పచ్చ పార్టీ కాంట్రాక్టర్‌ నిర్వాకం | - | Sakshi

పచ్చ పార్టీ కాంట్రాక్టర్‌ నిర్వాకం

Apr 15 2025 1:34 AM | Updated on Apr 15 2025 1:34 AM

పచ్చ

పచ్చ పార్టీ కాంట్రాక్టర్‌ నిర్వాకం

వేటపాలెం: మా ప్రభుత్వం.. మేము చేసిందే కరెక్టు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు పచ్చ పార్టీ నాయకులు. ఆ పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌ కూడా అదే రీతిలో వ్యవహరించాడు. దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరిపట్నంలో మూడు వీధుల్లో ఎన్‌ఆర్‌జీఈఎస్‌ నిధులతో నూతనంగా ఆదివారం సిమెంట్‌ రోడ్లు వేశారు. అయితే, ఈ రోడ్డు వేస్తున్న వీధిలో నివాసం ఉంటున్న యర్రా రూపా ఆనంద్‌ అభ్యంతరం తెలిపాడు. రోడ్డికిరువైపులా పంచాయతీ స్థలం ఆక్రమణకు గురై వెడల్పు తగ్గి పోయిందని పంచాయతీ కార్యదర్శికి ఐదు నెలల కిందట ఫిర్యాదు చేశారు. వేటపాలెం తహసీల్దార్‌కి గత ఏడాది నవంబర్‌ 2 రోడ్డు సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని దాని నిమిత్తం చలానా కట్టి అర్జీ కూడా ఇచ్చారు. అది ప్రస్తుతం తహసీల్దార్‌ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. సర్వే ఊసే లేదు. అనంతరం రోడ్డు సర్వేపై జిల్లా కలెక్టర్‌ గ్రీవెన్స్‌ సెల్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌ 7న ఆనంద్‌ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా రోడ్డు ఆక్రమణలకు సంబంధించి సర్వే నిర్వహించలేదు.

సెలవు దినాల్లో హడావుడిగా

రోడ్డు నిర్మాణం

ఆ కాంట్రాక్టర్‌ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం రోజైన ఆదివారం హడావుడిగా ఆమోదగిరిపట్నలో సిమెంట్‌ రోడ్డు నిర్మాణం చేశాడు. దీనికి సంబంధించి యర్రా రూపా ఆనంద్‌కి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అదే రోడ్డులో నివసిస్తున్న ఆయన ఇంటి పక్కనే సొంత స్థాలంలో రోడ్డు మీద కారు పార్కు చేసి ఉంచారు. ఈ క్రమంలో రూపా ఆనంద్‌ కుటుంబ సభ్యులు గుంటూరులో చికిత్స పొందుతుంటే వారిని పరామర్శించడం కోసం ఆదివారం ఉదయం వెళ్లారు. రాత్రికి తిరిగి వచ్చే చూసే సరికి ఇంటి పక్కన తన స్థాలంలో రోడ్డు పక్కన పార్కు చేసి ఉంచిన కారు కిందగా కొత్తగా సిమెంట్‌ రోడ్డు వేశారు. ఇది చూసిన ఆనంద్‌ ఒక్కసారిగా కంగుతిన్నాడు. కారు ముందు టైరు సిమెంట్‌ రోడ్డులో ఇరుక్కుపోయింది. కారుపై సిమెంట్‌ వ్యర్థాలు సైతం పడ్డాయని ఆరోపించారు. రూపా ఆనంద్‌ వెంటనే తనకు జరిగిన అన్యాయంపై వేటపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్‌కి, ఎస్సీ ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

కారును పక్కకు తీయకుండా

సిమెంట్‌ రోడ్డేసిన వైనం

కాంట్రాక్టర్‌కి సహకరించిన

పంచాయతీ అధికారులు

లబోదిబోమంటున్న కారు ఓనర్‌

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

పచ్చ పార్టీ కాంట్రాక్టర్‌ నిర్వాకం 1
1/1

పచ్చ పార్టీ కాంట్రాక్టర్‌ నిర్వాకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement