కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో సందేశ్‌ఖాలీ వ్యవహారం రోజురోజుకీ రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సందేశ్‌ఖాలీని సందర్శించడానికి వెళ్లిన రాష్ట్ర ప్రతిపక్ష నేత, బీజేపీ నేత సువేందు అధికారి, సీపీఎం బృందా కారత్‌ను పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. సువేందు అధికారి తన మద్దతు దారులతో కలిసి సందేశ్ ఖాలీకి వెళ్తుండగా ధమాఖలి వద్ద పోలీసులు, అల్లర్ల నియంత్రణ దళం సిబ్బంది బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, సీపీఎం మద్దతుదారులు ధమాఖలీలో వేర్వేరుగా నిరసనలు చేపట్టారు.
కాగా నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్‌శాలీలో కొందరు టీఎంసీ నేతలు భూఆక్రమణలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే బీజేపీ ఆరోపణలతో ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వెళ్లువెత్తుతున్న విషయం తెలిసిందే. టీఎంసీ నేతలపై ఆరోపణల అనంతరం నందిగావ్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు సందేశ్ ఖాలీని సందర్శించడం ఇది మూడోసారి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన అంతకముందు రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు.
చదవండి: 2018 పరువునష్టం కేసులో రాహుల్‌కు ఊరట..
అయితే సందేశ్‌కాలీ గ్రామంలో పర్యటించేందుకు బీజేపీ నేత సువేందు అధికారితోపాటు ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌కు కోల్‌కతా హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. తన మద్దతుదారులతో కలిసి వెళ్లవద్దని పేర్కొంది. భద్రతా సిబ్బందితో వెళ్లొచ్చని తెలిపింది. అలాగే రెచ్చగొట్టే ప్రసంగాలేవీ చేయవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలగనీయరాదని హెచ్చరించింది. అదే విధంగా బీజేపీ నేత సందేశ్‌ఖాలీని సందర్శించడంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మంగళవారం ఉదయం హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది,
సందేశ్ కాలీ వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా కూడా తనను అడ్డుకుంటున్నారని సువేందు అధికారి అసహనం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని కోల్‌కతా హైకోర్టు దృష్టికి ఈసుకెళ్తానని తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, రాష్ట పోలీసులు కలకత్తా హైకోర్టు ఆదేశాలను పాటించడం లేదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment