సాక్షి,అనంతపురం: కల్యాణ దుర్గలో టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. కూటమి సర్కార్ తనని వేధిస్తోందంటూ తన కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
కూటమి సర్కారు తనకు కుటుంబానికి అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ కార్యకర్త శివకుమార్, తన కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు బాధితుణ్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శివకుమార్‌కు డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. ఓ కేసులో కూటమి నేతలు తన కుటుంబాన్ని అక్రమంగా ఇరికిస్తున్నారని శివకుమార్ తన సెల్ఫీ వీడియోలో ఆరోపణలు చేశాడు.


