
సాక్షి, అనంతపురం: పట్టణంలోని మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బోయ వాల్మీకి సామాజిక వర్గాన్ని ఎస్టీల్లో చేర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎస్టీ సంఘాల ప్రతినిధులు ఆదివారం మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటిని ముట్టడించారు.
బోయ వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని, ఇలా చేరిస్తే తమకు అన్యాయం జరుగుతుందని వారు అన్నారు. గిరిజన గర్జన పేరిట ప్లకార్డులు పట్టుకొని.. ఆందోళనకు దిగిన గిరిజన సంఘాల ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.