Bapatla
-
పచ్చ నేతల పైసావసూల్
బాపట్లగురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ముగిసిన ప్రతిష్ట వేడుకలు శావల్యాపురం: వేల్పూరులోని గంగమ్మ తల్లి, పోతురాజుల పేర్పిడి ప్రతిష్టా మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. భక్తులు భారీసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. త్రికోటేశ్వర విగ్రహ పునఃజీవ ప్రతిష్ట సత్తెనపల్లి: అమ్మిశెట్టి వారి వీధిలోని త్రికోటేశ్వర స్వామి విగ్రహ పునఃజీవ ప్రతిష్ట, దేవాలయం పునర్నిర్మాణం, ధ్వజస్తంభ ప్రతిష్ట బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రెడ్డి పేరంటాలమ్మకు పూజలు నాదెండ్ల: సాతులూరులో రూ.2 కోట్లతో నిర్మించిన శ్రీ రెడ్డిపేరంటాలమ్మ ఆలయంలో గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్ నడికట్టు రామిరెడ్డి పూజలు నిర్వహించారు. సాక్షి ప్రతినిధి, బాపట్ల: మత్స్యకారుల వేట నిషేధ భృతిపై పచ్చనేతల కన్నుపడింది. ఇప్పటివరకూ ఇసుక, బుసక, గ్రానైట్, గ్రావెల్, పేదల బియ్యం మాత్రమే బొక్కుతున్నారు. ఇప్పుడు చేపల వేట జీవనాధారంగా బతికే గంగ పుత్రులకు ప్రభుత్వం ఇచ్చే వేట నిషేధ భృతిని కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధంలో జీవన భృతి కోసం ప్రభుత్వం గంగ పుత్రులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక దీని మాటున డబ్బులు కొట్టేసేందుకు పచ్చ నేతలు సిద్ధమయ్యారు. ఒక్కో బోటుకు ఇద్దరు లేదా ముగ్గురి పేర్లు అదనంగా చేర్చి ఆ మొత్తాన్ని తమకు చెల్లించాలని మత్స్యశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అధికారులకు బెదిరింపులు ఇప్పటికే నిజాంపట్నానికి చెందిన ఒక పచ్చ నేత ఏకంగా మత్స్యశాఖ కార్యాలయానికి వెళ్లి అధికారులను బెదిరించినట్లు ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చెప్పిన పేర్లన్నీ భృతి జాబితాలో ఉండాల్సిందేనని, లేకపోతే ఉండరంటూ సదరు నేత హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇదే తరహాలో బాపట్ల, చీరాల ప్రాంతాలకు చెందిన మరికొందరు నేతలు బెదిరించినట్లు తెలుస్తోంది. మాట వినకపోతే ఎమ్మెల్యేలు లేదా మంత్రులతో ఫోన్లు చేయిస్తామంటూ మత్స్యశాఖ అధికారులను భయభ్రాంతులకు గురి చేసినట్లు సమాచారం. అవసరమైతే కొంతవాటా ఇస్తామని ప్రలోభపెట్టినట్లు సమాచారం. కొందరు ఒత్తిళ్లకు తలొగ్గి వారిచ్చిన పేర్లను జాబితాలో చేర్చినట్లు సమాచారం. బుధవారం సాయంత్రమే జిల్లా నుంచి మత్స్యశాఖ అధికారులు జాబితాను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. జాబితా 15 వేలకు చేరే అవకాశం వాస్తవానికి వైఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2022లో జిల్లా వ్యాప్తంగా 9వేల మందికి, 2023లో 10వేల మంది వరకూ జాబితా సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది 14 వేల మంది పైచిలుకు భృతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బుధవారం నాటికి తుది జాబితాను అధికారులు వెల్లడించలేదు. పచ్చనేతల ఒత్తిళ్లతో జాబితా 15 వేలకు చేరే అవకాశమున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వేల సంఖ్యలో పచ్చనేతలు బోగస్ మత్స్యకారుల పేర్లను జాబితాలో చేర్చినట్లు అనుమానించాల్సిందే. జాబితాలో అదనంగా నాలుగు వేల మంది.. గత ప్రభుత్వంలో ఇచ్చిన దానితో పోల్చుకున్నా నాలుగు వేల మందిని అదనంగా జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్కొక్కరికీ రూ. 20 వేలు అనుకుంటే నాలుగు వేల మందికి సుమారు రూ. 8 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం పచ్చనేతలు కొట్టేసేందుకు సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అర్హులైన మత్స్యకారులకు భృతి ఇస్తే సంతోషమే. అలా కాకుండా పచ్చనేతల జేబులు నింపడానికి రూ. కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం సరికాదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మరోవైపు వైఎస్సార్ సీపీ సానుభూతి పరులంటూ పచ్చనేతలు కొందరు అర్హులైన మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, అర్హులైన మత్స్యకారులందరికీ భృతి ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. పచ్చనేతల దోపిడీ ఇలా ... 3న్యూస్రీల్వేట నిషేధ భృతి కొట్టేసేందుకు స్కెచ్ తాము చెప్పిన వారికే భరోసా ఇవ్వాలంటూ హుకుం అధికారులపై నిజాంపట్నం, బాపట్ల, చీరాల నేతల ఒత్తిడి రూ. కోట్లలో ప్రజాధనం దోపిడీకి రంగం సిద్ధం జిల్లాలో 2,834 బోట్లు బోటుకు కనీసం రెండు నుంచి మూడు అదనపు పేర్ల నమోదు చేయాలని హుకుం అర్హులైన మత్స్యకారులకు మొండి చేయి పచ్చ నేతల తీరుతో తలలు పట్టుకుంటున్న అధికారులు వాస్తవానికి జిల్లాలో నిజాంపట్నం హార్బర్, బాపట్ల, చీరాల ప్రాంతాల్లో అధికారికంగా 2,432 మోటరైజ్డ్ బోట్లు, 174 మెకనైజ్డ్ బోట్లు, 228 నాన్ మోటరైజ్డ్ బోట్లు కలిపి మొత్తం 2,834 ఉన్నాయి. మోటరైజ్డ్ బోట్లలో ఆరుగురు, మెకనైజ్డ్ బోట్లలో ఎనిమిది నుంచి పది మంది, నాన్ మోటరైజ్డ్ బోట్లలో ముగ్గురు తగ్గకుండా మత్స్యకారులు వేట సాగిస్తారు. పచ్చనేతల ఒత్తిళ్లతో మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లలో అదనంగా ఒక్కో బోటుకు ముగ్గురికి తగ్గకుండా పేర్లను పచ్చనేతలు భృతి జాబితాలో చేర్పించినట్లు సమాచారం. -
గంజాయి, డగ్స్ రవాణాపై ఉక్కుపాదం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ బాపట్ల: జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లాస్థాయి గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం బుధవారం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలను సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో గంజాయి తీసుకునే వారి వివరాలను సేకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజల సహకారంతో గంజాయి సరఫరా చేసే వారిని పట్టుకోవాలని తెలిపారు. జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై దాడులు నిర్వహించి, వారికి అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో గంజాయి విని యోగించే వారి వివరాలను గ్రామ సచివాలయ సిబ్బంది సేకరించాలని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు ప్రజలు కూడా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. వివరాలను గోప్యంగా ఉంచుతాయని తెలిపారు. జిల్లాలోని నాలుగు లక్షల కుటుంబాలకు గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన తెలియజేసే వాల్‌పోస్టర్లు, కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేయాలని ఆయన అధికారులు సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వర్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా రవాణాశాఖ అధికారి పరంధామరెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు. బంగారు కుటుంబాల అభ్యున్నతే లక్ష్యం బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకి తెచ్చేలా మార్గదర్శులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. పీ–4 అమలుపై జిల్లా, మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో 62,291 బంగారు కుటుంబాలు ఉన్నాయని, వాటిని పేదరికం నుంచి బయటకు రావడానికి చేయూతనందించాలని ఆదేశించారు. పీ–4 అమలుకు జిల్లా, మండల, గ్రామస్థాయిలో కమిటీలు నియమిస్తామని పేర్కొన్నారు. ఒక్కో మండలంలో సుమారు 500 బంగారు కుటుంబాలు ఉన్నాయని, వీటిల్లో యువతకు నైపుణ్యాల అభివృద్ధిపై అవగాహన కల్పించాలని సూచించారు. పింఛన్ పంపిణీ ప్రక్రియ ముగిసిన తక్షణమే మిగిలిన నగదును ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పారు. సంతమాగులూరు మండలంలో రూ.6.41 లక్షలను ఎందుకు చెల్లించలేదని అధికారులను నిలదీశారు. బాపట్ల, బల్లికురవ, మార్టూరు, వేటపాలెం, నిజాంపట్నం మండలాలలోను నగదు పక్కదారి పడితే బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులను సస్పెండ్ చేయాలని, వారిపై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదుతో చార్జ్‌షీట్ పంపాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్‌గౌడ్, సీపీఓ కె. శ్రీనివాసరావు, డీఆర్డీ ఎఫ్‌సీ డి. శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ జె.వెంకట మురళి -
వైఎస్సార్ సీపీ నాయకుల శాంతి ర్యాలీ
బాపట్ల: పెహల్గాం మృతుల ఆత్మ శాంతించాలని, టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం ప్రదర్శన చేపట్టారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పురవీధుల్లో కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శనను ఉద్దేశించి వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్‌బాబు మాట్లాడుతూ పెహల్గాంలో పర్యాటకులను దారుణంగా హత్య చేయడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనగా పేర్కొన్నారు. టెర్రరిస్టుల అణచివేతకు కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, నాయకులు గవిని కృష్ణమూర్తి, కొక్కిలిగడ్డ చెంచయ్య, చల్లా రామయ్య, తన్నీరు అంకమ్మ, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, కటికల యోహోషువా, వడ్డిముక్కల డేవిడ్ పాల్గొన్నారు. పెహల్గాం మృతులకు ఘన నివాళి టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలి -
ఫొటోలు మార్ఫింగ్ చేసి యువతికి బెదిరింపులు
మంగళగిరి: నగర పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్న ఘటన చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓ గ్రామానికి చెందిన యువతి బీ ఫార్మసీ పూర్తి చేసుకుని యూఎస్ వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఆమెకు తుళ్లూరు మండలానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన యువకుడు కంచర్ల మౌనిష్కర్ ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి వరుడి ఇన్‌స్ర్ట్రాగామ్ ఖాతాలో పోస్టు చేస్తున్నాడు. వరుడు ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి ఆధారాలు సేకరించిన వారు బుధవారం మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యార్డులో 1,29,798 బస్తాలు మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు):గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,22,419 బస్తాల మిర్చి రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,29,798 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.9,800 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 58,020 బస్తాలు నిల్వ ఉన్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. ధూళిపాళ్లలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సత్తెనపల్లి: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో బుధవారం లభ్యమైంది. గ్రామంలో మృతదేహం ఉందని స్థానికులు సత్తెనపల్లి రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలాన్ని సందర్శించి పోస్ట్‌మార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. సుమారు 35–40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మృతదేహంపై మెరూన్ రంగు టీ షర్ట్, దానిపై ఎవరెస్ట్ అని ప్రింట్ చేసి ఉంది. గ్రే రంగు పాయింటు ధరించి ఉన్నాడు. నలుపు రంగు బెల్టు ఉండి బెల్ట్ బకెట్ ఆరంజ్, నలుపు రంగులో ఉంది. మృతుడి మెడకి రెండు తాయిత్తులు, కుడి చేతికి రబ్బర్ బ్యాండ్, నడుముకు నాలుగు పేటల నలుపు, ఎరుపు రంగుల మొలతాడు ఉంది. మృతుడు పొడవు సుమారు 5 అడుగుల 2 అంగుళాలు, నలుపు రంగులో ఉన్నాడు. వివరాలు తెలిసినవారు సత్తెనపల్లి రూరల్ సీఐ 94407 96231, సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ 80199 98643 నెంబర్లకు తెలియ చేయాలని పోలీసులు కోరారు. చిలకలూరిపేట డిపో నుంచి హైదరాబాద్‌కు ఇంద్ర బస్సులు నకరికల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లి డిపోల నుంచి రిజర్వేషన్ సౌకర్యం చిలకలూరిపేట టౌన్: చిలకలూరిపేట డిపో నుంచి హైదరాబాదు – బీహెచ్ఈఎల్ ఏసీ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు డీఎం ఎస్.రాంబాబు బుధవారం తెలిపారు. హైదరాబాద్, బీహెచ్ఈఎల్ మార్గాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్తగా రిజర్వేషన్‌ను ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట నుంచి హైదరాబాద్ (మియాపూర్, ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్) సెక్టార్లో ఇంద్ర ఏసీ బస్సులు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పట్టణ డిపో నుంచి ఏడు సర్వీసులు, అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు ఏడు సర్వీసులు ఉన్నాయన్నారు. చిలకలూరిపేట నుంచి హైదరాబాద్‌కు డిపోనుంచి ఆయా సర్వీసులకు నకరికల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లిలో సీట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. -
నారాయణ విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు
చీరాల అర్బన్ : చీరాలలోని నారాయణ స్కూల్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. మాచవరపు సాహిత్య 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు, జిల్లాలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుంది. ఉపాధ్యాయుల బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించానని విద్యార్థిని తెలిపింది. విద్యార్థిని తండ్రి ఎం.సత్యనారాయణ ఉద్యోగి కాగా, తల్లి అనంతలక్ష్మి రెవెన్యూ డిపార్టుమెంట్లో పని చేస్తున్నారు. ఈ సందర్భంగా సాహిత్యను స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి.నిరుపమ, ఏజీఎం శ్రీనివాస్, మూర్తి పాల్గొన్నారు. -
ఎన్‌సీసీతో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
వేటపాలెం: విద్యార్థులు ఎన్సీసీలో చేరడం ద్వారా ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందే అవకాశం ఉందని ప్రధానోపాధ్యాయుడు ఎం. శేఖరరావు తెలిపారు. పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో బుధవారం ఎన్సీసీ క్యాడెట్స్‌కి సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా హెచ్ఎం మాట్లాడుతూ ఎన్సీసీలో చేరిన 43 మంది విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికీ రూ.4,400 చొప్పన రూ.1,89,200 మంజూరైనట్లు తెలిపారు. ఈ నగదుతో ఒకొక్క క్యాడెట్కి రెండు జతల సూట్లు, రెండు జతల బూట్లు, రెండు టీ షర్టులు, బెల్టు, నేమ్ ప్లేట్, లైన్ యాడ్ అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఎన్సీసీలో చేరడం వల్ల దేశభక్తి, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం అలవడి సమాజ సేవలో ఉత్సాహంగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్. లలితా పరమేశ్వరి, ఉమ్మిటి వేణుగోపాలరావు, సీహెచ్. భవానీదేవి, వి.ఎల్. నరసింహం, బుద్ది మోహనరావు, ఎద్దు రత్నం, గుంటూరు శివశంకర్, చైతన్య పాల్గొన్నారు. -
చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు
గుంటూరు రూరల్: చిరునామా అడుగుతున్నట్లు నటించి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే మామా అల్లుళ్లను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అడవితక్కెళ్ళపాడులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ డీఎస్పీ భానోదయ ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలిపారు. పాతగుంటూరు యాదవ బజారుకు చెందిన బాణావత్ బద్రునాయక్, పల్నాడు జిల్లా మాచర్ల మండలం చింతలతండా గ్రామానికి చెందిన కేతావత్ శరత్‌లు మేనమామ, మేనల్లుడు. నగరంలో ఆటోలు నడుపుతూ వ్యసనాలకు బానిసలయ్యారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్‌లను ఎన్నుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళుతూ ఒంటరిగా వెళుతున్న మహిళలను అడ్రస్ అడుగుతున్నట్లు నటించి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ పారిపోయేవారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన ఇన్నర్ రింగ్‌రోడ్డులో ఓ మహిళ మెడలోని 20 గ్రాముల బంగారు చైన్‌ను ఇదే తరహాలో లాక్కెళ్లారు. నల్లపాడు సీఐ వంశీధర్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం ఉదయం వై జంక్షన్ వద్ద తిరుగుతున్న ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితులు నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి పోలీసులు 20 గ్రాముల బంగారం, నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ, సీఐని, ఎస్ఐ వాసు, సిబ్బంది సుబ్బారావు, మస్తాన్‌వలి, నరుల్లాలను జిల్లా ఎస్పీ అభినందించారు. -
కావ్యేషు నాటకం రమ్యం
● మార్టూరు కళాపరిషత్తుకు 15 వసంతాలు ● గ్రామీణ ప్రాంత ప్రజల చైతన్యమే లక్ష్యంగా అవిశ్రాంత నిర్వహణ ● నేటి నుంచి మార్టూరులో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నాటికల పోటీలుమార్టూరు: కావ్యేషు నాటకం రమ్యం అన్నారు పెద్దలు. అన్ని కళల్లో నాటకం ప్రాధాన్యతకు ఇది అద్దం పడుతుంది. ఒకప్పుడు వెలుగు వెలిగిన నాటక రంగం నేడు మిణుకు మిణుకుమంటోంది. సినీ, టీవీ మాధ్యమాలతో వెలవెలబోతోంది. ప్రజల ఆదరణ కూడా తగ్గింది. నాటక పరిషత్‌లు జవసత్వాలు కల్పిస్తున్నా, వాటి నిర్వహణ వ్యయ ప్రయాసలతో కూడుకుంది. ప్రదర్శనల వల్ల వ్యయమే తప్పా ఆదాయం రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో మార్టూరుకు చెందిన శ్రీకారం రోటరీ కళాపరిషత్తు 15 సంవత్సరాలుగా నిరంతరంగా నాటక పోటీలు నిర్వహిస్తోంది. నటులను ప్రోత్సహించడంతో పాటు ఆలోచింపజేసే నాటికలతో జనరంజకంగా సాగుతోంది. ఏప్రిల్ 24, 25,26 తేదీల్లో మార్టూరు మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో 15వ నాటికల పోటీలు నిర్వహిస్తోంది. శ్రీకారం రోటరీ కళా పరిషత్ ఆవిర్భావం ప్రపంచవ్యాప్తంగా సేవారంగంలో వ్యాపించి ఉన్న రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ మార్టూరు శాఖ ఇక్కడ కళారంగంలో అడుగుపెట్టడం విశేషం. స్థానికంగా ఉన్న శ్రీకారం స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి ఒకటిన్నర దశాబ్దాలుగా మార్టూరులో శ్రీకారం రోటరీ కళాపరిషత్ పేరుతో పరిషత్తు నాటికల పోటీలు నిర్వహిస్తోంది. ఈ పరిషత్తు ద్వారా నటుల్ని, నాటికలను మాత్రమే ప్రోత్సహించడమే కాకుండా రాష్ట్రంలో వివిధ రంగాలలో ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులు, క్రీడాకారులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలను సన్మానిస్తోంది. కళా పరిషత్తుకు అండగా జేవీ మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన జాష్టి వెంకట మోహన్‌రావు (జె.వి) ఆయన భార్య అనూరాధ దంపతులు మార్టూరు కేంద్రంగా స్థాపించిన ఎఫర్ట్ స్వచ్ఛంద సంస్థ మూడు దశాబ్దాలుగా నడుస్తోంది. ప్రజలకు ముఖ్యంగా రైతులకు నిర్మాణాత్మక సేవలు అందిస్తోంది. రైతులకు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని రంగాలకు ఉపయోగపడాలనే జేవీ ఆశయం నుంచి ఆవిర్భవించిందే ఈ కళాపరిషత్తు. విశ్రాంత అధ్యాపకులు, నటుడు, రచయిత, దర్శకుడు అయిన మండలంలోని కోలలపూడి గ్రామానికి చెందిన కందిమళ్ల సాంబశివరావు, జాష్టి అనూరాధ అధ్యక్ష, కార్యదర్శులుగా 15 సంవత్సరాల కిందట మార్టూరు రోటరీ క్లబ్‌తో కలిసి శ్రీకారం రోటరీ కళాపరిషత్‌ను స్థాపించారు. నిర్వహణ కోసం శాశ్వత నిధి నాటకాలు సామాజిక స్పృహను కల్పించడంతో కీలకపాత్ర పోషిస్తాయని నమ్మిన జేవీ భవిష్యత్తులో ఎలాంటి అవరోధాలు ఏర్పడకుండా ఈ కళాపరిషత్ నిరాటంకంగా కొనసాగేందుకు గాను 2018లో శాశ్వత నిధిని ఏర్పాటు చేయడం విశేషం. నాటికలతో సాంత్వన రోజురోజుకూ యాంత్రికత పెరిగిపోతున్న మనిషి జీవితంలో ఆటవిడుపునకు నాటకాలు ఎంతో దోహదపడతాయి. ఒత్తిడిని మరిచిపోయి, జీవితంలో ఏమి కోల్పోతున్నామో తెలుసుకోగలుగుతాం. ఏటా ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో పరిషత్ ఆధ్వర్యంలో నాటికల ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువలో పరిషత్తు నిర్వహణ గర్వించదగ్గ విషయం. –శానంపూడి లక్ష్మయ్య, మార్టూరు రోటరీ క్లబ్ సభ్యులు సామాజిక సమస్యల పరిష్కార వేదిక నాటక రంగం సమాజంలోని రుగ్మతలను ఎత్తి చూపి వాటి పరిష్కారాలను కళ్లకు కట్టినట్లు చూపగలిగేది నాటిక మాత్రమే. మా పరిషత్తు ద్వారా సమాజంలోని కొంతమందిలోనైనా మార్పు తీసుకురాగలిగితే మా ప్రయత్నం సఫలమైనట్లే. రోటరీ క్లబ్‌తో కలిసి ప్రయాణం చేయడం, స్థానికులు, దాతల ప్రోత్సాహంతో పరిషత్తును విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాం. ఈ పరంపరను ఇలాగే కొనసాగిస్తాం. –జె. వి.మోహనరావు, డైరెక్టర్, ఎఫర్ట్ స్వచ్ఛంద సంస్థ -
జిల్లా విద్యార్థులు సత్తా చాటెన్
బాపట్ల: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారుల కృషి ఫలించింది. జిల్లాలో 83.96 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖాధికారి పురుషోత్తం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 212 నుంచి 9,235 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 8,229 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలు 126 ఉన్నాయన్నారు. వీటిల్లో 6,947మందికి గానూ 5,357మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొత్తంగా చూస్తే జిల్లాలో 83.96శాతం ఉత్తీర్ణత సాధించామని డీఈఓ పురుషోత్తం వెల్లడించారు. వీరిలో బాలురు 6,615మంది, బాలికలు 6,971 ఉన్నారని వివరించారు. బాలురు ఉత్తీర్ణత 81.24 శాతం కాగా బాలికలు 86.71శాతం ఉందని ఆయన వివరించారు. చైతన్య విద్యార్థినికి ఫస్ట్ ర్యాంక్ బాపట్ల పట్టణంలో శ్రీ చైతన్య విద్యార్థిని శ్రీ ప్రణస్య (596) మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. సరస్వతి స్మారక బాలికల ఉన్నత పాఠశాల (ఎస్ఎంజీ) విద్యార్థిని షేక్ జహూర 593 మార్కులు, జెమ్స్ హైస్కూల్ విద్యార్థినులు సీహెచ్. హారిక 593 మార్కులు, ఎస్. నాగ మనస్వి 592 మార్కులు సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎస్ఎంజీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, జెమ్స్ హైస్కూల్ డైరెక్టర్ ఆదెళ్ల విజయ్ కుమార్, శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ మాధురి, పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. జిల్లాలో 83.96 శాతం ఉత్తీర్ణత -
నేటి నుంచి రీజినల్ వాలీబాల్ స్పోర్ట్స్ మీట్
సత్తెనపల్లి: క్రీడల పండుగకు రంగం సిద్ధమైంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ (రామకృష్ణాపురం) ప్రాంగణంలో కెవిస్ హైదరాబాద్ రీజినల్ స్థాయి అండర్–17 బాలబాలికల వాలీబాల్ స్పోర్ట్స్ మీట్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే కెవిస్ హైదరాబాద్ రీజినల్ స్థాయి వాలీబాల్ స్పోర్ట్స్‌మీట్ ఈ నెల 27 వరకు నాలుగు రోజుల పాటు హోరాహోరీగా సాగనున్నాయి. దీనికిగాను 8 బాలికల జట్లు, 17 బాలుర జట్లు కలిపి మొత్తం 25 బాలబాలికల జట్లు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరుకానున్నాయి. బాలికల విభాగం నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, ఖమ్మం, విజయవాడ, తెనాలి, హకీంపేట, బొల్లారం, సత్తెనపల్లి, బాలుర విభాగానికి సంబంధించి విజయవాడ–1, విజయవాడ –2, ఒంగోలు, తెనాలి, కర్నూలు, వాల్తేరు, బొల్లారం, కంచనబాగ్, హకీంపేట, సత్తెనపల్లి, హైదరాబాద్, సీఆర్పీఎఫ్, బార్కాన్, పికెట్, సూర్యలంక, ఖమ్మం నుంచి జట్లు రానున్నాయి. ఈనెల 24, 25న అండర్–17 బాలికలకు, ఈ నెల 26, 27న అండర్–17 బాలురకు పోటీలు జరుగుతాయి. జూలైలో పంజాబ్‌లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల జట్టును ఈ నెల 27న ఎంపిక చేయనున్నారు. క్రీడా పోటీలకు మొత్తం 260 మంది బాలబాలికలు, 40 మంది కోచ్‌లు, ఇతర అఫీషియల్స్ హాజరుకానున్నారు. హజరుకానున్న 25 జట్లు సత్తెనపల్లిలో నాలుగు రోజుల పాటు పోటీలు 27న జాతీయ స్థాయి వాలీబాల్ జట్టు ఎంపిక -
‘సాక్షి’పై దాడి అప్రజాస్వామికం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సాక్షి దినపత్రిక కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులతో దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బుధవారం బాపట్లలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామికమని తప్పుబట్టారు. బాధ్యతాయుత ప్రజాప్రతినిధులు పత్రికా కార్యాలయంపై దాడికి దిగడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి నిరసనగా బుధవారం పాత్రికేయులు జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. జర్నలిస్టులపై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. దాడి చేసిన వారిపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసులు పెట్టి, దాడులు చేసి పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఏఎస్పీ విఠలేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు బిజివేముల రమణారెడ్డి, ఆర్. ధనరాజ్, రాఘవ, కె. ప్రశాంత్, ఉమామాహేశ్వరరావు, పి.వెంకట్, అంజయ్య, గణేష్, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, రవితేజ, అన్నాధరావు, చంటి, బొట్టు కృష్ణ, సాల్మన్‌రాజు, మరియదాసు పాల్గొన్నారు. ఆగ్రహించిన జర్నలిస్టులు బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్ ఏలూరు సాక్షి కార్యాలయంపై చింతమనేని అనుచరుల దాడి హేయం -
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచండి
యద్దనపూడి: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.పురుషోత్తమం తెలిపారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో భాగంగా బుధవారం మండలంలోని పూనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఆరవ తరగతిలో 28 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆరవ తరగతిలో చేర్పించేలా హెచ్ఎంలతో పాటు ఉపాధ్యాయులు, సీఆర్పీలు, విద్యాశాఖాధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నిష్టాతులైన ఉపాధ్యాయుల శిక్షణలో చిన్నారుల బంగారు భవిష్యత్ ఉన్నతంగా తీర్చిదిద్దుతామనే నమ్మకాన్ని తల్లిదండ్రులకు కలిగించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న రుచికరమైన మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫాం, పుస్తకాలు, నోట్స్ పుస్తకాలు, షూ తదితర మౌలిక వసతుల గురించి అవగాహన కల్పించాలని తెలిపారు.అనంతరం పాఠశాలలోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ డి. గంగాధర్, ఎంఈఓ –2 చిలుకూరి గోపి, ప్రధానోపాధ్యాయుడు ఏఎం . శ్రీనివాసరావు ,హెచ్ఎం రాఘవరెడ్డి, మాజీ సర్పంచ్ బోయపాటి సాంబశివరావు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.పురుషోత్తమం -
లాం ఫాంలో సలహా మండలి సమావేశం
గుంటూరు రూరల్: కృష్ణా మండలం వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం బుధవారం నిర్వహించారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాంఫాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ శాఖలు సంయుక్త ఆధ్వర్యం వహించాయి. నగర శివారుల్లోని లాంఫాం నందున్న సమావేశ మందిరంలో రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి మాట్లాడుతూ రైతుల సలహాలు, సూచనలు దృష్టిలో ఉంచుకుని పరిశోధన ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. నూతన వంగడాలపై ఫీడ్ బ్యాక్ రైతుల నుంచి తీసుకోవాలన్నారు. సహజ వనరుల పొదుపు, నేల ఆరోగ్యం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కృష్ణా మండలంలో నిష్ణాతులైన రైతుల ద్వారా సాగు సమస్యలు, సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ జి. శివన్నారాయణ మాట్లాడుతూ జిల్లా వనరులు, అవసరాలు, పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని నూతన పరిశోధనలు జరపాలని చెప్పారు. రైతులు విత్తన రకాలపై కాకుండా పంటల్లో యాజమాన్య పద్ధతులపై దృష్టి సారించాలని కోరారు. వివిధ జిల్లాల వ్యవసాయ అధికారులు ఆయా ప్రాంతాల పంటల స్థితిగతులు, పంటల యాజమాన్యం, మినీ కిట్ల పనితీరు గురించి వివరించారు. వచ్చే ఏడాదిలో చేపట్టాల్సిన పరిశోధనలకు దిశానిర్దేఽశం చేశారు. కేవీకే ఘంటశాల, గరికపాడులతో తయారు చేసిన పలు రకాల ప్రచురణలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఆరు జిల్లాల వ్యవసాయ శాఖల అధికారులు, 12 పరిశోధన స్థానాలు, ఆరు విస్తరణ యూనిట్లు శాస్త్రవేత్తలు, వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు, డీఆర్సీ అధికారులు, ఆరు జిల్లాల అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కూటమి లిక్కర్ మాఫియా
● టీడీపీ నాయకులకే మద్యం దుకాణాల అప్పగింత ● వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు నగరంపాలెం (గుంటూరు వెస్ట్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ మాఫియా కొనసాగుతోందని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు మండిపడ్డారు. గుంటూరు బృందావన్గార్డెన్స్ వైఎస్ఆర్ీ సపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్టీఆర్ మద్యపానం నిషేధించగా, చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మద్యం పాలసీ తీసుకువచ్చారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో సారాయి, మద్యం ఏరులై ప్రవహిస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేశారని తెలిపారు. టీడీపీ నాయకులకే మద్యం దుకాణాలను అప్పగించారని ఆరోపించారు. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలకు 30శాతం వాటా, ఊరుకి ఎనిమిది బెల్ట్ షాప్‌లు, పర్మిట్ రూంలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. రూ.వేల కోట్లు టీడీపీ నేతల చేతుల్లో మారుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు గతంలో బెల్ట్‌షాపులు రద్దు చేస్తామని తొలి సంతకం చేశారని, ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారని అశోక్‌బాబు విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో 43 వేల బెల్ట్ షాప్‌లను రద్దు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుమారు 4,300 మద్యం దుకాణాలు ఉండగా వైఎస్ జగన్ హయాంలో 33 శాతం తగ్గించారని తెలిపారు. మద్యం దుకాణాలన్నీ టీడీపీ నాయకులకు వచ్చేలా చేశారని, క్వాటర్ బాటిల్‌కు అదనంగా రూ.20 లబ్ధి చేకూర్చేలా చేశారని మండిపడ్డారు. బెల్డు షాప్‌లు ఏర్పాటుకు సైతం లంచం కింద రూ.2 లక్షలు చెల్లిస్తున్నారని, తద్వారా తాగునీటి సీసాల విక్రయాలు, పర్మిట్లు ఇస్తున్నారని విమర్శించారు. గతంలోని మద్యం పాలసీపై చంద్రబాబు ఏ–3 గా ఉన్నారని, ఆ కేసు ఏమైందనేది చూసుకోవాలని అన్నారు. రాజ్ కసిరెడ్డితో పాటు ఆ కేసులో వైఎస్ జగన్‌ను ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లతో బలవంతంగా రాజ్ కేసిరెడ్డి పేరు చెప్పించారని అశోక్‌బాబు ఆరోపించారు. -
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఫిరంగిపురం: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత కానందుకు మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పి.వినయకుమార్ (16) స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదు. మనస్తాపానికి గురై తన తాత పాపయ్య ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరి వేసుకొన్నాడు. చుట్టు పక్కల వారు గమనించి విద్యార్థిని స్థానికంగా ఉన్న ప్రయివేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విద్యార్థిని రక్షించిన పోలీసులు తాడేపల్లి రూరల్ : 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేస్తుండగా బుధవారం తాడేపల్లి పోలీసులు కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐ కల్యాణ్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ విద్యార్థికి 10 తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుండి వచ్చాడన్నారు. తల్లిదండ్రులు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అక్కడి సీఐ అప్రమత్తమై విద్యార్థి వద్ద సెల్‌ఫోన్ ఆధారంగా లొకేషన్ కనిపెట్టి తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. నాలుగు బృందాలుగా తాడేపల్లి పోలీసులు వెతకగా తాడేపల్లి కృష్ణాకెనాల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు పంపినట్లు సీఐ కల్యాణ్ రాజు తెలిపారు. నకిలీ ఉద్యోగాల ముఠాపై ఫిర్యాదు తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లిలో జనసేన పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై బుధవారం జనసేన నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు సామాల నాగేశ్వరరావు, తాడేపల్లి పట్టణ సీనియర్ నాయకుడు అంబటి తిరుపతిరావు మాట్లాడుతూ ఉండవల్లి సెంటర్లో శివ అనే వ్యక్తి ఇల్లు అద్దెకు తీసుకుని జనసేన ఎంపీ, మంత్రుల పేర్లు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దరఖాస్తులు స్వీకరిస్తూ, నగదు వసూలు చేస్తున్నాడని తమ దృష్టికి వచ్చిందన్నారు. శివకు, అతని వెనుక ఉన్న ముఠాతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చల్లాకుల కోటేష్, నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, ఉండవల్లి గ్రామ అధ్యక్షులు రాజా రమేష్ పాల్గొన్నారు. -
పట్టపగలు బస్టాండ్ సెంటర్లో నగదు అపహరణ
● రూ. 5 లక్షలున్న బ్యాగ్‌ను ఎత్తుకుపోయిన గుర్తు తెలియని వ్యక్తులు ● డీఎస్సీ మోయిన్ విచారణఅద్దంకి రూరల్: పట్ట పగలు అందరూ చూస్తుండగానే మెయిన్ సెంటర్ బస్టాండ్ వద్ద రోడ్ పక్కన నిలిపిన బైకు కవర్లో నుంచి నగదు బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి పరారైన సంఘటన బుధవారం అద్దంకిలో కలకలం రేపింది. సీఐ సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి వివాహ పనుల నిమిత్తం బుధవారం రూ. 3 లక్షలు తీసుకుని అద్దంకికి వచ్చాడు. దీనికి తోడుగా మరో రూ. 2 లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకున్నాడు. మొత్తం రూ. 5 లక్షలను ఒక బ్యాగ్‌లో పెట్టి బైకు ట్యాంకులో ఉంచి టిఫిన్ చేసేందుకు అద్దంకి బస్టాండ్ సమీపంలోని బండి వద్దకు వచ్చాడు. బైకు దిగి టిఫిన్ చేశాడు. చేతులు కడుక్కనేందుకు పక్కకు తిరిగిన సమయంలో గుర్తు తెలియని యువకుడు వచ్చి బైకు కవర్లో ఉన్న నగదును తీసుకున్నాడు. వెంటనే వేరొక యువకుడు బైకు మీద రావడంతో దాన్ని ఎక్కి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ మోయిన్ బుధవారం రాత్రి అద్దంకిలోని సంఘటనా స్థలానికి వచ్చి అక్కడి వారిని దొంగతనం జరిగిన తీరును విచారించారు. దొంగలను వెంటనే పట్టుకుంటామని చెప్పారు. నగదు, విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట సీఐ సుబ్బరాజు, ఎస్ఐ రవితేజ, సిబ్బంది ఉన్నారు. -
ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని రికార్డు
వేటపాలెం: పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో పదో తరగతి విద్యార్థిని సజ్జా దివ్యశ్రీ 596 మార్కులతో రికార్డు సృష్టించింది. బాలికది చేనేత కుటుంబం. తండ్రి రామకృష్ణ 104లో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నారు. దివ్యశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వం స్కూల్స్‌లో ఉత్తమ బోధన అందిస్తున్నారని, వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడినట్లు తెలిపింది. ఎస్‌పీఈసీ (స్పెషన్ చానల్ ఫర్ ఎడ్యుకేషన్) ఎంట్రన్స్ పరీక్షలు రాసి హైదరాబాదులోని ఐఐఐటీలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ చదువడమే లక్ష్యమని పేర్కొంది. -
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
ఇంకొల్లు(చినగంజాం): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధూసూదనరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల స్థితిగతులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సోమవారం ఇంకొల్లులో రైతులతో కలిసి భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గిట్టుబాటు ధర లేదంటూ ఆందోళన చెందిన రైతులు పొగాకును తగలబెట్టి తమ నిరసన తెలిపారన్నారు. దాదాపు 500 మందికి పైగా రైతులు ఈ నిరసనలో పాల్గొనడాన్ని చూస్తే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. రైతు పండించిన పంటలకు గత ప్రభుత్వం మాదిరిగానే గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని, రైతులు పండించిన పొగాకును ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేసి నష్టపోకుండా చూడాలని ఆయన కోరారు. వైఎస్ జగన్ హయాంలో... వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించారని, ఆ సమయంలో రైతులు లాభాలు చవిచూశారన్నారు. ఆయన కల్పించిన ‘మద్దతు’తో ఈ సీజన్లో భారీగా పెట్టుబడులు పెట్టి రైతులు పొగాకు సాగు చేపట్టారని గాదె మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా స్థానిక రైతులు నల్లబర్లీ పొగాకును ఎక్కువగా పండించారని అన్నారు. ప్రధానంగా పర్చూరు డివిజన్లో సుమారు లక్ష ఎకరాలలో నల్ల బర్లీ పొగాకు సాగు చేశారని అన్నారు. పొగాకు పంటను కొనుగోలు చేస్తామని మొదట్లో మాటిచ్చిన కంపెనీలు సైతం నేడు కనిపించకుండా పోవడంతో రైతులను దిక్కుతోచని పరిస్థితులలో సోమవారం రోడ్డెక్కాన్నారు. మరో వైపు మొక్కజొన్న, మిర్చి, మినుము, శనగ, వరి పంటల పండించిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పంట దిగుబడులు వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, పంటను గోడౌన్లలో నిల్వ చేసి ప్రయోజనం లేదన్నారు. ఈ పరిస్థితులో రైతులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని గాదె మధుసూదనరెడ్డి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల బాధలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే రైతుల తరఫున వైఎస్సార్సీపీ అండగా ఉండి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయమై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ చూపి రైతులకు మేలు చేయాలని, అప్పటి వరకు వేచి చూస్తామని లేనిపక్షంలో రైతులతో కలిసి పోరాటం చేయక తప్పదని అన్నారు. ఇంకొల్లులో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు భవనం శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, షేక్ బాబుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషావలి, జిల్లా కార్యదర్శి కొండూరి గోవింద్, ఇంకొల్లు, మార్టూరు, చినగంజాం, కారంచేడు, యద్దనపూడి మండల కన్వీనర్లు చిన్ని పూర్ణారావు, జంపని వీరయ్యచౌదరి, మున్నం నాగేశ్వరరెడ్డి, జువ్వా శివరామప్రసాద్, రావూరి వేణు, జిల్లా కమిటీ సభ్యులు కోట శ్రీనివాసరావు, తోకల కృష్ణమోహన్, దండా చౌదరి, ఆసోది బ్రహ్మానందరెడ్డి, దాసరి వెంకటరావు, బిల్లాలి డేవిడ్, కరి వాసు, తమ్మా అమ్మిరెడ్డి, గడ్డం మస్తాన్‌వలి, మాచవరపు రవికుమార్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నరన్నారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం పర్చూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి -
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బాపట్లలో ఆపాలి
బాపట్ల: సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బాపట్లలో తప్ప అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగుతుందని పౌర సమాఖ్య సభ్యుడు కారుమంచి విజయకుమార్ పేర్కొన్నారు. బాపట్లలోని నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో విజయకుమార్ మాట్లాడారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బాపట్ల లో కూడా ఆగేలా చర్యలు తీసుకోవాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ని జూన్ 2024లోనే పౌర సమాఖ్య కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే రైలు చీరాలో నిలుపుదల చేసేందుకు ఎంపీ కృషి చేస్తున్నట్లు వస్తోన్న వార్తలు ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాపట్ల స్టేషన్లో మధ్యలో రద్దయిన రైళ్లని పునరుద్ధరించాలని, ఉప్పరపాలెం, కంకటపాలెం గేట్ల వద్ద ఆర్వోబీలుగాని, లేక పరిమిత అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జమృద్బాషా, కందుల రమణకుమార్, జి. వెంకటేశ్వర్లు, పి.సి.సాయిబాబు, తోట రామాంజనేయులు పాల్గొన్నారు. -
జీవించే హక్కులను కాలరాస్తున్నారు
రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు చీరాలరూరల్:ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై చేస్తున్న దాడులను ఆపేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిన నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సీనియర్స్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేధావులు, ప్రజా సంఘా లు, వివిధ రంగాలకు చెందిన ప్రజలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలోని సహజవనరులైన ఖనిజ సంపదను భవిష్యత్ తరాలకు అందించడంతోపాటు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతున్న ఆదివాసీలను కేంద్ర ప్రభుత్వం కొన్ని బహుళజాతి కంపెనీలకు ఆయా సంపదలను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలను, సైన్యాన్ని ఉపయోగించి మావోయిస్టులను ఏరివేస్తున్నట్లు నటిస్తు అడవులలో జీవిస్తున్న ఆదివాసీలపై దాడులు చేయిస్తుందని అన్నారు. మావోయిస్టులతో ప్రమాదమున్నదని భావించినట్లయితే కేంద్రం వారితో చర్చలు జరపాలని సమావేశంలో పాల్గొన్న వక్తలు సూచించారు. సమావేశంలో ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్‌కుమార్ ధర్మ, ఆదివాసీల సంఘీభావ వేదిక ప్రకాశం జిల్లా కన్వీనర్ వీరాంజనేయులు, రాష్ట్ర చేనేత జసనమాఖ్య నాయకులు మాచర్ల మోహనరావు, ఊటూకూరి వెంకటేశ్వర్లు, దామర్ల శ్రీకృష్ణ, చుండూరు వాసు, మచ్చ అర్జునరావు, శీలం రవి, మేడా వెంకటరావు, గాదె హరిహరరావు, దేవన వీరనాగేశ్వరరావు, మేడిన వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెస్టారెంట్లు, బిర్యాని పాయింట్లలో తనిఖీలు
చీరాల టౌన్: చీరాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంట్లు, బిర్యాని హోటళ్లలో ఆహార తనిఖీ భద్రతాధికారులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా ఆహార తనిఖీల అధికారి ప్రభాకరరావు నేతృత్వంలో పట్టణంలోని దావత్, మిస్సమ్మ, రావుగారి బిర్యాని, గోదావరి రుచులు అనే పలావ్ పాయింట్లలో తనిఖీలు చేశారు. రెస్టారెంట్లు, పలావ్ పాయింట్లకు ఉన్న ఆహార లైసెన్సులతో పాటుగా కిచెన్, ఫ్రిడ్జ్‌ల్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన చేపలు, రొయ్యలు, చికెన్, మసాలా దినుసులు, ఉల్లిపాయల పేస్టులు, పుదీనా చెట్నీలతో పాటుగా రంగు కోసం వినియోగిస్తు ప్రజలను రోగాల పాలు చేసే రంగుల డబ్బాలు, టేస్టింగ్ సాల్ట్ ప్యాకెట్లను చూసి విస్తుపోయారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంచడం, మూతలు లేకుండా కూరగాయలు, మసాల పౌడర్లుతోపాటుగా వాడిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగిస్తుండటంపై నిర్వాహకులను హెచ్చరించారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం, రొయ్యలు, చికెన్, పెరుగు, మంచూరియా, రంగు డబ్బాలు, టేస్టింగ్ సాల్ట్ ప్యాకెట్లను వ్యర్థ పదార్థాల డబ్బాల్లో పడేయించారు. ప్రజలను అనారోగ్యాలకు గురిచేసే రంగులను చికెన్, చేపలు, రొయ్యలకు పూసిన ముక్కలను శాంపిల్ సేకరించి నిర్వాహకులకు నోటీసులు అందించారు. శాంపిల్ ఫలితాలు వచ్చిన తర్వాత రెస్టారెంట్ నిర్వాహకులపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జిల్లా ఆహార తనిఖీ అధికారి ప్రభాకరరావు మాట్లాడుతు...చీరాల పట్టణంలో ఉన్న రెస్టారెంట్లు, బిర్యాని హోటళ్లలో ఆహారంపై పలు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టామన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులు యథేచ్ఛగా మాంసాహారాన్ని, వండిన అన్నం, ఇతర పిండి పదార్థాలు, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్టులను, పొదినా చట్నీలను రోజుల తరబడి ఫ్రిడ్జ్‌ల్లో నిల్వ చేయడం దారుణమన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే రెస్టారెంట్లు, హోటళ్లు నిబంధనల ప్రకారం తాజా మాంసాహారం, ఇతర పదార్థాలను వినియోగించాలని, నిల్వఉన్న ఆహారాన్ని వేడి చేసి, రంగులు అద్ది ఆహారం అమ్మకాలు చేస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహార శాంపిల్ రిపోర్టులు వచ్చిన తర్వాత కలెక్టర్ ఆదేశాలతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాడుల్లో చీరాల డివిజన్ ఆహార తనిఖీ అధికారి ప్రణీత్, వినియోగదారుల సమాఖ్య ప్రతినిధి దాసరి ఇమ్మానియేల్, పాల్గొన్నారు.నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు స్వాధీనం శాంపిల్స్ సేకరణ -
గుర్తుతెలియని వాహనం ఢీకొని యాచకురాలు మృతి
బల్లికురవ: రోడ్డుపై వెళుతున్న యాచకురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టటంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం మేదరమెట్ల– నార్కెట్‌పల్లి నామ్ రహదారిలోని మండలంలోని వీ.కొప్పరపాడు శివాలయం ఎదుట జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. నాలుగు నెలల నుంచి మహిళ(55) గ్రామంలో తిరుగుతూ యాచన చేస్తూ పెట్టిన ఆహారాన్ని తింటూ రాత్రికి బస్‌షెల్టర్‌లో నిద్రిస్తుంది. రోడ్డుపై వెళుతున్న మహిళను నార్కెట్‌పల్లి వైపు వెళుతున్న వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టటంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భౌతికకాయాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకుపోవాలి
బాపట్ల: విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చు కుని ముందుకుపోవాలని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ఐదు రోజులపాటు జరిగే స్మార్ట్ మొబిలిటీ, వెహికల్ సేఫ్టీ–ఏఐ సిస్టమ్స్‌పై వర్క్‌షాపును మంగళవారం ప్రారంభించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ స్మార్ట్ మొబిలిటి, వాహన భద్రత, కృత్రిమ మేధస్సు రంగాల్లో తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నైపుణ్యాలను వెలికితీసే వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ వర్క్‌షాపు ఉపయోగపడుతుందని ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి తమ విద్యాసంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. సొసైటీ జాయింట్ సెక్రటరీ డి.వెంకయ్యచౌదరి, ట్రెజరర్ బ్రహ్మయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రమాదేవి, కన్వీనర్ డాక్టరు ఎన్.కార్తీక్ పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితా రూపకల్పనలో బీఎల్ఓలదే కీలక పాత్ర
బాపట్ల:ఓటర్ల జాబితా రూపకల్పనలో బీఎల్ ఓల పాత్ర అత్యంత కీలకమైందని బాపట్ల ఆర్డీఓ గ్లోరియా అన్నారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో బీఎల్ఓలకు ఓటర్ల జాబితాపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా రూపొందించడంలో బీఎల్వోలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వెయ్యి ఓట్లు దాటితే రెండో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సందర్భంలో వారందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, తహసీల్దార్లు షేక్ సలీమా, సుందరమ్మ, వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ నాయకులు మల్యాద్రి, బీఎస్పీ నాయకులు కాగిత కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దోనేపూడి రవి, జనసేన నాయకులు బీఎల్వోలు పాల్గొన్నారు. బాపట్ల ఆర్డీఓ గ్లోరియా -
స్వగ్రామానికి చేరిన విద్యార్థి మృతదేహం
●తిరుచ్చిలో ఇంజినీరింగ్ చదువుతున్న వెంకటేష్ ●ఈతకు వెళ్లి మృతి ●అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు అద్దంకి: ఇంజినీరై తిరిగి ఇంటికి వస్తాడనుకున్న కుమారుడు చదువు పూర్తికాక మునుపే శవమై ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈత సరదా ఆ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో జరిగింది. తిరుచ్చి నుంచి భౌతికకాయం మంగళవారం ఇంటికి చేరింది. కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు.. మండలంలోని గోవాడ గ్రామానికి చెందిన మాదాల నాగేశ్వరరావు కుమారుడు వెంకటేశ్(20) పదో తరగతి వరకూ అద్దంకిలో, ఇంటర్ గుంటూరులో అభ్యసించాడు. ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని ధనలక్ష్మి శ్రీనివాసన్ విశ్వవిద్యాలయంలో గత సంవత్సరం చేరాడు. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు. అక్కడ తోటి విద్యార్థులు ఎనిమిది మందితో కలసి ఒకేగదిలో ఉంటున్నాడు. ప్రతి రోజూ కళాశాలకు వెళ్లి తిరిగి వస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం వారు నివసించే గదికి సమీపంలోని బావిలో ఈతకు దిగారు. ఒకసారి అందరూ ఈత వేసి ఒడ్డుకు చేరినా రెండోసారి వెంకటేశ్ ఈతకు దిగాడు. తాను వేసుకున్న గాలి పైపు పక్కకు తొలగడంతో మునకేశాడు. గమనించిన తోటి విద్యార్థులు కాపాడాలని ప్రయత్నించినా వీలు కాకపోవడంతో కాపాడటానికి ప్రయత్నించిన మరో యువకుడు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్, వెంకటేశ్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు బంధువులు తెలిపారు. ఈ విషయం తోటి విద్యార్థుల ద్వారా సమాచారం అందుకున్న బంధువులు తిరుచ్చి వెళ్లి భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి మంగళవారం అంత్య క్రియలు నిర్వహించారు. నాగేశ్వరరావుకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు ఆకస్మికంగా మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. దీంతో గ్రామంలోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు చీరాల రూరల్: కుల, మతాలకతీతంగా పరిపాలన చేస్తామని భారత రాజ్యంగంపై ప్రమాణంచేసి ఉపముఖ్యమంత్రి పదవి పొందిన పవన్ కల్యాణ్ ఆవిధంగా పరిపాలన చేయడంలేదని, దళితులు, ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తూ కేవలం సనాతన ధర్మాన్ని మాత్రమే కాపాడుతానని మాట్లాడుతున్నారని అది మంచి పద్ధతి కాదని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ అన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలో దళిత మహిళలు లైంగిక వేధింపులకు గురై సాంఘిక బహిష్కరణ జరిగినా, వారిపై దాడులు జరిగినా పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని పాటిస్తానని బహిరంగంగా చెపుతూ ఇతర మతాలను కించపరచే విధంగా మాట్లాడడం తగదన్నారు. అన్ని కులాలవారు ఓట్లు వేస్తేనే ఎవరైనా గెలవగలరు కానీ ఒక కులం వారు ఓట్లువేస్తే గెలలేరనే విషయాన్ని పవన్‌కళ్యాణ్ గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో మాల మహాసభ రాష్ట్ర నాయకుడు కొండమూరి ప్రకాష్, మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు, మేరిగ రమేష్, రత్నం తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా నదిలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం
రేపల్లె రూరల్: గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం పెనుమూడి గ్రామం వద్ద కృష్ణా నదిలో లభ్యమైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మహిళ మృతదేహం కృష్ణా నదిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారన్నారు. పోలీసులు పెనుమూడిలోని సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పట్టణ సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ మృతురాలికి సుమారు 65 సంవత్సరాల వరకు ఉండవచ్చని పేర్కొన్నారు. ఆమె పుష్కర ఘాట్ వద్ద ఒంటరిగా కూర్చుని ఉండటానికి గమనించిన స్థానికులు వివరాలు అడగ్గా తాను తన మనవడు పుష్కర్ ఘాటు వద్ద నిద్ర చేయాల్సి ఉందని, తన మనవడు ఇంకా రాలేదని బాపట్ల నుంచి వస్తున్నాడని తెలిపిందని అన్నారు ఉదయం చూడగానే నదిలో శవమై తేలిందన్నారు. ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీంచి శవపంచనా మా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభు త్వ వెద్యశాలకు తరలించామన్నారు. మృతు రాలి పూర్తి వివరాలు తెలియరాలేదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కోర్కెలు తీర్చే కల్పవల్లి.. గంగమ్మతల్లి
కారంచేడు: కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కారంచేడు గంగమ్మ తల్లి శిడి మహోత్సవం ఈనెల 27వ తేదీ ఆదివారం వైభవంగా జరగనుంది. గ్రామంలోని పుట్టాయిపాలెంలో పెద్ద ఎత్తున జరిగే గంగమ్మ తల్లి తిరునాళ్లకు ఎంతో విశిష్టత ఉంది. 38 ఏళ్లుగా ప్రతి ఏడాదీ అమ్మవారి తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తారు. శక్తి స్వరూపం కలిగి, భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉండే గంగమ్మ అమ్మవారి గుడి అంటే సమీప ప్రాంతంలో మంచి ప్రసిద్ధి. తొలుత స్థానిక గ్రామస్తులు చిన్న గుడిని ఏర్పాటు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించగా ప్రస్తుతం ఆ దేవాలయం దినదినాభివృద్ధి చెందింది. దేవాలయం అభివృద్ధిలో దేవస్థాన కమిటీ, సభ్యులు విశేష కృషి చేశారు. ప్రతివారంలో మంగళ, ఆదివారాల్లో భక్తులు విరివిరిగా వచ్చి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న భక్తుల కష్టాలు, కోర్కెలను తీర్చే తల్లిగా పోలేరమ్మ తల్లికి పేరుంది. అందుకే ప్రతి ఏడాదీ అమ్మవారి తిరునాళ్ల, శిడి మహోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. తిరునాళ్ల రోజు శిడి పెళ్లి కొడుకుతో ఊరేగింపుగా అమ్మవారి గుడికి వెళ్లి గుడి వద్ద ఉండే శిడి మానుకు ఒక పెట్టెలో మేకపోతును ఉంచి, గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ సమయంలో శిడిమాను పైభాగంలో చెక్కపెట్టెలో ఉంచిన మేకపోతును భక్తులు జీడికాయలతో కొడుతుంటారు. శిడిమాను లాగితే కష్టాలు తొలిగిపోతాయని భావించే భక్తులు శిడిమాను బండిని లాగేందుకు పోటీ పడతారు. తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేకంగా విద్యుత్ ప్రభలు ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఏడాది ప్రభలతోపాటు నాటికలు, కళాకారులతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పా టు చేశారు. తిరునాళ్లను పురస్కరించుకొని పశుసంపదతోపాటు వాహనాలను గుడి చుట్టూ తిప్పి ప్రజలు తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ తిరునాళ్లకు గ్రామ ఆడపడుచులు ఎక్కడ ఉన్నా గ్రామానికి చేరుకుంటారు. తమ ఇంటి ఇలవేల్పుకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ పండుగకు బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల నుండే కాకుండా మండలంలోని అన్ని గ్రామాలతోపాటు పరిసర గ్రామాల నుంచి తిరునాళ్లను చూసేందుకు ప్రజలు వేల సంఖ్యలో వస్తుంటారు. భారీ బందోబస్తు తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చీరాల డీఎస్పీ ఆధ్వర్యంలో ఇంకొల్లు సీఐ, కారంచేడు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. నేటి నుంచి ఐదు రోజుల ప్రత్యేక పూజలు బుధవారం పోలేరమ్మ, గంగాభవానీ అమ్మవార్లకు తలంట్లు, నైవేద్యాల సమర్పణ, సాయంత్రం పావనం బొల్లావుల ఊరేగింపు, 24వ తేదీన రాజు, ప్రధాని బియ్యం కోల, బద్దె గొర్రె, 25వ తేదీన పాలవెల్లి, కథా కాలక్షేపం, 26వ తేదీన ఆగుమంచి బోనాలు, ఆడపడుచుల జమ్మి పొంగళ్లు, సాయంత్రం పాలేరు దగ్గర గంగా, కాటమరాజుల తర్కవాదాలు, 27వ తేదీ ఉదయం గ్రామంలోని పశువులు, నూతన వాహనాలు ప్రత్యేక అలంకరణలో గుడిచుట్టూ ప్రదక్షిణలు, సాయంత్రం శిడి పెళ్లికుమారుడి ఊరేగింపు, శిడిమాను మహోత్సవం, విద్యుత్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 28న అమ్మవారి పొంగళ్లతో తిరునాళ్ల ముగింపు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నేటి నుంచి ఐదు రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు 27న శిడిమహోత్సవం, తిరునాళ్లు -
బాపట్ల
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 202525కు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ దరఖాస్తు పొడిగింపు బాపట్ల: అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ దరఖాస్తు గడువు ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత రక్షణ శాఖ వివిధ దళాల రిక్రూట్మెంట్లో నూతనంగా ప్రవేశపెట్టిన అగ్ని పథకంలో భాగంగా ఆర్మీలో ఉద్యోగాల ప్రకటన జారీ అయినదని జిల్లా కలెక్టర్ తెలిపారు. అగ్ని జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాలలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని, అర్హులైన యువత నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తెలిపారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాత పరీక్షను ఆన్లైన్ ద్వారా జూన్ 2025న నిర్వహిస్తారని తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలన వెలగపూడి(తాడికొండ): తుళ్ళూరు మండలం వెలగపూడి గ్రామంలోని సచివాలయం సమీపంలో మే 2వ తేదీన జరగనున్న అమరావతి తదితర శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్న నేపథ్యంలో ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజలతో కలిసి మంగళవారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పరిశీలించారు. హెలీప్యాడ్ నిర్మాణం, ప్రధాని రోడ్ షో సాగే మార్గాలు, ప్రధాన వేదిక, పబ్లిక్, వీవీఐపీ, గ్యాలరీల వద్ద ఏర్పాట్లను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏర్పాట్లు నిర్దేశిత సమయం కంటే ముందే వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఎం.నవీన్ కుమార్, అడిషనల్ ఎస్పీ సుప్రజ, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. మేయర్ ఎన్నికకు 28న ప్రత్యేక సమావేశం నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం నెహ్రూనగర్: గుంటూరు నగర మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ఉత్తర్వులను అనుసరించి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక నిర్వహించాలని, ఈ ఎన్నికకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజను ఎన్నికల అధికారిగా నియమించారు. ఎన్నికల అధికారి ద్వారా ఈ నెల 24 లోపు గుంటూరు నగర పాలక సంస్థ కార్పొరేటర్లకు, ఎక్స్ అఫిషియో సభ్యులు 28న ప్రత్యేక సమావేశానికి హాజరు కావలసినదిగా నోటీసులు అందనున్నాయి. షెడ్యూలు ప్రకారం ఈ నెల 28న ఉదయం 11 గంటలకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మేయర్ ఎన్నిక జరుగుతుందని ఎలక్షన్ అథారిటీ, సీడీఎంఏ డాక్టర్ పి. సంపత్ ఉత్తర్వులు జారీ చేశారు. చీరాలటౌన్: సబ్సిడీ రుణాలను టీడీపీ నేతలు పంచుకుతింటున్నారు. అర్హులకు రుణాలు అందించకుండా టీడీపీ నేతలు చెప్పిన వారికే అందిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ పేరుతో అధికారులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఫలితంగా నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై అందించే రుణాలను అర్హులకు కాకుండా టీడీపీ నేత సిఫార్సు చేసిన వారికే కేటాయిస్తున్నా రు. కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను లబ్ధిదారులకు అందించేందుకు కమిటీ కన్వీనర్ ఎంపీడీవోగా, ఈవోఆర్డీ, పలువురు బ్యాంకుల మేనేజర్లు ఎంపిక కమిటీ సభ్యులుగా నియమించారు. స్క్రీనింగ్ కమిటీని మొక్కుబడిగా ఏర్పాటు చేశారే కానీ తుది నిర్ణయం అంతా ముఖ్యనేతదే. ఆయన ఆమోదం పొందిన వారినే అర్హులుగా నిర్ధారించారు. ఎంపీడీవో కార్యాలయానికి టీడీపీ నాయకులు వచ్చి నేరుగా తమవారికి రుణాలు ఖరారయ్యాయో లేదో అని జాబితాలను చూసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారుల అక్రమాలకు టీడీపీ నాయకులు అండగా నిలవడంతో అడ్డూ అదుపులేకుండా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. 90 యూనిట్లకు 621 మంది దరఖాస్తు ప్రభుత్వం బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు మండలానికి 90యూనిట్లను కేటాయించగా 621 మంది అభ్యర్థు లు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరి బ్యాంకు సిబిల్ రేటు, ధ్రువీకరణ పత్రాలను బ్యాంకు మేనేజర్ల సమక్షంలో మండల పరిషత్ అధికారులు విచారణ చేపట్టారు. మండలానికి కేటాయించిన 90 యూని ట్లు బీసీ, ఈబీసీ సబ్సిడీ రుణాలకు రూ.1.69 కోట్లు బ్యాంకు మేనేజర్లు రుణాలను అందించనున్నారు. ఈనెల 9న ఇంటర్వ్యూలు నిర్వహించగా 612 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. సబ్సిడీలను నిర్ధారిస్తున్న టీడీపీ నాయకులు మా గ్రామానికి కేటాయించిన రుణాలను మా వారందరికీ ఇవ్వాలి....సబ్సిడీలను సైతం మేమే నిర్దారిస్తాం....మాకు ఇబ్బందులు లేకుండా చూడండంటూ...టీడీపీ నాయకులు అధికారులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. అధికారులు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మీరు చెప్పిన వారికే రుణాలు అందిస్తామని టీడీపీ నేతలకు హామీ ఇస్తూ జీ హుజూర్ అంటున్నారు. ముఖ్యనేత సిఫార్సుతో కేవలం టీడీపీ నాయకులు సూచించిన వారికే ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు వదులుతున్నారు. రుణాల ఎంపికకు సంబంధించి తుది జాబితాలను అధికారులు వివరాల జాబితాను జిల్లా కార్పొరేషన్ కార్యాలయాల కంటే ముందుగా టీడీపీ నేతలకు చూపిస్తున్నారంటే చీరాల్లో రుణాలు ఎవరికి అందుతాయో అర్థం చేసుకోవచ్చు. జనసేన, బీజేపీలకు దక్కని ప్రాధాన్యం టీడీపీ అధికారంలోకి రావడానికి ముఖ్యపాత్ర పోషించిన జనసేన, బీజేపీ నాయకులకు చీరాల్లో సరైన ప్రాధాన్యతనివ్వడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన, బీజేపీ నేతలు సూచించిన వారికి సబ్సిడీ రుణాలు ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనమే. గత ఎన్నికల సమయంలో వేరే పార్టీకి పనిచేసి ప్రస్తుతం అధికార పార్టీ పంచన చేరిన మండలంలోని కొందరు నేతలు అంతా తామే అన్నట్లు రుణాల పంపిణీలో చక్రం తిప్పడాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.జాబితాను బ్యాంకులకు పంపాం కార్పొరేషన్ల సబ్సిడీ రుణాలకు సంబంధించి ఇంటర్వ్యూలను పూర్తిచేశాం. ఎంపిక కమిటీ జాబితాను ఆయా బ్యాంకులకు పంపించాం. సిబిల్ ప్రకారం రుణాలు అందిస్తాం. బ్యాంకులు నిర్ధారించి, నమ్మకమైన వ్యక్తులకే రుణాలు అందిస్తారు. మిగిలిన వారికి మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహించి రుణాలు అందించేందుకు కృషి చేస్తాం. – బి.శివసుబ్రహ్మణ్యం, ఎంపీడీవో చీరాల.●సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి వేమూరు పోలీసుస్టేషన్ ఎస్ఐ అవినీతి లీలల్లో కొన్ని... 7న్యూస్రీల్అర్హులకు మొండిచెయ్యి టీడీపీ నేతలు చెప్పిన వారికే రుణాలు పేరుకే స్క్రీనింగ్ కమిటీ నిరాశలో అర్హులుటీడీపీ నేతల తీరుపై ఆగ్రహం చేనేతలు, రోజువారీ కూలీలు, చదువుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు చేయూతనిచ్చే రుణాల ఎంపికలో అర్హులకు కాకుండా టీడీపీ నేతలకే రుణాలు కేటాయిస్తుండటంతో అధికారులు, టీడీపీ నేతల తీరుపై ప్రజలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేతలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే రుణాలు కేటాయించడంతో గ్రామాల్లోని అర్హులు మాత్రం టీడీపీ, ముఖ్యనేత తీరుపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సబ్సిడీ రుణాల కోసం ఎదురుచూపులు చూస్తున్న లబ్ధిదారుల ఆశలకు ముఖ్యనేత జాబితా తయారుతో బ్రేక్ పడింది. కొద్ది రోజుల క్రితం కార్పొరేషన్ రుణాలను అర్హులకు కాకుండా అనర్హులకు, ప్రజాప్రతినిధి చెప్పిన వారికే ఇవ్వడంతో గ్రామాల్లో విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. -
లా అండ్ ఆర్డర్ ఉందా
అద్దంకి రూరల్: ‘‘అధికారం వచ్చిందని ఏదైనా చేస్తారా.. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి జరిగితే లా అండ్ ఆర్డర్ ఏమైంది. దాడి జరిగిన విషయం అక్కడి ఎస్సైకి తెలియదా... ఎందుకు ఇంతవరకు కేసు కట్టలేదు’’ అంటూ వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ బల్లికురవ మండల కన్వీనర్‌ను స్టేషన్‌కు పిలిపించి బెదిరించటం, వైఎస్సార్ సీపీకి చెందిన వారిపై దాడి జరిగితే ఎస్సై స్పందించడా అని ప్రశ్నించారు. బల్లికురవ మండలం సోమవరప్పాడు గ్రామంలో టీడీపీ సానుభూతిపరుల దాడిలో తీవ్రంగా గాయపడి అద్దంకి వైద్యశాలలో చికిత్స పొందుతున్న గోపిరాజుయాదవ్ను నాగార్జున మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోపిరాజు యాదవ్‌పై ఇప్పటికి మూడుసార్లు దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి కొట్టటం, మరోసారి కత్తితో నరకటం, ఇప్పుడు కర్రలతో దాడి చేయడమేమిటని ప్రశ్నించాడు. అతను సోషల్ మీడియాలో పనిచేస్తున్నాడనా, బీసీ కులస్తుడు పేదవాడు ఏమీ చేయలేడనా, దాడి చేశారని ప్రశ్నించారు. అధికారం వచ్చిందని ఏమైనా చేస్తామంటే సరిపోదన్నారు. సోమవారం దాడి జరిగితే ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయకపోవటం ఏమిటని ప్రశ్నించారు. అక్కడ ఎస్సైకి దాడి చేసిన విషయం తెలియదా అన్నారు. దాడి విషయమై తాను ఎస్పీతో మాట్లాడానని, ఆయన వెంటనే స్పందించి కేసు రిజిస్టర్ చేయిస్తామని చెప్పామన్నారు. ఉన్నతాధికారి స్పందించిన విధంగా స్థానిక ఎస్సై, సీఐ ఎందుకు స్పందించలేదని అన్నారు. అక్కడ ఎస్సై ఏమి చేస్తున్నాడన్నారు. వైఎస్సార్ సీపీ పార్టీతోపాటు తామంతా అండగా ఉంటామని ఈ విషయాన్ని మా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కేసు రిజిస్టర్ చేసి సునిశితమైన విచారణతో దాడికి పాల్పడ్డవారిని శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. నాగార్జున వెంట బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, పానెం హనిమిరెడ్డి సోదరులు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అద్దంకి పట్టణ వైఎస్సార్ అధ్యక్షడు కాకాని రాధాకృష్ణమూర్తి, బల్లికురవ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, వైఎస్సార్ సీపీ అద్దంకి మండల కన్వీనర్ జగన్మోహన్రెడ్డి, సంతమాగులూరు మండల కన్వీనర్ వుట్ల నాగేశ్వరరావు సర్పంచ్ నగేష్, కోల్లా భువనేశ్వరి, షేక్ అబిదా, వార్డు కౌన్సిలర్లు, ఇన్చార్జిలు, స్థానిక నాయకులు ఉన్నారు. బీసీ సామాజిక వర్గీయుడిపై దాడి జరిగితే కనిపించలేదా వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున -
సోషల్ మీడియా కన్వీనర్‌పై టీడీపీ సానుభూతిపరుల దాడి
బల్లికురవ: బల్లికురవ మండల వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కొండవద్దు గోపీరాజు యాదవ్‌పై టీడీపీ సానుభూతిపరులు పథకం ప్రకారం దాడి చేశారు. కర్రలతో కొట్టి గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఉప్పమాగులూరు పంచాయతీలోని సోమవరప్పాడులో రామాలయం వద్ద శ్రీరామనమి పదహారు రోజుల పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు గోపిరాజు యాదవ్ గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన గోపిరాజును కొట్టాలని పథకం వేసుకున్న టీడీపీ సానుభూతిపరులు చావలి నాగేశ్వరరావు, సురేశ్, వెంకటేశ్, రాజమోహన్‌లు కర్రలతో దాడి చేశారు. దాంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, క్షతగాత్రుడిని హుటాహుటిన గుంటుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. క్షతగాత్రుడిని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు పరామర్శించారు. కృష్ణబాబు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్‌పై టీడీపీ సానుభూతిపరులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన యువకునిపై కక్ష కట్టి దాడిచేశారన్నారు. గతంలోనూ ఇదే విధంగా అతనిపై దాడి చేశారని చెప్పారు. ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. స్థానిక పోలీసులు సైతం నిందితులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. అధికారులు పక్షపాత వైఖరి విడనాడాలన్నారు. గ్రామాల్లో ప్రజలు ఐక్యతతో జీవించేలా చూడాలన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
● చీరాల మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ● కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, కలెక్టర్ చీరాల: ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా నియోజకవర్గస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో గిరిజన ప్రజలు, విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి మూడో శుక్రవారం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చీరాల నియోజకవర్గంలో భూములకు సంబంధించి ఇంటి స్థలాలు, గృహ నిర్మాణాలు, పెన్షన్ల గురించి, పోలీస్‌శాఖకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయన్నారు. వాడరేవు పంచాయతీ సిద్దూర్ కాలనీలో నిలిచిపోయిన గృహ నిర్మాణాలను ప్రభుత్వం పూర్తి చేయాలని ప్రజలు కోరారన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు పరిశీలించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చీరాల వైకుంఠపురం గేటు వద్ద గల శ్మశానస్థలంలో కొంత మంది గిరిజనులు నివాసం ఉంటున్నారని, వారికి గృహ నిర్మాణ సదుపాయా లు కల్పించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ చీరాల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే కార్యక్రమానికి జిల్లా అధికారులు రావడం వలన సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయన్నారు. నియోజకవర్గంలో ఖాళీ భూములను గుర్తించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యల పరిష్కారానికి అర్జీలు అందించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, డీఆర్వో గంగాధర్‌గౌడ్, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, డ్వామా పీడీ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ రాధామాధవి, డీఎంహెచ్ఓ విజయమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరాా, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, తహసీల్దార్లు గోపీకృష్ణ, పార్వతి పాల్గొన్నారు. -
గుంటూరు జిల్లా జడ్జిగా కల్యాణ్ చక్రవర్తి బాధ్యతల స్వీకారం
గుంటూరు లీగల్ : జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బి.కల్యాణ్ చక్రవర్తిని సోమవారం జిల్లా ప్రెసిడెంట్ తుబాటి శ్రీను, ప్రధానకార్యదర్శి పి.శ్రీనివాసరావు, టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మనాయక్ మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నవీన్, స్టేట్ జనరల్ సెక్రటరీ పి.రాంగోపాల్, జాయింట్ సెక్రటరీ బ్రహ్మయ్య, శేషగిరి, హరిబాబు, ఖాజా, కల్యాణి, సాయి అభిజిత్, శివారెడ్డి పాల్గొన్నారు. చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ జడ్జిగా షమీ పర్వీన్ సుల్తానా గుంటూరులీగల్: జిల్లా కోర్టులో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ (పోక్సో) జడ్జిగా షమీ పర్వీన్ సుల్తానా బేగం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యంగళశెట్టి సూర్యనారాయణ, జనరల్ సెక్రెట రీ మోతుకూరి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రామకోటిరెడ్డి, కార్యవర్గ సభ్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఒరిగిన రామలింగేశ్వర ఆలయ శిఖరం అమరావతి: అమరావతిని రాజధానిగా చేసు కుని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు రామేశ్వరం యాత్రకు వెళ్లి, గుర్తుగా రామలింగేశ్వర విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్టించి, స్థానికంగా ఆలయ నిర్మాణం చేశారు. అప్పటినుంచి ఆలయంలోని రామలింగేశ్వరునికి నిత్యపూజలు జరుగుతున్నాయి. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయం ఏళ్లతరబడి ఆదరణ లేక నిర్లక్ష్యానికి గురైంది. ఈక్రమంలో ఇటీవల గాలివానకు ఆలయ విమాన శిఖరం ఒరిగి వేలాడుతోంది. ఆలయ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆలయ శిఖరానికి దూరం నుంచి నమస్కారం చేసుకుంటే స్వామివారికి నమస్కరించినట్లేనని భక్తుల నమ్మకం. అటువంటి శిఖరానికి అపచారం జరిగినా పట్టించుకోని దేవాలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి విస్తరణ సలహా మండలి సమావేశాలు గుంటూరురూరల్:నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో 2024–25 ఏడాదికిగానూ కృష్ణ మండలం పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు లాంఫాం ఏడీఆర్ డాక్టర్ దుర్గాప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23, 24 తేదీల్లో రెండు రోజులపాటు సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గత ఏడాది కార్యాచరణ, సలహాల మేరకు చేపట్టిన కార్యక్రమాలు, ప్రగతి, రానున్న ఏడాది నిర్వహించే కార్యక్రమాలు, పరిశోధన, విస్తరణపై చర్చలు జరుగుతాయన్నారు. రైతులు, శాస్త్రవేత్తలు, సలహా మండలి సభ్యులు తదితరులు పాల్గొంటారన్నారు. ఘనంగా సివిల్ సర్వీసెస్ డే నరసరావుపేట: సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకొని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జేసీ గనోరే సూరజ్ ధనుంజయలను అధికారులు సత్కరించారు. సోమవారం టౌన్ హాలులో వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా, డివిజన్స్థాయిఅధికారులు పాల్గొన్నారు. ప్రధాని పర్యటనకు పోలీస్ సిబ్బంది మంగళగిరిటౌన్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. మంగళగిరి నగర పరిధిలోని పలు స్కూళ్లు, కాలేజీలను సోమవారం సిబ్బందితో కలసి సందర్శించారు. డీఎస్పీ మాట్లాడుతూ మే 2న ప్రధాని మోదీ రాజధాని అమరావతికి రానున్న నేపథ్యంలో ఆరువేల మంది పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తుకు రానున్నట్లు పేర్కొన్నారు. మంగళగిరి పట్టణ, రూరల్, తాడేపల్లి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, కల్యాణ మండపాలలో మూడు రోజుల ముందు నుంచే సిబ్బంది ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. -
జాతీయ రహదారుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి
అధికారులకు ఎంపీ తెన్నేటి ఆదేశం చీరాలటౌన్: జిల్లా పరిధిలో నిర్మాణం చేస్తున్న జాతీ య రహదారుల పనులను నాణ్యంగా, త్వరగా పూర్తి చేయాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఆదేశించారు. సోమవారం చీరాల ఆర్డీవో కార్యాలయంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం.కొండయ్యతో కలిసి ఎంపీ జాతీయ రహదారులపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ నేషనల్ హైవే అథారిటి అధికారులు విధులు సమర్థంగా నిర్వర్తించి జాతీయ రహదారి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నా రు. వివిధ జిల్లాలను కలుపుతూ నిర్మాణం చేస్తున్న 167–ఏ వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి పనులు సకాలంలో పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. 216 రహదారిలో గుంతలు లేకుండా చూడాలన్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారిలో కొంతమందికి నష్టపరిహారం సక్రమంగా రాలేదని ఫిర్యాదులు వచ్చాయని వాటిని త్వరగా పరిష్కరించి నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. నాణ్యతలో రాజీలేకుండా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జేసీ ప్రఖర్‌జైన్, ఆర్డీవో టి.చంద్రశేఖర నాయుడు, తహసీల్దార్లు గోపికృష్ణ, పార్వతి, నేషనల్ హైవే అథారిటి అధికారులు పాల్గొన్నారు. -
లే అవుట్ల క్రమబద్ధీకరణ
నిబంధనల మేరకే జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల లే అవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో బాపట్ల మున్సిపాలిటీ, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అక్రమ లే అవుట్లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మ, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్‌బాబు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ 2019 నుంచి మున్సిపాలిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అక్రమ లే అవుట్లను గుర్తించాలని అన్నారు. మున్సిపాలిటీ, బావుడా పరిధిలోని తొమ్మిది మండలాలలో మొత్తం 183 లే అవుట్లను గుర్తించి వాటి వివరాలను డీటీసీపీకి పంపినట్లు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. వివరాలను పత్రికలలో ప్రచురించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. అందులో 86 లే అవుట్లను 22–ఎ కింద గుర్తించి రిజిస్ట్రేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌కు పంపినట్లు తెలిపారు. మిగిలిన లే అవుట్లను సబ్ డివిజన్లుగా చేసి పంపాలని వాటిని తిప్పి పంపారని వారు కలెక్టర్‌కు వివరించారు. 183 లే అవుట్ల క్రమబద్ధీకరణకు సాధ్యాసాధ్యాలపై జిల్లా కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. కొత్త లేఅవుట్ల అనుమతులకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ల్యాండ్ కన్వర్షన్‌కు, ఇంటి నిర్మాణాలకు సంబంధించి మునిసిపాలిటీ, బావుడా, పంచాయతీ పరిధిలోని నిబంధనలను ప్రజలకు అర్థమయ్యే విధంగా తయారు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఆలస్యం అవుతుందని, తద్వారా ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గుతుందని, బాపట్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, వాటిని వీలైనంత త్వరలో నిబంధనల మేరకు క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి గంగాధర్‌గౌడ్, డీపీఓ ప్రభాకర్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్‌రెడ్డి, బావుడా ప్లానింగ్ అధికారి షేక్ కాలేషా తదితరులు పాల్గొన్నారు. -
భళా.. రామకృష్ణ విద్యా తృష్ణ
● 58 ఏళ్ల వయస్సులో కార్డియాలజీ పీజీ పూర్తి చేసిన గుంటూరు వైద్యుడు ● గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుదైన రికార్డు ● నాలుగు పీజీలు పూర్తి గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గాజుల రామకృష్ణ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. సోమవారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్ష ఫలితాల్లో ఆయన ఉత్తీర్ణత సాధించారు. కార్డియాలజీలో పీజీ పూర్తి చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నాలుగు పీజీ వైద్య విద్యలు జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, న్యూరాలజీ, కార్డియాలజీ అభ్యసించారు. ఇన్ఫెక్షన్ డిసీజెస్, డయాబెటాలజీలో డిప్లొమో కోర్సులు పూర్తి చేశారు. చావలి వాస్తవ్యులు గుంటూరు జిల్లా వేమూరు మండలం చావలికి చెందిన గాజుల వీరశేఖరరావు, లీలావతి దంపతుల కుమారుడు రామకృష్ణ గుంటూరు ఎల్ఈఎం స్కూల్లో 7వ తరగతి వరకు చదివారు. బాలకుటీర్ స్కూల్లో 8 నుంచి 10వ తరగతి వరకు, గుంటూరు జేకేజీ కళాశాలలో ఇంటర్ అభ్యసించారు. గుంటూరు వైద్య కళాశాలలో 1986 – 92లో ఎంబీబీఎస్, 1998– 2000లో పల్మనాలజీలో పీజీ చేశారు. 2001 నుంచి 2004 వరకు వెల్దుర్తి మండలం ఉప్పలపాడు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. 2004 నుంచి 2006 వరకు ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో ట్యూటర్‌గా పని చేశారు. 2006 నుంచి 2009 వరకు జనరల్ మెడిసిన్‌లో గుంటూరులో పీజీ అభ్యసించారు. 2009 నుంచి 2011 వరకు గుంటూరు జీజీహెచ్‌లో జనరల్ మెడిసిన్ వైద్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు తిరుపతి సిమ్స్‌లో న్యూరాలజీలో పీజీ వైద్య విద్యను అభ్యసించారు. 2014 నుంచి నేటి వరకు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూ 2022లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. పీజీ నీట్ ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించి కార్డియాలజీ సూపర్‌స్పెషాలిటీ పీజీలో మంగళగిరి ఎన్నారైలో చేరారు. నేడు విజయవంతంగా కార్డియాలజీ పీజీ కోర్సు పూర్తి చేసుకుని, నాలుగు పీజీలు చదివిన ఏకై క వైద్యుడిగా అరుదైన రికార్డు డాక్టర్ రామకృష్ణ సొంతం చేసుకున్నారు. క్రీడల్లోనూ ప్రతిభ తిరుపతిలో పీజీ వైద్య విద్యార్థిగా ఉన్న సమయంలో డాక్టర్ గాజుల రామకృష్ణ 86 స్పోర్ట్స్ మెడల్స్ దక్కించుకున్నారు. 33 న్యూరాలజీ క్విజ్ పోటీల్లో విజేతగా నిలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2014లో నేషనల్ క్విజ్ పోటీలో విన్నర్‌గా నిలిచారు. -
నేడు కొండపాటూరు పోలేరమ్మ తల్లి తిరునాళ్ల
కొండపాటూరు(కాకుమాను): భక్తుల కొంగు బంగారమైన కొండపాటూరు పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మంగళవారం జరగనుంది. దేవాలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ప్రధాన ఘట్టం శిడిమాను మహోత్సవం ఒక పెద్ద దులానికి చివరి భాగాన ఇనుప బోనును ఏర్పాటు చేస్తారు. అందులో మేకపోతును ఉంచి సాయంత్రం ఆరు గంటల సమయంలో గ్రామ పురవీధులలో మేళతాళాలు, కనక తప్పెట్ల మధ్య ఊరేగిస్తారు. శిడిమాను బయలుదేరే ముందు శిడి పెడ్లి కొడుకుని ప్రత్యేకంగా అలంకరించి, దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ పురవీధుల్లో తిప్పుతారు. దీంతో శిడిమాను బయలు దేరేందుకు సిద్ధమైందని గ్రామస్తులంతా దేవాలయం వద్దకు చేరుకుంటారు. సోమవారం దేవాలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులు శిడిమానును ఏర్పాటు చేశారు. ఆ పెద్ద దూలానికి రైతులు పండించిన వివిధ రకాల పంటలను కట్టి, చల్లంగా చూడాలని అమ్మవారిని మొక్కుకున్నారు. తిరునాళ్లలో వినోదం అందిచేందుకు రంగుల రాట్నాలు, జెయింట్ వీల్లను ఏర్పాటు చేశారు. చిన్నారులకు ఆట వస్తువులు, గృహోపకరణాల దుకాణాలు ఏర్పాటు చేశారు. -
వేగవంతంగా మాదిపాడు బ్రిడ్జి నిర్మాణం
అచ్చంపేట: మండల సరిహద్దులోని మాదిపాడు వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై వంతెన నిర్మాణ ఆవశ్యకతను గుర్తించిన అప్పటి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అభ్యర్థన మేరకు 2023 జూన్ 12న నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరించారు. అయితే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. మాదిపాడు నుంచి ముక్త్యాలవరకు కృష్ణానదిపై 600 మీటర్ల పొడవు, 12మీటర్ల వెడల్పు, 14 పిల్లర్లతో వంతెన నిర్మాణం చేపట్టవలసి ఉంది. ప్రస్తుతం కృష్ణానదిలో రెండు పిల్లర్లకు అవసరమైన ఐరన్ బిగించి, బీములను భూమి లెవెల్ వరకు పోశారు. బ్రిడ్జి నిర్మాణానికి 13.45 ఎకరాల భూ సేకరణ వంతెనకు సంబంధించి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే 13.45 ఎకరాల భూమిని సేకరించారు. ఇందుకుగాను రూ.60.50 కోట్లు నాబార్డు నిధులు మంజూరు చేయించారు. పల్నాడు జిల్లా మాదిపాడు వైపు 4.45 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా ముక్త్యాలవైపు 9 ఎకరాల భూమిని సేకరించారు. బ్రిడ్జి పొడవు 450మీటర్లు కాగా, వెడల్పు 12మీటర్లు. ముక్త్యాలవైపు కిలోమీటరు, మాదిపాడు వైపు అరకిలోమీటరు రోడ్డు వేయనున్నారు. కృష్ణానదిపై 14 పిల్లర్లతో బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన 13.45 ఎకరాలు భూసేకరణ చేసి రూ.60.50 కోట్లు మంజూరు చేసిన గత ప్రభుత్వం -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బాపట్లటౌన్: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీని కలసి తమ సమస్యలు ఏకరవు పెట్టారు. బాధితుల సమస్యలు తెలుసుకుని, వారి నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ జిల్లాలోని పోలీస్ అధికారులతో మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులు అత్యంత ప్రాధాన్యతతో చట్ట పరిధిలో విచారించి పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోలీస్స్టేషన్లకు, కార్యాలయాలకు వచ్చినప్పుడు వారి పట్ల పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. వారి ఫిర్యాదులకు ముఖ్య ప్రాధాన్యతనిచ్చి, చట్ట పరిధిలో విచారించి బాధితులకు తగిన న్యాయం చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపాలన్నారు. అర్జీలను పరిష్కరించడంలో జాప్యత వహించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ తుషార్ డూడీ పీజీఆర్ఎస్లో 71 అర్జీలు స్వీకరణ -
హెల్త్ యూనివర్సిటీ టాపర్‌గా గుంటూరు వైద్యుడు
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో పీజీ తృతీయ సంవత్సరం చదువుతున్న డాక్టర్ పప్పిరెడ్డి కార్తిక్‌రెడ్డి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సోమవారం ప్రకటించిన పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్ష ఫలితాల్లో టాపర్‌గా నిలిచాడు. డీఎం న్యూరాలజీ పరీక్ష ఫలితాల్లో 800 మార్కులకు గాను 649 సాధించి హెల్త్ యూనివర్సిటీలో ప్రథమ స్థానం సాధించాడు. ద్వితీయ, తృతీయ స్థానం కూడా గుంటూరు జీజీహెచ్ వైద్యులే సాధించి రికార్డు సృష్టించారు. డాక్టర్ అజ్మ హెల్త్ యూనివర్సిటీ సెకండ్ టాపర్‌గా, డాక్టర్ కాంతిమాల థర్డ్ టాపర్‌గా నిలిచి గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగ ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో మారుమోగేలా చేశారు. స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్ ప్రదానం యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన డాక్టర్ కార్తిక్‌రెడ్డికి హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవం రోజు గోల్డ్‌మెడల్ అందిస్తారు. కాగా, హెల్త్ యూనివర్సిటీ పరీక్షా ఫలితాల్లో డీఎం న్యూరాలజీలో వరుసగా మూడు సార్లు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్యులే టాపర్లుగా నిలిచి చరిత్ర సృష్టించారు. గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో నాలుగు పీజీ సీట్లు ఉన్నాయి. పరీక్ష రాసిన నలుగురిలో ముగ్గురు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు యూనివర్సిటీ స్థాయిలో సాధించి రికార్డు సృష్టించారు. గుంటూరు జీజీహెచ్‌లో న్యూరాలజీ అభ్యసించిన డాక్టర్ లలిత, డాక్టర్ గొట్టిపాటి బిందునర్మద హెల్త్ యూనివర్సిటీ టాపర్లుగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించగా, మూడో సారి డాక్టర్ పి.కార్తిక్‌రెడ్డి గోల్డ్ మెడల్ అందుకోనున్నారు. కడపకు చెందిన డాక్టర్ పప్పిరెడ్డి కార్తిక్‌రెడ్డి కర్నూలులో ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యనభ్యసించి సూపర్‌స్పెషాలిటీ పీజీ న్యూరాలజీ గుంటూరులో చేరాడు. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన డాక్టర్ కార్తిక్‌రెడ్డిని, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన డాక్టర్ అజ్మా, డాక్టర్ కాంతిమాలను గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అభినందించారు. ఆయన గైడెన్స్ వల్లే తాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించగలిగానని డాక్టర్ కార్తిక్‌రెడ్డి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
జె.పంగులూరు: మండల పరిధిలోని పంగులూరు గ్రామానికి చెందిన జంపు శంకరరావు (55) ఈనెల 10వ తేదీన ముప్పవరం గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పంగులూరు గ్రామానికి చెందిన జంపు శంకరరావు మార్టూరు కూరగాయాల మార్కెట్లో రోజువారి కూలీగా పనిచేస్తూ జీవనం సాగుస్తుంటాడు. రోజు మాదిరిగానే ఈనెల 10వ తేదీ మార్టురు మార్కెట్ కూలి పనికి వెళ్లి పని ముగించుకొని తిరిగి వస్తున్నాడు. ముప్పవరం వచ్చే సరికి జాతీయ రహదారిపై బైక్ పై వస్తున్న శంకరరావును గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ప్రమాదంలో తలకు బలమైన గాయాలయ్యాయి. సోమవారం మృతి చెందగా మృతదేహాన్ని పంగులూరు స్వగ్రామం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తా..
కారంచేడు: అధిక లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంతో తప్పించుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ పెనుప్రమాదం తప్పిందనే చెప్పాలి. సోమవారం ఉదయం వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారిలోని కారంచేడు–చీరాల మధ్యన జరిగిన ఈ ప్రమాదంలో చీరాల వైపు నుంచి పర్చూరు వైపునకు వేరుశనగ కాయల లోడుతో వేగంగా వస్తున్న ఈ ట్రాక్టర్ అదుపుతప్పి పడిపోయింది. దీంతో రోడ్డుపై వేరుశనగ కాయల బస్తాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. రోడ్డుపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలచిపోయింది. స్థానిక ఎస్ఐ వీ వెంకట్రావు సంఘటనా స్థలానికి తన సిబ్బందిని పంపి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ప్రమాదం సమయంలో ద్విచక్రవాహనాలు, ఆటోలు రాకపోవడంతోపాటు, కాలువ వైపు కాకుండా మరోక వైపు పడిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. అధిక లోడు కారణంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెబుతున్నారు. -
బీచ్‌లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి
చీరాల: చీరాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని, బీచ్‌లను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. చీరాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, పర్యాటక ప్రాంతం అభివృద్ధిపై జిల్లా స్థాయి అధికారులతో సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చీరాలలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.10.2 కోట్ల నిధులతో జలజీవన్ మిషన్ కింద పనులు చేపడతామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా కోసం రూ.60 లక్షలు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా మంజూరు చేస్తామన్నారు. చీరాల పరిధిలోని ఐదు ఎత్తిపోతల పథకాల మరమ్మతులు చేయడానికి యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8.25 కోట్లతో అభివృద్ధి పనులు చేయడానికి నిధులు కేటాయింపులు జరగగా అదనంగా మరో రూ.1.75 కోట్ల నిధులు వెచ్చిస్తామన్నారు. డిఎఫ్ఎం కింద మరో రూ.2 కోట్లు నిధులు బీచ్‌ల అభివృద్ధికి మంజూరు చేస్తామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.1.50 కోట్లతో చీరాల పట్టణంలో మురికినీటి వ్యవస్థ అభివృద్ధికి కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. రూ.150 కోట్లతో చీరాలలో ఫిషింగ్ హార్బర్ నిర్మించడానికి తయారుచేసిన డీపీఆర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలన్నారు. చీరాల వాడరేవు, రామాపురం బీచ్‌లలో బయో టాయిలెట్స్ నిర్మిస్తామన్నారు. పర్యాటక రంగంగా మారనున్న బీచ్‌ల వద్ద రక్షణ చర్యలు పెంచాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైల్వే ట్రాక్‌పై ఆర్వోబీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మసీదు సెంటర్, పేరాల రైల్వేగేటు వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించాలన్నారు. అభివృద్ధి పనులు వేగంగా చేపట్టడానికి కొన్నింటికి ప్రతిపాదనలు, మరికొన్నింటికి టెండర్లు పిలవాలన్నారు. పనుల్లో జాప్యం వద్దని అధికారులకు సూచించారు. ప్రతి నెలా రెండు రోజులు నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గంలో మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాల్‌మనీ తరహాలో వడ్డీ వ్యాపారులు ప్రజల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారన్నారు. ఇంటి స్థలాలు లేక పేదలు కాలువ కట్టలపై ఉంటున్నారన్నారు. విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు నియోజకవర్గంలో రెండు విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించాలన్నారు. చీరాల నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి జరిగేలా సహకరించాలని ఆయన కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, డీఆర్వో జి.గంగాధర్ గౌడ్, ఆర్డీఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. చీరాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.10.2 కోట్లు పేరాల, మసీదు సెంటర్లలో ట్రాఫిక్ నియంత్రించాలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష -
జాతీయ రహదారిపై తిరగబడ్డ కారు
ఇరువురికి గాయాలు జె.పంగులూరు: మండల పరిధిలోని అలవలపాడు అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ఘటనలో ఇరువురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అందిన సమాచారం మేరకు.. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు నుంచి బిహార్ వెళుతున్న టీఎస్ 73 ఏసీ 5344 నంబరు గల కారు ముందు టైరు ఫంక్చర్ కావడంతో రోడ్డు మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మలను ఢీకొని బోల్తా పడింది. సోమవారం అలవలపాడు అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ సంఘటనలో కారు నడుపుతున్న జీ మురళీధరన్ (వేలూరు)తోపాటు అందులో ప్రయాణిస్తున్న శశికళ అనే మహిళకు గాయాలయ్యాయి. సమాచార తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది గాయపడిన ఇరువురిని చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్‌లో ఒంగోలు కిమ్స్‌కు తరలించారు. రోడ్డుపై పడిపోయిన కారును మార్జిన్లోకి తరలించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. -
ఆదివాసీలపై దాడులను ఆపేయాలి
కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేసిన ప్రజాసంఘాల ఐక్యవేదిక చీరాల రూరల్: కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై చేస్తున్న దాడులను ఆపేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిన నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సీనియర్స్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాయకులు రాష్ట్ర చేనేత జసనమాఖ్య నాయకులు మాచర్ల మోహనరావు, ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్‌కుమార్ ధర్మ, బీసీ ఫెడరేషన్ నాయకుడు ఊటూకూరి వెంకటేశ్వర్లు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదె హరిహరరావు, పౌరహక్కుల సంఘం నాయకుడు బడుగు విమలాకర్లు మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. మధ్య భారతదేశం అయిన ఛత్తీస్‌ఘడ్, ఝార్కండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలోని సహజవనరులైన ఖనిజ సంపదను భవిష్యత్ తరాలకు అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవడం కోసం ఆదివాసీలు అడవులను, అడవుల్లోని ఖనిజ సంపదను కాపాడుతుంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని బహుళజాతి కంపెనీలకు ఆయా సంపదలను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నది వారు ఆరోపించారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలను, సైన్యాన్ని ఉపయోగించి మావోయిస్టులను ఏరివేస్తున్నట్లు నటిస్తూ అడవులలో జీవిస్తున్న ఆదివాసీలపై దాడులు చేయిస్తుందని విమర్శించారు. ఆదివాసీలకు ప్రత్యేకంగా ఉన్న రాజ్యాంగంలోని షెడ్యూల్ 5లోని షెడ్యూల్ కుమాలు, షెడ్యూలు ప్రాంతాలు రక్షణ చట్టం, ఫారెస్టు హక్కుల చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం వంటి హక్కులను కాపాడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను కాలరాస్తు ఆదివాసీలను అడవులలో ఉండకుండా దూరం చేస్తుందని ఆరోపించారు. గత 18 నెలలుగా మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను హననం చేస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టులతో ప్రమాదమని కేంద్రం భావిస్తే వారితో చర్చలు జరిపి పరిష్కార దిశగా ఆలోచించాలి కానీ ఈవిధమైన ఘోరాలకు పాల్పడడం మంచిదికాదని వారు హితవు పలికారు. ఈ విషయమై మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలతో మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. -
వ్యవసాయంలో డ్రోన్స్ వినియోగంతో శ్రమ,ఖర్చు ఆదా
జిల్లా వ్యవసాయాధికారి వై.రామకృష్ణ బాపట్ల: వ్యవసాయంలో డ్రోన్స్ వినియోగంతో రైతులకు శ్రమ తగ్గటంతోపాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని బాపట్ల జిల్లా వ్యవసాయాధికారి వై.రామకృష్ణ అన్నారు. బాపట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయంలో డ్రోన్స్ వినియోగంపై సోమవారం గ్రూప్ కన్వీనర్, కో కన్వీనర్లకు బ్యాంకు అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ డ్రోన్ యంత్ర పరికరాల ఖరీదు కూడా 80 శాతం సబ్సిడీతో రైతు గ్రూపులకు అందించేందుకు కొన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. డ్రోన్ ఉపయోగించటం వలన ఖచ్చితత్వం ఆధారంగా మందుల వినియోగం కూడా 20 నుంచి 25 శాతం ఆదా అవుతుందని తెలిపారు. సమావేశంలో అధికారులు బి.ప్రకాశ్‌రావు, దిబోరా, వివిధ కంపెనీల అధికారులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులకు బెదిరేది లేదు
మార్టూరు: ‘మా పార్టీ నాయకుడు దాసం హనుమంతరావును రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు పథకం ప్రకారం అరెస్టు చేశారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. తప్పకుండా న్యాయపోరాటం చేస్తాం’ అని పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. మార్టూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 31వ తేదీ వరకు హనుమంతరావు లైసెన్సు కలిగి ఉన్నాడని పోలీసులే చెబుతున్నారని, రెండు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న వ్యక్తి తిరిగి రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయాన్ని పోలీసులు ఉద్దేశపూర్వకంగానే దాచి పెడుతున్నారని ఆయన ఆరోపించారు. హనుమంతరావు ఇల్లు, గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పేలుడు పదార్థాలు లభించినట్లు పోలీసులు ఎక్కడా చెప్పలేదని, అయినా తప్పుడు వార్తలు ఎలా ప్రచురించారని ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, హనుమంతరావు తరఫున కోర్టులో పోరాడతామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కలిసేందుకు ససేమిరా.. హనుమంతరావును ఒకసారి కలిసి వెళ్తామని సీఐ శేషగిరిరావును మధుసూదన్‌రెడ్డి కోరగా అందుకు ఆయన అనుమతించలేదు. రెండు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న హనుమంతరావుపై రాజకీయ ఒత్తిళ్లతోనే కేసులు బనాయించి అరెస్టు చేయడం పద్ధతి కాదని పోలీసుల తీరును గాదె తప్పుబట్టారు. లైసెన్స్ రెన్యువల్ కొలిక్కి వచ్చే సమయంలో హనుమంతరావును అరెస్టు చేయడం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయో అందరికీ తెలుసని, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. న్యాయ పోరాటం చేస్తా.. బాధితులకు అండగా ఉంటా.. వైఎస్సార్ సీపీ పర్చూరు ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి -
నేడు టౌన్‌హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నరసరావుపేట: నరసరావుపేట పట్టణంలోని టౌన్‌హాలు వేదికగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణంగా కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ వేదిక మార్పును ప్రజలు గమనించుకోవాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా ఈసారి నరసరావుపేట నియోజకవర్గాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఘనంగా చెన్నుని పుష్పయాగం మాచర్ల: మాచర్లలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. అర్చకులు కొండవీటి రాజగోపాలాచార్యులు, ఈఓ ఎం పూర్ణచంద్రరావు, జేఏ వీరారెడ్డి, గౌరవాధ్యక్షులు పోలిశెట్టి చంద్రశేఖరరావు, పందిరి సాంబశివరావు, షరాబు వెంకటరత్నం, గజవెల్లి కిషోర్, కంభంపాటి అనిల్‌కుమార్, సూరె యలమంద, తిరివీధి వెంకట నాగేశ్వరరావు, కంభంపాటి వెంకటరమణలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి పుష్పయాగం మండపంలో జరిపారు. ఈ ఉత్సవాన్ని చూసిన భక్తులు జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ అంటూ నామస్మరణ చేశారు. పట్టాలు తప్పిన సర్వీసు రైలు దుగ్గిరాల: దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో మరమ్మతుల నిమిత్తం వచ్చిన సర్వీసు రైలు ఆదివారం సాయంత్రం పట్టాలు తప్పింది. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. దీంతో గేటు వద్ద భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కార్తికేయుని ఆలయంలో భక్తజన సందడి మోపిదేవి: శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తులతో క్యూలు సందడిగా మారాయి. అన్నప్రసాదం ప్రాంగణం వద్ద భక్తులు బారులు తీరి కనిపించారు. డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సూపరిటెండెంట్ బొప్పన సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు యువకుడి దుర్మరణం వినుకొండ: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై యువకుడు మృతి చెందిన ఘటన పట్టణంలో శనివారం జరిగింది. టీడీపీ యూత్ ఆధ్వర్యంలో పట్టణంలోని కుమ్మరి బజారులో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో స్థానిక రణాహుస్సేన్ బజారుకు చెందిన షేక్ గౌస్‌బాషా (చంటి)(22) శనివారం సాయంత్రం క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతనిని స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అనంతరం కొంతసేపటికి అతడు మృతిచెందాడు. మృతదేహాన్ని చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, సీపీఐ నాయకులు సండ్రపాటి సైదా, డాక్టర్లు కేఎల్‌రావు, కాసుల పార్వతి తదితరులు సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. మృతుడు చంటి స్థానిక నిమ్స్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితమే వివాహమైంది. తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులు ఉన్నారు. -
వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలి
చీరాల రూరల్: కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని, ఆ చట్టాన్ని తక్షణమే విరమించుకోవాలని బాపట్ల జిల్లా ముస్లిం సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ముస్లిం మనోభావాలను దెబ్బతీస్తూ రాజ్యాంగ విరుద్ధంగా బిల్లు ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. ఆదివారం చీరాల వెంగళరావు నగర్‌లోని షాదీఖానాలో జిల్లా ముస్లిం సంఘ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో కాలంగా ఉన్న వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేసి, వక్ఫ్ ఆస్తులను లాక్కుని దేశంలోని బడా కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన 15, 21, 25, 26, 29 ఆర్టికల్స్‌కు విరుద్ధంగా కేంద్రం పని చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ఉపసంహరించుకుని ప్రజారంజక పరిపాలనపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. వక్ఫ్‌బోర్డు చట్ట సవరణకు నిరసనగా ఈనెల 25న ముస్లిం సంఘాలతో భారీ శాంతి ర్యాలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ హుమాయున్ కబీర్, అబ్దుల్ రెహమాన్, వైఎస్సార్ సీపీ చీరాల అధ్యక్షుడు షేక్ అల్లాభక్షు, షౌకత్ఆలీ, ముక్తీమహమ్మద్ షఫీ, హబీబుల్లా సాహెబ్, అబ్దుల్ సలీం, సీఐటీయూ బాబురావు, కమ్రుద్దీన్, చీరాల ప్రాంతంలోని ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ముస్లిం సంఘాల నాయకుల డిమాండ్ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 25న నిరసన ర్యాలీ -
సూర్యలంకలో పర్యాటకుల సందడి
బాపట్ల: వరుస సెలవుల నేపథ్యంలో సూర్యలంకకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బాపట్ల జిల్లాతోపాటు గుంటూరు, కృష్ణా, హైదరాబాద్ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచి సూర్యలంక సముద్ర తీర ప్రాంతం పర్యాటకులతో కళకళలాడుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు యువకులు, చిన్నారులు కేరింతలు కొడుతూ తీరంలో ఆహ్లాదకరంగా గడిపారు. స్నానాల అనంతరం తీరం వెంబడి సేద తీరేందుకు ఏపీ టూరిజం శాఖకు చెందిన రిసార్ట్స్ అందుబాటులో ఉండటంతో ఆన్లైన్ బుక్‌చేసుకున్న పర్యాటకులు శనివారం రోజునే ఇక్కడికి చేరుకొని ఆదివారం సాయంత్రం తిరుగుపయనమవుతున్నారు. సూదూర ప్రాంతాల నుంచి వివిధ వాహనాల ద్వారా సూర్యలంక చేరుకున్న పర్యాటకులు స్నానాల అనంతరం తీరం వెంబడి ఉన్నటువంటి జీడిమామిడి తోటలో వనభోజనాలు చేసి సేదతీరారు. సెలవుల నేపథ్యంలో పెరుగుతున్న పర్యాటకులు జీడిమామిడి తోటలో సేదతీరుతున్న వైనం -
మార్టూరులో 15వ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు
మార్టూరు: మార్టూరులోని మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో ఈనెల 24, 25, 26 తేదీలలో 15వ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు మార్టూరు రోటరీ క్లబ్ అధ్యక్షుడు మద్దుమాల కోటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎఫర్ట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎఫర్ట్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జేవీ మోహనరావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మోహనరావు మాట్లాడుతూ మార్టూరు రోటరీ క్లబ్, శ్రీకారం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నాటికల పోటీలలో మొత్తం తొమ్మిది నాటికలు ప్రదర్శిస్తారని తెలిపారు. శ్రీకారం రోటరీ కళా పరిషత్ తరపున పదో నాటికగా ఎగ్జిబిషన్ ప్లే ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 24వ తేదీ రాత్రి 7.30 గంటలకు న్యూ స్టార్ మోడరన్ థియేటర్ విజయవాడ వారి ’కపిరాజు ’నాటిక, 9 గంటలకు రసఝరి పొన్నూరు వారి ’గురితప్పిన వేట’ నాటిక, 10 గంటలకు యంగ్ థియేటర్ విజయవాడ వారి ‘27వ మైలురాయి’ నాటిక, రాత్రి 11 గంటలకు శ్రీకారం రోటరీ కళా పరిషత్ మార్టూరు వారి ‘50 కోట్లు.... ఆ తరువాత,’ నాటికలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 25 తేదీ రాత్రి 7.30 గంటలకు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి ’జనరల్ బోగీలు’ నాటిక, రాత్రి 8.30 గంటలకు శ్రీ చైతన్య కళా స్రవంతి విశాఖ వారి ‘(అ)సత్యం’ నాటిక, రాత్రి 9.30 గంటలకు కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘ఋతువు లేని కాలం’ నాటికలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 26వ తేదీ రాత్రి 7.30 గంటలకు విశ్వశాంతి కల్చరల్ హైదరాబాదు వారి ‘స్వేచ్ఛ’ నాటిక, రాత్రి 9.30 గంటలకు అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి ‘విడాకులు కావాలి’ నాటిక, రాత్రి పదిన్నర గంటలకు శ్రీ మైత్రి కళానిలయం విజయవాడ వారి ‘బ్రహ్మ స్వరూపం’ నాటికలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. రోటరీ సభ్యుడు శానంపూడి లక్ష్మయ్య తమ మిత్ర బృందం తరఫున రూ.50 వేల నగదును పరిషత్ నాటికల నిర్వహణ నిమిత్తం మోహనరావుకు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో రోటరీ, శ్రీకారం పరిషత్ ప్రతినిధులు ఖాజా హుస్సేన్, ఈశ్వరప్రసాద్, గొట్టిపాటి శ్రీను, సురేష్, గాలి గంగాధర్, లక్ష్మీనారాయణ, జీవీ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వెనిగండ్ల కల్యాణ మండపంలో దోపిడీ
పెదకాకాని: వెనిగండ్లలోని మైత్రీ కల్యాణ మండపంలో లైటింగ్, డెకరేషన్‌కు వేలంపాటలు నిర్వహించకుండా కొందరు పంచాయతీ ఉద్యోగులు సొమ్ము చేసుకుంటున్నారని గ్రామ మాజీ సర్పంచి, వైఎస్సార్ సీపీ నాయకుడు కొండమడుగుల శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వెంటనే పాటలు నిర్వహించి గ్రామ పంచాయతీకి ఆదాయం పెంచాలని అధికారులను కోరారు. పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో ప్రభుత్వ భూమిలో కొందరు గ్రామ పెద్దలు సుమారు రూ.కోటి నిధులు సేకరించి కల్యాణ మండపాన్ని నిర్మించారు. గ్రామస్తులకు తక్కువ ధరకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే దీనిని స్వాధీనం చేసుకున్న పంచాయతీ అధికారులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మండపాన్ని ఓసీలకు రూ.18,500కి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.12,500కు ఇస్తున్నారు. ప్రతి వేడుకకూ మరుగుదొడ్ల శుభ్రత పేరుతో మరో రూ.500 వసూలు చేస్తున్నారు. మైక్, లైటింగ్, ఫ్లవర్ డెకరేషన్ పేరుతో మరింత దోపిడీ చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఈ వసూళ్ళు పంచాయతీ సిబ్బంది కనుసన్నల్లో జరుగుతున్నట్లు సమాచారం. గత ఏడాది మైత్రీ కల్యాణ మండపంలో 175 వేడుకలు జరిగాయి. మైక్ అండ్ లైటింగ్, పూల అంకరణను కొందరు ప్రైవేటు వ్యక్తులు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. దీనిలో పంచాయతీ ఉద్యోగులకు వాటాలు వెళ్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కల్యాణ మండపంలో లైటింగ్, పూల అలంకరణకు వేలంపాటలు నిర్వహించకపోవడంతో పంచాయతీ ఏటా రూ.30లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఆదాయం కోల్పోతోంది. అయినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి వేలంపాటలు నిర్వహించాలని మాజీ సర్పంచి కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, గ్రామ ప్రజలు కోరుతున్నారు. మైక్, లైటింగ్, డెకరేషన్ పేరిట వసూళ్లు వేలంపాటలు నిర్వహించకుండా పంచాయతీ ఉద్యోగుల దొంగాట పారిశుద్ధ్యం పేరుతో ప్రత్యేక రుసుం ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు -
స్వర్ణలో ఏడుగురు జూదరుల అరెస్ట్
కారంచేడు: గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్న జూదరులను స్థానిక ఎస్ఐ వీ వెంకట్రావు తన సిబ్బందితో కలసి దాడి చేసి పట్టుకున్నారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని స్వర్ణ గ్రామంలోని చెరువుకట్ట మీద చెట్ల కింద పేకాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సాధారణ వ్యక్తుల మాదిరిగా వెళ్లి దాడి చేశారు. సాధారణ దుస్తుల్లో ఉండడంతో దగ్గరకు వచ్చే వరకు పోలీసులను జూదరులు గుర్తించలేకపోయారు. పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.4090 నగదు స్వాదీనం చేసుకున్నారు. జూదరులను కోర్టుకు హాజరుపరుస్తామని ఎస్ఐ తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా పేకాట ఆతున్నట్లు తెలిస్తే మాకు సమాచారం అందించాలని ఆయన గ్రామస్తులను కోరారు. హోటల్స్, లాడ్జిల్లో తనిఖీలు చేసిన పోలీసులు బాపట్లటౌన్: లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని 75 హోటల్స్, లాడ్జిల్లో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ తుషార్‌డూడీ మాట్లాడుతూ నేరాలకు, బెట్టింగ్‌లకు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్న వారిని గుర్తించి, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసే ఉద్దేశంతో తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లాలోని 32 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న 75 లాడ్జిలు, రిసార్ట్స్, హోటళ్లను పోలీసు అధికారులు తనిఖీ చేయడం జరిగిందన్నారు. బైక్ అదుపు తప్పి ముగ్గురికి గాయాలు కారంచేడు: చిలకలూరిపేటకు చెందిన ముగ్గురు యువకులు చీరాల సమీపంలోని వాడరేవు సముద్ర తీరంలో సేదతీరేందుకు ఆదివారం వచ్చారు. ఉదయం బీచ్‌లో సేదతీరి, మధ్యాహ్నం వరకు సముద్రంలో కేరింతలు కొట్టి తిరిగి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారిలోని కారంచేడు–చీరాల మధ్య చిన చట్టాల వద్ద కుక్క ఒకటి అడ్డురావడంతో ముగ్గురు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో ముగ్గురు రోడ్డుపై పడి గాయపడ్డారు. విషయం తెలిసిన ఎస్ఐ వీ వెంకట్రావు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని ఎస్ఐ తెలిపారు. అగ్నిప్రమాదాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – అగ్నిమాపక శాఖాధికారి వెంకటేశ్వరరావు బాపట్లటౌన్: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈనెల 14 నుంచి జరుగుతున్న అగ్ని ప్రమాద వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ముగింపులో భాగంగా ఆర్టీసీ బస్టాండ్లు, కళాశాలల్లోని విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు అధికసంఖ్యలో జరిగే అవకాశం ఉందని, వాటి నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ విజయ్‌కుమార్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. నేడు ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష జెట్టిపాలెం(రెంటచింతల):జెట్టిపాలెం ఆదర్శ పాఠశాల(ఏపీ మోడల్ స్కూల్)లో 6వ తరగతిలో ప్రవేశానికి 2025–2026 విద్యాసంవత్సరానికి మార్చి 31వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు సోమవారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కె.పాపయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో పొందిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారని పేర్కొన్నారు. మార్చి నెల 31లోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 21 న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. -
సోమవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు విడుదల చేసిన డీఎస్సీ–2025 షెడ్యూల్ అభ్యర్థులకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మొదలు జూన్ ఆరో తేదీన పరీక్షల ప్రారంభానికి మధ్యలో 45 రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో అంత తక్కువ కాలంలో పరీక్షలకు సన్నద్ధం కావడం సాధ్యమేనా ? అని అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోందనిసంతోషించాలో, సన్నద్ధమయ్యేందుకు కనీసం గడువు ఇవ్వకుండా హడావుడిగా షెడ్యూల్ జారీ చేసినందుకు బాధపడాలో తెలియని ఆయోమయ పరిస్థితుల్లో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,143 పోస్టులు డీఎస్సీ–2025 ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,143 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 622, ఎస్జీటీ 521 ఉన్నాయి. వీటితో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరో 16 పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా చూపారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా తెలుగు 42, హిందీ 57, ఇంగ్లీషు 69, మాధ్స్ 35, ఫిజికల్ సైన్స్ 58, బయాలాజికల్ సైన్స్ 86, సోషల్ 109, ఫిజికల్ ఎడ్యుకేషన్ 166తో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 521 ఉన్నాయి. మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ డీఎస్సీ–2025కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు గడువు ఇచ్చారు. మే 20 నుంచి మాక్‌టెస్ట్‌లు జరగనున్నాయి. మే 30 నుంచి హాల్ టిక్కెట్లు డోన్లోడింగ్, జూన్ 6వ తేదీ నుంచి జూలై ఆరు వరకు ఆయా కేటగిరీల వారీగా పరీక్షలు జరగున్నాయి. పరీక్షల నిర్వహణ అనంతరం ప్రాధమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, తుది కీ విడుదల చేసి, మెరిట్ ప్రకటించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్లో పొందుపర్చారు. న్యూస్‌రీల్ డీఎస్సీ నియామకాలపై అభ్యర్థుల పెదవి విరుపు నోటిఫికేషన్ కోసం ఎన్నాళ్లగానో 30వేల మంది అభ్యర్థుల నిరీక్షణ మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మే 20 నుంచి మాక్ టెస్ట్‌లు జూన్ 6 నుంచి జూలై ఆరు వరకు పరీక్షలు సన్నద్ధతకు 45 రోజులే వ్యవధి ప్రిపరేషన్‌కు కనీసం 90 రోజులు అవసరమంటున్న సబ్జెక్టు నిపుణులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇలా.. భర్తీ చేయనున్న పోస్టులు : 1,143 ఎస్జీటీ పోస్టులు: 521 45 రోజులు సరిపోవు ఏడేళ్ల అనంతరం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 45 రోజుల సమయం సరిపోదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సబ్జెక్టు నిపుణులూ అదే విషయం చెబుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డీఎస్సీ కోసం 30వేల మంది వరకు అభ్యర్థులు ఎన్నాళ్ల నుంచో నిరీక్షిస్తున్నారు. వీరిలో చాలా మంది వయోపరిమితి పూర్తయిపోతోంది. ఈ నేపథ్యంలో వయో పరిమితిని పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. 90 రోజుల వ్యవధి అవసరం డీఎస్సీ దరఖాస్తు గడువు, పరీక్షలకు మధ్య వ్యవధి చాలా తక్కువ ఉంది. విస్తృత సిలబస్‌ను పూర్తి చేసేందుకు 45 రోజులు సరిపోవు. విద్యాశాఖ హడావుడిగా షెడ్యూల్ ఖరారు చేసింది. కనీసం 90 రోజుల వ్యవధి అవసరం. అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచాలి. 2018 తరువాత చేపడుతున్న డీఎస్సీ కావడంతో వేలాది మంది అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. తెలంగాణలో 46ఏళ్లకు వయోపరిమితి పెంచారు. రాష్ట్రంలో 47ఏళ్లకు పెంచాలి. – కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ -
ఎల్ఈడీ లైట్లతో ప్రమాదం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): నిబంధనలకు నీళ్ళొదిలేస్తున్నారు.. కనీస ఆలోచన లేకుండా.. ఇతరుల ప్రాణాలకు ముప్పు అని తెలిసినా.. ఎల్ఈడీ లైట్ల వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. ద్విచక్ర వాహనాలు మొదలుకుని.. ఆటోలు, లారీలు, ప్రైవేట్ బస్సుల్లో లైట్ల వినియోగం జరుగుతోంది. అయినా పట్టించుకోవాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారు. కొన్నాళ్ళ క్రితం గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాలెం వద్ద ఒక బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి కారణం తెలిసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. నేరుగా ఇంజిన్ నుంచి ఎల్ఈడీ లైట్లుకు వైర్లు అనుసంధానం చేయటం ద్వారానే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఆ ప్రమాదంలో బస్సు దగ్ధమై, ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలతో బయట పడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనాలకు సంబందించి ఎల్ఈడీ లైట్ల వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిషేధిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చింది. భారీ ఫోకస్ వచ్చే లైట్లు వినియోగించటం ద్వారా, ఎదురుగా వచ్చే వాహనదారులకు కనపడకపోవటంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు 90శాతం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం కంపెనీల ఫోకస్ లైట్లు ఇచ్చిన వాటి వరకే వినియోగించాలనేది చట్టం. అదనపు ఫిట్టింగ్‌లు చేయకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటీకీ.. వాహనదారులు యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు. వాహనాల చట్టం 1988 (మోటార్ వెహికల్ యాక్ట్) ప్రకారం.. వాహనాల్లో అనుమతించని మార్పుల్లో ఎల్ఈడీ లైట్లు వినియోగం ఒకటి. ఈ చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం వాహనాల నిర్మాణం, ఫీచర్లలో అనుమతి లేకుండా మార్పులు చేయటం చట్ట విరుద్ధం. ఎల్ఈడీ లైట్లు హాలోజెన్ లైట్ల కంటే అధికంగా ప్రకాశిస్తాయి. తద్వారా ఇతర డ్రైవర్లకు గందరగోళం ఏర్పడటంతోపాటు, అంధత్వాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆర్టీఏ, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అధికమైన వాట్స్, అన్ అప్రూవ్డ్ లైట్లు నిషేదించిన పరిస్థితులు ఉన్నాయి. కారుల్లో 75 వాట్స్, లారీలకు 100 వాట్స్, బైక్‌లకు 10 వాట్స్ లోపు మాత్రమే లైట్ల వినియోగం ఉండాలి. జైలు శిక్షకు కూడా అవకాశం ఆర్టీఏ రూల్ ప్రకారం ఎల్ఈడీ లైట్లు వినియోగం చేపడితే వాహనాన్ని సీజ్ చేయటంతోపాటు జరిమానా విధించవచ్చు. జరిమానా రూ.1,000 నుంచి రూ.పదివేల వరకు పడే అవకాశం ఉంది. గత కొద్ది కాలం క్రితం బెంగుళూరుతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కేవలం వారం రోజుల వ్యవధిలో 8వేల కేసులు నమోదు చేశారంటే ఎల్ఈడీ లైట్లు వినియోగం పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. లైట్ల వినియోగం ద్వారా ఒకొ సారి జైలు శిక్షకు దారి తీసే అవకాశాలు లేకపోలేదు. ఇష్టానుసారంగా వినియోగం ద్విచక్రవాహనాలు మొదలుకుని భారీ వాహనాల వరకు పట్టించుకోని ఆర్టీఏ శాఖ అధికారులు ఎల్ఈడీ లైట్లు వినియోగిస్తే చర్యలు నిబంధనలకు విరుద్ధంగా హెవీ ఫోకస్ ఉన్న ఎల్ఈడీ లైట్లు వినియోగిస్తే చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా కేసులు నమోదు చేయటంతోపాటు, వాహనాలను సీజ్ చేస్తాం. అధిక వెలుగు వచ్చే లైట్లు వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ. కంపెనీలు అమర్చిన లైట్లు మినహా ఏ ఒక్కరూ విడిగా ఎల్ఈడీ లైట్లు పెట్టుకోకూడదు. ఇష్టానుసారంగా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. –ఎం. రమేష్ (గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ) అడ్డగోలుగా అమ్మకాలు.. మోటార్ వెహికల్ షాపుల్లో ఎల్ఈడీ లైట్ల విక్రయాలు చేపట్టకూడదని నిబంధనలు చెబుతున్నాయి ఆయా వాహనాన్ని బట్టి దాని వినియోగానికి సరిపడా వాట్స్ కంటే అధిక ప్రమాణాలు ఉండకూడదని నిబంధనలు ఉన్నాయి. రోడ్డు మంత్రిత్వ శాఖ (మినిస్టరీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే లైట్లు వినియోగించాలి. అయితే దీనిపై చర్యలు తీసుకునేందుకు ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులకు అధికారం ఉంది. అయినా కనీసం చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇటీవల కాలంలో కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. -
గోల్డెన్ ప్రైమ్ సిటీ బ్రోచర్ ఆవిష్కరణ
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): అమరావతి మండలం నరుకుళ్ళపాడు గ్రామంలో 12 ఎకరాలలో సీఆర్డీఏ అఫ్రూవల్‌తో వారాహి ఇన్ఫ్రా టౌన్‌షిప్స్ వారి గోల్డెన్ ప్రైమ్ సిటి బ్రోచర్‌ను ఆదివారం సంస్థ చైర్మన్ కొండవీటి శ్రీనివాసరావు, డైరెక్టర్స్ దేవమిత్ర రాజా, అరుణ్‌ప్రశాంత్, సాయి ఆదిత్య స్కూల్ డైరెక్టర్ రవీంద్రబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ లక్కీడిప్‌లో పాల్గొనే అవకాశం కల్పించి గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా కారు, రెండు, మూడు బహుమతులుగా రాయల్ ఎన్ఫీల్డ్, టీవీఎస్ స్కూటీని విజేతలకు అందించారు. ఫ్లాట్ బుకింగ్ చేసిన ప్రతి ఒక్కరికీ 2 గ్రాముల గోల్డ్ కాయిన్ అందించారు. గతంలో కేఎస్ఆర్ డవలపర్స్ పెదపరిమి, గొర్లవారిపాలెంలో పంచాక్షరి గార్డెన్స్ దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. జొన్నలగడ్డలో వారాహి ఇన్‌ఫ్రాజ్యూయల్ సిటి, విజయవాడలో నిడమానూరులో ఎంబసి విల్లాస్ పూర్తి కావస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఉపాధ్యాయుల కేటాయింపు అసంబద్ధం బాపట్లటౌన్: రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయుల కేటాయింపు చాలా అసంబద్ధంగా, గందరగోళంగా ఉందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) బాపట్ల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బడుగు శ్రీనివాస్, గుడివాడ అమరనాథ్‌లు తెలిపారు. ప్రభుత్వ తీరును ఆదివారం జరిగిన సమావేశంలో తీవ్రంగా ఖండించారు. విధానాన్ని వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు బడుగు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఒక పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా మార్చి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని చొప్పున ఐదుగురు ఉపాధ్యాయులను కేటాయిస్తామని పత్రికల్లో ఊదరగొట్టిన విద్యాశాఖ అధికారులు ఇప్పుడు 60 రోలు దాటితేనే ఐదుగురు ఉపాధ్యాయులను కేటాయిస్తామని మాట మార్చడం ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయటమేనన్నారు. రోల్‌తో సంబంధం లేకుండా ప్రతి గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా మార్చాలి. వాటికి పీఎస్ హెచ్ఎం పోస్టు కేటాయించాలన్నారు. -
పేలుడు పదార్థాలు స్వాధీనం
మార్టూరు: మార్టూరు మండలం నాగరాజుపల్లి గ్రామ సమీపంలో గ్రానైట్, క్రషర్లలో వినియోగించే పేలుడు పదార్థాలతోపాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు తెలిపారు. మార్టూరు పోలీస్ స్టేషన్లో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నాగరాజుపల్లి గ్రామానికి చెందిన దాసం హనుమంతరావు గ్రానైట్ క్వారీలలో ముడి రాయిని పగలకొట్టడం కోసం వినియోగించే జిలెటిన్ స్టిక్స్ వ్యాపారం రెండు దశాబ్దాలుగా చేస్తున్నాడు. అదే గ్రామంలో 135/7,137/7 సర్వే నంబర్లలోని భూమి మిడాల నాగ వేణుగోపాల్‌కు చెందినది. ఈ భూమిని దాసం హనుమంతరావు లీజుకు తీసుకొని గోడౌన్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మార్టూరు సీఐ శేషగిరిరావు శనివారం రాత్రి తమ సిబ్బందితో గోడౌన్లో తనిఖీలు నిర్వహించి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై హనుమంతరావును అతని అన్న కుమారుడు దాసం వీరాంజనేయులును శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దాసం హనుమంతరావును ఏ–1గాను, దాసం వీరాంజనేయులును ఏ–2గా, నాగండ్ల ప్రసన్నను ఏ–3గా, బత్తుల సాంబశివరావును ఏ–4గా, ప్రతాపరెడ్డిని ఏ–5గా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాల్వో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏ–6 చేర్చినట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసుల తనిఖీలో 20 లక్షల రూపాయల విలువైన పేలుడు సామాగ్రితోపాటు ఒక అశోక్ లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని దాసం హనుమంతరావును, దాసం వీరాంజనేయులును కోర్టుకు హాజరు పరచనున్నట్లు తెలిపారు. భూమి యజమాని మిడాల నాగవేణుగోపాల్కు పేలుడు పదార్థాలకు సంబంధించిన లైసెన్స్ 31.3.2025 తేదీ వరకు ఉందని హనుమంతరావు ఆ భూమికి లీజుదారుగా ఉంటూ కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో మార్టూరు, సంతమాగులూరు సీఐలు శేషగిరిరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఆరుగురిపై కేసు నమోదు పోలీసుల అదుపులో ఇద్దరు? విలేకరుల సమావేశంలో డీఎస్పీ రామాంజనేయులు -
ఉర్దూ పోస్టులు తొలగించడం దారుణం
మార్టూరు: దశాబ్దాలుగా ముస్లిం జనావాసాల మధ్య ఉన్న ప్రాథమిక పాఠశాలలోని ఉర్దూ పోస్టును తొలగించటం తగదని, పోస్టు కొనసాగించాలంటూ ద్రోణాదుల గ్రామ ముస్లింలు శనివారం మండల విద్యాశాఖ అధికారి ఎంసీహెచ్ వస్రం నాయక్‌కు విజ్ఞప్తి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ద్రోణాదుల ముస్లిం కాలనీలో ఉన్న ఎంపీపీఎస్(పీఎస్) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత కొన్ని దశాబ్దాలుగా ఉర్దూ సబ్జెక్టుకు సంబంధించిన పోస్ట్ కొనసాగుతూ వస్తుంది. ఇటీవల ప్రభుత్వం అవలంభిస్తున్న నూతన విధానాలలో భాగంగా ఆ పాఠశాలలోని ఉర్దూ పోస్టును తొలగిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ద్వితీయ అధికార భాషగా ఉన్న ఉర్దూ పోస్టులు ఇప్పటివరకు మండలంలో 11 ఉండగా వాటిలో నాలుగు పోస్టులను తొలగించి ఏడుగురు టీచర్లను మాత్రమే కొనసాగించటం దారుణమని వారు పేర్కొన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నందువలన గత రెండు దశాబ్దాలుగా ఇప్పుడిప్పుడే ముస్లింలు తమ పిల్లలను చదివిస్తూ ఉన్నత స్థానాలకు పంపగలుగుతున్నారని ఈ క్రమంలో ఉర్దూ పోస్టులు రద్దు చేయడం ద్వారా ముస్లింలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఎంఈఓ ఎంసీహెచ్ వస్రం నాయక్‌కు తమ కాలనీ పరిధిలోని పాఠశాలలో ఉర్దూ పోస్టును కొనసాగించాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. కార్యక్రమంలో ద్రోణాదుల ముస్లిం కాలనీ వాసులు పఠాన్ బాషా, షేక్ మస్తాన్, పెద్ద మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు మార్కాపురం టౌన్: మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక ఎస్వీకేపీ కళాశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు 2వ రోజైన శనివారం ఉత్సాహంగా సాగాయి. పోటీలకు గుంటూరు, నంద్యాల, బాపట్ల, తెలంగాణలోని సూర్యాపేట, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయి. శనివారం పోటీల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడు గ్రామానికి చెందిన జీఎల్ఆర్ గ్రూప్స్, గరికపాటి లక్ష్మయ్యచౌదరిలకు చెందిన ఎడ్ల జత 4351.06 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని, నంద్యాల జిల్లా పెద్దకొట్టాలకు చెందిన బీ కేశవరెడ్డికి చెందిన ఎడ్ల జత 4325.09 అడుగుల దూరంలాగి రెండో స్థానాన్ని, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చుండూరుకు చెందిన ఆర్కె బుల్స్, శిరీషా చౌదరికి చెందిన ఎడ్ల జత 4291.10 అడుగులు లాగి మూడో బహుమతిని, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన జే సహస్రయాదవ్, జేవీఎల్ యాదవ్‌కు చెందిన ఎడ్ల జత 3881.10 అడుగులు లాగి 4వ స్థానాన్ని సాధించాయి. విద్యతోపాటు మహిళల అభివృద్ధిలో భాగస్వామి పిడుగురాళ్ల: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యతోపాటు మహిళల అభివృద్ధికి కూడా భాగస్వామి అవుతుందని సీఎస్ఆర్ డైరెక్టర్ బి.బబిత అన్నారు. పట్టణ శివారులోని కొండమోడులో ఏర్పాటు చేసిన ఉచిత జూట్ ఉత్పత్తుల తయారీ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ ఉచిత శిక్షణ పొందిన మహిళలకు ధ్రువీకరణ పత్రాలను అందజేయటం జరుగుతుందని పేర్కొన్నారు. శిక్షణను వదిలేయకుండా మహిళలు స్వయం ఉపాధికి ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ నెల రోజుల శిక్షణ తరగతులు 15 రకాల ఉత్పత్తులను శిక్షణ ద్వారా తయారు చేయటం నేర్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎస్ఆర్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మండూరు వెంకటరమణ, శిక్షకురాలు పి.దుర్గా, పీఎస్ఆర్ డిగ్రీ కాలేజీ డైరెక్టర్లు కె.నరసింహారావు, బాడిస మస్తాన్ పాల్గొన్నారు. వాటర్ ట్యాంకర్‌ను ఢీకొన్న కంటైనర్ తమిళనాడుకు చెందిన డ్రైవర్‌కు తీవ్రగాయాలు యడ్లపాడు: హైవే సెంట్రల్ డివైడర్‌పై మొక్కలకు నీరు పొస్తున్న వాటర్ ట్యాంకర్‌ను కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ టి శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..తమిళనాడు చెందిన కంటైనర్ గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న క్రమంలో యడ్లపాడు మండలం బోయపాలెంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి గుడి సమీపంలో హైవేపై మొక్కలకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుండి ఢీకొట్టింది. సాయంత్రం 4 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో కంటైనర్ లారీ ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కార్మికుల పోరాటాన్ని పట్టించుకోకపోవడం దారుణం నరసరావుపేట: ఆప్కాస్‌లో ఉన్న తమకు పనిచేసిన రోజులు అన్నింటికి జీతం చెల్లించాలని కోరుతూ 30 రోజులుగా పారిశుద్ధ్య కార్మికుల చేస్తున్న పోరాటాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్పీఎస్) రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్ల సాధనకోసం కార్మికులు చేస్తున్న నిరసన దీక్షలు శనివారంతో 31వ రోజుకు చేరాయి. శిబిరాన్ని కృష్ణ సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలియచేసి మాట్లాడారు. ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తుందో అర్ధంకావట్లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు తీరుస్తామని ప్రజలకు పలు వాగ్దానాలు చేసిన కూటమి నాయకులు తమకు నెలజీతం ఇప్పించమని కోరుతున్న కార్మికులవైపు చూడకపోవటం వారి నైజం తెలియచేస్తుందన్నారు. కార్మికులు చేస్తున్న పోరాటానికి తమ సంఘం పూర్తిగా మద్దతు తెలియచేస్తుందన్నారు. వెంటనే అధికారులు కలుగుచేసుకొని వారికి పూర్తిజీతంతో పాటు విధుల్లోకి తీసుకోవాలని కోరారు. -
నిండా నీళ్లున్న కుంటకు మళ్లీ నీళ్లా!
మేదరమెట్ల: కుంట నిండా నీళ్లు కనిపిస్తున్నా అధికారులు నేతలతో కుమ్మకై ్క మళ్లీ నీళ్లు పెడతామంటూ తీర్మానం చేసిన సంఘటన కొరిశపాడు మండలం ప్రాసంగులపాడు పంచాయతీలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సిద్దన్నకుంటలో పూర్తిస్థాయిలో నీరు నిండా ఉంది. అయినా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్థానిక నాయకులతో కుమ్మకై ్క నీరు నిండా ఉన్న కుంటకు మరలా నీరు పెడుతున్నట్లు అనంతరం బిల్లులు చేసుకునేలా ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. పనులు చేయకుండానే పనులు చేశామని బిల్లులు చేసుకోవడం ఏమిటని, ఇలా చేస్తుంటే ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి పనులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులతో ప్రజాప్రతినిధులు కుమ్మక్కు మళ్లీ నీరు పెట్టేందుకు తీర్మానం -
జగనన్న కాలనీల్లో వసతులు కల్పించాలి
మంత్రి అనగానికి వినతి రేపల్లెరూరల్: పట్టణంలోని జగనన్న కాలనీలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కాలనీవాసులు శనివారం మంత్రి అనగాని సత్యప్రసాద్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సీపీఎం పట్టణ కార్యదర్శి మణిలాల్ మాట్లాడుతూ జగనన్న కాలనీలో కనీస వసతులు కరువై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సొంతగూటి కోసం అప్పులు చేసి గృహాలు నిర్మించుకున్న కాలనీవాసులు కాలనీలో వసతులు లేకపోవటంతో నివాసం ఉండలేని పరిస్థితులు వచ్చాయన్నారు. జగనన్నకాలనీ పేరును తొలగించి పీఎంవై ఎన్టీఆర్ కాలనీగా మార్చిన ప్రభుత్వం వసతులు మాత్రం కల్పించలేదన్నారు. డ్రయిన్లు, రహదారులు లేక మురుగు నివాస గృహాల మధ్య నిలిచి పారిశుద్ధ్యం క్షీణించటంతోపాటు దోమలు వృద్ధి చెంది క్షణకాలం ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి కాలనీలో కనీస వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీి కన్వీనర్ వి.ధనమ్మ, కో–కన్వీనర్ రవికుమార్, సహాయ కార్యదర్శి కె.నాంచారమ్మ, సభ్యులు వనజాక్షి, కృష్ణకుమారి, రాధా తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ప్రేమయ్య ఎంపిక
ఇంకొల్లు(చినగంజాం) జాతీయ స్థాయిలో నిర్వహించే టీ 20 క్రికెట్ పోటీలకు మండలంలోని నాగండ్ల గ్రామానికి చెందిన బూరగ ప్రేమయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రేమయ్యకు ఆల్ ఇండియా క్రికెట్ డవలప్మెంట్ ట్రస్టు నుంచి ఉత్తర్వులు అందాయి. జాతీయ జట్టులో భారతదేశం తరపున క్రికెట్ జట్టులో ప్రేమయ్య బ్యాట్స్‌మన్ ఎంపిక కాగా మే నెల 26 నుంచి 31 వరకు నేపాల్‌లో నిర్వహించే పోటీలలో పాల్గొనున్నట్లు ప్రేమయ్య తెలిపారు. ప్రేమయ్య ప్రస్తుతం నరసరావు పేటలో కృష్ణవేణి డిగ్రీ కాలేజీ నందు డిగ్రీ చదువుతున్నాడు, -
పూనూరు పోస్టుమాస్టర్‌పై ఖాతాదారుల ఫిర్యాదు
ఉన్నతాధికారుల దర్యాఫ్తు యద్దనపూడి: బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం పూనూరు గ్రామ పోస్టుమాస్టర్ అవినీతి ఆరోపణలపై గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో శనివారం అధికారులు పూనూరులో విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.... పూనూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఉప్పుల సాంబశివరావు గత నెల 6వ తేదీ అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. సాంబశివరావు జీవించి ఉన్న సమయంలో రెండు రికరింగ్ డిపాజిట్లు ప్రారంభించి ప్రతి నెలా రూ.5000 కిస్తీలు చెల్లిస్తూ వచ్చాడు. ఇలా ఫిబ్రవరి నెల వరకు పోస్టుమాస్టరుకు నగదు చెల్లిస్తూ వచ్చాడు. రికరింగ్ డిపాజిట్లకు సంబంఽధించిన పుస్తకాలు మాత్రం పోస్టుమాస్టరు వద్దే ఉంచుకుంటూ వస్తున్నాడు. అందులో ఒక ఆర్డీ పుస్తకానికి సంబంధించి 7 నెలల వరకు నగదు చెల్లించలేదు. ఇలా సూమారు రూ.17,500 పోస్టుమాస్టరు తన సొంతానికి వాడుకున్నాడని మృతుని కుమారుడు అంకినీడు ప్రసాద్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సేవింగ్ ఖాతాలో గత సంవత్సరం 7–2–24న, 16–10–24న తేదీన రెండుసార్లు మెత్తం రూ.40 వేలు నగదు డ్రా చేసినట్లు కుటుంబసభ్యులు ఆధారాలతో పోస్టల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక గ్రామంలో మరికొంత మంది వ్యక్తుల నుండి ఆర్డీల పేరిట నెలనెల కిస్తీలు వసూలు చేసి వాటికి ఇవ్వాల్సిన డిపార్ట్మెంట్ తాలుకా రసీదులు ఇవ్వకుండా చిన్నసైజు పాకెట్ సైజ్ పుస్తకంలో నెలనెల ఆర్డీ సొమ్మును జమ చేస్తున్నట్లు ఖతాదారులకు ఇస్తూ పోస్టల్‌శాఖ పుస్తకాలు మాత్రం తన దగ్గరే ఉంచుకుంటున్నాడని పలువురు అధికారులకు తెలిపారు. ఈ విచారణలో భాగంగా చీరాల అసిస్టెంట్ సూపంటెండెంట్ ఆఫ్ పోస్టు ఆఫీస్ (ఏఎస్పీ) శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులు తీసుకున్నానని పోస్టుమాస్టర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంతకాలను ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపి వాస్తవాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. -
భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలి
గుంటూరు వెస్ట్: భూ సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శనివారం రాత్రి కలెక్టరేట్లో పలు రెవెన్యూ అంశాలపై నిర్వహించిన వర్క్‌షాపులో కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు, వెబ్‌ల్యాండ్ టెక్నికల్ సమస్యలు, రీసర్వే తదితర అంశాల నుంచి అధిక ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. సమస్యలకు కారణాలు పరిశీలించాలని, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. వెబ్‌ల్యాండ్‌కు సంబంధించి సమస్యల పరిష్కారం జాయింట్ కలెక్టర్ లాగిన్‌లోనే చేయాల్సి ఉందన్నారు. కలెక్టర్ స్థాయిలోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావడం వల్ల జాప్యం అవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా కొన్ని సమస్యల పరిష్కారానికి అర్జిదారులు పదేపదే వస్తున్నారని, దీన్ని అధికారులు గుర్తించాలన్నారు. సమస్య పరిష్కారం కాని వాటిని వారికి వివరించి చెప్పాలన్నారు. అధికంగా వస్తున్న సమస్యలపై రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి -
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పు అని, వాటిని శాసీ్త్రయ పద్ధతిలో నాశనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ చెప్పారు. శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఈ–వ్యర్థాల నిర్వహణపై గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాభిరామ్, కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్‌తేజ, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ ఇన్చార్జి మేయర్ షేక్ సజీలా, ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులతో కలిసి విజ్ఞాన మందిరం ఆవరణలో మెక్కలు నాటి, నగరంలో ఈ – వ్యర్థాల సేకరణ చేసే వాహనాన్ని ప్రారంభించి, సిగ్నేచర్ క్యాంపెయిన్‌లో సంతకం చేశారు. వివిధ రంగాల స్టాళ్లను పరిశీలించారు. సీఎస్ మాట్లాడుతూ ఈ–వ్యర్థాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని, వాటిని ఎక్కడపడితే అక్కడ పారేస్తే భూ కాలుష్యం, నీటి కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. ఈ–వ్యర్థాల సేకరణకు గుంటూరుతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రెడ్యూస్, రీ యూజ్, రీసైక్లీంగ్ (ఆర్ఆర్ఆర్) సెంటర్లను ఏర్పాటుచేసినట్టు వివరించారు. ఈ–వ్యర్థాలను ఆర్ఆర్ఆర్ సెంటర్ల నిర్వహణ ద్వారా సంపద సృష్టించవచ్చని, దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకురానుందని వివరించారు. రాష్ట్రంలో మూడు నెలలుగా జరు గుతున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో 1.90 కోట్ల మంది పాల్గొన్నారని, స్వచ్ఛత కార్యక్రమాలను ఉద్యమంగా యుద్ధప్రాతిపదికన ప్రజలు, అధికారులు, ప్రజాప్రతి నిధులు, స్వచ్ఛంద సేవ సంస్థల భాగస్వామ్యంతో కొనసాగించటం ద్వారా స్వచ్ఛంద్ర తద్వారా స్వర్ణాంధ్ర సాధ్యం అవుతుందన్నారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఈ–వ్యర్థాల సేకరణకు ప్రత్యేకంగా ఆర్ఆర్ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గుంటూరులోని ప్రతి సచివాలయంలో ఆర్ ఆర్ ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. -
వైఎస్సార్ సీపీ నిరంతరం ప్రజాపక్షం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): అధికారంలో ఉన్నా.. లేకున్నా.. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమేనని రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా కొత్త కార్యాలయ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా వైఎస్సార్ సీపీ జెండాను ఆవిష్కరించిన అనంతరం సర్వమత ప్రార్థనలు జరిపి కార్యాలయాన్ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత కాకాని వైజంక్షన్ నుంచి భారీ బైక్ ర్యాలీతో వైవీ సుబ్బారెడ్డికి నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం సూపర్‌సిక్స్ హామీలను గుప్పించిందని విమర్శించారు. ప్రజలు వాటిని ఎక్కడ అడుగుతారో అని అక్రమ అరెస్టులు, బెదిరింపులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు పెట్టినా.. అక్రమ అరెస్ట్ చేసినా.. వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదని, కార్యకర్తలు, నాయకులు కలిసి కట్టుగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ నూతనంగా నగర కార్యాలయాన్ని ప్రారంభించటం సంతోషదాయకమన్నారు. రాబోయే రోజుల్లో అన్ని డివిజన్లు, నగర కమిటీ, అనుబంధ విభాగాల కార్యాలయాలను అందరి సహకారంతో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ గుంటూరు, నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాలయాన్ని ప్రారంభించటం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకపాలనపై కొండంత ధైర్యంతో ముందుకు సాగేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నారు. నూరిఫాతిమా తమకు సోదరిలాంటిందని, ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. గోవుల మృతిపై విచారణ జరపాలి అనంతరం మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో గోవులు మృతి చెందటం బాధాకరమన్నారు. దీనిపై కచ్చితంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గోశాలలో 1,500పైగా గోవులు ఉండేవని, అనారోగ్యంతో మృతి చెందితే ఆ దారి వేరని, కూటమి ప్రభుత్వం లోపాల వల్ల మరణించడం బాధాకరమన్నారు. వైఎస్సార్ సీపీలో నెంబర్ వన్..టూ అంటూ ఉండదని.. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరం ముందుకు సాగుతామన్నారు. పార్టీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డికి కోటరీల గురించి తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీలో ఎవరికీ ప్రాధాన్యం తగ్గించడం, పెంచడం ఉండవని, అప్పజెప్పిన బాధ్యతను అందరూ చిత్తశుద్ధితో చేసుకుంటూ పోవడమేనని పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాటానికి వెనుకాడం : నూరిఫాతిమా ప్రజల పక్షాన పోరాటాలకు వెనుకాడబోమని, వారి సమస్యలను గొంతెత్తి నినదిస్తామని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా స్పష్టం చేశారు. జగనన్న తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కచ్చితంగా పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకుని వెళ్తామన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, డెప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, పార్టీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అధికారం ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే ప్రయాణం రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి పార్టీ గుంటూరు నగర కార్యాలయం ప్రారంభం -
అంతర్‌జిల్లాల దొంగలు అరెస్టు
మేదరమెట్ల: పలు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను కొరిశపాడు మండలం మేదరమెట్ల వై.జంక్షన్ వద్ద శనివారం మేదరమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. చీరాల డీఎస్పీ ఎస్డీ మొయిన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల ఒకటో తేదీ సాయంత్రం వరుసగా రెండు చైన్‌స్నాచింగ్ సంఘటనలు మేదరమెట్ల పోలీస్టేషన్ పరిధిలో జరిగాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, మేదరమెట్ల, కొరిశపాడు, పంగులూరు ఎస్ఐలు షేక్ మహ్మద్ రఫీ, వై.సురేష్, బీ.వినోద్బాబులు టీంగా ఏర్పడి సీసీ కెమెరాల ఆధారంగా ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ దొంగల కోసం ఆధారాలు సేకరించారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన దర్శనాల ఏడుకొండలు మరో ముద్దాయి అదే గ్రామానికి చెందిన షేక్ ఆషిద్లను మేదరమెట్ల వై.జంక్షన్ వద్ద మోటారు బైకుపై ఉన్నారన్న సమాచారం రావడంతో మేదరమెట్ల పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు వారి వద్ద నుంచి 126 గ్రాముల బంగారు చైన్లు రెండు మోటారు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏడుకొండలుపై గతంలో చీమకుర్తి స్టేషన్లో మూడు, టంగుటూరు స్టేషన్‌పరిధిలో ఒక కేసు నమోదై ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండో ముద్దాయి షేక్ ఆషిద్పై కొత్తపట్నం పొలీసుస్టేషన్ పరిధిలో ఒకటి, ఒంగోలు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో రెండు దొంగతనాల కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరిద్దరూ ముప్పవరం, పంగులూరు, కొరిశపాడు సమీప గ్రామాల్లో చైన్‌స్నాచింగ్‌లకు రెక్కీలు నిర్వహించినట్లు తెలిసింది. వేసవికాలం కావడంతో దొంగతనాలు పెరిగే అవకాశం ఉందని ఒంటరిగా ఉండే మహిళలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. అంతర్‌జిల్లాల దొంగలను పట్టుకున్న సందర్భంగా సీఐ, ఎస్‌ఐలతోపాటు నాయబ్‌రసూల్, తిరుపాల్‌రెడ్డి, జీ.సురేష్, ఎన్.రమేష్‌లను రివార్డులతో అభినందించారు. పది లక్షల విలువైన బంగారం, రెండు బైకులు స్వాధీనం పోలీసులకు రివార్డులు అందజేసిన డీఎస్పీ -
బీమా.. ఏదీ ధీమా?
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వేటపాలెం: సంక్షేమ పథకాల అమలును కూటమి సర్కారు గాలి కొదిలేసింది. కనీసం బీమా పథకమైనా అమలు చేస్తే కాస్త భరోసా ఉంటుందని పేద ప్రజలు భావించారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వైఎస్సార్ బీమాను అమలు చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదోడికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయం అందించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా బాధితుల వద్దకే వెళ్లి సీఎం సహాయ నిధి పరిహారం అందించారు. సవ్యంగా సాగుతున్న ఈ పథకం సార్వత్రిక ఎన్నికల తర్వాత కుంటుపడింది. పథకం పేరును చంద్రన్న బీమాగా మార్చి అమలును మాత్రం వదిలేశారు. దీంతో సహజ మరణంతోపాటు ప్రమాదవశాత్తూ మరణించిన కుటుంబాలు పది నెలలుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్నాయి. అసలు బీమా పథకం ఇస్తారా? ఎత్తేస్తారా? అనే అనుమానాలు వ్యక్తవుతున్నాయి. బాపట్ల జిల్లా వ్యాప్తంగా 4,70,200 రేషన్ తెల్లకార్డులు ఉన్నాయి. వీకంతా దారిద్య్రరేఖకు దిగువగా ఉన్నవారు. చీరాల నియోజకర్గం పరిధిలోని చీరాల టౌన్, రూరల్, వేటపాలెం మండలాల పరిధిలో 57,010 మంది తెల్లరేషన్ కార్డులు దారులు ఉన్నారు. ఏఏవై, తెల్ల రేషన్ కార్టులు కలిగిన వారంతా బీమా పథకానికి అర్హులు. ప్రమాదవశాత్తూ ఏదో ఒక రూపంగా మృత్యువు నిత్యం కబళిస్తూనే ఉంది. అయితే ఆదుకోవాల్సిన బీమా పథకం అమలు చేస్తారో? లేదో తెలియడం లేదు. రూ.10 లక్షలు మాటేంది... బీమా పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. అర్హులందరీకి న్యాయం చేస్తాం. వైఎస్సార్ సీపీ హయాంలో కంటే రెట్టింపు సాయం అందిస్తాం.. సహజ మరణానికై తే రూ.5 లక్షలు, ప్రమావశాత్తూ మరణిస్తే రూ.10 లక్షలు ఇస్తామంటూ కూటమి నాయకులు ఎన్నికలప్పుడు ఊరూరా ఊదర గొట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ముంద్రించి ఇంటింటా పంపిణీ చేశారు. అధికారం చేపట్టాక వక్ర బుద్ధి చూపుతున్నారు. 2024 మే 13 నుంచి బీమా పథకం వివరాలు వెబ్సైట్ నుంచి తొలగించారు. తర్వాత నమోదుకు అవకాశం కల్పించలేదు. అప్పటి నుంచి ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలై సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వేచి చూడాల్సి వస్తోంది. న్యూస్‌రీల్ 2024 మార్చి తర్వాత అమల్లోకి రాని పథకం 13 నెలలుగా ఎదురు చూపులకే పరిమితం ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్భాట ప్రకటన అధికారం చేపట్టి పది నెలలైనా అతీగతీలేదు బీమా ఉంటే కుటుంబాన్ని ఆదుకునేది నేను కూలి పనులు చేసుకొని జీవిస్తున్నాను. ఎదిగి వచ్చిన కొడుకు కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించాం. ఆరు నెలల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో నా కుమారుడు మృతి చెందాడు. అదే బీమా పథకం ఉంటే రూ.10 లక్షలు సాయం అందేది. ఇప్పటికై నా రూ.10 లక్షలు పరిహారం అందించి ఆదుకోవాలి –లక్ష్మి, వేటపాలెం: మార్గదర్శకాలు రావాలి ప్రభుత్వం నుంచి బీమా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడలేదు. సచివాలయాల్లో ఈ పథకానికి సంబంధించిన వెబ్సైట్ ఆన్‌లో లేదు. మార్గదర్శకాలు రాగానే అమలు చేస్తాం. –అంజిబాబు, ఏపీఎం, వేటపాలెం: -
మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
బాపట్లటౌన్: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి వాహనాలను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ అక్రమ రవాణా, నేర నియంత్రణ లక్ష్యంగా వాహన తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. జిల్లాలోని చీరాల గడియార స్తంభం సెంటర్, బస్టాండ్ సెంటర్, పేరాల గేటు వద్ద, ఈపురుపాలెం, బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డులో జరిగిన వాహన తనిఖీలలో ఎస్పీ స్వయంగా పాల్గొన్నారు. వాహన తనిఖీలు నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు, ఏఆర్ డీఎస్పీ, ట్రైనీ డీఎస్పీలతో కలిసి జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలను ఎంపికచేసుకొని జిల్లాలోని 31 ప్రదేశాల్లో 3799 వాహనాలను తనిఖీ చేశారు. ధ్రువపత్రాలు లేని 136 అనుమానిత వాహనాలను సీజ్ చేశారు. 268 వాహనాలకు చలానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 14 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం చేశామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని సంబంధిత కోర్టులో హాజరుపరచునున్నారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికే అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు ప్రవేశించకుండా నిరోధించటానికి, నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్నామన్నారు. ప్రజలు రోడ్డు భద్రత నియమాలను, వాహన చట్టాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కారుల్లో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. వాహనదారులు సంబంధిత ధ్రువపత్రాలను కలిగి ఉండాలన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనదారులపైన, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాల నియంత్రణకే వాహన తనిఖీలు ధ్రువీకరణ పత్రాలు లేని 136 వాహనాలు సీజ్ 14 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు 268 వాహనాలకు చలానాలు విధింపు ఎస్పీ తుషార్ డూడీ -
కొంగు బంగారం.. పోలేరమ్మ తల్లి
చీరాల: కోరిన కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పేరాల పోలేరమ్మ తల్లి శిడి మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. పోలేరమ్మ గుడి స్థాపించి 50 సంవత్సరాలు పూరైన సందర్భంగా తిరునాళ్లను ఐదు రోజులపాటు వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 22న శిడి మహోత్సవం, తిరునాళ్ల నిర్వహించనున్నారు. తిరునాళ్ల విశిష్టత చీరాల పట్టణంలో పెద్ద ఎత్తున జరిగే పోలేరమ్మ తిరునాళ్లకు ఎంతో విశిష్టత ఉంది. స్థానిక హరిప్రసాద్‌నగర్‌లో పోలేరమ్మ తల్లి వేంచేసి ఉంది. 49 ఏళ్లుగా ప్రతి ఏడాదీ అమ్మవారి తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తారు. శక్తి స్వరూపం కలిగి, భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉండే పోలేరమ్మ అమ్మవారి గుడి అంటే చీరాల ప్రాంతంలో మంచి ప్రసిద్ధి ఉంది. తొలుత స్థానిక గ్రామస్తులు చిన్న గుడిని ఏర్పాటు చేసి అమ్మవారిని స్థాపించగా ప్రస్తుతం ఆ దేవాలయం దినదినాభివద్ధి చెంది పట్టణంలోనే విశిష్టత కలిగిన అమ్మ వారిగా పేరు పొందింది. దేవాలయం అభివృద్ధిలో దేవస్థాన కమిటీ, సభ్యులు విశేష కృషి చేశారు. ప్రతివారంలో మంగళ, ఆదివారాల్లో భక్తులు విరివిరిగా వచ్చి విశేష పూజలను నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న భక్తుల కష్టాలు, కోర్కెలను తీర్చే తల్లిగా పోలేరమ్మ తల్లికి పేరుంది. అందుకే ప్రతి ఏడాది అమ్మవారి తిరునాళ్ల, శిడి మహోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. తిరునాళ్ల రోజు శిడి పెళ్లి కొడుకుతో ఊరేగింపుగా అమ్మవారి గుడికి వెళ్ళి గుడి వద్ద ఉండే శిడి మానుకు ఒక పెట్టెలో మేకపోతునుంచి, గుడి చుట్టూ మూడు ప్రదక్షణలు చేస్తారు. ఈ సమయంలో శిడిమాను పైభాగంలో చెక్కపెట్టెలో ఉంచిన మేకపోతును భక్తులు జీడికాయలతో కొడుతుంటారు. శిడిమాను లాగితే కష్టాలు తొలిగిపోతాయని భావించే భక్తులు శిడిమాను బండిని లాగేందుకు పోటీ పడతారు. ప్రత్యేక కార్యక్రమాలు.. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది తిరునాళ్లను ఐదు రోజులపాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఎల్ఈడీ విద్యుత్ ప్రభలు ఆకర్షణగా నిలుస్తాయి. ప్రభలతోపాటు మ్యూజికల్ నైట్, నాటికలు, కళాకారులతో ప్రదర్శనలు, అన్నదానాలు నిర్వహించనున్నారు. తిరునాళ్లను పురస్కరించుకొని పశుసంపదతో పాటు వాహనాలను గుడి చుట్టూ తిప్పి ప్రజలు తమ మొక్కులు తీర్చుకుంటారు. చీరాలతోపాటు పరిసర గ్రామాల నుంచి తిరునాళ్లను చూసేందుకు ప్రజలు వేలాది సంఖ్యలో వస్తుంటారు. భక్తులు అధిక సంఖ్యలో రానున్న సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పేరాల పోలేరమ్మ తల్లి 50 సంవత్సరాలు పూరైన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు 22న శిడిమహోత్సవం, తిరునాళ్లు -
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన మారో లారీ
క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ అద్దంకి: ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టిన ఘటనలో క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయిన సంఘటన మండలంలోని శింగరకొండ వద్ద నామ్ రహదారిలో శుక్రవారం జరిగింది. అందిన సమాచారం మేరకు నాగార్జున సిమెంటు కంపెనీ నుంచి డ్రైవర్ నరేంద్ర లారీలో ిసిమెంటు లోడు చేసుకుని ఒంగోలు బయలుదేరాడు. ఈ క్రమంలో లారీ శింగరకొండకు సమీపంలోకి రాగానే అదుపు తప్పి ముందు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దాంతో లారీ క్యాబిన్ లోపలికి చొచ్చుకుపోవడంతో డ్రైవర్ అందులో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై రవితేజ హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని, క్యాబిన్లో నుంచి డ్రైవర్‌ను బయటకు తీసేందుకు రెండు గంటలపాటు కష్టపడ్డారు. ఎట్టకేలకు పొక్లెయిన్‌తో జాగ్రత్తగా క్యాబిన్‌ను వెనుక్కు వచ్చే విధంగా చేసి డ్రైవర్‌ను బయటకు తీశారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్‌ను 108 వాహనంలో ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్యాబిన్లో డ్రైవర్ ఒక్కడే ఉండడం, అతను అపస్మారక స్థితిలో ఉండడంతో అతని వివరాలు తెలియరాలేదు. -
21న చీరాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చీరాల మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 21వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజల సౌలభ్యం కోసం చీరాల నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చీరాల నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపరిశీలన తాడికొండ: మే 2న వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరుకానున్న ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, జేసీ భార్గవ్‌తేజ తదితరులు పరిశీలించారు. డాక్టరేట్ పొందిన ఆటో డ్రైవర్ శంకర్రావుకు అభినందనలు లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూనే కాలికట్ యూనివర్సిటీ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందిన గండికోట శంకర్రావును ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐఆర్‌టిడబ్ల్యూఎఫ్)అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య సత్కరించా రు. శుక్రవారం పాతగుంటూరులోని సీఐటీ యూ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు అధక్షతన అభినందన సభ జరిగింది. ఆర్ లక్ష్మయ్య మాట్లాడుతూ గండికోట శంకరరావు ఆటో డ్రైవర్ యూనియ న్ ప్రధాన కార్యదర్శిగా, ఆలిండియా రోడ్ ట్రా న్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి కె.దుర్గారావు పాల్గొన్నారు. చెలరేగిన మృగాడు క్రోసూరు: స్థానిక బోయ కాలనీలో భార్యపై అనుమానం పెంచుకుని భర్త బ్లేడుతో గొంతుకోసిన సంఘటన శుక్రవారం జరిగింది. స్టేషన్ రైటర్ దాసు వివరాల ప్రకారం.. బోయ కాలనీకి చెందిన చార్ల శ్రీను భార్య మల్లమ్మ. ఆమె ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుండటంతో అనుమానపడి శ్రీను బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. చుట్టపక్కల వారు ఆమెను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు 25 కుట్లు వేశారు. ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. శ్రీను, మల్లమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా అయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైటర్ దాసు తెలిపారు. పాక్ జలసంధిని ఈదిన గణేష్ విజయవాడస్పోర్ట్స్: తమిళనాడులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు ఉన్న పాక్ జలసంధిని ఆంధ్రప్రదేశ్ పారా స్విమ్మర్ బి.గణేష్ సాహసోపేతంగా ఈదాడు. శుక్రవారం ఉదయం 5.50 గంటలకు తలైమన్నార్‌లో ఈతను ప్రారంభించి సాయంత్రం 4.20కి ధనుష్కోటికి చేరుకున్నారు. 28 కిలోమీటర్లు పొడవున్న సముద్రాన్ని 10.30 గంటల్లో ఈదాడు. తెలుగు రాష్ట్రాల్లోని పారా స్విమ్మర్లలో పాక్ జలసంధిని ఈదిన మొట్టమొదటి పారా స్విమ్మర్‌గా ఖ్యాతిగడించారు. స్విమ్మర్ గణేష్ ప్రస్తుతం ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో స్విమ్మింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. -
శ్మశానవాటిక సమస్య పరిష్కారానికి కృషి
ఆర్డీవో చంద్రశేఖర నాయుడు చీరాల టౌన్: వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణంలో శ్మశాన వాటిక భూమి కోల్పోయిన విజయనగర్‌కాలనీ గ్రామస్తుల సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖరనాయుడు హామీ ఇచ్చారు. రెండు రోజుల కిందట కలెక్టర్ వెంకట మురళిని విజయనగర్‌కాలని గ్రామ పంచాయతీ పెద్దలు, ప్రజలు కలిసి గ్రామానికి కేటాయించిన శ్మశానవాటిక భూమి 167–ఏ రోడ్డు నిర్మాణంలో కోల్పోయామని ఫలితంగా తాము పడుతున్న బాధలు, ఇబ్బందులను పరిష్కరించాలని వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం విజయనగర్‌కాలనీ గ్రామ పంచాయతీలోని శ్మశానవాటిక స్థలాన్ని గ్రామస్తులు, గ్రామపెద్దలతో కలిసి ఆర్డీవో చంద్రశేఖర నాయుడు పరిశీలించారు. విజయనగర్‌కాలనీ గ్రామానికి 1985లో కేటాయించిన ఎనిమిది ఎకరాల శ్మశాన భూమికి సంబంధించిన రికార్డులతో పాటుగా వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణంలో కోల్పోయిన శ్మశాన భూమి ప్రాంతాలను పరిశీలించారు. తమకు శ్మశాన భూమిని కేటాయించడంతోపాటుగా రోడ్డు నిర్మాణంలో టన్నెల్‌ను తమ గ్రామంలో నిర్మాణం చేయించాలని అధికారులను గ్రామస్తులు కోరారు. దీనిపై ఆర్డీవో మాట్లాడుతూ విజయనగర్ కాలనీ గ్రామస్తుల సమస్యను జిల్లా కలెక్టర్ వెంకట మురళి సమక్షంలో ఈనెల 21న నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ సమక్షంలో పరిష్కారం లభిస్తుందని ప్రజా సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తానని గ్రామస్తులకు ఆర్డీవో హామీ ఇచ్చారు. ఆర్డీవోతో పాటుగా తహసీల్దార్ కె.గోపికృష్ణ, గ్రామస్తులు లక్ష్మీప్రసాద్, ఏసుపాదం, లక్ష్మీనరసయ్య, వందనం, రాజేష్, వెంకటేశ్వర్లు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
కొమర్నేనివారిపాలెంలో చోరీ
పర్చూరు(చినగంజాం): మండలంలోని కొమర్నేనివారిపాలెంలో శుక్రవారం దొంగతనం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రా వెంకట సుబ్బయ్య ఇంటిలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 10 సవర్ల బంగారం, రూ.14 వేలు నగదు, ఒక టీవీని అపహరించుకొని వెళ్లారు. గ్రామంలో శుభకార్యం జరుగుతున్న సమయంలో ఇంటిలోకి దొంగలు ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన వెంకట సుబ్బయ్య తలుపులు తీసి ఉండటం, ఇంటిలోని బీరువాలోని బట్టలు చిందరవందరగా పడి ఉండటంతో తన ఇంటిలో దొంగతనం జరిగిందని గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఎస్ఐ మాల్యాద్రి ఇంటి పరిసరాలను పరిశీలించి, క్లూస్‌టీంను పిలిపించి వివరాలను సేకరించారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. -
పొగాకు రైతులను ఆదుకోవాలి
కాకుమాను: ఈ ఏడాది పొగాకు సాగు చేస్తున్న రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పెదనందిపాడులో రైతులు పండించిన పొగాకును కృష్ణయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ధర సగానికి సగం తగ్గిందని ఆవేదన చెందారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల కష్టాలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల స్థిరీకరణ నిధికి ప్రభుత్వం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించిందని కనీసం రూ.5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతుల నుంచి పంటను రూ.18వేలకు కొనాలని కోరారు. కార్యక్రమంలో కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, కౌలురైతు సంఘం బాపట్ల జిల్లా నాయకులు గంగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వెకటశివరావు, దొప్పలపూడి రమేష్ బాబు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ఎలక్ట్రిషియన్ మృతి
అద్దంకి రూరల్: విద్యుత్ స్తంభంపై నుంచి కిందపడి ఎలక్ట్రిషియన్ మృతి చెందిన సంఘటన అద్దంకి మండలంలోని చిన కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతురాలి భార్య పులి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై రవితేజ కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చినకొత్తపల్లి గ్రామానికి చెందిన పులి నెహేమియా (35) సుమారు 15 సంవత్సరాలుగా ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన జొన్నలగడ్డ రామాంజనేయులు రైస్‌మిల్లుకు కరెంట్ రాకపోవటంతో చూడటానికి వెళ్లి విద్యుత్ స్తంభం ఎక్కి చూస్తుండగా ప్రమాదవశాత్తు కరెట్ షాక్ తగలటంతో స్తంభం పై నుంచి కిందపడ్డాడు. స్థానికులు రామాజంనేయులు, తంగిరాల మనోహర్‌లు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యుడు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. -
ఉపాధి హామీ కూలీ మృతి
బల్లికురవ: ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా ఎండ వేడిమితో అనారోగ్యం పాలై పదిరోజులపాటు వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. అందిన సమాచారం ప్రకారం.. మండలంలోని కొండాయపాలెం గ్రామానికి చెందిన తన్నీరు శ్రీనివాసరావు (45) పదిరోజుల కిందట గ్రామంలో జరిగిన ఉపాధి పనులకు వెళ్లి ఎండదెబ్బకు గురయ్యాడు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య ఇరువురు కుమారులు ఉన్నారు. రెక్కాడితేకాని డొక్క నిండని ఈ కుటుంబంలో కుటుంబ యజమాని చనిపోవటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంటుంది. అందరితో కలివిడిగా ఉండే శ్రీనివాసరావు అకాల మరణంతో కొండాయపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కప్పం కడితే రైట్ రైట్
సాక్షి ప్రతినిధి,బాపట్ల: కూటమి సర్కార్ దోపిడీ శృతిమించి రాగానపడింది. గ్రానైట్ పరిశ్రమల నుంచి పెద్దఎత్తున దండుకునేందుకు పచ్చనేతలు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి చెల్లించే పన్ను సంగతి దేవుడెరుగు ముందు మా సంగతి చూడమంటున్నారు. పన్ను ఎగనామం పెట్టినా ఫర్వాలేదు మాకు మాత్రం నెల మామూళ్లు ఇవ్వాల్సిందేనని హుకుం జారీచేశారు. అడిగిన మొత్తం చెల్లించకపోతే రాష్ట్ర సరిహద్దులు దాటినిచ్చేది లేదని బెదిరింపులకు దిగారు. పచ్చనేతల నెల మామూళ్లు ప్రభుత్వానికి చెల్లించే పన్ను కంటే అధిక మొత్తంలో ఉండడంతో బయ్యర్లు బెదిరిపోతున్నారు. మీకు కప్పం చెల్లించి వితౌట్(టాక్స్ లేకుండా)లో గ్రానైట్ పంపే దానికంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించి దర్జాగా తీసుకెళ్లడమే మేలని వ్యాపారులు భావిస్తున్నారు. చినబాబు కప్పం రూ.50 కోట్లు బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీలు, పరిశ్రమల నుంచి నెలకు రూ.50 కోట్లు ఇవ్వాలని చినబాబు జిల్లా గ్రానైట్ మంత్రిని ఆదేశించినట్లు సమాచారం. మంత్రి హుటాహుటిన గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, బయ్యర్లతో సమావేశం పెట్టి వ్యవహారం చక్కబెట్టాలని రెండు జిల్లాల మైనింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రి ఆదేశాలతో ఇటీవల గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీ యజమానులతో అధికారులు తొలుత సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా మంత్రి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒకరిద్దరికై తే కప్పం చెల్లించగలంకానీ పదుల సంఖ్యలో ఉన్న పచ్చనేతలందరికీ నెల మామూళ్లు ఇవ్వడం కుదరదని క్వారీ, పరిశ్రమల యజమానులు తేల్చి చెప్పినట్లు సమాచారం. మీరడిగినంత మొత్తం కట్టలేమని, ఇలాగైతే వ్యాపారమే మానుకుంటామని మరికొందరు వ్యాపారులు ఏకంగా మంత్రికే తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇలాగైతే బయ్యర్లు పలకలు తీసుకెళ్లేందుకు ఇష్టపడరని అదే జరిగితే వ్యాపారాలు మూత పడతాయని మరికొందరు వ్యాపారులు మంత్రికి వివరించినట్లు సమాచారం. అన్నీ విన్న మంత్రి పైనుంచి వచ్చిన ఆదేశాలు పాటించడం తప్ప తాను చేయగలిగిందేమీ లేదని వ్యాపారులకు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో మైనింగ్, విజిలెన్స్ అధికారులు మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు, ప్రకాశం జిల్లా పరిధిలోని చీమకుర్తి ప్రాంతాల్లోని క్వారీలు, ఫ్యాక్టరీలపై దాడులకు దిగారు. పచ్చనేతల తీరుతో విసిగి పోయిన క్వారీ, పరిశ్రమల యజమానులు వితౌట్లో మైనింగ్ చేయడం దాదాపుగా మానుకున్నారు. కొందరు మంత్రి అనుచరులకు ముడుపులు చెల్లించి రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా గ్రానైట్ తరలిస్తున్నట్లు సమాచారం. పచ్చనేతలకు కప్పం చెల్లించి వ్యాపారం చేయడం కంటే మానుకోవడమే మేలని కొందరు బయ్యర్లు వ్యాపారానికి తాత్కాలికంగా స్వస్తిపలికారు. ఇప్పుడు ఈ విషయం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. భూగర్భ గనులశాఖలో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది. గ్రానైట్‌లో వసూళ్ల దందా చినబాబు నెల మామూళ్లు రూ.50 కోట్లు అద్దంకి, పర్చూరు పచ్చనేతలకుచెరో రూ.8 వేలు రూ.10 వేలు డిమాండ్ చేస్తున్న గురజాల పచ్చనేత తనకు రూ.8 వేలు కావాలంటున్న నరసరావుపేట నాయకుడు కప్పం కట్టకపోతే సేల్‌టాక్స్, లోకల్ పోలీసులను ఉసిగొల్పుతున్న వైనం ఫ్యాక్టరీ యజమానులతో మంత్రి గొట్టిపాటి సమావేశం వసూళ్ల విషయం మీరే చూసుకోవాలని ఫ్యాక్టరీ యజమానులకు ఆదేశం తలలు పట్టుకుంటున్న పరిశ్రమల యజమానులు, బయ్యర్లు పచ్చ దోపిడీపై సర్వత్రా ఆగ్రహం శృతిమించిన పచ్చనేతల మామూళ్ల దందా చినబాబు కప్పం వ్యవహారం పక్కనబెడితే స్థాని క పచ్చనేతలంతా గ్రానైట్‌పై పడ్డారు. గ్రానైట్ పాలీషింగ్ పలకలు టాక్స్ లేకుండా తీసుకెళ్లేందు కు లారీకి ఏఎమ్మార్ టోకెన్‌కు రూ.25 వేలు చెల్లించాల్సి వస్తోంది. వాస్తవానికి ఏఎమ్మార్ ఇచ్చే టోకెన్ రూ.8 నుంచి రూ.10 వేలకు మించి ఉండదు. పేరుకు ఏఎమ్మార్ చెక్‌పోస్టులు నడుపుతున్నా అనధికారికంగా పచ్చనేతలే టోకెన్ల వ్యవహారం చూస్తున్నట్లు ప్రచారం. ఇది కాకుండా గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు ఉన్న పర్చూరు, అద్దంకి పచ్చనేతలకు వ్యాపారులు నెలకు చెరో రూ.8 వేలు కప్పం కడుతుండగా నరసరావుపేట పచ్చనేత రూ.8 వేలు డిమాండ్ చేస్తున్నారు. ఇక గ్రానైట్ దందాకు ఆద్యుడైన గురజాల నేత తనకు రూ.10వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుండగా చిలకలూరిపేట నేత మాత్రం తనకు రూ.6 వేలు చాలన్నట్లు సమాచారం. మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 150కి తగ్గకుండా లారీలు వితౌట్లో హైదరాబాద్ కు తరలిపోతుండగా ఇందులో చిలకలూరిపేట, విజయవాడ మీదుగా 30, నరసరావుపేట, గురజాల మీదుగా 120 లారీలు వెళుతున్నట్లు సమాచారం. వీరంతా ప్రతి లారీకి కప్పం చెల్లించాల్సిందేనని బయ్యర్లకు హుకుం జారీచేశారు. ఏఎమ్మార్ టోకెన్‌తోపాటు పచ్చనేతలకు ఇస్తున్న కప్పంతో కలుపుకుంటే ఒక్కో లారీకి రూ.58 వేలు ఖర్చు వస్తోంది. వాస్తవంగా ప్రభుత్వానికి టాక్స్ చెల్లించినా ఇంత మొత్తంలో ఖర్చురాదు. దీంతో బయ్యర్లు పచ్చనేతలు చెప్పిన మొత్తాన్ని చెల్లించలేమంటూ అడ్డు తిరిగినట్లు సమాచారం. ఒకవేల ఏఎమ్మార్ టోకెన్‌కు చెల్లించే మొత్తాన్ని రద్దు చేయిస్తే పచ్చనేతలు అడిగిన మేరకు కప్పం చెల్లిస్తామని బయ్యర్లు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. -
వక్ఫ్ చట్ట సవరణ కేంద్రం పెద్దల కుట్ర
ఇంకొల్లు(చినగంజాం): వక్ఫ్ చట్టంలో సవరణలు చేయడం ముస్లింల మత స్వేచ్ఛపై దాడి చేయడమేనని ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొల్లులో శుక్రవారం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముస్లిం మహిళలు సైతం పాల్గొన్నారు. పలువురు ముస్లిం సోదరులు మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ ముస్లింల హక్కులను హరించే విధంగా ఉందని, ముస్లింల ఆస్తులు అంబానీ, అదానీలకు కట్టబెట్టడానికి మోదీ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించిందని అన్నారు. వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిం యేతరులకు అవకాశం కల్పించడం సమంజసమేనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే ముస్లింలంతా కలిసి ఐక్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జామియా మసీదు కమిటీ సభ్యులు షేక్ ఉమ్రాన్ అలి, షేక్ బాషా, షేక్ మాబుల్లా, షేక్ ఈసూబ్, బాబు, సీపీఐ నాయకులు కందిమళ్ల రామకోటేశ్వరరావు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకొల్లులో నినదించిన ముస్లిం సోదరులు ముస్లింల ఆస్తులు అదానీ, అంబానీలకుధారాదత్తం ర్యాలీలో పాల్గొన్న ముస్లిం మహిళలు -
పాల వ్యాన్ బోల్తా
వ్యక్తికి గాయాలు జె.పంగులూరు: సురభి డెయిరీకి చెందిన పాల వ్యాను శుక్రవారం ఉదయం మండలంలోని చందలూరు, తూర్పు కొప్పెరపాడు గ్రామాల మధ్య అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మార్జిన్లో బోల్తా పడింది. మండలంలోని జాగర్లమూడి వారి పాలెం వద్ద గల సురభి డెయిరీ నుంచి వాహనం పాల పదార్థాలతో చందలూరు మీదుగా చీరాల వెళ్లేందుకు బయలు దేరింది. తూర్పు కొప్పెరపాడు దాటిన తర్వాత ఎదురుగా ఒక కారు రావడంతో ఆ కారు వెళ్లేందుకు దారి ఇస్తూ పక్కకు రావడంతో అదుపు తప్పి మార్జిన్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో పాల వాహనంలో ఉన్న ఎన్ కళ్యాణ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం ఇవ్వడంతో అతన్ని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పోరంబోకు భూమి అన్యాక్రాంతం
జె.పంగులూరు: కోట్లాది రూపాయల విలువ చేసే పోరంబోకు భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కొందరు ఆక్రమించిన భూమిలో శాశ్వత కట్టడాలు, రెస్టారెంట్లు, హోటళ్లు నిర్మించుకుంటున్నారు. మరి కొంతమంది మామిడి తోటనే నాటుకున్నారు. అమ్మకాలు చేసి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పేదల కడుపు కొట్టి...పెద్దలకు.. మండలంలోని కొండమంజులూరు గ్రామ రెవెన్యూ పరిధిలో బొల్లాపల్లి టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి వెంబడి 58 సర్వే నెంబర్లో 2.42 ఎకరాల డొంక పోరంబోకు ఉంది. గతంలో కొంత మంది పేదలు ఆ స్థలంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వారిని ఖాళీ చేయించారు. అనంతరం ఆ భూమిని పక్కనే ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ వారు ఆక్రమించగా, మిగిలిన భూమిలో కొంత మంది హోటళ్లు నిర్మించారు. సొంత స్థలాలు మాదిరిగా అమ్మకాలు ఆక్రమణదారులు వారి సొంత స్థలం మాదిరిగా అమ్ముకుంటూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. కొంత మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇస్తున్నారు. గతంలో పేదల గుడిసెలు ఖాళీ చేయించిన రెవెన్యూ సిబ్బంది ప్రస్తుతం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎకరా భూమి రూ.2 కోట్లు పైమాటే ప్రస్తుతం ఆక్రమణకు గురైన 2.42 ఎకరాల భూమి విలువ సుమారుగా రూ.5 కోట్లు పై మాటే. జాతీయ రహదారి వెంబడి ఉండటం, బొల్లాపల్లి టోల్ ప్లాజాకు అతి సమీపంలో ఉండే సరికి పెద్దల కన్ను ఈ భూమిపై పడింది. సెంటు భూమి కూడా వదలం –చంద్రశేఖర్‌నాయుడు, ఆర్డీఓ, చీరాల ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆ స్థలాన్ని పరిశీలించమని పంగులూరు తహసీల్దార్‌ను ఆదేశించాం. సర్వే చేయిస్తాం. ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఉంటే వారిని వెంటనే ఖాళీ చేయిస్తాం. సెంటు భూమి కూడా వదలం. ఆక్రమించిన భూమిలో ఇళ్లు, రెస్టారెంట్ నిర్మాణాలు భూమి విలువ రూ.ఐదు కోట్ల పైనే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు -
వీరభద్రస్వామి ఆలయ పూజారిపై విలేకరి దాడి
తనపై దాడి చేశారంటూ పూజారులపై పోలీసులకు ఫిర్యాదు చుండూరు(వేమూరు): వీరభద్రస్వామి ఆలయం పూజారిపై పత్రిక విలేకరి దాడి చేశాడు. పూజారి మామిళ్లపల్లి యశ్వంత్ తెలిపిన వివరాలు.. చుండూరు మండలం మోదుకూరు గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయంలో గోవులకు షేడ్ ఏర్పాటు చేశారు. గోవులకు షేడ్ చాలకపోవడంతో గోవులు ఇబ్బందులు పడుతుండడంతో పూజారులు అదనంగా షేడ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి పూజారికి ఫోన్ చేసి ఎండోమెంట్ అనుమతి పొంది గోవుల షేడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎండోమెంట్ అధికారుల అనుమతి లేక పోతే షేడ్ నిర్మాణం నిలిపివేయాలన్నారు. శుక్రవారం ఆంధ్రజ్యోతి విలేకరి వీరభద్ర స్వామి ఆలయం వద్దకు వచ్చి ఎండోమెంట్ అధికారి అనుమతి ప్రకారం షేడ్ ఏర్పాటు చేస్తున్నార లేదా అని అడిగాడు. షేడ్ నిర్మాణం కోసం ఎండోమెంట్ అధికారి అనుమతి లేదన్నారు. దీంతో విలేకరి షేడ్ నిర్మాణం ఫొటోలు తీశారు. దేవాలయంలో కూడా ఫొటోలు తీశారు. ఈ విషయాన్ని పూజారులు ఎండోమెంట్ పరిపాలన అధికారి రఘురామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆగ్రహించిన విలేకరి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న పూజారులు మామిళ్లపల్లి యశ్వంత్, నిరంజన్‌లపై దాడి చేశాడు. పూజారులు తనపై దాడి చేశారంటూ విలేకరి చుండూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మాపై దాడి చేసి, మాపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడం అన్యాయమని పూజారులు పేర్కొన్నారు. పూజారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం పూజారులకు రక్షణ కల్పించాలన్నారు. -
మార్టూరులో మరో చోరీ
మార్టూరు: వరుస దొంగతనాల మార్టూరు మండలం ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజా శుక్రవారం తెల్లవారుజామున మార్టూరులో స్థానిక జాతీయ రహదారి పక్కన గల ఎంఆర్ఎఫ్ టైర్ల షోరూమ్‌లో చోరీ జరిగింది. షోరూం యజమాని కొల్లా రాము తెలిపిన వివరాలు... గురువారం రాత్రి వ్యాపార లావాదేవీల అనంతరం రూ.50 వేల నగదును క్యాష్ కౌంటర్లో ఉంచి యధా ప్రకారం షట్టర్ తాళం వేసి ఇంటికి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో మొహం కనిపించకుండా మాస్క్ ధరించిన ఓ గుర్తు తెలియని అగంతకుడు షోరూం షట్టర్ తాళం ధ్వంసం చేసి లోనికి ప్రవేశించాడు. నేరుగా క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి అందులోని రూ.50వేల నగదు తీసుకెళ్లాడు. సమీపంలో ఉన్న యజమాని రాముకు చెందిన పాత బట్టల కవర్‌ను సైతం అగంతకుడు తీసుకొని వెళ్లిపోయాడు. తెల్లవారిన తర్వాత షట్టర్ తెరచి ఉండడం గమనించిన స్థానికుల సమాచారంతో షోరూం యజమాని రాము పోలీసులకు సమాచారం అందించాడు. రాముతో కలిసి షోరూమ్ లోని సీసీ కెమెరాను పరిశీలించిన పోలీసులు నిందితుడు ఆనవాళ్లను గమనించారు. రాము సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలో చోరీ జరిగిన తీరును గమనించిన షోరూమ్ యజమాని రాము ఇది ఖచ్చితంగా తెలిసిన వారి పనేనని తెలిపారు. -
కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు
రేపల్లె రూరల్: హామీలను అమలు చేయడంలోను, సమస్యలను పరిష్కరించటంలోను కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు వినూత్నంగా మొదలుపెట్టిన పల్లెపడక కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం పంచాయతీ బాప్టిస్టుపాలెంలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, గురవుతున్న ఇబ్బందులను తెలుసుకొని ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పించేందుకు పల్లెపడక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పల్లెను, ప్రతి గడపలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవటమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలను తెలుసుకోవటంతోపాటు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక పరిష్కరించేదిశగా పనిచేస్తామన్నారు. గ్రామంలో విస్త్రతంగా పర్యటించి ప్రజలతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పది నెలల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. గుళ్లపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి బాప్టిస్టుపాలెం వరకు నిర్వహించిన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, దుండి వెంకటరామిరెడ్డి, ఇంకొల్లు రామకృష్ణ, యార్లగడ్డ వెంకట రాంబాబు, నాయకులు యార్లగడ్డ మదనమోహన్, చిమట బాలాజీ, చిత్రాల ఓబేదు, చదలవాడ శ్రీనివాసరావు, బసవయ్య, కేవీ కృష్ణారెడ్డి , నిజాంపట్నం కోటేశ్వరరావు, రాజు, సాంబశివారెడ్డి, కొండల్‌రెడ్డి, నాగలక్ష్మి, రత్నాకర్, రఘు, కిరణ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఆళ్లవారిపాలెం నుంచి పల్లె పడక ప్రారంభం వైఎస్సార్ సీపీ రేపల్లె సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ -
ఇంద్రకీలాద్రికి పెరిగిన రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వారాంతం, పండుగలు, వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్దఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన యాత్రికులతో ఉదయం 7 గంటల నుంచే ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లలో రద్దీ కనిపించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు రద్దీ కొనసాగగా, ఆది దంపతులకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు పాల్గొన్నారు. నూతన వధూవరులు పెళ్లి దుస్తుల్లో అమ్మ వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయ దర్శనం రద్దు రద్దీ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచే అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. రూ.300, రూ.100 టికెట్లను మాత్రమే విక్రయించారు. దీంతో వీఐపీల పేరిట వచ్చే భక్తులతో పాటు సిఫార్సు లేఖలపై వచ్చే వారికి సైతం ముఖ మండప దర్శనం మాత్రమే కల్పించారు. రద్దీ నేపథ్యంలో సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో ఆలయంలో రద్దీ మరింత పెరిగింది. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భక్తులు ముందుకు కదిలేలా ఆలయానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది క్యూలైన్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అంతరాలయ దర్శనాన్ని పునరుద్ధరించారు. ఆర్జిత సేవలకు డిమాండ్... చైత్ర మాసం కావడంతో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. -
కందిరీగల దాడిలో 15 మందికి గాయాలు
బాపట్ల:బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డు లో గాయత్రీ అపార్టుమెంటు సమీపంలో కందిరీగలు దాడిలో 15 మందికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం సమయంలో కందిరీగలు ఒక్కసా రి గా పైకిలేచి ఆ ప్రాంతంలో వెళ్లే వారిపై దాడి చేశా యి. దాడిలో 15 మందికి గాయాలు కాగా వీరు ప్రభుత్వ వైద్యశాల్లో చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో చోటు బాపట్ల: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో బాపట్ల జిల్లాకు చెందిన పలువురికి అవకాశం కల్పిస్తూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి, జాయింట్ కార్యదర్శులుగా మాచవరపు రవికుమార్, షేక్ ఫర్వీజ్, రాష్ట్ర క్రిష్టియన్ మైనార్టీ విభాగం కార్యదర్శిగా ఇమానియేల్ రీభాలను ఎంపిక చేశారు. వీరు ఎంపికై న పలువురు అభినందనలు తెలిపారు. తప్పిన ప్రమాదం జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన మినీ లారీ చీరాల: జాతీయ రహదారిపై పెనుప్రమాదం తప్పింది. గురువారం చిన్నగంజాం నుంచి చెరుకుపల్లి మండలం పొన్నపల్లికి కుటుంబంతో కలసి ఆటోలో వెళుతుండగా చీరాలలోని జాతీయ రహదారిలో టీడీపీ కార్యాలయం వద్ద నీరు తాగేందుకు ఆటో నిలిపారు. అదే మార్గంలో వేరుశనగ లోడుతో వస్తున్న మినీ లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో అటో వేగంగా పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు పెద్దలు, ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో అందరూ ప్రాణాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి బాపట్ల టౌన్: ఇటీవల బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ప్రైవేటు టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాపడిన రిటైర్డు రైల్వే ఉద్యోగి తులబందుల లక్ష్మీ నారాయణ(65) గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. లక్ష్మీనారాయణ, నల్లమోతు మాధవి గుంటూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. నల్లమోతు మాధవి బుధవారం మృతి చెందగా లక్ష్మీనారాయణ గురువారం మృతి చెందారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీరిరువురు జీవితాలు విషాదం కావటంతో వారి బంధువుల్లో విషాదం నెలకొంది. -
రైతుల దుస్థితిని కళ్లకు కట్టిన ‘అన్నదాత’
తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక నాటక కళాపరిషత్, తెనాలి ఆధ్వర్యంలో ఇక్కడి రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో జరుగుతున్న జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన నాటికల పోటీల్లో భాగంగా ఆరో రోజైన గురువారం రెండు నాటికలను ప్రదర్శించారు. తొలుత కళాంజలి, హైదరాబాద్ వారి అన్నదాత నాటికను ప్రదర్శించారు. నేటి సమాజంలో రైతుల పరిస్థితిని కళ్లకు కట్టిందీ నాటిక. అప్పుల్లో కూరుకుపోతున్న రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్న వర్తమాన స్థితిని ఎత్తిచూపింది. రైతాంగం మనుగడ ప్రశ్నార్థకం కావటం వ్యవసాయాధారిత దేశంలో ఓ గొప్ప విషాదంగా వర్ణించిందీ నాటిక. వల్లూరు శివప్రసాద్ రచించిన ఈ నాటికను కొల్లా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రదర్శించారు. వివిధ పాత్రల్లో శోభారాణి, సురభి ప్రియాంక, భుజంగరావు, పున్నయ్యచౌదరి, రాధాకృష్ణ, తిరుమల, శివరాం, ప్రశాంత్ నటించారు. వినోదాన్ని పంచిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’.. అనంతరం సహృదయ, ద్రోణాదుల వారి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ నాటికను ప్రదర్శించారు. నలభీముడిలా వంటల చేయగల దిట్ట అయిన సుధీర్ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్‌లో అటు వృత్తిపని, ఇంట్లోకి తరచూ వచ్చే చుట్టాలకు వంటలు చేస్తూ సతమతమైన వ్యవహారాన్ని ఆద్యంతం హాస్య సన్నివేశాలకు వినోదాత్మకంగా సాగిందీ నాటిక. చివరకు ఉద్యోగానికి రిజైన్ చూసి ‘సౌమ్యలక్ష్మీ హోమ్ ఫుడ్స్’ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభిస్తాడు. కేకే భాగ్యశ్రీ మూలకథను అద్దేపల్లి భరత్‌కుమార్ నాటకీకరించగా, డి.మహేంద్ర దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించారు. ఇతర పాత్రల్లో కొత్త శివరాంప్రసాద్, ఆళ్ల హరిబాబు, షేక్ షఫీ ఉజ్మా, వి.నాగేశ్వరరావు, లహరి నటించారు. తొలుత యనమదల రీతిక శిష్యబృందం కూచిపూడి నృత్యప్రదర్శన ఆహుతుల అభినందనలు అందుకుంది. తెనాలి కళాకారుల సంఘం నిర్వహణలో జరుగుతున్న ఈ నాటికల పోటీలను గౌరవాధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, అధ్యక్షుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి, కార్యదర్శి పిట్టు వెంకటకోటేశ్వరరావు పర్యవేక్షించారు. గోవుల మృతిపై విచారణ చేపట్టాలి చినకాకాని(మంగళగిరి): తిరుపతిలో గోవుల మృత్యువాతపై ప్రభుత్వం విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాల్సిందిపోయి మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ మంటలు సృష్టిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. చినకాకానిలో జరుగుతున్న జనసేవాదళ్ శిక్షణ తరగతులకు హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ తిరుపతిలో లడ్డూ కల్తీ అయిందని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ప్రధానిగా ఉన్న మోదీ 11 ఏళ్లలో హిందువులకు ఏం చేశారని ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చాక రూపాయి విలువ పడిపోయిందని విమర్శించారు. ప్రధాని అదానీ, అంబానీలకు దోచి పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తా రు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ మోదీ పా లనలో మహిళలపై దాడులు, లైంగిక దాడులు పెరిగాయన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, నాయకులు చిన్ని తిరుపతయ్య, జాలాది జాన్‌బాబు, గని, ఆరేటి రామరావు, కోట మాల్యాద్రి పాల్గొన్నారు. -
స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు ప్రారంభం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): బృందావన్‌గార్డెన్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై ఏపీ ప్రభుత్వ సృజనాత్మకత, సంస్కృతీ సమితి, భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ టీవీ, కళాంజలి క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు మొదలయ్యాయి. ఆలయ పాలక మండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి పుట్ట గుంట ప్రభాకరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఏపీ నాటక అకాడమీ నిర్వాహకులు గుమ్మడి గోపాలకృష్ణ, హంస అవార్డు గ్రహీత కావూరి సత్యనారాయణ, ఉగాది పురస్కారగ్రహీత నల్లక శ్రీనివాసరావు, టీవీ. నటుడు, నిర్మాత డాక్టర్ వలేటి అప్పారావు ప్రసంగించారు. ఈనెల 19 వరకు స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు జరుగుతాయని కళారత్న డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతరం శ్రీదుర్గాభవాని నాట్యమండలి (తెనాలి) ఆధ్వర్యంలో ఆరాధ్యుల ఆదినారాయణరావు నిర్వహణలో శ్రీకృష్ణ తులాభారం, పౌరాణిక పద్య నాటకం ప్రదర్శిం చారు. నటీనటులు వారి పాత్రల్లో పౌరాణి పద్యాలతో నాటక అభిమానులను మెప్పించారు. డోలక్‌పై సాంబిరెడ్డి చక్కటి సహకారాన్ని అందించారు. -
ఆర్టీసీలో నిలిచిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి
చీరాల అర్బన్: ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎన్ఎంయూ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. డిపో అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రవిబాబు, పి.దయాబాబులు మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అలానే ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఈఓఎల్లు మంజూరు చేయాలని, ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్యవిధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని, నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 114 జీవోలో పొందుపరచిన మేరకు నైట్ అవుట్ అలవెన్సులను రూ.150 నుంచి రూ.400 వరకు చెల్లింపులు చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డెలిగేట్ డి.ప్రవీణ్‌కుమార్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
కుమార్తె పెళ్లికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం
చేబ్రోలు: కుమార్తె పెళ్లికి వెళ్లి వస్తుండగా కారు ప్రమదవశాత్తూ బ్రిడ్జి సైడ్వాల్ను వేగంగా ఢీ కొట్టడంతో తల్లిదండ్రులతోపాటు వధువు అన్నకు గాయాలైన ఘటన చేబ్రోలులో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..పొన్నూరు రూరల్ మండలం కట్టెంపూడి గ్రామానికి చెందిన రోహా, రాధిక దంపతులు తమ కుమార్తెను తాడికొండకు చెందిన అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. వివాహాం అనంతరం భార్యభర్తలు, తమ కుమారుడు నవీన్ కుమార్‌రెడ్డితో కలిసి తాడికొండ నుంచి కారులో స్వగ్రామానికి గురువారం బయలు దేరారు. నవీన్‌కుమార్‌రెడ్డి కారు నడుపుతున్నాడు. చేబ్రోలులోని సినిమాహాలు సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వంతెన సైడ్ వాల్‌ను వేగంగా ఢీకొట్టింది. ఘటనలో కారు ముందు బాగం నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ముగ్గురికీ ముఖానికి, కాళ్లు, చేతులు, నడుంకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనం ద్వారా క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు వధువు అన్నకు కూడా.. చేబ్రోలులో అదుపుతప్పిన కారు -
ఒడిశా టు ఆంధ్రా గంజాయి రవాణా
తాడేపల్లి రూరల్ : ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతోందని రుజువైంది. తాజాగా గురువారం తాడేపల్లి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ కేసు వివరాలను నార్త్‌జోన్ డీఎస్పీ మురళీకృష్ణ విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. తాడేపల్లి కృష్ణాకెనాల్ జంక్షన్ వద్ద కొందరు గంజాయి తాగుతున్నారన్న సమాచారం రావడంతో తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజు, ఇతర సిబ్బంది నిఘా ఏర్పాటుచేసి గంజాయి తాగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నాలుగు కేజీల గంజాయి లభ్యమైంది. పాత ఈస్‌ఐ హాస్పిటల్ వద్ద వార్పునకు చెందిన పీతా దినేష్ కుమార్, పోలకంపాడుకు చెందిన కోడె సూర్యగణేష్, ఉండవల్లికి చెందిన మల్లిశెట్టి అనీల్, పెనుమాకకు కళ్ళం అనీల్‌రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. వీరు ఒడిశాలోని బరంపురంలో గంజాయి కొని అక్కడి నుంచి రైలు ద్వారా తాడేపల్లికి తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తున్నట్టు నిర్ధారణైంది. ఈ నలుగురిలో పీతా దినేష్‌కుమార్‌పై కృష్ణాజిల్లాలో ఓ గంజాయి కేసు నమోదై ఉంది. మిగిలిన ముగ్గురు తొలిసారి పట్టుబడ్డారు. వీరు డబ్బులు అవసరమైనప్పుడు ద్విచక్రవాహనాలు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో ఒడిశా వెళ్లి గంజాయి కొని తీసుకువచ్చి ఎక్కువ ధరకు అమ్ముతుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది. గంజాయికి అలవాటు పడిన అంతర్జాతీయ స్విమ్మర్ నిందితుల్లో మల్లిశెట్టి అనీల్ అంతర్జాతీయ స్విమ్మర్ అని, అతనూ గంజాయికి అలవాటు పడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వ్యాయామాలపై అవగాహన కలిగిన క్రీడాకారులూ వ్యసనాలకు అలవాటు పడడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కేసులో ప్రతిభకనబర్చిన తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజు, సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్ అభినందించారని డీఎస్పీ వెల్లడించారు. తాడేపల్లి పోలీసులకు పట్టబడిన నలుగురు యువకులు నిందితుల్లో అంతర్జాతీయ స్విమ్మర్! -
చీరాలలో డ్రోన్లతో నిఘా
చీరాల: చీరాల పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు ఒన్‌టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు తెలిపారు. గురువారం రాత్రి పట్టణంలోని ప్రధాన ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. నిర్మానుష్య ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో గంజాయి, మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకునే దిశగా నిఘాను మరింత కఠినతరం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సహకారం ద్వారా చీరాలలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ నాగభూషణం, పోలీసు సిబ్బంది ఈ ప్రత్యేక నిఘా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇసుక లారీ బీభత్సం ●ఆర్టీసీ బస్సును ఢీకొట్టి షాపుల్లోకి దూసుకెళ్లిన వైనం ● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం చేబ్రోలు: ప్రమాదవశాత్తూ ఇసుక లారీ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న షాపుల్లోకి దూసుకుపోయిన ఘటన చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో గురువారం జరిగింది. తెనాలి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గుంటూరుకు బయలుదేరి వేజండ్ల అడ్డరోడ్డు వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవటం కోసం నిలిచి ఉంది. అదే సమయంలో తెనాలి నుంచి నారా కోడూరు వైపు వేగంగా వస్తున్న టర్బో ఇసుక లారీ ఆర్టీసీ బస్సును వెనుకవైపు ఢీకొట్టింది. వెంటనే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, మెకానిక్ షాపులలోకి దూసుకువెళ్లింది. ప్రమాద సమయంలో షాపుల వద్ద ఎవరూ లేకపోవటంతో ప్రాణాపాయం తప్పింది. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. చేబ్రోలు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని ఇసుక లారీని, ఆర్టీసీ బస్సును పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గిన్నిస్‌బుక్‌లో స్థానం పొందడం అభినందనీయం
బల్లికురవ: విద్యార్థి వివేక్ కృషి పట్టుదలతో కీబోర్డుపై పాటలు పాడుతూ ప్రపంచ రికార్డుతోపాటు గిన్సీస్బుక్లో స్థానం పొందటంతో మండలానికి, జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చాడని ఎంఈవో–2 ఎ.రమేష్‌బాబు కొనియాడారు. వల్లాపల్లి ప్రాథమికోన్నత పాఠశాలో 7వ తరగతి చదువుతున్న మందా వివేక్ హలేల్ మ్యూజిక్ స్కూల్ తరుపున క్రిస్టియన్ సంగీత పోటీల్లో పాల్గొని గిన్నీస్తో ప్రపంచ రికార్డు సాధించిన విషయం విదితమే. గురువారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షత అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో ఎంఈవో మాట్లాడుతూ వివేక్ తండ్రి రమేష్ కీ బోర్డుప్లేయర్ కావటం వల్ల వారసత్వంతోపాటు ప్రోత్సాహంతో క్రిస్టియన్ గీతాలు పాడుతూ గతేడాది డిసెంబర్ 1న జరిగిన ఆన్లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో పాల్గొన్నాడన్నారు. 18 దేశాల నుంచి 1046 మంది గంట వ్యవధిలో వీడియోలు అప్లోడ్ చేశాడని అందులో వివేక్ ఉండటం గర్వించదగ్గ విషయం అన్నారు. సంగీతంతో రాబోయే కాలంలో వివేక్ మరెన్నో పతకాలు సాధించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు మందా సుబ్బారావు, గొండ్రు చిన్న, చింతల రామారావు అన్నారు. -
కాసుల వర్షం
బాపట్లశుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కార్యదర్శులకు ● జాతీయ రహదారి నిర్మాణంతో భూముల ధరలకు రెక్కలు ● జోరుగా అక్రమ లే అవుట్లు ● గ్రామ పంచాయతీ కార్యదర్శలు భారీగా అవినీతి ● జిల్లా, డివిజన్ పంచాయతీ అధికారుల సహకారం వేటపాలెం: జాతీయ రహదారి నిర్మాణంతో తీర ప్రాంత గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. జాతీయ రహదారికి ఇరువైపులా భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. ఏకంగా ఎకరం రూ.2 కోట్లు పైనే పలుకుతుంది. సముద్ర తీర గ్రామలైన రామాపురం, కఠారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామాలలో పర్యాటకం కూడా బాగా అభివృద్ధి చెందింది. దీనితో ఆయా గ్రామాలలో ఏకంగా ఎకరం దాదాపు రూ.ఏడు కోట్లు పలుకుతుంది. దీంతో అక్రమ లే అవుట్లు విచ్చలవిడిగా వెలిశాయి. ఇది పంచాయతీ కార్యదర్శులకు వరంగా మారింది. లే అవుట్లు, భవన నిర్మాణాలకు ఫిక్స్డ్ ధర నిర్ణయించి వసూళ్లు ఆరంభించారు. అనుమతి లేని లే అవుట్లు.. సముద్ర తీరం వెంట రామాపురం, కఠారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామాల పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో లేఅవుట్లు వెలశాయి. వీటితోపాటు 50 వరకు రిసార్ట్‌ల నిర్మాణాలు జరిగాయి. 216 జాతీయ రహదారి ఇరువైపుల పంట పొలాలు, అసైడ్ భూముల్లో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ఇవి ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రధానంగా పాపాయపాలెం, అక్కాయిపాలెం, చల్లారెడ్డిపాలెం గ్రామాల పరిధిలో వంద సంఖ్యలో అనుమతి లేని లేఅవుట్లు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ కార్యాదర్శులు అక్రమ లేఅవుట్లకు, అక్రమ భవన నిర్మాణాలకు ధర నిర్ణయించి వసూలు చేసుకుంటున్నారని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సముద్ర తీరం వద్ద అక్రమ లేఅవుట్లకు గరిష్టంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు, ఎటువంటి అనుమతులు లేకుండా రిసార్ట్‌ల నిర్మాణానికి రూ.2 లక్షలు, విద్యుత్ మీటర్ మంజూరుకు ఇచ్చే అనుమతి ఎన్వోసీకి రూ.5 నుండి రూ.10 వేలు ధర నిర్ణయించినట్లు సమాచారం. ప్లాన్ ఇవ్వకుండా భవనాలు నిర్మించుకుంటున్న వారి వద్ద భవనం నిర్మాణాన్ని బట్టి రూ.20 వేలు ధర నిర్ణయించారు. కొత్త భవనాలకు ఆస్తి పన్నులు విధింపునకు ధర నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు సమాచారం. అవినీతిపరులైన కొందరు మండల, డివిజనల్ పంచాయతీ అధికారులు కార్యదర్శులు ప్రతి నెలా ఇచ్చే ముడుపులకు కక్కుర్తిపడి పట్టించుకోవడం లేదు. నోటు కొట్టు. ఎన్వోసీ పట్టు చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో కొత్తగా భవనం, రేకుల షెడ్డు, వ్యాపార సంస్థ, బంకు ఏర్పాటు చేసుకున్నా సరే దానికి విద్యుత్ మీటరు కోసం కార్యదర్శిఽ ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. కార్యదర్శి చేయి తడిపితే చాలు ఎలాంటి నిబంధనలు లేకుండానే ఎన్ఓసీ జారీ చేస్తున్నారు. పోరంబోకు, డ్రెయినేజీ పోరంబోకు భూములు, పంట పొలాల్లో కట్టడాలు కట్టుకున్నా సరే డబ్బులు తీసుకుని ఎన్ఓసీ జారీ చేస్తున్నారు. అక్రమ లేవుట్, రోడ్డు మార్జిన్, పంట పొలాల్లో ఎక్కడైనా ఇల్లు నిర్మించుకుని విద్యుత్ మీటరు కావాలంటే ఎన్ఓసీ కావాలి. కార్యదర్శికి రూ.2 వేలు నుంచి రూ.5 ఇస్తే చాలు ఎన్ఓసీ ఇచ్చేస్తారు. విచారణ చేస్తాం ఆరోపణలు వచ్చిన కార్యదర్శులపై విచారణ చేస్తాం. ఆరోపణలు నిరూపణ అయితే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ, వేటపాలెం 9న్యూస్రీల్కొత్తపేట కార్యదర్శి ప్రత్యేకం కొత్తపేట పంచాయతీ చీరాల మున్సిపాలిటీలో కలసి ఉంటుంది. కానీ పంచాయతీగానే కొనసాగుతుంది. సంపన్నులు ఎక్కువగా ఈ పంచాయతీ పరిధిలోనే ఉంటుంటారు. ఈ పంచాయతీ కార్యదర్శి దాదాపు నాలుగేళ్లగా ఇక్కడే కొనసాగుతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేటపాలెం మండలం పరిధిలోని అందరు కార్యదర్శులను బదిలీ చేశారు. కానీ కొత్తపేట కార్యదర్శి మాత్రం బదిలీ కాలేదు. రాజకీయ నాయకులకు రూ.20 లక్షలు వరకు ముడుపులు ఇచ్చి బదిలీ ఆపుకున్నట్లు బహిరంగ గానే చర్చ జరిగింది. మండల పరిధిలోని ఏ కార్యదర్శిపైనా రాని విధంగా ఇతనిపై అవినీతి ఆరోపణలు వచ్చినట్లు ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. -
సొంతింటి కలపై ధరల పిడుగు
వేటపాలెం: పైసాపైసా కూడబెట్టి సొంతిల్లు నిర్మించుకోవాలనుకునే పేద, మధ్య తరగతి ప్రజల కల నెరవేరేలా లేదు. ప్రస్తుతం ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోవడమే అందుకు కారణం. వారం కిందట సిమెంట్ బస్తా రూ.270 ఉండగా ప్రస్తుతం రూ.320కి చేరింది. అలాగే ఐరన్, ఇటుకలు, ఇసుక, కంకర ధరలు గతేడాది కంటే 30 శాతం పైగా పెరిగాయి. దీనికి తోడు కూలీలు, తాపీమేస్త్రిల కూలి ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం తలకు మించిన భారంగా మారింది. దీంతో ఇంటి నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. గృహ నిర్మాణాలు చేసి పేదల సొంతింటి కలను నిజం చేస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం ధరల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిలిచిన ప్రభుత్వ పక్కా ఇళ్ల పథకం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పక్కా ఇళ్ల పథకం నిలిచిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే అగిపోయాయి. బాపట్ల జిల్లాలో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 31,167 వేల పక్కా ఇళ్లు మంజూరు చేశారు. వాటిల్లో ఎన్నికల ముందు నాటికి 11 వేలు నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభించారు. ఇంకా 20 వేలు ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అసంపూర్తిగా నిలిచిపోయిన పక్కా ఇళ్ల బిల్లులు కూటమి ప్రభుతం నిలిపి వేసింది. ప్రస్తుతం పెరిగిన భవన నిర్మాణ మెటీరియల్ ధరలు లబ్ధిదారుకు మరింత భారం కానుంది.ఆకాశంలో భవన నిర్మాణ సామగ్రి ధరలు వారం వ్యవధిలో బస్తాకు రూ.50 పెరిగిన సిమెంట్ ధర ఐరన్ టన్నుకు రూ.6 వేలు పెరుగుదల 30 శాతం పెరిగిన ఇంటి నిర్మాణ వ్యయం అర్ధంతంగా నిలిచిన నిర్మాణాలువ్యాపారం కష్టం మారింది మేము చాలా కాలంగా సిమెంట్, స్టీల్ షాపు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం సిమెంట్ బస్తాకు రూ.50 పెరిగింది. స్టీల్ ధర టన్నుకు రూ.6 వేలు పెరిగింది. ప్రస్తుతం ధరలు పెరగడంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. వ్యాపారాలు పెద్దగా లేవు. గతంలో లాగా వ్యాపారాలు జరగడం లేదు. – నారాయణ, వ్యాపారి, చీరాలగతంలో ఇప్పుడు ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు వ్యత్యాసాలు సామగ్రి పేరు గతంలో ప్రస్తుతం సిమెంట్ బస్తా రూ.270 రూ.320 స్టీల్ కిలో రూ. 57 రూ.65 ఇటుకలు ఒకటి రూ.7 రూ. 11 ఇసుక ట్రాక్టర్ రూ.2 వేలు రూ.4 వేలు బెల్దారీ కూలి రూ.600 రూ.850 మేస్త్రి కూలి రూ.800 రూ.900 చదరపు అడుగు నిర్మాణ ఖర్చు రూ.2500 రూ.3500 -
పరిశ్రమల స్థాపనకు అన్ని వనరులు సమకూర్చాలి
బాపట్ల: పరిశ్రమల స్థాపనకు అన్ని వనరులు, అనుమతులు సమకూర్చాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలతో ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు పెరుగుతాయని చెప్పారు. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకువచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. అవసరమైన వనరులు సమకూర్చడం, అనుమతులకు సహకరించాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పలు సూచనలు చేశా రు. పరిశ్రమల స్థాపనకు ఇటీవల సింగిల్ డెస్క్ విధానంలో 189 దరఖాస్తులురాగా, అందులో 171 అనుమతులు పొందాయన్నారు. పీఎంఈజీపీ పథకం కింద 56 యూనిట్లు స్థాపించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రూ.1.53 కోట్ల నిధులతో యూనిట్ల స్థాపన లక్ష్యం కాగా 65 యూనిట్లను ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. పీఎం విశ్వకర్మ పథకానికి జిల్లా నుంచి 38,446 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని పరిశీలించి అందులో 4,765 దరఖాస్తులను కేంద్రానికి పంపామన్నారు. 2,916 దరఖాస్తులకు అనుమతులు లభించాయన్నారు. సమావేశంలో డీఆర్వో జి గంగాధర్‌గౌడ్, కమిటీ కన్వీనర్ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వై రామకృష్ణ, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ఫ్యాప్సా కార్యదర్శి భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలకు భూసేకరణ చేపట్టాలి జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ చేపట్టా లని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో తాగునీటి సరఫరా, పరిశ్రమలకు భూసేకరణ, ఇసుక రవాణా, స్వచ్ఛ ఆంధ్ర, పరిశ్రమల స్థాపన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణాల కోసం చీరాల, రేపల్లె డివిజన్లలో భూసేకరణ చేపట్టాలన్నారు. రుతు పవనాలు రాకముందు ప్రజలకు ఇసుక కొరత లేకుండా ముందస్తుగా లక్ష టన్నుల ఇసుకను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నుండి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టులు, నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం గాజులంక –1 ఇసుక రీచ్ నుండి ఇసుక సరఫరా జరుగుతుందన్నారు. గాజులంక –2 ఇసుక రీచ్ త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలో తాగునీటి ఇబ్బందులు లేకుండా కృష్ణా పశ్చిమ కాలువల ద్వారా ట్యాంకులకు నీరు నింపుకోవాలని ఆదేశించారు. బాపట్ల పట్టణానికి తాగునీరు అందించే రక్షిత నీటి పథకానికి కృష్ణ పశ్చిమ కాలువ ద్వారా నీటిని నింపుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో మూడుసార్లు ఫిర్యాదులు వచ్చిన సిబ్బందిని పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులకు చెప్పారు. సమావేశంలో డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్, గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్, జిల్లా సరఫరాల శాఖ అధికారి విలియమ్స్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు పి.గ్లోరియా, చంద్రశేఖర నాయుడు, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
కృష్ణా నదిలో మునిగి ఇద్దరు యువకులు మృతి
సురక్షితంగా బయటపడ్డ మరో ముగ్గురు రేపల్లె రూరల్: పెనుమూడి వద్ద కృష్ణా నదిలో మునిగి ఇరువురు యువకులు మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... భట్టిపోలు మండలం వేమవరం గ్రామానికి చెందిన 30 మంది గ్రామస్తులు ఆటోలో రేపల్లె మండలం పెనుమూడి వద్ద కృష్ణా నదికి చేరుకున్నారు. బాప్టిజం కోసం ముగ్గురు రాగా వారి వెంట కుటుంబ సభ్యులు తరలివచ్చారు. వారిలో సరదాగా ఈత వేసేందుకు ఐదుగురు నదిలో దిగి నీట మునగగా గమనించిన స్థానికులు ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మిగిలిన ఇద్దరిని నదిలో గాలించి కొంతసేపటికి ఒడ్డుకు తరలించారు. కొన ఊపిరితో ఉన్న ఇరువురు యువకులను అంబులెన్స్‌లో రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మార్గంలో ఒక యువకుడు మృతి చెందగా చికిత్స పొందుతూ మరో యువకుడు మృతి చెందాడు. గుంటూరులో ఇంటర్ పూర్తి చేసిన తలకాయల గౌతం (18), పొన్నూరులో పాలిటెక్నిక్ పూర్తి చేసిన పెనుమాల దేవదాసు (19)లు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ మల్లికార్జునరావు, తహసీల్దార్ శ్రీనివాసరావులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. -
మాతా, శిశు మరణాలు లేకుండా విధులు నిర్వర్తించండి
చీరాల టౌన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్య సిబ్బంది విధులు సమర్థంగా నిర్వర్తించి గ్రామాల్లో మాతా, శిశు మరణాలు లేకుండా చూడాలని బాపట్ల డీఎం అండ్ హెచ్‌వో ఎస్.విజయమ్మ సూచించారు. గురువారం పట్టణంలోని డోలా ఐజాక్ ఎన్జీవో భవనంలో చీరాల డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తేన్న ఏఎన్ఎంలు, ఎంపీహెచ్‌ఈవోలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికి వైద్యం సకాలంలో సక్రమంగా అందించే బాధ్యత సిబ్బంది, మెడికల్ ఆఫీసర్లపై ఉందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని మారుమూల ప్రాంతాలు, శివారు కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి వైద్య సేవలందించేలా ప్రణాళికాబద్దంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా ఏఎన్ఎంలు, హెచ్‌ఈవోలు, ఆశ కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఎక్కడా కూడా మాతా, శిశు మరణాలు లేకుండా చూడాలని, విధుల్లో అశ్రద్ధ వహించినా సకాలంలో వైద్య సేవలందించకపోయినా చర్యలు తప్పవన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులకు క్రమం తప్పకుండా టీకాలు, వ్యాక్సిన్లు సకాలంలో వేయాలన్నారు. అలానే వేసవిలో వడదెబ్బలు తగలకుండా ప్రజలకు సూచనలు అందించడంతో పాటుగా అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఏఎన్ఎం, ఎంపీహెచ్‌వోలు విధులు సమర్థంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో పర్చూరు. వెదుళ్లపల్లి, కారంచేడు, చినగంజాం, ఈపురుపాలెం పీహెచ్‌సీలోని ఏఎన్ఎం, ఎంపీహెచ్వోలతోపాటుగా, పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యాకోబ్, సీహెచ్‌వో మల్లికార్జునరావు, కోటేశ్వరరావు, బాపట్ల 108 ఇన్చార్జి డాక్టర్ బ్రహ్మం, సబ్ యూనిట్ అధికారి సీహెచ్ శేషుబాబు, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. డీఎం అండ్ హెచ్‌వో ఎస్.విజయమ్మ -
ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి
చీరాల: ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, మాజీ మంత్రి పాలేటి రామారావుల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. ఎమ్మెల్యే గ్రూపు నేరుగా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటుండగా పాలేటి గ్రూపు మాత్రం ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పేరుతో పనులు చక్కబెట్టుకుంటున్నారు. వీరి మధ్య వివాదానికి గతంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కారణమైంది. దీంతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వ్యవహారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరగాలని ఆయన తరపున పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పట్టుబట్టారు. ఈ వ్యవహారం తన ఆధ్వర్యంలో జరగాలని పాలేటి భీష్మించుకుని కూర్చొన్నారు. ఈ వ్యవహారం సర్దుమణిగింది. మరో రాజకీయ వ్యవహారం బయటపడింది. చీరాల గొల్లపాలెం శ్మశానవాటిక ప్రహరీ వ్యవహారం ఇద్దరి మధ్య రాజకీయ చిచ్చుకు దారితీసింది. మూడు రోజుల కిందట ఎమ్మెల్యే కొండయ్య అధికారికంగా ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయాల్సి ఉంది. శ్మశాన స్థలంలో కొంత తమది ఉందంటూ కొందరు ముందుకు రావడంతో ఈ విషయంపై ఇరువురితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరుకాలేదు. దీంతో మాజీ మంత్రి పాలేటి రామారావు ఎన్నో ఏళ్లు శ్మశానవాటిక ప్రహరీ నిర్మాణం జరగకుండా ఉందని చెప్పి స్థానికులతో చర్చించి ఆయన అక్కడే కూర్చొని ప్రహరీ నిర్మాణం జరిపించారు. ఎమ్మెల్యే వాయిదా వేసిన విషయాన్ని పాలేటి నిర్మాణ పనులు దగ్గరుండి చేయించడంపై చీరాలలో రాజకీయ చర్చలకు తెరలేపింది. ముందు ముందు ఇరువురి మధ్య పలు కీలక అంశాలు రాజకీయ దుమారం, విభేదాలు జరుగుతాయని టీడీపీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నారు. నాడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై వివాదం నేడు శ్మశానవాటికి ప్రహరీ నిర్మాణంపై రచ్చ -
కార్మిక సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం
అద్దంకి రూరల్: కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైనా కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని రాష్ట్ర ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య అన్నారు. గురువారం స్థానిక రూపేష్ భవనంలో ఎస్కె కరిముల్లా అధ్యక్షత ఏఐటీయూసీ జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కాలరాస్తున్నారన్నారు. అధికారం రాకముందు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరిద్దరిస్తామని హామీ ఇచ్చి అధికారం వచ్చిన తరువాత పట్టించుకోవటం లేదన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం మే 20వ తేదిన సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 25న అన్ని యూనియన్లతో సన్నాహక సదస్సును విజయవాడలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీసీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు శింగరకొండ, రాష్ట్ర అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి జే.లలితమ్మ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యేలు, నియోజకవర్గ కార్యదర్శులు ఎస్ శ్రీనివాసులు. డీ.నాగేశ్వరరావు, కెఎల్డీ ప్రసాద్, ముస్తాఫా, అంగన్వాడీ జిల్లా కన్వీనర్ ఎస్ వాణిశ్రీ, జిల్లా పాఠశాల ఆయా సంఘం కన్వీనర్ సుజాత, కోటేశ్వరరావు, రమణయ్య, మరియబాబు, బాపిపైడయ్య, సీహెచ్ ప్రకాష్, ఎస్తేరు రాణి తదితరులు పాల్గొన్నారు. -
చీరాల కేంద్రంగా గోవా మద్యం
చీరాల: చీరాల కేంద్రంగా గోవా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. రైళ్లలో గోవా నుంచి చీరాల వాడరేవు, తీర ప్రాంతాలకు తరలించి రిసార్టులకు విక్రయిస్తున్నారు. ఇది చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. గురువారం సమాచారం అందుకున్న ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్, ఎకై ్సజ్ పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గోవా మద్యం నిల్వ ఉంచిన స్థావరాలపై దాడులు నిర్వహించారు. వాడరేవు వైఎస్సార్ కాలనీకి చెందిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.55 వేలు విలువ చేసే 550 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. ఎన్ఫోర్స్మెంట్ ఏసీ విజయ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా నాన్ డ్యూటీ మద్యంను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలా తరచూ మద్యం తరలించిన వారిపై కఠినమైన చట్టాలను ఉపయోగిస్తామన్నారు. దాడులలో ఎన్ఫోర్స్మెంట్ ఒంగోలు సీఐ రామారావు, చీరాల ఎకై ్సజ్ సీఐ పి.నాగేశ్వరరావు, ఎస్సైలు బి.శ్రీహరి, రమాదేవి, రాజేంద్రప్రసాద్, టూటౌన్ ఏఎస్సై టి.వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 550 బాటిళ్లు స్వాధీనం చేసుకున్న ఎకై ్సజ్ పోలీసులు -
రైతులను ఆదుకోకుంటే పోరుబాట
మార్టూరు: అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలైనా కల్పించి ఆదుకోవాలని, లేకుంటే పోరుబాట తప్పదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. మార్టూరు మండల కన్వీనర్ జంపని వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో బుధవారం మార్టూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం పొగాకు, మిర్చి, శెనగ, వరి తదితర రైతులు గిట్టుబాటు ధరలు లభించక వీధిన పడే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. మిర్చి, పొగాకు రైతులకు పెట్టుబడి వ్యయం ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల అవుతోందని గుర్తుచేశారు. వాటిని కొనుగోలు చేసే నాథుడే కరవయ్యాడని ఆయన విమర్శించారు. రైతాంగాన్ని మభ్యపెట్టడం కోసం సీఎం చంద్రబాబు గిట్టుబాటు ధరల కోసం కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకొంటున్నారని ఆరోపించారు. పంటలను ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయదని ఆయన ప్రశ్నించారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వమే పంట బీమా చేయించి ఆదుకోవాల్సిందిపోయి బీమా రుసుము భారం రైతులపై వేసి చోద్యం చూస్తోందని ఆయన విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోగానీ, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోగానీ పండుగలా వ్యవసాయం సాగిందన్నారు. సాగంటే నేడు దండగలా మారటానికి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆయన అన్నారు. అమరావతి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఉన్న శ్రద్ధ ఆరుగాలం కష్టపడే రైతులపై, వ్యవసాయంపై లేకపోవడం దారుణమని నాగార్జున మండిపడ్డారు. అకాల వర్షంలో దీనావస్థలో రైతులు మంగళవారం రాత్రి మార్టూరు మండలంలో కురిసిన అకాల భారీ వర్షానికి మొక్కజొన్న, పొగాకు, మిర్చి పంటలను కల్లాల్లో ఆరబెట్టుకున్న రైతుల బాధలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళికి ఫోన్ ద్వారా మార్టూరు పరిసర ప్రాంతాల రైతుల సమస్యలను నాగార్జున వివరించారు. రైతులను అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు. అధికారులను బాధిత రైతుల వద్దకు పంపి పంట నష్టం తెలుసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులను ఆదుకుంటామని తెలిపారు. పార్టీని బలోపేతం చేయండి తనను కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో నాగార్జున మాట్లాడుతూ... పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి మధుసూదన్ రెడ్డితో కలిసి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషావలి, నాయకులు ఉప్పలపాటి అనిల్, గర్నె పూడి రవి చందు, అడకా గంగయ్య, తమ్ములూరి సురేష్, మైల నాగేశ్వరరావు, అట్లూరి సుకుందరావు, వంకాయలపాటి భాగ్యారావు, గడ్డం మస్తాన్ వలి, దివ్వె కిషోర్, సులేమాన్ ఖాదర్ బాషా, కొండ మస్తాన్, కొమెర శ్రీను, రావిళ్ళ అంజిబాబు, మోషే నాయక్, బాజీ నాయక్, కోటి, అజీమ్ తదితరులు పాల్గొన్నారు. ‘సూపర్ సిక్స్’ అమలు లేదు.. గిట్టుబాటు ధరలైనా కల్పించండి అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున జిల్లా కలెక్టర్ దృష్టికి అన్నదాతల సమస్యలు -
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పల్లె పడక
రేపల్లె రూరల్: కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ ఆరోపించారు. చెరుకుపల్లి మండలం గుల్లపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ముకాయడమే కాకుండా పేదలను ఇబ్బంది పెట్టేలా కూటమి పాలన ఉందన్నారు. పది నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 18వ తేదీన ‘పల్లె పడక’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. చెరుకుపల్లి మండలం అల్లావారిపాలెంలో ఆ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అదే రోజు గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని తెలిపారు. రాత్రికి గ్రామంలో బస చేసి, ప్రజలతో మమేకమై అక్కడే నిద్రించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కూటమి పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బందులే వారి కష్టాలు తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ -
కాటేసిన కరెంట్ తీగ
చేనేత కార్మికుడు మృతి వేటపాలెం: అకాల వర్షం కారణంగా కరెంట్ తీగ రూపంలో చేనేత కార్మికుడిని మృత్యువు కాటేసింది. ఈ సంఘటన దేశాయిపేట పంచాయతీ ఆణుమల్లిపేటలో బుధవారం తెల్లపారుజామున చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. తెల్లపారుజామున గాలితో కూడిన వాన కురిసింది. ఈదురు గాలులకు కరెంట్ షార్టు సర్క్యూట్‌తో ఇంటికి వేసిన సర్వీస్ వైరు తెగి రోడ్‌పై పడింది. ఉదయాన్నే పాలు తెచ్చుకోవడానికి బొడ్డు మోహన్‌రావు (64) రోడ్డుపైకి వచ్చాడు. రోడ్డుకు అడ్డుగా పడి ఉన్న కరెంటు తీగను పక్కకు తొలగించే ప్రయత్నం చేశాడు. తెగి పడిన సర్వీస్ వైరులో విధ్యుత్ ప్రవహిస్తుండటంతో షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు గుర్తించి విద్యుత్ శాఖ సిబ్బంది సమాచారం అందించారు. వారు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎం.వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మోహన్‌రావు చేనేత మగ్గం పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మాతాశిశు మరణాలను నివారించాలి
మాతాశిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి డాక్టర్లను ఆదేశించారు. గత సంవత్సరం ఆగస్టు మాసంలో సంభవించిన 2 ప్రసవ మరణాలపై జిల్లా కలెక్టర్ మాతాశిశు మరణాల కమిటీ సభ్యులతో బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నిడమానూరు గ్రామానికి చెందిన మానికల లక్ష్మి మృతికి సంబంధించి తొమ్మిదో ప్రసవం అని, ఎక్కువ రిస్క్ ఉందని నమోదు చేయడాన్ని పరిశీలించారు. వైద్య అందించిన తీరుపై అసహనం వ్యక్తపరిచారు. సంబంధిత డాక్టర్లు, సిబ్బందిపై తగు చర్యలను తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. కారుమూరి ఆశ మరణంపై ఆరా తీశారు. ప్రసవం తర్వాత ఆమె డయేరియాతో చనిపోయారని రేపల్లె కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డాక్టర్ రామకృష్ణ, వైద్యం అందించిన డాక్టర్లు, కమ్యూనిటీ హెల్త్ అధికారులు, హెల్త్ ఎడ్యుకేటర్లు, పబ్లిక్ హెల్త్ నర్సులు, హెల్త్ ప్రోగ్రామర్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి
బాపట్ల: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఏఈలు, డీఈలు, రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండల ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వాటర్ ట్యాంకులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ల వివరాలు, నీటి నిల్వలపై కలెక్టర్ ఆరా తీశారు. జిల్లాలో కెడబ్ల్యూడీ కింద 75 వాటర్ ట్యాంకులు ఉన్నాయని అధికారులు చెప్పారు. వాటిలో 53 ట్యాంకులు 90 శాతం, 15 ట్యాంకులు 20 – 50 శాతం, 7 ట్యాంకులు 25 శాతంలోపు నీళ్లు కలిగి ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా 3 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకుగాను బాపట్లలో 33 శాతం, రేపల్లెలో 44 శాతం, చీరాలలో 73 శాతం నీటి నిల్వలు ఉన్నాయని కృష్ణ పశ్చిమ డెల్టా ఎస్ఈ వెంకట్ రత్నం వివరించారు. ఎన్ఎస్పీ కింద జిల్లాలో 40 ట్యాంకులు ఉన్నాయని చెప్పారు., వాటిలో నీరు 45 రోజులపాటు సరిపోతాయని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు తెలిపారు. బాపట్లలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోని నీరు వారంపాటు అవసరాలకు మాత్రమే సరిపోతుందని, రేపల్లెలో నీరు నెలపాటు, చీరాలలోని నీరు 120 రోజులపాటు అవసరాలకు సరిపోతుందని మున్సిపల్ కమిషనర్లు వివరించారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు నీరు అవసరం ఉన్నందున కృష్ణా పశ్చిమ డెల్టా నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆ నీటిని పశ్చిమ డెల్టాకు విడుదల చేసిన మూడు రోజుల తరువాత బాపట్లకు వస్తాయని, పశ్చిమ డెల్టాకు 15 రోజులపాటు నీరు విడుదల జరుగుతుందని అధికారులు తెలిపారు. నీరు బాపట్లకు చేరిన తర్వాత ఎప్పటికప్పుడు ట్యాంకులను నీటితో నింపాలన్నారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి డి.గంగాధర్ గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఏఈలు, డీఈలు, వీసీ ద్వారా రేపల్లె, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారులు, అద్దంకి, రేపల్లె మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండల ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. నీటి తీరువా వసూళ్లు పెంచాలి బాపట్ల: గత బకాయిలతో కలిపి నీటి తీరువా రూ.15.46 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రూ.2.26 కోట్లు మాత్రమే వసూలు చేయడమేంటని అధికారులను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ప్రశ్నించారు. రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులను చైతన్యపరచి నీటి తీరువా వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. నివాస భూమి లేని పేదలందరికీ ఇంటి స్థలం పంపిణీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించారు. నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళిక జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి కృష్ణా పశ్చిమ డెల్టా నుంచి నీటి విడుదలకు ఆదేశం -
మద్యం మత్తులో సముద్రంలోకి దిగితే కఠిన చర్యలు
● బహిరంగ ప్రదేశంలో మద్యం తాగినా జైలు శిక్ష తప్పదు ● మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదు ● బీచ్ సందర్శకులకు జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ హెచ్చరిక ● నిర్దిష్ట లోతును సూచించేలా జెండాల ఏర్పాటు బాపట్ల టౌన్: మద్యం మత్తులో సముద్రంలోకి దిగే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని, ఈ మేరకు పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. బుధవారం సూర్యలంక తీరంలో జిల్లా ఎస్పీ పర్యటించారు. తీరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, గజ ఈతగాళ్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... సూర్యలంక బీచ్ పర్యాటకంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిందన్నారు. వేసవి కావడంతో యాత్రికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దానికి అనుగుణంగా సందర్శకుల రక్షణ కోసం పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. తీర ప్రాంతంలో పోలీస్ గస్తీని ముమ్మరం చేయడంతోపాటు బీచ్‌లో యాత్రికులు ప్రమాదాలకు గురైనప్పుడు వారిని రక్షించేందుకు స్థానిక, మైరెన్ పోలీసులతోపాటు గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కువ లోతులోకి వెళ్లే వారిని సులభంగా గుర్తించి అప్రమత్తం చేసేందుకు డ్రోన్లను వినియోగించాలని పేర్కొన్నారు. సముద్ర తీరాలకు విహారానికి వచ్చే యాత్రికులు పోలీస్ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సముద్రంలో నిర్దిష్ట లోతు దాటి లోపలకి వెళ్లకుండా యాత్రికులను అప్రమత్తం చేస్తూ సముద్రంలో జెండాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. యాత్రికులు బీచ్ పరిసరాల్లో వ్యవహరించాల్సిన తీరును వివరిస్తూ తీరంలో ప్రచార బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. లోతుకు వెళ్తున్న యాత్రికులను అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండాలన్నారు. గజ ఈతగాళ్లు, పోలీస్ సిబ్బంది లైఫ్ జాకెట్స్ ధరించి అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో యాత్రికులను మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించేందుకు ఆంబులెన్న్స్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. బీచ్ పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ గస్తీ ముమ్మరం చేయాలని తెలిపారు. మహిళా యాత్రికులు దుస్తులు మార్చుకొనుటకు తాత్కాలిక గదులను ఏర్పాటు చేయించాలని పేర్కొన్నారు. వాటి వద్ద మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, ఎస్బీ సీఐ నారాయణ, బాపట్ల రూరల్ సీఐ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు, మైరెన్ పోలీసులు, గజ ఈతగాళ్లు పాల్గొన్నారు. -
బాపట్ల జేసీ ప్రఖర్‌జైన్ బదిలీ
బాపట్ల: బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్‌జైన్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రఖర్‌జైన్‌ను ఆర్టీజీఎస్ సీఈవోగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రఖర్‌జైన్ గతేడాది ఆగస్టులో బాపట్ల జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించారు. గతేడాది లంక గ్రామాలకు కృష్ణానది ముంపు సందర్భంగా ఆయన చేసిన సేవలకు ప్రశంసలు అందుకున్నారు. బాపట్ల జిల్లా జేసీగా ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించలేదు. సబ్ జైలులో జిల్లా జడ్జి పరిశీలన రేపల్లె రూరల్: రేపల్లె సబ్ జైల్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సయ్యద్ జియావుద్దీన్ బుధవారం సందర్శించారు. జైలు పరిసరాలను, ఖైదీల గదులను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. నేరం ఆరోపించబడి ప్రైవేటు న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారి కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేసిందన్నారు. అవసరమైన వారు ప్రభుత్వ న్యాయవాది సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాది గుమ్మడి కుమార్‌బాబు, సబ్ జైల్ సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు యద్దనపూడి: యద్దనపూడి మండలంలోని పూనూరు, చింతగుంటపాలెం, గన్నవరం గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి ఆరుగాలం శ్రమించి పండించిన పంట కల్లాల్లో తడిసి ముద్ద కావటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే అకాల వర్షంతో మరింత నష్టం చేకూరిందని వాపోతున్నారు. సుమారు 2 గంటలపాటు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టిగా వర్షం పడటంతో కల్లాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న, పందిళ్లపై ఉన్న పొగాకు పంటలు పూర్తిగా తడిసిపోయాయి. తద్వారా పంటకు బూజు, ఫంగస్ పట్టి పంట నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం పిడుగురాళ్ల : పట్టణంలోని శ్రీ రామ తీర్థ సేవాశ్రమం బజార్‌లోని శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఇటీవల ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. బుధవారం గాయత్రి పీఠం ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్ శర్మ శాస్రోక్తంగా పూజలు నిర్వహించి మేధా దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. అనంతరం కందుల శ్రీనివాసరావు తండ్రి జ్ఞాపకార్థం రూ. 17 లక్షలను ఆలయ పునర్నిర్మాణానికి అందించారు. వేలమంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేరళకు తరలిస్తున్న గోవులు పట్టివేత మంగళగిరి: నగర పరిధిలోని కాజ టోల్గేట్ వద్ద 30 గోవులను పట్టుకున్నారు. శ్రీకాకుళం నుంచి కేరళకు గోవులను తరలిస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం వీహెచ్‌పీ నేతలు టోల్గేట్ వద్ద కాపలా వుండి 30 గోవులను తరలిస్తున్న కంటైనర్‌ను, డ్రైవర్ అన్సారీని పట్టుకుని మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు గోవులను గో ఆశ్రమానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ముడుపుల పే..కాట!
బాపట్లగుణదలకు క్రైస్తవుల పాదయాత్రదుగ్గిరాల: ఆర్సీఎం మత పెద్దలు, దీక్ష తీసుకున్న క్రైస్తవులు బుధవారం గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి డాక్టర్ సురేష్ యామర్తి ఆధ్వర్యాన పాదయాత్ర చేశారు. సంకటహర చతుర్థి పూజలు అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరుడి ఉపాలయంలో బుధవారం సంకట హర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. అర్చకుడు శేషసాయిశర్మ ఆధ్వర్యంలో ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేశారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 515.00 అడుగుల వద్ద ఉంది. ఇది 140.3150 టీఎంసీలకు సమానం. గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025రేపల్లె రూరల్: నియోజకవర్గ ప్రజలకు జూదాన్ని అలవాటు చేసిందే టీడీపీ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో కోడి పందేలు, పేకాట, గుండాట, కోత ముక్క.. ఇలా జూద క్రీడలను బహిరంగంగా నిర్వహించిన ఘనత కూడా తమ్ముళ్లదేనని ప్రజలు మండిపడుతున్నారు. మళ్లీ అధికారంలోకి రావడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని నగరం, రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల్లో విచ్చలవిడిగా పేకాట కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో పై పందేలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా పేకాట కేంద్రాలకు నిలయంగా నగరం మండలం మారిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తమ్ముళ్ల అడ్డాలు ఇవే.. ● మండలంలోని ఏలేటిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని వెలమవారిపాలెం శివారులో టీడీపీ నేతకు చెందిన ఇంట్లో పెద్ద జూద కేంద్రాన్ని (పేకాట క్లబ్) ఏర్పాటు చేశారు. ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి పేకాటరాయుళ్లు వస్తున్నారు. నిత్యం రూ. కోట్లలో పందేలు జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అనుమతులు లేకుండా కాయిన్స్‌తో పేకాట శిబిరాన్ని నడుపుతున్నారు. ● వెలమవారిపాలెంలోని సపోటా తోటల్లోనూ టీడీపీ నేతల ఆధ్వర్యంలో జోరుగా పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇక్కడ బహిరంగంగా పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నా ఇప్పటి వరకు కనీసం తనిఖీలు జరగలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పేకాట కేంద్ర నిర్వాహకులు ఎలా లాబీయింగ్ చేస్తున్నారనే దానికి ఇదే నిదర్శనంగా ప్రజలు చెబుతున్నారు. ● గత నెల రోజులుగా ధూళిపూడి పాత సినిమా హాలును అడ్డాగా చేసుకుని పేకాట కేంద్రాన్ని నడుపుతున్నారు. ఇటీవల వేమూరు నియోజకవర్గంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు రైడింగ్ చేసి పేకాట కేంద్రాల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు మాత్రం తనిఖీలు చేసిన పాపాన కూడా పోలేదు. దీనిపై ప్రజలు బహిరంగంగా విమర్శలు కురిపిస్తున్నారు. పేకాటకు అడ్డాగా మారిన ధూళిపూడి పాత సినిమా హాలు 7న్యూస్రీల్పచ్చ నేతకు భారీగా ముడుపులు నియోజకవర్గంలో పేకాట కేంద్రాలపై పోలీసులు రైడింగ్ చేయకుండా పచ్చ పార్టీలోని ముఖ్య నేతకు ఆయా పేకాట కేంద్రాల నిర్వాహుకులు భారీ స్థాయిలో ముడుపులు సమర్పించుకుంటున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. నగరం మండలంలోని వెలమవారిపాలెంలో పేకాట కేంద్రం నుంచి రోజుకు రూ.లక్షల్లో ముడుపులు అందిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు పేకాట కేంద్రాలపై దాడులు జరగకుండా ఈ ముఖ్య నేత అడ్డుపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పేకాట కేంద్రాలపై దాడులు నిర్వహించాలని, జూదాన్ని పూర్తిస్తాయి అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. నగరం మండలంలో అతిపెద్ద పేకాట క్లబ్ వెలమవారిపాలెం కేంద్రంగా చేతులు మారుతున్న రూ.కోట్లు దాడులు జరగకుండా టీడీపీ ముఖ్య నేతకు భారీగా ముడుపులు పేకాట కేంద్రాల వైపు కన్నెత్తి చూడని పోలీసు అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్న ప్రజలు -
పట్టణ పరిసరాల్లో తోటల సాగుపై ప్రత్యేక శిక్షణ
వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ ప్రసూనా రాణి బాపట్ల: అర్బన్ కేంద్రాల పరిసరాలలో ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, పూల పెంపకం చేసే విధానం ద్వారా ఆహార భద్రత కలుగుతుందని వ్యవసాయ కళాశాల డీన్ డాక్టరు పి.ప్రసూనారాణి పేర్కొన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బుధవారం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీన్ మాట్లాడారు. కూరగాయాలకు స్థానిక మార్కెట్లలో ప్రాధాన్యత పెరుగుతుందని, సాగుభూమి విస్తీర్ణానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. పట్టణ పరిసరాలలో జీవించే చిన్న, సన్నకారు రైతుల కమతాలలో పెంచదగిన కూరగాయలు, వాటి సాగులో తీసుకోవలసిన మెలకువలు గురించి శిక్షణ శిబిరంలో తెలియజేశారు. ఉద్యాన విభాగాధిపతి డా. వి.శ్రీలత రైతులకు పూల తయారీ, వాటికి మార్కెట్లో ఉన్న ప్రాముఖ్యత గురించి వివరించారు. డా.యన్.రత్నకుమారి, డా.కె.సుశీల, డా.ఎం.సురేష్ కుమార్, ఉద్యాన విభాగ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
తెనాలి డీఎస్పీకి ఏబీసీడీ అవార్డు
తెనాలి రూరల్: సంచలనం సృష్టించిన దళిత బాలిక హత్య కేసును ఛేదించిన తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు ఏబీసీడీ (అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) కన్సోలేషన్ ప్రైజ్ అవార్డు (డీజీపీ మెడల్) అందుకున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన ఏడో తరగతి చదువుతున్న దళిత బాలిక పేరిపోగు శైలజను గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేసే కృష్ణా జిల్లాకు చెందిన నరమామిడి నాగరాజు గతేడాది దారుణంగా హత్య చేయడం.. ఘటన రాష్ట్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడం తెలిసిందే. కేసును చేబ్రోలు పోలీసులు నమోదు చేయగా, డీఎస్పీ జనార్ధనరావు దర్యాప్తు చేశారు. హత్యకు పాల్పడి పరారైన నాగరాజు, తన సెల్‌ఫోన్, సిమ్‌ను మార్చి వేసి పోలీసులకు సవాల్ విసిరాడు. సుమారు మూడు నెలల పాటు నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించి అతికష్టం మీద అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కీలకమైన కేసును ఛేదించడంలో కృషి చేసిన డీఎస్పీ, చేబ్రోలు పోలీసులను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా అభినందించారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో తెనాలి డీఎస్పీకి ఏబీసీడీ కన్సోలేషన్ ప్రైజ్ అవార్డును డీజీపీ అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీకి తెనాలి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. పోలీసులకు అవార్డులు.. చేబ్రోలు: కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పేరుపోగు శైలజ హత్య కేసులో నిందితుడు ఎన్.నాగరాజు కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో నాగరాజును పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పొన్నూరు రూరల్ సీఐ వై.కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్ఐ డి.వెంకట కృష్ణ, చేబ్రోలు పీఎస్ కానిస్టేబుళ్లు ఎ.అప్పలనాయుడు, జి.నాగరాజులకు అవార్డులను అందజేసినట్లు పోలీసులు తెలిపారు. -
లంక గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించండి
ఆర్డీఓని కోరిన వైఎస్సార్ సీపీ వేమూరు ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు వేమూరు: లంక గ్రామాల్లో ఇసుక తవ్వకాల్లో యంత్రాలను నిషేధించి కూలీలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజక వర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. రేపల్లె రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో బుధవారం ఆర్డీఓను కలిసి పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. నదీ తీరప్రాంతాల్లో ఇసుక తవ్వకాల్లో యంత్రాలు ఉపయోగించకుండా లంక ప్రాంతాల్లోని కూలీల చేత చేయించాలన్నారు. ఇతర ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలివెళ్లకుండా అడ్డుకోవాలని ఆయన కోరారు. ఇసుక తరలింపు కోసం కొందరు నదిలో రోడ్లు సైతం వేస్తున్నారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని, రోడ్లను ఛిద్రం చేయాలన్నారు. ఇసుక తవ్వకాల్లో పూర్తిగా లంక గ్రామాలకు చెందిన కూలీలను వినియోగించాలని ఆయన కోరారు. -
రెవెన్యూ సేవల్లో అలసత్వం వద్దు
● ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు ● చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని అధికారులతో సమీక్ష సమావేశం చీరాల టౌన్: రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అశ్రద్ధ వద్దని, వచ్చిన ప్రతి అర్జీని నిశితంగా విచారణ చేయించాలని, విధుల్లో అశ్రద్ధ వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖరనాయుడు సూచించారు. బుధవారం రాత్రి చీరాల ఆర్డీఓ కార్యాలయంలో చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని చీరాల, కారంచేడు, వేటపాలెం, చినగంజాం, అద్దంకి, పంగులూరు, సంతమాగులూరు. ఇంకొల్లు, బల్లికురవ మండలాల తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, రీ సర్వే డీటీలతో రెవెన్యూ సమస్యలు, అర్జీల పెండింగ్‌పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డివిజన్ పరిదిలోని మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలు, రీ సర్వే, పీజీఆర్ఎస్ అర్జీలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అర్జీలు, ల్యాండ్ కన్వర్షన్, నీటి తీరువా వసూళ్లపై మాట్లాడి పలు సూచనలు చేశారు. ఆర్డీఓ మాట్లాడుతు....మండలాల వారీగా అర్హుత ఉండి నివేశన స్థలాలు రాని వారి వివరాలను అందించడంతో పాటుగా కావాల్సిన భూమి వివరాలు అందించాలన్నారు. మండలాల్లో నీటి తీరువా వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి రైతుల నుంచి విధిగా నీటి తీరువా వసూలు చేయాలన్నారు. రీ సర్వే పకడ్బందీగా చేసి రికార్డుల ప్రకారమే వివరాలు ఆన్లైన్ చేయాలన్నారు. రెవెన్యూ సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. అర్జీదారులను కార్యాలయాల చుట్ట తిప్పుకోవద్దని ప్రజలకు సత్వరం సేవలందిస్తే మంచి అధికారులుగా గుర్తింపు వస్తుందన్నారు. గ్రామాల వారీగా పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను త్వరగా అందించడంతో పాటుగా గ్రామాల్లో ఎక్కడా అనధికార లే అవుట్లు వేయకుండా కట్టడి చేయాలన్నారు. ఓటీసీలను త్వరగా మంజూరు చేయాలన్నారు. సమావేశంలో డివిజనల్ సర్వే ఇన్స్పెక్టర్ ముసలయ్య, తహసీల్దార్లు గోపికృష్ణ, పార్వతి, ప్రభాకరరావు, నాగరాజు, రీసర్వే డీటీలు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్మశాన వాటికకు భూమి కేటాయించాలి
కలెక్టర్‌కు జాతీయ రహదారి విస్తరణ బాధితుల వినతి చీరాల: వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారి 167 విస్తరణలో కోల్పోయిన శ్మశాన వాటిక భూమిని తిరిగి వేరే ప్రాంతంలో కేటాయించాలని విజయనగర్ కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ వెంకట మురళికి బుధవారం వినతిపత్రం అందజేశారు. 1985లో కారంచేడు బాధితులకు చీరాల వద్ద విజయనగర్ కాలనీ ఏర్పాటు చేశారన్నారు. ఈ కాలనీలకు సంబంధించి 8 ఎకరాల్లో శ్మశాన వాటికను అప్పటి ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మిస్తున్న వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రాహదారిలో శ్మశాన వాటిక స్థలంలో చాలావరకు కోల్పోవడం జరిగిందన్నారు. శ్మశానానికి వెళ్లేందుకు దారిని ఏర్పాటు చేయాలని కోరారు. కాలనీ వాసులు తేళ్ల లక్ష్మీప్రసాద్, దేవదానం, ప్రసాద్, దుడ్డు ఏసుపాదం బుడంగుట్ల లక్ష్మీ నరసయ్య, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు దుడ్డు వందనం, తాళ్లూరి రాజేష్, దుడ్డు వెంకటేశ్వర్లు, చుండూరి రమేష్‌బాబు, తేళ్ల రాంబాబు, దుడ్డు విజయ భాస్కర్ పాల్గొన్నారు. -
88 ఏళ్ల వృద్ధుడికి అరుదైన ఆపరేషన్
విలేకరుల సమావేశంలో డాక్టర్ ఫణీంద్ర కుమార్ వెల్లడి గుంటూరు మెడికల్: స్వర పేటికకు పెరాలసిస్ వచ్చి ఎనిమిది నెలలుగా తీవ్ర ఇబ్బంది పడుతున్న 88 సంవత్సరాల వృద్ధుడికి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అరుదైన ఆపరేషన్ చేసి గొంతు సమస్యను సరిచేసినట్లు గుంటూరులోని శ్రీ సత్య సాయి ఫణింద్ర కుమార్ ఈఎన్టీ అండ్ వాయిస్ క్లినిక్ అధినేత, వాయిస్ సర్జన్ డాక్టర్ వి.ఫణీంద్ర కుమార్ చెప్పారు. బుధవారం గుంటూరు బ్రాడీపేటలో ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ వివరాలు ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 88 సంవత్సరాల లక్ష్మణరావు 8 నెలలుగా స్వర పేటిక పెరాలసిస్‌కు గురై మాట రాక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. లక్ష్మణరావు కుమారులు అమెరికాలో ఉండటంతో అక్కడికి వెళ్లిన వృద్ధుడు అమెరికాలో వైద్యులను సంప్రదిస్తే ఇండియాలో ఆపరేషన్ చేసే వైద్యులు ఉన్నారని అక్కడే చేయించుకోవాలని సూచించారు. దీంతో లక్ష్మణరావు పిల్లలు ఇండియాలోని తమ బంధువుల సలహా మేరకు ఫిబ్రవరి నెలలో చికిత్స కోసం లక్ష్మణరావును తమ వద్దకు తీసుకు వచ్చారన్నారు. వైద్య పరీక్షలు చేసి స్వర పేటిక పెరాలసిస్ వల్ల గొంతు రాకపోవడం, పీలగా మారటం చాలా చిన్నగా మాట్లాడటం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. ఎలాంటి కారణం లేకుండానే స్వర పేటిక పెరాలసిస్ రావడంతో ఫిబ్రవరి 17న సుమారు రెండు గంటలసేపు థైరోప్లాస్టి ఆపరేషన్ చేసి సమస్యను నివారించామన్నారు. కొద్దిరోజులపాటు వాయిస్ థెరపిస్ట్ పర్యవేక్షణలో లక్ష్మణరావుకు స్పీచ్ థెరపి చేయించడంతో నేడు పూర్తిస్థాయిలో మాట్లాడుతున్నట్లు డాక్టర్ ఫణీంద్ర కుమార్ వెల్లడించారు. మెడికల్ జర్నల్స్ లో 88 సంవత్సరాల వయసున్న వృద్ధుడికి ఆపరేషన్ చేయటం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి వెల్లడించారు. ఆపరేషన్ ప్రక్రియలో ఈఎన్టీ వైద్యులు డాక్టర్ భార్గవ్, మత్తు వైద్యులు డాక్టర్ సురేంద్ర పాల్గొన్నట్లు తెలిపారు. అరుదైన ఆపరేషన్ చేసి స్వర సమస్యను సరిచేసి మామూలు వ్యక్తి లాగా మాట్లాడే విధంగా చేసిన డాక్టర్ ఫణీంద్ర కుమార్ కు సీనియర్ సినీ నటుడు, లక్ష్మణరావు బావ అయిన మురళీమోహన్ అభినందనలు తెలిపారు. -
కీబోర్డులో గిన్నిస్ రికార్డు
పెదకాకాని: మ్యూజికల్ కీ బోర్డులో కొప్పురావూరుకు చెందిన ఉషారాణి రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకుంది. పెదకాకాని మండలంలోని కొప్పురావూరు గ్రామానికి చెందిన టి.ఉషారాణి స్ఫూర్తి మహిళా సంక్షేమ అభివృద్ధి సంస్థ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. 2024 డిసెంబరు 1వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ గంట సమయం పాటు 17 దేశాలకు చెందిన 1090 మంది ఒకే టైమ్‌లో నాన్‌స్టాప్‌గా కీ బోర్డు ప్లే చేయడం జరిగింది. ఈ వీడియో రికార్డును నాస్టర్ అగస్టీన్ దండంగి ఆధ్వర్యంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీడియోను వీక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ వారు కొప్పురావూరుకు చెందిన టి.ఉషారాణిని గిన్నిస్‌బుక్ రికార్డు కు ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ మణికొండలో నిర్వహించిన కార్యక్రమంలో అగస్టీన్ దండంగి, బ్రదర్ అనిల్ కుమార్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్‌ల చేతుల మీదుగా సర్టిఫికెట్, మెడల్‌ను టి.ఉషారాణికి అందజేశారు. -
సంగీతంలో గిన్నిస్ బుక్ రికార్డు
కర్లపాలెం: కీబోర్డు ప్లే చేసి బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బిడారుదిబ్బ గ్రామానికి చెందిన ఓ విద్యార్థి వరల్డ్ గిన్నిస్ బుక్ సర్టిఫికెట్ అందుకున్నాడు. బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు దుండివారిపాలెం పంచాయతీ బిడారుదిబ్బ గ్రామానికి చెందిన కట్టుపల్లి విల్సన్‌బాబు, ప్రత్యూష దంపతుల పెద్దకుమారుడు విజయవాడలో ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి జోయెల్ విల్సన్‌బాబు పాస్టర్లు లాభాన్రాజు, అగస్టిన్ దండంగి సారధ్యంలో కీబోర్డు వాయించటం నేర్చుకున్నాడు. 2024 డిసెంబర్ 1వ తేదీన విజయవాడలో ప్రపంచ స్థాయిలో 108 దేశాలలో 1090మంది సంగీత కళాకారులకు ఆన్లైన్ విధానంలో జరిగిన పోటీలలో జోయెల్ విల్సన్‌బాబు పాల్గొని 45 నిమిషాలలో కీబోర్డు ప్లేచేసి వీడియోను అప్లోడ్ చేసి గిన్నిస్‌బుక్ రికార్డు సాధించాడని తెలిపారు. ఈనెల 14వ తేదీన హైదరాబాద్ మణికొండలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధి రాజేంద్రన్ చేతుల మీదుగా వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకున్నాడని తెలిపారు. -
పీఎఫ్ పనులపై వచ్చి ఉపాధ్యాయుడు మృతి
గుంటూరు ఎడ్యుకేషన్: బోధన వృత్తిలో సుదీర్ఘ సేవలందించిన ఉపాధ్యాయుడు హఠాన్మరణం చెందారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న చల్లా వెంకటరెడ్డి (62) బుధవారం పీఎఫ్ క్లియరెన్స్, ఎన్ఓసీ కోసం గుంటూరు డీఈఓ కార్యాలయానికి వచ్చారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని విజిటర్స్ కుర్చీలో కూర్చుని ఉండగానే, తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన వెంట ఉన్న కుమారుడు ప్రసన్నాంజనేయులు రెడ్డితో పాటు డీఈఓ కార్యాలయ సిబ్బంది హుటాహుటిన సమీపంలోని రమేష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తక్షణమే సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక రమేష్ ఆస్పత్రికి వచ్చి వెంకటరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించారు. ఆయన కుమారుడిని పరామర్శించి, అంబులెన్స్‌లో ఆయన స్వస్థలమైన పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామానికి పంపారు. మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ పొంది, కుటుంబ సభ్యులతో కలసి శేష జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన ఉపాధ్యాయుడు ఈ విధంగా హఠాన్మరణం చెందడంతో తోటి ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా పీఎఫ్ క్లియరెన్స్, ఎన్ఓసీ కోసం నరసరావుపేట డీఈఓ కార్యాలయానికి వెళ్లాల్సిన వెంకటరెడ్డి సరైన సమాచారం లేకపోవడంతో గుంటూరు డీఈఓ కార్యాలయానికి వచ్చి ఈ విధంగా మృతి చెందారు. గుంటూరులోని డీఈఓ కార్యాలయంలో కుప్పకూలిన ఉపాధ్యాయుడు చల్లా వెంకటరెడ్డి జూన్‌లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా.. ఇంతలోనే మృత్యువాత -
పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి
జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్‌రావు కర్లపాలెం: పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్‌రావు చెప్పారు. దమ్మనవారిపాలెం ఘన వ్యర్ధ పదార్ధాల నిర్వహణ కేంద్రంలో బుధవారం ఎనిమిది గ్రామ పంచాయతీలలోని పారిశుద్ధ్య కార్మికులకు, పంచాయతీ కార్యదర్శులకు పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డీపీఓ కేఎల్ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం పనుల బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శులపై, పారిశుద్ధ్య కార్మికులపై ఉందన్నారు. ప్లాస్టిక్ వాడటం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామస్తులు తమ ఇళ్లల్లోని తడిచెత్త, పొడిచెత్తను వేర్వేరు డబ్బాలలో వేసి తమకు అందజేసే విధంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సర్పంచ్ గురపుసాల వెంకటేశ్వరమ్మ, ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు, కార్యదర్శి తిరుమలరెడ్డి, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. -
డెయిరీ ఫామ్‌లో కార్మికుడు మృతి
అద్దంకిరూరల్: బతుకు తెరువు కోసం బిహార్ రాష్ట్రం నుంచి వచ్చి డెయిరీ ఫామ్‌లో పనిచేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన బుధవారం అద్దంకి మండలంలోని మణికేశ్వరం గ్రామంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు... బిహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి బికాస్ జయదేవ్ (22) మణికేశ్వరం గ్రామంలోని ఓ డెయిరీ ఫామ్‌లో కొంత కాలంనుంచి పనిచేస్తున్నాడు. ప్రమాద వశాత్తు మిషన్ల వద్ద కిందపడి మృతి చెందాడు. సమా చారంతో అద్దంకి సీఐ సుబ్బరాజు, ఎస్ఐ ఖాదర్‌బాషా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించి కేసుదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏఎన్‌యూలో నేడు వార్షికోత్సవంఏఎన్యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా, యూనివర్సిటీ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ గురువారం జరుగుతాయని వేడుకల కన్వీనర్ ఆచార్య ఎం.త్రిమూర్తిరావు, ఆచార్య సీహెచ్ లింగరాజు, డాక్టర్ డి.రవిశంకర్ రెడ్డి తెలిపారు. వేడుకలకు ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.కృష్ణ తేజ, విశిష్ట అతిథిగా హైదరాబాద్ సీఎస్బీ అకాడమీ ప్రతినిధి ఎం.బాలలత, చీఫ్ ప్యాట్రన్‌గా వీసీ ఆచార్య కె.గంగాధరరావు, పాట్రన్స్గా రెక్టార్ ఆచార్య కె.రత్నషీలామణి, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, ఓఎస్డీ ఆచార్య ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవి కుమార్, గౌరవ అతిథులుగా ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎం.సురేష్ కుమార్, ఆచార్య కె.వీరయ్య, ఆచార్య ఎ.ప్రమీలారాణి హాజరవుతారన్నారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు.. యూనివర్సిటీ కళాశాలల యాన్యువల్ డే సెలబ్రేషన్స్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.సురేష్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేడుకల ఏర్పాట్లకోసం ఆరు ప్రత్యేక కమిటీలను నియమించామన్నారు. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా నిర్వహించిన పోటీల విజేతలకు వేడుకల్లో బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. యార్డుకు 1,59,032 బస్తాల మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,59,032 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,57,640 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.9,800 నుంచి రూ.13,500 వరకు లభించింది. తాలు రకం మిర్చి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 76,896 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
బెట్టింగ్‌లకు పాల్పడితే జీవితం అంధకారమే
బాపట్లటౌన్: బెట్టింగ్‌లకు పాల్పడితే జీవితం అంధకారంగా మారుతుందని ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని లాడ్జిలు, హోటల్స్, రిసార్ట్స్, దాబాలు, రెస్టారెంట్లలో మంగళవారం తనిఖీలు చేశారు. ఎస్పీ తుషార్‌డూడీ మాట్లాడుతూ ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది స్వార్థపరులు వారి స్వలాభం కోసం యువతను బెట్టింగ్ ఊబిలోకి లాగే అవకాశం ఉందన్నారు. అటువంటి వారు ప్రధానంగా లాడ్జిలు, హోటళ్లు, రిసార్ట్స్, రెస్టారెంట్లు, దాబాలను అడ్డాలుగా చేసుకొని వారి కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. అటువంటి వారి కార్యకలాపాలను కట్టడి చేసే ప్రధాన ఉద్దేశంతో తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించినా, ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమన్నారు. హోటళ్లు, లాడ్జిలు, రిసార్ట్స్‌లో బస చేయడానికి వచ్చే వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి వారి వివరాలను రికార్డులో నమోదు చేసుకోవాలన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు, ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించిన సమాచారం ఉంటే సంబంధిత పోలీసులకు, డయల్ 100, 112 నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. లాడ్జిలు, హోటల్స్, రిసార్ట్స్‌లో తనిఖీలు చేసిన పోలీసులు -
కత్తవ చెరువులో ఆక్రమణలు తొలగించాలి
నరసరావుపేట: సత్తెనపల్లి రోడ్డులో ఆవుల సత్రం పక్కన ఉన్న 60 ఎకరాలకుపైగా విస్తీర్ణం కలిగిన కత్తవ చెరువు ఆక్రమణల చెరలో ఉంది. ఈ చెరువును పరిరక్షించాల్సింది ఎవరనే దానిపై మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య వాదన నడుస్తోంది. పట్టణానికి పశ్చిమం వైపు నుంచి ప్రవహించే మురుగునీరు ఈ చెరువుకు చేరి కిందికి వెళుతోంది. దగ్గరలోనే రైల్వే బ్రిడ్జి, రైల్వే లైను ఉన్నాయి. నిరంతరం రైల్వే అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఈ చెరువును పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక్కడ ఆక్రమణల విషయం మున్సిపల్ అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్లానింగ్ ఆఫీసర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లను కలిసి ఆక్రమణలు తొలగించాలని వారు గతంలో కోరారు. ఆక్రమణలు తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినా చర్యలు తీసుకునేందుకు అధికారులు ముందుకు రావట్లేదు. ఆక్రమణదారుల వైపు ఎంత బలముందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారంపై పోరాడుతున్న ప్రజాసంఘాల నాయకులు తాజాగా మంగళవారం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కార్యాలయ సూపరింటెండెంట్‌తోపాటు చిన్న నీటి పారుదల శాఖకు చెందిన డీఈ, ఏఈలకు వినతిపత్రాలు సమర్పించారు. దీనిపై వారు స్పందిస్తూ ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖలు కలిసి చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపినట్లు నాయకులు వెల్లడించారు. గతంలో ఆర్డీవో సమావేశం నిర్వహించి ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేశారన్నారు. దీనిపై పీడీఎం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ.. రైల్వే లైను భద్రతతోపాటు పట్టణంలోని బరంపేట, గుంటూరు రోడ్డు ప్రాంతాలు ముంపు లేకుండా ఉండాలంటే కూడా ఈ చెరువును ఆక్రమణల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఆయా శాఖలకు చెందిన అధికారులను సమన్వయపరిచి ఆక్రమణలు తొలగింపజేయాలన్నారు. రక్షణ కంచె ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. పీడీఎం జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి, సీనియర్ నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోట నాయక్, ఆర్టీఐ కార్యకర్త వసంతరావు పాల్గొన్నారు. ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా శాఖల మధ్య సమన్వయలోపమే శాపం జిల్లా కలెక్టర్ జోక్యానికి నేతల వినతి -
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తుల స్వీకరణ
నరసరావుపేట ఈస్ట్: జిల్లా క్రీడా ప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో మే నెల 1 నుంచి 31వ తేదీ వరకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. పల్నాడు జిల్లా పరిధిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 50 శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శిబిరంలో 8 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల 25 మంది చొప్పున బాలురు, బాలికలకు శిక్షణ ఇస్తామన్నారు. జిల్లా పరిధిలోని క్రీడా అసోసియేషన్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు, సీనియర్ క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తాము శిక్షణ ఇవ్వనున్న క్రీడాంశం, ప్రదేశం పేర్కొంటూ పూర్తి వివరాలతో ఈ నెల 17వ తేదీలోగా స్టేడియంలోని కార్యాలయంలో అందజేయాలన్నారు. పద్మ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి పల్నాడు జిల్లా పరిధిలోని అర్హులైన క్రీడాకారులు నుంచి కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత పద్మ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2026వ సంవత్సరం గణతంత్ర దినోత్సవాల్లో అందించే పద్మ పురస్కారాల పరిశీలనకు దరఖాస్తులు పంపనున్నట్టు తెలిపారు. వివరాలను www. padmaawardr-gov.in వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. అర్హత గల క్రీడాకారులు తమ దరఖాస్తులను మే 26 వ తేదీలోగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ rportri na p@fmai.com, incentiver.-rchemer@fmai.com మెయిల్ అడ్రస్‌కు పంపాలని కోరారు. -
‘అభినవ గంధర్వ’ ఆరాధ్యుల వెంకటేశ్వరరావు
తెనాలి: కళారంగంలో విశిష్ట కృషిచేసిన నాటకరంగ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే కందుకూరి వీరేశలింగం రాష్ట్ర అవార్డుకు పట్టణానికి చెందిన ప్రముఖ పద్యనాటక కళాకారుడు ఆరాధ్యుల వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు. కందుకూరి వీరేశలింగం జయంతి రోజైన బుధవారం సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటుచేసే అవార్డుల ప్రదానోత్సవంలో వెంకటేశ్వరరావును వీరేశలింగం అవార్డు, రూ.లక్ష నగదు, జ్ఞాపికతో సత్కరిస్తారు. ఈ సందర్భంగా కళారంగ ప్రముఖుడు వెంకటేశ్వరరావు పరిచయం. తన పద్యగానంతో పౌరాణిక నాటకరంగాన్ని ప్రశాశింపజేసిన ఆణిముత్యాల్లో తెనాలికి చెందిన ‘అభినవ గంధర్వ’ ఆరాధ్యుల వెంకటేశ్వరరావు ఒకరు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలతో అర్ధ శతాబ్దంపాటు నాటక ప్రియులను అలరించిన ‘గానకోకిల’ ఏవీ సుబ్బారావు సుపుత్రుడు వెంకటేశ్వరరావు. డిగ్రీ చదివినా, తండ్రి కళా వారసత్వాన్ని అందుకున్నారు. ఏవీ సుబ్బారావు కళాప్రతిభతో ఒక వెలుగు వెలిగిన శ్రీపూర్ణశ్రీ నాట్య కళాసమితిని చేతబట్టి పద్యనాటకానికి అంకితమయ్యారు. తండ్రి తరహాలోనే శ్రీకృష్ణుడు పాత్రలో రాణించటమే కాకుండా వివిధ పౌరాణిక పాత్రల్లో తనదైన శైలితో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. నాలుగున్నర దశాబ్దాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని తెలుగువారు సహా ఆయన పద్యగానంలోని మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించారు. ‘గానకోకిల’ ఏవీ సుబ్బారావు పెద్దకుమారుడు వెంకటేశ్వరరావవు. సొంతూరు తెనాలి సమీపంలోని కొల్లూరు మండల గ్రామం అనంతవరం. తండ్రితోపాటు తెనాలిలోనే స్థిరపడ్డారు. తండ్రి స్ఫూర్తితో హైస్కూలులోనే తొలి వేషం గట్టిన ఈ కళాకారుడు. బీకాం చదువయ్యాక 1979లో పద్యనాటకాన్నే తన కెరీర్‌గా చేసుకున్నారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, అర్జునుడు, భవానీశంకరుడు, వేమారెడ్డి, నక్షత్రకుడు, బాలవర్ధి, చంద్రుడు పాత్రల్లో ప్రతిభను చాటారు. 2023 వరకు 4,371 ప్రదర్శనలు ఇచ్చిన ఘనతను సాధించారు. చింతామణి నాటకంలో ప్రేమ సన్నివేశం, శ్రీకృష్ణ రాయబారంలో పడకసీను, సెంటర్సీను, గయోపాఖ్యానం నాటకంలో యుద్ధసీను, చింతామణి పూర్తినాటకం, భవానీశంకరుడు ఏకపాత్ర ఆడియో రికార్డులుగా విడుదలయ్యాయి. గయోపాఖ్యానంలో యుద్ధసీను వీడియో రికార్డుగా వచ్చింది. పౌరాణిక పద్యనాటక కళాసేవకు గుర్తింపుగా 852పైగా సత్కారాలను, గౌరవాలను స్వీకరించారు. 2007–08 నంది నాటకోత్సవాల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతం, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు నంది అవార్డులు, బిరుదులను అందుకున్నారు. 1995లో ‘తానా’ ఆహ్వానంపై ఉత్తర అమెరికాలో అనేకచోట్ల నాటక ప్రదర్శనలిచ్చారు. గాయనీమణి పి.సుశీల చేతులమీదుగా బంగారు కంకణం, నెల్లూరులో బంగారు కిరీటం, అక్కినేని నాగేశ్వరరావు చేతులమీదుగా కె.రఘురావుయ్య అవార్డు మరచిపోలేని అనుభూతులుగా వెంకటేశ్వరరావు చెబుతారు. నాటకం ప్రదర్శిస్తుండగా ప్రేక్షకుల నుంచి కానుకల రూపంలో వచ్చిన రూ.4 లక్షలతో ఒక నిధి ఏర్పాటుచేసి నెలకు ఐదుగురు చొప్పున పేదకళాకారులకు రూ.500 వంతున ఆర్ధికసాయం అందజేస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు. అధ్యాపకుడిగా పనిచేస్తున్న వీరి కుమారుడు నాగరాజు రంగస్థల నటుడిగా రాణిస్తున్నారు. ఏవీ సుబ్బారావు వర్ధంతి రోజైన డిసెంబరు 16న వెంకటేశ్వరరావు, నాటకరంగంలోనే కొనసాగుతున్న ఆయన సోదరులు కోటేశ్వరరావు, ఆదినారాయణ ఏటా భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏవీ సుబ్బారావు పేరిట రాష్ట్రస్థాయి అవార్డును ప్రదానం చేయటమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా గల పలువురు కళాకారులను సత్కరిస్తున్నారు. తండ్రి ఏవీ సుబ్బారావు కళావారసుడు పౌరాణిక పద్యనాటకానికి అంకితమైన కళాకారుడు నాలుగున్నర దశాబ్దాల్లో నాలుగువేలకు పైగా ప్రదర్శనలు వందలాది సత్కారాలు, బిరుదులు, గౌరవాలు కందుకూరి వీరేశలింగం రాష్ట్ర అవార్డుకు ఎంపిక -
పునర్విభజనతో దక్షిణాదికి నష్టం ఖాయం
నరసరావుపేట: పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే పరిస్థితి ఉందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి ఆధారంగా పెంచితే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు. ‘పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన–ఫెడలరిజం’ అనే అంశంపై మంగళవారం కోటప్పకొండ రోడ్డులోని విజ్ఞాన మందిరంలో నిర్వహించిన సెమినార్లో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. 2026లో జరిగే డీలిమిటేషన్‌తో జనాభా ఆధారంగా జరిగితే 543 సీట్లు 843 కు పెరుగుతాయన్నారు. దక్షణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరిగిందన్నారు. ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల వెనుకబాటుతనంతో జనాభా విపరీతంగా పెరిగిందన్నారు. దీని వలన అక్కడ సీట్లు పెరిగే అవకాశం బాగా ఉందన్నారు. యూపీలోని 80 సీట్లు 128 అవుతాయన్నారు. ఉమ్మడి ఏపీలోని 42 సీట్లు 48 సీట్లు మాత్రమే అవుతాయన్నారు. దీని వలన రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని తెలిపారు. దీంతో దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య సమతుల్యత లోపిస్తుందన్నారు. దీని వల్ల దేశ సమైక్యతకు భంగం వాటిల్లే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. అన్ని రాజకీయపార్టీలు దీనిపై చర్చించాలని కోరారు. ఏపీలోని కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, ప్రతిపక్ష వైఎస్సార్సీపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. పౌరసమాజం చైతన్యవంతమై రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని సూచించారు. పార్లమెంట్ నియోజవర్గాలను సీట్ల ప్రాతిపదికన విభజిస్తేనే న్యాయం జనాభా ప్రాతిపదికన సరికాదన్న మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు -
జిల్లా ఫస్ట్ సాధించిన విద్యార్థినికి నగదు బహుమతి
చీరాలఅర్బన్: ఇంటర్మీడియట్ ఫలితాలలో చీరాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన సీనియర్ ఇంటర్ విద్యార్థిని కె.ధాత్రిశ్రీ బైపీసీలో 1000 మార్కులకు 975 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రిన్సిపాల్ ఎస్.స్నేహలత తెలిపారు. జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా కె.ధాత్రిశ్రీకి జిల్లా కేంద్రం బాపట్లలో జరిగిన కార్యక్రమంలో బాపట్ల ఎంపీ టి.కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్రవర్మ, జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి చేతుల మీదగా రూ.10వేల నగదు ప్రశంసా పత్రాన్ని అందుకుందన్నారు. విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. నేడు 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బాలుర ఖోఖో జట్టు ఎంపిక జె.పంగులూరు: 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ స్పోర్ట్స్ అథారిటి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి బాచిన నారాయణ జూనియర్ కళాశాలలో ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీలో బాలుర ఖోఖో జట్టు ఎంపిక జరగనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి కెఏ పాల్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎంపికలో 18 సంవత్సరాలపై బాలురు, 10.01.2007 తరువాత పుట్టిన వారు మాత్రమే పాల్గొనాలని తెలియజేశారు. ఈ పోటీలలో ఎంపికై న క్రీడాకారులకు బీహార్ రాష్ట్రంలోని గయా పట్టణంలో మే 5 నుంచి 9 వరకు జరగబోవు ఖేలో ఇండియా పోటీలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ ఎంపికలో రాష్ట్రం నలుమూలల నంచి క్రీడాకారులు హాజరౌతారని తెలిపారు. ఈ ఎంపికలో శాప్ చైర్మన్ ఏ రవినాయుడు, వీసీ ఎండీ గిరీష్ సహకారంతో జరుగుతుందని రాష్ట్ర కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి తెలిపారు. వివేక్ ప్రపంచ రికార్డు సాధించడంపై హర్షం బల్లికురవ: సంగీతంపై ఉన్న మమకారం, తండ్రి ప్రోత్సాహంతో మందా వివేక్ ప్రపంచ రికార్డు సాధించటం అభినందనీయమని వల్లాపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ మందా మోహన్‌రావు మంగళవారం కొనియాడారు. వల్లాపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న వివేక్‌కు సంగీతమంటే ప్రాణం తండ్రి రమేష్ కీబోర్డు ప్లేయర్ కీబోర్డుపై వివేక్ గీతాలు ఆలపిస్తూ గతేడాది డిసెంబర్ 4 జరిగిన ఆన్లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో పాల్గొన్నారు. కీబోర్డు వాయిస్తున్న కళాకారుల బృందం గంటలో 1046 వీడియోలు అప్లోడ్ చేశారు. హలీల్ మ్యూజిక్ స్కూల్ స్థాపన పాస్టర్ అగస్టీన్ చేతుల మీదుగా సోమవారం హైదరాబాద్‌లో మెడల్, ప్రశంసా పత్రం అందుకున్నారు. బాల్యదశలోనే విద్యతో పాటు పట్టుదలతో సంగీతం నేర్చుకుని ప్రపంచ రికార్డుతో అరుదైన గౌరవం దక్కటం దేవునికృప అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. -
నాటుసారా విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
చీరాల: అక్రమంగా నాటుసారా విక్రయాలు సాగిస్తున్న చీరాల మండలం ఆదినారాయణపురంకు చెందిన వల్లాగి నాగరాజు అనే వ్యక్తిని మంగళవారం ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎకై ్సజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఎకై ్సజ్ సీఐ పి.నాగేశ్వరరావు, ఎస్సైలు, ఒన్‌టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈపూరుపాలెం పంచాయతీ ఆదినారాయణపురానికి చెందిన వల్లాగి నాగరాజు అక్రమంగా సారా విక్రయాలు చేస్తుండడంతో అతడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఆరు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అలానే చీరాల వైకుంఠపురం దండుబాట సమీపంలో జాలమ్మ గుడి వద్ద కావాటి నాగరాజు నాటుసారా విక్రయిస్తున్నాడనే సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఎనిమిది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ చట్టం ప్రకారం నాటుసారా కలిగి ఉండుట, అమ్ముట, రవాణా చేయడం నేరమని సీఐ నాగేశ్వరరావు అన్నారు. నాటుసారా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పసుపు ధరలు దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో 1,303 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొమ్ములు 846 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.10,200, గరిష్ట ధర రూ.12,000, మోడల్ ధర రూ.11,700 పలికింది. కాయలు 457, బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.10.200, గరిష్ట ధర రూ.12,225, మోడల్ ధర రూ.11,700 పలికింది. -
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
జె.పంగులూరు: ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ముప్పవరం కోటపాడు గ్రామాల మధ్య మంగళవారం రాత్రి జరిగింది. కోటపాడు గ్రామానికి చెందిన పూసపాటి శివశంకర్ ట్రాక్టర్ మొక్కజొన్న లోడ్‌కి వెళ్లి రాత్రి సమయంలో కోటపాడు వస్తుంది. అదే ట్రాక్టర్లో కోటపాడు గ్రామానికి చెందిన గొల్లమూడి అంజయ్య (50) ఉన్నాడు. అంజయ్య ట్రాక్టర్ ఇంజిన్‌పై కూర్చున్నట్లు తెలుస్తుంది. ట్రాక్టరు ముప్పవరం నుంచి కోటపాడు వచ్చే రూట్లో ఆదిరెడ్డి బావి దగ్గర మలుపు తిరుగుతుండగా, ట్రాక్టర్ అదుపు తప్పి ఒకసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్‌పై ఉన్న గొల్లమూడి అంజయ్య కింద పడిపోయాడు. కిందపడ్డ అంజయ్యపై ట్రాక్టర్ వెనుక చక్రం పోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య వెంకాయమ్మ, కుమారులు మరియబాబు, వెంకటేష్ ఉన్నారు. అంజయ్య మృతి వార్త తెలియడంతో ఎస్సీ కాలనీవాసులంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు. రూ.8.52 లక్షలు అపరాధ రుసుము వసూలు -
చలివేంద్రానికి పోలీసు అనుమతి నిరాకరణ
పర్చూరు (చిన్నగంజాం): చలివేంద్రం ఏర్పాటు చేసేందుకు రోటరీ క్లబ్ చేసుకున్న విన్నపాన్ని పర్చూరు పోలీసులు తిరస్కరించారు. బొమ్మల సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందన్న కారణంతో పోలీసులు అనుమతిని నిరాకరించినట్లు తెలిసింది. దీంతో పాదచారులు, ప్రయాణికులు ఎండ తీవ్రతకు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల దాహార్తిని తీర్చటానికి బొమ్మల సెంటర్లో చలివేంద్రం లేకపోవడంతో స్థానికులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పర్చూరు రోటరీ క్లబ్ గత 23 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో నిస్వార్థ సేవలు అందిస్తుంది. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటుచేసి దాతల సహకారంతో 45 రోజుల పాటు మజ్జిగను కూడా అందిస్తుంది. ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నా ఇంకా చలివేంద్రం మొదలు కాక పోవడంతో స్థానికులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. పంచాయతీ వారు అనుమతిని మంజూరు చేసినా, పోలీసులు నిరాకరించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇన్ని సంవత్సరాల నుండి లేని ట్రాఫిక్ సమస్య ఇప్పుడే తలెత్తిందా అన్న ప్రశ్నను స్థానికులు లేవనెత్తుతున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించడం వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో జోరుగా చర్చ సాగుతోంది. ఏదేమైనా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బొమ్మల సెంటర్లో చిన్నపాటి చలివేంద్రం ఏర్పాటుకై నా పోలీసులు అనుమతిని మంజూరు చేయాలని కోరుతున్నారు. -
పోలీస్ శాఖ ని‘శ్రేష్ట’ం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులకు ఒక న్యాయం..బలహీన వర్గ అధికారులకు మరో న్యాయం అన్న చందాన రేంజ్ అధికారి సర్వశ్రేష్ట త్రిపాఠి వ్యవహార శైలి ఉంది. దీనిపై జిల్లా పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అరెస్టు చేసిన సమయంలో వేటు పడిన ఇద్దరు ఎస్‌ఐలూ బలహీనవర్గాలకు చెందినవారే. ఆ సమయంలో అక్కడే ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ సామాజికవర్గ పోలీసు అధికారులు అక్కడే ఉన్నా.. వారిపై కనీస చర్యల్లేకపోవడంపై పోలీసుశాఖలో నిరసన వ్యక్తమవుతోంది. ఆద్యంతం టీడీపీ సామాజికవర్గ అధికారుల కనుసన్నల్లోనే.. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను, ఆయన అనుచరులను మంగళగిరిలో అరెస్టు చేసి ముందుగా నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన ఎస్హెచ్ఓ వంశీధర్ వద్దకు తరలించారు. కోర్టులో హాజరు పరిచే ముందు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన స్పెషల్ బ్రాంచ్ సీఐ ఆళ్ల హరిశ్రీనివాస్, కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో తీసుకెళ్లారు. ఆ తర్వాత కోర్టులో హాజరు పరిచే సమయంలో మాధవ్ తన అనుచరుల వద్ద ఫోన్ తీసుకుని తన లాయర్‌తో మాట్లాడుతుండగా సీఐ వీరాస్వామి దానిని లాక్కున్నారు. ఈ సమయంలో సీఐ వీరయ్యచౌదరి, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఆళ్ల హరి శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నారు. వారు మాధవ్ ఫోన్లో మాట్లాడుతున్నా పట్టించుకోలేదు. సీఐ వీరాస్వామి ఫోన్ లాక్కున్నారు. అయితే మాధవ్ ఫోన్ మాట్లాడుతతున్నా.. నిర్లక్ష్యంగా ఉన్నారన్న సాకుతో సీఐ వీరాస్వామితోపాటు పట్టాభిపురం ఎస్ఐ రాంబా బు, నగరంపాలెం ఎస్ఐ రామాంజనేయులుతోపాటు 12 మందిని రేంజ్ ఐజీ సస్పెండ్ చేశారు. వాస్తవానికి అరెస్టు సమయంలో నిందితుడు బంధుమిత్రులు, లాయర్‌తో ఫోన్ మాట్లాడే హక్కుంది. అతని వద్ద ఫోన్ లాక్కునే అధికారం పోలీసులకు లేదని సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మాధవ్ ఫోన్ మాట్లాడుతున్నా.. చోద్యం చూసిన వారిని వదిలేసి ఫోన్ లాక్కున్న సీఐ వీరాస్వామిపై వేటు పడడం విస్తుగొలుపుతోంది. ఒక వేళ మాజీ ఎంపీ వ్యవహారంలో తప్పు జరిగినట్టు పోలీస్ బాస్ భావిస్తే మంగళగిరి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్ వరకు ఎంత మంది పోలీసు అధికారులు ఉన్నారో అంత మందినీ సస్పెండ్ చేయాలి కానీ ఎస్సీ, బీసీలనే టార్గెట్‌గా చేసి సస్పెండ్ చేయడమేమిటని సిబ్బంది ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఉద్యోగోన్నతి జాబితాలో ఉన్నా వేటు నగరంపాలెం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ రామాంజనేయులు ఉద్యోగోన్నతి జాబితాలో ఉన్నారు. కొద్దిరోజుల్లో సీఐ కానున్నారు. దీంతో ఆయన కూడా తన తప్పు లేకుండా సస్పెండ్ వేటు వేశారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. బలహీనవర్గాలపై వివక్ష? ఆరునెలల్లో రెండు సార్లు సస్పెండైన ఎస్ఐ సీఐ ఉద్యోగోన్నతి జాబితాలో ఉన్న ఎస్ఐపైనా వేటు అధికారపార్టీ సామాజికవర్గానికి రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి వంత జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిన పోలీస్‌బాస్ తీరు ఆరునెలల్లో రెండోసారి సస్పెన్షన్ పట్టాభిపురం ఎస్ఐ రాంబాబు ఆరునెలల్లో రెండో సారి సస్పెండ్ అయ్యారు. దీంతో ఆయన తన తప్పు లేకున్నా వేటు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. దీని వల్ల తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారతాయని బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. వీరిపై చర్యలేవీ.. మాజీ ఎంపీ మాధవ్ సెల్‌ఫోన్ మాట్లాడిన వ్యవహారంలో 12 మందిని సస్పెండ్ చేసిన పోలీసుశాఖ ఇందులో భాగస్తులైన టీడీపీ సామాజికవర్గానికి చెందిన మంగళగిరి ఎస్ఐ వెంకట్, కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి, నల్లపాడు సీఐ వంశీధర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఆళ్ల హరి శ్రీనివాస్‌లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వెస్ట్ డీఎస్పీ ముందు సస్పెండ్ అయిన ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. బందోబస్తుకు వెళ్లి దూరంగా ఉన్న తమపై వేటు వేయడం ఏమిటని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో సస్పెండ్ అయి ఏఆర్ నుంచి సివిల్‌కు కనవర్షన్ అయిన బలహీనవర్గాల వారిని ఆరునెలలైనా ఇంతవరకు విధుల్లోకి తీసుకోలేదు. కానీ వీఆర్‌లోకి వెళ్లిన టీడీపీ సామాజిక వర్గానికి చెందిన సీఐకి మాత్రం తుళ్లూరు ఎస్హెచ్ఓగా బాధ్యతలు అప్పగించారు. ఈ వివక్ష ఎందుకో అధికారులే సమాధానం చెప్పాలి. -
ఎస్సీ సంక్షేమ శాఖ గుంటూరు డీడీగా రాజా దిబోరా
నెహ్రూనగర్: గుంటూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా రాజా దిబోరా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ డీడీగా పనిచేస్తున్న డి.మధుసూదనరావు 3 నెలలకుపైగా సెలవుపై వెళ్లడంతో ఇప్పటి వరకు ఏఓ గా పనిచేస్తున్న మాణిక్యవరరావు ఇన్చార్జ్గా వ్యవహరించారు. తాజాగా ఆయన స్థానంలో బాపట్ల జిల్లా ఎస్సీ వెల్ఫేర్‌గా డీడీగా పనిచేస్తున్న రాజా దిబోరాకు గుంటూరు జిల్లా డీడీగా (పూర్తి అదనపు) బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్సైట్లో ఎస్ఏల సీనియార్టీ జాబితా గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లతో రూపొందించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీఈవోజీఎన్‌టీ.బ్లాగ్స్పాట్.కామ్ సైట్లో ఉంచిన సీనియార్టీ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈ నెల 20వ తేదీలోపు గుంటూరు డీఈవో కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమర్పించాలని తెలిపారు. మున్సిపల్ యాజమాన్యంలోని పాఠశాలల్లో ఉద్యోగోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయులతో సీనియార్టీ జాబితాను ఇప్పటికే విడుదల చేశామని గుర్తుచేశారు. గరుడ వాహనంపై చెన్నకేశవుడు మాచర్లరూరల్: శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని గరుడు వాహనం పై ఊరేగించనున్నారు. మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి రాజగోపాలాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఊరేగింపును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పల్నాటి ప్రజల ఇలవేల్పు శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయన్నారు. భక్తులు వేలాదిగా తరలివస్తారన్నారు. ఈఓ ఎం. పూర్ణచంద్రరావు, జేఏ వీరారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు కొమెర అనంతరాములు, బండ్ల బ్రహ్మం, గాజుల గణేష్, కోమటి వీరు, మద్దిగపు శ్రీనివాసరెడ్డి, సుంకె వాసు తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ కొరిటెపాడు(గుంటూరు): వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ ముస్లింల పట్ల అంకితభావం చాటుకుందని గుంటూరు మాజీ ఎమ్మెల్యే, మైనార్టీ వ్యవహారాల రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు ఎస్.ఎం.జియావుద్దీన్ అన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బిల్లు విషయంలో తెలుగుదేశం పార్టీ ద్వంద్వ విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ముస్లింలకు మంచి చేసే సంస్థలను నీరుగార్చేలా కేంద్రంలోని బీజేపీ కూటమి కుయుక్తులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన నేత పవన్ కల్యాణ్ ఎందుకు మౌనం వీడటం లేదని ప్రశ్నించారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 515.20 అడుగుల వద్ద ఉంది. ఇది 140.6684టీఎంసీలకు సమానం. -
పునరావాసం కల్పించి ఇళ్లను కూల్చండి
గుంటూరురూరల్: ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేజ్ 3 నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 41వ డివిజన్ స్వర్ణభారతినగర్‌లో సుమా రు 200 ఇళ్లను అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా తొలగిస్తున్నారు. దీంతో ఇళ్లు కోల్పోతున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఇళ్లు కట్టుకుని ఉంటున్నామని, కూలీనాలీ చేసుకుని బతుకుతున్నామని పేర్కొంటున్నారు. అధికారులు ఉన్నపళంగా ఇళ్లను కూలిస్తే ఏం చేయాలని కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు పూర్తి పునరావాసం కల్పించి ఇళ్లను కూల్చాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఇళ్లను పొక్లెయిన్లతో కూల్చి వేస్తున్న క్రమంలో అడ్డుకున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం పునరావాసం కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్, కమిషనర్, నగర మేయర్‌కు వినతిపత్రాలు అందించారు. 40 ఏళ్ల నుంచి నివసిస్తున్నాం ఇళ్లను తొలగించడం అన్యాయం ఇన్నర్‌రింగ్‌రోడ్డు ఫేజ్ 3లో ఇళ్లు కోల్పోతున్న 200 కుటుంబాల ఆవేదన కూలి చేసుకుని బతికేవాళ్లం గత ప్రభుత్వాలు ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించు కుని 40 ఏళ్లుగా కూలి చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి ఇళ్లను కూల్చేస్తున్నారు. పునరావాసం కల్పించి ఇళ్లు కూల్చుకోవాలని చెబుతున్నాం. అయినా పట్టించుకోవడం లేదు. ఇల్లు కూల్చేశారు. ఇప్పుడు పిల్లలతో కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్లాలి? – జిల్లా సత్యవతి, స్థానికురాలు, బాధితురాలు -
కన్నేశాడు...కబ్జా చేశాడు
టాస్క్‌ఫోర్స్: కుక్క పిల్ల..సబ్బు బిళ్ల..అగ్గి పుల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఏ రకమైన భూమైనా ఆక్రమణకు అర్హమై అంటున్నారు కూటమి నేతలు. ఈ నేపథ్యంలో వారి చూపు ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంపై పడింది. అంతే అప్పటికప్పుడు దొంగ సర్వే నంబర్లు వేసి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా అమ్మకానికి పెట్టారు. భూమి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని స్థానికుల అంచనా. రెవెన్యూ అధికారులు కూడా ఆక్రమణదారుడికి అండగా నిలిచారు. ఆక్రమణదారుడు అధికార పార్టీ నేత కావడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. 110 ఏళ్ల నాటి పూరాతన స్కూల్ వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని కొత్తనగర్లో చీరాల–ఒంగోలు ప్రధాన రహదారి పక్కన నాలుగు సెంట్ల స్థలంలోని ఓ పెంకుటింటిలో స్కూల్ నిర్వహించే వారు. 1985 ఫిబ్రవరి 24న అప్పటి సమితి అధ్యక్షుడు ఉప్పల వెంకటేశ్వర్లు పెంకుటిల్లును తొలగించి నూతనంగా పక్కా భవనం నిర్మించారు. కొంతకాలం తరువాత స్కూల్‌కి వచ్చే విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ప్రధాన రహదారి పక్కనే స్కూల్ భవనం ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండేవి. దీన్ని గమనించిన అప్పటి ప్రభుత్వం పాఠశాలను వేరే ప్రాంతంలో కొత్తగా భవనాలు నిర్మించి అక్కడికి తరలించారు. అప్పటి నుండి పాత స్కూల్ భవనం ఖాళీగా ఉండేది. కొంత కాలం ఈ స్కూల్ భవనాన్ని కమ్యూనిటీ హాలుగా గ్రామస్తులు వినియోగించుకున్నారు. ఆ తరువాత పశువైద్యశాలకు వినియోగిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆ స్కూల్ భవనంలోనే కొంత భాగంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతు భరోసా కేంద్రాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. స్థలంపై కూటమి నేత కన్ను లక్షలు విలువ చేసే స్కూల్ భవనం ముందు ఉన్న ఖాళీ స్థలంపై పందిళ్లపల్లికి చెందిన కూటమి చోటా నాయకుడి కన్ను పడింది. వెంటనే కబ్జాకు పథకం రచించాడు. అతనికి రామన్నపేట కొత్తనగర్లో సర్వే నెంబర్ 347–1లో అసైడ్ భూమికి పట్టా ఉంది. అప్పట్లో ఈ అసైన్డ్ భూమిని స్థానికులు ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నారు. వేటపాలెం రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 344–2లో 60 సెంట్ల భూమి ఉంది, దానికి కొలతలు కొలిపించాలంటూ జనవరి 6వ తేదీన తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ దాఖలు చేశాడు. జనవరి 24న సర్వేయరు ఆ భూమిని సర్వే చేశాడు. సర్వే సమయంలో సర్వేయరుకు వాల్యుం 87–1941లో రిజిస్టేషన్ డాక్యుమెంట్లు అర్జీదారుడు చూపించాడు. అతను చూపించిన డాక్యుమెంట్‌లోని అసైన్డ్ భూమి వేటపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 347–1లో ఉందని, అర్జీదారుడు కొలతల కోసం చూపించిన భూమి మాత్రం సర్వే నెంబరు 344–2లో ఉందని అర్జీదారుడికి సర్వేయరు ఎండార్స్మెంట్ ఇచ్చారు. దీన్ని అడ్డు పెట్టుకొని 344–2లోగల పాత స్కూల్‌కి చెందిన ఒకటిన్న సెంట్ల భూమిని ఇంకొల్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మార్చి 24వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రామన్నపేటలో ప్రభుత్వ స్కూల్ భూమి ఆక్రమణ దొంగ సర్వే నెంబర్‌తో రిజిస్ట్రేషన్ భూమి విలువ రూ.20 లక్షలు ఆక్రమణదారుడికి సహకరించిన రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపులు అటు వైపు కన్నెత్తి చూడని ప్రభుత్వ అధికారులు సర్వే నంబర్లు వేరని ఎండార్స్మెంట్ ఇచ్చాం పందిళ్లపల్లికి చెందిన వారు రామన్నపేట పాత స్కూలు ముందు స్థలం తమదని, దాన్ని సర్వే చేయాలని అర్జీ పెట్టారు. సర్వే సమయంలో వారు చూపిన డాక్యుమెంట్లు పరిశీలించాం. వారు కోరిన సర్వే నంబరు, వారు అర్జీలో రాసిన సర్వే నంబరు వేరుగా ఉన్నట్లు గుర్తించాం. అర్జీదారుడికి రెండు సర్వే నంబర్లు వేరని ఎండార్స్మెంట్ ఇచ్చాం. –శ్రీనివాసరావు, మండల సర్వేయర్ -
లక్ష్యాల మేరకు పురోగతి సాధించాలి
బాపట్ల: గృహ నిర్మాణాలలో లక్ష్యాల మేరకు పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. గృహ నిర్మాణాలపై ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు మంజూరు చేస్తున్న పక్కా గృహాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. లక్ష్య సాధనలో నిర్లిప్తంగా ఉండరాదన్నారు. అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను లబ్ధిదారులు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. గృహ నిర్మాణాలలో చీరాల డివిజన్ పురోగతిలో లేకపోవడంపై సంబంధిత డీఈని ప్రశ్నించారు. గృహ నిర్మాణాలలో ప్రతివారం పురోగతి కనిపించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలలో చెరుకుపల్లి, కారంచేడు, చుండూరు, ఇంకొల్లు, పర్చూరు, వేటపాలెం మండలాలలో పురోగతి లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ అధికారులు పద్ధతి మార్చుకొని పనిచేయాలని హెచ్చరించారు. అద్దంకి, చీరాల, చినగంజాం మండలాలలో గృహ నిర్మాణ పనులు జరగకపోవడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలలో గృహ నిర్మాణాలు, ధ్రువీకరణ పత్రాల జారీ, బిల్లుల చెల్లింపులు, తదితరమైన వాటిపై ప్రతి వారం లక్ష్యాలు నిర్దేశించుకుని ఆ మేరకు పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వర్లు, డీఈలు, ఏఇలు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు చర్యలు బాల్య వివాహాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను ఎవ్వరూ ప్రోత్సహించకూడదని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలను గమనిస్తే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు. జిల్లా యంత్రాంగం సరైన చర్యలు తీసుకుని వాటిని ఆపడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వటం జరుగుతుందన్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ను గమనించి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలలోనూ విద్యార్థులకు బాల్య వివాహాలపై సదస్సులు ఏర్పాటుచేసి అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి గృహ నిర్మాణాలపై సమీక్ష -
కానిస్టేబుల్ అదృశ్యం
మంగళగిరి టౌన్: కానిస్టేబుల్ అదృశ్యంపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆక్టోపస్‌లో కానిస్టేబుల్‌గా ఫారుఖ్ విధులు నిర్వహిస్తున్నాడు. మంగళగిరి పట్టణ పరిధిలోని టిప్పర్ల బజార్లో గత కొంతకాలంగా కుటుంబంతో కలసి ఉంటున్నాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు. వైజాగ్‌లో ఫైరింగ్ ప్రాక్టీస్ ఉందంటూ ఫారుక్ ఈ నెల 8వ తేదీన బయలుదేరి వెళ్లాడు. ఆ మరుసటి రోజు సాయంత్రం 6 గంటల సమయంలో భర్తకు ఫోన్ చేశానని, ఆ సమయంలో వైజాగ్‌లోనే ఉన్నానని చెప్పినట్లు బషీరున్ ఫిర్యాదులో పేర్కొంది. 10వ తేదీ ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. మళ్లీ రెండు రోజుల తరువాత ఫోన్ చేసినా స్విచ్చాఫ్‌గా ఉండడంతో ఫారుఖ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు 12వ తేదీన మంగళగిరి చేరుకుని నగరంలోని ఆక్టోపస్ కార్యాలయానికి బషీరున్ను తీసుకుని వెళ్లారు. ఆక్టోపస్ కార్యాలయంలో అధికారులకు జరిగిన విషయం చెప్పడంతో ఫారుఖ్ ఈనెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు సెలవు పెట్టి ఉన్నాడని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తప్పిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి సంతమాగులూరు(అద్దంకి): మండలంలోని ఏల్చూరులో ఉన్న కస్తూరిబా గాంధీ గురుకుల బాలికా విద్యాలయ్యాన్ని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు పద్మావతి సోమవారం సందర్శించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. విద్యార్థినులకు అంబేడ్కర్ చరిత్ర గురించి విరించారు. ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోధన చేయాలని ఉపాధ్యాయులకు చెప్పారు. బాలల హక్కుల గురించి వివరించారు. పదో తరగతి పాసైన విద్యార్థినులకు కేజీబీవీలోనే ప్రవేశాలు కల్పించే విధంగా సమగ్ర శిక్ష, విద్యాశాఖను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన తప్పనిసరి చీరాల అర్బన్: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి వీవీ రామకృష్ణ పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సోమవారం స్థానిక అగ్నిమాపక కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సిబ్బంది అగ్నిమాపక పతాకానికి గౌరవ వందనం చేశారు. అగ్నిమాపక శాఖలో పనిచేసి అమరులైన సిబ్బందికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అగ్నిప్రమాదాల నియంత్రణలో ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. చిన్న చిన్న అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి వాటిని నివారించవచ్చన్నారు. సరైన అవగాహన లేకపోవడం వలనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. అగ్నిప్రమాదం జరిగితే అగ్నిమాపక వాహనం వచ్చే సమయంలోగా ప్రాథమికంగా ప్రజలే స్వయంగా మంటలు అదుపుచేసేందుకు పలు రకాల చర్యలు చేపట్టాలన్నారు. 1944 ఏప్రిల్ 14న ముంబైలోని దాల్ యార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో 336 మందితోపాటు 66 మంది సిబ్బంది కూడా మరణించారని, వారి స్మతికి చిహ్నంగా ఏప్రిల్ 14వ నుంచి 20వ తేదీ వరకు దేశమంతటా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వారోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. -
సోషలిస్ట్ నేత మోదుగుల పాపిరెడ్డికి ఘన నివాళి
గుంటూరు రూరల్: సోషలిస్ట్ పార్టీ నేత మోదుగుల పాపిరెడ్డి(88) దిశదిన కర్మకు ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. సోమవారం ఇన్నర్ రింగ్‌రోడ్డులోని రెడ్డిపాలెం వద్ద ఉన్న ఆయన కుమారుడు, వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి నివాసంలో పాపిరెడ్డి కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, మోదుగుల కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు. పాపిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, మర్రి రాజశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, వైఎస్సార్ సీపీ పొన్నూరు, ప్రత్తిపాడు, వేమూరు, సత్తెనపల్లి, మంగళగిరి సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, బలసాని కిరణ్‌కుమార్, వరికూటి అశోక్‌కుమార్, గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబులతో పాటు భాష్యం రామకృష్ణ, నన్నపనేని రాజకుమారి, కోవెలమూడి రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీలు జేడీ శీలం, వై.శివాజీ తదితరులు నివాళుల ర్పించిన వారిలో ఉన్నారు. దశ దిన కర్మకు హాజరైన ప్రముఖులు కుటుంబ సభ్యులకు పరామర్శ -
అంబేడ్కర్ ఆశయాలు యువతకు ఆదర్శనీయం
బాపట్ల టౌన్: అంబేడ్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎస్పీ తుషార్‌డూడీ మాట్లాడుతూ దేశంలో అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడానికి అంబేడ్కర్ విశేష కృషి చేశారని తెలిపారు. భారతదేశ రాజ్యాంగానికి దిశా నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారని చెప్పారు. నాడు అంబేడ్కర్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని ప్రపంచ మేధావి అయ్యారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. సమాజంలో కుల, మత, వర్గ, లింగ వివక్షను ఎప్పుడైతే విడనాడతామో అప్పుడే అభివృద్ధి చెందుతుందని వివరించారు. అంబేడ్కర్ చెప్పిన విధంగా ‘‘మనమంతా భారతీయులం, మనమంతా ఒక్కటే’’ అనే నినాదంతో జీవించాలని, అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. అంబేడ్కర్ పేద కుటుంబంలో పుట్టి, ఎంతో కష్టపడి చదివి, ఎన్నో కష్టనష్టాలకు ఎదురొడ్డి ఉన్నతస్థాయికి చేరుకున్నారని ఎస్పీ వివరించారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయ వేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా అన్నిటికి మించి సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్, సీసీ హరికృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ తుషార్ డూడీ -
నేలవాలిన పంటలు
అకాల వర్షంతో బల్లికురవ: ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికందే దశలో ఈదురుగాలుల వర్షం ధాటికి నేలవాలాయి. ఆదివారం సాయంత్రం మండలంలోని కొప్పరపాడు, వైదన, కొమ్మినేనివారిపాలెం, చెన్నుపల్లి, ముక్తేశ్వరం, ఎల్ఎల్గుడిపాడు, అంబడిపూడి, బల్లికురవ గ్రామాల్లో వర్షం, గాలి ప్రభావంతో కండె దశలో ఉన్న మొక్కజొన్న నేలావాలింది. ఎకరాకు రూ.30 నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టామని దిగుబడులు ఆశాజనకంగా ఉన్న పరిస్థితిలో నష్టాలు మిగిల్చాయని రైతులు వాపోయారు. పైగ్రామాల్లో సుమారు. 800 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నష్టపోయిన పంటలను పరిశీలించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. గాలివానతో నేలవాలిన మొక్కజొన్న జే పంగులూరు: అదివారం సాయంత్రం మండలంలోని కొన్ని గ్రామాల్లో గాలితో కూడిన వర్షం పడటంతో మొక్కజొన్న రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందని ఏఓ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం గాలివానతో నొలకొరిగిన మొక్కజొన్న పంటను, కారణంగా తడిచిన మొక్కజొన్నను ఏఓ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సోమవారం, మంగళవారం, బుధవారాలు వరకు వాతావరణ శాఖ దక్షిణ కోస్తా జిల్లాలో గాలి, ఉరుములతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారన్నారు. కల్లాలో ఉన్న పంటలను జాగ్రత్త పరుచుకోవాలని తెలిపారు. వీలైతే పంట కోతలు బుధవారం వరకు వాయిదా వేయాలని ఆయన సూచించారు. బొప్పాయి, అరటి తోటలకు తీవ్ర నష్టం అద్దంకి: వేసవిలో కురిసిన గాలి వానకు సంతమాగులూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉద్యాన రైతుకు నష్టం కలిగింది.అ అలాగే అద్దంకి మండలంలోని రామాయపాలెం, తిమ్మాయపాలెం, అద్దంకి, తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల్లో పచ్చి ఇటుక వర్షానికి తడిసిపోయింది. ఒక్కో బట్టీల్లో కనీసం రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు నష్టం జరిగిందని యజమానులు తెలిపారు. ఇక సంతమాగులూరు మండలంలోని సంతమాగులూరు, మక్కెనవారిపాలెం గ్రామాల్లో సాగు చేసిన బొప్పాయి, అరటి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. -
పచ్చ పార్టీ కాంట్రాక్టర్ నిర్వాకం
వేటపాలెం: మా ప్రభుత్వం.. మేము చేసిందే కరెక్టు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు పచ్చ పార్టీ నాయకులు. ఆ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కూడా అదే రీతిలో వ్యవహరించాడు. దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరిపట్నంలో మూడు వీధుల్లో ఎన్ఆర్జీఈఎస్ నిధులతో నూతనంగా ఆదివారం సిమెంట్ రోడ్లు వేశారు. అయితే, ఈ రోడ్డు వేస్తున్న వీధిలో నివాసం ఉంటున్న యర్రా రూపా ఆనంద్ అభ్యంతరం తెలిపాడు. రోడ్డికిరువైపులా పంచాయతీ స్థలం ఆక్రమణకు గురై వెడల్పు తగ్గి పోయిందని పంచాయతీ కార్యదర్శికి ఐదు నెలల కిందట ఫిర్యాదు చేశారు. వేటపాలెం తహసీల్దార్‌కి గత ఏడాది నవంబర్ 2 రోడ్డు సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని దాని నిమిత్తం చలానా కట్టి అర్జీ కూడా ఇచ్చారు. అది ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. సర్వే ఊసే లేదు. అనంతరం రోడ్డు సర్వేపై జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఈ ఏడాది ఏప్రిల్ 7న ఆనంద్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా రోడ్డు ఆక్రమణలకు సంబంధించి సర్వే నిర్వహించలేదు. సెలవు దినాల్లో హడావుడిగా రోడ్డు నిర్మాణం ఆ కాంట్రాక్టర్ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం రోజైన ఆదివారం హడావుడిగా ఆమోదగిరిపట్నలో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశాడు. దీనికి సంబంధించి యర్రా రూపా ఆనంద్కి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అదే రోడ్డులో నివసిస్తున్న ఆయన ఇంటి పక్కనే సొంత స్థాలంలో రోడ్డు మీద కారు పార్కు చేసి ఉంచారు. ఈ క్రమంలో రూపా ఆనంద్ కుటుంబ సభ్యులు గుంటూరులో చికిత్స పొందుతుంటే వారిని పరామర్శించడం కోసం ఆదివారం ఉదయం వెళ్లారు. రాత్రికి తిరిగి వచ్చే చూసే సరికి ఇంటి పక్కన తన స్థాలంలో రోడ్డు పక్కన పార్కు చేసి ఉంచిన కారు కిందగా కొత్తగా సిమెంట్ రోడ్డు వేశారు. ఇది చూసిన ఆనంద్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. కారు ముందు టైరు సిమెంట్ రోడ్డులో ఇరుక్కుపోయింది. కారుపై సిమెంట్ వ్యర్థాలు సైతం పడ్డాయని ఆరోపించారు. రూపా ఆనంద్ వెంటనే తనకు జరిగిన అన్యాయంపై వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్‌కి, ఎస్సీ ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కారును పక్కకు తీయకుండా సిమెంట్ రోడ్డేసిన వైనం కాంట్రాక్టర్‌కి సహకరించిన పంచాయతీ అధికారులు లబోదిబోమంటున్న కారు ఓనర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు -
వక్ఫ్ సవరణ చట్టం రద్దు కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన
నరసరావుపేట: భారత రాజ్యాంగం కాపాడాలని, వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత, పేద మధ్యతరగతి ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ముస్లిం సంఘాలు, సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌కు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ముస్లిం మైనార్టీ నాయకులు మస్తాన్‌వలి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముస్లింల అణచివేతకు పాల్పడుతుందన్నారు. ఒక్క ముస్లింను కూడా కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో నియమించలేదని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు, సీపీఎం నాయకులు డి.శివకుమారి, పీడీఎం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, అమరావతి రజక ఐక్యవేదిక నాయకులు ఉదయగిరి వెంకటస్వామి, మైనారిటీ నాయకులు మాదిన రసూల్ రఫీ, వర్లమాబు, కరీముల్లా, ఖలీల్, మెకానిక్ మస్తాన్ వలి పాల్గొన్నారు. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల నివారణ నరసరావుపేటటౌన్: జాగ్రత్తలు పాటించటంతో అగ్ని ప్రమాదాలు అరికట్టవచ్చని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండి ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎస్.శ్రీధర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో గతేడాది 530 ప్రమాదాలు చోటుచేసుకోగా రూ.6.62 కోట్లు ఆస్తి నష్టం జరిగిందన్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో స్పందించి రూ.22.57 కోట్ల విలువైన ఆస్తిని కాపాడన్నారు. వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, బహుళ అంతస్తుల భవనాలు, ఆసుపత్రులు, పెట్రోలు బంకులు, గ్యాస్ గోదాంలు, రద్దీ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో నరసరావుపేట అగ్నిమాపక శాఖ అధికారి ఎం.వి. సుబ్బారావు, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ముగిసిన గోవర్ధనస్వామి ఆలయ బ్రహోత్సవాలు నాదెండ్ల: నాదెండ్లలో కొలువై ఉన్న చారిత్రాత్మక ఆలయమైన రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ గోవర్ధనస్వామి, భూనీలా సమేత శ్రీ చెన్నకేశవస్వామి వార్ల దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. చివరిరోజు స్వామివారి ధ్వజారోహణ నిర్వహించారు. ఈ నెల 8న ప్రారంభమైన బ్రహోత్సవాల్లో భాగంగా స్వామివార్లకు వైభవంగా కల్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు పరాంకుశం సాయిశ్రీనివాసాచార్యులు, విజయరామాచార్యులు, సీతారామాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. కార్యక్రమాలను ధర్మకర్తల మండలి సభ్యులు, దేవాదాయశాఖ ఈవో శ్రీనివాసు పర్యవేక్షించారు. గంజాయి అమ్మకాలపై నిఘా ఉంచాలి నెహ్రూనగర్: ప్రభుత్వం తలపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 28 గ్రామాలను నాటుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ తెలియజేశారు. సోమవారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ కార్యాలయంలో ఎకై ్సజ్ శాఖకు సంబంధించిన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టి పట్టణ, మున్సిపల్ ప్రాంతాల్లో అమ్మకాలపై కేసులు నమోదు చేయాలన్నారు. -
అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
బాపట్ల: వేసవిలో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి చెప్పారు. అగ్నిమాపక వారోత్సవాల వాల్‌పోస్టర్లను స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సోమవారం విడుదల చేశారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉందన్నారు. వాటిని నివారించడానికి ముందస్తు అవగాహన చర్యలు ముఖ్యమన్నారు. విద్యుత్ ప్రమాదాలు నివారించాలని, గృహాలలో ప్రమాదాలు అరికట్టాలన్నారు. కర్మాగారాలు, గిడ్డంగులు, తాత్కాలిక నిర్మాణాలు, పందిళ్ల ద్వారా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ద్వారా ఏప్రిల్ 14 నుంచి 20 తేదీ వరకు జరగనున్న అగ్నిమాపక వారోత్సవాలలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. అగ్ని ప్రమాదాలు అరికట్టడానికి అందరి సహకార కావాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక సేవల శాఖ అధికారి సి మాధవనాయుడు, ఫైర్ ఆఫీసర్ వై వెంకటేశ్వరరావు, డీపీఓ ప్రభాకర్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ రామకృష్ణ, ఎల్డీఎం శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
అందరికీ సమానత్వం అంబేద్కర్‌తోనే సాధ్యం
నరసరావుపేట: రాజ్యాంగంలో అందరికీ సమానత్వం కల్పించిన మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ అని ఎస్పీ కంచి శ్రీనివాసరావు కొనియాడారు. భారతరత్న అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రచించి ఆయన దేశానికి చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, సమానత్వం, మానవ హక్కులు, విద్యా స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన కృషి అనిర్వచనీయమైందని ఎస్పీ అన్నారు. . ఆయన చూపిన సమానత్వం, న్యాయం, సౌభ్రాతత్వం వంటి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, పోలీస్ సిబ్బంది అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తితో ఉద్యోగ నిర్వహణ చేయాలని సూచించారు. అదనపు అడ్మిన్ ఎస్పీ జేవీ సంతోష్, అడ్మిన్ ఆర్.ఐ రాజా, వెల్ఫేర్ ఆర్ఐ గోపీనాథ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
గొప్ప ఆర్థికతత్వవేత్త
డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ బాపట్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గొప్ప ఆర్థికతత్వవేత్తగా ఎదిగి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించారని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో సభ నిర్వహించారు. అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థినీలు జై భీమ్,... జై భీమ్ అంబేడ్కర్ అంటూ... కోలాట నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించి బైపీసీలో 975 మార్కులు సాధించిన చీరాల విద్యార్థినీ కె ధాత్రి, ఎంపీసీలో 975 మార్కులు సాధించిన పర్చూరుకి చెందిన విద్యార్థిని సమీరాలకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున నగదు బహుమతులను కలెక్టర్ అందజేశారు. ఇటీవల యాజిలి గ్రామంలోని నీటి కుంటలో పడి మృతి చెందిన ఎస్సీ బాలుడు జి ప్రవీణ్ తల్లి అమృతకు కలెక్టర్ రూ.10వేల చెక్కు అందించారు. ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక సాధికారతతోనే సమానత్వం లభిస్తుందని ఉద్యమాలు చేసిన గొప్ప నాయకుడు అంబేడ్కర్ అన్నారు. సమానత్వం కోసం రాజ్యాంగంతో చట్టాలు రూపొందించారని పేర్కొన్నారు. ఎన్నో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ రిజర్వేషన్లు సాధించి పెట్టారని ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి మాట్లాడుతూ పేదరికం, అంటరానితనాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యతో మేధావిగా చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. మట్టిలో మాణిక్యం, ఆణిముత్యంలా... సమాజానికి దిక్సూచిలా మారారన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ సామ్యవాదంతో ప్రపంచ మార్గదర్శకుడిగా అంబేడ్కర్ నిలిచారని అన్నారు. చిన్నతనంలోనే అంబేడ్కర్ అస్పృశ్యతపై ఉద్యమించారన్నారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, బుడా చైర్మన్ సలగల రాజశేఖర్‌బాబు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్‌గౌడ్, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిని రాజా దెబోరా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డీపీఓ ప్రభాకర్, ఆర్డీవో పి గ్లోరియా, ఎస్సీ నాయకులు జి.చార్వాక, మాణిక్యరావు, లక్ష్మీనరసయ్య, పల్నాడు శ్రీరాములు, ఎస్టీ నాయకులు ఎన్ మోహన్‌కుమార్ ధర్మ, తదితరులు పాల్గొన్నారు. ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు -
రెచ్చిపోతున్న టీడీపీ నేతలు.. రూ.25 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా
ఒంగోలు,సాక్షి: ఒంగోలులో కూటమి నేతల బరితెగించారు. కేశవరాజు కుంటలో రూ.25 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమి కబ్జా చేశారు.కేశవరాజు కుంటలో సుమారు 5 ఎకరాల 60 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంపై కూటమి నేతల కన్నుపడింది. అంతే రూ.25కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని ఎంచక్కా కబ్జా చేశారు. ప్లాట్లుగా వేసి అమ్మేందుకు సిద్ధమయ్యారు. స్థలం చుట్టూ ఫెన్సింగ్ పోల్స్ కూడా ఏర్పాటు చేశారు.కూటమి నేతల భూకబ్జాపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్ ఆందోళన చేశారు. టీడీపీ కబ్జాకి గురైన స్థలంలో నిరసన తెలిపారు. తక్షణమే రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని కంచె తీసేయాలని డిమాండ్ చేశారు. ఒంగోలులో కూటమి నేతల భూకబ్జాలపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. -
క్షుద్ర పూజలు: దడపుట్టించిన నల్లకోడి, ఈకలు, జాకెట్టు
బాపట్ల: మార్టూరులో ఆదివారం ఉదయం క్షుద్ర పూజల ఆనవాళ్లు స్థానికంగా కలకలం రేకెత్తించాయి. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నేతాజీ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం ఈ క్షుద్ర పూజల ఆనవాళ్లను గమనించిన స్థానికులు విలేకరులకు సమాచారం అందించారు. అక్కడ పరిశీలించిన విలేకరులకు ప్రత్యేకంగా కుంకుమ చల్లి దానిపై మహిళకు చెందిన జాకెట్టును పెట్టి ముగ్గు వేసి అందులో నిమ్మకాయలు, సమీపంలో మల్లెపూలు ఉంచి పూజలు చేసినట్లు కనిపించింది. దీని పక్కనే చిన్న సైజు నల్లకోడి పిల్లను కాల్చి దహనం చేసినట్లుగా చిన్నచిన్న ఎముకలతోపాటు కోడి ఈకలు కనిపించటం గమనార్హం. క్షుద్ర పూజలు చేసినట్లు కనిపిస్తున్న ఆనవాళ్లను చూసి స్థానికులు భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో నలుగురు కుటుంబ సభ్యులు కలిగిన ఓ కుటుంబానికి చెందిన ఫొటోను కుంకుమలో ఉంచి క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు ఆ సంఘటనను ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు. నేతాజీ కాలనీకి సమీపంలో జరుగుతున్న ఈ క్షుద్ర పూజల ప్రయత్నాలను అధికారులు అడ్డుకొనే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
చెరుకుపల్లి: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామానికి చెందిన మున్నం గోవర్ధనరెడ్డి, పార్వతమ్మ దంపతుల చిన్న కుమారుడు ప్రశాంత్‌రెడ్డి(18) చెరుకుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. శనివారం ఇంటర్ ఫలితాలు విడుదల కాగా, ప్రశాంత్‌రెడ్డి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. మనస్తాపానికి గురైన ప్రశాంత్ రెడ్డి... ఆదివారం ఉదయం తన తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
పేలిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు
నరసరావుపేట: ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు టైరు పేలిన ఘటన నరసరావుపేటలో ఆదివారం జరిగింది. ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి ప్రయాణీకులతో నరసరావుపేట బయల్దేరిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆదివారం ఉదయం ఏడుగంటల సమయానికి పట్టణానికి కిలోమీటరు దూరంలోని వినుకొండ రోడ్డులోకి వచ్చేసరికి రెండుటైర్లలో ఒకటి పెద్దశబ్ధంతో పేలి మంటలు, పొగ వ్యాపించాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపటంతో ప్రయాణికులంతా బస్సు నుంచి బయటపడ్డారు. రోడ్డుపక్కనే బ్రిక్స్ తయారీ యూనిట్ ఉండడంతో, అక్కడి నీటి పైపు ద్వారా మంటలు వ్యాపించిన టైరును తడిపి మంటలను ఆర్పేశారు. వేసవి కావటంతో రెండుటైర్లు రాపిడికి గురై, వాటిలో ఒకటి పేలి ఈ సంఘటన జరిగిందని ప్రయాణీకులు తెలిపారు. కొందరు ప్రయాణికులు అదేమార్గంలో వస్తున్న ఆటోల ద్వారా పట్టణానికి చేరుకున్నారు. వెల్లటూరు ఉపాధ్యాయుడికి అవార్డు ప్రదానం భట్టిప్రోలు (కొల్లూరు) : కృష్ణా వరదల సమయంలో లంక గ్రామాలలో సేవలు అందించిన మండలంలోని వెల్లటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గుర్రం మురళీ అబ్దుల్ కలాం జాతీయ సేవా రత్న అవార్డును ఆదివారం అందుకున్నారు. చీరాలలో కృతి ఫౌండేషన్ ఐదో వార్షికోత్సవాన్ని పునస్కరించుకొని నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో ఏపీసీపీఎస్ఈఏ జిల్లా ప్రెసిడెంట్, ఏపీఎస్ఎస్టీఎప్ రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడైన మురళీకి రోటరీ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సీఐ సాంబశివరావు, నాగమణి, అమర్నాధ్, వెంకట అశ్వినిలు అవార్డును అందజేసి సత్కరించారు. ఈసందర్భంగా సోషల్ ఫోరమ్ సభ్యులు నాగిరెడ్డి, శేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, వై.శ్రీను, లక్ష్మణ్‌రావు, నాగరాజు మురళీని అభినందించారు. ప్రయాణికులంతా క్షేమం -
రసవత్తరంగా కొండవీడు నాటికల పోటీలు
యడ్లపాడు: కొండవీటి కళాపరిషత్ 26వ జాతీయస్థాయి నాటికల పోటీలు లింగారావుపాలెంలో ఆదివారం కొనసాగాయి. బోయపాలెం శ్రీఅనంతలక్ష్మి నూలుమిల్లు చైర్మన్ సామినేని కోటేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేయగా, ఎంపీటీసీ సభ్యుడు తోకల వీరరాఘవయ్య నటరాజపూజతో రెండోరోజు పోటీలను ప్రారంభమయ్యాయి. పోసాని సుబ్బారావు చౌదరి స్మారక వేదికపై మహాకవి కాళిదాసు కళా ప్రాంగణాన మూడు చైతన్య కళారూపాల్ని ప్రదర్శించారు. సామాన్య మహిళ అసామాన్య పోరాటం ‘జనరల్ బోగీలు’ ఖర్చు తక్కువగా ఉండే రైలు ప్రయాణంలో ప్రభుత్వం జనరల్ బోగీల సంఖ్యను తగ్గించడంతో కూర్చేనే ఖాళీలేక కిటికీలపై, టాయిలెట్లోనూ కూర్చుని ప్రయాణించే సామాన్యుల అవస్థలకు ప్రతిరూపమే ‘జనరల్ బోగీలు’ నాటిక. ఒకవేళ రైలు ప్రమాదం జరిగినా, జనరల్ బోగీల్లో ప్రయాణించే వారి వివరాలు రైల్వేశాఖ వద్ద ఉండవు. దీంతో టిక్కెట్ ఉన్నా గుర్తింపులేని ప్రయాణికుల్లా వారి చరిత్రలు, కుటుంబాల బాధలు గాలిలో కలిసిపోతాయి. ఇలా రైలు ప్రమాదంలో తన కొడుకును కోల్పోయిన సావిత్రమ్మ రైల్వేశాఖ నిర్లక్ష్యంపై ఉత్త రాల పోరాట ఉద్యమానికి శ్రీకారం చుట్టి జనరల్ బోగీల ప్రయాణికుల జనగొంతుక అవుతుంది. శ్రీ సాయి ఆర్ట్స్(కొలకలూరు) వారు ప్రదర్శించిన ఈ నాటికకు పీటీ మాధవ్ రచించగా, గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. హృదయ వేదికపై నిత్యం కొలువుండే ‘అ..సత్యం’ నాటిక మనిషి హృదయం దైవత్వానికీ, రాక్షసత్వానికీ వేదిక. అందులోని స్వార్థం, భయం ప్రతి సత్యానికీ–అసత్యానికీ మూలంగా మారుతాయని సందేశాన్ని అందించే కథనమే ‘ అ..సత్యం’ నాటిక. కనబడేదంతా సత్యం కాదని..కనబడనిదంతా అసత్యం కాదు. ఏ యథార్థమైనా చెడుకు దోహదపడితే అది అసత్యంగా, అబద్ధమైనా మంచికి మార్గం అయితే అది సత్యంగా సందర్భానుసారంగా స్వీకరించాల్సి వస్తుంది. అన్నింటికీ మూలం మనసు.. అందులోని స్వార్థమని సంఘటన ద్వారా చూపిన కథనం ఇది. చెతన్య కళాస్రవంతి (ఉక్కునగరం–విశాఖ) వారు సమర్పించిన ఈ నాటికను పిన్నమనేని మృత్యుంజయరావు రచించగా, పి.బాలాజీ నాయక్ దర్శకత్వం వహించారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు కట్టా శ్రీహరిరావు, ఉపాధ్యక్షులు తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, కార్యదర్శి మండెపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.రెండోరోజు మూడు ప్రదర్శనలు న్యాయవాద వృత్తికి అద్దంపట్టే ‘27వ మైలురాయి’ నాటిక న్యాయమంటే కోర్టు తీర్పు కాదని.. అది నైతికత, సమాజం పట్ల బాధ్యత అంటూ న్యాయవాద వృత్తికి అద్దం పట్టే కళారూపమే ‘27వ మైలురాయి’ నాటిక. న్యాయవాదులు న్యాయం కోసం అన్న విషయాన్ని విస్మరించి క్లయింటు వాదులుగా మారొద్దని, ‘న్యాయాన్ని వాదించడం’ కన్నా ‘న్యాయంగా ఉండడం’ మిన్న అంటూ 1993లో జరిగిన కొన్ని యధార్థ సంఘటనలతో సందేశాన్ని ఇచ్చే నాటిక. యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్(విజయవాడ) వారు సమర్పించిన ఈ నాటికకు టి.మాధవ్ రచన, ఆర్.వాసుదేవరావు దర్శకత్వం వహించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురానికి చెందిన సందీప్ (25) పెదపలకలూరు మీదుగా గుంటూరు వెళుతున్నాడు. పెదపలకలూరు శివారుల్లోని జెఎల్ఈ సినిమాస్ సమీపంలో ఆటో ఢీకొనటంతో తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికులు గమనించి అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కారు ప్రమాదంలో వైఎస్సార్సీపీ సీనియర్ కార్యకర్త మృతి తాడికొండ: ప్రమాదవశాత్తు కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టడంతో వైఎస్సార్ సీపీ సీనియర్ కార్యకర్త లంకా సుభానీ మృతి చెందిన ఘటన తుళ్ళూరు మండలం దొండపాడు గ్రామ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన లంకా సుభానీ(38) ఫార్చూనర్ కారులో వెళ్తుండగా దొండపాడు సీడ్ యాక్సిస్ రోడ్డుపై కారు అదుపుతప్పి కాలువలోకి బోల్తా కొట్టింది. ఘటనలో లంకా సుభానీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుళ్ళూరు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సుభానీ అకాల మృతి పట్ల వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు(డైమండ్ బాబు) ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుభానీ ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కోదండ రామాలయంలో చోరీ తాళాలు పగులగొట్టి హుండీలో నగదు తస్కరణ మాచర్ల రూరల్: నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కనే ఉండే కోదండ రామాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, హుండీలో నగదు చోరీకి పాల్పడిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలో శ్రీ కోదండ రామాలయంలోని దేవాలయ ప్రాంగణంలో ఉత్తర ద్వారానికి గొలుసులతో తాళం వేసి ఉంటుంది. ఇనుపరాడ్డుతో ఆ తాళం బద్దలు కొట్టిన దొంగలు లోపలికి ప్రవేశించి, హుండీ పగులకొట్టి నగదును దోచుకొని పోయారు. దేవాలయ కమిటీ అధ్యక్షుడు బచ్చు రామారావు ఆదివారం తెల్లవారుజామున నీటి మోటారు వేసేందుకు దేవాలయంలోకి ప్రవేశించి చూడగా, హుండీ తాళాలు పగలకొట్టి కనిపించాయి. ఆయన వెంటనే పట్టణ పోలీసులకు సమాచారమందించారు. సీఐ పచ్చిపాళ్ల ప్రభాకర్‌రావు తమ సిబ్బందితో దేవాలయానికి చేరుకొని సంఘటన జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించి పలు వివరాలు సేకరించారు. గర్భగుడి తలుపు తెరిచేందుకు విఫలయత్నం.. ఇటీవల జరిగిన శ్రీరామనవమి సందర్భంగా రూ. 20లక్షల విలువైన ఆభరణాలు ఆలయంలోని దేవతా మూర్తులకు అలంకరించియున్నాయి. గర్భగుడి తలుపు తీసేందుకు యత్నించిన దుండగుడు విఫలమయ్యాడు. తలుపు తెరుచుకొని ఉంటే ఆభరణాలు కూడా చోరీకి గురయ్యేవి. ఇటీవల కొన్ని రోజుల క్రితం పాత మాచర్లలోని వీరాంజనేయ స్వామి దేవాలయంలోనూ హుండీని పగుల కొట్టి నగదును దొంగిలించిన విషయం విధితమే. ఈ సంఘటనలు మరువకముందే పట్టణ నడిబొడ్డులో వందలాది మంది నిత్యం సంచరించే ప్రధాన రహదారి పక్కనే ఉన్న కోదండ రామాలయంలో చోరీ జరగటంపై స్థానికులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై వరుస చోరీల పై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ ప్రభంజనం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియె ట్ పరీక్ష ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ విద్యార్థులు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మో హన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంఈసీ విభాగంలో మల్లవోలు లిఖిత 500 మార్కులకు 494, ఓకే గీతిక 494, మామిడిపాక హరి ణి 494 మార్కులు సాధించినట్లు తెలిపారు. అదే విధంగా 490కిపైగా సాధించిన విద్యార్థులు 88 మంది, 480కి పైగా సాధించిన వారు 498 మంది, 475కి పైగా సాధించిన వారు 649 మంది ఉన్నట్లు వివరించారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో విద్యార్థిని సము ద్రాల సాత్విక 982 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా 970కి పైగా 71 మంది, 960కి పైగా 141 మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు. ఈసందర్భంగా విద్యార్థులను అభినందించారు. -
26 నుంచి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
రెంటచింతల: మఠంపల్లి శుభవార్త దేవాలయం తిరునాళ్ల సందర్భంగా శుభోదయ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయ భరత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గాదె పవన్‌రెడ్డి, కార్యదర్శి తానం బాలరెడ్డి తెలిపారు. ఆదివారం రెంటచింతలలో వారు రెవ. ఫాదర్ మార్టిన్ పసల, రెవ.ఫాదర్ అల్లం బాలరెడ్డిలతో కలిసి ఎడ్ల బల ప్రదర్శన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా మండల కేంద్రమైన మఠంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఈ ఎడ్ల ప్రదర్శనకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే ఎడ్ల యజమానులకు, రైతు సోదరులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విభాగంలో 10 బహుమతుల చొప్పున 40 మంది రైతులకు మొత్తం రూ. 8.78 లక్షల నగదును అందచేయనున్నట్లు తెలిపారు. శుభోదయ యువజన సంఘం నాయకులు కందుల కిరణ్ కుమార్‌రెడ్డి, సలిబండ్ల రాజేష్‌రెడ్డి, కొమ్మారెడ్డి రంజిత్‌రెడ్డి, గోపు అఖిల్‌రెడ్డి, గాదె మనీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్నేహ బంధం.. అజరామరం
కొల్లూరు : మనసు రెక్కలు తొడిగి ఐదు పదుల వెనక్కి పరుగులెట్టింది. చిన్ననాటి స్నేహబంధం చిరునామాలో వాలిపోయింది. ఆనాటి అనుభూతులను గుర్తుచేసుకుని నవ్వులొలికింది. ఆ అనుబంధం అజరామరం అంటూ నినదించింది. ఈ స్నేహ సంబరానికి కొల్లూరు ఎంప్లాయిస్ రిక్రియేషన్ హోమ్ వేదికై ంది. కొల్లూరు జెడ్పీ హైస్కూల్లో 1974–75 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలలో దేశ, విదేశాలలో స్థిర పడిన అలనాటి విద్యార్థులు తరలివచ్చారు. అప్పటి స్నేహితులను ఆప్యాయంగా పలకరించారు. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు. 50 ఏళ్ల అనంతరం కలుసుకోవడంతో పూర్వ విద్యార్థులు ఉద్వేగానికి లోనయ్యారు. ఆనందబాష్పాలు రాల్చారు. ఇకపై తరచూ కలవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు నలుగురిని సత్కరించి ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం బాధాతప్త హృదయాలతో వీడ్కోలు తీసుకున్నారు. 1974–75 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం