breaking news
TDP
-
నిజాలు అలా చెబుతారా?.. మంత్రి రాసలీలలపై టీడీపీ నేతకు హెచ్చరిక
సాక్షి, అమరావతి: మంత్రి రాసలీలల గురించి బహిరంగంగా చెప్పిన టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి.సుధాకర్‌రెడ్డిపై పార్టీ క్రమశిక్షణ సంఘం విరుచుకుపడినట్లు తెలిసింది. మంగళవారం సుధాకర్‌రెడ్డిని మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి పిలిపించిన క్రమశిక్షణ సంఘం నాయకులు వర్ల రామయ్య, కొనకళ్ల నారాయణ, పంచుమర్తి అనూరాధ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.ఈ సందర్భంగా.. ‘మీరు మాట్లాడిన నిజాలు తీసుకొచ్చే నష్టం ఎంతో తెలుసా? ఏవైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ప్రత్యర్థులకు రాజకీయ అస్రాలు ఇచ్చేలా మాట్లాడటం కరెక్ట్ కాదు’ అంటూ హెచ్చరించినట్లు తెలిసింది. ఇటీవల టీడీపీ అనుకూల చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్ర మంత్రి ఒకరు తిరుపతికి వచ్చిన సమయంలో స్టార్ హోటళ్లలో రాసలీలల్లో మునిగితేలతారని ఆయన చెప్పారు. మంత్రికి తమ లాంటి పార్టీ కార్యకర్తలను కలవడానికి సమయం లేదని, రాసలీలలకే సమయం సరిపోతోందంటూ.. తిరుపతిలో మంత్రి చేసే అసాంఘిక కార్యకలాపాలను వివరించారు.మండల అధ్యక్ష, ఇతర పార్టీ పదవుల్ని సైతం టీడీపీ ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇది సోషల్ మీడియా, మీడియాలో విస్తృతంగా ప్రచారమవడంతో ఉలిక్కిపడిన టీడీపీ అధిష్టానం రాసలీలల మంత్రిని ప్రశ్నించకుండా ఆ విషయాన్ని బయటపెట్టిన నేత సుధాకర్‌రెడ్డిని టార్గెట్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రికి చంద్రబాబు వత్తాసు పలుకుతుండటంతో.. ఆ మంత్రి కూడా సుధాకర్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే క్రమశిక్షణ సంఘం నేతలు సుధాకర్‌రెడ్డిని పిలిపించుకుని వివరణ కోరారు. తాను చెప్పినవన్నీ వాస్తవాలేనని, మంత్రి పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవకుండా వేరే వ్యవహారాలు నడుపుతున్నారని సుధాకర్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది.‘మీరు మాట్లాడినవి నిజమే అయి ఉండవచ్చు. నిజాలన్నీ బయట మాట్లాడకూడదు. ప్రతిపక్ష పార్టీ వారికి అ్రస్తాలను అందిస్తారా?. అంతర్గతంగా ముఖ్య నాయకుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు’ అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న పనులపై అసహ్యం కలిగి, పారీ్టకి నష్టం జరుగుతోందనే ఆవేశంలో కొన్ని విషయాలు బయటపెట్టానని సుధాకర్‌రెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఇకపై జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన్ని క్రమశిక్షణ సంఘం నేతలు హెచ్చరించి పంపినట్లు తెలిసింది. అయితే సుధాకర్‌రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందేనని సదరు మంత్రి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. -
ని‘వేదన’లే..! డబ్బులు గుంజుతున్న అధికార పార్టీ నేతలు
బాపట్ల జిల్లా చీరాల ఈపూరుపాలేనికి చెందిన పిట్టు నాగేశ్వరమ్మ, పిట్టు వెంకట్రావులకు సర్వే నెంబర్ 746–2లో 1.55 ఎకరాలు, సర్వే నెంబర్ 746–3లో 1.46 ఎకరాల భూమి ఉంది. కొనుగోలు ద్వారా సంక్రమించిన ఈ భూమిని ప్రభుత్వం ఇటీవల జీరో (ఎవరికీ చెందనిది) ఖాతాలో చేర్చడంతో తహసీల్దార్, కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇంతకాలం సక్రమంగానే ఉన్న తమ భూమి రికార్డులు మార్చడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అవసరానికి అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పాపిశెట్టిపల్లిలో టీడీపీ నేతల అండదండలతో గ్రామ కంఠం భూములను ఆక్రమించడంపై గ్రామస్థులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రశ్నించినందుకు తమపై దౌర్జన్యానికి తెగబడుతున్నారని, తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఈనాం భూమిగా నమోదుతో.. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం గొండుపాలెం గ్రామం సర్వే నెంబర్లు 340/1, 340/2, 3లో మొత్తం 82 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. రీ సర్వే తర్వాత ఎల్పీఎం నెంబర్లు ఇచ్చినప్పుడు 340/2, 3 సర్వే నెంబర్లలో ఉన్న రెండు సెంట్ల భూమిని సర్వీస్ ఈనాంగా తప్పుగా నమోదు చేశారు. దీంతో మొత్తం భూమంతా సర్వీస్ ఈనాంగా రికార్డుల్లో నమోదు కావడంతో ఫ్రీ హోల్డ్ చేసినట్లు చూపారు. ఇప్పుడు ఫ్రీ హోల్డ్ భూములన్నింటినీ కూటమి ప్రభుత్వం 22 ఏ జాబితాలో పెట్టేసింది. దీంతో భూ యజమాని అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ఫ్రీహోల్డ్‌గా తప్పుగా పేర్కొన్న 2 సెంట్లను మినహాయించి మిగిలిన 80 సెంట్ల జిరాయితీ భూమిని ఆంక్షల జాబితా నుంచి తొలగించాలని ఏడాదిగా బాధిత రైతు వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ, స్థానిక ఎమ్మెల్యేకు దీనిపై ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పరిష్కారం కాలేదు. పీజీఆర్ఆర్ఎస్లో అర్జీ పెట్టుకున్నా స్పందన లేదు. ఫ్రీహోల్డ్ భూములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ దీనిపై ఏమీ చేయలేమని సీసీఎల్ఏ అధికారులు చేతులెత్తేశారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు స్వయంగా తమ ఫిర్యాదును తీసుకున్నారంటే ఇక ఆ సమస్య కచ్చితంగా పరిష్కారమైనట్లేనని అర్జీదారులు కొండంత భరోసా పెట్టుకుంటారు! మరి అవే బుట్టదాఖలవుతున్నాయంటే ఇక సామాన్యుల గోడు తీర్చెదెవరు? రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలు, టీడీపీ నేతల ఆక్రమణలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులతో ప్రభుత్వ పెద్దలే ముఖం చాటేస్తే ఇక బాధితులకు న్యాయం చేసేదెవరు? రాష్ట్రంలో భూములకు సంబంధించిన ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. వెల్లువలా వస్తున్న అర్జీలపై ఆరా తీయకుండానే పరిష్కరించేసినట్లు ప్రభుత్వం ప్రకటించుకోవడంపై బాధితులు నివ్వెరపోతున్నారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్లలో భూములకు సంబంధించి లక్షలాది ఫిర్యాదులు వస్తున్నా ఒక్కటీ పరిష్కారానికి నోచుకోవడంలేదు. భూ సమస్య అంటేనే అధికారులు దాన్నో పెద్ద భూతంగా, సివిల్ పంచాయితీగా చూస్తుండడంతో భూ యజమానులు దిక్కు తోచక దళారుల బారిన పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు బ్రోకర్ల అవతారం ఎత్తి పనులు చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్నారు. గ్రామ, మండల స్థాయిలో పరిష్కరించే సమస్యలను సైతం రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. నియోజకవర్గ ఎమ్మెల్యేనో, అధికార పార్టీ నేతలో పురమాయిస్తే గానీ వినతిపత్రాలు సైతం తీసుకోవడంలేదు. ప్రతి సోమవారం కలెక్టరేట్లు సహా అన్ని కార్యాలయాల్లో జరుగుతున్న గ్రీవెన్స్ డే (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) కేవలం మొక్కుబడి తంతుగా ముగుస్తోంది. అధికారులంతా విందు భోజనానికి వచ్చినట్లు కూర్చుని రశీదులు ఇప్పిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత సమస్య పరిష్కారమైపోయినట్లు బాధితులకు మెసేజ్‌లు రావడంతో విస్తుపోతున్నారు. వాస్తవానికి సమస్య అలాగే ఉంటోంది. అధికారులు మాత్రం అది ముగిసిపోయినట్లు నివేదిక ఇచ్చేస్తున్నారు. దీంతో బాధితులు ఎప్పటి మాదిరిగానే కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ సమస్యలు పరిష్కారం కాని రైతులు, భూ యజమానులు, బాధితులు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. రికార్డుల్లో తప్పులు.. రైతులకు శాపాలు పలు చోట్ల భూమి ఒకరి పేరు మీద ఉంటే పట్టాదారు పాస్‌బుక్ ఇతరుల పేరు మీద రావడం లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పట్టాదారుల పేర్లలో తప్పులు, సర్వే లేదా ఎల్పీఎం నెంబర్లలో తప్పులు, భూమి స్వభావంలో తప్పులు లాంటి వాటికైతే లెక్కే లేదు. జాయింట్ ఎల్పీఎంల సమస్య ఇటీవల తీవ్రం కావడంతో సబ్ డివిజన్ల ద్వారా చక్కదిద్దకుండా సబ్ డివిజన్ చేసుకుంటే చెల్లించాల్సిన మొత్తాన్ని రూ.50 నుంచి రూ.550కి ప్రభుత్వం పెంచేసింది. డబ్బులు కట్టకపోతే సబ్ డివిజన్ జరగడంలేదు. ఇలా రెవెన్యూలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నా వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కనీస ఆలోచన కూడా చేయడంలేదు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద తమ ఆవేదనను వెల్లడిస్తున్న చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం పాపిశెట్టిపల్లి గ్రామస్తులు సీఎం స్వయంగా తీసుకున్నా అంతే..!‘పీజీఆర్ఎస్’కు వచ్చే ఫిర్యాదుల్లో 80 శాతం భూ సమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబే చాలాసార్లు వెల్లడించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో వారంలో రెండు మూడు రోజులు బాధితుల నుంచి వినతిపత్రాలు తీసుకుంటుండగా అందులో 70 నుంచి 80 శాతం భూముల సమస్యలే ఉంటున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, రెవెన్యూ శాఖ మంత్రి, ఇతర మంత్రులు తీసుకున్న వినతిపత్రాలు సైతం పరిష్కారానికి నోచుకోవడంలేదు. కొద్దిరోజుల క్రితం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి స్వయంగా వినతిపత్రాలు స్వీకరించి ఐదు వేల వినతులు వచ్చినట్లు ప్రకటించారు. కానీ అందులో పది శాతం కూడా పరిష్కారం కాలేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. కుప్పలు తెప్పలుగా వస్తున్న అర్జీలను చూసి సీఎం వాటిని తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వస్తానని చెప్పి రాకుండా ముఖం చాటేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 12 లక్షలు అర్జీలు అందగా అందులో మెజారిటీ రెవెన్యూ శాఖకు సంబంధించినవే. భూముల సమస్యల్లో దాదాపు అన్నింటినీ పరిష్కరించేసినట్లు ఇటీవల రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే అంతకుముందు 15 రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్రంగా పక్షం రోజుల్లోనే అవన్నీ పరిష్కారమైపోయినట్లు ప్రకటించేశారు. తిరగలేక విసిగిపోయాఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో 131/1ఏ, 132/ 2ఏ సర్వే నంబర్లలో నాకు 3.04 ఎకరాల భూమి ఉంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాసు పుస్తకాలున్నాయి. నా భూమిలో 0.44 సెంట్లను ఇతరులు ఆక్రమించుకుని కంచె వేశారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఆరు సార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయా. – మేడా సత్యనారాయణ70 ఏళ్ల వయసులో నాకేంటీ తిప్పలు 1993లో ప్రభుత్వం 40 సెంట్ల భూమిని నా భార్య కొల్లి చిట్టమ్మ పేరుతో ఇచ్చింది. నా భార్య చనిపోవడంతో ఆ భూమికి నా పేరుతో పాస్‌బుక్ ఇవ్వాలని కాళ్లరిగేలా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్లో రెండుసార్లు అర్జీ ఇచ్చా. 70 ఏళ్ల వయసులో తిప్పలు పడి తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. – కొల్లి ప్రకాశం, నాగంపల్లి, సీతానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లాకాళ్లు అరిగేలా తిరుగుతున్నా.. నాకు ఐదు ఎకరాల పొలం ఉండగా 2.47 ఎకరాలను రజని అనే వ్యక్తికి విక్రయించా. అనంతరం అతడి నుంచి దాన్ని కొనుగోలు చేసిన పాండు మొత్తం భూమి తనదేనంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. నాకు న్యాయం చేయమని భూమి పత్రాలతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా. సర్వే చేయాలని మొర పెట్టుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోవడం పోలేదు. – రామచంద్రనాయుడు, ఊటుకూరు గ్రామం, రాజంపేట -
చెరువు భూమిని చుట్టేశారు.. అప్పనంగా కొట్టేశారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరం నడిబోడ్డున ఉన్న చెరువు భూమిని 99 ఏళ్లకు టీడీపీ కార్యాలయం కోసం ప్రభుత్వం కట్టబెట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను కూడా బేఖాతరు చేసింది. చెరువు స్థలాలను లీజుకు ఇవ్వకూడదు. అందులో కట్టడాలు అసలే నిర్మించకూడదు. అయినా అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలోనే చెరువు స్థలాన్ని ఆక్రమించుకుని టీడీపీ కార్యాలయం నిర్మించేశారు. చెరువు స్థలాన్ని లీజుకు ఇచ్చే అధికారం లేదని తెలిసి మున్సిపల్ అధికారులు ఆ విషయాన్ని కౌన్సిల్ ముందు ఉంచలేదు. ఈ అంశాన్ని రహస్యంగా ఉంచి చివరి నిమిషంలో టేబుల్ అజెండాగా తీసుకువచ్చి కౌన్సిల్లో ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదింపచేసుకున్నారు. ఈ తీర్మానంలో కనీసం నగరపాలక సంస్థ అధికారుల నుంచి ఎటువంటి ప్రతిపాదనలు, వివరణలు లేకుండానే తీర్మానం చేసేయడం గమనార్హం. ఆ తరువాత జీవో కూడా అడ్డగోలుగా ఇచ్చేశారు. ఈ అడ్డగోలు వ్యవహారం వివరాల్లోకి వెళితే.. నగరం నడిబొడ్డున 2,954 గజాలు గుంటూరు అరండల్‌పేట పిచ్చుకులగుంటలోని చాకలి చెరువుకు చెందిన టీఎస్ నంబర్–826లో వెయ్యి చదరపు అడుగుల స్థలాన్ని ఏటా రూ.25 వేలు అద్దె చెల్లించేలా 1999లో తెలుగుదేశం పారీ్టకి లీజుకు ఇచ్చారని, ప్రతి మూడేళ్లకు అద్దె పెంచేలా లీజు నిర్ణయించారని మున్సిపల్ కమిషనర్ ప్రతిపాదనలో పేర్కొన్నారు. అయితే, లీజు కింద పేర్కొన్న 1,000 చదరపు గజాలతోపాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా టీడీపీ ఆక్రమించి మూడు అంతస్తుల భవనం నిర్మించింది. 2008 నుంచి ఒక్క రూపాయి కూడా నగరపాలక సంస్థకు అద్దె చెల్లించలేదు.పైగా అప్పటి నుంచి లీజు పునరుద్ధరించలేదు. అందులో నిర్మించిన పార్టీ కార్యాలయానికి కూడా ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ఇప్పటివరకూ పన్నులు కూడా విధించలేదు. 2015లో అప్పటి టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెయ్యి గజాలకు అదనంగా 1,637 గజాలను కూడా కలిపి 2,637 గజాల స్థలాన్ని 99 సంవత్సరాలకు లీజుకు ఇవ్వాలని కోరారు. నగరపాలక సంస్థ అధికారులు ఆ భూమిని సర్వే చేయించి మొత్తం 2,954 గజాలు ఉందని తేల్చారు.అప్పట్లో దీనిపై నిర్ణయం తీసుకోలేదు. 2017లోనే లీజు గడువు ముగిసిపోయింది. అప్పటి నుంచి పైసా కూడా అద్దె చెల్లించకుండా అక్రమంగా ఆ స్థలాన్ని కార్యాలయం పేరిట టీడీపీ నేతలు అనుభవిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచి్చన తర్వాత ఈ ఏడాది మార్చి 15న టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఈ స్థలాన్ని శాశ్వత పద్ధతిలో లీజుకు ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనను టేబుల్ అజెండా కింద కౌన్సిల్లో కనీసం సభ్యులు చర్చించకుండానే ఆమోదం తెలిపారు.99 ఏళ్లకు కట్టబెట్టిన కేబినెట్ జీవో–340 ప్రకారం మున్సిపల్ స్థలాన్ని లీజుకు ఇచ్చే విషయంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీన్ని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. దీని ఆధారంగా ప్రభుత్వం 2017 నుంచి 33 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేవిధంగా.. ఆ తర్వాత దాన్ని 99 సంవత్సరాల వరకూ పొడిగించే విధంగా.. ఎకరానికి కేవలం వెయ్యి రూపాయలు అద్దె చెల్లించేలా ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ జీవో జారీ చేశారు.నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారం ఆ స్థలం మార్కెట్ విలువలో 10 శాతం లీజుగా నిర్ణయించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ స్థలం మార్కెట్ విలువ గజం రూ.55 వేలుగా ఉంది. దీని ప్రకారం ఇప్పుడు లీజుకు తీసుకుంటున్న 2,954 గజాలకు ఏడాదికి కోటిన్నరకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది.ఈ లెక్క ప్రకారం ఇప్పటివరకూ రూ.9 కోట్ల వరకు లీజు చెల్లించాలి. ఇవేమీ లేకుండానే ఆ భూమి మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి అప్పనంగా కట్టబెట్టేశారు. జీవో–340ని అడ్డం పెట్టుకుని కేవలం ఎకరానికి రూ.వెయ్యి చొప్పున అద్దె చెల్లించేలా ఆదేశాలు జారీ చేయడంపై నగరవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్ర.. భారీ మార్జిన్‌కు 'పచ్చ' స్కెచ్
సాక్షి, విజయవాడ: టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్రకు తెరతీసింది. మద్యం బార్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది. 840 బార్లలో 52 బార్లకే ఆఫ్లికేషన్లు దాఖలయ్యాయి. బార్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు రాకుండా టీడీపీ లిక్కర్ సిండికేట్ అడ్డుకుంది. భారీగా మార్జిన్ పెంచుకునేందుకు టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్రకు తెరతీసింది.లిక్కర్ సిండికేట్‌కి సరెండర్ అయిన చంద్రబాబు సర్కార్.. 29వ తేదీ వరకు అప్లికేషన్లకు గడువు పెంచింది. మంత్రి వర్గం ఉపసంఘం ద్వారా మార్జిన్ పెంచుకోవడానికి లాబీయింగ్ చేశారు. ఇతరులెవ్వరిని బార్ల కోసం దరఖాస్తు చేసుకొనివ్వకుండా టీడీపీ సిండికేట్ బెదిరింపులకు దిగారు.ఇంత తక్కువగా దరఖాస్తులు దాఖలు కావడం వెనుక టీడీపీ మద్యం సిండికేట్ వ్యూహాత్మక ఎత్తుగడ దాగుంది. బార్ల దరఖాస్తుల కోసం అయితే ఏకంగా 2,300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ.. వీరిలో తమ సిండికేట్ కాని వారిని గుర్తించిన టీడీపీ నేతలు.. దరఖాస్తు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ పార్టీ గూండాలు, పోలీసు అధికారులతో వారిని బెదిరిస్తున్నారు.ఇక సిండికేట్‌కు అనుకూలంగా బార్ విధానంలో ముందే మార్పులు చేస్తే తమ దోపిడీ కుట్ర బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకే.. తగినంత మంది దరఖాస్తు చేయలేదు కాబట్టి బార్ల యజమానులకు లాభాల మార్జిన్ పెంచుతున్నాం అన్నట్లుగా ప్రజల్ని నమ్మించాలన్నది అసలు తంత్రం. అలాగే, 840 బార్లలో కనీసం 10 శాతం బార్లకు కూడా దరఖాస్తులు రాలేదు కాబట్టి సిండికేట్ దోపిడీకి వీలుగా ఇలా బార్ విధానంలో మార్పులు చేయాలన్నది పచ్చముఠా పన్నాగం. -
టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి కొత్త రూల్.. ఎస్పీకి వార్నింగ్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లా ఎస్పీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వినాయక చవితి వేడుకల్లో డీజేలకు అనుమతి తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేయగా.. డీజేలకు అనుమతి కోరితే ఊరుకునేది లేదంటూ.. మీ అనుమతులు మాకు అక్కర్లేదంటూ శ్రీనివాసులురెడ్డి హుకుం జారీ చేశారు. డీజేలకు అనుమతులు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నా.. అలా తీసుకోవడం కుదరదంటూ ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వినాయక చవితి పందిళ్లు, డీజే మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పనసరి అని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ఇస్తుంటే మీరు ఆంక్షలు పెట్టడం ఏంటంటూ శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు.ప్రభుత్వ నిబంధనలను కూడా అధికార పార్టీ నేతలు ఉల్లంఘిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఏడాదీ ఉత్సవ నిర్వాహకులు అనుమతులు తీసుకుంటున్నారు. అనుమతి ప్రకారం కావాల్సిన భద్రతను పోలీస్‌శాఖ కల్పిస్తోంది. కానీ అనుమతులు తీసుకోవాలంటే.. ఊరుకునేది లేదంటూ శ్రీనివాసులురెడ్డి కొత్త రూల్ పెట్టారు. -
ప్రశ్నించడమంటే ఇదేనా పవనూ: గోరంట్ల మాధవ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారంటూ నిలదీశారు. తన శాఖ అధికారుల మీదే దాడిని ప్రశ్నించలేనప్పుడు పదవికి రాజీనామా చేస్తే బెటర్ అంటూ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు.మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బుడ్డా రాజశేఖరరెడ్డ పవిత్ర శ్రీశైలంలో మద్యం తాగి అటవీశాఖ అధికారుపై దాడి చేశారు. అధికారులను రాత్రంతా తిప్పుతూ దాడి చేశారు. తమ అధికారులపై దాడి చేసినా ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. ఇంత జరిగినా పవన్ తల వంచుకుని కూర్చోవడం సిగ్గుచేటు’’ అంటూ మాధవ్ మండిపడ్డారు.ప్రతిభ కలిగిన పోలీసు అధికారులు ఏపీలో పని చేయలేకపోతున్నారు. కొందరు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. పోలీసులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చంద్రబాబు ఇవ్వకుండా వేధిస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయితే రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసులను దూషిస్తే కనీసం కేసు నమోదు చేయలేదు.బుడ్డా రాజశేఖరరెడ్డిని అరెస్టు కూడా చేయలేదు. పైగా తూతూమంత్రపు కేసు కట్టి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి ఘటనలు తప్ప అని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు?. ప్రశ్నించలేనప్పుడు పవన్ కళ్యాణ్ పదవి కి రాజీనామా చేయాలి. పోలీసులపై దాడి జరుగుతుంటే పోలీసు సంఘం ఏం చేస్తుంది?. ఇంతవరకు కనీసం నోరెత్తి ఎందుకు ప్రశ్నించలేదు. బుడ్డా రాజశేఖరరెడ్డి దౌర్జన్యాలకు చంద్రబాబు అవార్డు ఇస్తాడేమో?’’ అంటూ గోరంట్ల మాధవ్ ఎద్దేవా చేశారు. -
25 ఏళ్ళగా టీడీపీలో ఉండి ఈ రోజు YSRCP లో చేరడానికి ప్రధాన కారణం ఇదే
-
బార్ల లైసెన్సులో.. కూటమి సర్కార్ దొంగాట
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగుల నిరసనలు, బైఠాయింపు, అర్జీలు.
-
మందుబాబులం... మేం మందుబాబులం
గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వేపంజేరి రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)లో కాంట్రాక్టు టీచర్ అయిన టీడీపీ కార్యకర్త మద్యం తాగిన వైనం బయటకు వచ్చింది. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే వ్యక్తి మరో వీడియోలో టీడీపీ నాయకులను దూషించిన వీడియో కూడా బయటకు వచి్చంది. గంగాధర నెల్లూరు మండలం చిన్న వేపంజేరి గ్రామానికి చెందిన దివ్యాంగుడు హరిప్రసాద్ వేపంజేరి ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్. ఈయన టీడీపీ కార్యకర్త. వారం క్రితం ఓ ప్రభుత్వ ఉద్యోగితో కలిసి ఆర్బీకేలో మద్యం తాగాడు.కాగా, ఆదివారం చిన్న వేపంజేరిలో ఓ వ్యక్తి కర్మక్రియలు జరిగాయి. దీంట్లో నాయీబ్రాహ్మణ వృత్తి చేసేందుకు తనను పిలవలేదని హరిప్రసాద్ గ్రామస్థులను దుర్భాషలాడగా, అతనిపై స్థానికుడు ఆనందరెడ్డి చేయిచేసుకున్నాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా హరిప్రసాద్ ఈ వీడియో చిత్రీకరించి పోలీసు ఉన్నతాధికారులకు పంపాడు. ఆనంద్రెడ్డిపై కేసు నమోదైంది. అయితే, గ్రామస్థులు సోమవారం స్థానిక స్టేషన్లో హరిప్రసాద్ విపరీత ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. హరిప్రసాద్ వాహనంపై ప్రెస్ స్టిక్కర్ వేసుకుని అందరినీ బెదిరించి, డబ్బులు తీసుకుని తిరిగివ్వడని పోలీసులకు వివరించారు.నన్నెవరూ ఏమీ చెయ్యలేరు..కాంటాక్ట్ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ... టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్న హరిప్రసాద్ సొంత పార్టీ నాయకులపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ ఎమ్మెల్యేను కూడా అసభ్యంగా దూషించాడు. తననెవరూ ఏమీ చేయలేరని ఎమ్మెల్యే, ఎంపీకి కూడా తన రేంజ్ తెలుసని, తాను తలుచుకుంటే రేషన్ డీలర్లను క్షణాల్లో మార్చేస్తానని, మండల అధ్యక్షుడు సైతం ఏమీ చేయలేడని, సంతకం పెడితే ఎంత పని అయినా అయిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. -
బార్ల లైసెన్సులో.. సర్కారు దొంగాట
సాక్షి, అమరావతి: ‘బార్ల లైసెన్సులకు మేం దరఖాస్తు చేయం.. ఇతరులను చేయనివ్వం’ ఇదీ టీడీపీ సిండికేట్ రాష్ట్రంలో ప్రస్తుతం సాగిస్తున్న హైడ్రామా. ఇందులో మతలబు ఏంటంటే.. మద్యం విక్రయాల ద్వారా భారీ లాభాలు కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలే ఈ పన్నాగం రచిస్తున్నారు. దరఖాస్తులు దాఖలు కాలేదు కాబట్టి లాభాల మార్జిన్‌ను “సిండికేట్’ కోరినంతగా పెంచేందుకు తలొగ్గాల్సి వచి్చందని వారు పకడ్బందీగా ఆడుతున్న దొంగాట ఇది.టీడీపీ ముఠా రక్తికట్టిస్తున్న బార్ల లైసెన్సుల నాటకం గూడుపుఠాణీ ఏమిటంటే.. రాష్ట్రంలో 840 బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసేందుకు ఇంకా 24 గంటలు మాత్రమే గడువు ఉంది. కానీ, సోమవారం నాటి పరిస్థితి ఏమిటంటే.. దాదాపు 2,300 దరఖాస్తుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ వాటిలో కేవలం 72 బార్లకే దరఖాస్తులు దాఖలయ్యాయి.వీటిలో కూడా కనీసం నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలైన బార్లు కేవలం 45 మాత్రమే. కనీసం నాలుగు దరఖాస్తులు వచి్చన బార్లకే లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయిస్తామని ప్రభుత్వ బార్ల పాలసీ ప్రకటించింది. అంటే.. 840 బార్లలో లాటరీ ద్వారా లైసెన్సు ఇచ్చేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నవి కేవలం 45 బార్లే. మరోవైపు.. దరఖాస్తుల దాఖలుకు మంగళవారంటీడీపీ గూండాలు, పోలీసులతో బెదిరింపులుఇంత తక్కువగా దరఖాస్తులు దాఖలు కావడం వెనుక టీడీపీ మద్యం సిండికేట్ వ్యూహాత్మక ఎత్తుగడ దాగుంది. బార్ల దరఖాస్తుల కోసం అయితే ఏకంగా 2,300 మంది రిజి్రస్టేషన్ చేసుకున్నప్పటికీ.. వీరిలో తమ సిండికేట్ కాని వారిని టీడీపీ నేతలు గుర్తిస్తున్నారు. దరఖాస్తు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ పార్టీ గూండాలు, పోలీసు అధికారులతో వారిని బెదిరిస్తున్నారు.పోనీ.. టీడీపీ సిండికేట్ సభ్యులు అయినా ఒక్కో బార్‌కు కనీసం నాలుగు చొప్పున దరఖాస్తులు చేశారా అంటే అదీ లేదు. ఎందుకంటే.. అడ్డగోలు లాభాలు కొల్లగొట్టేలా బార్ పాలసీలో మార్పులు చేయాలన్నదే వీరి అసలు పన్నాగం. ఇందుకోసం రెండు నెలలుగా సిండికేట్–ప్రభుత్వ పెద్దల మధ్య మంతనాలు సాగాయి.పచ్చముఠా పన్నాగం ఇదీ..ఇక సిండికేట్‌కు అనుకూలంగా బార్ విధానంలో ముందే మార్పులు చేస్తే తమ దోపిడీ కుట్ర బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకే.. తగినంత మంది దరఖాస్తు చేయలేదు కాబట్టి బార్ల యజమానులకు లాభాల మారిŠజ్న్ పెంచుతున్నాం అన్నట్లుగా ప్రజల్ని నమ్మించాలన్నది అసలు తంత్రం. అలాగే, 840 బార్లలో కనీసం 10 శాతం బార్లకు కూడా దరఖాస్తులు రాలేదు కాబట్టి సిండికేట్ దోపిడీకి వీలుగా ఇలా బార్ విధానంలో మార్పులు చేయాలన్నది పచ్చముఠా పన్నాగం.మార్జిన్ ఎక్కువ వచ్చేలా ‘ఇన్వాయిస్’ ధర తగ్గింపు..ప్రస్తుతం బార్లకు 105 శాతం ఇన్వాయిస్ ధరకు మద్యం సరఫరా చేస్తున్నారు. అంటే.. ఒక మద్యం బాటిల్ ఎంఆర్పీ రూ.100 అనుకుంటే, ఆ బాటిల్‌ను రూ.105 చొప్పున ఇన్వాయిస్ ధరకు బార్లకు సరఫరా చేస్తున్నారు. ఈ బాటిల్‌ను బార్ల యజమానులు రూ.120కు వినియోదారులకు విక్రయిస్తున్నారు. తద్వారా బార్ల యజమానులకు ఒక్కో బాటిల్‌పై రూ.15 మార్జిన్ వస్తోంది. అయితే, ఈ మార్జిన్‌ను వీలైనంత ఎక్కువగా పెంచి వారికి మరింత మేలు చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం బార్లకు సరఫరా చేసే ఇన్వాయిస్ ధర తగ్గించాలని ఎత్తులు వేస్తోంది.అంటే.. 105 శాతంగా ఉన్న ఇన్వాయిస్ ధరను 90 శాతంగా నిర్ణయించాలని బావిస్తోంది. తద్వారా రూ.100 ఎంఆర్పీ ఉన్న మద్యం బాటిల్‌ను రూ.90కే బెవరేజెస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది. ఆ బాటిల్‌ను ఎంతకు విక్రయించాలన్నది మాత్రం ప్రభుత్వం కచి్చతంగా చెప్పదు. బార్ల యజమానులు మాత్రం యథావిథిగా రూ.120కే విక్రయిస్తారు. అంటే.. ఒక్కో బాటిల్‌పై వారికి రూ.30 చొప్పున లాభం వస్తుంది. ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఒక్కో బాటిల్‌పై రూ.15 చొప్పున చిల్లు పడుతుంది. దీనినిబట్టి టీడీపీ మద్యం సిండికేట్‌కు అడ్డగోలుగా లాభాలు వచ్చేలా చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టడమే చంద్రబాబు ప్రభుత్వ ఎత్తుగడ అన్నది స్పష్టమవుతోంది.నాడూ ఇదే పన్నాగంతో దోపిడీ..2015లో కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇదే రీతిలో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును చీకటి జీవోలతో రద్దుచేసి ఏడాదికి రూ.1,300 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది. ప్రివిలేజ్ ఫీజు తగ్గించాలని మద్యం దుకాణాలు, బార్ల యజమానుల నుంచి విజ్ఞప్తి వచ్చినట్లు కథ నడిపించి.. అందుకే అది రద్దు చేసినట్లు బిల్డప్ ఇచ్చింది.అది కూడా కేబినెట్‌ను బురిడీ కొట్టించి రెండు చీకటి జీవోలు జారీచేసి ఆ ఫీజు రద్దు చేసేసింది. ఇప్పుడు కూడా అదే రీతిలో ఇన్వాయిస్ ధరను తగ్గించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ.. అదే సమయంలో టీడీపీ సిండికేట్‌కు జేబులు నింపేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.బార్ల లైసెన్స్ ఫీజులకూ కోత?బార్ల లైసెన్స్ ఫీజు కూడా భారీగా తగ్గించాలని ఈ సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. రూ.75 లక్షల కేటగిరీ ఫీజును రూ.40 లక్షలకు.. రూ.55 లక్షల కేటగిరీ ఫీజును రూ.30 లక్షలకు, రూ.35 లక్షల కేటగిరీ ఫీజును రూ.20 లక్షలకు తగ్గించేలా పావులు కదుపుతోంది. -
ఓ మంత్రి రాసలీలలు వెలుగులోకి తెచ్చిన సుధాకర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: మంత్రి రాసలీల విషయం బయటపెట్టినందుకు టీడీపీ అధికారప్రతినిధి ఎన్బీ సుధాకర్‌రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి, శాప్ చైర్మన్, రాసలీలల మంత్రి ముగ్గురూ కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్‌రెడ్డి ఇటీవల టీడీపీ ఎల్లో చానళ్లు ఏబీఎన్, టీవీ5 డిబేట్లో మాట్లాడారు.ఆ డిబేట్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంలో టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఓ మంత్రి తిరుపతికి వచి్చన సమయంలో స్టార్ హోటల్లో ఉంటూ మహిళలతో రాసలీలల్లో మునిగి తేలుతుంటారని బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.దీంతో టీడీపీ అధిష్టానం ఆ మంత్రి రాసలీలలు, ఎన్బీ సుధాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. ఆ కమిటీ తిరుపతిలో విచారించినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే... ఇక్కడ రాసలీలల విషయం పక్కకు పోయి, ఎన్బీ సుధాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలనే అంశంపై తెరపైకి వచి్చంది. టీడీపీలోని ముఖ్య నేతలు ఎన్బీపై చర్యలకే పట్టుబడుతున్నట్లు తెలిసింది.పిలిచి అవమానిస్తున్నారా?తిరుపతిలో మానసిక వైద్యులుగా ఉన్న ఎన్బీ సుధాకర్‌రెడ్డి టీడీపీకి వీర విధేయుడు. సోషల్ మీడియా వేదికగా నిత్యం ప్రతిపక్షాలపై విమర్శలు చేసేవారు. ఇదే ప్రామాణికంగా తీసుకుని చంద్రబాబు తనను పిలిచి మాట్లాడారని అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. 2020లో ఓసారి అమరావతికి పిలిపించి ఎమ్మెల్సీ ఇస్తానని, మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. కూటమి అధికారంలోకి రాగానే ఎన్బీకి అధికార ప్రతినిధి హోదా కట్టబెట్టారు.ఏడాదిగా కూటమిలో జరుగుతున్న పరిణామాలు, మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై సన్నిహితులు, పార్టీ శ్రేణుల వద్ద ఎన్బీ తీవ్ర అసహనం వ్యక్తం చేసేవారని సమాచారం. స్టార్ హోటల్లో ఉన్న మంత్రిని కలిసేందుకు వెళ్లినప్పుడు అక్కడ జరుగుతున్న బాగోతాల గురించి తెలిసినట్లు సన్నిహితులతో చెప్పుకునేవారు.అదే విషయాలను ఎల్లో చానల్ డిబేట్లో ప్రస్తావించారు. ఆ విషయాలను జీరి్ణంచుకోలేని టీడీపీ నేతలు ఎన్బీ సుధాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. మంగళవారం అమరావతిలో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు ఎన్బీ సుధాకర్‌రెడ్డి హాజరు కానున్నారు. తనపై చర్యలు తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, సీఎం, మంత్రి లోకేశ -
కొబ్బరి తోటలో కోడిపందాలు నిర్వహిస్తున్న TDP నేత మండా సురేష్
-
బాబు ముఠా బార్ల దందా.. టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టేందుకు కుట్ర
సాక్షి,విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీలో మరో అంకానికి తెరలేచింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 840 బార్లను ఏకపక్షంగా దక్కించుకునేందుకు సిండికేట్ రంగంలోకి దిగింది. ఇతరులు ఎవరూ దరఖాస్తులు చేయకుండా అడ్డుకుంటోంది. దీంతో 840 బార్లలో 72 బార్లకే అప్లికేషన్లు వచ్చాయి. అయితే వీటిల్లో 45 బార్లకు మాత్రమే లాటరీకి అవసరమైన దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఏపీలో మద్యం బార్ల కోసం టీడీపీ సిండికేట్ స్కెచ్ వేసింది. దరఖాస్తులు వేయకుండా టీడీపీ నేతల సిండికేట్ చక్రం తిప్పింది. కమిషన్ భారీగా పెంచుకుని బార్లను దక్కించుకునేందుకు ప్లాన్ చేసింది. రేపటితో బార్ల దరఖాస్తులకు గడువు ముగుస్తుండగా.. 10 శాతం బార్లకు కూడా దరఖాస్తులు దాఖలు కాకపోవడం చర్చాంశనీయంగా మారింది. -
విశ్వనాథ్ రెడ్డి అనుచరులు తనపై దాడి చేశారని యూ ట్యూబర్ ఫిర్యాదు
-
వైఎస్ జగన్‌పై బీఆర్ నాయుడు ఛానల్ విష ప్రచారం చేస్తోంది: భూమన
సాక్షి,తిరుపతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బీఆర్ నాయుడు ఛానల్ విషప్రచారం చేస్తోందని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తిరుమల పర్యటన అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాం కంటే వైఎస్సార్,జగన్ పాలనలోనే కొన్ని వేల రెట్లు హిందూ ధర్మ పరిరక్షణ జరిగింది. జగన్ ఐదేళ్లు సీఎంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీనివాస దివ్య హోమం జగన్ పాలనలోనే ప్రారంభమైంది’ అని స్పష్టం చేశారు. -
పులివెందులలో YSRCPకి ప్రచారం చేశాడని యూ ట్యూబర్ ఆది శేషుపై దాడి
-
యూట్యూబర్ సుంకేశుల ఆదిశేషుపై దాడి
సాక్షి,వైఎస్సార్: యూట్యూబర్ సుంకేశుల ఆదిశేషుపై దాడి జరిగింది. ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆదిశేషు వైఎస్సార్సీపీ తరుఫు ప్రచారం చేశారు.అయితే, వైఎస్సార్సీపీ తరుఫున ప్రచారం చేశారనే నెపంతో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. ఆదిశేషుపై దాడి చేశారు. కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఆదిశేషుకు తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. ఇక ఈ దాడి చేసింది టీడీపీకి చెందిన తుమ్మలపల్లి విశ్వనాథ్‌రెడ్డి అనుచరులేననంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పుట్టపర్తిలో రెడ్‌బుక్.. ఉషాశ్రీచరణ్‌ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి,శ్రీసత్యసాయి జిల్లా: పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషాశ్రీచరణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అర్హులైన వికలాంగులందరికీ పింఛన్లు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వెళ్లిన ఉషాశ్రీచరణ్‌ను అడ్డుకున్నారు. ఉషాశ్రీచరణ్ వెంట వచ్చిన వికలాంగులను కూడా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, మాజీ ఉషాశ్రీచరణ్ మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్ ఎదుట వికలాంగులు నిరసన తెలిపారు.అనంతపురం: నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో వికలాంగులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. వికలాంగులను ఈడ్చి పడేసిన పోలీసులు.. బలవంతంగా అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ ఎదుట వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెరిఫికేషన్ పేరుతో వికలాంగుల పింఛన్లను కూటమి ప్రభుత్వం తొలగించడంపై వికలాంగులు మండిపడ్డారు. తక్షణమే కట్ చేసిన పింఛన్లను వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వికలాంగులతో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామంటూ దివ్యాంగులు హెచ్చరించారు.తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట దివ్యంగులు ధర్నా నిర్వహించారు. అర్హత ఉన్నా తమ పింఛన్లు ప్రభుత్వం తొలగించిందంటూ ఆందోళను దిగారు. దివ్యాంగులకు వైఎస్సార్సీపీ నేతలు మద్దతు ప్రకటించారు. దివ్యాంగులకు పెన్షన్లు పునరుద్ధరించాలంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, గిరిజాల బాబు కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు. 100 శాతం అంగవైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్లు ఇచ్చి మరీ పెన్షన్ తొలగించడం దారుణమని దివ్యాంగులు మండిపడ్డారు.కృష్ణా జిల్లా: తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు నిరసన చేపట్టారు. వైఎస్సార్సీపీ నేత కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో భారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న దివ్యాంగులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్‌ను కలిసి తమ ఆవేదనను చెప్పుకుంటామని దివ్యాంగులు అంటున్నారు. శాంతియుతంగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని దివ్యాంగులు వేడుకుంటున్నారు. -
మీకు ముందు ముందు సినిమా చూపిస్తాం దగ్గుపాటికి ఎన్టీఆర్ ఫాన్స్ స్వీట్ వార్నింగ్
-
ఎమ్మెల్యేల దందాలపై కిమ్మనరేమి బాబు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న అనేకానేక పేర్లలో లీకు వీరుడన్నది ఒకటి. చేసే పనులతో సంబంధం ఉండదు. కానీ తనకు ప్రయోజనం కలిగే ప్రచారం మాత్రమే జరిగేలా జాగ్రత్త పడుతూంటారు. అయితే సోషల్ మీడియా లేని టైమ్‌లో ఈయన గారి చేష్టలు నడిచిపోయాయి కానీ.. ఇప్పుడు అసలు గుట్టును బయటపెట్టేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేల వల్ల చెడ్డపేరు వస్తే సహించనని ఆయన ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో అన్నారట.కూటమి ప్రభుత్వ వైఫల్యాల వల్ల తమకు చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యేలు మొత్తకుంటూంటే.. చంద్రబాబు తెలివిగా దాన్ని తిరిగి ఎమ్మెల్యేలపైనే తోసేసే ప్రయత్నమన్నమాట ఈ వ్యాఖ్య! కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారని అంగీకరిస్తూనే, వారేదో చిన్న తప్పులు చేస్తున్న కలరింగ్ ఇవ్వడం ఇంకోసారి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు లీక్ ఇచ్చి సరిపెట్టుకున్నారు. దీనర్థం... మీరెన్ని అకృత్యాలకు పాల్పడ్డ.. పెద్దగా ఇబ్బందేమీ ఉండదన్న సందేశం పంపడమే!నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం తదితర దందాలు సాగిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. పలువురు మంత్రులపై కూడా విమర్శలున్నాయి. ఈ విషయాలపై చంద్రబాబు ఇప్పటికే 35 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు ఎల్లోమీడియా కథనం. అంటే ఇంకెంతమంది అక్రమ దందాల్లో మునిగి తేలుతున్నట్లు? ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడేదెన్నడు? ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలపై చాలా తీవ్రమైన ఆరోపణలే వచ్చాయి కానీ.. వాటిని కూడా చూసిచూడనట్టుగా సుతిమెత్తటి వార్నింగ్‌లతో సరిపుచ్చేస్తున్నారు తెలుగుదేశం అధినేత.నెల్లూరు జిల్లాకు చెందిన ఒక రౌడీషీటర్, జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ ఇచ్చిన తీరు కలకలం రేపింది. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫారసు చేయడం, ఆ మీదట హోం మంత్రి అనిత ఒత్తిడి కారణంగా హోం శాఖ అధికారులు పెరోల్ మంజూరు చేశారని నిఘా విభాగమే నివేదిక అందించిందట. అయినా బాబు ఎమ్మెల్యేలను కానీ.. మంత్రిని కానీ ఏమీ అనలేదు. మంత్రి ఏమో.... అదేదో ఒవర్లుక్ వల్ల జరిగిందని బాధ్యత నుంచి తప్పించుకోచూశారు. ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ పెరోల్ ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారట.ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారా? లేదా? వీరిపై చర్య తీసుకోవడం మాని వైసీపీ వారు దుష్ప్రచారం చేస్తున్నారని, క్రిమినల్ మాఫియాగా ఉన్నారని చంద్రబాబు అనడంలో అర్థం ఏమైనా ఉందా? ప్రస్తుతం ఏపీ అంతటా టీడీపీ వర్గీయులు మాఫియాగా మారి దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై వేధింపులు తదితర అకృత్యాలకు పాల్పడుతున్నట్లు నిత్యం వార్తలు వస్తుంటే, వాటి గురించి మాట్లాడకుండా వైసీపీపై విమర్శలు చేసి డైవర్ట్ చేస్తే సరిపోతుందా? టీడీసీ ఎమ్మెల్యేల గత చరిత్ర ప్రకారం ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయో ఆయనకు తెలియదా! ఈ పెరోల్ వ్యవహారంలో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఎక్కడ మరిన్ని నిజాలు చెబుతుందో అని అనుమానించి ఆమెను ఏదో కేసులో అరెస్టు చేసి భయపెట్టడం మంచి పాలన అవుతుందా? అన్న చర్చ కూడా ఉంది.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుపై అగ్రోస్ జీఎం రాసిన లేఖ గురించి సీఎం ఏమంటారో తెలియదు. ఒక ఏపీ మంత్రి హైదరాబాద్‌లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారని ఎల్లో మీడియానే రాసింది. ఒక మంత్రి రాసలీలలు అంటూ టీడీపీ అధికార ప్రతినిధే వెల్లడించిన వైనం కనపడుతూనే ఉంది. అయినా చర్యలు నిల్. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీశైలంలో అటవీశాఖ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగిన తీరు పాశవికంగా ఉంది. చెక్ పోస్టు గేట్ తీయలేదని అటవీశాఖ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి భౌతిక దాడికి దిగారని టీడీపీ మీడియా కూడా రాసింది. తప్పనిసరి స్థితిలో బుడ్డా రాజశేఖరరెడ్డిపై కేసు పెట్టారు కాని, బెయిలబుల్ సెక్షన్లు పెట్టి సరిపెట్టారు. అది ఎంత పెద్ద నేరం? అయినా ఇంతవరకు ఎమ్మెల్యేని అరెస్టు చేయలేదు. మొక్కుబడి తంతుగా మార్చారు.ఇక్కడ ట్విస్టు ఏమిటంటే జనసేన నేతను ఏ-1గా కేసు పెట్టారట. దాంతో టీడీపీనే కాకుండా, వారి కేసుల్నీ కూడా జనసేన మోయాలా అన్న జోకులు వస్తున్నాయి. అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కమిటీ వేశారట.అంతే తప్ప ఆ ఎమ్మెల్యేని ఒక్క మాట అన్నట్లు కనినపించలేదు అదే తమకు గిట్టని వ్యక్తులు, తమ అరాచకాలకు మద్దతు ఇవ్వని జర్నలిస్టులపై సైతం చిన్న తప్పు చేసినా, అసలు తప్పు చేయకపోయినా, ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి,పదేసి సెక్షన్లు రాసి బెయిల్ రానివ్వకూడదన్న లక్ష్యంతో జైలుకు పంపిస్తుంటారు. దీనినే మంచి ప్రభుత్వం అనుకోవాలన్నమాట. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా ఎమ్మార్వోని బెదిరించారన్న అభియోగం రాగానే పోలీసులు కేసు పెట్టి స్టేషన్‌కు తీసుకువెళ్లారు.ఆ రోజుల్లో శ్రీధర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నాయకత్వం, 2024 ఎన్నికలలో ఆయనను తమ పార్టీలో చేర్చుకుని టిక్కెట్ కూడా ఇచ్చింది.అలాగే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లపై తీవ్రమైన ఆరోపణలు చేసేవారు. పేకాట క్లబ్ లు నడుపుతారని, అవినీతిపరుడని ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే గత ఎన్నికలలో ఆయనకు గుంతకల్ టిక్కెట్ ఇచ్చారు.అలా ఉంటుంది. చంద్రబాబు స్టైల్. తన పార్టీలో ఉంటే ఎంత తప్పు చేసినా పునీతుడు అయిపోతాడు, అదే వేరే పార్టీవారైతే నోటికి వచ్చిన దూషణలు చేస్తుంటారు.జూనియర్ ఎన్టీఆర్‌ను, ఆయన తల్లిని దూషించారన్న అభియోగాలు ఎదుర్కుంటున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై ఎందుకు చర్య తీసుకోలేకపోయారో ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదు. అలాగే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలపై వచ్చిన అభియోగాలు ఏమీ చిన్నవి కావు.అయినా వారిని ఎవరూ టచ్ చేయలేరు. అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులదేనని సీఎం చెప్పారట.అసలు మంత్రుల మాట వినే ఎమ్మెల్యేలు ఎవరు అన్నది చర్చ. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా..ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అక్రమాలపై ప్రచారం జరగరాదట. ప్రభుత్వం చేసే మంచిపైనే చర్చ జరగాలట. నిజమే ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే ప్రచారం ఆశించడం తప్పుకాదు.కాని మంచి జరిగినా, జరగక పోయినా, అన్నీ జరిగిపోతున్నట్లు ప్రచారం జరగాలని కోరుకోవడమే ఇక్కడ ఆసక్తికర అంశం. ఎమ్మెల్యేలను మందలించినట్లు కనిపిస్తే వారు చేసిన తప్పులన్నీ ఒప్పులయిపోతాయా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
YSRCPకి ఓటేశామని చిత్రహింసలు పెడుతున్నారు.. మా ఆయన్ని మీరే కాపాడాలి జగనన్నా..
-
బాబు ముఠా బార్ల దందా.. వేరేవాళ్లు అప్లై చేస్తే అంతు చూస్తాం
-
బాబు ముఠా బార్ల దందా
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీలో మరో అంకానికి తెరలేచింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 840 బార్లను ఏకపక్షంగా దక్కించుకునేందుకు సిండికేట్ రంగంలోకి దిగింది. ఇతరులు ఎవరూ దరఖాస్తులు చేయకుండా అడ్డుకుంటోంది. టీడీపీ సిండికేట్ కూడా చివరి వరకు దరఖాస్తులు చేయకుండా పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. తద్వారా దరఖాస్తులు రావడం లేదనే సాకు చూపించి బార్ల విధానంలో తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, రాయితీలు దక్కించుకోవాలని సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఈ తతంగం మొత్తం సాగుతుండటం గమనార్హం. రాష్ట్రంలో 840 బార్లకు లైసెన్సుల కేటాయింపు కోసం ఎక్సైజ్ శాఖ ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులు దాఖలు చేసేందుకు ఈ నెల 26వ తేదీ చివరి రోజు. ఇప్పటికి వారం రోజులు అయినా సరే 840 బార్లకు కేవలం 32 దరఖాస్తులే దాఖలయ్యాయి. కనీసం నాలుగు దరఖాస్తులు దాఖలయ్యే బార్లకే లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తామని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తులు దాఖలు చేసేందుకు మరో రెండు రోజులే గడువు ఉంది. అయినా సరే దరఖాస్తులు ఇంత తక్కువగా దాఖలు కావడం వెనుక గూడుపుఠాని జరుగుతోందని ఇట్టే స్పష్టమవుతోంది. ఎవరైనా దరఖాస్తు చేస్తే ఖబడ్డార్.. బార్లకు ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం వెనుక టీడీపీ సిండికేట్ దందా దాగుంది. బెదిరింపులు, దౌర్జన్యాలతో హడలెత్తించి ప్రైవేటు మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకున్న కుట్రనే ఇక్కడా పునరావృతం చేస్తోంది. వాస్తవానికి బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసేందుకు ఇప్పటి వరకు దాదాపు 2 వేల మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. కానీ వారిలో ఏడు రోజుల్లో కేవలం 32 మంది మాత్రమే దరఖాస్తు చేయడం గమనార్హం. తమ సిండికేట్ సభ్యులు కాకుండా ఇతరులెవరైనా బార్లకు దరఖాస్తులు చేస్తే అంతు చూస్తామని కూటమి ప్రజా ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను టీడీపీ సిండికేట్ సేకరించి వడపోస్తోంది. వారిలో తమ సిండికేట్ సభ్యులు కాని వారిని బెదిరించి బెంబేలెత్తిస్తోంది. ఏకంగా డీఎïస్పీ, సీఐ స్థాయి అధికారులు వారిని పిలిపించి మరీ బెదిరిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ‘ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆయనకు ఇష్టం లేకుండా బార్ లైసెన్స్ కోసం ఎందుకు అప్లై చేయడం? లాటరీలో లైసెన్స్ వచ్చినా బార్ బిజినెస్ చేసుకోనివ్వరు. ఎందుకు అనవసర గొడవలు’ అని పోలీసు అధికారులే హెచ్చరిస్తున్నారు. ‘మీరు బార్ పెట్టుకోవడానికి ఎవరూ భవనాన్ని గానీ, ఖాళీ స్థలాన్ని గానీ లీజుకు ఇవ్వరు.. ఇవ్వాలని అనుకున్నా ఎమ్మెల్యే ఇవ్వనివ్వరు. మీ సొంత భవనంలో పెట్టుకున్నా ఎక్సైజ్, పోలీస్ ఆఫీసర్లు ఎప్పుడు పడితే అప్పుడు రైడింగ్లు చేస్తారు. బిజినెస్ జరగనివ్వరు’ అని కూడా అసలు విషయాన్ని కుండబద్దలు కొడుతున్నారు. మరో వైపు టీడీపీ గూండాలు బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు దరఖాస్తు చేయడానికి భయపడుతున్నారు. నేడు, రేపు సిండికేట్ సభ్యులే దాఖలు చేసే ఎత్తుగడచివరి రెండు రోజుల్లో టీడీపీ సిండికేట్ ఎంపిక చేసిన వారే దరఖాస్తులు దాఖలు చేసేలా స్కెచ్ వేశారు. కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చే బార్లకే లైసెన్సుల కేటాయింపు కోసం లాటరీ నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆ ప్రకారం టీడీపీ సిండికేట్ సభ్యుల తరఫునే నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలు చేసేలా పన్నాగం పన్నారు. ఈ నాలుగు దరఖాస్తుల ప్రక్రియ అంతా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని నమ్మించేందుకు కొన్ని ప్రధాన ప్రాంతాల్లో అదనంగా మరో ఇద్దరు ముగ్గురితో కూడా దరఖాస్తు చేయిస్తారు. వారు కూడా టీడీపీ సిండికేట్ వర్గీయులే అయ్యుండేలా గూడు పుఠాణి సాగిస్తున్నారు. ఫలితంగా లాటరీ ద్వారా సిండికేట్‌కే బార్ల లైసెన్సులు దక్కించుకునేలా పక్కాగా స్కెచ్ వేశారు.మరింత అడ్డగోలు దోపిడీకి స్కెచ్ బార్ల విధానంలో తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, మరింత లాభం మార్జిన్ దక్కించుకోవాలని కూడా సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ప్రస్తుత బార్ల విధానం పట్ల వ్యాపారులు ఎవరూ ఆసక్తి కనబరచడం లేదని నమ్మించేందుకు కూడా తక్కువ దరఖాస్తులు దాఖలు అయ్యేలా కథ నడిపిస్తున్నారు. ఇప్పటికే రోజుకు ఏకంగా 14 గంటలు బార్లు తెరచి ఉంచేలా, లైసెన్స్ దక్కిన తర్వాత రెస్టారెంట్ ఏర్పాటు చేసుకునేలా, ఆరు వాయిదాల్లో లైసెన్స్ ఫీజు చెల్లించేలా, ఇతరత్రా సడలింపులు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. అయినా సరే మరింత అడ్డగోలు దోపిడీపై సిండికేట్ గురి పెట్టింది. బార్ల యజమానులను ప్రోత్సహించాలనే సాకుతో లాభాల మార్జిన్ మరింత పెంచేలా, పన్నులు తగ్గించేలా ఒత్తిడి తేవాలన్నది లక్ష్యం. దరఖాస్తుదారుల నుంచి ఆ డిమాండ్ రాగానే వెంటనే ఆమోదించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని సమాచారం. బార్ల యజమానులతో ముందుగా ఇండెంట్ పెట్టించి.. ప్రభుత్వమే తన డబ్బుతో మద్యం కొనుగోలు చేసేలా స్కెచ్ వేశారు. ఇందులోనే పెద్ద కుంభకోణం దాగి ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా జరగలేదు.బాబు రాజ్యం.. మద్యం దోపిడీ భోజ్యం⇒ చంద్రబాబు ప్రభుత్వం అంటేనే టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ రాజ్యం అని మరోసారి కూటమి ప్రభుత్వం రుజువు చేస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం సాగించిన మద్యం దోపిడీకి మించిన స్థాయిలో ఈసారి మహా దోపిడీకి బరితెగిస్తోంది. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మద్యం విధానం ముసుగులో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. ⇒ 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారు. ఆర్థిక శాఖ అనుమతిగానీ, కేబినెట్ ఆమోదం గానీ లేకుండానే 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలు 216, 217 జారీ చేసింది. తద్వారా 2015 నుంచి 2019 వరకు నాలుగేళ్లలో ఏడాదికి రూ.1,300 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ⇒ 4,840 ప్రైవేటు మద్యం దుకాణాలతోపాటు మరో 4,840 పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాలు, బార్లు అన్నీ టీడీపీ సిండికేట్‌కే కట్టబెట్టింది. 43 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 20 డిస్టిలరీలలో 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే (మిగతా ఆరింటికి అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి) అనుమతినిచ్చింది. అంతే కాకుండా బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది కూడా నాటి టీడీపీ ప్రభుత్వమే. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి మరో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టింది.⇒ మొత్తం మీద 2014–19లో రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడింది. ఈ కుంభకోణాన్ని సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ప్రధాన నిందితులుగా అప్పటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలతోపాటు పలువురిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1), (డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పై ఉన్నారు.⇒ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అంతకు మించి మద్యం దోపిడీకి బరితెగించింది. అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిన ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ తీసుకువచ్చింది. మొత్తం 3,736 మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్‌కే కట్టబెట్టింది. దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. ఇక 840 బార్లు కూడా తమ సిండికేట్‌కే కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది. -
చిన్న పరిశ్రమలు చితికిపోతున్నాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఇవి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఫలితంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యూనిట్లు ఇప్పుడు తెగ మూతపడుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖే సాక్షాత్తు పార్లమెంటులో ఇటీవలే వెల్లడించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ ఏడాది జూలై 28 వరకు మొత్తం 2,191 ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతపడినట్లు తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1,401 యూనిట్లు ఈ ఆరి్థక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే 790కి పైగా యూనిట్లు మూతపడ్డాయంటే రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధంచేసుకోవచ్చు. ఎంఎస్ఎంఈలు ఇలా మూతపడుతుండటంతో సుమారుగా 30,000 మంది ఉపాధి కోల్పోయినట్లు అంచనా.షాక్ కొడుతున్న విద్యుత్ బిల్లులు.. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రాగానే బిల్లుల రూపంలో ఎంఎస్ఎంఈలకు గట్టిగా కరెంట్ షాక్ ఇచ్చింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలోని ఎంఎస్ఎంఈలపై విద్యుత్ బిల్లుల భారం విపరీతంగా పెరిగిపోయింది. అలాగే, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం, మానవ వనరుల కొరత, ముడి సరుకుల ధరలు పెరుగుదల, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వంటివి వీటిని వెంటాడుతున్నాయి. విజయవాడ కేంద్రంగా పనిచేసే ఒక ఎంఎస్ఎంఈకి సగటున యూనిట్ ఛార్జీ రూ.13.55 పడితే అదే తమిళనాడులో సగటున యూనిట్ ధర 7–8లుగా ఉంది. అంటే యూనిట్‌కు దాదాపు రూ.6 అదనం. ఈ స్థాయిలో విద్యుత్ బిల్లులు బాదితే ఇతర రాష్ట్రాలతో ఎలా పోటీపడాలని ఆ సంస్థ ప్రతినిధి వాపోయారు. ప్రోత్సాహకాల ఊసేలేదు..ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ ఏడాది ప్రోత్సాహకాలు ఆ ఏడాదే ఇచ్చేస్తాం.. ఇందుకోసం ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ పెడుతున్నామన్న చంద్రబాబు, ఇతర కూటమి నేతల మాటలు నీటిమూటలయ్యాయి. సుమారు రూ.10,000 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో కనీసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇవి ఇవ్వకపోగా వీటిని అడగడానికి వెళ్లిన పారిశ్రామిక ప్రతినిధులను అధికారులు పీ–4 దత్తత అంటూ వేధిస్తున్నారని వారు వాపోతున్నారు. పరిశ్రమ నడపడానికి, జీతాలివ్వడానికి మా దగ్గర డబ్బుల్లేవని చెబుతున్నా.. ఆ సంగతి తర్వాత చూద్దాంలే ముందు రెండొందల బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటన చేయమనడంతో చేసేదిలేక మొక్కుబడిగా ప్రకటన చేసి వచ్చేసినట్లు మరో పారిశ్రామిక ప్రతినిధి చెప్పారు. దీన్నిబట్టి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధంచేసుకోవచ్చు. ఇంకోపక్క ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ప్రభుత్వ శాఖలు కూడా కొనుగోలు చేయకపోవడం, ప్రభుత్వ అసమర్థ విధానాలతో ప్రజల్లో కొనుగోలు శక్తిపడిపోవడంతో ఈ ప్రభావం ఎంఎస్ఎంఈ యూనిట్లపై ప్రత్యక్షంగా పడుతోంది. కోవిడ్ వంటి సంక్షోభం వచ్చినా ఏ ఒక్క పరిశ్రమ మూతపడకూడదన్న ఉద్దేశంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీతో ఆదుకుంది. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం మా ప్రోత్సాహకాలు మాకివ్వండని అడిగితే బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్ల అప్పు తీసుకుంటున్నాం.. రాగానే ఇస్తామని చెప్పి ఆరునెలలు దాటినా చిల్లిగవ్వ ఇవ్వలేదని పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు. సకాలంలో ప్రోత్సాహకాలు విడుదల చేయాలి.. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు అనేక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, అధిక విద్యుత్ ఛార్జీలు, ప్రభుత్వ శాఖల కొనుగోళ్లు లేకపోవడం, టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ లేకపోవడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి తమిళనాడు తరహా విధానం అమలుచేయాలంటూ ఇప్పటికే ప్రభుత్తానికి ఒక నివేదిక ఇచ్చాం. సకాలంలో ప్రోత్సాహకాలు విడుదలచేసి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. – వి. మురళీకృష్ణ, ప్రెసిడెంట్, ఫ్యాఫ్సియా -
ఘనంగా ‘వైఎస్సార్సీపీ ఐటి వింగ్ - ఢిల్లీ చాప్టర్’ ప్రారంభం
సాక్షి, ఢిల్లీ: న్యూఢిల్లీలోని "Constitution Club of India" లో ఢిల్లీ,ఎన్.సి.ఆర్ పరిధిలో నివాసం ఉంటున్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి , పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులతో,వైఎస్సార్సీపీ సానుభూతి పరులతో జరిగిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమంలో ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటి వింగ్ - ఢిల్లీ చాప్టర్’ ను లాంచనంగా ప్రారంభించారు. డిల్లీ, గురుగ్రామ్, నోయిడా, నలుమూలల నుండి వచ్చిన వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ సభ్యులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర ఐటి వింగ్ ప్రెసిడెంట్ పోసింరెడ్డి సునీల్ రెడ్డి , రాష్ట్ర ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు హాజరై వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు..అనంతరం MP గురుమూర్తి మాట్లాడుతూ... TDP కూటమి ప్రభుత్వం జగన్‌పై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఢిల్లీ వేదికగా తిప్పికొడతామని అన్నారు. అబద్ధం పైన పోరాటం లక్ష్యంగా ఢిల్లీ విభాగం పని చేస్తుంది అని ఆయన అన్నారు. పార్టీ బలోపేతం కోసం ఢిల్లీ లో అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో మరిన్ని సమావేశాలు ఢిల్లీ వేదికగా నిర్వహిస్తామని చెప్పారు.ఐటి వింగ్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ ..ఐటీ వింగ్ కార్యకలాపాలు ఢిల్లీలో కూడా మొదలుపెట్టడం చాలా గర్వకారణంగా ఉంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాలలో చేసిన ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ప్రచారం చేయడంలో మనం విఫలమయ్యామని తెలిపారు. కాబట్టి రాబోయే రోజుల్లో నిజాన్ని బలంగా పలికి, అబద్ధాన్ని ఖండించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. అలానే ఈ ప్రోగ్రాం దగ్గరుండి అన్ని చూసుకున్న వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ రెడ్డి, కోఆర్డినేషన్ సభ్యులను అభినందించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు..ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇంత దూరం వచ్చి ఢిల్లీలో స్థిరపడి ఇన్ని సంవత్సరాలు అయినా రాష్ట్రానికి మరలా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నినాదించారు.. అందరి కోరిక తప్పకుండా 2029 సంవత్సరంలో తీరుతున్నది అని విశ్వాసం నెలకొల్పారు.రానున్న రోజుల్లో ఐటి వింగ్ ఆధ్వర్యంలో అన్నీ మెట్రో నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్య మంత్రి చేసుకొనే ఒక బృహత్తర కార్యక్రమంలో ఐటి వింగ్ తన వంతుగా కృషి చేస్తోందన్నారు. మనకు 2024లో ఆశించిన ఫలితాలు రాకపోయిన ఇప్పటికీ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ పాలసీలు, డిజిటల్ ప్రచారం, భవిష్యత్ యూత్ ఎన్గేజ్మెంట్ వ్యూహాలపై చర్చలు జరిపారు. పార్టీలో యువత పాత్రను పటిష్టపరిచేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ప్రముఖులు మాట్లాడుతూ, “డిజిటల్ యుగంలో పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లేందుకు ఐటీ వింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ సమావేశం ద్వారా మనం ఒక కుటుంబంగా కలిసికట్టుగా ముందుకు సాగేందుకు మరో మెట్టు ఎక్కాం” అని తెలిపారు.కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. వీరిలో• రాష్ట్ర ఐటి విభాగం అధ్యక్షుడు: సునీల్ రెడ్డి•రాష్ట్ర ఐటి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు: విజయ్ భాస్కర్ రెడ్డి.ఎన్నారై UK కోఆర్డినేటర్ కార్తీక్ ఎల్లాప్రగడఎన్నారై కెనడా కోఆర్డినేటర్ వేణురాష్ట్ర ఐటీ విభాగం ఉపాధ్యక్షులు హరీష్ రెడ్డి.రాష్ట్ర ఐటీ విభాగం భాగం అధికార ప్రతినిధి జగన్ పూసపాటి.ఢిల్లీ కార్యదర్శులు: శ్రీకాంత్, శామ్యూల్, జోగారావు, పెంచలయ్య, అనిల్, విష్ణువర్ధన్ , సదానంద్, మధుసూదన్.మరియు భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. -
టీడీపీ గూండాల అరాచకం..! నా తమ్ముడిని కత్తులతో..
-
పోలీసులపై మరోసారి స్పీకర్ అయ్యన్న బూతుల పర్వం
-
వినుకొండలో బరి తెగించిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించారు. వైఎస్సార్సీపీ నేత భీమనాథం వెంకటప్రసాద్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. వెంకట ప్రసాద్‌పై కత్తితో దాడి చేశారు. వెంటాడి మరీ వెంకట ప్రసాద్‌పై టీడీపీ గూండాలు కత్తులతో దాడి చేశారు. టీడీపీ గుండాల దాడిలో వెంకట ప్రసాద్, ఆయన తండ్రి గురవయ్య, అన్న వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపపడ్డారు.టీడీపీ నాయకులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయడంతో వెంకట ప్రసాద్ స్పాట్లో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రసాద్ చనిపోయాడని భావించిన టీడీపీ గూండాలు వదిలేసి వెళ్లిపోయారు. గుంటూరు ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. వెంకట ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని.. 48 గంటలు గడిస్తే గాని పరిస్థితి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు.ఈ హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ నేత అంబటి మురళీ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘వినుకొండలో ఇది రెండో దారుణం.. గతంలో రషీద్‌ను అత్యంత దారుణంగా చంపేశారు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. మీరు చేసే ప్రతి ఒక అరాచకాన్ని గుర్తుపెట్టుకుంటాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. -
పోలీసులను బూతులు తిడుతూ.. రెచ్చిపోయిన స్పీకర్ అయ్యన్న
సాక్షి, అనకాపల్లి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులను బూతులు తిడుతూ మరోసారి విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అయ్యన్న తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనకాపల్లిలోని కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్‌పై విరుచుకుపడ్డారు. పోలీసు అధికారులు అని కూడా చూడా బూతులు తిట్టారు. రాయలేని భాషలో అసభ్య పదజాలం వాడారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దొండపూడి గ్రామ దేవత పండగ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, స్పీకర్ వెళ్లే సమయంలో పక్కన ఎస్కార్ట్ లేకపోవడంతో ఇలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్న తీరుపై పోలీసు అధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
దెందులూరులో పచ్చ కుట్రలు.. వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. దాదాపు 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలం దగ్గర దౌర్జన్యం చేసి టీడీపీ నేతలు పోలీసులతో రివర్స్ కేసులు పెట్టించారు. ఈ క్రమంలో 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. నిన్న సాయంత్రం నుండి చాటపర్రు దళిత సర్పంచ్.. గుడిపూడి రఘుని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఏలూరు రూరల్ నుండి రాత్రి పెదపాడు స్టేషన్‌కు పోలీసులు తీసుకువెళ్లారు. పెదపాడు పోలీస్ స్టేషన్ నుండి డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో, వైఎస్సార్సీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు రాత్రంతా పెదపాడు స్టేషన్ వద్దే ఉన్నారు. అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏయూ పరువు గంగపాలు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతోంది. రాజకీయ అనాలోచిత నిర్ణయాలతో పూర్వ వైభవాన్ని కోల్పోతూ వర్సిటీ పరువు గంగపాలు అవుతోంది. శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న యూనివర్సిటీపై ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్’ (ఎన్బీఏ) తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి ఎన్బీఏ గుర్తింపు మూల్యాంకనం కోసం వచ్చిన ఎన్బీఏ నిపుణుల బృందానికి ఏయూ అధికారులు సహకరించలేదని తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. అంతేకాక.. రెండు కవర్లతో బహుమతులు ఎర వేసినట్లు ఆరోపిస్తూ లేఖ రాయడం ఏయూలో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ఏయూ పాలకులు సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. సహకరించని ఏయూ..ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ (స్వయం ప్రతిపత్తి) నేషనల్ బోర్డు ఆఫ్ అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేయగా.. ఎన్బీఏ నిపుణుల బృందం ఈ ఏడాది జనవరి 17 నుంచి 19 వరకు ఏయూని సందర్శించింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజిలో సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు విద్యార్థుల వివరాలు, ఫీజులు, ఫ్యాకల్టీ, ఇతర వివరాలను పరిశీలించే ప్రయత్నం చేసింది. అయితే, ఏయూ అధికారులు బృందం సభ్యులకు సరైన పత్రాలు సమర్పించలేదు. దీంతో.. ఎన్బీఏ బృందం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. అలాగే, ఈ బృందం సభ్యులకు రెండేసి కవర్లతో బహుమతుల ఎరవేశారు. అనంతరం.. ఏయూ నుంచి వెళ్లిపోయిన ఆ బృందం ఎన్బీఏకు నివేదికను సమర్పించే సమయంలో ఏయూ అధికారుల తీరును వెల్లడించింది. దీంతో వివరణ కోరుతూ ఏయూ పాలకవర్గానికి ఎన్బీఏ లేఖ రాసింది. కవర్లలో పెన్నులు, పెన్సిళ్లు ఉన్నాయంట..! ఎన్బీఏ లేఖపై ఏయూ అధికారులు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పత్రాల సమర్పణలో జాప్యానికి సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే కారణమని అందులో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుకాదని, బృందాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయలేదన్నారు. ఇంకా ఏదైనా డాక్యుమెంట్లు అవసరమైతే వెంటనే సమరి్పంచడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే, ఫ్యాకల్టీ విషయంలో కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టామని తెలిపారు. బృందానికి ఇచి్చన ఆ రెండు కవర్లలో ఏయూకు సంబంధించిన గుర్తింపు పత్రాలు, నోట్ ప్యాడ్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఉన్నాయని, దీనిని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు చింతిస్తున్నామని ఏయూ అధికారులు ఆ లేఖలో వివరణ ఇచ్చారు. దిగజారుతున్న ఏయూ ప్రతిష్ట.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏయూ అభివృద్ధిలో దూసుకుపోయింది. నూతన ఆవిష్కరణలకు వేదికగా మారింది. సరికొత్త విభాగాలు, చైర్లు, ఇన్నోవేషన్ హబ్‌లు ఇలా అనేక సంస్కరణలకు అడుగులు పడ్డాయి. ఏయూ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా నాక్ ఏ++ గుర్తింపు లభించింది. అటువంటి ఆంధ్రా యూనివర్సివటీ ప్రస్తుతం రాజకీయ ప్రేరేపిత దాడులు, ప్రొఫెసర్లపై విచారణలకు పరిమితమైంది. దీంతో ఏయూ పూర్వవైభవం తగ్గుతూ వస్తోంది. ప్రతిష్టాత్మక ఎన్బీఏ బృందం ఏయూలో సందర్శించిన సమయంలో వారికి సరైన డాక్యుమెంట్లు అందించకపోవడం ఏయూలో అధికారుల పనితనానికి అద్దం పడుతోంది. మూడ్రోజుల పాటు ముల్యాంకనం జరిగితే.. కనీసం వారికి అవసరమైన సమాచారం అందించకపోవడం ఏయూలో చతికిలపడ్డ పరిపాలనకు నిదర్శనం. ఫలితంగా.. ఎన్బీఏ నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచి్చంది. ఏయూ అధికారుల సుదీర్ఘ వివరణతో ఎన్బీఏ బృందం మరోసారి మూల్యాంకనానికి ఏయూను సందర్శించాలని నిర్ణయించింది. -
రాసలీలల మంత్రి ఎవరు అనగా..!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలోని ఒక టీడీపీ మంత్రి తిరుపతిలో తరచూ రాసలీలు సాగిస్తుండటంపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సదరు మంత్రి కామకలాపాలపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ లీలలను బయట పెట్టింది ఆ పార్టీకి చెందిన నేత కాబట్టే. అదీ ఎల్లో చానల్ వేదికగా. టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్‌రెడ్డి సదరు మంత్రిపై చేసిన సంచలన ఆరోపణలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ మంత్రి తరచూ తిరుపతికి వస్తూ ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగి రాసలీలలు సాగిస్తున్నారంటూ ఓ ఎల్లో మీడియా చానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టడంతో ‘ఇంతకూ ఆ మంత్రి ఎవరు అనగా..’ అంటూ సర్వత్రా చర్చ మొదలైంది. హైదరాబాద్‌లోనూ మంత్రి నీచపు పనులు ‘‘ఆ మంత్రి తరచూ తిరుపతికి వస్తారు. ఆయన వస్తే ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలోనే బస చేస్తారు. ఆయన పక్క గదినే ఓ మహిళకు కేటాయిస్తారు. ఆమె చెబితేనే మంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుంది. నాకు కూడా ఆ మంత్రి అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఆయన ఉన్నన్ని రోజులూ మహిళలతో రాసలీలలు సాగిస్తారు. ఆ మంత్రి గురించి టీడీపీలో అందరికీ తెలుసు. పేరు చెప్పను. ఆ మంత్రి తీరు చూస్తూ ఊరుకోలేక కడుపు మండి ఈ విషయాలు చెప్పాల్సి వస్తోంది’ అంటూ సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కూడా స్పందించారు. టీడీపీ అధికార ప్రతినిధి చెబుతున్న ఆ మంత్రి హైదరాబాద్‌లోని ఖరీదైన హోటళ్లలో నికృష్టపు చేష్టలు చేస్తుంటాడని విమర్శించారు. అతనే పవిత్ర ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోనూ రాసలీలలు సాగిస్తున్నాడని, పదవులు ఇప్పిస్తానని చెప్పి మహిళలను ప్రలోభ పెడుతున్నాడని ధ్వజమెత్తారు. ఈయన హైదరాబాద్‌లో సాగించే ఘన కార్యాలపై గతంలోనూ ఎల్లో మీడియాలోనే కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. అటువంటి మంత్రిపై సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని భూమన డిమాండ్ చేశారు. మంత్రులే ఇలా బరితెగిస్తే, ఇక ఎమ్మెల్యేలు మరీ పేట్రేగిపోరా అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సన్నిహితులు పిలిచే పేరు డార్లింగ్ మంత్రి టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్‌రెడ్డి చెబుతున్న ఆ మంత్రిపై మరిన్నో ఆరోపణలు ఉన్నాయి. ఏపీ మంత్రిగా ఉంటూ.. శుక్ర, శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లలో ఆయన గడుపుతారట. సన్నిహితుల కోసం గదులు బుక్ చేస్తారట. తెలంగాణ, ఏపీకి చెందిన వారితో అక్కడే సెటిల్మెంట్లు చేస్తారట. ఫైళ్లపై సంతకాలూ అక్కడేనట. వారంలో మూడు రోజులు రాసలీలలు, గానా బజానాలతో కాలం గడుపుతారట. తెలంగాణాలో ఏపీ మంత్రి సెటిల్మెంట్ల వ్యవహారం శ్రుతిమించుతోందని అక్కడి ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ కూడా రాసినట్లు గతంలో ఓ పచ్చపత్రిక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ మంత్రే ఇప్పుడు విజయవాడ, తిరుపతిల్లోనూ రాసలీలలు సాగిస్తున్నట్టు సమాచారం. ఆయన సొంత నియోజకవర్గానికి వారంలో ఒక రోజు మాత్రమే వెళతారట. అక్కడ మాత్రం బుద్దిమంతుడుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. బాపట్ల జిల్లాలో అనుచరుల ద్వారా మంత్రి పేకాట స్థావరాలూ నడిపిస్తున్నట్టు భారీ విమర్శలు ఉన్నాయి. ఈ మంత్రిని ఆయన అనుచరులు, సన్నిహితులు ‘డార్లింగ్ మంత్రి’ అని పిలుచుకుంటుండడం కొసమెరుపు.సీఎం గారూ మీ మంత్రిపై చర్యలు తీసుకోండి పదవులు ఇప్పిస్తానంటూ మహిళలను ప్రలోభపెట్టి, హైదరాబాద్, తిరుపతిల్లోని ఖరీదైన హోటళ్లలో వారితో రాసలీలలకు పాల్పడుతున్నమంత్రిపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులే ఇలాంటి నికృష్టపు చేష్టలకు పాల్పడుతుంటే చంద్రబాబు ఎందుకు చోద్యం చూస్తున్నారు? టీడీపీ నేతే మంత్రి రాసలీలల గురించి మాట్లాడారు. ఈ మంత్రి హైదరాబాద్‌లో సాగించే ఘన కార్యాలపై గతంలో ఎల్లో మీడియా పత్రికలోనే కథనం ప్రచురితమైంది. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి. కూటమి నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బట్టబయలు » రాష్ట్రంలో కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల రాసలీలలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని నెలల క్రితం సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనతో సన్నిహితంగా ఉన్న వీడియోను ఓ మహిళ బయటపెట్టి సంచలనం రేపింది. » ఇటీవల గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్లో ఓ మహిళతో మాట్లాడుతూ ముద్దులు పెట్టిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. » శ్రీకాకుళం జిల్లా ఆమదాలవస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అదే జిల్లాకు చెందిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజేటి సౌమ్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ మహిళా ఉద్యోగులను రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాలయానికి రావాలని అనుచరుల ద్వారా ఒత్తిళ్లు చేయించడం వెలుగులోకి వచ్చింది. » పలు చోట్ల వివిధ పనుల కోసం వస్తున్న మహిళల బలహీనతలు, పేదరికాన్ని ఆసరాగా తీసుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లోబరుచుకునే యత్నాలు పలు జిల్లాల్లో వెలుగు చూస్తున్నాయి. రాత్రిళ్లు ఫోన్ చేయడం, ఒత్తిడికి గురి చేయడం ద్వారా లొంగదీసుకునే యత్నాలు దారుణమని ప్రజల్లో చర్చ జరుగుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని, సీఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ ‘ప్రేమఖైదీ’!
సాక్షి, టాస్క్ ఫోర్స్: నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదిగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వెనుక భారీ డీల్ నడిచింది. దశాబ్దకాలం పైగా శ్రీకాంత్ సైన్యంతో నెల్లూరును నేరమయం చేసిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి పెరోల్ ద్వారా అతడిని బయటకు రప్పించేందుకు వ్యవహారం నడిపించాడని పోలీస్ నిఘా వర్గాల విచారణలో తేలినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ నాలుగు జిల్లాల్లో తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. వంద మందికిపైగా సైన్యాన్ని కూడగట్టుకున్నాడు. వారి ద్వారానే సెటిల్మెంట్లు, దందాలు, బెదిరింపులు, చేయిస్తున్నాడని పోలీస్‌శాఖ విచారణలో తేలింది. నెల్లూరుకు చెందిన ప్రజాప్రతినిధి కనుసన్నల్లో శ్రీకాంత్ అతని సైన్యం నడుస్తున్నట్టు తేటతెల్లమైంది. నెల్లూరులో జరిగే సెటిల్మెంట్లు, సింగిల్ నంబర్ల ఆట, బెట్టింగ్, ఆర్థిక నేరాలు అన్నింటినీ అతని ద్వారానే నడిపిస్తూ నగరంలో ప్రజాప్రతినిధితో పెట్టుకుంటే నూకలు చెల్లినట్లే అనే భయాన్ని కలిగించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఫలితంగా దశాబ్దకాలంగా నెల్లూరులో ఆ ప్రజాప్రతినిధిని చూస్తేనే నగర వాసులు వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సు’లతోనే.. శ్రీకాంత్ పెరోల్ విషయంలో సిఫార్సు లెటర్లు ఇచ్చినా రిజక్ట్ చేశారంటూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బుకాయిస్తున్నప్పటికీ వారి ఒత్తిడి, హోంమంత్రి అండతో హోంశాఖ పెరోల్ ఉత్తర్వులు ఇచ్చిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాంత్‌ను బయటకు రప్పించి మరిన్ని సెటిల్మెంట్లతో ప్రజాధనాన్ని దోచేసేందుకు పెరోల్ అస్త్రాన్ని బయటకు తీశారు. అధికారులు అడ్డుపడడంతో కీలక మంత్రికి రూ.2 కోట్ల డీల్ కుదిర్చారన్న ప్రచారం ఉంది. ఆ డబ్బుతోనే పెరోల్‌తోపాటు వచ్చే ఏడాది జనవరిలో స్రత్పవర్తన కింద విడుదలయ్యే ఖైదీల జాబితాలో శ్రీకాంత్ పేరు చేర్చేలా ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం సాగుతోంది.అరుణ వ్యవహారంతోనే వెలుగులోకి.. ఇటీవల పెరోల్లో బయటకు వచ్చిన శ్రీకాంత్ తన సన్నిహితురాలు అరుణనురౌడీ సామ్రాజ్యానికి రాణిని చేసేందుకు తన సైన్యంతో సమావేశం పెట్టడం వల్లే అతని పెరోల్ వ్యవహారం లీకైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రిలో శ్రీకాంత్‌తో అరుణ సన్నిహితంగా ఉన్న వీడియోలూ అతని సైన్యాధిపతి తీసినవేనని తెలుస్తోంది. ఎక్కడ తమ ఆధిపత్యం పోతుందోనని ఆ సైన్యాధిపతి లీకులు ఇచ్చారనే ప్రచారం ఉంది. ఈ వ్యవహారం ఎల్లో మీడియా వైఎస్సార్సీపీకి అంటగట్టేలా చేసిన యత్నాలు బూమ్రాంగ్ కావడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ఇదే అదనుగా కూటమిలోని ప్రజాప్రతినిధి వ్యతిరేక వర్గం ఎల్లో మీడియాలో ఓ వర్గాన్ని ప్రోత్సహించి వ్యవహారాన్ని బజారులో పెట్టేలా చేశారనే ప్రచారం తీవ్రంగా జరుగుతోంది.శ్రీకాంత్ పెరోల్‌కు సిఫార్సు లేఖ ఇచ్చిన మాట వాస్తవమే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు సిటీ: నెల్లూరు కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్‌కు తాను సిఫార్సు లేఖ ఇచి్చన మాట వాస్తవమేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒప్పుకున్నారు. శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాంత్ పెరోల్ కోసం తనతో పాటు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ కూడా లేఖ ఇచ్చారని చెప్పారు. తమ లేఖల్ని జూన్ 16న రిజెక్ట్ చేసిన అధికారులు పెరోల్ ఇవ్వలేమని చెప్పారన్నారు. జూలై 30న హోంశాఖ మంత్రి కార్యాలయం నుంచి పెరోల్‌కు అనుమతి ఇచ్చిందన్నారు. పెరోల్ విషయంలో తమకేం సంబంధం లేదన్నారు. ఇకపై తాను బతికుండగా పెరోల్ కోసం సిఫార్సు లెటర్లు ఇవ్వనని చెప్పారు. ఇది తనకు గుణపాఠం లాంటిదన్నారు. గత ప్రభుత్వంలో కూడా శ్రీకాంత్ పెరోల్‌కు సిఫార్సు లెటర్లు ఇచ్చానని అన్నారు. లేఖలు ఇవ్వడం సాధారణమన్నారు. అధికారులు నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
పరిపాలన మహాపతనం!
‘సుపరిపాలన – తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. తమ తొలి ఏడాది పాలనా ఫలితాలు ఎంత రమ్యంగా ఉన్నాయో యెల్లో మీడియా కళ్లద్దాల్లోంచి లోకానికి చూపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ, ఆ రంగుటద్దాలను బద్దలు కొట్టుకొని మరీ రోజుకో యథార్థం బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా బయటకొస్తున్నది. ఆ చిత్రాల్లో కంచే చేను మేస్తున్న వంచనోదంతం కనిపిస్తున్నది. అండగా నిలబడవల సిన ప్రజా ప్రతినిధుల కళ్లలోంచి జారుతున్న కీచక కిరణాలు కనిపిస్తున్నాయి. వాటి కంపరాన్ని తట్టుకోలేని ఆడబిడ్డల నిస్స హాయత కన్నీటి బొట్టు రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నది. భూమినీ భూగర్భాన్నీ, యేటిలోని ఇసుకనూ, గట్టు మీది మట్టినీ కబళిస్తున్న కబంధ హస్తాలు కనిపిస్తున్నాయి.‘ధిక్కారముల్ సైతుమా’ అంటున్న కంసమామల హింస రచన ఊరూవాడల్ని దాటి అడవులూ, కొండల్లోకి పాకింది.మంత్రుల పేషీలకి మూటలు మోసే బ్రోకరేజి పనులు చేయలేన న్నందుకు తనను శంకరగిరి మాన్యాలు పట్టించారని ఓ అధికారి ఆవేదనతో రాసుకున్న ఉత్తరం వెలుగులోకి వచ్చింది. ‘మా మంత్రిగారు పర్యటనకొస్తే స్టార్ హోటల్లో సేద దీరేందుకు ఏసీ రూమ్, పక్కనే ఇంకో రూమ్ పెట్టుకుని ఆ పనులకే పరిమిత మవుతార’ని సొంత పార్టీ నాయకుడే సర్కార్ వారి ఛానల్లో దండోరా వేశాడు. ఇలాంటి కథలింకెన్నో! వెలుగు చూసిన వాటిలో మంత్రుల లీలలూ, ఎమ్మెల్యేల విన్యాసాలూ, ఇతర నాయకుల కళలూ డజన్లకొద్దీ ఉన్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనేది మన పాత సామెత. ప్రభుత్వ యంత్రాంగంలోని దూడలన్నీ ఇప్పుడు చేలను చడతొక్కుతున్న దృశ్యమైతే అందరికీ కనిపిస్తున్నది. ఆవు గట్టున మేస్తే ఈ పరిస్థితి రాదు కదా! ఎమ్మెల్యేల మీద, నాయ కులు, మంత్రుల మీద జుగుప్సాకరమైన ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఆయన ఫలానా వారి మీద చాలా సీరియస్ అయ్యారనీ, గట్టిగా మంద లించారనీ యెల్లో మీడియాకు ‘విశ్వసనీయంగా’ తెలియవస్తుంది. కథ అంతటితో ముగిసిపోతుంది. ఒకరిద్దరు నేతలనైతే ‘వివరణ’ పేరుతో ముఖ్యమంత్రి పిలిపించినట్టున్నారు. వారు గట్టిగా ఎదురు తిరిగారనీ, దాంతో ఆయన... అయితే ఓకే అని పంపించారని మనకు కూడా విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఆ తదుపరి చర్యలేమీ లేకపోవడమే ఈ నిర్ధారణకు ఆధారం.నైతికంగా, పాలనాపరంగా, రాజకీయంగా ఇంతగా దిగ జారిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూసి ఉండలేదు. ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే యెల్లో మీడియా కూడా దాచిపెట్టలేకపోతున్నది. ముఖ్యమంత్రి సీరి యస్ అయ్యారని చెప్పడం కోసమైనా ఒకటి రెండు ఉదంతా లను వారే స్వయంగా వెలుగులోకి తెస్తున్న వింత పరిణామాన్ని చూస్తున్నాము. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన కొందరు సీనియర్ నాయకులు సైతం దుర్గంధ భరితమైన ఈ ప్రభుత్వ పాలనపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పతనాన్ని స్థూలంగా మూడు భాగాలుగా మనం విభ జించవచ్చు. 1. నేతల విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవ ర్తన, 2. పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసం, 3. రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలు.విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవర్తన ఈ అంశంపై 14 నెలల కాలాన్ని సమీక్షించాలంటే ఓ గ్రంథమే రాయవలసి ఉంటుంది. ఒకటి రెండు వారాలుగా వెలుగు చూస్తున్న కొద్దిపాటి ఉదంతాలను పరికిస్తే చాలు. వ్యవ సాయ శాఖకు అనుబంధంగా ఉండే ఆగ్రోస్ జీఎమ్‌గా పనిచేసి బదిలీ అయిన అధికారి ఈమధ్య చీఫ్ సెక్రటరీకి ఒక ఉత్తరం రాశారు. మంత్రిగారి (అచ్చెన్నాయుడు) పేషీలోని అధికారి ఒకా యన తనను పిలిచి ఆగ్రోస్ కొనుగోళ్లకు సంబంధించిన కమీష న్లను తమకు మాట్లాడిపెట్టే మధ్యవర్తిత్వం చేయాలని సూచించా రని ఆయన ఉత్తరంలో ఆరోపించారు. ఈ పనికి తాను అంగీక రించకపోవడంతో తనను బదిలీ చేసి, అర్హత లేని ఒక జూనియర్ అధికారిని అక్కడ నియమించారని ఆయన సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యా లేదు.తిరుపతి వాస్తవ్యుడైన సుధాకర్‌రెడ్డి అనే సీనియర్ టీడీపీ నాయకుడు ఈ మధ్య ఏబీఎన్ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొ న్నారు. తమ జిల్లాకు రెగ్యులర్‌గా వచ్చే మంత్రి ఫైవ్‌స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగి తన రూమ్‌తోపాటు ఇంకో అనుబంధ రూమ్‌ను కూడా మెయిన్‌టెయిన్ చేస్తాడనీ, పార్టీ వారికి మాత్రం అందుబాటులో ఉండరని ఆరోపించారు. ఎమ్మెల్యేలను అదు పులో పెట్టవలసిన మంత్రులే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక వారి సంగతి చెప్పడానికేముందని ఆయన వాపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన కరుడుగట్టిన రౌడీషీటర్, జీవిత ఖైదీ శ్రీకాంత్‌కు సంబంధించిన పెరోల్ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఆయనకు పెరోల్ ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేలు – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్ ప్రభుత్వానికి లేఖలు రాశారట! జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి కొంతకాలం సమాజంలో గడపడానికి కాలపరిమితితో, షరతులతో కూడిన విడు దలనే ‘పెరోల్’ అంటాము. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే ఇస్తారు. ఈయనకు గతంలో జైలు నుంచి పారి పోయిన రికార్డు కూడా ఉన్నది. అందువల్ల హోంశాఖ అధికా రులు సిఫారసును తిరస్కరించారట! అయితే మంత్రిస్థాయిలో ఆమోదం లభించింది. ఎలా సాధ్యం? డబ్బులు చేతులు మారైనా ఉండాలి. మానవీయ కోణంతోనైనా ఆమోదించి ఉండాలి. లేదా అత్యున్నత స్థాయి ఆదేశాలైనా ఉండాలి. సుగాలి ప్రీతి మీద లేని మానవీయ కోణం రౌడీషీటర్ విషయంలో ఉంటుందా?మంత్రులకు సంబంధించిన పై మూడు ఉదంతాలు చాలా తీవ్రమైనవి. ఆరోపణలు నిజం కాకపోతే సాక్ష్యాధారాలతో కూడిన వివరణలు వారు స్వయంగా ఇచ్చి ఉండవలసింది. ఇక్కడ అర్ధాంగీకారాలు ఉండవు. కనుక ఈ మౌనాన్ని పూర్తి అంగీకారంగానే జనం భావిస్తారు. ఎమ్మెల్యేల కథలైతే బేతాళ కథల మాదిరిగా అనంతం. శ్రీశైలం ఎమ్మెల్యే పుణ్యక్షేత్రం చెక్ పోస్టు దగ్గర గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులపై చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇంత బరితెగింపు ఎలా వచ్చింది? ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపించారు. విసిగి వేసారిన ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. దాని మీద ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. కానీ, ఒక మహిళా ఉద్యోగికి ఎమ్మెల్యే రాత్రిపూట వీడియోకాల్స్ చేయవలసిన అవసరమేమిటనేదే కీలకమైన ప్రశ్న. చోడవరం ఎమ్మెల్యేపైనా, గుంటూరు ఎమ్మెల్యేపైనా వీడియోల సైతంగా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. రామాయంపేట పోర్టు పనుల కాంట్రాక్టర్‌ను కప్పం కోసం స్థానిక ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని యెల్లో మీడియానే రాసింది. ఇలా అనేకమంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారని కూడా ఆ మీడియానే రాసింది. కొస మెరుపుగా అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాయడం మాత్రం మరచిపోలేదు. అయినా ఈ దందాలు పెరుగు తున్నాయే తప్ప తగ్గడం లేదు.రాష్ట్రమంతటా మద్యం ఏరులై ప్రవహిస్తున్నది. నాలుగు వేలకుపైగా లైసెన్స్డ్ షాపులకు అనుబంధంగా భారీ పర్మిట్ రూమ్‌లకు ఈమధ్యనే అనుమతులిచ్చారు. 75 వేలకు పైగా బెల్టు షాపులు ఇప్పటికే గలగలలాడుతున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం 24 వేల కోట్లయితే, మిగిలిన నాలుగేళ్లు నలభై వేల కోట్ల చొప్పున ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం లక్షా 84 వేల కోట్లు. నాయకుల కమిషన్ బెల్ట్ షాపుల్లో 20 శాతం, లైసెన్స్డ్ షాపుల్లో 5 శాతం, పర్మిట్ రూమ్‌లు ఇచ్చిన నేపథ్యంలో 10 శాతంగా చెబుతున్నారు. సగటున 10 శాతం లెక్క వేసినా 18 వేల కోట్ల పైచిలుకు సర్కారు వారి కోటా. ఒక్కో ఎమ్మెల్యే సామ్రాజ్యంలో వంద కోట్లకు పైగానే మద్యం గిట్టుబాటనుకోవాలి.పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసంవాగ్దాన భంగం కూడా పాలనా వైఫల్యం కిందకే వస్తుంది. దానికదే ఒక పెద్ద పరిశీలనాంశం. మేనిఫెస్టోలో అగ్ర ప్రాధాన్య తగా ‘సూపర్ సిక్స్’ను కూటమి ప్రకటించింది. ఈ ‘సూపర్ సిక్స్’ సూపర్ హిట్ అయింది. అన్నీ అమలు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది పూర్తిగా మోసపూరిత ప్రకటనగానే భావించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా వ్యయమయ్యే రెండు ప్రధాన హామీల జోలికి ఆయన అసలు వెళ్లలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేల రూపాయల చొప్పున భృతిని అందజేస్తామని చెప్పారు. ఈ హామీని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. కొత్త ఉద్యోగాల సంగ తేమో కానీ ఉన్న ఉద్యోగాలకు అంటకత్తెర పడుతున్నది. మేని ఫెస్టో హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని కనీసం కోటిమందికి (రాష్ట్రంలో 1.6 కోట్ల కుటుంబాలున్నాయి) లెక్క వేసుకున్నా 14 నెలల్లో 42 వేల కోట్లు బకాయిపడ్డారు.మరో ముఖ్యమైన హామీ ‘ఆడబిడ్డ నిధి’. 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలందరికీ నెలకు 1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. రాష్ట్రంలో ఈ వయసుల్లో ఉన్నవారు సుమారు ఒక కోటి 80 లక్షలమంది (ఓటర్ల జాబితా లెక్కల ప్రకారం, 59 పై వయసు వారిని మిన హాయించగా) ఉన్నట్టు అంచనా. వీరందరికీ తొలి ఏడాది 18 వేల రూపాయల చొప్పున ఎగనామం పెట్టినట్టే! ఇప్పుడు ఈ హామీ ప్రస్తావన కూడా తేవడం లేదు. మిగిలిన నాలుగు హామీ లను అరకొరగా అమలు చేయడం తెలిసిందే. ‘అన్నదాత సుఖీ భవ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగానే గత సంవత్సరం 20 వేలు, ఈ సంవత్సరం అందులో తొలి భాగంగా సగమైనా ఈపాటికి జమ చేసి ఉండవలసింది. కానీ ఇంతవరకు జమ చేసింది 5 వేలు మాత్రమే! ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళ లకు 14 నెలలు ఎగవేసి అనేక మినహాయింపులతో వారం రోజుల కింద ప్రారంభించారు. ‘తల్లికి వందనం’ తొలి సంవ త్సరం రద్దు. రెండో సంవత్సరం కోతలతో అమలు చేశారు. హామీ ప్రకారం ఈపాటికి ప్రతి ఇంటికీ నాలుగు ఉచిత గ్యాస్ బండలు అంది ఉండాలి కానీ, చాలాచోట్ల ఒకటి మాత్రమే అందింది.ఒక బస్తా యూరియా సంపాదించడం కోసం రైతన్నలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఇంటి దగ్గరికి నడిచొచ్చిన జగన్ రోజులెక్కడ, ఈరోజులు ఎక్కడని జనం బేరీజు వేసుకుంటున్నారు. పెన్షన్ ఎగవేసి కడుపు కొట్టినందుకు ఆవేదనతో దివ్యాంగులు నడి రోడ్లపై ధర్నాలు చేయడం ఎప్పుడైనా చూశామా? కంటికి కనిపిస్తున్న అంగవైకల్యానికి సర్టిఫికెట్ ఇవ్వాలంటే లంచాలడుగు తున్న నికృష్టమైన అవినీతి వ్యవస్థ అమల్లోకి వచ్చింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్న దని విమర్శించి 14 నెలల్లోనే ఆయన 60 నెలల్లో చేసిన అప్పులో 56 శాతం చేసేశారు. ప్రాథమిక వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారు. జగన్ ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో సహా వైద్యరంగాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్నారు. పేద పిల్లలను నాణ్యమైన విద్యకు దూరం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకత లేదు. వాటిని లోతుగా పరిశీలించిన వారెవరికీ ఆ ప్రాజెక్టులు గట్టెక్కు తాయన్న నమ్మకం లేదు. మేము అధికారంలో ఉన్నంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానీయమని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆరు వేలమంది కార్మికు లను తొలగించారు. 32 విభాగాలను ప్రైవేట్‌పరం చేయడానికి టెండర్లు పిలిచారు. ముడి పదార్థాల సరఫరా నియంత్రణ, విద్యుత్‌ను అందజేసే థర్మల్ ప్లాంట్లలో 44 విభాగాలు, బ్లాస్ట్ ఫర్నేస్‌కు సంబంధించిన కీలక విభాగాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నవనాడుల్ని తెగ్గోసిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఊపిరి మిగిలి ఉంటుందా? ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రజల పరిస్థితి దిగజారిపోయిందనడానికి జీఎస్టి వసూళ్లే పెద్ద సాక్ష్యం. ఇక వ్యవస్థల విధ్వంసం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పోలీసు యంత్రాంగాన్ని ఈ స్థాయిలో ప్రైవేట్ సేనగా మార్చేసిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ఉన్నత న్యాయస్థానం కూడా ఈ ధోరణిపై పలు మార్లు చీవాట్లు పెట్టవలసి వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏరకంగా భ్రష్టుపట్టిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. ఐఏఎస్ అధికారులు తనకు ఎదురొచ్చి కుర్చీ వేయలేదని మండిపడ్డ ఒక ఎమ్మెల్యేను చూశాము. ప్రభుత్వ అధికారులను బండబూతులు తిడుతున్న నాయకులను చూస్తున్నాము. అధికా రులు తమకు కమీషన్ ఏజెంట్లుగా పనిచేయాలని డిమాండ్ చేస్తున్న మంత్రుల పేషీలను చూస్తున్నాము. ప్రభుత్వ యంత్రాంగాన్ని చివరకు ఎక్కడిదాకా నడిపిస్తారో తెలియని అగమ్య గోచరంగా పరిస్థితి మారింది.రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలుచంద్రబాబు రాజకీయ అవకాశవాదాన్ని గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇతర రాజకీయ పార్టీలతో తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన పెళ్లిళ్లు, తీసుకున్న విడాకులు న భూతో న భవిష్యతి. ఎన్డీఏ ప్రభుత్వాల్లో ఆయన ఇప్పటికి మూడుసార్లు చేరారు. మొదటిసారి విడాకులు ఇచ్చినప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించారు. రెండో విడా కుల తర్వాత ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడటాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. తొలి రోజుల్లో కమ్యూనిస్టులతో స్నేహం చేసి ఉమ్మడి రాష్ట్రంలో వారిని నిర్వీర్యం చేసేదాకా ఆయన నిద్రపోలేదు. ఇలా జెండాలు మార్చడం ఒక భాగమైతే, ఒక కూటమితో కాపురం చేస్తూ మరో కూటమితో రహస్య స్నేహం చేయడం రాజకీయ విలువల పతనానికి పరాకాష్ఠ. జగన్మోహన్రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో టీడీపీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్‌తో రహస్య స్నేహం మొదలు పెట్టారు. 2012లోనే ఈ విషయంపై ‘రహస్య మిత్రులు?’ పేరుతో ‘ఇండియా టుడే’ కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది.అప్పుడు మొదలైన స్నేహం పుష్కరకాలం దాటినా అవిచ్ఛి న్నంగా కొనసాగుతూనే ఉన్నది. 2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒక కూటమిగా కూడా పనిచేశాయి. నేరారోపణకు గురై 30 రోజులు కస్టడీలో ఉన్న ప్రధాని, ముఖ్య మంత్రుల పదవులు కోల్పోయేలా రూపొందించిన బిల్లుపై ఈమధ్య పార్లమెంటులో తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ చంద్రబాబును పదవిలోంచి తొలగించేందుకే ఈ బిల్లు పెట్టారని ఆరోపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శత్రు కూటమిలో ఉన్న రహస్య మిత్రుడి కోసం ఇంకా కాంగ్రెస్ తాపత్రయపడుతూనే ఉన్నది. ఆ పార్టీ ఆంధ్ర, తెలంగాణా విభా గాలు ఇప్పటికే బాబు అభీష్టానికి అనుగుణంగా పనిచేస్తున్నా యనేది ఆ రాష్ట్రాల ప్రజలకు తెలిసిన సంగతే. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే బాబు ‘ఇండియా కూటమి’లో చేరిపోతారని ఇటీవల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా చేసిన ఉపన్యాసం కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాంగ్రెస్ ఎం.పి. మల్లు రవి ఈమధ్యన ఒక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు. పార్టీ గుర్తు కోసం ఎన్టీఆర్ – చంద్రబాబుల మధ్య జరిగిన వివాదంలో తీర్పు చెప్పిన బెంచిలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కూడా ఉన్నారు కనుక అందుకు కృతజ్ఞతగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను బాబు సమర్థించాలని రవి విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తులు సాక్ష్యాలు, ఆధారాల ప్రాతి పదికన తీర్పులు చెబుతారు. అందుకు దశాబ్దాల తర్వాత కూడా కృతజ్ఞత చూపెట్టడం దేనికో... ఈ సందర్భంలో కాంగ్రెస్ నేతలు బాబుపై ఇలా కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే రాహుల్ – బాబుల మధ్యన హాట్‌లైన్ లేదంటే నమ్మశక్యమా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘నాకు లేని ల్యాప్‌టాప్‌ను సిట్ ఎలా స్వాధీనం చేసుకుంటుంది?’
సాక్షి, తిరుపతి: చంద్రబాబు తన పాలనా వైఫల్యాల నుంచి, తన దుర్మార్గాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి లేని లిక్కర్ వ్యవహారాన్ని సృష్టించారని మాజీ డిప్యూటీ సీఎం కే.నారాయణస్వామి మండిపడ్డారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జీడీనెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కె.కృపాలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడారు. కేవలం కక్షసాధింపుల కోసం లిక్కర్ స్కాం అంటూ ఒక బేతాళ కథను తయారు చేసి, దాని ద్వారా తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు కుట్రను అమలు చేస్తున్నాడని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇందులో భాగంగానే మా పార్టీకి చెందిన నాయకుల్ని, మచ్చలేని రిటైర్డ్ అయిన అధికారులను కూడా అరెస్టు చేసి చంద్రబాబు మానసిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. దీనికి కొనసాగింపుగానే 76 ఏళ్ల వయస్సున్న నాపై కూడా చంద్రబాబు కుట్ర పన్ని, విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..వృద్ధాప్యం కారణంగా నాకు ఆరోగ్యం బాగోలేదు. అందుకనే నేను గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని, నా కుమార్తెకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వైఎస్ జగన్ నా కుమార్తెకు టిక్కెట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్న సిట్ వాళ్లు వచ్చి దర్యాప్తు పేరిట నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఎక్సైజ్ మంత్రిగా అయిదేళ్ళ పాటు పనిచేశాను.'నాకేమీ తెలియదు, నాపైన ఉన్న వారు అన్ని నిర్ణయాలు చేశారు' అని ఎలా చెబుతాను? అలా చెప్పాను అని అంత బాధ్యతారహితంగా ఎల్లో మీడియాలో ఎలా కథనాలు రాశారో అర్థం కావడం లేదు. నా ఇంటికి సిట్ బృందం వచ్చినప్పటి నుంచి నన్ను అరెస్ట్ చేస్తున్నారని, మా ఇంట్లో ఉన్న డబ్బును లెక్కిస్తున్నారని, ఏదో స్వాధీనం చేసుకుంటున్నారంటూ ఇలా కసీ, ద్వేషం, పగతోనే నాపైన తప్పుడు బ్రేకింగ్‌లు, స్క్రోలింగ్‌లు వేశారు. తప్పుడు కథనాలు రాశారు.నా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తూనే పదవులను అందుకున్నాను. నాపైన ఎప్పుడూ ఎటువంటి ఆరోపణలు లేవు. సిట్ వాళ్లు దర్యాప్తులో తాము చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటిదీ తేల్చలేకపోయినా, వాళ్లేదో కనిపెట్టినట్టుగా కట్టు కథలు అల్లుతున్నారు. వాటినే ఈ ఎల్లో మీడియా రాస్తుంది. వాటినే ఛార్జిషీట్లలో పెట్టడం కూడా మనం చూస్తున్నాం. అంతకుమించి సిట్ వాళ్లు చూపించిన ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేవు. ఈ లిక్కర్ వ్యవహారం అక్రమ కేసని తేల్చిచెప్పడానికి ఇంతకన్నా రుజువులు అవసరం లేదు.ఎల్లోమీడియా రాతలకు అడ్డూ అదుపు లేదునాకు ల్యాప్‌టాప్ లేకపోయినప్పటికీ నిన్న సిట్ వాళ్లు ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్టు తప్పుడు రాతలు రాశారు. నేను ఎప్పుడూ ల్యాప్ టాప్ వాడలేదు, ఉపయోగించడం కూడా నాకు తెలియదు. సిట్ వాళ్లు కూడా మా ఇంటి దగ్గర నుంచి ఎలాంటి ట్యాప్ టాప్‌ను తీసుకెళ్లలేదు. మరి ఈ తప్పుడు ఎలా రాయగలుగుతున్నారు? చివరకు సిట్ వాళ్లు నా ఫోన్‌ను తీసుకున్నారు. నా ఫోన్ తీసుకుని వాళ్లేం చేస్తారు? నా లాంటి వాడు ఈ ఫోన్లను ఎంతవరకూ వాడతాడు?అయినా ఏదో ఉందని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. మద్యపానం వల్ల కుటుంబాల్లో వస్తున్న సంక్షోభాలు, ఆరోగ్య సమస్యలు, విచ్చలవిడి విక్రయాల కారణంగా వస్తున్న సామాజిక సమస్యలు, మహిళల భద్రత, వారికి రక్షణ తదితర అంశాలపై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు కాగానే లిక్కర్ వినియోగాన్ని నియంత్రించడంపై దృష్టిపెట్టాం. లాభాపేక్ష ఉన్న ప్రైవేటు వ్యాపారుల వల్ల విక్రయాలు, వేళల్లో నియంత్రణ లేకపోవడం, మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడ్డం, వీధికో బెల్టుషాపులు పెట్టి మద్యాన్ని డోర్ డెలివరీ పద్ధతిలో అందుబాటులోకి తీసుకురావడం… ఇవన్నీ చూసిన తర్వాత వీటికి కళ్లెం వేస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు పెట్టాం. వేళల్ని నియంత్రిస్తూ, లిక్కర్ వినియోగాన్ని తగ్గించాం. మాఫియాకు అడ్డుకట్ట వేశాం.పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేశాంటీడీపీ ప్రభుత్వ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారా చివరి ఏడాది 2018–19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే, మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023–24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, మద్యం అమ్మకాలు తగ్గాయి. ఆదాయం ఎందుకు పెరిగిందంటే, పన్నులువేశాం. ఆవిధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది ఐఎంఎల్ 3.84 కోట్ల కేసులు, బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడు పోతే, మా ప్రభుత్వ చివరి ఏడాదిలో ఐఎంఎల్ 3.32 కోట్ల కేసులు, బీర్లు 1.12 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి. అత్యంత పారదర్శరకంగా మద్యం పాలసీని అమలు చేయడం వల్ల, లిక్కర్ వినియోగం తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, 2014-19తో పోలిస్తే పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ లెక్కలన్నీ ప్రభుత్వ వద్దే ఉన్నాయి.ఇంత పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేస్తే, మాపై తప్పుడు కేసులు పెట్టి, రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. మద్యం దుకాణాలనే ప్రభుత్వమే నిర్వహిస్తున్నప్పుడు, లాభాపేక్ష లేకుండా వాటిని నడుపుతున్నప్పుడు, ప్రైవేటు విక్రయాలకు పులిస్టాఫ్ పెట్టినప్పుడు చంద్రబాబు ఆరోపిస్తున్నట్టుగా స్కాంకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? మాపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు? మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మా హయాంలో అమ్మకాలు తగ్గితే, చంద్రబాబు హయాంలో పెరిగాయి.మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మేం ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మితే, చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాడు. వాళ్లంతా మాఫియాలా ఏర్పడి దోచుకున్నారు. విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? మా హయంలో అమ్మకం వేళలు తగ్గించాం. చంద్రబాబుగారు రాత్రీ పగలూ లేకుండా అమ్మించారు.చంద్రబాబు హయాంలోనే మద్యం అవినీతిమద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మేం దుకాణాలు తగ్గించాం. కాని చంద్రబాబు విచ్చలవిడిగాద మద్యం దుకాణాలు, బార్లు, పర్మిట్ రూమ్స్ పెట్టాడు. దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టుషాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? మేం 43 వేల బెల్టుషాపులు రద్దుచేశాం. వీధి వీధికీ చంద్రబాబు బెల్టుషాపులు పెట్టాడు. ఆలయాల వద్దా, స్కూళ్ల వద్దా ఇలా ప్రతి చోటా బెల్టు షాపులు పెట్టాడు. ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? చంద్రబాబు హయాంలో పూర్తి వివక్ష పాటించాడు.అస్మదీయులైన తనవాళ్లకే ఆర్డర్లు ఇచ్చాడు. మరి ఎవరిది అవినీతి?. ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలువస్తాయా? రాష్ట్రంలో ఉన్న డిస్టరీలకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబే. మేం ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మరి ఎవరిది అవినీతి.అన్నిటికీ మించి 2014-19 మధ్య చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజులను రద్దుచేసి, అధికార దుర్వినియోగం చేసి, సుమారు రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు. దీనిమీద మా ప్రభుత్వం హయాంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులో చంద్రబాబు ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. దాన్ని మరుగున పరచడానికి, తాను అవలంబించిన తప్పుడు విధానాలు సరైనవే అని చెప్పుకోవడానికి, మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. మేం వివక్షకు పాల్పడుతున్నామని ఆరోపిస్తూ అప్పట్లోనే కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాకు కంపెనీలు వెళ్లాయి. ఆ కేసును కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. మా పారదర్శకతకు ఇది నిదర్శనం. అయినా మాపై బురదజల్లుతూనే ఉన్నారు.కూటమి ప్రభుత్వంలోనూ అదే దోపిడీఇవాళ మంచి ప్రభుత్వం అంటూ డబ్బాలు కొట్టుకుంటున్న ఈ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ పూర్తిగా అవినీతి మయం. ఇష్టానుసారం దోచుకుంటున్నారు. విలచ్చవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారు. తెల్లవారు జాము మొదలుకుని మళ్లీ తెల్లవారుజాము వరకూ మందు అమ్ముతున్నారు. ఎమ్మార్పీ రేట్లకు మించి లిక్కర్ అమ్ముతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్‌లు పెట్టి అమ్ముతున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులకు వేలం పాటలు పెడుతున్నారు. ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నారు. మొత్తం మాఫియా మయమే. వేల కోట్ల రూపాయాలు దోచుకుంటున్నారు. కింద నుంచి పై స్థాయివరకూ ఈ లంచం సొమ్ము చేరుతుంది. నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇంతటి అవినీతి చూడలేదు. పైగా ఈ అవినీతి బాగోతానికి మంచి పాలసీ అని ముద్రవేసి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ..ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పనులు చేసిపెట్టినట్లు నిరూపిస్తే విషం తాగి చనిపోతాను. లిక్కర్ పాలసీలో ఏం తప్పు జరిగిందని అప్రూవర్‌గా మారాలి? దళిత, బలహీనవర్గానికి చెందిన నాయకుడిననే నా వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు కథనాలు రాశారు. నా ఇంట్లో ఎనిమిది కోట్ల రూపాయలు సిట్ అధికారులు లెక్కించి తీసుకుపోయారంటూ ఎలా ఎల్లో మీడియాలో స్క్రోలింగ్‌లు వేశారు. రికార్డులు స్వాధీనం చేసుకున్నారని రాశారు. ఇది సమంజసమా?. అన్ని అర్హతలు ఉన్న దివ్యాంగుల పెన్షన్లలోనూ కోతలు పెడుతున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. దీనిలో కేవలం అయిదు కేటగిరిలకే ఎందుకు పరిమితం చేశారు? వీటిపై మాట్లాడితే పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వేధిస్తున్నారు. చివరికి జిల్లా కలెక్టర్ వద్ద సమస్యలపై వెళ్ళినా ఏ పార్టీ అని రాస్తున్నారు -
ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క: ఏపీ జేఏసీ అమరావతి
సాక్షి, విజయవాడ: మూడు నెలల్లో పెండింగ్ బకాయిలు క్లీయర్ చేయకపోతే పోరుబాట పడతామని చంద్రబాబు సర్కార్‌ను ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరించింది. ఇవాళ(శనివారం) కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వంపై మా వైఖరీలో ‘‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క’’ అంటూ తేల్చి చెప్పింది. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ.. ఏడాది దాటినా కానీ.. సీఎం, కేబినెట్ ఉపసంఘం మాతో చర్చించలేదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు తీరుస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. జూన్‌లో జరగాల్సిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆగస్టులో జరిగాయి. ఏ అంశం పరిష్కారం కాలేదు’’ అని ఆయన మండిపడ్డారు.‘‘ఒక్కో ఉద్యోగికి మూడు నుండి 5లక్షలు, రిటైర్డ్ ఉద్యోగులకు 15 నుండి 20 లక్షలు బకాయిలు ఉన్నాయి. సీఎస్ఎంఎఫ్లో సంబంధం లేకుండా ప్లే స్లిప్‌లో మా బకాయిలు చూపించాలి. నాలుగు డీఎలు పెండింగ్‌లో ఉన్నాయి. డీఏ, ఐఆర్ కోల్పోవడం, బకాయిలు ఇవ్వకపోవడంతో వేల కోట్లు నష్టపోయాం. మా హక్కును మేం అడుగుతున్నాం. మూడు నెలల్లో బకాయిలు చెల్లించకపోతే పోరుబాట పడతాం’’ అని బొప్పరాజు చెప్పారు.ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి దామోదర్ మాట్లాడుతూ.. ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చానని చెప్పిన పవన్ ఇప్పుడు మాట్లాడటం లేదు. 2023 నుంచి ఐఆర్ రావాలి. వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. మా సమస్యలు పరిష్కరించకుంటే ఎటువంటి ఉద్యమాకైన సిద్ధం. ప్రభుత్వ స్థలాలు, ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వ్యాపారవేత్తలకు అప్పగిస్తే సంపద సృష్టి జరగదు. -
నాకు నటించాల్సిన అవసరం లేదు కూన రవికుమార్ బండారం బయటపెట్టిన సౌమ్య
-
‘చంద్రబాబు కుట్ర.. దివ్యాంగుల నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారు’
సాక్షి, తాడేపల్లి: దివ్యాంగులను కూడా చంద్రబాబు సర్కార్ వేధిస్తోందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్లు తొలగింపుపై బాధితులతో కలిసి కలెక్టర్‌ని కలుస్తామని తెలిపారు. దివ్యాంగుల నోటి దగ్గర కూడును చంద్రబాబు లాగేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో అర్హుందరికీ పెన్షన్ ఇచ్చారు. చంద్రబాబు ఐదు లక్షల పెన్షన్ల తొలగింపునకు కుట్ర పన్నారు. ఎన్నో ఏళ్లుగా పెన్షన్లు పొందుతున్న వారికి కూడా ఇప్పుడు కట్ చేశారు’’ అంటూ మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘బాధితులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా చంద్రబాబుకు కనపడటం లేదు. దివ్యాంగులకు వైఎస్ జగన్ హయాంలోనే న్యాయం జరిగింది. చంద్రబాబు హయాంలో 55 సదరన్ క్యాంపులు ఉంటే.. వాటిని జగన్ 171కి పెంచారు. దివ్యాంగులకు మేలు చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే పెన్షన్లు అందించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పెన్షన్లను తగ్గించే కుట్ర చేసింది’’ అంటూ మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు.‘‘పెన్షన్లు రాలేదన్న బాధతో చల్లా రామయ్య అనే బాపట్ల యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అడ్డుకోబోయిన 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసు పెట్టారు. ఇదేనా పరిపాలన అంటే?. లంచాలు ఇస్తే వైకల్యం పెంచేలా సర్టిఫికేట్లు ఇవ్వటం అత్యంత దారుణం. సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌ని కలుస్తాం. మా నియోజకవర్గంలో తొలగించిన 2,500 పెన్షన్ల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వక పోగా లక్షలాది పెన్షన్లు తొలగింపు అన్యాయం’’ అని మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. -
Botsa: మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి
-
స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి: బొత్స
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. దోచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతారు కానీ.. చర్యలు మాత్రం ఉండవా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. దోపిడీలు దౌర్జన్యాలు భూ కబ్జాలు పెరిగిపోయాయి.అర్హత కలిగిన వికలాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారు. వికలాంగులను తీసుకొని కలెక్టర్లను కలుస్తాం. ఈనెల 30 లోపు సమస్య పరిష్కరించాలి. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా?. దివ్యాంగుల తరఫున కూడా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పారు. 32 విభాగాలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి. vదేశంలో ఎక్కడా లేనివిధంగా ఎందుకు జరుగుతుంది. ఈనెల 30 తేదీన విశాఖలో జరిగే జనసేన సమావేశంలో స్టీల్ ప్లాంట్‌పై పవన్ కళ్యాణ్ తన వైఖరి చెప్పాలి. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా గిన్నిస్ బుక్ గురించి ఆలోచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడలేదు. చంద్రబాబు, పవన్‌కు ప్రధానిని అడిగే బాధ్యత లేదా?. రాజకీయ, ప్రజా కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. స్టీల్ ప్లాంట్‌పై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే ప్రధాని దగ్గరకు వెళ్తాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలతో కలిసి వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటానికి అందరూ కలిసి రావాలి’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు సంఖ్య బలం ఉన్నపుడు పోటీ పెట్టడానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం. ప్రణబ్ ముఖర్జీ, రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, కోడెల శివ ప్రసాద్ ఎన్నికకు మద్దతు తెలిపాం. ఇండియా కూటమి అభ్యర్థి జడ్జిగా ఉన్నప్పుడే చంద్రబాబుకు సైకిల్ సింబల్ వచ్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. చంద్రబాబు ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్టు చేస్తారా? అని ప్రశ్నించారు. -
తెలుగు సెంటిమెంట్ పండుతుందా?
మోకాలికి... బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే. రెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకునే పక్షానికే తాము ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతి ఇస్తామని బీఆర్ఎస్ చెప్పడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆమల్లోకి రావాలంటే కాంగ్రెస్ అధ్వర్యంలో ఇండియా కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తెలుగువాడైన జస్టిస్ సుదర్శన రెడ్డిని గెలిపించుకోవడానికి తెలుగు రాష్ట్రాల ఎంపీలు అందరూ కలిసి రావాలని కూడా ఆయన కోరారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధాని అయినప్పుడు ఆయన లోక్ సభకు ఎన్నిక అవ్వడానికి అప్పటి టీడీపీ అధినేత ఎన్టీ రామారావు మద్దతిచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో సెంటిమెంట్ రాజకీయాలు పనిచేసే అవకాశం తక్కువే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పాయింట్మెంట్ ఇస్తే తాను కలిసి మద్దతు కోరతానని రేవంత్ రెడ్డి అంటే, కాంగ్రెస్ ఒక చిల్లరపార్టీ అని, రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతిచ్చే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తేల్చేశారు. మరో వైపు తాము బీఆర్ఎస్ మద్దతు కోరలేదని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్తో సంబంధాలు పెట్టుకోవడానికి బీజేపీ ఇష్టపడడం లేదన్నమాట. తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్‌ను సంప్రదించలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.మరోవైపు జస్టిస్ సుదర్శనరెడ్డి.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తనకు సత్సంబధాలు ఉన్నట్టుగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ తెలంగాణకు చెందిన పార్టీ. ఆ రాష్ట్రానికే చెందిన ప్రముఖుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతివ్వడం ఒక నైతిక బాధ్యత. జస్టిస్ సుదర్శనరెడ్డి పట్ల వీరికి వ్యతిరేకత కూడా ఉండదు కానీ ఆయన కాంగ్రెస్ కూటమి పక్షాన పోటీలో ఉండడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా బీఆర్ఎస్ పోటీపడుతోంది. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతు ఇస్తే, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయన్న బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుందన్నది వారి భయం కావచ్చు.అలాగని బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతిస్తే బీజేపీ, బీఆర్ఎస్లు కలిసిపోయాయన్న కాంగ్రెస్ ప్రచారానికి బలం చేకూరినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు ఉన్న నాలుగు ఓట్లు ఎవరికి పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. తటస్థంగా ఉండే అవకాశం ఉంది. పీవీ నరసింహరావు నంద్యాల నుంచి లోక్‌సభకు పోటీ చేసినప్పుడు టీడీపీ ఆయనకు మద్దతిచ్చిన మాట వాస్తవమే కానీ.. తరువాతి కాలంలో పీవీ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు టీడీపీని చీల్చి ఏడుగురు ఎంపీలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. పైగా... పీవీ ప్రధానిగా ఉండగా.. ఆ తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న విషయాన్ని బీజేపీ, బీఆర్ఎస్లు ఇప్పుడు ఎత్తి చూపుతున్నాయి. పీవీ మరణాంతరం ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ఆఫీస్ ఆవరణలోకి అనుమతించలేదని ఆ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీటికి కాంగ్రెస్ సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకో విషయం. ప్రముఖ నేత నీలం సంజీవరెడ్డి తొలిసారి కాంగ్రెస్ అధికారిక అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్టీ నిర్ణయాన్ని కాదని స్వతంత్ర అభ్యర్ది వీవీ గిరికి మద్దతిచ్చారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డికి కాకుండా వీవీ గిరికి మద్దతిచ్చింది. ఆ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా తెలుగు సెంటిమెంట్ పట్టించుకోలేదన్నమాట. నీలం సంజీవరెడ్డి రెండోసారి జనతా పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సపోర్టు చేసిందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గోపాలకృష్ణ గాంధీని బలపరిచింది. ఇక ఏపీ విషయాన్ని చూస్తే రెండు సభలలో కలిపి తెలుగుదేశం కు 17 మంది ఎంపీల బలం ఉంది. జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. బీజేపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 11 మంది ఎంపీలున్నారు. తమకు మద్దతివ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కోరారు. రాజ్యాంగ పదవులకు ఎన్నిక జరిగినప్పుడు అనుసరించడానికి జగన్ ఒక పద్దతి పెట్టుకున్నారు. ఆ ప్రకారమే ఎన్డీయేకు మద్దతిస్తున్నట్లు శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక టీడీపీ, జనసేనలు ఎన్డీయేలోనే ఉన్నందున అవి సుదర్శనరెడ్డికి ఓటు వేసే పరిస్థితి లేదు.చంద్రబాబుకు, రేవంత్ రెడ్డి కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయంగా ఉప రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ కూటమికి టీడీపీ మద్దతు ఇవ్వలేదు. కాకపోతే జస్టిస్ సుదర్శనరెడ్డి తనకు చంద్రబాబుతో ఉన్న సంబంధాల గురించి వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబుతో ప్రత్యేక అనుబంధం ఉందని కాని, సంబంధం లేదని కానీ చెప్పలేనని ఆయన అంటున్నారు. 1995లో ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య జరిగిన న్యాయ పోరాటానికి సంబంధించి తీర్పు ఇచ్చిన బెంచ్‌లో తాను కూడా సభ్యుడనని ఆయన వెల్లడించారు. చంద్రబాబు మంచి, చెడు బెరీజు వేసుకోవచ్చని, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. సుదర్శనరెడ్డి వ్యూహాత్మకంగా మాట్లాడినా చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఎన్డీయేను కాదనే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఒక ప్రకటన చేస్తూ సుదర్శనరెడ్డికి మద్దతు ఇచ్చి తన కృతజ్ఞత తెలుపుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుపై ఆశలు పెంచుకుంటున్నట్లుగా ఉంది. బీహారు శాసనసభ ఎన్నికలలో బీజేపీ కూటమి ఓడిపోతే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని, చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వస్తారని కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కా లాంబా జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేం కాని చంద్రబాబుతో కాంగ్రెస్‌కు ఉన్న రహస్య సంబంధాలను ఆమె తెలియచేసినట్లుగా ఉంది.రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబు హాట్ లైన్ పెట్టుకున్నారని ఇప్పటికే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వరకు చూస్తే లోక్ సభలో కాంగ్రెస్‌కు ఎనిమిది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి 8 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు ఒకటి, బీఆర్ఎస్కు నాలుగు రాజ్యసభ స్థానాలూ ఉన్నాయి. ఈ రకంగా చూస్తే సుదర్శనరెడ్డికి కేవలం ఈ 12 మంది మద్దతు మాత్రమే లభించే పరిస్థితి ఉంది. కాగా తెలుగు సెంటిమెంట్‌ను రేవంత్ రెడ్డి వాడితే, బీజేపీ కూటమి తమిళ సెంటిమెంట్ వాడే అవకాశం ఉంటుంది. అక్కడ మెజార్టీ స్థానాలు డీఎంకే పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకేలు ఒకే కూటమిలో ఉన్నాయి. అక్కడ బీజేపీ పక్షాన ఒక్క ఎంపీ కూడా లేరు. అన్నాడీఎంకేకు మాత్రం ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మిగిలిన వారు డీఎంకే, కాంగ్రెస్ కూటమికి చెందినవారే. అయినప్పటికీ తమిళనాడుకు చెందిన బీజేపీ నేతను ఉప రాష్ట్రపతి పదవికి పోటీలో దించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ ఎంపిక చేసి ఉండవచ్చు. పోటీచేస్తున్న రాధాకృష్ణన్ తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో, సుదర్శనరెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి మెజార్టీ మద్దతు పొందలేరన్నమాట. కాగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పదే,పదే ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి రెడ్డి అగ్రవర్ణాలకు చెందిన ప్రముఖుడిని అభ్యర్ధిగా ఎలా పెడతారని బీజేపీ, బీఆర్ఎస్లు ప్రశ్నిస్తున్నాయి. సుదర్శనరెడ్డి గెలిస్తే బీసీ రిజర్వేషన్లకు కేంద్రంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది కూడా మోకాలికి, బోడు గుండుకు ముడిపెట్టడమే. కాగా ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ బీసీ వర్గానికి చెందినవారని బీజేపీ ప్రచారం చేస్తోంది. అందువల్ల కాంగ్రెస్ బీసీ కార్డు ఈ సందర్భంగా పనిచేసే అవకాశం ఉండదు. మొత్తం మీద జస్టిస్ సుదర్శనరెడ్డిని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తన పరపతి పెంచుకునే అవకాశం ఉంది.అంతకు తప్ప ఆయన ప్రయోగించిన తెలుగు సెంటిమెంట్ కాని, బిసి రిజర్వేషన్ ల వాదన కాని ఫలించే పరిస్థితి కనిపించడం లేదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
TDP నేత సంచలన ఆడియో.. తిరుపతి ఇంచార్జి మంత్రి జల్సాలు.. లాడ్జీల్లో సరసాలు..
-
కోట్ల స్థలాన్ని ఆంధ్రజ్యోతికి ఎలా ఇస్తారు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలోని విలువైన స్థలాలను కారుచౌకగా అనుయాయులకు అప్పగిస్తున్న కూటమి ప్రభుత్వం, తాజాగా తన తోకపత్రిక ఆంధ్రజ్యోతికి అర ఎకరం హౌసింగ్ బోర్డు స్థలం విశాఖ నగరపాలక సంఘం ద్వారా కేటాయించాలన్న ప్రయత్నం చివరి నిమిషంలో నిలిచిపోయింది. కోట్లాది రూపాయల స్థలాన్ని ఆంధ్రజ్యోతికి నామమాత్రపు ధరకు ఎలా కేటాయిస్తారంటూ శుక్రవారం కౌన్సిల్లో వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నించడంతో ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు.వివరాల్లోకి వెళితే, పరదేశీపాలెంలోని సర్వే నెంబరు 203/2పీలోని అర ఎకరం స్థలం కేటాయింపు అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ ముందుకు తెచ్చింది. నిజానికి రెగ్యులర్ అజెండాను నాలుగైదు రోజులు ముందుగానే కార్పొరేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఈ కేటాయింపును రెగ్యులర్ అజెండాలో చేర్చకుండా టేబుల్ అజెండాగా, అదీ చివరి 67వ అంశంగా ఆఖరు నిమిషంలో కౌన్సిల్ ముందుకు తెచ్చారు.అనంతరం టేబుల్ అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించారు. చివరి నిమిషంలో వైఎస్సార్సీపీ సభ్యులు 67 వ అంశాన్ని తిరిగి ప్రస్తావించారు. ఇంతటి కీలక అంశాన్ని టేబుల్ అజెండాగా చేర్చి, ఎలా ఆమోదింపజేస్తారంటూ గట్టిగా నిలదీశారు. దీనితో తప్పనిసరి పరిస్థితిల్లో 67వ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు. కాగా, ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరా ధర దాదాపు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా.గతంలోనూ కారుచౌకగా కేటాయింపు, రద్దు చేసిన వైఎస్సార్సీపీ.. వాస్తవానికి 2017లో ఇదే ప్రాంతంలో రూ.7.26 కోట్లు విలువ చేసే స్థలాన్ని రూ.50.50 లక్షలకే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్, ఆమోద పబ్లికేషన్స్‌కు కేటాయించింది. ఆ కేటాయింపును గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసి, ఆ స్థలాన్ని పేదలకు పంచాలని నిర్ణయించింది. ఇప్పుడు బాబు ప్రభుత్వం మరోసారి అదే సంస్థకు భూమిని అతి తక్కువ ధరకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
తువాలుతో మెడకు ఉచ్చేసి.. చంపేయాలని..
చిలమత్తూరు: చేతిలో మారణాయుధాలు పట్టుకుని శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ మూక రెచ్చిపోయింది..! ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుడే లక్ష్యంగా దాడికి దిగింది.. పైపెచ్చు బాధితుడిని పరామర్శించేందుకు వెళ్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడం ఈ దాడి వెనుక పెద్ద కుట్రను తేటతెల్లం చేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు ఎంపీపీ, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమరెడ్డిని హతమార్చేందుకు ప్రయత్నించింది. శుక్రవారం హుస్సేన్‌పురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. చౌడేశ్వరీదేవి ఆలయంలో పూజల అనంతరం పురుషోత్తమరెడ్డి ఇంటికి వెళ్తుండగా టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. టీడీపీకి చెందిన బాబూరెడ్డి, నర్సిరెడ్డి, మరో నలుగురు మారణాయుధాలతో వచ్చారు. ఎంపీపీ ఎత్తుగా ఉండడంతో ఎడమ కాలిపై ఇనుప రాడ్డుతో కొట్టి కిందపడేశారు. ఆయన మెడలోని తువాలుతోనే ఉచ్చు బిగించి చంపేందుకు ప్రయత్నించారు. ఇంతలో గ్రామస్థులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో బాబురెడ్డి, అతడి అనుచరులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన పురుషోత్తమరెడ్డిని హిందూపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. దాడి సంగతి తెలిసి వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక, ఆమె భర్త వేణురెడ్డిలు ఎంపీపీని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తుండగా.. రెండో పట్టణ పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై నిలదీయడంతో వదిలేశారు. ఆస్పత్రిలో పురుషోత్తమరెడ్డిని దీపిక దంపతులతో పాటు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పరామర్శించారు. నిందితులను అరెస్ట్ చేయాలని ధర్నా పురుషోత్తమరెడ్డిపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలంటూ హిందూపురం సద్భావన సర్కిల్లో దీపిక, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందన్నారు. హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హత్యలు, దాడులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీపీపై హత్యాయత్నం చేసిన టీడీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలోనే దీపికను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి.. వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. ఆమెతో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుడికే కట్లు.. టీడీపీ వింత నాటకం పురుషోత్తమరెడ్డిపై దాడిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ వింత నాటకానికి తెరతీసింది. నిందితులను పార్టీ నుంచి తొలగించాల్సిన టీడీపీ నేతలు అందుకు విరుద్ధంగా చిలమత్తూరు రప్పించుకుని, లేని గాయానికి కట్టు కట్టించారు. తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి బాధిత ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపైనే విమర్శలు చేయించారు. నిందితుడు బాబూరెడ్డి కుడి మణికట్టు దగ్గర వాపు ఉందని చెబితే మాత్ర ఇచ్చామని, అయినా నొప్పి ఉందని కట్టు కట్టించుకున్నారని, కంప్రెషన్ బ్యాండేజీ లేకపోవడంతో రక్త గాయాలకు కట్టే బ్యాండేజ్ ను కట్టినట్టు వైద్యాధికారి రోజా చెప్పడం గమనార్హం. -
ఒక్క టీడీపీ నేతపైనైనా చంద్రబాబు చర్యలు తీసుకున్నారా?
-
టీడీపీ గూండాల దాడులు తారాస్థాయికి చేరాయి: పేర్నినాని
-
చింతమనేని.. నీ ఉడత ఊపులకు భయపడం: పేర్ని నాని
సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడులు తారాస్థాయికి చేరాయన్నారు. అబ్బయ్య చౌదరిని చంపాలని చూస్తున్నారు. ఇప్పటికే అబ్బయ్య చౌదరి ఆస్తులను ధ్వంసం చేశారు. దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చింతమనేని ఉడత ఊపులకు భయపడేది లేదు. అబ్బయ్యచౌదరివ వెంట జగన్, పార్టీ మొత్తం ఉంది’’ అని పేర్ని నాని అన్నారు.దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావుపాలెంలో అబ్బయ్య చౌదరి పొలంలో చింతమనేని ప్రభాకర్ అనుచరుల దౌర్జన్యకాండను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. కొఠారు అబ్బయ్య చౌదరిని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మాజీ మంత్రులు పేర్ని నాని, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కవురు శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, బొమ్మి ఇజ్రాయిల్, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తదితరులు.. పచ్చ మూకలు ధ్వంసం చేసిన పొలాలను పరిశీలించారు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. అన్నీ లెక్కలు సరిచేస్తాం: సాకే శైలజానాథ్సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తూ.. భయాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారంటూ టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త మీ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటారు. రాయలసీమ వాసులుగా దెందులూరులో జరిగిన ఘటనలు చూస్తుంటే భయమేస్తుంది. ఆర్థిక మూలాలు దెబ్బతీసి.. బలహీనపరచాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ క్యాడర్‌ను భయపెట్టి రేపు అడ్డం లేకుండా చూసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే చింతమనేనికి అది భ్రమ మాత్రమే.. పచ్చని చెట్లను నరికి వేయడం దారుణం. పోలీసులు స్వామి భక్తితో పని చేస్తున్నారు. రక్తం వచ్చేలాగా టీడీపీ వాళ్ళు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. డీఎస్పీనే టీడీపీ మూకలు తోసేస్తుంటే ఏం చేస్తున్నారు?. ప్రతి వాటిని గుర్తు పెట్టుకుంటాం?. టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వచ్చి వీరంగం సృష్టించడం దారుణం. ఇప్పటికైనా పోలీసులకు సోయి ఉండాలి. ఎమ్మెల్యే మీకు జీతాలు ఇవ్వడు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. అన్ని లెక్కలు సరిచేస్తాం..దెందులూరులో పోలీసుల సాయం ధృతరాష్ట్ర కౌగిలి. నిలబడి సమాధానం చెప్పే రోజు వస్తుంది.. డేట్ నోట్ చేసుకోండి. అరాచకాలు చేసే వాళ్లని కేసులు పెట్టి లోపల వేయాల్సింది పోయి మా వాళ్లపై కేసులు పెడుతున్నారు. పోలీసుల ప్రభుత్వ అధికారులను గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏ వైఎస్సార్సీపీ నాయకుడు ఒంటరి కాదు. బాడుగకు తెచ్చిన వారితో కార్యక్రమాలు చేస్తే మంచి పద్ధతి కాదు. జాగ్రత్తగా ఉండండి. మంచికి మంచి.. చెడుకు చెడు లెక్కలు సరిచేసే కాలం ఉంటుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక లెక్కలు సరిచేస్తాం’’ అని సాకే శైలజానాథ్‌రెడ్డి హెచ్చరించారు. -
టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన పురుషోత్తమ రెడ్డి
-
‘పింఛన్ల కోత.. చంద్రబాబు సర్కార్ తీరు అమానవీయం’
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లలో భారీ కోత పెట్టేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు నెలల కాలంలోనే 4.15 లక్షల వృద్ధాప్య పెన్షన్లు తొలగించారని, వచ్చెనెల నుంచి 2 లక్షల దివ్యాంగ పెన్షన్లను రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దివ్యాంగుల పెన్షన్లపై కూటమి ప్రభుత్వం కత్తికట్టిందని, సీఎం చంద్రబాబు కనీస మానవత్వం కూడా లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దివ్యాంగులకు న్యాయం జరిగేలా వారి పక్షాన వైయస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. 2004లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత పేదరికంలో ఉండి వయస్సు మీరిపోయి, పనులు చేసుకోలేని వృద్ధులకు ఒక కొడుకులా అండగా నిలబడేందుకు ప్రతినెలా సామాజిక పెన్షన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి కూడా పెన్షన్లను అందించారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ సామాజిక పెన్షన్లను కొనసాగించాయి.వైఎస్ జగన్ హయాంలో 66.34 లక్షల పెన్షన్లు:వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షల మందికి మాత్రమే ఇస్తున్న సామాజిక పెన్షన్లతో పాటు 21 రకాల కేటగిరిలకు చెందిన దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చేందుకు చొరవ తీసుకున్నారు. ఆయన సీఎంగా దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో 66.34 లక్షల మందికి పెన్షన్లు అందాయి. ప్రతి ఏటా జనవరి, జూన్ నెలల్లో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు పెన్షన్లను పెంచుతామని, దివ్యాంగులకు కేటగిరిల వారీగా రూ.6 వేలు, రూ.10 వేలు, రూ.15 వేలు చొప్పున ఇస్తామని, కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఏడాది కాలంలోనే పెన్షన్ల సంఖ్యను 62.19 లక్షలకు కుదించుకుంటూ వచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పద్నాలుగు నెలల్లో దాదాపు 4.15 లక్షల పెన్షన్లను తొలగించారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లలో కూడా భారీగా కోత పెడుతూ వస్తున్నారు. పదేళ్ళ నుంచి పెన్షన్లు పొందుతున్న వారిని కూడా వివిధ కారణాలను చూపుతూ వారిని తొలగించారు. దివ్యాంగుల పైన కూడా ఇదే విధంగా కక్షసాధింపులు ప్రారంభమయ్యాయి.రీ వెరిఫికేషన్ పేరుతో, సదరం క్యాంప్‌ల నుంచి ధ్రువపత్రాలు తెచ్చుకుంటేనే పెన్షన్లు ఇస్తామంటూ ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు. వైయస్ జగన్ హయాంలో దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులు పెన్షన్ పొందుతూ ఉంటే, వారిలో సుమారు 2 లక్షల మందిని తొలగించేందుకు సిద్దయయ్యారు. వచ్చేనెల నుంచి వీరికి పెన్షన్లను నిలిపివేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికేట్లలో కూడా వారి వైకల్యం శాతంను తగ్గించి ఇస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి ఉన్న వత్తిడి మేరకే ఇలా చేస్తున్నామని వారు చెబుతున్నారు. పెన్షన్ల పంపిణీ పేరుతో ప్రతినెలా సీఎం చంద్రబాబు చేస్తున్న డ్రామాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? ప్రత్యేక హెలికాఫ్టర్లతో వెళ్ళి, భారీ బందోబస్త్, పెద్ద ఎత్తున ప్రచారం కోసం ప్రతినెలా సీఎం చంద్రబాబు చేస్తున్న ఖర్చును వృద్దులు, దివ్యాంగుల కోసం చేస్తే భారం తగ్గదా..?చంద్రబాబు దుర్మార్గాలపై పోరాడతాం:అనంతపురం జిల్లాలోనే ఏడాది కాలంలో 19 వేల మందికి పైగా దివ్యాంగులకు పెన్షన్లు తొలగించారు. ఇప్పుడు తాజాగా దివ్యాంగులను 9601 పెన్షన్లను ఈ నెలలో తొలగించారు. వీరినే కాకుండా 2314 మందిని దివ్యాంగుల కోటా వర్తించదు కాబట్టి, వారిని వృద్దాప్య పెన్షన్ల కింద మార్పు చేస్తున్నామని నోటీసులు ఇచ్చారు. ఇంత అమానవీయంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం దారుణం. దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారు. అనంతపురం మున్సిపల కార్పోరేషన్లో 23వేల మందికి పైగా ఉంటే తాజాగా 1008 మందికి నోటీసులు ఇచ్చారు. ఇది చంద్రబాబు విశ్వాసఘాతకంగా చేస్తున్న పని.ఎన్నికల ముందు దివ్యాంగుల పట్ల ఎంతో ప్రేమ చూపించి, వారి పక్షాన నిలబడతామని నమ్మించి, వారి ఓటుతో అధికారంలోకి వచ్చిన తరువాత అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నిన్న కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నంకు ఒక దివ్యాంగుడు ప్రయత్నించాడు. పెన్షన్లు తీసేస్తే ఎలా బతకాలని దివ్యాంగులు ఆవేదన చెందుతున్నారు. తమ దుర్మార్గంపై దివ్యాంగులు పోరాటం చేయలేరనే ధీమాతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. వారి పక్షాన పోరాడేందుకు వైయస్ఆర్సీపీ సిద్దంగా ఉంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ దివ్యాంగుల వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నారు. కలెక్టర్ కార్యాలయాలను దిగ్భందం చేస్తాం.టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలకు చంద్రబాబు అండ:కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బరితెగించి మహిళల పట్ల కూడా అనుచితంగా మాట్లాడటం, వ్యవహరించడం చూస్తున్నాం. అనంతపురంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పైన దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ప్రోత్సహిస్తూ, పైకి మాత్రం వారిపై ఆగ్రహంతో ఉన్నట్లుగా నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి నందమూరి హరికృష్ణ భార్య. స్వర్గీయ ఎన్టీఆర్ కోడలు. అంటే నందమూరి కుటుంబానికి చెందిన మహిళపైనే, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు నోరు పారేసుకుంటే, పైపై మందలింపుల డ్రామాతో సరిపెట్టడానికి చంద్రబాబు ఎందుకు తంటాలు పడుతున్నారు.మీ సతీమణి భువనేశ్వరిపై ఎవరో వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున యాగీ చేసిన చంద్రబాబుకు, తన సోదరి వరస అయ్యే హరికృష్ణ సతీమణి పై సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? నాలుగైదేళ్ళ కిందట సోషల్ మీడియాలో మహిళల పట్ల పోస్ట్‌లు పెట్టారంటూ రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లను వెదికి వెదికి పట్టుకుని, జైళ్ళ పాలు చేశారు. మరి మీ పార్టీలోనే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు, మీ కుటుంబంలోని ఒక మహిళ పట్ల ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎందుకు కఠినంగా స్పందించడం లేదో చంద్రబాబే చెప్పాలి. సీఎం అండతోనే టీడీపీ ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు. -
వైఎస్ జగన్ పథకాల్ని కాపీకొట్టడంలో చంద్రబాబు దిట్ట
సాక్షి,తాడేపల్లి: సీఎం చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎప్పుడూ రాదని, వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకాల్ని కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాకాణి మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో ఎరువులు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. కీలక సమయంలో రైతులకు ఎరువులు అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా అన్నీ సమకూర్చాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. రైతాంగాన్ని పట్టించుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రైతుల్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు.రైతుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. రైతులను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్న దుస్థితిలో ప్రభుత్వం ఉంది. అవినీతి సొమ్మును కూడబెట్టే పనిలో మంత్రులు ఉన్నారు. మంత్రి అచ్చెన్నాయుడికి నైతికత ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ఆగ్రోస్ ఎండీ ద్వారా లంచాలు గుంజాలని చూసిన వ్యక్తి అచ్చెన్నాయుడు. ఎంతటి నీచ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు.ఆగ్రోస్ ఎండీ రాసిన లేఖపై ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదంటేనే వారి వేధింపులను అర్థం చేసుకోవచ్చు.అధికారుల ద్వారా కమీషన్లు గుంజుకోవాలని చూడటం సిగ్గుచేటు. ఆ తప్పుడు పని చేయలేనంటూ ఆ అధికారి లేఖ రాశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి.రైతులకు యూరియా అందించలేని ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమేనా?.అసలు రైతాంగ సమస్యలపై ఒక్క సమీక్ష కూడా చంద్రబాబు చేయలేదు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా? అనే అనుమానం కలుగుతోంది. వ్యవసాయ ప్రణాళికలు, విత్తనాలు, ఎరువుల సమస్యలను పట్టించుకోవటం లేదు. రైతులు రాష్ట్రంలో ఉన్నారనే విషయాన్ని కూడా చంద్రబాబు మర్చిపోయారు.రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బ్లాక్ మార్కెట్ లో రూ.200 అదనంగా వెచ్చించి కొనాల్సి వస్తోంది. యూరియా, ఎరువులు అన్నీ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో ఆర్బీకేల ద్వారా రైతుల చెంతకే చేర్చాం. ఐదేళ్లలో ఏనాడూ యూరియా కొరత రాలేదు.కానీ నేడు రైతులను కూటమి ప్రభుత్వం సంక్షోభమలోకి నెట్టేసింది. రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో సగం కూడా ఏపీకి రాలేదు.అయినా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఏ పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయకుండానే చేసినట్టుగా చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. రైతులకు పెట్టుబడి కింద సొంతంగా రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు.వైఎస్ జగన్ రైతుల కోసం ప్రత్యేకంగా రూ.7,800 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు.అన్ని విధాలా రైతాంగాన్ని ఆదుకున్నారు. బీమా కోసం వైఎస్ జగన్ ప్రతి ఏటా ప్రభుత్వం తరపునే ఖర్చు చేశారు. దాన్ని కూడా టీడీపీ ఎంపీలు తప్పుదారి పట్టించేలా మాట్లాడారు. రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోనందునే 250 మంది ఆత్మహత్య చేసుకున్నారు.అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేం ఉంటుంది?. ఆగ్రోస్ ఎండీ రాసిన లేఖపై ఇప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?.వరదలకు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి.రైతులకు యూరియాను వెంటనే అందించాలి. రాష్ట్రంలో వ్యవసాయశాఖ మంత్రి ఉన్నాడా అనే అనుమానం ఉంది. కూటమి ప్రభుత్వం ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. చంద్రబాబుకు కొత్తపథకాల ఆలోచన ఎప్పుడూ రాదు. అన్నీ వైఎస్ జగన్ పథకాలే చంద్రబాబు కాపీ కొట్టాడు. వైఎస్ జగన్ హయాంలోనే రైతులకు న్యాయం జరిగింది. రైతులకు రైతు భరోసా అందించిన ఘటన వైఎస్ జగన్‌దే. చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తానని మోసం చేశారు’అని ధ్వజమెత్తారు. -
జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలే చెబుతారు
-
శ్రీకాంత్‌కు పెరోల్.. అడ్డంగా దొరికిన హోంమంత్రి అనిత
సాక్షి, అమరావతి: తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అలివేలి శ్రీకాంత్‌కు నిబంధనలకు విరుద్ధంగా పెరోల్ మంజూరు చేయించడం వెనుక రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమేయం ఉందని తేటతెల్లమైంది. అంతటి తీవ్రమైన నేరాల్లో శిక్ష పడిన అతనికి పెరోల్ మంజూరు చేయడం సాధ్యం కాదని హోం శాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్ స్పష్టంగా తిరస్కరించినా, హోం మంత్రి అనిత ఒత్తిడితోనే పెరోల్ మంజూరైందని స్పష్టమైంది. శ్రీకాంత్ పెరోల్ ప్రతిపాదనను జూలై 16నే హోం శాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్ తిరస్కరించడం గమనార్హం. దీంతో మంత్రి బుకాయింపు బెడిసికొట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జీవిత ఖైదీ అలివేలి శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు కోసం నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్‌లు హోంశాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్‌కు సిఫార్సు చేశారు. ఆ మేరకు వారిద్దరూ సిఫార్సు లేఖలు కూడా ఇచ్చారు. కానీ.. తీవ్రమైన నేరాలకు పాల్పడి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తుండటంతోపాటు గతంలో ఒకసారి జైలు నుంచి పరారైన శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వకూడదని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు నివేదిక సమరి్పంచారు. దాంతో శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేయాలన్న ప్రతిపాదనను కిషోర్ కుమార్ తిరస్కరించారు. ఈ మేరకు అధికారికంగానే జూలై 16న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పట్టుపట్టి మరోమారు హోం మంత్రి అనితపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణతో మంత్రికిడీల్ కుదిర్చారు. డీల్ ఓకే కావడంతో శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేయాలని ఆదేశిస్తూ హోం మంత్రి అనిత స్వయంగా నోట్‌ఫైల్‌పై సంతకం పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ ఫైల్ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వద్దకు వెళ్లింది. హోం మంత్రి ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితిలో కుమార్ విశ్వజిత్ అనివార్యంగా శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేస్తూ జూలై 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించాయి. -
దారి మళ్లిన యూరియా..
సొసైటీలకు సరఫరా కావాల్సిన యూరియా రాష్ట్రంలో దారి మళ్లింది. ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తూ టీడీపీ నేతలు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరికొంత మంది వ్యవసాయ అవసరాలకు ఉపయోగించాల్సిన యూరియాను బీర్ల తయారీతో పాటు పెయింట్, వార్నిష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం, పశువుల దాణా.. కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీ పాల తయారీ కోసం దర్జాగా దారిమళ్లించారు. ఇదంతా అధికార కూటమి పార్టీల ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోంది.ఈయనో రైతు.. పేరు సిరపురపు రామునాయుడు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఇతనికి ఉన్న రెండు ఎకరాల పొలంలో వరి పంట సాగు చేశాడు. ఇప్పుడు యూరియా అవసరం కావడంతో ఐదు రోజులుగా తిరుగుతున్నాడు. ఇప్పటికీ ఒక్క బస్తా కూడా దొరకలేదు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని వాపోతున్నాడు. ప్రభుత్వం చూస్తుంటే స్టాక్ ఉందని చెబుతోందని, ఇక్కడ చూస్తే నో స్టాక్ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలంలోని బెణికల్లులో టీడీపీ మండల నేత రమేష్‌కు చెందిన గోదాములో పెద్ద ఎత్తున యూరియాను అన్లోడ్ చేశారు. వాస్తవానికి ఈ నిల్వలను డీసీఎంఎస్, సొసైటీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఓ పక్క సొసైటీ కేంద్రాల వద్ద యూరియా నో స్టాక్ అని బోర్డులు పెట్టి, మండలానికి కేటాయించే యూరియా నిల్వలను తన గోదాముల్లోకి తరలించుకుపోయాడు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులపై సదరు టీడీపీ నేత తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఓ వైపు తీవ్ర వర్షాభావం.. మరో వైపు అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారమే 2.5 లక్షల ఎకరాలు ముంపునకు గురైనట్టు చెబుతుండగా, వాస్తవానికి దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా ముంపునీటిలో చిక్కుకున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణ, గోదావరి జిల్లాలతో పాటు దాదాపు 14 జిల్లాల్లో ఎటు చూసినా ముంపునీటిలో చిక్కుకున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ పంటలు తిరిగి నిలదొక్కుకోవాలంటే బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందే. లేకుంటే పంట పెరుగుదల లేక దిగుబడులు తగ్గి పంట నాణ్యత దెబ్బ తింటుంది. ప్రస్తుతం పిలక కట్టే దశలో వరి పైరు ఉంది. ఈ దశలో ఎకరాకు కనీసం 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటా‹Ù, పత్తికైతే 25–30 కిలోల యూరియా, 10–15 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. బఫర్ స్టాక్ నిర్వహణలో మార్క్‌ఫెడ్ విఫలమైంది. ఈసారి 2 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయనున్నామని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో లక్ష టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారు. కారణం బఫర్ స్టాక్ నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కారణం. మరో వైపు ఉన్న కొద్దిపాటి నిల్వలను టీడీపీ నేతలు దొడ్డిదారిన తమ గోదాములకు మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాలు కాదు కదా.. కనీసం సహకార సంఘాల్లో సైతం యూరియా కట్ట దొరకని పరిస్థితి. మిగిలిన ఎరువుల పరిస్థితి కూడా ఇంతే. అధికారులు మాత్రం రాష్ట్రంలో నిల్వలకు ఢోకా లేదని చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సర్కారు వద్ద ఉన్నది 10 శాతమే 2025– ఖరీఫ్ సీజన్ సాగు లక్ష్యం 85.26 లక్షలు కాగా ఆగస్టు 21వ తేదీ నాటికి 50.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 27 లక్షల ఎకరాల్లో వరి, 9.2 లక్షల ఎకరాల్లో పత్తి, 3.2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4.50 లక్షల ఎకరాల్లో కందులు, 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. దాదాపు రెండు నెలల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దెబ్బతిన్న రైతులు ప్రస్తుతం అధిక వర్షాలతో నష్టపోతున్నారు. ఈ పరిస్థితిలో యూరియా కట్ట దొరక్క రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌కు 16.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 6.45 లక్షల టన్నుల నిల్వలున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందులో సొసైటీలు, ఆర్ఎస్కేల వద్ద 65 వేల టన్నులు, మార్క్‌ఫెడ్ గోడౌన్లో 55 వేల టన్నులుండగా, మిగిలిన ఎరువులన్నీ ప్రైవేటు హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల వద్దే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో వీరు లాబీయింగ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కామరాజుపేట సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు ఎమ్మార్పీకి మించి విక్రయాలు బహిరంగ మార్కెట్లో యూరియా కట్ట (ప్రభుత్వ ధర 50 కేజీల బస్తా రూ.266.50) రూ.350 నుంచి రూ.450 వరకు విక్రయిస్తున్నారు. యూరియా ఒక్కటే కాదు.. డీఏపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. డీఏపీ నిల్వలు కూడా 70 వేల టన్నులకు మించి లేవు. దీంతో ఓపెన్ మార్కెట్లో డీఏపీ బస్తా (ప్రభుత్వ ధర రూ.1350) రూ.1,550 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. యూరియాతో పాటు ఇతర ఎరువుల కోసం రైతుల ఆందోళనలు ప్రతి జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి. చెప్పేదొకటి.. వాస్తవం మరొకటి అనంతపురం జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. చాలా ప్రాంతాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోంది. రైతులు ఆర్ఎస్కేలు, పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌తో పాటు ప్రైవేట్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఒకట్రెండు బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. చాలా చోట్ల టోకెన్లు ఇచ్చి పంపుతున్నా, మరుసటి రోజు కూడా ఇవ్వడం లేదు. ‘ఈ ఖరీఫ్‌కు సంబంధించి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26,839 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు ఉండగా.. ఇప్పటికే 29 వేల మెట్రిక్ టన్నులకు పైగా సరఫరా అయ్యింది. ఇందులో 28 వేల మెట్రిక్ టన్నులకు పైగా పంపిణీ జరిగింది. ఇంకా వేర్‌హౌస్‌లో బఫర్ స్టాక్ కింద 1,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది’ అని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి తెలిపారు. ఈ లెక్కన రైతులెందుకు యూరియా కోసం రోడ్డెక్కుతున్నట్లు?ఎరువులను అధికార పార్టీ కార్యకర్తలు దారి మళ్లించడంతో శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కనితూరులో రైతుల పాట్లు అన్ని జిల్లాల్లోనూ అవే కష్టాలు ⇒ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎరువుల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బస్తా రూ.400తో అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అరకొర ఎరువులు రైతు భరోసా కేంద్రాలకు కాకుండా కూటమి నాయకుల ఇళ్ల వద్ద ఉంచుకుని ఆ పార్టీ వర్గీయులకే అందిస్తున్నారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పెడన, పామర్రు, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఇదే సమయంలో ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో మాత్రం పుష్కలంగా అందుబాటులో ఉంది. అయితే యూరియాతో పాటు ఇతర మందులు కూడా కొనుగోలు చేయాలని వారు షరతు పెడుతున్నారు. సొసైటీల్లో అధికార పక్ష నేతలు సిఫారసు చేసిన వారికే యూరియా అందుతోంది. పలమనేరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో ఓ వైపు యూరియా కొరత తీవ్రంగా ఉంది. మరో వైపు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, యూరియాకు సంబంధించిన సమస్యలుంటే 8331057300, 9491940106 నంబర్లలో సంప్రదించాలని జిల్లా అధికారులు చెబుతున్నారు. ⇒ కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 2,429 టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నా.. ప్రయివేటు డీలర్లు, ఆర్బీకేలు, పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌ల్లో బస్తా కూడా యూరియా లభించడం లేదు. ఆదోని, కౌతాళం, హొళగుంద, పెద్దకడుబూరు, గోనెగండ్ల తదితర మండలాల్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు యూరియా కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. అధికారులు చెబుతున్న విధంగా యూరియా క్షేత్ర స్థాయిలో ఎక్కడా దొరకడం లేదు. ప్రైవేటు షాపు నిర్వాహకులు మాత్రం యూరియాను అధిక రేట్లకు అమ్మేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. పలమనేరులోని ఓ రైతు సమాఖ్య కేంద్రానికి గురువారం ఒక లోడు యూరియా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు షాపు తెరవక ముందే భారీగా క్యూ కట్టారు. గంట వ్యవధిలో ఖాళీ అయింది. వందలాది మంది రైతులకు దొరక్క పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ⇒ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వ్యాపారులు కృతిమ కొరత సృష్టించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. పెదకాకాని మండలంలోని గోళ్ళమూడి గ్రామంలో యూరియా ఉందని తెలియడంతో రైతులు క్యూకట్టారు. సొసైటీ వద్ద, ఆర్బీకే వద్ద కాకుండా లారీని రోడ్డుపై పెట్టి అమ్మకాలు చేపట్టారు. గురువారం ఆధార్ కార్డుకు రెండు బస్తాల చొప్పున కొంత మందికి మాత్రమే ఇచ్చారు. ఒక్క బస్తా ఇచ్చుంటే ఒట్టు మాకు ఎనిమిది ఎకరాలు సొంతభూమి ఉంది. మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. వరి, మిర్చి, పత్తి, కంది వంటి పంటలు సాగు చేస్తున్నాం. వరి నాట్లు వేస్తున్నాం. యూరియా అత్యవసరం అయింది. అన్ని పనులు వదులు కొని ఆర్బీకేలు, ప్రయివేటు డీలర్ల చుట్టూ 25 రోజులుగా తిరుగుతున్నాం. ఒక బస్తా ఇచ్చుంటే ఒట్టు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. – మర్రిస్వామి, రైతు, హొళగుంద, కర్నూలు జిల్లాఅధిక ధరకు అమ్ముతున్నారు పంటలకు అవసరమైన యూరియా దొరక్క ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం. 45 కేజీల బస్తా రూ.266కు అమ్మాల్సిన యూరియా దొరక్కపోవడంతో సుమారు రూ.500 కు పైగా ధర పలుకుతోంది. గతంలో ఎన్నడూ ఈ ధరలు చూడలేదు. ఈ విధంగా అధిక ధరలకు యూరియా కొనుగోలు చేసి వ్యవసాయం చేయలేం. – పీ సుధాకర్, రైతు, సోమేపల్లి, త్రిపురాంతకం మండలం, ప్రకాశం జిల్లాగత ప్రభుత్వంలో ఎన్ని బస్తాలైనా ఇచ్చేవారునేను ఐదెకరాల్లో వరి, ఐదెకరాల్లో దుంపతోట సాగు చేస్తున్నాను. నాకు 50 బస్తాల యూరియా అవసరం. గతంలో ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డుకు ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఇది ఎక్కడ చల్లాలో, ఏం చేయాలో తెలియడం లేదు. మాకు అవసరమైన మేరకు యూరియాను వెంటనే అందించాలి. – రాజమంద్రపు శ్రీను, రైతు, జగ్గంపేట నియోజకవర్గం, కాకినాడ జిల్లా 266 బస్తాల యూరియా లారీ పక్కదారి మంత్రి ఫరూక్ అనుచరుడి ప్రోద్బలంతో వ్యాపారికి విక్రయం సాక్షి, నంద్యాల: యూరియా దొరక్క ఓ వైపు రైతులు రోడ్డెక్కుతుంటే మరోవైపు అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ అవి వచ్చీరాగానే వాటిని గద్దల్లా తన్నుకుపోతున్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని పసురపాడు గ్రామానికి మార్క్‌ఫెడ్ ద్వారా 266 బస్తాల యూరియాను అధికారులు గత మంగళవారం రైతు సేవా కేంద్రానికి మంజూరు చేశారు. యూరియా ఈనెల 19న రావాల్సి ఉంది. అయితే, ఆ స్టాకు మొత్తం సంబంధిత రైతుసేవా కేంద్రానికి రాకుండానే మాయమైంది. టీడీపీ నాయకులు ఈ స్టాకు మొత్తాన్ని అమ్ముకున్నట్లు తెలుస్తోంది. గ్రామానికి రావాల్సిన యూరియా రాకపోవడంతో రైతులు మార్క్‌ఫెడ్ కార్యాలయాన్ని సంప్రదించగా 266 బస్తాలు పంపామని తెలిపారు. దీంతో గ్రామ రైతులు విలేజ్ హార్టీకల్చరల్ అసిస్టెంట్ (వీహెచ్ఏ) శ్రీకాంత్‌రెడ్డిని అడగ్గా.. ఇంకా రాలేదని ఆయన నిర్లక్ష్యంగా బదులిచ్చారు. అనుమానం వచ్చిన రైతులు గోస్పాడు ఏఓకు ఫిర్యాదుచేశారు. ఇది తెలుసుకున్న శ్రీకాంత్‌రెడ్డి పత్తాలేకుండాపోయారు. దీంతో.. గ్రామస్తులకు యూరియా అందిందా లేదా అని ఏఓ విచారించి రైతులకు అందలేదని తెలుసుకున్నారు. అనంతరం.. వారి సంతకాలు తీసుకుని జిల్లా వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నాయకులే వీహెచ్ఏ శ్రీకాంత్‌రెడ్డితో కుమ్మక్కై 266 బస్తాల యూరియా లారీని నంద్యాలలోనే ఓ బడా వ్యాపారికి అమ్మి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. మంత్రి ఫరూక్ ముఖ్య అనుచరుడి ప్రోద్బలంతోనే ఎరువు లారీని అమ్మే సాహసం టీడీపీ నాయకులు చేశారని తెలుస్తోంది. -
ఓటమి భయంతో కూటమి కుట్ర
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిన్న వార్డులోను ఓటమి భయం వెన్నాడుతున్న కూటమి నేతలు కుట్రలు పన్ని వార్డును విచ్ఛిన్నం చేశారు. ఉప ఎన్నికల సమయంలో వార్డులో ప్రాంతాలను తొలగించకూడదని నిబంధనలున్నా.. నేతల కుట్రకు అధికారులు వత్తాసు పలికారు. వార్డులోంచి ఈ ప్రాంతాలను ఎందుకు తొలగించారని స్థానికులు ప్రశ్నిస్తే అధికారులు నీళ్లు నములుతున్నారు. 484 ఓట్లున్న ఈ ప్రాంతాలు వైఎస్సార్సీపీకి అనుకూలమైనవనే కారణంతోనే ఈ దురాగతాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో ఈ అప్రజాస్వామిక పనులు యథేచ్ఛగా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి.. దాచేపల్లి, నడికుడి పంచాయతీలను కలిపి దాచేపల్లి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేయించారు. ఈ నగర పంచాయతీకి 2023లో తొలి ఎన్నికలు జరిగాయి. మూడోవార్డు నుంచి విజయం సాధించిన మునగా రమాదేవి వైఎస్సార్సీపీ తరఫున తొలి నగర పంచాయతీ చైర్పర్సన్ అయ్యారు. అప్పుడు ఈ వార్డులో 1,596 ఓట్లున్నాయి. రమాదేవికి 189 ఓట్ల మెజార్టీ లభించింది. తరువాత అనారోగ్యంతో రమాదేవి మరణించడంతో మూడోవార్డుకు ఉప ఎన్నిక నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు నగర పంచాయతీ అధికారులను ఆదేశించారు. దీంతో కూటమి నేతల్లో భయం మొదలైంది. ఈ వార్డులో గెలిచే సత్తా లేదు కాబట్టి వార్డునే విచ్ఛిన్నం చేయాలని కుట్రపన్నారు. వారు చెప్పినట్లే అధికారులు చేసేశారు. గతంలో ఈ వార్డు పరిధిలో ఉన్న చేపలగడ్డ, రంగనాయకస్వామి దేవాలయం, బొడ్రాయి సెంటర్ ప్రాంతాలను ఈ వార్డు నుంచి తొలగించారు. గతంలో 1,596 ఓట్లున్న ఈ వార్డులో ఇప్పుడు 1,112 ఓట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు ఓటర్ల జాబితా నమూనా సిద్ధం చేశారు. ఈ వార్డు నుంచి తొలగించిన మూడు ప్రాంతాల్లో 484 ఓట్లున్నాయి.స్పందించని కమిషనర్ ఈ విషయంలో నగర పంచాయతీ కమిషనర్ జి.వెంకటేశ్వర్లు వ్యవహారశైలి వివాదస్పదంగా మారింది. ఉప ఎన్నిక నేపథ్యంలో తమ ప్రాంతాలను వార్డులోంచి ఎందుకు తీసేశారని అడిగితే ఆయన స్పందించడంలేదని ఆయా ప్రాంతాల వారు చెబుతున్నారు. ఉప ఎన్నిలో టీడీపీకి అనుకూలంగా పనిచేసేలా ఆయన వ్యవహారశైలి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూటమి నేతలు చెప్పినట్లే కమిషనర్ పనిచేస్తున్నారు దాచేపల్లి 3వ వార్డులో 484 ఓట్లు మాయం కావటంపై కమిషనర్‌ను కలిసి ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించాం. మేం వెళ్లిన ప్రతిసారి కమిషనర్ దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారు. కూటమి నేతలు చెప్పిన విధంగానే కమిషనర్ పనిచేస్తున్నారు. – షేక్ సుభాని, వైఎస్సార్సీపీ దాచేపల్లి పట్టణ కన్వినర్మా ఓట్లు తీసే అధికారం కమిషనర్‌కు ఎక్కడిది? మూడోవార్డులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు మాయమయ్యాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరులమని మా ఓట్లను ఈ వార్డు నుంచి మాయం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. దీనికి కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరతాం. – కోలా శ్రీనివాసరెడ్డి, 3వ వార్డు ఓటర్ఓట్ల మాయంపై పరిశీలిస్తాం దాచేపల్లి మూడోవార్డులో 484 ఓట్లు మాయం కావడంపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై బీఎల్వోల ద్వారా సమాచారం తెప్పించుకుంటాను. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – జి.వెంకటేశ్వర్లు, కమిషనర్, దాచేపల్లి నగర పంచాయతీ -
ఖైదీ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో సంచలన ఆధారాలు
విజయవాడ: ఖైదీ శ్రీకాంత్ పెరోల్ అంశానికి సంబంధించి సంచలన ఆధారాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. శ్రీకాంత్ పెరోల్లో హోం మంత్రి అనిత అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ లేఖలపై హోంమంత్రి అనిత సంతకాలు చేశారు. హోంమంత్రి అనిత ఎండార్స్మెంట్ పైనే ఫైల్ కదిలింది. మే 16 న హోంమంత్రి అనిత ఫైల్‌పై సంతకం చేసి పంపగా, హోంమంత్రి ఆదేశాలతో హోంశాఖ ఫైల్ సిద్ధం చేసింది. అయితే ఖైదీ శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వొద్దని రిమార్క్స్ రాసిన నెల్లూరు జైల్ సూపరింటెండెంట్. ఫలితంగా శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదని హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. జులై 16వ తేదీన శ్రీకాంత్ పెరోల్ ఫైల్‌ను హోంశాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. అయినా మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పడంతో నిబంధనలు పక్కన పెట్టి శ్రీకాంత్‌కి పెరోల్ ఇస్తూ జీవో జారీ చేశారు. -
అవినీతి చేయడంలో..మంత్రులకు చంద్రబాబే ‘ఇన్స్పిరేషన్’
సాక్షి,శ్రీకాకుళం: రాష్ట్రంలో సీఎం చంద్రబాబుతో అవినీతిలో ఆయన కేబినెట్లోని మంత్రులు కూడా పోటీ పడుతున్నారని మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రుల అవినీతిని తట్టుకోలేక పారిపోతున్న అధికారులను వెంటాడి మరీ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడి అవినీతికి సహకరించలేదనే కారణంతోనే ఆగ్రోస్ జీఎం రాజమోహన్ని ఈ ప్రభుత్వం బదిలీ చేసి, ఆయన స్థానంలో అవినీతి కేసులున్న జూనియర్ అధికారిని నియమించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిజాయితీగా పనిచేసే అధికారులకు కనీస గౌరవం లేకుండా పోతోంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన అవినీతికి సహకరించలేదనే కారణంతో సీనియర్ అధికారి ఏపీ ఆగ్రోస్ జీఎం రాజమోహన్‌ను బదిలీ చేసి, ఆ స్థానంలో అర్హత లేని చిన్న స్థాయి ఉద్యోగిని తెచ్చిపెట్టుకున్నారంటే నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రయారిటీ ఏంటో అర్థమైపోతుంది.వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం నెరిపి తనకు మేలు జరిగేలా చేయాలని మంత్రి పేషీ నుంచి ఆగ్రోస్ జీఎం రాజమోహన్ కి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. కానీ దానికి ఆయన అంగీకరించకుండా సెలవుపై వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో అవినీతి ఆరోపణలు, పెండింగ్ కేసులన్న జూనియర్ అధికారిని తీసుకొచ్చి నియమించడం చూస్తుంటే అవినీతికి ఈ ప్రభుత్వం ఏవిధంగా పెద్దపీట వేస్తుందో చెప్పకనే చెప్పింది. వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీలో రైతులకు ఏవిధంగా మేలు చేయాలో ఆలోచించాల్సిందిపోయి కమీషన్ల ద్వారా జేబులు ఎలా నింపుకోవాలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్కెచ్ వేసుకోవడం సిగ్గుచేటు.ఆగ్రోస్ జీఎం రాజమోహన్ బదిలీ వెనుక ఏం కారణాలున్నాయో స్పష్టం చేయాల్సిన బాధ్యత అచ్చెన్నాయుడిపై ఉంది. మంత్రి అచ్చెన్నాయుడు ఎంతగా వేధించి ఉండకపోతే సీఎస్‌కి లేఖ రాసి మరీ ఆయన వెళ్లిపోతారు? సమర్థవంతమైన నిజాయితీగల అధికారులకు ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రజలకు మేలు చేయాలనుకున్న అధికారులను వేధించి ట్రాన్సఫర్లతో సన్మానిస్తారా? జరగని లిక్కర్ కుంభకోణాన్ని సృష్టించి వైయస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్న ఈ ప్రభుత్వం, అవినీతికి ప్రేరేపిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిపై ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలి.ఉచిత పంటల బీమాను ఎత్తేశారు:వైఎస్సార్సీపీ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను కూటమి ప్రభుత్వం వచ్చాక ఎత్తివేసింది. గత వైఎస్ జగన్ పాలనలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంట నష్టపోతే ప్రభుత్వం చెల్లించిన బీమా వల్ల వారికి పెద్దగా నష్టం లేకపోయేది. కానీ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. వరి, అరటి, మామిడి, మిర్చి, పొగాకు రైతులు తాము కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతుల్ని ఈ ప్రభుత్వం వంచించింది. కేంద్రం అందించే సాయంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక కేంద్ర సాయంతో కలిపి రూ. 20 వేలు ఇస్తామని మాట మార్చారు. అధికారంలోకి వచ్చిన 14 నెలలుగా రైతులను ఈ ప్రభుత్వం దగా చేస్తూ వస్తోంది. కూటమి నాయకుల అవినీతి వ్యవహారాలను వైఎస్సార్సీపీ ప్రస్తావించినప్పుడు వాటికి సమాధానం చెప్పుకోలేక గత ప్రభుత్వం అంటూ ఏడాదిగా మాపై బురదజల్లుతూనే ఉన్నారు. పొద్దస్తమానం వైఎస్ జగన్ పేరు తల్చుకోకుండా కూటమి నాయకులకు రోజు కూడా గడవడం లేదు. -
పల్నాడు జిల్లా గరికపాడులో టీడీపీ నేత బరితెగింపు
-
ఎమ్మెల్యే బుడ్డాను అరెస్ట్ చేయాల్సిందే: ఫారెస్ట్ అధికారులు
మార్కాపురం, ప్రకాశం జిల్లా: ఫారెస్ట్ అధికారులు, ఉద్యోగులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి పదవి నుంచి తొలగించాలని ఫారెస్ట్ అసోసియేషన్ నాయకులు నిరసన చేపట్టారు. ఒకవేళ బుడ్డాపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫారెస్ట్ అధికారులుపై దాడి చేపనప్పటికీ బుడ్డాపై చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై నిరసనను ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ నాయకులు బుడ్డాపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. నల్లమలలో అటవీ సిబ్బందిపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ దాడికి పాల్పడటం ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ వాహనాన్ని ఆపి తమపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.ఎమ్మెల్యే దాడి విషయాన్ని ఫారెస్ట్ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ వాహనాన్ని ఎమ్మెల్యే తానే నడుపుతూ.. సిబ్బందిని వాహనంలో ఎక్కించుకెళ్లినట్లు సమాచారం. అర్ధరాత్రి 2 గంటల వరకు ఫారెస్ట్ సిబ్బందిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తిప్పినట్లు తెలిసింది.ఫారెస్ట్ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మేం చెప్పినట్టు వినడం లేదని ఎమ్మెల్యే దాడి చేశారంటున్న ఫారెస్ట్ సిబ్బంది.. డిపార్ట్మెంట్ వాహనాన్ని కూడా ఎమ్మెల్యే లాక్కున్నారంటూ ఆరోపిస్తున్నారు. -
‘ఇది చాలా తప్పు నారా లోకేష్’.. ఏబీవీపీ ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఏపీలో విద్యా రంగం నిర్జీవమైపోయిందంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి మండిపడ్డారు. యువగళంలో నారా లోకేష్ యువతకు చాలా హామీలిచ్చారు. మార్చిలో ఇంటర్ పరీక్షలు పూర్తైతే.. ఈరోజుకీ డిగ్రీ అడ్మిషన్ల పట్ల స్పష్టత లేదు.. ఐదు నెలలు పూర్తైంది.. విద్యార్థులకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందంటూ మంత్రి నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అడ్మిషన్లు ఆలస్యం కావడంతో విద్యార్థులు ప్రైవేట్ యూనివర్శిటీలకు వలస పోతున్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల వద్ద తీసుకున్న లంచాల కారణంగానే అడ్మిషన్లు ఆలస్యం అవుతున్నాయని అనుమానాలొస్తున్నాయి. మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ బహిరంగంగా విడుదల చేయలేదు. మీ పార్టీ కార్యకర్తలకు డీఎస్సీ పోస్టులు ఇవ్వాలనే ఆలోచన కనిపిస్తోంది. మెరిట్ లిస్ట్‌ను మెసేజ్‌లు పెట్టి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పడం ముమ్మాటికీ తప్పు..రోస్టర్, మెరిట్ లిస్ట్ ప్రకారమే నియామక పత్రాలు అందించి రిక్రూట్ మెంట్ జరపాలి. ప్రైవేట్ యూనివర్శిటీల్లో చదివే పీజీ విద్యార్ధులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. ఐసెట్, పీజీ సెట్లు అయిపోయినా ఇంతవరకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల ఆవరణలోకి విద్యార్ధి సంఘాలు రాకూడదని జీవో ఇవ్వడం దారుణం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి పనిచేస్తున్నారు..యూనివర్శిటీల్లో ప్రైవేట్ కార్యక్రమాలు చేయొద్దంటారు. మీరు మాత్రం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలు ఉండాలని మీరే అంటారు. కానీ మీరే రాజకీయ కార్యకలాపాలు పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి నారా లోకేష్ పునరాలోచన చేసి జీవోను ఉపసంహరించుకోవాలి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి’’ అని యాగంటి వెంకట గోపి డిమాండ్ చేశారు.స్కూళ్లు, కాలేజీల ఆవరణలో డ్రగ్స్ దందా విపరీతమైపోయింది. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహించాలి. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తాం’’ అని వెంకట గోపి హెచ్చరించారు. -
ఏపీ కేబినెట్ భేటీలో.. టీడీపీ ఎమ్మెల్యేల బూతులపై చర్చ
సాక్షి, అమరావతి: చంద్రబాబు నోట.. మళ్లీ అదే మాట. సొంత ఎమ్మెల్యేలు తప్పుడు పనులకు, అరాచకాలకు పాల్పడుతున్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి స్వయంగా అంగీకరించారు. ఇవాళ కేబినెట్ భేటీలో మంత్రుల అలసత్వంతో పాటు ఎమ్మెల్యేల అరాచకాలపైనా చర్చ జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చాక.. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు వివాదాస్పదంగా ఉంటూ వస్తోంది. అవినీతి, అక్రమాలు, ఆరాచకాలు, వివాదాస్పద వ్యాఖ్యలు.. చేష్టలతో ఎవరో ఒకరు నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పదే పదే ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు. తాజాగా.. కేబినెట్ భేటీలో మునుపెన్నడూ లేని రీతిలో అరుదైన చర్చ జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేల దందాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. టీడీపీ ఎమ్మెల్యేల అసభ్య ప్రవర్తన, బూతులతోపాటు ఉద్యోగులపై దాడులు చేసిన ఘటనలపైనా హీటెక్కింది. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ సీరియస్ అయ్యారు. గాడితప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ మధ్యకాలంలో జరిగినవి.. శ్రీశైలం ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్.. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందిపై దాడి చేశారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యపై వేధింపులకు దిగగా.. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను దూషించిన ఆడియో క్లిప్ ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ టీడీపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీళ్లే కాదు.. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వ్యవహారంలో వేధింపులు భరించలేక టీడీపీకే చెందిన ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయమూ తెలిసిందే. కొలికపూడి శ్రీనివాస్, బండారు శ్రావణి, ఇలా మరికొందరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేల వ్యవహారం కూడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. ‘‘ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు. అధికార ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే.. ఎవరు బాధ్యత వహిస్తారు?. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. తప్పు చేసింది ఎవరైనా ఇక మీదట చట్టపరమైన చర్యలు తప్పవు’’ అని పేర్కొన్నట్లు సమాచారం. అదే సమయంలో.. అదేసమయంలో.. మంత్రుల పెరఫార్మెన్సుపైనా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. వాళ్లపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఫైల్స్ క్లీయరెన్సులో ఘోరంగా వెనకబడ్డారని అధికారులు తేల్చారు. దీంతో ఒక్కో ఫైల్ కు సరాసరిని ఒక్కో మంత్రి ఎంత టైమ్ తీసుకుంటున్నారో వివరించిన చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ పరిస్థితి మారాలి.. నిర్ణిత సమయంలో ఫైల్స్ క్లియర్ కావాలి అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. -
శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది వారే: కాకాణి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టడం వల్లే కక్షతో కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. జైలుకెళ్లొచ్చినా వెనక్కి తగ్గేది లేదని.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానన్నారు.‘‘దాదాపుగా రాష్ట్రంలోని అన్నీ జైళ్లు వైఎస్సార్సీపీ నేతలతో నిండిపోయాయి. టీడీపీ వాళ్లు అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టే ధైర్యం చేయలేకపోతున్నారు. అక్రమ కేసుల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు భవిష్యత్తులో ఫేస్ చేయాల్సి వస్తుంది. గతంలో మాపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా మేం ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఎప్పుడో జరిగిందని ఓ టీడీపీ నాయకుడి వాంగ్మూలాన్ని తీసుకుని కేసులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలుకుతున్నారు...జగన్ పరామర్శకు వెళ్లిన సమయంలో కూడా అనేక అక్రమ కేసులు పెట్టారు. అరెస్టులు చేయటం, పీటీ వారెంట్లు వేయటం.. జైళ్ల చుట్టూ తిప్పటం.. ఇదే వాళ్ల పని.. ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎవరూ కూడా పోలీసులు గుర్తించలేదు. మా పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. ఎవరో డ్రోన్ ఎగరేస్తే మా పార్టీ నేతపై మర్డర్ కేసులు పెడుతున్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే.ఎస్పీ స్థాయి అధికారులు వద్దన్నా టీడీపీ నేతల ఒత్తిడి తోనే పెరోల్ ఇచ్చారు.. దీన్ని మళ్ళీ వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పటికైనా టీడీపీ చేసిన తప్పులు ఒప్పుకుని చెంపలేసుకోవాలి. అడ్రస్ లేని వ్యక్తులు, ఏ గాలికి ఆ చాప ఎత్తే వ్యక్తులు మాట్లాడిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తాం. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసేందుకు కృషి చేస్తా’’ అని కాకాణి తెలిపారు. -
సుపరిపాలన అంటే స్కామ్‌లు, దాడులేనా?: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: సుపరిపాలన అంటే స్కాంలు, దళితుల మీద దాడులు చేయటమా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి, సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం, ఇసుకలో దోపిడీ చేయటమే సుపరిపాలనా? సాక్షాత్తు ఎమ్మెల్యేలే అధికారులను కిడ్నాప్ చేస్తుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. మహిళలను వేధిస్తున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు’’ అంటూ శైలజానాథ్ దుయ్యబట్టారు.‘‘జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దారుణంగా దూషించిన ఎమ్మెల్యేకి చంద్రబాబు వత్తాసు పలికారు. ఇదేనా సుపరిపాలన అంటే?. ప్రణాళికాబద్దంగా చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ఆయన పాలనలో ప్రజలకు ఒరగిందేమీ లేదు. టీడీపీ ఎమ్మెల్యే అటవీశాఖ అధికారుల మీద దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు? జూనియర్ ఎన్టీఆర్ తల్లిని టీడీపీ ఎమ్మెల్యే దారుణంగా దూషిస్తే కనీస చర్యల్లేవు. కూన రవికుమార్ ఒక మహిళా ప్రొఫెసర్ని వేధిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘మంత్రి అచ్చెన్నాయుడు వేధింపులకు ఆగ్రోస్ అధికారి సెలవుపై వెళ్లిపోతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?. ఎమ్మెల్యేలు, మంత్రుల నీతి మాలిన చర్యల వెనుక చంద్రబాబు ఆమోదం ఉంది. భూ కుంభకోణాల గురించి జనం చర్చించుకుంటున్నారని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రాయలసీమకు తాగునీరు రాకపోతున్నా పట్టించుకోరా?. దెందులూరులో మా పార్టీ నేత పామాయిల్ తోటలోకి టీడీపీ గూండాలు చొరపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ వికృత క్రీడలను ఇకనైనా ఆపండి’’ అంటూ శైలజానాథ్ హెచ్చరించారు.‘‘రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వటం వెనుక హోంశాఖ ఉండటం దుర్మార్గం. ప్రజలకు ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలి. అరుణ సెల్ఫీ వీడియోకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు సర్వ నాశనం అవుతున్నాయి. అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?. దౌర్జన్యాలు చేసే ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ ఇస్తారా? ఇంతకంటే దారుణం ఉంటుందా?’’ అంటూ శైలజానాథ్ మండిపడ్డారు. -
ఆడబిడ్డల జోలికొస్తే తాట తీస్తానన్న బాబూ.. మరి నీ నేతల సంగతేంటి..?
-
వికలాంగుల పెన్షన్ తొలగింపు.. కూటమి ప్రభుత్వానికి అబ్బయ్య చౌదరి సీరియస్ వార్నింగ్
-
‘ఉద్యోగుల హక్కులను చంద్రబాబు సర్కార్ కాలరాస్తోంది’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పద్నాలుగు నెలలకు నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వ వైఖరి తీవ్ర నిరాశను మిగిల్చిందని వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎస్ నేతృత్వంలో ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో ఏ ఒక్క అంశంపైనా నిర్ణయం తీసుకోకుండా మొక్కుబడిగా ముగించడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందన్నారు.పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ చెల్లింపులు, ఐఆర్ బకాయిలపై కనీసం ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏదైనా పాజిటీవ్ నిర్ణయం వస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు కొండంత ఆశ పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క దానిమీదా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ నిరాశ చెందారు.రెండేళ్ళ నుంచి పెండింగ్‌లో ఉన్న పన్నెండో పీఆర్సీకి నేటికీ కమిషనర్‌ను నియమించలేదు. గత ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడటంతోనే రాజకీనామా చేశారు. ఆయన స్థానంలో మరో కమిషనర్‌ను నియమించి పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు కనీసం పీఆర్సీ కమిషనర్‌నే నియమించలేదు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇస్తామన్న మధ్యంతర భృతి పైన కూడా ఎక్కడా నిర్ణయం తీసుకోలేదు.ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. ఈ బకాయిలు ఎంత అనే దానిపైన కూడా ఒక స్పష్టత లేదు. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన డీఏ ఎరియర్స్ ఎంత అనే దానిపైన ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. కనీసం పే స్లిప్‌ల్లో ఈ బకాయిలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని అమరావతి జేఏసీ తరుఫున దీనిపై సీఎస్‌ను డిమాండ్ చేసినా, దానిపైనా ఎటువంటి స్పందన లేదు. పదకొండో పీఆర్స్ ఎరియర్స్‌తో పాటు, డీఏలకు సంబంధించిన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి.ఇప్పటి వరకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉంది. డీఏల గురించి ఎక్కడా ఈ సమావేశంలో మాట్లాడలేదు. అసలు జేఎస్సీ ఎందుకు పెట్టారో చెప్పాలి. కేవలం టైంపాస్ కోసం, ఉద్యోగుల కళ్ళ నీళ్ళు తుడిచేందుకే ఈ సమావేశం నిర్వహించారా..? కనీసం ముప్పై శాతంకు తగ్గకుండా మధ్యంతర భృతిని ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీనిపైన కూడా ఎక్కడా నిర్ణయం తీసుకోలేదు.తక్షణం పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి:ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం తక్షణం పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, పీఆర్సీ కనీసం 30 శాతంకు తగ్గకుండా చూడాలి. డీఏ బకాయిలను విడుదల చేయాలి. మధ్యంతర భృతిని చెల్లించాలి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీంలు సరిగా నిర్వహించడం లేదు, బకాయిలు పెట్టడం వల్ల ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందించడం లేదని పలువురు ఉద్యోగులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. మెడికల్ రీయింబర్స్ మెంట్ ను రెండు నుంచి అయిదు లక్షల రూపాయలకు పెంచాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను తీసుకురావాలని, గత ప్రభుత్వం మూడు వేల మందిని రెగ్యులర్ చేసింది, మిగిలిన ఏడు వేల మందిని కూడా తక్షణం రెగ్యులర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు పదిశాతం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్, 75 దాటిన వారికి పదిహేను శాతం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశాయి. అయిదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కనీసం ఒక్క దానిపైన కూడా నిర్ణయం తీసుకోలేదు. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు 62 ఏళ్ళ వరకు పదవీ విరమణ వయస్సును పెంచాలని కోరారు.ఈ డిమాండ్లపై సీఎస్ నుంచి ఎటువంటి హామీ రాకపోవడం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెడతానంటూ చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం ఎంత వరకు సమంజసం..? కూటమి ప్రభుత్వ వైఖరిని వైయస్ఆర్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఉద్యోగ, పెన్షనర్ల తరుఫున ప్రభుత్వం మెడలు వంచైనా సరే, వారికి రావాల్సిన అన్నింటిని సాధించుకుంటాం. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరిక.. దగ్గుపాటికి చంద్రబాబు మద్దతు!
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తర్వాత బుధవారం చంద్రబాబుతో ఎమ్మెల్యే దగ్గుపాటి భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. దగ్గుపాటిపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించడం గమనార్హం.చంద్రబాబుతో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బుధవారం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారనే చర్చ నడిచింది. కచ్చితంగా సస్పెన్షన్ ఉంటుందని కొందరు టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఆశించారు. ఇలాందేమీ జరగకుండానే.. వారిద్దరి భేటీ ముగిసింది. అయితే, మంత్రి నారా లోకేష్‌కి దగ్గుపాటి సన్నిహితుడు అయిన కారణంగానే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలో బూతుల ఎమ్మెల్యేకు చంద్రబాబు మద్దతు ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ సైతం చేస్తున్నారు. తాజా పరిణామాలు కూడా అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దీంతో, మరోసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి రేపటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డెడ్ లైన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతపురం నడిబొడ్డున బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఎన్టీఆర్ అభిమానుల ప్రెస్ మీట్‌కి కూడా చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి మాట్లాడుతూ..‘టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి సభ్యసమాజం తలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత వాగారు. మా ఎన్టీఆర్ తల్లిపై దారుణంగా కామెంట్స్ చేశారు.ఎన్టీఆర్ తల్లినే కాదు, ఏ స్త్రీ మూర్తి గురించి అలా మాట్లాడకూడదు. అలా ఎవరు మాట్లాడినా తప్పే! ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే బెటర్. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు చెప్పాలి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరం ఛలో అనంతపురం అంటూ మీ ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు. -
బాబూ.. నిన్ను నమ్మేదెలా?
‘ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తా’ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హెచ్చరిక ఇది. అయితే ఇదంతా కేవలం ఉపన్యాసం కోసం చేసిందేనని, చిత్తశుద్ధి లేనిదని ఇప్పుడు పలువురు విమర్శిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ప్రసంగం ప్రచురితమైన రోజే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరిగిన దాష్టీకాల వార్తలూ ప్రముఖంగా వచ్చాయి. కొన్నింటిలో చంద్రబాబు సొంతపార్టీ ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. కానీ.. ఇప్పటివరకూ చంద్రబాబు వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఇందుకు తగ్గట్టుగానే బాబుకు వత్తాసు పలికే మీడియా కూడా టీడీపీ నేతల అక్రమాలను కప్పిపుచ్చుతూంటుంది. కానీ.. ఈ ఘటనలన్నీ ఇతర మాధ్యమాల్లో వస్తుండటంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి.టీడీపీ ఎమ్మెల్యేల ఇతర దందాల సంగతి పక్కనపెట్టినా.. వీరూ, వీరి అనుచరులు మహిళలపై చేస్తున్న వేధింపుల ఉదాహరణలు చూద్దాం. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ దూషించిన ఆడియో తీవ్ర కలకలం రేపింది. సినిమా విడుదలకు తన అనుమతి కావాలన్న ఆ ఎమ్మెల్యేపై కనీస చర్య తీసుకోలేదు. ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై ఒక కథనం వచ్చింది. దాని ప్రకారం ఆయన శ్రీకాకుళంలోని కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను ఫోన్ ద్వారా వేధిస్తున్నారు. తనతో వీడియో కాల్‌లోనే మాట్లాడాలన్నది ఆయన హుకుం!. మాట వినకపోతే బదిలీ ఖాయమని సిబ్బంది ద్వారా బెదిరింపులకు దిగుతున్నట్లు ఈ కథనం చెబుతోంది.రాత్రి పది గంటల సమయంలోనూ పార్టీ ఆఫీసుకు రావాలని మహిళా ఉద్యోగులను పిలుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వేధింపులు భరించలేక ఆ దళిత మహిళా ప్రిన్సిపాల్ ఆత్మహత్య యత్నం చేసుకోవడమే కాకుండా.. ఎమ్మెల్యేపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు. కూన రవికుమార్ ఇతర మహిళా ఉద్యోగులను కూడా వేధించారని ఆమె అంటున్నారు. మరి ఇవన్నీ ఆడబిడ్డ జోలికి వెళ్లడమే కదా? మరి చంద్రబాబు తాట ఎంతవరకు తీశారు? కొంతకాలంగా ఈ గొడవ సాగుతూనే ఉన్నా పట్టించుకోలేదని చెబుతున్నారు. చంద్రబాబుకు అన్ని విషయాలు చేరవేయడానికి పనిచేసే నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు?.ఇక మరో ఎమ్మెల్యే ఉదంతం చూద్దాం. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ ఒక మహిళకు వీడియో కాల్ చేసి ముద్దు పెడుతున్నట్లు పెదాలు కదుపుతున్న దృశ్యం సన్నివేశాలు వైరల్ అయ్యాయి. ఆ ఎమ్మెల్యేకి టీడీపీకే చెందిన ఒక మహిళా నేతతో సంబంధం ఉందట. దీంతో ఆ మహిళా నేత భర్తే సంబంధిత వీడియోని ప్రచారంలో పెట్టారట. ఈ విషయాన్ని సూఫియా అనే మరో టీడీపీ నేత ఎమ్మెల్యేకి చెబితే తొలుత ఆమెను కామ్‌గా ఉండమని చెప్పారట. తదుపరి అక్రమ సంబంధం ఉన్న మహిళ కుటుంబంతో సెటిల్మెంట్ చేసుకుని, తదుపరి తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని సూఫియా అంటున్నారు. దీనిపై వాస్తవాలు వెలికి తీయకుండా పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు.కళ్యాణదుర్గంలో జరిగిన ఘటన అత్యంత విషాద భరితం. శ్రావణి అనే గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె ఒక ఆడియో రికార్డు చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని ఆమె పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. అయితే భర్త టీడీపీకి చెందిన వాడు కావడంతో కళ్యాణదుర్గం మాజీ మున్సిపల్ ఛైర్మన్, మాజీ వైస్ చైర్మన్ తదితరుల ఒత్తిడితో పోలీసులు ఆ కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారని శ్రావణి ఆరోపించారు. తన ఆత్మహత్యకు టీడీపీ ప్రభుత్వం, పోలీసులు కారణమని ఆమె చెప్పిన ఆడియో వింటే ఎవరికైనా బాధ కలుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో సుగాలి ప్రీతి అనే మహిళ హత్య కేసు గురించి గొంతెత్తి అరిచేవారు. ఎన్నికల తర్వాత ఆయనకు పదవి రావడంతో ఆ మాటే ఎత్తడం లేదు. ఆ మీదట సుగాలి ప్రీతి తల్లి నిరసన యాత్ర చేయాలని తలపెట్టినా అనుమతించడం లేదట. జగన్ పాలన సమయంలో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని, వలంటీర్లే కిడ్నాప్‌లకు పాల్పడ్డారని తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయంటూ పవన్ కళ్యాణ్ విపరీతమైన ప్రచారం చేశారు. తీరా అధికారం వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. అధికారం సాధించడానికి గాను మహిళలను అడ్డు పెట్టుకుని అంత ఘోరమైన ఆరోపణలు చేయవచ్చా? అది వారిని అవమానించినట్లా? కాదా?.2014-19 మధ్య కాలంలో కూడా మహిళలపై పలు అఘాయిత్యాలు జరిగాయి. ముసునూరు మహిళా ఎమ్మార్వో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోబోగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మనుషులు ఆమెను తీవ్రంగా అవమానించిన ఘటన అప్పట్లో పెను సంచలనం. అయితే చంద్రబాబు ఎమ్మార్వోనే మందలించి రాజీ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పుడే కాదు.. కొద్ది నెలల క్రితం సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక టీడీపీ మహిళా నేత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనపై నామమాత్రంగా చర్య తీసుకున్నా, ఆ తర్వాత ఆ కేసే లేకుండా రాజీ చేశారని వార్తలు వచ్చాయి.శ్రీకాళహస్తి జనసేన మహిళా నేత వినూత వ్యక్తిగత వీడియోల కేసు చివరికి వారి పీఏ హత్యకు దారి తీసింది. వినూత దంపతులు ఇదంతా టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వల్లే జరిగిందని ఆరోపించారు. అనేక చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వపరంగా చర్యలు శూన్యమే. అందుకే చంద్రబాబు చెప్పే మాటలను ఎంత వరకు నమ్మాలో అర్థం కాని పరిస్థితి!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీపై YSRCP ఫైర్
-
గుట్టురట్టు కాకుండా అరుణ అరెస్ట్.. ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
సాక్షి టాస్క్‌ఫోర్స్: నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం గుట్టు రట్టు కాకుండా అత్యవసరంగా ఈ ఎపిసోడ్‌కు ఫుల్ స్టాప్ పెట్టడంలో భాగంగా శ్రీకాంత్ సన్నిహితురాలు నిడిగంటి అరుణను ప్రభుత్వం ఆగమేఘాలపై అరెస్ట్ చేయించింది. కోవూరులో బిల్డర్ నుంచి అపార్ట్మెంట్ కొనుగోలు వ్యవహారంలో అరుణ.. శ్రీకాంత్ స్నేహితులను అడ్డుపెట్టుకుని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నించిందని మూడేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు కేసు నమోదు చేయించింది.హైదరాబాద్‌కు వెళ్తున్న ఆమెను బాపట్ల జిల్లా అద్దంకిలో పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో ఒంగోలు జైలుకు తరలించారు. అంతకు ముందు అరుణను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను కారు డిక్కీలో వేశారు. ‘నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. నా కారులో గంజాయి పెట్టాలని నా కారు డ్రైవర్‌కు చెబుతున్నారు. నన్ను అక్రమంగా నిర్బంధించారు. నాపై ఏమేమి కేసులు పెడుతున్నారు? నేను చేసిన తప్పేంటి? నన్ను చంపుతారేమోనని భయంగా ఉంది. మీడియా నన్ను కాపాడాలి’ అంటూ డిక్కీలోంచి సెల్ఫీ వీడియో తీసి బయటకు పంపింది. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ పెద్దలు బెంబేలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెపై మరిన్ని కేసులు నమోదు చేసి.. ఇప్పుడప్పుడే బయటకు రాకుండా చేసేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది. అవును.. సిఫార్సు లేఖ ఇచ్చాను జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్‌కు తాను సిఫార్సు లేఖ ఇచ్చింది నిజమేనని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ బుధవారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న తన కుమారుడిని చూడాలని ఉందంటూ తనకు ప్రజా విజ్ఞప్తుల్లో ఓ మహిళ వినతి పత్రం ఇచ్చారన్నారు. ఆ తర్వాత పెరోల్ రద్దు కావడం తెలిసిందేనని చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల తాను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన సమయంలో అక్కడ అరుణ అనే మహిళ ఉందని, దీనిని ఆసరాగా చేసుకుని పెరోల్‌కు తామే సహకరించినట్లు ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. పెరోల్ రద్దుతో వివాదం సమసిపోయిందన్నారు.రూ.2 కోట్లు ఎవరికి ఇచ్చినట్లు?శ్రీకాంత్ 2014లో టీడీపీ హయాంలో జైలు నుంచి తప్పించుకుని నాలుగేళ్ల పాటు డాన్‌గా ఎదిగాడు. వంద మందికి పైగా రౌడీషీటర్లను సైనికుల్లా పెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేల సహకారంతో నెల్లూరులో సెటిల్మెంట్లు, దందాలు, హత్యాకాండలు సాగించాడు. నాలుగేళ్ల తర్వాత స్వచ్ఛందంగా లొంగిపోయాక కూడా అదే తరహాలో జైలు నుంచే అన్ని కార్యక్రమాలు నిర్వహించాడు. ఇవన్నీ తెలిసి కూడా కూటమి ప్రభుత్వం అతడికి పెరోల్ మంజూరు చేసి.. అతని నేరాలకు రాచబాట వేసింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పెరోల్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమను వాడుకుని వదిలేశారని, అందరి గుట్టు విప్పుతానని శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో పెరోల్ వెనుక అసలు గుట్టుతోపాటు అతని నేర చరిత్రలో భాగస్వాములుగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల అసలు రంగు బయట పడుతుందని ప్రభుత్వం బెంబేలెత్తిపోయి హడావుడిగా ఆమెను అరెస్ట్ చేయించింది. కాగా, పెరోల్ కోసం హోం శాఖలో ముఖ్యులొకరికి అరుణ రూ.2 కోట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకూ ఆ డబ్బును ఎవరు తీసుకున్నారో విచారణలో తేలుస్తారా?ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్ల సస్పెన్షన్జీవిత ఖైదీ శ్రీకాంత్ హాస్పిటల్లో ఉన్న సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ జీ కృష్ణకాంత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది డిసెంబర్లో శ్రీకాంత్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చేరారు. నెల రోజులకు పైగా అయన హాస్పిటల్లో ఉన్నారు. ఆ సమయంలో సన్నిహితురాలు అరుణతో మసాజ్ చేయించుకుంటూ, డ్యాన్స్‌లు చేసిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో దీనిపై విచారణ జరిపిన ఎస్పీ.. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుళ్లు సుబ్బారావు, ఖాజా మొహిద్దీన్, ఖలీల్‌ను విధుల నుంచి తొలగించారు. శ్రీకాంత్, అరుణ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు వారికి సహకరించారో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. -
వారికి నోటీసులు ఆపండి!
సాక్షి, అమరావతి: అనర్హులంటూ రాష్ట్రంలోని లక్షలాది మంది దివ్యాంగ పింఛనుదారులకు కొద్దిరోజులుగా జారీచేస్తున్న నోటీసులను కొందరికి నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పింఛను కార్యక్రమాలను పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ ఈ మేరకు సూచించారంటూ సెర్ప్ అధికారులు అన్ని జిల్లాల అధికారులకు బుధవారం సమాచారం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన జాబితాలను జిల్లాల వారీగా సెర్ప్ కార్యాలయం అందజేస్తుందని వారు తెలిపారు. నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకు దివ్యాంగులను ప్రధానంగా టార్గెట్ చేసింది. వీరి సంఖ్యను భారీగా కుదించేందుకు 10–15 ఏళ్లకు పైగా పింఛను పొందుతున్న లబ్ధిదారులకు కొత్తగా మళ్లీ వైద్య పరీక్షలు అంటూ హడావుడి చేస్తోంది. మీకు 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉంది, పింఛనుకు అనర్హులంటూ ప్రతి జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులకు నోటీసులు జారీచేస్తోంది. ఇప్పటికే నాలుగున్నర లక్షల పింఛన్లకు కోత..గత ప్రభుత్వ హయాంలో 66.34 లక్షల మందికి పైగా పింఛన్లు అందించగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో దాదాపు నాలుగున్నర లక్షల పింఛన్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ఆగస్టులో పంపిణీ చేసిన మొత్తం పింఛన్లు 62.19 లక్షలే. ఇప్పుడు దీనికి అదనంగా లక్షలాది మంది దివ్యాంగ, వైద్య పింఛనుదారులకు అనర్హత పేరుతో నోటీసులు జారీచేస్తుండడంపై ‘సాక్షి’ బుధవారం ‘పింఛన్లు.. కకావికలం’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో.. మెంటల్ రిటార్డేషన్, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 18 ఏళ్లలోపు పిల్లలకు జారీచేసే నోటీసులను నిలుపుదల చేయాలంటూ సెర్ప్ సీఈఓ ఆదేశాలు జారీచేశారు. -
నీచ రాజకీయాలకు కేరాఫ్ టీడీపీ
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్పడిన కుంభకోణాలు వరుసగా బయట పడుతుండటంతో టీడీపీ కుప్పకూలిపోతోందని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఇది ప్రభుత్వ విశ్వసనీయత, పాలన గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని స్పష్టం చేసింది. నీచపు రాజకీయాలకు టీడీపీ కేరాఫ్‌గా మారిందని నిప్పులు చెరిగింది. ప్రభుత్వ అధికారులపై నిస్సిగ్గుగా దాడులు మొదలు.. అవినీతి, పెరోల్ కుంభకోణాలు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన వరకు అనేక వివాదాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూరుకుపోవడంతో అధికార పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టిందని ఎత్తిచూపింది. ఈ మేరకు ‘సీబీఎన్ ఫెయిల్డ్ సీఎం’ హ్యాష్ ట్యాగ్‌తో జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేస్తూ బుధవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఆ పోస్టులో వైఎస్సార్సీపీ ఇంకా ఏమన్నదంటే.. » శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మద్యం మత్తులో విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై దాడి చేశారు. పెట్రోలింగ్ కార్యకలాపాలను అడ్డుకున్నారు. గిరిజన సిబ్బందిని కూడా వేధించారు. ఈ దిగ్భ్రాంతికర సంఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది అధికార పార్టీ శాసనసభ్యులలో చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎత్తిచూపింది.» ఈ వివాదానికి తోడు మంత్రి అచ్చెన్నాయుడు అవినీతిపై తుపానులో చిక్కుకున్నారు. డీలర్లతో అక్రమ కమిషన్ లావాదేవీలలో మధ్యవర్తిగా వ్యవహరించడానికి నిరాకరించినందుకు మాత్రమే తనను అకస్మాత్తుగా బదిలీ చేశారని ఆగ్రోస్ జనరల్ మేనేజర్ మోహన్ నేరుగా ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ ఆరోపణలు ఈ ప్రభుత్వ సమగ్రత, పాలనపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తాయి.» వివాదాస్పద పెరోల్ సిఫార్సుల చుట్టూ ఉన్న విషయాలు కూడా అంతే ఆందోళనకరంగా ఉన్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఒక ప్రసిద్ధ రౌడీ–షీటర్‌కు పెరోల్‌ను సిఫార్సు చేశారు. ఈ చర్య ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. హోం మంత్రి అనిత ఈ ఫైల్‌ను ఆమోదించడం మరింత ఆందోళన కలిగించే అంశం. ఇటువంటి చట్ట వ్యతిరేక నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించారు. ప్రజాభద్రత కంటే నేరస్థులకు పెరోల్ ఇచ్చేందుకు అధికంగా శ్రద్ధ చూపడం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. » మంత్రులు, ఎమ్మెల్యేల వేధింపులు, అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వరుస కుంభకోణాలతో టీడీపీ పూర్తిగా కుప్పకూలింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఒక మహిళ పట్ల అసభ్యకరమైన సైగలు చేస్తూ వీడియోలో దొరికిపోయాడు. ఇది వైరల్ అయ్యింది. అసెంబ్లీని ఇబ్బంది పెట్టింది. ఈ సంఘటనను బహిర్గతం చేసినట్లు అనుమానించి, మరొక మహిళను కూడా ఆ ఎమ్మెల్యే వేధించి, ఆమెను ఇబ్బంది పెట్టాడు. దాంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. » అమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను పదే పదే వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమెను పని సాకుతో తన కార్యాలయంలో ఉండమని బలవంతం చేస్తున్నాడు. అర్ధరాత్రి అనుచిత వీడియో కాల్స్ చేస్తున్నాడు. భరించలేని విధంగా అవమానాలకు గురిచేస్తున్నాడు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక సౌమ్య ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇది ఎన్నికైన ప్రజా ప్రతినిధుల అధికార దుర్వినియోగానికి ప్రతిబింబం.» మొత్తం మీద ఈ సంఘటనలు టీడీపీలోని మరో కోణాన్ని బహిర్గతం చేశాయి. కేవలం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అధికార దుర్వినియోగం నుంచి అధికారులపై ప్రత్యక్ష దాడులు, మహిళలపై అసభ్యకరమైన చర్యల వరకు నేరాలకు పాల్పడ్డారు. ఈ ఉదంతాలన్నీ నీచ శ్రేణి రాజకీయాలు చేసే పార్టీగా ప్రజలు టీడీపీని అభివర్ణిస్తున్నారనేందుకు అద్దం పడుతున్నాయని విమర్శకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జవాబుదారీతనం లేకుండా అధికార దుర్వినియోగంతో మహిళల గౌరవం, అధికారుల హక్కులు, ప్రజా విశ్వాసానికి విఘాతం కల్పిస్తున్నారు. -
టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ ఫైర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ మండిపడింది. జాతీయ మీడియాను ట్యాగ్ చేస్తూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. గత కొన్ని రోజుల్లోనే టీడీపీ పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవర్తన దారుణంగా తయారైంది. దీంతో ప్రభుత్వ విశ్వసనీయత, పాలన మీద తీవ్ర అనుమానాలు పెరుగుతున్నాయంటూ ఎక్స్ వేదిక వైఎస్సార్సీపీ పేర్కొంది.‘‘అధికారుల మీద దాడి చేయడం నుంచి అవినీతి, పెరోల్ స్కాం, మహిళలపై అసభ్య ప్రవర్తన వరకు అనేక దారుణాలకు ఒడిగట్టారు. శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మద్యం మత్తులో అటవీ అధికారుల మీద దాడి చేశారు. వారి గస్తీ విధులను అడ్డుకున్నారు. గిరిజన సిబ్బందిని కూడా వేధించారు. ఈ ఘటనపై కనీసం అధికారులు కేసు కూడా నమోదు చేయలేదు. మంత్రి అచ్చెన్నాయుడు వైఖరితో ఆగ్రోస్ జనరల్ మేనేజర్ మోహన్ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. డీలర్ల నుండి కమీషన్లు గుంజుకునే విషయంలో సహకరించలేదని ఆయన్ను వేధించి బదిలీ చేశారు...నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఒక రౌడీషీటర్‌కి పెరోల్ సిఫార్సు చేశారు. దీనికి హోం మంత్రి అనిత కూడా పూర్తిగా సహకరించారు. వీరి చర్యలను చూస్తే ప్రజల భద్రత కంటే నేరస్తుల ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఉంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్లో మహిళతో అసభ్యకరంగా వ్యవహరించారు. ఆ విషయం బయట పెట్టిందని అనుమానించి మరో మహిళను వేధించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.Third-Rate… Vulgar LeadersIn just the last few days, the Telugu Desam Party (TDP) has been rocked by a string of scandals involving its ministers and MLAs, raising serious questions about the government’s credibility and governance. The controversies range from brazen attacks…— YSR Congress Party (@YSRCParty) August 20, 2025..అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను రాత్రిళ్లు ఆఫీస్‌కి పిలిపించడం, అర్థరాత్రి వీడియో కాల్స్ చేయడం వంటి వేధింపులకు పాల్పడ్డారు. దాంతో ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. మూడునాలుగు రోజుల్లోనే ఈ ఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏస్థాయిలో అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అధికారులపై దాడులు, మహిళలపై అసభ్య ప్రవర్తన వంటి ఆరోపణలు రావడం సిగ్గుచేటు. టీడీపి ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళల గౌరవాన్ని కాలరాస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని తుంగలో తొక్కారు’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ నిలదీసింది. -
వికలాంగులకు నోటీసులు.. పింఛన్ దారుల ఆవేదన
-
చంద్రబాబు పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరు.. వికలాంగుల పింఛన్ల కోత
-
Kakinada: ఇన్ఛార్జ్ పదవి తమ నాయకుడికే ఇవ్వాలంటూ ఇరు వర్గాలు గొడవ
-
పక్కనే ఉంటూ పవన్ స్థాయిని తగ్గించే పనిలో!
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార కూటమిలో ఇటీవలి పరిణామాలను గమనించారా? మంత్రి లోకేశ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న వైనం.. ఇంకోపక్క ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను తక్కువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే.. రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఏమిటన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ప్రకటనలన్నింటిలో పవన్ కల్యాణ్ పక్కనే లోకేశ్ ఫొటో కూడా ముద్రిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర స్థాయిలో ప్రధాని, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి ఫొటోలను మాత్రమే ప్రచురించాలి. అయితే చాలా రాష్ట్రాలు వీటిని విస్మరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో కూడా వేస్తున్నారు. ఏపీ పరిస్థితి కూడా ఇదే అయినప్పటికీ ఇటీవలి కాలంలో పవన్‌తోపాటు లోకేశ్ ఫొటో కూడా వేయడం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పని ఏదైనా వైస్సార్సీపీ హయాంలో చేసి ఉంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇల్లెక్కి గగ్గోలు పెట్టేవారు. సుప్రీంకోర్టునే ధిక్కరిస్తారా? అని ప్రశ్నించేవారు. రాజ్యాంగ ఉల్లంఘన కింద పిక్చర్ ఇచ్చేవారు. టీడీపీ మీడియా నానా యాగీ చేసి ఉండేది. కాని ఇప్పుడు లోకేశ్ ఫొటో వేస్తున్నా నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు ఉన్న ఆర్థిక, రాజకీయ బంధం అంత బలీయమన్నమాట. విశేషం ఏమిటంటే లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. వీటికి సంబంధించిన ప్రకటనల్లో మంత్రి ఫొటో వేస్తే ఫర్వాలేదేమో కానీ.. ఇతర మంత్రిత్వ శాఖల కార్యక్రమాలకు కూడా ఆయా మంత్రులవి కాకుండా లోకేశ్ ఫొటో ముద్రిస్తూండటంతోనే వస్తోంది తేడా. ఏ హోదాలో అలా చేస్తున్నారని ఎవరూ అడగడం లేదు. అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. లోకేశ్ డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు ఇలాంటి ఘటనలు మరింత బలం చేకూరుస్తాయి. ప్రస్తుతం చంద్రబాబుకన్నా లోకేశే పవర్ పుల్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేశ్ గురించి పొగుడుతున్నారు. తద్వారా టీడీపీలోను, కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ఒక సంకేతం పంపుతున్నారన్నమాట. లోకేశ్‌ను సాధ్యమైనంత త్వరగా సీఎంను చేయాలన్న డిమాండ్ ఆయన అనుచరుల్లో కాని, కుటుంబ సభ్యులు కొందరి నుంచి గట్టిగానే ఉందని చెబుతారు. దానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇబ్బంది వస్తుందని చంద్రబాబు చెప్పి ఉండవచ్చని, పవన్‌తోసహా, వివిధ వర్గాల వారిని మానసికంగా సిద్దం చేసిన తర్వాత లోకేశ్‌ను సీఎం పదవిలోకి తీసుకురావచ్చని నచ్చ చెప్పి ఉండవచ్చన్నది టీడీపీ వర్గాలలో ఉన్న భావన. అందుకు తగినట్లుగానే చంద్రబాబు నాయకత్వంలో కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలన్న రాగాన్ని పవన్ కల్యాణ్ ఎత్తుకున్నారు. అంటే.. లోకేశ్‌ను సీఎంగా ఇప్పటికిప్పుడు చేయడానికి ఆయన సుముఖంగా లేరన్నమాట. దాంతో లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న తలంపును తెచ్చారు. ఇందుకు చంద్రబాబు కూడా రెడీ అయినప్పటికీ, జనసేన నుంచి నిరసన రావడం ఆరంభమైంది. తమ అధినేత పవన్ స్థాయిని తగ్గిస్తారా? అని ప్రశ్నించసాగారు. ఎన్నికల సమయంలో పవన్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్న అవగాహన ఉందన్నది వారి వాదన. వాస్తవానికి ఈ విషయంలో లోకేశ్ అప్పట్లో క్లారిటీతో మాట్లాడారు. సీఎం పదవిని పవన్‌కు షేర్ చేయడానికి గాని, ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ ఒక్కరికే కట్టబెట్టడానికిగాని ఆయన సానుకూలంగా మాట్లాడలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని సైతం తమ పాలిట్ బ్యూరో చర్చిస్తుందని అన్నారు. అయినా రాజకీయ వ్యూహాల రీత్యా పవన్ ఒక్కరికే చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు. లోకేశ్‌కు డిప్యూటి సీఎం పదవి ఇవ్వడానికి జనసేన వైపు అంత సుముఖత కనిపించకపోవడంతో వ్యూహాత్మకంగా లోకేశ్‌కు ప్రస్తుతం ఎలివేషన్ ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇతర శాఖల ప్రచార ప్రకటనలలో కూడా పవన్‌తోపాటు లోకేశ్ ఫొటో వేయడం ఆరంభించారు. దీనివల్ల లోకేశ్ స్థాయిని పెంచేసినట్లయింది. పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఒకటే స్థాయి అని ప్రపంచానికి తెలియ చేసినట్లయింది. పవన్ కళ్యాణ్ కూడా తొలుత కొంత అసౌకర్యంగా ఫీలై ఉండవచ్చు కానీ పదవిని అనుభవించడానికి అలవాటు పడ్డాక, అలాంటి వాటిని పక్కన పెట్టి సర్దుకుపోతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్‌ను ‘అన్నా..’ అని సంబోధిస్తూనే లోకేశ్ తెలివిగా తనమాటే చెల్లుబడి అయ్యేలా చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద తొలి విడత రైతులకు ప్రభుత్వం తరపున రూ.ఐదు వేలు ఇస్తున్న సందర్భంలో వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఫోటో వేయకుండా పవన్ కల్యాణ్ లోకేశ్ ఫోటోలనే వేశారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం స్కీమ్ అమలు ప్రచార ప్రకటనలో సైతం రవాణాశాఖ మంత్రి రామ ప్రసాదరెడ్డికి బదులు లోకేశ్ ఫొటో వేశారు. తద్వారా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకపోయినా, పవన్, లోకేశ్‌లది ఒకటే స్థాయి అన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వగలిగారన్న విశ్లేషణలు వస్తున్నాయి.అంతకుముందు లోకేశ్‌కు డిప్యూటి సీఎం పదవి ఎలా ఇస్తారని గొణిగిన జనసేన వర్గాలు కూడా నోరు మెదపలేకపోతున్నాయి. దీనివల్ల తమ నేత స్థాయి తగ్గిందని జనసేన క్యాడర్ భావిస్తున్నప్పటికి, పవన్ కి లేని బాధ తమకు ఎందుకులే అని సరిపెట్టుకుంటున్నారట. టీడీపీలో కాబోయే సీఎం లోకేశ్ అన్న సంగతేమి రహస్యం కాదు. అయితే ఎప్పుడు అవుతారన్నదే చర్చగా ఉంది. ఈ టర్మ్‌లోనే కావచ్చని కొందరు, వచ్చే ఎన్నికల సమయంలో అభ్యర్ధిగా ప్రకటించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ పదవిని వెంటనే తన కొడుక్కు ఇవ్వదలిస్తే చంద్రబాబు ఒక్కరోజులో చేయవచ్చు. కాని ఆయన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదలి ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, సిద్దపడకపోవచ్చు. కాకపోతే పార్లమెంటుకు వెళ్లాలని అనుకుంటే అనుకోవచ్చేమో! ఆయనకు ఆరోగ్యరీత్యా కూడా పెద్ద ఇబ్బందులు లేవు. లోకేశ్‌కు సీఎం పదవి ఇస్తే పార్టీ గట్టిగానే ఉంటుందా? లేదా? అన్న మీమాంస ఆయనకు ఉండవచ్చు.అలాగే ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపి అందరిని కలుపుకుని వెళ్లగలరా? లేదా?అన్నదానిపై కూడా ఆలోచన చేస్తుండవచ్చు. మానసికంగా తయారు చేయకుండా లోకేశ్ కు ప్రమోషన్ ఇస్తే సమస్యలు వస్తాయని ఆయన భావిస్తుండవచ్చు. అయితే ఏ పని చేసినా దాన్ని సమర్థించే దశకు పవన్ కల్యాణ్‌ను తీసుకు రాగలిగారు. పవన్ కల్యాణ్ అవసరాలు తీరుస్తూ ఆయనకు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లులు సమకూర్చడం ద్వారా గౌరవిస్తున్నట్లు కనిపిస్తే సరిపోతుందన్న అభిప్రాయం కూటమి నేతలలో ఉందట. అందువల్లే టీడీపీ నేతలకన్నా పవనే ఎక్కువ విధేయతను కనబరచుతున్నారని ఆ పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు. జనసేన వైపు నుంచి ఎవరూ టీడీపీని ప్రశ్నించరాదని పవన్ సోదరుడు నాగబాబు స్పష్టంగా చెప్పడం, అలా ప్రశ్నించే వారు ఎవరైనా ఉంటే పార్టీని వదలి వెళ్లవచ్చని ఒక ఎమ్మెల్యేకే పవన్ హెచ్చరిక చేయడం వంటివాటిని ఉదాహరణలుగా చూపుతున్నారు. దీంతో లోకేశ్‌ను సీఎంగా చేసినా పవన్ కల్యాణ్ పెద్దగా అభ్యంతరం పెట్టకవచ్చన్న భావన ఇటీవలి కాలంలో బలపడుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. లోకేశ్‌కు ఎలివేషన్ ఇవ్వడానికి చంద్రబాబు, టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రచార ప్రకటనలలో ఫోటోలు వేయడం, తల్లికి వందనం స్కీమ్ లోకేశే కనిపెట్టారని ప్రకటించడం, అలాగే ఆయా ప్రసంగాలలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తామని చంద్రబాబు చెప్పడం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయి. లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అవడం, ఢిల్లీ వెళ్లిన సందర్భాలలో ఆయా కేంద్ర మంత్రులను కలవడం, వాటికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చేలా చేయడం వంటివి చేస్తున్నారు. తప్పు కాదు కానీ... లోకేశ్ రాజకీయ అపరిపక్వత, కక్షపూరిత ధోరణి, రెడ్‌బుక్ అంటూ ప్రజల దృష్టిలో ముఖ్యంగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల దృష్టిలో విలన్‌గా కనిపిస్తుండడం వంటివి ఆయనకు నష్టం చేయవచ్చన్న ఆందోళన తెలుగుదేశం వర్గాలలో ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
శ్రీకాంత్ ఎపిసోడ్.. అరుణ అరెస్ట్
సాక్షి, నెల్లూరు: జీవిత ఖైదీ శ్రీకాంత్ ఎపిసోడ్ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ వ్యవహారంలో కూటమి నేతల పేర్లు బయట పెడుతున్న క్రమంలో తనను అరెస్ట్ చేసినట్టు అరుణ ఆరోపించారు. తన అరెస్ట్‌కు ముందు.. ఆమె కారు డిక్కీలో దాక్కుని సెల్ఫీ వీడియో తీసి అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. తనను మీడియానే కాపాడాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, శ్రీకాంత్ పెరోల్ విషయంలో అరుణ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా వీడియోలో మాట్లాడుతూ..‘నన్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. నాపై ఏ కేసు పెట్టారో కూడా తెలియదు. నా ప్రాణాలు ఉంచుతారో, తీస్తారో కూడా తెలియదు. నేను కారు డిక్కీలో దాక్కుని మాట్లాడుతున్నాను. నా కారులో గంజాయి పెట్టి అక్రమ కేసు పెట్టాలని చూస్తున్నారు. నన్ను ఏ అక్రమ కేసులో ఇరికిస్తున్నారో తెలియడం లేదు. నన్ను మీడియానే కాపాడాలి’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. కరుడుగట్టిన నేరస్థుడు శ్రీకాంత్‌కు కూటమి ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటకి పొక్కడంతో పెరోల్ రద్దు చేశారు. అయితే, శ్రీకాంత్ పెరోల్ మంజూరులో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్, హోం శాఖ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కూటమి నేతల పేర్లు బయట పెడుతున్న క్రమంలో తనను అరెస్ట్ చేసినట్టు అరుణ ఆరోపించారు. ఈ విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు. అరుణ సంచలన వ్యాఖ్యలు.. అంతకుముందు నిడిగుంట అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ‘మమ్మల్ని వాడుకుని వదిలేశారు. ఇప్పుడు మాపైనే విషప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతల బండారం బయట పెడతా. మౌనంగా ఉంటే మా ప్రతిష్ట దిగజారిపోతోంది. ఇన్ని నిందలు మోపుతుంటే ఇంకా మౌనంగా ఉండాలా.. ఇంకా బాధపడాలా?. ఇకపై ఎవరి మాట వినను. ఏం చేస్తారు మహా అయితే నన్ను చంపేస్తారు. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికేకన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు’ అని తెలిపారు.జీవిత ఖైదీ శ్రీకాంత్‌తో ఆస్పత్రిలో అరుణ సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు, ఫొటోలు బయటకు రావడం వెనుక టీడీపీ నేతల కుట్ర దాగి ఉందని అరుణ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఫేస్బుక్లో ఒక పోస్టు కూడా పెట్టారు. ఆ పోస్టులో అరుణ..‘మాపై ఇంత కుట్ర జరుగుతుంటే.. శ్రీకాంత్ బాధపడుతుంటే శ్రీకాంత్‌ను ఇన్నాళ్లు వాడుకున్న వాళ్లంతా నోరు మెదపకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి. శ్రీకాంత్ బాధలు పడుతుంటే మీ మౌనాన్ని మేం ఎలా అంచనా వేసుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు నేను శ్రీకాంత్ మాట విని నోరు మెదపకుండా ఉండాలి? ఓపెన్ అయిపోతే మేలు కదా. ఇంకనైనా స్పందిస్తారా? శ్రీకాంత్ మాట కూడా లెక్కచేయకుండా నేను నోరు విప్పేయాలా? మహా అయితే మీరు చంపేస్తారు! అంతే కదా! ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికే కన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు’ అంటూ ఆ పోస్టులో అరుణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కుదిపేస్తున్న శ్రీకాంత్ వ్యవహారం హత్య కేసులో నెల్లూరు జిల్లా జైలులో జీవిత ఖైదీగా ఉంటూనే శ్రీకాంత్ నేర సామ్రాజ్యాన్ని విస్తరించడం, టీడీపీ క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్న అతను ఆ పార్టీ కీలక నేతల సహకారంతో తరచూ పెరోల్‌పై బయటకు వస్తున్న వైనం ఇప్పుడు అధికార పార్టీని, ప్రభుత్వ పెద్దల నుంచి హోంశాఖను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు హోంశాఖ స్థాయిలో కథ నడిపించారనేది స్పష్టం కావడంతో ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసిన ఐదు రోజుల్లోనే దానిని రద్దు చేసి, ఖైదీని జైలుకు తరలించారు.అండగా ఓ మంత్రి, ఇద్దరు ప్రజాప్రతినిధులు అరుణ పోస్టు ప్రకారం ఒక మంత్రి, ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆమెకు అండగా ఉన్నారనే కొత్త కోణం వెలుగు చూడడంతో రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలకు, క్రిమినల్స్‌కు మధ్య సంబంధాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. -
వాడుకుని వదిలేశారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘మమ్మల్ని వాడుకుని వదిలేశారు. ఇప్పుడు మాపైనే విషప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతల బండారం బయట పెడతా. మౌనంగా ఉంటే మా ప్రతిష్ట దిగజారిపోతోంది. ఇన్ని నిందలు మోపుతుంటే ఇంకా మౌనంగా ఉండాలా.. ఇంకా బాధపడాలా?. ఇకపై ఎవరి మాట వినను. ఏం చేస్తారు మహా అయితే నన్ను చంపేస్తారు. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికేకన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు’ అంటూ మంగళవారం కొందరు విలేకరుల వద్ద కుండబద్దలు కొట్టారు జీవిత ఖైదీ శ్రీకాంత్ సన్నిహితురాలు నిడిగుంట అరుణ. జీవిత ఖైదీ శ్రీకాంత్‌తో ఆస్పత్రిలో అరుణ సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు, ఫొటోలు బయటకు రావడం వెనుక టీడీపీ నేతల కుట్ర దాగి ఉందని అరుణ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఫేస్బుక్లో ఒక పోస్టు కూడా పెట్టారు. ఆ పోస్టులో అరుణ ఏమని వ్యాఖ్యానించారంటే.. ‘మాపై ఇంత కుట్ర జరుగుతుంటే.. శ్రీకాంత్ బాధపడుతుంటే శ్రీకాంత్‌ను ఇన్నాళ్లు వాడుకున్న వాళ్లంతా నోరు మెదపకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి. శ్రీకాంత్ బాధలు పడుతుంటే మీ మౌనాన్ని మేం ఎలా అంచనా వేసుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు నేను శ్రీకాంత్ మాట విని నోరు మెదపకుండా ఉండాలి? ఓపెన్ అయిపోతే మేలు కదా. ఇంకనైనా స్పందిస్తారా? శ్రీకాంత్ మాట కూడా లెక్కచేయకుండా నేను నోరు విప్పేయాలా? మహా అయితే మీరు చంపేస్తారు! అంతే కదా! ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికే కన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు’ అంటూ ఆ పోస్టులో అరుణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుదిపేస్తున్న శ్రీకాంత్ వ్యవహారం హత్య కేసులో నెల్లూరు జిల్లా జైలులో జీవిత ఖైదీగా ఉంటూనే శ్రీకాంత్ నేర సామ్రాజ్యాన్ని విస్తరించడం, టీడీపీ క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్న అతను ఆ పార్టీ కీలక నేతల సహకారంతో తరచూ పెరోల్‌పై బయటకు వస్తున్న వైనం ఇప్పుడు అధికార పార్టీని, ప్రభుత్వ పెద్దల నుంచి హోంశాఖను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు హోంశాఖ స్థాయిలో కథ నడిపించారనేది స్పష్టం కావడంతో ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసిన ఐదు రోజుల్లోనే దానిని రద్దు చేసి, ఖైదీని జైలుకు తరలించారు. అండగా ఓ మంత్రి, ఇద్దరు ప్రజాప్రతినిధులు అరుణ పోస్టు ప్రకారం ఒక మంత్రి, ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆమెకు అండగా ఉన్నారనే కొత్త కోణం వెలుగు చూడడంతో రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. అ«ధికార పార్టీకి చెందిన నేతలకు, క్రిమినల్స్‌కు మధ్య సంబంధాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే అరుణ, శ్రీకాంత్‌తో తమకు ప్రాణ హాని ఉందని.. నెల్లూరు, గూడూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ఐదుగురు 15 రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆమె సన్నిహితుడు శ్రీకాంత్ జైల్లోనే ఉండి నేర సామ్రాజ్యాన్ని విస్తరించడం, ఆయనకు ఎస్కార్ట్‌గా ఉన్న ఇద్దరు ఏఆర్ పోలీసులు సహకరించడం, తరచూ పెరోల్‌పై బయట తిరగడం వంటి అంశాలపై జైలు సూపరింటెండెంట్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలుస్తోంది. శ్రీకాంత్‌కు పెరోల్ ఇచ్చింది మా ప్రభుత్వమే హోం మంత్రి వంగలపూడి అనిత సాక్షి, అమరావతి: శ్రీకాంత్‌కు తమ ప్రభుత్వమే పెరోల్ ఇచ్చిందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి అనిత మంగళవారం విలేకరులతో మాట్లాడారు. శ్రీకాంత్ పెరోల్ కోసం నెల్లూరుకు చెందిన అరుణ నుంచి హోం శాఖ పేషీకి ఫోన్ వచ్చిందని ఆమె చెప్పారు. ఆమె వెనుక ఎవరున్నారనే విషయం గురించి ఆరా తీస్తున్నామన్నారు. క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి పెరోల్ వచ్చిందని జైలు అధికారులు చెప్పగానే ఆ పెరోల్‌ను రద్దు చేశామన్నారు. శ్రీకాంత్ వ్యవహారంలో ఎస్కార్ట్ సిబ్బందిపైనా చర్యలు చేపడతామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలతో పెరోల్ మంజూరు చేయాలని మీరే సిఫారసు చేశారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా..ఆ విషయాలన్నీ పోస్ట్‌మార్టం చేయవద్దని మంత్రి వ్యాఖానించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామన్నారు. -
పింఛన్లు కకావికలం!
పింఛన్ ఆగింది.. ప్రాణం పోయింది కృష్ణా జిల్లా పెదపూడికి చెందిన మేడం లక్ష్మి(53) ఒంటరి మహిళ పింఛన్ పొందేది. కంటి చూపు మందగించడం, సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఆమెకు 2024 ఏప్రిల్ నుంచి దివ్యాంగ పింఛన్ వస్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్వహించిన రీ వెరిఫికేషన్‌లో ఆమెను అనర్హురాలిగా తేల్చారు. సచివాలయ సిబ్బంది సోమవారం ఆమెకు నోటీసు ఇవ్వడంతో ఆందోళనకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ ఆరోగ్యం దెబ్బతిందని.. పింఛన్ డబ్బులతోనే మందులు కొనుక్కునేవాళ్లమని లక్ష్మి తల్లి బాలమ్మ కన్నీటిపర్యంతమైంది.అన్యాయంగా తనకు వైకల్య శాతం తగ్గించారని ఓ దివ్యాంగుడు తిరుపతి జిల్లా వాకాడులో మంగళవారం కుటుంబ సభ్యులతో కలసి ధర్నాకు దిగారు. వాకాడు మండలం దుగ్గరాజపట్నం అరుందీతయ వాడలోని నిరుపేద కుటుంబానికి చెందిన పట్టపు వెంకటసుబ్బయ్య 2018లో చెట్టుపై నుంచి కిందపడిపోవడంతో రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. ఏడేళ్లుగా బాధితుడు మంచానికే పరిమితమయ్యాడు. 2019లో వైద్యులు పరీక్షలు చేసి 86 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం ధృవీకరణ పత్రం ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో తిరుపతిలో నిర్వహించిన సదరం క్యాంపులోనూ దీన్ని నిర్థారించారు. తాజాగా రీ వెరిఫికేషన్‌లో ఏకంగా 45 శాతానికి తగ్గించి ధ్రువీకరణ పత్రం ఇచ్చారంటూ బాధితుడు ధర్నాకు దిగాడు.సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: అవ్వాతాతలు అందుకుంటున్న పింఛన్లను ఎడాపెడా కత్తిరిస్తున్న చంద్రబాబు సర్కారు అనైతికంగా వ్యవహరించేందుకూ వెనుకాడటం లేదు! కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవాటినే ఏరిపారేస్తోంది! కనీసం దివ్యాంగుల పట్ల కూడా దయ చూపడం లేదు. గత ప్రభుత్వ హయాంలో 2024 ఎన్నికల ముందు నాటికి 66.34 లక్షల మందికిపైగా పింఛన్లు ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటివద్దే పారదర్శకంగా వలంటీర్ల ద్వారా అందించగా.. టీడీపీ కూటమి సర్కారు ఇప్పుడు వీటిని కేవలం 62.19 లక్షలకే పరిమితం చేసింది. ఏడాదిలో ఏకంగా దాదాపు నాలుగున్నర లక్షల పింఛన్లను ఎగరగొట్టింది! ఇప్పటికే పండుటాకులకు పింఛన్లు తొలగించి అవస్థలకు గురి చేస్తున్న కూటమి సర్కారు.. తాజాగా దివ్యాంగులను టార్గెట్‌గా చేసుకుని ఎడాపెడా కోతలు పెడుతోంది. మళ్లీ మళ్లీ సదరం సర్టిఫికెట్లు తేవాలంటూ, వైద్య పరీక్షలు, వైకల్య శాతం కుదింపుతో ముప్పు తిప్పలు పెడుతోంది. 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉందని, పింఛనుకు అనర్హులంటూ ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో లబ్ధిదారులకు నోటీసులు జారీ అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా నెలనెలా అందే పింఛన్నే నమ్ముకుని బతుకుతున్న దివ్యాంగులను చంద్రబాబు సర్కారు నిర్దయగా రోడ్డుకీడ్చేసింది! ఇన్నాళ్లూ నిబ్బరంగా తీసుకుంటున్న పింఛన్‌కు ఇకపై మీరు అనర్హులంటూ గత వారం పది రోజులుగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న నోటీసులతో పింఛన్‌దారులు కకావికలం అవుతున్నారు! నిశ్చేషు్టలై ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. ఆవేదనతో తల్లడిల్లి ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు సర్కారు మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని పెన్షన్లు కోల్పోతున్న దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారు. తమ వైకల్యాన్ని నిర్ధారిస్తూ గతంలో వైద్యులే ధ్రువీకరించి సర్టిఫికెట్లు జారీ చేస్తే ఇప్పుడీ కోతలు ఏమిటని ఆక్రోశిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి పైనే తాజాగా పింఛను నోటీసులు జారీ అయ్యాయని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.అప్పీలు చేయాలంటే అగచాట్లే.. దివ్యాంగ సర్టిఫికెట్ (సదరం) కలిగి ఉండి గత పదేళ్లకు పైగా పింఛను పొందుతున్న వారికి తాజా పరీక్షల్లో అనర్హులంటూ నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వినికిడి లోపం ఉన్న వారికి సైతం వైకల్యం లేదని అనర్హత పేరుతో నోటీసులు జారీ కావడంపై నివ్వెరపోతున్నారు. నోటీసులు అందుకున్న పింఛనుదారులు అభ్యంతరాలు తెలియజేసే ప్రక్రియను అత్యంత క్లిష్టతరంగా మార్చారు. దివ్యాంగ శాతంపై అభ్యంతరం ఉన్నవారు కొత్త సదరం సర్టిఫికెట్లను సంబంధిత ఏరియా వైద్యశాల నుంచి లేదంటే గ్రామ, వార్డు సచివాలయం నుంచి పొంది ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ఎండీపీవో తిరిగి వైద్య పరీక్షలకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అనంతరం నిరీ్ణత తేదీలో మళ్లీ వైద్య పరీక్షలకు హాజరవ్వాలి. ఎంపీడీవో నిర్దేశించిన తేదీన, ఆయన సూచించిన ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. శరీర అవయవాలు అన్నీ బాగున్న వ్యక్తులకే ఇన్నిసార్లు తిరగాలంటే ఇబ్బంది. అలాంటిది దివ్యాంగులు రోజులు, నెలల తరబడి మండలాఫీసులు, ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. సెప్టెంబరు 1వతేదీ నుంచి పింఛన్ నిలిపివేస్తున్నట్లు ఈ నెల 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు నోటీసులు అందాయి. నోటీసు అందుకున్న వారు తమ అర్హతను నిరూపించుకొని పింఛన్ కాపాడుకునేందుకు ప్రభుత్వం కనీసం 15 రోజులు గడువు కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలానికి చెందిన 34 ఏళ్ల మద్దులూరి నాగరాజు చిన్నతనంలో ప్రమాదవశాత్తూ పూరి గుడిసె దగ్ధమైన ఘటనలో సగానికిపైగా శరీరం, ఒక కన్ను పూర్తిగా కాలిపోయింది. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్న ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. 15 ఏళ్లుగా దివ్యాంగుల పింఛన్ పొందుతుండగా కూటమి సర్కారు నాగరాజును అనర్హుడిగా ప్రకటించి పెన్షన్ తొలగించింది. ఈ బాలుడికీ అర్హత లేదట!అనంతపురంలోని ప్రభాకర్ స్ట్రీట్‌లో ఉంటున్న వేలూరు ధీరజ్ వెంకట్నాథ్ పుట్టుకతోనే బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. నడవలేని స్థితిలో ఉన్న ఈ బాలుడికి తల్లిదండ్రులే సపర్యలు చేయాలి. ఈ నెల 14న ధీరజ్‌కు పింఛన్ తొలగిస్తున్నట్లు నోటీసులు రావడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇంత కన్నా దారుణం మరెక్కడా ఉండదని ఆక్రోశిస్తున్నారు.పక్షవాతమున్నా పింఛన్ తొలగింపు..నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన జి.గులాంబాషాకు రోడ్డు ప్రమాదంలో నడుం విరిగింది. పక్షవాతం బారిన పడటంతో 72 శాతం వైకల్యం ఉందని నిర్ధారిస్తూ 2019లో నంద్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులు శాశ్వత ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆయనకు దివ్యాంగుల పింఛన్ మంజూరైంది. ఇటీవల రీ వెరిఫికేషన్‌లో గులాంబాషాకు 40 శాతంలోపే వైకల్యం ఉందంటూ పింఛన్ తొలగిస్తూ అధికారులు నోటీసు ఇచ్చారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన గులాంబాషా మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. చుట్టుపక్కలవారు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాలకు తరలించారు. ⇒ గుంటూరు జిల్లాలో దివ్యాంగ పింఛన్లు 23,459 ఉండగా 2,489 మందిని అనర్హులుగా పేర్కొంటూ నోటీసులిచ్చారు. 472 మందికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కింద రూ.15 వేలు చెల్లిస్తుండగా వాటిని దివ్యాంగ పెన్షన్లుగా మార్చి రూ.6 వేలకు కుదించారు. 388 మంది దివ్యాంగ పెన్షన్ కింద రూ.6 వేలు పొందుతుండగా ఓల్డ్ ఏజ్ కిందకు మార్చి రూ.4 వేలకు పరిమితం చేశారు. ⇒ పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో 2024 మార్చి నాటికి 2,83,119 మందికి పింఛన్లు అందజేశారు. ప్రస్తుతం జిల్లాలో దివ్యాంగులకు 35,096 పింఛన్లు అందజేస్తుండగా వారిలో 3,300 మందికి వివిధ కారణాలతో తొలగించారు. రీ అసెస్మెంట్లో 40 శాతం కంటే తక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నందున తొలగించినట్లు డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి పేర్కొన్నారు. ⇒ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 32 వేల దివ్యాంగ పింఛన్లు ఉండగా మరోసారి ధ్రువీకరించాలంటూ రెండు నెలల క్రితం నోటీసులు జారీ చేశారు. ఆగస్టులో జిల్లావ్యాప్తంగా 4,215 దివ్యాంగ పింఛన్లను తొలగించారు. ఇవి కాకుండా 597 హెల్త్ పింఛన్లు (మంచానికే పరిమితమైనవారు), 1,611 వృద్ధాప్య పింఛన్లు నిలిపివేసినట్లు అధికారికంగా ధ్రువీకరించారు. ⇒ ప్రకాశం జిల్లావ్యాప్తంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్ తీసుకుంటున్న వారు 33,310 మంది ఉన్నారు. రీ వెరిఫికేషన్‌లో ఇప్పటివరకు 30 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా దాదాపు 9 వేల మంది దివ్యాంగులకు అనర్హులంటూ నోటీసులు అందాయి. 85 నుంచి 90 శాతం అంగవైకల్యంతో ఇప్పటి వరకు పింఛను పొందుతుంటే రీ వెరిఫికేషన్‌లో సాధారణ వైకల్యం మాత్రమే ఉందని, పింఛన్‌కు అనర్హులని నోటీసులిచ్చారు. దీంతో సోమవారం ఒంగోలులో ‘మీ కోసం’ కార్యక్రమానికి నోటీసులతో దివ్యాంగులు పోటెత్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9,601 మంది దివ్యాంగులకు పింఛన్ నిలిపివేసేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వికలాంగులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మంచానికే పరిమితమైన వారిని జాబితా నుంచి తొలగించారు. కలెక్టర్, ఎంపీడీవో, సర్వజనాసుపత్రి, మున్సిపల్ కార్యాలయాల వద్ద వికలాంగులు మంగళవారం రోజంతా పడిగాపులు కాశారు. శ్రీసత్యసాయి జిల్లా అగళి, బత్తలపల్లి, తాడిమర్రి, హిందూపురం, అనంతపురం జిల్లా గుత్తి, గుంతకల్లు, పామిడి తదితర ప్రాంతాల్లో బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు అర్హత ఉన్నప్పటికీ ఎందుకు తొలగించారంటూ అధికారులను నిలదీశారు. ⇒ అన్నమయ్య జిల్లాలో దివ్యాంగుల పెన్షన్లు 29 వేలు ఉండగా 4 వేలకుపైగా పెన్షన్లు అనర్హుల జాబితాలో చేర్చారు. ⇒ ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం దివ్యాంగ పెన్షన్లు 27,302 ఉండగా రీవెరిఫికేషన్ పేరుతో 10,205 పెన్షన్లు నిలిచిపోయాయి. ⇒ కృష్ణా జిల్లాలో 33,173 దివ్యాంగ పింఛన్లు ఉండగా వేల సంఖ్యలో నోటీసులు జారీ అయ్యాయి. అర్హులై పించన్లు తొలగిస్తే ఉద్యమిస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కృష్ణాజిల్లా కార్యదర్శి ఎన్ఎస్ నారాయణ చెప్పారు. ⇒ తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 3,211 మంది దివ్యాంగులకు పింఛన్లు రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ⇒ బాపట్ల జిల్లాలో 24,660 దివ్యాంగ పింఛన్లు ఉండగా రీ వెరిఫికేషన్ పేరుతో 3,829 పింఛన్లను తొలగించేందుకు అధికారులు నోటీసులు అందజేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఈ నెల 18న ధర్నా చేస్తున్న దివ్యాంగులు కూర్చోలేడు.. లేవలేడు...మాట్లాడలేడు.. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం దాదంవారిపల్లెకు చెందిన ఎన్.జయరామిరెడ్డి నాలుగేళ్లుగా పక్షవాతంతో బాధ పడుతున్నాడు. కనీసం కాలు, చేతులు కూడా కదిలించలేడు. మాట కూడా పడిపోయింది. మలమూత్రాలకు కూడా ఎత్తుకుని వెళ్లాలి. ఇంత దీనస్థితిలో ఉన్న ఆయన దివ్యాంగ పింఛన్‌ను రీ వెరిఫికేషన్ పేరుతో రూ.15 వేల నుంచి తొలగించి రూ.6 వేలకు మార్చారు. గతంలో 90 శాతం వైకల్యం ఉందని సదరం సర్టిఫికెట్ జారీ కాగా ఇప్పుడు 75 శాతానికే పరిమితం చేశారు. నిరక్షరాస్యుడైన ఆయన.. చదవగలడు, రాయగలడు, బరువులు ఎత్తగలడు అని వైక్యలం సర్టిఫికెట్లో నమోదు చేయడం గమనార్హం. కోతలకే రీ వెరిఫికేషన్ వైఎస్ జగన్ పాలనలో దివ్యాంగుల పట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించారు. ఏ ఒక్కరి పెన్షన్ తొలగించలేదు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. 100 శాతం వైకల్యం ఉన్న వారిని సైతం రీ వెరిఫికేషన్ పేరుతో వేధిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు పిలిíపించి అమానుషంగా వ్యవహరిస్తున్నారు. పెన్షన్లలో కోత వేసేందుకే రీ వెరిఫికేషన్. నెలవారీ అవసరాలు తీర్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – పూర్ణకంటి బాబురావు, దివ్యాంగుడు , వేమవరం జగ్గయ్యపేటఎలా బతకాలి? నాకు యాక్సిడెంట్లో కాలు విరిగింది. డాక్టర్లు పరీక్షలు చేసి సర్టిఫికెట్ ఇచ్చారు. గత ఆరేళ్లుగా పింఛను అందుకుంటున్నా. ఇప్పుడు ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. మా కుటుంబం ఎలా బతకాలి? అప్పలనాయుడు, కొవ్వలి గ్రామం, ఏలూరు జిల్లా ⇒ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 32,101 దివ్యాంగ పింఛన్లున్నాయి. వీరిలో కదలలేని స్థితిలో ఉండేవారు 16,934 మంది కాగా దృష్టి లోపం ఉన్నవారు 4,036 మంది, వినికిడి లోపం ఉన్నవారు 3,992 మంది, మానసిక వైకల్యం ఉన్నవారు 3,751 మంది, మానసిక అనారోగ్యం బాధితులు 1,277 మంది, బహుళ వైకల్యం ఉన్నవారు 2,111 మంది ఉన్నారు. ఇప్పటివరకు సర్వేలో 24,213 మంది వివరాలు సేకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోనసీమ జిల్లాలో 2,899 పింఛన్లను రద్దు చేశారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు 27,193 మంది ఉండగా 13,690 మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. 1,289 మందిని వృద్ధాప్య పింఛన్ల కిందకు మార్చారు. ⇒ కాకినాడ జిల్లాలో 35 వేల మంది దివ్యాంగులు ఉండగా 24,000 మందికి పరీక్షలు నిర్వహించారు. 4,300 దివ్యాంగ పింఛన్లు తొలగించారు. ⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పింఛన్లు కోల్పోయిన దివ్యాంగులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు. డోన్, మద్దికెర, తుగ్గలి తదితర మండలాల్లో దివ్యాంగులు మండల పరిషత్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేశారు. 10,050 దివ్యాంగ పింఛన్లను తొలగిస్తూ నోటీసులు ఇస్తున్నట్లు సమాచారం. ⇒ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న 12,523 మందికి నోటీసులు జారీచేసి తొలగించడంతో కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తున్నారు. ఇటీవల బంగారుపాళ్యం మండల కేంద్రంలో ధర్నాకు దిగి రాకపోకలను నిలిపివేశారు. ఈనెల 18వ తేదీన చిత్తూరు కలెక్టరేట్లో వందలాది మంది దివ్యాంగులు బైఠాయించారు. ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో 2.50 లక్షలకు పైగా పెన్షన్లు ఉండగా దివ్యాంగుల పింఛన్లు 40 వేలకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 7,182 మంది దివ్యాంగులను అనర్హులుగా ప్రకటించారు. ⇒ విశాఖ జిల్లాలో మొత్తం 1,60,778 మంది పింఛన్లు పొందుతుండగా దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారు 21,306 మంది ఉన్నారు. ప్రస్తుతం 1,178 మంది దివ్యాంగులకు పింఛన్లు నిలుపుదల చేశారు. ⇒ శ్రీకాకుళం జిల్లాలో దివ్యాంగ పింఛన్‌దారులు 31,502 మంది ఉండగా 29,055 మందికి నోటీసులిచ్చారు. ఆగస్టులో 1,458 దివ్యాంగ పింఛన్లు తొలగించారు. ⇒ విజయనగరం జిల్లాలో 36,412 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతుండగా ప్రస్తుతం 6,770 పెన్షన్లు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. ⇒ పార్వతీపురం మన్యం జిల్లాలో దివ్యాంగ పింఛన్లు అందుకుంటున్న వారు 16,750 మంది ఉండగా పునఃపరిశీలన తర్వాత 2,781 మంది అనర్హులని తేల్చారు. దీంతో రెండు జిల్లాల్లో బాధితులు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ⇒ అనకాపల్లి జిల్లాలో 30,688 మంది దివ్యాంగుల పెన్షన్లు పొందుతుండగా 3,339 మంది పెన్షన్లను తొలగించారు. 799 మంది దివ్యాంగులకు వృద్ధాప్య పింఛన్ల కిందకు మార్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే జిల్లాలో 10,136 మంది వృద్ధాప్య పెన్షన్లను తొలగించింది. -
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నిరసన
కృష్ణాజిల్లా : జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మచిలీపట్నంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి, శ్రద్ధాంజలి ఘటించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. టీడీపీ ఎమ్మెల్యే చిత్ర పటాన్ని తగలబెట్టి నిరసన తెలియజేశారు. దీనిలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు. వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పే వరకూ రోజుకో రీతిలో నిరసన తెలుపుతామంటూ హెచ్చరించారు. ఆపై జూనియర్ .ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి , గుమ్మడికాయతో దిష్టి తీసి, కొబ్బరికాయ కొట్టారు అభిమానులు.కాగా, రెండు రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుపాటి ప్రసాద్.. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వవంటూ హెచ్చరించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు.వార్ -2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌పై దగ్గుపాటి ప్రసాద్ రెచ్చిపోయారు. -
‘రౌడీషీటర్ శ్రీకాంత్ వెనుక ఉన్నది టీడీపీ నేతలే’
తాడేపల్లి : రౌడీ షీటర్ శ్రీకాంత్ వెనుక ఉన్నది టీడీపీ నేతలేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కారయదర్శి జూపూడి ప్రభాకర్ విమర్శించారు. అతన్ని పెరోల్ మీద బయటకు తీసుకొచ్చింది కూడా ఆ పార్టీ వారేనన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 19) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన జూపూడి..‘ రౌడీషీటర్ శ్రీకాంత్ కు జూనియర్ నయీంగా పేరుంది. టీడీపీ నేతల మధ్య సయోధ్య కుదరకనే శ్రీకాంత్ వీడియోలు బయటకు వచ్చాయి. సుగాలి ప్రీతి కేసు తేల్చుతామన్న పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని మోసం చేశారు. ప్రీతి తల్లి ఆందోళనకు దిగితే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదేనా బాధిత మహిళల కుటుంబానికి మీరు చేసే న్యాయం?, ప్రభుత్వ అధోగతి పనులపై ప్రజా ఉద్యమానికి రెడీ అవుతున్నాం. ఎమ్మెల్యేలు చేస్తున్న అఘాయిత్యాలపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంకా జగన్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు?, ఎన్నాళ్లు ఇలా డైవర్షన్ రాజకీయలు చేస్తారు?, ఈనాడు పత్రిక తప్పుడు వార్తలు రాసే ముందు తమ చరిత్ర ఎలాంటిదో తెలుసుకోండి. ఆ పత్రిక రాసే కథనాలు చూసి జనం నవ్వుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.రౌడీషీటర్ పెరోల్ ఎపిసోడ్.. హోంమంత్రి అనిత తడబాటు -
రౌడీషీటర్ పెరోల్ ఎపిసోడ్.. హోంమంత్రి అనిత తడబాటు
సాక్షి, విజయవాడ: రౌడీషీటర్ పెరోల్ వ్యవహారంలో హోంమంత్రి వంగలపూడి అనిత తడబడ్డారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పని హోం మంత్రి అనిత.. విచారణ జరుగుతుందంటూ సమాచారం దాట వేశారు. సంతకాలు ఎవరెవరు చేశారో చెప్పని హోంమంత్రి.. సిఫార్సు చేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు అడిగితే నీళ్లు నమిలారు.పెరోల్ ఎలా వచ్చిందో అనవసరం అంటూ వింత వాదన వినిపించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్, అరుణపై విచారణ జరుపుతామంటూ ప్రకటించిన హోంమంత్రి.. మీడియా ఆ విషయం వదిలెయ్యాలంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెండు సార్లు శ్రీకాంత్‌కు చంద్రబాబు సర్కార్.. పెరోల్ ఇచ్చింది. టీడీపీ నేతల అండతోనే రౌడీ షీటర్ శ్రీకాంత్ బయటకొచ్చారు. పెరోల్లో మీ పాత్ర ఏంటంటూ హోంమంత్రి అనితను మీడియా ప్రశ్నించగా.. తన పాత్ర ఉందొ లేదో చెప్పకుండా.. పెరోల్ వెనుక ఉన్న వారిపై పోస్ట్‌మార్టం చేయండి అంటూ మాట దాటవేశారు.కాగా, హత్య కేసులో నేరం రుజువై నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వెనుక హోంశాఖ హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పెరోల్‌పై విడుదలైన శ్రీకాంత్ జల్సాలు చేస్తూ పలువురికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగిన విషయం తెలుసుకున్న కూటమి ప్రభుత్వం షాక్‌కు గురైంది. ఆగమేఘాలపై పెరోల్ రద్దు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కలిసి చేసిందంతా చేసి ఎల్లో మీడియా ద్వారా ఈ వ్యవహారాన్ని అంతా వైఎస్సార్సీపీకి అంటగట్టే యత్నం చేస్తుండడం అందరినీ విస్మయపరుస్తోంది.ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ టీడీపీలో క్రియాశీలక కార్యకర్త. శ్రీకాంత్ ఓ హత్య కేసులో 2010 నుంచి జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2014లో ఆయన సెమీ ఓపెన్ జైల్లో పని చేస్తూ తప్పించుకుని పరారయ్యాడు. నాలుగున్నరేళ్ల తర్వాత తిరిగి పోలీసులకు లొంగిపోయాడు. టీడీపీ నేతల అండదండలు ఉండడంతో శ్రీకాంత్ నాలుగున్నరేళ్లు ఎక్కడున్నాడు? ఏం చేశాడనే విషయం ఎవరికీ తెలియదు.జైలులో ఉన్నప్పుడు వివిధ నేరాల్లో పట్టుబడి జైలుకు వచ్చిన నిందితులతో మాటలు కలిపి వారికి అవసరమైన సహాయం అందించేవాడని, వారు బయటకు వెళ్లిన తర్వాత వారి ద్వారా సెటిల్మెంట్లు చేయించేవాడన్న ప్రచారం కూడా ఉంది. జైల్లో ఉన్న ఖైదీలతో కలిసి జైలు సిబ్బందిపై తిరగబడిన ఘటనలు లేకపోలేదు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా జైలు అధికారులను బెదిరించేవాడని తెలిసింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు అధికారులపై తరచూ ఒత్తిడి తీసుకువచ్చి అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో రోజుల తరబడి గడిపేవాడు. ఆ ఆస్పత్రుల్లో తన స్నేహితురాలితో సన్నిహితంగా ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైలు నుంచే బయట వ్యక్తులను శాసించే స్థాయికి ఎదిగాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ముఖ్య అనుచరుడు కావడంతో అధికారులు అతన్ని నిలువరించే సాహసం చేయలేకపోయారు.ఇంత అధికార బలం ఉండడం వల్లే టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పెరోల్ ఇవ్వొద్దని, అతను బయటకొస్తే శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని తిరుపతి జిల్లా ఎస్పీతోపాటు, గూడూరు డీఎస్పీ, సీఐ, జిల్లా కేంద్ర కారాగార సూపరింటెండెంట్ హోంశాఖ దృష్టికి తీసుకెళ్లినా, అనూహ్యంగా గత నెల 30న శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేస్తూ జీఓ విడుదలైంది. ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత కనుస న్నల్లోనే 30 రోజుల పెరోల్ మంజూరైనట్లు ప్రచారం జరుగుతోంది.దీంతో శ్రీకాంత్ బయటకు వచ్చేశాడు. హోంమంత్రి అనిత సంతకం ఆధారంగానే శ్రీకాంత్ పెరోల్‌పై వచ్చినట్లు అతని సన్నిహితురాలు అరుణ స్పష్టం చేయడం గమనార్హం. బయటకు వచ్చిన శ్రీకాంత్ జల్సాలు చేయడం, బెదిరింపులకు దిగటం వంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. హడావుడిగా పెరోల్‌ని రద్దు చేసింది. -
AP: ప్రాణం తీసిన పెన్షన్ తొలగింపు
సాక్షి, కృష్ణా జిల్లా: పెన్షన్ తొలగింపుతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ దివ్యాంగురాలు.. గుండెపోటుతో మృతి చెందింది. మొవ్వ మండలం పెదపూడి సచివాలయం పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇటీవల పెన్షన్ల సర్వేలో దివ్యాంగురాలైన మేడం లక్ష్మి పెన్షన్‌ను తొలగించారు. పెన్షన్ తొలగించడంతో తీవ్ర మనోవేదనతో గత రాత్రి లక్ష్మికి గుండెపోటుకు గురైంంది.పెదపూడి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ మాట్లాడుతూ.. ‘‘మా సచివాలయ పరిధిలో 113 పెన్షనర్లు ఉన్నారు. వారందరి పెన్షన్లను రీ వెరిఫికేషన్‌కు పంపించాం. 8 పక్షవాతం వచ్చిన వారి పెన్షన్లు ఉన్నాయి. వాటిని 6 వేల రూపాయల పెన్షన్‌లోకి మార్చారు. 34 మంది పెన్షన్ దారులను రిజెక్ట్ చేశారు. లక్ష్మి ఇంటికి పెన్షన్ రిజెక్ట్ చేసిన లెటర్ ఇవ్వడానికి వెళ్లాను. పెన్షన్ రిజెక్షన్ లెటర్ ఇవ్వగానే కన్నీరు పెట్టుకున్నారు. నేను లక్ష్మి సోదరుడికి ఫోన్ చేసి విషయం తెలియజేశాను. ఉదయం లక్ష్మి చనిపోయారని తెలిసింది’’ అని ఆమె తెలిపారు.డోన్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు వికలాంగుల నిరసననంద్యాల జిల్లా: పెన్షన్ల తొలగింపుపై డోన్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వికలాంగులు ఆందోళన చేశారు. అంగ వైకల్య శాతం తక్కువగా ఉందని నోటీసులు అందడంతో పింఛన్ లబ్ధిదారులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. తమకు ఎటువంటి పరీక్షలు చేయకుండానే నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. -
మంత్రి అచ్చెన్న ‘రెడ్‌బుక్’ ప్రయోగం
సాక్షి, విజయవాడ: అధికారులపై మంత్రి అచ్చెన్నాయుడు రెడ్‌బుక్ ప్రయోగించారు. అచ్చెన్నాయుడు వేధింపులకు తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ సెలవుపై వెళ్లిపోయారు. సీఎస్‌కు లేఖ రాసి ఆయన సెలవుపై వెళ్లిపోయారు. అవినీతి వ్యవహారాల కోసం జీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్డి ఒత్తిడి చేశారు. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని జీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు పేషీ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.దీంతో చెప్పిన మాట విననందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఆయనను నెల్లూరుకి బదిలీ చేశారు. సెలవుపై వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని సీస్‌కు ఆగ్రోస్ జీఎం లేఖ రాశారు. జీఎం రాజమోహన్ని వేధించేందుకే బదిలీ చేశారని సమాచారం. రాజమోహన్ స్థానంలో అర్హత లేని జూనియర్‌కి జీఎంగా మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యతలను అప్పగించారు. -
KGBV ప్రిన్సిపాల్ సౌమ్య ఘటనపై శ్యామల రియాక్షన్
-
నన్ను గౌరవించండి.. నేను సత్యవేడు ఎమ్మెల్యేని
తిరుపతి అర్బన్: ‘నేను ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా ఎన్నికైన సత్యవేడు ఎమ్మెల్యేని. నన్ను అధికారులు గౌరవించాలి. ముందుగా ప్రొటోకాల్ పాటించడం నేర్చుకోవాలి’ అంటూ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లో సాధారణ అర్జీదారుడిలా ఓ అర్జీలో తన సమస్యలను రాసి కలెక్టర్‌కు ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఏదైనా ఓ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత.. మళ్లీ తమ పార్టీకి చెందిన నాయకులే ప్రారంభోత్సవం చేయడం బాధగా ఉందని వాపోయారు. అలాగే ప్రైవేటు కార్యక్రమాలకు మండలానికి చెందిన నేతలు వెళితే.. వారికి అధికారులు ప్రొటోకాల్ పాటించడం సరికాదన్నారు. తన 50ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదని వాపోయారు. వర్గాలుగా చీలిపోయి పనిచేయడం ద్వారా నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. -
అనంత ఎమ్మెల్యే ప్రసాద్ దిష్టిబోమ్మ దహనం
కడప రూరల్/మదనపల్లె రూరల్/కర్నూలు(సెంట్రల్): అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి చేసిన పరుష వ్యాఖ్యలపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సోమవారం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ యూత్ లీడర్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ దిష్టిబోమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేత సునీల్‌కుమార్, రామారావు మాట్లాడుతూ.. సినీరంగంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన జూనియర్ ఎన్టీఆర్‌ను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అధికార మదంతో దూషించడం దారుణమన్నారు. జూ.ఎన్టీఆర్∙నటించిన సినిమాలను ఆడబోనివ్వమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఆపడం ఎవరి తరం కాదన్నారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ తక్షణం స్పందించాలన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను సస్పెండ్ చేయడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్‌కు, ఆయన తల్లి శాలినికి, అభిమానులకు బహిరంగంగా క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు బుల్లెట్ సాయి, హరి తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అదుపులో అభిమానులుజూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతి కోరిన అభిమానులను సోమవారం మధ్యాహ్నం వరకు మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. దీనిపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మదనపల్లె జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు టెంపర్ రాజేష్ మాట్లాడుతూ.. తమ హీరోకు మద్దతుగా నిరసన తెలిపేందుకు అనుమతి కోరితే పోలీసులు నిరాకరించారన్నారు. అనంత ఎమ్మెల్యే ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అభిమానులు వినతిపత్రం సమర్పించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నాకు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ యత్నించారు. దీంతో పోలీసులు వారిని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో వారంతా స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. -
నాలుగో సింహం... నవ్వులపాలు
ఆళ్లగడ్డ: కొందరు పోలీసుల తీరు వల్ల నాలుగో సింహం నవ్వులపాలవుతోంది. పోలీసు శాఖ ప్రతిష్ట మంటకలుస్తోంది. ఇందుకు ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని దొర్నిపాడు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న లక్ష్మీనారాయణ తీరే తాజా నిదర్శనం. ఆయన యూనిఫాం ధరించే పూటుగా మద్యం తాగి పలు సినిమా పాటలకు రీల్స్ చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీ బ్రహా్మండంగా ఉంది... పేదవాడికి తక్కువ ధరకే కోరుకున్న మద్యం అందుతోంది... నేను ఫుల్లుగా తాగుతున్నాను.మీరూ తాగండి.. అంటూ రీల్స్(విడియోలు) చేసి వాటిని ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడుతున్నాడు. పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం.. అంటూ కొందరికి మద్యం సీసాలు పంచుతూ కూడా రీల్స్ చేశాడు. ఆయన కూటమి ప్రభుత్వ మద్యం విధానానికి అనధికార బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోషల్ మీడియాలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ వీడియోలు వైరల్‌గా మారాయి.మద్యం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత గల పోలీసే ఇలా అత్యంత బాధ్యతారాహిత్యంగా మద్యం తాగి.. మీరూ తాగండి... అంటూ రీల్స్ చేస్తుండటంపై ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అతని రీల్స్‌ను ఉన్నతాధికారులు చూసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ రీల్స్ చూసి యువత చెడిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
డబ్బు, పలుకుబడి ఉంది.. రాజీ చేసుకో..
నరసరావుపేట రూరల్: తనపై లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని, పైగా.. ‘నిందితుడికి రాజకీయ పలుకుబడి, ధన బలం ఉన్నాయి. ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసారు. రాజీ చేసుకుంటే మంచిది’.. అని వినుకొండ రూరల్ సీఐ ప్రభాకర్ బెదిరిస్తున్నారని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందిన బాధిత దళిత మహిళ కన్నీటిపర్యంతమైంది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీకి విన్నవించుకునేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆమె రెండోసారి వచ్చింది. తొలుత.. ఈనెల 11న జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ కె. శ్రీనివాసరావుకు ఆమె ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కానీ, విచారణ పేరుతో తనను వినుకొండ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన అక్కడి సీఐ ప్రభాకర్ నిందితుడు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయకపోగా రాజీ చేసుకోవాలంటూ బెదిరిస్తున్నారని.. అందుకు తాను అంగీకరించలేదని బాధితురాలు తెలిపింది. -
టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి!
నరసరావుపేట రూరల్: టీడీపీ నేతల ఆగడాలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. ఆ పార్టీ మహిళా నేతలు సైతం భూ ఆక్రమణలు చేస్తూ రెచ్చిపోతున్నారు. పల్నాడు జిల్లాలో సోమవారం ఓ వృద్ధురాలు ఫిర్యాదుతో వెలుగుచూసిన ఘటనే ఇందుకు ఉదాహరణ. వివరాలివీ.. ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని టీడీపీ మహిళా నాయకురాలు ఒకరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని పల్నాడు జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు బత్తుల రోశమ్మ (70) ఎస్పీ కె. శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేసింది.తనకు రాష్ట్ర ప్రభుత్వం 2006లో నిరుపేదల కోటా కింద 1.50 ఎకరాల పట్టా భూమిని ఇచ్చిందని.. ఈ భూమి పక్కనే టీడీపీ మహిళ నాయకురాలు చల్లా అనువకళ భూమి కూడా ఉందని ఆమె చెప్పింది. అయితే, తన భర్త అనారోగ్యంతో చనిపోవడం.. ఇద్దరు కుమార్తెలకు వివాహం కావడం.. కుమారుడికి మతిస్థిమితం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని తన భూమిని ఆక్రమించుకునేందుకు ఓ పత్రికా విలేకరి సాయంతో అనువకళ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేధించడం ప్రారంభించిందని.. భూమిలోకి వస్తే చంపుతామని కూడా బెదిరించిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.అంతేగాక.. జూలై 30న అనువకళ, మరికొందరు కలిసి తనపై దాడిచేశారని.. కాలు విరిగి తీవ్రంగా గాయపడడంతో తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రోశమ్మ వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామంటూ పదిరోజులుగా బెదిరింపులు ఎక్కువ కావడంతో కుమార్తె రమాదేవి, మనవడు సాయిరాం సాయంతో రోశమ్మ సోమవారం అంబులెన్స్‌లో జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసింది. అనువకళతో పాటు ఆమెకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తనను కాపాడాలని ఎస్పీని కోరింది. అనంతరం జిల్లా కలెక్టర్‌కు కూడా అర్జీని అందజేశారు. -
ఎమ్మెల్యేతో పోరాడే శక్తి లేదు.. చనిపోతా!
శ్రీకాకుళం క్రైమ్: ‘‘ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వల్లే నాకీ పరిస్థితి వచ్చింది. రెండు నెలలుగా రకరకాలుగా ఇబ్బందిపెడుతున్నారు. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. మీడియా ముందుకురావడంతో నాపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. నేను ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో... నన్నే దోషిగా చిత్రీకరిస్తున్నారు. ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. సరిగానే పనిచేస్తున్నానని చెబుతున్నా, అందరితో సంతకాలు పెట్టిస్తూ... నాకు మద్దతిచ్చినవారిని భయపెడుతున్నారు.ఇక పోరాడే శక్తి లేదు. చనిపోదామని నిర్ణయించుకున్నా’’ అని శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య వాపోయారు. తన బాధను బయటకు చెప్పడమే తప్పా? అని ప్రశ్నించారు. దళిత మహిళా ఉద్యోగి అయిన సౌమ్య... సోమవారం శ్రీకాకుళం తిలక్‌నగర్‌లోని నివాస గృహంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే కూన, ఆయన అనుచరుల వేధింపులు తాళలేక జీవితాన్ని చాలించాలని అనుకున్నట్లు తెలిపారు. బాధితురాలు సౌమ్య, వారి కుటుంబ సభ్యులు, రిమ్స్ వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం... ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాక బెడ్రూమ్లోకి వెళ్లిన సౌమ్య బీపీ స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు మింగారు.బయటకు వచ్చిన ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. పనిమనిషి అప్పన్న నీళ్లు తాగమని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్లి చూశారు. మందులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో సౌమ్య తల్లి సద్విలాసిని, డ్రైవర్ శివకు చెప్పారు. రిమ్స్‌లో గైనిక్ ప్రొఫెసర్, సౌమ్య సోదరి రేజేటి శిరీషకు ఫోన్ చేశారు. అప్పన్న, శివ తక్షణమే కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చాలాసేపు అపస్మారక స్థితిలో ఉన్న సౌమ్యకు వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. స్పృహలోకి వచ్చాక సౌమ్య మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వెళ్లగక్కారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ రాము వెల్లడించారు. ఎమ్మెల్యేతో మాకు ప్రాణహాని సౌమ్యతో పాటు టీడీపీ కార్యకర్త సనపల సురేష్ కూడా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. ఆస్పత్రిలో సౌమ్యను చూద్దామని వెళ్తే కొందరు వెంబడించారని, తాను తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపారు. సురేష్‌తో పాటు భార్యాపిల్లలు కూడా స్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యే మనుషులతో తమకు ప్రాణహాని ఉందని కాపాడాలని కోరారు.అమ్మను రాత్రి 10 వరకు ఎమ్మెల్యే ఆఫీస్‌లో ఉంచారు..‘‘రాత్రిళ్లు ఎమ్మెల్యే వీడియో కాల్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎమ్మెల్యే కార్యాలయంలో నా తల్లిని రాత్రి 10 వరకు ఉంచారు. విపరీతంగా ట్రోల్స్ చేస్తుండటంతోనే మా అమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు’’ అని రేజేటి సౌమ్య కుమారుడు రాహుల్ తెలిపారు.నాన్న పోయిన బాధలో ఉంటే..‘‘మా నాన్న రిటైర్డ్ ఎంఈవో. ఆర్నెల్ల క్రితం మరణించారు. పుట్టెడు శోకంలో ఉన్నాం. మా కుటుంబానికి సౌమ్యనే పెద్ద దిక్కు. ఆమె ఆత్మహత్యాయత్నం కలచివేసింది. అమ్మ హెచ్ఎంగా రిటైరయ్యారు. కుటుంబమంతా బాగా చదువుకుని సెటిల్ అయ్యాం. అలాంటి మాపై ఆరోపణలు చేయడం తగదు’’ అని సౌమ్య సోదరి, గైనిక్ ప్రొఫెసర్ శిరీష వాపోయారు. -
మరో దారిలేదు.. చావే శరణ్యం
నరసరావుపేట రూరల్: ‘స్కూల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోండి. ఆ భవనం మాకు ఇచ్చేయండి.’ అంటూ టీడీపీ నాయకులు ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుడిని బెదిరించారు. ఏకంగా పాఠశాలలోకి వెళ్లేందుకు దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేశారు. విజయవంతంగా నడుస్తున్న స్కూలు మూత పడుతోందని నిర్వాహకుడు తట్టుకోలేకపోయాడు. ఇక తనకు మరో దారి లేదని, చావే శరణ్యమని భావించిన ఆ ప్రైవేట్ స్కూల్ నిర్వాహకుడు షేక్ బషీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది.బాధితుడి భార్య హేమలత తెలిపిన వివరాల ప్రకారం... నరసరావుపేటకు చెందిన షేక్ బషీర్ సెక్రటరీగా, మరికొందరు సభ్యులుగా పూజిత ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల ఏర్పాటుకు పట్టణంలోని లింగంగుంట్ల బ్యాంక్ కాలనీలో టీడీపీ నాయకుడు శాఖమూరి రామ్మూర్తికి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. పది సంవత్సరాలు లీజు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత రూ.80 లక్షలతో భవనాలు నిర్మించి 2020లో రెయిన్బో స్కూల్‌ను ప్రారంభించారు. బషీర్, ఆయన భార్య హేమలత ఆధ్వర్యంలో ఐదేళ్లుగా స్కూల్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టాలు మొదలు... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెయిన్బో స్కూల్ నిర్వాహకులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది నెలల నుంచి పాఠశాలను ఖాళీ చేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ‘నా భర్త బషీర్‌ను, నన్ను ఇటీవల టీడీపీ ఆఫీసుకు పిలిపించారు. పాఠశాలను ఖాళీ చేసి భవనాలు వారికి అప్పగించి వెళ్లిపోవాలని టీడీపీ నాయకులు వాసిరెడ్డి రవి, శాఖమూరి రామ్మూర్తితోపాటు మరికొందరు బెదిరించారు. లేకపోతే అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని బెదిరించారు. మేం లీజు అగ్రిమెంట్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను సైతం టీడీపీ నేతలు పట్టించుకోకుండా శనివారం రాత్రి పాఠశాలలోకి వెళ్లేందుకు దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేశారు. దీనిపై నరసరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా పట్టించుకోలేదు. ఇక టీడీపీ నాయకులతో పోరాడే శక్తి లేదంటూ నా భర్త బషీర్ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించారు.’ అని హేమలత ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే బషీర్‌ను ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. టీడీపీ నాయకుల కుట్రల వల్ల 300మంది విద్యార్థులు, సిబ్బంది రోడ్డునపడే పరిస్థితి వచ్చిందని హేమలత కన్నీటిపర్యంతమయ్యారు. టీడీపీ నేతల వేధింపులపై ఆమె ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ కె.శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
బార్లు.. ఇక బార్లా
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం సిండికేట్ సాగిస్తున్న అడ్డగోలు దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం బార్ల తలుపులు బార్లా తెరచింది. రాష్ట్రంలో బార్లు తెరిచి ఉంచే వేళలను మరో రెండు గంటలపాటు పెంచింది. అంటే అనధికారికంగా మరో నాలుగు గంటలు బార్లు తెరచి ఉంచినా పట్టించుకోబోమని స్పష్టమైన సంకేతం ఇచి్చంది. మరోవైపు టీడీపీ సిండికేట్‌కు బార్లు ఏకపక్షంగా కట్టబెట్టేందుకు రెస్టారెంట్ నిబంధనలను సడలించింది.దరఖాస్తు చేసేనాటికి రెస్టారెంట్ లేకపోయినా పర్వాలేదని నిబంధనల్లో పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గం తీర్మానాన్ని అనుసరించి సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త బార్ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 840 బార్ల లైసెన్సుల జారీకి సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్‌కుమార్ మంగళగిరిలో సోమవారం మీడియా సమావేశంలో నూతన బార్ విధానాలను వెల్లడించారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ..ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. బార్లు తెరిచి ఉంచే సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రభుత్వం పొడిగించింది. అంటే 24 గంటల్లో 14 గంటలపాటు బార్లు తెరచి ఉంటాయి. తద్వారా ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకు బార్లు బార్లా తెరిచే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేశాయి. ⇒ కల్లు గీత కుటుంబాలకు కేటాయించిన 10 శాతం బార్లకు లైసెన్సు ఫీజు 50శాతం తక్కువగా నిర్ణయించారు. ⇒ మూడేళ్లపాటు బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు సోమవారం నుంచి ఈ నెల 26 సాయంత్రం 5గంటల వరకు స్వీకరిస్తారు. నేరుగా గానీ ఆన్లైన్ ద్వారాగానీ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.5లక్షలు. ⇒ ఇప్పటివరకు రెస్టారెంట్ ఉన్నవారే బార్ల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనలో టీడీపీ కూటమి ప్రభుత్వం సడలింపునిచ్చింది. బార్ లైసెన్సు పొందిన తరువాత 15 రోజుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 28న లాటరీ విధానంలో బార్ల లైసెన్సులు కేటాయిస్తారు. ⇒ పట్టణాలు, నగరాల్లో జనాభా ప్రాతిపదికన బార్ల లైసెన్సు ఫీజు నిర్ణయించారు. 50 వేల జనాభా ఉన్న పట్టణాలకు రూ.35 లక్షలు, జనాభా 50 వేలు నుంచి 5 లక్షలలోపు ఉంటే రూ.55 లక్షలు, జనాభా 55 లక్షలు పైబడి ఉంటే రూ.75 లక్షలు లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ⇒ ఇప్పటివరకు లైసెన్స్ ఫీజును ఒకేసారి చెల్లించాలనే నిబంధన ఉంది. ఆ నిబంధనను సడలిస్తూ ఆరు వాయిదాల్లో లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. -
టీడీపీలో రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ చిచ్చు
విజయవాడ: టీడీపీలో ఇప్పుడు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ చిచ్చు మరింత అగ్గి రాజేస్తుంది. ఒక ఖైదీ పెరోల్ కోసం ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేయడం ఇప్పుడు అధికార కూటమి పార్టీలో కలకలం రేపుతోంది. రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ అంశానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర బయటపడింది. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ అంశంలో టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు వ్యవహారాన్ని హోంశాఖ అధికారులు బయటపెట్టారు. శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్ పై విచారణ నివేదిక ఇవ్వనున్నారు హోంశాఖ కార్యదర్శి.డ్యామేజ్ కంట్రోల్ కోసం సీఎంవో విచారణకు ఆదేశించగా ఎమ్మెల్యేల వ్యవహారం బహిర్గతమైంది. హోంమంత్రి ఫైల్ సర్క్యులేట్ చేసినట్టు శ్రీకాంత్ ప్రియురాలు అరుణ వెల్లడించిన నేపథ్యంలో అది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. శ్రీకాంత్ వెనుక ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే అని నిర్ధారణ కావడంతో ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబును డైలమాలో పడేసింది. అధికారులపై నెట్టేసే యత్నం ఎల్లో మీడియా చేసినా అంతటి ఘనకార్యం చేసింది టీడీపీ ఎమ్మెల్యేనని బయటపడటంతో వాట్ నెక్స్ట్ అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. -
బహిరంగంగా క్షమాపణ చెప్పు ఎమ్మెల్యే దగ్గుపాటి పై కర్నూల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్
-
కర్నూలులో ఉద్రికత్త.. ఎన్టీఆర్ అభిమానుల నిరసన
సాక్షి, కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసనకు దిగారు. తక్షణమే టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, నిరసనకారులను బలవంతంగా త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో జూనియర్ అభిమానులు త్రీటౌన్ పోలీసు స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని పీఎస్ ఎదుటే ఆందోళనకు దిగారు. పోలీసులు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలు వైరల్..అంతకుముందు.. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతకు ఫోన్ చేసి.. ‘ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు అనుమతించారు.. ఎవరు అనుమతి ఇచ్చారు.. ఎలా ఆడనిస్తారు? ఆ సినిమాను ఆడనిచ్చేదే లేదు.. వాడు బుడ్డా ఫకీర్.. లోకేష్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం..కొడుకు ఈ టైమ్‌లో వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా? నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా? ఈ సినిమా ఆడదు.. వాడు బుడ్డా ఫకీర్ గాడు లోకేశ్ గురించి మాట్లాడతాడా? ఈ సినిమా ఆడదు. నాకు తెలియకుండా సినిమా ఎట్లా ఆడుతుంది.. నేను అనంతపురం ఎమ్మెల్యే.. బుడ్డా ఫకీర్ నా కొడుకు.. సార్ గురించి మాట్లాడతాడా? గాడ్ ప్రామిస్‌గా చెబుతున్నా.. ఈ సినిమా ఆడదు.. ఆపేయిస్తున్నా.. నేను ఊరుకుంటానా.. పంపించేయండి అందరినీ’ అని హుకుం జారీ చేశారు’ ఈ ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. లోకేష్, చంద్రబాబు ప్రోద్భలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలు అందులో భాగమేనని నందమూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.వాయిస్ రికార్డ్ బయట పెట్టిన ధనుంజయ నాయుడుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ వివరణ ఇవ్వబోగా జూ.ఎన్టీఆర్ అభిమాని, టీఎన్ఎస్ఎఫ్ నేత గుత్తా ధనుంజయ నాయుడు ఆయన వాయిస్ రికార్డు బయట పెట్టారు. జూ.ఎన్టీఆర్‌ను తిడుతూ.. తనను ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన అనంతరం ఆయన ఒక ఆడియోను రికార్డు చేసి ఎమ్మెల్యేకు పంపినట్లు తెలుస్తోంది. ‘అన్నా.. మీరంటే గౌరవం ఉంది. దయచేసి చెబుతున్నా.. ఎవరో చెప్పిన మాటలు విని అలా మాట్లాడవద్దు. జూ.ఎన్టీఆర్‌కు సినిమా పరంగా ముందు నుంచీ అభిమానిని. ఈ విషయాన్ని నారా లోకేశ్ ముందు చెప్పమన్నా చెబుతా. అంతేగానీ ఎవరి కోసమో పని చేయలేదు నేను. దయచేసి నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు.సినిమా మీద కాంట్రవర్సీ ఎందుకు? నన్నెందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు? అసభ్యంగా మాట్లాడితే నేను పడను. నాకు ఫోన్ చేసి బెదిరించడం తప్పు. ఎన్టీఆర్ గాడు.. గీడు అని మాట్లాడవద్దు. మీరు నాతో మాట్లాడిన ప్రతిదీ వాయిస్ రికార్డు చేశాను. ఈ రికార్డులన్నీ నారా రోహిత్ అన్నకు పంపినా. నాకు నీవు ఏమైనా అర్ధ రూపాయి ఇచ్చినావా? ఏడాది దాటింది. ఒక్క పని ఇచ్చావా? చిన్న సహాయం చేశావా? నా మీద నీకేం హక్కుంది మాట్లాడేందుకు? నన్ను చంపుతావా.. చంపు. నన్ను చంపావంటే మా వాళ్లు ఊరికే ఉండరు. నువ్వు నోరు జారినావంటే బాగుండదు’ అని గుత్తా ధనుంజయ నాయుడు ఎమ్మెల్యేకు పంపిన వాయిస్ రికార్డులో పేర్కొన్నారు. దీంతో జూ.ఎన్టీఆర్ అభిమానులు మరింతగా రగిలిపోతున్నారు. -
బాబు, రాహుల్ హాట్‌లైన్ బంధం నిజమే!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కుమ్మక్కు అయినట్లేనా? రాహుల్ గాంధీ ఒకవైపు కేంద్రంలో బీజేపీతో పోరాడుతున్నట్లు హడావుడి చేస్తూ.. ఇంకోపక్క అదే ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించడం లేదు ఎందుకన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య ఉన్న హాట్ లైన్ సంబంధాల గుట్టు రట్టు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఈ కథ నడుస్తోందని ఆయన వెల్లడించారు. అంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా అటు బీజేపీతో పొత్తు, ఇటు కాంగ్రెస్‌తో రహస్య బంధం పెట్టుకున్నారన్న మాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది కాని పెద్దగా ఫీల్ కాలేదనిపిస్తుంది. అందువల్లే ఇప్పుడు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. జగన్‌పై కొద్దిమంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఓట్ల చోరీ జరిగిందని, బీజేపీకి మేలు చేసేందుకు ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతోందని ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ, ఇతర ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఏపీ, ఒడిశాలల్లో జరిగిన ఎన్నికల తీరుపై ఎందుకు మాట మాత్రం కూడా ప్రస్తావించడం లేదన్నదానికి జవాబు దొరకడం లేదు. ఏపీలో పోలింగ్ నాటితో పోలిస్తే కౌంటింగ్ రోజు 12.5 శాతం ఓట్లు అధికంగా లెక్కవేశారని... అంటే సుమారు 49 లక్షల ఓట్ల మాయాజాలం జరిగిందని ఎన్నికల సంస్కరణల సంస్థ (ఎడిఆర్) ఒక నివేదికలో తెలిపింది.అయినా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ విషయం తెలియనట్లు నటిస్తోంది. అదే జగన్ మాత్రం హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలై, బీజేపీ గెలిచిన రోజే ఎన్నికల అక్రమాలపై తన నిరసన తెలిపారు. ఈవీఎంలు మానిప్యులేషన్‌కు గురవుతున్నాయిని, బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు జరపాలని సూచించారు. జగన్ అలా వ్యాఖ్యానించినా, ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదు. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన పత్రంలో ఈవీఎంల మాయ, ఓట్ల రిగ్గింగ్ తదితర కారణాలతో వైఎస్సార్సీపీ 88 సీట్లు కోల్పోయిందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మోడీ అంటే వెరచేవారైతే జగన్ ఈ విషయాన్ని ఇంత ధైర్యంగా చెప్పగలిగేవారా? వైఎస్సార్సీపీ నేతలు కొందరు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ హైకోర్టుకు కూడా వెళ్లారు. కానీ ఎన్నికల అధికారులు వాటిని పది రోజులలోనే దగ్ధం చేయించిన విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రపంచానికి చాటి చెప్పింది. ఇన్ని జరిగినా కాంగ్రెస్ మాత్రం పెదవి విప్పలేదు. ఈ ఆధారాలను రాహుల్ వాడుకోగలిగి ఉంటే ఆయన వాదనకు మరింత బలం చేకూరేది. ఈ విషయాలన్నిటిని కప్పిపుచ్చి రాహుల్ గాంధీకి జగన్ మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాకూర్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఇప్పటికీ జగన్‌ను విమర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చారే కాని, ఏపీలో ఎన్నికల అవకతవకలు జరిగాయా?లేదా? అన్నదానిపై తమ అభిప్రాయం చెప్పలేదు. మోడీ,అమిత్ షాలపై జగన్ విమర్శలు చేయడం లేదట. హర్యానాలో ఎన్నికల ఫలితాలపై జగన్ ఎవరిపై విమర్శలు చేసినట్లో తెలియడం లేదా? పైగా షర్మిల ఆధ్వరంలో జరిగే ర్యాలీలో జగన్ పాల్గొనాలని ఒక పిచ్చి సలహా పారేసి చంద్రబాబు పట్ల, బీజేపీ కూడా భాగస్వామి అయిన కూటమి పట్ల ఎంత విధేయత ఉందో ఈ కాంగ్రెస్ నేతలు మరోసారి చెప్పకనే చెప్పారనిపిస్తుంది.రాహుల్ గాంధీ చెప్పుడు మాటలు వింటారని గతంలో అనుకునేవారు. తల్లి సోనియాగాంధీ కూడా అదే తరహాలో వ్యవహరించిన కారణంగానే ఏపీలో కాంగ్రెస్ నాశనమైందని కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడంలో విఫలమైందని అంతా విశ్వసిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన కుమారుడు జగన్ పట్ల కాంగ్రెస్ నాయకత్వం సరైన రీతిలో వ్యవహరించలేదు. జగన్‌ను ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసినా, కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకుండా, మరో సీనియర్ నేత రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది. తదుపరి అది తప్పు నిర్ణయమన్న భావనకు వచ్చిన అధిష్టానం ఆయనను మార్చి అప్పట్లో స్పీకర్‌గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేశారు. ఈ ఎంపికలో రాహుల్ గాంధీ పాత్ర అధికంగా ఉందని అంటారు.చిదంబరం వంటి నేతలను ప్రభావితం చేసి రాహుల్ తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా కిరణ్ వ్యూహం అమలు చేశారని అంటారు. ఆ పిమ్మట జగన్ తన సొంత పార్టీ పెట్టుకుని ముందుకు వెళ్లారు. దాంతో కక్షకట్టి ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇందులో చంద్రబాబు సహకారాన్ని కూడా తీసుకున్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడడం, చంద్రబాబు కోరుకున్నట్లు జగన్‌పై అక్రమ కేసులు పెట్టడం వంటివి కూడా చేశారు. తత్పలితంగా కాంగ్రెస్ తన సమాధికి తానే రాళ్లు పేర్చుకున్నట్లయింది. ఫలితంగా ఈ 15 ఏళ్లు అధికారానికి దూరం కావల్సి వచ్చింది. అధికారం పోయిన తరువాత కూడా వారిలో పెద్దగా మార్పేమీ రాలేదు. బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పరోక్ష స్నేహం చేస్తోందన్నది బహిరంగ రహస్యమే.ఏపీ కాంగ్రెస్‌లో కాస్తో, కూస్తో మిగిలి ఉన్న కేడర్ కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతోంది. 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత ఏపీలో ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేదు. 2019లో ఏపీలో పరాజయం తర్వాత చంద్రబాబు కాంగ్రెస్‌ను పూర్తిగా వదలివేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న సమయంలో ఆ పార్టీ అగ్రనేతలతో కలిసి ప్రచారాలు కూడా నిర్వహించారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ నేతలు కొందరికి టీడీపీ నాయకత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా లభించిందని చెబుతారు. 2019 ఓటమి తర్వాత కాంగ్రెస్‌ను వదలి బీజేపీ కూటమితో సాన్నిహిత్యం కోసం నానా పాట్లు పడ్డారు. అయినా ఎన్నడూ చంద్రబాబును రాహుల్ గాంధీ తప్పు పట్టలేదు. చివరికి 2024లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేసినా ఒకటి, అర సందర్భంలో తప్ప టీడీపీపై కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శలు చేయలేదన్నది వాస్తవం. అలాగే సోనియాగాందీ, రాహుల్ గాంధీలతోపాటు ,కాంగ్రెస్ ముఖ్యనేతలెవరిని చంద్రబాబు కూడా విమర్శించరు. ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీపై రాహుల్ ఎంత తీవ్ర ఆరోపణలు చేసినా, వాటిని ఖండించడానికి, మోడీకి అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడానికి చంద్రబాబు పెద్దగా చొరవ చూపిన సందర్భాలు కనిపించవు. ఆపరేషన్ సిందూర్ వంటి కీలకమైన అంశంలో సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ పెద్ద ఎత్తున తప్పుపట్టినా చంద్రబాబు మాత్రం నోరెత్తలేదని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. మోడీతో కలిసి పాల్గొనే సభలలో మాత్రం ఆయనను చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతుంటారు. మోడీ,అమిత్ షా వంటివారితో సంబంధం లేకుండా ఏపీలో నిత్యం జరిగే సభలలో మాత్రం చంద్రబాబు వారి ఊసే ఎత్తకుండా, మొత్తం తన గురించే ప్రచారం చేసుకుంటుంటారని, అయినా తమ నాయకత్వం చూసి చూడనట్లు పోతోందని బీజేపీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని చేయడంలో, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచాక ముఖ్యమంత్రి పదవి వచ్చేలా చేయడంలో చంద్రబాబు ప్రభావం కూడా ఉందని బీజేపీ వారికి కూడా తెలుసట. అయినా బీజేపీ వ్యూహాత్మకంగా ఏపీలో పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో మాత్రం పొత్తుకు ఈ రాష్ట్ర నాయకులు అంత సుముఖంగా లేరని అంటున్నారు. అసలు ఏపీ కాంగ్రెస్‌లో చాలామందికి ఇష్టం లేకపోయినా వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆమె అచ్చంగా అధికారం కోల్పోయిన జగన్ పై విమర్శలు చేస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సపోర్టుగా వ్యవహరిస్తుంటారన్న అభిప్రాయం ఉంది. ఆమెకు మాణిక్యం ఠాకూర్ వంటి వారు వంతపాడుతున్నారు. ఏపీలో అనేక స్కామ్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా ఆమె కాని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కాని వాటి గురించి కాకుండా విపక్షంలో ఉన్న జగన్ పై విమర్శలు చేస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ కొంతకాలం క్రితం ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడితే, షర్మిల తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఈవీఎంలకు బదులు బాలెట్ల వ్యవస్థను తీసుకురావాలని కోరుతుంటే ఈమె ఇలా ఎలా మాట్లాడతారో తెలియదు. ఈ కారణాలన్నిటి రీత్యానే రాహుల్ గాంధీపై జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబుకు, రేవంత్‌కు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇప్పటికీ సజావుగానే కొనసాగుతున్నాయని కాంగ్రెస్ కేడర్ సైతం చెబుతుంటుంది.అందువల్ల రేవంత్ ద్వారా రాహుల్ గాంధీ, చంద్రబాబుల మధ్య హాట్ లైన్ నడుస్తోందని, వారి మధ్య నిత్య సంబందాలు ఉన్నాయని జగన్ అభిప్రాయపడ్డారన్నమాట. చిత్రమేమిటంటే చంద్రబాబుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని కాంగ్రెస్ నేతలు అనడం లేదు. తాము చంద్రబాబు ఆద్వర్యంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై పోరాడతామని చెప్పడం లేదు. మళ్లీ జగన్ పైనే విమర్శలు చేసి చంద్రబాబును సంతోషపెట్టారనిపిస్తుంది. మరో వైపు ఒడిశాలో ఎన్నికల అక్రమాలపై బీజేడీ హైకోర్టుకు వెళుతోంది. అయినా రాహుల్ గాంధీ ఏపీ, ఒడిశాల గురించి మాట్లాడకుండా బీజేపీపై పోరాడుతున్నామని చెప్పడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బెడిసికొట్టినా సరే.. ఏపీలో మొదలైన ఉచిత బస్సు కష్టాలు! (చిత్రాలు)
-
Sugali Preethi: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయపోరాటం చేస్తానన్న పవన్ కళ్యాణ్
-
తాడిపత్రిలో ఉద్రిక్తత.. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం
సాక్షి, తాడిపత్రి: అనంతపురం జిల్లా నారాయణరెడ్డి పల్లిలో ఆరుగంటలుగా హైడ్రామా కొనసాగుతోంది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో నారాయణరెడ్డి పల్లిలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నారు. అయితే,తన స్వగ్రామానికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు,కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సంఘీభావం తెలిపేందుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నారాయణరెడ్డి పల్లికి చేరుకున్నారు. రోడ్డుమీదే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంఘీభావం తెలిపారు. ఆయనకు మద్దతుగా అక్కడే ఉన్నారు. దీంతో పోలీసులు గోరట్ల మాధవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అంతకుముందు.. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి వెళ్లనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేతిరెడ్డి.. తాడిపత్రికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. మరోవైపు.. తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు.వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు ఉదయం 10-11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 14 మాసాల తర్వాత హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తున్నారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామం నుంచి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డికి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంది. దీంతో, తాడిపత్రిలో పోలీసు బలగాలు భారీగా మోహరించారు.తిమ్మంపల్లి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి బయలుదేరారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం. హైకోర్టు తీర్పు వల్లే 14 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్తున్నాను. హైకోర్టు ఆదేశాలు పోలీసులు పాటించాలి. పోలీసులపై నమ్మకం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటాను. వైఎస్సార్సీపీ శ్రేణులు సమన్వయం పాటించాలి. నన్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావద్దు. తాడిపత్రిలోని నా ఇంటి వద్ద 50-60 మంది మాత్రమే ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. హైకోర్టు నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తాడిపత్రి ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తాను అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. తాడిపత్రికి వస్తున్న పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు తాడిపత్రి పట్టణానికి రావాలని జేసీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుత పరిణామాల కారణంగా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది. -
ఆంధ్రప్రదేశ్‌లో కారుచౌకగా భూముల విక్రయాలు.. ఎంత భూమైనా 99 పైసలకే.. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్..
-
మీ పాలన నిజంగానే బాగుంటే మమ్మల్ని ఓట్లు ఎందుకు వేయనివ్వలేదు?
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ఈ ప్రభుత్వ పాలన నిజంగానే బాగుంటే మాతో ఓట్లు ఎందుకు వేయనివ్వలేదు చంద్రబాబూ? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా? బీటెక్ రవికి మా ప్రాంతంలో ఓటు హక్కే లేదు. అసలు బయటి వారికి మా గ్రామాల్లో ఏం పని?..’’ అంటూ పులివెందుల మండలానికి చెందిన గ్రామాల ప్రజలు నిలదీస్తున్నారు. బందిపోటు ముఠాలు, పిండారీలు, దోపిడీ దొంగలు ఊర్లపై పడి మొత్తం దోచుకున్నట్లుగా తమ ఓట్లు కూడా దోచేశారని మండిపడుతున్నారు. గ్రామాలకు గ్రామాలే ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయని.. అసలు తాము ఓట్లే వేయనప్పుడు టీడీపీ ఎలా గెలుస్తుందని, విజయం సాధించిందని ఎలా ప్రకటిస్తారని విస్తుపోతున్నారు. తామంతా ఇంకా బతికేఉన్నా దొంగ ఓట్లు వేసుకుని తమను చంపేశారని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనికి కచ్చితంగా సమాధానం చెప్పాలని, తమ ఓటు హక్కు తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా టీడీపీ గూండాలు అడ్డుకోవడం.. బూత్‌ల వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లే లేకుండా చేసి ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించుకోవడం.. పోలీసు యంత్రాంగం మొత్తం వారికి కొమ్ముకాయడం లాంటి అరాచకాలు జరుగుతుంటే కొరడా ఝళిపించాల్సిన ఎన్నికల కమిషన్ ఏమీ పట్టనట్లు నిస్తేజంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కాదా? విచ్చలవిడిగా రిగ్గింగ్ జరుగుతుంటే కళ్లు మూసుకుని కూర్చోవడం ఏమిటి? అని ఆయా గామాలకు చెందిన ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. నా భర్త ఏజెంట్ ఫారాలు తీసుకెళ్తుంటే లాక్కొని వెళ్లగొట్టారునా కుమారుడు, భర్త ఏజెంట్ ఫారాలు తీసుకెళుతుంటే అడ్డుకుని చింపి గ్రామం నుంచి వెళ్లగొట్టారు. జమ్మలమడుగు, కమలాపురం, అనంతపురం నుంచి సుమారు 300 మంది బయట ప్రాంతాల వారు వచ్చారు. ఓటు వేసేందుకు వెళ్లిన వారిని బెదిరించి వెనక్కి పంపించారు. మా ఓట్లన్నీ దౌర్జన్యంగా వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? – అప్సరీ మస్తానమ్మ, చంద్రగిరిస్లిప్పులు లాక్కుని బెదిరించారు1978లో మొదటిసారి ఓటు వేసినప్పటి నుంచి ఇలాంటి దౌర్జన్యాలు, అరాచకం ఎన్నడూ చూడలేదు. ఇప్పటివరకు ఎన్నికల్లో ఇష్టమున్న వారికి ఓట్లు వేశాం. ఈసారి బూత్ వద్దకు వెళ్లగానే స్లిప్పులు లాక్కుని తామే ఓట్లు వేస్తామని, వెళ్లిపోవాలని బెదిరించారు. ఇంత చేసి ప్రజాస్వామ్యయుతంగా గెలిచామంటున్నారు! ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? పూర్వం ఊర్లకు ఊర్లు దోచుకెళ్లేవారు. ఇది కూడా అలాగే ఉంది. –భాస్కరరెడ్డి, కొత్తపల్లెఇంత దరిద్రమైన పనులా..? రాజకీయ నాయకుడు నీతి, నిజాయితీగా ఉంటేనే ఏ పార్టీ అయినా ఉంటుంది. ఇలాంటి పనులు చేస్తే ఏ నాయకుడూ నిలబడడు. ఇంత దరిద్రమైన పనుల కన్నా రాజకీయాలు వదులుకునేది మేలు. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. మేం ఓటు వేయలేదు. – భూమిరెడ్డి మోహన్‌రెడ్డి, కొత్తపల్లెరీ పోలింగ్ రోజూ వెళ్లలేదు..ఎన్నికల సమయంలో మేం ఎవరికి ఓటు వేసినా తర్వాత అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఇప్పుడు బయటి నుంచి జనాలను తీసుకొచ్చారు. వారు ఎవరో కూడా మాకు తెలియదు. అసలు ఏజెంట్లే లేకుండా చేశారు. ఓటర్లు పోలింగ్ బూత్ వద్దకు వెళ్లలేని పరిస్థితి కల్పించారు. రీ పోలింగ్ రోజు కూడా భయపడి మేం బూత్‌ల వద్దకు వెళ్లలేదు. – బాలగంగిరెడ్డి, చంద్రగిరిఫ్యాన్కు ఓటు వేస్తానని చెప్పా.. ! నేను 1942లో పుట్టా. ఇంత దౌర్జన్యం, అన్యాయం ఏనాడూ చూడలేదు. అధికారంలో ఉన్నంత మాత్రాన ఇలా దౌర్జన్యం చేయడం ఏమిటి? మేం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తానని చెప్పడంతో స్లిప్పు లాక్కుని అక్కడికక్కడే చింపేశారు. – వెంకటమ్మ, యర్రబల్లిఎవరికి ఓటేస్తున్నారని ప్రశ్నించారు..ఓటు వేసేందుకు ఉదయం రెండు సార్లు వెళ్లినా రానివ్వలేదు. 12.00 గంటలకు రమ్మన్నారు. ఓటరు స్లిప్పు లాక్కునేందుకు ప్రయత్నిస్తే నేను ఇవ్వలేదు. చివరికి నాకు ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వకుండా తామే వేసుకుంటామని చెప్పారు. ఓటు వేసేందుకు వచ్చిన వారందరినీ ఎవరికి ఓటేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. – పుల్లమ్మ, దళితవాడఏజెంట్గా వెళ్తే వెళ్లగొట్టారుపోలింగ్ ఏజెంట్‌గా బూత్‌లో కూర్చొనేందుకు వెళితే ఎందుకొచ్చావంటూ బెదిరించి వెళ్లగొట్టారు. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన వారి స్లిప్పులు లాక్కుని పంపేశారు. ఈమాత్రం దానికి ప్రచారంలో ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయమని ఎందుకు అడిగారు? అసలు పోలింగ్ ఎందుకు పెట్టారో చెప్పాలి! – రమాదేవి, దళితవాడఏడు పల్లెల్లో జగన్‌ను కాదని ఓట్లు వేయరు..మేమంతా జగన్ కావాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటాం. ఇక్కడ ఈ ఏడు పల్లెల్లో వైఎస్ జగన్‌ను కాదని ఇతరులకు ఓటు వేయరు. మా ఓటు మమ్మల్ని వేయనివ్వకుండా అడ్డుకున్నారు. జగన్‌పై గెలవలేక బయటి ప్రాంతాల వారిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారు. – రామసుబ్బారెడ్డి, కొత్తపల్లెఇప్పటికీ ఓటర్ స్లిప్ నా వద్దేనాకు 75 ఏళ్లు. ఈ ఎన్నికల్లో పోలింగ్ బూత్ మొహం చూడలేదు. ఇప్పటికి ఓటరు స్లిప్పు నావద్దే ఉంది. టీడీపీ వారు గెలిచామని అంటున్నారు. అసలు ఓట్లు ఎవరు వేశారో చెప్పాలి. పోలీసుల వద్దకు వెళ్లి అడిగితే నవ్వి ఊరుకున్నారు. ఎర్రబల్లిలో ఎవరు ఓటు వేయలేదు. ఈ ఏడు పల్లెల్లో ఓట్లు వేయలేదు. ఇది వాస్తవం. – చక్రానాయక్ కృష్ణమూర్తి, కొత్తపల్లెబయటోళ్లు ఓట్లన్నీ వేసుకున్నారు..టీడీపీ వాళ్లు బయటి ప్రాంతాల వారిని తీసుకొచ్చి మమ్మల్ని ఓట్లు వేయనివ్వలేదు. క్యూ లైన్లోకి వారి మనుషులను పిలిపించుకుని ఓట్లు వేయించుకున్నారు. మా ఓట్లను ఇతర ప్రాంతాల వారు వేసుకునే హక్కు ఎవరిచ్చారు? మా ఊరికి చెందిన ఇద్దరిని కొట్టడంతో భయపడి ఎవరూ పోలింగ్‌బూత్ వద్దకు వెళ్లలేదు.– ముత్యాలమ్మ, కనంపల్లెకాళ్లు పట్టుకున్నా కనికరం లేదుఓటు వేసేందుకు వెళితే రౌడీల్లాగా పోలింగ్ కేంద్రాల వద్ద కాపలా ఉన్నారు. కొట్టాలు, మబ్బుచింతలపల్లె, తుమ్మలపల్లె, జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన వారు మా గ్రామానికి వచ్చారు. బూత్ వద్దకు వెళితే పోలీసులు అడ్డుపడ్డారు. నా కుమారుడు పోలీసుల కాళ్లు పట్టుకున్నాడు. మా ఊరిలో ఒక్కరూ ఓటు వేసిన పాపాన పోలేదు. – తులశమ్మ, కనంపల్లెఈసీ.. మా ఓటు ఎక్కడ?ఓట్లకు పోనీయకుండా పోలీసులే దగ్గరుండి దౌర్జన్యం చేశారు. అవమానకరంగా మాట్లాడారు. ఒక్కో చోట 50 నుంచి 60 మంది పోలీసులను పెట్టారు. మా గ్రామస్తులను ఓటు వేయనివ్వలేదు. ఓటు వేసేందుకు వెళితే తరిమేశారు. మేం ఇంకా బతికే ఉన్నాం.. మా ఓటు మేమే వేయాలి. మాకు ఓటు హక్కు కావాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. – బుక్కే సాలమ్మఊరంతా ఓటేయలేదు..కనంపల్లెలో ఊరు ఊరంతా ఒక్క ఓటు కూడా వేయలేదు. దొంగ ఓట్లు గుద్దుకున్నారు. మేమంతా చనిపోయినట్లే భావిస్తున్నాం. ఈ ఎన్నికలను తలుచుకుంటే బాధేస్తోంది. మా ఓట్లు మాకు కావాలి. – నాగలా నాయక్, కనంపల్లెహీనమైన పని బాబూ..!50 ఏళ్లుగా రాజకీయాలను చూస్తున్నా. ఇలాంటి ఎన్నిక ఎన్నడూ జరగలేదు. పోలీసులతో బందోబస్తు పెట్టుకొని మేం పోలింగ్ కేంద్రాల వద్దకు పోకుండా నిర్బంధించి ఓట్లు వేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా హీనమైన పని చేశాడు. – కమాల్, చంద్రగిరిపాలన బాగుంటే ఓట్లు ఎందుకు వేయనివ్వలేదు?ఈ ప్రభుత్వ పాలన సక్రమంగానే ఉంటే మమ్మల్ని ఓటు ఎందుకు వేయనివ్వలేదు? టీడీపీ మూకలు చొరబడి మా ఊరిని సర్వనాశనం చేశాయి. బయటి వారికి మా ఊరిలో ఏం పని? అసలు బీటెక్ రవికి మా ప్రాంతంలో ఓటు హక్కు లేదు. ఆయన సింహాద్రిపురం మండలానికి చెందిన వ్యక్తి. మా గ్రామంలోని 605 మంది ఓటర్లలో ఒక్కరూ ఓటు వేసిన పాపాన పోలేదు. పోలీసుల కాళ్లు పట్టుకున్నా ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వలేదంటే ఇది ప్రజాస్వామ్యమా? రౌడీ రాజ్యమా? - చక్రానాయక్, కనంపల్లె -
అంతర్రాష్ట్ర బస్సులట.. ఫ్రీగా కుదరదట!
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సింహాచలం (విశాఖ): టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు పథకానికి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలకు చెందిన మహిళలు నోచుకోవడంలేదు. ఇక్కడ తిరుగుతున్న బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులని.. వీటికి స్త్రీశక్తి పథకం వర్తించదంటూ వాటిపై స్టిక్కర్లు అతికించి, బోర్డులు పెట్టి మరీ సర్వీసులు నడుపుతున్నారు. విలీన మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాకల్లో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన పలు బస్సులు నిత్యం తిరుగుతుంటాయి. ఆంధ్రాలోని విజయవాడ, గన్నవరం, కాకినాడ, గోకవరం, రాజమహేంద్రవరం, రాజోలు డిపోలకు చెందిన బస్సులు ఆయా మండలాల మీదుగా తెలంగాణలోని భద్రాచలం వరకు ప్రతిరోజూ తిరుగుతాయి. అలాగే, వీఆర్‌పురం నుండి కూనవరం మీదుగా భద్రాచలానికి షటిల్ సర్వీసులుగా పల్లెవెలుగు బస్సులు నడుస్తున్నాయి. నిన్నటివరకు విలీన మండలాల్లో మామూలుగానే తిరిగిన ఈ బస్సులు.. స్త్రీశక్తి పథకం ప్రారంభమైన వెంటనే ‘అంతర్రాష్ట్ర సర్వీసు.. స్త్రీశక్తి పథకం వర్తించదు’.. అంటూ బస్సులపై బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో ప్రభుత్వ తీరుపై ఇక్కడి మహిళలు మండిపడుతున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులంటూ తమకు ఉచిత ప్రయాణం లేకుండా చేస్తున్నారంటున్నారు. ఆంధ్రా సరిహద్దుల నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో వున్న తమకు ఈ పథకం నిలిపివేయడం దారుణమని వారు వాపోతున్నారు. మరోవైపు.. విజయవాడ, గన్నవరం డిపోలకు చెందిన బస్సులు భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని కుంట, ఒడిశాలోని మోటు పేరుతో సర్వీసులు నడుస్తున్నాయి. ఇవి ఆయా రాష్ట్రాల్లోకి వెళ్లకుండా కేవలం సరిహద్దుల వరకు మాత్రమే నడుస్తున్నాయి. వీటిల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం వర్తింపచేయకుండా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులంటూ బోర్డులు పెడుతున్నారు. ఆంధ్రాలోనైనా వర్తింపచేయాలి.. ఇక భద్రాచలం నుండి విలీన మండలాలకు వచ్చే బస్సులకు సంబంధించి నెల్లిపాక వరకు టికెట్ తీసుకుని అక్కడి నుండి ఆంధ్రానే కనుక ఉచిత బస్సు ప్రయాణం అనుమతించాలని మహిళలు కోరుతున్నారు. అదేవిధంగా.. కాకినాడ, రాజమహేంద్రవరం, రాజోలు, గోకవరం డిపోల నుండి భద్రాచలం వెళ్లే సర్వీసులకు నెల్లిపాక వరకు ఉచిత ప్రయాణం అనుమతించి అక్కడి నుండి భద్రాచలానికి టికెట్ తీసుకోవాలని వారు కోరుతున్నారు. మా ప్రాంతం ఈ రాష్ట్రంలో లేదా? రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వర్తిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం మా ప్రాంతానికి ఎందుకు వర్తించదు? మా ప్రాంతం ఈ రాష్ట్రంలో లేకుండా పోయిందా అనేది ప్రభుత్వం చెప్పాలి. ఇతర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో జీవించడమే మేం చేసిన నేరమా.. అడ్డగోలు నిబంధనలతో ఈప్రాంత మహిళలకు అన్యాయం చేయడం సబబు కాదు. – ముచ్చిక లక్ష్మి, మామిళ్లగూడెం, చింతూరు మండలం సింహాచలంలో సరికొత్త సమస్య.. ఇదిలా ఉంటే.. సింహాచలం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో కొత్త సమస్య ఎదురైంది. కొండపైకి వెళ్లే ఒక్కో ప్రయాణికుడి టికెట్ ధర రూ.25 కాగా.. అందులో రూ.5 దేవస్థానానికి చెల్లించడం ఆనవాయితీ. ఇప్పుడు మహిళలకు జీరో టికెట్ ఇస్తుండటంతో, దేవస్థానానికి చెల్లించాల్సిన రూ.5 అంశంపై చర్చ జరుగుతోంది. ఈ మొత్తం చెల్లిస్తారా లేదా అనే దానిపై స్పష్టత కరువైంది. -
జూనియర్ ఎన్టీఆర్ బుడ్డా ఫకీర్.. వాని సినిమాలు ఆడనిస్తానా..?
సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం క్రైం: ‘జూనియర్ ఎన్టీఆర్ ఒక బుడ్డా ఫకీర్.. వాడి సినిమాలు ఇక్కడ ఎలా ఆడనిస్తానని అనుకున్నారు.. లోకేశ్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం.. కొడుకు.. వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా.. ఈ సినిమా ఆడదు..’ అంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్–2’ సినిమా విడుదల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇటీవల ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడుతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతకు ఫోన్ చేసి.. ‘ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు అనుమతించారు.. ఎవరు అనుమతి ఇచ్చారు.. ఎలా ఆడనిస్తారు? ఆ సినిమాను ఆడనిచ్చేదే లేదు.. వాడు బుడ్డా ఫకీర్.. లోకే‹శ్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం..కొడుకు ఈ టైమ్‌లో వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా? నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా? ఈ సినిమా ఆడదు.. వాడు బుడ్డా ఫకీర్ గాడు లోకేశ్ గురించి మాట్లాడతాడా? ఈ సినిమా ఆడదు.నాకు తెలియకుండా సినిమా ఎట్లా ఆడుతుంది.. నేను అనంతపురం ఎమ్మెల్యే.. బుడ్డా ఫకీర్ నా కొడుకు.. సార్ గురించి మాట్లాడతాడా? గాడ్ ప్రామిస్‌గా చెబుతున్నా.. ఈ సినిమా ఆడదు.. ఆపేయిస్తున్నా.. నేను ఊరుకుంటానా.. పంపించేయండి అందరినీ’ అని హుకుం జారీ చేశారు. లోకేశ్, చంద్రబాబు ప్రోద్భలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలు అందులో భాగమేనని నందమూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.వాయిస్ రికార్డ్ బయట పెట్టిన ధనుంజయ నాయుడుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ వివరణ ఇవ్వబోగా జూ.ఎన్టీఆర్ అభిమాని, టీఎన్ఎస్ఎఫ్ నేత గుత్తా ధనుంజయ నాయుడు ఆయన వాయిస్ రికార్డు బయట పెట్టారు. జూ.ఎన్టీఆర్‌ను తిడుతూ.. తనను ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన అనంతరం ఆయన ఒక ఆడియోను రికార్డు చేసి ఎమ్మెల్యేకు పంపినట్లు తెలుస్తోంది. ‘అన్నా.. మీరంటే గౌరవం ఉంది. దయచేసి చెబుతున్నా.. ఎవరో చెప్పిన మాటలు విని అలా మాట్లాడవద్దు. జూ.ఎన్టీఆర్‌కు సినిమా పరంగా ముందు నుంచీ అభిమానిని.ఈ విషయాన్ని నారా లోకేశ్ ముందు చెప్పమన్నా చెబుతా. అంతేగానీ ఎవరి కోసమో పని చేయలేదు నేను. దయచేసి నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు. సినిమా మీద కాంట్రవర్సీ ఎందుకు? నన్నెందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు? అసభ్యంగా మాట్లాడితే నేను పడను. నాకు ఫోన్ చేసి బెదిరించడం తప్పు. ఎన్టీఆర్ గాడు.. గీడు అని మాట్లాడవద్దు. మీరు నాతో మాట్లాడిన ప్రతిదీ వాయిస్ రికార్డు చేశాను. ఈ రికార్డులన్నీ నారా రోహిత్ అన్నకు పంపినా. నాకు నీవు ఏమైనా అర్ధ రూపాయి ఇచ్చినావా? ఏడాది దాటింది.ఒక్క పని ఇచ్చావా? చిన్న సహాయం చేశావా? నా మీద నీకేం హక్కుంది మాట్లాడేందుకు? నన్ను చంపుతావా.. చంపు. నన్ను చంపావంటే మా వాళ్లు ఊరికే ఉండరు. నువ్వు నోరు జారినావంటే బాగుండదు’ అని గుత్తా ధనుంజయ నాయుడు ఎమ్మెల్యేకు పంపిన వాయిస్ రికార్డులో పేర్కొన్నారు. దీంతో జూ.ఎన్టీఆర్ అభిమానులు మరింతగా రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాదులో జూ.ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఉమ్మడి రాష్ట్ర కన్వీనర్లు, ముఖ్య నేతలు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నీ బండారం బయట పెడతానన్న ప్రభాకర్ చౌదరిఎమ్మెల్యే ఆడియో సామాజిక మాధ్యమాల్లోకి రాకమునుపే రెండ్రోజుల ముందు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. దగ్గుపాటి ప్రసాద్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నువ్వు జూ.ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడావో నా దగ్గర రికార్డులున్నాయి. నీ బండారం బయటపెడతా’నని హెచ్చరించారు. ఆగ్రహించిన జూ.ఎన్టీఆర్ అభిమానులుఅనంత ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. ఆదివారం ఉదయం అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైకి దాడికి దిగారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భారీ ఫ్లెక్సీలను చింపేసి నిరసన తెలిపారు. ‘అవసరమైనప్పుడు పార్టీకి పని చేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. ఆ విషయం తెలియదా? మీతో ఇలా ఎవరు మాట్లాడించారో చెప్పాలి. మేము కూడా ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు.అలాంటిది మా అభిమాన నాయకుణ్ని దూషిస్తారా? మాకు రాజకీయాలతో పని లేదు. నాలుగు గోడల మధ్య కూర్చొని క్షమాపణ చెబితే సరిపోదు. బయటకు వచ్చి.. మీరు, మీతో మాట్లాడించిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఇంట్లో ఉండీ బయటకు రావడం లేదని జూ.ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. కొందరు టీడీపీ చోటా నాయకులు కలుగజేసుకుని జూనియర్ అభిమానులకు సర్దిచెప్పారు. కాగా, శనివారం రాత్రే ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో పార్టీ పెద్దల పిలుపు మేరకు ఎమ్మెల్యే దగ్గుపాటి విజయవాడకు వెళ్లినట్లు తెలిసింది.ఆ వాయిస్ ఎమ్మెల్యేదే ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని ఎమ్మెల్యే అంటున్నారు. అది నిజం కాదు. అది ఎమ్మెల్యే వాయిస్సే. అతని వాయిస్ కాదనుకుంటే ఆడియోలో ఇంకో వైపు మాట్లాడింది ధనుంజయ నాయుడు (టీఎన్ఎస్ఎఫ్) వాయిస్ ఫేక్ కాదు కదా?! అంత పెద్ద హీరో తల్లిని అనరాని మాటలు అనడం తప్పు. ఎవరి తల్లి అయినా తల్లే కదా? ఎన్టీఆర్ అభిమాన సంఘాల నేతలు రేపు హైదరాబాద్‌లో సమావేశానికి పిలుపునిచ్చారు. అధికారం ఉంది కదా అని అనంతపురంలో అభిమాన సంఘం నేతలను, కార్యకర్తలను నోరు మూయించవచ్చు. ప్రభుత్వం మాది.. ఏమైనా చేస్తామంటే కుదరదు. ఇది ఇక్కడితో ఆగదు. ఎమ్మెల్యే కచ్చితంగా మీడియా వేదికగా, అభిమానుల ముందు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. – మహేష్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానిఅనంత ఎమ్మెల్యే ప్రసాద్‌పై భగ్గుమన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్తిరుపతి మంగళం/నెల్లూరు (బృందావనం)/గాందీనగర్(విజయవాడసెంట్రల్) : జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా వార్–2 విడుదల సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి.. ప్రముఖ హీరోను పట్టుకుని.. అదీ టీడీపీ అభ్యున్నతికి సహకరించిన జూనియర్ ఎన్టీఆర్ పట్ల దారుణంగా మాట్లాడటం ఏమాత్రం క్షమార్హం కాదని మండిపడుతున్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జూనియర్ అభిమానులు తమదైన శైలిలో నిరసన తెలిపారు.తిరుపతి పరిధిలోని తిమ్మినాయుడుపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ డౌన్ డౌన్.. అంటూ నినదిస్తూ అభిమానులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు సోముయాదవ్, తులసీరామిరెడ్డి, తదితర అభిమానులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్‌ను హేళన చేస్తూ మాట్లాడడం దారుణం అన్నారు. అసలు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.రాజకీయం.. టీడీపీ నాయకులకు నందమూరి కుటుంబం పెట్టిన భిక్ష అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని నెల్లూరు జిల్లా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వైఖరిని ఎండగడుతూ జూనియర్ ఎన్టీఆర్ సేవాదళ్ ఫౌండర్ గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు గాలి మధుసూదన్, నగర అధ్యక్షుడు రియాజ్, రూరల్ అ«ధ్యక్షుడు అశోక్, గాలి శ్రీధర్ తదితరులు నర్తకీ సెంటర్లో ఆందోళన చేపట్టారు. ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ జోలికివస్తే సహించేది లేదంటూ బహిరంగంగా హెచ్చరించారు.జూనియర్ ఎన్టీఆర్ తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గుపాటి ఇలా మాట్లాడడం తగదన్నారు. విజయవాడ గాం«దీనగర్‌లోని జయరాం థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కనీ్వనర్ నున్న గణేష్ ఆధ్వర్యంలో అభిమానులు భారీ స్థాయిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారు. ఆపై ఫ్లెక్సీని దహనం చేసి, ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.జూనియర్ ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూ.ఎన్టీఆర్‌కు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభిమానుల సమక్షంలో బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఫ్యాన్స్ సిటీ కనీ్వనర్ కావూరి కృష్ణ, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. సాక్ష్యాధారాలతో బయట పెడతాంఅనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరం. నోటికి వచ్చిన పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్‌ను తిడుతూ వార్–2 సినిమా ఆపుతానని, మీరెలా సినిమా ప్రదర్శిస్తారో చూస్తానని, రీల్స్‌ను తగలబెడతానని, అభిమానులు సినిమాకు వెళ్లరాదని బెదిరించడం దారుణం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై గౌరవం లేని ఇలాంటి ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. పైగా ఆ వాయిస్ తనది కాదని ఎమ్మెల్యే అబద్ధాలు చెప్పడం సరికాదు. ఎమ్మెల్యే ఫోన్ నంబర్ ద్వారా వెలువడిన సంభాషణను సాక్ష్యాధారాలతో బయట పెడతాం. ఇప్పటికైనా అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. – యర్రమల సుధాకర్‌రెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ ఎన్టీఆర్ సినిమాలు ఆపడం మీతరం కాదు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు కూడా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఎన్టీఆర్‌ను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు జూ.ఎన్టీఆర్ సినిమాలను ఆపాలనుకుంటే అది మీ తరం కాదు. ఒక ప్రజా ప్రతినిధిగా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్.. బాధ్యత గల స్థానంలో ఉండి అసభ్య పదజాలంతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ప్రజలకు మీరు నేర్పించేది ఇదేనా? ఎన్టీఆర్‌ను, ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొట్టొద్దు. – పి.పూర్ణ, ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత, ప్రకాశం జిల్లా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదుజూనియర్ ఎన్టీఆర్‌ను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నోటికి ఇష్టం వచ్చినట్లుగా దూషించడం అభిమానులకు తీరని మనోవేదన కలిగిస్తోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తక్షణమే స్పందించి ఆ ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి. లేకపోతే భవిష్యత్‌లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – డి.భాస్కర్, టీమ్ తారక్ ట్రస్టు, జిల్లా అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా -
ఐటీ ముసుగులో భూములు ‘లిఫ్ట్’!
సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వమైనా ఓ కంపెనీకి ఉదారంగా భూములివ్వాలంటే ముందుగా దాని ట్రాక్ రికార్డు చూస్తుంది! కంపెనీ శక్తి, సామర్థ్యాలు ఏమిటి? ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? రాష్ట్రానికి పారదర్శకంగా ఎన్ని పెట్టుబడులు వస్తాయో చూస్తుంది. అంతటా నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుంది. కానీ ఇలాంటివి ఏవీ పట్టించుకోకుండా పప్పు బెల్లాల మాదిరిగా భూముల పందేరానికి టీడీపీ కూటమి సర్కారు సిద్ధమైంది. ఐటీ కంపెనీల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసింది. ఎన్ని ఎకరాల భూమి అయినా సరే కేవలం 99 పైసలకే ఇస్తాం...! ఐటీ పేరుతో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకోండి..! ఆ తరువాత మార్కెట్ ధరకు అమ్మేసుకోండి..! అంటూ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పేరుతో విలువైన భూములను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు. ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నామంటూ పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సన్నాహాలు చేశారు. తొలుత ఒకటి రెండు ప్రముఖ కంపెనీలను తెరపైకి తీసుకొచ్చి కనీసం పాలసీ కూడా సిద్ధం కాకముందే విశాఖలో 99 పైసలకే భూములను కట్టబెట్టారు. ఈ క్రమంలో ఊరూ పేరు లేని ఉర్సాకు కారుచౌకగా భూములను కట్టబెట్టే యత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఉలిక్కిపడి ‘లిఫ్ట్’ పేరుతో ఓ పాలసీని తీసుకొచ్చారు. ఉర్సా లాంటి వందలాది సత్తాలేని కంపెనీలను సృష్టించి తమకు కావాల్సిన వారికి భూములు అప్పనంగా అప్పగించేందుకు సిద్ధపడ్డారు. అసలు టెక్నాలజీతో సంబంధం లేని కంపెనీలకు భూములను ధారాదత్తం చేస్తున్నారు! తొలుత విశాఖలో ఐటీ కంపెనీలను ప్రోత్సహించి ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా భూములను కేటాయించనున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నామినల్ రేటు అంటే 99 పైసలు..ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ఇప్పటికే ఏపీ ఐటీ అండ్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ (జీసీసీ) పాలసీ 2024–29 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కేటాయించడం కోసం ప్రత్యేకంగా ‘లిఫ్ట్’ పాలసీని తెరపైకి తెచ్చింది. ముందుగా ఐటీ లేదా జీసీసీతో అభివృద్ధి చేసే వాణిజ్య సముదాయంలో 20 శాతం కొనుగోలు లేదా లీజుకు తీసుకునేలా ఒప్పందం చేసుకుంటే చాలు.. అడిగినంత భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టనుంది. మిగిలిన 80 శాతంలో 30 శాతం ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు, జీసీసీలకు ఇస్తే చాలు 50 శాతం భూమిని వాటికి నచ్చినట్లుగా విక్రయించుకోవచ్చని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘నామినల్ రేటు అంటే 99 పైసలు..’’ అని అందులో పేర్కొనడం గమనార్హం.ప్రత్యేకంగా ‘ఫార్చూన్ 500 యూరప్’ ఎందుకు?ఐటీ, ఐటీఈఎస్, జీసీసీలకు 99 పైసలకే భూమి ఇస్తామంటూనే ‘‘ఫార్చూన్ 500 యూరోప్’’ను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిలో నాన్ ఐటీ కంపెనీలే ఉన్నాయి. టెక్నాలజీతో ఏమాత్రం సంబంధంలేని యూరోప్ ఫార్చూన్ 500 ఇండెక్స్‌ను ఎంపిక చేసుకోవడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ ఇండెక్స్‌లో నల్లధన రాజధాని స్విట్జర్లాండ్‌కు చెందిన 36కిపైగా కంపెనీలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఫార్చూన్ 500 యూరోప్ తేవడంపై ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.డెవలపర్స్ ముసుగులో ‘రియల్’ వ్యాపారంఐటీ పార్కు డెవలపర్స్, జీసీసీ డెవలపర్స్‌కు కూడా ఈ పాలసీ కింద 99 పైసలకే భూమిని కేటాయిస్తారు. జీసీసీ డెవలపర్స్ కనీసం ఒక ఎకరా భూమిలో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే విధంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. ఫార్చూన్, ఫోర్బ్స్ కంపెనీల్లో ఒక దానిని యాంకర్ కంపెనీగా ఎంపిక చేసుకొని అభివృద్ధి చేసిన భూమిలో 20 శాతం తీసుకునే విధంగా ఒప్పందం చేసుకోవాలి. ఎకరాకు కనీసం 500 మందికి ఉపాధి కల్పించాలి. ఇలా అభివృద్ధి చేసిన భూమిలో కనీసం 50 శాతం భూమిని ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు, జీసీసీలకు ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు . అదే ఐటీ పార్కు డెవలపర్స్ అయితే ఎకరాకు 1,00,000 చదరపు అడుగులు చొప్పున కనీసం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అంటే ఐటీ డెవలపర్స్‌కు కనీసం 10 ఎకరాల భూమిని కేటాయిస్తారు. -
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..ప్రైవేటీకరణ దిశగా స్టీల్ ప్లాంట్
సాక్షి,విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎన్నికల హామీని చంద్రబాబు ప్రభుత్వం నిలబెట్టు కోలేకపోతుంది. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ జరగకుండా కాపాడుతామని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా 32 విభాగాలను ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లను పిలిచిన స్టీల్ యాజమాన్యం.. సెప్టెంబర్ 9వ తేదీ టెండర్ల దాఖలకు ఆఖరి తేదీ విధించింది.ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) విధానంలో1)టీపీపీ, 2) ఎస్ ఎం ఎస్-1&2, 3)ఎంఎంఎస్ఎం, 4)ఎస్బిఎం, 5)డబ్ల్యూఆర్ఎం-1&2, 6) మాదారం మైన్స్, 7) రోల్షాప్అండ్ రిపేర్ షాప్ -1&2, 8) సిఎంఎస్, 9) ఫౌండ్రీ, 10)ఎస్టీఎం, 11)ఈఎన్ఎండి, 12) బ్లాస్ట్ ఫర్నిస్-1,2&3లను ప్రైవేట్ పరం చేసేందుకు టెండర్లను పిలిచింది. -
ఉన్మాదుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు
సాక్షి,విశాఖ: మహిళల్ని వేధించేందుకే టీడీపీ నేతలకు చంద్రబాబు ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మంచ నాగ మల్లేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల పట్ల టీడీపీ ఎమ్మెల్యేల దురాగతాలపై మంచ నాగ మల్లేశ్వరి స్పందించారు.‘ఎమ్మెల్యే కూన రవి కుమార్ మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధించారు. పనులు కావాలంటే తమ కోరికలు తీర్చాలని మహిళలను టీడీపీ ఎమ్మెల్యేలు వేధిస్తున్నారు. దళిత మహిళ ఉద్యోగిని అని చూడకుండా అందరి ముందు అవమానించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వల్ల ఓ మహిళ ఆత్మహత్యకు చేసుకుంది.టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం మహిళను లైంగికంగా వేధించారు.ఎమ్మెల్యే అదిమూలం వేదింపులకు భయపడి ఆ మహిళ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయింది.చోడవరం ఎమ్మెల్యే అడిగిన సీటు ఇవ్వలేదని ఆమెను ఇబ్బంది పెట్టారు. మహిళలను వేధించడానికి టీడీపీ నేతలకు చంద్రబాబు ఎమ్మెల్యేల పదవులు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. అనంతపురంలో టీడీపీ నేతలు మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టారు. టీడీపీలో ఉన్న మహిళలకు అన్యాయం జరిగిన హోం మంత్రి స్పందించలేదు.చేతగాని హోం మంత్రి రాజీనామా చేయాలి’అని డిమాండ్ చేశారు. -
కూటమి సర్కార్‌పై కల్లుగీత కార్మికులు సమరశంఖం
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంపై కల్లుగీత కార్మికులు సమరశంఖం పూరించారు. బెల్టుషాపులు తొలగించి.. నీరా కేఫ్‌లు ఏర్పాటు చేసే వరకూ పోరాడాలని కార్మికులు నిర్ణయించారు. బెజవాడలో కల్లుగీత కార్మికులు రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలపై ఆలోచన చేయలేదన్నారు. కల్లుగీత కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాలపై నోరు మెదపడం లేదని ఆయన మండిపడ్డారు.రాష్ట్రంలో 3396 వైన్ షాపులుంటే 75వేల బెల్టు షాపులు పెట్టించారు. స్పిరిట్‌తో తయారు చేసిన కల్తీ మద్యం అమ్మిస్తున్నారు. గోవా, యానాం అక్రమ మద్యాన్ని అమ్ముతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో మద్యం వరద పారిస్తున్నారు. మద్యంతో గ్రామాలను ముంచెత్తుతున్నారు. కల్లుగీత వృత్తిని ఈ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది. ఇంటింటికీ , వీధివీధికి బెల్టుషాపులు పెట్టి కల్లుగీత కార్మికులకు పొమ్మనలేక పొగబెడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మాట తప్పింది.సెప్టెంబర్ 30 వరకూ దశల వారీగా ఆందోళనలు చేపడతాం. ఆగస్ట్ 22వ తేదీన అన్ని జిల్లాల్లో ఒకేసారి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. ఆగస్ట్ 30న అన్ని జిల్లాలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపడతాం. సెప్టెంబర్ 8న మంగళగిరిలో ఎక్సైజ్ కమినర్‌ను కలుద్దాం రండి కార్యక్రమం నిర్వహిస్తాం. సెప్టెంబర్ 10న సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తాం. సెప్టెంబర్ 12ప బెల్ట్ షాపులు, కల్లు పాలసీ, ఉపాధిపై జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తాం. సెప్టెంబర్ 25న జిల్లాల్లో సమీక్షలు, సభలు నిర్వహిస్తాం’’ అని నరసింహమూర్తి తెలిపారు.‘‘ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 30న కార్యాచరణ ప్రకటిస్తాం. ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గంలో లెక్కలేనన్ని బెల్టు షాపులున్నాయ్. అక్రమ మద్యం వరదలా పారుతోంది. బెల్టు షాపులు పెడితే తోలు ఒలుస్తామని ముఖ్యమంత్రి , ఎక్సైజ్ మంత్రి మాటలు చెప్పారు. ఇంతవరకూ ఎవరి తోలూ ఒలవలేదు. ఇంకా బెల్టు షాపులు పెరుగుతూ ఉన్నాయికల్లుగీత కార్మికులకు బెల్ట్ షాపులు జీవన్మరణ సమస్యగా మారింది. పోరాటం ఆగదు.. సమరశంఖం పూరిస్తాం... ఉవ్వెత్తున ఉద్యమిస్తాం. చెట్టుమీద నుంచి పడిపోయిన కల్లుగీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా చంద్రబాబు రద్దు చేశారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. కల్లుగీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. తెలంగాణ మాదిరి నీరా పరిశ్రమలు పెట్టాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. -
జూ. ఎన్టీఆర్ సినిమాను ఆపే దమ్ముందా! టీడీపీకి రోజా కౌంటర్
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కూటమి సర్కార్ మరో వెన్నుపోటు
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కూటమి సర్కార్ వెన్నుపోటు పొడిచింది. ఉక్కు పరిశ్రమలో మరో కీలక విభాగం ప్రైవేటీకరణకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే పలు కీలక విభాగాలు ప్రైవేటుకు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో కార్మిక సంఘాలు భగ్గుమంటున్నారు. దశల వారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రైవేటీకరణ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.స్టీల్‌ప్లాంట్ ఆసక్తి వ్యక్తీకరణ జాబితాలోకి మరో విభాగం చేరింది. శనివారం విడుదల చేసిన నోటీసులో స్టీల్‌ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్ (టీపీపీ)–1కు సంబంధించి యాజమాన్యం ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) జారీ చేసింది. ‘కాంప్రహెన్సివ్ టెక్నికల్ మేనేజ్ మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కేప్టివ్ పవర్ ప్లాంట్–1 అండ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్’ పనులకు సంబంధించి ఈవోఐ దాఖలుకు సెప్టెంబర్ 9న ఆఖరు తేదీగా నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం బిడ్లు తెరవనున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వైజాగ్ స్టీల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. -
ఎమ్మెల్యే మాధవి తీరు సరికాదు
కడప సెవెన్‌రోడ్స్: స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా శుక్రవారం కడప పోలీసు పెరేడ్ మైదానంలో కడప ఎమ్మెల్యే ఆర్.మాధవిరెడ్డి జిల్లా ఉన్నతాధికారులైన జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు తదితర అధికారులతో వ్యవహరించిన తీరుపై రెవెన్యూ అధికారులు భగ్గుమంటున్నారు. ఈ సంఘటనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వేశ్వరనాయుడు, ఏపీ రెవెన్యూ సరీ్వసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవన్ చంద్రశేఖర్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, ఇతర వర్గాలకు జిల్లా యంత్రాంగం పోలీసు మైదానం వద్ద తగిన సౌకర్యాలు కల్పించిందన్నారు. పండుగ వాతావరణంలో స్వాతంత్య్ర దిన వేడుకలు జరుగుతున్న సమయంలో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఒకటిన్నర గంట ఆలస్యంగా అక్కడికి వచ్చారని పేర్కొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం మంత్రి, కలెక్టర్, ఎస్పీ మాత్రమే వేదికపై ఆశీనులు అవుతారన్నారు. ప్రజాప్రతినిధుల కోసం వేదిక పక్కన వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేశామన్నారు. కాగా, ఎమ్మెల్యే మాధవి రెడ్డి కార్యక్రమానికి ఆలస్యంగా రావడంతో పాటు.. ఆలస్యంగా వచ్చే విషయాన్ని కనీసం ముందస్తుగా తమ వ్యక్తిగత సహాయకుల ద్వారానైనా అధికారులకు తెలియజేయలేదన్నారు. అప్పటికే ఎమ్మెల్యేకు కేటాయించిన సీటులో ఇతరులు కూర్చొన్నారని తెలిపారు. దీన్ని గుర్తించిన అధికారులు వెంటనే కూర్చొన్న వారిని అక్కడి నుంచి పంపివేసి ఎమ్మెల్యేను ఆహ్వానించారన్నారు. ఎమ్మెల్యే మాధవీ అక్కడ కూర్చొనేందుకు విముఖత చూపారన్నారు. దీంతో వేదికపై ప్రత్యేకంగా కూర్చుని సమకూర్చి ఆహ్వానించుమన్నారు. ముందుగానే వేదికపై కుర్చీ వేయలేదని ఆమె అసహనం వ్యక్తం చేయడంతో పాటు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ స్వయంగా వెళ్లి వేదికపైకి రావాలంటూ ఆహ్వానించినా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరుషంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి సివిల్ సరీ్వసెస్ సాధించి జిల్లా ప్రజలకు సేవలు అందించేందుకు వచ్చిన జాయింట్ కలెక్టర్‌పై ఎమ్మెల్యే అమర్యాదకరంగా ప్రవర్తించడం జిల్లాకే అవమానకరమని వాపోయారు. ఎమ్మెల్యేతోపాటు అక్కడికి వచ్చిన అనధికార ప్రజాప్రతిని«ధి కూడా జిల్లా రెవెన్యూ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించడం గర్హనీయమన్నారు. అధికారులను అవమానించే విధంగా ప్రవర్తించడం ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదన్నారు. స్వయంగా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వెళ్లి వేదికపైకి రావాలంటూ ఎమ్మెల్యేను ఆహ్వానించినప్పటికీ ఆమె రాకుండా వెళ్లిపోయిందని తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలను స్మరించుకునేందుకు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో పాల్గొని ఆస్వాదించే బదులు తనకు కుర్చీ వేయలేదంటూ అధికారులపై రుసరుసలాడటం అత్యంత హేయమని దుయ్యబట్టారు. జిల్లా అధికారులనే ఆమె దురుసుగా మాట్లాడుతోందంటే ఇక కిందిస్థాయి అధికారులపై ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
పల్లెవెలుగు బస్సులకూ వర్తించని ‘స్త్రీ శక్తి’
కడప కోటిరెడ్డి సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన స్త్రీ శక్తి పథకం పల్లె వెలుగు బస్సుల్లో సైతం వర్తించకపోవడంపై మహిళలు మండిపడ్డారు. శ్రావణమాసం నాలుగో శనివారం సందర్భంగా ఆర్టీసీ అధికారులు కడప నుంచి వేంపల్లె మీదుగా పవిత్రమైన గండి క్షేత్రానికి రెండు బస్సులను ఏర్పాటుచేశారు. గండి ఆలయానికి ఉచితంగా వెళ్లవచ్చని భావించిన మహిళలు బస్సు ఎక్కాక డబ్బులు చెల్లించాలని కండక్టర్ కోరడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రాయచోటి నుంచి గండికి వెళ్లే బస్సుల్లో కూడా చార్జీలు వసూలు చేశారు. ఆయా బస్సుల్లో స్త్రీ శక్తి పథకం వర్తించదని స్టిక్కర్లను ఏర్పాటు చేయడంతో మహిళలు టీడీపీ కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. -
అధర్మం నాలుగు పాదాలపై...
శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి. ‘పరిత్రాణాయ సాధూనామ్, వినాశాయ చదుష్కృతామ్, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’ అనే సందేశాన్ని మన జనజీవన స్రవంతితో సమ్మేళన పరిచిన భగవానుడాయన. సన్మార్గులను రక్షించడానికీ, దుర్మార్గులను శిక్షించడానికీ ప్రతి యుగంలోనూ నేను అవత రిస్తూనే ఉంటానని ఆయన చేసిన గీతోపదేశాన్ని భారతీయ సమాజం ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉన్నది. ఇక జన్మాష్టమి సందర్భమైతే సరేసరి. పామరుల నుంచి పండితుల వరకు, సామాన్యుల నుంచి సర్కార్ పెద్దల వరకూ ఆ మహామహో పాధ్యాయుని సంస్మరణ అవిస్మరణీయమైన ఆచారంగా మిగిలి పోయింది.ఈ కృష్ణాష్టమి సందర్భంగా రాజకీయ నాయకులు ఇచ్చిన సందేశాల్లో ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ చేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఎక్కువగా ఆకర్షించింది. ‘అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా – అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు. నిన్నమొన్నటి రాజకీయ పరిణామాలు ఈ ట్వీట్‌కు ప్రేరణ కావచ్చు. ఎన్నికలొక తతంగంగా – ప్రజాస్వామ్యం ఒక ప్రహసనంగా మారిన తీరు ప్రభావితం చేసి ఉండవచ్చు. కిందటేడాది జరిగిన సాధారణ ఎన్నికలపై పుంఖా నుపుంఖాలుగా ఆరోపణలు వస్తున్న విషయం విదితమే. ఆ ఆరోపణలకు తగిన ఆధారాలు సమకూరుతున్న తీరు కూడా తెలిసిన సంగతే.రెండు రోజుల కిందటే జరిగిన రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల తతంగం మరో రకమైన వంచన. నడిబజార్లలో ప్రజా స్వామ్యం బట్టలూడదీసి వివస్త్రగా నిలబెట్టిన దుశ్శాసన క్రీడగా దాన్ని వర్ణించవచ్చు. ఈ వికృత కేళికి బాధ్యులెవరంటే ఏమని చెబుతాం? కర్ణుడి చావుకు కారణాలేమిటో అర్జునుడికి కృష్ణపర మాత్మ తెలియజెప్పుతాడు. ‘నీ చేతను, నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధర చేత భార్గవు చేత నరయంగ కర్ణుడీల్గె నార్వురి చేతన్’ అని వివరిస్తాడు. ‘కర్ణుడు నీవల్లా నావల్ల మాత్రమే చనిపోలేదు. ఆయన చావుకు కుంతీదేవి,ఇంద్రుడు, భూదేవి, పరశురాముడు కూడా కారకులే’నని చెబుతాడు.అదేవిధంగా పులివెందుల, ఒంటిమిట్టల్లో కూడా రక్షకు లుగా ఉండవలసినవారే ప్రజాస్వామ్య హత్యాకాండకు ఒడి గట్టారు. ‘సత్యం వద’ (సత్యాన్ని మాట్లాడు), ‘ధర్మం చర’ (ధర్మాన్ని అనుసరించు) అని ఉపనిషత్తులు చేస్తున్న బోధనను మన సనాతన ధర్మ ప్రభుత్వం ‘సత్యం వధ’ (సత్యాన్ని చంపు), ‘ధర్మం చెర’ (ధర్మాన్ని నిర్బంధించు)గా అర్థం చేసుకున్నట్టుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ సత్యాన్ని వధించైనా ఓ గెలుపును కైవసం చేసుకోవాలని సంకల్పించింది. రాజ్యాంగ ధర్మాన్ని నిర్వర్తించవలసిన ఎన్నికల వ్యవస్థ ఈ సంకల్పానికి సహకరించింది. నిష్పక్షపాతంగా వ్యవహరించవల సిన అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం ఈ సంకల్పానికి సాగిలబడింది. సత్యాన్ని మాట్లాడవలసిన నాలుగో స్తంభం (మీడియా) దాన్ని చంపేయడానికి తోడ్పాటు నిచ్చింది.రాజ్యాంగ ధర్మాన్ని నిలబెట్టవలసిన ప్రభుత్వం, ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం, మీడియా సమష్టిగా అధర్మ పతాకాన్ని ఎగరవేశాయి. అధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించాయి. ఆ నడక తీరు ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఇరవై జడ్పీటీసీ స్థానాలు ప్రాతినిధ్యం లేకుండా ఖాళీగా ఉన్నాయి. ఇందులో చాలా స్థానాలు పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలు ఖాళీ అవకముందు నుంచే అలా ఉన్నాయి. అధికారం బాగా తలకెక్కిన వారికి చిత్రాతిచిత్రమైన కోర్కెలు కలుగుతుంటాయని చాలా కథల్లో చదువుకున్నాము. అటువంటి ఒక కోరిక ముఖ్యమంత్రికో, ఆయన కుమారునికో కలిగిందని సమాచారం. జగన్మోహన్రెడ్డికి బలమైన కోట వంటి పులివెందులలో ఆయన్నొకసారి ఓడించాలనేది ఆశ. ఆ కోర్కె తీరేలోగా పులివెందుల నియోజకవర్గం నుంచి ఓ తోకనో, ఒక ఈకనో గెలుచుకొచ్చి అదేం దుర్భేద్యమైన దుర్గం కాదని చాటేందుకు ఉబలాటపడ్డారు. అలా చేస్తే వైసీపీ నైతిక ధృతి దెబ్బతిని స్థానిక ఎన్నికల్లో తమకు ‘జీవన్టోన్’లా ఉపయోగ పడుతుందని ఆశించారు.పులివెందుల జడ్పీటీసీతోపాటు పక్కనే ఉన్న రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట స్థానానికి కూడా ఉపఎన్నికలు జరిపి ఏదోవిధంగా రెండూ గెలవాలని ఆలోచన చేశారు. అలా జరిగితే కడప జిల్లాలో జగన్ బలం కోల్పోయాడని ప్రచారం చేసుకోవాలనేది లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం కలిసివచ్చే కరి వేపాకుల్ని ఇంతకుముందే సేకరించి పెట్టుకున్నారు. ఈ రెండింటికి మాత్రమే ఎన్నికలు జరిపితే మిగిలిన 18 జడ్పీటీసీల సంగతి? ఇన్నిచోట్ల ఒకేసారి దుశ్శాసన ప్రయోగం మంచిది కాదు. వికటించినా వికటించవచ్చు – అని ఈ రెంటికి మాత్రమే ఎన్నిక జరిగే విధంగా జయరామిరెడ్డి అనే దేశం కార్యకర్తను కోర్టు మెట్లు ఎక్కించారు. కడప జడ్పీ ఛైర్మన్ ఎమ్మెల్యేగా గెలిచి నందువల్ల అప్పటికే ఆ పదవి ఖాళీగా ఉన్నది. రెండు జడ్పీ టీసీలు ఖాళీగా ఉండగా కొత్త ఛైర్మన్ ఎన్నిక కుదరదని, కనుక ఈ రెండు స్థానాలకు ముందుగా ఎన్నికలు నిర్వహించేవిధంగా ఆదేశించాలని జయరామిరెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. న్యాయస్థానం ఓకే చేసింది.రాజ్యాంగంలోని 243వ అధికరణాన్ని అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సంపూర్ణమైన అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానిదే! రెండు జడ్పీటీసీల ఎన్నికలకు కోర్టు ఆదేశించినప్పుడు ఖాళీగా ఉన్న మిగిలిన స్థానాలకు కూడా ఎన్ని కల నిర్వహణకు ఈసీ ఉపక్రమించి ఉండవచ్చు. అది దాని ధర్మం కూడా! కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మతం కాని పనిని చేయడానికి ఈసీ సాహసించలేదు. ఆరు మాసాలకు మించి ఖాళీగా ఉండకూడదన్న స్ఫూర్తిని కూడా విస్మరించింది. ఇక ఎన్ని కలు జరిగిన రెండు స్థానాలపై చాలాకాలం ముందునుంచే టీడీపీ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఎన్నికలు సరిగ్గా వారం రోజుల ముందటే పులివెందుల నియోజకవర్గానికే చెందిన వైసీపీ కార్యకర్త సైదాపురం సురేష్ రెడ్డిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ మరుసటిరోజే శాసనమండలి సభ్యుడైన రమేశ్ యాదవ్‌పైనా, వైసీపీ నాయ కుడు వేల్పుల రాముపైన దాడి జరిగింది. రామును హత్య చేయ డానికే చూశారని సమాచారం. వైసీపీ కార్యకర్తలూ, నేతలూ ఎన్నికలయ్యేంతవరకు ఇళ్ళను వదిలి వెళ్లకపోతే ఇటువంటి ఘటనలే జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. పాలక కూటమి దాడుల పట్ల పోలీసుల స్పందన మరీ అన్యాయం. ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం వందలాదిమంది పోలీసులతో ఒక డీఐజీ స్థాయి అధికారే మోహరించారు. దాడులపై ఫిర్యాదులు చేసిన వారితో ఆయన వెటకారంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి. ‘పక్క ఊరికి వెళ్లి పత్తాపారం చేస్తే ఇలానే ఉంటుంద’ని ఆయన వ్యాఖ్యానించారు. తామే లేకపోతే అక్కడ తలలు తెగిపడేవనే మాటలు కూడా వైరల్ అయ్యాయి.ఈ తరహా కామెంట్ల వల్ల తమకు పోలీసు రక్షణ లభించ దనే అభిప్రాయం సహజంగానే వైసీపీ కార్యకర్తలకు ఏర్పడుతుంది. ఏడాది మాత్రమే గడువున్న ఒక చిన్న ఎన్నిక కోసం గ్రామాల ప్రశాంతత ఎందుకు భగ్నం కావాలన్న ఆలోచన కూడా ఉండవచ్చు. వైసీపీ ముఖ్య కార్యకర్తలంతా మండలం నుంచి బయటికి వెళ్లారు. యెల్లో మీడియా మాత్రం వైసీపీ వాళ్లు ఓటుకు ఐదు వేలు, పదివేలిచ్చి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనీ యథావిధిగా వెకిలి రాతలే రాసింది. తలలు తెగిపడే పరిస్థితులు ఉన్నాయని డీఐజీ స్థాయి అధికారి చెప్పినప్పుడు ఎన్నికల సంఘం స్పందించి ఉండాల్సింది. పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేసి ఉండవలసింది. కానీ అటువంటివేమీ జరగలేదు.నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు బయటి ప్రాంతాల వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలి. మంత్రి సవిత నాయకత్వంలో ఒకటి, జమ్మలమడుగు ఎమ్మెల్యే దండ నాయకునిగా మరొకటి, కమలాపురం ఎమ్మెల్యే నేతృత్వంలో ఇంకోటి, బీటెక్ రవి అధీనంలో ఒకటి చొప్పున అక్కడే తిష్ఠవేసి ఉన్న నాలుగు బెటాలియన్లు మాత్రం ఈ నిబంధన పాటించ లేదు. పోలింగ్ రోజున ఉదయం నాలుగు గంటలకే ఈ బెటా లియన్లు మొత్తం 15 పోలింగ్ బూతుల్ని చుట్టుముట్టాయి. పోలింగ్ బూత్‌లకు ఈ బెటాలియన్లు ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగా నిలబడితే పోలీసులు ఇన్నర్ రింగ్‌రోడ్డు మాదిరిగా పోలింగ్ బూత్ ప్రాంగణాల్లో ఉండిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వచ్చిన వారికి తొలుత కూటమి బెటాలియన్లే ఎదురుపడ్డాయి.ఓటేసేందుకు వచ్చిన ఓటర్ల దగ్గర స్లిప్పులు లాక్కుని కూటమి సైన్యం వారిని వెనక్కి పంపించింది. ఒక్క వైసీపీ ఏజెంట్‌ను కూడా బూతుల్లోకి ఈ కిరాయి సైన్యం అనుమతించలేదు. ఫిర్యాదు చేయడానికి ఏ ఒక్క పోలీసూ కనబడలేదు. అంతకు ముందే నాలుగు గ్రామాల పోలింగ్ బూత్‌లను ఎత్తివేసి పక్క గ్రామాలలో ఏర్పాటు చేశారు. ఆ గ్రామాల మధ్య మాత్రం పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి. కాళ్లు పట్టుకున్నా పోలీ సులు కనికరించలేదు. ఓట్లు వేసేందుకు వెళ్లనీయలేదు. ఈ వార్తలు, ఫోటోలు ఒక సెక్షన్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే కనిపించాయి. కానీ ఎన్నికల సంఘం స్పందించ లేదు. పోలింగ్ బూత్‌లను మార్చడమనే నిర్ణయాన్ని కూడా పాలక కూటమి సూచన మేరకే ఈసీ తీసుకున్నదనే విషయం బహిరంగ రహస్యం.ఒంటిమిట్ట మండలంలోనూ ఇదే ఫార్ములాను అమలు చేశారు. కాకపోతే తొలుత పోలింగ్ బూతుల్లోకి వైసీపీ ఏజెంట్లు ప్రవేశించగలిగారు. ఓ గంటన్నర తర్వాత రాష్ట్ర మంత్రి నాయ కత్వంలో ఓ పటాలం బయల్దేరి బూతుల్లో ఉన్న ఏజెంట్లను బయటకు తరిమేశారు. సాక్షాత్తూ ఒక రాష్ట్ర మంత్రి అక్రమంగా బూత్‌లో చొరబడ్డా, ఏజెంట్లపై దౌర్జన్యం చేసినా ఎన్నికల సంఘం కిమ్మనలేదు. కొన్ని బూతుల్లో కాసేపు ఏజెంట్లు కూర్చున్న ఫలితం ఓట్ల సంఖ్యలో కనిపించింది. అక్కడ వైసీపీకి 6 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. నిజమైన ఓటర్లను అనుమతించని పులివెందులలో వైసీపీకి 683 ఓట్లు వచ్చాయి. అవి కూడా కూటమి సైన్యమే వేసి ఉంటుంది కనుక అందుకు వారికి ఓ వైసీపీ నాయకుడు వెటకారంగా ధన్యవాదాలు తెలియజేశారు.బూటకపు ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత కూటమికి వంత పాడుతున్న మీడియాలోని ఓ ప్రధాన సెక్షన్ స్పందన జుగుప్సాకరంగా ఉన్నది. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినందువల్ల టీడీపీ గెలిచిందట. ముప్పయ్యేళ్ల తర్వాత పులివెందుల ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం లభించిందట! అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ బ్యాలెట్ బాక్సుల్లో స్లిప్పులు వేశారట! స్లిప్పుల బండారాన్ని సోషల్ మీడియాలో ఓ యువకుడు ఎండ గట్టిన తీరు నవ్వు తెప్పిస్తున్నది. కామెంట్లు రాసిన కాగితాలను బ్యాలెట్ బాక్సుల్లో వేయాలంటే ఆ కాగితాన్ని మతడపెట్టి వేయాలి. కానీ ఆ కాగితాలపై మడతలు లేకపోగా ఇస్త్రీ చేసిన ట్టుగా ఉన్నాయంటూ వాటి ఫోటోలను జతజేశాడు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటేయడానికి క్యూలైన్లలో నిలబడిన కూటమి కార్యకర్తలను గుర్తించి, ఆ ఫోటోలను ఒక సెక్షన్ మీడియా ప్రచురించింది. అయినా ఈసీలో స్పందన లేదు. ఈరకంగా వ్యవస్థలన్నీ ప్రలోభాలకు లోనై ఏలినవారి ఎదుట సాగిలపడుతున్న తీరును చూస్తుంటే మన ప్రజాస్వామిక వ్యవస్థ పెనుప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నట్టు హెచ్చరికలు కనిపిస్తు న్నాయి. పౌరులారా బహుపరాక్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేశారు’
సాక్షి, తాడేపల్లి: రియల్ ఎస్టేట్ మాయలో పడి కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానళ్లకు మళ్లించి పొన్నూరులో పొలాల ముంపునకు కారణమైందని వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆక్షేపించారు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకు వారు ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి మురళీకృష్ణ చెప్పారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:చోద్యం చూస్తున్నారు:ప్రభుత్వ కుట్ర వల్ల పొన్నూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం రివ్యూ చేసి ఎన్యుమరేషన్ చేయించకుండా చోద్యం చూడటం బాధాకరం. పంటలు మునిగి రైతులు నష్టపోయి వ్యవసాయానికి దూరమైతే పొలాలను రియల్ వెంచర్లుగా మార్చి రూ.3 వేల కోట్లు దోచుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్ర కుట్ర చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎలాగూ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాదని భావిస్తున్న నరేంద్ర, నియోజకవర్గ రైతాంగాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. మరో వైపు రాజధాని అమరావతి కోసం పొన్నూరు రైతులను కొండవీటి వరదనీటితో ముంచారు. పంటలు నీటమునిగి రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నా మంత్రులు కానీ, కూటమి ఎమ్మెల్యేలు కానీ పొలాల వైపు కన్నెత్తి కూడా చూసిన పాపానపోవడం లేదు. పంట నష్టంపై అధికారులను నివేదిక కోరినట్టు కూడా ఎక్కడా వార్తలు కూడా లేవు. రైతుల సమస్యలతో ప్రభుత్వానికి సంబంధమే లేదన్నట్టు వారి సమస్యలు అసలు సమస్యలే కావన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.పొన్నూరులో 72 వేల ఎకరాల్లో పంట నష్టం:పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ 17 కి.మీ మేర ప్రవహిస్తుంది. గుంటూరు ఛానల్‌కు గత ఏడాది గండ్లు పడ్డాయి. దాంతో ఇప్పుడు వరదనీటికి గండ్లు తెగి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రని రైతులు కోరినప్పుడు నల్లపాడు నుంచి గ్రావెల్ తెచ్చి వేస్తున్నామని చెప్పాడు. కానీ పంట కాలువల్లోని నల్ల మట్టిని తెచ్చి ఆ గండ్లు పూడ్చేయించాడు. తూటికాడు తీయమంటే గడ్డి మందు స్ప్రే చేసి వదిలేశారు. దీనికి సాగునీటి సంఘాలు రూ.24 లక్షల బిల్లులు పెట్టుకున్నాయి. ఎండినట్టే ఎండి మళ్లీ వర్షాలతో గడ్డి పెరిగిపోయిండి. వర్షాలకు ఈ తూటికాడు తూములకు అడ్డం పడి నంబూరు దగ్గర కాలువలకు మూడు గండ్లు పడ్డాయి.ఒక్క కాకాణి వద్దనే 11 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులే చెబుతున్నారు. చేబ్రోలు మండలంలో 15 వేల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉంటే అందులో 5 వేల ఎకరాలు నీట మునిగాయి. పొన్నూరు మండలంలో 28 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు మునిగిపొయాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. (అంటూ ప్రెస్మీట్లో ఆ ఫోటోలు చూపారు)సమస్యపై తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళితే చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకునే ఆలోచన వారిలో కనిపించలేదు. గత ఏడాది గుంటూరు ఛానల్, కృష్ణా వెస్ట్ ఛానల్, హైలెవల్ ఛానల్, అప్పాపురం ఛానల్ పరిధిలో మొత్తం 237 గండ్లు పడి 74వేల ఎకరాల మాగాణి, 30 వేల ఎకరాల ఉద్యానవన పంటలు కొట్టుకుపోయాయి. ఈ ఏడాది ఇప్పటికే 72వేల ఎకరాల్లో పంట వరద ముంపునకు గురైనట్టు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వరద ముంపు ప్రాంతాల్లో ఎక్కడా ఎన్యుమరేషన్ కి ఆదేశించలేదు.పొన్నూరును ముంచెత్తిన అమరావతి వరద:నంబూరు గ్రామంలో గతంలో ఉత్సవాల కోసం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, 18 వేల ఎకరాల్లో పంట నీట మునిగి రైతులు అల్లాడిపోతుంటే కనీసం పరామర్శించలేదు. నిజానికి ఈ పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం అమరావతి ముంపును తగ్గించడం కోసం ప్రభుత్వం కొండవీటి వాగుకు పంపులు పెట్టి గుంటూరు ఛానల్, కృష్ణా ఛానల్, అప్పాపురం ఛానల్లోకి మళ్లిస్తోందని రైతులు చెబుతున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.రూ.3 వేల కోట్ల దోపిడీకి ధూళిపాళ్ల స్కెచ్:గుంటూరు – బాపట్ల ప్రధాన రహదారిని నేషనల్ హైవేగా మార్చి ఫోర్ వేగా అభివృద్ధి మార్చాలని చూస్తున్నారు. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో కట్టిన చేబ్రోలు–కొమ్మమూరు బ్రిడ్జిని ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర పునర్నిర్మాణం చేయాలని అనుకోలేదు. నాడు జగన్ సీఎం అయ్యాక రూ.45 కోట్లకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌ను నియమించి బ్రిడ్జి పనులు మొదలుపెడితే కూటమి ప్రభుత్వం వచ్చాక 14 నెలలుగా ఈ పనులు పక్కన పడేశారు.కాంట్రాక్టర్‌ను రూ.5కోట్లు కమీషన్లు కట్టాలని డిమాండ్ చేయడంతో పనులు వదిలేసి వెళ్లిపోయాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదలతో రోడ్డు సగం కొట్టుకుపోయింది. ఈ బ్రిడ్జి కనుక కూలిపోతే రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. గత నెలన్నర కాలంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో జాడ లేకుండా పోయాడు.నంబూరు రైతులు తమ గోస వినిపించాలని ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే అవి పంటలు పండే పొలాలు కాదని, లేఅవుట్లుగా మార్చుకోవాలని ఉచిత సలహాలిస్తున్నాడని వారు వాపోతున్నారు. రాజధానికి దగ్గరగా ఉన్న 30 వేల ఎకరాలను లేఅవుట్లుగా మార్చితే ఎకరాకు రూ.10 లక్షల వంతున వసూలు చేసి రూ.3 వేల కోట్లు సొమ్ము చేసుకోవచ్చనేది ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారని అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. -
పులివెందుల, ఒంటిమిట్ట పోలింగ్ సమాచారం ఇవ్వండి: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తూ, అత్యంత దారుణంగా, ఏకపక్షంగా నిర్వహించిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తోంది. ఆ దిశలోనే ఆ రెండు ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి.. ‘‘పోలింగ్ స్టేషన్లు, ఆయా ప్రాంగణాల సీసీ కెమెరా ఫుటేజ్, పలు ఘటనలకు సంబంధించిన వీడియో కవరేజ్, పోలింగ్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్, ఆ రోజు పోలింగ్ బూత్‌ల్లో కూర్చున్న ఏజెంట్ల పేర్లు జాబితా....పోలింగ్ ఆఫీసర్ (పీఓ) డైరీ, ఫామ్–12. ఫామ్–32 ఈ ఏడు అంశాల పూర్తి వివరాలు, సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ)కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వేర్వేరుగా రెండు (పులివెందుల, ఒంటిమిట్ట) వినతిపత్రాలు పంపించారు. వీలైనంత త్వరగా ఆ వివరాలు, పూర్తి సమాచారం ఇవ్వాలి’’ అని లేఖల్లో లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అధికార పక్షం చేసిన అరాచకాలు, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ ప్రత్యక్షంగానూ, లేఖల ద్వారానూ మొత్తం 35 పర్యాయాలు ఎస్ఈసీకి వినతిపత్రాలు అందజేసింది. ఫిర్యాదు చేసింది. ఎన్నికలకు వారం రోజుల ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దానిపై ఆధారాలతో సహా ఎస్ఈసీకి వైయస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. అయినా ఎస్ఈసీ పట్టించుకోలేదు.ఇక ఎన్నికల రోజున ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, తెల్లవారుజాము నుంచే అన్ని పోలింగ్ బూత్‌లు స్వాధీనం చేసుకున్న అధికార పక్షం నాయకులు, కార్యకర్తలు.. చివరకు ఏ పోలింగ్ బూత్‌లోకి వైఎస్సార్పీపీ ఏజెంట్లను అడుగు కూడా పెట్టనీయలేదు. వారి నుంచి ఏజెంట్ అధీకృత ఫామ్స్ లాగేసుకున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులెవ్వరూ ఓటు వేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చివరకు పులివెందులలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంతరెడ్డిని కూడా ఓటు వేయనీయలేదు.ఆయన్ను ఇంట్లో నుంచి బయటకు కదలనీయలేదు. ప్రతిచోటా పోలీసు బలగాలను ఉపయోగించారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. దీనిపై అప్పటికప్పుడు ఆధారాలతో సహా, ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసినా, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు ఉప ఎన్నికల పూర్తి వివరాలు, సమాచారం, వీడియోలు ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ రెండు లేఖల ద్వారా ఎస్ఈసీకి విజ్ఞప్తి చేసింది. -
మహిళలను మోసం చేయడం సూపర్ హిటా?: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఉచిత బస్సు పేరుతో మహిళా ఆశలను బస్ టైర్ల కింద తొక్కేశారంటూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళను మోసం చేశారంటూ చంద్రబాబు సర్కార్‌ని నిలదీశారు. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లోకేష్ మహిళను మోసం చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘16 రకాల బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఎన్నికలు ముందు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో ప్రయాణం చేయొచ్చంటూ హామీ ఇచ్చారు. శ్రావణ శుక్రవారం రోజున మహిళలను చీటింగ్ చేశారు. మహిళలను మోసం చేయడం సూపర్ హిట్ నా..?. చీఫ్ మినిస్టర్ అంటే చంద్రబాబు చీటింగ్ మాస్టర్‌గా మారారు. కూటమి ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వంగా మారింది’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.‘‘పదహారు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలకు అనుమతి ఇవ్వాలి. పది 15 బస్సులు మారితే గానీ తిరుపతి వెళ్లడం సాధ్యం కాదు. లగేజీతో మహిళలు 15 బస్సులు మారి తిరుపతి వెళ్లగలరా..?. తిరుపతి శ్రీకాళహస్తి కాణిపాకం అన్నవరం, విజయవాడ నో ఫ్రీ బస్.. రెండున్నర కోట్ల మంది మహిళను మోసం చేశారు. చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల ఖర్చు తగ్గించుకుంటే మహిళలు అందరూ అన్ని బస్సల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు’’ అంటూ వరుదు కల్యాణి కళ్యాణి వ్యాఖ్యానించారు.‘‘లోకేష్ మీ మేనత్తలు ఏనాడైనా మీ నాన్నకు రాఖీలు కట్టారా?. మీ ఇంటి శుభకార్యాల్లో మీ మేనత్తలను మీ నాన్నా పిలిసారా?. హెరిటేజ్‌లో ఎంత వాటా మీ నాన్న మీ మేనత్తలకు ఇచ్చారు?. మహిళా గౌరవం గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు ఉందా?. పవన్ కళ్యాణ్ తల్లిని పది కోట్లు ఖర్చు చేసి లోకేష్ తిట్టించలేదా?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు. -
మైమరచిన పచ్చమీడియా!
1983లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించినప్పుడు ఆ పార్టీ అభిమానులు కొంతమంది కనిపించిన ఈనాడు జర్నలిస్టులందరికీ పూలదండలు వేసి సత్కరించారు. ఈనాడు పత్రిక ఆఫీస్ గేటుకు కూడా పూలమాలలు కట్టి వెళ్లేవారు. ఇదెక్కడి గొడవ! ఎంత టీడీపీకి సపోర్టు చేసినా, ఇలా మెడలో బొమికలు వేసుకున్నట్లుగా పరిస్థితి ఏర్పడిందేమిటా అని కొందరు సీనియర్ జర్నలిస్టులు బాధపడేవారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏపీలో ఏర్పడడం అత్యంత విచారకరం. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నకలలో టీడీపీకి చాలా కష్టపడి గెలిపించిన కొంతమంది పోలీసు అధికారులకు, జిల్లా ఎన్నికల యంత్రాంగ ముఖ్యులకు టీడీపీ నేతలు సన్మానం చేసి ఉండాలి. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మద్దతు మీడియా యజమానులకు, జర్నలిస్టులకు కూడా సత్కారాలు జరిగి ఉండాలి. ఆ టీడీపీ మీడియా కార్యాలయాలలో స్వీట్స్ కూడా పంచుకుని ఉంటారు. ఇవి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలైతే అదో రకం. కాని రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగ్ ద్వారా గెలవడంపై కూడా ఇంత సంబరపడాలా అని టీడీపీ క్యాడరే విస్తుపోతోంది. ఎందుకంటే గెలిచింది టీడీపీ కాదని, కొంతమంది పచ్చ చొక్కా వేసుకున్న పోలీస్ అధికారులన్నది ప్రజలందరికి తెలిసిన సత్యం. టీడీపీ అధినాయకత్వం, పోలీస్ యంత్రాంగం, ఎన్నికల నిర్వహణ అధికారులు, ఎన్నికల కమిషన్, టీడీపీకి మద్దతిచ్చే మీడియా .. ఇలా అందరికి తెలుసు వాస్తవం ఏమిటో! అయినా వారు జనాన్ని మోసం చేయడానికి తమ వంతు కృషి చేశారనిపిస్తుంది. ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వైఎస్సార్సీపీ ఓడినట్లు భ్రమ కలిగించడానికి నానా పాట్లు పడ్డారు. వైకాపాకు ఘోర పరాభవం అంటూ ఈనాడు మీడియా శీర్షిక పెట్టింది. నిజానికి పరాభవం జరిగింది ప్రజాస్వామ్యానికి. అయినా ఆత్మవంచన చేసుకుని వార్తలు ఇచ్చారు. అందులో పులివెందులను, వైఎస్ కుటుంబాన్ని ఒక భూతంగా చూపించడానికి ఆ మీడియా చేసిన ప్రయత్నం గమనిస్తే సంబంధిత జర్నలిస్టులపై అసహ్యం కలుగుతుంది. మరో విధగా చూస్తే ఇంత కట్టుబానిసలుగా మారారా అని జాలి కలుగుతుంది. ముప్పై ఏళ్లలో తొలిసారి ఓటు వేశానని ఎవరో ఒకరు స్లిప్ వేశారట. అది అసత్యమే అయినా దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు అందరూ ప్రచారం చేశారు. ఈ ముప్పై ఏళ్లలో సగం కాలం ఆయనే పాలన చేశారు. దానిని బట్టి ఆయన సమర్థంగా పరిపాలన చేయలేదని ఒప్పుకుంటున్నారా? ఏ నియోజకవర్గంలో అయినా కొన్ని సమస్యలు ఉంటే ఉండవచ్చు. కాని పులివెందులలో రాక్షసులు ఉంటారన్నట్లుగా ప్రచారం చేసి ఒక ప్రాంత ప్రజలను అవమానించడానికి టీడీపీతోపాటు ఈ మీడియా వెనుకాడడం లేదనిపిస్తుంది. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలకు చెందిన వేలాది మందిని ఓటర్లుగా చేర్పించి దొంగ ఓట్లు వేయిస్తుంటారని చెబుతారు. గతంలో అక్కడ ఆయనకు ప్రత్యర్ధిగా పోటీచేసిన చంద్రమౌళి అనే దివంగత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆ బోగస్ ఓట్లను తొలగించడానికి ఎంత ప్రయత్నించినా, సాధ్యపడలేదని అనేవారు. దాని గురించి ఎన్నడైనా ఈ మీడియా ఒక్క వార్త రాసిందా? కొన్ని దశాబ్దాలుగా పులివెందుల ప్రశాంతంగా ఉంటోందని, చాలావరకు ఎవరి ఓటు వారు వేసుకునే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాంటిది మళ్లీ ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిజం వేళ్లూనుకునేలా ప్రభుత్వం, పోలీసులే ప్రయత్నించడం ఎంత దారుణం? స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోండి అని ఒకప్పుడు పోలీసులు ప్రజలకు చెప్పేవారు. ర్యాలీలు తీయించేవారు. అలాంటిది ఓటు వేయడానికి వచ్చిన వారిని ఓటు వేయనివ్వకుండా చేసిన గొప్ప పోలీస్ యంత్రాంగాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నాం. చివరికి ప్రజలు తమ ఓటు తమను వేసుకోనివ్వండి అని పోలీసుల కాళ్లు పట్టుకున్న ఘటన కూడా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఇది కూడా గొప్ప విషయమే అని పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. అందుకే ఈ మీడియా మురికి మీడియాగా మారిందన్న విమర్శలకు గురి అవుతోంది. పోలింగ్ బూత్ లను మార్చేయడం, వైఎస్సార్సీపీ ఏజెంట్లను తరిమేయడం, పొరుగున ఉన్న జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి టీడీపీ, బీజేపీ నేతలు తమ కార్యకర్తలను తరలించి దొంగ ఓట్లు వేయించడం, వైఎస్సార్సీపీ వారిపై దాడులకు తెగపడడం వంటివి చూస్తే ప్రభుత్వమే ప్రజాస్వామ్యానికి పాతర వేసినట్లనిపిస్తుంది. అలాంటి వారికి అండగా నిలబడ్డ పోలీస్ అధికారులకు టీడీపీ నాయకత్వం ఎంతగా సన్మానించినా తప్పు ఉండకపోవచ్చు.స్వయంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ బూత్ పరిశీలన సమయంలోనే జమ్మలమడుగు నుంచి వచ్చిన దొంగ ఓటర్లు దర్జాగా ఓటు వేసుకుంటున్నారంటే అధికార యంత్రాంగం ఎంత బాగా పని చేసింది తెలిసిపోతుంది. దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఫోటోలతోసహా చూపించడంతో కలెక్టర్ తన సోషల్ మీడియా అక్కౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించుకున్నారే కాని, అలా దొంగ ఓట్లు వేసిన వారిపై చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించలేదే. ఇలాంటి అధికార యంత్రాంగానికి కూడా టీడీపీ నేతలు రుణపడి ఉండవచ్చు. వైఎస్సార్సీపీ వారి ఎన్నికల ప్రచారాన్ని పత్తాపారం అంటూ పోల్చి, టీడీపీ వారి దౌర్జన్యాలకు అండగా నిలబడ్డ పోలీస్ అధికారులను బహుశా టీడీపీ అధినాయకత్వం శహభాష్ అని మెచ్చుకుని ఉండాలి.ఇలాంటి వారందరికి డబుల్ ప్రమోషన్ లు కూడా వస్తాయోమే చూడాలని టీడీపీ నేతలే కొందరు చమత్కరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ దొంగ ఓట్లు వేయించిన నేతలు తెలివితక్కువగా వ్యవహరించారని టీడీపీ నాయకత్వ ఫీల్ అవుతోందట. వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్ కు బలమైన పులివెందుల మండలంలో మరీ ఆ పార్టీకి డిపాజిట్ రాకుండా ఓట్లు రిగ్ చేయడం వల్ల ఫలితాలను ప్రజలు ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినాయత్వం అసహనం వ్యక్తం చేసిందట. మంచి మెజార్టీతో గెలిచేలా రిగ్గింగ్ చేయండని చెబితే వీరు మితిమీరిన ఉత్సాహంతో చేసిన ఈ పని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అప్రతిష్ట వచ్చిందని భావించి ఉండాలి. రిగ్గింగ్ చేసేటప్పుడు వైఎస్సార్సీపీకి కూడా గణనీయంగా ఓట్లు వేసి ఉంటే ప్రజలు నిజంగానే వైఎస్సార్సీపీ ఓడిపోయిందేమోలే అనుకునేవారని, అలా చేయకపోవడంతో టీడీపీ అసలు రంగు బయట పడిపోయిందని ఆ పార్టీ నేతలు కొంతమంది వాపోతున్నారు. వైఎస్సార్సీపీకి దిమ్మతిరిగే ఫలితం అని మరో టీడీపీ మీడియా రాసింది. అవును..అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని,అరాచకం చేస్తే వైఎస్సార్సీపీకి కాదు దిమ్మతిరిగేది.. రాష్ట్ర ప్రజలకు.ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతోందా అన్న విషయం ప్రజలందరికి అర్థమైపోయింది. టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటికి జగన్‌పై ద్వేషం ఉంటే ఉండవచ్చు. కాని ఆయనపై కోపంతో ఈ మీడియా సంస్థల అధినేతలు తమ దుస్తులు తామే ఊడదీసుకుని నగ్నంగా బజారులో నిలబడి నవ్వులపాలవుతున్న సంగతిని విస్మరిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాలి. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు వాటి పని అవి చేయకపోతే ఎంత అనర్ధం జరుగుతుందో, ప్రజలలో ఎంత అపనమ్మకం ఏర్పడుతుందో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చాటి చెప్పాయి.ప్రభుత్వ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ, ఒక వర్గం మీడియా వ్యవస్థ అన్ని కుమ్మక్కై ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. ఈ పరిస్థితి నుంచి కాపాడుతుందని భావించిన న్యాయ వ్యవస్థ కూడా అలా చేయలేకపోయిందన్న బాధ చాలా మందిలో ఉంది.ప్రభుత్వం నిజాయితీగా ఎన్నికలు జరిపించి ఉంటే ప్రజలలో తమ ప్రభుత్వం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే అవకాశం వచ్చేది.అయినా బుల్ డోజ్ చేసి తమ ఎల్లో మీడియా మద్దతుతో ఏమి చేసినా జనం నమ్ముతారులే అనుకుంటే అది భ్రమే అవుతుంది. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో సైతం ఇలాగే చంద్రబాబు అరాచాకాలు చేయించి గెలిచారు. కాని సాధారణ ఎన్నికలలో టీడీపీ అంతకు రెట్టింపు ఓట్ల తేడాతో ఓడిపోయింది. చంద్రబాబు పాత్రతో పాటు ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ ప్రమేయం ఈ ఎన్నికలలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం గెలిచిందని ఆయన సంబరపడిపోతే అది ఆయన అమాయకత్వమే అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనికి వంతపాడి ఆయన ఎంత దీన పరిస్థితిలో ఉంది తెలియచేసినట్లయింది. ఎన్నికల కమిషన్ ప్రభుత్వం కోరిన వెంటనే కేవలం ఈ రెండిటికే ఎన్నికలు పెట్టడం, అక్కడ ఎన్ని అక్రమాలు జరుగుతున్నా కళ్లుమూసుకుని కూర్చోవడం, కనీసం అధికార యంత్రాంగాన్ని మందలిచే ధైర్యం చేయకపోవడం వల్ల, ప్రభుత్వంలోని వారెవరైనా ఎన్నికల కమిషనర్‌ను బెదిరించారా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్, ఇతర ఎన్నికల యంత్రాంగం అసలు ఓటర్లకు కాకుండా నకిలీ ఓటర్లకు ఓట్లు వేసే అవకాశం కల్పించడం ద్వారా తమ హోదాకు తామే అవమానం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ వారిని రకరకాలుగా కట్టడి చేయడం, టీడీపీ వారిని ఇష్టారాజ్యంగా తిరిగేలా స్వేచ్చనివ్వడం ద్వారా, పోలీస్ యంత్రాంగం ఏపీలో ఎంత దారుణంగా పనిచేస్తున్నది లోకానికి చాటి చెప్పినట్లయింది. గౌరవ హైకోర్టు ఈ అక్రమాలు కొన్నిటిని గుర్తించినట్లు వ్యాఖ్యలు చేసినట్లు అనిపించినా, అంతిమంగా సాంకేతిక కారణాలతో జోక్యం చేసుకోలేమని చెప్పడం బాధాకరమే అనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి హైకోర్టు మరింత చొరవ తీసుకుని ఉంటే దేశానికే ఒక సందేశం ఇచ్చినట్లయ్యేదేమో! ఏమైతేనేమి అన్ని వ్యవస్థలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఓటమికి కారణం అయ్యాయనుకోవాలి.ఇది దేశానికి మంచిదా?కాదా?అన్నది ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
Political Corridor: ఏంటి తమాషాలా..? భూమా అఖిల ప్రియ అరాచక పాలన
-
‘ముద్దు’ల ముచ్చట.. ‘కూన’ నైట్ కాలింగ్..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం పట్నం బజారు (గుంటూరు), కళ్యాణదుర్గం: దేశమంతా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొంటున్న వేళ.. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బరితెగించి ప్రవర్తిస్తుండటంతో మహిళలు రక్షణ కరువై అల్లాడుతున్నారు. పైశాచిక వేధింపులతో గుండె బరువై రాలిపోతున్నారు. బాధ్యత మరిచిన టీడీపీ ప్రజాప్రతినిధుల విశృంఖల వైఖరితో మహిళలు బెంబేలెత్తుతున్నారు. కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతోంది. విద్యాధికులైన మహిళలను సైతం కామ పిశాచాలు వేధిస్తుంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కళ్లు మూసుకుని కూర్చున్నారు! కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల ఆగడాలు మితిమీరిపోవడంతో మహిళా ఉద్యోగులు కార్యాలయాలకు రావాలంటే వణికిపోతున్నారు. రాత్రిపూట పార్టీ కార్యాలయాలకు పిలుస్తూ.. వీడియో కాల్స్ చేసి వేధింపులకు దిగుతున్నారు. అనంతపురం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన అఘాయిత్యాలు.. గుంటూరు ఎమ్మెల్యే ‘ముద్దు’ వీడియోలు మహిళల పట్ల ఏడాది పాలనలో జరుగుతున్న దుశ్చర్యలకు మచ్చు తునకగా నిలుస్తున్నాయి. ‘కూన’ వీడియో కాల్స్...!‘ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమా ర్ రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాలయాలకు రావాలని తన అనుచరులతో పిలిపిస్తారు. చాలాసేపు అక్కడే ఉంచుతారు. రాత్రి 10.30 దాటిన తర్వాత వీడియో కాల్ చేసి వేధిస్తుంటాడు. శారీరకంగా, మానసికంగా వేధించాడు. సాధారణ కాల్స్ చేయరు. వీడియో కాల్ అయితేనే మాట్లాడతారని అనుచరులతో చెప్పిస్తారు. దుర్బుద్ధితోనే ఇదంతా... దారికి రాలేదని వేధింపులకు గురి చేస్తున్నారు. నాలా నియోజకవర్గంలో అనేక మంది మహిళా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలను కున్నా...!’టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు ఎదుర్కొన్న పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆవేదన ఇదీ! దళితురాలిని తీవ్రంగా వేధించారంటూ బాధితురాలు కన్నీరు మున్నీరవుతున్నారు. కూన రవికుమార్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు చెబుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఇద్దరు మనుషులను పంపించి కేజీబీవీలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో తనకు వ్యతిరేకంగా బలవంతంగా సంతకాలు చేయించినట్లు తెలిపారు. అధికారులు తనకు అండగా ఉండకపోగా ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్నారని వాపోయారు. కాగా గార, కంచిలి కేజీబీవీల ప్రిన్సిపాళ్లపై కూడా వ్యూహాత్మకంగా ఫిర్యాదులు చేయించి బదిలీలు చేయించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.బలిపశువుని చేస్తున్నారు..!గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్ ‘ముద్దు’ దృశ్యాల వీడియో వైరల్ అయిన ఘటనలో తనని బలిపశువుని చేస్తున్నారంటూ పార్టీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగడం కలకలం రేపింది. ఎమ్మెల్యే, పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ శుక్రవారం ఆమె గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పార్టీ నాయకురాలు గుడిపల్లి వాణితో ఎమ్మెల్యే వివాహేతర సంబంధం గురించి ప్రతి ఒక్కరికీ తెలుసని సూఫియా మీడియాతో పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఆమె భర్త నవీన్‌కృష్ణ స్వయంగా రికార్డ్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు. తాను ఈ విషయాన్ని ఎమ్మెల్యే నసీర్‌కు చెప్పడంతో రెండు రోజులు మాట్లాడకుండా ఉండమన్నారని చెప్పారు. గుడిపల్లి వాణి కుటుంబంతో ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేసుకుని తనని ఇరికించే యత్నం చేస్తున్నారని చెప్పారు. నవీన్‌కృష్ణ ఫోన్లో ఉన్న వీడియోలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. కళ్యాణదుర్గంలో గర్భిణి బలవన్మరణం..‘భర్త, అత్త మామల వేధింపులు తాళలేక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగలేదు. నా ఫిర్యాదును పోలీసోళ్లు మార్చేశారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నాకు అన్యాయం చేశారు..’ అని విలపిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన నిండు గర్భిణి శ్రావణి (22) ఉరి పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తన దయనీయ పరిస్థితిని ఫోన్లో ఆడియో రికార్డ్ చేసి తనువు చాలించింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకోగా... శుక్రవారం ఉదయం మృతురాలి ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదా..?కళ్యాణదుర్గానికే చెందిన శ్రీనివాసులుతో మూడేళ్ల క్రితం శ్రావణికి వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త,అత్త మామలు తరచూ వేధించడంతో కళ్యాణదుర్గం పోలీస్‌లకు ఫిర్యాదు చేసినట్లు శ్రావణి పేర్కొంది. స్థానిక టీడీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ వైపీ రమేష్, మాజీ వైస్ చైర్మన్ శర్మస్ వలి ఒత్తిళ్లతో సీఐ దీన్ని మరో రకంగా మార్చేసి భర్త, అత్తమా మలకు అనుకూలంగా వ్యవహరించారని ఆడియోలో మృతురాలు కన్నీరు మున్నీరైంది. కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు తాను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నామని, కనీసం తన మొదటి బిడ్డకైనా (రెండేళ్ల చిన్నారి) న్యాయం చేయాలని వేడుకుంది. ఈ ప్రభుత్వంలో ఇక న్యాయం జరగదా? అని ఆక్రోశించింది. ఈమేరకు ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసి పుట్టింట్లో ఉరేసుకుని తనువు చాలించింది. దీనిపై పట్టణ సీఐ యువరాజును వివరణ కోరగా.. మృతురాలు ఆరోపించినట్లుగా తాము నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు. -
ఎమ్మెల్యే నసీర్‌కు, ఆ టీడీపీ మహిళా నేతకి మధ్య ఎఫైర్: సూఫియా
సాక్షి, గుంటూరు: టీడీపీ మహిళా కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యాయత్నం చేసుకున్న సూఫియాను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సూఫియా మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు ఓ టీడీపీ మహిళా నేతకు మధ్య ఎఫైర్ ఉన్న మాట వాస్తవం. ఆ మహిళా నేత భర్త నవీన్ కృష్ణే నాకు చెప్పాడు’’ అంటూ సూఫియా చెప్పుకొచ్చింది.‘‘నేను నా భార్యను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దగ్గరకు తీసుకువెళ్లే వాడినని నవీన్ కృష్ణ నాకు చెప్పాడు. నవీన్ కృష్ణ తన భార్య ఫోన్‌ను హ్యాక్ చేశాడు. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుకునే కాల్స్ అన్ని భర్త నవీన్ కృష్ణ వింటూ ఉండేవాడు. తన భార్యకు, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు సంబంధించిన వీడియోలు ఆమె భర్త నవీన్ కృష్ణ దగ్గర ఉన్నాయి. నేను నసీర్ అహ్మద్ దగ్గరికి వెళ్లి ఆమె భర్త దగ్గర మీ వీడియోలు ఉన్నాయని చెప్పాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నసీర్ బెదిరించాడు. ఇప్పుడు వాళ్లందరూ ఏకమై ఈ వ్యవహారాన్ని నాపై నెడుతున్నారు...పోలీసులు మా కుటుంబ సభ్యుల్ని తరచూ పోలీస్ స్టేషన్ పిలిపించి వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక నేను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించి ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటే అన్ని వీడియోలు బయటకు వస్తాయి. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో నవీన్ కృష్ణ బయటికి విడుదల చేశాడు. నవీన్ కృష్ణ, ఆయన భార్య వాళ్ల బంధువు విజయ్ కృష్ణను అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి’’ అని సూఫియా పేర్కొంది. -
అన్నమయ్య జిల్లా: తంబళ్లపల్లె టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
అన్నమయ్య జిల్లా: తంబళ్లపల్లె టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మదనపల్లిలో తంబ్లలపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులపై ప్రస్తుత తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ జై చంద్రారెడ్డి వర్గీయులు దాడి చేశారు. మదనపల్లి-బెంగళూరు రోడ్డు చెప్పిలి గ్రామ సమీపంలో కర్రలు, రాడ్లతో జయచంద్రారెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పెద్దమండెం మండలం, అవికే నాయక్ తాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ నటరాజ్ నాయక్, అలియాస్ నాగరాజ నాయక్, తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ నేత సాగర్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు శంకర్ యాదవ్ వర్గీయులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. -
ఇప్పటికీ మా వాళ్లు ఆసుపత్రిలోనే ఉన్నారు
-
ఇంతకంటే దారుణం ఉంటుందా?: సతీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి పౌరుడికి ఉన్న ఆస్తి ఓటు.. నిజమైన స్వాతంత్ర్యం అంటే నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడమేనన్నారు. ఎల్లో మీడియా నీచమైన వార్తలు రాస్తోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పులివెందులలో టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డారు. మరణాయుధాలతో దాడులు చేసి చాలామందిని గాయపరిచారు. ఎస్పీని కలిసి పులివెందుల వచ్చే లోపే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై దాడి చేశారు. వారు ఉన్న కారుపై పెట్రోల్ పోసి చంపడానికి యత్నించారు. ఇప్పటికీ వేల్పుల రాము ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. తిరిగి మా వాళ్లపైనే ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టారు’’ అంటూ సతీష్‌రెడ్డి నిప్పులు చెరిగారు.‘‘గ్రామాల్లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలపై కూడా తప్పుడు కేసులు పెట్టారు. 11న అర్ధరాత్రి ఎంపీ అవినాష్‌రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. వందల కిలోమీటర్లు తిప్పుతూ అవినాష్‌రెడ్డిని వేధించారు. నన్ను కూడా అక్రమంగా నిర్బంధించారు. జడ్పీటీసీ ఎన్నిక కోసం 700 మంది పోలీసులను పెట్టారు. 3 వేల మందికిపైగా టీడీపీ గూండాలను పులివెందులలో దింపారు. టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ము కాశారు. పోలింగ్ బూతులకు ఓటర్లను రాకుండా అడ్డుకున్నారు. వచ్చిన ఓటర్లను బెదిరించి స్లిప్పులు లాక్కున్నారు. 13 బూత్‌ల్లోకి మీడియాను కూడా అనుమతించలేదు’’ అంటూ సతీష్‌రెడ్డి దుయ్యబట్టారు.‘‘పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నిక జరిగిందని ఎల్లో మీడియా రాయడం విడ్డూరం. ఈ దిగజారిన వార్తలు చూసి సిగ్గుపడే పరిస్థితి. వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి పులివెందుల్లో ఏనాడు ఎన్నికల్లో అక్రమాలు జరగలేదు. టీడీపీ ఏనాడు ఎన్నికల్లో పులివెందుల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదు చేయలేదు. అలాంటప్పుడు 30 ఏళ్లుగా పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదని ఎలా వార్తలు రాస్తారు..?. గతంలో మేం టీడీపీలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలవడం నిజం కాదా..?పులివెందుల్లో కూటమి ప్రభుత్వం కొత్త సంప్రదాయాన్ని తీసుకుచ్చింది. టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోల్లోనే దొంగ ఓటర్లు ఉన్నారు. వారు దొంగ ఓటర్లు కాదు అని నిరూపించగలరా..?. జిల్లా కలెక్టర్ తను ఉన్న ఫోటోలో దొంగ ఓటర్ ఉన్నాడని గ్రహించి ఫోటోను డిలీట్ చేయలేదా..?. 700 మంది పోలీసులు బూత్‌లను స్వాధీనం చేసుకుని దొంగ ఓటర్లతో పోలింగ్ చేయించారు. దొంగ ఓట్లతో గెలిచిన వ్యక్తిని సీఎం సతీమణి అభినందించడం దారుణం’’ అని సతీష్‌రెడ్డి మండిపడ్డారు. -
సంచలన ఆడియో.. పోలీసులు, టీడీపీ నేతలే నన్ను చంపేశారు..
-
టీడీపీ నేతల వేధింపులు.. శ్రావణి చివరి ఆడియో వైరల్
సాక్షి, అనంతపురం జిల్లా: టీడీపీ నేతల వేధింపులకు గర్భిణి బలైంది. ఉరేసుకుని గర్భిణి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. కళ్యాణదుర్గంలో ఈ ఘటన జరిగింది. శ్రావణి భర్త శ్రీనివాస్ టీడీపీ కార్యకర్తగా ఉన్నాడు. భర్త వేధిస్తున్నాడంటూ శ్రావణి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ.. శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోకుండా పోలీసులపై టీడీపీ నేతల ఒత్తిడి తీసుకొచ్చారు. న్యాయం జరగకపోవడంతో శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.తన చావుకు కారణం టీడీపీ ప్రభుత్వం, పోలీసులే అంటూ శ్రావణి వాయిస్ రికార్డ్ చేసింది. సోషల్ మీడియాలో బాధితురాలి చివరి ఆడియో వైరల్‌గా మారింది. భర్త శ్రీనివాస్‌తో పాటు కళ్యాణదుర్గం మున్సిపల్ మాజీ ఛైర్మన్ రమేష్, మాజీ సర్పంచ్ శర్మాస్ పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఈ ఘటనపై ఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణదుర్గం పోలీసులు, టీడీపీ నేతలపై విచారణ జరపనున్నారు. -
బాబు వంటి నల్లదొరల పాలనలో స్వాతంత్ర్యం కనుమరుగు: రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు: జనరల్ ఎన్నికల్లో ఈవీఎం మిషన్లతో చీటింగ్.. ఉప ఎన్నికలు వస్తే పోలీసులతో ప్రభుత్వమే రిగ్గింగ్ చేస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. నేడు చంద్రబాబు వంటి నల్లదొరల చీకటి పాలన మధ్య స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కనుమరుగు అయిందని మండిపడ్డారు. పోలీసుల లాఠీలు, తూటాలు, ఇనుప బూట్ల మధ్య పాలన జరుగుతోందన్నారు.మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నేడు ఈవీఎం మిషన్ల మధ్య ప్రజాస్వామ్యం నలిగిపోతోంది. ఉపిరి ఆడక ప్రజాస్వామ్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉప ఎన్నికలు వస్తే పోలీసులతో ప్రభుత్వమే రిగ్గింగ్ చేస్తే.. ప్రజలు ఎక్కడ ఓటేస్తున్నారు?. వారికి కావాల్సిన పాలకులను ఎక్కడ నిర్ణయించుకుంటున్నారు?. బ్రిటీష్ పాలకుల నుంచి మహాత్ముడు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను తీసుకువచ్చారు. నేడు చంద్రబాబు వంటి నల్లదొరల చీకటి పాలన మధ్య స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కనుమరుగైంది. అబద్దాలు, ఆశలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు.నేడు పద్నాలుగు నెలలైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా?. సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై అణచివేతకు తెగబడుతున్నారు. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. పోలీసుల లాఠీలు, తూటాలు, ఇనుప బూట్ల మధ్య పాలన జరుగుతోంది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులపై బ్రిటీష్ వారు కూడా ఇంతలా బాధించలేదు. కానీ చంద్రబాబు పాలనలో బ్రిటీష్ వారిని మించి వేధింపులు ఉన్నాయి. ప్రశ్నించే ప్రతీ గొంతును పాశవికంగా కూటమి ప్రభుత్వం నొక్కేస్తోంది. ఇటువంటి నిరంకుశ పాలనలో స్వాతంత్ర్యం ఉందని స్వాతంత్య్ర దినోత్సవం ఎలా జరుపుకోవాలి? అని ప్రశ్నించారు.ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు..రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం అమలువుతుందా?. నాకు అసలు ఓటర్లు వద్దు.. దొంగ ఓటర్లే కావాలని చంద్రబాబు ప్రభుత్వం ఎంచుకుంది. పులివెందులలో జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చుకుని దొంగ ఓట్లు వేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా ఒక్కొక్కరిపై 30 కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని, బెదిరించి ప్రభుత్వాన్ని నడిపే విధానం మంచిదా?. పులివెందులలో జరిగిన ఎన్నికను ఎన్నిక అంటారా? ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఆ ఎన్నిక చూసిన తర్వాత ప్రజాస్వామ్య వాదులంతా సిగ్గుతో తలదించుకుంటున్నారు. రాక్షసులు కూడా అంత హీనంగా ప్రవర్తించరు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు భక్షకులయ్యారు. రక్షణగా లేకపోగా.. ప్రజల మీదే పులివెందులలో దాడి చేశారు. నా ఓటు నేను వేసుకోవాలి నాకు రక్షణగా ఉండండి అని పోలీసుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. ప్రజల పట్ల వాళ్లకు ఉండాల్సిన బాధ్యతను విస్మరించారు. తెలుగు దేశం పార్టీని గెలిపించడానికి పోలీసులు వంద సార్లు ప్రజాస్వామ్యాన్ని చంపారు.ఈ దేశ ప్రజలకు ఎన్నికల కమిషన్‌పై గౌరవం పూర్తిగా పోయింది. ఎన్నికల కమిషన్‌కి ఎవరు అనుకూలం అయితే వారే పాలకులు అవుతారని ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు. ప్రజాస్వామ్యాన్ని కొద్దిగా కొద్దిగా బలహీనపరిచి.. కుప్పకూలేలా చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మహాత్ముడు ఆశించిన గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముందుకు తెచ్చింది వైఎస్ జగన్. అటువంటి నాయకుడిని తిరిగి మనం మళ్లీ తెచ్చుకోవాలి.. అప్పుడే రాష్ట్రంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పొందగలుగుతారు. ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా కూలదోయాల్సిన అవసరం ఏర్పడింది’ అని అన్నారు. -
దొంగ ఓట్ల బాగోతాన్ని బయటపెట్టిన పులివెందుల మహిళలు
-
ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదు.. కూటమి ఇచ్చుకున్న రిగ్గింగ్ తీర్పు
-
Big Question: కలెక్టర్ ముందే దొంగ ఓట్లు.. గుద్దేశాం.. గెలిచేశాం
-
రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో టీడీపీ విజయం
-
వైఎస్సార్సీపీకి 683 ఓట్లే వచ్చాయంటే టీడీపీ వాళ్లే నమ్మడం లేదు: ప్రొ. నాగేశ్వర్
సాక్షి అమరావతి: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 683 ఓట్లు మాత్రమే వచ్చాయంటే టీడీపీ వాళ్లే నమ్మడం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. అలాంటిది ఇక రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. టీడీపీ గెలుపుపై సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ గురువారం నాగేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇదే విషయంపైన సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి. భారీ ఎత్తున దొంగ ఓట్లు, రిగ్గింగ్, పోలీసుల అండతోనే టీడీపీ గెలిచిందని నెటిజన్లు మండిపడుతున్నారు. పులివెందులలో వైఎస్సార్సీపీకి 683 ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. -
రిగ్గింగ్ ఎన్నికల్లో.. సిగ్గుపడే గెలుపు
సాక్షి ప్రతినిధి, కడప, సాక్షి రాయచోటి: ‘‘అసలు ప్రతిపక్షానికి చెందిన ఏజెంట్లే లేకుండా జరిగిన ఈ ఎన్నికలు ఒక ఎన్నికలా..? ఏ ఒక్క బూత్లోనూ విపక్ష ఏజెంట్లను రానివ్వకుండా రిగ్గింగ్ చేసి, అనైతికంగా పోలీసుల సాయంతో గెలిచి సంబరాలు చేసుకోవడం ఏమిటి? ప్రపంచ చరిత్రలో ఏ ఎన్నికా ఇలా జరిగి ఉండదు...!’’ అని ప్రజాస్వామికవాదులు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘దేశంలో ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు పోలీసు వ్యవస్థను వినియోగిస్తారు. కానీ మొట్టమొదటిసారి ప్రజలు ఓట్లు వేయకుండా ఉండేందుకు పోలీసులను వాడిన దుర్మార్గమైన చరిత్ర చంద్రబాబు సర్కారుది..’ అని వ్యాఖ్యానిస్తున్నారు. కళ్లు మూసుకున్న ఎన్నికల కమిషన్!పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో టీడీపీ గట్టెక్కింది! ఎన్నికల ముందు తాలిబన్లు, బందిపోటు ముఠాల మాదిరిగా అటకాయించి వైఎస్సార్ సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులకు తెగబడటంతో మొదలైన పచ్చముఠాల అకృత్యాలు ఎన్నికల రోజు మరింత యథేచ్ఛగా సాగాయి. అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని కొమ్ము కాసే పోలీసుల సహకారంతో ప్రభుత్వ పెద్దలు ఎన్నికల అరాచకాలకు బరి తెగించారు. టీడీపీ నేతలు ఎన్నికల ముందు రోజు రాత్రే వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్ల ఇళ్ల వద్దకు చేరుకుని వారు బయటకు రాకుండా మోహరించారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారితో దొంగ ఓట్లు వేయించారు. దేశ చరిత్రలో తొలిసారిగా అసలు విపక్ష పోలింగ్ ఏజెంట్లే లేకుండా చేసి అధికార పార్టీ అడ్డగోలుగా అరాచకాలకు పాల్పడినా ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. వైఎస్సార్ సీపీ నేతలపై బైండోవర్ కేసులు మొదలు హత్యాయత్నం, కౌంటర్ కేసులు బనాయించి అరెస్టులు చేసుకుంటూ వెళ్లారు. పట్టపగలు నల్లగొండువారిపల్లె గ్రామం మధ్యలో ప్రజలంతా చూస్తుండగా ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగితే నిందితులను ఇప్పటికీ అదుపులోకి తీసుకోలేదు. పైగా కౌంటర్ కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ ఏజెంట్లు బూత్‌ల వద్దకు రాకుండా దగ్గరుండి మరీ అడ్డుకుని టీడీపీ గూండాలకు సహకారం అందించారు. ఏకంగా డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలోనే తిష్ట వేసి ఈ అరాచకాలను పర్యవేక్షించడం విస్మయం కలిగిస్తోంది. ఒంటిమిట్టలో మంత్రి సమక్షంలోనే దాడులు..ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 10.30 వరకు సాఫీగా సాగినా ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు పసిగట్టిన పచ్చముఠాలు బూత్‌లను ఆక్రమించుకుని దౌర్జన్యాలకు తెగబడ్డాయి. ఏకంగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సమక్షంలోనే వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడులకు దిగినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. టీడీపీ గూండాలను వారించకపోగా.. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను రాకుండా కట్టడి చేయడంతో అధికార పార్టీ బూత్‌లలో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకుంది. పోలింగ్ రోజంతా విచ్చలవిడిగా సాగిన టీడీపీ మూకల రిగ్గింగ్, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లతో జాతరను తలపించింది. ఉదయం పోలైన ఓట్లలో ఎక్కువ శాతం వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత పచ్చ ముఠాలు అక్రమాలకు బరి తెగించాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని దొంగ ఓట్లు వేశాయి. సాయంత్రం వరకు విపక్ష ఏజెంట్లు లేకుండా ఈ డ్రామా సాగింది. ఈ అరాచకాలు, అక్రమాలు, ఏకపక్ష ఎన్నికలను నిరసిస్తూ కడపలో జరిగిన కౌంటింగ్‌ను వైఎస్సార్ సీపీ అభ్యర్థితోపాటు ఏజెంట్లు బహిష్కరించారు.అభాసుపాలైన ఎస్ఈసీ..జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వ్యవహరించిన తీరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభాసుపాలైంది. ఓటర్లు నాలుగైదు కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఓట్లు వేయాల్సి వచ్చేలా పోలింగ్ కేంద్రాలను ఇష్టానుసారంగా మార్చేసినా ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకుంది. టీడీపీ నాయకులు దొంగ ఓటర్ల అవతారం ఎత్తిన వైనం మీడియా, సామాజిక మాధ్యమాల్లో రోజంతా వైరల్ అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు మహిళలవి కూడా దొంగ ఓట్లు పోలయ్యాయి. పులివెందులలో 3,684 మంది మహిళలు ఓట్లు వేసినట్లు నమోదైంది. వెబ్ కాస్టింగ్ పరిశీలిస్తే బోగస్ బాగోతం వెల్లడవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యవస్థలన్నీ కుమ్మక్కై రౌడీ రాజ్యానికి పట్టం కట్టారని పులివెందుల ప్రజలు పేర్కొంటున్నారు.ఓటర్లతో మాట్లాడే ధైర్యం ఉందా? సాక్షి, అమరావతి: ఒంటిమిట్ట, పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, అందుకే కౌంటింగ్ ప్రక్రియను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించామని ఒంటిమిట్ట వైఎస్సార్ సీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఒంటిమిట్టలో ఉదయం 11 గంటల వరకు మాత్రమే ఎన్నికలు సజావుగా జరిగాయని, ఆ తరువాత టీడీపీ నేతలు పోలీస్ ప్రొటెక్షన్‌తో రిగ్గింగ్ చేసుకుని దొంగ ఓట్లు వేసుకున్నారని వెల్లడించారు. ఈ రెండు ఉప ఎన్నికలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట, పులివెందులలో ఏ గ్రామానికి వెళ్లినా వేలికి సిరా గుర్తు లేని వారే కనిపిస్తారని చెప్పారు. ప్రతి గ్రామానికి వెళ్లి ఓటర్లకు సిరా గుర్తు ఉందో లేదో విచారణ చేయాలని కోరారు. గ్రామాలకు వచ్చి నిజమైన ఓటర్లతో మాట్లాడే ధైర్యం ఉందా? అని టీడీపీ నేతలకు సవాల్ చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలు టీడీపీకే కడప సెవెన్‌రోడ్స్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం కడప శివార్లలోని మను పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల హేమంత్‌రెడ్డికి 683 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,716 ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె 6,033 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి 6,267 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు. -
Perni Nani: దొంగ ఓట్లతో గెలిచారు.. పులివెందుల గడ్డ జగన్ అడ్డా
-
దొంగ ఓటు వేస్తున్నా..! నిజం ఒప్పుకున్న టీడీపీ కార్యకర్త
-
Perni Nani: ఓటరు ఓటు వేయకుండానే ఎన్నికలు భలే జరిపించారు
-
ఉచిత బస్సు పథకం.. అసలు రంగు ఇదే!
2024 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. అధికారంలోకి రావడమే తరువాయి.. ‘‘మీ ఇష్టం ...మీరు ఎక్కడకు కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు’’ అని ఇద్దరూ తెగ ఊరించారు. ఇంకో అడుగు ముందుకేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘‘ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న చెప్పాడని బస్ కండక్టర్‌కు తెలపండి.. నేను సేఫ్ డ్రైవర్ని’’ పదే పదే చెప్పారు కూడా. ఈ హామీకి సంబంధించిన ప్రచారం కోసం తయారు చేసిన ప్రకటనల్లో ‘‘మహిళలు ఏపీలోని ఏ పుణ్యక్షేత్రానైన్నా ఉచితంగా దర్శించి రావచ్చు’’ అని ఉండేది. ఒక యాడ్ ఎలా ఉందంటే... ‘‘టీ కూడా పెట్టకుండా బిజీగా రాసుకుంటున్నావు..’’ అని భర్త తన భార్యను ప్రశ్నిస్తాడు..‘‘మొక్కులు తీర్చుకోవడానికి యాత్రలకు గాను పుణ్యక్షేత్రాల జాబితా తయారు చేస్తున్నా’’.. అని భార్య జవాబు.. ‘‘అసలే ఖర్చులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఎలా’’ అని భర్త ప్రశ్న.. ‘‘మనం ఒక పనిచేస్తే సగం ఖర్చు తగ్గించుకోవచ్చు’’ అని భార్య సమాధానం..‘‘జనసేనకు ఓటు వేస్తే ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చు. దాంతో సగం ఖర్చు తగ్గిపోతుంది’’ అని భార్య వివరణరిప్లై.. ఇక అంతే కూటమికి ఓటు వేస్తే ఫ్రీబస్ అంటూ ఊదరగొట్టేశారు..అధికారం అయితే వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 14 నెలల వరకు అందుబాటులోకి రాలేదు. ఆడబిడ్డ నిధితోసహా పలు స్కీములు అమలు చేయకుండా కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలలో ముఖ్యంగా మహిళలలో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో, దాన్ని ఎంతో కొంత తగ్గించాలన్న ఉద్దేశంతో ఇచ్చిన హామీలలో కొన్ని అయినా, కొంత మేర అయినా అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాని వీటిని అరకొరగా చేస్తుండడంతో ప్రజలలో వ్యతిరేకత పెద్దగా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. టీడీపీ జనసేనలు తమను మోసం చేశాయని మహిళలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని పేరుకే తప్ప పెద్దగా ప్రయోజనం లేకుండా అమలు చేయ సంకల్పించారని విమర్శిస్తున్నారు. దానికి కారణం ఆడవారు ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే అవకాశం కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు రకరకాల షరతులు పెట్టడమే. ఉచిత బస్ స్కీమ్‌పై కూటమి మంత్రులు ఇంతకాలం పలురకాల పిల్లి మొగ్గలు వేశారు. జిల్లాల వరకే ఉచితం అని ఒకసారి, ఉమ్మడి జిల్లాలలో ప్రయాణాలకు అనుమతిస్తామని మరోసారి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా జిల్లా స్థాయిలో ఉచిత ప్రయాణాలు ఉంటాయని అన్నప్పుడు అంతా నవ్వుకున్నారు. యథా ప్రకారం మరో మోసం చేశారని విమర్శించారు. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శల ఒత్తిడి ఉండనే ఉంది. కడప నుంచి అమరావతి ఎప్పుడు ఉచిత బస్‌లలో వెళదామని స్త్రీలు ఎదురు చూస్తున్నారని ఒక సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొత్త ఆలోచన చేసి రాష్ట్రమంతా పర్యటించవచ్చంటూ చెబుతూనే లిటిగేషన్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుకునేలానే చెప్పేవారు. తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం.. ఏ గుడికి అయినా, ఎంత దూరం అయినా హాపీగా వెళ్లి రావచ్చనుకున్న ఆడవాళ్ల ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితి ఏర్పడింది. మొత్తం పదహారు రకాల బస్ సర్వీసులు ఉంటే ఐదింటిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారట. దాని ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలోనే ఫ్రీ. ఇవేవి దూర ప్రాంతాలకు వెళ్లేవి కావు. ఎక్స్‌ప్రెస్ బస్సులను అనుమతించినా, అవి సరిపడా ఉండవు. పైగా వీటిలో చాలా బస్సులు నాన్‌స్టాప్‌లుగా మార్చారు. అన్ని కలిపి 8458 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని టీడీపీ మీడియా మహిళలను మభ్య పెట్టాలని యత్నించింది. ఈ లెక్కలు కూడా కావాలని పెంచి చెప్పినవే. ఏ మహిళైనా విశాఖ నుంచి తిరుపతికి వెళ్లాలంటే పది బస్సులు మారి వెళ్లాల్సి వస్తుందని, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అల్ట్రా డీలక్స్, సూపర్ లక్జరీ, నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైన్, ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వీల్లేదు. నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోకాని, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కాని టిక్కెట్ తీసుకోవల్సిందే. అంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే స్త్రీలు టిక్కెట్లు తీసుకోవల్సిందే అన్నమాట. మహిళలు హైదరాబాద్ వెళ్లాలన్నా బస్సులు మారుతూ గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏపీ సరిహద్దు వరకే ఉచితం కనుక, ఆ తర్వాత టిక్కెట్ తీసుకుని మరో బస్సు ఎక్కాలన్నమాట. అమరావతి బస్సుల్లో కాని, ఆర్టీసీ అద్దెకు తీసుకుని నడిపేవాటిల్లోనూ ఉచిత ప్రయాణం అవకాశం లేదు. నాన్‌స్టాప్ బస్సులు ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి ఉంటాయి. వాటిలో ఎక్కడానికి వీలు లేదు. ఉదాహరణకు విజయవాడ-గుంటూరు మధ్య ప్రతి పావుగంటకు నాన్‌స్టాప్ బస్సులు ఉంటాయి. అలాగే విశాఖ- శ్రీకాకుళం, తిరుపతి-కడప, నెల్లూరు-ఒంగోలు ,విజయవాడ-ఏలూరు, కాకినాడ- రాజమండ్రి, అనంతపురం-కర్నూలు, నంద్యాల-కర్నూలు ఇలా వివిధ పట్టణాల మధ్య పెద్ద సంఖ్యలో నాన్‌స్టాప్ బస్సులు ఉంటాయి. ఇవి ఉచిత పథకంలో భాగం కాదు. తిరుమల, పాడేరు, శ్రీశైలం ఘాట్ రోడ్డులలో కూడా టిక్కెట్ కొనాల్సిందేనట. అలాంటప్పుడు పుణ్య క్షేత్రాలకు ఉచితంగా వెళ్లడం ఎలా సాధ్యం. చివరికి గిరిజనులు అధికంగా ప్రయాణించే పాడేరు ఘాట్ రోడ్డులో కూడా ఈ స్కీమ్ ఉండదట. అంటే ప్రజలను మభ్య పెట్టడానికే ఎన్నికల సమయంలో అన్నీ ఫ్రీ అని అబద్దపు ప్రచారం చేశారన్నమాట. అప్పుడేమో ఎలాంటి షరతులు పెట్టకుండా నమ్మబలికి , ఇప్పుడేమో అన్నీ కండిషన్స్ పెడతారా అని మహిళలను మండిపడుతున్నారు. ఇంకో విషయం చెప్పాలి. ఎల్లో మీడియాలో మే నెల18 న రాసిన ఒక స్టోరీలో ఉచిత స్కీమ్ అమలుకు ఏపీ ప్రభుత్వంపై రూ.3182 కోట్ల భారం పడుతుందని లెక్కవేశారు. అదే మీడియా ఆగస్టు 10న రాసిన ఒక కథనంలో ఏడాదికి ఈ స్కీమ్ కింద భారం రూ.1942 కోట్లు అవుతుందని అంచనా వేశారని తెలిపారు. అంటే దాదాపు 1200 కోట్ల మేర భారం తగ్గించారంటే ఆ మేరకు ఉచిత బస్ ప్రయాణ సర్వీసులలో కోత పెట్టినట్లే. నిజానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ స్కీమును అమలు చేశారు. ఆ పథకం అమలులో ఆ రాష్ట్రాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణలో నెలకు సుమారు రూ.300 కోట్లు ఖర్చు అవుతున్నదని అంచనా. ఏపీలో కూడా తొలుత సుమారు రూ.250 కోట్ల వ్యయం అంచనా వేసినా, ఆ తర్వాత దానికి కోత పెట్టుకుంటూ స్కీమ్‌ను నామమాత్రం చేశారా అన్న సంశయం కలుగుతుంది. తెలంగాణలో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులను రీయింబర్స్ చేయడం లేదు. దాంతో పలు సమస్యలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. నిధుల కొరత కారణంగా తెలంగాణలో గౌలిగూడ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని తాకట్టు పెట్టి రూ.400 కోట్ల రుణం తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోందని ఒక వార్త వచ్చింది. ఏపీలో గత జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా మార్చినందున కొంత భారం తగ్గుతుంది. అయినా స్కీమ్ అమలులో తీవ్ర జాప్యం చేశారు. ఇది ఇలా ఉండగా, ఉచిత బస్ స్కీమ్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆటోలు, టాక్సీల వారు వాపోతున్నారు.స్వయంఉపాధి కింద వేలాది మంది బతుకుతున్న వారికి ఇది ఒక గండంగా మారుతుంది. ఫ్రీ బస్ స్కీమ్ హామీ వల్ల ఆటోలవారు నష్టపోకుండా వారికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, రుణ సదుపాయం, రాయితీల కల్పన వంటివి చేస్తామని హామీ ఇచ్చినా, ఇంతవరకు అవి అమలు కావడం లేదు. దాంతో ఆటో యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు గురి అవుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం మొత్తమ్మీద చూస్తే విజయవాడ, విశాఖ వంటి పెద్ద నగరాలలో సిటీ బస్సుల్లో తిరిగే మహిళలకే కాస్త ఉపయోగం.అదేమీ పెద్ద ఖర్చు కాదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానానికి, ఆచరణలో అమలు చేస్తున్నదానికి చాలా తేడా ఉందన్నమాట.ఉచిత బస్ స్కీమ్ వల్ల వేల రూపాయలు ఆదా అవుతాయని చేసిన ప్రచారం అంతా ఉత్తదే అన్నమాట. పుణ్య క్షేత్రాలన్నీ తిరిగేసి మొక్కులు తీర్చుకోవాలనుకున్న ఏపీ మహిళలు, కనీసం టీడీపీ, జనసేనలకు మద్దతు ఇచ్చిన వనితలకు ఇది పెద్ద నిరాశ మిగుల్చుతుందని భావించవచ్చు. ఇదన్నమాట! స్త్రీ శక్తి పేరుతో అమలు చేయతలపెట్టిన ఉచిత బస్ ప్రయాణం పథకం అసలు రంగు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: పులివెందులలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారని ఘాటు విమర్శలు చేశారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు అంటూ ఆధారాలు చూపించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరపడమేంటి?. సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన పోలీసులు ఇలాగేనా చేసేది. పులివెందులలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలే నమ్మడం లేదు. చంద్రబాబు, లోకేష్ మాటలను టీడీపీ నేతలే నమ్మడం లేదు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఎలా ఓట్లు వేశారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ ప్రకారమే రీపోలింగ్ పెట్టింది.పులివెందులలో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు ప్రజలందరూ చూశారు. కిరాయి మీడియాతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారు. చంద్రబాబు సర్కార్ ప్లాన్ ప్రకారమే జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టింది. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. టీడీపీ అరాచకాలకు ఉన్నతాధికారులు కూడా వంత పాడారు. సీసీ ఫుటేజీ, వెబ్ క్యాస్టింగ్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘానికి భయమెందుకు?. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు అని మండిపడ్డారు.టీడీపీ నేతలు ఇచ్చిన వీడియోల్లోనే దొంగ ఓటర్లు బయటపడ్డారు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఎలా ఓట్లు వేశారు?. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలకు రిగ్గింగ్ చేయాలని కాంట్రాక్ట్ ఇచ్చారు. పోలింగ్ బూత్‌ల వద్ద ఎక్కడా కూడా క్యూలైన్లలో మహిళలు కనిపించలేదు. గ్లాస్ దొంగలను.. సైకిల్, పువ్వు దొంగలు నమ్మలేదు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికతో చంద్రబాబు ఏం సాధించారు. పులివెందులలో టీడీపీ నేతలే వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారు. కూటమిలో బీజేపీ, జనసేన డమ్మీ పార్టీలు. పులివెందులలో జరిగింది ఎన్నిక కాదు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్తారు’ అని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే లెక్కింపులో ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా పార్టీల్లో చంద్రబాబు బ్రోకర్లు ఉన్నారు. ఇతర పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుని పనిచేయడం చంద్రబాబు నైజం. గతంలో చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారా?. చంద్రబాబుకు పౌరుషం ఉంటే 2019-24 వరకు ఎంత జీతం తీసుకున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
‘వేసుకుందే దొంగ ఓట్లు.. ఉత్కంఠ ఎక్కడిది?’
సాక్షి, పులివెందుల: పులివెందుల ఎన్నికల విషయమై ఎల్లో మీడియా రాతలపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిగ్గింగ్ జరిగితే ఎన్నికలపై ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. తప్పుడు రాతలతో.. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇలాంటి రాతలు అనైతికం కాదా? అని ప్రశ్నలు సంధించారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ తాజాగా మాట్లాడుతూ.. ‘ఈరోజు ఈనాడు పత్రిక చూస్తే ఆ రాతలు ప్రజలను ఏదో నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉత్కంఠకు తెర అని ఈనాడు రాస్తే.. లోకేశ్ అయితే ప్రజాస్వామ్యం నిలబడింది అంటున్నాడు. పులివెందులలో దొంగ ఓటింగ్ జరిగిందని ప్రజలందరికీ తెలుసు. దొంగ ఓటింగ్ జరిగితే ఉత్కంఠ ఎలా అవుతుంది?. ఉత్కంఠకు తెర అని రాతలు రాసి నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. రిగ్గింగ్ జరిగితే ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది?. తప్పుడు రాతలతో మరోసారి ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి రాతలు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అసలు పులివెందులలో ఓటింగ్ జరిగితే కదా.. ఇలాంటి రాతలు అనైతికం కాదా?. మీ పత్రిక అనైతిక రాతలు చూసి ఆత్మవిమర్శ చేసుకోండి.ఎవరి కోసం స్టేట్మెంట్స్.. అసలు పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఓటింగ్ జరిగి ఉంటే కదా మీరు ఇలాంటి రాతలు రాయాల్సింది?. వేసుకుందే దొంగ ఓట్లు.. దానికి మళ్లీ ప్రజాస్వామ్యం నిలబడింది అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఎందుకు?. ఇక్కడ జరిగింది పులివెందుల, కడప జిల్లా వాళ్లకు మాత్రమే తెలుసు. రాష్ట్రమంతా తెలియదు కాబట్టి ఎల్లో మీడియాలో ఇక్కడ అంతా సవ్యంగా జరిగినట్లు వార్తలు రాయించేసుకుంటున్నారు. మీ పత్రిక, చానల్ ఎంత అనైతికంగా ఇలాంటి వార్తలు రాస్తుందో మీరే ఒక సారి ఆత్మవిమర్శ చేసుకోండి. నిజమైన పోటీ జరిగి ఐదు ఓట్లతోనైనా టీడీపీ గెలిస్తే వారికి ఎనలేని తృప్తి ఉండేది.. మాకు బాధ ఉండేది. కానీ, ఈ విధంగా పోలీసుల సంపూర్ణ సహకారంతో వేలాది మంది టీడీపీ కార్యకర్తలను బూత్‌ల ఎదురుగా పెట్టి నిజమైన ఓటరు స్లిప్పులు లాక్కున్నారు.నిజమైన ఓటర్లు ఉన్నారా?నిజమైన ఓటరును అసలు పోలింగ్ బూత్‌లోకే పోనివ్వలేదు. దీన్ని ఎలక్షన్ అంటారా?.. ఇంకేమైనా అంటారా?. మీరు గెలిచామని మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే అవకాశమే లేదు. ప్రజలు ఓట్లు వేస్తే కదా.. మీరు గెలిచాం అని చెప్పుకోడానికి?. మీ దొంగ ఓటర్లు కూడా మీరు గెలిచారు అని అనుకోరు.. ఎందుకంటే జరిగిందతా వారికి తెలుసు కాబట్టి. వారితో ఓట్లు వేయించలేదు కాబట్టి పులివెందుల మండల ఓటర్లు మీరు గెలిచారని అసలే అనుకోరు. ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను, ఓటర్లను బూత్‌లోకి రానివ్వకుండా చేసుకున్న పోలింగ్‌ను ఎలక్షన్ అంటారా?. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది.. అప్పుడు ఇలా దొంగ ఓట్లతో కాదు.. మనం ఎప్పుడు చేసే విధంగా నిజమైన ఓటింగ్‌తోనే వీళ్లకు గుణపాఠం చెబుదాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
కష్టపడి తెచ్చి గిఫ్ట్ ఇవ్వాలి.. మీలా కొట్టుకొచ్చి ఇవ్వడం కాదు..
-
Big Question: 'నా ఓటు వేయనివ్వండి..' అని ఓటరు కాళ్లు మొక్కాల్సిన దుస్థితి
-
రీపోలింగ్ లోనూ టీడీపీ రిగ్గింగ్
-
చంద్రబాబు మోసకారి... పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ...
-
బూటకపు మాటలొద్దు.. రంకెలేసిన ఎద్దు
ఆలమూరు: మూగజీవాలకూ తెలిసిపోయింది కూటమి హామీలు బూటకమని. టీడీపీ నేతల నాటకాలను జనం భరించినా మేం చూసి ఊరుకోలేమన్నట్లు రంకెలు వేశాయి. రైతు సంబరాల పేరిట టీడీపీ నిర్వహించిన కార్యక్రమం ఈ ఉదంతానికి వేదికగా నిలిచింది. టీడీపీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎడ్ల బండిపై నుంచి మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్, అన్నదాత సుఖీభవ అనగానే ఆ బండి ఎద్దులు ఒక్కసారిగా రంకెలు వేశాయి. కాడిని బలంగా గుంజుకున్నాయి. దీంతో బండిపై నుంచి కింద పడ్డ ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైతు సంబరాల కార్యక్రమంలో భాగంగా బుధవారం చొప్పెల్ల నుంచి ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు టీడీపీ శ్రేణులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ నర్శిపూడి, నవాబుపేట, పెనికేరు, కలచవర్ల మీదుగా ఆలమూరుకు చేరుకుని సభకు వెళుతున్న తరుణంలో టీడీపీ నేతలు ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్.. అన్నదాత.. సుఖీభవ..’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎక్కిన బండి లాగుతున్న ఎద్దులు ఒక్కసారిగా రంకెలేశాయి. వెనక్కు తిరిగి పక్కనున్న వారిని ఎగిరి కాళ్లతో తంతూ పరుగుతీశాయి. దీంతో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పీఏసీఎస్ చైర్పర్సన్ ఆకుల రామకృష్ణ, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్‌రాజు కింద పడిపోయారు. వారిని కార్యకర్తలు పక్కకు తీసుకెళ్లి సపర్యలు చేశారు. తీవ్రంగా గాయపడ్డ సతీష్రాజును రావులపాలెం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు ఏం మేలు జరిగిందని ‘అన్నదాత.. సుఖీభవ’ అంటూ నినాదాలు చేశారని.. రైతులకు ఏం మేలు జరగలేదని మూగజీవాలకు కూడా తెలిసిపోయిందని పలువురు గుసగుసలు పోయారు. -
రీ పోలింగ్‌లోనూ దొంగ ఓట్ల దందా
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను కప్పిపుచ్చుతూ కంటి తుడుపుగా రెండు చోట్ల నిర్వహించిన రీ పోలింగ్‌లోనూ దొంగ ఓట్ల దందా కొనసాగింది! రీ పోలింగ్ జరిగిన అచ్చివెళ్లి, ఇ.కొత్తపల్లె గ్రామాల్లో పోలింగ్ ప్రారంభానికి ముందే కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు తిష్ట వేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ రీ పోలింగ్‌ను బహిష్కరించడంతో సామాన్య ఓటర్లు ఇంటి నుంచి బయటికి రాలేదు. దీంతో పచ్చ ముఠాలు బుధవారం కూడా యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశాయి. పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాల అరాచకాలను వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మంగళవారం సాయంత్రం లేఖ రాశారు. అధికార పార్టీ అరాచకాలతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, 14వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో టీడీపీ గూండాల అరాచకాలను కప్పిపుచ్చుతూ ఎన్నికల కమిషన్ కంటి తుడుపు చర్య తీసుకుంది. కేవలం రెండు పోలింగ్ కేంద్రాల్లో రీ–పోలింగ్‌కు ఆదేశించింది. అది కూడా బుధవారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. మొత్తం బూత్‌లలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలన్న వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల విన్నపాలను ఈసీ పెడచెవిన పెట్టింది. 15 పోలింగ్ బూత్‌లలో 10,601 ఓట్లు ఉండగా కేవలం 1,765 ఓట్లకు మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించింది. తక్కువ ఓట్లు ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలను ఎంచుకుని రీ పోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఒంటిమిట్టలో పలు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని కోరినా ఈసీ పట్టించుకోలేదు. రెండు చోట్లా అదే తంతు.. రీ పోలింగ్ జరిగిన ఇ.కొత్తపల్లె (14వ బూత్), అచ్చివెళ్లి (3వ బూత్)లో టీడీపీ గూండాలు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. ఇ.కొత్తపల్లెలో కమలాపురం టీడీపీ నేతలు, అచ్చివెళ్లిలో బీటెక్ రవి అనుచరులు క్యూలైన్లలో నిలుచుని దొంగ ఓట్లు వేసుకున్నారు. కమలాపురం మండలం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గుజ్జల నారాయణయాదవ్ రీ పోలింగ్ క్యూలైన్లో కనిపించాడు. టీడీపీ గూండాల బెదిరింపులతో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రాకపోవడంతో 10 గంటలకు అచ్చివెళ్లిలో కేవలం 6.71 శాతం, ఇ.కొత్తపల్లెలో 11.47 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక గ్రామస్తులు ఓటింగ్‌కు రారని గ్రహించిన టీడీపీ మూకలు దొంగ ఓట్లు వేసేందుకు క్యూలైన్లలో చొరబడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు అచ్చివెళ్లిలో 33.74 శాతం, ఇ.కొత్తపల్లెలో 26.71 శాతం పోలింగ్ జరిగింది. 3 గంటలకు అచ్చివెళ్లిలో 59.35 శాతం, ఇ.కొత్తపల్లెలో 42.5 శాతం పోలింగ్ నమోదు కాగా సాయంత్రం 5 గంటలకు అచ్చివెళ్లిలో 68.5 శాతం, ఇ.కొత్తపల్లెలో 54.28 శాతం నమోదైంది. ‘మమ’ అనిపించేందుకే..! పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ అభ్యర్థులకు వెబ్ కాస్టింగ్ ఇస్తే దొంగ ఓట్లు నిరూపిస్తామని, ఆ తర్వాత రీ పోలింగ్ ఆదేశాలు ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. క్యూలైన్లలో ఉన్న టీడీపీ నేతల పేర్లు, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల్లో వారి ఓటు వివరాలు, పులివెందులలో ఓటు వేస్తున్న దృశ్యాలతో కూడిన ఆధారాలతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించకుంటే న్యాయస్థానాలు తప్పుబట్టే అవకాశం ఉన్నందున ఎన్నికల కమిషన్ కంటితుడుపు చర్యగా కేవలం రెండు బూత్‌లలో మాత్రమే రీ పోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రీ పోలింగ్ నిర్వహించామని చెప్పుకునేందుకు మాత్రమే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ తీరుకు నిరసనగా రీ పోలింగ్‌ను వైఎస్సార్సీపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం బహిష్కరించారు. కలెక్టరు కార్యాలయం తొలగించిన ఆ ట్వీట్ కథేంటో? సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ భారీగా దొంగ ఓట్లు వేసిందనేందుకు సాక్ష్యంగా నిలిచిన ఓ ఫొటో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ సమక్షంలోనే ఈ దొంగ ఓట్ల తతంగం జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసినట్లు పేర్కొంటున్న ఓ ట్వీట్‌ను అకస్మాత్తుగా తొలగించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ‘‘జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, ఎర్రబెల్లి గ్రామాల్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ పరిశీలించారు’’ అంటూ కలెక్టర్ కార్యాలయ అధికారి ట్వీట్ చేశారు. ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్న 4 ఫొటోలను జత చేశారు. అయితే, కొంతసేపటికే దానిని తొలగించారంటూ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనికి కారణం... ఈ ట్వీట్లోని ఓ ఫొటోలో కలెక్టర్ ఎదుట ఓటు వేస్తున్నవారు పులివెందుల మండలానికి సంబంధం లేని జమ్మలమడుగు నియోజకవర్గ ఓటర్లు అని ఆధారాలతో సహా ప్రచారం జరగడమే అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వివరణ ఇవ్వాలంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.పులివెందుల, ఒంటిమిట్టలో రీ పోలింగ్‌కు ఆదేశాలివ్వండి» అధికార పార్టీ నేతలు అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు » రీ పోలింగ్ కోరినా ఎన్నికల సంఘం స్పందించడం లేదు » హైకోర్టులో వైఎస్సార్సీపీ అభ్యర్థుల పిటిషన్.. నేడు విచారణ సాక్షి, అమరావతి: ‘‘పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాలను ఆక్రమించారు. ఈ నేపథ్యంలో రీ పోలింగ్‌కు చర్యలు చేపట్టేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి’’ అని కోరుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం లంచ్ మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై వెంటనే విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి కోర్టును కోరారు. లేదంటే నిరర్ధకం అవుతాయన్నారు. సకాలంలో వ్యాజ్యాలు తమ ముందుకురాలేదని, అత్యవసర విచారణ సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. గురువారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఈసీ ఆదేశాలు కంటితుడుపే.. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ భారీ అక్రమాలకు పాల్పడిందని పిటిషనర్లు పేర్కొన్నారు. అన్ని పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకుందని తెలిపారు. కేవలం రెండు కేంద్రాల్లో మాత్రమే రీ పోలింగ్ నిర్వహిస్తున్నారని, మొత్తం 15 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. అవకతవకలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చామని.. కానీ, రెండుచోట్ల మాత్రమే రీ పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసిందని, ఇది కంటితుడుపు చర్య అని వైఎస్సార్సీపీ నేతలు అభివర్ణించారు. అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడిన పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ ఫుటేజీ, వెబ్ కాస్టింగ్‌ను భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని కోరారు. మారణాయుధాలతో భయపెట్టి ఓట్లేసుకున్నారు.. ‘‘టీడీపీ వారు మారణాయుధాలు ధరించి ఓటర్లను బెదిరించి, భయపెట్టారు. సాధారణ ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లేకుండా చేశారు. మా పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్లపై బహిరంగంగానే దాడులకు పాల్పడ్డారు. అసలు ఓట్లు లేనివారు, స్థానికేతరులు కూడా ఓటు వేశారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. అధికార పార్టీ నేతల అండతో మా నాయకులను అక్రమంగా నిర్బంధించారు. ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను పలుసార్లు కోరినా ప్రయోజనం లేకపోయింది. అందుకే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది’’ అని వైఎస్సార్సీపీ నాయకులు వివరించారు. -
ఏజెంట్లే లేకుండా ఎన్నికలా?: వైఎస్ జగన్
మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చల విడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా చంద్రబాబూ? – వైఎస్ జగన్ అసలు ఏజెంట్లే లేకుండా పోలింగ్ నిర్వహిస్తే.. వాటిని ఎన్నికలు అని ఎలా అంటారు? ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశ్నించకపోతే, గొంతు విప్పకపోతే అసలు ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఎన్నికలు హాస్యాస్పదమే అవుతాయి. అప్పుడు ఎన్నికల అవసరం కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్లు అంతా ఓట్లు వేసుకోవడమే. సీఎం చంద్రబాబు, ఆయనతో చేతులు కలిపి అంట కాగుతున్న ఎల్లో మీడియా లక్ష్యం ఇదే. వారి లక్ష్యం ప్రజలకు మంచి చేయడం, పాలకుల మోసాన్ని ప్రశ్నించడం కానే కాదు. కేవలం దోచుకో.. పంచుకో.. తినుకో.. అదే వారి ఎజెండా. దీనికి ప్రజాస్వామ్యం సిగ్గుపడాలి.చంద్రబాబుకు మా డిమాండ్.. అలాగే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారికి మా విన్నపం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే, అది చేజారిపోతే.. నక్సలిజం అక్కడే పుడుతుంది. చంద్రబాబు ఈ రోజు ఒక ప్రమాదకర పరిస్థితికి పునాది వేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. నిన్న జరిగిన రెండు ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్‌గా తీసుకోండి.పులివెందుల జెడ్పీటీసీ కింద ఆరు పంచాయతీలకు సంబంధించి 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఏకంగా 700 మంది పోలీసులను పెట్టారు. కేవలం ఓటర్లను భయపెట్టడం కోసమే అంత మందిని మోహరించారు. ఉదయం 4 గంటలకల్లా జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వారు ఆయా గ్రామాల్లో మకాం వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూత్ వద్ద దాదాపు 400 మంది పాగా వేశారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. వారే ప్రోత్సహించారు. పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, బయట నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు.. అంతా కలిపి మొత్తం 7 వేల మంది ఉంటారు. అంటే ఒక్కో ఓటరుకు బయట నుంచి దాదాపు ఒక్కో రౌడీని ఏర్పాటు చేశారు. సాక్షి, అమరావతి: ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మీరు ప్రజలను మోసం చేశారు. మీ పాలన మొత్తం రాక్షస పాలన అని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అందుకే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ఇదివరకు చంబల్ లోయ బందిపోటు దొంగలను మరిపించేలా.. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అడ్డగోలుగా దొంగ ఓట్లు వేసుకున్నార’ని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇలా అడ్డగోలుగా రాజకీయాలు చేసే వారిని నాయకుడనరని.. చంద్రబాబు ఒక మాబ్స్టర్.. ఫ్రాడ్‌స్టర్ అని తేల్చి చెప్పారు. ‘మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే.. మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే.. వెంటనే మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి’ అని సవాల్ విసిరారు. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే.. మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే.. ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దెప్పిపొడిచారు. ‘ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా?’ అని సీఎం చంద్రబాబుకు మరో సవాల్ విసిరారు. వెబ్ కాస్టింగ్, సీపీ ఫుటేజీ ఇస్తే ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్‌లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది మరింతగా బట్టబయలవుతుందన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల వైఎస్సార్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లను తనతో కూర్చోబెట్టుకుని వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నిక పోలింగ్‌లో పోలీసులు, టీడీపీ నాయకులు జట్టుగా ఏర్పడి వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, ఏజెంట్లపై దౌర్జన్యం చేయడం.. ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను అడ్డుకోవడం.. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులతో దొంగ ఓట్లు వేయించుకోవడం, కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేయడం నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసుల ఏకపక్ష దాడులు.. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల దౌర్జన్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చూపుతూ సాక్ష్యాధారాలతో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరును తూర్పారబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు. అందుకు నిన్న (మంగళవారం) జరిగిన ఎన్నికలు (పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు) ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలింగ్ బూత్‌లలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో 15 పోలింగ్ బూత్‌లు ఉండగా, వాటిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అస్సలు ఉండనివ్వలేదు. ఏ ఒక్క ఏజెంట్‌ను బూత్ దగ్గరకు పోనివ్వకుండా ఆపేసి రిగ్గింగ్ చేశారు. పోలీసుల ప్రోద్బలంతో బూత్‌లలోకి ఏజెంట్లను పోనివ్వలేదు. ఇంత దారుణం ఏ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా ఉండదేమో.. ఒక్క మన రాష్ట్రంలో తప్ప!.పోలింగ్ ఏజెంట్ల కీలక బాధ్యతలు ⇒ అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్ హక్కులు, బాధ్యతలు ఏమిటంటే.. దొంగ ఓటర్లను గుర్తించడం. ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం. ఎక్కడైనా అక్రమాలు గుర్తిస్తే, వెంటనే పోలింగ్ అధికారికి చెప్పడం. అలాగే అవే వివరాలు పార్టీకీ తెలియజేయడం. ఈ బాధ్యతలన్నీ ఏజెంట్లకు ఉంటాయి కాబట్టే.. వారికీ హక్కులు కల్పించబడ్డాయి. ⇒ ఒక పోలింగ్ ఏజెంట్ బూత్‌లోకి వెళ్లగానే పోలింగ్ మొదలవడానికి ముందే ఫామ్–12 (వారి అపాయింట్మెంట్ కోసం పార్టీ ఇచ్చేది)ను అక్కడి ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు ఇస్తారు. ఆ తర్వాత బూత్‌లో కూర్చుంటాడు. కానీ నిన్న (మంగళవారం) మా పార్టీ ఏజెంట్ల నుంచి ఆ ఫామ్‌లను టీడీపీ వారు, పోలీసులు లాక్కుని చింపేశారు. ఆ స్థాయిలో ప్రజాస్వామ్యం దిగజారి పోవడం చరిత్రలో చూసి ఉండం.⇒ ఓటరు బూత్‌లోకి రాగానే తన పేరు చెబుతాడు. అక్కడ పోలింగ్ ఆఫీసర్ సంతకం తీసుకుని బ్యాలెట్ ఇస్తాడు. రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ అయితే, దాన్ని నిర్ధారించేది పోలింగ్ ఏజెంట్. పోలింగ్ ముగిసిన తర్వాత ఫాం–32ను నింపి ఆ బూత్‌లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయనేది రికార్డు చేస్తారు. బూత్‌లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రిసైడింగ్ ఆఫీసరు.. ఏజెంట్ నుంచి ఒక రిసీట్ కూడా తీసుకుంటాడు. ఆ రికార్డుతో ఈ రిసీట్‌ను కూడా జత చేయాలి. మరోవైపు ఆ రికార్డును ధృవీకరించడమే కాకుండా, బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేసే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు. చివరకు ఆ సీల్‌పై కూడా పోలింగ్ ఏజెంట్ సంతకం చేస్తాడు. ఈ ఉప ఎన్నికల్లో ఇవన్నీ జరిగాయా? ఈ రోజు ఎంత దారుణంగా వారు ఎన్నికలు నిర్వహించారంటే, ప్రజాస్వామ్యాన్ని ఎంతగా ఖూనీ చేశారంటే.. ఒక్కమాటలో చెప్పాలంటే అచ్చం చంబల్‌లోయ బందిపోట్ల మాదిరిగా వ్యవహరించారు. పోలీసులే దగ్గరుండి అన్నింటినీ ప్రోత్సహించారు. చంద్రబాబుకు ఇదే నా సవాల్ ⇒ మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే, వెంటనే నిన్నటి ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాలు దింపి, వారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించండి. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే, మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా? మీకు ఆ ధైర్యం లేదు. అయినా ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్‌లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది చూపుతాం. ఇలా అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుణ్ని లీడర్ అనరు. మాబ్స్టర్ లేదా ఫ్రాడ్‌స్టర్ అంటారు. ⇒ ఎంత దారుణంగా నిన్నటి ఎన్నికలు జరిగాయంటే.. ఎక్కడైనా ఏ ఊరి ఓటర్లు ఆ ఊరిలోనే ఓట్లు వేస్తారు. ఎప్పుడైనా, ఎక్కడైనా అదే జరుగుతుంది. ఓటర్లు వారి సొంత ఊళ్లలోనే ఓటేయడం సహజం. కానీ, ఇక్కడ చంద్రబాబు ఏకంగా ఒక ఊరి నుంచి మరో ఊరికి పోలింగ్ బూత్‌లు మార్చేశారు.⇒ ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, నల్లగొండవారిపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, మళ్లీ నల్లపురెడ్డిపల్లి వారు ఎర్రబల్లికి.. నల్లపురెడ్డిపల్లి నుంచి నల్లగొండవారిపల్లికి వెళ్లి ఓటు వేయాలంట. 4 కిలోమీటర్లు నడిచి వెళ్లేలా పోలింగ్ సెంటర్లు మార్చారు.⇒ దాదాపు 10,600 ఓట్లకు గాను, 4 వేల ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. స్కెచ్ అక్కడే మొదలైంది. ఇంకా వారి ఆలోచన ఏమిటంటే, ఓటర్లు 4 కిలోమీటర్లు నడిచి పోతుంటే బెదిరించాలి. దాడి చేసి అడ్డగించాలి. ఓటేయకుండా చూడాలి. నిన్న అదే జరిగింది.ఏకంగా గ్రామాలే పంచుకున్నారుఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా? టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అరాచకం సృష్టించేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత ఎర్రబల్లెలో తిష్ట వేస్తే.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి భారీగా తన అనుచరులతో నల్లపురెడ్డిపల్లెలో మకాం వేశాడు. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఇ.కొత్తపల్లిలో వందల మంది కార్యకర్తలతో మకాం వేస్తే.. బీటెక్ రవి అనే టీడీపీ నాయకుడు పులివెందుల రూరల్ ఓటరు కాకపోయినా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు. పోలింగ్ బూత్‌లకు వైఎస్సార్సీపీ ఏజెంట్లు వెళితే, వారిపై దాడి చేసి, ఫామ్‌లు లాక్కుని చింపేశారు. ఓటర్ల స్లిప్‌లు కూడా లాక్కుని వారిని వెనక్కి పంపి, వారే ఓటు వేసుకున్నారు. ఎవరైనా వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైనా, లేక తటస్థుడైనా బూత్ వైపు వస్తే టీడీపీ వారు బెదిరించి ఓటరు స్లిప్ లాక్కుని దౌర్జన్యంగా బయటకు పంపించారు.పులివెందుల మండలంలో టీడీపీ నేతల ఆగడాలను విలేకరుల సమావేశంలో వివరిస్తున్న వైఎస్ జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి⇒ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో ఇన్ని అక్రమాలతో జరిగింది ఎన్నికలేనా? అసలు ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?⇒ ఉదయం 4 గంటల నుంచే పోలింగ్ బూత్‌ల ఆక్రమణ నిజం కాదా?⇒ పులివెందుల టౌన్లో ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి అక్రమ అరెస్ట్ నిజం కాదా? నిజానికి అక్కడ ఎన్నిక లేదు. అయినా తెల్లవారుజామున అరెస్టు చేశారు.⇒ మొట్నూతలపల్లెకు 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు ఆపి, ఓటర్లను అడ్డగించడం నిజం కాదా?⇒ ఎర్రపల్లెలో మహిళలను ఓటు వేయనివ్వక పోవడం నిజం కాదా? ⇒ కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి, మంచంపై రైఫిల్ పెట్టి బెదిరించడం వాస్తవం కాదా?⇒ ఎర్రపల్లెలో రిగ్గింగ్‌కు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు స్వాగతం పలకలేదా?⇒ కనంపల్లెలో రిగ్గింగ్ జరిగిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం, బిటెక్ రవి తమ్ముడు భరత్ బెదిరింపులు నిజం కాదా?⇒ తమను ఓటు వేయనీయాలంటూ ఓటర్లు కనంపల్లెలో పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకోలేదా?⇒ పులివెందులలో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిని బయటకు రానివ్వకపోవడం నిజం కాదా?⇒ ఒంటిమిట్టలోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఓటర్లు వాపోలేదా?⇒ ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ వాళ్లు స్లిప్‌లు ఇస్తూ, దొంగ ఓట్లు వేయించలేదా?⇒ ఎన్నిక పులివెందుల రూరల్‌లో జరుగుతుంటే, పులివెందులలో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్‌కు డీఐజీ కోయ ప్రవీణ్ వెళ్లి ఎందుకు హడావుడి చేశారు? ⇒ ‘కాల్చి పారేస్తా నా కొడకా’ అంటూ డీఎస్పీ మురళి బెదిరించడం వాస్తవం కాదా?⇒ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ సెంటర్లో దౌర్జన్యం చేయలేదా? మా పార్టీ ఏజెంట్‌పై దారుణంగా దాడి జరగలేదా?⇒ చంద్రబాబూ.. నీవు నిజంగా మంచి చేశావనుకుంటే ఎందుకీ అక్రమాలు?భవిష్యత్తులో అవి మీకే చుట్టుకుంటాయి మీరు దౌర్భాగ్య పని చేస్తున్నారు. తప్పుడు వి«ధానానికి బీజాలు వేస్తున్నారు. అవే రేపు వృక్షాలు అవుతాయి. గ్రామాల్లో ఇప్పుడు మీరు తీసుకొచ్చే కక్షలు, దాడులు రాబోయే రోజుల్లో మీకే చుట్టుకుంటాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవే మీకు ఆఖరి ఎన్నికలు కావొచ్చు. ఈ వయసులో ఈ పనులేంటి? కనీసం రామ, కృష్ణ అనుకుంటే పుణ్యం వస్తుంది. ఈ విధంగా చేస్తే నరకానికి పోతావు. ఇప్పటికన్నా రవ్వంత మార్పు తెచ్చుకోమని చంద్రబాబుకు గట్టిగా హితవు పలుకుతున్నా.డమ్మీ కన్నా దారుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా, దురదృష్టవశాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) డమ్మీ కన్నా దారుణమైన పాత్ర పోషిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తోంది. ఇది చాలా దురదృష్టకరం. అందుకే కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. కోర్టులో కేసులు వేస్తాం. ఈ ఆధారాలన్నీ చూపుతాం. నిన్న పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా అందుకే ఇక్కడికి వచ్చారు. పోలీసులు పూర్తి వివక్ష⇒ ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి వైఎస్సార్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఐదు మంది కలిసి వెళ్లినా కూడా పోలీసులు తరిమి తరిమి కొట్టారు. మహిళా ఏజెంట్లపైనా దాడులు చేశారు. ఇతర నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్లు వందల మంది ఒకే చోట ఉన్నా కూడా షామియానాలు వేసుకుని, భోజనాలు చేస్తున్నా పోలీసులు వేడుక చూశారు. ⇒ ఈ ఎన్నికల కోసం పోలీసులను ఏరికోరి నియమించుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్రావు సమీప బంధువు. వరసకు అల్లుడు అవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపారు. ఆయన అచ్చంగా పచ్చ చొక్కా వేసుకుని సోమవారం రాత్రి నుంచే తనకు కావాల్సిన వారిని విధుల్లోకి తీసుకుని పులివెందులలో మకాం వేసి, ఎన్నికలు జరిపారు. యథేచ్ఛగా దోపిడీ, వాటాలు చంద్రబాబునాయుడు చేస్తున్న అవినీతిలో వీళ్లందరూ భాగస్వాములు. డీఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్లు.. మాఫియా రింగ్ లీడర్ ఎవరంటే డీఐజీ. బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి.. ఇసుక, మట్టి, ల్యాటరేట్, క్వార్ట్›జ్, సిలికా.. పేకాట క్లబ్బులు.. ఇంకా ఏ మైన్ ఉన్నా కలెక్షన్ అంతా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. వచ్చిన దాంట్లో ఎమ్మెల్యేలకు ఇంత.. చినబాబుకు ఇంత.. పెదబాబుకు ఇంత అని ఈ డీఐజీలు, డీఎస్పీలు, సీఐలు నడిపిస్తున్నారు. ఇదీ ముఠా నాయకత్వం.చంద్రబాబు మాట వినకపోతే.. ఒకవేళ పోలీసు అధికారులు ఎవరైనా చంద్రబాబు మాట వినకపోతే.. డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు కావాల్సిందే. పీఎస్ఆర్ ఆంజనేయులు జైలుకెళ్లారు. దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్‌కుమార్, అడిషనల్ డీజీ సంజయ్, విశాల్ గున్నీలపై అక్రమ కేసులు పెట్టారు. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిరాణా టాటాపై కూడా అక్రమ కేసు. ఇంకా ఎంతో మందిని సస్పెండ్ చేశారు. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. వీరు కాక నలుగురు నాన్‌క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్ కమాండెంట్లు, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్లను హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, వందలాది మంది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు.ఆనాడు ఏం జరిగిందో గుర్తుందా?2017లో నా ప్రజా సంకల్పం పాదయాత్ర మొదలు కావడానికి ముందు నంద్యాల ఉప ఎన్నికలోనూ ఇలాగే చేశారు. 27 వేలతో గెల్చి ఇక మా పార్టీ పనైపోయిందని అదేపనిగా చెప్పారు. కానీ ఏం జరిగింది? సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అదే నంద్యాలలో 35 వేలతో గెల్చాం. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రమంతా చంద్రబాబును భూస్థాపితం చేశాం. ఇంకో మూడున్నర ఏళ్ల తర్వాత ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారు. మీకు కనీసం డిపాజిట్లు కూడా రావు.ఇవిగో ఆధారాలు..⇒ ఇతర నియోజకవర్గాలు, మండలాల నుంచి వచ్చిన వారు ఎలా దొంగ ఓట్లు వేసింది.. వారు ఎవరనే పూర్తి వివరాలతో ఈ ఫొటోల్లో (ఫొటోలు చూపుతూ) చూడండి. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే వారు దొంగ ఓట్లు వేశారు. ఆ వేసింది జమ్మలమడుగుకు చెందిన (ఫొటో చూపుతూ) టీడీపీ కార్యకర్తలు దస్తగిరి, సందీప్‌కుమార్. నల్లపురెడ్డిపల్లె పోలింగ్‌బూత్‌లో వారు దొంగ ఓట్లు వేశారు. మరో ఆశ్చర్యం ఏమిటంటే, ఈ రోజు (బుధవారం) రీ పోలింగ్‌లో కూడా దొంగ ఓట్లు వేస్తున్నారు (ఆ ఫోటోలు కూడా ప్రెస్మీట్లో చూపారు). పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేరు కాబట్టి, యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు.⇒ జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ప్రకాశం, మైలవరానికి చెందిన ద్వారచర్ల జనార్ధనరెడ్డి నల్లపురెడ్డిపల్లెలో ఓటు వేశారు.⇒ పొన్నతోట మల్లికార్జున టీడీపీ జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి (చంద్రబాబుతో దిగిన ఫొటో ప్రదర్శించారు). జమ్మలమడుగు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కూడా. వీళ్లందరూ వచ్చి పులివెందులలో ఓట్లు వేశారు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ అనే వాడిని ఉండనివ్వలేదు. ఇక అడిగేవాడు లేడని దొంగ ఓట్లు వేసుకున్నారు. కలెక్టర్ రెండు చేతులు జేబులో పెట్టుకుని దొంగ ఓట్లు వేయిస్తున్నాడు.⇒ కర్మలవారిపల్లె గ్రామం టీడీపీ సర్పంచ్ మారెడ్డి చిన్నపుల్లా రెడ్డి పులివెందులలో ఓటు వేశారు. జమ్మలమడుగు మండలానికి చెందిన నాగేశ్వరరెడ్డి, అదే మండలంలోని గూడెం చెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డిలు నల్లపురెడ్డిపల్లెలో దొంగ ఓటు వేశారు.⇒ నవాబుపేట గ్రామానికి చెందిన రామస్వామిరెడ్డి, భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్, హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్, కమలదిన్నె గ్రామానికి చెందిన మంత్రి కుళ్లాయప్ప ఇలా అందరూ దొంగ ఓటర్లే. ⇒ విచిత్రంగా బుధవారం రీ పోలింగ్ జరుగుతుంటే కూడా.. కమలాపురం నియోజకవర్గానికి చెందిన నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గుజ్జల నారాయణ యాదవ్ పులివెందులలోని ఈ కొత్తపల్లిలో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డాడు. ఇలా రిపిటేషన్ పద్ధతిలో దొంగ ఓటర్లను తిప్పుకున్నారు. -
బ్యాలెట్ బాక్సులనే మాయం చేశారు: ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల ప్రక్రియను అపహాస్యంపాలు చేసేలా నిర్వహించిన ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కనీవినీ ఎరగని అరాచకాన్ని చూశామని వైఎస్సార్సీపీ ఒంటిమిట్ట జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక చిన్న జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం చంద్రబాబు ఏకంగా ఏడుగురు మంత్రులను మండలంలో మోహరించినప్పుడే మా సత్తా అర్థమైందని అన్నారు.మంత్రి రాంప్రసాద్‌రెడ్డి 300 మంది రౌడీలను వెంటేసుకుని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు 17 పోలింగ్ బూత్‌లలో తిరుగుతూ మా ఏజెంట్లపై దాడులు చేసి బయటకు పంపించారని, ఏకంగా బ్యాలెట్ బాక్సులనే మాయం చేసి రిగ్గింగ్‌కి పాల్పడ్డారని సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అరాచకాలను కళ్లారా చూసిన జాయింట్ కలెక్టర్ కానీ, ఫోన్లో ఫిర్యాదు చేస్తే జిల్లా ఎస్పీ కానీ స్పందించకపోవడం చూస్తుంటే ఎన్నికలు ఎంత లోపభూయిష్టంగా జరిగాయో అర్థంఅవుతోంది. అందుకే రీపోలింగ్ ని బహిష్కరించామని, కౌంటింగ్‌కి కూడా వైయస్సార్సీపీ హాజరుకాబోవడం లేదు. కానీ ప్రశాంతంగా ఉంటే ఒంటిమిట్టలో కోదండరాముడి సాక్షిగా మంత్రి చేసిన అరాచకాలకు తప్పకుండా గుణపాఠం నేర్పుతాం. ఒంటిమిట్ట నుంచే మంత్రి రాంప్రసాదరెడ్డి పతనం ప్రారంభమైంది.ముగ్గురు మంత్రులు మండలంలో తిష్ట వేశారుఒంటిమిట్టలో నామినేషన్ వేసింది మొదలు ముగ్గురు మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, సవిత, రాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో ప్రలోభాలు, బెదిరింపుల పర్వం నడిచింది. మరో నలుగురు మంత్రులు ప్రచారం పేరుతో మండలంలో విపరీతమైన హడావుడి చేశారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి ఒంటిమిట్ట మండలంలో పార్టీకి గట్టిగా అండగా నిలబడిన దాదాపు 50 మంది వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేశారు. అన్నీ ఎదుర్కొని ఎన్నికల రోజున ఉదయం 5 గంటలకే ఏజెంట్లను నిలబెట్టగలిగాం. కానీ కీలకమైన పార్టీ ఏజెంట్లను గుర్తించి పోలీసులే బయటకు బూత్‌ల నుంచి బయటకు గెంటేశారు.దీనిపై జిల్లా ఎస్పీకి ఉదయం 9 గంటలకు ఒకసారి, 11 గంటలకు మరోసారి ఫిర్యాదు చేయడం జరిగింది. మండలంలో ఎన్నికలు జరుగుతుంటే రాజంపేట, రాయచోటితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పోలింగ్ బూత్‌ల వద్ద యాక్టివ్‌గా తిరుగుతూ కనిపిస్తున్నారని, గొడవలు జరిగే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశాను. కొంతమంది వ్యక్తులను గుర్తించి అక్కడే ఉన్న పోలీసులకు చెప్పడం కూడా జరిగింది. అయినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా ఫిర్యాదు చేసిన మమ్మల్నే అక్కడ్నుంచి బలవంతంగా పంపించి వేశారు. పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే యూనిఫాంకే చెడ్డపేరు తెచ్చారు.17 బూత్‌లలో మంత్రి రిగ్గింగ్ చేయించాడుఉదయం 11 గంటల ప్రాంతంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి 300 మంది రౌడీలతో చిన్నకొత్తపల్లికి వచ్చి హల్ చల్ చేశాడు. 700 మంది ఓటర్లున్న చాలా చిన్న బూత్ అది. మా వారు 5 గురు ఏజెంట్లుగా ఉన్నారు. పోవడం పోవడం మా పార్టీ ఏజెంట్లను బయటకు ఈడ్చి దారుణంగా కొట్టారు. ఆ విషయం తెలిసి నేను ఈ బూత్ వద్దకు వెళితే నన్ను కూడా బెదిరించాడు. ఇదేం పద్దతని నేను ఆయన్ను నిలదీస్తే పోలీసులు నన్ను అక్కడ్నుంచి పంపించేశారు. ఆ తర్వాత మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మంటపంపల్లి అనే మరో ప్రాంతానికి వెళ్లి అక్కడా అంతే.వందల మంది రౌడీలతో వెళ్లి మా ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టిపడేశారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తనకు సంబంధం లేని ప్రాంతానికి వచ్చి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ఆయనకు చిన్నకొత్తపల్లిలో ఓటు కూడా లేదని జాయింట్ కలెక్టర్‌కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని నేను మా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డికి చెప్పడం జరిగింది. ఆయనతో కలిసి నేను మంటపంపల్లెకి వెళ్లేసరికి అక్కడ బాక్సుల్నే మాయం చేశారు.పోలింగ్ బూత్ ఖాళీగా ఉంది. మాతోపాటే వచ్చిన జాయింట్ కలెక్టర్‌కి కూడా జరిగిన విషయాన్ని చెబితే ఆమె కూడా కళ్లారా చూశారు. ఆ తర్వాత ఆమె కూడా అక్కడ్నుంచి మెల్లిగా జారుకున్నారు. మంత్రిని అడ్డుకోవడానికి మేం ప్రయత్నిస్తుంటే పోలీసులు వెళ్లనీయకుండా మా కార్లను అడ్డుకుంటున్నారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 17 పోలింగ్ బూత్‌లల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నాడు.కౌంటింగ్‌ను కూడా బహిష్కరిస్తున్నాంప్రజాస్వామ్యంలో నిన్నటి రోజు ఒక చీకటి దినం. ప్రశాంతంగా ఉన్న మండలంలో మంత్రి అరాచకం సృష్టించాడు. ఏడాది తర్వాత అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరిగితే ఆయన ఇదే విధంగా చేయగలడా? భవిష్యత్తులో టీడీపీకి ఏజెంట్లు కూడా ఉండరు. మంత్రి బెదిరింపులకు నేను వెనక్కి తగ్గేదే లేదు. చిన్న మండలంలో సొంతంగా గెలవలేక 780 మంది పోలీసులను తెచ్చుకున్నారు. మంత్రి అండ చూసుకుని నన్ను భూస్థాపితం చేస్తానని అన్నోళ్లు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి.పులివెందుల, ఒంటిమిట్టలో జరిగింది ఎన్నికే కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు. రీపోలింగ్‌ను బహిష్కరించాం. కౌంటింగ్‌ను కూడా బహిష్కరిస్తున్నాం. మీ ఇష్టమైన మెజారిటీ రాసుకోండి. రాబోయే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తాం. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అనుసరించిన తీరుని రాష్ట్ర ప్రజలంతా చూశారు. భవిష్యత్తులో మంచి గుణపాఠం చెబుతారు. కోదండరాముని సాక్షిగా చెబుతున్నా ఈ జడ్పీటీసీ ఎన్నిక మంత్రి పతనానికి ఆరంభం. -
YSRCP ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వకుండా బెదిరింపులు
-
టీడీపీ సంబరాల్లో రంకెలు వేసిన ఎడ్లు
-
టీడీపీ సంబరాల్లో రంకెలు వేసిన ఎడ్లు