kalyana durgam
-
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
సాక్షి, అనంతపురం: చంద్రబాబుది ఊసరవెళ్లి రాజకీయమని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారని ప్రశ్నించారు. మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడని మండిపడ్డారు. ఆరునూరైనా ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. కల్యాణదుర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళ్యాణదుర్గం సిద్ధమేనా.. టైము రెండు కావస్తోంది. ఎండలు చూస్తే తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఏ ఒక్కరూ కూడా ఎండను ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్యే ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలను పంచి పెడుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ,ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, నా ప్రతి స్నేహితుడికీ ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం.కేవలం మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కానేకావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడం. ఇదే చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్ధం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే? పొరపాటున చంద్రబాబు నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతిఒక్కరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్దం చెప్పిన మీ జగన్.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలలో మీ బిడ్డ ఈ 59 నెలల్లో గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా ఈరోజు రూ.2.70 లక్షల కోట్లు, మళ్లీ చెబుతున్నాను రూ.2.70 లక్షల కోట్లను నేరుగా బటన్ నొక్కడం, వివిధ పథకాలకు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకే, వారి చేతికే ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా పంపించాడు అని ఈ సందర్భంగా సగర్వంగా చెబుతున్నాను. నేను అడుగుతున్నాను.. ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఏం అన్నా గతంలో జరిగిందా? అక్కా ఈ మాదిరిగా జరిగిందా? ఈమాదిరిగా బటన్లు నొక్కడం నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్లిపోవడం.. గతంలో ఎప్పుడైనా చూశామా? అని మీబిడ్డ అడుగుతున్నాడు. ఏకంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు, గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన వ్యక్తి మీ జగన్. ఇలా అర్థం చెప్పిన పాలన కేవలం ఈ 59 నెలలకాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. గతంలో మేనిఫెస్టోలను ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో రిలీజ్ చేసి రంగురంగుల అబద్ధాలు చెప్పి ఆ తర్వాత చెత్తబుట్టలో వేసే సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా మార్చింది ఈ 59 నెలలకాలంలోనే కాదా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ప్రతీదీ ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో జరగనివిధంగా నాడు-నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్లు, గవర్నమెంట్ బడులల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూములో కూడా డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచి ప్రతి పిల్లాడి చేతిలోనూ ఈరోజు ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి, ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3 తరగతి నుంచే పిల్లలకు టోఫెల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, ఇంగ్లీష్ మీడియంతో మొదలుపెడితే ఐబీ దాకా ఈరోజు ప్రయాణం జరుగుతోంది. ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ అంటే పిల్లల టెక్స్ట్ బుక్కుల్లో ఒక పేజీ ఇంగ్లీష్ మరో పేజీ తెలుగుతో పిల్లల చేతుల్లో కనిపిస్తున్నాయి. బడులు తెరిచే టైమ్‌కే పిల్లలకు విద్యాకానుక అందుతోంది, బడులు మొదలయ్యేసరికే పిల్లలకు గోరుముద్ద అనే కార్యక్రమంతో పిల్లలను చూసుకుంటున్నాం, ఈరోజు నేను అడుగుతున్నాను.. మొట్టమొదటిసారిగా తల్లులను ప్రోత్సహిస్తూ తమ పిల్లలను బడికి పంపండి చాలు బడికి పంపించినందుకు తల్లులకు ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి అనే కార్యక్రమం,పెద్ద చదువులకు ఏ తల్లి, తండ్రి కూడా తమ పిల్లలను చదివించేందుకు ఇబ్బంది పడకూడదని, అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని పెద్ద చదువులకు పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన అనే కార్యక్రమం, ఇంటర్నేషనల్ యూనివర్శిటీస్‌తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను మన డిగ్రీలతో అనుసంధానం, డిగ్రీలో ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయడం ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగిందా? పిల్లల చదువుల మీద ప్రభుత్వం ఇంత ధ్యాస పెట్టడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఏం అన్నా గతంలో జరిగిందా? అక్కా గతంలో జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా తమ్ముడూ?.అక్కచెల్లెమ్మలు ఆర్దిక స్వావలంబన దిశగా...మొట్టమొదటిసారిగా అక్కచెల్లెమ్మలను తమ కాళ్ల మీద తాము నిలబడేట్టుగా ఆ అక్కచెల్లెమ్మలకు ఓ ఆసరా, ఓ సున్నావడ్డీ,చేయూత, కాపునేస్తం,ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, అందులో చేపట్టిన ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇక్కడున్న ఇన్ని వేలమంది నా అన్నదమ్ములను, నా అక్కచెల్లెమ్మలను అడుగుతున్నాను.. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు అందాయా? అన్నా జరిగాయా? జరిగాయా అక్కా? జరిగాయా తమ్ముడూ?.గతంలో లేని విధంగా రైతన్నను చేయిపట్టుకుని నడిపించాం.అవ్వాతాతలకు గతంలో ఎప్పుడూ జరగనివిధంగా అవ్వాతాతలకు నేరుగా ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్, ఇంటివద్దకే పౌర సేవలు, ఇంటివద్దకే రేషన్, ఇంటివద్దకే పథకాలు.. నేను అడుగుతున్నాను ఇప్పుడిలా జరుగుతున్న కార్యక్రమాలు ఇంటికే పెన్షన్, ఇంటివద్దకే రేషన్, ఇంటికే పౌర సేవలు, ఇంటికే పథకాలు ఇలా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం.. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? అని అడుగుతున్నాడు మీబిడ్డ. అన్నా జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడూ? జరిగిందా అక్కా? మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా రైతన్నలకు ఈరోజు పెట్టుబడికి సహాయంగా ఓ రైతుభరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్, రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ.. నేను అడుగుతున్నాను ఇంతగా రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్న పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని అడుగుతున్నాడు మీబిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడూ? జరిగిందా అక్కా.స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ.. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనివిధంగా ఆటోలు, ట్యాక్సీలు తోలుకునే నా అన్నదమ్ములకు ఈరోజు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులకు మత్స్యకారభరోసా,చిరువ్యాపారులకు, శ్రమజీవులకు అండగా ఓ తోడు, చేదోడు, లాయర్లకు కూడా లా నేస్తం.. ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఇచ్చారా? అని మీబిడ్డ అడుగుతున్నాడు .పేదవాడు ఆరోగ్యం పరంగా అప్పులపాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని, పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఏకంగా రూ.25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆపరేషన్ తర్వాత కూడా రెస్ట్ పీరియడ్ లో కూడా ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఈరోజు ప్రతి ఇంటి తలుపు తడుతూ కూడా ఈరోజు ఇంటికే ఓ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం.. నేను అడుగుతున్నాను పేదవాడికి ఆరోగ్యంపట్ల ఇంత శ్రద్ధ చూపిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. వీటన్నింటికీ తోడు ఏకంగా 600 రకాల సేవలు అందిస్తూ ప్రతి గ్రామంలోనూ ఈరోజు గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ, నాలుగు అడుగులు అక్కడి నుంచి వేస్తే అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, మరో నాలుగు అడుగులు ముందుకుపోతే అదే గ్రామంలో నాడు-నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి అక్కడే కనిపిస్తుంది, గ్రామానికే ఈరోజు ఫైబర్ గ్రిడ్ వచ్చింది, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మొట్టమొదటిసారిగా నా అక్కచెల్లెమ్మలకు రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, నా అక్కచెల్లెమ్మలకు రక్షణగా ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనే ఓ దిశ యాప్ కనిపిస్తోంది. నేడు అడుగుతున్నాను.. ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్లెదుటే ఈరోజు కనిపిస్తున్నాయి. ఈ విప్లవాలు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కూడా చూశారా? అని కూడా మీ బిడ్డ అడుగుతున్నాడు. ఈ మాదిరిగా ఇంటికే వచ్చే పాలన, లంచాలు వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీబిడ్డ అడుగుతున్నాడు . మరోవంక చూడండి.. చంద్రబాబు 14 ఏళ్లు, ౩ సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానంటాడు. ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. మీలో ఏఒక్కరికైనా కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్న ఈ చంద్రబాబు మీలో ఒక్కరికైనా కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా మీకు గుర్తుకొస్తుందా అని అడుగుతున్నాడు మీబిడ్డ. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు మరి అలాంటి వ్యక్తి పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా? ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.ఒక్క హామీని అమలు చేయని బాబు.అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు చెబుతాడు, మోసాలు చేస్తాడు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి 2014లో ఆయన ముఖ్యమైన హామీలు అనంటూ ఆయన మీ ప్రతిఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూశారా? (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) అని అడుగుతున్నాను. గుర్తుందా అన్నా ఈ పాంప్లెట్? ఈ పాంప్లెట్ గుర్తుందా తమ్ముడూ? అక్కా ఈ పాంప్లెట్ గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తోందా? 2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ ఈ పాంప్లెట్ పంపించాడు. పంపించిన తర్వాత 2014లో చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలంతా ఓట్లు వేశారు. వేసిన తర్వాత చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతున్నా. 2014లో చంద్రబాబు ముఖ్యమైన హామీలంటూ సంతకం పెట్టి ఇదే కూటమిగా మారి ఇదే కూటమిగా తాను ఈ ఫొటోలు పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పిన హామీలు ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా? అని అడుగుతున్నాడు మీబిడ్డ.చంద్రబాబు విఫల హామీలు.ఇందులో చెప్పిన హామీలు.. మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతున్నా రూ.87,612 కోట్ల మేర రైతుల రుణమాఫీ జరిగిందా? అని అడుగుతున్నాడు మీబిడ్డ. రెండో హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో రెండో హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ అన్నాడు. అక్కా పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు మరి పొదుపు సంఘాల రుణాలు ఏకంగా రూ.14,205 కోట్ల డ్వాక్రా సంఘాల రుణాలు ఇందులో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఇన్నివేల మంది ఉన్నారు నేను అడుగుతున్నారు మీ ఇళ్లల్లో ఏ ఒక్కరికైనా కూడా రూ.25 వేల కథ దేవుడెరుగు, ఒక్క రూపాయి అయినా బ్యాంకుల్లో వేశాడా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి నెలనెలా అన్నాడు. ఐదేళ్లు ఆయన పరిపాలన చేశాడు 60 నెలలు, అంటే రూ.1.20 లక్షలు ఇక్కడున్నవాళ్లల్లో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? అర్హులందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను అడుగుతున్నాను ఇక్కడ ఇన్ని వేలమంది ఉన్నారు. అన్నా నేను అడుగుతున్నా?, అక్కా నేను అడుగుతున్నా ? మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా?.రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తామన్నారు చేసిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, నిర్మించాడా? కళ్యాణదుర్గంలో కనిపిస్తోందా ? మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ ఈ పాంప్లెట్ పంపించి... 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? అనిమీబిడ్డ అడుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా? మళ్లీ కొత్త మేనిఫెస్టోతో వస్తున్న బాబు.మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఇదే వ్యక్తి, ఇప్పుడు ఏమంటున్నాడు ఇదే చంద్రబాబు.. మళ్లీ కొత్త మేనిఫెస్టో అంటున్నాడు. సూపర్ సిక్స్ అంటున్నారు నమ్ముతారా? అన్నా నమ్ముతారా? తమ్ముడూ నమ్ముతారా? అక్కా నమ్ముతారా? నమ్ముతారా అమ్మా? సూపర్ సెవెన్ అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు నమ్ముతారా? అక్కా నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారమంట నమ్ముతారా? ఇంటింటికీ బెంజి కార్ కొనిస్తారట నమ్ముతారా? అన్నా నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతున్నా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క పేదవాడికి కూడా ఏ ఒక్క మంచి చేయలేదు. 14 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఏ ఒక్కపేదవాడికి ఏ రోజూ కూడా ఏ స్కీమూ తీసుకొచ్చి ఏ పేదవాడికి మంచి చేసిన పుణ్యం కట్టుకోలేదు చంద్రబాబు. ఆయన జీవితమంతా కూడా మోసాలు, ఆయన జీవితమంతా కూడా అబద్ధాలు. ఆయనకు అధికారం వచ్చిన ప్రతీసారి కూడా పేదవాడు బాగు పడింది లేదు. అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తూ ఆయన చేసిందేమిటంటే దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చంద్రబాబు చేశాడు.మంచి కొనసాగాలంటే ఫ్యానుకే ఓటేయండి.కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండి ఉన్నాయి. మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బుల్లేవు. కానీ చంద్రబాబు ఆ బటన్లు నొక్కలేదు పేదవాడికి డబ్బులు ఇచ్చింది లేదు పేదవాడికి స్కీములు ఇచ్చింది లేదు. చంద్రబాబు చేసిందల్లా అదే డబ్బు మీకు ఇవ్వాల్సిన డబ్బును తాను దోచుకున్నాడు, దోచుకున్నది పంచుకున్నాడు. కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బులోనుంచి ఓటుకు రూ.2వేలు, 3వేలు ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో ఓటుకు రూ.4వేలు కూడా ఇస్తాడు. చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరూ ఆ డబ్బులు వద్దు అని చెప్పొద్దు. ఎందుకంటే ఆ డబ్బు అంతా మనదే. మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీలో ప్రతిఒక్కరూ కూడా ఆలోచన చేయండి. మీ ఇంటికి వెళ్లండి. మీ భార్యలతో కూర్చొండి, మీ ఇంట్లో ఉన్న అవ్వాతాతలతో మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న మీ చిన్నపిల్లలతో కూడా మాట్లాడండి. ఓటు లేదు కదా అని పిల్లలను పెట్టొద్దు. వాళ్లతో కూడా మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి. మీ ఆడపడుచులతో మాట్లాడండి. అందరితో కూడా మాట్లాడి ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. ఎవరు ఉంటే మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరిగింది? మీకు మంచి జరిగింది? ఆ మంచి కొనసాగాలంటే ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మిమ్మల్ని ఓటు వేసే విషయంలో ఈ ఆలోచన చేసిన తర్వాతనే ఓటు వేయండి అని మాత్రం మీఅందరితో కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను.ఇది విన్నవించుకుంటూ వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ రూ.3వేలు మళ్లీ ఇంటికే రావాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్లీ మీకు రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు.. రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు... సిద్ధమేనా?మన గుర్తు ఫ్యాను. ఇక్కడో, అక్కడో, ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే..మన గుర్తు ఫ్యాను. ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ తమ్ముడూ, అక్కా మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అవ్వా మన గుర్తు ఫ్యాన్, తాత మన గుర్తు ఫ్యాన్.. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింకులోనే ఉండాలి.మన అభ్యర్ధులను ఆశీర్వదించండి.మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగయ్యను మీకు పరిచయం చేస్తున్నాను. మీలో ఒకడు, వెనుకబడిన కులాలకు సంబంధించిన వాడు, మంచివాడు, సౌమ్యుడు.. నేను ఇంతకు ముందే చెప్పా.. చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. బాబు ఇచ్చే రూ.2 వేలకో, రూ.3 వేలకో పొరపాటున మోసపోకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. జగన్ మళ్లీ ఉంటేనే ప్రతినెల కేలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందో ముందే చెప్పి ప్రతి నెలా ఇదుగో ఈనెల రైతు భరోసా, ఇదిగో ఈనెల అమ్మఒడి, ఇదిగో ఈనెల చేయూత అంటూ ప్రతి సంవత్సరమూ..ఐదు సంవత్సరాలూ ప్రతి పథకమూ కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే రూ.2వేలకు, రూ.3వేలకు మోసపోవద్దండీ. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే..ప్రతి నెలా ప్రతి ఇంట్లో పండుగే అని గుర్తుపెట్టుకోండి. ఈ పథకాలన్నీ కొనసాగాలి అంటే...మళ్లీ జగనే రావాలి..జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంపీ అభ్యర్థిగా శంకరన్న నిలబడుతున్నాడు. తాను కూడా మీలో ఒకడు. వెనుకబడిన కులాలకు సంబంధించిన వాడు. మంచివాడు సౌమ్యుడు, మంచి చేస్తాడు. మీరు ఇక్కడ నొక్కే బటన్ ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి. మీ బిడ్డ పెన్షన్లు ఇంటికి నేరుగా పంపుతా ఉంటే అడ్డుకున్న ఢిల్లీదాకా సౌండ్ వినిపించాలి. మీ బిడ్డ బటన్లు నొక్కితే అడ్డుకున్న ఢిల్లీదాకా సౌండ్ వినిపించాలి. అంత గట్టిగా ఖచ్చితంగా సౌండ్ వినిపించేట్లుగా మీ మెజారిటీతో ఇద్దరినీ గెలిపించాలని సవినయంగా మీఅందర్నీ రెండు చేతులు జోడించి పేరుపేరునా మీబిడ్డ ప్రార్థిస్తున్నాడు అంటూ ముఖ్యమంత్రి శ్రీ.వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల బరితెగింపు
-
అంబులెన్స్ వచ్చినా.. దారివ్వని చంద్రబాబు!
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డుకు అడ్డంగా చంద్రబాబు ప్రచార రథం నిలిపారు. అంబులెన్స్ వచ్చినా.. చంద్రబాబు దారివ్వలేదు. అంతేగాక 108 అంబులెన్స్‌ను టీడీపీ నేతలు వెనక్కి పంపారు. కళ్యాణదుర్గం పట్టణంలోని టీ-సర్కిల్లో ఈ ఘటన చోటుచేసుకోగా.. టీడీపీ నేతల దౌర్జన్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహా మనిషి వైఎస్సార్: సీఎం జగన్
Updates: ►తెలుగు రైతుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహా మనిషి వైఎస్సార్: సీఎం జగన్ ►వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం ►ఏ పథకం చూసిన గుర్తుకొచ్చే నేత వైఎస్సార్ ►వైఎస్సార్ పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు గుర్తొస్తాయి. ►దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంటబీమా పరిహారం జమ చేస్తున్నాం ►2022 ఖరీఫ్ బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం ►రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకులబ్ధి చేకూరనుంది. ►ఐదేళ్లలో చంద్రబాబు బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు ►మేము అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించింది రూ. 7,802 కోట్లు ►గ్రామస్థాయిలోనే ఆర్బీకేలు తీసుకొచ్చి రైతులకు సేవలు అందిస్తున్నాం. ►అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సీఎం జగన్ చేరుకున్నారు. వైఎస్సార్ రైతు దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడారు. 2022 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారాన్ని అందించారు. ►అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. కాసేపట్లో వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొనున్నారు. 2022 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో నిర్వహించే వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొననున్నారు. ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 2022– ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 10.2 లక్షల మందికి రైతులకు లబ్ధి కలిగిస్తూ రూ.1,117 కోట్ల బీమా పరిహారం విడుదల చేస్తారు. తద్వారా ఒక్క అనంతపురం జిల్లాలోనే 1,36,950 మంది రైతులకు రూ.212.94 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. అనంతరం సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత వైఎస్సార్ జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. నేటి నుంచి 10వ తేదీ వరకు ఆ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని మహానేతకు నివాళులర్పిస్తారు. 9న గండికోటకు సీఎం జగన్ ఈనెల 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండికోట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ వ్యూ పాయింట్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్ ఆఫీసు భవనాన్ని, రాణితోపులో నగరవనాన్ని, గరండాల రివర్ ఫ్రెంట్ వద్ద కెనాల్ డెవలప్మెంట్ ఫేజ్–1 పనులను, పులివెందులలో నూతనంగా నిర్మించిన (వైఎస్సార్ ఐఎస్‌టీఏ) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏపీ కార్ల్‌లో న్యూటెక్ బయో సైన్సెస్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమికి ప్రారం¿ోత్సవం చేస్తారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకుంటారు. 10వ తేదీ ఉదయం 9 గంటలకు కడపలోని రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్ ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కొప్పర్తిలో పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీడీపీ, జనసేన పార్టీలు కనుమరుగు అవ్వడం ఖాయం : మంత్రి ఉషశ్రీ చరణ్
-
కళ్యాణదుర్గంలో కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో ఇరువర్గాలతో మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్,పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి పవన్‌రెడ్డి సమావేశమయ్యారు. మాటామాటా పెరిగి ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. -
సర్పంచ్ బరిలో బామ్మ!
కళ్యాణదుర్గం రూరల్: ఏకంగా ఏడు పదుల వయస్సులో ఓ బామ్మ సర్పంచు బరిలో నిలబడింది. ఎక్క డో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కాదు. కళ్యాణదుర్గం మండలంలో నూతన పంచాయతీగా ఆవిర్భవించిన పీటీఆర్ పల్లి తండాకు సర్పంచ్ అభ్యర్థిగా సుగాలి సీతమ్మతో స్థానికులు బుధవారం నామినేషన్ వేయించారు. ఈ విషయంలో ఆమెను అన్ని విధాలుగా భర్త శంకర్‌నాయక్ ప్రోత్సహించారు. మొట్టమొదటి సారి పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని పెద్దావిడకు కట్టబెట్టేందుకు ఏకగ్రీవం చేయాలని తండావాసులు భావిస్తున్నారు. (చదవండి: పురోహితులకు డిమాండ్) -
ఆగంతకుడు ఫోన్: ఎమ్మెల్యే ఉషశ్రీ చాకచక్యం
అనంతపురం : అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులనే కాకుండా ప్రజాప్రతినిధులను సైతం తమ బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. పీఎమ్ఈజీపీ రుణాలు ఇప్పిస్తామని ఏకంగా ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించే యత్నం చేశాడు. ఈ పథకం కింద మూడు కోట్ల రుణం కావాలంటే తొలుత రెండు లక్షల రూపాయలను డిపాజిట్ చేయాలని మోసం చేసే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే ఎమ్మెల్యేకు అనుమానం రావడంతో చాకచక్యంగా వ్యవహరించి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. ఇదంతా మోసమని తేలటంతో ఎమ్మెల్యే ఉషశ్రీ కళ్యాణదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆగంతకుడు ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి విచారణ చేపట్టారు. -
కళ్యాణదుర్గ్ భవనం.. రఘువీరాకు భయం
సాక్షి, కళ్యాణదుర్గం : ఎన్నికల వేళ రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు చాలా కామన్. నామినేషన్ దగ్గర నుంచి ప్రచారం వరకూ ఒక్కొక్కరూ ఒక్కో సెంటిమెంట్‌ను నమ్మడం చూస్తుంటాం. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డికి మాత్రం వాస్తు సెంటిమెంట్ ఉంది. తాను మంత్రిగా ఉన్న సమయం లో కళ్యాణదుర్గంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించుకున్న సొంత భవనం (కళ్యాణదుర్గ్ భవనం) ఆయనకు అచ్చిరాలేదంట. అందుకే ఇప్పుడు కళ్యాణదుర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన ఆయన ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే కార్యాలయం ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. పార్వతి నగర్లో అద్దెకు తీసుకున్న భవనంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆ ఇంటి వాస్తే కారణమట! 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రఘువీరారెడ్డి మంత్రి పదవులు కూడా చేపట్టారు. అదే సమయంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పెద్ద భవంతిని నిర్మించారు. మహా నేత వైఎస్సార్ అకాల మరణం అనంతరం.. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడగా ఆ సమయంలో జరిగిన పోరాటాలతో మంత్రిగా ఉన్న రఘువీరా ఉక్కిరిబిక్కిరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో ఆయన పెనుకొండకు మకాం మార్చారు. అక్కడ ఘోరంగా ఓడి పోయారు. పీసీసీ అధ్యక్షుడి పదవి దక్కించుకున్న ఆయన.. రాష్ట్రంలో ము ఖ్యమైన నేతలనూ కాపాడుకోలేకపోయారు. కేవలం వాస్తు సరిగాలేని ఇంట్లో ఉండటం వల్లే ఇవన్నీ జరిగాయని ఆయన భావిస్తున్నారు. ఐదేళ్ల పాటు చుట్టపు చూపుగా కళ్యాణదుర్గం వచ్చి వెళ్లిన ఆయన... 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయడానికి సిద్ధమయ్యారు. కళ్యాణదుర్గం భవనానికి వాస్తు సరిగా లేదని పార్వతి నగర్లో అద్దె భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యకలాపాలు నడుపుతున్నారు. అక్కడినుంచే ఆర్ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. -
రఘువీరా దొంగాట
సాక్షి, కంబదూరు: సార్వత్రిక ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత పరిచయాలు.. టీడీపీతో చీకటి ఒప్పందం గెలుపు తీరాలకు చేరుస్తాయని భ్రమపడిన ఆయనకు వాస్తవం బోధపడింది. ప్రజల్లో వైఎస్సార్సీపీకి లభిస్తున్న ఆదరణ.. ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ దూసుకుపోతున్న తీరుతో రఘువీరా చీకటి రాజకీయాలకు సిద్ధమయ్యారు. ఎలాగైనా వైఎస్సార్సీపీ వర్గీయులను తన వైపునకు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్యాకేజీలు ఎర వేస్తూ.. అరచేతిలో వైకుంఠం చూపుతూ మంతనాలు మొదలు పెట్టారు. నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ వర్గీయులకు రఘువీరాతో పాటు ఆయన వర్గీయులు ఫోన్లు చేస్తూ పార్టీ మారాలనే ఒత్తిళ్లు తీవ్రతరం చేశారు. అయినప్పటికీ ససేమిరా అంటుండటంతో ఆయనే స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి బతిమలాడుతున్నారు. ఈ కోవలోనే గురువారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో కంబదూరు మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ దళిత నేతలు సీహెచ్ నరసప్ప, మల్లేష్, మల్లికార్జునతో పాటు మరికొందరి ఇళ్ల వద్దకు రఘువీరారెడ్డి వెళ్లారు. పడుకున్న వాళ్లను నిద్ర లేపి పార్టీలో చేరాలని బలవంతపెట్టారు. వాళ్లంతా పార్టీ మారబోమని స్పష్టం చేసినా బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఫొటోలు తీయించారు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయించి వైఎస్సార్సీపీ శ్రేణులు పార్టీ మారుతున్నారనే సంకేతాలు పంపే ప్రయత్నం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది. -
రఘువీరారెడ్డికి చంద్రబాబు ఆశీస్సులు!
సాక్షి, అనంతపురం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ-కాంగ్రెస్ మైత్రి ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన బంధం తేటతెల్లం కాగా ...తాజాగా టీడీపీ-కాంగ్రెస్ బంధం కూడా మరోసారి బయటపడింది. తెలంగాణలో ఏర్పడిన ఆ రెండు పార్టీల బంధం...ఏపీలోనూ పునరావృతమైంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డిని గెలిపించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని స్థానికేతరుడైన ఓ డమ్మీ అభ్యర్థిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బరిలోకి దించారు. అంతటితోనే ఆగకుండా...రఘువీరా రెడ్డిని గెలిపించాల్సిందిగా తమ పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇవ్వడంతో కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. స్వార్థ రాజకీయాల కోసం సొంత పార్టీ అభ్యర్థినే ఓడించమని చెప్పడం ఏమిటని వాడివేడి చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, అభ్యర్థిగా తాను ప్రకటించిన అమిలినేని సురేంద్రను కాదనుకున్న చంద్రబాబు...అనూహ్యంగా ఉరవకొండకు చెందిన ఉమా మహేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రాహుల్ గాంధీ సూచనలతోనే రఘువీరాను గెలిపించేందుకే స్థానికేతరుడైన ఉమా మహేశ్వరరావుకు చంద్రబాబు టికెట్ ఇచ్చారని సాక్షాత్తు టీడీపీ వర్గాలే చెప్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థికి ఎలా సహకరించాలని స్థానిక టీడీపీ నేతలు పట్టుకుంటున్నారు. మరోవైపు టీడీపీ-కాంగ్రెస్ అంతర్గత పొత్తుపై అనంతపురంలో చర్చనీయాంశంగా మారింది. -
రఘవీరాకు చంద్రబాబు లిఫ్ట్!
-
పాపం..పసివాళ్లు
సాక్షి, కళ్యాణదుర్గం: నెల వ్యవధిలో అనారోగ్యం కారణంగా దంపతులిద్దరూ మృతి చెందడంతో అభం..శుభం తెలియని వారి పిల్లలు అనాథలుగా మారారు. వివరాల్లోకి వెళితే..వీరేష్, జయలక్ష్మి దంపతులు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో అద్దె ఇంట్లో నివసిస్తుండేవారు. కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవారు. అయితే ఫిబ్రవరి 20వ తేదీన అస్వస్థతకు గురై వీరేష్ మృతి చెందాడు. భర్త పోయిన బాధలో ఉన్న జయలక్ష్మికి గత వారం పురిటినొప్పులు వచ్చాయి. దీంతో స్థానికులు ఆమెను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నాటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండేది. బుధవారం అక్కడే మృతి చెందింది. దీంతో ఆమె కుమార్తెలు నవ్య(2), ఇటీవల పుట్టిన చిన్నారి అనాథలుగా మారారు. ప్రస్తుతం వీరేష్ సోదరి సరస్వతి వీరి ఆలనా పాలనా చూసుకుంటోంది. జయలక్ష్మి మృతదేహం వద్ద బంధువుల రోదనలు చూపరులను కలిచివేశాయి. అనాథలుగా మారిన చిన్నారులను దాతలు ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. -
పాతకక్షలతో ఇంటికి నిప్పు పెట్టి..
కల్యాణదుర్గం: అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం మండలంలో పాత కక్షలతో దుండుగులు ఓ వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన మండలంలోని మల్లికార్జునపల్లెలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రసాద్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇళ్ళు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సమయంలో అప్రమత్తమైన ఇంట్లో వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఇంటితో పాటు సామగ్రి, నిల్వ ఉంచిన రూ.1.50 లక్షల విలువ చేసే పొగాకు పూర్తిగా కాలిపోయాయి. మొత్తం రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. పాతకక్షలను మనస్సులో పెట్టుకుని గ్రామానికి చెందిన వారే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. -
గొర్రెలు మందపైకి దూసుకెళ్లిన టెంపో..
కల్యాణదుర్గం(అనంతపురం జిల్లా): కల్యాణదుర్గం శివారులోని రాయదుర్గం రోడ్డులో గురువారం ఉదయం ఓ గొర్రెల మందపైకి టెంపో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 16 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 5 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ గొర్రెలు కమ్మదూరు మండలం కురుకులపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులుగా గుర్తించారు. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్‌స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కల్యాణదుర్గం: తనకు జీవనోపాధి నిచ్చే ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారంటూ ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ఎం.వెంకటంపల్లికి చెందిన సోమ శేఖర్(36) చెందిన ట్రాక్టర్ ను మూడు రోజుల క్రితం అధికారులు సీజ్ చేసి, స్టేషన్లో ఉంచారు. తన ట్రాక్టర్‌ను విడిపించుకోవటానికి సోమశేఖర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మనస్తాపం చెందిన అతడు శుక్రవారం మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై పురుగు మందు తాగాడు. గమనించిన పోలీసులు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. -
అనుమానాస్పదంగా మహిళ మృతి
కళ్యాణదుర్గం(అనంతపురం): అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మొదిగల్ గ్రామ సమీపంలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. గ్రామానికి చెందిన శివమ్మ(34) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు గ్రామ సమీపంలోని రామప్ప కొండపై అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ వంటిపై బట్టలు లేకపోవడంతో.. అత్యాచారం అనంతరం హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
15 మంది మట్కా బీటర్లు అరెస్ట్
కళ్యాణదుర్గం(అనంతపురం): అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజక వర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జూదాలు నిర్వహిస్తున్న 15 మంది మట్కా బీటర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1.13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో మట్కా బీటర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి 15 మందిని అరెస్ట్ చేశారు. -
జీతాలు అందక అంగన్వాడీ ఆత్మహత్య
అనంతపురం : ప్రభుత్వం అంగన్వాడీలకు గౌరవజీతాలు అందించకపోవడంతో ఒక అంగన్వాడీ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతరపురం జిల్లా కళ్యాణదుర్గం మారెంపల్లిలో శుక్రవారం జరిగింది. వివరాలు..మారెంపల్లికి చెందిన సుశీలమ్మ(45) బెలుసప్త మండలంలోని యలగలవంక తండాలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక శుక్రవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతురాలి కుమారుడు కడప రిమ్స్‌లో వైద్య విద్య చదువుతున్నాడు. కొడుకు పరీక్ష ఫీజు కట్టే స్థితిలో లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్యహత్య కు పాల్పడిందని స్తానికులు తెలిపారు. (కళ్యాణదుర్గం) -
స్టేట్ బ్యాంక్‌లో చోరీకి యత్నం
అనంతపురం : స్టేట్ బ్యాంక్‌లో చోరికి దుండుగులు విఫలయత్నం చేశారు. బ్యాంక్ లోని అలారం మొగడంతో వారు పరారయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్టేట్ బ్యాంక్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గోడ పెకిలించి బ్యాంకు లోపలికి ప్రవేశించిన దుండగులు మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత స్ట్రాంగ్‌రూంను తెరవడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా అలారం మోగింది. స్థానికులు ఎవరైన వస్తారేమోననే.. భయంతో దుండగులు పరారయ్యారు. సోమవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది విషయాన్ని మేనేజర్ రాంప్రసాద్‌కు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్‌టీంతో సహా సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాధమిక దర్యాప్తు చేపడుతున్నారు. (కళ్యాణదుర్గం) -
కళ్యాణదుర్గంలో అగ్ని ప్రమాదం: రూ.5లక్షల ఆస్తి నష్టం
అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి బ్యాంగిల్ షాపు స్టోర్ రూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.5 లక్షల విలువచేసే వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. -
70 తులాల బంగారు నగల చోరీ
కళ్యాణదుర్గం రూరల్ : కళ్యాణదుర్గంలో శుక్రవారం రాత్రి ఓ ఇంటిలో 70 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని జయనగర్ కాలనీకి చెందిన శివశంకర్ మునిసిపల్ కార్యాలయ సమీపంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అనారోగ్యానికి గురైన కూమార్తెను తీసుకొని గురువారం భార్యతో కలిసి విజయవాడ వెళ్లాడు. పసిగట్టిన దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా ధ్వంసం చేసి చోరీ చేశారు. ఇంటి తలుపులు తెరచి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు శివశంకర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న దంపతులు లోపలకు వెళ్లి పరిశీలించగా రూ.20 లక్షల విలువైన 70 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ ఎస్ఐ వలిబాషా, ఏఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రం డీఎస్పీ వేణుగోపాల్, సీఐ వంశీధర్‌గౌడ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆదివారం డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ చేయిస్తామని చెప్పారు. అంతవరకు ఇంటిలోపలకు ఎవరూ వెళ్లరాదని సూచించారు. -
వలస పక్షి రఘువీరా
* మూడు నియోజకవర్గాలు మార్చిన వైనం * 2009లో కళ్యాణదుర్గం, ఈసారి పెనుకొండ నుంచి ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వలస పక్షిగా మారారు. 25 ఏళ్ల ఆయన రాజకీయ అనుభవంలో మూడుసార్లు నియోజకవర్గాలు మార్చడమే ఇందుకు నిదర్శనం. 2009లో కళ్యాణదుర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ఆయన ఈసారి 2014లో పెనుగొండ నియోజకవర్గానికి మకాం మార్చారు. మడకశిరలో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ లేకపోవడం కారణంగానే ఆయన ప్రతిసారి ఇతర నియోజకవర్గాలను వెతుక్కోవలసి వస్తోందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించే రఘువీరారెడ్డి ఒకే నియోజకవర్గంలో స్థిరంగా గెలుపొందే బలాన్ని పెంచుకోలేక పోతున్నారన్న విమర్శ లేకపోలేదు. బీజేపీలో అతితక్కుత కాలం పనిచేసిన రఘువీరారెడ్డి 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మడకశిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999, 2004 ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తిరిగి గెలుపొందారు. 2004లో గెలుపొందిన అనంతరం మహానేత వైఎస్ఆర్ క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పదవిని అలంకరించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో మడకశిర ఎస్సీ రిజర్వేషన్‌గా మారింది. అంత వరకు ఎస్సీ రిజర్వేషన్‌గా ఉన్న కళ్యాణదుర్గం జనరల్‌గా మారింది. మహానేత వైఎస్ఆర్ చలువతో 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి పదవిని చేపట్టారు. కళ్యాణదుర్గంలో ఎదురుగాలి వీచడంతో ఆయన ఈసారి 2014 ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నారు. -
పేదల బియ్యం పెద్దల పాలు
కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్: పేద ప్రజల కడుపు నింపేందుకు ఉద్దేశించిన సబ్సిడీ బియ్యం పథకం లక్ష్యం తప్పి, పెద్దల జేబు నింపే కార్యక్రమంగా మారింది. నెల రోజుల వ్యవధిలో కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలో 692 బస్తాల బియ్యం పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. వివరాలిలా ఉన్నాయి. జనవరి 21న కంబదూరు మండలంలో విజిలెన్స్ ఎస్పీ దాడులు నిర్వహించి కర్ణాటకకు తరలుతున్న 115.50 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 27న 44 బస్తాలు ఫిబ్రవరి 9న కళ్యాణదుర్గం మండలం నారాయణపురం నుంచి కర్ణాటకకు తరలుతున్న 52 బస్తాలు పట్టుబడ్డాయి, తహశీల్దార్ మహబూబ్ బాషా నిర్వహించిన దాడుల్లో నారాయణపురంలో 10, ఎర్రంపల్లిలో 44 బస్తాలు పట్టుబడ్డాయి. ఈ మధ్య కాలంలోనే బోరంపల్లి వద్ద టస్కర్ వాహనంలో తరలుతున్న 307 బస్తాలు అధికారులకు పట్టుబడ్డాయి. కాంగ్రెస్, టీడీపీ నేతలే సూత్రధారులు ఈ వ్యవహారమంతటికీ జిల్లాలోని ఓ మంత్రికి అనుచరుడైన వ్యక్తి, ఉరవకొండ ఎమ్మెల్యే అనుచరులు ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. సబ్సిడీ బియ్యం అక్రమ రవాణాకృు వీరే ప్రధాన సూత్రధారులని తెలిసినా, రాజకీయ ఒత్తిళ్లకు భయపడో, మామూళ్లకు అలవాటుపడినందునో అధికారులు వారిపై కేసులు నామమాత్రంగా నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తూ మంత్రి అనుచరుడు కళ్యాణదుర్గం తహశీల్దార్ మహబూబ్ బాషాకు పట్టుబడినా, అతనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. విజిలెన్స్ ఎస్పీ స్వాధీనం చేసుకున్న బియ్యం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరునికి చెందినవని తేలడంతో, బినామీలపై కేసు నమోదు చేసి అసలు వ్యక్తులను తప్పించినట్లు తెలిసింది. నారాయణపురం నుంచి కర్ణాటకకు తరలిస్తూ పట్టుబడిన కేసులో సూత్రధారి అయిన కాంగ్రెస్ నాయకునిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దసరా పండుగకు ముందు స్థానిక గాంధీ సర్కిల్లోని ఓ దుకాణంలో చౌక బియ్యాన్ని మామూలు సంచుల్లోకి మారుస్తుండగా దాడులు చేసిన అధికారులు, ఆ వ్యాపారి ఇచ్చిన ముడుపులు తీసుకోవడం వల్లే కేసు నమోదు చేయలేదని సమాచారం. కర్ణాటకకు తరలుతున్న బియ్యం ఉరవకొండ, కళ్యాణదుర్గం, కంబదూరు స్టాక్ పాయింట్ల పరిధిలో ఉన్న చౌకధాన్యపు డిపోల డీలర్లు ఆయా ప్రాంతాల్లోని కాంగ్రెస్, టీడీపీ నాయకులతో కుమ్మక్కై ఒక్కో స్టాక్ పాయింట్ పరిధిలో ప్రతి నెలా కనీసం 3 వేల క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ బియ్యాన్ని రూ.800తో డీలర్ల నుంచి కొనుగోలు చేసిన బియ్యం స్మగ్లర్లు వాటిని కర్ణాటకలోని పావగడకు తరలించి రూ.1800కు విక్రయిస్తున్నారు. ప్రతి నెలా భారీగా మామూళ్లు ముడుతుండడం వల్లే ఈ వ్యవహారంపై రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నేటితో కొనుగోళ్లు బంద్!
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : క్వింటా రూ.4 వేల మద్దతు ధరతో వేరుశనగ కొనుగోళ్లు శుక్రవారంతో ముగియనున్నాయి. అనంతపురం, ధర్మవరం, గుత్తి, పెనుకొండ, ఉరవకొండ, కళ్యాణదుర్గం తదితర మార్కెట్‌యార్డుల్లో వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ నెల 8 నుంచి ఇప్పటి వరకు 50 వేల క్వింటాళ్లు సేకరించారు. గడువు ముగియనుండటంతో గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు అధిక సంఖ్యలో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చారు. అయితే అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం, కాటాలు, హమాలీలు తక్కువగా ఉండటంతో తూకాలు వేయడం ఆలస్యమవుతోంది. దీనికితోడు వేరుశనగను నిల్వ చేయడానికి గోదాములు లేకపోవడంతో బయటే ఉంచుతున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు వచ్చిన సరుకును తీసుకుని రెండు మూడు రోజుల్లో తూకాలు వేయడానికి చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్‌శాఖ ఏడీ బి.శ్రీకాంత్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ డీఎం ఏకాంబరరాజు తెలిపారు. ఆ తర్వాత వచ్చే వేరుశనగకాయలను తీసుకోబోమన్నారు. నేడు అదనపు కాటాలు మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ సి.రామాంజినేయులు గురువారం అనంతపురం మార్కెట్‌యార్డులోని వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రెండో కౌంటరు సరిగా పనిచేయడం లేదని, తూకాలు వేయడంలో చాలా ఆలస్యం జరుగుతోందని రైతులు ఫిర్యాదు చేశారు. వ్యాపారులు, దళారుల బెడద కూడా ఉందని మండిపడ్డారు. వ్యాపారులు ఎవరో పసిగట్టి సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆర్జేడీ రైతులకు చెప్పారు. శుక్రవారం నుంచి ఇపుడున్న ఐదు కాటాలకు అదనంగా మరో నాలుగు కాటాలతో తూకాలు వేస్తామని హామీ ఇచ్చారు. ఆచరణకు నోచుకోని డెరైక్టర్ హామీ వేరుశనగ కొనుగోళ్లు గడువు ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తామని మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఇసార్ అహ్మద్ ఈ నెల 27న హామీ ఇచ్చారు. శుక్రవారం గడువు ముగియబోతున్నా.. పొడిగింపు ఉత్తర్వులు మాత్రం అందలేదు. దీనిపై నేడు మార్కెటింగ్ శాఖ కమిషనర్ నిర్వహించే వీడియో కాన్షరెన్సలో నిర్ణయం వెలువడనుంది. గడువు పొడిగించకపోతే మాత్రం రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. జాగారమే! గుత్తి, న్యూస్‌లైన్ : గుత్తి మార్కెట్‌యార్డులో వేరుశనగ కాయల విక్రయాల కోసం అన్నదాతలు రెండు రోజులుగా జాగరణ చేస్తున్నారు. ఈ నెల 22న ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి పది గంటల వరకు గుత్తితో పాటు పామిడి, గుంతకల్లు, యాడికి, పెద్దవడుగూరు మండలాలకు చెందిన 2800 మంది రైతులు వేరుశనగ కాయలను తీసుకొచ్చారు. ఇందులో టోకెన్లు తీసుకున్న 1500 మంది రైతులకు సంబంధించిన వేరుశనగ కాయలు కాటా వేశారు. మిగతా 1300 మంది రైతులు టోకెన్లు తీసకుని కాటా కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే కొనుగోలు గడువు శుక్రవారంతో ముగియనుందని ఆయిల్‌ఫెడ్ అధికారులు చెప్పడంతో దిక్కతోచడం లేదని రైతులు వాపోతున్నారు. చలికి వణికుతూ, దోమల కాటుకు గురవుతూ అన్నపానీయాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో విక్రయించాలంటే కనీసం పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదు. కొనుగోలు కేంద్రంలో అయితే క్వింటాకు రూ.4 వేలు మద్దతు ధర ఇస్తున్నారు. దీంతో ఎన్ని కష్టాలు ఎదురైనా ఓర్చుకుని మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నారు.