
సాక్షి,హైదరాబాద్: దేశ వ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఏపీ,తెలంగాణ చెన్నై,బెంగళూరు,ఢిల్లీ,ముంబై నగరాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో అక్రమలావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. శ్రీచైతన్య సంస్థ పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
హైదరాబాద్ ప్రధానంగా మొత్తం ఆరు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రీచైతన్య యాజమాన్యం పెద్ద మొత్తంలో అక్రమలావాదేవీలు జరుపుతుందనే సమాచారంతో ఐటీ అధికారులు సోమవారం ఏక కాలంలో శ్రీచైతన్య కాలేజీల కార్పొరేట్ కార్యాలయాలపై దాడులు చేశారు.
విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఐటీ రైడ్ నిర్వహించినట్లు సమాచారం. ఐటీ అధికారుల సోదాల్లో భారీ ఎత్తున అక్రమ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment