Calcutta High Court
-
25 వేల మంది టీచర్ల నియామకాలు రద్దు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్ఎస్సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం టీఎంసీ ప్రభుత్వానికి షాక్ వంటిదని చెబుతున్నారు. ఎంపిక ప్రతి దశలోనూ పాల్పడిన అక్రమాలను కప్పిపుచ్చుకు నేందుకు డబ్ల్యూబీఎస్ఎస్సీ చేసిన అతి ప్రయత్నాల వల్ల ప్రస్తుతం పరిశీలన, ధ్రువీకరణ అసాధ్యంగా మారాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవకత వకల కారణంగా మొత్తం ఎంపిక ప్రక్రియ ఉద్దేశపూర్వకంగా లోపభూయిష్టంగా మారిందని నమ్ముతున్నట్లు స్పష్టం చేసింది. కోల్‌కతా హైకోర్టు మొత్తం నియామకాలను రద్దు చేస్తూ 2024 ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును సమర్థించింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, ఒక్క వ్యక్తి చేసిన తప్పిదానికి అందరినీ ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. మానవీయ కోణంలో ఈ తీర్పును అంగీకరించబోనంటూనే సుప్రీం ఆదేశాలను అమలు చేస్తానని, న్యాయవ్యవస్థను గౌరవిస్తానంటూ ప్రకటించారు. -
ఎట్టకేలకు.. అనిల్ అంబానీకి భారీ ఊరట
అప్పుల భారం తగ్గించుకుంటున్న అనిల్ అంబానీకి భారీ ఊరట దక్కింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) వివాదంలో తమకు అనుకూలంగా కోల్‌కతా హైకోర్టు తీర్పు వెలువరించినట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధికారికంగా ప్రకటించింది. డీవీసీ-రియలన్స్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కేసుపై కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 27న విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా డీవీసీ.. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు రూ.780 కోట్లు చెల్లించాలని ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును కోల్కత్తా హైకోర్టు సమర్ధించింది.పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పే కాంట్రాక్టును రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక దశాబ్దం క్రితం రూ.3,750 కోట్లకు దక్కించుకుంది. అయితే కొన్ని వివాదాలు, ఇతర కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైంది.ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం: ఊపిరి పీల్చుకున్న దిగ్గజ దేశాలుఈ సమయంలో డీవీసీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి నష్టాన్ని కోరింది. దీన్ని సవాలు చేస్తు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్టును ఆశ్రయించింది. 2019లో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అనిల్ అంబానీ కంపెనీకి అనుకూలంగా తీర్పునిస్తూ.. రూ.896 కోట్లు చెల్లించాలని డీవీసీని ఆదేశించింది. కానీ డీవీసీ దీనిపైన కోల్కత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశంపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు అనిల్ అంబానీకి భారీ ఊరట దక్కేలా గతంలో ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాన్ని సమర్థించింది. -
నిందితుడు సంజయ్‌ది పశు ప్రవృత్తి
న్యూఢిల్లీ/ కోల్‌కతా: ట్రైనీ పీజీ డాక్టర్ హత్యాచారం కేసులో ప్ర ధాన నిందితుడైన సంజయ్ రాయ్ పశుప్రవృత్తిని కలిగి ఉన్నాడని సైకో అనాలసిస్ పరీక్షలో తేలింది. వైద్యురాలిపై పాశవిక రేప్, హత్యపై అతనిలో కించిత్తు కూడా పశ్చాత్తాపం లేదని, అశ్లీల చిత్రాలు విపరీతంగా చూస్తాడని సైకో అనాలసిస్‌లో తేలిందని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. “అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. రేప్, హత్యను ప్రతి చిన్న అంశంతో సహా పూసగుచ్చినట్లు వివరించాడు.ఏమాత్రం సంకోచించలేదు’అని సీబీఐ అధికారి చెప్పారు. సంజయ్ రాయ్ మొబైల్ ఫోన్లో పలు అశ్లీల చిత్రాలు పోలీసులకు లభించిన విషయం తెలిసిందే. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలు సంజయ్ రాయ్ ఘటనా స్థలి (ఆర్.జి.కర్ ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్) వద్ద ఉన్నట్లు నిరూపిస్తున్నాయని సీబీఐ తెలిపింది. హత్యాచారం జరిగిన ఆగస్టు 8న అర్ధరాత్రి దాటాక సంజయ్ రాయ్ తప్పతాగి ఉత్తర కోల్‌కతాలోని వేశ్యావాటికను సందర్శించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అక్కడ ఒక మహిళను నగ్న చిత్రాన్ని అడిగాడు. ఆగస్టు 9న వేకువజామున 4 గంటల ప్రాంతంలో సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నట్లు సీసీటీవీల్లో రికార్డైంది. జీన్స్ ప్యాంట్, టీ షర్టు ధరించిన అతని చేతిలో పోలీసు హెల్మెట్ ఉంది. రాయ్ కోల్‌కతా పోలీసు సివిల్ వాలంటీర్ అనే విషయం తెలిసిందే. రాయ్ మెడచుట్టూ బ్లూటూత్ డివైస్ సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. తర్వాత ఇదే బ్లూటూత్ డివైస్ క్రైమ్ సీన్లో లభించింది. దర్యాప్తులో కీలకంగా మారింది. సంజయ్‌రాయ్‌కు సంబంధించిన డీఎన్ఏ పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. సందీప్ ఘోష్‌కు లై డిటెక్టర్ టెస్టు ఆర్.జి.కర్ ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకల కేసును కలకత్తా హైకోర్టు శుక్రవారం సీబీఐకి బదిలీ చేసింది. ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అప్పగించాలని ఆసుపత్రి మాజీ డిప్యూ టీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ వేయడంతో హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. మూడు వారాల్లో పురోగతి నివేదిక సమరి్పంచాలని ఆదేశిస్తూ కేసును సెపె్టంబరు 17కు వాయిదా వేసింది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ఐదుగురికి లై డిటెక్టర్ పరీక్షలు చేయడానికి స్థానిక కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. అలాగే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై పాలిగ్రాఫ్ పరీక్షకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. మరోవైపు బీజేపీ కార్యాకర్తలు బెంగాల్ వ్యాప్తంగా పోలీసుస్టేషన్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
యువతుల లైంగిక కోరికలపై హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అదే విధంగా యువతులు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంటూ హైకోర్టు చేసిన అభ్యంతరకమైన వ్యాఖ్యాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.అక్టోబర్ 18 2023న హైకోర్టు తీర్పును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ సందర్భగా న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడి దర్మాసనం లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం కింద(పోక్సో) కేసుల నిర్వహణపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కోర్టులు తీర్పులు ఎలా ఇవ్వాలనే దానిపై కూడా జస్టిస్ ఓకా.. ఆదేశాలు జారీ చేశామన్నారు.ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ 8న హైకోర్టు ఇచ్చిన తీర్పును విమర్శిస్తూ.. అత్యంత అభ్యంతరకరమైన, పూర్తిగా అసంబద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు డివిజన్ బెంచ్ చేసిన కొన్ని పరిశీలనలను అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది కాగా గతంలో .. యవ్వనంలో ఉన్న బాలికలు రెండు నిమిషాల లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంట వ్యాఖ్యానించింది. లైంగిక ఆనందం కోసం లోంగిపోతే సమాజం దష్టిలో నష్టపోయేది యువతులనేని పేర్కొంది. లైంగిక వేధింపుల కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడిన వ్యక్తి అప్పీల్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది.జనవరి 4న ఈ కేసును విచారిస్తున్నప్పుడు, హైకోర్టు తీర్పులోని కొన్ని పేరాగ్రాఫ్‌లు "సమస్యాత్మకమైనవి" అని మరియు అలాంటి తీర్పులు వ్రాయడం "పూర్తిగా తప్పు" అని అత్యున్నత న్యాయస్థానం గమనించింది.గత ఏడాది డిసెంబరు 8న జారీ చేసిన ఉత్తర్వుల్లో, హైకోర్టు చేసిన కొన్ని పరిశీలనలను అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావిస్తూ, “ప్రథమంగా, ఈ పరిశీలనలు ఆర్టికల్ 21 (జీవించే హక్కు) కింద హామీ ఇవ్వబడిన యుక్తవయస్సులోని యువకుల హక్కులను పూర్తిగా ఉల్లంఘించేవిగా ఉన్నాయి. మరియు వ్యక్తిగత స్వేచ్ఛ) భారత రాజ్యాంగం." -
అధికార యంత్రాంగం వైఫల్యం వల్లే విధ్వంసం
కోల్‌కతా: ఆర్జీ కార్ ప్రభుత్వ ఆసుపత్రిలో దుండగులు సృష్టించిన విధ్వంసకాండపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ అధికార యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆక్షేపించింది. ఆసుపత్రిలో దాడి ఘటనపై వివరణ ఇవ్వాలని, వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని పోలీసులు, ఆసుపత్రి వర్గాలను ఆదేశించింది. ఆర్జీ కార్ ఆసుపత్రిలో విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.శివాజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విధ్వంసాన్ని పోలీసు నిఘా వర్గాలు ఎందుకు పసిగట్టలేకపోయాయని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత అసలేం జరిగిందో చెప్పాలని అధికారులను ఆదేశించారు. వైద్యురాలి మృతదేహం కనిపించిన గదిని శుభ్రం చేసి, రంగులు వేయాల్సిన అవసరం ఏమొచి్చందని నిలదీశారు. ఆసుపత్రిని మూసివేయాలని ఆదేశాలు ఇవ్వగలమని స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనలో విచారణ పురోగతిని వివరించాలని, మధ్యంతర నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు. -
దీదీ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో యువ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ దుశ్చర్యను ఖండిస్తూ.. ఓవైపు వైద్యులు, విద్యార్ధులు తీవ్ర నిరనసలువ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ఘటన జరిగిన ఆర్జీ కర్ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. తాజాగా దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పోలీసులే తమను తాము రక్షించుకోలేకపోతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు నిర్భయంగా ఎలా విధులు నిర్వర్తించగలగరని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలిపింది.ఒకవేళ రాష్ట్ర పోలీసులు వైద్యులకు రక్షణ కల్పించలేకపోతే అవసరమైతే ఆసుపత్రిని మూసివేసి.. అక్కడి రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తామని హెచ్చరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసులపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితి అదుపు తప్పిన నేపథ్యంలోనే పోలీసులను మందలించింది. ‘పోలీసులకు ముందస్తు నిఘా విభాగం ఉంటుంది. ఇలాంటి ఘటనలు తలెత్తే అవకావం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా 144 సెక్షన్ విధిస్తారు. కానీ ఇంత గొడవ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతాన్ని మీరు ఎందుకు చుట్టుముట్టలేదు. ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? 7000 మంది ప్రజలు నడుచుకుంటూ ఆసుపత్రి వద్దకు రావడం అనేది అసాధ్యం కదా? అంటూ మండిపడింది. ఇలాంటి సంఘటనలు వైద్యులు, వైద్య సిబ్బంది నైతికత, విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయిఇంత మంది ఆసుపత్రి వద్ద గుమిగూడితే.. అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే. హింసకు భయపడకుండా వైద్యులు, ఇతర సిబ్బంది తమ విధులను నిర్వహించే వాతావరణాన్ని కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి’ అని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.అదే విధంగా ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులను వివరంగా సీబీకి తెలియజేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆసుపత్రిపై దుండగుల దాడి ఘటనపై కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. తమ కేసు విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదికను దాఖలు చేయాలని సీబీఐను కోర్టు కోరింది.అయితే దుండగుల దాడిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన గదిలో సాక్ష్యాలు ధ్వంసం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించిన నేపథ్యంలో క్రైమ్‌సీన్ చెక్కుచెదరకుండా ఉందని నిరూపించే ఫొటోలను చూపించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ‘పోలీసులకు ముందస్తు నిఘా విభాగం ఉంటుంది. ఇలాంటి ఘటనలు తలెత్తే అవకావం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా 144 సెక్షన్ విధిస్తారు. మరి ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు..? 7 వేల మంది ఒకేసారి నడుచుకుంటూ ఆసుపత్రి వద్దకు రావడం అనేది అసాధ్యం. ఇంత మంది ఆసుపత్రి వద్ద గుమిగూడితే.. అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే. వైద్యులు, మెడికల్ సిబ్బంది తమ విధులను భయం లేకుండా నిర్వర్తించేలా వాతావరణం కల్పించడం ప్రభుత్వం బాధ్యత. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సందర్భంగా ఆస్పత్రిలో విధ్వంసానికి పాల్పడిన 19 మందిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ప్రకారం బుధవారం అర్థరాత్రి 40 నుంచి 50 మంది వ్యక్తుల గుంపు ఆసుపత్రి ఆవరణలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. -
కోల్‌కతా జూనియర్ డాక్టర్ కేసు సీబీఐకి అప్పగింత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై కోల్‌కతా హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటివరకు విచారణ చేపట్టిన రాష్ట్ర పోలీసులు ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను వెంటనే సీబీఐకి అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐని కోర్టును ఆదేశించింది. కోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరగాలని మృతురాలి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా పోలీసుల దర్యాప్తులో పురోగతి లేదంటూ హైకోర్టు మండిపడింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ శివజ్ఞానం ఆదేశాలు జారీ చేశారు. గత వారం రోజులుగా ఈ కేసులో న్యాయం జరగాలని జూనియర్ డాక్టర్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్య, అత్యాచారం ఘటనపై విచారణను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు నోటీసులు జారీ చేసింది.ఈ కేసును వచ్చే ఆదివారం లోపు పరిష్కరించాలని సీఎం మమతా బెనర్జీ సోమవారం పోలీసులకు డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ప్రతీ నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆమె పోలీసులను ఆదేశించారు. National Human Rights Commission (NHRC), India has taken suo motu cognizance of a media report carried on 9th August that a junior woman doctor was found dead at the Seminar Hall of the Kolkata’s state-run R G Kar Medical College & Hospital on 9th August...The Commission has… pic.twitter.com/Ct4eSVXNzA— ANI (@ANI) August 13, 2024చదవండి: ట్రైనీ డాక్టర్ కేసు.. ఆర్జీకార్ మాజీ ప్రిన్సిపల్‌పై కోల్‌కతా హైకోర్ట్ ఆగ్రహం -
మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ పరువు నష్టం దావా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువు నష్టం దావా వేశారు. బెంగాల్ రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకే మహిళలు భయపడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయన ఈ చర్యలకు దిగారు. శుక్రవారం కలకత్తా హైకోర్టులో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలో రాజ్‌భవన్‌లో పని చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిణి.. గవర్నర్ ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఇది కుట్ర అని, ముందు ముందు ఇలాంటి ఆరోపణలు చాలానే వస్తాయని ఆ టైంలోనే గవర్నర్ ఆనంద బోస్ అన్నారు. మరోవైపు ఈ ఆరోపణల పర్వం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా సచివాలయంలో జరిగిన పాలక భేటీలో ‘‘రాజ్‌భవన్‌కు వెళ్లాలంటే మహిళలు భయపడుతున్నారని, తనకు ఫిర్యాదులు చేస్తున్నారని’’ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అంతకు ముందు టీఎంసీ నేతలు కొందరు గవర్నర్ ఆనందబోస్‌పై ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. దీంతో మమతా బెనర్జీతో పాటు టీఎంసీ నేతలపైనా గవర్నర్ పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.ఈ పరిణామంపై టీఎంసీ సీనియర్ నేత డోలా సేన్ మీడియా స్పందన కోరింది. అయితే ఇది సున్నితమైన అంశం కాబట్టి పార్టీతో చర్చించాకే తమ నిర్ణయం ఏంటో చెబుతామని అన్నారాయన. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై బీజేపీ మద్దతు తెలిపింది. గవర్నర్ ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని, ఆలస్యమైనా సరైన నిర్ణయం తీసుకున్నారని, ఆయనకు తమ మద్దతు ఉంటుందని బీజేపీ సీనియర్ రాహుల్ సిన్హా చెబుతున్నారు. మరోవైపు సీపీఐ(ఎం) నేత సుజాన్ చక్రవర్తి తాజా పరిణామాలతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఒరగదని, పైగా జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీస్తాయని అంటున్నారు. -
మమత సర్కారుకు షాక్.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కారుకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం(మే22)న కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీ కోటాలోని పలు క్లాసులు చట్ట విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసింది.2012 పశ్చిమబెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలో పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు డివిజన్ బెంచ్ తెలిపింది. ఓబీసీ వర్గీకరణ చట్టవిరుద్ధంగా ఉందని స్పష్టంచేసింది.అయితే, ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రేనని ఆరోపించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎప్పటిలాగే అమలవుతాయన్నారు. -
‘సందేశ్‌ఖాలీ’ కేసు.. ఎన్నికల వేళ ‘తృణమూల్’కు షాక్
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో రాజకీయ దుమారం రేపిన సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, భూ కబ్జాల కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపింది. సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నేతలు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా వారి భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అక్కడి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తాజాగా సందేశ్‌ఖాలీ అకృత్యాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సందేశ్‌ఖాలీ అకృత్యాల కేసు చాలా సంక్లిష్టమైనది. ఇందులో నిష్పాక్షిక విచారణ జరగాలి. ఈ కేసును ఎవరు విచారించినా రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని మా అభిప్రాయం. కేసు దర్యాప్తులో భాగంగా సామాన్యుల, ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు ఎవరినైనా విచారించే అధికారం సీబీఐకి ఉంది. కేసు విచారించి సమగ్ర దర్యాప్తు నివేదిక మాకు అందించాలి’అని హై కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. సందేశ్‌ఖాలీలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నతృణమూల్ నేత షేక్షాజహాన్ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ఇదే కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేయడానికి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో సీబీఐ ఆయను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. ఈడీ అధికారులపై దాడి కేసును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. కాగా, సందేశ్‌ఖాలీ ఆందోళనలకు నేతృత్వం వహించిన రేఖాపత్రా అనే మహిళకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. సందేశ్‌ఖాలీ అంశం ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ ఓట్ల శాతానికి భారీగా గండి కొట్టి బీజేపీకి మేలు చేసే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. ప్రచారంలో యువతికి ముద్దు -
సందేశ్‌ఖాలీ హింస.. దీదీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం
సందేశ్‌ఖాలీ వ్యవహారంపై సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సందేశ్‌ఖాలీలో జరిగిన ఘటన అత్యంత సిగ్గుచేటని పేర్కొంది. ఈ మేరకు సందేశ్‌ఖాలీ హింసపై దాఖలైన పిటిషన్లను గురువారం విచారణ చేపట్టింది. సందేశ్‌ఖాళీ భూఆక్రమణ, లైంగిక ఆరోపణలపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అఫిడవిట్లో పేర్కొన్న ఒక్క విషయం నిజమైనా, అందులో ఒక శాతం వాస్తవమున్నా అది సిగ్గుచేటని పేర్కొంది. రాష్ట్రంలో పౌరుల భద్రతకు ముప్పు కలిగితే 100 శాతం ప్రభుత్వ బాధ్యతేనని తెలిపింది. దీనికి అధికార పార్టీ, స్థానిక యంత్రాంగం అందుకు పూర్తి నైతిక బాధ్యత వహించాలని చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అంతేగాక ఈ కేసులో నిందితుడైన షేక్ షాజహాన్ తరపున హాజరైన న్యాయవాదిపై సైతం చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. ‘విచారణలో ఉన్న నిందితుడి తరుపున హాజరువుతున్నారు. ముందు మీరు మీ చుట్టూ అలుముకున్న చీకటిని తొలగించండి. తరువాత మీ వాయిన్‌ను వినిపించడండి.’ అని మందలించారు. కాగా జనవరి 5న ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు షాజహాన్ షేక్ కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 55 రోజుల పాటు షాజహాన్ పరారీలో ఉండడంపై కోర్టు అసహనం వ్యక్తంచేసింది. కాగా ఫిబ్రవరి నెలలో పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆలస్యంగా అరెస్ఠ్ చేయడంపై బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. స్థానిక టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతడి అనుచరులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కవాకుండా వారి భూములను బలవంతంగా లాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన అధికార టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ వివాదానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. చదవండి: ఎన్నికల వేళ.. వంద కోట్ల ఇల్లీగల్ లిక్కర్ పట్టివేత? -
Sandeshkhali: షాజహాన్‌ను సీబీఐకి అప్పగించిన బెంగాల్ పోలీసులు
పశ్చిమ బెంగాల్‌లోని ‘సందేశ్‌ఖాలీ’ అరాచకాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన సస్పెండెడ్ టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను కస్టడీకి అప్పగించే విషయంలో బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ మధ్య రసవత్తర రాజీకీయం నడుస్తోంది. తాజాగా షాజహాన్‌ను సీబీఐకి అప్పగించేందుకు బెంగాల్ పోలీసులకు కలకత్తా హైకోర్టు కొత్త డెడ్‌లైన్ విధించింది సందేశ్‌ఖాలీ కేసుపై జస్టిస్లను హరీష్ టండన్, హిరన్మయి భట్టాచర్యాలతో కూడా ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా షాజహాన్‌ను నేటి సాయంత్రం 4.15 నిమిషాల వరకు సీబీఐకి అప్పగించాల్సిందేనని ఆదేశించింది. సీఐడీపై కోర్టు ధిక్కారం నమోదు చేయాలని సీబీఐ కోరిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో సీబీఐ అధికారులు బెంగాల్ పోలీసు హెడ్‌క్వార్టర్‌కు చేరుకున్నారు. ఎట్టకేలకు షాజహాన్‌ను పోలీసులు సీబీఐకి అప్పజెప్పారు. ఇక ఈ కేసులో షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టు మంగళవారమే ఆదేశాలు ఇచ్చింది. కానీ దీనిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లెక్కచేయలేదు. అతడిని అప్పగించబోమని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారులు కోల్‌కతాలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా.. షాజహాన్‌ను అప్పగించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో సీబీఐ అధికారులు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు. చదవండి: Rajasthan : డబుల్ జీరో! కాంగ్రెస్ ‘సున్నా’ రాత మారేనా? అనంతరం సీబీఐ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం నాటి ఆదేశాలపై సుప్రీం ఎటువంటి స్టే ఇవ్వలేదని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం షాజహాన్ షేక్‌ను అప్పగించడం లేదని ఈడీ చెప్పడంతో నేటి సాయంత్రానికి నిందితుడు షాజహాన్ షేక్‌ను అప్పగించి తీరాల్సిందేనని హైకోర్టు డెడ్‌లైన్ విధించింది. కాగా గత కొంతకాలంగా సందేశ్‌ఖాలీ పేరు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై అతడి అనుచరులు దాడి చేశారు. అనంతరం అతడు స్థానికుల నుంచి భూములు లాక్కోవడం, ఇవ్వని పక్షంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆకృత్యాలపై, టీఎంసీ గుండాలకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు రోడ్డెక్కారు. ఈ ఉద్యమానికి బీజేపీతో సహా ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో జనవరి 5 నుంచి షేక్ షాజహాన్ పరారీలో ఉన్నాడు. దాదాపు 55 రోజుల తర్వాత గవర్నర్, హైకోర్టు అల్టిమేటంతో బెంగాల్ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వమే షాజహాన్ని కాపాడుతోందని బీజేపీ విమర్శిస్తోంది. ఈ వివాదం పెద్దది కావడంతో టీఎంసీ అతడిని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇతడికి బెయిల్ ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరిస్తూ.. అతడిపై తమక సానుభూతి లేదని ప్రకటించింది. -
Calcutta High Court: వారిని డార్లింగ్ అనడం లైంగిక వేధింపే
కోల్‌కతా: ఫూటుగా తాగి మహిళా కానిస్టేబుల్‌ను డార్లింగ్ అని పిలిచిన ఓ వ్యక్తిని దోషిగా తేలుస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరిచింది. పరిచయం లేని మహిళను అలా పిలవడడాన్ని ‘లైంగిక వేధింపు నేరం’గా పరిగణిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ సందర్భంగా ఇదే కేసులో గతంలో కింది కోర్టు ఇచి్చన తీర్పును హైకోర్టు సమర్థించింది. భారతీయ శిక్షాస్మృతిలోని 354ఏ (మహిళా గౌరవాన్ని భంగపరచడం), 509 సెక్షన్ల కింద అతడిని దోషిగా తేలి్చంది. మహిళా కానిస్టేబుల్‌ను మద్యం మత్తులో డార్లింగ్ అని పిలిచిన జనక్ రామ్ అనే వ్యక్తికి గతంలో పడిన శిక్షను సమరి్థస్తూ జస్టిస్ జై సేన్ గుప్తా నేతృత్వంలోని ఏకసభ్య హైకోర్టు ధర్మాసనం తాజా తీర్పును వెలువరిచింది. ‘‘ పరిచయంలేని మహిళను తాగిన/తాగని వ్యక్తి నడి వీధిలో డార్లింగ్ అనే పిలిచే ధోరణి భారతీయ సమాజంలో లేదు. నిందితుడు మద్యం మత్తులో ఉంటే అప్పుడు నేరాన్ని మరింత తీవ్రమైనదిగా పరిగణిస్తాం’ అని జడ్జి వ్యాఖ్యానించారు. అండమాన్ నికోబార్ ద్వీపంలోని మాయాబందర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జనాన్ని అదుపు చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను ‘చలాన్ వేయడానికి వచ్చావా డార్లింగ్?’ అంటూ జనక్‌రామ్ వేధించాడు. -
Sandeshkhali: బెంగాల్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటు చేసుకున్న అశాంతి విషయంలో కోల్‌కతా హైకోర్టు సీరియస్ అయింది. సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన కేసును మంగళవారం కోల్‌కతా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సందేశ్‌కాలీ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజాహాన్ షేక్ పరారీలోనే ఉండటానికి వీలులేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన్ను సమర్థించకూడదని పేర్కొంది. సందేశ్‌ఖాలీని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని బీజేపీ నేత సువేందు అధికారి అభ్యర్థించారు. ఆయన విజ్ఞప్తిపై ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం స్పదించారు. సందేశ్‌కాళీ ప్రాంతంలోని మహిళలు చేసిన ఆరోపణలను హైకోర్టు గుర్తించిందని తెలిపారు. ‘మేము అక్కడి మహిళలకు సంబంధించి బాధలను చూశాం. ఆ ప్రాంతంలోని మహిళలు సమస్యలపై నిరసన తెలిపారు. అక్కడ కొంత భూమి ఆక్రమణకు గురైంది. ఈ కేసులో ప్రాథమికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజాహాన్ షేక్ పరారీలోనే ఉండటానికి వీలులేదు. రాష్ట్రం ప్రభుత్వం కూడా విషయాన్ని సమర్ధించదు. ఆయన లొంగిపోవాలి. ఆయన చట్టాన్ని ధిక్కరించడం సాధ్యం కాదు’అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ‘నేరాలకు పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆయన రక్షించబడుతున్నాడో? లేదో? మాకు తెలియదు. రాష్ట్ర పోలీసులు మాత్రం పలు ఘటనల్లో కీలకంగా ఉన్న షాజాహాన్ షేక్‌ను అరెస్ట్ చేయలేకపోయారు’ అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. చదవండి: Sandeshkhali: సువేందు అధికారిని మరోసారి అడ్డుకున్న పోలీసులు -
Sandeshkhali: సువేందు అధికారిని మరోసారి అడ్డుకున్న పోలీసులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సందేశ్‌ఖాలీ వ్యవహారం రోజురోజుకీ రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సందేశ్‌ఖాలీని సందర్శించడానికి వెళ్లిన రాష్ట్ర ప్రతిపక్ష నేత, బీజేపీ నేత సువేందు అధికారి, సీపీఎం బృందా కారత్ను పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. సువేందు అధికారి తన మద్దతు దారులతో కలిసి సందేశ్ ఖాలీకి వెళ్తుండగా ధమాఖలి వద్ద పోలీసులు, అల్లర్ల నియంత్రణ దళం సిబ్బంది బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, సీపీఎం మద్దతుదారులు ధమాఖలీలో వేర్వేరుగా నిరసనలు చేపట్టారు. కాగా నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్శాలీలో కొందరు టీఎంసీ నేతలు భూఆక్రమణలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే బీజేపీ ఆరోపణలతో ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వెళ్లువెత్తుతున్న విషయం తెలిసిందే. టీఎంసీ నేతలపై ఆరోపణల అనంతరం నందిగావ్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు సందేశ్ ఖాలీని సందర్శించడం ఇది మూడోసారి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన అంతకముందు రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. చదవండి: 2018 పరువునష్టం కేసులో రాహుల్‌కు ఊరట.. అయితే సందేశ్‌కాలీ గ్రామంలో పర్యటించేందుకు బీజేపీ నేత సువేందు అధికారితోపాటు ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌కు కోల్‌కతా హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. తన మద్దతుదారులతో కలిసి వెళ్లవద్దని పేర్కొంది. భద్రతా సిబ్బందితో వెళ్లొచ్చని తెలిపింది. అలాగే రెచ్చగొట్టే ప్రసంగాలేవీ చేయవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలగనీయరాదని హెచ్చరించింది. అదే విధంగా బీజేపీ నేత సందేశ్‌ఖాలీని సందర్శించడంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మంగళవారం ఉదయం హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది, సందేశ్ కాలీ వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా కూడా తనను అడ్డుకుంటున్నారని సువేందు అధికారి అసహనం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని కోల్‌కతా హైకోర్టు దృష్టికి ఈసుకెళ్తానని తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, రాష్ట పోలీసులు కలకత్తా హైకోర్టు ఆదేశాలను పాటించడం లేదని మండిపడ్డారు. -
Calcutta High Court: జడ్జి వర్సెస్ జడ్జి కేసు.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
కలకత్తా: పశ్చిమ బెంగాల్ హైకోర్టులో రెండు బెంచ్‌ల మధ్య నెలకొన్న వివాదానికి సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఫుల్స్టాప్ పెట్టింది. మెడికల్ సీట్ల అడ్మిషన్లలో నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ల స్కామ్‌లో కలకత్తా హై కోర్టులోని సింగిల్ జడ్జి బెంచ్ సీబీఐ విచారణకు ఆదేశించగా అలాంటిదేమీ అవసరం లేదని డివిజన్ బెంచ్ ఆదేశించింది. డివిజన్ బెంచ్ నిర్ణయంపై మళ్లీ సింగిల్ జడ్జి బెంచ్ జోక్యం చేసుకుని డివిజన్ బెంచ్ నిర్ణయం అక్రమం, చట్ట విరుద్ధం అని పేర్కొంది. దీంతో ఈ వివాదాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును శనివారం(జనవరి 27) విచారించింది. ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ల స్కామ్‌లో కలకత్తా హైకోర్టులోని రెండు బెంచ్‌ల ముందు నడుస్తున్న మొత్తం కేసు విచారణ ప్రక్రియపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను సోమవారం(జనవరి 29)కి వాయిదా వేసింది. ఇదీచదవండి..నితీశ్ సర్కారు కీలక నిర్ణయం -
జడ్జీలు బోధనలు చేయరాదు
న్యూఢిల్లీ: కౌమార బాలికలు లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని, బాలురు మహిళలను గౌరవించడం అలవర్చుకోవాలంటూ కలకత్తా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇటువంటి తీర్పు ఎంతో అభ్యంతరకరం, అవాంఛనీయమని పేర్కొంది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం కౌమార వయస్కుల హక్కులను పూర్తి స్థాయిలో ఉల్లంఘించడమేనని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘సంబంధిత అప్పీల్లో న్యాయపరమైన అంశాలను పరిశీలించాలే తప్ప,న్యాయమూర్తులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరచరాదని, బోధనలు చేయరాదని ప్రాథమికంగా మేం భావిస్తున్నాం’అని తెలిపింది. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేసింది. సీనియర్ న్యాయవాది మాధవి దివాన్‌ను అమికస్ క్యూరీగాను, ఆమెకు సాయం అందించేందుకు న్యాయవాది లిజ్ మాథ్యూను నియమించింది. ‘ప్రతి కౌమార బాలిక లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి. అలా కాకుండా, కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందాన్ని ఆస్వాదించడం కోసం లొంగిపోతే సమాజం దృష్టిలో ఆమె ఓడిపో యినట్లే’అని కలకత్తా హైకోర్టు అక్టోబర్ 18వ తేదీన ఓ కేసు తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం సుప్రీంకోర్టు స్వయంగా విచారణ జరిపింది. -
టీనేజర్లు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని సూచించింది. ముఖ్యంగా బాలికలను ఉద్ధేశించి.. రెండు నిమిషాల సుఖం కోసం లొంగిపోవద్దని, ఇది సమాజంలో ఆమె గౌరవాన్ని తగ్గిస్తుందనే విషయాన్ని నొక్కి చెప్పింది. అబ్బాయిలు కూడా మహిళల విషయంలో గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని పేర్కొంది. పరస్పర సమ్మతితో సెక్స్‌లో పాల్గొనే కేసుల్లో పోక్సో చట్టాన్ని ప్రయోగించే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. మైనర్ అయిన తన భార్యతో శారీరక సంబంధంలో పాల్గొనందుకు గతేడాది ఓ టీనేజర్‌కు సెషన్స్ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై యువకుడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై జస్టిస్ చిత్తరంజన్ దాస్, పార్థ సారథి సేన్లతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అత్యాచారం కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ మేరకు టీనేజీ అబ్బాయిలు, అమ్మాయిలకు పలు సూచనలు చేసింది. విచారణ సందర్భంగా... తన ఇష్టపూర్వకంగానే టీనేజర్‌తో రిలేషన్లో ఉన్నానని కోర్టుకు సదరు బాలిక కోర్టుకు తెలిపింది. అతన్ని పెళ్లి కూడా చేసుకున్నానని పేర్కొంది. అయితే 18 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం అనే విషయాన్ని కూడా ఆమె అంగీకరించింది. కాగా, పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు వస్తుంది. చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి! టీనేజీలో సెక్స్ అనేది సాధారణమైన విషయమని, అయితే అలాంటి కోరికలను ప్రేరేపించడం అనేది వ్యక్తుల చర్యలపై ఆధారపడి ఉంటుందని బెంచ్ పేర్కొంది. యుక్త వయసు బాలికలు రెండు నిమిషాల సుఖం కోసం బాలికలు మొగ్గు చూపరాదని, లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని సూచించింది. రెండు నిమిషాల సుఖం కోసం ఆశపడితే సమాజంలో చెడ్డపేరు వస్తుందని, అలాంటి పనులకు పాల్పడవద్దని హితవు పలికింది. బాలికలకు వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం అన్నిటికంటే ముఖ్యమని చెప్పింది. అదే విధంగా టీనేజీలోని అబ్బాయిలు కూడా అమ్మాయిలను గౌరవించాలని తెలిపింది. వారి హక్కులను, గోప్యతను, ఆత్మగౌరవవాన్ని, ఆమె శరీర స్వయంప్రతిపత్తిని కాపాడేలా వ్యవహరించాలని తెలిపింది. ఇలాంటి విషయాల్లో పిల్లల తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులుగా ఉండాలని, మంచి-చెడుల గురించి చెప్పాలని సూచించింది. మగపిల్లలకు తల్లిదండ్రులు మహిళలను ఎలా గౌరవించాలో చెప్పాలని, లైంగిక కోరికతో ప్రేరేపించబడకుండా వారితో ఎలా స్నేహం చేయాలో చెప్పాలని సూచించింది. యుక్త వయస్సులో లైంగిక సంబంధాల వల్ల తలెత్తే చట్టపరమైన సమస్యలను నివారించడానికి పాఠశాలలో లైంగిక విద్య అవసరమని నొక్కి చెప్పింది. -
రూ.49లక్షలతో పట్టుబడిన ఆ ఎమ్మెల్యేలకు మధ్యంతర బెయిల్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో రూ.49 లక్షల నగదుతో పట్టుబడిన ముగ్గురు జార్ఖండ్ ఎమ్మెల్యేలకు కలకత్తా హైకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చాప్, నామన్ బిక్సల్ కొంగరీ జూలై 30న అరెస్టయిన సంగతి తెలిసిందే. వారు ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేయగా, రూ.49 లక్షల నగదు లభ్యమయ్యింది. ఈ వ్యవహారంపై బెంగాల్ సీఐడీ బృందం దర్యాప్తు చేస్తోంది. నిందితులకు మూడు నెలలపాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. కోల్‌కతా మున్సిపల్ ఏరియాను దాటి వెళ్లొద్దని ఆదేశించింది. పాస్‌పోర్టులను అధికారులకు అప్పగించాలని, ప్రతీవారం విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇదీ చదవండి: మూడొంతుల మందిపై క్రిమినల్ కేసులు! -
ముఖ్యమంత్రికి మూడుసార్లు ఫోన్ చేసిన అరెస్టయిన మంత్రి.. కానీ!
కోల్‌కతా: పాఠశాల ఉద్యోగాల కుంభకోణం కేసులో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పాఠశాల ఉద్యోగాల విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో శనివారం అరెస్టయిన మంత్రి.. తమ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి మూడు సార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేయటం వరకు బాగానే ఉన్నా... ఆయన చేసిన కాల్స్‌కు మమత ఎలాంటి స్పందన ఇవ్వకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తాము అరెస్టయిన సమాచారాన్ని కుటుంబసభ్యులకు గానీ.. స్నేహితులకు గానీ తెలియజేసేందుకు ఫోన్ చేసే అవకాశాన్ని నిందితులకు పోలీసులు కల్పిస్తారు. ఈ అవకాశాన్ని అందుకున్న డెబ్బై ఏళ్ల పార్థ ఛటర్జీ.. తమ అధినేత్రి మమతాబెనర్జీకి మూడుమార్లు ఫోన్ చేసినట్టు అరెస్ట్ మెమోలో పోలీస్ అధికారులు వెల్లడించారు. అర్ధరాత్రి 55 నిమిషాల సమయంలో మంత్రి అరెస్టు కాగా.. 2 గంటల 33 నిమిషాలకు మొదటి కాల్ చేశారు. కానీ.. ఆ సమయంలో మమతా ఆ కాల్‌కు స్పందించలేదు. ఆ తర్వాత.. వేకువజామున 3 గంటల 37 నిమిషాలకు కూడా ఫోన్ చేయగా.. మమత నుంచి మళ్లీ ఎలాంటి స్పందన లభించలేదు. తిరిగి.. ఉదయం 9 గంటల 35 నిమిషాలకు మరోసారి ఫోన్ చేసినా పార్థ ఛటర్జీకి నిరాశే ఎదురైంది. ఈ విషయాన్ని అరెస్టు మెమోలో పోలీసున్నతాధికారులు పేర్కొన్నారు. చదవండి: కుక్కల కోసం లగ్జరీ ఫ్లాట్.. పార్థ చటర్జీ ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు అయితే ఈ విషయాన్ని తృణముల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. అరెస్టయిన మంత్రి సీఎం మమతాబెనర్జీకి ఫోన్ చేసే ప్రసక్తేలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. మొబైల్ ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నప్పుడు.. సీఎంకు ఫోన్ ఎలా చేయగలరని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఏయిడెడ్ పాఠశాలల్లో.. ఉపాధ్యాయుల నియామకాల్లో అవినీతికి పాల్పడ్డట్టు మంత్రిపై అభియోగం ఉంది.దీంతో ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో ఆయన నివాసంలో సుమారు 20 కోట్ల నగదు లభించగా.. మంత్రిని ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత.. మంత్రి అనారోగ్యానికి గురికావటంతో.. ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించటంతో.. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు మంత్రి పార్థ ఛటర్జీని ఈరోజు ఉదయం ఎయిర్ అంబులెన్స్‌లో భువనేశ్వర్‌లోని ఏయిమ్స్‌కు తరలించారు. కాగా.. దృశ్య మాధ్యమం ద్వారా విచారణకు హాజరుకావాలని మంత్రికి న్యాయస్థానం తెలిపింది. -
బాణాసంచాపై సంపూర్ణ నిషేధం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: బాణాసంచా కాల్చడంపై సంపూర్ణ నిషేధం ఉండబోదని, గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఉంటుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. వాటి దుర్వినియోగాన్ని అరికట్టడానికి పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాళీ పూజ, దీపావళి, క్రిస్మస్, కొత్త ఏడాది వేడుకలు ఇతరత్రా పండుగల సమయంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి బాణాసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. గౌతమ్ రాయ్, సుదీప్త భౌమ్నిక్ తదితరులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. బాణాసంచా డీలర్ల తరఫు న్యాయవాది సిద్ధార్ధ భట్నాగర్ వాదనలు వినిపిస్తూ.. గ్రీన్ కాకర్స్‌కు అనుమతిస్తూ 2020లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. బాణాసంచాపై పూర్తి నిషేధం లేదని, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యానికి హానికలిగించే వాటినే నిషేధిస్తున్నట్లు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ధర్మాసనానికి వివరించారు. గ్రీన్ కాకర్స్పై నిషేధం లేదని, సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలు అమలు చేస్తున్నామని భట్నాగర్ తెలిపారు. ఇటీవలే నిషేధిత బేరియంతో బాణాసంచా తయారుచేస్తున్న పలు ఉత్పత్తి సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. జులై, అక్టోబరుల్లో వేర్వేరు పిటిషన్ల విచారణ సందర్భంగా బాణాసంచా కాల్చడంపై సంపూర్ణ నిషేధం ఉండదని, గ్రీన్‌కాకర్స్‌ను అనుమతిస్తామని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెల్సిందే. -
సౌరవ్ గంగూలీకి షాక్.. కోల్‌కతా హైకోర్టు జరిమానా
కలకత్తా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి షాక్ తగిలింది.కోల్‌కతా హైకోర్టు జరిమానా గంగూలీకి ఓ స్థలం కేటాయింపు విషయంలో జరిమానా విధించింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా సమీపంలో ఓ పాఠశాల భవనం నిర్మాణం కోసం గంగూలీకి అక్రమ పద్ధతుల్లో భూమి కేటాయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో ద్విసభ్య న్యాయస్థానం విచారణ చేపట్టింది. అది వాస్తవమేనని తేల్చి ధర్మాసనం రూ. 10 వేల జరిమానా విధించింది. కేటాయింపు చేసిన హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హిడ్కో)తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రూ.50 వేల చొప్పున జరిమానా వేసింది. చదవండి: మహిళ పోలీస్ అధికారి బాత్రూమ్లో కెమెరా.. స్నానం చేస్తుండగా.. చదవండి: మగువ, మందుతో ఖాకీలకు వల.. సవాల్‌గా కార్పొరేటర్ భర్త కేసు -
బెంగాల్ హింసపై సీబీఐ దర్యాప్తు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాకాండపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారం, హత్య వంటి దారుణాలు చోటుచేసుకోవడం దారుణమని పేర్కొంది. కొన్ని సంఘటనల్లో బాధితుల ఫిర్యాదులను అధికారులు నమోదు చేయలేదని తప్పుపట్టింది. బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) చేసిన సిఫార్సులను హైకోర్టు ఆమోదించింది. హింసాకాండపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. ఎన్నికల తర్వాత హింసకు సంబంధించిన ఇతర అన్ని కేసులపై దర్యాప్తు చేపట్టడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బెంగాల్ దురాగతాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కలకత్తా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఎన్హెచ్ఆర్సీ కమిటీ నివేదిక ప్రకారం హత్య, అత్యాచారం, అత్యాచార యత్నానికి సంబంధించిన అన్ని కేసులను తదుపరి దర్యాప్తు నిమిత్తం సీబీఐకి తక్షణమే బదిలీ చేయాలని, సంబంధిత రికార్డులను అప్పగించాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. సీబీఐ, సిట్ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని తెలిపింది. ఆరు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు తమకు సమర్పించాలని సీబీఐ, సిట్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో గురువారమే రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తునకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. హింస జరిగినా కేసులు నమోదు చేయరా? ఎన్నికల తర్వాత ఎన్నో దారుణాలు చోటుచేసుకున్నాయని, హత్యలు జరిగినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ధర్మాసనం పేర్కొంది. దీన్నిబట్టి దర్యాప్తు నుంచి తప్పించుకోవాలన్న దుర్బుద్ధిని ప్రదర్శించినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తే బాధితుల్లో నమ్మకం పెరుగుతుందని తెలియజేసింది. ఎన్నికలు, ఫలితాల అనంతరం హింస కేవలం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని వివరించింది. హత్యలు, అత్యాచారాలకు పాల్పడడంతోపాటు అధికార పార్టీకి మద్దతు ఇవ్వని వారి ఇళ్లను కూల్చివేశారని, వారి ఆస్తులను ధ్వంసం చేశారని న్యాయస్థానం ఉద్ఘాటించింది. కేసులు వెనక్కి తీసుకోవాలంటూ బాధితులను బెదిరించారని తెలిపింది. కొన్ని హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పెద్ద ఎత్తున హింస జరిగినా కేసులు పెట్టకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాల ప్రకారం బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ సర్కార్నుఆదేశించింది. హింసపై కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని బీజేపీ స్వాగతించింది. ఈ తీర్పు రాజ్యాంగ విజయమని అభివర్ణించింది. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనదన్న విషయంలో మరోసారి నిరూపితమైందని బీజేపీ నేత సువేందు అధికారి చెప్పారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్న సంకేతాలను తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చింది. -
బెంగాల్లో హింసపై హైకోర్టు సీరియస్
కోల్‌కతా: రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల అనంతర హింసాబాధితులు చేసే ఫిర్యాదులను తీసుకొని కేసులు నమోదు చేయాలని కలకత్తా హైకోర్టు ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. వీరందరికీ తగిన వైద్య సదుపాయం అందించాలని, రేషన్ సరుకులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది. తదుపరి న్యాయ విచారణ కోసం సంబంధిత డాక్యుమెంట్లన్నింటినీ కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ ద్వివేదిని కోరింది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింస చెలరేగినట్లు కనిపిస్తోందని, అయితే ప్రభుత్వం మాత్రం ఈ నిజాన్ని నిరాకరిస్తోందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ హింసలో పలువురు చనిపోయారని, పలువురిపై లైంగిక దాడులు జరిగాయని, మైనర్ బాలికలను కూడా వదిలినట్లు కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలామంది ఇళ్లూ వాకిళ్లు వదిలిపోవాల్సివచ్చిందని, ఇప్పటివరకు ప్రభుత్వం బాధితుల్లో ధైర్యం, నమ్మకం కలిగించే పని చేయలేదని విమర్శించింది. చాలామంది బాధితుల ఫిర్యాదులను సైతం పోలీసులు తీసుకోలేదని, కొందరిపై ఎదురు కేసులు పెట్టారని వ్యాఖ్యానించింది. సుప్రీం నోటీసులు మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై దర్యాప్తుకు సిట్ నియమించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేసింది. కాగా కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని బీజేపీ నేత సువేందు అధికారి స్వాగతించారు. ఎన్నికల అనంతర హింసపై తమ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. పలువురు బీజేపీ నేతలు ఈ సందర్భంగా మమతపై విమర్శలు గుప్పించారు. బెంగాల్లో హింసపై జాతీయ మానవ హక్కుల సంఘంతో విచారింపజేయాలన్న సూచనను మార్చాలని బెంగాల్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు జూన్ 21న తోసిపుచ్చింది. బెంగాల్ పోలీసులు హింసను అడ్డుకోలేదన్న ఆరోపణల నిజానిజాలు తెలుసుకోవాలని రాష్ట్ర హోంశాఖ కోరింది. అయితే హింసారోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పనిచేస్తుందన్న నమ్మకం తమకు కలగట్లేదని, అందుకే జాతీయ మానవ హక్కుల సంఘ విచారణకు ఆదేశించామని కోర్టు తెలిపింది. మరోవైపు సువేందు అధికారికి కేంద్రం ఇచ్చే రక్షణతో పాటు తమ ప్రభుత్వం అదనపు రక్షణ ఏర్పాట్లు చేస్తుందని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. -
West Bengal: సువేందుకు ఝలక్.. ఇవాళే విచారణ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ చీఫ్ సువేందు అధికారికి ఝలక్ తగిలింది. ఆయన ఎన్నికపై అనుమానాలున్నాయంటూ సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం ఇవాళ (శుక్రవారం) ఉదయం 11 గం. పిటిషన్ విచారణ చేపట్టనుంది. కాగా, దీదీపై సువేందు రెండు వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో నందిగ్రామ్ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. కౌంటింగ్ రోజు నాటకీయ పరిణామాలు జరగ్గా.. రీ కౌంటింగ్ కోసం తృణమూల్ కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఇక ఫలితాల మరుసటి రోజే మమతా బెనర్జీ, సువేందు ఎన్నికపై కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ కౌశిక్ చందా నేతృత్వంలో ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. అంతేకాదు ఆ సమయంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కిషోర్ బిశ్వాస్ ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ.. ఆయనకు భద్రత కల్పించింది మమత సర్కార్. కాగా, 2011 నుంచి భాబనీపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న మమత.. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైంది. అయినప్పటికీ భారీ స్థానాలు గెల్చుకుని టీఎంసీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణం చేసింది. చదవండి: సువేందుపై చోరీ కేసు -
పౌరసత్వం: పాస్‌పోర్టు తప్పనిసరి కాదు
కోల్‌కత: సరైన పాస్‌పోర్టు లేకున్నా భారత పౌరసత్వం కోసం విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పాస్‌పోర్టు ఎందుకు లేదో సరైన కారణాలు తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. పౌరసత్వ నిబంధనలు-2019లోని 11వ నిబంధన ప్రకారం పాస్‌పోర్టు కలిగి ఉండకపోవడానికి గల కారణాలు పేర్కొంటూ సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చని పిటిషనర్‌కు జస్టిస్ సబ్యసాచి భట్టాచార్య అనుమతిచ్చారు. పౌరసత్వానికి సంబంధించిన దరఖాస్తు పత్రంలో (ఫారం 3)లోని క్లాజ్ 9లో పాస్‌పోర్టు వివరాలు పొందుపరచడమే కాకుండా సరైన పాస్‌పోర్టు నకలును దరఖాస్తుకు జతచేయాల్సి ఉంటుంది. అయితే, 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 5(1) (సీ) ప్రకారం పాస్‌పోర్టును తీసుకెళ్లడం తప్పనిసరి కాదని చెబుతోందని కోర్టు గుర్తు చేసింది. పైగా పిటిషనర్ తన వద్ద పాస్‌పోర్టు లేకపోవడానికి సరైన కారణాలు తెలిపారని, సదరు అధికారులు కూడా అందుకు సంతృప్తి చెందారని పేర్కొంది. (చదవండి : సామరస్యం మిగిలే ఉంది!) -
‘వారంలోగా తేల్చండి’
కోల్‌కతా : ఆందోళన చేపట్టిన వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరికను బేఖాతరు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. వైద్యుల ఆందోళనతో ఆస్పత్రుల్లో చికిత్స లభించక వైద్యులు పడుతున్న ఇబ్బందులకు తెరదించాలని, వారంలోగా సమస్యను పరిష్కరించాలని కోల్‌కతా హైకోర్టు మమతా బెనర్జీ సర్కార్‌ను ఆదేశించింది. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలని పీపుల్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ సంస్ధకు చెందిన కునల్ సహా దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా వైద్యుల సమ్మెపై స్టే ఉత్తర్వులు జారీ చేయబోమని కోర్టు స్పష్టం చేసింది. ఇక జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఏం చర్యలు చేపట్టారో వివరించాలని కోరింది. వివాదానికి కేంద్ర బిందువైన ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ 82 మంది వైద్యులతో పాటు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ రాజీనామా చేశారు. మరోవైపు దీదీ సమీప బంధువు, కోల్‌కతా మేయర్ కుమార్తె వైద్యుల ఆందోళనలో పాలుపంచుకోవడం మమతా సర్కార్‌ను ఇరకాటంలో పడేసింది. కాగా ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన రోగి బంధువులు జరిపిన దాడిలో ఇద్దరు వైద్యులు తీవ్రంగా గాయపడిన ఘటనను నిరసిస్తూ గత నాలుగు రోజులుగా బెంగాల్ అంతటా వైద్యుల నిరసన కొనసాగుతోంది. తమకు భద్రత కల్పించాలని కోరుతూ వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. -
హైకోర్టు సీజే రాధాకృష్ణన్ బదిలీ
-
బీజేపీ రథయాత్రకు దక్కని ఊరట
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రథయాత్ర నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టులో బీజేపీకి ఊరట లభించలేదు. రథయాత్రను కలకత్తా హైకోర్టు అడ్డుకోవడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సాధారణ పిటిషన్లతో పాటే దానినీ విచారిస్తామని సోమవారం కోర్టు రిజిస్ట్రీ అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్ 21 నాటి కలకత్తా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని బీజేపీ కోరగా, సుప్రీంకోర్టు అంగీకరించలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల ముంగిట పశ్చిమ బెంగాల్‌లోని 42 పార్లమెంట్ స్థానాల్లో ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట ర్యాలీ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు కలకత్తా హైకోర్టు ఏక సభ్య బెంచ్ తొలుత అనుమతి ఇవ్వగా, తరువాత డివిజన్ బెంచ్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశాలున్నాయని రాష్ట్ర నిఘా వర్గాల ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసును మళ్లీ విచారించాలని ఏక సభ్య బెంచ్‌కే డివిజన్ బెంచ్ తిరిగి పంపింది. శాంతియుతంగా చేపట్టాలనుకున్న యాత్రను రాష్ట్ర అధికారులు లేవనెత్తిన సందేహాలు, ఊహాజనిత అభిప్రాయాల ఆధారంగా అడ్డుకోవడం తగదని బీజేపీ తన పిటిషన్లో పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్య కార్యదర్శి, అదనపు డీజీపీలను కక్షిదారులుగా చేర్చాలని కోరింది. బీజేపీ కార్యక్రమంలో హింస.. రథయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఉత్తర 24 పరగణాలు జిల్లాలో నిర్వహించిన చట్ట ఉల్లంఘన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఇందులో పలువురు పోలీసులు, పౌరులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 54 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
అమిత్ షా రధయాత్రకు హైకోర్టు నో
సాక్షి, కోల్‌కతా : బీజేపీ చీఫ్ అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌లో శుక్రవారం పాల్గొనాల్సిన రధయాత్రకు కలకత్తా హైకోర్టు గురువారం అనుమతి నిరాకరించింది. బెంగాల్ అంతటా పలు జిల్లాల్లో సాగే ఈ మెగా ర్యాలీనీ అమిత్ షా లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో బీజేపీ బెంగాల్ శాఖ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 9న తదుపరి విచారణ చేపడతామని అప్పటివరకూ రధయాత్రను వాయిదా వేయాలని హైకోర్టు కోరింది. కాగా రధయాత్రకు అనుమతి నిరాకరించిన కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్‌లో సవాల్ చేస్తామని బీజేపీ బెంగాల్ ఇన్చార్జ్ విజయ్‌వర్గీయ వెల్లడించారు.కాగా, కూచ్‌బెహర్ సమస్యాత్మక ప్రాంతమని, అక్కడ ఇలాంటి ర్యాలీకి అనుమతిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. డిసెంబర్ ఏడు నుంచి రాష్ట్రంలో మూడు ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి కోసం తాము దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వ అధికారులు, పోలీసుల నుంచి స్పందన లేదని పేర్కొంటూ బీజేపీ బుధవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. -
అలా చేయలేమన్న దీదీ..
కోల్‌కతా : బక్రీద్ సందర్భంగా జంతుబలిని నియంత్రించాలన్న కోర్టు ఉత్తర్వులకు బదులిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. జంతు వధను నిలిపివేసేందుకు అవసరమైన మౌలిక యంత్రాంగం తమ వద్ద లేదని కలకత్తా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో మమతా బెనర్జీ సారథ్యంలోని బెంగాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రమంతటా ప్రతి సబ్ డివిజన్లోని అన్ని బ్లాక్‌ల్లో ఈద్ ఉల్ జుహ జరుపుకుంటారని పశ్చిమ బెంగాల్ జంతు వధ నియంత్రణ చట్ట నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు తగిన యంత్రాంగం ప్రభుత్వం వద్ద లేదని పేర్కొంది. రాష్ట్రంలో తగినంతగా వెటర్నరీ సర్జన్లు, వెటర్నరీ అధికారులు లేరని కోర్టుకు నివేదించింది. కబేళాలు సైతం చాలినంతగా లేవని స్పష్టం చేసింది. వచ్చే క్యాలండర్ సంవత్సరాంతానికి సంబంధిత చట్టానికి అనుగుణమైన సాధనా సంపత్తిని సమకూర్చుకుంటామని పేర్కొంది. కాగా ఈద్ ఉల్ జుహ వేడుకులకు ముందు జంతు వధ నియంత్రిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బహిరంగ నోటీసు జారీ చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. బక్రీద్‌కు ముందుగా జంతు వధ నియంత్రణపై ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాలో ప్రకటనలు జారీ చేయాలని కోరింది. -
జస్టిస్ కర్ణన్ విడుదల
తిరువొత్తియూరు(చెన్నై): కోర్టు ధిక్కార నేరం కింద ఆర్నెళ్ల జైలుశిక్ష పూర్తికావడంతో కలకత్తా హైకోర్టు మాజీ జడ్జీ జస్టిస్ సీకే కర్ణన్ విడుదలయ్యారు. కోల్‌కతాలోని ‘ప్రెసిడెన్సీ కరెక్షనల్ హో మ్’ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు కర్ణన్ విడుదలైనట్లు ఆయన భార్య సరస్వతి మీడియాకు తెలిపారు. జస్టిస్ కర్ణన్ త్వరలోనే ఆత్మకథ రాయనున్నట్లు ఆయన న్యాయవాది మ్యాథ్యూ.జె.నెడంపుర వెల్లడించారు. పెన్షన్ తదితర సమస్యల్ని పరిష్కరించుకుని ఆయన త్వరలోనే చెన్నైకి బయలుదేరుతారన్నారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడటంతో సుప్రీం కోర్టు మే 9న జస్టిస్ కర్ణన్‌కు ఆరు నెలల జైలుశిక్ష విధించింది. దీంతో జస్టిస్ కర్ణన్ పరారుకాగా.. సుప్రీం ఆదేశాలతో పోలీసులు కోయంబత్తూర్‌లో జూన్ 20న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. -
ప్రభుత్వమే చిచ్చు పెట్టేలా ఉంది!
మమతను మందలించిన కోల్‌కతా హైకోర్టు మతాల మధ్య స్నేహాన్ని పెంచాలని సూచన సాక్షి, కోల్‌కతా : దుర్గాదేవి విగ్రహాల నిమజ్జన విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రెండు మతాల మధ్య విభేధాలు వచ్చేలా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోందని కలకత్తా హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. రెండు మతాలవారూ తమతమ పండుగలను సంతోషంగా అందరూ కలిసి నిర్వహించునే వాతావరణాన్ని ఎందుకు ప్రభుత్వం కల్పించలేకపోతోందని కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు అక్షింతలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయంలో స్పందిస్తూ.. ప్రభుత్వం ఎక్కడా దుర్గా పూజలను నిషేధించలేదని చెప్పారు. ప్రభుత్వ ప్రకటనను కొన్ని వర్గాలు తప్పుడు ప్రచారం చేశాయని అన్నారు. అక్టోబర్ 1న ఏకాదశి, మొహర్రం పండుగలు ఒకే రోజున రావడంతో.. ఆ ఒక్క రోజు మాత్రమే నిమజ్జ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిషేధించిందని చెప్పారు. మొహర్రం రోజున ముస్లిం సోదరులు కార్యక్రమాలు చేసుకుంటారని.. అందువల్ల ఒకటో తారీఖున నిషేధించినట్లు ప్రకటించారు. తరువాత 2 నుంచి నాలుగో తేదీవరకూ యథావిధిగా నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయని మమతా బెనర్జీ ప్రకటించారు. దుర్గా నవరాత్రులకు సంబంధించి వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆమె చెప్పారు. -
ఆ జడ్జి దేశం వదిలి వెళ్లిపోయారా?
-
ఆ జడ్జి దేశం వదిలి వెళ్లిపోయారా?
పదవిలో ఉండగా ఆరు నెలల జైలుశిక్ష పడిన మొట్టమొదటి న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ ఎక్కడున్నారన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. కలకత్తా హైకోర్టుకు చెందిన ఈ న్యాయమూర్తి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారని కొంతమంది చెబుతుండగా ఆయన సన్నిహితులు మాత్రం భారతదేశంలోనే ఎవరికీ తెలియని ఓ ప్రదేశంలో ఉన్నారంటున్నారు. ఆయన అరెస్టును తప్పించుకోడానికి ఏమీ ప్రయత్నించడం లేదని, అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి కొంత సమయం అడుగుతున్నారని ఆయన అనుచరులు మీడియాకు చెప్పారు. తమిళనాడులోని ఓ గెస్ట్‌హౌస్‌లో ఉన్నారని కథనాలు రావడంతో పశ్చిమబెంగాల్ నుంచి పోలీసు బృందం చెన్నైకి వెళ్లినా, అక్కడ ఆయన కనిపించలేదు. తనపై జారీచేసిన అరెస్టు ఉత్తర్వులను రీకాల్ చేసుకోవాలని కర్ణన్ సుప్రీంకోర్టును కోరారు. కర్ణన్ బృందం కొత్తగా ఒక రివ్యూ దరఖాస్తు సిద్ధం చేస్తోందని, త్వరలోనే దాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేస్తారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల పూర్తికాపీ అందితే గానీ పిటిషన్ దాఖలు చేయడానికి గానీ, బెయిల్ కోసం దరఖాస్తు చేయడానికి గానీ కుదరదు. కుల్‌భూషణ్ జాదవ్ కేసును అంతర్జాతీయ కోర్టులో సవాలు చేసినట్లే తన కేసును కూడా అక్కడకు పంపాలని రాష్ట్రపతిని అడిగేందుకు ఆయన అపాయింట్మెంట్ కూడా కర్ణన్ కోరినట్లు తెలిసింది. అయితే.. జస్టిస్ కర్ణన్‌ను అరెస్టు చేస్తే ఆయన స్వగ్రామంలో అల్లర్లు చెలరేగుతాయని తమిళనాడు ప్రభుత్వం కూడా జాగ్రత్త పడుతోంది. మొత్తానికి జస్టిస్ కర్ణన్ బయటకు రాకుండా వీలైనంత వరకు తప్పించుకోడానికే ప్రయత్నిస్తున్నారు. -
ప్రధాన న్యాయమూర్తి విమానం ఎక్కకూడదట!
కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్నన్ విచిత్రమైన ఆదేశాలు జారీచేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ సహా మొత్తం ఏడుగురు న్యాయమూర్తులు విమానాలు ఎక్కి విదేశాలకు వెళ్లకుండా చూడాలంటూ న్యూఢిల్లీలోని ఎయిర్ కంట్రోల్ అథారిటీని ఆదేశించారు. వాళ్ల మీద ఉన్న కేసులు తేలేవరకు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. కోల్‌కతా న్యూటౌన్‌లోని రోజ్డేల్ టవర్స్‌లో గల తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కోర్టు నుంచి ఆయన ఈ ఆదేశాలు ఇవ్వడం విశేషం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేఖర్, ఇంకా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ పినకి చంద్రఘోష్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల మీద ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేయాలంటూ ఏప్రిల్ 13న జస్టిస్ కర్నన్ ఆదేశాలు ఇచ్చారు. వాళ్లంతా ఏప్రిల్ 28న తన ఇంట్లోని కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు సైతం ఇచ్చారు. అంతకుముందు జస్టిస్ కర్నన్ మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, ఆరుగురు ఇతర న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించింది. మార్చి 31న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రస్తుతం పనిచేస్తున్న, రిటైర్ అయిన 20 మంది న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేసిన జస్టిస్ కర్నన్.. వాటిని ప్రధానమంత్రికి, సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి పంపారు. వాటిని ఉపసంహరించుకోవాలని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం సూచించగా, తనకు అంతకుముందున్న అధికారాలను పునరుద్ధరిస్తేనే అలా చేస్తానని ఆయన చెప్పారు. దానికి ధర్మాసనం తిరస్కరించింది. నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని, మే 1న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈలోపు జస్టిస్ కర్నన్.. తనదైన శైలిలో ఈ ఆదేశాలు ఇచ్చారు. -
మమతా బెనర్జీకి షాక్
► నారద కేసులో దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు ఆదేశం కోల్‌కతా: పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేతకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. నరద స్టింగ్ ఆపరేషన్ పై దర్యాప్తు కొనసాగించాలని కతకత్తా హైకోర్టు సీబీఐనీ ఆదేశించింది. సీబీఐ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ని కొట్టేయాలని కోరుతూ తృణముల్ ఎంపీ ఆలీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. వరుస అవినీతి ఆరోపణలతో సతమతమవుతోన్న మమత సర్కార్‌కు ఇది గట్టి ఎదరుదెబ్బతగిలింది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీ లాండరింగ్ కేసులో మమత సర్కార్‌పై కేసు నమోదు చేసింది. గతేడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోల్లో కొందరు తృణముల్ కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఇవి ట్యాంపర్ చేసిన టేపులు కావని చండీగఢ్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరెటరీ (సీఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో రాజ్యసభ ఎంపీ ముఖుల్ రాయ్, లోక్‌సభ ఎంపీ సౌగాత రాయ్, వీరితో సంబంధం ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సుల్తాన్ అహ్మద్, ఇక్బాల్ అహ్మద్, కకోలి ఘోష్, ప్రసూన్ బెనర్జీ, సువేందు అధికారి, సోవన్ చటర్జీ, సుబ్రత ముఖర్జీ, సయ్యద్ హుస్సేన్ మీర్జా, ఫిర్హాద్ హకీమ్ తదితరులున్నారు. చిట్‌ఫండ్ స్కాంతో సంబంధం ఉన్న ఇద్దరు ఎంపీలు సుదీప్ బెనర్జీ, తపస్ పాల్ ఇప్పటికే సీబీఐ అదుపులో ఉన్నారు. -
నిరాహార దీక్షలు చేపడతా: జస్టిస్ కర్ణన్
కోల్‌కతా: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తాను దళితుడైనందునే ఉన్నత న్యాయస్థానం వేధిస్తోందని కర్ణన్ ఆరోపిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా త్వరలోనే తాను నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు జారీ చేసిన బెయిలబుల్ అరెస్ట్ వారంట్‌ను వెనక్కి తీసుకోవాలని, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రద్దు చేసిన తన అధికారాలు, విధులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన విధులకు ఆటకం కలిగించినందుకు గాను రూ.14 కోట్ల పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ల సాధనకు త్వరలోనే కోల్‌కతా, లక్నో, ఢిల్లీ, చెన్నై నగరాలలో నిరాహార దీక్షలు చేపడతానని తన ప్రతినిధి రమేశ్ పీటర్ కుమార్ ద్వారా ఆయన వెల్లడించారు. ఢిల్లీలో అయితే రాష్ట్రపతి భవన్ ఎదుటగానీ, లేక రామ్‌లీలా మైదానంలో ఎక్కడ పర్మిషన్ ఇస్తే అక్కడ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు వారంట్ నేపథ్యంలో ఈ దీక్షలను మార్చి 31వ తేదీ తర్వాత చేపట్టాలా? అంతకు ముందే ప్రారంభించాలా? అనేది తాను ఇంకా నిర్ణయించుకోలేదని జస్టిస్ కర్ణన్ చెప్పారు. -
కర్ణన్ చేతికి అరెస్టు వారెంట్
-
‘నారద’ కేసు సీబీఐకి
-
‘నారద’ కేసు సీబీఐకి
3 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలి: కలకత్తా హైకోర్టు కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ముడుపులు తీసుకుంటూ నారద న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన వ్యవహారంలో ప్రాథమిక విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని, వస్తువులను 24 గంటల్లో స్వాధీనం చేసుకోవాలని, 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, తర్వాత దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది. ప్రముఖుల ప్రవర్తన ఇతరులు వేలెత్తి చూపేలా ఉండకూడదని, అవినీతి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని జస్టిస్ చక్రవర్తి పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని సీఎం మమత చెప్పారు. గతేడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలను పలు వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. మొదట ఈ వీడియోలు ‘నారదన్యూస్.కామ్’లో ప్రసారమయ్యాయి. దీనిలో కొందరు నేతలు డబ్బులు తీసుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఇవి ట్యాంపర్ చేసిన టేపులు కావని చండీగఢ్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరెటరీ (సీఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉన్నందువల్ల రాష్ట్ర సంస్థలు కాకుండా సీబీఐ అయితేనే స్వతంత్రంగా దర్యాప్తు నిర్వహించగలదని కోర్టు పేర్కొంది. స్టింగ్ ఆపరేషన్ బూటకం: మమత హైకోర్టు ఆదేశం దురదృష్టకరమని, దీన్ని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని మమత చెప్పారు. ‘స్టింగ్ ఆపరేషన్ నాటకం. వీడియోను బీజేపీ కార్యాలయంలో విడుదల చేశారు’ అని అన్నారు. ఆపరేషన్‌లో లంచం తీసుకుంటూ కనిపించిన టీఎంసీ ఎంపీలపై చర్యలు తీసుకోవాలని వామపక్షాలు లోక్‌సభలో డిమాండ్ చేశాయి. దర్యాప్తు పరిధిలోకి సీఎంను తేవాలనే డిమాండ్‌తో లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు కోల్‌కతా భారీ ర్యాలీ నిర్వహించాయి. -
కర్ణన్ చేతికి అరెస్టు వారెంట్
- న్యాయమూర్తి ఇంటికెళ్లి అందించిన డీజీపీ - తిరస్కరించిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి కోల్‌కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు కోర్టు ధిక్కార నేరం కింద సుప్రీంకోర్టు జారీ చేసిన బెయిలబుల్ అరెస్టు వారంట్‌ను పశ్చిమబెంగాల్ డీజీపీ సుర్జిత్కర్ శుక్రవారం అందజేశారు. నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్, డీఐజీ (సీఐడీ) రాజేష్‌కుమార్‌తో కలసి ఇక్కడి కర్ణన్ ఇంటికి వెళ్లిన డీజీపీ... వారంట్‌ను ఆయన చేతికిచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కాగా, డీజీపీ అరెస్టు వారంట్ ఇచ్చిన కాసేపటికే దాన్ని తిరస్కరిస్తున్నట్టు జస్టిస్ కర్ణన్ ప్రకటించారు. ‘ఓ దళిత జడ్జిని వేధింపులకు గురిచేస్తూ మీరు తీసుకుంటున్న ఇలాంటి కించపరిచే చర్యలు పూర్తిగా చట్ట విరుద్ధం. కోర్టుల గౌరవ మర్యాదలను కాపాడేందుకు ఇకనైనా ఈ వేధింపులు ఆపమని అభ్యర్థిస్తున్నా’అని సీజే సహా తనకు అరెస్టు వారంట్ జారీ చేసిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి జస్టిస్ కర్ణన్ లేఖ రాశారు. మద్రాస్ హైకోర్టులోని కొందరు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డారంటూ జస్టిస్ కర్ణన్ ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖెహర్‌కు లేఖలు రాసిన నేపథ్యంలో... సుప్రీంకోర్టు ఈ నెల 10న జస్టిస్ కర్ణన్‌కు కోర్టు ధిక్కారం కింద బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. మార్చి 31 లోగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. సిట్టింగ్ హైకోర్టు జడ్జిపై అరెస్టు వారెంట్ జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదని, దళితుడిని కనుకనే తనపై దాడి చేస్తున్నారని కర్ణన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తనపై అరెస్టు వారంట్ ఇచ్చిన సీజే, మరో ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అధికార దుర్వినియోగం కింద విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ఆయన సీబీఐని కూడా ఆదేశించారు. రూ.14 కోట్లు నష్టపరిహారం ఇవ్వండి... అరెస్టు వారంట్ ఇచ్చిన చీఫ్ జస్టిస్ ఖెహర్ సహా ఏడుగురు న్యాయమూర్తుల సుంప్రీంకోర్టు ధర్మాసనంపై కర్ణన్ తీవ్రంగా స్పందించారు. తనను న్యాయ సంబంధిత, పరిపాలనా పనులు చేసుకోనివ్వకుండా నియంత్రించినందుకు గానూ రూ.14 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని ధర్మాసనంలోని ఏడుగురు న్యాయమూర్తులకు గురువారం లేఖ రాశారు. తనపై రాజ్యాంగ విరుద్ధంగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసిన ధర్మాసనాన్ని రద్దు చేసి, తన రోజువారీ పనిని చేసుకోనివ్వాలని కోరారు. ‘ఈ ఏడుగురు జడ్జీలూ మార్చి 8 నుంచి నన్ను న్యాయ, పరిపాలనా పనులు చేసుకోకుండా అడ్డుకున్నారు. సాధారణ జీవితంతో పాటు కోట్ల మంది భారతీయుల ముందు అవమానించినందుకు ధర్మాసనంలోని ఆ జడ్జీలూ ఈ ఆదేశాలను అందుకున్న వారం లోగా రూ.14 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. -
ముఖ్యమంత్రికి భారీ షాక్.. సీబీఐ చేతికి కేసు!
నారదా న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికేసిన టీఎంసీ నేతల కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు నిర్ణయించింది. దీంతో పశ్చిమబెంగాల్ ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. ఈ స్టింగ్ ఆపరేషన్ సీడీలు బీజేపీ కార్యాలయం నుంచి ప్రసారం అయ్యాయన్న విషయం అందరికీ తెలుసని, అయితే ఇప్పుడు తాను దీనిపై వ్యాఖ్యానించేది ఏమీ లేదని, ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తానని మమతా బెనర్జీ అన్నారు. సరిగ్గా 2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది ముందు ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగింది. దీనిపై సీబీఐ విచారణ జరపాలని, 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిషితా మాత్రే, జస్టిస్ టి. చక్రవర్తి ఆదేశించారు. అవసరమైతే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలన్నారు. ఈ కేసు విచారణను ఒక స్వతంత్ర కేంద్ర సంస్థకు అప్పగించే అవకాశాలున్నాయని కలకత్తా హైకోర్టు జనవరిలోనే చెప్పింది. ఈ కేసులో సాక్ష్యాలను బట్టి చూస్తే సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం కనిపిస్తోందని జస్టిస్ మాత్రే వ్యాఖ్యానించారు. అప్పటికి రాష్ట్ర పోలీసులే కేసును విచారిస్తుండటంతో.. విచారణ సక్రమంగా సాగట్లేదన్న అభిప్రాయంతో కోర్టు ఇలా వ్యాఖ్యానించి ఉంటుందని భావిస్తున్నారు. ఏమిటీ ఆపరేషన్.. గత సంవత్సరం మార్చి నెలలో సరిగ్గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొద్ద ముందు నారదా న్యూస్ చానల్ రెండు సీడీలను బయటపెట్టింది. అందులో పలువురు టీఎంసీ నాయకులు లంచాలు తీసుకుంటున్న వ్యవహారం మొత్తం రికార్డయింది. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ దీనిపై వివరణ కోరింది. సీడీలలో ఐదుగురు టీఎంసీ ఎంపీలు కూడా ఉండటంతో వారు వివరణ ఇవ్వాలని తెలిపింది. టీఎంసీ విద్యార్థి విభాగం నాయకుడు కూడా ఇందులో ఉన్నాడు. -
సుప్రీం కోర్టు జడ్జిలపై పరువు నష్టం దావా వేస్తా
కోల్‌కతా: కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్.. సుప్రీం కోర్టుతో ఘర్షణ, ధిక్కార వైఖరిని కొనసాగిస్తున్నారు. కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు జారీ చేసిన బెయిలబుల్ వారెంట్‌ను తీసుకునేందుకు ఆయన తిరస్కరించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పశ్చిమబెంగాల్ డీజీపీ సురజిత్ కర్ పురకాయస్తా, కోల్‌కతా పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు.. బెయిలబుల్ వారెంట్ అందజేసేందుకు జస్టిస్ కర్ణన్ నివాసానికి వెళ్లారు. ఈ నెల 31న విచారణకు హాజరు కావాల్సిందిగా ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం జస్టిస్ కర్ణన్‌ను ఆదేశించింది. అయితే వారెంట్ తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. తనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సుప్రీం కోర్టు జడ్జిలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తన జీవితానికి, మనశ్శాంతికి భంగం కలిగించినందుకు సుప్రీం కోర్టు 14 కోట్ల రూపాయల నష్టం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్రాస్ హైకోర్టు జడ్జిలు, మాజీ న్యాయమూర్తులు కొందరు అవినీతికి పాల్పడ్డారని జస్టిస్ కర్ణన్ గతంలో ఆరోపించారు. జడ్జిల ఫిర్యాదు మేరకు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్.. జస్టిస్ కర్ణన్‌ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీ చేశారు. అంతేగాక మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి భార్య ఆయనపై సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణకు హాజరుకానందుకు సుప్రీం కోర్టు ఆయనకు వారెంట్ జారీ చేసింది. గతంలో సుప్రీం కోర్టుపై సంచలన ఆరోపణలు చేసిన జస్టిస్ కర్ణన్ తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు వారెంట్ జారీ చేయడం చట్టవిరుద్ధమని, ఓ దళిత జడ్జిని వేధించడమేనని అన్నారు. తనను వేధించడం మానుకోవాలని కోరారు. తనపై వారెంట్ జారీ చేసి సుప్రీం కోర్టు ప్రపంచం ముందు నవ్వుల పాలైందని విమర్శించారు. సుప్రీం కోర్టులో తాను ఎందుకు హాజరు కావాలని, ఇది తప్పుడు ఉత్తర్వు అని, చట్టవిరుద్ధమని అన్నారు. హైకోర్టు జడ్జీపై చర్యలు తీసుకునే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుందని చెప్పారు. -
సుప్రీంకోర్టుకు హాజరుకాని జస్టిస్ కర్ణన్
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ను వ్యక్తిగతంగా హాజరుకావాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ఆయన మాత్రం సోమవారం నాటి విచారణకు హాజరుకాలేదు. జస్టిస్ కర్ణన్ పై సుమోటోగా ధిక్కార కేసు స్వీకరించి విచారణ ఎందుకు చేపట్టకూడదో ఆయన వ్యక్తిగతంగా తెలపాలని ఫిబ్రవరి 8న సుప్రీం ఆదేశించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలను విమర్శిస్తూ జస్టిస్ కర్ణన్ రాసిన వరుస లేఖలపై సుప్రీం కోర్టు సీరియస్ అయి ధిక్కార కేసు నమోదు చేయడానికి సిద్ధపడింది. ఆయనకు జ్యుడీషియల్, కార్యనిర్వాహక విధులు అప్పగించవద్దని హైకోర్టును ఆదేశించింది. అయితే ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల విస్తృత ధర్మాసనం.. జస్టిస్ కర్ణన్ విచారణకు హాజరుకానందున ఆయనపై ధిక్కార అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టా లన్న అటార్నీ జనరల్ రోహత్గీ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆయన సమాధానం కోసం మూడు వారాల గడువిస్తూ విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. -
నోట్ల రద్దుపై కేంద్రానికి కఠినప్రశ్నలు!
నోట్ల రద్దు విషయంపై కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు, కోల్కత్తా హైకోర్టు నుంచి శుక్రవారం కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొంది. నోట్ల రద్దు కారణంగా దేశంలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని..అల్లర్లు చెలరేగే అవకాశాలున్నాయని సుప్రీంకోర్టు కేంద్రాన్ని హెచ్చరించిన వెంటనే... నోట్ల రద్దు విషయంపై వెంటనే కేంద్రం స్పందించాలని కోల్కత్తా హైకోర్టు ఆదేశించింది. నవంబర్ 25లోపు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తమకు సమర్పించాలని కోరింది. బ్యాంకుల ఎదుట భారీ రద్దీ, క్యూలైన్లపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించగా... తమకు కేంద్ర ప్రభుత్వ పాలసీలను మార్పు చేసే అవకాశం లేదని, కానీ ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల అమలు సరిగా లేదని కోల్కత్తా హైకోర్టు అభిప్రాయపడింది. అడ్వకేట్ రామప్రసాద్ సర్కార్ వేసిన పిల్‌ను విచారించిన కోల్కత్తా హైకోర్టు కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. ‘‘ప్రభుత్వం ప్రజలను బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి, పాత నోట్లను దానిలో డిపాజిట్ చేయమని చెబుతోంది. కానీ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ప్రజలు పడే ఇబ్బందులు మీకు తెలుసా? పన్ను పరిధిలోకి రాని ఆదాయాల వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. సాధారణ ప్రజల కోసం కేంద్రం ఏం చేస్తుంది? అనే ప్రశ్నలను కేంద్రానికి సంధించింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా పాత కరెన్సీ నోట్లు అంగీకరించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, పెద్ద నోట్ల రద్దుతో అస్వస్తతతో బాధపడుతున్న ప్రజలను రక్షించడానికి ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
కలకత్తానే ముద్దు.. కోల్‌కతా వద్దు
కోల్‌కతా: బాంబే, మద్రాస్, కలకత్తా హైకోర్టుల పేర్లను ముంబై, చెన్నై, కోల్‌కతా హైకోర్టులుగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కలకత్తా హైకోర్టు పేరును కోల్‌కతాగా మార్చవద్దంటూ ఆ కోర్టులో పనిచేస్తున్న జడ్జిలు, న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. కలకత్తా హైకోర్టు పేరును యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జడ్జీలందరూ ఓ తీర్మానాన్ని చేసి, దానిని కేంద్ర న్యాయ శాఖకు పంపారు. భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు అయిన కలకత్తా హైకోర్టుకు 154 ఏళ్ల చరిత్ర ఉందని, కలకత్తా పేరును స్థానికులు సెంటిమెంట్ గానూ భావిస్తారని పైగా షిప్పింగ్, బ్యాంకింగ్ ఇంతర వ్యాపారాలకు సంబంధించిన వివాదాల్లో ప్రపంచ దేశాలకు ఇది(కోర్టు) కలకత్తా హైకోర్టుగానే పరిచయమని లా సొసైటీ ఆఫ్ కలకత్తా (ఐఎల్ఎస్ సీ) అధ్యక్షుడు ఆర్కే ఖన్నా అంటున్నారు. ఏ రకంగా చూసినా హైకోర్టు పేరు మార్పు తగదని, అందుకే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు ఖన్నా తెలిపారు. ఇదిలా ఉండగా, కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే మూడు హైకోర్టుల పేర్లను మార్చేశారు అధికారులు. కలకత్తా హైకోర్టు వెలుపల 'కోల్ కతా' హైకోర్టు అని బెంగాలీలో బోర్డులు ఏర్పాటుచేశారు. కానీ ఇంగ్లిష్ పేరు మాత్రం కలకత్తా హైకోర్టుగానే ఉంచారు. హైకోర్టుల పేర్ల మార్పుకు సంబంధించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లిందని, తాము సుప్రీంకోర్టు అప్పీలుకు వెళ్లేది, లేనిది రాష్ట్రపతి నిర్ణయం తర్వాత స్పష్టత వస్తుందని జడ్జిలు చెబుతున్నారు. -
సెక్స్ వర్కర్లకూ ఆ అవకాశమివ్వండి: కలకత్తా హైకోర్టు
రోడ్లను ఆక్రమించుకుని దుర్గాపూజలు చేసే రాజకీయ నాయకులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారంటూ కలకత్తా హైకోర్టు మండిపడింది. సెక్స్ వర్కర్ల సంఘం వాళ్లు సామూహిక పూజలు చేసుకుంటామంటే అవకాశం ఎందుకివ్వరో ఓ నివేదిక ఇవ్వాలని నగర పోలీసులను జస్టిస్ సంజీవ్ బెనర్జీ ఆదేశించారు. దాదాపు 65 వేల మంది సెక్స్ వర్కర్లకు ప్రాతినిధ్యం వహించే దర్బార్ మహిళా సమన్వయ కమిటీ ఈ మేరకు దాఖలుచేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఉత్తర కోల్‌కతా నగరంలో సామూహిక పూజ చేసుకుంటామంటే అనుమతి ఇవ్వలేదని డీఎంఎస్సీ కోర్టుకెక్కింది. ట్రాఫిక్ సమస్యలు వస్తాయన్న కారణంగా పోలీసులు వీరికి అనుమతి నిరాకరించారు. అయితే, నాయకులకు మాత్రం వీధులు ఆక్రమించి పూజలు చేసుకునే అనుమతి ఎందుకిచ్చారని జస్టిస్ బెనర్జీ ప్రశ్నించారు.