సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్‌సీపీ అవతరించింది. రాజ్యసభలో బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే.
ఇక, ఏపీలోని 11 రాజ్యసభ సీట్లకు గాను 11 సీట్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. రాజ్యసభ సీట్లలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ విజయం సాధించింది. ఈ క్రమంలో నేటి నుంచి అధికారికంగా ఏపీ నుంచి రాజ్యసభలో వైఎస్ఆర్‌సీపీకి సంపూర్ణ ప్రాతినిధ్యం ఉంటుంది. రేపు రాజ్యసభ సభ్యులుగా నూతన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇదిలా ఉండగా.. రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. నిన్న(మంగళవారం)తో టీడీపీ ఏకైన రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ కాలం ముగిసింది. దీంతో, రాజ్యసభలో టీడీపీ జీరో అయ్యింది. కాగా, టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది.
Comments
Please login to add a commentAdd a comment