సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అనంతరంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పోలీసులు.. ప్రేక్షక పాత్ర వహించారు.
వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత నారాయణరెడ్డికి చెందిన ప్రవారీ గోడను పట్టపగలే ధ్వంసం చేశారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.
అయితే, ఈ భూ వివాదంపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి టీడీపీ నేతలు ప్రహరీ గోడను ధ్వంసం చేశారు. ఇక, ఇదంతా జరుగుతున్నా ఘటనా స్థలంలోనే ఉన్న పోలీసులు.. ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. దీంతో, పోలీసుల తీరు చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment