Kaluva Srinivasulu
-
టీడీపీ నేత కాలువ శ్రీనివాసులకు ఇప్పుడు టిక్కెట్ టెన్షన్
-
ఏంటి మీ గొప్ప.. పార్టీలో మీరెంత
అనంతపురం (శ్రీకంఠం సర్కిల్): ‘ఏంటి మీ గొప్ప.. పార్టీలో మీరెంత. మీరా పార్టీకి పని చేసింది’ అంటూ అనంతపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ఆ పార్టీ ఎస్సీ శ్రేణులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీ నియోజకవర్గంలో 41 వేల మెజారిటీతో వైఎస్సార్సీపీ గెలిచింది. మీరా నాతో మాట్లాడేది. కులానికి.. అంటే తలా గరిటెడు అన్నట్టుగా ఉంది మీ వాదన. చెప్పినట్టు విని ఉంటే సరేసరి. లేదంటే చర్యలు తప్పవు. కార్యకర్తల సలహాలు తీసుకునే దుస్థితిలో ఇక్కడెవరూ లేరు. ఖబడ్దార్ నోరు అదుపులో పెట్టుకోండి’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ‘ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన శింగనమలలో అగ్రకులాలకు పెద్దపీట వేస్తే మేమంతా ఏం కావాలయ్యా’ అని అడిగినందుకు కార్యకర్తలపై రెచ్చిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన కార్యకర్తలు కుర్చీలతో కాలవపై దాడి చేసేవరకు వెళ్లారు. సకాలంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. గురువారం అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. అసలేం జరిగిందంటే.. బుధవారం రాత్రి 40 మందితో కూడిన అనంతపురం టీడీపీ పార్లమెంటరీ కమిటీని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. అదేవిధంగా శింగనమల అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న బండారు శ్రావణిశ్రీని కాదని పార్టీ కమిటీల నియామకం, పార్టీ కార్యక్రమాల అమలు బాధ్యతలను ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిలకు అప్పగించింది. దీంతో శ్రావణిశ్రీ గురువారం ఈ విషయమై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసేందుకు అనంతపురంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చారు. ఇందుకు పార్టీ కీలక నేతలు అనుమతించకపోవడంతో ఆమె కార్యకర్తలతో కలిసి వెనుదిరిగారు. అనంతరం శింగనమల నియోజకవర్గం కార్యకర్తలు పెద్దఎత్తున శ్రావణిశ్రీ ఇంటికి చేరుకుని ఆమెతో చర్చించారు. అనంతరం తమ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు కాలవను కలసి చర్చిద్దామని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో ఉన్న కాలవతో గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేయబోయారు. ఊహించని రీతిలో కార్యకర్తలపై కాలవ చిందులేయడంతో వివాదం ముదిరింది. ‘పార్టీ వీడుతామని బెదిరిస్తే భయపడాలా? చాలా మందినే చూశాం. పార్టీలో విర్రవీగిన వాళ్లంతా కనిపించకుండా పోయారు. మీరెంత..’ అంటూ కార్యకర్తలను చులకన చేసి మాట్లాడటంతో కార్యకర్తలు ఆయనను చుట్టుముట్టి కుర్చీలతో దాడికి యత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను బయటకు పంపించివేశారు. కార్యాలయం బయట పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం గురించి మాట్లాడే నాయకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, కార్యకర్తల కష్టాలు పంచుకుంటామని చెప్పే నీతులు కేవలం మాటలకే పరిమితమా అంటూ నిందించారు. తమ సామాజిక వర్గానికి న్యాయం చేయకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యకర్తలంతా వెళ్లిపోయిన అనంతరం నూతన కమిటీలోని శ్రీధర్ చౌదరి సమక్షంలో కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడిన కాలవ శ్రీనివాసులు.. తమదంతా ఒకే కుటుంబం అంటూ వివాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. మీడియాలో వస్తున్నదంతా అవాస్తవమని బుకాయించారు. కాగా, శింగనమల నియోజకవర్గ బాధ్యతలను మరొకరికి అప్పగించడంపై బండారు శ్రావణిశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్టీ అధినేతకు లేఖ రాశారు. అంతకుముందు టీడీపీ కార్యాలయ పరిసరాలు ఫ్యాక్షన్ సినిమా సన్నివేశాలను తలపించాయి. ఎటు చూసినా వాహనాల హారన్ మోతలు.. పరుగులు తీస్తున్న జనంతో ఆ ప్రాంతమంతా ఉలికి పాటుకు గురైంది. -
రచ్చకెక్కిన విభేదాలు: కాల్వ శ్రీనివాస్‌పై జేసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, కాల్వ శ్రీనివాస్‌ల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఓడిపోవడం ఖాయమంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పుకొచ్చారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని సూచించారు. కార్యకర్తలను టీడీపీ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఓటమి భయంతో జేసీ కంటతడి..!) తనకు, కార్యకర్తలకు ఏ మాత్రం సమాచారం లేకుండానే మీటింగ్‌లు నిర్వహిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ వైఖరిని తప్పుపట్టారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ కనుసన్నల్లోనే ఇలా జరుగుతుందన్నారు. కాల్వ శ్రీనివాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇలానే జరిగితే త్వరలోనే కార్యకర్తలు తామే స్వయంగా మీటింగ్ పెట్టుకుంటారని జేసీ హెచ్చరించారు. పెద్దవాళ్లను దృష్టిలో పెట్టుకుని తాను ఇలా మాట్లాడటం లేదని.. తమను పలకరించిన వారే లేరని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను సరిగా చూసుకోవడం లేదు.. టీడీపీ నేతలను కార్యకర్తలు నమ్మటంలేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చదవండి: కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన జేసీ -
కళ్యాణదుర్గంలో కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో ఇరువర్గాలతో మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్,పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి పవన్‌రెడ్డి సమావేశమయ్యారు. మాటామాటా పెరిగి ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. -
స్క్రిప్ట్ ప్రకారమే జయరాంరెడ్డి ఆత్మహత్యాయత్నం
సాక్షి, రాయదుర్గం : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో టీడీపీకి మైండ్‌బ్లాక్ అయ్యింది. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ జనరంజక పాలనతో దూసుకుపోవడంతో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా తమ పార్టీని బతికించుకునేందుకు నాయకులు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇంటి స్థల సమస్యను సాకుగా చూపి వైఎస్సార్సీపీ నాయకులకు, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు టీడీపీ కార్యకర్త ద్వారా ఆత్మహత్యాయత్నం డ్రామాకు తెరలేపారు. గుమ్మఘట్ట మండలం బీటీపీ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త జయరామిరెడ్డి తనకు మంజూరు చేసిన ఇంటి పట్టాకు సంబంధించి అధికారులు స్థలం చూపలేదంటూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేసిన ఆత్మహత్యాయత్నం డ్రామా అని తేలింది. నీటితో నింపిన పురుగుమందు డబ్బాను వెంట తెచ్చుకుని గుటగుటా తాగేయగా.. భార్య పల్లవి సెల్ఫోన్లో వీడియో తీస్తూ డ్రామాను రక్తి కట్టించింది. రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం సమస్యకు కారణం వైఎస్సార్సీపీ నాయకులే అంటూ పేర్లు చెప్పడానికి ప్రాధాన్యత ఇచి్చంది. భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తుంటే కనీసం వెంట కూడా పోకుండా కార్యాలయం ముందే కూర్చోవడం, కంటిలో నీరు కూడా రాకపోవడం అక్కడున్న వారు చూసి ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని చర్చించుకోవడం కనిపించింది. టీడీపీ నాయకుడి అత్యుత్సాహం టీడీపీ మండల నాయకుడు రాఘవరెడ్డి కుట్ర రాజకీయాలకు తెరలేపినట్లు తెలిసింది. టీడీపీ హయాంలో జరిగిన తప్పిదాన్ని వైఎస్సార్సీపీపై నెట్టాలని కుయుక్తులు పన్నాడు. ఆ కుట్రల్లో భాగంగా సంఘటన జరగడానికి గంట ముందే తనకు కావాల్సిన మీడియా వారికి ఫోన్ చేసి ‘గుమ్మఘట్ట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లండి, జయరామిరెడ్డి అనే వ్యక్తి హత్యాయత్నం చేస్తున్నాడం’టూ సమాచారమందించాడు. అంతటితో ఆగ కుండా వైఎస్సార్సీపీ నాయకుల పేర్లు చెప్పాలం టే రాయదుర్గం ప్రభుత్వాసుపత్రిలో బాధితులకు సూచించడం అక్కడున్నవారందరూ గుర్తించారు. అడ్డు తగులుతున్న మాజీ మంత్రి బీటీపీకి చెందిన జయరామిరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అనుచరుడు. టీడీపీ కార్యకర్తకు స్థలం ఇప్పించడంలో కూడా మంత్రి కాలవ శ్రీనివాసులు అడ్డు తగులుతున్నాడని 2018 ఏప్రిల్, మే నెలల్లో గ్రామాల పర్యటనలో భాగంగా ఆరోపణలు గుప్పించాడు. చివరకు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఒత్తిడి మేరకు 2018 జూన్‌లో జయరామిరెడ్డికి పట్టా ఇప్పించారు. అయితే ఆ పట్టాలో చెక్కుబందీ సరిగా పొందుపరచలేదు. స్థలం చూపాలంటూ జయరామిరెడ్డి పలుమార్లు ప్రయతి్నస్తే అప్పటి మంత్రి కాలవ, జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు అడ్డుపడ్డారు. అప్పటి నుంచి జయరామిరెడ్డి సమస్య సమస్యగానే మిగిలిపోయింది. -
చారిత్రాత్మకం...రాయదుర్గం
కర్ణాటక సరిహద్దున ఉన్న దుర్గాల్లో రాయదుర్గం చారిత్రాత్మకమైనది. విజయనగర రాజుల పాలనా వైభవానికి, నాటి శిల్పకళా నైపుణ్యానికి చిహ్నంగా నిలిచిన ప్రాంతం. 15వ శతాబ్దంలో రాజకీయ, సాంస్కృతిక రంగాలకు నిలయం. కాలక్రమేణా రాజులు పోయినా.. రాజ్యాలు అంతరించినా.. ఆ సంస్కృతీ పరిమళాలు మాత్రం ఇప్పటికీ గుభాళిస్తూనే ఉన్నాయి. అత్యంత ప్రశాంతమైన ఈ నియోజకవర్గంలో ఎడారి ఛాయలు విస్తరిస్తుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. సాక్షి, రాయదుర్గం : నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 67 ఏళ్లలో ఇప్పటి వరకు 16 సార్లు జరిగాయి. అయితే శాసనసభ్యులుగా గెలుపొందిన నాయకులు మాత్రం పదవులకు ఆమడదూరంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాధాన్యత లేకపోవడంతో నియోజకవర్గం అభివృద్ధికి కూడా ఆమడదూరంలో ఉంది. 2014లో టీడీపీ తరఫున గెలుపొందిన కాలవ శ్రీనివాసులు మాత్రం ఆ చరిత్రను చెరిపేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్, గృహనిర్మాణ, పౌరసమాచార శాఖ మంత్రి అయ్యారు. మున్సిపాలిటీతోపాటు రాయదుర్గం, గుమ్మగట్ట, డి.హీరేహాళ్ , బొమ్మనహాళ్ , కణేకల్లు మొత్తం ఐదు మండలాలున్నాయి. అంతకు మునుపు ఆంధ్రాలో ఉన్న బళ్లారి జిల్లాను కర్ణాటకలో కలవడంతో బళ్లారి జిల్లాలో ఉన్న రాయదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లాలో చేరింది. గుమ్మఘట్ట మండలం పూలకుంట వద్ద 2016 ఆగస్టు 31న రక్షకతడుల ప్రారంభానికి వచ్చిన చంద్రబాబు ఆ ఏడాదిలోపు బీటీపీకి నీరు తెస్తామంటూ తొలిసారి హామీ ఇచ్చారు. 2017 జూన్ 9న ఏరువాక కార్యక్రమ ప్రారం భానికి రెండోసారి వచ్చిన బాబు అదే ఏడాది ఆగస్టు 15న బీటీపీ పనులకు మంత్రి కాలవ శంకుస్థాపన చేస్తారని, రూ.968 కోట్లతో 2018 అక్టోబర్ 10న బీటీ ప్రాజెక్టు పనులు ప్రారంభించి, 2019 సంక్రాంతికి నాటికి కృష్ణజలాలతో ప్రాజెక్ట్‌ను నింపుతామని గొప్పగా చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రధాన రహదారుల పక్కన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండానే అక్కడక్కడ కాలువలు తవ్వి వదిలేశారు. కమీషన్లతో పాలకులే లబ్ధి పొందారు. రాయదుర్గం కేంద్రంగా జీన్స్ పరిశ్రమకు విద్యుత్ రాయితీ ఇచ్చి, గార్మెంట్ రంగాన్ని అంతర్జాతీయ గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తానని గతంలో బాబు ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైంది. బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో కొండల్లా పేరుకుపోయిన ఇసుకమేటలను తొలగిస్తామని ఇచ్చిన హామీ ఎండమావిగానే మిగిలింది. ప్రధాన సమస్యలు.. నియోజకవర్గాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ప్రధానమైనది కరువు. ఏటా తీవ్ర వర్షాభావంతో సాగు చేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉపాధి హామీ పనులను పూర్తిస్థాయిలో చేపట్టడకపోవడంతో వ్యవసాయ కూలీలతోపాటు రైతులు వేలాదిగా కర్ణాటకకు వలస వెళుతున్నారు. హెచ్చెల్సీ ఆధునీకరణ పనులు వేగవంతం చేసి చివరి ఆయకట్టు రైతుల భూములకు నీరివ్వడంలోనూ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. బీటీపీకి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీరు మళ్లించి 12 వేల ఎకరాల భూములను సాగులోకి తేవాలని కోరుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. జీన్స్ కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. ‘దుర్గం’ దాహార్తి తీర్చిన గతంలో రాయదుర్గం పట్టణంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉండేది. పట్టణ ప్రజలు నిత్యం నీటి కోసం కొట్టుకోవాల్సిన దుస్థితి ఉండేది. అయితే వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో తాగునీటి పథకానికి రూ.48 కోట్లు విడుదల చేశారు. కణేకల్లు వద్ద సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటు కు 168 ఎకరాలు భూసేకరణ చేసి, ట్యాంకు నిర్మించారు. హెచ్చెల్సీ నీటిని ట్యాంకులోకి ఎత్తిపోతల ద్వారా నింపి అక్కడి నుంచి రాయదుర్గం వరకు పైపులైను నిర్మించారు. ఆ తర్వాత 2009లో అప్పటి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కోరిక మేరకు తాగునీటి కోసం రూ.4 కోట్లు విడుదల చేశారు. మహానేత కృషికి గుర్తుగా రాయదుర్గం తాగునీటి పథకానికి వైఎస్సార్ తాగునీటి పథకంగా నామకరణం చేశారు. టీడీపీకి వ్యతిరేక పవనాలు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు నెరవేర్చకపోవడం, నియోజకవర్గంలో మంత్రి కాలవతో పాటు అతని అనుచరగణం చేసిన మట్టి, ఇసుక దోపిడీతో ప్రజల్లో టీడీపీకి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాలు అర్హులకు అందించకుండా జన్మభూమి కమిటీలు అడ్డుకోవడంపై కూడా బాధితులు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి కాలవ తన కోటరీ ద్వారా వేల కోట్లు దండుకున్నట్లు ఆ పార్టీలోని నాయకులే బహిరంగంగా ప్రకటిస్తున్నారు. మంత్రి అవినీతిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, సీనియర్ టీడీపీ నేతలు సమావేశాలు పెట్టి చెబుతున్నారు. టీడీపీకి చెందిన దీపక్‌రెడ్డి వర్గాన్ని కేసులు పెట్టి వేధించాడని, దాడులు చేయించాడని ఆవేదన చెందుతూ మంత్రికి వ్యతిరేకంగా ఓటు వేయిస్తామంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వైఎస్సార్సీపీకి ఆదరణ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి ఆదరణ పెరుగుతోంది. ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు సాగిస్తూ వస్తున్నారు. నవరత్నాలపై ఇప్పటికే నియోజకవర్గమంతా ముమ్మర ప్రచారం చేశారు. జగన్ పథకాలతో ఆకర్షితులైన పలువురు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి రాకతో రాయదుర్గం పట్టణంతోపాటు కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో పార్టీకి మరింత బలం పెరిగింది. సామూహిక వివాహాలు, ట్రై సైకిళ్ల పంపిణీ, ఉచిత కంటి ఆపరేషన్లు, మసీదులు, ఆలయాల అభివృద్ధికి విరివిగా విరాళాలు తదితర సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ ‘కాపు’ తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాయదుర్గం నియోజకవర్గ వివరాలు.... మొత్తం జనాభా 3,19,479 మొత్తం ఓటర్లు 2,40,196 పురుషులు 1,20,350 మహిళలు 1,19,839 ఇతరులు 07 పోలింగ్ బూత్‌లు 316 రాయదుర్గం ఎమ్మెల్యేలు వీరే.. సంవత్సరం పార్టీ విజేత 1952 కాంగ్రెస్ గురుమాల నాగభూషణ 1957 కాంగ్రెస్ ఎన్సీ శేషాద్రి 1962 కాంగ్రెస్ లక్కా చిన్నపరెడ్డి 1967 స్వతంత్ర గొల్లపల్లి తిప్పేస్వామి 1972 కాంగ్రెస్ గొల్లపల్లి తిప్పేస్వామి 1975 రెడ్డి కాంగ్రెస్ పయ్యావుల వెంకటనారాయణ 1978 కాంగ్రెస్ కేబీ చన్నమల్లప్ప 1983 స్వతంత్ర పాటిల్ వేణుగోపాల్ రెడ్డి 1985 టీడీపీ బండి హులికుంటప్ప 1989 కాంగ్రెస్ పాటిల్ వేణుగోపాల్ రెడ్డి 1994 టీడీపీ బండి హులికుంటప్ప 1999 కాంగ్రెస్ పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి 2004 టీడీపీ మెట్టు గోవిందరెడ్డి 2009 కాంగ్రెస్ కాపు రామచంద్రారెడ్డి 2012 వైఎస్సార్సీపీ కాపు రామచంద్రారెడ్డి 2014 టీడీపీ కాలవ శ్రీనివాసులు -
టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. గోవిందరెడ్డి రాజీనామా
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. చంద్రబాబు నాయుడు వైఖరిపై అసహనం, రాయదుర్గం టికెట్‌ను మరోసారి మంత్రి కాలవ శ్రీనివాస్‌కు కేటాయించడంపై అసంతృప్తితో టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా గోవింద రెడ్డిని బుజ్జగించేందుకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మంత్రి కాలవ శ్రీనివాస్ రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని మనస్తాపంతో టీడీపీకి రాజీనామా చేశారు.మరోవైపు రాయదుర్గం టికెట్‌ను మంత్రి కాలువ శ్రీనివాస్‌కు కేటాయించడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం పెట్టి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. (ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతా) -
‘నగు’బాట
మంత్రి కాలవ.. ప్రజలను మాయ చేయడంలో దిట్ట. జనం కళ్లకు గంతలు కట్టి లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు నమ్మిస్తున్నారు. అభివృద్ధి మాటున రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపుతూ ఓట్లు దండుకునేందుకు పన్నాగం పన్నారు. ఇందుకోసం ఒకే పనికి పదే పదే భూమిపూజలు, శంకుస్థాపనలు చేసేస్తున్నారు. రాయదుర్గం పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు కూడా తన ఓటు రాజకీయానికి వాడుకున్నారు. 2014లో ప్రారంభమైన 4 కి.మీ రోడ్డు విస్తరణ పనులకు గతంలోనే రెండుసార్లు శంకుస్థాపన చేసిన మంత్రి కాలవ.. ఎన్నికల కోడ్ వస్తుండటంతో 1.3 కి.మీ మాత్రమే పూర్తయిన పనులకు ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేసి నవ్వులపాలయ్యారు. రాయదుర్గం : పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో రోడ్డు విస్తరణకు అధికారులు ప్రతిపాదనలు పంపగా.. 2014 డిసెంబర్లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం రోడ్డులోని పాలశీతలీకరణ కేంద్రం నుంచి లక్ష్మీబజార్, పాతబస్టాండ్, వినాయక సర్కిల్, తేరు బజార్ మీదుగా మొలకాల్మూరు రోడ్డులోని చెక్‌పోస్టు సమీపంలో హైవే రోడ్డుకు లింక్ కలుపుతూ 4 కి.మీ, రోడ్డు విస్తరణకు రూ.9.10 కోట్లు మంజూరయ్యాయి. అంతేకాకుండా తాగునీటి పైపులైను, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల ఏర్పాటు కోసం అదనంగా మరో రూ.4.59 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో మొత్తంగా రూ.13.69 కోట్లు మంజూరు కాగా.. అంతా తానే చేయించినట్లు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన కాలవ శ్రీనివాసులు ప్రచార ఆర్భాటం చేశారు. ఆరు నెలల్లో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దిడంతో పాటు మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామంటూ ప్రతి సమావేశంలోనే ప్రసంగాలు దంచేశారు. మార్కింగ్‌లో లోపించిన పారదర్శకత 2015 నవంబర్ 26న రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కాగా... తొలుత ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అయితే ఆక్రమణల తొలగింపులో కూడా అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారు. తమకు కావాల్సిన వారి భవనాలు, స్థలాలు కాపాడేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చే మార్కింగ్ మార్చేశారు. ఈ క్రమంలో రూ.లక్షలు చేతులు మారాయి. అందువల్లే లక్ష్మీబజార్లో 80 అడుగుల మేర వేసిన మార్కింగ్....వినాయక సర్కిల్ నుంచి తేరుబజార్ వరకు 72 అడుగులకే కుచించుకుపోయింది. అంతేకాకుండా రోజుకోసారి మార్కింగ్ మారుస్తూ ఇక్కడి టీడీపీ కీలక నేతలు వ్యాపారుల నుంచి భారీగా దండుకున్నారు. ఇప్పటికి మూడుసార్లు రోడ్డు విస్తరణ పనులకు మంత్రి కాలవ శ్రీనివాసులు ఇప్పటికి మూడుసార్లు శంకుస్థాపన చేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పుడల్లా పట్టణంలో ఆర్భాటంగా సమావేశం నిర్వహించడం.. రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇలా ఇప్పటికి మూడుసార్లు భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ప్రచార ఆర్భాటంపై ఉన్న శ్రద్ధ పనులు చేయించడంపై లేకపోవడంతో నాలుగేళ్లు గడిచినా పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు 1.3 కి.మీ మేర మాత్రమే పూర్తయ్యాయి. అయినప్పప్పటికీ తన వల్లే రాయదుర్గం పట్టణం సుందరమైపోయినట్టు, జిల్లాలో ఎక్కడా లేని అభివృద్ధి జరిగినట్లు మంత్రి గొప్పలు చెప్పుకుంటున్నారు. సగం పనులతో సంబరాలు పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వినాయకసర్కిల్ , తేరుబజార్ వరకు కేవలం 1.3 కి.మీ. సీసీ రోడ్డు వేశారు. అరకొరగా డివైడర్లు వేసి, విద్యుత్ దీపాలు అమర్చారు. 1.3 కి.మీ.లలో కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. లింక్ రోడ్లను కలుపుతూ రోడ్లు వేయలేదు. రెండు రోడ్ల మధ్య దారులు వదిలిన చోట డివైడర్ల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అయినప్పటికీ త్వరలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో మంత్రి కాలవ హడావుడి చేశారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయని చెప్పి ప్రజలను మభ్య పెట్టేందుకు ఈ నెల 22వ తేదీన రాత్రి వేళ హడావుడిగా జెడ్పీ చైర్మన్ పూల నాగరాజుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అన్నీ అప్పటికప్పుడే మంత్రి కాలవ రోడ్డు విస్తరణ పనులకు ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించుకోవడంతో...అధికారులు కూడా హడావుడిగానే పనులు చేసేశారు. సీసీ రోడ్డుకు లింక్ కలుపుతూ 140 మీటర్ల బీటీ రోడ్డును ప్రారంభోత్సవానికి మూడు రోజుల ముందు వేశారు. అలాగే డివైడర్లకు అక్కడక్కడా రంగుల ప్యాచ్‌లు వేశారు. అలాగే ఆఘమేఘాల మీద శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఈ పనుల్లో నాణ్యత లోపించడంతో కణేకల్లు రోడ్డును కలుపుతూ ఏర్పాటు చేసిన సర్కిల్లో 20వ తేదీ కట్టిన డివైడర్ 21వ రోజే పడిపోయింది. తేరుబజార్ రోడ్డు విస్తరణలో అధికార పార్టీ రాజకీయం ఇక తేరుబజార్‌లో జరిగిన రోడ్డు విస్తరణ పనులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అడ్డుకున్నారు. వినాయక సర్కిల్ నుంచి తేరుబజార్ వరకు 1.5 మీటర్ల డివైడర్ వేయగా, పట్టుపట్టి దాన్ని ఒక మీటర్‌కు కుదించారు. అలాగే తేరు వద్ద నుంచి గుమ్మఘట్ట, మొలకాల్మూరు రోడ్డు క్రాస్ వరకు సీసీ రోడ్డు వేయకుండా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే బాధితులతో కోర్టులో కేసు వేయించినట్లు అధికార పార్టీలోని ఒకవర్గం నాయకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రచార ఆర్భాటం మాని...చిత్తశుద్ధితో అభివృద్ధి పనులు చేయాలని, లేకపోతే సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పితీరుతామని దుర్గం వాసులు మంత్రి హెచ్చరిస్తున్నారు. -
తుప్పు పట్టిన పరికరాలు ఇచ్చి ఇంకెన్నాళ్లు...
సాక్షి, కర్నూలు : రానున్న ఎన్నికల్లో బీసీల ద్రోహి చంద్రబాబుకు బీసీలంతా ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబును వాల్మీకుల దేవుడు అంటూ మంత్రి కాలువ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వాల్మీకి జాతి మొత్తాన్నిఅవమానపరిచేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. సొంత ప్రాపకం కోసం జాతి ఆత్మాభిమానాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టిన ఘనుడు శ్రీనివాసులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మీకులు నమ్మకానికి మారుపేరని.. వారి మనోభావాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. చంద్రబాబు మోసాలను వాల్మీకులు గుర్తించారని.. ఇకపై ఆయన వారిని వంచించలేరని అన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తమకు అండగా ఉంటారన్న నమ్మకం బీసీల్లోని అన్ని వర్గాల్లో ఏర్పడిందని పేర్కొన్నారు. వాల్మీకి ఫెడరేషన్ ఘనత వైఎస్సార్‌ది కాదా.. గత నాలుగున్నరేళ్ల కాలంలో టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో ఏనాడైనా వాల్మీకి రిజర్వేషన్‌పై నోరు విప్పారా అని రామయ్య ప్రశ్నించారు. ఒకరికి మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన జాతి మొత్తాన్ని ఉద్ధరించినట్టుకాదన్నారు. వాల్మీకి ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. వాల్మీకి జయంతిని అధికారికంగా జరుపుకునేందుకు చర్యలు తీసుకుంది కూడా ఆయనేనన్న విషయాన్ని గుర్తుచేశారు. వాల్మీకుల అభ్యున్నతికి పాటుపడేందుకు వైఎస్ జగన్ వారికి చట్టసభల్లో స్థానం కల్పించనున్నారని పేర్కొన్నారు. తుప్పు పట్టిన పరికరాలు ఇచ్చి.. బీసీల కొరకు ఏర్పాటు చేసిన బీసీ సబ్‌ప్లాన్ నిధులు ఏమయ్యాయో మంత్రి కాల్వ సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్ చేశారు. సంవత్సరానికి రూ. 10 వేల కోట్లు ఇస్తామన్న చంద్రబాబు గత ఐదు సంవత్సరాలుగా బీసీలకు ద్రోహం చేశారని విమర్శించారు. ఆదరణ పథకం కింద తుప్పు పట్టిన పరికరాలు ఇచ్చి బీసీలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీల అభ్యున్నతికి వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వబోతున్నారని తెలిపారు. -
ఈ టపాసులు ఎలక్షన్ స్పెషల్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కడప ఉక్కు కర్మాగారం, విశాఖపట్నం మెట్రో రైలు, దుగరాజపట్నం పోర్టు వంటి ప్రాజెక్టులను తామే సొంతంగా చేపడతామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి మూడు లేఖలు రాయనున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సచివాలయంలో ఆయన మీడియాకు తెలియజేశారు. రాష్ట్ర విభజన ఒప్పందంలో భాగంగా కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, తక్షణమే వాటన్నింటినీ అమలు చేయాలని కోరుతూ ప్రధానికి మరో లేఖ రాయనున్నట్లు తెలిపారు. తిత్లీ తుపాన్ విషయంలో కేంద్రం వైఖరిపై కేంద్ర హోంమంత్రికి ప్రత్యేకంగా మరో లేఖ రాయాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో నాలుగేళ్లు భాగస్వామిగా ఉండి విభజన చట్టంలోని హామీలపై ఏనాడూ నోరుమెదపని టీడీపీ సర్కారు ఇపుడు ఎన్నికల ముంగిట ఏదో చేసేయబోతున్నట్లు హడావిడి చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ఏడాదిలో ఇదేదో కొత్త గిమ్మిక్కు మాదిరిగా ఉందని జనం చర్చించుకుంటున్నారు. కడప ఉక్కు కర్మాగారం వైఎస్సార్ జిల్లా కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. పెట్టుబడి వ్యయాన్ని 100 శాతం రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించామన్నారు. ఈ మేరకు ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్’ను ఏర్పాటు చేశామన్నారు. నెల రోజుల్లో పునాదిరాయి వేయనున్నట్లు పేర్కొన్నారు. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ మేనేజింగ్ లిమిటెడ్ డైరెక్టరుగా గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఎండీగా పని చేసిన పి.మధుసూధన్‌ను నియమించామన్నారు. ప్రైవేటు సంస్థలతో జాయింట్ వెంచర్‌గా ముందుకెళ్లాలని భావించామని చెప్పారు. ఈ కార్పొరేషన్‌కు ప్రాథమిక పెట్టుబడిగా రూ.2 కోట్లు కేటాయించామని, మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.12,000 కోట్లుగా అంచనా వేశామన్నారు. విశాఖ మెట్రో... విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రం విశాఖపట్నం మెట్రో ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే దాని బాధ్యత తీసుకుని, సత్వరం ప్రాజెక్టును చేపట్టనున్నట్లు మంత్రి కాలువ తెలిపారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్ఎఫ్పీ, రాయితీ ఒప్పందంపై గతంలో జారీచేసిన ఉత్తర్వులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆర్ఎఫ్పీ, రాయితీ ఒప్పందాన్ని విడుదల చేయడానికి అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కాలువ తెలిపారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో 42.55 కిలోమీటర్ల మేర 3 కారిడార్లుగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టనున్నామన్నారు. ఈ ప్రాజెక్టు తాజా అంచనా వ్యయాన్ని రూ.8,300 కోట్లుగా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాజెక్టు సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు నిమిత్తం బాహ్య వాణిజ్య రుణాలు(ఈసీబీ) లేదా ఏదైనా విదేశీ ఫండ్ ఏజెన్సీలు, ఆర్థిక సంస్థల నుంచి భారతీయ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ రేట్లకే రూ.4,200 కోట్లు మించకుండా రాష్ట్ర ప్రభుత్వ వన్‌టైమ్ సావరిన్ గ్యారంటీతో అప్పుగా తీసుకోవడానికి ఏఎంఆర్‌సీ అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్‌ను గ్రిడ్ నుంచి నిరంతరాయంగా సరఫరా చేస్తారన్నారు. దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్ ప్రకాశం జిల్లా దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణానికి 2,395.98 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దొనకొండ మండలం రాగమక్కపల్లి, భూమనపల్లి, రుద్రసముద్రం, ఇండ్లచెరువు గ్రామాల పరిధిలోని ఈ భూమిని ‘దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్’ నిర్మాణం కోసం ప్రకాశం జిల్లా ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌కు అప్పగించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పైబర్ నెట్‌కు రూ.3,283 కోట్ల మేర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2019 జూన్ నాటికి పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ·బందరు పోర్టు అభివృద్ధికి అవసరమైన భూసేకరణ కోసం రూ.200 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. తాగునీటి సరఫరాకు రూ.22 వేల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో రూ.22,000 కోట్ల వ్యయంతో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తామని మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. మొదటి విడతగా రూ.9,400 కోట్లతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తాగునీటి సరఫరా పనులను చేపట్టేందుకు ఏపీడీడబ్ల్యూఎస్సీ మేనేజింగ్ డైరెక్టర్‌కు అనుమతిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ ‘అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ట్రస్టుకు వచ్చే నిధుల ద్వారా భవిష్యత్తులో అన్న క్యాంటీన్లను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు - భాషా పండితులు/ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి ఆమోదం. - 250 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల మంజూరు ప్రతిపాదనకు ఆమోదం. - నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కొత్తగా మంజూరైన సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సిబ్బంది మంజూరు. బీజేపీతో కలిపి ఉన్నప్పుడు గుర్తుకు రాలేదేం.. రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన కడప ఉక్కు ఫ్యాక్టరీ విభజన చట్టం ప్రకారం దక్కాల్సి ఉంది. ఈ హక్కును ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడే మెడలు వంచి సాధించుకోవాల్సి ఉండగా, నాలుగున్నరేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వం మౌనం వహించింది. బీజేపీతో కలిసి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకున్నంత కాలం చంద్రబాబు సర్కారుకు కడప ఉక్కు కర్మాగారం గుర్తుకు రాలేదు. ఎన్నికల ముంగిట శంకుస్థాపన పేరిట ప్రజలను మభ్యపెట్టేందుకు ఎత్తులు వేస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ నుంచి విడిపోయిన తరువాత కడపలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేత ‘దీక్ష’లు చేయించి, ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడుతున్నట్లుగా సీఎం చంద్రబాబు కలరింగ్ ఇచ్చారు. అంతకుముందు సీఎం రమేష్ ఒక్కసారి కూడా పార్లమెంట్లో ఈ అంశంపై మాట్లాడిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయిస్తుందనడం ఎన్నికల స్టంటేనని పరిశీలకులు చెబుతున్నారు. ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానిస్తున్నారు. రామాయపట్నం పోర్టు వెనుక.. విభజన చట్టం ప్రకారం నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో పోర్టు ఏర్పాటు కావాల్సి ఉంది. నాలుగున్నరేళ్లపాటు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు దాన్ని పక్కనపెట్టి, రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేస్తామని ప్రజల చెవుల్లో పూలు పెడుతోంది. దుగరాజపట్నం పోర్టు కోసం నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు ఎన్ని పర్యాయాలు విన్నవించినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఆ పోర్టును కాదని, రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక లోగుట్టు ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు సర్కారుకు నిజంగా శ్రద్ధ ఉంటే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ఏనాడో పట్టాలెక్కేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రంపై నాలుగున్నరేళ్లపాటు ఒత్తిడి తీసుకురాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ప్రజలను భ్రమల్లో ముంచెత్తి ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప ఉక్కు కోసం నాలుగున్నరేళ్లుగా వైఎస్సార్సీపీ పోరాటం వైఎస్సార్ జిల్లా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయా లని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాలుగున్నరేళ్లుగా పోరాడుతోంది. ప్రత్యేక హోదాతోపాటు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పట్టుపడుతూనే ఉంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లిన అన్ని సందర్భాల్లోనూ కడప ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ వినతిపత్రాలు అందజేశారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పార్లమెంట్లో పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉక్కు పరిశ్రమ కావాలంటూ ప్రొద్దుటూరులో సభ నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశాల్లో, స్థానిక సంస్థల సమావేశాల్లో పరిశ్రమ కోసం తీర్మానాలు చేయించారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన పోరాటానికి మద్దతివ్వని టీడీపీ ఎన్నికల ముందు శంకుస్థాపనల పేరిట హడావుడి చేయాలని నిర్ణయించడం గమనార్హం. -
ఒకే ఒరలో మూడు కత్తులు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాయదుర్గం టీడీపీలో అసమ్మతిపోరు తారస్థాయికి చేరింది. మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి మధ్య నెలకొన్న వర్గపోరు మరింత తీవ్ర రూపం దాల్చింది. ‘నున్వా–నేనా’ అంటూ పరస్పరం కత్తులు దూస్తున్నారు. ఓ వైపు మెట్టు.. మరోవైపు దీపక్ కాలవ కంట్లో నలుసులా మారారు. దీపక్‌రెడ్డి అసలు టీడీపీ వ్యక్తే కాదు అని మంత్రి కాలవ.. తాను లేకపోతే ఎమ్మెల్యేగా కాలవ గెలిచేవాడే కాదని దీపక్‌రెడ్డి దూషణలకు దిగుతున్నారు. వీరివద్దరి వైఖరితో ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డి తిరిగి తెరపైకి వచ్చి కాలవకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీంతో ‘దుర్గం’ టీడీపీలో పార్టీ కేడర్ మూడు ముక్కలైంది. అనూహ్యంగా దుర్గంపై కాలవ జెండా రాయదుర్గం నియోజకవర్గానికి మంత్రి కాలవ శ్రీనివాసులు స్థానికేతరుడు. శింగనమల నియోజకవర్గానికి చెందిన కాలవ 1999లో ఎంపీగా గెలుపొందారు. తర్వాత రెండుసార్లు ఓడిపోయారు. దీంతో గత ఎన్నికల్లో రాయదుర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. చీఫ్ విప్‌గా కొనసాగి ఆపై మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ‘దుర్గం’ టీడీపీకి మెట్టు గోవిందరెడ్డి నాయకుడిగా ఉండేవారు. 2009లో కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత టీడీపీ బలహీనపడింది. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు. ఆపై జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాపు రాజీనామాతో 2012లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో దీపక్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. అప్పటి నుండి ‘దుర్గం’ టీడీపీ మెట్టు, దీపక్‌రెడ్డి వర్గాలుగా చీలిపోయింది. 2014 ఎన్నికల్లో టిక్కెట్టు కోసం ఇద్దరూ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఇద్దరికీ కాకుండా కాలవ శ్రీనివాసులకు టీడీపీ అధిష్టానం టిక్కెట్టు కేటాయించింది. కాలవ విజయం సాధించారు. మెట్టు, దీపక్ వర్గాలను పక్కనపెట్టి మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గానికి పూర్తి కొత్త కావడంతో మెట్టు, దీపక్‌రెడ్డితో సంబంధం లేకుండా తనకంటూ ఓ వర్గం ఏర్పరుచుకోవాలని భావించారు. టీడీపీలో ఇక వర్గాలు లేవని, కాలవ వర్గం ఒకటే ఉంటుందని, ఎవ్వరి వద్దకు వెళ్లొద్దనే మెసేజ్‌ను కేడర్‌లోకి పంపారు. అయితే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో దీపక్, మెట్టు సహకారంతో గెలిచిన వాళ్లు... వారిని వదులుకునేందుకు అయిష్టత చూపారు. కాలవకు వద్దకూ వెళుతూ పాత నేతలను కూడా కలుస్తూ వచ్చారు. ఇది కాలవకు నచ్చలేదు. దీపక్‌రెడ్డి వద్దకు వెళ్లే నాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. కాంట్రాక్టులు, ఇతర విషయాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. డీ. హీరేహాల్ ఎంపీపీ పుష్పావతి, ఉస్మాన్, రంగప్పతో పాటు పలువురు నేతలు కాలవ వైఖరిని విభేదించి దీపక్ వెంటే నడుస్తూ వచ్చారు. దీపక్‌పై అవినీతి ఆరోపణలు ఎంతగా ప్రయత్నించినా దీపక్‌రెడ్డి అనుచరులు తనవైపు రాకపోవడంతో.. కాలవ శ్రీనివాసులు పథకం ప్రకారం ముందుకు సాగారు. దీపక్‌రెడ్డి అవినీతి పరుడని అంతర్గతంగా పార్టీ శ్రేణులకు చెబుతూ వచ్చినట్లు తెలుస్తోంది. దీపక్‌రెడ్డిపై బెదిరింపులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, దాడి చేశారని సెక్షన్ 506, 447, 341 కింద మారణాయుధాలు ఉన్నాయని సెక్షన్ 148 కింద మాదాపూర్, హైదరాబాద్‌లో 6 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కాలవ వాదనలకు బలం చేకూరింది. దీంతో దీపక్, కాలవను లక్ష్యంగా చేసుకుని నియోజకవర్గంలో పర్యటిస్తూ నియోజకవర్గ అభివృద్ధి, కాలవ అవినీతిపై బహిరంగంగా మాట్లాడుతూ వచ్చారు. గుమ్మఘట్ట జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పూలనాగరాజు కాలవ వర్గంలో చేరారు. దీంతో దీపక్, మెట్టు ఏకమయ్యారు. పైకి దూరంగా ఉన్నప్పటికీ ఇద్దరి లక్ష్యం ‘కాలవ’ కావడంతో ఆయనకు వ్యతిరేకంగా తమ వర్గాన్ని బలపరుచుకున్నారు. ఎన్ని ప్రలోభాలు, బెదిరింపులకు గురిచేసినా వ్యతిరేకవర్గాన్ని కాలవ తనవైపు తిప్పుకోలేకపోయారు. పార్టీ నిర్వహించిన సర్వేలు కూడా టీడీపీ ఓటమి ఖాయమని వచ్చింది. ఈ పరిస్థితుల్లో దుర్గం నుండి బరిలోకి దిగితే దీపక్, మెట్టు పూర్తిగా సహకరించరని, ఓడిపోతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవల్సి వస్తుందనే ఆలోచనలో పడ్డారు. ఏకమైన దీపక్, మెట్టు కాలవ చర్యలను గమనించిన దీపక్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశం పెట్టి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014కు ముందు స్థానికసంస్థల ఎన్నికల్లో ఎవరు పార్టీ కోసం పనిచేశారో..? ఎవరి అండతో గెలిచావో గుర్తుంచుకోవాలని మంత్రికి సూచించారు. వైఖరి మారకుంటే కాలవ చిట్టా విప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. అసలు వచ్చే ఎన్నికల్లో కాలవకు టిక్కెట్టు దక్కకుండా చేయాలని దీపక్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాలవకు కాకుండా మెట్టు, దీపక్రెడ్డిలో ఎవరికి వచ్చినా పరస్పరం సహకరించుకోవాలని అంతర్గతంగా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఇది కాలవకు పూర్తిగా మింగుడుపడటం లేదు. నాలుగేళ్లలో కాలవకు భారీగా లబ్ధి కాలవ శ్రీనివాసులు నాలుగేళ్లలో ఆర్థికంగా బాగా లబ్ధిపొందారు. నీరు–చెట్టు, హైవే పనులు, హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ, ఇతర అభివృద్ధి పనుల్లో బాగా లబ్ధిపొందారు. తాజాగా బీటీపీ పనులు కూడా దక్కాయి. ఈ ఒక్క పనిలోనే రూ. 50 కోట్ల దాకా కాలవకు అందుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రూ.దాదాపు వందకోట్లు కాలవ ఖాతాలో జమ అవుతుందని ఆయన వ్యతిరేక వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాలవ గుట్టు విప్పుతా అని దీపక్ చేసిన ఆరోపణల వెనుక ఈ అవినీతి తతంగమే ఉంటుందని తెలుస్తోంది. ఏదిఏమైనా పార్టీని మూడు వర్గాలతో అంతంత మాత్రంగానే ఉన్న టీడీపీ పరిస్థితి మరింత దిగజారిందనేది పరిశీలకు అభిప్రాయం. గుంతకల్లు వైపు చూసినా.. వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం టికెట్‌ను తన అల్లుడు దీపక్‌రెడ్డికి ఇప్పించుకోవాలనే యోచనలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఉన్నారు. మరోవైపు మెట్టు గోవిందరెడ్డి వర్గం కూడా సహకరించని పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో దుర్గం కాకుండా గుంతకల్లు టిక్కెట్టు దక్కించుకోవాలని పార్టీ పెద్దల ద్వారా మంత్రి కాలవ లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ జితేంద్రగౌడ్ కాకుండా మాజీ ఎమ్మెల్యే మధూసూదన్గుప్తాకు టిక్కెట్టు ఇప్పించాలని జేసీ ప్రయత్నిస్తున్నారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించినట్లు తెలిసింది. దీంతో తిరిగి ఎంపీగా వెళ్లాలనే యోచన కూడా చేశారు. అదీ కుదరకపోవడంతో తిరిగి ‘దుర్గం’ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అందువల్లే అసమ్మతిని అణగదొక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలోనే సీఎం పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలపై ఎక్కడా దీపక్‌రెడ్డి ఫొటో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. -
అనంతపురం జిల్లా టీడీపీలో ముదిరిన వర్గపోరు
-
సాకులు చెప్పి తప్పించుకోకు
రాయదుర్గం : మంత్రి కాలవ శ్రీనివాసులు కుంటిసాకులు వీడి.. నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సూచించారు. రాయదుర్గంలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు మాట్లాడారు. ‘పరిమిత సంఖ్యలో రావాలని నోటీసులతో పోలీసులను మంత్రి కాలవ గురువారం రాత్రి మా ఇంటికి పంపారు. పరిమిత సంఖ్య అయితే అది బహిరంగ చర్చ ఎలా అవుతుందని’ కాపు ప్రశ్నించారు. తేదీ ఖరారు చేసిన మంత్రి కాలవ.. డీఎస్పీకి అనుమతి కోరిన లేఖలో ఇరువైపులా పరిమిత సంఖ్యలో అనుమతి ఇవ్వాలని, తన తరఫున శాంతిభద్రతలకు విఘాతం కలిగితే చర్యలు తీసుకోవాలని రాయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. బహిరంగ చర్చ అంటే అభివృద్ధిపైన గానీ అవినీతిపైన గానీ ఒక్కో అంశంపై ప్రజల సమక్షంలో చర్చించడమే బహిరంగ చర్చ అన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. బహిరంగ చర్చకు ప్రజలను తరలించడానికి సామర్థ్యం లేదని మంత్రి చెప్పడం సరికాదని, ప్రజలను తరలించాల్సి న అవసరం లేదని, ప్రజలే ఆసక్తిగా తరలివస్తారని సూ చించారు. రాయదుర్గం ప్రజలు శాంతికాముకులు అనే విషయం నీకు తెలియదా? అని కాపు ప్రశ్నించారు. సమయం లేదు మిత్రమా.. మంత్రి కాలవ శ్రీనివాసులు గత ఎన్నికలకు 15 రోజుల ముందు దుస్తులు సర్దుకొని రాయదుర్గం వస్తే .. ఆయన అందం చూసి ప్రజలు ఓటువేసి గెలిపించలేదని కాపు అన్నారు. టీడీపీ మేనిఫెస్టోను నమ్మారని, ఈయన కూడా ప్రచారం చేయడంతోనే గెలిపించారన్నారు. అవే అంశాలపై చర్చించడానికి ఒప్పుకోకపోవడం ఎంత వరకు సబబన్నారు. కాలవ ఎంపీగా వున్న సమయంలో దుర్గం అభివృద్ధికి ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. 2002లో హెచ్చెల్సీ నీటి కోసం జరిగిన ఉద్యమంలో రైతులపై కేసులు పెడితే, ఇటు వైపు తిరిగి చూడని నీవు రైతులకు ఏమిలబ్ధి చేకూర్చావని నిలదీశారు. సమయంలేదు మిత్ర మా... పోలీసులతో అనుమతి తీసుకో... చర్చించడానికి మేము వస్తున్నాం’ అని తెలిపారు. కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్ర రెడ్డి, బీసీ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎన్టీ సిద్దప్ప, బీటీపీ గోవిందు, జిల్లా అధికార ప్రతి నిధి మాధవరెడ్డి, మండల కన్వీనర్లు మలి ్లకార్జున, కాంతారెడ్డి, ఆలూరు చిక్కణ్ణ, ఈశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ గోనబావి శర్మస్, పట్టణ ప్రచార కార్యదర్శులు పైతోట సంజీవ, హనుమంతు, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాసులు, సీతారం, బాబు, గిడ్డరాము, నాయకులు ముల్లంగి నారాయణ స్వామి, ఎంసీహెచ్ రాజ్‌కుమార్ , కొత్తపల్లి సత్యనారాయణ రెడ్డి, లక్ష్మిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బేలోడు రామాంజనేయులు, తిమ్మప్ప, సత్తి పాల్గొన్నారు. పోలీసుల అదుపులో కాపు డి.హీరేహాళ్ నుంచి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో రాయదుర్గం వస్తున్న కాపు రామచంద్రారెడ్డిని మల్లాపురం రోడ్డు సమీపాన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము శాంతియుతంగా ఉన్నప్పటికీ అదుపులోకి తీసుకోవడమేంటని కాపు ప్రశ్నించారు. అవసరమైతే గృహనిర్బంధం చేసుకోండి.. ఇలా నియోజకవర్గం దాటించాలని చూస్తే కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతారన్నారు. అయితే పోలీసులు అందుకు ససేమిరా అన్నారు. పరిమిత సభ్యుల మధ్య చర్చిద్దాం: మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం : 2014 నుంచి ఇప్పటి వరకు దుర్గం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి , అవినీతిపై బహిరంగంగా చర్చిద్దామని చెప్పిన మాట వాస్తవమే.. వేలాది మంది ప్రజల మధ్య చర్చ పెడితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు చెప్తున్నారని, పరిమిత సభ్యులతో చర్చించడానికి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రావాలని మంత్రి కాలవ శ్రీనివాసులు కోరారు. గురువారం తన గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధితో పాటు టీడీపీ మేనిఫెస్టోపై చర్చిద్దామని చెప్పడం భావ్యం కాదన్నారు. కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా వున్న 2009 నుంచి 2014 వరకు, 2014 నుంచి ఇప్పటి వరకు నా హయాంలో జరిగిన అబివృద్ధిపై మాత్రమే చర్చిద్దామన్నారు. ఇది రాజకీయ చర్చ కాదని ఇద్దరు వ్యక్తుల మధ్య చర్చ అన్నారు. మా మధ్యలో సంధానకర్తగా మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ ఉంటారని తెలిపారు. పరిమిత సంఖ్యలో అర్థవంతమైన చర్చ చేయడానికి రామచంద్రారెడ్డి రావాలని కోరుతున్నానన్నారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశులు, మురడి ఆనంద్‌రెడ్డి, మల్లికార్జున, నాగళ్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రైతు గోడు పట్టాదా?
అనంతపురం సిటీ: అధికార పార్టీకి చెందిన వారైనా సరే..తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబట్టాల్సి వచ్చింది. జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తున్నా..ప్రభుత్వం 44 మండలాలనే కరువు జాబితాలో చేర్చడంతో సందిగ్ధంలో పడిన అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు..తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. గురువారం జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం రసవత్తరంగా సాగింది. సమావేశంలో మంత్రి కాలువ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ యామినీ బాల, జాయింట్ కలెక్టర్ డిల్లీరావు, జెడ్పీ సీఈఓ శోభాస్వరూపారాణి పాల్గొనగా...వ్యవసాయశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, విద్యుత్, పశుసంవర్థకశాఖలకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. సమయం లేకపోవడంతో విద్య, వైద్యం, గ్రామీణ నీటిపారుదల, పంచాయతీ, అటవీశాఖలపై చర్చ జరలేదు. రైతుల జీవితాలతో ఆడుకుంటారా..? తీవ్ర వర్షాభావంతో జిల్లా వ్యాప్తంగా పొలాలన్నీ బీళ్లుగా మారాయని....అక్కడక్కడా విత్తనాలు వేసినా..అవి మొలకెత్తలేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కేవలం 44 మండలాలను మాత్రమే కరువు జాబితాలో చేర్చడంపై సభ్యులు మండిపడ్డారు. ఇలా నివేదికలు ఎలా పంపారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథిలు వ్యవసాయశాఖ జేడీపై మండిపడ్డారు. గతేడాది రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ నేటికీ రైతులకు అందలేదనీ... తక్షణం వారికి ఈ డబ్బు చేతికందితే కొంత భరోసా ఉంటుందన్నారు. స్పందించిన జేడీ మాట్లాడుతూ, జూన్‌లో కొంతమేర వర్షాలు కురవడంతో నివేదిక ఇలా పంపామనీ, ప్రస్తుతం 63 మండలాలను కరువు మండలాలుగా గుర్తించి నివేదిక సిద్ధం చేశామన్నారు. విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి సెప్టెంబరులో వర్షాలు కురిస్తే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఆయా ప్రాంతాల వాతావరణాన్ని బట్టి వందశాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలని సభ్యులు కోరగా.. అధికారులు సానుకూలంగా స్పందించారు. వాతావరణ బీమా ‘అనంత’ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేకపోతోందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కాలువ స్పందిస్తూ.. ఈ పథకంపై సీఎంకు అవగాహన ఉందనీ, త్వరలోనే ఆయన వాతావరణ బీమాలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే యోచనలో ఉన్నారన్నారు. ఇక పశుక్రాంతి పథకం ద్వారా ఈ వాతావరణానికి అలవాటు లేని పశువులను అధికారులు తీసుకువస్తున్నారనీ, దీంతో అవి మృత్యువాత పడి రైతుకు నష్టం కలుగుతోందని సభ్యులు అన్నారు. అలా కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి పశువులను కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. స్పందించిన మంత్రి కాలవ..సభ్యుల కోరిక మేరకు తప్పకుండా మార్పు చేస్తామన్నారు. కల్తీ జరుగుతున్నా..కట్టడి చేయలేకపోతున్నారు మార్కెట్లో పాలు, నెయ్యి, చివరికి నీరు కూడా కల్తీ చేస్తున్నా...అధికారులు పట్టించుకోక పోవడం దారుణమని సభ్యులు ధ్వజమెత్తారు. తక్షణం కల్తీలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ డిల్లీ రావు.. ..ఆహారకల్తీ విభాగానికి ఒకే అధికారి ఉన్న కారణంగా కేసులు ఎక్కువగా నమోదు చేయలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఇకపై కల్తీలకు పాల్పడే వారిపై ఐపీసీ సెక్షన్లు విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిపాజిట్లు చేస్తేనే రుణాలిస్తారా..? ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు రుణాల మంజూరులో పలు బ్యాంకుల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, ముందుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తేనే రుణాలిస్తామంటూ మొండిగా వాదిస్తున్నారన్నారు. స్పందించిన జాయింట్ కలెక్టర్...వెంటనే బ్యాంకర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే అనంతపురం శివారుల్లో జాతీయ రహదారి నిర్మాణంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్ అన్నారు. స్పందించిన జేసీ..తానే స్వయంగా గ్రామాలకు వచ్చి రైతులతో మాట్లాడుతానన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పార్థసార థి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతురాయ చౌదరి, ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, కత్తినరసింహారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. కరుణానిధి మృతికి నివాళి సమావేశం ప్రారంభం కాగానే అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. తీర్మానాలివీ... ♦ జిల్లాలోని 63 మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి. ♦ జిల్లాలోని 1,468 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు తాగునీటి సౌకర్యం కల్పించాలి. ఆయా పాఠశాలల్లో మొక్కలు పెంచి..సంరక్షణ అటవీశాఖ చర్యలు తీసుకోవాలి. ♦ జిల్లాలోని అన్ని చెరువులకు హంద్రీనీవా నుంచి నీరు విడుదల చేయాలి. ♦ అనంతపురం, గుత్తి, రాయదుర్గంలోని జెడ్పీ స్థలాల్లో రూ.61 లక్షలతో గదులు నిర్మించి వాటిని అద్దెలకు ఇవ్వాలి. ♦ రాయదుర్గం మండలం, వీరాపురం ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలుగా విభజించాలని తీర్మాణాలు చేశారు. -
రాయదుర్గంలో మంత్రి కాల్వకు గట్టి ఎదురుదెబ్బ
-
మంత్రి కాలువకు ఎదురుదెబ్బ
అనంతపురం: ఏపీ మంత్రి కాలువ శ్రీనివాస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి నియోజకవర్గం రాయదుర్గంలోని బొమ్మనహల్ మండల టీడీపీ నేత ముల్లంగి నారాయణ స్వామి చౌదరి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి సమక్షంలో నారాయణస్వామి వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనతో పాటు వందలాది మంది అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి కాపు రామచంద్రారెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..ఏపీని విభజించిన కాంగ్రెస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్ధతివ్వడం దుర్మార్గమన్నారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. -
రామ్‌గోపాల్‌వర్మను అరెస్టు చేయాలి
అనంతపురం : ఐద్వా నాయకులురాలు పీ మణి, సామాజిక కార్యకర్త పీ దేవిలపై అసభ్యంగా మాట్లాడిన రామ్‌గోపాల్ వర్మపై తక్షణం కేసు నమోదు చేసి అరెస్టు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులును ఐద్వా, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. మంత్రిని ఆదివారం ఆయన స్వగృహంలో ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, సావిత్రి ఇతర నాయకురాళ్లు, నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్‌గోపాల్ వర్మ ఇంగ్లీషులో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) అనే డిజిటల్ పోర్స్ సినిమా నిర్మించారన్నారు. దాని ట్రైలర్ యూటూబ్‌లో విడుదల చేశారన్నారు. ఆ సందర్భంగా ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్‌గోపాల్‌వర్మ ఐద్వా నాయకురాలు పీ మణి, సామాజిక కార్యకర్త పీ దేవిలపై అసభ్యంగా మాట్లాడడమే కాకుండా, వారి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా వ్యహరించిన ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకురాళ్లు యమున, చంద్రిక, రామాంజినమ్మ, వైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు నూరుల్లా, బాలకృష్ణ, పి.రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటివద్ద ఉద్రిక్తత!
సాక్షి, అనంతపురం: పట్టణంలోని మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బోయ వాల్మీకి సామాజిక వర్గాన్ని ఎస్టీల్లో చేర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎస్టీ సంఘాల ప్రతినిధులు ఆదివారం మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటిని ముట్టడించారు. బోయ వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని, ఇలా చేరిస్తే తమకు అన్యాయం జరుగుతుందని వారు అన్నారు. గిరిజన గర్జన పేరిట ప్లకార్డులు పట్టుకొని.. ఆందోళనకు దిగిన గిరిజన సంఘాల ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
‘ఇంటింటా’నిలదీత
ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి కాలవకు చుక్కెదురు రాయదుర్గం : రాయదుర్గంలో సోమవారం చేపట్టిన ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమంలో మంత్రి కాలవ శ్రీనివాసులుకు చుక్కెదురైంది. ఏ ఇంటికెళ్లినా ప్రజలు సమస్యలను ఏకరువు పెట్టి ఆయనను నిలదీశారు. మునిసిపల్ చైర్పర్సన్ ముదిగల్లు జ్యోతి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనిమిదో వార్డులోని కృష్ణాశ్రమం వద్ద ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. సమావేశం ముగియగానే మహిళలు శాంతమ్మ, లక్ష్మీదేవి లేచి ‘వార్డులో పర్యటించండి, అభివృద్ధి గురించి తెలుస్తుంది’ అని మంత్రితో అన్నారు. ‘డ్రెయినేజీలపై ఆక్రమణల తొలగింపు నిబంధనలు సాధారణ ప్రజలకేనా.. టీడీపీ వారికి వర్తించవా’ అంటూ శాంతమ్మ ప్రశ్నించారు. ‘451 ఇళ్లుండే 8వ వార్డులో రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయిందని, అందులో పందుల స్వైర విహారం చేస్తుండటంతో దుర్వాసన భరించలేకపోతున్నామని, పట్టించుకునేవారే లేరని లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గతంలో 6వ వార్డు కౌన్సిలర్ రాజశేఖర్ చైర్మన్ అయితే ఆయన ఇంటి ముందు రోడ్డు వేయించుకున్నారు. ప్రస్తుతం 8వ వార్డు కౌన్సిలర్ జ్యోతి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆమె ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వేయించుకుంటున్నారు. మిగిలిన వార్డు ప్రజలు మనుషులు కారా?’ అని ప్రశ్నించారు. దీంతో మంత్రి వార్డులో కొంతభాగం పర్యటించారు. ఏ ఇంటికెళ్లినా పింఛన్ రాలేదని, ఇళ్లు ఇవ్వలేదని, మరుగుదొడ్లు మంజూరు కాలేదని ఇలా ఏదోక సమస్యను ఏకరువుపెట్టారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించకపోవడంతో పస్తులతో బతుకుబండి లాక్కొస్తున్నామని చేనేతలు వాపోయారు. మూడేళ్లుగా వార్డును పట్టించుకునే వారే లేరని వార్డు ప్రజలంతా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి మాట్లాడుతూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి ముందు 8వ వార్డు ప్రజలు ఏకరువు పెట్టిన సమస్యల్లో కొన్ని ఇలా ఉన్నాయి. మీకో దండం : మంత్రి వద్ద టీడీపీ సీనియర్ నాయకుడి నిర్వేదం ‘సార్.. నాకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి టీడీపీకే ఓటు వేశాను, అదే పార్టీలోనే ఉన్నాను. ఇప్పటికీ పూరిగుడిసెలోనే ఉంటున్నాను. మగ్గం ద్వారానే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకొక ఇల్లు మంజూరు కాలేదు. ప్రభుత్వం నుం డి ఎలాంటి సహాయ, సహకారాలు లేవు. వార్డులోని ప్రజల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్తే ఆమె పట్టించుకోవడం లేదు. కనీసం బాడుగ ఇళ్లకు మరుగుదొడ్లయినా మంజూరు చేయమంటే అదీ చేయలేదు. ఇన్ని రోజులు పార్టీ కార్యకర్తగా ఉన్నందుకు ఈ మేలు చాలు సార్’ అంటూ స్థానికంగా టీడీపీలో సీనియర్ నాయకుడైన చేనేత కార్మికుడు రాజు మంత్రికి దం డం పెట్టారు. ‘ఇప్పుడు నీకేం కావాలి చెప్పు’ అని మంత్రి అడిగినా ‘నాకు ఏమీ వద్దు సార్.. ఇప్పటివరకు పార్టీలో ఇచ్చిన మర్యాద చాలు’ అని నిర్మొహమాటంగా తెగేసి చెప్పారు. ⇔ అరుణ అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదని, కౌన్సిలర్ చుట్టూ, మున్సిపాల్టీ చుట్టూ తిరిగి తిరిగి చేసి అలసిపోయామని అరుణ మంత్రి కాలవ దృష్టికి తీసుకొచ్చింది. పింఛన్ ఇప్పిస్తామని మంత్రి చెప్పగా ‘ఏమో సార్ ఏమిస్తారో? ఎప్పుడిస్తారో?’ అంటూ నిర్వేదం వ్యక్తం చేసింది. ⇔ ఆంజనేయులు చేనేత రుణమాఫీ అన్నారని, వడ్డీలేని రుణాలిప్పిస్తామన్నారని, ఏదీ ఇవ్వకపోగా కనీసం నేతన్నలను పట్టించుకునేవారే కరువయ్యారని ఆంజనేయులు మంత్రి వద్ద ఆవేదన చెందారు. ఇంట్లో మగ్గం నేస్తున్న ఆంజనేయులును మంత్రి పలుకరించగా ఆయన ఇలా స్పందించారు. ‘సార్ ఓనర్లతో ముడిసరుకులు తెచ్చి చీరలు నేస్తున్నాం. 15 రోజుల పాటు ఒక చీరను ఇద్దరం నేస్తే రూ.2,500 ఇస్తున్నారు. దాంతోనే బతుకీడ్చుతున్నాం’ అని విచారం వెలిబుచ్చారు. పిల్లల చదువులు భారం అవుతున్నాయని, బ్యాంకు ద్వారా రుణాలిప్పించి ఆదుకోవాలని కోరారు. ⇔ లక్ష్మీదేవి అద్దె గుడిసెలో ఉన్నామని, ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుందామని అనుకుంటే పట్టించుకునే వారే లేరని లక్ష్మీదేవి మంత్రితో అన్నారు. ‘అర్హత ఉన్న మా లాంటి నిరుపేదలకు కాకుండా ఇళ్లు ఎవరికిస్తారు? గొప్పలు చెప్పడం కన్నా, స్వయంగా పరిశీలించి అర్హత ఉన్న మాలాంటి వారికి న్యాయం చేయండి సార్’ అని వేడుకున్నారు. ⇔ చంద్రకళ ‘సార్.. ఎలాంటి సౌకర్యాల్లేని ఈ వార్డులో జీవనం సాగిస్తున్న మా దీనావస్థను ఒకసారి పరికించండి. రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, ఎక్కడికక్కడ నీరు నిలబడి మురికికూపాలను తలపిస్తున్నాయి. ఆ మురుగులో పడి దొర్లుతున్న పందులను చూడండి. ఈ దుర్వాసనలో ఎలా బతకాలి, రోగాలు రావా?’ అంటూ నిలదీశారు. తాగడానికి నీరు కూడా సక్రమంగా రావడం లేదని, వచ్చినా కలుషితమైనవి వస్తున్నాయని, వాటిని ఎలా తాగాలని ప్రశ్నించారు. -
సాక్షి కథనాలపై విచారణకు సిద్ధంగా లేం: కాలువ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో భూముల దురాక్రమణపై సాక్షి పత్రికలో వచ్చిన కథనాలపై విచారణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఏపీ ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సభ లోపల లేదా వెలుపల ఎక్కడైనా ప్రతిపక్ష నేత జగన్‌తో చర్చకు సిద్ధమని తెలిపారు. సోమవారం ఆయన ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్ఆర్ఐ వేమూరి రవికుమార్ చట్టప్రకారం సంపాదించిన డబ్బుతో 11 ఎకరాల భూమిని కొన్నారని, దానితో నారా లోకేశ్‌కు సంబంధం లేదన్నారు. వైఎస్సార్ సీపీ ఆరోపించిన నేతలంతా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. -
రాష్ట్రంలో సామాజిక వర్గాల గణన
రాష్ట్రంలో సామాజికవర్గాల గణన చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వారి ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలు తెలుసుకునేందుకు సర్వే చేయించి దానికనుగుణంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. దామాషా పద్ధతిలో ప్రతి సామాజికవర్గం ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యాకులుగా ఉన్న వాల్మీకి-బోయ కులస్తులను ఎస్టీలుగా గుర్తించే అంశాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు నేతృత్వంలో వాల్మీకి-బోయ సామాజికవర్గ ప్రతినిధులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి బీసీ-ఎ జాబితాలో ఉన్న తమను కర్నాటకలో మాదిరిగా ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఉత్తరప్రదేశ్, కేరళ, హర్యానా తదితర రాష్ట్రాల్లో వాల్మీకి-బోయలను ఎస్సీలుగా గుర్తించారని, రాష్ట్రంలోనూ వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చేందుకు ఎన్టీఆర్ హయాం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తెలుగుదేశం మేనిఫెస్టోలోనూ దీనిపై హామీ ఇచ్చినట్లు వారు గుర్తుచేశారు. కర్నాటకలో హవనూర్ కమిషన్ వేసి 1991లో ఆర్డినెన్స్ ద్వారా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించారని తెలిపారు. కేబినెట్ నిర్ణయం, అసెంబ్లీ తీర్మానం లేదా కమిషన్ ఏర్పాటు ద్వారా సమస్య పరిష్కరించవచ్చని సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇచ్చిన హామీ ప్రకారం వాల్మీకి-బోయలను ఎస్టీలుగా గుర్తిస్తామని చెప్పారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చించి ఎస్టీ రిజర్వేషన్ ఎలా కల్పించాలనే దానిపై స్పష్టత తీసుకుంటామని తెలిపారు. -
ఇసుక తరలిస్తున్న 8వాహనాలు స్వాధీనం
అనంతపురం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాలోని కన్నెకల్ మండలం గంగాపురం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 టిప్పర్లు, 2 లారీలు, 1 జేసీబీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇసుక కుంభకోణం వెనక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
అవిశ్వాస తీర్మానం పెడతామనడం బాధాకరం
హైదరాబాద్: ఏపి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి అనడం బాధాకరం అని ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు. శాసనసభలో జగన్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్‌కు స్పీకర్ అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ అవిశ్వాస తీర్మానం పెడతామనడం బాధాకరం అన్నారు. జగన్ సభాసాంప్రదాయాలు పాటించడంలేదన్నారు. జగన్ సభను తన కనుసన్నలలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారని కాలువ విమర్శించారు.