
పర్యాటకులపై ఉగ్రదాడి హేయం
కందనూలు: జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జిల్లాకేంద్రంలోని ఫాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం బాలుర ఉన్నత పాఠశాల నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు పాస్టర్లు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి, కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంబీ చర్చి చైర్మన్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ మృతిచెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలోని ప్రజలపై, సైనికులపై దాడులు చేయడం హేయమైన చర్య అని, ఇలాంటి వారిపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.