వైఎస్సార్ సీపీ నాయకుల శాంతి ర్యాలీ
బాపట్ల: పెహల్గాం మృతుల ఆత్మ శాంతించాలని, టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం ప్రదర్శన చేపట్టారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి పురవీధుల్లో కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శనను ఉద్దేశించి వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్‌బాబు మాట్లాడుతూ పెహల్గాంలో పర్యాటకులను దారుణంగా హత్య చేయడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనగా పేర్కొన్నారు. టెర్రరిస్టుల అణచివేతకు కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, నాయకులు గవిని కృష్ణమూర్తి, కొక్కిలిగడ్డ చెంచయ్య, చల్లా రామయ్య, తన్నీరు అంకమ్మ, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, కటికల యోహోషువా, వడ్డిముక్కల డేవిడ్ పాల్గొన్నారు.
పెహల్గాం మృతులకు ఘన నివాళి టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలి


