income tax raids
-
ఎస్వీసీ ఆఫీస్‌కు దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, ఆఫీసులలో నాలుగోరోజు కూడా ఐటీ సోదాలు(Income Tax Officer) జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా పలు డాక్యుమెంట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దిల్రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు సంబంధించిన ఆఫీస్‌కు ఆదాయపన్ను శాఖ అధికారులు తీసుకెళ్లారు.దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు దాదాపు ముగిశాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ సోదాలలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళా అధికారి సమక్షంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నివాసం నుంచి వారు తాజాగా సాగర్ సొసైటీలోని తన ఎస్వీసీ కార్యాలయానికి వెళ్లారు. తమ వాహనంలోనే దిల్ రాజును వారు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎస్వీసీ ఆఫీస్‌లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీశ్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. వారు నిర్మించిన పలు సినిమాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రైడ్స్ గురించి అధికారులు ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి విషయాలు ప్రకటించలేదు. -
సినీ ప్రముఖులపై ముగిసిన ఐటీ సోదాలు
-
ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు
-
ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు గురువారం ముగిశాయి. మూడురోజుల పాటు సాగిన తనిఖీల్లో భాగంగా.. పన్నుల చెల్లింపులు, బ్యాంకు లావాదేవీల వివరాలు, చిత్ర నిర్మాణంలో పలురకాల చెల్లింపులు, సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం..ఇలా అనేక అంశాలపై అధికారులు ఆరా తీశారు. భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఐటీ చెల్లింపుల్లో అవకతవకలను ఈ సందర్భంగా గుర్తించినట్లు తెలిసింది. పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్‌్కలు, ఆడిట్ రిపోర్టులు స్వా«దీనం చేసుకున్న అధికారులు.. వీటి ఆధారంగా పలువురి స్టేట్మెంట్లు రికార్డు చేసినట్టు సమాచారం. భారీ చిత్రాల నిర్మాతలు, ఫైనాన్షియర్లే లక్ష్యంగా.. ఇటీవల విడుదలైన భారీ తెలుగు చిత్రాలను నిర్మించిన సంస్థలు, వాటి నిర్మాతలు, ఫైనాన్షియర్లే లక్ష్యంగా పలు బృందాలు సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి దాడులు ప్రారంభం కాగా.. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మైత్రీ మూవీస్ సీఈఓ చెర్రీ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థ, భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మొదటి రోజు సోదాల్లో దిల్‌రాజు ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేక ర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో స్వా«దీనం చేసుకున్న డాక్యుమెంట్లు ఆధారంగా..బుధవారం ఉద యం నుంచి పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ సహా మరికొంత మంది డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేపట్టారు. గురువారం సైతం సుకుమార్‌తో పాటు మరో బడా నిర్మాత నెక్కంటి శ్రీధర్ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒకపక్క సోదా లు సాగుతుండగానే దిల్‌రాజు తల్లి అస్వస్థతకు గురికావడంతో ఐటీ అధికారుల వాహనంలోనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. -
ఐటీ దాడులపై స్పందించిన వెంకటేశ్, అనిల్ రావిపూడి
తెలుగు చలనచిత్ర నిర్మాతల ఇళ్లు, కార్యాలయల్లో మూడు రోజులుగా ఐటీ సోదాలు (Income Tax Raids) జరుగుతున్నాయి. పుష్ప 2, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతల ఇళ్లలో ప్రధానంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్‌రాజు ఇంట్లో, ఆఫీసులో.. సుకుమార్ ఇంట్లో.. అలాగే మైత్రీమూవీ మేకర్స్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.పండక్కొచ్చారుతాజాగా ఈ ఐటీ సోదాలపై విక్టరీ వెంకటేశ్ (Daggubati Venkatesh) స్పందించారు. మొదట ఈ ప్రశ్న ఎదురవగానే.. అవునా? నిజమా? అంటూ ఆశ్చర్యపోతున్నట్లు నటించారు. ఆ తర్వాత అన్నీ బానే జరిగిపోతాయన్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నామని మేము టైటిల్ పెట్టాం కదా.. వాళ్లు కూడా మేమూ సంక్రాంతికి వస్తున్నామని వచ్చారని చమత్కరించారు. ఇది సాధారణమేదిల్ రాజుపైనే కాదు, చాలామంది ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయన్నారు. రెండేళ్లకోసారి ఐడీ రైడ్స్ జరగడం సర్వసాధారణమేనని పేర్కొన్నారు. తన ఇంట్లో ఎలాంటి ఐటీ సోదాలు జరగలేవన్నారు. ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటివరకు రూ.230 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.చదవండి: రామ్‌గోపాల్‌వర్మకు మూడు నెలల జైలు శిక్ష -
సినీ ప్రముఖులపై 3 రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో మూడోరోజు ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీప్రముఖుల ఇళ్లలో వరుసగా మూడోరోజు ఐటీ సోదాలు (Income Tax department Raids) కొనసాగుతున్నాయి. నిర్మాతలతో పాటు నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసిన వారి నివాసాలు, ఆఫీసుల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత నెక్కింటి శ్రీదర్, దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.టాలీవుడ్‌పై టార్గెట్తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ మంగళవారం సోదాలు మొదలుపెట్టింది. దాదాపు 55 బృందాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా ఆఫీస్‌లోనూ సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపన్ను చెల్లించలేదని గుర్తించారు.బుధవారం నాడు సుకుమార్ ఇంటికీ ఐటీ అధికారులు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సుకుమార్‌ను నేరుగా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు ఆయన బ్యాంకు లావాదేవీలు, లాకర్ల గురించి ఆరా తీశారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఇంట్లోనూ సోదాలు చేశారు. దిల్ రాజు కూతురు హన్సిత, సోదరుడు నర్సింహ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసిందని, కానీ లాభాలకు తగ్గట్లు పన్నులు చెల్లించలేదని ఐటీ శాఖ గుర్తించింది.మరోవైపు ఈ వ్యవహారంపై దిల్‌రాజు బుధవారం స్పందిస్తూ.. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైనే0 జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు. -
రెండోరోజూ ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు రెండోరోజూ కొనసాగాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తోపాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల కార్యాలయాలు, కొందరు సినీ ఫైనాన్షియర్ల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి మొదలైన సోదాలు, బుధవారం రాత్రి వరకు కొనసాగాయి. భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించే వారిపై ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అధికారులు 55 బృందాలుగా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు సాగించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. దిల్‌రాజు, ఆయన కూతురు హన్సిత, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఇళ్లు, మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సినీ ఫైనాన్షియర్స్ సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్, బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. తనిఖీలు జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. ఐటీ దాడులపై దిల్‌రాజు స్పందించారు. తన ఒక్కరి ఇళ్లు, కార్యాలయాల్లోనే సోదాలు జరగడం లేదని.. సినీ ఇండస్ట్రీ మొత్తంపై జరుగుతున్నాయని తెలిపారు. -
ఐటీ రైడ్స్ పై స్పందించిన దిల్ రాజు
తన ఇంటిపై ఐటీ శాఖ అధికారుల జరుపుతున్న సోదాలపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju)స్పందించారు. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైన మాత్రమే జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారని ఆయన అన్నారు. వారికి తనతో పాటు తన కుటుంబ సభ్యులు మొత్తం సహకరిస్తున్నామని అని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కాగా, టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం మొదలైన ఈ సోదాలు.. బుధవారం కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు.సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్(sukumar) ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు(IT Rids) నిర్వహించారు. . శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్‌ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. పుష్ప2 చిత్రం రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆదాయ పన్నుశాఖ అధికారులు ఈ లెక్కలపైనే ప్రధానంగా గురి పెట్టారు.వెలుగులోకి కీలక ఆంశాలు..ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ వసూళ్లకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ విషయంలో అవకతవకలు జరిగినట్లు వస్తుంది. ఈ సినిమా వారం రోజుల్లో రూ.203 కోట్లు వసూళ్లు సాధించినట్లు అధికారులు గుర్తించారు. అయితే వచ్చిన లాభాలకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. -
డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు
-
హైదరాబాద్ లో సినీ నిర్మాతల ఇళ్లల్లో ఐటీ సోదాల్లో వెలుగులోకి కీలకాంశాలు
-
హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు ఐటీ సోదాలు
-
తెలుగు సినీ నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు
-
ఏపీ, తెలంగాణాలో ఐటీ సోదాలు
-
HYD: రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రముఖ రియల్ ఎస్టేట్‌కు చెందిన కంపెనీల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో తనిఖీలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్ నగర్లో కంపెనీ చెందిన నివాసాల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో ఏక కాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఓ ఎంఎన్సీ కపెంనీకి రూ.300 కోట్లతో భూమి విక్రయించిన సదరు సంస్థ. షాద్ నగర్లో ఈ భూమిని అమ్మిన స్వస్తిక్ గ్రూప్. అయితే, ఈ భూమి విక్రయానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్స్‌లో చూపలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ట్రూకాలర్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు.. అసలేమైంది?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కాలర్ ఐడీ ప్లాట్‌ఫాం ట్రూకాలర్ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్‌లో లొసుగులు, పన్ను ఎగవేతల ఆరోపణలకు సంబంధించి సమాచారాన్ని సమీకరించేందుకు, పత్రాలను పరిశీలించేందుకు సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.విచారణకు పూర్తిగా సహకారం అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వివరించాయి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ విషయంలో అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన విధానాలనే పాటిస్తున్నట్లు పేర్కొన్నాయి. స్వీడిష్ కంపెనీ అయిన ట్రూకాలర్‌కు భారత్‌లో ముంబై, గురుగ్రామ్, బెంగళూరులో కార్యాలయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: అంబానీ, మిట్టల్‌లకు షాక్.. మస్క్ వైపే కేంద్రం మొగ్గు! -
హైదరాబాద్ లో ఐటీ సోదాలు
-
HYD: ఏక కాలంలో 30 చోట్ల ఐటీ సోదాలు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 30 చోట్ల ఏక కాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ అధినేత అచ్చుత్‌రావు ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ అధినేత బొప్పన అచ్చుత్‌రావు, బొప్పన శ్రీనివాస రావు, బొప్పన అనుప్ ఇంట్లో ఐటీ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టారు అధికారులు. ప్రస్తుతం కొల్లూరు, రాయదుర్గంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.రాయదుర్గంలోని అన్విత బిల్డర్స్ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు. జీ స్క్వేర్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని ఆరో అంతస్తులో అన్విత బిల్డర్ సంబంధించిన ప్రధాన కార్యాలయం ఉంది. ఇతరులను లోపలికి అనుమతించని సీఆర్పీఎఫ్ సిబ్బంది. సింగపూర్, దుబాయ్‌లో ఇంటీరియర్ వ్యాపారం చేస్తున్న బొపన్న కుటుంబ సభ్యులు. విదేశాల నుండి అన్విత బిల్డర్స్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులను ఐటీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ గుర్తించింది. ఇక, ఇటీవలే కొల్లూరులో ఫ్రీ లాంచ్ ఆఫర్‌ను కూడా అన్విత బిల్డర్స్ ప్రకటించింది. ఇక, ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. -
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం
సాక్షి, హైదారాబాద్: నగరంలో మరోసారి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కలకలం రేగింది. తెల్లవారుజాము నుంచే 10 బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్, మూసాపేట్, కూకట్పల్లి ఏరియాల్లో పలువురు ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. కూకట్ పల్లిలోని రెయిన్బో విస్టాస్లోని ఓ అపార్ట్మెంట్లో 8 మంది ఐటీ సభ్యుల బృందం ఉదయం 5గం.30ని. నుంచే సోదాలు నిర్వహిస్తోంది. ఆ ఇంటి ఓనర్ ఓ మీడియా సంస్థకు ఓనర్ అని సమాచారం. -
నాసిక్‌లోని బులియన్ వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు
-
రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) 72 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో రూ.170 కోట్ల విలువైన సొత్తు లభ్యమైంది. పట్టణంలోని భండారీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదినాథ్ అర్బన్ మలీ్టస్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకు కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఈ నెల 10వ తేదీన సోదాలు ప్రారంభించారు. 12వ తేదీ ఈ సోదాలు ముగిశాయి. వందలాది మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. రూ.14 కోట్ల నగదు, 8 కిలోల బంగారం సహా మొత్తం రూ.170 కోట్ల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగదును లెక్కించడానికి 14 గంటలు పట్టినట్లు సమాచారం. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు భండారీ ఫైనాన్స్, ఆదినాథ్ బ్యాంకుపై ఆరోపణలున్నాయి. నాందేడ్ టౌన్లో ఈ స్థాయిలో ఐటీ సోదాలు జరగడం, భారీగా సొమ్ము దొరకడం ఇదే మొదటిసారి. -
అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్లో ఐటీ సోదాలు
కలకత్తా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రధాన కార్యదర్శి, సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్‌ను ఆదివారం(ఏప్రిల్14) ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) అధికారులు తనిఖీ చేశారు. కలకత్తాలోని బెహలా ఫ్లైయింగ్ క్లబ్లో ఈ తనిఖీలు జరిగాయి. హెలికాప్టర్ వెళ్లకుండా ఐటీ అధికారులు చాలా సేపు అడ్డుకున్నారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. తనిఖీల సందర్భంగా అభిషేక్ బెనర్జీ సెక్యూరిటీ సిబ్బందికి ఐటీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. తనిఖీలపై అభిషేక్‌బెనర్జీ ట్విటర్(ఎక్స్)లో స్పందించారు.‘ఇటీవల ప్రజల ఆగ్రహానికి గురైన ఎన్ఐఏ స్థానిక డీజీ, ఎస్పీలను తొలగించకుండా నా హెలికాప్టర్లో తనిఖీలకు ఐటీ అధికారులను పంపించారు. వారికి తనిఖీల్లో ఏం దొరకలేదు. జమీందార్లు ఎన్నిరకాల ఒత్తిళ్లు పెట్టినా బెంగాల్ తలవంచదు’ అని పోస్టులో బెనర్జీ పేర్కొన్నారు. అభిషేక్ బెనర్జీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే విమర్శలు -
IT, ED: నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీ డీఎంకేకు చెందిన కొందరు నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. అదే సమయంలో.. మరోవైపు కొందరు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్ని లక్ష్యంగా చేసుకుని ఆదాయ పన్నుల శాఖ దాడులు కొనసాగిస్తోంది. చెన్నై సహా 35కు పైగా ప్రాంతాల్లో ఈడీ మంగళవారం ఉదయం ఏకకాలంలో సోదాలకు దిగింది. డీఎంకే బహిష్కృత నేత.. సినీ నిర్మాత జాఫర్ సాదిక్‌కు సంబంధించిన ఆఫీసులతో పాటు, అతనితో పరిచయం ఉన్నవాళ్ల ఇళ్లు, ఆఫీసులకు ఈడీ బృందాలు చేరుకున్నాయి. ఇందులో డీఎంకే నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. భారీ డ్రగ్స్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక, రూ.2,000 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జాఫర్ సాదిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు మార్చి 9వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డీఎంకేలో పని చేసిన సాదిక్ పలు తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే అరెస్ట్ తర్వాత డీఎంకే అతన్ని పార్టీ నుంచి తొలగించింది. మరోవైపు సినీ పరిశ్రమలో, వ్యాపార వర్గాల్లో సాదిక్‌తో పరిచయాలు ఉన్నవారిపై కూడా ఎన్సీబీ దృష్టి సారించింది. ఈ కేసుకు సంబంధించి చిత్ర దర్శకుడు, నటుడు అమీర్‌తో పాటు మరో ఇద్దరు వ్యాపారవేత్తలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఇటీవలె ఢిల్లీలో విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శన నటుడు అమీర్ ఇంట్లో ఈడీ అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అమీర్ తీసిన మూడు చిత్రాల్లోనూ సాదిక్ నిర్వాణ భాగస్వామ్యం ఉండడం గమనార్హం. అలాగే పలువురు డీఎంకే ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్సీబీ నమోదు చేసిన కేసును, మరికొన్ని ఎఫ్ఐఆర్లను పరిగణలోకి తీసుకుని సాదిక్, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రూ.32 కోట్లు స్వాధీనం మరోవైపు.. తమిళనాడులో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కొనసాగుతున్నాయి. పొల్లాచ్చిలో ఎంబీఎస్ పౌల్ట్రీ ఫామ్స్ నడుపుతున్న వ్యాపారవేత్తల ఇళ్లలో ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. అరుల్‌మురుగన్, శరవణ మురుగన్, ఇళ్లు, కార్యాలయాలు ఉన్నాయి. ఈ సోదాల్లో రూ.32 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
హైదరాబాద్‌లో ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మంగళవారం ఉదయం ఐటీ సోదాల కలకలం రేగింది. ప్రముఖ ఫుడ్ ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్స్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హోటల్స్‌తో పాటు వాటి యజమాని ఇండ్లలోనూ ఐటీ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మేఘనా ఫుడ్స్ ఈటరీస్‌లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోనూఈ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ ఐటీ సోదాలకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసింది. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పోలీసుల స్వల్ప లాఠీచార్జ్, నాటకీయ పరిణామాల మధ్య ఈడీ అధికారులు రాత్రి 8:45 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లి.. విమానంలో ఢిల్లీకి తరలించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలోని 12 మంది ఢిల్లీ అధికారుల బృందం హైదరాబాద్ ఈడీ అధికారుల సహకారంతో శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకుంది. సుమారు 1.45 గంటల సమయంలో సోదాలు ప్రారంభించారు. కవిత, ఆమె భర్త అనిల్‌కుమార్ సహా అక్కడున్నవారి సెల్ఫోన్లను సీజ్ చేశారు. సోదాల్లో పలు పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని, పీఎంఎల్ఏ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్–2002)లోని 3, 4 సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ కవితకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అరెస్టుకు కారణాలను తెలియజేస్తూ 14 పేజీల కాపీని కవితకు అందజేశారు. తర్వాత సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను ఈడీ బృందం అరెస్టు చేసింది. దీనికి సంబంధించిన సమాచార లేఖను ఆమె భర్త అనిల్‌కుమార్‌కు అందించింది. కవితను ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది ఈడీ అధికారుల బృందంలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య తరలింపు.. ఈడీ సోదాల విషయం తెలుసుకుని భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కవిత నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈడీ సోదాలు కొనసాగినంత సేపూ నిరసన తెలిపారు. బీజేపీ, ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు, ఇతర నేతలు, న్యాయవాదులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. వారు లోనికి వెళ్లకుండా ఈడీ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీనితో సుమారు ఇరవై నిమిషాల పాటు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతలు గేటు వద్దే వేచి ఉన్నారు. ఒకదశలో బీఆర్ఎస్ శ్రేణులు గేటు తోసుకుని కవిత నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. దీనితో పోలీసులు బందోబస్తు పెంచారు. రోప్ పారీ్టలను పిలిపించారు. స్వల్పంగా లాఠీచార్జి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అక్రమమంటూ వాగ్వాదం! కొంతసేపటి తర్వాత కేటీఆర్, ఇతర నేతలు కవిత నివాసం లోపలికి వెళ్లారు. కవిత అరెస్టు అక్రమం, చట్టవ్యతిరేకమని ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఈడీ అధికారి భానుప్రియ మీనా కల్పించుకుని కేటీఆర్, ఇతర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలు జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా లోపలికి వచ్చారని మండిపడ్డారు. వారందరినీ వీడియో తీయాలంటూ మరో ఈడీ అధికారిని ఆదేశించారు. ఈ సమయంలో కేటీఆర్ కలగజేసుకుని.. ‘‘మేడం.. సెర్చ్ చేయడం అయిపోయింది. అరెస్టు వారెంట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు లోపలికి రావొద్దని ఎలా చెప్తున్నారు? ఎలాంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా, మెజి్రస్టేట్ ముందు హాజరుపర్చకుండానే కేసు చేస్తాను అంటున్నారు. కావాలనే శుక్రవారం వచ్చి అరెస్టు చేస్తున్నారు. మీరు (ఈడీ అధికారులు) ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు అండర్‌టేకింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల సీరియస్ ట్రబుల్లో పడతారు..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. అందరికీ అభివాదం చేసి.. సుమారు 7 గంటల సమయంలో ఈడీ అధికారులు కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు బయటికి వచ్చారు. ఈ సమయంలో కవిత ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఉన్న తన కుమారుడిని హత్తుకుని ముద్దుపెట్టుకున్నారు. కుమారుడి కన్నీటిని తుడిచి, త్వరగా వస్తానని చెప్పారు. ఆందోళన చేస్తున్న అభిమానులకు నమస్కరించారు. కవితను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు పోలీసులతో కలసి ప్రత్యేక కాన్వాయ్ సిద్ధం చేశారు. అయితే కవిత తన భర్త అనిల్‌కుమార్ కారులో వస్తానని చెప్పారు. ఈడీ అధికారులు అంగీకరించడంతో భర్తతో కలసి కారులో బయలుదేరారు. ఈ కారు ముందు వెనుక ఈడీ, పోలీసు వాహనాలు కాన్వాయ్‌గా శంషాబాద్‌కు చేరుకున్నాయి. విమానాశ్రయం లోపలికి వెళ్లే సమయంలోనూ కవిత పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. ఈడీ అధికారుల బృందం విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే–870 విమానంలో రాత్రి 8.58 గంటలకు కవితను ఢిల్లీకి తరలించింది. నేడు కోర్టు ఎదుట హాజరు కవితను ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి ఆమెను ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. శనివారం మధ్యాహ్నం ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నట్టు సమాచారం. లిక్కర్ కేసులో అరెస్టులు ఇవీ.. సమీర్ మహేంద్రు (ఇండో స్పిరిట్ యజమాని) సెప్టెంబర్ 27, 2022 శరత్‌చంద్రారెడ్డి (ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్) నవంబర్ 10, 2022 వినయ్‌బాబు (ఫెర్నాడ్ రికార్డ్ కంపెనీ) నవంబర్ 10, 2022 అభిషేక్ బోయినపల్లి (రాబిన్ డిస్ట్రిబ్యూషన్) నవంబర్ 14, 2022 విజయ్ నాయర్ (మద్యం వ్యాపారి) నవంబర్ 14, 2022 అమిత్ అరోరా (బడ్డీ రిటైల్ డైరెక్టర్) నవంబర్ 30, 2022 గోరంట్ల బుచ్చిబాబు (కవిత మాజీ ఆడిటర్) ఫిబ్రవరి 9, 2023 గౌతం మల్హోత్రా (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 9, 2023 మాగుంట రాఘవ (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 11, 2023 మనీష్ సిసోదియా (ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం) ఫిబ్రవరి 26, 2023 కల్వకుంట్ల కవిత (ఎమ్మెల్సీ) మార్చి 15, 2024 నేడు కేసీఆర్, కేటీఆర్ ఢిల్లీకి.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతోపాటు మరికొందరు కీలక నేతలు శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. తండ్రిగా కేసీఆర్, సోదరుడిగా కేటీఆర్ నైతికంగా కవితకు అండగా నిలబడేందుకు, న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో ఈడీ అరెస్టు చేసిన అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. కవిత అరెస్టుతోపాటు తెలంగాణ, జాతీయ రాజకీయాలు, మోదీ–బీజేపీ విధానాలపై కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. ఈడీ తీరు చట్టవిరుద్ధం: కవిత న్యాయవాది మోహిత్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టులో ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది మోహిత్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మంగళవారానికి వాయిదాపడిందని.. ఈ కేసులో కవితపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఈడీ గతంలో కోర్టుకు హామీ ఇచ్చిందని వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు కఠిన చర్యలు తీసుకోబోమన్న ఈడీ హామీ వర్తిస్తుందని చెప్పారు. అయినా ముందస్తు పథకంలో భాగంగా సోదాల పేరిట వచ్చి కవితను అరెస్ట్ చేశారని.. విమానం టికెట్లు కూడా ముందుగానే బుక్ చేశారని ఆరోపించారు. కవిత ముందు న్యాయపరంగా చాలా అవకాశాలు ఉన్నాయని, అరెస్ట్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.