
చైనీస్ ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ దిగ్గజం 'బీవైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఇటీవల ఇండియన్ మార్కెట్లో 'సీలియన్ 7' లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసినప్పటి నుంచి కొనుగోలుదారులు దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఒకే రోజు 52 కార్లను డెలివరీ చేసి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌ను సాధించినట్లు ప్రకటించింది.
గతంలో చాలా కంపెనీ వందలాది వాహనాలను డెలివరీ చేశాయి. కానీ బీవైడీ కంపెనీ డెలివరీ చేసిన కారు ధరలు ధర రూ. 48.9 లక్షల నుంచి రూ. 54.9 లక్షలు మధ్య ఉన్నాయి. ఇంత ఖరీదైన కార్లను 52 డెలివరీ చేయడం బహుశా ఇదే మొదటిసారి. ఈ కారణంగానే కంపెనీ అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. సీలియన్ 7 ఎలక్ట్రిక్ కార్ల డెలివరీకి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి: 2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు ప్రీమియం, పర్ఫామెన్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రీమియం వేరియంట్ ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో 308 Bhp పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తే.. పర్ఫార్మెన్స్ వేరియంట్ డ్యూయల్ మోటార్ సెటప్ ద్వారా 523 Bhp పవర్, 690 Nm టార్క్ అందిస్తుంది. ఈ రెండూ 82.56 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా వరుసగా 567 కిమీ, 542 కిమీ రేంజ్ అందిస్తాయి. మంచి డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందింది.