
పండ్లు.. జ్యూస్‌లకు డిమాండ్..
వేసవిలో కొబ్బరిబొండాలు, పుచ్చకాయలు, మామిడిపండ్ల, ఇతర జ్యూస్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
● ఆరోగ్యానికి చెరుకు రసం ఎంతో మేలైనది. ప్రత్యేకంగా వేసవిలో చెరుకురసం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. దీనిని తీసుకోవడం వల్ల ఎండల నుంచి ఉపశమనం పొందడంతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో ప్రతిచోటా చెరుకు రసం సెంటర్లు వెలుస్తున్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో దాదాపు 50 చెరుకు రసం కేంద్రాలు ఉన్నాయి. చెరుకు రసం ఫుల్‌గ్లాస్ రూ.30, ఆఫ్ గ్లాస్ రూ.20 ధరలు ఉన్నాయి.
● ఈ సీజన్‌లో ప్రతిచోట లస్సీ సెంటర్లు వెలుస్తాయి. కొన్నేళ్ల నుంచి లస్సీ (పెరుగు)కి ప్రత్యేక గుర్తింపు ఉంది. సాధారణ లస్సీ రూ.20, స్పెషల్ లస్సీని రూ.30కు విక్రయిస్తున్నారు. అదేవిధంగా ఫలుదాకు ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. పాలు, డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసే ఫలుదాకు ఇటీవలే కాలంలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గ్లాసు ఫలుదా రూ.40 చొప్పున అమ్ముతున్నారు.
● పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ కొబ్బరిబొండాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రతిచోట ప్రధాన రోడ్ల వెంట వీటి అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి జిల్లాలు, కాకినాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఒక్కటి రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు.
● మార్కెట్లో తాటిముంజులు, మామిడి పండ్ల సందడి నెలకొంది. కొల్లాపూర్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మామిడిపండ్లను దిగుమతి చేసుకొని కిలో రూ.80 – 100 వరకు విక్రయిస్తున్నారు. ఇక శరీరానికి చలువ చేయడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తాటిముంజలకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంటుంది. రూ.100కు 12 ముంజలు ఇస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు కా ర్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉండే పుచ్చకాయలు అన్ని ప్రాంతాల్లో లభిస్తుంది. కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.
లస్సీ.. ఇష్టంగా తాగుతా..
లస్సీ అంటే చాలా ఇష్టం. వేసవి కాలంలో లస్సీని ఎక్కువగా తాగుతా. ఎండలో తిరిగే సమయంలో లస్సీ తాగడం శరీరానికి చల్లటి ఉపశమనం లభిస్తుంది. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది.
– సాయికుమార్, మహబూబ్‌నగర్

పండ్లు.. జ్యూస్‌లకు డిమాండ్..

పండ్లు.. జ్యూస్‌లకు డిమాండ్..

పండ్లు.. జ్యూస్‌లకు డిమాండ్..