కోల్‌కతా: లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, జాబితా విడుదల చేయటంలో బిజీగా ఉంటున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీ.. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పోటాపోటీగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నేత కునాల్ ఘోష్ బీజేపీకి సవాల్ విసిరారు.
బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించటంలో జాప్యం చేస్తుందని అన్నారు. ఆ స్థానంలో పోటీకి నిలపడానికి బీజేపీకి అభ్యర్థులే దొరకటం లేదని ఎద్దేవా చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారిని పోటీకి దింపాలని టీఎంసీ నేత కునాల్ ఘోష్ సవాల్ విసిరారు.
‘బీజేపీ నేత సువేందు అధికారికి నేను బహిరంగ వివాల్ విసురుతున్నా. ఆయిన డైమండ్ హార్బర్ సెగ్మెంట్‌లో మా నేత అభిషేక్ బెనర్జీపై పోటీ చేయలి’ అని కునాల్ అన్నారు. ఇప్పటికీ డైమండ్ హార్బర్ సెగ్మెంట్‌లో బీజేపీ ఎవరినీ పోటీకి దింపలేదు. ఇక.. ఈ సీటులో పోటీ చేయాలని బీజేపీ తమ అభ్యర్థులను కోరుతోందని ఎద్దేవా చేశారు. అయితే టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీకి కంచుకోట అయిన డైమండ్ హార్బర్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజర్టీతో గెలుపొందారు.
ఆదివారం బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులు ప్రకటించింది. అందులో బెంగాల్ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీకి దింపింది. ఇప్పటి వరకు మొత్తం 38 మంది అభ్యర్థులను బీజేప ప్రకటించింది. ఇక.. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది.
చదవండి: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే మంత్రిపై కేసు
Comments
Please login to add a commentAdd a comment