సాక్షి, హైదరాబాద్: మధ్య మండలంలోని రామ్‌గోపాల్ పేటలో (ఆర్ పేట) క్లబ్ టెకీల పేరుతో కేఫ్ అండ్ బార్ ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని పబ్‌గా మార్చేశాడు. అది చాలదన్నట్లు డ్యాన్స్ బార్ యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయిస్తూ రూపమిచ్చి క్యాబరేలు నడుపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. నిర్వాహకులు, కస్టమర్ల సహా మొత్తం 18 మందిని అరెస్టు చేసినట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు.
క్లబ్ టెకీల మేనేజింగ్ డైరెక్టర్ సైతం మహిళ కావడం గమనార్హం. బోయిన్‌పల్లికి చెందిన జి.విజయ్‌కుమార్ గౌడ్ కొన్నాళ్లుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్లబ్ టెకీలను నిర్వహిస్తున్నారు. దీనికి నళిని రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఎన్.రవి దీనికి మేనేజర్/అకౌంటెంట్‌గా, సైదా జరీన్, బి.హరికృష్ణ డీజే ఆపరేటర్లుగా, బి.ప్రకాష్ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. సమయ పాలన లేకపోవడంతో పాటు డీజే నిర్వహణ, డిస్కో లైట్ల ఏర్పాటులోనూ నిబంధనలు పాటించలేదు. ఈ నేపథ్యంలోనే గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ మారని, అంతటితో ఆగని క్లబ్ టెకీల నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరో అడుగు ముందుకు వేశారు.
నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దిగువ మధ్య తరగతి యువతులను ఆకర్షించి వారితో నృత్యాలు చేయిస్తూ డ్యాన్స్ బార్‌గా మార్చేశారు. ఈ యువతులు తమ హావభావాలతో పాటు చర్యలతోనూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. డ్యాన్సర్లు అభ్యంతరకరంగా నృత్యం చేస్తూ వెళ్లి కస్టమర్ల పక్కన కూర్చోవడం, వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చేస్తూ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నారు. దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్.రఘునాథ్‌కు సమాచారం అందింది.
ఎస్సై సీహెచ్ నవీన్ కుమార్ బృందంతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటల ప్రాంతంలో క్లబ్ టెకీలపై దాడి చేశారు. నళిని రెడ్డి, ఎన్.రవి, సైదా జరీన్, బి.హరికృష్ణ, బి.ప్రకాష్‌లతో పాటు నృత్యాలు చేస్తున్న ఎనిమిది మంది యువతులు, ఐదుగురు కస్టమర్లను అరెస్టు చేశారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం ఆర్ పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న విజయ్ కుమార్ గౌడ్ కోసం గాలిస్తున్నారు.
పబ్‌లో రష్యన్ యువతులతో డ్యాన్సులు
బంజారాహిల్స్: రష్యన్ యువతులతో అర్దనగ్న డ్యాన్స్‌లతో అర్ధరాత్రి హంగామా సృష్టించిన ఓ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు–36లో ఎనిగ్మా పేరుతో ఒక రెస్టారెంట్, పబ్‌ను ప్రారంభించారు. ప్రీలాంచింగ్ అంటూ ప్రారంభించిన ఈ పబ్‌లో రష్యన్ యువతులతో నృత్యాలు ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలకు ఎౖMð్సజ్‌శాఖ నుంచి అనుమతులు తీసుకున్న పబ్ నిర్వాహకులు..పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.
ఇదే సమయంలో పబ్‌లో శనివారం రాత్రి అతిథులు పెద్దసంఖ్యలో రావడం, మద్యం మత్తులో తూలడంతో పాటు అక్కడున్న రష్యన్ యువతులతో కలిసి నృత్యాలు చేశారు. దీనికితోడు రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడం,పబ్‌లోని శబ్ధాలకు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పబ్ నిర్వాహకులైన దుర్గాప్రసాద్, చువాల్‌సింగ్‌లపై ఐపీసీ సెక్షన్ 294, ఆబ్సెంట్ చట్టం, 341, 21 ఆఫ్ 76 చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: పబ్బు..గబ్బు!)
Comments
Please login to add a commentAdd a comment