సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ నిప్పులు చెరిగారు. చంద్రబాబును ఈడీ, సీబిఐ ఎందుకు అరెస్టు చేయలేదు.. ఆయన అవినీతిపరుడు కాదా ? అంటూ ప్రశ్నించారు. ఆయనపై కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? అంటూ నిలదీశారు.
ప్రభుత్వం ఏర్పాటు కోసం అవినీతిపరులతో చేతులు కలిపారు. చంద్రబాబు, అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ లాంటివారు బీజేపీతో చేతులు కలిపితే వారిపై కేసులను వాషింగ్ మిషన్‌లో వేసినట్లేనా?. బీజేపీతో చేతులు కలిపినంత మాత్రాన నిజాయితీపరులుగా మారిపోయారా ?’’ అంటూ దుయ్యబట్టారు.
‘‘బీజేపీకి 400 సీట్లు దాటుతాయని ప్రచారం చేసి స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొనాలని ప్రచారం చేశారు. టీడీపీ అగ్రనేత ఒకేరోజులో రూ.521 కోట్ల రూపాయలు సంపాదించారు.ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరపాలి’’ అని కల్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment