YSRCP
-
రైతులను నమ్మించి వంచించడం చంద్రబాబు నైజం: కాకాణి
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో వ్యవసాయ రంగం(Agricultural sector) సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతులకు శాపంలా మారిందన్న ఆయన, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆవేదన చెందారు.ఇప్పటివరకు 95 మంది రైతులు(Farmers) ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా చెబుతున్నా, అనధికారికంగా ఆ సంఖ్య 150కి పైగానే ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్థన్‌రెడ్డి గుర్తు చేశారు.కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:సంక్షోభంలో వ్యవసాయ రంగం:ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతుల సమస్యలు పరిష్కరించకపోగా, ఎప్పటికప్పడు డైవర్షన్ పాలిటిక్స్‌తోనే సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం. ఒక పక్క భారీ వర్షాలు, వరదలు. మరోవైపు కరవు పరిస్థితి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.రైతుల ఆత్మహత్యలు బాధాకరం:తాజాగా వైయస్సార్ జిల్లాలో కన్నబిడ్డలతో సహా నాగేంద్ర, వాణి అనే రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతో కలిచి వేసింది. ఇది ప్రభుత్వ అసమర్థతను, వ్యవసాయ రంగం పట్ల వారి ఉదాసీనతను తెలియజేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారిక లెక్కల ప్రకారం 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, అనధికారిక లెక్కల ప్రకారం ఆ సంఖ్య 150కి పైగానే అని సమాచారం.రైతు ఆత్మహత్యలపై కూటమి పార్టీ నాయకులు దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆత్మహత్యలు ఎక్కువ చూపిస్తే చంద్రబాబు అసమర్థ పాలనపై ప్రజల్లో ఆగ్రహం వెల్లుబుకుతుందని వారి భయం. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం దండగ అని గతంలో ఒకసారి చంద్రబాబు అనడం అందరికీ గుర్తుంది.పరిహార చెల్లింపులోనూ బాబు వంచన:రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటుంటే వారి కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాల్సిన సీఎం చంద్రబాబు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా ఆయనది అదే ధోరణి. లక్ష రూపాయల పరిహారం కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారిని కించపర్చేలా మాట్లాడిన చంద్రబాబు, నాడు ఉమ్మడి రాష్ట్రంలో 2003 నాటికి ఆ పరిహారం కూడా ఆపేశారు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన తర్వాత కూడా 2015, ఫిబ్రవరి 18 వరకు ఆ పరిహారం రూ.1.50 లక్షలు మాత్రమే ఇచ్చారు. దాన్ని రూ.5 లక్షలకు పెంచుతామని చెప్పి, ఆ డబ్బును నేరుగా బాధిత కుటుంబానికి కూడా అందజేయకుండా వంచించారు.లక్షన్నర బ్యాంకు రుణాల కోసం కేటాయించి, మిగతా మూడున్నర లక్షలు కూడా వారికి ఇవ్వకుండా బ్యాంకుల్లో జమ చేసి వడ్డీతోనే జీవించాలనేలా చేసి మోసగించాడు. 2014– 19 మధ్య చూస్తే దాదాపు 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ప్రభుత్వం గుర్తించింది కేవలం 1223 మందిని మాత్రమే. ఆ మొత్తం కుటుంబాలకు కాకుండా, కేవలం 450 కుటుంబాలకు మాత్రమే రూ.20.12 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిహారం:2019లో జగన్‌గారు సీఎం అయ్యాక, రైతుల ఆత్మహత్యల పరిహారాన్ని ఒకేసారి రూ.7 లక్షలకు పెంచడంతో పాటు, చంద్రబాబు పాలనా కాలంలో ఆత్మహత్యల పరిహారం అందని కుటుంబాలకు కూడా న్యాయం చేశారు. ఆ విధంగా 474 మంది రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 1794 కుటుంబాలకు రూ.116.10 కోట్ల పరిహారం అందించగా, వారిలో 495 కుటుంబాలు కౌలు రైతులవి.రైతులకు చంద్రబాబు మోసం:నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తే.. 2014 అధికారంలోకి రావడం కోసం రైతుల రుణాలు మొత్తం మాఫీ చేస్తానన్న చంద్రబాబు, వారిని దారుణంగా మోసగించారు. మళ్లీ మొన్న ఎన్నికల్లో రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తానని చెప్పి, దాన్ని కూడా అమలు చేయకుండా మరోసారి మోసం చేశారు. రైతు భరోసా కింద వైయస్సార్సీపీ ప్రభుత్వం 53.58 లక్షల కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం చేసింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు వారికి రూ.20 వేలు ఇవ్వాలంటే, ఈ ఏడాది రూ.10,718 కోట్లు కావాలి. కానీ, బడ్జెట్లో ఆ కేటాయింపు చేయకుండా మరోసారి చంద్రబాబు రైతులను వంచించారు.ఎన్నికల కోడ్ వల్ల గత ప్రభుత్వం చెల్లించలేకపోయిన రూ.930 కోట్ల రైతుల ప్రీమియం, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చెల్లించని కారణంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు దక్కాల్సిన రూ.1385 కోట్ల బీమా దూరమైంది. ఉచిత పంటల బీమా పథకానికి కూడా కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది. మా ప్రభుత్వ హయాంలో యూనివర్సలైజేషన్ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేకుండా నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు, రైతులు చెల్లించాల్సిన ప్రీమియం, కేంద్ర ప్రీమియం కూడా చెల్లించడం జరిగింది. ఇదీ చదవండి: చంద్రబాబూ.. విజన్ అంటే అప్పులేనా?: బుగ్గనరైతులకు బాబు బకాయి రూ.12,563 కోట్లు:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఏమేం ఎగ్గొట్టిందనేది చూస్తే.. ఆ విలువ ఏకంగా రూ.12,563 కోట్లు. 2023–24 రబీ సీజన్లో దాదాపు 3.91 లక్షల మంది రైతులకు చెందాల్సిన కరువు సాయం రూ.328 కోట్లు. సున్నావడ్డీ రాయితీ కింద 2023 సీజన్‌కి సంబంధించి 6.31 లక్షల మంది రైతులకు రూ.132 కోట్లు. పెట్టుబడి సాయం. సున్నా వడ్డీ పంట రుణాలు. కరవు సాయం.. ఇలా మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు హామీ ఇచ్చి చంద్రబాబు ఎగ్గొట్టిన మొత్తం సాయం దాదాపు రూ.12,563 కోట్లు. వెంటనే ప్రభుత్వం వాటన్నింటినీ అందించాలి.కూటమి ప్రభుత్వంలో రైతుల కష్టాలు:రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ సీఎంగా ఉండగా 54.55 లక్షల మంది రైతులకు రూ.7802 కోట్లు బీమా పరిహారం చెల్లించడం జరిగింది. ఇంకా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తూ 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పుడు కూటమి పాలనలో ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైంది.ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగడం లేదు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సరిపడా ఎరువులు అందడం లేదు. రైతులే బహిరంగంగా కూటమి పాలనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్తా యూరియాపై రూ.100 అదనంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. కొన్నిచోట్ల కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేస్తే తప్ప యూరియా దొరకని దుస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ధాన్యం కొనుగోళ్లలో దళారుల రాజ్యం నడుస్తోంది. వాట్సాప్‌లో హాయ్ అని పెడితే కొంటానని చెబుతాడే తప్ప ఎక్కడా మద్దతు ధరకు కొనుగోలు చేసిన పరిస్థితులు కనిపించడం లేదు.ఇవీ మా డిమాండ్స్:ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేల చొప్పున అందించాలి. ప్రతి పంటకు ఈ–క్రాపింగ్ చేసి ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలి. ఆర్బీకే వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలి. రైతులకు బోనస్‌తో కలిపి మద్ధతు ధర చెల్లించాలి. ప్రభుత్వం ఇంకా రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే, వారి పక్షాన నిలబడి పోరాడుతామని కాకాణి గోవర్థన్‌రెడ్డి వెల్లడించారు. -
