
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ తారాస్థాయికి చేరాయి. భారత్‌లో అయితే 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.లక్ష దాటి తర్వాత కాస్త తగ్గింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న బంగారం ధరలతో ఆందోళన చెందుతున్న వారికి ఉపశమనం కలిగించే వార్తొకటి వచ్చింది. వచ్చే 12 నెలల్లో బంగారం ధర భారీగా పడిపోయే అవకాశం ఉందని కజకిస్థాన్ గోల్డ్ మైనింగ్ సంస్థ సాలిడ్ కోర్ రిసోర్సెస్ పీఎల్‌సీ సీఈఓ చెబుతున్నారు.
12 నెలల్లో బంగారం ధరలు (ఒక ఔన్స్) 2,500 డాలర్లకు చేరుకుంటుందని సాలిడ్ కోర్ రిసోర్సెస్ సీఈఓ 'విటాలీ నేసిస్' రాయిటర్స్‌తో చెప్పారు. అయితే 1,800 - 1,900 డాలర్ల స్థాయికి చేసే అవకాశం లేదు. సాధారణంగా బంగారంపై ఓ స్థాయి వరకు ప్రతిస్పందన ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది (ధరలు పెరగడం) ఓవర్ రియాక్షన్' అని కజకిస్థాన్ రెండో అతిపెద్ద గోల్డ్ మైనర్ సాలిడ్‌కోర్ నేసిస్ అంటున్నారు.
ఎంతకు తగ్గొచ్చు?
నేసిస్ చెబుతున్నదాని ప్రకారం.. ఒక ఔన్స్ అంటే 28.3495 గ్రాముల బంగారం ధర 2,500 డాలర్లకు తగ్గుతుంది. అంటే 10 గ్రాముల ధర దాదాపు రూ. 75,000 లకు దిగొస్తుంది. సాంప్రదాయకంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులకు వ్యతిరేకంగా రక్షణ కవచంగా భావించే బంగారం ధర ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 26 శాతం పెరిగింది. ఎందుకంటే యూఎస్ సుంకాలు మాంద్యం భయాలను రేకెత్తించాయి. ఈ క్రమంలో గత మంగళవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం రికార్డు స్థాయిలో 3,500.05 డాలర్లను తాకింది.
👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!
ప్రస్తుతం ధరలు ఇలా..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 26 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..
తెలుగు రాష్ట్రాల్లో..
- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210
- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020
చెన్నైలో..
- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210
- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020
👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
ఢిల్లీలో..
- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,310
- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,170
ముంబైలో..
- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210
- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020
బెంగళూరులో..
- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210
- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020
(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)