Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Serious Comments On CBN And Yellow Media1
చంద్రబాబు.. ఇంక మీ డ్రామాలు ఆపండి: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: రైతుల పక్షాన మేము నిలబడితే ఎల్లో మీడియా దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా రాతలు రాయడానికి, మాట్లాడటానికి సిగ్గు ఉండాలి?. చంద్రబాబు.. రైతులకు నిజంగా మీరు మేలు చేస్తే.. మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నిన్నటి బంగారుపాళ్యం పర్యటనపై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రైతుల విషయమై.. చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో పిచ్చి రాతలు రాసిన పచ్చ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.చంద్రబాబు.. మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా, వెరవక వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా, తమగోడు చాటుతూ హాజరయ్యారు. ప్రభుత్వ తీరుపట్ల రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. ఇదే సందర్భంలో కొంతమంది రైతులు, తమకు తీవ్ర నష్టం వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని, ఈ దేశం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇది నేరమన్నట్టుగా, రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీషీటర్లుగానూ, అసాంఘిక శక్తులుగానూ, దొంగలుగానూ చిత్రీకరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ, మరోవైపు వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడులో, మీ ఎల్లోమీడియాలో రాయించడం మీకే చెల్లింది. తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడ్డం వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల మీకు, మీ ప్రభుత్వానికి, మిమ్మల్ని భుజానమోస్తున్న మీ ఎల్లోమీడియాకు ఉన్న తేలికతనానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబుగారు మీరు పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గు ఉండాలి? పత్రికలు, టీవీలు అని చెప్పుకోవడానికి మీ ఎల్లోమీడియాకు సిగ్గు ఉండాలి?2. 2.2లక్షల ఎకరాల్లో 6.5 లక్షల టన్నుల పంట, 76 వేల రైతు కుటుంబాలకు చెందిన సమస్య ఇది. గత 2 నెలలుగా మామిడి తోటల్లోనూ, ర్యాంపులవద్దా, ఫ్యాక్టరీల ముందు, పండిన పంటను కొనేవాడులేక రైతులు పారబోస్తున్నారు. ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమే. మరి వీళ్లంతా మీ కంటికి రౌడీలు, దొంగలు, అసాంఘిక శక్తులు మాదిరిగానే కనిపిస్తున్నారా? కష్టాల్లో ఉన్న రైతులకు చేదోడుగా మీరు ఉండకపోగా, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేం రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంచేస్తే, ఆ కార్యక్రమంపై మీరు చేస్తున్న వెకిలి వ్యాఖ్యలు, రాస్తున్న వెకిలి రాతలు, వక్రీకరణలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.3. మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగి, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీదృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలు... అంతేకదా చంద్రబాబుగారూ..! అంతేకాదు, అసలు వీరికి ఏ ఒక్కసమస్యాలేదని, అన్ని హామీలూ మీరు తీర్చేశారని, సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అందుకొని ఆనందంతో వీరంతా కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం. తమకు ధరలేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా, వీళ్లందరూ అసాంఘిక శక్తులు కాబట్టి వీరు రోడ్లు ఎక్కారనేగా మీ ఉద్దేశం. ఇదేం పద్ధతి, ఇదేం విధానం చంద్రబాబుగారూ..?4. మామిడి రైతులు కష్టాల్లో లేకపోతే, రైతులు పంటను తెగనమ్ముకోకపోతే, మీరు ఎంతమేర అమలు చేశారన్న విషయం పక్కనపెడితే, కిలోకు రూ.4లు ప్రభుత్వం నుంచి ఇస్తామన్న ప్రకటన ఎందుకు చేశారు? ఫ్యాక్టరీలు కిలో రూ.8ల చొప్పున కొనుగోలు చేయాలని దొంగ ఆదేశాలైనా ఎందుకు జారీచేశారు? కర్ణాటకలో కిలో రూ.16ల చొప్పున కనీస ధరకు కొనుగోలుచేస్తామని కేంద్ర ప్రభుత్వం, మీ ఎన్డీయేలోనే ఉన్న జేడీఎస్‌ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది? బంగారుపాళ్యంలో నా పర్యటన కార్యక్రమం ఖరారుకాగానే మీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు?. దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా? మరి రైతులు నష్టపోయినట్టు ఓవైపు మీరు అంగీకరిస్తూ, ఆ నష్టాన్ని రైతుల పక్షంగా మేం ఎత్తిచూపితే మళ్లీ ఈ దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు?5. వైయస్సార్‌సీపీ హయాంలో రైతులకు ఏరోజు ఇలాంటి కష్టం రాలేదు. గతేడాది కూడా కిలో మామిడికి రూ.25-29ల ధర వచ్చింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ధరలు పడిపోయాయి? ప్రతి ఏటా మే 10-15తేదీల మధ్య తెరవాల్సిన పల్ప్‌ ఫ్యాక్టరీలను, ఈ ఏడాది ఆ సమయానికి ఎందుకు తెరవలేదు? ఒక నెలరోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు? అవికూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు? సకాలానికి ఫ్యాక్టరీలు తెరవకపోయినా చంద్రబాబుగారూ మీరు ఎందుకు పట్టించుకోలేదు, ఒకేసారి సరుకు వచ్చేలా చేయడంద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్టు కాదా? మీ గల్లా ఫ్యాక్టరీకి, మీ శ్రీని ఫుడ్స్‌కు… ఇలా మీవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడంలేదంటారా? మీరు ఇస్తానన్న రూ.4లు ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు రూ.8ల చొప్పున ఫ్యాక్టరీలు చెల్లించాయి? ఇదికూడా నిరుడు సంవత్సరం వైయస్సార్‌సీపీ పాలనతో పోలిస్తే ఎక్కడ రూ.29ల రేటు, ఎక్కడ ఈరోజు అమ్ముకుంటున్న రూ.2.5/3లు కేజీకి. దీన్ని నిలదీసే కార్యక్రమాన్ని ప్రతిపక్షనేతగా, రైతుల పక్షాన నిన్న బంగారుపాళ్యంలో నేను చేస్తే, మీ దగ్గర సమాధానాలు లేక రైతులు మీద, మామీద తప్పుడు మాటలు మాట్లాడతారా? తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా?6. చంద్రబాబుగారూ.. మీరు వచ్చిన తర్వాత వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, ఉల్లి, చీనీ, కోకో, పొగాకు, చివరకు మామిడి… ఇలా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదన్నది వాస్తవం కాదా? గట్టిగా ప్రశ్నిస్తే, డ్రామాలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మిర్చిరైతులకు ధరలు రావడంలేదని గగ్గోలు పెడితే, కేంద్రంచేత కొనిపిస్తానంటూ డ్రామా చేశారు. చివరకు ఒక్క కిలో అయినా కొన్నారా? ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టారా? టొబాకో రైతులు ఆందోళన చేస్తే, ఇంకో డ్రామా చేస్తూ, ప్రకటనలు చేయిస్తున్నారు. చిత్తశుద్ధితో మీరు వ్యవహరించారా?7. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కాక ఇతర పంటల కొనుగోలు విషయంలో రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. రైతులు నష్టపోతున్నా మీరెందుకు ఆ పనిచేయడం లేదు? ఏ పంటకు ఏ ధర ఉందనే దానిపై ఆర్బీకేల్లో రియల్‌ టైం మానిటరింగ్‌ చేసే CM APP ఏమైంది?8. గత ఏడాది మీరు ఇస్తానన్న రైతు భరోసా రూ.20వేలు ఇవ్వలేదు, జూన్‌ 21 ఇస్తానని చెప్పి, జులై రెండోవారం అవుతున్నా ఇప్పటికీ, ఈ ఏడాదికూడా దాని గురించి ప్రస్తావించడంలేదు. సీజన్‌ మొదలై వారాలు గడుస్తున్నా పరిస్థితి అగమ్యగోచరమే. మా హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేది.9. వరదలు వచ్చినా, కరువులు వచ్చినా సమయానికే సీజన్‌ ముగిసేలోగా ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇచ్చే మా విధానాన్ని గాలికి వదిలేశారు. ఉచిత పంటలబీమాను పూర్తిగా ఎత్తేశారు, ఆర్బీకేలను, ఇ-క్రాప్‌ విధానాన్ని, గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను, విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకూ రైతును చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. టెస్టింగ్‌ ల్యాబ్స్‌ను నాశనం చేస్తున్నారు. ఇలా ప్రతిదశలోనూ రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు. వీటిని ప్రశ్నిస్తే, మీ వైఫల్యాలను ఎత్తిచూపితే మాపైన, ఆందోళన చేస్తున్న రైతులపైనా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబుగారూ..! రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి.1.@ncbn గారూ, మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా,… pic.twitter.com/9WFD13951r— YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2025

Supreme Court Comments on Bihar electoral roll revision July 10th News2
బీహార్ ఓటర్ల జాబితా సవరణ.. ఈసీపై సుప్రీం కోర్టు ఆగ్రహం

బీహార్ ఓటర్ల జాబితా సవరణ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం కోర్టు మండిపడింది. ఓటర్‌ జాబితా ప్రక్రియలో తప్పులు సరిదిద్దే ప్రక్రియ మంచిదేనని.. అయితే ఈ కసరత్తును ముందే ఎందుకు చేపట్టలేదని ఈసీని నిలదీసింది.న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు దాఖలైన అత్యవసర పిటిషన్‌ను జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా ఈసీ చర్య రాజ్యాంగబద్ధమైనదే అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈసీ చర్యను సమర్థించిన సుప్రీం ధర్మాసనం.. 2003లో చివరిసారి అలాంటి ప్రక్రియ జరిగిందని వ్యాఖ్యానించింది. అయితే, ఎన్నికల ముందే ఈ ప్రక్రియ ప్రారంభించడం వెనుక అనుమానం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగం ప్రకారం చేయాల్సిన పని. ప్రాక్టికల్ అవసరం ఉంది. కంప్యూటరైజేషన్ తర్వాత మొదటిసారి కావడం వల్ల తగిన లాజిక్ ఉంది. ఓటర్ల జాబితాలో నాన్-సిటిజన్లు ఉండకూడదని తొలగింపు ప్రక్రియ చేపట్టడం తప్పేం కాదు. కానీ, ఎన్నికల ముందు రెండు నెలలకే నిర్ణయం తీసుకోవడం సరైనదా? అని ప్రశ్నించింది.వాదన సమయంలో ఆధార్‌ పౌరసత్వ గుర్తింపు కాదని పేర్కొన్న ఎన్నికల సంఘం.. ఆర్టికల్ 326 కింద తమకు అన్ని అధికారాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో.. ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదు. కానీ, ఇక్కడ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోంది. ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దే ప్రక్రియ మంచిదే. అలాంటప్పుడు ఈ కసరత్తు ముందే ఎందుకు చేపట్టలేదు. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రారంభిస్తే ఎలా? అని ప్రశ్నించింది. ఈ తరుణంలో కేంద్రం, ఎన్నికల సంఘానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.బీహార్‌ ఓటరు జాబితా ప్రత్యేక సవరణను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంలో ఈసీ ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. జూలై 25 కల్లా అధీకృత డాక్యుమెంట్లు చూపించకుంటే... ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని పిటిషన్‌లో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఈ రివిజన్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకేనని, బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాలను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే ఈ కసరత్తు లక్ష్యమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో స్పెషల్ రివిజన్ నిలిపివేసేలా ఈసీని ఆదేశించాలని పిటిషన్‌ వేశాయి. వాదనలు & విమర్శలు• అధిక సంఖ్యలో పాత ఓటర్లను తొలగించే అవకాశం ఉందని కాంగ్రెస్, RJD వంటి విపక్షాలు విమర్శించాయి.• ఆధార్, ఓటర్ ID వంటి సాధారణ పత్రాలను అంగీకరించకపోవడం వివక్షత అని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు.• 2003 ముందు పౌరసత్వంపై అనుమాల్లేకుండా అంగీకరించారు. కానీ ఇప్పుడు ఐదుసార్లు ఓటు వేసినా పౌరసత్వం నిరూపించాల్సిన పరిస్థితి ఉందని వాదించారు. ఎన్నికల సంఘం వాదనగత 20 ఏళ్లలో పునరావృత నమోదు, మరణాల సమాచారం లేకపోవడం, వలసలు వంటి కారణాలతో డూప్లికేట్ ఎంట్రీలు పెరిగాయని తెలిపింది.57% మంది ఇప్పటికే ఫారాలు సమర్పించారని పేర్కొంది.పలు ప్రశ్నలుఎన్నికల సంఘం చేపట్టిన Special Intensive Revision (SIR) ప్రక్రియ రాజ్యాంగబద్ధమా?పౌరసత్వ నిరూపణ కోసం ఓటర్లపై పెట్టిన నిబంధనలు సమంజసమా?ఎన్నికల ముందు నెలలకే ఈ కసరత్తు ప్రారంభించడం సమయపరంగా సరైనదా?

Chandrababu Again Self dabba Credits Thalliki Vandanam to Lokesh3
సారీ.. ఈసారి క్రెడిట్‌ లోకేష్‌ బాబుకే!

కంప్యూటర్‌ కనిపెట్టింది ఎవరు?.. సెల్‌ఫోన్‌ కనిపెట్టింది ఎవరు?.. చార్లెస్‌ బబ్బేజ్‌, డాక్టర్‌ మార్టిన్‌ కూపర్‌లు. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలను అడిగితే టక్కున చెప్పే పేరు.. నారా చంద్రబాబు నాయుడు. హా.. షాకయ్యారా!. సెటైరిక్‌గాలే లేండి. ప్రపంచంలో ఏమూల.. ఏం జరిగినా.. ఎవరు ఏం కనిపెట్టినా.. టెకనలాజియాకు ముడిపెట్టి ఆ క్రెడిట్‌ అంతా కొట్టేయాలని ఉవ్విళ్లూరుతుంటారు చంద్రబాబు. ఈసారి అలా క్రెడిట్‌ను తన కుమారుడు నారా లోకేష్‌కు కట్టబెట్టారు. తల్లికి వందనంపై పథకంపై సెల్ఫ్‌ డబ్బా కొట్టుకునే క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం అనే పథకం ఆలోచన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ మైండ్‌లోంచి పుట్టిందని, ఆ క్రెడిట్‌ అంతా లోకేష్‌ బాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారాయన. పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్త చెరువు స్కూల్‌లో సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు.. అక్కుడున్న విద్యార్థులనే కాదు, నెట్టింట విస్తుపోయేలా చేస్తున్నాయి. దేశంలో.. పేద కుటుంబాలకు విద్యా సహయార్థం పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. నవరత్నాల్లో భాగంగా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారాయన. అయితే.. ఆ పథకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చేసుకుంది. పోనీ.. పథకం అయినా సక్రమంగా అమలు అవుతుందా? అంటే.. అదీ లేదు. అర్హతల పేరుతో మెలికలు పెట్టి చాలామందిని తొలగించింది. పైగా ఒక అకడమిక్‌ ఇయర్‌ సొమ్మును కాగితం మీద లెక్క పెట్టి.. తల్లుల అకౌంట్లలో జమ చేయకుండా ఎగ్గొట్టింది కూడా!. అలాంటిది జగన్‌ ప్రవేశపెట్టిన పథకాన్ని హైజాక్‌ చేసి.. తన తనయుడి ఆలోచనగా చంద్రబాబు ప్రమోట్‌ చేసుకోవడాన్ని కొందరు నెటిజన్లు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

Not Number 3 Player Nitish Reddy Could Make Place For Him: Sanjay Manjrekar4
‘ఒక్క మ్యాచ్‌కే తప్పిస్తారా?.. అతడి కోసం నితీశ్‌ రెడ్డి త్యాగం చేయాల్సింది’

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా యాజమాన్యం వ్యవహరించిన తీరు సరికాదని భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ విమర్శించాడు. చారిత్రాత్మక గెలుపు కారణంగా తుదిజట్టు ఎంపిక విషయంలో చేసిన కొన్ని పొరపాట్లు కనుమరుగైపోయాయని పేర్కొన్నాడు. ఫలితం అనుకూలంగా రాకపోయి ఉంటే.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేవని అభిప్రాయపడ్డాడు.కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతున్న టీమిండియా (IND vs ENG).. లీడ్స్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే, అందుకు ప్రతీకారం తీర్చుకుని ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి గెలుపు జెండా ఎగురవేసి చారిత్రాత్మక​ విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. సాయి సుదర్శన్‌, శార్దూల్‌ ఠాకూర్‌లపై మాత్రం వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానాల్లో ఆకాశ్‌ దీప్‌ (Akash Deep), వాషింగ్టన్‌ సుందర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (Nitish Kumar Reddy)లను జట్టులోకి తీసుకుంది.ఈ నేపథ్యంలో సంజయ్‌ మంజ్రేకర్‌ మాట్లాడుతూ.. సాయి సుదర్శన్‌పై వేటు వేయడాన్ని తప్పుబట్టాడు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన అతడిని తప్పించాల్సిన అవసరం లేదని.. మరో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. నిజానికి కరుణ్‌ నాయర్‌ వన్‌డౌన్‌ బ్యాటర్‌ కాదని.. సాయి ఈ స్థానంలో సరిగ్గా సరిపోతాడని అభిప్రాయపడ్డాడు.ఒక్క మ్యాచ్‌కే తప్పిస్తారా?.. ‘‘గత మ్యాచ్‌లో టీమిండియా యాజమాన్యం కొన్ని ఆసక్తికర ఎంపికలు చేసింది. వాటితో నేను ఏమాత్రం ఏకీభవించడం లేదు. రెండో టెస్టులో గెలిచిన కారణంగా ఇవన్నీ కనుమరుగైపోయాయి.నిజానికి సాయి సుదర్శన్‌ విషయంలో వారు చేసింది తప్పు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఈ యువ ఆటగాడికి మరో అవకాశం ఇవ్వాల్సింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు బాగానే ఆడాడు. కాబట్టి రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించాల్సింది.కానీ వాళ్లు అతడిని తప్పించారు. మూడో స్థానంలో సాయి సుదర్శన్‌ సరైన బ్యాటర్‌. కరుణ్‌ నాయర్‌ను వన్‌డౌన్‌లో ఆడించడం సరికాదు. విఫలమైనా కరుణ్‌కి అవకాశాలు ఇచ్చినప్పుడు సాయి సుదర్శన్‌కు కూడా ఛాన్స్‌ ఇవ్వాల్సింది కదా!అతడి కోసం నితీశ్‌ రెడ్డి త్యాగం చేయాల్సిందిఅలా అని నేనేమీ కరుణ్‌ నాయర్‌కు వ్యతిరేకం కాదు. చాలా ఏళ్ల తర్వాత కష్టపడి అతడు జట్టులోకి వచ్చాడు. అయితే, అతడు మాత్రం వన్‌డౌన్‌లో ఆడే బ్యాటర్‌ మాత్రం కాదు. నిజానికి లోయర్‌ ఆర్డర్‌లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి కరుణ్‌ కోసం త్యాగం చేయాల్సింది’’ అని మంజ్రేకర్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు. కాగా లీడ్స్‌ టెస్టుతో టీమిండియా తరఫున సంప్రదాయ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్‌ డకౌట్‌ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 30 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మరోవైపు.. కరుణ్‌ నాయర్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ కేవలం 20 పరుగులే చేశాడు. ఇక భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య గురువారం నుంచి లార్డ్స్‌లో మూడో టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌తో బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.చదవండి: IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటు

KSR Comment On CBN Revanth Banakacherla Drama5
బనకచర్ల.. గురు శిష్యుల డ్రామా?

రాజకీయాల్లో కొందరు గాల్లో కత్తులు తిప్పుతూంటారు. అదే యుద్ధమని జనాన్ని నమ్మించే ప్రయత్నమూ జరుగుతూంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల్లో హడావుడి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంతి​ గత ఏడాది అధికారంలోకి వచ్చింది మొదలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సుమారు రూ.85 వేల కోట్లతో గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామని ప్రతిపాదించారు. కేంద్రం కూడా నిధుల రూపంలో సాయం చేయాలని కోరారు. అయితే.. పలు లిఫ్ట్‌లు, రిజర్వాయర్లు, సొరంగాలతో కూడిన బనకచర్ల ప్రాజెక్టు అంత తేలికగా అయ్యేది కాదన్నది అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వమేమో సాయం సంగతి దేవుడెరుగు... పంపిన ప్రతిపాదననే తిప్పి పంపింది. జలసంఘం ఆమోదం తరువాత పర్యావరణ అనుమతులు కూడా తీసుకుని మాట్లాడమని సూచించింది. ఇదంతా ఒక పార్శ్వమైతే.. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో ఇంకో రకమైన రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఈ అంవాన్ని పెద్ద వివాదంలా మార్చి వాదోపవాదాలు సాగిస్తున్నాయి. రెండు పార్టీలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూండటం గమనార్హం. కానీ... ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను అంగీకరించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డిలు స్పష్టం చేస్తూనే కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగిందని విమర్శిస్తున్నారు. వీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తే, దీనికి పోటీగా బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి టి.హరీష్ రావు మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు గురు శిష్యులని, అందుకే బనకచర్ల ప్రాజెక్టుకు సహకరిస్తున్నారని హరీష్‌ అంటున్నారు. చంద్రబాబు, రేవంత్‌లు హైదరాబాద్‌లో భేటీ అయినప్పుడే బనకచర్ల ప్రాజెక్టుకు ఓకే చేశారని హరీష్‌రావు ఆరోపిస్తున్నారు. ఆ తరువాత ఉత్తం కుమార్ రెడ్డి విజయవాడ వెళ్లి చంద్రబాబు వద్ద బజ్జీలు తిని మరీ ఈ ప్రాజెక్టుకు ఓకే చేసి వచ్చారని అన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణ నీటి వాటాలలో నష్టం జరిగిందని, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైనప్పుడు ఇందుకు బీజం పడిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్‌, జగన్‌లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒక భేటీ జరిగిన మాట నిజమే. గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి జూరాలకు తరలించడానికి కేసీఆర్‌ ప్రతిపాదించగా, దానిని పరిశీలించడానికి జగన్ ఒప్పుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఏపీకి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం ఏర్పడడంతో అది ముందుకు సాగలేదు. కేసీఆర్‌, జగన్‌లు అయినా, చంద్రబాబు, రేవంత్ అయినా సమావేశమైతే ఉభయ రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించవచ్చు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. తదుపరి చంద్రబాబుకు చెప్పే కాంగ్రెస్‌లో చేరారు. తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి, పిమ్మట పీసీసీ అధ్యక్షుడై, ఎన్నికలలో గెలవడంతో ముఖ్యమంత్రి అయ్యారు.అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పరోక్షంగా తెలంగాణ టీడీపీ కూడా సహకరించడం బహిరంగ రహస్యమే.చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, కాంగ్రెస్‌తో కూడా స్నేహం చేస్తున్నారన్నది రాజకీయ వర్గాలలో ఉన్న మాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్‌లు కలిసి కూర్చుని విభజన సమస్యలను చర్చించి పరిష్కారం కనుక్కుని ఉంటే బాగుండేది. తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.ఏడువేల కోట్ల విద్యుత్ బకాయిలు రావల్సి ఉంది. హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో వాటా తెచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించి ఉండాల్సింది. తనను చంద్రబాబు శిష్యుడని చెప్పడాన్ని రేవంత్ అంత ఇష్టపడక పోయినట్లు కనిపిస్తుంటారు. అయినా వారిద్దరి మధ్య సంబంధ, బాంధవ్యాలు బాగానే ఉన్నాయని అంటారు. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ ఉదాసీనంగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. గోదావరి జలాలలో 1500 టీఎంసీల నీటిని కేటాయించిన తర్వాత ఏపీ ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం వాదనగా ఉంది. అయితే తాము వరద జలాలను మాత్రమే వాడుకోదలిచామని, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులపై గతంలో ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పలు ఆరోపణలు చేస్తూ తెలంగాణ అడ్డుపడింది. ఇప్పుడు బనకచర్ల విషయంలో కూడా తెలంగాణ గట్టిగా అడ్డుపడుతున్నట్లు కనిపిస్తుంది. బీజేపీ కోణంలో చూస్తే వారికి తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఏపీకి ఎంతవరకు సహకరిస్తుందన్నది సందేహమే. ఇక్కడ విశేషం ఏమిటంటే బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం వల్ల ఏపీకి వచ్చే లాభం ఏమీ లేదని, తెలుగుదేశానికి మద్దతుదారుగా పేరొందిన మాజీ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో సహా మరికొందరు ప్రత్యేకంగా సమావేశం పెట్టి ప్రకటన చేశారు. అంతేకాక 18.5 కిలోమీటర్ల వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల తవ్వకాలు రెండున్నర దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయని, అయినా అవి ఒక కొలిక్కి రాలేదని, అలాంటిది ఇప్పుడు ఏకంగా నల్లమల అడవులలో, కొండల్లో 26.5 కీలోమీటర్ల మేర సొరంగం తవ్వకం ఆరంభిస్తే అది ఎప్పటికి పూర్తి అవుతుందని వారు ప్రశ్నించారు. చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. తాను ఏమైనా ప్రతిపాదిస్తే, ఎవరూ దాన్ని వ్యతిరేకించరాదని భావిస్తారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే అభివృద్ది వ్యతిరేకులంటూ వారిపై తట్టెడు బురద వేసి ప్రజల మైండ్ ఖరాబు చేస్తుంటారు. ఇందుకు తనకు మద్దతు ఇచ్చే మీడియాను పూర్తిగా వాడుకుంటారు. అందువల్ల ఏపీలో తెలుగుదేశం మినహా ఇతర రాజకీయ పార్టీలేవి ఈ ప్రాజెక్టుపై పెద్దగా స్పందించడం లేదు. ఇదంతా ఏపీలోని కూటమి ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఆడుతున్న డ్రామా అని ఆయా రాజకీయ నేతలు భావిస్తున్నారు. సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురుశిష్యులు చంద్రబాబు, రేవంత్‌ కలిసి ఈ డ్రామా నడుపుతున్నారని, చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు పూర్తిచేసే ఉద్దేశం లేదని అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్సార్‌సీపీ కూడా ఇదే తరహా ప్రాజెక్టుకు డీపీఆర్‌ పంపించింది. ప్రభుత్వం మారడంతో బనకచర్ల ప్రాజెక్టు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం అంత తేలిక కాదన్న సంగతి అందరికి తెలుసు. ఎందుకంటే ఏకంగా రూ.85 వేల కోట్ల వ్యయం అవుతుంది. అది అక్కడితో ఆగుతుందన్న నమ్మకం కూడా లేదు. కేంద్రం దీనికి నిధులు కేటాయించితే పెద్ద విశేషమే. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదు. అయినా కేసీఆర్‌ రుణాలు తెచ్చి ఆ ప్రాజెక్టును నిర్మించారు. కాని అందులో ఒక భాగం దెబ్బతినడం కేసీఆర్‌ ప్రభుత్వానికి ఇరకాటమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల వాయిదాలు సరిగా చెల్లించలేక పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే యత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బనకచర్లకు రుణాలు వచ్చే అవకాశం ఎంతన్నది చెప్పలేం. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టినా, తెలంగాణకు వచ్చే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. అయినా రాజకీయ పక్షాలు పరస్పర విమర్శలు సాగిస్తూ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నాయి. మరో వైపు ఏపీ ప్రభుత్వం తామేదో పెద్ద ప్రాజెక్టును చేపడితే ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పి జనాన్ని మభ్యపెట్టే యత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రం తగ్గించిన అంశాన్ని పక్కన బెట్టి డైవర్షన్ రాజకీయాలలో భాగంగా చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు భారీ ప్రాజెక్టులపై అంత విశ్వాసం ఉండేది కాదు. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న విషయాన్ని గుర్తించి, ఇప్పుడు ఆయన కూడా ఆ రాగం ఆలపిస్తున్నారు. అయితే ఆ పాట పాడుతున్నది చిత్తశుద్దితోనా, రాజకీయం కోసమా అన్నదానిపై ఎవరికి కావల్సిన విశ్లేషణ వారు చేసుకోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Is Akshay Kumar Used Teleprompter For Playing Lord Shiva In Kannappa Movie?6
కన్నప్ప సినిమా.. చీటింగ్‌ చేసిన అక్షయ్‌ కుమార్‌?!

మంచు విష్ణు కన్నప్ప సినిమా (Kannappa Movie)లో నార్త్‌ నుంచి సౌత్‌ వరకు పెద్ద పెద్ద స్టార్స్‌ భాగమయ్యారు. ప్రభాస్‌, మోహన్‌లాల్‌, శరత్‌కుమార్‌, అక్షయ్‌కుమార్‌.. ఇలా పలువురు కన్నప్ప చిత్రంలో నటించారు. అక్షయ్‌కుమార్‌ శివుడిగా, కాజల్‌ అగర్వాల్‌ పార్వతిగా యాక్ట్‌ చేశారు. మొదట ఈ మూవీ చేసేందుకు అక్షయ్‌ అసలు ఒప్పుకోనేలేదు. రెండుసార్లు రిజెక్ట్‌ చేశాడు. అయినా విష్ణు పట్టు వదలకుండా ప్రయత్నించి ఆయన్ను ఎలాగోలా ఒప్పించాడు. డైలాగ్స్‌ చెప్పేందుకు అక్షయ్‌ కుమార్‌ తిప్పలుఅలా అక్షయ్‌ కుమార్‌ వెండితెరపై మహాశివుడిగా కనిపించాడు. జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభించింది, కానీ కలెక్షన్లు మాత్రం రాలేదు. తాజాగా ఈ సినిమాలోని ఓ క్లిప్‌ నెట్టింట విపరీతంగా వైరలవుతోంది. అందులో అక్షయ్‌ కుమార్‌ డైలాగులు నేర్చుకుని సొంతంగా చెప్పినట్లు కనిపించడం లేదు. టెలిప్రాంప్టర్‌ను చూస్తూ అక్కడ రాసున్న డైలాగ్స్‌ చదువుతున్నట్లుగా ఉంది. అది అతడి కళ్లు తిప్పడం చూస్తేనే అర్థమైపోతుంది.ఇది చీటింగ్‌ కాదా?ఇది చూసిన నెటిజన్లు అక్షయ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ డైలాగ్స్‌ గర్తుపెట్టుకుని చెప్పలేడా? ఎందుకిలా సగం సగం యాక్టింగ్‌ చేయడం? శివుడి వేషం కట్టుకుని చిన్న డైలాగ్స్‌ కూడా చెప్పడం రాకపోతే ఎలా? ఇది జనాల్ని చీటింగ్‌ చేయడమే అవుతుంది అని కామెంట్లు చేస్తున్నారు. అయితే సదరు వీడియోను సోషల్‌ మీడియా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. కాగా అక్షయ్‌ కుమార్‌.. ఇలా ప్రాంప్టర్‌ చూసుకుంటూ డైలాగ్స్‌ చెప్పడం కొత్తేమీ కాదు. సర్ఫిరా సినిమాలోనూ ఓ సీన్‌లో ఇలాగే డైలాగ్స్‌ చూసుకుంటూ చదివాడు. అక్షయ్‌ ప్రస్తుతం జాలీ ఎల్‌ఎల్‌బీ 3, వెల్‌కమ్‌ టు ద జంగిల్‌ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: ప్రియుడితో శ్రద్ధా.. సీక్రెట్‌ వీడియో వైరల్‌.. ఇంత పని చేస్తారనుకోలేదు

Shashi Tharoor Sensational Comments On Indira 1975 Emergency7
ఇందిరాగాంధీపై శశిథరూర్‌ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తూ.. దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అంటూ ఓ విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారాయన. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. ఆ చీకటి అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎమర్జెన్సీ కాలంలో స్వేచ్ఛను హరించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు.. అంటూ ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘‘ప్రాజెక్టు సిండికేట్‌’’ అనే వెబ్‌సైట్‌లో ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఓ ఆర్టికల్‌ రాశారు. దేశంలో అంతర్గత గందరగోళాన్ని తొలగించడానికి, బయటి నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీలాంటి కఠినమైన నిర్ణయం తప్పనిసరి అని ఆమె(ఇందిరాగాంధీని ఉద్దేశించి..) భావించారు. కానీ, ఈ విధానాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి, అణచివేతతో కూడిన స్థితిలోకి ప్రజలను నెట్టివేశాయి అని పేర్కొన్నారాయన.అయితే స్వేచ్ఛను అణచివేసే చర్యలు ఎంత ప్రమాదకరమో, ప్రజల జీవితాలపై ఎంత తీవ్ర ప్రభావం చూపవచ్చో అంటూ నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ ఆయన పలు విమర్శలు చేశారు. 21 నెలలపాటు పౌర హక్కులను హరించి వేశారు. సంజయ్ గాంధీ నేతృత్వంలో బలవంతపు వాసెక్టమీ కార్యక్రమాలు.. పేద ప్రాంతాల్లో అమలయ్యాయి. ఢిల్లీలోని స్లమ్ ప్రాంతాలు కూల్చివేయబడ్డాయి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. న్యాయవ్యవస్థ ఒత్తిడికి లోనై, హేబియస్ కార్పస్ హక్కును కూడా నిలిపివేసింది. ఈ చర్యలు “అత్యధిక అధికారాన్ని” ఎలా దుర్వినియోగం చేయవచ్చో చూపించాయి. ఫలితంగా.. ప్రజలు 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీని తిరస్కరించి ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్థాపించారు అని తన వ్యాసంలో థరూర్‌ పేర్కొన్నారు.ఎమర్జెన్సీని కేవలం భారత చరిత్రలోని చీకటి అధ్యాయంగా గుర్తుపెట్టుకోవడం కాకుండా, దాని నుంచి పాఠాలను నేర్చుకోవాలి. ప్రజాస్వామ్యం అనేది అది అపురూపమైన వారసత్వం. దానిని నిరంతరం పోషిస్తూ.. పరిరక్షించుకోవాలి. ఈ విషయం ప్రజలందరికీ ఎప్పటికీ గుర్తుండేలా చేయాలి. చరిత్ర మళ్లీ పునరావృతం కాకుండా.. స్వేచ్ఛను నిలుపుదాం అంటూ వ్యాసం ముగించారాయన. My column for a global audience on the lessons for India and the world of the Emergency, on its 50th anniversary @ProSyn https://t.co/QZBBidl0Zt— Shashi Tharoor (@ShashiTharoor) July 9, 20252020లో.. జీ23 పేరిట విడుదలైన లేఖ కాంగ్రెస్‌లో కలకలం రేపింది. శశిథరూర్‌ సహా 23 మంది సీనియర్ నేతలు ‘కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం’ కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా(మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..) తిరుగుబాటు లాగా భావించారంతా. అప్పటి నుంచి థరూర్‌కు, కాంగ్రెస్‌ అధిష్టానానికి గ్యాప్‌ మొదలైంది. తిరిగి.. 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ గ్యాప్‌ మరోసారి బయటపడింది. శశిథరూర్ మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఖర్గే గెలిచినా, థరూర్‌కు 1,000కి పైగా ఓట్లు వచ్చాయి. అయితే పార్టీలో అంతర్గతంగా థరూర్‌కు మద్దతు ఉన్నట్లు ఈ ఎన్నిక స్పష్టం చేసింది. 2023-24.. శశిథరూర్ ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. అదే సమయంలో థరూర్‌ అభిప్రాయాల ఆధారంగానే కాం‍గ్రెస్‌పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. 2025లో.. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాంగ్రెస్‌కే షాకిస్తూ ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్‌ మోదీ నాయకత్వంపై ప్రశ్నలు గుప్పించారు. ఇది ఆయన కొందరు కాంగ్రెస్‌ నేతలతో సోషల్‌ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే.. అవి నాలుగు గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం.. ప్రధాని మోదీ శక్తి, చురుకుదనం భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశిథరూర్‌ తాజాగా స్పష్టత ఇచ్చారు. అయితే థరూర్‌పై చర్యలు ఉండబోవని కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఇప్పటికే స్పష్టం చేశారు. ఈలోపే ఏకంగా ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తప్పుబడుతూ మరో వ్యాసం రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

former Meta AI researcher debate on company culture8
‘మెటాలో పని.. క్యాన్సర్‌ అంత ప్రమాదం’

ప్రముఖ టెక్‌ కంపెనీ మెటా సూపర్‌ ఇంటలిజెన్స్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ముందుకుసాగుతున్న తరుణంలో కంపెనీ మాజీ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారుతున్నాయి. కంపెనీలో ఉద్యోగం మానేసి బయటకు వస్తున్న సమయంలో అంతర్గతంగా ఆ ఉద్యోగి ఈమెయిల్ పంపించాడు. దీనిలో కంపెనీ కృత్రిమమేధ విభాగం గురించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తాడు.ది ఇన్ఫర్మేషన్‌లో టిజ్మెన్ బ్లాంకెవర్ట్‌ రాసిన కథనంలో మెటాలోని సంస్కృతిని సంస్థ అంతటా వ్యాపిస్తున్న ‘మెటాస్టాటిక్ క్యాన్సర్’తో పోల్చాడు. మెటా ఎల్ఎల్ఏఎంఏ మోడళ్లపై పనిచేసే బృందంలో బ్లాంకెవర్ట్ కూడా కొంతకాలం పని చేశాడు. ఉద్యోగం నుంచి నిష్క్రమించే ముందు అతడు మెటా నాయకత్వాన్ని, అక్కడి పని విధానాన్ని విమర్శిస్తూ ఒక సుదీర్ఘ లేఖ రాశాడు.‘మెటాలో పని చేస్తున్నన్ని రోజులు చాలా మంది ఉద్యోగులు ఎంతో నష్టపోయారు. అక్కడ భయంతో కూడిన సంస్కృతి ఉంది. తరచుగా పనితీరు సమీక్షలు, తొలగింపులు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, సృజనాత్మకతను దెబ్బతీశాయి. ప్రస్తుతం 2 వేల మందికిపైగా బలంగా ఉన్న ఏఐ విభాగానికి దిశానిర్దేశం కొరవడింది. చాలా మందికి మెటాలో పని చేయడం ఇష్టం లేదు. తమ మిషన్ ఏమిటో కూడా వారికి తెలియదు. పదేపదే అంతర్గత విభేదాలు, అస్పష్టమైన లక్ష్యాలు నిర్దేషిస్తారు. ఇది జట్టు నూతన ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో పనిచేయకపోవడం మాత్రమే కాదు. మెటాస్టాటిక్ క్యాన్సర్‌లా ఇది సంస్థను ప్రభావితం చేస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర..ఓపెన్ఏఐ, గూగుల్ డీప్‌మైట్‌ వంటి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మెటా తన ఏఐ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన విమర్శలు గుప్పించారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) నిర్మాణంపై దృష్టి సారించే సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగాన్ని కంపెనీ ఇటీవల సృష్టించింది. మెటా పరిశ్రమ అంతటా అగ్రశ్రేణి ప్రతిభావంతులను నియమించుకుంటోంది. అందుకు కంపెనీ ఎంతైనా ఇచ్చేందుకు వెనకాడడంలేదు.

YSRCP Buggana Rajendranath Serious comments On CBN Govt9
బాబు.. 2,45,000 కోట్ల బడ్జెట్‌ ఏమైంది.. అప్పులపై అడిగితే దేశద్రోహులమా?: బుగ్గన

సాక్షి, హైదరాబాద్‌: ​చంద్రబాబు.. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. అమరావతిని అభివృద్ధి చేయలేక వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు.మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎందుకు అప్పులు చేస్తున్నారని అడిగతే మేము దేశద్రోహులమా?. మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఎందుకు?. అమరావతిని అభివృద్ధి చేయలేక మాపై విమర్శలు చేస్తున్నారు. మేం అప్పు చేస్తే తప్పు.. మీరు అప్పులు చేస్తే ఒప్పా?. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయి. రూ.2,45,000 కోట్ల బడ్జెట్‌ ఎక్కడికి పోయింది?. ఒక్క పెన్షన్లకు తప్ప ఏ సంక్షేమ పథకానికైనా కేటాయింపులు చేస్తున్నారా?. రాష్ట్రంలో పొగాకు, మామిడి, మిర్చి రైతుల పరిస్థితి ఏంటి?. ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు చేశారా?. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా?. తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు?. ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ అడిగితే దేశద్రోహులమా?. ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చి ఇప్పుడు షరతులు పెడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం అంటున్నారు. ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ ఇచ్చారా?. దీపం ఎంత మందికి వచ్చంది?. 50 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజల తరఫున పోరాటం చేస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని వ్యాఖ్యలు చేశారు.

Phone tapping Case SIT Will Approach Supreme Court10
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ట్విస్ట్‌.. ప్రభాకర్‌ రావుకు ఝలక్‌!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సిట్‌ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు డీసీపీ విజయ్‌కుమార్‌, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు.అయితే, గతంలో ప్రభాకర్‌ రావును అరెస్ట్‌ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మినహాయింపులు రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిట్‌ అధికారులు కోరనున్నారు. ప్రభాకర్‌ రావు విచారణకు సహకరించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభాకర్‌ రావును కస్టడీకి తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను సిట్‌ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారనుంది. వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అధికారులు ఉన్నారు. ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభాకర్‌ రావు.. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్‌ అనుమానం వ్యక్తం చేస్తోంది.ఇక, ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్‌ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను సిట్‌ గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ధ్వంసమైన హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం. దీంతో, సిట్‌ అధికారులు.. హార్డ్ డిస్కులపైన ఆశలు పెట్టుకున్నారు. డేటా రిట్రైవ్, హార్డ్‌ డిస్కులోని రహస్యాలపై సిట్ ఆరా తీస్తోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement