Rajya Sabha
-
ఆప్ సర్ప్రైజ్.. ఎంపీగా కేజ్రీవాల్?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత సైలెంట్ అవుతారని భావించిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).. పార్టీ కన్వీనర్ హోదాలో క్రమం తప్పకుండా పార్టీ మీటింగ్‌లకు హాజరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ ఓ ప్రచారం తెర మీదకు వచ్చింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం చవిచూసింది. మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా ఓడిపోవడంతో ఢిల్లీ రాజకీయాలకు ఆయన శాశ్వతంగా దూరం అవుతారని, అందుకు ‘లిక్కర్ స్కామ్’ అవినీతి మరకే కారణమని విశ్లేషణలు నడిచాయి. ఈ కారణంగానే ప్రతిపక్ష నేతగా అతిషీని ఎంపిక చేశారని కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలో..పంజాబ్ లూథియానా వెస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఆప్ ఆశ్చర్యకరరీతిలో అభ్యర్థిని ఎంపిక చేసింది. కిందటి నెలలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి మృతి చెందారు. దీంతో.. రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను ఆ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిగా ఈ ఉదయం ప్రకటించింది ఆప్. సంజీవ్ అరోరా(Sanjeev Arora) 2022లో ఆప్ తరఫున పంజాబ్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2028తో ముగియనుంది. దీంతో అరోరాను అసెంబ్లీకి పంపి.. ఆ ఎంపీ సీటును కేజ్రీవాల్‌కు అప్పజెప్పబోతున్నారన్నది ఆ ప్రచార సారాంశం. లూథియానా వెస్ట్ ఉప ఎన్నికకు ఈసీ ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. అయితే ఆర్నెల్ల లోపు ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన ప్రకారం.. జులై 11లోపు ఈ ఉపన్నిక జరిగే అవకాశం ఉంది.అందుకేనా సమీక్షలు!ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. పంజాబ్ ఆప్ కేడర్‌తో కేజ్రీవాల్ వరుసబెట్టి సమావేశాలు జరిపారు. ఒకానొక టైంలో.. భగవంత్ మాన్‌ను తప్పించి కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అవుతారంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ చర్చల సారాంశం.. బహుశా రాజ్యసభ స్థానం కోసమే అయి ఉంటుందని ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. -
ద్రవ్యోల్బణం తగ్గింపే మా లక్ష్యం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని, పెరిగిన ధరల భారం పౌరులపై పడకుండా చూసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) అన్నారు. సాధారణ బడ్జెట్(General budget)పై చర్చలో భాగంగా గురువారం రాజ్యసభలో ఆమె ప్రసంగించారు. ‘‘వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.22 శాతంగా ఉంటే జనవరికల్లా దానిని 4.31 శాతానికి తగ్గించాం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ లక్ష్యాలకు తగ్గట్లుగా ఇప్పుడు ద్రవ్యోల్బణం 4 శాతానికి దిగొస్తోంది’’ అని మంత్రి నిర్మల అన్నారు. ఈ సందర్భంగా పలువురు విపక్ష నేతలు మంత్రి ప్రసంగానికి అడ్డు తగిలారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విపక్ష, అధికార ఎన్డీఏ సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మోదీ సర్కార్ ఏ ఒక్క రాష్ట్రం పట్ల వివక్ష చూపలేదని నిర్మల బదులిచ్చారు. అయినా విపక్ష సభ్యులు మంత్రి సమాధానంతో సంతృప్తి చెందలేదు. తర్వాత పలు విపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు.అంతర్జాతీయంగా అనిశ్చితి‘‘అభివృద్ధిని పరుగుపెట్టించే లక్ష్యంతో బడ్జెట్‌కు తుదిరూపునిచ్చాం. సమ్మిళిత అభివృద్ధికి బడ్జెట్ భరోసానిస్తుంది. ప్రైవేట్ రంగానికి పెట్టుబడుల ఊతం అందిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మౌలిక వసతుల కల్పన కోసం మూలధన వ్యయంలో పెట్టుబడుల పెంపుదల ఉంటుందేగానీ తగ్గుదల ఉండబోదు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, ప్రతికూల సవాళ్ల మధ్య బడ్జెట్ రూపకల్పన జరిగింది. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రంగాలకు నిధుల కేటా యింపులు తగ్గాయి. పరిస్థి తులు మారుతున్నా అత్యంత కచ్చితత్వంతో ముందస్తు బడ్జెట్ అంచనాలు వేశాం. దేశ ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తు న్నాం. అంతర్జాతీయ పరిస్థి తులు ఎప్పటికప్పుడు మా రుతుండటంతో ఎల్లప్పుడూ ఒకే వ్యూహం పనికిరాదు. అనిశ్చితి రాజ్య మేలుతుండటంతో మన దిగుమతులపై దాని పెను ప్రభావం కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెల కొన్న అస్తవ్యస్త ధోరణి మన ఆర్థికాభివృద్ధి పథంలో అవరోధంగా మారుతోంది. ద్రవ్యో ల్బణం కారణంగా టమాటా, ఉల్లి, బంగాళా దుంప చివరకు పప్పు ధాన్యాల ధరల్లోనూ తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అననుకూల వాతావరణం కారణంగా దిగుబడులు తెగ్గోసు కుపోవడంతో ఆహార ద్ర వ్యోల్బణం కట్టుతప్పుతోంది. సరుకు రవాణా గొలు సుల్లో ఏవైనా ఆటంకాలుంటే వెంటనే కేంద్ర మంత్రుల బృందం రంగంలోకి దిగి సమయానికి విదేశీ దిగుమతులు వచ్చేలా చూస్తోంది’’ అని నిర్మల తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత బడ్జెట్ తొలిసెషన్లో భాగంగా రాజ్యసభను వాయిదావేస్తున్నట్లు డిప్యూటీ ౖచైర్మన్ హరివంశ్ ప్రకటించారు. మార్చి పదో తేదీ ఉదయం 11 గంటలకు మళ్లీ రాజ్యసభ కార్యకలాపాలు మొదలుకానున్నాయని ఆయన చెప్పారు. -
రాజ్యసభకు కమల్ హాసన్?
చెన్నై, సాక్షి: సీనియర్ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారనే చర్చ తమిళనాట జోరుగా నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్ధతు ప్రకటించిన ఆయన.. డీఎంకే అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 39 సీట్లను కూటమి కైవసరం చేసుకుంది. దీంతో ఆయన్ను పెద్దల సభకు నామినేట్ చేయాలని డీఎంకే భావిస్తోందన్నది ఆ ప్రచార సారాంశం. ఈ ఏడాది జూన్‌లో రాజ్యసభ నుంచి ఆరు సీట్లు ఖాళీ కానున్నాయి. అయితే ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన కమల్‌ను రాజ్యసభకు పంపే యోచనలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారట. తాజాగా.. బుధవారం తమిళనాడు మంత్రి పీకే శేఖర్‌బాబు కమల్ హాసన్ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. మరోవైపు కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(MNM) ప్రతినిధి మురళి అప్పాస్.. తమ పార్టీకి ఓ రాజ్యసభ సీటు దక్కబోతుందనే విషయాన్ని ధృవీకరించారు. అయితే అది ఎవరనేది పార్టీ అధ్యక్షుడు కమల్ హాసనే నిర్ణయిస్తారని తెలిపారాయన. శేఖర్‌బాబుతో కమల్ జరిపిన చర్చల సారాంశాన్ని ఆయన మీడియాకు వివరించేందుకు నిరాకరించారు.2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ ఎన్ఎంఎం పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. 2019 సార్వత్రిక ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ. ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే.. ఓటు షేర్ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది. మరీ ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయింది. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్.. బీజేపీ అభ్యర్థి వనతిశ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల మెజారిటీలోఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా.. 140 స్థానాలకు ఒక్కటి కూడా గెలవలేకపోయింది. -
రాజ్యసభలో మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: రాజ్యసభలో మాజీ ప్రధాని దేవెగౌడ(Devegowda) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఎన్డీఏ వైస్ చైర్మన్ లేదంటే చైర్మన్ కావాలని అనుకున్నారని, అందుకు ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ(Narendra Modi) ఒప్పుకోలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘ యూపీఏ హయాంలో చైర్మన్ పదవి పవర్ సెంటర్ గా ఉండేది. కానీ నరేంద్ర మోదీ ఎవరిని కూడా ఎన్డీఏ చైర్మన్ గా పెట్టలేదు. ప్రభుత్వంలో వేలు పెట్టే ప్రయత్నాలను అడ్డుకున్నారుఎన్డీఏ పార్టీల కమిటీ చైర్మన్ కావాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు. కనీసం ఎన్డీఏ పార్టీల వైస్ చైర్మన్ పదవి కోసం చంద్రబాబు ప్రయత్నించారు. ఎన్డీఏ చైర్మన్ లేదా వైస్ చైర్మన్ పదవిని చంద్రబాబు అడిగారు. కానీ అందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీనికి మోదీ అస్సలు అంగీకరించలేదు. పరిపాలన ఎలా సాగించాలో నరేంద్ర మోదీకి బాగా తెలుసు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. దేశంలో ప్రధాని మోదీయే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు’ అంటూ దేవెగౌడ వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ కు ఫ్యామిలీనే ఫస్ట్: Modi
-
కాంగ్రెస్ ఫ్యామిలీపై ప్రధాని మోదీ చురకలు
ఢిల్లీ : సుదీర్ఘ సమయంపాటు దేశాన్ని కాంగ్రెస్ పాలించింది. అంతపెద్ద పార్టీ ఒక కుటుంబానికి పరిమితమైంది. అందుకే ఆ పార్టీలో సబ్ కా సాత్..సబ్కా సాత్ వికాస్ సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభ (Rajya Sabha)లో ప్రసంగించారు. ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘దేశానికి ఎదురయ్యే సమస్యలను చాలా తెలివిగా పరిష్కరించాలి.పదేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నాం. దేశ ప్రజలు మాకు మూడోసారి అవకాశం ఇచ్చారు. మా డెవలప్మెంట్ మెడల్‌ను సమర్థించారు. సబ్ కా సాత్.. సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ప్రజల కళ్లకు గంతలు పాలించింది. ఇంతపెద్ద దేశంలో మాకు మూడోసారి అవకాశం దక్కిందంటే మా అభివృద్ధిని ప్రజలు అర్థం చేసుకున్నారు. బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల కళ్లకు గంతలు కట్టి తమ అధికారాన్ని కాపాడుకున్నారు. మా హయాంలో సమయమంతా దేశ ప్రగత కోసం వినియోగిస్తున్నాం. దేశంలో చివరి వ్యక్తికి సంక్షేమం అందించడం మా లక్ష్యం. నేషన్ ఫస్ట్ అనేది మా విధానం. సుదీర్ఘ సమయంపాటు దేశాన్ని కాంగ్రెస్ పాలించింది. దేశ ప్రజలందరికి సేవ చేసేందుకు మనం ఇక్కడున్నాం. అంతపెద్ద పార్టీ ఒక కుటుంబానికి పరిమితమైంది. అందుకే ఆ పార్టీలో సబ్ కా సాత్.. సబ్కా సాత్ వికాస్ సాధ్యం కాదు. పదేళ్లలో సబ్కా సాత్ సబ్కా వికాస్ మార్పును గమనిస్తున్నాం.ఎస్సీ,ఎస్టీలను బలోపేతం చేస్తున్నాం. ఓబీసీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇవ్వలేదు.భారత వికాస యాత్రలో మహిళల పాత్ర ఎంతో కీలకం. నారీశక్తి వందన్ను మొదటగా అమలు చేస్తూ ఈ కొత్త భవనాన్ని ప్రారంభించాం. బీఆర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదు. అంబేద్కర్‌ను ఓడించేందుకే ప్రయత్నించింది. దేశంలో దివ్యాంగుల గురించి మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నాం. దివ్యాంగుల కోసం ఎన్నో రకాల పథకాలు చేపట్టాం. ట్రాన్స్‌జెండర్స్ గౌరవంతో బతికేలా చర్యలు తీసుకున్నామని’అన్నారు. -
సంకెళ్లతో భారత వలసదారులు.. స్పందించిన కేంద్రం
ఢిల్లీ : అమెరికాలో నివసిస్తున్న భారత వలసదారుల చేతులకు సంకెళ్లు.. కాళ్లకు గొలుసులు వేసి స్వదేశానికి పంపించడంపై కేంద్రం స్పందించింది. భారత వలసదారుల పట్ల అమెరికా దురుసుగా ప్రవర్తించలేదు. వలస దారుల విషయంలో కేంద్రం ట్రంప్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు తెలిపింది. అక్రమ వలసదారుల్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వారి దేశాలకు విమానాల ద్వారా తరలిస్తోంది. ఈ తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, తొలివిడతలో 104 మంది భారతీయులను సీ-17 విమానంలో అమృత్‌సర్‌కు తరలించింది. తరలించే సమయంలో భారత వలసదారుల చేతులకు సంకెళ్లు,కాళ్లకు గొలుసలతో బంధించింది. ఇలా బంధించి తరలించడంపై రాజకీయ వివాదం తలతెత్తింది.అయితే, భారత వలసదారుల తరలింపు వివాదంపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో స్పందించారు. అక్రమ వలసలను అరికట్టడానికి మేం ప్రయత్నిస్తున్నాం.కొందరు అక్రమంగా వలసలు వెళుతున్నారు. ఈ ప్రయాణంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డిపోర్టేషన్ అనేది కొత్త విషయం కాదు. 2009 నుంచి జరుగుతుంది. అన్ని దేశాల అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించి వేస్తోంది. ఈ జర్నీలో వారికి కావాల్సిన ఆహారం, మెడిసిన్ అందిస్తోంది. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం అమెరికా విధానం. తరలించే సమయంలో అవసరాల్ని చేతులకు సంకెళ్లు,కాళ్లకు గొలుసుల్ని తొలగిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. Speaking in Rajya Sabha on Indian citizens deported from the US, EAM S Jaishankar says, "...It is the obligation of all countries to take back their nationals if they are found to be living illegally abroad..." pic.twitter.com/6tnkvqbuQJ— ANI (@ANI) February 6, 2025జైశంకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వలసదారులకు అమెరికా ఉగ్రవాదులకు వేసినట్లు సంకెళ్లు వేయడం ఎంత వరకు కరెక్టో జయశంకర్ చెప్పాలి. భారతీయుల ఆత్మాభిమానం కాపాడటంలో మోదీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. అంతకుముందు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత వలస దారుల తరలింపుపై యునైటెడ్ స్టేట్స్ బోర్డర్ పెట్రోల్ విభాగం చీఫ్ మైఖేల్ డబ్ల్యూ బ్యాంక్ 24 సెకన్ల వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అక్రమ వలస దారుల్ని విజయవంతంగా భారత్‌కు తిరిగి పంపించాం. ఈ మిషన్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో మా నిబద్ధతను నొక్కి చెబుతుందని పేర్కొన్నారు. USBP and partners successfully returned illegal aliens to India, marking the farthest deportation flight yet using military transport. This mission underscores our commitment to enforcing immigration laws and ensuring swift removals.If you cross illegally, you will be removed. pic.twitter.com/WW4OWYzWOf— Chief Michael W. Banks (@USBPChief) February 5, 2025 -
పార్లమెంట్ సమావేశాలు.. కుంభమేళాపై చర్చకు విపక్షాల ఆందోళన
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష పార్టీల ఎంపీలు ప్రభుత్వం వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. మహాకుంభమేళాలో తొక్కొసలాట ఘటనపై చర్చకు విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో, సభలో నిరసనలు తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో రోజులు కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో భాగంగా మహాకుంభమేళాలో తొక్కొసలాట ఘటనపై ప్రభుత్వం చర్చకు రావాలని విపక్ష పార్టీల నేతలు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో విపక్ష ఎంపీలు సభను హోరెత్తించారు. దీంతో, ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభ్యులను కోరారు. అనంతరం, రాజ్యసభ నుంచి ప్రతిపక్ష నేతలు వాకౌట్ చేశారు. All Opposition parties' MPs in Rajya Sabha walkout from the House over the issue Prayagraj Mahakumbh stampedePhoto source: Sansad TV/YouTube pic.twitter.com/ekGB0qYIJN— ANI (@ANI) February 3, 2025మరోవైపు.. లోక్‌సభలో సైతం సభ్యులు కుంభమేళాలో తొక్కిసలాటపై చర్చకు పట్టుబట్టారు. ఈ సందర్భంగా యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, విపక్ష సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయొద్దని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆ ఘటన గురించి ప్రస్తావించాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ.. నినాదాలు ఆగలేదు. ఈ పరిస్థితుల మధ్యే లోక్‌సభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి #WATCH | Opposition MPs in Lok Sabha raise slogans against Uttar Pradesh's Yogi Adityanath government over Maha Kumbh stampede issue (Video source: Sansad TV/YouTube) pic.twitter.com/8Fl2KXlY9a— ANI (@ANI) February 3, 2025 -
ధన్‌ఖడ్‌పై అభిశంసన నోటీసు తిరస్కరణ
న్యూఢిల్లీ: అధికార పక్షం పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాల కూటమి పార్టీలు రాజ్యసభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నోటీసు గురువారం తిరస్కరణకు గురైంది. వాస్తవికత లోపించిందని, వ్యక్తిగత దాడిని ఈ నోటీసు ప్రతిబింబిస్తోందని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘ నోటీసు మొత్తం తప్పుల తడకగా ఉంది. ప్రామాణిక విధానంలో రూపొందించ లేదు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రతిష్టను దురుద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా నోటీసును సిద్ధంచేశారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ప్రవేశపెట్టిన నోటీస్ ఇది’’ అంటూ హరివంశ్ ఈ నోటీసును తిరస్కరించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఛైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధిత వివరాలున్న మూడు పేజీల రూలింగ్‌ను రాజ్యసభ ప్రధాన కార్యదర్శి పీసీ మోడీ గురువారం సభ ముందు ఉంచారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ధన్‌ఖడ్‌పై తాము విశ్వాసం కోల్పోయామని, ఆయనను ఆ పదవిని తప్పించాలని కోరుతూ 60 మంది విపక్ష పార్టీల ఎంపీలు డిసెంబర్ పదో తేదీన సంతకాలుచేసి ఆ అభిశంసన తీర్మాన నోటీసును రాజ్యసభలో అందించిన విషయం విదితమే. ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు వీలు కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బీ) కింద విపక్షాలు ఈ నోటీసును ఇచ్చాయి. ‘‘ నోటీస్ ద్వారా విపక్ష సభ్యులు ఉపరాష్ట్రపతి అధికారాలను తక్కువ చేసి చూపించే అనవసర సాహసం చేశారు. పార్లమెంట్, పార్లమెంట్ సభ్యుల ప్రతిష్టకు భంగం కల్గించేలా ఉన్న ఈ నోటీసు డిప్యూటీ ఛైర్మన్ అభిప్రాయాలను కించపరిచేలా ఉంది. అయినా ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు సంబంధించిన తీర్మానంపై ఓటింగ్ చేపట్టాలంటే కనీసం 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. డిసెంబర్ 10న సభ ముందుకొచ్చిన ఈ నోటీస్‌పై తీర్మానం, అనుమతి అనేవి నిబంధనల ప్రకారం డిసెంబర్ 24వ తేదీ తర్వాతే సాధ్యం. మంత్రిమండలి నవంబర్ ఆరో తేదీన నోటిఫై చేసిన ప్రకారం ప్రస్తుత రాజ్యసభ 266వ సెషన్ నవంబర్ 25న మొదలై డిసెంబర్ 20న ముగుస్తుంది. ఈ లెక్కన తీర్మానం తేదీ(డిసెంబర్ 24)కంటే ముందుగానే రాజ్యసభ సెషన్ ముగుస్తోంది. ఇలాంటి సందర్భంలో తీర్మానాన్ని ఆ తేదీలోపే అనుమతించడం కుదరదు’’ అని హరివంశ్ వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
మాటలు.. మంటలు
న్యూఢిల్లీ: మాటలు మంటలు రేపాయి. అంబేడ్కర్‌ను ప్రస్తావిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో రెండు రోజుల చర్చకు మంగళవారం ఆయన బదులిచ్చారు. ఆ సందర్భంగా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ అంబేడ్కర్ ప్రస్తావన తెచ్చారు. ‘‘అంబేడ్కర్, అంబేడ్కర్ అనడం వాళ్లకు ఇప్పుడో ఫ్యాషనైపోయింది. అన్నిసార్లు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల దాకా స్వర్గమన్నా దక్కేది’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్ పదేపదే అంబేడ్కర్ నామస్మరణ చేస్తుండటం మాకూ ఆనందమే. కానీ ఆయనపై వారి అసలు వైఖరేమిటో కూడా బయటపెట్టాలి. అంబేడ్కర్‌ను పదేపదే అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌ది. ఆర్టికల్ 370తో పాటు పలు విధానాలపై నెహ్రూ సర్కారు విధానాలతో విభేదించి ఆయన మంత్రివర్గం నుంచి అంబేడ్కర్ వైదొలిగాల్సి వచి్చంది. అలా మీరు నిత్యం వ్యతిరేకించిన అంబేడ్కర్ పేరునే ఇప్పుడు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఇదెంత వరకు సమంజసం?’’ అంటూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. అయితే అమిత్ షా చేసిన ‘అంబేడ్కర్–దైవ నామస్మరణ’ పోలిక తీవ్ర విమర్శలకు దారితీసింది. జాతీయ రాజకీయాలు బుధవారమంతా వాటిచుట్టే తిరిగాయి. రాజ్యాంగ నిర్మాతనే గాక దేశంలోని దళితులందరినీ అమిత్ షా తీవ్రంగా అవమానించారని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ దుయ్యబట్టాయి. ఆయన తక్షణం బహిరంగంగానూ, పార్లమెంటులోనూ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మరో అడుగు ముందుకేసి, ‘‘షా తక్షణం రాజీనామా చేయాల్సిందే. లేదంటే ప్రధాని మోదీయే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలి. అంబేడ్కర్ పట్ల మోదీకి ఏమాత్రం గౌరవమున్నా బుధవారం అర్ధరాత్రిలోపు ఈ పని చేయాలి’’ అంటూ అల్టిమేటం జారీ చేశారు. లేదంటే దేశవ్యాప్త ఆందోళనలు, వీధి పోరాటాలు తప్పవని హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాల ఆందోళనతో పార్లమెంటు కూడా అట్టుడికిపోయింది. ఉభయ సభలూ కార్యకలాపాలేవీ చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విపక్షాలు నిరసనలకు, ఆందోళనలకు దిగాయి. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆప్ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనకు దిగారు. ‘అమిత్ షా సిగ్గు పడు’, ‘క్షమాపణలు చెప్పు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. విపక్షాల ఆరోపణలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ‘‘ప్రసంగంలో కొంత భాగాన్ని తీసుకుని వక్రీకరిస్తున్నారు. కాంగ్రెస్‌కు మరే అంశాలూ లేక నిస్పృహతో చౌకబారు చర్యలకు అన్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు అమిత్ షాకు బాసటగా మాట్లాడారు. దేశమంతా అగ్గి రాజుకుంటుంది: ఖర్గే బీజేపీ అహంభావ ధోరణికి, అంబేడ్కర్‌పై వారికున్న ద్వేషానికి అమిత్ షా వ్యాఖ్యలు అద్దం పట్టాయని ఖర్గే మండిపడ్డారు. ‘‘అంబేడ్కర్‌కు, రాజ్యాంగానికి ఏమాత్రం గౌరవం ఇవ్వొద్దని మనుస్మృతి సిద్ధాంతాన్ని ఆచరించే బీజేపీ, ఆరెస్సెస్ నిర్ణయించుకున్నాయి. మనుస్మృతికి చోటివ్వలేదంటూ రాజ్యాంగ ప్రతిని, అంబేడ్కర్ దిష్టి»ొమ్మలను తగలబెట్టిన చరిత్ర బీజేపీది’’ అని ఆరోపించారు. ఉభయ సభలు వాయిదా పడ్డాక పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలన్నీ అమిత్ షా వ్యాఖ్యలపై ఆందోళనకు దిగాయి. నేతలంతా నల్లజెండాలు, ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్‌గాం«దీ, ప్రియాంకతో పాటు తృణమూల్, ఆప్, ఆర్జేడీ, ఎస్పీ, శివసేన (యూబీటీ), వామపక్షాల నేతలు పాల్గొన్నారు. వారితో కలిసి ఖర్గే మీడియాతో మాట్లాడారు. అమిత్ షా ఇలాగే మాట్లాడితే దేశమంతటా అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారు. ‘‘ఎవరైనా రాజ్యాంగంపై ప్రమా ణం చేసిన మీదటే కేంద్ర మంత్రి అవుతారు. రాజ్యాంగ నిర్మాతనే అవమానించే వారికి ఆ పదవిలో కొనసాగే అర్హతే లేదు’’ అన్నారు. ఆయన రాజీనామాకు విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయన్నారు. ‘‘అమిత్ షాపై మోదీ చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయనకు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. ఆప్తమిత్రులు ఒకరి పాపాలను ఒకరు కప్పిపుచ్చుకుంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు.మనువాదానికి తార్కాణం: రాహుల్ ‘‘మనువాదులకు అంబేడ్కర్ సహజంగానే నచ్చరు. అమిత్ షా వ్యాఖ్యలు దాన్ని మరోసారి నిరూపించాయి’’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘బీజేపీ ఎప్పుడూ రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు, ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకమే. అంబేడ్కర్ చరిత్రను, రాజ్యాంగ రచనలో ఆయన కృషిని తెరమరుగు చేసేందుకు ప్రయతి్నస్తోంది. కానీ బాబాసాహెబ్‌ను అవమానిస్తే దేశం సహించబోదు. అమిత్ షా క్షమాపణలు చెప్పి తీరాల్సిందే’’ అని స్పష్టం చేశారు. ప్రియాంక కూడా ఈ మేరకు ఎక్స్‌లో డిమాండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తదితరులు కూడా అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్‌ది చౌకబారుతనం: బీజేపీ అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని బీజేపీ దుయ్యబట్టింది. ఇది ఆ పార్టీ చౌకబారు మనస్తత్వానికి నిదర్శనమని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, కిరెణ్ రిజిజు, అశ్వినీ వైష్ణవ్, రవ్నీత్ బిట్టూ తదితరులు మండిపడ్డారు. అంబేడ్కర్‌ను ఆయన జీవితపర్యంతమూ, తదనంతరమూ పథకం ప్రకారం అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. ‘‘దాన్నే అమిత్ షా రాజ్యసభ సాక్షిగా నిరూపించారు. దాన్ని తట్టుకోలేక ఆయనపై తప్పుడు ఆరోపణలకు దిగింది’’ అని రాజ్‌నాథ్ ఆరోపించారు. తీవ్ర నిస్పృహలో కూరుకుపోయిన కాంగ్రెస్ చివరికి అబద్ధాలు ప్రచారం చేసే దుస్థితికి దిగజారిందని నడ్డా ఎద్దేవా చేశారు. బీజేపీ మనస్తత్వం బయటపడిందిపుణే: అమిత్ షా వ్యాఖ్యలను అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన అఘాడీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ ఖండించారు. బీజేపీ పాత మనస్తత్వం ఆయన మాటలతో బయటపడిందని అన్నారు. అంబేడ్కర్ పట్ల బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఆక్షేపించారు. ‘‘బీజేపీ మాతృసంస్థలు ఆర్ఎస్ఎస్, జన సంఘ్ అంబేడ్కర్‌ను వ్యతిరేకించాయి. రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో అంబేడ్కర్‌ను తప్పుబట్టాయి. అంబేడ్కర్ భావజాలం దేశంలో బలంగా ఉండటం వల్లే బీజేపీ తన పాత ప్రణాళికలు అమలు చేయడానికి జంకుతోంది. ఆ ఉక్రోషం కొద్దీ ఆయన పట్ల కోపాన్ని ఇలా వెళ్లగక్కుతోంది’’ అని ఆరోపించారు. అట్టుడికిన రాజ్యసభ షాపై హక్కుల తీర్మానం సభలో టీఎంసీ నోటీసు అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను అమిత్ షాపై చర్యలు తీసుకోవాలంటూ సభా హక్కుల తీర్మానం పెట్టాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 187వ నిబంధన మేరకు టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేత డెరెక్ ఓబ్రియాన్ బుధవారం రాజ్యసభలో ఈ మేరకు నోటీసిచి్చనట్టు సమాచారం. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్ష సభ్యుల నిరసనలతో సభ అట్టుడికింది. మంత్రి రాజీనామాకు సభ్యులంతా డిమాండ్ చేశారు. షా ప్రసంగంలో కేవలం 12 సెకన్ల భాగాన్నే ప్రచారం చేస్తూ కాంగ్రెస్ వక్రీకరిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు. 1990 దాకా ఆయనకు భారతరత్న కూడా ఇవ్వని చరిత్ర ఆ పారీ్టదని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్‌కు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్నే అమిత్ షా నిండు సభలో ఎండగట్టారన్నారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కు తగ్గలేదు. ‘అంబేడ్కర్‌కు అవమానాన్ని దేశం సహించబోదు’’ అంటూ పెద్దపెట్టున నినాదాలకు దిగారు. ఆయన్ను అవమానించింది కాంగ్రెసేనంటూ రిజిజు కౌంటరిచ్చారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేచి అంబేడ్కర్ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఆందోళనల నడుమ సభను మధ్యాహ్నం రెండింటి దాకా చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక కూడా అవే దృశ్యాలు కొనసాగడంతో సభను చైర్మన్ గురువారానికి వాయిదా వేశారు. లోక్‌సభలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. విపక్ష సభ్యులు అంబేడ్కర్ పోస్టర్లతో వెల్‌లోకి దూసుకెళ్లి ‘జై భీమ్’ అంటూ నినాదాలకు దిగారు. దాంతో సభ తొలుత మధ్యాహ్నం దాకా, తర్వాత గురువారానికి వాయిదా పడింది. ముసుగు తొలగింది ‘‘మొత్తానికి ముసుగు తొలగింది. రాజ్యాంగ వజ్రోత్సవాల వేళ రాజ్యాంగ నిర్మాతనే అమిత్ షా అవమానించారు. ఆయన వ్యాఖ్య లు బీజేపీ కులవాదానికి, దళిత వ్యతిరేక భావజాలానికి నిదర్శనం. 240 లోక్‌సభ సీట్లొస్తేనే ఇలా ప్రవర్తిస్తున్నారు. అదే 400 వస్తే అంబేడ్కర్ స్మృతులనే పూర్తిగా చెరిపేస్తూ చరిత్రను తిరగరాసేవాళ్లేమో!’’ – తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశి్చమబెంగాల్ సీఎం మమతా బెనర్జీఅంబేడ్కర్ పేరే జపిస్తాం ‘‘పాపాలు చేసేవాళ్లే పుణ్యం కోసం ఆలోచిస్తారు. దేశం, ప్రజలు, రాజ్యాంగ పరిరక్షణ గురించి తపించేవాళ్లు అంబేడ్కర్ నామాన్నే జపిస్తారు’’ – డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దొందూ దొందే ‘‘బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. అంబేడ్కర్ పేరును రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి. దళితులకు, అణగారిన వర్గాలకు అవి చేసిందేమీ లేదు’’ – బీఎస్పీ అధినేత్రి మాయావతి -
రాజ్యాంగం వాళ్లకు ప్రైవేట్ జాగీరు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై, నెహ్రూ– గాంధీ కుటుంబంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం రాజ్యసభలో నిప్పులు చెరిగారు. ‘‘కాంగ్రెస్ పార్టీతో పాటు రాజ్యాంగాన్ని కూడా తమ వ్యక్తిగత జాగీరుగా ఆ కుటుంబం పరిగణించింది. అందుకే కనీసం పార్లమెంటు అనుమతి కూడా లేకుండానే రాజ్యాంగంలోకి ఆర్టీకల్ 35ఏను చొప్పించే దుస్సాహసానికి తెగబడింది. చివరికి పార్లమెంటును కూడా మోసగించిన చరిత్ర కాంగ్రెస్‌ది! రాజ్యాంగం పేరిట 75 ఏళ్లుగా లెక్కలేనన్ని ద్రోహాలకు పాల్పడుతూ వస్తోంది’’ అంటూ మండిపడ్డారు. స్వీయ రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఇష్టానికి సవరించిందంటూ పలు ఉదంతాలను ఉటంకించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు గండికొట్టే తొలి రాజ్యాంగ సవరణతో దేశ మొదటి ప్రధాని నెహ్రూయే ఇందుకు తెర తీశారని ఆరోపించారు. ‘‘సంతుష్టికరణ రాజకీయాలకు కాంగ్రెస్ చిరునామా. తన ఓటు బ్యాంకుకు భంగం కలుగుతుందని ముస్లిం మహిళలకు ఏళ్ల తరబడి హక్కులను నిరాకరించిన చరిత్ర ఆ పార్టీది. ముస్లింలకు రిజర్వేషన్లు కలి్పచేందుకు 50 శాతం పరిమితిని అతిక్రమించేందుకు కూడా వెనకాడలేదు! తన పాలనలోని రెండు రాష్ట్రాల్లో రాజ్యాంగ విరుద్ధంగా మతాధారిత రిజర్వేషన్లు తెచి్చంది’’ అంటూ ఆరోపించారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా రాజ్యసభలో జరిగిన రెండు రోజుల చర్చకు మంత్రి బదులిచ్చారు. బీజేపీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నంత కాలం మతాధారిత రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ప్రకటించారు. వెనకబడ్డ వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ఏనాడూ ప్రయతి్నంచలేదని షా ఆరోపించారు. ఎన్నికల ఓటమికి ఈవీఎంలను సాకుగా చూపడం ఇప్పటికైనా కాంగ్రెస్ మానుకోవాలని సూచించారు. ఉత్తరాఖండ్‌లో మాదిరిగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.జమిలి బిల్లు కాంగ్రెస్ పుణ్యమే: నడ్డా కేంద్రంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉండగా కాంగ్రెస్ చేసిన నిర్వాకాల వల్లే మోదీ సర్కారు జమిలి ఎన్నికల బిల్లు తేవాల్సిన అవసరం ఏర్పడిందని రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా అన్నారు. మంగళవారం రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకూ తొలుత ఒకేసారి ఎన్నికలు జరిగేవి. అప్పట్లో కాంగ్రెస్ పాలకులు తమకు ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వాలను యథేచ్ఛగా కూలదోయడంతో జమిలికి బ్రేక్ పడింది’’ అని చెప్పారు. ‘‘ఎమర్జెన్సీ కాంగ్రెస్ చరిత్రపై చెరగని మచ్చ. అందుకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పిందనడం పచ్చి అబద్ధం. మైనారిటీల సంతుïÙ్టకరణ రాజకీయాల్లో భాగంగా మతాధారిత రిజర్వేషన్లకు కాంగ్రెస్ తెర తీయజూస్తోంది. ఆ ప్రయత్నాలను పలుమార్లు కోర్టులు అడ్డుకున్నా దాని తీరు మారడం లేదు. ట్రిపుల్ తలాక్, ఆర్టీకల్ 370పై కాంగ్రెస్ వైఖరి మొదలుకుని షాబానో తీర్పును నిర్వీర్యం చేసేందుకు రాజ్యాంగ సవరణ దాకా ఇందుకు ఉదాహరణలెన్నో’’ అని నడ్డా ఆరోపించారు. వాటిపై ఆ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల మాటేమిటని కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. అవి కేవలం ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికన కలి్పంచినవంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలి్పంచుకున్నారు. సభను జైరాం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా సామాజిక, ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించింది తప్ప మతాధారితంగా కాదంటూ జైరాం బదులిచ్చారు. వారిద్దరి మధ్య వాడివేడి చర్చ సాగింది. -
ఈ–విధాన్ ప్రాజెక్ట్‌పై ఏపీ ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ: శాసన, శాసన మండలిలో ఈ–విధాన్ ప్రాజెక్ట్ అమలుపై ఏపీతో పాటు 26 రాష్ట్రాలు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురగన్ తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ–విధాన్ ప్రాజెక్ట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. డ్రోన్ల ఉత్పత్తి ప్రోత్సాహాకంఏపీలో డ్రోన్లు, డ్రోన్ల భాగాల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) కింద మూడేళ్లకు రూ.120కోట్లు ప్రకటించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర మోహల్ తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. మహారాష్ట్రలోని ఆరు జిల్లాలకు గోదావరి నీళ్లుగోదావరి బేసిన్‌లోని ప్రాణహిత ఉప బేసిన్‌లోని వైన్ గంగా నదిపై ఉన్న గోసిఖర్డ్(ఇందిరా సాగర్) ప్రాజెక్ట్ నుంచి 1,772 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని మళ్లించి మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని ఆరు జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి తెలిపారు. వైన్‌గంగా–నల్గంగా నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌పై వైఎస్సార్ సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 73.22లక్షల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలుదేశవ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాల్లో 73,22,965లక్షల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలు నోటిఫై చేసినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ ఎస్.నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. స్మార్ట్ సిటీ కింద 47 ప్రాజెక్ట్‌లు..విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, తిరుపతి నగరాల్లో రూ.6,616కోట్లతో 281 స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లను ప్రారంభించగా.. దాదాపు 83శాతం పూర్తి అయినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘అమరావతిలో రూ.930కోట్లతో 20 ప్రాజెక్ట్‌లను ప్రారంభించగా.. రూ.746కోట్ల వ్యయంతో 14 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. రూ.184కోట్లతో ఆరు ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోంది.కాకినాడలో రూ.1,908కోట్లతో 92 ప్రాజెక్ట్‌లు మంజూరు కాగా.. రూ.1,722.97కోట్లతో 79 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. రూ.185.12కోట్లతో 13 ప్రాజెక్ట్‌ల పనులు జరుగుతున్నాయి.తిరుపతిలో రూ.2,082.75కోట్లతో 104 ప్రాజెక్ట్‌లు మంజూరు కాగా.. రూ.1,610.65కోట్లతో 79 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. రూ.472.10కోట్లతో 25 ప్రాజెక్ట్‌ల పనులు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నంకు రూ.1,695.23కోట్లతో 65 ప్రాజెక్ట్‌లు మంజూరు కాగా.. రూ.1,573.58కోట్లతో 62 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. రూ.121.65కోట్లతో 3 ప్రాజెక్ట్‌ల పనులు జరుగుతున్నాయి’ అని కేంద్ర మంత్రి తెలిపారు.241.4వేల మంది ఎల్పీజీ సబ్సిడీని వదులుకున్నారుఏపీలో 2,41.4వేల మంది తమ ఎల్పీజీ సబ్సిడీని వదులుకున్నట్లు పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ పరిమళ్‌నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. -
చర్చ జరగాలి కానీ, ఇలాగా..?
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈ సోమవారంతో ఆఖరి వారం వ్యవధిలోకి ప్రవేశించాయి. దేశంలో చలి పెరుగుతుంటే, సభలో వాతావరణం మాత్రం వేగంగా వేడెక్కుతోంది. మొన్న నవంబర్ 26న 75 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం చూస్తే ఆ భావనే కలుగుతుంది. లోక్‌సభలో గత శుక్ర, శనివారాలు రాజ్యాంగ చర్చ జరిగితే, ఈ సోమ, మంగళవారాలు రాజ్యసభలో అది కొనసాగుతోంది. ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ బిల్లుకు కావాల్సిన రాజ్యాంగ సవరణ మాట అటుంచితే, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కాక గాంధీల కుటుంబ శ్రేయానికై కాంగ్రెస్ నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని సవరిస్తూ పోయిందని ఆర్థిక మంత్రి ఆరోపించడం తాజాగా అగ్గి రాజేసింది. అనేక జటిల సమస్యలకు రాజ్యాంగ సవరణలే ఏకైక పరిష్కారం అంటూ నెహ్రూకు సాక్షాత్తూ సర్దార్ పటేలే లేఖ రాశారంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టాల్సి వచ్చింది. వెరసి, భారత గణతంత్రానికి ఆత్మ లాంటి రాజ్యాంగంపై చర్చ పక్కదోవ పట్టి, పార్టీలు బురదజల్లుకొనే ప్రక్రియగా మారిపోయింది. నిజానికి, స్వాతంత్య్రానంతరం భారతదేశ భవితవ్యమెలా ఉంటుందన్న దానిపై బోలెడన్ని అనుమానాలు, జోస్యాలు వెలువడినా, మన రాజ్యాంగం పటాపంచలు చేసింది. నిజానికి, నవ యువ గణతంత్ర రాజ్యంగా మనం అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ తట్టుకొని నిలవడంలోనూ విజయవంతమయ్యాం. భారత రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచి, దేశానికి మూలస్తంభంగా నిలిచింది. ఇవాళ అనేక దేశాల్లో, చివరకు సోకాల్డ్ ప్రజాస్వామ్యాల్లోనూ అధికార బదలాయింపులో పలు సమస్యలను ఎదుర్కొంటున్నా, భారత్‌లో మాత్రం ప్రజాభీష్టాన్ని ప్రతిఫలించే అధికార బదలీ శాంతియుతంగా సాగిపోవడం మన రాజ్యాంగం వేసిన పటిష్ఠమైన పునాదికీ, చూపిన ఆచరణాత్మకమైన మార్గానికీ తార్కాణం. ఈ ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో వేర్వేరు రాజకీయ పార్టీలు, కూటములు దేశాన్ని పాలించాయి. 1975లో ఎమర్జెన్సీ విధింపు లాంటి అశనిపాతాలు అడపాదడపా ఎదురైనా, ప్రభుత్వాలన్నీ దేశాన్ని ముందుకే నడిపాయి. క్రియాశీలక సజీవపత్రంగా రాజ్యాంగ రూపకర్తలు సంభావించిన భారత రాజ్యాంగం అంతర్గత సంకల్పబలం, స్థితిస్థాపక చైతన్యంతో నవ భారత అవసరాలకు తగ్గట్టుగా మార్పులతో నిత్య నూతనంగా నిలుస్తూ వచ్చింది. దానికి తగ్గట్టే రాజ్యాంగాన్ని ఇప్పటికి శతాధిక పర్యాయాలు సవరించడం జరిగింది. దేశ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలకు తగ్గట్టు దేశం ముందుకు పోయేందుకు అనేక ఏళ్ళుగా భారత రాజ్యాంగం వీలు కల్పిస్తూనే వచ్చింది. అనేక పార్ష్వాలున్న ఈ రాజ్యాంగ ప్రస్థానాన్ని పార్లమెంట్లో చర్చిస్తున్నారంటే, భవిష్యత్తుపై దృష్టి సారిస్తారని భావించాం. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, లక్ష్యాలు సాకారమయ్యేందుకు పథ నిర్దేశం జరుగుతుందని ఆశించాం. భారత స్వాతంత్య్ర శతవర్ష సమారోహం సాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై మేధా మథనం జరపాలని ఆకాంక్షించాం. ఆ దిశలో సామాన్యుల జీవితాలు మెరుగయ్యేలా లక్షించాల్సింది పోయి విమర్శల పర్వానికే చర్చ పరిమితమైపోవడం శోచనీయం. నిజానికి, ఎవరూ విమర్శలకు అతీతులు కారు. గాంధీ, నెహ్రూలైనా అంతే. వారిని విమర్శించ దలుచుకుంటే నేరుగా విమర్శించవచ్చు. అంతేకానీ, రాజ్యాంగంపై చర్చ పేరిట పరోక్షంగా కొంద రిపై బురద జల్లడం ఏమిటన్నది ఒక వాదన. తాజా చర్చ సందర్భంలో అధికార ఎన్డీఏ వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను తప్పుబడుతున్నారని కూడా ఆరోపణ. అయితే, అసలు భావప్రకటనా స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు పెట్టవచ్చంటూ తొలి రాజ్యాంగ సవరణ తెచ్చింది కాంగ్రెసే అని బీజేపీ ఎత్తిచూపుతోంది. స్వేచ్ఛ ఉండాలి నిజమే కానీ, అన్ని సమయాల్లోనూ అది నిర్నిబంధమైతే కష్టం గనక సహేతుకమైన పరిమితులు విధించవచ్చని అలా ప్రథమ సవరణతో రాజ్యాంగ రూపకర్తలే దిద్దుబాటు బాట పట్టారన్నది కాంగ్రెస్ వర్గీయుల ప్రతివాదన. రాజ్యాంగ అమలుకు అమృతోత్సవ వేళ చర్చ దాని అమలు తీరుతెన్నులు, భవిష్యత్ సవాళ్ళపైనే సాగాల్సింది. సామూహిక ఆత్మపరిశీలనకు దీన్ని అవకాశంగా మలుచుకోవాల్సింది. కానీ, జరుగుతున్నది వేరు. చర్చంతా రాజకీయ రంగు పులుముకొని, నెహ్రూ కుటుంబం, ఎమర్జెన్సీ, మోదీ సర్కార్ చుట్టూ సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవిశ్వాస తీర్మానంపై చర్చ ఫక్కీలోకి జారిపోయింది.1975 ఎమర్జెన్సీలోనైనా, ఇప్పుడు ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ ఉందంటున్నా... రెండు సందర్భాల్లో పాలకుల చేతిలో నలిగిపోయింది రాజ్యాంగానికి గుండె లాంటి పౌరుల ప్రాథమిక హక్కులే అని విస్మరించరాదు. ఏళ్ళు గడుస్తున్నకొద్దీ సవాళ్ళు అధికరిస్తున్నాయి. లౌకికవాదం, సమాఖ్య వాదం, న్యాయవ్యవస్థ స్వతంత్రత, దుర్విచక్షణ లేకపోవడం, మైనారిటీల హక్కుల పరిరక్షణ లాంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలపైనే ప్రశ్నార్థకాలు పొడసూపుతున్నాయి. సమాన అవకాశాల మాట దేవుడెరుగు, ఆర్థికంగా– సామాజికంగా– లింగపరంగా సమానత్వం సైతం నేటికీ పూజ్యం. అంత రాలు పెరుగుతున్న సమాజంలో అసమానతల నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామా? అన్ని పక్షాలూ ఆత్మావలోకనం చేసుకోవాలి. రాజకీయ పత్రం, దేశ రాజకీయాలకు పునాది అయినప్పటికీ, రాజ్యాంగమనేది అదే సమయంలో రాజకీయాలకు అతీతమైనది. దానిపై చర్చలో ప్రధాని సహా అందరూ సంకుచిత రాజకీయాలకే చోటిస్తే ఇంకేమనాలి? ఈ ధోరణి మారాలి. రాజ్యాంగం ఇన్నేళ్ళుగా జాతికి దిక్సూచిగా నిలిచింది. ప్రభుతకూ, పౌరులకూ ప్రజాస్వామ్య ఫర్మానాగా వెలిగింది. ఆ ఉజ్జ్వల స్ఫూర్తికి కట్టుబడడమే సమస్త సమస్యలకూ పరిష్కారం. సామాన్యుల హక్కులకు శ్రీరామరక్ష. -
రాజ్యాంగాన్ని ద్వేషించినవాళ్లా పాఠాలు నేర్పేది?: ఖర్గే
రాజ్యాంగంపై చర్చ.. రాజ్యసభలోనూ నిప్పులు రాజేస్తోంది. సోమవారం పెద్దల సభలో రాజ్యాంగం చర్చ మొదలైంది. అయితే.. నెహ్రూ ప్రస్తావనతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.‘‘లోక్‌సభలో రాజ్యాంగ చర్చ ద్వారా ప్రధాని మోదీ సభను తప్పుదోవ పట్టించారు. ఎలా మాట్లాడాలో ఈరోజు నేను వాళ్లకు(బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ..) చెప్పదల్చుకున్నా. నేను చదువుకుంది మున్సిపాలిటీ బడిలో. ఆమె(నిర్మలా సీతారామన్) జేఎన్‌యూ(జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లోనే కదా చదివింది. ఆమె హిందీగానీ, ఇంగ్లీష్గానీ మాట్లాడడం బాగుంది. ఆమె ఆర్థిక నిపుణురాలే కావొచ్చు. కానీ, ఆమె మాట్లాడే విధానమే అస్సలు బాగోలేదు... జాతీయ పతకాన్ని, అందులో అశోక చక్రాన్ని.. రాజ్యాంగాన్నే ద్వేషించినవాళ్లు.. ఇవాళ మాకు పాఠాలు చెబుతున్నారు. రాజ్యాంగం వచ్చిన కొత్తలో వాళ్లే దానిని తగలబెట్టారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన టైంలో.. రామ్‌లీలా మైదానంలో గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ దిష్టిబొమ్మలను తగలబెట్టిన విషయాన్ని వాళ్లు మరిచిపోయారేమో!’’ అని ఆయన మండిపడ్డారు. అలాగే.. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనని వాళ్లు కూడా.. ఆ పోరాటం ఎలా ఉంటుందో తమకు తెలుసంటూ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఖర్గే సెటైర్లు వేశారు. 1949లో ఆరెస్సెస్ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని, అది మనుస్మృతికి తగ్గట్లుగా లేదని ఆనాడు విమర్శించారని, రాజ్యాంగాన్నే కాకుండా మువ్వన్నెల జెండాను కూడా అంగీకరించలేదని, ఆ సంస్థ ప్రధాన కార్యాలయంపై 2002 రిపబ్లిక్ డేన తొలిసారి జాతీయ జెండా ఎగరేశారని, అదీ కోర్టు ఆదేశాల తర్వాతేనని ఖర్గే రాజ్యసభకు గుర్తు చేశారు. #WATCH | Constitution Debate | Rajya Sabha LoP #mallikarjunkharge says, “In 1949, #RSS leaders opposed the Constitution of #India because it was not based on #manusmriti. Neither did they accept the #Constitution nor the tricolour. On 26 January 2002, for the first time, the… pic.twitter.com/yLScuHkY3o— TheNews21 (@the_news_21) December 16, 2024 -
ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగుతోంది: విజయసాయిరెడ్డి
సాక్షి,ఢిల్లీ: ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగుతోందని, కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అసలు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. సోమవారం(డిసెంబర్ 16) రాజ్యాంగంపై రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆదేశసూత్రాలను ఉల్లంఘిస్తున్న టీడీపీ ప్రభుత్వం రూ.86 వేల కోట్లు దారి మళ్లించిందని ఆరోపించారు. తామెప్పుడూ నిధులను మళ్లించలేదన్నారు. అనేక స్కీమ్‌ల ద్వారా పేద ప్రజలకు నిధులు చేరవేశామని గుర్తు చేశారు.రాజ్యసభలో విజయసాయిరెడ్డి పూర్తి స్పీచ్..టీడీపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది86 వేల కోట్ల రూపాయలు దారి మళ్ళించారని తప్పుడు ఆరోపణలు చేశారుటీడీపీ లోక్‌సభ తప్పుడు ప్రచారం చేసిందిమేము ఎప్పుడు ఎక్కడ నిధులు మళ్లించలేదువిద్యా దీవెన, వసతి దీవెన, కళ్యాణమస్తు, పెన్షన్ కానుక, అమ్మ ఒడి, చేయూత, జగనన్న తోడు ద్వారా కోట్లాదిమంది ఎస్సీ ఎస్టీలు , బీసీలు ప్రయోజనం పొందారువిజయవంతంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లు అమలు చేసిందిటీడీపీ రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలను ఉల్లంఘిస్తోందిమేము ఎక్కడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదుచట్టబద్ధంగా పోలీసులు చంద్రబాబునాయుడును అరెస్టు చేశారుకోర్టు చంద్రబాబు నాయుడును రిమాండ్ చేసిందిప్రభుత్వం కేవలం కేసు ఫైల్ చేసిందికేసు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుందిరాజ్యాంగ విరుద్ధం అయితే కోర్టు ఆయనను రిమాండ్ ఎందుకు పంపుతారుస్టిల్స్ స్కాంలో 370 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారుషెల్ కంపెనీల ద్వారా ఈ డబ్బును స్వాహా చేశారుప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం రైతు భరోసాను అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధంఇంగ్లీష్ మీడియంను నిషేధించారుప్రజలకు కాకుండా కేవలం బంధువుల కోసమే దీన్ని అమలు చేస్తున్నారుఎన్టీఆర్ను వెన్నుపోటుపోవడమే రాజ్యాంగ విరుద్ధంఆర్టికల్ 46 ప్రకారం అణగారిన వర్గాలకు విద్యను ప్రోత్సహించాలని ఉందిమేము అమలు చేసిన పథకాలను టీడీపీ ఆపివేసిందికులం మతం ఆధారంగా ప్రజలను తీయడమే రాజ్యాంగ విరుద్ధంఇది టీడీపీ కొనసాగిస్తుందినాటి కేసులను ఉపసంహరించుకుంటున్నారు..ఇది రాజ్యాంగ విరుద్దమేముఖ్యమంత్రి తనపై కేసులను విత్ డ్రా చేసుకుంటున్నారుఅధికారం ఉంది కదా అని కేసులను విత్ డ్రా చేసుకుంటున్నారుమహిళలపై నేరాలు పెరిగిపోతున్న పట్టించుకోవడం లేదంటే అది రాజ్యాంగ విరుద్ధమేవిజయవాడలో వరద నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది24 గంటల సమయం ఉందని వరదలు వదిలేయడంతో అనేకమంది చనిపోయారుప్రజలను కాపాడకుండా వారిని గాలికి వదిలేసారుకాగా, సోమవారం ఉదయం రాజ్యసభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో కూటమి నేతల ప్రలోభాలపై ప్రశ్నల వర్షం కురిపించారు విజయసాయిరెడ్డి. వైఎస్సార్సీపీ నేతలను కుట్రపూరితంగా, ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలోకి లాక్కురని టీడీపీపై విమర్శలు చేశారు.నేడు రాజ్యసభలో ఎంపీలుగా సాన సతీష్, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా నూతన ఎంపీల ప్రమాణం నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ ప్రలోభాలపై రాజ్యసభలో ఆయన ప్రశ్నించారు. ప్రలోభాలతోనే వైఎస్సార్సీపీకి చెందిన నేతలను టీడీపీ లాక్కుందని అన్నారు. టీడీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఈ క్రమంలో కల్పించుకున్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్.. ఈ వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లవని చెప్పారు. -
స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో... రాజ్యసభపై లోక్‌సభ విజయం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో పరస్పరం వాగ్వాదానికి దిగే ఎంపీలు ఆదివారం ఉల్లాసంగా గడిపారు. పరస్పరం పోటీపడ్డారు. కానీ, పార్లమెంట్ లోపల కాదు, బయట మాత్రమే. క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన పెంచడానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ జట్టుపై లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ విజయం సాధించింది. రాజ్యసభ జట్టుకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు, లోక్‌సభ టీమ్‌కు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కెపె్టన్లుగా వ్యవహరించారు. పక్కా ప్రొఫెషనల్స్‌ను తలపిస్తూ ఇరు జట్లూ హోరాహోరీగా తలపడటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లోక్‌సభ ఎలెవన్ ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు సాధించింది. కెపె్టన్ ఠాకూర్ సెంచరీ (111 పరుగులు) చేయడం విశేషం. లక్ష్యఛేదనలో రాజ్యసభ ఎలెవన్ 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజ్యసభ జట్టు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ మహమ్మద్ అజారుద్దీన్ 42 బంతుల్లో 74 పరుగులు సాధించారు. ఆయనతో పాటు హర్బజన్‌సింగ్, యూసుఫ్ పఠాన్ రూపంలో మ్యాచ్‌లో ముగ్గురు మాజీ ఇండియా ఆటగాళ్లు తలపడటం విశేషం. లోక్‌సభ సభ్యులు దీపేందర్ హుడా(కాంగ్రెస్)కు బెస్ట్ బౌలర్, నిషికాంత్ దూబే(బీజేపీ)కి బెస్టు ఫీల్డర్ అవార్డులు లభించాయి. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి సూపర్ క్యాచ్ అవార్డు దక్కింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవార్డులను ప్రదానం చేశారు. అంతకుముందు మ్యాచ్ ఆరంభించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కాసేపు సరదాగా బ్యాట్ పట్టి అలరించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, గజేంద్రసింగ్ షెకావత్, సురేశ్ గోపీ, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు రాఘవ్ చద్దా (ఆప్), డెరెక్ ఓబ్రియాన్ (టీఎంసీ) తదితరులు మ్యాచ్‌లో పాల్గొన్నారు. -
నేను రైతు బిడ్డను.. నేను కార్మికుడి బిడ్డను
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై శుక్రవారం ఎగువ సభలో తీవ్రస్థాయిలో రగడ జరిగింది. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం దూషించుకున్నారు. చైర్మన్ ధన్‌ఖడ్, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభ మొదటి గంటలోనే సోమవారానికి వాయిదా పడింది. శుక్రవారం సభ ప్రారంభం కాగానే తొలుత బీజేపీ సభ్యుడు రాధామోహన్ దాస్ మాట్లాడారు. ధన్‌ఖడ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసు అంశాన్ని లేవనెత్తారు. నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజులకు సభలో చర్చ జరగాల్సి ఉండగా, ప్రతిపక్షాలు నిత్యం ధన్‌ఖడ్‌పై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయని తప్పుపట్టారు. దేశాన్ని, ఉపరాష్ట్రపతి పదవిని, రైతులను కించపరుస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రపతులను, ఉప రాష్ట్రపతులను అగౌరవపర్చిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను పదేపదే కించపర్చేవారని చెప్పారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ మృతిచెందితే అంత్యక్రియలు ఢిల్లీలో జరగనివ్వలేదని, మృతదేహాన్ని పటా్నకు తరలించారని గుర్తుచేశారు. అంత్యక్రియలకు హాజరు కాకూడదని అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను నెహ్రూ కోరారని తెలిపారు. అయినప్పటికీ నెహ్రూ మాట లెక్కచేయకుండా పటా్నలో బాబూ రాజేంద్ర ప్రసాద్ అంత్యక్రియలకు రాధాకృష్ణన్ హాజరయ్యారని వెల్లడించారు. కాంగ్రెస్ పారీ్టకి రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కేవలం ఒక్క కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఆరాటపడుతోందని బీజేపీ ఎంపీ కిరణ్ చౌదరి విమర్శించారు. రైతు బిడ్డ అయిన ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఈ సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీకి ధన్‌ఖడ్ అవకాశం ఇచ్చారు. ధన్‌ఖడ్ రైతు బిడ్డ అయితే, ఖర్గే కార్మికుడి బిడ్డ అని చెప్పారు. దళితుడైన ఖర్గేకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో ధన్‌ఖడ్ తీవ్రంగా స్పందించారు. ‘‘నేను రైతు బిడ్డను. ఎవరికీ భయపడను. దేశం కోసం ప్రాణత్యాగమైనా చేస్తా. మీకు(విపక్షాలు) నిత్యం ఒక్కటే పని. నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. నాపై దు్రష్పచారం చేస్తుండడం వ్యక్తిగతంగ బాధ కలిగిస్తోంది. ఇప్పటికే చాలా సహించా. నాపై అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కుమీకు ఉండొచ్చు. నోటీసు ఇచ్చాక చర్చ జరగడానికి 14 రోజులు వేచి చూడాలి. కానీ, వేచి చూసే ఓపిక మీకు లేదు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు’’ అని ధన్‌ఖఢ్ మండిపడ్డారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మీ గొప్పలు వినడానికి రాలేదు: ఖర్గే ఆ తర్వాత ఖర్గే మాట్లాడారు. ‘‘మీరు(ధన్‌ఖడ్) బీజేపీ సభ్యులను ప్రోత్సహిస్తున్నారు. మాపై ఉసిగొల్పుతున్నారు. నేను కార్మికుడి బిడ్డను. జీవితంలో మీకంటే ఎక్కువ సవాళ్లు ఎదుర్కొన్నా. మీరు మా పార్టీని, మా పార్టీ నాయకులను కించపరుస్తున్నారు. మీరు చెప్పుకొనే గొప్పులు వినడానికి మేము ఇక్కడికి రాలేదు. చర్చ కోసం వచ్చాం. మీరు పక్షపాతం చూపుతున్నారు. విపక్షాల గొంతును నొక్కేస్తున్నారు. రాజ్యసభ కార్యకలాపాలకు మీరే పెద్ద అడ్డంకి. మరో పదోన్నతి సాధించుకోవడానికి ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించారు. సభ సజావుగా సాగాలన్నదే తన ఉద్దేశమని, సభలో గొడవలకు తావులేకుండా సభ్యులంతా సహకరించాలని కోరారు. దీనిపై చర్చించడానికి తన చాంబర్‌కు రావాలని ఖర్గేతోపాటు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను ధన్‌ఖడ్ ఆహ్వానించారు. దీనిపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని ఎలా గౌరవించాలి? మీరు నన్ను దారుణంగా కించపర్చారు అంటూ మండిపడ్డారు. -
అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ యాదవ్‌పై వేటు తప్పదా?
న్యాయ్యవస్థలో అత్యంత కీలమైన వారు న్యాయమూర్తులు. రాగద్వేషాలకు అతీతంగా వీరు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో కొంతమంది న్యాయమూర్తులు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) మద్దతుగా వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగిచేందుకు కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రాజ్యసభలో అభిశంసన తీర్మానం పెట్టేందుకు యత్నిస్తున్నాయి.అసలేంటి వివాదం?ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం (డిసెంబర్ 8) అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై మాట్లాడుతూ.. మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యమని అన్నారు. బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. దేశంలోని పౌరులందరినీ సమానంగా చూడాలన్నదే యూసీసీ లక్ష్యమని చెప్పుకొచ్చారు.పదవి నుంచి తొలగించాల్సిందేజస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మతసామరస్యాన్ని భంగపరిచేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తాయి. న్యాయమూర్తి పదవి నుంచి ఆయనను తప్పించేందుకు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ముందుగా ఈ ప్రతిపాదన చేయగా సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, వివేక్ తఖ్కా బలపరిచారు. రాజ్యసభలో విపక్ష సభ్యుల నుంచి బుధవారం నాటికి 38 మంది సంతకాలు సేకరించారు. న్యాయమూర్తులు రాజకీయ ప్రకటన చేయడం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైనారిటీల పట్ల వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తపరిచిన జస్టిస్ శేఖర్ యాదవ్.. తాను విచారించే కేసులలో నిష్పక్షపాతంగా వ్యవహరించలేరని, ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు కూడా జస్టిస్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించింది. అలహాబాద్ హైకోర్టు నుంచి వివరణ కోరింది.అంత ఈజీ కాదు..హైకోర్టు జడ్జిని పదవీచ్యుతుడిని చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా పెద్ద వ్యవహారమే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, ఆర్టికల్ 218లో దీని ప్రస్తావన ఉంది. న్యాయమూర్తిని తొలగించాలన్న తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే 100 మంది లోక్‌సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేయాలి. ఈ పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్‌ను అందజేయాలి. పార్లమెంట్లో తీర్మానం ఆమోదం పొందాలంటే మూడింట రెడింతల మెజారిటీ తప్పనిసరి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తీర్మానాన్ని అదే సెషన్లో రాష్ట్రపతికి సమర్పించాలి. తర్వాత రాష్ట్రపతి ప్రకటన చేయడం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగిస్తారు.చదవండి: మందిర్- మసీదు పిటిషన్లపై ‘సుప్రీం’ సంచలన ఆదేశాలుఅయితే ఇదంతా మనం చెప్పుకున్నంత సులభమేమీ కాదు. పార్లమెంట్లో తీర్మానాన్ని చర్చకు అంగీకరించడానికి ముందు చాలా తతంగం ఉంటుంది. ఒకవేళ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అంగీకరించిన పక్షంలో లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తారు. ఇందులో సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రముఖ న్యాయనిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదిక ఆధారంగానే పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానాన్ని చర్చకు పెడతారు. తర్వాత తీర్మానంపై ఓటింగ్ జరుపుతారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ఇంత సుదీర్ఘ ప్రక్రియ నిర్వహిస్తారు. తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగానే న్యాయమూర్తి పదవీత్యుడయ్యారనేలా ఈ వ్యవహారం సాగుతుంది. కాగా, తాజా వివాదం నుంచి జస్టిస్ శేఖర్ యాదవ్ బయటపడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అధికార ఎన్డీఏ కూటమి పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.గతంలోనూ తీర్మానాలుహైకోర్టు న్యాయమూర్తులపై గతంలోనూ పార్లమెంట్లో అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టిన దాఖలాలు ఉన్నాయి. 1993లో జస్టిస్ వి రామస్వామికి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఓడిపోయింది.2011లో కలకత్తా హైకోర్టు జడ్జి సౌమిత్రా సేన్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ తీర్మానం ఆమోదించడంతో ఆయన రాజీనామా చేశారు. 2015లో రాజ్యసభ తీర్మానంతో గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా పదవీచ్యుతుడయ్యారు.2016-17లో ఏపీ-తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డిపై రెండుసార్లు పెట్టిన తీర్మానం వీగిపోయింది. 2017లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై పెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. -
మ్యారిటల్ రేప్ నేరం కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని(మ్యారిటల్ రేప్) నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్లు దాటి ఉంటే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపినా నేరం కాదని వెల్లడించింది. ఒకవేళ ఆమె వయసు 18 ఏళ్లలోపు ఉంటే ఆ లైంగిక కార్యం నేరమేనని ఉద్ఘాటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ బుధవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 74, 75, 76, 85తోపాటు గృహహింస నుంచి మహిళలకు రక్షణ కలి్పంచే చట్టం–2005 వివాహిత మహిళలకు పలు హక్కులు, రక్షణలు, గౌరవం కలి్పస్తున్నాయని వెల్లడించారు. -
క్రియాశీలకంగా లేని జన్‌ధన్ ఖాతాల్లో వేల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పీఎంజేడీవై)కింద దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో 54.03 కోట్ల ఖాతాలు తెరవగా ఇందులో సుమారు 11.30 కోట్ల ఖాతాలు క్రియాశీలకంగా లేవని కేంద్రం మంగళవారం రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. లావాదేవీలు నెరపని ఈ అకౌంట్లలో ఈ ఏడాది నవంబర్ 20వ తేదీ నాటికి రూ.14,750 కోట్ల బ్యాలెన్సు ఉందని వివరించారు. 2017లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 39.62% వరకు ఉన్న జన్ ధన్ ఖాతాల సంఖ్య 2024 నవంబర్‌కు 20.91%కి పడిపోయాయన్నారు.రెండేళ్లపాటు ఎటువంటి లావాదేవీలు జరగని సేవింగ్/కరెంట్ ఖాతాలను ఆర్బీఐ క్రియాశీలకం కాని ఖాతాగా పరిగణిస్తుందన్నారు. ఖాతాలను క్రియాశీలకంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. క్రియాశీలకం కాని ఖాతాల సంఖ్యను తగ్గించుకోవాలని బ్యాంకులను కోరామన్నారు. ఎప్పటికప్పుడు కేవైసీ అప్‌గ్రేడేషన్, వీడియో కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియ వంటి వాటితో అకౌంట్లను క్రియాశీలకం చేయాలని సూచిస్తున్నామన్నారు.పీఎం–కిసాన్తో 2 కోట్ల ఎస్సీ, ఎస్టీ రైతులకు లబ్ధి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) ద్వారా దేశవ్యాప్తంగా 2.04 కోట్ల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ రైతులకు లబ్ధి చేకూరుతోందని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన పీఎం–కిసాన్ కింద ఇప్పటి వరకు 18 విడతలుగా రూ.3.46 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇటీవలి 18వ ఇన్స్టాల్మెంట్లో 9.58 కోట్ల మంది లబ్ధిదారులు కాగా, వీరిలో 1.16 కోట్ల మంది ఎస్సీ రైతులు, 88.34 లక్షల మంది ఎస్టీ రైతులు, ఇతర కేటగిరీలో 7.54 కోట్ల మంది రైతులు ఉన్నారని వివరించారు. పథకం కింద ఏటా రూ.6 వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేస్తోందంటూ ఆయన ఈ మొత్తాన్ని పెంచే యోచన లేదని వివరించారు.‘పీఎం విశ్వ కర్మ’ కింద రూ.1,751 కోట్ల రుణాలు పీఎం విశ్వకర్మ పథకం కింద అక్టోబర్ 31వ తేదీ నాటికి రూ.1,751 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభకు తెలిపారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, శిల్పి వృత్తులకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లోని నిపుణులు, పనివారికి సులభంగా రుణాలు అందేలా పలు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ పథకం కింద ఈ వర్గం వారు మొత్తం 2.02 లక్షల బ్యాంకు అకౌంట్లు తెరిచారని చెప్పారు. 2023–24 నుంచి 2027–28 కాలానికి గాను కేంద్రం వీరికి ఈ పథకం కింద చేయూతనిచ్చేందుకు రూ.13 వేల కోట్లు కేటాయించింది. 18.74 కోట్ల రైతులకు పంట రుణాలు ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా సుమారు 18.74 కోట్ల మంది రైతులు వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారని కేంద్రం తెలిపింది. ఇందులో మొదటిస్థానంలో తమిళనాడు నిలిచిందని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రాంనాథ్ ఠాకూర్ మంగళవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మొత్తం 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రైతులకు వ్యవసాయ రుణాలతో బ్యాంకు ఖాతాలున్నాయని వివరించారు. చదవండి: ఫస్ట్ డే డ్యూటీకి వెళ్లింది.. అంతలోనే అంతులేని విషాదంతమిళనాడులో అత్యధికంగా 2.88 కోట్ల మంది రైతులు పొందగా, తర్వాతి స్థానంలో యూపీలోని 1.88 కోట్ల మంది, కర్ణాటకలో 1.62 కోట్ల మంది రుణాలు పొందారని తెలిపారు. 2019–2024 మధ్య కాలంలో కేంద్రం ఎటువంటి పంట రుణాలను మాఫీ చేయలేదని చెప్పారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రైతుల రుణాలను రద్దు చేశాయని మంత్రి పేర్కొన్నారు. -
పార్లమెంట్లో ‘సోరోస్’ రగడ
న్యూఢిల్లీ: కాంగ్రెస్–జార్జి సోరోస్ బంధంతోపాటు అదానీ వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికిపోయాయి. మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు అదానీ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో సభ మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి నడ్డా మాట్లాడారు. బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్‌కు, కాంగ్రెస్ పెద్దలకు మధ్య సంబంధాలున్నాయని ఆరోపించారు.వారంతా చేతులు కలిపారని, ఇండియాను అస్థిరపర్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నడ్డా ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. బీజేపీ సభ్యులు ప్రతిస్పందించారు. సోరోస్‌తో సంబంధాలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. నడ్డా ఆరోపణలను కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్ తివారీ ఖండించారు. అదానీ పెద్ద ఎత్తున లంచాలు ఇచి్చనట్లు ఆరోపణలు వచ్చాయని, దీనిపై వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నినాదాలు మిన్నంటాయి. దీంతో సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. లోక్‌సభలోనూ అదే దుమారం సోరోస్తోపాటు భారతదేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ నాయకులు సంబంధాలు కొనసాగిస్తున్నారని లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కిరణ్ రిజిజు ఆరోపించం దుమారం రేపింది. మంగళవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. తర్వాతవిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సోరోస్‌తో కాంగ్రెస్‌కు సంబంధాలున్నాయంటూ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీకి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా లోక్‌సభను మరుసటి రోజుకు వాయిదావేశారు. అంతకుముందు మర్చంట్ షిప్పింగ్ బిల్లు–2024ను కేంద్ర మంత్రి శర్భానంద సోనోవాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మర్చంట్ షిప్పింగ్ చట్టం–1958 స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన అదానీ వ్యవహారంపై విపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మోదీ, అదానీ ఫొటోలు ముద్రించి ఉన్న సంచులను ధరించారు. ఈ సంచులకు మరోవైపు ‘మోదీ అదానీ భాయి భాయి’ అని రాసి ఉంది. పార్లమెంట్ మకరద్వారం మెట్ల ముందు కాంగ్రెస్ సభ్యులు రాహుల్ గాంధీ, ప్రియాంకతోపాటు డీఎంకే, జేఎంఎం, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు నిరసన వ్యక్తంచేశారు. మోదీ, అదానీ బంధంపై పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగించారు. -
ధన్‌ఖడ్‌పై ‘అవిశ్వాసం’
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపార్టీలు మంగళవారం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న ధన్‌ఖడ్‌ను రాజ్యసభ చైర్మన్ పదవి నుంచి తొలగించాల్సిందేనని తేల్చిచెప్పాయి. అవిశ్వాస తీర్మానం నోటీసుపై కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఆమ్ ఆద్మీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యసభ చరిత్రలో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం గట్టిగా పోరాడుతామన్న సందేశం ఇవ్వడానికే అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చినట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. ఆయన అన్ని పరిధులు అతిక్రమించారని, అందుకే నోటీసు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యనాయకులపై బీజేపీ ఎంపీలు ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నా ధన్‌ఖఢ్ పట్టించుకోలేదని విమర్శించారు.ఈ మేరకు జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ధన్‌ఖఢ్ విషయంలో ఇండియా కూటమి పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. సభను ఆయన నడిపిస్తున్న తీరు సక్రమంగా లేదన్నారు. ప్రతిపక్షాలపై ఆయన వివక్ష చూపుతున్నారన్న అభిప్రాయం కలుగుతోందన్నారు. ధన్‌ఖఢ్ కేవలం ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు తప్ప రాజ్యసభ చైర్మన్‌గా నిజాయతీగా పనిచేయడం లేదని తప్పుపపట్టారు. ధన్‌ఖడ్‌ను పదవి నుంచి తప్పించడానికి అవసరమైన బలం తమకు లేదని రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు సాగరికా ఘోష్ చెప్పారు. అయినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ కోసమే పోరాడుతున్నారని, తాము ఎవరికీ వ్యతిరేకం కాదని తేలి్చచెప్పారు. ధన్‌ఖడ్‌ను చూసి గర్వపడుతున్నాం: రిజిజు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను పదవి నుంచి తొలగించడానికి విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం చాలా విచారకరమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ధన్‌ఖడ్‌ను చూసి తాము గర్వపడుతున్నామని చెప్పారు. ఆయన చాలా హూందాగా, పక్షపాతానికి తావులేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం ఎంతమాత్రం లేదని, రాజ్యసభలో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉందని రిజిజు గుర్తుచేశారు. లోక్‌సభలో మూడుసార్లు నోటీసులు లోక్‌సభలో స్పీకర్‌ను తొలగించాలని కోరుతూ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. 1954 డిసెంబర్ 18న అప్పటి స్పీకర్ జి.వి.మౌలాంకర్, 1966 నవంబర్ 24న హుకం సింగ్, 1987 ఏప్రిల్ 15న బలరాం జక్కడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చాయి. మౌలాంకర్, బలరాం జక్కడ్‌పై తీర్మానాలు వీగిపోయాయి. హుకుం సింగ్‌పై ఇచ్చిన నోటీసు తిరస్కరణకు గురైంది. ఓటింగ్‌లో పాల్గొనడానికి 50 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు సముఖత వ్యక్తం చేయకపోవడమే ఇందుకు కారణం. ఓటింగ్ జరగాలంటే కనీసం 50 మంది సభ్యులు అంగీకరించాలి. -
ఆందోళనలు,విమర్శలతో అట్టుడుకుతున్న ఉభయ సభలు
ఢిల్లీ : కొనసాగుతున్న పార్లమెంట్ సీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్య వాగ్వాదం మొదలైంది. అమెరికాలో అదానీపై వచ్చిన ఆరోపణలపై చర్చ జరపాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుబడుతుంటే.. దేశ వ్యతిరేక కార్యలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ సంబంధాల వ్యవహారంపై చర్చ జరపాలని బీజేపీ పట్టుబట్టింది. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాల ఆందోళనలు, పరస్పర ఆరోపణ, విమర్శలతో ఉభయ సభలూ పలు మార్లు వాయిదా పడ్డాయి. #WATCH | Delhi | After both Houses are adjourned till noon, Opposition MPs protest on the steps of the Parliament on Adani issue, demand reply from the government on the issue pic.twitter.com/S6g59PDBHw— ANI (@ANI) December 10, 2024అమెరికా వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నిధులతో పనిచేస్తున్న ఫోరమ్ ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్-ఆసియా ఫసిఫిక్ ఫౌండేషన్ (ఎఫ్డీఎల్-ఏపీ)కు సహఅధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాందీ.. ఆ సంస్థలో తన పాత్రపై స్పష్ట ఇవ్వాలని చెప్పేది మేంకాదని, పబ్లిక్ డొమైన్ ఉందని అందరికి తెలుసని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.రాహుల్ గాంధీ ప్రవర్తన, అతని కార్యకలాపాలన్నింటి గురించి ప్రజలకు బాగా తెలుసు. జాతీయ ప్రయోజనాల విషయానికి వస్తే, మనమందరం కలిసి నిలబడాలి మరియు ఐక్యంగా ఉండాలి. జార్జ్ సోరోస్ భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని అనుకుంటున్నారు. ఇది దేశంలోని ప్రతి పౌరుడికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం’అని మీడియాతో మాట్లాడారు. -
రాజ్యసభ సీటును ఆశించిన డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు నాగబాబు
-
ఏపీలో 427 ‘ఉద్యం సఖి’ లబ్ధిదారులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ‘ఉద్యం సఖి’ పథకం కింద 427 మంది లబ్ధిదారులున్నారని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సహాయ మంత్రి శోభ కరన్ ద్లాజే తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఎంఎస్ఈలను స్థాపించిన మహిళలు ఈ ‘ఉద్యం సఖి’ పోర్టల్‌లో నమోదు చేసుకుని ఆ పథకం లబ్ధిని పొందుతున్నట్లు కేంద్ర మంత్రి శోభ కరన్ ద్లాజే పేర్కొన్నారు. ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోలేదు.. విశాఖపట్నంలో మార్కెటింగ్ టెర్మినల్ పునర్నిర్మించడానికి సవరించిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోకుండా సమీక్షించారని పెట్రోలియం, సహజవాయువులు సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. 2014 జూలైలో రూ.250కోట్ల అంచనాతో ప్రారంభించిన మార్కెటింగ్ టెర్మినల్ తొలగించిన విషయంపై రాజ్యసభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని ప్రశి్నంచారు. 2014లో పునరుద్ధరణ ప్రతిపాదనకు రూ.247కోట్లు మంజూరు చేయగా..ఆ పనులు డ్రాప్ అయ్యాయని కేంద్ర మంత్రి రాతపూర్వకంగా తెలిపారు. సౌభాగ్య పథకం కింద.. సౌభాగ్య పథకం కింద రాష్ట్రంలో 1,81,930 కుటుంబాలకు విద్యుత్తు అందించారని కేంద్ర విద్యుత్తు సహాయ మంత్రి శ్రీపద్ నాయక్ తెలిపారు. రాజ్యసభలో సౌభాగ్య పథకం కింద ఎన్ని గ్రామాలకు విద్యుత్తు అందిస్తున్నారని ఎంపీ పరిమళ్నత్వాని అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిచ్చారు. అర్సెనిక్ కాలుష్యం బారిన ఏపీలోని 7 జిల్లాలు.. దేశవ్యాప్తంగా ఆర్సెనిక్ కాలుష్యాన్ని 25 రాష్ట్రాల్లోని 230జిల్లాలు ఎదుర్కొంటున్నాయని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ ఎస్.నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన మౌఖికంగా సమాధానమిచ్చారు. ఏపీలో ఏడు జిల్లాలున్నట్లు తెలిపారు. ఆర్సెనిక్ కాలుష్యం వలనే భూగర్భ జలాలు కలుíÙతం అవుతున్నట్లు సమాచారం ఉందని కేంద్ర మంత్రి వివరించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021–22 నుంచి 2023–24 మధ్య 1.27 కోట్ల మంది విద్యార్థులు సమగ్ర శిక్ష పథకం ద్వారా లబ్ధి పొందారని వైఎస్సార్సీపీ ఎంపీలు డాక్టర్ గుమ్మ తనూజరాణి, మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు. అంతేగాక గత మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.867.60 కోట్ల వ్యయంతో 2,032 ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ ల్యాబ్స్, 4,678 స్మార్ట్ తరగతులు ప్రారంభించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. నెల్లూరు–చెన్నై హైవేని విస్తరించండి కలకత్తా–చెన్నై జాతీయ రహదారి–16 నెల్లూరు నుంచి చెన్నై వరకు రహదారిని 4–లైన్ నుంచి 6–లై¯Œన్గా మార్పు చేయాలని.. ప్రత్యేక అధికరణం 377 ద్వారా తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రస్తావించారు. ఇందులో భాగంగా కృష్ణపట్నం ఓడరేవు, శ్రీ సిటీ, మేనకూరు వంటి పారిశ్రామిక ప్రాంతాలుండడంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని ఎంపీ గుర్తు చేశారు. హైవే విస్తరణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎంపీ పేర్కొన్నారు. ఏపీలో గత మూడేళ్లలో ప్రధానమంత్రి ముద్రా యోజన కింద నిరర్ధక ఆస్తుల సంఖ్య ఏడాదికేడాదికి తగ్గిందని వైఎస్సార్సీపీ ఎంపీలు పీవీమిధున్ రెడ్డి, డాక్టర్ గుమ్మ తనూజరాణి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరి్థక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ( ఎస్ఎల్బీసీ)ప్రకారం, ఈ కేటగిరీ కింద ఎనీ్పఏలు 2021–22లో 16.09%, 2022–23 లో 11.52%, 2023–24లో 4.68% కి తగ్గాయని కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. -
లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ.. సమాధానమివ్వనున్న మోదీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై లోక్‌సభలో డిసెంబర్ 14న జరిగే చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. లోక్‌సభలో శుక్రవారం, శనివారం (డిసెంబర్ 13, 14) రెండు రోజులపాటు రాజ్యాంగంపై చర్చలు జరగనున్నాయి. అటు రాజ్యసభలోనూ డిసెంబర్ 16, 17వ తేదీల్లో చర్చ జరగనుంది. డిసెంబరు 16న ఎగువ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో చర్చ జరగనుంది.కాగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉభయసభల్లో రాజ్యాంగంపై చర్చించాలని ప్రతపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ప్రాథమిక స్థాయిలో మార్చేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో గతవారం నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో రాజ్యాంగంపై చర్చలకు అధికార, ప్రతిపక్ష లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంగీకరించాయి -
రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి.. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. రాజ్యసభలో చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌తో సహా విపక్షాలు తరుచూ ఆరోపిస్తున్నాయి. ఆయన తమ ప్రసంగాలకు అంతరాయం కలిగిస్తున్నారని, క్లిష్టమైన అంశాలపై తగిన చర్చకు అనుమతించడం లేదని, వివాదాస్పద చర్చల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే రాజ్యంగంలోని ఆర్టికల్ 67(బీ) ప్రకారం జగ్దీప్ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, ఇతర భారత బ్లాక్ పార్టీల సభ్యులు ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తీర్మానంపై ఇప్పటికే ఇండియా కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన 70 మంది ఎంపీలు సంతకాలు చేశారు.కాగా బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరస్‌తో కాంగ్రెస్ నేతలు లింకు పెట్టుకున్నట్లు బీజేపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. సభాపక్ష నేత, ప్రతిపక్ష నేతలతో ధన్కడ్ సమావేశం నిర్వహించి సభను సజావుగా సాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఐక్యత, సార్వభౌమత్వం.. దేశానికి పవిత్రమైనవని, ఆ ఐకమత్యాన్ని, సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడాన్ని సహించబోమని ధన్కడ్ తెలిపారు. -
ఆర్.కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ టికెట్
సాక్షి, ఢిల్లీ: మూడు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి బీసీ నేత ఆర్. కృష్ణయ్యకు అవకాశం కల్పించింది. అలాగే, ఒడిషా నుంచి సుజీత్ కుమార్, హర్యాన నుంచి రేఖా శర్మకు అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్. కృష్ణయ్య రేపు నామినేషన్ వేయనున్నారు. -
పార్లమెంట్‌లోకి నోట్ల కట్ట తీసుకెళ్లకూడదా?
రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట కనిపించడం తాజాగా కలకలం సృష్టించింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదానికి కారణమైంది. సమగ్ర దర్యాప్తు-కుట్ర అని పరస్పరం ఆరోపించుకున్నాయవి. తీవ్ర గందరగోళం మధ్య సభ వాయిదా కూడా పడింది. కానీ, ఒక చట్ట సభ్యుడు నిజంగా అలా నోట్ల కట్టతో సభకు వెళ్లకూడదా?.. ఇది రాజకీయ రాద్ధాంతం చేయాల్సిన అంశమా?.. అసలు అంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయమా?పార్లమెంట్ అంటే చట్ట సభ్యులు కొలువుదీరే భవనం. కాబట్టి.. హైసెక్యూరిటీ జోన్ అని అందరికీ ఓ అభిప్రాయం ఉంటుంది. అయితే పార్లమెంట్లో భాగమైన రాజ్యసభలో.. అదీ ఓ సభ్యుడి సీటు దగ్గర డబ్బు దొరకడం కచ్చితంగా తీవ్రమైన అంశమే!. పార్లమెంట్‌లోకి ఏది పడితే అది తీసుకురావడానికి ఆస్కారం ఉందన్న సంకేతాలను పంపిచింది ఈ ఘటన.‘‘ప్రతి సీటు చుట్టూ గాజు గదినిగానీ, ముళ్లతో కూడిన ఇనుప కంచెనుగానీ ఏర్పాటుచేయాలి. సభ్యులు వాటికి తాళాలు వేసుకుంటే.. తాము ఇంటికెళ్లాక సీట్ల వద్ద ఇతరులెవరూ గంజాయి, కరెన్సీ నోట్లు పెట్టకుండా నివారించొచ్చు’’.. నోట్ల కట్ట దొరికిన సీటు ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కామెంట్అసలేం జరిగిందంటే..శుక్రవారం రాజ్యసభ నడుస్తుండగా.. చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. ‘‘గురువారం సభ వాయిదా పడిన తర్వాత భద్రతా అధికారులు లోపల సాధారణ తనిఖీలు చేపట్టారు. 222వ నంబరు సీటు వద్ద నోట్ల కట్టను వారు గుర్తించారు. అది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురాగానే నిబంధనల ప్రకారం దర్యాప్తునకు ఆదేశించా. ఈ విషయాన్ని సభకు తెలియజేయడం నా బాధ్యత’’ అన్నారు.#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, "I here by inform the members that during the routine anti-sabotage check of the chamber after the adjournment of the House yesterday. Apparently, a wad of currency notes was recovered by the security officials from seat number… pic.twitter.com/42GMz5CbL7— ANI (@ANI) December 6, 2024రాజకీయ దుమారంతో..చైర్మన్ చేసిన ఈ ప్రకటన రాజకీయ దుమారం రేపింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ధన్‌ఖడ్ ప్రకటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నోట్ల కట్ట వ్యవహారంపై దర్యాప్తునకు తమకు అభ్యంతరమేమీ లేదని.. కానీ, దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు బయటకు చెప్పడమేంటని ప్రశ్నించారు. సభను సజావుగా జరగనివ్వకూడదనే కుట్రలో ఇది భాగంకావొచ్చని అనుమానం వ్యక్తం చేశారాయన. అయితే..ఖర్గే స్పందనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుబట్టారు. ఏ సీటు వద్ద కరెన్సీ దొరికిందో.. అక్కడ ఎవరు కూర్చుంటారో.. ఛైర్మన్ చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు. నోట్ల కట్టను సభకు తీసుకురావడం చాలా తీవ్రమైన అంశమని, దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. రాజ్యసభ సమగ్రతకు కాంగ్రెస్ భంగం కలిగించిందంటూ మరో సభ్యుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. సభ్యులెవరూ శాంతించకపోవడంతో.. సభ వాయిదా పడింది. అరుదుగా జరిగిన ఘటన.. అందునా రాజకీయ దుమారం రేగడంతో మీడియా కూడా అంతే హైలైట్ చేసి చూపించింది.మరి ఇంత వీకా?అయితే సదరు సభ్యుడు ఆరోపిస్తున్నట్లు ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే!. గత అనుభవాల దృష్ట్యా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం గురించి ఇక్కడ ప్రస్తావించాలి. సరిగ్గా కిందటి ఏడాది ఇదే నెలలో లోక్‌సభలోనూ భద్రతా వైఫల్యం బయటపడింది. సెషన్ జరుగుతున్న టైంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి ఛాంబర్లోకి దూకిన ఇద్దరు.. టియర్ గ్యాస్ షెల్స్‌తో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారు. కొందరు ఎంపీలు, సెక్యూరిటీ సిబ్బంది ఆ ఇద్దరినీ నిలువరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. హైటెక్ హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంట్‌లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. ఇక పాత పార్లమెంట్ భవనం ఉన్నప్పుడు 2001లో జరిగిన ఉగ్రదాడి సంగతి సరేసరి.ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతా ఎవరి బాధ్యతో తెలుసా? మరోవైపు ఈ ఘటనతో పార్లమెంట్ ఔనత్యంపై ప్రజల్లోనూ పలు అనుమానాలు కలగొచ్చు. చట్ట సభల్లోనే సభ్యుల్ని కొనుగోలు చేసే ప్రయత్నమా? లేదంటే డబ్బుతో ప్రభావితం చేయాలనుకుంటున్నారా? లేకుంటే.. విపక్ష సభ్యుడి సీటు దగ్గరే దొరకడంలో ఏదైనా కుట్ర దాగి ఉందా?.. అనే ప్రశ్నలు తలెత్తే అవకాశం లేకపోలేదు. వీటిని నివృత్తి చేయడానికైనా రాజ్యసభలో నోట్ల కట్ట బయటపడడంపై రాద్ధాంతం కాకుండా.. చర్చ జరగాల్సిందేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
రాజ్యసభలో దొరికిన డబ్బులు ఎవరివి?
ఢిల్లీ : రాజ్యసభలో సెక్యూరిటీ అధికారులకు రూ.50వేల నగదు లభ్యమవ్వడంపై దుమారం చెలరేగింది. సభలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సంఘ్వీకి కేటాయించిన స్థానంలో ఆ నగదు లభ్యమైందని భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ వెల్లడించారు. వెంటనే ఆ నగదుపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.అయితే జగదీప్ ధనకర్ ఆదేశాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టకుండానే నగదు ఎక్కడ దొరికిందో చెప్పడం సరైంది కాదన్నారు. విచారణ పూర్తయిన తర్వాత సభలోని సభ్యుల పేర్లను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.మరోవైపు, తన స్థానంలో రూ.50వేల నగదు లభ్యం కావడంపై కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ఖండించారు. రూ.50వేల నగదు గురించి నాకు తెలియదు. భారీ మొత్తంలో రాజ్యసభలో నగదు లభ్యమైందని తొలిసారి వింటున్నా. గురువారం రాజ్యసభకు వెళ్లేటప్పుడు జేబులో రూ. 500 నోటు మాత్రమే ఉంది. మధ్యాహ్నం 12.57 గంటలకు రాజ్యసభకు చేరుకున్నాను.. మధ్యాహ్నం 1.00 గంటకు సభ వాయిదా పడింది. అనంతరం 1.30 గంటల వరకు క్యాంటీన్లో కూర్చున్నాను.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాను.’ అని సింఘ్వీ తెలిపారు.కొన్నినిమిషాల పాటు సభలో కూర్చున్నానని, రూ.50వేల నగదు తన సీటు వద్ద ఎలా దొరికాయో తనకు తెలియదని అన్నారు. విచారణ చేపడితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఎక్స్ వేదికగా స్పందించారు. Seat number 222 in Rajya Sabha belongs to Congress MP Abhishek Manu Singhvi ji.Abhishek Manu Singhvi ji StatedThat he goes to Rajya Sabha with only one Rs 500 note.Yesterday also he reached the house at 12.57The House adjourned at 1 o'clock, till 1.30 he was present in the… pic.twitter.com/iAQtQxrVCQ— Harmeet Kaur K (@iamharmeetK) December 6, 2024 -
రాజ్యసభలో నోట్ల కట్టల కలకలం
-
Parliament Session Updates: లోక్‌సభ శుక్రవారానికి వాయిదా
న్యూఢిల్లీ, అప్డేట్స్: రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ నిషికాంత్ చేసిన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసననిషికాంత్ దూబే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్విదేశీ పెట్టుబడిదారుడికి, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మధ్య సంబంధాలు ఉన్నాయన్న నిషికాంత్ దూబేమోదీ నాయకత్వంలో భారతదేశ పురోగతిని అణగదొక్కడానికి అంతర్జాతీయ కుట్ర పన్నారని ఆరోపణదూబే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వినతి లోక్‌సభ రేపటికి(శుక్రవారానికి) వాయిదాస్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం జీరో అవర్‌ను ప్రారంభించగా.. విపక్ష సభ్యులు లేచి నిలబడి, సంభాల్ హింసాత్మక పరిస్థితులపై సభలో చర్చించాలని పట్టుబట్టారు.దూబే తన ప్రజెంటేషన్‌ను పూర్తి చేసిన తర్వాత సంభాల్ సమస్యను పరిష్కరించడానికి ప్రతిపక్షాలకు అనుమతి ఇస్తామని స్పీకర్ బిర్లా హామీ ఇచ్చారు.అయినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేస్తునన్నట్లు ప్రకటించారు.ప్రతిపక్ష పార్టీల తీరుతో చాలా బాధపడ్డాను: కిరన్ రిజుజుశీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీల తీరుతో చాలా బాధపడ్డాను.తొలి రోజు నుంచే బిల్లులు, రాజ్యాంగంపై చర్చ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయించాం. కానీ కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఎందుకు నిరసన చేస్తున్నాయి. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించి పార్లమెంట్ వెలుపల ఎందుకు నాటకాలాడుతున్నారు. ఇదనే సభ నడిచే తీరు; పార్లమెంట్ హౌస్ అంటే చర్చలు జరగాలి. కానీ వారు రంగురంగుల బట్టలు వేసుకుని పార్లమెంట్ హౌస్ చుట్టూ తిరుగుతున్నారు.భారతదేశం వెలుపల కొన్ని గ్రూపులు పన్నిన కొన్ని కుట్రల గురించి, భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రత ప్రయోజనాలపై దాడి చేయడంపై నేడు మన ఎంపీలలో కొందరు చాలా ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. ఇవి చాలా తీవ్రమైన విషయాలుకానీ ప్రతిపక్షాలు భారత ప్రభుత్వానికి సంబంధం లేని మరికొన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఏదో సమస్యలను లేవనెత్తుతూ పార్లమెంటు ఆవరణ చుట్టూ తిరుగుతున్నారు. నేను ప్రతిపక్ష పార్టీలతో చాలా బాధపడ్డాను’ అని రిజుజు అన్నారు. సంభాల్ హింసాకాండ, బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై గందరగోళం మధ్య లోక్‌సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి.ప్రతిపక్షాలు అన్ని చోట్లా ఓడిపోతాయి: బీజేపీ ఎంపీ రవికిషన్‘హర్యానాలో ఓడిపోయారు. మహారాష్ట్రలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రానున్న రోజుల్లో అన్ని చోట్లా ఓడిపోతారు. అందుకే వారి బాధ ఇక్కడ చూపిస్తున్నారు’ అని కిషన్ అన్నారు.మధ్యాహ్నం 12 వరకు రాజ్యసభ వాయిదాపార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం రోజు ప్రారంభమయ్యాయి. అదానీ వ్యవహారంపై లోక్‌సభ రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో రాహుల్ మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ విచారణ జరపలేరని అన్నారు. ఎందుకంటే అలా చేయాలంటే తనను తాను దర్యాప్తు చేసుకున్నట్లే అవుతుందని విమర్శించారు.మోదీ ఔర్ అదానీ ఏక్ హై. దో నహీ హై, ఏక్ హై(మోదీ, అదానీ ఒకటే.. ఇద్దరు కాదు)అని పేర్కొన్నారు.#WATCH | Delhi: Opposition MPs, including LoP Lok Sabha Rahul Gandhi protest over Adani matter, at the Parliament premises. pic.twitter.com/BuBDGDnT7f— ANI (@ANI) December 5, 2024కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ గురువారం లోక్‌సభలో ‘ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ప్రాథమిక హక్కుల తిరస్కరణ’పై చర్చను కోరుతూ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వంపై మండిపడుతూ.. ఇది ప్రతిపక్షాల గొంతును అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నంగా ఠాగూర్ పేర్కొన్నారు.మరోవైపు నేడు లోక్‌సభ రైల్వేస్ (సవరణ) బిల్లు, 2024పై చర్చను కొనసాగించనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ (సవరణ) బిల్లు, 2024, విపత్తు నిర్వహణ చట్టం, 2005ని సవరించడానికి ముందుకు తీసుకురానున్నారు. ఇక భారతీయ వాయుయన్ విధేయక్, 2024పై రాజ్యసభలో చర్చ జరగనుంది. -
ఏపీలో 58.8% మహిళలకు రక్తహీనత
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో 58.8% మంది 15–49 ఏళ్ల వయసున్న మహిళల్లో రక్తహీనత అధికంగా ఉందని కేంద్రం తెలిపింది. ఈ సంఖ్య జాతీయంగా 57% ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లో వెల్లడైందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. ఏపీలోని మహిళల్లో ఆహారపు అలవాట్లు, విటమిన్ సీ తగినంతగా తీసుకోకపోవడం కారణంగా రక్తహీనత ఎక్కువగా ఉందని వివరించారు. సూక్ష్మ పోషకాల అవసరాలు తీర్చేందుకు, మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను నియంత్రించేందుకు అంగన్వాడీ కేంద్రాలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. 2024 మార్చికి ఫోరి్టఫైడ్ బియ్యం పంపిణీలో ఏపీ 100% కవరేజీ సాధించిందని, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనలో భాగంగా ఏపీలో 1.32 కోట్ల మంది మహిళలకు బలవర్ధక బియ్యం అందించినట్లు తెలిపారు. ఏపీలో 13,280 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తైంది దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 3.16 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి అయ్యిందని పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ లలన్‌సింగ్ తెలిపారు. వీటిలోని ఏపీలో 13,280 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అలాగే, దేశ వారసత్వాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ఏక్తా మాల్ ఒకటి ఏపీకి మంజూరు చేసినట్లు ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల సహాయ మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వకంగా బదులిచ్చారు. కాగా, ఏపీలో 18,913 మంది మహిళా పోలీసులు ఉన్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఎంపీ తనుజా రాణి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కడప స్టీల్‌ప్లాంట్ అంశం మా ముందు లేదు కడప స్టీల్‌ప్లాంట్ అంశం తమ వద్ద లేదని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. మంగళవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో విభజన చట్టంలో కడప స్టీల్‌ప్లాంట్ హామీ ఉందని, దీని ఏర్పాటుపై కేంద్రం ఏం చేస్తుందని ఎంపీ బాలÔౌరి ప్రశి్నంచగా పై విధంగా మంత్రి బదులిచ్చారు. ‘దిశ’ను రాష్ట్రపతి అనుమతికి స్వీకరించారు: కేంద్రం రాష్ట్రంలో మహిళల భద్రత కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన ‘దిశ’చట్టం రాష్ట్రపతి పరిశీలనకు అనుమతి కోసం స్వీకరించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ‘దిశ’ఏ దశలో ఉందని ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నించగా..కేంద్ర మంత్రి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘దిశబిల్లు–2019’సవరణల తర్వాత కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిందన్నారు. సవరణ చేసిన ఈ బిల్లు రాష్ట్రపతి పరిశీలనకు అనుమతించారని తెలిపారు. చట్ట ప్రకారం, రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రాల నుంచి స్వీకరించబడిన బిల్లులు నోడల్ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లతో సంప్రదించి తదుపరి ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అన్ని నోడల్ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల వారి సలహాలు, సూచనలు స్వీకరించారని తెలిపారు. మహిళా భద్రతా విభాగం, హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలను మరింత స్పష్టత కోసం ఏపీ ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. -
ప్రతిష్టంభనకు తెర!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చొరవ ఫలించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై వారం రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రాజ్యాంగ దిన వజ్రోత్సవాల సందర్భంగా ఉభయ సభల్లోనూ రాజ్యాంగంపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య అంగీకారం కుదిరింది. ఆ మేరకు డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్‌సభలో, 16, 17ల్లో రాజ్యసభలో చర్చ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ప్రకటించారు. సోమవారం అన్ని పారీ్టల పార్లమెంటరీ పక్ష నేతలతో స్పీకర్ భేటీ అనంతరం ఆయన మీడియాకు ఈ మేరకు తెలిపారు. మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలూ సజావుగా జరిగేలా సహకరించేందుకు అన్ని పక్షాలూ అంగీకరించాయన్నారు.దీన్ని భేటీలో పాల్గొన్న విపక్షాల నేతలు కూడా ధ్రువీకరించారు. విపక్షాలు చర్చకు పట్టుబడుతున్న సంభాల్ హింస, మణిపూర్ కల్లోలం తదితరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా నిబంధనలకు లోబడి ఏ అంశాన్నైనా సభల్లో లేవనెత్తవచ్చని రిజిజు బదులిచ్చారు. అదానీ, మణిపూర్ కల్లోలం తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతుండటంతో నవంబర్ 25న పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచీ ఉభయ సభల్లో రోజూ వాయిదాల పర్వం సాగుతుండటం తెలిసిందే. దీనికి తెర దించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయతి్నస్తున్నారు.వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించనున్నట్టు సమాచారం. తాము డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కారు ఎట్టకేలకు అంగీకరించిందని కాంగ్రెస్ పేర్కొంది.అదానీ, సంభాల్ తదితర అంశాలపై పార్లమెంటులో చర్చకు భయపడి తప్పించుకుంటోందని దుయ్యబట్టింది. ఆ పార్టీ గట్టిగా పట్టుబడుతున్న అదానీ అంశంపై చర్చకు అధికార పక్షం అంగీకరిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ విషయంలో ఇతర విపక్షాలేవీ కాంగ్రెస్‌కు దన్నుగా నిలవడం లేదు. ప్రతి సమావేశాల్లోనూ పార్లమెంటును అధికార బీజేపీ హత్య చేస్తూ వస్తోందని టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియాన్ దుయ్యబట్టారు.అవే ఆందోళనలు.. ఉభయసభలూ నేటికి వాయిదాఅదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా సహా పలు అంశాలపై సోమవరం పార్లమెంటు అట్టుడికింది. వాటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం కూడా ఉభయ సభలూ కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభమవగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టగా విపక్షాలు అడ్డుకున్నాయి. అదానీపై చర్చించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో సభ తొలుత మధ్యాహ్నం దాకా వాయిదా పడింది.తర్వాత కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో మంగళవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. అదానీ సహా పలు అంశాలపై విపక్షాలిచి్చన 20 వాయిదా తీర్మానాలను చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. ఆందోళనల నడుమ సభ తొలుత మధ్యాహ్నానికి, తర్వాత మంగళవారానికి వాయిదా పడింది. -
పార్లమెంట్లో వాయిదాల పర్వం.. అఖిలపక్ష భేటీలో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా లోక్‌సభలో సంభాల్ అంశంపై మాట్లాడేందుకు సమాజ్‌వాదీ పార్టీకి, బంగ్లాదేశ్ పరిస్థితులపై మాట్లాడేందుకు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుమతించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి పార్లమెంటు సమావేశాలు సజావుగా నడిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించినట్లు సమాచారం.ఈ క్రమంలోనే వచ్చే వారం రాజ్యాంగంపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్ష లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంగీకరించారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్‌సభలో,16, 17 తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరుగనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంట్ వెలుపల విలేకరులతో చెప్పారు. ‘పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం మంచిది కాదు. రేపటి నుంచి పార్లమెంట్ సజావుగా జరిగేలా మనమందరం చేసుకున్న ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపక్ష నేతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని రిజిజు పేర్కొన్నారు.అయితే అన్ని అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు కోరుతున్నాయి. నిరుద్యోగం, రైతుల సమస్యలు, సంబాల్ హింస, పెరుగుతున్న ధరలు తదితర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆదాని అంశంపై బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరాయి.కాగా గతవారం (నవంబర్25) ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో వాయిదాలపర్వం కొనసాగుతోంది. విపక్షాల డిమాండ్లతో రోజూ సభ ప్రారంభం కావడం, వాయిదా పడటం పరిపాటిగా మారింది. అదానీ అవినీతి వ్యవహారం, సంభాల్ హింస, మణిపూర్ అంశం వంటి విషయాలపై చర్చించాలని విపక్షాలు నిరసనలు చేస్తుండటంతో ఉభయసభలు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. డిసెంబరు 20 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. -
పార్లమెంట్లో అదే రచ్చ.. ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో చెలరేగిన హింస, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అవినీతి తదితర అంశాలపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం కూడా పార్లమెంట్లో ఇదే పరిస్థితి కొనసాగింది. శుక్రవారం వాయిదా పడిన ఉభయసభలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. భారత్-చైనా సరిహద్దు ఒప్పందం పురోగతిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో ప్రకటన చేస్తారని ముందుగా భావించారు. కానీ ఎగువ, దిగువ సభలు ప్రారంభం కాగానే సభలో అదానీ, సంభాల్‌లో హింసాకాండపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.విపక్షాల ఆందోళనలతో సభలను మధ్యాహ్నం 12 గంటల వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు. ఇక సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు రేపటికి (డిసెంబర్ 3)కి వాయిదా పడ్డాయి. -
Parliament Session: ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు రేపటికి(శుక్రవారం) వాయిదా పడ్డాయి. అటు లోక్‌సభ, రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనలతో సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. అదాని గ్రూప్ అవినీతి ఆరోపణలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభలను వాయిదావేశారు. పార్లమెంట్ ఉభయ సభలు 12గంటల వరకూ వాయిదా పడ్డాయి.లోక్‌సభ స్పీకర్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో కేరళలోని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో సభకు వచ్చిన ఆమె.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నాలుగోరోజైన గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలయ్యాయి. #WATCH | Delhi: Congress MP Shashi Tharoor says, " I am delighted as we had campaigned for her. I am happy that she won...as you can see, she is appropriately dressed in a Kerala saree" pic.twitter.com/MFoJPaf4dj— ANI (@ANI) November 28, 2024 కాగా తాజాగా వెలువడిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ నాలుగు లక్షలకుపైగా రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టనుండగా, పార్లమెంటులో ముగ్గురు గాంధీలు ఎంపీలుగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం సోనియా రాజ్యసభలో ఎంపీగా ఉండగా, రాహుల్, ప్రియాంక లోక్‌సభలో కూర్చోనున్నారు. వక్ఫ్ బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను సమర్పించేందుకు నవంబర్ 29న గడువును పొడిగిస్తూ ప్రతిపాదనను సమర్పించనుంది.ఇక నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజు నుంచి స్తంభిస్తూనే ఉన్నాయి. ఉభయ సభలు రోజంతా వాయిదా పడుతున్నాయి. మణిపూర్ హింస, సంభాల్ హింస సహా పలు సమస్యలపై ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండో రోజు సభ జరగలేదు. మూడో రోజు ఉభయ సభలు గంట వ్యవధిలో వాయిదా పడ్డాయి. -
ఏపీలో 3 రాజ్యసభ సీట్ల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్ల ఉప ఎన్నికకు మంగళవారం షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 3వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందని, 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 20వ తేదీన పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం అందులో పేర్కొంది.వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీల రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీతో పాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, హర్యానాలో ఒక్కో స్థానానికి కూడా(రాజీనామాలే) ఈ నోటిఫికేషన్ వర్తించనుంది. డిసెంబర్ 20వ తేదీనే పోలింగ్ అయ్యాక సాయంత్రం కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుందని ఈసీ ఆ షెడ్యూల్లో పేర్కొంది. మిగతా వివరాలు ఈ కింది నోటిఫికేషన్లో చూడొచ్చు. ఇదీ చదవండి: హాయ్ చెప్తే.. అంత డ్రామా చేస్తారా? -
ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా ఘన్‌శ్యామ్ తివారీ
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎథిక్స్ (నైతిక విలువల) కమిటీ ఛైర్మన్‌గా బీజేపీకి చెందిన ఘన్‌శ్యామ్ తివారీ నియమితులయ్యారు. అక్టోబర్ 10 నుంచి ఈ కమిటీ మనుగడలోకి వస్తుందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తెలిపారు. ఎథిక్స్ కమిటీలో వైఎస్సార్సీపీ ఎంపీ వై.విజయసాయి రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. ప్రమోద్ తివారీ (కాంగ్రెస్), డెరెక్ ఒబ్రియాన్ (తృణమూల్ కాంగ్రెస్), తిరుచ్చి శివ (డీఎంకే), సంజయ్ సింగ్ (ఆప్), శస్మిత్ పాత్రా (బీజేడీ), ప్రేమ్‌చంద్ గుప్తా (ఆర్జేడీ), మేధా విశ్రామ్ కులకర్ణి, దర్శనా సింగ్ (బీజేపీ)లు కమిటీలోని ఇతర సభ్యులు. రాజ్యసభలో ఎంపీల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే ఎథిక్స్ కమిటీ పరిశీలించి నిర్ణయాలు వెలువరిస్తుంది. అలాగే విజయసాయి రెడ్డిని రవాణా, పర్యాటక, సాంస్కృతిక స్టాండింగ్ కమిటీ నుంచి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల స్టాండింగ్ కమిటీకి మారుస్తూ ధన్‌ఖడ్ ఆదేశాలు జారీచేశారు. -
‘నా ఛాంబర్లో చొరబాటు’.. రాజ్యసభ ఛైర్మన్‌కు ఖర్గే లేఖ
ఢిల్లీ: సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్( సీపీడబ్ల్యూడీ ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), టాటా ప్రాజెక్ట్‌ల అధికారులు సమాచారం ఇవ్వకుండా పార్లమెంట్‌లోని తన గదిలోకి ప్రవేశించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు లేఖ రాశారు.‘‘ఇది చాలా అసాధారణ విషయం. నా ఛాంబర్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి.. ఎంపీగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నాకున్న అధికారాలు, నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇలా నా ఛాంబర్లోకి చొరబాడటం... అగౌరవపర్చటంతో పాటు ఆమోదయోగ్యం కాదు. ఎవరి అదేశాలు, సూచనల ప్రకారం వారు అనుమతి లేకుండా నా ఛాంబర్లోకి ప్రవేశించారో తెలియజేయాని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి' అని ఖర్గే లేఖలో పేర్కొన్నారు.అయితే.. ఈ విషయంపై ఇంకా ఎటువంటి అప్డేట్ లేదని రాజ్యసభ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఖర్గే లేఖపై.. సీఐఎస్ఎఫ్ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఛాంబర్లతో ఏవైనా నిర్మాణ మరమత్తు పనులు జరుగుతున్న సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్‌లోని ప్రోటోకాల్‌లో భాగంగా ఇతర ఏజెన్సీలతో కలిసి ఉంటారని ఓ అధికారి తెలిపారు.‘‘పలు కార్యాలయాల్లో మరమత్తు పనులు జరిగాయి. కార్యాలయాల తాళాలు సీఐఎస్ఎఫ్ వద్ద లేవు. పార్లమెంటు అంతటా భద్రత కోసం మాత్రమే సీఐఎస్ఎఫ్ ఉంది. నిర్వహణ పనుల జరగుతున్న సమయంలో వారు.. అధికారులతో పాటు పలు కార్యాలయాలకు వెళ్లి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూశారు’ అని చెప్పారు. -
బీజేడీ నుంచి ఎంపీ బహిష్కరణ.. కాసేపటికే బీజేపీలోకి
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న కారణంతో రాజ్యసభ ఎంపీ సుజీత్ కుమార్‌ను మాజీసీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేపీ) పార్టీ నుంచి బహిష్కరించింది. ఎంపీ సుజీత్ కుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, ఈ బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బీజేపీ చీఫ్ నవీన్ పట్నాయక్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. తనను రాజ్యసభకు పంపిన పార్టీని, కలహండి జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను అతను నెరవేర్చడంలో విఫలమయ్యాడని ఉత్తర్వుల్లో పేర్కొంది.దీంతో సుజీత్‌కుమార్ వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుజీత్ కుమార్ రాజీనామా లేఖను భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కఢ్ ఆమోదించారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్టీ ఒడిశా ఇన్ఛార్జ్ విజయపాల్ సింగ్ తోమర్, ఎంపీ భర్తృహరి మహతాబ్, పార్టీ సీనియర్ నేతల సమక్షంలో సుజీత్ కుమార్ కాషాయ కండువా కప్పుకున్నారు.అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుమార్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, 2036 నాటికి ఒడిశాను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కృషి, ఆయన దృక్పథానికి ఆకర్షితుడై తాను కాషాయ పార్టీలో చేరానని చెప్పారు.‘నాకు దేశమే ప్రథమం. నేషన్ ఫస్ట్ అనేది నా ఫిలాసఫీ. నేను చాలా సంవత్సరాలు విదేశాల్లో నివసించాను . యునైటెడ్ నేషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థల కోసం పనిచేశాను. దేశ అభివృద్ధి కోసం 2011లో భారతదేశానికి తిరిగి వచ్చాను.ఒడిశాలోని కలహండి జిల్లా అనేక అవినీతి కారణంగా అభివృద్ధి చెందలేదని నేను. ఇందులో జిల్లాకు చెందిన పలువురు బీజేడీ నాయకుల హస్తం ఉంది. ఈ విషయాన్ని బీజేడీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చాలాసార్లు ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. అందుకే బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నాను.’ అని పేర్కొన్నారు. BJD expels party leader Sujeet Kumar for "anti-party activities."He resigned from Rajya Sabha and his resignation has been accepted by Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar. pic.twitter.com/asjLLxpnOw— ANI (@ANI) September 6, 2024 -
పార్టీ మార్పు పుకార్లపై గొల్ల బాబూరావు రియాక్షన్
-
రాజ్యసభ: మెజారిటీ మార్క్‌కి చేరిన ఎన్డీయే.. 12 మంది ఏకగ్రీవం
ఢిల్లీ: రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మంగళవారం.. మెజారిటీ మార్కుని చేరుకుంది. బీజేపీ బలం 96కి చేరుకుంది. కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 112కి చేరింది. అధికార కూటమికి ఆరుగురు నామినేటెడ్ ఎంపీలతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది.మొత్తం 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 మంది బీజేపీ వారు కాగా, మరో మూడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఒకరు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి ఒకరు, ఆర్ఎల్ఎం నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాజ్యసభలో మొత్తం స్థానాలు 245 కాగా, ప్రస్తుతం ఎనిమిది ఖాళీగా ఉన్నాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ నుంచి 4 ఉండగా, మరో నాలుగు నామినేట్ చేయబడ్డాయి. ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల సంఖ్య 237 కాగా, మెజారిటీ మార్క్ 119. కాంగ్రెస్ బలం 27కి చేరుకోవడంతో ప్రతిపక్షం హోదాను దక్కించుకుంది. ప్రతిపక్ష నేత హోదా పొందాలంటే పార్టీకి కనీసం 25 మంది ఎంపీలు ఉండాలి. -
రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కేంద్ర మంత్రి
భోపాల్: కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజ్యసభ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా జార్జ్ కురియన్ను భోపాల్‌లో నామినేషన్ వేశారు. జ్యోతిరాదిత్య సింధియా లోక్‌సభకు ఎన్నికవ్వడంతో.. ఖాళీ అయిన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి కురియన్ను తమ అభ్యర్థిగా బీజేపీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది.ప్రస్తుతం జార్జ్ కురియన్ మోదీ 3.0 కేబినెట్లో ఫిషరీస్, పశుసంవర్ధక పాడి పరిశ్రమ, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. బుధవారం ఉదయం భోపాల్ చేరుకున్న కురియన్‌కు అక్కడ రాష్ట్ర బీజేపీ చీఫ్ వీడీ శర్మ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్‌లో సీఎం యాదవ్, ఉప ముఖ్యమంత్రులు రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవదా, రాష్ట్ర బీజేపీ చీఫ్ శర్మ సమక్షంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారని పార్టీ అధికార ప్రతినిధి ఆశిష్ అగర్వాల్ తెలిపారు.ఇక పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలకు కేంద్రమంత్రులు రణ్‌వీత్‌సింగ్ బిట్టూ (రాజస్థాన్ నుంచి), జార్జి కురియన్ (మధ్యప్రదేశ్ నుంచి)ను అభ్యర్థులగా బరిలో దించింది. బిజూ జనతాదళ్ మాజీ నేత మమత మొహంతను ఒడిశా నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించిన కమలం పార్టీ.. బార్ కౌన్సిల్ ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రాను బిహార్ నుంచి పోటీకి దించింది. సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగిన నేపథ్యంలో పలువురు సభ్యులు రాజీనామాలు చేయడం, అలాగే, తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, ఒడిశాలో బిజేడీ ఎంపీ మమతా మొహంత తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ బరిలో నిలిచారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.కాగా, తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన అభ్యర్థితత్వాన్ని ఏఐసీసీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇక, ఇటీవలే కేశవరావు రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఉప ఎన్నికలకు కాంగ్రెస్ నుంచి సింఘ్వీ పెద్దల సభకు పోటీలో నిలవనున్నారు. Congress President Mallikarjun Kharge has approved the candidature of Abhishek Manu Singhvi as Congress candidate to contest the ensuing bye-election to Rajya Sabha from Telangana. pic.twitter.com/gj9EpkNENz— ANI (@ANI) August 14, 2024కాగా రాజ్యసభలో 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు మూడో తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఇక, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో, వారంతా రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో, ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మొహంత తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ఆ స్థానాలకూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. -
వంకర బుద్ధుల పెద్దలు
ఏం చదివితే ఏమి? ఏ పదవిలో కూర్చుంటే ఏమి? పితృస్వామ్య భావజాలం నరనరాన జీర్ణించుకున్నప్పుడు ప్రతి ఒక్కడూ ఒక మనువే అవుతాడు. ఇందుకు రాజ్యసభలో జయాబచ్చన్ పట్ల చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వ్యవహారశైలే ఒక ఉదాహరణ.ప్రజలందరి స్వేచ్ఛా సమానత్వాలను కాపాడటానికి కృషి చేసే చట్టసభల్లో మహిళా సభ్యులు అవమానాలకు, వివక్షలకు గురి కావడం భారతదేశంలో చాలా సహజంగా మారిపోయింది, చర్చించవలసిన విషయం కాకుండా పోయింది. ఇందిరాగాంధీ, జయ లలిత, సోనియాగాంధీ, మాయావతి, మమతా బెనర్జీతో సహా రాష్ట్రాల మహిళా శాసనసభ్యులు అనేకమంది ఇలాంటి వాటిని ఎదుర్కొన్నవారే. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, రెండు దశాబ్దాలుగా భారత పార్లమెంటేరియన్; ఆస్తులు, హోదాలు, కుటుంబపు దన్ను, సామాజిక ఆధిపత్య స్థానంలో ఉన్న జయాబచ్చన్ కూడా రాజ్యసభలో తన పేరును వ్యంగ్యంగా కాక గౌరవంగా పిలవడం కోసం పోరాటం చేస్తోంది. ‘తోటి సభ్యురాలి పేరుకి విలువ ఇవ్వనివారు, మా హక్కులను ఎలా కాపాడతారని’ ప్రజలు ప్రశ్నిస్తే చట్టసభలు ఏమని సమాధానం ఇస్తాయి? మొన్నటి రాజ్యసభ సమావేశాల్లో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్‌ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తను మాట్లాడ టానికి అవకాశం ఇమ్మని కోరిన జయను ఉద్దేశించి– ‘ఇపుడు జయా అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడతారని’ ధన్‌ఖడ్ అన్నారు. ‘అమితాబ్’ పేరుని ఒత్తి పిలవడంతో, అందులోని వ్యంగ్యాన్ని జయ గుర్తించి అందుకు అభ్యంతరం చెప్పింది. అప్పటికి అది నాలుగోసారి జయ పేరుని ధన్‌ఖడ్ ఆ తీరులో పలకడం! తనని జయాబచ్చన్ అని మాత్రమే పిలవమని ప్రతిసారీ ఆయనకు చెబుతూనే ఉంది. తను భర్త చాటు భార్యను కాననీ, స్త్రీగా తన ఉనికిని గుర్తించాలని స్పష్టంగా చెప్పింది. ఒక స్త్రీ, అందునా ప్రతిపక్షంలో ఉన్న స్త్రీ కచ్చితంగా చెప్పడం ఎంతటి ఉదారులకైనా నచ్చు తుందా! ఎన్నికల అఫిడవిట్లో జయ పేరు ‘జయా అమితాబ్ బచ్చన్’ అని ఉంటుంది. అందుకే అలా పిలిచానని ధన్‌ఖడ్ అన్నారు. రాజ్యసభలో ఉన్న సభ్యుల పేర్లన్నీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారమే పిలవడం లేదు కదా! దీన్ని బట్టి చూస్తే జయని రెచ్చగొట్టడానికే పదేపదే అలా పిలిచారు. అయితే పేరు పిలవడం కేవలం సాంకేతిక విషయం కాదు. పైకి మామూలుగా కనిపించే మాటకు మనం అద్దే స్వరం ద్వారా ఉద్దేశించిన అర్థం మారి పోవచ్చు. తనొక కళాకారిణిననీ, ఎదుటివారి హావభావాలు తనకి ఇట్టే తెలిసిపోతాయనీ, ‘పిలిచిపుడు మీ టోన్ బాలేద’నీ చెప్పింది జయ. చట్టసభల్లో సభాధ్యక్షులు ఎలా వ్యవహరించాలి అన్నదానికి మనకి కొన్ని సంప్ర దాయాలు ఉన్నాయి. చైర్మన్ ఏ పార్టీ నుంచి ఎన్నిక అయినా సరే సభలో ఉన్న అన్ని పార్టీలు, సభ్యుల పట్ల తటస్థ వైఖరితో వ్యవహరించాలి. కానీ జగదీప్ ధన్‌ఖడ్ సభా నిర్వహణ చాలా స్పష్టంగా ఒక పక్షం వైపు పనిచేస్తూనే ఉంది. ఆయన ముందుగానే ప్రతిపక్ష సభ్యులతో వాదం వేసుకుని అధికారపార్టీ సభ్యుల పని సులువు చేస్తారు. దేశ ప్రజలందరికీ ఆదర్శమైన వ్యక్తిత్వంతో ఉండాల్సిన మనిషి, పరుషమైన భాష, వ్యంగ్యపు హావభావాలు, కటుత్వం, ఆధిపత్యపు మొగ్గు, సభా సంప్రదాయాలను పట్టించుకోకపోవడం ద్వారా ప్రతిపక్ష సభ్యుల విశ్వసనీయతను కోల్పోతున్నారు. తను కళాకారిణిని కాబట్టి హావభావాలు గ్రహించానని చెప్పడం, ‘మనం కొలీగ్స్ కదా’ అని జయ అనడంతో ధన్‌ఖడ్ ద్వంద్వానికి గురయ్యారు. ‘మీరు సెలబ్రెటీ అయితే ఏమిటి, సభలో అందరూ ఒక్కటే’ అన్న మరుక్షణమే ‘మనం ఒకటి ఎలా అవుతాం! అధ్యక్ష స్థానానికి విలువ ఇవ్వరా!’ అంటూ ధన్‌ఖడ్ పెద్దస్వరంతో మాట్లాడడం రాజ్యసభ ప్రసారాలు చూసినవారికి ఆశ్చర్యం కలిగించింది. ప్రతిపక్ష సభ్యులంతా వాకౌట్ చేసి బయటకు వచ్చారు. జయకి సోనియాగాంధీ మద్దతుగా నిలబడింది. ధన్‌ఖడ్ స్వభావం గురించి చెబుతూ సభ్యులను తరచుగా ‘శూన్యబుద్ధి’ అంటారని, మాట్లాడుతుంటే ‘న్యూసెన్స్’ అంటారని జయ చెప్పింది. ఈ సందర్భంలో జయ ప్రస్తావించిన ‘మాటల్లో ధ్వని’ గురించి మాట్లాడుకోవాలి. ‘ఇప్పుడు ఆడవాళ్ళని ఒక మాటని బతకగలమా!’ అన్నది తరచూ వింటున్న మాట. స్త్రీలమీద జరిగే రకరకాల వేధింపులు, దాడులను అరికట్టడానికి కొన్ని చట్టాలు వచ్చాక నిస్సంకోచంగా స్త్రీలను అవమానించడం కొంతమేరకు తగ్గి ఉండవచ్చు. కానీ ఆ మేరకు కొత్త సాధనాలను పితృస్వామ్యం సమకూర్చుకుంటుంది. అందులో ఒకటి ధ్వని గర్భితంగా మాట్లాడటం! తాము వాడే ప్రతీ పదం రాజకీయంగా తప్పులేకుండా చూసుకుని– స్వరంలోని హెచ్చుతగ్గులు, తమకి అవసరమైన పదాలను ఒత్తి పలకడం, హావభావాల ద్వారా వివక్షను చూపడం! రాజ్యసభలో ఈ తెలివైన వివక్షకే జయ గురయింది. దీని వెనుక ఉన్న కారణం ఒక్కటే. ఇప్పటికీ స్త్రీలు రెండవతరగతి పౌరులు! అటువంటివారు చట్టసభల్లోకి వచ్చి మౌనంగా కూర్చోకుండా సవాళ్ళు విసురుతారు, గట్టి గొంతుతో మాట్లాడతారు.అందుకే జేపీ నడ్డా లాంటి వారికి జయలో సభా మర్యాదలు, ప్రజాస్వామిక విలువలు పాటించడం తెలియని గర్వపోతు కనపడింది. స్త్రీలు ఎంతటి స్థానానికి ఎదిగినా వారు సమాజం కళ్ళకు స్త్రీలుగానే కనపడతారు. అందుకే సోనియా గాంధీ ఇటలీ వెళ్లిపోవాలని ఆశిస్తారు. సునీత రెండో పెళ్లి చేసుకోవద్దని డిమాండ్ చేస్తారు. తులసి చందు తన యూట్యూబ్ ఛానెల్ ఆపేయాలని బెదిరిస్తారు. దేశంలోని మామూలు మనుషులంతా ఆ కుస్తీపిల్లని గుండెల్లో పెట్టుకుంటే మతతత్వ వాదులు ఆమె ఒంటి మీది దుస్తులను విప్పాలని చూస్తారు. జయను ఎలా పిలవాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు! కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
Parliament Session: చినికి చినికి గాలివానగా... జయ వర్సెస్ ధన్‌ఖడ్!
న్యూఢిల్లీ: పేరులో ఏముందంటారు. కానీ పేరు పెను వివాదానికి దారి తీయగలదని, అంతకుమించి రాజకీయ సంక్షోభానికీ కారణం కాగలదని రాజ్యసభ సాక్షిగా రుజువైంది. సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్ పేరు విషయమై శుక్రవారం రాజ్యసభలో రాజుకున్న రగడ నాటకీయ మలుపులు తిరిగి చివరికి రాజకీయ దుమారంగా మారింది. ఏకంగా రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించుకునే దాకా వెళ్లింది! దాంతో విపక్ష సభ్యులకు, ఆయనకు మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు కీలక మలుపు తిరిగాయి. వేడెక్కిన రాజ్యసభ జయాబచ్చన్ ‘పేరు’ అంశం శుక్రవారం రాజ్యసభను అమాంతం వేడెక్కించింది. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై గత వారం బీజేపీ సభ్యుడు ఘన్‌శ్యాం తివారీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయడంతో రగడకు బీజం పడింది. ఇది ముగిసిపోయిన అంశమని ధన్‌ఖడ్ బదులివ్వడంతో విపక్ష ఎంపీలంతా గొడవకు దిగారు. దీనిపై జయ మాట్లాడతాననడంతో ధన్‌ఖడ్ అనుమతించారు. ‘జయా అమితాబ్ బచ్చన్! మాట్లాడండి’ అన్నారు. ఆయన తన పేరును పిలిచిన తీరులో వ్యంగ్యం ధ్వనిస్తోందంటూ జయ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘నేను నటిని. హావభావాలను ఇట్టే అర్థం చేసుకోగలను. మీ మాటతీరు ఏమాత్రం అంగీకారయోగ్యంగా లేదు. మీరు సభాధ్యక్ష స్థానంలో ఉండొచ్చు గాక. కానీ మీరు మా తోటి సభ్యులు మాత్రమే’’ అన్నారు. దాంతో ధన్‌ఖడ్ తీవ్రంగా ఆగ్రహించారు. ‘ఇక చాలు’ అంటూ మధ్యలోనే కలి్పంచుకున్నారు. ‘‘మీకు గొప్ప పేరుండొచ్చు. కానీ నటీనటులు దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందే. సభాధ్యక్ష స్థానం నుంచి నేను చూసేది మీకు కని్పంచకపోవచ్చు. నా మాటతీరునే తప్పుబడతారా? నేనేం చేయాలో మీరు నిర్దేశించలేరు’’ అంటూ ఆక్షేపించారు. ఇందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ధన్‌ఖడ్ మరింతగా మండిపడ్డారు. ‘‘మీరు సెలబ్రిటీ అయినా, మరెవరైనా సరే! నథింగ్ డూయింగ్. నిబంధనలను అర్థం చేసుకోవాల్సిందే. సభా మర్యాదలు పాటించి తీరాల్సిందే’’ అని బచ్చన్‌కు స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలంతా తీవ్ర అభ్యంతరం తెలిపినా, మూకుమ్మడిగా నినాదాలకు దిగినా లెక్కచేయలేదు. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎవరికీ అనుమతివ్వబోనని స్పష్టం చేశారు. ‘‘పేరు ప్రఖ్యాతులు మీకే ఉంటాయనుకోకండి. మనమంతా ఇక్కడికొచ్చేది మన బాధ్యతలు సరిగా నిర్వర్తించి పేరు సంపాదించేందుకే. పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టుగా నడుచుకోవాలి’’ అంటూ క్లాసు తీసుకున్నారు. ‘‘సీనియర్ సభ్యులైనంత మాత్రాన సభాపతి స్థానాన్ని అవమానించేందుకు సభాపతి మాటతీరుకు ఉద్దేశాలు ఆపాదించేందుకు ఎవరికీ హక్కు లేదు. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించాల్సి వచ్చింది. నా సొంత స్క్రిప్టునే అనుసరిస్తాను తప్ప ఎవరో చెప్పినట్టు నడుచుకునే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. విపక్ష సభ్యుల వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లబోవని స్పష్టం చేశారు. జయ పేరుపై రాజ్యసభలో ఆమెకు, ధన్‌ఖడ్‌కు సంవాదం జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. మేం స్కూలు పిల్లలమా?: జయ ధన్‌ఖడ్ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు విపక్ష సభ్యులు ప్రకటించారు. దాంతో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు దేశం మొత్తాన్నీ అస్థిరపరిచే ప్రయత్నంలో ఉన్నారని నాకు బాగా తెలుసు. సభలో గందరగోళం సృష్టించడమే మీ ఉద్దేశం. అందుకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోను. మీరంతా మీ బాధ్యతల నుంచి పారిపోతున్నారు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘రాజ్యాంగాన్ని పణంగా పెట్టయినా ఖర్గే తన మాట నెగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’’ అంటూ తప్పుబట్టారు. అనంతరం సోనియాగాంధీ తదితరులతో కలిసి జయాబచ్చన్ సభ నుంచి వాకౌట్ చేశారు. సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘క్రమశిక్షణలో పెట్టేందుకు మేమేమీ స్కూలు పిల్లలం కాదు. ధన్‌ఖడ్ మాటతీరుతో చాలా కలత చెందాను. అధికార పక్ష సభ్యులు నిండు సభలో మా పట్ల అమర్యాదకరమైన మాటలు వాడుతున్నారు’’ అని ఆరోపించారు.87 మంది ఎంపీల సంతకాలుఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు నోటీస్‌పై 87 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. ‘‘నోటీసు ఎప్పుడివ్వాలో త్వరలో నిర్ణయిస్తాం. ఇది తీర్మానం దాకా వెళ్లకపోయినా, చైర్మన్‌గా ధన్‌ఖడ్ అనుసరిస్తున్న ఏకపక్ష పోకడలను దేశ ప్రజల ముందు ఎత్తి చూపడమే మా ఉద్దేశం’’ అని విపక్షాలు స్పష్టం చేశాయి.ముందస్తు నోటీసు తప్పనిసరి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 67(బి) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలని కోరుతూ మహాభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తే తీర్మానం నెగ్గి ఆయన పదవీచ్యుతుడవుతారు. అయితే మహాభిశంసన కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామంటూ కనీసం 14 రోజుల ముందస్తు నోటీసివ్వడం తప్పనిసరి. -
ధన్‌ఖర్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి తీర్మానం?
న్యూఢిల్లీ : భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ తీరును విమర్శిస్తూ విపక్ష పార్టీల 'ఇండియా' కూటమిలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఛైర్మన్ పదవి నుంచి ధన్‌ఖర్‌ను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బి) ప్రకారం.. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ) తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ పదవి నుండి తొలగించవచ్చు అని ఇండియా కూటమి పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టికల్ 67(బీ) అనుగుణంగా ధన్ఖర్పై చర్య తీసుకోవాలనే ప్రతిపాదనపై 87 మంది సభ్యులు సంతకం చేసినట్లు ప్రతిపక్ష పార్టీ నేతలు చెబుతున్నాయి. రెండ్రోజుల క్రితమే విపక్షాలు ధనఖర్‌ను తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాయని రాజ్యసభలో అధికార పక్ష నేత జేపీ నడ్డాకు సమాచారం అందిందని జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి.ప్రతిపక్ష నాయకులు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేయడం, అమర్యాదగా మాట్లాడడం వంటి అంశాలను ఎత్తి చూపుతూ ధన్‌ఖర్‌కు వ్యతిరేకంగా తీర్మానించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విపక్ష పార్టీ నేతలు మాత్రం సభను నిబంధనల ప్రకారం నడపాలని కోరుకుంటున్నాయని, సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆ వర్గాలు తెలిపాయి.రాజ్యసభ ఛైర్మన్ ధన్ఖర్ సభను ఏకపక్షంగా నడుపుతున్నారని, ప్రతిపక్షంపై పక్షపాత వైఖరని ప్రదర్శిస్తున్నారంటూ కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు శుక్రవారం సభలో ఆందోళన చేపట్టాయి. ఆమోదయోగ్యం కాని విధంగా సభలోని సభ్యుల్ని అగౌరపరుస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ.. ఎగువ సభలో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ధన్ఖర్ ఇవ్వడం లేదని పేర్కొన్నాయి. ఈ తరుణంలో రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యారు. -
‘జయా అమితాబ్ బచ్చన్’ వివాదం.. రాజ్యసభలో విపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: ‘జయా అమితాబ్ బచ్చన్’ ప్రస్తావన రాజ్యసభలో మరోసారి గందరగోళాన్ని సృష్టించింది. సమాజ్‌వాదీ ఎంపీ అయిన జయా బచ్చన్‌ను రాజ్యసభలో శుక్రవారం చైర్మన్ జగదీప్ ధన్ఖర్ జయా అమితాబ్ బచ్చన్‌గా సంబోధించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటికే జయా బచ్చన్నుఇప్పటికే రెండు సార్లు ఆ పేరుతో పిలవడం వల్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు మరోసారి ఇదే తంతు పునరావృతం కావడంతో జయా బచ్చన్ అసహనానికి గురయ్యారు. మరోసారి అలా పిలవొద్దని అన్నారు. దీనిపై దన్ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘నాకు పాఠాలు బోధించవద్దు’ అని తీవ్రంగా స్పందించారు. అయితే ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేయడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఛైర్మన్ వైఖరిని నిరసిస్తూ విపక్ష ఎంపీలంతా వాకౌట్ చేశాయి. జయా బచ్చన్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. వాకౌట్ తర్వాత జయా బచ్చన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇది అవమానకరమైన అనుభవమని తెలిపారు. అధికార బీజేపీ నేతలు ప్రతిపక్ష ఎంపీల పట్ల వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. ‘ చైర్మన్ ఏదీ మాట్లాడిన చెల్లుతుందా? ఆయన కూడా మనలంటి ఎంపీనే. ఛైర్మన్ ఉపయోగించిన స్వరాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మేం స్కూల్ పిల్లలం కాదు. మాలో కొందరు సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారు.ప్రతిపక్ష నేత (కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే) మాట్లాడేందుకు నిల్చున్న సమయంలో ఆయన మాట తీరు బాధించింది. మైక్ కట్ చేశారు. అలా ఎలా ప్రవర్తిస్తారు? మీరు సెలబ్రిటీ అయితే ఏంటి నేను పట్టించుకోనంటూ తీవ్ర పదజాలం వాడుతుంటారు. ఆయన పట్టించుకోవాలని నేను అడగడం లేదు. ఐదోసారి నేను రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. నాకు తెలీదా ఏం మాట్లాడాలో..? ఇలాంటి ప్రవర్తన పార్లమెంట్లో ఎన్నడూ చూడలేదు. ఆయన మాట్లాడిన తీరు మహిళలకు అగౌరపరిచేలా ఉంది. దీనిపై క్షమాపణలు చెప్పాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఆమె వెంట సోనియా గాంధీ కూడా ఉన్నారు.కాగా ఇటీవల రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్.. ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వానించారు. దీనిపై జయాబచ్చన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘జయా బచ్చన్ అంటే సరిపోతుంది’ అంటూ పేర్కొన్నారు. ‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’ అంటూ చెప్పగా.. ‘మహిళలను వారి భర్త పేరుతోనే పిలస్తారా, వారికంటూ స్వతహాగా గుర్తింపు లేదా’ అంటూ మండిపడ్డారు. అనంతరం గత సోమవారం కూడా జయా అమితాబ్ బచ్చన్ అని సంభోధించారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ.. జయా బచ్చన్ అని సంబోధిస్తే సరిపోతుందని అన్నారు.పార్లమెంట్ నిరవధిక వాయిదాపార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. -
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు అంశం పట్ల రాజ్యసభలో అలజడి రేగింది. ప్రతిపక్ష సభ్యులు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. వినేశ్ ఫోగాట్ అంశంపై సభలో చర్చించేందుకు చైర్మన్ అనుమతి ఇవ్వకపోవడంపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జగదీప్ ధన్‌ఖడ్ సభ నుంచి వెళ్లిపోయారు. ఎగువ సభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. వినేశ్ ఫోగాట్‌పై అనర్హత అంశంపై తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. అందుకు ధన్‌ఖడ్ అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. డెరెక్ ఓబ్రెయిన్‌తోపాటు విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండడంతో సభలో గందరగోళం నెలకొంది. ఫోగాట్‌పై చర్చించేందుకు ధన్‌ఖడ్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. విపక్ష ఎంపీల తీరు పట్ల ధన్‌ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఉండలేనని చెప్పారు. భారమైన హృదయంతో సభ నుంచి నిష్కృమిస్తున్నానని తెలిపారు. -
రాజ్యసభకు వినేశ్ ఫోగట్?
ఢిల్లీ: ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పండింది. ఈ క్రమంలో ఆమెకు దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు అండగా నిలిచారు. ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ వినేశ్ అనర్హత అంశంపై పార్లమెంట్లో చర్చ జరపాలని పట్టుపట్టాయి. తాజాగా వినేశ్ ఫోగట్ అనర్హత మాజీ హర్యానా సీఎం భూపేందర్ సింగ్ హూడా స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజ్యసభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం ఉంటే వినేశ్ పేరును ప్రతిపాదించేవాడిని. ఆమె మనందిరికీ చాలా గర్వకారణం’’ అని అన్నారు. మరోవైపు.. భూపేంద్ర సింగ్ హూడా తనయుడు ప్రస్తుత కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ దీపేందర్ హూడా సైతం స్పందిస్తూ.. రాజ్యసభలో ఒక సీట్ ఖాళీ కాబోతోందని, దానికి ఫోగట్‌ను నామినేట్ చేస్తామని అన్నారు. ఆమె ఓడిపోలేదని, మన అందిరి మనసులు గెలిచిందన్నారు.అయితే కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై వినేశ్ ఫోగట్ పెద్దనాన్న మహవీర్ ఫోగట్ స్పందించారు. వారి మాటలు ఒక పోలిటికల్ స్టంట్ అని అన్నారు. భూపేందర్ సింగ్ హూడా హర్యానా సీఎంగా ఉన్న సమయంలో తన కూతురు గీతా ఫోగట్ సైతం పలు పతకాలు సాధించిందని, కానీ ఆమెను రాజ్యసభకు పంపలేదని అన్నారు. మెజార్టీ ఉంటే వినేశ్‌ను రాజ్యసభకు పంపేవాడినని భూపీందర్ హుడా ఇప్పుడు అంటున్నారు. మరీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు గీతా ఫోగట్‌ను ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు మాటాలు పొలిటికల్ స్టంట్ మాత్రమేనని అన్నారు. -
మధ్యతరగతిపై పన్నుల భారాన్ని తగ్గించాలి: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: రకరకాల పన్నులతో ప్రజలపై భారం మోపడమే తప్ప.. వాళ్లకు ఒనగూరుతోంది ఏంటని? వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘‘ఓవైపు ఆదాయపన్ను, మరోవైపు జిఎస్టి, ఇంకోవైపు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వేస్తున్నారు. కానీ ఈ పన్నులతో ప్రజలకు ఒనగురుతున్నది ఏంటి?. కేవలం రోడ్లు భవనాలు నిర్మిస్తున్నామంటే సరిపోదు. మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలి. అదే సమయంలో తగిన ప్రోత్సాహకాలు అందించాలి’’ అని ప్రసంగించారు.‘‘పెన్షన్‌పై ఎలాంటి పన్నులు వేయవద్దు. లక్ష రూపాయల వరకు పెన్షన్లు టాక్స్ ఫ్రీ చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే.. సీనియర్ సిటిజన్లో కోసం ఐటీ ఫైలింగ్ కోసం ప్రత్యేక సహాయ యంత్రంగా ఏర్పాటు చేయాలి. పీపీఎఫ్ వడ్డీరేట్లు, ఎఫ్డీ రేట్లకంటే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే పీపీఎఫ్ వడ్డీ రేట్లు పెంచాలి పొదుపును ప్రోత్సహించాలి. సరైన సమయంలో ఆదాయ పన్ను ఫైల్ చేసిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి’’ అని కేంద్రాన్ని కోరారాయన. వీటితో పాటు.. తక్కువ వడ్డీకే వాయిదాలు చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని, వ్యవసాయ రంగానికి తగిన ప్రోత్సాహకాలు, నిధులు ఇవ్వాలని, అలాగే.. వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీని తగ్గించాలి అని ఆయన వైఎస్సార్సీపీ తరఫున కేంద్రాన్ని కోరారు. -
బంగ్లాదేశ్ పరిస్థితులను గమనిస్తున్నాం: కేంద్ర మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పరిణామాలపై రాజ్యసభలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ఢాకాలోని భారత్ దౌత్య కార్యాలయం ద్వారా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.బంగ్లాదేశ్‌లో 19,000 మంది భారతీయులు ఉన్నారని జైశంకర్ వెల్లడించారు. వీరిలో 8,000 మంది విద్యార్థులు ఇప్పటికే భారత్ చేరుకున్నారని తెలిపారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీల వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయని, మైనార్టీల రక్షణకు అక్కడున్న సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఢాకాలోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు.‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.ఆమె షార్ట్ నోటీసుతో ఇండియాకు వచ్చారు. బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో భారతీయ యువకులు వెనక్కి రావాలనుకుంటున్నారు. భారతీయ యువకులను వెనక్కి రప్పించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. బంగ్లాదేశ్‌లోని భారతీయులు, మైనారిటీల భద్రతపై అక్కడి ఆర్మీతో మేము టచ్‌లో ఉన్నాం. అక్కడి శాంతి భద్రతనలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం’ అని తెలిపారు -
‘జయా అమితాబ్ బచ్చన్’.. సమాజ్‌వాదీ ఎంపీ మరోసారి అభ్యంతరం
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆమెను ‘జయా అమితాబ్ బచ్చన్’ అంటూ పూర్తి పేరుతో సంబోధించడంపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కొత్త డ్రామా ప్రారంభించారంటూ జయా బచ్చన్ మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమితాబ్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నా. ఆయనతో నా వివాహం, భర్తతో ఉన్న అనుబంధాన్ని చూసి గర్వపడుతున్నా.. నా భర్త పాధించిన విజయాలపై సంతోషంగా, గర్వంగానూ ఉంది. కానీ నన్ను కేవలంజయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుంది. మహిళలకు సొంత గౌరవం అంటూ లేేదా? మీరందరూ ప్రారంభించిన కొత్త డ్రామా ఇది. ఇంతకు ముందు ఇలా జరిగేది కాదు’ అని జయా బచ్చన్ పేర్కొన్నారు.అయితే దీనిపై ఉపరాష్ట్రపతి ధన్ఖర్ స్పందిస్తూ.. ఎన్నికల సర్టిఫికెట్లో పేరు అలాగే ఉందని, కావాలంటే తన పేరును మార్చుకునే నిబంధన కూడా ఉందని తెలిపారు. ‘అమితాబ్ బచ్చన్ సాధించిన విజయాలకు దేశమంతా గర్విస్తోంది. ‘ఎన్నికల సర్టిఫికేట్లో కనిపించే పేరునే మేము ఉపయోగిస్తున్నాం. మీరు కావాలంటే పేరు మార్చుకోవచ్చు. దాని కోసం నిబంధన కూడా ఉంది’ అని పేర్కొన్నారు.కాగా జయాబచ్చన్ తన పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదేం తొలిసారి కాదు. జూలై 29న సభా కార్యక్రమాల్లో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ‘జయ అమితాబ్ బచ్చన్’ అని సంబోధించడంపై అసహనానికి లోనయ్యారు. తనను కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందన్నారు. అయితే, ఇలా తనను భర్త పేరుతో కలిపి పిలవడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన రోజుల వ్యవధిలోనే ఆమె అదే పేరుతో తనను పరిచయం చేసుకుని రాజ్యసభలో శుక్రవారం కాసేపు సరదాగా నవ్వులు పూయించారు. -
రాజ్యసభలో అమితాబ్ ప్రస్తావన.. పగలబడి నవ్విన ఛైర్మన్
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలో భాగంగా రాజ్యసభలో శుక్రవారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించింది. సభలో తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో ఆమె తన భర్త అమితాబ్ పేరును ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పగలబడి నవ్వారు. సభలో మిగిలిన ఎంపీలు నవ్వుతూ కనిపించారు. అయితే సోమవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్.. ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వాహించాగా.. ఆమె అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. తనను ‘‘జయా బచ్చన్ అంటే సరిపోతుంది’’ అంటూ పేర్కొన్నారు. దానికి బదులుగా డిప్యూటీ ఛైర్మన్ స్పందిస్తూ.. ‘‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’అంటూ చెప్పారు. దానికి ఆమె స్పందిస్తూ మహిళలకు సొంతంగా గుర్తింపు లేదా’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.Watch 🔥 🔥 🔥Vice-president Jagdeep Dhankhar Ji enjoying the meltdown with his witty relies.🤣🤣🤣🤣🤣 pic.twitter.com/N6SMykvQg0— Alok (@alokdubey1408) August 2, 2024 ఈ నేపథ్యంలో శుక్రవారం జయా బచ్చన్ మాట్లాడుతూ.. తనను తాను జయా అమితాబ్ బచ్చన్‌గా పేర్కొనడంతో సభలో నవ్వులు విరిశాయి. ఆమె అబితాబ్ ప్రస్తావన తీసుకురాగనే జగదీప్ ధన్‌ఖడ్ పగలబడి నవ్వారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘మీరు ఇవాళ భోజనం చేసినట్లు లేదు. అందుకే కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన పేరు ప్రస్తావించకుంటే మీకు ఆహారం అరగదేమో’అంటూ చమత్కరించారు. దానికి ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సైతం అంతే సరదాగా సమాధానం ఇచ్చారు. ‘వాస్తవానికి బ్రేక్ సమయంలో లంచ్ చేయలేదు. తర్వాత జైరాంతో కలిసి భోజనం చేశాను’అంటూ సమాధానం ఇవ్వడంతో సభలో నవ్వులు విరిశాయి. -
రైళ్లలో అందుబాటులోకి బేబీ బెర్తులు: మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: రైళ్లలో బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో శుక్రవారం(ఆగస్టు2) వెల్లడించారు. రైల్వే కోచ్‌లలో బేబీ బెర్త్‌లను అమర్చే ఆలోచన ఉందా అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ సమాధానమిచ్చారు. లక్నో మెయిల్లో రెండు బేబీ బెర్త్‌లను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకువచ్చామన్నారు.మెయిల్లోని ఒక బోగీలో రెండు లోయర్ బెర్త్‌లకు బేబీ బెర్త్‌లను అమర్చామని తెలిపారు. దీనిపై ప్రయాణికుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. అయితే సీట్ల వద్ద సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గిపోవడం లాంటి సమస్యలొచ్చాయన్నారు. అయితే ప్రయాణికుల కోచ్‌లలో మార్పులు చేయడమనేది నిరంత ప్రక్రియ అని మంత్రి అన్నారు. కాగా,రైళ్లలో లోయర్ బెర్త్‌లకు అనుబంధంగా ఉండే బేబీ బెర్త్‌లపై తల్లులు తమ పిల్లలను పడుకోబెట్టుకోవచ్చు. దీనివల్ల ఒకే బెర్త్‌పై స్థలం సరిపోక ఇబ్బందిపడే బాధ తల్లిపిల్లలకు తప్పుతుంది. -
ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గించాలి: ఆప్ ఎంపీ
న్యూఢిల్లీ: దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాజ్యసభలో అత్యంత పిన్న వయస్కుడైన చద్దా గురువారం మాట్లాడుతూ.. యువ భారత్‌కు యువ రాజకీయ నాయకులు ఎంతో అవసరమని తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభాలో 65 శాతం ప్రజలు 35 సంవత్సరాలలోపే ఉన్నారని పేర్కొన్నారు. జనాభాలో 50 శాతం మంది ప్రజలు 25 ఏళ్ల లోపువారే ఉన్నారని చెప్పారు. ‘‘యువ భారతం మనది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే 25 ఏళ్లు ఉండాలనే నిబంధన ప్రస్తుత కాలానికి సరిపోదు. ప్రస్తుతం దేశ జనాభాలో 50 శాతం మంది ప్రజలు 25 ఏళ్ల లోపువారే ఉన్నారు. ఇక 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారే. దేశానికి స్వాతంత్రం వచ్చాక తొలిసారి లోక్‌సభ ఎన్నికైనప్పుడు 26 శాతం మంది సభ్యులు 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారే.ఇక రెండు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 40 ఏళ్లలోపు వారు కేవలం 12 శాతం మంది మాత్రమే ఎన్నికయ్యారు. యువ భారత్‌కు యువ రాజకీయ నాయకులు ఎంతో అవసరం. అందుకే ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలి. ఇదే కేంద్ర ప్రభుత్వానికి నా సూచన. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను’ అని రాఘవ్ చద్దా అన్నారు. #WATCH | In Rajya Sabha, AAP MP Raghav Chadha demands the minimum age for contesting elections in India should be reduced from 25 years to 21 years. He says "India is one of the youngest countries in the world. 65% of our population is less than 35 years old and 50% of our… pic.twitter.com/NjL8p2Qjmb— ANI (@ANI) August 1, 2024 -
రాష్ట్ర సమస్యలపై రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రసంగం
-
విశాఖలో మెట్రో రైలు నిర్మించాలి.. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్
సాక్షి, ఢిల్లీ: విశాఖలో మెట్రో రైలు నిర్మించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన రాజ్యసభలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై జరిగిన చర్చలో మాట్లాడుతూ విశాఖపట్నంలో 76.9 కిలోమీటర్ల లైట్ మెట్రో నిర్మించాలని నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పునర్విభజన చట్టంలో "సాధ్యమైతే, అవకాశం ఉంటే" అనే పదాలు ఉపయోగించడం వల్ల ఏపీకి నష్టం జరిగిందన్నారు. బడ్జెట్లో రూ. 24వేల కోట్ల రూపాయలు మెట్రో రైలుకు కేటాయిస్తే, విశాఖకు మాత్రం ఒక్క రూపాయి కేటాయించలేదని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కేంద్ర ప్రభుత్వం విశాఖలో మెట్రో రైలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి వర్షానికి పార్లమెంటు ఆవరణలోనే మోకాలు లోతు నీరు ప్రవహించింది. డ్రైన్ల పూడిక తీయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వెంటనే డ్రైనేజీలు, మౌలిక వసతులను మెరుగుపరచాలి. సింధులోయ నాగరికత సమయంలోనే అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థలు నిర్మించగలిగారు. ఇప్పుడు సరైన డ్రైనేజీ వ్యవస్థను ఎందుకు నిర్మించలేకపోతున్నారు?’’ అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.నగరాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుచాలి. అల్పాదాయ వర్గాలలో 90 శాతం మందికి ఇళ్లు లేవు. దీనివల్ల మురికివాడలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జనాభా లెక్కలు చేపట్టాలి. నగరాల్లో 17 శాతం మురికివాడలు ఉన్నాయి. మురికివాడలలో బహుళ అంతస్తులు భవనాలు నిర్మించాలి. నగరాలలో ఉపాధి కల్పన పెంచాలి. మురికివాడలలో పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా ముందుకు తీసుకెళ్లాలి’’ అని రాజ్యసభలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
రాజ్యసభలో ఖర్గే భావోద్వేగం.. ‘ఆ వ్యాఖ్యలు తొలగించాలి’..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం రాజ్యసభలో భావోద్వేగానికి గురయ్యారు. తన రాకీయ జీవితంపై బీజేపీ ఎంపీ ఘనశ్యామ్ తివారీ సభలో మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకించారు. తన కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉందని ఘన శ్యామ్ తివారీ అన్నారని, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని సభాపతిని కోరారు. అయితే ఖర్గే మాటలకు సభ ఛైర్మన్ జదగీప్ ధన్ఖర్ స్పందించారు. ఖర్గేను బాదపెట్టిన ఏ పదం రికాల్లో ఉండదని హామీ ఇచ్చారు. మరోవైపు ఖర్గే మా ట్లాడుతూ.. తమ కుటుంబంలో తానే మొదటితరం రాజకీయ నాయకుడినని తెలిపారు. యువకుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్‌లో చేరడంతో తన రాజకీయ జీవితం ప్రారంభమయ్యిందని అన్నారు. తాను చేపట్టిన వివిధ పదవుల గురించి ఆయన వివరించారు.అయితే తన తండ్రి 85 ఏ ళ్ల వయసులో మరణించాడని ఖర్గే తెలపగా.. దీనికి చైర్మన్ స్పందిస్తూ.. తన తండ్రి కంటే ఎక్కువ సంత్సరాలు ఖర్గే జీవించాలని ఆకాంక్షించారు. అయితే ఈ వాతావరణంలో ఎక్కువ కాలం జీవించాలనే కోరిక తనకు లేదని ఖర్గే బదులిచ్చారు.అనంతరం తివారీ మాట్లాడిన సమయంలో తాను సభలోనే ఉన్నానని, బీజేపీ నేత తప్పుగా ఉద్దేశించి మాట్లాడినట్లు తాను భావించడం లేదని అన్నారు. రికార్డులను సూక్ష్మంగా పరిశీలించి, అటువంటి వ్యాఖ్యలు ఉంటే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు. -
Wayanad Landslides: కేరళను ముందుగానే హెచ్చరించాం, కానీ: అమిత్ షా
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు అతీతంగా కేరళ ప్రజలు, ప్రభుత్వానికి ప్రధాని మోదీ అండగా ఉంటారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై రాజ్యసభలో అమిత్‌షా మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం జులై 23నే హెచ్చరించిందని పేర్కొన్నారు.వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడానికి వారం రోజుల ముందు పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించిందని, దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన కేంద్రం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపిందని పేర్కొన్నారు. అయితే సకాలంలో ప్రజలను తరలించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని అన్నారుఅయితే ప్రకృతి వైపరీత్యాల గురించి కనీసం ఏడు రోజుల ముందుగానే హెచ్చరికలు ఇవ్వగల దేశాలలో భారత్ ఒకటని అన్నారు. ఒకవేళ ఎన్డిఆర్ఎఫ్ బృందాల రాకతో కేరళ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఉంటే కొండచరియలు విరిగిపడటంతో మరణాలను తగ్గించవచ్చని షా అన్నారు. వయనాడ్ దుర్ఘటనను ఎదుర్కొనేందుకు నరంద్ర మోదీ.. కేరళ ప్రభుత్వం, ప్రజలకు మద్దతుగా ఉన్నారని అన్నారు. మంగళవారం రాత్రి వాయనాడ్‌లో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ పర్యటించారని, ప్రధాని మోదీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు.కాగా కేరళలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో మంగళవారం వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇప్పటి వరకు 158 మందికి పైగా మరణించారు, మరో 200 మంది గాయపడ్డారు. ఇక 180 మంది గల్లంతవ్వగా వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
భర్త పేరుతో పిలవటంపై ఎంపీ జయా బచ్చన్ అసహనం
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో సోమవారం సీనియర్ నటీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను భర్తతో పేరుతో కాకుండా జయా బచ్చన్ అని పిలిస్తే చాలని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌తో అన్నారు. సోమవారం రాజ్యసభలో ఎస్పీ రాజ్యసభ సభ్యురాలైన ఆమెను మాట్లాడావల్సిందిగా రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్.. ‘శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ జీ, ప్లీజ్’ అని కోరుతారు. అయితే స్పీకర్ పూర్తి పేరుతో పిలవడంపై జయా బచ్చన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను జయా బచ్చన్ అని పిలిస్తే చాలని ఆమె స్పీకర్‌కు బదులు ఇచ్చారు. అయితే దీనిపై డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ.. మీపేరు పార్లమెంట్ రికార్డుల్లో అధికారికంగా జయా అమితాబ్ బచ్చన్ అని ఉందని తెలిపారు. పార్లమెంట్ రికార్డుల్లో ఎలా రాసిఉందో.. అలాగే తాను పిలిచినట్లు డిప్యూటీ స్పీకర్ అన్నారు. అయినప్పటికీ జయా బచ్చన్ అభ్యంతం తెలిపారు. ‘‘ఇది చాలా కొత్తగా ఉంది. మహిళలను వారి భర్తలపేరుతో గుర్తించటం. భర్త పేరు లేకుండా గుర్తించడానికి మహిళలకు వారి సొంతం ఉనికి, సాధించిన విజయాలు ఉండవా?’’ అని ఆమె అన్నారు.Watch: "It's a very painful incident and we should not bring politics into the matter," says Samajwadi Party MP Jaya Bachchan on the death of the UPSC student in Old Rajinder Nagar pic.twitter.com/4928QcZoNS— IANS (@ians_india) July 29, 2024అనంతరం ఆమె ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లోకి వరదనీరు పోటెత్తటంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటనపై మాట్లాడారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం. ఈ విషయంలో రాజకీయలను తీసుకురాము’ అని జయా బచ్చన్ అన్నారు. -
కోచింగ్ సెంటర్లు వ్యాపారంగా మారిపోయాయి: రాజ్యసభ ఛైర్మన్
‘కోచింగ్ వ్యవస్థ పూర్తిగా వాణిజ్యంగా మారింది. ఎప్పుడూ వార్తాపత్రికలను చదువుదాం అని తెరిచిన ప్రతిసారీ ముందు ఒకటి రెండు పేజీల్లో వారి ప్రకటనలే కనిపిస్తాయి’ అంటూ అని ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో వరదనీటిలో మునిగి యూపీఎస్సీ అభ్యర్థులు మరణించిన ఘటనను ఉద్దేశిస్తూ సోమవారం రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ దుర్ఘటనపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు పిలుపునివ్వడం సముచితమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై తన ఛాంబర్లో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తానని ఉపరాష్ట్రపతి ధన్కర్ తెలిపారు. కాగా ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ సహా ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్‌ను స్టోర్ రూమ్, పార్కింగుకు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. -
Parliament: కోచింగ్ వ్యాపారంగా మారిపోయింది: రాజ్యసభ చైర్మన్
Updatesరావూస్ సివిల్స్ సెంటర్ ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లోక్‌సభలో మాట్లాడారు. ఈ ఘటన జరగటం చాలా విషాదకరం.ఒక తెలివైన అభ్యర్థి సివిల్స్ సాధించి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి వస్తారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు చాలా కలలు కంటారు. కానీ, ఇలాంటి ఘటనలు వారి హృదాయాన్ని ముక్కలు చేస్తాయి. నష్టపరిహాం ఇచ్చే విషయమే అయినా.. ఎంత నష్టం పరిహారం ఇచ్చినా అభ్యర్థులు కోల్పోయిన జీవితానికి తిరిగి ఇవ్వలేం. ఇటవంటి ఘటనలు జరగకుండా పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. భవనం కోడ్లు, అగ్నిమాపక భద్రత, వరద భద్రత వంటి విషయాల్లో ప్రాథమిక నిబంధనల ఉల్లంఘిస్తున్నారు.#WATCH | Speaking about the Old Rajinder Nagar incident, in Lok Sabha, Congress MP Shashi Tharoor says, "It's a shocking situation and I have to say that when you have a brilliant student all the dreams of serving the nation through the UPSC exam have been shattered and the hopes… pic.twitter.com/gAv9wTJGsu— ANI (@ANI) July 29, 2024 రావూస్ సివిల్స్ సెంటర్ ప్రమాదంపై ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో మాట్లాడారు. ఈ ఘటన జరగటం చాలా బాధాకరం. ఈ ఘటనకు ప్లాన్, ఎన్ఓసీ ఇచ్చిన అధికారులే బాధ్యత వహించాలి. దీనంతటికీ అసలు ఎవరు బాధ్యత వహిస్తారు. అధికారులుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం ఒకే అక్రమం భవనం కాదు. యూపీలో అక్రమ భవనాలను బుల్డోజర్తో కూల్చటం చూస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం ఢిల్లీలో బుల్డోజర్తో చర్యలు చేపడుతుందా? లేదా?అని ప్రశ్నించారు.#WATCH | Old Rajinder Nagar incident | "It's a painful incident. It's the responsibility of the officers to plan and provide NOCs, the question is who all are responsible and what actions are being taken against them. It's not just a single case of illegal building, we are seeing… pic.twitter.com/JH7gXphzGg— ANI (@ANI) July 29, 2024 ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ ఘటనపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ భానుశ్రీ స్వరాజ్ మాట్లాడారు. సివిల్స్ ప్రివేర్ అవుదామని ఢిల్లీకి వచ్చిన అభ్యర్థుల మృతికి ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఆమ్ ఆద్మీ పార్టీ పాలన యంత్రాంగం నిర్లక్ష్యంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు. వరదల విషయంలో రాజేంద్ర నగర్ ప్రాంత ప్రజలు ఎన్నొసార్లు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ఆయన చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై హోం మంత్రిత్వ శాఖ ఓ కమిటి ఏర్పాటు చేసిన దర్యాప్తు చేయలని కోరుతున్నా.#WATCH | Speaking about the Old Rajinder Nagar incident, in Lok Sabha, BJP MP Bansuri Swaraj says, "...Those students were in Delhi for the preparation of IAS examinations, but sadly I have to say that due to criminal negligence of Delhi govt, those students have lost their… pic.twitter.com/2alk7SPBDH— ANI (@ANI) July 29, 2024రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడారు. నాకు రూల్ 267 కింద నోటీసులు అందాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల విషాద మరణంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.‘‘కోచింగ్ సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయి. ఎప్పుడు న్యూస్ పేపర్ చదువుదామని తెరిచినా రెండు పేజీలు ఈ సంస్థల ప్రకటనలే ఉంటాయి. ఈ అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ సముచితమని భావిస్తున్నాం. దీనిపై అన్ని పక్షాలతో కలిపి ఇన్‌ఛాంబర్ మీటింగ్ ఏర్పాటుచేయాలి’’ అని ధన్‌ఖడ్ అన్నారు. #WATCH | Delhi's Old Rajinder Nagar incident | Rajya Sabha to have a discussion on the death of 3 UPSC aspirants. Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, "I have received notices under Rule 267...They have demanded a discussion on the tragic death of UPSC… pic.twitter.com/MyEezLrlKh— ANI (@ANI) July 29, 2024రాజ్యసభలో శివసేన(యూబీటీ) పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ నోటీసులు ఇచ్చారు. మహారాష్ట్రలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు.Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi gives Suspension of Business notice under Rule 267 in Rajya Sabha, over alleged rampant corruption in infrastructure projects in Maharashtra. pic.twitter.com/VS3wL6XRXO— ANI (@ANI) July 29, 2024 ఢిల్లీ రావూస్ ఘటనపై దద్దరిల్లనున్న పార్లమెంట్కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అమర్ సింగ్ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని, సభలో వివరణ ఇవ్వాలని కోరారాయన. Congress MP Dr Amar Singh moves Adjournment Motion in Lok Sabha 'demanding accountability for death of IAS aspirants in Delhi’s coaching centre' pic.twitter.com/4k1cdh4nB9— ANI (@ANI) July 29, 2024 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో జమ్ము కశ్మీర్ అప్రోప్రియేషన్ (నం 3) బిల్లును ఇవాళ ప్రవేశపెట్టనున్నారుNirmala Sitharaman to move J-K Appropriation (No 3) Bill in Lok Sabha; Budget discussion to continue in Parliament todayRead @ANI Story | https://t.co/WKrumWYWrp#BudgetSession #NirmalaSitharaman #LokSabha pic.twitter.com/zDkjVNcTpA— ANI Digital (@ani_digital) July 29, 2024 కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చైనాతో సరిహద్దు పరిస్థితి, భారీ వాణిజ్య లోటుపై చర్చను డిమాండ్ చేశారు.#ParliamentMonsoonSession | Congress MP Manish Tewari gives adjournment motion notice in Lok Sabha, demands discussion on "the border situation and huge trade deficit with China." pic.twitter.com/G7VJolxgx0— ANI (@ANI) July 29, 2024 నేడు లోక్‌సభ, రాజ్యసభ బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై చర్చలో ఇవాళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. జూలై 22న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. -
ఇల్లమ్మితే... బోలెడు నష్టం!
కేంద్ర బడ్జెట్ 2024లో ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మండిపడ్డారు. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగిస్తే.. రియల్ ఎస్టేట్‌లో భారీగా నల్లధనం వచ్చి చేరుతుంది. కాబట్టి దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రోత్సహించారు. అయితే ఇప్పుడు ఇండెక్సేషన్‌ను తొలగించడం ద్వారా పెట్టుబడిదారీ వర్గం వెనుకడుగు వేస్తుంది. ఇండెక్సేషన్‌ను తీసివేయడం అంటే పన్ను విధించడం కాదు.. పెట్టుబడిదారులకు జరిమానా విధించడంతో సమానం అని అన్నారు.2024 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన ప్రతిపాదనలో పాత ఆస్తులను విక్రయించే వ్యక్తులు అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుందని రాఘవ్ చద్దా తెలిపారు.బడ్జెట్లో, ప్రభుత్వం స్థిరాస్తులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. అయితే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయడానికి ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించింది. ఇండెక్సేషన్‌ను పునరుద్దరించకపోతే.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు తగ్గుతాయి, ప్రజలు తమకు నచ్చిన డ్రీమ్ హోమ్‌లను కొనుగోలు చేయడం సాధ్యం కాదని చద్దా అన్నారు.ఇండెక్సేషన్ అనేది బాండ్లు, స్టాక్‌లు, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడులను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేసే పద్ధతి. సాధారణంగా ఇందులో పెట్టుబడి ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఉంటాయి. అయితే ద్రవ్యోల్బణం వల్ల వాస్తవ పెట్టుబడి విలువ తగ్గిపోతుంది. ఈ సమయంలో అప్పటికి ఉన్న ధరలకు అనుకూలంగా అడ్జస్ట్ చేయడానికి ఇండెక్సేషన్ ఉపయోగపడుతుంది.Removal of ‘Indexation’ benefit from the Investor is a grave mistake by the Government. I explain in detail. Please watch. pic.twitter.com/AhB7vViy0n— Raghav Chadha (@raghav_chadha) July 25, 2024 -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: ఎంపీ నిరంజన్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఇప్పటికైనా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి. పార్లమెంట్ వేదికగా అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.కాగా, రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..‘ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామన్న కేంద్ర ప్రభుత్వం.. ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకోవాలి. రాజ్యసభలో నాటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఈ హామీని నిలబెట్టుకోవాలి. అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చారు . ఏపీకి ఇచ్చిన హామీ అమలు చేయకుంటే రేపు వేరే రాష్ట్రానికి ఇదే పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం.. నగరాల అభివృద్ధి ప్రణాళిక లోపభూయిష్టంగా ఉంది. ఏఐ వల్ల అనేక ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. అయితే, ఏఐ నేర్చుకుంటే పెద్ద ఎత్తున కొత్త అవకాశాలు వస్తాయి. ఏఐ టెక్నాలజీలో యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే, ‘కేంద్ర బడ్జెట్ ప్రజాకర్షకంగా కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రవేశపెట్టారు. ప్రైవేటు పెట్టుబడులు పెద్దగా రావడం లేదు. జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ వల్ల పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు. పన్ను కట్టలేదని పెట్టుబడిదారులను జీఎస్టీ అధికారులు ఇబ్బందిపెడుతున్నారు. ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తున్న పెట్టుబడిదారుల పట్ల జీఎస్టీ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడిదారుల పట్ల అనుచితంగా వ్యవహరించవద్దు. పెట్టుబడిదారుల్లోభయాన్ని తొలగించాలి. అధికారుల వేధింపుల వల్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. దీంతో, రియల్ ఎస్టేట్ షేర్లలో వారు పెట్టుబడి పెడుతున్నారు. దాని వల్ల దేశానికి జీడీపీకి పెద్దగా ఉపయోగం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఏపీకి విషమ కాలం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది ఏమీ లేనప్పటికీ, రూ.48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించార న్నట్లుగా ఎన్డీఏతో పాటు ఇండియా కూటమి సభ్యు లు ప్రచారం చేయడం శోచనీయమని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆ రెండు కూటముల నేతలను ఏపీ సీఎం చంద్రబాబు తన గారడీతో బుట్టలో వేసుకుని, ఇలా మాట్లాడి స్తున్నారని చెప్పారు.కేంద్ర బడ్జెట్‌పై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మా ట్లాడుతూ.. ఇది భారత దేశానికి అమృత్కాల్ కా వచ్చు కానీ, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం విషమ కాల మని అభివర్ణించారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని నిధులు వేటికి కేటాయించారో కేంద్రం, ఆర్థిక శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ, బీహార్‌లో అధికారంలో ఉన్న భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూల ద్వారానే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు.బీహార్‌లో మళ్లీ అధికారంలోకి రావాలన్న ఉద్దే శంతోనే ఆ రాష్ట్రానికి నిధులిచ్చారని, ఏపీలో ఇప్ప టికే అధికారంలో ఉండడంతో కేటాయింపులు జరగలేదన్నారు. బీహార్‌లో రహదారులకు రూ.26 వేల కోట్లు గ్రాంట్‌గా ఇచ్చి, ఆంధ్రప్రదేశ్‌లో అమ రావతికి ఇస్తామన్న రూ.15 వేల కోట్లు రుణంగా ఇ చ్చారన్నారు. ఈ రుణం మొత్తన్ని వడ్డీతో సహా రాష్ట్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు.పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.55 వేల కోట్లు కేటాయింపు పైనా ఆర్థిక మంత్రి స్పష్టత ఇవ్వలేదన్నారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని విభజన చట్టంలో ఉన్నప్పుడు 2014లో నిర్మాణ బాధ్యత లను రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారని నిల దీశారు. డబ్బులు దండుకొనేందుకే చంద్రబాబు పోలవరం బాధ్యతలు తీసుకున్నారని అన్నారు. ఏపీ గత 50 రోజులుగా దమనకాండకు కేంద్ర బిందువుగా మారిందన్నారు. ఫేక్ వార్తల కట్టడికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.ప్రత్యేక హోదా ఎందుకివ్వలేదు?ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.చంద్రబాబుతో సర్వ నాశనమే2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు అనేక కుంభకోణాలతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డా రన్నారు. ఆ కేసులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఉంటే ఏపీకి నిధులు కోరబోమని చంద్రబాబు బీజేపీతో క్విడ్ ప్రోకో చేసుకున్నారని ఆరోపించారు. టీడీపీ అంటే ‘టోటల్ డిజప్పా యింట్మెంట్ పార్టీ’ అని వ్యాఖ్యానించారు. రాజ్య సభలో ప్రతిపక్ష నేత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఇక్కడిలా.. అక్కడలా..రాష్ట్రంలో అధికార కూటమి రాక్షస పాలనను విజయసాయి రెడ్డి సభ దృష్టికి తెస్తుండగా బడ్జెట్ పైనే మాట్లాడాలని, లేదంటే రికార్డుల్లోంచి తొలగిస్తామని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరి వంశ్ హెచ్చరించడం గమనార్హం. మరోవైపు లోక్‌సభలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్పుడు సభాపతి స్థానంలో ఉన్న టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్ అడ్డుచెప్పకపోవడం కొసమెరుపు. -
రాజ్యసభలో ఎన్డీఏపై విజయసాయిరెడ్డి ఫైర్
-
Parliament Budget Session 2024: కేంద్ర బడ్జెట్‌పై సభా సమరం
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై అధికార, విపక్షాల తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. సమాఖ్య స్ఫూర్తికి, పేదలకు బడ్జెట్ ఫక్తు వ్యతిరేకంగా ఉందంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. అధికార ఎన్డీఏ కూటమి భాగస్వాములను ప్రసన్నం చేసుకోవడానికే మోదీ సర్కారు పరిమితమైందని ఆరోపించాయి. రాజ్యసభ, లోక్‌సభ సమావేశం కాగానే బడ్జెట్ కేటాయింపులపై చర్చకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టాయి. సభాపతులు అందుకు నిరాకరించడంతో ఉభయ సభల నుంచీ కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. కుర్చీ కాపాడుకునే బడ్జెట్! ‘‘బడ్జెట్లో బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు పకోడా, జిలేబీ దక్కాయి. మిగతా రాష్ట్రాలన్నింటికీ మోదీ మొండిచేయి చూపారు’’ అంటూ రాజ్యసభలోవిపక్ష నేత ఖర్గే దుయ్యబట్టారు. ఇతర కార్యకలాపాలను పక్కన పెట్టి ముందుగా బడ్జెట్‌పై చర్చ చేపట్టాలంటూ నోటీసులిచ్చారు. వాటన్నింటినీ చైర్మన్ తిరస్కరించడంపై విపక్ష సభ్యులంతా మండిపడ్డారు. ‘కేవలం ఐదు రాష్ట్రాలకే పరిమితమైన బడ్జెట్’, ‘కురీ్చని కాపాడుకునే బడ్జెట్’ అంటూ నినాదాలకు దిగారు. బడ్జెట్ కేటాయింపులు విపక్షపూరితమంటూ విపక్ష ఎంపీలు బుధవారం ఉదయం లోక్‌సభ ప్రవేశద్వారం వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. ఈ అంశాన్నే ముందు చర్చకు చేపట్టాలంటూ సభలో పదేపదే డిమాండ్ చేశారు. వారి తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహించారు. బైఠాయించి ఎవరినీ లోనికి రానీయకపోవడం ఏం పద్ధతని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ బి.మహతాబ్ బడ్జెట్‌పై చర్చ ప్రారంభించారు. నయా మధ్యతరగతిని సాధికారతకు బడ్జెట్ పెద్దపీట వేసిందన్న ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ సభ్యురాలు కుమారి సెల్జా తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర బడ్జెట్ ఎవరి కోసమో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ‘ఇది వికసిత్ బడ్జెట్ కాదు, విచలిత్ బడ్జెట్’ అంటూ ఎద్దేవా చేశారు. తుమ్మితే ఊడేలా ఉన్న సంకీర్ణానికి మోదీ సారథ్యం వహిస్తున్నారంటూ తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ఎద్దేవా చేశారు. అందుకే కీలక ఎన్డీఏ భాగస్వాములను తృప్తి పరిచేందుకు బిహార్, ఏపీలకే బడ్జెట్లో పెద్దపీట వేశారని ఆరోపించారు. బెనర్జీ వ్యాఖ్యలు తృణమూల్ పాలిత పశి్చమబెంగాల్కే వర్తిస్తాయంటూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. దయానిధి మారన్ (డీఎంకే), సుప్రియా సులే తదితరులు బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. విపక్ష సభ్యులనుద్దేశించి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ చేసిన విమర్శలు వివాదమయ్యాయి. దాంతో వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు.పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాల నిరసన కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు తీరుపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పాలిత రాష్ట్రాలకు బడ్జెట్లో మొండిచేయి చూపారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిపై బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. దేశ సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై మోదీ ప్రభుత్వం దాడి చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపించారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అఖిలేష్ యాదవ్ సహా డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు.నిర్మల మాతాజీ! ఖర్గే సంబోధన కూతురన్న ధన్‌ఖడ్ రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సంబోధనల సంవాదం జరిగింది. చాలా రాష్ట్రాలకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరణ ఇచ్చేందుకు చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ అవకాశమిచ్చారు. దాంతో ఖర్గే ఆగ్రహించారు. నిర్మలను ఉద్దేశించి, ‘‘మాతాజీ! మీరు మాట్లాడటంలో ఎక్స్పర్ట్ అని నాకు తెలుసు. కానీ ముందుగా దయచేసి నన్ను పూర్తి చేయనివ్వండి’’ అన్నారు. మాతాజీ సంబోధనపై చైర్మన్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఆర్థిక మంత్రికి 64 ఏళ్లు. మీకు 82. ఆమె మీకు మాతాజీ కాదు, కూతురి వంటిది’’ అన్నారు. అనంతరం ఖర్గే చర్చను కొనసాగిస్తూ నిర్మల కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైనందున బడ్జెట్లో ఆ రాష్ట్రానికి ఎంతో ఇస్తారనుకుంటే అసలేమీ ఇవ్వలేదంటూ ఎత్తిపొడిచారు. -
సభాపతులే పక్షపాతం ప్రదర్శిస్తే..!
స్వరాజ్ పార్టీతో తన సంబంధాలను తెంచుకోవడం ద్వారా స్పీకర్ స్థానానికి విఠల్‌భాయ్ పటేల్ ఆరోగ్యకరమైన ప్రారంభాన్ని ఇచ్చారు. 1946లో సెంట్రల్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైనప్పుడు, జి.వి. మావలంకర్ ‘కాంగ్రెస్‌వాడిని అయినప్పటికీ... నిష్పక్షపాతంగా వ్యవహరించడం, పార్టీకి చెందిన అన్ని అంశాలకు అతీతంగా ఉండటం నా కర్తవ్యం’ అన్నారు. 1956లో స్పీకర్ పదవిని చేపట్టడం కోసం, ఎం.ఏ. అయ్యంగార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1970ల నాటికి లోక్‌సభ స్పీకర్ నిష్పాక్షికత బలహీనపడటం మొదలైంది. ఇక ప్రస్తుత లోక్‌సభ, రాజ్యసభల్లోని ప్రిసైడింగ్ అధికారులిద్దరూ తమ పార్టీ ఆదేశాల మేరకు భారత పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కడం ద్వారా, వెస్ట్ మినిస్టర్ సంప్రదాయాలకు కళంకం తెస్తున్నారు.స్పీకర్ అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం నిష్పక్షపాతంగా ఉంటారు. అన్ని అంశా లను నిర్ణయించే ముఖ్యమైన న్యాయపరమైన విధులను స్పీకర్‌కు సభ వదిలివేయవచ్చు.– సర్ ఐవర్ జెన్నింగ్స్,పార్లమెంట్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, 195718వ లోక్‌సభ మొదటి సెషన్ జూన్ 24న సమావేశమైనప్పుడు, బీజేపీ మెజారిటీని కలిగి ఉన్న 16వ, 17వ లోక్‌సభలలో రాజకీయ పార్టీలు విడిచిపెట్టిన చోట నుండే పక్షపాతం తిరిగి ప్రారంభమైంది. సహజంగానే, లోక్‌సభ స్పీకర్‌కు పోటీ, ‘ఎన్నిక’, సభ తదుపరి కార్యకలాపాల నిర్వహణ వంటివి ‘నిష్పక్షపాతానికి’ చాలా దూరంగా ఉన్నాయి. బ్రిటిష్ పార్లమెంట్ గురించిన తన విశిష్ట అధ్యయనంలో సర్ జెన్నింగ్స్ ఇలాంటి స్థితి గురించి వివరంగా నమోదు చేశారు.వాస్తవానికి, రాజ్యాంగానికి తగిన గౌరవం ఇవ్వకపోగా, దాని సంప్రదాయాన్ని కూడా పక్కనపెట్టి, పార్లమెంటును తన కట్టడిలోనే పనిచేసేలా చూస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ నొక్కి చెప్పింది. లోక్‌సభ, శాసనసభలలో రాజ్యాంగం అమలైనప్పటినుండి కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి, సభలోని అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించే వెస్ట్‌మినిస్టర్ నమూనాకి చెందిన పురాతన సంప్రదాయానికి ఈసారి తిలోదకాలు ఇచ్చేశారు. సంప్రదాయం ప్రకారమైతే ఆ పదవిని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీకి కేటాయించాల్సి ఉండింది. కానీ ఈసారి పార్లమెంటులో బీజేపీకి చెందిన రెండో సీనియర్ సభ్యునికి ప్రొటెం స్పీకర్ పీఠం దక్కింది. సహజంగానే, ‘మా ఎంపికను అంగీకరించడమే ఏకాభిప్రాయం’ అనే రాజకీయ ప్రకటనలో, ఏకాభిప్రాయం కోసం ఏదైనా ప్రతిపక్ష సూచనను ఆశించే, ఆమోదించే అవకాశమే లేదు. ఈ ఏడాది లోక్‌సభలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సంపూర్ణ మెజారిటీని ప్రజలు లాక్కుని ఆ పార్టీ బలాన్ని 303 సీట్ల నుంచి 240కి తగ్గించారు. ఎన్నికలకు ముందు ఎన్ డీఏ ఏర్పర్చుకున్న కొత్త మిత్రుల దన్నుతో 293 మంది ఎంపీలతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 99 సీట్లతోనూ, విస్తృత ప్రాతిపదికన ‘ఇండియా’ కూటమి 234 సీట్లతోనూ తిరిగి రావడం వల్ల, తమను తాము నొక్కి చెప్పు కోగల ప్రతిపక్షంతో, ట్రెజరీ బెంచ్‌లను సర్దుబాటు చేసే కథను పూర్తి చేశాయి. ప్రతిపక్ష నేత కార్యాలయం రాహుల్ గాంధీని ముందుకు నడిపింది.ఏది ఏమైనప్పటికీ, స్పీకర్ పదవికి పోటీని మొదట ప్రతిపాదించినప్పటికీ, భారతదేశం ఎక్కువగా అనుసరించే వెస్ట్‌మిన్ స్టర్ సంప్ర దాయం ప్రకారం ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయి స్తారని ఆశించిన ఇండియా కూటమి... ఎన్డీఏ ఎంపిక మేరకు (మోదీ ఎంపిక అని భావించాలి) మునుపటి స్పీకర్ ఓం బిర్లాకు మద్దతు ఇచ్చింది. కానీ ప్రతిపక్షాలకు ఈ ప్రత్యేక పదవిని నిరాకరించడానికి, పదేళ్లపాటు ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచారు. దీనిపై ఇప్పటికీ మౌనం కొనసాగించడం అరిష్టదాయకం అనే చెప్పాలి.హౌస్ ఎక్స్–అఫీషియో ఛైర్మన్ అయిన భారత ఉపరాష్ట్రపతిని ఒక వ్యవస్థ ఎన్నుకున్నప్పుడు రాజ్యసభ ప్రిసైడింగ్ అధికారి ఎవరనే ప్రశ్న పరిష్కరించబడుతుంది. దీనిని తప్పనిసరి చేసే ఆర్టికల్ 89, సభ్యుల నుండి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను కూడా తప్పనిసరి చేస్తుంది. ప్రతిపక్షా లకు ఈ పదవిని కల్పించేందుకు రాజ్యాంగపరమైన నిబంధన కానీ, సంప్రదాయం కానీ లేవు. అయితే, 1952 నుండి అనేక సందర్భాల్లో ప్రతిపక్ష ఎంపీ ఈ పదవిని అలంకరించారు.‘ఒకసారి స్పీకర్‌ను నియమించిన తర్వాత, ఆయన తన పార్టీ స్వభావానికి దూరంగా ఉంటాడనీ, అలాగే తనను నియమించిన వారిని సమర్థించకుండా ఉంటాడనీ’ బ్రిటన్ సంప్రదాయాలు స్పష్టంగా సూచిస్తున్నాయి.స్వరాజ్ పార్టీతో తన సంబంధాలను విఠల్‌భాయ్ పటేల్ తెంచుకున్నప్పుడు, 1926లో తన పార్టీ శాసనసభ్యులతోపాటు వాకవుట్ చేయడానికి నిరాకరించినప్పుడు వెస్ట్ మినిస్టర్ వ్యవస్థ సంప్రదాయా లకు కట్టుబడి భారతదేశం ఆరోగ్యకరమైన అభ్యాసాన్ని ప్రారంభించింది. విఠల్‌భాయ్ పటేల్ 1927లో కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరించారు. 1946లో సెంట్రల్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైనప్పుడు, జి.వి.మావలంకర్ ఇలా అన్నారు: ‘‘కాంగ్రెస్‌వాడిని అయినప్పటికీ, నిష్పక్షపాతంగా వ్యవహరించడం, పార్టీకి చెందిన అన్ని అంశాలకు అతీతంగా ఉండటం నా కర్తవ్యం’’. 1956 మార్చిలో స్పీకర్ పదవిని చేపట్టడం కోసం, ఎంఏ అయ్యంగార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సర్దార్ హుకుమ్ సింగ్ (1962 నుండి 1967 వరకు లోక్‌సభ స్పీకర్) కూడా తనకు తానుగా ఆరోపణలకు దూరంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ స్పీకర్ పదవికి ఎన్నిక కావడానికి, అధికారంలో ఉన్న లేదా మెజారిటీ పార్టీపై ఆధారపడటం వల్ల పాలక పార్టీల ఆజ్ఞలకు అతడు/ఆమె కట్టుబడాల్సి ఉంటుందనే విషయాన్ని ఆయన గమనించారు. అందుకే 1970ల నాటికి లోక్‌సభ స్పీకర్ నిష్పాక్షికత కాస్త బలహీనపడటంలో ఆశ్చర్యం లేదు. సోమనాథ్ ఛటర్జీ (2004–09) తన నిష్పాక్షికతతో స్పీకర్ కార్యాలయాన్ని ఉన్నతీకరించగా, బలి రామ్ భగత్, బలరామ్ జాఖడ్ వంటి కొందరు స్పీకర్ బాధ్యతలు ముగిసిన తర్వాత తిరిగి కేంద్ర మంత్రివర్గంలో చేరి పనిచేశారు.ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరూ స్పీకర్ కుర్చీ వద్దకు ఓం బిర్లాను తీసుకువెళ్లినప్పుడు, ఆయన మోదీ ముందు వంగి కరచాలనం చేయడం, తరువాతి ప్రతిపక్ష నేత వద్ద నిటారుగా నిలబడటం ద్వారా తన విధేయత ఎవరి పట్ల ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. జూన్ 27న శశి థరూర్ ‘జై సంవిధాన్’ అని చెప్పడం ద్వారా ఎంపీగా తన ప్రమాణ స్వీకారం ముగించినప్పుడు ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కీర్తిస్తూ ప్రమాణం చేయ డానికి అభ్యంతరం ఎందుకు అని దీపేందర్ హుడా అడిగినప్పుడు, బిర్లా ఆయన్ని ఆక్షేపించి కూర్చోవాల్సిందిగా కోరారు. ఇది స్పష్టంగానే నిశ్చితమైన పక్షపాతానికి సంకేతం.స్పష్టంగా ప్రధానమంత్రి సూచనల మేరకు, 1975 నాటి ఎమర్జెన్సీని ఖండిస్తూ బిర్లా చేసిన తీర్మానం, ఆయన పార్టీ విధేయతకు తిరుగులేని సంకేతం. లోక్‌సభకు సంబంధించిన రూల్స్ అండ్ ప్రొసీజర్‌లోని రూల్ 380 కింద ప్రధాని, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను కూడా ఆయన తొలగించారు. కొన్ని వివాదాస్పద బిల్లులను అడ్డంకులు లేకుండా ఆమోదించడం కోసం 17వ లోక్‌సభలో 100 మంది ప్రతిపక్ష ఎంపీలను బహిష్కరించిన ఈ వ్యక్తి, అధికార పక్షానికి తన విధేయ తను ప్రదర్శించారు.ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కూడా ద్వంద్వ పాత్రను పోషిస్తూ, గత పార్లమెంటులో బిల్లులను ఆమోదించడం కోసం 46 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడటానికి సమ యం నిరాకరించడం, వారు ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని అడ్డు కోవడం ద్వారా ధన్‌ఖడ్ రాజ్యసభ కార్యకలాపాలను నిర్వహించడంలో పక్షపాత వైఖరిని కొనసాగిస్తున్నారు. పార్లమెంటులోని ప్రిసైడింగ్ అధికారులిద్దరూ తమ పార్టీ ఆదేశాల మేరకు భారత పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కడం ద్వారా, వెస్ట్ మినిస్టర్ సంప్రదాయాలకు కళంకం తెస్తున్నారు.అజయ్ కె మెహ్రా వ్యాసకర్త రాజకీయ శాస్త్రవేత్త(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రాజ్యసభలో మరింత కీలకంగా వైఎస్సార్సీపీ!
న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. రాజ్యసభలో మాత్రం మెజార్టీ తగ్గిపోయింది. నామినేటెడ్ ఎంపీలైన నలుగురు రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జఠ్మలాని పదవికాలం శనివారంతో ముగియడంతో పెద్దల సభలో బీజేపీ బలం 86కు పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్రపది ద్రౌపది ముర్ము వీరిని నియమించారు. వీరు అనంతరం రాజ్యసభలో అధికార ఎన్డీయే కూటమికి మద్దతుగా నిలిచారు. అయితే నలుగురు ఎంపీల రాజీనామాలతో రాజ్యసభలో బీజేపీ సంఖ్య 86కు చేరగా.. ఎన్డీయే కూటమికి 101 మంది ఎంపీల బలం ఉంది. మొత్తం 245 సభ్యులు కలిగిన పెద్దల సభలో మెజార్టీ మార్కు 113గా ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో 225 మంది ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇందులో కాంగ్రెస్‌కు 26, తృణమూల్ కాంగ్రెస్‌కు 13, ఆమ్ ఆద్మీపార్టీ 10, డీఎంకే పార్టీకి 10 మంది సభ్యులు ఉన్నారు. వీరితోపాటు ఇక అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమిలో భాగంగా లేని తెలంగాణలోని బీఆర్ఎస్, పలువురు నామినేటేట్ ఎంపీలు, స్వతంత్రులు ఉన్నారుఅయితే ఎగువ సభలో బిల్లులను ఆమోదించడానికి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీయేతర పార్టీలపై ఆధారపడి ఉంది. దీంతో గతంలో ఎన్డీఏకు మిత్రపక్షంగా వ్యవహరించిన తమిళనాడులోని అన్నాడీఎంకే, అంశాలవారీగా పలుమార్లు మద్దతిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇపుడు కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీల ఎంపీలనూ ( అన్నాడీఎంకే 4, వైఎస్సార్ సీపీ11) కలిపితే 101 ప్లస్ 15.. మొత్తంగా 116 కావటంతో.. బిల్లులు ఆమోదం పొందడానికి ఈ రెండు పార్టీలూ కీలకంగా మారాయి.గతంలో కూడా పలు సందర్భాల్లో వైఎస్సార్సీపీ(11), అన్నాడీఎంకే (4) పలు బిల్లుల విషయంలో ఎన్డీయేకు మద్దతిచ్చాయి. కానీ ఇటీవల ఎన్నికలకు ముందు గత ఏడాది డిసెంబర్లో అన్నాడీఎంకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేనతో కూటమి గట్టి మరీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పోటీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీకి ఈ రెండు పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. బిల్లులు గట్టెక్కాలంటే వైఎస్సార్సీపీ సపోర్టు ఎన్డీయేకు తప్పనిసరి. ఎందుకంటే 11 మంది సభ్యులున్న వైస్సార్సీపీ... రాజ్యసభలో నాలుగవ అతిపెద్ద పార్టీ కావటం విశేషం. ఇక గతంలో ఎన్డీయేకు మరో మిత్రపక్షంగా ఉన్న ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌కు చెందిన బిజూ జనతాదళ్ కూడా ఎన్నికల ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదని ఇప్పటికే బీజేడీ తేల్చి చెప్పింది. బీజేడీకి తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వచ్చేవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లుల ఆమోదానికి వై ఎస్సార్సీపీ , బీజేడీ , బీఆర్ఎస్ మద్దతు కీలకం.ప్రస్తుతం రాజ్యసభలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 మంది ఎన్నికయ్యేవారు కాగా.. ఈ ఏడాది ఈ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో మహారాష్ట్ర, అస్సాం, బీహార్లలో రెండు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమికి అస్సాం, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర నుంచి ఏడు చోట్ల గెలిచే అవకాశం ఉంది ఇక మహారాష్ట్రలో మరో రెండు దక్కించుకునే ఛాన్స్ ఉంది. దీంతో బీజేపీకి అదనంగా తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు నామినేటెడ్ సభ్యుల ఓట్లు, వైఎస్సార్సీపీ ఓట్లు కలిపితే బీజేపీకి మెజారిటీ మార్కును దాటేందుకు కావాల్సినంత బలం ఉండనుంది. -
వ్యాక్సిన్ ఇప్పిద్దాం...మహిళల ప్రాణాలు కాపాడదాం
రాజ్యసభ సభ్యురాలిగా మొదటిసారి సమావేశాల్లో పాల్గొన్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి భారతీయ పేద మహిళల్లో ఇటీవల అత్యధికంగా చోటు చేసుకుంటున్న సర్వైకల్ క్యాన్సర్ మరణాల గురించి మాట్లాడారు. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం వేక్సిన్ ఇవ్వాల్సిన ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేశారు. నిజమే. సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇది చైతన్యం కలిగించాల్సిన సమయం. ప్రభుత్వం పూనుకోవాల్సిన సమయం.కొన్ని అధ్యయనాల ప్రకారం మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాప్తి 7% నుంచి 27% మందిలో కనిపిస్తోంది. ఇవన్నీ క్యాన్సర్‌గా మారనప్పటికీ, చాలా కేసుల్లో క్యాన్సర్ ముప్పు మాత్రం ఉంటుంది. పద్ధెనిమిదేళ్ల తర్వాత పెళ్లయ్యే యువతులతో పోలిస్తే అంతకంటే ముందుగానే వివాహమయ్యేవారిలో ఇది ఆరు శాతం ఎక్కువ. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రతి ఏడాది 1,23,907 మంది మహిళల్లో దీన్ని కనుగొంటుండగా... ఏటా 77,348 మంది మరణిస్తున్నట్లు అంచనా. గణాంకాల ప్రకారం సంఖ్యాపరంగా పదిహేనో ఏటి నుంచి 44 ఏళ్ల మహిళల్లో వస్తూ, వారిని మృత్యుముఖానికి నెట్టే క్యాన్సర్లలో ఇది రెండో అతి పెద్దది.ఏమిటీ సర్వైకల్ క్యాన్సర్? మహిళల్లో యోని (వెజైనా) తర్వాత వచ్చే భాగమే సర్విక్స్. ఇది గర్భాశయానికి కింద ఉంటుంది. అంటే ఇది యోనికీ, గర్భాశయానికీ (యుటెరస్)కూ మధ్యన సన్నటి దారిలా ఉండే సర్విక్స్ గర్భాశయానికి ముఖద్వారంలా ఉంటుంది కాబట్టే దీన్ని ‘గర్భాశయ ముఖద్వారం’ అనీ, దీనికి వచ్చే క్యాన్సర్‌ను ‘సర్వైకల్ క్యాన్సర్’ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) అని అంటారు. నిజానికి మిగతా క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం మంచి పరిష్కారం. దీని చికిత్స కూడా చాలా సులభం. ఎంత ముందుగా గుర్తిస్తే దీనికి అంత సమర్థంగా, తేలిగ్గానూ చికిత్స అందించవచ్చు. సాధారణంగా పల్లెల్లో కంటే పట్టణాల్లో, నగరాల్లో వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ ఈ క్యాన్సర్ విషయానికి వస్తే ఇది గ్రామీణ ప్రాంతాల స్త్రీలలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. చాలా చిన్నవయసులోనే అందునా పద్ధెనిమిదేళ్ల వయసు కంటే చాలా తక్కువ వయసులోనే అక్కడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ ఉండటం ఇందుకు ఒక కారణమని కొంతమంది పరిశీలకుల విశ్లేషణ. అయితే ఇంతటి తీవ్రమైన వ్యాప్తిలోనూ అదృష్టం ఏమిటంటే... ఈ క్యాన్సర్ రావడానికి ముందర కనీసం 10 ఏళ్ల ముందుగానే కనుగొనగలిగేలా దీనికి చాలా ఎక్కువ వ్యవధిగల ప్రీ–క్యాన్సరస్ దశ ఉంటుంది. ఈ సమయంలో కనుగొనగలిగితే దాన్ని దాదాపు పూర్తిగా నయం చేయడానికి అవకాశముంటుంది.ప్రధాన రకాలు... సర్వైకల్ క్యాన్సర్లలో రెండు ప్రధాన రకాలుంటాయి. మొదటిది తరచుగా కనిపించే ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అనే రకం. రెండోది ‘అడెనోకార్సినోమా’ తరహాకు చెందినదైతే, ఆపరేషన్ ద్వారా తొలగించగల దశలో ఉంటే, సర్జరీ ద్వారా ఆ భాగాన్ని తొలగించవచ్చు. ఇది కాస్త అరుదు. రిస్క్ ఫాక్టర్లు...హెచ్‌పీవీ వైరస్ సోకడం అనేది సర్వైకల్ క్యాన్సర్‌కు ఓ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్. చాలామందిలో ఈ హెచ్‌పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదమముంది. అలాగే పొగ తాగడం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని.చికిత్స ప్రక్రియలు... ఈ క్యాన్సర్ల మొదటి, రెండో దశల్లో శస్త్రచికిత్స అయినా, రేడియోథెరపీ, కీమోథెరపీ... ఈ మూడూ బాగానే పనిచేస్తాయి. అయితే ఈ అన్ని చికిత్సా ప్రక్రియలకు వాటివాటి ప్రయోజనాలూ, దుష్ప్రభావాలూ రెండూ ఉంటాయి. చికిత్సకు ముందు ఈ రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకొని చికిత్స ప్రక్రియను డాక్టర్లు నిర్ణయిస్తారు. సర్జరీతో సాధారణ జీవితానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. సర్జరీ తర్వాత వారం లేదా పది రోజుల్లోనే సాధారణ జీవితం గడిపేలా బాధితులు కోలుకోగలరు. సర్జరీ విజయావకాశాలు 75% నుంచి 90% వరకు ఉంటాయి. పైగా చిన్నవయసులోనే దీని బారిన పడ్డవారికి డాక్టర్లు సాధారణంగా శస్త్రచికిత్సనే సూచిస్తుంటారు. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అవసరం. ఇక సర్జరీతో వచ్చే దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువే. ఇది ఎంతమాత్రమూ ప్రాణాంతకం కాదు. ఇక కొద్దిమందిలో సర్జరీ తర్వాత కాంప్లికేషన్లు వస్తే / సర్జరీ అంటే భయపడేవారికి డాక్టర్లు ‘రాడికల్ రేడియోథెరపీ’ అనే చికిత్స చేస్తారు. హెచ్‌పీవీతో సమర్థమైన నివారణమామూలుగా శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్’ ను తయారుచేస్తుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్‌ను తెచ్చిపెట్టే హెచ్‌పీవీ వైరస్ విషయంలో మాత్రం మహిళల దేహం ఎలాంటి యాంటీబాడీస్లనూ తయారు చేయదు. అందువల్ల ఒకసారి హెచ్‌పీవీ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం శరీరంలో ఉండిపోయి సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. అదే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను మహిళకు తొమ్మిది నుంచి 26 ఏళ్ల వయసు లోగా ఇప్పిస్తే యాంటీబాడీస్‌ను తయారుచేసి, సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. కేవలం బాలికలు, యువతులకే కాకుండా బాలురు, యువకులకూ కూడా ఇచ్చే అత్యాధునిక వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే పురుషులు క్యారియర్లుగా మారి దీన్ని మహిళలకు వ్యాప్తి చేస్తారు కాబట్టి మగవాళ్లకూ ఇచ్చే వ్యాక్సిన్లు రూపొందాయి. ఇవి ఒకటి రెండు రకాలకే గాక... మరిన్ని రకాల సర్వైకల్ క్యాన్సర్లను నివారిస్తాయి. 9 నుంచి 14 ఏళ్ల మగపిల్లల్లో రెండు డోసులూ, పధ్నాలుగేళ్లు దాటిన వారికి 0, 2, 6 నెలల్లో వరసగా ఇవ్వాలి. కారణాలుసర్విక్స్ మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన కారణంగా క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలెక్కువ. సర్వైకల్ క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ప్రధానం. ఈ వైరస్ లైంగికంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే క్యాన్సర్‌ను కలగజేస్తుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ తో సెక్స్‌లో పాల్గొనేవారికీ హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ.నివారణ... సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్‌స్మియర్ మంచి పరీక్ష. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, లైంగిక జీవితం ప్రారంభమై మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ విషయంలో మరో వెసులుబాటు ఏమిటంటే ఇది రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దీన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–క్యాన్సరస్ దశ’ దీనికి ఉంది డా‘‘ కావ్య ప్రియ వజ్రాల లీడ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ – రిస్క్ ఆబ్స్టెట్రీషియన్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కు వ్యాక్సిన్‌ను ప్రభుత్వమే అందజేస్తే మహిళాలోకానికి చాలా మేలు చేసినట్లవుతుంది. తమ కుటుంబానికే తొలి ప్రాధాన్యమిచ్చే స్త్రీలు సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి, ఏ నాలుగో దశలోనో, మూడో దశలోనో హాస్పిటల్స్‌కు వస్తూ, చేజేతులా మరణాన్ని తెచ్చుకుంటున్నారు. అదే తొమ్మిది నుంచి 45 ఏళ్ల వయసులోనే వారికీ వ్యాక్సిన్ ఇప్పిస్తే ఎన్నో మరణాలను నివారించగలం. కోవిడ్ టైమ్‌లో దేశం మొత్తానికి వ్యాక్సిన్ ఇప్పించిన మనకు ఇదేమీ కష్టం కాబోదు. ప్రైవేటు సంస్థల్లో దీన్ని దాదాపు రూ. 1,400 నుంచి రూ. 1,500 లకు అమ్ముతున్నారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపి, చవగ్గా ఏ ఏడువందల రూపాయలకో ఇప్పించగలిగితే అత్యంత నిరుపేద మహిళల ప్రాణాలనూ మనం కాపాడ గలిగినవాళ్లమవుతాం. – సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలు, సమాజ సేవిక -
రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా ఉపఎన్నిక జరిగితే..!
-
సుధామూర్తి తొలి స్పీచ్..ప్రధాని ప్రశంసలు
న్యూఢిల్లీ: పుస్తక రచయిత్రి, దాత, ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఎంపీగా రాజ్యసభలో తొలిసారి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యం అంశంపై ఆమె ప్రసంగించారు. దీనిపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. బుధవారం(జులై 3) ఎగువసభకు వచ్చిన ఆయన సుధామూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవలే సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆమె సభలో మాట్లాడారు. 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సిన్ ఇస్తారని తెలిపారు. ఆ వ్యాక్సిన్‌ను తీసుకుంటే క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చన్నారు. చికిత్స కంటే నివారణే మేలని చెప్పారు. ఈసందర్భంగా తన తండ్రి చెప్పిన మాటలను సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అది తీరని లోటు అన్నారు. కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని, ఆ అనుభవంతో సర్వైకల్ వ్యాక్సిన్‌ను బాలికలకు అందించడం సులభమన్నారు. దీంతోపాటు వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రసంగించారు. దేశానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటే ఆదాయం పెరుగుతుందని సూచించారు. సుధామూర్తి చేసిన ఈ ప్రసంగంపై ప్రధాని స్పందించారు. మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తిజీకి కృతజ్ఞతలని అన్నారు. గత పదేళ్లకాలంలో ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టిసారించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసిందని, గర్భిణీలకు వ్యాక్సినేషన్ తీసుకువచ్చామని వెల్లడించారు. -
మణిపూర్‌పై రాజకీయాలు ఆపండి: విపక్షాలకు మోదీ చురకలు
న్యూఢిల్లీ: నీట్ వివాదం, మణిపూర్ హింసపై చర్చ జరపాలంటూ పార్లమెంటులో ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కేంద్రం తరపున ఆయన సమాధానమిచ్చారు.మణిపూర్ అంశంలో అగ్నికి ఆజ్యం పోయడం ఆపాలని విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సాధారణ స్థితిని తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. మణిపూర్‌లో హింస తగ్గుముఖం పట్టిందని, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని తెలిపారు.చిన్న రాష్ట్రంలో 11 వేలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని.. 500 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారని తెలిపారు. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణ జరుగుతోందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే మణిపూర్‌లో కూడా సాధారణ పరీక్షలు జరిగాయన్నారు. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం హోంమంత్రి మణిపూర్‌లోనే ఉంటూ తగిన చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.‘మణిపూర్‌లో కాంగ్రెస్ సుదీర్ఘ పాలనను ప్రస్తావిస్తూ.. మణిపూర్ చరిత్ర తెలిసిన వారికి మణిపూర్‌లో సామాజిక సంఘర్షణకు సుదీర్ఘ చరిత్ర ఉందని తెలుస్తుంది. ఈ సామాజిక సంఘర్షణ మూలం చాలా లోతైనదని ఎవరూ కాదనలేరు. ఇంత చిన్న రాష్ట్రంలో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రజలు మర్చిపోకూడదు.ఈ తరహా హింస 1993లో జరిగిందన్నారు. ఐదేళ్లపాటు ఇలాంటి ఘటనలు నిరంతరం జరిగాయన్నారు. మణిపూర్‌ను విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయి. అక్కడి ప్రజలు వారి కుట్రలను తిరస్కరిస్తారు’. అని పేర్కొన్నారు. -
రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?
మంగళవారం రాజ్యసభలో తొలి ప్రసంగంలో రెండు కీలక అంశాలపై మాట్లాడి అందర్నీ ఆశ్చర్యరిచారు సుధామూర్తి. ముఖ్యంగా తన ప్రసంగంలో సర్వైకల్ వాక్సినేషన్, టూరిజం గురించి హైలెట్ చేశారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తిని రాష్ట్రపతి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె సాధారణంగా ప్రసంగంలో మహిళల సాధికారత గురించి ప్రముఖంగా మాట్లాడతారని అందరికీ తెలిసిందే. ఇక రాజ్యసభలో మహిళ ఆరోగ్యంపై మాట్లాడటమే గాక దాని పరిష్కారం గురించి కూడా వివరించి దటీజ్ సుధామూర్తి అని చెప్పకనే చెప్పారు. సోషల్ సర్వీస్‌లో ముందుండే ఆమె రాజ్యసభ ఎంపీ హోదాలో కూడా ఆమె ప్రజా సేవకే పెద్ద పీట వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆమె ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ అంటే ఏంటీ? ఎందుకు వేయించుకోవాలి అంటే..సర్వైకల్ వ్యాక్సినేషన్ని గర్భాశయ కేన్సర్ నిరోధక టీకా అని పిలుస్తారు. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్, దాని వ్యాక్సిన్ గురించి ప్రజలకు అవగాహన లేదు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఏ వ్యాక్సిన్ వేయాలో, ఎప్పుడు వేయాలో చాలా మంది మహిళలకు తెలియదు. టీకా గురించి సమాచారం లేకపోవడం వల్ల భారతదేశంలో గర్భాశయ కేన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే టీకాతో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 70 నుంచి 80 శాతం వరకు తొలగించవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఇస్తేనే ప్రయోజనం ఉంటుంది. బాలికలు ఈ టీకా తీసుకుంటే కేన్సర్ రాకుండా నివారించొచ్చు. వచ్చాక చికిత్స తీసుకుని నయమయ్యేలా చేయడం కంటే ముందుగానే నివారించడం ఉత్తమం. 26 ఏళ్ల తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకుంటే అంతగా ప్రయోజనం ఉండదు. దీన్ని 9 నుంచి 14 ఏళ్ల లోపు తీసుకుంటేనే ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల ఈ విషయాన్నే సుధామూర్తి రాజ్యసభ ప్రసంగంలో హైలెట్ చేసి మాట్లాడారు. మన దేశం కరోనా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని పెద్ద ఎత్తున చేపట్టి విజయవంతం చేయగలిగినప్పుడూ ఈ సర్వైకల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా విజయవంతమవుతుందని అన్నారు. కాస్త ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుంటే ప్రతి కుటుంబ ఒక తల్లిని కోల్పోదని సుధామూర్తి అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ..ఓ తల్లి చనిపోతే ఆస్పత్రిలో ఒక మరణంగా నమోదవ్వుతుంది. కానీ ఓ కుటుంబం తల్లిని కోల్పోతుందంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో సర్వైకల్ వ్యాక్సినేషన్‌ను అభివృద్ధి చేశామని, గత 20 ఏళ్లుగా దీనిని ఉపయోగిస్తున్నామని అన్నారు. ఇది చాలా బాగా పనిచేస్తోందని కూడా చెప్పారు. ఈ వ్యాక్సిన ఖరీదు రూ. 1400. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఆ వ్యాక్సిన్‌ను కేవలం రూ. 700 నుంచి రూ. 800లకు అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. పైగా మన దేశంలో జనభా ఎక్కువ కాబట్టి మన ఇంటి ఆడబిడ్డలకు ఈ వ్యాక్సిన్ మేలు చేస్తుందని అన్నారు సుధామూర్తి. కాగా, అందుకుగానూ ప్రధాని నరేంద్రమోదీ సుధామూర్తిని ప్రశంసించారు . పైగా తన తొలి ప్రసంగంలో మహిళల ఆరోగ్యం గురించి మాట్లాడినందుకు ధన్యావాదాలని కూడా చెప్పారు మోదీ. (చదవండి: 'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!..ఏకంగా రోబోటిక్ పాములతో..) -
రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం
-
చర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారు: విపక్షాలపై మోదీ ఫైర్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో బుధవారం ప్రసంగించారు. ప్రజలు మూడసారి ఎన్డీయేకు పట్టం కట్టారని పేర్కొన్నారు. 60 ఏళ్ల తరువాత దేశంలో వరుసగా మూడోసారి ఓ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు అడ్డు తగిలారు. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. విపక్ష నేతలను మాట్లాడనివ్వలేని వాకౌట్ చేశాయి. అయితే దీనిపై మోదీ స్పందిస్తూ.. విపక్ష సభ్యులు ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు. సభను విపక్షాలు అవమానిస్తున్నాయని అన్నారు. నిజాలు చెబుతుంటే ప్రతిపక్షానికి భరించడం లేదని, ప్రజలు ఓడించినా వారిలో మార్పు రావడం లేదని ధ్వజమెత్తారు. చర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారని చురకలంటించారు.తన సమాధానం వినే ధైర్యం విపక్షాలకు లేదని అన్నారు ప్రధాని మోదీ. ప్రజా తీర్పును విపక్షాలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయని పేర్కొన్నారు. విపక్షాలు అబద్దం ప్రచారం చేస్తున్నాయని, సన్నకారు రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పథకాలు తేలేదని దుయ్యబట్టారు. తాము వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చామన్న మోదీ.. రైతుల పంటలకు కనీసమద్దతు ధరను భారీగా పెంచామని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు అండగా నిలిచామన్నారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాంమని, బంజారాల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. -
రాజ్యసభలోనూ నీట్ రగడ
న్యూఢిల్లీ: నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం రాజ్యసభను కుదిపేసింది. పేపర్ లీక్‌తో లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ‘‘ దేశంలో రెండు ఐపీఎల్‌లు జరుగుతున్నాయి. ఒకటి ఇండియన్ ప్రీమియర్ లీగ్, మరొకటి ఇండియన్ పేపర్ లీక్. ఒక ఐపీఎల్ బాల్, బ్యాట్‌తో ఆడితే ఇంకో ఐపీఎల్ యువత భవిష్యత్తుతో ఆడుకుంటోంది.నీట్–యూజీ పరీక్ష చేపట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అంటే ఇకపై నో ట్రస్ట్ ఎనీమోర్(ఎన్టీఏ)గా పలకాలి’ అని ఆప్ సభ్యుడు రాఘవ్ చద్దా అన్నారు. ప్రతిష్టాత్మక పరీక్షల పేపర్ లీకేజీల అంశాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ఇంకొందరు సభ్యులు డిమాండ్‌చేశారు. ‘‘ తీవ్ర వివాదాస్పదమైన నీట్ పరీక్షను కేంద్రం ఇకనైనా రద్దుచేస్తుందా లేదా? ’’ అని కాంగ్రెస్ నేత దిగి్వజయ్‌సింగ్ సూటిగా ప్రశ్నించారు.ఎన్టీఏ చైర్మన్‌కు గతంలో మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ స్కామ్‌తో సంబంధం ఉందని దిగ్విజయ్ ఆరోపించారు. ‘‘ నీట్, నెట్ లీకేజీల్లో కోచింగ్ సెంటర్లదే ప్రధాన పాత్ర. అయినా వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు’’ అని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను తక్షణం డిస్మిస్ చేయకుండా రెండునెలల శాఖాపర దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పడంలో ఆంతర్యమేంటి?’ అని ఎస్పీ నేత రాంజీలాల్ సుమన్ అనుమానం వ్యక్తంచేశారు. -
రాజ్యసభలో విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా డిమాండ్..