Abhishek Bannerjee
-
‘సువేందును పోటీకి దింపాలి’.. బీజేపీకి టీఎంసీ సవాల్
కోల్‌కతా: లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, జాబితా విడుదల చేయటంలో బిజీగా ఉంటున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీ.. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పోటాపోటీగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నేత కునాల్ ఘోష్ బీజేపీకి సవాల్ విసిరారు. బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించటంలో జాప్యం చేస్తుందని అన్నారు. ఆ స్థానంలో పోటీకి నిలపడానికి బీజేపీకి అభ్యర్థులే దొరకటం లేదని ఎద్దేవా చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారిని పోటీకి దింపాలని టీఎంసీ నేత కునాల్ ఘోష్ సవాల్ విసిరారు. ‘బీజేపీ నేత సువేందు అధికారికి నేను బహిరంగ వివాల్ విసురుతున్నా. ఆయిన డైమండ్ హార్బర్ సెగ్మెంట్లో మా నేత అభిషేక్ బెనర్జీపై పోటీ చేయలి’ అని కునాల్ అన్నారు. ఇప్పటికీ డైమండ్ హార్బర్ సెగ్మెంట్లో బీజేపీ ఎవరినీ పోటీకి దింపలేదు. ఇక.. ఈ సీటులో పోటీ చేయాలని బీజేపీ తమ అభ్యర్థులను కోరుతోందని ఎద్దేవా చేశారు. అయితే టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీకి కంచుకోట అయిన డైమండ్ హార్బర్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజర్టీతో గెలుపొందారు. ఆదివారం బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులు ప్రకటించింది. అందులో బెంగాల్ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీకి దింపింది. ఇప్పటి వరకు మొత్తం 38 మంది అభ్యర్థులను బీజేప ప్రకటించింది. ఇక.. పశ్చిమ బెంగాల్లో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. చదవండి: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే మంత్రిపై కేసు -
West Bengal: మమతా బెనర్జీ అల్లుడికి అందలం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో కీలక పదవి లభించింది. టీఎంసీ పార్టీ జాతీయ కార్యదర్శిగా అభిషేక్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు పార్టీ అధినేత్రి మమత బెనర్జీ. టీఎంసీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ ప్రకటించింది. ఒకరికి ఒకే పదవి ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని వర్కింగ్ కమిటీ సమావేశంలో మమత నిర్ణయించినట్టు ఆ పార్టీ నేత పార్థ చటర్జీ తెలిపారు. దీని ప్రకారం అభిషేక్ బెనర్జీని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను సుబ్రతా బక్షి నిర్వహిస్తున్నారు. పార్టీ యువజన విభాగం బాధ్యతలను సయోని ఘోష్‌కి అప్పగించారు. విమర్శలకు వెరవక విమర్శలకు ఘాటైన సమాధానం చెప్పడంలో మమత బెనర్జీతి ప్రత్యేక శైలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అభిషేక్ బెనర్జీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ముఖ్యంగా సువేందు అధికారి అభిషేక్‌ను అవినీతికి అడ్రస్‌గా పేర్కొన్నారు. అయితే ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మమత తన అల్లుడికి కీలక బాధ్యతలు అప్పగించింది. -
కోలుకుంటున్న సీఎం మేనల్లుడు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అభిషేక్‌కు సర్జరీ చేసినట్టు చెప్పారు. అభిషేక్ చికిత్స పొందుతున్న బెల్లె వ్యూ క్లినిక్ బుధవారం హెల్తె బులెటిన్ విడుదల చేసింది. బీపీ, పల్స్ రేట్ నిలకడగా ఉందని తెలిపారు. వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అభిషేక్ బెనర్జీ (29) తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. హుగ్లీ జిల్లాలోని ముర్షిబాద్ లో పార్టీ మీటింగ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రత్నపూర్ వద్ద ప్రమాదం జరిగింది. కాగా ప్రమాదం జరిగిన తర్వాత వారం రోజుల వరకు ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. రెండు రోజుల నుంచి ఆయన బాగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.