కల్యాణదుర్గం(అనంతపురం జిల్లా): కల్యాణదుర్గం శివారులోని రాయదుర్గం రోడ్డులో గురువారం ఉదయం ఓ గొర్రెల మందపైకి టెంపో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 16 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 5 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.
ఈ గొర్రెలు కమ్మదూరు మండలం కురుకులపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులుగా గుర్తించారు. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గొర్రెలు మందపైకి దూసుకెళ్లిన టెంపో..
Published Thu, Apr 14 2016 7:50 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM
Advertisement
Advertisement