కూటమి ‘కుట్ర’ రాజకీయాలు: మనోహర్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ఏపీలో టీడీపీ ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పిందని చేస్తున్నారని వైఎస్సార్సీపీ లీగల్ (YSRCP Legal Cell) సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడపలో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నానా అల్లరి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి సమావేశం జరగకుండా గొడవ చేశారని.. గాలివీడు(Galividu)లో కూడా ఇదే తరహాలో టీడీపీ నేతలు వ్యవహరించారని మనోహర్‌రెడ్డి(Manohar Reddy) నిప్పులు చెరిగారు.‘‘జల్లా సుదర్శన్ రెడ్డి ఎంపీపీ కార్యాలయానికి వస్తున్నారని తెలిసి టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. కారప్పొడి, పెప్పర్ స్ప్రేతో 100 మందికి పైగా దాడి చేసేందుకు యత్నించారు. సుదర్శన్ రెడ్డి దౌర్జన్యం చేశారని కట్టుకథ అల్లారు. నిత్యం ప్రజల్లో ఉండే సుదర్శన్ రెడ్డికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న సుదర్శన్ రెడ్డిని తీవ్రవాది మాదిరి ఈడ్చుకుంటూ పోవడం దారుణం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ కక్ష, రాజకీయ దురుద్ధేశంతో చేసినవే’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘గాలివీడులో వైఎస్సార్సీపీలో చురుగ్గా ఉండే నాయకులపై కేసులు బనాయించాలని కుట్ర చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. బాధితుల పక్షాన నిలబడకుండా రాజకీయ దురుద్ధేశంతోనే పవన్ గాలివీడులో పర్యటించారు. బలవంతంగా వైఎస్సార్సీపీ వారి ఆస్తులు లాక్కుంటున్నా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ప్రభుత్వంపై ఎవరు నిరసన తెలిపినా.. వారి పై కేసులు పెడుతున్నారు. అధికారంలోకి రాకముందు 34 వేల మంది మహిళలు అపహరణకు గురయ్యారని పవన్ చెప్పారు. ఈ రోజు ఆ 34 వేల మంది ఎక్కడున్నారో పవన్ సమాధానం చెప్పాలి’’ అని మనోహర్‌రెడ్డి నిలదీశారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. విజన్ అంటే అప్పులేనా?: బుగ్గన‘‘కాకినాడలో దళిత డాక్టర్‌పై జనసేన ఎమ్మెల్యే బూతులు తిడుతూ దాడి చేస్తే పవన్ ప్రశ్నించలేదు. పరామర్శించలేదు. యలమంచిలి ఎమ్మెల్యే విలేకరిని కిడ్నాప్ చేస్తే పవన్ ప్రశ్నించలేదు.. పరామర్శించలేదు. ముచ్చుమర్రిలో మైనర్ బాలిక పై అత్యాచారం చేస్తే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ స్పందించలేదు. పిఠాపురంలో టీడీపీ నేత బాలికపై లైంగికదాడి చేస్తే ఆ కుటుంబాన్ని పవన్ ప్రశ్నించలేదు. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నేత వీఆర్వో పై బీర్ బాటిల్ తో దాడి చేస్తే స్పందించలేదు.. ఖండించలేదు. కేవలం రాజకీయదురుద్ధేశంతోనే పవన్ గాలివీడులో పర్యటించాడు’’ అని మనోహర్‌రెడ్డి చెప్పారు.‘‘మూడు పార్టీలు ఏకమైతేనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జగన్ సింగిల్‌గా పోటీ చేస్తే 40 శాతం ఓట్లు వచ్చాయని పవన్ గుర్తుంచుకోవాలి. ఆరు నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి రేగింది. మరో ఆరు నెలల తర్వాత గన్మెన్లు లేకుండా కూటమి నేతలు ప్రజల్లోకి తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. గాలివీడు ఘటనపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. పోలీసులు కూటమి నేతలు మాటలు వినడం మానుకోవాలి. గాలివీడు ఘటనను న్యాయవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలి. లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుంది’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. -
పవన్ కల్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: రవీంద్రనాథ్ రెడ్డి
-
ఆరు నెలలు అయ్యింది.. చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది
-
చంద్రబాబూ.. విజన్ అంటే అప్పులేనా?: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: అప్పుడు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తోందని ఎద్దేవా చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు.. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. అలాగే, ఈ అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు.మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు 1998లో కూడా విజన్-2020 అన్నారు. చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు. ప్రజలు ఐదేళ్ల కోసం గెలిపించుకుంటారా? వచ్చే 20 ఏళ్ల కోసం గెలిపించుకుంటారా?. మన మేనిఫెస్టోనే మన విజన్. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి నీకు 15వేలు, నీకు 18వేలు అంటూ లెక్కలేసి హామీలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణం చంద్రబాబు మేనిఫెస్టోనే కదా. ఆరు నెలలు అయ్యింది. చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది?.పథకాల అమలేదీ..యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా.. నిరుద్యోగ భృతి అన్నారు.. ఇవ్వలేదు. తల్లికి వందనం అన్నారు.. అది కూడా ఇవ్వడం లేదు. ప్రతీ మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. అదీ లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు.. అది ఏమైంది?. తల్లికి వందనం అమలు చేయాలంటే రూ.12,450 కోట్లు అవసరం. కానీ, కేవలం రూ.5,386కోట్లు కేటాయించారు. అంటే, తల్లికి వందనం లేనట్టే. దీపం పథకానికి రూ.3,955 కోట్లు అవసరం ఉంటే.. కేవలం రూ.895 కోట్లు కేటాయించారు. అంటే ఈ ఏడాది దీపం పథకం కూడా లేనట్టే. ఆడబిడ్డ నిధికి రూ.37,313 కోట్లు అవసరం.. కానీ, కేటాయింపులు మాత్రం సున్నా. దీంతో, అది కూడా లేనట్టే.ప్రశ్నిస్తానన్న నేత ఎక్కడ?కూటమిలో ఒక వ్యక్తి ప్రశ్నిస్తా అన్నాడు.. కాన్నీ, ప్రశ్నించడం లేదు. కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా ఓ నేత పక్కకు వెళ్లిపోయారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన మహిళల బంగారం బయటకు తెస్తామన్నారు. అలాగే, బెల్టు షాపులు రద్దు అన్నారు.. ఇప్పుడు విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టారు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు ఇస్తామన్నారు.. ఒక్కరికైనా ఇచ్చారా?.అప్పుల్లో బాబుదే రికార్డ్..2014-19 మధ్యలో కాపులకు ఐదేళ్లలో 5వేల కోట్లు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. చేనేత రుణాలకు మాఫీ అన్నాడు. ఏమీ చేయలేదు. పుట్టిన ప్రతీ బిడ్డకు మహాలక్ష్మీ పథకం కింద డబ్బులు ఇస్తామన్నాడు.. ఇచ్చాడా?. హామీలు అమలు చేయకుండా ఇప్పుడు విజన్ డ్యాకుమెంట్ రిలీజ్ చేస్తున్నాడు. జూన్‌లో రూ.6వేల కోట్ల అప్పు. జూలైలో రూ.10వేల కోట్లు, ఆగస్టులో రూ.3వేల కోట్లు, సెప్టెంబర్‌లో రూ.4వేల కోట్లు, అక్టోబర్‌లో రూ.6వేల కోట్లు, నవంబర్‌లో రూ.4వేల కోట్లు, డిసెంబర్లో రూ.9వేల కోట్లు అప్పులు చేశారు. ఒకేసారి రూ.5వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర టీడీపీదే. కేవలం అమరావతి పేరుతో రూ.31వేల కోట్లు అప్పులు చేశారు. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలి. అప్పులు ఎవరు కడతారు. వైఎస్సార్సీపీ హయాంలో కేవలం 13 శాతం మాత్రమే అప్పు.. మీరు ఏకంగా 22.6 శాతం అప్పులు చేశారు’ అని చెప్పారు. -
కరెంట్ చార్జీల బాదుడుపై జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట
-
న్యాయవాదిపై పోలీసు గూండాగిరి
సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల గూండాగిరి పెచ్చుమీరిపోతోంది. సీఎం, మంత్రుల మనసెరిగి వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు చేయడమే ఏకైక కర్తవ్యంగా పోలీసు అధికారులు చెలరేగిపోతున్నారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలో పోలీసులు అధికార పార్టీ గూండాల్లా రెచ్చిపోయారు. లక్కిరెడ్డిపల్లె సీఐ కొండారెడ్డి వైఎస్సార్సీపీ నేత, మాజీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, పెద్ద స్థాయిలో ఉన్న సీనియర్ న్యాయవాది జల్లా సుదర్శన్‌రెడ్డిని కాలర్ పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకెళ్లడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంపీడీవోపై దాడి చేశారనే అక్రమ కేసు బనాయించింది కాకుండా, పోలీసులు ఈ దాష్టీకానికి తెగబడటం రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసులో కక్షసాధింపు ధోరణిలో, పక్కా పన్నాగంతో జె. సుదర్శన్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. సుదర్శన్‌రెడ్డి గాలివీడు మండలం మాజీ ఎంపీపీ. ప్రస్తుతం ఆయన తల్లి ఎంపీపీగా ఉన్నారు. సీనియర్ న్యాయవాది అయిన ఆయన గతంలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా గతంలో కీలక పదవిని నిర్వర్తించారు. ఆయన కుటుంబం రాయచోటి నియోజకవర్గంలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా చేస్తున్న న్యాయ పోరాటంలో సుదర్శన్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై కక్షసాధింపు చర్యలకు తెగబడింది. ఎంపీడీవోపై దాడి చేశారని అక్రమ కేసు బనాయించి పోలీసుల ద్వారా దౌర్జన్యానికి పాల్పడింది. ప్రభుత్వ పక్కా ఆదేశాలతోనే సీఐ కొండారెడ్డి శుక్రవారం గాలివీడు ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సుదర్శన్‌రెడ్డిని చొక్కా పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో ఉన్న ప్రజలు ఎంతగా అభ్యంతరం పెడుతున్నా, ఏమాత్రం పట్టించుకోకుండా లాక్కెళ్లి పోలీసు వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఏదైనా కేసులో నిందితులను అరెస్టు చేసేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలను సీఐ కొండారెడ్డి నిర్భీతిగా ఉల్లంఘించి మరీ ఈ దాషీ్టకానికి పాల్పడ్డారన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన సుదర్శన్‌రెడ్డిని చొక్కా పట్టుకొని తీసుకెళ్లుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పోలీసు వ్యవస్థ ఇంతగా దిగజారడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుదర్శన్‌తో పాటు మరో ఇద్దరికి రిమాండ్ రాయచోటి : గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జవహర్‌బాబుపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఎంపీడీవో ఫిర్యాదు ఇచ్చారు. గాలివీడు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది జల్లా సుదర్శన్‌రెడ్డితో పాటు మరో 12 మందిపై కేసు నమోదు చేశారు. ఎన్.వెంకటరెడ్డి, ఎం.బయారెడ్డి, జి.చంద్రశేఖర్‌రెడ్డి, జె.ధనుంజయరెడ్డి, ఎన్.రమణారెడ్డి, భానుమూర్తిరెడ్డి, జి.రామాంజులురెడ్డి, ఎన్.రామాంజుల్‌రెడ్డి, యు.ధర్మారెడ్డి, రెడ్డికుమార్, ఎం.ఆంజనేయరెడ్డి, పి.బయారెడ్డిలపై కేసు నమోదు చేశారు. వీరిలో జల్లా సుదర్శన్‌రెడ్డి, ఎన్.వెంకటరెడ్డి, ఎం.బైరెడ్డిలను పోలీసులు శనివారం లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఆదేశానుసారం శనివారం సాయంత్రం వీరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని గాలివీడు పోలీసులు తెలిపారు. -
జనవరి 3న జరగాల్సిన వైఎస్సార్సీపీ ధర్నా వాయిదా
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ధర్నాలో మార్పు జరిగింది. ప్రజా సమస్యలపై ఉద్యమ బాటలో భాగంగా విద్యార్థులకు బాసటగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఆందోళనన కార్యక్రమాన్ని జనవరి 29కి ఆ పార్టీ అధిష్టానం వాయిదా వేసింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.2800 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.1100 కోట్లు కలిసి మొత్తం రూ.3900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. జనవరి 3వ తేదీన కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, 3వ తేదీన ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా 29న నిర్వహించాలని అధిష్టానం పిలుపునిచ్చింది.పోరుబాట విజయవంతం:ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో యూనిట్ కు రూ.1.20 నుంచి రూ.1.25 పైసలు చొప్పున దాదాపు రూ.15,600 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు, ప్రభుత్వమే డిస్కమ్‌లకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినియోగదారులతో కలిసి వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం విజయవంతమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం వేయమన్న హామీ నిలబెట్టుకోవాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స డిమాండ్ చేశారు. -
పవన్.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా వ్యవహరించడమే తన విధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన, అన్నమయ్య జిల్లా గాలివీడులో పవన్‌కళ్యాణ్ పర్యటన పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైందని విమర్శించారు. అదే ప్రాంతంలో జరిగిన రైతు ఆత్మహత్యను హేళన చేసేలా డిప్యూటీ సీఎం మాట్లాడటం దారుణమని అన్నారు.గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు:గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో దాడిని రాజకీయం చేస్తూ, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ హుటాహుటిన పర్యటించారు. కడపలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను పరామర్శించడంతో పాటు, గాలివీడు మండల పరిషత్ కార్యాలయం సందర్శించిన ఆయన, ఏ మాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా, ఏకపక్షంగా మాట్లాడడం దారుణం. పిచ్చిగా విమర్శలు చేయడం, హెచ్చరికలు జారీ చేయడం అత్యంత హేయం.గాలివీడులో వాస్తవంగా ఏం జరిగింది?:మాజీ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఆ ప్రాంతంలో 30 ఏళ్లుగా రాజకీయాల్లో మచ్చ లేని నాయకుడుగా ఉన్నారు. ప్రజల కోసం ఆయన నిరంతరం పని చేస్తున్నారు. ఆయన తల్లి ఎంపీపీగా ఉన్నారు. కిందిస్థాయి సిబ్బంది పిలవడంతోనే ఆయన ఎంపీపీ ఛాంబర్‌కు వెళ్లారు. ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ వారు ఆయనపై దాడి చేశారు. ఏకంగా పెప్పర్ స్ప్రే ఉపయోగించారంటే వారి ఉద్దేశం అర్థమవుతోంది. అటువంటి దారుణ ఘటనలో న్యాయవాదిగా, మంచిపేరున్న నాయకుడుగా ఉన్న సుదర్శన్‌రెడ్డిపై పోలీసులు హేయంగా వ్యవహరించారు.ఈ ఘటనలో వాస్తవాలు తెలుసుకోవాలంటే, ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కాల్స్ డేటా పరిశీలిస్తే, ఎవరు దీనికి ఆదేశాలు ఇచ్చారు? ఎవరు హింసను ప్రేరేపించారు? అన్నది తెలుస్తుంది. బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్‌కళ్యాణ్‌కు ఇవ్వన్నీ తెలుసుకునే ఓపిక లేదు. ఏకపక్షంగా ఆయన మాట్లాడటం, వైయస్ఆర్సీపీని రాజకీయ లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం.రాయలసీమపై చులకన భావం:పవన్‌కళ్యాణ్ మాటల్లో రాయలసీమ ప్రజలపై చులకనభావం కనిపిస్తోంది. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి ఈ వైఖరి పెరిగిపోయింది. ఎక్కడో రైలు తగలబడితే రాయలసీమ గూండాలు చేశారంటూ గతంలో ఆయన మాట్లాడిన మాటలను మరిచిపోలేదు. రాయలసీమ ప్రాంతం నుంచి హైకోర్ట్‌ను, లా వర్సిటీని తీసుకుపోతున్నా పవన్ ఎందుకు స్పందించడం లేదు? ఆయనకు కూడా ఈ ప్రాంతం పట్ల మంచి భావం లేదనేదే దీనికి అర్థం.రైతు ఆత్మహత్యలు కనిపించడం లేదా?:గాలివీడు పర్యటన సందర్భంగా అక్కడకు సమీపంలోనే రైతు ఆత్మహత్య జరిగింది. దీనిపై మీడియా పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నించగా ఆయన స్పందించిన తీరు చాలా దారుణంగా ఉంది. రైతులకు పంటలు బాగానే వచ్చాయి. డబ్బులు బాగానే ఉన్నాయి. అయినా, ఎందుకు చనిపోయారు? అంటూ పవన్ చాలా హేళనతో మాట్లాడిన తీరు బాధ కలిగిస్తోంది.దళితులపై అత్యాచారాలు, అవమానాలు జరిగినప్పుడు, తన పార్టీ ఎమ్మెల్యేలే దాడి చేసినప్పుడు పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? కడప అనగానే రాజకీయం చేయాలని ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడ ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో జరుగుతున్న సమయంలో, ఇక్కడ కడపలో పవన్‌కళ్యాణ్ రాజకీయం చేశారు. రైతుల ఆత్మహత్యలపై చులకనగా మాట్లాడారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరిస్తారా?తెలుగుదేశం పార్టీకి మేలు చేయడమే పవన్ లక్ష్యం:తెలుగుదేశం పార్టీకి మేలు చేయడమే తన లక్ష్యంగా, వైఎస్సార్సీపీని రాజకీయంగా దూషించడమే తన విధానంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా, దానిలో వైయస్సార్సీపీ ప్రమేయం ఉందనే ఆరోపణలు రాగానే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తు్తన్నారు. కనీసం ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఏకపక్షంగా విషయాన్ని వింటూ, రాజకీయంగా వైయస్ఆర్సీపీపై పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు.వాటన్నింటిపై ఎందుకు స్పందించలేదు?:కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లకే వినుకొండలో నడిరోడ్డుపై ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. దానిపై పవన్ మౌనంగా ఉన్నారు. నందికొట్కూరులో బీసీ మెనర్ బాలికపై దారుణ అత్యాచారం చేసి, హతమార్చినా ఆ కుటుంబాన్ని ఇంత వరకు పరామర్శించ లేదు. ఎన్నికల ముందు సుగాలి ప్రీతి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావించారు. ఈరోజు దానిపై ఎక్కడా మాట్లాడటం లేదు. బద్వేల్‌కు చెందిన ఒక బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ బాలిక కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. బాలిక కుటుంబసభ్యులను కూడా పవన్ పరామర్శించ లేదు.కాకినాడలో జనసేన ఎమ్మెల్యే నానాజీ ఒక దళిత ప్రోఫెసర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేసినా కనీసం తన ఎమ్మెల్యేను ప్రశ్నించే సాహసం చేయలేదు. పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే దానిపైనా మాట్లాడలేదు. యలమంచిలిలో జనసేన ఎమ్మెల్యే విలేకరులను నిర్భందించి వేధిస్తే కనీసం పెదవి విప్పలేదు. ఇదేనా పవన్‌కళ్యాణ్ విధానం?. ప్రశ్నిస్తాను అన్న ఆయన నైజం?హామీలపైనా నోరు మెదపడం లేదు:కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా సూపర్ సిక్స్ హామీల అమలు లేదు. దానిపై పవన్ మాట్లాడ్డం లేదు. ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తొలగిస్తున్నారు. ఉద్యోగులకు డీఎ, ఐఆర్ ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలను పెద్ద ఎత్తున పెంచుతున్నారు. రైతులను ఆదుకునే చర్యలు అంతకన్నా లేవు. వీటన్నింటిపై పవన్ ప్రశ్నలు ఏమయ్యాయి? సన్నాతన ధర్మం అన్నారు. తిరుపతి లడ్డూ అన్నారు. తరువాత వాటిపై మాట్లాడటమే మానేశారు.ఇకనైనా వైఖరి మార్చుకోవాలి:రాజకీయం కోసమే పవన్‌కళ్యాణ్ ఇలా వ్యవహరించడం దారుణం. అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన సంఘటనలో జవహర్‌బాబుకు మంచి జరగాలి. అదే క్రమంలో ఎందుకు పెప్పర్ స్ప్రే చల్లారనే దానిపైనా విచారణ జరగాలి. అలా కాకుండా ఏకపక్షంగా వైయస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుంటూ, ఆ పార్టీని ఎక్కడా ఉండనివ్వకూడదు అనేది దారుణమైన ఆలోచనలు చేయడం అత్యంత హేయం. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే అధికారంలో ఉన్న వారు ముందుగా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి. అలా కాకుండా ఏకపక్షంగా ఒత్తిళ్లకు లోనై వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే పవన్‌కళ్యాణ్ ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. -
ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: బొత్స
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం వేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మండిపడ్డారు. పోరుబాటలో పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.‘‘ఎన్నికల హామీలను చంద్రబాబు(chandrababu) వెంటనే అమలు చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది. ఇప్పటివరకు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల్లోనే 74 వేల కోట్లు అప్పులు చేశారు. ప్రపంచ బ్యాంకు నుంచి 15 వేల కోట్లు అప్పు చేశారు. మొత్తంగా ఈ ప్రభుత్వం లక్ష కోట్లు అప్పు చేసింది. సంక్షేమ పథకాలు ఇవ్వకుండానే 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమయ్యారా?. కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.’’ అని బొత్స చెప్పారు.పోరుబాట విజయవంతం:ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో యూనిట్ కు రూ.1.20 నుంచి రూ.1.25 పైసలు చొప్పున దాదాపు రూ.15,600 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు, ప్రభుత్వమే డిస్కమ్‌లకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినియోగదారులతో కలిసి వైయస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం విజయవంతమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం వేయమన్న హామీ నిలబెట్టుకోవాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స డిమాండ్ చేశారు.ప్రభుత్వంలో చలనం లేదు:పండిన పంటకు గిట్టుబాటు ధర రాక, అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న రైతుల తరపున కూడా ఆందోళన చేపట్టి వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను పెడచెవిన పెట్టి ప్రభుత్వం కళ్లబొల్లి మాటలతో కాలం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏడు నెలల్లో లక్ష కోట్లు:ఎన్నికలకు మందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసిందని తెలుగుదేశం పార్టీ బాకా పట్టుకుని అబద్దాలు ప్రచారం చేసిందని బొత్స ఆక్షేపించారు. వైయస్సార్సీపీ హయాంలో అన్ని రకాల అప్పులు కలుపుకున్నా రూ.6 లక్షల కోట్లు మించలేదని.. అయినా రూ.14 లక్షల కోట్లు అప్పు అని విపరీతంగా దుష్ప్రచారం చేయడాన్ని తప్పు బట్టారు.మరో వైపు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు తిరక్క ముందే దాదాపు రూ.74 వేల కోట్లు అప్పు చేసిందన్న బొత్స.. అవీ కాకుండా మార్క్ ఫెడ్, సివిల్ సఫ్లైస్, ఏపీఎండీసి వంటి కార్పొరేషన్ల నుంచి కూడా అప్పులు చేస్తున్నారని వెల్లడించారు. వీటికి అదనంగా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15 వేల కోట్ల అప్పులు కలుపుకుంటే, ఇప్పటికే కూటమి ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేసిందని గుర్తు చేశారు. ఆ రోజు వైఎస్సార్సీపీ అప్పులు చేసినా, అందులో కీలక భాగం ప్రజలకు పంచిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. వివిధ పథకాల ద్వారా ఆ 5 ఏళ్లలో ఏకంగా రూ.2.74 లక్షల కోట్లు డీబీటీ ద్వారా జమ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.మరి ఈ అప్పు అంతా ఏమైంది?:ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిన లక్ష కోట్ల అప్పు ఏం చేశారని మాజీ మంత్రి నిలదీశారు. పెన్షన్ రూ.1000 పెంచినా, ఇప్పటికే వాటిలో 3 లక్షలు కోత పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోగా, యూనిట్ విద్యుత్‌కు పేదవాడి మీద రూ.1.20 అదనపు భారం వేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు నెలకు ఉచితంగా ఇస్తున్న 200 యూనిట్లు విద్యుత్ కూడా నిలిపేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా గతంలో దశల వారీగా ఇచ్చే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల రిజిష్ట్రేషన్లు కూడా నిలిపివేశారని ఆక్షేపించారు. ఈ విధంగా అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయం చేస్తూ.. తిరిగి ప్రతిపక్షంపై దుమ్మెత్తి పోయడం అధికార పార్టీకి అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి బొత్స ఆక్షేపించారు.ఇప్పటికే లక్ష కోట్ల అప్పు చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒక్క మంచి కూడా చేయలేదని చెప్పారు. ఈ ఆరు నెలల్లోనే లక్ష కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వం.. ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్ల అప్పు చేయాడనికి సన్నద్ధమయిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఎక్కడుందని నిలదీసిన బొత్స సత్యనారాయణ, సంపద సృష్టి అంటే అప్పులు చేయడమా? అని ప్రశ్నించారు.అన్నింటా కూటమి ప్రభుత్వం విఫలం:అధికారంలోకి వ్చచిన ఆరునెలల్లోనే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కూటమి ప్రభుత్వం కనీసం కొత్త సంవత్సరంలోనైనా ప్రజలను సుభిక్షంగా ఉంచేలా పాలన చేయాలని హితవు పలికారు. ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు లాంటి చిన్న చిన్న హామీలను కూడా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అవగాహన లేకుండానే అన్ని హామీలను ఎలా ఇచ్చారన్న బొత్స.. కేవలం అధికారం కోసమే అబద్దాలు ఆడి ప్రజలను గాలికొదిలేయడం న్యాయమేనా? అని నిలదీశారు.కనీసం డిస్కమ్‌లకు ఇవ్వాల్సిన డబ్బులైనా ప్రభుత్వం చెల్లించి ఉంటే.. సామాన్యులకు ట్రూఅప్ ఛార్జీల మోత తగ్గేదని చెప్పారు. కానీ, ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్కో వినియోగదారుడి మీద రూ.2 వేల నుంచి రూ.3 వేల భారం పడుతుంటే సామాన్యుడు ఎలా బ్రతుకుతాడని నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లులోనూ ప్రభుత్వం రైతులను వంచిస్తోందని బొత్స గుర్తు చేశారు. ఒకవైపు 24 గంటల్లో ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెపుతుంటే.. తేమ శాతం ఎక్కువగా ఉందని.. 20 శాతం వరకు డబ్బులు మినహాయించుకుంటున్నారని మండిపడ్డారు.సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను కొత్త ఏడాదిలో ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. మీడియా అండదండలున్నాయని కల్లిబొల్లి మాటలతో కాలం వెల్లదీయాలని చూస్తే ఎల్లకాలం సాగదని తేల్చి చెప్పారు.మీడియా ప్రశ్నలకు సమాధానంగా..అందులో తప్పేముంది?: విశాఖ విమానాశ్రయంలో తనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలవడంపై మాట్లాడుతూ.. తాను గతంలో లోకేష్‌ను, పవన్‌కళ్యాణ్‌ను కూడా కలిశానన్నారు. అందులో తప్పేముందన్నారు. కేవలం అభద్రతా భావంతో ఉన్న వాళ్లే ఇలాంటి విషయాలకు భయపడి అనవసర రాద్ధాంతం చేస్తారని చెప్పారు. ఈ వివాదాన్ని సృష్టించిన వారే దీనికి సమాధానం చెప్పాలన్నారు. అధికార పార్టీ అనుకూల ఛానల్లో ఈ వార్త వచ్చిందన్న బొత్స.. మంత్రి శ్రీనివాస్ మీద ఆ పార్టీలోనే కుట్ర జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.ఫోన్ చేస్తే ఎత్తడం లేదు:డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేయడంపై బొత్స సత్యనారాయణ విస్మయం వ్యక్తం చేశారు. తప్పు జరిగితే తొక్క తీస్తానని తరచూ మాట్లాడే పవన్‌కళ్యాణ్ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దీన్ని కూడా జగన్‌గారి ప్రభుత్వ వైఫల్యం అంటారేమోనని ఎద్దేవా చేశారు. డీజీపీ అన్నా, ఆ పదవి అన్నా తనకు చాలా గౌరవమన్న మాజీ మంత్రి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తాను డీజీపీ అన్న విషయాన్ని ప్రస్తుత డీజీపీ మర్చిపోయినట్టున్నారని, అందుకే తాము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారని తెలిపారు.పవన్ ఆ పని చేస్తే బాగుండేది:ఎంపీడీఓ పై దాడి జరిగిందని పరామర్శకు కడప వెళ్లిన పవన్, అదే జిల్లాలో బీరు బాటిల్ తో టీడీపీ నేతల దాడిలో గాయపడిన చంద్రమౌళి అనే వీఆర్వోనూ కూడా పరామర్శిస్తే బాగుండేదన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. అందరికీ ఒకటే అని చెప్పుంటే బాగుండేదని సూచించారు. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా మార్చొద్దని బొత్స హితవు పలికారు. సినీ హీరోలను జగన్ నాడు అవమానించారనేది అవగాహన రాహిత్యమన్న మాజీ మంత్రి.. తనను వైఎస్ జగన్, ఎంతో గౌరవించారని చిరంజీవి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. -
నా తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్న
-
బాబు బాదుడుపై ధర్మవరం YSRCP నేతలు పోరుబాట
-
బాబు బాదుడుపై తుని YSRCP నేతలు పోరుబాట
-
బాబు బాదుడుపై రామచంద్రపురం YSRCP నేతలు పోరుబాట
-
మన్మోహన్‌కు వైఎస్సార్సీపీ నేతల నివాళులు..
సాక్షి, విశాఖపట్నం: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి పలువురు వైఎస్సార్సీపీ నేతలు సంతాపం తెలిపారు. విశాఖలో మన్మోహన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశం గొప్ప నేతను కోల్పోయిందని చెప్పుకొచ్చారు. ఆయన సంస్కరణలు దేశానికి, రాబోయే తరానికి ఎంతో ఉపయోగకరమని ప్రశంసించారు.విశాఖలో మన్మోహన్ సింగ్ మృతిపై వైఎస్సార్సీపీ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, రవీంద్ర బాబు, కుంభ రవిబాబు, బొత్స ఝాన్సీ, మంత్రి గుడివాడ అమర్నాథ్, జడ్పీ చైర్మన్ సుభద్ర సహా పార్టీ నేతలు పాల్గొన్నారు.అనంతరం, బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ..‘దేశం గొప్ప నేతను కోల్పోయింది. అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. పనికి ఆహార పథకాన్ని తీసుకుని వచ్చి పేదల కడుపు నింపారు. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి. ఆయన మరణం దేశానికి తీరని లోటు అంటూ కామెంట్స్ చేశారు.మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ..‘దేశ చిత్రపటాన్ని ప్రపంచంలో నిలిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్. సంస్కరణల వారధి మన్మోహన్ సింగ్. ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన సంస్కరణలు దేశానికి రాబోయే తరానికి ఎంతో ఉపయోగకరం అని అన్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘దేశానికి మన్మోహన్ సేవలు మరువలేము. స్టీల్ ప్లాంట్ విస్తరణకు ఎంతో కృషి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కాకుండా కాపాడారు. ఆయన సేవలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అని వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ..‘ఇండియాను గ్లోబల్ పవర్‌గా చేసిన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుంది. అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ గొప్ప దేశ భక్తుడు అని తెలిపారు.కుంభ రవిబాబు మాట్లాడుతూ.. దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే అణు ఒప్పందం జరిగింది. గ్రామీణ దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన తన సంస్కరణలతో మార్చారు అని చెప్పుకొచ్చారు. -
వైఎస్సార్సీపీ నేతల పోరుబాటపై పోలీసుల అక్రమ కేసులు
-
వైఎస్ఆర్ సీపీ పోరుబాట సక్సెస్
-
ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లుల బాదుడు, నయవంచక పాలనపై ఎగసిపడ్డ ప్రజాగ్రహం... వైఎస్సార్సీపీ పోరుబాట విజయవంతం
-
టీడీపీ రౌడీల దౌర్జన్యకాండ
సాక్షి ప్రతినిధి, కాకినాడ/శంఖవరం/కళ్యాణదుర్గం: తెలుగుదేశం పార్టీ నేతలు అధికార మదంతో చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో పథకం ప్రకారం వైఎస్సార్సీపీ నేతలపై కత్తులతో మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌కు చెందిన స్కార్పియో వాహనానికి టీడీపీ నేతలు నిప్పుపెట్టారు. పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న మరో ఘటనలో.. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడిచేశారు. ఈ క్రమంలో అడ్డువచ్చిన ఆయన తల్లిని టీడీపీ మూకలు నెట్టడంతో ఆమె కిందపడగా తలకు బలమైన గాయమైంది. వివరాలివీ..ప్రత్తిపాడులో మూకుమ్మడి దాడిపెంచిన విద్యుత్ చార్జీలపై వైఎస్సార్సీపీ శుక్రవారం ప్రత్తిపాడులో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి శంఖవరం మండలం ‘మండపం’ గ్రామం నుంచి వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. మండపం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత గుండుబిల్లి నానాజీ ప్రత్తిపాడు వెళ్లేందుకు తన పొలం నుంచి ఇంటికి తిరిగొస్తున్నారు. ఇది తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పొలం చిన్నా, పిల్లి రమేష్, సుంకర వెంకటసూరి, చలమశెట్టి మానీలు, సుంకర శివ, ఉటుకూరి రమణ, మరో పాతిక మంది ఆ మార్గంలో కాపు కాశారు. అటుగా వస్తున్న నానాజీపై మూకుమ్మడిగా కత్తులతో దాడికి దిగారు. విచక్షణారహితంగా జరిపిన ఈ దాడిలో నానాజీ తలకు, మెడకు తీవ్రగాయాలు కావడంతో ఆయన అపసార్మక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మండపం గ్రామ సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యం తదితరులు నానాజీని హుటాహుటిన తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు.అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు నక్కా మాణిక్యం, గట్టెం దివాణంపై టీడీపీ నేతలు మారణాయుధాలు, కర్రలతో దాడిచేశారు. వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పల్నాడు జిల్లాలోనూ దాడి..అడ్డుకోబోయిన మహిళకు తీవ్రగాయం..పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు వెంకయ్యపై అదే గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులు దరువూరి వెంకటేశ్వర్లు మరికొంత మంది దాడిచేశారు. అనంతరం సాయంత్రం మరో నేత ఇంటూరి వీరయ్యపై దాడి నిమిత్తం ఆయన ఇంటి మీదకు వెళ్లారు. దాడిచేసే క్రమంలో అడ్డువచ్చిన వీరయ్య తల్లి ఇంటూరి శిరోమణిని నెట్టడంతో ఆమె వెనక్కి సీసీ రోడ్డుపై పడింది. దీంతో ఆమె తలపగిలి తీవ్ర రక్తస్రావమైంది. బాధితురాలిని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కారుకు నిప్పు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 23వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అర్చన, హరిప్రకాష్ దంపతులకు చెందిన స్కార్పియో వాహనానికి (ఏపీ16బీ2 6066) గుర్తుతెలియని దుండగులు గురువారం అర్థరాత్రి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న కౌన్సిలర్ దంపతులు బయటకు రాగా.. అప్పటికే కారు పూర్తిగా దగ్థమైంది. ఈ ఘటనపై హరిప్రకాష్ టీడీపీకి చెందిన వారిపై పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై కక్ష సాధింపులో భాగంగానే ఈ ఘటనకు ఒడిగట్టినట్లు ఆయన పేర్కొన్నారు. టీడీపీకి చెందిన పూజారి మహేష్, బోయ తిప్పేస్వామిలకు గతంలో రూ.8.50 లక్షలు అప్పుగా ఇచ్చానని.. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వమని ఇటీవల అడిగితే దౌర్జన్యానికి దిగారని తెలిపారు. ఈ క్రమంలోనే తనను భయపెట్టేందుకు ఈ ఘటనకు ఒడిగట్టి ఉంటారనే ఆయన అనుమానం వ్యక్తంచేశారు. -
దారి పొడవునా బ్రహ్మరథం
సాక్షి ప్రతినిధి, కడప/ సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ జిల్లాలో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారిపొడవునా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం పులివెందుల– బెంగళూరు మార్గంలోని పల్లెల జనమంతా రోడ్డుపైకి వచ్చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. తమ అభిమాన నాయకుడు ఆ రహదారిలో వెళ్తున్నారని తెలుసుకుని ఆయా గ్రామాల వద్ద రోడ్డుపై తిష్ట వేశారు. దారి పొడువునా జననేతకు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ సైతం ఏ ఒక్కరినీ నిరాశ పరచకుండా అందరినీ పలకరిస్తూ, సెల్ఫీలు దిగుతూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మార్గం మధ్యలో ఆయా గ్రామాల్లో నేతలందరినీ పేరు పేరునా పలకరిస్తూ ముందుకు సాగారు. అంబకపల్లి క్రాస్, దొరిగల్లు మీదుగా ముదిగుబ్బ బైపాస్ రోడ్డుకు చేరుకున్న జగన్‌కు.. కాకతీయ దాబా వద్ద కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారందరికీ జగన్ అభివాదం చేశారు. తర్వాత కట్టకిందిపల్లె మీదుగా బత్తలపల్లి మండలం రామాపురం చేరుకున్న జగన్ కాన్వాయ్‌ని ప్రజలు ఆపి, జై జగన్ అంటూ నినదించారు. బత్తలపల్లి టోల్‌ప్లాజా వద్దకు కాన్వాయ్ చేరుకునే సరికే భారీ సంఖ్యలో జనం, పార్టీ శ్రేణులు వేచి ఉన్నారు. ఇక్కడ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు కాన్వాయ్‌కు అడ్డుపడుతూ తమతో మాట్లాడాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వాహనంలో నుంచి బయటకు వచ్చి అభివాదం చేశారు. టోల్‌ప్లాజా వద్దనే అడుగడుగునా వాహనానికి అడ్డుపడడంతో జగన్ వాహనంలో నుంచి మూడు సార్లు బయటకు వచ్చి అభివాదం చేయాల్సి వచ్చింది.కరచాలనానికి పోటాపోటీరాప్తాడులోని నాలుగు రోడ్ల కూడలికి జగన్ కాన్వాయ్ చేరుకోగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మీ శ్రీనివాస్, భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.జగన్‌తో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి ప్రజలు పోటీ పడ్డారు. మార్గం మధ్యలోని బొమ్మేపర్తి, లింగనపల్లి, హంపాపురం, గొల్లపల్లి, మరూరు, ఎం.చెర్లోపల్లి, చెన్నేకొత్తపల్లి సమీపంలో పార్టీ శ్రేణులు, ప్రజలు, మహిళలు ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలికారు. సోమందేపల్లి వై.జంక్షన్ వద్ద శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్, వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, చిలమత్తూరు మండలానికి సమీపంలోని బాగేపల్లి టోల్‌ప్లాజా వద్ద హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఇక్కడ జగన్‌తో కరచాలనం చేసేందుకు యువతీ యువకులు పోటీపడ్డారు. టోల్ ప్లాజా దాటేందుకు సుమారు గంట సమయం పట్టడం గమనార్హం. జగన్‌ను చూసేందుకు వచ్చిన జనాన్ని, పార్టీ శ్రేణుల్ని నిలువరించడానికి ఏపీ, కర్ణాటక పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.అక్రమ కేసులకు భయపడొద్దురాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు. ఇటీవల చిలమత్తూరు మండల టీడీపీ కన్వీనర్ రంగారెడ్డి చేసిన దాడిలో శివప్ప, అతని సోదరుడు వెంకట్‌తో పాటు మత్సేంద్ర, నారాయణప్ప, పవన్ గాయపడ్డారు. అయితే.. పోలీసులు బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వారంతా పెద్దనపల్లి వద్ద వైఎస్ జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయించారని వాపోయారు. వారి కష్టాన్ని ఓపికగా విన్న జగన్.. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులకు భయపడొద్దని వారికి ధైర్యం చెప్పారు. -
అబద్ధాలతో మోసగించే నైజం చంద్రబాబుది
పుంగనూరు: ఎన్నికల సమయంలో ప్రతి చోటా పదేపదే అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించే నైజం చంద్రబాబుదేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెతారు. విద్యుత్ చార్జీలు పెంచబోనని ఎన్నికల్లో అనేక సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే ప్రజలపై రూ.15,485,36 కోట్లకు పైగా కరెంటు చార్జీల భారం వేశారని తెలిపారు. ప్రజలను వంచించిన చంద్రబాబుకు గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పతో కలసి వేలాదిమందితో శుక్రవారం పట్టణంలో జోరు వానలోనూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని, రైతులందరికీ వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత చంద్రబాబు పాలనలో మూడు డిస్కంలు రూ.86 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిస్కంలకు ఆర్థిక సహాయం చేకూర్చి, మళ్లీ లాభాల బాట పట్టించారని తెలిపారు. అలాగే సోలార్ విద్యుత్‌ను చవగ్గా రూ.2.49కే అందించేందుకు సెకితో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. -
ఎగిసిపడ్డ ప్రజాగ్రహం
సాక్షి, అమరావతి: కరెంట్ చార్జీలను పెంచబోమని... ఇంకా తగ్గిస్తామని ఎన్నికల్లో నమ్మించి అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే రూ.15,485.36 కోట్ల షాకులిచ్చిన సీఎం చంద్రబాబు మోసాలపై ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. టీడీపీ కూటమి సర్కారు విద్యుత్తు చార్జీల బాదుడుపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ వేధింపులు.. పోలీసుల బెదిరింపులకు వెరవకుండా.. నయవంచన పాలనను నిరసిస్తూ కిరోసిన్ లాంతర్లతో జన వాహిని కదం తొక్కింది. కరెంటు చార్జీలు పెంచి ఇప్పటికే వసూలు చేస్తున్న రూ.6,072.86 కోట్లను తిరిగి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనవరి నుంచి మోపనున్న రూ.9,412.50 కోట్ల భారాన్ని రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి సర్కారు మంగళం పాడిన ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని నినదించారు. ‘ఓటు’ దాటాక హామీలను తగలేయడాన్ని నరనరాన జీర్ణించుకున్న చంద్రబాబు మోసాలను ఎండగడుతూ విద్యుత్తు బిల్లుల బాదుడుకు నిరసనగా వైఎస్సార్ సీపీ శుక్రవారం నిర్వహించిన పోరుబాటకు ప్రజలు ఉప్పెనలా కదలివచ్చారు. పోలీసుల ఆంక్షలకు వెరవకుండా కిరోసిన్ లాంతర్లు చేతబట్టి కూటమి ప్రభుత్వం చేసిన దగాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ చార్జీల పెంపును వెంటనే రద్దు చేయాలి.. నయవంచక చంద్రబాబు డౌన్ డౌన్.. అంటూ గర్జించారు. దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ వేలాది మంది కిలోమీటర్ల తరబడి విద్యుత్ శాఖ కార్యాలయాల వరకూ ర్యాలీగా కదిలి వచ్చారు. విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసనలు నిర్వహించి అధికారులకు డిమాండ్ పత్రాలను అందజేశారు. ఈనెల 13న నిర్వహించిన రైతు పోరును మించి కరెంటు చార్జీల బాదుడుపై పోరుబాటలో జనం ఉద్యమించడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కదనోత్సాహం నెలకొంది. » కృష్ణా జిల్లాలో విద్యుత్‌చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీ స్పందన లభించింది. » విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలు హోరెత్తాయి.» శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘పోరుబాట’కు జనం పోటెత్తారు. బుచ్చిరెడ్డిపాళెంలో రెండు కిలోమీటర్ల మేర నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. » ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోరుబాట నిరసన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఏలూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. » తూర్పు గోదావరి జిల్లాలో కోటిపల్లి బస్టాండ్ నుంచి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయం వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. » పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో నిరసన ప్రదర్శనల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీలు, పాదయాత్రలు, విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. » వైఎస్సార్ జిల్లా కడపలో పార్టీ కార్యాలయం నుంచి విద్యుత్ భవన్ వరకూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో విద్యుత్ పోరు కొనసాగింది.» కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు.» తిరుపతి నగరంలో నిరసన ర్యాలీ పద్మావతిపురంలోని భూమన కార్యాలయం నుంచి ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకూ సాగింది. నాయుడుపేట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, గూడూరు, నాగలాపురంలో ర్యాలీలు నిర్వహించారు.» కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీగా విద్యుత్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు డిమాండ్ పత్రాన్ని అందచేశాయి.» చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కూడలి నుంచి ర్యాలీగా పీఎల్ఆర్ రోడ్డులోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయానికి చేరుకుని విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలంటూ నినదించారు. చిత్తూరు, నగరి, పూతలపట్టు, కార్వేటి నగరం, పలమనేరులో నిరసన ప్రదర్శనలు జరిగాయి. -
‘చంద్రబాబు సూపర్ సిక్స్ కాదు.. సూపర్ షాక్‌లిచ్చారు’
సాక్షి, కాకినాడ: గత ఏడు నెలలుగా చంద్రబాబు ప్రజలకు షాక్ ఇస్తున్నారని.. ఆరోగ్యశ్రీ ఉందా? లేదా? అనే పరిస్ధితికి తీసుకువచ్చారంటూ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్సులిన్ కూడా లేని పరిస్ధితి ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని.. కొందర్ని తొలగించారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.సూపర్ సిక్స్ కాదు.. సూపర్ షాక్ అన్నట్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. భుజాలపై మోసే సొంత మీడియా ఉండడమే చంద్రబాబు అదృష్టం. పేరులో ఉచితం తప్పా.. ఉచిత ఇసుక ఎక్కడా?. చంద్రబాబుకు ఇస్తున్న షాకులకు ఎవరూ మినహయింపు కాదు. బాబు వస్తే తమకు స్వర్గం అనుకున్న మద్యం ప్రియులకు కూడా షాక్ ఇచ్చారు’’ అని కన్నబాబు దుయ్యబట్టారు.‘‘ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ఇవాళ వైఎస్సార్సీపీ పోరుబాట దిగ్విజయంగా జరిగింది. విద్యుత్ భారం, మూడు డిమాండ్లను అధికారులకు వినతిపత్రం ద్వారా అందించాం. ఒక్క నెలలోనే ఆరు వేల కోట్లు విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఎంత కాలం జగన్ నామ స్మరణం చేస్తారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. పచ్చి అబద్దాలను కూటమి ప్రభుత్వం మానిఫెస్టోలో పెట్టింది. చంద్రబాబు సర్కార్ ఎన్ని కుట్రలు చేసిన ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరు ఆపదు.’’ అని కన్నబాబు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కరెంట్ కోత.. చార్జీల మోత‘‘ఉచిత విద్యుత్ అంటే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. తొమ్మిది గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. రైతుల ఉచిత విద్యుత్ కోసం ఫీడర్లను ఆధునీకరించారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు పట్ల ప్రజల ఆగ్రహం బయటకు వచ్చింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలు చేయాలి’ అని చంద్రబాబు సర్కార్‌ను కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. -
బాబు బాదుడుపై అనంతపురం YSRCP నేతలు పోరుబాట
-
బాబు వచ్చాడు.. బాదుడు పెంచాడు