rides
-
తల్లీ.. నీకు సెల్యూట్!
నాడు ఝాన్సీ లక్ష్మీబాయి తన దత్త పుత్రుడిని వీపుకు కట్టుకుని జవనాశ్వాన్ని దౌడు తీయిస్తూ బ్రిటిష్ వారిపై కత్తి ఝళిపిస్తే, నేడు ఈ రాజ్‌కోట్ యువతి తన బిడ్డను మోటార్ బైక్ పైన కూర్చోబెట్టుకుని, వీపుకు బ్యాగు తగిలించుకుని, డెలివరీ ఏజెంట్‌గా జీవన పోరాటం సాగిస్తోంది! ఈ దృశ్యాన్ని చూసిన ‘విష్విద్’ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఆమెను వీడియో తీసి, బ్యాక్‌గ్రౌండ్‌లో కత్తి పట్టిన ఝాన్సీరాణిని ఆమెకు జత కలిపి పెట్టిన పోస్ట్‌కు ఇప్పటివరకు 9 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. నెటిజెన్ లు తమ కామెంట్లలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.‘‘బైక్ నడుపుతున్నావ్.. బద్రం సిస్టర్’’ అని జాగ్రత్తలు చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవాలని కొందరు సూచిస్తున్నారు. కాళ్లకు చెప్పులు తొడుక్కోవాలని మరికొందరు కోరుతున్నారు. ఈ యువతి గత నెల రోజులుగా డెలివరీ ఏజెంటుగా పని చేస్తోంది. ఇన్ స్టాలో వెల్లడైన వివరాలను బట్టి.. ఈమె హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసింది. పెళ్లయ్యాక, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. ఇక ఇప్పుడైతే.. ‘‘బిడ్డ తల్లివి కదా.. ఉద్యోగం ఎలా చేస్తావ్?’’ అని అడుగుతున్న వారే ఎక్కువమంది! చివరికి డెలివరీ ఏజెంట్ ఉద్యోగాన్ని ఎంచుకుని, తనతోపాటు కొడుకునూ వెంట బెట్టుకుని ధైర్యంగా జీవనయానం సాగిస్తోంది. -
50 ఏళ్ల వయసులో బైక్ రైడ్, డ్యాన్స్, ట్రెక్కింగ్..!
చుట్టుపక్కల వాళ్లంతా ఈ ఏజ్‌లో ఇవి నేర్చుకుంటున్నావా అని ఒకటే హేళన చేసేవారు ఆమెను. సోషల్ మీడియాలో సైతం ఈ వయసులో ఎందుకు మీకు..హాయిగా కృష్ణ.. రామా.. అనుకుంటూ కూర్చొక అన్న మాటలు వినిపిస్తున్నే ఉన్నాయి. అయినా లెక్కచేయకుండా ఉత్సాహభరితంగా తనకు నచ్చినవి అన్నీ చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు నీరూ సైనీ. ఆమె హర్యానాలోని పంచకులకి చెందిన 54 ఏళ్ల నీరూ సైనీ . సమాజంలో వృద్దులు అంటే ఇలానే ఉంటారనే మూస భావనను బ్రేక్ చేసింది నీరూ. ఆమె 40 ఏళ్ల వయసులో డ్యాన్సులు, బైకింగ్, ట్రెక్కింగ్ వంటివి నేర్చుకుని ఆదర్శంగా నిలిచింది. నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటే వయసు అడ్డంకి కాదని ప్రూవ్ చేసి చూపించింది. ఇంతకీ ఆమె ఈ వయసులో ఇలా ఇవన్నీ నేర్చుకోవడానికి గల కారణం ఏంటంటే..చండీగఢ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నీరు కుంటుబ నేపథ్యం ఏంటంటే..నీరుకి 20 ఏళ్ల వయసులో పెళ్లయింది. ఆమె భర్త నేవీలో పనిచేస్తారు. ఆయనతో కలిసి సుమారు 26 దేశాలకు వెళ్లారు. అయితే ఆమె భర్తకు కేన్సర్ వచ్చిందని తెలిసిందో అప్పుడే ఆమె ప్రపంచం అంతా తలకిందులైపోయింది. 2000 సంవత్సరం అంతా నీరుకి బ్యాడ్ టైం అని చెప్పొచ్చు. భర్త మందులకే లక్షకు పైగా ఖర్చు అయ్యేది. ఎంతలా డబ్బు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆయన కేన్సర్‌తో పోరాడుతూ 2002లో మరణించారు. అప్పటికి ఆమెకు నాలుగు, పది సంవత్సరాల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ భారం అంతా నీరుపై పడింది. భర్త చికిత్స కోసం దాచుకున్న డబ్బంతా ఖర్చు అయ్యిపోవడంతో ఒంటరిగా కూతుళ్లను పెంచడం ఆమెకు పెను భారమయ్యింది. అయినా అలానే ట్యూషన్, చెబుతూ కాలం వెళ్లదీసింది. ఈలోగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంది. అలా ఆమె పదేహేనేళ్లు కూతుళ్ల బాధ్యతను నిర్వర్తించడంలోనే మునిగిపోయింది. నీరు పెద్ద కుమార్తె ఐవీ లీగ్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొంది మంచి ఉద్యోగం సంపాదించగా, చిన్న కుమార్తె కూడా మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యింది. ఇద్దరూ ఆమెను వదిలి విదేశాలకు వెళ్లిపోవడంతో ఒంటిరిగా అయిపోయింది నీలు. ఒక్కసారిగా వచ్చిపడ్డ ఒంటరితనం భరించలేకపోయింది. ఇది ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో అనూహ్యంగా బరువు తగ్గిపోయింది. ఆమె బాధను చూడలేక చిన్న కూతురు తల్లితో గడిపేందుకు ఒక ఏడాది సెలవు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ టైంలోనే ధ్యానం చేయడం స్కూబా డ్రైవింగ్, స్కై డైవింగ్ వంటి సాహస క్రీడలపై దృష్టిసారించింది. తన కూతుళ్ల సాయంతోనే తనకు నచ్చినవన్నింటిన అలవోకగా నేర్చుకుంది. అంతేగాదు 52 ఏళ్ల వయసులో రెండు సోలో బైక్ రైడ్లను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఆమె చండీగఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా చేస్తూ ఇవన్నీ నేర్చుకుంది. పైగా ప్రతి స్త్రీ తన కోసం తను జీవించాలని తన కలలను కొనసాగించాలని చెబుతోంది నీరు. వ్యక్తిగత జీవితంలోని విషాదం నుంచి తేరుకుని నిలదొక్కుకోవడమే గాక పిల్లల భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దింది. మళ్లీ జీవితంలో వచ్చి చేరిన శ్యూన్యతను చెదరగొట్టి కొత్త జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలిపింది. జీవితమనేది సవాలని దాన్ని నీకు నచ్చినట్లుగా మలుచుకుంటూ ముందుకు సాగిపోవాలని నీరు కథే చెబుతోంది కదూ..!.(చదవండి: ప్రపంచ సంగీత దినోత్సవం: సంగీతం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదా..?) -
స్కూటర్‌పై తిరుగుతూ.. స్మృతీ ఇరానీ సందడి!
ఉత్తరప్రదేశ్‌లోని తన లోక్‌సభ నియోజకవర్గం అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్కూటర్‌పై తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. అలాగే పలువురితో సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ మీడియాకు కనిపించారు. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు.స్మృతి ఇరానీ ఈరోజు (సోమవారం) అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2019లో ఆమె కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓడించి, ఈ సీటును సొంతం చేసుకున్నారు. స్మృతి ఇరానీ ఆదివారం నాడు అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకున్నారు. కాగా అమేథీ నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేయనున్నారనే విషయాన్ని కాంగ్రెస్ ఇంతవరకూ వెల్లడించలేదు. అమేథీ.. కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందింది. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. -
ED Attachment: మూడు ఆండ్రాయిడ్ యాప్‌లు..రూ.150 కోట్ల మోసం!
అధిక రాబడి వస్తుందని ప్రజల్లో ఆశ చూపించి మోసానికి పాల్పడుతున్న మొబైల్ యాప్ నిర్వాహకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. యాప్ నిర్వాహకులైన వైభవ్ దీపక్ షా, సాగర్ డైమండ్స్, ఆర్‌హెచ్‌సీ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన రూ.59.44 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పవర్ బ్యాంక్ యాప్ మోసం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ), 2002 నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఉత్తరాఖండ్, దిల్లీ పోలీసులు(స్పెషల్ సెల్), కర్ణాటక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికారులు చెప్పారు. భారత ప్రజలను మోసం చేసేందుకు చైనాకు చెందిన కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల సహాయంతో దేశంలో షెల్ కంపెనీలను సృష్టించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. తమ పెట్టుబడులపై భారీ మొత్తంలో సంపాదించవచ్చని ప్రజల్లో ఆశ చూపించి మోసం చేస్తున్నట్లు పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని పవర్ బ్యాంక్ యాప్, టెస్లా పవర్ బ్యాంక్ యాప్, ఈజీప్లాన్ అనే మూడు అప్లికేషన్ల ద్వారా ప్రజలను మోసగిస్తున్నట్లు అధికారులు గుర్తించామన్నారు. ఈ యాప్‌ల ద్వారా ప్రజల నుంచి రూ.150 కోట్ల మేర మోసం చేసినందుకు దిల్లీ పోలీస్ సైబర్ సెల్ జూన్ 2021లో అనేక మందిని అరెస్టు చేసింది. ఈ యాప్‌లు కస్టమర్ల నుంచి చెల్లింపులను సురక్షితం చేసిన తర్వాత వినియోగదారు ఖాతాలను బ్లాక్ చేసేవని ఈడీ తెలిపింది. ఇలా కూడగట్టిన డబ్బును నిందితులు, ఈ కేసుతో సంబంధం ఉన్న సంస్థలు బోగస్ దిగుమతుల సాకుతో విదేశాలకు భారీగా నిధులు మళ్లించారని వెల్లడైంది. అయితే రూ.10.34 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ రికవరీ చేసింది. రూ.14.81 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
బుల్లెట్ నడిపిన సీఎం ఖట్టర్
చంఢీగర్: ఎలాంటి భద్రత లేకుండా బైక్ రైడ్ చేశారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై సీఎం ముందు వెళుతుండగా.. భద్రతా సిబ్బంది, అధికారులు ఆయనను అనుసరించారు. కర్నాల్ ఎయిర్‌పోర్టు వరకు బైక్ ప్రయాణం చేశారు. హరియాణాలో 'కార్ ఫ్రీ డే' సందర్భంగా సీఎం బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్‌ను తగ్గించే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. వారంలో ఓ రోజు కార్లను ఉపయోగించకుండా ప్రజలను ప్రోత్సహించే సంకల్పంతో బైక్ రైడ్ నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన కర్నాల్‌లో ఈ ర్యాలీ చేపట్టారు. "कार फ्री डे" हो या "नशामुक्त हरियाणा" बनाने का संकल्प हो बिना जनसहयोग के पूरा नहीं हो सकता! “कार फ्री डे” पर करनाल एयरपोर्ट तक की यात्रा बाइक द्वारा करके, आज के दिन कार ट्रैफिक कम करने का एक छोटा सा प्रयास मेरा भी रहा। मुझे आशा है कि प्रदेश के जागरूक लोग इस सन्देश को आगे… pic.twitter.com/a5DQeDn1ky — Manohar Lal (@mlkhattar) September 26, 2023 ఇదీ చదవండి: బీజేపీ నేతపై లుక్అవుట్ నోటీసులు -
'మా స్టాండ్‌ని వదిలిపెట్టం'! అందుకు మూల్యం చెల్లించేందుకు రెడీ!
ఎన్సీపీకి చెందిన కొందరు నేతలపై ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శరద్ పవార్ దీని గురించి విలేకరులతో మాట్లాడారు. ఎన్సీపీ సీనియర్ నేత జయంత్ పాటిల్‌ని ఎన్‌ఫోర్ట్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీని గురించి పవార్‌ని మీడియా ప్రశ్నించగా..కొందరూ నాయకులు పాలక వ్యవస్థ అంచనాలను అందుకోవడానికి నిరాకరించడంతో ఈ చర్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఐతే వారు కష్టపడతారేమో కాని వారు ఎంచుకున్న మార్గం నుంచి మాత్రం ఎప్పటికీ తప్పుకోరని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్సీపీకి చెందిన సుమారు తొమ్మిది నుంచి పదిమంది నాయకుల విషయంలో కొంత అంచనాలను కలిగి ఉన్నారనే దాన్ని కొట్టిపారేయలేం అన్నారు. తాము ఆ అంచనాలను అందుకోవడానికి సిద్ధంగా లేమని, మా స్టాండ్ కోసం మూల్యం చెల్లించేందుకు కూడా సిద్ధమేనని కరాఖండీగా చెప్పారు. అలాగే తాము ఎంచుకున్న మార్గాన్ని ఎన్నటికీ వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. ఎన్సీపీ స్టాండ్‌ని చూసి కొందరూ(బీజేపీని ఉద్దేశించి) జీర్ణించుకోలేకపోవడంతోనే తాము బాధపడాల్సి వస్తుందని, ఐనా దాని గురించి తాము చింతించటం లేదని అన్నారు. తన వద్ధ విచారణ ఎదుర్కొన్న కీలకమైన 10 మంది నాయకుల జాబితా కూడా ఉందన్నారు. వారిలో కొందరు ఏజెన్సీ చర్యలను కూడా ఎదుర్కొన్నారు. అందుకు ఉదహరణగా మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ గురించి చెప్పుకొచ్చారు పవార్. ఒక విద్యాసంస్థ కోసం దేశ్‌ముఖ్ దాదాపు రూ.100 కోట్లు స్వీకరించారని ఆరోపణలు ఎదర్కొన్నారు. అందుకోసం సుమారు 13 నుంచి 14 నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది కూడా. ఆ తర్వాత వచ్చిన మొత్తం రూ.100 కోట్లు కాదని రూ. 1.50 కోట్లని తేలింది. అప్పటికే దేశ్‌ముఖ్ పరువు పోయింది" ఆరోపణల స్థాయి ఇలా ఉంటుందంటూ అధికార దుర్వినయోగం గురించి పవార్ చెప్పుకొచ్చారు. (చదవండి: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా ఖాదర్) -
ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..
తాగిన మైకంలో పలువురు వ్యక్తులు ఏం చేస్తారో కూడా తెలియదు. కొందరికి ఆ సమయంలో తాము ఏం చేశాం అనే స్పృహ కూడా ఉండదు. మత్తులో చిత్తయిన ఓ యువకుడు చేసిన పని అందర్నీ షాక్‌కి గురి చేసింది. అసలేం జరిగిందంటే.. ఓ యువకుడు తాగిన మత్తులో ఎద్దుపై స్వారీ చేస్తూ వీధుల గుండా హల్చల్ చేశాడు. రోడ్డుపై ఉన్న జనం ఆ యవకుడిని చూసి ఒకింత ఆశ్చర్యానికి, ఎక్కడ ఆ ఎద్దు తమపైకి దూసుకొస్తుందోననని మరొకింత ఆందోళనకు గురయ్యారు. జల్లికట్టు మాదిరిగా ఆ ఎద్దుపైకి ఎక్కి కూర్చొని వెళ్లడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్ తపోవన్ ప్రాంతంలో జరిగినట్లుగా గుర్తించారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ పోలీసులు ట్విట్టర్ వేదికగా.. మే 5న అర్థరాత్రి రిషికేశ్‌లోని తపోవన్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఎద్దుపై స్వారీ చేస్తూ కనిపించిన వైరల్ వీడియోని గుర్తించాం. ఆ యువకుడిపై చర్యలు తీసుకున్నాం. జంతువులతో ఎవరూ అసభ్యంగా ప్రవర్తించొద్దని యువతను గట్టిగా హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు ఉత్తరాఖండ్ పోలీసులు. కొందరు నెటిజన్లు ఎద్దును ఇలా హింసించడం సరికాదని ట్వీట్ చేయగా, మరికొందరూ జల్లికట్టు క్రీడతో పోల్చుతూ ట్వీట్లు చేశారు. (చదవండి: రెజ్లర్ల నిరసనలో పాల్గొనేందుకు తరలి వస్తున్న రైతులు..బారికేడ్లను చేధించి..) -
'ఎన్నిసార్లు ఇలానే చేస్తారు.. స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్‌ను మార్చుకోండి'
పాట్నా: జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యుల ఇళ్లపై ఈడీ దాడులు చేసిన ముడు రోజలు తర్వాత తేజస్వీ యాదవ్ స్పందించారు. ఈ సోదాల్లో రూ.కోట్ల నగదు, బంగారు ఆభరణాలు సీజ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ స్కాం ద్వారా పొందిన రూ.600 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించినట్లు ఈడీ చేసిన ప్రకటన పచ్చి అబద్దమన్నారు. ఈడీ అధికారులు తన ఢిల్లీ నివాసంలో అరగంటలోనే సోదాలు పూర్తి చేశారని తేజస్వీ చెప్పారు. ఈ సమయంలో తన సోదరీమణులు ధరించి ఉన్న నగలను తీసి పక్కకు పెట్టమని చెప్పారని, వాటినే ఫోటోలు తీసి సీజ్ చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2017లో కూడా తమ పార్టీ రూ.8,000కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడిందని చెప్పి దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని, వాటి సంగతేంటని ప్రశ్నించారు. ముందు వాటికి సంబంధించిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీలా తమది ఫేక్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ కాదని తేజస్వీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమిత్ షా క్రోనాలజీ వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు. తమది నిజమైన సోషలిస్టు కుటుంబం అని పేర్కొన్నారు. బిహార్‌లో బీజేపీని అధికారానికి దూరం చేసినందుకే తమపై దాడులు జరుగుతున్నాయని ప్రజలందరికీ తెలుసునని తేజస్వీ అన్నారు. కమలం పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈడీ సోదాల్లో ఏం సీజ్ చేశారో అధికారికంగా ప్రకటన విడదల చేయాలని, లేదంటే తానే నిజాన్ని వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేయాలని బహుశా అమిత్‌షానే డైరెక్షన్ ఇచ్చి ఉంటారని తేజస్వీ ఆరోపించారు. ప్రతిసారి ఇలానే చేస్తే వర్కవుట్ కాదని.. వాళ్లు స్క్రిప్ట్ రైటర్లు, డైలాగ్ రైటర్లను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా? -
నెల్లూరులో భారీగా కుళ్లిన చికెన్.. అక్కడ వేస్ట్‌గా కొనుగోలు చేసి.. ఇక్కడ ఫ్రెష్‌గా..
కాసుల వేటలో కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమిళనాడులో చికెన్ వ్యర్థాలుగా పడేసే లివర్, కందనకాయలతో పాటు నిల్వ చికెన్‌ను వేస్ట్‌గా కొనుగోలు చేసి నెల్లూరులో ఫ్రెష్ చికెన్‌గా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొంత కాలం క్రితం నిరంతరం నిఘాతో మున్సిపల్ హెల్త్ అధికారుల దాడులతో సర్దుమణిగిన నిల్వ చికెన్ వ్యాపారం మళ్లీ ఇటీవల కాలంలో పుంజుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మున్సిపల్ హెల్త్ అధికారుల దాడుల్లో నిల్వ ఉంచిన చికెన్‌తో పాటు లివర్, కందనకాయలు చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి విక్రయాలు చేస్తున్నట్లు వెలుగుచూసింది. కొందరు ముఠాగా ఏర్పడి చెన్నై పరిసరాల నుంచి కొనుగోలు చేసిన ఇలాంటి వ్యర్థాలను హోటల్స్‌కు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సాక్షి, నెల్లూరు: తమిళనాడులో చికెన్ లివర్, కందనకాయలకు డిమాండ్ తక్కువ. ఇక్కడ చికెన్ కేజీ ధరలతోనే లివర్, కందనకాయలను కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా ఓ ముఠా చెన్నై నుంచి నెల్లూరుకు భారీగా చికెన్ లివర్, కందనకాయలను దిగుమతి చేస్తున్నారు. నగరంలోని చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్లకు విక్రయిస్తుంటారు. కేవలం రూ.30 నుంచి రూ.40లకే అక్కడ దొరికే లివర్, కందనకాయలు తీసుకొచ్చి చికెన్ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ తంతు గత కొన్నేళ్లుగా జరుగుతోంది. గతంలో ఇప్పటి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పలు దుకాణాలపై దాడులు చేసి గుర్తించిన విషయం తెలిసిందే. తిరిగి వెంకటరమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ ముఠా ఆగడాలకు మరోసారి అడ్డుకట్టవేశారు. కేజీ రూ.100లకే విక్రయం తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రతి వారం భారీగా నిల్వ చికెన్, లివర్, కందనకాయల మాంసాన్ని రూ.40లకే కొనుగోలు చేసి ట్రక్కుల ద్వారా నెల్లూరుకు తరలిస్తున్నారు. ఈ ముఠా సభ్యులు తమ ఇళ్లలో నిల్వ చేసి చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్లకు రూ.100లకు విక్రయిస్తున్నారు. తమిళనాడులో లివర్, కందనకాయలు తినడం వల్ల అనారోగ్యాలు వస్తాయని వాటిని కొనుగోలు చేయరు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చికెన్ ధరతో సమానంగా లివర్, కందనకాయలను విక్రయిస్తుంటారు. తమిళనాడులో నిల్వ ఆహారాన్ని నెల్లూరుకు గుట్టుచప్పుడు కాకుండా వివిధ వాహనాల్లో దిగుమతి చేసుకుంటున్నారు. నెల్లూరుతో పాటు ఒంగోలు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు సైతం ఈ మాంసం తరలివెళుతుంది. విస్తృత తనిఖీలు అవసరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వెంకటరమణ గతంలో విధులు నిర్వహించిన సమయంలో నగరంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేశారు. బోడిగాడితోట వద్ద కుళ్లిన మాంసం నిల్వలపై, చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలపై వరుస దాడులతో విక్రయదారుల్లో భయాందోళన నెలకొంది. ఆ తర్వాత ఆయన మరో విభాగానికి బదిలీ కావడంతో కొంత కాలం ఈ ముఠా ఆగడాలు మళ్లీ చెలరేగాయి. తిరిగి ఎంహెచ్‌ఓగా వెంకటరమణ బాధ్యతలు తీసుకోవడంతో ఈ ముఠా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మళ్లీ విస్తృత స్థాయిలో దాడులు చేస్తే ఇలాంటి నిల్వ మాంసం విక్రయాలు గుట్టురట్టు అయ్యే అవకాశం ఉంది. 400 కేజీల నిల్వ మాంసం పట్టివేత ►నోటీసులు జారీ, రూ.25 వేల జరిమానా నగరంలోని మైపాడుగేటు వేణుగోపాల్‌నగర్‌లో ఉన్న ఓ చికెన్ స్టాల్లో గుట్టుచప్పుడు కాకుండా 27వ తేదీ నాటి నిల్వ ఉంచిన చికెన్ లివర్, కందనకాయలను ఆరిఫ్ అనే వ్యక్తి ఓ ఐస్‌క్రీమ్ వాహనం నుంచి దిగుమతి చేసుకుంటుండగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంటకరమణ తన బృందంతో ఆకస్మిక దాడులు చేశారు. 400 కేజీల చెడిపోయిన మాంసాన్ని గుర్తించారు. దీంతో ఫినాయిల్ పోసి నిర్వీర్యం చేశారు. మాంసాన్ని చెత్త వాహనాల్లో డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజలు నాణ్యమైన ఆహారం కొనుగోలు చేసేందుకు వస్తారని, ఇలా చెడిపోయిన ఆహారాన్ని విక్రయించడం ద్వారా నమ్మకాన్ని కోల్పోతారన్నారు. ప్రజలకు అనారోగ్య కలిగించే ఆహారాన్ని ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చికెన్ స్టాల్‌కు నోటీసులు జారీ చేసి, రూ.25 వేలు జరిమానా విధించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెంచలయ్య మాట్లాడుతూ 27వ తేదీనాటి మాంసాన్ని నెల్లూరుకు తరలించి దిగుమతి చేయడాన్ని వెంకటరమణ బృందం దాడులు చేసి పట్టుకున్నారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహారా న్ని మాత్రమే విక్రయించాలన్నారు. -
హైదరాబాద్ లో ముగిసిన ఈడీ సోదాలు
-
పబ్బులో అశ్లీల నృత్యాలు...
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్‌లోని మరో పబ్బుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ పబ్బులోనూ అశ్లీల నృత్యాలు చేస్తున్న మహిళలను, పురుషులను అదుపులోకి తీసు కున్నారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ ఎస్డీరోడ్‌లోని బసేరా హోటల్లో పబ్‌ను నిర్వహిస్తున్నారు. డీజే సౌండ్ల హోరులో యువతీ, యువకులు అశ్లీలంగా నృత్యాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పబ్ యాజమాన్యం ఈ దందా కొనసాగిస్తూ యువతీ, యువకులను ఆకర్షిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందడంతో ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి కస్టమర్ల తరహాలో పబ్‌కు వెళ్లారు. అప్పటికే అక్కడ యువతీ, యువకులు తాగిన మైకంలో నృత్యాలు చేస్తున్నారు. మహిళలు పురుషుల వద్దకు వచ్చి వారిని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీసులకు అప్పగించారు. వారిలో 9 మంది మహిళలు, 24 మంది పురుషులు, 8 మంది హోటల్ సిబ్బంది ఉన్నారు. హోటల్ యజమాని అమర్ ఓరీ పరారీలో ఉన్నాడు. (చదవండి: ఉస్మానియా ఆసుపత్రిలో దారుణం...రూ.వెయ్యి ఇస్తేనే మార్చురీలోకి మృతదేహం..) -
కేజీఎఫ్ కోటలో కలకలం
బనశంకరి: వందలాది కోట్ల రూపాయలను అక్రమంగా బదిలీ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ నేత, పారిశ్రామికవేత్త కేజీఎఫ్ బాబుపై ఐటీ, ఈడీ సోదాలు దాడులు చేశాయి. బెంగళూరు వసంతనగరలోని రుక్సానా ప్యాలెస్, ఉమ్రా డెవలపర్స్, ఉమ్రా రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఏకకాలంలో దాడులు చేసిన ఐటీ, ఈడీ అధికారులు ముఖ్యమైన ఫైళ్లు, రికార్డులను, బ్యాంకు లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేజీఎఫ్ బాబు పలు చోట్ల వందలాది కోట్ల విలువచేసే భూములు, స్థలాలు, అపార్టుమెంట్లు, భవనాలు కలిగి ఉన్న పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. కుటుంబసభ్యుల అకౌంట్లలో భారీగా నగదు మొదటి భార్య రుక్సానా, కుమారుడు అఫ్ఘాన్‌తో పాటు కుటుంబసభ్యుల పేర్లతో ఉన్న మొత్తం 23 బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్నారు. కేజీఎఫ్ బాబు తన పేరుతో 12 బ్యాంకు అకౌంట్లు తెరిచారు. కుటుంబసభ్యుల అకౌంట్లలో రూ.70 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు తనిఖీలో తెలిసింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు చెందిన విలాసవంతమైన రూ.6 కోట్ల విలువచేసే రోల్స్‌రాయ్స్ కారును కేజీఎఫ్ బాబు ఒక మధ్యవర్తి ద్వారా కొనుగోలు చేశారు. గత ఏడాది ఆగస్టులో యుబీ సిటీ వద్ద కారును ఆర్టీఓ అధికారులు సరైన పత్రాలు లేవని సీజ్ చేశారు. ఈడీ సమన్లు జారీ ఉమ్రా డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా వందలాది కోట్ల నగదు లావాదేవీల గురించి ఈడీ అధికారులకు ఒకనెల క్రితమే సమాచారం అందింది. విచారణకు రావాలని కేజీఎఫ్ బాబుకు ఈడీ సమన్లు జారీచేసింది. మైసూరులో కేజీఎఫ్ బాబు బంధువు రెహమాన్‌ఖాన్ ఇంటిలోనూ సోదాలు సాగాయి. మరికొన్ని రోజులు సోదాలు కొనసాగే అవకాశముంది. (చదవండి: KGF Babu: ‘కేజీఎఫ్ బాబు’కు ఐటీ షాక్ ) -
పబ్‌గా కేఫ్ అండ్ బార్... అర్థనగ్న డ్యాన్సులతో హంగామా!
సాక్షి, హైదరాబాద్: మధ్య మండలంలోని రామ్‌గోపాల్ పేటలో (ఆర్ పేట) క్లబ్ టెకీల పేరుతో కేఫ్ అండ్ బార్ ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని పబ్‌గా మార్చేశాడు. అది చాలదన్నట్లు డ్యాన్స్ బార్ యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయిస్తూ రూపమిచ్చి క్యాబరేలు నడుపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. నిర్వాహకులు, కస్టమర్ల సహా మొత్తం 18 మందిని అరెస్టు చేసినట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. క్లబ్ టెకీల మేనేజింగ్ డైరెక్టర్ సైతం మహిళ కావడం గమనార్హం. బోయిన్‌పల్లికి చెందిన జి.విజయ్‌కుమార్ గౌడ్ కొన్నాళ్లుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్లబ్ టెకీలను నిర్వహిస్తున్నారు. దీనికి నళిని రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఎన్.రవి దీనికి మేనేజర్/అకౌంటెంట్‌గా, సైదా జరీన్, బి.హరికృష్ణ డీజే ఆపరేటర్లుగా, బి.ప్రకాష్ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. సమయ పాలన లేకపోవడంతో పాటు డీజే నిర్వహణ, డిస్కో లైట్ల ఏర్పాటులోనూ నిబంధనలు పాటించలేదు. ఈ నేపథ్యంలోనే గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ మారని, అంతటితో ఆగని క్లబ్ టెకీల నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరో అడుగు ముందుకు వేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దిగువ మధ్య తరగతి యువతులను ఆకర్షించి వారితో నృత్యాలు చేయిస్తూ డ్యాన్స్ బార్గా మార్చేశారు. ఈ యువతులు తమ హావభావాలతో పాటు చర్యలతోనూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. డ్యాన్సర్లు అభ్యంతరకరంగా నృత్యం చేస్తూ వెళ్లి కస్టమర్ల పక్కన కూర్చోవడం, వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చేస్తూ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నారు. దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్‌కు సమాచారం అందింది. ఎస్సై సీహెచ్ నవీన్ కుమార్ బృందంతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటల ప్రాంతంలో క్లబ్ టెకీలపై దాడి చేశారు. నళిని రెడ్డి, ఎన్.రవి, సైదా జరీన్, బి.హరికృష్ణ, బి.ప్రకాష్‌లతో పాటు నృత్యాలు చేస్తున్న ఎనిమిది మంది యువతులు, ఐదుగురు కస్టమర్లను అరెస్టు చేశారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం ఆర్ పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న విజయ్ కుమార్ గౌడ్ కోసం గాలిస్తున్నారు. పబ్‌లో రష్యన్ యువతులతో డ్యాన్సులు బంజారాహిల్స్: రష్యన్ యువతులతో అర్దనగ్న డ్యాన్స్‌లతో అర్ధరాత్రి హంగామా సృష్టించిన ఓ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు–36లో ఎనిగ్మా పేరుతో ఒక రెస్టారెంట్, పబ్‌ను ప్రారంభించారు. ప్రీలాంచింగ్ అంటూ ప్రారంభించిన ఈ పబ్‌లో రష్యన్ యువతులతో నృత్యాలు ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలకు ఎౖMð్సజ్‌శాఖ నుంచి అనుమతులు తీసుకున్న పబ్ నిర్వాహకులు..పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇదే సమయంలో పబ్‌లో శనివారం రాత్రి అతిథులు పెద్దసంఖ్యలో రావడం, మద్యం మత్తులో తూలడంతో పాటు అక్కడున్న రష్యన్ యువతులతో కలిసి నృత్యాలు చేశారు. దీనికితోడు రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడం,పబ్‌లోని శబ్ధాలకు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పబ్ నిర్వాహకులైన దుర్గాప్రసాద్, చువాల్సింగ్లపై ఐపీసీ సెక్షన్ 294, ఆబ్సెంట్ చట్టం, 341, 21 ఆఫ్ 76 చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పబ్బు..గబ్బు!) -
పబ్బు..గబ్బు!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌పై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడితో వీటి కేంద్రంగా సాగుతున్న రేవ్ పార్టీలు బహిర్గతమయ్యాయి. తాజాగా రామ్‌గోపాల్‌పేటలోని క్లబ్ టెకీలపై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జూబ్లీహిల్స్‌లోని ఎనిగ్మా పబ్‌పై స్థానిక పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేయడంతో వీటి కేంద్రంగా జరుగుతున్న ‘డ్యాన్సుల’ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన నగర పోలీసులు అన్ని క్లబ్బుల పైనా నిఘా ముమ్మరం చేశారు. దేశ, విదేశీ యువతులతో క్యాబరేలు... పబ్స్‌లో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాల్లో నగరంలోని దిగువ, మధ్యతరగతి, దేశ, విదేశీ యువతులతో చేయించే క్యాబరేలు నయా ట్రెండ్‌గా మారాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి వీటి నిర్వాహకులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు తెర తీస్తున్నారు. వివిధ మెట్రో నగరాలకు చెందిన యువతలతో పాటు టూరిస్టు వీసాలపై విదేశీ యువతుల్ని నగరానికి తెస్తున్న దళారులు పబ్స్, రిసార్ట్స్‌లో వారి ఒంపుసొంపులను ఎరగా వేసి రెండు చేతులా ఆర్జిస్తున్నారు. పర్యాటకం ముసుగులో సాగుతున్న ఈ వ్యాపారం వ్యవస్థీకృతంగా జరుగుతోంది. ఎప్పుడైనా దాడులు జరిగినపుడు ఆ యువతులే పట్టుబడుతున్నారు తప్ప సూత్రధారులు మాత్రం తప్పించుకుంటున్నారు. గతంలో బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో పట్టపగలే అశ్లీల నృత్యాలుృ చేస్తూ ముగ్గురు రష్యా యువతులు పోలీసులకు దొరికారు. మరో యువతి టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడింది. ఆ దేశాల వాళ్లే ఎక్కువ... ఈ అనధికారిక క్యాబరేల్లో నర్తించడానికి వస్తున్న విదేశీ యువతుల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, ఇతర వూజీ సోవియట్ యూనియన్ దేశాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఆయా దేశాల్లోని ఆర్థిక పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు దళారులు అక్కడి యువతులకు డబ్బు ఎరవేస్తున్నారు. ఆకర్షణీయమైన దేహ సౌష్టవం కలిగిన వారిని టూరిస్టు వీసాలపై ఇక్కడకు రప్పిస్తున్నారు. ఆపై వారికి, వారి నృత్యాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనంతరం వీరితో పబ్‌లు, క్లబ్బుల్లో అశ్లీల ప్రదర్శనలు ఇప్పిస్తూనే కస్టమర్లను విటులుగా మార్చుకుని మరోపక్క వ్యభిచారం చేయిస్తున్నారు. గంట గంటకో రేటు... విదేశీ యువతుల నృత్యాలు, వారిపై ఉండే క్రేజును లక్ష్యంగా చేసుకునే ఏజెంట్లు వీరిని ఆటబొమ్మల్ని చేసి గంటల చొప్పున రేటు కట్టి మరీ వసూలు చేస్తుంటారు. ఒక్కో సందర్భంలో ఈ క్యాబరేలకు గంటకు రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇందులో యువతులకు దక్కేది మాత్రం తక్కువే. వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ వ్యవహారాలు నడిపే సూత్రధారులు నగరానికి చెందిన వారు కారని తెలుస్తోంది. కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ముంబై కేంద్రంగా ఈ దందా నడుపుతున్నాడని సమాచారం. అక్కడి ఓ ఆంగ్లో ఇండియన్ యువతి ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పబ్స్‌పై డేగకన్ను వేశాం వరుసగా వెలుగులోకి వస్తున్న ఉదంతాల నేపథ్యంలో నగరంలోని పబ్స్‌పై డేగకన్ను వేశాం. ఇప్పటి వరకు డ్రగ్స్ పైనే దృష్టి ఉండేది. ఇకపై ఇలాంటి డ్యాన్సుల విషయాన్నీ, అసాంఘిక కార్యకలాపాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తాం. నిర్ధేశిత సమయానికి మించి నడుస్తున్న పబ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. దీనిపై ఇప్పటికే వాటి నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు ఇచ్చాం. – నగర పోలీసు ఉన్నతాధికారి (చదవండి: కార్డినల్‌గా పూల ఆంథోనీ) -
మియాపూర్‌లో సీక్రెట్‌గా హైటెక్ వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మియాపూర్‌లో హైటెక్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ రైడ్‌లో ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో ఉన్న సాయిరాం రెసిడెన్సీలోని ఫ్లాట్ నెంబర్ 1205లో గుట్టుగా హైటెక్ వ్యభిచారం నడుస్తోంది. ఒంగోలుకు చెందిన షైక్ ఇర్ఫాన్(26), సాయి గణేష్ రెడ్డి(27)లు.. మహిళలతో వ్యభిచార వ్యవహారం నడుపుతున్నారు. కాగా, ఫ్లాట్‌లో వ్యభిచారం నడిపిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు శుక్రవారం రైడ్స్ వెళ్లారు. దాడుల్లో భాగంగా ఇద్దరు నిర్వాహాకులను అదుపలోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో అదుపులోకి తీసుకున్న ఓ మహిళను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. వ్యభిచారం నిర్వహణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: న్యూడ్ కాల్స్‌తో పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్.. ప్రియుడ్ని హత్య చేసి యాక్సిడెంట్‌గా డ్రామా -
క్యాబ్.. ఓన్లీ క్యాష్!
సాక్షి, హైదరాబాద్: క్యాబ్‌లో కాసింత ప్రశాంతంగా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీ జేబులో నగదు ఉందో లేదో చూసుకొని మరీ క్యాబ్ బుక్ చేసుకోండి. గూగుల్ పే నుంచి, పేటీఎం వంటి యూపీఐ సేవల నుంచి చార్జీలు చెల్లించవచ్చనుకుంటే క్యాబ్ లభించడం కష్టమే. ఆన్లైన్ పేమెంట్లపై సేవలను అందజేసేందుకు నగరంలో క్యాబ్ డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్న వెంటనే చార్జీల చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. నగదు రూపంలోనే చెల్లించనున్నట్లు ప్రయాణికులు భరోసా ఇస్తేనే క్యాబ్‌లు వస్తున్నాయి. లేదంటే ఉన్నపళంగా రైడ్స్ రద్దవుతున్నాయి. కొంతమంది ఆటోడ్రైవర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు. చివరి నిమిషంలో రైడ్స్ రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉబెర్, ఓలా తదితర సంస్థలకు చెందిన క్యాబ్‌లు, ఆటోలు ప్రయాణికులకు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్టీఏ అధికారులు, పోలీసులు క్యాబ్‌ల నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో కొంతమంది డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మోటారు వాహన నిబంధనల ప్రకారం ప్రయాణికులు నమోదు చేసుకున్న రైడ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడానికి వీల్లేదు. అలాంటి రైడ్స్ రద్దును పోలీసులు, రవాణా అధికారులు తీవ్రంగా పరిగణించి రూ.500 వరకు జరిమానా విధించవచ్చు, కానీ ఈ నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ రకాల కారణాలతో డ్రైవర్లు ప్రతి పది రైడ్లలో 3 నుంచి 4 రైడ్లను రద్దు చేయడం గమనార్హం. డ్రైరన్ల నెపంతో రద్దు.. మరోవైపు డ్రై రన్ సాకుతో కొందరు డ్రైవర్లు రైడ్లను రద్దు చేస్తున్నారు. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకొన్న సమయానికి కనీసం 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉంటే క్యాబ్‌లు, ఆటోలు ఠంచన్‌గా బుక్ అవుతున్నాయి. అంతకంటే ఎక్కువ దూరంలో ఉంటే మాత్రం వెంటనే రద్దవుతున్నాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ‘మహిళలు, పిల్లలతో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఆకస్మిక రద్దులతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. క్యాబ్‌లను నమ్ముకొని ప్రయాణం చేయడం కష్టమనిపిస్తుంది.’ అని మారేడుపల్లికి చెందిన సుధీర్ విస్మయం వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో రైడ్ల రద్దు ఎక్కువగా ఉంటోంది. ‘పెళ్లిళ్లు, పుట్టిన రోజు వంటి వేడుకల్లో పాల్గొనేందుకు క్యాబ్‌లను నమ్ముకొని నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లకు వెళ్తే తిరిగి ఇల్లు చేరుకోవడం కష్టమే’నని ఎల్బీనగర్కు చెందిన నవీన్ చెప్పారు. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకున్న తరువాత 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే డ్రైవర్లు వెంటనే రైడ్ రద్దు చేస్తున్నారు. మరోవైపు దూరాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా కొందరు ఆకస్మిక రద్దుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గిట్టుబాటు కావడం లేదు డ్రై రన్లలో డ్రైవర్లు ఎక్కువ దూరం ఖాళీగా వెళ్లాల్సి ఉంటుంది. పెరిగిన డీజిల్ ధరల దృష్ట్యా ఇది ఎంతో భారం. ఓలా, ఉబెర్ సంస్థలు ఇచ్చే కమీషన్లు గిట్టుబాటు కావడం లేదు. ఆన్లైన్ చెల్లింపుల్లో సదరు క్యాబ్ అగ్రిగేటర్ల ఖాతాల్లోంచి డ్రైవర్ ఖాతాలోకి జమ కావడానికి చాలా సమయం పడుతోంది. అందుకే కొంతమంది డ్రైవర్లు తప్పనిసరి పరిస్థితుల్లోనే రైడ్స్ రద్దు చేస్తున్నారు. – షేక్ సలావుద్దీన్, చైర్మన్, తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ (చదవండి: నిరుద్యోగులకు బస్‌పాస్‌లో 20 శాతం రాయితీ) -
డ్రగ్స్ కేసులో నాగబాబు కుమార్తెకు నోటీసులు
Pudding And Mink Pub Raid: సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పబ్‌లో డ్రగ్స్(కొకైన్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల రాకతో పబ్‌లోని యువతీ యువకులు డ్రగ్స్‌ను కిటికీ నుంచి కింద పడేశారు. కాగా, బయట పడేసిన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు ఉన్నారు. పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడు తదితర ప్రముఖులు ఉన్నారు..కాగా, ఈ కేసులో నిహారికాను విచారించిన తర్వాత ఆమెకు నోటీసులు ఇచ్చారు. మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. అర్ధరాత్రి పబ్‌పై దాడులు.. పోలీసుల అదుపులో ప్రముఖ సింగర్.. మరోవైపు.. పబ్ విషయంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. పబ్‌పై గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. అయితే, పబ్ మాజీ ఎంపీ కుమార్తెది కావడంతో పోలీసుల చూడనట్టు వదిలేశారని తెలుస్తోంది. ఈ కేసులో సీఐ శివచంద్రను సస్పెండ్ చేసి ఏసీపీ సుదర్శన్‌కు ఛార్జ్ మెమోను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఫుడింగ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వాడినట్టు తెలిపారు. పబ్యాజమాన్యమే డ్రగ్స్ సప్లై చేసిందని స్పష్టం చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తే డ్రగ్స్ సప్లై చేసినట్టు అంగీకరించారు. ఆ హోటల్లో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పబ్‌ల్లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు డ్రగ్స్ కేసులో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు ఉన్నతాధికారులు. అసలు పబ్‌ల్లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయనే దానిపై నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ రంగంలోకి దిగింది. వీఐపీలు, వీవీఐపీల పిల్లల తీరుపై దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. పబ్‌ల్లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేపట్టనున్నారు. అదే సమయంలో పబ్ యాజమాన్యం, సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ సప్లై చేసిన పెడర్ల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. -
ఆదిత్య ఠాక్రే సన్నిహితులపై ఐటీ దాడులు
ముంబై: మహారాష్ట్ర మంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే సన్నిహితులపై ఆదాయపన్ను శాఖ పలు దాడులు నిర్వహించింది. బెంగాల్, ఏపీలోలాగా తమను వ్యతిరేకించేవారిని కేంద్రం లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపిస్తోందని ఆదిత్య విమర్శించారు. పార్టీ ఆఫీస్ బేరర్, షిర్డీ ట్రస్ట్ సభ్యుడు రాహుల్ కనాల్, కేబుల్ ఆపరేటర్ సదానంద్ కదమ్, బజరంగ్ ఖర్మాటే నివాసాలపై ఐటీ శాఖ మంగళవారం దాడులు నిర్వహించింది. వీరిలో రాహుల్ ఆదిత్యకు, మిగిలిన ఇద్దరు శివసేన మంత్రి అనీల్పరాబ్కు సన్నిహితులు. ముంబై కార్పొరేషన్ ఎన్నికలయ్యేవరకు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయని సేన నేత సంజయ్‌రౌత్ కేంద్రంపై విమర్శలు సంధించారు. రాష్ట్రాలపై ఒత్తిడి పెంచేందుకే కేంద్రం ఈ చర్యలకు పాల్పడుతోందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 14మంది ప్రముఖులపై దాడులు జరిగాయని, వీరిలో ఎవరూ బీజేపీకి చెందరని చెప్పారు. తాము బీజేపీకి చెందిన పలువురి పేర్లను ఐటీ, ఈడీలకు పంపామని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. (చదవండి: ఈవీఎం మిషన్ల దొంగతనం...ట్రక్కుల్లో తరలింపు) -
ఉబర్ డ్రైవర్ని వరించిన రూ. 75 లక్షల లాటరీ
వాషింగ్టన్: లాటరీ తగలడమే అదృష్టం అందులోనూ ఆ లాటరీలో మరింత ఎక్కువ డబ్బు వస్తే ఇక ఆనందానికి అవధులే ఉండవు. పైగా చిన్నచితకా ఉద్యోగాలతో రోజంతా నిర్విరామంగా పనిచేసే వాళ్లకు లాటరీ తగలితే ఇక ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటి అనుభవం ఒక ఉబర్ డైవర్కి ఎదురైంది. వివరాల్లోకెళ్లితే...అమెరికాలోని 69 ఏళ్ల ఒక ఉబర్ డ్రైవర్ పగలు రాత్రి రైడింగ్‌తో నిర్విరామంగా పనిచేస్తుంటాడు. (చదవండి: సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు) పెద్దగా ఆదాయం లేని విరామ సమయాన్ని ఈ ఉబర్ డ్రైవర్ మంచి లాభదాయకంగా మార్చుకున్నాడు. ఇంతకీ అతను ఆ సమయంలో ఏం చేశాడంటే....జోప్పాలోని ఓ దుకాణం వద్ద 10 డాలర్లతో లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేస్తూ డబ్బలు గడిస్తుండేవాడు. ఆ విధంగా అతను ఒకరోజు అనుకోకుండా 1000 డాలర్ల వెచ్చించి మరీ పెద్ద లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. అయితే ఆరోజు అనుహ్యంగా లక్ష (రూ.75 లక్షలు) గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఉబర్ డైవర్ మాట్లాడుతూ.. "ఈ రోజు చాలా పవిత్రమైంది అంటూ నేను అరుస్తుంటే పక్కనే ఉన్న ఎన్ఫోర్స్మెంట్ అధికారి బాగానే ఉన్నావా అంటూ విచిత్రంగా చూశాడు. ఆ తర్వాత నేను చూశావా నాకు లాటరీలో ఎంత తగిలిందో చూడు అంటూ ఆనందంగా చూపించాను. మిడిల్ రివర్ నుండి వచ్చిన నేను మేరీల్యాండ్ లాటరీ టికెట్ కంపెనీకి ఉబర్ డ్రైవర్‌గా ఐదేళ్లు నుంచి పనిచేయడమే కాక 24 వేల రైడ్లకు పైగా చేశాను" అని అన్నాడు. అంతేకాదు సదరు డ్రైవర్ ఈ డబ్బులో కొంతవరకూ తన కారును బాగుచేయించుకోవడానికి ఖర్చు పెడతానని అన్నాడు. (చదవండి: దయచేసి ఫోన్ ఎత్తి మేము సురక్షితంగా ఉన్నాం అని చెప్పండి!) -
సైకిల్‌పై సీఎం సందడి: కొత్త స్కీం
చండీగఢ్: వరల్డ్ కార్ ఫ్రీ డే సందర్భంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సైకిల్‌పై సందడి చేశారు. కాలుష్య నివారణపై అవగాహన కల్పించేలా తన మంత్రి వర్గ సహచరులు, ఇతర ఎమ్మెల్యేలతో సైకిల్‌యాత్ర చేపట్టారు. తన అధికారిక నివాసం నుండి సెక్రటేరియట్ వరకు సైకిల్‌పై వచ్చి పలువురిని ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ మంత్రి జేపీ దలాల్, రవాణా శాఖ మంత్రి మూల్‌చంద్ శర్మ సైకిల్‌పై పౌర సచివాలయానికి చేరుకోవడం విశేషం. (World Car Free Day: ఎంచక్కా సైకిల్‌పై షికారు చేద్దాం!) ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 75 సంవత్సరాల పైబడిన పాత చెట్ల నిర్వహణ నిమిత్తం, ప్రాణ వాయు దేవత పెన్షన్ యోజన పేరిట ఏడాదికి రూ.2,500 పెన్షన్ అందజేస్తామని చెప్పారు. మొత్తం రాష్ట్రంలో ఇటువంటి చెట్లను గుర్తించి, స్థానిక ప్రజలను ఈ పథకంలో చేర్చడం ద్వారా పరిరక్షణకు చర్యలు చేపడతా మన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇస్తున్న హరియాణా ప్రభుత్వం త్వరలో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని తీసుకురానుంది. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో, ఖట్టర్ చండీగఢ్ నుండి కర్నాల్ వరకు రైలులో ప్రయాణించారు. అలాగే సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకుని అందర్నీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. #WATCH | Haryana Chief Minister Manohar Lal Khattar* rides a bicycle along with his cabinet colleagues and MLAs from his residence to the secretariat in Chandigarh to observe #Worldcarfreeday pic.twitter.com/ME0dt31MJl — ANI (@ANI) September 22, 2021 -
ఏసీబీ దాడులు: అదుపులో తణుకు ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్
సాక్షి, తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో అదనంగా డబ్బులు వసూలు చేయడంతో పాటు పలు అవకతవకలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ పెచ్చెట్టి రాంబాబు వద్ద లెక్కలు చూపని నగదు రూ.54,100 స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల వసూలుకు ప్రైవేటుగా కొందరు వ్యక్తులను నియమించుకున్నట్టు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారణ చేసి సంబంధిత అధికారులకు నివేదిస్తామన్నారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ పెచ్చెట్టి రాంబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. రాత్రంతా తనిఖీలు కొనసాగుతాయని డీఎస్పీ వెల్లడించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాస్, కె.నాగేంద్రప్రసాద్, కె.ఏసుబాబు పాల్గొన్నారు. -
అంతరిక్షానికి ఎగిరే బెలూన్.. సీట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు
... ఎస్.. ఆ బెలూన్ భూ వాతావరణ పరిధిని దాటి అంతరిక్షం వరకు వెళుతుంది.. మనుషులను తీసుకొని మరీ! ఫేక్ కాదు ఫ్యాక్ట్. ఫ్లొరిడాలోని ఓ టూరిజం సంస్థ స్పేస్ బెలూన్ సవారీని టేకాఫ్ చేయనుంది. సుమారు లక్ష అడుగుల ఎత్తుకు.. కేవలం రెండు గంటల్లోనే మిమ్మల్ని తీసుకెళ్లగలదు. అక్కడికి చేరుకున్నాక మరో రెండు గంటలు ఆ అంతరిక్ష అందాలను వీక్షించడానికి, ఆస్వాదించడానికి అనువుగా అక్కడే చక్కర్లు కొడుతుంది. ఈ షికారులో ప్రయాణికులకు కావాల్సిన ఆహారాన్ని టూరిజం సంస్థ వారే సరఫరా చేస్తారు. అంతేకాదు ఈ బెలూన్‌లో ఒక కిచెన్, బార్, బాత్రూమ్ కూడా ఉంటాయి. తిరిగి నేలకు చేరుకోడానికి మరో రెండు గంటలు. మొత్తం ఆరుగంటల ఈ ప్రయాణంలో కేవలం ఎనిమిది మందికి మాత్రమే చోటు ఉంటుంది. బాగుంది కదూ! ఈ షికారును మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? కూసింత కరుసవుద్ది మరి! జస్ట్ రూ. 93 లక్షలు చెల్లించి, సీట్ బుక్ చేసుకుని.. 2024 వరకు వేచి చూడండి. హైడ్రోజన్ బెలూన్లు అంతపైకి ఎలా వెళ్లగలవనే కదా మీ డౌటా. ‘నాసా’ ఆధ్వర్యంలో అంతరిక్ష ప్రయాణ నిపుణులు వివిధ ప్రయోగాలు చేసి అతి తక్కువ బరువుతో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాన్ని రూపొందించారు. అది గురత్వాక్షరణ శక్తిని అధిగమించి అంతరిక్ష ప్రయాణానికి అనుకూలిస్తుంది. ఈ పద్ధతి ఉపయోగించే తాజాగా.. ఫ్లొరిడాలోని ఓ సంస్థ అంతరిక్షంలోకి విమాన ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ విమానం మాదిరే ఈ బెలూన్ను నడిపేందుకూ ఒక స్పేస్ పైలట్, ఒక కో పైలట్ ఉంటారు. ప్రయాణికులు అంతరిక్ష సవారీని ఆస్వాదిస్తూ ఆ మధుర క్షణాలను బెలూన్ పారదర్శక గోడల నుంచి మీ మొబైల్ కెమెరాలతో ఫొటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు. -
దొరికిపోతానని రూ.5 లక్షలు కాల్చేశాడు!
కల్వకుర్తి టౌన్/కల్వకుర్తి/వెల్దండ/మన్సూరాబాద్: అవినీతి వ్యవహారంలో లంచంగా డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రావడంతో ఆ నోట్ల కట్టలను గ్యాస్‌స్టవ్‌పై పెట్టి తగలబెట్టేశాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన మంగళవారం కల్వకుర్తిలోని విద్యానగర్‌లో జరిగింది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరంతకుంట తండా సర్పంచ్ రమావత్ రాములునాయక్ వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామ శివారులో ఉన్న 15 హెక్టార్ల భూమిలో క్రషర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి జనవరి 12న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఫిబ్రవరి 16న భూమి సర్వేకు హాజరు కావాలని రాములునాయక్‌కు వెల్దండ తహసీల్దార్ కార్యాలయం నుంచి నోటీసులు పంపించారు. సర్వే కోసం రూ.6 లక్షలు ఇవ్వాలని తహసీల్దార్ సైదులు డిమాండ్ చేశారు. దాదాపు నెల పాటు చర్చలు జరిగిన తర్వాత రూ.5లక్షలు ఇచ్చేందుకు రాములునాయక్ ఒప్పుకున్నారు. ఈ డబ్బులను మధ్యవర్తి, వెల్దండ మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్యగౌడ్‌కు ఇవ్వాలని తహసీల్దార్ సూచించారు. దీంతో రాములు నాయక్ ఈనెల ఒకటో తేదీన మహబూబ్‌నగర్‌లోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం సాయంత్రం డబ్బులు ఇచ్చేందుకు కల్వకుర్తిలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకటయ్యగౌడ్ ఇంటికి వెళ్లారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఇంటికి ఎవరో వచ్చారని పోలీసులకు ఫోన్.. ఏసీబీ అధికారులు వచ్చినా వెంకటయ్యగౌడ్ తలుపు తీయకుండా.. తన ఇంటికి ఎవరో వచ్చారని స్థానిక పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు.. వారు ఏసీబీ అధికారులు అని తెలుసుకుని వెనుదిరిగారు. అదే సమయంలో తాను దొరికిపోతాననే భయంతో వెంకటయ్యగౌడ్ వంటగదిలోకి వెళ్లి గ్యాస్‌స్టవ్‌పై డబ్బులు పెట్టి నిప్పంటించారు. వెంటనే మరో తలుపు నుంచి వయటకు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన ఏసీబీ అధికారులు తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లి అతడిని పట్టుకున్నారు. కాలుతున్న నోట్లపై నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. అయితే, అప్పటికే నోట్లన్నీ దాదాపు 70శాతం మేరకు కాలిపోయాయి. తగలబడిన నోట్లు అనంతరం వెంకటయ్యగౌడ్‌ను విచారించి, అతడిని తీసుకుని వెల్దండ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఏసీబీ అధికారులు వెంకటయ్యగౌడ్‌ను కార్యాలయంలోకి తీసుకెళుతుండగా.. పలువురు బాధితులు ఆయనపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఏసీబీ అధికారులు తహసీల్దార్ సైదులును అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులను బుధవారం హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపారు. నిందితుల ఇద్దరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కాగా, తహసీల్దార్ వేధింపులకు విసిగిపోయిన కొందరు బాధితులు ఈ సందర్భంగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. -
రోగుల ప్రాణాలతో మందులోళ్ల చెలగాటం..
సాక్షి, హైదరాబాద్: కొన్ని ఔషధ కంపెనీలు, మందుల దుకాణాలు, బ్లడ్ బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మెడికల్ షాపుల్లో గడువు తీరిన, నాసిరకం మందుల అమ్మకంతో రోగులకు ముప్పు పొంచి ఉంటోంది. ఔషధ నియంత్రణశాఖ పరిధిలో జరిగే ఉల్లంఘనల్లో దాదాపు 75% మెడికల్ షాపుల్లో జరిగేవేనని అధికారులు అంటున్నారు. ప్రధానంగా రిఫ్రిజిరేటర్లో ఉంచాల్సిన ఔషధాలను వేడి వాతావరణంలో పెట్టడం, సాధారణ మెడికల్ షాపు ల్లోనూ పశువుల మందులు విక్రయించడం, ఫార్మ సిస్ట్ లేకపోవడం, ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మడం, ఒక బ్రాండ్‌కు బదులు మరో బ్రాండ్ మందులు అంటగట్టడం, నిర్ణీత ధర కంటే ఎక్కువకు అమ్మడం, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం వంటి ఉల్లంఘనలు జరిగినట్లు సర్కారు గుర్తించింది. అలాగే కొన్ని ఔషధ కంపెనీలు కూడా నాణ్యతలేని ముడి సరుకులతో ఔషధాలు తయారు చేస్తున్నాయని తేలింది. అంతేగాక లేబిలింగ్ సరిగా ఉండకపోవడం, తక్కువధర ఉండాల్సిన వాటికి ఎక్కువ ధర నిర్ణయించడం తదితర ఉల్లంఘనలు జరిగాయి. మరోవైపు బ్లడ్‌బ్యాంకుల్లోనూ విపరీతంగా ఉల్లంఘనలు జరిగాయి. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో రక్తాన్ని నిల్వ ఉంచకపోవడం, నిర్దేశిత టెస్టుల్లో కొన్ని చేయకపోవడం జరుగుతోంది. తద్వారా సేకరించిన రక్తంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే స్వీకరించే రోగులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. అలాగే మెడికల్ ఆఫీసర్ లేకుండానే టెక్నీషియన్లతో బ్లడ్ బ్యాంకును నడిపించడం వంటి ఉల్లంఘనలు జరిగాయి. ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ వంటి వాటికి ప్రత్యేక లైసెన్సు లేకుండా నడపడం తీవ్రమైన ఉల్లంఘనగా అధికారులు చెబుతున్నారు. 21,087 ఉల్లంఘనల్లో 18 వేలు మెడికల్ షాపుల్లోనే.. మందుల దుకాణాలు, ఫార్మసీ కంపెనీలు, బ్లడ్ బ్యాంకులు, స్టోరేజీ సెంటర్లలో గత ఐదేళ్లలో ఏకంగా 21,087 ఉల్లంఘనలు జరిగినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అసెంబ్లీకి సమర్పించిన నివేదిక వెల్లడించింది. 2016–17 నుంచి 2020–21 జనవరి వరకు ఈ ఐదేళ్లలో ఫార్మసీ కంపెనీలు, మందుల దుకాణాలు, బ్లడ్‌బ్యాంకులు, స్టోరేజీ సెంటర్లలో 87,700 తనిఖీలు నిర్వహించారు. వీటిల్లో 21,087 ఉల్లంఘనలను గుర్తించారు. ఏకంగా 24 శాతం ఉల్లంఘనలు జరగడం విస్మయం కలిగిస్తోంది. గడిచిన ఐదేళ్లలో 12,801 శాంపిళ్లను పరీక్షించగా... 1,348 కేసులు ప్రాసిక్యూషన్ వరకు వెళ్లాయి. ఔషధ నియంత్రణ సంస్థలోని కొందరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే యదేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఉల్లంఘనలు జరిగిన వాటిల్లో దాదాపు 18 వేలు మెడికల్ షాపుల్లోనే జరిగినట్లు ఔషధ నియంత్రణశాఖ వర్గాలు చెబుతున్నాయి. (చదవండి: ‘బల్సిందా నీ.. ఊర్కో బే’ బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం) వైద్య ఆరోగ్యశాఖ నివేదికలోని మరికొన్ని అంశాలు.. గతేడాది కరోనా నేపథ్యంలో అనారోగ్యానికి గురైనా చాలామంది ఆసుపత్రులకు రావడానికి జంకారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య బాగా పడిపోయింది. ప్రసవాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రిలో 2019లో ఔట్పేషెంట్లు 6.03 లక్షల మంది కాగా, 2020లో ఆ సంఖ్య ఏకంగా 2.98 లక్షలకు పడిపోయింది. అలాగే 2019లో 47,359 మంది ఇన్న్ పేషెంట్లుగా చికిత్స తీసుకోగా, 2020లో ఆ సంఖ్య 25,931కు పడిపోయింది. ఇక శస్త్రచికిత్సలు 2019లో 24,638 జరగ్గా, 2020లో సగానికికంటే తక్కువగా 11,073కు పడిపోయాయి. 2019లో మూత్రపిండాల మార్పిడి చికిత్సలు 105 జరగ్గా, 2020లో 30కు పడిపోయాయి. మోకాళ్ల మార్పిడి చికిత్సలు 2019లో 173 కాగా, 2020లో 34కు పడిపోయాయి. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని 108 ఆసుపత్రులకు సగటున ఏడాదికి 1.08 కోట్ల మంది ఔట్ పేషెంట్లు వస్తుండగా, 2020–21లో జనవరి వరకు కేవలం 60.52 లక్షల మందే వచ్చారు. ఇన్ పేషెంట్లు 9.55 లక్షలు అంచనా కాగా, ఆ సంఖ్య 6.96 లక్షలకు పడిపోయింది. అయితే కరోనా కాలంలో 108 జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. వాటిల్లో సగటున ఏడాదికి 81,600 ప్రసవాలు జరుగుతుండగా, 2020లో ఏకంగా 1,24,278 ప్రసవాలు జరగడం విశేషం. ఆయా ఆసుపత్రుల్లో ల్యాబ్ టెస్ట్‌లు 36.95 లక్షల నుంచి 40.44 లక్షలకు చేరుకోవడం గమనార్హం. సగటు ఏడాదికి జరిగే ఈసీజీలు 63,175 కాగా.. గత ఏడాది ఏకంగా 79,970 జరిగాయి. ఇక తెలంగాణ డయాగ్నస్టిక్‌లలో 2019లో 9.05 లక్షల పరీక్షలు జరగ్గా, 2020లో 7.61 లక్షలకు పడిపోయాయి. 9 ప్రభుత్వ బోధనాసుపత్రులు, 22 స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 2019లో 76.83 లక్షల మంది ఔట్ పేషెంట్లు వైద్య సేవలు పొందగా, 2020లో ఆ సంఖ్య సగానికి అంటే 38.25 లక్షలకు పడిపోయింది. ఇన్ పేషెంట్ల సంఖ్య 2019లో 5,91,772 కాగా, 2020లో 3.98 లక్షలకు పడిపోయింది. 2019లో ఈ ఆసుపత్రుల్లో 3.22 లక్షల శస్త్రచికిత్సలు జరగ్గా, 2020లో 1.48 లక్షలు జరిగాయి. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 2019–20లో 3.50 లక్షల మంది వైద్య సేవలు పొందగా, 2020–21 మార్చి 10వ తేదీ నాటికి 2.26 లక్షల మంది సేవలు పొందారు. (చదవండి: ఉపాధి పనికి ఆలయ అర్చకుడు ) -
నగ్నంగా బైక్‌పై హల్చల్ : పోలీసుల వేట!
-
నగ్నంగా బైక్‌పై హల్చల్ : పోలీసుల వేట!
సాక్షి, సిటీబ్యూరో: అతడో బైక్‌ను చోరీ చేశాడు... దానిపై నగ్నంగా రెండు కమిషనరేట్ల పరిధిలో సంచరించాడు... పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వాహనం వదిలి పారిపోయాడు. ఆ ‘నగ్న చోరుడి’ కోసం ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. చిక్కితే ఓ చోరీ కేసు ఇప్పటికే సిద్ధంగా ఉండగా, మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం మరో కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..ఓ గుర్తుతెలియని యువకుడు గత వారం లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. దీనిపై స్థానిక పీఎస్‌లో కేసు నమోదైంది. ఆ చోరుడు మూడు రోజుల క్రితం పట్టపగలు ఆ వాహనాన్ని తీసుకుని నగ్నంగా షికారుకు బయలుదేరాడు. తొలుత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని బోయిన్పల్లి పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ ఏరియాలో హల్చల్ చేశాడు. ఆపై బొల్లారంలోని మిలటరీ ప్రాంతంలో సంచరించాడు. అక్కడి నుంచి బేగంపేట వచ్చిన ఈ ‘న్యూడ్ రైడర్’ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన నాలాపై ఉన్న వంతెన మీదుగా బల్కంపేటకు, అట్నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే సనత్‌నగర్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ ఠాణా పరిధిలోనే ఎక్కువసేపు సంచరించాడు. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన గస్తీ బృందాలు సనత్‌నగర్ ఎస్ఆర్టీ ప్రాంతంలోని నెహ్రు పార్క్ వద్ద ఆ నగ్న యువకుడిని గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు యువకుడు వాహనాన్ని అక్కడే పడేసి వారిపై రాళ్ల దాడికి దిగాడు. అదను చూసుకుని పార్క్ లోపలికి వెళ్లిన అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సతన్‌నగర్ పోలీసులు ఆ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది రిజిస్టరై ఉన్న చిరునామా, ఫోన్ నంబర్ ఆధారంగా అతడిని గుర్తించాలని ప్రయత్నించారు. అయితే ఆ వాహనం చోరీపై లంగర్‌హౌస్ ఠాణాలో కేసు నమోదై ఉన్నట్లు తేలింది. దీంతో సనత్‌నగర్ పోలీసులు వాహనాన్ని బుధవారం ఆ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు. సదరు యువకుడి కోసం చోరీ కేసు ఉండటంతో లంగర్‌హౌస్ అధికారులు, న్యూసెన్స్ చేసినందుకుగాను మెంటల్ హెల్త్ యాక్ట్ కింద కేసు పెట్టాలని సనత్‌నగర్ పోలీసులు గాలిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలోనూ ఈ గాలింపు కొనసాగుతోంది. ప్రధానంగా లంగర్‌హౌస్ సహా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలిస్తున్నారు. ఆ యువకుడు నగ్నంగా బైక్ నడుపుతుండగా మిలటరీ ఏరియాలో వెనుక నుంచి వెళ్తూ కొందరు వాహన చోదకులు వీడియో తీశారు. ఆ ప్రయత్నంలో అతడిని పిలుస్తున్నా పలకకుండా, తల కూడా తిప్పకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అతగాడు మతిస్థిమితం లేక ఇలా చేశాడా? స్నేహితులు లేదా పరిచయస్తులతో పందాలు కాసి అలా ప్రవర్తించాడా? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
నైట్ క్లబ్‌లపై దాడులు.. పోలీసుల అదుపులో 275 మంది
సాక్షి, ముంబై: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న నైట్ క్లబ్బులపై బీఎంసీ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మిక దాడులు చేశారు. ఇందులో పట్టుబడిన నాలుగు క్లబ్బులకు షోకాజ్ నోటీసులు జారీచేయడమే గాకుండా ఓ క్లబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చర్యల్లో భాగంగా నాలుగు క్లబ్‌ల యజమానుల నుంచి రూ.43,200 జరిమానా వసూలు చేశారు. కోవిడ్ నియమాలు తుంగలో తొక్కి నైట్ క్టబ్బులు నడిపితే కఠిన చర్యలు తప్పవని, క్లబ్ యాజమాన్యాలు తమ వైఖరి మర్చుకోకుంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు కర్ఫ్యూ విధిస్తామని ఇదివరకే బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ క్లబ్ యాజమాన్యాలలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. అందులో పార్టీలు చేసుకునే కస్టమర్లు ముఖాలకు మాస్క్‌లు ధరించడం లేదు. సామాజిక దూరాన్ని పాటించడం లేదు. కస్టమర్ల నిర్లక్ష్యం వల్ల కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదముంది. నియమాలు కచ్చితంగా పాటించాల్సిందేనని చహల్ సూచించారు. కఠిన చర్యలు తీసుకుంటాం: బీఎంసీ కమిషనర్. కొన్ని క్లబ్బుల యజమానులు కోవిడ్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నట్లు బీఎంసీ కమిషనర్ చహల్ దృష్టికి వచ్చింది. దీంతో నగరంతోపాటు ఉప నగరాలలో అర్ధరాత్రి దాటిన ఆకస్మిక దాడులు చేపట్టారు. అందులో దాదర్‌లోని ప్రీతం హోటల్లో, తూర్పు బాంద్రా, మలాడ్, కాందివలిలోని నైట్ క్లబ్బుల్లో నియమాలు ఉల్లంఘించి పార్టీ చేసుకోవడం, డ్యాన్స్‌లు చేస్తున్నట్లు బీఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒక్కో నైట్ క్లబ్లో 50 మందికే అనుమతి ఉంది. కానీ, 100–150 పైనే అందులో కస్టమర్లు ఉన్నారు. అనేక మంది మాస్క్ ధరించలేదు. సామాజిక దూరమైతే పటాపంచలైంది. దీంతో 275 మందిని అదుపులోకి తీసుకుని క్లబ్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులతోపాటు జరిమానా విధించారు. చదవండి: (సోదరిపై ప్రేమతో అతడు చేసిన పని ఇప్పుడు హాట్‌టాపిక్..) ప్రస్తుతం ముంబై, ఉప నగరాలలో కరోనా వైరస్ అదుపులోకి వస్తున్నప్పటకీ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మరికొద్ది రోజులు ముఖాలకు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి పనులు చేయాల్సి ఉంది. కానీ, కొందరి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల కరోనా మళ్లీ పడగలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి బీఎంసీ సిబ్బంది జరిమానా విధిస్తున్నారు. కానీ, నైట్ క్లబ్బుల్లో తొంగిచూసే నాథుడే లేకపోవడంతో అక్కడ విచ్చల విడిగా నియమాల ఉల్లంఘన జరుగుతోంది. దీంతో కరోనా వైరస్ పూర్తిగా సద్దుమణిగే దాకా రాత్రి వేళ్లలో దాడులు ఇలాగే కొనసాగిస్తామని చహల్ హెచ్చరించారు. క్లబ్ యజమానుల్లో మార్పు రాని పక్షంలో చర్యలు మరింత కఠినం చేస్తామని హెచ్చరించారు. -
ప్రభుత్వాసుపత్రులపై ఏసీబీ మెరుపు దాడులు
సాక్షి, విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మందుల కొనుగోలులో చేతివాటం, పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు సమాచారం అందడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏసీబీ మెరుపుదాడులు నిర్వహించింది. కగా వారం కిందట ఏపీలోని ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగినట్లు వెలుగు చూడడంతో ఏసీబీ దాడులు ప్రాధాన్యతను సంతరించకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రులపై దృష్టి సారించిన ఏసీబీ 13 టీమ్‌లుగా ఏర్పడి వంద మంది సిబ్బందితో సోదాలు నిర్వహిస్తున్నారు. -
టీడీపీ నేత ఇంటిపై ఐటీ దాడులు
సాక్షి, వైఎస్సార్ కడప: టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంటిపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ద్వారక నగర్‌లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో శ్రీనివాసులరెడ్డి ఇంటి చుట్టూ మొహరించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న ఆయన కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో శ్రీనివాసులరెడ్డి చేపట్టిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన పత్రాలను ఐటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పన్ను ఎగవేసినట్టు ప్రాథమికంగా గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఏమేరకు పన్ను ఎగవేశారన్నది సోదాల్లో తేలనుంది. -
డిప్యూటీ తహసీల్దార్‌పై ఏసీబీ దాడులు
సాక్షి, కర్నూల్ : పాణ్యం డిప్యూటీ తహసీల్దార్ పత్తి శ్రీనివాసులుపై ఏసీబీ దాడులు చేసింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో కోర్టు సెర్చ్ వారెంట్‌తో ఏసీబీ డిఎస్పి నాగభూషణం తన సిబ్బందితో కలసి ఈ దాడులు చేశారు. ఇందులో భాగంగా నంద్యాల, కొండు జూటూరు, కోవెల కుంట్లలో సోదాలు నిర్వహించగా, నంద్యాలలోని అద్దె ఇంట్లో ఒక ఇన్నోవా, రూ. లక్షన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు. కోవెల కుంట్లలో భారీగా ఎల్ఐసి బాండ్లు కనుగొన్నారు. పట్టుబడిన సొమ్ము విలువ బహిరంగ మార్కెట్ ప్రకారం కోటిన్నర రూపాయల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో లాకర్ ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
ఏసీబీ వలలో ఆర్ఐ
సాక్షి, చాగల్లు(పశ్చిమగోదావరి) : అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో రెవెన్యూ అధికారి చిక్కారు. పట్టాదారు పాస్‌పుస్తకం కోసం సొమ్ములు డిమాండ్ చేసిన అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంగళవారం చాగల్లు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. ఎస్.ముప్పవరం గ్రామానికి చెందిన రైతు అయినం దుర్గాప్రసాద్ వద్ద చాగల్లు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న గాడి సుబ్బారావు పొలం పట్టాదారు పాస్ పుస్తకం నిమిత్తం రూ.2 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రైతు దుర్గాప్రసాద్ తండ్రి భీమయ్య మృతిచెందడంతో తండ్రి పేరు మీద ఉన్న 1 ఎకరా 75 సెంట్ల వ్యవసాయ భూమిని తన తల్లి కాంతమ్మ పేరుపై మార్చి పాస్ పుస్తకం ఇవ్వాలని కోరుతూ ఈనెల 1న మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్వో ధ్రువీకరించిన తర్వాత అతని దరఖాస్తు ఆర్ఐ సుబ్బారావు వద్ద పెండింగ్‌లో ఉంది. అప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ రైతు దుర్గాప్రసాద్ పలుమార్లు తిరుగుతున్నారు. ఈనేపథ్యంలో పాస్ట్‌పుస్తకం కావాలంటే రూ.2 వేలు ఇవ్వాలని ఆర్ఐ సుబ్బారావు ఫోన్లో దుర్గాప్రసాద్‌ను డిమాండ్ చేశారు. దీంతో దుర్గాప్రసాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అతని ఫిర్యాదు మేరకు మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆర్ఐ సుబ్బారావుకు దుర్గాప్రసాద్ రూ.2 వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. సుబ్బారావుపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, సుబ్బారావును రాజమండ్రి ఏసీబీ కోర్టుకు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఏసీబీ సీఐలు కె.శ్రీనివాసరావు, ఎం.రవీంద్ర, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. అనంతరం రైతు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తనకు పాస్‌పుస్తకం ఇప్పించాలని పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగానని.. సొమ్ములు ఇస్తేనే పని అవుతుందని ఆర్ఐ సుబ్బారావు చెప్పడంతో విసుగు చెంది ఏసీబీ అధికారులను ఆశ్రయిం చానని చెప్పారు. ఆర్ఐ సుబ్బారావుపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. చాగల్లులో తహసీల్దార్ కార్యాలయంలో గతంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడు కూడా అతనిపై ఫిర్యాదులు రావడంతో కొంతకాలం విధులకు దూరమయ్యారు. అవినీతిపై సమాచారం ఇవ్వండి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అవినీతి అధికారులపై తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ అన్నారు. 94404 46157 ఫోన్లో సంప్రదించాలని ఆయన సూచించారు. -
యానాంకు క్యూ కడుతున్న పేకాట పాపారావులు
సాక్షి, భీమవరం : జిల్లాలోని క్లబ్‌ల్లో పేకాటలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పేకాట పాపారావులు ఇప్పుడు యానాంకు క్యూ కడుతున్నారు. కాలక్షేపం కోసం ఏర్పాటు చేసుకున్న రిక్రియేషన్ క్లబ్‌ల్లో నిబంధనలకు విరుద్ధంగా పేకాట ఆడడంతో.. గత రెండు నెలలుగా జిల్లాలోని క్లబ్‌లపై పోలీసుల దాడులు ముమ్మరమయ్యాయి. కొన్ని చోట్ల యూత్, కాస్మో క్లబ్‌లు, టౌన్హాళ్లలో విచ్చలవిడిగా మూడుముక్కలాట ఆడడంతో పోలీసులు వారి ఆట కట్టిస్తున్నారు. దీంతో పేకాట లేనిదే పొద్దుగడవని కొంతమంది పేకాట ఆడేందుకు పొరుగున ఉన్న కేంద్రపాలితప్రాంతం యానాంకు తరలిపోతున్నారు. గతంలో మన రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉన్న సమయంలో ఉభయగోదావరి, కృష్టా తదితర జిల్లాల మందుబాబులు మద్యం కోసం యానాం వెళ్లేవారు. ఇప్పుడు పేకాట ఆడేందుకు ఖరీదైన కారల్లో యానాం తరలివెళ్తున్నారు. జిల్లాలో సుమారు 40 క్లబ్‌లు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం వంటి పట్టణాలతోపాటు ఏలూరులో యూత్‌క్లబ్, కాస్మోపాలిటన్ క్లబ్, టౌన్ హాల్స్‌ను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇవిగాకుండా చింతలపూడి, చేబ్రోలు, నారాయణపురం, చాగల్లు, నల్లజర్ల వంటి గ్రామాల్లో కూడా క్లబ్‌లు నిర్వహిస్తున్నారు. క్లబ్‌ల్లో కొన్ని చోట్ల విచ్చలవిడిగా పేకాట, మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని క్లబ్‌ల్లో అధికారికంగా మద్యం విక్రయాలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల అనధికారికంగా మద్యం షాపులు నడుపుతున్నారు. సాధారణంగా క్లబ్‌లు, టౌన్‌హాల్స్‌లో కేవలం సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. దానిలో సభ్యులైన వారే ఆటలు ఆడుకునేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని క్లబ్‌ల్లో 13 ముక్కలతో సీక్వెన్స్ ఆడుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే పెద్ద మొత్తంలో డబ్బులతో పేకాట ఆడడమే కాకుండా.. కొన్నిచోట్ల వార్షికోత్సవ వేడుకల పేరిట ఆశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. మందు పార్టీలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా పోలీసులు క్లబ్‌లపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తుండడంతో పేకాటరాయుళ్లు పెద్ద సంఖ్యలో యానాం పరుగులు తీస్తున్నారు. రూ.లక్షల్లో సభ్యత్వం పట్టణాల్లో ఏర్పాటుచేసే క్లబ్‌లు, టౌన్‌హాల్స్‌లో సభ్యత్వం తీసుకోవాలంటే ఆయా కమిటీలకు లక్షల్లో సొమ్ములు చెల్లించాల్సిందే. భీమవరంలో ఒక క్లబ్లో లైఫ్ సభ్యత్వం కోసం రూ. 2 లక్షలు చెల్లించాలి. డోనరైతే రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. రెండు నెలలుగా వెలవెల పేకాట రాయుళ్లు జిల్లా వదిలి యానాం వెళ్తుండడంతో జిల్లాలోని క్లబ్‌లు, టౌన్‌హాల్స్ గత రెండు నెలలుగా వెలవెలబోతున్నాయి. ప్రధానంగా ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం వంటి క్లబ్‌ల్లో కోర్టు అనుమతించిన 13 పేక ముక్కలతోనే ఆడుతుంటారు. అయితే కొంతమంది పెద్ద మొత్తంలో డబ్బుతో విచ్చలవిడిగా పేకాట నిర్వహించడంతో జిల్లాలో క్లబ్‌ల్లో ఎలాంటి పేకాట జరగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. దీనితో క్లబ్‌లు వెలవెలబోతున్నాయి. -
కడపలో ఏసీబీ దాడులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కడపలో నిర్వహించిన ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల్లో భారీగా బంగారం, నగదును పట్టుకున్నారు. కమర్షియల్ ట్యాక్స్ డిఫ్యూటీ కమీషనర్ లూర్తయ్య నాయుడు ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగగా.. కడపతో సహా బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలో కూడా తనిఖీలు చేపట్టారు. 750 గ్రాముల బంగారు, కేజీ వెండి, రూ.4.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాడుల్లో రెండు కోట్ల అక్రమాస్తులను గుర్తించగా.. ఏసీబీ అధికారులు లూర్తయ్య నాయుడును అరెస్ట్ చేశారు. -
దూకుడు పెంచిన జీఎస్టీ అధికారులు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ జీఎస్టీ అధికారులు దూకుడు పెంచారు. షెల్ కంపెనీల ద్వారా లబ్ధి పొందుతున్న వ్యాపారుల పని పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం అధికారులు 500 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న ఓ ఐరన్ అండ్ స్టీల్ వ్యాపార సంస్థ యజమాని ఇంటితో పాటు కంపెనీల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో శంకరంపేట, నాచారం యూనిట్లలో భారీ అక్రమాలు బయటపడ్డాయి. మూడు డొల్ల కంపెనీల ద్వారా సుమారు 40 కోట్ల రూపాయల మేర ఇన్‌వాయిసెస్‌లు జారీ చేసినట్లు గుర్తించారు. ఈ నకిలీ ఇన్‌వాయిసెస్‌ల వల్ల ప్రభుత్వానికి రూ. 4 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్నారు అధికారులు. ప్రస్తుతం సదరు సంస్థ యజమానిని అరెస్ట్ చేయడమే కాక రూ. 3 కోట్ల రూపాయలు రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల్లోగా మిగతా కోటి రూపాయలు చెల్లించే విధంగా యజమాని నుంచి పూచీకత్తు తీసుకున్నారు. ఇవే కాక ఇతర అనేక రంగాలలో పన్ను ఎగవేతదారుపై జీఎస్టీ అధికారులు దృష్టి సారించారు. -
హీరా గోల్డ్ కేంద్ర కార్యాలయంలో పోలీసుల తనిఖీలు
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కుంభకోణం కేసులో దర్యాప్తును సీసీఎస్ పోలీసు అధికారులు వేగవంతం చేశారు. ఈ శనివారం హీరా గోల్డ్ కేంద్ర కార్యాలయంలో సీసీఎస్ పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. తొమ్మిది మంది సభ్యుల బృందం హీరా గోల్డ్ కేంద్ర కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. వందల కోట్ల రూపాయల నిధుల సేకరణపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. డిపాజిట్ దారుల వివరాలను కంపెనీ గోప్యంగా ఉంచింది. హీరా గోల్డ్ గ్రూప్ దాదాపు 16 రాష్ట్రాలనుంచి డిపాజిట్ సేకరించింది. ఆనతి కాలంలో ఆరువేల కోట్ల రూపాయల టర్నోవర్ చూపించిన హీరా గోల్డ్ పెట్టుబడులు మొత్తం హవాల డబ్బులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హీరా గోల్డ్ గ్రూపు దాదాపు 160 బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హీరా గ్రూప్ పెద్దమొత్తంలో సేకరించిన పెట్టుబడులతో విదేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోందని దర్యాప్తులో తేలింది. -
ఉదయసింహా బంధువు కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్ : తన బంధువు రణధీర్ రెడ్డిని ఐటీ అధికారులమని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అనుచరుడు ఉదయసింహ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చైతన్యపురి లిమిట్స్, జైపురి కాలనీలో నివసించే తన బంధువు రణధీర్ రెడ్డి ఇంట్లో ఆదివారం కొంతమంది సోదాలు నిర్వహించారన్నారు. ఈ సోదాల పేరిట సెల్ ఫోన్లు, నగదు, బంగారంతో పాటు రణధీర్ రెడ్డిని కూడా తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఐటీ అధికారుల దృష్టికి తీసుకు రాగా.. తాము ఎలాంటి సోదాలు చేయలేదని, తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారన్నారు. నిన్నటి నుంచి రణధీర్ రెడ్డి ఆచూకీ లేదని, మరోవైపు ఐటీ అధికారులు తమకు సంబంధం లేదంటున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వ్యభిచార గృహాలపై పోలీసుల ఉక్కుపాదం
సాక్షి, యాదాద్రి : పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో అసాంఘీక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. యాదాద్రిలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 15 మంది చిన్నారులను వ్యభిచార రొంపి నుంచి పోలీసులు కాపాడారు. గుట్టలో దాడులు జరుగుతున్నాయన్న సంగతి తెలుసుకున్న కొందరు నేరగాళ్లు ఇళ్లకు తాళాలు వేసి చిన్నారులతో సహా పరారయ్యారు. వీరందరూ సిద్ధిపేట, ధర్మపురి, నిజామాబాద్, రామాయంపేటలకు వెళ్ళి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. చిన్నారులకు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్న ఆసుపత్రిని సీజ్ చేసి ఆర్ఎంపీ డాక్టర్ని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు డాక్టర్ల ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో వ్యభిచారం పూర్తిగా నిర్ములించాలని, నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యాదాద్రిలో వ్యభిచార గృహాలను నడుపుతున్న వారికి నాయకుడిగా భావిస్తున్న యాదగిరి అనే వ్యక్తి ప్రస్తుతం పీడీ యాక్ట్ కేసులో వరంగల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ జైల్లో నుంచే చక్రం తిప్పుతూ చిన్నారుల అక్రమ రవాణాను నిర్వహిస్తున్నాడని సమాచారం. కాగా, ఇప్పటికే యాదగిరి ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. -
రెండవ రోజుకు మల్టీప్లెక్స్‌ల్లో తనిఖీలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పలు మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లపై తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీలు రెండవ రోజు కూడా కొనసాగాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని పలు షాపింగ్, సినిమా మాల్స్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు తినుబండారాలను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 54 కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. -
నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో తనిఖీలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లపై తూనికలు కొలతల శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయిన కూడా వారు నిబంధనలకు పాటించడంలేదని వార్తలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ పరిధిలోని ప్రసాద్ మల్టీప్లెక్స్, ఉప్పల్ ఏషియన్, ఏఎస్ రావు నగర్‌లోని రాధిక, జీవీకే మాల్, కాచిగూడ ఐనాక్స్‌తో పాటు ఇతర మల్టీప్లెక్స్‌ల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం ఏడు టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు ఆ శాఖ కంట్రోలర్ అకూన్ సబర్వాల్ తెలిపారు. ఇప్పటి వరకు అధికారులు 20 కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కాచిగూడ ఐనాక్స్కు నోటీసులు ఈ రోజు ఉదయం తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో కాచిగూడలోని ఐనాక్స్ ధియేటర్లో అధికారులు దాడులు నిర్వహించారు. ప్రమాణాలు పాటించకుండా వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించిన అధికారులు యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. ఐనాక్స్ నిర్వహకులు నెట్ క్వాంటిటి, ఎమ్మార్పీ ధరలు లేకుండా అమ్మకాలు చేపట్టడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.పలు శ్యాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ ఏషియన్, కొత్తపేట మహాలక్ష్మీ థియేటర్‌పై మూడు కేసులు నమోదు చేసినట్టు ఏసీసీ జగన్మోహన్ తెలిపారు. చాలా వరకు థియేటర్లలో నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్టు తేలిందన్నారు. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల్లో ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా కొంతకాలంగా ప్రేక్షకుల నుంచి తూనికల శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో అధిక ధరలకు అడ్డుకట్ట వేయడానికి తూనికలు కొలతల శాఖ చర్యలు చేపట్టింది. -
నవయుగలో సోదాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఒకే చిరునామాతో లెక్కకు మించిన కంపెనీలను రిజిస్టరు చేసి... వాటి ఖాతాలు సైతం సరిగా నిర్వహించకుండా పలు అవకతవకలకు పాల్పడుతున్న కంపెనీలపై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మూడు రోజులుగా నగరంలో సోదాలు చేస్తున్న ఆర్ఓసీ అధికారులు... శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని నవయుగ ఇంజనీరింగ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఇన్ఫ్రా, ఇంజనీరింగ్ కంపెనీ అయిన నవయుగ... విద్యుత్, స్టీలు, ఐటీ, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి పలు రంగాల్లో ఉంది. కృష్ణపట్నం పోర్టు కూడా ఈ గ్రూపుదే. రాష్ట్ర విభజన తరవాత పలు కంపెనీల రిజిస్టర్డ్ చిరునామాలను ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌కు మార్చింది. ఇందులో భాగంగా కొన్ని కంపెనీల రిజిస్టర్డ్ కార్యాలయాలు విశాఖపట్నానికి మారాయి. అయితే హైదరాబాద్‌లో 25కు పైగా గ్రూపు కంపెనీలో జూబ్లీహిల్స్‌లోని ఒకే చిరునామాతో ఉండటంతో ఆర్ఓసీ అధికారులు శుక్రవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ సోదాల్లో ఆర్ఓసీ అధికారులతో పాటు ఆర్థిక నేరాలను, అవకతవకలను గుర్తించే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) అధికారులు కూడా పాలు పంచుకున్నారు. రీజనల్ డైరెక్టరేట్ సూచనల మేరకే ఈ సోదాలు జరిగినట్లు తెలిసింది. సోదాల సంద ర్భంగా పలు రికార్డులు పరిశీలించటంతో పాటు వాటిపై అక్కడి సిబ్బందిని ఆరా తీశారు. ఉదయం 12 గంటల నుంచి రాత్రి వరకూ ఈ సోదాలు కొనసాగాయి. నిజానికి ఆర్ఓసీ ప్రాథమిక నిబంధనల ప్రకారం ప్రతి కంపెనీ తన నమోదిత కార్యాలయం ఎదుట బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు రిజిస్టర్డ్ కార్యాలయంలోనే సంబంధిత రికార్డులన్నీ నిర్వహించాలి. ఒకవేళ వేరే చోట నిర్వహించాలని అనుకుంటే దానికి బోర్డు ప్రత్యేక తీర్మానం చేయాలి. చాలా కంపెనీలు వీటిని ఉల్లంఘిస్తూ ఏదో ఒక ఫ్లాగ్షిప్ కంపెనీ బోర్డును మాత్రమే ఏర్పాటు చేస్తున్నాయి. దీనికితోడు ఒకే కార్యాలయంలో భారీ కంపెనీలున్న సందర్భంలో వారి ఖాతాల నిర్వహణలో పలు అవకతవకలు ఉంటున్నాయనేది ఆర్ఓసీ అధికారుల మాట. ఇలాంటి ఉల్లంఘనల్ని పట్టుకోవడంతో పాటు ఖాతాల్లో అవకతవకలుంటే బయటపెట్టడానికి ఎస్ఎఫ్ఐఓ సహకారం తీసుకుంటున్నారు. నవయుగ గ్రూపు ప్రమోటర్ చింతా విశ్వేశ్వరరావు. నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు ప్రమోటర్ కూడా ఈయనే. ప్రధానంగా ఈయన కుటుంబానికి చెందిన చింతా శశిధర్, చింతా శ్రీధర్, చింతా శ్రీనివాసరావు వివిధ కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతూ పర్యవేక్షిస్తున్నారు. విడివిడిగా, ఉమ్మడిగా వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీల సంఖ్య దాదాపు 50కి పైనే ఉంది. వీటిలో కొన్ని కంపెనీల్లో అసలు కార్యకలాపాలే లేవని, నగదు లావాదేవీలు మాత్రం చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. దీనికితోడు ఆయా డైరెక్టర్లు తమ ఆదాయపు పన్ను రిటర్నుల్లో అన్ని కంపెనీల పేర్లూ పేర్కొన్నారా? లేదా? అన్నింటి నుంచీ వచ్చే ఆదాయాన్ని చూపించారా లేదా? అనే కోణంలో కూడా తదుపరి దశలో పరిశీలించనున్నట్లు సమాచారం. నవయుగ గ్రూపునకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఏపీలో పలు భారీ ఇన్ఫ్రా, ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని ఈ సంస్థ దక్కించుకుంది కూడా. అంతేకాకుండా బాబుకు బినామీగా పేరున్న ఓ పత్రికాధిపతితో ఈ గ్రూపునకు ఆర్థిక బంధాలూ ఉండటం గమనార్హం. -
భిక్షగాళ్ల దీనవ్యథ : కదిలిస్తే కన్నీరే..!
మాసిన గడ్డం..ఏపుగా పెరిగిన జుట్టు.. దుర్వాసన వచ్చే దుస్తులు. కాళ్లు, చేతులకు గాయాలతో అమ్మా, అయ్యా అంటూ చేయి చాస్తూ నగరంలో సంచరించే భిక్షగాళ్లను చూస్తే కొందరు జాలి చూపి చేతిలో చిల్లర వేస్తారు..మరికొందరు చీదరించుకుంటారు.. కానీ ఆ చీదరింపు వెనుక గాయపడిన మనస్సు ఉంటుంది.. ఒకప్పుడు అందరిలా దర్జాగానే బతికిన వారే.. కానీ విధి రాతకు తలొగ్గి కడుపు నింపుకొనేందుకు చేతులు చాస్తున్నారు.. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్యర్యంలో జరిపిన ప్రత్యేక డ్రైవ్‌లో పట్టుబడిన వారి మనోగతం వింటే కళ్లు చెమ్మగిల్లాల్సిందే.. – సాక్షి,అమరావతిబ్యూరో బంగారు లచ్చన్న విజయవాడకు చెందిన లచ్చన్న గతంలో నగరపాలక సంస్థలో వెహికల్ డిపోలో కార్మికుడిగా పనిచేశాడు. విశాఖజిల్లా గుడిచర్లకు చెందిన నాగమణితో వివాహమైంది. వారికి ముగ్గురు కొడుకులు, ఒక కూమార్తె. అందరిలానే వారికి చదువులు చెప్పించి వారిని ఉన్నతంగా బతికేలా చేశారు. ముగ్గురు కొడుకులు ప్రస్తుతం వివిధ వృత్తులు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. కుమార్తెను బావమరిదికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. చేతికొచ్చిన పిల్లలు ఆదుకుంటారని ఆశించిన లచ్చన్నకు నిరాశే మిగిలింది. 2013లో ఉద్యోగ విరమణ చేసిన ఆయన్ను కొన్నేళ్లు ఇంట్లో ఉంచుకున్న బిడ్డలు ఆపై మొహం చాటేశారు. ప్రస్తుతం పక్షవాతం రావడంతో కాలు, చేయి పనిచేయడం లేదు. కర్రసాయంతో రెండేళ్లుగా భిక్షమెత్తుకుంటున్నాడు. ఈయన సతీమణి మాత్రం పుట్టింటి వారి దగ్గరే ఉంటుంది. జేమ్స్ అంథాల్ విశాఖజిల్లా రేగడ ప్రాంతానికి చెందిన వాడు. అదే ప్రాంతానికి చెందిన రాములమ్మను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. ఆ బిడ్డలను ఉన్నతస్థాయిలో ఉంచాలని ముఫ్పై ఏళ్లు సికింద్రాబాద్‌లోని బొయినపల్లి వద్ద ఫంక్షన్ హాలులో వర్కర్‌గా పనిచేశాడు. అనుకున్నట్లే బిడ్డలను చదువులు చదివించి ఉన్నతస్థాయికి ఎదిగేలా చేశాడు. ఈయన పెద్దకుమారుడు విశాఖ జిల్లాలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నాడు. మరో అబ్బాయి పెయింటర్ వృత్తి చేసుకుంటున్నాడు. కుమార్తె చదువుకొని మంచి స్థాయిలోనే ఉంది. కానీ వారికి తండ్రి భారమయ్యాడు.రెండేళ్లుగా ఇంటిని వదిలి తమిళనాడుతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భిక్షమెత్తుకుంటూ పొట్టపోసుకుంటున్నాడు. రంజిత్ తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన వ్యక్తి. మెకానిక్‌గా పనిచేసే∙రంజిత్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఏఎన్ఎంను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కానీ కుటుంబ కలహాలతో రంజిత్ ఇంట్లో గొడవపడి గత 8 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వచ్చేశాడు. విజయవాడలో మెకానిక్‌గా పనిచేస్తూ మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. అనారోగ్యం బారిన పడి భిక్షమెత్తుకోవడం అలవాటు చేసుకున్నాడు. అందరిలాగానే కుటుంబంతో కలిసి దర్జాగా జీవించాల్సి ఉన్నా.. తన విధి రాత బాగా లేక దీనస్థితిలో బతుకుతున్నానంటూ బాధను వ్యక్తం చేశాడు.. పగవాడికి ఇలాంటి కష్టం రాకూడని ఆవేదన చెందాడు. -
బెల్టుషాపులపై ఉక్కుపాదం
యాచారం : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌శాఖ గ్రామాల్లో ప్రశాంతత కోసం ముందు జాగ్రత్తలకు శ్రీకారం చుట్టింది. ప్రజలు విచ్చలవిడిగా మద్యం తాగడం వల్లే ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణంకు దారి తీస్తుందని అంచనాకు వచ్చిన పోలీస్ శాఖ కఠిన చర్యలకు పూనుకుంది. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో మద్యం బాటిల్ కానీ, నాటు సారాయి కానీ దొరక్కుండా కట్టడి చర్యలకు ఉపక్రమించింది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా మేజర్ గ్రామ పంచాయతీలైన నక్కర్తమేడిపల్లి, యాచారం, గునుగల్, నందివనపర్తి, మాల్, చింతపట్ల తదితర గ్రామాల్లోని ఆశావహులు నిత్యం దావత్‌లు ఇస్తుండడంతో తాగుబోతుల వీరంగం అంతా ఇంతా కాదు. మాల్, గునుగల్, యాచారం కేంద్రాల్లో ఉన్న వైన్స్ దుకాణాల నుంచి నిత్యం ఆయా గ్రామాల్లోని బెల్టు దుకాణాల వ్యాపారులు వేలాది రూపాయలు విలువ జేసే మద్యాన్ని తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. స్థానికంగానే మద్యం దొరకడం వల్ల మందుబాబులు అర్థరాత్రి వరకు తాగుతూ గ్రామాల్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. గ్రామాల్లో ఏ క్షాణాన ఏం జరుగుతుందోనని ప్రజల్లో భయాందోళన నెలకొంది. బెల్టు దుకాణాలపై ఏకకాలంలో దాడులు మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో దాదాపు 150కి పైగానే బెల్టు దుకాణాలున్నట్లు పోలీస్ శాఖ అంచనాకు వచ్చింది. ఆయా గ్రామాల్లో ఏ బెల్టు దుకాణం దారుడు మద్యం విక్రయాలు జరుపుతారనే సమాచారాన్ని ఇన్ఫార్మర్ల ద్వారా సేకరించిన పోలీసులు ఏక కాల దాడులకు నిర్ణయించారు. పక్షం రోజుల వ్యవధిలోనే మద్యం విక్రయాలు జరుపుతున్నందుకు గాను ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. సీఐ లిక్కి కృష్ణంరాజు పర్యవేక్షణలో ఎస్సైలు వెంకటయ్య, సురేష్, 30 మందికి పైగా పోలీస్ సిబ్బంది గ్రామాల్లో ఉన్న బెల్టు దుకాణాలపై ఏక కాలంలో దాడులు చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే నక్కర్తమేడిపల్లి, మల్కీజ్‌గూడ, నానక్‌నగర్, చింతుల్ల, గునుగల్, చౌదర్పల్లి తదితర గ్రామాల్లోని బెల్లు దుకాణాలపై దాడులు చేసి వ్యాపారులను గట్టిగా హెచ్చరించారు. 20 మందికి పైగా వ్యాపారులను అదుపులోకి తీసుకుని మళ్లీ మద్యం బాటిల్ విక్రయించినా కేసు నమోదు చేసి ఆరు నెలలు జైలుకు పంపిస్తామని పేర్లు నమోదు చేసుకుని వదిలేశారు. యాచారం, మాల్, గునుగల్ కేంద్రాల్లో ఉన్న వైన్స్ వ్యాపారులను కూడా కలిసి బెల్టు దుకాణాల వ్యాపారులకు మద్యం విక్రయించరాదని, విక్రయాలు జరిపితే మీపైన కూడా కేసులు నమోదు చేయడంతో పాటు వైన్స్ షాపులు సీజ్ చేస్తామని హెచ్చరికలు చేశారు. ఏకకాల దాడుల వల్ల గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం కనిపిస్తుంది. ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. పోలీస్ చర్యలు అభినందనీయం గ్రామాల్లో బెల్టు దుకాణాలపై పోలీసులు ఏక కాలంలో దాడులు చేయడం వల్ల గ్రామాల్లో మద్యం విక్రయాలు తగ్గాయి. ఎన్నికల నేపథ్యంలో ఏ గ్రామంలో చూసినా మందుబాబుల వీరంగం ఉంది. సర్పంచ్‌లుగా పోటీ చేసే ఆశావహులు నిత్యం రూ. వేలల్లో ఖర్చు చేసి అప్పులపాలైనారు. మద్యం కట్టడికి పోలీస్ శాఖ చర్యలు అభినందనీయం. – తలారి మల్లేష్, తక్కళ్లపల్లి మద్యం అమ్మితే ఫిర్యాదు చేయండి మండలంలోని 24 గ్రా మ పంచాయతీల్లో బెల్టు దుకాణాల వ్యాపారులు మద్యం విక్రయాలు జ రిపితే 94906 17313 ఫోను నంబరుకు ఫిర్యా దు చేయాలి. వెంటనే ఆ దుకాణంపై దాడులు చేసి వ్యాపారితో పాటు వైన్స్ యజమానిపై కూడా కేసులు నమోదు చేస్తాం. మద్యం వల్ల గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం లేకుండా పోతుందనే ఏక కాల దాడులకు దిగాం. – లిక్కి కృష్ణంరాజు, సీఐ యాచారం -
శీతల పానీయాల కేంద్రంపై విజిలెన్స్ దాడులు..
సాక్షి, విశాఖపట్నం : శీతల పానీయాల తయారీ కేంద్రంపై(ఖార్కాన్) బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అంతేకాక డ్రింక్స్ తయారీలో నాణ్యత పాటించలేదని అధికారులు గుర్తించారు. దీంతో కూల్ పాయింట్ నిర్వహకులపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాలివి.. జీవీఎంసీ పాయి మాధవ నగర్ పరిధిలో కృప ఏజెన్సీస్ పేరుతో పిల్లా శ్రీనివాస్ కూల్ పాయింట్ నిర్వహిస్తున్నాడు. వివిధ రకాల డ్రింక్స్ తయారు చేసి విక్రయిస్తున్నాడు. నాణ్యత ప్రమాణాలకు పాటించకుండా.. హానికరమైన రసాయనాలు వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు విశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు, జీవీఎంసీ ఆహార భద్రత అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. కూల్ పాయింట్లో శాంపిల్స్‌ను కూడా అధికారులు సేకరించారు. కూల్ డ్రింక్స్ తయారీలో నాణ్యత ప్రమాణాలను పాటించడంలేదని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి కూల్ డ్రింక్స్ తయారీలో శుద్ధి చేసిన మంచినీరు వినియోగించాల్సి ఉంది, అయితే అతను నేరుగా బోర్ నీటిని వినియోగిస్తున్నాడని అధికారుల చెప్పారు. అలాగే ప్రజలకు హాని కలిగించే మ్యాంగో, గ్రేప్స్, సాల్ట్ ప్లేవర్స్‌తో పాటుగా ఎసెన్స్.. కూల్ డ్రింక్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ప్రిజవేట్యు అనే రసాయనాలు కలిపి ఈ పానీయాలను తయారు చేస్తున్నట్టు ఈ దాడుల్లో బయటపడ్డాయి. ఏ విధమైన ఫిల్టరైజేషన్ నీరు వాడకుండా కలుషితమైన దోమలు, ఈగలు వాలిని నీటిని వాడుతూ కూల్ డ్రింక్స్ తయారు చేసి వ్యాపారం చేస్తున్నారని అధికారులు తెలిపారు. శీతల పానీయాలు తయారీ కేంద్రం నుంచి సేకరించిన శ్యాంపిల్స్‌ను హైదరాబాద్ స్టేట్ ఫుడ్ ల్యాబ్ రేటరీ పంపించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుటామని అధికారులు చెప్పారు. కూల్ పాయింట్ నిర్వహకుడు పిల్లా శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు డీఎస్సీ సీఎం నాయుడు తెలిపారు. -
ఓలా ఆఫర్.. రెండు రైడ్స్ ఉచితం
బెంగుళూరు : క్యాబ్ సేవల సంస్థ ఓలా తన కస్టమర్లకు రెండు రైడ్లు ఉచితంగా ఇస్తున్నట్లు బుధవారం తెలిపింది. కానీ అది మన ఇండియాలో కాదు. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో ఈ ఉచిత ఆఫర్ వర్తిస్తుంది. ఇటీవలే ఇండియాకు చెందిన ఓలా సంస్థ తన క్యాబ్ సేవలను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ, పెర్త్ నగరాలలో ప్రారంభించిన సంగతి తెల్సిందే. ట్రయల్‌లో భాగంగా పది డాలర్ల వరకు రెండు సార్లు ఉచితంగా తమ క్యాబ్‌లలో ప్రయాణించవచ్చని తెలిపింది. ప్రయాణికులకు తక్కువ చార్జీలు, డ్రైవర్లకు అధిక లాభంతో నాణ్యమైన ప్రయాణ అనుభవాన్ని కలిగించడమే తమ సంస్థ లక్ష్యమని ఓలా ప్రకటించింది. తమ సర్వీస్‌ను అభివృద్ధి పరుచుకోవడానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కస్టమర్లను కోరింది. సిడ్నీ, మెల్బోర్న్, పెర్త్ నగరాల్లోని ప్రైవేటు అద్దె వాహనాల యజమానులు కంపెనీ వెబ్సైట్ drive.olacabs.comలో రిజిస్టర్ చేసుకోవచ్చునని తెలిపింది. -
మాంసం అమ్మకంలో మోసం
అమరావతి,నగరంపాలెం: చికెన్ స్టాల్స్‌లో కుళ్లిన, దుర్వాసనతో బూజు పట్టిన స్థితిలో ఫ్రిజ్‌లలో కేజీల కొద్ది నిల్వ ఉన్న మాంసాన్ని రాష్ట్ర మాంసం అభివృద్ధి కార్పొరేషన్ (ఎస్ఎండీసీ) చైర్మన్ ప్రకాష్ నాయడు ఆకస్మిక తనిఖీలో వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా మాంసం అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న తనిఖీల్లో భాగంగా సోమవారం నగరంలో పలు ప్రాంతాల్లోని చికెన్ స్టాల్స్, పౌల్ట్రీ ఫారాల్లో ఆయన నగరపాలక సంస్థ ప్రజారోగ్యశాఖతో కలసి తనిఖీలు నిర్వహించారు. నల్లచెరువు ప్రదాన రహదారిలో ఉన్న రెండు, మణిపురం బ్రిడ్జ్ వద్ద, పొన్నూరురోడ్డులోని కోడి మాంసం విక్రయించే దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లోని ఫ్రిజ్‌ల్లో కిలోల కొద్ది కుళ్లినన స్థితిలో గడ్డకట్టిన మాంసాన్ని గమనించి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బందితో ప్రకాష్ నాయుడు చెత్త కుండీలో వేయించారు. దుకాణ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రథమ తప్పుగా షాపులకు రూ.95 వేలు అపరాధ రుసుం విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాంసం దుకాణాలపై ప్రజారోగ్య, ఫుడ్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తామని చైర్మన్ ప్రకాష్ నాయుడు తెలిపారు. మాంసం విక్రయిదారులకు స్థానిక సంస్ధల సహకారంతో త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ప్రజారోగ్యశాఖ అధికారి డాక్టరు శోభారాణి, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
భారత జాలర్లపై శ్రీలంక నౌకాదళం దాడి
టీ.నగర్: భారత జాలర్లపై శ్రీలంక నౌకాదళం శనివారం రాత్రి దాడి జరిపింది. రెండు వేల మంది జాలర్లు రామేశ్వరం నుంచి శనివారం 500కు పైగా పడవల్లో సముద్రంలోకి వెళ్లారు. కచ్చదీవి సమీపంలో రాత్రివేళ చేపలు పడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి పడవల్లో వచ్చిన శ్రీలంక నౌకాదళం సరిహద్దు దాటి చేపలు పడుతున్నారంటూ రామేశ్వరం జాలర్లపై రాళ్లు, బాటిళ్లు విసిరి అక్కడినుంచి వెళ్లగొట్టింది. దీంతో భీతిచెందిన జాలర్లు తీరానికి చేరుకున్నారు. ఓక్కి తుపాన్ తర్వాత సముద్రంలోకి వెళుతున్న తమపై శ్రీలంక నౌకాదళం వరుసగా దాడులు జరుపుతోందని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని జాలర్లు వాపోయారు. -
బైక్‌పై వచ్చి కుక్కను చంపి ఎత్తుకెళ్లారు
-
‘తూర్పు’లో మూలాలు ... ‘పశ్చిమ’లో సోదాలు
- పెద్దాపురం ఈవోపై ఏసీబీ కొరడా - అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు - రూ. కోటికి పైనే అక్రమాస్తులు - ఏసీబీ చేతిలో మరో అరడజన్ మంది చిట్టా - ‘సాక్షి’ వరుస కథనాలతో కొరడా ఝుళిపించి ఏసీబీ సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేవాదాయశాఖలోని అవినీతి తిమింగలాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గుడినే కాకుండా గుడిలో లింగాన్ని సైతం మింగేసే ప్రబుద్ధుల నిర్వాకాలతో ఆ శాఖపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. అర్హత లేకున్నా అందలాలు ఎక్కించడం మొదలుకుని ఒకే చోట ఏళ్ల తరబడి తిష్టవేయడం వరకు దేవాదాయశాఖలో అడ్డగోలు వ్యవహారాలకు అంతే లేకుండాపోయింది. ఈ బాగోతాలపై ‘సాక్షి’ ఇటీవల కాలంలో వరుస కథనాలను ప్రచురిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ శాఖలోని పలువురు అవినీతి అధికారులపై నిఘా పెట్టిన ఏసీబీ తొలి పంజా సోమవారం పెద్దాపురం మహారాణి సత్రం ఈఓ చీమలకొండ సాయిబాబుపై విసిరింది.ఆస్తులు గుర్తించింది పశ్చిమ గోదావరి జిల్లాలో అయినా దాని మూలాలు మాత్రం పెద్దాపురం సత్రంలోనే ఉండటం గమనార్హం. రెండేళ్లుగా ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న సాయిబాబు ఆధ్వర్యంలో సత్రంలో పేదలకు అన్నదానం జరుగుతుంటుంది. అన్నదానం చేయకుండానే చేసినట్టుగా రికార్డులు సృష్టించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి అక్రమ ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ నిర్థారణకు రావడం, ఏకకాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లో దాడులు జరపడంతో దేవాదాయ శాఖలో గుబులు రేపుతోంది. ఏసీబీ జాబితాలో మరింతమంది... ప్రస్తుతం ఏసీబీ వలకు చీమలకొండే చిక్కినా జిల్లాలో మరికొన్ని దేవాలయాల కార్యనిర్వాహణాధికారుల జాతకాలు కూడా ఏసీబీ సేకరించిందని సంబంధిత వర్గాల సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, కొందరు అధికారుల అండదండలు దండిగా ఉండటంతో అర్హత లేకున్నా ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్న వారి చిట్టా సిద్ధంగా ఉందంటున్నారు. ఇందులో అసిస్టెంట్ కమిషనర్లు,, గ్రేడ్–1, గ్రేడ్ –2 ఇఒలు అరడజన్ మంది వరకు ఉన్నారని చెబుతున్నారు. తొలి తిమింగలం పెద్దాపురం మహారాణి సత్రం ఈఓ సాయిబాబుతోనే మొదలైందని మిగిలిన వారి భరతం కూడా త్వరలో పట్టడం ఖాయమంటున్నారు. సాయిబాబు అక్రమాస్తుల చిట్టా... సాయిబాబు ఆస్తులను నిగ్గుతేల్చేందుకు ఏసీబీ పెద్దాపురం, తణుకు బ్యాంకు కాలనీలో సొంత ఇల్లు, మరో రెండు ఇళ్లతోపాటు మూడు ఇళ్లస్థలాలు, ప్లాటు, పెద్దాపురం కార్యాలయం, భీమవరంలో బావమరిది ఇంటితోపాటు స్వగ్రామం రేలంగిలో ఇల్లు, తణుకులో స్నేహితుడి ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించడంతో ఆ శాఖల అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కోనాల గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయానికి చెందిన 35 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, పాస్‌పుస్తకాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ లెక్కేస్తే అతని ఆస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు చెందిన 14 బ్యాంకు ఖాతాలకు చెందిన పాసు పుస్తకాలు, బ్యాంకు లాకర్లకు చెందిన పత్రాలను సీజ్ చేయగం గమనార్హం. -
వెలుగు చూసిన అవినీతి బాగోతం
ఏసీబీకి చిక్కిన రవాణా శాఖ అధికారి రూ. 6 కోట్లకు పైగా ఆస్తులు తల్లి, భార్య, కుమార్తెల పేరున ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు రాజమహేంద్రవరం క్రైం : రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న చిట్టిబొమ్మల నాగ వెంకట హైమారావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం రాజమహేంద్రవరంలోని వెంకటేశ్వర నగర్ లో ఉన్న ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గురువారం ఉదయం శ్రీకాకుళం నుంచి వచ్చిన ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అధికారులు హైమారావు అపార్ట్మెంట్లో పూర్తిస్థాయిలో సోదాలు నిర్వహించారు. ఈ దాడులలో హైమారావు అవినీతి చిట్టా బయటపడింది. రవాణా శాఖలో అనేక ప్రాంతాలలో పని చేసిన హైమారావు అనేక ప్రాంతాలలో ఆస్తులు కూడగట్టారు. హైమారావు కూడగట్టిన ఆస్తుల వివరాలు 10 ఫ్లాట్స్, 12 ఎకరాల భూములు, వైజాగ్, విజయవాడ, రాజమహేంద్రవరంలలోను, ఏలూరు, కడప, తదితర ప్రాంతాలలో ఇళ్లు భూములు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరంలో రూ 5.53 లక్షల విలువైన ఒక ఇంటి స్థలం, పశ్చిమ గోదావరి జిల్లా కొప్పాకలో 2.5 ఎకరాల భూమి, పశ్చిమ గోదావరి జిల్లా తంగెళ్లమూడిలో రూ.15 లక్షల విలువైన ఇంటి స్థం, అదే గ్రామంలో 5.82 ఎకరాల భూమి, ఉన్నట్టు గుర్తించారు. భార్య రజనీకుమారి పేరిట ఉన్న ఆస్తులు రాజమహేంద్రవరంలోని గాంధీ నగర్లో రూ .10 లక్షల విలువైన ఇల్లు, పిడింగొయ్యి గ్రామంలో 1002.36 ఎకరాల భూమి, (రూ.29,18,000 లక్షల విలువైన భూమి), తూర్పు గోదావరి జిల్లా కోలమూరు గ్రామంలో రూ.3,93 లక్షల విలువ గల ఇంటి స్థలం, తంగెళ్లమూడి గ్రామంలో 495 స్వేర్ యార్డ్స్ ఇంటి స్థలం (రూ.14,85 లక్షల విలువైన స్థలం), తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గ్రామంలో రూ 4.27 లక్షల విలువైన ఇంటి స్థలం, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం, కొప్పాక గ్రామంలో 2.02 సెంట్ల భూమి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కుమార్తె పేరున ఉన్న ఆస్తులు విజయవాడలో హౌస్ ప్లాట్, పిడింగొయ్యిలో 450 స్కేర్ యార్డ్స్ స్థలం, తంగెళ్లమూడి గ్రామంలో రూ 12,90 లక్షల విలువైన 430 స్కేర్ యార్డ్స్ స్థలం, అలాగే రూ.4.42 లక్షల విలువైన 491 స్క్వేర్ యార్డ్స్ ఇంటి స్థలం ఇంటి స్థలం ఉన్నట్లు గుర్తించారు. మరో కుమార్తె పేరిట.. మరోకుమార్తె ఆలైఖ్య పేరున విశాఖపట్నం లో రూ 2.55 లక్షలు విలువైన ఒక ఇంటి స్థలం, పిడింగోయ్యి గ్రామంలో 811.15 స్వెర్యార్డ్స్ ఇంటి స్థలం, రూ 23. 63లక్షలు విలువైన ఇంటి స్థలం ఉన్నట్లు గుర్తించారు. అలాగే నల్గొండ జిల్లా బీబీ నగర్ లో రూ 3.20 లక్షలు విలువైన, 267 స్వెర్ యార్డ్స్ ఇంటి స్థలం, తంగెళ్ళమూడి గ్రామంలో 430 స్వేర్యార్డ్స్ ఇంటి స్థలం ఉన్నట్లు గుర్తించారు. తల్లి లక్ష్మి రాజేశ్వరి పేరున ఉన్న ఆస్తులు హైమరావు తల్లి లక్ష్మి రాజేశ్వరి పేరున రూ 13.లక్షల విలువైన కారు ఉన్నట్టు ఎసీబీ అధికారులు గుర్తించారు. ఈ సోదాలలో హైమారావు ఇంట్లో రూ 2.80 లక్షల నగదు, అరకేజీ బంగారు వస్తువులు, ఐదు కేజీల వెండి వస్తువులు, ఒక లాకర్లో రూ 20లక్షల విలువైన బంగారు నగలు, మరో లాకర్లో బ్యాంక్ బ్యాలన్స్ ఉన్నట్టు గుర్తించారు. జానీవాకర్ రెడ్ వైన్ 12 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. హైమారావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోని తంగెళ్లమూడి అద్దెవారి పేట. 1984లో అసిస్టెంట్ మోటార్ వెహిల్ ఆఫీసర్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. 1997 మోటారు వెహికిల్ ఇనస్పెక్టర్‌గా పదోన్నతి పై రాజోలులో బాధ్యతలు స్వీకరించారు. 2010లో రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆర్టీఓగా కృష్ణ జిల్లా నందిగామాలో పదోన్నతి పొందారు. రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లాలోను విధులు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ఆర్టీఓ కార్యాలయంలో పని చేసి ప్రస్తుతం శ్రీకాకుళం ఆర్టీఓగా పనిచేసి సిక్లీవ్పై ఉన్న చిట్టిబొమ్మల నాగవెంకట హైమారావు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2003లో విజయవాడలో పని చేస్తున్న సమయంలో ఓసారి ఏసీబీ అధికారులకు చిక్కిన ఆయన తన విధానం మార్చుకోలేదు. -
ఇసుక ర్యాంపులపై దాడులు
- 1062 క్యూబిక్ మీటర్ల ఇసుక స్వాధీనం - కలెక్టర్ కార్తికేయ ఆదేశాలతో కదిలిన భూగర్భ గనులశాఖ యంత్రాంగం - ‘సాక్షి’ ఫోకస్‌కు ఎఫెక్ట్ సాక్షి ప్రతినిధి, కాకినాడ/కపిలేశ్వరపురం: అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్న అక్రమార్కులపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపించింది. జిల్లాలో అనుమతి లేని ఇసుక ర్యాంపుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలించి లక్షల రూపాయలు జేబులు నింపుకుంటున్న ఇసుక దందాను గత నెల 23న ‘ప్రతిరేణువుకూ రేటే’ శీర్షికన ‘సాక్షి ఫోకస్’ ద్వారా ఫొటోలతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రాథమిక సమాచారం రప్పించుకున్న జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పందించారు. గనులు, భూగర్భజల శాఖాధికారులతో ఇసుక ర్యాంపుల తనిఖీలు జరపాలంటూ ఆదేశించారు. ఈ మేరకు సంబంధితశాఖలోని రెగ్యులర్, విజిలెన్స్ విభాగాలకు చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, స్థానిక రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా బుధవారం దాడులు నిర్వహించారు. సాక్షి పత్రికే అజెండా... జిల్లాలోని మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం, కోరుమిల్లి, తాతపూడి, రాజమహేంద్రవరం కుమారి టాకీస్, వేమగిరి, కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం, అంకంపాలెం, జొన్నాడ, మందపల్లి, తునిలో తాండవ నది తదితర ర్యాంపుల్లో ఇసుకను అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమంగా తరలిస్తున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కలెక్టర్ ఆదేశాలతో ఇసుక అక్రమాలు అధికంగా జరుగుతున్న కపిలేశ్వరపురం మండలంలోని పలు ర్యాంపులపై దాడులు నిర్వహించారు. మైన్స్ శాఖ రాజమహేంద్రవరం ఆర్ఐ ఎస్.లక్ష్మీనారాయణ, మైన్స్ విజిలెన్స్ (రాజమహేంద్రవరం) ఆర్ఐ పి.మురళి ఆధ్వర్యంలోని బృందం కోరుమిల్లి, కపిలేశ్వరపుర, మాచర గ్రామాల్లో దాడులు నిర్వహించి ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. మొదట తాతపూడి ర్యాంపును తనిఖీ చేశారు. యూనిట్ ఇసుక రూ.750లకు బదులు రూ.1100లు విక్రయిస్తున్న విషయాన్ని గుర్తించారు. ఇలాగే ధరలు పెంచి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని అధికారులు అక్కడి నిర్వాహకులను హెచ్చరించారు. సీజ్ చేసిన 1062 క్యూబిక్ మీటర్ల ఇసుక... కోరుమిల్లి, కపిలేశ్వరపురం ర్యాంపుల పరిధిలో పరిసర గ్రామాల్లో వీఆర్వోలతో కలిసి తనిఖీలు నిర్వహించి 13 గుట్టలుగా ఉన్న 1062 క్యూబిక్ మీటర్ల ఇసుకను సీజ్ చేశారు. కోరుమిల్లి ఆరోగ్య ఉప కేంద్రం, శివాలయం, మాచర శివారుల్లో పలు గుట్టలను గుర్తించారు. ఇసుకను లారీలో లోడింగ్ చేసినప్పుడు ఒక యూనిట్ అదనంగా వేయించుకుని నిల్వ చేసుకుని లాభపడుతున్నారని తేల్చారు. కపిలేశ్వరపురం–2 ర్యాంపు సమీపంలో వ్యవసాయ క్షేత్రంలో ఇసుక గుట్టలను స్వాధీనం చేసుకుని వీఆర్వోలు తవిటికి సత్యనారాయణ, వెంకటరమణకు అప్పగించారు. దేశం నేతల పైరవీలు... ఆరోగ్య ఉప కేంద్రం వద్ద నిల్వలను స్వాధీనం చేసుకుంటుండగా అధికార పార్టీ నేతలు కొందరు అడ్డంపడ్డారు. ఇంటి పునాదులు కోసం నిల్వ చేసుకున్నామని చెప్పుకొచ్చారు. పునాదులకు ఉచిత ఇసుకను వినియోగించడం నిబంధనలకు విరుద్ధమంటూ ఆ నిల్వలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి నిర్మాణాల కోసం తెచ్చుకున్న వాటిని అక్రమం నిల్వలుగా నిర్ధారించడం సరికాదని వాదనకు దిగారు. ఇంటి నిర్మాణ ప్రదేశంలో లేని నిల్వలను స్వాధీన పర్చుకుంటామన్నారు. నిర్మాణం జరుగుతున్నట్టు వీఆర్వోల సమక్షంలో నిరూపించుకుంటే తిరిగి నిల్వలను వినియోగించుకోవచ్చని మైన్స్ అధికారులు వారికి చెప్పారు.. ఈ సందర్భంగా మైన్స్ ఆర్ఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 5తో కోరుమిల్లి–2, మార్చి–31తో కోరుమిల్లి–1 ర్యాంపులకు గడువు ముగిసిందన్నారు. కపిలేశ్వరపురం–1 ర్యాంపు 2018 ఫిబ్రవరి 16, తాతపూడి ర్యాంపు 2017 నవంబరు 27 వరకు అనుమతి ఉందన్నారు. త్వరలో కపిలేశ్వరపురం–3, కోరుమిల్లి–2, కేదారిలంక ర్యాంపులపై కసరత్తు జరుగుతోందన్నారు. ఈ దాడుల్లో ఎంపీడీఓ వి.అబ్రహంలింకన్, తహసీల్దారు కేపీ నరసింహులు, అంగర ఎస్సై వాసా పెద్దిరాజు, గోదావరి హెడ్ వర్క్స్ ఏఈ డి.రాధాకృష్ణ, వీఆర్వోలు ఎస్.సత్యనారాయణ, వీరబాబు, టి.సత్యనారాయణ, వెంకటరమణలతో కలిసి మైన్స్ అధికారులు పాల్గొన్నారు. -
హోటళ్లలో ఇంత దారుణమా ?
-
హోటళ్ళపై జీహెచ్ఎంసీ దాడులు
-
హుక్కా సెంటర్ సీజ్
నాగోలు(హైదరాబాద్): నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోన్న హుక్కా సెంటర్‌పై పోలీసులు ఆకస్మిక దాడిచేసి, సీజ్ చేసిన సంఘటన గురువారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎల్బీనగర్ రాక్‌టౌన్ కాలనీలో పద్మావతి కాంప్లెక్స్ 3వ ఫ్లోరులో హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిర్వాహకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సరూర్‌నగర్ డిప్యూటీ కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం వీఆర్వో అనూష, పోలీసులు కలిసి హుక్కా నిర్వహిస్తున్న సెంటర్‌ను సీజ్ చేశారు. -
షారూఖ్.. చాలా కాలం తరువాత..!
-
ఏపీలో ఏసీబీ అధికారుల దూకుడు
-
బల్దియాలో ఏడీఎంఏ ఆకస్మిక తనిఖీ
♦ అక్రమ లీజు ల్యాండ్‌లపై రికార్డుల పరిశీలన ♦ మీడియాను అనుమతించని..వివరాలు వెల్లడించని అధికారులు ♦బల్దియా అక్రమాలపై ఉన్నతాధికారుల నిఘా ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ బల్దియాలో ఏడీఎంఏ(అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్టేషన్, హైదరాబాద్) అధికారి అనురాధ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లీజు స్థలాలు, ప్రస్తుతం ఉన్న స్థలాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమె తనిఖీకి వచ్చినట్లు సమాచారం. లీజు ల్యాండ్ల రికార్డుల జిరాక్స్ కాపీలు, ఫైళ్లను తీసుకెళ్లారు. బల్దియాలో రెండున్నరేళ్లుగా జరుగుతున్న అక్రమాల విషయంలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల కౌసల్య, విఠల్‌రావు షిండే స్థలంపై కోర్టు మున్సిపల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బల్దియా అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోగా పరిశీలించేందుకు వెళ్లినట్లు సమాచారం. బల్దియాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా లీజు భూమి వివాదాలు పెరుగుతున్నాయి. పట్టణంలో ఉన్న ఆక్రమణల తొలగింపు సైతం అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని మాత్రమే ఆక్రమణలు తొలగించి మిగతా కట్టడాలను అలాగే ఉంచిన విషయాన్ని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మీడియాను ఏడీఎంఏ అనురాధతో ట్లాడేందుకు అనుమతించలేదు. ఉదయం 11 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. మీడియా ప్రశ్నించినప్పటికీ అమె సమాధానం చెప్పలేదు. మళ్లీ మాట్లాడతానని చెప్పి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాగా, మీడియాను అనుమతించక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తంమవుతున్నాయి. ఇటీవల కాలంగా నేతల కన్ను లీజుల్యాండ్, ప్రభుత్వ స్థలాలపై పడినట్లుగా ఆరోపణలున్నాయి. టీపీవో, రెవెన్యూ, ఇంజినీరింగ్ సెక్షన్ అధికారులనువిచారించారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ అలువేలు మంగతాయారు, మున్సిపల్ ఎంఈ నాగమల్లేశ్వర్రావు, ఏసీపీ నాగేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
బెంగళూరులో రూ.169 కోట్లు పట్టివేత
బెంగళూరు: నగరంలోని షాపింగ్ మాల్ల యజమానులు, స్థిరాస్థి వ్యాపారులపై డిసెంబరు 23 నుంచి 26 వరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసి రూ.169 కోట్ల విలువైన అప్రకటిత ఆదాయాన్ని పట్టుకున్నారు. వ్యాపారులపై అధికారులు 23న దాడులు ప్రారంభించారు. తొలి కేసులో వ్యాపారులు తప్పుడు లెక్కలు చూపించి రూ.143 కోట్ల ఆదాయానికి పన్ను కట్టలేదు. రెండో కేసులో రూ.26 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని అధికారులు గుర్తించారు. రెండో కేసులో వ్యాపారులు తమ సొంత ఖర్చుల్ని వాణిజ్య వ్యయాలుగా చూపించారు. బంగారం, ఆభరణాలను కూడా కొన్నారు. -
బంగారం దుకాణలపై ఐటి దాడులు
-
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్
భాగ్యనగర్‌కాలనీ(హైదరాబాద్ సిటీ): ఏసీబీ వలలో మరో భారీ తిమింగలం చిక్కింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తూ ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నాడని ఏసీబీకి ఫిర్యాదు అందింది.దీంతో సదరు బిల్‌కలెక్టర్‌కు చెందిన నివాసాలపై శుక్రవారం ఏక ధాటిగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఐదు బృందాలు, సిద్దిపేట జిల్లా నంగునూరులో మూడు బృందాలు ఒకే సారి దాడులు నిర్వహించి సుమారు 2.98లక్షల విలువచేసే ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం సుమారు ఆరుకోట్ల రూపాయల విలువచేసే ఆస్తులున్నట్లు కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే.. జీహెచ్ఎంసీ ఆబిడ్స్ సర్కిల్9లో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న మడప నర్సింహా రెడ్డి కూకట్‌పల్లిలోని హెచ్ఎంటీ శాతవాహననగర్‌లో నివాసం ఉంటున్నాడు. 1987లో బిల్‌కలెక్టర్‌గా విధుల్లో చేరిన నర్సింహారెడ్డి తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆర్జించాడని, ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నాడనే విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ అధికారులు నిఘావేసి ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. హెచ్ఎంటీ శాతవాహననగర్‌లోని ఆయన నివాసంలో ఉదయం ఆరుగంటలకు ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలలో 61వేల నగదుతో పాటు శాతవాహన నగర్‌లోని జీ ప్లస్ త్రీ, కళ్యాణ్‌నగర్‌లో జీ ప్లస్ వన్, బాలానగర్‌లో జీ ప్లస్ టూ, కూకట్‌పల్లిలో జీ ప్లస్ టూ అంతస్థుల భవనాలు, ఏడు ఖాళీస్థలాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో నిజాంపేటలో మూడు, కేపీహెచ్బికాలనీలో ఒకటి, కళ్యాణ్‌నగర్‌లో మరోకటి, నంగునూరులో రెండు ఉన్నాయి. వీటితో పాటు నంగునూరులో 33.01 ఎకరాల వ్యవసాయ భూమి, చేర్యాలలో ఒక ఎకరం భూమి ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా రెండు కిలోల బంగారు ఆభరణాలు, 3.745కేజీల వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఒక మారుతి స్విప్ట్ కారు, రెండు ట్రాక్టర్లు, ఒక గ్లామర్ హోండా మోటర్సైకిల్లతో పాటు బ్యాంక్‌లో 16లక్షల నగదు, 10 ఇన్సూరెన్స్ పాలసీలలో పదిలక్షల విలువచేసే బాండ్లు కూడా ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. దాడుల్లో పాల్గొన్న వారిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు విజయబాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, మంజుల, లక్ష్మి, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. కక్షతోనే ఫిర్యాదు... సిద్ధిపేటలోని వ్యవసాయ భూమి విషయంలో నెలకొన్న వివాదంతో తనపై కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బంధువులు ఏసీబీకి తప్పుడు ఫిర్యాదులు చేశారని బిల్‌కలెక్టర్ మడప నర్సింహా రెడ్డి పేర్కొన్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, ఎప్పటికప్పుడు ఆదాయపు పన్నులు కూడా చెల్లిస్తున్నట్లు తెలిపారు. -
పోలీసుల ఆకస్మిక తనిఖీలు
పెద్దాపురం : జిలాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెద్దాపు రం ఎన్టీఆర్నగర్, రామచంద్రపురం మండలం ఉట్రుమి ల్లిలోని సదాశివ కాలనీ తదితర చోట్ల విస్తృత తనిఖీ చేశారు. పోలీసు అధికారులు సహా సుమారు 50 మంది ఒక్కసారిగా పెద్దాపురం ఎన్టీఆర్నగర్ కాలనీని చుట్టుముట్టారు. కార్డెన్ సెర్చ్ పేరుతో ప్రతి ఇంటిలో సోదాలు చేశారు. డీఎస్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఐ ప్రసన్న వీరయగౌడ్, ఎస్సైలు ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులు, యజమానుల వివరాలను తెలుసుకున్నారు. ఈ కాలనీలో వ్యభిచారం చేస్తున్నారని, గుర్తు తెలియని వ్యక్తులు అద్దె ఇళ్లల్లో ఉంటున్నారన్న ఫిర్యాదులు వచ్చాయని డీఎస్పీ రాజశేఖర్ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం తెలియజేయాలని కాలనీవాసులను కోరారు. ఎస్సైలు వై.సతీష్, మురళీకృష్ణ, వి.సత్యనారాయణ, లక్ష్మీకాంతం పాల్గొన్నారు. అదుపులో ముగ్గురు వ్యక్తులు... ఎన్టీఆర్ నగర్లో నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పెద్దాపురం ఎస్సై వై.సతీష్ తెలిపారు. మూడు ఆటోలు, నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే 94409 04846కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
మందుల దుకాణాలపై దాడులు
ఎల్.ఎన్.పేట : మండల కేంద్రంలో డ్రగ్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు. దాడుల్లో శ్రీగోపాల్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌లో సుమారు రూ.3లక్షల విలువ చేసే 51 రకాల శ్యాంపిల్స్‌తో పాటు బిల్లులు, రికార్డుల్లో నమోదు కాని మరికొన్ని మందులను పట్టుకున్నట్టు డ్రగ్ అధికారులు ఎ.కృష్ణ, ఎ.లావణ్య విలేకరులకు తెలిపారు. గోపాల్ దుకాణంలో మందులు పరిశీలిస్తున్న సమయంలో లోపల ఉన్న మరో గది తాళాలు కావాలని యజమానికి అడిగామని దీనికి యజమాని నిరాకరించి వెళ్లిపోయి సాయంత్రం వరకు రాకపోవడంతో వీఆర్వో డీవీ రమణమ్మ, ఎల్‌ఎన్‌పేట ప్రభుత్వ ఆసుపత్రి పార్మసిస్ట్ బి.ఉషారాణి ఆధ్వర్యంలో గడియను పగులగొట్టేందుకు సిద్ధపడ్డారు. ఈ సమయంలో ఓ వ్యక్తి వచ్చి తాళాలు తీసుకువస్తామని చెప్పి 15 నిమిషాల తరువాత తేవడంతో గదిని తెరచి సోదాలు చేశామని చెప్పారు. ఆ గదిలో పెట్టెలతో శ్యాంపిల్స్ మందులు, బిల్లుల్లేని మందులు లభించాయని వివరించారు. మందులను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి ఆమదాలవలస కోర్టుకు అప్పగిస్తామని చెప్పారు. దుకాణదారుని లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కేసు నమోదు చేశామన్నారు. మత్తుమందులు విక్రయిస్తే చర్యలు మందుల దుకాణాల్లో డాక్టర్లు చీటి లేకుండా ఎలాంటి రోగానికైనా మందులు విక్రయించడం నేరమని అధికారులు కృష్ణ, లావణ్య చెప్పారు. అదేlవిధంగా మత్తును కలిగించే కొన్ని రకాల మందులు విక్రయించిన దుకాణదారులపై కేసులు నమోదు చేస్తామన్నారు. కాలం చెల్లిన, శ్యాంపిల్స్ మందులు దుకాణాల్లో ఉండకూదని వివరించారు. ఈ దాడుల్లో భాగంగా సరుబుజ్జిలి మండలం రొట్టవలస వద్ద ఉన్న మందుల దుకాణంలో కొన్ని రకాల శ్యాంపిల్స్ లభించాయన్నారు. ఆ దుకాణ యజమానిపైన శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కేసు నమోదు చేశామన్నారు. -
రైస్‌మిల్లుపై టాస్క్‌ఫోర్స్ దాడులు
కస్టమ్ మిల్లింగ్ బియ్యం మాయం దీని విలువ రూ.1.80కోట్లుగా నిర్ధారణ 6ఏ కింద కేసు నమోదు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: 12వేల క్వింటాళ్లు.. రూ.1.80 కోట్ల విలువ.. నల్లగొండ జిల్లా కేంద్ర శివారులో ఉన్న ఓ రైస్‌మిల్లుపై పౌరసరఫరాల శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడి జరిపితే కనిపించకుండా పోయిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎంఆర్) లెక్క ఇది. వివరాల్లోకి వెళితే... జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఆర్జాలబావి వద్ద సుమాంజలి పార్బాయిల్డ్ పేరిట ఓ రైస్‌మిల్లు నిర్వహిస్తున్నారు. ఈ మిల్లులో కస్టమ్ మిల్లింగ్ కోసం తీసుకున్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని గత ఖరీఫ్ సీజన్లో కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే, రబీ సీజన్లో తీసుకున్న బియ్యం కూడా ఇదే విధంగా పక్కదోవ పడుతుందన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో మిల్లుపై దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు విద్యాసాగర్‌రెడ్డి, రాజేశంల నేతృత్వంలోని బృందం కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో మొత్తం 31,981 బస్తాల్లోని 12,792.40 క్వింటాళ్ల బియ్యం కనపడడం లేదని తేలింది. వాస్తవానికి ఈ మిల్లుకు ఇచ్చిన కోటా ప్రకారం 36,968 బస్తాల్లో 14,787 క్వింటాళ్ల బియ్యం ఉండాలని, కేవలం 4,987 బస్తాల్లోని 1994 క్వింటాళ్ల బియ్యం మాత్రమే ఉందని అధికారులు గుర్తించారు. కనపడకుండా పోయిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం విలువ రూ.1.80 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సదరు మిల్లు నిర్వాహకులపై 6(ఏ) నిబంధన కింద కేసు నమోదు చేస్తున్నట్టు అధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ దాడుల్లో జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రాజేందర్, వాణిజ్య పన్నుల శాఖ అ«ధికారి రామనాథరావు, సహాయ పౌరసరఫరాల అధికారి శేషన్న, ఏజీపీవో ఆర్. చంద్రశేఖర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రంగారావు, ఆర్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కళశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
ఆలేరు : ఆలేరులోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఎస్ఆర్, వీఆర్, ఎస్‌వైఎల్‌ఎన్‌ఎస్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు వివరాలు, తరగతి గదులను, పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వో శ్రీధర్‌రెడ్డి, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
‘ప్లాస్టిక్’ దుకాణాలపై దాడులు
మెదక్: పట్టణంలో బుధవారం మున్సిపల్ శానిటేషన్ అధికారులు పలు దుకాణాలపై దాడులు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకొని జరిమాన విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ అధికారి షాదుల్లా మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లను ఎవరూ వాడిన సహించేది లేదని ఆయన హెచ్చరించారు. క్యాన్సర్‌కు కారణమవుతున్న ప్లాస్టిక్‌ను మెదక్ పట్టణంలో పూర్తిగా నిషేదించడం జరిగిందన్నారు. అక్రమంగా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న పలు దుకాణాలపై దాడులు చేసి రూ.20100 జరిమాన విధించడం జరిగిందన్నారు.దాడులు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది శేఖర్, కిషన్, శ్యామ్ తదితరులు ఉన్నారు. -
ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్
– రైతు నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం దేవరకొండ : పట్టామార్పిడికి లంచం ఇవ్వాలంటూ వేధించిన ఓ డిప్యూటీ తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో డీటీగా పని చేస్తున్న రాగ్యానాయక్ ప్రస్తుతం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో డీటీగా డిప్యుటేషన్‌పై పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో డిండి మండలం కామేపల్లికి చెందిన ఓ రైతు నుంచి పట్టా మార్పిడి కోసం రూ. 10 వేలు లంచం డిమాండ్ చేయగా సదరు రైతు ఫిర్యాదు మేరకు స్పందించిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం మాటు వేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన రైతు కొమ్మెర లక్ష్మణ్‌రావు తల్లి మృతి చెందగా ఆమె పేరిట ఉన్న 3.31 గుంటల వ్యవసాయ భూమిని అప్పటి రెవెన్యూ అధికారులు లక్ష్మణ్‌రావుకు రావాల్సిన భూమిని ఆమె అత్త తరుపు బంధువులకు పట్టా చేశారు. 2012లో ఈ విషయమై మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో ఇందుకు సంబంధించి సదరు భూమి లక్ష్మణ్‌రావుకు చెందుతుందంటూ అప్పీలు సమర్పించారు. ఆ మేరకు సదరు భూమి లక్ష్మణ్‌రావుకు చెందుతుందంటూ ఉన్నతాధికారులు తేల్చారు. ఇందుకు సంబంధించిన కాపీని ఆర్డీఓ కార్యాలయంలో పని చేస్తున్న రాగ్యానాయక్ నుంచి పొందడానికి కొన్ని రోజులుగా లక్ష్మణ్‌రావు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఇందుకోసం లక్ష్మణ్‌రావు కొడుకైన కిరణ్ నుంచి రాగ్యానాయక్ రూ. 30 వేలు డిమాండ్ చేశాడు. చివరకు బేరసారాల అనంతరం రూ.10వేలు ఇవ్వడానికి కిరణ్ ఒప్పుకోగా ఇప్పటికే కిరణ్ 10 రోజుల క్రితం రాగ్యానాయక్‌కు అందించాడు. ఈ పరిస్థితికి విసిగి వేసారిన కిరణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు డీఎస్పీ కోటేశ్వర్రావు, సీఐలు శ్రీనివాస్‌రావు, లింగయ్యలు రాగ్యానాయక్‌ను మంగళవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దేవరకొండ డివిజన్లో అధికారుల తీరు ఇంతే : గత ఏడాది క్రితమే దేవరకొండ మండలంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి పట్టా పేరు మార్పిడికై ఓ రైతు నుంచి రూ. 16వేలు లంచంగా తీసుకుంటుండగా తహసీల్దార్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. -
ఆదివాసీ మహిళలపై దాడులు ఆపాలి
ఖమ్మం సిటీ : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ మహిళలపై ఫారెస్టు, పోలీసుల మూకుమ్మడి దాడులు నిలిపివేయాలని, వారిపై బనాయించిన కేసులను ఎత్తివేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఙాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో హరితహారం పేరుతో పోడు భూముల్లో వేసిన పంటలను ధ్వంసం చేయిస్తూ గిరిజన మహిళలపై దాడులు జరపడం సరైందికాదన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజులు పర్యటించి పంట ధ్వంసాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఇల్లెందు మండలం మిట్టపల్లి, పోలారం, మాణిక్యారం, రొంపేడు, కోటిలింగాల, టేకులపల్లి మండలంలోని అబ్బుగూడెం తదితర గ్రామాల్లో వేలాది రూపాయలతో వేసిన పంటలను దుర్మార్గంగా ధ్వంసం చేశారని అరోపించారు. ఇదేమని ప్రశ్నించిన పోలారం సర్పంచ్ వాంక్డోత్ సరోజినిపై ఫారెస్టు అధికారులు, పోలీసులు దాడిచేసి స్పృహతప్పి పడిపోయేలా ప్రవర్తించారని అవేదన వ్యక్తం చేశారు. మిట్టపల్లిలో గిరిజన మహిళలపై బీట్ ఆఫీసర్ జయరామ్ చేయిచేసుకున్నారని పేర్కొన్నారు. గిరిజన మహిళలపై దాడులు నిలిపివేయాలని, వారిపై అక్రమంగా బనాయించిన కేసులను ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.రమ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ, నాయకులు పద్మ, లలిత, శిరోమణి, ఝాన్సీ, సావిత్రి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. -
21 ట్రావెల్స్ బస్సులపై కేసులు
ఎల్బీనగర్: రవాణా శాఖ అధికారులు మరోసారి ప్రైవేటు బస్సులపై కొరడా ఝుళిపించారు. ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు సమీపంలో బుధవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 21 బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. -
పోలీసును కారుతో ఢీ కొట్టి అలానే..
వేగంగా పోతున్న కారు, ముందు భాగంలో ఓ పోలీసు అధికారి. అచ్చం సినిమాల్లో స్టంట్లా కనిపించే వాస్తవ సంఘటనకు చెందిన దృశ్యాలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. తప్పించుకునే ప్రయత్నంలో ఓ దుండగుడు కారుతో పోలీసు అధికారిని ఢీ కొట్టాడు. ఉత్తర చైనాలోని టియాజిన్ మున్సిపాలిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సీసీకెమెరాల్లో రికార్డయిన వీడియో ఫుటేజిని పోలీసులు విడుదల చేశారు. వివరాలు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన దుండగుడిని ఇద్దరు పోలీసులు వెంబడించారు. గ్యాస్ బంకు దగ్గర ఆగడంతో అతన్ని లైసెన్స్ చూపించాల్సిందిగా ఆదేశించారు. అతని దగ్గర ఉన్నవి నకిలీ ధృవ పత్రాలు అని పోలీసులు నిర్ధారణకు వచ్చేలోపే దుండగుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారును ఆపాలని చూసిన ఓ పోలీసు అధికారి, కారు ఢీకొట్టడంతో ముందు భాగం పై పడ్డాడు. అయినా కారును ఆపకుండా అక్కడి నుంచి మెయిన్ రోడ్డు పై అతి వేగంగా పోనిచ్చాడు. ఈ మొత్తం తతంగం అక్కడే ఉన్న ట్రాఫిక్ సీసీ కెమరాల్లో చిక్కాయి. ఈ ఘటనలో ప్రాణాపాయం నుంచి గాయాలతో పోలీసు అధికారి బయటపడ్డాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
హార్లీ డేవిడ్సన్ బైకుపై వచ్చిన మహిళా ఎంపీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఈరోజు పార్లమెంటు మహిళా ఎంపీలతో కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో ఉమెన్స్ డే పురస్కరించుకొని కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ పార్లమెంట్ ఆవరణలో హల్చల్ చేశారు. ఖరీదైన బైకుపై ఆమె లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు. హెల్మెట్ పెట్టుకుని.. హార్లీ డేవిడ్సన్ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ పార్లమెంటుకు చేరుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. మహిళా దినోత్సవం సందర్భంగా సభలో మహిళలే మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించడంతో.. ఉదయం నుంచి లోక్‌సభలో మహిళలే మాట్లాడుతున్నారు. కాగా వివాదాస్పద బిహారీనేత పప్పూ యాదవ్ భార్య రంజీత్, బిహార్ లోని సౌపాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో భర్త ఆర్జేడీ నేతగా క్రియాశీల రాజకీయాల్లో ఉంటే, ఆమె మాత్రం కాంగ్రెస్ తరపున బరిలో నిలిచి ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. కాంగ్రెస్‌కు బలంగా వీస్తున్న వ్యతిరేక పవనాల్లో ఆమె విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. -
ఫేస్ బుక్ లో కొత్త షేర్ ఆప్షన్..!
సామాజిక మీడియా దిగ్గజం ఫేస్ బుక్.. యూజర్లకు మరో కొత్త అవకాశం కల్పిస్తోంది. వినియోగదారుల కోసం తమ ఈవెంట్స్ పేజీలో సరికొత్త ఫీచర్ ను ప్రవేశ పెడుతోంది. అందులో చేరినవారు.. తమ రైడ్స్ (సవారీ) ను పంచుకునే వీలు కల్పిస్తోంది. రైడ్ షేరింగ్ కాన్సెప్ట్ తో ఇప్పటికే ఎన్నో ప్లాట్ ఫామ్స్ ఉన్నా, ఫేస్ బుక్ కూడా తమ ఈవెంట్ పేజీలో ఈ ఆప్షన్ కు శ్రీకారం చుడుతోంది. ఈ అవకాశంతో ఒకే దారిలో వెళ్లేవారు ఫేస్ బుక్ ద్వారా క్యాబ్ రైడ్ షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఫేస్ బుక్ పేటెంట్ అప్లికేషన్.. తమ్ ఈవెంట్ పేజీ స్టోర్ లో మరిన్ని ఆసక్తికరమైన ప్రణాళికలు చేపట్టనున్నట్లు సూచిస్తోంది. ఈవెంట్ పేజీలోని రైడ్ షేరింగ్ సెంటర్ ను రెట్టింపు చేయనున్నట్లు చెబుతోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు వీలుగా ఫేస్ బుక్ ఈవెంట్ పేజీలో ప్రధానంగా 'గోయింగ్' అనే ఫీచర్ ను ఏర్పాటు చేసింది. దీనికి రెండు ఉప జాబితాలనూ జోడించింది. 'గోయింగ్ అండ్ డ్రైవింగ్' 'గోయింగ్ బట్ నాట్ డ్రైవింగ్' పేరుతో ఉన్న ఈ ఆప్షన్లను వినియోగించుకొని యూజర్లు రైడ్ షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో అమల్లో ఉన్న మొత్తం మూడు ఆప్షన్లలో గోయింగ్, నాట్ గోయింగ్ ఆప్షన్లపై జనం ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు తమ ఆసక్తికి అనుగుణంగా రైడ్స్ ను షేర్ చేసుకునేందుకు ఫేస్ బుక్ వీలుకల్పిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా పరిచయం చేసిన ఈ కొత్త అవకాశాన్ని అమెరికాలో ఫేస్ బుక్ వినియోగదారులు ఇప్పటికే మెసెంజర్ ద్వారా వినియోగిస్తున్నారు. మెసెంజర్ లో ముందుగా తమ స్నేహితులతో చాట్ చేసి, క్యాబ్ ను బుక్ చేసుకోవడం ద్వారా ఈ కొత్త ప్రయత్నాన్ని వాడకంలోకి తెచ్చారు. -
ఆదిశేషు బంధువుల ఇంట్లో ఏసీబీ సోదాలు
ఏలూరు అర్బన్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో ఇటీవల అరెస్ట్ అయిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు డిస్టిలరీస్‌లో అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్‌గా పనిచేస్తున్న మామిళ్లపల్లి ఆదిశేషు బినామీ ఇంటిలో ఆదివారం ఏసీబీ సోదాలు జరిగాయి. నాలుగు రోజులుగా ఆదిశేషు బినామీలుగా భావిస్తున్న వారి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఏలూరు పాత బస్టాండ్ సమీపంలోని శ్రీపాండురంగస్వామి వారి ఆలయం పక్కన ఉన్న ఆదిశేషు సమీప బంధువు మామిళ్లపల్లి ఏడుకొండల వెంకటసుబ్బారావు ఇంట్లో హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ సెంట్ర ల్ టీం డీఎస్పీ ఎ.అనూరాధ, ఇన్స్పెక్టర్ సుదర్శనరెడ్డి సోదాలు నిర్వహించారు. సుమారు రూ.రెండు కోట్ల విలువైన స్థిరాస్తి డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్, టాబ్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ అనూరాధ మాట్లాడుతూ ఆదిశేషు అక్రమాస్తులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారాన్ని 9440446130 నంబర్‌కు తెలపాలని కోరారు. సోదాలలో ఏలూరు ఏసీబీ సీఐ యు.విల్సన్ సహకరించారు. -
బాప్రే... టికెట్ 70 వేలా!
విమాన ధరలకు రెక్కలు రాకపోకల విమానాలన్నీ ఫుల్ జోరుగా విమాన ప్రయాణాలు గోపాలపట్నం: సంక్రాంతి సందడి ముగియడంతో జనం తిరుగు ప్రయాణాలతో విశాఖ విమానాశ్రయం కోలాహలంగా కనిపించింది. విమాన చార్జీలు ఠారెత్తించినా ప్రయాణికులు లెక్కచేయలేదు. దేశీయ ప్రయాణికులు, అంతర్జాతీయ ప్రయాణికులూ సమయానికే ప్రాధాన్యం ఇచ్చారు. విమాన చార్జీ ఒక దశలో రూ.70 వేలు పలికినా ప్రయాణికులు వెనక్కి జంకకుండా విమానం ఎక్కేశారు. సాధారణంగా హైదరాబాదుకి రూ.2 వేలకు దొరికేసే విమాన టికెట్ ఆదివారం మాత్రం రూ.17,603 నుంచి 50 వేల వరకూ పలికింది. అలాగే ఐదు వేలలోపు టికెట్ ఉండే ముంబయ్, చెన్నై, బెంగళూరుకి కూడా అదేస్ధాయిలో డిమాండ్ కనిపించింది. ఇక రూ.ఐదు వేల నుంచి పదివేల లోపు టికెట్ ఉండే దిల్లీ ప్రయాణ చార్జీ ఆదివారం రూ.25 వేల నుంచి మొదలై రూ.70 వేలు పలికింది. ఇలా ఠారెత్తిన చార్జీలు సందర్శకులకు ఆశ్చర్యం కలిగించినా ప్రయాణికులు సాధారణంగానే సాగారు. ఆలస్యంగా విమానాల రాకపోకలు... విశాఖ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు రావలసిన ఎయిరిండియా విమానం 9.47కి వచ్చింది. అలాగే దిల్లీ నుంచి విశాఖ రావలసిన మరో ఎయిరిండియా విమాన సర్వీసు సాయంత్రం 5.10కి రావలసి ఉండగా, రాత్రి 7.25కి వచ్చింది. దీంతో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. -
హుక్కాసెంటర్లపై పోలీసుల దాడులు
-
హుక్కాసెంటర్లపై పోలీసుల దాడులు
హైదరాబాద్: హుక్కాసెంటర్లపై దాడులు చేసిన పోలీసులు పలువురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని పలు హుక్కా కేంద్రాలపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా హుక్కా తయారీకి వినియోగించి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మైనర్ బాలుర తల్లిదండ్రులను పిలింపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. -
సెక్స్ రాకెట్ నిందితుడి ఫామ్‌హౌస్ పై దాడి
-
ప్రైవేటు బస్సుల పై దాడులు
కొరడా ఝుళిపించిన రవాణా శాఖ సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, నాగార్జునసాగర్ , ముంబై రూట్లలో తిరుగుతున్న బస్సులపై 156 కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పన్ను ఎగవేత, వాణిజ్య సరుకులను తీసుకెళ్లడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం, ప్రాథమిక చికిత్స బాక్స్ లేకపోవడం, అత్యవసర ద్వారం లేకపోవడం వంటివి ఈ దాడుల్లో బయటపడ్డాయి. కొన్ని బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. -
సెక్స్ రాకెట్ నిందితుడి ఫామ్‌హౌస్‌పై దాడి
* 45 కోడి పుంజులు స్వాధీనం * ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ సిటీ: కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులో ఆరో నిందితుడు పెండ్యాల శ్రీకాంత్ ఫామ్‌హౌస్‌పై టాస్క్‌ఫోర్స్, నున్న రూరల్ పోలీసులు సంయుక్త దాడులు చేశారు. అక్కడ కోడి పందేల నిర్వహణ కోసం పెంచుతున్న 45 కోడి పుంజులను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌ను సీజ్ చేయడంతోపాటు కోడి పుంజులకు రక్షణగా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. పటమట పంటకాల్వ రోడ్డులో కాల్‌మనీ దందా నిర్వహిస్తున్న యలమంచిలి రాము ముఠా ఆగడాలపై వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాచవరం పోలీసులు నమోదు చేసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు రాముతోపాటు రెండో నిందితుడు భవానీ శంకర్, ఏడో నిందితుడు దూడల రాజేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో విద్యుత్‌శాఖ డీఈ సత్యానందం, చెన్నుపాటి శ్రీనివాసరావు, వెనిగళ్ల శ్రీకాంత్‌తోపాటు ఆరో నిందితుడైన పెండ్యాల శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. కొద్ది రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ కీలక ప్రజాప్రతినిధి వద్ద ఆశ్రయం పొందిన శ్రీకాంత్.. రెండ్రోజులుగా విజయవాడ రూరల్ మండలం అప్పారావుపేటలోని 25 ఎకరాల మామిడి తోటలో ఉన్నట్టు తెలిసింది. తోటలో ప్రత్యేకంగా నిర్మించిన తన ఫామ్‌హౌస్‌లోనే ఉన్నట్టు పోలీసులకు అందిన కీలక సమాచారం మేరకు దాడి చేయాలని కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. బుధవారం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ప్రసాద్, నున్న రూరల్ సీఐ సహేరా ఆధ్వర్యంలో పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఆ సమయంలో శ్రీకాంత్ అక్కడ లేడు. అయితే కోడి పందేల నిర్వహణ కోసం పెంచుతున్న 45 పందెంకోళ్లు, వాటికి కాపలాగా ఉన్న ఇద్దరు మనుషులను అదుపులోకి తీసుకొని కాపలాగా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. -
కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్వాల్ ఇంట్లో రైడ్స్
-
‘సెక్స్’ రాకెట్‌ను దాచేసే కుట్ర!
-
‘సెక్స్’ రాకెట్‌ను దాచేసే కుట్ర!
విజయవాడ ప్రాంతంలో జరిగిన హేయమైన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను నీరుగార్చడం కోసం ఏపీ వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై సర్కార్ దాడులు సాక్షి, హైదరాబాద్: ‘కాల్ మనీ-సెక్స్ రాకెట్’లో పీకల దాకా మునిగిన ఏపీ అధికార పార్టీ.. దాని నుంచి బయటపడటానికి పడరానిపాట్లు పడుతోంది. విజయవాడ కేంద్రంగా సాగిన అతి హేయమైన ‘కాల్‌మనీ- సెక్స్ రాకెట్’ను దాచేసేందుకు దారుణమైన కుట్రలకు పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులకు ఆదేశించడం వెనక ఏపీ అధికార పార్టీ నేతలను తప్పించే వ్యూహమే ఉందని పోలీసు అధికారులే చెబుతున్నారు. భారీ వడ్డీలకు అప్పులిచ్చి.. బాధితుల నుంచి దౌర్జన్యంగా ఆస్తులను లాక్కోవడమే కాకుండా అత్యంత హేయంగా మహిళలను లైంగికంగా దోచుకుంటూ విజయవాడ కేంద్రంగా సాగిన ‘సెక్స్ రాకెట్’ రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్లో ఏపీ అధికారపార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులూ పెట్టుబడులు పెట్టారని, సెక్స్ రాకెట్ నిందితులకు అండగా నిలిచారని స్పష్టంగా వెల్లడైంది. దీంతో ఈ వ్యవహారం తమ పార్టీకి, ఆ తర్వాత తనకూ చుట్టుకుంటుందని భావించిన ఏపీ సీఎం చంద్రబాబు అసలు వ్యవహారాన్ని పక్కదోవ పట్టించి తన వారిని రక్షించే చర్యలకు పూనుకున్నారు. విజయవాడలో తన పార్టీ నేతల కనుసన్నల్లో సాగిన సెక్స్ స్కాండల్ వ్యవహారాన్ని సాధారణ వడ్డీ వ్యాపారంతో జమకట్టడం ద్వారా దాని తీవ్రతను తగ్గించేం దుకు ప్రణాళిక రూపొందించారు. కాల్‌మనీ -సెక్స్ రాకెట్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం పక్కనబెట్టి... ఏపీ వ్యాప్తంగా వడ్డీవ్యాపారులపై దాడులకు ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వడ్డీవ్యాపారులపై దాడులతో హడావుడి చేసి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనే భ్రమ కల్పించి.. సెక్స్‌రాకెట్‌పై నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే అధికారపార్టీ వ్యూహమని పోలీసులు అంచనా వేస్తున్నారు. అసలేం జరిగింది? విజయవాడలో అధికార పార్టీ నేతల అండదండలతో కాల్‌మనీ గ్యాంగులు చెలరేగిపోయాయి. ఊహించడానికి వీల్లేనంత వడ్డీలకు అప్పులు ఇవ్వడం, అవి చెల్లించలేని వారి ఆస్తులు తీసుకోవడం, అంతటితో ఆగకుండా మహిళలను లైంగికంగా దోచుకోవడం వారి అకృత్యాలకు పరాకాష్ట. ఈ గ్యాంగు విజయవాడ కేంద్రంగా 200 మందికి పైగా మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే కాకుండా వీడియోల్లో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ దురాగతంపై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో కాల్‌మనీ గ్యాంగుల వ్యవహారం బట్టబయలైంది. అద్భుతమైన నూతన రాజధాని నిర్మిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి నివాసముంటున్న విజయవాడ పట్టణంలో అత్యంత హేయంగా సాగుతున్న సెక్స్ స్కాండల్ వ్యవహారంతో రాష్ట్రం నివ్వెరపోయింది. ప్రభుత్వ చేతగానితనంపై ప్రజలు భగ్గుమన్నారు. ఈ సెక్స్‌రాకెట్‌లో కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పేర్లను ప్రస్తావిస్తూ ఒక మహిళ లేఖ రాసింది. వందలాదిమంది కమిషనర్ కార్యాలయానికి వచ్చి కాల్‌మనీ గ్యాంగుల ఆర్థిక, లైంగిక దురాగతాలపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. సీఎం ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ నిందితులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సి ఉంది. కాల్‌మనీ కీలక నిందితులతో కలసి తిరిగిన ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేయాల్సి ఉంది. కనీసం వారిని అదుపులోకి తీసుకుని నిందితుల ఆచూకీ సేకరించాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా వారిని రక్షించడానికి సర్కా రు ప్రయత్నించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. 2 నెలలముందే బాధితురాలు స్వయంగా ఏపీ సీఎంని కలసి ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. మరోవైపు ఈ సెక్స్ స్కాండల్ గుట్టు రట్టు చేసిన విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను సెలవుమీద పంపే ప్రయత్నాలు చేశారు. అంతకంటే సమర్థుడైన అధికారికి కేసు అప్పగిస్తామంటూ చెప్పుకొచ్చారు. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కితగ్గారు. గురువారం నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో సవాంగ్‌ను కొనసాగించక తప్పలేదు. ఆయన ద్వారానే కేసును చక్కబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసును నీరుగార్చేందుకు... ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న వడ్డీ వ్యాపారాలపై దాడులకు ఆదేశించారు. ఒక్క ఫిర్యాదు లేకపోయినా వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేయించి కాల్మనీనుంచి దృష్టి మళ్లించే యత్నాలుచేస్తున్నారు. పార్టీలకతీతంగా వడ్డీ వ్యాపారం సాగుతోందని, పాపం మొత్తం అధికార పార్టీ నేతలకే పరిమితం కాదని చెప్పడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఈ మేరకు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వడ్డీవ్యాపారులపై 123 కేసులు నమోదు చేసి, 118 మందిని అరెస్టు చేశారు. అందులో వివిధ పార్టీలతో సంబంధం ఉన్నవారు 46 మంది ఉన్నారని, మిగతా వారికి ఏ పార్టీతో సంబంధం లేదని అధికారపార్టీ నేతలు లెక్కలుగట్టారు. అలా ఒక ప్రాంతంలో జరిగిన హేయమైన కాల్‌మనీ-సెక్స్ స్కాండల్‌కు రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న వడ్డీ వ్యాపారానికి లింకుపెట్టి తీవ్రతను తగ్గించేందుకు సర్కారు పెద్దలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. విపక్షాలకు చెందిన కొందరిపై కేసులుపెట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రయత్నాలను ప్రజలు, ప్రజా సంఘాలు, పార్టీలూ తీవ్రంగా ఖండిస్తున్నా యి. కాల్‌మనీ-సెక్స్ రాకెట్లో అకృత్యాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా వదలిపెట్టకుండా చట్టం ముందు నిలబెట్టాలని ప్రజలు కోరుతున్నారు. పార్టీలకతీతంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులను నీరుగార్చడానికి రాష్ట్రవ్యాప్తంగా వడ్డీవ్యాపారుల మీద దాడుల పేరిట హడావుడి చేసి తప్పుదోవ పట్టించకూడదనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.