
కళ్యాణదుర్గంలో టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు.
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో ఇరువర్గాలతో మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్,పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి పవన్‌రెడ్డి సమావేశమయ్యారు. మాటామాటా పెరిగి ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు.