cbi
-
డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై సుబ్రహ్మణ్యస్వామి లేఖ
ఢిల్లీ: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్నారు. ఆ ఎన్నికల సందర్బంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారని, అక్రమాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్నారు. ఎంపీ గురుమూర్తి సహా పలువురుపై దాడికి పాల్పడిన సందర్భాన్ని సుబ్రహ్మణ్యస్వామి లేఖలో పేర్కొన్నారు.కాగా, ఈనెలలో జరిగిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి సర్కార్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అన్యాయంగా డిప్యూటీ మేయర్ పదవిని లాక్కుంది. దాడులు, దౌర్జన్యాలతో పదవి లాక్కున్న కూటమి ప్రభుత్వం బరి తెగించి.. కుతంత్రాలకు తెరతీసింది వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్‌తో కూటమి విధ్వంసం సృష్టించింది. టీడీపీకి ఓటు వేయకుంటే ఇళ్లు కూలుస్తామంటూ బెదిరింపులకు దిగింది. మహిళా కార్పొరేటర్లపై కూడా దాడులు చేసిన కూటమి గూండాలు.. బెదిరింపులకు పాల్పడ్డారు.మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు. -
సుగాలి ప్రీతి కేసు ఇక మూలకే!
-
సుగాలి ప్రీతి కేసు ఇక మూలకే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదో తరగతి దళిత విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు ఇక మూలకు చేరనుంది. గత చంద్రబాబు పాలనలో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు తూతూమంత్రంగా విచారించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని తల్లిదండ్రులు కోరగా, ఆమేరకు వైఎస్ జగన్ ఉత్తర్వులిచ్చారు. అయినా సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడంతో తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి సాగదీస్తూ వచ్చిన సీబీఐ.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రావడంతో పూర్తిగా యూటర్న్ తీసుకుంది. ఈ కేసులో అంత సంక్లిష్టత లేదని హైకోర్టుకు తెలిపింది. వనరుల కొరత కారణంగా చూపుతూ తాము దర్యాప్తు చేయలేమని తేల్చి చెప్పింది. ప్రీతి తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును కోరింది. చంద్రబాబు హయాంలో తూతూ మంత్రంగా దర్యాప్తుకర్నూలు నగర శివార్లలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతీబాయ్ 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్‌కి ఉరేసుకుని చనిపోయినట్లు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు లైంగిక దాడి చేసి చంపేశారని తల్లిదండ్రులు సుగాలి రాజు నాయక్, పార్వతిదేవి ఆరోపించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరిగింది. అదే రోజు కర్నూలు పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పోక్సో చట్ట నిబంధనల కింద కూడా కేసు పెట్టినా, అప్పటి ప్రభుత్వ పెద్దల తీరుతో తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ స్కూలు కరస్పాండెంట్, ఆయన కుమారులను అరెస్ట్ చేశారు. తరువాత కొద్ది రోజులకే వారు బెయిల్‌పై బయటకు వచ్చేశారు. చంద్రబాబు హయాంలో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.సీబీఐ స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, సీబీఐ కూడా స్పందించలేదు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ 2020 సెప్టెంబర్ 11న హైకోర్టులో ప్రీతి తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ రఘురామ రాజన్ ఈ నెల 13న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రీతి మృతి కేసులో అంతర్రాష్ట్ర పర్యవసానాలు, తాము జోక్యం చేసుకోవాల్సినంత చట్టపరమైన సంక్లిష్టత లేవని అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సీబీఐ ప్రధాన కార్యాలయానికి కూడా తెలిపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన, సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.అందువల్ల తమకున్న పరిమిత వనరులతో ఈ కేసు దర్యాప్తు చేపట్టడం సాధ్యం కాదని హైకోర్టుకు వివరించారు. సీబీఐ దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోరుతూ ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును కోరారు. ప్రీతి మృతి కేసును అప్పట్లో రాజకీయంగా వాడుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఎలా స్పందిస్తారో చూడాలి. న్యాయం చేసిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డివైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీతి కేసులో తదుపరి దర్యాప్తునకు ఆదేశించింది. అనంతరం ఓసారి కర్నూలు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. తమ కుమార్తె మృతి విషయంలో న్యాయం చేయాలని కోరారు. వారికి న్యాయం చేస్తానని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ప్రీతి మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ 2020 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాక 2021లో ప్రీతి తల్లిదండ్రులకు రూ. 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల పొలాన్ని కూడా జగన్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది. అయినా చంద్రబాబు కనీస చర్యలు కూడా తీసుకోకపోయినా, వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే టీడీపీ, జనసేన నేతలు ఈ కేసుపై నానా రాద్ధాంతం చేశారు. -
దస్తగిరిని ‘సాక్షి’గా పేర్కొనడంపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(YS Vivekananda Reddy murder case)లో తొలి నుంచి నిందితుడి (ఏ–4)గా పేర్కొన్న దస్తగిరిని ‘సాక్షి’గా పేర్కొనడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణా సంస్థతోపాటు దస్తగిరికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ.. విచారణను వాయిదా వేసింది. తాను అప్రూవర్‌గా మారినందున తనను సాక్షిగా పరిగణించాలంటూ గత ఏడాది సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ వేశారు.సీబీఐ కూడా దీనికి అనుకూలంగా వాదనలు వినిపించడంతో న్యాయస్థానం దస్తగిరిని సాక్షిగా పేర్కొనాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ డి.శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. కేసులో సీబీఐ తరఫున స్పెషల్ పీపీ శ్రీనివాస్ కపాడియా హాజరై సమయం కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణ ఈ నెల 27కు వాయిదా వేస్తూ.. సీబీఐ, దస్తగిరికి నోటీసులు జారీ చేశారు. పిటిషనర్ల వాదన ఇదీ... ‘సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దస్తగిరిని సాక్షిగా పేర్కొనడం సరికాదు. 2021, అక్టోబర్ 26న సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షిట్ దస్తగిరిని నిందితుడిగా పేర్కొంది. ఆ తర్వాత వేసిన రెండు మధ్యంతర చార్జ్‌షీట్లలోనూ దస్తగిరి పేరును తొలగించలేదు. 2022, ఫిబ్రవరి 21న సెక్షన్ 306(4)(ఏ) కింద అతని స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత కూడా చార్జ్షిట్లో అతని పేరు తీసివేయలేదు. ఒకసారి నిందితులుగా అనుమతించిన (కాగ్నిజెన్స్) తర్వాత.. ఇదే కోర్టు పునః సమీక్షించజాలదు.క్రిమినల్ ప్రొసిజర్ కోడ్‌లో అలాంటి నిబంధన ఎక్కడా లేదు. చట్ట ప్రకారం అలాంటి నిర్ణయం చెల్లదు. ఒకసారి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తిరిగి సమీక్షించే అధికారాలు లేవని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొంది. దస్తగిరిని సాక్షుల జాబితాలో 110వ సాక్షిగా పేర్కొన్నామని చెప్పడం కూడా సరికాదు. నిందితుడిగా పలుమార్లు ఇదే కోర్టుకు దస్తగిరి హాజరయ్యారు. హాజరుకానప్పుడు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. దస్తగిరిని సాక్షిగా పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలి’ అని పేర్కొంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. -
మనీలాండరింగ్ కేసులో సుజనా చౌదరికి ఎదురు దెబ్బ
ఢిల్లీ : ఈడీ మనీలాండరింగ్ కేసులో బీజేపీ విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఎదురు దెబ్బ తగిలింది. బెస్త్ అండ్ క్రాప్టన్ కేసును క్వాష్ చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ని సుప్రీం కోర్టు డిస్మీస్ చేసింది. చైన్నై ఈడీ కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. ఇదే కేసులో సీబీఐ సుజనా చౌదరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఫీ‘జులుం’ కోసమే కేఎల్‌యూ మాయాజాలం
సాక్షి, అమరావతి: న్యాక్ ర్యాంకింగ్ కోసం కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం (కేఎల్‌యూ) పాల్పడిన అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. పూర్తి ఆధారాలతో బయటపడిన ఈ ర్యాంకింగ్ గూడుపుఠాణి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా న్యాక్ చైర్మన్, సభ్యులకే భారీ లంచాలు ఇచ్చి మరీ న్యాక్ ఏ++ ర్యాకింగ్ కోసం కేఎల్‌యూ యాజమాన్యం పక్కా పన్నాగంతో వ్యవహరించినట్టు సీబీఐ కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. దాంతోనే పక్కా వ్యూహంతో వ్యవహరించి న్యాక్‌కు భారీ లంచాలు ఇస్తుండగా.. శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ చేసిన 10 మంది నిందితులను విజయవాడలోని న్యాయస్థానంలో ఆదివారం హాజరుపరిచింది. న్యాక్ చైర్మన్ సమరేంద్రనాథ్ సాహా, సభ్యులు రాజీవ్ సిజిరాయా, డి.గోపాల్, రాజేశ్‌సింగ్ పవర్, మానస్‌కుమార్ మిశ్రా, గాయత్రి దేవరాజ, బులు మహారాణతోపాటు కేఎల్‌యూ యాజమాన్య ప్రతినిధులు కోనేరు రాజ హరేన్ (వైస్ ప్రెసిడెంట్), జీపీ సారథి వర్మ (వీసీ), ఎ.రామకృష్ణ (డైరెక్టర్)లకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కేఎల్‌యూ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, ఇతర నిందితులు ఎల్.మంజునాథరావు (న్యాక్ మాజీ సలహాదారు), ఎం.హనుమంతప్ప(బెంగళూరు విశ్వవిద్యాలయం డైరెక్టర్), ఎం.శ్యామ్‌సుందర్ (న్యాక్ సలహాదారు)ల కోసం సీబీఐ గాలింపు ముమ్మరం చేసింది. కాగా.. న్యాయస్థానానికి సీబీఐ సమర్పించిన రిమాండ్ నివేదికలో న్యాక్ ర్యాంకింగ్ కుట్రపై పూర్తి వివరాలు వెల్లడించింది.భారీగా ఫీజులు కొల్లగొట్టేందుకే..అక్రమ విధానాలతో న్యాక్ ఏ++ ర్యాంక్ సాధించిన అనంతరం ఆ ర్యాంకింగ్‌ను చూపిస్తూ భారీగా ఫీజులు నిర్ణయించి దోపిడీకి పాల్పడాలన్నది కేఎల్‌యూ యాజమాన్యం ప్రధాన ఉద్దేశని సీబీఐ పేర్కొంది. రిమాండ్ నివేదికలో ఇంకా ఏమున్నాయంటే.. ఇష్టానుసారంగా సెక్షన్లు పెంచేసి భారీగా విద్యార్థులను చేర్పించుకుని భారీ ఫీజులతో దోపిడీకి పాల్పడటమే అసలు లక్ష్యం. ఈ ఏడాది న్యాక్ తనిఖీలు ఉంటాయని తెలిసినప్పటి నుంచి పక్కా పన్నాగంతో వ్యవహరించింది. అందుకోసం న్యాక్ చైర్మన్ సమరేంద్రనాథ్ సాహాతోపాటు సభ్యులను మధ్యవర్తుల ద్వారా కొన్ని నెలల ముందుగానే సంప్రదించింది. న్యాక్ ప్రస్తుత సలహదారు ఎం.శ్యామ్‌సుందర్, మాజీ సలహాదారు ఎం.హనుమంతప్ప ఇందులో కీలక పాత్ర పోషించారు. వారి ద్వారా న్యాక్ చైర్మన్, సభ్యులను లోబర్చుకునేందుకు కేఎల్‌యూ యాజమాన్యం పావులు కదిపింది. ఏ++ ర్యాంకింగ్ ఇస్తే భారీగా ముడుపులు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదిరింది. అందుకోసం న్యాక్ చైర్మన్, సభ్యుల గృహాలకే భారీగా ముడుపులు అందించేలా ఏర్పాట్లు చేసింది. తనిఖీల కోసం కేఎల్యూను సందర్శించినప్పుడు కూడా వారికి భారీగా కానుకలు, ఇతర తాయిలాలు ముట్టజెప్పేందుకు అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేసింది.పక్కా సమాచారంతో వ్యూహాత్మక దాడిన్యాక్ ర్యాంకింగ్ కోసం కేఎల్‌యూ యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతోందని ఉమ్మడి విజయవాడ, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచే సీబీఐకి పలువురు ఫిర్యాదు చేశారు. అందుకోసం కేఎల్‌యూ ఎలా వ్యవహరిస్తోందన్నది కూడా నేరుగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి సమాచారమిచ్చారు. దాంతో సీబీఐ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దిగారు. ఢిల్లీ, విశాఖపట్నంలోని సీబీఐ అధికార బృందాలు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్‌యూ ప్రధాన క్యాంపస్‌తోపాటు దేశంలోని 20 నగరాల్లోని న్యాక్ చైర్మన్, సభ్యులకు చెందిన నివాస గృహాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ అనూహ్య పరిణామంతో న్యాక్ చైర్మన్, సభ్యులు, కేఎల్‌యూ ప్రతినిధులు బిత్తరపోయారు. న్యాక్ చైర్మన్, సభ్యుల వద్ద భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.వాటికి సంబంధించిన వివరాలు అడిగితే న్యాక్ చైర్మన్, సభ్యులు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దాంతో న్యాక్ ర్యాంకింగ్ కోసమే అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. న్యాక్ చైర్మన్, సభ్యుల నుంచి మొత్తం రూ.37 లక్షల విలువైన పరికరాలను జప్తు చేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. -
RG Kar Case : నిందితుడు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ ఆస్పత్రి (RG Kar Case) ట్రైనీ డాక్టర్ (అభయ) హత్యాచార కేసులో సీల్దా కోర్టు (sealdah court ) సోమవారం మధ్యాహ్నం (జనవరి 20) తుది తీర్పును వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్ (sanjay roy)కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువరించే సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ ‘నేను అమాయకుడిని, కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారంటూ’ కోర్టుకు తెలిపారు. సంజయ్ రాయ్ వాదనల్ని సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ ఖండించారు. నిందితుడికి జీవిత ఖైదు విధించారు. తీర్పు సమయంలో వైద్యురాలి కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ సైతం వైద్యురాలి కేసు ఆరుదైన కేసుల్లో అరుదైన కేసు కేటగిరి కిందకు వస్తుందని, సమాజంపై ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు నిందితుడు రాయ్‌కు మరణిశిక్ష విధించాలని కోరింది. సీబీఐ వాదనపై సీల్దా కోర్టు సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ స్పందించారు. ‘ఈ కేసు అరుదైన కేటగిరీ కిందకు రాదు. అతనికి (సంజయ్ రాయ్‌కు) జీవిత ఖైదుతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సీల్దా కోర్టు తీర్పుపై అభయ తల్లిదండ్రులు కోర్టు హాలులో ఆందోళన చేపట్టారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కుమార్తె కేసులో న్యాయం జరిగే వరకు కోర్టులను ఆశ్రయిస్తామని కన్నీటి పర్యంతరమవుతున్నారు. ఉరితీయండిగత నెల డిసెంబర్లో కోల్‌కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్‌కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సంజయ్ రాయ్ నిర్దోషి సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సంజయ్ రాయ్ తరుఫు లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన వాదనల్ని వినిపించారు. తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని కోర్టుకు తెలిపారు. ఆ రోజు రాత్రి ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఏం జరిగిందంటేగతేడాది ఆగస్ట్‌లో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది. తాజాగా, సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించడంపై కోల్‌కతా వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆందోళన కారులు తమ నిరసనల్ని తెలుపుతున్నారు. -
ఆర్జీకార్ జూనియర్ వైద్యురాలి హత్యోదంతం.. బాధితురాలి తండ్రి సంచలన ఆరోపణలు
కోల్‌కతా : యావద్దేశాన్నీ కదిలించిన కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన యువ వైద్యురాలి (అభయ) పాశవిక హత్యోదంతంపై సీబీఐ విచారణ చేపట్టింది. అయితే, సీబీఐ విచారణపై బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమార్తె హత్యోదంతంలో సీబీఐ అధికారులు విచారణ పేరుతో చేసింది ఏమీలేదని వ్యాఖ్యానించారు. గతేడాది ఆగస్ట్ 9న ట్రైనీ డాక్టర్‌పై జురిగిన దారుణంపై సీబీఐ సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టింది. ఆ దర్యాప్తు ఆధారంగా మరికొద్ది సేపట్లో సిల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.ఈ సమయంలో అభయ తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దర్యాప్తులో సీబీఐ చేసింది ఏమీలేదు. మా కుమార్తె కేసుకు సంబంధించి మేం కోల్‌కతా హైకోర్టు,సుప్రీం కోర్టు ముందు అనేక ప్రశ్నలను లేవనెత్తాం. సమాధానాలు కోరాం. కోర్టు ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించింది.కానీ సీబీఐ మా అనుమానాల్ని ఇంతవరకూ నివృత్తి చేయలేదు. మా అమ్మాయికి జరిగిన దారుణంలో ఒక్కరు కాదు. నలుగురు అబ్బాయిలు. ఒక అమ్మాయి ప్రమేయం ఉందని డీఎన్ఏ రిపోర్ట్ చెబుతోంది. నిందితులకు శిక్ష పడినప్పుడే మాకు ఉపశమనం లభిస్తుంది. ఈ కేసులో మాకు న్యాయం జరిగేంత వరకు న్యాయ స్థానాల తలుపు తడుతూనే ఉంటామని’ స్పష్టం చేశారు.ప్రధాని మోదీకి లేఖ మా అమ్మాయి కేసు విషయంలో న్యాయం చేయాలని కోరుతూ మేం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు లేఖలు రాశాం.వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు’ అని అభయ తండ్రి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. -
నేడు ఏసీబీ విచారణకు ఏస్నెక్ట్స్జెన్కో, గ్రీన్కో ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కారు రేసు కేసు(Formula E Car Race Case) దర్యాప్తులో భాగంగా శనివారం ఏసీబీ(ACB) అధికారుల ఎదుట ఏస్‌నెక్ట్స్‌జెన్, గ్రీన్కో ప్రతినిధులు విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలు ఫార్ములా ఈ–ఆపరేషన్ లిమిటెడ్ (ఎఫ్ఈఓ), ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేటు లిమిటెడ్, పట్టణాభివృద్ధిశాఖ మధ్య జరిగాయి.ఇందులో సీజన్ 9కి ఏస్‌నెక్ట్స్‌జెన్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఏస్‌నెక్ట్స్‌జెన్ సంస్థకు మాతృ సంస్థ అయిన గ్రీన్కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కొన్ని లావాదేవీలు జరిగాయి.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ రెండు సంస్థల కార్యాలయాల్లో ఇటీవల సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంగా స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాలు, ఇప్పటి వరకు దర్యాప్తులో గుర్తించిన అంశాల ఆధారంగా మరింత సమాచారాన్ని ఈ సంస్థల ప్రతినిధుల నుంచి సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆరు రైల్వే లైన్లతో అనుసంధానం -
ఆర్జీ కార్ ఆస్పత్రి ఘటన.. నిందితుడు సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష?
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఆర్జీకార్ ఆస్పత్రి (rg kar hospital) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) గురువారం సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. ఈ కేసులో జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది.ఆర్జీకార్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దర్యాప్తు సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని సీల్దా సెషన్స్ (Sealdah sessions court) కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్‌కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సంజయ్ రాయ్‌కు ఉరే సరినిందితుడు సంజయ్ రాయ్‌పై హత్య, అత్యాచారం, మరణానికి కారణమైనందుకు, బాధితురాలు కోలుకోలేని విధంగా హింసించినట్లు తేలింది. కోర్టు తీర్పుతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 103(1), 64, 66 కింద ఉరిశిక్ష,లేదంటే జీవిత కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉండనుంది. సంజయ్ రాయ్ నిర్దోషి సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సౌత్ 24 పరగణాలకు చెందిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సర్వీస్ చీఫ్, డిఫెన్స్ లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన తుది వాదనలలో తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని వాదించారు. ఆ రోజు రాత్రి ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఏం జరిగిందంటేగతేడాది ఆగస్ట్‌లో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది.సుమారు ఐదు నెలల పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ఆధారాల్ని జనవరి 9న కోర్టుకు అందించింది. జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది. -
‘బయటి నేరగాళ్ల’కు చెక్ భారత్‌పోల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు కీలకపాత్ర పోషించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అమెరికాలో ఉన్న ఆయన్ను రప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించడానికి 8 నెలలుగా ప్రయత్నాలు చేస్తోంది. కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు, పోలీసు విభాగాలు అనునిత్యం ఏదో ఒక కేసులో నిందితుల ఆచూకీ కనుగొనడం, వారిని రప్పించే క్రమంలో ఇంటర్‌పోల్ సాయం కోరుతుంటాయి. ఇంటర్ పోల్గా పిలిచే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారానికి, నేరాల నియంత్రణకు కృషి చేస్తుంది. అయితే ఏదైనా పోలీసు విభాగం దీన్ని ఆశ్రయించడం అనేది ప్రస్తుతం ఓ సుదీర్ఘ, క్లిష్టతరమైన ప్రక్రియగా ఉంది. దీన్ని సులభతరం చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి గేషన్ (సీబీఐ) అధీనంలోని నేషనల్ సెంట్రల్ బ్యూరో (ఎన్సీబీ) ఫర్ ఇంటర్‌పోల్ ఓ పోర్టల్‌ను రూపొందించింది. అదే భారత్‌పోల్. ఈ పోర్టల్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండురోజుల క్రితం ఢిల్లీలో ఆవిష్కరించారు.అనేక కేసుల్లో విదేశీ లింకులుఒకప్పుడు దేశ వ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో విదేశాలతో లింకు ఉన్నవి అత్యంత అరుదుగా తెరపైకి వచ్చేవి. కానీ ప్రస్తుతం సైబర్ నేరాలు, భారీ ఆర్థిక నేరాలు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా తదితర కేసులతో పాటు వ్యవస్థీకృత నేరాల్లో ‘విదేశీ లింకులు’ సర్వసాధార ణం అయ్యా యి. సూత్ర ధారులు విదేశాల్లో ఉండి ఇక్కడ నేరాలు చేయించడమో, ఇక్కడ నేరం చేసిన వారు విదేశాలకు పారిపోవడమో జరుగుతోంది. దీంతో పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీలు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించడం అనివార్యంగా మారుతోంది. 195 దేశాల సభ్యత్వం కలిగిన ఇంటర్‌పోల్ ద్వారానే రెడ్ కార్నర్ సహా వివిధ రకాలైన నోటీసుల జారీ సాధ్యమవుతుంది.అంత ఈజీ కాదు..అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైదరాబాద్ పంజగుట్ట పోలీసుల వ్యయప్రయాసలు ఇంటర్‌పోల్ వ్యవహారానికి ఓ తాజా ఉదాహరణ. ఫోన్ ట్యాపింగ్ కేసు వినతి తొలుత వెస్ట్‌జోన్ డీసీపీ ద్వారా నగర పోలీసు కమిషనర్‌కు వెళ్లింది. పోలీసు కమిషనర్ రాష్ట్ర నోడల్ ఏజెన్సీ సీఐడీకి సిఫారసు చేశారు. అక్కడి నుంచి దేశంలో ఇంటర్‌పోల్‌కు నోడల్ ఏజెన్సీగా ఉన్న సీబీఐకి చేరింది. అక్కడి నుంచి ఇంటర్‌పోల్‌కు సదరు విజ్ఞప్తి చేరాల్సి ఉండగా.. అనేక వివరణలు, సందేహాలు, సమస్యలు ప్రక్రియ ముందుకు సాగేందుకు ఆటంకంగా మారాయి. ఈ కారణంగానే కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినా, 8 నెలలుగా హైదరాబాద్ పోలీసులు రకరకాలుగా ప్రయ త్నాలు చేస్తున్నా ఇప్పటికీ ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించే ప్రయత్నం సఫలం కాలేదు. దేశంలోని అనేక ఏజెన్సీలు, పోలీసు విభాగాలు ఈ సమస్య ఎదుర్కొంటున్నాయి. దీనికి పరిష్కారంలో భాగంగానే భారత్‌పోల్ తెరపైకి వచ్చింది.ఇకపై సులభంగా..ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అన్ని పోలీసు విభాగాలు, ఏజెన్సీలకు ఇంటర్‌పోల్‌తో సంప్రదింపులు సులువు అయ్యేందుకు అవకాశం ఏర్పడింది. వివిధ రకాలైన కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియ, అందుకు అవసరమైన పత్రాలు, నమూనాలను ఈ పోర్టల్‌లో పొందుపరిచారు. అధికారులకు వచ్చే సందేహాలు, వాటికి సమాధానాలను ఆన్లైన్లో పొందేలా డిజైన్ చేశారు. ఈ పోర్టల్ వినియోగంపై త్వరలో సీబీఐ దేశ వ్యాప్తంగా పోలీసులు, ఏజెన్సీలకు సమగ్ర శిక్షణ ఇవ్వనుంది.భారత్‌పోల్.. 5 ఉపయోగాలు1 దేశంలోని అన్ని ఏజెన్సీలు, పోలీసు విభాగాలతో పాటు కొన్ని విదేశీ ఏజెన్సీలు సైతం ఈ పోర్టల్ ద్వారాసంప్రదింపులు జరిపే అవకాశం ఉంది.2 వివిధ వ్యవస్థీకృత నేరాలు,నేరగాళ్లకు సంబంధించిన వివరాల్ని ఇందులో పొందుపరిచారు.3 బ్రాడ్ కాస్ట్ విధానంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వాంటెడ్ నేరగాళ్ల వివరాలను తేలిగ్గా ఇచ్చిపుచ్చుకునే ఆస్కారం ఏర్పడింది.4 వ్యవస్థీకృత నేరాలు, నేరగాళ్ల సమా చారం, నేరం చేసే విధానం, ప్రభావం ఉన్న ప్రాంతాలు తదితరాలను తేలిగ్గా గుర్తించేలా ఈ పోర్టల్ రూపొందింది.5 క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టం కంటే సమర్థంగా నేరగాళ్ల కదలికలు, వివరాలు తెలుసుకునేందుకు భారత్‌పోల్ ఉపయోగపడనుంది. -
19 ఏళ్ళ తరువాత దొరికారు.. కావలపిల్లలను తల్లిని హతమార్చిన హంతకులు
-
కేంద్ర అధికారులపై కేసు నమోదుకు.. సీబీఐకి రాష్ట్రాల అనుమతి అవసరం లేదు
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. జస్టిస్ సీటీ రవి కుమార్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఏ హోదాలో ఉన్నాసరే, ఆ ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు/ కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని సంస్థలు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం వారిపై తీవ్ర అభియోగాలున్నాయి’అని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే ఇద్దరు కేంద్ర అధికారులపై అవినీతి ఆరోపణలకు సంబంధించి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1946 కింద సీబీఐకి గతంలో అనుమతిచ్చిందని, రాష్ట్రం వేరు పడినందున మళ్లీ అనుమతులు అవసరమన్న నిందితుల వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. దీనిని తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు వర్తించిన అన్ని చట్టాలు కొత్తగా ఏర్పాటైన రెండు రాష్ట్రాలకు యథాప్రకారం కొనసాగుతాయని తేలి్చచెప్పింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదుకు తాజాగా ఎలాంటి అనుమతి అవసరం లేదని తెలిపింది. -
డేరా బాబాకు ‘సుప్రీం’ నోటీసులు
ఛండీగఢ్: ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ (dera baba)కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 2002లో డేరా బాబా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసుకు సంబంధించి డేరా బాబాతో పాటు మరో నలుగురికి సుప్రీం కోర్టు (supreme court) ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది.రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా, అతని సహ నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. కేసులో విచారణకు కోర్టు ఎదుట హాజరు కావడం లేదంటే, విచారణకు సహకరించాలని సూచించింది. ఈ కేసును సుప్రీం కోర్టు జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. 24ఏళ్ల నాటి కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే 2002లో పంజాబ్ విద్యార్థిని, డేరాబాబా శిష్యురాలు పేరుతో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ (atal bihari vajpayee), కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, సీబీఐ, జాతీయ మానవ హక్కుల కమిషన్ (nhrc), పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులకు హిందీలో ఓ ఆకాశ రామన్న ఉత్తరం అందింది. ఆ లేఖలో సిర్సా కేంద్రంగా డేరా సచ్చా సౌదా నిర్వహిస్తున్న గుర్మీత్ దైవత్వం పొందే మార్గమంటూ దాదాపు 400 మంది శిష్యులను నంపుసకులుగా మార్చారని, సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని, తిరగబడిన వారిని హత్య చేసేవారంటూ పలు ఆధారాల్ని ఆ లేఖలో పొందుపరిచింది. అప్పటి వరకు కోట్లాది మంది భక్తులకు దైవంగా విరాజిల్లిన డేరాబాబాకు ఆ లేఖతో పతనం మొదలైంది. ఆయన భక్తులు డేరా బాబాపై తిరగబడ్డారు.ఆకాశ రామన్న ఉత్తరం రాసింది ఎవరంటే అయితే అదే సమయంలో 2002, జులై 10న డేరా బాబా మేనేజర్ రంజిత్ సింగ్ హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర నగరానికి చెందిన కాన్పూర్ కాలనీలో అనుమానాస్పద రీతిలో మరణించారు. డేరాబాబా ఆకృత్యాలను ఎదిరించేలా రాసింది శిష్యురాలు కాదని, మేనేజర్ రంజిత్ సింగేనన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. హత్యకేసులో దోషులుగాఅదే సమయంలో రంజిత్ సింగ్ దారుణు హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతి కేసును 2021లో హర్యానా పంచాకుల సీబీఐ విచారించింది. విచారణలో రంజిత్ సింగ్ మృతిలో డేరాబాబాతో పాటు అవతార్ సింగ్, కృష్ణలాల్, జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్‌లను దోషులుగా పరిగణించింది. నిందితులకు జీవిత ఖైదు విధించింది.కేసుల నుంచి విముక్తి కల్పించండిఈ నేపథ్యంలో మే 2024లో డేరాబాబా తనపై నమోదైన అత్యాచార కేసులు, జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి హత్యకేసులో తనని నిర్ధోషిగా ప్రకటించాలని కోరుతూ కోర్టులలో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన పంజాబ్, హర్యానా హైకోర్టు, సీబీఐ కోర్టు డేరాబాకుకు విధించిన శిక్షను రద్దు చేసింది. రంజిత్ సింగ్ హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.తాజాగా, ఈ కేసులో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం కోర్టు సైతం కేసు తదుపరి విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. 2017 నుంచి జైలు జీవితం2017లో ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన తరువాత సీబీఐ కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో హర్యానాలోని రోహ్తక్ జైలులో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. రోహ్తక్ జైలులో శిక్ష అనుభవిస్తుండగా రంజిత్ సింగ్ కేసులో సీబీఐ జీవిత ఖైదు విధించింది. -
Magazine Story: చంద్రబాబుపై విచారణలో ఉన్న కేసులను నీరుగార్చే కుట్ర
-
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ కథ క్లోజ్.. విశాఖపట్నానికి వచ్చిన నౌకలో డ్రగ్స్ లేవని నిర్ధారించిన సీబీఐ... అప్పట్లో ఓటర్లను మోసగించడానికి టీడీపీ అండ్ కో దుష్ప్రచారం
-
కనికట్టు కుట్ర ‘పచ్చ’ పన్నాగమే!
ఆ రోజు డ్రై ఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ అవశేషాలున్నాయని ఎందుకు ఊరూరా ఊదరగొట్టారు? అందులో డ్రగ్స్ లేవని ఇప్పుడు సీబీఐ స్పష్టం చేసింది. దీనిని బట్టి మీరు చేసింది విష ప్రచారం కాదా? వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విష ప్రచారం చేసి, వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు గుప్పించింది కూటమి నేతలు కాదా? వీటన్నింటిపై ఇప్పుడు ఏమంటారు?సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం : ‘అడ్డదారిలో అధికారమే చంద్రబాబు జెండా.. అందుకు దుష్ప్రచారమే అజెండా’ అని మరోసారి నిరూపితమైంది. ఎన్నికల్లో ప్రజల్ని మోసగించేందుకు టీడీపీ కూటమి పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజల్ని వంచించారన్నది ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాదు ఎన్నికల ముందు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారం అంతా కుట్రేనన్నది నిరూపితమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని టీడీపీ కూటమి చేసిన దు్రష్పచారం.. అందుకు వంత పాడిన ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా రాద్ధాంతం అంతా కుతంత్రమేనని నిగ్గు తేలింది. బ్రెజిల్ నుంచి నౌకలో విశాఖపటా్ననికి వేల టన్నుల డ్రగ్స్‌ను దిగుమతి చేశారన్న ప్రచారం కేవలం చంద్రబాబు కుతంత్రమేనని నిర్ధారణ అయ్యింది. విశాఖపట్నంకు వచ్చిన నౌకలో అసలు ఎలాంటి డ్రగ్స్ లేవని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారమేనని స్పష్టమైంది. అదే కాదు.. భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా టీడీపీ కూటమి ఎన్నికల ముందు పెట్టిన గగ్గోలు అంతా దుష్ప్రచారమే తప్ప.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నదీ తేటతెల్లమైంది. రీసర్వేను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని చంద్రబాబే వెల్లడించడం అందుకు తార్కాణం. నేరుగా వైఎస్సార్సీపీని ఎదుర్కోలేమని గ్రహించే చంద్రబాబు ఎన్నికల ముందు ఈ దు్రష్పచార కుతంత్రాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించారన్నది తాజా పరిణామాలు తేల్చి చెబుతున్నాయి. ఇలా నెలకో అబద్ధానికి రెక్కలు కట్టి విష ప్రచారం చేస్తుండటం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, వదినమ్మ పురందేశ్వరి, ఈనాడు, టీవీ–5.. ఇతర ఎల్లో మీడియాకే చెల్లింది. రాష్ట్ర అప్పులు మొదలు.. శ్రీవారి లడ్డూ, విజయవాడ వరదలు, అదానీ వ్యవహారం, కాకినాడ పోర్టు వరకు.. ఎప్పటికప్పుడు వివాదాలు లేవనెత్తుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. డ్రగ్స్ అడ్డాగా ఏపీ.. ఇదీ పచ్చ ముఠా దుష్ప్రచారం » చంద్రబాబు 2024 ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. ప్రజల్ని మభ్యపెట్టందే, భయభ్రాంతులకు గురి చేయందే ఎన్నికల్లో గెలవలేమని గుర్తించిన ఆయన పక్కా పన్నాగంతో దుష్ప్రచార కుట్రకు తెగించారు. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు ఆడ్డాగా మారిపోయిందని పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశారు. » చంద్రబాబుకు కొమ్ముకాసే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆ ప్రచారాన్ని ఊరూ వాడా ఊదరగొట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. పోలింగ్‌కు కచ్చితంగా నెలన్నర ముందు డ్రగ్స్ దందా కుట్రను పతాక స్థాయికి తీసుకువెళ్లాలని చంద్రబాబు భావించారు. అప్పటికే తమతో జట్టుకట్టిన జనసేన, బీజేపీ నేతల సహకారంతో అందుకోసం పక్కా కుట్రకు తెరతీశారు. అందులో భాగంగానే బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రై ఈస్ట్‌ను తీసుకువచ్చిన ‘ఎస్‌ఈకేయూ 4375380’ అనే నౌకలో డ్రగ్స్ అక్రమంగా తీసుకువస్తున్నారంటూ ఢిల్లీలోని సీఐబీ కార్యాలయానికి ఆకాశరామన్న తరహాలో తప్పుడు సమాచారం అందించారు. » అనంతరం కొందరు అధికారులను ప్రభావితం చేశారు. దాంతో ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు ఆగమేఘాల మీద విశాఖపట్నం చేరుకుని మార్చి 21న ఆ నౌకలో తనిఖీలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సంధ్యా ఆక్వా అనే సంస్థ దిగుమతి చేసుకున్న 25 వేల టన్నుల డ్రై ఈస్ట్‌ను జప్తు చేశారు. అందుకోసం ముందుగానే కాచుకుని కూర్చున్న టీడీపీ.. ఆ వెంటనే డ్రై ఈస్ట్ పేరుతో కొకైన్ అనే డ్రగ్స్ అక్రమంగా దిగుమతి చేశారనే దు్రష్పచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. » వెయ్యి టన్నుల కొకైన్ ధర రూ.వెయ్యి కోట్లని.. ఆ లెక్కల ప్రకారం రూ.25 వేల కోట్లు విలువ చేసే 25 వేల టన్నుల కొకైన్‌ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశాయి. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి.. ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వరుసగా మైకులు పట్టుకుని అదే తప్పుడు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. వైఎస్సార్సీపీ నేతలే డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ విష ప్రచారం చేశారు. » ఆ షిప్లో డ్రగ్స్ దిగుమతి అయినట్టు సీబీఐ అధికారికంగా ప్రకటించనే లేదు. ఇంకా తనిఖీలు చేయాల్సి ఉందని, ఆ డ్రై ఈస్ట్‌ను ల్యాబొరేటరీకి పంపించి పరీక్షించాల్సి ఉందని సీబీఐ చెప్పినా సరే చంద్రబాబు ముఠా ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం ఎన్నికల ముందు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్రం డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోయిందంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించారు. ఏకంగా నెల రోజులపాటు ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగించడం పక్తు చంద్రబాబు పన్నాగమే. అందులో డ్రగ్స్ లేవు విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్)లో 25 వేల కిలోల డ్రైఈస్ట్‌తో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి అయ్యాయని ఈ ఏడాది మార్చి 19న సీబీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్‌కు వెయ్యి బ్యాగులొచ్చాయని వెల్లడించింది. ఆ తర్వాత డ్రగ్స్ మూలాలపై దర్యాప్తు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అనంతరం బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన నౌకలో అసలు డ్రగ్స్ లేనే లేవని సీబీఐ తేల్చి చెప్పింది. కంటైనర్ క్లియరెన్స్ వాస్తవమేనని కస్టమ్స్ అధికారులు ««ధృవీకరించారు.. సీజ్ చేసిన కంటైనర్‌ను సదరు సంస్థకు అప్పగించేందుకు సీబీఐ క్లియరెన్స్ సరి్టఫికెట్ ఇచ్చిందని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. పూర్తి ఆధారాలతో సీబీఐ కోర్టులో నివేదిక సమర్పించిన తర్వాత.. కోర్టు అనుమతించిన పత్రాల్ని తమకు ఇచ్చారని ఆయన వెల్లడించారు. భూముల రీసర్వేపై కూడా విషప్రచారం » భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా చంద్రబాబు, ఆయన ముఠా ఇదే రీతిలోదుష్ప్రచారం చేశాయి. వైఎస్సార్సీపీ నేతలు సామాన్యుల భూములను కబ్జా చేసేందుకు రీసర్వేను నిర్వహిస్తున్నారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతూ అందర్నీ భయాందోళనలకు గురి చేసేందుకు యత్నించాయి. » తాత, తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న భూములను బలవంతంగా తమ పేరిట రాయించేసుకుంటారని, ఆ మేరకు రీసర్వే నివేదికల్లో నమోదు చేసేస్తారని బురద జల్లడం ద్వారా సామాన్య ప్రజానీకాన్ని బెంబేలెత్తించాయి. టీడీపీ చేస్తోందంతా దుష్ప్రచారమేనని వైఎస్సార్సీపీ ఎంతగా వివరించేందుకు యత్నించినా సరే టీడీపీ కూటమి మాత్రం తమ కుట్రలను మరింత తీవ్రతరం చేసింది. » ఎప్పుడో బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో వందేళ్ల క్రితం రాష్ట్రంలో భూముల సర్వే చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ సర్వే చేయలేదని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివరించింది. దాంతో భూ వివాదాలు అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్యులు పడుతున్న అవస్థలకు పరిష్కార మార్గంగానే రీసర్వే చేపట్టినట్టు ఎంతగానో చెప్పుకొచ్చింది. భూముల రీసర్వేను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వివరించింది. కానీ టీడీపీ కూటమి ప్రజల్ని మభ్యపెట్టేందుకు పోలింగ్ వరకు తమ దు్రష్పచారాన్ని కొనసాగించింది. » తీరా అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. భూముల రీసర్వేను తాము కొనసాగిస్తామని ప్రకటించడం గమనార్హం. భూ వివాదాల పరిష్కారానికి రీసర్వేనే పరిష్కారమని ఆయన ప్రకటించారు. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే సరైన చర్యేనని అధికారికంగా ఆమోదించారు. అంటే కేవలం ఎన్నికల్లో ప్రజల్ని మోసగించి అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకే తాము దుష్ప్రచారం చేశామని చంద్రబాబు అంగీకరించినట్టే కదా! ఇలాంటి కుట్రలు ఎన్నెన్నో.. » వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని టీడీపీ కూటమి విష ప్రచారం చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.6.50 లక్షల కోట్లేనని వెల్లడించింది. 2014–19లో చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల శాతం కంటే 2019–24లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల శాతం తక్కువేనని ఆరి్థక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే టీడీపీ ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని నిరూపితమైంది. » రాష్ట్రంలో ఏకంగా 34 వేల మంది బాలికలు, మహిళలను వలంటీర్ల ద్వారా అపహరించి అక్రమ రవాణా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తనకు కేంద్ర హోమ్ శాఖ వర్గాలు తెలిపాయంటూ ఎన్నికల సభల్లో పదే పదే దు్రష్పచారం చేశారు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయంపై ఆయన ఒక్క మాట మాట్లాడ లేదు. కనిపించకుండా పోయారని చెప్పిన 34 వేల మందిని తీసుకురావాలని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతున్నా ఆయన స్పందించడమే లేదు. ఎందుకంటే అది అవాస్తవం కాబట్టే. అసలు అంత మంది కనిపించలేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలోని హోమ్ శాఖ తెలిపింది. అంటే ఇదంతా ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చేసిన దుష్ప్రచారమేనని నిగ్గు తేలింది. -
బ్యాంకు మోసాల దర్యాప్తునకు చర్యలు
బ్యాంకు మోసాలకు సంబంధించిన కేసులను మరింత సమర్థంగా, వేగంగా దర్యాప్తు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మధ్య పరస్పరం సహకారాన్ని పెంపొందించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ సంస్థల మధ్య సాధారణ చర్చల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిత్వశాఖ అంగీకరించింది.ప్రత్యేక వేదిక ఏర్పాటు..?బ్యాంకు మోసాలపై సీబీఐలో చాలా కేసులు నమోదవుతున్నాయి. వాటి దర్యాప్తులో అవసరమయ్యే కీలక సమాచారాన్ని బ్యాంకర్లు అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పూర్తి సమాచారం అందించేందుకు నిబంధనలు అడ్డుగా ఉంటాయి. అయితే ఎలాంటి కేసుల్లో ఎలాంటి సమాచారం అందించాలనే విషయంపై స్పష్టత వచ్చేందుకు సీబీఐ, బ్యాంకర్లు పరస్పరం చర్చించాల్సి ఉంది. అందుకు ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా..కేసులకు సంబంధించి సీబీఐ చేసిన అభ్యర్థనలను బ్యాంకర్లు పరిశీలించనున్నారు. బ్యాంకర్లు ఇచ్చిన సమాచారంపై భవిష్యత్తులో కస్టమర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సీబీఐ నుంచి బ్యాంకర్లకు రక్షణ ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. సీబీఐ, బ్యాంకర్ల మధ్య పరస్పరం సహకారం వల్ల ఫిర్యాదుల దాఖలుకు సంబంధించిన కార్యాచరణ అంశాలు, దర్యాప్తును క్రమం తప్పకుండా సమీక్షించడం, ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ సులువవడం వల్ల త్వరగా కేసులు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: 1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!అనుమతుల్లేక కేసులు పెండింగ్2018లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17Aలో చేసిన సవరణ ప్రకారం.. బ్యాంక్ మేనేజ్మెంట్ ఆమోదించిన తర్వాతే బ్యాంకు మోసాలపై దర్యాప్తు ఏజెన్సీ ఉద్యోగులను విచారించే అధికారం ఉంటుంది. పీఎస్‌యూ బ్యాంకులకు, ప్రైవేట్ బ్యాంకులకు ఈ నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ దర్యాప్తు సంస్థలు నేరుగా ఇన్వెస్ట్‌గేషన్ చేయాలంటే చట్టం ప్రకారం వారి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. తాజా సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు కొందరు అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), విజిలెన్స్ కమిషన్ వంటి ఏజెన్సీలకు బ్యాంకు యాజమాన్యాలు తమ ఉద్యోగులపై విచారణకు అనుమతి ఇవ్వనందున వందలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఫిర్యాదు చేశాయి. -
ఆర్జీ కర్ ఆస్పత్రిలో అవినీతి.. సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ప్రధాన నిందితునిగా పేర్కొంటూ సీబీఐ ఆ ఛార్జ్ షీట్లో పేర్కొంది. 1000 పేజీల చార్జిషీటును సీబీఐ సిద్ధం చేసింది. అయితే ఈ ఛార్జ్‌షీట్‌ను అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ చార్జిషీటులో ఐదుగురిని నిందితుల జాబితాలో చేర్చారు.సీబీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (సస్పెండ్ అయ్యారు)తో పాటు మరో నలుగురు అరెస్టయిన నిందితుల పేర్లు ఛార్జ్ షీట్లో ఉన్నాయన్నారు. ఇందులో బిప్లబ్ సింగ్, అఫ్సర్ అలీ, సుమన్ హజ్రా, ఆశిష్ పాండే పేర్లు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిపై చార్జిషీట్ దాఖలు చేయడానికి అవసరమైన అధికారిక అనుమతి పొందలేనందున అలీపూర్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ ఛార్జిషీట్‌ను అంగీకరించలేదు.ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇదే సమయంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో భారీ అవినీతి జరిగిందంటూ విద్యార్థులు, కొంతమంది వైద్యులు ఆరోపించారు. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేసింది. విచారణలో పలు ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. వైద్యసామగ్రి కొనుగోలులో నిందితులు అవినీతికి పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది. ఇది కూడా చదవండి: కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి -
ఎట్టకేలకు సల్మాన్ దొరికాడు
ఢిల్లీ: పాక్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ ఎట్టకేలకు చిక్కాడు.ఉగ్రవాద కార్య కలాపాలు కొనసాగించేలా సల్మాన్ రెహమాన్ ఖాన్ తూర్పు ఆఫ్రికా దేశం రువాండా రాజధాని కిగాలీ నుంచి బెంగళూరులో ఉన్న తన సహచరులకు డబ్బు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపాడు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర నిఘూ సంస్థలు బెంగళూరులోని తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున మారణాయుధాలు లభ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎన్ఏఐ సల్మాన్ రెహమాన్ ఖాన్ ఆచూకీ కోసం అత్యంత రహస్యంగా విచారణ చేపట్టింది.దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఐఏ, ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్‌లో కిగాలీలో సల్మాన్ రెహమాన్ ఖాన్ దొరికాడు. దీంతో సల్మాన్‌ను కిగాలీ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. -
కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: వేర్పాటువాది యాసిన్‌మాలిక్ కేసు విచారణ సందర్భంగా.. గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా అని పేర్కొంది. యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా తమ ఎదుటు హాజరు కావాలని ఆదేశించిన జమ్మూకశ్మీర్ కోర్టు ఆదేశాలను.. సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే.. 1990లో శ్రీనగర్ శివారులో నలుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయా సయీద్ (అప్పటి హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్) కిడ్నాప్ కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ నిమిత్తం.. జమ్ము శ్మీర్ కోర్టు వ్యక్తిగతంగా అతన్ని హాజరుపర్చాలని ఆదేశించింది. అందకు తాను సిద్ధంగా ఉన్నట్లు మాలిక్ సమ్మతి తెలియజేశాడు. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో అతడు జమ్మూకశ్మీర్ వెళ్లడం మంచిది కాదని, అది జమ్ములో అలజడి సృష్టించే అవకాశం ఉందని సీబీఐ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.సీబీఐ తరఫున తుషార్ మెహతా.. మాలిక్‌ను జమ్ము కశ్మీర్ తీసుకెళ్లాలని అనుకోవడం లేదు అని వాదించారు. అయితే.. జమ్ములో ఇంటర్నెట్ కనెక్ట్ సమస్య ఉందని గుర్తు చేస్తూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని(మాలిక్) క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉండదు కదా? అని జస్టిస్ ఏఎస్ ఒకా ప్రశ్నించారు. అయితే అతని విచారణను ఢిల్లీకే మార్చాలని మెహతా కోరారు. అతనొక వేర్పాటువాది అని, వ్యక్తిగతంగా హాజరైతే జిమ్మిక్కులు ప్రదర్శించే అవకాశం ఉందని వాదించారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ ఒకా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలో కసబ్ లాంటి ఉగ్రవాదికి కూడా విచారణ న్యాయంగానే అందింది కదా అని అన్నారు. అయితే.. జైల్లోనే కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని, దానికి న్యాయమూర్తిని ఎలా ఎంపిక చేస్తారో పరిశీలిస్తామని బెంచ్ పేర్కొంది. అలాగే.. అయితే ఈ విచారణ కోసం హాజరయ్యే సాక్షుల భద్రతకు సంబంధించి కేంద్రాన్ని వివరణ కోరుతూ తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. -
మహారాష్ట్రలో వేల కోట్ల బిట్‌కాయిన్ స్కాం కలకలం.. సుప్రీం కీలక ఆదేశాలు
ముంబై : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూ.6,600 కోట్ల బిట్ కాయిన్ స్కాం కలకలం రేపుతోంది. ఈ స్కాంలో పలువురి రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సైతం కేసు విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే, ఈ బిట్ కాయిన్ స్కాంలో మహరాష్ట్ర కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జరిగిన లావాదేవీల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్సీపీ (ఎస్పీ)ఎంపీ సుప్రియా సూలే బిట్కాయిన్లను ఉపయోగించారంటూ మాజీ పోలీసు అధికారి రవీంద్ర పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు.అందుకు ఊతం ఇచ్చేలా మహరాష్ట్ర పోలింగ్‌కు ఒక రోజు ముందు అంటే నిన్న (నవంబర్19) బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది ప్రెస్మీట్లో ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. వాటిలో కాల్ రికార్డింగ్‌లు, వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి. తాను బహిర్ఘతం చేసిన ఆధారాల్లో ఒక ఆడియో క్లిప్‌లో సుప్రియా సూలే వాయిస్ బయటికి వచ్చిందని ఆరోపించారు. అంతేకాదు, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ఆ ఆడియోలో ఉన్నది తన చెల్లెలు సుప్రియా సూలే వాయిస్ అని ధృవీకరించడం సంచలనం రేపుతోంది.కాగా, బిట్ కాయిన్ స్కాంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ బిట్ కాయిన్ స్కాం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. -
వాల్తేరులో వణుకు
సాక్షి, విశాఖపట్నం : ‘ఈయన మంచి డీఆర్ఎం.. మాకు టెండరు కావాలని అడిగితే.. ఎంతిచ్చినా తీసుకొని ఆ పనులు మాకే వచ్చేటట్లు చూసేవాళ్లు. అలాంటి మంచివ్యక్తిని సీబీఐ పట్టుకోవడమేంటి సార్..?’’.. రైల్వే సంబంధిత పనులు చేపట్టే ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలివీ.. సదరు కాంట్రాక్టర్.. తనకు రావాల్సిన పనులు ఆగిపోతాయేమోనన్న ఆందోళనతో చెప్పినా.. వాల్తేరు డీఆర్ఎం వ్యవహారమేంటనేది ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్‌కుమార్ ప్రసాద్.. ముంబైలో శనివారం ఉదయం లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. డీఆర్ఎంపై దర్యాప్తు బృందం దాడితో వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు, ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టే ఉద్యోగులు తమ పరిస్థితేంటనే ఆందోళనలో ఉన్నారు. రెండేళ్ల నుంచీ సీబీఐ నిఘా...! వాస్తవానికి.. సీబీఐతో డీఆర్ఎం సౌరభ్‌కు కొత్త పరిచయం కాదని తెలుస్తోంది. గతంలో వాల్తేరు డీఆర్ఎంగా రాకమునుపు సెంట్రల్ రైల్వే జోన్లో ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఈ)గా విధులు నిర్వర్తించే వారు. ఈయనకు ముందు పీసీఎంఈగా వ్యవహరించిన అధికారి.. రూ.లక్ష లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. అనంతరం నిర్వహించిన సోదాల్లో రూ.23 లక్షలు, రూ.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.13 కోట్ల విలువైన ఆస్తులు, సింగపూర్, యూఎస్ బ్యాంకుల్లో రూ.1.63 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో పీసీఎంఈగా విధుల్లోకి వెళ్లిన సౌరభ్‌పై అప్పటి నుంచి కేంద్ర దర్యాప్తు బృందం నిఘా పెట్టింది. పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. వైజాగ్ నుంచి ఫాలో చేస్తూ.. టెండర్ పాస్ చేసేందుకు లంచం అడుగుతున్నారంటూ ఓ కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించారు. దీంతో విశాఖ నుంచి దర్యాప్తు బృందం అధికారులు డీఆర్ఎం కదలికలపై నిఘాపెట్టారు. ముంబై వెళ్తున్నట్లు సమాచారం తెలుసుకొని అక్కడ బృందాల్ని అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకోవడం.. మెర్సిడెస్ కారులో ఇంటికి వెళ్లిన వెంటనే సీబీఐ అధికారులు డీఆర్ఎంను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. రెండేళ్ల నుంచి నిఘా కొనసాగించిన సీబీఐ అధికారులకు ఎట్టకేలకు శనివారం చిక్కారని సమాచారం. సీబీఐ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎంతిచ్చినా ఓకే.?? లంచం వ్యవహారంలో సౌరభ్ చిక్కడంతో.. ఆయన చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంట్రాక్టర్లతో నిరంతరం..డీఆర్ఎం కార్యాలయం బిజీ బిజీగా ఉండేదని తెలుస్తోంది. సివిల్, మెకానికల్ విభాగాలకు సంబంధించి టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుల వసూళ్లకు డీఆర్ఎం కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. టెండర్లు ఎవరికి రావాలంటే.. పని విలువ బట్టి వసూళ్లు రాబట్టేవారని వాల్తేరు డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. రూ.50 వేల నుంచి వసూళ్ల పర్వం మొదలయ్యేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. డబ్బులిచ్చిన వారికే పనులకు సంబంధించిన టెండర్లు దక్కేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్ఎం అండ్ కో బ్యాచ్‌పై పలుమార్లు ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. విశాఖ రైల్వే పరువు తీసేశారు.! వాల్తేరు డివిజన్ చరిత్రలో సీబీఐ దాడుల్లో ఒక ఉద్యోగి, లేదా అధికారి పట్టుబడటం ఇదే మొదటిసారని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో డీఆర్ఎంలుగా వ్యవహరించిన అనూప్‌కుమార్ సత్పతి, చేతన్‌కుమార్ శ్రీవాత్సవ్.. డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అంటున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. తప్పు చేసిన ఉద్యోగులను బదిలీలు, సస్పెన్షన్లు చేసేవారని చెబుతున్నారు. సదరు సౌరభ్ వచి్చన తర్వాత.. ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోకుండా వాళ్లతో మిలాఖత్ అయిపోయేవారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సీబీఐ వ్యవహారంతో విశాఖ రైల్వే డివిజన్‌పై మచ్చపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరిలో టెన్షన్ డీఆర్ఎంపై సీబీఐ దాడులతో.. డివిజన్లో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టిన ఇద్దరు ఉద్యోగులు.. సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే.. సెలవులో వెళ్తే.. సీబీఐ దృష్టిలో పడతారంటూ సహచరులు చెప్పడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఎప్పుడు తమని సీబీఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు. -
సీబీఐకి చిక్కిన అవినీతి అనకొండ
-
సీబీఐకి చిక్కిన అవినీతి అనకొండ
సాక్షి,విశాఖ: సీబీఐ వలకి అవినీతి అధికారి అడ్డంగా దొరికి పోయారు. ఓ కాంట్రాక్టర్ నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.వాల్తేరు డివిజన్ డీఅర్ఎంగా సౌరభ్ కుమార్ పని చేస్తున్నారు. అయితే మెకానికల్ బ్రాంచ్ పనులుకి టెండర్ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ సౌరబ్‌కు డబ్బులు ముట్ట జెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్లాన్ ప్రకారం.. సదరు కాంట్రాక్టర్ ముడుపుల వ్యవహారంపై సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు.పక్కా సమాచారంతో కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు డీఆర్ఎం సౌరబ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
సుశాంత్ కేసు.. సుప్రీంకోర్టులో రియా చక్రవర్తికి ఊరట
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటితోపాటు ఆమె కుటుంబంపై సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ సర్క్యూలర్‌ను (ఎల్ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈమేరకు బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన సీబీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.ఈ సందర్భంగా సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ అనవసరమైనదని పేర్కొంది. ‘నిందితుల్లో ఒకరు సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తి అయినందున మీరు ఈ పనికిరాని పిటిషన్ వేశారు. మేము మిమ్మల్నిహెచ్చరిస్తున్నాం. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు( సుశాంత్, రియా) సమాజంలో పేరు కలిగిన వారు.’ అని పేర్కొంది.ఇదిలా ఉండగా నటుడు సుశాంత్ సింగ్ 2020 జూన్ 14న ముంబయిలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అది ఆత్మహత్య కాదని, సుశాంత్ మరణంపై దర్యాప్తు చేయాలని కోరుతూ పాట్నాలో అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. తర్వాత ఈ కేసును సీబీఐకి విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ గతంలో ఎల్వోసీ జారీ చేసింది. దీనిపై ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఈ తీర్పు వెలువడింది. -
బీజేపీ నియంత్రణలో ఈసీ, సీబీఐ, ఈడీ: రాహుల్
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు పెంచారు. శనివారం రాంచీలో సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ సభలో ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి సహా అన్ని వైపుల నుంచి రాజ్యాంగంపై ముప్పేట దాడులను ఎదుర్కొంటోంది. వీళ్ల దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ, పాలనాయంత్రాంగం, న్యాయపాలికసహా అన్ని వ్యవస్థలను అధికారంలోని బీజేపీ గుప్పిటపట్టింది. నిధులు, సంస్థలనూ నియంత్రణలోకి తెచ్చుకుంది. ఖాతాల స్తంభన కారణంగా నగదులేకపోయినా కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో పోరాడింది. కులగణనకు సామాజిక ఎక్స్‌రే తప్పనిసరి. వీటికి మోదీ అడ్డుతగులుతున్నారు. మీడియా, న్యాయవ్యవస్థ నుంచి మద్దతు లేకపోయినా సరే మేం అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతాం. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం’’అని రాహుల్ అన్నారు. -
CBI: నిందితుడి డీఎన్ఏ, రక్తనమూనాలు సరిపోలాయి
కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైన ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడి పనేనని సీబీఐ తెలిపింది. వైద్యురాలి మృతదేహంపై ఉన్న డీఎన్ఏ, రక్తనమూనాలు నిందితుని నమూనాలతో సరిపోలాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా 11 సాంకేతిక ఆధారాలను చార్జిషీటులో పొందుపర్చింది. బాధితురాలి మృతదేహం నుంచి సేకరించిన డీఎన్ఏ సంజయ్ రాయ్ డీఎన్ఏతో సరిపోలిందని తెలిపింది. అలాగే కురచ వెంట్రుకలు, పెనుగులాటలో సంజయ్ రాయ్ ఒంటిపై అయిన గాయాలు, అతని శరీరంపై, ప్యాంటుపై బాధితురాలి రక్తపు మరకలు, సీసీటీవీ ఫుటేజీ, అతని మొబైల్ ఫోన్ లొకేషన్, ఫోన్‌కాల్ వివరాలు.. ఇవన్నీ సంజయ్ రాయ్ పాత్రను నిర్ధారిస్తున్నాయని పేర్కొంది. సంజయ్ రాయ్ ఒంటిపై బలమైన గాయాలున్నాయని, వైద్యురాలు తీవ్రంగా ప్రతిఘటించినపుడు ఇవి జరిగాయని వివరించింది. పాశవిక హత్యాచారం జరిగిన ఆగస్టు 9న సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో మూడో అంతస్తులోని సెమినార్ హాల్ వద్ద ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజి, అతని కాల్ డేటా ధ్రువీకరిస్తోందని తెలిపింది. సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న అరెస్టు చేయగా.. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే. సెమినార్ హాల్ వైపు వెళుతున్నపుడు సంజయ్ రాయ్ మెడపై ఉన్న బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నెక్‌బ్యాండ్ తర్వాత అతను తిరిగి వెళుతున్నపుడు లేదని, సంజయ్ రాయ్ ఫోన్‌తో ఇది అనుసంధానమైనట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లా»ొరేటరీ నివేదిక ఇచి్చందని స్థానిక కోర్టుకు సీబీఐ తెలిపింది. -
కోల్‌కతా డాక్టర్ ఉదంతం: ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. సోమవారం మధ్యాహ్నం సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ ఛార్జిషీటును సమర్పించింది.ఈ ఘటనలో సామూహిక అత్యాచారం లేదని సీబీఐ తేల్చి చెప్పింది. కాంట్రాక్టు ప్రాతిపదికన కోల్‌కతా పోలీసులతో కలిసి వాలంటీర్‌గా పనిచేసిన నిందితుడు సంజయ్ రాయ్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశాడని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసింది. రాయ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ.. దాదాపు 200 మంది వాంగ్మూలాలు నమోదయ్యాయని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది.జూనియర్ డాక్టర్ ఆగస్టు 9న ఆర్జీకర్ ఆస్పత్రిలో మృతిచెందినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు, సిబ్బంది, మెడికల్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఈ కేసును కోల్‌కతా హకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఘటన జరిగిన మరుసటి రోజు నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఇతర ఆధారాలతో సహా సంజయ్ రాయ్‌ను సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.ఇక.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు.చదవండి: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ -
సిట్ విచారణకు వచ్చినప్పుడు అంతా ఒకటే మాట చెప్పాలి
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల: తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయంటూ ‘కొవ్వు ప్రకటన’ చేసిన సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు షాకివ్వడంతో ఆయన వ్యూహం మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ను పక్కనపెట్టిన అత్యున్నత న్యాయస్థానం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల బృందానికి విచారణ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ బృందంలో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఇద్దరు, కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి ఒకరు ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కొత్త వ్యూహానికి తెరతీశారు. ఇందులో భాగంగా శుక్రవారం తిరుమలలో స్వామివారికి పట్టు వ్రస్తాలు సమర్పించిన సీఎం శనివారం టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిపై మన స్టాండ్ ఏమిటో మీకు తెలుసుకదా. సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకటే మాట మీద ఉండాలి. ఎవరూ నా మాటకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. అందరికీ ఈ మేరకు ట్రైనింగ్ ఇవ్వండి. ఆ బృందంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు అనుకూలమైనవారే ఉంటారు. ఆ ఇద్దరు అన్నీ చూసుకుంటారు’ అని ముఖ్య అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సీఎం చంద్రబాబు తిరుమల పద్మావతి అతిథిగృహంలో ఐదుగురు ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీఐపీ సంస్కృతి తగ్గాలి.. తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు. ఐదుగురు అధికారులతో సమావేశం ముగిశాక ఆయన దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతిఒక్కరూ పనిచేయాలని ఆదేశించారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని సూచించారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని, ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్నారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలన్నారు. వచ్చిన ప్రతి భక్తుడికి అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని సూచించారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగానే టీటీడీ పనిచేయాలన్నారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించారు. లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని, ఇది ఎల్లప్పుడూ కొనసాగాలని ఆదేశించారు. అలాగే తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు. టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలని ఆదేశించారు. కాగా తిరుమలలో చంద్రబాబు కేంద్రీకృత వకుళమాత వంటశాలను ప్రారంభించారు. పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున ఔటర్ రింగ్ రోడ్డు పక్కన నిర్మించిన అధునాతనమైన ఈ వంటశాలను సుమారు రూ.13.45 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. 37,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో దీన్ని నిర్మించారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ కొత్త కేంద్రీకృత వంటశాలలో 1.20 లక్షల మంది యాత్రికులకు అన్నప్రసాదాలు అందిస్తారు. సమావేశం కారణంగానే షెడ్యూల్లో మార్పులు..వాస్తవానికి శనివారం ఉదయం 7.35 గంటలకు వకుళమాత వంటశాల ప్రారంభం తర్వాత సీఎం చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంది. అయితే సీబీఐ నేతృత్వంలో ఏర్పాటు కానున్న సిట్ బృందం తిరుమలకు వచ్చి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఆయన టీటీడీ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారని చెబుతున్నారు.టీటీడీ అధికారులు, మార్కెటింగ్ సిబ్బందిని సిట్ ఏమడుగుతుంది? ఏం సమాధానం చెప్పాలి? ఎలా స్పందించాలి? అనే విషయాలపై సీఎం చంద్రబాబు ముఖ్య అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఉన్నతాధికారులు సిబ్బందికి కూడా దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.ఎమ్మెల్యే డిక్లరేషన్‌పై వివాదంచిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ శుక్రవారం శ్రీవారి దర్శనం సందర్భంగా ఇచ్చిన డిక్లరేషన్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్వామి వారి దర్శనానికి వెళ్లే సమయంలో తాను క్రిస్టియన్‌ను అని, శ్రీవారిపై విశ్వాసం ఉందంటూ ఎమ్మెల్యే డిక్లరేషన్ ఇచ్చారు. క్రిస్టియానిటీ తీసుకుంటే.. ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని, బీసీ కేటగిరీలోకి వస్తారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన జీడీ నెల్లూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే థామస్‌పై అనర్హత వేటు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తనకు తానుగా తిరుమలలో క్రిస్టియన్‌గా డిక్లరేషన్ ఇచ్చాక ఎస్సీ రిజర్వేషన్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్నారు. -
టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా సీబీఐ సిట్ విచారణ
-
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సీబీఐ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘సిట్’ను పక్కనపెట్టిన సుప్రీంకోర్టు
-
లడ్డూలో కాదు.. కూటమిలోనే కల్తీ
సాక్షి, విశాఖపట్నం: పవిత్రమైన తిరుపతి లడ్డూను రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారు. వందరోజుల పాలన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు విషరాజకీయాలకు తెరతీశారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేశారంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. రెండు రోజుల తర్వాత.. కల్తీ నెయ్యి అనీ.. మరికొద్ది రోజుల తర్వాత.. లడ్డూలో కలవలేదనీ.. కలవకుండా ఆపేశామంటూ పూటకోమాట మార్చేస్తూ.. భక్తుల మనోభావాలతో రాజకీయ చదరంగమాడారు. దీనిపై నిస్పాక్షికమైన దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు, అండ్ కో చేసిన వ్యాఖ్యలపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాల్లేకుండా.. దేవుడిని రాజకీయాల్లోకి లాగారంటూ మండిపడింది. చేసిన తప్పుడు వ్యాఖ్యల్ని సమరి్థంచుకునేందుకు కూటమి ప్రభుత్వం.. రాష్ట్ర పోలీసులతో సిట్ పేరుతో ఆడాలనుకున్న నాటకాలకు ధర్మాసనం స్వస్తి పలికింది. లడ్డూ వ్యవహారం సీబీఐకి అప్పగించి.. స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కుటిల స్వార్థంతో భగవంతుడిని రాజకీయాల్లోకి లాగారంటూ ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. సుప్రీం నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టులాంటిదని అభిప్రాయపడుతున్నారు. తప్పు జరిగితే దేవుడే చూసుకుంటాడని.. తప్పుడు ఆరోపణలు చేసినా.. ఏడుకొండల వాడు విడిచి పెట్టరంటున్నారు. మతజ్వాలలు రగిలించిన ప్రభుత్వ వ్యవహారంపై చిన్నా పెద్దా తేడాలేకుండా.. యావత్ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. అసలు లడ్డూలో కల్తీ లేదని.. కూటమి ప్రభుత్వం చేసిన విషప్రచారంలోనే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుంటే బావుంటుంది ఈ మధ్య మా మిత్రులతో కలిసి భద్రాచలం వెళ్లాం. అక్కడ ప్రసాదం తినే ముందు సీఎం చంద్రబాబు దుర్బుద్ధితో చేసిన కల్తీ లడ్డూ ప్రకటన గుర్తుచేసుకొని బాధపడ్డాం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఐదుగురితో ఏర్పాటు చేసిన బృందంలో ఏపీకి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులకు బదులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటే బావుంటుంది. సిట్ విచారణ చేయడానికి సుప్రీంకోర్టు కాలపరిమితి విధించాలి. – జీవీఎన్ సంజయ్, సాఫ్ట్ వేర్ ఆపరేషన్ మేనేజర్ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. తెలిసితెలిసి కలియుగ దైవం వేంకటేశ్వరస్వామితో ఆడుకుంటే వారికి మామూలుగా పాపం అంటదు. వంద రోజుల ప్రభుత్వ పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కల్తీ లడ్డూ వివాదం కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. చివరకు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తిరుమల రాకుండా మతం రంగు పులిమి అడ్డు తగిలారు. సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అయింది. –దంతులూరి వెంకట శివ సూర్యనారాయణరాజు, ఎంపీపీ, భీమిలిచంద్రబాబు ప్రకటన ఆవేదనకు గురిచేసింది నేను మూడేళ్ల నుంచి తిరుమల వెంకటరమణమూర్తి గోవింద మాల వేస్తున్నాను. తిరుమల లడ్డూ ప్రసాదం జంతువుల కొవ్వుతో కల్తీ చేశారనే చంద్రబాబు ప్రకటన చాలా ఆవేదనకు గురిచేసింది. ఆధారం లేకుండా ముఖ్యమంత్రిగా ఎలా బహిరంగ ప్రకటన చేశారని చంద్రబాబును సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించిన తర్వాత కాస్త మనసు కుదుటపడింది. దర్యాప్తులో ఏ రాజకీయ పార్టీది తప్పని తేలితే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి. – మజ్జి రవికుమార్, తిరుమల గోవింద మాలధారుడుచంద్రబాబును బహిష్కరించాలి హిందూ ధర్మ పరిరక్షణే మూల సిద్ధాంతంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం బీజేపీ మెజార్టీ హిందువుల ఓట్లతో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా చంద్రబాబు తిరుపతి లడ్డూపై వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తిని ఎన్డీఏ కూటమి నుంచి బహిష్కరించాలి. సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిజాయితీగా దర్యాప్తు చేయాలలి– వాసు, జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ఫైవ్మెన్ కమిటీని స్వాగతిస్తున్నా.. తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు స్వాగతిస్తున్నాం. విచారణకు సంబంధించి ఫైవ్‌మెన్ కమిటీతో నిజాలు బయటపడతాయన్న ఆశ ఉంది. కోట్లాది మంది హిందువులు..శ్రీవారి భక్తుల మనోభావాలను చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ దెబ్బతీశారు. సనాతన ధర్మం కోసం పవన్‌కల్యాణ్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. – వాసుపల్లి గణేష్‌కుమార్, వైఎస్సార్సీపీ దక్షిణ సమన్వయకర్తశివుడు కూడా సహించడు తిరుపతి వెంకన్న లడ్డూ్డ అంటే అది దివ్యప్రపాదం. ఒకసారి స్వామికి నివేదించాక అది అమృతం కన్నా గొప్పది. దేవతలు మనంపెట్టే నైవేద్యాలను ఆఘ్రాణ రూపంగా ఆరగిస్తారని శా్రస్తాలు చెపుతాయి. అటువంటి గొప్ప ప్రసాదం మీద కల్తీ అనే అపవాదు వ్యాపింపజేయడం గొప్ప అపచారం. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా సమయోచితంగా స్పందించింది. పరమ పవిత్రమైన లడ్డూపై జరిగిన దు్రష్పచారాన్ని చంద్రచూడుడు (శివుడు) మాత్రం సహిస్తాడా?? – బులుసు వేంకటేశ్వర్లు, ప్రముఖ పద్యకవి, తగరపువలసబాబు ఆరోపణలు తగవు తిరుమల లడ్డూ విషయంలో వైఎస్సార్ సీపీ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని ఆది నుంచి కోరింది. సుప్రీంకోర్టు కూడా ఫైవ్‌మెన్ కమిటీతో విచారణ చేపట్టాలని ఆదేశించింది. స్వతంత్ర దర్యాప్తుతోనే వాస్తవాలు బయటకు వస్తాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విషయంపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. – గొలగాని హరి వెంకటకుమారి, విశాఖ నగర మేయర్నిజం నిగ్గు తేలుతుంది రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌పై హిందువులెవరికీ నమ్మకం లేదు. ఒక స్వతంత్ర ఏజెన్సీ ద్వారా దర్యాప్తు జరపాలని వైఎస్సార్సీపీ తొలి నుంచి డిమాండ్ చేస్తోంది. శ్రీవారి లడ్డూపై వచ్చిన ఆరోపణలపై నిజనిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను యావత్ హిందువులు స్వాగతిస్తున్నారు. మాపార్టీ నుంచి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సు్రíపీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు చేయించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నాం. – గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, విశాఖ -
‘బాబు సిట్’ను పక్కన పెట్టిన ‘సుప్రీం..’ ఇక 'సీబీఐ సిట్'
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చైర్పర్సన్ నామినేట్ చేసిన ఓ అధికారి ఉంటారు. ఈ సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతమాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోం. రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోము.– సుప్రీంకోర్టు సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున ఈ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తద్వారా దర్యాప్తు విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు తామే ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సిట్‌లో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చైర్పర్సన్ నామినేట్ చేసిన ఓ అధికారికి స్థానం కల్పించింది. ఈ సిట్ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతమాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోమంది. రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ కల్పతి వెంకటరామన్ విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో నెయ్యి కల్తీపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను పరిÙ్కరిస్తున్నట్లు ప్రకటించింది. స్వతంత్ర దర్యాప్తు కోసం వైవీ తదితరుల పిటిషన్లు... తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత డాక్టర్ సుబ్రమణియన్ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఇతర రాష్ట్రాలకు చెందిన సంపత్, శ్రీధర్, సురేష్ చవంకే వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. నెయ్యిలో జంతు కొవ్వులు కలిపారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన రాజకీయ ప్రకటనలపై అసహనం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా?లేక స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చెప్పాలని సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతాను ఆదేశించిన విషయం తెలిసిందే. పత్రికా కథనాలను పట్టించుకోకండి.... తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా తుషార్ మెహతా స్పందిస్తూ.. ఇది దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారమని పేర్కొనగా.. ధర్మాసనం స్పందిస్తూ, దేశం కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలకు సంబంధించిందని తెలిపింది. ఈ వ్యవహారంలో ఆహార భద్రత కూడా ముడిపడి ఉందని ధర్మాసనం పేర్కొంది. తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు వ్యతిరేకం కాదని, అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు జరగడం సబబుగా ఉంటుందని మెహతా చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేయిస్తే అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్లు తాము పత్రికల్లో చదివామని గుర్తు చేసింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ పత్రికలు చాలా రాస్తున్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. టీటీడీ ఈవో చెప్పిన వాస్తవాలను వక్రీకరించాయని లూథ్రా తెలిపారు. దర్యాప్తు విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని కోర్టు పర్యవేక్షించినా కూడా ఇబ్బంది లేదని నివేదించారు. సీఎం వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశమే లేదు... ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుంటూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు నిష్పాక్షికంగా ఉండేందుకు అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా సిట్ దర్యాప్తు ఉండబోదని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు ఓ విలువ ఉంటుందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఖచ్చితంగా సిట్ దర్యాప్తుపై ప్రభావం చూపుతాయన్నారు. ఈ సమయంలో ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకుంటూ 100 రోజుల పాలనపై ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పారు. ఆయన మాట్లాడిన సందర్భం వేరన్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) జూలైలో నివేదిక ఇచ్చిందన్నారు. దాని ఆధారంగా ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. జూలైలో నివేదిక వస్తే ముఖ్యమంత్రి సెపె్టంబర్లో ఎందుకు మాట్లాడారని ప్రశ్నించింది. ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించింది. దీనిపై సిబల్ జోక్యం చేసుకుంటూ.. ఎన్డీడీబీ తన నివేదికలో ఎక్కడా జంతు కొవ్వు కలిసినట్లు చెప్పలేదని, వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉన్నట్లు చెప్పిందని నివేదించారు. అయితే ఇందుకు విరుద్ధంగా జంతు కొవ్వు అంటూ ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. కల్తీ నెయ్యిని కొండపైకి ఎందుకు అనుమతించారు..? అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. జూలై 6, 12వ తేదీల్లో వచ్చిన ట్యాంకులను వెనక్కి పంపామని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో అసలు ఉపయోగించలేదని టీటీడీ ఈవో పలుమార్లు చెప్పారని గుర్తు చేసింది. మరి అలాంటప్పుడు కల్తీ జరిగిందని దేని ఆధారంగా చెబుతున్నారని ప్రశ్నించింది. ఆ రెండు తేదీల్లో వచ్చిన ట్యాంకర్లలో కల్తీ నెయ్యి ఉందని లూథ్రా పేర్కొనగా.. అలాంటప్పుడు కల్తీ నెయ్యిని కొండపైకి ఎందుకు అనుమతించారని సిబల్ ప్రశ్నించారు. అప్పుడు అధికారంలో ఉన్నది తాము కాదని, మీరేనని ఆయన లూథ్రాకు గుర్తు చేశారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ స్వతంత్ర దర్యాప్తు అవసరమని, తద్వారా కోట్ల మంది భక్తుల్లో విశ్వాసం కలిగించినట్లు అవుతుందని తెలిపింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను పక్కనబెట్టి తామే ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేస్తూ ఆ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. రాజకీయ పోరాటాలకు వేదికగా చేసుకునేందుకు అనుమతించం... ‘మేం ఆరోపణలు, ప్రత్యారోపణల జోలికి వెళ్లడం లేదు. ఇక్కడ మేం ఓ విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాం. కోర్టును రాజకీయ పోరాటాలకు వేదికగా వాడుకునేందుకు అనుమతించం. కోట్ల మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటూ.. వారికి ఉపశమనం కలిగించేందుకు వీలుగా సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన స్వతంత్ర సిట్‌ను దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రత్యేక సిట్ దర్యాప్తు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ స్థానంలో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీబీఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్పర్సన్ సిఫారసు చేసిన ఓ అధికారి ప్రత్యేక సిట్‌లో ఉంటారు’ ధర్మాసనం ఉత్తర్వుల సారాంశం ఇదీ..‘జూలై 6, 12వ తేదీల్లో రెండు ట్యాంకర్లలో సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లోని ఆరోపణల ప్రకారం కల్తీ అయిన నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వినియోగించినట్లు చెప్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనసులను గాయపరిచినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. నెయ్యి కల్తీపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా? లేక స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలా? అనే విషయంపై కేంద్ర హోంశాఖతో సంప్రదించి ఏ విషయం మాకు చెప్పాలని గత విచారణ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లోని సభ్యులు సీనియర్ అధికారులని, వారికి మంచి పేరు ఉందని మెహతా ఈ రోజు మాకు చెప్పారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా దర్యాప్తును కొనసాగించాలని, అయితే ఆ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యవేక్షిస్తారని ఆయన మాకు నివేదించారు’ -
సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా
బెంగళూరు: కర్ణాటకలో మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్కాంలో సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించిన ముడా స్కాంలో సిద్ధరామయ్య అవకతవకు పాల్పడ్డారని, ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ తరుణంలో సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. అదే సమయంలో తన మిత్రపక్షమైన బీజేపీపై సైతం విమర్శలు గుప్పించారు. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో మంత్రా అని ప్రశ్నించారు. Mr. @siddaramaiah..Ughe Ughe to your 'Sidvilasa'Then: To escape from scams, you build a 'samadhi' for Lokayukta and formed ACB!Now: The same Lokayukta is a place you found to get rid of 'Mudahagaran'!!Isn't it Karma Mr siddaramaiah?ACB was also dismissed by the High Court…— ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | H.D.Kumaraswamy (@hd_kumaraswamy) September 27, 2024మోదీ కేబినెట్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి.. ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య స్వయం ప్రతిపత్తి వ్యవస్థ లోకాయుక్తపై ఆంక్షలు విధించి..అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఆయన ఎత్తి చూపారు.కర్మ సిద్ధాంతం అంటే ఇదేగతంలో లోకాయుక్తాకు బదులు ఏసీబీని ఏర్పాటు చేయాలని సీఎం సిద్ధరామయ్య అనుకున్నారు. కానీ 2022లో హైకోర్టు రాష్ట్రంలో లోకాయుక్త లేదంటే ఏసీబీ ఏదో ఒకటి ఉండాలని తీర్పు ఇచ్చింది. దీనిపై కుమారస్వామి స్పందిస్తూ.. ఇది కర్మ కాదా..సిద్ధరామయ్య. లోకాయుక్త వద్దనుకున్నారు. ఇప్పుడు మీరు వద్దనుకున్న లోకాయుక్త ఆధ్వర్యంలో ముడా స్కామ్‌లో విచారణ ఎదుర్కోనున్నారు అంటూ సెటైర్లు వేశారు. చదవండి : ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యాకు చిక్కులు -
సీబీఐ విచారణ.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కాం కేసులో సీఎం సిద్దరామయ్య విచారణను ఎదుర్కొనున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణను అనుమతిస్తూ గతంలో మంజూరు చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయించింది.కుంభకోణం కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. సీఎంపై సీబీఐ విచారణను నిరోధించడానికే కాంగ్రెస్ సర్కార్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే సీబీఐ పక్షపాతంగా వ్యవహరించడం వల్లే ఈ నిర్ణయం తీసుకునన్నట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. సీఎం సిద్దరామయ్య ఎదుర్కొంటున్న భూ కుంభకోణం ఆరోపణలకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘కేంద్ర దర్యాప్తు సంస్థ దుర్వినియోగానికి గురవుతోంది. పక్షపాతంతో వ్యవహరిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని తెలిపారు. కాగా ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. గవర్నర్ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది. కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించింది.అనంతరం ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 24 లోగా విచారణ నివేదికను కోర్టుకు అందజేయాలని పోలీసులకు సూచించింది.ఇదిలా ఉండగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం.. రాష్ట్రంలో నేర పరిశోధనలను స్వేచ్ఛగా నిర్వహించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు(సీబీఐ) ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. -
కోల్‌కతా ఘటన.. సీబీఐ విచారణకు టీఎంసీ ఎమ్మెల్యే
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ సోమవారం సీబీఐ ఎందుట హాజరయ్యారు. పానిహతి ఎమ్మెల్యేఘోష్ ఈ ఉదయం 10.30 గంటలకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.అయితే ఆర్జి కర్ ఆసుపత్రి ఘటనపై విచారణకు ఆయన్ను పిలిపించామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. వైద్యురాలి మరణం తర్వాత అంత్రక్రియలను తొందరపాటుగా ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా వైద్యురాలిపై హత్యాచారం అనంతరం మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిర్మల్ ఘోష్ జోక్యం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు సమన్లు జారీ చేయగా.. నేడు విచారణకు హాజరయ్యారు.చదవండి: మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో రాదో కానీ..: నితిన్ గడ్కరీ -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి 4,500 ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు తేలింది. వాటిల్లో కాంగ్రెస్‌కు చెందిన 190 మంది ఫోన్లు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వారిలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు సోదరులు, మిత్రులు, అనుచరులు సైతం ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్‌లో 80 శాతానికిపైగా ఎయిర్టెల్ కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్ డేటాను ధ్వంసం చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. మరోవైపు ఫోన్ టాపింగ్ వ్యవహారం దర్యాప్తులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మీడియా ఛానెల్ నిర్వాహకుడు అరువెల శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు వారిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సీబీఐ అనుమతిచ్చింది. రెడ్ కార్నర్ నోటీసు కోసం హైదరాబాద్ పోలీసులు పంపిన నివేదికను సమ్మతించిన సీబీఐ.. ఇంటర్ పోల్‌కు లేఖ రాసింది.చదవండి : మీ పాలనకో దణ్ణం చంద్రబాబు -
ఆర్జీ కర్ ఆస్పత్రి మెడిసిన్ కొనుగోళ్లలో భారీ లోపాలు: సీబీఐ
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులు దర్యాప్తు సంస్థ సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. సందీప్ ఘోష్ ప్రన్సిపల్గా ఉన్న సమయంలో ఆస్పత్రిలో పేషెంట్లకు అందించే మెడిసిన్ కొనుగోళ్ల వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని సీబీఐ తాజాగా పేర్కొంది. బయటి ఏజెన్సీల నుంచి ఔషధాలను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా బిడ్డర్లను సాంకేతికంగా పరిశీలన చేసే కీలకమైన అంశాన్ని విస్మరించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. పేషెంట్ల ఆరోగ్యం బిడ్డర్లు సప్లై చేసే నాణ్యమైన మెడిసిన్‌పై అధారపడి ఉంటుంది. అయితే.. ఈ క్రమంలో బిడ్డర్ల సాంకేతిక పరిశీలిన చాలా ముఖ్యమైన అంశం. కానీ.. రెండు దశల్లో పూర్తి చేసుకోవల్సిన సాంకేతిక పరిశీలనను కేవలం ఒక దశ తర్వాతే బిడ్డర్లకు కాంట్రాక్ట్ అప్పగించనట్లు పలు డాక్యుమెంట్లపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు వెల్లడించారు. బిడ్డర్లు మొదటి దశ పరిశీలనలో అర్హత సాధించకపోయినా రెండోదశకు అనుమతించి మరీ కాంట్రాక్టు అప్పగించినట్లు సీబీఐ పేర్కొంది. అదే విధంగా ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే మెడిసిన్ నాణ్యత విషయంలో పీజీ ట్రైనింగ్ డాక్టర్లు ఎన్నిసార్లు సందీప్ ఘోస్ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోలేదని సీబీఐ తెలిపింది. మరోవైపు.. కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంలో నిర్లక్ష్యం కారణంగా సందీప్ ఘోష్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక.. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌తో పాటు సందిప్ ఘోష్‌కు కూడా సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే.చదవండి: కోల్‌కతా కేసు: 25 దాకా ‘ఘోష్’ సీబీఐ కస్టడీ పొడిగింపు -
అపవాదు వేస్తారా?
న్యూఢిల్లీ: బెంగాల్ న్యాయవ్యవస్థ మీద అపవాదులు మోపడం సరికాదంటూ సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐని మందలించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస కేసులను బెంగాల్ బయటికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును సీబీఐ గత డిసెంబరులో కోరింది. ‘‘లేదంటే సాక్షులను భయపెట్టే అవకాశముంది. బెంగాల్ కోర్టులలో శత్రుత్వభావంతో కూడిన వాతావరణం నెలకొంది’’ అని పేర్కొంది. దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కేసుల బదిలీకి ఇదేం ప్రాతిపదిక? మొత్తం న్యాయవ్యవస్థపైనే అపవాదు వేస్తారా? బెంగాల్ కోర్టులన్నింటిలోనూ విరో«ధభావం నెలకొందన్నట్లుగా చూపుతున్నారు. ఒక రాష్ట్రంలోని న్యాయమూర్తులను సీబీఐ అధికారులు ఇష్టపడనంత మాత్రాన మొత్తం న్యాయవ్యవస్థే పనిచేయడం లేదనకండి. జిల్లా జడ్జిలు, సివిల్ జడ్జిలు, సెషన్స్ జడ్జిలు తమను తాము సమరి్థంచుకోవడానికి సుప్రీంకోర్టు దాకా రాలేరు’’ అని సీబీఐ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజును ఉద్దేశించి పేర్కొంది. పిటిషన్లో వాడిన పదజాలాన్ని ఆయన సమరి్థంచుకోనే ప్రయత్నం చేశారు. కోర్టులపై అపవాదు వేసే ఉద్దేశం తమకు లేదని పేర్కొంటూ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. -
సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. న్యాయవ్యవస్థపై నిందలా?
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో 2021 ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల తర్వాత జరిగన హింసకు సంబంధించిన కేసులను ఆ రాష్ట్రం వెలుపలకు (బెంగాల్ కాకుండా) బదిలీ చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ చేసిన అభ్యర్థనపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. కాగా ఎన్నికల తర్వాత హింసకు సంబంధించిన కేసు దర్యాప్తును కల్‌కతా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే సాక్షులను బెదిరించే అవకాశం ఉందన్న కారణంతో ఈ 45 కేసులను బెంగాల్ నుంచి మరోరాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సీబీఐ గతేడాది డిసెంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో నేడు విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం.. బెంగాల్‌లోని మొత్తం న్యాయవ్యవస్థపై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై తప్పుపట్టింది. సీబీఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ఉద్దేశించి బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బదిలీ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించింది.‘మిస్టర్ రాజు.. బెంగాల్‌లోని అన్ని కోర్టులు ఘర్షణ వాతావరణంలో ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఎటువంటి ఆధారాలు ఈ పిటిషన్లో ప్రస్తావించారు? విచారణలు సక్రమంగా జరగడం లేదని, అక్రమంగా బెయిళ్లు ఇస్తున్నాయని ఆరోపణలు చేశారు. న్యాయ వ్యవస్థ మొత్తం ఘర్షణ వాతావరణంలో పని చేస్తోందనేలా పిటిషన్ ఉంది. మీ అధికారులకు (సీబీఐ) జ్యుడీషియల్ అధికారులంటే ఇష్టం లేకపోవచ్చు. కానీ అలాంటి ప్రకటనలు చేయవద్దు’ అని సీబీఐకి సూచించింది.ఈ పిటిషన్ ధిక్కార నోటీసుకి తగిన కేసని.. న్యాయవాదికి సమన్లు జారీ చేస్తామని సుప్రీం ధర్మాసనం బెదిరించింది. అయితే న్యాయవ్యవస్థపైన చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా లేవని ఏఎస్జీ రాజు చెప్పారు. పిటిషన్ రాతలో కొంత లోపం ఉన్నట్లు అంగీకరించి క్షమాపణలు కోరవడంతో కోర్టు తీవ్ర చర్యలు తీసుకోలేదు. అనంతరం పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమంతించింది. దీంతో కొత్త పిటిషన్‌ను సమర్పిస్తామని ఎస్పీ రాజు కోర్టుకు తెలపడంతో పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. -
ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అమెరికాలో ఉన్న ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ రాసింది.తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ప్రభాకర్‌రావు ఉన్న సంగతి తెలిసిందే. ఎస్ఐబీ మాజీ చీఫ్ అయిన ప్రభాకర్‌రావు.. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన టైంలోనే విదేశాలకు వెళ్లిపోయారు. విచారణ నిమిత్తం రావాలన్నా.. సహకరించడం లేద దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతి ఇచ్చింది. తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, విచారణ నుంచి తనకు ఊరట కావాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ.. నాంపల్లి కోర్టు అందుకు అనుమతించలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సిట్, తెలంగాణ సీఐడీ సాయంతో సీబీఐని ఆశ్రయించింది. దీంతో.. జాతీయ దర్యాప్తు సంస్థ రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతించింది. ప్రభాకర్‌రావుతో పాటు ఐన్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్‌పైనా రెడ్ కార్నర్ నోటీసులకు అనుమతి జారీ చేసింది. త్వరలో ఇంటర్‌పోల్ వీళ్లిద్దరినీ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. అదే జరిగితే.. వాళ్లను భారత్‌కు రప్పించడం సులువు అవుతుంది. -
కోల్‌కతా డాక్టర్ కేసు: కుట్ర కోణంలో సీబీ‘ఐ’ దర్యాప్తు!
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ అధికారులు బుధవారం(సెప్టెంబర్18) కీలక విషయాలు వెల్లడించారు. హత్యాచారం సమయంలో కేసులో ప్రధాన నిందితుడు సంజయ్రాయ్ ధరించిన దుస్తులను కోల్‌కతా పోలీసులు ఆలస్యంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.హత్య జరిగిన రోజు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ సెమినార్‌హాల్‌లోకి నిందితుడు సంజయ్రాయ్ వస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా కేసులో సంజయ్రాయ్ ప్రధాన నిందితుడని హత్య జరిగిన మరుసటి రోజే స్పష్టమైంది. అయినా హత్య సమయంలో రాయ్ ధరించిన దుస్తులను సీజ్ చేసేందుకు కోల్‌కతాలోని తాలా పోలీస్‌స్టేషన్ పోలీసులకు రెండు రోజులు పట్టింది. ఒకవేళ హత్యాచారం జరిగిన మరుటిరోజే రాయ్ దుస్తులను సీజ్ చేసి ఉంటే మరిన్ని కీలక ఆధారాలు లభించి ఉండేవి’అని సీబీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్‌రాయ్‌తో పాటు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్, తాలా మాజీ సీఐ అభిజిత్ మండల్‌ను సీబీఐ ఇప్పటివరకు అరెస్టు చేసింది. అయితే వీరు విచారణలో సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తెలిపింది.రాయ్,ఘోష్,మండల్లు కుట్ర చేశారా..? సీబీఐ కూపీ..!మహిళా డాక్టర్ హత్యాచారంలో సంజయ్ రాయ్, ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ఘోష్, తాలా పీఎస్ సీఐ మండల్ మధ్య కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ సీబీఐ కూపీలాగుతున్నట్లు తెలుస్తోంది. హత్యకు ముందు వీరు ముగ్గురి మధ్య ఏమైనా ఫోన్‌కాల్స్ నడిచాయా అన్నకోణంలోనూ శోధిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు9 తెల్లవారుజామున కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో సెమినార్‌హాల్‌లో నిద్రపోతున్న మహిళా ట్రైనీ డాక్టర్‌పై లైంగికదాడి చేసి హత్యచేశారు. ఈ కేసును తొలుత కోల్‌కతా తాలా పీఎస్ పోలీసులు దర్యాప్తు చేయగా హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతలను ఐదు రోజుల తర్వాత సీబీఐ తీసుకుంది. కేసు దర్యాప్తును స్వయంగా సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుండడం గమనార్హం. ఇదీ చదవండి.. కోల్‌కతా సీపీగా మనోజ్‌వర్మ -
‘సీఎం మమత చర్యలు తీసుకొని ఉంటే.. నా బిడ్డ బతికేది’
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించి.. బాధితురాలికి న్యాయం చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడారు. తన కూతురికి జరిగిన దారుణ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ల డాక్టర్లు తన బిడ్డలలాంటి వారని అన్నారు. సీఎం మమతా బెనర్జీ 2021లోనే మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై చర్యలు తీసుకొని ఉంటే.. ఇవాళ తన కుమార్తె బతికే ఉండేదని అన్నారు.‘‘ సీబీఐ తన పని తాను చేస్తోంది. సీబీఐ విచారణ గురించి నేను ఏం మాట్లాడలేను. ఈ హత్యతో సంబంధం ఉన్నవాళ్లు, సాక్ష్యాలను తారుమారు చేసిన వారందరూ విచారణలో ఉన్నారు. తీవ్రమైన బాధతో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారంతా నా పిల్లలలాంటి వారు, వారిని చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. నిందితులకు శిక్ష పడిన రోజు మనం విజయం సాధించినట్టు. 2021లో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పుడే సందీప్ ఘోష్‌పై ముఖ్యమంత్రి మమత బెనర్జీ చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు నా కూతురు బతికే ఉండేది’’ అని అన్నారు."My daughter would have been alive...": RG Kar Medical College victim's father#RGKarMedicalCollege #victimfather #RGKarMedicalCollegecase #kolkataincident #newsupdate #CareForElders #StopInjustice #राष्ट्रीय_बेरोजगार_दिवस #Iran pic.twitter.com/XovHWLcdTU— The Savera Times (@thesavera) September 18, 2024credits: The Savera Timesమరోవైపు.. ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కోల్‌కతా పోలీసు కమిషనర్‌పై వేటు వేయాలన్న వైద్యుల డిమాండ్‌ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం అంగీకరించింది. అనంతరం కోల్‌కతా కొత్త పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డాక్టర్ల ప్రతినిధి బృందం మధ్య జరిగిన సమావేశం అనంతరం జూడాల డిమాండ్‌కు అనుకూలంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ జూనియర్ డాక్టర్లు ఇంకా తమ సమ్మెను విరమించకపోవటం గమనార్హం.చదవండి: జడ్జి వేధింపులు?.. ఎస్సై ఆత్మాహత్యాయత్నం -
అబద్ధాల పుట్ట సందీప్ ఘోష్.. అభయ కేసు దర్యాప్తుపై సీబీఐ అధికారులు
కోల్‌కతా : ఆర్జీ కార్ ఆస్పత్రి అభయ కేసు విచారణలో సీబీఐ కీలక విషయాల్ని వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ అధికారులు పాలిగ్రాఫ్ టెస్ట్, లేయర్డ్ వాయిస్ అనాలసిస్ పరీక్షల్లో సైతం అన్నీ అబద్ధాలు చెప్పినట్లు తేలిందని సీబీఐ అధికారులు వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL) నుండి వచ్చిన రిపోర్ట్ సైతం సందీప్ ఘోష్ చెప్పిన సమాధానాలు మోసపూరితంగా ఉన్నట్లు పీటీఐ సైతం నివేదించింది.అభయ కేసు విచారణలో సీబీఐ అధికారులు పలు కీలక విషయాల్ని వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆ వివరాల మేరకు.. ఆగస్టు 9న ఆర్జీ కార్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యురాలిపై దారుణం జరిగినట్లు సందీప్ ఘోష్‌కు ఉదయం 9.58 గంటలకు సమాచారం అందింది. కానీ సందీప్ ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో బాధితురాలి స్నేహితులు, తోటి జూనియర్ డాక్టర్లు విమర్శలు చేయడంతో ఆ తర్వాత జరిగిన ఘటనకు.. ఏ మాత్రం సంబంధం లేకుండా ఫిర్యాదు చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.హత్య జరిగితే.. ఆత్మహత్య అని ఎలా అంటారు?అదే సమయంలో ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పిన విషయాన్ని సీబీఐ అధికారులు ప్రస్తావించారు. బాధితురాలి దుస్తులు, ఆమె శరీరంపై గాయాలు ఆత్మహత్య అని ఎలా నిర్ధారిస్తారు అని దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేయడం ఎందుకు ఆలస్యమైంది?అభయ ఘటనపై సందీప్ ఘోష్ ఆగస్టు 9 ఉదయం 10.03 గంటలకు తాలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి (ఓసీ) అభిజిత్ మోండల్‌తో సంప్రదించగా.. ఉదయం 11.30 గంటలకు అసహజ మరణం కేసు నమోదు చేశారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇదే అంశంపై సీబీఐ అధికారులు మోండల్‌ను అరెస్ట్ చేశారు. జనరల్ డైరీ ఎంట్రీలో ఇలాజనరల్ డైరీ ఎంట్రీ 542 ప్రకారం.. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో వైద్యురాలు అచేతనంగా పడి ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ అప్పటికే బాధితురాలిని పరిశీలించిన ఆమె సహచర జూనియర్ డాక్టర్ మరణించినట్లు నిర్ధారించారు. సాక్ష్యాలన్నీ నాశనంఆసుపత్రి అధికారులు, నిందితులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలను ప్రస్తావిస్తూ జనరల్ డైరీలో వివరాలు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో మోండల్ జాప్యం చేయడం, నేరం జరిగిన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై కీలకమైన సాక్ష్యాలు దెబ్బతిన్నాయని సీబీఐ అధికారులు తెలిపారు.బాధితురాలి ఘటనపై ఆలస్యంగా స్పందించిన పోలీసులు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీ ఆధారంగా తెల్లవారు జామున 4.03 గంటలకు నిందితుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్లో ఉన్న అభయ గదిలోకి వెళ్లినట్లు గుర్తించారు. అంనతరం, అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. -
Kolkata Horror: సందీప్ ఘోష్‌పై సీబీఐ సంచలన ఆరోపణలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యచార ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తలా పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో అభిజిత్ మండల్‌లను మూడు రోజుల(సెప్టెంబర్ 17) వరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ఇద్దరిని ఆదివారం స్థానిక కోర్టులో హాజరుపరిచిన సీబీఐ.. సందీప్ ఘోష్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. వైద్యురాలిపై హత్యాచారం ఘటనను ఆత్మహత్యగా చూపించడానికి ప్రయత్నించాడని పేర్కొంది. ఇది నేరాన్ని తక్కువ చేసి చూపడంతోపాటు సాక్ష్యాలను నాశనం చేయడానికి దారి తీసిందని తెలిపింది.కాగా ఆర్జీ కర్ వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవలకు సంబంధించి ఈనెల 2న సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలను ఆ తర్వాత ఆయనపై నమోదు చేసింది. ఈ కేసులో తలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి అభిజిత్ మోండల్‌ను కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.కోర్టుకు సీబీఐ సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం.. మహిళా వైద్యురాలిపై హత్యాచారం విషయంపై ఆగస్టు 9న ఉదయం 9.58 గంటలకు సందీప్‌ఘోష్‌కు సమాచారం అందింది. అయితే ఆయన వెంటనే ఆసుపత్రిని సందర్శించలేదు. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. అదే విధంగా కేసు విచారణలో సందీప్‌ఘోష్ మోసపూరిత సమాధానాలు ఇస్తున్నారని సీబీఐ పేర్కొంది.ఆయనకు పాలీగ్రాఫ్ టెస్టు, వాయిస్ అనాలిసిన్ నిర్వహించగా.. కీలకమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఈ టెస్టుల్లో ఆయన ఇచ్చిన సమాధానాలు మోసపూరితమైనవని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక ఇచ్చినట్లు తెలిపారు.బాధితురాలి ఒంటిపై గాయాలు ఉన్నప్పటికీ.. ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. తమ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆసుపత్రి నుంచి వచ్చిన ఫోన్ కాల్ కూడా వచ్చిందని వైద్యుల తల్లిదండ్రులు తెలిపినట్లు చెప్పింది. ఈ ఘటన వెలుగుచూసిన అనంతరం ఘోష్, అభిజిత్ మోండల్‌తోపాటు ఓ లాయర్‌తో టచ్‌లో ఉన్నారని తెలిపింది.బాధితురాలి తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా మాజీ ప్రిన్సిపాల్ వారిని కలవలేదని, ఘటన అనంతరం వైద్యపరమైన విధివిధానాలను సకాలంలో పూర్తి చేయడంలో డాక్టర్ ఘోష్ విఫలమయ్యారని తెలిపింది. వెంటనే మృతదేహాన్ని మార్చురీకి పంపాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించినట్లు సీబీఐ కోర్టుకు పేర్కొంది. అంతేకాక ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో మండల్‌కు సందీప్ సూచనలు చేసినట్లు కోర్టులో సీబీఐ తెలిపింది. ఘోష్, మండల్లు కలిసి నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని పేర్కొంది. -
కోల్‌కతా కేసు: సందీప్ ఘోష్, అభిజిత్ సంభాషణపై అనుమానాలు!
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తోపాటు తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోండల్‌ను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. తాజాగా ఈ ఇద్దరిని దర్యాప్తు సంస్థ సీబీఐ ఆదివారం స్థానిక కోర్టులో హాజరుపర్చింది. హత్యాచార ఘటన జరిగిన గంటల వ్యవధితో సందీప్ ఘోష్.. అభిజిత్ మోండల్‌తో మాట్లాడారని సీబీఐ కోర్టుకు వెళ్లడించింది. ఈ కేసుతో వీరికి సంబంధం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది.వారిని విచారించాలని అసవరం ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో కోర్టు వారిని సీబీఐ కస్టడీలో భాగంగా రిమాండ్లకు ఆదేశించింది. ఈ కేసును కోర్టు సెప్టెంబర్ 17వరకు వాయిదా వేసింది.‘‘ఈ కేసులో రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయింది. మేము సేకరించిన కాల్ రిక్డార్డుల ప్రకారం ఘటన జరిగిన గంటల వ్యవధితో సందీప్ ఘోష్, మండల్ మాట్లాడుకున్నారు. ఈ ఘటనలో వారికి సంబంధం ఉన్నట్లు అనుమానం ఉంది. ఈ కేసులో నిజాలు వెలికితీయాలంటే వారిని విచారించాలి. బెంగాల్ పోలీసులకు, సీబీఐకి మధ్య విభేదాలు లేవు. మేము నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాం. మాకు మోండల్ ఓ పోలీసు అధికారిగా కనిపించటం లేదు.. ఆయన మాకు ఒక అనుమానితుడిగా కనిపిస్తున్నారు. హత్యాచారం కేసులో మోండల్ కాదు.. కానీ ఈ కేసులో నిజాలు కప్పిపుచ్చే పెద్ద కుట్రలో పాత్ర పోషించి ఉండవచ్చని అనుమానం కలుగుతోంది’ అని సీబీఐ కోర్టుకు వివరించింది. హత్యాచార ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం, విచారణలో సరైన సమాధానాలు చెప్పకపోవడం వంటి కారణాలతో తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోండల్ సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు.. ఇప్పటికే ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆర్థిక అవకతవకల పాల్పడిన కేసులో సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా హత్యాచార ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలను సీబీఐ సందీప్‌పై మోపింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు.చదవండి: ‘టీ’ తాగాలంటూ దీదీ ఆహ్వానం.. వద్దని ఖరాఖండిగా చెప్పిన డాక్టర్లు -
సాక్ష్యాలను నాశనం చేశారు
కోల్‌కతా: దేశవ్యాప్త ఆగ్రహావేశాలకు, ఆందోళనలకు కారణమైన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఉదంతం శనివారం కీలక మలుపు తిరిగింది. ఆర్.జి.కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఈ దారుణం జరిగిన సమయంలో ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్ సాక్ష్యాధారాలను నాశనం చేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆస్పత్రి నిధుల దురి్వనియోగం కేసులో ఆయన ఇప్పటికే జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. సాక్ష్యాలను నాశనం చేయడం, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యంతో పాటు కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయతి్నంచారని ఘోష్‌పై అభియోగాలు మోపింది. ఇవే అభియోగాలపై స్థానిక తలా పోలీసుస్టేషన్ సీఐ అభిజిత్ మండల్‌ను కూడా అరెస్టు చేసింది. ఆర్.జి.కర్ ఆసుపత్రి తలా పోలీసుస్టేషన్ పరిధిలోకే వస్తుంది. అభిజిత్ మండల్‌ను శనివారం సీబీఐ తమ కార్యాలయంలో కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో మండల్‌ను అరెస్టు చేసింది. అతన్ని ప్రశ్నించడం ఇది ఎనిమిదోసారి అని. ప్రతిసారీ మండల్ భిన్నమైన కథనం చెబుతున్నాడని సీబీఐ వర్గాలు తెలిపాయి. సందీప్ ఘోష్‌ను కస్టడీ కోరుతూ సీబీఐ న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. సీబీఐ కస్టడీ నిమిత్తం ఘోష్‌ను హాజరుపర్చాల్సిందిగా కోర్టు జైలు అధికారులను ఆదేశించిందని సీబీఐ అధికారి ఒకరు శనివారం తెలిపారు. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్ హాల్లో శవమై కని్పంచడం తెలిసిందే. ఆమెపై పాశవికంగా అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఒక రోజు అనంతరం ఆస్పత్రిలో పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణంపై వైద్యలోకం భగ్గుమంది. దీనివెనుక చాలామంది ఉన్నారని, ఆ వాస్తవాలను తొక్కిపెట్టేందుకు మమత సర్కారు ప్రయతి్నస్తోందని డాక్టర్లు ఆరోపించారు. వైద్యశాఖ కీలక డైరెక్టర్లు, కోల్‌కతా పోలీసు కమిషనర్ తదితరుల రాజీనామా కోరుతూ పశి్చమ బెంగాల్ వ్యాప్తంగా నిరసనలతో వైద్యులు హోరెత్తిస్తున్నారు. అనంతర పరిణామాల్లో కేసు దర్యాప్తును సీబీఐకి కలకత్తా హైకోర్టు అప్పగించింది. దర్యాప్తు పురోగతిపై మూడు వారాల్లోగా నివేదిక సమరి్పంచాల్సిందిగా ఆదేశించింది. ఆ మేరకు సెపె్టంబర్ 17లోగా దర్యాప్తు సంస్థ నివేదిక సమరి్పంచనుందని సమాచారం. ఘోష్‌కు నేరగాళ్లతో లింకులు వైద్యురాలిపై దారుణం జరిగిన మర్నాడే సందీప్ ఘోష్ హడావుడిగా ఆస్పత్రిలో మరమ్మతులకు ఆదేశాలు జారీ చేసినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఆ మేరకు ఘోష్ ఆదేశాలిచి్చ న లేఖను కూడా బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ కేసు నిందితులతో ఘోష్‌కు నేరపూరిత బంధం ఉందని, వారితో కలిసి పలు తప్పుడు పనులకు కూడా పాల్పడ్డారని సీబీఐ గత వారమే అభియోగాలు మోపింది. -
కేంద్రానికి చెంపపెట్టు
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ విడుదలను సీబీఐకి, అమిత్ షాకు, కేంద్రానికి చెంపపెట్టుగా ఆప్ అభివరి్ణంచింది. ‘‘సీబీఐ పంజరంలో చిలుకేనని సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. అవి నేరుగా కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు. కనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా ఏ సాక్ష్యాన్నీ సంపాదించలేకపోయాయని ఢిల్లీ మంత్రి ఆతిషి ఎద్దేవా చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తారని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సుశీల్ గుప్తా అన్నారు. కేజ్రీవాల్ విడుదలను ప్రజాస్వామ్య విజయంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అభివరి్ణంచారు. ఆప్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ‘‘కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే వచి్చందని మర్చిపోవద్దు. మద్యం కేసులో ప్రధాన నిందితుడైన ఆయన తక్షణం రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేసింది. లేదంటే ఢిల్లీ ప్రజలే ఆయన రాజీనామాకు పట్టుబట్టే రోజు ఎంతో దూరం లేదంది. -
సీబీఐపై ఘాటు వ్యాఖ్యలు.. సుప్రీం నోట మళ్లీ అదే మాట!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. ఈ మేరకు సుప్రీంకోర్టు జస్టిస్‌లు సూర్యకాంత్, ఉజ్జల్ భూయన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేజ్రీవాల్‌కు శుక్రవారం పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.బెయిల్‌పై విచారణ సందర్భగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐను ఉద్ధేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. దేశంలో సీబీఐ పరిస్థితిని వర్ణిస్తూ.. ‘పంజరంలో ఉన్న చిలుక (caged parrot) మాదిరి వ్యవహరించకూడదని సూచించారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్సీబీఐ అంటే స్వతంత్రంగా వ్యహరించడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థగా పనిచేస్తుందనే అర్థంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సీబీఐ.. కేంద్ర ప్రభావంతో పనిచేసే ‘బోనులో ఉన్న చిలుక’ కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ అంటే ‘స్వేచ్ఛగా విహరించే చిలుకలా’ వ్యవహరించాలని తెలిపారు. తనపై వ్యక్తం అయిన అనుమానాలను సీబీఐ నివృత్తి చేసుకోవాలన్నారు. అలాగే సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విధానంపై జస్టిస్ భూయాన్ విమర్శలు గుప్పించారు. ఆయన్ను కేవలం జైలులో ఉంచి వేధించాలన్న ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం అరెస్ట్ జరిగినట్లు కనిపిస్తోందన్నారు. అయితే ‘పంజరంలో బంధించిన చిలుక’ పదాన్ని 2013లో సీబీఐపై సుప్రీంకోర్టు ఉపయోగించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రమైనది కాదని కేంద్ర ప్రభుత్వ ప్రభావంతో పని చేస్తుందని వ్యాఖ్యానించింది. కోర్టు పరిశీలనతో ఏకీభవించిన అప్పటి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా.. ఈ వ్యాఖ్యను అంగీకరించారు. సీబీఐ విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న భావనతో ప్రతిపక్షాలు సీబీఐని ‘పంజరంలో చిలుక’ అనే మాటను తరచుగా ఉపయోగిస్తుంటాయి. తాజాగా సుప్రీంకోర్టు విచారణతో ఈ పదబంధం మళ్లీ తెరపైకి వచ్చింది.చదవండి: ఆరు నెలల తర్వాత బయటకు మరోవైపు విచారణ సందర్భంగా బెయిల్‌పై జస్టిస్ సూర్యకాంత్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ అరెస్టు సక్రమైందని తెలిపిన న్యామూర్తి.. సుదీర్ఘంగా జైలులో నిర్బంధించడం అంటే.. వ్యక్తి హక్కులను హరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదని.. ఈడీ కేసులో బెయిల్ లభించిన వెంటనే సీబీఐ అరెస్ట్ చేయడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 21 ప్రకారం సాధారణంగా కోర్టులు స్వేచ్ఛ వైపే మొగ్గుచూపుతాయని తెలిపారు.కాగా లిక్కర్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసులో తొలుత కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అదుపులోకి తీసుకుంది. అనంతరం జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఈడీ కేసులో సీఎంకు జూలై 12న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. సీబీఐ కేసులో ఇప్పటి వరకు బెయిల్ రాకపోవడంతో ఆయన జైలులోనే ఉన్నారు.సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ, బెయిల్ కోసం అభ్యర్థిస్తూ రెండు పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఈ నెల 5న విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్ బయటకు రానున్నారు.ఇదీ చదవండి: అభయ కేసు.. సీబీఐ సంచలన నిర్ణయం -
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దక్కింది. కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆయన ఆరు నెలల త్వరాత తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం (సెప్టెంబర్ 13) విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా మద్యం పాలసీ కేసులో సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. కానీ ఎందుకు అరెస్ట్ చేసిందో గల కారణాలపై స్పష్టతలేదు. సీబీఐ సమాధానాలు సైతం అర్ధవంతంగా లేవు. అందుకే కేజ్రీవాల్ అరెస్ట్‌తో పాటు జైలు శిక్షను కొనసాగించలేము. కేజ్రీవాల్‌ని సైతం వాంగ్మూలం ఇవ్వమని బలవంతం చేయలేము అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.సీబీఐపై ప్రశ్నలు సంధించిన సుప్రీంవిచారణ సందర్భంగా సుప్రీం కోర్టు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సీబీఐపై విమర్శలు చేశారు. మద్యం పాలసీకి సంబంధించి మార్చి 2023లో కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. విచారించిన 22 నెలల సమయం తీసుకుని కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసేందుకు ఎందుకు అంత సమయం తీసుకుందని ప్రశ్నించారు. షరతులతో కూడిన బెయిల్చివరగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. రూ.10లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో ఈ బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లడం,అధికారికంగా సంతకాలు చేయడంతో పాటు కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ఇదీ చదవండి : అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే సంపన్న మహిళ పోటీ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును ధర్మాసనం ఈ నెల 5వ తేదీన రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ అరెస్టును హైకోర్టు సమర్థించింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆగస్టు 5న ఉత్తర్వు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేయడంతోపాటు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాజాగా, శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సీబీఐ కేసులోనూ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన ఇవాళ తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. -
రేపే కేజ్రీవాల్ బెయిల్ తీర్పు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీం కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు వెల్లడించనుంది. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. రేపు బెయిల్ మంజూరు అయితే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన చేపట్టిన విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం బెయిల్ తీర్పును రిజర్వ్ చేసి రేపు (సెప్టెంబర్ 10)న వెల్లడిస్తామని పేర్కొంది.చదవండి: కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీంలో వాడీవేడి వాదనలు -
అభయ కేసు : సందీప్ ఘోష్ దంపతులు.. మహా ముదుర్లు
కోల్‌కతా: ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. అభయ ఘటన జరిగిన నేపథ్యంలో సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సందీప్ ఘోష్‌ను విచారిస్తుంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా కోల్‌కతాలో సందీప్ ఘోష్‌కు చెందిన మూడు ఫ్లాట్లు, రెండు ఇళ్లు, ఒక ఫామ్‌హౌస్, ముర్షిదాబాద్‌లోని మరో ఫ్లాట్ డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఆర్జీకర్ ప్రిన్సిపల్‌గా సందీప్ ఘోష్, ఆయన భార్య సంగీత ఘోష్ అదే కాలేజీకి చెందిన ఆస్పత్రిలో సీనియర్ వైద్యురాలిగా విధులు నిర్వహించనట్లు తేలింది.అనుమతి లేకుండా ప్రభుత్వ ఆస్తుల కొనుగోలుఆ సమయంలో సందీప్ ఘోష్ దంపతులు తమ పలుకుబడిని ఉపయోగించి భారీ మొత్తంలో అక్రమ ఆస్థుల్ని పోగేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆసక్తికర విషయం ఏంటంటే? ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే రెండు ప్రభుత్వ సిరాస్థుల్ని కొనుగోలు చేశారు.అనంతరం అందుకు అనుమతి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, 2021 సంవత్సరంలో డాక్టర్ సందీప్ ఘోష్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హోదాలో తన సతీమణి డాక్టర్ సంగీతా ఘోష్‌ని అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించారు’ అని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ట్రంప్‌పై హారిస్‌దే పై చేయిశుక్రవారం ఈడీ అధికారులు సందీప్ ఘోష్, ఆయన సన్నిహితులు, చెందిన ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నమోదైన కేసులో విచారణ కొనసాగుతోంది. అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుమరోవైపు అక్రమాస్తుల కేసులో ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు మంగళవారం సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురిని సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇక,ఇదే అక్రమాస్తుల కేసులో సెప్టెంబర్ 2న సీబీఐ సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసింది.ఘోష్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది.అప్పటి నుంచి ఎనిమిది రోజుల కస్టడీకి పంపింది. తాజాగా ఆ గడువు ముగియడంతో కస్టడీ గడువును పొడిగించాలని అధికారులు సీబీఐ కోర్టును కోరారు. దీంతో కోర్టు సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. -
సీబీఐ విచారణపై వారికెందుకు అభ్యంతరం?
సాక్షి, హైదరాబాద్: ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్)కు భూముల అక్రమ కేటాయింపుపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సిద్ధంగా ఉన్నప్పుడు అనధికారిక ప్రతివాదులు (బిల్లీరావు, మాజీ మంత్రి పి.రాములు)కు అభ్యంతరమెందుకని హైకోర్టులో పిటిషనర్లు ప్రశ్నించారు. భూముల కేటాయింపు అక్రమమని ఇదే హైకోర్టు తేల్చిందని, అయితే ఆ అక్రమాలకు, అవినీతికి పాల్పడిన వారెవరో నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. సీబీఐ విచారణ చేపడితే నిందితులుగా మారబోయే వారికి విచారణ వద్దు అని వాదించే హక్కు లేదని తేల్చిచెప్పారు. 12 ఏళ్ల క్రితం దాఖలైన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో వాదనలు పూర్తి కావడంతో సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ‘హైదరాబాద్ పరిధిలో రూ.వేల కోట్ల విలువైన (ప్రస్తుత విలువ రూ.లక్ష కోట్లు) 850 ఎకరాల ప్రభుత్వ భూములను ఓ బోగస్ కంపెనీకి నాటి చంద్రబాబు ప్రభుత్వం కారుచౌకగా కేటాయించింది. ఆ కంపెనీకి రూ.వందల కోట్ల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్‌లోని క్రీడా స్టేడియంలు కూడా అప్పగించింది.దీని వెనుక చంద్రబాబు సర్కార్ పెద్దలు ఉన్నారు. బోగస్ కంపెనీకి ఇన్ని వందల ఎకరాలు, రూ.వందల కోట్లు ఎందుకు కేటాయించారు.. దీని వెనకున్న వారెవరో తేలాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి..’అని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు తదితరుల తరఫు న్యాయవాదులు రఘునాథ్‌రావు, గాడిపల్లి మల్లారెడ్డి 2012లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. అక్రమాలను అధికారుల కమిటీ తేల్చింది.. శ్రీరంగారావు తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘భూ కేటాయింపులో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమి టీ 2006లో తేల్చింది. ఈ నివేదిక మేరకు నాటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్ భూముల కేటాయింపు రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. దీనిపై బిల్లీరావు పిటిషన్ దాఖలు చేయగా, భూ కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఇదే హైకో ర్టు ఈ ఏడాది మార్చిలో ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. రూ.లక్ష కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూ ముల అప్పగింత విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అక్రమాల వెనకున్న వారెవరో తెలియాలంటే సీబీఐతో పార దర్శక దర్యాప్తు జరిపించాల్సిందే. రాజకీయ దురుద్దేశాలతో ఈ పిల్లు దాఖలయ్యాయని చెప్ప డం హాస్యాస్పదం. శ్రీరంగారావుకు ఏ పార్టీతోనూ ఎలాంటి సంబంధాలు లేవు. పిటిషనర్లే కాదు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీబీఐ విచారణ కోరిన విషయాన్ని మరవద్దు. భూ కేటాయింపుపై విచారణ జరిపించాలని కేంద్రానికి వినతిపత్రం సమర్పించాం. ఎలాంటి స్పందన లేకపోవడంతోనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది..’అని వెల్లడించారు. ఏబీకే తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, ప్రముఖ జర్నలిస్ట్‌గా సుపరిచితులని చెప్పారు. కాగా ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ కేసు గానీ, ఫిర్యాదు గానీ నమోదు కాని అంశంలో సీబీఐ విచారణ చేయడం సరికాదని బిల్లీరావు తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు. మాజీ మంత్రి పి.రాములు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా ఆన్లైన్లో వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది. -
కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీంలో వాడీవేడి వాదనలు.. తీర్పు రిజర్వు
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజీవాల్ బెయిల్ పిటిషన్‌తో పాటు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదించారు. ఇరు వర్గాల నుంచి సుధీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేజ్రీవాల బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 10న తీర్పు వెల్లడించనుంది.ఎలాంటి ఆధారాలు లేకుండా సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిందని అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. ఇది అరుదైన సంఘటనగా అభివర్ణించారు. కఠినమైన మనీలాండరింగ్ చట్టం కింద ఢిల్లీ ముఖ్యమంత్రి రెండుసార్లు బెయిల్ పొందారని, కానీ సీబీఐ ఆయన్ను ‘బీమా అరెస్టు’(ముందస్తు) చేసిందని మండిపడ్డారు.సింఘ్వీ వాదనలు..ఈ కేసులో రెండేళ్ల తర్వాత కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మూడు కోర్టు ఉత్తర్వులు మాకు అనుకూలంగా ఉన్నాయి. అయినా బీమా అరెస్టు కింద( ఆకస్మిక) సీబీఐ కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకుంది. కాబట్టి ఆయన్ని ఎప్పటికీ జైలులో ఉంచవచ్చని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.41ఏ కింద కేజ్రీవాల్‌ను నిందితుడిగా విచారించాలని సీబీఐ దరఖాస్తు చేసుకుంది. అరెస్ట్ చేయాలని ముందుగా అనుకోలేదు. కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నప్పుడు కేవలం ఆయన్ను విచారించేందుకు మాత్రమే కోర్టు అనుమతించింది.41ఏ దరఖాస్తు ప్రకారం సీబీఐ సీఎంను మూడు గంటలు విచారించారు. కానీ వారి దగ్గర 41ఏ నోటీసు లేదు. మరి అంత అకస్మాత్తుగా కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట చేశారు. ఇది బీమా అరెస్ట్, హడావిడి అరెస్ట్ కాకుంటే మరెంటీ?కేజ్రీవాల్ దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందా? సాక్ష్యాలను తారుమారు చేస్తాడా? అతను సాక్షులను ప్రభావితం చేస్తాడా? సుప్రీంకోర్టు మూడు ప్రశ్నల గురించి సుప్రీంకోర్టు ఆలోచించాలి.సీబీఐ అరెస్టుకు ప్రధాన కారణం కేజ్రీవాల్ సహకరించకపోవడమే. ఒక వ్యక్తి తనను తాను నేరారోపణ చేసుకోవాలని ఎలా అనుకుంటారు.అరవింద్ కేజ్రీవాల్ ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి. ఎక్కడికి పారిపోలేడు. ట్యాంపరింగ్ కుదరదు, లక్షల డాక్యుమెంట్లు ఉన్నాయి, ఐదు చార్జిషీట్లు దాఖలయ్యాయి. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం కూడా ఉండదు. బెయిల్ కోసం మూడు తీర్పు మాకు అనుకూలంగా ఉన్నాయి.కేజ్రీవాల్‌కు రెండుసార్లు బెయిల్ పొందారు. పీఎంఎల్ఏ సెక్షన్ 45 కింద సుప్రీంకోర్టు ఓసారి బెయిల్ ఇచ్చింది. కేవలం ఇన్సురెన్స్ (ముందస్తు, హడావిడీ) అరెస్టు మాత్రమే. అతని అరెస్ట్‌ను సమర్ధించేందుకు అంతకుముంచి దర్యాప్తు సంస్థ కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు చూపించలేదు. ఈ కేసులో మిగతా నిందితులందరూ(విజయ్ నాయర్, మనీష్ సిసోడియా, బుచ్చి బాబు, సంజయ్ సింగ్, కవిత) విడుదలయ్యారు.లిక్కర్ పాలసీకి సబంధించిన ఈడీ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా.. సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘ఒకరు కస్టడీలో ఉన్నప్పుడు .. మళ్లీ అరెస్ట్ చేయాలంటే కోర్టు అనుమతి కావాలి. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్‌లో ఏదో ఉంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.సీబీఐ సెక్షన్ 41, 41ఏ లను పాటించకుండా అర్నేష్ కుమార్, యాంటిల్ తదితర తీర్పులను ఉల్లంఘించి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది.సీబీఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ కోసం ముందు మనీష్ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లారు కానీ కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ఆ పని చేయవలేదని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి కేసుల్లో తాము జోక్యం చేసుకోలేం తిరిగి ట్రయల్ కోర్టుకు వెళ్లండి అంటూ సుప్రీంకోర్టు చెప్పిన కేసులు చాలా ఉన్నాయని పేర్కొన్నారు.కేజ్రీవాల్ ను సెషన్స్ కోర్టుకు వెళ్లకుండానే హైకోర్టును ఆశ్రయించాడు. ఇది నా ప్రాథమిక అభ్యంతరం. మెరిట్ల దృష్ట్యా ట్రయల్ కోర్ట్ దీనిని మొదట విచారించాల్సి ఉంది. అసాధారణమైన కేసుల్లో మాత్రమే హైకోర్టు పరిశీలిస్తుంది. సాధారణ కేసుల్లో ముందుగా సెషన్స్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.కేజ్రీవాల్ ముందు సుప్రీంకోర్టుకు వచ్చారు. తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారు, ఇప్పుడు ఇక విషయాన్ని ఈ కోర్టు నిర్ణయించాలి. ఈ మేరకు కవిత కేసును ప్రస్తావిస్తూ.. ముందుగా ఆమె ట్రయల్ కోర్టుకు వెళ్లారు. అక్కడ తిరస్కరణ ఎదురవ్వడంతో హైకోర్టు మెట్లెక్కారు. అక్కడా ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు.ఎస్పీ రాజు వాదనలపై జస్టిస్ కాంత్ స్పందిస్తూ..ఒకరిని ట్రయల్ కోర్టుకు పంపాలనుకుంటే అప్పుడే హైకోర్టు నిర్ణయాత్మకంగా ఆలోచించాల్సి ఉండేది. ఇక్కడ మెయింటెనబిలిటీకి సంబంధించిన ప్రశ్న కూడా నిర్ణయించుకోవాలి.చట్టం ముందు అందరూ సమానులే. ఎవరూ ప్రత్యేక వ్యక్తులు కారు. ఏ వ్యక్తికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఉండదు. కేవలం ముఖ్యమంత్రి కావడం వల్లే కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. సాధారణ ప్రజలు ట్రయల్ కోర్టుకు వెళతారు. వారంతా సుప్రీంకోర్టుకు రాలేరు.కేజ్రీవాల్ రిమాండ్ దరఖాస్తును అందించాం, అందులో అరెస్టుకు సంబంధించిన వివరణాత్మక ఆధారాలు ఉన్నాయి. సాక్ష్యాలను తారుమారు చేసిప్పుడు లేదా సాక్షులను బెదిరించినప్పుడు. వారెంట్ లేకుండా సరైన దర్యాప్తు కోసం అరెస్టు చేయవచ్చు. ఈ కేసు ఆ వర్గంలోకి వస్తుంది.అరవింద్ కేజ్రీవాల్ ఛార్జ్ షీట్ కాపీని జతచేయలేదు. దానిని దాచినందున అతని బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలిఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తే, అది ఢిల్లీ హైకోర్టును నిలదీసినట్టే’ అంటూ వాదనలు వినిపించారు.అయితే లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో సీఎంకు సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ కేసులోనూ సుప్రీం ముఖ్యమంత్రి బెయిల్ మంజూరు చేస్తే కేజ్రీవాల్ ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు. -
అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ మరో కేసు
న్యూఢిల్లీ: మహారాష్ట్రకు చెందిన బీజేపీ అగ్రనాయకులను తప్పుడు కేసులో ఇరికించేందకు కుట్ర పన్నారనే అభియోగాలతో మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (ఎన్సీపీ– ఎస్పీ)పై సీబీఐ బుధవారం తాజాగా కేసు నమోదు చేసింది. 2020లో ఈ కుట్ర జరిగిందని తెలిపింది. 2020లో ప్రతిపక్షంలో ఉన్నపుడు దేవేంద్ర ఫడ్నవీస్ అప్పటి స్పీకర్‌కు ఒక పెన్‌డ్రైవ్‌ను అందజేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవీణ్ పండిత్ చవాన్.. అనిల్ దేశ్‌ముఖ్, ఇతరులతో కలిసి బీజేపీ నాయకుడు గిరీష్ మహజన్ (ప్రస్తుతం మంత్రి)ని ఇరికించడానికి ప్రయతి్నంచినట్లుగా పెన్డ్రైవ్లోని వీడియోల్లో ఉన్నట్లు సీబీఐ చెబుతోంది. పండిత్ చవాన్ ప్రముఖ బీజేపీ నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పలు కుట్రలకు తెరతీసినట్లు ఈ వీడియోల్లో స్పష్టం ఉందని ప్రాథమిక విచారణలో గిరీష్ మహజన్‌తో సహా నలుగురు ఎమ్మెల్యేలు.. సీబీఐకి తెలిపారు. ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం. సాక్షులను చిత్రహింసలు పెట్టడం, నగదు చెల్లింపులు, దర్యాప్తు అధికారులకు సూచనలు ఇవ్వడం.. ఇలా పక్కా పథకరచన చేశాడని ఆరోపించారు. డీసీపీ పూరి్ణమ గైక్వాడ్, ఏసీపీ సుష్మా చవాన్లతో కలిసి సాక్షుల వాంగ్మూలను, ఆధారాలను మార్చేశాడని పేర్కొన్నారు. తాజా ఎఫ్ఐఆర్లో సీబీఐ అనిల్ దేశ్ముఖ్తో పాటు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవీణ్ పండిత్ చవాన్, పూర్ణిమ, సుష్మ, న్యాయవాది విజయ్ పాటిల్‌లను నిందితులుగా పేర్కొంది. అవినీతి ఆరోపణలపై అనిల్ దేశ్‌ముఖ్ ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఈడీ కేసు కూడా నమోదైంది. ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవీస్ బెంబేలెత్తిపోయి తనపై నిరాధార కేసును నమోదు చేయించారని అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాతీర్పును చూసి.. కాళ్ల కింద నేల కదులుతోందని గ్రహించి ఫడ్నవీస్ ఇలాంటి కుట్రలకు దిగారని ఆరోపించారు. -
‘చంద్రబాబు’పై విచారణకు మేం రెడీ
సాక్షి, హైదరాబాద్: ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్)కు అక్రమంగా భూములు కేటాయించడంపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ హైకోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తెలిపింది. కోర్టు ఆదేశిస్తే నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపడతామని పేర్కొంది. అక్రమ భూ కేటాయింపు వెనుక ఉన్న వారెవరో తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తునకు తాము ఎప్పుడూ వెనకడు గు వేయలేదని, వసతుల లేమి కారణంగా ప్రాథమిక విచారణ సీబీసీఐడీతో చేయిస్తే, తదుపరి దర్యాప్తు తాము చేపడతా మని చెప్పామని, అదే విషయం ఈ కోర్టుకు సమర్పించిన కౌంటర్లోనూ వెల్లడించామని వివరించింది. ‘హైదరాబాద్ పరిధిలో రూ.వేల కోట్ల విలువైన (నేటి విలువ ప్రకారం రూ.లక్ష కోట్లు) 850 ఎకరాల ప్రభుత్వ భూములను కారుచౌకగా ఓ బోగస్ కంపెనీకి నాటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఆ కంపెనీకి రూ.వందల కోట్ల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ లోని స్టేడియాలు కూడా అప్పగించింది. దీని వెనుక చంద్రబాబు సర్కార్ పెద్దలు ఉన్నారు. బోగస్ కంపెనీకి ఇన్ని వందల ఎకరాలు, రూ.వందల కోట్లు ఎందుకు కేటాయించారు? దీని వెనకున్న వారెవరో తేలాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి..’అని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, న్యాయ వాది శ్రీరంగారావు 2012లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖ లు చేశారు. నాటి నుంచి ఈ పిటిషన్లపై విచారణ సాగుతూనే వస్తోంది. తాజాగా బుధవారం ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాస్‌రావు ధర్మాసనం ఈ వ్యాజ్యాల పై మరోసారి విచారణ చేపట్టింది. విచారణకు అభ్యంతరం లేదు: సీబీఐ సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ.. ‘కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధంగా సీబీఐ ఉంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సొనెల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ), సీబీఐ అఫిడవిట్ కూడా దాఖలు చేశాయి. విచారణ చేపట్టడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. అత్యంత భారీ కుంభకోణమైన ఐఎంజీ భారత్‌కు భూ కేటాయింపుల వెనుక ఎవరున్నారో తేల్చేందుకు సిద్ధంగా ఉన్నాం..’అని చెప్పారు. అసలేంటీ కేసు క్రీడాభివృద్ధి పేరిట ఐఎంజీ భారత్‌కు 2003లో మామిడిపల్లి, శేరిలింగంపల్లిలో 850 ఎకరాల అత్యంత విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 450 ఎకరాలకు సేల్‌డీడ్ కూడా చేసి ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలోని స్టేడియాలను ఆ సంస్థకే అప్పగించింది. అలాగే నిర్వహణ కోసం రాయితీలు ఇస్తూ ఒప్పందం చేసుకుంటూ జీవోను విడుదల చేసింది. అయితే తర్వాత వ చ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో, అదీ ఆ సంస్థ పెట్టిన నాలుగు రోజుల్లోనే భూములు ఇవ్వడాన్ని ఆక్షేపించింది. ఎలాంటి క్రెడిబులిటీ లేని సంస్థకు స్టేడియాలు, రాయితీలు ఇవ్వడం ప్రజా ధనం దుర్వినియోగం కిందకే వస్తుందని భావించి ఒప్పందాన్ని, జీవోను రద్దు చేసింది. దీనిపై బిల్లీరావు హైకోర్టులో పిటిషన్ వేయగా.. వైఎస్సార్ ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. ఆ భూములను స్వా«దీనం చేసుకోవాలని 2024 మార్చిలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇదే అంశంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ పలు పిల్స్ దాఖలు కాగా, వాటిపై విచారణ కొనసాగుతోంది. -
ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్‌కు ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీ
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోల్‌కతా కోర్టు ఎనిమిది రోజల సీబీఐ కస్టడీ విధించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ ఘోషతో పాటు, మరో ముగ్గురు నిందితులు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా, అఫ్సర్ అలీ ఖాన్‌లను సోమవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ వారిని సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఇప్పటికే కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో సందీప్ ఘోష్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ కేసులో విచారించడానికి నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోల్‌కతా కోర్టును కోరింది. అయితే కోర్టు ఎనిమిది రోజులు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. ఇందులో ఒక నిందితుడైన అఫ్సర్ అలీ బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సందీప్ ఘోష్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుపై కోల్‌కతా పోలీసులు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినప్పటికీ కలకత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో సోమవారం సీబీఐ సోదాలు జరిపి అనంతరం అరెస్ట్ చేసింది. -
మద్యం పాలసీ కేసు: విజయ్ నాయర్‌కు బెయిల్
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా సహాయకుడు విజయ్ నాయర్‌కు ఊరట దక్కింది. సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా ఇన్ ఛార్జ్‌గా ఉన్న విజయ్ నాయర్ మద్యం పాలసీ కేసులో 2022లో సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ కేసులో విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్‌పై సోమవారం (సెప్టెంబర్2) విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో ఇంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో బెయిల్ పొందారు.ఏంటి ఈ మద్యం పాలసీ కేసు?ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది.అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్‌సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్‌ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది.దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచి పెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా,కవితతో పాటు పలువురిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. -
కోల్‌కతా వైద్యురాలి కేసు : సీబీఐ దర్యాప్తులో కీలక పరిణామం
కోల్‌కతా : ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆగస్ట్ 9న ఆర్జీ కార్ ఆస్పత్రిలో వైద్యురాలిపై దారుణం జరిగిన ప్రాంతాన్ని సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు.కేసు విచారణలో భాగంగా ఆర్జీకార్ ఆస్పత్రి ఎమర్జెన్సీ బిల్డింగ్,బాయ్స్ హాస్టల్, ప్రిన్సిపల్ ఆఫీస్‌లో తనిఖీలు నిర్వహించారు. ఇదే కేసు నిమిత్తం ఆగస్ట్ 29న సీబీఐ అధికారులు ఆర్జీకార్ ఆస్పత్రి శవాగారాన్ని పరిశీలించారు.మాజీ ప్రిన్సిపల్‌కు రెండుసార్లు పాలిగ్రాఫ్ టెస్ట్‌లు మరోవైపు వైద్యురాలి కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఆర్జీకార్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌కు రెండు సార్లు పాలిగ్రాఫ్ టెస్ట్‌లు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి అరెస్టయిన నిందితుడు సంజయ్‌రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్‌లు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.చదవండి : మమత చుట్టూ బిగుస్తున్న ఉచ్చుఆ రాత్రి ఏం జరిగింది?కోల్‌కతా అభయపై జరిగిన దారుణంపై దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది. అభయ ఘటన జరగక ముందు రాత్రి అంటే ఆగస్ట్ 8న అభయ, ఇద్దరు మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, హౌస్ సర్జన్, ఒక ఇంటర్న్ కలిసి భోజనం చేశారు. అనంతరం ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్‌ను వీక్షించారు. అయితే, తెల్లవారు జామున (ఆగస్ట్9) 2 గంటలకు, ఇద్దరు సహచరులు డ్యూటీలో ఉన్న వైద్యులు విశ్రాంతి తీసుకునే గదిలోకి వెళ్లారు. బాధితురాలు సెమినార్ గదిలోనే ఉండిపోయింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ ఆగస్టు 9న తెల్లవారు జామున ఉదయం 3.50 గంటల సమయంలో ఆర్జీకార్ ఆసుపత్రికి చేరుకున్నాడు. తొలుత ఆపరేషన్ థియేటర్ డోర్‌ను పగలగొట్టిన నిందితుడు.. 4.03 గంటల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించాడు. అనంతరం మూడో అంతస్తులో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్లో గాఢ నిద్రలో ఉండగా, రాయ్ అభయంపై దారుణానికి పాల్పడ్డాడు. ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఉదయం 9.30 గంటలకు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్లలో ఒకరు బాధితురాలి కోసం వెతికేందుకు వెళ్లాడు. దూరం నుంచి కదలలేని స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని చూశాడు. దీంతో అభయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దారుణం జరిగిన ప్రదేశంలో బ్లూటూత్ లభ్యమైంది. ఆ బ్లూటూత్‌ను అనుమానితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని వారి ఫోన్లకు హెడ్‌ఫోన్ కనెక్ట్ చేయడానికి ప్రయత్నించగా అది సంజయ్ ఫోన్‌కు కనెక్ట్ అయ్యింది. దీంతో సంజయ్ రాయ్ అసలు నిందితుడిగా పోలీసులు తొలుత గుర్తించారు.అనంతరం విచారణ ముమ్మరం చేశారు. ఘటన జరిగిన అనంతరం నిందితుడు సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి తన దుస్తులపై ఉన్న రక్తపు మరకల్ని సంజయ్ శుభ్రం చేసుకున్నాడు. అయితే అతడి షూపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో సంజయ్ రాయ్‌తో పాటు ఆర్జీకార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు -
‘అది దేవుడి నిర్ణయమే’: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
బెంగళూరు : అక్రమాస్తుల కేసులో కోర్టు నిర్ణయాన్ని దేవుడి నిర్ణయంగా భావిస్తా. నేను కోర్టు తీర్పు, దేవుణ్ణి నమ్ముతాను’ అని కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. డీకే శివకుమార్ విచారణను కొనసాగించాలంటూ సీబీఐ, బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్లు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం కొట్టి వేసింది.కోర్టు తీర్పు వెలువరించిన తరుణంలో సకలేశ్పురలోని యెత్తినహోల్ ఇంటిగ్రేటెడ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును పరిశీలించిన సందర్భంగా అక్రమాస్తుల కేసుకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు శివకుమార్ పై విధంగా వ్యాఖ్యానించారు. 2013-2018 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివ కుమార్ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సెప్టెంబరు 2020న సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. విచారణ ప్రారంభించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే ఆ కేసు సీబీఐ నుంచి ఈ ఏడాది ఫిభ్రవరిలో లోకాయుక్త పోలీసులకు బదిలీ అయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా డీకే శివకుమార్ గత వారం లోకాయుక్త పోలీసుల ముందు హాజరయ్యారు. సుప్రీంలోనూ ఎదురుదెబ్బ అక్రమాస్తుల కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సిద్ధరామయ్యకు ఏం జరగదు అక్రమాస్తుల కేసుతో పాటు మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,ఆయన భార్య పార్వతిలపై వస్తున్న ఆరోపణలపై డీకే శివకుమార్ స్పందించారు. సీఎంకి ఏం కాదు.‘కొందరు ముఖ్యమంత్రిపై ఎందుకు విరుచుకుపడుతున్నారో నాకు తెలియదు. ఆయనకు ఏం కాదు. ముడా వ్యవహారంలో ఆయనకు ప్రమేయం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు డీకే శివకుమార్. -
కోల్‌కతా అభయ కేసు : సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన ఐఎంఏ
న్యూఢిల్లీ: కోల్‌కతా అభయ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సస్పెండ్ చేసింది.ఆర్జీకార్ అభయపై జరిగిన దారుణంలో సందీప్ ఘోష్ ప్రమేయం ఉందని తేలలేదు. అయినప్పటికీ ఘటన జరిగిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం, ఆత్మహత్య అని బాధితురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై సీబీఐ సైతం దర్యాప్తు చేస్తుంది. అదే సమయంలో ఆర్జీకార్ మాజీ డాక్టర్, ప్రస్తుత ముర్షిదాబాద్ వైద్య కళాశాల డిప్యూటీ సుపరింటెండెంట్ అక్తర్ అలీ సందీప్ ఘోష్‌పై సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. మృతదేహాలతో వ్యాపారం,బయోమెడికల్ వ్యర్థాలను అక్రమంగా రవాణా చేశారని ఆరోపించారు.ఈ ఆరోపణలతో సీబీఐ అధికారులు సందీప్ ఘోష్‌ను 90 గంటల పాటు ప్రశ్నించారు. దీంతో పాటు ఆయన ఇల్లు, ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సైతం 11 గంటల పాటు సోదాలు జరిపారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేశారు.ఈ తరుణంలో ఐఎంఏ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఐఎంఏ సస్పెండ్ చేసింది. వైద్యురాలి మరణంతో పాటు ఆమె కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యం, సానుభూతి లేకపోవడాన్ని ప్రస్తావించింది. తన తీరుతో సందీప్ ఘోష్ వైద్యవృత్తికి చెడ్డపేరు తెచ్చారని, క్రమశిక్షణా కమిటీ అతనిని సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని ఐఎంఏ తెలిపింది. కాగా,ఆర్జీ కార్ ఆస్పత్రి వైద్యురాలి మరణం అనంతరం జరిగిన పరిణామలపై సందీప్ ఘోష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కొన్ని గంటల్లోనే మమతా ప్రభుత్వం అతన్ని కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు ప్రిన్సిపల్‌గా నియమించడం విశేషం. -
అభయ కేసు... సీబీఐకి మమత సూటి ప్రశ్నలు!
కోల్‌కతా: ఆర్జీకార్ వైద్యురాలి ఘటన కేసులో సీబీఐ దర్యాప్తుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నల వర్షం కురిపించారు. దారుణం జరిగి 16 రోజులు అవుతుంది. న్యాయం ఎక్కడా? అంటూ సీబీఐని ప్రశ్నించారు. రాష్ట్ర అధికార తృణముల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవం బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ప్రసంగించిన దీదీ.. వైద్యురాలి కేసుపై పలు ప్రశ్నలు సంధించారు. "BJP is trying to defame Bengal," CM Mamata Banerjee condemns 12-hour 'Bengal Bandh'Read @ANI Story | https://t.co/bJMNXfPdD2 #MamataBanerjee #Bengalbandh #WestBengal #BJP pic.twitter.com/gCr6FFBGWa— ANI Digital (@ani_digital) August 28, 2024‘‘ఆర్జీ కార్ ఆస్పత్రి సెమినార్ హాల్లో వైద్యురాలిపై దారుణం జరిగిన రెండు రోజుల తర్వాత బాధితురాలి తల్లి దండ్రులను కలిశాను. కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు ఐదు రోజులు సమయం కావాలని వారిని అడిగాను. కానీ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది’’ అని అన్నారు. సీబీఐని ఉద్దేశిస్తూ..‘‘వాళ్లు మనకు న్యాయం చేయరు. కేసు దర్యాప్తు మరింత ఆలస్యం చేయడం వాళ్లకు కావాల్సింది’’ అని విమర్శించారు.నేరస్తులకు ఉరిశిక్ష.. త్వరలో అసెంబ్లీలో తీర్మానంబాధితురాలిపై దారుణం జరిగి 16 రోజులు అవుతుంది. న్యాయం ఎక్కడ? అని ప్రశ్నించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుందని, నేరస్తులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బిల్లును ప్రవేశపెడతామని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.విద్యార్థుల ముసుగులో బీజేపీ కుట్రఅభయ ఘటనకు వ్యతిరేకంగా ‘నబన్న మార్చ్’ పేరుతో విద్యార్థి సంఘాలు మంగళవారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి.నబన్నా అభియాన్ పేరుతో హావ్‌డా నుంచి ప్రారంభమైన ర్యాలీ గందరగోళానికి దారి తీసింది. సంతర్గాచి వద్ద పోలీసులు విద్యార్థుల్ని అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ర్యాలీ గురించి ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నబన్న మార్చ్‌కి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వగా.. రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి బీజేపీ-ఏబీవీపీ కుట్ర అని’ఆరోపించారు. ప్రభుత్వ పరువు తీయడమే బీజేపీ ప్లాన్రాష్ట్రంలో బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. వాళ్లకు కావాల్సింది మృతదేహాలు. కానీ మనం అభయ కేసు నిందితుల్ని ఉరిశిక్ష పడేలా న్యాయం చేయాలని కోరుతున్నాం. బాధితురాలికి న్యాయం చేయాలనే లక్ష్యం నుంచి వాళ్లు (బీజేపీ) దూరమయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పరువు తీస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు మరిన్ని కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’అని ధ్వజమెత్తారు.రాష్ట్ర పోలీసులకు నా సెల్యూట్అనంతరం నగర పోలీసులపై మమత బెనర్జీ ప్రశంసల వర్షం కురిపించారు. దాడులకు గురైనప్పటికీ ఉచ్చులో పడకుండా.. ప్రాణ నష్టం లేకుండా విధులు నిర్వహించిన పోలీసులకు నా సెల్యూట్ మరణాలను నిరోధించిన పోలీసులకు నా అభినందనలు’ అని మమతా బెనర్జీ ప్రసంగించారు. -
కోల్‌కతా వైద్యురాలి కేసు : సందీప్ ఘోష్ ఇళ్లపై సీబీఐ దాడులు!
కోల్‌కతా : కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రి దుర్ఘటనపై సీబీఐ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన దారుణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సైతం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆదివారం 15 ప్రాంతాల్లో సందీష్ ఘోష్ పాటు ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. సందీప్ ఘోష్‌తో పాటు ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఫోరెన్సిక్ మెడిసిన్,టాక్సాలజీ విభాగానికి చెందిన డాక్టర్ డెబాషిస్ సోమ్ ఇంటికి సైతం సీబీఐ అధికారులు వెళ్లారు.మూడురోజుల ముందు ఆర్జీకార్ ఆస్పత్రిలో మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు, డెబాషిస్ సోమ్‌పై ఆరోపణలు చేశారు. అనంతరం సీబీఐ అధికారులు కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో శనివారం సందీప్ ఘోష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం సందీష్ ఘోష్ ఇల్లు, కుటుంబ సభ్యుల ఇళ్లల్లో చేస్తున్న తనిఖీలు కొనసాగుతున్నాయి. -
అభయ కేసు... కోర్టులో నిందితుడి యూటర్న్!
కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులోని ప్రధాని నిందితుడు సంజయ్‌రాయ్‌తో పాటు మరో ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో పాలిగ్రాఫ్ పరీక్షకు నిందితుడు సంజయ్ రాయ్ సమ్మతించడంతో ఆయనతోపాటు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, నలుగురు జూనియర్ డాక్టర్లు, ఓ పౌర వాలంటీర్‌కు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. కానీ పాలిగ్రాఫ్ పరీక్షకు సీబీఐ ఇంకా తేదీని ఇంకా నిర్ణయించలేదు.అయితే పాలిగ్రాఫ్ పరీక్షకు ఎందుకు సమ్మతించారని సంజయ్‌రాయ్‌ను సీబీఐ కోర్టు విచారణ సందర్భంగా ప్రశ్నించింది. దీనికి అతను సమాధానం చెబుతూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తాను నిర్దోషినని చెప్పాడు. తనెలాంటి తప్పు చేయలేదని. కావాలనే ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. .ఈ పాలిగ్రాఫ్ పరీక్షతో ఆ విషయం బయటపడుతుందని ఆశిస్తున్నానని కోర్టుకు తెలిపాడు. దీంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది.అయితే ఇప్పటి వరకు పోలీసులు విచారణలో సీబీఐ దర్యాప్తులో నేరాన్ని అంగీకరించిన నిందితుడు సంజయ్ రాయ్.. ఇప్పుడు న్యాయస్థానంలో యూటర్న్ తీసుకొని, తాను ఏ నేరం చేయలేదని చెప్పడం విస్మయం కలిగిస్తోంది. సైకో అనాలసిస్లోనూ సంజయ్ రాయ్ చేసిన తప్పుకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. రేప్, హత్యను ప్రతి చిన్న అంశంతో సహా పూసగుచ్చినట్లు వివరించినట్లు వెల్లడైన సంగతి విదితమే.మరోవైపు కోల్‌కతాలో వైద్యుల ఆందోళనలు విరమించాలని బెంగాల్ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. రోగుల సంరక్షణకు ఆటంకం కలుగుతోందని, ఆందోళనలో ఉన్న జూనియర్ వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరింది."మెడికల్ కాలేజీలలో వైద్య సేవలకు రెసిడెంట్ వైద్యులు వెన్నెముక. వారు లేకపోవడం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తృతీయ, మాధ్యమిక ఆసుపత్రులలో రోగుల సంరక్షణ సేవలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నిరసన తెలుపుతున్న వైద్యులను విధుల్లోకి రమ్మని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ నారాయణ్ స్వరూప్ నిగమ్ పేర్కొన్నారు. -
నిందితుడు సంజయ్‌ది పశు ప్రవృత్తి
న్యూఢిల్లీ/ కోల్‌కతా: ట్రైనీ పీజీ డాక్టర్ హత్యాచారం కేసులో ప్ర ధాన నిందితుడైన సంజయ్ రాయ్ పశుప్రవృత్తిని కలిగి ఉన్నాడని సైకో అనాలసిస్ పరీక్షలో తేలింది. వైద్యురాలిపై పాశవిక రేప్, హత్యపై అతనిలో కించిత్తు కూడా పశ్చాత్తాపం లేదని, అశ్లీల చిత్రాలు విపరీతంగా చూస్తాడని సైకో అనాలసిస్‌లో తేలిందని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. “అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. రేప్, హత్యను ప్రతి చిన్న అంశంతో సహా పూసగుచ్చినట్లు వివరించాడు.ఏమాత్రం సంకోచించలేదు’అని సీబీఐ అధికారి చెప్పారు. సంజయ్ రాయ్ మొబైల్ ఫోన్లో పలు అశ్లీల చిత్రాలు పోలీసులకు లభించిన విషయం తెలిసిందే. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలు సంజయ్ రాయ్ ఘటనా స్థలి (ఆర్.జి.కర్ ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్) వద్ద ఉన్నట్లు నిరూపిస్తున్నాయని సీబీఐ తెలిపింది. హత్యాచారం జరిగిన ఆగస్టు 8న అర్ధరాత్రి దాటాక సంజయ్ రాయ్ తప్పతాగి ఉత్తర కోల్‌కతాలోని వేశ్యావాటికను సందర్శించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అక్కడ ఒక మహిళను నగ్న చిత్రాన్ని అడిగాడు. ఆగస్టు 9న వేకువజామున 4 గంటల ప్రాంతంలో సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నట్లు సీసీటీవీల్లో రికార్డైంది. జీన్స్ ప్యాంట్, టీ షర్టు ధరించిన అతని చేతిలో పోలీసు హెల్మెట్ ఉంది. రాయ్ కోల్‌కతా పోలీసు సివిల్ వాలంటీర్ అనే విషయం తెలిసిందే. రాయ్ మెడచుట్టూ బ్లూటూత్ డివైస్ సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. తర్వాత ఇదే బ్లూటూత్ డివైస్ క్రైమ్ సీన్లో లభించింది. దర్యాప్తులో కీలకంగా మారింది. సంజయ్‌రాయ్‌కు సంబంధించిన డీఎన్ఏ పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. సందీప్ ఘోష్‌కు లై డిటెక్టర్ టెస్టు ఆర్.జి.కర్ ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకల కేసును కలకత్తా హైకోర్టు శుక్రవారం సీబీఐకి బదిలీ చేసింది. ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అప్పగించాలని ఆసుపత్రి మాజీ డిప్యూ టీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ వేయడంతో హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. మూడు వారాల్లో పురోగతి నివేదిక సమరి్పంచాలని ఆదేశిస్తూ కేసును సెపె్టంబరు 17కు వాయిదా వేసింది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ఐదుగురికి లై డిటెక్టర్ పరీక్షలు చేయడానికి స్థానిక కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. అలాగే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై పాలిగ్రాఫ్ పరీక్షకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. మరోవైపు బీజేపీ కార్యాకర్తలు బెంగాల్ వ్యాప్తంగా పోలీసుస్టేషన్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
కోల్‌కతా హత్యోదంతం వేళ.. సందీప్ ఘోష్‌కు దీదీ రాసిన లేఖ వైరల్
కోల్‌కతా : యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కోల్‌కతా వైద్య విద్యార్థిని కేసులో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022 జూన్ 30న ఆర్జీకార్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ లేఖ రాశారు. ఆ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ లేఖతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అయితే సన్నిహితంగా ఉండే అతి కొద్ది మందికి మాత్రమే మమతా బెనర్జీ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాస్తారని, ఆ కొద్ది మందిలో సందీష్ ఘోష్ సైతం ఉన్నారని సమాచారం. ఇక ఆ లేఖపై దీదీని బీజేపీ టార్గెట్ చేసింది. సందీప్ ఘోష్‌కు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్, సీఎం మమతా బెనర్జీతో మంచి అనుబంధం ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ సందర్భంగా ఆర్జీకార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సందీప్ ఘోష్ మమతా బెనర్జీ అత్యంత సన్నిహితుల్లో ఒకరు అనేది రహస్యం కాదని, బీజేపీ అధికార ప్రతినిధి ప్రియాంక తిబ్రేవాల్ అన్నారు. ‘ఆర్జీ కార్ ఆసుపత్రిలో అవకతవకలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, డాక్టర్ సందీప్ ఘోష్‌ను తొలగించలేదు. ప్రిన్సిపల్‌గా కొనసాగారు’ అని తిబ్రేవాల్ చెప్పారు.రాజీనామా అంతలోనే పోస్టింగ్ వైద్యురాలిపై జరిగిన దారుణం జరిగిన రెండురోజుల తర్వాత.. దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. వెనువెంటనే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ అంశంపై వివాదం నెలకొంది. కలకత్తా హైకోర్టు సైతం ఆయన పోస్టింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సందీష్ ఘోష్‌ను నిరవధిక సెలవుపై పంపింది. ఆ తర్వాత బెంగాల్ ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది.సందీప్ ఘోష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చుఅదీకాక.. ఈ హత్యాచారం జరిగిన అనంతరం చోటు చేసుకున్న వరుస పరిణామాలు.. ఆ సమయంలో కాలేజీ ప్రిన్సిపల్‌గా సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు తీవ్ర సందేహాస్పదంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో శుక్రవారం సందీష్ ఘోష్ చుట్టు ఉచ్చు మరింత బిగిసేలా.. ఆర్జీ కార్ ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ సిట్ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోల్‌కతా హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఆర్జీ కార్ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ ఆధారంగా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు సైతం ఆగ్రహంఈ వారం ప్రారంభంలో అక్తర్ అలీ డాక్టర్ సందీష్ ఘోష్ మార్చురీలోని అనాధ శవాలతో వ్యాపారం చేశారని, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు సందీష్ ఘోష్‌ను విచారణకు ఆదేశించింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో ఎవరు టచ్‌లో ఉన్నారు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఎందుకు ఆలస్యం అయ్యింది?అని బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కోర్టు ప్రశ్నించింది. -
కేజ్రీవాల్ విచారణకు సీబీఐకి అనుమతి
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అవినీతి కేసులోప్రాసిక్యూట్ చేసేందుకు తమకు అనుమతి లభించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సంస్థ వెల్లడించింది. లిక్కర్‌స్కామ్ అవినీతి కేసులో ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌నూ విచారించనున్నట్లు సీబీఐ తెలిపింది. తమకు అనుమతి లభించిన విషయాన్ని సీబీఐ తాజాగా రౌస్ ఎవెన్యూకోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్‌పై సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఆగస్టు 27న కోర్టు పరిగణలోకి తీసుకోనుంది. ఛార్జ్‌షీట్ అనంతరం కేసు విచారణ ముందుకు సాగాలంటే కేజ్రీవాల్ విచారణకు పరిపాలన పరమైన అనుమతి తప్పనిసరి. దీంతో సీబీఐ ఈ మేరకు అనుమతులు తెచ్చుకుంది. మరోవైపు, సీబీఐ అరెస్టును సవాలు, బెయిల్ విజ్ఞప్తిపై దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. -
కోల్‌కతా డాక్టర్ కేసు.. ఆ వేలి ముద్రలు ఎవరివి?
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్య, అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో బాధితురాలి స్నేహితులకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ సిద్ధంగా ఉందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యురాలి కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఆమె నలుగురి స్నేహితుల్ని విచారించారు. విచారణలో వారు చెప్పిన సమాధానాలు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే ఆమె స్నేహితులకు లై డిటెక్టర్ టెస్ట్‌లు నిర్వహించే యోచనలో సీబీఐ అధికారులు ఉన్నారంటూ జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. లై డిటెక్టర్ టెస్ట్‌లో ఇద్దరు మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, హౌస్ సర్జన్, ఇంటర్న్లు ఉన్నారు. తాజాగా, ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై దారుణం జరగకముందు, జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ రాత్రి ఏం జరిగింది?ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందన్న దానిపై సీబీఐ కీలక సమాచారం సేకరించింది. ఆగస్ట్ 8న అర్ధరాత్రి వేళ బాధిత జూనియర్ వైద్యురాలు, ఇద్దరు మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, హౌస్ సర్జన్, ఒక ఇంటర్న్ కలిసి భోజనం చేశారు. అనంతరం సెమినార్ గదికి వారు వెళ్లారు. ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్‌ను వీక్షించారు. కాగా, తెల్లవారుజామున 2 గంటలకు, ఇద్దరు సహచరులు డ్యూటీలో ఉన్న వైద్యులు విశ్రాంతి తీసుకునే గదిలోకి వెళ్లారు. బాధితురాలు సెమినార్ గదిలోనే ఉండిపోయింది. సెమినార్ హాల్, డాక్టర్లు విశ్రాంతి తీసుకునే గది, ఇంటర్న్‌ల గది కూడా మూడవ అంతస్తులో దగ్గరగా ఉన్నాయి.మరోవైపు మరునాడు ఉదయం 9.30 గంటలకు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్లలో ఒకరు బాధితురాలి కోసం వెతికేందుకు వెళ్లాడు. దూరం నుంచి కదలలేని స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని చూశాడు. వెంటనే తన సహోద్యోగులకు, సీనియర్ వైద్యులకు అతడు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆసుపత్రి అధికారులకు ఈ సమాచారం అందించారని సీబీఐ అధికారులు తెలుసుకున్నారు.అయితే వైద్యురాలిపై దారుణం జరిగిన ప్రదేశంలో ఆమె నలుగురి స్నేహితుల్లో ఇద్దరి వేలుముద్రలు లభ్యమవ్వడం.. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారికి లై డిటెక్టర్ చేయాలంటూ సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్నారు. -
సీబీఐకి ఆర్జీకర్ కాలేజి ప్రిన్సిపల్ అవినీతి కేసు
కలకత్తా: మహిళా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన కలకత్తా ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు షాక్ తగిలింది. ఆయనపై అవినీతి ఆరోపణల కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు శుక్రవారం(ఆగస్టు23) సిట్‌ను ఆదేశించింది.ప్రస్తుతం ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. సీసీటీవీ ఫుటేజీలు, కేసు డైరీతో సహా అన్ని వివరాలను శనివారం ఉదయం 10 గంటల్లోపు సీబీఐకి అందించాలని సిట్‌కు హైకోర్టు సూచించింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. అనంతరం ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.అనాథ శవాల దందా, వాడేసిన సిరంజులు, ఇతర సామాగ్రిని రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకొనేవారని ఆరోపణలు వచ్చాయి. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో సందీప్ ఘోష్‌ను ఇప్పటికే సీబీఐ విచారిస్తోంది. ఈ విచారణ సమయంలో ఘోష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో నలుగురికి సీబీఐ పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనుంది. -
Kolkata Case: ఒక రోజు ముందే వైద్యురాలిపై కన్నేసిన నిందితుడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతామహిళా డాక్టర్ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసుల దర్యాప్తుల్లో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. ఘటన జరిగే ముందు రోజే నిందితుడు బాధితురాలి కదలికలను గమనించి ఆమెను వెంబడించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు వెల్లడైంది. ట్రైనీ వైద్యురాలిపై ఆగష్టు9న(శుక్రవారం తెల్లవారుజామున) అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు రోజు అంటే ఆగష్టు 8న వైద్యురాలిని ఆసుపత్రిలని చెస్ట్ మెడిసిన్ వార్డ్‌లో ఫాలో అయినట్లు సంజయ్ రాయ్ తెలిపాడు.ఇందుకు సంబంధించి ఆగష్టు 8న ఛాతీ వార్డులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. పౌర వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ బాధితురాలితోపాటు మరో నలుగురు జూనియర్ డాక్టర్లను వెంబడించినట్లు కనిపిస్తుంది.కాగా ఆగష్టు 8న నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ వైద్యురాలు.. విశ్రాంతి కోసం ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 1 గంటలకు సెమినార్ హాల్‌కు వెళ్లింది. సెమినార్ హాలులో తెల్లవారుజామున 2.30 గంటలకు ఓ జూనియర్ డాక్టర్ ఆమెతో మాట్లాడారు. వారి సంభాషణ అనంతరం వైద్యురాలు నిద్రపోయింది. ఆ సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్లోకి ప్రవేశించి.. వైద్యురాలిపై హత్యాచారానికి ఒడిగట్టాడు. సంజయ్ రాయ్ తెల్లవారుజామున 4 గంటలకు ప్రాంగణంలోకి ప్రవేశించడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అంతేగాక నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన బ్లూటూత్ హెడ్సెట్ ఆధారంగా రాయ్‌ని అరెస్ట్ చేశారు.ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. బాధితురాలికి న్యాయ చేయాలని కోరుతూ వైద్యులు, వైద్య సిబ్బంది విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు సైతం విచారణ చేపట్టింది. ఈ ఘటనలో కేసు నమోదు చేయడం, విచారణలో ఆలస్యంపై బెంగాల్ ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది. అయితేసంజయ్ రాయ్ మానసిక స్థితిని అంచనా వేయడానికి సీబీఐ కొందరు మానసిక విశ్లేషకులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. నిందితుడిని అన్ని కోణాల్లో ప్రశ్నించిన తర్వాత అతడు ఓ 'కామ పిశాచి' అని నిర్ధారించారు. జంతులాంటి ప్రవృత్తితో విచ్చలవిడిగా తయారయ్యాడని తేల్చారు. పోర్న్ వీడియోలకు బానిసై, కామోన్మాదం బాగా తలకెక్కిన స్థితిలో దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని గుర్తించారు. విచారణ సమయంలో సంజయ్ రాయ్‌లో ఎలాంటి భయం కానీ పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. సెమినార్ హాల్లోకి ప్రవేశించడం దగ్గరి నుంచి, జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేయడం, ఆ తర్వాత ఆమెను చంపేయడం వరకు పూసగుచ్చినట్టు అతడు చెబుతుండడం చూసి మానసిక నిపుణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా, అత్యాచారం ఎలా చేసిందీ చెబుతున్నప్పుడు అతడి ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు లేకపోగా, అదేదో సాధారణమైన చర్య అయినట్టు అతడు జరిగింది జరిగినట్టు చెప్పడం సీబీఐ బృందాన్ని నివ్వెరపరిచింది. అదే సమయంలో సీబీఐ సంజయ్ రాయ్‌తోపాటు ఆర్జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, మరో నలుగురు వైద్యులను పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. -
కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనలో క్రైం సీన్ మార్చేశారు... సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Kolkata Doctor Case: క్రైం సీన్‌నే మార్చేశారు
న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి, వైద్య కళాశాలలో వైద్యురాలి హత్యాచారోదంతంపై తమ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్టు సీబీఐ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘‘ఈ పాశవిక చర్యను కప్పిపుచ్చి ఆత్మహత్యగా చిత్రించేందుకు స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రయతి్నంచారు. అందులో భాగంగా మేం దర్యాప్తు బాధ్యతలు స్వీకరించే నాటికి ఏకంగా క్రైం సీన్‌నే సమూలంగా మార్చేశారు.ఈ కారణంగా దర్యాప్తు తమకో పెను సవాలుగా మారింది’’ అంటూ నివేదించింది. ‘‘తొలుత వైద్యురాలి ఆరోగ్యం బాగా లేదంటూ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వాళ్లు ఆస్పత్రికి చేరుకున్నాక ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. హతురాలి అంత్యక్రియలు పూర్తయ్యాక తీరుబడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’’ అని పేర్కొంది. ‘అంతేకాదు, ఆగస్టు 9న ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఆస్పత్రి వైద్యులు ఫోన్ చేసి వైద్యురాలు అపస్మారక స్థితిలో ఉందని సమాచారమిచ్చారు. నిజానికి ఆమె అప్పటికే చనిపోయింది’’ అని తెలిపింది. ప్రిన్సిపల్ వెనక ఎవరున్నట్టు: సీజేఐ కోల్‌కతా దారుణాన్ని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించడం తెలిసిందే. ధర్మాసనం ఆదేశం మేరకు ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన అంశాలతో దర్యాప్తు పురోగతిపై గురువారం సీబీఐ స్థాయీ నివేదిక సమరి్పంచింది. బెంగాల్ సర్కారు కూడా ఓ నివేదిక సమరి్పంచింది. ఈ కేసులో కోల్‌కతా పోలీసుల దర్యాప్తు అత్యంత లోపభూయిష్టమంటూ జస్టిస్ పార్డీవాలా ఈ సందర్భంగా మండిపడ్డారు. ‘‘సాయంత్రం 6.10 నుంచి 7.10 మధ్య పోస్టుమార్టం జరిపారు. అంటే అది అసహజ మరణమని అప్పటికే రూఢీ అయినట్టే. కానీ అర్ధరాత్రి కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం చాలా ఆశ్చర్యకరం.గత 30 ఏళ్లలో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు’’ అంటూ ఆయన తూర్పారబట్టారు. అర్ధరాత్రి పోస్టుమార్టం తర్వాత గానీ క్రైం సీన్‌ను పోలీసులు అ«దీనంలోకి తీసుకోలేదంటూ సీజేఐ ఆక్షేపించారు. అసహజ మరణమని పొద్దున్నే తేలినా ఎందుకంత ఆలస్యం చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ దాఖలులో కోల్‌కతా పోలీసుల అసాధారణ జాప్యం అత్యంత తీవ్రమైన అంశమంటూ దుయ్యబట్టారు. ‘‘14 గంటలు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడమా?! ఘోరం గురించి ఉదయమే తెలిసినా, సాయంత్రానికల్లా పోస్టుమార్టం చేసినా రాత్రి 11.30 దాకా పోలీసులకు సమాచారమే ఇవ్వలేదు. నిజానికి విషయం తెలియగానే నేరుగా ఆస్పత్రికి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చూడటం ప్రిన్సిపల్ కనీస బాధ్యత.ఈ విషయంలో ఆయన ఎందుకు జాప్యం చేసినట్టు? అసలాయన ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు? దాని వెనక కారణాలేమిటి? విమర్శల తీవ్రతకు ఎట్టకేలకు ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకపోగా ఆయన్ను సింపుల్‌గా మరో వైద్య కాలేజీకి బదిలీ చేసింది’’ అంటూ సీజేఐ ఆక్షేపించారు. దీనంతటినీ ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి తొలి ఎంట్రీ నమోదు చేసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు తమ ఎదుట హాజరై ఎంట్రీ నమోదు సమయం తదితర వివరాలన్నింటినీ నేరుగా వెల్లడించాలని ఆదేశించారు.ఈ ఉదంతాన్ని రాజకీయం చేయొద్దని పారీ్టలకు సీజేఐ సూచించారు. హతురాలి జననాంగంలో 150 జీఎం పరిమాణంలో వీర్యం ఉందన్న సీబీఐ తరఫు న్యాయవాది వాదనను తప్పుబట్టారు. సోషల్ మీడియా వార్తల ఆధారంగా వాదనలు విని్పంచొద్దంటూ మందలించారు. గ్యాంగ్ రేప్ జరగలేదని, ఇది కేవలం ఒక్కరి పనేనని ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తులో తేలిందని, డీఎన్ఏ నివేదిక కూడా దీన్నే ధ్రువీకరిస్తోందని సీబీఐ పేర్కొన్నట్టు సమాచారం!మెహతా వర్సెస్ సిబల్పశి్చమ బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఆయనకు, సీబీఐ తరఫున వాదనలు విన్పించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు మధ్య సాగిన వాడీ వేడి వాదనలు కోర్టు హాలును వేడెక్కించాయి. ఎఫ్ఐఆర్ దాఖలులో చోటుచేసుకున్న లోటుపాట్లను తాను వివరిస్తుంటే సిబల్ హేళనగా నవ్వుతున్నారంటూ ఒక దశలో మెహతా తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘ఒక అమాయకురాలు అత్యంత హృదయ విదారక పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయింది. కనీసం నవ్వకుండా ఉండటం సంస్కారం’’ అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేశారు.వైద్యులు పట్టుబట్టినందుకే వీడియో జరిగిన దారుణం గురించి తెలిసినా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఘోష్ వెంటనే ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటూ సొలిసిటర్ జనరల్ మెహతా తప్పుబట్టారు. హతురాలి తండ్రి ఎంతగా డిమాండ్ చేసినా అంత్యక్రియల అనంతరం రాత్రి 11.45 గంటలకు గానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం చాలా దారుణమని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘పోస్టుమార్టాన్ని వీడియో తీయాల్సిందేనని వైద్యురాలి సహచరులు, సీనియర్ డాక్టర్లు పట్టుబట్టారు. లేదంటే ఆ ఆధారాలు కూడా మిగిలేవి కాదు’’ అన్నారు. వీటిని సిబల్ ఖండించారు. సీబీఐ నివేదికను బురదజల్లే యత్నంగా అభివర్ణించగా మెహతా తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిజాలను కప్పిపెట్టేందుకు చల్లిన బురదను తొలగించేందుకే సీబీఐ ప్రయతి్నస్తోందన్నారు.నేనూ ధర్మాసుపత్రిలో నేలపై పడుకున్నా: సీజేఐ వైద్యుల సమస్యల గురించి ప్రస్తావిస్తూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి తన కుటుంబీకుల్లో ఒకరికి చికిత్స సందర్భంగా స్వయంగా ధర్మాసుపత్రిలో నేలపై పడుకున్నానని చెప్పారు. వైద్యులు దారుణమైన పరిస్థితుల నడుమ పని చేస్తున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వాళ్లకు కనీస మౌలిక వసతులు కూడా అందుబాటులో లేవు. 36 గంటలు, అంతకుమించి నిరంతరాయంగా పని చేయాల్సి వస్తోంది. ఇది అత్యంత అమానవీయం.అంతసేపు పని చేసి పూర్తిగా అలసిపోయిన స్థితిలో ఎవరన్నా వేధించినా అడ్డుకుని స్వీయరక్షణ చేసుకునే స్థితిలో కూడా ఉండరు! ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయని వైద్యులు దయచేసి అర్థం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు. న్యాయం, ఔషధాలు అందడంలో జాప్యం జరగరాదన్నారు. సమ్మె విరమించి విధులకు వెళ్లాల్సిందిగా వైద్యులను మరోసారి అభ్యర్థించారు. ఆందోళనల్లో పాల్గొన్నందుకు ఆస్పత్రి వర్గాలు తమను వేధిస్తున్నాయని నాగ్‌పూర్ ఎయిమ్స్ వైద్యులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాంతో వైద్యుల శాంతియుత నిరసనలపై బలప్రయోగానికి దిగొద్దని, విధుల్లో చేరాక ప్రతీకార చర్యలేవీ తీసుకోవద్దని సీజేఐ ఆదేశించారు.సలహాల కోసం పోర్టల్‘‘దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం కేంద్ర, రాష్ట్రాలు వారం లోపు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో, డీజీపీలతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సంప్రదింపులు జరపాలి’’ అంటూ సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. ‘‘వైద్యుల భద్రత తదితరాలపై సలహాల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలి. సలహాలు, సూచనలను నేషనల్ టాస్‌్కఫోర్స్ పరిగణనలోకి తీసుకుని వైద్యుల భద్రతపై నేషనల్ ప్రొటోకాల్‌ను రూపొందించాలి’’ అంటూ పలు నిర్దేశాలు జారీ చేశారు. విచారణను సెపె్టంబర్ 5కు వాయిదా వేశారు.మాజీ ప్రిన్సిపల్‌కు లై డిటెక్టర్ టెస్టు మరో నలుగురు వైద్యులకు కూడావైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో హతురాలి సహచరులైన నలుగురు వైద్యులకు కూడా లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు గురు వారం అనుమతి జారీ చేసింది. మరోవైపు అమానుషంగా ప్రవర్తించడం ఘోష్‌కు అలవాటని ఆయన ఇరుగుపొరుగు చెబుతున్నారు. సిజేరియన్ అయిన రెండు వారాలకే భార్యను ఆయన దారుణంగా కొట్టారంటూ 12 ఏళ్ల నాటి ఉదంతాన్ని గుర్తు చేస్తూ వారు చెప్పుకొచ్చారు.రేప్‌కు కఠిన చట్టాలు తెండిమోదీకి మమతా బెనర్జీ లేఖకోల్కతా: మానభంగానికి పాల్పడేవారికి అతి తీవ్రమైన శిక్షలను విధించేలా కేంద్రం కఠిన చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేస్తూ పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో పీటీ ట్రైనీ డాక్టర్ పాశవిక హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఈ లేఖను సంధించారు. ‘దేవవ్యాప్తంగా ప్రతిరోజూ రేప్‌లు జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి ప్రతిరోజూ భారత్‌లో 90 రేప్‌లు జరుగుతున్నాయి. వీటిలో చాలాకేసుల్లో బాధితులు హత్యకు గురవుతున్నారు. ఈ పరంపర భీతి గొల్పుతోంది. దేశం, సమాజం విశ్వాసాన్ని, అంతరాత్మను కుదిపేస్తోంది. ఈ ఘోరాలకు ముగింపు పలకడం మన విధి. అప్పుడే మహిళలు సురక్షితంగా, భద్రంగా ఉన్నామని భావిస్తారు. ఇలాంటి ఆందోళకరమైన, సున్నితమైన అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి. అత్యంత కఠినమైన కేంద్ర చట్టాన్ని తేవాలి. రేపిస్టులకు అతి తీవ్రమైన శిక్షలు విధించాలి’ అని మమత లేఖలో కోరారు.రేప్ కేసుల విచారణ వేగంగా జరగాలంటే ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరగాలంటే కేసు విచారణ 15 రోజుల్లోగా పూర్తి కావాలని మమత అన్నారు. వైద్యురాలి హత్యాచారం కేసులో మమత సర్కారు వ్యవహరించిన శైలిని సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మమత తీవ్ర విమర్శలను, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. డాక్టర్ల సమ్మె విరమణ ప్రకటించిన ఫైమాన్యూఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై ఆందోళనకు దిగిన డాక్టర్లు 11 రోజులుగా తాము చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు నుంచి సానుకూల ఆదేశాలు రావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) వెల్లడించింది. డాక్టర్లు సమ్మె విరమించాలని, తిరిగి విధులకు హాజరయ్యే వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలుండవి సుప్రీంకోర్టు గురువారం హామీ ఇచి్చంది. ’భారత ప్రధాన న్యాయమూర్తి నుంచి సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమించాలని నిర్ణయించాం.ఆసుపత్రుల్లో భద్రత పెంచడం, డాక్టర్లకు రక్షణపై మా వినతులను సుప్రీంకోర్టు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నాం. ఐక్యతతో చట్టపరంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని ఫైమా ‘ఎక్స్’లో వెల్లడించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు ఎయిమ్స్ ఢిల్లీ, ఆర్ఎంఎల్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ, ఇందిరాగాంధీ హాస్పిటల్ రెసిడెంట్ డాక్టర్స్ సమ్మెను విరమిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. బెంగాల్లో మాత్రం సమ్మె విరమించేది లేదని వైద్యులు, వైద్య సిబ్బంది ప్రకటించారు. -
కోల్‌కతా డాక్టర్‌ది గ్యాంగ్ రేప్ కాకపోవచ్చు.. సీబీఐ స్టేటస్ రిపోర్ట్
ఢిల్లీ : కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది. విచారణ సందర్భంగా సీబీఐ స్టేటస్ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటి నుంచి జూనియర్ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగిందనే అనుమానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో సీబీఐ స్టేటస్ రిపోర్ట్ అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.జూనియర్ వైద్యురాలిది సామూహిక అత్యాచారం కాకపోవచ్చు అని సీబీఐ తన స్టేటస్ రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే దారుణానికి ఒడిగట్టినట్లు సుప్రీంకు సీబీఐ ఇచ్చిన నివేదికలో తేలినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఫోరెన్సిక్, డీఎన్ఏ నివేదికలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి అని సీబీఐ కోర్టుకు తెలిపింది. హాస్పిటల్లో సంజయ్ రాయ్ కదలికలు సీసీటీల్లో రికార్డ్ అయ్యాయన్న సీబీఐ.. కేసును అన్నీ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ స్టేటస్ రిపోర్ట్‌లో వెల్లడించింది. అయితే ఈ దారుణ ఘటనలో ఒక్కరి ప్రమేయం మాత్రమే ఉందా.. లేక సామూహిక అత్యాచారమా అనే కోణంలో సీబీఐ తన దర్యాప్తును ఇంకా కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను స్వతంత్ర నిపుణులకు పంపిన తర్వాత తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆగస్ట్ 9న కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలోఆగస్ట్ 9న కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీకి చెందిన 31 జూనియర్ డాక్టర్‌పై నిందితుడు సంజయ్ రాయ్ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే బాధితురాలిపై నిందితుడు సంజయ్ రాయ్ అఘాయిత్యానికి పాల్పడినా..ఆస్పత్రి సిబ్బంది బాధితురాలి తల్లిదండ్రులకు ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేయడం, ఘటన జరిగిన స్థలాన్ని భద్రపరచుకుండా మరమ్మత్తులు చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేసు తప్పుదోవ పట్టించేందుకు సాక్ష్యాల్ని నాశనం చేస్తున్నారని ఆందోళనలు మొదలయ్యాయి. దీనికితోడు అదే ఆస్పత్రి ఎదుట వేలాది మంది ఆందోళన కారులు గుమిగూడడం భద్రతపై అనేక అనుమానాలు తలెత్తాయి.అయితే ఆర్జీకార్ ఆస్పత్రి కేసులో ప్రభుత్వం తీరుపై అనుమానం వ్యక్తమయ్యాయి. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని కోరుతూ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. ఆస్పత్రిలో ఘోరం జరుగుతున్నా ఎవరికి తెలియకపోవడం, అప్పటి ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్ రెండ్రోజుల తర్వాత రాజీనామా చేసి.. మరో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఛార్జ్ తీసుకోవడం వంటి అంశాలను కోల్‌కతా హైకోర్టు తీవ్రంగా మండిపడింది. కేసును సీబీఐకి అప్పగించింది. సందీష్ ఘోష్‌ను విచారించాలని సూచించింది. దీంతో సందీష్ ఘోష్‌ను సీబీఐ అధికారులు విచారించగా.. పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది నుంచి సందీష్ ఘోష్ అక్రమార్జనకు పాల్పడేవారని, ఆస్పత్రి మార్చురి వార్డ్‌లో శవాలతో వ్యాపారం చేసేవారని, నిబంధనల్ని ఉల్లంఘించి ఆస్పత్రి కాంట్రాక్ట్‌లు కట్టబెట్టేవారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.ఆర్జీకార్ దారుణంపై సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతుండగానే వైద్యురాలిపై లైంగికదాడి, హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆగస్ట్ 20న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని బెంచ్ విచారించింది.విచారణ సందర్భంగా ఆగస్ట్ 22లోపు కోల్‌కతా హత్యాచార ఘటనకు సంబంధించిన ఇప్పటిదాకా జరిపిన దర్యాప్తు స్టేటస్‌ను అందించాలని సీబీఐకి,ఆర్జీకార్ ఆస్పత్రి విధ్వంసానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇవాళ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ తమ స్టేటస్ రిపోర్ట్‌లను కోర్టుకు అందించాయి. వాటిపై విచారణ చేపట్టిన కోర్టు వైద్యుల భద్రతపై ఆసుపత్రులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ టాస్క్ ఫోర్స్ కమిటీ ముందు వైద్యులు తమ భద్రతకు సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చేలా పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. -
కోల్ కతా ఘటనపై సుప్రీం కోర్టుకు సీబీఐ సంచలన రిపోర్ట్
-
కోల్‌కతా కేసు: వైద్యుల భద్రతపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. గురువారం ఆర్జీకర్ ఘటనకు సంబంధించి ఇప్పటి దాకా జరిపిన దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్‌ను సీబీఐ సుప్రీం కోర్టుకు అందించింది. ఆర్జీ కర్ ఆస్పత్రి విధ్వంసానికి సంబంధించిన నివేదికను పశ్చిమ బెంగాల్ పోలీసులు సుప్రీం కోర్టుకు సమర్పించారు. ఈ రెండు స్టేటస్ రిపోర్ట్‌లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్యుల భద్రతపై ఆసుపత్రులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ టాస్క్ ఫోర్స్ కమిటీ ముందు వైద్యులు తమ భద్రతకు సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చేలా పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సూచించింది. శాంతియుత నిరసనలకు విఘాతం కలిగించవద్దని, ఆర్జీ కర్ ఘటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వైద్య సంస్థల వద్ద హింస, ఎలాంటి భయాందోళనలు లేకుండా చర్యలు తీసుకోవాలి వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసిన సుప్రీంకోర్టు నిరసన తెలిపిన వైద్యులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దు ఈ పరిస్థితిని రాజకీయం చేయవద్దని, చట్టం తన పని తాను చేసుకుంటోందన్న సుప్రీంకోర్టు వైద్యుల సంక్షేమం, భద్రతపై తాము ఆందోళన చెందుతున్నామన్న సుప్రీంకోర్టు వైద్యుల భద్రతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లతో చర్చించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ఆదేశించిన సుప్రీంకోర్టు వారంలోగా సమావేశాన్ని నిర్వహించాలని, రెండు వారాల్లో రాష్ట్రాలు పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ సెప్టెంబర్ 5 వాయిదా వేసిందిజూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీం కోర్టులో విచారణ..డాక్టర్లకు అధిక పనిగంటలపై సుప్రీం కోర్టు సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు.వైద్య నిపుణులు తిరిగి విధుల్లో చేరాలని, వారు తిరిగి విధుల్లో చేరిన తర్వాత అధికారులు ప్రతికూల చర్యలు తీసుకోకుండా ఆదేశిలిస్తామన్న సుప్రీంకోర్టుడాక్టర్లు తిరిగి విధుల్లోకి రాకపోతే ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు ఎలా పనిచేస్తాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఆర్జీ కర్ ప్రిన్సిపల్ ఘోష్ అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని సుప్రీంకోర్టుకు వెల్లడించిన జూనియర్ డాక్టర్స్ తరఫున న్యాయవాదిసీబీఐ దర్యాప్తు నివేదికను కోర్టుకు అందజేసిన సొలిసిటర్ జనరల్స్టేటస్ రిపోర్టును పరిశీలించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీ. వై చంద్ర చూడ్ ధర్మసనం అయిదో రోజున సీబీఐ దర్యాప్తు ప్రారంభించిందిశవ దహనం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారుతొలుత ఆత్మహత్య అని చెప్పారుఅక్కడున్న డాక్టర్లు పట్టుబట్టడం వల్లే వీడియోగ్రఫీ చేశారునిందితుడి గాయం గురించి సీజేఐ ఆరా తీశారు. ఇది కేసు డెయిరీలో భాగమని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు.5వ రోజున సీబీఐ దర్యాప్తు ప్రారంభించిందని, దీంతో కేసు అంతా తారుమారయ్యిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వివరించారు.సీనియర్ న్యాయవాది సిబల్ కేసులో ప్రతిదీ వీడియోగ్రాఫ్ చేయబడిందని తెలిపారు.మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత 11:45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని, సీనియర్ డాక్టర్లు, సహచరులు పట్టుబట్టడంతో వీడియోగ్రఫీ చేశామని తుషార్ మెహతా తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలపై సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒక అంశం చాలా కలవరపెడుతుందని, అసహజ మరణమని ఉదయం 10:10 గంటలకు నమోదు చేశారు. అయితే క్రైం సీన్ భద్రపరచడం, జప్తు చేయటం రాత్రిపూట జరిగాయని సీజేఐ డీ.వై చంద్రచూడ్ ప్రశ్నించారు.మొత్తం వీడియోగ్రఫీ చేయబడిందని బెంగాల్ ప్రభుత్వం తరఫున న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.ఈ ఘటనలో బెంగాల్ ప్రభుత్వం అనుసరించిన తీరు తనకు స్పష్టంగా కనిపించలేదని ధర్మాసనంలోని జస్టిస్ జేబీ పార్దివాలా అన్నారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రవర్తనపై ఆయన సందేహాన్ని లేవనెత్తారు. ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారని ప్రశ్నించారు.బాధ్యతాయుతమైన ప్రకటన ఇవ్వాలని, ఆవేశపూరిత ప్రకటన చేయవద్దని సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబల్‌కు సూచించింది. అసహజ మరణం కేసు ఎప్పుడు నమోదైందనే విషయాన్ని కోర్టుకు ఇంకా సమాధానం రాలేదు. మరోరోజు ఈ విషయాన్ని తీసుకుంటామని, బాధ్యతాయుతమైన పోలీసు అధికారిని ఇక్కడ ఉంచాలని కోర్టు పేర్కొంది.అసహజ మరణం అని తెలిసిన తర్వాత ఎందుకు పోస్టుమార్టం చేశారు? బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్నకోల్కతా పోలీసుల దర్యాప్తు సరిగ్గా లేదుగత 30 ఏళ్లలో లోపాలు ఉన్న ఇలాంటి ఘటన చూడలేదని పేర్కొన్న ధర్మాసనంపోస్టుమార్టం తర్వాత సంఘటన స్థలాన్ని ధ్వంసం చేశారు.కోల్‌కతా పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.పోలీసుల దర్యాప్తు ఆందోళనకంగా ఉంది.ఆగస్టు 9న రాత్రి 7 గంటలకు ఘటనా స్థలాన్ని భద్రపరిచారు. పోస్ట్‌మార్టమ్ తర్వాత నేరం జరిగిన ప్రదేశాన్న ఎందుకు భద్రపర్చలేదు. ‘సీడీ చూశాము, పోలీసు అధికారుల కదలికలు, మృతదేహం ఎప్పుడు కనిపించిందో, పోలీసులు ఎప్పుడు వచ్చారో, అసహజ మరణ నివేదిక, పోస్ట్‌మార్టం నివేదిక, దహన సంస్కారాలు, ఎఫ్ఐఆర్’పరిశీలించాలని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. అయితే సాధారణ డైరీ ఎంట్రీని చదవమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టును కోరారు. రాత్రి 11:30 గంటలకు అసహజ మరణం కేసు నమోదు చేయబడిందని అది సాధారణ డైర నమోదు మాత్రమే విజ్ఞప్తి చేశారు. కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ సంచలన రిపోర్ట్ ఇచ్చింది..అత్యాచారం, మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారుతల్లిదండ్రులను తప్పుదారి పట్టించారుశవ దహనం తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సంఘటన స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారు సీబీఐ స్టేటస్ రిపోర్ట్‌లోని కీలకాంశాలు.. ముఖ్యంగా కోల్‌కతా పోలీసులు, కాలేజీ ప్రిన్సిపాల్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘నిందితుడ్ని అరెస్ట్ చేశాక.. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంలో ఆలస్యం జరిగింది. కేసును విచారించడంలో లోకల్ పోలీసులు అలసత్వం ప్రదర్శించారు. సాక్ష్యాలు, ఆధారాలు నాశనం అయ్యాక కేసు నమోదు చేశారు. మరోవైపు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ప్రిన్సిపాల్ ఆలస్యం చేశారు. పైగా బాధితురాలి ఆత్మాహత్య అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆస్పత్రిలో దాడి జరిగింది. ఘటనా స్థలాన్ని ప్రొటెక్ట్ చేయడంలోనూ పోలీసులు ఘోరంగా విఫలం అయ్యారు. నిందితుడి వెనుక ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీయడంలోనూ పోలీసులు విఫలం అయ్యారు’’ అని సీబీఐ పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని మంగళవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా ఈ ఘోరానికి సంబంధించిన దర్యాప్తు పురోగతిపై ఆగస్టు 22లోపు స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని, సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో వైద్య సిబ్బంది భద్రత కోసం నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటునకు ఆదేశించింది. -
ఏం జరగనుందో?..రేపే కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీంలో విచారణ
ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై రేపు (ఆగస్ట్22న) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.ఈ దుర్ఘటనకు సంబంధించిన దర్యాప్తు పురోగతిపై ఆగస్టు 22 లోపు స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని, సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.దీంతో రేపు సుప్రీం కోర్టులో ఏం జరగనుందో ఉత్కంఠగా మారింది.ఆర్జీ కార్ ఘటన యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేస్తోంది. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ తరుణంలో కేసును విచారిస్తున్న సీబీఐ ఈ కేసులో ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్/లై డిటెక్టర్పరీక్ష నిర్వహించేందుకు కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ దారుణం చోటుచేసుకున్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు కూడా నిజ నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ యోచిస్తోంది. దర్యాప్తులో సందీష్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.వ్యభిచార గృహాలకు సంజయ్ రాయ్మరోవైపు నిందితుడు సంజయ్ రాయ్ బాధితురాలిపై హత్యాచారానికి ఒడిగట్టేముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు సమాచారం. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి పూట అప్పటికే మద్యం తాగిన రాయ్ రాత్రి 2 గంటల సమయంలో ఆసుపత్రికే చెందిన మరో సివిక్ వాలంటీర్‌తో కలిసి కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 3.50 గంటల సమయంలో రాయ్ ఆర్జీకార్ ఆసుపత్రికి చేరుకున్నాడు. 4.03 గంటల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించాడు. అనంతరం మూడో అంతస్తులో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్లాడు. అక్కడ నిద్రిస్తున్న జూనియర్ డాక్టర్‌పై దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణం వెలుగులోకి రావడం, హత్యాచారాన్ని ఆత్మహత్య అంటూ బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేయడం, సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఆగస్టు 20న విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు సీజేఐ డీ.వై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్దివాలా,మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించింది.విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం.. బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్యం,పోలీసుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్లు, ఆస్పత్రుల భద్రత కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి మూడు వారాల్లోగా మధ్యంతర నివేదికను, రెండు నెలల్లో తుది నివేదికను సమర్పించాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టిఎఫ్)కి ఆదేశించింది. మాజీ ప్రిన్సిపల్ తీరుపై అనుమానాలు ఆగస్టు 9న వెలుగులోకి వచ్చిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో డాక్టర్ హత్యాచార ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే కోల్‌కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ నియామకం వివాదాస్పదం కావడంతో కలకత్తా హైకోర్టు స్పందించింది. సందీప్ ఘోష్ సుదీర్ఘ సెలవులో ఉండాలని ఆదేశించింది. మృతురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేట్టిన కోల్‌కతా హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసింది. సీబీఐ విచారణలో సందీష్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. దీనికి తోడు ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అవకతవకలు, మార్చురీలో శవాలతో వ్యాపారం చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వరుస పరిణామలతో ఆగస్ట్ 22న సుప్రీం కోర్టు ఈ సంచనలనాత్మక కేసులో ఎలాంటి తీర్పును వెలువరిస్తోందనని యావద్ దేశం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. -
చంద్రబాబు మరో యూటర్న్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు మరో యూ టర్న్ తీసుకున్నారు. ఆరేళ్ల క్రితం బీజేపీతో విభేదాల కారణంగా అప్పట్లో ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ 2018లో ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంపై తాను యుద్ధం ప్రకటించానని.. సీబీఐని రాష్ట్రంలోకి రానిచ్చేది లేదంటూ చంద్రబాబు బీరాలు పలికారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్ది.. సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ 2019 జూన్ 6న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులనే చంద్రబాబు ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ ఎన్డీయేతో జత కట్టిన చంద్రబాబు సీబీఐ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లి‹Ùమెంట్ చట్టం–1946 ప్రకారం సీబీఐకి రాష్ట్రంలో కేసుల విచారణకు అనుమతిస్తూ హోం శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులపై విచారణ చేపట్టేందుకు అనుమతించింది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ముందస్తు అనుమతితో విచారణ చేపట్టవచ్చని తెలిపింది. ఈ అనుమతి ఈ ఏడాది జూలై 1 నుంచే అమలులోకి వచ్చినట్టుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.చంద్రబాబు ఘనతగా ఎల్లో మీడియా డప్పు సీబీఐని రాష్ట్రంలో నిషేధిస్తూ 2018లో చంద్రబాబు జారీ చేసిన ఉత్తర్వులను తోసిరాజని వైఎస్ జగన్ సర్కారు 2019 జూన్ 6న జారీ చేసిన ఉత్తర్వులనే మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. అదంతా చంద్రబాబు ఘనతగా తెలుగుదేశం పార్టీ గొప్పలు చెప్పుకుంటోంది. దానినే ఎల్లో మీడియా ప్రచారంలోకి తెచ్చి0ది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు గొప్పేనంటూ ఎల్లో మీడియా డప్పు కొడుతోంది. -
ఉన్నావ్,హత్రాస్ సీబీఐ అధికారుల చేతికే ఆర్జీ కార్ డాక్టర్ కేసు
దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రగిల్చిన కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన దారుణంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల ట్రాక్ రికార్డ్ చర్చాంశనీయంగా మారింది. గతంలో దేశంలో సంచలనం సృష్టించిన రెండు దారుణాల్లో నిందితుల్ని కటకటాల వెనక్కి నెట్టడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు మహిళా సీబీఐ అధికారులకు ఆర్జీకార్ కేసును కేంద్రం అప్పగించింది. ఇప్పుడు ఆ ఇద్దరు మహిళా అధికారుల పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగుతుంది. సీబీఐ మహిళా అధికారుల్లో ఒకరు జార్ఖండ్‌కు 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సంపత్ మీనా గతంలో హత్రాస్, ఉన్నావ్ కేసుల్ని కొలిక్కి తెచ్చారు. హత్రాస్ కేసులో సంపత్ మీనాతో పాటు సీమా పహుజా సైతం ఉన్నారు. దర్యాప్తుతో నిందితులకు శిక్షపడేలా చేశారు. కాబట్టే కేంద్రం ప్రత్యేకంగా ఆర్జీ కార్ కేసును వీరికి అప్పగినట్లు సమాచారం. సీబీఐ అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న సంపత్ మీనా ఆర్జీకార్ ఆస్పత్రి కేసు దర్యాప్తు చేస్తున్న 25 మంది అధికారుల బృందానికి బాధ్యత వహిస్తున్నారు. కేసు దర్యాప్తు ఎలా జరుగుతుందో తెలుసుకునే పర్యవేక్షక బాధ్యతల్ని ఈమే చూస్తున్నారు.మరో మహిళా సీబీఐ అధికారిణి, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీమా పహుజా సైతం 2007 నుంచి 2018 మధ్యకాలంలో పలు సంచలనాత్మక కేసుల్లో నిందితులకు శిక్షపడేలా కేసు దర్యాప్తు చేపట్టినందుకు రెండుసార్లు గోల్డ్ మెడల్ అందుకున్నారు.2017లో హిమాచల్ ప్రదేశ్‌లో 10వ తరగతి విద్యార్ధిని కేసు, ఉన్నావ్ కేసుల్ని సంపత్ మీనాతో పాటు సీమా పహుజా ఛాలెంజింగ్ తీసుకున్నారు. 2017లో హిమాచల్ ప్రదేశ్‌లో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 10వ తరగతి విద్యార్థిని కిడ్నాప్‌కు గురైంది. రెండ్రోజుల తర్వాత శవమై కనిపించింది. నాటి విద్యార్ధినిపై జరిగిన దారుణం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేసింది.అయితే ఏప్రిల్ 2018లో సీబీఐ అధికారిణి సీమా అహుజా కేసును ఛేదించారు. అధునాతన డీఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి 1000 మందికి పైగా స్థానికుల విచారణ, 250 మందికి పైగా డీఎన్ఏ పరీక్షల అనంతరం నిందితుడు అనిల్ కుమార్ తండ్రిలో ఫోరెన్సిక్ నమూనాలకు సరిపోలినట్లు కనుగొన్నారు. తండ్రి ఫోరెన్సిక్ నమూనాల ఆధారంగా నిందితుడు అనిల్ కుమార్‌ను గుర్తించారు. ఈ కేసులో అనిల్‌కుమార్‌కు జీవిత ఖైదు పడడంలో సీమా అహుజా సేకరించిన ఆధారాలు కీలకంగా వ్యవహరించాయి.ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్‌లో 2017 జూన్ 4న 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక దురాఘతంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ దోషిగా నిర్ధారించడంలో సంపత్ మీనా, సీమా పహుజాల దర్యాప్తు తోడ్పడింది.2020లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌లో 19 ఏళ్ల బాలికపై అగ్ర కులానికి చెందిన నలుగురు నిందితుల చేసిన దారుణంలో వారం రోజుల తర్వాత బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో మరణించారు. ఆ ఉదంతం దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దారి తీశాయి. ఈ కేసులో నిందితుల్ని గుర్తించి శిక్షపడేలా చేసిందనుకుగాను సీబీఐ అధికారులు సంపత్ మీనా, సీమా పహుజా దర్యాప్తు చేసిన తీరుపై ప్రశంశలు వెల్లువెత్తాయి. తాజాగా ఆర్జీకార్ జూనియర్ డాక్టర్ కేసు దర్యాప్తు చేసేలా సీబీఐ మహిళా అధికారులైన సంపత్ మీనా,సీమా పహుజాలకు కేంద్రం అప్పగించింది. -
నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రగిలి్చన వైద్యురాలి రేప్, హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించడానికి సోమవారం స్థానిక కోర్టు అనుమతించింది. ఆర్జి కార్ ఆసుపత్రిలో పీజీ ట్రైనీ డాక్టర్‌ను అత్యంత పాశవికంగా రేప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడికి ఏరోజు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలనేది సీబీఐ ఇంకా ఖరారు చేయలేదు. సంజయ్ రాయ్ మానసిక స్థితిని తెలుసుకోవడానికి సీబీఐ ఇదివరకే సైకోఅనాలసిస్ టెస్టు చేసింది. మరోవైపు కోల్‌కతా పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అసత్య ప్రచారాన్ని అడ్డుకునేందుకేనని పోలీసులు చెబుతుండగా, నిరసనకారుల గళం నొక్కేందుకేనని విపక్షాలు మండిపడుతున్నాయి. వైద్యురాలి హత్యపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సీనియర్ డాక్టర్లు కునాల్ సర్కార్, సువర్ణ గోస్వామిలకు సమన్లు జారీ చేయడంతో వారు భారీ ర్యాలీతో కోల్‌కతా పోలీసు కేంద్ర కార్యాలయానికి వచ్చారు. వైద్య రంగానికి చెందిన వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘యువ డాక్టర్‌కు న్యాయం కోరుతున్నాం. మేమేమీ నేరం చేయలేదు. పోలీసులు తమ సమన్లను వెనక్కి తీసుకున్నారు. వైద్య పరివారం సహకారాన్ని కోరారు’ అని డాక్టర్ కునాల్ సర్కార్ తెలిపారు. సీఎం మమతా బెనర్జీని బెదిరించినందుకు, బాధితురాలి పేరును సోషల్ మీడియాలో బహిర్గతపర్చినందుకు పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఆర్జి కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ వరుసగా నాలుగోరోజు కూడా విచారించింది. మరోవైపు దేశ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరసనలు సోమవారం కూడా కొనసాగాయి. కేంద్ర ఆరోగ్యశాఖతో సోమవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయని, అంగీకారయోగ్యమైన ఒప్పందానికి రాలేకపోయామని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) వెల్లడించింది. వైద్యుల సమ్మె కొనసాగుతుందని ప్రకటించింది. నేడు సుప్రీంకోర్టు విచారణ దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె, తీవ్ర ఆగ్రహావేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం పీజీ డాక్టర్ హత్యోదంతంపై సుమోటోగా విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10:30 గంటలకు విచారణ చేపడుతుంది. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సలె్టంట్స్ ఆఫ్ ఇండియా (ఫామ్కీ), ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా)లు సుమోటో కేసులో తమను భాగస్వాములను చేయాలని సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు, వైద్యురాలి హత్యోదంతంలో పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బదనాం చేస్తూ, రాజీనామా చేయాలని ఆమెవైపు వేలెత్తి చూపుతున్న వారి వేలు విరిచివేయాలని సీనియర్ మంత్రి ఉదయన్ గుహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మమతపై దాడి చేస్తూ ఆమెను వేలెత్తి చూపుతున్న వారు. రాజీనామాకు డిమాండ్ చేస్తున్న వారు ఎప్పటికీ సఫలం కాలేరు. మమత వైపు ఎత్తిన వేళ్లను విరిచేస్తాం’ అని ఉదయన్ అంటున్న వీడియో వైరల్‌గా మారింది.