రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీల ప్రశ్నలకు కేంద్రం సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ‘ఉద్యం సఖి’ పథకం కింద 427 మంది లబ్ధిదారులున్నారని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సహాయ మంత్రి శోభ కరన్ ద్లాజే తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఎంఎస్‌ఈలను స్థాపించిన మహిళలు ఈ ‘ఉద్యం సఖి’ పోర్టల్‌లో నమోదు చేసుకుని ఆ పథకం లబ్ధిని పొందుతున్నట్లు కేంద్ర మంత్రి శోభ కరన్ ద్లాజే పేర్కొన్నారు.
ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోలేదు..
విశాఖపట్నంలో మార్కెటింగ్ టెర్మినల్ పునర్నిర్మించడానికి సవరించిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోకుండా సమీక్షించారని పెట్రోలియం, సహజవాయువులు సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. 2014 జూలైలో రూ.250కోట్ల అంచనాతో ప్రారంభించిన మార్కెటింగ్ టెర్మినల్ తొలగించిన విషయంపై రాజ్యసభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని ప్రశి్నంచారు. 2014లో పునరుద్ధరణ ప్రతిపాదనకు రూ.247కోట్లు మంజూరు చేయగా..ఆ పనులు డ్రాప్ అయ్యాయని కేంద్ర మంత్రి రాతపూర్వకంగా తెలిపారు.
సౌభాగ్య పథకం కింద..
సౌభాగ్య పథకం కింద రాష్ట్రంలో 1,81,930 కుటుంబాలకు విద్యుత్తు అందించారని కేంద్ర విద్యుత్తు సహాయ మంత్రి శ్రీపద్ నాయక్ తెలిపారు. రాజ్యసభలో సౌభాగ్య పథకం కింద ఎన్ని గ్రామాలకు విద్యుత్తు అందిస్తున్నారని ఎంపీ పరిమళ్‌నత్వాని అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిచ్చారు.
అర్సెనిక్ కాలుష్యం బారిన ఏపీలోని 7 జిల్లాలు..
దేశవ్యాప్తంగా ఆర్సెనిక్ కాలుష్యాన్ని 25 రాష్ట్రాల్లోని 230జిల్లాలు ఎదుర్కొంటున్నాయని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎస్.నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన మౌఖికంగా సమాధానమిచ్చారు. ఏపీలో ఏడు జిల్లాలున్నట్లు తెలిపారు. ఆర్సెనిక్ కాలుష్యం వలనే భూగర్భ జలాలు కలుíÙతం అవుతున్నట్లు సమాచారం ఉందని కేంద్ర మంత్రి వివరించారు.
లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021–22 నుంచి 2023–24 మధ్య 1.27 కోట్ల మంది విద్యార్థులు సమగ్ర శిక్ష పథకం ద్వారా లబ్ధి పొందారని వైఎస్సార్‌సీపీ ఎంపీలు డాక్టర్ గుమ్మ తనూజరాణి, మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు. అంతేగాక గత మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.867.60 కోట్ల వ్యయంతో 2,032 ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ ల్యాబ్స్, 4,678 స్మార్ట్ తరగతులు ప్రారంభించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
నెల్లూరు–చెన్నై హైవేని విస్తరించండి
కలకత్తా–చెన్నై జాతీయ రహదారి–16 నెల్లూరు నుంచి చెన్నై వరకు రహదారిని 4–లైన్ నుంచి 6–లై¯Œన్‌గా మార్పు చేయాలని.. ప్రత్యేక అధికరణం 377 ద్వారా తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రస్తావించారు. ఇందులో భాగంగా కృష్ణపట్నం ఓడరేవు, శ్రీ సిటీ, మేనకూరు వంటి పారిశ్రామిక ప్రాంతాలుండడంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని ఎంపీ గుర్తు చేశారు. హైవే విస్తరణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎంపీ పేర్కొన్నారు.
ఏపీలో గత మూడేళ్లలో ప్రధానమంత్రి ముద్రా యోజన కింద నిరర్ధక ఆస్తుల సంఖ్య ఏడాదికేడాదికి తగ్గిందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు పీవీమిధున్ రెడ్డి, డాక్టర్ గుమ్మ తనూజరాణి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరి్థక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ( ఎస్‌ఎల్‌బీసీ)ప్రకారం, ఈ కేటగిరీ కింద ఎనీ్పఏలు 2021–22లో 16.09%, 2022–23 లో 11.52%, 2023–24లో 4.68% కి తగ్గాయని కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment