breaking news
Bapatla District Latest News
-
భోగిమంటల్లో పీపీపీ జీఓ ప్రతుల దహనం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అఖిల భారత విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలో ‘పీపీపీ’ విధానాన్ని రద్దు చేయాలని, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ, జీఓలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. గుంటూరు కొత్తపేట మల్లయ్య లింగం భవన్ సీపీఐ కార్యాలయం ఎదుట బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో భోగిమంటలలో జీఓ పత్రాలను దహనం చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వంద రోజుల్లో 107, 108 జీఓలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నప్పటికీ జీవోలను రద్దు చేయకపోగా 100 శాతం వైద్య విద్యను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంగాల చైతన్య, షేక్, వలి మాట్లాడారు. విద్యార్థి నాయకులు యశ్వంత్ రఘువీర్, అమర్నాథ్, చల్లా మరియదాసు, అజయ్, సాయి గణేష్ పాల్గొన్నారు. -
కోడికత్తుల తయారీ ముఠా అరెస్ట్
గుంటూరు రూరల్: కోడి కత్తుల తయారీ ముఠాను నల్లపాడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ ఆదేశాల మేరకు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ అలహరి శ్రీనివాస్ పర్యవేక్షణలో స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బంది జిల్లావ్యాప్తంగా కోడి పందేలు జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. కోడి పందేల నిర్వహకులు, కోడి కత్తులు తయారు చేసి సరఫరా చేసే వ్యక్తులు, కోడి పందేల కోసం బరులు ఏర్పాటు చేస్తున్న వారిని గుర్తిస్తూ చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నల్లపాడు స్పెషల్ బ్రాంచ్ పోలీస్‌లకు అందిన సమాచారం మేరకు.. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాయుడుపేట, అంబేడ్కర్ కాలనీ (జిందాల్ ఫ్యాక్టరీ సమీపంలో)లో ఒక నివాసంలో కోడి కత్తులు తయారు చేస్తూ, వాటికి సాన పెట్టి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో సీఐ ఆదేశాలమేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో ఇంటిపై దాడి నిర్వహించారు. దాడిలో గుంటూరు శ్రీనివాసరావుపేటకు చెందిన బండి బాలచంద్ర కోడి కత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తయరు చేసిన 60 కోడి కత్తులు, మూడు కోడి కత్తులకు సాన పెట్టే మిషన్లను స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం నిందితుడిని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తూ జీవ హింసకు పాల్పడే వారిపట్ల ఎలాంటి సడలింపు ఉండదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. -
అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్
తెనాలిరూరల్: వరుస చోరీలకు ప్పాడుతున్న అంతర్ జిల్లాల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన తెనాలి ఆటోనగర్‌లోని స్టీలు కంపెనీతో పాటు త్రీ టౌన్ పరిధిలోని ఏపీ గ్రామీణ బ్యాంకు, వైన్ షాపులు, మరో రెండు దుకాణాల్లో చోరీలు జరిగిన సంగతి తెలిసిందే.. ఆటోనగర్ కేసును దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు నిందితులను గుంటూరు శారదా కాలనీకి చెందిన మిక్కిలి సందీప్, పఠాన్ మస్తాన్వలిగా గుర్తించారు. నిందితుల కదలికలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తెనాలి రూరల్, త్రీ టౌన్ పోలీస్స్టేషన్ల పరిధితో పాటు అమరావతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లాది గ్రామంలోని ఇంట్లో బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు, అమరావతిలో ఓ దుకాణంలో నగదు అపహరించుకెళ్లినట్లు ఒప్పుకొన్నారు. చెడు అలవాట్లకు బానిసలై చోరులుగా మారిన వీరిద్దరూ డిసెంబరులోనే జైలు నుంచి బయటకు వచ్చి వెంటనే నేరాలకు పాల్పడడం ప్రారంభించినట్టు సీఐ తెలిపారు. సందీప్ 28 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడని, మస్తాన్ వలి 12 కేసుల్లో జైలుకెళ్లాడని చెప్పారు. నిందితుల నుంచి 8.50 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులు, రూ.17 వేల స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఊరు వెళ్లే వారు ఎల్‌హెచ్‌ఎంఎస్ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అలానే ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ కె.ఆనంద్ ఉన్నారు. -
క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తా
ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బాపట్ల: బాపట్లలో క్రీడాకారుల కోసం క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ హామీ ఇచ్చారు. స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం వెటర్న్ క్రికెట్ మ్యాచ్‌ను ఎంపీ బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆర్ట్స్ అండ్ సైన్‌న్స్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో వివిధ ఉద్యోగాల్లో స్థిరపడిన వారందరూ సంక్రాంతి పండుగ సొంత గ్రామానికి వచ్చి ఈ విధంగా మ్యాచ్ ఆడటం సంతోషదాయకమన్నారు. 12 సంవత్సరాల నుంచి బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వెటరన్ క్రికెట్ మీట్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. యువ క్రీడాకారుల కోసం నెట్ ప్రాక్టీస్ నిమిత్తం వివేకానంద కాలనీలో స్థలాన్ని కేటాయించేందుకు ఆయన హామీ ఇచ్చారు. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీరామ్ చిట్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్‌న్స్ ఆధ్వర్యంలో క్రీడాకారులందరికీ జేఎంటీ కోళ్లపూడి శ్రీనివాస్, సీఈఓ ఎంఎస్ చౌదరి, డీజీఎం సిహెచ్.బాలసుబ్రహ్మణ్యం, కె.వి.సత్యనారాయణ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునాథ్, సెక్రటరీ రామ్మోహన్ రావు , ట్రెజరర్ అబ్దుల్ కరీం, వైస్ ప్రెసిడెంట్ స్టాండ్లీ, మధు, సత్తిపండు పాల్గొన్నారు. దాడులకు పాల్పడేవారిని వదిలేది లేదు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పిడుగురాళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడే టీడీపీ గూండాలను వదిలేది లేదని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త మందా సాల్మన్‌ను అదే గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన మోటమర్రి పేతురు బుధవారం ఇనపరాడ్డుతో విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచారు. గాయాలపాలైన మందా సాల్మన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న కాసు మహేష్‌రెడ్డి హుటాహుటిన గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లి, బాధితుడి ఆరోగ్య స్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాసు మాట్లాడుతూ ఇటువంటి దాడులకు పాల్పడిన టీడీపీ మూకలను వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. 2029లో రాబోయేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమేనని, దాడులకు పాల్పడిన ఎవరినీ ఉపేక్షించేది లేదని, చట్టపరమైన శిక్షలు తప్పవన్నారు. టీడీపీ మూకలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న పోలీస్ అధికారులను సైతం రేపు వదిలి పెట్టేది లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పిన్నెల్లి గ్రామం వదిలి వేరే గ్రామాల్లో నివసిస్తున్నప్పటికీ గ్రామాల్లో అడుగుపెడితే ప్రాణాలు తీసేందుకు కూడా టీడీపీ నాయకులు వెనకాడటం లేదని, అటువంటి వారిని తమ ప్రభుత్వ వచ్చాక వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ముందుగా మందా సాల్మన్ బంధువులను, అదే హాస్పటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మోర్జంపాడు గ్రామానికి వైఎస్సార్ సీపీ నాయకుడు చిన్న సాంబయ్యను పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ చింతపల్లి పెద సైదా ఉన్నారు. -
వైద్యకళాశాలల ప్రైవేటీకరణ జీఓల దహనం
నరసరావుపేట ఈస్ట్: రపభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థల పరం చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో పీపీపీ జీఓ కాపీలను భోగి మంటల్లో దహనం చేసారు. ఈసందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్రకు చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతున్నదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, షేక్ చినజాన్ సైదా, కోవై శ్రీను, జక్రం, దీనమ్మ పాల్గొన్నారు. -
ప్రాణాలు వదులుతా..
వైఎస్సార్ సీపీ జెండా చేత పట్టుకునే పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున పర్చూరు (చినగంజాం): తాను చనిపోవాల్సి వస్తే వైఎస్సార్ సీపీ జెండా చేత పట్టుకొని తన ప్రాణాలు వదులుతానే తప్ప పార్టీని వదలి పెట్టి వెళ్లేది లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. పర్చూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నియోజక వర్గ కార్యకర్తల విస్తృత సమావేశానికి ఇన్చార్జి గాదె మధుసూదన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాంబాబు. రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి మాచవరపు రవికుమార్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లాటి ఏడుకొండలు, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, పార్టీ మండల కన్వీనర్లు కఠారి అప్పారావు, జువ్వా శివరాం ప్రసాద్, జంపని వీరయ్య చౌదరి, మున్నం నాగేశ్వరరెడ్డి, చిన్ని పూర్ణారావు పఠాన్ కాలేషావలి, నాయకులు పి.రామకృష్ణారెడ్డి, మొగిలి నాగేశ్వరరావు, కొండూరి గోవింద్, జంగా వంశీ, యూ.అనిల్ చౌదరి, కాటుకూరి బాబూరావు, నూర్ అహ్మద్, జి.రవిచందర్, దాసరి వెంకట్రావు, కోట శ్రీనివాసరావు, వై.హరిప్రసాద్, కె.రమేష్, కొల్లా శేషగిరి పాల్గొన్నారు. -
గుదిబండలా చంద్రబాబు పాలన
చిన్నగంజాం: నమ్మి ఓట్లేస్తే...చంద్రబాబు పాలన అన్నివర్గాల ప్రజలకు గుదిబండలా మారిందని జనం లబోదిబోమంటున్నారు. మంగళవారం పర్చూరు నియోజకవర్గం, ఇంకొల్లు మండలం, పావులూరు ప్రధాన కూడలి ప్రాంతంలోని రచ్చబండ వద్ద గ్రామస్తులను ‘సాక్షి’ పలకరించింది. చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ప్రజలు అన్నారు. సంక్షేమ పథకాల్లో కోత పెట్టారని, అభివృద్ధి పనుల జాడే లేదన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించినా గిట్టుబాటు ధర దక్కడం లేదని వాపోయారు. పేదల ఉపాధి పనుల్లోనూ కోత పెట్టారన్నారు. మొత్తంగా చంద్రబాబు పాలనలో అష్టకష్టాలు పడుతున్నామని పావులూరు రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అందరి కడుపు నిండేదని మాట్లాడుకోవడం కనిపించింది. వారిలో ఎక్కువ మంది రైతులు తమ బాధలను అందరి ముందు వ్యక్తపరుస్తూ వారి చర్చలను కొనసాగించారు. పండగ సమయంలో ఎంతో సంతోషంగా గడపాల్సి ఉండగా... ఎవరినోట చూసినా బాధలు, ఆవేదనలతో వచ్చే మాటలే వినిపించాయి. సాగుకు కష్టకాలమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయం కుంటుపడింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదు. కనీసం కొనుగోలు చేసే నాథుడే లేడంటూ గాదె వెంకటేశ్వరరెడ్డి అవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేండ్ల పాలనలో పంటలు బాగా పండాయి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించింది, రైతులంతా సుభిక్షంగా ఉన్నామంటూ చిడిపూడి శ్రీనివాసరెడ్డి, హనుమంతరెడ్డిలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ ఐదేళ్లలో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినప్పటికీ దాదాపు మూడేళ్లపాటు వరుసగా పండించిన పంటలు చక్కగా అమ్మకాలు జరిగాయన్నారు. తమలాంటి రైతులకు ఇబ్బంది కలిగిన పరిస్థితిలో ప్రభుత్వం నేరుగా గిట్టుబాటు ధర ఇచ్చి పంటను కొనుగోలు చేసిందనానరు. రైతులకు ఎటువంటి కష్టం లేకుండా చేశారంటూ పులఖండం జయరామిరెడ్డి చెప్పారు. అండగా నిలిచి... ‘జగన్ అధికారంలో లేకపోయినా మాలాంటి పొగాకు రైతులకోసం మద్దతు ప్రకటించేందుకు మా ప్రాంతానికి వచ్చారు. ఽమాకు అండగా నిలిచారు. అప్పుడే కొనుగోలు ప్రారంభించారు. అది కూడా టీడీపీకి చెందిన రైతుల వద్ద మాత్రమే పొగాకు కొనుగోలు చేసి ఇతరులను ఇబ్బందులకు గురిచేశారు. ప్రస్తుతం పొగాకును అటు అమ్ముకోలేక...ఇటు కాపాడుకోలేక పోతున్నాం’ అని ముప్పవరపు శ్రీరాములు, పవన్‌కుమార్ రెడ్డిలు ఆవేదన వ్యక్తపరిచారు. శనగకు గిట్టుబాటు ధర లేక, కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ పులఖండం పుల్లారెడ్డి తదితరులు తమ ఆవేదనను నలుగురి ముందు వ్యక్తపరిచారు. వీరితోపాటు పలువురు స్థానిక గ్రామస్తులు రచ్చబండ వద్ద తమ బాధలను బహిరంగంగా చర్చించుకోవడం కనిపించింది. వారి చర్చల్లో ఆరోగ్య శ్రీ , ఫీజు రీయంబర్స్మెంట్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఆడబిడ్డ నిధి వంటి పలు అంశాలను చర్చించి చంద్రబాబు సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుకు వెన్నుపోటు పొడిచింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మిర్చి క్వింటా ధర రూ. 27 వేల నుంచి రూ. 30 వేలు వరకు ఉంది. ప్రస్తుతం క్వింటా రూ. 10 వేల నుంచి రూ. 12 వేలు మాత్రమే ఉంది. శనగలు గత ప్రభుత్వంలో క్వింటా రూ.10 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 4,800లు మాత్రమే పలుకుతోంది. పొగాకు రూ. 18 వేలు ఉంటే ప్రస్తుతం రూ. 3 వేలు, రూ. 6 వేలు మాత్రమే ఉంది. మొక్కజొన్న గతంలో రూ. 3 వేలు ఉండగా... ఈ ప్రభుత్వంలో రూ. 1000, రూ. 1,500 మాత్రమే ఉంది. శనగలు గోదాముల్లో పడి మూలుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేయకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంట స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు అనుకూలంగా పాలన సాగించారు. – పులఖండం జయరామిరెడ్డి, రైతు, పావులూరు, ఇంకొల్లు మండలం -
బరి.. భలేరంజుగా..
చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో కోడిపందేల శిబిరం వద్ద భారీగా వాహనాలు కోడి పందేల శిబిరాన్ని ప్రారంభిస్తున్న అధికార పార్టీ నాయకులుకోడి పందేలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారం అండగా రెచ్చిపోతున్నారు. జిల్లాలో అనేక చోట్ల బరులు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల అయితే అత్యధిక పందేలు గెలుపొందిన వారికి బుల్లెట్, స్కూటీలు బహుమతులుగా ప్రకటించి పందేలను ఆసక్తిగా మార్చారు. –సాక్షి నెట్వర్క్ -
అమరేశ్వరునికి భోగి సేవ
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరుని సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం భోగి పండుగ సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామి వారికి వారు పోసి హారతులు ఇచ్చి పూజలు చేశారు. అలాగే అమరావతి పాండురంగస్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. నకరికల్లు: భోగి పండుగ సందర్భంగా స్థానిక ఆదిలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం బుధవారం కనుల పండువగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం పురవీధుల్లో సాగింది. యువకులు, భక్తులు రథాన్ని లాగుతూ స్వామివారి నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. ముందుగా అర్చకులు కొడవటికంటి మధుసూదనాచార్యులు, పాండురంగాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. రేపల్లె: పట్టణంలోని ఉప్పూడి రహదారిలోని రాజ్యలక్ష్మి, గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని, రంఘనాథస్వామి వారిని వధూవరులుగా తీర్చిదిద్ద వేదమంత్రాల నడుమ కళ్యాణం కనుల పండువగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. గుంటూరు రూరల్: నల్లపాడు, చల్లావారిపాలెం గ్రామాల ఇలవేల్పు దేవత శ్రీ పుట్టలమ్మతల్లి శ్రీ ఘంటాలమ్మ తల్లి సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. గత ఏడాది అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలందుకున్న 9 కిలోల లడ్డూను వేలంలో రూ.15 లక్షలకు పాడుకున్న భక్తుడు దుగ్గెంపూడి సుధాకర్‌రెడ్డి, శ్రీవాణి దంపతులు ఆలయానికి అందించిన నగదుతో ఆలయ కమిటీ చైర్మన్ ఇంటూరి అంజిరెడ్డి, కమిటీ సభ్యులు అమ్మవారికి కెంపు, పగడాలు పొదిగిన హారాన్ని తయారు చేయించారు. సుధాకర్‌రెడ్డి దంపతులు ఆలయ కమిటీ సమక్షంలో బుధవారం అమ్మవారికి బహూకరించారు. కార్యక్రమంలో దుగ్గెంపూడి యోగేశ్వర్‌రెడ్డి, గౌతమ్ కార్తికేయరెడ్డి, తరుణ్ కార్తికేయరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాచర్ల : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వీరనారి చాకలి ఐలమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దంతవైద్యులు సిద్దూ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా పలువురు పేద మహిళలకు చీరెలు పంపిణీ చేయటం ప్రశంసనీయమన్నారు. అనంతరం 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు కేళం శ్రీనివాసరావు, ఆవుల ఉదయ్‌కుమార్, అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు పాషావలి, వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెం పాండురంగారావు, మోరా భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సందడిగా సంక్రాంతి సంబరాలు
బాపట్ల టౌన్: తెలుగువారి అతిపెద్ద పండుగ, సంస్కృతికి ప్రతీకై న సంక్రాంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమ, మంగళవారాల్లో పోలీస్ పరేడ్ మైదానంలో ‘సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నిత్యం శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల దర్యాప్తులో తలమునకలయ్యే పోలీస్ అధికారులు, సిబ్బంది, సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎడ్లబళ్లు, రంగవల్లులు, డూడూబసవన్నల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, మహిళల కోలాటం, చిన్నారుల భరతనాట్యం ప్రదర్శన కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. సంబరాల్లో భాగంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్ పోటీలు అత్యంత ఉత్కంఠగా సాగాయి. పెయింటింగ్, మ్యూజికల్ చైర్స్ పోటీలు ఆహ్లాదకరంగా సాగాయి. ఎస్పీ స్వయంగా దగ్గరుండి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడల అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. -
కోఢీ
చీరాల నియోజకవర్గ పరిధిలో జోరుగా కోడి పందేలు తూర్పుపాలెం బరిలో పోరాడుతున్న కోడిపుంజులు సాక్షి టాస్క్ఫోర్సు: చీరాల నియోజకర్గ పరిధిలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పెద్ద ఎత్తున కోడిపందేలు బుధవారం జరిగాయి. అధికార పార్టీ నాయకుడి కుమారుడే స్వయంగా కోడిపందేలు ప్రారంభించాడని సమాచారం. చల్లారెడ్డి పాలెం గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఈ కోడి పందేలను పర్యవేక్షించారు. గడిచిన 10 ఏళ్లలో చీరాల నియోజకవర్గ పరిధిలో కోడి పందేలు బరులు బహిరంగా ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. వేటపాలెం మండల పరిధిలోని అక్కాయిపాలెం, కఠారివారిపాలెం గ్రామాల మధ్యగల పొలాల్లో ప్రత్యేక బరులు ఏర్పాటు చేసి ఉదయం నుంచి రాత్రి వరకు కోడి పందేలు కొనసాగిస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి పందెం రాయుళ్లు జోరుగా కోడిపందేల్లో పాల్గొన్నారు. పందేలు చూసేందుకు వచ్చిన వేల మంది జనం పందేలు కాసుకున్నారు. అక్కాయిపాలెం నుంచి కఠారివారిపాలెం వెళ్లే రోడ్డుకు రెండు వైపులా అధికార పార్టీ నాయుకలు ఫెక్సీలు ఏర్పాటు చేశారు. రూ. లక్షలో నగదు చేతులు మారినట్లు సమాచారం. బరుల వద్దే మద్యం, తినుంబండారాలు బహిరంగంగా విక్రయాలు జరిగాయి. గంజాయి తాగి హల్చల్ చేశారు. నాయకులు బరి తెగించి ఈ పందేలతో పాటు జూద క్రీడలకు తెరలేపారు. ప్రభుత్వ అధికారికంగా అనుమతించిందని, అందుకే అటువైపు పోలీసులు గానీ అధికారులు కానీ వెల్లడించడం లేదనే ప్రచారం జరుగుతోంది. -
భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య
గుంటూరు రూరల్: భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తూ, తనను జైలుకు పంపి, ఇబ్బందులకు గురిచేస్తుందనే మానసిక వేదనకు గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్ తెలిపిన, మృతుడు వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ చేసిన సమాచారం మేరకు... ఏటీ అగ్రహారానికి చెందిన .వెంకటేశ్వర్లు కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. మొదటి భార్య అకాల మృత్యువాతకు గురవ్వటంతో అడవితక్కెళ్లపాడు టిడ్కో హౌస్‌లలో నివాసం ఉండే వెంకటరమణను రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు కుమార్తె లాయర్ డిగ్రీ పూర్తి చేసుకుని వేముల బాలాజీ అనే వ్యక్తి వద్ద ప్రాక్టీస్‌కు చేరింది. కుమార్తె ప్రాక్టీస్‌కు వెళుతున్న సమయంలో ఆమెకు తోడుగా వెళ్లే వెంకటరమణ, బాలాజీ లాయర్‌తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయమై వెంకటేశ్వర్లు, వెంకటరమణ మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండేవి. వివాదాల నేపథ్యంలో వెంకటరమణ, లాయర్ బాలాజీ ఇరువురు తనపై గతంలో తొమ్మిదికి పైగా అక్రమ కేసులు బనాయించి, తనను జైలుకు కూడా పంపారని వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు ముందు చేసిన వీడియో ద్వారా తెలిపాడు. తనపై కేసులు మోపటంతోపాటు తన అన్నదమ్ములు, మొదటి భార్య బిడ్డలపై కూడా అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయాడు. ● లాయర్ బాలాజీ అండతో తనను తన భార్య చిత్రహింసలకు గురిచేస్తుందని, తాను కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో పేరేచర్లలోని జగనన్న కాలనీలో ఇంటిని కొనుక్కున్నానని, అయితే అందులోకి కూడా తనను వెళ్లకుండా చేసి ఆ ఇంటిని లాయర్, తన భార్య గెస్ట్ హౌస్‌గా వాడుకుంటున్నారని వీడియో ద్వారా వాపోయాడు. గతంలో తనపై పెట్టిన కేసుల్లో జైలు నుంచి వచ్చాక రాజీ కోసం ప్రయత్నించి తన సొంత ఇంటిని అమ్మి డబ్బులు కూడా తన భార్య వెంకటరమణకు ఇవ్వడం జరిగిందని తెలిపాడు. అనంతరం మళ్లీ తనకు ఫోన్ చేసి రూ 20 లక్షలు ఇస్తే డైవోర్స్ ఇస్తాను, తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని ఆ లాయర్, తన భార్య వేధిస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన చావుకు కారణం లాయర్ బాలాజీ, భార్య వెంకటరమణలే కారణమని పేపర్‌పై రాసి, వీడియోద్వారా తెలిపాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఘటనకు కారణమైన వెంకటరమణను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. లాయర్ బాలాజీ పరారీలో ఉన్నాడని అతడిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. న్యాయవాదితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనపై తొమ్మిది కేసులు పెట్టి, జైలుకు పంపిందని వీడియోలో వాపోయిన మృతుడు విడాకులు కావాలంటే రూ.20లక్షలు ఇవ్వాలని వేధించడంతో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య -
మహిళా వీఆర్వోను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు
మేడికొండూరు: మేడికొండూరు మండలం కొరప్రాడు గ్రామంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న మహిళను అసభ్య పదజాలంతో దూషించిన కొరప్రాడు గ్రామానికి చెందిన మద్దూ రామకోటిపై సీఐ నాగూర్ మీరా సాహెబ్ మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ తెలిపిన వివరాలు.. రామకోటి నూతన పాస్ పుస్తకం కోసం వెళ్లి వీఆర్వోను కలువగా ఆమె మీ పొలం కోర్టు కేసులో ఉందని, అర్జీ పెట్టుకుంటే ఓకే చేస్తామని చెప్పింది. కోపోద్రికుడైన రామకోటి మహిళా వీఆర్వోను అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడాడు. రామకోటి ప్రవర్తనకు భయపడిన మహిళా వీఆర్వో మేడికొండూరు పోలీసులను ఆశ్రయించింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. మహిళా వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, వారి విధులకు ఆటంకం కలిగించిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగూర్ మీరా సాహెబ్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేశాం: మంత్రి నాదెండ్ల తెనాలి అర్బన్: ధాన్యం కొనుగోలు వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41.27లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రూ.10 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించారు. రైతులందరూ సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. యడ్లపాడు: నూలుమిల్లు క్వార్టర్స్‌లో మైనర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పురుషోత్తంపూర్ తాలూకా, బడబరగాం గ్రామానికి చెందిన సజని బిష్ణోయ్ కుటుంబం ఉపాధి నిమిత్తం ఐదు నెలల కిందట బోయపాలెం గ్రామానికి వలస వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ నూలుమిల్లు కార్మికులుగా చేరి కంపెనీ క్వార్టర్స్‌లో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. సజని బిష్ణోయ్ కుమార్తె ప్రియాంక బిష్ణోయ్(16) రెండేళ్లుగా తమ స్వగ్రామానికి చెందిన బబ్లునాయక్ అనే యువకుడితో తరచు ఫోన్ ద్వారా మాట్లాడుతుంది. ఈ విషయం తెలుసుకున్న తల్లి కూతుర్ని మందించి ఆ యువకుడితో మాట్లాడవద్దని హెచ్చరించింది. మనస్థాపం చెందిన ప్రియాంక ఈనెల 12వతేదీ మధ్యాహ్నం కంపెనీ క్వార్టర్స్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై యడ్లపాడు పోలీస్ స్టేషన్‌న్‌లో కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ టి శివరామకృష్ణ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్ ప్రశాంత్‌రాజు మృతి
బాపట్ల/కర్లపాలెం: విశాలాంధ్ర తెలుగు దినపత్రిక బాపట్ల జిల్లా బ్యూరో కాగిత ప్రశాంత్ రాజు (36) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం విధులు పూర్తిచేసుకుని కర్లపాలెంలోని తన నివాసానికి బైక్‌పై వెళుతుండగా నల్లమోతువారిపాలెం వద్ద ఆక్వా సీడ్స్ లారీ ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తరువాత అదే మార్గంలో లో వెళుతున్న బాపట్ల దిశ రిపోర్టర్ బడుగు విజయ భరత్ ప్రమాదానికి గురైన ప్రశాంత్‌ను 108లో బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు లేని కారణంగా రెండు గంటలపాటు కొన ఊపిరితో పోరాడి చివరకు తుది శ్వాస విడిచారు. జర్నలిస్ట్ ప్రశాంత్ రాజుకు భార్య, ఒక పాప, బాబు ఉన్నారు. మృతికి కోన సంతాపం ప్రశాంత్‌రాజు మృతికి మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సంతాపం తెలిపారు. జర్నలిస్టుగా విశేష సేవలు అందించిన ప్రశాంత్‌రాజు మృతి తీరనిలోటన్నారు. ప్రశాంత్‌రాజు కుటుంభ సభ్యులకు సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపినవారిలో మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, జర్నలిస్టు నాయకులు సంతాపం తెలిపారు. ప్రశాంత్‌రాజు భౌతికకాయాన్ని కర్లపాలెం ఎంపీపీ యారం వనజ, సర్పంచి నక్కల శేషాద్రి, పలువురు ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు సందర్శించి నివాళులర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీంద్ర తెలిపారు.బాపట్లలో అలముకున్న విషాదం -
సత్తా చాటిన వేటపాలెం ఎడ్లు
యర్రగొండపాలెం: యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆద్యంతంగా ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతున్నాయి. మంగళవారం న్యూ కేటగిరీ ఎడ్ల బల ప్రదర్శనలో బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన గిత్తలు 4,800 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు ఆర్కే బుల్స్ అత్తోటి శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి రూ.లక్ష నగదు బహుమతి అందుకున్నారు. ఎమ్మెల్యే తాటిపర్తి ఎడ్లు 466.2 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచి రూ.80 వేలు దక్కించుకున్నాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాల, ముప్పాళ్లకు చెందిన ఎడ్లు 4,500 అడుగుల లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని పుచ్చకాయల శివపార్వతి, కల్యాణ్ మెమోరియల్స్కు చెందిన శేషాద్రి చౌదరి రూ.60 వేలు అందుకున్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం మునుగోడుకు చెందిన ఎడ్లు 4,500.6 అడుగులు లాగి చతుర్థ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని కోపూరి శ్రీనివాసరావు రూ.50 వేలు, నంద్యాల జిల్లా బిళ్వలాపురానికి చెందిన ఎడ్లు 4,028.6 అడుగులు లాగి 5వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని రూ.40 వేలు, గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన ఎడ్లు 3,911.4 అడుగులు లాగి 6వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు గువిబండి మాధవరెడ్డి అండ్ సన్స్, శ్రీనివాసరెడ్డి రూ.30 వేలు, కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం తూడిచర్ల గ్రామానికి చెందిన ఎడ్లు 3,475.4 అడుగులు లాగి 7వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు రూ 25 వేలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని కోట కందుకూరుకు చెందిన ఎడ్లు 3,455 అడుగులు లాగి 8వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని గోన నరసింహారెడ్డి రూ.20 వేలు, పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన ఎడ్లు 3,388 అడుగులు లాగి 9వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు పి.ఈశ్వర్ ప్రణయ్ యాదవ్, అశ్విక్ యాదవ్ రూ.18 వేలు ప్రకారం ఎమ్మెల్యే అందచేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు యేర్వ చలమారెడ్డి, చేదూరి విజయభాస్కర్, వాగ్యా నాయక్, గుమ్మా ఎల్లేష్ యాదవ్, ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, సింగారెడ్డి పోలిరెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, కె.ఓబులరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, షేక్.బుజ్జి, దొండేటి నాగేశ్వరరెడ్డి, ఆర్.అరుణాబాయి, ఎల్.రాములు, పి.రాములు నాయక్, పల్లె సరళ, గార్లపాటి శార, వాడాల పద్మ, మిడత నరసింహారావు, మందుల ఆదిశేషు, కందూరి కాశీవిశ్వనాథ్, పబ్బిశెట్టి శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్‌కుమార్, గోళ్ల కృష్ణారావు, సూరె శ్రీనివాసులు, షేక్.కాశింపీరా, షేక్ మహమ్మద్ కాశిం, షేక్ షెక్షావలి, తోకల ఆవులయ్య, గుండారెడ్డి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. నేడు సీనియర్ విభాగంలో ఎడ్ల పోటీలు ఎడ్ల బలప్రదర్శనలో భాగంగా బుధవారం సీనియర్ విభాగంలో ఎడ్ల పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు ప్రథమ బహుమతి రూ.1.50 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.లక్ష, తృతీయ బహుమతి రూ.80 వేలు, చతుర్ధ బహుమతి రూ.70 వేలు, 5వ బహుమతి రూ.60 వేలు, 6వ బహుమతి రూ.50 వేలు, 7వ బహుమతి రూ.40 వేలు, 8వ బహుమతి రూ.30 వేలు, 9వ బహుమతి రూ.20 వేలు అందజేస్తారు. -
రైతులను మోసగించిన విత్తన కంపెనీ
వినుకొండ: విత్తనాలు మేమే ఇస్తాం.. మందులు మేమే ఇస్తాం పంట పండకపోతే నష్టపరిహారం ఇస్తాం అంటూ నమ్మబలికిన ఓ ప్రముఖ విత్తన కంపెనీ, తీరా పంట చేతికి వచ్చే సమయానికి చేతులెత్తేయడంతో ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలోని రైతులు రోడ్డున పడ్డారు. దాదాపు 70 ఎకరాల్లో సాగైన మొక్కజొన్న సాగులో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వివరాల ప్రకారం కొచ్చెర్ల గ్రామ రైతులకు ఓ సీడ్స్ కంపెనీ ప్రతినిధులు ఆశచూపారు. ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, క్వింటాకు రూ.3,500 చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఒకవేళ పంట వైఫల్యం చెందితే ఎకరానికి రూ.70వేలు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడి కోసం ఎకరానికి రూ.20 వేలు ఇస్తామని చెప్పి, తీరా సమయానికి కొందరికి తక్కువ ఇచ్చి, మరికొందరికి అసలు ఇవ్వకుండా కంపెనీ మొఖం చాటేసింది. బాధిత రైతులు కృష్ణా నాయక్, భుక్యా బాలు నాయక్, ఐనాల పుల్లారావు తదితరుల 11 ఎకరాల పొలాలను పరిశీలిస్తే విత్తన లోపం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఇవే పొలాల్లో మిరప పంటలు పండగా, ఇప్పుడు కంపెనీ పర్యవేక్షణలో వేసిన మొక్కజొన్న మాత్రం విఫలమైంది. దీన్ని ప్రశ్నిస్తే, మీ భూమిలో లోపం వల్లే పంట రాలేదు అంటూ కంపెనీ ప్రతినిధులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీడ్స్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు చేకూరి సురేష్ రాజా, సత్యనారాయణ, ముని వెంకటేశ్వర్లు బాధిత పొలాలను సందర్శించి, రైతులతో మాట్లాడారు. ఈ విషయాన్ని వెంటనే మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ‘కంపెనీలు ఇచ్చే మాయమాటలు నమ్మి బాండ్లు లేకుండా ఒప్పందాలు చేసుకోవద్దు. నూజివీడు సీడ్స్ యాజమాన్యం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. లేనిపక్షంలో బాధితుల తరపున ఉద్యమిస్తామన్నారు. -
తెనాలి దేవదాయశాఖ ఈవోపై మంత్రి ఫైర్
తెనాలి: విడవమంటే పాముకు కోపం...కరవమంటే కప్పకు కోపం అన్నట్టుగా తెనాలిలో అధికారుల పరిస్థితి తయారైంది. దేవదాయ శాఖ ఈవో తమ్మా శివారెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్ కావడం, సెలవుపై వెళ్లాలని ఆదేశించడం ఇందుకో నిదర్శనం. దేవదాయ పరిధిలోని శ్రీ సత్యనారాయణ టాకీస్ లీజు వ్యవహారమే ఇందుకు కారణం. డిపాజిట్ చెల్లించకపోయినా డిఫాల్టర్ అయినప్పటికీ బినామీకి థియేటర్ లీజు అప్పగించడమే ఈఓ పొరపాటు. నాడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ నుంచి అక్షింతలు వేయించుకోని మరీ మౌనంగా ఉండిపోయినందుకు ఈఓ శివారెడ్డికి ఇప్పుడు మంత్రి మనోహర్‌తో చివాట్లు పడాల్సి వచ్చింది. పైగా బదిలీపై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గతేడాది సంక్రాంతి కోడిపందేలు వ్యవహారంలో అప్పట్లో ఒక సీఐ సెలవుపై వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు ఈఓకు ఆ పరిస్థితి తప్పటం లేదు. దేవాదాయ పరిధిలోని స్థానిక బోసురోడ్డులో గల శ్రీ కాకుమాను శంకరుని సత్రానికి చెందిన శ్రీ సత్యనారాయణ టాకీస్ లీజు పేరుతో టీడీపీ వర్గీయుల ఆధీనంలో కొనసాగుతోంది. కొన్నేళ్లుగా అందులో ఫంక్షన్ హాలు నడుపుతున్నారు. 2025 ఏప్రిల్ నాటికి టాకీస్ లీజు కాల పరిమితి ముగిసింది. లీజుదారుడు అప్పటికీ రూ.12 లక్షలు అద్దె బకాయిలు ఉన్నారు. బకాయిలు వసూలుకు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. దేవదాయశాఖ హాలు వేలానికి ప్రకటన చేసింది. డిఫాల్టర్ అయిన శ్రీనివాస్‌కు వేలంలో పాల్గొనే అర్హతను కోల్పోవటంతో, అతడి బినామీ వీరయ్య చౌదరి వేలంలో పాడుకున్నారు. నెలకు రూ.1.28 లక్షల వేలంతో దక్కించుకున్నారు. వేలంలో పాల్గొన్న ఇతరులను అంతకుమంచి పాడనివ్వకుండా చేశారని అప్పట్లో ఆరోపణ లొచ్చాయి. ఏదైమైనా డిఫాల్టరయిన శ్రీనివాస్, వీరయ్య చౌదరి ద్వారా మళ్లీ లీజు దక్కించుకున్నారు. నిబంధనలు ప్రకారం రూ.5 లక్షల డిపాజిట్‌ను చెల్లించకుండానే వేలానికి అనుమతించటం, అతడు పేరిట కొట్టేయడం జరిగిపోయింది. దీనికి కారణం ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు పుట్టి శ్రీనివాస్‌కు టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అండదండలు ఉండటమేనని అందరికీ తెలుసు. గతంలోని అద్దెను స్వల్పంగా పెంచి శ్రీనివాస్‌కు ఇవ్వాల్సింది పోయి, వే లం ఎందుకు పెట్టావంటూ అప్పట్లో ఈఓపై ఆల పాటి ఆగ్రహించినట్లు కూడా చెబుతారు. ఆలపాటి ఆశీస్సులతో శ్రీ సత్యనారాయణ టాకీస్‌ను వీరయ్య చౌదరి పేరుతో లీజు దక్కించుకున్న పుట్టి శ్రీనివాస్ నెలనెలా చెల్లించాల్సిన అద్దె రూ.1.28 లక్షలు యఽథౠప్రకారం బకాయిల జాబితాలో చేరాయి. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలలకు రూ.10లక్షలకు పైగా చెల్లించాల్సి వుండగా, కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించినట్లు సమాచారం. పాట సమయంలో చెల్లించాల్సిన రూ.5 లక్షలు డిపాజిట్ అతీగతీ లేదు. ఇదిలావుంటే మూడేళ్ల లీజుకు అనుమతిస్తూ దేవదాయశాఖ కమిషనర్ నుండి ఉత్తర్వులు కూడా వచ్చాయి. రాజకీయ సిఫార్సుల్లేకుండా నిబంధనలకూ విరుద్ధంగా అనుమతులు ఎలా వస్తాయనేది ప్రశ్న! శ్రీ సత్యనారాయణ టాకీస్‌కు ఫంక్షన్ హాలుగా నడుపుతున్న పుట్టి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. థియేటర్ వేలం పాటలో డిఫాల్టర్ తరఫున బినామీ లీజులో పాల్గొన్నారని, టీడీపీ మద్దత తో ‘మనోడు’ దక్కించుకున్నాడని ‘సాక్షి’లో అప్పట్లోనే కథనం ప్రచురితమైనంది. ఆ సమయంలో పట్టించుకోని మంత్రి పది నెలలకు సత్యనారాయణ టాకీస్ లీజు వ్యవహారంపై ఈఓను సెలవుపై వెళ్లాలంటూ ఆదేశించడం విశేషం. ఇటీవల ఫ్లెక్సీల వివాదం తరువాత ఈ ఘటన చోటుచేసుకోంది. ఇలా ఇద్దరి మధ్య నలుగుతున్న అధికారులు ఇంకెందరో? అన్న చర్చ పట్టణంలో నడుస్తోంది! సెలవుపై వెళ్లాలని ఆదేశం సత్యనారాయణ టాకీస్ వేలం వ్యవహారంలో మంత్రి మనోహర్ ఆగ్రహం వేలం నాడే ‘సాక్షి’ హెచ్చరించినా ఎవరికీ పట్టని వైనం ఎమ్మెల్సీ రాజా వర్సెస్ మంత్రి మనోహర్ మధ్య మరో అధికారి బలి? -
నిత్యాన్నదానానికి రూ.2 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి చీరాలకు చెందిన భక్తులు మంగళవారం రూ.2 లక్షల విరాళం సమర్పించారు. చీరాల కొత్తపేటకు చెందిన ఎం.రామకౌశిక్, యశస్విని దంపతులు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నాగేశ్వరరావు, ప్రజ్ఞరాజశ్రీ పేరిట ఈ విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఈఓ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ అరుణ్‌బాబు తెనాలిటౌన్: త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పేదలకు ఇళ్ల నిర్మాణం చేయనున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. రూరల్ మండలం బుర్రిపాలెం గ్రామంలో మంగళవారం ఆయన అధికారులతో కలసి పర్యటించారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో సెంట్రల్ స్కీమ్ ద్వారా సొంత ఇంటి స్థలం కలిగిన 91 మంది పేదలకు త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇంటి నిర్మాణం పూర్తిచేసి ఇవ్వనున్నట్లు చెప్పారు. పూర్తి ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. గ్రామంలోని లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. అనంతరం జగ్గడిగుంటపాలెం గ్రామంలోని జగనన్న కాలనీ లే అవుట్‌ను పరిశీలించారు. ఇంటి నిర్మాణాలు పరిశీలించి కాంట్రాక్టర్లతో ముచ్చటించారు. నిర్మాణం ఏ దశలో ఉంది, లబ్ధిదారులకు మేలు కలిగేలా నిర్మాణాలు జరుగుతున్నది లేనిది వాకబు చేశారు. నాణ్యత ప్రమాణాలకు లోటు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆయన వెంట చీఫ్ ఇంజినీర్ జయరామాచారి, ఎస్ఈ వేణుగోపాల్, జిల్లా హౌసింగ్ పీడీ ప్రసాద్, తెనాలి హౌసింగ్ ఈఈ భాస్కర్, ఏఈ బాలాజీ, ఉన్నారు. -
కాయ్ రాజా.. కాయ్!
బాపట్లIఅధికార పార్టీ నేతల కనుసన్నల్లో కోడిపందేలు, పేకాట శిబిరాలు జోరుగా సాగుతున్నాయి. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం బరిలో మంగళవారం పెద్ద ఎత్తున కోడిపందేలు జరిగాయి. బరులు నాలుగురోజుల ముందే సిద్ధమైనా సంక్రాంతి తొలిరోజు బుధవారం నుంచి పందేలు ఉంటాయని భావించారు. ఐతే ఒక రోజు ముందు నుంచే పందేలు మొదలు పెట్టారు. 60 ఎకరాల బరిలో పలు చోట్ల కోడి పందేలు నిర్వహించారు. మరోవైపు ఇదే బరిలో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున పేకాట శిబిరాలు కొనసాగాయి.వేమూరు నియోజకవర్గంలో వేమూరులో కోడి పందేల బరిని ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ప్రారంభించారు. చావలి– కోడిపర్రు మధ్యన, చుండూరు మండలం వేటపాలెం వద్ద బరులు సిద్ధం చేశారు. పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం పెద గంజాంతోపాటు నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామాల్లో కోడి పందేలు జరగనున్నాయి. చీరాల, బాపట్ల నియోజకవర్గాల్లోని సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించనున్నారు. అధికార పార్టీ నేతలే వీటిని నిర్వహిస్తుండడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అధికారులు ప్రెస్మీట్లు పెడుతున్నా.. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. పండుగ పేరుతో సామాన్యుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో మంగళవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.2500, గరిష్ట ధర రూ.4000, మోడల్ ధర రూ.3500 వరకు పలికింది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 555.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 45,242 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 38.7890 టీఎంసీలు. కొల్లూరు: కోడి పందేల జోరు కొల్లూరు మండలంలో ఊపందుకుంది. సంక్రాంతి సంబరాల పేరుతో చంద్రబాబు ప్రభుత్వంలోని టీడీపీ నాయకులు బరి తెగించి ఈ పందేలతోపాటు జూద క్రీడలకు తెరలేపారు. జనం బలహీనతను సొమ్ము చేసుకొని కాసులు దండుకోవడమే లక్ష్యంగా సకల సౌకర్యాలతో బరులను సిద్ధం చేశారు. కోడి పందేలు, పేకాట, గుండాట వంటి క్రీడలకు వసతులు కల్పించారు. బరుల వద్దే మద్యం కౌంటర్లను తెరిచారు. కొల్లూరు మండలంలోని క్రాప అడ్డరోడ్డు, అనంతవరం వద్ద పందేలు జోరుగా సాగాయి. వీటిని నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు కార్లు, ద్విచక్ర వాహనాలను బహుమతులుగా ఇస్తామని వల విసిరారు. కొల్లూరు టీడీపీలో ఉన్న రెండు వర్గాలు పోటాపోటీగా వ్యవహరిన్నాయి. -
మాయప్పిరాన్ అలంకరణలో శ్రీవారు
మంగళగిరి టౌన్: లడక్‌లో ఈ నెల 20 నుంచి 27వ తే దీ వరకు జరిగే ఖేలో ఇండియా గేమ్స్– 2026కు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీత, అంతర్జాతీయ ఐస్ స్కేటర్ జెస్సీ రాజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికై ంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జెస్సీరాజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి బాలికల విభాగంలో ఎంపికై న ఏకై క స్కేటర్‌గా నిలవడం విశేషం. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్న జెస్సీ వ్యక్తిగత ప్రతిభకు నిదర్శంగా నిలవడమే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి షేక్ ఖాజా పేర్కొన్నారు. దీంతో పలువురు క్రీడాకారులు, నాయకులు ఈ ఆమెకు అభినందనలు తెలిపారు. చేబ్రోలు: చేబ్రోలు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారుల బృందాలు మంగళవారం విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. 3072 సర్వీసులను తనిఖీ చేసి 123 మందిపై కేసులు నమోదు చేసి రూ.5.63 లక్షల జరిమానా విధించినట్లు తెనాలి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అక్కల సత్యనారాయణ తెలిపారు. మీటరు లేకుండా డైరెక్టుగా విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఐదు కేసులకు రూ.20 వేలు, అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 111 సర్వీసులకు రూ.4.43 లక్షలు, మాల్ ప్రాక్టీస్ సంబంధించి ఏడు కేసులకు రూ.లక్ష జరిమానా విధించినట్లు తెలిపారు. ఈఈ మాట్లాడుతూ విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో డీపీఈ (విజిలెన్సు) కే రాజశేఖర్, కే రవికుమార్, ఎ.సుందరంబాబు, మల్లికార్జున ప్రసాద్, శ్రీనివాసరావు, స్థానిక ఏఈ బి.శ్రీనివాసరావు, చేబ్రోలు, తెనాలి డివిజన్ వివిధ సెక్షన్ల డీఈఈలు, ఏఈఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
దూరమైన సంప్రదాయాలు
● అలనాటి సంక్రాంతి పండుగ నిర్వహణ తీరే వేరు ● కళాకారులతో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పండుగ హుషారు ● నేడు అక్కడక్కడే కనిపిస్తున్న నాటి సంప్రదాయ గురుతులు హరిదాసులు.. గంగిరెద్దుల విన్యాసాలు.. బుడబక్కల వారు.. కొమ్మదాసరులు.. జంగమ దేవరులు.. గ్రామంలో హరిదాసు సంచారం (ఫైల్) బుడబక్కల వారు (ఫైల్) -
నకిలీ ముఠా గుట్టు రట్టు
బాపట్లటౌన్ తక్కువ ధరకే బంగారం పేరిట మోసానికి పాల్పడిన నకిలీ ముఠా గుట్టును వెదుళ్లపల్లి పోలీసులు రట్టు చేశారు. బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముఠా వివరాలు వెల్లడించారు. స్టువార్టుపురం రెండో గ్యాంగ్‌కు చెందిన లక్ష్మి అలియాస్ పీరిగ కల్యాణి తన బావ అంగడి చంద్రబాబు, అక్క ప్రసన్నకుమారిలు ఆర్థిక లావాదేవిల కారణంగా బ్యాంకులో పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేకపోతున్నారని, అది విడిపించుకుంటే చాలా లాభం వస్తుందని తనకు పరిచయం ఉన్న తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం పందూరు గ్రామానికి చెందిన మొగిలిశెట్టి శ్రీదేవి అలియాస్ దేవిని నమ్మిచింది. లక్ష్మి మాటలు నమ్మిన శ్రీదేవి తన డ్రైవర్ విజయ్‌తో కలిసి ఈనెల 6న స్టువర్టుపురం గ్రామానికి చేరుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం లక్ష్మి వీరితో మాట్లాడుతుండగా అంగడి ప్రసన్నకుమారి అలియాస్ అమ్ములు, అంగడి చంద్రబాబు, చిన్నపోతుల భవానీశంకర్ అలియాస్ సన్నీ, మాదిగాని రామచంద్రకుమార్ అలియాస్ పెద్దపప్పు, అంగవి కావేరి అలియాస దీప్తి, అంగడి లోహిత్ అలియాస్ దీపులు పోలీసు వేషాల్లో వచ్చి శ్రీదేవిని బెదిరించి ఆమె వద్ద ఉన్న రూ.6.50 లక్షలు లాక్కొని పారిపోయారు. దీంతో బాధితురాలు వెదుళ్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వెదుళ్లపల్లి ఎస్ఐ పి.భాగ్యరాజ్ తమ సిబ్బందితో దాడిచేసి ఈనెల 11న చీరాల మండలం తోటవారిపాలెం పోలేరమ్మ తల్లి దేవాలయంలో నిందితులను అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు వ్యక్తులను అరెస్ట్‌చేశారు. నకిలీ ముఠా కేసును ఛేదించిన వెదుళ్లపల్లి ఎస్ఐ భాగ్యరాజ్, రూరల్ సర్కిల్ సీఐ బి.హరికృష్ణలను ఎస్పీ అభినందించారు. -
బరి తెగింపు
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో కోడిపందాల కోసం వచ్చే వీఐపీలకు సిద్ధమవుతున్న వేదిక రేపల్లె నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలంలో 50 ఎకరాల విస్తీర్ణంలో కోడిపందేలు, పేకాట కోసం బరి సిద్ధం చేశారు. ఇందులో ఒకటి పెద్ద బరికాగా.. మిగిలిన పది బరులు చిన్నవి. పెద్ద బరిలో రూ.లక్ష నుంచి రెండు లక్షల పందేలు జరగనుండగా చిన్న బరుల్లో రూ.10 వేల నుంచి లక్ష వరకు జరగనున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున పేకాట నిర్వహించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన వారికి ఐదు రోజులపాటు పేకాట ఆడుకునేందుకు రూ. 60 లక్షలకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సమాచారం. బరులవద్ద పార్కింగ్, మద్యం దుకాణాల ఏర్పాటుకు నిర్వాహకులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, బాపట్ల: సంక్రాంతి నాడు సంప్రదాయ క్రీడగా ఆడుకొనే కోడి పందేలను జూద క్రీడగా మార్చి కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు అధికారపార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఇందుకోసం పండుగకు వారం ముందే బరులు సిద్ధం చేశారు. ఐదు రోజులపాటు పందాలు, పేకాట జోరుగా సాగనుంది. అంతకు మించి పై పందాలు ఉండనున్నాయి. వందల కోట్లలో వ్యాపారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. బరుల వద్ద పలురకాల వ్యాపారాలను లాభసాటిగా మార్చేందుకు టీడీపీ, జనసేన నేతలు సిద్ధమయ్యారు. కూల్‌డ్రింక్ షాపులు మొదలు చిరుతిళ్ల దుకాణాలు నెలకొల్పతున్నారు. బరులవద్ద అనధికార మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. వేమూరు నియోజకవర్గంలో.. ఈ ప్రాంతంలో ఐదు బరులు ఏర్పాటు చేస్తున్నారు. వేమూరు మండలం కేంద్రం మార్కెట్ సమీపంలో టీడీపీ నేత పది ఎకరాల్లో ఒక బరి సిద్ధం చేయగా..ఇదే మండలంలోని చావలి– కోడిపర్రు మధ్యన జనసేన నేత పది ఎకరాల్లో మరో బరి నెలకొల్పారు. కొల్లూరు మండలం కేంద్రం సమీపంలో క్రాప వద్ద ఒక బరి, ఇదే మండలంలోని అనంతవరం వద్ద మరొక బరిని టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. చుండూరు మండలం వేటపాలెం వద్ద బరి సిద్ధం చేశారు. బాపట్ల నియోజకవర్గంలో... పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం వద్ద టీడీపీ నేతలు బారీ బరి ఏర్పాటు చేశారు. ఈ బరులన్నింటిలో రూ.25 వేలు మొదలు రెండు లక్షల వరకు పందాలు సాగనున్నాయి. పెద్ద ఎత్తున పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం పెద గంజాంతోపాటు నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామాల్లో కోడి పందేలు జరగనున్నాయి. చీరాల, బాపట్ల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో కోడిపందాలు, పేకాట నిర్వహించనున్నారు. జిల్లాలో జరిగే కోడిపందాలు, పేకాటలకు జిల్లా నలుమూల నుంచే కాక అటు ప్రకాశం, నెల్లూరు, జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి రానున్నారు. అక్కడే మద్యం దుకాణాల ఏర్పాటు -
క్షయ బాధితుల వివరాలు యాప్‌లో పొందుపరచాలి
అడిషనల్ డీఎంహెచ్‌వో, డీఎల్ఏటీబీ డాక్టర్ సోమ్లా నాయక్ చీరాల రూరల్: క్షయ వ్యాధి బాధితులను సకాలంలో గుర్తించి వారికి అందిస్తున్న వైద్య సేవలను నిక్షయ యాప్‌లో పొందుపరచాలని జిల్లా అడిషనల్ మెడికల్ అండ్ హెల్త్, జిల్లా టీబీ, లెప్రసీ, ఎయిడ్స్ అధికారి డాక్టర్ సోమ్లా నాయక్ వైద్య ఆరోగ్య, ఆశా కార్యకర్తలను సూచించారు. సోమవారం ఆయన చీరాలకు వచ్చిన సందర్భంగా స్థానిక పాపరాజుతోటలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, వైకుంఠపురంలోని పీహెచ్‌సీని సందర్శించారు. రోగులకు అక్కడ అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. ల్యాబ్‌లు, ఫార్మసీ, టీబీ కార్డులు, టీబీ నోటిఫికేషన్, రికార్డులను తనిఖీ చేశారు. ఆయా కేంద్రాలలోని వైద్యులు డాక్టర్ జాకోబు, డాక్టర్ హేమ మాధురి నుంచి వివరాలు సేకరించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ వ్యాధిపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బాధితులకు అందించే మందులు ఆరోగ్య జాగ్రత్తలను ఎప్పటికప్పుడు యాప్‌లలో నిక్షిప్తం చేయాలని సూచించారు. అలానే క్షయవ్యాధిపై నిరంతరం బాధితులకు అవగాహన కల్పించాలని చెప్పారు. క్షయవ్యాధి అవగాహన కార్యక్రమాలను నిక్షయ ఎన్రోల్మెంట్, స్పుటమ్ పరీక్షలు, రిఫరల్స్ వంటి లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. టీబీ మందులు వాడేవారికి టోల్‌ఫ్రీ నంబర్ 18003136120 పై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో టీబీ ఆరోగ్య కార్యకర్త కె. శ్రీలక్ష్మి, ఫార్మసి కేశవ, కళ్యాణి, రమేష్, ప్రసన్న, డీపీసీ సీహెచ్ ప్రపుల్ల, ఐసీటీసీ కోఆర్డినేటర్ బాషా పాల్గొన్నారు. -
క్రీడల్లో బాపట్ల జిల్లాకు ప్రాధాన్యం పెరగాలి
బాపట్ల: రాష్ట్ర స్థాయిలో ఒలంపిక్ గేమ్స్‌లో సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ ప్రత్యేక అవసరాల గల విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన ఎ.భార్గవ్ శ్రీరామ్, ఎం.రత్న కుమార్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం లో మొదటి, మూడవ స్థానంలో విజేతలుగా నిలిచారు. రేపల్లె మండలం, ప్రభుత్వ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి ఎస్.కె.అహ్మద్ జోనల్ లెవెల్లో బాపట్ల జిల్లా నుంచి ఎంపికై న విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు క్రీడల్లో ప్రాధాన్యం పెరగాలని ఆకాంక్షించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ -
బాపట్ల జిల్లా టూరిజం అధికారిగా ఎస్.కె.అలీ అజగర్
అధికారుల నిర్లక్ష్యంపై రైతు నిరసన యడ్లపాడు: ప్రభుత్వ పథకాల అమలులో రెవెన్యూ అధికారుల ఉదాసీనతపై ఓ రైతు బహిరంగంగానే తన నిరసన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని తిమ్మాపురంలో జరిగిన బహిరంగ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలోనే అధికారుల తీరును ఎండగట్టారు. ఐదు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానంటూ గ్రామానికి చెందిన రైతు రాధాకృష్ణ వేదిక వద్దకు వచ్చి తన ఆవేదనను వెలిబుచ్చారు. ఐదు దశాబ్దాల క్రితం వారసత్వంగా వచ్చిన భూమికి పలు కారణాలు చూపి ఆన్లైన్ ఎక్కించడం లేదని వాపోయారు. అర్హత ఉన్నా రెండు విడతలుగా ’అన్నదాత సుఖీభవ’ పథకం వర్తించడం లేదని ఫిర్యా దు చేశారు. రైతు ఫిర్యాదుపై స్పందించిన ఎంపీ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భూముల సర్వేలో ఇబ్బందు లు ఉన్నా, పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లినా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్సీ కాలనీలో ఏర్పాటుచేసిన రక్షిత నీటి ప్లాంట్, పార్కులో వాలీబాల్ కోర్టు, జెడ్పీహైస్కూల్లో క్రీడామైదానం అభివృద్ధి పనుల్ని ప్రారంభించి, గ్రామస్తులు నాగండ్ల రాంబాబు తన సొంత నిధులతో నిర్మించనున్న హిందూ శ్మశాన వాటికకు భూమిపూజ చేశారు. -
రామావతారం అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలోని రైల్వేస్టేషన్‌రోడ్‌లో గల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం శ్రీవారికి రామావతారం అలంకరణ చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పాశురాలను పఠించారు. ఆలయ ప్రాంగణంలో స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు కోలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా శ్రీవారి సేవా సమాజం ఏర్పాట్లను పర్య వేక్షించారు. భక్తులు సమర్పించిన వస్త్రాల వేలం మంగళగిరి టౌన్: మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ఎగువ, దిగువ సన్నిధిల్లో శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన వస్త్రాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14, 15వ తేదీలలో ఉదయం 9 గంటల నుంచి దిగువ సన్నిధిలోని ఆలయంలో వేలం నిర్వహిస్తామని, ఆసక్తి గలవారు పాల్గొనాలని పేర్కొన్నారు. స్వదేశీ నినాదాన్ని చాటిన మహనీయుడు వివేకానంద మంగళగిరి టౌన్ : స్వదేశీ నినాదాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలోని స్వామి వివేకానంద స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. వర్శిటీ పరిపాలనా భవనంలో జరిగిన కార్యక్రమంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నైతిక విలువలు, దేశభక్తిని నాటడంలో వివేకానంద చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం, వర్శిటీ ఆర్ట్స్, కామర్స్ లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సురేష్‌కుమార్, పలువురు ఆచార్యులు లింగరాజు, తేజామూర్తి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సాగర్ నీటిమట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 556.00 అడుగులకు చేరింది. ఇది 223.1910 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 9,800, ఎడమ కాలువకు 7,272, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 26,704, ఎస్ఎల్బీసీకి 1,650, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది.జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 45,726 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 33,098 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. భక్తిశ్రద్ధలతో మహా పూర్ణాహుతి నగరంపాలెం(గుంటూరువెస్ట్):గుంటూరుబృందావన్ గార్డెన్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆల య ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞా న పరిషత్, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పాలకమండలి సంయుక్త ఆధ్వర్యంలో విశ్వశాంతి, లోక కల్యాణాలను కాంక్షిస్తూ సోమవారం చండీహోమం మహా పూర్ణాహుతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అన్నప్రసాద వితరణ చేశారు. -
కవయిత్రి విశ్వైక పావని దంపతులకు సన్మానం
సత్తెనపల్లి: సామాజిక కవయిత్రి విశ్వైక కలం నుంచి వెలువడిన ‘తొలి సంతకం‘ కవితా సంకలనం పుస్తక పరిచయం పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉషోదయ కళాపరిషత్ అధ్యక్షుడు పిన్నమనేని పాములయ్య అధ్యక్షత వహించి మాట్లాడుతూ కవిత్వం ఆత్మ భాషయని, భావోద్వేగాలను పదాలుగా నేయగలవాడు ‘కవి’ అన్నారు. ఈ ‘తొలి సంతకం’ కవితా మాలిక కవయిత్రి పావని కాగా ఆమె కలంపేరు ‘విశ్వైక.’ ఇటీవల హైదరాబాద్ నగరంలో ప్రారంభావిష్కరణ జరుపుకోగా సత్తెనపల్లిలో పుస్తక సమీక్ష ‘తొలి సంతకం’ కవితా మాలిక ప్రతిష్టను సంతరించుకొన్నదన్నారు. సభలో ప్రముఖ కవి కొరబండి ఆంథోనీ, యూటీఎఫ్ నాయకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు కె.పోతులూరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ కుమార్ సీపీఎం పట్టణ కార్యదర్శి డి విమల, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పట్టణ కార్యదర్శి జి ఉమాశ్రీలు మాట్లాడారు. అనంతరం ‘తొలి సంతకం’ కవితా సంపుటి పుస్తకాన్ని సభికులు ప్రారంభించి సభకు పరిచయం చేశారు. విశ్వైక కుమారులు కార్తీక్ దీపక్‌లు ఈ పుస్తకానికి సాంకేతిక వర్గంగా వ్యవహరించారు. అనంతరం కవయిత్రి విశ్వైక, ఆమెను ప్రోత్సహించిన భర్త విశ్వరూపాచారి, ఆమె తండ్రి రొంపిచర్ల పురుషోత్తంలను పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఉషోదయ కళాపరిషత్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కవయిత్రి విశ్వైక, విశ్వరూపాచారి దంపతులు పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంకు రూ.50 వేలు విరాళంగా బ్యాంక్ చెక్కును అంద జేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు బత్తినేని లక్ష్మయ్య, ఈవీ ప్రసాద్, మాతంగి సాంబశివరావు, నాగేశ్వరరావు, రమాదేవి, జొన్నలగడ్డ రత్నరాజు, రవి, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులపై చర్యలు తీసుకోవాలి
మైనర్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన నగరంపాలెం: మైనర్ విద్యార్థులపై దాడికి పాల్పడిన ఎస్ఐ, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలంటూ కాకుమాను, అప్పాపురం గ్రామస్తులు, మాలమహానాడు, మాల మహాసభ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని నినదించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అర్జీదారుల ఫిర్యాదులను ఆలకించారు. సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్లు చేసి, ఆయా అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులను వేగంగా, చట్టబద్ధంగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అబ్దుల్అజీజ్ (గుంటూరు తూర్పు) పాల్గొన్నారు. విద్యార్థులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఇటీవల కాకుమాను మండలం అప్పాపురం గ్రామం మాలపల్లిలో జరిగిన అమానుష ఘటనను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు వాలీబాల్ నెట్ కట్టే క్రమంలో టెలిఫోన్ స్తంభాన్ని తొలగించారని అన్నారు. దీనిపై ఓ మహిళా కాకుమాను పీఎస్‌లో ఫేక్ ఫిర్యాదు చేసిందని, దాన్ని ఆధారంగా చేసుకుని ఎస్ఐ ఏక్నాథ్, కానిస్టేబుల్ శ్రీకాంత్‌తో కలిసి నలుగురు విద్యార్థులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వాపోయారు. విద్యార్థులను దుర్భాషలాడుతూ, తాము తలుచుకుంటే గ్రామాన్ని ఖాళీ చేయిస్తామని వ్యాఖ్యానించారన్నారు. వారిపై విచక్షణరహితంగా దాడి చేయడమేగాక రౌడీషీటర్ల వలే రోడ్డుపై నడిపించారని ఆరోపించారు. ఇప్పటివరకు ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం శోచనీయమన్నారు. ఎస్ఐ ఏక్నాథ్, పీసీ శ్రీకాంత్‌ను తక్షణమే సస్పెండ్ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌పాల్, ఎస్.వెంకటరమణ, మల్లెల వెంకట్రావు, బాధితులు, వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. -
ముగిసిన భాష్యం ఒలంపస్ క్రీడా పోటీలు
గుంటూరు ఎడ్యుకేషన్: లక్ష్య సాధన కోసం దృఢ సంకల్పంతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ కేజీవీ సరిత అన్నారు. భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో గుంటూరు వికాస్‌నగర్‌లోని భాష్యం స్పోర్ట్స్ ఎరీనా గ్రౌండ్లో భాష్యం ఒలంపస్ పేరిట జరుగుతున్న భాష్యం సెంట్రల్ లెవల్ ఒలంపస్ క్రీడా పోటీల కార్యక్రమం సోమవారం ముగిసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సరిత మాట్లాడుతూ 60 వేలకు మందికి పైగా విద్యార్థులు ఈ భాష్యం ఒలంపస్లో పాల్గొని ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం నిజమైన క్రీడా స్ఫూర్తిని తెలియజేస్తుందన్నారు. ఎన్సీసీ క్యాడెట్స్ బృందం ఓపెన్ పరేడ్‌లో ప్రదర్శించిన క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పోలీస్ అధికారిగా గర్వపడేలా చేశాయన్నారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు ట్రోపీలను అందజేశారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గెలుపొందిన జట్ల వివరాలు.. -
వివేకానంద జీవితం యువతకు మార్గదర్శకం
గుంటూరు వెస్ట్: స్వామి వివేకానంద జీవితం యువతకు మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు వివేకానంద చిత్ర పటానికి పూలమాలలు నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారత ఆధ్యాత్మిక, తాత్విక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడన్నారు. యువతకు శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని అందించిన మహోన్నత ఆలోచనావేత్త అని పేర్కొన్నారు. ‘మేలుకో .. లక్ష్యాన్ని సాధించే వరకు ఆగవద్దు’’ అనే వివేకానందుని సూక్తి నేటి యువతకు మార్గదర్శకమని కొనియాడారు. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం, ఆయన యువతపై చూపిన ప్రభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. యువత ఆయన ఆదర్శాలను ఆచరణలో పెట్టి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ కె.కళ్యాణ చక్రవర్తి, జలవనరుల శాఖ ఎస్ఈ వెంకటరత్నం, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అక్షర ఆంధ్రతో అక్షరాస్యత పెంచాలి ఆధునిక సమాజంలో విద్య ఎంతో కీలకమని దాని ప్రాముఖ్యతను వివరించి అక్షరాస్యతా శాతాన్ని పెంచే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉల్లాస్ – అక్షర ఆంధ్ర కార్యక్రమం నిర్దేశిత లక్ష్యాలను అందుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో నిరక్షరాస్యులను గుర్తించడం జరిగిందని, అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటు చేసి వాలంటీర్లతో ఉల్లాస్ ద్వారా అక్టోబరు నుంచి తరగతులను ప్రారంభించామన్నారు. పోస్టర్‌ను జిల్లా కలెక్టర్, అధికారులు విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ ఆంజనేయులు, జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీం బాషా, డీపీఓ నాగసాయి కుమార్, అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా -
సహాయక పరికరాలు సద్వినియోగం చేసుకోవాలి
పర్చూరు(చినగంజాం): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు అందజేస్తున్న సహాయక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరక్టర్ సువార్త అన్నారు. మండల కేంద్రమైన పర్చూరులోని జెడ్పీ హైస్కూల్లో సోమవారం జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయక పరికరాల నమోదు శిబిరం నిర్వహించారు. సహాయ పరికరాలు లేని వారికి అలిన్‌కో సంస్థ తయారు చేసిన పరికరాలను అందజేసే మఖ్య ఉద్దేశంతో శిబిరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిబిరానికి 150 మంది విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు హాజరు కాగా 120 మందికి సహాయ పరికరాలు అవసరమవుతాయని గుర్తించినట్లు తెలిపారు. సహాయ పరికరాలను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. వైకల్యం 80 శాతం పైబడిన వారికి బ్యాటరీతో కూడిన ట్రైసైకిల్, వినికిడి పరికరాలు, చేతికర్రలు, వీల్చైర్లు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ప్రత్యూష వికలాంగుల ధ్రువపత్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వి. ప్రద్యుమ్నకుమార్, ఎంఈఓలు శివకోటేశ్వరరావు, వెంకటరామయ్య పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువార్త -
కలెక్టరేట్లో సంక్రాంతి సంబరాలు
బాపట్ల: జిల్లా యంత్రాంగం అంత ఒక కుటుంబం లాంటిదని అందరం కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలైన మహిళలకు బహుమతులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భావన, డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్‌తో కలసి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం ఎక్కడ ఉన్నా మన సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లను మరవకుండా రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా అన్ని శాఖల మహిళ ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తామని, పోటీల్లో ప్రతి శాఖ నుంచి జిల్లా అధికారులు, సిబ్బంది అందరూ పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముగ్గుల పోటీలు శాఖల మధ్య నిర్వహించడం వలన ఆ శాఖల మధ్య సమన్వయం ఏర్పడుతుందని అన్నారు. జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట మాట్లాడుతూ పల్లె వాతావరణంతో ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా స్పోర్డ్స్ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు వైభవంగా నిర్వహించామని తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీలలో విజేతలైన మహిళలకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రెవెన్యూ శాఖకు చెందిన జానకి, రెండవ బహుమతి వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఎన్.కృష్ణదేవి, ఏ.ఇందిరా దేవి, మూడో బహుమతి జిల్లా పౌర సరఫరాల శాఖకు చెందిన నాగవల్లి.వి.లక్ష్మి, 4వ బహుమతి జిల్లా పంచాయతీ రాజ్ శాఖకు చెందిన ఎ.మంగాదేవి, ఎ.రేణుక, ఐదో బహుమతి జిల్లా ల్యాండ్ – సర్వే శాఖకు చెందిన కె. భరణి ప్రభ, ఆరో బహుమతి మెప్మా శ్రీ లక్ష్మిలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ.డాక్టర్ విజయమ్మ, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, సివిల్ సప్లై డీఎం శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది వివిధ శాఖల మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయండి
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఈనెల 29, 30, 31, ఫిబ్రవరి 1న గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. గుంటూరు అరండల్ పేటలోని ఓ హోటల్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో లక్ష్మణరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డి, సుందరయ్య కళా నిలయం అధ్యక్షుడు ముత్తవరపు సురేష్ బాబులు మాట్లాడారు. గుంటూరు టీటీడీ కళ్యాణ మండపంలో ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి, ఢిల్లీ రైతు ఉద్యమంతో సహా వివిధ రైతాంగ ఉద్యమాలలో పాల్గొన్న 300 మంది రైతునాయకులు వస్తున్నారన్నారు. అదేవిధంగా ఆయా రోజుల్లో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వ్యవసాయ ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్ టి.రత్నారావు, ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజయ్ కుమార్, కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాశం రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయ కలయికలతో అసమానతలు లేని సమాజం
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): అసమానతలు లేని సమాజం కోసం ఇలాంటి ఆత్మీయ కలయికలు తరచూ జరగాలని సమతా పార్టీ జాతీయ కమిటీ మాజీ అధ్యక్షుడు వీవీ కృష్ణారావు అన్నారు. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో సంక్రాంతి ఆత్మీయ కలయిక ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకతీతంగా గత 10 సంవత్సరాలుగా ఈ ఆత్మీయ కలయికను నిర్వహిస్తున్నానన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రజల పరం కావాలని, అసమానతలు లేని సమాజమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కృష్ణారావు ఆకాంక్షించారు. విధానాలు వేరైనా అభ్యుదయం, సమానత్వం కోసం ఆత్మీయంగా అందరూ కలిసి పనిచేయాలన్నారు. పాల్గొన్న ప్రముఖులు.. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తూ రాష్ట్రాలపై బలవంతంగా రద్దుతోందన్నారు. ఆత్మీయ కలయికలో ఎమ్మెల్సీ బి.టి.నాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పోలీస్ విశ్రాంత అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ షుబ్లీ, సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, సీపీఐ నాయకురాలు అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలనుకొండ శివాజీ, బీజేపీ నాయకుడు లక్ష్మీపతి రాజా, జీఎస్టీ(ఆడిట్) కమిషనర్ ఆనంద్, ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్‌కుమార్, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, హైకోర్టు న్యాయవాది రవితేజ, మాదిగ దండోరా నాయకుడు కృపాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరిలో హౌస్ బోట్లు ప్రారంభం
బాపట్ల: ఏపీటీడీసీ ఆధ్వర్యంలో సూర్యలంక బీచ్‌లో హౌస్ బోట్లను త్వరలో ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ చెప్పారు. బోట్లు ప్రారంభానికి ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం కలెక్టర్ పర్యాటక, పంచాయతీరాజ్, జలవనరులు, అటవీ, అగ్నిమాపక శాఖల అధికారులతో కలసి సూర్యలంక ఆదర్శనగర్ వంతెన నుంచి నిజాంపట్నం హార్బర్ వరకు మోటారైజ్డ్ బోటులో ప్రయాణించారు. పేరలి డ్రెయిన్, పొగరు, నిజాంపట్నం హార్బర్ వరకు పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పొగరు వద్ద పర్యాటకుల కోసం వాక్‌వే ఏర్పాటు చేయాలని, ఆదర్శనగర్ వద్ద జెట్టి నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదర్శనగర్ నుంచి నిజాంపట్నం వరకు కెనాల్ చుట్టూ బ్యూటిషన్ పెంపునకు చర్యలు తీసుకోవాలని, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని టూరిజం అధికారులకు సూచించారు. వన్ హెచ్‌బీ సామర్థ్యం కలిగిన బోట్లను ఫిబ్రవరిలో ఆరు బెడ్స్ సామర్థ్యం గల హౌస్ బోటు, రెండు బెడ్స్ సామర్థ్యం గల హౌస్ బోటు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. నిజాంపట్నం హార్బర్లో సముద్రం నుంచి వేట ముగించుకుని వచ్చిన మత్స్యకారులతో మార్కెటింగ్ సౌకర్యం, చేపల వేటకు వెళ్లి సముద్రంలో ఎన్ని రోజులు ఉంటారు, అక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనే అంశాలపై చర్చించారు. కలెక్టర్ ప్రతిపాదిత ఆక్వా టూరిజం పార్క్‌ను వేగంగా అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీడీసీ విజయవాడ జనరల్ మేనేజర్ నాంచారయ్య, డీపీఓ ఎల్.ప్రభాకరరావు, జలవనరుల శాఖ ఈఈ ధనలక్ష్మి, జిల్లా అగ్నిమాపక అధికారి కె.వినయ్, బాపట్ల తహసీల్దార్ సలీమా, ఎంపీడీఓ బాబురావు తదితరులు పాల్గొన్నారు. అధికారులతో కలసి ఫీల్డ్ సర్వే చేసిన జిల్లా కలెక్టర్ -
ఆకట్టుకున్న ఆవుల పోటీలు
గన్నవరం: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆవరణలో ఆదివారం శ్రీలక్ష్మీనరసింహా సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయ స్థాయిలో ఆవుల అందాల పోటీలను నిర్వహించారు. తొలుత ఈ పోటీలను ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి ఆవులను తీసుకువచ్చారు. వెంకట్రావు మాట్లాడుతూ.. అంతరించిపోతున్న మన జాతి సంపదైన పుంగనూరు, ఒంగోలు, కపిల పశువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా రైతులను పోత్సాహించేందుకు జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన పశువులకు సంబంధించిన యాజమానులకు 6.50 లక్షల నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. పోటీల నిర్వాహకులు కాసరనేని రాజా, ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం ఇన్చార్జ్ సర్పంచ్ పాలడుగు నాని, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, మాజీ సర్పంచ్ గూడపాటి తులసిమోహన్ పాల్గొన్నారు. పోటీల్లో విజేతల వివరాలు.. ఈ పోటీల్లో ఒంగోలు జాతి పళ్లు కలిపిన ఆవుల విభాగంలో ఏలూరు జిల్లాకు చెందిన అడపా శ్రీనివాసరావు మొదటి స్థానం, బాపట్ల జిల్లా ఇస్రంపేటకు చెందిన తువ్వాటి బాలకృష్ణ, తిమ్మరాజుపాలెంకు చెందిన నర్రా సుబ్బారావు ఆవులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఒంగోలు జాతి ఆరు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా దేవరపల్లికి చెందిన ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆవు విజేతగా, కంకిపాడుకు చెందిన వట్టి కృష్ణయ్య, పల్నాడు జిల్లా లింగారావుపాలెంకు చెందిన కనపర్తి సుబ్బారావు ఆవులు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి. నాలుగు పళ్ల విభాగంలో కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం పమిడిగుంటపాలెంకు చెందిన మైనేని వంశీకృష్ణ మొదటి స్థానం, గుంటూరులోని స్వర్ణభారతినగర్‌కు చెందిన నల్లమేకల సతీష్, అరండల్‌పేటకు చెందిన పసుపులేటి కృష్ణ ఆవులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఒంగోలు జాతి రెండు పళ్ల విభాగంలో పెనమలూరుకు చెందిన కిలారు వెంకటేశ్వరరావు ఆవు, టచ్ పళ్లు(పళ్ళు కలిపిన ఆవులు) విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా చామవరానికి చెందిన బర్రెడ్డి మణికంఠ సతీష్ ఆవు విజేతగా, పుంగనూరు జాతిలో కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన అడపా లక్ష్మీనారాయణ, కపిల జాతిలో తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన వల్లూరి శ్రీనివాస్‌కు చెందిన ఆవులు విజేతలుగా నిలిచాయి. -
26 నుంచి గిత్తల ప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి 2న నిర్వహిస్తున్న స్థానిక కానుకమాత చర్చి 176వ తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకని ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన పోటీలను నిర్వహించనున్నారు. సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో కార్యక్రమం ఉంటుందని ఆదివారం క్రీడామైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రదర్శన కమిటీ సభ్యులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. 26న టచ్ పళ్ల, 27న రెండు పళ్ల, 28న నాలుగు పళ్ల, 29న ఆరు పళ్ల, 30న న్యూ కేటగిరీ, 31న సబ్ జూనియర్ విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన జూనియర్స్, ఫిబ్రవరి 3న సీనియర్స్ విభాగంలో పోటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 8 విభాగాలలో 9 బహుమతుల చొప్పున రైతు సోదరులకు రూ. 28 లక్షల బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో నిర్వాహకులు మాజీ వైస్ ఎంపీపీ గొంటు సుమంత్‌రెడ్డి, గాదె కస్పాల్రెడ్డి, బొడపాటి రామకృష్ణ, ఏరువ జోజిరెడ్డి, ఓరుగంటి ఇన్నారెడ్డి, మూలి రాజారెడ్డి, మొండెద్దు చిన్న శౌర్రెడ్డి, కొమ్మారెడ్డి జోసఫ్‌రెడ్డి, ఏరువ ఫాతిమా మర్రెడ్డి, బోయపాటి జోజిరెడ్డి తదితరులు ఉన్నారు. రొంపిచర్ల: ‘ఫోన్ పే చేస్తాం.. పెట్రోల్ కొట్టండి’ అంటూ బంక్‌లోని ఆపరేటర్ వెంకట కృష్ణపై దుండగులు దౌర్జన్యం చేసిన సంఘటన మండల కేంద్రమైన రొంపిచర్ల సమీపంలోని ఓ బంక్‌లో చోటుచేసుకుంది. అతడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితుడి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలు... శనివారం రాత్రి కారులో ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంక్‌లోకి వచ్చారు. వారిలో ఒకడు వచ్చి ఆపరేటర్‌తో రూ.5 వేలు ఫోన్ పే చేస్తామని చెప్పాడు. రూ. 2 వేలకు పెట్రోల్ కొట్టి, రూ.3 వేలు నగదు ఇవ్వాలని అడిగాడు. ఫేక్ మెసేజ్ చూపాడు. పెట్రోల్ పోయించుకున్నాక, రూ.3 వేలు నగదు అడిగాడు. తనకు మెసేజ్ రాలేదని, స్కానర్‌తో డబ్బు పంపాలని ఆపరేటర్ చెప్పారు. ఇంతలో కారులోని మరో ఇద్దరు వచ్చి ఆపరేటర్ మెడలో ఉన్న డబ్బు సంచి లాక్కున్నారు. ఆపరేటర్ సంచి పట్టుకొని వదలకుండా వారితో పెనుగులాడాడు. కారులో వెంకట కృష్ణను బలవంతంగా ఎక్కించి తీసుకుపోయేందుకు ప్రయత్నించారు. ఇంతలో వేరేవారు అటుగా రావడంతో దుండగులు అతడిని కారులో నుంచి బయటకు నెట్టి పరారయ్యారు. ఈ పెనుగులాటలో వెంకటకృష్ణ ఫోన్ కారులో పడిపోయింది. అతడి తలకు గాయాలు అయ్యాయి. నరసరావుపేట వైద్యశాలలో అతడు చికిత్స పొందుతున్నారు. ఇదే తరహాలో నకరికల్లులో కూడా ఓ బంక్‌లో ఇదే ముఠా రూ.5 వేలను కాజేసినట్లు సమాచారం. సత్తెనపల్లి: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పాతబస్టాండ్ సమీపంలోని శ్రీకృష్ణా లాడ్జిలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు... గుంటూరు జిల్లా తెనాలి మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ అజీజ్ (31) గత కొన్ని సంవత్సరాలుగా వెండి వస్తువులు చేస్తున్నాడు. ఈ క్రమంలో కొంత అప్పులయ్యాయి. తీరే మార్గం కనిపించక మనస్తాపం చెందిన అబ్దుల్ అజీజ్ ఈ నెల 9న సాయంత్రం సత్తెనపల్లిలోని శ్రీకృష్ణా లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఉన్నాడు. శనివారం రాత్రి నుంచి తలుపు తీయకపోవడంతో ఆదివారం ఉదయం అనుమానం వచ్చి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ జె.రాజశేఖర్, సిబ్బంది వచ్చి డోర్ పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు దుప్పటితో అతడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అతడి చెయ్యి విరగడంతో 3 నెలల నుంచి చికిత్స నిమిత్తం నరసరావుపేట వైద్యశాలకు వెళ్లడం కోసం హైదరాబాద్ నుంచి ట్రైన్లో వస్తూ ఈ లాడ్జిలో బస చేస్తున్నాడు. పర్సులో చిన్న పేపర్ ఉంది. అందులో ‘లాడ్జి ఓనర్ గారు.. నన్ను క్షమించండి. కొందరి అప్పులు సెటిల్ చేయండి, నన్ను క్షమించండి, ఇల్లు కూడా అమ్ముకున్నాను.’ అని రాసి ఉంది. పట్టణ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సత్తెనపల్లి: కడుపు నొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం జరిగింది. వివరాలు... పట్టణంలోని వెంకటపతి నగర్ 3వ లైన్‌కు చెందిన జగన్నాథం హనుమయ్య (48) రెండు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
వైభవంగా ఘనరాగ పంచరత్న కీర్తనల గోష్టిగానం
విజయవాడకల్చరల్: సద్గురు సంగీత సభ, భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జీవీఆర్ సంగీత కళాశాలలో నిర్వహిస్తున్న 31వ త్యాగరాజస్వామి ఆరాధాన ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. త్యాగరాజస్వామి రచించిన స్వరపరచిన ఘనరాగ పంచరత్న కీర్తనలు జగదానందకారక, దుడుకుగల, సాధించినే, కనకన రుచిరా, ఎందరో మహానుభావులు కీర్తనలను 200 మంది గాయకులు వాద్యకారుల సహకారంతో ఆలపించారు. వాగ్గేయకారుడు సంగీత విద్వాంసుడు మల్లాది సూరిబాబు, మోదుమూడి సుధాకర్, వేమూరి విశ్వనాథ్, గౌరీనాథ్, పారుపల్లి సుబ్బరాయ ఫల్గుణ్, గాయత్రీ గౌరీనాథ్, అంజనా సుధాకర్, మల్లాది కార్తీక త్రివేణి పంచరత్న కీర్తనల గోష్టిగానంలో పాల్గొన్నారు. స్వరార్చన కార్యక్రమంలో భాగంగా విద్యావైద్యనాథ్, పసుమర్తి పావని, పసుమర్తి పవిత్ర, అచల శంకరనాథ్(వీణ), కొత్తపల్లి వందన, విష్ణుభోట్ల సోదరీమణులు, సీవీపీ శాస్త్రి, పోపూరి శ్రీరాం చరణ్, చిట్టా కార్తీక్, చిట్టా దీపక్ త్యాగరాజ స్వామి రచించిన కీర్తనలను ఆలపించారు. సంగీత విద్వాంసులు ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఆలపించడంతో సంగీత ఉత్సవాలు ముగిశాయి. -
ప్రతిభావంతులు సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలి
●సీసీఎల్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ ●442 మంది విద్యార్థులకు రూ.61.82 లక్షలు ఉపకార వేతనాలు పంపిణీ గుంటూరు ఎడ్యుకేషన్: దాతల సహకారంతో ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నాక సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని సీసీఎల్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీహెచ్ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం జేకేసీ కళాశాలరోడ్డులోని డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్లో శ్రీ కాకతీయ స్టూడెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 23వ ఉపకార వేతన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజేంద్రప్రసాద్, సొసైటీ ప్రతినిధులు రూ.442 మంది ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రూ.61.82 లక్షల ఉపకార వేతన చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా సొసైటీ వ్యవస్థాపకులు జాస్తి వెంకటేశ్వర్లు, పుట్టగుంట వేణుగోపాల్‌రావు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. – సొసైటీ ప్రెసిడెంట్ పాలడుగు లక్షణరావు మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించే లక్ష్యంతో సొసైటీ పని చేస్తోందన్నారు. సొసైటీ ప్రతినిధి నామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ కాకతీయ స్టూడెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గత 23ఏళ్లలో 6,923 మంది విద్యార్థులకు రూ.7.50 కోట్ల మేరకు ఉపకార వేతనాలు పంపిణీ చేశామని, దీనిని ప్రతి యేటా కొనసాగిస్తామని చెప్పారు. సొసైటి చైర్మన్ డాక్టర్ కె. బసవ పున్నయ్య మాట్లాడుతూ ఉపకార వేతనాలు అందుకున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని సత్ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. – సొసైటీ ముఖ్యదాత పుట్టగుంట వేణుగోపాలరావు కుమార్తె డాక్టర్ పుట్టగుంట లక్ష్మీ మాట్లాడుతూ తన తల్లిదండ్రులకు చదువు అన్నా, ప్రకతి అన్నా ప్రాణమని, తన తండ్రి సొసైటీకి రూ.కోటి విరాళం ఇవ్వడం వెనుక అంతరార్ధం అదేనని చెప్పారు. సొసైటీ కార్యదర్శి డాక్టర్ కె.కృష్ణప్రసాద్, కోశాధికారి వి.గోవర్ధనరావు,సొసైటీ యూఎస్ఏ ప్రతినిధి బొప్పన ద్వారకా ప్రసాద్‌లు మాట్లడారు. కార్యక్రమంలో నాట్కో ఫార్మా ప్రతినిధి ఎన్.సదాశివరావు, కొర్రపాటి రామారావు, కావూరి ప్రసాదరావు, కొల్లా శ్రీనివాసరావు, బుచ్చయ్యచౌదరి, చుక్కపల్లి రమేష్, కొత్తా ఛాయ, యడ్లపల్లి అశోక్ కుమార్, పంచుమర్తి నాగసుశీల, దండా బ్రహ్మానందం, నరేంద్రనాధ్ చౌదరి, హరేంద్రనాధ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల సత్తా
చీరాల రూరల్: జాతీయ స్థాయిలో నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో చీరాల క్రీడాకారులు తమ సత్తా చాటారు. రన్నింగ్, షాట్‌పుట్, జావలిన్ త్రో వంటి వివిధ విభాగాల్లో రాణించి బంగారు, వెండి పతకాలను కై వసం చేసుకున్నట్లు మాస్టర్ అథ్లెట్ పంబా నాగయ్య ఆదివారం తెలిపారు. పూర్తి వివరాలు ... ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ చాంపియన్ షిష్ కై వసం చేసుకోగా, బాపట్ల జిల్లాలోని క్రీడాకారులు ఓవరాల్‌గా 32 పతకాలు సాధించి జిల్లాకు మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7వ తేదీల్లో హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్–2026 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బాపట్ల జిల్లా తరఫున వివిధ విభాగాల్లో మాస్టర్స్ క్రీడాకారులు పోటీల్లో నిలిచి తమ సత్తా చాటుకున్నారు. పతకాలు సాధించింది వీరే.. ● 70 ఏళ్ల ప్లస్ విభాగంలో పంబా నాగయ్య 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్‌లో బంగారు పతకాలు, 1500 మీటర్ల పరుగులో వెండిపతకం సాధించారు. 45 ప్లస్ విభాగంలో 200 మీటర్లు, 400 మీటర్లు పరుగులో బంగారు, 100 మీటర్ల పరుగులో తృతీయ స్థానం సాధించి బ్రాంజ్ మెడల్ అందుకున్నారు. ● 45 ప్లస్ విభాగంలో ఎస్. శివన్నారాయణ 400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం, లాంగ్‌జంప్‌లో వెండిపతకం సాధించారు. ● 45 ప్లస్ విభాగంలో షేక్ రెహమాన్ షాట్‌పుట్, 800 మీటర్ల రన్నింగ్‌లో ద్వితీయ స్థానం సాధించి వెండిపతకాలు సొంతం చేసుకున్నారు. ● అలానే 40 ప్లస్ విభాగంలో సీహెచ్ నాగరాజు షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు, జావలిన్‌త్రోలో ద్వితీయ స్థానం సాధించి వెండిపతకం అందుకున్నారు. ● 40 ప్లస్ విభాగంలో ఎం. నాగరాజురెడ్డి 400 మీటర్ల రన్నింగ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం, 1500 మీటర్లు, 5 కిలో మీటర్లు పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి వెండిపతకాలు అందుకున్నారు. ● 35 ప్లస్ విభాగంలో బడే శ్రీనివాసరెడ్డి జావలిన్‌త్రో, డిస్కస్‌త్రోలో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానంలో నిలిచి వెండిపతకం అందుకున్నా రు. ● 35 ప్లస్ విభాగంలో ఆర్. ప్రదీప్ 200 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని బంగారు పతకం, 100 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ అందుకున్నారు. ● అలానే 30 ప్లస్ విభాగంలో పిట్టు మాధవరావు 1500 వందల మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం సాధించి బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు. బంగారు పతకాలు సాధించి క్రీడాకారులు ఏప్రిల్‌లో థాయ్‌లాండ్‌లో జరిగే అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
బ్రిటీష్ పాలకులను ఎదిరించిన ఓబన్న
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్బాపట్ల: పంటలు పండని సమయంలో పన్నులు చెల్లించాలని ప్రజలపై దౌర్జన్యం చేస్తున్న బ్రిటీష్ పాలకులను ఎదిరించిన నాయకుడు వడ్డే ఓబన్న అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆదివారం ఉదయం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ డీఆర్వో జి గంగాధర్‌గౌడ్, బీసీ సంక్షేమ శాఖ డీడీ శివలీల, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ అంజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలసి వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని, ఆయన జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన విలువలు, సూచనలు నేటితరం నాయకులు యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. -
మనిషినే సరుకుగా మార్చిన నేటి ఆర్థిక వ్యవస్థ
గుంటూరుఎడ్యుకేషన్: ఆర్థిక అసమానతలతో సమాజంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, సరుకులకే విలువున్న నేటి సమాజంలో మనిషి సరుకుగా మారి విలువ కోల్పోయాడని ఆర్థిక రంగ విశ్లేషకులు డి.పాపారావు అన్నారు. ఉపాధ్యాయ ఉద్యమ సారథి నూతలపాటి పరమేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏసీ కళాశాలలో విద్యాసదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పాపారావు ‘విద్య ప్రైవేటీకరణ – ఆర్థిక అసమానతలు‘ అనే అంశంపై మాట్లాడుతూ పెట్టుబడి దారీ వ్యవస్థ లో యజమాని కార్మిక శ్రమ దోపిడీతో లాభాలు గడిస్తూ, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉన్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతున్నారన్నారు. – ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె.భానుమూర్తి మాట్లాడుతూ 12వ పీఆర్సీ, డీఏ విడుదల, పెండింగ్ బకాయిలు, సీపీఎస్ రద్దు అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలిసంఘం అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలతో ముందు కు వెళుతూ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తు న్నాయని ఆరోపించారు. నూతలపాటి పరమేశ్వరావు అమరుడై నాలుగేళ్లు గడిచాయని ఆయన ఆలోచన అవగాహనతో పనిచేసినప్పుడే అతనికిచ్చే ఘన నివాళి అని వక్తలు కొనియాడారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘు వర్మ, ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు షేక్ జిలాని, పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు, ఓపీడీఆర్ రాష్ట్ర కార్యదర్శి వి.హనుమంతరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ సదస్సులో ఆర్థిక రంగ విశ్లేషకులు డి.పాపారావు -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ ప్రయాణికుల సౌకర్యార్ధం సంక్రాంతి పండుగ సందర్భంగా అనాకాపల్లి–చర్లపల్లి–అనకాపల్లి ప్రత్యేక రైళ్లను కేటాయించడం జరిగిందని పీఆర్ఓ వినయ్‌కాంత్ ఆదివారం తెలిపారు. రైలు నంబర్ 07479 అనకాపల్లి–చర్లపల్లి రైలు ఈనెల 18వ తేదీన కేటాయించడం జరిగిందని రాత్రి 10.30 గంటలకు అనకాపల్లి స్టేషన్ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. 07477 చర్లపల్లి–అనకాపల్లి రైలు ఈనెల 19న మధ్యాహ్నం 12.40 గంటలకు బయలు దేరి అదే రోజు రాత్రి 9 గంటలకు అనకాపల్లి స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. రైలు నంబర్ 07478 అనకాపల్లి – చర్లపల్లి రైలు ఈనెల 19వ తేదీన రాత్రి 10.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. గుంటూరు రూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలమేరకు బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన తనిఖీలలో భాగంగా బియ్యం అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న 6 టన్నుల బియ్యాన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నల్లపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏటుకూరు గ్రామంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద నెంబర్ లేని టాటా ఏస్ వాహనంలో పీడీఎస్ రైస్ బ్యాగులు నింపి పార్క్ చేసి ఉన్నట్లు సమాచారం మేరకు దాడిచేసి అందులోని మొత్తం 2.5 టన్నులు (50 కేజీలవి, 50 బస్తాలు) బియ్యం స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం వాహనాన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడీపేట 5/18 లైన్ వద్ద పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరుగుతుందని టాస్క్‌ఫోర్స్ బృందానికి అందిన సమాచారం మేరకు దాడిచేసి వాహనాన్ని, వాహన డ్రైవర్ పాలేటి నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. హోరాహోరీగా రాష్ట్ర స్థాయి పోటీలు కారంచేడు: మండల కేంద్రమైన కారంచేడు దగ్గుబాటి రామానాయుడు ఇండోర్ స్టేడియంలో ఆదివారం రాష్ట్ర స్థాయి డబుల్ షటిల్ బాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ముందుగా ప్రకటించిన రీతిలోనే ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు చెందిన 60 టీంలు ఇందులో నమోదు చేసుకున్నారు. ఉదయం నుంచి నిర్వహించిన ఈ పోటీల్లో టీంలుగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. బాడ్మింటన్ కమిటీ, ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ, నాలుగో స్థానాల్లో విజయం సాధించిన టీంలతో పాటు, ఒక ప్రత్యేక బహుమతిని కూడా అందించనున్నామని నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగానే ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. క్రీడలను ప్రోత్సహించడంతో పాటు, యువతలో ఆటల పోటీల పట్ల చైతన్యం కల్పించేందుకే ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు. కోడి పందేల నిర్వాహకుల అరెస్టు -
సత్తాచాటిన పల్నాడు ఎడ్లు
యర్రగొండపాలెం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో ఆదివారం ప్రారంభమైన ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో పల్నాడు జిల్లాకు చెందిన ఎడ్లు సత్తాచాటాయి. మొదటి రోజు రెండు పళ్ల విభాగం ఎడ్లకు బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 22 జతల ఎడ్లు పాల్గొన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన ఎడ్లు 3,442.4 అడుగుల బండను లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు యర్రం రాజశేఖర్, యశ్వంత్‌లు రూ.50 వేల నగదు బహుమతితోపాటు షీల్డ్‌ను అందుకున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని చుండూరుకు చెందిన ఎడ్లు 3,418.9 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. వాటి యజమానులు అత్తోటి శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి రూ.40 వేల నగదు బహుమతితోపాటు షీల్డ్ అందుకున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని మాదల, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని కొండేపాడు గ్రామాలకు చెందిన ఎడ్లు 3,246.8 అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. వాటి యజమానులు పొన్నెబోయిన విష్ణుభరత్ యాదవ్, చాంగంటి శ్రీనివాస చౌదరి రూ.30 వేల నగదు బహుమతిని అందుకున్నారు. నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం రోళ్లపాడు, గుంటూరు జిల్లా లింగాయపాలెంకు చెందిన ఎడ్లు 3006.4 అడుగులు లాగి నాలుగో స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు పేరెడ్డి మురళీ మోహన్‌రెడ్డి, యల్లం సాంబశివరావు రూ.25 వేలు, పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన ఎడ్లు 3004.4 అడుగులు లాగి 5వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని మైలా త్రివేణి నాయుడు రూ.20 వేల నగదు బహుమతి అందుకున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరుకు చెందిన ఎడ్లు 3 వేల అడుగులు లాగి 6వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు బెల్లం రుతిక్ చౌదరి, యువాన్ చౌదరి రూ.15 వేలు, కడప జిల్లా చాపాడు మండలం పెద్దచీపాడు ఎడ్లు 2845 అడుగులు లాగి 7వ స్థానంలో నిలిచాయి. వాటి యజమాని బోగిరెడ్డి వీరాతేజా రెడ్డి రూ.10 వేలు, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం అయోధ్యనగర్, పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదాల గ్రామాలకు చెందిన ఎడ్లు 2764.2 అడుగులు లాగి 8వ స్థానంలో నిలిచాయి. వాటి యజమానులు రూ.8 వేలు, పల్నాడు జిల్లా దాచేపల్లి, సత్తెనపల్లి గ్రామాలకు చెందిన ఎడ్లు 2700 అడుగులు, తెలంగాణ రాష్ట్రం ఉప్పుగుంతల మండలం వేలటూరు గ్రామానికి చెందిన ఎడ్లు 2700 అడుగులు లాగి 9వ స్థానంలో నిలిచాయి. రెండు ప్రాంతాలకు చెందిన యజమానులు యామర్తి శేలేంద్ర యాదవ్, నక్కా బలరాంక్రిష్ణ, శివరామకృష్ణలకు రూ.6 వేల నగదు బహుమతి అందచేశారు. ఈ బహుమతులతోపాటు ఎమ్మెల్యే ఎడ్ల యజమానులకు శాలువాలు కప్పి షీల్డ్‌లు అందజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు సయ్యద్ జబీవుల్లా, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, నాయకులు టి.సత్యనారాయణరెడ్డి, ఆవుల వీర కోటిరెడ్డి, జానకి రఘు, ఆవుల రమణారెడ్డి, షేక్.మహమ్మద్ కాశిం పాల్గొన్నారు. -
విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక
బాపట్ల: బాపట్ల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎంపిక ఆదివారం జరిగింది. బాపట్లలోని బ్రహ్మంగారి దేవస్థానంలో ఈ ఎంపిక నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కడలి జగదీష్ అధ్యక్షతన ఎంపిక చేపట్టారు. ప్రధాన కార్యదర్శిగా మత్సా. సుధాకర్, గౌరవ అధ్యక్షులుగా మార్టూరు నుంచి మత్సా శేషాచారి, పొతకమూరి ప్రభాకర్, కోశాధికారిగా, ఆర్గనైజయింగ్ సెక్రటరీగా రేపల్లె నుంచి కొసూరి శివ, వర్కింగ్ ప్రెసిడెంట్గాసాంబశివరావు శనగపటి ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు వెదురుపర్తి లక్ష్మణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు జి. ప్రభాకర్ విశ్వకర్మ, బ్రాహ్మగారి మఠం అన్నదానం సేవా సమాజం అధ్యక్షులు కోడూరి సుబ్రహ్మణ్యాచారి, చిరంజీవి చిత్తరంజన్ శర్మ, సున్నం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
కనుల పండువగా నగర సంకీర్తన
తెనాలిటౌన్: ఆధ్యాత్మిక భావనతోనే మానవ జన్మ చరితార్థమవుతుందని, ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలమని సంగీత విద్వాంసురాలు నేరెళ్ల వరలక్ష్మి కళ్యాణి అన్నారు. ధనుర్మాసం సందర్భంగా తెనాలిలో ఆదివారం నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. మహిళలు వీధులలో భజనలు, నృత్యం చేస్తూ భక్తిని, ఆధ్యాత్మిక భావనను పెంపొందించే దిశగా కృషి చేశారు. ధనుర్మాసం అనగా దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలం వంటిదని, ఈ రోజుల్లో దేవతలు అత్యంత ప్రీతి చెందుతారని చెప్పారు. పూజా, గానం, యజ్ఞం, ఇత్యాది విషయాలు సంపూర్ణంగా స్వీకరిస్తారని వివరించారు. కార్యక్రమంలో చిన్నమయి సంగీత శిక్షకులు ఆంజనేయశాస్త్రి, నృత్య గురువు నిర్మల రమేష్, ఎన్సీసీ అధికారి బెల్లంకొండ వెంకట్, గాయని వఝుల సునీత, తదితరులు పాల్గొన్నారు. కొల్లూరు: గంధ మహోత్సవ వేడుకలు బాపట్ల జిల్లా కొల్లూరులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్‌లో వెలసిన హజరత్ ఖాజ్వా గరీబ్ నవాజ్ రహమతుల్లా అలైహి పేరిట ముస్లింలు భక్తి శ్రద్ధలతో గంధ మహోత్సవం జరిపారు. తొలుత స్థానిక జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం, ప్రత్యేకంగా అలంకరించిన జెండాను కొల్లూరు వీధుల్లో ఊరేగింపుగా తర లించారు. గంధ మహోత్సవ వేడుకలలో హిందువులు పాల్గొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ప్రసాదాలు పంపిణీ చేశారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం కూడారై మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌స్వామి మంగళ శాసనాలతో 108 గంగాళాలతో కూడారై ప్రసాదం (పాయసం) పాత్రలను గోద రంగనాథులకు సమర్పించామని, అనంతరం పాసుర విన్నపాన్ని గావించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి గోదా అమ్మవారి అనుగ్రహాన్ని పొందారని పేర్కొన్నారు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసం సందర్భంగా కూడారై మహోత్సవాన్ని ఎంతో విశేషంగా జరుపుకుంటారని తెలిపారు. తెనాలిటౌన్: శ్రీ శరణాగతి గోష్టి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలోని వీఎస్సార్ కళాశాల రోడ్డులో జరుగుతున్న 12వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా 27వ రోజు ఆదివారం వేలాది మంది భక్తులు పాల్గొని 581 ఇత్తడి గంగాళాలతో స్వామివారికి పాయస నివేదన చేశారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నిష్టగా భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు. అనంతరం పాయస నివేదన చేశారు. సత్తెనపల్లి:ధనుర్మాసా న్ని పురస్కరించుకొని పట్టణంలోని వడ్డవల్లి రామాలయం, వేంక టేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం కూడారై ఉత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామిలకు ప్రత్యేక అలంకరణ చేశారు. -
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
బాపట్ల టౌన్: పట్టణంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు తెలిపారు. పట్టణంలోని రైలుపేటలో ఆదివారం బాపట్ల డీఎస్పీ నేతృత్వంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జి. రామాంజనేయులు మాట్లాడుతూ రైలుపేటలోని అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, అనుమానితుల నివాసాలు తనిఖీ చేశామన్నారు. 90 మంది పోలీసులు పాల్గొన్నారన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రతి ఇంటిలో నివసిస్తున్న వ్యక్తుల వివరాలు, ఆధార్ కార్డులను తనిఖీ చేశామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సంప్రదాయ క్రీడలు, ఎడ్ల పందేలు వంటి పోటీలను చట్టపరిధిలో నిర్వహించుకోవాలని సూచించారు. పేకాట, కోడిపందేలు వంటి జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రజలు గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే అంశంపై స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల టౌన్ సీఐ రాంబాబు, బాపట్ల రూరల్ సీఐ శ్రీనివాసరావు, బాపట్ల రూరల్ సర్కిల్ సీఐ హరికృష్ణ, సబ్‌డివిజన్ పరిధిలోని ఈగల్ టీమ్, సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో కార్డెన్ సెర్చ్ -
నాటకం ద్వారా విజ్ఞానం, వికాసం
ముగిసిన గుంటూరు కళాపరిషత్ వార్షిక నాటకోత్సవాలు నగరంపాలెం(గుంటూరువెస్ట్): మనిషికి విజ్ఞానం, వికాసం నాటకం ద్వారా వస్తుందని విద్యావేత్త పీవీ.శంకరరావు అన్నారు. గుంటూరు మార్కెట్ కూడలిలోని శ్రీవెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తోన్న గుంటూరు కళా పరిషత్ 28వ వార్షిక నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. సభకు అధ్యక్షత వహించిన పరిషత్ గౌరవ సలహాదారులు ఆలోకం పెద్దబ్బాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కళాపరిషత్‌ను ఆదరిస్తున్నారని అన్నారు. ఏపీ ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్ మాట్లాడుతూ ఎన్నో కళాపరిషత్‌లకు ఆదర్శంగా గుంటూరు కళాపరిషత్ ముందుకు వెళ్తుందని అన్నారు. టిక్కెట్ కొని నాటకం వీక్షించే ప్రేక్షకులు గుంటూరులోనే ఉన్నారని పరిషత్ ప్రధాన కార్యదర్శి బి.పూర్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ ఆడిటర్ ముప్పాళ్ళ సుబ్బారావు, సిటీ వాకర్స్ కార్యదర్శి నారదాసు కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు షేక్.సైదా పాల్గొన్నారు. ఒక రాక్షసుడి కథ... ఏపీ ప్రజానాట్యమండలి (విశాఖపట్నం) ఆధ్వర్యంలో ఒక రాక్షసుడి కథ నాటిక ప్రదర్శించారు. రచన, దర్శకత్వం కేకేఎల్.స్వామి చేయగా, సిటీ వాకర్స్ అసోసియేషన్ గుంటూరు వారు సమర్పించారు. మనిషి నాగరిక సమాజం ముసుగులో నేటికి అనాగరికంగా అజ్ఞానంగానే ఉన్నాడనే విమర్శనాస్త్రం ఈ నాటిక ద్వారా సంధించారు. ● ఎండమావుల్లాంటి బిడ్డల వల్ల ప్రయోజనం శూన్యం అంటూ పేరు రాసిన శాసనం అనే నాటికను ప్రదర్శించారు. గంగోత్రి పెదకాకాని ఆధ్వర్యంలో ప్రదర్శించగా, చింతకింది శ్రీనివాసరావు రచించగా, నాయుడు గోపీ దర్శకత్వం వహించగా, ఆకట్టుకుంది. -
కారును తప్పించబోయి చెట్టును ఢీకొన్న కారు
తాడికొండ: ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి మరో కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన తాడికొండ మండలం లాం గ్రామం వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తుళ్లూరు గ్రామానికి చెందిన యువకులు గుంటూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గ కార్యాలయానికి కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా లాం గ్రామ సమీపంలో వెటర్నరీ డాక్టర్స్ క్వార్టర్స్ వద్దకు వచ్చే సమయానికి ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి చింతచెట్టును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనుక సీటులో ఉన్న కంతేటి తరుణ్(17), బాకి అఖిల్(18)లకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మేరుగ కిరణ్, పేరం ఇంద్రలకు గాయాలు కాగా జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పేరం ఇంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హుటాహుటిన జీజీహెచ్‌కు వెళ్లిన బాల వజ్రబాబు ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు హుటాహుటిన జీజీహెచ్‌కి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని క్షతగాత్రులను పరామర్శించారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి జీజీహెచ్ సూపరింటెండెంట్ ఇతర ఉన్నతాధికారులు, వైద్యులతో సంప్రదించి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారికి అంగా ఉంటానని హామీ ఇచ్చారు. -
రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ విజేత బాపట్ల
మార్టూరు: గత మూడు రోజులుగా మార్టూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో బాపట్ల జిల్లా విద్యార్థులు విజేతలుగా నిలిచారు. స్థానిక వివేకానంద నెక్స్ట్ జెన్ పాఠశాలలో నిర్వహించిన అండర్–19 విభాగంలో 13 జిల్లాల బాల బాలికలు పాల్గొన్నారు. హోరాహోరీగా జరిగిన పోరులో బాలుర విభాగంలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానం, అనకాపల్లి జిల్లా ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా విద్యార్థులు తృతీయ స్థానం కై వసం చేసుకున్నారు. బాలికల విభాగంలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానం, అనకాపల్లి జిల్లా ద్వితీయ స్థానం, సత్యసాయి జిల్లా బాలికలు తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. విజేతలకు జరుగుల లక్ష్మీనారాయణ, పెంటేల శరత్ బాబు, మాదాల సాంబశివరావు, పొత్తూరి శివరావు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో షూటింగ్ బాల్ రాష్ట్ర చైర్మన్ ఆర్డీ ప్రసాద్, కార్యదర్శి కె.జె. జోసెఫ్, ఆర్గనైజర్ ఎం.రత్నకుమార్, ఎం.కిషోర్ బాబు, పూల ప్రసాద్, బాపట్ల జిల్లా కార్యదర్శి పిల్లి సురేంద్ర, క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు. -
చందుకు ‘ప్రైడ్ ఆఫ్ భారతరత్న’ పురస్కారం
మార్టూరు: అమ్మ అనాథ ఆశ్రమం స్థాపించి వృద్ధులు, అనాథలకు సేవలు అందిస్తున్న మార్టూరుకు చెందిన గుంటుపల్లి చందు ఆదివారం హైదరాబాదులో అరుదైన పురస్కారం అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదు రవీంద్రభారతిలో ఆదివారం సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా ఆశ్రమ నిర్వాహాకుడు చందుకు ప్రైడ్ ఆఫ్ భారతరత్న అవార్డును పార్లమెంట్ మాజీ సభ్యుడు సముద్రాల వేణుగోపాల చారి, తెలంగాణ ఫిలింనగర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, దైవజ్ఞశర్మ, వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస రాజు చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహాకుడు చందును మార్టూరుకు చెందిన పలువురు అభినందించారు. -
వేడుకగా సంక్రాంతి సంబరాలు
రేపల్లె: సంస్కృతి, సాంప్రదాయాలను చిన్న వయస్సు నుంచే తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని మోంట్ స్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ కిరణ్‌కుమార్ అన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా పట్టణంలోని మోంట్‌ఫోర్ట్ స్కూలులో శనివారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు కలిగిన భారతదేశంలో అనేక పండుగలు ఉన్నాయని, ప్రతి పండుగ విశిష్టతను విద్యార్థి దశ నుంచే తెలుసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులు, వారి తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమాల్లో భాగంగా వేసిన భోగి మంటలు, భోగి పళ్ల వేడుక కనులపండువుగా సాగింది. వైస్ ప్రిన్సిపల్ ప్రదీప్‌రెడ్డి, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు. కర్లపాలెం: కర్లపాలెం శ్రీ భార్గవి హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు వేడుకగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా శనివారం విద్యార్థులు పాఠశాల ఆవరణలో రంగవల్లులు వేశారు. పొంగళ్లు చేసి భోగి మంటలు వేసి సందడి చేశారు. విద్యార్థులు పలు వేషధారణలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. గంగిరెద్దుల విన్యాసాలతో పండుగ సందడి నెలకొంది. విద్యార్థులు హరిదాసుల వేషధారణలో పండుగ గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, హైస్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారంతో అభివృద్ధి
కలెక్టర్ వినోద్ కుమార్పర్చూరు(చినగంజాం): భూ సమస్యల సత్వర పరిష్కారంతో అభివృద్ధి సాధ్యం అవుతుందని పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం రెవెన్యూ శాఖ ద్వారా రైతులకు నిర్వహించడం సంతోషంగా ఉందని కలెక్టర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం పర్చూరు నియోజకవర్గంలోని పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మీ భూమి మీ హక్కు భూ హక్కు పత్రం పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమంలో కలెక్టర్ వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కొన్ని పుస్తకాల్లో తప్పులు వచ్చాయని వాటిని మళ్లీ ప్రభుత్వానికి పంపి సరిచేసిన తరువాత వచ్చే నెల 9వ తేదీ రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి వారం కలక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్‌లో ఎక్కువ శాతం భూ సమస్యలకు సంబంధించిన అర్జీలు వస్తున్నాయని రెవెన్యూ అధికారులు సాధ్యమైనంత వరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిష్కారం చేస్తామన్నారు. ప్రతి శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే సీనియర్ సిటిజన్ కోర్టులో కేసుల్లో కూడా ఎక్కువ భూమి సమస్యలకు సంబంధించి అర్జీలు వస్తుంటాయని గ్రామ పెద్దలు మీరే కుటుంబ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని మరికొన్ని సమస్యలను రైతులే పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, తహసీల్దార్ బ్రహ్మయ్య,గ్రామ సర్పంచ్ ఎన్.అనంతమ్మ పాల్గొన్నారు. -
స్వచ్ఛ ఆర్టీసీలో భాగస్వాములు కావాలి
చీరాల: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా స్వచ్ఛ ఆర్టీసీలో భాగస్వాములు కావాలని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ పరికరాలు అందించేందుకు శనివారం చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిపో మేనేజర్ జంజనం శ్యామల అధ్యక్షత వహించారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ మాట్లాడుతూ మన ఆర్టీసీ.. స్వచ్ఛ భారత్ నినాదంతో ముందుకెళ్లాలన్నారు. బస్టాండ్ పరిశుభ్రంగా ఉంటే ప్రయాణికులు ఎక్కువ మంది వస్తారన్నారు. ప్రతి రోజూ బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అందుకు పారిశుద్ధ్య సిబ్బంది పాత్ర కీలకమైందన్నారు. చెత్తా చెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. అలానే ఆర్టీసీలో సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులు, అద్దె బస్సులు యజమానులు, డ్రైవర్లు ఆర్టీసీ పరిధిలోకే వస్తారని, అందరి భాగస్వామ్యంతోనే ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణతో పాటు బస్సులను కూడా నిత్యం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బస్సులను కండిషన్లో ఉంచాలన్నారు. అలానే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా డస్ట్బిన్లను అందించారు. సీ్త్రశక్తి పథకం ద్వారా ఆర్టీసీలో కొత్త చరిత్ర సృష్టించామన్నారు. పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ మహిళల నమ్మకాన్ని నిలబెట్టామని తెలిపారు. ఆర్టీసీలో నూతన బస్సుల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో చీరాల డిపోకు కూడా కొత్త బస్సులు అందిస్తామని తెలిపారు. అనంతరం శానిటేషన్ సిబ్బందికి సంక్రాంతి సందర్భంగా చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ముందుగా యూనియన్ల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. బాపట్ల డీపీటీఓ విమల, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ మువ్వల వెంకటరమణారావు, న్యాయవాది బండారుపల్లి హేమంత్‌కుమార్ పాల్గొన్నారు.ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్‌రెడ్డి -
ఘనంగా రామనామ క్షేత్రంలో పూర్ణాహుతి
అద్దేపల్లి(భట్టిప్రోలు): అద్దేపల్లి శ్రీరామనామ క్షేత్రం 75వ వజ్రోత్సవ వేడుకల శ్రీరామ యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదేశ స్వామి, దాసశేష స్వామి వార్ల గురుపరంపర పీఠం సష్ట పీఠాధిపతులు కార్యక్రమాలను వైభవంగా జరిపారు. శ్రీ సీతారామదాస స్వామి(దాసకుటి–అంగలకుదురు) పర్యవేక్షణలో పలు వేడుకలు జరిగాయి. ఉదయం 8 గంటలకు జరిగిన శ్రీరామ యజ్ఞం కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. ఉదయం శ్రీ కోదండరామ స్వామికి సహస్రనామ పూజ, శ్రీరామ సప్తాక్షర జపమును కమిటీ సభ్యులు భక్తులతో జరిపించారు. క్రోసూరి మురళీ కృష్ణమాచార్యుల బృందం స్వామి వారికి ప్రధాన పూజలు, అలంకరణ నిర్వహించారు. రామనామ క్షేత్రం ఆవరణలో శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం(తెనాలి) ఆర్గనైజర్ ఎ.వెంకట లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
అన్నింటా దైవత్వాన్ని చూడాలి
బాపట్ల : అన్నింటా దైవత్వాన్ని చూడాలని తిరుపతి మాతాజీ రమ్యానందభారతి పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ జిల్లెళ్లమూడి సంయుక్త ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ శిల్పశాల సదస్సు శనివారం జిల్లెళ్లమూడిలో నిర్వహించారు. సదస్సును శ్రీ శక్తి పీఠాధిస్వరి తిరుపతి మాతాజీ రమ్యానంద భారతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అదే మొదటి మెట్టు పెద్దవారు చెప్పేది చెబుతారు కానీ మనం చేయాల్సింది చేయాలన్నారు. సభా ప్రారంభకులు విశ్వజరణి పరిషత్ ట్రస్ట్ పూర్వ అధ్యక్షులు, ఆర్థిక శాస్త్ర నిపుణులు కె నరసింహమూర్తి మాట్లాడుతూ ఎన్నో నాగరికతలు నశించాయి కానీ మన సనాతన ధర్మం మిగిలిందని గుర్తు చేశారు. లోక మంతా బాగుండాలని కోరుకునే మన ధర్మమే గొప్పదని, ధర్మాన్ని నిలపడడానికే అమ్మవారు ఇక్కడికి వచ్చారని, అమ్మ తత్వం సమాజానికి ప్రపంచానికి అవసరమన్నారు. ఉలిదెబ్బలు తగిలితేనే శిలకు శిల్పంగా రూపం వస్తుందని అమ్మ చెప్పారని చెప్పారు. సభాధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసరావు ప్రసంగిస్తూ రమ్యానంద భారతి రావటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో గోరంట వెంకయ్య, సూక్తి సుధాకర్, డాక్టర్ అన్నదానం చిదంబర శాస్రి, వల్లూరి ప్రేమ్ రాజు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మాతాజీ రమ్యానందభారతి -
బాపట్ల
ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026రంగవల్లి విరిసే.. కోర్టు ప్రాంగణాలు మురిసే.. తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1500, గరిష్ట ధర రూ.3200, మోడల్ ధర రూ.2400 వరకు పలికింది.విజయపురిసౌత్: నాగార్జునకొండకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. లాంచీస్టేషన్‌కు రూ.2,73,950 ఆదాయం సమకూరినట్లు యూనిట్ మేనేజర్ కె.మస్తాన్‌బాబు తెలిపారు.బాపట్ల: బాపట్ల జిల్లా కోర్టు ప్రాంగణాలు సంక్రాంతి సంబరాలతో అలరారాయి. కుల మతాలకతీతంగా న్యాయవాదులు సాంప్రదాయ దుస్తులలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రాంగణాన్ని ముత్యాలముగ్గులతో అలంకరించారు. తెల్లవారుజామున భోగి మంటలతో ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు, హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో కోర్టు ప్రాంగణం సరికొత్త సాంప్రదాయాలకు వేదికగా నిలిచింది. న్యాయవాదులతో సమానంగా న్యాయమూర్తులు ఆయా వేడుకల్లో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. సాంప్రదాయ క్రీడల్లో పాల్గొంటూ.. సరికొత్త సంస్కృతి, సాంప్రదాయాలకు వేదికగా కోర్టు కాంప్లెక్స్‌ను మార్చారు. ప్రతిరోజు కక్షిదారులు, కేకలు, చట్టాలు, ఒకరిపై ఒకరు వేసుకునే ఎత్తులు, పై ఎత్తులు తో కోర్టు ప్రాంగణాల్లో చదరంగం ఆడే న్యాయవాదులు, రోజువారి ఒత్తిడికి దూరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. సంక్రాంతి సంబరాలకు శ్రీకారం... బాపట్ల జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టారు. సీనియర్లు, జూనియర్లు అనే భేదం లేకుండా, కోర్టు ఉద్యోగులతో కలిసిపోయి, సాంప్రదాయ క్రీడల్లో పాల్గొంటూ మురిసిపోయారు. న్యాయమూర్తులు సైతం న్యాయవాదులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, సంబరాలకు సహకారాన్ని అందించారు. పురుష న్యాయవాదులతో సమానంగా పోటీపడి మహిళా న్యాయవాదులు క్రీడలలో పాల్గొని అనేక బహుమతులు సాధించారు. న్యాయవాదులతోపాటు గుమస్తాలు, కోర్టు ఉద్యోగులు ఆయా పోటీలలో పాల్గొని ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. సంక్రాంతి అంటేనే పల్లె పండుగ... ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే, పల్లె పండుగ, సంబరాల పండుగ, అలాంటి సంబరాలు రోజువారి ఒత్తిడి నుంచి బయటపడి, సరికొత్త జీవనయానానికి, దోహదపడతాయని నిర్వాహకులను అభినందించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఆటల పోటీలలో విజేతలకు న్యాయమూర్తులు కె.శ్యాంబాబు, వాణి, పవన్ కుమార్, ఎం.కళ్యాణిలు బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమాలలో బాపట్ల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అవినాష్, న్యాయవాదులు విన్నకోట సత్యప్రసాద్, బి.స్టాన్లీ విమల్ కుమార్, కె.రవిబాబు, బెంజ్, శ్యామలదేవి, కత్తి నాగలక్ష్మి, దుర్గ అంబిక, అనూష, నాగమోహిని, టి.రాఘవేంద్రనాథ్, దుద్దుకూరి భాస్కరరావు, కె.సురేంద్ర, రామిడి వెంకటేశ్వర్లు, నల్లమోతు సుబ్బారావు, భీమా లీలాకృష్ణ, రామకోటి, పల్లప్రోలు మురళీ తదితరులు పాల్గొన్నారు. Iఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్‌రెడ్డి తిరుపతి మాతాజీ రమ్యానందభారతి -
ఆండళక్కుం మెయ్యన్ అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: పట్టణంలోని రైల్వేస్టేషన్‌రోడ్‌లో గల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీవారిని ఆండళక్కుం మెయ్యన్గా అలంకరించి ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు ఆలయ ప్రధాన అర్చకుడు చిత్రకవి శ్యాము ఆచార్యులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆండళక్కుం మెయ్యన్ అంటే ‘ఆండాళ్ (గోదాదేవి)కి మెయ్యన్’ అని అర్ధమన్నారు. నిజమైన (ప్రియమైన) వాడని అర్థమని, ఇది విష్ణువును సూచిస్తుందన్నారు. ఇది తమిళనాడులోని తిరువాదనూర్లో ఉన్న ఒక ముఖ్యమైన వైష్ణవ దేవాలయం అని, ఈ ఆలయంలోని ప్రధాన దైవమే ఆండళక్కుం మెయ్యన్ అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా శ్రీవారి సేవకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమరావతి: అమరేశ్వరాలయంలోని దేవుడి సొమ్ముపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ అమరావతి మండల అధ్యక్షుడు మేకల వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం అయన మాట్లాడుతూ ఇటీవల పత్రికల్లో వస్తున్న అవినీతి వార్తలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పాలకమండలి సభ్యులే అవినీతి జరిగిందని ఆరోపించినా కనీసం విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించకపోవటంపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దేవదాయశాఖ ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు వెలికి తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ డిమాండ్ చేస్తుందన్నారు. అవినీతిపై దేవదాయశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోతే విశ్వహిందూ పరిషత్ లీగల్‌సెల్ తరఫున న్యాయపోరాటం చేస్తామని వీహెచ్‌పీ మండల లీగల్‌సెల్ అధ్యక్షులు బి.సుబ్బారావు అన్నారు. సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామికి, శనివారం పండ్లతో ప్రత్యేక అలంకరణ, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిలకు నిజరూపదర్శన అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారి పాదాలను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. గుంటూరురూరల్: రెడ్డి కళాశాల సమీపంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సరస్(అఖిలభారత డ్వాక్రా బజార్) మేళాలో స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారవేత్తలుగా మారటానికి అవసరమైన నైపుణ్యాలపై యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఎస్ఈటీఐ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉచిత వసతి భోజన సౌకర్యాలతో అందించే వివిధ రకాల స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను తెలియజేశారు. -
నాడు అక్రమం.. నేడు సక్రమం
చీరాల: ‘మేము కళ్లు మూసుకుంటాం.. మీరు నిర్మాణాలు చేపట్టండి తర్వాత చూసుకుందాం... బీపీఎస్ వంటి స్కీమ్‌లతో మీ నిర్మాణాలు క్రమబద్ధీకరించుకోవచ్చు’ అన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) అక్రమ నిర్మాణదారులను ప్రోత్సహించేలా ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు కూడా తీసుకోకుండా స్థలం ఉందని నిర్మాణాలు చేస్తున్నారు. అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారు. ఇలా భవనాలు నిర్మించి బీపీఎస్ స్కీమ్‌ల ద్వారా తిరిగి భవనాలను సక్రమం చేసుకుంటున్నారు. ఇది అక్రమదారులకు వరంగా మారింది. ప్లాన్‌కు విరుద్ధంగా.. ఒక భవనం నిర్మించాలంటే అందుకు తగిన ప్లాను, ఎన్ని అంతస్తులు నిర్మిస్తున్నారు? అనేది ముందుగా మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులకు తెలియచేసి ప్లాన్‌ను ఆమోదించిన తర్వాత భవన నిర్మాణాలు చేపట్టాలి. కొందరు మాత్రం ప్లానుకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మించుకున్న గృహాలు, భవనాలు, అపార్టుమెంట్లను క్రమబద్ధీకరించుకునేందుకు కూటమి ప్రభుత్వం బీపీఎస్ స్కీమ్‌ను తెరపైకి తెచ్చింది. ఇదంతా కేవలం ఆదాయమే పరమావధిగా అమలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2015, 2019లోనూ బీపీఎస్ ద్వారా అనధికార భవనాలను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. జిల్లాలో చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దంకి పట్టణాల్లో వెయ్యికి పైగా భవనాలు, అక్రమ అనుమతులు ఉల్లంఘించి నిర్మించినవిగా ప్రాథమిక అంచనాలు వేశారు. బీపీఎస్ పరిధిలోకి వచ్చే భవనాలను గుర్తించడానికి సర్వే నిర్వహించాలని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. బీపీఎస్ అమల్లో పాటించాల్సిన నిబంధనలపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వాహనాల పార్కింగ్‌కు కేటాయించే సెల్లార్లో నిర్మాణాలను క్రమబద్ధీకరించవద్దని ఆదేశాలు జారీ చేశారు. 1985 జనవరి 1వ తేదీ నుంచి 2025 ఆగస్టు 31వ తేదీ వరకు మధ్య అనధికార నిర్మాణాలు చేపట్టి ఉండడం, అనుమతులు తీసుకున్నా వాటిని అతిక్రమించి నిర్మాణాలు చేపట్టినవి బీపీఎస్ పరిధిలోకి వస్తాయి. 120 రోజుల్లోగా సంబంధిత భవన యజమానులు దరఖాస్తులు చేసుకోవాలి. ప్రభుత్వ స్థలాలు, మాస్టర్ ప్లాన్, రహదారి ప్లాన్ లైన్, తీర ప్రాంత నియంత్రణ జోన్, వివాదంలో ఉన్న భవనాలకు ఈ ప్లాన్ వర్తించదు. ఇదిలా ఉంటే అక్రమ నిర్మాణాలను బీపీఎస్‌తో సరిచేసుకోవచ్చని అధికారులు సైతం చెప్పుకొస్తున్నట్లు సమాచారం. -
మహారాష్ట్ర దోపిడీ గ్యాంగ్ అరెస్టు
చీరాల: మహారాష్ట్ర రాష్ట్రంలోని కో–ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్‌ను కత్తితో బెదిరించి నగదు తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తున్న ఐదుగురు సభ్యుల దోపిడీ ముఠాను బాపట్ల జిల్లా పోలీసులు రైలులో అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ శనివారం వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర రాష్ట్రం హింగోలి నగరం పరిధిలోని మహారాష్ట్ర మధ్యవర్తి సహకారి కో–ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ వద్ద రూ.8 లక్షలు దోపిడీ చేసి రైలులో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుండగా మహారాష్ట్ర పోలీస్‌శాఖ అభ్యర్థన మేరకు బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బాపట్ల రైల్వేస్టేషన్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీ చేయగా రైలులో ప్రయాణిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6,72,700 నగదు, ఒక కత్తి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ముఠా సభ్యులను, నగదును మహారాష్ట్ర పోలీసుశాఖకు అప్పగించనున్నారు. శనివారం సాయంత్రం 3 గంటల సమయంలో జిల్లాలోని బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్ల వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్లలో పదుల సంఖ్యలో పోలీసులు మోహరించారు. బాపట్లలో తప్పించుకుంటే చీరాల్లో పట్టుకునేందుకు ముందస్తుగా చీరాలలో డీఎస్పీ ఎండీ మొయిన్ ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. ఎట్టకేలకు పోలీసులకు బాపట్ల రైల్వేస్టేషన్లో ముఠా సభ్యులు చిక్కారు. పండగ సెలవుల నేపథ్యంలో అత్యంత రద్దీగా ఉన్న రైలులో నుంచి కేవలం మూడు నిమిషాల్లో నిందితులను పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నందుకు బాపట్ల జిల్లా పోలీసులను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ప్రత్యేకంగా అభినందించారు. -
తీరంలో తమ్ముళ్ల భూదందా
చినగంజాం: అధికార పార్టీ అండదండలతో కొందరు స్వార్థ పరులు తీర ప్రాంత భూములను కొల్లగొట్టి కోట్లు గడిస్తున్నారు. అమాయక ప్రజలను మభ్యపెట్టి కోటీశ్వరులుగా మారిపోతున్నారు. చినగంజాం మండలం పెదగంజాం గ్రామ రెవెన్యూ పరిధిలో తీరం వెంబడి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ భూములు లక్ష్యంగా చేసుకొని స్వార్థ పరులు దోచుకుంటున్నారు. సర్వే నంబర్ 1160లో వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములతో పాటు సర్వే నంబర్ 656, 657, 658, 659, 668, 660, 661లో ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూముల్లో పాగా వేసి అమ్మేసుకుంటున్నారు. మడ అడవులను సైతం నరికేస్తున్నారు. తాతల కాలం నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ప్రైవేట్ వ్యక్తుల భూములన్నీ స్వాధీనం చేసుకుంటున్నారు. పూర్వం భూములను మత్స్యకార, యాదవ సామాజిక వర్గాల వారు బ్రాహ్మణులకు సేవ చేసుకుంటూ నాటువైద్యం, ఇంటి పనులు చేసి పెట్టి వారి మెప్పును పొంది బహుమతిగా అందుకున్నారు. గతంలో సాగు చేసినప్పటికీ గత 20 ఏళ్లుగా ఉప్పు నీటి ప్రభావంతో సాగు నిలిపివేశారు. వియ్యం అందుకుని... బాపట్ల మండలానికి చెందిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి చినగంజాం మండ లంలో తన సామాజిక వర్గానికి చెందిన స్థానికుల తో వియ్యం అందుకొని తరచూ మండలానికి రాకపోకలు సాగిస్తూ 2023లోనే తీరం వెంబడి భూములపై కన్నేశాడు. చిన్న డ్రైనేజీలను పూడ్చి రొయ్యలు చెరువులుగా మార్చడం, రొయ్యల చెరువుల యజమానులను భయభ్రాంతులకు గురిచేసి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయడం, మరికొన్ని భూములను కబ్జా చేయడంతో తన కబ్జాల వ్యవహారాన్ని మొదలు పెట్టాడు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ అండదండలతో పెదగంజాం తీరం వెంబడి ప్రభుత్వ భూమి 75 ఎకరాలు, ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూములు 30 ఎకరాల భూముల్లో మార్కెట్ పరంగా కోట్ల విలువైన ఆస్తులను కబ్జా చేసుకొని దర్జాగా అమ్మేసుకుంటున్నాడు. -
దేవాలయాల్లో చోరీ
నరసరావుపేటటౌన్: రెండు దేవాలయాల్లో తాళాలు పగులగొట్టి హూండీలలో నగదు అపహరించుకు వెళ్లిన సంఘటన శుక్రవారం పట్టణంలో వెలుగు చూసింది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంపురంలో బ్రహ్మంగారి గుడి, రాములవారి దేవస్థానం పక్కపక్కనే ఉంటాయి. అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగుడు రాములవారి గుడి గేటు తాళాలు పగలగొట్టి హుండీ అపహరించాడు. అందులోని నగదు తీసుకొని హుండీని గుడి వెనుక ప్రాంతంలో పడవేశాడు. అదే విధంగా బ్రహ్మంగారి గుడిలోని హుండీ పగలగొట్టి అందులో నగదు తీసుకున్నాడు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త హనుమాన్ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ ఫిరోజ్, ఎస్ఐ వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న క్లూస్‌టీం ఘటనా స్థలానికి చేరుకొని హుండీపై ఉన్న వేలి ముద్రలను సేకరించారు. రెండు హుండీల్లో నగదు అపహరణ -
అల్లుడు చేతిలో మామ హతం
మార్టూరు: మద్యం మత్తులో మామను అల్లుడు కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన మార్టూరులో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక క్వారీ కుంటల్లో నివాసం ఉండే కొప్పరపు హుస్సేన్ సాహెబ్ (50)కు తన అల్లుడు నూర్ బాషాతో సాయంత్రం మద్యం తాగే దగ్గర ఘర్షణ జరిగింది. అనంతరం ఇంటికి చేరుకున్న హుస్సేన్ సాహెబ్‌ను అల్లుడు నూర్ బాషా తన ఇంటిలోని కత్తి తీసుకొని వెళ్లి మామ పొట్టలో విచక్షణారహితంగా పొడిచాడు. అపస్మారక స్థితికి చేరుకున్న హుస్సేన్ సాహెబ్‌ను పొడిచిన అల్లుడే స్వయంగా ఆటోలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. కొన ఊపిరితో ఆసుపత్రికి చేరిన హుస్సేన్ సాహెబ్ కొద్దిసేపటికి మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రెక్కలు రాని ప్రేమలు
తెనాలి: పదవ తరగతి విద్యార్థి ప్రేమపాఠాలు...ఆ పేరుతో డబ్బు వసూలు...నూతన సంవత్సరం వేడుకలకు చేయి కోసుకుంటాననీ, టీసీ తీసుకు వెళ్లిపోతానని బెదిరింపులు...ఆ ఒత్తిడి తట్టుకోలేక, డబ్బులు ఇవ్వలేక మానసిక క్షోభకు గురైన తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఎలుకల మందు తిని ఆసుపత్రి పాలైంది. ఏడు రోజులపాటు నరకం చూసి చివరకు మృతి చెందింది. కన్న తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. మైనారిటీ తీరకుండానే ప్రేమపురాణాలు .. తెనాలి నియోజకవర్గంలో గత పది నెలల్లో దాదాపు 22 మంది బాలికలు అదృశ్యమైనట్టు కేసులు నమోదయ్యాయి. ఇద్దరు పెళ్లి చేసుకుని తిరిగొచ్చారు. మిగిలిన వాటిలో ఒకటి మినహా అన్నీ తెలిశాయి. వీటిలో ఎక్కువశాతం ప్రేమ నేపథ్యమే. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. బంగారు భవిష్యత్ కోసం ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని చేరుకునేలా కష్టపడాలి. ప్రేమ అంటూ చిన్న వయసులో భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు. ప్రేమ పేరిట మైనర్‌ను వేధించినా, ఇద్దరికీ ఇష్టమేనని ప్రేమ పేరుతో మైనర్ల వెంట పడినా పోక్సో కేసు నమోదు చేస్తాం. మైనర్‌ను పెళ్లి చేసుకున్నా నేరమే. పోక్సో యాక్టు కింద శిక్ష తప్పదు. – బి.జనార్ధనరావు, తెనాలి డీఎస్పీ -
క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుతోనే జిల్లా పురోభివృద్ధి
బానిస కూలీల వ్యవస్థ నిర్మూలించాలి పెట్రోల్ బంకు నిర్మాణానికి స్థల పరిశీలన వేగంగా రీ సర్వే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ రాజముద్రతో రీ సర్వే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు, మండల తహసీల్దార్లతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. రీ సర్వే పట్టాదారు పాసు పుస్తకాలను ఈనెల 12వ తేదీలోగా లబ్ధిదారులకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంపిణీ కార్యక్రమంలో ఈకైవెసీ ప్రక్రియ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. వీఆర్వోల పనితీరులో మార్పు రావాలి ఐవీఎస్ సర్వేలో 13 మంది వీఆర్వోలు కేవలం 50 శాతం పనితీరు చూపడంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సమయానికి నిర్లక్ష్యం లేకుండా మెరుగైన సేవలు అందించాలని వీఆర్వోలను ఆదేశించారు. 13 మంది వీఆర్వోలతో సమావేశం నిర్వహించి, పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బస్సులు జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్‌ల్లో ప్రయాణికుల కు సీటింగ్, వెయిటింగ్, తాగునీరు, మరుగు దొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ -
నృసింహుని ఆలయంలో సంక్రాంతి సంబరాలు
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ పేర్కొన్నారు. దేవస్థానంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వామివారి కల్యాణ మైదానంలో 11వ తేదీన సంక్రాంతి సంబరాలు జరుగుతాయని తెలిపారు. ఇందులో భాగంగా ముగ్గుల పోటీలు, చిన్నారులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గాలిపటాలు ఎగురవేత నిర్వహిస్తారని చెప్పారు. 12వ తేదీన రంగవల్లుల పోటీలు జరుగుతాయని, పాల్గొనదలచిన వారు మధ్యాహ్నం 1 గంటలోపు పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. దేవస్థాన ఆవరణలో ఆ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆ రోజు నమోదు చేసుకోని వారు 13వ తేదీన శివాలయంలో జరిగే రంగవల్లుల పోటీలకు పేర్లు నమోదు చేసుకుని పాల్గొనవచ్చని అన్నారు. 14వ తేదీన దేవస్థానం ఎదుట భోగిమంటల కార్యక్రమం జరుగుతుందని, అలాగే మొట్టమొదటి సారిగా దేవస్థానంలో నైరుతిలో ఉన్న కొట్టాయి మండపంలో సామూహిక గోదా కల్యాణం నిర్వహించనున్నామని, ఇప్పటికి 50 మంది దంపతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, మరో 20 మంది దంపతులను అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 15వ తేదీన గంగిరెద్దులు, పిట్టలదొర, హరిదాసు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 16వ తేదీన సామూహిక గోపూజ, శ్రీ స్వామివారు, అమ్మవార్ల పారువేట ఉత్సవంతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయని ఆయన తెలిపారు. రంగవల్లుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. -
బాపట్ల
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026అమ్మవారికి సారె సమర్పణ నరసరావుపేట ఈస్ట్: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం పాతూరులోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవార్లకు భక్తులు సారె సమర్పించారు. నిమ్మకాయల ధరలు తెనాలి:తెనాలి మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1300, గరిష్ట ధర రూ.2900, మోడల్ ధర రూ.2000 వరకు పలికింది. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 557.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 49,902 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. I -
రాయి గరుడుడు అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్లోగల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం శ్రీవారిని రాయిగరుడుడుగా అలంకరించి ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు మాట్లాడుతూ రాయిగరుడు విశిష్టతను వివరించారు. రేపు ఉపకార వేతనాలు పంపిణీ గుంటూరు ఎడ్యుకేషన్: కాకతీయ స్టూడెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 11న ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.61 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య తెలిపారు. శుక్రవారం గుంటూరులోని డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయ, సహకారాలను అందించే ఆశయంతో 2003లో సొసైటీని ప్రారంభించినట్లు చెప్పారు. ఈనెల 11న కేఎల్పీ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న 23వ ఉపకార వేతన పంపిణీ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ, పీజీ చదువుతున్న 440 మంది విద్యార్థులకు రూ.61 లక్షలు చెక్కుల రూపంలో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా రానున్నారని చెప్పారు. సొసైటీకి రూ.కోటి విరాళాన్ని అందజేసిన కెనడాకు చెందిన ముఖ్యదాత డాక్టర్ పుట్టగుంట వేణుగోపాలరావు కుమార్తె డాక్టర్ పుట్టగుంట లక్ష్మి హాజరవుతున్నట్లు చెప్పారు. సమావేశంలో సొసైటీ కార్యదర్శి డాక్టర్ కె.కృష్ణప్రసాద్, బొప్పన ద్వారకాప్రసాద్, వడ్లమూడి గోవర్ధనరావు, నామినేని కోటేశ్వరరావు, రామారావు పాల్గొన్నారు. బీఆర్ స్టేడియం అభివృద్ధికి రూ. 14 కోట్లు మంజూరు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు నగరంలోని ప్రఖ్యాత బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్టేడియం అభివృద్ధి కోసం గతంలో రూ.170 కోట్ల క్రీడా మౌలిక వసతుల ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఖేలో ఇండియా పథకం కింద మల్టీ–స్పోట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఈ నిధులు మంజూరు చేసిందన్నారు. దీంతోపాటు దశల వారీగా నిధులను సేకరిస్తామని తెలిపారు. ఈ నిధులతో విశాలమైన స్టేడియం అభివృద్ధి చెంది ఔత్సాహిక క్రీడాకారులు అందుబాటులోకి వస్తారన్నారు. పశ్చిమ డెల్టాకు నీటి విడుదల దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 2,519 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 11.5 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. బ్యాంక్ కెనాల్ 150 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 267, పశ్చిమ కాలువకు 60, నిజాంపట్నం కాలువకు 31, కొమ్మూరు కాలువకు 1,360 క్యూసెక్కులు విడుదల చేశారు. -
40 ఎకరాలు విక్రయం
అధికార పార్టీ ప్రజా ప్రతినిధి అండదండలతో ఒంగోలుకు చెందిన ఓ వ్యాపార వేత్తకు 40 ఎకరాలకు భూమిని ఎకరం రూ. 4 లక్షలు చొప్పున అమ్మినట్లు, సదరు వ్యాపారి తను కొనుగోలు చేసిన భూమిలో జేసీబీ వంటి భారీ యంత్రాలను ఉపయోగించి వ్యాపారి రాత్రి వేళల్లో పనులు నిర్వహిస్తుండటంతో రెవెన్యూ అధికారులు అభ్యంతర పెట్టినట్లు సమాచారం. మరికొందరు వ్యక్తులకు చిల్లరగా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నట్లు నష్టపోయిన స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. అదే భూమిలో ప్రాంతాన్ని బట్టి ఎకరం రూ. 7 లక్షల వరకు బేరం పెట్టినట్లు సమాచారం. మడ అడవులను నిర్దాక్షిణ్యంగా నరికి వేస్తూ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. గత నెల డిసెంబరులో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌ను స్థానికులు కలిసి అర్జీని సమర్పించినప్పటికీ చర్యలు తీసుకోక పోవడం గమనార్హం. దీనికి సంబంధించి వివరణ కోసం తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావును సంప్రదించగా ఆ విషయం తమ దృష్టికి ఇంకా రాలేదన్నారు. పరిశీలన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కేఎల్‌యూలో ఐకాన్ ప్యాక్–2026 ప్రారంభం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం కేఎల్ యూనివర్శిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ శుద్ధ, అనువర్తిత రసాయన శాస్త్ర సదస్సు (ఐకాన్ ప్యాన్ 2026) గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జి.రంగారావు, ప్రముఖ పదార్థ శాస్త్రవేత్త డాక్టర్ శ్వేత అగర్వాల్‌లు విచ్చేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు శుభ్రమైన శక్తి సాంకేతికతలు, క్వాటలిసిస్, శక్తి నిల్వ వ్యవస్థలు, పర్యావరణ పునరుద్ధణలో పదార్ధ రసాయన శాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ అనువర్తనాలకు సంబంధించిన ఆధునిక కార్యాచరణ పదార్థాలలో జరిగిన తాజా ఆవిష్కరణలను వివరించారు. సదస్సు కన్వీనర్ నిరంజన్ పాత్ర ఐకాన్ ప్యాక్ 2026 యొక్క దృష్టి, లక్ష్యాలను వివరించారు. ఈ సదస్సు ద్వారా పరిశోధకులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు ఒకే వేదికపై కలిసి అభిప్రాయాలను పంచుకుని, ఆధునిక పరిశోధనలను ప్రదర్శించి, సహకారాన్ని పెంపొందించుకునే అంతర్జాతీయ వేదికగా నిలుస్తుందని తెలిపారు. కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సదస్సులో కీ నోట్ ప్రసంగాలు, ఆహ్వానిత ఉపన్యాసాలు, మౌఖిక, పోస్టర్ ప్రదర్శనలు నిర్వహించబడుతాయని పేర్కొన్నారు.వర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి.పార్ధసారధి వర్మ, ప్రో వీసీలు ఏవీఎస్ ప్రసాద్, ఎన్.వెంకట్రామ్, కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ కేఆర్ఎస్ ప్రసాద్, డీన్ ఎంహెచ్ఎస్ ఎం.కిషోర్‌బాబు, వివిధ సంస్థలకు చెందిన ప్రముఖ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉద్యాన, పట్టు పరిశ్రమలతో రైతులకు సుస్థిర ఆదాయం
●ఏపీ వ్యవసాయ కమిషనరేట్, ఉద్యాన, పట్టు పరిశ్రమ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు ●విజ్ఞాన్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు చేబ్రోలు: సంప్రదాయ పంటలతోపాటు ఉద్యాన పట్టు పరిశ్రమల సాగును చేపట్టడం ద్వారానే రైతులకు ఏడాది పొడవునా సుస్థిర ఆదాయం లభిస్తుందని ఏపీ వ్యవసాయ కమిషనరేట్, ఉద్యాన, పట్టు పరిశ్రమ డైరెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు (ఐఏఎస్) అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ విభాగం, రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రైతుశ్రేయస్సే కేంద్రంగా సంక్రాంతి సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఏపీ వ్యవసాయ కమిషనరేట్, ఉద్యాన, పట్టు పరిశ్రమ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే మామిడి, జామ, అరటి వంటి పండ్ల తోటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. రైతు ఆదాయం రెండింతలు చేయడం లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్, రైతు క్లబ్బులు, రైతు సమాఖ్యల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ అటవీ శాఖ ప్రభుత్వ సలహాదారు ఎం.మల్లికార్జునరావు మాట్లాడుతూ సామాజిక అడవుల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందన్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ లావు శ్రీకష్ణదేవరాయలు మాట్లాడుతూ విద్యార్థులే ఈ దేశ భవిష్యత్ ఆస్తి, జ్ఞానం, నైపుణ్యం, నైతిక విలువలతో ముందుకు వచ్చిన యువత భారత్‌ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. విజ్ఞాన్ యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు మాట్లాడుతూ భారతీయ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయ రంగం, ఆధునిక సాంకేతికతతో జోడించబడినప్పుడే రైతు ఇంట నిజమైన సంక్రాంతి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సంప్రదాయ హరిదాసు, కోలాటాలు, గంగిరెద్దుల ఆటలు, సాంస్కతిక నత్యాలతో సంక్రాంతి పండుగ సందడిని విద్యార్థులు, పాల్గొన్న అతిథులు ఆనందంగా ఆస్వాదించారు. రైతులకు ప్రత్యేక సన్మానాలు నిర్వహించి, పంటల ప్రదర్శనలు, వరి, సిరిధాన్యాలు, అపరాలు, నూనెగింజలు, పత్తి, వాణిజ్య పంటలు, మిరప, ఆయిల్ ఫామ్, కూరగాయలు, పండ్లు, అగ్రో ఫారెస్ట్రీ, పశుపోషణ కోళ్ల పెంపకం, మత్య్సోత్పత్తి వంటి 12 పంటలపైన వ్యవసాయ సాంకేతిక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. సుమారు 250 మంది రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చానన్స్లర్ డాక్టర్ కె.ధనుంజయరావు, ఐసీఏఆర్ డైరెక్టర్, ఉపకులపతి డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు, వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వర రావు, ఐసీఏఆర్–ఐఐఎమ్ఆర్ డైరెక్టర్ డా.తార సత్యవతి, ఐసీఏఆర్–ఎన్‌ఐఆర్‌సీఏ(రాజమండ్రి) డైరెక్టర్ డాక్టర్ ఎం. శేషు మాధవ్ ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, రైతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
కోర్టు కాంప్లెక్స్‌లో సంక్రాంతి సంబరాలు
●సాంప్రదాయ క్రీడలలో న్యాయవాదులు ●రెండు రోజులపాటు పోటీలు ●నేడు రంగవల్లులు సంగీత విభావరి బాపట్ల బాపట్ల జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం నుంచి జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఆవరణ న్యాయవాదుల సంప్రదాయ క్రీడలతో నేటి తరానికి పాత జ్ఞాపకాలను, అందించేలా సరికొత్త నూతన ఉత్సాహంతో హడావుడి చేశారు. తొలుత క్యారమ్స్, చెస్ పోటీలను కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించారు. అనంతరం మహిళా న్యాయవాదులు, పురుష న్యాయవాదులతో పోటీగా లాంగ్ జంప్, షాట్ పుట్, పోటీలలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. స్లో సైక్లింగ్, టగ్ ఆఫ్ వార్, బాస్కెట్‌బాల్, త్రో బాల్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ పోటీలలో పురుష న్యాయవాదులతో పోటీగా మహిళా న్యాయవాదులు పాల్గొని విజేతలుగా నిలిచారు. సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే, పల్లె పండుగ, సంబరాల పండుగ, అలాంటి సంబరాలు అన్ని వృత్తులలో వారికి అవసరం అన్నారు. రోజువారి ఒత్తిడి నుండి బయటపడి, సరికొత్త జీవనయానానికి, సంక్రాంతి సంబరాలు ఎంతో దోహదపడతాయని ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే అవినాష్ మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం నుండి హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలు, గోమాతల ఊరేగింపు, రంగవల్లుల పోటీలు, వేద పండితుల ఆశీర్వచనం, సినీ సంగీత విభావరి కార్యక్రమాలతో హోరెత్తిస్తామని, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, న్యాయవాద గుమస్తాలు వారి కుటుంబ సభ్యులు కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. రెండు రోజులుగా జరుగుతున్న ఆటల పోటీలలో విజేతలకు శుక్రవారం సాయంత్రం జరిగే కార్యక్రమాలు బహుమతి ప్రదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమాలను న్యాయవాదులు విన్నకోట సత్యప్రసాద్, బి స్టాన్లీ విమల్‌కుమార్, కె రవిబాబు, బెంజ్, శ్యామలాదేవి, టి రాఘవేంద్రనాథ్, కే సురేంద్ర, రామిడి వెంకటేశ్వర్లు, నల్లమోతు సుబ్బారావు, పులిపాక రఘురాం, నంబూరి నరసింహారావు, ఎన్ వీఎస్వీ చలపతిరావు, ఎస్కేజెడ్ బాషా, రామకోటి, ఇమ్మడిశెట్టి సతీష్, ఎలవల నరేష్, బీమా లీలాకృష్ణ, వుట్ల రామారావు, బండి రామ్మూర్తి, దగ్గుమల్లి కిరణ్, సుబ్రహ్మణ్యం, ఉసిరికాయల శ్రీనివాసరావు, సాయి నాగేశ్వరరావు, యుమ్మడిశెట్టి బాలకృష్ణ, శంకరి, మాధురి, చంద్రిక, దివ్య, హేమంత్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. -
దేశ విజ్ఞాన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిన నాగార్జునుడు
ఏఎన్‌యూ(పెదకాకాని): ప్రాచీన భారత విజ్ఞాన చరిత్రలో ఆచార్య నాగార్జునుడికి విశిష్ట స్థానం ఉందని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు అన్నారు. వర్సిటీ రసాయనశాస్త్ర విభాగం, సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జునుడి ఆల్కెమికల్ వారసత్వం–సంప్రదాయిక, ఆధునిక దృక్పథాలు అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ముగింపు సభకు జాతీయ సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ దిట్టకవి రామచంద్రన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కంచర్ల గంగాధర్‌రావు మాట్లాడుతూ మెటలర్జీ, కెమికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలలో ఆయన ఆలోచనలు ప్రేరణగా మారాయన్నారు. ఆయుర్వేదం, సిద్ధ వైద్యం వంటి రంగాలపై ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ రామచంద్రన్ మాట్లాడుతూ తమిళనాడు, కేరళ, తెలంగాణ, న్యూఢిల్లీ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల నుంచి సుమారు 300 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని, పరిశోధన పత్రం సమర్పించారని తెలిపారు. జబల్పూర్, మంగళాయతన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కే ఆర్ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ ప్రయోగాత్మక దృక్పథం, పరిశీలన పద్ధతులు, శాసీ్త్రయ తత్వం నాగార్జునుడి రచనలలో స్పష్టంగా కనిపిస్తాయన్నారు. చాణిక్య ఎడ్యుకేషన్ హబ్ ప్రతినిధి డాక్టర్ ఇంకుర్తి వెంకట్ మాట్లాడుతూ శాసీ్త్రయ పరిశోధనలో కృత్రిమ మేధస్సు దోహదపడుతుందన్నారు. అనంతరం పరిశోధన పత్రాలు సమర్పించిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం, వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి రోశయ్య, ఓఎస్డి ఆచార్య ఆర్‌విఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్, పాలకమండలి సభ్యులు సీహెచ్ ఏపీ రామేశ్వరరావు, నూట అధ్యక్షులు ప్రొఫెసర్ బ్రహ్మాజీ, ప్రొఫెసర్ సుబ్బారావు, ప్రొఫెసర్ రమేష్ రాజు, జాతీయ సదస్సు కో కన్వీనర్ ప్రొఫెసర్ పి.సుధాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బిహెచ్.మల్లికార్జునరావు, జనరల్ సెక్రెటరీ బి.సత్యనారాయణ, ట్రెజరర్ డాక్టర్ పి.భరత్ తదితరులు పాల్గొన్నారు. -
స్కౌట్ శిక్షణతో సేవాభావం పెంపు
తాడికొండ: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో, పీఎంసీ పాఠశాలల్లో మహిళ ఉపాధ్యాయులకు గైడ్ కెప్టెన్, ఏడు రోజుల బేసిక్, అడ్వాన్స్ కోర్స్ శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించినట్లు జిల్లా సెక్రటరీ ఎం.ఏడుకొండలు తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణకు హాజరైన వందమంది మహిళ ఉపాధ్యాయులను ఉద్దేశించి విద్యాశాఖ అధికారి డాక్టర్ సలీం బాషా మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో స్కౌట్ ద్వారా సేవా భావాన్ని దేశభక్తిని క్రమశిక్షణ పెంపొందించాలన్నారు. విద్యార్థుల్లో తగ్గుతున్న నైతిక విలువలను పెంపొందించడానికి స్కౌట్ ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. సంక్రాంతి సెలవుల అనంతరం జనవరి 20 నుంచి పీఎం శ్రీ పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ బాల బాలికలకు ఐదు రోజుల ద్వితీయ సోపానం శిక్షణ కార్యక్రమం డివిజన్లవారీగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధానోపాధ్యాయులు, స్కౌట్ ఉపాధ్యాయులు విద్యార్థులను సంసిద్ధం చేసి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో 66 మంది బేసిక్ 34 మంది అడ్వాన్స్ కోర్సుకు హాజరయ్యారని కోర్సు లీడర్ ఎస్ఓటీ ఉమాదేవి తెలియజేశారు. జాయింట్ సెక్రటరీ కామాక్షి, రిసోర్స్ పర్సన్స్ మహాదేవమ్మ, శకుంతల, గిరిజాకుమారి, వర కమలాదేవి, ఎస్ఓసీ శ్రీనివాసరావు, స్కౌట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రమాద బాధితులకు వేగంగా పరిహారం
బాపట్ల: రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రమాదాలలో మరణించిన, గాయపడిన బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు అందేలా అధికారులు శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల వివరాలను కలెక్టర్ సమీక్షించారు. పరిహారం మంజూరు మరింత వేగవంతం చేయాలని సూచించారు. రవాణా శాఖలో ఆన్లైన్ ద్వారా అమలవుతున్న వాహన్, సారథి సేవల పనితీరును పరిశీలించారు. పర్మిట్లు, పన్నుల చెల్లింపు విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె. పరంధామ రెడ్డి, బాపట్ల ఆర్డీఓ గ్లోరియ, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జున, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు రంగారావు తదితరులు పాల్గొన్నారు. లక్ష్యాలను అధిగమించాలి స్వర్ణాంధ్ర కేపీఐసీ లక్ష్యాలను అధికారులు అధిగమించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి ఆయా శాఖల జిల్లా అధికారులతో గురువారం ఆయన స్థానిక కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ బాపట్ల దిశగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, పరిశుభ్రమైన తాగునీటిని అందించడం చాలా ముఖ్యమన్నారు. పబ్లిక్ హెల్త్ నుంచి 49 శాతం కుళాయి కనెక్షన్ ఇవ్వాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం 43 శాతమే ఇవ్వడంపై నిలదీశారు. మురుగు నీటిని శుద్ధి చేసే కేంద్రాలు మున్సిపాలిటీలలో ఏర్పాటు చేయాలన్నారు. శుద్ధి చేసిన తర్వాత ఆ నీటిని వినియోగించుకోవడం, వాటిని సురక్షితమైన పద్ధతిలో బయటకు విడుదల చేయడం వంటివి చేయాలన్నారు. తాగునీరు అందించాలి గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా 4,493 కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం కాగా, కేవలం 200 మాత్రమే చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని వాటర్ ప్లాంట్లన్నింటినిలో నీటి పరీక్షలు నిర్వహించాలన్నారు. పంచాయతీరాజ్ కింద 49.93 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాల్సి ఉండగా, కేవలం రెండు కిలోమీటర్లు నిర్మించడం ఏంటని నిలదీశారు. చాలా పనులు టెండర్ దశలో ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వేగంగా నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ అసంతృప్తి ఆర్ అండ్ బీ రహదారుల నిర్మాణ పనుల లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు. మూడు నెలలలో 28.93 కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని లక్ష్యం కాగా, కేవలం 14.2 కిలోమీటర్ల నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన లక్ష్యాలు చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. గృహ నిర్మాణశాఖ ద్వారా 700 గృహాలకుగాను ఇప్పటివరకు 259 నిర్మించడంపై చర్చించారు. లబ్ధిదారులను చైతన్యపరచడం, అప్రమత్తంగా ఉండి నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూగర్భ ఖనిజ సంపదపై దృష్టి సారించాలన్నారు. పీఎం శ్రీ పథకంలో రూ.ఐదు కోట్లు నిధులు జిల్లాకు మంజూరు కాగా, 87 పనులకుగాను 28 ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అమృత్– 2 పనులు చేపట్టాలన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేయాలని సూచనలు చేశారు. ఈ సమావేశంలో సీపీఓ షాలేము రాజు, విద్యుత్ శాఖ ఎస్ఈ ఆంజనేయులు, గృహ నిర్మాణశాఖ పీడీ వెంకటేశ్వర్లు, ఆర్అండ్బీ డీఈ అరుణకుమారి, తదితర అధికారులు పాల్గొన్నారు. -
తమ్ముళ్ల బరితెగింపు!
రేపల్లె: సంప్రదాయం పేరుతో కోడిపందేలు నిర్వహించేందుకు ఇప్పటికే నియోజకవర్గంలోని చెరువుపల్లి మండలంలోని ముఖ్య నేత ఏర్పాట్లు చేస్తున్నారు. చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం సమీపంలో సుమారు 50 ఎకరాలు పొలాలను లీజుకు తీసుకొని కోడిపందేలు, గుండాటా, చక్రం ఆట, పేకాట వంటి వాటి నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. కోడి పందేలు నిర్వహించే ప్రాంతంలో నాలుగు రకాల బరులను సిద్ధం చేస్తున్నారు. బరుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున స్తంభాలు, ఇతర సామగ్రిని ఆ ప్రదేశానికి చేర్చారు. పందేల నిర్వహణకు వచ్చే వారి కోసం పెద్ద వేదికలను సిద్ధం చేసి మూడు రోజులపాట రేయింబవళ్లు పోటీలు జరిగేలా భారీ ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి సత్యప్రసాద్ అండదండలతోనే ఏర్పాట్లు జరుగుతుండడంతో అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుడ్డికాయలంక నుంచి చెరుకుపల్లి వరకు.. ప్రశాంతమైన రేపల్లె నియోజకవర్గాన్ని జూదకేంద్రంగా మార్చింది టీడీపీ నేతలే అనటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో పండుగ వేళల్లో అడపా దడపా చాటుమాటున జరిగే కోడి పందేలను బహిరంగంగా, అధికారికంగా చేసిన ఘనత పచ్చనేతలకే దక్కుతుందని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత మంత్రి.. ఎమ్మెల్యేగా ఎన్నికై న తొలినాళ్ళల్లో రేపల్లె మండలంలోని గుడ్డికాయలంకలో అట్టహాసంగా, అధికారికంగా కోడిపందేల సంస్కృతిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా సంక్రాంతి పండుగ పేరుతో కోడిపందేలు బహిరంగంగా నిర్వహించి రూ.కోట్లు దండుకోవటం ఆనవాయితీగా వస్తోంది. రెండేళ్ల నుంచి చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో యథేచ్ఛగా పందేలు నిర్వహిస్తున్నా అడ్డుకునే ప్రయత్నం అధికారులు చేయకపోవటం శోచనీయం. జీవహింస, బహిరంగ కోడిపందేలు నిషేధమంటూ న్యాయస్థానాలు పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నా రేపల్లె నియోజకవర్గంలో పచ్చనేతల ఒత్తిళ్లతో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. సంప్రదాయం ముసుగులో జరిగే కోడిపందేలకు, జూదశాలల నిర్వహణకు పోలీసు అధికారులు అడ్డుకట్ట వేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందేలు, జూద శిబిరాలకు చిరునామాగా తీర ప్రాంతంలోని రేపల్లె నియోజకవర్గం మారుతోంది. సంప్రదాయం పేరుతో తెలుగు తమ్ముళ్లు అక్రమార్జనకు బరి తెగిస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకాలో దీనికి తోడు పచ్చ నేతలు ఇష్టారాజ్యంగా జూద శిబిరాలను నిర్వహిస్తూ సామాన్యుల జేబులను కొల్లగొడుతున్నారు. అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
‘చారిత్రక కొండవీడు ఫెస్ట్–2026’ కు ఏర్పాట్లు
యడ్లపాడు: చారిత్రక వారసత్వానికి నెలవైన కొండవీడు కోటపై ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించనున్న ‘కొండవీడు ఫెస్ట్–2026’ ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభమైంది. గురువారం వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు కొండవీడుకోటను సందర్శించి, ఉత్సవాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రాథమిక పరిశీలన జరిపారు. ఉత్సవాలకు వచ్చే వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేలా చేపట్టాల్సిన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తీరుపై చర్చించారు. రవాణా సౌకర్యాలు, వేదికల ఏర్పాటు, పర్యాటకుల భద్రత వంటి అంశాలపై అధికారులు చర్చించారు. గత ఉత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మెరుగైన వసతులు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నట్లు అధికారులు వివరించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో అన్ని శాఖల అధికారులతో కలిసి తుది పరిశీలన ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్శనలో ఆర్డీవో మధులత, డీఎంహెచ్‌వో డాక్టర్ రవి, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీధర్, ఆర్టీసీ ఆర్ఎం అజిత కుమారి, టూరిజం మేనేజర్ గంగిరెడ్డి నాయుడమ్మ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమణమ్మ, తహసీల్దార్ విజయశ్రీ, ఎంపీడీవో హేమలతాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
‘సరస్’లో ఆకలి కేకలు
గుంటూరు: నగరంలో గత రెండు రోజులుగా జరుగుతున్న సరస్ అఖిల భారత డ్వాక్రాబజార్లో భోజనాలకు ఇబ్బందులు పడుతున్నామని స్టాల్స్‌లోని సిబ్బంది, ప్రాంగణంలో పనులు చేస్తున్న వారు వాపోతున్నారు. సిబ్బందికి సరిపడా భోజనాలను వండాలని కోరుతున్నారు. ప్రాంగణంలో సుమారు 300కు పైగా స్టాల్స్, వాటిలో ప్రతి షాప్‌కు కనీసం ఒకరిద్దరు, అదేవిధంగా పర్యవేక్షణకుగానూ మరో 300 మంది అధికారులు, సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ప్రాంగణం పరిశుభ్రత నిర్వహణకు మరో 300 మంది ఉన్నారు. నగర మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిలో కూడా 400 మందిని అధికారులు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో పూటకు కనీసం 700 నుంచి వెయ్యి మందికి భోజన వనతి కల్పించాల్సి ఉంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో వసతులు ఎలా ఉన్నా, మధ్యాహ్నం సమయంలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. రూ.కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి నిర్వహిస్తున్న కార్యక్రమంలో వసతులు కల్పించటంలో యంత్రాంగం విఫలమైందని సిబ్బంది చర్చించుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో యంత్రాంగం ఒకటి రెండు స్టాళ్లను ఏర్పాటు చేస్తుండటం, టోకెన్లను సక్రమంగా పంపకపోవటం, ఒకొక్కసారి భోజనం అయిపోయి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని అంటున్నారు. కూర ఉంటే భోజనం లేక, భోజనం ఉంటే కూర సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. దాదాపు మరో పది రోజులపాటు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమంలో భోజనాలు సక్రమంగా ఏర్పాటు చేయకపోవటంతో మున్ముందు ఇబ్బందేనని పేర్కొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యక్రమంలోనే ఏర్పాట్లు ఇలా ఉంటే ఎలా అని సిబ్బంది పెదవివిరుస్తున్నారు. గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని పలువురు ఆవేదన -
ప్రభుత్వ సేవలన్నీ అందాలి
చీరాల: ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు సజావుగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. గురువారం చీరాలలోని మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి వచ్చిందని, ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన సేవలు వివరాలను ఉంచాలన్నారు. వాహన పోర్టల్, సారధి పోర్టల్‌లో అందుతున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వం భావించినట్లుగా ప్రజలకు సక్రమమైన పద్ధతిలో సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం చీరాలలో రెండుళ్లుగా కొనసాగుతుండగా ఇప్పటి వరకు 2001 రిజిస్ట్రేషన్లు అయ్యాయన్నారు. ఆరుగురు సిబ్బంది ఉండగా వారి హాజరు పట్టికను పరిశీలించారు. బయోమెట్రిక్ యంత్రాన్ని ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించారు. ఆన్లైన్ హాజరుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఎల్ఎల్ఆర్, లైసెన్స్‌ల స్వీకరణ దరఖాస్తులు, జారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. కార్యాలయాన్ని పరిశీలించి ప్రతి గదిలో ఉంచిన పాత రికార్డులు పరిశీలించారు. వాహన పోర్టల్, సారధి పోర్టల్స్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ సగటున 15 మంది లైసెన్స్ కోసం వస్తున్నారని మోటారు వాహనాల తనిఖీ అధికారి కె.రవికుమార్ ఆయన దృష్టికి తెచ్చారు. 378 వాహనాల లైసెన్స్‌లు రెన్యువల్ పొందడానికి ఆన్లైన్లో రాగా ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉండడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే పరిశీలించి మంజూరు చేయాలని ఆదేశించారు. లైసెన్స్‌లు పొందడానికి వచ్చిన అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. మధ్యవర్తులు, ఏజెంట్ల వద్దకు ప్రజలు వెళ్ళరాదని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు తెలుసుకోవడానికే ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామన్నారు. డ్రైవింగ్ పరీక్షల కోసం ట్రాక్ ఏర్పాటు చేయాలని, కార్యాలయానికి సొంత భవనం కేటాయించాలని ఎంవీఐ కె.రవికుమార్ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. చీరాల ఎంవీఐ కార్యాలయానికి కలెక్టర్ వచ్చారని తెలుసుకున్న ఆర్డీఓ టి.చంద్రశేఖర్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆయన వెంట చీరాల, వేటపాలెం తహసీల్దార్లు కె.గోపీకృష్ణ, గీతావాణి ఉన్నారు. -
విహారయాత్రల వేళ అప్రమత్తత ముఖ్యం
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: సంక్రాంతి సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతి సెలవులకు తాత్కాలికంగా ఇళ్లకు తాళాలు వేసి విహార యాత్రలు, తీర్థయాత్రలు వెళ్లే ప్రజలు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషనన్‌లో ముందస్తుగా సమాచారం అందించాలన్నారు. సంక్రాంతి సెలవులను ఆసరాగా చేసుకొని తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు జరగకుండా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. సమాచారం అందిస్తే ఇంటిపై నిరంతర పోలీసు నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ నిఘాను పటిష్టం చేస్తామన్నారు. విహార యాత్రలకు వెళ్లే సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో, ఇతర సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపరుచుకోవాలన్నారు. వీలైనంత వరకు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, వాటిని మొబైల్ ఫోనన్లకు అనుసంధానం చేసి ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలు సముద్రాలు, నదులు, కాలువలు వంటి నీటి ప్రదేశాల్లో ఈతకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే, తప్పనిసరిగా సురక్షితమైన ప్రదేశాల్లోనే తల్లిదండ్రులు, పెద్దల సంరక్షణలో వెళ్లే విధంగా చూసుకోవాలన్నారు. జలవనరుల వద్దకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. -
వైభవంగా ఉరుసు మహోత్సవాలు
నగరంపాలెం: స్థానిక జీటీరోడ్డులో శ్రీహాజరత్ కాలే మస్తాన్ షా ఆవులియా 134వ ఉరుసు మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం బాబా సమాధి ప్రత్యేకంగా అలకరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. రాత్రికి గ్యార్మీ షరీఫ్ (ఖురాన్ పఠనం) చేపట్టారు. కార్యక్రమాలను ధర్మకర్త రావి రామ్మోహరావు పర్యవేక్షించారు. నగరంపాలెం: స్థానిక లక్ష్మీపురం శ్రీ త్యాగరాజ కళావేదికపై నిర్వహిస్తోన్న శ్రీత్యాగరాజస్వామి 179వ ఆరాధన సంగీత మహోత్సవాలు గురువారం ముగిశాయి. శ్రీత్యాగరాజ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరగ్గా, తొలుత శ్రీ త్యాగరాజస్వామికి శ్రీకాంత్ బృందంచే నాదస్వరం, ఉంఛవత్తి, పంచామృతాభిషే కార్చన, విశేష అలంకరణతో ప్రారంభించారు. శ్రీత్యాగరాజ స్వామిని పల్లకీలో కళాకారులు, సంగీతజ్ఞులు, ఔత్సాహికులు శ్రీత్యాగరాజ పంచరత్న కీర్తనల గానంతో తిరు వీధులలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక, స్థానికేతర కళాకారులతో పంచరత్న సేవ విశేష హారతి, అన్న ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం నాట్యాచార్య డాక్టర్ కాజా వెంకటసుబ్రహ్మణ్యం శిష్య బృందం చే ప్రహ్లాద భక్తి విజయం నృత్య రూపకం ప్రదర్శించారు. దేవదాయశాఖ గౌరవ సలహాదారులు బ్రహ్మశ్రీ చుండూరి సీతారామాంజనేయప్రసాద్, ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి హాజరై, త్యాగరాజ స్వామి విశిష్టతను వివరించారు. చిన్నారులను ప్రశంసించారు. సంఘం కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్, ఉపాధ్యక్షులు ఎస్.గిరిజాశంకర్, కోశాధికారి రవీంద్రనాధ్, సలహాదారు నేతి విశ్వేశ్వరరావు పాల్గొనగా, అతిధులను, కళాకారులను సత్కరించారు. శిశువుల అక్రమ విక్రయాల్లో 30కి చేరిన అరెస్ట్‌లు లబ్బీపేట(విజయవాడతూర్పు): శిశువుల అక్రమ విక్రయాల కేసుల్లో ఇప్పటి వరకూ 30 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు నగర డిప్యూటీ కమిషనర్ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో శిశువుల కిడ్నాప్ అమ్మకం కేసులకు సంబంధించి పోక్సో యాక్ట్ , మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అహ్మదాబాద్, గుజరాత్, ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లో టీములు ఈ రాకెట్మూలాలను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ ఫెర్టిలిటి సెంటర్స్ ప్రమేయం ఎంతవరకు ఉంది.. నిజంగా పిల్లల కిడ్నాప్ చేశారా లేదంటే తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పిల్లలను ఈ రకమైన అమ్మకానికి పెడుతున్నారా అనే అంశాలను విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పెదకాకాని: నో ప్లాస్టిక్ జోన్‌గా ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు సహకరించాలని కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనా బేగం అన్నారు. ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా (నో ప్లాస్టిక్ జోన్)గా మార్చే ఉద్దేశంతో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం ఉప్పలపాడు పక్షుల కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పక్షి సంరక్షణ కేంద్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వినియోగాన్ని నిషేధించి, పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించేందుకు డీఎఫ్‌ఓకు సూచనలు జారీ చేశారు. పక్షి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించే వారికి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను లోపలికి తీసుకురావద్దని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే హానికర ప్రభావాలను వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి కె శ్రీనివాసరావు, పర్యాటకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. -
కోల్డ్ స్టోరేజీ యాజమాన్యాల సమస్యలు పరిష్కరించాలి
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లాలో శీతల గిడ్డంగుల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించాలని కోల్డ్ స్టోరేజ్‌ల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సురేంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ది గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్‌ల ఓనర్స్ వేల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం చుట్టుగుంటలోని మార్కెటింగ్‌శాఖ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు సమస్యలతో కూడిన వినతిప్రతం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో అసోసియేషన్ కార్యదర్శి కేఎస్ రాఘవయ్య, కోశాధికారి ఆర్.రమణ, సభ్యుడు జుగిరాజ్ భండారి తదితరులు ఉన్నారు. జిల్లా కోల్డ్‌స్టోరేజీల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్రబాబు -
నడిరోడ్డుపై నడిపించి కోర్టుకు..
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్న రౌడీషీటర్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు నడిరోడ్డుపై నడిపించి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు లాలాపేట పోలీసులు తెలిపిన వివరాలు.. లాలాపేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉన్న గణపతి రాజేష్, అతని స్నేహితులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఉమర్బుడేసాహెబ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం ఢీ కొనడడంతో వివాదం జరిగింది. దీనిపై కక్ష పెంచుకున్న గణపతిరాజేష్ అతని స్నేహితులతో కలిసి గతేడాది డిసెంబర్ 21న బుడేసాహెబ్ ఇంటికి వెళ్లి రాడ్లు, కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన బుడేసాహెబ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇందిరాకాలనీకి చెందిన గణపతి రాజేష్ అలియాస్ శ్రీను, గణపతి ఆనంద్, బత్తుల హరీష్‌తో పాటు మరో మైనర్‌ను అదుపులోకి తీసుకుని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. కాగా రౌడీషీటర్ గణపతి రాజేష్ 10 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
పీపీపీతో పేదలకు వైద్య విద్య, వైద్యం దూరం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పేరుతో వైద్య విద్యను ప్రైవేటు పరం చేసి, పేదలకు వైద్య విద్య, వైద్యం దూరం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. చిలకలూరిపేటలో సీపీఐ శత వార్షికోత్సవ ముగింపు వేడుకలు బుధవారం నిర్వహించారు. ముందుగా పట్టణంలోని సీపీఐ కార్యాలయం నుంచి పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళామందిర్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు సీపీఐ చిలకలూరిపేట ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు అమరావతి, పోలవరం రెండు కళ్లు అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండి పడ్డారు. అమరావతి కోసం భూములను సేకరించిన ప్రభుత్వం తిరిగి 16వేల ఎకరాలను రైతులను నుంచి సమీకరించనుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెద్ద పీట వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమంతోనే దేశంలోనే అనేక సంస్కరణలు అమలు అయ్యాయని గుర్తు చేశారు. బీజేపీ పాలన లో నినాదాలే మిగిలాయని ఎద్దేవా చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యురాలు, జిల్లా ఇన్చార్జి అక్కినేని వనజ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజా ప్రతినిధులు అత్యాచారం చేసి నిర్లజ్జగా బయట తిరుగుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్, సహాయ కార్యదర్శులు కాసా రాంబాబు, హుస్సేన్, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు బందెల నాజర్జీ, ఏఐవైఎఫ్ అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, సహాయ కార్యదర్శి షేక్ సుభాని, నాయకులు దాసరి వరహాలు, రమణారావు, బందెల శ్రీనివాసరావు, యుగంధర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆపస్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఉపాధ్యాయ సంఘ (ఆపస్) నూతన సంవత్సర కేలండర్, డైరీని పాఠశాల విద్య ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉన్న ఆర్జేడీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆపస్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పి.పద్మ, ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎ.బాలచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీలో గురువారం జరగాల్సిన స్థాయీ సంఘ సమావేశాలతో పాటు సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. సీఎం చంద్రబాబు గుంటూరు నగరానికి వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు ఓ ప్రకటనలో తెలిపారు. ఏఎన్‌యూ(పెదకాకాని): అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్సిక్ మహా సంఘం (ఏబీఆర్ఎస్ఎం) ఆంధ్రప్రదేశ్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో దాదాపు ఐదు వేల అధ్యాపకుల పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఏబీఆర్ఎస్ఎం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ వై.వి.రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డి.ఎస్.వి.ఎస్ బాలసుబ్రహ్మణ్యం కోరారు. అనంతరం ప్రొఫెసర్ మధుమూర్తి మాట్లాడుతూ కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఉన్నందువల్ల అధ్యాపక పోస్టుల భర్తీ ఆలస్యం అవుతుందని, వీలైనంత తొందరలో భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఆర్ఎస్ఎం జాతీయ సహ సంఘటన కార్యదర్శి గుంతా లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ రామచంద్రన్, డాక్టర్ వాణి, డాక్టర్ గంగరాజు, డాక్టర్ బాల మురళి, తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: గుంటూరులోని నల్లపాడు రోడ్డు రెడ్డికళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన సరస్ మేళా ఏర్పాట్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి ఇది ఒక వేదికని తెలిపారు. ఇది మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడుతుందన్నారు. ఈ అఖిల భారత డ్వాక్రాబజార్ సరస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు గురువారం ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శన విక్రయాలు జరుగుతాయన్నారు. గుంటూరులో ఈ మేళా 12 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాటు చేయబడిందన్నారు.300 షాపులు ఉంటాయని, వాటిలో 65 షాపులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉత్పత్తులను ప్రదర్శన విక్రయాలు చేస్తారన్నారు. -
22 నుంచి విజ్ఞాన్‌లో ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్–2026
చేబ్రోలు: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఏపీ స్పేస్‌టెక్ అకాడమీ, హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 22 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్–2026 ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ పి. నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా సమ్మిట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అమరావతిలోని సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ ను కూడా మూడు రోజుల పాటు ఇదే సమ్మిట్‌లో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కాలేజీ స్థాయి విద్యార్థులకు కెమికల్ రాకెట్రీ, స్కూల్ స్థాయి విద్యార్థులకు హైడ్రో రాకెట్రీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్‌ను ‘లివరేజింగ్ స్పేస్ టెక్నాలజీ ఫర్ వికసిత్ భారత్–2047’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ లో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, డిగ్రీ, స్కూల్, పాలిటెక్నిక్ విద్యార్థి బృందాలు పాల్గొననున్నాయని తెలిపారు. విజేతలకు ప్రత్యేక ట్రోఫీలు, సర్టిఫికెట్లు, నగదు బహుమతులు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందజేయనున్నట్లు చెప్పారు. ప్రత్యేక ఆకర్షణగా సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్ -
వీవీఐటీ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మక సిమెన్స్ ఈడీఏ సెంటర్
పెదకాకాని: విద్యాలయాలలో అత్యాధునిక రీసెర్చ్, ఆవిష్కరణల రూపకల్పనతోపాటు పరిశ్రమలతో అనుసంధానం చేయడానికి సిమెన్స్ సంస్థ ఏర్పాటు చేసిన సిమెన్స్ ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమిషన్ సెంటర్ (సిమెన్స్ ఈడీఏ సెంటర్) ఏర్పాటుకు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ ఎంపికై నట్లు వీవీఐటీయూ ప్రొ–చాన్స్‌లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీయూలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగం సిమెన్స్ అకడమిక్ పార్టనర్ గ్రాంట్‌కు సమర్పించిన విద్యార్థుల ప్రాజెక్ట్ సమూనాలు, అధ్యాపకుల పరిశోధనల ఆధారంగా ఈ కేంద్రం ఎంపిక కాబడిందని బుధవారం ప్రొ ఛాన్సలర్ తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుకు మూడు సంవత్సలకు కోటిన్నర విలువచేసే ఐసీ డిజైన్ అండ్ వెరిఫికేషన్, ఎంబడెడ్ సిస్టమ్స్, పీసీబీ డిజైన్స్ అనుబంధ ఈడీఏ సాధనాలను సిమెన్స్ సంస్థ అందించినట్లు వివరించారు. అనంతరం ఈిసీఈ విభాగాధిపతి, ఈడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.వై. భానుమూర్తి, సైట్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎస్.కె ఇనావుల్హక్ లను వీవీఐటీయూ చాన్స్‌లర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వీసీ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి. అకడమిక్ డీన్ డాక్టర్ కె. గిరిబాబు అభినందించారు. -
వైఎస్సార్‌సీపీతోనే ఎస్సీల సంక్షేమం
● ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా? అని గతంలో చంద్రబాబు ఎద్దేవా ● రోజురోజుకూ ఎస్సీలను చులకనగా చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ● మళ్లీ వైఎస్ జగన్ సీఎంగా వస్తేనే ప్రజలకు సంక్షేమం ● వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు బాపట్ల: పేదల బతుకుల్లో వెలుగులు నిండాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవటంతోనే సాధ్యమని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టి.జె.ఆర్.సుధాకర్‌బాబు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఎస్సీసెల్ కార్యవర్గ సమావేశం బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సుధాకర్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీలపై దాడులు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా? అని సీఎం చంద్రబాబునాయుడే మాట్లాడటం చూసిన మనం ఆయన ఎస్సీలకు న్యాయం చేస్తారని నమ్మటం అవివేకం అన్నారు. ఎస్సీలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునేందుకే ప్రభుత్వం ఉందన్నారు. ఎస్సీలకు ఆ పార్టీలో కూడా సరైన స్థానం లేదన్నారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవటంతోనే పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పారు. ఓసీలకు కేటాయించిన స్థానాల్లో కూడా ఎస్సీలకు అవకాశం ఇచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారని గుర్తు చేశారు. ఎంతో మంది పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించారని గుర్తు చేశారు.వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రూ.70వేల కోట్లు ఎస్సీల సంక్షేమానికి ఖర్చు చేయగా, చంద్రబాబు ఆ దిశగా అడుగులు కూడా వేయలేదని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన ఏడాదిన్నరకు రూ.20వేల కోట్లు ఎస్సీలకు ఖర్చు పెట్టాల్సి ఉండగా.. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని చెప్పారు. చంద్రబాబు సర్కారుకు ఎస్సీలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రకాశం,బాపట్ల పరిశీలకులు బత్తుల బ్రహ్మనందరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు, సమన్వయకర్తలు కోన రఘుపతి, కరణం వెంకటేష్‌బాబు, వరికూటి అశోక్‌బాబు, ఈవూరి గణేష్, గాదె మధుసూదనరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వాసుమళ్ళ వాసు, రాష్ట్ర కార్యదర్శి మండే విజయ్‌కుమార్, నియోజకవర్గాల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బడుగు ప్రకాశరావు, అనిల్, బలరామ్, కమల్‌దేవ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్‌కు ఎంపిక
వేటపాలెం: ఆల్ ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో వేటపాలెంకు చెందిన గాత్రం ఉమామహేశ్వరరావు, వెంకటలక్ష్మి దంపతులు సత్తాచాటారు. హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో ఈ నెల 6, 7 తేదీల్లో ఆల్ ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 45 ప్లస్ విబాగంలో గాత్రం ఉమామహేశ్వరావు, వెంకటక్ష్మి దంపతులు అద్భుత ప్రతిభ కనపరిచ్చారు. త్రిపుల్ జంప్ 4–100 మీటర్ల రిలే పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. 800 మీటర్ల పరుగు పందెం లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఉమా భార్య వెంకటలక్ష్మి లాంగ్ జంప్, 4–100 మీటర్ల రిలే లో ప్రథమ స్థానం, 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం, షార్ట్ పుట్లో తృతీయ స్థానం నిలిచింది. ఽథాయిలాండ్లో జరగనున్న అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు భార్య, భర్తలు ఎంపికయ్యారు. సత్తా చాటిన దంపతులు -
మహిళా దొంగ అరెస్ట్
చీరాల రూరల్: నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో బంగారు నల్లపూసల దండ దొంగిలించిన మహిళను రైల్వే జీఆర్పీ పోలీసులు అరెస్టు చేసి రూ. 2,16,000 విలువైన బంగారు దండను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి జీఆర్పీ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితురాలి వివరాలను జీఆర్పీ సీఐ ఎస్కే మౌలా షరీఫ్ వెల్లడించారు. 60 ఏళ్ల వయస్సు కలిగిన చీరాలకు చెందిన గోలి స్వరాజ్యం అనే మహిళ 27 డిసెంబర్ 2025న నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ కంపార్టుమెంటులో ప్రయాణిస్తుండగా ఆమె బ్యాగులోని జిప్ తెరచి 36 గ్రాములు బరువు కలిగిన బంగారు నల్లపూసల దండను గుర్తు తెలియని దొంగలు చోరీ చేశారు. అయితే బాధితురాలు 6 జనవరి 2026న చీరాల జీఆర్పీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నెల్లూరు రైల్వే డీఎస్పీ జి. మురళీధర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. ఒంగోలు రైల్వే సీఐ మౌలా షరీఫ్, చీరాల జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి.. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒంగోలు రైల్వే సీఐ మౌలా షరిఫ్, ఎస్సై సీహెచ్ కొండయ్య కేసును ఛేదించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. అనేక సీసీ కెమెరాలను నిరంతరాయంగా పరిశీలించి ఒకే రోజులో అంటే బుధవారం దొంగను గుర్తించారు. నిందితురాలు చీరాల రామ్‌నగర్‌కు చెందిన చిన్నపోతుల రోజాను అరెస్టు చేశారు. ఆమెవద్దనున్న 2,16,000 విలువైన బంగారు నల్లపూసల దండను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. ఒకే రోజులో కేసును ఛేదించిన సీఐ మౌలా షరీఫ్, ఎస్సై సీహెచ్ కొండయ్యతో పాటు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. -
ప్రజలను నట్టేట ముంచిన ప్రభుత్వం
● ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలి ● ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుంది ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున బాపట్ల: ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయంలో బుధవారం జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రకాశం,బాపట్ల జిల్లాల కమిటీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, సెంట్రల్ పార్టీ పొలిటికల్ కో ఆర్డినేటర్ కందుల రవీంద్రరెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ సూపర్‌సిక్స్ పేరుతో చంద్రబాబు సర్కారు ప్రజలను మోసం చేసిందన్నారు. హామీలు మాట పక్కనబెడితే సంక్షేమం జోలికే చంద్రబాబు సర్కారు వెళ్లడం లేదన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు తీసుకుంటున్న శ్రద్ధ ప్రజలకు మంచి చేసే వాటిపై లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దామని, ప్రజలకు వెన్నంటి ఉండేందుకు శక్తివంచన లేకుండా ముందుకు పోదామని సూచించారు. కష్టపడే వారికి భవిష్యత్ – బత్తుల బ్రహ్మానందరెడ్డి పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్ ఉంటుందని ప్రకాశం, బాపట్ల జిల్లాల టాస్క్‌ఫోర్స్ కమిటీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రజాసంక్షేమానికి చేపట్టిన పనులను చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా నిర్వీర్యం చేసిందో ప్రజలకు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ పదే పదే చెబుతున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ పార్టీ పొలిటికల్ కో ఆర్డినేటర్ కందుల రవీంద్రరెడ్డి, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, బాపట్ల సమన్వయకర్త కోన రఘుపతి, చీరాల – కరణం వెంకటేష్‌బాబు, రేపల్లె – ఈవూరి గణేష్‌బాబు, వేమూరు – వరికూటి అశోక్‌బాబు, పర్చూరు – గాదె మధుసూదనరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్‌బాబు, పార్టీ రాష్ట్రకార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమరేశ్వరుని సొమ్ముకు ఎసరు
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరస్వామి వారి ఆదాయాన్ని ఇష్టారాజ్యంగా దారి మళ్లించి అధికంగా చెల్లింపులు చేయటంపై భక్తులలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాలని భక్తులు కోరుతున్నారు. అమరేశ్వరునికి హుండీ, భక్తుల విరాళాలు, ఆర్జితసేవలు, భూముల కౌలు ద్వారా ఆదాయం వస్తుంది. దీనిని స్వామి వారి కై ంకర్యాలకు ఖర్చు చేస్తుంటారు. ఏటా తరహాలో ఈ సంవత్సరం కూడా కార్తికమాసంలో భక్తుల సౌకర్యాలకు, స్వామి వారి అలంకారం కోసం పూలదండలు, టెంట్లు, క్యూలైన్ల నిర్వహణ, పాలు ఇలా తదితరాల కోసం టెండర్లు ఖరారు చేశారు. తర్వాత వీరికి ఆలయాధికారులు అధికంగా చెల్లించారనే ప్రచారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్తికమాసంలో క్యూలైన్ల నిర్వహణకు రూ.5,11,000, టెంట్లకు రూ.3.68 లక్షలు, ఇతర విభాగాల్లోనూ అధికంగా దేవుని సొమ్ము డ్రా చేసినట్లు సమాచారం. పాలు, పూలదండలు, బియ్యం సరఫరాకు స్వామివారి నిధులు ఉన్న బ్యాంకుల నుంచి డ్రా అయినట్లు ప్రచారం జరుగుతోంది. దేవాలయం పారిశుద్ధ్య టెండర్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటి వెనుక కృష్ణా జిల్లాకు చెందిన దేవదాయశాఖ ఉద్యోగి చక్రం తిప్పినట్లు భక్తులు చెబుతున్నారు. బాధ్యులపై దేవాలయ పాలకమండలి చర్యలు తీసుకుని, సీఐడీతో సమగ్రంగా విచారణ చేయించాలని భక్తులు కోరుతున్నారు. -
వేపగింజల కషాయంతో కత్తెర పురుగు నివారణ
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ గంగాదేవి ప్రత్తిపాడు: వేప గింజల కషాయంతో కత్తెర పురుగు ఉధృతిని తగ్గించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ గంగాదేవి అన్నారు. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో బుధవారం ఆత్మ సౌజన్యంతో శాస్త్రవేత్తలు రైతులతో చర్చా గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మ పీడీ వెంకటేశ్వరరావు రైతులు సాగు చేస్తున్న పంటలు, పంట మార్పిడి విధానం, సాగు నీరు, రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం.. వంటి అనేక అంశాలపై రైతులకు వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్ గంగాదేవి మాట్లాడుతూ కత్తెర పురుగు ఉధృతి అధికంగా ఉంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ ఐదు శాతం వేసి ఎకరాకు 60 మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలన్నారు. మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు నివారణకు మోనోక్రోటో ఫాస్ 36 ఎస్.ఎల్ ఎకరాకు 320 మిల్లీలీటరు లేదా క్లోరంట్రినిలిప్రోల్ (క్రోరాజెన్) పిచికారీ చేసుకోవాలన్నారు. గుంటూరు ఏడీఏ ఎన్.మోహన్‌రావు మండల వ్యవసాయాధికారి షేక్.సుగుణ బేగం మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాలకు వెళ్లి రైతులందరూ పంట నమోదు తప్పకుండా చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్ఎన్ వి.షణ్ముఖ రెడ్డి, ఎంపీఈవో కె.నాగరాజు, ఏఈవో వై. నీలాంబరం పాల్గొన్నారు. -
సచివాలయాల్లో ఈ–గవర్నెన్స్ అమలు
జడ్పీ చైర్పర్సన్ హెనీక్రిస్టినా నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఈ – గవర్నెన్స్ అప్లికేషన్స్ అమలు చేయాలని గుంటూరు జడ్పీ చైర్పర్సన్ హెనీక్రిస్టినా అన్నారు. జిల్లాపరిషత్ (జడ్పీ) ఆవరణలోని హాల్లో మంగళవారం పంచాయతీరాజ్ డిప్యూటీ ఎంపీడీఓలు, పరిపాలనాధి కారులు (ఏఓ), సీనియర్/ జూనియర్ సహాయకులు (ఎస్ఏ/జేఏ), పంచాయతీ అభివృద్ధి అధికారుల (పీడీఓ)కు ఈ–గవర్నెన్స్‌పై ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఈ–ఆఫీస్, పీఆర్–ఒన్, ఈ–క్రాప్, వాట్సాప్ యాప్ గవర్నర్స్ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో శిక్షణ పొందాలని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఈనెల ఒకట్నుంచి ఈ–ఆఫీస్ ద్వారా ఫైల్స్‌ను నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో దీనిపై తర్ఫీదు పొందేందుకు శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. డీపీఆర్సీ ఏఓ ప్రతాప్‌కుమార్, జడ్పీపీ ఏఓ శామ్యూల్, డీటీఎం కె.నాగేశ్వరరావు, రిసోర్స్ పర్సన్స్ కె.శ్రీనివాసరావు, కె.అనురాధ, డి.రవీంద్రబాబు, ఏ.శృతి, శిరీషరాణి ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల సిబ్బంది పాల్గొన్నారు. రైల్ వన్ యాప్‌లో అన్రిజర్వ్డ్ టికెట్లు కొనొచ్చు లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): భారతీయ రైల్వేలు ఆర్ వాలెట్ మినహా అన్ని డిజిటల్ మార్గాల ద్వారా రైల్‌వన్ యాప్‌లో అన్ రిజర్వ్డ్ టికెట్ల కొనుగోలుపై 3 శాతం తగ్గింపును ప్రవేశపెట్టినట్లు గుంటూరు రైల్వే డివిజన్ పీఆర్ఓ వినయ్‌కాంత్ తెలిపారు. రైల్ వన్ యాప్ ఇటీవల భారతీయ రైల్వే ద్వారా ప్రారంభించబడిందని తెలిపారు. ఇది ప్రయాణికులకు తేలికగా వినియోగించేలా సమగ్రమైన అన్ని కలిసిన అప్లికేషన్ అని తెలిపారు. ఈ యాప్ అన్రిజ్వర్డ్ ప్లాట్‌ఫామ్ టికెట్లు, రిజర్వ్ టికెట్లు, లైవ్ ట్రైన్ ట్రాకింగ్, ఫిర్యాదుల పరిష్కారం, ఇ–క్యాటరింగ్, వంటి అన్ని ప్రయాణికుల సేవలను అనుసంధానిస్తుందని తెలిపారు. ప్రయాణికులు ఇంటి నుంచే తమ టికెట్లను (జర్నీ, ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు రెండు) బుక్ చేసుకోవచ్చని తెలియజేశారు. డిజిటల్ మార్గాల ద్వారా అన్ రిజర్వ్డ్ టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు 3 శాతం తగ్గింపును అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నిబంధనలు 2026 జనవరి 14 నుంచి జులై 14 వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. అయితే ఆర్–వాలెట్ ద్వారా అన్ రిజర్వ్డ్ టిక్కెట్లు కొనుగోలుకు 3 శాతం క్యాష్ బ్యాక్ ఇచ్చే ప్రస్తుత విధానం కొనసాగుతుందని తెలిపారు. మరణానంతరం భూలక్ష్మి నేత్రదానంమాచర్ల రూరల్: తన మరణానంతరం కూడా మరొకరికి వెలుగు ప్రసాదించిన తెడ్ల భూలక్ష్మి త్యాగనిరతిని ప్రజలు కొనియాడుతున్నారు. వివరాలలోకి వెళితే.. దుర్గిలో నివసించే తెడ్ల భూలక్ష్మి (65) గుండెపోటుతో సోమవారం మృతిచెందింది. మరణానికి ముందే ఈమె కుమారుడు తెడ్ల మురళి మాస్టర్ సూచన మేరకు మరణించిన తరువాత నేత్ర దానం చేస్తే చూపులేని వారికి కంటి చూపు అందించే అవకాశం కల్పించిన వారమౌతారని చెప్పిన ఆయన కుమారుడి సలహా మేరకు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా లయన్స్ క్లబ్, నల్గొండ చారిటీ ట్రస్టు వారికి అంగీకార పత్రాన్ని అందించారు. ఆమె మరణ వార్తను ట్రస్టు సభ్యులకు తెలుపగా మంగళవారం వారు వచ్చి వైద్యుల ఆధ్వర్యంలో ఆమె నేత్రాలను సేకరించారు. -
ప్రపంచ నాటక వినీలాకాశంలో గుంటూరు
యడ్లపాడు: మనిషి మదిలోని ఘర్షణ..సమాజంలోని సంక్లిష్టతను..మట్టిలో పుట్టిన మమకారాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించే అద్భుత ప్రక్రియ ‘నాటకం’. అందులో భారత ప్రభుత్వపు ప్రతిష్టాత్మక భారత్‌రంగ్ మహోత్సవం ప్రపంచ నాటక రంగంలోనే ఒక మైలురాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్ఎస్డీ) ప్రతి ఏటా నిర్వహించే ‘భారత్‌రంగ్’ కేవలం ప్రదర్శనల సమాహారం మాత్రమే కాదు, విశ్వవ్యాప్త సంస్కృతుల మహోన్నత సంగమం. అటువంటి నాటక కళా వైభవం, ఖండాంతరాలను దాటి మన గుంటూరు నగర ముంగిట కొలువుదీరబోతోంది. వందల మైళ్ల దూరం నుంచి, శతాబ్దాల చరిత్ర కలిగిన అరుదైన కళా రూపాలు ఇప్పుడు మన ముందుకు రానున్నాయి. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా డైరెక్టర్ చిత్తరంజన్త్రిపాఠి, యడ్లపాడు వేదిక(తెలుగు నాటక కళాపరిషత్తుల సమ్మేళన సంఘం) అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబుల కృషి ఫలితంగా గుంటూరు నగరానికి ఈ అరుదైన గౌరవం దక్కనుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణను ప్రకటించారు. సంయుక్త సంకల్పం ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్ఎస్డీ), యడ్లపాడుకు చెందిన ‘వేదిక’ (తెలుగు నాటక కళాపరిషత్తుల సమ్మేళన సంఘం) సంస్థల సంయుక్త సారథ్యంలో ఐదు రోజులు గుంటూరు నగరం ఒక భావాల ప్రపంచంలా మారుతుంది. ఇందుకోసం గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం, ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు ఒక ప్రపంచ స్థాయి వేదికగా రూపాంతరం చెందనుంది. అభినవ భాష, మూగబోని భావోద్వేగం ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంట నుంచి సాయంత్రం వరకు మన తెలుగు కళాకారుల జానపద, సాంస్కృతిక ప్రదర్శనలతో విజ్ఞాన మందిర ప్రాంగణం పులకించనుంది. సాయంత్రం 7గంట ల వేళ, విదేశీ భాషల స్వరాలు వినిపిస్తున్నా, రంగస్థలంపై పలికే అభినయం ప్రేక్షకుడిని ఆ కథలో లీనం చేస్తుంది. భాష అర్థం కాకపోయినా, నటుడి కళ్లలోని భావం ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతుంది. -
తండ్రీకొడుకుల అరాచకాలు ఎంతోకాలం సాగవు
వెంకటాచలం (పొదలకూరు): అధికారమనే అహంకారంతో తండ్రీ కొడుకులు బరితెగించి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచకాలు సాగిస్తున్నారని, ఇవి ఎంతో కాలం సాగవని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నేతలను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో.. రేపటి రోజున వీరికి అదే గతి పడుతుందని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం 16 నెలల పాలనలో పిన్నెల్లి సోదరులపై 16 అక్రమ కేసులను నమోదు చేయించి జైలు పాలు చేసిందని ధ్వజమెత్తారు. నెల్లూరు కేంద్ర కారాగారం రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను మంగళవారం రోజా , తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలిసి ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల రోజా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకుల ఆధిపత్య పోరులో భాగంగా హత్యలు జరిగితే పిన్నెల్లి సోదరులపై హత్య కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ఎన్నికల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్ చేస్తే అడ్డుకున్న పిన్నెల్లిపై కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారని విమర్శించారు. జైల్లో సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించినా అమలు చేయించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల మన్ననలు పొందిన కుటుంబం : అంబటి మురళీకృష్ణ మాచర్లలో ప్రజల మన్ననలు పొందిన కుటుంబం పిన్నెల్లి కుటుంబమని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. పిన్నెల్లి సుందరామిరెడ్డి, లక్ష్మారెడ్డి, రామకృష్ణారెడ్డి వరుసగా మాచర్లలో పోటీ చేసి గెలుపొందేవారన్నారు. టీడీపీ అక్కడ బలహీనంగా ఉండడంతో ప్రతి ఎన్నికల్లో అభ్యర్థిని మార్చేవరన్నారు. మాచర్లలో ఎలాగైనా పట్టుసాధించాలని పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నట్టు మండిపడ్డారు. ఈవీఎంల మాయాజాలం, పోలీసుల దమనకాండతో మాచర్లలో టీడీపీ విజయం సాధించినట్టు ఆరోపించారు. కోర్టు పిన్నెల్లి సోదరులకు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆదేశించినా 27 రోజులుగా వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. -
తెనాలిలో టీడీపీని అంతం చేసే కుట్ర
తెనాలి టౌన్: మున్సిపల్ అధికారులు పోలీసుల సాయంతో పట్టణ వహాబ్చౌక్లో ఫ్లెక్సీల తొలగింపులో హైడ్రామా నెలకొంది. తొలగించిన ఫ్లెక్సీని టీడీపీ నాయకులు తిరిగి నిలబెట్టటమే కాకుండా మరో ఫ్లెక్సీని తీయకుండా అడ్డుకుని, అధికారులపై మండిపడ్డారు. నల్లబ్యాడ్జిలతో ఫ్లెక్సీ ఎదుట కూర్చొని నిరసన తెలియజేశారు. కూటమి ధర్మం వీడి మంత్రి మనోహర్ తమ పార్టీని టార్గెట్ చేశారంటూ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో టీడీపీని చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చేసేదిలేక అధికారులు, పోలీసులు వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలి వహాబ్చౌక్లోని డివైడర్‌కు రెండు వైపులా టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల తొలగింపునకు మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సిటీప్లానర్ వాణి, తన సిబ్బందితో ఉదయం 11 గంటలకు అక్కడకు చేరుకున్నారు. వహాబ్ చౌక్‌లో డివైడర్‌కు పడమరవైపున్న ఫ్లెక్సీని పొక్లెయిన్‌తో తొలగించారు. డివైడర్‌కు మరోవైపు మున్సిపల్ కౌన్సిలర్, టీడీపీ ఫ్లోర్‌లీడర్ పసుపులేటి త్రిమూర్తి కార్యాలయం ఎదుటగల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నంలో ఉండగా, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ టౌన్ ప్లానింగ్ అధికారులను అడ్డుకున్నారు. నల్లరిబ్బన్లు ధరించి ఫ్లెక్సీ ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. టీడీపీ శ్రేణులకు అధికారుల మధ్య తోపులాట జనం రద్దీగా ఉండే సమయంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులతో వచ్చి ఫ్లెక్సీల తొలగింపుకు పూనుకోవటం ఏమిటని ప్రశించారు. ఎవరి ప్రోద్బలం లేకుండానే అధికార పార్టీ నేత ఆలపాటి రాజా ఫ్లెక్సీని తొలగించేందుకు అధికారులు అత్యుత్సాహం చూపించడం ఏంటని మండిపడ్డారు. తెనాలిలో టీడీపీని చంపేయడమే లక్ష్యంగా మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వ్యవహరిస్తున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ ఆరోపించారు. డివైడర్ కు ఒకవైపు ఇదంతా జరుగుతుండగా మరోవైపు తొలగించిన ఫ్లెక్సీని కొందరు యువకులు తిరిగి ఏర్పాటుకు ప్రయత్నించారు. దీనిని నిరోధించటానికి పోలీసులు పూనుకోవటంతో తోపులాట జరిగింది. అయినప్పటికీ తొలగించిన ఫ్లెక్సీని టీడీపీ నాయకులు తిరిగి ఏర్పాటుచేశారు. రెండోవైపు తొలగించటానికి సాధ్యంకాక పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మౌనంగా ఉండిపోయారు. ఈ సమయంలోనే టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌పై ఆరోపణలను గుప్పించారు. తెనాలిలో టీడీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేయడమే లక్ష్యంగా మంత్రి మనోహర్ వ్యవహరిస్తున్నారని మహమ్మద్ ఖుద్దూస్ ఆరోపించారు. కూటమి పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తెనాలిలో పరిపాలన జరుగుతుందని అన్నారు. ఎన్నికలవేళ జనసేన, టీడీపీ నాయకులను రెండు కళ్లుగా చూస్తానని చెప్పి గెలిచిన తర్వాత టీడీపీ నేతల ముఖం చూడడానికి కూడా మంత్రి మనోహర్ ఇష్టపడడం లేదని వారు దుయ్యబట్టారు. టీడీపీని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క టీడీపీ కౌన్సిలర్ కూడా ఉండకూడదని మంత్రి నిర్దేశించుకున్నాడని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కౌన్సిలర్ త్రిమూర్తి ఆరోపించారు. ఇటువంటి చర్యలు పునరావృతం అయితే సహించేది లేదని టీడీపీ నాయకులు హెచ్చరించారు. -
సామాజిక ఆరోగ్య కేంద్రం పునఃప్రారంభం
కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం పునఃప్రారంభం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబుగతంలో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభం చేసిన మంత్రి మేరుగ నాగార్జున వేమూరు: చంద్రబాబు సర్కార్‌లో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని పునఃప్రారంభించారు. మండల కేంద్రంలోని 30 పడకల ఈ కేంద్రాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మళ్లీ ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయంలో ఈ కేంద్రం నిర్మాణం కోసం నాబార్డు నిధులు రూ. 8.60 కోట్లను మంజూరు చేసింది. 2020 డిసెంబరు 14వ తేదీన 30 పడకల ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 2024 నాటికి భవనాలు పూర్తి అయ్యాయి. అదే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన నూతన భవనాన్ని అప్పటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ప్రారంభించారు. నూతన భవనాల్లో వైద్యులు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత ఈ భవనాలను పునఃప్రారంభించడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కమ్యూనిటీ కేంద్రాన్ని మంగళవారం పునఃప్రారంభించారు. 2025 నవంబరు 13వ తేదిన వేమూరు మండలంలోని చదలవాడ గ్రామంలో రెండు ప్రభుత్వ గృహాలు ప్రారంభించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం నిర్మాణం చేసిన ఇళ్లు పునఃప్రారంభం చేసి చంద్రబాబు సర్కార్‌లో ఇళ్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభం చేశారు. అదే విధగా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం కూడా మళీ జరిగింది. -
గుంటూరు చేరుకున్న ‘జన చైతన్య యాత్ర ’
కొరిటెపాడు(గుంటూరు): ఏపీ – తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (ఏపీఅండ్టీబీఈఎఫ్) ఆధ్వర్యంలో ప్రజా రంగ బ్యాంకుల పరిరక్షణ, సామాన్య ప్రజల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ‘జన చైతన్య యాత్ర – సైకిల్ రైడ్’ విజయవంతంగా కొనసాగుతోంది. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు సుమారు 850 కిలోమీటర్లు, జిల్లా నుంచి జిల్లా, ప్రజల మధ్యకు వెళ్లేలా రామరాజు నిర్వహిస్తున్న సైకిల్ రైడ్ యాత్ర గుంటూరు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు ఏటుకూరు రోడ్డు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం వద్దకు యాత్ర చేరుకుంది. అక్కడ నుంచి గుంటూరులో అన్ని బ్యాంకుల ఉద్యోగులు ప్రధానవీధుల గుండా ర్యాలీ నిర్వహించి జీటీ రోడ్‌లోని యూనియన్ బ్యాంకు రీజినల్ ఆఫీసు వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ నాయకులు రామకృష్ణ, వేణుబాబు, రవిచంద్రారెడ్డి, పృథ్వీ, మురళీ షరీఫ్, పావని క్రాంతి, అఖిల, పి.కిషోర్ కుమార్ తదితర నాయకులు మాట్లాడుతూ ప్రజారంగ బ్యాంకులను బలహీనపరచే విధానాలకు వ్యతిరేకంగా, బ్యాంకింగ్ సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్రకు ప్రజలు, ఉద్యోగుల నుంచి లభిస్తున్న విశేష స్పందన ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తోందని పేర్కొన్నారు. దేశంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బ్వాంకులలో దాచుకొన్న సొమ్ము సుమారు రూ.230 లక్షల కోట్లు సురక్షితంగా ఉండాలంటే బ్యాంకులు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, ప్రజలను చైతన్యపరుస్తూ బ్యాంకులను కాపాడు కోవాలని తెలిపారు. ఈ సైకిల్ యాత్రను కొనసాగిస్తూ రామరాజు చిలకలూరిపేట మీదుగా ఒంగోలు వెళ్లారు. -
లారీ ఢీ కొని వ్యక్తి మృతి
కర్లపాలెం: నడిచి వెళుతున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి లారీ ఢీ కొనటంతో ఆ వ్యక్తి మృతి చెందిన సంఘటన పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. చందోలు ఎస్ఐ ఎంవీ శివకుమార్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు కర్లపాలెం మండలం శ్రీరామ్‌నగర్ గ్రామానికి చెందిన పిట్టు వెంకటశివారెడ్డి(45) అనారోగ్యంతో తమ గ్రామ సమీపంలోని పిట్టలవానిపాలెం మండల పరిధిలో ఉన్న హాస్పటల్‌కు వెళ్ళి వైద్యం చేయించుకుని తిరిగి తమ గ్రామం వెళుతుండగా ఒడిశా నుంచి వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొనటంతో అతనికి తీవ్ర గాయాలయి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలి
తాడేపల్లి రూరల్: క్రీడల ద్వారా యువత శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఐఎఫ్ఎస్ అధికారిణి భరణి వ్యాఖ్యానించారు. మంగళవారం తాడేపల్లి రూరల్, వడ్డేశ్వరంలో మూడు రోజులుగా జరుగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంట్–2026 ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా భరణి ప్రసంగిస్తూ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో కూడా సత్తా చాటాలని కోరారు. రానున్న కాలంలో కేఎల్‌యూ వేదికగా జాతీయ అంతర్జాతీయ క్రీడలు జరుగుతాయని తెలిపారు. కేఎల్‌యూ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి.పార్ధసారధి వర్మ మాట్లాడుతూ కర్నాటకకు చెందిన జైన్ యూనివర్శిటీ ప్రథమ స్థానంలో, కేఎల్‌యూ ద్వితీయ స్థానం, చైన్నె ఎస్ఆర్ఎం యూనివర్శిటీ జట్టు తృతీయ, కేరళ కాలికట్ యూనివర్శిటీ నాల్గవ స్థానంలో నిలిచాయని పేర్కొన్నారు. అనంతరం పరిశ్రమల అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ శివజ్యోతి, ఐఎఫ్ఎస్ అధికారిణి భరణి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా యూనివర్సిటీల పరిశీలకులు మనోజ్‌కుమార్, వర్శిటీ ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, క్రీడల డైరెక్టర్ డాక్టర్ కె.హరికిషోర్, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్, సలహాదారు డాక్టర్ హబీబుల్లా ఖాన్, వ్యాయామ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
చిత్ర కళాప్రదర్శనకు గోల్డ్ మెడల్
చినగంజాం: గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనలో చినగంజానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సూరిబోయిన శ్రీనివాసరెడ్డి గోల్డ్ మెడల్ సాధించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 3,4,5 తేదీల్లో గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలోని నందమూరి తారకరామారావు వేదికపై నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలో సంక్రాంతి పండుగ వేడుకల్లో యువతుల ముగ్గులు అనే చిత్రకళకు ఈ గౌరవం దక్కిందని మంగళవారం ఆయన తెలిపారు. శ్రీనివాసరెడ్డి గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. -
సాయుధ బలగాల సంక్షేమ నిధికి విరాళం
నరసరావుపేట: సాయుధ బలగాల సంక్షేమ నిధికి దాతలు ఇచ్చిన చెక్కులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి గుణశీలకు అందజేశారు. నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీ(ఎన్ఈసీ) చెందిన ఎన్సీసీ క్యాడెట్లు రూ.30వేలు, వాసవీ క్లబ్ సభ్యులు రూ.25వేలు విరాళంగా ఇచ్చారు. దేశ రక్షణలో భాగస్వాములయ్యే సైనికుల సంక్షేమం కోసం ముందుకు వచ్చిన క్యాడెట్లు, వాసవి క్లబ్ సభ్యులను కలెక్టర్ అభినందించారు. నరసరావుపేట రూరల్: యూరియా అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు హెచ్చరించారు. సబ్ డివిజన్ పరిధిలోని ఎరువుల డీలర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జగ్గారావు మాట్లాడుతూ చట్టప్రకారం ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్ అప్టేట్ చేసుకోవాలని తెలిపారు. ఐఎఫ్ఎమ్ఎస్ స్టాక్ గోడౌన్ స్టాక్ సరిపోవాలని పేర్కొన్నారు. ఎరువుల గోడౌన్ల వద్ద స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని, స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. సమావేశంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు, వి.హనుమంతరావు, జిల్లా ఎరువుల డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నాగిరెడ్డి, పట్టణ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏవోలు, సిబ్బంది పాల్గొన్నారు. సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లిలోని శ్రీ రామాలయం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామికి మంగళవారం తులసితో అలంకారం చేశారు. కోదండ రామచంద్ర ప్రభువైన శ్రీరాముడు, సీతాదేవి,లక్ష్మణుడు,ఆంజనేయస్వామిలను విశేష అలంకరణ చేసి కనుల పండువగా పూజలు, గోత్ర నామాలతో అభిషేకాలు చేశారు. మహిళలు పాశురాలను పఠించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గుంటూరు రూరల్: అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్‌అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌లు మంగళవారం పరిశీలించారు. స్థానిక రెడ్డి కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన సరస్ అఖిల భారత డ్వాక్రా బజారును ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్శించి పలు స్టాళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మంగళవారం నుంచి 18వ తేదీ వరకు అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. సరస్‌లో ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 8వ తేదీన ప్రారంభిస్తారని చెప్పారు. -
ఎమ్మెల్యే నసీర్ వ్యాఖ్యలపై ముస్లింల అభ్యంతరం
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): అంజుమన్, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై గుంటూరు నగరంలోని తూర్పు నియోజక వర్గంలోని మజ్లిస్ ఉల్ ఉలెమా ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముస్లిం సంఘాల వారు, మత పెద్దలు, నాయకులు, అంజుమన్ సుదీర్ఘ కాల కమిటీ సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గులాం రసూల్, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుత తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్, జమియతుల ఉలెమా పెద్దలు ముఫ్తి బాసీత్, మాజీ డిప్యూటీ మేయర్ గౌస్, తెలుగుదేశం పార్టీ నాయకుడు షౌకత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ మాట్లాడుతూ ముస్లిం మత పెద్దలు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జన సమీకరణ లేకపోవడం చాలా బాధగా ఉందనన్నారు. ముస్లిం మత పెద్దల కమిటీ సభ్యులు కూడా సమావేశంలో లేకపోవడం, నగరంలో ఉన్న మసీదుల్లో ఉన్న మౌలానాలు, మౌజన్లను పిలిచినా జనం భారీ సంఖ్యలో వచ్చే వారని తెలిపారు. పార్టీ సమావేశాలకు రెండు వందల మంది తగ్గకుండా వస్తున్నారని, ఇప్పుడు పట్టుమని 50 మంది కూడా లేకపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థకు సంబంధించిన చినకాకానిలోని 71.57 ఎకరాల భూమిపై ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్ గురించి ప్రస్తావించలేదు. పైగా ఎమ్మెల్యే అయిన తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ముస్లిం సంఘాలు, పెద్దలు, ఆయా పార్టీల నాయకులు తమవంతుగా కార్యాచరణకు దిగాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నందున ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని చెప్పారు. ఖండించిన మత పెద్దలు ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ సంభాషణ పూర్తి అయిన తరువాత ముస్లిం మత పెద్దలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సంఘం గురించి కించపరిచేలా మాట్లాడటం సబబు కాదని, ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం జన సమీకరణ కాదన్నారు. జన సమీకరణ ఎలా ఉంటుందో తమ సంఘం అనేక మార్లు చూపించడం జరిగిందని ఎమ్మెల్యే నసీర్‌ను నిలదీశారు. కించపరిచేలా మాట్లాడటం తన ఉద్దేశం కాదని, జన సమీకరణ ఉంటే బాగుంటుందని చెప్పడం మాత్రమే తన ఉద్దేశం అని సమర్థించుకునే యత్నం చేశారు. -
ప్రత్యేక ప్రణాళికతో పర్యాటకాభివృద్ధి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రత్యేక ప్రణాళిక ద్వారా జిల్లాలో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హైదరాబాదో నగరంతోపాటు తెలంగాణ ప్రాంతానికి చీరాల, బాపట్ల, నిజాంపట్నం గోల్డెన్ శాండ్ బీచ్‌లు దగ్గరగా ఉన్నాయన్నారు. దీంతో ఈ ప్రాంతానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా బీచ్‌లను వరల్డ్ క్లీన్ బీచ్‌లుగా మారుస్తామన్నారు. సూర్యలంక తీరంలో దాదాపు రూ. వంద కోట్లతో అభివృద్ధి పనులు ఇప్పటికే మొదలు పెట్టామని పేర్కొన్నారు. రూ.25 కోట్లతో 216 జాతీయ రహదారి నుంచి బీచ్‌లు ఉన్న రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, పాండురంగాపురం, అక్కడినుంచి ఈపూరుపాలెం స్ట్రెయిట్కట్ ప్రాంతాలకు రోడ్లు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిజాంపట్నంలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పేరలి డ్రైన్ నుంచి సూర్యలంక వరకూ హౌస్ బోట్లు నడుపుతామన్నారు. జిల్లాలో టూరిజం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయన్నారు. యూరియా సరిపడా అందుబాటులో ఉంచామన్నారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని రేపల్లె, బాపట్ల, వేమూరు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక టాస్క్ఫోర్సుతో చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ మాఫియాపైనా చర్యలు తీసుకుంటామన్నారు. వీటన్నింటినీ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి బాపట్ల పంచాయతీ, మున్సిపల్ విభాగాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లాలో అమలవుతున్న పనులు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగాలని ఆదేశించారు. యాభై శాతం కంటే తక్కువ పనితీరు ఉన్న మండలాలపై అసహనం వ్యక్తం చేశారు. ఉత్తమ సిబ్బందికి అవార్డులు అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలి రెవెన్యూ, హెల్త్, అగ్రికల్చర్, శానిటేషన్ నిర్వహణలో ప్రజా సానుకూలతలో రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లా టాప్ 3లో ఉండేలా సంబంధిత శాఖ అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, డీఎంహెచ్ఓ, మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరగాలి పిట్టలవానిపాలెం(కర్లపాలెం): భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని బాపట్ల జిల్లా కలెక్టర్ చెప్పారు. పిట్టలవానిపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దస్త్రాలను పరిశీలించారు. సీనియర్ సహాయకులు పఠాన్ హుస్సేన్‌ఖాన్, పీవీ పాలెం తహసీల్దార్ వెంకటేశ్వరరావు ఉన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలపై సుమోటోగా విచారిస్తున్నాంబాపట్ల: కుల ధ్రువీకరణ పత్రాలను సుమోటోగా తీసుకుని విచారిస్తున్నామని స్పెషల్ సీఎస్ దృష్టికి జిల్లా కలెక్టర్ తీసుకువెళ్లారు. రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూఆర్డీ స్పెషల్ సీఎస్డీ సాయి ప్రసాద్, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ అంశాలపై మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. కుల ధ్రువీకరణ పత్రాల కొరకు ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా విచారించిన తదుపరి ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బాపట్ల జిల్లాలో 3,94,172 మంది ధ్రువీకరణ పత్రాలను సుమోటోగా విచారించి ప్రభుత్వ వెబ్సైట్లో నిక్షిప్తం చేశామన్నారు.‘సాక్షి’తో జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ బాపట్ల: డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాలునందు డీఆర్డీఏ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులతో బ్యాంకు లింకేజీ, ఉన్నతి, శ్రీనిధి, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా అందించే రుణాలపై, పలు వర్గాలకు ఉపకార వేతనాలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి డ్వాక్రా మహిళకు బ్యాంకు లింకేజీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని సూచించారు. -
ఇసుక అక్రమంగా రవాణా చేస్తే చర్యలు
చీరాల టౌన్ : అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని.. చీరాల రూరల్ మండలం నుంచి చినగంజాం మండలం వరకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు తెలిపారు. మంగళవారం చీరాల ఆర్డీవో కార్యాలయంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాలకు చెందిన రెవెన్యూ, పంచాయితీ రాజ్, పోలీస్ అధికారులతో ఆర్డీవో జాయింట్ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మైనింగ్ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. అక్రమంగా ఇసుకను రవాణా చేయనీయకుండా చీరాల మండలంలోని రూరల్ గ్రామాల నుంచి చినగంజాం మండలంలోని గ్రామాల వరకు చెక్‌పోస్టును ఏర్పాటు చేసి ఇసుక రవాణాను అరికట్టాలన్నారు. అక్రమంగా ఇసుకను రవాణా చేసే వాహనాలను పట్టుకుని జీవోనెంబర్ 100 ప్రకారం భారీ జరిమానాలు విధించడంతో పాటు రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. డివిజన్ పరిధిలో ప్రత్యేక టీంతో పాటు ఆయా మండలాల్లో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టంలో కీలకంగా పనిచేయాలన్నారు. డివిజినల్ అధికారుల బృందంలో ఆర్డీవో, డీడీవో, డీఎస్పీలు వ్యవహరిస్తారని, మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఈవోపీఆర్డీ, ఎస్‌హెచ్‌వోలు వ్యవహరిస్తారని, గ్రామస్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, వీఆర్ఏలు గ్రామ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు. ప్రభుత్వ నిబంధనలు, జిల్లా కలెక్టర్ ఆదేశాలను విధిగా అమలు చేసి అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా అడ్డుకట్ట వేయాలని ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు సూచించారు. చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల తహసీల్లారు కె.గోపికృష్ణ, గీతారాణి, జె.ప్రభాకరరావు, ఎంపీడీఓలు విజయ, రాజేష్‌బాబు, ఈవోఆర్డీలు, ఎస్సైలు, ఆర్ఐలు, మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి
పర్చూరు(చినగంజాం): గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించి పర్చూరు ప్రాంత ప్రజలు, రైతులకు సాగునీరు, తాగునీరు అందించి ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు కొల్లా రాజమోహనరావు, రైతులు డిమాండ్ చేశారు. గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో పర్చూరు బొమ్మల సెంటర్ వద్ద మంగళవారం పర్చూరు ప్రాంత రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం గుంటూరు చానల్ పర్చూరు వరకు పొడిగించాలని, చానల్ పొడిగింపునకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ పర్చూరు తహసీల్దార్ కార్యాలయ వరకు ర్యాలీగా శాంతియుతంగా ధర్నాను కొనసాగించారు. అనంతరం గుంటూరు చానల్ పొడిగింపునకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ సుధారాణికి చదివి వినిపించిన అనంతరం ఆమెకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజమోహనరావు మాట్లాడుతూ కృష్ణానది చాలా దగ్గరలో ఉన్నప్పటికీ బ్రిటిషు ప్రభుత్వం పాలన నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా గుంటూరు చానల్ ద్వారా పర్చూరు ప్రాంతానికి పట్టుబట్టి నీరిచ్చేందుకు చర్యలు తీసుకోలేదు. పర్చూరు ప్రాంతానికి కృష్ణా నది చాలా దగ్గరలో ఉందని ప్రభుత్వం ప్రభుత్వం సాగు నీటి కోసం రూ. 109 కోట్లు మంజూరు చేసిందని వాటిలో గుంటూరు చానల్‌ను పెదనందిపాడు వరకు కొనసాగించేందుకు రూ. 75 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించారని, పర్చూరు ప్రాంతవరకు చానల్‌ను పొడిగించి నీరిచ్చేందుకు మరో రూ. 7 కోట్లు మంజూరు చేసి కేవలం 49 ఎకరాలు భూసేకరణ జరిపితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే గజిట్ నోటిఫికేషన్ ఇచ్చి పర్చూరు ప్రాంతానికి నీరిచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో కోట హరిప్రసాద్, ఎం. జగన్నాథం, తోకల కృష్ణమోహన్, వై. హరిప్రసాద్, గడ్డిపాటి శ్రీనివాసరావు, కోట శ్రీనివాసరావు, లంకాశివ, ఒగ్గిశెట్టి నరసింహం, గోవిందరాజులు , మల్లా శ్రీనివాసరావు , కె. ప్రసాద్ పాల్గొన్నారు. -
బాపట్ల
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026ముగిసిన తెలుగు మహాసభలు7స్వామివారికి విశేషార్చన పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రులోని శ్రీ భూనీళా సమేత శ్రీ వరదరాజస్వామి సోమవారం ప్రాతః కాలంలో విశేషార్చనలో దర్శనమిచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డుకు సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1500, గరిష్ట ధర రూ.3500, మోడల్ ధర రూ.2300 వరకు పలికింది. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 560.00 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,472 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలు సోమవారంతో ముగిశాయి. సభలకు తెలుగు భాషాభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సభల రెండో రోజైన ఆదివారం మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ దంపతులు హాజరయ్యారు. సభల ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గోవా గవర్నర్ పి.అశోక్‌గజపతిరాజు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. మహాసభల సందర్భంగా పోస్టల్ శాఖ రూపొందించిన ప్రత్యేక కవర్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రపంచంలో తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. చిన్న పిల్లలను తెలుగులోనే మాట్లాడించాలని తల్లిదండ్రులకు సూచించారు. 7 -
అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి
బాపట్ల: ప్రజా పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) నిర్వహించారు. కలెక్టర్ ఇతర అధికారులతో కలసి 166 అర్జీలను స్వీకరించారు. శాఖాపరమైన వాటిని పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ క్లినిక్‌లు సమర్థంగా నిర్వహించాలి రెవెన్యూ క్లినిక్‌లు సమర్థంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించామని తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన రెవెన్యూ క్లినిక్ శిబిరాలను కలెక్టర్ పరిశీలించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న అర్జీల ను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్‌లపై ఆర్డీఓలు ప్రతి సోమ వారం ఒక్కొక్క గ్రామానికి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంచిన రెవెన్యూ దస్త్రాలు, వాటి పరిష్కారం ప్రక్రియ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సమస్యలు పూర్తిగా పరిష్కరించడమే ప్రభుత్వ ముఖ్యద్దేశం అన్నారు. ప్రజలు ఈ అవకాశాల ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్వో జి గంగాధర్‌గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు పాల్గొన్నారు. విస్తృతంగా గ్రామసభలు నిర్వహించండి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్–జీ రామ్‌జీ’గా మార్పు చేసిన నేపథ్యంలో గ్రామసభలు విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ‘వికసిత్ భారత్–జీ రామ్‌జీ’ పథకంపై రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పథకం పేరు మార్చిన విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. 125 రోజులు ఉపాధి కల్పించడమే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అన్నారు. పీజీఆర్ఎస్ అర్జీలపై సక్రమంగా ఆడిట్ నిర్వహించాలన్నారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోరాదని సూచించారు. గత నెలలో బాపట్ల జిల్లాలో 1,009 అర్జీలు నమోదయ్యాయన్నారు. ఇప్పటివరకు రెవెన్యూ శాఖలోనే అత్యధికంగా వచ్చాయన్నారు. ఏపీఎస్ఆర్టీసీ, విద్యుత్ శాఖలో డిసెంబర్ నెల మొత్తం మీద ఒకటి కూడా నమోదు కాకపోవడం ఏమిటని అధికారులను నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా ఐజిఓటీలో నైపుణ్య శిక్షణలు పొందాలని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగు దిద్దడానికే రాష్ట్ర ప్రభుత్వం ఐజిఓటి ద్వారా ఆన్లైన్ శిక్షణలు ఇస్తుందన్నారు. ఓటర్ల జాబితా తయారీలో దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి ఆర్వోలు పనిచేయాలని ఆదేశించారు. రెడ్‌క్రాస్ సభ్యత్వ నమో దు పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, వీక్షణ సమావేశం ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులలో మొక్కలు నాట్టాలి ఉపాధి హామీ పనులలో భాగంగా చెరువు కట్టలు, రహదారుల వెంట విరివిగా మొక్కలు నాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఉపాధి హామీ పథకం అభివృద్ధి పనుల అమలు తీరుపై అనుబంధ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో సోమవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. చెరువు కట్టలపై ఖచ్చితంగా కొబ్బరి మొక్కలు నాటాలని సూచించారు. అధిక పోషకాలు, బహుళ ప్రయోజనాలున్న 23,599 మునగ మొక్కలను 95 ఎకరాలలో నాటించడం లక్ష్యంగా నిర్దేశించామన్నారు. కచ్చితంగా లక్ష్యాలు చేరుకోవాలన్నారు. 541.69 ఎకరాలలో ఉద్యాన పంటలు వేయాలని లక్ష్యం కాగా, ప్రస్తుతం 387.49 ఎకరాలలోనే పంటల సాగయ్యాయన్నారు. మిగిలిన 154.2 ఎకరాలలో ఉద్యాన పంటలు సాగు త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక శాఖ జెడీ వేణుగోపాల్, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భవనాలకు భూమిని కేటాయించాలి జిల్లా కేంద్రంతో పాటుగా రెవెన్యూ డివిజన్ల పరిధిలో వివిధ ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణాల కోసం భూమిని త్వరగా కేటాయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్.వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెనన్స్‌లో జాయింట్ కలెక్టర్ భావన, డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్, బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ల అధికారులు, తహసీల్దార్లు, పోలీస్ సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నల్లమడ కాలువ ఆధునికీకరణకు భూమి త్వరగా సేకరించాలన్నారు. భారత తీర ప్రాంత భద్రత కేంద్రానికి భూమి కేటాయింపులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ హిల్ పోరంబోకు భూములను గుర్తించాలని ఆర్డీఓలను ఆదేశించారు. సమావేశంలో వీడియో కాన్ఫరెనన్స్‌లో బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం పలు చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో సోమవారం గ్రామపంచాయతీలలో గ్రామసభల నిర్వహణపై కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని 354 గ్రామపంచాయతీలలో రెండు గ్రామసభలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామపంచాయతీలలో ఇంటి పన్నులు, ఇతర పన్నులు కేవలం స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా వసూలు చేస్తామని తెలిపారు. -
విశేష అలంకరణలో కల్యాణ వేంకటేశ్వరస్వామి
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు ఆలయాల్లో సోమవారం భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లిలోని శ్రీ రామాలయం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామికి విశేష అలంకారం చేశారు. కోదండ రామచంద్ర ప్రభువైన శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామిలను విశేష అలంకరణ చేసి పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు చేశారు. మహిళలు పాశురాలను పఠించారు. పట్టణంలోని రైల్వేస్టేషన్‌రోడ్‌లో ఉన్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారికి గంధంతో అలంకారం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కోలాట ప్రదర్శన చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆయా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. వైభవంగా శ్రీరామయోగయ్య స్వామి తిరునాళ్ల వేడుకలు నూజెండ్ల: నూజెండ్ల గ్రామంలో వేంచేసి యున్న శ్రీరామయోగయ్య స్వామి తిరునాళ్ల వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని వేకువజాము నుంచి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకించి విశేష పూజలు చేశారు. గ్రామంలోని నలుదిక్కులు ఏర్పాటు చేసిన పాదులకు మేళతాళాల నడుమ వైభవంగా 108 బిందెలతో గ్రామస్తులు జలాభిషేకం చేశారు. మహిళలు పొంగళ్లు పొంగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని వీధుల్లో మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు. మూడు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. కోర్టు ఆవరణలో సోషల్ సెక్యూరిటీ ఆడిట్ నరసరావుపేట టౌన్: నరసరావుపేట కోర్టు ఆవరణలో పల్నాడు జిల్లా ఏఆర్ ఏఎస్పీ సత్తిరాజు ఆధ్వర్యంలో సోమవారం సోషల్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు ఆవరణలో భద్రతాపరమైన అంశాలను పరిశీలించి న్యాయస్థానం ఏవోకు పలు సూచనలు చేశారు . ప్రహరీ గోడపైన ఇనుప కంచె నిర్మించాలని సూచించారు. కోర్టు ఆవరణలోకి వచ్చే కక్షిదారులను తనిఖీ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. కోర్టు విధులు నిర్వహించే సమయంలో సాయుధ భద్రతనుఆవరణలో ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. జనరేటర్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు ఆవరణలో రాత్రి సమయంలో విద్యుత్ కాంతి ఉండేలా లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. సత్తెనపల్లిలో 100 అడుగుల జాతీయజెండా ఆవిష్కరణ సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి తాలూకా సెంటర్లో రూ.18.40 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను రాష్ట్ర విద్యుత్ శాఖ, పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చల్లం చర్ల లక్ష్మీతులసీ, కమిషనర్ నంబూరి ఆనంద్‌కుమార్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాల విభజనలో సాంకేతికత లేదు
బాపట్ల: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో సాంకేతికత లేదని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కోన రఘుపతి మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విభన చేపడితే కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే పునర్విభజన చేసిందన్నారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయటం వలన నీతిఆయోగ్ నుంచి నిధుల విడుదల, వాటి సఫలీకృతం చేసేందుకు వీలు ఉంటుందనే మంచి ఆలోచనతో విభజన చేశారని గుర్తు చేశారు. మా మార్క్ కనిపించాలనే విధంగా కూటమి ప్రభుత్వం అశాసీ్త్రయంగా విభజన చేసిందన్నారు. రాయచోటి జిల్లాను మార్పుచేసి మదనపల్లికి ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందో అర్ధంకావటంలేదన్నారు. బాపట్లకు ప్రాధాన్యం తగ్గే విధంగా పునర్విభజన బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గాన్ని తొలగించటం బాధాకరమన్నారు. 1982 సంవత్సరం నుంచి బాపట్ల జిల్లాను సాధించాలని తన తండ్రి కోన ప్రభాకర్ నుంచి తన వరకు ఏ సందర్భం వచ్చినా జిల్లా ప్రస్తావనతో ముందుకు నడిశామన్నారు. నీతి ఆయోగ్ ప్రాధాన్యతను చూసినప్పుడు సంతనూతలపాడు నియోజకవర్గం బాపట్ల జిల్లాలోకి రాలేదని కొద్దిపాటి ఆలోచన చేసినప్పటికి ఒంగోలుకు చుట్టుపక్కల ఉండటంతో అలా చేయాల్సి వచ్చిందని భావించామన్నారు. తాను మొదటి నుంచి పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలను బాపట్ల జిల్లాలో చేర్చాలని కోరుతూనే ఉన్నానని కోన చెప్పారు. అద్దంకి తొలగిపోవటంతో ఆర్థికంగా బాపట్ల జిల్లా వెనుకబడిపోతుందని కోన అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా బాపట్ల జిల్లా ముందు ఉండాలంటే పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలను జిల్లాలో కలపాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందిస్తామని కోన చెప్పారు. జిల్లాల పునర్విభజన సందర్భంగానైన ఆ రెండు నియోజకవర్గాలను బాపట్ల జిల్లాలో కలపాలని బలంగా తమ వాణి వినిపిస్తామని చెప్పారు. సమావేశంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరు లీలాశ్రీనివాసరెడ్డి, నాయకులు గవిని కృష్ణమూర్తి, మోర్ల సముద్రాలగౌడ్, లక్ష్మీరాఘవ, అహ్మద్ హుస్సేన్, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, ఇనగలూరి మాల్యాద్రి, తన్నీరు అంకమ్మరావు తదితరులు ఉన్నారు. -
అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవు
– ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్ల టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నుంచి 65 మంది ఆర్జీదారులు వచ్చి తమ సమస్యలను వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలకు సంబంధించిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు ఎస్పీకి వివరించారు. -
టెన్త్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలి
డీఈఓ డి.శ్రీనివాసరావు చీరాల: పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం చీరాల మండలం వాడరేవులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల ఆవరణలో ఉన్న ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను ఆయన పరిశీలించారు. మొత్తం వెయ్యి మంది విద్యార్థులున్నట్లు గమనించారు. అయితే విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా మరుగుదొడ్లు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు అవసరమైన మరుగుదొడ్లు, వంటశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పదవ తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న వంద రోజుల ప్రత్యేక కార్యక్రమంపై ఆరా తీశారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కౌతవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ మొత్తం 73 మంది పదవ తరగతి విద్యార్థులలో ఒక విద్యార్థిని గత రెండు నెలలుగా పాఠశాలకు హాజరు కావడం లేదని, ఆంగ్ల ఉపాధ్యాయుడు పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లి పాఠశాలకు రావాలని ప్రోత్సహించినట్లు తెలిపారు. స్పందించిన డీఈఓ విద్యార్థిని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థినిని పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వగా పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చింది. పదవ తరగతి పరీక్షలు దగ్గరపడుతుండగా విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని సూచించారు. -
జాతీయస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
కొల్లూరు: జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్ బాల్ పోటీలకు శ్రీరామ సైనిక్ స్కూల్ విద్యార్థులు 12 మంది ఎంపికై నట్లు శ్రీరామ రూరల్ విద్యా సంస్థల డైరెక్టర్ కొలసాని తులసి విష్ణుప్రసాద్ సోమవారం తెలిపారు. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్లో నిర్వహించనున్న 2వ జాతీయ బాలుర, బాలికల స్పీడ్ హ్యాండ్ బాల్ పోటీలలో తమ పాఠశాల నుంచి ఎంపికై న క్రీడాకారులు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యా సంస్థల ఆవరణలో నిర్వహించిన క్రీడాకారల ఎంపిక ప్రక్రియలో విద్యార్థులు, కె.హేమంత్, యు.జస్వంత్, ఎం.యోగ రాజశేఖరరెడ్డి, ఎస్.శివగోపి, పి.సుమంత్, యు.జిష్ణునాథ్, ఆర్.సుదర్శన్, ఇ.ఆదిశేషు, ఎం.ఈశ్వర్ మణికంఠ, ఎస్.హేమంత్, జి.ప్రభు, ఎ.జస్వంత్‌లు ఎంపికై నట్లు తెలిపారు. రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులను స్పీడ్ హ్యాండ్ బాల్ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి వణకూరి గోపికృష్ణ, శ్రీరామ సైనిక్ స్కూల్ డైరెక్టర్ కె.శ్రీకాంత్, విద్యా సంస్థల అధ్యక్షుడు తులసి విష్ణుప్రసాద్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. -
11న ఏపీ టీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ ఉద్యమ సారథి నూతలపాటి పరమేశ్వరరావు 4వ వర్ధంతి సందర్భంగా ఈనెల 11న ఏపీ టీఎఫ్ ఆధ్వర్యంలో ఏసీ కళాశాలలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్యాసదస్సులో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవలింగారావు, మహమ్మద్ ఖాలీద్‌లు పిలుపునిచ్చారు. కన్నావారితోటలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సోమవారం విద్యాసదస్సు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.బసవలింగారావు మాట్లాడుతూ గత 80 ఏళ్లుగా ఆంధ్రనాట విద్యారంగ ప్రగతికి, ఉపాధ్యాయ సంక్షేమానికి ఏపీటీఎఫ్ కృషి చేస్తోందని అన్నారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న ఏపీటీఎఫ్ సంఘంలో పరమేశ్వరరావు కీలక పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు, జి.దాస్, జిల్లా కార్యదర్శులు పి.లక్ష్మీనారాయణ, పి.శివరామకృష్ణ, ఎస్.సత్యనారాయణ మూర్తి, కేసన రమేష్, ఆర్.బలరాజు, సిద్దిక్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి ముఠా అరెస్టు
పిడుగురాళ్ల: గంజాయి ముఠాను అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ బీఎల్ఎన్ జగదీష్ తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గురజాల డీఎస్పీ బీఎల్ఎన్ జగదీష్ మాట్లాడుతూ పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి కార్యకలాపాలలో పాల్గొంటున్న ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 కేజీల 400 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని పట్టణ సీఐ ఎస్ వెంకట్రావు, ఎస్ఐ డి.శివనాగరాజుల బృందం చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు. వారిలో పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వెన్ను తిరుమలరావు, సాదుపాటి రాజేష్, నున్సావత్ శివకుమార్, సాదుపాటి గోపి, కొండమోడుకు చెందిన షేక్ బాబావలి, పిడుగురాళ్ల ఎస్టీ కాలనీకి చెందిన తాడిమళ్ల దివ్యబాల, డేగల శిరిష వీరికి అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ శివారు కళ్లం టౌన్షిప్ పరిధిలో 60 అడుగుల రోడ్డు చివర పడమర వైపు కొంత మంది గంజాయి కలిగి ఉన్నారనే సమాచారంతో సీఐ వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజులు ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్మకాలు వినియోగిస్తున్న స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వీరితోపాటు దాచేపల్లి పట్టణానికి చెందిన సాకేటి తిరుపతినారం నాయుడు, పిడుగురాళ్ల ఎస్టీ కాలనీకి చెందిన మామిడిశెట్టి మణికంఠలు పరారీలో ఉన్నారు. వీరు విశాఖపట్నం, ఒడిస్సాలో ప్రాంతాల నుంచి కిలో గంజాయిని కిలో రూ. 5000 వేలకు కొనుగోలు చేసి దానిని అరెస్టు అయిన ఏడుగురికి కిలో రూ.10 వేల చొప్పున అమ్మేవారు. ఈ ఏడుగురు పది గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్ కవర్లలో పెట్టి పది గ్రాముల గంజాయి ప్యాకెట్ రూ.300లకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే వీరిపై గంజాయి కేసులు వంటి పలు కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, యువత భవిష్యత్‌కు, సమాజానికి తీవ్ర ప్రమాదమని డీఎస్పీ జగదీష్ హెచ్చరించారు. నిషేధిత మాదకద్రవ్యాల కొనుగోలు, విక్రయం, రవాణా కలిగి ఉండటం చట్టపరంగా తీవ్రమైన నేరమని, ఇటువంటి వాటికి పాల్పడితే కఠిన శిక్ష తప్పదని తెలిపారు. ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తక్షణమే 112కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ పేర్కొన్నారు. అనంతరం గంజాయిని పట్టుకున్న సీఐ, ఎస్ఐను అభినందించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ఎస్.వెంకట్రావు, ఎస్ఐలు బి.శివనాగరాజు, ఎం.మోహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రొటోకాల్‌కు అధికారుల మంగళం!
మేడికొండూరు: అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం ఇవ్వడం లేదు. కేవలం టీడీపీ నేతల అండతోనే వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ప్రకారం గౌరవించకుండా అవమానాలకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడికొండూరు మండల పరిధిలోని డోకిపర్రు సచివాలయం వద్ద మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వైఎస్సార్ సీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు కందుల సిద్ధయ్యకు అధికారులు ఆహ్వానం పలికారు. స్థానిక పంచాయతీ అధికారి ఆహ్వానం మేరకు గ్రామసభకు వచ్చిన జడ్పీటీసీ సిద్ధయ్యకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామ సభ వేదికపై టీడీపీ చోటా నాయకులు కొలువుదీరారు. జడ్పీటీసీ సిద్ధయ్య వేదిక వద్దకు వచ్చినా.. వేదికపైకి ఆహ్వానించలేదు. తనకు ప్రొటోకాల్ పాటించకపోవడంపై సిద్ధయ్య ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్థానిక పంచాయతీ అధికారి షేక్ జిలానీ స్టేజిపైకి పిలిచి, చివరన కూర్చోబెట్టారు. అధికారులు టీడీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం ఇవ్వకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏకాగ్రతతో వాహనాలు నడిపితే ప్రమాదాలు నివారించవచ్చు
చీరాల: డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని జిల్లా రవాణా శాఖాధికారి టి.కె.పరంధామరెడ్డి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా సోమవారం చీరాలలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో లారీ, టాక్సీ డ్రైవర్లుకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమేనని, రోడ్డు కండీషన్, ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని పరిమిత స్పీడ్‌తో వాహనాలను నడపాలని అన్నారు. ప్రమాదాల నివారణకు డ్రైవింగ్‌లో ఏకాగ్రత అవసరమన్నారు. రహదారులపై వాహనాలను నిలుపవద్దని డ్రైవర్లను ఆయన కోరారు. చీరాల డిఎస్పీ ఎండి మొయిన్ మాట్లాడుతూ డ్రైవర్లు ప్రమాదాలలో మరణిస్తే ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ విషయం దృష్టిలో ఉంచుకొని వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు. నిద్రమత్తు కూడా ప్రమాదాలకు కారణమవుతుందన్నారు. డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ డ్రైవర్లందరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే డ్రైవర్లు సురక్షితమైన డ్రైవింగ్ చేయగలుగుతారన్నారు. డ్రైవర్లుకు బీపీ, షుగర్, కంటి పరీక్షలతో పాటు ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చీరాల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి.రామకృష్ణారెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె.రవినాయక్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి.మురళీమోహన్, సెక్రటరీ వి.చంద్రబాబు, చీరాల టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.మోజెస్, డ్రైవర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో.. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా సోమవారం చీరాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో డ్రైవర్లుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి చీరాల ట్రాఫిక్ ఎస్సై కె.పవన్‌కుమార్ హాజరయ్యారు. డ్రైవర్లు బస్సు నడిపే సమయంలో ఎంతో ఏకాగ్రతతో ఉండాలన్నారు. ప్రమాదం ఎటునుంచి వస్తుందో చెప్పలేమన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం వాటిల్లుతుందన్నారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ జంజనం శ్యామల పాల్గొన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె.పరంధామరెడ్డి -
26న రాజ్యాంగ పరిరక్షణ సభ
పొన్నూరు: ఈ నెల 26వ తేదీన పొన్నూరు పట్టణంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సభ నిర్వహించనున్నట్లు మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకటరావు తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో సభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పొన్నూరు, నిడుబ్రోలులో సామాజిక సంఘర్షణలు తలెత్తకుండా సామరస్యం కోసం కృషి చేసిన వారికి స్వర్ణపురి సంఘమిత్ర పురస్కారం ప్రదానం చేయనున్నట్లు జైభీం సమూహం కార్యనిర్వాహక వర్గం తెలిపారు. మాల మహానాడు, మాల మహాసభ, ఇతర ప్రజా సంఘాలు సంయుక్తంగా 26న సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్న సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎద్దు రత్నరాజు, రెమెళ్ల వెంకట్రావు, యడ్ల వందనం, జంగా రాజేష్, చల్లపల్లి ఆనంద్, కంచర్ల సుధాకర్, గుమ్మడి రోశయ్య, గిరిబాబు, శ్యామ్ ప్రసాద్, దూళ్ల జంగం తదితరులు పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్, బెంచ్‌ప్రెస్ పోటీలకు రాష్ట్ర జట్టు ఎంపిక
సత్తెనపల్లి: హరియాణాలో ఈ నెల 7వ తేదీ నుంచి 11 వరకు జరిగే జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ – బెంచ్ ప్రెస్ పోటీల రాష్ట్ర జట్టును పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పవర్ హౌస్ ఫిట్నెస్ నందు సోమవారం ఎంపిక చేశారు. ఇక్కడ ఎంపికై న జట్టు జాతీయ స్థాయిలో జరిగే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ అండ్ ఉమెన్ ఏక్విప్పెడ్ అండ్ అన్ ఏక్విప్పెడ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు పల్నాడు జిల్లా సెక్రెటరీ పసుపులేటి సురేష్ తెలిపారు. సబ్ జూనియర్ విభాగం నుంచి 53 కేజీల్లో కత్తి కార్తీక్(గురజాల), 74 కేజీల్లో షేక్ మొహిద్దిన్ (సత్తెనపల్లి), జూనియర్ విభాగం నుంచి 83 కేజీల్లో పసుపులేటి వంశీ కృష్ణా (సత్తెనపల్లి), 120 కేజీల్లో లింగిశెట్టి శివ నాగేశ్వరరావు(సత్తెనపల్లి) ఎంపికయ్యారన్నారు. క్రీడాకారులను ఉద్దేశించి బాధ్యులు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పథకాలను సాధించి పల్నాడు జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ జిమ్ము రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివరావు, శాంతయ్య, తదితరులు ఉన్నారు. -
అమెరికాలో వాలీబాల్ పోటీలకు ఎంపిక
మంగళగిరి టౌన్ : అమెరికాలో ఎంసీఏఏ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగే ఆ దేశ వాలీబాల్ పోటీల్లో పాల్గొనే టీమ్‌కు మంగళగిరి క్రీడాకారుడు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా క్రీడాకారుడు ఈశ్వర్‌ను స్థ్ధానిక వివిధ పార్టీల నాయకులు సోమవారం శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనవరి నుంచి మే వరకు అమెరికాలో జరిగే ఆ దేశ వాలీబాల్ పోటీల్లో మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన పొండుగల ఈశ్వర్ ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈశ్వర్ అమెరికాలో పుట్టి పెరిగి అక్కడే విద్యను అభ్యసిస్తూ, ఆ దేశంలో జరిగే వాలీబాల్ పోటీలకు పెప్పర్ డైన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంపికయ్యాడని తెలిపారు. ఫిబ్రవరి 12న జరిగే పోటీలలో ఈశ్వర్ టీమ్ తలపడనుందని, గ్రామానికే కాక రాష్ట్రానికి దేశానికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో ఈశ్వర్ క్రీడల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అభినందించిన వారిలో స్థానికులు వెంకటేశ్వరరావు, శివరామయ్య, నంద కిషోర్, బ్రహ్మం, అన్నె చంద్రశేఖర్ ఉన్నారు. -
సెమీ ఫైనల్స్‌కు కేఎల్‌యూ జట్టు
తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరంలో జరుగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్–2026 పోటీలు సోమవారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరి డాక్టర్ కె.హరికిషోర్ మాట్లాడుతూ.. ఎనిమిది జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయని తెలిపారు. సెమీ ఫైనల్స్ క్రీడలు రాత్రి కూడా జరగనున్నాయని.. సోమవారం సాయంత్రం 5వ రౌండ్ పూర్తయ్యే సమయానికి కేఎల్‌యూ జట్టు చైన్నెకు చెందిన భారతీయార్ యూనివర్సిటీ జట్టుపై విజయం సాధించి సెమీ ఫైనల్స్‌లో తలపడనుందని తెలిపారు. జేఎన్టీయూ కాకినాడ జట్టుపై కేరళకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ విజయం సాధించిందని పేర్కొన్నారు. వీటితో పాటు మరో ఆరు జట్లు సెమీ ఫైనల్స్‌లో తలపడుతున్నాయని.. సెమీ ఫైనల్స్ ముగిసిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్ జరుగనున్నట్లు వివరించారు. -
రోగాలూ ఎంతో ఫాస్ట్
● నాణ్యతలేని ఫాస్ట్ఫుడ్తో అనారోగ్యం ● చిన్న వయస్సులోనే గ్యాస్ట్రబుల్ సమస్యలు ● జంక్ ఫుడ్‌తో పెరుగుతున్న వ్యాధులు ● కనీసం పట్టించుకోని అధికారులు జిల్లాలో వెయ్యికిపైగా షాపులు... వ్యాధులకు కారణాలు నేడు ఎంతో మంది బయటి ఆహారం ఎక్కువగా తింటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులు సైతం ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడి రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. సకాలంలో వ్యాధులను గుర్తించి చికిత్స అందించని పక్షంలో తీవ్రంగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కన్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన శ్రీవల్లి
యడ్లపాడు: పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని చిన్న గ్రామమైన గంగిరెడ్డిపాలెంలో రైతు దంపతులు పెమ్మా రామారావు, పద్మల కుమార్తె శ్రీవల్లి. ఆమె సోదరుడు బీటెక్ చదువుతున్నాడు. మద్దిరాల పీఎంశ్రీ నవోదయ విద్యాలయంలో శ్రీవల్లి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. జేఎన్వీలో సీనియర్ల పతకాలు చూసి తనకు ఇష్టమైన కబడ్డీని ఎంచుకుంది. మొదట్లో ఎంతో భయపడింది. ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు, పీఈటీలు గుడిబెండ గోవిందమ్మ, ఆర్.పాండు రంగారావుల ప్రోత్సాహంతో నిత్యం సాధన చేసింది. ఆట మీద ఏకాగ్రత పెంచింది. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకుంది. క్లస్టర్, రీజినల్, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటింది. పెరిగిన స్థాయి శ్రీవల్లీ ఏకంగా నవోదయ విద్యాసమితి హైదరాబాద్ రీజియన్ (ఐదు రాష్ట్రాల) ప్రతినిధిగా ఎంపిక కావడం విశేషం. ఇప్పుడు ఆమె పోరాటం కేవలం జేఎన్‌వీలకే పరిమితం కాదు. సీబీఎస్ఈ, వెల్ఫేర్, కేంద్రియ విద్యాలయాల జట్లతో ఆమె తలపడనుంది. జనవరి 18 నుంచి 23వ తేదీ వరకు ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యాన హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే అండర్ –19 జాతీయ పోటీలకు జేఎన్వీ జాతీయ జట్టులో స్థానం పొందింది. ఇందుకోసం హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలాన్ జేఎన్వీలో వీరి జట్టు శిక్షణకు సిద్ధమైంది. మొత్తం పదిరోజుల పాటు వారు శిక్షణ పొందనున్నారు. ఎప్పటికైనా ఏషియన్ గేమ్స్‌లో పాల్గొని, విజయం సాధించి దేశం గర్వించేలా త్రివర్ణ పతాకాన్ని చేతబట్టాలన్నదే శ్రీవల్లి కల. కబడ్డీ నేషనల్ (జేఎన్వీ) బెస్ట్ రైడర్‌గా ఎంపిక మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యార్థిని ప్రతిభ త్వరలో జాతీయస్థాయి పోటీలకు హాజరు ఆమె ‘కూత’ పెడితే ప్రత్యర్థి జట్లు గడగడలాడాల్సిందే. సామాన్య రైతు బిడ్డ అయినా జాతీయ స్థాయి కబడ్డీలో మెరుస్తోంది. ప్రతిభకు తోడు పట్టుదల ఉంటే పల్లె సరిహద్దులు దాటడం కష్టమేమీ కాదని నిరూపిస్తోంది మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యార్థిని పెమ్మా శ్రీవల్లి. ఉత్తమ ‘రైడర్’గా గుర్తింపు పొందింది. కబడ్డీ నాలో ఆత్మవిశ్వాసం పెంచింది. లక్ష్యం ఏషియన్ గేమ్స్, ఖేలో ఇండియాలో పాల్గొనడమే. బాలికలు క్రీడల్లో రాణించడం కష్టమనే అభిప్రాయం సాధారణంగా ఉంది. దాన్ని తుడిచేయాలి. అవకాశాల్ని వదలొద్దు. క్రీడల వలన పోరాటతత్వం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగం కూడా పొందొచ్చు. ఇష్టమైన రంగంలో కష్టపడాలి. ఏకాగ్రత, పట్టుదల ఉంటే మైదానంలోనే కాదు, జీవితంలోనూ విజయం సాధించవచ్చు. -
బాపట్ల
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026● వాటి మేళవింపుతోనే లోక కల్యాణం ● ఉత్తరాఖండ్ ఆది శంకరాచార్య పీఠం ఉత్తరాధికారి ● మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో అనుగ్రహ భాషణం గుంటూరు ఎడ్యుకేషన్: భాష, సంస్కృతుల మేళవింపుతో లోక కల్యాణానికి కృషి చేయాలని ఉత్తరాఖండ్‌లోని జగద్గురు ఆది శంకరాచార్య పీఠం ఉత్తరాధికారి స్వామి ప్రత్యక్ చైతన్య ముకుందానందగిరి శంకరాచార్య మహరాజ్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు శివారులోని శ్రీసత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సభలో ఆయన దివ్య అతిథిగా పాల్గొన్నారు. జగద్గురు ఆది శంకరాచార్య ధర్మ పరిరక్షణ కోసం దేశమంతా పర్యటించారని అన్నారు. సంస్కృతి, సంప్రదాయం, భాష ఎక్కడైతే మనుగడ సాగిస్తాయో అక్కడ జీవన విధానం వెల్లివిరుస్తుందన్నారు. వసుదైక కుటుంబ భావనతో ప్రజలు కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. అప్పుడే లోక కల్యాణం సాధ్యపడుతుందన్నారు. దేశంలో ఎక్కడ పుట్టినా అంతా ఏకమనే భావన రావాలని చెప్పారు. కేరళలోని కాలడిగిలో జన్మించిన జగద్గురు ఆది శంకరాచార్య దేశం మొత్తం ఒక్కటనే భావన తెచ్చేందుకు నాలుగు దిశల్లో నాలుగు పీఠాలను స్థాపించారని అన్నారు. ధర్మ సంరక్షణ కోసం నడుం బిగించి, ముందుకు వెళ్లేవారికి దైవం అండగా ఉంటుందని చెప్పారు. భాషను రక్షించుకోవడం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలన్నారు. దేశం ఆధ్యాత్మికంగా విశ్వగురువుగా నిలిచిందని, గోవులను రక్షించుకోవడం మన జీవన విధానంలోనే ఉందన్నారు. తల్లిని దైవంగా భావించుకునే గొప్ప సంస్కృతి, ఋషుల ద్వారా వారసత్వంగా వచ్చిన సంప్రదాయం, గొప్ప పుణ్యనదులు దేశానికి తరగని సంపద అని అన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మారిషస్‌లో తెలుగు ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలను చాటుతున్నారని చెప్పారు. ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో బోధన కోసం పోరాటం చేస్తుండగా, మారిషస్‌లో కేజీ నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమంలో బోధన ఉందని చెప్పారు. మాతృభాష పరిరక్షణపై ప్రజలతోపాటు ప్రభుత్వాల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరమ్ బీర్ గోకుల్‌కు భారత మిత్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.7– శ్రీలక్ష్మి, సివిల్ సప్లైస్ డీఎం, బాపట్ల శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఆంగ్ల నూతన ఏడాది వేడుకలను జరుపుకొన్నంత ఆనందంగా ఉగాదిని జరుపుకోవడం లేదని అన్నారు. గ్రామాల్లో ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలను ఘనంగా నిర్వహించడంపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగులో విద్యాబోధన చేయించాలని సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్, ముఖ్య సమన్వయకర్త పి.రామచంద్రరాజు, తెనాలికి చెందిన శిల్పి రామలింగేశ్వరరావు, మెట్రో ఇండియా చైర్మన్ సీఎల్ రాజమ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రముఖులు, భాషావేత్తలు, అభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 3,900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 40.3045 టీఎంసీలు. నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయ అన్న ప్రసాద వితరణకు ఒంగోలుకు చెందిన ప్రసాద్, లక్ష్మి, శివకృష్ణలు ఆదివారం రూ.లక్ష విరాళమిచ్చారు.విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 560.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కి 18,678 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
నేడు మంగళగిరికి మారిషస్ అధ్యక్షుడు
మంగళగిరి టౌన్: మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ సోమవారం మంగళగిరి రానున్నారు. ఆయన ఉదయం లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన ఎగువ, దిగువ సన్నిధిలోని స్వామివార్లను దర్శించుకోనున్నట్లు ఆ లయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకు ధరమ్ బీర్ గోకుల్ ఆలయానికి రానున్నారని, సంబంధిత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం అమృత వర్షిణి అలంకారంలో పూజలందుకున్నారు. అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 2,304 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యాంక్ కెనాల్‌కు 106 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 306, పశ్చిమ కాలువకు 126, నిజాంపట్నం కాలువకు 168, కొమ్మూరు కాలువకు 1,271 క్యూసెక్కులు విడుదల చేసినట్లు తెలిపారు. -
ఆ రోడ్డు.. రెండు జిల్లాలది..!
బల్లికురవ: సిమెంట్ రోడ్డు రెండు జిల్లాలకు హద్దుగా మారింది. ఈ రోడ్డు ఉత్తరం వైపు ప్రకాశం జిల్లా.. దక్షిణం వైపు బాపట్ల జిల్లాలోకి చేరడంతో అయోమయం నెలకొంది. బల్లికురవ నుంచి నక్క బొక్కలపాడు– కొణిదన– రాజుపాలెం మీదుగా ఎన్‌హెచ్ 16ను కలిపే లింకు రోడ్డు ఉంది. బల్లికురవ మండలంలోని కె.రాజుపాలెం రోడ్డు ఉత్తర భాగంలో.. మార్టూరు మండలంలో ఉన్న రాజుపాలెం దక్షిణ భాగంలోకి చేరింది. కె.రాజుపాలెంలో 920 మంది ఓటర్లు, రాజుపాలెంలో 2,400 మంది ఓటర్లున్నారు. మొన్నటి వరకు రెండు మండలాలు బాపట్ల జిల్లా పరిధిలోనే ఉన్నాయి. అంటే మార్టూరు మండలంలోని రాజుపాలెం పర్చూరు నియోజకవర్గంలో.. బల్లికురవ మండలంలోని కె.రాజుపాలెం అద్దంకి నియోజకవర్గంలో చేరి ఉన్నాయి. ఇటీవల జిల్లాల పెంపు సర్దుబాటులో భాగంగా బల్లికురవ మండలంలోని కె.రాజుపాలెం ప్రకాశం జిల్లాలోకి.. రెవెన్యూ డివిజన్ అద్దంకిలో చేరింది. మార్టూరు మండలంలోని రాజుపాలెం బాపట్ల జిల్లాలోకి.. రెవెన్యూ డివిజన్ చీరాల్లోకి వెళ్లింది. అయితే కె.రాజుపాలెం వాసులకు పొలాలన్నీ మార్టూరు మండల పరిధిలోకి చేరడంతో.. రెవెన్యూ పనులకు చీరాల వెళ్లక తప్పదని రైతులు చెబుతున్నారు. అధికారులు తికమక పడుతున్నారు. కాగా కె.రాజుపాలెంలో టీ దుకాణాలు కూడా లేకపోవడంతో రోడ్డు దాటి పక్క జిల్లా అయిన బాపట్లకు వెళ్లాల్సి రావడం కొసమెరుపు. -
ప్రపంచ తెలుగు మహాసభల్లో పేరిరెడ్డికి సన్మానం
ఇంకొల్లు(చినగంజాం): గుంటూరులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇంకొల్లు మండలం ఇడుపులపాడు విద్యాపరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం పిడవర్తి పేరిరెడ్డికి ఆదివారం సన్మానం చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆదివారం నిర్వహించిన కవితా శీర్షికలో బాపట్ల జిల్లా శాఖ సంచాలకులు పిడవర్తి పేరిరెడ్డి కవిత్వాన్ని ప్రదర్శించారు. ఇందుకు కార్యనిర్వాహకవర్గం అతనిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకుడు కొత్తగూడెం రాజేష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు ప్రాభవాన్ని వివరించిన శ్రీరామచంద్రమూర్తిరెడ్డి 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో చినగంజాం మండలం కొత్తపాలెం పంచాయతీ మూలగాని వారిపాలెం గ్రామానికి చెందిన సాహితీవేత్త, కవి కుక్కల శ్రీరామచంద్రమూర్తి రెడ్డి తెలుగు భాష గొప్పదనాన్ని గురించి సభలో వివరించారు. ఆయనను కార్యనిర్వాహకులు అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు. -
విశ్వజననీ పరిషత్‌కు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం
బాపట్లటౌన్: ఆంధ్ర సరస్వత్ పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో జిల్లెల్లమూడి అమ్మవారికి చెందిన విశ్వజననీ పరిషత్ ట్రస్ట్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్ర శ్రీ పూర్ణకుంభ పురస్కారం దక్కింది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ పూర్వ అధ్యక్షులు బొప్పూడి రామబ్రహ్మం, మేనేజింగ్ ట్రస్టీ వల్లూరి ప్రేమ్ రాజు పురస్కారాన్ని అందుకున్నారు. రేపల్లె: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన పెనుమూడి చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. సీఐ వి.మల్లికార్జునరావు తెలిపిన వివరాల మేరకు.. పెనుమూడి చెక్‌పోస్ట్ వద్ద తమ సిబ్బందితో తనికీలు నిర్వహిస్తున్నారు. వేమూరు నుంచి కాకినాడ రేషన్ బియ్యంతో వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేశారు. వేమూరుకు చెందిన అమర్తలూరి కోటేశ్వరరావు వద్ద కాకినాడకు చెందిన కొండమూరి చంద్రారావు 500 బ్యాగులలో 25.86 క్వింటాళ్ల బియ్యంను కొనుగోలు చేసి లారీలో తరలిస్తున్నట్లు తెలిసింది. లారీ డ్రైవర్ ఆకుల శివకృష్ణ మణికంఠను అదుపులోకి తీసుకుని బియ్యం సీజ్ చేసి లారీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. తనిఖీలలో ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేదరమెట్ల: ఈత కోసం చెక్‌డ్యాంలో దిగి ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన కొరిశపాడు మండలం రాచపూడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. రాచపూడి ఎస్సీ కాలనీకి చెందిన పల్లి చినబాబు (20) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాచపూడి–పమిడిపాడు మధ్యలో ఉన్న చెక్ డ్యాం వద్దకు ఆదివారం ఈతకు వెళ్లారు. ఈత కోసం నీటిలో దిగిన ముగ్గురిలో చినబాబు నీటిలో మునిగిపోతున్న సమయంలో గమనించిన స్నేహితులు అతన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సమాచారాన్ని చినబాబు బంధువులకు అందచేశారు. కొరిశపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఈతగాళ్ల సహకారంతో చెక్‌డ్యాంలో పడిపోయిన చినబాబును బయటకు తీయించారు. అప్పటికే చనిపోయి ఉండటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నెహ్రూనగర్: ఆంధ్రప్రదేశ్‌లో ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. సంపత్‌నగర్‌లో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజధానిలో ముదిరాజ్ కమ్యూనిటీ భవన్ కోసం ఐదెకరాల స్థలం ఇవ్వాలని కోరారు. బీసీ డీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చాలన్నారు. జనాభా దామాషా ప్రకారం నామినేట్ పదవుల్లో ముదిరాజ్‌లకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. సమావేశంలో ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి బొమ్మన సుబ్బారాయుడు, గౌరవ అధ్యక్షుడు జయరాం, జిల్లా అధ్యక్షుడు గొడుగు శంకర్, రాజు, సాంబశివరావు, రాంబాబు, శేఖర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఫిరంగిపురం: మండలకేంద్రంలోని బాల ఏసు కథెడ్రల్ దేవాలయంలో ఆదివారం శ్రీసభలో క్రీస్తు సాక్షాత్కార (ముగ్గురు రాజుల పండుగ)మహోత్సవం నిర్వహించారు. దివ్యపూజాబలి నిర్వహించారు. బాల ఏసు కథెడ్రల్ దేవాలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి వాక్యోపదేశం చేశారు. దేవుని కుమారుడు మానవుడిగా జన్మించాడని చెప్పారు. సహాయ విచారణగురువులు సాగర్ పాల్గొన్నారు. -
దేశీయ కూరగాయల సాగులో భేష్
రేపల్లె: పట్టణంలో కాళేపల్లి హరిణి నేతృత్వంలో పది మంది మహిళలు ‘సా – సేవ్ – షేర్’ నినాదంతో గార్డెన్ బ్లూమ్స్ పేరుతో టెర్రస్ గార్డెన్ల ఏర్పాటుకు ఊతమిస్తున్నారు. 2003 నుంచి తోటి మహిళలను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ జనవరి నాటికి బ్లూమ్స్ సభ్యుల సంఖ్య వంద దాటింది. దేశీయ విత్తనాలు మాత్రమే అందరూ వినియోగిస్తున్నారు. తొలుత సాగు చేసిన వారు తోటి మహిళలకు వాటిని అందిస్తున్నారు. టెర్రస్, బాల్కనీ, చిన్న ప్రాంగణాలలో టమాటా, బంగాళదుంప, బీరకాయ, నేతిబీర, చిక్కుడు, వంకాయ, బెండకాయ, మిరప, కొత్తిమీర, పాలకూర, పొట్లకాయ, సొరకాయ వంటి కూరగాయలు పండిస్తున్నారు. పోషకాలే ప్రధానం మార్కెట్లో కొత్త విత్తనాలతో పండే పంటలలో కార్బొహైడ్రేట్లు మాత్రమే ఉంటున్నాయి. ఫైబర్, ప్రోటీన్ పాళ్లు తగ్గిపోతున్నాయి. దేశీయ విత్తనాల సాగుతో ఇవన్నీ సమపాళ్లలో అందుతున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు. పెరటిలో నాటి ప్రకృతి సిద్ధమైన, గోఆధారిత ఎరువులతో పెంచుతున్నారు. దీంతో కూరగాయల్లో పౌష్టిక విలువలు మెరుగ్గా ఉంటున్నాయి. రైతులు సంరక్షించిన విత్తనాలను వినియోగంలోకి తీసుకురావటం ద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చని మహిళలు భావిస్తున్నారు. వర్క్‌షాప్‌లు, ఆన్లైన్ సమావేశాల ద్వారా కొత్త వారికి సాయం చేస్తున్నారు. -
షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌కు విశేష స్పందన
తెనాలిటౌన్: ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి విశేషస్పందన లభించిందని మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్‌రాజా చెప్పారు. ఈనెల 11న నిర్వహించనున్న ఈ పోటీల వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మా–ఏపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్‌రాజా వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలనే భావనతో నిర్వహిస్తున్న ఈ పోటీలకు మొత్తం 203 ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. ఆయా షార్ట్ ఫిలింస్ జ్యూరీ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పోటీలకు ఎంట్రీలు పంపిన ఔత్సాహికులు అందరికీ జనవరి 11న తెనాలిలో జరిగే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సంబరాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు కో– కన్వీనర్, సినీదర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్ కోరారు. సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ దోనే, నటుడు మిలటరీ ప్రసాద్ పాల్గొన్నారు. -
ఏపీఆర్ఎస్ఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
గుంటూరు వెస్ట్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా పీఏ కిరణ్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. కిరణ్ కుమార్ ప్యానెల్‌కు వ్యతిరేకంగా ఎవరూ పోటీ చేయకపోవడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గెలుపొందిన ప్యానెల్ 2029 వరకు పని చేస్తుందని తెలిపారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా కోటంరాజు గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎండీ గౌస్, వి.సర్వేశ్వర రెడ్డి, ఎస్.హీనాప్రియ, ప్రధాన కార్యదర్శిగా ఎం.వెంకట రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.భాస్కర రావు (డిప్యూటీ తహసీల్దార్), స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా ఎస్కే దరియా వలి, జాయింట్ సెక్రటరీలుగా డి.దివ్య దుర్గాదేవి (డిప్యూటీ తహసీల్దార్), కె.రాజీవ్ కుమార్, జె.రవికుమార్, ట్రెజరర్‌గా కె.గోపి ఎన్నికయ్యారు. -
నాటకరంగాన్ని భావి తరాలకు అందించాలి
యద్దనపూడి: అంతరించిపోతున్న నాటక కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గుదె పాండు రంగారావు అన్నారు. మండలంలోని అనంతవరం గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యాన ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రస్థాయి నాటికల పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కమిటీ సభ్యులతో ఆదివారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి మార్టూరు శ్రీకారం రోటరీ కళాపరిషత్ అధ్యక్షుడు జాష్టి మోహన్‌రావు, కారుమంచి కళా పరిషత్ అధ్యక్షుడు కె.రామాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీకారం రోటరీ కళాపరిషత్ అధ్యక్షుడు మోహన్‌రావు మాట్లాడుతూ తెలుగు నాటకరంగం ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందిందని కానీ నేడు సినిమా, టీవీల ప్రభావంతో మసకబారిపోతోందన్నారు. తెరపడే నాటకరంగానికి ఎంతోమంది కళాపరిషత్‌లు ద్వారా నాటకరంగానికి జీవం పోస్తున్నారన్నారు. కారుమంచి కళాపరిషత్ అధ్యక్షుడు కె.రామాంజనేయులు మాట్లాడుతూ సమాజంలో జరిగే వాస్తవ సంఘటనలను ఇతివృత్తంగా తీసుకొని ఎందరో మహనీయులు తమ రచనల ద్వారా నాటక ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారన్నారు. గుదే పాండురంగారావు మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించిన నాటకపోటీలు నాలుగో సంవత్సరం కూడా నిర్వహించేందుకు గ్రామస్తులు ముందుకు రావటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గుదే తారక రామారావు, రావిపాటి సీతయ్య, కొరిటాల వంశీకృష్ణ, ఈశ్వరప్రసాద్, మద్దినేని గోపాలకృష్ణ, పోపూరి నాగేశ్వరావు, హనుమంతురావు, నిమ్మల సాంబశివరావు, శానంపూడి లక్ష్మయ్య, జ్యోతిబాబు, పెరవల్లి శ్రీనివాసరావు, రావి శ్రీనివాసరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
జాతీయ కబడ్డీ పోటీలకు ఇద్దరు ఎంపిక
చినగంజాం: మండలానికి చెందిన ఇరువురు విద్యార్థులు 69వ జాతీయ ఛాంపియన్ షిప్ స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపికై నట్లు బాల కోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు, కబడ్డీ కోచ్, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు ఎం.గిరిబాబు తెలియజేశారు. గత రెండు సంవత్సరాలుగా బాల కోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్లో శిక్షణ పొందుతూ స్థానిక సత్యం హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న మండలంలోని కొత్తపాలెం పంచాయతీ శాంతినగర్‌కు చెందిన గాలి శ్రీనివాసరెడ్డి ఎంపికై నట్లు తెలిపారు. అతడు అండర్ 17 విభాగంలో తెలంగాణలోని బయ్యారంలో ఈ నెల 7,8,9,10,11 తేదీల్లో నిర్వహించే స్కూల్ గేమ్స్ పోటీలకు హాజరవుతున్నట్లు తెలిపారు. చినగంజాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కొత్తపాలెం పంచాయతీ మూలగానివారిపాలెం గ్రామానికి చెందిన భోగిరెడ్డి వేణుగోపాలరెడ్డి ఎంపికై నట్లు తెలిపారు. అతడు అండర్–14 విభాగంలో చత్తీస్‌ఘడ్‌లోని దుర్గాలో ఈనెల 6,7,8,9 తేదీల్లో నిర్వహించే స్కూల్ గేమ్స్‌కు హాజరవుతున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గిరిబాబుతో పాటు సత్యం హైస్కూల్ కరస్పాండెంట్ నున్నా హరినాఽథ్, పాఠశాల సిబ్బంది, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం కె.శ్రీనివాసరెడ్డి, పీడీ అంకమ్మ, స్పోర్ట్స్ క్లబ్ సమ్మర్ కోచింగ్‌కు ఆర్థిక సహకారం అందించిన డాక్టర్ నల్లూరి సుబ్బారావు, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు పోలీస్ శాఖలో డీఎస్పీ వేణుగోపాల్‌లు వీరికి అభినందనలు తెలియజేశారు. -
పిల్లలు సైతం భాగస్వాములే
రసాయన ఎరువుల వినియోగం లేకుండా దేశీయ విత్తనాలతో సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరలు, పండ్లు ఎంతో ఆనందాన్నిస్తున్నాయి. సాగుతో పొలంలో ధాన్యం, ఇతర పంటలు పండించే రైతుల కష్టం తెలుస్తోంది. నాతోపాటు మా పిల్లలను సైతం గార్డెన్లో మొక్కల పెంపకంలో భాగస్వాములను చేస్తున్నా. మా పిల్లలకు పని విలువ తెలపటంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించే పద్ధతులను వివరిస్తున్నాను. రోజూ కూరగాయల కోసం పరుగులు పెట్టాల్సిన పని తప్పింది. మంచి ఆరోగ్యంతోపాటు డబ్బు, సమయం ఆదా అవుతోంది. – దివ్యజ్యోతి, రేపల్లె -
వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి
తాడికొండ: రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం వడ్డమానులో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన శనివారం జరిగింది. గేదెలు కాసుకునేందుకు వెళ్లగా కర్రతో విచక్షణా రహితంగా దాడిచేసిన గుర్తు తెలియని వ్యక్తి పరారీ కాగా రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలిని ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వివరాల ప్రకారం.. వడ్డమాను గ్రామానికి చెందిన మేళం కోటేశ్వరమ్మ గేదెలు కాసుకునేందుకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తి కరత్రో విచక్షణరహితంగా దాడి చేయడంతో స్పృహ కోల్పోయింది. దీంతో దుండగుడు ఆమె మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రం లాక్కెళ్లాడు. గేదెలు కాసేందుకు వెళ్లిన ఆమె సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో వెతికేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందించి ఇంటికి తీసుకొచ్చిన అనంతరం తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఘటనపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలికి తలకు 30 కుట్లు పడ్డాయని, ఘటన అనంతరం ఆమె మానసిక స్థితి సైతం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. -
తీరంలో సినిమా షూటింగ్ సందడి
చీరాల రూరల్: చీరాల వాడరేవు తీరంలో ఆదివారం సినిమా షూటింగ్ జరగడంతో సందడి వాతావారణం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సముద్ర స్నానానికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. షూటింగ్ చూడటానికి ఆసక్తి చూపారు. తమ సినిమా విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపుదిద్దుకోనుందని డైరెక్టర్ భీంజి తెలిపారు. శ్రీసుధార క్రియేషన్స్ బ్యానరుపై మాస్టర్ కనిష్క సమర్పిస్తున్న ఈ సినిమాలో అనంతనేని శ్రీనివాస్, మౌనిక శర్మ జంటగా నటిస్తున్నారని పేర్కొన్నారు. ఇతర పాత్రల్లో సుహాసినీ మణిరత్నం, వినోద్‌కుమార్, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నట్లు తెలిపారు. కొరియోగ్రఫీ సంతోష్, బాలకృష్ణ, ఫైట్స్ రాజు సమకూరుస్తున్నట్లు ఆయన వివరించారు. పి.నాగరాజు నిర్మాత అని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో చిరుద్యోగి మృతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారి, కుంచనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. జరిగిన సంఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సేకరించిన వివరాల ప్రకారం... దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన కామినేని భవానీశంకర్ (33) కుటుంబ జీవనోపాధి కోసం విజయవాడలోని ఓ వస్త్రదుకాణంలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి స్టాక్ రావడంతో వాటిని చూసుకొని 12 గంటల తరువాత ఇంటికి వెళుతుండగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న కారు భవానీశంకర్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో భవానీ శంకర్‌కు తీవ్ర గాయాలుకాగా, కారులో వైద్య నిమిత్తం దగ్గరలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. తాడేపల్లి పోలీసులు అక్కడి నుండి తీసుకువచ్చి విచారణ చేపట్టారు. -
మరింత విస్తరించేందుకు కృషి
దేశీయ విత్తనాల ఉత్పత్తులను ప్రోత్సహించటమే లక్ష్యంగా పది మందితో గ్రూపు ప్రారంభించా. నిత్యం సాగు చేసే కూరగాయల యాజమాన్యంతోపాటు సేంద్రియ ఎరువుల తయారీపై అందరం చర్చించుకుంటాం. ఇలా సాగు చేసే కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. భవిష్యత్‌లో మరింత మందిని భాగస్వాములను చేస్తా. విద్యార్థులలో చైతన్యం పెంచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. దేశీయ విత్తన మొక్కలను 200 మందికి అందించా. – కాళేపల్లి హరిణి, గార్డెన్ బ్లూమ్స్ వ్యవస్థాపకురాలు -
2వ రోజుకు చేరిన పురుషుల బ్యాడ్మింటన్ పోటీలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరంలో జరుగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్ 2026 పోటీలు ఆదివారం రెండవ రోజుకు చేరుకున్నాయి. సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ అసోసియేషన ఆర్గనైజింగ్ సెక్రటరి డాక్టర్ కె.హరికిషోర్ మాట్లాడుతూ రెండవ రోజు పోటీలలో రెండు, మూడు రౌండ్లు పూర్తయ్యాయని, రెండవ రౌండ్లో మొత్తం 64 జట్లు పోటీ పడ్డాయని, వాటిలో 30 జట్లు గెలుపొందాయని పేర్కొన్నారు. రెండవ రౌండ్లో గెలుపొందిన 30 జట్లు ఆదివారం మధ్యాహ్నం మూడవ రౌండ్లో తలపడ్డాయని, 3వ రౌండ్లో ఆంధ్రాకు చెందిన జెఎన్టీయూ కాకినాడ జట్టు కర్ణాటకకు చెందిన గార్డెన్ సిటీ యూనివర్సిటీపై విజయం సాధించిందని వివరించారు. సోమవారం సెమీ ఫైనల్ అనంతరం మంగళవారం ఫైనల్ పోటీలు జరుగుతాయని హరికిషోర్ పేర్కొన్నారు. -
నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
చీరాల: చీరాల్లోని రెండు ప్రైవేటు హాస్పిటల్స్ డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైందని హైకోర్టు న్యాయవాది రజని అన్నారు. శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చీరాల కొత్తపేటకు చెందిన పి.సౌమ్య అనే మహిళ డిసెంబర్ 20న కాన్పు కోసం చీరాలలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చేరిందన్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని గంటలకు ఆమెను హడావిడిగా చీరాల్లోని మరో ప్రముఖ హాస్పిటల్‌కు పంపించారన్నారు. డెలివరీ అయిన గంటల వ్యవధిలోనే ఆమె చనిపోయిందని చెప్పడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతమన్నారు. కనీసం ఆమె ఆరోగ్య పరిస్థితి ఏలా ఉందనేది కుటుంబ సభ్యులకు కూడా చెప్పకపోవడం దారుణమని తెలిపారు. గంటల కొద్దీ హాస్పిటల్స్‌లో ఉంచుకోవడం వలనే ఆమె చనిపోయిందని, ఆమె ఆరోగ్య పరిస్థితి ముందుగానే చెబితే వారి స్థోమతను బట్టి వేరే ప్రాంతానికి తీసుకొనివెళ్లే వారన్నారు. ఇద్దరు వైద్యుల నిర్లక్ష్యం వలనే ఆమె మరణించిందని ఆరోపించారు. మృతురాలికి ఏ వైద్యం చేశారనేది కూడా కేసు షీటు గాని, డిశ్చార్జి సమ్మరీ గాని ఇవ్వలేదన్నారు. బాధితులు ఈ విషయమై పోలీసులను ఆశ్రయించినా పోలీసులు వైద్యులపై కేసులు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. తక్షణమే ఆమె మృతికి కారణమైన వైద్యులపై కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.వసంతరావు, ఎం.ప్రతాప్, ఎం.రాజా, మృతురాలి తండ్రి పి.ఏడుకొండలు పాల్గొన్నారు. చీరాల: వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిన సంఘటనపై శనివారం చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కొత్తపేటకు చెందిన పి.సౌమ్య(30) అనే గర్భిణి గత నెల 12న చీరాలలోని శంకర్ ల్యాప్రోస్కోపీ ఇన్ఫెర్టిలిటీ హాస్పిటల్లో చేరింది. 16న సిజేరియన్ ఆపరేషన్ చేయగా.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ జరిగి గంటలు గడిచినా థియేటర్లో నుంచి తల్లిని బయటకు తీసుకురాకపోవడంతో బంధువుల ఆందోళన చెందారు. దీంతో ఆమెను రాత్రి 10 గంటల సమయంలో మరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తరలించగా మార్గమధ్యంలో మరణించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలింత మృతికి కారణమైన డాక్టర్ రామకృష్ణ హనుమాన్‌పై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ ఎస్.సుబ్బారావు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాకంపై బాధితుల ఆందోళన -
హిమ స్నోయగం..
చీరాల నియోజకవర్గం పరిధిలో శనివారం విపరీతంగా మంచు కురిసింది. వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు మంచు కురస్తూనే ఉండటంతో వాహచోదకులు ఇబ్బందులు పడ్డారు. శ్వాసకోస సమస్యలు ఉన్న వారు, వృద్ధులు, చిన్నారులు అసౌకర్యానికి గురయ్యారు. మంచు వర్షం జల్లులను తలపించింది. దీనితోపాటు రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరిగింది. మంచు అధికంగా కురుస్తుండడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. – వేటపాలెంచీరాల–వేటపాలెం ప్రధాన రహదారిలో మంచు తెరలుప్రధాన రహదారిలో ఆటో కేవలం లైట్లు కనిపిస్తున్న దృశ్యంమంచులో నడుస్తున్న విద్యార్థినులు -
రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ చీరాల: అమృత్ భారత్ పథకంలో భాగంగా చీరాల రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన సాగడం, పలు నిర్మాణ పనులు ప్రయాణికులకు అసౌకర్యంగా ఉండడంతో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు. ప్లాట్‌ఫాంపై జరుగుతున్న పనులను పరిశీలించారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలోని చీరాల, బాపట్ల, రేపల్లె రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే క్రమంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. మరోవైపు బాపట్ల – రేపల్లె కొత్త రైల్వే లైను, బాపట్ల నుంచి పర్చూరు మీదుగా మార్కాపురం వరకు కొత్త రైల్వేలైను మార్గానికి ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. -
హోరాహోరీగా బ్యాడ్మింటన్ పోటీలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్ శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ప్రారంభించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 128 విశ్వవిద్యాయాల జట్లు పాల్గొంటున్నట్లు చెప్పారు. సుమారు 896 మంది క్రీడాకారులు తలపడనున్నట్లు తెలిపారు. కేఎల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్థసారథి వర్మ మాట్లాడుతూ జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు పోటీలు జరుగనున్నాయని తెలిపారు. యువత క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక శక్తిని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. క్రీడల డైరెక్టర్ డాక్టర్ కె.హరి కిషోర్ మాట్లాడుతూ తమ వర్సిటీలో క్రీడాకారులకు ఫీజు రాయితీతోపాటు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ జాయింట్ సెక్రటరీ పున్నయ్య చౌదరి, ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె. కోటేశ్వరరావు, వర్సిటీ ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్. వెంకట్రామ్, డాక్టర్ కె. రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తొలి రౌండ్లో 60 జట్లు విజయం పోటీల వివరాలను వర్సిటీ సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ హరికిషోర్ వెల్లడించారు. తొలిరోజు మొదటి రౌండ్లో మొత్తం 128 జట్లు పోటీ పడగా 60 జట్లు గెలుపొందగా, 4 పోటీల ఫలితాలు డ్రాగా ముగిసినట్లు తెలిపారు. ఏపీకి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు యూనివర్శిటీపై తమిళనాడుకు చెందిన భారతీయార్ యూనివర్సిటీ జట్టు విజయం సాధించిందని, తమిళనాడుకు చెందిన తిరువళ్లువర్ యూనివర్సిటీపై హైదరాబాద్‌కు చెందిన జేఎన్టీయూ వర్సిటీ జట్టు గెలిచిందని పేర్కొన్నారు. ఆదివారం రెండో రౌండ్ పోటీలు ఉంటాయని వివరించారు. -
బాల్య వివాహాల నివారణ అందరి బాధ్యత
నరసరావుపేట టౌన్: బాల్య వివాహాలు అరికట్టటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పీఓ ప్రశాంతి అన్నారు. బాల్య వివాహ నిషేధిత చట్టంపై శనివారం పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం ద్వారా వారి భవిష్యత్తు, ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. బాల్య వివాహం ఒక సామాజిక నేరమన్నారు. దీన్ని అరికట్టడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యన్నారు. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21సంవత్సరాలు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. చిన్న వయసులో గర్భం దాల్చడం వలన తల్లి, బిడ్డల ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుందన్నారు. పెళ్లి కారణంగా బాలికలు చదువుకు దూరం అవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే చైల్డ్ లైన్ నెంబర్ 1098 లేదా 100 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంతోష్ కుమార్, రెండవ పట్టణ ఏఎస్ఐ, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, చంద్రబాబు నాయుడు కాలనీలోని అంగన్వాడి వర్కర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పీఓ ప్రశాంతి -
గోవాడ దేవస్థానం కమిటీ ప్రమాణస్వీకారం
గోవాడ(వేమూరు): బాల కోటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి ధర్మకర్తల మండలి సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కోరారు. అమృతలూరు మండలంలోని గోవాడ శ్రీ బాల కోటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పావులూరు రమేష్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటు 11 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఆలయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వాతావరణం పరిరక్షణతో పాటు ఆలయ సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రమాణస్వీకారం చేసిన కమిటీ సభ్యుల్లో కాటం నాగేశ్వరరావు, రామదాసు శ్రీనివాసరావు, మండవ అనంతలక్ష్మి, దేవీ హైమా ప్రియా, బన్నారపూరి అంజనేయులు, కొండవీటి లక్ష్మీభ్రమరాంబ, మోపిదేవి లక్ష్మి, గండికోట పోలయ్య, అల్లూరు విజయకుమారి, అమృతలూరు బాబూరావు ఉన్నారు. -
ఎన్టీఆర్ స్తుతి... పీవీకి దక్కని చోటు
బాపట్లఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1200, గరిష్ట ధర రూ.2500, మోడల్ ధర రూ.1700 వరకు పలికింది.మాచర్ల: పాత ఊరులోని లక్ష్మీచెన్నకేశవ స్వామి నిత్య కల్యాణ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చుని స్వామి కల్యాణం జరిపించారు.జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిఘంటం శ్రీనరసింహ, విశ్వయోగి విశ్వంజీ చిన్నారుల నృత్య ప్రదర్శనసాక్షిప్రతినిధి,గుంటూరు/నగరంపాలెం:మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు శ్రీసత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 శనివారం ప్రారంభమయ్యా యి. పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సభలు జరిగాయి. ప్రారంభ సభకు ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ విచ్చేసి భాష కేవలం భావ వ్యక్తీకరణకే కాదని, అది జీవన విధానమన్నారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశ్వయోగి విశ్వంజీ, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోడా రఘురామ్, తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, హైకోర్టు జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్, తెలుగు మహాసభల ముఖ్య సమన్వయకర్త పి.రామచంద్రరాజు, కొప్పరపు కవుల సాహితీపీఠం ప్రతినిధి మా శర్మ, మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ, వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రముఖులు, భాషావేత్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని పీవీని మరిచారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన నిర్వాహకులు, అతిథులు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా సేవలందించిన అచ్చ తెలుగువాడు పీవీ నరసింహారావును మరిచారు. సంస్కరణలను ప్రవేశపెట్టి, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి, రాజ నీతిజ్ఞుడు పీవీ పేరును కనీసం తలచుకోకపోవడంతో సభకు వచ్చిన ఎంతో మంది ప్రముఖులు అసంతప్తి వ్యక్తం చేశారు. ఈనాడు రామోజీరావు పేరుతో ఏకంగా ఒక స్టాల్ పెట్టడమే కాకుండా ఆయన విగ్రహాన్ని కూడా సభా ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. పత్రికాధిపతుల పేరుతో ప్రదర్శన శాలలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు బహుభాషాకోవిదుడు, తెలుగులో పలు రచనలు చేసి తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేసిన పీవీ నరసింహారావు పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం విచారకరం. ప్రపంచ తెలుగు మహాసభలకు గుర్తుగా రూపొందించిన వీడియోలోనూ ఆయన ప్రస్తావన లేకపోవడం పట్ల పలువురు పెదవి విరిచారు. గుంటూరు నగరంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం 7ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్.మానవేంద్రనాథ్‌రాయ్, పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి, ఎంపీ కె.గోపీనాథ్ (తమిళనాడు)లు ప్రసంగించారు. -
ఫిబ్రవరి 7,8 తేదీల్లో కొండవీడు ఉత్సవాలు
నరసరావుపేట: ప్రముఖ పర్యాటక కేంద్రం కొండవీడు కోట ఖ్యాతి రాష్ట్రం నలుమూలలా వ్యాపించేలా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించనున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. కొండవీడు ఫెస్ట్ నిర్వహణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి, నోడల్ అధికారిగా జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియను నియమించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సాహపూరిత వాతావరణంలో ఫెస్ట్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆహ్లాదకరమైన సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యాటకుల సంఖ్యకు తగినవిధంగా ఫుడ్‌కోర్టులు, స్టాల్స్, తాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫిరంగిపురం, నాదెండ్ల, వంకాయలపాడుల నుంచి కొండవీడు కోటకు వచ్చే రహదారులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. గత ఉత్సవాలలో పర్యాటకులను ఆకర్షించిన హెలిరైడ్, బోటింగ్ వంటి వాటికి అదనంగా కార్యక్రమాలు రూపొందించాలని ఈవెంట్ మేనేజర్‌ను ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి కృష్ణ్ణప్రియ, డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీవో మధులత, దీపీఓ నాగేశ్వర్‌నాయక్ పాల్గొన్నారు. సత్తెనపల్లి: ధనుర్మాసంను పురస్కరించుకొని సత్తెనపల్లిలోని అలివేలు మంగ పద్మావతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీవారిని ‘జగత్ రక్షకుడు’గా అలంకరించి పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారికి విశేష పౌర్ణమి పూజ, గరుడ పూజ చేసి శ్రీవారిని ‘ఉత్తర దిశగా’ ఊరేగించారు. గరుడ ప్రసాదంను ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు భక్తులకు అందించారు. ఆలయ ప్రాంగణంలో కోలాటం ఆడారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆలయ కమిటీ బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నకరికల్లు: శివముక్కోటిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నర్శింగపాడు లోని శ్రీ మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు పమిడిమర్రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తు లకు స్వామివారి ఉత్తరద్వార దర్శనం కల్పించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకొని మొక్కులు చెల్లించారు.అమరావతి: ప్రసిద్ధ శైవక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండికా సమే త అమరేశ్వరునికి శనివారం ఆరుద్రోత్సవం నిర్వహించా రు. శనివారం వేకువజామున మహా న్యాస పూర్వక ఏకాదశ రుద్ర అన్నాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలు త పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం దాతల సహకారంతో సుమారు నాలుగు క్వింటాళ్ల బియ్యాన్ని అన్నంగా వండి స్వామివారికి అభిషేకించారు. తొలుత అర్చకు లు, వేద పండితులు వెంకటాద్రినాయుని మండపంలో మహాన్యాసం నిర్వహించి అనంతరం 11 అమృతాలతో ఏకదశ రుద్రాభిషేకం వండిన నాలుగు క్వింటాళ్ల అన్నంతో అభిషేకం చేశారు. బాలచాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అభిషేకించిన అన్నాన్ని అన్నప్రసాదంగా భక్తులకు పంపిణీ చేశారు. ప్రతి ఏడాదీ అన్నప్రసాద వితరణ సాయంత్రం మూడు గంటల వరకు జరిగేది ఈ ఏడాది రెండు గంటలలోపు అన్న ప్రసాద వితరణ ముగించటంతో పలువురు భక్తులు నిరాశతో వెనుదిరిగారు. -
భార్యను హతమార్చిన భర్త అరెస్ట్
చిలకలూరిపేటటౌన్: భార్యపై అనుమానంతో రోకలి బండతో దాడి చేసి, ఆమె మరణానికి కారణమైన నిందితుడిని చిలకలూరిపేట రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈమేరకు చిలకలూరిపేట రూరల్ సీఐ కార్యాలయంలో మీడియా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు వివరాలు వెల్లడించారు.. వేలూరు గ్రామానికి చెందిన అల్లడి సల్మాన్‌రాజు తన భార్య పుష్పపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తలపై రోకలి బండతో దాడి చేశాడు. తీవ్ర రక్తగాయాలతో ఆస్పత్రి పాలైన పుష్ప చికిత్స పొందుతూ డిసెంబర్ 30వ తేదీన మృతి చెందింది. మృతురాలి తల్లి మంచాల సారమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ప్రెస్మీట్లో రూరల్ ఎస్ఐ జి.అనిల్‌కుమార్, లేఖా ప్రియాంక సిబ్బంది పాల్గొన్నారు.


