Nagarkurnool
-
పకడ్బందీగా పారిశుద్ధ్య పనుల నిర్వహణ
స.హ.చట్టంపై అవగాహన సమాచార హక్కు చట్టం, గ్రామసభ నిర్మాణ సారథ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు దేవసహాయం అన్నారు. సహచట్టం, గ్రామసభ నిర్మాణ సామర్థ్యంపై పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాలను అభివృద్ధిపరచడంలో పంచాయతీ కార్యదర్శులు ముఖ్య పాత్ర పోషిస్తారని, కాబట్టి వీరంతా ఆయా అంశాలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఇద్దరు చొప్పున పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. సహచట్టం, గ్రామసభల నిర్మాణ సామర్థ్యంపై ఏడాది పొడవునా అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీపీఓ రామ్మోహన్రావు, రీజినల్ ట్రైనింగ్ మేనేజర్ హన్మంతు, రీసోర్స్‌పర్సన్స్ కృష్ణ, కోటేశ్వరరావు, నర్సిరెడ్డి పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్: భూగర్భ జలాలు పెంపొందించడానికి, ఇంకుడు గుంతల నిర్మాణం అత్యంత ఆవశ్యకమైందని, నీటి అవసరాలను తీర్చడమే కాకుండా భవిష్యత్ తరాలకు నీటిని అందించడానికి నీటి కొరతను నివారించడానికి ఉపయోగపడుతుందని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో ఆయా శాఖల అధికారులతో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఆఖరు నాటికి అన్ని గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ మోడల్‌గా మార్చాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు విస్తృతంగా ఏర్పాటు చేయాలని, మురుగు నిల్వ ఉండే చోటు గుర్తించి ఇంకుడు గుంతలు నిర్మించాలని, గ్రామాల్లో శుభ్రత పాటించాలని పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలని చెప్పారు. గ్రామీణ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. జిల్లా, గ్రామీణ నీటి పారుదల, పారిశుద్ధ్య మిషన్ కమిటీ ప్రతినెల సమావేశాలు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేదని అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఓ చిన్న ఓబులేసు, డీపీఓ రాంమోహన్‌రావు, డీఈఓ రమేష్‌కుమార్, డీఏఓ చంద్రశేఖర్, డీడబ్ల్యూ ఓ రాజేశ్వరి, డీటీడబ్ల్యూఓ ఫిరంగి పాల్గొన్నారు. -
‘మల్లమ్మకుంట’పై నీలినీడలు..!
రిజర్వాయర్‌కు గ్రీన్‌సిగ్నల్.. అంతలోనే.. రిజర్వాయర్లు నిర్మిస్తే తప్ప పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు మొరపెట్టుకున్నారు. స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రిజర్వాయర్లలో రూ.520 కోట్ల వ్యయంతో 1.2 టీఎంసీల సామర్థ్యంతో మల్లమ్మకుంట నిర్మాణానికి మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తుమ్మిళ్ల లిఫ్ట్‌లో కీలకమైన ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అధికారులు చేపట్టిన భూసర్వేకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. మొత్తం 567 ఎకరాలు అవసరమని అధికారులు నివేదికలు రూ పొందించారు. పెగ్ మార్కింగ్ పనులు నిర్వహిస్తున్న క్రమంలో రైతులు అడ్డుకున్నారు. పూర్తి నష్టపరిహారం ఇచ్చి.. న్యాయం చేశాకే పనులు మొదలుపెట్టాలని ఆందోళనలకు దిగారు. ● ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి కలెక్టర్‌కు లేఖ రాయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం వల్ల 250 మంది దళిత రైతులు భూములు కోల్పోతారని.. దాన్ని రద్దు చేయాలని ఆయన గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్‌కు లేఖ రాయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఈ మేరకు ఆయన నీటిపారుదల శాఖ ఎస్ఈకి లేఖ రాయడం.. ఆ అధికారి పైఅధికారికి నివేదికలు సమర్పించడం.. కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం హాట్‌టాపిక్‌గా మారింది. మల్లమ్మకుంట రిజర్వాయర్‌పై నీలినీడలు కమ్ముకోగా.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజోళిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్).. దశాబ్దాల కాలంగా నీటి వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ, కర్ణాటక మధ్య నీటి వాటాల స్థిరీకరణతోపాటు తెలంగాణ ప్రాంతానికి నీటి కేటాయింపుల్లో వివక్షపై జగడాలు కొనసాగాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇదే కీలకాంశంగా మారగా.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సైతం మునుపటి పరిస్థితులే నెలకొన్నాయి. ప్రస్తుతం మూడు రాష్ట్రాల సమస్యగా మారింది. ఇది ఒకవైపు కాగా.. మరోవైపు తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా వెనుకబడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని ఆర్డీఎస్ ఆయకట్టును పూర్తిస్థాయిలో సస్యశ్యామలం చేయాలనే లక్ష్యం మాటలకే పరిమితమైంది. ఈ ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించాల్సిన రిజర్వాయర్లపై ఏళ్ల తరబడి సందిగ్ధత వీడకపోవడం.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త ప్రతిపాదనలు తెరపైకి రావడం వంటి కారణాలు అనిశ్చితికి కారణమవుతున్నాయి. సరైన ప్రణాళిక లేమి.. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం వెరసి మల్లమ్మకుంట రిజర్వాయర్‌పై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ పేరుకే 87,500 ఎకరాలు.. నిజాం కాలంలో కర్ణాటక పరిధిలోని రాజోళిబండ సమీపంలో తుంగభద్రపై ఆనకట్ట నిర్మించిన విషయం తెలిసిందే. తెలంగాణకు సంబంధించి నడిగడ్డ ప్రాంతంలో 87,500 ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ఆనకట్ట ఎడమవైపున 143 కిలోమీటర్ల కాల్వ (ఆర్డీఎస్ కెనాల్) నిర్మాణం పూర్తి చేశారు. అయితే 20 ఏళ్లుగా ఏనాడూ పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరందలేదు. పంటలు సాగుచేయడం.. నీరందక అవి ఎండిపోవడం.. రైతులు నష్టాల పాలవడం పరిపాటిగా మారింది. కనీసం 30 వేల ఎకరాలకు నీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆర్డీఎస్ ఆయకట్టును పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం 2017లో తుమ్మిళ్ల లిఫ్ట్‌తో పాటు ఇటిక్యాల మండలం వల్లూరు, వడ్డేపల్లి మండలం జూలకల్, తనగల వద్ద మల్లమ్మకుంట వద్ద మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించిన ఫేస్–1, 2 పనులకు జీఓ 429 జారీ చేసింది. 9.6 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం చేపట్టి.. తనగల సమీపంలోని డిస్ట్రిబ్యూటరీ 23 వద్ద డెలివరీ సిస్టమ్ ద్వారా తుంగభద్రలోని నీటిని తోడి ఆర్డీఎస్ కెనాల్‌కు మళ్లించేందుకు శ్రీకారం చుట్టింది. ఏడాది లోపే తుమ్మిళ్ల లిఫ్ట్‌ను రూ.190 కోట్లతో ఏర్పాటు చేసి.. కెనాల్‌కు నీటిని పంపింగ్ చేశారు. కానీ రిజర్వాయర్ల నిర్మాణం అటకెక్కింది. రిజర్వాయర్ నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు కలెక్టర్‌కు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి లేఖతో దుమారం అలంపూర్ పరిధిలోని ఆయకట్టు రైతుల్లో ఆందోళన చిన్నోనిపల్లి, ఆర్డీఎస్కు లింక్ అంటూ తెరపైకి కొత్త ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్న అన్నదాతలు.. కాంగ్రెస్‌లో భిన్నస్వరాలు -
ఆయిల్‌పాం కష్టాలు తీరేనా!
త్వరలో ఇబ్బందులు తీరుతాయి.. ఆయిల్‌ఫెడ్ జీఎం అందించిన సమాచారం మేరకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్ద 95 ఎకరాల్లో, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో 40 ఎకరాల్లో ఆయిల్‌పాం పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం చిత్తనూర్ వద్ద 80 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటుకు స్థలం సేకరణలో దాదాపు కొలిక్కి వచ్చింది. మరో కొన్ని నెలల్లో రైతులు స్థానికంగానే పంటను విక్రయించవచ్చు. – సమీనా బేగం, ఆయిల్‌ఫెడ్ ఇన్చార్జి, నారాయణపేట నర్వ: దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం వంటి కారణాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. డిమాండ్ మేర నూనె గింజల ఉత్పత్తే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు అనువైన నేలలు ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభంలో కాస్త వెనకబడినా.. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం పరిశ్రమ లేకపోవడంతో రైతులు పంటను విక్రయించేందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. – 2020–21 సంవత్సరం ప్రారంభంలో ఉమ్మడి జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కాగా.. 430 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పాం సాగుకు శ్రీకారం చుట్టగా.. అధికారులు 4,60,000 మొక్కలను దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 28,999 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు ఆయిల్‌పాం గెలలను తరలించాల్సి వస్తోంది. పరిశ్రమలు ఉంటేనే ప్రయోజనం.. పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో కత్తిరించిన గెలలను గంటల వ్యవధిలోనే పరిశ్రమలో ప్రాసెసింగ్ చేస్తే ఎక్కువ స్థాయిలో నూనె వస్తుంది. జిల్లాలో తెంపిన గెలలను అశ్వారావుపేటకు తీసుకెళ్లేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగానే పరిశ్రమలు అందుబాటులో ఉంటే ప్రయోజనం కలుగుతోందని రైతులు అంటున్నారు. కాగా.. ఇటీవల నారాయణపేట జిల్లాలో ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించి.. రూ. 300 కోట్లతో ఆయిల్‌పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమ ఏర్పాటుపై జాప్యం చేయవద్దని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం కోతలు ప్రారంభం పంట విక్రయానికి అశ్వారావుపేటకు వెళ్లాల్సిందే.. స్థానికంగా ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉంటేనే రైతులకు ప్రయోజనం -
ఉగ్రవాదాన్ని నిర్మూలించి దేశ ఐక్యత చాటాలి
కందనూలు: ఉగ్రవాదాన్ని నిర్మూలించి దేశ ఐక్యతను చాటాలని కవులు, రచయితలు తమ కవితల ద్వారా నిరసన గళాన్ని వినిపించారు. జమ్ముకాశ్మీర్‌లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రముఖ కవి గుడిపల్లి నిరంజన్ అధ్యక్షతన ‘ఉగ్రవాదం నశించాలని’ అంశంపై కవులు, రచయితలు తమ కవితలు చదివారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించి, దేశ ఐక్యత చాటాలని, అన్ని మతాల మధ్య మతసామరస్యం పెంపొందించాలని ఆకాంక్షించారు. అలాగే మతాల మధ్య విద్వేషం కాకుండా సామరస్య పూరిత వాతావరణం నెలకొనాలని, లౌకిక ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ విలువలు ప్రతి పౌరుడు పాటించాలని కవులు తమ కవితల ద్వారా పాటల రూపంలో తెలియజేశారు. సరిహద్దులో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి ఇలాంటి తీవ్రవాద చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో కవులు, రచయితలు ముచ్చర్ల దినకర్, ఎదిరేపల్లి కాశన్న, కందికొండ మోహన్, కొంగరి జానయ్య, సోమశిల సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోనే ఉన్నత శిఖరాలకు..
నాగర్‌కర్నూల్ క్రైం: విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి నసీం సుల్తానా కోరారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని కొల్లాపూర్ క్రాస్‌రోడ్‌లో ఉన్న జ్ఞానేశ్వర వాత్సల్య మందిరం అనాథ ఆశ్రమాన్ని ఆమె సందర్శించి నిర్వాహకులతో మాట్లాడి మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రతి చిన్నారితో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలుంటే న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని చెప్పారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు మధుసూదన్‌రావు, శ్రీరామ్ ఆర్య, పవనశేషసాయి తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలు పరిరక్షించాలి : ఎమ్మెల్యే
అచ్చంపేట రూరల్: నియోజకవర్గంలో శాంతిభద్రతలు పరిరక్షించాలని ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ కోరారు. సోమవారం పట్టణంలో పోలీసు అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ కుట్రలను సహించేది లేదని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే సామాన్యులకు న్యాయం చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పట్టణంలో ప్రతిష్టాత్మకమైన నిర్వహించే బొడ్రాయి పండుగకు భద్రతా చర్యలపై సమీక్షించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఎస్ఐలు రమేశ్, పవన్‌కుమార్, వెంకట్‌రెడ్డి, ఇందిర పాల్గొన్నారు. -
భూ భారతిపై అవగాహన కలిగి ఉండాలి
తిమ్మాజిపేట: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఈ చట్టం ప్రకారం భూముల రికార్డులు క్రమబద్దీకరించేందుకు త్వరలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ఇన్చార్జ్ కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో భూ భారతిపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూ భారతి చట్టంలో తహసీల్దార్‌కు సమస్య పరిష్కరించే అధికారం ఉందని.. ఆయన పరిష్కరించకుంటే ఆర్డీఓ, కలెక్టర్, కమిషనర్ వరకు వెళ్లవచ్చన్నారు. 30 రోజుల్లో సమస్య పరిష్కారంగాకపోతే ఆన్లైన్లోనే రికార్డు వస్తుందని తెలిపారు. త్వరలోనే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని.. అవసరమైన ధ్రువపత్రాలు అధికారులకు చూపించాలన్నారు. ఇప్పటి వరకు అక్రమంగా ఉన్న పట్టాలను రద్దు చేస్తామని చెప్పారు. అంతకుముందు అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ నరేష్ చట్టం గురించి సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణయ్య, డీటీ జ్యోతి, ఆర్ఐలు రవిచంద్ర, హారిక, శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. రికార్డులను క్రమబద్ధీకరించేందుకే రెవెన్యూ సదస్సులు ఇన్చార్జ్ కలెక్టర్ విజయేందిర బోయి -
భూ సమస్యల పరిష్కారానికే..
బిజినేపల్లి: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని అదనపు కలెక్టర్ పి.అమరేందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జూన్ 2 నుంచి గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి రైతుల భూ సమస్యలు పరిష్కారం చేస్తారని.. రెవెన్యూ అధికారులే స్వయంగా గ్రామాలకు వస్తారన్నారు. ఽగ్రామసభల నిర్వహణ తేదీలను ముందుగానే గ్రామ ప్రజలకు చాటింపు ద్వారా తెలియజేస్తారని చెప్పారు. భూ సమస్యలు పరిష్కరించడానికి ఇదో సరైన సమయమని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్, తహసీల్దార్ శ్రీరాములు, ఉప తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ కతలప్ప, ఏఓ నీతి, రైతులు పాల్గొన్నారు. భూ భారతితో సమస్యలు పరిష్కారం.. తెలకపల్లి: భూ భారతి ద్వారా రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం భూముల ధరలు పెరగడంతో గ్రామాల్లో భూ సమస్యలు పెరిగాయని.. రైతులు ఏ సమస్యలున్నా ముందుగా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే పరిష్కరిస్తారని, అక్కడ పరిష్కారంగాకపోతే ఆర్డీఓ, కలెక్టర్‌స్థాయిలో పరిష్కరిస్తారని చెప్పారు. త్వరలో గ్రామ పాలన అధికారులను నియమిస్తామని తెలిపారు. రైతులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్, సింగిల్‌విండో వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ చిన్నజంగయ్య, తహసీల్దార్ జాకీర్ అలీ, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు -
ప్రజావాణికి 21 వినతులు
నాగర్‌కర్నూల్: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 21 వినతులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ వినతులు స్వీకరించి ఆయా విభాగాల సిఫారస్ చేసి మాట్లాడారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నామని.. ప్రజల వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్లోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీసు ప్రజావాణికి 12.. నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 12 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదుదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని సంబంధిత పోలీసు అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలకు సంబంధించి 4, భార్యాభర్తల గొడవలకు సంబంధించి ఒకటి, వేర్వేరు ఫిర్యాదులు 7 వచ్చినట్లు వివరించారు. నేడు మద్యం బార్ల కేటాయింపు నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని అచ్చంపేటలో లైసెన్స్ రెన్యూవల్ కాని రెండు మద్యం బార్ల స్థానంలో కొత్త వాటి ఏర్పాటుకు 18 దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సమక్షంలో లాటరీ విధానంలో కొత్త వారిని ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గాయత్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఉదయం 10 గంటలలోగా వారికి కేటాయించిన ఎంట్రీ పాసులు తీసుకొని హాజరుకావాలని పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: హైదరాబాద్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో 2025–26 విద్యాసంవత్సరానికిగాను పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి పూర్తి చేసిన అనాథ బాలికలు, ఎలాంటి ఆధారం లేని బాలికలు మాత్రమే అర్హులని.. ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి బాలరక్షా భవన్, రూం.నం. 308, పాత కలెక్టర్ కార్యాలయం, నాగర్‌కర్నూల్‌లో మే 17లోగా అందజేయాలని సూచించారు. కాంగ్రెస్‌లో సంస్థాగత నియామకాల సందడి స్టేషన్ మహబూబ్‌నగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఎన్నికలలోపే మండల, బ్లాక్, డీసీసీ అధ్యక్షులు, ఇతర కార్యవర్గాల ఎంపిక కోసం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే ఇటీవలే జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా పీసీసీ పరిశీలకులను నియమించింది. మహబూబ్‌నగర్ జిల్లాకు దొమ్మాటి సాంబయ్య, గజ్జి భాస్కర్యాదవ్లను పీసీసీ పరిశీలకులుగా నియామకం చేసింది. ఈ మేరకు పీసీసీ పరిశీలకుల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, చైర్మన్లు, పీసీసీ, డీసీసీ కార్యవర్గంతోపాటు మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హాజరుకానున్నారు. మండల, బ్లాక్ కాంగ్రెస్, డీసీసీ కార్యవర్గం నియామకంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించి సంస్థాగత నియామకాల కోసం వచ్చేనెల 4 నుంచి 10 వరకు నియోజకవర్గ స్థాయిలో, 13 నుంచి 20 వరకు మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నారు. మండల స్థాయిలో ఐదుగురు, బ్లాక్ కాంగ్రెస్‌కు నలుగురు, డీసీసీ అధ్యక్షుడికి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను టీపీసీసీకి నివేదించనున్నారు. వచ్చే నెల చివరి వారంలో మండల, బ్లాక్ కాంగ్రెస్, డీసీసీ అధ్యక్షుల పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. -
డీసీసీబీ రుణ లక్ష్యం రూ.600 కోట్లు
ఉప్పునుంతల: ఈ ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీ ద్వారా రూ.600 కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పీఏసీఎస్‌లో చైర్మన్ సత్తు భూపాల్‌రావుతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సంఘ సభ్యులు తమ పూర్తి సహకారాన్ని అందజేసి రైతులకు పంట, ఇతర రుణాలు అందించేలా చూడాలని సూచించారు. అలాగే స్థానిక పీఏసీఎస్‌లో సాఫ్ట్వేర్ సమస్యలతో ఓటీఎస్ ద్వారా రైతుల నుంచి కొంత అధికంగా రుణ బకాయిలు వసూలు చేశామని.. జరిగిన పొరపాటును సరిచూసుకున్న వెంటనే వసూలు చేసిన ఎక్కువ డబ్బులను మార్చిలోనే తిరిగి వారి సొంత ఖాతాలో జమ చేశామని, ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని వివరించారు. నాబార్డ్, టెస్కాబ్ రుణాలు పొందాలంటే రుణ రికవరీ శాతం పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం డీసీసీబీకి రూ.21 కోట్లు నష్టం వాటిల్లినా.. ఓటీఎస్ ద్వారా మొండి బకాయిలు వసూలు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 78 సహకార పరపతి సంఘాల్లో 39 సంఘాలు మాత్రమే 50 శాతం మేర రుణాలను రికవరీ చేసేవని.. ఓటీఎస్‌తో మరో 16 సంఘాలు రుణ రికవరీ శాతం 50 శాతం దాటిందని వివరించారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ పురుషోత్తం, అచ్చంపేట డీసీసీబీ మేనేజర్ రవికుమార్, పీఏసీఎస్ సీఈఓ రవీందర్రావు పాల్గొన్నారు. -
ధరణి ఆపరేటర్లకు 14 నెలలుగా అందని జీతాలు
● ఏజెన్సీ రద్దుతో టీజీటీఎస్‌కు అటాచ్ ● ప్రభుత్వ ఆదేశాలు అందక ఆగిన వైనం ● జిల్లాలో 23 మంది.. నాగర్‌కర్నూల్: జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే ధరణి ఆపరేటర్లకు 14 నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే అరకొర జీతాలు.. అందులో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అవికూడా సకాలంలో అందడం లేదు. సమస్యను పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నా.. ప్రభుత్వం మాత్రం దృష్టి సారించడం లేదని చెబుతున్నారు. జిల్లాకు వచ్చే మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా కూడా ఫలితం లేకపోయింది. 2018లో విధుల్లోకి .. గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి అన్ని మండలాల తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా నియమించింది. ఇందుకోసం తహసీల్దార్ కార్యాలయంలో గదిని ఏర్పాటుచేసి భూ రిజిస్ట్రేషన్ల కోసం ధరణి ఆపరేటర్లను నియమించింది. జిల్లాలో 23 మందిని ఆపరేటర్లుగా నియమించగా.. సుమారు ఆరేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రారంభంలో రూ.10 వేలు వేతనం చెల్లిస్తుండగా.. ప్రస్తుతం రూ.12,500 చెల్లిస్తున్నారు. మిగతా వారితో పోలిస్తే వీరి జీతాలు చాలా తక్కువే.. ప్రస్తుతం అవి కూడా సకాలంలో అందకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. టీజీటీఎస్‌కు అనుసంధానం.. మొదట వీరిని విధుల్లోకి తీసుకున్నప్పుడు ‘టెరాసిస్’ అనే ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లించేవారు. గతేడాది జనవరిలో ఏజెన్సీ కాంట్రాక్ట్ గడువు ముగియగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గడువు పెంచకుండా నిలుపుదల చేసింది. అంతేగాకుండా ఆపరేటర్లను తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ సర్వీసెస్(టీజీటీఎస్)కు అనుసంధానం చేసి ఆ ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి ధరణి ఆపరేటర్లకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. టీజీటీఎస్‌కు అనసంధానం చేయడంతో ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆశపడినా.. కనీసం వేతనాలు కూడా రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపకపోవడంతో ఇప్పట్లో వేతనాలు అందుతాయన్న నమ్మకం కూడా కలగడం లేదని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విషయానికొస్తే 23 మంది ఆపరేటర్లు దాదాపు 14 నెలలుగా వేతనాల కోసం వేచి చూస్తున్నారు. కేవలం జిల్లాకే రూ.40 లక్షల వరకు రావాల్సి ఉంది. పెద్దకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ధరణి ఆపరేటర్ (ఫైల్)ఇబ్బందులు పడుతున్నాం.. ప్రభుత్వం నుంచి మాకు వచ్చే జీతమే తక్కువ. అరకొర వేతనాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాం. కానీ ప్రస్తుతం ఆ జీతం కూడా సకాలంలో రావడం లేదు. గతేడాది ఫిబ్రవరి నుంచి వేతనాలు అందాల్సి ఉంది. తప్పని పరిస్థితుల్లో ఆపరేటర్లు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఈ విషయంపై చొరవ చూపాలి. – రాంబాబు, జిల్లా అధ్యక్షుడు, ధరణి ఆపరేటర్స్ అసోసియేషన్ -
స్పందన అంతంతే..
ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు ముందుకు రాని ప్లాట్ల యజమానులు ●సద్వినియోగం చేసుకోవాలి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్స్ అందజేస్తున్నాం. 25 శాతం రాయితీ గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ ప్రక్రియపై ఎలాంటి సందేహాలున్నా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే దరఖాస్తుదారులకు లెటర్లు పంపించడం, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. – యాదయ్య, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట అచ్చంపేట పట్టణ వ్యూ అచ్చంపేట: అనధికార లే–అవుట్‌లోని స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించి గడువు పెంచినా మున్సిపాలిటీల్లో లక్ష్యం నెరవేరలేదు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదట మార్చి 31 నాటికి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఈ నెల 30 వరకు మరోసారి గడువు పొడిగించింది. కాగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 19 మున్సిపాలిటీల్లో సోమవారం వరకు 32,781 దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం రుసుం చెల్లించడంతో ప్రభుత్వానికి రూ.55.38 కోట్ల ఆదాయం సమకూరింది. 25 శాతం రాయితీతో.. 2020 ఆగస్టు 31 నాటికి ఉన్న అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే వివిధ కారణాలతో దరఖాస్తుదారులకు అనుమతులు మంజూరు చేసే ప్రక్రియలో ఆలస్యం కావడంతో ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందులో కొన్ని నిబంధనలు చేర్చింది. దీని ప్రకారం 2025 మార్చి 31లోగా క్రమబద్ధీకరణ చార్జీలు, ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ కల్పిస్తూ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే పెద్దగా స్పందన రాకపోవడంతో 25 శాతం రాయితీ గడువును ఈ నెల 30 వరకు పొడిగించింది. మొత్తం దరఖాస్తులు 1,95,963 ఆమోదించినవి 1,40,299 రుసుం చెల్లించినవి 32,781 క్రమబద్ధీకరించినవి 13,765 ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.58.38 కోట్లు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల వారీగా ఇలా.. మున్సిపాలిటీ మొత్తం ఆ.వి రుసుం క్ర .వి సమకూరిన దరఖాస్తులు చెల్లించినవి ఆదాయం (రూ.కోట్లలో) నాగర్‌కర్నూల్ 16,158 10,782 2,588 1,522 4.20 కల్వకుర్తి 11,482 9,491 1,936 806 4.11 అచ్చంపేట 12,045 10,765 1,765 94 2.53 కొల్లాపూర్ 4,595 3,718 662 238 1.17 అలంపూర్ 431 366 121 61 0.15 వడ్డేపల్లి 1,941 1,787 355 279 0.68 అయిజ 9,845 5,244 1,074 652 1.34 గద్వాల 14,387 4,000 1,700 848 2.74 జడ్చర్ల 17,684 11,070 2,597 819 5.68 మహబూబ్‌నగర్ 31,438 22,183 6,817 2,160 15.62 భూత్పూర్ 6,119 4,703 1,260 590 2.12 పెబ్బేరు 7,306 6,484 1,443 391 1.74 కొత్తకోట 7,582 7,318 1,284 648 1.50 ఆత్మకూర్ 3,812 3,150 731 623 0.86 అమరచింత 447 333 162 121 0.51 వనపర్తి 29,072 25,820 4,693 2,499 5.80 మక్తల్ 10,577 9,062 1,170 563 2.15 కోస్గి 3,982 1,987 904 135 1.81 నారాయణపేట 7,060 2,036 1,519 707 3.67 ఆ.వి: ఆమోదించినవి క్ర .వి: క్రమబద్ధీకరించినవి 25 శాతం రాయితీ ఇచ్చి గడువు పెంచినా నెరవేరని లక్ష్యం ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అదే పరిస్థితి విస్తృతంగా ప్రచారం కల్పించినా కనిపించని ఫలితం మరో రెండు రోజులే అవకాశం విస్తృతంగా ప్రచారం.. ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ కల్పించిన ప్రభుత్వం వందశాతం లక్ష్యం నెరవేర్చాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఈ పథకంపై అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పించింది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అధికారులు సామాజిక, ప్రసార మాధ్యమాలు, ఇతర విభాగాల ద్వారా అవగాహన కల్పించినప్పటికీ దరఖాస్తుదారులు పెద్దగా ముందుకు రాలేరు. సోమవారం వరకు క్రమబద్ధీకరణకు 32,781 మంది దరఖాస్తుదారులు రుసుం చెల్లించగా 13,765 మందికి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు 55,664 దరఖాస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంతో సంబంధిత దరఖాస్తుదారులు వాటిని సరి చేయాలంటూ ఆయా శాఖల అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక కారణాలతో నిషేధిత జాబితాలోకి వెళ్లాయని, సంబంధిత స్థలాల ఆధారాలు అందిస్తేనే వాటిని సరి చేస్తామని ఓ అధికారి పేర్కొన్నారు. అయితే 25 శాతం రాయితీ గడువుకు బుధవారం (ఈ నెల 30) వరకు మాత్రమే గడువు ఉండటంతో ఎంత మేరకు లక్ష్యం చేరుకుంటారో వేచి చూడాల్సిందే. -
ఒత్తిళ్లకు తలొగ్గి..
ప్రైవేట్ కళాశాలల సూచనలతో డిగ్రీ సెమిష్టర్ పరీక్షలు వాయిదా ఇబ్బందులు రానివ్వం.. ప్రైవేటు కళాశాలలకు ఎట్టి పరిస్థితిలోనూ ర్యాటిఫికేషన్, అప్లియేషన్ ఇన్స్పెక్షన్ చేపడతాం. వీటికోసం ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. అలా చేస్తేనే దోస్త్‌లో అడ్మిషన్లు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సమస్యలు ఉన్న కారణంగా వాయిదా వే సిన పరీక్షలను వచ్చేనెలలో నిర్వహిస్తాం. వి ద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – రమేష్‌బాబు, పీయూ రిజిస్ట్రార్ షెడ్యూల్ ప్రకారమే.. అసలు యూనివర్సిటీ అధికారులు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఎందుకు తలొగ్గి.. పరీక్షలు వాయిదా వేశారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుంది కాబట్టి కచ్చితంగా వాటిని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలి. అలాగే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటి ప్రక్రియలు వెంటనే పూర్తిచేయాలి. – రాము, యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఉద్యమం చేపడుతాం.. ప్రైవేటు కళాశాలలకు రీయింబర్స్మెంట్ రాకుంటే పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నష్టం చేస్తారా.? పీయూ అధికారుల ఈ తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రైవేటు కళాశాలల్లో వసతులు మెరుగుపడాలంటే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటివి చేపట్టాల్సిందే. పీయూ అధికారులు తీరు మార్చుకోకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతాం. – నాగేష్, యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వింత ధోరణి నడుస్తోంది. ప్రైవేట్ కళాశాలలను నియంత్రించాల్సిన యూనివర్సిటీ అధికారులు.. ఏకంగా వారి ఒత్తిళ్లకే తలొగ్గి పనిచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు. ఈ నెల 28 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు 2, 4, 6 నిర్వహిస్తున్నట్లు గతంలో సర్క్యులర్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బ్రాంచ్ విడుదల చేయగా.. ఈ నెల 25న వాటిని వాయిదా వేస్తున్నట్లు మరో సర్క్యులర్ జారీ చేశారు. దీనికి కారణం ‘ప్రైవేట్ కళాశాలల విజ్ఞప్తి మేరకు’ మాత్రమే వాయిదా వేసినట్లు అందులో పేర్కొనడం గమనార్హం. సాధారణంగా పరీక్షలు వాయిదా వేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పోటీ పరీక్షలు, సెలవుల దృష్ట్యా మాత్రమే వాయిదా వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిళ్లతో వాయిదా వేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనందుకే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. విద్యార్థులకు తీవ్రనష్టం.. పీయూ పరిధిలో యూజీ, పీజీ, బీఈడీ తదితర అన్ని కళాశాలలు కలిపి 102 ఉండగా.. వీటిలో సుమారు 22 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీ పూర్తయిన వెంటనే పీజీలో పీజీ సెట్, లా సెట్, ఎంబీఏ వంటి కోర్సులలో ప్రవేశాలకు విద్యార్థులు సిద్ధం కావాల్సి ఉంది. ఎంట్రెన్స్‌లకు చదివేందుకు కనీసం 15 రోజుల సమయం కూడా సరిపోదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయడం వల్ల ఫలితాలు, మెమోల జారీ వంటి ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని.. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు తీవ్రనష్టం జరుగుతుందని వాపోతున్నారు. యథావిధిగా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాయిదా వేసిన డిగ్రీ పరీక్షలను అధికారులు వచ్చే నెల 6 నుంచి నిర్వహించనున్నారు. 9 రోజులపాటు నిలిపివేయడంతో పీజీసెట్, లాసెట్పై ప్రభావం అప్లియేషన్, ర్యాటిఫికేషన్ ప్రక్రియపై పట్టింపులేని వైఖరి ఆదేశాలను బేఖాతరు చేస్తున్న యాజమాన్యాలు పీయూ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు -
నిబంధనలకు పాతర..!
జిల్లాలో అధ్వానంగా హోటళ్ల నిర్వహణ ● అపరిశుభ్రంగా వంట గదులు, పరిసరాలు ● కల్తీ సరుకులు, నూనెలు ● నామమాత్రపు దాడులతో సరిపెడుతున్న అధికారులు అచ్చంపేట రూరల్: ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని ప్రభుత్వం వైద్య, పంచాయతీ అధికారులు, కొందరు స్థానికులతో కలిపి ఆహార కమిటీలను నియమించింది. సభ్యులు హోటళ్లు, ఆహార పదార్థాలు విక్రయిస్తున్న కేంద్రాలను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించారు. కానీ నామమాత్రపు తనిఖీలు చేపడుతుండటంతో జిల్లాలో హోటళ్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా శుభ్రతను పాటించకుండా వ్యవహరిస్తున్నారు. యథేచ్ఛగా హోటళ్లు, టిఫిన్ సెంటర్ల ఏర్పాటు.. జిల్లాలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంత్లాలో భోజన ప్రియులను ఆకర్షించేలా హోటళ్లు, దాబాలు, టిఫిన్ సెంటర్లు వెలుస్తున్నాయి. నిర్వాహకులు వాటిని అందంగా తీర్చిదిద్దడానికి ఇస్తున్న ప్రాధాన్యత.. ఆహార నాణ్యతలో పాటించడం లేదు. తయారీలో వినియోగించే సరుకులు, నూనెలు, ఇతర సరుకులు నాసిరకంగా ఉంటున్నాయి. ప్రారంభంలో నాణ్యతగా పాటించి రానురాను తగ్గిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వంట గదులు ఇరుకుగా ఉండటంతో కుప్పలు కుప్పలుగా ఈగలు, బొద్దింకలు సంచరిస్తుంటాయి. కల్తీ పదార్థాలు తిని అనేక మంది రోగాలబారిన పడుతున్నారు. బోటీ కర్రీలో ఎలుక.. అచ్చంపేటలోని ఓ హోటల్లో వినియోగదారుడు శుక్రవారం సాయంత్రం బోటీ కర్రీని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. భోజన సమయంలో తెరిచి చూడగా అందులో ఎలుక కనిపించింది. పార్సిల్‌ను తీసుకొని హోటల్ నిర్వాహకుడిని నిలదీయడంతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం ఆ హోటల్‌తో పాటు మరో హోటల్‌ను తనిఖీ చేసి నమూనాలు సేకరించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోని పలు హోటళ్లలో జరుగుతున్నా.. కొందరు మేనేజ్ చేసుకొని నడిపిస్తున్నారు. వంట గదులు అపరిశుభ్రంగా ఉండటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆహార పదార్థాల్లో బొద్దింకలు, బల్లులు పడిన ఘటనలూ ఉన్నాయి. ఫ్రిజ్‌లలో మాంసాన్ని నిల్వచేసి అవసరం ఉన్న సమయంలో కూరలు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కేసులు నమోదు చేస్తాం.. జిల్లాలోని హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. బేకరీల్లో ఆహార పదార్థాలు నిల్వ చేయొద్దు.. ఏ రోజుకారోజు తయారుచేసి విక్రయించాలి. పలు హోటళ్లల్లో తనిఖీలు చేసి నమూనాలు సేకరించాం. నిబంధనలు పాటించని హోటళ్లను మూసి వేయిస్తాం. – మనోజ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ -
‘వక్ఫ్ చట్టం సవరణతో పేద ముస్లింలకు మేలు’
కందనూలు: ప్రధాని మోదీ తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్టంతో పేద ముస్లింలకు మేలు చేకూరుతుందని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అఫ్సరపాషా అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వక్ఫ్ బోర్డుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పేద ముస్లింకు ఈ చట్టం ఉపయోగపడలేదని, ఏళ్లుగా ఈ ఆస్తులు బడా బాబులకు మాత్రమే చెందాయని, కొత్త చట్టంతో దోపిడీని అరికట్టే అవకాశం వచ్చిందన్నారు. నరేంద్రమోదీ ముస్లింలకు చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక కొన్ని రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని.. ముస్లిం సమాజం నమ్మవద్దని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, మైనార్టీి మోర్చా జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సుబ్బారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గప్రసాద్, మాయని శ్రీశైలం, సుధాకర్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్‌చారి, మహిళా నాయకురాలు పద్మ, చంద్రకళ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.నాయినోనిపల్లికి తగ్గిన రద్దీ పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కేవలం 5 వేల మంది భక్తులు మాత్రమే వచ్చారని ఆలయ ట్రస్ట్ చైర్మన్ తెలిపారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి కందనూలు: విద్యార్థులు ఉత్తమ చదువుతో ఉన్నత స్థానానికి ఎదగాలని విశ్రాంత డీజీపీ డా. పుట్టపాగ రవీంద్రనాథ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయంలో ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించి పుట్టపాగ మహేంద్రనాథ్ స్మారక విద్యా పురస్కారాలు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన పేద విద్యార్థులు మంచి మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. తన తండ్రి మహేంద్రనాథ్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని తెలిపారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, ఐక్యత సమాజ సంస్థ ప్రతినిధులు కళ్యాణం నర్సింహ, భగవేణి నర్సింహులు, బాలరాజు, డా. రాఘవులు, న్యాయవాది రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. హిందువులు చైతన్యం కావాలి తిమ్మాజిపేట: మారుమూల గ్రామాల్లోని హిందువులు సైతం చైతన్యం కావాల్సిన అవరం ఉందని విశ్రాంత ప్రొఫెసర్ హన్మంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని అప్పాజిపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కశ్మీర్లో జరిగిన మారణకాండ ప్రజలను ఆందోళనకు గురి చేసిందని.. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందడాన్ని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు పర్యాటకులను చంపి పర్యాటకరంగాన్ని నీరుగార్చాలని చూశాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉండటంతో పాకిస్థాన్ కుట్రలు చేస్తోందని తెలిపారు. ఐక్యమత్యం లేకపోవడంతో కలిగే నష్టాలు, కలిసి ఉంటే కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం స్థానికులతో కలిసి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో భిక్షపతి, నారాయణ, నర్సింహ, చంద్రయ్య, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చలో వరంగల్..
బీఆర్ఎస్ శ్రేణుల్లో రజతోత్సవ సందడి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘గులాబీ’ శ్రేణుల్లో రజతోత్సవ సందడి నెలకొంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఆదివారం నిర్వహిస్తున్న రజతోత్సవ సభను ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు భారీ జనసమీకరణకు ఇదివరకే సన్నాహాలు మొదలుపెట్టిన నేతలు.. తాము రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ముందుకుసాగుతున్నారు. నేడు ఊరూరా పార్టీ జెండావిష్కరణలను పండుగ వాతావారణంలో నిర్వహించి.. అనంతరం వాహనాల్లో సభకు తరలేలా తగిన ఏర్పాట్లు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం సైతం పార్టీ జెండాలు ఆవిష్కరించారు. అదేవిధంగా ఫ్లెక్సీలు, పార్టీ బ్యానర్లతో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాకేంద్రాల్లో పలు కూడళ్లు గులాబీమయంగా మారాయి. సెగ్మెంట్‌కు 300 వాహనాలు.. 3 వేల మంది జనసమీకరణ వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా పార్టీ శ్రేణులను తరలింపు కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ, అలంపూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజకవర్గానికి 300 వాహనాల వరకు సిద్ధం చేసి.. సుమారు మూడు వేల మంది కార్యకర్తలను సభకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి దాదాపు 50 వేల మందిని తరలించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. పర్యవేక్షణకు ఇన్చార్జీల నియామకం.. వరంగల్‌కు సుదూర ప్రయాణం చేయాల్సి ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం పార్టీ నేతలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రతి వాహనానికి ఓ ఇన్చార్జితో పాటు భోజనం, తాగునీటి వసతుల పర్యవేక్షణకు విడివిడిగా ఇన్చార్జీలను నియమించారు. అదేవిధంగా సభకు వెళ్లే ప్రతి వాహనానికి సంఖ్య, ఇన్చార్జి పేరు, సెల్ నంబర్‌తో స్టిక్కర్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఇన్చార్జీలు నియోజకవర్గ ఇన్చార్జితో సమన్వయం చేసుకోనున్నారు. వాహనాలు ఎక్కడి నుంచి బయలు దేరాయి.. ఎక్కడ భోజనాలు చేశారు.. ఎప్పుడు సభకు వచ్చారు.. ఎ ప్పుడు వెళ్లారు.. ఇలా సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు ప ర్యవేక్షించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. పాలమాకుల లేదంటే శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్కు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వాహనాలు పాలమాకుల దాటిన తర్వాత లేదా శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పైకి చేరుకుని.. నేరుగా ఘట్కేసర్ వద్ద వరంగల్ హైవేలో దిగుతాయి. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జోన్–2లో పార్కింగ్.. రజతోత్సవ సభకు తరలివెళ్లే ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ తమ వాహనాలను జోన్–2లో పార్కింగ్ చేసుకోవాలి. వరంగల్ జాతీయ రహదారిలో కరుణాపురం వద్ద ఎన్‌హెచ్–163 బైపాస్‌లో టోల్గేట్ నుంచి దేవన్నపేట, మేడిపల్లి, అనంతసాగర్ మీదుగా పార్కింగ్ స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. వాహనాలను అక్కడ పార్కింగ్ చేసి నేరుగా సభావేదిక స్థలానికి వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్ సభకు భారీగా తరలుతున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు 50 వేల మంది తరలింపు బస్సులు, కార్లు ఇతర ప్రైవేట్ వాహనాలను సమకూర్చిన నేతలు పట్టణాలతో పాటు ఊరూరా పండుగలా పార్టీ జెండావిష్కరణలు ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయమైన పలు కూడళ్లు -
నాగర్‌కర్నూల్
విచారణ పేరుతో కాలయాపన ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వివరాలు IIలో u●ఇప్పటికై నా స్పందించండి.. తెలకపల్లిలో దుకాణాల అక్రమ నిర్మాణాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసినాం. డీపీఓ పెట్రోల్ పోసి నన్ను చంపేయండి అంటూ సమాధానమిస్తున్నాడు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – శివ, మైఖేల్, ఫిర్యాదుదారులు కలెక్టర్‌కు నివేదిస్తాం తెలకపల్లిలోని సర్వే నంబర్ 497లో దుకాణాల నిర్మాణాలకు సంబంధించి విచారణ పూర్తయింది. ప్రస్తుతం కలెక్టర్ సెలవులో ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే రిపోర్ట్ అందజేస్తాం. పని ఒత్తిడి వల్ల ఫిర్యాదుదారులతో అలా మాట్లాడటం జరిగింది. – రామ్మోహన్, డీపీఓ ● తెలకపల్లిలోని దుకాణ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం ● చర్యలు తీసుకోకుండా ఏళ్లతరబడిగా కాలయాపన చేస్తున్నారని ఆరోపణ ● కిందిస్థాయి అధికారుల నుంచి పైవరకు అక్రమార్కులకే వత్తాసు నాగర్‌కర్నూల్: అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించడంతో.. ఓ జిల్లా అధికారి ఏకంగా ‘నన్ను పెట్రోల్ పోసి చంపేయండి’ అంటూ వింత సమాధానమిచ్చారు. తెలకపల్లిలోని ప్రధాన రహదారిపై ఎలాంటి అనుమతి లేకుండా 40 దుకాణాలు నిర్మిస్తే ఎలాంటి చర్యలు తీసుకోని అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు. దీంతో ఫిర్యాదు చేసిన వ్యక్తులు డీపీఓ రామ్మోహన్‌కు ఫోన్ చేసి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించడంతో సదరు వ్యక్తులకు పైవిధంగా సమాధానం చెప్పడంతో ముక్కున వేలేసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. తెలకపల్లిలోని సర్వే నం.497లో ఎలాంటి అనుమతి లేకుండా దుకాణ సముదాయ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ స్థలం భూదాన్ భూమి అని, దీనికి అసలైన వారసులం తామేనని, ఇద్దరు వ్యక్తులు కొన్నేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. భూదాన్ భూమి తాము రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కొంతమంది తప్పుడు పత్రాలు సష్టించారని, దీనికి సంబంధించి మ్యుటేషన్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తహసీల్దార్ కార్యాలయంలో ఎండార్స్మెంట్ కాపీ సైతం అందజేశారు. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈ అక్రమ నిర్మాణాలపై మాత్రం అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాకుండా సదరు వ్యక్తులతో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిర్మాణ సమయంలో ఒక్కో దుకాణానికి రూ.2 లక్షల వరకు అధికారులు, అప్పటి పాలకవర్గం వసూలు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే 2024 ఆగస్టు 12న హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాలని కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో డీఎల్పీఓ వరలక్ష్మి క్షేత్రస్థాయిలో విచారణ జరిపినా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కలెక్టర్ ఆగ్రహం.. దుకాణాల అక్రమ నిర్మాణాలపై బాధితులు ప్రజావాణిలో కలెక్టర్ బదావత్ సంతోష్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పట్లో విచారణ చేసిన కిందిస్థాయి అధికారులు ఈ దుకాణాలకు ఎలాంటి అనుమతులు లేవని తేల్చారు. కానీ, ఈ నివేదిక మాత్రం మూడు నెలలుగా కలెక్టర్‌కు చేరలేదు. దీంతో అధికారులు అక్రమ నిర్మాణాలకు ఏ స్థాయిలో వత్తాసు పలుకుతున్నారో అర్థమవుతుంది. -
పూలే, అంబేడ్కర్ ఆధునిక భారత నిర్మాతలు
కల్వకుర్తి రూరల్: మహాత్మ జ్యోతిబాపూలే, బీఆర్ అంబేడ్కర్ మన ఆధునిక భారత నిర్మాతలు అని, వారు చూపిన మార్గంలో నడుద్దామని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు అన్నారు. శనివారం కల్వకుర్తిలోని టీఎస్ యూటీఎఫ్ భవనంలో ‘పూలే, అంబేడ్కర్ ఆలోచనలు– సమకాలీన పరిస్థితులు’ అనే అంశంపై కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పరశురాములు అధ్యక్షతననిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారిద్దరూ ఆధునిక భారత నిర్మాతలు అనే విషయాన్ని నేటితరం మర్చిపోతుందన్నారు. పూలే దంపతులు అందరికీ విద్య కోసం తుది శ్వాస వరకు కృషి చేశారన్నారు. మహిళా సమానత్వం కోసం నాటి ఆటవిక సమాజాన్ని నాగరిక సమాజంగా మార్చారన్నారు. సత్యశోధన జంగ్ సమాజం స్థాపించి సామాజిక సేవలు విస్తృతంగా నిర్వహించారన్నారు. అంబేడ్కర్‌ను కేవలం రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే భావిస్తూ ఆయన అధ్యయన లోతులను విస్మరిస్తున్నారని చెప్పారు. భూమి జాతీయీకరణ జరగాలని, పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా హక్కు ఉండాలని ఆనాడే ఆయన రాష్ట్రాలు– మైనార్టీలు అనే పుస్తకంలో ప్రస్తావించారని చెప్పారు. మహిళల సమానత్వం కోసం హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి నాటి ప్రభుత్వం అంగీకరించకపోతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. కుల వివక్ష, అంటరానితనంపై పూలే, అంబేడ్కర్ అడుగు జాడల్లో ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మిస్తున్నట్లు స్కైలాబ్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిన్నయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కాశన్న, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, స్వాతి, బాలామణి తదితరులు పాల్గొన్నారు. -
పండ్లు.. జ్యూస్‌లకు డిమాండ్..
వేసవిలో కొబ్బరిబొండాలు, పుచ్చకాయలు, మామిడిపండ్ల, ఇతర జ్యూస్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ● ఆరోగ్యానికి చెరుకు రసం ఎంతో మేలైనది. ప్రత్యేకంగా వేసవిలో చెరుకురసం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. దీనిని తీసుకోవడం వల్ల ఎండల నుంచి ఉపశమనం పొందడంతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో ప్రతిచోటా చెరుకు రసం సెంటర్లు వెలుస్తున్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో దాదాపు 50 చెరుకు రసం కేంద్రాలు ఉన్నాయి. చెరుకు రసం ఫుల్గ్లాస్ రూ.30, ఆఫ్ గ్లాస్ రూ.20 ధరలు ఉన్నాయి. ● ఈ సీజన్లో ప్రతిచోట లస్సీ సెంటర్లు వెలుస్తాయి. కొన్నేళ్ల నుంచి లస్సీ (పెరుగు)కి ప్రత్యేక గుర్తింపు ఉంది. సాధారణ లస్సీ రూ.20, స్పెషల్ లస్సీని రూ.30కు విక్రయిస్తున్నారు. అదేవిధంగా ఫలుదాకు ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. పాలు, డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసే ఫలుదాకు ఇటీవలే కాలంలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గ్లాసు ఫలుదా రూ.40 చొప్పున అమ్ముతున్నారు. ● పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ కొబ్బరిబొండాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రతిచోట ప్రధాన రోడ్ల వెంట వీటి అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి జిల్లాలు, కాకినాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఒక్కటి రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. ● మార్కెట్లో తాటిముంజులు, మామిడి పండ్ల సందడి నెలకొంది. కొల్లాపూర్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మామిడిపండ్లను దిగుమతి చేసుకొని కిలో రూ.80 – 100 వరకు విక్రయిస్తున్నారు. ఇక శరీరానికి చలువ చేయడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తాటిముంజలకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంటుంది. రూ.100కు 12 ముంజలు ఇస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు కా ర్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉండే పుచ్చకాయలు అన్ని ప్రాంతాల్లో లభిస్తుంది. కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. లస్సీ.. ఇష్టంగా తాగుతా.. లస్సీ అంటే చాలా ఇష్టం. వేసవి కాలంలో లస్సీని ఎక్కువగా తాగుతా. ఎండలో తిరిగే సమయంలో లస్సీ తాగడం శరీరానికి చల్లటి ఉపశమనం లభిస్తుంది. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. – సాయికుమార్, మహబూబ్‌నగర్ -
పర్యాటకులపై ఉగ్రదాడి హేయం
కందనూలు: జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జిల్లాకేంద్రంలోని ఫాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం బాలుర ఉన్నత పాఠశాల నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు పాస్టర్లు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి, కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంబీ చర్చి చైర్మన్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ మృతిచెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలోని ప్రజలపై, సైనికులపై దాడులు చేయడం హేయమైన చర్య అని, ఇలాంటి వారిపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం కీలకం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో కీలకం అని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్స్ ప్రతి ఒక్క విభాగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అందుకోసం విద్యార్థులు పూర్తిస్థాయిలో కంప్యూటర్ విద్యపై దృష్టిసారించాలన్నారు. వీటిద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలు సైతం స్కిల్స్ ఉన్న విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయని, పరిశోధన కోణం ఆలోచించే వారికి సృజనాత్మకత ఉండడం వల్ల వారు త్వరగా ఉద్యోగాలు సాధిస్తారన్నారు. ఈ సందర్భంగా అధికారులు సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంవీఎస్ ప్రిన్సిపాల్ పద్మావతి, ఆర్జేడీ యాదగిరి పాల్గొన్నారు. -
పాఠ్యపుస్తకాలు
బడుల ప్రారంభం రోజే.. విడతల వారీగా జిల్లాకు సరఫరా ● ఇప్పటికే గోదాంకు చేరుకుంటున్న పుస్తకాలు ● విద్యార్థులకు సకాలంలో అందించేందుకు విద్యాశాఖ కసరత్తు ● మరోవైపు నోట్‌బుక్స్ సైతం ఇచ్చేలా చర్యలు అచ్చంపేట: నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమకూర్చాల్సిన సౌకర్యాలపై విద్యాశాఖ ముందుగానే దృష్టిసారించింది. ఇప్పటికే యూనిఫాంల వస్త్రం బడులకు చేరగా.. దుస్తులు కుట్టేందుకు అందిస్తున్నారు. వచ్చే 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు సైతం జిల్లాకు చేరుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత కొన్ని రాగా.. మిగిలినవి విడతల వారీగా రానున్నాయి. జిల్లాకు చేరిన పుస్తకాలను గోదాంలో భధ్రపరిచారు. జూన్‌లో బడులు తెరుచుకునే నాటికి పూర్తిస్థాయిలో అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. పక్కదారి పట్టకుండా నంబర్లు పాఠ్య పుస్తకాలు వేసవి సెలవులు ముగిసే వరకు విడతల వారీగా గోదాంకు చేరనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై వరుస క్రమంలో నంబర్లను ముద్రించారు. వీటి ఆధారంగా ఎన్ని మండలాలకు ఏయే పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు వెళ్లాయన్నది అధికారుల రికార్డుల్లో నమోదు చేయనున్నారు. స్కాన్ చేస్తే వీడియో రూపంలో.. ఎంఈఓలు పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా వాటిని హెచ్ఎంలకు బడుల ప్రారంభం నాటికి పంపిణీ చేసేలా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. పుస్తకంలో ఒకవైపు తెలుగు, మరోవైపు ఆంగ్ల మాధ్యమంలో పాఠాన్ని 1– 10వ తరగతి విద్యార్థులకు అందిస్తున్నారు. 3– 10 తరగతి వారికి పార్ట్–1, పార్ట్–2గా పంపిణీ చేయనున్నారు. ఈ విధానంతో విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గనుంది. అలాగే పుస్తకాల్లోని ప్రతి పాఠానికి బార్కోడ్ ముద్రిస్తుండటంతో ఫోన్లో స్కాన్ చేస్తే ఆ పాఠాన్ని వీడియో రూపంలో విద్యార్థులు చూసుకునే సదుపాయం ఉంటుంది. నోట్‌బుక్స్ అందజేత 1 నుంచి 5వ తరగతి వారికి వర్క్ బుక్స్, 6 నుంచి 10వ తరగతి వారికి రాత పుస్తకాలు అందించనున్నారు. వీటిని పిల్లలకు ఉచితంగా అందించడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గనుంది. 5 నుంచి 10వ తరగతి వరకు చదివే ఒక్కో విద్యార్థికి 6 నోట్ బుక్స్ చొప్పున అందించనున్నారు. దీంతో పాఠ్యపుస్తకాలతోపాటు నోటుబుక్స్‌ను కూడా ఎంఈఓలు తమ మండలాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. యూడైస్ వివరాల ప్రకారం.. జిల్లా, మండల పరిషత్, ఎయిడెడ్ స్కూళ్లలోని ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు.. కేజీబీవీ, మోడల్, ఆదర్శ, ఆశ్రమ పాఠశాలలతోపాటు సంక్షేమ గురుకులాల్లో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందజేయనున్నారు. కొత్తగా ప్రవేశాలు పొందేవారితోపాటు ప్రస్తుతం చదువుతున్న వారికి పాఠశాల ప్రారంభం రోజే పుస్తకాలు ఇవ్వనున్నారు. యూడైస్ ప్లస్ వివరాల ప్రకారం వీటిలో చదువుతున్న విద్యార్థులకు మొత్తం 5,34,660 పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఇటీవల జిల్లా పాఠ్య పుస్తకాల గోదాంకు 1,23,190 పుస్తకాలు చేరుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పంపిణీ చేయకుండా నిల్వగా మరో 25 వేల పాఠ్యపుస్తకాలు గోదాంలో ఉండగా.. ఇంకా 4,11,470 పుస్తకాలు రావాల్సి ఉంది. గోదాంలో భద్రపరుస్తున్నాం.. జిల్లాకు పాఠ్య పుస్తకాలు చేరుకుంటున్నాయి. వీటిని జిల్లాకేంద్రంలోని గోదాంలో భద్రపరుస్తున్నాం. ప్రస్తుతానికి పార్ట్– 1 పుస్తకాలు రాగా.. పార్ట్–2కు సంబంధించిన పుస్తకాలు తర్వాత వస్తాయి. గోదాం నుంచి మండలాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా చేస్తాం. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందిస్తే వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. పుస్తకాలు పక్కదారి పట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – రమేష్‌కుమార్, డీఈఓ -
మలేరియాను పూర్తిగా నిర్మూలించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: దేశంలో 2030 నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించడానికి వైద్య సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాస్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీని జెడ్పీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు 2008 నుంచి ప్రతి సంవత్సరం అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. మలేరియా ప్లాస్మోడియం పరాన్న జీవులు గల ఆడ అనాఫిలిస్ దోమకాటు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందన్నారు. దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు అని, దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికెన్ గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. ఇల్లు, పరిసరాల్లో వ్యాధికారగా దోమలు పెరుగుతాయని, ఈ క్రమంలోనే గతేడాది జిల్లాలో 4 మలేరియా కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీరికి చికిత్స అందించి ఇంటి పరిసరాల్లో యాంటీలార్వా మందులు పిచికారీ చేశామన్నారు. ప్రతిఒక్కరూ దోమలు నివారణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీకాకరణ అధికారి రవికుమార్, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీనివాసులు, వైద్యులు వాణి, సంతోష్, అభిరాం పాల్గొన్నారు. -
గ్రామ గ్రామాన మే డే ఉత్సవాలు
నాగర్‌కర్నూల్ రూరల్: అమరవీరుల స్ఫూర్తితో గ్రామ గ్రామాన మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శివశంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో మేడే ఉత్సవాల ఏర్పాట్లపై భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 139వ మే డే సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్రం 44 కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులను అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మీపతి, నాయకులు శివకృష్ణ, పరశురాం తదితరులు పాల్గొన్నారు. -
ఇరు రాష్ట్రాల జాలర్ల మధ్య సరిహద్దు వివాదం..
సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు నాగర్‌కర్నూల్ జిల్లాలోని కృష్ణాతీరంలో ఉన్న సోమశిలకు చేరుకుంటారు. అక్కడి నుంచి బోటులో సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఆలయం ఏపీ పరిధిలో ఉండటంతో సంగమేశ్వరం, సిద్దేశ్వరం గ్రామాలకు చెందిన జాలర్లు, బోట్ల నిర్వహకులు తెలంగాణ నుంచి వచ్చే బోట్లను అడ్డుకుంటున్నారు. తమకు ఆదాయం రావడం లేదని అభ్యంతరం చెబుతుండటంతో తరచుగా వివాదం చెలరేగుతోంది. దీంతో కొన్ని రోజులుగా సంగమేశ్వర దర్శనం కోసం వస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మొదట తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి బోటులో బయలుదేరితే ఏపీ పరిధిలోని సిద్దేశ్వరం తీరం వద్ద బోటును నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి 3 కి.మీ. దూరంలోని సంగమేశ్వరం వరకు ఆటోలో ప్రయాణించి ఆలయాన్ని చేరుకుంటున్నారు. దర్శనం తర్వాత ఆటోలో సిద్దేశ్వరం వరకు వచ్చి, అక్కడి కృష్ణానదిలో ఏపీకి చెందిన జాలర్ల బోట్లలో సోమశిలకు చేరుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కో చోట రూ.వంద చొప్పున.. ఒక్కొక్కరికి మొత్తం రూ.300 ఖర్చు అవుతుంది. బోటు నుంచి ఆటో, ఆటో నుంచి మళ్లీ బోటుకు మారి ప్రయాణించేందుకు కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. ఇరు రాష్ట్రాల జాలర్ల సరిహద్దు వివాదంతో పర్యాటకులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఉద్యమాల ద్వారానే ఉద్యోగ భద్రత
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: అధ్యాపకులు ఉద్యమించడం ద్వారా ఉద్యోగ భద్రత సాధ్యపడుతుందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి పేర్కొన్నారు. పీయూలో కొన్ని రోజులుగా కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న సమ్మెకు ఆయన శుక్రవారం మద్దతు తెలిపి, మాట్లాడారు. అధ్యాపకులు మరింత ఉత్సాహంగా ఉద్యమం చేయాలని, వారికి పౌర సమాజం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఉన్నతవిద్యలో విశ్వవిద్యాలయం అధ్యాపకులు సమాజానికి మార్గదర్శకులుగా పనిచేస్తున్నారని, అలాంటి వారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని టెంట్ కింద కూర్చోవడం సభ్య సమాజానికి తలవంపులు తెస్తుందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పీయూ అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అధ్యాపకులుకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు తమవంతు సహకారం ఉంటుందన్నారు. -
డేంజర్ నుంచి క్రిటికల్ జోన్లోకి.. ఎస్ఎల్బీసీలో ఇప్పుడేం జరుగుతోంది?
మహబూబ్‌నగర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల జాడ కోసం నిర్వహిస్తున్న సహాయక చర్యలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేయనుంది. గడచిన 63 రోజులుగా నిర్విరామంగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఎనమిది మందిలో ఇప్పటికీ కేవలం ఇద్దరు మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రమాదం జరిగిన టన్నెల్లో డేంజర్ జోన్ వద్ద కూడ పనులు పూర్తయ్యాయి. కేవలం క్రిటికల్ జోన్లో మాత్రమే సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంది కాని అక్కడ పనులు చేయాలంటే నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతవరకు ఇక సహాయక చర్యలు నిలిపివేయటం మేలన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఫిబ్రవరి 22న పైకప్పు కూలడంతో 8 మంది గల్లంతు కాగా, ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. మిగిలిన వారి మృతదేహాల కోసం నిర్విరామంగా అన్వేషణ కొనసాగుతుంది. క్రిటికల్ జోన్లో మిగిలిన ఆరుగురి మృతదేహాలు ఉండవచ్చని భావిస్తున్నారు. 12 ఏజెన్సీలకు చెందిన దాదాపు 550 మంది మూడు షిప్పుల్లో పనిచేశారు. భారీ ఊరుతున్న నీటిని పెద్దపెద్ద పంపులతో డీ వాటరింగ్ చేశారు. మట్టి, బురదను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలించారు.టీబీఎం మిషన్‌ను గ్యాస్, ధర్మల్ కట్టర్స్‌తో కటింగ్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకొచ్చారు. చివరి 43 మీటర్ల ప్రాంతం మినహా సొరంగంలోని ఇతర ప్రాంతాల్లో పైకప్పు కూలడంతో పడిన మట్టి, బండరాళ్లు, ఇనుప తుక్కును తొలగించి అన్వేషించినా గల్లంతైన వారిజాడ తెలియరాలేదు. చివరి 43 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా ఉందని, ఈ ప్రాంతంలో సహాయక చర్యలను కొనసాగిస్తే మళ్లీ పైకప్పు కూలవచ్చని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్సిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో భవిష్యత్ ప్రణాళికలు, రక్షణ చర్యలపై ఏర్పాటైన నిపుణు కమిటీ సమావేశం అయ్యింది. సహాయక చర్యలకు ప్రస్తుతానికి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. సహాయక చర్యల విషయంలో ఏవిధంగా ముందుకెళ్లాలనే అంశంపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు చెందిన నిపుణులతో సబ్ కమిటీ వేసి అధ్యయనం జరిపించాలని నిర్ణయించారు. సైట్ స్పెసిఫిక్ రిపోర్టును తయారు చేయాలని కమిటీని కోరారు. కమిటీ నివేదిక ఆధారంగా సహాయక చర్యల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నారు.నివేదిక ఇచ్చేందుకు కనీసం మూడు నెలల సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. సమావేశంలో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్దతిలో సొరంగం పనులు చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. మరోవైపు ఉపరితలం నుంచి సొరంగం చివరి ప్రాంతానికి ప్రత్యామ్నాయ మార్గం నిర్మించాలంటే కూడ ఇదంతా అమ్రాబాద్ రక్షిత పూలుల అభయారణ్య పరిధిలో ఉండటంతో కేంద్రం అనుమతులు తప్పని సరి. అనుమతులు రావటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మరి భవిష్యత్ లో ఎస్‌ఎల్‌బీసీల కొనసాగింపుపై ఏ మార్గాన్ని ఎంచుకోవాలో సబ్‌కమిటీ నివేదిక మీద అధారపడి ఉంది.కాగా అవుట్లెట్ మన్నెవారిపల్లి వైపు నుంచి మాత్రం టీబీఎం ద్వారా తవ్వకాలను కొనసాగించడం సురక్షితమని భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా నుంచి తెప్పించిన బేరింగ్, అడాప్టర్, రింగ్ బేర్లు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నె వారిపల్లి అవుట్లెట్ వద్దకు చేరాయి. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
‘పంచాయతీ’లో అక్రమాలు..
‘గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలను మండల స్థాయి పంచాయతీ అధికారులకు అప్పగించారు. ఇందులో భాగంగా వాహనాల అలెవెన్స్ కోసం పంచాయతీల నుంచి నిధులు వాడుకోవచ్చని 2022లో జిల్లా ఉన్నతాధికారులు ఒక సర్క్యులర్ జారీచేశారు. తర్వాత ఐదు నెలలకే ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. అయితే ఇదే అదునుగా భావించిన ఓ అధికారి.. ఉత్తర్వులు రద్దు అయినప్పటికీ ఏకంగా 15 నెలలపాటు వివిధ గ్రామ పంచాయతీల నిధుల నుంచి సొంత ఖాతాకు మళ్లించాడు. ఒక్కో జీపీ నుంచి రూ.20 వేల చొప్పున సదరు పంచాయతీ అధికారి రూ.లక్షల్లో నిధులను దుర్వినియోగం చేసినట్టు తెలిసింది.’ ‘తెలకపల్లి మండలం కమ్మారెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన నిధుల్లో నుంచి రూ.30 వేల చొప్పున సదరు పంచాయతీ అధికారి వ్యక్తిగత ఖాతాలోకి మళ్లాయి. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన చివరి రోజున హడావుడిగా మిగులు నిధులను సొంత ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయడం గమనార్హం. ఇదే మండలం పెద్దూర్ గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్ల జీతాల పేరుతో రూ.17 వేల చొప్పున అధికారి సొంత ఖాతాలోకి బదిలీ అయ్యాయి. ● జీపీ నిధులు సొంత ఖాతాకు బదిలీ చేసుకున్న మండలస్థాయి అధికారి ● మల్టీపర్పస్ వర్కర్ల జీతాల పేరుతో పక్కదారి ● వాహనాల అలవెన్స్ పేరిట దుర్వినియోగం ● మరో చోటుకి బదిలీ చేసినా పలుకుబడితో పూర్వస్థానానికే డిప్యుటేషన్ సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖలో అక్రమాల పరంపర కొనసాగుతోంది. పంచాయతీ నిధులను ఆయా గ్రామా ల అభివృద్ధి పనులు, నిర్వహణ ఖర్చుల కోసం వినియోగించాల్సి ఉండగా, కొందరు వాటిని పక్కదారి పట్టిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు ఉదాసీనత వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్నిసార్లు అక్రమాలపై ఫిర్యాదులు అందుతున్నా స్పందించడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. సొంత ఖాతాల్లోకి నిధులు.. జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల నిధులను కొందరు అధికారులు పక్కదారి పట్టిస్తున్నారు. గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నర్సరీలు, వైకుంఠధామాలు, హరితహారం, పల్లె ప్రగతి నిర్వహణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం ఆయా మండలాల పంచాయతీ అధికారులకు అప్పగించింది. ఇందుకోసం వాహనాలను వినియోగిస్తే వాటి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో ఆయా గ్రామ పంచాయతీల నిధుల నుంచి నెలకు రూ.20 వేల చొప్పున వాహన అలవెన్సు తీసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే కేవలం ఆరునెలల పాటే కొనసాగించిన అధికారులు తర్వాత దానిని రద్దు చేశారు. అయినా ఉన్నతాధికారుల కళ్లుగప్పి మరో ఏడాదిపాటు వాహనాల అలవెన్సు పేరుతో ఆయా గ్రామాల నుంచి నిధులను వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేసుకున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఆయా గ్రామాల మల్టీ పర్పస్ వర్కర్లకు వారి ఖాతాల్లోకే జీతాలను బదిలీ చేయాల్సి ఉండగా, వారితోపాటు అదనంగా మండలస్థాయి పంచాయతీ అధికారి తన వ్యక్తిగత ఖాతాలోకి జీతాలను మళ్లించడం ఈ శాఖలో కొనసాగుతున్న అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. డిప్యుటేషన్‌తో పాగా.. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న సదరు మండలస్థాయి పంచాయతీ అధికారి ఒకే మండలంలో ఐదేళ్లుగా కొనసాగుతున్నారు. గతేడాది సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన్ను కొల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఓ మండలానికి బదిలీ చేసింది. అయితే ట్రాన్స్ఫర్ అయ్యి రెండు నెలలు గడవక ముందే సదరు అధికారి చక్రం తిప్పాడు. తనకున్న పలుకుబడితో ‘ప్రత్యేక’ డిప్యుటేషన్ పేరుతో మళ్లీ పూర్వస్థానానికే వచ్చి చేరాడు. రాజకీయ నేత లు, ఉన్నతాధికారుల సహకారంతోనే అక్రమాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలున్నాయి. అక్రమాలపై ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమగ్ర విచారణ చేపడతాం.. గ్రామ పంచాయతీ నిధులను సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్టుగా ఓ అధికారిపై మాకు ఫిర్యాదు అందింది. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – రామ్మోహన్రావు, డీపీఓ ● -
రేషన్‌కార్డు మాకెప్పుడు?!
జిల్లాలో దరఖాస్తుదారుల ఎదురుచూపులు ●ఎన్నోసార్లు దరఖాస్తు.. నాకు ఏడేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం రేషన్ కార్డు మంజూరు చేయలేదు. ఎన్నోసార్లు దరఖాస్తు చేశాను. ఇటీవల గ్రామసభలో మా పేరు చదివినా కార్డు మాత్రం రాలేదు. దీంతో రేషన్‌తోపాటు వివిధ పథకాలు అందడం లేదు. అధికారులు వెంటనే స్పందించి రేషన్‌కార్డు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – సయ్యద్, అమ్రాబాద్ ఆదేశాలు రాగానే.. జిల్లాలో ఇప్పటికే కొందరికి రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీరికి ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు ఇస్తే అప్పటి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తాం. ప్రజాపాలన దరఖాస్తుల సర్వే కొనసాగుతుంది. సర్వే పూర్తి కాగానే అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపుతాం. – శ్రీనివాసులు, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి అచ్చంపేట: రేషన్‌కార్డు లేని నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో కార్డులేని వారు ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. అయితే అర్హులైన వారికి కొత్త రేషన్‌కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. కానీ, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మంజూరు చేసేందుకు సర్వేకు ఆదేశించింది. రేషన్‌కార్డు కోసం జిల్లావ్యాప్తంగా 2016 నుంచి వివిధ దశల్లో కొత్తగా 78,867 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఎంపిక చేసిన గ్రామాల్లో 5,307 మందికి కార్డుల పంపిణీ చేశారు. ఈ నెల 1 నుంచి ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో మిగిలిన వారంతా కార్డు తమకెప్పుడు వస్తుందోనని ఎదరుచూస్తున్నారు. అన్ని పథకాలకు ప్రామాణికంగా తీసుకోవడంతో అర్హుల ఆందోళన ఇటీవల కొందరికి మంజూరు, పంపిణీ మార్పులు, చేర్పులకుఅవకాశం ఇవ్వని ప్రభుత్వం 2016 నుంచి పెండింగ్‌లోనే వేలాది అర్జీలు -
మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
పెంట్లవెల్లి: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జైబాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని జటప్రోల్, గోప్లాపూర్ గ్రామాల్లో కొనసాగిన సంవిధాన్ పాదయాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మంది నేతలు మన దేశం కనుమరుగు కాకూడదని ఎన్నో త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని కొందరు చూస్తున్నారని, ప్రజలు దీనిని ఎప్పటికీ సహించరన్నారు. బీఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనేత అని, ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే ఆ మహనీయుల కృషి ఫలితమే అన్నారు. ప్రతిఒక్కరూ మహనీయుల అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం మండలంలోని జటప్రోల్లో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, చైర్పర్సన్ వెన్నెల ప్రారంభించారు. కార్యక్రమంలో గోవింద్‌గౌడ్, రామన్‌గౌడ్, భీంరెడ్డి, గోపాల్, ఖదీర్, కుమార్ పాల్గొన్నారు. -
ఖైదీలకు మెరుగైన సేవలు
నాగర్‌కర్నూల్ క్రైం: సబ్ జైల్లో ఖైదీలకు మెరుగైన సేవలు అందించాలని జడ్జి నసీం సుల్తానా అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి నసీం సుల్తానా గురువారం సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, తినే ఆహార పదార్థాలు, వంటగది, వాష్‌రూంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరికై నా న్యాయ సహాయం అవసరమైతే న్యాయ సేవాధికార సంస్థ తరపున ఉచితంగా అందించి అడ్వకేట్‌ను నియమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ శ్రీరామ్ ఆర్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ పవన్ శేషు సాయి, సబ్ జైల్ సూపరింటెండెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి నాగర్‌కర్నూల్ క్రైం: పరీక్షల ద్వారానే ప్రాథమిక స్థాయిలో జీవనశైలి ద్వారా సంక్రమించే వ్యాధులను గుర్తించవచ్చని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని చెప్పారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వచ్చే నెల 1న నిర్వహించే నాలుగో విడత అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ పరీక్షలపై వైద్యాధికారులు, పర్యవేక్షణ సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్లు, పక్షవాతం, కిడ్నీ తదితర వ్యాధులతో ప్రజలలో 65 శాతం మరణాలు, అస్వస్థత కలుగుతున్నాయన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ప్రాథమిక దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరిని పరీక్షించడం ద్వారా మాత్రమే రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్లను గుర్తిస్తారన్నారు. జిల్లాలో ఇప్పటికే రక్తపోటుతో 77,301 మంది, మధుమేహంతో 38,457 మంది బాధపడున్నట్లు గుర్తించామన్నారు. మే 1 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు 30 ఏళ్లు పైబడిన 4,35,081 మందిని సిబ్బంది ఇంటింటికి వెళ్లి రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాస్, వైద్యులు భీమానాయక్, తారాసింగ్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్, ప్రోగ్రాం అధికారి రవికుమార్, డీపీఓ రేనయ్య, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
జూరాల.. భద్రమేనా?
● జలాశయంలో తెగిన 8 గేట్ల ఇనుప రోపులు ● 18 చోట్ల రబ్బర్‌సీల్ దెబ్బతినడంతో లీకేజీలు ● మరమ్మతు నేపథ్యంలో నిలిచిన గ్యాంటీక్రేన్ సేవలు ● మూడేళ్లుగా 50 శాతం కూడా పూర్తికాని రిపేర్లు ● ఆందోళన కలిగిస్తోన్న అధికార యంత్రాంగం, పాలకుల వైఖరి గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా పేరుగాంచిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రమేనా..? 2009 సంవత్సరం మాదిరిగా మరోసారి వరద పోటెత్తితే ప్రాజెక్టు తట్టుకుంటుందా? అంటే.. ప్రాజెక్టులోని తెగిన గేట్ల రోప్‌లు, ధ్వంసమైన రబ్బర్ సీల్ నిర్మాణాలను చూస్తే నిస్సందేహంగా లేదనే మాటే వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులకు సాగునీరందిస్తూ.. కీలకపాత్ర పోషిస్తున్న పెద్దన్నకు పెనుముప్పు తరుముకొస్తే.. అన్న ఆలోచన కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా పాలమూరుకు సాగు, తాగు నీరందిస్తున్న ప్రాజెక్టును.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అధికార యంత్రాంగం, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు.. కృష్ణాబేసిన్ పరిధిలో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా ఇందిరా ప్రియదర్శిని జూరాలను 1981లో రూ.550 కోట్లతో నిర్మించారు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. దీని కింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ పరిధిలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 37,700 ఎకరాలు, కుడి కాల్వ పరిధిలో ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో 63,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. జూలై నాటికి పూర్తి.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల కిందట రూ.11 కోట్ల నిధులు వచ్చాయి. అయితే 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. కానీ, 2023లో గ్యాంటీక్రేన్కు సమస్య తలెత్తడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం గ్యాంటీక్రేన్ను పూర్తిస్థాయిలో రిపేరు చేశాం. శుక్రవారం నుంచి పనులు వేగవంతం చేసి జూలై నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. 62 రేడియల్ క్రస్ట్ గేట్లు.. జూరాల ప్రాజెక్టుకు మొత్తం 62 రేడియల్ క్రస్ట్ గేట్లు, 84 బ్లాకులు ఉన్నాయి. ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు ఈ 62 రేడియల్ క్రస్ట్ గేట్లను ఆపరేట్(పైకెత్తడం) చేయడం ద్వారా నీటిని దిగువనకు విడుదల చేసేలా సులభతరమైన విధానంలో రేడియల్ క్రస్ట్‌గేట్లు ఏర్పాటు చేశారు. అర్ధ చంద్రాకారంలో ఉన్న గేట్లను పైకి, కిందికి ఆపరేట్ చేసేందుకు గేట్లకు ఇరువైపులా రెండు రబ్బర్ సీల్స్, అడుగు భాగాన ఒక రబ్బర్ సీల్ ఉన్నాయి. ఆపరేట్ చేసేందుకు అవసరమైన ఇనుప రోప్‌లు గేటుకు ఇరువైపులా, కింది భాగాన రెండు చొప్పున ఇనుప రోపుల నిర్మాణం ఉంటాయి. వీటి సాయంతోనే మొత్తం రేడియల్ క్రస్ట్ గేట్లను అవసరమైనప్పుడు పైకి ఎత్తడం, దించడం చేస్తారు. రిపేర్లతో లీకేజీలు.. ప్రాజెక్టు మొత్తం 62 గేట్లలో 18 గేట్ల నుంచి ఏడాదిగా నీరు లీకేజీ అవుతోంది. ప్రధానంగా గేట్లు దెబ్బతినకుండా, రాపిడికి గురికాకుండా రక్షణ కల్పించే రబ్బర్ సీల్ పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే గేట్లను పైకి, కిందికి ఆపరేట్ చేసేందుకు సహాయపడుతున్న ఇనుప రోప్‌లు పూర్తిగా దెబ్బతిని 8 గేట్లను ఆపరేటింగ్ చేయలేకపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన అధికారులు మొత్తం 62 గేట్లు మొదలుకొని రబ్బర్ సీల్స్, రోప్స్, పెయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెంథనింగ్ వంటివి మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసింది. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఒప్పందం గడువు ముగిసి.. మరోసారి పొడిగించిన గడువు ముగిసిపోయినా పట్టుమని 50 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ● ప్రస్తుతం డ్యాం పైభాగాన ఉన్న హయిస్ట్ బ్రిడ్జి, గేట్ల వద్ద ఉన్న వాక్‌వే బ్రిడ్జికి సంబంధించి సాండ్ బ్లాస్టింగ్ పనులు పూర్తి చేయగా.. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. భారీ వరద వస్తే.. 2009 సంవత్సరం మాదిరి జూరాలకు భారీ వరద వస్తే దెబ్బతిన్న గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదు. ఇటీవల కర్ణాటకలోని టీబీ డ్యాం గేటు కొట్టుకుపోవడం, తాజాగా విజయవాడలోని కృష్ణా బ్యారేజీ గేట్లు దెబ్బతినడం ఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వీడి మొత్తం గేట్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి భారీ వరదలు వచ్చినా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
‘రెస్క్యూ’ కొనసాగించాలా.. వద్దా?
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో శిథిలాల కింద ఉన్న మిగతా కార్మికుల ఆచూకీ కోసం 60 రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటుచేసుకోగా, ఇప్పటివరకు ఇద్దరు కార్మికుల మృతదేహాలు లభించాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ కోసం నిరాటంకంగా పనులు కొనసాగుతున్నాయి. 12 సంస్థలకు చెందిన 560 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో తవ్వకాలను కొనసాగిస్తున్నారు. సొరంగంలోని ప్రమాదస్థలంలో డీ2 పాయింట్ వద్ద రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప కంచె వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. అక్కడి నుంచి ఇంకా ముందుకు పనులు కొనసాగించాలా లేక నిలిపివేయాలా అన్న దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. చివరి 43 మీటర్లలోనే.. 14 కి.మీ. లోపల సొరంగం చివరన 43 మీటర్లు ప్రమాదకరంగా ఉండటంతో డీ2 పాయింట్ వద్ద ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. అక్కడి మట్టిని తొలగిస్తే మళ్లీ సొరంగం కూలిపోయే అవకాశం ఉందని ఇప్పటికే జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఇనుప కంచె వరకు తవ్వకాలు పూర్తికాగా మిగతా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. వారు ఆ 43 మీటర్ల పరిధిలోనే కూరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంకా పనులు కొనసాగించాలా, వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు ప్రభుత్వం సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్, ఎన్జీఆర్ఐ డైరెక్టర్, జీఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ డైరెక్టర్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన కల్నల్ పరీక్షిత్ మెహ్రా, అటవీశాఖ పీసీసీఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్, నీటిపారుదల శాఖ సీఈ, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ సీఈతో కూడిన 12 మంది సభ్యులు ఉన్నారు. చివరి 43 మీటర్లలో పనులు చేపడితే రెస్క్యూ బృందాలకు సైతం అపాయమున్న నేపథ్యంలో పనులు నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. -
ఆరోగ్య సమస్యల నుంచి ఆత్మహత్యల దాకా..
ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కల్తీకల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, వృద్ధులు, మహిళలతో సహా కల్తీ కల్లుకు బానిస అవుతున్నారు. ఏళ్ల తరబడి కల్తీ కల్లు సేవిస్తుండటంతో ప్రధానం మెదడు, నాడీ వ్యవస్థ, లివర్ భాగాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. చివరికి నోటి నుంచి మాటరాని పరిస్థితికి చేరుకుంటున్నారు. కల్తీకల్లులో వినియోగిస్తున్న మితిమీరిన మత్తు పదార్థాలతో పూర్తిగా బానిసై కల్లు మానేయలేని స్థితికి చేరుకుంటున్నారు. విపరీతమైన మత్తులో గొడవలు పడటం, కుటుంబ కలహాలు, మహిళలపై చేయి చేసుకోవడంతో పాటు క్షణికావేశంలో తమవారినే అంతమొందించేందుకు సిద్ధమవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మత్తులో డిప్రెషన్‌కు గురికావడం, తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనలేక ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారు. -
చెంచుల స్థితిగతులపై అధ్యయనం
మన్ననూర్: నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ చెంచుల జీవన స్థితిగతులపై బుధవారం రాష్ట్ర అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాల మేర కు అధికారుల బృందం అప్పాపూర్, భౌరాపూర్ చెంచు పెంటల్లో చెంచులతో సమావేశమై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. చెంచుల జోవనోపాదులతో పాటు జీవన భృతి తదితర అంశాల గురించి చర్చించారు. చెంచు పెంటల్లో తాగునీరు, రవాణా, రోడ్లు, చెక్‌డ్యాంలు తదితర సౌకర్యాల కల్పనతో పాటు నేచర్ గైడ్ల శిక్షణ కోసం రూ. 1.2కోట్లు మంజూరు చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యాలయ జాయింట్ సెక్రెటరీ భవానీ శంకర్, పవన్‌సింగ్, ఫైనాన్స్ అధికారి శ్రీనివాస్, ట్రైబ ల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇస్కాన్ సభ్యులు, మిష న్ భగీరథ డీఈ హేమలత, రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ కల్లుతో బేజారు
కల్లుకు బానిసై తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతం ఏడాదిన్నర కిందట కల్తీ కల్లు సేవించి మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రానికి సమీపంలోని తిమ్మసానిపల్లి, కోయినగర్, దొడ్లోనిపల్లి గ్రామాలకు చెందిన 20 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో చేరి వారం రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కల్తీ కల్లు వినియోగిస్తూ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి క్రమంగా పెరుగుతోంది. ‘ఈ ఫొటోలోని వ్యక్తి పేరు లక్ష్మయ్య. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలకేంద్రానికి చెందిన ఈయన కొన్నేళ్లుగా కల్తీ కల్లు తాగుతుండటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మెదడు దెబ్బతిని నోటమాట రాని పరిస్థితికి చేరుకున్నాడు. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో మెంటల్ హెల్త్ విభాగంలో చికిత్స తీసుకుంటున్నాడు. గ్రామాల్లో విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు చేపడుతున్నారని, తనలాంటి బాధితులు ఎంతోమంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని వాపోయాడు.’ -
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: వేసవిలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఉంటాయని.. ఇందుకు గాను ప్రాథమిక, ఉన్నత పాఠశాల, మండల, జిల్లా స్థాయిల్లో ఆర్పీలుగా పనిచేసేందుకు ఆసక్తిగల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయుల శిక్షణకు ఆర్పీలుగా నలుగురు జీహెచ్ఎంలు, మరో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలతో పాటు 228 మంది రిసోర్స్పర్సన్లు అవసరమన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఈ నెల 30వ తేదీలోగా ఆర్పీల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుందన్నారు. ఎంపికై న ఆర్పీలకు మే నెలలో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల 24వ తేదీలోగా డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బోనస్ ఆలస్యం కావొద్దు బిజినేపల్లి: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం అందించే బోనస్ ఆలస్యం కాకుండా చూడాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. అనంతరం 45 మందికి సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీరాములు, ఏఓ నీతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజుగౌడ్, తిరుపతయ్య, మిద్దె రాములు, నసీర్, మాన్యా నాయ క్, కత్తె ఈశ్వర్, పండ్ల పాషా తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ప్రగతి సాధించాలి మన్ననూర్: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని డీఆర్డీఓ చిన్న ఓబులేష్ సూచించారు. వాటర్‌షెడ్ పథకం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న అమ్రాబాద్ మండలం బీకే ఉప్పునుంతలలో బుధవారం గ్రామస్తులతో కలిసి ఆయన అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో డీఆర్డీఓ మాట్లాడుతూ.. వాటర్‌షెడ్ పథకం ద్వారా పండ్ల తోటలు, పశుగ్రాసం, పశుసంపద పెంచుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామ సమీపంలో ప్లాంటేషన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి జగన్, ఏడీహెచ్ జ్ఞానశేఖర్, డీఆర్ఓ వాణికుమారి, ఎఫ్ఆర్ఓ వీరేష్, రామకృష్ణ, క్రాంతి, కేశవులు, సర్దార్ నాయక్, వాటర్‌షెడ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా అర్హుల ఎంపిక
నాగర్‌కర్నూల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా చేపట్టాలని ఇన్చార్జి కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్లో రాజీవ్ యువవికాసం దరఖాస్తుల విచారణ ప్రక్రియ, మండల స్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటుపై అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీవ్ యువవికాసం పథకానికి జిల్లావ్యాప్తంగా 42,335, దరఖాస్తులు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 50వేల వరకు వందశాతం సబ్సిడీ, రూ.లక్ష వరకు 90శాతం, రూ. 2లక్షల వరకు 80శాతం, రూ. 4లక్షల వరకు 70 శాతం సబ్సిడీతో యూనిట్లు మంజూరు చేస్తుందన్నారు. ఇందుకు గాను ప్రణాళికా బద్ధంగా లక్ష్యాల కేటాయింపులు చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల విచారణ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. మండలస్థాయిలో విచారణకు ఎంపీడీఓ, మండల ప్రత్యేకాధికారి, బ్యాంకు మేనేజర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ అధికారులు, డీఆర్డీఓ సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. మండలస్థాయి విచారణ తదుపరి జిల్లా కమిటీ పరిశీలన చేస్తుందన్నారు. తుది జాబితాను ఆయా కార్పొరేషన్లకు పంపనున్నట్లు చెప్పారు. జిల్లాలో లాభదాయక యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమర్పించడంతో పాటు సదరు లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం త్వరగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఇళ్ల మంజూరు పూర్తిచేసి.. నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.. ఊర్కొండ: రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని రూపొందించిందని ఇన్చార్జి కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ఊర్కొండ రైతువేదికలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. గతంలో సరైన రిజిస్ట్రేషన్ లేకుండా జరిగిన సాదాబైనామా లావాదేవీలకు ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. అర్హులైన వారు నిర్దేశిత ప్రక్రియ ద్వారా తమ సాదాబైనామాలను క్రమబద్ధీకరించుకోవచ్చని సూచించారు. అంతే కాకుండా వారసత్వ భూముల విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో భూ సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో బాధితులు ఆర్డీఓ, కలెక్టర్ లేదా సీసీఎల్ఏలకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ అప్పీల్ ప్రక్రియ కూడా నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేయబడుతుందన్నారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత పారదర్శకత, కచ్చితత్వం కోసం ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని కలెక్టర్ వెల్లడించారు. భవిష్యత్‌లో భూ సరిహద్దులు, యజమానికి సంబంధించిన వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ ఎండీ యూసుఫ్ అలీ, ఎంపీడీఓ కృష్ణయ్య, ఏఓ దీప్తి, ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, నాయకులు జనార్దన్‌రెడ్డి, రమేశ్ నాయక్, అయూబ్ పాషా, అబ్దుల్ సమీ, వహిదుద్దీన్, మనోహర్ రెడ్డి, ధర్మేందర్ రెడ్డి, మ్యాకల శ్రీనివాసులు, ఆదినారాయణ ఉన్నారు. ‘రాజీవ్ యువవికాసం’లో లాభదాయక యూనిట్ల ఏర్పాటుకు చర్యలు ఇన్చార్జి కలెక్టర్ విజయేందిర బోయి -
కల్తీ కల్లు బాధితులే ఎక్కువ..
జనరల్ ఆస్పత్రిలోని మెడికల్ హెల్త్ సెంటర్‌కు కల్తీ కల్లు బాధితులు ఎక్కువగా వస్తున్నారు. కల్లులో మత్తుకోసం క్లోరో, ఆల్ఫ్రాజోలం, యాంటీ సైకోటిక్ పదార్థాలను కలుపుతుండటంతో తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. నిత్యం కల్తీకల్లు సేవించడం వల్ల బ్రెయిన్, లివర్, నాడీ సంబంధ సమస్యలకు లోనవుతున్నారు. చివరికి నోట మాటరాని పరిస్థితి ఎదురవుతోంది. – డాక్టర్ అంబుజ, సైకియాట్రిస్ట్, జిల్లా మెడికల్ హెల్త్ సెంటర్, నాగర్కర్నూల్కౌన్సెలింగ్ ద్వారా చికిత్స.. కల్తీకల్లు వినియోగంతో నరాల బలహీనత, ఫిట్స్, తిమ్మిర్లు రావడం, చేతు లు, కళ్లలో మంటలతో ఆస్పత్రులకు వస్తున్నారు. వారికి కౌన్సెలింగ్, మందులు ఇచ్చి పంపిస్తున్నాం. తీవ్రమైన కేసులు ఉన్నవారిని హైదరాబాద్‌కు పంపుతున్నాం. – డాక్టర్ రఘు, సూపరింటెండెంట్, జనరల్ ఆస్పత్రి, నాగర్‌కర్నూల్ ● -
రికవరీ ఎప్పుడో?
నాగర్‌కర్నూల్ బల్దియాలో జీతాల పేరుతో రూ. కోటికి పైగా పక్కదారి విచారణ కొనసాగుతోంది.. మున్సిపాలిటీలో జరిగిన అవినీతికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. సిబ్బంది జీతాల పేరుతో నిధులు పక్కదారి పట్టిన సమయంలో ఇక్కడ పనిచేసిన వారందరూ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశాం. త్వరలోనే పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – కనకయ్యగౌడ్, సీఐ, నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రమైన నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి అవినీతి పరంపర కొనసాగుతోంది. అవినీతి జరిగిన ప్రతీసారి కొన్ని రోజులపాటు హడావుడి చేయడం.. ఆ తర్వాత విషయం కనుమరుగైపోవడం పరిపాటిగా మారింది. గతేడాది మున్సిపాలిటీలో జీతాల పేరుతో రూ. 1.08 కోట్లు పక్కదారి పట్టినట్లు తేలింది. అయితే ఇందుకు బాధ్యులైన ఓ పర్మినెంట్ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేయగా.. మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవినీతి ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. అయితే రికవరీ విషయంలో మాత్రం ఆశలు సన్నగిల్లుతున్నాయి. సదరు వ్యక్తులు నిధులను ఏ ఖాతాల్లోకి మళ్లించారు.. వాటిని ఎలా రికవరీ చేయాలనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత కరువైంది. దీంతో గతంలో జరిగిన అవినీతి మాదిరిగానే నిధుల పక్కదారి అంశం కూడా కనుమరుగవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెరపైకి మరికొందరి పేర్లు.. మున్సిపాలిటీలో జరిగిన అవినీతికి ఇద్దరిని బాధ్యులను చేస్తూ కేసులు నమోదు చేయడం వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇందులో ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం మాత్రం బహిర్గతం కావడం లేదు. అయితే చర్యలు తీసుకోబడిన ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ అవినీతిలో మరికొంత మందికి భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. గతంలో ఇక్కడ పనిచేసిన మున్సిపల్ కమిషనర్లు, అకౌంటెంట్ల పేర్లతో పాటు ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఒకరిద్దరి పేర్లు కూడా చెప్పినట్లు సమాచారం. కాగా, సదరు అధికారులు, సిబ్బంది విచారణకు హాజరు కావాలని ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. గతంలో ఒకరిద్దరు అధికారులు హాజరైనా.. పూర్తిస్థాయిలో విచారణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 2020 నుంచి గత సంవత్సరం వరకు జీతాల విషయంలో ఈ అవినీతి జరగడంతో.. అప్పటి అధికారులు సైతం విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అధికారులు, ఇతర సిబ్బంది అండదండలు లేకుండా ఇద్దరు సిబ్బంది ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడతారా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈ విషయంలో ఆ ఇద్దరినే బలి పశువులను చేస్తారా? లేక పూర్తి స్థాయిలో విచారణ చేసి.. అవినీతి బాగోతం వెనకున్నవారిని కనిపెట్టి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. ఇద్దరు ఉద్యోగులపై చర్యలకే పరిమితం అవినీతి సొమ్ము రికవరీపై కనిపించని శ్రద్ధ -
ఉగ్రమూకలను తరమికొడదాం
కందనూలు: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో ఉగ్రవాదుల మారణకాండపై జనాగ్రహం పెల్లుబికింది. ఉగ్రమూకల దుశ్చర్యను ఖండిస్తూ బుధ వారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ చేసి చంపడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హిందూ సమాజం చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఉగ్రవాదులకు అశ్రయం ఇస్తున్న వ్యక్తులను ఇక్కడి నుంచి తరమివేయాలన్నారు. ఉగ్రవాదులను నడిరోడ్డుపై కాల్చి చంపాలని వారు డిమాండ్ చేశారు. -
అకాల వర్షాలతో రైతులకు తీవ్రనష్టం
బిజినేపల్లి: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అన్నారు. మండలంలోని లట్టుపల్లిలో వారం రోజుల క్రితం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రం నుంచి ప్రభుత్వ అధికారులు సరైన సమయంలో ధాన్యం సేకరించడంతో ఆదివారం కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన వడ్లను మ్యాచర్ పేరుతో కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. సోమవారం మండలంలోని లట్టుపల్లిలో కొనుగోలు కేంద్రం ఆవరణలో వర్షానికి తడిసిన, కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాల వర్షం కాారణంగా ఎండిన వడ్లు మళ్లీ తడవడంతో 25 నుంచి 50 శాతం వరకు నష్టం వాటిల్లిందన్నారు. కొనుగోలు కేంద్రాల సిబ్బంది, అధికారులు, ప్రభుత్వం రైతులను పలు రకాలుగా మోసం చేయడంతో వారు చేసేది లేక ప్రైవేటు మిల్లర్లకు రూ.1,800 గుండుగుత్తగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే నష్టం అంచనా వేసి రైతులకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, నారాయణచారి, భూషయ్య, రమేష్‌గౌడ్, చంద్రకళ, తిరుపతయ్య, రఘుబాబు, ఓం ప్రకాష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’కి 35 అర్జీలు
నాగర్‌కర్నూల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణికి 35 ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు. పోలీస్ గ్రీవెన్స్‌కు 9.. నాగర్‌కర్నూల్ క్రైం: పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయానికి వివిధ ప్రాంతాల నుంచి పోలీస్ ప్రజావాణికి 9 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 3 భూమి పంచాయతీ, 5 తగు న్యాయం గురించి, ఒకటి భార్యాభర్తల గొడవ ఫిర్యాదు వచ్చాయన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: కార్పొరేట్ కళాశాలల పథకం కింద 2025–26 సంవత్సరానికి గాను (frerh& renewal) జూనియర్ కళాశాలలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రావణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కార్పొరేట్ కళాశాలల గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలనుకున్న యాజమాన్యం వారు తమ కళాశాలల గుర్తింపు, విద్యార్థులకు కల్పిస్తున్న హాస్టల్ సదుపాయాలు, అధ్యాపక సిబ్బంది తదితర వివరాలు https: //telanganaepass.cgg.gov.in వెబ్సైట్ లో ఈ నెల 30లోగా పూర్తి వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసి జిల్లా కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎ.రాజసింహుడు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఫోరం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానంగా గత 2022 ఏప్రిల్ నుంచి రిటైర్డ్ అయిన కార్మికులకు రావాల్సిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, 2017 పీఆర్సీకి సంబంధించిన ఏరియర్స్, ప్రతి నెలా 10వ తేదీ లోపు చెల్లించాల్సిన ఎస్ఆర్బీఎస్ డబ్బులను అందజేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు జీబీ పాల్, ఆర్.నారాయణ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు 10వ తేదీలోగా చెల్లించాల్సిన ఎస్ఆర్బీఎస్ డబ్బులు ఇంతవరకు చెల్లించలేదన్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగుల జీతభత్యాలకే విడతల వారీగా ఈ నెల 16వరకు చెల్లించారని, ఇంకా డీఏలు, 2021 పీఆర్సీ ఇవ్వాల్సిఉందని, అలాగే పీఎఫ్, సీపీఎస్లకు చెల్లించాల్సిన బకాయిలను కూడా చెల్లించకుండా నియామకాలను ఎలా చేపడుతారని ప్రశ్నించారు. సమావేశంలో నాగాంజనేయులు, లలితమ్మ, నర్సింలు, మనోహర్, బుచ్చన్న, రియాజుద్దీన్ పాల్గొన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని పీయూ వైస్‌చాన్స్‌లర్ జీఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పీయూలో ఏర్పాటు చేసిన మహనీయుల జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపేందుకు ఎంతో మంది గొప్ప వ్యక్తులు జీవితాంతం కృషి చేశారని, వారి కృషి వల్ల ఎంతో మంది అట్టడుగు వర్గాల వారికి మేలు జరిగిందన్నారు. మహనీయుల జయంతులు చేస్తే వారి ఆశయాలను కొనసాగించినట్లు కాదని, వారు ఎలాంటి సేవలు చేయడం వల్ల గొప్ప వ్యక్తులయ్యారనే అంశాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ జానకి మాట్లాడుతూ గతంలో మహనీయులు చేసిన త్యాగాల వల్లే అన్ని వర్గాల వారు స్వేచ్ఛ సమానత్వంతో మెలుగుతున్నారని, నేటి తరం యువతకు కూడా సమాజసేవ చేసేందుకు తమ వంతుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ప్రొఫెసర్ కాశీం, పీయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబు, పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కుమారస్వామి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. -
దందాలకే ప్రాధాన్యం
● రియల్ వ్యాపారాల్లో జిల్లాలోని కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరు తరచుగా వివాదాస్పదమవుతోంది. తరగతి గదుల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సింది పోయి.. కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ దందాల్లో, చిట్టీ వ్యాపారాల్లో ఆరి తేరుతున్నారు. ఈ క్రమంలో అదనపు సంపాదన కోసం అక్రమ దందాలకు పాల్పడేందుకు సైతం వెనకాడటం లేదు. అక్రమంగా చిట్టీల దందాకు పాల్పడుతూ ప్రజలను మోసం చేసినట్టుగా తేలడంతో ఇటీవల జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూనే ప్రజల నుంచి రూ.కోటికి పైగా సొమ్మును వసూలు చేసి, తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించడంతో ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించి అతనిపై సస్పెన్షన్ వేటు విధించారు. విచారణ పేరుతో కాలయాపన.. జిల్లాలోని కొందరు ప్రభుత్వ టీచర్లు చిట్టీలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో బిజిబిజీగా గడుపుతూ పాఠశాలల్లో విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నా అధికారులు స్పందించడం లేదు. చాలా సందర్భాల్లో విచారణ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారు. తమ గ్రామాల్లో టీచర్లు పాఠశాలలకు సరిగా రావడం లేదని ఫిర్యాదులు అందుతున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మా బడి మూతబడింది.. మా తండాలోని ప్రభుత్వ పాఠశాలలో కొన్ని నెలలపాటు టీచర్ సరిగా రాలేదు. ఎప్పుడు చూసినా మీటింగ్ ఉందంటూ బయటకు వెళ్లేవాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరి పాఠశాల మూతబడింది. వచ్చే ఏడాదైనా తరగతులను ప్రారంభించాలి. – రమేశ్, రూప్లాతండా, బిజినేపల్లి మండలం చర్యలు తీసుకుంటున్నాం.. జిల్లాలో కొందరు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులపై వస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల విధులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నాం. – రమేశ్‌కుమార్, డీఈఓ ఫైనాన్స్, చిట్టీలు, వడ్డీ వ్యాపారాల్లో తలమునకలు పాఠశాలల్లో సమయపాలన పాటించడం లేదని ఫిర్యాదులు ఇటీవల వెల్దండ మండలంలోని ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు జిల్లాలో నామమాత్రంగా మారిన హాజరు ప్రక్రియ -
భూ భారతితో శాశ్వత పరిష్కారం
మన్ననూర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంను రైతులు సద్వినియోగం చేసుకొని శాశ్వత పరిష్కారం పొందాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం పదర, అమ్రాబాద్ మండల కేంద్రాల్లోని అధికారులు, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అమలులో ఉన్న ధరణిలో జరిగిన లోపాలను సవరిస్తూ భూ భారతి ద్వారా సరిచేసుకునే వెసులుబాటు ప్రభుత్వం రైతులకు కల్పించిందన్నారు. సాదాబైనామాలు, వారసత్వ, అసైన్డ్, వక్ఫ్, పోరంబోకు భూములలో ఉన్న లోపాలు సరిచేసుకోవచ్చని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్కారం కాని సమస్యలు తహసీల్దార్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ వరకు, ఆ తర్వాత సీసీఎల్ ద్వారా కూడా నిర్భయంగా వెళ్లి దరఖాస్తు చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఇకపై బ్యాంకు రుణాల కోసం వెళ్లినప్పుడు భూమికి సంబంధించిన ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, భూ భారతి పోర్టల్‌లో పొందుపరిచిన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆర్డీఓ మాధవి మాట్లాడుతూ ప్రత్యేకించి ఏజెన్సీ పరిధిలో ప్రభుత్వ భూములు ఎవరైనా అమ్మితే కొనకూడదని, ఇప్పటి వరకు సాగులో ఉన్న భూములు కాకుండా కొత్తగా భూములు సాగు చేయకూడదని సూచించారు. రైతులు తమ పొలాలపై హక్కులు కలిగి ఉండటంతోపాటు బ్యాంకులో పంట రుణాలు, 1978కి ముందు కొనుగోలు చేసుకున్న భూములకు మాత్రమే పట్టాలు అవుతాయనేది గమనించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్‌బాబు, ఎంపీడీఓలు శైలేంద్రకుమార్, వెంకటయ్య, ఏఓ సురేష్, నాయకులు హరినారాయణగౌడ్, రహీం, సంబు శోభ, ప్రణీత, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రహసనంగా హాజరు ప్రక్రియ..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులు తరచుగా వస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో మాత్రమే బయోమెట్రిక్ ఉండగా, అది కూడా ఎక్కడా పకడ్బందీగా అమలు కావడం లేదు. మారుమూల గ్రామాల్లోని పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్లడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. కొన్నిచోట్ల ఉదయం, సాయంత్రం పాఠశాలల్లో హాజరు వేసుకుని మిగతా సమయం అంతా బయటకు వెళ్లి వ్యాపార, ప్రవృత్తి రంగాల్లో నిమగ్నమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నదిలో రోడ్డేసి.. దర్జాగా తవ్వేసి..
●కృష్ణా పరివాహకంలో యథేచ్ఛగా ఇసుక దందా ● నారాయణపేట జిల్లాలో పేట్రేగుతున్న ఇసుక మాఫియా ● జేసీబీ, హిటాచీల వంటి భారీ యంత్రాలతో తవ్వకాలు ● 2 చోట్ల రోడ్డు వేసి పగలు, రాత్రనక బెంజ్ వాహనాల్లో రవాణా ● పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ● ఫిర్యాదులు వచ్చినప్పుడే తనిఖీల పర్వం ● తూతూమంత్రపు కేసులతో సరిపెడుతున్న ఖాకీలు ● ఓ రాజకీయ నేత ‘హస్తం’ ఉన్నట్లు ఆరోపణలు అధికారులు పట్టించుకోవాలి.. కృష్ణా నది నుంచి ఇసుక తరలించడం మూలంగా సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతోపాటు నదిలో రోడ్లు వేయడం వల్ల దిగువకు నీళ్లు రాకుండా పోతున్నాయి. ఉన్న కాస్త నీరు అక్కడే నిలుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే వేసవి చివరలో నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అధికారులు పట్టించుకోవాలి. – అంబ్రెష్. మాజీ సర్పంచ్, గుడెబల్లూరు, కృష్ణా నా దృష్టికి రాలేదు.. నది రోడ్లు వేసినట్లు నా దృష్టికి రాలేదు. త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టినా.. అనుమతుల్లేకుండా తరలిస్తున్నా.. చర్యలు తప్పవు. – వెంకటేష్. తహసీల్దార్, కృష్ణా ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా.. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో మైనింగ్ సిబ్బంది కొరత ఉంది. అయినా నదిలో రోడ్డు వేసినట్లు మా దృష్టికి వచ్చిన వెంటనే.. పరిశీలించాలని సిబ్బందిని పంపించా. నీటిని మళ్లించేందుకు రైతులు వేసుకున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా. చర్యలు తీసుకోవాల్సింది వారు. – సంజయ్, ఏడీ, మైనింగ్ శాఖ, మహబూబ్‌నగర్ తొలుత 8 కి.మీ.ల మేర మట్టి రోడ్డు.. ఉమ్మడి పాలమూరు.. ప్రస్తుత నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో తంగిడి వద్ద కృష్ణానది ప్రవేశిస్తోంది. ఈ మండల పరిధి టైరోడ్ సమీపంలో కృష్ణా పరివాహకంలోని ఓ ఆశ్రమం వద్ద మాఫియా ఆధ్వర్యంలో నదిలో తొలుత ఏడెనిమిది కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు నిర్మించింది. నదిలో ఊట నీరు లేదంటే వరద వచ్చినా.. ఇబ్బందుల్లేకుండా అక్కడక్కడ చిన్న చిన్న తూములను ఏర్పాటు చేసి మట్టి రోడ్డు వేశారు. ప్రస్తుతం నదిలో ఇసుక మేటలు పెద్ద ఎత్తున తేలగా.. ఆ ప్రాంతంలో హిటాచీ, జేసీబీల వంటి భారీ యంత్రాలతో తవ్వి.. ఈ మట్టి రోడ్డు గుండా బెంజ్‌లు, టిప్పర్ల ద్వారా పగలు, రాత్రనక కర్ణాటకకు తరలిస్తున్నారు. ఆ తర్వాత వేరే చోట.. తొలుత మట్టి రోడ్డు వేసి బెంజ్ వంటి వాహనాల్లో ఇసుక తరలించడంపై పలువురు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇసుక తరలిస్తున్న వాహనాలపై పోలీసులు తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఎవరు కూడా అటు వైపు చూడకపోవడంతో ఇసుక మాఫియా రాత్రిళ్లూ యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో అదే ఆశ్రమం నుంచి కొద్దిదూరంలో వేరే చోట మట్టి రోడ్డు వేసి.. భారీ ఎత్తున తవ్వకాలు చేపడుతోంది. రోజుకు వందలాది ట్రిప్పుల చొప్పున ఇసుకను కర్ణాటకలోని తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. బెంజ్ ఇసుకను రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దందా వెనుక ఎవరి ‘హస్తమో’? కృష్ణా పరివాహకంలో అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా నదిలో రోడ్డు వేసినా.. రాత్రిళ్లూ ఇసుక రవాణా కొనసాగుతున్నా.. రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఇరిగేషన్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా వెనుక నారాయణపేట జిల్లాకు చెందిన ఓ ‘అధికార’ నేత హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణా మండలానికి చెందిన ఓ నాయకుడు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. సమన్వయ లేమినా.. ముడుపులు అందడంతోనా.. ఇసుక దందాను అరికట్టడంలో భాగంగా ప్రభు త్వ ఆదేశాల మేరకు పేట జిల్లా అధికార యంత్రాంగం ఇదివరకే టాస్క్‌ఫోర్స్ కమిటీ వేసింది. ఇందులో రెవెన్యూ, భూగర్భ జల, ఇరిగేషన్, పోలీస్, ఆర్టీఏ అధికారులు ఉన్నారు. వీరందరూ ఐక్య కార్యాచరణతో ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాల్సి ఉంది. కానీ.. జిల్లాలో ఆయా శాఖల మధ్య సమన్వయం కొరవడినట్లు తెలుస్తోంది. మరో వైపు ఆయా శాఖల అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. నెలనెలా శాఖల వారీగా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా నదిలో రోడ్డు వేస్తే చర్యలు తీసుకోరా.. రాత్రిళ్లూ తవ్వకాలు చేప ట్టొచ్చా? అని ‘సాక్షి’ వివిధ విభాగాల అధికారులను సంప్రదించగా..మా బాధ్యత కాదు అంటూ ముక్తసరిగా సమాధానం ఇవ్వడం గమనార్హం. మళ్లీ కొన్ని రోజుల తర్వాత మఠం నుంచి దాదాపు రెండు కి.మీ.ల దూరంలో ఏడెనిమిది కిలోమీటర్ల మేర నదిలో వేసిన మరో రోడ్డు ఇది.. మక్తల్ నియోజకవర్గ పరిధి టైరోడ్డు సమీపంలోని ఓ మఠం వద్ద కృష్ణానదిలో తొలుత వేసిన రోడ్డు ఇది.. ఇసుకాసుర ‘హస్తం’..! ...తెలంగాణ–కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నారాయణపేట జిల్లాలోని కృష్ణా పరివాహకంలో ఇసుక మాఫియా ఆగడాలకు ఇవి నిదర్శనం. నదిలో మట్టి రోడ్లు వేసి మరి తెలంగాణ పరిధిలోని ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారు. పగలు, రాత్రనక యథేచ్ఛగా దందా కొనసాగుతున్నా.. రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్, పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ‘ఎత్తిపోతల’పై ప్రభావం.. కృష్ణానది ఆధారంగా మక్తల్ నియోజకవర్గంలో కుసుమూర్తి, వాసునగర్, గూడెబల్లూరు, ముడుమాల్, కొల్పూరు, పారేవులా, పస్పుల మినీ ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా దాదాపు 20 వేల ఎకరాలకు సాగు నీరందుతోంది. పలు ఎత్తిపోతల ద్వారా మే నెల వరకు తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. ప్రస్తుతం రబీ సీజన్ ముగిసింది. దీంతో పంటలకు అంతగా నీటి అవసరం లేకున్నా.. ప్రతి ఏటా ఇసుక తవ్వకాలు చేపడుతుండడంతో పంటల సాగుపై ప్రభావం చూపడంతో పాటు తాగు నీటికి ఇబ్బందులు వస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
లేబర్ కోడ్ కార్మిక చట్టాలను రద్దు చేయాలి
అచ్చంపేట: దేశవ్యాప్తంగా మే 20 నుంచి జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. సోమవారం అచ్చంపేట మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడుస్తున్నా కార్మికులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. 44 కార్మికుల చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారని, ఉన్న చట్టాలను కాలరాయడమే తప్ప కార్మికులకు మేలు చేయలేదని దుయ్యబట్టారు. సంఘాలు లేకుండా చేస్తున్న మోదీ దిమ్మ తిరిగే విధంగా సమ్మెను చేద్దామని, కార్మికులు కలిసి రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అసంఘటిత, సంఘటిత రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోందని, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ భవిష్యత్ తరాలకు బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందన్నారు. కార్మికులను రెగ్యులర్ చేసి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రభు త్వ ఉద్యోగులతో సమానంగా గౌరవ వేతనం ఇవ్వా లని డిమాండ్ చేశారు.జిల్లా ఉపాధ్యక్షుడు పర్వతాలు, జిల్లా సహాయక కార్యదర్శి శంకర్‌నాయక్, పట్టణ కార్యదర్శి రాములు, నాయకులు మధు, సురేష్, సాయిలు, వెంకటయ్య, రమేష్, హరీష్, వెంకటమ్మ, బాలమ్మ, సుభద్రమ్మ పాల్గొన్నారు. -
‘సంవిధాన్’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కొల్లాపూర్ రూరల్: జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలాని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశం మంత్రి పాల్గొని మాట్లాడారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పాదయాత్రలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, చేసిన అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది.. వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేస్తుంది.. అప్రజాస్వామిక నిర్ణయాలు, తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు. అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని గ్రంథాలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నానని చెప్పారు. ఇందులో భాగంగా రూ.5 కోట్ల నియోజకవర్గ నిధుల నుంచి రూ.2 కోట్లు గ్రంథాలయాలు, క్రీడల అభివృద్ధికి వెచ్చిస్తానని ప్రకటించారు. ప్రతి గ్రామానికి రూ.లక్ష చొప్పున గ్రంథాలయాలకు కేటాయించామన్నారు. అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మహాత్మగాంధీ వంటి మహనీయుల జీవిత చరిత్ర, వారి ఆశయాలు, సిద్ధాంతాలు తెలిపే పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. -
అద్దె బస్సుల డ్రైవర్ల సమ్మె విరమణ
అచ్చంపేట: అచ్చంపేట ఆర్టీసీ డిపో ఎదుట గత ఐదురోజులుగా అద్దె బస్సుల ప్రైవేట్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె ఆదివారం ముగిసింది. కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అద్దె బస్సుల యాజమాన్యం డ్రైవర్ల శ్రమ దోపిడీని అరికట్టాలని తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హయ్యర్ అద్దె బస్సు డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. సమ్మెతో దిగివచ్చిన యాజమాన్యాలు డ్రైవర్లకు గతం కంటే రూ.3 వేలు ఎక్కువ ఇచ్చేందుకు అంగీకరించారు. జీతాలు పెరగడంతో డ్రైవర్లు సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శంకర్‌నాయక్, అద్దె బస్సు ప్రైవేట్ డ్రైవర్ల నియోజకవర్గ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ అద్దె బస్సు యాజమాన్యం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించారని చెప్పారు. సమ్మె చేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగడంతో ఆర్టీసీ డీఎం జోక్యం చేసుకొని యాజమాన్యాలతో చర్చలు జరపడం వల్ల వేతనాలు పెరిగాయన్నారు. కార్యక్రమంలో నాయకులు రాములు, శ్రీహరి, అనిల్, నాగరాజు, బాలయ్య, చంద్రయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
యూడైస్ కచ్చితమేనా..?
ప్రభుత్వ పాఠశాలల సమగ్ర సమాచారం సేకరణ ప్రతిరోజు రెండు పాఠశాలలు.. జిల్లాలో సర్వే కోసం 759 పాఠశాలలను ఎంపిక చేశారు. మహబూబ్‌నగర్ డైట్ కళాశాలకు చెందిన 77 మంది డైట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి పదేసి పాఠశాలలు కేటాయించారు. ప్రతిరోజు రెండేసీ పాఠశాలల చొప్పున బుధవారం నుంచి ఈ నెల 22 వరకు సర్వే చేసేలా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ రూపొందించారు. ఇందులో కేజీబీవీ, ఆదర్శ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండే విధంగా చూశారు. క్లస్టర్ రిసోర్స్పర్సన్ల సహకారంతో సర్వే కొనసాగుతుంది. యూడైస్‌లో పొరపాట్లు ఉంటే సరిచేసి.. సర్వే పూర్తయిన తర్వాత తుది నివేదికను జిల్లా విద్యాధికారులకు అందిస్తారు. అచ్చంపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల సమగ్ర సమాచారం సేకరించేందుకు విద్యాశాఖ సర్వే చేపట్టింది. డైట్ కళాశాలలకు చెందిన విద్యార్థులకు ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రతి విద్యా సంవత్సరంలో పాఠశాలల సమగ్ర సమాచారాన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (యూడైస్)లో నమోదు చేస్తున్నారు. వీటిని కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈఓల పరిశీలన అనంతరం ఆన్లైన్లో పొందుపరుస్తారు. పాఠశాలలకు నిధుల కేటాయింపు, పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను ప్రామాణికంగా తీసుకుంటుంది. స్కూళ్లలో సరైన మౌలిక వసతులు లేవని కేంద్రం కొన్నేళ్లుగా చెబుతోంది. అయితే ఈ వివరాలు కచ్చితంగా, పారదర్శకంగా పొందుపరుస్తున్నారా.. లేదా.. అనే విషయాన్ని విద్యాశాఖ తొలిసారిగా డైట్ విద్యార్థులతో సర్వేకు చర్యలు చేపట్టింది. 77 మంది డైట్ విద్యార్థులతో రేపటి వరకు సర్వే జిల్లావ్యాప్తంగా 759 పాఠశాలల ఎంపిక ఈ నివేదిక ప్రామాణికంగానే నిధుల కేటాయింపు -
ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
నాగర్‌కర్నూల్ క్రైం: అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి నిర్వహించిన వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. వారం రోజులపాటు జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజవర్గాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాకేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో వ్యాసరచన పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఫైర్ ఆఫీసర్ కృష్ణమూర్తి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లీడింగ్ ఫైర్మెన్లు వహీదుద్దీన్, రంగస్వామి, సిబ్బంది ఖదీర్, మల్లేష్, వెంకటేశ్వరరావు, కై ఫ్, సాయిబాబ, అమరేందర్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలి జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్రంలో దివ్యాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ చౌరస్తాలోని రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ణగారిన వర్గాలలో ఉన్న దివ్యాంగులు అధికారం కలిగిన సంస్థల్లో భాగం కావడానికి చట్టపర అధికారాలతో స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 20 మంది టీచర్లకు స్పౌజ్ బదిలీలు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: 317 జీఓలో గతంలో ఇబ్బందులకు గురైన స్పౌజ్ ఉపాధ్యాయులకు త్వరలో బదిలీ చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారు గతంలో తమకు బదిలీ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం ఈ అంశంపై నిర్ణయం తీసుకుని బదిలీలకు ఆమోదం తెలిపింది. మొత్తంగా మహబూబ్‌నగర్ జిల్లాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 20 మంది బదిలీపై రానున్నారు. పాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి మహబూబ్‌నగర్‌కు బదిలీ కానున్నారు. కాగా 8 మంది టీచర్లు ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు. ఇటీవల డీఎస్సీ ద్వారా ప్రభుత్వం చాలా పోస్టులు భర్తీ చేసింది. ఖాళీలు ఎక్కువ లేని క్రమంగా మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చే ఉపాధ్యాయులకు బై పోస్టుల కింద భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ విషయంపై డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. 20 మంది ఉపాధ్యాయులకు అన్ని పరిశీలించి ఈ నెల 22లోగా బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. -
అకాల వర్షం.. ఆగమాగం
● జిల్లాలో బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు ● విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న పంటలు ● వరద నీటిలో కొట్టుకుపోయిన వరిధాన్యం జిల్లావ్యాప్తంగా ఆదివారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను ఆగమాగం చేశాయి. బలమైన ఈదురు గాలులు వీయడంతోపాటు వడగండ్లతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. వందలాది ఎకరాలు వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతినగా.. పంట కోసి ఆరబోసిన వేలాది బస్తాల వరిధాన్యం తడిసి ముద్దయ్యింది. కొన్నిచోట్ల వరద నీటిలో ధాన్యం సైతం కొట్టుకుపోయింది. అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో కరెంట్ సరఫరా నిలిచిపోగా.. అధికారులు పునరుద్ధరించే పనులు చేపట్టారు. నల్లమలతోపాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గత మూడురోజులుగా అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. – సాక్షి నెట్వర్క్ -
వివరాలు సరిపోల్చుతూ..
ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, యూడైస్‌లో పొందుపరిచిన వివరాలకు సరిపోతున్నాయా.. లేదా.. పరిశీలించేందుకు జిల్లావ్యాప్తంగా బుధవారం సర్వే ప్రారంభించారు. డీఎడ్ విద్యార్థులు యూడైస్ సమగ్ర సమాచారాన్ని తెలిపే స్కూల్స్ రిపోర్టు కార్డు ఆధారంగా వివరాలు పరిశీలిస్తున్నారు. ఎంఈఓ కార్యాలయంలో కొనసాగుతున్న ఈ సర్వేలో హెచ్ఎంలను ప్రశ్నించే అధికారం సైతం వీరికి ఇచ్చారు. ఇప్పటికే వీరికి పాఠశాల విద్యాశాఖ ప్రశ్నావళి కూడా ఇచ్చింది. మౌలిక వసతులు, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫాంల వివరాలు ఇందులో ఉన్నాయి. స్కూళ్లలో ఉన్నవన్నీ యూడైస్‌లో నమోదు చేశారా.. ప్రధానంగా పాఠశాలలో నమోదైన విద్యార్థులు అదే పాఠశాలలో చదువుతున్నారా..? ఉపాధ్యాయుల సంఖ్య, తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి వసతి, వంటగది, విద్యుత్, ఫర్నిచర్, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతి గదులు, క్రీడా మైదానం వంటి వివరాలు, మైనర్, మేజర్ మరమ్మతు నమోదులో పారదర్శకతను పరిశీలిస్తున్నారు. ఆయా వసతులను యూడైస్ వివరాలతో సరిపోల్చుతున్నారు. -
లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలి
నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శివశంకర్ అధ్యక్షతన నిర్వహించిన సార్వత్రిక సమ్మె సన్నాహక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా విభజించేందుకు ప్రయత్నంచిందని, ఇది సరికాదన్నారు. కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా, ప్రభుత్వాలను ప్రశ్నించకుండా ఈ లేబర్ కోడ్లు ఉపయోగపడతాయన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం విధానాన్ని ఎండగడతామన్నారు. ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు అప్పగిస్తే సామాన్యుడికి రిజర్వేషన్ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేవారు. దేశంలో ప్రజలను చైతన్యవంతులుగా చేసి మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే దాకా ప్రజా ఉద్యమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి పర్వతాలు, నాయకులు ఈశ్వర్, దశరథం, రామయ్య, సత్యం, బాలపీరు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఎండీసీఏ మైదానంలో ‘టర్ఫ్ వికెట్’
● త్వరలో మూడు పిచ్‌లు అందుబాటులోకి.. ● మైదానం మొత్తం గ్రీనరీ ఏర్పాటు ● భవిష్యత్‌లో రంజీ మ్యాచ్‌లకు వేదిక కానున్న పాలమూరు ●మహబూబ్‌నగర్ క్రీడలు: మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ సంఘం (ఎండీసీఏ) ఆధ్వర్యంలో టర్ఫ్ వికెట్ పిచ్‌లు సిద్ధం చేస్తున్నారు. జిల్లాకేంద్రం పిల్లలమర్రి సమీపంలోని ఈ మైదానంలో క్రీడాకారుల సౌకర్యార్థం చాలా వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు ఉన్న ఏకై క క్రీడా మైదానమిది. ఇప్పటికే ఇక్కడ క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం దాతల సహకారంతో నెట్, రెండు బౌలింగ్ యంత్రాలతో పాటు పెవిలియన్ భవనాన్ని ఏర్పాటు చేశారు. ● క్రికెట్లో టర్ఫ్ వికెట్(పిచ్)లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేవలం మ్యాట్ల మీద క్రికెట్ ఆడే క్రీడాకారులకు టర్ఫ్ వికెట్‌పై ఆడాలంటే మెరుగైన ప్రాక్టీస్ ఉండాల్సిందే. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఔత్సాహిక ఉమ్మడి జిల్లా క్రికెట్ క్రీడాకారులకు కల నెరవేరనుంది. గతేడాది ఎండీసీఏ మైదానంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో పలువురు హెచ్‌సీఏ ప్రతినిధులు పాల్గొనగా మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటు కోసం ఎండీసీఏ ప్రతినిధులు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హెచ్‌సీఏ రూ.60 లక్షలు కేటాయించగా.. కొన్ని రోజులుగా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అదే విధంగా మైదానం మొత్తం పచ్చగడ్డి (గ్రీనరీ)ని ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో వర్షపు నీరు నిలువకుండా ఎత్తు పెంచి చుట్టూ అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ వేస్తున్నారు. త్వరలో ఎండీసీఏ మైదానంలో మూడు టర్ఫ్ వికెట్ పిచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. చురుగ్గా సాగుతున్న పనులు.. ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ పిచ్ ఏర్పాటు చేయాలనే కల నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతేడాది హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు టర్ఫ్ వికెట్ కోసం విన్నవించగా వారు సానుకూలంగా స్పందించారు. మైదానంలో టర్ఫ్ వికెట్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. క్రీడాకారులకు మెరుగైన క్రికెట్ శిక్షణ లభిస్తుంది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు – ఎం.రాజశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి టర్ఫ్ వికెట్ పిచ్‌పైనే జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మ్యాచ్‌లు ఆడుతారు. ఇంతకాలం మ్యాట్‌పై ఆడే జిల్లా క్రీడాకారులు టర్ఫ్ వికెట్ అందుబాటులోకి వస్తే వారి ఆటతీరు మరింత మెరుగు పడే అవకాశం ఉంటుంది. హెచ్‌సీఏ రాష్ట్రస్థాయి టోర్నీల్లో జిల్లా క్రీడాకారులు మరింతగా రాణించవచ్చు. రంజీస్థాయిలో ఆడేలా జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చు. ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటయితే భవిష్యత్‌లో రాష్ట్రస్థాయి మ్యాచ్‌లతో పాటు రంజీ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. -
బీఆర్ఎస్ నేతల కోసమే ధరణి
నాగర్‌కర్నూల్/గద్వాల: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగు గోడల మధ్య కూర్చొని, నలుగురి స్వార్థం కోసం రూపొందించిన చట్టమే ధరణి అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో భూ భారతిపై అవగాహన సదస్సులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లు చేయలేదని వీఆర్వో వ్యవస్థనే రద్దు చేశారని ఆరోపించారు.ఎప్పుడైనా, ఏ నియోజకవర్గంలోనైనా ధరణిపై సమావేశం పెట్టారా? అన్ని ప్రశ్నించారు. ఒకవేళ సమావేశం పెట్టి ఉంటే నాయకుల వీపులు చింతపండయ్యేవని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, వారి బంధువుల కోసమే ధరణి తెచ్చారని ఆరోపించారు. ధరణిలో రాత్రికి రాత్రే భూ యజమానుల పేర్లు మారిపోయేవని తెలిపారు. అన్ని సమస్యలకు పరిష్కారంగానే భూ భారతి చట్టం తెచ్చామని చెప్పారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణమోహన్‌రెడ్డి ఏ పార్టీ..?గద్వాల జిల్లా ధరూరు మండలంలో మంత్రి పర్యటన ఉద్రిక్తతలు, అలకల మధ్య సాగింది. అవగాహన సదస్సు పూర్తిగా అధికారిక కార్యక్రమం కావడంతో అధికారులు ప్రొటోకాల్ పాటించారు. దీంతో మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సభా వేదికపైకి రాకుండా దూరంగా ఉండిపోయారు. దీంతో వారి అనుచరులు ఆందోళనకు దిగారు. కాసేపు అక్కడే వేచి చూసిన సంపత్‌కుమార్ వేదికపైకి పిలవకపోవడంతో సభాప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.సరిత అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నాయకురాలిని ఇలా అవమానించడం ఏంటని మండిపడ్డారు. లోక్‌సభ సభ్యుడు మల్లురవితో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆయన వారిని సముదాయించారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా సరిత, సంపత్‌కుమార్ వర్గీయులు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినట్లు చెబుతున్న ఎమ్మెల్యే.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో సభాముఖంగా ప్రకటించాలని నినాదాలు చేయడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు సభా ప్రాంగణానికి దూరంగా తీసుకెళ్లారు. హెలిప్యాడ్‌లో మంటలు: మంత్రి పొంగులేటి పర్యటనలో చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ వద్ద ఉన్న హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండింగ్ సిగ్నల్ కోసం స్మోక్ ఫైర్ చేసిన సమయంలో కింద ఉన్న ఎండు గడ్డికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
జీవన నైపుణ్యానికి బాటలు
అచ్చంపేట: అనాథ బాలికలు, ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న బాలికలను కస్తూర్బాగాంధీ విద్యాలయాలు అక్కున చేర్చుకుంటున్నాయి. ఇంటర్మీడియట్ వరకు వసతితో కూడిన విద్యను అందిస్తూ ఉజ్వల భవితకు బాటలు వేస్తున్నారు. మెరుగైన విద్యతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పిస్తున్న కేజీబీవీలను బాలికలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ నెల 17న వార్షిక పరీక్షలు ముగియగా.. 24 నుంచి వేసవి సెలువులు ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి 23వ తేదీ వరకు ఆరురోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థినుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపునకు దోహదపడుతాయని భావిస్తున్నారు. తల్లిదండ్రుల బాధ్యతలు గుర్తించేలా.. జిల్లాలోని 20 కస్తూర్బాల్లో 5,784 మంది బాలికలు చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షలు ముగియడం, వారు వెళ్లిపోవడంతో 4 వేల మంది బాలికలు ఉన్నారు. వేసవి సెలవులకు ముందు చివరి ఆరురోజుల్లో జీవితంలో ఉన్నతంగా స్థిరపడే అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పిల్లల కలలు సాకారం చేసేందుకు తల్లిదండ్రులు వారి బాధ్యతను గుర్తిచేలా ప్రత్యేక కార్యక్రమం దోహదపడనుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందనే సందేశం ఇవ్వనున్నారు. కార్యక్రమాలు ఇలా.. ● శుక్రవారం మిగతా ఐదు రోజుల ప్రణాళికపై సమావేశం నిర్వహించారు. ● శనివారం విద్యార్థులకు నచ్చిన, ఇష్టమైన కథలు తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషాల్లో రాయించారు. ● మూడోరోజు తమకు తాము పరిచయం చేసుకోవడంతో పాటు తల్లిదండ్రులను పరిచయం చేయడం. ● నాలుగోరోజు పిల్లలు తమ ఆకాంక్షలను అమ్మానాన్నలకు చదవి వినిపించడం. ● ఐదోరోజు కస్తూర్బాలో చదివి ఉన్నతంగా ఎదిగిన వారి విజయగాథలు, ఆత్మ గౌరవ కార్యక్రమాలు వివరిస్తారు. ● ఆరోరోజు జీవిత నైపుణాల్యపై అవగాహన, బాధ్యతాయుతమైన ప్రవర్తన, బాల్యవివాహాలపై నాటికలు ప్రదర్శిస్తారు. ● చివరిరోజు తల్లిద్రండులు, ఉపాధ్యాయలతో సమావేశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. బాలికల భవితపై మార్గనిర్దేశనం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడి తమ కలలు సాకారం చేసుకునేలా అత్మ విశ్వాసం పెరగనుంది. లక్ష్యాలు సాధించుకోవాలనే పట్టుదల పెరుగుతుంది. – శోభారాణి, జీసీడీఓ, నాగర్‌కర్నూలు సద్వినియోగం చేసుకుంటా.. విద్య మాత్రమే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్న మహనీయుల స్పూర్తితో చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుతున్నా. ఆరు రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఆత్మ విశ్వాసంతో కలలు సాకారం చేసుకునేందుకు శ్రమిస్తా. – వైష్ణవి, 8వ తరగతి, కేజీబీవీ, బల్మూర్ కస్తూర్బాల్లో ప్రత్యేక కార్యక్రమాలు వేసవి సెలవుల ఆరంభం వరకు ప్రణాళిక -
భూ భారతి
పేదవాడి చుట్టంలా నాగర్‌కర్నూల్: పేదల భూ సమస్యలు తీర్చే చట్టమే భూ భారతి అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయానికి హెలికాప్టర్లో చేరుకోగా ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న ఓ ఫంక్షన్హాల్లో భూ భారతి చట్టం–2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల కన్నీరు తుడవడానికి తీసుకొచ్చిన చట్టమే భూ భారతి అని, ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి చట్టాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఒక చట్టం రూపొందిస్తే అది పేదవాడికి చుట్టంలాగా ఉండాలని.. భూ భారతి చట్టం వందేళ్లకు సరిపడే విధంగా ఉందని తెలిపారు. ఆధార్ తరహాలో భూధార్ నంబర్ త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగారని.. ఇప్పుడింకా ఆ అవసరం లేదని, అధికారులే రైతుల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. మే 1 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని వివరించారు. ● రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఏడాది పాటు ఇతర రాష్ట్రాల్లోని చట్టాల్ని అధ్యయనం చేసి భూ భారతి రూపకల్పన చేసిన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ప్రతిపక్షాలు అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని.. ప్రజలు గుర్తించి పేదల అభ్యున్నతికి పాటుపడే ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. ● ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో రూపొందించిన భూ భారతి చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని తెలిపారు. రైతు బిడ్డకు మాత్రమే అన్నదాతల కష్టాలు, భూమితో రైతుకు ఉన్న అనుబంధం తెలుస్తుందని.. భూ భారతి అమలుతో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు మేలు చేకూరుతుందని చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికి ఎవరి దగ్గరకు పైరవీలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. పోర్టల్‌లో అన్ని ఆప్షన్లు ఉన్నాయన్నారు. ● ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రైతులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. రైతులు మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు.. తహసీల్దార్ కార్యాలయంలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ● కలెక్టర్ బదావత్ సంతోష్ భూ భారతి చట్టం గురించి వివరిస్తూ కొత్త ఆర్వోఆర్ చట్టం విధి విధానాలను రైతులకు తెలియజేశారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని.. రైతులు సమగ్ర వివరాలు తెలుసుకోవాలని సూచించారు. రైతుల భూ సమస్యలను గ్రామంలోనే రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తారని తెలియజేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, భూ సమస్యలు లేని రాష్ట్రాన్ని చూడబోతున్నామని వివరించారు. సదస్సుకు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్, నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రమణారావు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆధార్‌లాగే త్వరలోనే భూధార్ నంబర్ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
నేటి నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు
కందనూలు: 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఓపెన్ (సార్వత్రిక) పది, ఇంటర్ పరీక్షలు ఆదివారం నుంచి 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఎనిమిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. జిల్లాకేంద్రంలో రెండు, కల్వకుర్తిలో రెండు, అచ్చంపేటలో రెండు, కొల్లాపూర్‌లో రెండు కేంద్రాలు ఉన్నాయి. పదోతరగతి, ఇంటర్‌కు వేర్వేరుగా కేంద్రాలు కేటాయించగా.. మొత్తం 1,503 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకుగాను జిల్లావ్యాప్తంగా 9 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 9 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ప్రతి సెంటర్‌కు ఒక సిట్టింగ్ స్క్వాడ్, 65 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ విద్యార్థులకు రాత పరీక్షల అనంతరం ఈ నెల 26 నుంచి మే 3 వరకు ప్రయోగ పరీక్షలు (ప్రాక్టికల్స్) నిర్వహించనున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు.. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్, జిల్లా ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ శివప్రసాద్ శనివారం తెలిపారు. ఇప్పటికే విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు జారీ చేశామని.. కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. హాల్‌టికెట్లు పొందని వారు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కేంద్రాల్లోకి విద్యార్థులు, సిబ్బందికి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని.. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, కనీస సౌకర్యాలు కల్పించామన్నారు. హాజరుకానున్న 1,503 మంది విద్యార్థులు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు -
ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు : ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
కల్వకుర్తి రూరల్: ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని తోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు తమ మేధస్సుతో ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని.. తాము పనిచేసినన్ని రోజులు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు విజయభాస్కర్‌రెడ్డిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో విష్ణుమూర్తి, శంకర్‌నాయక్, నరేష్‌గౌడ్, రాజేందర్, సింగయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సాధారణ ప్రసవాలు చేయాలి బిజినేపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు చేయాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డా. ఎం.లక్ష్మణ్‌నాయక్ అన్నారు. శనివారం మండలంలోని పాలెం పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి గర్భిణికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పు జరిగేలా చూడాలని, అందుతున్న వైద్యసేవలపై అవగాహన కల్పించి మూత్ర, రక్త పరీక్షలు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉచితంగా నిర్వహించి రిపోర్టులు అందజేయాలని సూచించారు. జిల్లా ఆస్పత్రిలో చిన్న పిల్లల వైద్య నిపుణులు నిరంతరం అందుబాటులో ఉంటారని, 102 అంబులెన్స్ సదుపాయం ఉందన్నారు. ఆయన వెంట పీహెచ్సీ వైద్యాధికారి డా. ప్రియాంక, విస్తరణ అధికారి బాదం రాజేష్, కుమార్ తదితరులు ఉన్నారు. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత కందనూలు: జిల్లాకేంద్రంలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్‌శాఖ ఏఈ మాన్యానాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఉయ్యాలవాడ నుంచి కూరగాయల మార్కెట్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా తీగల మరమ్మతులు, అదేవిధంగా కలెక్టరేట్ సమీపంలోని సబ్‌స్టేషన్‌లో మరమ్మతులతో కలెక్టరేట్, దేశిటిక్యాల, మంతటి చౌరస్తా, నల్లవెల్లి తదితర ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడుతుందని.. విద్యుత్ వినియోగదారులు గుర్తించి సహకరించాలని పేర్కొన్నారు. -
అమిత్‌షా వ్యాఖ్యలు సరికాదు : మంత్రి
నాగర్‌కర్నూల్ రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీం, జై అచ్చితసంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గగ్గలపల్లి శివారులోని ఓ కన్వెన్షన్‌లో జరిగిన సమావేశంలో ఆయనతో పాటు ఎంపీ డా. మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని రాజ్యాంగ ప్రతిజ్ఞ చేసి అక్కడి నుంచి గగ్గలపల్లికి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి ఆయనతో పాటు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కించపర్చే విధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. -
మంత్రులు పొంగులేటి, జూపల్లి పర్యటనలో అపశృతి
సాక్షి, నాగర్ కర్నూల్: తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. వారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది.వివరాల ప్రకారం.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి శనివారం నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. భూ భారతిపై రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులు వచ్చారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో ల్యాండ్ అవుతున్న సమయంలో హెలిపాడ్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. మంటలను ఆర్పి వేశారు. అయితే, హెలికాప్టర్ ల్యాండ్ కోసం ఇచ్చిన సిగ్నల్ బుల్లెట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. -
‘నల్లమల’కు తరలిస్తున్నాం..
నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిన మాట వాస్తవమే. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. చిరుత సంచారాన్ని తెలుసుకునేలా మోమినాపూర్, నందిగామ, నందిపాడ్ వంటి ప్రధాన చోట్ల ట్రాక్ కెమెరాలు అమర్చాం. ఈ ప్రాంతాలతోపాటు దేవరకద్ర, ధన్వాడ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశాం. కొత్తపల్లి మండలం నందిగామ, ధన్వాడలో ఇప్పటివరకు రెండింటిని బంధించి నల్లమల పరిధిలోని లింగాల, అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాం. మిగతా వాటిని తరలిస్తాం. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటాం.. – కమాలొద్దీన్, జోగుళాంబ సర్కిల్ అటవీ రేంజ్ ఆఫీసర్ ● -
సుమారు 25 కి.మీ.,లు పయనించి..
కర్ణాటక రాష్ట్రంలో యాద్గిర్ ఫారెస్ట్ డివిజన్లో హోరంచ, అష్‌నాల్, ఎర్గోల, మినాస్‌పూర్ బ్లాక్‌లు ఉన్నాయి. మొత్తం 28,868.55 హెక్టార్ల పరిధిలో అడవులు విస్తరించినట్లు అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, పెద్దపులులకు ఆవాసంగా ఉన్న ఈ అడవిలో కొన్నేళ్లుగా చిరుతల సంతతి గణనీయంగా పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో నీరు, ఆహారం కోసం చిరుతలు ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మినాస్‌పూర్ బ్లాక్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నారాయణపేట జిల్లాలోకి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. -
ఎవరూ చెప్పలేదు..
రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి. అన్ని అర్హతలు ఉన్నా సంక్షేమ ఫలాలు అందడం లేదు. ఉపాధి హామీ పథకంలో ఉన్న అనేక పథకాల గురించి ఎవరూ చెప్పడం లేదు. అర్హులైన రైతులందరికీ జీవాల షెడ్లను మంజూరు చేయాలి. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. – శ్రీనివాసులు, రైతు, గోదల్, బల్మూర్ మండలం సద్వినియోగం చేసుకోవాలి.. ఉపాధి హామీ పథకంలో సన్న, చిన్నకారు రైతులకు షెడ్లు, ఫాంఫాండ్ వంటి వాటిని మంజూరు చేస్తున్నాం. ఇప్పటికే చాలా చోట్ల రైతులకు అవగాహన కల్పించాం. అర్హులైన సన్న, చిన్నకారు రైతులు జాబ్‌కార్డు కలిగి ఉండి గ్రామ పంచాయతీ కార్యదర్శుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో షెడ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తాం. – చిన్న ఓబులేషు, డీఆర్డీఓ ● -
నెరవేరని ‘ఉపాధి’ లక్ష్యం
అచ్చంపేట రూరల్: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పశువుల షెడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో గ్రామీణాభివృద్ధి పనులకు ప్రాధాన్యమివ్వగా.. ఈసారి వాటికి భిన్నంగా వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషిచేయాలని భావించింది. వేసవిలో జల సంరక్షణకు ఇంకుడు గుంతలు, చేపల కొలనులతోపాటు పాడి రైతుల కోసం ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు పశువులు ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఉపాధి హామీ జాబ్‌కార్డు కలిగి ఉండి కనీసం నాలుగు పశువులు ఉన్నవారు షెడ్ల నిర్మాణానికి అనుమతిస్తారు. పశువుల షెడ్డుతోపాటు దాని పక్కనే తాగునీటి ట్యాంకు, పశుగ్రాసం నిల్వ చేసుకునేందుకు ప్రత్యేక గదిని సైతం నిర్మించుకోవచ్చు. ఇప్పటి వరకు చిన్న, సన్నకారు రైతులు తమ పశువులను పొలాల వద్ద చెట్ల కింద కట్టేసేవారు. దీంతో వాటి ఆరోగ్యంపై వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపడంతో వ్యాధుల బారినపడేవి. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పశువుల షెడ్ల నిర్మాణానికి అనుమతివ్వడంతో వారి కష్టాలు తీరనున్నాయి. 195 షెడ్ల నిర్మాణానికి.. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 195 షెడ్ల నిర్మాణానికి అనుమతి రాగా.. ఇప్పటి వరకు 145 ప్రారంభించారు. అందులో కేవలం 48 మాత్రమే పూర్తిచేయగా.. మిగతా 97 ప్రగతిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించకపోవడంతో షెడ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.84 వేల వరకు కేటాయిస్తున్నారు. నిధులు కేటాయిస్తున్నా.. రైతులకు అవగాహన లేక సద్వినియోగం చేసుకోవడం లేదు. ఫలితంగా జిల్లాలో అనుకున్న స్థాయిలో షెడ్ల నిర్మాణం జరగడం లేదు. జిల్లాలో నత్తనడకన జీవాల షెడ్ల నిర్మాణం పనులు ప్రారంభించినా ముందుకు సాగని వైనం అవకాశాలున్నా.. అవగాహన కల్పించని అధికారులు పథకాలకు నోచుకోలేకపోతున్న రైతులు -
నాగర్‌కర్నూల్
సమస్యల పరిష్కారానికి డెడ్లైన్శనివారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వివరాలు 10లో uసాక్షి, నాగర్‌కర్నూల్: భూ సమస్యలపై తీసుకువచ్చిన భూభారతి చట్టం–2025పై ప్రజలకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ధరణికి బదులుగా తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. గత రెవెన్యూ చట్టాలకు భిన్నంగా ఈసారి కొత్త చట్టంలో భూసమస్యల పరిష్కారానికి నిర్దేశిత గడువును విధించింది. భూరికార్డుల్లో తప్పుల సవరణ పరిష్కారం 60 రోజుల్లో పూర్తి కావాలని నిర్దేశించింది. వారసత్వ భూముల్లో హక్కుదారులను 30 రోజుల్లోగా నిర్ణయించాలని, లేకపోతే దరఖాస్తు ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు సైతం చర్యలు తీసుకోగా, ఇందుకోసం గరిష్టంగా 90 రోజుల గడువు విధించింది. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు.. పూర్వంలో గ్రామాల్లో రికార్డుల నిర్వహణ పక్కాగా నిర్వహించినట్టుగా ఇకనుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులను నిర్వహించనున్నారు. మ్యుటేషన్, రికార్డుల మార్పులు జరిగినప్పుడు వాటిని గ్రామ పహాణి, ప్రభుత్వ భూముల రిజిస్టర్లను మారుస్తారు. భూభారతి పోర్టల్‌లో దరఖాస్తుల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. తహసీల్దార్ నిర్ణయంపై ఆర్డీఓకు, ఆర్డీఓ నిర్ణయంపై కలెక్టర్‌కు, కలెక్టర్ నిర్ణయంపై ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీళ్లను 60 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ రైతులకు ఉచిత న్యాయసాయాన్ని అందించనున్నారు. మండలస్థాయి, జిల్లా లీగల్ అథారిటీల ఆధ్వర్యంలో పేద రైతులకు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించనున్నారు. న్యూస్రీల్మోసపూరితంగా పట్టాలు పొందితే చర్యలు.. ఇష్టారీతిగా భూ రికార్డుల్లో మార్పులు చేయడం, మోసపూరితంగా భూమి హక్కులు, పట్టాలను పొందితే వాటిని వెంటనే రద్దు చేయనున్నారు. ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టాలుగా పొందితే ఆ భూములన్నీ రద్దు కానున్నాయి. ఈ భూములు అన్యాక్రాంతం అయినట్టుగా అనుమానాలున్నా ప్రజలు నేరుగా సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయవచ్చని భూభారతి చట్టం పేర్కొంది. గ్రామాల్లో ఎక్కువగా ఆబాదీ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. గ్రామకంఠం, ఆబాదీ భూముల్లో ఇళ్లు ఉన్నవారికి సరైన చట్టబద్ధమైన భూ హక్కులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లస్థలాలు, ఆబాదీ, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులను పక్కాగా నిర్వహిస్తారు. ప్రతి భూ యజమానికి ఆధార్ తరహాలో భూధార్ కార్డులను జారీ చేస్తారు. భూభారతి పోర్టల్‌లో ఉన్న హక్కుల రికార్డు ఆధారంగా తహసీల్దార్లు భూధార్ కార్డులను జారీ చేయనున్నారు. కొత్త రెవెన్యూచట్టంలో సాదా బైనామా దరఖాస్తులను సైతం పరిష్కరించాలని నిర్ణయించడంతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో కదలిక రానుంది. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం విచారణకు రావాలని సంబంధిత ఆర్డీఓ నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత దరఖాస్తుదారుడు అఫిడవిట్ సమర్పించాలి. ఆర్డీఓ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సాదాబైనామా దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారు. వీటిలో అసైన్డ్, సీలింగ్, షెడ్యూల్ ఏరియా భూములు ఉంటే వాటిపై భూ హక్కులు ఉండవు. దరఖాస్తు సక్రమంగా తేలితే ఆర్డీఓ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 90 రోజుల్లోగా పూర్తికావాలని చట్టంలో నిర్దేశించారు. ఉమ్మడి జిల్లాలో నేడుమంత్రి పొంగులేటి పర్యటన.. భూభారతి చట్టంపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు నిర్వహించే అవగాహన సదస్సునకు హాజరయ్యేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. జోగుళాంబ గద్వాలతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని సదస్సుల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం 8.50 గంటలకు జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌కు హెలీకాప్టర్ ద్వారా చేరుకుంటారు. ధరూర్ మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే భూ భారతి చట్టం –2025 అవగాహన సదస్సుల్లో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న తేజ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే అవగాహన సదస్సుకు హాజరవుతారు. అనంతరం 2 గంటలకు హెలీకాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. భూభారతిపై అవగాహనకల్పించేందుకు సిద్ధమైన ప్రభుత్వం 60 రోజుల్లో సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త రెవెన్యూ చట్టం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు నేడు గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి పొంగులేటి -
11 నెలల్లో 4 మృత్యువాత..
చిరుత వలసలు పెరిగిన క్రమంలో నారాయణపేట జిల్లాలో 11 నెలల కాలంలో నాలుగు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. గత ఏడాది మే నాలుగో తేదీన మద్దూరు మండలం నందిగామ గ్రామ పంచాయతీ పరిధి మల్కిజాదరావుపల్లి శివారులోని పొలంలో ఓ చిరుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అదే ఏడాది ఆగస్ట్ 17న అదే మండలం జాదరావుపల్లి శివారు తాటిగట్టు సమీపంలోని రాయం చెరువు వద్ద మరో చిరుత చనిపోయింది. ఈ ఏడాది జనవరి 28న దామరగిద్ద మండలం ఉడుమల్గిద్ద శివారులో ఉన్న గుట్టలో ఇంకొకటి, ఫిబ్రవరి 16న మద్దూరు మండలంల మోమినాపూర్ శివారులో మరొకటి మృత్యువాత పడింది. పోస్టుమార్టంలో ఇవి సహజ మరణాలేనని తేలినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సంరక్షణకు చర్యలు చేపట్టారు. మోమిన్‌పూర్‌లో చనిపోయిన చిరుతను పరిశీలిస్తున్న అటవీ సిబ్బంది -
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయూష్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని, దీర్ఘకాలిక రోగాలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం చేసేందుకు ఆయూష్ మందులు పనిచేస్తాయని యునాని వైద్యాధికారి శభాజ్ మాలిక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయూష్ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి మంగళవారం వరకు రక్త హీనత, పౌష్టికాహారంపై చిన్నపిల్లలు, గర్భిణులకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా జనరల్ ఆస్పత్రిలో గర్భిణులకు వైద్య చికిత్స నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సైతం పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫార్మసిస్ట్ మురళీకృష్ణగౌడ్, యోగా మహిళా కార్యకర్త అంజలి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
నాగర్‌కర్నూల్ క్రైం: అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని ఫైర్ ఆఫీసర్ కృష్ణమూర్తి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది, రోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు నిర్లక్ష్యం వహించకూడదని, వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో లీడ్ ఫైర్మెన్లు వహీదుద్దీన్, రంగస్వామి, ఫైర్మెన్లు మల్లేష్, శంకర్, వెంకటేశ్వరరావు, సిబ్బంది సైఫ్, శ్రీనివాసులు, సాయిబాబ తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీ టీచర్ సస్పెన్షన్
కందనూలు: జిల్లాలోని నాగనూల్ కేజీబీవీలో పనిచేసే ఇంగ్లిష్ టీచర్‌ను విధుల నుంచి తొలగిస్తూ గురువారం సాయంత్రం డీఈఓ రమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంగ్లిష్ టీచర్ వేధింపులు భరించలేక కేజీబీవీలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిపై విద్యార్థినులు ఆందోళనలు చేపట్టి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశాల మేరకు ఇంగ్లిష్ టీచర్‌ను విధుల నుంచి తొలగిస్తూ.. సదరు ఉపాధ్యాయురాలిపై జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర వి చారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారన్నారు. 27న ప్రవేశ పరీక్ష కోడేరు: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ (ఆదర్శ పాఠశాల)లో ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాఘవేంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తెలంగాణ మోడల్ స్కూల్ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. 6వ తరగతి విద్యార్థులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షకు హాజరుకావాలని సూచించారు. అడవి జంతువులకు హాని కలిగించొద్దు నాగర్‌కర్నూల్ క్రైం: అడవి జంతువులు గ్రామాలు, పొలాల్లోకి వస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని, జంతువులకు ఎలాంటి హాని తలపెట్టకూడదని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దేవరాజ్ అన్నారు. నాగర్‌కర్నూల్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అటవీ జంతువుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారాన్ని గురువారం ఆయన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దేవరాజ్ మాట్లాడుతూ అటవీ జంతువుల వల్ల నష్టం జరిగితే సంబంధిత అటవీ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి పరిహారం పొందవచ్చన్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో సమీప అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లోకి జంతువులు వస్తుంటాయని, వాటికి హాని కలిగించవద్దన్నారు. అనంతరం వెల్దండ మండలంలోని రవీందర్‌రెడ్డి, గంటల లక్ష్మయ్య, నర్సమ్మ, సైదమ్మ, ఊర్కొండ మండలానికి చెందిన ఆంజనేయులు, లక్ష్మయ్య, శ్రీనివాస్‌గౌడ్, పద్మ, వంగూరు మండలానికి చెందిన శ్రీనివాసులు, బిజినేపల్లి మండలానికి చెందిన ఉపేందర్‌రెడ్డి సహా మొత్తం పది మంది రైతులకు అటవీ జంతువుల కారణంగా పంటలు, పెంపుడు జంతువుల వల్ల కలిగిన నష్టానికి గాను రూ.3,12,000 పరిహారం అందజేసినట్లు వివరించారు. ఫారెస్ట్ సెక్షన్ అధికారి చంటి, సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు ఉన్నారు. వీరిలో నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న జి.సబిత యాదాద్రి–భువనగిరి జిల్లాలోని రామన్నపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఆ బాధ్యతలను కల్వకుర్తి జడ్జికి అప్పగించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కోర్టులో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న నసీం సుల్తానాను నాగర్‌కర్నూల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పంపిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో అడిషనల్ జడ్జిగా పని చేస్తున్న వి.ఈశ్వరయ్యను మహబూబ్‌నగర్ జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్ర జుడీషియల్ అకాడమిలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్.వెంకట్రాంను నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టుకు సీనియర్ సివిల్ జడ్జిగా రానున్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న జి.కళార్చన వనపర్తి జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. ఇదే హోదాలో ఇక్కడ పనిచేస్తున్న కమలాపురం కవితను వనపర్తిలోని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న టి.లక్ష్మిని అక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. అలాగే ఇదే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న గంటా కవితాదేవిని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న గుండ్ల రాధికను ఇక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. -
అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: షాపింగ్‌మాల్స్, ఆస్పత్రులు, సినిమా థియేటర్లతోపాటు పెద్ద భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలోని ఓ షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అదుపు చేసేందుకు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో లీడ్ ఫైర్మెన్లు రంగస్వామి, వహీద్ పాల్గొన్నారు. -
దేశంలోనే రోల్ మోడల్‌గా భూభారతి
నారాయణపేట/మద్దూర్/కొత్తపల్లి: పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని.. ఒక్క రూపాయి తీసుకోకుండానే భూ సమస్యలను పరిష్కరించనున్నామని.. దేశంలోనే భూ భారతి చట్టం రోల్‌మోడల్‌గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోర్టల్‌ను ప్రారంభించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున మంత్రికి స్వాగతం పలకగా.. కాలినడకన రెవెన్యూ సదస్సు సభా స్థలికి చేరుకుని మాట్లాడారు. ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ఉద్దేశంతో మేధావులతో కలిసి ఈ చట్టాన్ని రూపొందించామని, గత ప్రభుత్వ ధరణి చట్టానికి దీనికి ఎంతో తేడా ఉందన్నారు. ప్రజల వద్దకే అధికారులు.. ధరణి చట్టంతో ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, భూభారతితో ప్రజల వద్దకే అధికారులు వచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, వీఆర్ఏ వీఆర్వో వ్యవస్థను కుప్ప కూల్చిందని, ఈ ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి, అర్హులైన వారిని మళ్లీ తీసుకువచ్చి గ్రామాల్లో ఇలాంటి భూ సమస్య ఎక్కడ ఉన్నా అక్కడే పరిష్కారం చూపిస్తామన్నారు. ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు. మొదటి విడత 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి మ్యాప్‌పై సర్వేయర్ సంతకంతో కంప్యూటర్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. సీఎం ఇటీవల కలెక్టర్లను పిలిచి భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారన్నారు. అన్ని మండలాలకు కలెక్టర్లు వెళ్లి ఈ చట్టంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. అయితే జూన్ 2 లోగా ఎంపిక చేసిన మొదటి నాలుగు పైలెట్ గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఆ తర్వాత ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇదే పద్ధతిలో అధికారులే రైతుల వద్దకు వస్తారన్నారు. సీఎం నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. తాము అమలు చేస్తున్న కొత్త భూభారతి చట్టాన్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు వినియోగించుకోవచ్చని మంత్రి సూచించారు. ధరణితో ప్రజలను ఎంత గోస పెట్టారో భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే మంచి చేసిందని చెప్పకపోయినా పర్వాలేదు కానీ.. మంచిని చెడుగా చెప్పి ప్రచారం చేస్తే మాత్రం ప్రతిపక్షానికి వచ్చే ఎన్నికలలో రెండు అంకెల సీట్లు కూడా రావని, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరిగా శాసనసభ ఎన్నికలలో రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. ఒక్క రూపాయి తీసుకోకుండానే భూ సమస్యలు పరిష్కరిస్తాం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మద్దూరు మండలం ఖాజీపూర్‌లో రెవెన్యూ సదస్సు ప్రారంభం -
ముగిసిన ఎస్ఏ–2 పరీక్షలు
కందనూలు: జిల్లాలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ–2) పరీక్షలు గురువారం ముగిశాయి. వీరి ప్రతిభను తెలిపే ప్రోగ్రెస్ కార్డుల విధానానికి స్వస్తి పలికి రెండేళ్లుగా విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలను అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ వద్ద ఇప్పటికే నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక (ఎస్ఏ–1) పరీక్ష ఫలితాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 20లోగా ఎస్ఏ–2 పరీక్షల ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలో ఇది వరకు విద్యార్థులకు నిర్వహించిన నిర్మాణాత్మక (ఎఫ్ఏ–1, 2, 3, 4), సంగ్రహణాత్మక (ఎస్ఏ–1) మూల్యాంకనానికి సంబంధించిన ఫలితాల అప్లోడ్ ప్రక్రియ పూర్తయింది. సమ్మేటివ్–2 పరీక్షలు గురువారంతో పూర్తి కావడంతో ఉపాధ్యాయులు జవాబు పత్రాలు మూల్యాంకనం చేస్తున్నారు. ఫలితాలను ఆదివారంలోగా ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఆన్లైన్లో కార్డులు డౌన్లోడ్ చేసుకుని, బుధవారం తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి వారి సమక్షంలో ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులు విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తారు. 23న ముగియనున్న 2023– 24 విద్యా సంవత్సరం ప్రతి విద్యార్థికి అందించాలి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక పరీక్షలకు సంబంధించిన ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని హెచ్ఎంలకు సూచించాం. ఈ నెల 23న తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రతి విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డులు అందించాలి. – రాజశేఖర్‌రావు, జిల్లా పరీక్షల నిర్వహణాధికారి -
ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు..
ప్రస్తుతం జూరాలలో ఉన్ననీటి నిల్వలను పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తాం. ఇప్పుడు జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు మే నెలాఖరు వరకు సరిపోతాయి. అయితే ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు రావొచ్చు. అప్పుడు పరిస్థితులను బట్టి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. – రహీముద్దీన్ ఎస్ఈ జూరాల మరో తడి ఇవ్వండి.. అమరచింత ఎత్తిపోతల ద్వారా రబీలో 6 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. ప్రస్తుతం జూరాల ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని నిలిపేస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ కాల్వకు అనుసంధానంగానే అమరచింత లిఫ్ట్‌కు సాగునీరు అందుతుంది. మరో తడి సాగు నీరు ఇస్తేనే మా పంటలు చేతికి వస్తాయి. – వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు, అమరచింత రైతులను ఆదుకోవాలి.. జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని డీ–6లో పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇంకా పక్షం రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంట చేతికి వస్తుంది. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా పంటలు చేతికి వచ్చే విధంగా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి. – లక్ష్మణ్, రైతు, ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం ● -
‘భూ భారతి’తో భూ సమస్యల పరిష్కారం
తాగునీటి సరఫరాకు ముందస్తు చర్యలు నాగర్‌కర్నూల్: వేసవి నేపథ్యంలో జిల్లాలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వేసవిలో తాగునీటి సరఫరా తదితర అంశాలపై అదనపు కలెక్టర్ దేవసహాయం, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సరఫరాపై మున్సిపల్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులతో కలిసి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని, నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చూడాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ చిన్న ఓబులేషు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్ పాల్గొన్నారు. వంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టంతో భూ సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం వంగూరు రైతువేదికలో నిర్వహించిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘భూ భారతి’ నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. భూ భారతి చట్టం ద్వారా రికార్డులలోని తప్పొప్పులను క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ద్వారా సవరించుకునే అవకాశం ఉందన్నారు. ఈ చట్టంపై నిర్వహించే అవగాహన సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జూన్ 2 నుంచి ఆన్లైన్లో భూభారతి చట్టం పోర్టల్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు మీసేవలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే చలాన్ ద్వారా చెల్లించిన మొత్తాన్ని తిరిగి బాధితులకు ఇస్తారన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూ భారతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్ చేస్తారన్నారు. ‘భూ భారతి’ నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరిచి నూతన చట్టాన్ని తెచ్చిందన్నారు. రైతు కమిషన్ సభ్యుడు కేవీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగం ధరణి ద్వారా తమ భూ రికార్డులలో ఎదుర్కొన్న అనేక సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక భూ రికార్డుల చట్టం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ మురళీమోహన్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
వెల్దండ: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. వాటిలోనే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మండలానికి రూ.5 కోట్లు మంజూరు చేశారని, వాటితో కస్తూర్బాగాంధీ విద్యాలయ, జెడ్పీ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో వివిధ పనులు చేపడుతున్నట్లు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రమేష్‌కుమార్, తహసీల్దార్ కార్తీక్‌కుమార్, ఎంపీడీఓ సత్యపాల్‌రెడ్డి, డీఈఈ రామచందర్, నాయకులు బాలాజీసింగ్, భూపతిరెడ్డి, సంజీవ్‌కుమార్, మోతీలాల్‌నాయక్, మట్ట వెంకటయ్యగౌడ్, పర్వత్‌రెడ్డి, బచ్చు రామకృష్ణ, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సైన్స్ ల్యాబ్ ప్రారంభం.. కల్వకుర్తి రూరల్: మండలంలోని తాండ్ర ఉన్నత పాఠశాలలో బుధవారం సైన్స్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కాయతి ఆశాదీప్‌రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం ల్యాబ్ ఏర్పాటుకు రూ.లక్ష విరాళం అందించగా.. ఉపాధ్యాయులు మరో రూ.80 వేలు జమచేసి ల్యాబ్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరిని అభినందించారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు సభ్యుడు బాలాజీసింగ్, కాయతి విజయకుమార్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, కాయతి ఆశాదీప్‌రెడ్డి, సాయిరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు జహంగీర్, ఉపాధ్యాయుడు జంగయ్య, నాయకులు పాల్గొన్నారు. -
పక్కాగా ‘భూ భారతి’ నిర్వహణ
నాగర్‌కర్నూల్: భూ భారతి చట్టంపై రెవెన్యూ అధికారులందరూ అవగాహన కలిగి ఉండాలని, అవగాహన సదస్సులు పక్కాగా నిర్వహించాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూ భారతి చట్టంపై రెవెన్యూ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. 13 నెలల పాటు 18 రాష్ట్రాల చట్టాలను పరిశీలించి రూపొందించిన చట్టం భూ భారతి అన్నారు. రెవెన్యూ ఉద్యోగులు చట్టం గురించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, ధరణిలోని లోపాలను భూ భారతి పరిష్కరిస్తుందని చెప్పారు. క్షేత్రస్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారం అయ్యేలా చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. రికార్డులలో తప్పుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేందుకుగాను ముందుగా భూముల సర్వే, మ్యాప్ తయారీ, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ భూ భారతిలో కీలక అంశాలని వెల్లడించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన భూ భారతిని ప్రజల్లోకి విస్లృతంగా తీసుకెళ్లాలని, రైతుసంఘాల నాయకులు, సభ్యులను కూడా సదస్సులో భాగస్వామ్యం చేయాలని, చట్టంలోని ప్రాధాన్యత అంశాలు ప్రజలకు అర్థమయ్యేలా కరపత్రంపై ముద్రించాలన్నారు. నకిలీ విత్తనాల తయారీ వ్యవస్థను రూపుమాపేందుకు కలెక్టర్ కృషి చేయాలని, నకిలీ బీటీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులను వారి బారి నుంచి కాపాడాలని కోరారు. న్యాయవాది, రైతు కమిషన్ సభ్యుడు సునీల్ భూ భారతిలోని సెక్షన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ వివరించారు. కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. ప్రజాపాలనలో చారిత్రక మార్పు తేవడానికే ప్రభుత్వం కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకొచ్చిందన్నారు. ఏప్రిల్ 17 నుంచి 30 వరకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది, అధికారులు కార్యక్రమంలో నిమగ్నమై భూ సమస్యలు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు కేవీ నరసింహారెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, రాములునాయక్, మరికంటి భవాని, అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రశేఖర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతుల సలహాలు, సూచనలు స్వీకరిస్తాం తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
ఉద్యోగ ఆధారిత కోర్సులు ప్రవేశ పెడతాం..
డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆ వెంటనే ఉద్యోగాలు సాధించే దిశగా వివిధ కోర్సుల్లో అన్ని స్థాయిల్లో సిలబస్‌లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. కొత్త కోర్సుల వల్ల సులువుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, రీసెర్చి ఆప్టిట్యూట్, మెషిన్ టూల్స్, వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ తరగతులతో పాటు వీటిని బోధిస్తారు. అవకాశం ఉన్న కోర్సుల్లో మార్కులు నేరుగా విద్యార్థి మెమోలో ముద్రిస్తాం. అవకాశం లేని వాటికి నేరుగా సర్టిఫికెట్లు అందజేస్తాం. – జీఎన్.శ్రీనివాస్, వైస్ చాన్స్‌లర్, పీయూ ఉన్నత విద్యా మండలి సూచనలతో.. ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. చదువులు పూర్తయిన వెంటనే సాంకేతిక విద్యనభ్యసించిన వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి సూచనలతో సిలబస్‌లో 25 శాతం మార్పులకు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తాం. – రమేష్ బాబు, రిజిస్ట్రార్, పీయూ ● -
నీటి సరఫరాలో ఇబ్బందులు కలగొద్దు
నాగర్‌కర్నూల్: తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని మిషన్ కాంపౌండ్, బీసీకాలనీలో తాగునీటి సరఫరాను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవసహాయం, కాలనీవాసులతో కలిసి అందుబాటులో ఉన్న నీటి సరఫరా వ్యవస్థను పరిశీలించారు. నీటి ట్యాంకులు, పైపులైన్లు, నీటి సరఫరా సంబంధిత మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నీటి సరఫరాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా మెరుగు, నిరంతరాయంగా నీటి సరఫరాకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు సూచనలు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పైప్‌లైన్ లీకేజీలు లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నాగర్‌కర్నూల్ పుర కమిషనర్ నరేష్‌బాబు, మిషన్ భగీరథ అధికారులు, పుర సిబ్బంది తదితరులు ఉన్నారు. రేషన్ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి పేదలకు సన్న బియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం పుర పరిధిలోని ఎండబెట్ల రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం, తహసీల్దార్ తబితారాణితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 558 రేషన్ దుకాణాల ద్వారా 2,43,107 రేషన్ కార్డుదారులకు 4,946.455 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్నామని వివరించారు. ఈ పథకంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని.. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని వివరించారు. -
ఫలించిన రైతుల ఆందోళన
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ ఆయకట్టులో వరి సాగు చేసిన రైతులు తమకు నీరు అందడం లేదని, పంటలు వాడుముఖం పడుతున్నాయంటూ ప్రాజెక్టు రహదారిపై రెండు పర్యాయాలు చేసిన ఆందోళనకు ఫలితం దక్కింది. రైతుల ఆవేదనను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రాజెక్టు ఉన్నతాధికారులకు విన్నవించడంతో ఎట్టకేలకు చివరి తడిగా రెండురోజుల పాటు నీటిని అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం జూరాల ఎడమ కాల్వకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే నీటిని విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎడమ కాల్వ పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో అత్యధికంగా వరి సాగు చేయడంతో ఇరు మండలాల ప్రజలు సాగునీరు కావాలంటూ వారం రోజుల్లో రెండు పర్యాయాలు ఆందోళన చేపట్టారు. మరోతడి అవసరమే.. ఆత్మకూర్ మండలంలోని తూంపల్లి, కత్తేపల్లి, ఆరేపల్లి, మెట్లంపల్లి, జూరాల గ్రామాలతో పాటు ఇతర గ్రామాల ఆయకట్టు రైతులు ఆలస్యంగా వరి సాగుచేయడంతో సమస్య జఠిలంగా మారింది. అధికారుల అంచనా ప్రకారం మార్చి చివరి వారంలోనే పంట చేతికందాల్సి ఉంది. ఆలస్యంగా సాగు చేయడంతో 15 రోజుల తర్వాతే పూర్తిస్థాయిలో వరిపంట చేతికందే పరిస్థితి ఉంది. చివరి తడిగా బుధవారం నుంచి రెండురోజుల పాటు నీటిని వదులుతుండగా.. వచ్చేవారం రెండ్రోజుల పాటు నీటిని అందిస్తే పంటలు చేతికందుతాయంటున్నారు. జలాశయంలో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుండటంతో ఇదే చివరితడిగా వదులుతున్నామని, పొదుపుగా వాడుకోవాలని సూచిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎత్తిపోతల రైతులు గట్టెక్కినట్లే.. జూరాల ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు చివరిసారిగా అందిస్తున్న నీటితో తమ పంటలు చేతికందే అవకాశం ఉందని రైతులు తెలిపారు. సాగునీరు వదిలిన వెంటనే ఆయకట్టు పరిధిలోని మూలమళ్ల, మస్తీపురం, సింగంపేట, ఖానాపురం, అమరచింత, పాంరెడ్డిపల్లిలో రైతులు వెయ్యి ఎకరాల వరి సా గుచేశారు. పొట్టదశలో ఉన్న వరి పైరుకు ప్రస్తుతం అందిస్తున్న సాగునీరు ఊపిరి పోసేలా ఉందని, పంట చేతికందుతుందనే ఆశలో ఉన్నారు. రెండ్రోజుల పాటు సరఫరా.. ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు జూరాల ఎడమ కాల్వ పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల రైతులకు సాగునీరు రెండురోజుల పాటు వదులుతున్నాం. రోజువారీగా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించాం. – శ్రీనివాస్‌రెడ్డి ఎస్ఈ, జూరాల జలాశయం జూరాల ఎడమ కాల్వకునీటి విడుదల చివరి తడిగా ప్రకటించిన అధికారులు మరో తడి ఇవ్వాలంటున్న రైతన్నలు -
సిర్సనగండ్ల ఆదాయం రూ.12.67 లక్షలు
చారకొండ: అపర భద్రాదిగా పేరుగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 5 నుంచి 11 వరకు వైభవంగా కొనసాగాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలను బుధవారం ఆలయ చైర్మన్ రామశర్మ, ఎండోమెంట్ అధికారి వీణాధరి, తహసీల్దార్ సునీత, ఎస్ఐ శంషోద్దీన్, ఈఓ ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, యూనియన్ బ్యాంకు మేనేజర్ నర్సింహ, అధికారుల సమక్షంలో లెక్కించారు. మొత్తం రూ.12,67,915 నగదు, వెండి 400 గ్రాములు సమకూరినట్లు ఆలయ చైర్మన్, ఈఓ ప్రకటించారు. అదేవిధంగా ఇండోనేషియాకు చెందిన 2 వేల కరెన్సీని భక్తులు హుండీలో వేసినట్లు గుర్తించారు. గతేడాది కంటే రూ.4,40,937 ఎక్కువగా వచ్చిందని వివరించారు. కార్యక్రమంలో అధికారులు, ఆలయ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే తెలకపల్లి: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గౌతంపల్లిలో సీసీ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేసి మాట్లాడారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ. 10 లక్షలతో రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. మాజీ సర్పంచ్ యాదిరెడ్డి, నాగరాజు, నారాయణగౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలుసద్వినియోగం చేసుకోవాలి అచ్చంపేట రూరల్: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ మాధవి కోరారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సతీమణి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు డా. అనురాధతో కలిసి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంలాంటివన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ హైదరాబాద్ నుంచి లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ‘గాలికుంటు’ నివారణ టీకాలు వేయించాలి బల్మూర్: సీజనల్ వ్యాధులు సోకకుండా రైతులు తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డా. జ్ఞానశేఖర్ సూచించారు. బుధవారం మండలంలోని జిన్‌కుంటలో నిర్వహించిన ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరంలో ఆయన పాల్గొన్నారు. పశుసంపద పెంపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం పశు పోషణకు అందిస్తున్న పథకాల గురించి రైతులకు వివరించారు. శిబిరంలో మొత్తం 310 పశువులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారులు డా. అనిల్, డా. మహేశ్వరి, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఆ టీచర్’ మాకొద్దు..
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో మంగళవారం విద్యార్ధులు దాదాపు నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. వారం రోజుల క్రితం నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఓ విద్యార్థి స్టడీ అవర్స్‌కు ఆలస్యంగా వచ్చిందని ఇంగ్లిష్ టీచర్ మూడు గంటల పాటు నిలబెట్టిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించి విచారణ చేపట్టి టీచర్‌పై చర్యలు తీసుకుంటామని డీఈఓ రమేష్‌కుమార్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. అయి తే వారం రోజులు గడుస్తున్నా ఆ ఉపాధ్యాయురాలిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంగళవారం విద్యార్థులు పాఠశాల ప్రధాన గేటు వద్ద ఎండలో దాదాపు నాలుగు గంటల పాటు భోజనం చేయకుండా ధర్నా చేశారు. సంబంధిత టీచర్‌ను సస్పెండ్ చేసే వరకు మేము భోజనం చేయమని నినదించారు. ఆమె మళ్లీ పాఠశాలకు వస్తే ఎవ్వరం పాఠశాలలో ఉండమని విద్యార్థినులు బీష్మించారు. తను విద్యార్థినులను అసభ్య పదజాలంతో దూషించి, మానసికంగా వేధిస్తోందని, వాష్‌రూంకు వెళితే ఆ ఫొటోలు, వీడియోలు తీసి వాటిని బయట లీక్ చేస్తా నని భయపెడుతుందని విద్యార్థులు వాపోయారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేదిలేదని కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న డీఈఓ రమేష్‌కుమార్ పాఠశా లకు చేరుకొని విద్యార్థులకు నచ్చచెప్పి ఆ టీచర్‌ను ఎట్టి పరిస్థితులలో ఇక్కడ ఉంచబోమని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.బిడ్డల్లాగా చూసుకుంటారనుకుంటే... పాఠశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత బిడ్డల్లాగా చూసుకుంటారని అనుకుంటే.. వీళ్లే ఈ విధంగా ప్రవర్తించడం బాగా లేదు సార్. మా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ టీచర్‌ను సస్పెండ్ చేయాలి. తమ పిల్లలకు మంచి చదువు చెప్పించండి సార్. – సత్యనారాయణ, విద్యార్థిని తండ్రి, మొలచింతపల్లి -
సదరం శిబిరాలనువినియోగించుకోండి
నాగర్‌కర్నూల్ క్రైం/ కందనూలు: దివ్యాంగులు సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ చిన్న ఓబులేషు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం యూడీఐడీ పోర్టల్‌లో నేరుగా, మీసేవలో దరఖాస్తు చేసుకుని రశీదుతోపాటు పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ఆధార్ జిరాక్స్ కాపీలను తీసుకుని కలెక్టరేట్లోని డీఆర్డీఓ కార్యాలయం రూం నంబర్ ఎఫ్1లో స్లాట్ పొందాలని నమోదు చేసుకోవాలన్నారు. సదరం శిబిరాలను ఈ నెల 17 నుంచి 28 వరకు జనరల్ ఆస్పత్రిలో నిర్వహిస్తామన్నారు. శారీరక దివ్యాంగులు ఈ నెల 23, 28, వినికిడి లోపం ఉన్నవారికి 22న, కంటిచూపు లోపం ఉన్నవారికి 17, 25, మానసిక దివ్యాంగులకు 24న ఉదయం 10 గంటలకు ఉంటుందన్నారు. 20న జిల్లా సదస్సు నాగర్‌కర్నూల్ రూరల్: ఈ నెల 20న ఏఐటీయూసీ, సీఐటీయూ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించే జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, కార్యదర్శి శివశంకర్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సంయుక్త సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు లక్ష్మీపతి, వెంకటస్వామి, బాలమురళికృష్ణ, సురేష్, సుభాష్, సత్యం, శివ తదితరులు పాల్గొన్నారు. నేడు హుండీ లెక్కింపు చారకొండ: మండలంలోని అపర భద్రాది సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి హుండీ లెక్కింపు బుధవారం చేపడుతున్నట్లు ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుంచి 11 వరకు జరిగిన బ్రహ్మోత్సవాలకు భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని హుండీలో వేసిన కానుకలను ఆలయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ, తహసీల్దార్ సునీత, ఎస్ఐ శంషొద్దీన్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు లెక్కించనున్నట్లు వివరించారు. రైతు కమిషన్ చైర్మన్ రాక వంగూరు: మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి బుధవారం రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితోపాటు కమిటీ సభ్యులు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూ భారతిపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఉదయం 9 గంటలకు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం 10 గంటలకు పోల్కంపల్లిలోని రైతువేదికలో రైతులతో సమావేశం కానున్నారు. కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మార్కెట్ వైస్ చైర్మన్ పండిత్రావు తెలిపారు. నల్లమల ప్రాణవాయువుతో సమానం మన్ననూర్: నల్లమల ప్రాంతం నాకు ప్రాణ వాయువుతో సమానం అని, ఇక్కడి ప్రజల ప్రేమానురాగాలు నాకు ఎంతగానో ప్రేరణ కలిగిస్తాయని వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు, కాళోజీ పురస్కారం గ్రహీత జయరాజ్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పదరలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నల్లమల ప్రాంతం అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబాటుకు గురైందని, అయినప్పటికీ ఇక్కడి ప్రజల్లో రాష్ట్రం నలుమూల గుర్తుండిపోయేంత మంచితనం ఉందని, అందుకే నాకు ఈ ప్రాంతం అన్నా.. ఇక్కడి ప్రజలు అన్నా ఎంతో ఇష్టం అన్నారు. దళిత బహుజనులు అంబేడ్కర్ మార్గంలో పయనిస్తూ.. ఆయన ఆశయ సాధన కోసం ముందుకు సాగాలన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని తీసేసి తిరిగి రాచరికాన్ని తీసుకువచ్చే కుట్ర జరుగుతుందన్నారు. అంబేడ్కర్ వారసులమైన మనం అగ్రకుల భావాజాలాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో చదువుకు ఉన్న విలువ మరొక దానికి లేదని గమనించి తమ పిల్లలు ఉన్నత చదువుల్లో రాణించేలా ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా ప్రొఫెసర్ గడుదాస్ వెంకటేశ్వర్లు, కళాకారుడు జక్కా గోపాల్, నాయకులు సత్యనారాయణ, రామలింగం, చిన్న చంద్రయ్య, వెంకటయ్య, ప్రవీణ్‌కుమార్, రాయుడు, బాలింగం, బాలాకుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. -
మహిళల చేతికి ప్రగతి చక్రాలు
అచ్చంపేట: మహిళల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేస్తూ కోటీశ్వరులు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే మహిళా సమాఖ్యలకు జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తోంది. ఇందుకోసం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బస్సుల ఆవశ్యకతను దృష్టిలో మొత్తం ఉంచుకుని 10 డిపోల పరిధిలో అచ్చంపేట 5, కల్వకుర్తి 4, నాగర్‌కర్నూల్ 2, కొల్లాపూర్ 2, గద్వాల 4, వనపర్తి 7, మహబూబ్‌నగర్ 5, నారాయణపేట 2, కోస్గి 1, షాద్‌నగర్ 17 చొప్పున 49 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో నూతన సంఘాల ఏర్పాటుతో పాటు ఇది వరకు ఉన్న సంఘాలకు బస్సుల నిర్వహణకు అవసరమయ్యే రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్ల ఏర్పాటు, పెరటి కోళ్ల పెంపకం, మీ– సేవ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆహార కేంద్రాలు తదితర వాటి ఏర్పాటుకు సహకారం అందిస్తోంది. రద్దీ నేపథ్యంలో 64 కొత్త బస్సుల కోసం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేశాక అన్ని డిపోల్లో బస్సుల కొరత తీవ్రమైంది. రద్దీతో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి సరిపడా బస్సులు లేక ఉన్న వాటినే పంపిస్తున్నారు. ఇవి చాలా ఏళ్ల కిందటివి కావడంతో తరుచుగా మరమ్మతుకు గురవుతున్నాయి. పండుగలు, జాతర్లు, ముఖ్యమైన రోజుల్లో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. బస్‌భవన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో బస్సుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 10 డిపోల పరిధిలో అచ్చంపేటకు (2 ఎక్స్‌ప్రెస్‌లు), కల్వకుర్తికి (2 ఎక్స్‌ప్రెస్‌లు) నాగర్‌కర్నూల్‌కు (3 పల్లె వెలుగులు), గద్వాలకు (7 ఎక్స్‌ప్రెస్‌లు, 12 పల్లె వెలుగులు, 2 డీలక్స్‌లు), వనపర్తికి (4 ఎక్స్‌ప్రెస్‌లు, 4 పల్లె వెలుగులు), మహబూబ్‌నగర్‌కు (11 ఎక్స్‌ప్రెస్‌లు, 6 పల్లె వెలుగులు), నారాయణపేటకు (1 ఎక్స్‌ప్రెస్, 1 పల్లెవెలుగు), షాద్‌నగర్‌కు (6 ఎక్స్‌ప్రెస్‌లు, 3 పల్లె వెలుగులు) చొప్పున మొత్తం 64 బస్సుల కోసం అధికారులు ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే ఈ కొత్త బస్సులు ఆయా డిపోలకు చేరనున్నాయి. అద్దె ప్రాతిపదికన రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని డిపోల పరిధిలో సరిపడా బస్సులు లేవు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో బస్సుల కొనుగోలుతో కొంత వరకై నా సమస్య తీరనుంది. ఈ క్రమంలో మహిళా సమాఖ్యలు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. దీంతో మండల మహిళా సమాఖ్యలు పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఆర్టీసీ సంస్థ ఏడేళ్లపాటు ప్రతి నెలా రూ.77,220 అద్దె చెల్లించనుంది. దీంతో మహిళా సంఘాల మహిళలకు ఆర్థిక ఊతం లభిస్తుంది. మరోవైపు రూ.లక్షల విలువైన బస్సు సమాఖ్య సొంతం కానుంది. మండల సమాఖ్యలకు ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో 49 బస్సుల కోసం ప్రతిపాదనలు ప్రతినెలా ఒక్కో బస్సుకు అద్దె రూపంలో రూ.77,220 చెల్లింపు మహిళలూ ఆర్థిక పరిపుష్టి సాధించే సదావకాశం ఇందిరా మహిళా శక్తి ద్వారా ప్రభుత్వం చేయూత -
పాలమూరు పనుల్లో కదలిక
వివరాలు 8లో u● నార్లాపూర్– ఏదుల ప్రధాన కాల్వ పెండింగ్ పనులకు రూ.780.63 కోట్లు మంజూరు ● డిసెంబర్ నాటికి కర్వెన రిజర్వాయర్ వరకు పనులు పూర్తిచేసేలా కార్యచరణ ● విడతల వారీగా పనులను పూర్తిచేయనున్న ప్రభుత్వం ఏదుల రిజర్వాయర్ప్రధాన కాల్వ నిర్మాణ పనులకు నిధులు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ మధ్యలో ప్రధాన కాల్వకు 1.725 కి.మీ. పాయింట్ నుంచి 2.125 పాయింట్ కాల్వ తవ్వకం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 6.325 కి.మీ. పాయింట్ నుంచి 6.650 కి.మీ. పాయింట్ నడుమ కాల్వ నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. ప్యాకేజీ 3 పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.780.63 కోట్లు కేటాయించింది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ మధ్య పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ కెనాల్, ఓపెన్ కెనాల్ నిర్మాణంతో పాటు హెడ్ రెగ్యులేటరీ ఏర్పాటు కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. కుడికిళ్ల సమీపంలో ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తిగా ఆగిపోయాయి. అక్కడ హార్డ్ రాక్తో కాల్వ తవ్వకాలకు ఇబ్బందిగా ఉందని చెబుతుండగా, తాజాగా ప్రభుత్వం అంచనాలను సవరించి నిధులను విడుదల చేసింది. గతంలో ఈ ప్యాకేజీ కింద పనులకు రూ.416.10 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం ఈ పనుల విలువను రూ.780.63 కోట్లకు చేరింది. -
వాటర్ షెడ్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్‌కర్నూల్: ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజనలో భాగంగా ఈ నెల 23న వాటర్ షెడ్ యాత్ర ఉప్పునుంతల, బీకే లక్ష్మాపూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ దేవసహాయం తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో వాటర్ షెడ్ యాత్రపై సంబంధి త శాఖ అధికారులతో దేవసహాయం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎంపీ, కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొననున్న వాటర్ షెడ్ యాత్రకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. వాటర్ షెడ్లు మన నీటి వనరులు, పర్యావరణానికి కీలకమైనవని, వాటిని సమర్థవంతంగా నిర్వహించడం చాలా ముఖ్యమని, వాటర్ షెడ్ల ప్రాముఖ్యత, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు వివరించారు. వాటర్ షెడ్ పథకంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. భూ, నీటి సంరక్షణ, గ్రామీణ ప్రజల జీవనోపాధి మెరుగు కోసం ఉద్దేశించిన వ్యవసాయ సంబంధమైన పండ్ల తోటల పెంపకం, అధునాతన సాంకేతిక వ్యవసాయ పద్ధతి ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అటవీ సంరక్షణలో భాగంగా వాటర్‌షెడ్ ప్రాంతాల్లో చెట్లను నరకకుండా చూడటంతోపాటు కొత్త మొక్కలను నాటాలని, నేల కోతను నివారించడానికి సరైన వ్యవసాయ పద్ధతులు, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడాలని, వర్షపు నీటిని సంరక్షించుకొని భవిష్యత్ తరాలకు అందించాలన్న ముఖ్య లక్ష్యంతో చేపట్టనున్న వాటర్ షెడ్ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. వాటర్ షెడ్ యాత్రలో విద్యార్థులు, యువత, ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగ స్వాములు చేయాలన్నారు. పాఠశాలల్లో వాటర్ షెడ్ పథకంపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యా స, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని సూచించారు. వాటర్ షెడ్ యాత్రపై స్టాళ్లు ఏర్పాటు చేయా లని, మొక్కలు నాటే కార్యక్రమం, చెక్‌డ్యాం నిర్మా ణానికి భూమిపూజ తదితర పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ చిన్న ఓబులేషు, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, పంచాయతీ అధికారి రామ్మోహన్రావు, ఉద్యానవన శాఖ అధికారి జగన్ తదితరులు పాల్గొన్నారు. -
కొల్లాపూర్– నాగర్‌కర్నూల్ మధ్య..
మాకు కేటాయించిన బస్సును మార్చి 20 నుంచి కొల్లాపూర్– నాగర్‌కర్నూల్ మధ్య నడిపిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షలతో ఎలక్ట్రికల్ బస్సు కొనుగోలు చేసి అప్పగించింది. ఆర్టీసీ వారు నెలకు రూ.77,220 అద్దె చెల్లిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. పెద్దకొత్తపల్లి మండల మహిళా సమాఖ్య జిల్లాలోనే ఉత్తమ మహిళా సమాఖ్యగా ఎంపికై ంది. – అరుణ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, పెద్దకొత్తపల్లి జిల్లాకు ఏడు బస్సులు.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 మండలాలకు గాను ఏడింటికి మొదటి విడతలో ఏడు బస్సులు మంజూరయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా పెద్దకొత్తపల్లికి చెందిన సమాఖ్య బస్సు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రూ.30 లక్షల నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాగా మహిళా సంఘాల అకౌంట్లో జమ అయ్యాయి. – చిన్న ఓబులేషు, డీఆర్డీఓ, నాగర్‌కర్నూల్ ● -
ముగిసిన ‘పది’ మూల్యాంకనం
కందనూలు: జిల్లాకేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ముగిసిందని డీఈఓ రమేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని మూల్యాంకన కేంద్రంలో చీఫ్ ఎగ్జామినర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎలాంటి అవరోధాలు లేకుండా మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసిందని, అత్యంత పారదర్శకంగా పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ నిర్వహించామన్నారు. 64 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 384 మంది సహాయ ఎగ్జామినర్లు, 130 మంది స్పెషల్ అసిస్టెంట్స్ విధులకు హాజరై 1,34,503 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారన్నారు. మూల్యాంకనం చివరిరోజు రెగ్యులర్ విద్యార్థుల పరీక్ష పేపర్లు తెలుగు 20,482, హిందీ 19,180, ఇంగ్లిష్ 11,991, గణితం 23,406, ఫిజికల్ సైన్స్ 26,100, బయోసైన్స్ 14,088, సోషల్ స్టడీస్ 17,616, ఒకేషనల్ 1,604, తెలుగు రెండో సబ్జెక్ట్ 36 పేపర్లు మూల్యాంకనం చేసినట్లు వివరించారు. ఎలాంటి పని అప్పగించినా ఉపాధ్యాయులు అంకితభావంతో పూర్తి చేసి జిల్లా విద్యా శాఖకు పేరు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. గత మూడేళ్ల నుంచి లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలను మూల్యాంకన ప్రక్రియకు అప్పగించి సహకరించిన పాఠశాల ప్రిన్సిపల్ రాజును డీఈఓ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖర్‌రావు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ కుర్మయ్య, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, ఎంఈఓ భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి కోసం రైతుల రాస్తారోకో
అమరచింత: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు రహదారిపై సాగునీరు ఇవ్వాలంటూ మండుటెండలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా యాసంగిలో 20 వేల ఎకరాలకు సాగునీటిని రామన్‌పాడు వరకే అందిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రాజెక్టు సమీపంలో ఉన్న అమరచింత, ఆత్మకూరు మండలాల రైతులు వరిపంట సాగుచేశారు. వారబందితో సాగునీటిని అందించిన అధికారులు పంటలు చేతికొచ్చే సమయంలో నీటిని నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి, తూంపల్లి, గుంటిపల్లి, జూరాల గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం జూరాల ఎడమ కాల్వ వద్దకు చేరుకొని ప్రాజెక్టు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అక్కడే ఉన్న బారికేడ్లు, ముళ్లపొదలు అడ్డంగా పెట్టడంతో వాహనాల రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ ఎస్ఐ, వనపర్తి జిల్లా అమరచింత ఎస్ఐ సురేష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, తమకు సాగునీరు అందించాల్సిందేనని, అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు తెగేసి చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రైతుల రాస్తారోకో విషయాన్ని సీఐ శివకుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వచ్చి ఉన్నతాధికారులతో చర్చించి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. మండుటెండలో జూరాల ప్రాజెక్టుపై బైఠాయింపు గంటన్నర వరకు కదలని రైతులు నిలిచిన వాహన రాకపోకలు -
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
● ఈ నెల 8 నుంచి ప్రారంభమైన పోషణ్ పక్వాడా ● 22 వరకు అంగన్వాడీల్లో వారోత్సవాలు ● పౌష్టికాహారంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కందనూలు: జిల్లాలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోషణ్ పక్వాడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపాన్ని గుర్తించి.. నివారించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు పోషకాహార విలువలు, పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నెల 8న ప్రారంభమైన ఈ అవగాహన కార్యక్రమాలు 22 వరకు కొనసాగనున్నాయి. జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,131 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో గర్భిణులు 4,692, బాలింతలు 4,462, ఐదేళ్లలోపు చిన్నారులు 41,993 మంది ఉన్నారు. తల్లిపాల ఆవశ్యకత.. అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శిశువు జన్మించిన మొదటిరోజు వెయ్యి రోజుల వరకు ప్రాముఖ్యతను వివరించడం, పౌష్టికాహారం లోపంతో ఉన్న చిన్నారులను గుర్తించడం, అనుబంధ పోషకాహారం కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేయడం వంటివి చేస్తారు. ఇప్పటికే మహిళాభివృద్ధి, శిశు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో గర్భిణుల బరువు తీయడం, గర్భిణుల సంరక్షణపై భర్తలకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించడంతోపాటు రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. 15 రోజులపాటు ఓ కార్యక్రమం చొప్పున పోషకాహార లోపాన్ని నివారించడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈ పక్షోత్సవాల్లో అంగన్వాడీ టీచర్లతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్, గ్రామపంచాయతీ, వ్యవసాయ శాఖల అధికారులు, సిబ్బంది భాగస్వా ములు అవుతున్నారు.జిల్లాలోని ప్రాజెక్టుల వారీగా వివరాలిలా.. ప్రాజెక్టు గర్భిణులు బాలింతలు ఐదేళ్లలోపు చిన్నారులు నాగర్‌కర్నూల్ 1,552 1,362 15,552 కల్వకుర్తి 984 1,019 7,660 కొల్లాపూర్ 918 901 8,167 అచ్చంపేట 672 610 5,810 బల్మూర్ 566 570 4,804 అవగాహన కల్పిస్తున్నాం.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తీసుకునే పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి కేంద్రం పరిధిలో పోషకాహార లోపం, తక్కువ బరువుతో శిశువుల జననం, ఊబకాయ లోపం ఉన్నవారిని గుర్తిస్తాం. వారి పర్యవేక్షణతో పాటు పోషకాహారం అందిస్తాం. – రాజేశ్వరి జిల్లా సంక్షేమఅధికారి -
అణగారిన వర్గాలకూ రాజకీయ, సంక్షేమ ఫలాలు
నాగర్‌కర్నూల్/ కొల్లాపూర్: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్‌లోని అంబేడ్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలకు ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతోనే అణగారిన వర్గాల ప్రజలు సంక్షేమ, రాజకీయ ఫలాలు పొందుతున్నారన్నారు. అలాగే జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలన్న దృఢ సంకల్పంతో రాజ్యాంగాన్ని రచించి, అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన మహనీయుడు అంబేద్కర్ అని, దళిత గిరిజన, వెనకబడిన, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం అహర్నిశలు శ్రమించారన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శ్రవణ్‌కుమార్, కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పూలే, అంబేడ్కర్ జాతర వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
సమగ్ర విచారణ జరిగేనా?
కల్వకుర్తి రూరల్: రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. వినియోగదారులు సైతం దొడ్డు బియ్యం తినలేమనే ఉద్దేశంతో వచ్చిన ధరకు మధ్యవర్తులకు విక్రయిస్తున్నారనేది బహిరంగ రహస్యం. వినియోగదారుని వద్దకు వెళ్లిన బియ్యం తిరిగి రైస్ మిల్లులకు చేరుకోవడం అక్కడి నుంచి తిరిగి ప్రభుత్వానికి వెళ్లి మళ్లీ రేషన్ షాపుల ద్వారా వినియోదారులకు రావడం ఒక రీసైక్లింగ్ వ్యవహారంగా కొనసాగింది. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నిష్ప్రయోజనంగా మారిపోయాయి. తలా పాపం తిలా పిడికేడు అన్న చందంగా రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి అధికారులు తదితరవి రేషన్ బియ్యం చుట్టూ తిరగడంతో అక్రమ రవాణాకు అడ్డు, అదుపు లేకుండా చేశాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సన్నబియ్యం అందించాలనే సంకల్పంతో ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే సన్న బియ్యం సైతం పక్కదారి పట్టి అధికారులకు పట్టుబడిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కల్వకుర్తి మండలంలోని మార్చాల రైస్ మిల్లులో ఏకంగా వెయ్యికిపైగా క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడటం కలకలం రేపింది. మిల్లులో 90 శాతం.. అధికారులు దాడి చేసిన రైస్ మిల్లుకు నాలుగేళ్లుగా సీఎంఆర్ ధాన్యం ఇవ్వడం లేదని అధికారులు గుర్తించారు. అయితే సీఎంఆర్ కేటాయించని మిల్లులో రేషన్ బియ్యం ఎలా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ బియ్యం ఈ మిల్లుకు ఎలా వచ్చాయనే విషయాన్ని అధికారులు తేల్చాల్సి ఉంది. సదరు మిల్లులో ఏకంగా 90 శాతం రేషన్ బియ్యం ఉండటం గమనార్హం. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే మరికొన్ని మిల్లుల భాగోతం బయటకు వస్తుందని పలువురు చెబుతున్నారు. కొన్ని బ్రాండ్ల కవర్లను తొడిగి రేషన్ బియ్యం కల్వకుర్తిలోని కొందరికి అమ్మేందుకు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఆదివారం సైతం దాడులు నిర్వహించడం పక్కా సమాచారంతోనే అంటున్నారు. అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలుసుకున్న కొన్ని మిల్లుల యజమానులు తమ వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించారని తెలుస్తుంది. రేషన్ బియ్యం వ్యవహారంపై మరిన్ని నిజాలు తెలిసే విధంగా అధికారులు విచారణ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడటంతో కలకలం -
డిగ్రీ కళాశాలలోనే ఎన్నికల సామగ్రి
జడ్చర్ల టౌన్: పట్టణంలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న ఎన్నికల సామగ్రిని తరలించకపోవడంతో గదుల కొరత ఏర్పడింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సామగ్రి, ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను కళాశాలలో ఏర్పాటుచేశారు. ఎన్నికలు ముగిశాక ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించగా.. ఇతర సామగ్రి మొత్తాన్ని కళాశాలలోనే నిల్వ చేశారు. ఇందుకోసం ఫిజికల్ డైరెక్టర్ గదులు రెండింటిని వినియోగిస్తున్నారు. ఈ కారణంగా ఫిజికల్ డైరెక్టర్ గదిని మరోచోట ఏర్పాటు చేసుకోవా ల్సివచ్చింది. 2023 డిసెంబర్ నుంచి ఎన్నికల సామగ్రిని తరలించి తమకు గదులు అప్పగించాలని కళాశాల ప్రిన్సిపాల్ పలుమార్లు అధికారులు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిసింది. అయితే ఆ సామగ్రిని ఎక్కడికి తరలించాలో తెలియక అధికారులు మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసం కళాశాల గదులను ఇస్తే.. వాటిని 16 నెలలుగా తమకు అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని అధ్యాపక బృందం వాపోతోంది. ఇప్పటికై నా ఎన్నికల సామగ్రిని తరలించాలని ప్రిన్సిపాల్ సుకన్య కోరుతున్నారు. -
దాహం తీరేనా..?!
శ్రీశైలం జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటిమట్టం తాగునీటి అవసరాలకే.. ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద 818 అడుగుల మేరకు కృష్ణానదిలో బ్యాక్ వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాలను బట్టే ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణానదిలో బ్యాక్ వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఎప్పటికీ ఢోకా ఉండదు. – అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ ● మిషన్ భగీరథ అవసరాలకు కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు ● వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు చర్యలు ● యాసంగి సీజన్ ముగియడంతో నిలిచిన సాగునీటి సరఫరా ● నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో లభించనున్న శాశ్వత పరిష్కారం ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న నీరు 38.86 టీఎంసీలు ఇందులో వాడుకునే అవకాశం ఉన్నది 1.86 టీఎంసీలు కొల్లాపూర్: శ్రీశైలం బ్యాక్‌వాటర్ లెవెల్స్ క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి అవసరాలపై అధికారులు దృష్టిసారించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు చేపట్టారు. ఇందుకోసం కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్‌హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లా 3 నియోజకవర్గాల పరిధిలోని 84 మండలాల ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ ట్యాంకులు నిర్మించి నీటి సరఫరా చేస్తున్నారు. అయితే వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. తగ్గుతున్న నీటిమట్టం.. వేసవి ప్రభావంతో శ్రీశైలంలో బ్యాక్‌వాటర్ లెవెల్స్ వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం డ్యాంలో 818 అడుగుల వద్ద 38.86 టీఎంసీల నీరు ఉండగా.. మిషన్ భగీరథ కోసం 800 అడుగుల (37.0 టీఎంసీల డెడ్ స్టోరేజీ) వరకు నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్ ముగియడంతో సాగునీటి సరఫరా నిలిపివేసి.. కేవలం తాగునీటి కోసమే ఎత్తిపోతలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నీటి అవసరాలు తీర్చేలా... మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.2 టీఎంసీల నీళ్లు అవసరం. కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఒక్కసారి రిజర్వాయర్‌ను నింపితే దాదాపుగా 18 రోజులపాటు తాగునీటి అవసరాలు తీరుతాయి. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్స్ ప్రకారం వేసవి పూర్తయ్యే వరకు నీటిని ఎత్తిపోసుకునే వీలుంది. తాగునీటి కేటాయింపుల ప్రకారమే శ్రీశైలం బ్యాక్ వాటర్ వినియోగం ఉంటుంది. జలాశయం డెడ్ స్టోరేజీ 37.0 టీఎంసీలు కేఎల్ఐ కాల్వ అప్రోచ్ కెనాల్లో కృష్ణా బ్యాక్‌వాటర్ మిషన్ భగీరథకు ప్రతిరోజు అవసరమైన నీరు 0.2 టీఎంసీలు -
వచ్చే ఏడాది నుంచి..
ప్రతి సంవత్సరం తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం చిన్నది కావడంతో తాగునీటి సరఫరాపై ఆందోళనలు నెలకొంటున్నాయి. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు జరిగితే తాగునీటి ఇక్కట్లు పూర్తిస్థాయిలో తీరుతాయి. నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6 టీఎంసీల పైనే. ఒక్కసారి రిజర్వాయర్ నిండుగా ఉంచితే వేసవి మొత్తం మిషన్ భగీరథకు తాగునీరు అందుతుంది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ పథకానికి నీటిని మళ్లించేందుకు వీలుగా రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. -
అగ్ని ప్రమాదాలపై నిర్లక్ష్యం వహించొద్దు
నాగర్‌కర్నూల్ క్రైం: అగ్ని ప్రమాదాల పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి అన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహిస్తారన్నారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ముంబాయి విక్టోరియా డాక్ యార్డు నౌకలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు అనేవి అనుకోకుండా సంభవిస్తామని, ప్రమాదాలు జరిగినప్పుడు డయల్ 101కు సమాచారం అందిస్తే వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరకుని ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు కృషిచేస్తారన్నారు. అగ్ని అనేది మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని, కానీ దానిని ఉపయోగించే క్రమంలో ఏదైనా అలసత్వం ప్రదర్శిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అగ్ని ప్రమాదాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణనష్టంతోపాటు, ఆస్తినష్టం కూడా సంభవిస్తుందన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ‘భూ భారతి’కి మద్దూరు ఎంపిక నారాయణపేట: వ్యవసాయ భూములకు సంబందించి సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం ఈ పోర్టల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించగా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో సీఎం ఇలాఖా అయిన కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద మద్దూరుమండలాన్ని ఎంపిక చేయడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్‌షాలం సూచనలతో తహసీల్దార్ మహేశ్‌గౌడ్, అధికార యంత్రాంగం భూభారతిని క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి మండలంలో క్షేతస్థాయిలో రైతులకు, ప్రజలకు ముందుగా భూ భారతిపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల నుంచి వచ్చే సందేహాలు, సలహాలు, సూచనలు స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు. రెవెన్యూ గ్రామాలు 17.. భూమి 30,621 ఎకరాలు మద్దూరు మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. చెన్వార్, చెన్నారెడ్డిపల్లి, చింతల్‌దిన్నె దమ్‌గన్‌పూర్ దొరెపల్లి, జాదరావ్‌పల్లి, ఖాజీపూర్, లక్కాయపల్లి, మద్దూర్, మల్కిజాదవ్రావ్పల్లి, మొమినాపూర్, నాగిరెడ్డిపల్లి, నందిపహడ్, పల్లెర్ల, పర్సపూర్, పెదరిపాడు, రేనివట్ల గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం మండల వ్యాప్తంగా 30,621 ఎకరాల భూమి ఉంది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండగా ఒక ఆర్ఐ, ఒకరు సర్వేయర్ విధుల్లో ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మద్దూర్ మండలానికి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ రెవెన్యూ, సర్వేయర్లను నియమించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
జిల్లాలో 1.53 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు
నాగర్‌కర్నూల్: జిల్లాలో ప్రతిఏటా వరిసాగు గణనీయంగా పెరుగుతోంది. అనుకున్న స్థాయిలో సాగునీరు అందుబాటులో ఉండడం, కేఎల్ఐ నీటితో ఎప్పటికప్పుడు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నింపడం వల్ల వరిపంట సాగు చేసే రైతుల సంఖ్య కూడా ఏటా రెట్టింపు అవుతోంది. గత యాసంగి సీజన్‌తో పోలిస్తే ఈసారి వరి సాగు పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్‌లో పంట చేతికి వచ్చే సమయం కావడంతో రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం వరకు పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇటీవల అధికారుల సమావేశంలో కలెక్టర్ ఆదేశించారు. 99 వేల మె.ట., మాత్రమే.. జిల్లాలో వానాకాలం సీజన్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలపై రైతులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం, ప్రైవేటు వైపే మొగ్గు చూపడంతో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల లక్ష్యం నెరవేరలేదు. ఇది కాక జిల్లాలో సన్నరకాలపై రైతులు ఆసక్తి చూపడం, సన్న రకాలకు ప్రభుత్వం ఇచ్చే ధర, బోనస్ కలిపినా గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ప్రైవేట్‌లోనే ఈ ధాన్యాన్ని అమ్ముకున్నారు. 250 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కేవలం 99 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. అయితే కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది అందుబాటులో లేకపోవడం, తేమ పేరుతో ధరలు తగ్గించడం, ఇతరత్రా సమస్యలు ఉన్నాయని ఆరోపణలు వినిపించినా అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా సమాధానమిస్తున్నారు. రైతులు సన్నాలు పండించడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలపై ఆసక్తి చూపడం లేదని సమాధానమిస్తున్నారు. ఈ సీజన్లో మాత్రం నాగర్‌కర్నూల్ జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా 2,87,297 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యం నిర్దేశించారు. 234 కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో 70, పీఏసీఎస్ 160, మెప్మా ఆధ్వర్యంలో 4 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సన్నాలకు రూ.500 బోనస్ జిల్లాలో ఈ యాసంగిలో 1,53,164 ఎకరాల్లో వరిపంట సాగు చేయగా ఇందులో సన్నరకం 76,584 ఎకరాల్లో సాగు చేశారు. మొత్తంగా దీని ద్వారా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే 2.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం క్వింటాల్ ఏ–గ్రేడ్ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర ప్రకటించింది. దీంతోపాటు సన్న రకానికి బోనస్‌గా రూ.500 ఇవ్వనున్నారు. రైతులు ధాన్యం తీసుకువచ్చేటప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా, వీఆర్ఓ, ఏఈఓతో ధ్రువీకరణ పత్రం తేవాల్సి ఉంటుంది. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి.. తర్వాత చెల్లింపులు చేస్తారు. అందుబాటులో గన్నీ బ్యాగులు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో కావాల్సిన గన్నీ బ్యాగులను అధికారులు సమకూరుస్తున్నారు. ధాన్యం సేకరణకు మొత్తం 47 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా.. ప్రస్తుతం 26 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ధాన్యం సేకరణ జరగుతున్న సమయంలో అవసరాన్ని బట్టి మిగతా వాటిని తెప్పిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే వర్షం వచ్చినప్పుడు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు 4,670 అవసరం ఉండగా ప్రస్తుతం 2,600 అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దిగుబడి అంచనా 3,50,635 మె.ట., జిల్లాలో సాగైన వరి పంట 1,53,164 ఎకరాలు ధాన్యం సేకరణ లక్ష్యం 2,87,297 మె.ట., ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాలు 234 ఏ–గ్రేడ్ ధాన్యం మద్దతు ధర రూ.2,320 సన్నాలు క్వింటాల్‌కు అందించే బోనస్ రూ.500 సాధారణ రకం మద్దతు ధర రూ.2,300 ఊపందుకుంటున్న పంట కోతలు.. సేకరణకు చర్యలు రేపటిలోగా పూర్తిస్థాయిలో కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు గత సీజన్లో కొనుగోలు కేంద్రాలపై ఆసక్తి చూపని రైతులు అత్యధికంగా ప్రైవేట్ వ్యాపారులకే అమ్మకాలుకొర్రీలు పెట్టొద్దు.. గతేడాది మాదిరిగా ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ప్రభుత్వం ధాన్యం సేకరించారు. ప్రభుత్వ ధర కంటే ప్రైవేట్ వ్యక్తులే గతేడాది అధిక ధరలకు కొనుగోలు చేశారు. తేమ శాతం, ధూళి పేరుతో గతేడాది సక్రమంగా కొనుగోలు చేయలేదు. ఈసారైనా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా రైతులు పండించిన సన్నధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలి. ప్రభుత్వం మద్దతు ధర మరింత పెంచాలి. – పెద్ద మశన్న, రైతు, గట్టురాయిపాకుల రేపటి నుంచి ప్రారంభిస్తాం.. జిల్లాలో రైతుల నుంచి వరిధాన్యాన్ని సేకరించేందుకు 234 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ప్రతి రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి. ఈ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తాం. మంగళవారం నుంచి అన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. – శ్రీనివాస్, డీఎస్ఓ -
వెళ్లొస్తాం.. లింగమయ్యా
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం ● ముగిసిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు ● మూడురోజుల్లో లింగమయ్య దర్శించుకున్న 2 లక్షల మంది భక్తులు ● ఫర్హాబాద్ చెక్‌పోస్టులు మూసివేత నల్లమలలోని లోతట్టు ప్రాంతం సలేశ్వర క్షేత్రంలో వెలసిన లింగమయ్య ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. మూడు రోజులపాటు నల్లమల కొండలు జనసంద్రంతో కిక్కిరిసి కనిపించాయి. చివరిరోజు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వాహనాలు అడవిలోకి వెళ్లకుండా అటవీశాఖ నిలిపివేసింది. చివరిరోజు వస్తున్నాం.. లింగమయ్యా.. వెళ్లొస్తాం.. లింగమయ్యా అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. – అచ్చంపేట వివరాలు 8లో u -
ఇప్పటివరకు 12,521 మెట్రిక్ టన్నుల పంపిణీ..
● అన్నం వండుకోవడానికే ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులు ● పలు రేషన్ షాపుల పరిధిలో నిర్ణీత కోటా మించి డిమాండ్ ● అక్కడక్కడా కొంత మేర నూకలు.. ముద్దగా అన్నం ● దొడ్డు బియ్యంతో పోల్చితే పరవాలేదంటున్న వినియోగదారులు ● సరైన సమయంలో గంజి వార్చితే బాగుంటుందంటున్న మహిళలు ● ‘రేషన్ దుకాణాల్లో ఇదివరకు దొడ్డు బియ్యం ఇచ్చేవారు. అన్నం సరిగ్గా కాకపోయేది. వాటిని పిండి పట్టించి దోశలు ఇతర పిండి పదార్థాల తయారీకి ఉపయోగించేటోళ్లం. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. కొంత మేర నూకలు ఉన్నాయి. అన్నం ముద్దగా అవుతోంది. అయినా దొడ్డు బియ్యంతో పోల్చితే నయమే కదా. ఈ సన్న బియ్యంతో అన్నమే వండుకుంటున్నాం. సరైన సమయంలో గంజి వార్చితే అన్నం పుల్లలు పుల్లలుగా ఉంటుంది.’ అని రేషన్ లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ● దొడ్డుబియ్యం పంపిణీ సమయంలో ఆసక్తి చూపని లబ్ధిదారులు, కిలో రూ.9, రూ.10 అంటూ బేరసారాలకు దిగే వారు.. సన్న బియ్యం వచ్చాయా.. తీసుకోవడానికి వస్తున్నాం అంటూ డీలర్లకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారు... సర్కారు ఉగాది కానుకగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీపై ప్రజా స్పందనకు ఇవి అద్దం పడుతున్నాయి. లబ్ధిదారులు అన్నం వండుకుని తినేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలో 2,024 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 9,67,639 రేషన్ కార్డులు ఉండగా.. ఏప్రిల్ కోటాకు సంబంధించి రేషన్ దుకాణాలకు సుమారు 20,469 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 21,064 మెట్రిక్ టన్నులు సరఫరా కాగా.. రేషన్‌షాపుల ద్వారా లబ్ధిదారులకు శనివారం వరకు 12,521 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.60 లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. ఇందులో మెజార్టీ సంఖ్యలో ముంబై, పూణే వంటి ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు కాకుండా హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో 80 వేల మంది వరకు భవన నిర్మాణ రంగంలో మేసీ్త్రలు, అడ్డా కూలీలు, డైలీ కూలీలుగా బతుకీడుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సన్న బియ్యం పంపిణీ వాయిదా పడింది. అక్కడ దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన వలస కూలీలు సొంత ప్రాంతాలకు వచ్చి రేషన్‌షాపుల్లో తమ కోటా సన్న బియ్యం తీసుకెళ్తున్నారు. దీంతో వనపర్తి జిల్లా అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరుతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్, మహమ్మదాబాద్, హన్వాడా, కోయిల్‌కొండ, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నారాయణపేట జిల్లా కోస్గి, మద్దూర్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని పలు రేషన్ దుకాణాలకు నిర్ణీత కోటాకు మించి సరఫరా చేయాలని డీలర్లు కోరుతున్నారు. ఈ మేరకు అధికారులు రేషన్ కోటా పెంచేలా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకే కోటాకు మించి 594.478 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా పంపిణీ చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ● వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో మొత్తం 9,673 రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ షాపులు 21 ఉండగా.. లబ్ధిదారులు 34,629 మంది ఉన్నారు. ఫిబ్రవరిలో చౌక దుకాణాలకు 203.929 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అయ్యాయి. అదే ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు నాలుగు మెట్రిక్ టన్నులు అధికంగా సరఫరా చేశారు. వలస కూలీలు వచ్చి సన్నబియ్యం తీసుకెళ్లడంతో కోటాకు మించి అధికంగా కావాల్సి వచ్చినట్లు డీలర్లు చెబుతున్నారు. సన్నవి ఇస్తుండడంతో ఊరికొచ్చి తీసుకున్నాం.. నా భార్య, పిల్లలతో సహా 15 ఏళ్లుగా హైదరాబాదులో నివాసం ఉంటున్నాం. మేం మొత్తం ఐదుగురం. ప్రతి నెల 35 కిలోల బియ్యం వస్తాయి. ఈ సారి సన్న బియ్యం ఇస్తున్న కారణంగా మా ఊరిలో తీసుకున్నాం. సన్న బియ్యంలో కొంత నూక ఉంది. అయినా బాగానే ఉన్నాయి. – స్వామి, వలస కూలీ, దుప్పల్లి, మదనాపురం, వనపర్తి అన్నం బాగానే అయింది.. గతంలో వేసే లావు బియ్యం తినటానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయితే ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం ఇస్తుండగా.. మొన్ననే తెచ్చుకున్నాం. అవే తింటున్నాం. అన్నం చాలా బాగా అయ్యింది. కాకపోతే కొత్త బియ్యం కావడంతో మెత్తగా అయింది. ఇదే బియ్యం బయట అంగట్లో కొంటే కిలో రూ.53 పలుకుతోంది. మా లాంటి పేదోళ్లు అంత ధర పెట్టి కొనలేం. – వెంకటేష్, నల్లకుంట, గద్వాల నాణ్యతపై రాజీ పడొద్దు.. మేము కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాం. కుటుంబంలో నలుగురికి కలిపి వచ్చే 24 కేజీల రేషన్ బియ్యమే మాకు కడుపు నింపుతోంది. సన్నబియ్యం ఇవ్వడం సంతోషం. ఇప్పుడు వచ్చినవి వండుకుంటే అన్నం బాగానే అయింది. ప్రతి నెలా నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలి. ఎక్కడా రాజీ పడొద్దు. – కాసింబీ, గోప్లాపూర్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ 3 రోజుల్లోనే అయిపోయాయి.. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేపట్టడంతో ఎప్పుడూ లేని విధంగా మూడు రోజుల్లోనే నా షాప్‌నకు వచ్చిన కోటా 171.33 క్వింటాళ్లు అయిపోయాయి. మిగతా రెండు షా పుల్లో కూడా మూడు రోజుల్లోనే బియ్యం స రఫరా జరిగిపోయింది. గతంలో బియ్యం పంపిణీకి 15 రోజులు పట్టేది. కోటా అయిపోయి న కూడా లబ్ధిదారులు వస్తున్నారు. అదనపు కోటా కోసం అధికారులకు తెలియజేశాం. – సంజీవరెడ్డి, డీలర్, రేషన్‌షాప్ నంబర్–3, మద్దూరు, నారాయణపేట జిల్లాల వారీగా సన్న బియ్యం పంపిణీ వివరాలు (మెట్రిక్ టన్నుల్లో).. జిల్లా రే.షా రే.కా ఏప్రిల్ కోటా రే.షా.ప.అ ల.ప.అ మహబూబ్‌నగర్ 506 2,53,229 5,228.000 5,129.000 3,471 జోగుళాంబ గద్వాల 335 1,63,693 3,591.429 3,591.428 2,500 నారాయణపేట 301 1,44,472 3,382.916 3,382.916 1,745 నాగర్‌కర్నూల్ 558 2,43,107 4,946.455 4,500.000 2,813 వనపర్తి 324 1,63,138 3,321.066 4,461.000 1,992 మొత్తం 2,024 9,67,639 20,469.866 21,064.344 12,521 రే.షా: రేషన్‌షాపులు,రే.కా: రేషన్‌కార్డులు, రే.షా.ప.అ: రేషన్‌షాపులకు పంపిణీ అయింది, ల.ప.అ: లబ్ధిదారులకు పంపిణీ అయింది అవసరమైతే గడువు పెంపు.. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో శనివారం నాటికి 65 శాతం మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సరఫరా చేశారు. మరో మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు వేగం పెంచాలని డీలర్లను ఆదేశించారు. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉన్నట్లయితే.. వారికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచి అందజేయనున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు. నిర్ణీత కోటాకు మించి డిమాండ్.. -
నేటినుంచి అగ్నిమాపక వారోత్సవాలు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో సోమవారం నుంచి 20 వరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలో అదనపు కలెక్టర్ అమరేందర్ అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు ప్రజలకు అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని చెప్పారు. -
రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం
కల్వకుర్తి రూరల్: భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వేపూరులో జై బాపు– జై భీమ్– జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడంతోపాటు మహాత్మగాంధీ చెప్పిన శాంతి సందేశాన్ని గడపగడపకూ తీసుకెళ్లారు. గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి.. పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన చేస్తున్నాయని విమర్శించారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వాని అన్నారు. దేశంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఎన్నికల హామీలను నెరవేర్చిన ఘనత తమదేనని చెప్పారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి, శ్యాంసుందర్‌రావు, మల్లేష్, శ్రీధర్, వెంకటేశ్వరరావు, లింగమయ్య, పాండురంగారెడ్డి, బాలరాజు, వంశీ, రవి, యుగంధర్, వెంకటేష్, గణేష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగమే దేశానికి శ్రీరామ రక్షకందనూలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దళితుల అభ్యున్నతి కోసం నిజాయితీగా బీజేపీ మాత్రమే పనిచేస్తుందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఉయ్యాలవాడ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గంగిడి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా ఈ నెల 13 నుంచి 25 వరకు అంబేడ్కర్ జయంతి ఉత్సవాల పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కుట్రలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అంబేడ్కర్‌కు పోటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి కుట్రపూరితంగా ఆయనను ఓడించారని విమర్శించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేడ్కర్ చిత్రపటాన్ని ఉంచేందుకు కూడా కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. రాబో యే రోజుల్లో బీజేపీ సెమినార్లు, దళితవాడల్లో కార్నర్ మీటింగ్‌ల ద్వారా కాంగ్రెస్ ఇతర పార్టీలు చేసే తప్పుడు ప్రచారాలను ఎండగట్టి దళిత సామాజిక వర్గాల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ నేత పోతుగంటి భరత్‌ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి, ఎస్సీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జలాల్ శివుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్‌రెడ్డి, ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాగరాజు, నాగేంద్రగౌడ్, చందు, భీమేశ్వర్రెడ్డి, అభిలాష్‌రావు, రాము పాల్గొన్నారు. -
1,075 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కల్వకుర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చాలని సంకల్పంతో రేషన్ షాపుల ద్వారా ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే సన్నబియ్యం సైతం పక్కదారి పట్టిన సంఘటన కల్వకుర్తి మండలంలో వెలుగుచూసింది. సన్నబియ్యంతోపాటు దొడ్డు బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారం రావడంతో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఆదివారం మండలంలోని మార్చాల సమీపంలో ఉన్న శ్రీకృష్ణ రైస్‌మిల్‌పై ఆకస్మికంగా దాడులు నిర్వహించగా.. 1,075 క్వింటాళ్ల బియ్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. మిల్లర్లు ఇవి రేషన్ బియ్యం కావని చెప్పినప్పటికీ అధికారులు వారి మాటలను పట్టించుకోలేదు. మిల్లుకు నాలుగేళ్లుగా సీఎమ్మార్ వడ్లు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. అయినా మిల్లులో ఎఫ్ఆర్కే బియ్యం దర్శనం ఇవ్వడంతో అవి రేషన్ బియ్యం అని అధికారులు తేల్చారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసే పనిలో పడ్డారు. రాత్రి 10 గంటల వరకు.. రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో అధికారులు మిల్లుకు చేరుకున్నారు. ఆ సమయంలో మిల్లు మూసి ఉండగా సంబంధిత యజమాని గుమాస్తాలతో మిల్లు తెరిపించారు. దీంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు టెక్నికల్ సిబ్బందితోపాటు జిల్లాలో పనిచేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డీటీలు, డీఎం రాజేందర్‌ను మిల్లు వద్దకు రప్పించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సోదాలు నిర్వహించారు. మిల్లులో ఉన్న రేషన్ బియ్యాన్ని వివిధ వాహనాల ద్వారా వేరే మిల్లుకు తరలించారు. మిల్లు గుమాస్తాలను అదుపులోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. మిల్లు యజమాని సంబు రమణపై పోలీసులకు ఫిర్యాదు చేశామని డీఎం రాజేందర్ తెలిపారు. పక్కా సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన సోదాలు -
శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. సలేశ్వరంలో భక్తుల సందడి
అమ్రాబాద్: వరుస సెలవుల కారణంగా శ్రీశైలం ప్రధాన రహదారి భక్తులతో రద్దీగా మారింది. సలేశ్వరానికి వెళ్లేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో, సలేశ్వరానికి వెళ్లే మన్ననూర్ చెక్‌పోస్టు వద్ద వాహనాల తాకిడి ఎక్కువైంది. టోల్గేట్ వద్ద ఛార్జీల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం కావడంతో చెక్‌పోస్టు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని సలేశ్వరానికి వెళ్లేందుకు భక్తులు భారీ సంఖ్యలో బయలుదేరారు. ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరగడంతో మన్ననూర్ చెక్‌పోస్టు వద్ద చార్జీల చెల్లింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో, 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిద్ధాపూర్ క్రాస్ వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.Situation at saleshwaram jathara pic.twitter.com/37j3IcqLjf— 🚘 𝐊𝐂𝐑_𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 🌈™🚘 (@KCR_Vidheyudu) April 13, 2025ఇదిలా ఉండగా.. ఏటా చైత్రపౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను భక్తులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. Yesterday #Saleshwaram was crowded with devotees. If you’re planning to visit, please plan accordingly. I’d suggest avoiding taking kids along, if possible. https://t.co/QckyDl4udO pic.twitter.com/TWHB1i9Wqo— Rudra🚩 (@Mee_Rudra) April 13, 2025 -
రెస్క్యూ ఆపరేషన్ @ 50!
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం కుప్పకూలి శనివారానికి సరిగ్గా 50 రోజులైంది. దేశంలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో సుదీర్ఘంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 12 సంస్థలతోపాటు నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించినా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా.. వందల మంది సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నా గల్లంతైన వారిలో ఇంకా ఆరుగురు కార్మికుల జాడ బయటపడకపోవడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది.150 మీటర్ల మేర మట్టిని తొలగించి.. ఈ ప్రమాదంలో సొరంగం శిథిలాల కింద మొత్తం 8 మంది కార్మికులు కూరుకుపోగా ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీశారు. మిగితా ఆరుగురి జాడ కోసం నిత్యం మూడు షిఫ్టుల్లో మొత్తం 560 మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు అడ్డుగా ఉన్న టీబీఎం భాగాలను తొలగించడంతోపాటు సుమారు 150 మీటర్ల మేర టన్నులకొద్దీ మట్టిని తొలగించి 13.9 కి.మీ. అవతల సొరంగం నుంచి బయటకు తరలించారు. ఇంకా 100 మీటర్ల వరకు మట్టి, శిథిలాలను తొలగించేందుకు మరో 4 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. రంగంలోకి ఎన్నో సంస్థలు.. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, సింగరేణి, బార్డర్ రోడ్స్ అండ్ ఆర్గనైజేషన్, హైడ్రా, దక్షిణమధ్య రైల్వే, మేఘా, ఎల్ అండ్ టీ, రాబిన్స్, జేపీ సంస్థలతోపాటు ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మందిని సురక్షితంగా బయటకు తీసిన ర్యాట్ హోల్ మైనర్స్ ఎస్ఎల్బీసీ ప్రమాదస్థలి వద్ద సేవలు అందిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత వినియోగం.. బురద, శిథిలాల కింద కూరుకుపోయిన కార్మికుల ఆనవాళ్లను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజా్ఞనాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది. ఇప్పటివరకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, మానవ అవశేషాలను గుర్తించే కడావర్ డాగ్స్, నీటిలో సైతం మానవ రక్తం, అవశే షాలను గుర్తించే అక్వా–ఐ, ప్రోబోస్కోప్ టెక్నాలజీతోపాటు ఎన్జీఆర్ఐ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేస్తున్నాయి.టీబీఎం భాగాలను కట్ చేసేందుకు అల్ట్రా థర్మల్, గ్యాస్ కట్టర్లను వినియోగిస్తుండగా మ ట్టిని వేగంగా కన్వేయర్ బెల్టుపై వేసేందుకు నాలుగు ఎస్కలేటర్లు, సైన్యానికి చెందిన మినీ బాబ్‌కట్ మెషీన్లను ఉపయోగిస్తున్నారు. సొరంగం చివరి భాగంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న 40 మీటర్ల ప్రాంతంలో ఎన్వీ రోబోటిక్స్‌కు చెందిన రొబోటిక్ యంత్రాలను వినియోగించనున్నారు. -
సన్నబియ్యం పథకం పేదలకు వరం
వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకం పేదల కడుపు నింపుతుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఆయన పర్యటించారు. గ్రామానికి చెందిన నాగనూలు లక్ష్మమ్మ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రేషన్ షాపులలో సన్నబియ్యం అందిస్తున్నట్లు వివరించారు. పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు. అలాగే గ్రామంలో పెద్ద మొత్తంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండారెడ్డిపల్లి రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయడంతోపాటు అండర్ డ్రెయినేజీ పనులను ప్రారంభించాలన్నారు. పాల శీతలీకరణ భవనాన్ని కూడా త్వరితగతిన పూర్తిచేయాలని, భగీరథ లైన్ ద్వారా తాగునీటి సరఫరా అందించాలని, గ్రామంలో వందశాతం సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కలెక్టర్ ప్రత్యే క పూజలు చేశారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారి విజయ్‌కుమార్, డీపీఓ రాంమోహన్‌రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘అర గ్యారంటీ కూడా అమలు చేయలేదు’
కల్వకుర్తి రూరల్: ఎన్నికలకు ముందు అడ్డగోలుగా హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు హామీలు అమలులో ఘోర వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, అర గ్యారంటీ కూడా చేయలేదన్నారు. దళిత బంధు, ఫీజు రీయంబర్స్మెంట్, స్కూటీలు, తులం బంగారం అన్ని పథకాలు పక్కన పెట్టి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దామన్నారు. ఈ సందర్భంగా చలో వరంగల్ పోస్టర్‌ను విడుదల చేశారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 3 వేల మంది కార్యకర్తలు, నాయకులు తరలివస్తారన్నారు. ప్రతి కార్యకర్త కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధర్మయుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసి జనరంజక, రైతు ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌గౌడ్, విజితారెడ్డి, గోవర్ధన్, రాంరెడ్డి, బాలయ్య, మధు పాల్గొన్నారు. -
విద్యారంగం అభివృద్ధికే తొలి ప్రాధాన్యత
కందనూలు: విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, సొంత గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని నెలికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఫేర్వెల్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఫేర్వెల్ వేడుకలు విద్యార్థుల మధ్య అనుబంధాన్ని పెంపొందించే విధంగా నిలుస్తాయన్నారు. చదువులో మేలు చేయాలన్న విద్యార్థుల ప్రయత్నాలకు తనవంతు సహాయ, సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ విద్యపైనే ఆధారపడి ఉంటుందని, విద్యతోనే మంచి జీవితం సృష్టించుకోవచ్చని పేర్కొన్నారు. గురువులు చెప్పే మాటలను ప్రామాణికంగా తీసుకుని ఆచరించాలని విద్యార్థులకు సూచించారు. వివిధ స్థాయిలో చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ ఎమ్మెల్సీ ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహమ్మద్ ఇర్ఫాన్, అధ్యాపకులు మదన్మోహన్, వనిత, ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన శనేశ్వరుడి వార్షికోత్సవం బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ గ్రామంలో శనేశ్వరస్వామి 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకుడు విశ్వనాథశాస్త్రి అర్చక బృందం ఉమామహేశ్వరస్వామి వ్రతం నిర్వహించారు. శాంతిహోమం, బలిహరణం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు జరిపారు. సాయంత్రం వడ్డెమాన్ గ్రామస్తులు ఎద్దుల బండ్లతో ఆలయ పరిసరాల్లో శోకటోత్సవం నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్‌రావు అన్నదానం ఏర్పాటు చేశారు. పీయూలో ప్రాంగణ ఎంపికలు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లోని సెమినార్ హాల్లో శనివారం ఎంఎస్ఎన్ లేబరేటరీ నిర్వాహకులు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. కాగా క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ పోస్టుల కోసం యూజీ, పీజీ రసాయన శాస్త్రం విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ ఆఫీసర్ డా.ఎస్ఎన్ అర్జున్‌కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో రాత పరీక్ష ఉంటుందన్నారు. ఇందులో అర్హత సాధించిన ఉద్యోగార్థ్లుకు తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మధుసూదన్‌రెడ్డి, హెచ్ఆర్ సుబ్బారావుతో పాటు క్యూసీ మేనేజర్లు పాల్గొన్నారు. -
తప్పని వెతలు
ఎండలో విధులు.. వడగాలుల నడుమ ట్రాఫిక్ పోలీసుల విధులు ఒకవైపు పోటెత్తిన వాహనాలు.. మరోవైపు నిప్పులు కురిసేలా ఎండ.. ఒక్క క్షణం ఆదమరిచినా ముంచుకొచ్చే ప్రమాదాలు. ఎండల్లో ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సామే. నిప్పుల కుంపటిపై నిల్చొని పని చేస్తున్నట్లు ఉన్నా.. వేడి గాలులు వీస్తున్నా.. వడదెబ్బలు తగులుతున్నా.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నారు. – మహబూబ్‌నగర్ క్రైం/ నాగర్‌కర్నూల్ క్రైంఉదయం 8 గంటల నుంచే ఎండ దంచికొడుతోంది. ప్రస్తుతం దాదాపు 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగకు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి.. కానీ ట్రాఫిక్ పోలీసులకు సెగలు కక్కుతున్న ఎండలో విధులు కొనసాగిస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఎండలతో రోడ్లపై విధులు నిర్వహించే పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నా సమర్థవంతంగా వారి బాధ్యతలు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏకై క ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ మహబూబ్‌నగర్‌లో ఉండగా.. ఇక్కడ మొత్తం 55 మంది పోలీస్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో ఒక సీఐతో పాటు ఇద్దరూ ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, 12 మంది హెడ్‌కానిస్టేబుల్స్, 32 మంది కానిస్టేబుల్స్, ఏడుగురు హోంగార్డులు ఉన్నారు. మిగతా జిల్లాలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ లేనప్పటికీ ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. వనపర్తి జిల్లాలో ఏఆర్ ఎస్ఐ, ఏఎస్ఐ,12 మంది కానిస్టేబుల్స్, నలుగురు హోంగార్డులు, గద్వాల జిల్లాలో ఒక ఏఆర్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది హోంగార్డులు, నాగర్‌కర్నూల్‌లో ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, నలుగురు హోంగార్డులు, ఆరుగురు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో ట్రాఫిక్ విభాగంలో 102 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను బట్టి రెండు షిఫ్ట్‌లుగా విభజించి విధులు కేటాయిస్తున్నారు. మొదటి షిప్ట్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో షిప్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మహబూబ్‌నగర్‌లోని పిస్తాహౌస్, మెట్టుగడ్డ, న్యూటౌన్, సుభాష్ చంద్రబోస్ సర్కిల్,, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, అశోక్ టాకీస్, పాత బస్టాండ్, వన్‌టౌన్ చౌరస్తా, తెలంగాణ కూడలి, పాన్‌చౌరస్తా, గాంధీచౌక్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఉంటుంది. వనపర్తిలో ఇందిరాపార్క్, రాజీవ్ చౌరస్తా, కొత్త బస్టాండ్, గాంధీ చౌక్, నారాయణపేటలోని సత్యనారాయణ చౌరస్తా, ఓల్డ్ బస్టాండ్, మెయిన్ చౌక్, నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో బస్టాండ్ ఇన్‌గేట్, ఔట్‌గేట్ వద్ద, శ్రీపురం చౌరస్తా, రవీంద్రటాకీస్ చౌరస్తా, గద్వాలో పాత బస్టాండ్, కృష్ణవేణి చౌరస్తా, పాత కూరగాయల మార్కెట్, గాంధీ చౌక్, సుంకులమ్మ మెట్టు వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అధిక వేడి వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు పాలమూరులో క్యాప్‌లు, కూలింగ్ అద్దాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ -
ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి..
రోడ్లపై విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది వీలైనంత ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ కలిపిన నీటిని సైతం తీసుకోవాలి. ఎండలోనే ఎక్కువ సమయం నిలబడి ఉండే వారు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు సైతం మేలు చేస్తాయి. చెమటలో నీటితో పాటు లవణాలు ఉంటాయి. వీటిలో సోడియం, క్లోరైడ్ ముఖ్యమైనవి. రోజుకు ఐదు లీటర్ల నీటిని తీసుకోవడంతో పాటు పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఏజీ శంకర్, జనరల్ మెడిసిన్, మహబూబ్‌నగర్ జాగ్రత్తలు పాటిస్తున్నాం జిల్లా ఎస్పీ సూచన మేరకు ఆరోగ్య జాగ్రత్తలు పాటించడంతో పాటు ఇటీవల ఎస్పీ ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ వాటర్ బాటిల్స్, క్యాప్‌లు, కూలింగ్ గ్లాస్లు అందజేశాం. అలాగే ఆరోగ్య పరీక్షలు సైతం చేయించారు. నిత్యం సిబ్బందికి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నాం. – భగవంతురెడ్డి, ట్రాఫిక్ సీఐ, మహబూబ్‌నగర్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి.. పట్టణంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు మొత్తం తిరుగుతూ తనిఖీలు చేస్తుంటాను. ధర్నాలు, ర్యాలీలు, ఇతర ట్రాఫిక్ సమస్యలు వస్తే వెంటనే సంఘటనా స్థలానికి వెళ్తుంటాను. ఇటీవల ఉన్నతాధికారులు అద్దాలు, టోపీలు, వాటర్‌బాటిల్స్ ఇవ్వడం వల్ల సిబ్బందికి ఉపయోగకరంగా మారాయి. మా వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యపరంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. – లక్ష్మయ్య, ఏఎస్ఐ, మహబూబ్‌నగర్ ద్రవ పదార్థాలు తీసుకుంటున్నాం.. దాదాపు ఆరు గంటల పాటు రోడ్లపై విధులు నిర్వహించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రధానంగా నీరు అధికంగా తాగుతున్నాం. ఉన్నతాధికారులు ఇచ్చిన టోపీలు, అద్దాలు ఉపయోగపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో తలనొప్పి వంటి సమస్య వస్తే మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల నుంచి కావాల్సిన సహాయం అందుతుంది. – రాఘవేందర్, ట్రాఫిక్ కానిస్టేబుల్, మహబూబ్‌నగర్ ఎండతో ఇబ్బందికరం.. ట్రాఫిక్ నియత్రించేందుకు ఎండలో నిలబడటం వల్ల ఎండవేడిమితో ఇబ్బందికరంగా ఉంది. షిఫ్ట్‌ల వారీగా విధులు ఉండటంతో కొంత ఉపశమనంగా ఉంది. ఎండవేడిమి నుంచి రక్షణ పొందేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూలింగ్ గ్లాసెస్‌తో పాటు టోపీలను అందజేశారు. ఎండలో ట్రాఫిక్ డ్యూటీలో ఉండే సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా ఉండటంకోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. – శ్రీనివాస్, ట్రాఫిక్ కానిస్టేబుల్, నాగర్‌కర్నూల్ ● -
అణగారిన వర్గాల అభ్యున్నతికి ఫూలే కృషి
నాగర్‌కర్నూల్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిబాఫూలే ఎంతో కృషిచేశారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆడపిల్లలు చదువుకోవాలని, చదువు వల్లనే ఈ సమాజంలో ఆడపిల్లలకు భరోసా ఉంటుందని భావించి ఆ రోజుల్లోనే సీ్త్ర విద్య కోసం విశేష సేవలు అందించారన్నారు. శుక్రవారం ఫూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతి బాఫూలే తన భార్యను మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిని చేసి మహిళా విద్యకు పాటుపడ్డారన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి ఆయన చేపట్టిన సంస్కరణలు ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కుల, లింగ వివక్ష లేకుండా ప్రస్తుతం అందరి జీవనం కొనసాగుతోందని, వారు చూపిన దారిలో నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత జీవితాలను సమాజం కోసం త్యాగం చేసి నలుగురికి ఉపయోగపడేలా మంచి పనులు చేసిన ప్రతిఒక్కరు మహనీయులుగా కీర్తించబడుతున్నారని కొనియాడారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ జ్యోతిబాఫూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి కాజా నజీం అలీ అప్సర్, డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
శనేశ్వరుడికి శతకుంభ తిలతైలాభిషేకం
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌లో వెలసిన జేష్ట్యాదేవి సమేత శనేశ్వరుడి 25వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండోరోజు స్వామివారికి శతకుంభ తిలతైలాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి శుక్రవారం గణపతి పూజానంతరం జేష్ట్యాదేవి సమేత శనేశ్వరులకు వెయ్యి కుంభాలతో నువ్వుల నూనెతో ప్రత్యేక పూజలు, మహాన్యాస పూర్వక అష్టోత్తర సహిత అభిషేక పూజలు జరిపారు. కాగా.. శనివారం ఉదయం 9 గంటలకు ఉమామహేశ్వరస్వామి వ్రతం, శాంతిహోమం, బలిహరణం, పూర్ణాహుతి, సాయంత్ర ఆలయం చుట్టూ బండ్ల ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్‌రావు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు వీరశేఖర్, పుల్లయ్య, ప్రభాకరచారి, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, మల్లికార్జున్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రతి చిన్నారికి టీకాలు అందేలా చూడాలి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతి గర్భిణి సురక్షిత మాతృత్వం పొందాలనే లక్ష్యంతో వైద్య సిబ్బంది పనిచేయాలని, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నిర్వహించే ప్రత్యేక టీకాకరణ కార్యక్రమానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. జాతీయ సురక్ష మాతృత్వ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఆశా నోడల్ పర్సన్స్, ఆశా ఫెసిలిటేటర్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి టీకాకరణ చేయించుకుని, తప్పిపోయిన చిన్నారుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. భవన నిర్మాణ ప్రదేశాలు, ఇటుక, బొగ్గు బట్టీల దగ్గర వలస కుటుంబాల చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ నెల 21 నుంచి 26 వరకు, మే 21 నుంచి 28, జూన్ 23 నుంచి 30 వరకు ప్రతిరోజు టీకాకరణ నిర్వహించాలని సూచించారు. వడదెబ్బ నివారణ చర్యల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డాక్టర్ అజహర్ మాట్లాడుతూ ప్రత్యేక టీకాకరణ శిబిరానికి అన్ని రకాల వ్యాక్సిన్, టీకాలు ఇవ్వాల్సిన చిన్నారులు, గర్భిణుల జాబితాను, తప్పనిసరిగా ఏఎన్ఎంలు తమ వెంట తీసుకువెళ్లాలన్నారు. మాతృ మరణాలు తగ్గించేందుకు కృషి మాతృ మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. ఆమె చాంబర్లో బల్మూర్ మండలంలోని గట్టుతుమ్మెన్, ఊర్కొండ మండలంలోని రాచాలపల్లిలో ఇటీవల జరిగిన మాతృ మరణాలపై సమీక్షించారు. గర్భిణుల వివరాల నమోదు, రక్త, మూత్ర పరీక్షల వివరాలను, ప్రసవ చరిత్ర, ప్రత్యక్ష, పరోక్ష కారణాలు, మాతృ మరణాలను నివారించగల పరిస్థితులపై ఆరాతీశారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి గైనకాలజిస్ట్ నీలిమ మాట్లాడుతూ గర్భిణుల్లో ఏవైనా ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్య సిబ్బంది వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం వల్ల, దానికి తగ్గట్టుగా ప్రసవ ప్రణాళిక చేయడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాస్, డాక్టర్ భీమానాయక్, ప్రోగ్రాం అధికారి లక్ష్మణ్, డీడీఎం సందీప్‌రావు తదితరలు పాల్గొన్నారు. -
ముంచిన నాసిరకం వరి సీడ్
పంట కాలం ముగుస్తున్నా ఈనె దశలోనే వరి బల్మూర్: మా కంపెనీ విత్తనాలతో అధిక దిగుబడి వస్తుందని ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి.. సదరు సీడ్ విత్తనాలతో పంట సాగు చేసిన రైతులు నట్టేట మునిగారు. కంపెనీ పేరుతో మార్కెట్లోకి వచ్చిన సంజీవని (పీఎంఎస్‌పీ–1122) రకం వరి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు పంటలను సాగు చేశారు. కానీ, పంట కాలం ముగుస్తున్నా నేటికీ ఈనె దశలోకి కూడా రాకపోవడంతో నాసిరకం విత్తనాలతో నష్టపోయామని గగ్గోలు పెడుతున్నారు. మండల కేంద్రం బల్మూర్‌కు చెందిన ఎనిమిది మంది రైతులు స్థానికంగా ఓ లైసెన్స్ కలిగిన డీలరు వద్ద సంజీవని (పీఎంఎస్‌పీ– 1122) రకం వరి విత్తనాలు తీసుకెళ్లి నల్ల చెరువు ఆయకట్టు కింద జనవరి మొదటి వారంలో సుమారు 16 ఎకరాల్లో పంట సాగు చేశారు. ప్రస్తుతం తమ పక్క పొలంలో సాగు చేసిన వరి పంటలు కోతలకు రాగా.. తాము సాగు చేసిన సదరు సీడ్ విత్తనం పంటల గడువు దాటినా కూడా ఈనె దశకు రాకపోవడంతోపాటు వివిధ రకాల తెగుళ్లు సోకుతున్నాయని రైతులు వాపోతున్నారు. స్పందించని సీడ్స్ కంపెనీ ప్రతినిధులు నాసిరకం విత్తనాలతో నట్టేట ముంచారని అన్నదాతల ఆవేదన రైతుల ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన డీఏఓ, శాస్త్రవేత్తలు నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడి -
కొత్త పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సకాలంలో ఉచిత పాఠ్యపుస్తకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అందుకు అనుగుణంగా ప్రస్తుత వేసవిలోనే పాఠ్యపుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ రమేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లాకు కొత్త పాఠ్యపుస్తకాలు చేరుకుంటున్నాయని, ఈ మేరకు జిల్లాకేంద్రంలోని టెస్ట్ బుక్స్ గోదాంలో భద్రపరిచిన పాఠ్య పుస్తకాలను జిల్లా టెస్ట్ బుక్ మేనేజర్ నర్సింహులుతో కలిసి డీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో మండల, జిల్లా పరిషత్, ఆదర్శ, గురుకులాలు, కేజీబీవీలు కలుపుకొని జిల్లాలో మొత్తం 939 పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 72,641 మంది విద్యార్థులకు సుమారు 6 లక్షల వరకు ఉచిత పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయన్నారు. జిల్లాకు పుస్తకాలు వస్తున్నాయని, ఇప్పటి వరకు వివిధ తరగతులకు సంబంధించి 35,710 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయని, వచ్చే విద్యా సంవత్సరంలోనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. మే నెలలో జిల్లాకు పూర్తిస్థాయిలో పుస్తకాలు వస్తాయని, ఇక్కడి నుంచి మండలాలకు, పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేస్తామన్నారు. పుస్తకాల జాబితా ఎన్ని వచ్చాయి.. ఎన్ని పంపిణీ చేశారు.. ఏయే పాఠశాలకు ఎన్ని వెళ్లాయి.. తదితర వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేసి పారదర్శకంగా చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి తీవ్ర కృషి చేస్తోందన్నారు. -
అంబేడ్కర్ ఆశయాలను సాధిద్దాం
నాగర్‌కర్నూల్ క్రైం: అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా జడ్జి రాజేష్‌బాబు అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంఘ సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అన్నారు. అంబేడ్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతరావు, మధుసూదన్‌రావు పాల్గొన్నారు. -
అంతుచిక్కని ఆచూకీ.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో అసలేం జరుగుతోంది?
మహబూబ్‌నగర్/నాగర్ కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం ప్రమాద ఘటనలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి గురువారం నాటికి 48 రోజులు అవుతోంది. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో సహాయక సిబ్బంది నిరంతరాయంగా పనులు చేపడుతున్నారు. నిత్యం సహాయక సిబ్బంది 20 మీటర్ల మేర తవ్వకాలు చేపడుతూ శిథిలాలను బయటకు తరలిస్తున్నారు.సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఎనిమిది మంది కారి్మకులు చిక్కుకోగా, మార్చి 9న టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్ మృతదేహాన్ని డీ2 ప్రదేశంలో వెలికితీశారు. మార్చి 25న ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్‌కుమార్ మృతదేహాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురి అచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.సొరంగం లోపల 13.73 కిలోమీటరు నుంచి 13.8 కిలోమీటరు వరకు కన్వేయర్ బెల్టును పొడిగించేందుకు గురువారం లోకో ట్రైన్ ద్వారా కన్వేయర్ బెల్టు, ఇతర సామగ్రిని సొరంగం లోపలికి తరలించారు. ప్రమాద స్థలం వరకు కన్వేయర్ బెల్టును పొడిగిస్తూ మట్టిని తవ్వే ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. వారం రోజుల్లో శిథిలాల తొలగింపును పూర్తి చేసేందుకు సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు. -
పాల ధరల సడలింపు
విజయ డెయిరీలో పాల ధరల్లో హెచ్చుతగ్గులు నాగర్‌కర్నూల్: జిల్లాలో పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. గతంతో పోలిస్తే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంతోపాటు పాడి పరిశ్రమ సైతం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ ద్వారా గతంలో 40 వేల లీటర్ల వరకు పాలు సేకరించగా.. ప్రస్తుతం 74 వేల వరకు పెరిగింది. అయితే ఈ ఏప్రిల్ 1 నుంచి పాల ధరలు సడలిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో గేదె పాల ధరను పెంచగా ఆవు పాలకు ధరలను తగ్గిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. 220 అవుట్లెట్ల ద్వారా.. జిల్లాలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో తొమ్మిది కేంద్రాలు మాత్రమే కొనసాగుతున్నాయి. జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్, కొండారెడ్డిపల్లి, అచ్చంపేట, వెల్దండ, ఊర్కొండ, మాధారం, గుండూరు, కల్వకుర్తి, కుప్పగండ్ల ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ కేంద్రాలు కొనసాగిస్తున్నారు. రూర్బన్ పథకం కింద పెద్దకొత్తపల్లిలో మండలం పెద్దకార్పాములలో ఏర్పాటు చేస్తున్న పెరుగు తయారీ కేంద్రానికి సంబంధించి పనులు పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అయితే జిల్లాలో తొమ్మిది కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా.. 220 అవుట్లెట్ల ద్వారా పాలు సేకరిస్తున్నారు. జిల్లాలో పాల ఉత్పత్తి 1.70 లక్షల లీటర్లు తగ్గించిన ఆవు పాల ధర రూ.4.33 విజయ డెయిరీ సేకరిస్తున్న పాలు 74,000 లీటర్లు పెంచిన గేదె పాల ధర రూ.4.50 తీవ్రంగా నష్టపోతాం.. గ్రామీణ ప్రాంతాల్లో గేదెలకు బదులు ఆవులను అధికంగా పెంచుతాం. కానీ, ప్రభుత్వం గేదెపాలకు ధర పెంచి ఆవుపాలకు తగ్గించింది. లీటరు ఆవు పాలకు గతంలో రూ.46 ఇస్తుండగా.. ప్రస్తుతం ఆ ధరను రూ.4 తగ్గించి రూ.42లకే పరిమితం చేసింది. ఫలితంగా ఆవు పాల రైతులం తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం పునరాలోచించి ఆవు పాల ధర పెంచి రైతులను ఆదుకోవాలి. – కొండలయ్య, పాడిరైతు, గట్టునెల్లికుదురు 1 నుంచే అమల్లోకి.. విజయ డెయిరీలో సవరించిన పాల ధరలు ఈ నెల 1 నుంచే అమలులోకి వచ్చాయి. ప్రతి మూడు, నాలుగు నెలలకొకసారి సంస్థ చేపట్టే సమీక్షలో భాగంగా ధరలు హెచ్చు తగ్గులు అవుతుంటాయి. రైతులతో చర్చించే పాల ధరలను నిర్ణయిస్తారు. ఈసారి కూడా అదే కోవలో పాల ధరలను నిర్ణయించారు. – ధన్‌రాజ్ డీడీ, పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఆవు పాలకు తగ్గింపు, గేదె పాలకు పెంపు జిల్లాలో అత్యధికంగా ఆవు పాలే సేకరణ తీవ్రంగా నష్టపోనున్న పాడిరైతులు -
రథచక్రాలు
కదిలిన రాములోరిపకడ్బందీగా వరిధాన్యం కొనుగోళ్లు ● అంగరంగ వైభవంగా పెద్ద తేరు మహోత్సవం ● జనసంద్రమైన సిర్సనగండ్ల ● మార్మోగిన శ్రీరామ నామం వివరాలు 8లో u– చారకొండ నాగర్‌కర్నూల్: జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరిధాన్యం కొనుగోలుకు పగడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యాసంగి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ అమరేందర్, ఆయా శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సీజన్లో 2,87,297 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారన్నారు. ఇందుకోసం జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాలు ఐకేపీ ఆధ్వర్యంలో 70, మెప్మా 4, పీఏసీఎస్ 160 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వం గ్రేడ్–ఏ రకం ధాన్యానికి క్వింటాల్ రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధరతోపాటు సన్న రకం ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తుందన్నారు. ఈ నెల 15లోగా 234 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, కేంద్రానికి ధాన్యం వచ్చినప్పటి నుంచే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సన్నాలు, దొడ్డురకం వేర్వేరుగా కొనుగోలు చేయాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు తాగునీరు, షామియానా, కుర్చీలు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం సేకరణకు సంబంధించి వివరాలను ట్యాబ్‌లో ప్రతిరోజు నమోదు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు లారీల కొరత లేకుండా చూడాలని, ప్యాడీ క్లీనర్లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. వరిధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈవీఎం గోడౌన్ పరిశీలన జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ను గురువారం కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియ భాగంగా ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను, పోలీసు బందోబస్తును పరిశీలించారు. కలెక్టర్ వెంట గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రవికుమార్, కల్పన తదితరులున్నారు. -
‘ర్యాలంపాడు’ లీకేజీల పరిశీలన
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్‌కు ఏర్పడిన లీకేజీలను సీడబ్ల్యూపీఆర్ఎస్ పూణెకు చెందిన నిపుణుల బృందం గురువారం పరిశీలించింది. ఉదయం11.30 గంటలకు రిజర్వాయర్ వద్దకు చేరుకున్న డాక్టర్ సంజీవ్ బరేలే, సునీల్ పిల్లై (కేరళ), కే. నర్సయ్య (ఏపీ కాకినాడ), మందిర ముజుకుదార్, తనుశ్రీ సమంత తదితరుల బృందం సభ్యులు దాదాపు 3 గంటల పాటు ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా ఎడమ కాల్వ వద్ద నీటి లెవెల్స్, ప్రాజెక్టు బండ్ అండ్ గ్రౌండ్ లెవెల్లను పరిశీలించారు. ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్‌తో పలు విషయాలు ఆరా తీశారు. ప్రాజెక్టు డిజైన్ మ్యాప్స్, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎలాంటి మెటీరియల్ వాడారు, ప్రాజెక్టు డిజైన్‌ను ఏ సంస్థ చేపట్టింది, ముందుగా సమస్య ఎక్కడ ఏర్పడింది అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎంత, లీకేజీల తరువాత ఎంత మేర నీటిని నిల్వ చేస్తున్నారనే దానిపై ఆరా తీశారు. అక్కడి నుంచి లీకేజీలు ఏర్పడిన మూడు ప్రాంతాలను బండ్ ప్రాంతాలకు వెళ్లి క్షేత్ర స్థాయి పరిశీలించారు. ప్రస్తుతం ర్యాలంపాడు రిజర్వాయర్‌లో నీటి లెవెల్ కేవలం 0.2 టీఎంసీలు మాత్రమే ఉండడంతో లీకేజీ ప్రాంతాల వద్ద ఊట లేకపోవడంపై చర్చించారు. ప్రాజెక్టుపై భాగంలో ఎలాంటి సమస్య లేదని, కేవలం తగ్గు ప్రాంతాల వద్ద మాత్రమే లీకేజీ సమస్య వచ్చినట్లు గుర్తించామని బృందం సభ్యులు తెలియజేశారు. లీకేజీలు ఏర్పడటానికి గల కారణాలను అధ్యయనం చేసందుకు ఇక్కడి నుంచి కొంత మెటీరియల్‌ను తీసుకు వెళ్లి టెస్టులు నిర్వహించి త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను సంబంధిత సీఈకి అందిస్తామని బృందం సభ్యులు తెలియజేశారు. ఇక్కడి నుంచి కృష్ణా నది కలిసే ప్రాంతం దూరాన్ని అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ ప్రధాన కాలువల వెంట అక్కడక్కడ చేపట్టాల్సిన పనులపై ఎస్ఈ రహీముద్దీన్‌కు వివరించారు. పనులు త్వరలోనే పూర్తి చేస్తామని సభ్యులకు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు పరిదిలోని మిగతా రిజర్వాయర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నోనిపల్లి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ప్రాజెక్టు డిజైన్, వాడిన మెటీరియల్‌పై పూణె నిపుణుల బృందం ఆరా -
ప్రతిఒక్కరూ భక్తిభావంతో మెలగాలి
తెలకపల్లి: హిందు ధర్మాన్ని ప్రతిఒక్కరు కాపాడుకోవాలని అంబాత్రాయ క్షేత్ర పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామీజీ అన్నారు. తెలకపల్లిలో గురువారం రాత్రి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం వార్షికోత్సవ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వామీజీకి భక్తులు మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ భక్తులనుద్దేశించి మాట్లాడారు. హిందువులంతా ధర్మం కోసం పాటుపడాలని, భక్తిభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. ఇతర మతాలకు ఆకర్షితులు కావొద్దని భక్తులకు సూచించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, హిందూ దేవతలను నిత్యం పూజించాలన్నారు. ఏ ఒక్కరు పరమతానికి వెళ్లవద్దని, ఈ దేశంలో అత్యుత్తమమైనది హిందూ మతం అన్నారు. హిందూ మతాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను, భారత దేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవితాన్ని గడపాలని ఆయన ఆకాక్షించారు. -
ఎస్ఏ–2 పరీక్షలు ప్రారంభం
కందనూలు/వెల్దండ: జిల్లాలో 1నుంచి 9 తరగతుల విద్యార్థులకు సమ్మెటీవ్ అసెస్మెంట్–2 పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. వెల్దండ మండలం పెద్దాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తుంకిబండ తండా ప్రాథమిక పాఠశాలలను డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మికంగా సందర్శించి.. పరీక్షల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ప్రభు త్వ, ప్రైవేటు, గురుకులాలు తదితర 1,100 పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలి పారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు గాలి, వెలుతురు పుష్కలంగా ఉండేలా చూడాలని హెచ్ఎంలకు సూచించారు. ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగే పరీక్షలను సమర్థవంతగా నిర్వహించాలని తెలిపారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఈ నెల 23న ఫలితాలు వెల్లడించాలని.. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటుచేసి ప్రోగ్రెస్ కార్డులను అందించాలని డీఈఓ సూచించారు. డీఈఓ వెంట జిల్లా టెస్ట్ బుక్ మేనేజర్ నర్సింహులు, ఇన్చార్జి ఎంఈఓ చంద్రుడు నాయక్ ఉన్నారు. సజావుగా ‘పది’ మూల్యాంకనం కందనూలు: జిల్లా కేంద్రంలో పదో తరగతి వార్షి క పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం సజా వుగా కొనసాగుతుందని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. స్థానిక లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో బుధవారం రెగ్యులర్ విద్యార్థుల పరీక్ష పేపర్లు తెలుగు 6,761, హిందీ 6,089, ఆంగ్లం 4,144, గణితం 7,175, ఫిజికల్ సైన్స్ 8,331, బయోసైన్స్ 5,098, సోషల్ స్టడీస్ 5,908తో కలిపి మొత్తం 43,898 పేపర్లను మూల్యాంకనం చేసినట్లు డీఈఓ వెల్లడించారు. మూల్యాంకనం కేంద్రంలో ఉపాధ్యాయులకు పలు సూచనలు చేయడంతో పాటు ప్రథమ చికిత్స మందులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎగ్జామ్స్ ఏసీ రాజశేఖరరావు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ కురుమయ్య పాల్గొన్నారు. -
రాజ్యాధికారం కోసం ఉద్యమిద్దాం
బిజినేపల్లి: అగ్రకుల నాయకుల సహకారంపై ఆధారపడకుండా బీసీలు స్వయంగా ఉద్యమించి రాజ్యాధికారం సాధించుకోవాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం బిజినేపల్లిలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జాజులతో పాటు ప్రొ.కాశీం, బీఆర్ఎస్ రాష్ట్ర నేత బైకాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దీలీపాచారి హాజరయ్యారు. ఫూలే విగ్రహావిష్కరణ అనంతరం జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. జనాభాలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు 10 శాతం జనాభా ఉన్న వారికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అగ్రకులాల వారే బలహీన కులాల వారని.. బీసీలు బలమైన కులస్తులని అన్నారు. పోలవరంలో మునిగిపోయిన పడవను నలుగురు గంగపుత్రులు పట్టుకొచ్చారని గుర్తుచేశారు. కులవృత్తుల వారు లేకుంటే ఇతర వర్గాలకు బతుకు లేదని.. బీసీల చేతిలో గుత్ప ఉంటేనే రాజ్యాధికారం వస్తుందన్నారు. ప్రొ.కాశీం మాట్లాడుతూ.. జ్యోతిరావు ఫూలే ముదిరాజ్ కులస్తుడని, ఆయనను చదువుకు దూరం చేయాలని కొందరు యత్నిస్తే.. క్రైస్తవ పాస్టర్ వద్దకు రాత్రి బడికి వెళ్లి చదువుకున్నారని గుర్తుచేశారు. బీసీలు కులవృత్తుల వల్ల చదువుకు దూరమయ్యారన్నారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలు ఎందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేకపోతున్నారని.. అతి తక్కువ జనాభా ఉన్న అగ్రకులాలు ఎందుకు రాజ్యమేలుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. బీసీలు ఏకమై ఉద్యమిస్తేనే భవిష్యత్‌లో రాజ్యాధికారం సాధిస్తామన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొ.పెబ్బేటి మల్లికార్జున్, స్థానిక నాయకులు బాలరాజ్‌గౌడ్, మంగి విజయ్, కుర్మయ్య, మిద్దె రాములు, రాజేందర్గౌడు, రామన్‌గౌడు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల ఆరోగ్యంపై నజర్
నాగర్‌కర్నూల్ క్రైం: ఆరేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. వారిలో ప్రాథమిక దశలోనే దృష్టిలోపాలు, మానసిక ఎదుగుదల సమస్యలను నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కంటి పరీక్షలతో పాటు మానసిక సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రత్యేక బృందాలతో 0–6 ఏళ్లలోపు చిన్నారులకు అన్ని పరీక్షలు నిర్వహించి.. అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. దృష్టిలోపం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 47,317 మంది చిన్నారులు.. జిల్లావ్యాప్తంగా 1,131 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. ఆరేళ్లలోపు చిన్నారులు 47,317 మంది ఉన్నారు. తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్ల సమక్షంలో వారికి కంటి పరీక్షలతో పాటు మానసిక ఎదుగుదలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాలను కంటివైద్య నిపుణులు, ఆర్బీఎస్కే సంచార ఆరోగ్య బృందాలు సందర్శించి.. చిన్నారుల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే వాటిని పరీక్షిస్తున్నారు. కంటి పరీక్షల కోసం ప్రత్యేకంగా బొమ్మలతో కూడిన చార్ట్ వినియోగిస్తున్నారు. ఈ పరీక్షల్లో కంటిచూపుతో పాటు మెల్లకన్ను, కార్నియా సమస్యలు, కంటి తేమలోపం, పొడిబారి పోవడం వంటి వాటిని ఆఫ్తాలమిక్ వైద్యులు గుర్తిస్తున్నారు. చిన్నారుల్లో దృష్టిలోపాలు ఉంటే.. జిల్లా జనరల్ ఆస్పత్రిలోని కంటి స్పెషలిస్టు వైద్య నిపుణులతో మళ్లీ పరీక్షించి.. తగిన చికిత్సలతో పాటు కంటి అద్దాలను ఉచితంగా అందించనున్నారు. అదే విధంగా ఆర్బీఎస్కే వైద్యులు చిన్నారుల మానసిక ఎదుగుదల లోపాలను గుర్తిస్తున్నారు. చిన్నారులు సరిగ్గా మాట్లాడుతున్నారా.. ప్రవర్తనలో ఏమైనా అసహజ మార్పు లు, వయసుకు తగ్గుట్టు ఎలా స్పందిస్తున్నారు.. మానసిక ఎదుగుదల మైలురాళ్లను పరీక్షిస్తున్నారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో 10 ప్రత్యేక బృందాలతో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 8 అంగన్వాడీ కేంద్రాల్లో 923 మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేశారు. వీరిలో 9మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. మానసిక ఎదుగుదలకు సంబంధించి 45 అంగన్వాడీ కేంద్రాల్లో 1,834 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురు చిన్నారులకు మానసిక ఎదుగుదల సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. వీరిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ప్రత్యేక కార్యాచరణ.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కంటి పరీక్షలతో పాటు మానసిక ఎదుగుదల సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్స అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ప్రత్యేక శిబిరాల్లో చిన్నారులకు పరీక్షలు చేసేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. దృష్టిలోపం సమస్యలు ఉన్న వారికి అద్దాలు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన చికిత్స అందిస్తాం. – డా.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్ఓ అంగన్వాడీ కేంద్రాల్లో కంటి, మానసిక పరీక్షలు ఈ నెల7న ప్రత్యేక శిబిరాలు ప్రారంభం దృష్టిలోపం ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలు చిన్నారుల మానసిక ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ -
రేషన్ కార్డు లేకపోవడంతో..
రాజీవ్ యువవికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వెళితే రేషన్‌కార్డు అడిగారు. మాకు రేషన్‌కార్డు రాకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకం తీసుకోలేదు. కొత్త ప్రభుత్వంలోనైన రేషన్‌కార్డు వస్తుందనుకుంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడంలేదు. – రాజు, గద్వాల పట్టణం టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తాం యువ వికాసం పథకం దరఖాస్తులకు సంబంధించి పలు టెక్నికల్ సమస్యలు మా దృష్టికి వచ్చాయి. కొన్నింటిని పరిష్కరించాం. కొత్త మండలాల్లో బ్యాంకులు, గ్రామాలు తదితర సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ లోన్ కింద దరఖాస్తు చేసుకునే వారు మహబూబ్‌నగర్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వస్తే వెంటనే పరిష్కరిస్తాం. ఎవరూ ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం ఉంది. – ఇందిర, బీసీ సంక్షేమ శాఖ అధికారి, మహబూబ్‌నగర్ ● -
మెరుగైన విద్య అందించాలి
తిమ్మాజిపేట/తెలకపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. తిమ్మాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుదవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తెలకపల్లి సీఎల్ఆర్ విద్యాసంస్థల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ఏర్పాటుపై కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. విద్యార్థులు అత్యాధునిక విద్యా ప్రమాణాలతో ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం చైర్మన్‌ను సత్కరించారు. ఆయన వెంట అధికారులు రాధాకృష్ణ, శివరాం, రామరాజు, మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్ జాకీర్ అలీ, ఎంఈఓలు శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణశెట్టి, సీఎల్ఆర్ విద్యాసంస్థల యాజమాన్యం లక్ష్మారెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, రాజమహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే సలేశ్వరం లింగమయ్య జాతరకు జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ యా దయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని.. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం బల్మూర్: జిల్లాలో అవకతవకలకు తావులేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా హౌసింగ్ పీడీ సంగప్ప అన్నారు. బుధవారం బల్మూర్‌లో మోడల్ ఇందిరమ్మ హౌస్ నిర్మాణంతో పాటు పైలెట్ గ్రామం జిన్‌కుంటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలో మొదటి విడతగా 353 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. బల్మూర్ మండలం జిన్‌కుంట గ్రామానికి 73 ఇళ్లు మంజూరైనట్లు చెప్పారు. ఇందులో 50 ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ ఇవ్వగా.. 12 నిర్మాణాలు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయని వివరించారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా జియో ట్యాంగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసినప్పటి నుంచి.. నిర్మాణం పూర్తయ్యే వరకు పకడ్బందీగా పర్యవేక్షణ ఉంటుందన్నారు. పీడీ వెంట డీఈ ఆనంద్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ రాఘవులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, భూషన్న ఉన్నారు. దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్ కందనూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువవికాస పథకంలో దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారిణి కె.రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయేతర రుణాలకు దరఖాస్తు చేసుకునే వారు 21–55 ఏళ్లు, వ్యవసాయ రుణాలకు దరఖాస్తు చేసుకునే వారు 21–60 ఏళ్లు ఉండాలన్నారు. ఆసక్తిగల దివ్యాంగులు ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
గరుడ వాహనంపై ఊరేగిన రామయ్య
చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున స్వామివారికి గరుడ వాహన సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జైశ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. అంతకుముందు ఆలయంలో సీతారామచంద్రస్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అదే విధంగా శివదత్తాత్రేయ, పరశురామ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల తరలివచ్చిన భ క్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్ శర్మ, మురళీదర్ శర్మ, సీతారామశర్మ, కోదండరామశర్మ, రఘుశర్మ, ప్రవీణ్‌శర్మ, అనంతరామశర్మ, భాస్కరశర్మ పాల్గొన్నారు. స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తున్న భక్తులు -
సద్వినియోగం చేసుకోవాలి
ఎర్లీబర్డ్ స్కీం ఐదు శాతం ఆఫర్ ఈసారి పాత బకాయిదారులకు కూడా వర్తిస్తోంది. మొత్తం బకాయిలు చెల్లించి, 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ముందస్తు చెల్లించే వారికి అవకాశం ఉంటుంది. ఈ సదావకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుని ముందుస్తు పన్ను చెల్లించాలి. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి. – యాదయ్య, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట జిల్లాలోని మున్సిపాలిటీల్లోఈ ఏడాది ఆస్తిపన్ను వివరాలు మున్సిపాలిటీ అసెస్మెంట్లు పన్ను డిమాండ్ (రూ.కోట్లలో) నాగర్‌కర్నూల్ 11,028 4.20 కల్వకుర్తి 8,195 2.48 అచ్చంపేట 6,857 2.30 కొల్లాపూర్ 6,536 0.90 -
ఈదురు గాలుల బీభత్సం
కొల్లాపూర్: పట్టణంలో మంగళవారం సాయంత్రం అకాలవర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో భారీగా ఈదురుగాలులు వీచి బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆర్డీఓ కార్యాలయంలో చెట్టు కొమ్మలు విరిగి కార్లపై పడటంతో కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల కారణంగా మామిడితోటల్లో కాయలు రాలాయి. వరిదేల మాసూంబాబా దర్గా ముందు గల హైమాస్ట్ లైట్ విద్యుత్ స్తంభం విరిగి వైర్ల పడింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే మరమ్మతు చేపట్టగా.. కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా పంటలు, పండ్లతోటలు ఏమైనా దెబ్బతిన్నాయా అనే వివరాలు సేకరిస్తున్నట్లు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. -
నేటినుంచి ఎస్ఏ–2 పరీక్షలు
కందనూలు: జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మెటివ్ అసెస్మెంట్–2) నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే ఆయా ఎమ్మార్సీల నుంచి ప్రశ్నపత్రాలు పాఠశాలలకు చేరుకున్నాయి. జిల్లాలో మొత్తం 1,019 పాఠశాలలు ఉండగా.. వీటిలో 1 నుంచి 9వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ మాధ్యమాల్లో కలిపి 1,06,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. పరీక్షల సమయం ఇలా.. అన్ని తరగతులకు ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. 1 నుంచి 7వ తరగతి వరకు 11– 30 గంటల వరకు, 8వ తరగతికి 11.45 గంటల వరకు, 9వ తరగతికి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక విద్యార్థులకు ఈ నెల 11న తెలుగు, 12న ఆంగ్లం, 15న గణితం, 16న పరిసరాల విజ్ఞానం పరీక్షలు కొనసాగుతాయి. 6, 7 తరగతుల వారికి 9న తెలుగు, 10న హిందీ, 11న ఆంగ్లం, 12న సాంఘికశాస్త్రం, 15న జనరల్ సైన్స్, 16న గణితం పరీక్షలు ఉంటాయి. 8, 9 తరగతులకు 9న తెలుగు, 10న హిందీ, 11న ఆంగ్లం, 12న గణితం, 15న భౌతికశాస్త్రం, 16న జీవశాస్త్రం, 17న సాంఘికశాస్త్రం పరీక్షలు రాయనున్నారు. 23న పీటీఎం నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని జిల్లా డీసీఈబీ అధికారి రాజశేఖర్‌రావు తెలిపారు. జిల్లాలో 1,06,000 మంది విద్యార్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు -
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారత సాధించే విధంగా ప్రోత్సహిస్తుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అందుకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా అత్యాధునిక వసతులతో మహిళా సమాఖ్య భవనం నిర్మించనున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రూ.5 కోట్ల నిధులతో పట్టణంలోని సర్వే నం.29లో 786 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 13 గదులతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనం, మహిళల శిక్షణ కార్యక్రమాలు, సమావేశాలు, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు, కార్యాలయ వినియోగం, సామూహిక చర్చలకు ఉపయోగపడే విధంగా రూపకల్పన చేసినట్లు వివరించారు. మహిళా సమాఖ్య భవనం నిర్మాణం పూర్తయితే గ్రామీణ మహిళలకు మరింత శిక్షణ అవకాశాలు, సామూహిక కార్యాచరణకు వేదికలు, పాలకవర్గాల సమావేశాలు నిర్వహించుకునే అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. మహిళల అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ తబితారాణి, పీఆర్ఏఈ శివకృష్ణ తదితరులు ఉన్నారు. -
నల్లగొండకు సాగునీరు తరలించడం అన్యాయం
కందనూలు: జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లాకు అక్రమంగా సాగునీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓను విడుదల చేసిందని, దీనిని అడ్డుకునేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎమ్యెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముఖ్యమంత్రిని నిలదీయాలని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అధికార పార్టీ నేతలకు ప్రాజెక్టులపై అవగాహన లేదని, ప్రజల కోసం పనిచేయకుండా స్వార్థం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలోనే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అన్ని అనుమతులను సాధించడం జరిగిందని, తద్వారా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూపొందించిన పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఇంజినీర్ ఆడించే ఆటగా పాలకులు పనిచేస్తున్నారని ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు అందించవచ్చని, అందుకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రి జీఓను కూడా విడుదల చేశారని దానిని పక్కన పెట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు చేస్తున్న కుట్రలతో ఉమ్మడి పాలమూరు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు అర్థం రవి, బాలగౌడ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీలో డీఈఓ విచారణ
కందనూలు: జిల్లాకేంద్రం శివారులోని నాగనూలు కేజీబీవీలో మంగళవారం డీఈఓ రమేష్‌కుమార్ విచారణ చేపట్టారు. వివరాలు ఇలా.. కేజీబీవీలో 9వ తరగతి విద్యార్థిని స్టడీ అవర్స్‌కు ఆలస్యంగా వచ్చిందని మూడు గంటల పాటు నిలబెట్టిన ఓ ఉపాధ్యాయురాలు కనీసం నీళ్లు తాగనివ్వకుండా, బాత్రూం వెళ్లకుండా పనిష్మెంట్ ఇచ్చిందని మనస్తాపంతో చేయి కోసుకుంది. సమాచారం అందుకున్న డీఈఓ రమేష్‌కుమార్ కేజీబీవీ జిల్లా బాలిక అభివృద్ధి అధికారి శోభారాణితో కలిసి పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులతో విచారణ జరిపారు. విద్యార్థులను కలిసి ఉపాధ్యాయురాలి తీరు, విద్యార్థులతో ప్రవర్తిస్తున్న విధానం గురించి తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదిక కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. ముందుగా ఘటనకు కారకురాలైన ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీస్ జారీ చేశామని, ఉపాధ్యాయురాలి వివరణ అనంతరం పూర్తిస్థాయిలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఈఓ చెప్పారు. అయితే ఉపాధ్యా యురాలిని సస్పెండ్ చేయాలని పాఠశాల వద్ద మంగళవారం విద్యార్థి, కుల సంఘాల నాయ కులు ఆందోళన చేపట్టారు. పోలీసులు పాఠశాల దగ్గరకు వచ్చి విద్యార్థినికి న్యాయం చేస్తా మని చెప్పడంతో ఆందోళన విరమించారు. బ్యాంక్ సేవలు గ్రామీణులకు చేరువ చేయాలి లింగాల: మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకు సేవలను మరింత చేరువ చేయాలని ఆర్బీఐ లీడ్ జిల్లా అధికారి డిబోజిత్ భౌరా అన్నారు. మంగళవారం లింగాలలోని సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని సందర్శించిన ఆయన కేంద్రం నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంక్ సేవలపై ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారనే విషయాలను తెలుసుకొని.. సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సైబర్ క్రైం మోసాల గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రం పనితీరును మరింతగా మెరుగుపర్చుకొని సమర్థవంతంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు, యూబీఐ అధికారి లక్ష్మణ్, ఎఫ్ఎల్సీ శేషయ్య, సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు ఎండీ మన్సూర్, రూపే ష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. నేడు ఏఐపై జాతీయ సెమినార్ జడ్చర్ల టౌన్: డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్యశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)పై జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా.సుకన్య తెలిపారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘వాణిజ్య రంగంలో ఏఐ ప్రభావం’ అన్న అంశంపై ఒకరోజు సెమినార్ కొనసాగుతుందని దేశంలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి సెమినార్ కోసం ఆన్లైన్ ద్వారా ఇప్పటికే 130 జనరల్స్ వచ్చాయన్నారు. త్వరలోనే విద్యార్థులకు పాఠ్యాంశంగా తేబోతున్న ఏఐతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని అన్నారు. సరైన మార్గంలో వినియోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని, దానివల్ల కలిగే అనర్థాలు అదే తరహాలో వివిధ కళాశాలల నుంచి ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారన్నారు. సెమినార్‌కు రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, పీయూ వైస్ చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్, సీసీఈ జేడీ జి.యాదగిరి, రాజేందర్‌సింగ్, ఏజీఓ బాల భాస్కర్, ముఖ్యవక్త యలమంచిలి రామకృస్ణ, రీసోర్స్ పర్సన్ డా.కె.రాజ్‌కుమార్ హాజరుకానున్నారని తెలిపారు. వైస్‌ప్రిన్సిపాల్ డా.నర్మద, మీడియా కన్వీనర్ రాఘవేందర్, సభ్యులు సతీష్ పాల్గొన్నారు. -
ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్దాం
నాగర్‌కర్నూల్ రూరల్: సీపీఎం సీనియర్ నాయకుడు రణదివే ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్దామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్యర్యంలో రణదివే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ.. టెక్స్టైల్స్, రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రణదివే చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన 1969 వరకు ఏఐటీయూసీలో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. పాలకవర్గాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ఉద్యమాలు చేపట్టడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, రాధాకృష్ణ, రాజు, నరేష్, రామస్వామి పాల్గొన్నారు. -
బీజేపీని మరింత బలోపేతం చేద్దాం
కందనూలు: క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీని స్థాపించి నేటితో 46 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఎంతో మంది పార్టీ కో సం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తుండటంతో నే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. -
బెట్టింగ్ భూతం..!
పందాలతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న యువత ● ఐపీఎల్ సీజన్లో పందెంరాయుళ్ల బిజీ ● జోరుగా క్రికెట్ బెట్టింగ్ ● బలవుతున్న యువత ● యాప్‌ల్లో మోసపోతున్నా.. బయటకు పొక్కకుండా జాగ్రత్తలు కేసులు నమోదు చేస్తాం.. బెట్టింగ్ ఆడుతున్నట్లు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తాం. అనుమానం ఉన్న వ్యక్తులపై, గ్రామాల్లో నిఘా పెంచుతాం. ఇప్పటి వరకు బెట్టింగ్‌ల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండాలి. – శ్రీనివాసులు, డీఎస్పీ, అచ్చంపేట అచ్చంపేట రూరల్: కొందరు యువత ఆటను ఆస్వాదిస్తుండగా.. మరికొందరు సొమ్ము చేసుకోవాలని ఆశపడి బోల్తా పడుతున్నారు. బెట్టింగ్‌లతో జేబులు గుల్లా చేసుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ చోట క్రికెట్ ఆడినా.. ఎలాంటి ఫార్మాటైనా పందెం ఆడుతూ బానిసలుగా మారుతున్నారు. బెట్టింగ్‌లతో జరగాల్సిన నష్టం జరిగి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో పట్టణాలు, నగరాల్లోనే బెట్టింగ్‌లు జరిగేవి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ పల్లె, పట్టణం తేడా లేకుండా అంతటా బెట్టింగ్ భూతం పట్టి పీడిస్తోంది. ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్‌ల జోరుతో పందెం రాయుళ్లకు పండుగ వాతావరణం నెలకొంది. పల్లెలకు పాకిన పందెం.. చాపకింద నీరులా క్రికెట్ బెట్టింగ్ పల్లెల్లోకూ వ్యాపించింది. గ్రామీణ యువత కొందరు తమ సెల్ఫోన్లో బెట్టింగ్‌లకు సంబంధించిన యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ విధానంతో పందెం కాస్తున్నారు. మరికొందరు ఆఫ్‌లైన్ విధానంలోనూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఆఫ్‌లైన్‌కు సంబంధించి ఓ వ్యక్తి మధ్యవర్తిగా ఉండి తతంగం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో యువత ఓ దగ్గర కూర్చొని బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్, ప్లేయర్ల స్కోర్, వికెట్లపై బెట్టింగ్ కడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కోడ్ భాషతో మాట్లాడుకుంటూ పందెం కాస్తున్నారు. ప్రతి ఒక్కరి వద్ద సెల్‌ఫోన్ ఉండటంతో ఎప్పటికప్పుడు పందెం రాయుళ్లకు సమాచారం అందించి లావాదేవీలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే యువత ఆసక్తి, సరదా పందెం రాయుళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. విదేశాల్లోనూ సంబంధాలు.. దేశానికి చెందిన కొంత మంది యువకులు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడి వారితో మన దేశంలో ఉన్న యువతకు పరిచయాలు ఉండటంతో వారితోనూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుతున్నారు. పందెంలో గెలిచిన వారికి ఓడిన వారు మరుసటి రోజు ఉదయం డబ్బులను అకౌంట్లో వేస్తారు. మధ్యవర్తిగా ఉన్న వారు 10 – 15శాతం కమీషన్ తీసుకుంటున్నారు. తెలిసిన వారు ఇదేం పద్ధతి అని ప్రశ్నిస్తే.. తాము ఎంచుకున్న యాప్ అధికారికమని, ఐటీ కూడా చెల్లిస్తున్నామని చెప్పుకొస్తున్నారు.అప్పుల ఊబిలో యువత.. యువతకు బెట్టింగ్ ఓ వ్యసనంలా మారింది. కొందరు ఎలాంటి పనులు చేయకుండా బెట్టింగ్‌పైనే ఆధారపడుతున్నారు. అయితే పట్టణాలతో పాటు పల్లెల్లోనూ బెట్టింగ్‌లతో డబ్బులు నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. చివరకు అప్పులపాలై ఆత్మహత్యకు యత్నిస్తున్నారు. మరికొందరు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. బెట్టింగ్‌ను అరికట్టకపోతే పెను ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదు. సరదా కోసం బెట్టింగ్ కాసిన ఎంతో మంది వ్యసనంలా మార్చుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్లో పిల్లలపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
తాడూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం తగదని.. కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కోకన్వీనర్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. తాడూరు మండలం పాపగల్లో ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతర పోరాటాలతోనే కార్మికుల డిమాండ్లు సాధ్యమవుతాయన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఆంజనేయులు, రాంచంద్రయ్య, కృష్ణయ్య, చెన్నయ్య, బాలయ్య పాల్గొన్నారు. రామన్‌పాడులో 1,015 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం 1,015 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల్లో నీటి సరఫరా లేదని.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 15 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 52 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. హ్యాండ్‌బాల్ పోటీలకు పాలమూరు క్రీడాకారులు మహబూబ్‌నగర్ క్రీడలు: ఒడిశా రాష్ట్రంలో మంగళవారం నుంచి శనివారం వరకు జరిగే జాతీయ సబ్ జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీ లకు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. సాయి వివేక్, ఎండీ నవాజ్ తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి ఎంపికపై సంఘం సభ్యులు రజనీకాంత్‌రెడ్డి, ఎండీ జియావుద్దీన్, ఎండీ అహ్మద్ హుస్సేన్, కోచ్ ప్రదీప్‌కుమార్, పీఈటీ ప్రణయ్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. తుర్క కాశలను ఆదుకోవాలని వినతి స్టేషన్ మహబూబ్‌నగర్: అన్ని రంగాల్లో వెనుకబడిన తుర్క కాశ (బీసీ–ఈ)లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ తుర్క కాశ కార్మిక సంక్షేమ సంఘం జిల్లా ప్రతినిధులు ఆదివారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌కు వినతిపత్రం అందజేశారు. బీసీ–ఈ 14 నంబర్లో తుర్కకాశ, పత్తార్పోడ్లుగా పిలవబడే ముస్లిం కులస్తులు బండలు కొట్టుకుంటూ అరకొర జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తుర్కకాశలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ, ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అనంతరం కొత్వాల్‌ను ఘనంగా సన్మానించారు. తుర్క కాశ కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జుబేర్, ఉపాధ్యక్షుడు షేక్ ఖాజా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబుబకర్, సలహాదారులు చోటో హుస్సేన్‌మియా, జిల్లా ఇన్చార్జీ పాష, మహెబూబ్ పాల్గొన్నారు. -
మహనీయుడు.. జగ్జీవన్‌రాం
నాగర్‌కర్నూల్: ‘సామాజిక న్యాయం, సమానత్వం కోసం అట్టడుగు వర్గాల తరపున అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్‌రాం అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ వద్ద బాబు జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి కలెక్టర్ బాబు జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబుజగ్జీవన్‌రాం దేశ రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతమైన నాయకుడిగానే కాకుండా, నిస్వార్థ సేవ, న్యాయ పోరాటానికి ప్రతీకగా నిలిచారని, సామాజిక శ్రేయస్సు కోసం ఆయన చేసిన కృషి, నిస్వార్థంగా కొనసాగించిన ఉద్యమాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, సామాజిక సమానత్వం, ఐక్యత, విలువలను పాటించాలని, ఆయన చూపిన మార్గం, ఇచ్చిన సందేశం మనకు నిరంతర స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మాట్లాడుతూ జగ్జీవన్‌రాం గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడని, ప్రజాప్రతినిధిగా తనదైన ముద్రను వేశారన్నారు. దళిత వర్గాల్లో ఆయన చేసిన కృషి మరువలేనిదని, భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారని, ఆయన ఆదర్శంగా యువత ముందుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్‌రాం జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రావణ్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్, ఏఎస్డబ్ల్యూఓ శ్రీకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి
కందనూలు: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువవికాసం పథకం కోసం జిల్లాలోని బీసీ, ఈబీసీ నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, అభివృద్ధి శాఖ అధికారి ఖాజానాజిమ్ అలీ అప్సర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనాభా ప్రాతిపదికన జిల్లా, మున్సిపాలిటీ, మండలాలకు యూనిట్లు కేటాయిస్తారని, రూ.50 వేలు ఖర్చయ్యే యూనిట్లకు ప్రభుత్వం వందశాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వ్యయంతో కూడిన ప్రాజెక్టులకు 90 శాతం సబ్సిడీ, 10 శాతం బ్యాంకు రుణం, రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.4 లక్షల వరకు ఉన్న యూనిట్లకు 70 శాతం సబ్సిడీ ఇచ్చి మిగిలిన 30 శాతం బ్యాంకు రుణాల ద్వారా గ్రౌండింగ్ చేస్తారన్నారు. నిరుద్యోగులు స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకోవడానికి ఈనెల 14 వరకు గడువు ఉందని చెప్పారు. బీజేపీ బలోపేతానికి కృషి చేద్దాం కందనూలు: జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని, నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా సహకరించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి పదాధికారుల సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి మదగని శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించి, రైతులు, మహిళలు, యువత, వివిధ వర్గాల సమస్యలపై ఉధృతంగా పోరాడాలని తీర్మానిచారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు సుధాకర్‌రెడ్డి, దిలీప్‌చారి, జిల్లా మాజీ అధ్యక్షుడు సుధాకర్‌రావు, రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు. పట్టుబడిన దొడ్డు బియ్యం గోదాంకు తరలింపు పెద్దకొత్తపల్లి: మండలంలోని కొత్తపేట బాలాజీ రైస్‌మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న 624 క్వింటాళ్ల దొడ్డు బియ్యాన్ని శనివారం కొల్లాపూర్ సివిల్ సప్లయ్ గోదాంకు తరలించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఎముల నాయక్ తెలిపారు. అలాగే రైస్‌మిల్ యజమాని సునీల్‌కుమార్‌పై పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కే సు, ఎన్ఫోర్స్ కేసు నమోదు చేసినట్లు వివరించారు. బాలాజీ రైస్‌మిల్లు సీజ్ చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
రోజువారీ కూలి రూ.300 నుంచి రూ.307కు పెంపు ●సద్వినియోగం చేసుకోవాలి.. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల రోజువారీ వేతనం రూ.307కు పెరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు సగటు కూలి రూ.300 వచ్చేలా కొలతలు తీసి కూలీలతో పనులు చేయించాలని ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేశాం. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – ఓబులేసు, డీఆర్డీఓ మరింత పెంచాలి.. ఉపాధి హామీ ద్వారా ఇస్తామన్న రూ.307 కూలి ఏమాత్రం సరిపోదు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మరింత పెంచాలి. బయట వ్యవసాయ, ఇతర పనులకు వెళ్తే రూ.600 దాకా కూలి వస్తది. ప్రభుత్వం ఇచ్చే కూలి సరిపోక వ్యవసాయ ఇతర పనులకే పోతున్నాం. – లక్ష్మయ్య, ఉపాధి కూలీ, గట్టురాయిపాకుల నాగర్‌కర్నూల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రోజువారీ కూలీలకు మేలు చేసేందుకు, కూలి చెల్లింపుల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మరోమారు ఉపాధి హామీలో చెల్లించే కూలిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ పెంచిన కూలిని ఈ నెల నుంచే అమలు చేసేందుకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. 2005 సంవత్సరంలో మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం ప్రారంభం కాగా మొదట్లో రూ.87.50 చెల్లించేవారు. అయితే ప్రతిఏటా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వల్ల ప్రస్తుతం కూలీలకు రూ.300 చెల్లిస్తున్నారు. కాగా ప్రస్తుతం పెంచిన వాటితో ఉపాధి కూలి రూ.307కు చేరుకుంది. గతేడాది రూ.300.. జిల్లాలో మొత్తం 1,11,181 యాక్టివ్ జాబ్ కార్డులు ఉండగా అందులో 1,69,870 మంది కూలీలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం పెంచిన కూలితో పేదలకు మేలు జరిగే అవకాశం ఉంది. 2022 మార్చి వరకు కూలీలకు రోజుకు రూ.245 చెల్లిస్తుండగా.. అదే ఏడాది మార్చిలో రూ.12 పెంచి రోజువారీ కూలిని రూ.257 చెల్లించారు. తర్వాత 2023 ఏప్రిల్‌లో కూలిని మరో రూ.15 పెంచడంతో రూ.272కు చేరుకుంది. 2024లో రూ.28 పెంపుతో రూ.300లకు చేరుకోగా.. ఈ ఏడాది రూ.7 పెంచడంతో రూ.307కు చేరుకుంది. పెంచిన ఈ కూలిని ఈ నెల నుంచే అమలు చేసేలా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే గతేడాది ఉపాధి కూలి రూ.300 వరకు ఉన్నా ఒకరోజు సగటు వేతనం రూ.201 వరకే అందింది. కాబట్టి ఈ ఏడాది ప్రతి కూలీకి సగటున రూ.300 అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కాగా.. జిల్లాలో ఈ ఏడాది 38.30 లక్షల పనిదినాల లక్ష్యం నిర్దేశించగా, ఇందుకోసం రూ.114 కోట్ల అంచనా బడ్జెట్ వెచ్చించారు. చెల్లింపుల్లోనూ పారదర్శకతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు గతేడాది సగటున రూ.201 మాత్రమే చెల్లింపు పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపని ప్రజలు వ్యవసాయ పనులకే మొగ్గుచూపుతున్న వైనం ప్రైవేట్ వైపే మొగ్గు.. ఉపాధి హామీ పథకంలో కూలి ప్రతిఏటా పెంచుతున్నా జిల్లాలో కూలీలు మాత్రం ఉపాధి పనులకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంలో వేసవిలో కూలీలకు వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి పనులకు వచ్చేందుకు మొగ్గుచూపేవారు. అయితే ప్రస్తుతం రూ.300 కూలి చెల్లిస్తున్నా.. పనుల కొలతల ప్రకారమే ఇస్తుండటంతో కూలీలకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. దీనికితోడు ప్రైవేట్‌లో కూలీల కొరత ఉండడం, కూలి కూడా రూ.500 నుంచి రూ.600 వరకు వస్తుండటంతో కూలీలు ప్రైవేట్ పనులకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా వ్యవసాయ పనుల సమయంలో కూలీలకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో రూ.700 వరకు కూలి చెల్లించడమే కాకుండా కూలీలు వెళ్లేందుకు వాహన సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. దీంతో ఉపాధి పనులు మానేసి ఇతర పనులపై కూలీలు ఆసక్తి చూపుతున్నారు. -
గ్రామ పాలనాధికారి కొలువులపై ఆశలు
అచ్చంపేట: గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గ్రామ పాలనాధికారి (జీపీఓ) పేరిట కొత్త అధికారుల నియామకానికి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయగా.. ఇందుకనుగుణంగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి గత నెల 29న జీఓ 129 విడుదల చేశారు. ఈ జీఓ ప్రకారం గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ)లుగా పనిచేసి వేరే శాఖల్లోకి వెళ్లిన వారు తిరిగి మాతృ శాఖలోకి వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన వారిని మాత్రమే ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. వీరికి కూడా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. రెవెన్యూ శాఖలోకి వచ్చే వారికి కామన్ సీనియార్టీ వర్తించదని, సర్వీస్ మళ్లీ మొదటి నుంచే లెక్కిస్తారని ప్రభుత్వం జీఓలో స్పష్టం చేసింది. ఈ నిబంధనలపై వీఆర్వో, వీఆర్ఏల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గూగుల్ ఫాం ద్వారా తమ ఆప్షన్లను మరోసారి ఈ నెల16 వరకు తెలియజేయాలని భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. కాగా.. గతంలో వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు స్వీకరించగా.. 245 మంది అంగీకరించారు. అయితే ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం డిగ్రీ లేదా ఇంటర్ పూర్తి చేసినవారు మాత్రమే అర్హులు. గతంలో ఆప్షన్లు ఇచ్చిన వారిలో ఇంటర్ విద్యార్హత లేని వారు కూడా ఉన్న నేపథ్యంలో.. తాజాగా డిగ్రీ, ఇంటర్ చదివిన వారికి మాత్రమే ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. ఇతర శాఖల్లో సర్దుబాటు అయిన వారు.. జిల్లాలో 450 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. భూ వివాదాలు, ధ్రువపత్రాల జారీ, విపత్తుల సాయం, లబ్ధిదారుల ఎంపిక వంటి వాటిపై గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలు క్షేత్రస్థాయిలో విచారణ చేసేవారు. అయితే గత ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా 2022 ఆగస్టు 1న 176 మంది వీఆర్వోలను 25 శాఖల్లో సర్దుబాటు చేయగా, ఏడాది తర్వాత 2023 ఆగస్టు 10న 502 మంది వీఆర్ఏలను నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని 18 శాఖలకు కేటాయిస్తూ సర్వీసును క్రమబద్ధీకరించింది. మిగులు సిబ్బంది పేరిట ఇతర జిల్లాల్లో విధుల్లో చేరారు. అయితే ఈ ఏడాది జనవరిలో ప్రస్తుత ప్రభుత్వం ఇతర శాఖల్లో సర్దుబాటు అయిన వారి నుంచి మాతృ శాఖకు వచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో గ్రామస్థాయి పాలనాధికారి కోసం 228 మంది, సర్వేయర్‌కు 17 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 121 మంది వీఆర్వోలు, 124 మంది వీఆర్ఏలు ఉండగా.. పీజీ ఇద్దరు, బీటెక్ ముగ్గురు, 99 మంది డిగ్రీ, 42 మంది ఇంటర్, 99 మంది ఇంటర్‌లోపు అర్హత కలిగిన వారు ఉన్నారు. పూర్వపు వీఆర్ఓ, వీఆర్ఏలకు ప్రాధాన్యం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం రెవెన్యూ శాఖలో చేరేందుకు ఆప్షన్లు ఇచ్చిన వారే అర్హులు ఈ నెల 16 వరకు గూగుల్ ఫాం ద్వారా మరో అవకాశం మార్గదర్శకాలు సవరించాలి జీపీఓ పోస్టుల కోసం పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను సవరించాలి. జీఓ 129లో మార్పులు చేయాలి. ఈ నెల 16 వరకు రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేయకపోతే వీఆర్వో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. ఎలాంటి పరీక్ష లేకుండా మళ్లీ రెవెన్యూలోకి తీసుకొని కామన్ సీనియార్టీ వర్తింపజేయాలి. విద్యార్హత, చివరి తేదీ నిబంధనలు కూడా తొలగించాలి. – వెంకటేష్, పూర్వ వీఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షుడు పునరాలోచనలో.. జీపీఓ పోస్టుల కోసం ప్రభుత్వం జనవరిలో పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకుంది. అయితే ఇప్పుడు మరోసారి గూగుల్ ఫాం ద్వారా ఆప్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల్లో చర్చ మొదలైంది. జీఓ 129 మార్గదర్శకాల ప్రకారం పాత సర్వీసును పరిగణలోకి తీసుకోమని చెప్పడంతో ఆప్షన్లు ఇచ్చిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ప్రస్తుతం పనిచేస్తున్న శాఖలను వదులుకొని రెవెన్యూలోకి వెళ్తే వచ్చే ప్రతిఫలం ఏమిటని ఆలోచిస్తున్నారు. జీరో సర్వీస్ కాకుండా తాము ఉద్యోగంలో చేరిన నాటిని నుంచి పరిగణిస్తే తప్ప వెళ్లడానికి సుముఖంగా కనిపించడం లేదు. ఈ క్రమంలో జీపీఓ పోస్టులకు ఎంత మంది గూగుల్ ఆప్షన్లు ఇస్తారో వేచి చూడాలి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో 9 రకాల విధులు రూపొందించారు. అవన్నీ గతంలో వీఆర్ఓలు, వీఆర్ఏలు ఉన్నప్పుడు నిర్వహించినవే కావడం గమనార్హం. -
చిన్నారులకు సమగ్ర కంటి పరీక్షలు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని అంగన్వాడీల పరిధిలోని ఆరేళ్లలోపు చిన్నారులకు సోమవారం నుంచి సమగ్ర కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని పీహెచ్‌సీల పర్యవేక్షణ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని 1,131 అంగన్వాడీ కేంద్రాల్లో 47,317 చిన్నారులకు ప్రాథమిక దశలోనే సమగ్ర కంటి పరీక్ష నిర్వహించి తగిన మందులతో చికిత్స నిర్వహించి.. కంటి అద్దాలు అందించడం వలన అంధత్వాన్ని నివారించగలమన్నారు. చిన్నారుల్లో విటమిన్–ఏ లోపం, మెల్ల కన్ను, టెరీజియం, హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టి తదితర కంటి సమస్యలు వస్తాయని, వీటిని నివారించడానికి ప్రతి చిన్నారికి సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆర్బీఎస్కే సంచార వైద్య బృందం, నేత్రాధికారులు సంయుక్తంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చిన్నారుల సమగ్ర కంటి పరీక్ష కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశాలు తమ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే సమగ్ర కంటి పరీక్ష శిబిరానికి చిన్నారులు హాజరయ్యేలా చూడాలన్నారు. శిశువులు, చిన్నారుల్లో ఎవరైనా టీకాకరణ చేయించుకోని వారు ఉంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో టీకాకరణ క్యాచ్ అప్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాసు, ప్రోగ్రాం అధికారి రవికుమార్, రాజశేఖర్, డీపీఓ రేణుయ్య, ఏపీఓలు మినహాజ్, శ్రీనివాసులు, నిరంజన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
నాగర్‌కర్నూల్: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అర్హులైన ప్రతిఒక్కరికీ ఈ పథకాలను అందించే బాధ్యత అధికారులదేనని, ఎవరైనా పథకానికి దూరంగా ఉంటే, వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 150 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, 46 సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసి మాట్లాడారు. పేద కుటుంబాల్లో అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ● జిల్లాకేంద్రంలో రూ.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ కార్యాలయ సమీపంలో అధునాతన సౌకర్యాలతో భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. మహిళా సంఘాలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందన్నారు. అనంతరం ఎల్ఐసీ కార్యాలయం పక్కన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ కేంద్రాన్ని మహిళలు వినియోగించుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ నరేష్‌బాబు, మాజీ కౌన్సిలర్లు సునేంద్ర, నిజాం తదితరులు పాల్గొన్నారు. -
దొడ్డు బియ్యంతో దందా
అక్రమార్కులకు కలిసొచ్చిన సన్నబియ్యం పంపిణీ అందని మార్గదర్శకాలు.. ప్రభుత్వం ఈ నెల 1 నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. అయితే ఇప్పటికే ఉన్న పాత దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వ స్టాక్ పాయింట్లకు అప్పగించాల్సి ఉంది. కానీ, చాలాచోట్ల దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టించారు. రేషన్ షాపులకు కేటాయించిన స్టాక్ మేరకు మిగిలిన బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకపోతే వారి నుంచి ఈ మేరకు డబ్బులు వసూలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ రేటు కన్నా అధిక ధరలకు దొడ్డుబియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రైస్ మిల్లుల్లో కేటాయించిన మేరకు ప్రభుత్వానికి సీఎమ్మార్ ఇవ్వకుండా పెద్దఎత్తున రేషన్‌బియ్యాన్ని నిల్వ చేసుకుని సీఎమ్మార్‌గా చూపుతూ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిందే.. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. నిబంధనల ప్రకారం రేషన్ దుకాణాల వద్ద ఉన్న పాత బియ్యం స్టాక్‌ను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లుల్లోని దొడ్డు బియ్యాన్ని సైతం ఎఫ్‌సీఐకి అప్పగించాలి. – రాజేందర్, పౌర సరఫరాల శాఖ మేనేజర్, నాగర్‌కర్నూల్ సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా ఇప్పటి వరకు కొనసాగుతున్న రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాకు తెరపడుతుందని భావిస్తుండగా.. ఇప్పటికే టన్నుల కొద్దీ పోగు చేసుకున్న పాత బియ్యంతో అక్రమార్కులు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. పాత దొడ్డు బియ్యాన్ని నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్టాక్ పాయింట్లు, ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉండగా.. ఎక్కడికక్కడ నిల్వ చేసుకుని, అక్రమ రవాణా చేస్తున్నారు. శుక్రవారం జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేటలో ఉన్న రైస్‌మిల్లులో 300 క్వింటాళ్ల దొడ్డు బియ్యాన్ని అధికారులు పట్టుకోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సీజ్చేసిన మిల్లులో.. పెద్దకొత్తపల్లి మండలంలోని కొత్తపేట బాలాజీ రైస్‌మిల్లు గతంలో సీఎమ్మార్ కింద బియ్యం ఇవ్వకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. అయితే ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా, అక్రమ దందా చేయడంతో సీజ్ చేసినప్పటికీ మళ్లీ దందా కొనసాగిస్తుండటం గమనార్హం. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డీసీబీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఆనంద్‌కుమార్ రైస్‌మిల్లుపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో రైస్‌మిల్లులో 600 బస్తాల్లో నిల్వ చేసిన 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఈ మిల్లు కేంద్రంగా పెద్దఎత్తున రేషన్ బియ్యాన్ని నిల్వ చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వచేస్తూ దందా చేస్తున్న మిల్లు యజమాని సునీల్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రైస్‌మిల్లుల్లో పెద్ద ఎత్తున రేషన్‌బియ్యాన్ని నిల్వ చేస్తూ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ దొడ్డు బియ్యం డంపు చేసిన మిల్లర్లు పాతవి స్టాక్ పాయింట్లకు తరలించకుండా దందా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి తాజాగా పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ రైస్‌మిల్లులో 300 క్వింటాళ్ల దొడ్డు బియ్యం స్వాధీనం -
సీతమ్మకు కీలక పదవి
నారాయణపేట: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కొత్తకోట దయాకర్‌రెడ్డి కుటుంబానికి పదవి వరించింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ గురువారం ప్రభుత్వం జీఓ ఆర్టీ నంబర్ 45 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం సీతా దయాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లపాటు బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం కొనసాగనున్నారు. సీతా దయాకర్‌రెడ్డికి కీలక పదవి రావడంతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దయాకర్‌రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. విద్యాభ్యాసం.. కుటుంబ నేపథ్యం సీతాదయాకర్ రెడ్డి 1961 అక్టోబర్ 27న కామినేని రాజేశ్వరరావు, భారతి దంపతులకు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లో జన్మించారు. ఆర్బీవీఆర్ఆర్ కళాశాలలో ఇంటర్ (1977–79), బీఏ (1979–82) పూర్తిచేశారు. 1982–84లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషియాలజీ చదివారు. 1984 ఫిబ్రవరి 3న కొత్తకోట దయాకర్ రెడ్డితో సీతాదయాకర్ రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు (సిద్ధార్థ, కార్తీక్) ఉన్నారు. మక్తల్ టికెట్ ఆశించిన సమయంలో భరోసా.. దయాకర్‌రెడ్డి కుటుంబానికి మక్తల్, దేవరకద్రల్లో పెద్దఎత్తున అభిమానులు, మద్దతుదారులు ఉన్నారు. సీతమ్మ, దయాకర్ రెడ్డిలు పలు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు సీతమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. కాంగ్రెస్ టికెట్ మక్తల్ నియోజకవర్గం నుంచి ఇవ్వాలని కోరారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి టికెట్ ఇస్తూ.. గెలిపించుకొని రావాలని, భవిష్యత్‌లో కీలక పదవి అప్పగిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఎలాంటి రాజకీయ తప్పిదాలు జరగకుండా వాకిటి శ్రీహరి గెలుపులో కీలకపాత్ర పోషించి అధిష్టానం దృష్టిలో పడ్డారు. టీడీపీని వీడుతూ కంటతడి.. సుదీర్ఘకాలం దయాకర్‌రెడ్డి దంపతులు టీడీపీలో కొనసాగారు. అయితే 2022లో వీరు టీడీపీని వీడారు. టీడీపీతో తమకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపించడంతో ఏదో ఓ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే 2023 జూన్‌లో దయాకర్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని పాడె మోశారు. రాజకీయ పరిణమాలతో రేవంత్‌రెడ్డి సమక్షంలో సీతమ్మ కాంగ్రెస్ గూటికి చేరారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా దయాకర్‌రెడ్డి మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి దయాకర్‌రెడ్డి కుటుంబానికి పెద్దపీట రాజకీయ రంగ ప్రస్థానం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో కొత్తకోట దయాకర్‌రెడ్డి దంపతులు కీలకంగా వ్యవహరించారు. అమరచింత నియోజకవర్గం నుంచి దయాకర్‌రెడ్డి 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్ నుంచి గెలుపొందారు. సీతమ్మ 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2001లో దేవరకద్ర జెడ్పీటీసీగా విజయం సాధించిన ఆమె.. ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2009లో కొత్తగా ఏర్పడిన దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీచేసి.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణసుధాకర్‌రెడ్డిపై 19,034 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2014 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన ఆల వెంకటేశ్వరరెడ్డి చేతిలో ఆమె పరాజయం పొందారు. 2023 సెప్టెంబర్ 11న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో సీతా దయాకర్‌రెడ్డి హస్తం గూటికి చేరారు. ఉమ్మడి రాష్ట్రంలోని 2009లో ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి భార్యాభర్తలిద్దరూ కలిసి అసెంబ్లీలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. -
భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
బిజినేపల్లి: ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు కీలకమైన ఘట్టం ఇంటర్ విద్య అని.. ఈ దశలో విద్యార్థులు తప్పటడుగులు వేస్తే జీవితాంతం సర్దుకుపోతూ బతకాల్సి వస్తుందని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా వార్షిక పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పే టీ–శాట్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని డీఈఓ బిజినేపల్లి కేజీబీవీ పాఠశాల విద్యార్థులతో కలిసి వీక్షించారు. వీసీ అనంతరం డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకొని.. అందుగు తగు ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు షర్ఫుద్దీన్, శోభారాణి, నాగేందర్, ఎంఈఓ రఘునందన్‌రావు, ప్రత్యేకాధికారి నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగిరం చేయాలి
నాగర్‌కర్నూల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు దేవసహాయం, అమరేందర్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ జిల్లా అధికారులతో ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువవికాసం, తాగునీటిపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలు అందరూ ఇల్లు కట్టుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని నిర్మాణంలో పురోగతి సాధించాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లాలో తాగునీటి సరఫరాకు ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వేసవికాలం యాక్షన్ ప్లాన్ ప్రకారం మున్సిపల్, పంచాయతీ, మిషన్ భగీరథ, ఎంపీడీఓలు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజలకు తాగునీరు అందించాలని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పైపులైన్ లీకేజీ, మరమ్మతు వంటివి ఉంటే వెంటనే చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకం ద్వారా జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. మండల స్థాయిలో సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పారదర్శకంగా సన్నబియ్యం పంపిణీ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామన్నారు. ఆదివారం వరకు వందశాతం అన్ని రేషన్ షాపులలో స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. రేషన్ షాపుల దగ్గర సన్న బియ్యం పంపిణీలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొనడం జరిగిందని, సన్న బియ్యం అందుకున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని మంత్రికి కలెక్టర్ వివరించారు. -
వైద్యులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం/ బిజినేపల్లి: వైద్యులు చట్టాలపై అవగాహన పెంచుకుంటే నేర పరిశోధనలో మెడికల్ సర్టిఫికెట్లపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని జిల్లా జడ్జి రాజేష్‌బాబు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఐసీఎఫ్ఏఐ లా స్కూల్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులకు శనివారం న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వైద్యులు ఎంతో సేవ చేస్తున్నారని, మెడికల్ లీగల్ నేర పరిశోధనలో మెడికల్ సర్టిఫికెట్ల పాత్రపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోస్టుమార్టం నివేదికతోపాటు వైద్య సంస్థల్లో ర్యాగింగ్ పరిణామాలకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా శిక్షకు గురవడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ చదువు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే చాలా కేసుల్లో వైద్యుల సహాయం అవసరం అవుతుందని చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి మాట్లాడుతూ లెక్చరర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని సద్వినియోగం చేసుకొని భవిష్యత్‌లో ఉన్నత స్థాయిలో స్థిరపడి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సబిత ఎక్ఫై లా స్కూల్ ప్రొఫెసర్ దామోదర్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కల్నల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతరావు, సునీల్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కళాశాలలో.. బిజినేపల్లి మండలంలోని వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా జడ్జి రాజేష్‌బాబు మాట్లాడుతూ నేటి సమాజంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు రైతులు సర్టిఫైడ్ చేసిన వాటినే కొనేలా అవగాహన కల్పించాలని, వాటికి రశీదు తప్పనిసరిగా తీసుకునేలా చూడాలన్నారు. తద్వారా ఏదైనా కంపెనీ ద్వారా రైతులకు నష్టం వాటిల్లితే కోర్టులను ఆశ్రయించవచ్చన్నారు. మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకు తక్కువగా విక్రయించరాదని, అలా ఎవరైనా కొనుగోలు చేస్తే చట్టపరంగా న్యాయం పొందడంపై జిల్లా న్యాయ సేవా సమితి కార్యదర్శి సబిత వివరించారు. మండలంలోని మంగనూర్ జెడ్పీహెచ్ఎస్లో న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమాల్లో కళాశాల అసోసియేట్ డీన్ సుధాకర్, శాస్త్రవేత్తలు సత్యనారాయణ, సునీల్ ప్రేమ్, న్యాయవాదులు రవికాంత్‌రావు, దామోదర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, శ్రీరామ్ ఆర్య, పరశురాములు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం : డీజీపీ
గద్వాల క్రైం: కేసుల నమోదు విషయంలో ఏ స్థాయి అధికారి అయినా నిర్లక్ష్యం.. అవినీతి, అక్రమ దందాల వ్యవహారంలో అంటకాగినట్లు బహిర్గతమైతే ఉపేక్షించేది లేదని రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ప్రజలకు, యువతకు దిక్సూచిగా వ్యవహరిస్తూ.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఉండాలని జిల్లా పోలీసు శాఖకు డీజీపీ దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలను వెల్లడించారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో ఆన్లైన్ బెట్టింగ్ కేసులపై ప్రత్యేక బృందం విచారణకు శ్రీకారం చుట్టిందన్నారు. యువత బెట్టింగ్ యాప్‌ల ద్వారా తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్న ఘటనలు ప్రతి చోట వెలుగులోకి వస్తున్నాయని.. ఈ కేసుల విచారణకు సీట్ దర్యాప్తు చేస్తుందన్నారు. నడిగడ్డలో నమోదైన బెట్టింగ్ కేసుల నివేదికలను అందించాలని డీజీపీ ఆదేశించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు కావడంతో నిషేధిత మత్తు పదార్థాలు, ఇసుక, రేషన్ బియ్యం, మట్టి, నకిలీ విత్తనాలు, గంజాయి, గుట్కా తదితర మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందన్నారు. కృష్ణా, తుంగభద్ర నదీ తీర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు నిఘా పెంచాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. హిట్ అండ్ రన్ కేసులో సాధ్యమైనంత వేగంగా నిందితులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కల్పిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి.. రౌడీ షిట్ ఓపెన్ చేయాలన్నారు. మావోయిస్టు, ప్రభుత్వ వ్యతిరేకత అంశాలపై ద్వేషం, హింసాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా ఉంటే గుర్తించాలని సూచించారు. 9న కలెక్టరేట్ ముట్టడి నాగర్‌కర్నూల్ రూరల్: రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9న కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నామని సంఘం నాయకుడు వార్ల వెంకటయ్య అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన రైతు సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టే కలెక్టరేట్ల ముట్టడికి తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు జిల్లా సంఘం నాయకులు కృష్ణాజీ, అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి సూర్యశంకర్గౌడ్, నాయకులు చంద్రమోళి, రైతు సంఘం నాయకులు కృష్ణయ్య, కొండన్నగౌడ్, నారాయణ, కుర్మయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సు కొల్లాపూర్: పట్టణం నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డీఎం ఉమాశంకర్ తెలిపారు. ప్రతిరోజూ కొల్లాపూర్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బస్సు కల్వకుర్తి, ఆమనగల్, తుక్కుగూడ మీదుగా బయలుదేరుతుందని, మరుసటి రోజు తెల్లవారుజామున యాదగిరిగుట్ట నుంచి తిరుగు ప్రయాణం ఉంటుందని చెప్పారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.