valmiki boya
-
సీఎం జగన్ చేతికి బోయ, వాల్మీకి కులాల సమస్యల అధ్యయన నివేదిక
సాక్షి, గుంటూరు: బోయ, వాల్మీకి కులాలకు సంబంధించిన సమస్యలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్యామూల్ ఆనంద్‌కుమార్ చేసిన అధ్యయనం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి చేరింది. నివేదిక (పార్ట్ 1)ను సీఎం జగన్‌కు స్వయంగా అందజేశారు శామ్యూల్. సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్‌ను కలిసి అందజేశారు. సీఎం జగన్‌ను కలిసిన వాళ్లలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే కూడా ఉన్నారు. -
వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చే తీర్మానం బయటపెట్టాలి
సాక్షి, హైదరాబాద్: వాల్మీకి బోయలను ఎస్టీల్లో కలపడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెబుతున్న పత్రాన్ని సీఎం కేసీఆర్ విడుదల చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. ఆదివారం పాలమూరు జిల్లా సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నర ఏళ్లు గడుస్తున్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారడానికి కేసీఆర్ అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణే కారణమని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేని కేసీఆర్.. కేంద్రం అడ్డంకులు పెడుతోందని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని అరుణ మండిపడ్డారు. ముఖ్యమంత్రికి కేవలం తన కుటుంబ సభ్యులను అవినీతి కేసుల నుంచి ఎలా తప్పించాలనే ఆలోచన తప్ప మరొకటి లేదన్నారు. అవినీతికి పాల్పడితే సొంత బిడ్డను కూడా విడిచిపెట్టనని స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్.. తన కూతురి విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో వలసలు లేవనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మంత్రి మల్లారెడ్డి గురించి సీఎం గొప్పగా మాట్లాడటాన్ని బట్టి చూస్తే టీఆర్ఎస్ నేతల అవినీతిని ఆయనే ప్రోత్సహిస్తున్నట్లు అర్థమవుతోందని తెలిపారు. -
బీసీ రిజర్వేషన్‌పై స్పందించిన మంత్రి పితాని
సాక్షి, అమరావతి : కాపుల రిజర్వేషన్ అంశంపై ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ స్పందించారు. వెనుకబడిన వర్గాలకు నష్టం కలిగించే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఎన్నికల హామీని నెరవేర్చే క్రమంలోనే కాపులకు రిజర్వేషన్ కల్పించారని, బీసీల మనోభావాలు, ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో వ్యక్తిగతంగా చర్చిస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం పితాని సత్యనారాయణ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పితాని మంగళవారం మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వెనుకబడిన వర్గాల్లో నెలకొన్న ఆందోళన నెలకొందని, తాను అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అవసరమైతే బీసీ సంఘ ప్రతినిధులతో కూడా చర్చించేందుకు చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తానని తెలిపారు. కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయమై ప్రభుత్వం ముందుగాని, నిర్ణయం వెల్లడించిన తరువాత గానీ వెనుకబడిన వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు చేసి ఉంటే ఇంత గందరగోళం ఉండేదికాదని బీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయని, ఈ విషయంలో తాను కూడా వారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు మంత్రి పితాని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బీసీలకు నష్టం కలిగే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించరని, తమకు కూడా బీసీల ప్రయోజనమే ముఖ్యమని ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ అంశంపై వెనుకబడిన వర్గాలు సంయమనంతో వ్యవహరించాలని, సమస్య జఠిలం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తనకు ఉందన్నారు. అలాగే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం హర్షణీయమని, దీనివల్ల వారి స్థితిగతులు మారతాయన్నారు. -
మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటివద్ద ఉద్రిక్తత!
సాక్షి, అనంతపురం: పట్టణంలోని మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బోయ వాల్మీకి సామాజిక వర్గాన్ని ఎస్టీల్లో చేర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎస్టీ సంఘాల ప్రతినిధులు ఆదివారం మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటిని ముట్టడించారు. బోయ వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని, ఇలా చేరిస్తే తమకు అన్యాయం జరుగుతుందని వారు అన్నారు. గిరిజన గర్జన పేరిట ప్లకార్డులు పట్టుకొని.. ఆందోళనకు దిగిన గిరిజన సంఘాల ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
‘కర్నూలు లేదా అనంత నుంచి ఎంపీ టికెట్’
సాక్షి, కర్నూలు : వచ్చే ఎన్నికల్లో బోయలకు కర్నూలు లేదా అనంతపురం జిల్లా నుంచి ఏదో ఒక స్థానం నుంచి ఎంపీ టికెట్ కేటాయిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గోరంట్లలో జరిగిన బీసీ సంఘాల ప్రతినిధులు సమావేశంలో ఆయన శనివారం ఈ ప్రకటన చేశారు. ‘ చంద్రబాబు లాంటి మోసపూరిత హామీలు నేను ఇవ్వను. బోయలకు న్యాయం చేస్తా. రానున్న కాలంలో ప్రతి జిల్లాలో బీసీ కమిటీలను ఏర్పాటు చేస్తా. కమిటీ సభ్యులు బీసీల అభిప్రాయాలను సేకరిస్తుంది. బోయలకు కర్నూలు లేదా అనంతపురం జిల్లా నుంచి ఎంపీ టికెట్ కేటాయిస్తా. ప్రజా సంకల్పయాత్ర అనంతరం బీసీ గర్జన ఉంటుంది. బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తా. అలాగే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో గోరంట్ల-ఎర్రగుడి బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తా. రెండేళ్లలో బ్రిడ్జి పనులు పూర్తి చేసి చూపిస్తా. పాదయాత్రలో నా దృష్టికొచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తా. చంద్రబాబు బీసీ సబ్‌ప్లాన్‌కు ఏడాదికి రూ.10వేల కోట్లు ఇస్తామన్నారు. మూడేళ్లలో బీసీ సబ్‌ప్లాన్‌కు రూ.10వేల కోట్లు కూడా కేటాయించలేదు. బోయలను ఎస్టీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు అడిగితే ప్రయత్నం చేస్తున్నానంటున్నారు. రెండే రెండు పేజీల మేనిఫెస్టో తీసుకువచ్చి అందులో ప్రతి అక్షరాన్ని తప్పకుండా అమలు చేస్తా.’ అని అన్నారు. -
రాష్ట్రంలో సామాజిక వర్గాల గణన
రాష్ట్రంలో సామాజికవర్గాల గణన చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వారి ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలు తెలుసుకునేందుకు సర్వే చేయించి దానికనుగుణంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. దామాషా పద్ధతిలో ప్రతి సామాజికవర్గం ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యాకులుగా ఉన్న వాల్మీకి-బోయ కులస్తులను ఎస్టీలుగా గుర్తించే అంశాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు నేతృత్వంలో వాల్మీకి-బోయ సామాజికవర్గ ప్రతినిధులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి బీసీ-ఎ జాబితాలో ఉన్న తమను కర్నాటకలో మాదిరిగా ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఉత్తరప్రదేశ్, కేరళ, హర్యానా తదితర రాష్ట్రాల్లో వాల్మీకి-బోయలను ఎస్సీలుగా గుర్తించారని, రాష్ట్రంలోనూ వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చేందుకు ఎన్టీఆర్ హయాం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తెలుగుదేశం మేనిఫెస్టోలోనూ దీనిపై హామీ ఇచ్చినట్లు వారు గుర్తుచేశారు. కర్నాటకలో హవనూర్ కమిషన్ వేసి 1991లో ఆర్డినెన్స్ ద్వారా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించారని తెలిపారు. కేబినెట్ నిర్ణయం, అసెంబ్లీ తీర్మానం లేదా కమిషన్ ఏర్పాటు ద్వారా సమస్య పరిష్కరించవచ్చని సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇచ్చిన హామీ ప్రకారం వాల్మీకి-బోయలను ఎస్టీలుగా గుర్తిస్తామని చెప్పారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చించి ఎస్టీ రిజర్వేషన్ ఎలా కల్పించాలనే దానిపై స్పష్టత తీసుకుంటామని తెలిపారు. -
వాల్మీకిబోయ, కాయతీ లంబాడాలపై సర్వే
- దానిపై న్యాయనిపుణుల సలహాలు స్వీకరిస్తాం - ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్.చెల్లప్ప వెల్లడి హైదరాబాద్: రాష్ర్టంలోని వాల్మీకిబోయ, కాయతీ లంబాడాల వెనకబాటుకు సంబంధించిన వివరాలను తాజా సర్వే ద్వారా సేకరించాల్సి ఉందని ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎస్.చెల్లప్ప వెల్లడించారు. ఈ రెండు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంపై ప్రభుత్వం తమ కమిషన్‌ను ఏర్పాటు చేసినందున తాము స్వతంత్రంగా పరిశీలన చేపట్టాల్సి ఉందన్నారు. సోమవారం ఎస్టీ కమిషన్ సభ్యులు కె.జగన్నాథరావు, హెచ్.కె.నాగుతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగంలోని 15(4), 16(4) ప్రకారం ఆయా కులాలు సామాజిక , ఆర్థిక, విద్యాపరంగా ఎంత మేరకు వెనుకబడి ఉన్నాయనేది తేల్చడమే కమిషన్ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. న్యాయనిపుణులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి ఏయే అంశాల ప్రాతిపదికన సర్వే నిర్వహించాలనే దానిపై ఒక అభిప్రాయానికి వస్తామన్నారు. ఆ తర్వాత దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. వాల్మీకిబోయలకు సంబంధించి మహబూబ్నగర్జిల్లాలో పరిశీలన జరిపామని, ఇంకా ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వాల్మీకిబోయలున్నారని చెప్పారు. కాయతీ లంబాడీల జనాభా ఎక్కువగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉందని, మంగళవారం నుంచి (5-7 తేదీల మధ్య) నిజామాబాద్ జిల్లాలో పరిశీలన జరుపుతామన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై సరైన సర్వే జరగకపోవడాన్ని కోర్టు తప్పుబట్టడంతో సమస్య వచ్చిందని చెప్పారు. ఎస్టీ కమిషన్‌కు చట్టబద్ధత పై వివిధసంఘాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై ప్రశ్నించగా, 1968లో నియమించిన అనంతరామన్ కమిషన్ జ్యుడీషియల్ కమిషన్ కాకపోయినా.. 27 శాతం బీసీ రిజర్వేషన్లపై వారు చేసిన సిఫార్సు ఇప్పటికీ ప్రాతిపదికగానే ఉందని చెల్లప్ప జవాబిచ్చారు. రాష్ర్టంలో మొత్తం 3.6 లక్షల జనాభా ఉన్న వాల్మీకిబోయల్లో, మహబూబ్నగర్జిల్లాలోనే 2.5 లక్షలున్నట్లు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలుస్తోందన్నారు.