కోలుకుంటున్న సీఎం మేనల్లుడు | TMC MP Abhishek Bannerjee in stable condition | Sakshi
Sakshi News home page

కోలుకుంటున్న సీఎం మేనల్లుడు

Published Wed, Oct 26 2016 2:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

TMC MP Abhishek Bannerjee in stable condition

కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అభిషేక్కు సర్జరీ చేసినట్టు చెప్పారు. అభిషేక్ చికిత్స పొందుతున్న బెల్లె వ్యూ క్లినిక్ బుధవారం హెల్తె బులెటిన్ విడుదల చేసింది. బీపీ, పల్స్ రేట్ నిలకడగా ఉందని తెలిపారు.  

వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అభిషేక్ బెనర్జీ (29) తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. హుగ్లీ జిల్లాలోని ముర్షిబాద్ లో పార్టీ మీటింగ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రత్నపూర్ వద్ద ప్రమాదం జరిగింది. కాగా ప్రమాదం జరిగిన తర్వాత వారం రోజుల వరకు ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. రెండు రోజుల నుంచి ఆయన బాగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement