 వేలు, ఇంకొకరు రూ.20 వేలు చొప్పున చెల్లించారని తెలిసింది. వీరిలో ఒకరైతే బాత్రూమ్కు వెళ్లిన ఆ యువతి కోసం దాదాపు ఏడెనిమిది గంటలు పబ్‌లోనే వేచి ఉన్నారట. దీనికోసం ఆయన చేసిన ఖర్చు మందు బిల్లుకు అదనం. రితిక, కృతిక పేర్లతో కొందరు యువతులు ఇదే పబ్ నిర్వాహకులతో కలిసి ఈ దందా చేస్తున్నారని, అలా వచి్చన మొత్తంలో యువతులు కొంత కమీషన్ తీసుకుంటున్నారని వ్యాపారి గుర్తించారు. ఈ విషయంపై పబ్ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అంతలోనే రంగ ప్రవేశం చేసిన బౌన్సర్లు బలవంతంగా బిల్లు కట్టించి పంపారు. దీంతో ఆ వ్యాపారి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మోష్ పబ్‌పై కేసు నమోదు హైటెక్ సిటీలోని మోష్ పబ్ యాజమాన్యంపై శుక్రవారం సుమోటో కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ ఎస్సై ఎన్వీ రమణ తెలిపారు. కొన్ని ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా అమ్మాయిలతో ఎరవేసి, అలా వచ్చిన కస్టమర్లకు విలువైన మద్యం తాగించి, వారి నుంచి ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాల ఆధారంగా నమోదైన ఈ కేసు దర్యాప్తులో ఉందని, వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆయా యువతులకు, పబ్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.బాధితుల భయమే వీరికి వరం ఇలా యువతుల వల్లో పడిన బాధితుల్లో అనేక మంది వివాహితులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్లు ఉంటున్నారు. దీంతో తాము మోసపోయామని తెలిసినా.. యువతి కోసం వెళ్లామని బయటపడితే పరువుపోతుందని భయపడుతున్నారు. దీంతో కొందరు మాత్రం పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్‌లో విషయం పొందుపరుస్తున్నా.. అనేక మంది మిన్నకుండిపోతున్నారు. ఇదే అటు పబ్ నిర్వాహకులు, యువతులకు వరంగా మారుతోంది. ఈ తరహా దందాలో ఆ ఒక్క పబ్‌లోనే కాదని, నగరంలోని అనేక పబ్బుల్లో జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయి. వాటిలోకి ఈ ‘జంటలు’ ప్రవేశిస్తున్న సమయంలో కేవలం యువకుల వివరాలు మాత్రమే అడిగి, నమోదు చేసుకుంటున్నారు. ఈ హనీట్రాప్ దందాపై తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదులు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇలా చేయడం కచి్చతంగా నేరమే అని, దీనికి యువతులతో పాటు పబ్స్ నిర్వాహకులు బాధ్యులని స్పష్టం చేస్తున్నారు. బాధితులుగా మారిన ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
బంజారాహిల్స్ పబ్‌లో అసభ్య డ్యాన్స్‌లు.. 35 యువతుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలోని ఆఫ్టర్ 9 పబ్‌పై శనివారం రాత్రి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. కస్టమర్లను ఆకర్షించడానికి నిర్వాహకులు వేరే రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్‌లో అసభ్యకర డ్యాన్స్‌లు చేపిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు చేపట్టారు. అర్థరాత్రి మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పబ్‌ను క్లోజ్ చేయించి.. కేసు నమోదు చేశారు.కాగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు బార్ & పబ్ ఆర్గనైజర్ నిర్వహిస్తున్నారు. After 9 పబ్ రైడ్ సమయంలో సుమారు 100 నుండి 150 మంది యువతి యువకులు ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో డ్యాన్స్ 32 మంది యువతులు, 75 యువకులు అదుపులోకి తీసుకున్నారు. 32 మంది యువతులను పోలీస్ వాహనంలో సైదాబాద్‌లోని రెస్క్యూ హోమ్ తరలించారు. వీరు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు. -
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. స్టార్ హీరోకు షాకిచ్చిన పోలీసులు!
ఇటీవలే కాటేరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు కన్నడ స్టార్ హీరో దర్శన్. గతేడాది చివర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కర్ణాటక వ్యాప్తంగా రికార్డ్ స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ శాండల్‌వుడ్ స్టార్ హీరో దర్శన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైన దర్శన్.. సమయం ముగిసిన తర్వాత పార్టీని కొనసాగించారని బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీకి హాజరైన సినీ ప్రముఖులతో పాటు పబ్ యజమానిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసులో హీరో దర్శన్‌తో పాటు ధనంజయ, అభిషేక్ అంబరీష్, రాక్‌లైన్ వెంకటేష్‌లకు పోలీసు అధికారులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఎఫ్ఐఆర్పై ఇప్పటివరకు నటీనటులు ఎవరూ స్పందించలేదు. అసలేం జరిగిందంటే.. న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరులోని రాజాజీ నగర్‌లోని ఓ పబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో కన్నడ నటీనటులు పాల్గొన్నారు. అయితే సమయానికి మించి అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా పార్టీని కొనసాగించారు. సెలబ్రిటీలంతా కేక్‌లు కట్ చేస్తూ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాగా.. దర్శన్ నటించిన కాటేరా చిత్రానికి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరాధన రామ్ హీరోయిన్గా నటించగా.. టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో కనిపించారు. -
రూ.16,195 కోట్ల టాక్స్ నోటీసుపై హైకోర్టు స్టే
డెల్టాకార్ప్ సంస్థకు జారీ చేసిన రూ.16,195 కోట్ల జీఎస్టీ నోటీసుపై తుది ఉత్తర్వులు ఇవ్వకూడదని బొంబాయి హైకోర్టు గోవాబెంచ్ తేల్చి చెప్పింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనంతో డెల్టాకార్ప్ షేర్ హోల్డర్లకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. గత నెలలో డెల్టాకార్ప్‌తో పాటు అనుబంధ సంస్థలకు దాదాపు రూ.23,000 కోట్ల మేర పన్ను చెల్లింపునకు సంబంధించిన నోటీసులు అందాయి. ముందస్తు అనుమతి లేకుండా రూ.16,195 కోట్ల పన్ను నోటీసుపై తుది ఉత్తర్వులు జారీ చేయరాదని బొంబాయి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 23న కంపెనీ, దాని అనుబంధ సంస్థలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను బాంబే హైకోర్టు పరిశీలించింది. గేమింగ్, క్యాసినో వ్యాపారాలపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో జీఎస్టీ పన్ను రేట్లను సైతం భారీగా పెంచింది. ప్రస్తుతం ఈ రంగంలోని చాలా కంపెనీలు భారీ పన్ను నోటీసులతో సతమతమవుతున్నాయి. -
‘సాక్షి’ రాసింది.. ఏసీబీ కదిలింది!
సాక్షి, హైదరాబాద్: పెంచిన మామూళ్లతో పాటు ‘పాత బకాయిల’ కోసం పబ్ యజమానిని వేధించి, బెదిరించి, తప్పుడు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్, ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చర్యలకు ఉపక్రమించారు. రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్నాళ్ల క్రితం అటకెక్కిన ఈ కేసు వ్యవహారంపై ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేపట్టారు. మామూలు పెంచి ‘ఎరియర్స్’ ఇమ్మని... బంజారాహిల్స్ పీఎస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్‌కు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తన పరిధిలో ఉన్న పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌తో పాటు మసాజ్ సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. తన వద్ద హోంగార్డుగా పని చేస్తున్న హరికి ఈ కలెక్షన్స్ బాధ్యతలు అప్పగించారు. అతడే ప్రతి నెలా అందరికీ ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేసుకుని వస్తుంటాడు. కొన్ని నెలల క్రితం నరేందర్ తన పరిధిలో ఉన్న పబ్స్ ఇచ్చే నెల వారీ మామూళ్లను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచేశారు. అంతటితో ఆగకుండా రెండు నెలల ‘ఎరియర్స్’తో కలిపి మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్ పబ్‌ను లక్ష్మణ్ రావు, శివలాల్ నిర్వహిస్తున్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో ‘రిబేటు’ ఇచ్చిన నరేందర్ రూ.3 లక్షలకు తగ్గించారు. ఈ డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణ రావుకు హోంగార్డు హరితో పదేపదే వాట్సాప్ కాల్స్ చేయించాడు. హేయమైన ఆరోపణలతో తప్పుడు కేసు... పబ్ యాజమాన్యం తన మాట వినకపోవడంతో వారిపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డితో కలిసి పథక రచన చేశాడు. ఈ ఏడాది జులై 30 రాత్రి నవీన్‌రెడ్డికి రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందినట్లు, అతడు దానిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు. సదరు పబ్ యాజమాన్యం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పబ్‌లో మహిళలను కూడా సరఫరా చేస్తోందని, వారితోనే కస్టమర్లకు సర్విస్ చేయిస్తూ రెచ్చగొడుతోందని, ఆకర్షితులైన వినియోగదారులతో కలిసి గడిపేలా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. అదే నెల 31న మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం కిందన నమోదు చేసిన కేసులో ఇద్దరు యజమానులనూ నిందితులుగా చేర్చారు. కాగా రోజు పబ్‌లో వారు ఇరువురూ లేరని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదని, అసలు పోలీసులు దాడే చేయలేదని ఇటీవల ఏసీబీ గుర్తించింది. ఒత్తిడితో మిన్నకుండిపోయిన ఏసీబీ... ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రావు ఆగస్టులోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవసరమైన ఆధారాల కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య కెమెరాలతో కూడిన వాచీలు తదితరాలను ఏర్పాటు చేసి పబ్‌కు సంబంధించిన ఓ వ్యక్తిని నరేందర్ వద్దకు పంపారు. లంచా నికి సంబంధించిన బేరసారాలు ఆడియో, వీడియో లు రికార్డు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఓ దశలో సదరు వ్యక్తి రహస్య కెమెరాలతో వచ్చిన విషయం గుర్తించిన నరేందర్ అప్రమత్తమయ్యారు. అసలు విషయం గ్రహించి తన ‘బంధువైన’ రాజకీయ నాయకుడిని ఆశ్రయించారు. ఆయన జోక్యంతో ఏసీబీకి చెందిన కింది స్థాయి అధికారులు అడుగు వెన క్కు వేశారు. మరోసారి సదరు పబ్ జోలికి రావద్దని ఇన్స్పెక్టర్ నరేందర్‌కు, నరేందర్‌ను వదిలేయని పబ్ యాజమాన్యానికి చెప్పి రాజీ చేసి ఫైల్‌ను అటకెక్కించేశారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కేసు మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధి కారులు ‘బంజారాహిల్స్ ఫైల్8 దుమ్ము దులిపించారు. ఓసారి షుగర్ డౌన్... మరోసారి ఛాతి నొప్పి... ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ ఠాణాపై దాడి చేసింది. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. పబ్ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు సేకరించింది. సుదీర్ఘంగా ఈ ముగ్గురు నిందితులను విచారించింది. దీంతో తొలుత తన షుగర్ లెవల్స్ పడిపోయాయంటూ నరేందర్ చెప్పడంతో వైద్య బృందాన్ని ఠాణాకు పిలిపించి చికిత్స చేయించా రు. సాయంత్రం తనకు ఛాతీ నొప్పంటూ పడిపోవడ ంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్ వెళ్ళడానికి నరేందర్ నడుచుకుంటూ వచ్చి తన వాహనమే ఎక్కడం గమనార్హం. ఈ కేసుపై ప్రకటన విడుదల చేసిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్.. ‘ఇన్స్పెక్టర్ నరేందర్ ఆదేశాల మేరకు నవీన్‌రెడ్డి గత శనివారం అర్ధరాత్రి సదరు పబ్ వద్దకు వెళ్లా రు. లక్ష్మణ్ రావును అనవసరంగా పబ్ బయటకు పిలిచారు. రోడ్డుపై ఆపి ఉంచిన పోలీసు వాహనం వద్దకు వచ్చిన ఆయన్ను బలవంతంగా అందులో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు నిర్భంధించారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలపై నమోదు చేసి కేసు దర్యాప్తులో ఉందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. -
పబ్‌లో చిల్ అవుతున్న కీర్తి సురేశ్.. డ్యాన్స్ వీడియో వైరల్
తమిళసినిమా: కీర్తిసురేశ్ ఇప్పుడు విజయాల మీద సవారీ చేస్తుందనే చెప్పాలి. ఆమధ్య వరుస ఫ్లాప్‌లతో సతమతమైన ఈ కేరళ కుట్టి నటిగా మాత్రం ఫెయిల్ కాలేదు. నటనపై ఈమె అంకితభావమే ఇప్పుడు మళ్లీ గాడిలో పడేలా చేసిందని చెప్పవచ్చు. మహానటి వంటి అద్భుత విజయం సాధించిన చిత్రం తర్వాత కీర్తి సురేశ్ కథానాయకి పాత్రలకు ప్రాముఖ్యత కలిగిన చిత్రాల్లో నటించడం మొదలెట్టింది. అలా అనడం కంటే ఆమెను దర్శక, నిర్మాతలు అలాంటి పాత్రలకు ఎంపిక చేశారు అని చెప్పవచ్చు. అయితే ఆ చిత్రాలు కీర్తిసురేశ్‌కు ఆశించిన విజయాలను తెచ్చిపెట్టలేదు. ఇటీవల తెలుగులో నటించిన దసరా చిత్రం , తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన మామన్నన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతోపాటు కీర్తిసురేశ్ సహజత్వంతో కూడిన నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. అంతేకాదు ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇప్పటివరకు తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న కీర్తిసురేశ్‌కు ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా పిలుపు రావడం విశేషం. హిందీలో వరుణ్ ధావన్ సరసన నటించబోతోంది. అదేవిధంగా తెలుగులో నాగచైతన్య సరసన నూతన చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. తమిళంలో జయంరవి సరసన సైరన్, రివాల్వర్ రోటా, రఘు తాత అనే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు చేస్తున్నారు. ఇంత బిజీలోనూ కీర్తిసురేశ్ పబ్‌ల్లో పాటలతో చిల్ అవుతోంది. ఈమె స్నేహితులతో ఒక పబ్‌లో డాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
అత్యంత పురాతన 'పబ్'..సందర్శకులు మాత్రం దాన్ని..
ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన మధుశాల. ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్‌లో ఎనిమిది శతాబ్దాల కాలానికి పైగా ఇది పనిచేస్తోంది. ‘ది ఓల్డె ట్రిప్ టు జెరూసలేం’ పేరుతో ఉన్న ఈ పబ్ 1189 సంవత్సరంలో ప్రారంభమైంది. జెరూసలేంపై క్రూసేడ్ కోసం బయలుదేరడానికి ముందు అప్పటి ఇంగ్లండ్ రాజు కింగ్ రిచర్డ్ ది లయన్ హార్ట్, ఆయన సహచరులు ఈ పబ్‌లోనే మందు విందులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారట! అప్పట్లో ఒక కొండను తొలిచి, ఈ పబ్ భవనాన్ని నిర్మించారు. ఇందులోని గదులు గుహల్లోనే ఉంటాయి. గుహల్లో కూర్చుని పార్టీ చేసుకోవాలనుకునే పర్యాటకులు ఇప్పటికీ ఇక్కడకు పనిగట్టుకుని మరీ వస్తుంటారు. ఈ పబ్‌లో గుహల్లోని బార్లు మాత్రమే కాకుండా, దీనిలో నేల దిగువన సొరంగం కూడా ఉంది. ఈ పబ్ ప్రాంగణంలో చక్కని కోట, లోపలి పురాతన వాతావరణం చూస్తే, మధ్యయుగాల్లోకి అడుగుపెట్టినట్లే ఉంటుంది. ఇది పబ్ మాత్రమే కాదు, మ్యూజియం కూడా అని ఇక్కడకు వచ్చే పలువురు సందర్శకులు వ్యాఖ్యానిస్తుంటారు. (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కారు! చూస్తే చిన్నసైజు కొండలా..!) -
ఆ హోటల్లో తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే
లండన్: బ్రిస్టల్ లోని ఓ ప్రఖ్యాత పబ్‌లో ప్రతేకమైన ఆదివారం స్పెషల్ డిష్ తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే. ఈరోజు బుక్ చేసుకుని నాలుగేళ్లపాటు ఎదురు చూస్తే చాలు ఆ వంటకం రుచి చూసే భాగ్యం కలుగుతుంది. సాధారణంగా ఓ హోటల్లో తినడానికి ఏదైనా ఆర్డర్ ఇచ్చిన తరవాత నిముషాల వ్యవధిలో ఆ ఐటెం మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఆర్డర్ ఇచ్చిన ఐటెం కోసం గంటల తరబడి ఎదురు చూడటమన్నది చాలా అరుదుగా చూస్తుంటాం. మరికొన్ని ప్రముఖ హోటళ్లలో మాత్రం ఆదివారం ప్రైమ్ టైమ్ ఫుడ్ బుకింగ్ కావాలంటే ఒకట్రెండు రోజుల ముందు టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక ఫుడ్ ఐటెం కోసం నాలుగేళ్లు ఎదురు చూడటమంటే నిజంగా విడ్డూరమే. అలాంటి విడ్డూరమే బ్రిస్టల్ లోని ది బ్యాంక్ టావెర్న్ పబ్. ఈ పబ్‌లో ఆర్డర్ చేయాలంటే ఓపిక ఉండాలి. అందులోనూ ఆ హోటల్ ప్రత్యేకం తినాలంటే బుకింగ్ టైమ్ నాలుగేళ్లు పడుతుంది. అంత పొడవాటి వెయిటింగ్ లిస్టు ఉన్న హోటల్ ప్రపంచంలోనే మరొకటి లేదు. ఆ హోటల్లో సండే స్పెషల్ రోస్ట్ బుక్ చేసుకుంటే మన టైమ్ వచ్చేసరికి కనీసం నాలుగేళ్ల సమయం పడుతుంది. అన్నేళ్ల పాటు ఆగాలంటే నిజంగానే ఓపికపట్టడంలో పీ.హెచ్.డి చేనుండాలి. అందులోనూ భోజనప్రియులు అంత కలం ఆగడమంటే చాలా గొప్ప విషయం. ది బ్యాంక్ టావెర్న్ హోటల్ వడ్డించే సండే రోస్టులో రుచికరమైన ప్రత్యేక వంటకాల ఉఉంటాయి. నోరూరించే ఈ వంటకానికి 2018లో బ్రిస్టల్ గుడ్‌ఫుడ్ అవార్డుల్లో ఉత్తమ సండే లంచ్ అవార్డుతోపాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది. అయితే కరోనా సమయానికి ముందు ఈ హోటల్లో ఆర్డర్లన్నీ సమయానికే డెలివరీ ఇచ్చేవారు. కానీ లాక్డౌన్ సమయంలో పబ్ మూసివేసి ఉండటంతో ఆ సమయంలో వచ్చిన ఆర్డర్లన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయి. వాటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్న పబ్‌వారు ప్రస్తుతానికి నాలుగేళ్లు వెనుకబడ్డారు. దీంతో ఈ హోటల్లో ఇప్పుడు సండే రోస్ట్ ఆర్డర్ చేసేవారు నాలుగేళ్లు వేయిట్ చేయక తప్పదు. అందుకే ఈ రెస్టారెంట్ వారు ప్రస్తుతానికైతే బుకింగ్ లను పూర్తిగా నిలిపివేశారు. ఇది కూడా చదవండి: వివేక్ రామస్వామికి ఓటు వేయొద్దంటూ మత ప్రచారకుడి ప్రచారం.. -
పబ్‌లో కత్తితో నృత్యాలు!
బంజారాహిల్స్: పబ్‌లో మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. డ్యాన్స్ ఫ్లోర్లో ఏకంగా కత్తితో నృత్యాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.14లో రాక్ క్లబ్ స్కై లాంజ్ పేరిట పబ్ ఉంది. శనివారం రాత్రి కొంత మంది యువకులు పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో డ్యాన్స్ ఫ్లోర్ వద్దకు వెళ్లి హంగామా సృష్టించారు. వీరిలో ఓ వ్యక్తి కత్తి తీసి నృత్యం చేశారు. వీరి విన్యాసాలతో మిగతా పార్టీ ప్రియులు భయంతో బయటకు పరుగులు తీసారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
ప్యూబ్లో ఓ అంటావా మావ పాటకు డాన్స్ చేస్తూ రెచ్చిపోయిన సమంత
-
మలుపు తిరిగిన అమ్నీషియా పబ్ అత్యాచార కేసు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌లో గతేడాది మే 22వ తేదీన ఓ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో మైనర్లను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏ2 నిందితుడి తండ్రి హైకోర్టును ఆశ్రయించగా ఈ తీర్పుపై అభ్యంతరాలను పరిశీలించాలని జువైనల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అమ్నీషియా పబ్‌లో గతేడాది ఓ పార్టీకి వచ్చిన బాలికను ట్రాప్ చేసి అయిదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. జువైనల్ జస్టిస్ బోర్డు నలుగురు నిందితులను మేజర్లుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ తన కొడుకును మైనర్‌గా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఓ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, కేవలం మరసారి పరిశీలించాలని మాత్రమే జువైనల్ కోర్టుకు సూచిస్తామని తెలిపింది. జువైనల్ కోర్టులో ఉన్న ఈ కేసు 12వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు(పోక్సో కోర్టు)కు బదిలీ చేశారు. అవకతవకలు జరిగాయని రివిజన్ పిటిషన్ వేయగా కోర్టు ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఏ2 నిందితుడి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న జస్టిస్ అనుపమా చక్రవర్తి సంబంధిత కోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ అభ్యంతరాలు పరిశీలించాలని పోక్సో కోర్టుకు సూచించింది. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల మానసిక పరిపక్వత మేజర్ల తరహాలోనే ఉందని వారిని మైనర్లుగా పరిగణించకూడదని జూబ్లీహిల్స్ పోలీసులు గతంలోనే కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఇందుకు సంబంధించిన గట్టి శాసీ్త్రయ ఆధారాలు సమర్పించారు. -
అమ్మాయిల వీరంగం..ఫుల్లుగా తాగి మరో యువతిపై దాడి..వీడియో వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో అమ్మాయిలు రెచ్చిపోయారు. ఫుల్లుగా తాగిన నలుగురు యువతులు మరో యువతిని చితకబాదారు. బెల్టుతో కొట్టారు. పబ్బు బయటే ఈ ఘటన జరిగింది. అక్కడున్న వారు చూస్తే ఉండిపోయారే తప్ప.. వాళ్లను ఆపే సాహయం చేయలేదు. నలుగురూ కలిసి దాడి చేయడంతో బాధిత యువతి ఏమీ చేయలేకపోయింది. గతేడాది నవంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది. బాధిత యువతి తనపై దాడి చేసిన నలుగురు అమ్మాయిలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్లను అరెస్టు చేశారు. 4 girls brutally beating 1 girl with belts and kicks passer-by watching and enjoying #Fights #streetfights #fightingvideos #Girlsfight #India #gemsoffights pic.twitter.com/MVLec2CYai — TheFight1 (@InsanelyIfight3) December 29, 2022 చదవండి: రోడ్డుపై గుంతను తప్పించబోయి ట్రక్కును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి -
జూబ్లీహిల్స్ లోని పబ్ ల వ్యవహారం పై హైకోర్టు మరోసారి సీరియస్
-
పబ్‌లో అమ్మాయిలతో చిందేసిన ఆర్జీవీ.. వీడియో వైరల్
డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనంగా మారుతోంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే ఆర్జీవీ తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో మందు తాగుతూ అమ్మాయిలతో కలిసి చిందేశారు. హాలోవీన్ కాస్టూమ్స్‌లో హెరెత్తే మ్యూజిక్‌కి అమ్మాయిలతో కలిసి స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో త్వరలోనే వ్యూహం అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ఆర్జీవీ పేర్కొన్న సంగతి తెలిసిందే. At PRISM pub last nite celebrating HALLOWEEN pic.twitter.com/CjU2l4fPam — Ram Gopal Varma (@RGVzoomin) October 31, 2022 FUN n FROLIC at PRISM PUB 💐💐💐 pic.twitter.com/C1mFuv7wf9 — Ram Gopal Varma (@RGVzoomin) October 31, 2022 -
మితిమీరిన వర్క్ అవుట్...దెబ్బకు పుర్రెలో సగభాగం ఔట్!
‘అతి సర్వత్ర వర్జయేత్’ .. (ఏ విషయంలోనూ అతిగా ఉండకూడదు)అని పెద్దలు ఊరకనే అనలేదు. ఏదైన మన శరీరం తట్టుకోలేనంతగా అధికంగా ఏ పని చేసినా అది ప్రమాదమే . అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ చాలామంది అత్యుత్సహంతోనో లేక మరే ఇతర కారణాల వల్ల కొన్ని పనులు అతిగా చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తన నిర్లక్యమో లేక అతని పై అధికారి నిర్లక్ష్యం కారణంగానో తెలియదు గానీ అతిగా ఆడి పెద్ద ప్రమాదాన్నే కొనితెచ్చుకున్నాడు. వివరాల్లోకెళ్లితే...యూకేలోని రీడింగ్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల మైక్బ్రోకీ ఏప్రిల్ 2019లో కంపెనీ వార్షిక ఈవెంట్లో భాగంగా పబ్ గోల్ఫ్ గేమ్‌ని ఆడాడు. ఐతే విరామం తీసుకోకుండా గోల్ఫ్ గేమ్ అదేపనిగా ఆడాడు. దీంతో అతను కింద పడిపోయాడు. ఇక అప్పటి నుంచి బ్రోకీ కొన్నాళ్లపాటు కోమాలోనే గడిపాడు. అంతేకాదు అతను పుర్రెలో సగ భాగాన్ని కూడా తొలగించారు వైద్యులు. కోలుకోవడానికి అతనికి దాదాపు ఆరునెలలు పట్టింది. దీంతో అతను తనకు జరిగినదానికి పరిహారంగా పీడబ్ల్యూసీ కంపెనీ యజమాని సుమారు రూ.1.87 కోట్లు ఇవ్వాలంటూ కోర్టు మెట్లెక్కాడు. తన మేనేజర్ సైమెన్ ఫ్రాడ్గలీ తన సహోద్యోగుల భద్రతను పట్టించుకోలేదంటూ ఆరోపణలు చేశాడు. బ్రోకీ పిటిషన్లో పబ్ గోల్ఫ్ ఈవెంట్లో తీవ్రంగా గాయపడటం అనేది ఊహజనితమైన విషయంగా ఉంటుందని పేర్కొన్నాడు. తన తలకు అయిన తీవ్ర గాయం కారణంగా ఇప్పటికి కొన్నింటిని గుర్తించుకోలేకపోతున్నానని వాపోయాడు. ఐతే లండన్ హైకోర్టు పీడబ్ల్యూసీ కంపెనీ తన మేనేజర్ నిర్లక్ష్యానికి భాద్యత వహించాలని స్పష్టం చేసింది. అలాగే కంపెనీలో ఏడేళ్లుగా కొనసాగతున్న వార్షిక ఈవెంట్‌ని కూడా నిలిపివేసింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. భాద్యతయుతమైన యజమానిగా ఉద్యోగుల సంరక్షణ బాధ్యతలను చూసుకుంటాం గానీ ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడూ కాస్త బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఇంకా నడుస్తోంది. (చదవండి: యువతి హల్చల్.. ఎవరికో వచ్చిన ఆర్డర్ లాక్కుని డెలివరీ బాయ్‌పై దాడి!) -
అమ్నీషియా పబ్ కేసు: ప్రధాన నిందితుడు సాదుద్దీన్కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్కు బెయిల్ లభించింది. సాదుద్దీన్కు నాంపల్లి కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా ఇప్పటికే ఈ కేసులో జువైనల్లో ఉన్న అయిదుగురు మైనర్ నిందితులకు తెలంగాణ హైకోర్టు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గత వారమే పబ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. చదవండి: ప్రజలారా జర పైలం.. మూడు వారాలు మస్తు వానలే! -
అమ్నీషియా పబ్ కేసు.. ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: అమ్నీషియా పబ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకుకి బెయిల్ లభించింది. ఎమ్మెల్యే కొడుకు రహిల్ ఖాన్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొదట జువెనైల్ బోర్డు బెయిల్‌కు నిరాకరించడంతో.. హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. దీంతో హైకోర్టు బుధవారం మైనర్ అయిన ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ మంజూరు చేసింది. కాగా జువైనల్ హోమ్‌లో ఉన్న నలుగురు నిందితులకు మంగళవారమే బెయిల్ వచ్చింది. సుమారు ఘటన జరిగిన 48 రోజుల తర్వాత ఈ కేసులోని నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇప్పటికే నలుగురు బెయిల్‌పై బయటకొచ్చారు. అయితే ఈ కేసులో A1గా ఉన్న సాదుద్ధీన్ మాలిక్‌కు మాత్రం బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది. ఇక రేప్ కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. చదవండి: రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై స్పందించిన రేవంత్ -
మద్యంమత్తులో రెచ్చిపోయిన యువతులు.. పబ్బులో యువకుడిపై దాడి
లక్నో: తాగిన మత్తులో ఇద్దరు యువతులు రెచ్చిపోయారు. పబ్బులో యువకుడిపై దాడి చేసి చితకబాదారు. అతడు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా పట్టించుకోకుండా కొట్టారు. ఇద్దరిలో ఒక యువతి పబ్బు ఎంట్రెన్స్ డెకరేషన్‌లోని పూలకుండి తీసుకొని మరీ యువకుడిపై విరుచుకుపడింది. పరిస్థితి చేయిదాటిపోతుందని భావించి అక్కడున్న బౌన్సర్ వచ్చి ముగ్గురినీ విడదీశాడు. అనంతరం ఆ ఇద్దరమ్మాయిలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఒకవేళ ఎవరైనా కేసు పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. Fierce fight between boys and girls in the unplugged cafe of Vibhutikhand police station area of #Lucknow #Trending #Viralvideo #India pic.twitter.com/vMQrArO3eZ — IndiaObservers (@IndiaObservers) July 23, 2022 ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో గతవారం ఈ ఘటన జరిగింది. నగరంలో గొతకొద్ది వారాలుగా వరుసగా వివాదాస్పద ఘటనలు జరుగుతుండటమూ చర్చనీయాంశమైంది. ఇటీవలే లులు షాపింగ్ మాల్లో అర్ధరాత్రి నిర్వహించిన సేల్ వీడియో వైరల్ కాగా.. ఓ షాపింగ్ మాల్లో మతపరమైన ప్రార్థనలు నిర్వహించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. చదవండి: మంత్రిగారి లైఫ్ స్టైల్ మామూలుగా లేదుగా.. కుక్కల కోసం ఖరీదైన ఫ్లాట్.. అర్పితకు కానుకలు! -
కొండాపూర్ పబ్‌లో రెచ్చిపోయిన బౌన్సర్లు.. కస్టమర్‌పై పిడిగుద్దులు
గచ్చిబౌలి(హైదరాబాద్): పబ్‌లలో బౌన్సర్లు రెచ్చిపోతున్నారు. కస్టమర్లకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూడాల్సిన బౌన్సర్లే సహనం కోల్లోయి విచక్షణ రహితంగా దాడులుకు తెగబడుతున్నారు. వివరాలివీ... కూకట్పల్లి లోధా టవర్స్‌లో నివాసం ఉండే సంజీవ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు కొండాపూర్‌లోని కోమా పబ్‌కు వెళ్లారు. రాత్రి 1.30 సమయంలో టైం ముగిసిందని బయటకు వెళ్లాలని ఓ బౌన్సర్ సూచించారు. 5 నిమిషాల్లో వెళతానని చెప్పిన కొద్ది సేపటికే మరో బౌన్సర్ వచ్చి బయటకు వెళ్లాలని గద్దించాడు. బాధితుడు సంజీవ దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ తరువాత పబ్ నుంచి బయటకు వెళ్లగా బౌన్సర్లు వెంబడించారు. బౌన్సర్లు పట్టుకోగా మరో వ్యక్తి ముఖంపై పిడి గుద్దులు కురించాడు. దీంతో సంజీవ ముఖంపై తీవ్ర రక్త స్రావం జరిగింది. శనివారం ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బౌన్సర్లు, నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుఖేందర్ రెడ్డి తెలిపారు. బయటకు వెళుతుండగా పార్కింగ్ వద్ద నలుగురు బౌన్సర్లు నన్ను పట్టుకోగా ఓ వ్యక్తి ముఖంపై దాడి చేశాడన్నారు. -
గ్యాంగ్ రేప్ నిందితులకు డీఎన్ఏ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుడు, చట్టంతో విభేదించిన బాలురకు కచ్చితంగా శిక్ష పడేలా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వీరికి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్ (టీఐపీ) పూర్తి చేసిన అధికారులు నిందితులకు డీఎన్ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయస్థానాలు అనుమతి మంజూరు చేయడంతో తదుపరి చర్యలకు ఉపక్రమించారు. అవసరమైన పక్షంలో బాధితురాలి నుంచీ నమూనాలు సేకరించాలని యోచిస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసులో సాదుద్దీన్, మరో ఐదుగురు చట్టంతో విభేదించిన బాలురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు సైతం పట్టుబడి జువైనల్ హోమ్‌కు చేరాడు. అయితే ఇతడు కేవలం బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడానికి సంబంధించి మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సాదుద్దీన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు సహా ఐదుగురు మాత్రం గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాన్సూ బేకరీ నుంచి బాలికను ఇన్నోవా కారులో పెద్దమ్మ గుడి సమీప ప్రాంతాలకు తీసుకువెళ్లిన ఈ ఐదుగురూ గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో వెంట్రుకలు, వినియోగించిన టిష్యూ పేపర్లతో సహా అనేక ఆధారాలు సేకరించారు. బాలిక పోలీసులకు, న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలోనూ తనపై ఆ కారులోనే అఘాయిత్యం జరిగినట్లు బయటపెట్టింది. దీంతో ఇన్నోవా కారులో లభించిన ఆధారాలు క్లూస్ టీమ్ ద్వారా సేకరించిన పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇప్పుడు సాదుద్దీన్ సహా ఐదుగురి నుంచి సేకరించిన నమూనాలకూ పంపనున్నారు. ఈ రెండింటినీ సరిపోల్చే నిపుణులు ఆ రోజు కారులో ఉన్నది, బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది వీరేనంటూ సాంకేతికంగా నిర్థారించనున్నారు. పోలీసులు దాఖలు చేసే అభియోగపత్రాల్లోనూ ఈ అంశాన్ని పొందుపరుస్తారు. న్యాయస్థానంలో నేరం నిరూపించడానికి ఇది కీలకం కానుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కోర్టుల్లో బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలంటూ పోలీసులు కోర్టును కోరుతున్నారు. కాగా బాలికపై సామూహిక అత్యాచారంలో ఎమ్మెల్యే కుమారుడి పాత్ర లేకున్నా... బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు, ఆధారాలు ఉండటంతోనే జువైనల్ హోమ్‌కు చేరాడు. ఇతడిపై ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ కింద సదరు ఆరోపణలు నమోదు చేశారు. ఆమ్నేషియా పబ్ వద్ద సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఓ కీలక విషయం గుర్తించారు. ఇన్నోవా కారులో అప్పటికే ఉన్న సాదుద్దీన్‌ను దింపిన ఎమ్మెల్యే కుమారుడు అక్కడే కారు ఎక్కాడని, అలా ఈ కేసులో చిక్కాడని తెలుసుకున్నారు. (చదవండి: కోర్టును ఆశ్రయించిన పోలీసులు.. ఎందుకంటే..?) -
Hyderabad: పబ్‌లో మైనర్లతో పార్టీ నిర్వహణ.. బడా నేత ప్రమేయం!
సాక్షి, హైదరాబాద్: వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. విమర్శలు వెల్లువెత్తుతున్నా.. హైదరాబాద్‌లో పబ్‌ల తీరు మారడం లేదు. తాజాగా.. జూహ్లీహిల్స్ అమ్నీషియా పబ్ తరహాలో ఓ పబ్‌లో మైనర్ల పార్టీ నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో రెండ్రోజుల పాటు మైనర్ల పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. సైబర్ హవర్స్ వాల్యూమ్-11 పేరుతో ఈవెంట్‌ను నిర్వహించారు. మైనర్ల పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతి నిరాకరించింది. అయితే ఒక బడా నేత ప్రమేయంతో మైనర్ల పార్టీ ఎరేంజ్ చేసినట్లు సమాచారం. ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ల పార్టీకి కొందరు ఆహ్వానాలు పంపించారు. ఇక నిర్వాహకులేమో పబ్‌లో మద్యం సరఫరా చేయలేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు తెలియాల్సి ఉంది. -
మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లపై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: వీకెండ్ అంటే ఐటీ హబ్‌లో పండగ వాతావరణం ఉంటుంది. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, పబ్‌లు కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. వచ్చే వీకెండ్లో జులై 2, 3న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆంక్షలు ఉండనున్నాయి. దీంతో రెస్టారెంట్లు, పబ్‌లు, మాల్స్‌లకు వచ్చే కస్టమర్లను నియంత్రించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హెచ్ఐసీసీ, నోవా టెల్‌తో పాటు నగరంలో 50కి పైగా స్టార్ హోటల్స్‌లో బస చేయనున్నారు. దీంతో రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. నోవాటెల్ చుట్టూ బలగాల గస్తీ తొలిసారిగా గ్రేటర్లో రెండు రోజుల పాటు ప్రధాని ఉండనున్నారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 2న సమావేశం జరగనున్న మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ, పలువురు కేంద్ర మంత్రులు బస చేయనున్న నోవాటెల్ హోటల్ చుట్టూ పోలీసు బలగాలు గస్తీ కాయనున్నాయి. రెండు రోజుల పాటు సైబర్ టవర్స్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను, వాటి పరిస్థితులను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సమావేశం జరిగే హెచ్ఐసీసీలో అతిథుల వాహనాల కోసం 3 ప్రాంతాలలో పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. సుమారు 500 నుంచి 600 కార్లు పార్కింగ్ చేసుకునే వీలుంటుంది. రెండు రోజుల పాటు 500 మంది ట్రాఫిక్ పోలీసులు విధులలో పాల్గొంటారని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. (చదవండి: సీఎం పీఠంకోసం కుమ్ములాట) -
ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని..
నిజాంపేట్ (హైదరాబాద్): జూబ్లీహిల్స్ సామూహిక లైంగిక దాడి ఘటన మరువక ముందే నగరంలో ఒక యువతిపై జరిగిన అత్యాచారం కలకలం సృష్టిస్తోంది. పుట్టిన రోజు పార్టీ అనంతరం ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని అర్ధరాత్రి సమయంలో యువతి ఇంటికి వచ్చిన స్నేహితుల్లో ఒకరు ఆమెపై లైంగిక దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఓ యువతి ప్రగతినగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటోంది. క్రాంతి అలియాస్ మ్యాక్స్‌వెల్ ఈ నెల 13న తన పుట్టినరోజు ఉందంటూ కంటెంట్ రైటర్ అయిన 28 ఏళ్ల యువతిని పార్టీకి ఆహ్వానించాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్‌లోని రిపీట్ పబ్‌కు స్నేహితులతో కలిసి వెళ్లింది. పబ్‌లో పార్టీ అనంతరం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఇంటి వద్ద డ్రాప్ చేస్తామంటూ క్రాంతితో పాటు స్నేహితులు రోషన్, మనుప్రీత్, కిషోర్ ఆమె ఇంటికి వచ్చారు. అందరూ కలిసి మళ్లీ మద్యం సేవించారు. తెల్లవారుజాము సుమారు 4.30 గంటల వరకు పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకుంటూ సరదాగా గడిపారు. 5 గంటల సమయంలో యువతి నిద్రలోకి జారుకుంది. మిగతావారు కూడా ఆమె ఇంట్లోనే పడుకున్నారు. యువతితో పాటు ఇద్దరు స్నేహితులు ఒక గదిలో, మరో ఇద్దరు ఇంకో గదిలో పడుకున్నారు. సుమారు 6.15 గంటల సమయంలో రోషన్ తనపై అత్యాచార యత్నం చేస్తున్నట్లు గ్రహించిన యువతి అతన్ని పక్కకు నెట్టివేసేందుకు ప్రయత్నించింది. అయితే అతడు తనను కొట్టి బలవంతంగా లైంగికదాడి చేసినట్లు ఆ యువతి 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం లైంగిక దాడికి పాల్పడిన చిత్రపురి కాలనీకి చెందిన రోషన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే వీరంతా సెంట్రల్ యూని వర్సిటీ విద్యార్థులని పోలీసులు పేర్కొంటున్నారు. యువతిపై ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే లైంగిక దాడి జరిగిందా? స్నేహితులు అందరూ దీనికి సహకరించారా? తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: ప్లాన్ ప్రకారమే ఆ వాహనం వినియోగించాం.. కానీ..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్‌లో విదేశీబాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్ల పోలీసు కస్టడీ మంగళవారం ముగిసింది. ఈ నెల 9న వీరిని నాలుగు రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించిన విషయం తెలిసిందే. అంతకుముందే ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను కస్టడీకి తీసుకోగా సోమవారమే ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత నాలుగు రోజులుగా బంజారాహిల్స్ ఏసీపీ ఎం.సుదర్శన్ కస్టడీలో ఉన్న మైనర్లను వేర్వేరుగా, ఒకేచోట కూర్చోబెట్టి విచారించారు. అత్యాచారం ఎక్కడ జరిగింది, ఇందుకు ఉసిగొల్పింది ఎవరు అనే విషయాలపై ఆరా తీయగా, జూబ్లీహిల్స్‌లోని ఓ గుడి వెనుకాల నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారం జరిపినట్లు చెప్పారు. ఒకేచోట అందరం కలిసి అత్యాచారానికి పాల్పడినట్లుగా వెల్లడించారు. నిందితుల్లో ఓ ఎమ్మెల్యే కొడుకుతోపాటు వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కొడుకు, సంగారెడ్డి మున్సిపాలిటీ కో–ఆప్షన్ మెంబర్ కొడుకు ఉండగా ఆ రోజు అధికారిక వాహనాన్ని ఎవరు తీసుకు రమ్మన్నారని పోలీసులు ప్రశ్నించారు. ప్రభుత్వ వాహనం అని రాసి ఉన్న ఇన్నోవా కారును పథకం ప్రకారమే తీసుకొచ్చామని, ఈ కారుకు బ్లాక్ ఫిలింఉండటమే కాకుండా గవర్నమెంట్ వెహికిల్ అని ఉంటే ఎవరూ టచ్ చేయరన్న ఉద్దేశంతో దీన్ని ఎంపిక చేసుకున్నామని వెల్లడించారు. ముందస్తు పథకంలో భాగంగానే కండోమ్ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చినట్లు విచారణలో చెప్పారు. ఫోరెన్సిక్ విభాగం అధికారులు కారును తనిఖీ చేసినప్పుడు కండోమ్‌లు దొరికిన విషయం తెలిసిందే. కస్టడీలో భాగంగా ఆదివారం మైనర్లందరినీ సీన్ ఆఫ్ రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లారు. పోలీసు కస్టడీలో మైనర్లందరూ కూడబలుక్కున్నట్లుగా ఒకే సమాధానం చెప్పారు. పోలీసు కస్టడీ ముగియగానే మంగళవారం సాయంత్రం ఈ ఐదుగురు మైనర్లను జువనైల్ హోంకు తరలించారు. కార్ల యజమానులపై కేసులు: ఈ ఘటనలో మైనర్లు నడిపిన కార్లకు సంబంధించి కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. బంజారాహిల్స్‌లో నివసించే ఓ ఎమ్మెల్యే కుమార్తెకు చెందిన బెంజ్ కారును ఆమె కుమారుడు నడిపాడు. అలాగే ఇన్నోవా డ్రైవర్ని బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వద్ద దించి ఆ వాహనాన్ని మరో మైనర్ నడిపాడు. ఈ ఉదంతాల్లో మైనర్లతో పాటు వారికి వాహనాలిచ్చిన వారిపైనా కేసులు నమోదు చేయనున్నారు. చదవండి: Hyderabad: హెరిటేజ్ పాల లారీ బీభత్సం.. చెల్లెల్ని బైక్‌పై తీసుకొస్తుండగా -
పబ్ కేసు: ముందు చాలా జరిగింది.. డ్యామిట్ అతడే వల్లే ఇదంతా..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ కేసులో పోలీసు కస్టడీ ముగిసింది. ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌తో పాటు మైనర్ల కస్టడీ నేటితో ముగిసింది. కాగా, కస్టడీలో పోలీసులు పలు విషయాలను రాబట్టారు. ఈ సందర్బంగా పోలీసులు.. ‘‘సామూహిక లైంగిక దాడి ఘటనలో నిందితుల్లో పశ్చాత్తాపం కనిపించలేదు. విచారణ సమయంలో నిందితులు జాలీగా ఉన్నారు. తప్పు చేయలేదన్న ఫీలింగ్‌లో ఉన్నారు. ఇక, వీడియో లీకేజీపై నిందితుల మధ్య గొడవ జరిగింది. వీడియో షూట్ చేసిన ఓ మైనర్‌పై మిగిలిన నిందితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో బయటికి రాకపోయి ఉంటే.. కేసు ఉండదని నిందితులు ధీమా వ్యక్తం చేశారు. మైనర్‌కు కారు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కుమార్తెపై కేసు నమోదైంది. బెంజ్ కారు నడిపిన మైనర్ కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేశాము. బెంజ్ కారును పోలీసులకు చిక్కకుండా కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేశారు. బెంజ్ కారు విషయంలో నిందితుల కుటుంబ సభ్యులు.. పోలీసులను తప్పుదోవపట్టించారు. వక్ఫ్‌బోర్డ్ చైర్మన్‌కు అధికారికంగా కారు కేటాయించలేదు. సొంత కారుపైనే వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ గవర్నమెంట్ స్టిక్కర్ వేసుకున్నారు. ఇంటి నుంచి ఇన్నోవా కారును డ్రైవర్ తీసుకెళ్లాడు. కాన్సూ బేకరీ వద్ద డ్రైవర్‌ను దింపేసి కారును మైనర్లు తీసుకెళ్లారు. ఇన్నోవా కారు దొరక్కుండా ప్రయత్నాలు చేశారు. బాలిక గొంతుపై గాట్లు ఉండటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు ముందే బంజారా హిల్స్‌లోని ఆశ హాస్పిటల్లో మైనర్‌కు సైకియాట్రిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఆమె పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇప్పించారు. తమ కూతురుపై ఎవరో అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానించి, బాలికను పబ్‌కు తీసుకువెళ్లిన హాదీని మైనర్ పేరెంట్స్ ప్రశ్నించారు. మైనర్‌ను పబ్‌కు తీసుకు వెళ్లింది ఎమ్మెల్యే బంధువు కుమారుడని చెప్పడంతో ఘటన బయటకు వచ్చింది. దీంతో, నిందితులు, ఎమ్మెల్యే తనయుడు బాలిక కుటుంబ సభ్యులను బెదిరించారు. ఇక, ఇన్నోవా కారులోనే మైనర్‌పై ఐదుగురు నిందితులు లైంగిక దాడి చేశారు అని వెల్లడించారు. -
Amnesia Pub Incident: ఐదుగురు మైనర్లకు ముగిసిన పోలీస్ కస్టడీ
-
జూబ్లీహిల్స్ పబ్ కేసు: ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణం కాదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక అత్యాచార కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! రొమేనియాకు చెందిన బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని కారులో ఎక్కించుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులోని నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఇప్పటికే క్రైమ్‌సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తాజాగా ఈ ఘటనపై నటుడు సోనూసూద్ స్పందించాడు. ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణమనేది తప్పని వారించాడు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, మనం చూసే విధానం తప్పుగా ఉంటే చెడు ఆలోచనలు వస్తాయని పేర్కొన్నాడు. చదవండి: పెళ్లి చేసుకున్నాం, కానీ మా లైఫ్‌లో పెద్ద ఛేంజ్ ఏం లేదు మైనర్లతో సీన్ రీకన్స్ట్రక్షన్ -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: సాదుద్దీన్ కస్టడీ విచారణలో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ పోలీస్ కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో శాస్త్రీపురం కార్పొరేటర్ కుమారుడు అసలు సూత్రధారి అని సాదుద్దీన్ పోలీసులకు వివరించాడు. కార్పొరేటర్ కుమారుడు, ఎమ్మెల్యే కొడుకు పబ్‌లోకి ఎంటర్ కాగానే అమ్మాయిలను వెతకడం ప్రారంభించారని, పబ్‌లోనూ మైనర్ అమ్మాయిలను వేధించినట్లు పేర్కొన్నాడు. ‘పబ్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు మైనర్ వెంట పడ్డారు. నేను వారిని వద్దని వారించాను. దీంతో నన్ను బెంజ్ కారులో ఎక్కొద్దని ఎమ్మెల్యే కొడుకు ఆదేశించాడు. నన్ను పబ్ దగ్గర వదిలి అమ్మాయిని బెంజ్ కారులో ఎక్కించుకున్నాడు. నేను బెంజ్ కారులో కాకుండా ఇన్నోవాలో బేకరికి వెళ్లాను. బెంజ్ కారులోకి ఎక్కగానే మైనర్ అమ్మాయిని ఏమ్మెల్యే కుమారుడు వేధించడం ప్రారంభించాడు. మార్గ మధ్యలో ఇద్దరు, మరొక ముగ్గురు పెద్దమ్మతల్లి ఆలయం పక్కన ఖాళీ స్థలంలో అఘాయిత్యానికి ఒడిగట్టారు. నా ఫ్రెండ్స్ బలవంతం కారణంగానే నేనూ ఈ అత్యాచారం చేయాల్సి వచ్చింది. వారి ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది’ అని సాదుద్దీన్ పోలీసుల ముందు తెలిపాడు. సంబంధిత వార్త: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసు: అత్యాచార ఉద్ధేశంతోనే పబ్‌కు అయితే అత్యాచారంలో ఎవరి పాత్ర ఎంత ఉందనేది పోలీసులు తేల్చారు. శాస్త్రీపురం కార్పొరేటర్ కుమారుడు ఈ కేసులో అత్యంత కీలక సూత్రధారి అని అతని తరువాత సాదుద్దీన్, వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే సోదరి కొడుకు, సంగారెడ్డి కార్పొరేటర్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు తెలిపారు నిందితుల మధ్య ఘర్షణ మరోవైపు జూబ్లీహిల్స్ పబ్ కేసులోని నిందితుల మధ్య ఘర్షణ జరిగింది. జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లు ప్లేట్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్ కుమారుడు సాదుద్దీన్ టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. నీ వల్లే విషయం బయటకు వచ్చిందని సాదుద్దీన్‌పై మిగతా నిందితులు దాడి చేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. సాదుద్దీన్కు రిమాండ్ అమ్నీషియా పబ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నాంపల్లి కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు సాదుద్దీన్‌ను తరలించారు. -
జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసు: అత్యాచార ఉద్ధేశంతోనే పబ్‌కు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక అత్యాచార కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో తవ్వేకొద్దీ అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. నిందితులు పబ్‌లోకి ఎంటర్ అయ్యే ముందే ఇన్నోవా, బెంజ్ కారులో పోలీసులు కండోమ్ ప్యాకెట్లను తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కండోమ్ ప్యాకెట్లు తెచ్చినట్లు నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. రేప్ ఇంటెన్షన్‌తోనే పబ్‌కు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ కస్టడీ ముగిసింది. కాసేపట్లో అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. అత్యాచార కేసులో మైనర్లతోపాటు సాదుద్దీన్ మాలిక్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. ఈ కేసులో కస్టడీకి తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కుమారుడు, పొరుగు జిల్లా కార్పొరేటర్ కుమారుడు సహా ఐదుగురు మైనర్లతో పోలీసులు ఆదివారం క్రైమ్‌సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పబ్, కాన్సూ బేకరీ, రోడ్ నంబర్ 44లోని పవర్‌స్టేషన్, తిరిగి పబ్ మధ్య వారిని తిప్పుతూ ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు పబ్ నుంచి ఎవరెవరు, ఏ కారులో వెళ్లారు? ఆ రోజు బాధిత బాలిక ఏ కారులో కూర్చుంది? తిరిగి వచ్చే క్రమంలో ఎలా వచ్చారు? ఏయే ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారం చేశారన్న వివరాలను సేకరించి రికార్డు చేశారు. సంబంధిత వార్త: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో దర్యాప్తు ముమ్మరం అయితే సోమవారం మరోసారి అయిదుగురు మైనర్లను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. జువైనల్ హోమ్ నుంచి జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించనున్నారు. సాదుద్దీన్ మాలిక్ రెచ్చగొట్టడం వల్లే తాము బాలికపై అత్యాచారం చేశామంటూ మైనర్లు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ముందుగా ఎమ్మెల్యే కుమారుడే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సాదుద్దీన్ పోలీసులకు తెలిపాడు. -
మైనర్లతో సీన్ రీకన్స్ట్రక్షన్
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో రొమేనియా బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కస్టడీకి తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కుమారుడు, పొరుగు జిల్లా కార్పొరేటర్ కుమారుడు సహా ఐదుగురు మైనర్లతో పోలీసులు ఆదివారం క్రైమ్‌సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పబ్, కాన్సూ బేకరీ, రోడ్ నంబర్ 44లోని పవర్‌స్టేషన్, తిరిగి పబ్ మధ్య వారిని తిప్పుతూ ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు పబ్ నుంచి ఎవరెవరు, ఏ కారులో వెళ్లారు? ఆ రోజు బాధిత బాలిక ఏ కారులో కూర్చుంది? తిరిగి వచ్చే క్రమంలో ఎలా వచ్చారు? ఏయే ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారం చేశారన్న వివరాలను సేకరించి రికార్డు చేశారు. అనంతరం మైనర్లను జువెనైల్ హోమ్‌కు తరలించారు. సోమవారం ఉదయం వీరిని ఠాణాకు తీసుకువచ్చి మళ్లీ విచారించనున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌తో ఇప్పటికే క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. సాదుద్దీన్ కస్టడీ గడువు ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. సాదుద్దీన్ చెప్పిన వివరాలు, మైనర్లు చెప్పిన వివరాలను పోల్చి చూడనున్నారు. రెండుసార్లు ‘గుర్తింపు’ పరేడ్ సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితు డు సాదుద్దీన్, మిగతా ఐదుగురిని బాలిక గుర్తించి కన్ఫర్మ్ చేయాల్సిన ‘టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ (టీఐపీ)’ విషయంలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. బాలికతో రెండు సార్లు, వేర్వేరు ప్రాంతాల్లో టీఐపీ చేయించడం అనివార్యంగా మారింది. రెండు వేర్వేరు కోర్టుల్లో కేసు విచారణ జరుగుతుండటం.. సాదుద్దీన్ చంచల్‌గూడ జైల్లో, మైనర్లు జువెనైల్ హోంలో ఉండటమే దీనికి కారణమని పోలీసులు చెప్తున్నారు. మేజర్ అయిన సాదుద్దీన్కు సంబంధించి నాంపల్లిలోని పోక్సో ప్రత్యేక కోర్టులో, మైనర్లకు సంబంధించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని జువెనైల్ జస్టిస్ కోర్టులో సోమవారం టీఐపీ పిటిషన్లను దాఖలు చేయనున్నారు. టీఐపీ’ చేసేదిలా.. గ్యాంగ్ రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి శిక్ష పడాలంటే.. సాక్షులతో ‘టీఐపీ’ నిర్వహణ చాలా కీలకం. డిజిగ్నేటెడ్ న్యాయమూర్తి సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. నిందితులను పోలిన వయసు, శారీరక లక్షణాలున్న వారిని దాదాపు ఆరు నుంచి పది మందిని ఎంపిక చేస్తారు. వారి మధ్యలో నిందితులను ఉంచి.. బాధితులు, సాక్షులను పిలిచి గుర్తించాలని కోరుతారు. నిందితుల స్థానాన్ని రెండు, మూడు సార్లు మార్చి మళ్లీ గుర్తించాలని కోరుతారు. పరేడ్‌లో పాల్గొనే బాధితులు/సాక్షులకు ముసుగు వేయడం లేదా ప్రత్యేకమైన అద్దం వెనుక ఉంచడం ద్వారా.. వారిని నిందితులు గుర్తించకుండా జాగ్రత్త పడతారు. తాజా కేసులో.. అమ్నీషి యా పబ్, కాన్సూ బేకరీ, ఇతర ప్రాంతాల్లో నిందితులను చూసిన వారితో (సాక్షులతో) కూడా టీఐపీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని జైళ్లలో కేవలం శనివారం మాత్రమే టీఐడీ పరేడ్లు జరుగుతున్నాయి. దీనికి ఏర్పాటు చేయాల్సిందిగా ముందుగా జైలు అధికారులకు లేఖ రాయాల్సి ఉంటుంది. వీలును బట్టి జువెనైల్ హోమ్‌లోనూ టీఐపీ పరేడ్ నిర్వహించనున్నారు. -
జూబ్లీ హిల్స్ కేసులో కీలక వీడియో లభ్యం..!!
-
Jubilee Hills Pub Case: జూబ్లీ హిల్స్ కేసు సీన్ ను రీ-కన్ స్ట్రక్షన్ చేస్తున్న పోలీసులు
-
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన.. టాటూలా ఉండాలనే మెడపై కొరికినట్లు..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఘటన జరిగి 15 రోజులు కావొస్తున్నా.. నిత్యం కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచార కేసులోని ఆరుగురు నిందితులను పోలీసులు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులోని A1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడి నేటీతో ముగియనుంది. నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మొత్తం ఆరుగురిని పోలీసులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అయిదుగురు మైనర్లతో పాటు సాదుద్దీన్‌ను విచారించనున్నారు. పోలీసులు శనివారం నిందితులందరికి ఉస్మానియాలో పొటెన్సీ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఐదుగురు మైనర్లను జువెనైల్ హోంకు, సాదుద్దీన్ మాలిక్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇక ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్టు కీలకంగా మారనుంది. ఈ మెడికల్ రిపోర్టు ప్రకారం లైంగిక దాడి సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ సమయంలో మైనర్ లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమె మెడపై కొరకడం వంటి దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్ శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే టాటూలా ఉండాలనే మెడపై కొరికినట్లు నిందితుల వాగ్మాలం ఇచ్చారు. బాలిక ప్రతిఘటించడంతో గాయాలైనట్లు ఒప్పుకున్నారు. చదవండి: మైండ్ బ్లోయింగ్: అమ్నేషియా పబ్ కేసులో మరో ట్విస్ట్ -
జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన: బాధితురాలిని ట్రాప్ చేసింది ఎవరంటే..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ సామూహిక అత్యాచార ఘటనలో.. పోను పోను సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే మనవడు, పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్ రిమాండ్‌లో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. కార్పొరేటర్ కుమారుడే బాధితురాలిని ట్రాప్ చేశాడన్న నిందితులు వెల్లడించారు. పబ్‌లో బాధితురాలితో, కార్పొరేటర్ కుమారుడు అనుచిత ప్రవర్తించాడు. మళ్లీ పబ్ బయటకు వచ్చాక కార్పొరేటర్ కొడుకే మాయమాటలు చెప్పి ట్రాప్ చేశాడు. ఆపై ఆమెను కారులో ఎక్కించాడని నిందితులు వెల్లడించారు. ‘‘బెంజ్ కారులో మొదట ఎమ్మెల్యే కుమారుడు.. బాధితురాలిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతని తర్వాత.. కార్పొరేటర్ కొడుకు అసభ్యంగా వ్యవహరించాడు. కాన్సూ బేకరీ దగ్గరికి వెళ్లేసరికి ముందు సీట్లో నుంచి సాదుద్దీన్ వెనక సీట్లోకి మారాడు. ఆమెపై సాదుద్దీన్ లైంగిక దాడి చేశాడు. కాన్సూ బేకరీ దగ్గర బాధితురాలిని కార్లోనే కూర్చోబెట్టాం. బేకరీలో అందరూ ఫుడ్‌తిని, సిగరెట్లు తాగాం. అక్కడి నుంచి అంతా కలిసి ఇన్నోవా కారులో పబ్‌కి బయల్దేరాం. ఆమె సెల్‌ఫోన్, కళ్లద్దాలను బలవంతంగా లాక్కున్నాం. అవి కావాలంటే ఇన్నోవా ఎక్కాలని బెదిరించాం. కారులో ఒకరి తర్వాత ఒకరం లైంగిక దాడి చేశాం’’ అని నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అమ్నీషియా పబ్ రేప్ కేసులో జువనైల్స్‌ని కస్టడీకి అనుమతించింది కోర్టు. దీంతో రేపటి నుంచి నాలుగు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతి దొరికినట్లయ్యింది. ఇప్పటికే ఈ కేసులో ఏ-1గా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను విచారిస్తున్నారు. ఐదుగురిని కలిసి రేపటి నుంచి విచారించనున్నారు. చదవండి: బాధితురాలి రెండో స్టేట్మెంట్లో సంచలన విషయాలు -
జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్
-
హైదరాబాద్: పబ్బుల్లో ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌లో ఓ మైనర్ బాలిక డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కూకట్‌పల్లిలోని క్లబ్ మస్తీ రెస్టో బార్ అండ్ పబ్‌పై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి.. అశ్లీల నృత్యాలు చేస్తున్న 9 మంది యువతులతో పాటు మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలకు మారిపోయిన పబ్‌లపై సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక నిఘా పెట్టారు. పబ్‌లలో మద్యం, ధూమపానం, కస్టమర్లను ఆకర్షించేందు కు మహిళలతో నృత్యాలను నియంత్రించని, నిబ ంధనలు పాటించని యజమానులపై చర్యలు తీసుకోనున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లోని పబ్‌లు, రిసార్ట్లు, ఫామ్ హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు, ఓయో రూమ్స్‌లపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆయా ప్రాంతాలలో పగలు, రాత్రి వేర్వేరు సమయాల్లో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అనుమానం వస్తే వెంటనే తనిఖీలు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 800 మంది నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలో అందులో వివరించారు. వీటిని అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటన్నింటినీ కలిపి ఒకటే గ్రూప్‌లోకి తీసుకొచ్చారు. పబ్బుల్లో ఏం జరుగుతోంది? ఎవరు బుకింగ్ చేసుకుంటున్నారు? వేడుకలు, ఈవెంట్లు, పార్టీలకు సంబంధించిన వివరాలు, ఎంత మంది హాజరవుతున్నారనే వివరాలు పోలీసులకు ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. అనుమానం ఉంటే వెంటనే తనిఖీలు చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. సత్ప్రవర్తనకు బాండ్ పేపర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారితో సీపీ కార్యాలయంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కొంతమంది పాత నేరస్తులు హత్యలు తదితర కేసులలో ఉన్నటువంటి వారు సత్ప్రవర్తనతో మెలగడానికి, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉండేందుకు హామీ ఇవ్వాలని ఆదేశించారు. ఇద్దరు జామీనుదారులతో పాటు, రూ.50 వేల హామీ బాండ్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. అతిక్రమించిన వారిపై సెక్షన్ 107/122 సీఆర్పీసీ ప్రకారం ఏడాది జైలు శిక్ష విధిస్తామని చెప్పారు. సమావేశంలో క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ శింగేనవర్, ఏసీపీ రవిచంద్ర పాల్గొన్నారు. -
వీడియోలు బయటకు, రఘునందన్‌పై కేసు.. ఎమ్మెల్యే రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి తనపై కేసులు పెడితే లీగల్‌గా ఎదుర్కొంటానని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు తెలిపారు. నోటీసులు ఇచ్చినా, పోలీసులు అరెస్ట్ చేసేం దుకు వచ్చినా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పార్టీ కార్యాల యంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం జరిగే దాకా బాధితురాలి పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేద న్నారు. అమ్నీషియా పబ్ మైనర్ అమ్మాయి కేసులో కాంగ్రెస్ నేతల పిల్లలు కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలో నిందితులకు శిక్ష పడే వరకు బండి సంజయ్ నేతృత్వంలో పోరాడుతామని పేర్కొన్నారు. సంబంధిత వార్త: Amnesia Pub Case: ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: ఆరుగురిలో ఐదుగురు మైనర్లే!
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన.. కీలక వివరాలు వెల్లడించిన సీపీ
సాక్షి, హైదరాబాద్: సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన నగర కమిషనర్.. ఈ కేసులో నిందితులు మైనర్లు కాబట్టి పేర్లు, ఇతర వివరాలు వెల్లడించడం కుదరని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ కేసును లోతుగా దర్యాప్తు చేశాం. ఆరుగురిలో ఒకరు మేజర్, ఐదుగురు మైనర్లు. కేసులో మైనర్లు ఉన్నందున పేర్లు చెప్పడం లేదు. మార్చి 28న ఈ వ్యవహారం మొదలైంది. బెంగళూరులో ఉండే ఒక స్టూడెంట్.. స్కూల్ మొదలుకాక ముందు పార్టీ చేసుకోవాలని హైదరాబాద్‌లో స్నేహితులతో ప్లాన్ చేశాడు. అందుకోసం అమ్నీషియా పబ్‌ను ఎంచుకుని.. ఏప్రిల్‌లో పార్టీ గురించి పోస్ట్ చేశాడు. నాన్ ఆల్కాహాలిక్, స్మోకింగ్ పార్టీ కోసం అప్లై చేసుకున్నారు. ఉస్మాన్ అలీఖాన్ అనే వ్యక్తి ద్వారా పబ్‌ను బుక్ చేయించారు. మే 28వ తేదీన పార్టీ గురించి సదరు స్టూడెంట్ మళ్లీ పోస్ట్ చేశాడు. మే 28వ తేదీన మధ్యాహ్నాం బాధితురాలు పబ్‌కు వెళ్లింది. నిందితులు.. పబ్‌లో ముందుగానే పథకం వేసుకున్నారు. ఆమె ఫాలో చేసి ట్రాప్ చేశారు. అదే రోజు సాయంత్రం రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర బాధితురాలిని వదిలిపెట్టారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. భరోసా సెంటర్లో కౌన్సెలింగ్ తర్వాత బాధితురాలు వివరాలు చెప్పింది. ఆ తర్వాత మరికొన్ని సెక్షన్లు నమోదు చేశాం. పబ్, బేకరి వద్ద అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలించాం. ఏ1 సాదుద్దీన్‌తో పాటు మైనర్ నిందితులు, బాధితురాలు వాహనంలో వెళ్లారు. మైనర్‌తో పాటు సాదుద్దీన్ బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నిందితులను బాధితురాలు గుర్తించలేకపోయింది. ఆధారాలతో సహా జూన్ 2వ తేదీన నిందితులను గుర్తించాం. జూన్ 3న సాదుద్దీన్‌ను అరెస్ట్ చేశాం. ఏ1 సాదుద్దీన్‌తో పాటు మిగతా వాళ్లపై కేసు నమోదు అయ్యింది. సాదుద్దీన్‌తో పాటు నలుగురిని అరెస్ట్‌చేశాం. మరొకరి కోసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశాం. దర్యాప్తు చాలా పారదర్శకంగానే జరిగిందని.. పలు కోణాల్లో దర్యాప్తు చేయడం వల్లే ఆలస్యమైందని చెప్పారు. ఇలాంటి కేసుల్లో శిక్షలూ కఠినంగానే ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. పబ్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. -
జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
-
ఆమ్నీషియా పబ్ కేసు.. మరో మైనర్తోనూ అసభ్యంగా..!
సాక్షి, హైదరాబాద్/ బంజారాహిల్స్: రొమేనియా బాలికపై జరిగిన ఘాతుకం కేసుకు సంబంధించి మరో కోణంలోనూ పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఈ నేరానికి పాల్పడిన నిందితులు ఆమ్నేషియా పబ్‌లో మరో బాలికతోనూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ అంశం రొమేనియా బాలిక వాంగ్మూలంతో వెలుగులోకి వచి్చనా ఇప్పటివరకు తదుపరి చర్యలు తీసుకోలేదు. అలా చేస్తే నిందితులపై మరో కేసు నమోదవుతుందనే ఒత్తిళ్ల నేపథ్యంలోనే పోలీసులు మిన్నకుండిపోయారని తెలుస్తోంది. మరోపక్క ‘కారులో బాలిక’ వీడియోలను వైరల్ చేసిన మూడు యూట్యూబ్ చానళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటిని మీడియాకు విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై చర్యలు తీసుకునే అంశంలోనూ పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. అది కాలేజీ పార్టీ కాదు ... ఆమ్నేíÙయా పబ్‌లో గత నెల 28న జరిగింది ఓ కార్పొరేట్ స్కూల్‌కు సంబంధించిన ఫేర్వెల్ పార్టీ అని ఇప్పటివరకు భావించారు. పబ్ సిబ్బందిని క్షుణ్ణంగా విచారించిన పోలీసులు అది ఓ ప్రైవేట్ పార్టీగా తేల్చారు. నగరానికి చెందిన హాదీ, సుల్తాన్ తదితరులు వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారు. హాదీ రొమేనియా బాలికను పార్టీకి హాదీ తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు వీళ్లు వెళ్లగా... 3.15 గంటలకు నిందితులు వచ్చారు. పబ్‌లోనే ఈమెకు మరో బాలికతో పరిచయమైంది. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో సమీపించిన సాదుద్దీన్, ఉమేర్లతో పాటు మిగిలిన నిందితులు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో విసుగు చెందిన బాలికలు ఇద్దరూ పార్టీ ముగియడానికి ముందే పబ్ నుంచి బయటకు వచ్చేశారు. మరో బాలిక క్యాబ్‌లో వెళ్లిపోగా.. హాదీ కోసం ఎదురుచూస్తూ రొమేనియా బాలిక బయటే ఆగింది. ఈ సమయంలో బయటకు వచి్చన ఎమ్మెల్యే కుమారుడు, నిందితులు ఆకర్షణీయమైన మాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నారు. ఈ వ్యవహారంలో సదరు కార్పొరేటర్ కుమారుడు కీలకంగా వ్యవహరించాడు. కాగా కారులోనూ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కాన్సూ బేకరీ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి వెళ్లిపోవడానికి బాలిక సిద్ధమవగా.. ఇంటి వద్ద దింపుతామన్న నిందితులు, బెంజ్ కారులో పెట్రోల్ అయిపోయిందని చెప్పి ఇన్నోవాలో ఎక్కించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఎమ్మెల్యే కుమారుడు బేకరీ వద్ద నుంచే వెళ్లిపోయాడు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత నిందితులు బేకరీకి వచ్చారు. తాము ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫోటో దిగి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేశారు. అక్కడ నుంచి ఎవరి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ వివరాలు రొమేనియా బాలిక, నిందితుల వాంగ్మూలాల్లో బయటకు వచ్చాయి. పోక్సో చట్టం కింద కేసు నమోదుకు అవకాశం చిన్నారులపై జరిగే లైంగిక దాడులు నిరోధించడానికి ఉద్దేశించిన పోక్సో చట్ట ప్రకారం ఏదైనా నేరం జరిగిందని తెలిసీ ఫిర్యాదు చేయకపోవడం, తదుపరి చర్యలు తీసుకోకపోవడం సైతం నేరమే. అలాగే పబ్‌లో మరో బాలిక పట్ల సాదుద్దీన్, ఉమేర్ తదితరులు అసభ్యంగా ప్రవర్తించడమూ నేరమే అవుతుంది. దీనికి సంబంధించి ఆ బాలిక లేదా ఆమె సంబం«దీకుల నుంచి వాంగ్మూలం నమోదు చేసి పోక్సో చట్టం కింద మరో కేసు రిజిస్టర్ చేయడానికి ఆస్కారం ఉంది. కానీ నగర పోలీసులు మరో బాలికను గుర్తించి, వాంగ్మూలం నమోదు చేయడం దిశగా చర్యలు తీసుకోలేదు. ఆమెపై జరిగిన అసభ్య ప్రవర్తన విషయం తెలిసినప్పటికీ మిన్నకుండిపోయారు. సోమవారం పోలీసులు పబ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడూ ఈ దృశ్యం వారికి స్పష్టంగా కనిపించింది. నిందితుల రిమాండ్ రిపోర్టులోనూ ఈ అంశాలను పోలీసులు చేర్చారు. ఎమ్మెల్యే కుమారుడికి చెక్ పెట్టేందుకే వీడియో? ఈ ఉదంతానికి సంబంధించి బయటకువచి్చన వీడియోల చిత్రీకరణ వెనుక మరో కోణం ఉన్నట్లు నిందితుల విచారణ సందర్భంగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే కుమారుడు, ఈ కేసులో నిందితులు స్నేహితులే అయినప్పటికీ వారి మధ్య కొన్ని స్పర్ధలు ఉన్నాయి. ఎమ్మెల్యే కుమారుడు వీరిపై ఆధిపత్యం చెలాయిస్తుండేవాడని సమాచారం. దీంతో అతడికి చెక్ పెట్టడానికి అవకాశం కోసం మిగిలిన వాళ్లు ఎదురు చూశారు. బెంజ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే కుమారుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది చూసిన ఉమేర్ తన ఫోన్‌ను ముందు సీట్లో కూర్చున్న వ్యక్తికి ఇచ్చి రికార్డు చేయించాడు. దీని ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడిని బెదిరించాలని వాళ్లు భావించారు. అయితే దారుణం బయటకు వచ్చి కేసు నమోదు కావడం, పోలీసుల గాలింపు నేపథ్యంలో వీడియోలను మరో రకంగా వాడుకున్నారు. ఆ ఉదంతంలో తమ తప్పు లేదని, బాలిక సమ్మతితోనే అంతా జరిగిందని చెప్పడానికి ఎంపిక చేసుకున్న వారికి ఓ నిందితుడి తండ్రి లీక్ చేశాడు. ఇలా చేసిన వ్యక్తితో పాటు నిందితులకు ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం ఇచి్చన వారికీ నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేపై కేసు వద్దంటూ ఒత్తిళ్లు... సంబంధించిన కారులోని వీడియోలు వైరల్ చేస్తున్న యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియాపై చర్యలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే యూట్యూబ్‌ను పరిశీలించిన అధికారులు ఈ వీడియోలు పోస్టు చేసిన మూడు యూట్యూబ్ చానళ్లను గుర్తించారు. ఆదివారం వాటిపై సుమోటో కేసులు నమోదు చేసిన అధికారులు ఓ చానల్ రిపోర్టర్‌కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. అయితే బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కుమారుడిపైనా, ‘కారులో బాలిక’వీడియోలను మీడియాకు విడుదల చేసిన ఎమ్మెల్యే రఘునందన్‌రావుపైనా కేసు నమోదు చేసే విషయంలో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. చట్ట ప్రకారం ఈయనపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేస్తున్నాయి. అయితే అలా చేస్తే అది రాజకీయ ఇబ్బందులకు కారణమవుతుందంటూ పోలీసులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది. న్యాయస్థానంలో బాలిక వాంగ్మూలం జూబ్లీహిల్స్ పోలీసులు రొమేనియా బాలికను సోమవారం న్యాయస్థానానికి తీసుకువెళ్లి మేజి్రస్టేట్ ఎదుట హాజరుపరిచారు. ఆయన సమక్షంలో బాధితురాలి నుంచి మరోసారి వాంగ్మూలం సేకరించారు. దీని ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడిని ఆరో నిందితుడిగా చేర్చాలని ఎట్టకేలకు పోలీసులు నిర్ణయించారు. మరోపక్క ఫోరెన్సిక్ నిపుణులు సోమవారం మరోసారి బెంజ్, ఇన్నోవా కార్లను తనిఖీ చేసి పలు నమూనాలు సేకరించారు. -
జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో మరొకరు అరెస్ట్
-
జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో మరో మలుపు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మైనర్‌పై అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా బాలిక అత్యాచారం కేసులో మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఓ ఎంఐఎం కార్పొరేటర్ని పోలీసులు విచారించనున్నారు. సదరు కార్పొరేటర్ని విచారణకు రావాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులు ఆదేశించినట్లు సమాచారం. గతంలో హైదరాబాద్ మాజీ మేయర్‌గా ఆ కార్పొరేటర్ సేవలందించారు. ఈ కేసులో నిందితులకు సహకారం చేశాడని కార్పొరేటర్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. కారులో మొయినాబాద్ వరుకు కార్పొరేటర్ వెళ్లినట్టు, నిందితులకు సహకరించినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. చదవండి: ఉత్తర ప్రదేశ్‌లో అమానుషం.. కస్టడీలో ఉన్న వ్యక్తికి కరెంట్ షాక్, లాఠీ దెబ్బలు -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: చిక్కిన ఐదుగురు నిందితులు
-
జూబ్లీహిల్స్ పబ్ కేసు: చిక్కిన నిందితులు.. వారి బ్యాక్ గ్రౌండ్ ఇదే..
జూబ్లీహిల్స్‌లో ఓ మైనర్‌పై అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అమ్నీషియా పబ్ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మైనర్‌తో పాటు ఉమేర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారు. కాగా, నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా పోలీసులు గుర్తించారు. నిందితులు వీరే.. A1.. సాదుద్దీన్(ఎంఐఎం నేత కొడుకు) A2.. ఉమేర్‌ఖాన్(ఎమ్మెల్యే సోదరుడి కొడుకు) మైనర్-1.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు మైనర్-2.. ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు మైనర్-3.. సంగారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ కొడుకు ఉన్నారు. ఇదిలా ఉండగా.. మైనర్‌పై అత్యాచార కేసుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరా రాజన్ స్పందించారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. 2 రోజుల్లో నివేదికను అందించాలని ఆదేశించారు. మరోవైపు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు.. లైంగిక దాడి అనంతరం కారులో మొయినాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్‌లో ఆశ్రయం పొందారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: అత్యాచారం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేసీఆర్‌కు బండి లేఖ -
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం
-
అమ్నీషియా పబ్ కేసు: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ!
సాక్షి, హైదరాబాద్: అమ్నీషియా పబ్ అత్యాచార ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌కు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారాయన. ఈ ఘటనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని, నాలుగు రోజులు గడుస్తున్నా పోలీస్ శాఖ పనితీరు అనుమానాకు తావిస్తోందని లేఖలో ఆయన ఆరోపించారు. ఘటనలో కేసీఆర్ రాజకీయ మిత్రుల వారసుల పేర్లు ప్రముఖంగా మీడియాలో, సోషల్ మీడియాలో వినిస్తున్నాయని తెలిపారు. అనుమానాలు నివృత్తి చేసి.. సంఘటనపై స్పష్టత ఇప్పించాలని తెలంగాణ బీజేపీ తరపున కోరుతున్నట్లు లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ.@TelanganaCMO pic.twitter.com/uwr4ivDW5c — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 4, 2022 చదవండి: అమ్నీషియా పబ్ కేసు: సంచలన ఫొటోలు, వీడియోలు బయటకు.. -
అమ్నీషియా పబ్ కేసు: కారులో ఉంది ఎమ్మెల్యే కొడుకే!
-
అమ్నీషియా పబ్ కేసులో కీలక మలుపు.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఐదుగురు వ్యక్తులు ఓ మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారు. కాగా, బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదులో పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఒక మేజర్, ఇద్దరు మైనర్లు ఉన్నారు. సాజిద్ మాలిక్ (18 ), వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు (16)తో పాటు మరో మైనర్ (16)ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ధృవీకరించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. ఇది కూడా చదవండి: పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం.. అసలేం జరిగింది? -
అమ్నీషియా పబ్ కేసు: బెంజ్‌కారులో అత్యాచారం.. ఇన్నోవా కారులోని వారి అరెస్టా?
సాక్షి, హైదరాబాద్: రొమేనియా బాలికపై అత్యాచారం ఘటనలో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడని.. కానీ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. బెంజ్ కారులో అత్యాచారం జరిగితే.. ఇన్నోవాలో ఉన్న వారిని అరెస్ట్ చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బెంజ్ కారులో ఉన్న వారినెవరినీ ముద్దాయిలుగా చూపకపోవడం బాధాకరమన్నారు. అత్యాచార ఘటనకు సంబంధించి తాము సేకరించిన ఫొటోలు, వీడియోలను శనివారం బీజేపీ కార్యాలయంలో మీడియాకు విడుదల చేశారు. ఎరుపు రంగు బెంజ్ కారులో బాధితురాలిపై ఎమ్మెల్యే కుమారుడు, ఇతరులు లైంగిక దాడి చేశారని నిరూపించడానికి ఈ ఆధారాలు ఉపయోగపడతాయన్నారు. క్లీన్చిట్ ఎలా ఇస్తారు? అత్యాచార ఘటనతో సంబంధమున్న వారి ని ఇతర రాష్ట్రాలు, దేశాలకు పంపించినట్టు.. కొందరిని దుబాయ్ విమానం ఎక్కించినట్టు తనకు సమాచారం ఉందని రఘునందన్‌రావు తెలిపారు. ఈ కేసు చల్లబడ గానే వారిని తిరిగి హైదరాబాద్‌కు రప్పించుకునే ప్లాన్‌లో ఉన్నారని.. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దోషులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు విచారణ జరపకుండానే ఘటనలో ఎమ్మెల్యే కొడుకు లేడని, హోంమంత్రి మనవడి ప్రమేయం లేదని క్లీన్చిట్ ఎలా ఇస్తా రని నిలదీశారు. పబ్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న, అత్యాచార ఘటనలో పాల్గొనవారి ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని.. హైకోర్టుకు సమర్పించి.. సీబీఐ విచారణ కోరుతామన్నారు. పోలీసులకు ఆధారాలు ఇచ్చేందుకు తాను సిద్ధమేనని.. కానీ పోలీసులు వాటిని ధ్వంసం చేసి అంతా ఉత్తుత్తివేనంటే పరిస్థితి ఏమిటనే అనుమానం ఉందన్నారు. ఎంఐఎం వారిని కాపాడేందుకు.. అత్యాచార ఘటనలో ఎంఐఎం వారిని కాపాడేందుకు టీఆర్ఎస్ వారిని బలిపశువులను చేస్తున్న విషయాన్ని కేటీఆర్ గ్రహించడం లేదని రఘునందన్ అన్నారు. హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థ మొత్తాన్ని ఎంఐఎం నేతలే నడిపిస్తున్నారని.. ఈ కేసులో వాళ్లు చెప్పినట్టే ఎఫ్ఐఆర్లలో పేర్లు, విచారణ జరుగుతోందన్నారు. దోషులకు శిక్షపడే దాకా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.. ఈ ఘటనపై సీబీఐతోగానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోగానీ విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను రఘు నందన్‌రావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోలీసులను ఎంఐఎం నేతలు కీలుబొమ్మలుగా చేసి ఆడిస్తున్నారని.. అందుకే సీబీఐ, హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నట్టు తెలిపారు. -
కూకట్ పల్లి పబ్ లో చీకటి గుట్టు రట్టు
-
ఆ పబ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం: డీసీపీ శిల్పవల్లి
-
అమ్నీషియా పబ్ కేసు: ఇంట్లో డ్రాప్ చేస్తామంటూ బాలికను కారులో తీసుకెళ్లిన నిందితులు
-
కూకట్పల్లి పబ్‌లో యువతుల అర్ధనగ్న నృత్యాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో పబ్ కల్చర్ పెరిగిపోతోంది. దీంతో పబ్ నిర్వాహకులు ఇష్టారీతిలో రూల్స్‌ను బ్రేక్ చేస్తూ పబ్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ‘సాక్షి’ నిఘాతో కబ్ల్ మస్తీ పబ్ చీకటి గుట్టు బయటలకు వచ్చింది. మరో పబ్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. వివరాల ప్రకారం.. కేపీహెచ్బీలో మంజీరా మెజిస్టిక్ కమర్షియల్‌లోని క్లబ్ మస్తీ పబ్‌లో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పబ్‌లో యువతులతో అర్ధనగ్న నృత్యాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా పబ్ యజమాన్యం పరిమితికి మించి డీజే సౌండ్‌తో పబ్ నడుపుతోంది. ఈ పోలీసుల దాడుల్లో భాగంగా పబ్‌లో 9 మంది యువతులు, మేనేజర్ ప్రదీప్, డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, పబ్ యజమాని శివప్రసాద్, మేనేజర్లు, కృష్ణ పరారీలో ఉన్నారు. ఇక, డీజే మిక్సర్, హుక్కా ప్లేయర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అనంతరం ఎస్ఓటీ పోలీసులు నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. అయితే, కస్టమర్లను ఆకర్షించేందుకే పబ్ యాజమాన్యం అమ్మాయిలతో ఇలా అర్ధనగ్న నృత్యాలు చేపిస్తున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: ఆమ్నేషియా పబ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత -
బాలికపై సామూహిక అత్యాచారం, ఆనంద్ మహీంద్రా ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో బాలికపై ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల యువకులు అత్యాచారానికి పాల్పడ్డారన్న వార్తలపై మహీంద్రా గ్రూపు చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘‘ఆ యువకులు ఎవరో నాకు తెలియదు. కానీ వార్తల్లో వారిని ఉద్దేశించిన ప్రస్తావన సరికాదని నా అభిప్రాయం. ఆ యువకులు ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల వారు కాదు.. సంస్కృతి, మానవతా విలువలు లేని, సరైన పెంపకం తెలియని ‘దిగువ స్థాయి’ కుటుంబాల వారు అనడం సరైనది. బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా..’’ అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. I don’t know these boys but may I suggest that the headline is inappropriate? These boys are not from ‘influential’ families but from ‘poor’ families. Families that are ‘poor’ in culture, upbringing & human values. May justice be delivered. https://t.co/Z22kok8cp1 — anand mahindra (@anandmahindra) June 3, 2022 -
బాలికపై సామూహిక అత్యాచారం
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున కారులో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పబ్ నుంచి ఇంట్లో దింపేస్తామంటూ కారు ఎక్కించుకున్న ఐదుగురు దుండగులు.. నిర్మానుష్యమైన గల్లీల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆందోళనకు లోనైన బాలిక ముభావంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం.. పోలీసులు లోతుగా ఆరా తీయడంతో ఈ దారుణం బయటపడింది. నిందితుల్లో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్ కుమారుడు, మరో ఇద్దరు మైనర్లుకాగా.. పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్ మాలిక్ (18), బంజారాహిల్స్‌కు చెందిన ఉమేర్‌ఖాన్ ఉన్నారు. వీరిలో సాదుద్దీన్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మసీవుల్లాఖాన్ కుమారుడి ఆచూకీ గుర్తించారు. అతడు మైనర్ కావడంతో శనివారం ఉదయం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అప్పటివరకు అతడిపై ప్రత్యేక బృందంతో నిఘా వేసి ఉంచారు. ఇక ఉమేర్ ఖాన్, మరో ఇద్దరు మైనర్ల కోసం గాలిస్తున్నారు. వీరిలో సంగారెడ్డికి చెందిన ఓ కార్పోరేటర్ కుమారుడు కూడా ఉన్నట్టు సమాచారం. ఏం జరిగింది? మే 28న కొందరు విద్యార్థులు జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌లో పార్టీ చేసుకున్నారు. కొందరు స్నేహితులూ ఆ పార్టీకి వచ్చారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడితో కలిసి బాలిక పబ్‌కు వెళ్లింది. పబ్‌లో ఐదుగురు వ్యక్తులు ఆ బాలికతో మాటలు కలిపారు. ఆమెపై అఘాయిత్యానికి ప్లాన్ వేసుకున్నారు. ఇంటి దగ్గర దింపుతా మంటూ కారు ఎక్కించుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి ప్రాంతంలోని గల్లీల్లోకి తీసుకెళ్లి.. ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి పబ్ వద్ద వదిలేసి వెళ్లారు. ఇంటికి వెళ్లిన బాలిక ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు నిలదీశారు. తనను కొందరు వేధించారని చెప్పడంతో 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను ‘భరోసా’ కేంద్రానికి తీసుకెళ్లారు. మహిళా అధికారులు, నిపుణులు సేకరించిన వాంగ్మూలం, వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా తేలింది. దీంతో రేప్ సెక్షన్లను నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. ఒకరిని అరెస్టు చేసి మరొకరిపై నిఘా పెట్టారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. కాలేజీ పార్టీకని వెళ్లి.. బంజారాహిల్స్‌లో నివాసముండే రొమేనియా దేశానికి చెందిన బాలిక (17) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న హాదీ అనే యువకుడితో బాలిక కుటుంబానికి పరిచయం ఉంది. అతడు చదువుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని అమ్నీషియా ఇన్సోమియా పబ్‌లో ఫ్రెషర్స్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. దానికి తనతోపాటు రమ్మని హాదీ బాలికను ఆహ్వానించాడు. గత నెల 28న మధ్యాహ్నం 1.30 గంటలకు హాదీతోపాటు సూరజ్ అనే స్నేహితుడితో కలిసి బాలిక అమ్నీషియా పబ్‌కు వెళ్లింది. ఇది నాన్ ఆల్కహాలిక్, నాన్ స్మోకింగ్ పార్టీగా విద్యార్థులు ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రచారం చేసుకున్నారు. మొత్తం 150 మంది వరకు వస్తారంటూ కాలేజీ నుంచి లెటర్ తీసుకువచ్చినప్పటికీ 182 మంది వచ్చారు. వీరిలో సదరు కాలేజీ విద్యార్థుల స్నేహితులు కూడా ఉన్నారు. రొమేనియన్ బాలిక స్నేహితులతో కలిసి సాయంత్రం 5.30 గంటల దాకా పబ్‌లో గడిపింది. ఈ సమయంలో ఆమెకు సాదుద్దీన్, ఉమేర్‌ఖాన్, మిగతా ముగ్గురు మైనర్లు (మసీవుల్లాఖాన్ కుమారుడు సహా)తో పరిచయమైంది. అయితే ఈ ఐదుగురూ పబ్‌కు తమ వెంట తెచ్చుకున్న మద్యం తాగినట్టు సమాచారం. పార్టీ ముగిశాక హాదీ బిల్లు చెల్లించే పనిలో ఉండగా.. సాదుద్దీన్, ఉమేర్, మిగతా ముగ్గురు తాము ఇంటివద్ద దింపుతామంటూ ఆ బాలికను బయటికి తీసుకువచ్చారు. అప్పటికే ఆ బాలికపై అఘాయిత్యానికి పథకం వేసుకున్నారు. పథకం ప్రకారం కారులో ఎక్కించుకుని.. పబ్ బయట కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ముగ్గురు ఎరుపు రంగు బెంజ్ కారులో బాలికను ఎక్కించుకుని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని కాన్‌సీయూ బేకరీకి తీసుకొచ్చారు. మిగతా ఇద్దరు ఇన్నోవా కారులో వారిని అనుసరించారు. అందరూ బేకరీలో దాదాపు 20 నిమిషాలపాటు ఉన్నారు. తర్వాత బెంజ్ కారును అక్కడే వదిలేశారు. ఐదుగురూ ఇన్నోవా కారులో బాలికను ఎక్కించుకున్నారు. బాలికను ఇంటివద్ద దింపుతామంటూ.. పెద్దమ్మ గుడి సమీపంలోని గల్లీల్లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారు అద్దాలన్నీ మూసేసి.. ఒకరి తర్వాత ఒకరుగా కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు గంటసేపటి తర్వాత ఆమెను తీసుకుని బయలుదేరారు. రాత్రి 7.30 గంటల సమయంలో అమ్నీషియా పబ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ సమయంలో పబ్‌లోకి వెళ్లిన బాలిక.. తన జాకెట్ మర్చిపోయానంటూ సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి తీసుకువెళ్లింది. అయితే.. ఇంటికి వెళ్లిన బాలిక ఆందోళనతో రెండు రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయింది. దీనితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గట్టిగా ప్రశ్నించడంతో.. తనతో ఐదుగురు అసభ్యంగా ప్రవర్తించారని చెప్పింది. ఈ మేరకు బాలిక తండ్రి గత నెల 31న సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్లు 354, 323, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక వాంగ్మూలం, వైద్య పరీక్షలతో.. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి పంపించారు. వైద్య పరీక్షల సందర్భంగా, మహిళా అధికారులు, నిపుణులు వాంగ్మూలాన్ని సేకరించిన సమయంలో.. తనపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని బాలిక బయటపెట్టింది. దీని ఆధారంగా పోలీసులు.. కేసును మార్చి ఐపీసీ 376 (డి), పోక్సో యాక్ట్‌లోని కొన్ని సెక్షన్లను జోడించారు. బాలికను మెరుగైన వైద్య పరీక్షల కోసం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అమ్నీషియా పబ్, ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీని సేకరించి.. బాలికతోపాటు ఉన్నవారు ఎవరనేది ఆరా తీశారు. పబ్ నుంచి బంజారాహిల్స్‌లోని బేకరీ దాకా రెండు వాహనాలు రావడం, బేకరీ వద్ద సుమారు 20 నిమిషాలు ఆగడం, ఐదుగురు యువకులతో కలిసి బాలిక కారు బయలుదేరడం వంటివన్నీ పరిశీలించారు. సాదుద్దీన్, ఉమేర్‌ఖాన్, మసీవుల్లాఖాన్ కుమారుడు సహా ఐదుగురిని నిందితులుగా గుర్తించారు. వారు ఏ దారిలో ప్రయాణించారు, ఎక్కడ కారు ఆపి లైంగిక దాడికి పాల్పడ్డారనేది గుర్తించేందుకు.. నిందితుల ఫోన్‌కాల్స్, టవర్ లొకేషన్, బాలిక ఫోన్ లొకేషన్ల ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే కుమారుడిపై అనుమానాలు! అమ్నీషియా పబ్ నుంచి బాలికతో కలిసి బయలుదేరిన వారిలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికపై అఘాయిత్యానికి పాల్పడే ప్లాన్‌లో అతనూ భాగమేనని.. అయితే బేకరీ వద్ద బాలికను కారు ఎక్కించుకునే సమయంలో ఓ ఫోన్‌కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని సమాచారం. ఈ విషయంపై పోలీసులు స్పందించడం లేదు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ మీడియా సంస్థ యజమాని కుమారుడి సమాచారంతో అమ్నీషియా పబ్‌లో పార్టీకి హాజరైనవారిలో చాలామందికి ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయం లేదు. అంతా ఇన్‌స్ట్రాగామ్ ద్వారా స్నేహితులైన వారు కావడంతో నిందితులను గుర్తించడం కష్టమైం దని పోలీసువర్గాలు చెప్తున్నాయి. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన అధికారులు.. నిందితులు 29న (అఘాయిత్యానికి పాల్పడిన తర్వాతి రోజు) మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన ఓ మీడియా సంస్థ కార్యాలయానికి వెళ్లి, దాని యజమాని కుమారుడిని కలిసినట్టు గుర్తించారు. అతడిని ప్రశ్నించగా.. ఐదుగురు నిందితులు తనవద్దకు వచ్చి అఘాయిత్యం విషయం చెప్పారని వెల్లడించినట్టు తెలిసింది. కానీ తాను సహకరించబోనని వారికి స్పష్టం చేసినట్టుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే పోలీసులు ఈ మీడియా యజమాని కుమారుడి సాయంతోనే నిందితులను గుర్తించినట్టు తెలిసింది. హోంమంత్రి మనవడికి సంబంధం లేదు రొమేనియన్ బాలికపై అత్యాచారం కేసులో హోంమంత్రి మనవడికి ఎలాంటి సంబంధం లేదు. వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడి పాత్రపై ఆధారాలు లభించాయి. అతడి ఆచూకీ కనిపెట్టినా రాత్రివేళ మైనర్లపై చర్యలు తీసుకోవడానికి చట్టం అంగీకరించదు. అతడిపై ప్రత్యేక బృందంతో నిఘా ఉంచాం. శనివారం చర్యలు తీసుకుంటాం. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నాం. మిగతా ముగ్గురు నిందితులను 48 గంటల్లో పట్టుకుంటాం. బాలిక పూర్తిగా కోలుకున్నాక ఆమెతో కోర్టులో వాంగ్మూలం నమోదు చేయిస్తాం. మరెవరి పాత్ర అయినా ఉన్నట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. ఎంతవారైనా వదిలి పెట్టేది లేదు. ఓ ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అత్యాచారం చేసిన సమయంలో వీడియో తీసినట్టుగానీ, దాన్ని చూపిస్తామని బెదిరించినట్టుగానీ ఎలాంటి ఆధారాలూ లభించలేదు. – జోయల్ డెవిస్, హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ -
అత్యాచార ఘటనతో నాకు సంబంధం లేదు: హోంమంత్రి మనవడు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మైనర్ అత్యాచార ఘటనతో తనకు సంబంధం లేదని హోంమంత్రి మనవడు ఫుర్ఖాన్ అహ్మద్ స్పష్టం చేశారు. తనెవరికీ పార్టీ ఇవ్వలేదన్నారు. వాళ్లు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఘటన జరిగిన రోజు తాను ముంబైలో ఉన్నట్లు తెలిపారు. ఆరోపణలు చేసిన వారు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. సీసీ ఫుటేజ్ తీస్తే ఎవరున్నారో తెలుస్తుందన్నారు. తనకు అసలు బెంజ్ కారు లేదని తెలిపారు. కాగా జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌కు వెళ్లిన 17 ఏళ్ల బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు చేశారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్: బాలిక అత్యాచార ఘటనపై స్పందించిన హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: బాలిక అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. కచ్చితంగా నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పోలీసులకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. కేటీఆర్ ట్వీట్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో అత్యాచార ఘటన వార్తలు చూసి షాక్ గురయ్యానన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హోదాతో సంబంధం లేకుండా నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని అన్నారు. నిస్పక్షపాత విచారణ జరిపించాలన్నారు. ఇద్దరు అరెస్ట్ కాగా జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌కు వెళ్లిన 17 ఏళ్ల బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు చేశారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: బాలిక అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు -
పీఎస్‌లోకి చొచ్చుకెళ్లిన బీజేపీ కార్యకర్తలు
-
Amnesia Pub Case: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’
-
Hyderabad: బాలికపై సామూహిక అత్యాచారం.. స్పందించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం వార్త విని షాక్‌కు గురయ్యానని, తీవ్ర ఆగ్రహం కలిగిందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఈ సంఘటనలో ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సంఘటనలో పాల్గొన్న వారు ఎంత హోదాలో ఉన్నా, ఎలాంటివారితో అనుబంధమున్నా క్షమించరాదని స్పష్టం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం... కేటీఆర్ ట్వీట్‌కు హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఈ సంఘటన దారుణమైనదని, దీనికి పాల్పడిన వారు ఎంతటి వారైనా, ఎంత బలమైన వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని రీట్వీట్ చేశారు. వారిని త్వరగా అరెస్టు చేసి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ఇప్పటికే డీజీపీని, నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. Outraged & shocked with the news of the rape of a minor in Hyderabad Request HM @mahmoodalitrs Garu @TelanganaDGP Garu and @CPHydCity to take immediate & stern action. Please don’t spare anyone involved irrespective of their statuses or affiliations — KTR (@KTRTRS) June 3, 2022 -
ఆమ్నేషియా పబ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బీజేపీ ధర్నాకు దిగింది. పోలీస్‌స్టేషన్‌లోకి బీజేపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎంఐఎం నేత కొడుకును తప్పించారంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. చదవండి: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’ -
పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పబ్, బేకరీతోపాటు పలు ప్రాంతాల్లో సీసీఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారం జరిగింది వాస్తవమేనని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. నలుగురు నిందితులు మైనర్లేనని వారిపై పోక్సో, నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు గోవాకు పరారయ్యారని సమాచారం అందిందని, గోవాలో రెండు బృందాలుగా పోలీసులు జల్లెడ పడుతున్నారని పేర్కొన్నారు. బాలికను పబ్‌కు తీసుకెళ్లిన హదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంజ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాదీని బురిడి కొట్టించి బాలురు బాలికను తీసుకెళ్లారని, రెండు గంటలపాటు బాలికపై మైనర్ బాలురు అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసి మరో కారులో పబ్ వద్ద బాలికను వదిలివెళ్లారన్నారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్న విచారణలో తేలుతుందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సంబంధిత వార్త: ఆమ్నేషియా పబ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత లిక్కర్ పార్టీ జరగలేదు. అమ్నేషియా పబ్‌లో లిక్కర్ పార్టీ జరగలేదని, పబ్‌లో న్యూసెన్స్ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. పబ్ నుంచి బాలిక స్నేహితులతో బయట వెళ్ళిన తరువాత బెంజ్ కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డారని అన్నారు. బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి తండ్రికి చెప్పడంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. బాలిక స్టేట్మెంట్ ఆమ్నేషియా పబ్ వ్యవహారంలో బాధిత బాలిక.. తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ‘మే 28న సా.5 గంటలకి గుర్తుతెలియని యువకులు నన్ను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఆమ్నేషియా పబ్‌లో మేం పార్టీ చేసుకున్నాం, పార్టీలో కొందరు యువకులు నన్ను బెంజ్ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. బెంజ్ కారులో నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 7 గంటలకు పబ్ దగ్గర తనను వదిలిపెట్టారు. నా మెడ వద్ద గాయాలైన విషయాన్ని మా నాన్న గమనించారు. నాపై జరిగిన అఘాయిత్యం గురించి ఆయనకు చెప్పాను. దీంతో ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు’ అని పేర్కొంది. అసలేం జరిగింది? కాగా గత నెల 28న బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివసించే బాలిక (16) ఓ పార్టీకి హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉండే హాదీతో కలిసి ఆయన బెంజ్ కారులో (టీఎస్ 09 ఎఫ్ఎల్ 6460)లో అమ్నేషియా పబ్‌కు వెళ్లింది. సాయంత్రం 5 గంటల వరకు అక్కడే పార్టీ చేసుకున్నారు. అనంతరం పబ్ నుంచి బాలిక బయటకు వచ్చింది. బాలికను బలవంతంగా బెంజ్ కారులో తీసుకెళ్లి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఓ బేకరీ దగ్గరకు వెళ్లి ఆహారం కొనుగోలు చేశారు. అనంతరం కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కార్లోనే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత 7.30 నిమిషాల సమయంలో పబ్ వద్ద వదిలేసి వెళ్లారు. అనంతరం బాలిక ఫోన్ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఇది కూడా చదవండి: Amnesia Pub Case: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’ నిందితుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు ఇదిలా ఉండగా అత్యాచార నిందితుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. హోమంత్రి మనవడు, ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు పాత్ర ఉన్నట్లు పలు అరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటి వరకైతే దీనిపై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. -
Amnesia Pub Case: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’
సాక్షి, హైదరాబాద్: ఆమ్నేషియా పబ్ కేసులో ఎమ్మెల్యే రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్‌లో పార్టీ బుక్ చేసింది హోంమంత్రి మనవడేనంటూ రఘునందన్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హోంమంత్రి పీఏ అమ్మాయిని లోపలికి పంపాడు. హోంమంత్రి మనవడు, వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, ఓల్డ్ సిటీకి చెందిన ప్రముఖ దినపత్రిక డైరెక్టర్ కొడుకు ఇందులో ఉన్నారన్నారు. లైంగిక దాడి కోసం వాడిన కారును ఎందుకు సీజ్ చేయలేదని రఘునందన్ ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబసభ్యులకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన అన్నారు. చదవండి: బంజారాహిల్స్: బాలికను కారులో తీసుకెళ్లి అసభ్యకర ప్రవర్తన -
బాలికతో అసభ్య ప్రవర్తన కేసులో ఎమ్మెల్యే కుమారుడు?
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా అండ్ ఇన్సోమియా పబ్ నుంచి బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడితో పాటు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్న అధికారులు సూరజ్, హాదీలను అదుపులోకి తీసుకుని ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివసించే రుమేనియా దేశానికి చెందిన బాలిక (16) ఓ పార్టీకి హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉండే హాదీతో కలిసి ఆయన బెంజ్ కారులో (టీఎస్ 09 ఎఫ్ఎల్ 6460)లో అమ్నేషియా పబ్‌కు వెళ్లింది. పథకం ప్రకారం అప్పటికే హాదీ స్నేహితుడు సూరజ్ పబ్‌లో ఉన్నాడు. పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో తానంతట తాను వెళ్లిపోతానని బాలిక చెప్పినా వినిపించుకోని హాదీ, సూరజ్ బలవంతంగా కారులో ఎక్కించుకుని బయలుదేరారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె కేకలు పెట్టేందుకు యత్నించగా సూరజ్, హాదీలతో పాటు మరో యువకుడు బెంజ్ కారును అక్కడే ఉంచి ఇన్నోవా కారులో బాలికను బలవంతంగా కూర్చొబెట్టుకుని పబ్ వద్దకు తీసుకువచ్చి వదిలి వెళ్లారు. ఇంటికి వెళ్లిన బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు హదీ, సూరజ్‌లతో పాటు మరో ముగ్గురు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పబ్ నుంచి వెళ్లిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో ఆ కారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లు తేలింది. అక్కడే వదిలేసిన బెంజ్ కారును తీసుకువచ్చి సీజ్ చేశారు. అయితే.. పబ్‌లోకి బాలికను ఎలా అనుమతించారనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోపక్క నిందితుల్లోనూ ముగ్గురు మైనర్లుగా తెలుస్తోంది. (చదవండి: వివాహేతర సంబంధం: ఇంట్లో నుంచి బయటకు వెళ్లి..) -
బంజారాహిల్స్: బాలికను కారులో తీసుకెళ్లి అసభ్యకర ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని ఒక పబ్‌కి వెళ్లిన బాలికను కారులో తీసుకెళ్లి కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ చెందిన ఒక బాలిక(17) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని అమ్నేషియ ఇన్సోనియా పబ్‌కు స్నేహితులు ఇచ్చిన పార్టీకి గత నెల 28న హాజరైంది. అదే రోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో ఒక బెంజి, ఇన్నోవా కార్లలో వచ్చిన కొందరు యువకులు ఆ బాలికను తీసుకెళ్లారు. ఆ తరువాత రెండు గంటల తరువాత బాలిక తిరిగి వచ్చింది. అయితే.. బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని బాలిక తండ్రి బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మెడపై చిన్న గాయం అయ్యిందని, సంఘటన జరిగిన సమయం నుంచి షాక్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన ఫిర్యాదు చేయగా పోలీసులు పొక్సో కింద కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చదవండి: అదృశ్యమైన బాలికను నాలుగు నెలలు గదిలో బంధించి.. -
క్లబ్ టెకీల అంశంలో... మరో ఇన్స్పెక్టర్కు పబ్ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పబ్బుల్లో నడుస్తున్న గబ్బు దందాలను అడ్డుకోవడంలో విఫలమవుతున్న ఇన్స్పెక్టర్లపై వేటు పడుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కొత్వాల్ సీవీ ఆనంద్ చర్యలు తీసుకుంటున్నారు. వెస్ట్‌జోన్ పరిధిలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ వ్యవహారంలో అప్పటి బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.శివచంద్ర సస్పెండ్ అయ్యారు. తాజాగా ఆదివారం తెల్లవారుజామున బయటపడిన క్లబ్ టెకీల వ్యవహారంలో మధ్య మండలంలోని రామ్‌గోపాల్ పేటలో (ఆర్ పేట) ఇన్స్పెక్టర్ ఎస్.సైదులుపై బదిలీ వేటు పడింది. సైదులును కమిషనర్ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో అదనపు ఇన్స్పెక్టర్ గడ్డం కాశికి బాధ్యతలు అప్పగించారు. (చదవండి: అసలే అక్రమం... ఆపై అనైతికం!)