‘ఐటీ నోటీసులతో చంద్రబాబులో భయం మొదలైంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తనను ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయచ్చన్న భయంతో కుత కుత లాడిపోతున్నారు. అరెస్టే కాదు 118 కోట్ల రూపాయల మేరకు బయట పడ్డ లూటీ వ్యవహారంపై ఈడీ.. సీబీఐ దాడులు కూడా జరగచ్చని ఆయన ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు ఇలానే తనను అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశాలున్నాయని ప్రజల సాక్షిగానే అన్నారు. తనని అరెస్ట్ చేస్తే తనకి సంఘీభావంగా రక్షణ వలయంలా మీరే ఉండాలంటూ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇపుడు మళ్లీ ఎన్నికల ఏడాదిలో చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది.
వెలుగులోకి నిజస్వరూపం
కేంద్ర ఐటీ శాఖ అధికారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల లూటీ వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐటీ నోటీసులు రావడంతోనే దేశ వ్యాప్తంగా చంద్రబాబు నిజస్వరూపం వెలుగులోకి వచ్చింది. ఐటీ నోటీసుల్లోని అంశాల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా చంద్రాబును దర్యాప్తు చేసే అవకాశాలున్నాయి. దుబాయ్‌లో అక్కడి కరెన్సీ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు అందుకున్న చంద్రబాబుపై ఈడీ కేసులు పెట్టే అవకాశాలున్నాయి.
ఏం చేయాలో పాలుపోక.. రేపో మాపో అరెస్ట్ అంటూ
మనీ లాండరింగ్ కోణంలోనూ దర్యాప్తులు జరుగుతాయంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ ఊహించుకుంటోన్న చంద్రబాబు నాయుడు కొద్ది రోజులుగా మౌన వ్రతంలో ఉండిపోయారు. అయితే రోజు రోజుకీ తనపై వచ్చిన ఆరోపణలకు సరిపడ సాక్ష్యాలు కూడా బయట పడ్డంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. కచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారని ఆయనకు సిక్త్స్ సెన్స్ హెచ్చరిస్తోన్నట్లుంది. అందుకే నన్ను రేపో మాపో అరెస్ట్ చేయచ్చు అంటూ చంద్రబాబు చాలా ఆందోళనగా భయం భయంగా అంటున్నారు.
చదవండి: ‘జనం నిద్రపోయే టైంలో యాత్రలు ఏంటో అర్థం కాదు’
అప్పుడు కూడా అదే మాట
2019 ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు నాయుడు ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన కొత్తలో కూడా తనపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగే అవకాశాలున్నాయని ప్రతీ సభలోనూ భయం వ్యక్తం చేసేవారు. తనను అరెస్ట్ చేస్తే జైలుకెళ్తానని కూడా అన్నారు. తనకు రక్షణ వలయంగా ఉండి కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలపైనే ఉందని దబాయించారు కూడా.
రూ. 118 కోట్లు పైనే లూటీ
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు ఇంచుమించు 400 కోట్ల రూపాయలను తన ఖాతాలో జమ చేయించుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఐటీ నోటీసుల్లో చంద్రబాబు అమరావతిలో నిర్మాణాల కాంట్రాక్టులు అప్పగించిన షాపూర్ జీ పల్లోంజీ నుంచి డొల్ల కంపెనీల ద్వారా రూ. 118 కోట్లు పైనే లూటీ చేసినట్లు సాక్ష్యాలు బయటకు వచ్చాయి.
చదవండి: చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ
అవినీతికి సాక్ష్యాలు లేకుండా
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా చంద్రబాబు తాను నిప్పే అంటున్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా తాను దొరక్కపోడానికి కారణం తనపై ఆరోపణలకు సాక్ష్యాలు పట్టుకోలేకపోవడమేనని చంద్రబాబు గడుసుగా అన్నారు. తద్వారా తాను అరెస్ట్ కాకపోడానికి కారణం తాను తన అవినీతికి సాక్ష్యాలు లేకుండా జాగ్రత్తపడటమేనని చాటి చెప్పారు.
సీబీఐ అడుగు పెట్టకుండా ప్రత్యేక జీవో
తాను నిప్పు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు గత ఎన్నికల ముందు తన అవినీతి కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తుందేమోనని భయపడ్డారు. ఎందుకైనా మంచిదని ఏపీలో సీబీఐ అడుగు పెట్టడానికి వీల్లేకుండా ప్రత్యేక జీవో జారీ చేసిన ఘన చరిత్ర చంద్రబాబుది. ఆయన ఏ తప్పూ చేయకపోతే సిబిఐ అంటే అంత భయం దేనికని ఆర్ధిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఐటీ నోటీసుల నేపథ్యంలో తన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఇక తనను అరెస్ట్ చేయచ్చని చంద్రబాబుకు అర్ధం అవుతోన్నట్లుంది. అందుకే ఆయన ముందస్తుగానే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని అరెస్టు చేస్తారని.. ఈడీ, సీబీఐ దాడులు కూడా చేయించవచ్చునని ముందస్తుగానే భయపడుతున్నారుని విశ్లేషకులు అంటున్నారు.
-యాజులు, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment