కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై కోల్‌కతా హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటివరకు విచారణ చేపట్టిన రాష్ట్ర పోలీసులు ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను వెంటనే సీబీఐకి అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐని కోర్టును ఆదేశించింది.
కోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరగాలని మృతురాలి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా పోలీసుల దర్యాప్తులో పురోగతి లేదంటూ హైకోర్టు మండిపడింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ శివజ్ఞానం ఆదేశాలు జారీ చేశారు. గత వారం రోజులుగా ఈ కేసులో న్యాయం జరగాలని జూనియర్ డాక్టర్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్య, అత్యాచారం ఘటనపై విచారణను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు నోటీసులు జారీ చేసింది.
ఈ కేసును వచ్చే ఆదివారం లోపు పరిష్కరించాలని సీఎం మమతా బెనర్జీ సోమవారం పోలీసులకు డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ప్రతీ నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆమె పోలీసులను ఆదేశించారు.
National Human Rights Commission (NHRC), India has taken suo motu cognizance of a media report carried on 9th August that a junior woman doctor was found dead at the Seminar Hall of the Kolkata’s state-run R G Kar Medical College & Hospital on 9th August...The Commission has… pic.twitter.com/Ct4eSVXNzA
— ANI (@ANI) August 13, 2024
చదవండి: ట్రైనీ డాక్టర్ కేసు.. ఆర్‌జీకార్ మాజీ ప్రిన్సిపల్‌పై కోల్‌కతా హైకోర్ట్ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment