సాక్షి, కర్నూలు : వచ్చే ఎన్నికల్లో బోయలకు కర్నూలు లేదా అనంతపురం జిల్లా నుంచి ఏదో ఒక స్థానం నుంచి ఎంపీ టికెట్ కేటాయిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గోరంట్లలో జరిగిన బీసీ సంఘాల ప్రతినిధులు సమావేశంలో ఆయన శనివారం ఈ ప్రకటన చేశారు. ‘ చంద్రబాబు లాంటి మోసపూరిత హామీలు నేను ఇవ్వను. బోయలకు న్యాయం చేస్తా. రానున్న కాలంలో ప్రతి జిల్లాలో బీసీ కమిటీలను ఏర్పాటు చేస్తా. కమిటీ సభ్యులు బీసీల అభిప్రాయాలను సేకరిస్తుంది. బోయలకు కర్నూలు లేదా అనంతపురం జిల్లా నుంచి ఎంపీ టికెట్ కేటాయిస్తా.
ప్రజా సంకల్పయాత్ర అనంతరం బీసీ గర్జన ఉంటుంది. బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తా. అలాగే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో గోరంట్ల-ఎర్రగుడి బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తా. రెండేళ్లలో బ్రిడ్జి పనులు పూర్తి చేసి చూపిస్తా. పాదయాత్రలో నా దృష్టికొచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తా. చంద్రబాబు బీసీ సబ్‌ప్లాన్‌కు ఏడాదికి రూ.10వేల కోట్లు ఇస్తామన్నారు. మూడేళ్లలో బీసీ సబ్‌ప్లాన్‌కు రూ.10వేల కోట్లు కూడా కేటాయించలేదు. బోయలను ఎస్టీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు అడిగితే ప్రయత్నం చేస్తున్నానంటున్నారు. రెండే రెండు పేజీల మేనిఫెస్టో తీసుకువచ్చి అందులో ప్రతి అక్షరాన్ని తప్పకుండా అమలు చేస్తా.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment